Activities calendar

28 November 2017

21:58 - November 28, 2017
21:55 - November 28, 2017

హైదరాబాద్ : ఇవాంక ట్రంప్‌ హైదరాబాద్‌లో బిజీ బిజీగా గడిపారు. హైదరాబాద్‌ చేరుకున్న ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఘనంగా స్వాగతం పలికారు. మధ్యాహ్నం ప్రపంచ వ్యాపారవేత్తల సదస్సులో పాల్గొన్న ఇవాంక...ఆకట్టుకునే స్పీచ్‌తో అదరగొట్టారు. పురుషాధిక్య సమాజంలో రాణించాలంటే మహిళలు మరింత కష్టపడాలని తెలుసుకున్నట్లు చెప్పారు. 

జీఈ సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్‌ చేరుకున్న ఇవాంక ట్రంప్‌..తొలిరోజు బిజీ బిజీగా గడిపారు. ప్రత్యేక విమానంలో తెల్లవారుజామున శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఇవాంకకు అమెరికా రాయబారి కెన్నత్ జుస్టర్ ఘన స్వాగతం పలికారు. ప్రభుత్వం తరుపున పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ఆమెకు స్వాగతం పలికారు. 

ఎయిర్‌పోర్టు నుంచి కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రత్యేక వాహనంలో మాదాపూర్‌లోని ట్రైడెంట్‌ హోటల్‌కు చేరుకున్నారు. ఇవాంక ట్రైడెంట్ హోటల్ నుంచి మధ్యాహ్నం మూడు గంటలకు హెచ్ఐసీసీకి చేరుకున్నారు. ఆ తర్వాత హెచ్ఐసీసీలోని రెండో అంతస్తులో కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌తో భేటీ  అయ్యారు. అనంతరం ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసారు. తర్వాత ప్రధాని మోదీతో కలిసి ప్రపంచ వ్యాపార సదస్సులో పాల్గొన్నారు. భారత్‌లో పారిశ్రామిక వేత్తలు సరికొత్త విప్లవం సృష్టిస్తున్నారని కొనియాడారు. ఆసియాలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్‌గా టి-హబ్‌ తయారైందన్నారు. జీఈ సదస్సులో 52శాతం మహిళలు పాల్గొనడం తనకు గర్వకారణంగా ఉందన్నారు. పురుషాధిక్య సమాజంలో రాణించాలంటే మహిళలు మరింత కష్టపడాలని తెలుసుకున్నట్లు చెప్పారు ఇవాంక.

అనంతరం జీఈ సదస్సు ప్యానెల్‌ సెషన్‌కు హాజరైన ఇవాంక పారిశ్రామికవేత్తలతో చర్చించారు. మనలో ఉన్న ఆలోచనలు, నైపుణ్యాలు కొత్త అవకాశాలను సృష్టిస్తాయని ఇవాంక అన్నారు. అవకాశాలను అందిపుచ్చుకుంటే ఏ స్థాయికైనా ఎదగొచ్చన్నారు. హెచ్‌ఐసీసీ నుంచి ఫలక్ నుమా ప్యాలెస్‌కు ప్రధాని మోదీ ఇచ్చే డిన్నర్‌కు ఇవాంక వెళ్లారు.  బుధవారం ఉదయం ఇవాంక హెచ్ఐసీసీ సదస్సులో పాల్గొంటారు. 

21:53 - November 28, 2017

హైదరాబాద్ : ప్రపంచ పారిశ్రామికవేత్తలు భారత్‌లో పెట్టుబడులుపెట్టి, దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు ఇచ్చారు. పెట్టుబడులకు భారత్‌ గమ్యస్థానమని, మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ఇండియాలో పెట్టుబడులు సురక్షితమని హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో చెప్పారు. 

హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో  ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరుగుతున్న ఈ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూతురు సలహాదారు ఇవాంక ట్రంప్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

ముందుగా హెచ్‌ఐసీసీలో ఏర్పాటు చేసిన అంకుర సంస్థల ఎగ్జిబిషన్‌ను సీఎం కేసీఆర్‌ , మంత్రి కేటీఆర్‌తో కలిసి  మోదీ, ఇవాంక తిలకించారు. ఆయా సంస్థల ప్రతినిధులో మాట్లాడారు. మైక్రో అంబులెన్స్‌ మొబైల్‌ క్లీనిక్‌, త్రీడీ ప్రింటర్‌ ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎగ్జిబిషన్‌లో ఉంచిన మిత్ర రోబోను మోదీ, ఇవాంక ఆసక్తిగా పరిశీలించారు.  ప్రపంచం నలుమూలల నుంచి 150 దేశాలకు చెందిన 1500 మంది ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. అమెరికా నుంచి వచ్చిన 350 మంది పారిశ్రామికవేత్తల బృందానికి ఇవాంక నేతృత్వం వహిస్తున్నారు.  

జీఎస్‌టీ అమలుతో భారత్‌లో విప్లవాత్మక ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైన విషయాన్నిజీఈ సమ్మిట్‌లో ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఇన్సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్రప్సీ పాలసీ తీసుకొచ్చిన తర్వాత రుణాల ఎగవేత తగ్గిన అంశాన్ని పారిశ్రామికవేత్తల దృష్టికి తెచ్చారు. నల్లధనం నియంత్రణలోకి వచ్చిందని,  రేటింగ్‌ ఏజెన్సీలు భారత్‌కు మంచి ర్యాంకింగ్‌ ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇన్ని అనుకూలతలు ఉన్న భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని మోదీ కోరారు. 

ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్‌ ప్రగతిపథంలో దూసుకుపోతోందని ఇవాంకా ట్రంప్‌  ప్రశంసించారు. టెక్నాలజీ, మెడిసిన్‌, అంతరిక్ష పరిశోధనల వంటి రంగాల్లో భారత్‌  స్ఫూర్తిగా నిలుస్తున్నదని చెప్పారు. 

