Activities calendar

27 November 2017

21:28 - November 27, 2017

గుంటూరు : కడప ఫాతిమా కాలేజీ వైద్య విద్యార్థుల పోరాటంతో ప్రభుత్వంలో చలనం వచ్చింది. రెండు రోజులుగా విజయవాడలో దీక్ష చేస్తున్న నేపథ్యంలో..బాధిత విద్యార్థులు అసెంబ్లీలో సీఎం చంద్రబాబును కలిసి న్యాయం చేయాలని కోరారు. వారి సమస్యపై సానుకూలంగా స్పందించిన చంద్రబాబు విద్యార్థులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కోరుతూ శాసనసభలో తీర్మానం చేసింది ఏపీ ప్రభుత్వం. ఫాతిమా మెడికల్‌ కాలేజీ విద్యార్థులతో భేటీ తర్వాత కొన్ని గంటల్లోనే ఈ తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు సీఎం చంద్రబాబు. నీట్‌ అర్హత పొందినవారికి ఫాతిమా కాలేజీ లేదా ఇతర కాలేజీల్లో సీటు వచ్చేలా సుప్రీంకోర్టు అనుమతికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. నీట్‌ అర్హత సాధించని విద్యార్థులకు అవసరమయ్యే కోచింగ్ అందిస్తామని, ఇందుకయ్యే వ్యయాన్ని కూడా భరించడానికి ప్రభుత్వం సిద్ధంగా వుందన్నారు. ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపేందుకు వీలుగా కొందరు విద్యార్థులు కమిటీగా ఏర్పడాలని సీఎం సూచించారు.

కాల్ సెంటర్ ద్వారా....
కాల్ సెంటర్ ద్వారా విద్యార్థులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు. తన కార్యాలయంలోనూ ఇందుకు సంబంధించి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలన్నారు. మంత్రి కామినేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో అధికారులు, విద్యార్థులు ఎల్లుండి ఢిల్లీ వెళ్లి సమస్యను మరోమారు కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని ఆదేశించారు. మరోవైపు విద్యార్థులు సెల్‌టవర్ ఎక్కి నిరసన తెలపడంపై సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్న సమయంలో ఇలాంటి చర్యలు సరికావన్నారు. మరోవైపు సీఎం ఇచ్చిన హామీలపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే పూర్తిస్థాయిలో న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని, దీక్ష కొనసాగించాలా లేదా అన్నది అందరితో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామన్నారు. కడప ఫాతిమా కాలేజీ విద్యార్థుల సమస్య పరిష్కారానికి చంద్రబాబు సర్కార్‌ ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందా లేక పాతపాటే పాడుతుందో చూడాలి. 

రేపే జీఈఎస్ సదస్సు

హైదరాబాద్ : నగరంలో ప్రతిష్టాత్మక జీఈఎస్ సదస్సు జరగబోతుంది. రేపు జీఈఎస్ సదస్సును లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఇవాంక హాజరుకానున్నారు. ఈ సదస్సులో మొత్తం1500 పారిశ్రమికవేత్తలు పాల్గొననున్నారు. 

21:25 - November 27, 2017

గుంటూరు : సాంఘిక, గిరిజన, బీసీ, మహిళ, మైనారిటీల సంక్షేమంపై అసెంబ్లీలో విస్తృత చర్చ జరిగింది. చర్చలో పాల్గొన్న అధికార టీడీపీ, మిత్రపక్షమైన బీజేపీ సభ్యులు సంక్షేమ పథకాలను ఆయా వర్గాలకు మరింత చేరువైయేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు, సలహాలు ఇచ్చారు. చర్చకు మంత్రులు నక్కా ఆనందబాబు, అచ్చెన్నాయుడు, పరిటాల సునీత సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు జోక్యం చేసుకుని సంక్షేమ పథకాల అమలుపై కొన్నికీలక నిర్ణయాలు ప్రకటించారు. చేతివృత్తుల వారికి చేయూతనందించే ఆదరణ పథకాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించిన విషయాన్ని చంద్రబాబు సభ దృష్టికి తెచ్చారు. చేనేత కార్మికులు ఉపాధి కల్పించేందుకు వీలుగా సగం రేటుకే చీర, ధోవతి పంపిణీ కార్యక్రమాన్ని వచ్చే నెల 25 నుంచి అమలు నిర్ణయించారు. పెళ్లి కానుక పథకాన్ని వచ్చే జనవరి నుంచి అమలు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు.

వైశ్యులకు కూడా ఫెడరేషన్‌
బ్రాహ్మణ కార్పొరేషన్‌ తరహాలో వైశ్యులకు కూడా ఫెడరేషన్‌ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు సభ దృష్టికి తెచ్చారు. పేదలకు 18 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామన్నారు. వచ్చే ఏడాది జనవరిలో రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలని నిర్ణయించినట్టు చంద్రబాబు సభలో ప్రకటించారు. బీసీ రిజర్వేషన్లకు నష్టం లేకుండా కాపులకు రిజర్వేషన్లు అమలు చేస్తామని మరోసారి స్పష్టం చేశారు. మరోవైపు ఫాతిమా మెడికల్‌ కాలేజీ విద్యార్థులకు న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ చంద్రబాబు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. విద్యార్థులు తల్లిదండ్రులపై కేసులు పెడుతున్న ఫాతిమా మెడికల్‌ కాలేజీ యాజమాన్యానికి చంద్రబాబు గట్టి వార్నింగ్‌ ఇచ్చారు.ఫాతిమా మెడికల్‌ కాలేజీ తీర్మానం తర్వాత స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు అసెంబ్లీని మంగళవారానికి వాయిదా వేశారు. 

21:23 - November 27, 2017

హైదరాబాద్ : హైదరాబాద్‌ మహానగరంలో గ్లోబల్ ఎంటర్‌ప్య్రూనర్‌షిప్ సమ్మిట్ నిర్వహణకు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో జీఈ సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ఈ సమ్మిట్‌లో పాల్గొనేందుకు ఇవాంకా ట్రంప్‌ మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు హైదరాబాద్‌ చేరుకోనున్నారు. సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు ప్లీనరీ సెషన్ ప్రారంభమవుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మూడు రోజుల పాటు నిర్వహించనున్న సదస్సులో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వారి ఆలోచనలు, నెట్‌వర్క్‌లు, ఇష్టాలను వేదిక ద్వారా వెల్లడించనున్నారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్, ఇవాంకా ట్రంప్ వేదికను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

అమెరికా, భారత ప్రభుత్వాలు సంయుక్తంగా
జీఈఎస్‌ను అమెరికా, భారత ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. వుమెన్ ఫస్ట్- ప్రాస్పర్టీ ఫర్ ఆల్ అన్న నినాదాంతో ఈ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. మహిళలు ఆర్థిక సాధికారత సాధించాలనేది జీఈ సమ్మిట్‌ ముఖ్య ఉద్దేశమని నీతిఅయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ స్పష్టం చేశారు.150కి పైగా దేశాల నుంచి 1500 మంది పారిశ్రామికవేత్తలు ఈ సదస్సుకు హాజరవుతారన్నారు.10 దేశాల నుంచి కేవలం మహిళా బృందాలే ఈ ఈవెంట్‌లో పాల్గొననున్నాయి. ప్లీనరీలు, బ్రేకౌట్ సెషన్స్, మాస్టర్ క్లాసెస్, వర్క్‌షాపులు నిర్వహించనున్నారు. గూగుల్ వైస్ ప్రెసిడెంట్ డయానా లూయిస్ పెట్రిసియా, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, సిటాడెల్ సాఫ్ట్‌వేర్ ఈసీవో రోయా మహబూబ్ సదస్సులో ప్రసంగించనున్నారు. వివిధ దేశాలకు చెందిన మహిళలు.. తమ తమ దేశాల్లో ఉన్న అవకాశాల గురించి ప్యానెల్ సెషన్‌లో వివరిస్తారు.

భారీ భద్రత ఏర్పాట్లు
ఎస్‌కు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మెట్రో, జీఈఎస్‌ ఈవెంట్లకు 10,400 మంది పోలీసులను వినియోగిస్తున్నట్లు రాష్ట్ర డీజీపీ మహేందర్‌ రెడ్డి తెలిపారు. ఇవాంకా బస చేసే హోటల్‌ వద్ద నాలుగంచెల భద్రత...విదేశీ ప్రతినిధులు బస చేసే 13 హోటళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.జీఈస్‌లో పాల్గొనేందుకు వస్తున్న ప్రతినిధులకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో సంప్రదాయబద్ధంగా ఆహ్వానం పలికేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ వాలంటీర్లను నియమించింది.  

నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ : ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూతురు ఇవాంక రాక సందర్బంగా పోలీసులు నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. ఫలక్ నుమా వెళ్లే దారితో పాటు ఇవాంక బస చేసే హోటల్ వైపు కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తారు. 

20:23 - November 27, 2017

తెలంగాణల న్యాయం నాల్గు పాదల మీద నడుస్తున్నదని చెప్తడు మన బాతాల పోశెట్టిగారు.. మరి ఏ పాదం మీద చటాక్ న్యాయం గనిపిస్తలేదు.. అసలు తెలంగాణల న్యాయం అనేది ఉన్నదా..? ఉంటె మరి..? నిజామాబాద్ భరత్ రెడ్డిగాని అరెస్టు ఏమాయే..? ఇయ్యాళటికి వారం పదిరోజులు దాటిపాయే.. ఇప్పటికి వాన్ని అరెస్టు జేయలేదంటే ఏందన్నట్టు మత్లావు..?

ఎద్క తెలంగాణ రాష్ట్రంల శితం సచ్చిపోతున్నరుగదా రైతులు.. మనకేమో సర్కారు దొంగ లెక్కలు గట్టి.. రైతులు ఎంత నిమ్మలంగున్నరు అబ్బా.. అగజూడుండ్రి నా పోట్వమీద పాలాభిషేకాలు అయితున్నయ్ అని అవ్వి సూపెడ్తరుగని.. అసలు రైతుల గోసమాత్రం సూపెట్టది ఈ ప్రభుత్వం.. దేశంలనే రైతుల ఎక్వ సచ్చిపోతున్న రాష్ట్రంల తెలంగాణ నెంబర్ వన్ అయ్యింది..

ఎమ్మార్వో ఆఫీసోళ్లంటె అంత అల్లాటప్పగాళ్లనుకున్నడో ఏమో.. ఒక రైతు.. పోంగనే వాళ్లు నిజాయితీగ పనులు జేశి పెడ్తరు.. ఇది ప్రజల ప్రభుత్వం అని ఫీలైనట్టుండు.. రెవెన్యూ రికార్డులళ్ల నా భూమి సరిజేయుండ్రి సారు అని వీఆర్వో తానికి వొయ్యిండట.. ఆ వీఆర్వోకు కనీసం ఐదువేల రూపాల లంచమన్న ఇయ్యంది ఎట్ల పనైతది చెప్పుండ్రి..

ఏ నేరం జేయని మన్షి పాణం దీశె హక్కు ఎవ్వలికి లేదని భారత రాజ్యాంగం జెప్తుంటె.. అణ్యం పుణ్యం ఎరుగని అమాయకుల మీద డ్రగ్స్ ప్రయోగం జేశి సంపుతున్నరు.. గోలీలు మందులు తయ్యారు జేశేటోళ్లు.. వాళ్లు కనిపెట్టిన కొత్త మంది కొంతమందికి ఏశి సూస్తరు.. అట్ల ఏసుకున్నందుకు పదో పర్కో చేతుల వెడ్తరు.. ఇట్లనే జమ్మికుంట పిలగాని మీద ప్రయోగం జేశిండ్రట.. పోరనికి పిచ్చిలేశి ఆగమాగం జేస్తున్నడట..

వా పెండ్లంటే ఇది..? అస్సలు పెండ్లి.. ఈ నమూన పెండ్లిలే చాల అరుదుగైతుంటయ్.. ఇద్దరికి మాటలు రావు.. ఇద్దరి చెవ్వులు ఇనవడయ్.. ఈళ్లిద్దరు ప్రేమించుకున్నరు.. కులం వేరైనా.. ప్రేమ ముంగట కులం పనిజేయలే.. ప్రేమ గెలిచింది.. ఆఖరికి నిన్న పెండ్లి అయ్యింది.. పెండ్లి కొచ్చిన పెద్దలు గూడ.. మూగ చెవిటోళ్లే.. వాళ్ల సంతోషం సైగలళ్లనే గనిపిస్తున్నది.. పాండ్రి మనం పంచుకోని అచ్చింతలేద్దాం..

వాడు పనిజేశేది ఆప్కారి డిపార్టుమెంట్ల.. అంటే.. తాగుడును తక్వ జేపిచ్చె డిపార్టుమెంట్ .. ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ .. అండ్ల పనిజేశే కానిస్టేబుల్ జేయవల్సిన పని ఏంది.?. ప్రజలను మద్యం బారీన పడకుంట కాపాడాలే.. వాళ్లకు మంచి బుద్దులు జెప్పాలే.. సర్కారు జెప్పిన సర్కు అమ్మెతట్టు జూడాలే.. అప్కారి పోలీసోడే కడ్పునిండ దాగితె ఆఫీసుకొస్తె.. ఇంతకు ఏమనుకుంటున్నడు వాడు..

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుగారూ.. మీకు ప్రభుత్వ జీతం నెలనెల ఒక్కటి తారీకే వస్తలేదు..? ఒక దినం ఇటాటు ఆల్చంగాకుంట బ్యాంకు ఖాతల వడిపోతయ్.. మరి నెలనెల పించిన మీదనే బత్కుతున్న ముసలోళ్లు, వికాంగులు.. భర్తలు లేనోళ్ల పరిస్థితి ఏంది..? నీది కడ్పుగని.. వాళ్లకు కడ్పులేదా..? ఒక్కటి తారీఖు వొయ్యి ఎన్నొద్దులాయే..?

ఇంటి ముంగట వెట్టిన లారీలనే ఎత్కపోతున్నరంటే.. రేపు రేపు రైళ్లను గూడ ఎత్కపోయెతట్టే ఉన్నరు దొంగలు.... అరే లారీలను గూడ దొంగతనం జేసుడంటే.. అయిపాయే అదేమన్న చిన్న బండిగాదాయే.. ఎత్కపోయెతందుకు.. నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం మల్కాపూరం ఉర్లకెళ్లి లారి వొయ్యింది లారిలున్న లోడు వొయ్యింది..

20:20 - November 27, 2017

మెట్రో రైలు పరుగులు తీసే సమయం దగ్గరకొచ్చింది. ఎన్నో ఏళ్లుగా కలలు కంటున్న భాగ్యనగర వాసి పిల్లర్లపై పరుగులు తీసే మెట్రోలో పయనించబోతున్నాడు. ఈ క్రమంలో ఎన్నో అంచనాలతో పాటు, మరికొన్ని సందేహాలు వినిపిస్తున్నాయి. సదుపాయాలు, పార్కింగ్ గురించి పలుప్రశ్నలు వినిపిస్తుంటే, అసలీ మెట్రో సామాన్యుడికి అందుబాటులో ఉంటుందా అనే సందేహాలూ.... టికెట్ రేట్లు అనూహ్యంగా పెంచిన తీరుపై విమర్శలూ వినిపిస్తున్నాయి. సో పరుగులు తీయనున్న మెట్రోపై ఎప్పుడెప్పుడా అని నగరవాసి ఎదురు చూస్తున్న మెట్రో రైలు మరికొద్ది గంటల్లో నగరంలో పరుగులు పెట్టనుంది. ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారంగా, కాలుష్యానికి దూరంగా, సౌకర్యవంతమైన ప్రయాణంతో, మెట్రో రైలు సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. మరి మెట్రో నగర ముఖ చిత్రాన్ని ఎలా మార్చనుంది.. ?మెట్రో స్టేషన్ల నిర్వహణ ఎలా ఉండబోతోంది? భద్రతా ప్రమాణాలు ఏ స్థాయిలో ఉండబోతున్నాయి. మానవ రహిత ఆటోమాటిక్ సిస్టమ్ లు ఎలా పనిచేస్తాయిదీనిపై మెట్రో వర్గాలేం చెప్తున్నాయి?

