Activities calendar

24 November 2017

21:33 - November 24, 2017

ఈజిప్టు : దేశంలో ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. మసీదును లక్ష్యంగా చేసుకుని ముష్కరులు దారుణ మారణకాండకు పాల్పడ్డారు. ఈజిప్టులోని సినాయ్‌ ద్వీపకల్పంలోని మసీదులో జరిగిన దాడిలో 182 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 120 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను 30 అంబులెన్స్‌ల సాయంతో ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. భక్తులను లక్ష్యంగా చేసుకుని ముష్కరులు బాంబులు విసిరారు. విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడి నేపథ్యంలో ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్‌ ఫత్తా అల్‌ సీసీ భద్రతాధికారులతో అత్యవసరంగా భేటీ అయ్యారు. శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించారు. ఉగ్రవాద దాడిని ప్రభుత్వం ఖండించింది. ఈజిప్టులో మూడు రోజులు సంతాప దినాలు ప్రకటించింది. 

21:32 - November 24, 2017

చెన్నై : తమిళనాడు, ఆర్కేనగర్‌ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ని విడుదల చేసింది. డిసెంబర్‌ 21న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్‌ 24న ఎన్నికల ఫలితాలు వస్తాయి. జయలలిత మరణంతో ఆర్కే నగర్ అసెంబ్లీ సీటు ఖాళీ అయ్యింది. 

21:31 - November 24, 2017

హైదరాబాద్ : ప్రొఫెసర్‌ కంచ ఐలయ్యపై కరీంనగర్‌ జిల్లా కోరుట్లలో జరిగిన దాడిని అఖిలపక్ష నేతలు ఖండించారు. ఐలయ్యపై బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ దాడిని ఖండిస్తూ రాజకీయ పార్టీలతో రౌండ్‌ టేబుట్‌ సమావేశం జరిగింది. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఈ భేటీకి వివిధ పక్షాల నేతలు హాజరయ్యారు. బలహీన వర్గాల హక్కుల సాధన కోసం గళం విప్పుతున్న మేధావుల నోరు నొక్కడం పాలక పక్షాల పనిగా పెట్టుకున్నాయని విమర్శించారు. ఇలాంటి శక్తలను ఎన్నికల్లో ఓడించాలని అఖలపక్ష నేతలు పిలుపు ఇచ్చారు. 

21:21 - November 24, 2017

నెల్లూరు : వైఎస్‌ జగన్‌పై మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఫైర్‌ అయ్యారు. నెల్లూరులోని ఆర్ అండ్ బి అతిధి గృహంలో ఆయన సమావేశమయ్యారు. ఈడీ విడుదల చేసిన అవినీతి పరుల జాబితాలో జగన్మోహన్ రెడ్డి టాప్ టెన్ లో ఉన్నారని అన్నారు. 31 డొల్ల కంపెనీల ద్వారా 368 కోట్ల రూపాయలను మనీ లాండరింగ్ ద్వారా దేశం దాటించారని ఆరోపించారు. ఇవన్నీ తాను చెబుతున్నది కాదని సాక్షాత్తు ఈడీ చెప్పిన మాటలని అన్నారు. అవినీతిపరులు రాజకీయాల్లో ఉండకూడదని పాదయాత్రలో సందేశాలు ఇస్తున్న జగన్ తక్షణం పార్టీ బాధ్యతల నుంచి తప్పుకుని ఆ బాధ్యతను వేరే వాళ్లకు అప్పగించి తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని మంత్రి సోమిరెడ్డి అన్నారు. 

21:20 - November 24, 2017

 

యాదాద్రి : ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబ సమేతంగా యాదాద్రిలో పర్యటించారు. హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో యాదాద్రి చేరుకున్న కేసీఆర్‌ దంపతులకు.. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు స్వాగతం పలికారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం నాయకుడు తుంగ బాలు విహాహానికి హాజరై వధూవరులను ఆశ్వీర్వదించారు. నంతరం కొండపైకి చేరకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులు, కుటుంబ సభ్యులకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. బాలాలయంలో లక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. పూజల తర్వాత ప్రధాన ఆలయం నిర్మాణ పనులను పరిశీలించారు. స్వయంభువు ఆలయంలోపాటు రాజగోపురాలు, శివాలయం, మాఢ వీధులను తనిఖీ చేశారు. జరుగుతున్న పనుల పురోగతిని అధికారులు కేసీఆర్‌కు వివరించారు. ముందుగా నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం పనులు జరగడంలేదని గ్రహించిన ముఖ్యమంత్రి..యాదాద్రి టెంపుల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మూల విరాట్‌ను దర్శించుకునేందుకే ప్రాధాన్యత
యాదాద్రి ప్రధాన దేవాలయం నిర్మాణ పనులను పరిశీలించిన తర్వాత కేసీఆర్‌... సమీక్ష నిర్వహించారు. ప్రణాళికాబద్ధంగా పనులు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని వైటీడీఏ అధికారులను ఆదేశించారు. భక్తులను బాలాలయం దర్శనానికే ఎక్కువ కాలం పరిమితం చేయడం మంచిదికాదన్నారు. మూల విరాట్‌ను దర్శించుకునేందుకే ప్రాధాన్యత ఇస్తారన్న అంశాన్ని గుర్తు చేశారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ప్రధాన ఆలయ నిర్మాణ పనులు సాధ్యమైనంత తర్వాత పూర్తి చేయాలని ఆదేశించారు. యాదాద్రి అభివృద్ధికి పలు చర్యలు ప్రకటించారు సీఎం కేసీఆర్‌. యాదాద్రి దేవాలయాన్ని దివ్యధామంగా అభివృద్ధి చేసిన తర్వాత పెరిగే జనాభాను దృష్టిలో పెట్టుకుని యాదగిరిగుట్ట గ్రామాన్ని మున్సిపాలిటీగా మార్చాలని కేసీఆర్‌ నిర్ణయించారు. వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. యాదాద్రి దేవాలయం చుట్టూ 7 కి.మీ. రింగ్‌ రోడ్డు నిర్మాణానికి 143 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. రాయగిరి, తుర్కపల్లి, వంగపల్లి, రాజాపేట, కీసర మార్గాలను డబుల్‌ లైన్‌ రోడ్లుగా విస్తరిస్తారు. యాదాద్రి భవితష్యత్‌ విద్యుత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని 132 కేవీ, 33 కేవీ విద్యుత్‌ సబ్‌ స్టేషన్లను నిర్మించాలని కేసీఆర్‌ ఆదేశించారు. గుట్ట దిగువున సేకరించిన 143 ఎకరాల్లో చేపట్టాల్సిన ప్రవచనాల ప్రాంతం, బస్‌ స్టేషన్‌, కోనేరు నిర్మాణాలపై అధికారులకు సూచనలు చేశారు. లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తుల వసతిసౌకర్యాలకు ఇబ్బంది లేకుండా కాటేజీల నిర్మాణాన్ని కేసీఆర్‌ ఆదేశించారు. దాదాపు రెండు గంటపాటు యాదాద్రిలో గడిపిన ముఖ్యమంత్రి, ఆ తర్వాత హైదరాబాద్‌ బయలుదేరి వెళ్లారు. 

21:19 - November 24, 2017

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్ధుల భవిష్యత్ కోసం నూతన విధానాలను రూపొందిస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు దేశానికే ఆదర్శంగా నిలవాలని కాంక్షించారు. తుళ్లూరు మండలం మందడం గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో వర్చువల్ క్లాస్ రూమ్‌ను ఆయన ప్రారంభించారు. వర్చువల్‌ విధానంలో అధ్యాపకులు బోధిస్తున్న పాఠాలను విద్యార్థులతో కలిసి విన్నారు. డిజిటల్‌ క్లాస్‌రూమ్స్‌ వల్ల కలిగే ఉపయోగాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. సాధారణ గదికి, వర్చువల్‌ గదికి ఎలాంటి తేడాలు గమనించరని విద్యార్థులను ప్రశ్నించారు. వర్చవల్‌ క్లాసులు చాలా బాగున్నాయని స్టూడెంట్స్‌ హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులకు స్వయంగా డిజిటల్‌ పాఠాలు బోధించారు సీఎం చంద్రబాబు.

5వేల వర్చువల్‌ క్లాస్ రూమ్‌లు
అనంతరం మాట్లాడిన చంద్రబాబు..రాష్ట్రంలో మొత్తం 5వేల వర్చువల్‌ క్లాస్ రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. స్టూడియోలో 10 నుంచి 20 మంది టీచర్లు అందుబాటులో ఉంటారని.. ప్రతి క్లాస్‌కి 30 నుంచి 40 మంది విద్యార్థులుండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఒక టీచర్‌కు ఎంతమంది విద్యార్థులు అందుబాటులో ఉంటే.. అన్ని స్కూళ్లను డిజిటలైజేషన్‌కు అనుసంధానిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్చువల్ క్లాస్ రూమ్‌లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందన్నారు. ఇప్పటి వరకు బెంగళూరు నుంచి వర్చువల్‌ క్లాస్‌రూమ్స్‌ను ఆపరేట్‌ చేశామని, త్వరలో గుంటూరు నుంచే పూర్తి కార్యకలాపాలు నిర్వహిస్తామని చంద్రబాబు తెలిపారు. విద్యార్ధుల వివరాలను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు తెలుసుకునేలా ఓ యాప్‌ను రూపొందిస్తున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. జూనియర్ కాలేజీలను అప్‌గ్రేడ్‌ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. 

ఈజిప్టులో బాంబు పేలుడు

ఈజిప్టు : ఆల్ అరీష్ లోని ప్రార్థనామందిరం వద్ద పేలుడు జరిగింది. పేలుడు అనంతరం దుండగులు కాల్పులకు కూడా పాల్పడ్డారు. ఈ పేలుడు, కాల్పుల్లో 150మంది మృతి చెందారు. 120మందికి గాయాలయ్యాయి. ఉగ్రవాదులు 4 వాహనాల్లో వచ్చి దాడులు తెగబడ్డారు. 

20:43 - November 24, 2017

28ఏళ్ల క్రితం తెలుగు తెరపై ఓ అద్భుతం ఆవిష్కృతమయింది. ఇప్పుడు మళ్లీ అదే క్రేజీ కాంబినేషన్ తో వస్తున్న సినిమా ఎలాంటి సంచనాలు క్రియేట్ చేస్తుంది? నాటి శివ రేంజ్ లో అద్భుతాలు సృష్టిస్తుందా? తెలుగు తెర దశ దిశను మారుస్తుందా? మరో మైలు రాయిగా మారుతుందా? తనకు మైండ్ దొబ్బింది కానీ.. ఇంకా గుజ్జు అయిపోలేదు అంటున్న వర్మ... ఎళాంటి సంచనాలు సృష్టించబోతున్నాడు? తెలుగు సినిమాపై చెరగని ముద్ర..బాలీవుడ్ ని కుదిపేసిన ఫిల్మ్ మేకర్.. ఇవన్నీ రొటీన్ మాటలు.. కానీ రామ్ గోపాల్ వర్మ... సినిమా వస్తుంది అంటే అతడి అభిమానులే కాదు.. విమర్శించే వాళ్లు కూడా ఆసక్తి చూపటం మాత్రం నిజం..ఇప్పుడు కూడా అదే సీన్ కనిపిస్తోంది.

పెద్ద నోట్లను కాదు.. వర్మ సినిమాలను రద్దు చేయాలి.. ఫేస్ బుక్ లో ఆ మధ్య కనిపించిన ఓ కామెంట్.. సినిమా ప్రకటించటంలో ఉన్న ఉత్సాహం తీయటంలో ఉండదు.. అని అసలు విషయాలను దాటవేసి పైపై మెరుగులకే ప్రాధాన్యం ఇస్తాడనే విమర్శ.. సంచలనాలకు ప్రాధాన్యమిచ్చే వర్మ.. టేకింగ్ లో అత్యంత జాగ్రత్తగా ఉండే వర్మ.. కథ విషయంలో మాత్రం పెద్దగా కేర్ తీసుకోవటం లేదని, వివాదం.. ప్రచారం.. సంచలనం.. ఊపిరిగా నడిచే వర్మ.. అంతిమంగా సినిమా విషయంలో బోల్తా కొడుతున్నాడనే వాదనలు.. వీటన్నిటి మధ్య... వర్మ ఫ్యాక్టరీ నుంచి మరో ప్రాడక్డ్ రాబోతోంది..

