Activities calendar

26 November 2017

21:36 - November 26, 2017
21:35 - November 26, 2017

వాషింగ్టన్ : ముంబై టెర్రర్ మాస్టర్ మైండ్ హఫీజ్ సయీద్ విడుదలపై అమెరికా భగ్గుమంది. తీవ్రవాదానికి ఊతం ఇవ్వబోమని చెబుతూనే.. ఇప్పుడు హఫీజ్‌ను ఎలా విడుదల చేస్తారని ప్రశ్నించింది. వెంటనే అతడిని అరెస్ట్ చేయాలని అమెరికా పాక్‌కు లేఖ రాసింది. రెండురోజుల క్రితం విడుదలైన హఫీజ్... కశ్మీర్ స్వాతంత్ర్యం కోసం పోరాడుతానని ప్రకటించాడు. ముంబయి ఉగ్రదాడి‌లో కీలక సూత్రధారిగా ఉన్న హఫీజ్ సయీద్.. ప్రస్తుతం జమాత్ ఉద్ దవా ఉగ్రవాద సంస్థ ఛీఫ్ గా వ్యవహరిస్తున్నాడు.

21:26 - November 26, 2017

భోపాల్ : మధ్యప్రదేశ్‌ కేబినెట్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. మైనర్లపై అత్యాచారానికి పాల్పడిన దోషులకు మరణశిక్ష విధించేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. పన్నెండు సంవత్సరాలు, అంతకంటే తక్కువ వయసు ఉన్న చిన్నారులపై అత్యాచారానికి పాల్పడిన వాళ్లు దోషులుగా రుజువైతే మరణశిక్ష విధించాలనే తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సామూహిక అత్యాచారానికి పాల్పడిన దోషులకు కూడా మరణశిక్ష అమలయ్యేలా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అత్యాచార దోషులకు విధించే జరిమానా, శిక్షల విషయంలోనూ సవరణలు తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన బిల్లును సోమవారం నుంచి జరిగే ఆ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. మధ్యప్రదేశ్‌లో చిన్నారులు, మహిళలపై లైంగిక దాడులు ఎక్కువవుతున్న నేపథ్యంలో వాటిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. 

21:22 - November 26, 2017

హైదరాబాద్ : మెట్రో రైలు ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ అసత్య ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్‌ మండిపడింది. మెట్రో రైలు మంజూరు చేసింది కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్న వాస్తవాన్ని టీఆర్‌ఎస్‌ పాలకులు విస్మరించారని టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. నిర్మాణం కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమైన విషయాన్ని గుర్తు చేశారు. హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్టుపై కాంగ్రెస్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చింది. అనుమతులు, నిధుల మంజూరు నుంచి నిర్మాణం వరకు కాంగ్రెస్‌ ప్రభుత్వాలు చేసిన కృషిని వివరించారు. కేసీఆర్‌ వల్లే ఈ ప్రాజెక్టు రెండేళ్లు ఆలస్యమైందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు మంజూరు, అమల్లో కేసీఆర్‌, కేటీఆర్‌ పాత్ర ఏమీలేదన్నారు. 

20:35 - November 26, 2017

ఒంగోలు మార్కెట్లో భారీ చోరీ

ప్రకాశం : జిల్లా ఒంగోలు కూరగాయల మార్కెట్లో భారీ చోరీ జరిగింది. ఆగివున్న కారు నుంచి 2కిలోల బంగారం, రూ.2లక్షలను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. నగల వ్యాపారి రాహుల్ వన్ టౌన్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు.

 

ఆందోళన విరమించిన ఫాతిమా వద్యార్థులు

కృష్ణా : విజయవాడలోని గుణదలలో ఆందోళన చేస్తున్న ఫాతిమా వైద్య విద్యార్థులు తమ ఆందోళను విరమించారు. విద్యార్థులు రేపు సీఎం చంద్రబాబుతో సమావేశం కానున్నారు.

20:15 - November 26, 2017
20:14 - November 26, 2017

గుంటూరు : నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. గుంటూరు జిల్లా మంగళగిరి వద్ద తెల్లవారుజామున 5 గంటల 17 నిమిషాలకు వేదపండితుల మంత్రోచ్ఛారణ మధ్య సీఎం చంద్రబాబు భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అలాగే సీఎం నివాసం పక్కనే నిర్మించిన గ్రీవెన్స్ హాలును కూడా ప్రారంభించారు.తెలుగు వాళ్లు ఎక్కడున్నా వారి సంక్షేమం కోసం టీడీపీ పనిచేస్తుందన్నారు చంద్రబాబు. పార్టీ ఆఫీసు నిర్మాణాన్ని 9 నెలల్లో పూర్తి చేయాలని, ఇందులో ప్రతి ఒక్క కార్యకర్తలు భాగస్వామ్యం కావాలన్నారు. పార్టీ కార్యాలయం అందరికీ అందుబాటులో ఉంటుందని, సొంత ఇంటికి వస్తే ఎంత గౌరవం ఉంటుందో.. పార్టీ కార్యాలయంకు వచ్చిన వారికి అంతే గౌరవం ఇవ్వాలన్నారు. టీడీపీ కార్యాలయంలో నిత్యం భోజన వసతి కల్పించడం ఆనవాయితీగా వస్తోందని, దీని కోసం ఫిక్స్‌డ్ ఫండ్ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.

టీడీపీ ఓ స్వచ్ఛంద సంస్థ
అధికారంలో ఉన్నా లేకపోయినా టీడీపీ ఓ స్వచ్ఛంద సంస్థలా పనిచేస్తుందని..పార్టీక్యాడర్‌కు అండగా ఉంటుందని హోంమంత్రి చినరాజప్ప అన్నారు. దేశంలో ఏ పార్టీ ఏర్పాటు చేయని విధంగా కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసిన ఘనత ఒక్క టీడీపీదే అని మంత్రి నారాలోకేష్‌ అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం నిర్మాణానికి పలువురు నేతలు విరాళాలు ప్రకటించారు. పార్టీ కార్యాలయాన్ని మొత్తం నాలుగు బ్లాకులుగా నిర్మించనున్నారు. 3.60 ఎకరాల విస్తీర్ణంలో మూడు భవనాలుగా నిర్మిస్తారు. పరిపాలనా భవనాన్ని జీ+4 అంతస్తులతో నిర్మించనుండగా, ఐదో అంతస్తులో పార్టీ జాతీయ అధ్యక్షుడు, జాతీయ కార్యదర్శి కార్యాలయాలు, 4వ అంతస్తులో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శుల కార్యాలయాలు వుంటాయి. 

20:12 - November 26, 2017

తూర్పుగోదావరి : మూడు రోజుల క్రితం కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో అపహరణకు గురైన శిశువు ఆచూకీని పోలీసులు గుర్తించారు. శిశువును అపహరించిన మహిళను పోలీసులు అరెస్ట్‌ చేశారు. జిల్లా ఎస్పీ విశాల్‌ గున్నీ ఆ శిశువును తల్లిదండ్రులకు అప్పగించారు. మూడు రోజుల క్రితం ముఖానికి ముసుగు ధరించి వచ్చిన ఓ మహిళ ప్రసూతి ఆస్పతి వార్డులో ఉన్న గంటా లక్ష్మి అనే బాలింత నుంచి ఒక్కరోజు వయసున్న ఆడశిశువును వ్యాక్సిన్‌ కోసమని నమ్మబలికి వెంట తీసుకు వెళ్లింది. చిన్నారి అమ్మమ్మ వెళ్లినా.. ఆమె కళ్లుగప్పి..శిశువును ఆగంతకురాలు అపహరించింది. సీసీ పుటేజ్‌ ఆధారంగా పోలీసులు నిందితురాలిని ఐ.పోలవరంలో గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

20:10 - November 26, 2017

కృష్ణా : మతోన్మాదాన్ని రెచ్చగొట్టే రాజకీయ పార్టీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ గోపాలగౌడ పిలుపునిచ్చారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రజల మధ్య విధ్వేషాలు సృష్టించేవారిని ఒక కంటకనిపెట్టి ఉండాలన్నారు. విజయవాడ ఎంబీ భవన్‌లోజరిగిన పర్సా సత్యనారాయణ, నండూరు ప్రసాదరావు స్మారక సదస్సుకు జస్టిస్‌ గోపాలగౌడ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశంలో తరతరాలుగా నివసిస్తున్న మైనారిటీలను భారత్‌ విడిచి వెళ్లమనే హక్కు ఎవరికీలేదన్నారు. కమ్యూనిస్టులు రాజ్యాంగ విలువలు కాపాడుతున్నారని జస్టిస్‌ గోపాలగౌడ ప్రశంసించారు. 