మెట్రో రైలు ధరలు సామాన్యులకు అందుబాటులో ఉన్నాయా?నగర వాసులను ఊరిస్తూ వస్తున్న మెట్రో సాధారణ ప్రజానీకానిగా బరువుగా మారనుందా? అవునంటున్నారు ప్రజలు. టికెట్ రేట్లు ముందు చెప్పిన దానికంటే ఎక్కువగా కనిపిస్తున్న తీరు నిరాశకు గురిచేస్తోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అసలు మెట్రో రైలు టికెట్లు ఎలా ఉన్నాయి?దశాబ్దాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఆకాశహర్మ్యాలూ విశాలమైన రోడ్లూ ఫ్లైఓవర్లతో నగర ముఖచిత్రం మారిపోయింది. నగరానికి సైబరాబాద్‌ అనుబంధమైంది. ప్రపంచ స్థాయి సంస్థలెన్నో నగరంలో తమ చిరునామా ఏర్పరచుకున్నాయి. ఐటీ, ఫార్మా, బయోటెక్‌, టూరిజం రంగాల్లో వేగంగా అభివృద్ధిని నమోదు చేస్తున్న నగర జనాభా ఇప్పటికే కోటి దాటుతోంది. ఈ తరుణంలో వస్తున్న మెట్రోపై భారీ అంచనాలున్నాయి. అదే సమయంలో పార్కింగ్ లాంటి పలు సమస్యలకు ఇంకా సమాధానం కనిపించని పరిస్థితి ఉంది

రవాణా సదుపాయాలు పెరగటం ఏ నగరానికైనా మంచి విషయమే. అందునా, జనాభా విపరీతంగా పెరుగుతూ, వివిధరంగాల పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు విస్తరిస్తున్న భాగ్యనగరంలో మెట్రో సదుపాయం రావటం ఉపయోగమే. కానీ, సామాన్యుడికి అందుబాటులో లేని అభివృద్ధి వల్ల ప్రయోజనాలు స్వల్పమే. అశేష ప్రజానీకం భరించగలిగేలా మెట్రో ఛార్జీలు అందుబాటులో ఉండాలి. అప్పుడే ఇలాంటి భారీ ప్రాజెక్టుల పరమార్ధం నెరవేరుతుంది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

కరెంట్ షాక్ తో రైతు మృతి

కరీంనగర్/సిద్దిపేట : జిల్లా కోహెడ మండలం వరుకోలు లో వీరారెడ్డి అనే రైతు కరెంట్ షాక్ తో మృతి చెందాడు. ఆయన ట్రాన్స్ ఫార్మర్ ఫీజు పోవడంతో విషయాన్ని ముందుగా విద్యుత్ అధికారులకు తెలిపాడు. విద్యుత్ అధికారులు విద్యుత్ ను నిలిపివేస్తున్నాం ఫీజు వేయండి అని వీరారెడ్డి చెప్పారు. దీంతో వీరారెడ్డి ఫీజు వేస్తుండగా కరెంట్ సరఫరా కావడంతో వీరారెడ్డి కరెంట్ షాత్ మృతి చెందాడు. వీరారెడ్డి మరణానికి విద్యుత్ అధికారులు కారణమని గ్రామస్తులు ఆందోళనకు దిగారు.

19:49 - November 27, 2017

హైదరాబాద్ : ప్రపంచ వ్యాపారసదస్సుకు హాజరవుతున్న ఇవాంక ట్రంప్‌ ఏ హోటల్‌లో బస చేస్తుందో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ముందుగా హైటెక్‌సిటీలోని మైండ్‌స్పేస్‌ హోటల్‌లో ఆమె బసకు ఏర్పాట్లు చేశారు. తాజాగా అదే ప్రాంతంలోని మరో హోటల్‌కు మార్చినట్లు తెలుస్తోంది. ట్రెటెన్డ్‌ హోటల్‌లో ఇవాంక విడిది ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

19:48 - November 27, 2017

హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన షెడ్యూల్ ఖరారైంది. మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట 10 నిమిషాలకు ప్రధాని ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాఫ్టర్లో 2 గంటల 5 నిమిషాలకు మియాపూర్ హెలిప్యాడ్‌కు .. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కార్యక్రమ వేదిక వద్దకు చేరుకుంటారు.2.15 నుంచి 2.23 వరకు మెట్రో పైలాన్‌ను ఆవిష్కరించి.. హైదరాబాద్ మెట్రోను జాతికి అంకితం చేస్తారు. అక్కడ ప్రదర్శించే ఆడియో విజువల్ దృశ్యమాలికను తిలకిస్తారు. మెట్రో రైలు బ్రోచర్‌ను, ప్రయాణికులకు అనువుగా రూపొందించిన యాప్‌ను ప్రధాని విడుదల చేస్తారు. మధ్యాహ్నం 2.30 నుంచి 2.40 వరకు మియాపూర్ నుంచి కూకట్‌పల్లి , అక్కడి నుంచి మియాపూర్ వరకు మెట్రో రైలులో ప్రయాణం చేస్తారు.

హెలికాఫ్టర్లో మియాపూర్ కు
2.55కు మియాపూర్ నుంచి హెలికాఫ్టర్లో బయల్దేరి ప్రధాని 3.15కు హెచ్ఐసీసీ చేరుకుంటారు. 3.35 నుంచి 3.55 వరకు 20 నిమిషాల పాటు ఇవాంకా ట్రంప్‌తో ప్రత్యేకంగా భేటీ అవుతారు. అనంతరం.. భారత ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను కలిసి వారితో చర్చిస్తారు. 4.40 నుంచి 4.43 నిమిషాల వరకు సీఎం కేసీఆర్ సదస్సులో స్వాగతోపన్యాసం చేస్తారు. 4.43కు అధికారికంగా సదస్సును ప్రారంభిస్తారు. 4.45 నుంచి 4.50 నిమిషాల వరకు ఇవాంకా ట్రంప్‌ సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం 4.50 నుంచి 5.10 వరకు ప్రధాని ప్రసంగిస్తారు. అనంతరం పారిశ్రామిక వేత్తలతో సమావేశమవుతారు. మర్యాదపూర్వక భేటీల అనంతరం 7.30కి అక్కడి నుంచి బయల్దేరి ఫలక్‌నుమా చేరుకుంటారు. ఫలక్‌నుమాలో రాత్రి 8 గంటలకు భారత ప్రభుత్వం ఇచ్చే విందులో ముందుగా విదేశీ అతిథులకు ప్రధాని స్వాగతం పలుకుతారు. 8.05 నుంచి 8.20 వరకు 'ట్రీ ఆఫ్ లైఫ్'పేరుతో భారతీయ కళలు, దుస్తుల ప్రదర్శన ఉంటుంది. 8.20 నుంచి 8.35 వరకు భారత చారిత్రక వారసత్వంపై లైవ్ షో ప్రదర్శిస్తారు. 8.45 నుంచి 9.50 వరకు విందు ఉంటుంది. 10 గంటలకు ప్రధాని మోదీ తిరుగుపయనమవుతారు. 10.25కు శంషాబాద్ ఎయిర్‌ పోర్ట్‌కు చేరుకుని అక్కడి నుంచి ప్రధాని మోదీ ఢిల్లీకి వెళ్లిపోతారు. 

19:45 - November 27, 2017

హైదరాబాద్ : ఎప్పుడెప్పుడా.. అని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న మెట్రో రైలు హైదరాబాద్‌ నగరవాసులకు అందుబాటులోకి వస్తోంది. మంగళవారం మధ్యాహ్నం మియాపూర్‌ మెట్రోస్టేషన్‌ వద్ద ప్రధాని మోదీ.. పైలాన్‌ను ఆవిష్కరించడంతో పాటు మెట్రో రైలును ప్రారంభించి.. జాతికి అంకితం చేయనున్నారు. మెట్రో రైల్‌ ప్రారంభోత్సవానికి సంబంధించి ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. మియాపూర్‌ మెట్రో స్టేషన్‌ను అధికారులు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రధాని భద్రత రీత్యా అధికారులు విస్త్రతంగా తనిఖీలు చేపట్టారు. అలాగే ప్రారంభోత్సవ పనులను మంత్రి కేటీఆర్‌ పరిశీలించారు. మెట్రో పైలాన్, మెట్రో స్టేషన్‌తో పాటు.. ప్రధాని హెలికాప్టర్‌ ల్యాండ్ అయ్యే హెలిప్యాడ్ ప్రాంతాలను సందర్శించారు. పైలాన్ నిర్మాణం, ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. ప్రధాని మోదీ ఆవిష్కరించే మెట్రో పైలాన్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. మూడు కారిడార్లను ప్రతిబింబించేలా దీన్ని నీలం రంగులో స్టెయిన్‌ లెస్‌ స్టీల్‌తో రూపకల్పన చేశారు. దీన్ని ఎవరైనా దగ్గర నుంచి చూసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 

హైదరాబాద్ చేరుకున్న ముకేశ్ అంబానీ

హైదరాబాద్ : ముకేశ్ అంబానీ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. ఆయన జీఈఎస్ లో పాల్గొడానికి హైదరాబాద్ వచ్చారు.

19:23 - November 27, 2017
19:07 - November 27, 2017

ఎమ్మెల్యే హత్యకు కుట్ర

అనంతపురం : జిల్లాలో ఎమ్మెల్యే హత్యకు కుట్ర చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే హత్యకు ప్రత్యర్థి వర్గం హంతకుల ముఠాకు సుపారీ ఇచ్చింది. హంతక గ్యాంగ్ కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు వారిని అరెస్ట్ చేసినట్టు ధృవీకరించారు. 

రేపు హైదరాబాద్ కు ఇవాంక

హైదరాబాద్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక రేపు హైదరాబాద్ రానున్నారు. రేపు ఉదయం 3గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి ఉదయం 3.10 నుంచి హోటల్ వెస్టిన్ కు చేరుకుని అక్కడే బస చేస్తారు. మధ్యాహ్నాం 3గంటలకు హెచ్ఐసీసీకి వెళ్తారు. అక్కడ జీఈఎస్ సదస్సులో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 5.50 తిరిగి హోటల్ వెస్టిన్ కు చేరుకుంటారు. రాత్రి 8 గంటలకు ఫలక్ నుమా ప్యాలెస్ చేరుకుని అక్కడ విందుకు హాజరై తిరిగి వెస్టిన్ హోటల్ ఇవాంక చేరుకుంటారు. ఎల్లుండి ఉదయం 10గంటలకు హెచ్ఐసీసీలో జీఈఎస్ సదస్సుకు రెండవ రోజు హాజరౌతారు. 

18:59 - November 27, 2017

కడప : జిల్లాలోని.. యోగి వేమన యూనివర్సిటీలో దారుణం చోటుచేసుకుంది. తోటి విద్యార్థే... ఓ దళిత విద్యార్థిని.. కులం పేరుతో వేధిస్తున్నాడు. జర్నలిజం మొదటి సంవత్సరం చదువుతున్న సులోచన అనే విద్యార్థిని.. తనతో పాటు చదువుతున్న చంద్రశేఖర్‌రెడ్డి అనే విద్యార్థి కులం పేరుతో దూషిస్తూ... మానసికంగా వేధిస్తున్నాడు. దీనిపై సులోచన యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోలేదని.. సులోచన ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ కారెం శివాజికి ఫిర్యాదు చేసింది. 

18:58 - November 27, 2017

అనంతపురం : జిల్లాలో ఎమ్మెల్యే హత్యకు కుట్ర చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే హత్యకు ప్రత్యర్థి వర్గం హంతకుల ముఠాకు సుపారీ ఇచ్చింది. హంతక గ్యాంగ్ కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు వారిని అరెస్ట్ చేసినట్టు ధృవీకరించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

18:57 - November 27, 2017

అనంతపురం : మళ్లీ ఫ్యాక్షన్‌ భూతపు ఛాయలు..!సరికొత్త రూపులోకి ఫ్యాక్షనిజం పరకాయ ప్రవేశం..!సుపారీ సంస్కృతి వైపు మొగ్గుతోన్న ఫ్యాక్షనిజం..!ఉలికిపడుతోన్న అనంతపురం జిల్లా జనం..!!ఫ్యాక్షన్‌ రాజకీయాలకు పెట్టింది పేరైన అనంతపురం జిల్లా.. పదేళ్ల సుదీర్ఘ ప్రశాంతత తర్వాత.. ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రాజకీయ ప్రత్యర్థుల ఏరివేతకు.. కొందరు ప్రయత్నిస్తున్నారన్న వార్తలు జిల్లాలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. టీడీపీకి చెందిన ప్రస్తుత ధర్మవరం ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ అలియాస్‌ వరదాపురం సూరి హత్యకు పన్నిన కుట్ర బయటకొచ్చింది. సూరి హత్యకు.. బిహారీ గ్యాంగ్‌కు సుపారీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

దాదాపు ఓ దశాబ్ద కాలంగా..
అనంతలో ఒకప్పుడు ప్రత్యర్ధులను మట్టుపెట్టేందుకు ఫ్యాక్షన్ నేతలు తమ అనుచర వర్గంతోనే కలిసి పక్కా ప్లాన్‌తో రంగంలోకి దిగేవారు. ఈ ప్రయత్నంలో ఇరువర్గాల వారూ ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలున్నాయి. ఆ తర్వాతి రోజుల్లో ప్రత్యర్థి ప్రాణాలు తీయడం కన్నా.. ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తీయాలన్న భావనతో.. ఆస్తులను ధ్వంసం చేసేవారు. ముఖ్యంగా ఏపుగా ఎదిగి కాపుకొచ్చిన పండ్లతోటలను.. సమూలంగా నరికేసేవారు. అయితే.. దాదాపు ఓ దశాబ్ద కాలంగా.. ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరిస్తుండడంతో.. ఫ్యాక్షనిజం కొంత తగ్గుముఖం పట్టింది. అయితే.. ఇప్పుడు మళ్లీ ఫ్యాక్షన్‌ ఆనవాళ్లు బయటపడుతున్నాయి.

కొత్త పంథాను ఎంచుకున్న నాయకులు
అనంతపురం జిల్లాలో ఫ్యాక్షనిస్టులు.. ప్రత్యర్ధులను మట్టుబెట్టేందుకు కొత్త పంథాను ఎంచుకున్నట్లు వెల్లడైంది. తమ చేతికి మట్టి అంటకుండా బిహారీ కిల్లర్ గ్యాంగ్‌లకు సుపారీ ఇచ్చి కుట్రలు ప్రత్యర్థులను మట్టుబెట్టేందుకు పన్నాగాలు పన్నుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. అధికార పార్టీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ హత్యకు ఇదే తరహాలో కుట్ర చేశారని.. నిఘా వర్గాలు కూడా హెచ్చరించడం.. ఇప్పుడు సంచలనంగా మారింది. ఎమ్మెల్యే సూర్యనారాయణను హత్యకు.. రెండు కోట్ల సుపారీ ఇచ్చారని... తొమ్మిది మంది సభ్యులున్న బిహారీ గ్యాంగ్‌.. అనంతపురం, ధర్మవరం పట్టణాల్లో రెక్కీ నిర్వహించారనీ సమాచారం. 