అంతా ప్రచారం కోసమే చేస్తున్నాడు అనిపిస్తాడు. వార్తల్లో ఉండటానికే ఈ హడావుడి అనేలా చేస్తాడు.. కానీ, వర్మ ఉన్నట్టుండి కళ్లు చెదిరే ఓ సినిమా వదులుతాడు.. గతాన్ని మరచి ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించుకుంటాడు. మళ్లీ కొన్ని ఫ్లాప్ సినిమాలు. వివాదాల ట్వీట్లు.. సంచలనాల ప్రకటనలు.. వెరసి వర్మ అంటే ఎప్పటికీ ఓ సంచలనమే. నా ఇష్టం.. నేను తీసేది తీస్తా.. మీకు నచ్చితే చూడండి లేదంటే లేదు..ఇదే లాస్ట్ సినిమా మళ్లీ తీయను..నా మాట మీద నేను నిలబడను..ఈ సారి నామీద నేనే ఒట్టేసుకుంటున్నాను..నేను మీరనుకున్నంత వెధవను కాను. నాకు మైండ్ దొబ్బంది కానీ, జ్యూస్ అయిపోలేదు.. ఇవీ వివాదాల వర్మ వ్యాఖ్యలు.. ఇప్పుడు నాగ్ తో చేస్తున్న లేటెస్ట్ సినిమా ఎలాంటి సంచనాలు క్రియేట్ చేయబోతోంది? శివ రేంజ్ లో చరిత్ర సృష్టించగలదా?ఇదీ ఈ రోజు వైడాంగిల్ స్టోరీ.. తర్వాతి ఎపిసోడ్ లో మరో అంశంపై విశ్లేషణాత్మక కథనం చూద్దాం..

 

 

 

 

 

20:40 - November 24, 2017

నేను గప్పుడు జెప్పలేదా... ఇది కొల్వులు భర్తీ జేశే ప్రభుత్వం గాదు కోతల ప్రభుత్వమే అని... అన్నట్టే అయ్యింది.. ముప్పై ఒక్క జిల్లాల ప్రకారం నోటిఫికేషన్ ఏస్తున్నమని మొన్న టీచర్ రిక్రూట్ మెంట్ టెస్టు నోటిఫికేషన్ ఏశిండ్రుగదా... సర్కారును హైకోర్టు దౌడమీదికెళ్లి గొట్టినంత పనిజేశింది.. మీ ముప్పై ఒక్క జిల్లాలకు కేంద్రంల గుర్తింపే లేదు ఏట్ల ఏస్తవయ్యా.. చల్ పది జిల్లాల లెక్క మీదికెళ్లే ఎయ్యుండ్రి అని చెప్పింది..

తెలంగాణ బాతాల పోశెట్టిగారికి ప్రాజెక్టులు గడ్తున్న కాంట్రాక్టర్ల మీదున్న ప్రేమ.. నిరుద్యోగుల మీద ఎందుకు లేదట తెల్సా..? కోదండరాం సారు కుండవలగొట్టినట్టు బైటవెట్టిండు అసలు రహస్యం.. ఉద్యోగాలు ఎందుకు భర్తీ జేస్తలేదు సారు ఈ ప్రభుత్వం అని విలేకర్లు అడిగితె.. మతలావు గిదట.. మరి మనం గూడ ఇందాం పటుండ్రి..

దొంగలకు సద్ది గట్టుట్ల చంద్రబాబు తర్వాతనే ఎవ్వలైనా అంటున్నరు యవ్వారం జూస్తున్న జనం.. తెలంగాణ ముఖ్యమంత్రి ఒక్కడే అసెంబ్లీల అవద్దాలు జెప్తడేమో అనుకున్నంగని.. అమ్మో చంద్రాలు గూడ కేసీఆర్ బాప్ తయ్యారైండుగదా..? నిండు అసెంబ్లీల పచ్చి అవద్దం ఎట్ల మాట్లాడిండో సూడుండ్రి చంద్రాలు.. పైస అంటె పనాలది తినెతట్టుండు..

ఆ పొల్ల ఇవాంక బాగనే వస్తున్నదిగని.. మొత్తం హైద్రావాదంత కలెతిర్గుతా..? అంటె ఎంత ముద్దుగుండు.. హైటెక్ సిటీ.. ఫలక్ నూమా ప్యాలెస్ దిక్కు తిర్గుతది గావట్టి అక్కడ ఇంతెజాం ఇపరీతంగ జేస్తున్నరు.. అమెరికాలున్న డల్లాసు ఇది సేం టూ సేమ్ అన్కునెతట్టు ముస్తాబు జేశిండ్రు.. అమే పాదం ఈ రెండు జాగలే గాకుంట వడ్డెర బస్తి.. బత్కమ్మ కుంట తిక్కుగూడ వడ్తె ఎంత బాగుంటుండే..?

ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి మన్సులు.. గిరిజనుల భూముల మీద మన్సువడ్డరు.. ముందే అధికార పార్టోళ్లాయే.. వాళ్లు మన్సువారేసుకున్నంక గిరజనులు తట్ట బుట్ట సదురుకోని ఎల్లిపోవాల్నా..? లేకపోతె మా భూముల మీద మీరెట్ల కడీలు వాతుతరు అని పంచాదికి వోవాల్నా..? ఇడ్సిపెట్టి ఎల్లిపోవాలెగదా..? కాదని తిర్గవడ్తున్నరు గిరిజనులు అంటె.. వీళ్లు ప్రజాస్వామ్యంల ఉన్నమనుకుంటున్నరా ఎట్ల..?

గచ్చిబౌలి స్టేడియంలో మైనర్ల ఆందోళన

హైదరాబాద్ : గచ్చిబౌలి స్టేడియలో సన్ బర్న్ ఈవెంట్ లో మైనర్లను అనుమతించపోవడంపై వారు ఆందోళనకు దిగారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం మైనర్లు రాకుడదని ఈవెంట్ ప్రతినిధులు చెబుతున్నారు. 

19:26 - November 24, 2017

ఎవరైనా సరే అధికారంలోకి రాగానే ఇలాంటి షోలకు అనుమతి ఇస్తారని, ఇందులో భారతీయ సంస్కృతి వరుద్ధమని అంటున్నారు మరి ఇందులో ఏది విరుద్ధమంటే గణేష్ నిమర్జనం సమయంలో చిన్నపిల్లల తాగుతున్నారని, ఇలాంటి ఈవెంట్ల వల్ల మనం పిల్లలకు ఎటువంటి సూచనలు చేయబోతున్నమని ప్రముఖ జర్నలిస్టు వనజ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం గుడుంబా ను లేకుండా చేస్తామని ఇప్పుడు తాగి ఉగాండి అని చెబుతున్నారని, గోవా, ఢిల్లీ సన్ బర్న్ ఈవెంట్ అనుమతి ఇవ్వడం లేదని కానీ హైదరాబాద్ లో అనుమతి ఇవ్వడానికి కారణం ఏమిటి అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ అన్నారు. గతంలో రాహుల్ గాంధీ గారు సంగారెడ్డి వచ్చినప్పుడు దానికి పర్మిషన్ ఇచ్చారని, ఉద్యోగుల కోట్లాటకు ఇవాంక, మోడీ రాక సందర్బంగా పర్మిషన్ ఇవ్వలేదని టీఆర్ఎస్ నేత గోవర్థన్ రెడ్డి అన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

 

బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థినులు

చెన్నై : తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా మనపాకం వద్ద విషాదం జరిగింది. లెక్చరర్ మందలించాడని నలుగురు ప్లస్ వన్ (11వ తరగతి) విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్నారు.

19:06 - November 24, 2017

చెన్నై : తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా మనపాకం వద్ద విషాదం జరిగింది. లెక్చరర్ మందలించాడని నలుగురు ప్లస్ వన్ (11వ తరగతి) విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

18:57 - November 24, 2017

పెళ్లిచూపులు సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుని టాలీవుడ్ లో ఫుల్ గా ఫేమస్ అయ్యాడు నిర్మాత రాజు కందూకురి. ఆ సినమా నేషనల్ అవార్డు అందుకోవడంతో రాజు కందూకురి వచ్చే సినిమాలపై ఫుల్ ఫోకస్ చేశారు అంతా. శ్రీ విష్ణుతో రాజు కందూకురి నిర్మించిన చిత్రం మెంటల్ మదిపై భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. ఈ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కథ విషయానికొస్తే అరవింద్ కృష్ణకు చిన్నప్పటి నుంచి కన్ఫ్యూజన్ అనే ప్రాబ్లమ్ ఉంటుంది. ఆప్షన్స్ ఇస్తే దేన్ని ఎంచుకోవలో తెలియదు. దానికి తోడు ఆమ్మాయిలను చూడడానికి కూడా భయపడుతాడు. దాంతో అతనికి ప్రతి పెళ్లిచూపుల్లో రిజక్ట్ అనే మాట వినబడుతుంది. కానీ స్వేచ్ఛ అనే ఆమ్మాయిని చూసిన అరవింద్ కు ఆమె కనెక్ట్ అయిపోతాడు. కానీ అతని ప్రాబ్లమ్స్ అన్ని ఆమెతో చెబుతాడు. ఆమె కూడా పాజిటివ్ గా రియాక్టు అవుతారు. ఆమె అరవింద్ కృష్ణ మైండ్ సెట్ మారుస్తుంది. అలా కొంతకాలం తర్వాత సరిగ్గా వీరి నిశ్ఛితార్థం టైమ్ లో స్వేచ్ఛ వాళ్ల నానమ్మ చనిపోవడంతో నిశ్ఛితార్థం వాయిదా పడుతంది. ఈ లోగా అరవింత్ కృష్ణ ముంబై వెళ్తాడు. తర్వాత స్వేచ్ఛకు ఫోన్ చేసి నిశ్ఛితార్థం చెబుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెరపై చూడాలి.

18:44 - November 24, 2017

ఎప్పుడు కొత్త తరహాకథలతో విభిన్న ప్రయోగాలు చేసే నారా రోహిత్ ఇప్పుడు కావాలనే మరి రొటిన్ కమార్షల్ మూవీ చేశాడు అదే బాలకృష్ణుడు. పవన్ మల్లెల దర్శకత్వంలో నారా రోహిత్, రెజీనా జంటగా నటించిన చిత్రం బాలకృష్ణుడు ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఇప్పుడు చూద్దాం...కథ విషయానికొస్తే బాలకృష్ణ అలియాస్ బాలు పోకిరిగా తిరిగే వ్యక్తి అతనికి ఆద్య అనే ఆమ్మాయికి బాడీ గార్డుగా మారి ఆమెను అపదలనుంచి కాపాడే ఆఫర్ వస్తోంది. ఈ ఆఫర్ యక్సెప్ట్ చేసిన బాలు ఆద్య క్లోజ్ అయి ఆమెను ప్రొటెక్టు చేస్తాడు. వారి మధ్య చనువును లవ్ అనుకుంటుంది ఆద్య ఇలా జరిగిపోతున్న కథలో ఓ రోజు ఆద్య పై అటాక్ జరుతుంది. ఇంతకి ఆ అటాక్ చేసింది ఎవరు అనేది తెరపై చూడాల్సిందే...రోహిత్ ఈ సినిమాలో చాలా స్టైలిష్ గా కానిపిస్తాడు. అతని నటనలో కొత్త కోణాన్ని ఈ సినిమాలో చూడవచ్చు. టీజింగ్ సన్నివేశాల్లో, కామెడీ సన్నివేశాల్లో నారా రోహిత్ బాడీ లాగ్వేజ్ అకట్టుకుంది. ఇకా రెజీనా తన గ్లామర్ తో అలరించింది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

 

18:31 - November 24, 2017

చిత్తూరు : టీటీడీ ఆధ్వర్యంలో ధర్మప్రచారాన్ని మరింత విస్తృతం చేస్తున్నట్లు ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. డిసెంబర్ 1 నుండి 3వ తేదీ వరకూ టీటీడీ ఆధ్వర్యంలో జరగనున్న మన గుడి కార్యక్రమంలో వినియోగించే పూజా సామాగ్రికి శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ధర్మ ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్లు అనిల్‌ కుమార్ చెప్పారు. అందులో భాగంగా 300 ఆలయాల్లో మన గుడి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తామన్నారు. 

18:27 - November 24, 2017

గుంటూరు : ఠాగూర్ రైల్‌ మిల్ నూతన అవుట్‌ లెట్ ప్రారంభమైంది. సంస్ధ యజమాని తాతారావు అవుట్‌ లెట్‌ను లాంఛనంగా ప్రారంభించారు. అంజలీ, గీతాంజలి, సాగర్‌ గోల్డ్‌తో పాటు అమరావతి పేరుతో నూతన బ్రాండ్‌ రైస్‌ బ్యాగ్‌లను ఆయన విడుదల చేశారు. 22 ఏళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా నాణ్యత ప్రమాణాలతో కూడిన రైస్‌ను అందిస్తున్నామని, కస్టమర్లకు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో అవుట్‌ లెట్‌ ప్రారంభించినట్లు యజమాని తాతారావు చెప్పారు. 

