Activities calendar

25 November 2017

హాంకాంగ్ ఓపెన్ ఫైనల్ చేరుకున్న సింధు

బ్యాడ్మింటన్  భారత్ స్టార్ షేట్లర్ పీవీ సింధు హాంకాంగ్ ఓపెన్ ఫైనల్ కు చేరింది. సెమీస్ లో రచనోక్ పై 21-17, 21-17 తేడాతో సింధు గెలుపొందింది. 

తమిళనాడులో బస్సు బోల్తా

చెన్నై : తమిళనాడు శ్రీరంగం వద్ద ఓ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మందిక గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. తూర్పుగోదావరి నుంచి శబరిమలై వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. 

ఎస్టీల్లోకి నాయకపోడు

గుంటూరు : ఎస్టీల్లోకి నాయకపోడు వర్గాన్ని చేరుస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నాయకపోడు కమ్యూనిటీని ఎస్టీ జాబితాలో చేర్చాలని పార్లమెంట్ లో ఎంపీ కేశినేని నాని  ప్రస్తావించారు. కేంద్రం సిఫార్సు మేరకు ఏపీ ప్రభుత్వం నాయకపోడు వర్గాన్ని చేర్చింది.

20:26 - November 25, 2017
20:15 - November 25, 2017

సొచ్చెదాక రామారావు.. సొచ్చినంక సోమారావు.. మన కేసీఆర్ మాటలు ఇట్లనే ఉంటయ్.. ఎన్కటికి ఒకడు ఏం జేశిండట.. ఒకామె ఏడుస్తుంటే.. ఎందుకేడుస్తున్నవ్ తల్లీ అన్నడట.. మా భర్త గొట్టిండు అని చెప్తదట.. అయ్యో వాని చేతులిర్గిపోను భార్యను గొడ్తడా అని తిట్టి.. ఇంటికి వొయ్యిండట.. ఏమైంది గింత ఆల్చమైంది అంటే.. నన్నే అడ్గుతావే అని ఇంటికాడ భార్యను వీడు గూడ గొట్టిండట.. ఈ ముచ్చట ఎందుకంటె.. సూడుండ్రి మీకే అర్థమైతది..

అబ్బా శెల్లె జర్రంతల తప్పిచ్చుకోని అవుతల వడ్డదిగని.. రైతులకు దొర్కినుంటే రంజుకుంటుండే ముచ్చట.. బాతాల పోశెట్టి బిడ్డె లేదా..? దేవనపల్లి కవితమ్మా.. అగో ఆమె ఎట్ల ఎగవడ్డదనుకుంటున్నరు నిన్న.. రైతులు ఆమె కారుకు అడ్డంబడి అడ్డుకోవాలని సూశిండ్రు.. కని రాజ్యాం వాళ్ల చేతుల ఉన్నదిగదా..? అందుకే పోలీసోళ్లను అడ్డం బెట్టుకోని ఎగవడ్డది..

తన కొడ్కు తప్పు జేశిండు.. కచ్చీరు కాడ అందరి ముంగట నిలవెట్టిండ్రని తెల్సుకున్న ఒక తెల్వికల్ల తండ్రి ఏం జేశిండట.. ఆ కచ్చీరు కాడికి వొయ్యి.. కొడ్కును నాల్గు సప్పరిచ్చి ఇంక ఈడ ఏమొఖం బెట్టుకోని నిలవడ్డవ్ రా..? అని తన్ని తర్ముతడట.. ఆడున్న పెద్దమన్షులు అయ్యో తండ్రే గాతీర్గ గొట్టిండు గావట్టి ఇక పంచాదెందుకు తీయ్ అని ఊకుంటరట.. యాదగిరి గుట్ట మీద నిన్న కేసీఆర్ జేశింది ఇదే అన్నట్టు..

దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు ఇప్పుడున్న సమస్యలు సరిపోవేమో.. మొన్ననే గంజాయి కేసు గత్తర గత్తర అయ్యి జనంల మొఖం జూపెట్టుకోలేని పరిస్థితొస్తే.. ఇప్పుడు సొంత పార్టీ నాయకులే కొట్టుకోని మంథని నియోజకవర్గంల కాంగ్రెస్ పార్టీ దుక్నమే బందుజేశే ఉపాయం జేస్తున్నరట.. నిన్న రాత్రి ఒక పంచాది అయ్యింది సూడుండ్రి ప్రత్యక్ష ప్రసారంల..

నిన్నటి సంది మీరు జూశే ఉంటరు ఒక ముచ్చట.. రియలెస్టేట్ వెంచరోని తాన రాయగిరి సర్పంజి రెండు కోట్లు డిమాండు జేశిండని అవ్విటి ఆడియో టేపులు.. అధికార పార్టీ సర్పంజి ఇట్ల జేసుడు తప్పుగాదా..? అని అదో పెద్ద యవ్వారం నడ్శింది.. సరే సర్పంజి లంచం దీస్కునుడు ముమ్మాటికి తప్పే.. నిజమని తేలితే సర్పంజి గిరి తీశేయవల్సిందే.. కానీ మరి ఈ రియలెస్టేటోని సంగతేంది... వీడెళ్ల సుద్దపూసైండు..?

నేను మొత్తుకుంటనే ఉన్న.. మీకు ఎవ్వలన్న ఫోన్ జేశి ఇర్వైవేల రూపాల ఫోను మీకు నాల్గువేలకే ఇస్తున్నం..మీకు లక్కిలాట్రీ దల్గిందని చెప్తరు.. పోస్టాఫీసుల పైకం గట్టి తీస్కోండ్రి అంటరు.. అబ్బా నా అదురుష్టం ఎంత బాగున్నది.. ఇయ్యాళ తెల్లారి లేవంగనే ఎవ్వలి మొఖం జూశ్న అనుకోని పోస్టాపీసుకు వొయ్యి నాల్గువేలు గట్టి పర్సల్ దీస్కుంటం అది ఇప్పి సూస్తె రాళ్లు.. రప్పలుంటయ్.. కామారెడ్డి కాడ ఇదే అయ్యింది..

అత్తింటి వేధింపులు తాళలేక.. భర్త ఇంటి ముందు భార్య మౌన పోరాటం.. నిన్నియాళ్ల చాలగనిపిస్తున్నయ్ ఇసొంటియి.. సరే ఏడనో ఒకతాన చెడిపోయిన అత్తమామలు ఉండొచ్చు కోడలును బాధవెడ్తుండొచ్చుగని.. మా అత్తమామకు మేమే అన్నం బెడ్తం.. వాళ్లను మేమే సాధుకుంటం అని ధర్నాలకు దిగే కొడ్కులు లేరాయే.. మౌనపోరాటాలకు దిగే కోడండ్లు లేరాయే.. సరే ఇదెట్లున్నాగని..? ఒక నిజాన్ని మీకు జెప్పవోతున్న సూడుండ్రి..

ఇదో పెద్ద కథనే అయ్యింది గదా.. తెల్గురాష్ట్రాలళ్ల సంటిపోరగాళ్లను దావఖాండ్లళ్ల కెళ్లి ఎత్కపోవుడు.. మొన్న నీలోఫర్ ఆస్పత్రికాడ ఒక్కటి అయ్యెనా... నిన్నరాత్రి కాకినాడ సర్కారు ఆస్పత్రిల గూడ అయ్యింది నర్సు లెక్కొచ్చిన ఒకామె.. అప్పుడే వట్టిన బిడ్డను ఇంజీషన్ ఇయ్యాలే అని తీస్కపోయి అటే ఊర్కింది.. పాపం బిడ్డను కండ్లార సూస్కోగూడ సూస్కోలే ఆ తల్లి ఎంత బాధుంటది చెప్పుండ్రి..

టాటా ఏస్ ఆటోల ఎంతమంది వడ్తరయ్యా..? అది ఏడ్గురు గూసోంగ ఒక డ్రైవర్ అంటె సెవన్ ప్లస్ వన్.. మరి ముప్పైమందిని ఎక్కిచ్చుకపోతుంటె.. అరే ఇదెక్కడి దందరా బై... ఉంటరా..? ఎక్కినోళ్లు బుడ్డపోరగాళ్లాయే ఏడనన్న జారిపడ్తె ఏంది పరిస్థితి అని తొవ్వొంట వొయ్యెటోడు ఎవ్వడన్న అడ్గితె తప్పా.. అది..? సూడుండ్రి ఒక స్కూల్ యాజమాని కథ ఎట్లున్నదో..

మెట్రో రైలు చార్జీలను ప్రకటించిన ఎల్అండ్ టీ

హైదరాబాద్ : మెట్రో రైలు చార్జీలను ఎల్అండ్ టీ ఖరారు చేసింది. మెట్రో రైలు కనీస చార్జీ రూ.10 గరిష్టంగా రూ.60 గా ఎల్ అండ్ టీ నిర్ణయించింది. 2 కి.మీ వరకు రూ.10, 2 నుంచి 4 కి.మీ వరకు రూ.15, 4 నుంచి 6 కి.మీ వరకు రూ.25, 6 నుంచి 8 కి.మీ లవరకు  రూ.30, 10 నుంచి 14 కి.మీ రూ.40, 18నుంచి 22 కి. మీ వరకు రూ.55, 26 కి.మీ దాటితే రూ.60 వసూలు చేస్తారు. 

19:03 - November 25, 2017
18:38 - November 25, 2017
18:32 - November 25, 2017

ఢిల్లీ : గుజరాత్‌ తరహాలో ఏపీకి ఆప్‌షోర్‌ మినరల్స్‌పై రాయల్టీ ఇవ్వాలని అంతర్‌ రాష్ట్ర మండలి స్థాయిసంఘం సమావేశంలో కోరినట్లు మంత్రి యనమల అన్నారు. పూంచికమిషన్‌ సిఫారసు మేరకు ప్రధాన ఖనిజాలపై రాయల్టీ మూడేళ్లకోసారి పెంచాలని కోరామన్నారు. ఈ ప్రతిపాదనను కేంద్రం ఆమోదించినట్లు చెప్పారు. సముద్ర తీర ప్రాంతాలన్నీ తమ పరిధిలోకే వస్తాయని..ఆఫ్‌షోర్‌ మినరల్స్‌పై రాయల్టీ ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. 12 నాటికల్ మైళ్ల పరిధిలో జరుగుతున్న ఆప్ షోర్ ఖనిజ తవ్వకాలపై రాయల్టీ ఇవ్వాలని తాము వాదించినట్లు యనమల తెలిపారు. 

18:31 - November 25, 2017

కృష్ణ : అవినీతిలో ప్రతిపక్షనేత జగన్మోహన్‌రెడ్డి టాప్‌టెన్‌లో ఉన్నారని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా అన్నారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి జగన్‌ కుట్ర పన్నారని ఆరోపించారు. రాష్ట్రంలో నిర్మితమవుతున్న ప్రాజెక్టులపై వైసీపీ నేతలు దృష్ప్రచారం చేస్తున్నారన్నారు. పట్టిసీమ ద్వారా లక్షలాది ఎకరాలు సాగవుతున్నాయని మంత్రి తెలిపారు. 

18:30 - November 25, 2017

అనంతపురం : జిల్లా కదిరి మున్సిపాలిటీ అత్యవసర సమావేశం రసాభాసగా సాగింది. అజెండా అంతా చైర్‌ పర్సన్ సురియా బాను ఇష్టానుసారంగా ఉందంటూ టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు కౌన్సిల్ హాలులో గందరగోళం సృష్టించారు. సురియాబాను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అజెండా కాపీలను చించి వేశారు. గడువు ముగిసేవరకు తాను రాజీనామా చేసే ప్రసక్తి లేదన్న చైర్ పర్సన్ సురియా బాను సమావేశాన్ని వాయిదా వేశారు. 