పెట్టుబడులకు తెలంగాణ స్వర్గదామమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సులో కేసీఆర్‌ స్వాగతోపన్యాసం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పారిశ్రామిక విధానం టీఎస్ ఐపాస్ ద్వారా 15 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతి లభిస్తోందన్నారు. గత మూడేళ్లలో 5,469 ఇండస్ట్రియల్ యూనిట్లకు అనుమతి ఇచ్చామన్నారు.

విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌, రక్షణ శాఖ మంత్రి నిర్మాలా సీతారామన్‌, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌తోపాటు హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి,  అపోలో  ఫౌండేషన్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ ఉపాసన, సినీనటి, వ్యాపారవేత్త మంచు లక్ష్మీ, జీఎంఆర్‌ గ్రూపు అధిపతి గ్రంధి మల్లికార్జునరావు తదితరులు  ప్రపంచ పారిశ్రామివేత్తల సదస్సు ప్రారంభోత్సవానికి హాజరయ్యారు.

హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు ప్రారంభం 

21:50 - November 28, 2017

అమ్మ పుట్టిల్లు మేనమామకి తెలీదా అన్నట్టు... ఈ ఇంటర్నెట్ యుగంలో పైపై డెకరేషన్లతో అసలు రంగు దాగుతుందా? నగరాన్ని నివాసయోగ్యంగా మార్చటం, సుందరంగా మలచటం అనేది ఓ నిరంతర ప్రక్రియ. అది రాత్రికి రాత్రో, ఓ వారం రోజుల్లోనో చేసేది కాదు. దానికి చిత్తశుద్ధి ఉండాలి. ప్రజల పట్ల గౌరవం ఉండాలి. కానీ, అతిధుల ముందు గొప్పలుపోయే ప్రభుత్వాలకు సామాన్యుడి సంగతి పట్టదని మరోసారి రుజువయింది. వారం రోజుల్లో ప్రజల సొమ్మును కోట్లు ఖర్చుపెట్టిన తీరు అనేక ప్రశ్నలకు కారణమౌతోంది. ఇదే ఈ రోజు వైడాంగిల్ స్టోరీ.. అసలిది భాగ్యనగరమేనా? మన గతుకుల రోడ్లేమయ్యాయి..అడుగడుగునా కనిపించాల్సిన చెత్తకుప్పలెక్కడ? అడుగడుగునా కనిపించే బిచ్చగాళ్లెక్కడ? నగరానికి బ్రాండ్ అంబాసిడర్ లాంటి డ్రైనేజీ వాసనలెక్కడ? పూలవనాలు, దీపాలంకరణలు, ఆహ్లాదభరిత పరిమళాలు ఆహా..ఇది భాగ్యనగరమేనా? మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

21:44 - November 28, 2017

హైద్రావాదుకు మెట్రో రైలొచ్చుడు మా పుణ్యమే, అడ్డగొలుగా హామీలిస్తున్న జగనాలు, ఎక్కింది సైకిల్.. తిప్పేదే ఫ్యాను, నగర మేయర్ కు అవమానం, బెయిల్ మీద బయటకొచ్చిన గాడ్ధులు.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

21:26 - November 28, 2017

విశాఖ : అప్పుడే పరచుకుంటున్న తొలికిరణాలు.. తెలిమంచు మేలిముసుగులో తూరుపు వేదిక తళతళలు .. కువకువల ప్రభాతగీతం.. చలితెమ్మెరల గిలిగింతలు.. ఆకాశాన్నితాకే కొండలపై జర్రున జారే రైలుబండి.. వేడివేడిగా కాఫీ చప్పరిస్తూ  మనసైనవారితో అలాఅలా తిరిగొస్తే..! అలా విహరించే అవకాశం మరోసారి కల్పిస్తోంది ఏపీ టూరిజంశాఖ. విశాఖ అరకు అందాలను తిలకించేందుకు అద్దాల రైలుబండి  మళ్లీ రెడీ అయింది. విశాఖ జిల్లా అరకు అందాలను అద్దాల రైలుబండిలో తిలకించడానికి మళ్లీ అవకావశం కల్పిస్తోంది ఏపీ టూరిజం శాఖ. మంచుకురిసేవేళలో పూలవనాలను చూస్తూ మనసైనవారితో విహరించరమ్మంటోంది అరకులోయలో నేచర్‌నెచ్చెలి. 

అరకును సందర్శించడానికి ఇటీవల కురిసిన వర్షాలు కొద్దిరోజులు బ్రేక్‌వేశాయి. కొత్తవలస కిరండోల్‌ మధ్య కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడ్డంతో పర్యాటకులను ఎంతగానో అలరించే అద్దాలరైలు పరుగులకు బ్రేకులు పడ్డాయి. అయితే.. శీతాకాలం, మంచుకురుస్తున్న రోజుల్లో అరకు ప్రాంతానికి సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని .. పర్యాటకుల కోరికమేరకు అద్దాల కోచ్‌ను తాత్కాలికంగా నడపడానికి టూరిజం అధికారులు ఏర్పాట్లు చేశారు. అద్దాలరైలు ప్రతిరోజు ఉదయం 6గంటల 50నిముషాలకు విశాఖ రైల్వేస్టేషన్‌ నుంచి  బయలుదేరుతుంది. పదిగంటలకు చిమిడిపల్లి, పదిన్నరకు టైడారైల్వేస్టేషన్‌కు చేరుతుంది. ఇక అక్కడ నుంచి పర్యాటకులు బస్సులో బొర్రాగుహలకు చేరుకుంటారు. మధ్యాహ్నం 12గంటలకల్లా అరకు చేరుకుంటారని టూరిజం అధికారులు తెలిపారు. అక్కడ  గిరిజన ఆహార రుచులను ఆస్వాదించేలా ఏర్పాట్లు ఉంటాయంటున్నారు. ఆతర్వాత ఆసక్తి ఉంటే  హాట్‌ఎయిర్‌ బెలూన్‌లో కూడా విహరించే ఛాన్స్‌ ఉంది. 