18:49 - November 27, 2017

కర్నూలు : అవినీతి సొమ్ముతోనే తమపార్టీ ఎమ్మెల్యేలను సీఎం చంద్రబాబు కొనుగోలు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. కేవలం అభివృద్ధిని చూసి టీడీపీలోకి వెళ్లామని, ప్రలోభాలకు లొంగలేదని ఫిరాయింపు నేతలు గుండెమీద చేతులు వేసుకుని చెప్పగలరా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న సీఎం చంద్రబాబుపై గవర్నర్‌, కేంద్రం చర్యలు తీసుకోవాలని పెద్దిరెడ్డి డిమాండ్ చేశారు.

18:41 - November 27, 2017

గుంటూరు : రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ పేదలకు 18 లక్షల్ల ఇళ్లు నిర్మించిన తర్వాతే ఎన్నికలకు వెళతామని ముఖ్యమంత్రి చంద్రబాబు శపథం చేశారు. ఇందుకోసం 51 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్టు సంక్షేమ పథకాలపై అసెంబ్లీలో చర్చకు సమాధానంగా చెప్పారు. 

18:40 - November 27, 2017

గుంటూరు : భారతీయ వైద్య మండలి అనుమతి రద్దు చేయడంలో నష్టపోయిన కడపలోని ఫాతిమా మెడికల్‌ కాలేజీ విద్యార్థులకు న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించింది. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లి 2015-16 బ్యాచ్‌ విద్యార్థులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. 

18:24 - November 27, 2017

గుంటూరు : బలహీనవర్గాల ఆడపిల్లల పెళ్లి కానుక పథకాన్ని వచ్చే ఏడాది జవనరి నుంచి అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. హిజ్రాలకు నెలకు వెయ్యి రూపాయల పెన్షన్‌ చెల్లించేందుకు విధివిధానాలు రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. సంక్షేమ పథకాలపై అసెంబ్లీలో జరిగిన చర్చకు సమాధానంగా చంద్రబాబు ఈ విషయాలను సభ దృష్టికి తెచ్చారు. 

శ్రీలంకతో వన్డే సీరిస్ కు భారత జట్టు ఎంపిక

ముంబై : బీసీసీఐ సెలక్టర్లు శ్రీలంకతో వన్డే సీరిస్ భారత జట్టును ఎంపిక చేశారు. వన్డే సీరిస్ నుంచి కోహ్లికి విశ్రాంతినిచ్చారు. ఈ వన్డే సీరిస్ లో రోహిత్ శర్మకు సారధ్య బాధ్యతలు అప్పగించారు. 15 మందితో వన్డే జట్టు ప్రకటించారు. జట్టు సభ్యుల్లో రోహిత్ శర్మ (కెప్టెన్), ధావన్, రహానె, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, కేదార్ జాదవ్, దినేష్ కార్తిక్, దోనీ, పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్, చాహల్, బుమ్రా, భువీ, సిద్దార్థ కౌల్ ఉన్నారు. 

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీ.అసిస్టెంట్

విశాఖ : జిల్లా అర్బన్ తహశీల్దార్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ సూర్యకళ రూ.10వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కింది. 

17:40 - November 27, 2017
17:39 - November 27, 2017

యాదాద్రి : జిల్లా.. మోత్కూర్‌లోని ఒక మొబైల్‌ షాపులో రెడ్‌ మీ నోట్‌-4 ఫోన్ పేలి ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన రెడ్‌ మీ నోట్‌-4లో సిమ్‌ మార్చుతుండగా.. భారీ శబ్దంతో పేలిపోయింది. అయితే షాపు యజమాని అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. 

17:38 - November 27, 2017

హైదరాబాద్ : జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ MFA విద్యార్థులు అద్భుతాలు సృష్టించారు. మాస్టర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ చదువుతున్న విద్యార్థులు వేసిన పెయింటింగ్స్‌ అందర్నీ అకట్టుకుంటున్నాయి. యూనివర్సిటీకి చెందిన ముగ్గురు విద్యార్థులు.. తలచింతల తిరుపతిరాజు, అన్నగౌని ప్రశాంతి, పెద్దిరెడ్డి స్రవంతి వేసిన పెయింటింగ్స్‌తో నిర్వహిస్తున్న ప్రదర్శన అందర్నీ ఆకట్టుకుంటోంది. కళాకృతులకు ఆధునిక టెక్నాలజీ జోడించారు. ఫైన్‌ ఆర్ట్స్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ ప్రొఫెసర్‌ వికాస్‌, విభాగాధిపతి ప్రీతి సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులు రూపొందించిన పెయింటింగ్స్‌... కళ పట్ల వీరికి ఉన్న భావాలను బయపెట్టాయి. నియో ఐడియాలజీ పేరుతో నిర్వహిస్తున్న పెయింటింగ్స్‌ ఎగ్జిబిషన్‌ ఈనెల 30 వరకు కొనసాగుతుంది. 

17:37 - November 27, 2017

కామారెడ్డి : జిల్లా బాన్సువాడ మండలంలోని దేశాయిపేట గ్రామం. గడిచిన ఎన్నో ఏళ్లుగా ఈ గ్రామం అభివృద్ధికి నోచుకోలేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా పరిస్థితులుండేవి. ఇప్పుడిప్పుడే ఇక్కడి పరిస్థితుల్లో మార్పు వస్తోంది. ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ చాలా మంది ఉపాధ్యాయులుగా, ఇతర ప్రభుత్వ ఉద్యోగులుగా పని చేస్తున్నారు. వాళ్లందరి సహకారంతో ఈ గ్రామంలో అనేక అభివృద్ధి పథకాలు వేగంగా అమలవుతున్నాయి. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవడంలో ఈ గ్రామం ముందు వరసలో ఉంది. మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అండదండలు ఉండటంతో.. గ్రామస్తులు సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. గత 60 ఏళ్లలో జరగని అభివృద్ధిని.. ఈ మూడేళ్ల కాలంలో సాధించినట్లు స్థానిక ప్రజా ప్రతినిధులు చెబుతున్నారు.

ప్రతీ ఒక్కరికీ సొంతిళ్లు...
దేశాయిపేటలో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, మిషన్ భగీరథ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఇంటింటికీ మంచి నీటి కొళాయిలను ఏర్పాటు చేశారు. వాటిని మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి చేతుల మీదగా ప్రారంభించారు. మిషన్ భగీరథలో భాగంగా నిర్మించిన వాటర్‌ ట్యాంక్‌లకు పైపులైన్లు వేసి గ్రామంలో సిద్ధంగా ఉంచారు. ఇక కాళేశ్వరం నుంచి పైపులైన్ల ద్వారా నీరు వచ్చిన వెంటనే గ్రామంలోని ప్రతీ ఇంటికీ స్వచ్ఛమైన మంచినీరు అందుతుందని గ్రామ సర్పంచ్ చెప్పారు. ఇదిలా ఉంటే ఎక్కడా లేని విధంగా నిరు పేదలైన ప్రతీ ఒక్కరికీ తమ సొంతింటి కల నిజమవుతోంది. గ్రామంలో 50 డబుల్ బెడ్‌ రూమ్‌ ఇళ్లు నిర్మిస్తున్నట్టు ప్రజా ప్రతినిధులు చెబుతున్నారు. పనులు పూర్తి చేసి త్వరలోనే అర్హులైన నిరుపేద కుటుంబాలకు అందజేయనున్నారు. రోజురోజుకీ గ్రామంలో జనాభా పెరిగిపోతోంది. దీంతో వాళ్లు ఒకే ఇంట్లో ఎక్కువ మంది ఉండలేక వేరే ప్రాంతాల్లో అద్దెకు ఉంటున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్‌.. ప్రతీ ఒక్క కుటుంబం గౌరవంగా ఉండేలా ఇళ్లు కట్టిస్తున్నట్లు ప్రజా ప్రతినిధులు చెబుతున్నారు.అద్దె ఇళ్లలో ఉన్న కుటుంబాలకు సొంతింటి కల నెరవేరనుంది. దేశాయ్‌పేట అభివృద్ధికి సహకరిస్తున్న మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మొత్తానికి ఇప్పుడు ఈ ఊరి స్వరూపమే మారిపోయింది. 

17:36 - November 27, 2017

సంగారెడ్డి : జిల్లా జహీరాబాద్‌ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లోని.. భూములను ప్రభుత్వం.. బలవంతంగా కైవశం చేసుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తోంది. రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామంటూనే.. వారి భూములను కొల్లగొట్టేందుకు పావులు కదుపుతోంది. దీంతో పాలకుల చర్యలపై రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. భూములు ఇచ్చేది లేదంటూ తేల్చి చెబుతున్నారు.

వ్యవసాయం మీదే ఆధారపడి కొన్ని వందల కుటుంబాలు
జహిరాబాద్‌ నియోజకవర్గంలోని నానల్‌కల్‌ మండలంలోని ఉస్సెల్లి, మామిడ్గి, బసంత్‌పూర్‌, మెటల్‌కుంట, నానమలేబాద్‌ గ్రామాల్లో రైతులు.. చెరుకు, కూరగాయలు పడిస్తుంటారు. వ్యవసాయం మీదే ఆధారపడి కొన్ని వందల రైతుల కుటుంబాలు ఇక్కడ జీవిస్తున్నాయి. అయితే ఏడాదికి రెండు పంటలు పండే..ఈ భూములపై ప్రభుత్వం కన్ను పడింది. నిమ్జ్‌ కోసం ఈ భూములను తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. రైతులు మాత్రం తమకు అన్నం పెట్టే భూములివ్వడానికి.. నిరాకరిస్తున్నారు. కోర్టు ద్వారా తమ ఉద్యమాన్ని సాగి‌స్తున్నారు. భూములివ్వమంటూ.. హైకోర్టులో పిటిషన్ వేయగా.. రెండు పంటలు పండే.. భూములు తీసుకోవద్దని కోర్టు తీర్పునిచ్చింది. కానీ.. ప్రభుత్వం మాత్రం చట్టాన్ని కూడా గౌరవించకుండా.. తన పంథాలోనే ముందుకు సాగుతోందని.. రైతులు వాపోతున్నారు. అధికారులు సైతం భూములు సేకరించేందుకు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని.. రైతులు న్యాయబద్దంగా పోరాటం చేసి.. తమ భూములు కాపాడుకుంటామని రైతులు అంటున్నారు. 

17:34 - November 27, 2017

హైదరాబాద్ : మెట్రో రైలు మరికొద్ది గంటల్లో ప్రజలకు అందుబాటులోకి రానుంది. రేపు సాయంత్రం నాలుగు గంటల తర్వాత... ప్రధానమంత్రి నరేంద్రమోదీ మెట్రో రైల్‌ను ప్రారంభించనున్నారు.. మెట్రో రైల్లో కొద్దిసేపు ప్రయాణించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. అలాగే పోలీసులు, సెక్యూరిటీకి సంబంధించిన అధికారులు భధ్రతా చర్యలు చేపడుతున్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

17:33 - November 27, 2017

హైదరాబాద్ : మియాపూర్ మెట్రోరైలు ప్రారంభోత్సవ పనులను మంత్రి కేటీఆర్ పరిశీలించారు. మెట్రో పైలాన్, మెట్రో స్టేషన్‌తో పాటు.. ప్రధాని హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే హెలిప్యాడ్ ప్రాంతాలను సందర్శించారు. పైలాన్ నిర్మాణం, ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. 

17:32 - November 27, 2017

హైదరాబాద్ : మహిళలు ఆర్థిక సాధికారత సాధించాలనేది జీఈ సమ్మిట్‌ ముఖ్య ఉద్దేశమని నీతిఅయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ స్పష్టం చేశారు. జీఈ సమ్మిట్‌ హైదరాబాద్‌లో ఈ నెల 28 నుంచి 30 వరకు జరుగనుందని ఆయన తెలిపారు. అమెరికా, భారత్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సమ్మిట్‌లో ఇవాంకా ట్రంప్ పాల్గొంటున్నారని తెలిపారు. ఆవిష్కరణలు, ఉపాధి కల్పన, కఠిన సవాళ్లపై జీఈఎస్‌లో చర్చ జరుగుతుందన్నారు. 150కి పైగా దేశాల నుంచి 1500 మంది పారిశ్రామికవేత్తలు ఈ సదస్సుకు హాజరవుతారన్నారు. మహిళలు పారిశ్రామిక రంగంలో పురోగాభివృద్ధి సాధించేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. బేటీ బచావో-బేటీ పడావో పథకాలను కేంద్రం అమలు చేస్తోందని అమితాబ్‌ కాంత్‌ తెలిపారు. సమ్మిట్‌ విజయవంతమవుతుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ అన్నారు. 

17:32 - November 27, 2017

హైదరాబాద్ : మహిళలు ఆర్థిక సాధికారత సాధించాలనేది జీఈ సమ్మిట్‌ ముఖ్య ఉద్దేశమని నీతిఅయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ స్పష్టం చేశారు. జీఈ సమ్మిట్‌ హైదరాబాద్‌లో ఈ నెల 28 నుంచి 30 వరకు జరుగనుందని ఆయన తెలిపారు. అమెరికా, భారత్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సమ్మిట్‌లో ఇవాంకా ట్రంప్ పాల్గొంటున్నారని తెలిపారు. ఆవిష్కరణలు, ఉపాధి కల్పన, కఠిన సవాళ్లపై జీఈఎస్‌లో చర్చ జరుగుతుందన్నారు. 150కి పైగా దేశాల నుంచి 1500 మంది పారిశ్రామికవేత్తలు ఈ సదస్సుకు హాజరవుతారన్నారు. మహిళలు పారిశ్రామిక రంగంలో పురోగాభివృద్ధి సాధించేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. బేటీ బచావో-బేటీ పడావో పథకాలను కేంద్రం అమలు చేస్తోందని అమితాబ్‌ కాంత్‌ తెలిపారు. సమ్మిట్‌ విజయవంతమవుతుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ అన్నారు. 

17:05 - November 27, 2017

మొదటి నుంచి హంగు అర్బాటలు అంటే ఇద్దరికి నచ్చేవి కావని పెళ్లి కుమారుడు అవనీశ్ అన్నారు. మా నాన్నగారు కూడా అర్గన్ డోనర్ మరియు సైన్స్ టీచర్ దీంతో ఆయనను ఒప్పించడం సింపుల్ అయ్యిందని, దీనిపై వెంటనే నీలిమతో మాట్లాడాను అని అవనీశ్ తెలిపారు. రైతు కుటుంబాలకు రూ.10వేలు ఇవ్వడమనేది అవనీశ్ ఐడియా అని నీలిమ అన్నారు. అవనీశ్ తనకు ఇంటర్ నుంచి క్లాస్ మెంట్ అని, అప్పట్లో ఇద్దరికి పడకపోయేది కానీ తన వే ఆఫ్ టాకింగ్, బీహెవీయర్ చూసి తనను ఇష్టపడడం మొదలు పెట్టా అని తన కోసం తన గ్రేడ్ కూడా మార్చుకున్నాని నీలిమ అన్నారు. పూర్తి వివరాలకువ వీడియో క్లిక్ చేయండి. 

ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ : సీఎం

గుంటూరు : ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఇస్తామని, కుటుంబ వికాసంలో చెప్పామని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. దాని అనుగుణంగా రూ.474 కోట్ల వ్యయంతో 29 లక్షల వంటగ్యాస్ కనెక్షన్లు ఇస్తామని ఆయన తెలిపారు. 