18:30 - November 25, 2017

విశాఖ : జిల్లా బుచ్చయ్యపేట మండలం పొట్టిదొరపాలెంలో దారుణం జరిగింది. అక్క కూతురిపై కన్నేసిన మేనమామ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక గర్భం దాల్చడంతో విషయం వెలుగులోకి వచ్చింది. గౌరీపట్నంకు చెందిన సోమరాజుకు గతంలో పెళ్లైంది. భార్యతో విభేదాలు రావడంతో అక్క దగ్గర ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో 8వ తరగతి చదువుతున్న అక్క కూతురిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సోమరాజును పోలీసులు అరెస్టు చేశారు. బాలికను ఐసిడిఎస్ అధికారులు భీమిలి బాలసదన్‌కు తరలించారు. 

18:29 - November 25, 2017

కడప : దేశంలో లంచం లేనిదే పనికావడం లేదని లొక్‌సత్తా అధినేత జయప్రకాష్‌ నారయణ మండిపడ్డారు. ప్రజలుకు దక్కాల్సినవి కూడా డబ్బులిచ్చి పనిచేయించుకుంటున్నారని అన్నారు. సురాజ్య యాత్రలో భాగంగా కడపలో ఆయన పాల్గొన్నారు. దేశంలో, రాష్ట్రంలో చట్టబద్దమైన పాలన లేదని.. అవినీతి రాజకీయాలకు యువత దూరంగా ఉండాలని ఆయన అన్నారు.

18:28 - November 25, 2017

పశ్చిమగోదావరి : జిల్లా ఏలూరులో దారుణం జరిగింది. ఫోటోగ్రాఫర్‌ వెంకట రంగారావు..వివాహేతర సంబంధం పెట్టుకుని భార్యాపిల్లలను ఇంటి నుంచి గెంటేశాడు. దిక్కుతోచని స్థితిలో వెంకట రంగారావు ముగ్గురు పిల్లలు..అతని ఫోటో స్టూడియో ఎదుట న్యాయపోరాటానికి దిగారు. చలికి వణుకుతూ రాత్రినుంచి స్టూడియో ఎదుటే ఆందోళన చేస్తున్నారు.  

18:27 - November 25, 2017

కృష్ణా : కనకదుర్గమ్మ గుడి దగ్గర.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేపట్టిన ఫ్లై ఓవర్‌ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ప్రాజెక్టు వ్యయంలో కేంద్రం 75 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం నిధులను భరించాల్సి ఉంది. తన వాటా నిధులను టీడీపీ ప్రభుత్వం ఇప్పటికే ఖర్చు చేసింది. అయితే.. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల జారీలో జాప్యం వల్ల.. పనులు అస్సలు ముందుకు సాగడం లేదు. ఇటీవల కాంట్రాక్ట్‌ సంస్థ సోమా కన్‌స్ట్రక్షన్స్‌.. 20 కోట్ల రూపాయల నిధుల కోసం కేంద్రానికి లేఖ రాసినా ఇంతవరకూ స్పందనే లేదు. దుర్గగుడి ప్లై ఓవర్ నిర్మాణ ప్రక్రియలో.. ఈసరికే, మొత్తం 23 స్పాన్లు, వింగ్స్ పూర్తికావాల్సి ఉంది. అయితే, కేవలం 15 స్పాన్లే పూర్తయ్యాయి. 23 స్పాన్లకు గాను 46 కోట్ల రూపాయల దాకా ఖర్చు చేయాల్సి ఉంది. వంతెనకు 47 పిల్లర్లు నిర్మించాల్సి ఉండగా.. 35 మాత్రమే పూర్తయ్యాయి. ఏతావాతా.. ప్రభుత్వం ఈ వంతెన నిర్మాణం కోసం ఇప్పటికే 170 కోట్లకు పైగా చెల్లింపులు జరిపింది.

ఆరువరసల్లో నిర్మిస్తోన్న వంతెన
తొలిసారిగా ఆరువరసల్లో నిర్మిస్తోన్న వంతెన పటిష్టత కోసమే నాణ్యతకు కనకదుర్గ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులను, సోమా కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ.. 2015 డిసెంబర్ 27న ఎంతో ఆర్భాటంగా ప్రారంభించింది. ఏడాదిలోగా ప్రాజెక్టు పూర్తి చేయాలన్నది లక్ష్యం. అయితే.. రెండేళ్లు పూర్తి కావస్తున్నా.. పనులు ముందుకు సాగక, నగర జీవికి ట్రాఫిక్‌ కష్టాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఎక్కడికక్కడ డైవర్షన్‌లు.. ట్రాఫిక్‌ జామ్‌లతో ప్రయాణికులు.. గమ్యస్థానానికి చేరేందుకు చాలా సమయం వృథా అవుతోంది. బెజవాడలో ట్రాఫిక్‌ తరచూ స్తంభిస్తుండడంతో.. విద్యార్థులు, ఉద్యోగ, వ్యాపార నిమిత్తం వెళ్లేవారు, ట్రాఫిక్‌ పద్మవ్యూహంలో చిక్కుకుపోతున్నారు. ఈ ఇబ్బందులు తీరేదెన్నడంటూ ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి.. నిధులను సాధించుకుని.. దుర్గగుడి ఫ్లైఓవర్‌ను సత్వరమే పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. పనుల్లో వేగం పెంచి ఉగాది నాటికైనా సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 

18:15 - November 25, 2017

హైదరాబాద్ : సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 'ఏది బూతు-ఏది కామెడీ' అనే అంశంపై చర్చా గోష్టి జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ విమర్శకులు కత్తి మహేష్‌, సామాజిక కార్యకర్త దేవితో పాటు పలు మహిళా, ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు. హాస్యం పేరుతో ప్రముఖ చానెల్స్‌లో పలు కార్యక్రమాలు అసభ్యత, అశ్లీలత ఎక్కువయ్యిందని పలువురు అభిప్రాయపడ్డారు. పిల్లలు, మహిళలు ప్రోగ్రామ్స్‌ చూసే విధంగా లేవన్నారు. అలాంటి కార్యక్రమాలపై చర్యలు తీసుకోవడమే కాకుండా బ్యాన్‌ చేయాల్సిన అవసరముందన్నారు. జబర్దస్త్‌ ప్రోగ్రామ్‌లో తమను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని అనాథ విద్యార్థులు ఆరోపించారు. సైఫాబాద్‌ పీఎస్‌లో హైపర్‌ ఆది, జబర్దస్త్‌ కార్యక్రమంపై ఫిర్యాదు చేశారు. 

18:14 - November 25, 2017

హైదరాబాద్ : టీఆర్‌టీపై డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి స్పందించారు. కోర్ట్‌ ఆదేశాల మేరకు రిక్రూట్‌మెంట్ అంశంపై ఉన్నతాధికారులతో మరోసారి సమీక్ష చేస్తామని అన్నారు. పాత జిల్లాల ప్రకారం సాద్యాసాద్యలపై సీఎంతో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్శిటీలో ఎగ్జామినేషన్‌ బ్రాంచ్‌ బిల్డింగ్‌ భూమి పూజలో పాల్గొన్నారు.

18:13 - November 25, 2017

హైదరాబాద్ : ఈనెల 28న ప్రధాని మోడీ హైదరాబాద్‌కు రానున్న నేపథ్యంలో .. పర్యటన ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, డీజీపీ మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ మున్సిపల్ శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, జీహెచ్ఎంసి కమిషనర్ జనార్ధన్ రెడ్డిలతో పాటు పలువురు సీనియర్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. మియాపూర్‌లో మెట్రో రైలు ప్రారంభించే పైలాన్, హెలీప్యాడ్, రూట్‌ మ్యాప్‌లను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా మెట్రో రైలులో ఎస్పీసింగ్ ఇతర అధికారులు ప్రయాణించారు. మియాపూర్ రైల్వే స్టేషన్‌ పరిసర ప్రాంతాల్లో బ్యూటిఫికేషన్ చేపట్టాలని అంతర్జాతీయ స్ధాయి హంగులు ఉండేలా చర్యలు చేపట్టాలని HMR అధికారులను సీఎస్ ఆదేశించారు. 

18:12 - November 25, 2017

హైదరాబాద్ : భాగ్యనగరంలో ఈ నెల 29 నుండి అందుబాటులోకి రానున్న మెట్రో రైలుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 28 న ప్రధానమంత్రి మోదీ లాంఛనంగా మెట్రోను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ప్రారంభమైన మరుసటి రోజు నుండే ఉదయం 6 గంటల నుండి రాత్రి పది గంటల వరకు మెట్రో అందుబాటులో ఉండనుందన్నారు మంత్రి కేటీఆర్‌. నాగోల్‌ నుండి మియాపూర్‌ వరకు 30 కిలోమీటర్ల మేర మెట్రో అందుబాటులోకి రానుంది. ప్రధాని మెట్రో ప్రారంభోత్సవం చేయనున్నందున ఇవాళ ప్రజాప్రతినిధులు, మంత్రులు, అధికారులు మెట్రో పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మెట్రో స్మార్ట్‌ కార్డ్‌ను ప్రారంభించారు. ఈ కార్డ్‌ ప్రస్తుతానికి మెట్రోలో మాత్రమే అందుబాటులో ఉండనుందని, భవిష్యత్‌లో అన్ని వాహనాలకు అనుసంధానం చేస్తామని తెలిపారు.

ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రో రైల్‌ ప్రాజెక్ట్‌
ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రో రైల్‌ ప్రాజెక్ట్‌ను ఎల్‌ అండ్ టీ కంపెనీకి మంత్రి కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. ప్రైవేట్‌ అండ్‌ పబ్లిక్‌ పార్టనర్‌ షిప్‌ మోడ్‌లో అతిపెద్ద ప్రాజెక్టుగా మెట్రో రైల్‌ నిలిచిందన్నారు. మెట్రో ప్రారంభోత్సవానికి కావలసిన అన్ని పనులు పూర్తి చేశామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. కార్మికుల కఠోరశ్రమకు ఫలితంగా హైదరాబాద్‌ మెట్రో సగర్వంగా ప్రస్థానం ప్రారంభించబోతోందన్నారు. మెట్రోను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు మంత్రి. ప్రజల భాగస్వామ్యంతో ప్రజల మద్దతుతో మెట్రోను ప్రారంభిస్తున్నామన్నారు. ప్రస్తుతం 57 రైళ్లు కొరియన్‌ కంపెనీ నుండి ఈ రైళ్లను కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఒక్కో రైళ్లో 1000 మంది వరకు ప్రయాణించవచ్చన్నారు. గ్రేటర్‌లో మొత్తం 24 స్టేషన్లు ప్రారంభించామన్నారు. మెట్రో కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్న గ్రేటర్‌ వాసుల కల ఇంకో మూడు రోజుల్లో నెరవేరనుంది. 

శరణం గచ్ఛామీపై ఫీఎస్ లో ఫిర్యాదు

మేడ్చల్ : శరణం గచ్ఛామీ సినిమా ప్రొడ్యూసర్ బొమ్మకు మురళిపై మేడిపల్లి పీఎస్ లో బ్రాహ్మణ సేవా సమితి ఫిర్యాదు చేసింది. వేదాలను హిందు ధర్మాన్ని కించపరిచారని వారు ఫిర్యాదు చేశారు.

17:19 - November 25, 2017

మేడ్చల్ : శరణం గచ్ఛామీ సినిమా ప్రొడ్యూసర్ బొమ్మకు మురళిపై మేడిపల్లి పీఎస్ లో బ్రాహ్మణ సేవా సమితి ఫిర్యాదు చేసింది. వేదాలను హిందు ధర్మాన్ని కించపరిచారని వారు ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

 

విద్యార్థుల వద్ద డ్రగ్స్

మేడ్చల్ : జిల్లా జవహర్ నగర్ పీఎస్ పరిధి శాంతినగర్ లో విద్యార్థుల వద్ద రాచకొండ ఎస్ వోటీ పోలీసులు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. బీటెక్ విద్యార్థి అరవింద్, ఐటీఐ విద్యార్థుల శ్రవణ్, హేమంత్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

16:34 - November 25, 2017

శంషాబాద్ లో రోడ్డు ప్రమాదం

రంగారెడ్డి : జిల్లా శాతరాయి వద్ద హైదరాబాద్, బెంగళూరు హైవేపి రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును ఆయిల్ ట్యాంకర్ ఢీకొనడంతో 20 మందికి గాయాలయ్యాయి. 