20:09 - November 26, 2017

కృష్ణా : ఏపీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తోందని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్‌ విమర్శించారు. యాభై లక్షల మంది కార్మికులు కనీస వేతనాలకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. విజయవాడ ఎంబీ భవన్‌లో జరిగిన పర్సా సత్యనారాయణ, నండూరు ప్రసాదరావు స్మారక సదస్సులో గఫూర్‌ కీలకోపన్యాసం చేశారు. కనీస హక్కుల సాధన కోసం కార్మికులందరూ ఏకం కావాలని గఫూర్‌ పిలుపునిచ్చారు.

20:08 - November 26, 2017

కర్నూలు : ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా చంద్రబాబు నెరవేర్చలేదని జగన్‌ మండిపడ్డారు. జగన్‌ చేపడుతున్న ప్రజాసంకల్ప యాత్ర పద్దెనిమిదో రోజుకు చేరుకుంది. యాత్రలో భాగంగా ఆయన కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం గోరంట్లలో బీసీ సంఘం ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల ముందు కరెంటు బిల్లులు తగ్గిస్తామని చెప్పిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక అంతకు పది రెట్లు బిల్లులు వచ్చేలా చేశారని మండిపడ్డారు. కురుమలను, వాల్మీకులు, బోయలను ఎస్టీలో చేరుస్తామని, రజకులను ఎస్సీలుగా గుర్తిస్తామని చంద్రబాబు ఎన్నికల్లో చెప్పారని గుర్తుచేశారు. చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్క హామీ కూడా ఇప్పటివరకూ నెరవేర్చలేదని జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

20:05 - November 26, 2017

గుంటూరు : టెక్నాలజీ ద్వారా ప్రజలతో మమేకమయ్యేందుకు ఏపీ ప్రభుత్వం రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ను ప్రారంభించింది. ఇందులో బెల్జియం నుంచి తెప్పించిన 80 అడుగుల వీడియో వాల్‌ ఏర్పాటు చేశారు. ఇది ఆసియాలోనే అతిపెద్ద వీడియో వాల్‌. దీంతో రైతులు, విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులతో మాట్లాడొచ్చు. ఎక్కడ నేరం జరిగినా రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ ద్వారా ఇట్టే పసిగట్టొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 20 వేల కెమెరాలతో అన్ని జిల్లాలను ఈ కేంద్రంతో అనుసంధానం చేస్తున్నామంటున్నారు.

20:04 - November 26, 2017

గుంటూరు : వెలగపూడి సచివాలయం మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన రియల్ టైం గవర్నెన్స్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను సీఎం చంద్రబాబునాయుడు ప్రారంభించారు. ఈ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి... అధికారులు, ప్రజలతో ఎక్కడి నుంచైనా వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించే అవకాశం ఉంటుందన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ను ఏర్పాటు చేయడం జరిగిందని, విపత్తులు, ప్రమాదాల సమయంలో సెంటర్‌ నుంచి పర్యవేక్షించే అవకాశం ఉందన్నారు చంద్రబాబు. 

 

17:35 - November 26, 2017

సంగారెడ్డి : ఇది సంగారెడ్డి కలెక్టరేట్‌లోని మినీ మీటింగ్‌ హాల్‌. ఇక్కడ మెదక్‌ ఎంపీ కొత్తా ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో.... డిస్ట్రిక్‌ డెవలప్‌మెంట్‌ కో-ఆర్డినేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ -దిశా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలుతీరుపై సమీక్షించారు. కానీ... కో-చైర్మన్‌ జహీరాబాద్‌ ఎంపీ బి.బి.పాటిల్‌తోపాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్‌పర్సన్‌లు లేకుండానే సమావేశం ముగించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సమావేశానికి హాజరు కాని అధికారులు
ఇక సమావేశానికి హాజరైన సంగారెడ్డి, పటాన్‌చెరు ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్‌, గూడెం మహిపాల్‌రెడ్డిలు తమ ప్రాంత సమస్యలను ప్రస్తావించారు. అయితే... చాలామంది అధికారులు సమావేశానికి హాజరు కాకపోవడం... వచ్చిన అధికారులు కూడా పూర్తి సమాచారంతో రాకపోవడంతో సభ్యులకు సరైన సమాధానాలు లభించలేదు. దీనిపై కొత్తా ప్రభాకర్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఇదిలావుంటే కొంతమంది... ఇదంతా మాకెందుకులే అనుకుంటూ కునుకు తీశారు. కేంద్ర, రాష్ట్ర పథకాల అమలుతీరుపై సమీక్షించే సమావేశాలు ఇలా జరగడం పట్ల సమావేశానికి హాజరైన ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంగన్‌వాడీ భవనాల నిర్మాణం, అందరికీ విద్యుత్‌ అంటూ కేంద్రం తీసుకువచ్చిన దీనదయాళ్‌ గ్రామజ్యోతి పథకం అమలుతీరు నిరాశజనకంగా ఉందంటున్నారు. అంతేకాకుండా... పథకాల అమలులోనూ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. పనులు ఎలాగూ జరగడం లేదు.. కనీసం కారణాలు తెలుసుకునే సమావేశం కూడా ఇలా జరిగితే.. ప్రజలకు ఎలా న్యాయం జరుగుతుంది. ప్రజాప్రతినిధులు, అధికారులు ఇకనైనా మొక్కుబడి సమావేశాలు నిర్వహించకుండా ఉంటే మంచిదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

17:32 - November 26, 2017

కామారెడ్డి : జిల్లా దేవునిపల్లిలో దారుణం జరిగింది. మామ లైంగిక వేధింపులు భరించలేక కోడలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో మామ కత్తితో కడుపుపై కోసుకున్నాడు. కుంచం పోచయ్య అనే వ్యక్తి కోడలు కౌసల్యను కొంతకాలంగా లైంగికంగా వేధిస్తున్నాడు. అతని వేధింపులు భరించలేక ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వచ్చి అరెస్టు చేస్తారనే భయతో పోచయ్య కత్తితో కడుపుపై కోసుకున్నాడు. అతని పరిస్థితి ప్రమాదకరంగా ఉందన్న కామారెడ్డి డాక్టర్లు హైదరాబాద్ గాంధీకి రిఫర్ చేశారు. పోచయ్య భార్య అతని వేధింపులు భరించలేక వదిలిపెట్టి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న కామారెడ్డి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

17:30 - November 26, 2017

హైదరాబాద్ : మెట్రో రైలు ప్రారంభానికి ముందే ప్రయాణికులపై వడ్డన షురు చేసింది. సామాన్య ప్రజలకు మెట్రో ప్రయాణాన్ని దూరం చేసేలా రేట్లను అమాంతంగా పెంచేసింది. 2012లో ప్రభుత్వంతో ఎల్‌అండ్‌టీ ఒప్పందం చేసుకున్న శ్లాబ్‌ల ధరల కంటే చార్జీలు మూడింతలు పెంచేసింది. రాష్ట్ర ప్రభుత్వంతో ఎల్‌అండ్‌టీ చర్చించి ఆమోదించిన తర్వాత మెట్రో రైలు టికెట్‌ ధరలు ఖరారయ్యాయి. కనీస టికెట్‌ ధర 8 నుంచి 10కు పెంచారు. మొదటి స్టేజీ నుంచి చివరి స్టేజీ వరకు ప్రయాణిస్తే గతంలో టికెట్‌ ధర 19 నిర్ణయించగా, 60కు పెంచేసింది.

ఆరు శ్లాబుల్లో మాత్రమే చార్జీలు
2012 మెట్రో ఒప్పందం ప్రకారం కనిష్ట ధర 8 గరిష్ట ధర 19. కేవలం ఆరు శ్లాబుల్లో మాత్రమే చార్జీలుంటాయని పేర్కొంది. మొద‌టి 2 కిలోమీట‌ర్లకు 8 రూపాయ‌లు, 2 నుంచి 6 కిలోమీట‌ర్లకు 10 రూపాయలు. 6 నుంచి 10కిలో మీట‌ర్లకు 12 రూపాయ‌లు..10 నుంచి 14 కిలోమీట‌ర్లకు 14 రూపాయ‌లు..14 నుంచి 18 కిలోమీట‌ర్లకు 16 రూపాయ‌లుగా నిర్ణయించారు. 18 కిలోమీట‌ర్లు దాటితే 19 రూపాయ‌లు ఉండాల‌ని ప్రతిపాదించారు. కానీ ఇప్పుడు 6 నుంచి 10 శ్లాబుల‌కు పెంచడంతో పాటు 10 రూపాయ‌ల నుండి 60 రూపాయ‌ల‌కు రేట్లు వడ్డించారు. 2012 ఒప్పందానికి ప్రస్తుతం పెరిగిన రేట్లు రెండు వంద‌ల శాతం అధికం. ఇప్పటికే ఢిల్లీ మెట్రో రైలులో టికెట్‌ ధరలు పెరగడంతో సుమారు మూడు లక్షల మంది మెట్రో ప్రయాణానికి దూరమయ్యారని లెక్కలు చెబుతున్నాయి. అయినా, ఢిల్లీ మెట్రోతో పోటీపడి ఎల్‌అండ్‌టీ టిక్కెట్ల ధరలు పెంచింది. అగ్రిమెంట్‌లో ఏటా 5శాతం పెంచుకోవ‌చ్చన్న ఒప్పందాన్ని ఉల్లంగించారని పలువురు మండిపడుతున్నారు. 