హిజ్రాలకు రూ.1000 పెన్షన్

గుంటూరు : త్వరలో హిజ్రాలకు కూడా రూ.1000 పెన్షన్ ఇవ్వనున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. పెన్షన్లు, రేషన్ పంపిణీలో పోర్టబులిటీ తీసుకొచ్చామని ఆయన గుర్తు చేశారు. 

జనవరి 1నుంచి చంద్రన్న పెళ్లికానుక

గుంటూరు : జనవరి 1నుంచి చంద్రన్న పెళ్లి కానుక కింద పేదలకు ఆర్థిక సాయం చేస్తామని, పెళ్లికి ముందు 20శాతం, పెళ్లి తర్వాత 80 శాతం ఆర్థిక సాయం చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. అన్న అమృత పథకంపై 85 శాతం సంతృప్తి వ్యక్తం చేశారని ఆయన అన్నారు.

డ్వాక్రా ద్వారా ప్రతి కుటుంబానికి రూ. 10వేల ఆదాయం

గుంటూరు : డ్వాక్రా సంఘాల ద్వారా ప్రతి కుటుంబానికి రూ.10వేల ఆదాయం వచ్చేలా చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రకటించారు. చదువు, ఆరోగ్యం, పెళ్లిళ్ల వల్ల పేదల ఖర్చులు పెరుగుతున్నాయని, చంద్రన్న బీమా ద్వారా సహజ మరణమైనా రూ.2లక్షలు ఇస్తున్నాం అని ఆయన తెలిపారు.

ఫాతిమా విద్యార్థుల సమస్యపై మండలి తీర్మానం

గుంటూరు : కడప ఫాతిమా విద్యార్థుల సమస్యపై కేంద్రమే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని విజ్ఞప్తి చేస్తూ ఏపీ ప్రభుత్వం శాసనమండలిలో తీర్మానం చేసింది. 

ఆధార్ లింక్ పై స్టే నిరాకరించిన సుప్రీం

ఢిల్లీ : బ్యాంకు అకౌంట్, మొబైల్ నంబర్ కు ఆధార్ లింక్ పై చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు స్టేకు నిరాకరించింది. వచ్చే వారంలో మరోసారి వాదనలు వింటామని రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది.

16:15 - November 27, 2017

హైదరాబాద్ : తీన్మార్ ఫేమ్ బిత్తిరి సత్తిపై గుర్తుతెలియని దుండగుడు దాడి చేశాడు. ఆయన పనిచేసే చానల్ ముందు ఓ వ్యక్తి వచ్చి హెల్మిట్ తలపై దాడి చేశాడు. దాడిలో గాయపడ్డ సత్తిని దగ్గరలో ఉన్న స్టార్ ఆసుపత్రికి తరలించారు. తెలంగాణ భాషను అవమానపరుస్తారన్న కారణంతోనే ఆయనపై దాడి జరిగినట్టు తెలుస్తోంది. 

సీఎం హామీతో సంతృప్తి చెందని ఫాతిమా విద్యార్థులు

గుంటూరు : సీఎం హామీ పట్ల కడప ఫాతిమా విద్యార్థులు సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. దీక్ష విరమించాలా లేదా అనేది సాయంత్రం నిర్ణయం తీసుకుంటామని విద్యార్థులు తెలిపారు. సీఎం 3, 4ప్రత్యామ్నాయాలను సూచించారని వాటిపై చర్చించుకుని ఓ నిర్ణయానికి వస్తామని వారు అన్నారు.

15:54 - November 27, 2017

కడప : ప్రజాసమస్యల పరిష్కారం కోసమే రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తున్నామని కడప వైసీపీ ఎమ్మెల్యే అంజద్‌బాష అన్నారు. కడప సరోజీని నగర్‌లో రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్థానికుల నుంచి వినతులు స్వీకరించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతిగ్రామంలో గ్రామ సచివాలయం ఏర్పాటు చేసి ప్రజల సమస్యలు తీరుస్తామన్నారు. 

15:53 - November 27, 2017

కరీంనగర్ : జిల్లా దుర్శెడ్‌లో రాజు అనే బాలుడు బావిలో పడి మృతిచెందాడు. పెళ్లికి హాజరైన 8 మంది మైనర్లు రాత్రి బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తుండగా.. పోలీసులు పెట్రోలింగ్‌కు రావడంతో బయపడి పరుగులు తీశారు. ప్రమాదవశాత్తు రాజు అనే బాలుడు బావిలో పడి మృతిచెందాడు. బాలుడి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు. గ్రామంలో మైనర్లకు యథేచ్ఛగా మద్యం విక్రయిస్తున్నారంటున్న గ్రామస్తులు అంటున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

15:52 - November 27, 2017
15:51 - November 27, 2017

ఢిల్లీ : గుజరాత్‌ ఎన్నికల్లో బిజెపిని ఓడించాలని ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ పిలుపునిచ్చారు. తమ అభ్యర్థి ఉన్నా లేకున్నా...బిజెపికి మాత్రం ఓటు వేయొద్దని గుజరాత్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ స్థాపించి ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రస్తుతం దేశంలో సమస్యాత్మక పరిస్థితులు నెలకొన్నాయని కేజ్రీవాల్‌ అన్నారు. హిందూ ముస్లింలను విభజించడం ద్వారా దేశాన్ని చీల్చేందుకు బిజెపి కుట్ర పన్నుతోందని ఆయన విమర్శించారు. దేశాన్ని విభజించాలని చూస్తున్నవారిని పాకిస్తాన్‌ ఐఎస్‌ఐ ఏజెంట్లతో పోల్చారు. ఐఎస్‌ఐ 70 ఏళ్లలో చేయనిది...బిజెపి కేవలం మూడేళ్లలోనే చేసిందని విమర్శించారు. కాంగ్రెస్‌ తరహాలోనే బిజెపి కూడా కుంభకోణాలకు పాల్పడుతోందని కేజ్రీవాల్‌ ధ్వజమెత్తారు.

15:50 - November 27, 2017

ఆహ్మదబాద్ : గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. పాకిస్తాన్‌లో ఓ కోర్టు ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌ను విడుదల చేస్తే కాంగ్రెస్‌ పండగ చేసుకుంటోందని విమర్శించారు. సర్జికల్‌ స్ట్రయిక్స్‌పై కాంగ్రెస్‌కు విశ్వాసం లేదని.. చైనా రాయబారిని మాత్రం విశ్వసించిందని మోది ధ్వజమెత్తారు. 2008 ముంబై దాడులు, ఉరి దాడుల తర్వాత ఏ ప్రభుత్వం ఎలా స్పందించిందో చూస్తే కాంగ్రెస్‌ ఏంటో మీకు తెలిసిపోతుందని మోది అన్నారు. తనపై బురద జల్లినందుకు సంతోషమని, ఎందుకంటే కమలం బురదలోనే వికసిస్తుందని కాంగ్రెస్ విమర్శలను ప్రధాని తిప్పికొట్టారు. పదవి కోసం ఇక్కడ లేమని, భారత్‌ను అత్యున్నత శిఖరాలకు చేర్చడమే తన లక్ష్యమని మోదీ స్పష్టంచేశారు. గుజరాత్ తన ఆత్మగా.. భారత్‌ను పరమాత్మగా పేర్కొన్నారు.

భార్యపై అనుమానంతో కూతరిని చంపిన తండ్రి

ప్రకాశం : జిల్లా పెద్దావీడు మండలం పడమటిపల్లిలో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో భర్త ఘాతుకానికి ఒడిగట్టాడు. తండ్రి 2నెలల చిన్నారిని చంపి గోతిలో పాతిపెట్టాడు.

వివాహిత అనుమానాస్పద మృతి..

హైదరాబాద్ : నగరంలోని చెత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో వివాహిత దివ్య అనుమానాస్పదంగా మృతి చెందింది. దివ్య ఆత్మహత్య చేసుకుందని భర్త చెబుతున్నారు. దివ్య మృతిపై ఆమె తండ్రి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తమ కూతురిని భర్త, అత్త, మరుదులు కలిసి హత్య చేశారని ఆరోపిస్తున్నారు. 

15:12 - November 27, 2017

నాగ్ పూర్ : టెస్ట్‌లో భారత్‌ రికార్డుల మోత మోగించింది. శ్రీలంకపై కోహ్లీ సేన ఇన్నింగ్స్‌... 239 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇంకో రోజు మిగిలి ఉండగానే భారత్‌ ఈ ఘనత సాధించింది. ఇషాంత్‌, అశ్విన్‌, జడేజా చెలరేగి బౌలింగ్‌ చేయడంతో.. శ్రీలంక బ్యాట్స్‌మెన్లు తక్కువ స్కోర్‌కే కుప్పకూలిపోయారు. రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్‌ నాలుగు వికెట్లు తీసి.. టెస్టుల్లో 300 వికెట్ల క్లబ్‌లో చేరాడు. డెన్నిస్‌ లిల్లీ 36 ఏళ్ల రికార్డ్‌ను అశ్విన్‌ బద్దలుకొట్టాడు. లిల్లీ 56 టెస్టుల్లో 300 వికెట్లు తీయగా... అశ్విన్‌ 54 మ్యాచ్‌ల్లోనే 300 వికెట్లు తీసి.. ప్రపంచంలోనే ఫాస్టెస్‌ 300 వికెట్ల క్లబ్‌లో చేరాడు. 300 వికెట్లు తీసిన ఐదో భారత బౌలర్‌గా అశ్విన్‌ నిలిచాడు. నవంబర్‌ 2011లో టెస్ట్‌ కెరీర్‌ ఆరంభించిన అశ్విన్‌... ఆరేళ్లలోనే ఈ ఘనత సాధించడం విశేషం. అటు బ్యాటింగ్‌లోనూ అశ్విన్‌ తన సత్తా చాటాడు. ఇప్పటివరకు నాలుగు సెంచరీలతో... 2 వేలకు పైగా పరుగులు చేశాడు. 

15:11 - November 27, 2017

కామారెడ్డి : కోమలంచ గ్రామానికి చెందిన 18 దళిత కుటుంబాలు రెండు రోజులుగా తమ ఇల్లు వాకిలి వదిలి నిజాంసాగర్ తహసీల్దార్‌ కార్యాలయంలో వంటవార్పు చేపడుతున్నారు. వెంటనే తమకు ఎస్సీ కుల ధృవీకరణ పత్రాన్ని మంజూరు చేయాలని తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఇదేమీ తనకు పట్టదన్నట్లు ఇక్కడి ఎమ్మార్వో వ్యవహరిస్తున్నారని కోమలంచ గ్రామ దళితులు ఆరోపిస్తున్నారు. ఏళ్లు గడుస్తున్నా తమ సమస్యను పట్టించుకొనే నాథుడే కరువయ్యారని వీళ్లంతా కన్నీటి పర్యంతమవుతున్నారు. బతుకే భారంగా రోజులు వెళ్లదీస్తుంటే తమకు లేని మతాన్ని అంటించి బీసీ సీ సర్టిఫికెట్ ఇస్తున్నారంటున్నారు. రాత్రి వేళలో తమ ఇళ్లలోకి వచ్చి సోదాలు నిర్వహిస్తున్నారని మనోవేదనకు గురవుతున్నారు. ఎస్సీ సర్టిఫికెట్ లేక స్కాలర్‌షిప్ రాక తమ పిల్లలను చదివించుకోలేకపోతున్నామని వాపోయారు.

క్రిస్టియన్ మతం తీసుకోలేదని లెటర్
తమ 18 కుటుంబాలు క్రిస్టియన్ మతం స్వీకరించలేదని గ్రామ పంచాయితీ లెటర్ రాసి ఇచ్చిందని అంతేకాకుండా జాయింట్ కలెక్టర్‌కి కూడా వినతి పత్రం ఇచ్చామని చెప్పారు. వారు ఎస్సీ కుల ధృవీకరణ పత్రం ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారని.. అయినా ఫలితం లేకుండా పోయిందని కోమలంచ గ్రామ దళితులు వాపోయారు. వీరికి మద్దతుగా వచ్చిన జిల్లా దళిత సంఘాల నాయకులు.. బాధితులకు వెంటనే ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలను జారీ చేయాలంటూ ఎమ్మార్వో ఆఫీసు ముందు నినాదాలు చేశారు. ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేయకపోతే భారీ ఎత్తున ధర్నాలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. 

15:09 - November 27, 2017

హైదరాబాద్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గారాల పట్టి ఇవాంక ట్రంప్‌ తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ఫేమస్‌ అయ్యారు. ఈ నెల 28 నుంచి 3 రోజుల పాటు హైదరాబాద్‌ నగరంలో జరగనున్న జీఈఎస్‌ సమ్మిట్‌లో పాల్గొనేందుకు వస్తోంది. ఆమెకు సాదర ఆహ్వానం పలికేందుకు తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో చేస్తున్న హడావిడిపై.. తెలంగాణలోని కొందరు నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. దశాబ్ద కాలంగా కొన్ని ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు లేవు. తాము పడుతున్న కష్టాలను తీర్చండంటూ సామాన్యులు ఎన్ని వినతులు చేసినా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు విదేశీ అతిథుల కోసం చేస్తున్న హంగు ఆర్భాటాలను చూసి ఆశ్చర్యపోతున్నారు. నెల రోజుల్లోనే నగరాన్ని అద్దంలా మెరిసిపోయేలా తీర్చి దిద్దడంపై అవాక్కవుతున్నారు. మూడు రోజుల పాటు జరిగే సమ్మిట్‌కి మన తెలంగాణ ప్రభుత్వం ఉరుకులు, పరుగులు పెట్టి చేయిస్తున్న అభివృద్ధి పనులను చూసి ఔరా అనుకుంటున్నారు. ట్రంప్‌ కూతురు వస్తుందని హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కొత్తదనం చూసి.. ఏళ్ల తరబడి కాని పనులు ఇప్పుడు కావడంపై తెగ సంతోషపడుతున్నారు.

తమ ప్రాంతానికి రావాలని...
సమ్మిట్‌లో పాల్గొనేందుకు వస్తున్న ఇవాంక.. తమ ప్రాంతానికి రావాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఆమె వచ్చే ప్రాంతాల్లో దీర్ఘకాలిక సమస్యలు పటాపంచలు అవుతున్నాయని ఆశ పడుతున్నారు. వాట్సాఫ్‌, ఫేస్‌ బుక్‌, ట్విట్టర్ మిగిలిన సామాజిక అంతర్జాల మాద్యమాలను వేదికగా చేసుకొని, ఇవాంక పర్యటనపై ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు కామెంట్స్‌ పెడుతూ, తెగ సంతోషపడిపోతున్నారు. ఇలా ఒక్క నగరవాసులే కాకుండా రాష్ట్రం మొత్తం.. ఇవాంక మా ప్రాంతానికి రావమ్మా అంటూ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ఫారెన్‌ డెలిగేట్స్‌ కూడా ఇక్కడ ఏర్పాట్లను చూసి ఎంతో సంబరపడిపోతున్నారు. కొందరు కవితలతో ఆమెకు విభిన్నంగా స్వాగతం పలకడం నవ్వులను పూయిస్తున్నాయి. ఇవాంక పేరుతో నెట్టింటిలో జరుగుతున్న సంభాషణలపై నెటిజన్ల తీరుపై పాలక ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో చూడాలి. 

వివాహిత అనుమానాస్పద మృతి..

హైదరాబాద్ : నగరంలోని చెత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో వివాహిత దివ్య అనుమానాస్పదంగా మృతి చెందింది. దివ్య ఆత్మహత్య చేసుకుందని భర్త చెబుతున్నారు. దివ్య మృతిపై ఆమె తండ్రి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తమ కూతురిని భర్త, అత్త, మరుదులు కలిసి హత్య చేశారని ఆరోపిస్తున్నారు. 