15:24 - November 25, 2017

మేడ్చల్ : సంగీత పోరాటం కొనసాగుతుంది. న్యాయం కోసం సంగీత వారం రోజులుగా ధర్నా చేస్తున్నారు. ఇంతవరకు ఎవరు స్పందిచకపోవడంపై మహిళాలు నల్ల బ్యాడ్జ్ లతో నిరసన తెలుపుతున్నారు. నేతలు ఇచ్చిన మాటలకు, చేతలకు ఎలాంటి సంబంధం లేకుండా ఉందని మహిళ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇరువైపుల చర్చలలు జరుపుతున్నమని ఎంపీ మల్లారెడ్డి తెలిపారు. సాయంత్రంలోగా చర్చలు జరిపి న్యాయ పోరాటం విరమించేలా చేస్తామని ఆయన అన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

కొనసాగుతున్న సంగీత పోరాటం

మేడ్చల్ : సంగీత పోరాటం కొనసాగుతుంది. న్యాయం కోసం సంగీత వారం రోజులుగా ధర్నా చేస్తున్నారు. ఇంతవరకు ఎవరు స్పందిచకపోవడంపై మహిళాలు నల్ల బ్యాడ్జ్ లతో నిరసన తెలుపుతున్నారు. నేతలు ఇచ్చిన మాటలకు, చేతలకు ఎలాంటి సంబంధం లేకుండా ఉందని మహిళ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇరువైపుల చర్చలలు జరుపుతున్నమని ఎంపీ మల్లారెడ్డి తెలిపారు. సాయంత్రంలోగా చర్చలు జరిపి న్యాయ పోరాటం విరమించేలా చేస్తామని ఆయన అన్నారు. 

15:15 - November 25, 2017
15:09 - November 25, 2017
15:04 - November 25, 2017

తహశీల్దార్ ఆఫీస్ లో రైతు ఆత్మహత్యాయత్నం

భూపాలపల్లి : జిల్లా వెంకటాపూర్ మండల తహశీల్దార్ ఆఫీస్ లో అందుగులమిది గ్రామానికి చెందిన ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేసుకన్నాడు. రైతును ములుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

14:46 - November 25, 2017

తూర్పుగోదావరి : కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో ప్రసూతీ వార్డు ఎదుట కిడ్నాప్‌ అయిన శిశువు బంధువులు ఆందోళనకు దిగారు. సెక్యూరిటీ సిబ్బంది సహకారంతో తమ బిడ్డను కిడ్నాప్‌ చేశారని వారు ఆరోపిస్తున్నారు. తమ బిడ్డ గురించి ఇప్పటివరకు ఏ సమాచారం లేదని.. ఆచూకీ తెలిసేవరకూ ఆందోళన చేస్తామని ఆసుపత్రి ఎదుట బైటాయించారు. అయితే సెక్యూరిటీ సిబ్బందికి నాలుగు నెలల నుంచి జీతాలు చెల్లించకపోవడంతో నైట్‌ షిఫ్ట్‌లో పని చేసే సెక్యూరిటీ సిబ్బంది విధులకు హాజరు కావడం లేదు. కాకినాడ జీజీహెచ్‌లో ఉన్న సీసీ కెమెరాలు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఉన్నాయి. దానికి సుమారు 22 లక్షలు బకాయిలు చెల్లించకపోవడంతో.. కాంట్రాక్టర్‌ నిర్వహణ సరిగా చూడటం లేదనే వాదన వినబడుతోంది. 

14:45 - November 25, 2017

గుంటూరు : రాజధాని అమరావతిలో టీడీపీ సెంట్రల్ ఆఫీసు శంకుస్థాపనకు రంగం సిద్ధం అయింది. రేపు ఉదయం 5గంల 15 నిముషాలకు శంకుస్థాపనకు మూహూర్తం నిర్ణయించారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

14:44 - November 25, 2017

భూపాలపల్లి : జిల్లా వెంకటాపూర్ మండల తహశీల్దార్ ఆఫీస్ లో అందుగులమిది గ్రామానికి చెందిన ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేసుకన్నాడు. రైతును ములుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

13:23 - November 25, 2017

విశాఖపట్టణం : అగ్రిగోల్డ్ పత్రాలు పరిశీలనకు వచ్చిన ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన విశాఖపట్టనంలోని భీమిలి పీఎస్ వద్ద చోటు చేసుకుంది. గత కొద్ది రోజులుగా అగ్రిగోల్డ్ లో డిపాజిట్లు చేసిన వారి పత్రాలను అధికారులు పరిశీలన చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా విశాఖ రూరల్ లో 14, సిటీ ప్రాంతాల్లో 10 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మండల హెడ్ కేంద్రంలో ఉన్న పీఎస్ వద్ద పత్రాలను అధికారులు తనిఖీ చేస్తున్నారు. అందులో భాగంగా భీమిలి పీఎస్ వద్ద కేంద్రం ఏర్పాటు చేశారు. వీరయ్య అనే వ్యక్తి ఇక్కడకు వచ్చాడు. కానీ ఒక్కసారిగా అతను గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. అక్కడనే ఉన్న స్థానికులు, అధికారులు స్పందించి ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే వీరయ్య మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

భీమీలి పీఎస్ వద్ద విషాదం..

విశాఖపట్టణం : అగ్రిగోల్డ్ భీమిలి పీఎస్ వద్ద విషాదం చోటు చేసుకుంది. అగ్రిగోల్డ్ పత్రాల పరిశీలన చేస్తుండగా పోలయ్య అనే వ్యక్తి కుప్పకూలి మృతి చెందాడు. ఇతను పాతవాలెం వాసిగా గుర్తించారు. 

ప్రారంభోత్సవంలోనే మెట్రో రికార్డు - కేటీఆర్...

హైదరాబాద్ : ఈనెల 28వ తేదీన మధ్యాహ్నం 2.15 గంటలకు మెట్రో రైలు ప్రారంభం కాబోతుందని, ప్రారంభోత్సవంంలోనే రికార్డు సాధించనుందన్నారు. 30 కి.మీటర్ల దూర ప్రయాణంతో ప్రారంభోత్సవం చేయడం ఇదే ప్రథమమన్నారు. 29వ తేదీ నుండి సాధారణ పౌరులకు మెట్రో రైలు ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రానుందన్నారు. మొదటి నాలుగు నెలలు మెట్రో సర్వీసులు ఉదంయ 6 నుండి ప్రారంభం అవుతాయన్నారు. ప్రారంభంలో ప్రతి రైలుకు మూడు బోగీలు ఉంటాయని..ఒక్కో బోగీలో 300 మంది ప్రయాణించవచ్చన్నారు. 

టీ సవారీ స్మార్ట్ కార్డుల ఆవిష్కరణ...

హైదరాబాద్ : మెట్రో ప్రయాణానికి వినియోగించే 'టీ సవారీ' స్మార్ట్ కార్డ్ లను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. భవిష్యత్ లో బస్సులు..క్యాబ్ లు..ఆటోల్లోనూ వినియోగించేలా ఈ కార్డులు ఉండనున్నాయన్నారు. 

పీఎం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం..

హైదరాబాద్ : ప్రధాన మంత్రి నేతృత్వంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. పౌష్టికాహార లోపం, ఎదురవుతున్న సమస్యలపై చర్చించారు. ఈ సమావేశంలో నీతి ఆయోగ్ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

జగన్ విషం గక్కుతున్నారు - దేవినేని..

విజయవాడ : పట్టిసీమ నీటితో కృష్ణా పునీతమైతే ప్రతిపక్ష నేత విషం గక్కుతున్నారని మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. బాధ్యతారహిత్యంగా తన పత్రిక ద్వారా ప్రజలకు తప్పుడు సమాచారం అందిస్తున్నారని, అసత్య ప్రచారాలపై జగన్ వివరణ ఇవ్వాలన్నారు. కృష్ణా డెల్టా కింద 13 లక్షల ఎకరాల పంటలు పండుతున్నాయని పేర్కొన్నారు. 

12:25 - November 25, 2017

కడప : భారతదేశంలో లంచం లేనిదే పని కావడం లేదని లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. స్వరాజ యాత్రలో భాగంగా కడప జిల్లాకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలకు దక్కాల్సినవి కూడా డబ్బులిచ్చి పని చేయించుకుంటున్నారని, దేశంలో, రాష్ట్రంలో చట్టబద్ధమైన పాలన లేదన్నారు. అవినీతి రాజకీయాలకు యువత దూరంగా ఉండాలని సూచించారు. సామాన్యుడి ఓటు కోసం తపన పడుతున్నారని..ప్రేమ ఒలకబోస్తున్నారని..ఇందులో సామాన్యుడు మోసపోతున్నాడని తెలిపారు. రాజకీయాన్ని క్రికెట్ మ్యాచ్ లాగా భావించవద్దన్నారు. 

12:22 - November 25, 2017

విజయవాడ : అవినీతి విషయంలో టాప్ టెన్ 10లో జగన్ ఉన్నారని ఏపీ రాష్ట్ర మంత్రి దేవినేని ఉమ ఎద్దేవా చేశారు. విజయవాడలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి జగన్ కుట్ర పన్నారని, రాష్ట్రంలో నిర్మితమౌతున్న ప్రాజెక్టులపై వైసీపీ నేతలు దుష్ర్పచారం చేస్తున్నారని విమర్శించారు. పట్టిసీమ ద్వారా లక్షలాది ఎకరాలు సాగవుతోందని, పురుషోత్త పట్నం ఎలూరు రిజర్వాయర్ కి సెకండ్ స్టేజ్ ద్వారా నీళ్లు వెళ్లాయని తెలిపారు.

'మెట్రో రైలు ప్రారంభించుకోవడం గర్వకారణం' ..

హైదరాబాద్ : మెట్రో రైలును ప్రారంభించుకోవడం గర్వకారణమని మంత్రి కేటీఆర్ అన్నారు. 28వ తేదీన మెట్రో రైలును ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా మెట్టుగూడ నుండి నాగోల్ వరకు మెట్రో రైలులో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రయాణించారు. 

12:15 - November 25, 2017

హైదరాబాద్ : మెట్రో రైలును ఎంతో శుభ్రతగా ఉండే విధంగా ప్రజలు చూడాలని, ఇందుకు అందరూ సహకరించాలని సూచించారు. 28వ తేదీన మెట్రో రైలును ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా మెట్టుగూడ నుండి నాగోల్ వరకు మెట్రో రైలులో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రయాణించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. అహోరాత్రులు పనిచేయడం మూలంగానే మెట్రో రైలు ఈ దశకు వచ్చిందని, మెట్రో రైలుకు రావాల్సిన అన్ని అనుమతులు వచ్చాయన్నారు. పూర్తిస్థాయి సన్నద్దతో మెట్రో రైలు ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం 57 రైళ్లు వచ్చి ఉన్నాయని, ప్రారంభ దశలో మూడు కోచ్ లు ఉంటాయని..ఒక్కో కోచ్ లో 300మంది ప్రజలు ప్రయాణించే సౌకర్యం ఉంటుందన్నారు.

మెట్రో ఛార్జీలపై ఎల్ అండ్ టి వారు ప్రకటన చేస్తారని, ఛార్జీలు అందరికీ అందుబాటులో ఉంటాయనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఢిల్లీలో కాలుష్యం కారణంగా అక్కడున్న స్కూళ్లకు సెలవులు ప్రకటించడం జరిగిందని అలాంటి పరిస్థితి హైదరాబాద్ కు రావొద్దని రవాణాపై దృష్టి సారించడం జరిగిందన్నారు. ఆర్టీసీ నష్టాల నుండి గట్టెక్కించడానికి జీహెచ్ఎంసీ నుండి నిధులు కేటాయించడం జరిగిందన్నారు. రైలు ప్రారంభం అనంతరం ప్రెస్ మీట్ ఉండదని..పీఎంకు సమయానుభావం తక్కువగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్వచ్చ మెట్రో పోస్టర్ ను ఆవిష్కరించారు. 