18:26 - November 24, 2017

కర్నూలు : పేదల సొంతింటి కలను సాకారం చేయాలన్న సీఎం చంద్రబాబు లక్ష్యాన్ని నెరవేరుస్తున్నామన్నారు మంత్రి నారాయణ. కర్నూలులోని జగన్నాథగట్టుపై మెప్మా ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఇళ్లను నారాయణ పరిశీలించారు. పేదల కోసం 10వేల ఇళ్లు నిర్మిస్తున్నామని.. ప్రజా ప్రతినిధుల కోరిక మేరకు మరో 15వేల ఇళ్లు త్వరలో మంజూరు చేస్తామని మంత్రి నారాయణ చెప్పారు. వచ్చే సంక్రాంతి లోపు అన్ని ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామంటున్నారు నారాయణ. 

18:25 - November 24, 2017

గుంటూరు : విద్యా విధానంలో సమూల మార్పులకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టంది. రాష్ట్రంలోని ఐదువేల పాఠశాలల్లో డిజిటల్‌ తరగతులు ప్రారంభించాలని నిర్ణయించింది. మొదటిగా అమరావతి పరిధిలోని మందడం జిల్లా పరిష్కత్‌ హైస్కూల్లో డిజిటల్‌ తరగతులను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. వర్చువల్‌ విధానంలో విద్యార్థులతో కలిసికూర్చుని పాఠాలు విన్నారు. సాధారణ తరగతి గదికి వర్చువల్‌ క్లాస్‌రూమ్‌కు ఉన్న తేడా గురించి విద్యార్థులను ప్రశ్నించారు. విద్యార్థులకు స్వయంగా డిజిటల్‌ పాఠాలు బోధించారు. ప్రస్తుతం బెంగళూరు నుంచి ఆపరేట్‌ చేస్తున్న డిజిటల్‌ క్లాసులను త్వరలోనే గుంటూరు నుంచి నిర్వహించేలా ఏర్పాటు చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. ఇందుకు అవసరైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 

18:11 - November 24, 2017

ఏపీ పూర్తిస్థాయి డీజీపీగా సాంబశివరావు

గుంటూరు : ఏపీ పూర్తిస్థాయిగా డీజీపీగా సాంబశివరావు ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. నాండురి సాంబశివరావు ప్రస్తుతం తాత్కాలిక డీజీపీగా కొనసాగుతున్నారు.

18:08 - November 24, 2017

గుంటూరు : ఏపీ పూర్తిస్థాయిగా డీజీపీగా సాంబశివరావు ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. నాండురి సాంబశివరావు ప్రస్తుతం తాత్కాలిక డీజీపీగా కొనసాగుతున్నారు. మరింత సమాచారం కోసం వీడియో కోసం క్లిక్ చేయండి. 

17:35 - November 24, 2017

హైదరాబాద్ : బీజేపీ పాలనలో దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదకర పరిస్థితుల్లోకి నెట్టివేయబడిందని టీ మాస్‌ ఫోరం ఆందోళన వ్యక్తం చేసింది. కంచ ఐలయ్యపై బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నేతల దాడిని ఖండిస్తూ టీ మాస్‌ ఫోరం రాజకీయ పార్టీలతో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించింది. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఈ భేటీకి వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు. దేశంలో అణగానికి వర్గాలకి అనుకూలంగా గళం వినిపిస్తున్న ప్రజాస్వామ్యవాదులపై మతోన్మాద బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ శక్తులు దాడులు చేస్తుండటాన్ని వివిధ పార్టీల నేతలు ఖండించారు.

17:34 - November 24, 2017

మెదక్ : ఇక్కడ కనిపిస్తున్నవి మెదక్‌ జిల్లాలోని రాజ్‌పల్లి తండా వాసుల గిరిజనుల భూములు. యాభై సంవత్సరాల క్రితం ఇక్కడి గిరిజనులకు ప్రభుత్వం ఈ భూమిని పంపిణీ చేసింది. 33/1 సర్వే నంబర్‌లోని ముప్పై ఎకరాల ఈ భూమిలో 15 మంది లబ్దిదారులు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే వీరికి భూములు ఇచ్చినప్పుడు ఇవి రాళ్లు రప్పలతో సాగుచేసుకునేందుకు పనికి రాకుండా ఉండేది. రేయింబవళ్లు కష్టపడి సాగుకు యోగ్యంగా మలచుకొని గిరిజనులు ఇక్కడ పంటలు సాగు చేసుకుంటున్నారు.

మెదక్‌ జడ్పీటీసీ లావణ్యరెడ్డి కన్ను
కష్టపడి సాగు చేసుకుంటున్న గిరిజనుల భూమిపై మెదక్‌ జడ్పీటీసీ లావణ్యరెడ్డి కన్ను పడింది. ఇంకేముంది గిరిజనుల ముప్పై ఎకరాల భూమి చుట్టూ అధికారుల అండదండలతో ఫెన్సింగ్‌ వేసి భూముల్ని ఆక్రమించేసుకుంది. ఇదేంటని ప్రశ్నించిన తమపై బెదిరింపులకు పాల్పడిందని రైతులంటున్నారు. ఉన్నఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు.

గిరిజనుల భూముల కోసం
అయితే తాను భూముల్ని కబ్జా చేయలేదని, సీలింగ్‌ భూములపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే తమకు కోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని జడ్పీటీసీ లావణ్యరెడ్డి అంటున్నారు. ఇదంతా తరతరాలుగా తమకు సంక్రమించిన ఆస్తి అని చెప్పుకొస్తున్నారు. గిరిజనుల భూముల్ని అన్యాయంగా ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి మల్లేష్‌ డిమాండ్‌ చేశారు. లేదంటే గిరిజనుల భూముల కోసం పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. జడ్పీటీసీ లావణ్యరెడ్డి భూ కబ్జాపై ఉన్నతాధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజాసంఘాలంటున్నాయి. గిరిజనుల పొట్టకొట్టే ఈ వ్యవహారంపై అధికారులు ఏ మేరకు స్పందిస్తారో వేచిచూడాలి. 

17:33 - November 24, 2017

యాదాద్రి : జిల్లా రాయగిరి సర్పంచ్‌ భర్త చంద్రశేఖర్‌ శివాలెత్తిపోయారు. గ్రామ పంచాయతీ పరిధిలో..ఏర్పాటు చేసిన వెంచర్‌కు ఎన్‌ఓసీ ఇచ్చేందుకు 2 కోట్లు డిమాండ్ చేసినట్లు తెలిసింది. దాంతోపాటు గ్రామవార్డు సభ్యులకు ప్లాట్లు ఇవ్వాలని డిమాండ్‌ను సదరు యాజమాన్యం తిరస్కరించడంతో..సర్పంచ్‌ భర్త చంద్రశేఖర్‌ వారిపై దాడికి యత్నించాడు. అంతేకాదు కుర్చీలు విసిరేస్తూ నానా హంగామా సృష్టించడంతో..సంస్థ ప్రతినిధులు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

17:32 - November 24, 2017

హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు మరో మైలురాయిని దాటింది. కేంద్ర అటవీ శాఖ నుంచి రెండవ దశ క్లియరెన్స్‌ లభించింది. ఈ నేపథ్యంలో మంత్రి హరీష్‌రావు హర్షం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కోర్టు కేసులతో అడ్డంకులు సృష్టిస్తున్న వ్యక్తులు..శక్తులకు ఇది చెంపపెట్టు అన్నారాయన. మిగతా డైరెక్టరేట్ల నుంచి ఇంకా మిగిలిపోయిన అనుమతులను కూడా త్వరితగతిన సాధించాలని ఆయన ఇరిగేషన్ ఉన్నతాధికారులను కోరారు. 

17:30 - November 24, 2017

హైదరాబాద్ : టీచర్ల నియామక నోటిఫికేషన్‌పై ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టులో తెలంగాణ సర్కార్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. టీఆర్‌టీకి సంబంధించి జీవో నంబర్ 25 ను సవరించి తీరాల్సిందేనని న్యాయస్ధానం స్పష్టం చేసింది. 10 జిల్లాల ప్రకారమే టీఆర్‌టీ నోటిఫికేషన్ ఉండాలని పేర్కొంటూ ఆదేశాలు జారీ చేసింది. పాఠశాల విద్యాశాఖ అక్టోబర్ 10న జీవో నంబర్ 25, అందుకు అనుగుణంగా 31 జిల్లాల ఆధారంగా టీఆర్‌టీ నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిపై ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన జి.అరుణ్‌కుమార్ , మరో ముగ్గురు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై పలు దఫాలుగా విచారించిన హైకోర్టు రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధమన్న పిటిషనర్ వాదనను ఏకీభవిస్తూ తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌ను సవరించాలని స్పష్టం చేసింది. 

17:30 - November 24, 2017

హైదరాబాద్ : ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీ హన్మంతరావు విమర్శలు గుప్పించారు. హిందూసంస్కృతిని దెబ్బతీసే సన్‌బర్న్‌ పార్టీకి..హైదరాబాద్‌లో ఎలా అనుమతిచ్చారని ప్రశ్నించారు. ఇదంతా ఇవాంక ట్రంప్‌ను మెప్పించడానికి చేశారని ఎద్దేవా చేశారు. ఇవాంక టూర్‌ నేపథ్యంలో రోడ్లపై చిరువ్యాపారులను అడ్డుకోవడం దారుణమన్నారు. 

17:29 - November 24, 2017

కరీంనగర్/సిద్దిపేట : కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఇవాంక ట్రంప్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో మీడియాతో మాట్లాడిన పొన్నం..ఇవాంక ట్రంప్‌ వస్త్రధారణపై విమర్శలు చేశారు. ఐకేపీ ఉద్యోగులు 20 రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని..ఇవాంక టూర్‌ కోసం 32 కోట్లు ఖర్చుపెడుతున్నారని.. అందులో 10 శాతం వెచ్చించినా వారి సమస్య తీరుతుందన్నారు. 

17:28 - November 24, 2017

సిరిసిల్ల : వ్యవసాయ మార్కెట్‌ యార్డులో మరమగ్గాల ఆధునీకరణ మేళాను చేనేత, జౌళి శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 150 కోట్ల రూపాయల నిధులతో ఈ పనులు చేపట్టారు. ఒక్కో మరమగ్గం ఆధునీకరణకు 40 వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. సిరిసిల్లలో 34 వేల పవర్‌లూమ్స్‌ ఉండగా... ఇప్పటికే నాలుగు మగ్గాలను ఆధునీకరించారు. ఈ మేళాలో దేశంలోని వివిధ మరమగ్గాల కంపెనీలు పాల్గొంటున్నాయి.

 

17:27 - November 24, 2017

యాదాద్రి : ముఖ్యమంత్రి కేసీఆర్‌ సతీసమేతంగా యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి బాలాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత ప్రధాన ఆలయం నిర్మాణ పనులను పరిశీలించారు. గర్భగుడి, రాజపోపురాలు, శివాలయం నిర్మాణాలను తనిఖీ చేశారు. పనులు జరుగుతున్న తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో యాదగిరిగుట్ట చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌... టీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం అధ్యక్షుడు తుంగ బాలు వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. 

17:25 - November 24, 2017

సిద్దిపేట : జిల్లా కొండపాక మండలం దుద్దెడ శివారులో శిక్షణ విమానం కూలిపోయింది. ల్యాండ్‌ అవుతున్న సమయంలో ఎయిర్‌ క్రాఫ్ట్‌లో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ఇద్దరు పైలెట్లు పారాచూట్ల సాయంతో కిందకు దూకారు. చిన్నచిన్న గాయాలతో పైలెట్లు తప్పించుకోలిగారు. హకీంపేట నుంచి వస్తున్న ఈ శిక్షణా విమానం గాలిలోనే పేలినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పైలట్లకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని చికిత్సనిమిత్తం సిద్దిపేట ఆస్పత్రికి తరలించారు. 

మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

మహబూబాబాద్ : జిల్లా తోర్రూరు మండలం మాటేడు వద్ద  ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ఓ చిన్నారితో సహా నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. 