15:08 - November 27, 2017

ఖమ్మం : కలెక్టరేట్‌ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మూడెకరాల భూమి, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు నిర్మాణం చేపట్టాలని.. శ్మశాన వాటికలకు స్థలం కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ.. కేవీపీఎస్‌ ఆధ్వర్యంలో దళితులు కలెక్టరేట్‌ను ముట్టడించారు. కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించగా... పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తోపులాట జరిగింది. కేవీపీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబాబుతో పాటు... పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

టెస్టుల్లో 300వికెట్ల క్లబ్ చేరిన అశ్విన్

నాగ్ పూర్ : స్పిన్నర్ అశ్విన్ మరో ఘనతను సాధించాడు. టెస్టుల్లో 300 వికెట్ల క్లబ్ లో చేరాడు. అతి తక్కువ మ్యాచ్ లలో 300 వికెట్లు తీసిన బౌలర్ అశ్విన్ రికార్డు సృష్టించాడు. అశ్విన్ కేవలం 54 మ్యాచ్ లలో 300 వికెట్లు సాధించాడు. 

14:10 - November 27, 2017

మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం ఖైదీ నెం.150 ఎంతగా విజయం సాధించిందో అదరికి తెలుసు. చిరు తాజాగా సైరా మూవీ చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో చారిత్రత్మక నిర్మిస్తున్న ఈ సినిమాకి రామ్ చరణ్ నిర్మాతగా వ్యవరిస్తున్నారు. అయితే ఈ చిత్రం నుంచి తను తప్పుకుంటున్నట్టు అస్కార్ అవార్డు గ్రహీత ప్రకటించారు. హైదరాబాద్ లో నిర్వహించిన లైవ్ మ్యూజిక్ షోకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. చిరు అంటే తనకు చాలా ఇష్టమని కేవలం బిజీ షెడ్యూల్ కారణంగానే ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన వివరణ ఇచ్చారు. రెహమాన్ స్థానంలో ఇంక ఎవరిని సంగీత దర్శకుడిగా చిత్ర యూనిట్ ప్రకటించలేదు. 

శ్రీలంక పై భారత్ ఇన్నింగ్స్ విజయం

నాగ్ పూర్ : శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 239 పరుగులతో ఘన విజయం సాధించింది. శ్రీలంక మొదటి ఇన్నింగ్స్ లో 205 పరుగులకు అలౌట్ కాగా, రెండవ ఇన్నింగ్స్ లో 166 పరుగులకు అలౌట్ అయింది. 

సీఎంతో ముగిసిన పాతిమా విద్యార్థుల భేటీ

గుంటూరు : ఏపీ సీఎం చంద్రబాబుతో కడప పాతిమా విద్యార్థుల భేటీ ముగిసింది. సీఎం గంట పాటు విద్యార్థులతో సీఎం సమావేశమయ్యారు. చంద్రబాబు ఒక్కో విద్యార్థితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇకపై విద్యార్థులతో నేరుగా మాట్లాడతానని సీఎం హామీ ఇచ్చారు. 

మంత్రి పర్యటనలో వివాదం

మహబూబ్ నగర్ : జిల్లా కోస్గి మండలం నాగసానిపల్లిలో మంత్రి జూపల్లి పర్యటన వివాదంగా మారింది. బీటీ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమానికి సర్పంచ్ ను ఆహ్వానించపోవడంపై కాంగ్రెస్ ఆందోళనకు దిగింది. 

13:18 - November 27, 2017

కోల్ కతా : టీమిండియా విజయపరంపర కొనసాగుతోంది. నాగ్ పూర్ టెస్టులో ఇన్నింగ్స్ 239 పరుగుల తేడాతో లంకపై గెలుపొందింది. మూడు టెస్టుల మ్యాచ్ సిరీస్ లో భాగంగా భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. భారత్ తన తొలి ఇన్నింగ్స్ ను 610/6 వద్ద డిక్లేర్డ్ చేసిన సంగతి తెలిసిందే. నాలుగో రోజు తొలి సెషన్ లో భారత్ ఆధిప్యత్యమే కనపడింది. బౌలర్ల ధాటికి లంక ఏ మాత్రం పుంజుకోలేకపోయింది. నాలుగో రోజు లంచ్ విరామ సమయానికి 8 వికెట్లు కోల్పోయి 145 పరుగులు మాత్రమే చేసింది. చివరకు 166 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అశ్విన్ -4, ఇషాంత్, జడేజాలు చెరో మూడు వికెట్లు తీశారు. టెస్టుల్లో 300 వికెట్ల క్లబ్ లో అశ్విన్ చేరాడు.
శ్రీలంక తొలి ఇన్నింగ్స్ : 205
భారత్ తొలి ఇన్నింగ్స్ : 610/6
శ్రీలంక రెండో ఇన్నింగ్స్ : 166 (ఆలౌట్), 

13:15 - November 27, 2017

కరీంనగర్ : మద్యం ఓ ప్రాణం తీసింది. మైనర్లకు మద్యం విక్రయించవద్దని ఆదేశాలున్నా మద్యం షాపు యజమానులు పట్టించుకోవడం లేదు. దుర్షెడ్ గ్రామంలో ఓ ఇంట వివాహం జరిగింది. ఈ వివాహంలో పాల్గొన్న కొంతమంది మైనర్లు ఆదివారం రాత్రి మద్యం షాపుకు వెళ్లారు. అక్కడ మద్యం తీసుకుని సమీపంలోని పొల్లాలో మద్యం సేవించడానికి వెళ్లారు. కానీ అదే సమయంలో బ్లూ కోర్టు పోలీసులు గస్తీ నిమిత్తం వస్తున్నారు. హారన్ వినపడగానే పోలీసులు వస్తున్నారని గ్రహించిన మైనర్లు తలో దిక్కుకు పరుగులు తీశారు. పరుగులు తీసిన వారిలో రాజు అనే పదో తరగతి విద్యార్థి కూడా ఉన్నాడు. కానీ రాత్రికి అతను చేరుకోలేదు. దీనితో కుటుంబసభ్యులు గాలించారు. చివరకు పొలంలోని వ్యవసాయ బావిలో రాజు పడిపోయాడని నిర్ధారించారు. సోమవారం ఉదయం అతని మృతదేహాన్ని పోలీసులు బయటకు తీశారు. మైనర్లకు మద్యం విక్రయించవద్దని స్పష్టమైన ఆదేశాలున్నా మద్య ఎలా విక్రయించారన్నది తెలియరావడం లేదు. 

12:22 - November 27, 2017

పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు పెద్దలు. కానీ కొంత మంది పెళ్లిని ప్రెస్టేజస్ ఇష్యూగా తీసుకుని అతిగా ఖర్చు పెడుతున్నారు. పెళ్లిపత్రిక నుంచి మొదలు పెడితే పెళ్లి పూర్తైయ్యేవరకు కోట్లలో ఖర్చు చేస్తున్నారు. కొంత మంది పెళ్లి కార్డుల్లో కానుకలు పెట్టి పంచుతున్నారు. మొన్న ఆ మధ్య జరిగిన గాలి జనార్ధన్ రెడ్డి కూతురు పెళ్లికి పెళ్లి కార్డులో విలువైన బహుమతులను పెట్టి బంధువులను ఆహ్వానించారు. ఇక మన రాష్ట్ర విషయానికొస్తే ఎన్టీవీ అధినేత కూతురు పెళ్లికి కార్డుల్లో బహుమతులు పంచారు. అయితే దీనిపై కొంత మంది ఉన్నవారు ఖర్చు పెడితే తప్పేంటి అని అంటున్నారు. కానీ కొంత మంది తహాతకు మించి ఖర్చు చేసి అప్పుల పాలవుతున్నారు.

30 శాతం వృథా...
పెళ్లి ఖర్చుల్లో 30 శాతం డబ్బు వృథా అవుతున్నట్టు ఓ నివేదిక పేర్కొంది. పెళ్లి విందుల్లో దాదాపు 10 నుంచి 30 రకాలు వంటలు చేయిస్తున్నారు. దీంట్లో చాలా వరకు వృథా అవుతుంది. కొంత మంది క్యాటరింగ్ వాళ్లకు వంట విషయాలు అప్పచెబుతున్నారు. క్యాటరింగ్ వారు ఒక్క ప్లేటుకు రూ.500 నుంచి రూ.7,500 వరకు ఉంటుంది. అంటే ఈ లెక్కన ఒక్క తిండికే రూ. 5లక్షల నుంచి 25 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు.

ఆధునిక టెక్నాలజీలతో పెళ్లివీడియోలు 
కొంత మంది పెళ్లిలను సినిమాల రెంజ్ లో వీడియో తీయించుకుంటున్నారు. అత్యధునిక కెమెరాలు, డ్రోన్ కెమెరాలు, జిమ్మి కెమెరాలు ఉపయోగిస్తూ వారి పెళ్లిని మరుపురాని అనుభూతిగా మల్చుకుంటున్నారు. పెళ్లి జరుగుతుండంగా లైవ్ వీడియోలను టివిలో ప్లే చేస్తున్నారు. కొన్ని పెళ్లిళు సినిమాకు ఏ రెంజ్ టెక్నాలజీని వాడుతామో అదే వాడుతున్నారు. కొంత మంది కొయోగ్రాఫర్లును తీసుకొచ్చి డ్యాన్స్ చేయిస్తున్నారు. సింగర్లను తీసుకొచ్చి పాటలు పాడిస్తున్నారు. వీటి కోసం లక్షల్లో ఖర్చు చేస్తున్నారు.

పెళ్లిలతో చాలా మందికి ఉపాధి...
పెళ్లిలతో చాలా మందికి ఉపాధి కల్గుతుంది. ఈవెంట్ అర్గనైజర్లు, బ్యాండ్, క్యాటరింగ్, మేకప్ చేసేవారికి, టైలరింగ్ వారికి పెళ్లిలతో ఉపాధి పొందుతారు. అయితే పెళ్లి ఖర్చులో చాలా వరకు వృథా కావడం ఇక్కడ బాధ కల్గించే విషయం. కొంత మంది తహతకు మించి ఖర్చు పెట్టి అప్పులపాలై ఆస్తులు అమ్ముకున్న ఘటనలు కూడా ఉన్నాయి. పెళ్లి అంటే భార్య, కలిసే కార్యక్రమం తప్ప మరొకటి కాదు. మనం ఎంత ఖర్చు పెట్టి పెళ్లి చేసిన వారి కాపురాలు బాగుంటాయా అంటే దానికి గ్యారంటీ ఇవ్వలేము. విదేశాల్లో చాలా మంది చాల సింపుల్ గా వివాహాలు చేసుకుంటారు. ఈ మధ్య మహారాష్ట్ర లో ఓ పెళ్లి కూతురు తన పెళ్లి చేసే ఖర్చును ఇళ్లు లేని పేదవారికి ఇళ్లు కంటిచాల్సిందిగా కోరింది. దీంతో ఆమె తండ్రి పేదలకు ఇళ్లు కట్టించారు. ''అతి ధనోద్భలిర్ బద్దో యతిమనో సుయేధనహా వినిష్టో రావణో లౌల్యత్ యతి సర్వత్ర వర్జేయత్'' ఏది చేసిన అతి చేయకుడదని దీని అర్థం ఇప్పటికైనా మన పెద్దలు మారి వివాహాల ఖర్చులు తగ్గించుకుంటారని ఆశింద్డాము...

 

12:09 - November 27, 2017

విజయవాడ : తమ సమస్యకు పరిష్కారం చూపించాలని ఫాతిమా కళాశాల విద్యార్థులు గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఫాతిమా కళాశాల చేసిన మోసంతో వంద మంది విద్యార్థుల భవితవ్యం ఆగమ్యగోచరంగా తయారైన సంగతి తెలిసిందే. దీనితో విద్యార్థులు..తల్లిదండ్రులు గత కొన్ని రోజులుగా ఆందోళన చేపడుతున్నారు. కానీ ప్రభుత్వం సరైన విధంగా స్పందించడం లేదని, ఆత్మహత్యలే శరణ్యమని భావించి ఆదివారం సెల్ టవర్ ఎక్కి ఆందోళన కొనసాగించిన సంగతి తెలిసిందే. అనంతరం ప్రభుత్వం స్పందించడంతో తమ ఆందోళనను విరమించారు. సోమవారం ఉదయం సీఎం చంద్రబాబు నాయుడితో విద్యార్థులు..తల్లిదండ్రులు భేటీ అయ్యారు. ఈ భేటీలో మంత్రి కామినేని శ్రీనివాసరావు కూడా పాల్గొన్నారు. సమస్యలపై చర్చిస్తున్నారు.

కానీ ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడితో పలుమార్లు ఫాతిమా విద్యార్థులు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఎన్నిసార్లు భేటీ అయినా సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. ఎంసీఐ తో ప్రభుత్వం సరిగ్గా మాట్లాడడం లేదని విద్యార్థులు పేర్కొంటున్నారు. మరి ఈ భేటీలో వారి సమస్యకు చెక్ పడుతుందా ? లేదా ? అనేది చూడాలి. 

ఏపీ అసెంబ్లీ రహదారిపై రోడ్డు ప్రమాదం

గుంటూరు : జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెం వద్ద అసెంబ్లీ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. తుళ్లూరు వైపు వేగంగా వెళ్తూ ఓ ఆటోను కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో ఉన్నవారి తీవ్ర గాయాలయ్యాయి. కారు ఉన్న వారు పరారైయ్యారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని విచారిస్తున్నారు. 

చంద్రబాబును కలసిన ఫాతిమా విద్యార్థులు

గుంటూరు : ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఫాతిమా వైద్య విద్యార్థులు కలిశారు. తమకు న్యాయం చేయాలని విద్యార్థులు ముఖ్యమంత్రిని కోరారు. 

కాసేపట్లో పెళ్లి...పెళ్లి కొడుకు అదృశ్యం...

జగిత్యాల : జిల్లా ఆత్మకూరులో పెళ్లికొడుకు అదృశ్యం కలకలం రేపింది. ఈ రోజు ఉదయం 11గంటలకు జరగాల్సిన పెళ్లి వరుడు నాగరాజు లేకపోవడంతో ఆగిపోయింది. నాగరాజు రెండు రోజుల క్రితమే ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. మెట్ పల్లి బస్టాండ్ లో నాగరాజు బైక్ లభ్యమైంది. దీంతో పెళ్లి కూతురు తరపు వారు ఆందోళన చెంది పీఎస్ ఫిర్యాదు చేశారు.

11:37 - November 27, 2017

ఎప్పుడైనా టెక్నాలజీ మనకు ఉపయోగపడేలే ఉండాలి తప్ప మనిషి చేటును చేసే విధంగా ఉండకూడదు. అయితే కొంత మంది టెక్నాలజీని మితిమీరి వాడి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఎవరి వద్ద చూసిన స్మార్ట్ ఫోన్ దర్శనం ఇస్తోంది. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు యువత ప్రపంచాన్ని మారిచిపోతున్నారు. కానీ దీని వల్ల వచ్చే అనార్థలను ఎవరు గుర్తించడంలేదు. కొంత మంది ఫోన్ ప్రక్కన లేకుంటే చాలా ఇబ్బందిగా ఫీలవుతారు. నిద్రపోతునప్పుడు కూడా ఫోన్ పక్కలో పెట్టుకుని పడుకుంటారు. ఇలా ఫోన్ ఎప్పుడు దగ్గర ఉంచుకోవడం వల్ల మెదడు ఏకాగ్రత దెబ్బతింటుందని, మెదడు పనితీరును ప్రభావితం చేస్తుందని తాజాగా శాస్రవేత్తల ఆధ్యయనంలో తేలింది. యూనివర్శిటీ ఆఫ్ టెక్సాన్ పరిశోధకులు కొంత మంది వలంటీర్లపై ప్రయోగత్మకంగా పరీక్షలు జరిపి ఈ విషయాన్ని నిర్ధారించారు. ఇకైనా ఫోన్ కాసేపు దూరంగా పెట్టి మనుషులతో మాట్లాడాండి..... 