అరకు చేరుకున్న టూరిస్టులు గిరిజన మ్యూజియం, అనంతగిరి కాఫీతోటలు, గాలికొండ వ్యూపాయింట్‌ నుంచి ప్రకృతి అందాలను తిలకిస్తారు. కొండవాగుల్లో చేపపిల్లల్లా చిందులేస్తారు. తర్వాత సాయంత్రం 5.30కు అనంతగిరికి  చేరుకుంటారు. పర్యటన ముగించుకుని రాత్రి 8గంటలకల్లా పర్యాటకులను విశాఖకు చేరుస్తారు. ఇలా 3,200లకే  టూర్‌ప్యాకేజి అందిస్తున్నట్టు టూరిజం అధికారులు చెబుతున్నారు. చలికాలం.. గిలిగింతల కాలం.. పువ్వులు, నవ్వులు వికసించేకాలం.. అందుకే నన్ను ఓసారి చూసిపొమ్మంటోంది  నేచర్‌నెచ్చెలి. అద్దాలరైలులో విహరించండి అంటూ ఆహ్వానిస్తోంది ఏపీ టూరిజంశాఖ  సో  గెట్‌రెడీ టూ  అరకు టూర్‌.. 

21:18 - November 28, 2017

కృష్ణా : సాగునీటి కోసం కృష్ణా జిల్లా... నందిగామ రైతులు ఆందోళనకు దిగారు. కోనాయపాలెం నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌ కాలువ వద్ద ఆందోళన చేపట్టారు. సాగర్‌ కాలువ ద్వారా నీరు రాకపోవడంతో  మిర్చి పసుపు సుబాబుల్‌ తోటలు ఎండిపోతున్నాయని  రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీటిని అందించి పంటలను కాపాడాలని రైతులు డిమాండ్‌ చేశారు. రైతుల ఆందోళనతో నందిగామ, చందర్లపాడు మండలాలకు  రాకపోకలు నిలిచిపోయాయి. ఈ మేరకు పోలీసులు రైతులతో చర్చలు జరుపుతున్నారు. 

 

21:10 - November 28, 2017

ఢిల్లీ : 26/11 ముంబయి దాడుల ప్రధాన సూత్రధారి, మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌.. ఉగ్రవాదుల జాబితా నుంచి తన పేరును తొలగించాలని కోరుతూ ఐక్యరాజ్యసమితిలో పిటిషన్‌ వేశాడు. జమాత్‌ ఉద్‌ దవా వ్యవస్థాపకుడైన హఫీజ్‌ తన సంస్థ తరపున పిటిషన్‌ దాఖలు చేశాడు. లాహోర్‌కు చెందిన ఓ న్యాయసంస్థ చేత పిటిషన్‌ వేయించాడు. 2008 డిసెంబర్‌లో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం 1267 ద్వారా సయీద్‌ను ప్రకటిత ఉగ్రవాది జాబితాలో చేర్చారు. ముంబై దాడుల ఘటన తర్వాత అతని పేరు ఉగ్రవాద టెర్రరిస్టుల లిస్టులో చేరింది. 297 రోజుల గృహనిర్బంధం అనంతరం పాకిస్థాన్‌ ప్రభుత్వం ఇటీవల హఫీజ్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. హఫీజ్‌ విడుదలను భారత్‌, అమెరికాలు వ్యతిరేకించాయి. సయీద్‌ విడుదలను పాక్‌ సమర్థించుకుంది. హఫీజ్‌ సయీద్‌ తలపై అమెరికా కోటి డాలర్ల బహుమానం ప్రకటించింది.

 

21:06 - November 28, 2017

హైదరాబాద్ : రాత్రి 8 గంటలకు ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరిగే విందుకు ప్రధాని మోదీ, ఇవాంకా ట్రంప్‌, పారిశ్రామిక వేత్తలు హాజరుకానున్నారు. ఇందులో ట్రీ ఆఫ్‌ లైఫ్‌ పేరుతో భారతీయ కళలు, దుస్తుల ప్రదర్శన నిర్వహిస్తారు. 8:30కి భారత చారిత్రక వారసత్వంపై లైవ్‌ షో ఉంటుంది. రాత్రి 10:25కు ప్రధాని మోదీ తిరిగి ఢిల్లీకి వెళ్లిపోతారు. 

20:53 - November 28, 2017

విశాఖపట్నం : జిల్లాలోని పెందుర్తి మండలం..వేపగుంట చీమలపల్లిలోని ఓ టింబర్‌ డిపోలో అగ్ని ప్రమాదం సంభవించింది.  తెల్లవారుజాము సమయంలో షార్ట్‌ సర్క్యూట్‌ అయి పదియా టింబర్‌ డిపోలో భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక అధికారులు.. డిపో వద్దకు చేరుకుని మంటలు అదుపుచేశారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు అంచనా.

 

20:35 - November 28, 2017

మేడ్చల్‌ : జిల్లాలోని మేడిపల్లి.. పీఎస్‌ పరిధి ఫీర్జాదిగూడలోని ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక చిన్నారి సహ ఐదుగురికి  తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను గాంధీ ఆస్పత్రికి తరలించారు. తెల్లవారుజామున ఉదయం ఆరు గంటలకు ముందు జరిగినట్టు  సమాచారం. ఈ ప్రమాదంలో అభరునిత, షారున్నిషా, వాహీద్‌ ఫిరోజ్, షంషుద్దీన, షాజాన్‌లు గాయపడ్డారు. 