టికెట్ల ద్వారా 50 శాతం మాత్రమే
హైద‌రాబాద్ మెట్రో రైల్ ఆదాయం టికెట్ల ద్వారా 50 శాతం మాత్రమే స‌మ‌కుర్చుకోవాలి. మాల్స్, రియ‌ల్ వ్యాపారాల నుంచి 45 శాతం, వాణిజ్య ప్రక‌ట‌న‌ల ద్వారా 5శాతం రాబట్టుకోవాలనేది నిబంధన. మియాపూర్‌లో 100ఎక‌రాలు..., ఉప్పల్‌లో 103 ఎక‌రాలతో పాటు ప్రధాన ప్రాంతాల్లో సుమారు 60 ఎక‌రాల వ‌ర‌కు భూములు కేటాయించారు. మాల్స్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వ‌స్తే ఆదాయం భారీగా పెరిగే అవకాశం ఉంది. ప్రాజెక్టు ఆలస్యం కార‌ణంగా నిర్మాణ వ్యయం పెరిగిన‌ట్లు ఎల్ అండ్ టి వ‌ర్గాలు చెబుతున్నాయి. ఆదాయం రాబట్టుకునే మార్గాలున్నా కేవలం టికెట్ల ద్వారానే సమకూర్చుకోవాలనుకోవడం సరికాదని విపక్షాలు గళమెత్తుతున్నాయి. మ‌రోవైపు మెట్రో స్టేషన్ల నుంచి క‌నెక్టివిటీతో పాటు పార్కింగ్ సదుపాయాలు లేకపోవడం సమస్యగా మారింది. మెట్రో చార్జీలు భారీగా ఉన్న నేప‌థ్యంలో..నగర ప్రజలు టైమ్‌కు ప్రయారిటీ ఇస్తారా లేక మనీకి ఇంపార్టెన్స్‌ ఇస్తారా అన్నది మ‌రికొన్ని రోజుల్లో తేలిపోనుంది. 

17:28 - November 26, 2017

హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటనకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈనెల 28న మధ్యాహ్న ఒంటిగంట పది నిమిషాలకు.. ప్రధాని బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అనంతరం ఎయిర్‌పోర్టులోనే ఉన్న 4వేల మంది బీజేపీ కార్యకర్తలతో 15నిమిషాలు మాట్లాడిన అనంతరం.. మెట్రో ప్రారంభోత్సవం కోసం... హెలికాప్టర్‌లో మియాపూర్ వెళ్తారు. మోదీ బేగంపేట ఎయిర్‌పోర్టుకు వస్తుండటంతో.. భద్రత ఏర్పాట్లను హైదరాబాద్ సీపీ శ్రీనివాసరావు, ఎస్పీజీ , ఎయిర్‌ పోర్ట్ అథారిటీ అధికారులు పరిశీలించి భద్రతపై రిహార్సల్ నిర్వహించారు.

15:20 - November 26, 2017

కాకినాడ కిడ్నాప్ గురైన శిశువు క్షేమం

తూర్పుగోదావరి : జిల్లా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కిడ్నాప్ గురైన పసికందు ఆచూకీ లభ్యమైంది. శిశువును ఐ.పోలవరం మండలం ఇరగవరంలో పోలీసులు గుర్తించారు. శిశువును తల్లిదండ్రులకు అప్పగించేందుకు కాకినాడకు తరలించారు.

15:07 - November 26, 2017

తూర్పుగోదావరి : జిల్లా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కిడ్నాప్ గురైన పసికందు ఆచూకీ లభ్యమైంది. శిశువును ఐ.పోలవరం మండలం ఇరగవరంలో పోలీసులు గుర్తించారు. శిశువును తల్లిదండ్రులకు అప్పగించేందుకు కాకినాడకు తరలించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

వైసీపీకి మరో షాక్

విశాఖ : ఏపీలో వైసీపీకి మరో షాక్ తగిలింది. పాడేరు వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి సైకిల్ ఎక్కెందుకు సిద్ధమైయ్యారు. రేపు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరే అవకాశం ఉంది. 

14:01 - November 26, 2017

హాస్యం అపహాస్యం అవుతోందా ? కామెడీ షోలు అడల్ట్ షోలుగా మారిపోయాయా ? తెలుగు రాష్ట్రాల్లో హైపర్ ఆది కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి. హైపర్ ఆదీ కామెంట్లపై మహిళా, ప్రజా సంఘాలు భగ్గుమంటున్నాయి. మహిళా ప్రజా సంఘాలు కేసులు కూడా పెట్టారు. ఇంత జరుగుతున్నా కామెడీ షో నిర్వాహకులు స్పందించలేకపోవడం విమర్శలకు తావిస్తోంది. దీనిపై టెన్ టివి ప్రత్యేక చర్చ చేపట్టింది. ఈ చర్చలో దేవి (సామాజిక కార్యకర్త), కత్తి మహేష్ (సినిమా క్రిటిక్), ప్రియాంక(అనాథ) , కాదంబరి కిరణ్ (నటుడు) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

12:35 - November 26, 2017

నెల్లూరు : ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ప్రభుత్వం..ఉన్నతాధికారులు ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా కొంతమందిలో మార్పు రావడం లేదు. ఓ రోగి కడుపులో కత్తెర పెట్టి కుట్లు వేయడంతో అతని పరిస్థితి విషమంగా తయారైంది. ఇటీవలే చలపతి రావు అనే వ్యక్తి కడుపునొప్పితో బాధ పడుతూ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాడు. కానీ వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కడుపులోనే కత్తెర పెట్టి కుట్లు వేసి కొద్ది రోజుల అనంతరం ఇంటికి పంపించారు. తిరిగి కడుపునొప్పి రావడంతో ఆసుపత్రికి వచ్చారు. స్కానింగ్ తీయడంతో అసలు విషయం బయటపడింది. కడుపులో కత్తెర ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని టెన్ టివి కథనాలు ప్రసారం చేసింది. స్పందించిన వైద్యులు..కలెక్టర్ ఆర్థిక సహాయాన్ని అందిస్తామని చెప్పారు. కానీ ఎలాంటి సహాయం అందించలేదని చలపతి రావు కుటుంబసభ్యులు పేర్కొంటున్నారు.

ఇదిలా ఉంటే గత వారం రోజుల నుండి తిండి లేకపోవడం..మలమూత్రాలు కూడా రాకపోవడంతో కడుపు పూర్తిగా ఉబ్బిపోయింది. కళ్లెదుటే..భర్త అలాంటి పరిస్థితిలో ఉండడంతో భార్య కన్నీరుమున్నీరవుతోంది. తమను ఆదుకోవాలని ఆ కుటుంబం వేడుకొంటోంది. 

కట్టుదిట్టమైన భద్రత – సీపీ..

హైదరాబాద్ : భారత ప్రధాన మంత్రి మోడీ నగర పర్యటన సందర్భంగా నగరంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ వెల్లడించారు. 28వ తేదీన మధ్యాహ్నం 1.30కి బేగంపేట ఏయిర్ పోర్టుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేరుకుంటారని, మధ్యాహ్నం 1.10 నుండి 1.25 వరకు బీజేపీ కార్యకర్తలకు ఆయన అభివాదం చేస్తారని తెలిపారు. మధ్యాహ్నం 1.25 కు హెలికాప్టర్ లో మియాపూర్ మెట్రో స్టేషన్ కు బయలుదేరుతారని, ఈ సందర్భంగా బేగంపేట ఎయిర్ పోర్టు పరిసర ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగిందన్నారు. 

ఎయిర్ పోర్టులో ఉన్నతాధికారుల సమీక్ష...

హైదరాబాద్ : బేగంపేట ఎయిర్ పోర్టులో ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. ఈనెల 28న ప్రధాని పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. పోలీసు ఉన్నత అధికారులు..ఎస్పీజీ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

12:20 - November 26, 2017

తూర్పుగోదావరి : రాజమహేంద్ర వరం మేయర్ రజనీ శేషాసాయికి అవమానం జరిగింది. ఓ ప్రారంభోత్సవంలో ఏర్పాటు చేసిన శిలాఫలకంలో పేరు లేకపోవడంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. వేదికపైనే కన్నీరు కారుస్తూ వెళ్లిపోయారు. ఆదివారం రాజమహేంద్రవరంలో మంత్రి సోమిరెడ్డి పర్యటించారు. వ్యవసాయ కాలేజీకి ఆయన శంకుస్థాపన చేశారు. శిలాఫలకంపై తన పేరు లేకపోవడంపై మేయర్ రజనీ శేషసాయి తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. మంత్రి సోమిరెడ్డి ఎదుట కన్నీరుపెట్టుకుంది. తనకు ప్రాధాన్యత కల్పించలేదని..అవమానం భరించలేక మేయర్ అక్కడి నుండి వెళ్లిపోయారు. 