11:27 - November 27, 2017

సంగారెడ్డి : పెళ్లి అంటే హంగు..ఆర్భాటాలు ఉంటాయి...అంతేకాదు వివాహ వేడుకకకు లక్షల..కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ఈ రోజుల్లో ఓ నవ యువ జంట అందరికీ ఆదర్శంగా నిలిచింది. మతాంతర వివాహమే కాదు...పెళ్లి వేడుకలోనే తమ అవయవ దానం చేశారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన బోడపల్లి అవనీష్, సంగారెడ్డి జిల్లాకు చెందిన కూనదొడ్డి నీలిమలు సామాజిక బాధ్యతతో ఎంతో భిన్నంగా వివాహం జరుపుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు సన్మానం..ఆర్థిక సహాయాన్ని అందించారు ఆ నవదంపతులు. 

11:21 - November 27, 2017

హైదరాబాద్ : నగరంలో కలకలం రేపిన భారీ చోరీలో పోలీసులు పురోగతి సాధించారు. రూ. 1.25 కోట్లను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించిన సంగతి తెలిసిందే. బషీర్ బాగ్ లోని స్కైలేన్ అపార్ట్ మెంట్ వద్ద ఈ దోపిడి జరిగింది. నగలు కొనుగోలు చేసేందుకు మైసూర్ నుండి హైదరాబాద్ నగరానికి వ్యాపారులు వచ్చారు. వీరివద్ద దుండగులు నగదును అపహరించారు. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న నారాయణగూడ పోలీసులు 24గంటల్లోనే చేధించారు. మొత్తం ఐదుగురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద రూ. 1.26 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన సూత్రధారి బేకరీ నిర్వాహకుడు, సెక్యూర్టీ గార్డు అని పోలీసులు అనుమానిస్తున్నారు. 

 

11:21 - November 27, 2017

దిల్ రాజు 14 ఏళ్ల కింద నితిన్ తో తీసిన చిత్రం దిల్. దిల్ చిత్రంతో ఆయన పేరే మారిపోయింది. దిల్ సినిమాకు ముందు దిల్ రాజు పేరు వెంకటరమణ దిల్ సినిమా తర్వాత ఆయన పేరు దిల్ రాజు గా మారింది. మూవీ పేరే తన పేరుగా మారిపోయిందంటే ఆ సినిమా ఎంత బ్లాక్ బస్టరో చెప్పనక్కర్లేదు. మరి దాదాపు దశాబ్దన్నర తర్వాత వీరి కలయికలో మరో చిత్రం వస్తోంది. చిత్రం పేరు శ్రీనివాస కల్యాణం ఫిక్స్ చేశారు. ఈ చిత్రానికి శతమానం భవతి ఫేమ్ సతీష్ వెగ్నేశ్న దర్శకత్వం వహిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ గా మిక్కీ జె మేయర్ వ్యవహిరించనున్నారు. ఈ చిత్ర రెగ్యూలర్ షూటింగ్ వచ్చే సంవత్సరం మార్చి నుంచి మొదలై ఆగస్టు పూర్తి కానున్నట్టు తెలుస్తోంది. మిగతా నటినటుల వివరాలను త్వరలో విడుదల చేస్తామని తెలిపారు. ఈ చిత్రాన్ని శ్రావణమాసంలో విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. నితిన్ ప్రస్తుతం పవన్ కల్యాణ్ నిర్మిస్తున్న చిత్రంలో చేస్తున్నారు. చూద్దాం 14 ఏళ్ల తర్వాత చరిత్ర రీపిట్ అవుతుందో.....!  

బషీర్ బాగ్ దోపిడీ కేసును చేధించిన పోలీసులు

హైదరాబాద్ : బషీబాగ్ స్కైలైన్ అపార్ట్ మెంట్ వద్ద జరిగిన డోపిడీ కేసును నారాయణగూడ పోలీసులు చేధించారు. 2 రోజుల్లోనే పోలీసులు కేసును చేధించడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మొత్తం ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 1.26 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. దుండగులు బంగారం కొనుగోలుకు మైసూరు నుంచి హైదరాబాద్ వచ్చారు.

10:50 - November 27, 2017

విజయవాడ : వైసీపీ పార్టీలో తన ఆత్మాభిమానం దెబ్బతిన్నదని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ పేర్కొన్నారు. కొద్దిసేపటి క్రితం టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో టిడిపిలో చేరారు. దీనితో పాడేరు నియోజకవర్గంలో వైసీపీ గట్టి షాక్ తగిలినట్లైంది. ఏజెన్సీలో వందల కోట్ల రూపాయలు అభివృద్ధికి ముగ్ధురాలై..అభివృద్ధికి సహకరించాలని..సీఎం చంద్రబాబు నాయుడు పరిపాలనకు ఆకర్షితులై గిడ్డి ఈశ్వరీ టిడిపిలో చేరారని టిడిపి జిల్లా నేత తెలిపారు. జిల్లా అభివృద్ధి చెందుతూ..పాడేరు కొంత వెనుకబాటుతనానికి గురి కావడంతో పార్టీలో చేరేందుకు ఆమె నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు.

జగన్ గుర్తించలేదన్న గిడ్డి ఈశ్వరీ...
వైసీపీ పార్టీలో తన ఆత్మాభిమానం దెబ్బతిన్నదని..పార్టీ కోసం..గిరిజనుల కోసం..పార్టీ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేయడం జరిగిందని టిడిపిలో చేరిన అనంతరం గిడ్డి ఈశ్వరీ పేర్కొన్నారు. కానీ ప్రతిపక్ష నాయకుడు జగన్ గుర్తించలేని పరిస్థితిలో ఉన్నారని, విశాఖ జిల్లాలో హుదూద్ తుఫాన్ అనంతరం ఎంతో అభివృద్ధి చెందుతోందన్నారు. ఆత్మాభిమానం దెబ్బతినడం...తమ గిరిజన ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలనే కాంక్షతో తాను టిడిపిలో చేరినట్లు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో బాబు నడిపిస్తున్నారని కొనియాడారు.

అభివృద్ధికి సహకరించాలన్న బాబు..
పాడేరు నియోజకవర్గంలోని ఇతర పార్టీలో ఉన్న నేతలు టిడిపిలో చేరుతున్నారని టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. పాడేరు వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ టిడిపిలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన జరిగిన అనంతరం రాజకీయాలు ముఖ్యం కాదని..రాజకీయాలు చేసినా అభివృద్ధికి తోడ్పడాలని సూచించడం జరిగిందని, ఇందుకు చాలా మంది స్పందిస్తున్నారని పేర్కొన్నారు. పీలేరు నియోజకవర్గం నుండి మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి కుమారుడు..కిరణ్ కుమార్ రెడ్డి కుమారుడు టిడిపిలో చేరారని గుర్తు చేశారు. 

టిడిపిలో గిడ్డి ఈశ్వరీ..

విజయవాడ : వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ టిడిపి పార్టీలో చేరారు. సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆమె టిడిపి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆమెతో పాటు పలువురు నేతలు..కార్యకర్తలు పచ్చకండువాలు కప్పుకున్నారు. 

ఏపీ అసెంబ్లీ ప్రారంభం..

విజయవాడ : ఏపీ అసెంబ్లీ సమావేశాలు సెలవుల అనంతరం సోమవారం తిరిగి ప్రారంభమయ్యాయి. సమావేశం ప్రారంభం కాగానే స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. 

10:10 - November 27, 2017

విజయవాడ : వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పార్టీ కండువాను వదులుతున్నారు. పచ్చకండువా కప్పుకోవడానికి ఉత్సాహ పడుతున్నారు. తమ పార్టీకి చెందిన వారికి ప్రలోభాలు పెట్టి ఫిరాయింపులను టిడిపి ప్రోత్సాహిస్తోందని వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. ఇప్పటికే వైసీపీకి చెందిన 21 మంది ఎమ్మెల్యే పచ్చకండువాలు కప్పుకున్న సంగతి తెలిసిందే. తాజాగా విశాఖపట్టణం పాడేరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. ఈశ్వరీతో పాటు నాయకులు..కార్యకర్తలు టిడిపిలో చేరనున్నారు. గత కొంతకాలంగా పార్టీతో గిడ్డి ఈశ్వరీకి విభేదాలున్నట్లు తెలుస్తోంది. ఆమె చేరికతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోవద్దనే ఉద్ధేశ్యంతో పాడేరు నియోజకవర్గానికి చెందిన టిడిపి సీనియర్ నేతలతో పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు చర్చించినట్లు తెలుస్తోంది. వైసీపీకి చెందిన నేతలు టిడిపిలో చేరిన అనంతరం టిడిపి సీనియర్ నాయకులు..కార్యకర్తలకు..మంత్రులకు ఎలాంటి సమస్యలు రావని చెబుతున్నట్లు సమాచారం. ఇంకా ఎంతమంది టిడిపి తీర్థం పుచ్చుకోనున్నారో ..దీనిపై వైసీపీ ఎలాంటి స్పందన వ్యక్తం చేస్తుందో చూడాలి. 

కాసేపట్లో టిడిపిలోకి గిడ్డి ఈశ్వరీ..

విజయవాడ : వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ టిడిపి పార్టీలో చేరనున్నారు. ఆమెతో పాటు పలువురు నేతలు..కార్యకర్తలు పచ్చకండువాలు కప్పుకోనున్నారు. 

09:12 - November 27, 2017

గుంటూరు : నాదెండ్ల మండలం గణపవరంలో స్వాతి కాటన్ ప్రైవేటు లిమిటెడ్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ కంపెనీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు చెందినదిగా తెలుస్తోంది. తెల్లవారుజామున సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటలను అదుపుచేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. మంత్రి పుల్లారావుకు సంబంధించిన కంపెనీగా చెబుతున్నారు. ప్రమాదానికి గల కారణాలను యాజమాన్యం చెప్పలేకపోతోంది. సుమారు రూ. 3కోట్ల మేర నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. కానీ నష్టం అధికంగా ఉంటుందని తెలుస్తోంది. 

స్వాతి కాటన్ కంపెనీలో ఫైర్ ఆక్సిడెంట్...

గుంటూరు : నాదెండ్ల మండలం గణపవరంలో స్వాతి కాటన్ ప్రైవేటు లిమిటెడ్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ కంపెనీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు చెందినదిగా తెలుస్తోంది. 

08:22 - November 27, 2017

నెల్లూరు : శబరిమలైకి వెళ్లి వస్తున్న వారి వాహనం ప్రమాదానికి గురైంది. ఈఘటనలో ఇద్దరు భక్తులు మృతి చెందారు. కృష్ణా జిల్లా పేలప్రోలకు చెందిన కొంతమంది టాటా ఎస్ వాహనంలో శబరిమలైకి వెళ్లి తిరిగి వస్తున్నారు. సోమవారం ఉదయం మంచు దట్టంగా అలుముకుంది. తడ (మం) పన్నంగాడు ఎదురుగా ఆగి ఉన్న లారీని టాటా ఎస్ వాహనం ఢీకొంది. దీనితో ఇద్దరు అక్కడికక్కడనే మృతి చెందగా మరో ఏడుగురికి గాయాలయ్యాయి. మృతులు పేలప్రోలుకు చెందిన రాహుల్, రామాంజనేయులుగా గుర్తించారు. గాయాలైన వారిని తమిళనాడు రాష్ట్రంలోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 

07:56 - November 27, 2017

రిజ్వేషన్ల కోసం ఢిల్లీలో సీఎం కేసీఆర్ చేపట్టే ధర్నాకు డీఎంకే మద్దతు ప్రకటించింది. రిజర్వేషన్లు అనేవి రాష్ట్రాలు నిర్ణయించుకోవాలి...కేంద్రం జోక్యం..ఇతర రాష్ట్రాల పోలిక అంశాన్ని స్టాలిన్ లేవనెత్తుతున్నారు...మరోవైపు వైసీపీ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లోకి వెళ్లిపోతున్నారు. ఆ పార్టీకి చెందిన గిడ్డి ఈశ్వరీ టిడిపి కండువా కప్పుకోనున్నారు. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో కొండా రాఘవరెడ్డి (వైసీపీ), చంద్రశేఖరరెడ్డి (టీఆర్ఎస్), దినకరన్ (టిడిపి), తెలకపల్లి రవి (విశ్లేషకులు) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

 

గుజరాత్ కు మోడీ..

హైదరాబాద్ : గుజరాత్‌లో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మంగళవారం నుండి మూడు రోజుల పాటు మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. 

పన్నంగాడులో రోడ్డు ప్రమాదం..

నెల్లూరు : తడ (మం) పన్నంగాడు వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని జీపు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా ఏడుగురికి గాయాలయ్యాయి. మృతులు పేలప్రోలుకు చెందిన రాహుల్, రామాంజనేయులుగా గుర్తించారు. 

లంక 21/1...పట్టుబిగిస్తోన్న భారత్..

నాగపూర్‌ :  టెస్ట్‌లో భారత్‌ పట్టుబిగిస్తోంది. మూడోరోజు కోహ్లీసేనదే పైచేయిగా నిలిచింది. కోహ్లీ డబుల్‌ సెంచరీ, రోహిత్‌ సెంచరీలతో చెలరేగడంలో భారత్‌ భారీ స్కోర్‌ చేసింది. 610 పరుగుల వద్ద భారత్‌ డిక్లేర్‌ చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన లంక 21 పరుగులకే ఒక వికెట్‌ కోల్పోయింది.

07:07 - November 27, 2017

కుడిదగా, ఎడమదగా.. ఎటుచూసినా దగా దగా... ప్రస్తుతం ఇలాగే ఉంది రైతు పరిస్థితి. రైతు పండించినపుడు గిట్టుబాటు ధర రాని ఉల్లిపాయ, టమాట, పచ్చిమిర్చి ధరలు ఇపుడు విపరీతంగా పెరిగాయి. ఒక వైపు రైతు ఆత్మహత్యల మీద దేశ వ్యాప్తంగా ఉద్యమాలు నడుస్తున్నవేళ.. దగాపడుతున్న రైతుపై చర్చ తనపరిధిని పెంచుకుంది. ఈ విషయంపై టెన్ టివి జనపథంలో తెలంగాణ రైతుసంఘం ప్రధాన కర్యాదర్శి సాగర్‌ విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

07:05 - November 27, 2017

నాగ్ పూర్ : టెస్ట్‌లో భారత్‌ పట్టుబిగిస్తోంది. మూడోరోజు కోహ్లీసేనదే పైచేయిగా నిలిచింది. కోహ్లీ డబుల్‌ సెంచరీ, రోహిత్‌ సెంచరీలతో చెలరేగడంలో భారత్‌ భారీ స్కోర్‌ చేసింది. 610 పరుగుల వద్ద భారత్‌ డిక్లేర్‌ చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన లంక 21 పరుగులకే ఒక వికెట్‌ కోల్పోయింది. మూడో రోజూ ఆట ముగిసేసమయానికి రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక వికెట్‌ నష్టానికి 21 పరుగులు చేసింది. దీంతో లంక ఇంకా 384 పరుగులు వెనకబడి ఉంది. కరుణరత్నె, తిరుమానె క్రీజులో ఉన్నారు. మురళీ విజయ్‌, పుజారా, రోహిత్‌ సెంచరీలు చేస్తే.. కోహ్లీ డబుల్‌ సెంచరీతో విరుచుకుపడ్డాడు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు రెండు వికెట్లకు 312 పరుగులతో పుజారా, కోహ్లీ మూడో రోజు ఆటను ఆరంభించారు. ఉదయం సెషన్‌లో పుజారా నెమ్మదిగా ఆడినప్పటికీ.. విరాట్‌ మాత్రం దూకుడు కొనసాగించాడు. లంక బౌలర్లను చీల్చి చెండాడి.. 130 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. తన విశ్వరూపం ముందు లంక బౌలర్లు నిలవలేకపోయారు.