 

20:29 - November 28, 2017

హైదరాబాద్ : మిషన్ కాకతీయ నాలుగో దశ పరిపాలనా అనుమతుల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ముందుగా ఖమ్మం జిల్లాలో 28 చెరువుల పునరుద్ధరణకు నాలుగు కోట్ల 97 లక్షల 57 వేల రూపాయాలను నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు మంజూరు చేశారు. ఈ కార్యక్రమం పూర్తైతే 1450 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరగుతుంది. వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని మంత్రి హరీశ్‌రావు  సంబంధిత ఇంజనీర్లను ఆదేశించారు. మిషన్‌ కాకతీయ నాల్గో దశ పనుల కోసం ఈనెల 30 లోగా ప్రతిపాదలను చీఫ్‌ ఇంజినీర్‌ కార్యాలయానికి పంపాలని అన్ని జిల్లాల ఎస్ ఈలను కోరారు. ఆ తర్వాత అందే ప్రతిపాదనలకు అనుమతించబోమని మంత్రి స్పష్టం చేశారు. వచ్చే నెల 15 లోగా సీఈ కార్యాలయం నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపాలని ఆదేశించారు. డిసెంబర్‌ 31 వరకు పరిపాలనా అనుమతులు మంజూరు చేయాలని నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌ రాజ్‌ను కోరారు. ప్రజాప్రతినిధులందూ సమన్వయంలో పనిచేస్తూ మిషన్‌ కాకతీయ నాల్గో దశను విజయవంతం చేయాలని హరీశ్‌రావు సూచించారు.

20:27 - November 28, 2017

ఖమ్మం : పరిశ్రమలు, ప్రాజెక్టుల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా భూములు సేకరిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కేసీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పూర్తిగా పరిహారం చెల్లించి భూములు తీసుకుంటే అభ్యంతరం లేదన్నారు. దీనికి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులను  బెదిరిస్తూ భూములు తీసుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను తమ్మినేని తప్పు పట్టారు. ఖమ్మం రూరల్‌ మండలం సీపీఎం మహాసభల్లో పాల్గొన్న తమ్మినేని వీరభద్రం... టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడ్డారు. 
 

20:10 - November 28, 2017

హైదరాబాద్ : ప్రస్తుతం అందిస్తున్న సేవలకంటే.. మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలని మంత్రి లక్ష్మారెడ్డి..ఆదేశించారు.  ఆరోగ్య శ్రీ, ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టుల వైద్య సేవలపై ఆయన ఆరోగ్య శ్రీ ట్రస్ట్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు.  ఆరోగ్యశ్రీ, ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టుల వైద్య సేవల అప్రోవల్స్‌ విషయంలో ఎలాంటి కాలయాపన జరగకుండా చూడాలని, వైద్య శాలల ఎంప్యానల్‌మెంట్ ప్రక్రియను సాధ్యమైనంత వేగంగా సులభంగా అయ్యేటట్టు చూడాలని మంత్రి ఆదేశించారు. త్వరలోనే అన్ని పాత జిల్లా కేంద్రాల్లో వెల్ నెస్‌ సెంటర్లను ప్రారంభించాలని ఆదేశించారు. అలాగే కొత్తగా అంకాలజీ విభాగంలో గొంతు క్యాన్సర్‌, ట్యూమర్‌కి ప్రత్యేకంగా కోడ్‌ని కేటాయించి.. చికిత్సను అందించాలని నిర్ణయించారు. 

 

20:06 - November 28, 2017

రాజమండ్రి : పోలవరం ప్రాజెక్టుకు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు...రాహు, కేతువుల్లా తయారయ్యారని ఏపీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తులసి రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో 32 శాతం పనులు పూర్తైతే బాబు పాలనలో ఆర్భాటం తప్ప పనులు ముందుకు సాగడం లేదని ఆయన రాజమండ్రిలో అన్నారు. 49 శాతం పనులను ఏడాదిలోగా ఎలా పూర్తి చేయగలుగుతారో సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోలవరం ప్రాజెక్టు కోసం ప్రజా ఉద్యమం నిర్మిస్తామన్నారు. 

 

20:01 - November 28, 2017

గుంటూరు : ఏపీ సచివాలయం వద్ద అక్కాచెల్లెళ్లు ఆత్మహత్యాయత్నం చేశారు. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన షకీరా, ఫాతిమా అరే ఇద్దరు అక్కాచెల్లెళ్లు తన తండ్రి చనిపోవడంతో కుటుంబంలో ఎవరికైనా ఉద్యోగం కేటాయించాలని విజ్ఞప్తి చేసేందుకు సచివాలయానికి వచ్చారు. లోనికి అనుమతించకపోవడంతో మనస్తాపానికి గురైన ఇద్దరు పురుగుల మందు తాగారు. అనేకసార్లు అధికారులను కలిసినప్పటికీ ఫలితం లేకపోవడంతో వీరు ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. 

 

19:57 - November 28, 2017

గుంటూరు : అమరావతిలో విట్ ఏపీ యూనివర్సిటీని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. సర్వేపల్లి రాధాకృష్ణ హాస్టల్ బ్లాక్‌ను వెంకయ్య, సరోజినీ నాయుడు బ్లాక్‌ను చంద్రబాబు ప్రారంభించారు. యూనివర్సిటీ ప్రారంభించిన అనంతరం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ..పేద కుటుంబాల్లో పుట్టి బాగా చదవగలిగే మట్టిలో మాణిక్యాలను వెలికేతీసే ఆ దిశగా ప్రభుత్వాలు పని చేయాలన్నారు.  
ఆంధ్రప్రదేశ్  విద్యారంగంలో నెంబర్ వన్‌గా, అమరావతి నాలెడ్జ్ సిటీగా, హెల్త్‌హబ్‌గా తీర్చిదిద్దుతున్నామన్నారు. జీవితంలో అన్నిటి కంటే అధిక ప్రాధాన్యత విద్యకు ఇవ్వాలని చంద్రబాబు అన్నారు.  