కడుపులో కత్తెర మరిచిపోయి కుట్లు...

నెల్లూరు : ప్రభుత్వాసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్ల రోగి చలపతి రావు ఆరోగ్యం విషమంగా మారింది. చలపతి రావు కడుపులో కత్తెర మరిచిపోయి డాక్టర్లు కట్లేశారు. అతని కడుపు ఉబ్చిపోవడంతో వైద్యులు కత్తెరను బయటకు తీశారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. 

12:14 - November 26, 2017

విజయవాడ : కడప ఫాతిమా విద్యార్థులకు న్యాయం చేస్తామని చెప్పిన ఏపీ సర్కార్ ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన హామీ రాలేదు. దీనితో గత 27 రోజులుగా విజయవాడ ధర్నా చౌక్ లో ఆందోళన ధర్నాలు చేపడుతున్నారు. అయినా ప్రభుత్వంలో కదలిక రాలేదు. చివరకు తాడో..పేడో తేల్చుకోవడానికి వారు సిద్ధమయ్యారు. గుణదల ఈఎస్ఐ ఆసుపత్రి వద్దనున్న సెల్ టవర్ పైకి 8మంది విద్యార్థులు..తల్లిదండ్రులు ఎక్కి ఆందోళన చేపట్టారు. రెండు సంవత్సరాల విద్యా సంవత్సరం కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు స్పష్టమైన హామీనిచ్చేంత వరకు టవర్ పైనే ఉంటామని వారు పేర్కొంటున్నారు. గతంలో ముఖ్యమంత్రి..మంత్రి కామినేని కలిసినా ప్రయోజనం లేదని పేర్కొంటున్నారు. మరి ప్రభుత్వం ఇప్పటికైనా స్పష్టమైన హామీనిస్తుందా ? లేదా ? అనేది చూడాలి. 

12:11 - November 26, 2017

విజయవాడ : వెలగపూడి సచివాలయంలో మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన రియల్ టైమ్ గవర్నమెంట్ కంట్రోల్ సెంటర్ ను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ సిస్టం నుండి ప్రజలతో అధికారులు ఎక్కడి నుండైనా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించే అవకాశం ఉందని, నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్న కమాండ్ సెంట్రల్ ఏర్పాటు చేయడం జరిగిందని, విపత్తు..ప్రమాదాలు జరిగి సమయంలో ఇక్కడి నుండే పర్యవేక్షించే అవకాశం ఉందన్నారు. 

11:32 - November 26, 2017

విశాఖపట్టణం : పిచ్చికుక్క దాడి ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇంటర్ విద్యార్థిని మేఘన చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఈనెల 6న చోడవరం (మం) గోవాడలో ఇంటికి వస్తుండగా పిచ్చికుక్క కరిచింది. ఇంట్లో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. అనంతరం మరోసారి 21వ తేదీన అస్వస్థకు గురైంది. మలేరియా..డెంగ్యూ వ్యాధులు సోకడంతో ఆమె మృతి చెందింది. 

పేరు లేదని కన్నీరు పెట్టుకున్న మేయర్...

తూర్పుగోదావరి : రాజమహేంద్రవరంలో మంత్రి సోమిరెడ్డి పర్యటించారు. వ్యవసాయ కాలేజీకి ఆయన శంకుస్థాపన చేశారు. శిలాఫలకంపై తన పేరు లేకపోవడంపై మేయర్ రజనీ శేషసాయి తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. మంత్రి ఎదుట కన్నీరుపెట్టుకుంది. 

11:12 - November 26, 2017

హైదరాబాద్ : నగరంలోని నెక్లెస్ రోడ్డులో ఫ్రీడం హైదరాబాద్ 10 కె రన్ జరిగింది. మంత్రి లక్ష్మారెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డిలు పాల్గొన్నారు. అంతేగాక ఈ రన్ ఈవెంట్ లో 'జవాన్' సినిమా హీరో 'సాయి ధరమ్ తేజ', హీరోయిన్ మెమరిన్, ‘దిల్' రాజులు పాల్గొన్నారు. రన్ లో పాల్గొన్నన వారందరికీ 'జవాన్' చిత్ర టీం శుభాకాంక్షలు తెలిపింది. ఈ కార్యక్రమంలో అవయవ దానం గురించి అవగాహన కల్పించారు. అందరితో అవయవదాన ప్రతిజ్ఞ చేయించారు. రన్ లో పాల్గొని విజేతగా నిలిచిన వారికి మంత్రి లక్ష్మారెడ్డి బహుమతులు అందచేశారు. ప్రతొక్కరూ అవయవదానంపై అవగాహన పెంచుకోవాలని మంత్రి లక్ష్మారెడ్డి సూచించారు. 

పిచ్చికుక్క దాడిలో మేఘన మృతి...

విశాఖపట్టణం : పిచ్చికుక్క దాడి ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇంటర్ విద్యార్థిని మేఘన చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఈనెల 6న చోడవరం (మం) గోవాడలో మేఘన గాయపడింది. 

10:52 - November 26, 2017

కృష్ణా : అనాథలను 'హీల్' అనే సంస్థ అక్కున చేర్చుకొంటోంది. ఉచిత విద్యతో పాటు..ఉచిత వసతి సౌకర్యం కల్పిస్తోంది. దేశంలో ఎక్కడి నుండి వచ్చినా సంస్థలో చేరే అవకాశం కల్పిస్తున్నారు. పదో తరగతి తరువాత పిల్లలకు తమ కాళ్లపై నలబడేలా పలు కోర్సుల్లో శిక్షణ కల్పిస్తున్నారు. పిల్లలకు ఇష్టం ఉన్న రంగంలో శిక్షణ కూడా ఇస్తారు. ప్రస్తుతానికి సంస్థలో వెయ్యి మంది పిల్లలున్నారు. పిల్లల కోసం స్వచ్చందంగా వాలంటీర్లు సేవలందిస్తున్నారు. వికలాంగులకు కృత్రిమ అవయవావలను ఈ సంస్థ అందిస్తోంది. భవిష్యత్ లో ఇంకా సేవలందిస్తామని సంస్థ నిర్వాహకులు పేర్కొంటున్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

10:41 - November 26, 2017

విజయనగరం : తమకు చెందిన భూముల్లో ఫెన్సింగ్ ఎలా వేస్తారని..నష్టపరిహారం చెల్లించకుండా భూములు ఎలా తీసుకుంటారని దళితులు ప్రశ్నిస్తున్నారు. భూముల్లో వేసిన ఫెన్సింగ్ ను తొలగించేందుకు ప్రయత్నించడంతో కొవ్వాడలో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. కొవ్వాడలో నెల్లిమర్ల ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామి నాయుడికి చెందిన ఎస్వీఎల్ లైఫ్ సైన్స్ కంపెనీ కోసం భూములను సేకరించారు. 17 ఎకరాల్లో భూమి సేకరించారు. ఈ భూములు తమకు చెందినవని..ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా ఫెన్సింగ్ వేశారని దళితులు పేర్కొంటున్నారు. దీనిపై వారు ఎప్పటి నుండో పోరాటం చేస్తున్నారు. వీరి పోరోటానికి సీపీఎం మద్దతు తెలిపింది. ఎమ్మెల్యే వేసిన ఫెన్షన్ ను గతంలో దళితులు తొలగించారు. కోర్టుకు వెళ్లడంతో భూములపై స్టే విధించింది. అయినా మళ్లీ భూమిలో ఫెన్సింగ్ వేశారు. తీవ్ర ఆగ్రహానికి గురైన దళితులు దానిని తొలగించే ప్రయత్నం చేశారు. ముందే విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. వీరికి మద్దతిస్తున్న సీపీఎం నేతలను ముందస్తు అరెస్టులు చేశారు. నష్టపరిహారం చెల్లించిన అనంతరమే భూములు తీసుకోవాల్సి ఉంటుందని, ఎలాంటి పరిస్థితుల్లో తమ భూములు వదులుకొనేది లేదని స్పష్టం చేస్తున్నారు. 

కొవ్వాడలో ఉద్రిక్తత...