పుజారా ఔటైన తర్వాత వచ్చిన రహానె ఎంతో సేపు నిలవలేదు. అనంతరం క్రీజులోకి వచ్చిన రోహిత్‌ శర్మతో కలిసిన విరాట్‌ స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. వేగంగా ఆడుతూ చూడచక్కని షాట్లతో టెస్టు కెరీర్‌లో ఐదో డబుల్‌సెంచరీ నమోదు చేశాడు. కోహ్లీ 267 బంతుల్లో 213 పరుగులు చేసి భారీ స్కోరుకు బాటలు వేశాడు.

దిల్రువాన్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి కోహ్లీ వెనుదిరిగాడు. స్వల్ప వ్యవధిలోనే రోహిత్‌ శతకం పూర్తి చేసుకోవడంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ను 610 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన లంకకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. సమరవిక్రమను ఇషాంత్‌ శర్మ డకౌట్‌గా పెవీలియన్‌ పంపాడు. బౌలర్లు చెరరేగితే భారత్‌ విజయం తథ్యంగా మారనుంది.

07:03 - November 27, 2017

హైదరాబాద్ : బషీర్‌బాగ్ ఫ్లై ఓవర్ సమీపంలోని స్కైలెన్స్ అపార్ట్‌మెంట్‌ వద్ద భారీ చోరీ జరిగింది. మైసూరుకు చెందిన ఓ జ్యుయలరీ వ్యాపారి బంగారం కొనుగోలు చేసేందుకు తన దగ్గర పనిచేసే సిబ్బందిని ఈనెల 24న హైదరాబాద్‌కు పంపించాడు. యజమానికి ఇచ్చిన కోటి 25 లక్షల రూపాయలతో హైదరాబాద్‌ చేరుకున్న వారు.. వ్యాపారి బంధువుకు చెందిన బషీర్‌బాగ్‌లోని స్కై లెన్స్ అపార్ట్‌మెంట్‌లో రాత్రి బస చేశారు. మర్నాడు వ్యాపారి బంగారం ధరలు ఎక్కువగా ఉండటంతో తిరిగి వచ్చేయమని ఫోన్ చేశాడు. వారు తిరుగు ప్రయాణమై అపార్ట్‌మెంట్ కిందకు రాగానే వారికి ఎదురైన ఇద్దరు క్యాష్‌ బ్యాగ్‌ను ఎత్తుకువెళ్లినట్లు సిబ్బంది చెబుతున్నారు. హుటాహుటీన హైదరాబాద్‌కు చేరుకున్న వ్యాపారి నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ముగ్గురు బస చేసిన అపార్ట్‌మెంట్‌లో సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో ఈ చోరీ వ్యవహారం పోలీసులకు చిక్కుముడిగా మారింది.

ఒంగోలులో...
ఒంగోలులో భారీ చోరీ జరిగింది. కర్నూలు రోడ్డులోని అజంతా హోటల్‌ వద్ద ఆపివున్న కారు నుంచి రెండు కిలోల బంగారంతోపాటు, రెండు లక్షల నగదును దుండగులు అపహరించారు. నెల్లూరులో బంగారం వ్యాపారం చేస్తున్న రాహుల్‌ జైన్‌ వ్యాపార పనుల కోసం కారులో ఒంగోలు వచ్చాడు. భోజనం చేసేందుకు డ్రైవర్‌తో కలిసి హోటల్‌కు వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి కారులోని బంగారం, క్యాష్‌బ్యాగ్‌ కనిపించపోవడంతో ఆందోళనకు గురైన రాహుల్‌ జైన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న వన్‌ టౌన్‌ పోలీసులు కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

06:57 - November 27, 2017

హైదరాబాద్ : కొలువుల కోసం కోట్లాటకు టీజాక్ రెడీ అవుతోంది. పోలీసుల అనుమతి నిరాకరణతో వాయిదా పడుతూ వస్తున్న సభను నిర్వహించాలన్న పట్టుదలతో ఉంది. కోర్టు సూచనలతో సభకోసం టీజాక్‌ ఉత్సహాంగా ఏర్పాట్లు చేస్తోంది. డిసెంబర్ నాలుగో తేదీన నిరుద్యోగులతో సభను నిర్వహించాలని జేఏసీ నేతలు భావిస్తున్నారు. కొలువల కొట్లాట పెరుతో భారీ సభను నిర్వహించేందుకు టీజాక్ ప్రయత్నిస్తూనే ఉంది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో మొదటి సారి పోలీసులు అనుమతి నిరాకరించారు. రెండో సారి కూడా ప్రభుత్వ పరంగా ప్రతిష్టాత్మకంగా పలు కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో అనుమతి దక్కడం జాక్ కు ఇబ్బంది గా మారింది. తమ సభకు అనుమతి ఇవ్వాలని కోర్టు కెక్కడంతో ఇప్పుడు కొలువుల కొట్లాల సభ వ్యవహారం కోర్టు న్యాయస్థానంలో ఉంది. తెలంగాణా వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ పలు డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచేందుకు టీజాక్ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా ఆరు డిమాండ్లతో సభను నిర్వహించాలని జేఏసీ నేతలు నిర్ణయించినట్టు తెలుస్తోంది.

తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల నియామకంపై ఏర్పడుతున్న ప్రతిష్టంభనను తొలగించి ఉద్యోగాల భర్తీ కోసం క్యాలెండర్ విడుదల చేయాలని, ఖాళీగా ఉన్న ఉద్యోగాల వివరాలను ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేస్తోంది. దాదాపు రెండు లక్షల ఉద్యోగాల ఖాళీ ఉన్నాయని టీజాక్ నేతలు అంటున్నారు.

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీతో పాటు ప్రైవేటు రంగంలోకూడా తెలంగాణా స్థానికులకు రిజర్వేషన్లను అమలు చేయాలని టీజాక్‌ డిమాండ్‌ చేస్తోంది. దాంతోపాటు భూ నిర్వసితుల సమస్యలపై పెద్ద ఎత్తున ఉద్యమించాలని నిర్ణయించారు. డిసెంబర్‌ 4న సభ నిర్వహణకు కోర్టు అనుమతిస్తే.. కేసీఆర్‌ సర్కార్‌ ప్రజావ్యతిరేక విధానాలపై వ్యతిరేక పోరును మరింత ఉధృతం చేస్తామని కోదండరాంమ్‌ అండ్‌ టీమ్‌ స్పష్టం చేస్తున్నారు. 

06:54 - November 27, 2017

హైదరాబాద్ : దేశీయ మద్యం సేవించి బోరుకోట్టిందా.. లోకల్ బ్రాండ్ అంటేనే వెగటుగా ఉందా.. అయితే నగరంలో మద్యం ప్రియులకు ఇది శుభావార్తే .. చేతిలో సోమ్ములుంటే చాలు ఏ స్టార్ హోటల్‌కైనా వెళ్లి ..సీమసరుకును చప్పరించే ఛాన్స్‌ తెలంగాణ ఎక్సైజ్‌శాఖ కల్పించింది. నగరంలో జరగనున్న జీ.ఈ.యస్ సదస్సు నేపథ్యంలో .. అతిథులకోసం స్టార్ హోటల్స్ ఫారన్‌ బ్రాండ్స్‌ను రెడీ చేశాయి. ఇన్నాళ్లు పారన్ బ్రాండ్స్ మద్యం సేవించాలంటే.. ఎన్నో షరతులు, నిబంధనలు. సిటీలో ఎక్కడైనా ధనికుల ఇళ్లలో ఏదైనా పార్టీలు జరిగితే..ఎందో తీర్థం పుట్టుకున్నట్లు..ఒకటి, రెండు పెగ్గులతో సరిపుచ్చుకోవడం మద్యం ప్రియులకు అలవాటే. వేల రూపాయాలు చెల్లిస్తే తప్పా చేతికి రానీ విదేశీ మద్యం జీ.ఈ.యస్ సదస్సు పుణ్యమాఅని పెద్ద ఎత్తున నగరానికి దిగుమతి అవుతోంది.

హైదారాబాద్ లో మూడు రోజుల పాటు జరిగే పారిశ్రామిక వేత్తల గ్లోబల్ సమ్మిట్ నేపథ్యంలో నగరంలోని స్టార్‌ హోటళ్లలో విదేశీ మద్యం బాటిళ్లు మెరిసిపోతున్నాయి. సమ్మిట్‌లో పాల్గొనే అతిధులను ఆకర్షించేందు.. నగరంలో స్టార్ హోటల్స్ మద్యం బాటిళ్లతో సిద్ధం అయ్యాయి. హైటెక్స్ పరిసరాల్లోని వివిధ స్టార్ హోటల్స్ బస ఏర్పాటు చేశారు.. హైటెక్ సిటీ పరిసరాల్లోనే పదుల సంఖ్యలో ఉన్న స్టార్ హోటల్స్ లోని వివిద దేశాల నుంచి వచ్చే పారిశ్రామిక వేత్తలకు కావాల్సిన ఏర్పాట్లు ఇప్పటికే ప్రభుత్వం పెద్దఎత్తున చేసింది. ముఖ్యంగా విదేశీయులు ఎక్కువగా ఇష్టపడే విదేశీ బ్రాండ్లను సేల్స్‌లో పెట్టేందుకు ఇప్పటికే స్టార్‌హోటల్స్‌ తెలంగాణ ఎక్సైజ్ శాఖ కు దరఖాస్తు పెట్టుకున్నాయి. ఎక్సైజ్ శాఖ తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని 16 సార్ట్ హోటల్స్ కు ఎలాంటి లిక్కర్ అయినా విక్రయించేందుకు అనుమతి పొందాయి. దీంతో స్టార్‌ హోటళ్లలో ఈ వారం రోజులు ఫారిన్‌ సరుకును చప్పరించొచ్చని మందుబాబులు ఉత్సాహపడుతున్నారు.

28 నుంచి30 వతేది వరకుజరగనున్న గ్లోబల్ సమ్మిట్ ను ద్రుష్టిలో పెట్టుకుని, ఒక్కో స్టార్ హోటల్ ఇంతకు ముందు కంటే 10నుంచి 15 శాతం మేరకు అదనపు ఇండెంట్లతో మద్యాన్ని స్టోర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గత రెండు నెలలో 31,34,877 కేసుల మద్యంలో.. విదేశీ బ్రాండ్లే ఎక్కువగా సేల్స్‌ అయినట్టు తెలుస్తోంది. ఇది రానున్న రోజుల్లో మరింత ఎక్కువగా కానున్నట్లు ఎక్సైజ్‌ శాఖ అంచనా వేస్తోంది. మొత్తానికి.. నగరంలో విదేశీ సరుకును భారీగా దించడం మద్యంప్రియులను ఊరిస్తోంది. అయితే స్టార్‌హోటళ్లో తప్పితే ఎక్కడా విదేశీ మద్యం అమ్మకాలకు అనుమతి లేకపోవడంతో కొంత అసంతృప్తిగా ఉందని సాధారణ మందుబాబులు నిట్టూరుస్తున్నారు. 

06:52 - November 27, 2017

హైదరాబాద్ : శ్రమ మాది సంబరాలు మీవా..? మాకు దక్కాల్సిన కిరటాన్ని మీరెలా పెట్టుకుంటారు..? పరుగులు పెట్టడానికి మెట్రోరైలు రెడీ అవుతున్న తరుణంలో కేసీఆర్‌ ప్రభుత్వ తీరుపై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ కస్సుబుస్సులాడుతోంది. కనీసం ప్రారంభోత్సవానికి కూడా పిలవరా..? అని హస్తంపార్టీ నేతలు మండిపడుతున్నారు. భాగ్యనగరంలో మెట్రోపరుగులు మొదలువుతుంటే.. ప్రతిపక్షకాంగ్రెస్‌ విమర్శల దాడి పెంచింది. కాంగ్రెస్‌ ప్రభుత్వమే మెట్రో ప్రాజెక్టును తీసుచ్చి నిర్మాణాన్ని ప్రారంభిస్తే.. అంతా తమ గొప్పే అని టీఆర్‌ఎస్‌ పాలకులు చెప్పుకోవడాన్ని హస్తంపార్టీ నేతలు తప్పపడుతున్నారు. కిరీటం దక్కాల్సింది మాకు..మీరెలా పెట్టుకుంటారని హస్తంపార్టీ నేతలు కస్సుబుస్సులాడుతున్నారు.

హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ అసత్య ప్రచారం చేస్తున్నారని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. మెట్రో రైలు మంజూరు చేసింది కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్న వాస్తవాన్ని టీఆర్‌ఎస్‌ పాలకులు విస్మరించారని, అసలు నిర్మాణం కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమైన విషయాన్ని ఉత్తమ్‌ గుర్తు చేశారు. మెట్రో రైలు ప్రాజెక్టుపై కాంగ్రెస్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు.

వాస్తవానికి మెట్రో రైలుకు సంబంధించి టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది శూన్యమని, సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ అంతా తామే చేసినట్టు గొప్పలు చెప్పుకుంటున్నారని టీపీసీసీ చీఫ్‌ ఎద్దేవా చేశారు. 2014 డిసెంబర్‌ నాటికే మైట్రోరైలు ప్రజలకు అందుబాటులోకి రావాల్సి ఉన్నా.. కేసీఆర్‌ ప్రభుత్వ తప్పుడు విధానల వల్ల ప్రాజెక్టు ఆలస్యమైందని ఉత్తమ్‌ ఆరోపించారు. అసలు పాతబస్తీలో మెట్రో రైల్‌కు అడ్డుపడింది ఎవరో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే గవర్నర్‌ ప్రసంగంలో అలైన్‌మెంట్ మార్పును ప్రస్తావించారన్నారు. అప్పుడు మెట్రోకు అడ్డుపడిన వాళ్లే ఇప్పుడు అంతా తమ గొప్పతనమే అన్నట్టు చెప్పుకుంటున్నారని ఉత్తమ్‌ విమర్శించారు. మెట్రోరైలు టీఆర్‌ఎస్‌పార్టీ, కేసీఆర్‌ ఇంటిప్రాజెక్టుకాదని, ఇది ప్రజల ప్రాజెక్టు అంటున్న కాంగ్రెస్‌నేతలు.. ఇంతటి ప్రతిష్టాత్మక మెట్రోరైలు ప్రారంభోత్సవానికి ప్రధాన ప్రతిపక్షాన్ని పిలవకపోవడం దారుణం అంటున్నారు. ముఖ్యమంత్రి కేసీర్‌ అహంకారానికి ఇది నిదర్శనం అంటున్నారు. మొత్తానికి మెట్రోపరుగులు మొదలవనున్న తరుణంలో కాంగ్రెస్‌పార్టీ విమర్శలు ఆసక్తికరంగా మారాయి. 