 

ఫలక్‌నుమా ప్యాలెస్‌లో విందుకు హాజరుకానున్న మోదీ, ఇవాంకా

హైదరాబాద్ : రాత్రి 8 గంటలకు ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరిగే విందుకు ప్రధాని మోదీ, ఇవాంకా ట్రంప్‌, పారిశ్రామిక వేత్తలు హాజరుకానున్నారు. ఇందులో ట్రీ ఆఫ్‌ లైఫ్‌ పేరుతో భారతీయ కళలు, దుస్తుల ప్రదర్శన నిర్వహిస్తారు. 8:30కి భారత చారిత్రక వారసత్వంపై లైవ్‌ షో ఉంటుంది. రాత్రి 10:25కు ప్రధాని మోదీ తిరిగి ఢిల్లీకి వెళ్లిపోతారు. 

19:46 - November 28, 2017

హైదరాబాద్ : రాత్రి 8 గంటలకు ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరిగే విందుకు ప్రధాని మోదీ, ఇవాంకా ట్రంప్‌, పారిశ్రామిక వేత్తలు హాజరుకానున్నారు. ఇందులో ట్రీ ఆఫ్‌ లైఫ్‌ పేరుతో భారతీయ కళలు, దుస్తుల ప్రదర్శన నిర్వహిస్తారు. 8:30కి భారత చారిత్రక వారసత్వంపై లైవ్‌ షో ఉంటుంది. రాత్రి 10:25కు ప్రధాని మోదీ తిరిగి ఢిల్లీకి వెళ్లిపోతారు. 

 

19:43 - November 28, 2017

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం మహిళల పట్ల వివక్షత చూపుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ ఆరోపించారు. మహిళా పారిశ్రామిక వేత్తలకు పెద్దపీట వేస్తూ...సదస్సు జరుగుతున్న తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి మహిళా సాధికారత గురించి మాట్లాడే అర్హత లేకుండాపోయిందని విమర్శించారు. హైదరాబాద్‌కు ఉండే ప్రత్యేకత, గత ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి కారణంగానే.. నగరంలో  పారిశ్రామిక  సదస్సు జరుగుతుందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. 

19:27 - November 28, 2017

హైదరాబాద్‌ : మహానగరం సిగలో మరో కలికితురాయి చేరింది. నగర ప్రజా రవాణాలో నవశకం మొదలైంది. భాగ్యనగర వాసులు సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న మెట్రోకల సాకారమైంది. హైదరాబాద్‌ మెట్రోరైల్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితమిచ్చారు. మియాపూర్‌ స్టేషన్‌లో మెట్రో సేవలను ప్రారంభించిన మోదీ... కూకట్‌పల్లి వరకు మెట్రోరైలులో ప్రయాణించారు. 
మెట్రో రైలును ప్రారంభించిన ప్రధాని మోడీ
భాగ్యనగర ప్రజలు ఎప్పుడెప్పుడా..అని ఎదురుచూస్తున్న హైదరాబాద్ మెట్రోరైలు పట్టాలెక్కింది. మధ్యాహ్నం బేగంపేట ఎయిర్‌ పోర్ట్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ .. అక్కడి నుంచి ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్ హెలికాఫ్టర్‌లో  మియాపూర్ మెట్రో స్టేషన్‌‌ చేరుకున్నారు. గవర్నర్ నరహింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలిసి... .ప్రధాని మెట్రో రైలును ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు. ముందుగా మెట్రో పైలాన్‌ను ఆవిష్కరించి మియాపూర్‌ స్టేషన్‌ను ప్రారంభించారు. అనంతరం మెట్రో ప్రాజెక్టు, నగర పునఃనిర్మాణంపై చిత్రించిన డాక్యుమెంటరీని తిలకించారు. టీ-సవారీ యాప్‌, బ్రోచర్‌ను ఆవిష్కరించారు. 
మెట్రో రైలులో ప్రయాణించిన మోడీ 
ఆ తర్వాత మియాపూర్ నుంచి కూకట్ పల్లి వరకు ప్రధాని మెట్రో రైలులో ప్రయాణించారు. ప్రధాని వెంట గవర్నర్ నరసింహన్‌, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ తదితరులు మెట్రో రైలులో ప్రయాణించారు. మెట్రో రైలు నుంచి ప్రధాని హైదరాబాద్ సిటీ అందాలను తిలకించారు. సిటీ విశేషాలను పక్కనే ఉన్న మంత్రి కేటీఆర్ మోడీకి వివరించారు. కూకట్‌పల్లి నుంచి తిరిగి అదే ట్రైన్‌లో మియాపూర్ చేరుకున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు మియాపూర్ నుంచి బయల్దేరిన మెట్రోరైలు..కూకట్ పల్లి వరకు వెళ్లి రావటానికి 11 నిమిషాలు పట్టింది. మోదీ ప్రయాణించిన మెట్రోరైలును మహిళా లోకోపైలట్‌ నడిపారు.  
హైదరాబాద్‌లోనూ మెట్రో రైలు సౌకర్యం 
కోల్‌కతా, ఢిల్లీ, బెంగళూరు, చెన్నైలో మాదిరిగానే హైదరాబాద్‌లోనూ మెట్రో రైలు సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. మియాపూర్‌ నుంచి నాగోలు వరకు 30 కిలోమీటర్ల పొడవున మెట్రోరైలు సేవలు రేపటి నుంచి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. మెట్రోరైలుతో నగరవాసులకు ట్రాఫిక్‌ కష్టాలు తీరడంతో పాటు.. మానవ వనరుల పనిగంటల ఆదా, రహదారి ప్రమాదాల తగ్గుదల, కాలుష్య నియంత్రణ, ఇంధన ఆదా ప్రయోజనాలు కలగనున్నాయి. మెట్రోరైలుతో అంతర్జాతీయ స్థాయి ప్రయాణ అనుభూతి తమకు దక్కనుందని భాగ్యనగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం ఉదయం 6 గంటల నుంచి మెట్రో సామాన్యులకు అందుబాటులోకి రానుంది. 
 