విజయనగరం : కొవ్వాడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నెల్లిమర్ల ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామి నాయుడికి చెందిన ఎస్వీఎల్ లైఫ్ సైన్స్ కంపెనీ భూములను తిరిగి ఇవ్వాలని దళితులు పోరాడుతున్నారు. దళితులకు సీపీఎం మద్దతు ప్రకటించింది. భూమల్లో ఉన్న ఫెన్సింగ్ ను తొలగించేందుకు దళితులు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకుని మద్దతిస్తున్న సీపీఎం నేతలను అరెస్టు చేశారు. కొవ్వాడలో 144 సెక్షన్ అమలు చేశారు. 

మెట్రో స్మార్ట్ కార్డుల విక్రయం..

హైదరాబాద్ : నేటి నుంచి మెట్రో రైలుకు సంబంధించిన స్మార్ట్ కార్డుల విక్రయం జరగనుంది. నాలుగు స్టేషన్లలో ఈ స్మార్ట్ కార్డులను విక్రయించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మియాపూర్‌, ఎస్‌ఆర్‌ నగర్‌, తార్నాక, నాగోల్‌ స్టేషన్లలో ఈ కార్డులను విక్రయించనున్నారు. 

నెక్లెస్ రోడ్డులో 10కే రన్...

హైదరాబాద్ : నెక్లెస్ రోడ్డులో ప్రీడమ్ 10 కె రన్ ను తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి ప్రారంభించారు. 10 కె, 5 రన్ లో దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, విదేశాల నుండి క్రీడాకారులు హాజరయ్యారు. 

సిద్ధిపేటలో కార్డన్ సెర్చ్..

సిద్ధిపేట : హౌసింగ్ బోర్డు, ప్రశాంత్‌నగర్‌లో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు కార్డెన్ సర్చ్ నిర్వహించారు. డీసీపీ నరసింహరెడ్డి ఆధ్వర్యంలో ఈ సర్చ్ జరిగింది.

09:37 - November 26, 2017

హైదరాబాద్ : ఇప్పటికే హైదరాబాద్‌లో ఇందిరా పార్క్‌ వద్ద ధర్నాలకు చెక్‌పెట్టి పంతం నెగ్గించుకున్న టీ సర్కార్‌... తాజాగా సుందరయ్య విజ్ఞాన కేంద్రపై దృష్టి సారించింది. ఇందిరా పార్క్‌ వద్ద ధర్నాలు, దీక్షలకు ప్రభుత్వం అనుమతిని పూర్తిగా నిరోధించడంతో సుందరయ్య విజ్ఞాన కేంద్రంగా ఉద్యమాలకు బీజాలు పడ్డాయి. ఇది టీ సర్కార్‌కి తలనొప్పిగా మారింది. దీంతో సుందరయ్య విజ్ఞాన కేంద్రంపై పోలీసులు ప్రత్యేక నిఘా పెడుతున్నారు. ఇందిరా పార్క్‌ ధర్నా చౌక్‌ తొలగించి.. ప్రతి పక్షాలను, ప్రజా సంఘాలను రోడ్డెక్కకుండా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నిలువరించింది. దీంతో కొంతకాలంగా ప్రజా సంఘాలు, వామపక్షాలు ప్రభుత్వంపై పోరాడేందుకు సుందరయ్య విజ్ఞాన కేంద్రాన్ని కేంద్రంగా చేసుకున్నాయి. గత కొద్ది కాలంగా ఇక్కడి నుంచే ఆందోళనకు, రాస్తారోకోలకు, ముట్టడిలకు పిలుపునివ్వడంతో ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. దీంతో ఇప్పుడు ప్రభుత్వం సుందరయ్య విజ్ఞాన కేంద్రంపై ఫోకస్‌ పెట్టింది.

ఎస్వీకేలో నిత్యం వివిధ ప్రజాసంఘాలు, ఇతర కుల సంఘాల చర్చలు, సమావేశాలు, రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు జరుగుతుండటాన్ని ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతుంది. ప్రభుత్వ తీరును ఎండ గట్టేందుకు ఎస్వీకే కేంద్రంగా వ్యూహ రచనలు సాగుతున్నాయని ప్రభుత్వం భావిస్తొంది. గత రెండు నెలల కాలంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రంగా జరిగే వామపక్షాల పార్టీల సభలను సమావేశాలపై స్టేట్‌ ఇంటలిజెన్సీ, స్థానిక పోలీసులు, ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. ఏ రోజు ఏ కార్యక్రమం జరగబోతుంది.. కార్యక్రమ ముఖ్యోద్దేశ్యంపై ఆరా తీస్తున్నారు. కార్యక్రమానికి ఏవరెవరు హాజరవుతున్నారన్న సమాచారాన్ని ముందస్తుగా సేకరిస్తున్నారు. కార్యక్రమ ప్రాధాన్యత బట్టి స్థానిక పోలీసులను ఎస్‌బీ అధికారులు అలర్ట్‌ చేస్తున్నారు. ధర్నా చౌక్‌ లేకపోవడంతో గురుకుల కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు తమ సమావేశాలను మూడు మాసాలుగా ఎస్వీకేలో పెట్టుకుంటున్నారు. అయితే సమావేశానికి అనుమతి లేదంటూ శుక్రవారం కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను పోలీసులు అడ్డుకుని అక్రమంగా కేసులు నమోదు చేశారు.

ప్రభుత్వ ప్రజావ్యతిరేక తీరుపై సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటారో వారిని ముందస్తుగానే అడ్డుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. సాధారణంగా ప్రతిపక్ష పార్టీల సభలు, సమావేశాలతో అంశాలను తెలుసుకునేందుకు ఎస్‌బీ పోలీసులు సమావేశాల్లో పాల్గొని పై అధికారులకు చేరవేసేవారు. కానీ ప్రభుత్వం పోలీసు ఉన్నతాధికారుల నుండి ప్రత్యేక ఆదేశాలు రావడంతో అనుక్షణం ఎస్వీకేలో జరిగి సదస్సులపై దృష్టి సారించారు. గత కొంత కాలంగా ఎస్వీకేకు వచ్చే దారులను మళ్లిస్తూ.. బారికేడ్లను, ముళ్లకంచెలను ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు. పోలీసుల పికెటింగ్‌ చూసి స్థానికులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. ముళ్లకంచెలను దాడుకుంటూ వెళ్లడం పెద్ద సమస్యగా మారుతుందని ఎస్వీకే పరిసర వాసులు వాపోతున్నారు.

09:35 - November 26, 2017

నల్గొండ : ప్రైవేట్‌ విద్యాసంస్థలపై అశాస్త్రీయ విధానాలు అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలు ఛలో నల్లగొండకు పిలుపునిచ్చాయి. డిసెంబర్‌ 2న ఎన్‌.జీ కాలేజీలో ఆత్మగౌరవ సభ నిర్వహించనున్నట్టు ప్రైవేట్‌ విద్యాసంస్థల జేఏసీ నేత గింజల రమణారెడ్డి తెలిపారు. ఈ మేరకు భువనగిరిలో సభకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి హెల్త్‌కార్డులు, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఆత్మగౌరవ సభను విజయంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. 

08:19 - November 26, 2017

జమ్మూ కాశ్మీర్‌ : ఉగ్రవాదులు సెలవులో ఉన్న ఓ ఆర్మీ జవాన్‌ను కిరాతకంగా చంపారు. 23 ఏళ్ల ఇర్ఫాన్‌ అహ్మద్‌ మీర్‌ను టెర్రరిస్టులు కిడ్నాప్‌ చేసి దగ్గర నుంచి కాల్చి చంపారు. షోపెయిన్‌ జిల్లాలో ఇర్ఫాన్‌ మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇర్ఫాన్‌ సెలవులపై శుక్రవారమే ఇంటికి వచ్చాడు. ఇర్ఫాన్‌ గురేజ్‌ సెక్టార్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. జమ్ముకశ్మీర్‌ ముఖ్యమంత్రి మెహబాబు ముఫ్తి, మాజీ సిఎం ఒమర్‌ అబ్దుల్లా ఆర్మీ జవాన్‌ ఇర్ఫాన్‌ హత్యను తీవ్రంగా ఖండించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు.

08:14 - November 26, 2017

విజయవాడ : మంగళగిరి సమీపంలో టిడిపి కేంద్ర కార్యాలయానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఉదయం 5.17 నిమిషాలకు ఆయన భూమి పూజ చేశారు. ఆయన నివాసం పక్కనే నిర్మించిన గ్రీవెన్స్ హాల్ ను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు, తెలంగాణ టిడిపి అధ్యక్షుడు ఎల్.రమణ, ఏపీ హోం మంత్రి చిన రాజప్ప మాట్లాడారు. ఆత్మగౌరవం..ఆత్మవిశ్వాసాలకు ప్రతీకగా టిడిపి కార్యాలయం పనిచేయాలని బాబు ఆకాంక్షించారు. 9 నెలల్లోనే కేంద్ర కార్యాలయ భవనాన్ని పూర్తి చేస్తామన్నారు. అధికారంలో ఉన్నా..విపక్షంలో ఉన్నా..ప్రజల పక్షాన ఉంటామని ఎల్.రమణ పేర్కొన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా ఎన్టీఆర్ ఉంటే ఆత్మ విశ్వాసానికి ప్రతీకగా చంద్రబాబు ఉన్నారని పొగిడారు. అధికారంలో ఉన్నా..లేకపోయినా టిడిపి ఓ స్వచ్చంద సంస్థలా పనిచేస్తోందని హోం మంత్రి చిన రాజప్ప తెలిపారు. 