కాసేపట్లో కడియం అత్యవసరం సమావేశం

హైదరాబాద్ : టీఆర్ టీపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఉన్నత విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి కాసేపట్లో అధికారలు, న్యాయనిపుణులతో సమావేశం కానున్నారు.  తీర్పును సవాల్ చయాలా లేక అమలు చేయాలా అన్న దానిపై సమావేశంలో చర్చించనున్నారు. 

16:36 - November 24, 2017

సన్ బర్న్ కు హైకోర్టు అనుమతి

హైదరాబాద్ : సన్‌ బర్న్‌పై పార్టీకి హైకోర్టు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. పార్టీ మొత్తాన్ని రికార్డు చేయాలని ఎక్సైజ్ మరియు లా అండ్ ఆర్డర్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 30 లోగా వీడియో రికార్డులను సమస్పించాలన్న కోర్టు తదుపరి విచారణను ఈనెల 30 కి వాయిదా వేసింది. 

సంపులో పడి ఇద్దరు కార్మికుల మృతి

యాదాద్రి : జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగిలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు ఇద్దరు కార్మికులు నీటిసంపులో పడి మృతి చెందారు. పుల్లంగాడి మనోహర్ రెడ్డికి చెందిన పాలీహౌస్ ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది.

బండ్ల గణేష్ కు జైలు శిక్ష విధించిన కోర్టు

హైదరాబాద్ : సినీ నిర్మాత బండ్ల గణేశ్‌కు హైదరాబాద్‌ ఎర్రమంజిల్‌ కోర్టు 6నెలల జైలుశిక్ష విధించింది. దాంతోపాటు మరో 15లక్షల 86వేల 550 రూపాయల జరిమానా కూడా విధించింది. రచయిత,దర్శకుడు వక్కంతం వంశీ దాఖలు చేసిన పటిషన్‌పై కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. టెంపర్‌ మూవీకి స్టోరీ అందించింనందుకు గాను తనకు నిర్మాత నుంచి రావాల్సిన డబ్బు అందలేదని వంశీ కోర్టును ఆశ్రయించారు. 

క్షీణిస్తున్న సంగీత ఆరోగ్యం

మేడ్చల్ : టీఆర్‌ఎస్‌ లీడర్‌ శ్రీనివాస్‌రెడ్డి ఇంటిముందు రెండో భార్య సంగీత న్యాయపోరాటం సాగిస్తూనే ఉంది. సంగీతకు మద్దతుగా గత ఆరు రోజులుగా మహిళా సంఘాల కార్యకర్తలు కూడా శ్రీనివాసరెడ్డి ఇంటిముందు బైఠాయించారు. అత్తింటి నుంచి సంగీతకు ఆర్థిక సాయం అందాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు సంగీతకు రాజీ కుదిర్చేందుకు ఎంపీ మల్లారెడ్డి ముందుకు వచ్చారు. సంగీత మామ బాల్‌రెడ్డితో ఆర్థికసాయంపై మాట్లాడతానంటున్నారు. 

15:43 - November 24, 2017

హైదరాబాద్ : చర్లపల్లిజైలుకు ఎంపీ మల్లారెడ్డి చేరుకున్నారు. జైల్లో ఉన్న శ్రీనివాస్‌రెడ్డిని కలిసి సంగీతకు న్యాయం జరిగేలా మాట్లాడతానని మల్లారెడ్డి చెప్పారు. సంగీతకు న్యాయం చేసేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నానన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

15:42 - November 24, 2017

హైదరాబాద్ : సన్‌ బర్న్‌పై పార్టీకి హైకోర్టు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. పార్టీ మొత్తాన్ని రికార్డు చేయాలని ఎక్సైజ్ మరియు లా అండ్ ఆర్డర్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 30 లోగా వీడియో రికార్డులను సమస్పించాలన్న కోర్టు తదుపరి విచారణను ఈనెల 30 కి వాయిదా వేసింది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

15:39 - November 24, 2017

యాదాద్రి : జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగిలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు ఇద్దరు కార్మికులు నీటిసంపులో పడి మృతి చెందారు. పుల్లంగాడి మనోహర్ రెడ్డికి చెందిన పాలీహౌస్ ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

15:38 - November 24, 2017
15:37 - November 24, 2017

భారత్ చెందిన మహిళాలు అమెరికాలో అరుదైనా గౌరవాన్ని అందుకుంటున్నారు. తాజాగా చెన్నై చెందిన మహిళలకు యూఎస్ లో అరుదైనా గౌరవం దక్కింది. సియటెల్ డిప్యూటీ మేయర్ గా చెన్నైకి చెందిన శిఖాలి రంగనాథన్ ఎంపికైయ్యారు.

17ఏళ్ల తర్వాత భారత్ మిస్ వరల్డ్ కీరిటం గెలవడం మిస్ వరల్డ్ గా హర్యానాకు చెందిన మనుషి చిల్లార్ నిలిచిన నేపథ్యంలో ఆమెపై ఓ పక్క ప్రశంసలు కురుపిస్తుంటే మరో పక్క కొందరు సంచలన వాఖ్యలు చేశారు.

భారత్ దేశ చరిత్రలో అతి పిన్న వయస్సులో గ్రామ సర్పంచ్ గా ఎన్నికైనా మహిళగా పేరు సాధించింది. అనంతరం తన గ్రామంలో అభివృద్ధి పనులు చేపుడుతూ అందరి మన్నానలు అందుకుంటుంది జాబ్న చౌహన్. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

15:37 - November 24, 2017

హైదరాబాద్ : సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి సచివాలయ ముట్టడికి వెళ్తున్న ఉపాధ్యాయ సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలనే డిమాండ్‌తో వారు సచివాలయ ముట్టడికి బయల్దేరారు. అయితే వారిని పోలీసులు మధ్యలోనే అడ్డుకొని బలవంతంగా అరెస్ట్ చేశారు.

 

15:36 - November 24, 2017

హైదరాబాద్ : సినీ నిర్మాత బండ్ల గణేశ్‌కు హైదరాబాద్‌ ఎర్రమంజిల్‌ కోర్టు 6నెలల జైలుశిక్ష విధించింది. దాంతోపాటు మరో 15లక్షల 86వేల 550 రూపాయల జరిమానా కూడా విధించింది. రచయిత,దర్శకుడు వక్కంతం వంశీ దాఖలు చేసిన పటిషన్‌పై కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. టెంపర్‌ మూవీకి స్టోరీ అందించింనందుకు గాను తనకు నిర్మాత నుంచి రావాల్సిన డబ్బు అందలేదని వంశీ కోర్టును ఆశ్రయించారు. దీనిపై ఎర్రమంజిల్‌ కోర్టు ఈ తీర్పునిచ్చింది. కాగా బండ్ల గణేశ్ అభ్యర్థన మేరకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది న్యాయస్థానం. 

15:34 - November 24, 2017

మేడ్చల్ : టీఆర్‌ఎస్‌ లీడర్‌ శ్రీనివాస్‌రెడ్డి ఇంటిముందు రెండో భార్య సంగీత న్యాయపోరాటం సాగిస్తూనే ఉంది. సంగీతకు మద్దతుగా గత ఆరు రోజులుగా మహిళా సంఘాల కార్యకర్తలు కూడా శ్రీనివాసరెడ్డి ఇంటిముందు బైఠాయించారు. అత్తింటి నుంచి సంగీతకు ఆర్థిక సాయం అందాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు సంగీతకు రాజీ కుదిర్చేందుకు ఎంపీ మల్లారెడ్డి ముందుకు వచ్చారు. సంగీత మామ బాల్‌రెడ్డితో ఆర్థికసాయంపై మాట్లాడతానంటున్నారు. అయితే తనకు లిఖితపూర్వకంగా హామీఇస్తే నిరసన విరమించుకుంటానని సంగీత స్పష్టం చేస్తున్నారు. 

కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు...

హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టుకు రెండో దశ అటవీ అనుమతులు లభించాయి. కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతులు మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుండి అధికారిక సమాచారం అందింది. 8 అటవీ డివిజన్లలో 3,221 హెక్టార్ల అటవీ భూమి కేటాయించింది. అటవీ సంరక్షణ చట్టం కింద అనుమతులు మంజూరు చేసింది. 

బండ్ల గణేష్ కు జైలు శిక్ష...

హైదరాబాద్ : చెల్లని చెక్కు కేసులో బండ్ల గణేష్ కు ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తున్నట్లు ఎర్రమంజిల్ కోర్టు తీర్పు చెప్పింది. జైలు శిక్షతో పాటు రూ. 15.86 లక్షల జరిమాన విధించింది. టెంపర్ సినిమా రచయిత వక్కంతం వంశీ ఫిర్యాదు చేసిన కేసులో కోర్టు తీర్పును వెలువరించింది. 

13:35 - November 24, 2017

హైదరాబాద్ : టీఆర్‌టీ(టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్) నోటిఫికేషన్ పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలుగు రాష్ట్రాల హైకోర్టు మొట్టికాయలు వేసింది. కొత్త జిల్లాల వారీగా కాకుండా పాత జిల్లాల వారీగా నోటిఫికేషన్ అభ్యర్థులు డిమాండ్ చేస్తూ హైకోర్టు మెట్లు ఎక్కారు. దీనిపై దశల వారీగా విచారణ జరిగింది. శుక్రవారం తుది తీర్పును వెలువరించింది. పాత జిల్లాల ప్రకారమే నోటిఫికేషన్ విడుదల చేయాలని టీఎస్పీఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రక్రియ గడువు డిసెంబర్ 15 వరకు పొడిగించాలని సూచించింది.

  • టీఆర్‌టీ ద్వారా 8,792 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ మొత్తం ఐదు నోటిఫికేషన్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
  • స్కూల్‌ అసిస్టెంట్లు 1941, పీఈటీ 416 పోస్టులు,
  • స్కూల్‌ అసిస్టెంట్లు (వ్యాయామ విద్య) 9, భాషా పండితులు 1011,
  • ఎస్‌జీటీ 5,415 పోస్టుల చొప్పున భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు విడుదల చేశారు.
  • వచ్చే ఏడాది ఫిబ్రవరి రెండో వారంలో పరీక్ష తేదీలను ప్రకటించనున్నట్టు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది.
  • స్కూల్‌ అసిస్టెంట్లు, ఎస్‌జీటీ, భాషా పండితుల పోస్టులకు టెట్‌ 20శాతం వెయిటేజీ కల్పించనున్నారు.
  • తాజా తీర్పుతో టీఎస్పీఎస్సీ, ప్రభుత్వ పెద్దలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. 
13:28 - November 24, 2017

విజయవాడ : సీఎం చంద్రబాబు నాయుడు నివాసం వద్ద కలకలం రేగింది. సీతానగరంలోని కృష్ణా నది ఒడ్డు తీరం వద్ద బాబు నివాసం ఉన్న సంగతి తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్న సమయంలో ఓ కారు తగలబడడంతో పోలీసుల్లో కలవరం మొదలైంది. వన్ వే ఉండడంతో భారీ ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. వెంటనే స్పందించిన పోలీసులు ఫైర్ ఇంజిన్ కు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పారు. కారులో ప్రయాణిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వారు ఎక్కడి నుండి వచ్చారు. ? ఎక్కడకు వెళుతున్నారు ? తదితర వివరాలను ఆరా తీస్తున్నారు. కారులోని ఏసీలో షార్ట్ సర్క్యూట్ రావడంతో మంటలు చెలరేగాయని, వెంటనే తామంతా దిగిపోయామని ప్రయాణీకులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. 

హైకోర్టులో టి.సర్కార్ కు ఎదురు దెబ్బ..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. 10 జిల్లా ప్రాతిపదికన టీఆర్టీ నోటిఫికేషన్ సవరించాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కొత్త జిల్లాల వారీగా కాకుండా పాత జిల్లాల ప్రాతిపదికనే నోటిఫికేషన్ వేయాలని ఆదేశించింది. 

13:06 - November 24, 2017

ఢిల్లీ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు పార్లమెంట్ వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకుంది. కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. పార్లమెంట్ సమావేశాలు అజెండాను ఖరారు చేసినట్లు సమాచారం. డిసెంబర్ 15 నుండి జనవరి 5 వరకు సమావేశాలు జరుగనున్నాయి. ట్రిపుల్ తలాక్, బీసీ కమిషన్ కు చట్టబద్ధత బిల్లులపై పార్లమెంట్ సమావేశాల్లో చర్చకు తీసుకరావాలని కేంద్రం యోచిస్తోంది.