 

19:19 - November 28, 2017

హైదరాబాద్ : హెచ్ ఐసీసీ పాటు మూడు కమిషనరేట్ల పరిధిలో పరిస్థితిని తెలంగాణ డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షణ చేయనున్నారు. పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. హెచ్ ఐసీసీలో  మూడు రోజులపాటు అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సు జరుగనుంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

భారత మార్స్ మిషన్ లో మహిళలదే కీలక పాత్ర : మోడీ

హైదరాబాద్ : చరక సంహిత ప్రపంచానికి ఆయుర్వేదాన్ని అందించిందని ప్రధాని మోడీ చెప్పారు. జీఈఎస్ సదస్సు ప్రారంభం అనంతరం మోడీ మాట్లాడారు. పబ్లిక్ ఫైనాన్స్ విధానాలకు కౌటిల్యుడు అర్థశాస్త్రమే పునాది అన్నారు. యోగాను జూన్ 21న అంతర్జాతీయ దినోత్సవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. భారత మార్స్ మిషన్ లో మహిళలదే కీలక పాత్ర అని పేర్కొన్నారు. స్టార్టప్ ఇండియా కార్యక్రమంలో ఆవిష్కరణలకు పెద్దపీట వేసినట్లు తెలిపారు. 21 రంగాల్లో విదేశీ పెట్టుబడులకు సంబంధించి 87 నిబంధనలను సడలించామని చెప్పారు. దివాలా సంస్థల చట్టాన్ని బలోపేతం చేస్తున్నామన్నారు. 

మహిళలే ప్రథమం అన్న థీమ్ సదస్సు విలక్షణత : ప్రధాని మోడీ

హైదరాబాద్ : అమెరికాతో కలిసి అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సును దక్షిణాసియాలో తొలిసారి నిర్వహించడం సంతోషదాయకమన్నారు. హెచ్ ఐసీసీలో జీఈఎస్ సదస్సును ప్రారంభించిన అనంతరం మోడీ మాట్లాడారు. సిలికాన్ వ్యాలీతో హైదరాబాద్ ను కలపడమేగాదు.., భారత్, అమెరికా బంధాన్ని బలోపేతం చేస్తోందన్నారు. మహిళలే ప్రథమం అన్న థీమ్ ఈ సదస్సు విలక్షణత అన్నారు. భారత పురాణాల ప్రకారం మహిళ ఒక శక్తి అన్నారు. రాణి అహల్యాబాయ్ హోల్కర్, రాణి లక్ష్మీబాయి వంటి మహిళలు తమందరికీ స్ఫూర్తినిస్తున్నారని తెలిపారు. గుజరాత్ లో లిజ్జత్ పాపడ్ వంటి సహకార సంఘాలను మహిళలే నిర్వహిస్తున్నారని చెప్పారు.

18:31 - November 28, 2017
18:28 - November 28, 2017

హైదరాబాద్ : అమెరికాతో కలిసి అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సును దక్షిణాసియాలో తొలిసారి నిర్వహించడం సంతోషదాయకమన్నారు. హెచ్ ఐసీసీలో జీఈఎస్ సదస్సును ప్రారంభించిన అనంతరం మోడీ మాట్లాడారు. సిలికాన్ వ్యాలీతో హైదరాబాద్ ను కలపడమేగాదు.., భారత్, అమెరికా బంధాన్ని బలోపేతం చేస్తోందన్నారు. మహిళలే ప్రథమం అన్న థీమ్ ఈ సదస్సు విలక్షణత అన్నారు. భారత పురాణాల ప్రకారం మహిళ ఒక శక్తి అన్నారు. రాణి అహల్యాబాయ్ హోల్కర్, రాణి లక్ష్మీబాయి వంటి మహిళలు తమందరికీ స్ఫూర్తినిస్తున్నారని తెలిపారు. గుజరాత్ లో లిజ్జత్ పాపడ్ వంటి సహకార సంఘాలను మహిళలే నిర్వహిస్తున్నారని చెప్పారు. కల్పనా చావ్లా, సునీత్ విలియమ్స్ వంటి భారతీయ మహిళలు ఎన్నో అంతరిక్ష ప్రయోగాల్లో కీలక పాత్ర పోషించారని తెలిపారు. సైనా నెహ్వాల్, పీవీ.సింధు, సానియా మీర్జా హైదరాబాదీలే అన్నారు. చరక సంహిత ప్రపంచానికి ఆయుర్వేదాన్ని అందించిందని చెప్పారు. పబ్లిక్ ఫైనాన్స్ విధానాలకు కౌటిల్యుడు అర్థశాస్త్రమే పునాది అన్నారు. యోగాను జూన్ 21న అంతర్జాతీయ దినోత్సవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. భారత మార్స్ మిషన్ లో మహిళలదే కీలక పాత్ర అని పేర్కొన్నారు. స్టార్టప్ ఇండియా కార్యక్రమంలో ఆవిష్కరణలకు పెద్దపీట వేసినట్లు తెలిపారు. 21 రంగాల్లో విదేశీ పెట్టుబడులకు సంబంధించి 87 నిబంధనలను సడలించామని చెప్పారు. దివాలా సంస్థల చట్టాన్ని బలోపేతం చేస్తున్నామన్నారు. 

ఇన్నోవేషన్ హబ్ గా హైదరాబాద్ ఎదుగుతోంది : ఇవాంకా

హైదరాబాద్ : ప్రజాస్వామ్య విజయానికి భారత్ అశాదీపంగా ఉందని ఇవాంకా ట్రంప్ అన్నారు. హైదరాబాద్ లో జరుగుతున్న జీఈఎస్ సదస్సులో ఆమె మాట్లాడారు. ఇన్నోవేషన్ హబ్ గా హైదరాబాద్ ఎదుగుతోందని తెలిపారు. అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థలో భారత్ ఒకటి అన్నారు. భారత అంతరిక్ష విజ్ఞానం చంద్రున్ని దాటి మార్స్ వరకు వెళ్లిందని అభివర్ణించారు. భారత్ అమెరికాకు నిజమైన మిత్రుడని ట్రంప్ చెబుతారని చెప్పారు. ప్రధాని మోడీ పాలనలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. మార్పు సాధ్యమని నిరూపిస్తున్న మోడీకి అభినందనలు తెలిపారు. కొత్త ఆవిష్కరణలకు ముందుకొస్తున్న యువతకు స్వాగతం ఆమె తెలిపారు.