08:09 - November 26, 2017

విజయవాడ : మంగళగిరి సమీపంలో టిడిపి కేంద్ర కార్యాలయానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఉదయం 5.17 నిమిషాలకు ఆయన భూమి పూజ చేశారు. ఆయన నివాసం పక్కనే నిర్మించిన గ్రీవెన్స్ హాల్ ను కూడా ప్రారంభించారు. 2018 డిసెంబర్ నాటికి భవన నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు 3.60 ఎకరాల విస్తీర్ణం కేటాయించారు. ఇందులో మూడు భవనాలు నిర్మించనున్నారు. పరిపాలన భవనం, జీ +4 అంతస్తులతో నిర్మాణం చేపట్టనున్నారు. ఐదో అంతస్తులో పార్టీ జాతీయ అధ్యక్షుడు, జాతీయ కార్యదర్శి కార్యాలయాలు, 4వ అంతస్తులో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శుల కార్యాలయాలుంటాయి.

కార్యకర్తల కోసం..
తెలుగు వారు ఎక్కడున్నా..ఎవరికి ఏం ఇబ్బందులున్నా వారి కోసం పోరాడింది టిడిపి పార్టీయేనన్నారు. సుశిక్షితమైన కార్యకర్తలను తయారు చేయడం జరిగిందని, మంచి నాయకత్వం రావాలని కార్యకర్తలకు శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కార్యకర్తల సంక్షేమ నిధి పెట్టిన పార్టీ టిడిపి పార్టీయేనని, తెలుగు జాతి ఎక్కడున్నా సరే..ఇబ్బందులు వచ్చినా..అందరి యొక్క బాగోగులు చూసేది కేంద్ర కార్యాలయమన్నారు. 

07:54 - November 26, 2017

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు..హైటెక్ సీఎంగా పేరొందారు. అన్ని శాఖల్లో టెక్నాలజీని వాడాలన్నది ఆయన మాట. ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం టెక్నాలజీపై మరింత దృష్టి సారించారు. టెక్నాలజీని మరింత విస్తృతంగా పాలనా వ్యవహారాల్లో వినియోగిస్తే ప్రజలకు మరింత మెరుగైన పాలన ఇవ్వవచ్చని..ప్రజల సంతృప్తి స్థాయిని పెంచవచ్చని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. కానీ దీనిపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై విజయవాడ టెన్ టివి స్టూడియలో జరిగిన ప్రత్యేక చర్చలో శ్రావణ్ కుమార్ (టిడిపి), నర్సింగరావు (సీపీఎం), మల్లాది విష్ణు (వైసీపీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

టిడిపి కేంద్ర కార్యాలయానికి విరాళాలు..

విజయవాడ : తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా పలువురు నేతలు భవన నిర్మాణానికి విరాళాలు ప్రకటించారు. గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు రూ.11 లక్షలు...టీడీపీ యువనేత దేవినేని అవినాష్‌ రూ.10 లక్షలు..ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ రూ. 1.50 లక్షలు...టీడీపీ కార్యకర్త కోటేశ్వరరావు రూ.50 వేలు...టీడీపీ నేత మల్లు సురేంద్ర రూ.50 వేల విరాళాన్ని ప్రకటించారు.

5కే, 10కే రన్ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు...

హైదరాబాద్: ఆదివారం పీపుల్స్ ప్లాజా వద్ద ఏర్పాటు చేస్తున్న 5కే, 10కే రన్ సందర్భంగా ఉదయం 5 నుంచి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు.

టిడిపి కేంద్ర కార్యాలయం..విశేషాలు..

విజయవాడ : మంగళగిరి సమీపంలో టిడిపి కేంద్ర కార్యాలయానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఉదయం 5.17 నిమిషాలకు ఆయన భూమి పూజ చేశారు. ఆయన నివాసం పక్కనే నిర్మించిన గ్రీవెన్స్ హాల్ ను కూడా ప్రారంభించారు. 2018 డిసెంబర్ నాటికి భవన నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు 3.60 ఎకరాల విస్తీర్ణం కేటాయించారు. ఇందులో మూడు భవనాలు నిర్మించనున్నారు. పరిపాలన భవనం, జీ +4 అంతస్తులతో నిర్మాణం చేపట్టనున్నారు.

07:10 - November 26, 2017
06:47 - November 26, 2017

ఖమ్మం : ఒకరు మూగ. మరొకరు చెవిటి. అయితేనేం ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఇద్దరూ ప్రేమించుకున్నారు. మాటలు రాకున్నా మనసులు కలిశాయి. పెద్దలు కాదన్నా పెళ్లి చేసుకున్నారు. ప్రేమ అనే పదానికి అసలైన నిర్వచనం ఇస్తూ... సమాజంలో అందరికీ ఆదర్శంగా నిలిచిందో జంట. ఇంతకీ ఎవరా జంట. ఏమా పెళ్లి కథ. లెట్స్‌ వాచ్‌దిస్‌ స్టోరీ... ప్రేమంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడం. ఒకరినొకరు ఇష్టపడటం. ఒకరికి మరొకరు అండగా నిలవడం. రెండు మనసులు కలవడం. రెండు తనువులు ఒకటిలా ఏకమవ్వడం.. ప్రేమకు కులం లేదు. మతం లేదు. పేదా గొప్ప అన్న తారతమ్యాలు లేవు. చివరికి మూగ, చెవిటి, గుడ్డి అన్న భేదాలూ లేవు.

గోపి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం ఇతని నివాసం. గోపి పుట్టుకతో మూగ. చెవుడు కూడా ఉంది. డెఫ్‌ అండ్‌ డెమ్‌ స్కూల్‌లో చదివి.. హైదరాబాద్‌లోని ఓ త్రీస్టార్‌ హోటల్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఆమె పేరు సవిత. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన సవిత కూడా పుట్టుకతోనే చెవిటి, మూగ. గోపి, సవిత మధ్య మొదట పరిచయం ఏర్పడింది. ఇద్దరూ వీడియోకాల్‌, ఛాటింగ్‌ ద్వారా ఒకరిని ఒకరు అర్థం చేసుకున్నారు. ఇద్దరి మనసులు కలిశాయి. ఇద్దిరి భావాలు కలిశాయి. దీంతో వారి మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే సవిత తల్లిదండ్రులు మాత్రం వీరి పెళ్లికి నిరాకరించారు. కులాంతర వివాహమంటూ అడ్డుచెప్పారు. అయినా నమ్మిన వ్యక్తి కోసం సవిత నిలబడింది. తల్లిదండ్రులు వద్దన్నా.... ప్రేమించిన గోపినే కావాలనుకుంది. దీంతో కొత్తగూడెంలోని రుద్రంపూర్‌లో వీరిద్దరూ 100 మంది చెవిటి, మూగ స్నేహితుల మధ్య ఘనంగా పెళ్లి చేసుకున్నారు.

నమ్మిన వ్యక్తి కోసం చివరి వరకు నిలబడి పెళ్లిచేసుకున్న ఈ జంటను స్థానికులు, ప్రజా, మహిళా సంఘాల నేతలు అభినందించారు. ఈ జంట అందరికీ ఆదర్శప్రాయమని కొనియాడారు. మొత్తానికి గోపీ, సవిత జంట యువతీ, యువకులందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ప్రేమించిన వారికోసం కడవరకు నిలబడాలన్న స్ఫూర్తిని ప్రేమికులందరికీ ఈ జంట ఇస్తోంది. 