గుజరాత్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పీఎం..కేంద్ర మంత్రులు ప్రచారంలో మునిగిపోయారు. దీనితో ఆలస్యంగా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు విపక్షాలు పలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఎన్నికలు జరిగిన సమయాల్లో ముందుగా లేదా..ఎన్నికలు అయిన అనంతరం సమావేశాలు జరిగాయని కేంద్రం పెద్దలు పేర్కొంటున్నారు. రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎన్నికల సందర్భంగా జీఎస్టీ లో మార్పులు..వివిధ సమస్యలను ఈ సమావేశాల్లో ప్రస్తావించాలని విపక్షాలు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. విభజన సమయంలో ఇచ్చిన హామీలు..ఒప్పందాలు...తదితర సమస్యలను ప్రస్తావించాలని తెలుగు రాష్ట్రాల ఎంపీలు నిర్ణయం తీసుకున్నారు. 

యాదాద్రిలో కేసీఆర్ దంపతులు...

యాదాద్రి : సీఎం కేసీఆర్ దంపతులు యాదాద్రికి చేరుకున్నారు. యాదాద్రి ఆలయ నిర్మాణ పనులపై ఆయన సమీక్షిస్తున్నారు. కేసీఆర్ దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వీరితో పాటు పలువురు మంత్రులు కూడా ఉన్నారు. 

సన్ బర్న్ పార్టీపై హైకోర్టులో పిటిషన్...

హైదరాబాద్ : సన్ బర్న్ పార్టీపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పార్టీలో మద్యం సరఫరా చేస్తారని, పార్టీకి 15 ఏళ్ల మైనర్లను అనుమతించడం చట్ట విరుద్ధమని, అనుమతి రద్దు చేయాలని యువజన కాంగ్రెస్ నేత పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను హైకోర్టు స్వీకరించింది. మధ్యాహ్నం దీనిపై విచారణ చేపట్టనుంది. 

12:19 - November 24, 2017

హైదరాబాద్ : భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంక నగర పర్యటనలో భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు హైదరాబాద్ సీపీ శ్రీనివాస రావు పేర్కొన్నారు. పర్యటనకు సంబంధించి భద్రత ఏర్పాట్లపై ఆయన మీడియాతో మాట్లాడారు. సుమారు 2వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు, పర్యటన సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు తెలిపారు. భద్రతా ఏర్పాట్ల కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నట్లు, ఇవాంక భద్రత ఏర్పాట్లపై అమెరికా సీక్రెట్ ఏజెన్సీతో గంటపాటు చర్చించినట్లు వెల్లడించారు. హెచ్ ఐసీసీ, ఫలక్ నుమాకు ప్రతినిధులను తీసుకెళ్లేటపుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని, అందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రధాని మోదీ, ఇవాంక ట్రంప్, ఇతర అతిథులకు ఫలక్ నుమాలో విందు ఏర్పాటు చేశారని, సదస్సుకు వచ్చే మరికొందరు ప్రతినిధులకు గోల్కొండ కోటలో విందు ఏర్పాట్లు చేశారని తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులతో భద్రత..ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని తెలిపారు. ఫలక్‌నుమా ప్యాలెస్, గోల్కొండ కోట ప్రాంతాల్లో పటిష్ట నిఘా పెట్టామన్నారు. 

భద్రాత ఏర్పాట్లు ముమ్మరం - సీపీ...

హైదరాబాద్ : ప్రధాన మంత్రి మోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంక పర్యటనకు భద్రతా ఏర్పాట్లు ముమ్మరం చేసినట్టు హైదరాబాద్ సీపీ శ్రీనివాసరావు వెల్లడించారు. పాతబస్తీలో 300 మంది పోలీసులతో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. 

మీర్జాలపురంలో డబుల్ బెడ్ రూం నిర్మాణాకి భూమి పూజ..

మహబూబ్‌నగర్: మూసాపేట మండలం మీర్జాలపురంలో మంత్రి లక్ష్మారెడ్డి పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా మీర్జాలపురంలో డబుల్‌బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. 

12:11 - November 24, 2017

గుంటూరు : ఏపీ రాష్ట్రంలో నూతన విద్యావిధానం ప్రవేశ పెట్టారు. క్లాస్ రూంలో ఉపాధ్యాయుడు పాఠాలు చెబితే రాష్ట్రంలోని వివిధ పాఠశాల్లోని విద్యార్థులు లైవ్ లో వీక్షించే విధానానికి శ్రీకారం చుట్టారు. తుళ్లూరు మండలం మందడం గ్రామంలోని జెడ్పీ హై స్కూల్ లో వర్చువల్ క్లాస్ ను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..క్లాసు రూంలో బయో మెట్రిక్ విధానం ప్రవేశ పెట్టనున్నట్లు తెలిపారు. ఒక ఉపాధ్యాయుడు ఒక ప్రాంతంలో క్లాస్ చెబితే రాష్ట్రంలోని అన్ని పాఠశాలలో ఉన్న విద్యార్థులు లైవ్ లో పాఠాలు వీక్షించే అవకాశం ఉందన్నారు. ఇందుకు 40 స్టూడియోలు ఏర్పాటు చేసి, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల చేత పాఠాలు చెప్పించడం జరుగుతుందన్నారు. కొత్త టీవీలు కూడా అందించడం జరుగుతుందని..ఇందులో ఇంటర్నెట్...వీడియో సౌకర్యం ఉంటుందన్నారు. ఏ సిలబస్ లో ఏ పాఠం కావాలో మరలా చూసుకొనే అవకాశం ఉంటుందన్నారు. ఒక వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందన్నారు. 

యాదాద్రికి చేరుకున్న సీఎం కేసీఆర్...

యాదాద్రి : సీఎం కేసీఆర్ యాదాద్రి కి చేరుకున్నారు. హెలికాప్టర్ ద్వారా అక్కడకు చేరుకున్న ఆయన యాదాద్రి ఆలయ పునర్ నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. 

కాంట్రాక్టర్ ఆత్మహత్యాయత్నం...

విజయవాడ : సున్నపు బట్టీలు సెంటర్ దారుణం చోటు చేసుకుంది. కాంట్రాక్టర్ కేసాని శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఏళ్ల తరబడి కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ కత్తితో పొడుచుకున్నాడు. గుంటూరు జిల్లా బాపట్ల వాసిగా తెలుస్తోంది. 

11:49 - November 24, 2017

హైదరాబాద్ : తనకు న్యాయం చేయాలని కోరుతూ పోరాటం చేస్తున్న సంగీతకు మద్దతు పెరుగుతోంది. భర్త శ్రీనివాస్ రెడ్డి ఇంటి ముందు ఆందోళన చేస్తున్న సంగీత పోరాటం ఆరో రోజుకు చేరుకుంది. ఆమెకు మహిళా సంఘాలు...వివిధ సంఘాలు మద్దతు తెలుపుతూ ఆందోళనలో పాల్గొంటున్నారు. ఆమెకు న్యాయం చేసేందుకు ఎంపీ మల్లారెడ్డి ముందుకొచ్చారు. సంగీత మామ అయిన బాల్ రెడ్డితో చర్చలు జరుపుతానని..ఆర్థిక సహాయం చేసేందుకు కృషి చేస్తానని ఎంపీ మల్లారెడ్డి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సంగీత మామ...ఇతర వారితో ఎంపీ మల్లారెడ్డి..మహిళా సంఘాల ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా టెన్ టివితో సంగీత మాట్లాడారు. తన దగ్గరకు అత్తా..మామ. రావాలని, వారితో మాట్లాడిన తరువాతే..స్పష్టమైన హామీనిచ్చిన తరువాతే ఆందోళన విరమిస్తానని సంగీత ఖరాఖండిగా చెప్పింది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

11:48 - November 24, 2017

మహారాష్ట్ర : రాష్ట్రంలోని భివండి ప్రాంతంలోని భక్తినగర్ లో మూడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరికొంతమందికి గాయాలయ్యాయి. భవనం కుప్పకూలడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కూలిన భవనంలో 14 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా ప్రదేశానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల కింద 20 మంది చిక్కుకుని ఉంటారని తెలుస్తోంది. ఐదుగురిని సహాయక సిబ్బంది రక్షించారు. స్లమ్ ఏరియాలో ఈ భవనం ఉండడంతో సహాయక చర్యలు చేపట్టడానికి ఆటంకం కలుగుతున్నట్లు తెలుస్తోంది. 

పార్లమెంట్ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం...

ఢిల్లీ : పార్లమెంట్ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. పార్లమెంట్ సమావేశాలు అజెండాను ఖరారు చేయనుంది. ట్రిపుల్ తలాక్, బీసీ కమిషన్ కు చట్టబద్ధత బిల్లులపై పార్లమెంట్ సమావేశావల్లో చర్చకు తీసుకరావాలని కేంద్రం యోచిస్తోంది. డిసెంబర్ 15 నుండి జనవరి 5 వరకు సమావేశాలు జరుగనున్నాయి. 

11:34 - November 24, 2017

చెన్నై : ఆర్కే నగర్ ఉప ఎన్నికకు ఈసీ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. డిసెంబర్ 21న ఎన్నికలు..డిసెంబర్ 24న ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు. జయలలిత మరణంతో ఆర్కే నగర్ అసెంబ్లీ సీటు ఖాళీ అయిన సంగతి తెలిసిందే. డబ్బు పంపిణీ, నిబంధనల ఉల్లంఘనతో గతంలో వాయిదా పడింది. తాజాగ మరోసారి షెడ్యూల్ ను ఎన్నికల సంఘం విడుదల చేసింది.

జయలలిత మరణం అనంతరం రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. పన్నీర్ సెల్వం తన మద్దతు దారులతో బయటకు వెళ్లిపోవడంతో అన్నాడీఎంకే రెండుగా చీలిపోయింది. అనంతరం నాటకీయ పరిణామాల మధ్య శశికళ జైలుకు వెళ్లింది. అనంతరం పన్నీర్..పళనీ వర్గాలు ఒక్కటయ్యాయి. పార్టీ గుర్తు కోసం ఇరువర్గాలు పోటీ పడ్డాయి. చివరకు గురువారం పన్నీర్..పళనీ వర్గాలకు రెండాకుల గుర్తును కేటాయిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఆర్కే నగర్ ఉప ఎన్నికలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి. 

సీబీఐ కోర్టుకు జగన్..

హైదరాబాద్ : వైసీపీ అధ్యక్షుడు జగన్ నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. అక్రమాస్తుల కేసులో ఆయన పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. 

ఆర్కే నగర్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల...

చెన్నై : తమిళనాడు ఆర్కే నగర్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. డిసెంబర్ 21 పోలింగ్..24న ఓట్ల లెక్కింపు జరుగనుంది. జయ మరణంతో ఆర్కే నగర్ స్థాపానికి ఉప ఎన్నిక జరిగింది. డబ్బు పంపిణీ, నిబంధనల ఉల్లంఘనతో గతంలో వాయిదా పడింది. తాజాగా మరోసారి ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసింది. 

10:29 - November 24, 2017

విజయవాడ : ఆంధప్రదేశ్‌ సచివాలయంలో భద్రత డొల్లేనా ? నిర్మాణంలో ఆధునిక టెక్నాలజీ ఉపయోగించామని చెబుతున్నా.. తరచు భద్రతా లోపాలు ఎందుకు తలెత్తుతున్నాయి ? ఉద్యోగులు అభద్రతాభావంతో పనిచేయాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి ? ఫైర్‌ సేఫ్టీ, ఎమర్జెన్సీ అలారమ్‌ సిస్టం సరిగా పనిచేయకపోవడానికి కారణం ఏంటి ? ఈ ప్రశ్నలు ఇప్పుడు అమరావతిలో హాట్‌ టాపిక్‌గా మారాయి. ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో వర్షం వస్తే నీరు లీకు అవుతంది. లిఫ్టులు తరచూ మొరాయిస్తున్నాయి. అకారణంగా ఎమర్జెన్సీ అలారమ్‌లు మోగే పరిస్థితులు ఉన్నాయి. ఏదైనా ప్రమాదం జరిగితే ఉద్యోగులు బయటకు వెళ్లేందుకు సరైన మార్గాలు లేవు. ఈ పరిస్థితులు.. అమరావతి సచివాలయ సిబ్బందిలో తీవ్ర అభద్రతను, ఆందోళనను కలిగిస్తున్నాయి.