11:47 - November 25, 2017

కామారెడ్డి : మీ ఫోన్ నెంబర్ కు లక్కీ డ్రా వచ్చింది..గెలాక్సీ గోల్డ్ గెలుచుకున్నారు...పోస్టపీసుకు వెళ్లి..డబ్బు కట్టి..గిఫ్టులను తీసుకోండి...ఇలాంటి ఫోన్ వచ్చిందా ? ఈ ఫోన్ ఫేక్...ఇలాగే వచ్చిన ఫోన్ కాల్ నిజం అని నమ్మి వెళ్లిన వారు మోసపోయారు. కామారెడ్డి జిల్లా బిర్కూర్ కు చెందిన జాకీర్ పై విధంగా ఫోన్ వచ్చింది. ఇతను పోస్టాపీస్ కు వెళ్లి రూ. 3200 చెల్లించి అడ్రస్ తో ఉన్న ప్యాక్ ను తీసుకున్నాడు. ప్యాక్ ను తెరిచి చూడగా జాకీర్ ఆశ్చర్యపోయాడు. అందులో గోల్డ్ కోటెడ్ తో ఉన్న బొమ్మలు బయటపడ్డాయి. తాను మోసపోయానని గ్రహించి పోలీస్ స్టేషన్ కు పరుగులు పెట్టాడు. కానీ పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని జాకీర్ వాపోతున్నాడు. తనకు కూడా ఇదే విధంగా జరిగిందని మరో బాధితుడు మజీద్ పేర్కొంటున్నాడు.

11:41 - November 25, 2017

హైదరాబాద్ : టీఆర్టీ(టీచర్ రిక్రూట్ మెంట్ టెస్టు) నోటిఫికేషన్ ను హైకోర్టు రద్దు చేయలేదని మంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎగ్జామినేషన్ బ్రాంచీ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి కడియం మీడియాతో మాట్లాడారు. గిరిజన ప్రాంతాల్లోని విద్యార్థులకు న్యాయం చేసేందుకు 31 జిల్లాలను పరిగణనలోకి తీసుకుని టీఆర్టీ నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. దీనిపై హైకోర్టు ఇచ్చిన తీర్పు పరిగణలోకి తీసుకుంటామని, కోర్టు ఆదేశాలపై 2, 3 రోజుల్లో చర్చించి.. తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. త్వరలోనే టీఆర్టీ నిర్వహించి.. టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని, దీనిపై సీఎం కేసీఆర్ తో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. 

11:37 - November 25, 2017

మెట్రో రైలులో ప్రజాప్రతినిధులు..

హైదరాబాద్ : నాగోల్ మెట్రో స్టేషన్ ను ప్రజాప్రతినిధులు సందర్శించారు. మెట్రో రైలులో వారు ప్రయాణించారు. 28వ తేదీన ప్రధాన మంత్రి మోడీ మెట్రో రైలును ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. 

టీఆర్టీ నోటిఫికేషన్ రద్దు కాలేదన్న కడియం..

హైదరాబాద్ : టీఆర్టీ నోటిఫికేషన్‌ను హైకోర్టు రద్దు చేయలేదని కడియం శ్రీహరి స్పష్టం చేశారు. దరఖాస్తుల స్వీకరణ తేదీని పొడిగించాలని కోర్టు ఆదేశించినట్లు, గిరిజన విద్యార్థులకు న్యాయం చేసేందుకే టీఆర్టీ నోటిఫికేషన్‌లో 31 జిల్లాలను పరిగణనలోకి తీసుకున్నామన్నారు. హైకోర్టు ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. 

మియాపూర్ స్టేషన్ లో సీఎస్, డీజీపీ..

హైదరాబాద్ : మియాపూర్ మెట్రో స్టేషన్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, డీజీపీ మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ మున్సిపల్ శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి పరిశీలించారు. ఈ నెల 28న మెట్రో రైలును ప్రధాని మోదీ ప్రారంభించనున్న సంగతి తెలిసిందే.

11:25 - November 25, 2017

హైదరాబాద్ : విద్యార్థులను సక్రమమైన మార్గంలో వెళ్లే విధంగా విద్యాబుద్ధులు నేర్పించాల్సిన అధ్యాపకులు నీచమైన పనులకు పాల్పడుతున్నారు. విద్యార్థులపై లైంగిక దాడులకు పాల్పడుతూ కీచకుల్లా మారుతున్నారు. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ఓ ప్రిన్స్ పాల్ విద్యార్థినిపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఈఘటన హైదరాబాద్ లోని పేరుగాంచిన ఈఎస్ఎల్ లోని డీఏవీ స్కూల్ లో చోటు చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్కూల్ ప్రిన్స్ పాల్ మహాపాత్ర అక్టోబర్ 10వ తేదీన మద్యం సేవించి ఓ విద్యార్థిని క్యాబిన్ లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి ప్రయత్నించాడని తల్లిదండ్రులు పీఎస్ లో ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు మహాపాత్రను అదుపులోకి తీసుకున్నారు. గతంలో కూడా విద్యార్థినిలను లైంగికంగా వేధించాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

11:18 - November 25, 2017

వరంగల్ రూరల్ : పేదింటి ఆడపిల్లల కోసమే కళ్యాణ లక్ష్మీ..షాదీ ముబారక్ పథకాలను ప్రభుత్వం ప్రవేశ పెట్టిందని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పేర్కొన్నారు. వరంగల్ రూరల్ జిల్లా వర్దన్నపేట మండలం ఇల్లెంద గ్రామంలో జరిగిన వివాహ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కళ్యాణ లక్ష్మీ పథకానికి దరఖాస్తు చేసుకున్న మానసకు పెళ్లిలోనే రూ. 75వేల చెక్కును అందచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను వధువు కుటుంసభ్యులు సన్మానించారు. 

11:10 - November 25, 2017

ఆదిలాబాద్ : కడెం వద్ద ఓ స్కూల్ ఆటో బోల్తా కొట్టింది. ఈఘటనలో ఇద్దరు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. శనివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. కొంతమంది విద్యార్థులను ఆటోలో స్కూల్ కు వెళుతున్నారు. నర్సాపూర్ వద్దకు రాగానే ఆటో ఒక్కసారిగా బోల్తా కొట్టింది. ఆటో ఉన్న విద్యార్థులకు గాయాలయ్యాయి. విద్యార్థుల్లో ఒకరికి చేయి విరగగా..మరికొంతమందికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు ఘటనాస్థలికి చేరుకుని డ్రైవర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైవర్ నిర్లక్ష్లం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని ఆరోపించారు. బస్సుల్లో తీసుకెళ్లకుండా చిన్న చిన్న ఆటోల్లో ప్రమాదకరంగా తీసుకెళుతున్నారని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ఖానాపూర్ ప్రభుత్వసుపత్రిలో విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. 

స్కూల్ ఆటో బొల్తా..

మెదక్ : నర్సాపూర్ లో స్కూల్ ఆటో బోల్తా కొట్టింది. ఈఘటనలో ఇద్దరు విద్యార్థినిలకు తీవ్రగాయాలయ్యాయి. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.

10:48 - November 25, 2017

సిరిసిల్ల : రోడ్డు ప్రమాద నివారణలో గతంలో హెల్మెట్ పెట్టుకోవాలని ప్రచారం నిర్వహించిన మంత్రి కేటీఆర్...ట్రాఫిక్ నిబంధనలపై అలాగే స్పందిస్తున్నారు. శుక్రవారం సిరిసిల్ల పర్యటనకు మంత్రి కేటీఆర్ వచ్చారు. స్థానిక గాంధీ చౌక్ లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను పరిశీలిస్తున్నారు. ఆ సమయంలో ఒకే బైక్ పై ముగ్గురు వస్తుండడాన్ని మంత్రి కేటీఆర్ చూశారు. వెంటనే వారి ఆపి వారితో సరదగా మాట్లాడారు. ఇలా ప్రమాదకరంగా నడపవద్దని, నిబంధనల్లు ఉల్లంఘిస్తూ బైక్ ను నడవవద్దని సూచించారు. 

10:43 - November 25, 2017

జగిత్యాల : మెట్ పల్లి బంద్ కు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. మల్లాపూర్ (మం) ముత్యంపేటలో నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని డిమాండ్ చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా రిలే నిరహారదీక్షలు జరుగుతున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం ఎలాంటి స్పందన వ్యక్తం చేయడం లేదు. దీనితో రైతు సంఘాలు మెట్ పల్లి బంద్ కు పిలుపునిచ్చాయి. బంద్ కు మద్దతు తెలుపుతూ పాఠాశాల విద్యా సంస్థలు సెలవు ప్రకటించగా వ్యాపార సంస్థలు మూతబడ్డాయి. వ్యాపారసంస్థలను మూసివేస్తున్న రైతు సంఘాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. తమను ఉదయం 5గంటలకు అరెస్టు చేశారని తెలిపారు. శుకవారం ఎంపీ ఓ కార్యక్రమం నిమిత్తం ఇక్కడకు వచ్చారని, తిరుగు ప్రయాణంలో దీక్షా స్థలిని సందర్శించి ఏదైనా హామీనిస్తారని భావించామని కానీ అలా చేయకుండా తిరిగి వెళ్లిపోవడం సిగ్గు చేటన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

10:39 - November 25, 2017
10:31 - November 25, 2017

హైదరాబాద్ : మెట్రోరైలు ఈనెల 28వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి లోపం తలెత్తకుండా..భద్రత విషయంలో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం ఉదయం కొన్ని రైల్వే స్టేషన్లలో మాక్ డ్రిల్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు మెట్రో రైలులో ప్రయాణించనున్నారు. మెట్రో ఛార్జీలపై మంత్రి కేటీఆర్ ఓ స్ఫష్టత ఇచ్చే అవకాశం ఉంది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

అరుణ మృతదేహంతో ఆందోళన..

నల్గొండ : బోడపర్తిలో అరుణ మృతదేహంతో నిందితుడు నర్సింహగౌడ్ ఇంటి ఎదుట గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఒంటిరిగా ఉన్న అరుణపై నర్సింహగౌడ్ అత్యాచార చేసి నిప్పంటించాడు. చికిత్స పొందుతూ అరుణ శుక్రవారం మృతి చెందింది. పోలీసులు కేసును తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. 

ఎగ్జామినేషన్ బ్రాంచ్ నిర్మాణానికి శంకుస్థాపన...

హైదరాబాద్ : అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎగ్జామినేషన్ బ్రాంచ్ నిర్మాణానికి కడియం శ్రీహరి శంకుస్థాపన చేశారు. 

10:11 - November 25, 2017

నల్గొండ : చండూరు (మం) బోడనపర్తిలో అరుణ మృతి కలకలం రేపుతోంది. కేసును పోలీసులు పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అత్యాచారం చేసి నిప్పంటించి అరుణను హత్య చేసిన ఆర్టీసీ డ్రైవర్ ను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇద్దరు పిల్లలతో ఒంటరిగా ఉన్న అరుణపై ఆర్టీసీ డ్రైవర్ నర్సింహగౌడ్ అత్యాచారం చేయడమే కాకుండా విషయం బయటకు పొక్కకూడదనే ఉండడంతో ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. మంటలకు తాళలేక అరుణ కేకలు వేయడంతో స్థానికులు స్పందించి అరుణను కాపాడే ప్రయత్నం చేశారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. కేసును నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 306 సెక్షన్ కింద కేసు నమోదు చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీనితో గ్రామస్తులు అరుణ మృతదేహంతో నిందితుడు ఇంటి వద్ద ధర్నా చేస్తున్నారు. వెంటనే చట్టప్రకారం నిందితుడిపై శిక్ష వేయాలని..నిర్భయ కేసు నమోదు చేయాలని..అనాథలైన ఇద్దరు పిల్లలకు న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. పరారైన నిందితుడు నర్సింహ గౌడ్ ను పోలీసుల అదుపులోనే ఉన్నట్లు సమాచారం.