06:45 - November 26, 2017

హైదరాబాద్ : ప్రపంచ పారిశ్రామిక సదస్సుపై తెలంగాణ సర్కార్‌ కోటి ఆశలు పెట్టుకుంది. మొట్టమొదటి సారిగా తెలంగాణలో జరుగుతున్న సమ్మిట్‌తో లబ్ది పొందేందుకు సన్నాహకాలు మొదలు పెట్టింది. ఓ వైపు హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతూ... అదే తరహాలో ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడులను రాష్ట్రానికి రప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈనెల 28న హైదరాబాద్‌లో జరిగే గ్లోబల్‌ సమ్మిట్‌తో పెట్టుబడులకు రెడ్‌ కార్పెట్‌ పరిచేందుకు సిద్ధమవుతున్న తెలంగాణ సర్కార్‌పై 10టీవీ ప్రత్యేక కథనం.. ఈనెల 28 నుంచి హైదరాబాద్‌లో జరుగనున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుపై ప్రభుత్వం భారీగా ఆశలు పెట్టుకుంది. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణను పరిచయం చేసేందుకు దీన్ని వేదికగా మలుచుకోబోతోంది. పరిశ్రమలు, పెట్టుబడులకు ఇక్కడ ఉన్న అవకాశాలను చాటి చెప్పేందుకు ఈ సదస్సు దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన పారిశ్రామిక దిగ్గజాలు తరలివస్తుండడంతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఉవ్విళ్లూరుతోంది. దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసేలా మేకిన్‌ ఇండియా నినాదాన్ని, తెలంగాణ బ్రాండ్‌ ఇమేజ్‌ను విశ్వవ్యాప్తంగా ప్రచారం చేసి భారీగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు పరిశ్రమల స్థాపనకు అవకాశాలు మెరుగుపర్చాలని భావిస్తోంది. అందుకే హెచ్‌ఐసీసీలో జరిగే సదస్సుకు కనీవినీ ఎరుగని తరహాలో ఏర్పాట్లు చేస్తోంది.

గడిచిన రెండేళ్లలో దాదాపు ఆరువేల పరిశ్రమల స్థాపనకు దేశవిదేశాల నుంచి బడా కంపెనీలు, పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చి 1.10 లక్షల కోట్ల పెట్టుబడులు తరలివచ్చాయి. వీటితో దాదాపు నాలుగు లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. రాష్ట్ర పారిశ్రామిక విధానాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పి విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు స్వయంగా సీఎం కేసీఆర్‌ పది రోజులపాటు చైనాలో పర్యటించారు. దీంతో చైనాలోని వివిధ కంపెనీలు తెలంగాణలో కొత్త పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చాయి. లియో గ్రూపు, షాంఘై ఎలక్ట్రికల్‌ కార్పొరేషన్‌ ఒక్కొక్కటి వెయ్యికోట్ల పెట్టుబడులతో విద్యుత్‌ పరికరాల తయారీ పరిశ్రమల స్థాపనకు సంసిద్దత వ్యక్తం చేశాయి. మకేనా, సెల్‌కాన్‌ కంపెనీలు హైదరాబాద్‌లో ఎల్‌ఈడీ, ఎల్‌సీడీ తయారీ యూనిట్‌ నెలకొల్పేందుకు ఒప్పందం చేసుకున్నాయి. ఇక ఇదే క్రమంలో ప్రభుత్వం రాష్ట్ర పరిశ్రమల శాఖకకు అనుబంధంగా విదేశాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేసి పెట్టుబడులను ఆకట్టుకోవాలని నిర్ణయించింది.

పెట్టుబడుల సమీకరణకు, ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ఈ సదస్సు దోహదపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తోంది..కొత్త ఆవిష్కరణలు, ఆలోచనలను పంచుకునే వేదిక కావటంతో తెలంగాణ ప్రాంతంలో పెట్టుబడులకు ఉన్న అపారమైన అవకాశాలు, హైదరాబాద్‌కు ఉన్న భౌగోళిక, వాతావరణ సానుకూలతలను చాటిచెప్పేలా ప్రణాళికలు రచిస్తోంది..పారిశ్రామిక విధానానికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఐటీ పాలసీని సైతం ప్రచారం చేయాలని నిర్ణయించింది..రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలను చాటి చెప్పేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు,మంత్రి కె.తారకరామారావు సదస్సులో ప్రసంగించే అవకాశమున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి..28న ప్రారంభోత్సవంలో కేసీఆర్‌ ఆహ్వాన ప్రసంగం చేయనున్నారు..అనంతరం ఇవాంకా,తర్వాత ప్రధాని మోదీ ప్రసంగించేలా షెడ్యూల్‌ ఖరారైంది. మరుసటి రోజున దేశ విదేశీ ప్రతినిధుల సదస్సులో మంత్రి కేటీఆర్‌ ప్రసంగిస్తారు.

06:42 - November 26, 2017

హైదరాబాద్ : కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డికి తెలంగాణ మంత్రి కేటీఆర్ బావమరిది పాకాల రాజేంద్రప్రసాద్‌ లీగల్‌ నోటీసులు జారీచేశారు. రేవంత్‌రెడ్డి తనపై అసత్య ఆరోపణలు గుప్పించారని లీగల్‌ నోటీసులలో ఆయన పేర్కొన్నారు. శుక్రవారం గచ్చిబౌలిలో జరిగిన సన్‌బర్న్‌ పార్టీకి గానీ, ఇతర ఈవెంట్లతోగానీ తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో తనకు ఎలాంటి పబ్‌లు లేవని, తనపై ఆరోపణలు చేసిన రేవంత్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలని లీగల్‌ నోటీసులలో రాజేంద్రప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. లేకుంటే న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

 

06:41 - November 26, 2017

కర్నూలు : జిల్లాలో ప్రజాసంకల్ప యాత్ర కొనసాగిస్తున్న వైసీపీ అధినేత జగన్‌ దూకుడు పెంచారు. సార్వత్రిక ఎన్నికలకు సై అంటూ పత్తికొండకు ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీదేవిని ప్రకటించారు. రాబోయే ఎన్నికలకు సన్నద్ధంగా ఉన్నామంటూ ఆ పార్టీ కార్యకర్తల్లో జోష్‌ పెంచారు. మరోవైపు తనను పత్తికొండ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినందుకు వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీకి రుణపడి ఉంటానని..ప్రజాసేవకు తోడ్పడుతానన్నారు శ్రీదేవి. 

06:39 - November 26, 2017

హైదరాబాద్ : కామెడీ పేరుతో టీవీ ఛానెళ్లలో ప్రసారమవుతున్న అసభ్యకరమైన కార్యక్రమాలపై మహిళా, ప్రజా సంఘాలు గళమెత్తాయి. రేటింగ్స్ కోసం పోటీ పడి ఛానెళ్లు విలువలకు తిలోదకాలిచ్చి.. మహిళలను, పిల్లలను కించపర్చేలా చూపించడం దారుణమని ధ్వజమెత్తాయి. అనాథపిల్లలపై జబర్దస్త్‌ ప్రోగ్రామ్‌లో హైపర్‌ ఆది చేసిన వ్యాఖ్యలపై మహిళా లోకం మండిపడింది.తోంది. సదరు నటులు, చానెళ్లపై చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు HRC ని ఆశ్రయించాయి. తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానెళ్లలో కామెడీ షోస్‌ వివాదాస్పదమవుతున్నాయి. వినోదం పేరుతో అశ్లీలత, అసభ్యతను పెంచిపోషిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హాస్యం అంటే ఆస్వాదించేలా ఉండాలి కానీ.. జుగుప్సాకరంగా ఉండకూడదని మహిళా, ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి.

హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏది బూతు, ఏది కామెడీ పేరుతో నిర్వహించిన చర్చాకార్యక్రమం వాడివేడీగా సాగింది. హాస్యం పేరుతో ప్రముఖ చానెల్స్‌లో పలు కార్యక్రమాలు అసభ్యత, అశ్లీలత ఎక్కువయ్యిందని పలువురు అభిప్రాయపడ్డారు. రేటింగ్‌ మత్తులో పడిన కార్పొరేట్‌ మీడియాకి అశ్లీలత కనిపించడం లేదని..వారు చేస్తున్న తప్పులేంటో తెలియజేయాలన్నారు సామాజిక కార్యకర్త దేవి. ఛానల్‌, ప్రొడక్షన్‌, నటులతో పాటు వ్యాఖ్యాతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

హైపర్‌ ఆదిపై సినీ విమర్శకులు కత్తిమహేష్‌ విరుచుకుపడ్డారు. తను నటిస్తున్న ప్రోగ్రామ్‌ సమాజానికి కీడు చేస్తుందని తెలిసి కూడా ఓ కళాకారుడుగా ఆది స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. పవన్‌పై తాను చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా తనను టార్గెట్‌ చేశారన్నారు. ఇలాంటి షోలను బ్యాన్‌ చేయాలని డిమాండ్ చేశారు. జబర్దస్త్‌ కార్యక్రమంలో హైపర్ ఆది తమను కించపరిచేలా మాట్లాడారని ఆరోపిస్తూ.. అనాథ విద్యార్థులతో కలిసి మహిళా సంఘాలు సైపాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదితో పాటు ఆ ప్రోగామ్‌ ప్రసారం చేసిన చానెల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