హైదరాబాద్‌ నుంచి పరిపాలనను అమరావతికి తరలించాలన్న ఉద్దేశంతో సచివాలయాన్ని హడావుడిగా నిర్మించారు. నిర్మాణంలో ఆధునిక టెక్నాలజీ ఉపయోగించామని పాలకులు చెబుతున్నా.. వాస్తవిక పరిస్థితులు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయని ఉద్యోగులు అంటున్నారు. సచివాలయం భద్రత కోసం ఏర్పాటు చేసిన ఫైర్‌ సేఫ్టీ, ఎమర్జెన్సీ అలారమ్‌ సిస్టమ్స్‌లో తరచు తలెత్తున్న లోపాలు ఉద్యోగులను కలవరపెడుతున్నాయి. గందరగోళానికి గురి చేస్తున్నాయి. ఉద్యోగులు విధుల్లో తలమునకలై ఉన్న సమయంలో కొన్ని సందర్భాల్లో ఒక్కసారిగా ఎమర్జెన్సీ అలారమ్‌ మోగడంతో... భయంతో బయటకు పరుగులు తీయాల్సి వస్తోంది. ఒకటి కాదు... రెండు కాదు.. ఏడాది కాలంలో చాలాసార్లు ఎమర్జెన్సీ అలారమ్‌ మోగిన సందర్భాలను ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు. ఏం జరుగుతుందో అర్థంకాక.. ప్రతిసారి భయంతో పరుగులుతీయడం.. తనిఖీలు, సోదాల తర్వాత సాంకేతిక లోపంతో ఉత్తిగానే అలారం మోగిందని తేలడంతో ఉద్యోగులు ఊపిరి పీల్చుకుంటున్నారు. భద్రత కోసం ఏర్పాటు చేసిన ఈ విధానాలు తరచూ సమస్యలతో.. లేనిపోని తలనొప్పులు తెచ్చి పెడుతున్నాయని ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

సాంకేతిక లోపంతో ఎమర్జెన్సీ అలారమ్‌ సిస్టమ్‌ మోగడమే కాదు... లిఫ్టులు కూడా తరచూ మొరాయిస్తున్నాయి. రెండు వేల మంది ఉద్యోగులు, 40 మంది ఐఏఎస్‌ అధికారులు, 25 మంది మంత్రులు ఉండే సచివాలయంలో ఇలాంటి పరిస్థితులు నెలకోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. నిర్మాణంలో నాసిరకం టెక్నాలజీ వాడేరేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగుల ప్రవేశానికి, బయటకు రావడానికి ఒకే మార్గం అందుబాటులో ఉంది. సచివాలయంలోని ప్రతి బ్లాక్‌ను అనుసంధానం చేస్తూ నిర్మించిన రెండు మార్గాలు భద్రతా కారణాలతో పోలీసులు మూసివేశారు. దీంతో ఫైర్‌ అలారమ్‌, ఎమర్జెన్సీ అలారమ్‌ మోగినప్పుడు ఉద్యోగులంతా ఒకే మార్గం నుంచి బయటకు పరుగులు తీయాల్సి వస్తున్న సందర్భాల్లో తొక్కిసలాటలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షం వస్తే నీరు లీకైన సందర్భాల్లో పనిచేసే పరిస్థితులు లేవు. ఈ పరిస్థితుల్లో సచివాలయం ఎంతవరకు భద్రం అంటూ.. ఉద్యోగులు, అధికారులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

10:27 - November 24, 2017

మహబూబ్ నగర్ : మళ్లీ రేవంత్‌రెడ్డిని గులాబీ పార్టీ టార్గెట్‌ చేసింది. నిన్నమొన్నటి వరకు రాజీనామాను ఆయన వ్యక్తిగత వ్యవహారంగా చెప్పుకొచ్చిన టీఆర్‌ఎస్‌.. తాజాగా రాజీనామా అంశాన్ని మళ్లీ లెవనెత్తుతోంది. కొడంగల్‌లో తమ పట్టు పెంచుకున్న అధికార పార్టీ... దమ్ముంటే రాజీనామా లేఖను స్పీకర్‌కు ఇవ్వాలని రేవంత్‌ను డిమాండ్‌ చేస్తోంది. తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి వ్యవహారాన్ని అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ సీరియస్‌గా తీసుకుంటోంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించిన రేవంత్ రాజీనామా పత్రాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు అందచేశారు. రెండూ మూడు వారాలుగా రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారం చర్చనీయంశంగా మారినా....అధికార పార్టీ సైలెంట్ గా ఉంది. రాజకీయంగా కొడంగల్‌లో పట్టు సాధించేందుకు తమ వంతు ప్రయత్నాలను మొదలు పెట్టింది. ఓ వైపు నియోజకవర్గంలో రాజకీయంగా పావులు కదుపుతూ..... రేవంత్‌ను ఆత్మరక్షణలో వేసేందుకు రెడీ అవుతోంది.

ఇప్పటికే కొడంగల్ నియోజకవర్గంలో ఇతర పార్టీల నేతలను పెద్ద ఎత్తున కారెక్కించుకున్న అధికార పార్టీ ఉప ఎన్నికలు వచ్చినా..... రాకపోయినా ఆ నియోజకవర్గంలోనే రేవంత్‌కు షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నామన్న సంకేతాలను ఇస్తోంది. మంత్రి హరీష్‌రావ్ కొడంగల్‌పై ప్రత్యేకంగా సమీక్షలు నిర్వహిస్తూ రాజకీయంగా గులాబి పార్టీ పట్టు పెంచుకునే ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. నియోజకవర్గంపై ఓ అంచనాకు వచ్చిన గులాబి పార్టీ నేతలు దమ్ముంటే రాజీనామా లేఖను తెలంగాణా స్పీకర్ కు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రాజీనామా ఇచ్చినా.....ఇవ్వకపోయినా ఈ వ్యవహారం రేవంత్‌ను ఇరుకున పెట్టే అవకాశం ఉందని అధికార పార్టీ నేతలు అంటున్నారు. రాజీనామా ఇస్తే ఆమోదించేందుకే అధికార పార్టీ మొగ్గు చూపుతోంది. రాజీనామా ఇవ్వకపోతే రేవంత్ రాజీనామా వ్యవహారం డ్రామా అని ప్రజాక్షేత్రంలో రేవంత్‌ను ఎండగట్టేందుకు అధికార పార్టీ సిద్ధమవుతోంది.

10:10 - November 24, 2017

అనంతపురం : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తల్లి..కుమారుడిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. బత్తలపల్లి (మం), జ్వాలాపురంలో తల్లి వెంకట లక్ష్మీ (50) తో కుమారుడు గంగాధర్ (30) నివాసం ఉంటున్నాడు. గురువారం రాత్రి వీరు పడుకున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు బండరాయితో తలలు పగులగొట్టి అతి దారుణంగా చంపారు. హత్యకు ఆస్తి తగాదాలే కారణమని బంధువులు పేర్కొంటున్నారు. వీరిని ఎవరు చంపారనేది తెలియరావడం లేదు. పోలీసులు రంగ ప్రవేశం చేసి నిందితుల కోసం గాలింపులు చేపట్టారు. 

తల్లి..కుమారుడి దారుణ హత్య...

అనంతపురం : బత్తలపల్లి (మం), జ్వాలాపురంలో తల్లి వెంకటలక్ష్మి (50), కుమారుడు గంగాధర్ (30)లను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. 

భీవండిలో కుప్పకూలిన భవనం..

మహారాష్ట్ర : భీవండి ప్రాంతంలోని నాలుగంతస్తుల బిల్డింగ్ కుప్పకూలింది. ఈఘటనలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. 

09:32 - November 24, 2017
09:11 - November 24, 2017
09:07 - November 24, 2017

హైదరాబాద్ : సీపీఎస్ రద్దు చేయాలని హైదరాబాద్ సదస్సుకు వెళుతున్న ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు రాజశేఖరరెడ్డి, యూటీఎఫ్ కార్యదర్శి ఎడ్ల సైదులుతో సహా 50 మందిని అరెస్టు చేశారు. సీపీఎస్ రద్దు చేయాలని కోరుతూ ఎస్వీకేలో రాష్ట్రస్థాయి విద్యా సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు వివిధ జిల్లాల నుండి ఉపాధ్యాయులు..టీచర్లు తదితరులు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కానీ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పోలీసులు ముందస్తు అరెస్టులకు తెరలేపారు. ఈ సందర్భంగా నల్గొండ టూ టౌన్ పీఎస్ లో ఉన్న యూటీఎఫ్ నేతలతో టెన్ టివి ముచ్చటించింది. ఉద్యోగ, ఉపాధ్యాయులకు సీపీఎస్ విధానం ఎంతో నష్టం కలుగ చేస్తుందని..అందులో భాగంగా హైదరాబాద్ లో ఎస్వీకే లో సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. స్థానిక పోలీసులు అనుమతినిచ్చారని, సదస్సులో పాల్గొనేందుకు వెళుతున్న వారిని అరెస్టులు చేయడం అప్రజాస్వామికమన్నారు. అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని దుయ్యబాట్టారు. 

08:37 - November 24, 2017

చిత్తూరు : ప్రముఖ నటి 'నమిత' వివాహం ఘనంగా జరిగింది. ఇస్కాన్ ఆలయంలో ఈ వివాహం జరిగింది. మూడుముళ్లతో నమిత - వీరేంద్ర చౌదరి ఒక్కటయ్యారు. ఈ పెళ్లి వేడుకకు సినీ నటి రాధిక, శరత్ కుమార్, నమిత కుటుంబసభ్యులు, ఇతర సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఉదయం 5గంటల 30నిమిషాలకు వివాహం జరిగింది.

సింధూరి పార్క్ హోటల్ లో 22న సంగీత్ తో నమిత పెళ్లి వేడుక ప్రారంభమైంది. సింధూరి పార్క్ హోటల్ లో సాయంత్రం గం.7.30 నుంచి సంగీత్ నిర్వహించారు. ఇదిలా ఉంటే పెళ్ళయ్యాక కూడా సినిమాల్లో కొనసాగుతానని నమిత పేర్కొన్నట్లు తెలుస్తోంది. తెలుగులో 'సొంతం' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ బొద్దుగుమ్మ, వెంకటేష్‌తో 'జెమిని', బాలకృష్ణతో 'సింహా' తదితర సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఎక్కువగా తమిళ సినిమాలే చేస్తోంది.

08:23 - November 24, 2017

తమిళనాడు : చెన్నైలోని సత్యభామ విశ్వవిద్యాలయంలో తెలుగు విద్యార్ధిని ఆత్మహత్య కలకలం సృష్టించింది. ఇంటర్నల్ ఎగ్జామ్స్‌లో కాపీ కొట్టిందని రాగ మౌనిక అనే విద్యార్ధినిని అధ్యాపకులు బయటకు పంపించేశారు. అవమాన భారంతో మౌనిక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. యాజమాన్యం తీరువల్లే మౌనిక చనిపోయిందంటూ తోటి విద్యార్ధులు కాలేజ్‌ ఫర్నిచర్‌కు నిప్పుపెట్టారు. విద్యార్ధుల ఆందోళన నేపథ్యంలో యూనివర్సిటీకి జనవరి 1వరకు సెలవులు ప్రకటించారు.

చెన్నై సత్యభామ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ విద్యార్థిని రాగ మౌనిక ఆత్మహత్య కలకలం సృష్టించింది. హైదరాబాద్‌ లింగంపల్లికి చెందిన మౌనిక యూనివర్సిటీలో కంప్యూటర్ ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆమె తండ్రి రాజారెడ్డి ఓ కంపెనీలో జీఎమ్‌గా పనిచేస్తున్నారు. రెండురోజుల క్రిందట జరిగిన ఇంటర్నల్ ఎగ్జామ్‌లో మౌనిక కాపీ కొట్టిందని అధ్యాపకులు ఆమెను ఎగ్జామ్‌ హాల్‌ నుంచి బయటకు పంపించేశారు. తరువాత పరీక్షలకు కూడా అనుమతి ఇవ్వలేదు. దీంతో అవమాన భారంగా భావించిన మౌనిక హాస్టల్ గదిలో ఉరివేసుకుని చనిపోయింది.

ఆత్మహత్యకు ముందు అదే యూనివర్శిటీలో చదువుతున్న తన సోదరుడికి మౌనిక వీడియో కాల్ చేసింది. వెంటనే ఆమె సోదరుడు మౌనిక దగ్గరకు వెళ్లేంతలో సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. చివరిగా తన మిత్రులందరికీ లవ్‌ యూ ఆల్‌, మిస్ యూ ఆల్ అని మౌనిక మెసేజ్ పెట్టింది. అనంతరం ఆత్మహత్యకు పాల్పడింది. తాను సమయానికి వెళ్లి ఉంటే ఇంతటి దారుణం జరిగి ఉండేది కాదని ఆమె సోదరుడు ఆవేదన వ్యక్తం చేశారు.