టమాట కేజీ రూ. 60-80..

ఢిల్లీ : దేశ రాజధానిలో పొగమంచుతో పాటు కూరగాయల ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. టమాట కిలో రూ. 60 నుండి రూ. 80 పలుకుతుండగా ఉల్లిగడ్డ కూడా అధిక ధర పలుకుతోందని వినియోగదారులు పేర్కొంటున్నారు. 

09:32 - November 25, 2017

జగిత్యాల : మెట్ పల్లి బంద్ రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. మల్లాపూర్ (మం) ముత్యంపేట నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని డిమాండ్ చేస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో తెరిపిస్తామని టీఆర్ఎస్ పార్టీ ఆనాడు హామీనిచ్చిందని, కానీ అధికారంలోకి వచ్చి మూడున్నర సంవత్సరాలైనా హామీ నెరవేర్చలేదని రైతులు, విపక్షాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ శనివారం ఇచ్చిన బంద్ కు పలువురు మద్దతు ప్రకటిస్తున్నారు. బంద్ కు మద్దతు తెలుపుతూ పాఠాశాల విద్యా సంస్థలు సెలవు ప్రకటించగా వ్యాపార సంస్థలు మూతబడ్డాయి. 

09:09 - November 25, 2017

హైదరాబాద్ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 28వ తేదీన నగరానికి రానున్నారు. ఈ సందర్భంగా ఆయన పర్యటన షెడ్యూల్ అధికారికంగా ఖరారైంది. మెట్రో రైలు జాతికి అంకితం చేసిన అనంతరం ప్రపంచ వాణిజ్య సదస్సులో మోడీ పాల్గొననున్నారు. ఆయనతో పాటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ కూడా వస్తున్న సంగతి తెలిసిందే.

మోడీ షెడ్యూల్..

  • మధ్యాహ్నం 1.10 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు రాక.
  • 2.05 హెలికాప్టర్ మియాపూర్.
  • 2.15-2.23 మెట్రో పైలాన్ ఆవిష్కరణ.
  • 2.30 – 2.40 మియాపూర్ - కూకట్ పల్లి, కూకట్ పల్లి - మియాపూర్ మెట్రోలో ప్రయాణం.
  • 3.15 హెచ్ఐసీసీకి మోడీ.
  • 3.25 ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు ప్రారంభం.
  • 7.25 సదస్సులో ప్రసంగం.
  • 7.30 రోడ్డుమార్గంలో ఫలక్ నుమా ప్యాలెస్ కు.
  • 8 -10 వరకు విందు.
  • 10.25 రోడ్డు మార్గంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరిక

మెట్ పల్లి బంద్..

జగిత్యాల : మెట్ పల్లి బంద్ రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. మల్లాపూర్ (మం) ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బంద్ కు పిలుపునిచ్చాయి. సంఘీభావంగా పాఠాశాల విద్యా సంస్థలు సెలవు ప్రకటించాయి. 

08:20 - November 25, 2017
08:14 - November 25, 2017

నల్గొండ : జిల్లాలో ఓ ఆర్టీసీ డ్రైవర్ ఘాతుకం వెలుగులోకి వచ్చింది. మహిళపై అత్యాచారయత్నం చేయబోయి నిప్పంటించి పరరాయ్యాడు. ఇందులో రెండు భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఈ ఘటన చండూరు (మం) బోడనపర్తిలో చోటు చేసుకుంది. భర్త మృతి చెందడంతో అరుణ అనే మహిళ 8 ఏళ్ల బాబు..పాపతో నివాసం ఉంటోంది. కూలి పని చేసుకుంటూ జీవనాన్ని నెట్టుకొస్తోంది. ఈమెపై ఆర్టీసీ డ్రైవర్ గా పనిచేస్తున్న నర్సింహగౌడ్ కన్నేసినట్లు తెలుస్తోంది. పలుమార్లు లైంగికంగా వేధించినట్లు సమాచారం. ఈ క్రమంలో బుధవారం రాత్రి నర్సింహగౌడ్ ఆమెపై అత్యాచారయత్నం చేసేందుకు ప్రయత్నించాడు. అరుణ ప్రతిఘటించడంతో ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించి పరారైనట్లు తెలుస్తోంది. ఇందులో మరో వాదన కూడా వినిపిస్తోంది. తనపై ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడవద్దని..లేనిపక్షంలో తాను కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని అరుణ చెప్పినట్లు వాదన వినిపిస్తోంది. అప్పటికే కిరోసిన్ పోసుకున్న అరుణకు నర్సింహగౌడ్ నిప్పంటించినట్లు సమాచారం. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలింపులు చేపడుతున్నారు. అరుణ చనిపోవడంతో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారిపోయారు. వీరికి న్యాయం చేయాలని..నిందితుడిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మరి పిల్లలకు న్యాయం జరుగుతుందా ? లేదా ? అనేది చూడాలి. 

08:07 - November 25, 2017

మెట్రో రైలులో ఎమ్మెల్యేలు..మంత్రుల పర్యటన..

హైదరాబాద్ : మెట్రో రైలులో మంత్రులు..ఎమ్మెల్యేలు శనివారం ప్రయాణించనున్నారు. మెట్రో రైలు ఛార్జీలపై మంత్రి కేటీఆర్ స్పష్టతనివ్వనున్నారు. 

33 ట్రైన్లు ఆలస్యం..3 రైళ్లు రద్దు..

ఢిల్లీ : దేశ రాజధానిలో దట్టంగా పొగ మంచు అలుముకుంది. దీని కారణంగా రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. 33 ట్రైన్లు ఆలస్యంగా నడుస్తుండగా, 5 రైళ్ల సమయాల్లో మార్పులు..3 ట్రైన్లను రద్దు చేశారు. 

07:24 - November 25, 2017

ఉపాధ్యాయ నియామక నోటిఫికేషన్‌ టీఆర్టీపై, తెలంగాణ సర్కార్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. టీఆర్‌టీకి సంబంధించిన జీవో నంబర్ 25 ను సవరించి తీరాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. 10 జిల్లాల ప్రకారమే టీఆర్‌టీ నోటిఫికేషన్ ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో వినయ్ కుమార్ (విశ్లేషకులు), వేలూరి శ్రీనివాస రావు (టీఆర్ఎస్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

గోల్కొండ పీఎస్ పరిధిలో కార్డన్ సెర్చ్...

హైదరాబాద్ : గోల్కొండ పీఎస్ పరిధిలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీసీపీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 33 మంది అనుమానితులు, ఇద్దరు రౌడీషీటర్లను అదుపులోకి తీసుకున్నారు.

 

పోలీసుల అదుపులో చర్చి పాస్టర్...

ప్రకాశం : చీరాల సెయింట్ లూథరన్ మాక్స్ చర్చి పాస్టర్ సర్వోన్నతరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లో వ్యభిచారం చేస్తున్నారన్న ఆరోపణలపై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

మహిళపై అత్యాచారం చేసి నిప్పంటించిన ఆర్టీసీ డ్రైవర్...

నల్గొండ : చండూరు (మం) బోడనపర్తిలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఆర్టీసీ డ్రైవర్ మహిళపై అత్యాచారం చేసి నిప్పంటించి పరారయ్యాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది. పరారీలో ఉన్న నిందితుడు కోసం పోలీసులు గాలింపలు చేపడుతున్నారు. 

06:53 - November 25, 2017

రాజస్థాన్ : 'పద్మావతి' సినిమాకి వ్యతిరేకంగా ఓ యువకుడు ఆత్మహత్యకి పాల్పడ్డాడు. రాజస్థాన్‌ జైపూర్‌ పట్టణంలోని నహర్‌ఘడ్‌ కోటలో ఆత్మహత్యకి పాల్పడ్డాడు. తాము తలలు నరకం- ఉరి తీసుకుంటాం అని కోట గోడలపై రాశాడు. అక్కడ కోట గోడలపై ఊరి వేసుకుని ఆత్మహత్య కు పాల్పడ్డాడు. ఈ ఆత్మహత్యతో మాకు ఏలాంటి సంబంధం లేదని కర్ణిసేన తెలిపింది.

06:49 - November 25, 2017

ఈజిప్టు : దేశంలో రక్తపుటేరులు పారాయి. అల్‌ అరిష్‌లోని ఓ మసీదులో ఉగ్రవాదులు తెగబడ్డారు. మసీదుపై బాంబులతో దాడి చేశారు. భయంతో బయటకు పరుగులు పెడుతున్న వారిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఉగ్రవాదులో దాడిలో 235 మంది చనిపోయారు. మరో 10మంది గాయపడ్డారు. అయితే ఉగ్రవాదుల దాడిని ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఖండించాయి. ఈజిప్టులతో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. రక్తపుటేరులు పారించారు. అల్‌ అరిష్‌లోని ఓ మసీదును ఉగ్రవాదులు టార్గెట్‌ చేసుకున్నారు. నాలుగు వాహనాల్లో వచ్చిన ఉగ్రవాదులు మసీదుపై బాంబులతో దాడికి తెగబడ్డారు. భయంతో బయటకు పరుగులు పెడుతున్న వారిపైనా విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో 235 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మరో వంద మందికిపైగా గాయపడ్డారు. మసీదు దాడిలో ఓ సూసైడ్ బాంబర్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మసీదులో మృతదేహాలు మాంసపు ముద్దలా చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. మసీదులో ఎటు చూసినా రక్తపుటేరులే. ఘటనాస్థలికి హుటాహుటిన చేరుకున్న అక్కడి భద్రతా సిబ్బంది గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు.

ఈజిప్టులో మసీదుపై దాడికి పాల్పడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముస్లింల దేశంలో మసీదులపై దాడి జరగడం చాలా అరుదు. ఇక్కడ ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు ఎక్కువగా కాప్టిక్‌ క్రిస్టియన్‌ చర్చిలనే టార్గెట్‌ చేస్తారు. క్రిస్టియన్లతో పాటు భద్రతా దళాలను హతమార్చడమే ఇక్కడి ఇస్లామిక్‌ స్టేట్‌ పని. కానీ బిల్‌ ఆర్‌ అబ్ద్‌ మసీదులో జరిగిన సంఘటన యూవత్‌ ముస్లిం దేశాలను నివ్వెరపరుస్తోంది. ఈజిప్టు ప్రజలు కూడా తీవ్ర షాక్‌కు గురయ్యారు. అయితే ఉగ్రవాదులు ప్రత్యేకంగా సూఫీ ముస్లింలను టార్గెట్‌ చేసినట్టు అనుమానిస్తున్నారు.

ఈజిప్టులో ఉగ్రవాదులు సృష్టించిన మారణకాండ నేపథ్యంలో ఆ దేశాధ్యక్షుడు అబ్దెల్‌ ఫత్తా అల్‌ సీసీ భద్రతా అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈజిప్ట్‌లో భద్రతా దళాలు, ఇస్లామిక్‌ స్టేట్ మధ్య యుద్దం ఎప్పటి నుంచో కొనసాగుతోంది. గత మూడేళ్లకు పైగా కొనసాగుతున్న ఈ యుద్ధంలో వందలాది మంది పోలీసులు, సైనికుల్ని ఉగ్రవాదుల హతమార్చారు. ఉగ్రదాడి నేపథ్యంలో మూడు రోజులు సంతాప దినాలుగా ఈజిప్టు ప్రభుత్వం ప్రకటించింది.