17:45 - November 28, 2017

హైదరాబాద్ : ప్రజాస్వామ్య విజయానికి భారత్ అశాదీపంగా ఉందని ఇవాంకా ట్రంప్ అన్నారు. హైదరాబాద్ లో జరుగుతున్న జీఈఎస్ సదస్సులో ఆమె మాట్లాడారు. ఇన్నోవేషన్ హబ్ గా హైదరాబాద్ ఎదుగుతోందని తెలిపారు. అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థలో భారత్ ఒకటి అన్నారు. భారత అంతరిక్ష విజ్ఞానం చంద్రున్ని దాటి మార్స్ వరకు వెళ్లిందని అభివర్ణించారు. భారత్ అమెరికాకు నిజమైన మిత్రుడని ట్రంప్ చెబుతారని చెప్పారు. ప్రధాని మోడీ పాలనలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. మార్పు సాధ్యమని నిరూపిస్తున్న మోడీకి అభినందనలు తెలిపారు. కొత్త ఆవిష్కరణలకు ముందుకొస్తున్న యువతకు స్వాగతం ఆమె తెలిపారు. 150 దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు.    

 

జీఈఎస్ సదస్సులో సీఎం కేసీఆర్ స్వాగతోపన్యాసం

హైదరాబాద్ : హైదరాబాద్ ను ప్రపంచం గుర్తించిందని సీఎం కేసీఆర్ అన్నారు. జీఈఎస్ సదస్సులో ఆయన స్వాగతోపన్యాసం చేశారు. తమ ఇండస్ట్రియల్ పాలసీ దేశంలో అత్యుత్తమమని తెలిపారు. వరల్డ్ బ్యాంక్ నివేదికలో తెలంగాణను నెంబర్ వన్ ర్యాంక్ వచ్చిందని గుర్తు చేశారు. మూడేళ్లలో 5469 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చామని తెలిపారు.

17:33 - November 28, 2017

హైదరాబాద్ : హైదరాబాద్ ను ప్రపంచం గుర్తించిందని సీఎం కేసీఆర్ అన్నారు. జీఈఎస్ సదస్సులో ఆయన స్వాగతోపన్యాసం చేశారు. తమ ఇండస్ట్రియల్ పాలసీ దేశంలో అత్యుత్తమమని తెలిపారు. వరల్డ్ బ్యాంక్ నివేదికలో తెలంగాణను నెంబర్ వన్ ర్యాంక్ వచ్చిందని గుర్తు చేశారు. మూడేళ్లలో 5469 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చామని తెలిపారు.

 

అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సు ప్రారంభం

హైదరాబాద్ : హెచ్ ఐసీసీలో అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తల సదస్సు ప్రారంభం అయింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగత ఉపన్యాసం చేశారు. 

17:00 - November 28, 2017

హైదరాబాద్ : కాసేపట్లో జీఈఎస్ సదస్సు ప్రారంభం కానుంది. ప్రధాని మోడీ, ఇవాంకా ట్రంప్ సదస్సును ప్రారంభించనున్నారు. హెచ్ ఐసీసీలో స్టార్టప్ ఎగ్జిబిషన్ ను మోడీ, ఇవాంకా తిలకించారు. స్టార్టప్ ప్రతినిధులతో మోడీ మాట్లాడారు. మూడు రోజలపాటు సదస్సు కొనసాగనుంది. సదస్సుకు 150దేశాల ప్రతినిధులు వచ్చారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

16:53 - November 28, 2017
16:44 - November 28, 2017

హైదరాబాద్ : భారత ప్రధాని మోడీతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ భేటీ అయ్యారు. పలు అంశాలపై చర్చించారు.

ప్రధాని మోడీతో భేటీ అయిన ఇవాంకా ట్రంప్

హైదరాబాద్ : భారత ప్రధాని మోడీతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ భేటీ అయ్యారు. పలు అంశాలపై చర్చిస్తున్నారు.  

16:32 - November 28, 2017

హైదరాబాద్ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ పర్యటనను వ్యతిరేకిస్తూ నిరసనలు మిన్నంటాయి. అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్ కు వచ్చారు. ఇవాంకా ట్రంప్ రాకను నిరసిస్తూ నగరంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద తెలంగాణ ప్రజా ఫ్రంట్, ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి. 'గో బ్యాక్ ఇవాంకా' అంటూ నినాదాలు చేశారు. కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నేతలను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. దీంతో ఎస్ వీకే వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

16:23 - November 28, 2017

ఇవాంకా రాకను వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఆందోళన

హైదరాబాద్ : ఇవాంకా ట్రంప్ రాకను వ్యతిరేకిస్తూ ఎస్ వీకే వద్ద తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఇవాంకా గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు, కార్యకర్తల మధ్య వాగ్వాదం నెలకొంది. 

 

ఏపీ సచివాలయం వద్ద అక్కాచెళ్లెలు ఆత్మహత్యాయత్నం

గుంటూరు : ఏపీ సచివాలయం వద్ద కలకలం రేగింది. అక్కాచెళ్లెలు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తన తండ్రి చనిపోతే కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వడంలో ఆలస్యం చేస్తున్నారని నంద్యాలకు చెందిన షకీరా, ఫాతిమా ఆత్మహత్యాయత్నం చేశారు.