యూనివర్సిటీకి చేరుకున్న రాగ మౌనిక తండ్రి రాజారెడ్డి కన్నీరు మున్నీరయ్యాడు. సత్యభామ యూనివర్సిటీపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరోవైపు మౌనిక మరణవార్త తెలుసుకున్న తోటి విద్యార్థులు కాలేజ్ యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మేనేజ్‌మెంట్‌ తీరువళ్లే మౌనిక ఆత్మహత్యకు పాల్పడిందని ఆరోపిస్తూ కాలేజ్‌ ఫర్నిచర్‌కు నిప్పు పెట్టారు. మంటలు తీవ్రతరం కావడంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చారు. యూనివర్సిటీలో ఆందోళన నేపథ్యంలో యాజమాన్యం జనవరి 1వరకు సెలవులు ప్రకటించింది. మౌనిక మృతదేహానికి పోస్టుమార్టం పూర్తవడంతో తల్లిదండ్రులు ఆమె స్వస్థలమైన నెల్లూరు జిల్లా డెక్కిలి మండలం మాటమడుగుకు తరలించారు. అక్కడే ఆమెకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 

ఫలక్ నుమాలో పోలీసుల తనిఖీలు...

హైదరాబాద్ : ఇవాంక పర్యటన సందర్భంగా ఫలక్ నుమా పరిసర ప్రాంతాల్లో సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో తనిఖీలు జరిగాయి. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. 

తిరుపతిలో నమిత వివాహం...

చిత్తూరు : ప్రముఖ సినీ నటి నమిత వివాహం తిరుపతిలోని ఇస్కాన్ లో ఘనంగా జరిగింది. వీరేంద్ర చౌదరి అనే వ్యక్తితో వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకకు రాధిక, శరత్ కుమార్, సన్నిహితులు హాజరయ్యారు. 

ఉప్పల్ లో దారుణం...

హైదరాబాద్ : ఉప్పల్ లో దారుణం చోటు చేసుకుంది. పుట్ పాత్ పై నిద్రిస్తున్న ఓ వ్యక్తి పై నుండి వాహనం దూసుకెళ్లింది. ఈ ఘటనలో వ్యక్తి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి పేరు మధమోహన్ అని, ఓ ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేస్తాడని తెలుస్తోంది. 

కొనసాగుతున్న సంగీత పోరాటం..

హైదరాబాద్ : సంగీత పోరాటం ఆరో రోజుకు చేరుకుంది. కూతురితో కలిసి భర్త ఇంటి ఎదుట సంగీత ధర్నా చేస్తున్న సంగతి తెలిసిందే. అత్త..మామ..తనకు హామీ ఇచ్చే వరకు దీక్ష కొనసాగిస్తానని సంగీత స్పష్టం చేస్తోంది. 

07:27 - November 24, 2017

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్ కొద్ది రోజుల్లో నగరానికి రానున్నారు. నగరంలో జరిగే ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సులో పాల్గొనేందుకు ఈమె ఇక్కడకు రానున్నారు. ఈ సదస్సులో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏర్పాట్లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కూరగాయల ధరలు..ఇతర సరుకులు ధరలు పైకి ఎగబాగుతుండడంతో పేద..సామాన్య..మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో వీరయ్య (నవ తెలంగాణ ఎడిటర్, విశ్లేషకులు), పాశం సత్యనారాయణ (టీఆర్ఎస్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

ఉపాధ్యాయ..ఉద్యోగ సంఘాల నేతల అరెస్టు...

నల్గొండ : సీపీఎస్ రద్దు చేయాలని హైదరాబాద్ సదస్సుకు వెళుతున్న ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నేతలను అరెస్టు చేశారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు రాజశేఖరరెడ్డి, యూటీఎఫ్ కార్యదర్శి ఎడ్ల సైదులుతో సహా 50 మందిని అరెస్టు చేశారు. 

పట్టాలు తప్పిన రైలు..ఇద్దరు మృతి...

ఉత్తర్ ప్రదేశ్ : బాందాలో వాస్కోడిగామా - పాట్నా ఎక్స్ ప్రెస్ 13 బోగీలు పట్టాలు తప్పాయి. ఇద్దరు మృతి చెందగా 8 మందికి గాయాలయ్యాయి. 

నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రికి వెళ్లనున్నారు. లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అభివృద్ధి పనులు, పెద్దగుట్టపై టెంపుల్ సిటీ పనులను సీఎం చంద్రబాబు పరిశీలించనున్నారు. 

కొలువులకై కొట్లాట సభపై తుది తీర్పు..

హైదరాబాద్ : కొలువులకై కొట్లాటపై హైకోర్టు తుది తీర్పు ఇవ్వనుంది. నగరంలో పలు కార్యక్రమాలు జరుగుతున్నందున సభకు అనుమతినివ్వమని పోలీసులు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. 

జగన్ పాదయాత్రకు ఒక రోజు బ్రేక్...

హైదరాబాద్ : వైసీపీ అధ్యక్షుడు జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రకు నేడు ఒక రోజు విరామం ఇవ్వనున్నారు. ప్రస్తుతం ఆయన కర్నూలు జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. సీబీఐ కోర్టుకు హాజరు కానున్న నేపథ్యంలో ఒక రోజు బ్రేక్ ఇవ్వనున్నారు. 

06:43 - November 24, 2017

దేశంలో మహిళలకు సరైన రక్షణ ఉందా.. పెళ్లైయ్యాక పుట్టింది ఆడపిల్లని.. భార్యని వదిలేస్తే.. ఆ భార్యకి న్యాయం చేసే వ్యవస్థ ఉందా.. ఇప్పుడు సంగీత ఆందోళన తర్వాత వినిపిస్తున్న ప్రశ్నలివి. ఈ అంశంపై టెన్ టివి జనపధంలో ఐద్వా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

06:39 - November 24, 2017

హైదరాబాద్ : తెలంగాణలో టెన్త్‌క్లాస్‌ పబ్లిక్‌ పరీక్షలో మాస్‌ కాపీయింగ్‌కు అడ్డుకట్టపడనుంది. ఇక నుంచి ఎవరి స్కూల్‌లో వారికి సెంటర్ల ఏర్పాటుకు పాఠశాల విద్యాశాఖ చెక్‌ పెట్టింది. వచ్చే ఏడాది మార్చి 15న ప్రారంభమయ్యే టెన్త్‌ ఫైనల్‌ ఎగ్జామ్స్‌ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించింది. మాస్‌ కాపీయింగ్‌, హైటెక్‌ కాపీయింగ్‌ను అరికట్టేందుకు పక్కా వ్యూహాలు రచిస్తోంది పాఠశాల విద్యాశాఖ. పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో కాపీరాయుళ్ల ఆటకట్టించేందుకు పాఠశాల విద్యాశాఖ రెడీ అయ్యింది. మాస్‌ కాపీయింగ్‌కు పురిగొల్పుతున్న సెల్ఫ్‌ సెంటర్ల విధానానికి చెక్‌పెట్టేలా రంగం సిద్ధమైంది. దాదాపు ఐదున్నర లక్షల మంది విద్యార్థులు రాసే టెన్త్‌ ఎగ్జామ్స్‌ను ఈసారి పటిష్టంగా నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ సన్నద్ధమైంది. పదో తరగతి పరీక్షల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించింది. మాస్‌ కాపీయింగ్‌ ఎక్కువగా జరిగే పాఠశాల జాబితా తయారు చేసింది. ఇందులో మాస్‌ కాపీయింగ్‌ను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.

టెన్త్‌ పరీక్షల్లో ప్రధానంగా సెల్ఫ్‌ సెంటర్ల వ్యవస్థకు స్వస్తి పలకాన్ని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటికే రాష్ట్రంలో జంబ్లింగ్‌ విధానం అమలులో ఉన్నప్పటికీ విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యంతో కొన్ని ప్రైవేట్‌ పాఠశాల్లో ఇప్పటికీ సెల్ఫ్‌ సెంటర్లు కొనసాగుతున్నాయి. ఆయా పాఠశాలల్లో ఉండే ఇన్విజిలేటర్లను, అధికారులను యాజమాన్యాలు మచ్చిక చేసుకుని మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడుతున్నారనే ఫిర్యాదులు విద్యాశాఖకు అందాయి. అంతేకాదు.. కొన్ని ప్రైవేట్‌ స్కూల్స్‌తోపాటు సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలల్లోనూ సెల్ఫ్‌సెంటర్ల కొనసాగుతున్నట్టు అధికారులు గుర్తించారు. సెల్ఫ్‌ సెంటర్లు ఉన్న స్కూల్స్‌ను మాస్‌ కాపీయింగ్‌ కూడా ఎక్కువగా జరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు. దీంతో మాస్‌ కాపీయింగ్‌కు చెక్‌పెట్టేందుకు సెల్ఫ్‌ సెంటర్లను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

సిట్టింగ్‌ స్క్వాడ్స్‌గా రెవెన్యూ విభాగానికి చెందిన వారుగానీ, విద్యాశాఖేతర అధికారులను కానీ నియమించాలనే అంచనాకు పాఠశాల విద్యాశాఖ వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా పరీక్ష జరిగే కేంద్రాల్లో ఇదే విధానం అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. సిట్టింగ్‌ స్క్వాడ్‌గా విద్యాశాఖకు చెందిన అధికారులు ఉండడంతో వారు... ప్రైవేట్‌, కార్పొరేట్‌ స్కూళ్ల ఒత్తిడికి లొంగి, మాస్‌ కాపీయింగ్‌కు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో విద్యాశాఖేతరులను స్క్వాడ్స్‌గా నియమించాలనే నిర్ణయం తీసుకున్నారు. ఇదేకనుక అమలైతే పదో తరగతి పరీక్షల్లో చాలా వరకు మాస్‌ కాపీయింగ్‌ను అరికట్టవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

06:37 - November 24, 2017

హైదరాబాద్ : ఐదురోజులుగా అత్తింటి అరాచకాలపై పోరాటం చేస్తున్న సంగీత ఆందోళనపై ఉత్కంఠ రేపుతుంది...న్యాయం జరిగేవరకు కదిలేది లేదంటున్న సంగీతకు ప్రజాసంఘాలు అండగా నిలిచాయి...మరోవైపు సంగీతకు న్యాయం చేసేందుకు ప్రజాప్రతినిధులు చేస్తున్న ప్రయత్నాలు సఫలం కాలేదు...కొన్ని గంటల్లోనే ఈ ఆందోళనకు తెరపడేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఐదు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడలేదు..మరికొన్ని గంటలు పట్టే అవకాశం ఉంది...ప్రజాసంఘాలు.. మరోవైపు ప్రజాప్రతినిధులు..ఇంకోవైపు పోలీసులు..అన్ని రకాలుగా చర్చలు జరుపుతూ సంగీతకు న్యాయం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు కొనసాగుతున్నాయి...ఐదో రోజుకు ఆందోళన చేరడంతో ఉత్కంఠగా మారింది..రోజు రోజుకు సంగీతకు పెరుగుతున్న మద్దతుతో పాటు యావత్ రాష్ట్రం మొత్తం ఆమెకు చేసే న్యాయం కోసం ఎదురుచూస్తున్నారు...దీంతో రంగంలోకి దిగిన ఎంపీ మల్లారెడ్డి సంగీతను కలిసి న్యాయం చేసే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

ఇదిలా ఉండగా రెండు కుటుంబాల వైపు నుంచి చర్చలు జరుపుతూనే సంగీత చేస్తున్న డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న ఎంపీ మల్లారెడ్డి మరోసారి ఆమెను పరామర్శించారు...కొన్ని గంటల్లోనే ఆమె పోరాటానికి తెరపడుతుందంటున్నారు. భర్త చేసిన మోసంపై ఐదు రోజులుగా హైదరాబాద్‌ బోడుప్పల్‌లో అత్తారింటి ముందు ఆందోళన చేస్తున్న సంగీత తన కూతురు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఆర్థికపరమైన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తుంది..మరోవైపు శ్రీనివాసరెడ్డి భార్యగా తనకు సమాన హక్కులు కల్పించాలంటోంది...స్థిర,చర ఆస్తుల్లో సమాన భాగం కల్పించాలంటున్న సంగీత న్యాయం జరిగితేనే కదిలేదంటోంది.