06:47 - November 25, 2017

హైదరాబాద్ : పోలీస్‌లంటే ఉద్యోగంలో జాయిన్ అయ్యేటప్పుడు ట్రైనింగ్ తీసుకుంటారు. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ ఏళ్లు గడుస్తున్నా వాళ్లు అంతే చురుగ్గా ఫైట్స్‌ చేయగలరా? వారి కర్తవ్యాన్ని నిర్వర్తించగలరా? అయితే తెలంగాణ పోలీసులు మాత్రం తాము దేనికీ తీసిపోమంటున్నారు. కరీంనగర్‌ జిల్లాలో ఇజ్రాయిల్ యుద్ధ కళలతో శిక్షణ పొందుతోన్న పోలీస్ టీమ్స్‌పై స్పెషల్ స్టోరీ. పోలీసు ఉద్యోగమంటే నిత్యం ఎన్నో సవాళ్లను ఎదురుకోవాలి. మెంటల్‌గా, ఫిజికల్‌గా ఫిట్‌గా ఉండాలి. కానీ చాలా మందికి చిన్న వయస్సులోనే బీపీ షుగర్‌ లాంటి రోగాలు వస్తుంటాయి. 24 గంటలు పని చేయాల్సి వచ్చినప్పుడు తిండి, నిద్ర పట్టించుకోకుండా ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల వల్ల పోలీసులు ఫిట్‌నెస్‌ను కోల్పోయి కొంచెం ఆరోగ్యపరంగా కూడా దెబ్బతింటారు.

కరీంనగర్‌ పోలీసులు తాము ఎందులోనూ తక్కువ కాదంటున్నారు. అవును పోలీసులు ఉద్యోగంలో చేరే ముందు పొందే శిక్షణ మినహా ఆ తరువాత ఏమీ ఉండదు. అయితే మాజీ డీజీపీ అనురాగ్‌ శర్మ ఈ వ్యవస్థకు చరమగీతం పాడారు. అప్‌ డేట్ అవుతున్న వ్యవస్థకి అనుగుణంగా పోలీసులకు కూడా యుద్ధ విద్యను నేర్పేందుకు ఇజ్రాయిల్‌కి చెందిన యుద్ధ కళను తెలంగాణ పోలీసులకు నేర్పిస్తున్నారు.

మొదట హైదరాబాద్‌లోని సిబ్బందికి నేర్పిన తరువాత ప్రస్తుతం కరీంనగర్‌లోని సిబ్బందికి ఈ యుద్ధ విద్యలను నేర్పుతున్నారు. ఇజ్రాయిల్‌కి సంబంధించిన కొన్ని టెక్నిక్స్‌తో పాటు.. ఏడు రకాల డిఫెన్స్‌ విద్యలను జిల్లాలోని అన్ని పోలీస్‌ స్టేషన్లలోని సిబ్బందికి పరిచయం చేయిస్తున్నారు. జిల్లాలో ఉన్న పోలీస్‌ సిబ్బందిలో 35 ఏళ్ల కంటే తక్కువ వయస్సున్న కానిస్టేబుల్స్‌, ఎస్సైలకు ఈ విద్యలను నేర్పిస్తున్నారు. ఇప్పటికే కరీంనగర్‌ 10 బ్యాచ్‌లు ఈ ఇజ్రాయిల్ యుద్ధ విద్యను నేర్చుకుంటున్నారు.

గన్స్ వినియోగంతో పాటు.. అనుమానితులు చేతుల్లో ఉన్న గన్స్‌ను ఎత్తుకెళ్తే ఎలా ప్రతిఘటించాలి?.. నేరస్తులను పట్టుకునే తీరుపై శిక్షణ ఇచ్చారు. ఇలా మొత్తం ఏడు అంశాల్లో ప్రత్యేక శిక్షణతో పాటు.. పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగే సమయాల్లో వారిని నిలువరించే తీరుపై కూడా శిక్షణ ఇచ్చారు. జిల్లా కేంద్రంలో జరిగే ధర్నాలు, ఆందోళనల సమయాల్లో వీరిని ఉపయోగించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్నవారికి అత్యాధునిక ఆయుధాలతో పాటు.. శిక్షణకు సంబంధించిన సర్టిఫికెట్లు అందించారు. తరువాత హైదరాబాద్‌లోని పోలీస్‌ ట్రైనింగ్‌ సెంటర్లలో ఈ శిక్షణ ఉంటుంది. 

06:45 - November 25, 2017

నిజామాబాద్ : ప్రతిష్టాత్మక మిషన్‌ కాకతీయ పనుల లోపాలను కాగ్‌ కడిగిపారేసింది. చెరువుల పునరుద్దరణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకం చాలా జిల్లాలో పక్కదారి పట్టిందని తలంటింది. పనుల్లో నాణ్యతను పట్టించుకోలేదన్న కాగ్‌ నివేదికకు.. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో జరిగిన మిషన్‌ కాకతీయ అవకతవకలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మిషన్‌ కాకతీయ పథకం లోపభూయిష్టంగా మారింది. చెరువుల పునరుద్ధరణ కోసం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకం ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో అబాసుపాలైంది. ఇది ఎవరో విపక్షాల విమర్శ కాదు.. స్వయంగా కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) తన నివేదికలో వెల్లడించిన సత్యం. ఏళ్ల తరబడిగా నిరాదరణకు గురవుతన్న చెరువులకు మరమ్మతులు చేసి.. సాగు విస్తీర్ణం పెంచడానికి ఉద్దేశించిన పథకంలో అనేక అక్రమాలు చోటుచేసుకున్నట్లుగా కాగ్‌ తన నివేదికల్లో స్పష్టం చేసింది.

నిజామాబాద్‌ జిల్లాలో మిషన్‌ కాకతీయ కింద.. గతంలో వివిధ పథకాల కింద చేసిన పనులనే మళ్లీ చేపట్టారని కాగ్‌ తేటతెల్లం చేసింది. ఆయకట్టు లేని చెరువులను మరమ్మతుల కోసం ఎంపిక చేశారని గుర్తించింది. పూడికతీత పనుల్లో కూడా నిబంధనలను ఏమాత్రం పాటించలేదని కాగ్‌ తెలిపింది. మిషన్‌ కాకతీయ ప్రధానోద్దేశం.. గొలుసుకట్టు చెరువులను పరిరక్షించుకోవడం. అయితే.. మిషన్‌ కాకతీయ కింద నిజామాబాద్‌ జిల్లాలో చేపట్టిన చెరువు పనుల్లో పథకం ఉద్దేశాన్ని పట్టించుకోలేదని కాగ్‌ తలంటింది. చెరువుల్లో ఆక్రమణలను కూడా తొలగించక పోవడాన్ని కాగ్‌ తప్పుబట్టింది.

జిల్లాలో మిషన్‌ కాకతీయ కింద మూడు దశల్లో పనులు జరిగాయి. మొత్తం 1,653 చెరువుల పునరుద్ధరణ కోసం.. ఆరు వందల పన్నెండు కోట్ల పన్నెండు లక్షల రూపాయలను విడుదల చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో.. చెరువుల భాగస్వామ్య అభివృద్ధి పథకం, ఆర్‌ఆర్‌ఆర్‌ వంటి పథకాల కింద పూర్తి చేసిన పనులకే ఈ మొత్తాన్ని మళ్లీ ఖర్చు చేశారని కాగ్‌ తప్పుబట్టింది.

గత ప్రభుత్వ హయాంలో చెరువుల భాగస్వామ్య అభివృద్ధి పథకం కింద ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో 137 చెరువుల కట్టలు, తూములు, అలుగులను పటిష్టపరిచారు. అప్పట్లో దీనికోసం 24 కోట్ల 74 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ఈ పథకం కింద బాగుచేసిన వాటిల్లోనే.. 119 చెరువులను మిషన్‌ కాకతీయ పథకంలోనూ పని చేసినట్లు చూపారని కాగ్‌ ఆరోపించింది. ఇది నిబంధలనకు విరుద్ధమని కాగ్‌ వ్యాఖ్యానించింది.

అలాగే ఆర్‌ఆర్‌ఆర్‌ పథకంలో మరమ్మతులు చేసిన చెరువులనే.. మిషన్‌కాకతీయ రెండు, మూడు విడతల్లో చేర్చారని కాగ్‌ గుర్తించింది. రెండో విడతలో 19 చెరువులు, మూడో విడతలో 153 చెరువులను ఈ జాబితాలో చేర్చినట్లు వెల్లడించింది. చెరువుల సామర్థ్యం వెడల్పులతో సంబంధం లేకుండా కట్టను ఇష్టారీతిన విస్తరించారని కాగ్‌ నివేదించింది. వివిధ పథకాల కింద పోసిన మట్టితో పటిష్టంగా ఉన్న కట్టలకే... మళ్లీ మిషన్‌ కాకతీయ ద్వారా మట్టిపోసి చేతులు దులుపుకొన్నారని కాగ్‌ ఆక్షేపించింది. మరోవైపు, మిషన్‌ కాకతీయ మొదటి రెండు విడతల పనులే ఇంకా పూర్తికాకున్నా.. మూడో విడతకి ప్రభుత్వం సిద్ధమవ్వడం కూడా విమర్శలకు దారితీస్తోంది.

ఉమ్మడి జిల్లాలో 3,251 చెరువుల్లో సింహభాగం కబ్జాకు గురయ్యాయన్నది ఓ అంచనా. అధికారిక లెక్కల ప్రకారమే 1500 చెరువులు ఆక్రమణలకు గురైనట్లు గుర్తించారు. రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు సంయుక్త సర్వే నిర్వహించి హద్దులు నిర్ణయించి చెరువుల్లోని ఆక్రమణలు తొలగించాలి. తర్వాతే చెరువు అభివృద్ధి పనులు ప్రారంభించాలి. కానీ చాలాచోట్ల హద్దులు నిర్ణయించక పోవడం వల్ల చాలా మేర చెరువు భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ఇప్పటి వరకు జరిగిన మూడు విడతల మిషన్‌ కాకతీయ పథకం పనులు లక్ష్యానికి దూరంగా ఉన్నట్లు కాగ్‌ తప్పుపట్టింది. 

06:42 - November 25, 2017

హైదరాబాద్ : ఆమె రాకకోసం తెలంగాణ ప్రభుత్వం ఎన్నో ఏర్పాట్లు చేస్తోంది. బిచ్చగాళ్లు రోడ్లపై కనిపించకుండా ప్రత్యేక షెల్టర్‌కు తరలించారు. ఆమె కోసం చార్మినార్ వద్ద ఓ మాల్‌నే సిద్ధం చేశారు. నిఘా విషయంలో భాగ్యనగరమంతటినీ జల్లెడ పడుతున్నారు. ఆమె మరెవరో కాదు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కూతురు ఇవాంక. ఈ నెల 28న హైదరాబాద్‌లో జరిగే అమెరికా-భారత్‌ వాణిజ్య సదస్సుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కూతురు ఇవాంక హాజరవుతోంది. 350 మందితో కూడిన అమెరికన్ బృందానికి నాయకత్వం వహిస్తోంది. పేరుకి ఆమె అమెరికా అధ్యక్షుడి సలహాదారు. అంతకుమించి అధ్యక్షుడికి ఎంతో నమ్మకస్తురాలు. ఆమె కనుసన్నల్లోనే కీలక విభాగాలన్నీ నడుస్తుంటాయి.