06:49 - November 27, 2017

హైదరాబాద్ : మెట్రోరైలు ఎక్కకముందే గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మెట్రోరైలు స్పీడ్‌తో పోటీపడుతున్న టికెట్ల ధరలు సామాన్యులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. మిగతా రాష్ట్రాల మెట్రోరైలు ఛార్జీలతో పోల్చితే... హైదరాబాద్‌ మెట్రో రేట్లు వామ్మో అనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా మెట్రోరైలు ఛార్జీలతో పోల్చితే హైదరాబాద్‌ మెట్రో రేట్లు భారీగానే ఉన్నాయి. దేశరాజధానిలో 5 కిలోమీటర్లు ప్రయాణానికి 15 రూపాయలు కాగా.. హైదరాబాద్‌ మెట్రోలో 25 రూపాయలుగా ఉంది. టికెట్‌పై 10 రూపాయలు అదనంగా వడ్డీస్తున్నారు. ఢిల్లీ మెట్రోలో 12 కిలోమీటర్ల ప్రయాణానికి 20 ఉండగా.. హైదరాబాద్‌లో 40గా ఉంది. అదే 21 కిలోమీటర్లకు 30 కాగా.. హైదరాబాద్‌లో 50గా ఉంది. బెంగళూరుతో పోల్చుకున్నా హైదరాబాద్‌ మెట్రోరేట్ల వడ్డణ ఎక్కువగానే ఉంది. బెంగళూరులో 42 కిలోమీటర్ల దూరంలో మెట్రో సర్వీసులు నడుపుతోంది. ప్రయాణానికి కనిష్టంగా 10, గరిష్టంగా 48 మాత్రమే.

హైదరాబాద్‌ మెట్రోలో 10 కిలోమీటర్ల దూరానికి 35, ఢిల్లీలో 20, బెంగళూరులో 22, చెన్నైలో 40, కొచ్చిలో 30గా టికెట్ల ధరలు ఉన్నాయి. ఢిల్లీలో రద్దీ వేళల్లో మాత్రం నిర్ణీత రుసుముకన్నా 10 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు. ఢిల్లీ మెట్రోలో ఇటీవల భారీగా రేట్లు పెంచడంతో సుమారు 3 లక్షల మందికిపైగా ప్రయాణికులు తగ్గినట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీలో పెరిగిన రేట్ల కంటే కూడా హైదరాబాద్‌ మెట్రోలో కొన్నిస్లాబుల్లో రేట్లు ఎక్కువగానే ఉన్నాయి. మెట్రో ప్రయాణం ధనిక వర్గాలకు మాత్రమే కాకుండా సామాన్య, మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ఉండేలా ఉంటే బాగుంటుందంటున్నారు హైదరాబాదీలు.

06:47 - November 27, 2017

హైదరాబాద్ : గ్లోబల్‌ సమ్మిట్‌ ఏర్పాట్లను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా చేస్తోంది. హైటెక్స్‌ ప్రాంతంలో రోడ్లన్నీ వర్ణరంజింతం అయ్యాయి. పెయింటింగ్స్‌, లైటింగ్స్‌తో కలర్‌ఫుల్‌గా కనిపిస్తున్నాయి. హైటెక్‌ సిటీ అందాలను చూస్తూ జనం ఎంజాయ్‌ చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

06:43 - November 27, 2017

హైదరాబాద్ : మంగళవారం జరగనున్న గ్లోబల్ సమ్మిట్‌కు తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. సమిట్ జరుగుతున్న HICCతో పాటు ఫలక్‌నుమా ప్యాలెస్, గోల్కొండ పోర్టులో హై సెక్యూరిటీతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు పోలీసులు. ఇప్పటికే ఈ మూడు ప్రాంతాలు యూఎస్‌ సీక్రెట్ సెక్యూరిటీ ఏజెన్సీ నిఘా నీడలో ఉండగా.. 10 వేల 400 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈనెల 28 నుండి మూడురోజులపాటు హైదరాబాద్‌లో జరగనున్న గ్లోబల్ సమ్మిట్‌ నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం ఛాలెంజ్‌గా తీసుకుంది. 180 దేశాలకు పైగా విదేశీ ప్రతినిధులు హాజరవుతున్న ఈ సదస్సులో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి భద్రతా ఏర్పాట్లు చేపట్టింది.

మూడు రోజుల వ్యాపార భాగస్వామ్య సదస్సుకి తెలంగాణ పోలీసు శాఖ 10 వేల 400 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేసింది. ఇందులో 7వేల 500 మంది సివిల్, ట్రాఫిక్ పోలీసులు కాగా, 60 ప్లాటూన్ల కేంద్ర బలగాలు, 4 యూనిట్ల గ్రే హౌండ్స్, 2 యూనిట్ల ఆక్టోపస్, 700 మంది CSW పోలీసులతో పాటు 50 డాగ్ స్క్వాడ్ టీంలు ఉన్నాయి. ఇక ప్రధాని మోదీ, ట్రంప్ కుమార్తె ఇవాంక టూర్ ఫైనల్ ఐన రోజు నుండి అన్ని అనుమానాస్పద ప్రాంతాలను జల్లెడ పట్టిన పోలీసులు కీలక ప్రాంతాల్లో సెక్యూరిటీని పెంచారు. ఇందుకోసం ప్రత్యేకంగా 11 మంది IPS అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించారు. 

మంగళవారం తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న ఇవాంక ట్రంప్ కదలికలను అత్యంత గోప్యంగా ఉంచనున్నారు. అక్కడి నుంచి HICCకి చేరుకునే వివరాలు కూడా రహస్యంగా ఉంచారు. దీంతో పాటు ప్రధాని మోదీ పర్యటన ఖరారు కావడంతో బేగంపేట్ ఎయిర్ పోర్టు పరిసర ప్రాంతాల్లో హై సెక్యూరిటీ ఏర్పాట్లు చేసారు పోలీసులు. ఇప్పటికే ఎయిర్ పోర్ట్ ను తమ ఆధీనంలోకి తీసుకున్న పీఎం స్పెషల్ ప్రొటెక్షన్ గార్డ్స్.... ప్రధాని విమానం ల్యాండ్ అయ్యే ప్లేస్‌తో పాటు హెలిక్యాప్టర్ టేక్ ఆఫ్ అయ్యే రన్ వే లను పరిశీలించారు. షెడ్యూల్ ప్రకారం 1.10 నిమిషాలకు మోదీ బేగంపేట్ ఎయిర్ పోర్ట్ చేరుకున్న తరువాత అక్కడ 15నిమిషాల పాటు పార్టీ శ్రేణులతో భేటి అవుతారు. అనంతరం ప్రత్యేక హెలీకాప్టర్‌లో మియాపూర్ చేరుకుని అక్కడ మెట్రో రైల్ ను ప్రారంభిస్తారు. 

ఓ వైపు ప్రధాని మరోవైపు ఇవాంక టూర్‌లతో సామాన్యులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా పోలీసు ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫలక్‌నుమా ప్యాలెస్, శంషాబాద్ ఎయిర్‌పోర్టు, పీవీ ఎక్స్‌ప్రెస్ హైవే, ORR రూట్లను ఎంచుకున్నారు. ఐతే ఈ గ్లోబల్ సమ్మిట్ షెడ్యూల్ విడుదలైన రోజు నుండి సెక్యూరిటి ఆరెంజ్‌మెంట్స్‌తో కంటిమీద కునుకు లేకుండా ఉన్న పోలీస్ శాఖ ప్రజలు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తోంది. 

06:41 - November 27, 2017

విజయవాడ : విశాఖ జిల్లా పాడేరు వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఇవాళ చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈశ్వరితోపాటు పాడేరు నియోజవర్గానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు తెలుగుదేశంలో చేరనున్నారు. తనకు తెలియకుండా పాడేరు వైసీపీ ఇన్‌చార్జ్‌ని మార్చడంపై ఎమ్మెల్యే ఈశ్వరి పార్టీ అధిష్ఠానంపై అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఈశ్వరిని బుజ్జగించేందుకు ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తదితరులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. జగన్‌ వైఖరితో విసిగిపోయి టీడీపీలో చేరుతున్నట్టు ఈశ్వరి తెలిపారు.

06:38 - November 27, 2017

కర్నూలు : ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా చంద్రబాబు నెరవేర్చలేదని వైసీపీ అధినేత జగన్‌ మండిపడ్డారు. 18వ రోజు ప్రజా సంకల్ప యాత్ర కర్నూలు జిల్లాలో కొనసాగింది. 2019 ఎన్నికలకు అభ్యర్థుల ప్రకటనకు జగన్‌ శ్రీకారం చుట్టారు. కర్నూలు జిల్లా పత్తికొండ అసెంబ్లీ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా చెరుకులపాడు శ్రీదేవి పేరును ప్రకటించారు. అదే విధంగా కర్నూలు, అనంతపురం లోక్‌సభ స్థానాల్లో ఒక సీటును బోయలకు కేటాయిస్తానని జగన్‌ హామీ ఇచ్చారు. పత్తికొండ నియోజకవర్గంలోని రామకృష్ణాపురం నుంచి ప్రారంభమైన పాదయాత్ర ఎర్రగుడి, కృష్ణగిరి మీదుగాసాగి, కోడుమూరు అసెంబ్లీ స్థానంలోని గోరంట్లలో ప్రవేశించింది. యాత్ర సాగినంత దూరం గ్రామ గ్రామాన పార్టీ జెండాలు ఆవిష్కరించారు. వివిధ వర్గాల ప్రజలతో భేటీ అయ్యారు. వారి వారి సమస్యలు తెలుసుకుని, పార్టీ అధికారంలోకి వస్తే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఎర్రగుడిలో ఉల్లి రైతులు జగన్‌కు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ముస్లింతో కలిసి ప్రార్థనలు చేసిన జగన్‌... మార్గమధ్యలో గొర్రెలకాపర్లతో సమావేశమయ్యారు. అధికారంలోకి వచ్చిన తర్వాత గొర్రెపిల్లలకు బీమా సౌకర్యం కల్పిస్తామని జగన్‌ హామీ ఇచ్చారు.

కృష్ణగిరిలో జరిగిన సభలో పత్తికొండ అసెంబ్లీ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా చెరుకులపాడు శ్రీదేవి పేరును ప్రకటించారు. ఈ సీటు నుంచి ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి కేఈ కష్ణమూర్తి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014లో డోన్‌ స్థానానికి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిని అభ్యర్థిని ముందుగా ప్రకటించిన జగన్‌.. ఇప్పుడు పత్తికొండ స్థానానికి అభ్యర్థిగా శ్రీదేవి పేరును వెల్లడించారు. అప్పుడు, ఇప్పుడు కూడా కేవీ కృష్ణమూర్తి ప్రాతినిధ్యం వహించిన స్థానానికే తొలి అభ్యర్థిని ప్రకటించారు. ఎన్నికలకు ఏడాదిన్న ముందుగానే వైసీపీ మొదటి అభ్యర్థిని ప్రకటించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. కోడుమూరు నియోజకవర్గంలోని గోరంట్లలో జరిగిన సభలో బోయలను ఎస్టీల్లో చేరుస్తామని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని చంద్రబాబు విస్మరించారని జగన్‌ విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కర్నూలు లేదా అనంతపురం అసెంబ్లీ స్థానాల్లో ఏదో ఒకసీటును బోయలకు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. సోమవారం కోడుమూరు నియోజకవర్గంలోని వెంకటగిరి నుంచి 19వ రోజుల పాదయాత్ర ప్రారంభమవుతుంది.

06:34 - November 27, 2017

విజయవాడ : టెక్నాలజీ ద్వారా ప్రజలతో మమేకమయ్యేందుకు ఏపీ ప్రభుత్వం రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ముఖ్యమంత్రి నేరుగా క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న అధికారులు, రైతులు, విద్యార్థులతో మాట్లాడే అవకాశం RTGS ద్వారా సాధ్యమవుతుంది. ఈ కేంద్రంలో ఆసియాలోనే అతిపెద్ద 80 అడుగుల వీడియో వాల్‌ ఏర్పాటు చేశారు. అమరావతి సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో రిలయ్‌ టైమ్‌ గవర్నెన్స్ కమాండ్‌ కంట్రోల్‌ రూము ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిని లాంచనంగా ప్రారంభించారు. అనంతరం రైతులు, పోలీసులు, ప్రభుత్వ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు.

ఆర్‌టీజీఎస్‌ ద్వారా క్షేత్ర స్థాయిలో అమలవుతున్న పథకాలను నేరుగా పరిశీలించొచ్చు. రేషన్‌ షాపులను తనిఖీ చేసే అవకాశం ఉంది. వర్చువల్‌ క్లాస్‌ రూముగా ఉపయోగపడుతుంది. అధికారులు ఏ ప్రాంతంలో ఉన్నా ఫోన్‌లో మాట్లాడే అవకాశం అందుబాటులోకి వచ్చింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఆర్‌టీజీఎస్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూముతో అనుసంధానం చేస్తారు. ప్రభుత్వం ఐదు వేల కెమెరాలు ఏర్పాటు చేశారు. త్వరలో మరో 15 వేల కెమెరాలతో ఆర్‌టీజీఎస్‌ను విస్తరిస్తారు. ఆ తర్వాత మరో ఐదు వేల కెమెరాలు జోడిస్తారు. తుపాన్లు సంభవించి, వరదలు వచ్చినప్పడు జరిగిన నష్టాన్ని నేరుగా పరిశీలించి, నష్టాన్ని అంచనావేయడంతోపాటు ప్రజలకు కల్పించాలని పునరావాసంపై తక్షణం ఆదేశాలు ఇవ్వొచ్చు. అవసరమైతే ఆయా ప్రాంతాల్లో డ్రోన్ల సాయంతో తాజా పరిస్థితిని తిలకిస్తూ ఆదేశాలిచ్చే వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ రూములో బెల్జియం నుంచి తెప్పించిన 80 అడుగుల వీడియో వాల్‌ ఏర్పాటు చేశారు. ఇది ఆసియాలోనే అతిపెద్ద వీడియో కాన్ఫరెన్సింగ్‌ విధానం. నేరాలను అరికట్టడంలో కూడా ఆర్‌టీజీఎస్‌ కీలకంగా మారుతుంది. త్వరలో గ్రామ పంచాయతీలను కూడా ఆర్‌టీజీఎస్‌ కమాండ్‌ కంట్రోల్‌తో అనుసంధానం చేయాలని నిర్ణయించారు.

రూ. 1.26 కోట్ల నగదు అపహరణ...

హైదరాబాద్ : బషీర్ బాగ్ స్కైలైన్ అపార్ట్ మెంట్ వద్ద భారీ దోపిడి జరిగింది. ముగ్గురు వ్యాపారులను బెదిరించి రూ. 1.26 కోట్ల నగదును అపహరించారు. సాంకేత్, స్వప్నిల్, సంగప్పపై దాడి చేసి నగదును అపహరించారు. 

ఎయిర్ పోర్టుకు పారిశ్రామిక వేత్తలు..

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్టుకు పారిశ్రామిక వేత్తలు చేరుకున్నారు. అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సులో 1500 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. 

బాబుతో భేటీ కానున్న ఫాతిమా కళాశాల స్టూడెంట్స్..

విజయవాడ :నేడు గుణదలలో సీఎం చంద్రబాబుతో ఫాతిమా వైద్య కళాశాల విద్యార్థులు భేటీ కానున్నారు. 

టిడిపిలోకి గిడ్డి ఈశ్వరీ...

విజయవాడ : నేడు ఉదయం 10గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో వైసీపీ పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ టిడిపి తీర్థం పుచ్చుకోనున్నారు. 

Don't Miss