ఇక మరోవైపు సంగీత పెట్టిన కేసులో పోలీసులు మామ బాల్‌రెడ్డి,అత్త ఐలవ్వలతో మరిదిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు..ఏ 2గా కేసులో ఉన్న ఐలవ్వపై కేసులు పటిష్టంగా ఉండడంతో బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది..ఇక మామ బాల్‌రెడ్డి,మరిదికి బెయిల్ ఇచ్చింది...అయితే ఇంతదాకా వచ్చాక చట్టపరంగానే చూసుకుంటామంటున్న బాల్‌రెడ్డి సంగీతతో సెటిల్‌మెంట్‌కు నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది..మరోవైపు సంగీతకు మద్దతు తెలుపుతున్న వివిధ సంఘాలు పోరాటం కంటిన్యూ చేస్తామంటున్నాయి.

06:33 - November 24, 2017

హైదరాబాద్‌ : మెట్రో రైలుకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖ నిర్ణయించింది. మెట్రో రైలు కార్పొరేషన్‌ ప్రత్యేక ఏర్పాట్లు చేసుకునే వరకు జంటనగరాల్లోని మూడు కమిషనరేట్ల పోలీసులే భద్రతను పర్యవేక్షించనున్నారు. ఇందుకు ఎస్పీ స్థాయి అధికారిని ప్రత్యేకంగా నియమించారు. హైదరాబాద్‌ మెట్రో రైలు ఈనెల 28 నుంచి ప్రజలకు అందుబాటులోకి రానుంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా మెట్రో రైల్‌ ప్రారంభం కానుంది. ఆ మరుసటి రోజు.. అంటే ఈనెల 29 నుంచి ప్రజా రవాణా ప్రారంభమవుతుంది. మెట్రో రైళ్లు, స్టేషన్లలో భద్రతా బాధ్యతలను సిటీ పోలీసులు చేపట్టారు. నాగోలు-అమీర్‌పేట, అమీర్‌పేట-మియాపూర్‌ మార్గాల్లో 30 కి.మీ. మేర మెట్రో రైలు ప్రజలకు అందుబాటులోకి రాబోతోంది. అమీర్‌పేట, పరేడ్‌ గ్రౌండ్‌ మెట్రో స్టేషన్లలో ఒక్కో పోలీసు స్టేషన్‌ ఏర్పాటు చేస్తారు. ఈ మార్గాల్లోని మిగిలిన స్టేషన్లలో ఒక్కో పోలీసు అవుట్‌ పోస్టు అందుబాటుకి తెస్తారు. చీమ చిటుక్కుమన్నా ఇట్టే పసికట్టేలా హైడెఫ్నేషన్‌ సీసీ టీవీ కెమెరాలతో భద్రతను పర్యవేక్షిస్తారు. ప్రతి మెట్రో స్టేషన్‌లో కూడా కమాండ్‌ కంట్రోల్‌ ఏర్పాటుచేసి, వీటిని సిటీ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని ప్రధాన కమాండ్‌ కంట్రోల్‌ రూముతో అనుసంధానం చేస్తారు.

భద్రత కోసం సాయుధ పోలీసు బృందాలను నియమిస్తారు. ప్రత్యేకంగా నాలుగు డాగ్‌ స్క్వాడ్‌లను అందుబాటులో ఉంచుతారు. బ్యాగులు, లగేజీ తనిఖీ కోసం స్కానర్లు ఏర్పాటు చేస్తారు. మెట్రో స్టేషన్లలో ప్రవేశించే ప్రతి ఒక్కరినీ తనిఖీ చేసేచేందుకు అధునాతన మెటల్‌ డిటెక్టర్లను ఏర్పాటు చేస్తున్నారు. బోగీల్లో బేబుదొంగలు, ఇతరేతర నేరాలకు పాల్పడేవారిని అరికట్టేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపనున్నారు. మెట్రో రైల్వే ష్టేషన్ల వద్ద ట్రాఫిక్‌ నియంత్రణ, పార్కింగ్‌కు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈనెల 28న ప్రధాని నరేంద్ర మోదీ మెట్రో రైలు ప్రారంభించే మియాపూర్‌లో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. మియాపూర్‌ నుంచి జేఎన్‌టీయూ వరకు, ఇక్కడ నుంచి మళ్లీ మియాపూర్‌ వరకు మెట్రో రైల్లోనే మోదీతో సహా వీఐపీలు ప్రయాణం చేయనున్న నేపథ్యంలో మూడంచెల భద్రతా వలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 

06:26 - November 24, 2017

హైదరాబాద్ : ఒక్క షో ... ఇప్పుడు తెలంగాణలో సెగలు పుట్టిస్తోంది. టీఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌ల మధ్య మాటలు మంటలు రేపుతోంది. అడ్డుకుంటామని కాంగ్రెస్‌ అంటే.. జరిపి తీరుతామని సర్కార్‌ అంటోంది. ఇంతకు ఏంటా షో అనుకుంటున్నారా.. అదే గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించనున్న సన్‌బర్న్‌ షో.. కాంగ్రెస్‌ -టీఆర్‌ఎస్‌ మధ్య డైలాగ్‌ వార్‌కు.. ఇప్పుడు సన్‌ బర్న్‌ షో ఆజ్యం పోసింది. శుక్రవారం గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించనున్న ఈ సన్‌ బర్న్‌ షోను అడ్డుకుంటామని చిట్‌చాట్‌లో రేవంత్‌ రెడ్డి ప్రకటించడంతో.. ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం రాజుకుంది . సన్‌ బర్న్‌ షోలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతాయని... గోవా, ఢిల్లీ, కర్నాటక లాంటి ప్రభుత్వాలు ఈ షోను నిషేధించాయని.. కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. మరి తెలంగాణ ప్రభుత్వం ఈ షోకు ఎలా అనుమతి ఇచ్చిందని ప్రశ్నిస్తున్నారు.

యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు సన్‌ బర్న్‌ షోకు అనుమతులు రద్దు చేయాలంటూ అబ్కారీ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. క్రీడా మైదానాలలో పబ్‌లు, డ్రగ్స్‌ పార్టీలు నిర్వహించడమేంటని.. ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే టీఆర్‌ఎస్‌ నేతలు మాత్రం కాంగ్రెస్‌ విమర్శలను కొట్టిపారేస్తున్నారు. మ్యూజికల్‌ నైట్‌ షోకు అనుమతి ఇస్తే.. కాంగ్రెస్‌ కావాలనే రాద్ధాంతం చేస్తుందని ఆరోపిస్తున్నారు. ఆ షోలో డ్రగ్స్‌ వాడతారనడంలో నిజం లేదని అన్నారు.

06:24 - November 24, 2017

హైదరాబాద్ : ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన ఖరారు అయ్యింది. ఈనెల 28న ప్రధాని హైదరాబాద్‌ పర్యటనకు రానున్నారు. మెట్రోరైలును ప్రారంభించడంతోపాటు.. హెచ్‌ఐసీసీలో జరిగే ప్రపంచ వ్యాపారవేత్తల సదస్సులో పాల్గొననున్నారు. ప్రధాని పర్యటన కోసం ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.
మధ్యాహ్నం 2.30కు మోదీ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.
మియాపూర్‌కు హెలికాప్టర్‌లో వెళ్లనున్నారు.
మియాపూర్‌లో మెట్రోరైలు పైలాన్‌ను ప్రారంభిస్తారు.
మియాపూర్ నుంచి కూకట్‌పల్లి వరకు మెట్రోరైలులో మోదీ ప్రయాణించనున్నారు. తిరిగి అదే మెట్రో రైలులో కూకట్‌పల్లి నుంచి మియాపూర్ వరకు మోదీ ప్రయాణిస్తారు.
మియాపూర్ నుంచి హెచ్‌ఐసీసీకి హెలికాప్టర్‌లో వెళ్తారు.
అదే రోజు సాయంత్రం 4గంటలకు హెచ్‌ఐసీసీలో జరిగే ప్రపంచ వ్యాపారవేత్తల సదస్సుల్లో ప్రధాని మోదీ పాల్గొంటారు.
మోదీతోపాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూతురు ఇవాంకా ట్రంప్‌, సీఎం కేసీఆర్‌ పాల్గొంటారు.
అనంతరం హెచ్‌ఐసీసీ నుంచి రోడ్డు మార్గంలో ప్రధాని ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వెళ్తారు. ఇవాంకా, జీఈఎస్ ప్రతినిధులకు ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రధాని మోదీ విందు ఇవ్వనున్నారు.
రాత్రి 8.45 గంటలకు విందు కార్యక్రమం ఉంటుంది. విందు తర్వాత శంషాబాద్ విమానాశ్రయం వెళ్లి.. అక్కడి నుంచి మోదీ ఢిల్లీ వెళ్తారు.

మోదీ పర్యటన ఖరారు కావడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీసింగ్‌ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రధాని పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. బేగంపేట విమానాశ్రయంలో ప్రధానమంత్రిని స్వాగతించడానికి ఘనంగా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రధానమంత్రి పర్యటించే మార్గంలో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని పోలీస్‌ అధికారులను ఆదేశించారు. విదేశీ అతిథులు బస చేసే ప్రాంతంలో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలన్నారు. మోదీ పర్యటించే మెట్రోరైల్‌ను అందంగా అలంకరించాలని సీఎస్‌ ఆదేశించారు. ఫలక్‌నుమా ప్యాలెస్‌లో పీఎం ఇచ్చే విందుకు అతిథులను హెచ్‌ఐసీసీ నుంచి తీసుకెళ్లడానికి పకడ్బంధీ ప్రణాళిక రూపొందించాలన్నారు. అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 

30న కొలువులకై కొట్లాట కార్యక్రమం - కోదండరాం...

హైదరాబాద్ : ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయాలన్న డిమాండ్‌తో ఈనెల 30న హైదరాబాద్‌లో కొలువలకై కొట్లాట కార్యక్రమం నిర్వహించనున్నట్టు మెదక్‌ జిల్లా రామాయంపేటలో కోదండరామ్‌ చెప్పారు.

జీజీహెచ్ లో పసికందు మాయం..

తూర్పుగోదావరి : జిల్లా కాకినాడ జీజీహెచ్‌లో పసికందు మాయం కావడం కలకలం రేపింది. తొండంగి మండలం హుకుంపేటకు చెందిన జయలక్ష్మికి జన్మించిన చిన్నారి కనిపించకుండా పోయింది. చిన్నపిల్లల వార్డులో ఉన్న పసిపాపను ముఖానికి ముసుగు ధరించిన మహిళ అపహరించినట్లు సీసీ ఫుటేజ్‌లో గుర్తించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

'మిషన్ గుజరాత్' బీజేపీ భారీ టీం...

ఢిల్లీ : గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం బిజెపి తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రచారం కోసం ప్రత్యేకంగా 'మిషన్‌ గుజరాత్‌' పేరిట భారీ టీమ్‌ను ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోది సహా 50 మంత్రులు నవంబర్‌ 26 నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గోనున్నారు. 

యూపీలో ముస్లింలపై దాడులు...

ఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లో ముస్లింలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా బాగ్‌పత్‌ జిల్లాలో నడుస్తున్న రైలులో ముస్లిం గురువులపై దాడి జరిగింది. తలకు రుమాల్‌ ఎందుకు చుట్టుకున్నారంటూ ఆరుగురు దుండగులు దాడి చేశారు. అనంతరం రైలు నుంచి తమను బయటకు తోసేశారని బాధితులు ఆరోపించారు.

సయీద్ విడుదలపై భారత్ అసంతృప్తి..

ఢిల్లీ : ముంబై మారణ హోమం ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్‌ను గృహ నిర్బంధం నుంచి విడుదల చేయడంపై భారత్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పాకిస్థాన్ ఉగ్రవాదులను ప్రధాన స్రవంతిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోందని కేంద్ర విదేశాంగ విమర్శించింది.

బ్రిటన్ లో 'పద్మావతి' విడుదల..

ఢిల్లీ : పద్మావతి చిత్రం విడుదలకు బ్రిటన్‌ సెన్సార్‌ బోర్డు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సినిమాలో సింగల్‌ కట్‌ కూడా లేకుండా సర్టిఫికేట్‌ మంజూరు చేసింది. లండన్‌లో పద్మావతిని రిలీజ్‌ చేయడానికి నిర్మాత సిద్ధంగా లేరు. ముందు భారత్‌లో విడుదల చేశాకే ఇతర దేశాల్లో విడుదల చేస్తామని చెబుతున్నారు.

మోడీ షెడ్యూల్ ఖరారు..

హైదరాబాద్ : ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన షెడ్యూల్ ఖరారయింది. ఈనెల 28న ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. మధ్యాహ్నం 2.30కు మోదీ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. బేగంపేట నుంచి మియాపూర్‌కు మోదీ హెలికాప్టర్‌లో వెళ్లనున్నారు. మియాపూర్‌లో మెట్రోరైలు పైలాన్‌ను ప్రారంభిస్తారు.

Don't Miss