అమెరికాకు సంబంధించినంత వరకూ అధ్యక్షుడి తరువాతి స్థానం ఇవాంకదే. అంతటి ప్రాధాన్యం ఉన్న వ్యక్తి గనకే ఆమెకు అధ్యక్షుడికిచ్చినంత గౌరవమర్యాదలున్నాయి. ఆమె సలహాదారే అయినా ఇక్కడ మాత్రం ఆమెకు ట్రంప్‌ కూతురు హోదాలోనే స్వాగతం, భద్రత, ట్రీట్‌మెంట్‌ ఉంటాయి. ఇవాంక హైదరాబాద్‌ రావడం వెనక కొంత కసరత్తు జరిగింది. ప్రధాని నరేంద్రమోదీ వైట్‌ హౌస్‌ సందర్శించినప్పుడు ఈ ప్రస్తావన వచ్చింది. ట్రంప్‌ ప్రస్తుతానికి భారత్ వచ్చే అవకాశాలు లేవని తేలడంతో మోదీ ఇవాంకను పంపండని ప్రతిపాదించారు. ఆమె ప్రాధాన్యం ఎంత ఉందో అంచనా వేశాకే మోదీ ఈ ప్రదిపాదన చేశారు. ఎలాగూ చైనా రాయబారి కార్యాలయాన్ని సందర్శించి వారి నూతన సంవత్సర వేడుకల్లో ఇవాంక పాల్గొన్నారు. చైనాలో తయారయ్యే అనేక ఉత్పత్తులు ఎలక్ట్రానిక్ పరికరాలు, వీడయో గేమ్స్‌ ఆమెను ఆకర్షించాయి. మోదీ వాణిజ్య సదస్సును అత్యుత్తమ స్థాయిలో నిర్వహించాలని ఆదేశాలిచ్చారు. సదస్సు నినాదం ఉమెన్ ఫస్ట్‌ కూడా ఇవాంకను ఉద్దేశించే పెట్టారు. ఇవాంకాకు ఐదంచెల భద్రత కల్పిస్తున్నారు. అంటే దాదాపు అధ్యక్షుడి భద్రతతో సమానం. ఆమె ప్రధాని మోదీతోనూ, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌తోనూ, ఇతర ప్రభుత్వ పెద్దలతోనూ సంప్రదింపులు జరుపుతారు. ఇవాంక ఉత్సాహంగా సదస్సుకు హాజరవుతుండడానికి ఇది కూడా ఓ కారణం. ఆమె వెంట భర్త, అమెరికా ప్రభుత్వంలో మరో సలహాదారు కుష్నర్ కూడా వస్తున్నారు. 

06:39 - November 25, 2017

హైదరాబాద్‌ : నగరంలో జరగనున్న గ్లోబల్‌ ఎంటర్‌ ప్రెన్యూర్‌ సమ్మిట్‌ ఏర్పాట్లు పూర్తికావొస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక దిగ్గజాలు మరచిపోలేని విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రోడ్లను బాగుచేయడం దగ్గరి నుంచి అందమైన గ్రీనరీని అభివృద్ధి చేయడం వరకు పథకం ప్రకారం ఏర్పాట్లు సాగుతున్నాయి. ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కూతురు ఇవాకా ఈ సదస్సుకు హాజరవుతుండడంతో హైదరాబాద్‌ను అత్యంత అందంగా తీర్చిదిద్దుతున్నారు.

ఈనెల 28 నుంచి హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సదస్సు ప్రారంభంకానుంది. మూడు రోజులపాటు ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సుకు హైదరాబాద్‌ ఆతిథ్యం ఇవ్వబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా 2వేల మంది పారిశ్రామిక వేత్తలు ఈ సదస్సుకు హాజరవుతున్నారు. దేశంలోకి పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా జరుగనున్న ఈ సదస్సుకు అన్ని ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ప్రపంచంలోని ప్రముఖులు ఈ సదస్సుకు హాజరవుతుండడంతో సిటీలోని ప్రధాన మార్గాలను అందంగా తీర్చిదిద్దుతున్నారు.

ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు పనులను రాష్ట్ర ప్రభుత్వం నిత్యం సమీక్షిస్తోంది. మున్సిపల్‌శాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించారు. మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీ నుంచి హైటెక్‌సిటీ, గోల్కొండ, ఆరంఘర్‌, ఫలక్‌నుమా ప్యాలెస్‌తోపాటు చార్మినార్‌ వరకు రోడ్డు నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఇక ఈ మార్గాల్లో సుందరీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. 45 కోట్ల రూపాయలతో వందకుపైగా పనులు చేపట్టింది జీహెచ్‌ఎంసీ. ఇందులో రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, ఫుట్‌పాత్‌ల నిర్మాణం, గార్డెనింగ్‌ పనులు, లేన్‌ మార్కింగ్‌, పెయింటింగ్‌ వర్క్‌తోపాటు మరికొన్ని పనులు చేపట్టింది. శంషాబాద్‌ నుంచి హెచ్‌ఐసీసీ వరకు రహదారులను పకడ్బంధీగా వేయడంతోపాటు ఈ మార్గంలోని పరిసర ప్రాంతాలన్నింటినీ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.

హైటెక్‌ సిటీ జంక్షన్‌ దగ్గర ఉన్న ఫ్లైఓవర్‌ను రంగురంగుల కళాఖండాలతో, అందమైన పెయింటింగ్‌తో నింపేశారు. రోడ్డుకు ఇరువైపులా అందమైన మొక్కలు, పూల చెట్లతో అలంకరించారు. వివిధ జంతువులు, పక్షుల ఆకృతుల్లో ఏర్పాటు చేసిన పూలకుండీలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇక సాయంత్రం అయితే చాలు మిరుమిట్లు గొలుపుతూ వివిధ కలర్స్‌తో కూడిన వెలుగులు విరజిమ్మేలా లైట్స్‌ ఏర్పాటు చేశారు. హైటెక్స్‌ మార్గంలో ఉన్న చార్మాన్‌ లోగో ఆకర్షణీయంగా కనిపించేలా కలరింగ్‌ చేస్తున్నారు. రోడ్డుసైడ్‌, సెంటర్‌ మీడియంలో ఉన్న చెట్లకు అందమైన రంగులు, వాటిపై అందమైన బొమ్మలు వేశారు. ఈ ఏర్పాట్లను బల్దియా ఉన్నతాధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

అంతర్జాతీయ అతిథులు కలకాలం గుర్తించుకునేలా సదస్సుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. సదస్సుకు హాజరయ్యే ప్రతినిథులు బస చేసే హోటల్స్‌ మార్గాల్లోనూ రోడల్‌ను అభివృద్ధి చేస్తున్నారు. రోడ్లకు ఇరువైపులా వివిధ రకాల పూలచెట్లను ఉంచుతున్నారు. ఇవాంక ట్రంప్‌ బస చేసే వెస్టీన్‌ హోటల్‌ మార్గం... ప్రధానితోపాటు ప్రముఖులందరూ విందులో పాల్గొనే ఫలక్‌నుమా ప్యాలెస్‌ మార్గాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.

06:37 - November 25, 2017

హైదరాబాద్ : 200 కోట్లకు పైగా మనీలాండరింగ్‌కు పాల్పడ్డ 12 మందితో రూపొందించిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ జాబితాలో 10వ స్థానంలో నిలిచాడు వైఎస్‌ జగన్‌. పెద్దమొత్తంలో మనీలాండరింగ్‌కు పాల్పడ్డ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై విచారణ చేపట్టిన ఈడీ ఈ వివరాలను వెల్లడించింది. భారీ స్థాయిలో మనీలాండరింగ్‌కు పాల్పడ్డ టాప్‌ 12 వ్యక్తుల్లో జగన్‌ 10వ స్థానంలో ఉన్నారని తెలిపింది ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌. ఈ మేరకు హవాలా మార్గంలో విదేశాలకు పెద్ద ఎత్తున డబ్బు తరలించారన్న ఆరోపణలు ఉన్నవారిపై ఈడీ విచారణ చేపట్టింది. 200 కోట్లకు పైగా మనీలాండరింగ్‌కు పాల్పడ్డ 12 మంది వ్యక్తులతో జాబితా రూపొందించింది. ఈడీ రూపొందించిన జాబితాలో ఇద్దరు రాజకీయ నాయకులు ఉన్నారు. ఒకరు వైఎస్‌ జగన్‌ అయితే మరొకరు మహారాష్ట్రకు చెందిన ఎన్‌సీపీ నాయకుడు చగన్‌ భజ్‌బల్‌. ఇందులో జగన్‌తో పాటు ఆయన సంబంధికులు 31 షెల్‌ కంపెనీల ద్వారా 368 కోట్లను హవాలా మార్గంలో విదేశాలకు తరలించారని ఈడీ అంచనా వేసింది. రాజకీయ అవినీతితో పాటు బంగారం, డ్రగ్స్‌, స్మగ్లింగ్, ఉగ్రవాద కార్యకలాపాలు, ఇతర చట్టవ్యతిరేక చర్యలతో సంపాదించిన సొమ్మునే హవాలా మార్గంలో దేశం దాటించినట్లు ఈడీ చెబుతోంది. తనకు విదేశీ పెట్టుబడులు లేవని వాదిస్తున్న జగన్‌ మరి ఈడీ విచారణపై ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.  

06:35 - November 25, 2017

హైదరాబాద్ : అధికార పగ్గాలు దక్కించుకుని పార్టీ వలసలను ప్రోత్సహిస్తోన్న టీఆర్‌ఎస్‌కు క్రమంగా బ్రేక్‌ పడుతోంది. నిన్న మొన్నటి వరకు టీఆర్‌ఎస్‌లోకే వలసలు కనిపించేవి. ఎన్నికలు సమీపిస్తుండడంతో ఇప్పుడు పొలిటికల్‌ లీడర్లు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకుంటున్నారు. కాంగ్రెస్‌ కూడా ఎక్కడికక్కడ నేతలను తమ పార్టీలోకి ఆహ్వానిస్తోంది. దీంతో గులాబీ నేతల్లో కొత్త టెన్షన్‌ మొదలైంది.

తెలంగాణ ఉద్యమం నుంచి నేటివరకు టీఆర్‌ఎస్‌ హవా కొనసాగుతూనే ఉంది. తెలంగాణలో తమ ప్రాబల్యం బలంగా చాటుకునే కాంగ్రెస్‌కు, టీడీపీకి గులాబీ పార్టీ చెక్‌పెడుతూనే వస్తోంది. స్వరాష్ట్రం సిద్దించి టీఆర్‌ఎస్‌ అధికారం చేజిక్కించుకున్న తర్వాత కాంగ్రెస్‌, టీడీపీలను మరింతగా టార్గెట్‌ చేసింది. ఆపరేషన్‌ ఆకర్ష్‌ అనే ఆయుధాన్ని టీఆర్‌ఎస్‌ బయటకు తీసింది. ప్రతిపక్ష పార్టీల నుంచి విజయం సాధించిన ఎమ్మెల్యేలను కారెక్కించుకుని వలసలను ప్రోత్సహించింది. దాదాపు 30మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలు గులాబీ పార్టీ ఆకర్ష్‌కు కారెక్కక తప్పని పరిస్థితులను కల్పించడంలో సక్సెస్‌ అయ్యింది. రాజకీయ పునరేకీకరణ, బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలంటూ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుని విపక్షాలను దెబ్బతీసింది.

అధికారం చేజిక్కించుకున్న నాటి నుంచి నేటి వరకు టీఆర్‌ఎస్‌ తెలంగాణలో వలసలను ప్రోత్సహిస్తోంది. ఇతర పార్టీల నేతలను తమ పార్టీలో చేర్చుకుంటోంది. ఇప్పుడు తెలంగాణలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌ కూడా అస్త్రశస్త్రాలను బయటకు తీస్తోంది. సాధారణ ఎన్నికలకు సమయం సమీపిస్తుండడంతో ప్రయత్నాలను ముమ్మరం చేసింది. గులాబీ పార్టీ నేతలతోపాటు ఇతర పార్టీల నేతలపైనా కాంగ్రెస్‌ దృష్టిసారించింది. ఈ మూడేళ్ల కాలంలో హస్తాన్ని వీడి కారెక్కిన నేతలనూ మళ్లీ మాతృసంస్థలోకి ఆహ్వానించేలా ప్రయత్నాలు మొదలుపెట్టింది. కాంగ్రెస్‌ బలంగా ఉందని భావిస్తున్న మహబూబ్‌నగర్‌, నల్లగొండ జిల్లాల్లో ఇప్పటికే కొంతమంది నేతలను కాంగ్రెస్‌ తమ పార్టీలోకి ఆహ్వానిస్తోంది. ద్వితీయ శ్రేణి నాయకత్వంపైనా కాంగ్రెస్‌ ఫోకస్‌ పెట్టింది. దీంతో ఎక్కడికక్కడ నేతలను తమ పార్టీలో చేర్చుకుంటోంది. ఈ వలసలు ఇలాగే ఎన్నికల సమయం వరకు కొనసాగితే అధికార పార్టీ కూడా ఎంతోకొంత నష్టపోవాల్సి వస్తుంది.