06:32 - November 26, 2017

హైదరాబాద్ : భాగ్యనగర వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెట్రోరైలు ఈనెల 29 నుంచి పరుగులు తీసేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఎల్‌ అండ్‌ టీ సంస్థ చార్జీలను ఖరారు చేసింది. మెట్రో రైలు కనీస చార్జీ రూ.10 కాగా.. గరిష్టంగా రూ.60 నిర్ణయించారు. ఈ నెల 28 న హైదరాబాద్ మెట్రో రైలును ప్రధానమంత్రి మోదీ లాంఛనంగా ప్రారంభిస్తారు. 29 నుండి అందుబాటులోకి రానున్న మెట్రో రైలుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శనివారం మెట్రో ఛార్జీలను ఎల్ అండ్ టీ సంస్థ ప్రకటించింది. కనీస చార్జీ 10 రూపాయలు కాగా.. గరిష్టం 60 రూపాయలుగా నిర్ణయించారు.మెట్రో రైలు మొదటి 2 కిలోమీటర్ల వరకు 10 రూపాయలుగా అధికారులు నిర్ణయించారు. ఆపై 2 కిలోమీటర్ల నుంచి 4 కిలోమీటర్ల వరకూ రూ.15.. 4 నుంచి 6 కిలోమీటర్ల వరకూ రూ.25..6 కిలోమీటర్ల నుంచి 8 కి.మీ.ల వరకు రూ.30..8 నుంచి 10 కి.మీ. వరకు రూ.35..10 కిలోమీటర్ల నుంచి 14కి.మీ. వరకు రూ.40..14 నుంచి 18 కి.మీ.ల వరకు రూ.45..18 కిలోమీటర్ల నుంచి 22 కి.మీ.ల వరకు రూ.50..22 నుంచి 26 కి.మీ.ల వరకు రూ.55రూపాయలుగా అధికారులు నిర్ణయించారు. 26 కి.మీ. దాటితే మెట్రో రైలు చార్జీ రూ.60 వసూలు చేస్తారు. 29 నుంచి మెట్రో స్టేషన్‌లలో స్మార్ట్‌ కార్డులను అందుబాటులోకి తీసుకురానున్నారు అధికారులు. టోకెన్లు కొనుగోలు చేసి మెట్రో రైలులో ప్రయాణించే అవకాశం కూడా ఉంది. స్మార్ట్ కార్డు ప్రాథమిక ధర 200 రూపాయలుగా ఎల్‌ అండ్ టీ నిర్ణయించింది. స్మార్ట్ కార్డుకు 100 రూపాయల టాప్ అప్ రీచార్జీ చేసుకోవాల్సి ఉంటుంది. 

06:30 - November 26, 2017

హైదరాబాద్ : గ్రేటర్ వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెట్రో ఈ నెల 29 నుండి అందుబాటులోకి రానుంది. ట్రాఫిక్‌ ఇబ్బందులను తగ్గించేందుకు ఏర్పాటు చేసిన మెట్రోకు కావలసిన పనులు పూర్తి చేశారు అధికారులు. శనివారం మంత్రులు ప్రజాప్రతినిధులు మెట్రోలో ప్రయాణించి రైలు పనితీరును పరిశీలించారు.

భాగ్యనగరంలో ఈ నెల 29 నుండి అందుబాటులోకి రానున్న మెట్రో రైలుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 28 న ప్రధానమంత్రి మోదీ లాంఛనంగా మెట్రోను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ప్రారంభమైన మరుసటి రోజు నుండే ఉదయం 6 గంటల నుండి రాత్రి పది గంటల వరకు మెట్రో అందుబాటులో ఉండనుందన్నారు మంత్రి కేటీఆర్‌. నాగోల్‌ నుండి మియాపూర్‌ వరకు 30 కిలోమీటర్ల మేర మెట్రో అందుబాటులోకి రానుంది. ప్రధాని మెట్రో ప్రారంభోత్సవం చేయనున్నందున ఇవాళ ప్రజాప్రతినిధులు, మంత్రులు, అధికారులు మెట్రో పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మెట్రో స్మార్ట్‌ కార్డ్‌ను ప్రారంభించారు. ఈ కార్డ్‌ ప్రస్తుతానికి మెట్రోలో మాత్రమే అందుబాటులో ఉండనుందని, భవిష్యత్‌లో అన్ని వాహనాలకు అనుసంధానం చేస్తామని తెలిపారు.

ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రో రైల్‌ ప్రాజెక్ట్‌ను ఎల్‌ అండ్ టీ కంపెనీకి మంత్రి కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. ప్రైవేట్‌ అండ్‌ పబ్లిక్‌ పార్టనర్‌ షిప్‌ మోడ్‌లో అతిపెద్ద ప్రాజెక్టుగా మెట్రో రైల్‌ నిలిచిందన్నారు. మెట్రో ప్రారంభోత్సవానికి కావలసిన అన్ని పనులు పూర్తి చేశామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. కార్మికుల కఠోరశ్రమకు ఫలితంగా హైదరాబాద్‌ మెట్రో సగర్వంగా ప్రస్థానం ప్రారంభించబోతోందన్నారు. మెట్రోను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు మంత్రి. ప్రజల భాగస్వామ్యంతో ప్రజల మద్దతుతో మెట్రోను ప్రారంభిస్తున్నామన్నారు. ప్రస్తుతం 57 రైళ్లు కొరియన్‌ కంపెనీ నుండి ఈ రైళ్లను కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఒక్కో రైళ్లో 1000 మంది వరకు ప్రయాణించవచ్చన్నారు. గ్రేటర్‌లో మొత్తం 24 స్టేషన్లు ప్రారంభించామన్నారు. మెట్రో కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్న గ్రేటర్‌ వాసుల కల ఇంకో మూడు రోజుల్లో నెరవేరనుంది. 

06:27 - November 26, 2017

విజయవాడ : టీడీపీ కేంద్ర కార్యాలయ శంకుస్థాపన ఘనంగా జరిగింది. అమరావతి సమీపంలో టీడీపీ కేంద్ర కార్యాలయానికి శంకుస్థాపన నిర్వహించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భూమిపూజ నిర్వహించారు. 3.60 ఎకరాలలో ఈ కార్యాలయాన్ని నిర్మించనున్నారు. 2018 డిసెంబర్‌ నాటికి ఈ కార్యాలయాన్ని పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జాతీయ కార్యాలయం ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందని టిడిపి నేత బోండా ఉమ పేర్కొన్నారు. తెలుగు జాతి ఉన్నంతవ వరకు..సూర్య చంద్రులు ఉన్నంత వరకు తెలుగు ప్రజల ఆశీస్సులతో టిడిపి ముందుకు సాగుతుందన్నారు. దేవినేని ఉమ, పుల్లారావు, పీతల సుజాత తదితరులు మాట్లాడారు. 

ఆర్మీ జవాను చంపేసిన ఉగ్రవాదులు..

ఢిల్లీ : జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు సెలవులో ఉన్న ఓ ఆర్మీ జవాన్‌ను కిరాతకంగా చంపారు. 23 ఏళ్ల ఇర్ఫాన్‌ అహ్మద్‌ మీర్‌ను టెర్రరిస్టులు కిడ్నాప్‌ చేసి దగ్గర నుంచి కాల్చి చంపారు.  

చెంప పగులగొడితే కోటి రూపాయలు...

పాట్నా : బిహార్‌కు చెందిన బిజెపి నేత అనిల్‌ సాహ్ని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పెద్ద కొడుకు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ చెంప పగలకొట్టిన వారికి కోటి రూపాయలు ఇస్తానని నజరానా ప్రకటించారు. 

పుజారా రికార్డుల మోత...

నాగ్ పూర్ : భారత్‌-శ్రీలంక మధ్య జరుగుతోన్న టెస్ట్‌ సిరీస్‌లోని కీలక నాగ్‌పూర్‌ టెస్ట్‌ రెండో రోజు సైతం టీమిండియా డామినేట్‌ చేసింది.భారత బ్యాట్స్‌మెన్‌ ఆధిపత్యం ప్రదర్శించడంతో లంక బౌలింగ్‌ ఎటాక్‌ తేలిపోయింది.

టీమిండియా టెస్ట్‌ స్పెషలిస్ట్‌ చటేశ్వర్‌ పుజారా నాగ్‌పూర్‌ టెస్ట్‌లో రికార్డ్‌ల మోత మోగించాడు. మురళీవిజయ్‌తో డబుల్‌ సెంచరీ భాగస్వామ్యం, టెస్టుల్లో మరో సెంచరీతో పాటు 2017 సీజన్‌లో మరే ఇతర భారత బ్యాట్స్‌మెన్‌కు సాధ్యం కాని రికార్డ్‌ నమోదు చేశాడు. 

ముగ్గురు యువకుల మృతి..

మేడ్చల్ : గుండ్లపోచంపల్లిలో అదుపుతప్పి స్మశాన వాటిక ప్రహారీగోడను బైక్ ఢీకొంది. ముగ్గురు మృతి చెందారు. అనీల్ (25), బింటు (23), శశిరెడ్డి (22)లు మృతి చెందిన వారిలో ఉన్నారు. 

Don't Miss