కాంగ్రెస్‌లోకి వలసలు పెరగడంతో అధికార పార్టీ వాటిని నివారించే పనిలో పడింది. కాంగ్రెస్‌లోకి వలసలను నివారించడంపై సీరియస్‌గానే దృష్టి సారించింది. అసంతృప్త నేతలను గులాబీ నేతలు బుచ్చగిస్తున్నారు. మరికొంత మంది అసంతృప్తి నేతలు రాబోయే రోజుల్లో హస్తంపార్టీ గూటికి చేరుతారన్న అనుమానాలు గులాబీ దళాన్ని వెంటాడుతున్నాయి.

06:32 - November 25, 2017

హైదరాబాద్ : బోడుప్పల్‌ చెందిన మాజీ టీఆర్‌ఎస్‌ నాయకుడు శ్రీనివాస్‌రెడ్డి ఇంటిముందు రెండో భార్య సంగీత న్యాయపోరాటం ఆరో రోజుకు చేరింది...తనకు న్యాయం జరిగే వరకు పోరాటం విరమించేది లేదని తేల్చి చెబుతోంది. సంగీతకు మద్దతుగా మహిళా సంఘాల కార్యకర్తలు కూడా శ్రీనివాసరెడ్డి ఇంటిముందు బైఠాయించారు. అత్తింటి నుంచి సంగీతకు చెందాల్సిన హక్కులు..ఆమె కూతురి భవిష్యత్తుకు ఆర్థిక సాయం అందాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు సంగీతకు రాజీ కుదిర్చేందుకు ఎంపీ మల్లారెడ్డి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు...సంగీత మామ బాల్‌రెడ్డితో ఆర్థికసాయంపై మాట్లాడే ప్రయత్నం చేశారు...ఇక చర్లపల్లి జైలుకు ఎంపీ మల్లారెడ్డి వెళ్లి జైలులో ఉన్న సంగీత భర్త శ్రీనివాసరెడ్డిని కలిసి చర్చించారు. న్యాయం జరిగితే దీక్ష విరమణ చేసేందుకు రెడీగా ఉన్నానంటోంది సంగీత...తన డిమాండ్లు నెరవేర్చాలని వేడుకుంటుంది.

06:29 - November 25, 2017

హైదరాబాద్ : టీఆర్‌టీ నోటిఫికేషన్‌పై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. జీవో నంబర్ 25కి అనుగుణంగా 31 జిల్లాల ఆధారంగా టీఆర్‌టీ పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం అక్టోబర్ 10న నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిని వ్యతిరేకిస్తూ పలువురు హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. దీనిపై వాదోపవాదనలు విన్న న్యాయస్ధానం నోటిఫికేషన్ సవరించాల్సిందేనని స్పష్టం చేసింది.

ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన జి.అరుణ్‌కుమార్‌ సహా నలుగురు వ్యక్తులు, టీఆర్టీ నోటిఫికేషన్‌ను వ్యతిరేకిస్తూ.. కోర్టులో పిల్‌ వేశారు. తెలంగాణలోని పూర్వపు పది జిల్లాలకే రాష్ట్రపతి ఆమోదం ఉందని.. కొత్తగా ఏర్పడిన జిల్లాలకు ఆమోదం లేదని.. పిటిషనర్ తరపు వాదించిన రాహుల్‌రెడ్డి కోర్టుకు విన్నవించారు. నోటిఫికేషన్‌ ప్రకారం, కొత్త జిల్లాలోని అభ్యర్ధులు... పూర్వపు జిల్లాలో స్ధానికేతరుడై నష్టపోతారని వివరించారు. పాలనా సౌలభ్యం కోసమే 31 జిల్లాల ఏర్పాటు జరిగిందని, ఉద్యోగ నియామకాలకు ఈ జిల్లాలను ప్రామాణికంగా తీసుకోవడం చట్ట విరుద్ధమని రాహుల్‌రెడ్డి వాదించారు.

మరోవైపు సుప్రీం కోర్టు ఆదేశాల మేరకే టీఆర్‌టీ నిర్వహిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి కోర్టుకు తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి రెండో వారంలో పరీక్షలు నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయం అమలయ్యేలా చూడాలని.. పరీక్ష వాయిదా పడకుండా చూడాలని ఆయన కోర్టును అభ్యర్ధించారు. 31 జిల్లాలను పరిగణనలోకి తీసుకుని పరీక్ష నిర్వహిస్తే స్థానిక అభ్యర్థులకు అన్యాయం జరగదని, రాష్ట్రపతి ఉత్తర్వుల్ని ఉల్లంఘించినట్లు కాదని ఏజీ వాదించారు.ఇరువురి వాదోపవాదనలు విన్న హైకోర్టు రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధమన్న పిటిషనర్ వాదనతోనే ఏకీభవిస్తూ తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన నోటీఫికేషన్ సవరించాలని ఆదేశించింది. న్యాయస్థానం ఉత్తర్వులతో.. టీఆర్టీకి సిద్ధపడుతున్న అభ్యర్థుల్లో హర్షం వ్యక్తమవుతోంది. 

06:27 - November 25, 2017

హైదరాబాద్ : టీజేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన కొలువుల కొట్లాట సభకు బాలరిష్టాలు తొలగడం లేదు. సభ అనుమతి వ్యవహారం తేలిందనుకుంటే.. మరో అడ్డంకి వచ్చి పడింది. పారిశ్రామిక సమ్మిట్‌ , పీఎం టూర్ వల్ల.. సభకు అనుమతి, భద్రత ఇవ్వలేమంటూ.. పోలీసు అధికారులు చేతులు ఎత్తేశారు. దీంతో కథ మళ్లీ మొదటి వచ్చింది. సెప్టెంబ‌ర్‌లో హైదారాబాద్ లో సభ పెట్టి నిరుద్యోగుల గళం వినిపించేందుకు టీజేఏసీ గ్రౌండ్ వ‌ర్క్ చేసుకుంది. సభ అనుమతి కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే ప్రభుత్వం నుంచి వివరణ ఇవ్వడంలో జాప్యం జరగడంతో ఈ వ్యవహారం నెలరోజుల పాటు కోర్టులోనే నానింది. ప్రభుత్వం తరపున జరుగుతున్న జాప్యంపై మండిపడ్డ ... కోదండరామ్‌ తార్నాకలోని ఇంటి వద్ద ఒక రోజు నిరసన దీక్ష చేపట్టారు. కోదండరామ్‌ చేస్తున్న దీక్షకు ప్రతిపక్షాలు మద్దతునిచ్చాయి. దీంతో దిగి వచ్చిన ప్రభుత్వం షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. దీంతో సరూర్‌ నగర్‌ స్టేడియంలో 30వ తేదీన సభను నిర్వహించేందుకు టీజేఏసీ ఏర్పాట్లు చేసింది. సభకు పెద్ద ఎత్తున నిరుద్యోగులు తరలివచ్చేలా.. కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్న తరుణంలో పోలీసులు మళ్లీ షాక్‌ ఇచ్చారు.

28 నుంచి 30 వరకూ నగరంలో పారిశ్రామిక వేత్తల సదస్సు, మెట్రో ప్రారంభోత్సవ కార్యక్రమాలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కుమార్తె ఇవాంక ట్రంప్‌, భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్న నేపథ్యంలో టీజేఏసీ సభకు అనుమతి ఇవ్వలేమంటూ.. పోలీసులు చేతులెత్తేశారు. ఇదే విషయాన్ని కోర్టుకు విన్నవించుకున్నారు. దీనిపై స్పందించిన కోర్టు 30, డిసెంబర్‌ 1, 2 తేదీలలో తప్ప ఎప్పుడైనా సభ నిర్వహించుకోవచ్చునని.. స్పష్టం చేసింది. ఈ మేరకు డిసెంబర్‌ 6 తర్వాత మరొక తేదీని ప్రకటించి.. సభను జరుపుతామని జేఏసీ నేత కోదండరామ్‌ స్పస్టం చేశారు. అడగడుగునా.. ఇలా అడ్డంకులు సృష్టిస్తుండడంపై.. టీజేఏసీ ఆగ్రహంగా ఉంది. ఎన్ని అవాంతరాలు..ఎదురైనా హైదరాబాద్‌లో సభ నిర్వహించి తీరాలనే కృతనిశ్చయంతో టీజేఏసీ ముందుకు కదులుతోంది.

మహబూబాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం...

మహబూబాబాద్‌ : జిల్లా తొర్రూరు మండలం మాటేడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, కారు ఢీకొనడంతో అక్కడికక్కడే నలుగురు దుర్మరణం చెందారు. మృతులు శ్రీనివాస్‌రెడ్డి, లక్ష్మి, మాదవి, చిన్నారి కృష్ణవేణి ఒకే కుటుంబానికి చెందిన గుర్తించారు. వీరంతా నెల్లికుదురు మండలం వావిలాల వాసులుగా గుర్తించారు. 

పద్మావతి సినిమాకు వ్యతిరేకంగా యువకుడు ఆత్మహత్య...

పద్మావతి సినిమాకి వ్యతిరేకంగా ఓ యువకుడు ఆత్మహత్యకి పాల్పడ్డాడు. రాజస్థాన్‌ జైపూర్‌ పట్టణంలోని నహర్‌ఘడ్‌ కోటలో ఆత్మహత్యకి పాల్పడ్డాడు. తలలు నరకం ఊరి తీసుకుంటాం అని కోట గోడలపై రాశాడు. అక్కడ కోట గోడలపై ఊరి వేసుకుని ఆత్మహత్య కు పాల్పడ్డాడు. ఈ ఆత్మహత్యతో మాకు ఏలాంటి సంబంధం లేదని కర్ణిసేన తెలిపింది.

ఈజిప్టులో ఉగ్రదాడి...182 మంది మృతి..

ఈజిప్టులో ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. మసీదును లక్ష్యంగా చేసుకుని ముష్కరులు దారుణ మారణకాండకు పాల్పడ్డారు. ఈజిప్టులోని సినాయ్‌ ద్వీపకల్పంలోని మసీదులో జరిగిన దాడిలో 182 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 120 మంది గాయపడ్డారు. 

భారత్ - లంక టెస్టు...

నాగ్ పూర్ : భారత్‌-శ్రీలంక మధ్య జరుగుతోన్న టెస్ట్‌ సిరీస్‌లోని కీలక నాగ్‌పూర్‌ టెస్ట్‌ తొలి రోజే టీమిండియా డామినేట్‌ చేసింది.భారత బౌలర్ల ధాటికి లంక బ్యాట్స్‌మెన్‌ క్యూ కట్టడంతో శ్రీలంక....భారీ స్కోర్ చేయలేకపోయింది. 79.1 ఓవర్లు బ్యాటింగ్‌ చేసిన లంక జట్టు 205 పరుగులకే కుప్పకూలింది.అశ్విన్‌ 4 వికెట్లు తీయగా...ఇషాంత్‌ శర్మ, రవీందర్‌ జడేజా చెరో వికెట్లు తీశారు.తొలి ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే రాహుల్‌ వికెట్‌ కోల్పోయిన భారత్‌ మొదటి రోజు ఆట ముగిసే సరికి వికెట్‌ నష్టానికి 11 పరుగులు చేసింది.

సంగీతతో చర్చించిన ఎంపీ మల్లారెడ్డి...

మేడ్చల్ : బోడ్పుపల్ లో టీఆర్ఎస్ బహిష్కృత నేత శ్రీనివాస్ రెడ్డి భార్య సంగీతతో ఎంపీ మల్లారెడ్డి చర్చలు జరిపారు. సంగీత తమ ముందు కొన్ని డిమాండ్లు పెట్టిందని, దీనిపై సంగీత మామతో చర్చిస్తున్నట్లు మల్లారెడ్డి పేర్కొన్నారు.  

Don't Miss