 

15:26 - November 28, 2017

హైదరాబాద్ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ హెచ్ ఐసీసీకి చేరుకున్నారు. రోడ్డు మార్గంలో ఆమె వెళ్లారు. ఆమెతోపాటు భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, 400 మంది విదేశీ ప్రత్యేక డెలిగేట్స్ హెచ్ ఐసీసీకి చేరుకున్నారు. అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తల సదస్సులో ఇవాంకా పాల్గొనన్నారు. మరికాసేపట్లో ప్రధాని మోడీ హెచ్ ఐసీసీకి చేరుకోనున్నారు. జీఈ సమ్మిట్ ను మోడీ ప్రారంభించనున్నారు. సాయంత్రం 7.30గంటల వరకు 
సమ్మిట్ లో పాల్గొననున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

హెచ్ ఐసీసీకి బయల్దేరిన ప్రధాని మోడీ

హైదరాబాద్ : ప్రధాని మోడీ మియాపూర్ నుంచి హెచ్ ఐసీసీకి బయల్దేరారు. హెచ్ ఐసీసీలో అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సులో ఆమె పాల్గొననున్నారు. 

 

15:05 - November 28, 2017

హైదరాబాద్ : నగరంలో మెట్రో రైలు కూత పెట్టింది. మియాపూర్ లో ప్రధాని మోడీ మెట్రో రైలును ప్రారంభించారు. మియాపూర్ నుంచి కూకట్ పల్లి వరకు రైలులో మోడీ ప్రయాణించారు. ప్రధానితోపాటు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రయాణించారు. కూకటల్ పల్లి నుంచి ప్రధాని తిరుగుప్రయాణం అయ్యారు. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

మెట్రో రైలులో ప్రయాణించిన మోడీ

హైదరాబాద్ : మియాపూర్ లో ప్రధాని మోడీ మెట్రో రైలును ప్రారంభించారు. మియాపూర్ నుంచి కూకట్ పల్లి వరకు మోడీ రైలులో ప్రయాణించారు. ప్రధానితోపాటు గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రయాణించారు.

మెట్రో రైలు ప్రారంభం

హైదరాబాద్ : మెట్రో రైలు ప్రారంభం అయింది. మియాపూర్ లో ప్రధాని మోడీ మెట్రో రైలును ప్రారంభించారు. మియాపూర్ నుంచి కూకట్ పల్లి వరకు మోడీ రైలులో ప్రయాణించారు. 

14:51 - November 28, 2017
13:46 - November 28, 2017
13:40 - November 28, 2017

హైదరాబాద్ : ప్రధాని మోడీ హైదరాబాద్ చేరుకున్నారు. ప్రధాని ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్ పోర్ట్ చేరుకున్నారు. ఆయనకు గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, మండలి చైర్మన్ స్వామిగౌడ్, బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

హైదరాబాద్ చేరుకున్న ప్రధాని

హైదరాబాద్ : ప్రధాని మోడీ హైదరాబాద్ చేరుకున్నారు. ప్రధాని ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్ పోర్ట్ చేరుకున్నారు. ఆయన సీఎం కేసీఆర్, గవర్నర్, బీజేపీ నేతలు స్వాగతం పలికారు. 

విక్టోరియా భూములపై హైకోర్టులో విచారణ

హైదరాబాద్ : విక్టోరియా భూములపై హైకోర్టులో విచారణ జరిగింది. విక్టోరియా భూములను రాచకొండ కమిషరేట్ కు లీజ్ ఇచ్చే జీవో ను కోర్టు కొట్టివేసింది. 

బేగంపేటకు చేరుకున్న సీఎం, గవర్నర్

హైదరాబాద్ : ప్రధాని మోడీ స్వాగతం పలికేందుకు సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్ బేగంపేట ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు.

13:10 - November 28, 2017
13:05 - November 28, 2017

హైదరాబాద్ : ప్రధాని మోడీ స్వాగతం పలికేందుకు సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్ బేగంపేట ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి. 

కేసీఆర్ మహిళ ఉనికిలేకుండా చేస్తున్నారు : డీకే అరుణ

హైదరాబాద్ : కేసీఆర్ ప్రభుత్వం మహిళా సంఘాల ఉనికిలేకుండా చేసిందని, మహిళ సాధికారత సదస్సుకు కేటీఆర్ సంబంధం ఏంటి అని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ ప్రశ్నించారు. కేటీఆర్ ఏమైనా మహిళా మంత్రా అని ఎద్దేవా చేశారు. మేయర్ కు లేని ప్రొటోకాల్ కేటీఆర్ ఎలా వచ్చిందని, మేయర్ కేవలం బీసీ కావడమే అని ఆమె అన్నారు.

 

డిసెంబర్ 3 నుంచి చంద్రబాబు దక్షణ కొరియా పర్యటన

గుంటూరు : వచ్చే నెల 3 నుంచి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దక్షణ కొరియా పర్యటనకు వెళ్లనున్నారు. ఆయన 3 రోజుల పాటు కొరియాలో పర్యటిస్తారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ఈ పర్యటన చేస్తున్నట్టు తెలుస్తోంది. 

డిసెంబర్ 2వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు

గుంటూరు : డిసెంబర్ 2వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఎసీ సమావేశంలో నిర్ణయించారు. డిసెంబర్ 1న మిలాద్ ఉన్ నబి సందర్భంగా అసెంబ్లీ సెలవు ఇవ్వాలని కూడా నిర్ణయించారు. 

నందిగామలో రైతుల ఆందోళన

కృష్ణా : జిల్లా నందిగామలో సాగునీటి కోసం రైతులు ఆందోళనకు దిగారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు కాల్వ వద్ద నందిగామ, చందర్లపాడు మండలాల రైతులు ఆందోళన దిగారు. సాగర్ కాలువ ద్వారా నీరు రాకపోవడంతో మిర్చి, పసుపు, సుబాబుల్ తోటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

12:28 - November 28, 2017

హైదరాబాద్ : హెచ్ఐసీసీ లో జరుగుతున్న జీఈఎస్ సదస్సు పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. కేలవం పాస్ లు ఉన్నవారినే లోపలిక అనుమతిస్తున్నారు. గేట్ వద్ద ముగ్గురు ఐపీఎస్ లు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

జీహెచ్ఎంసీ మేయర్ కు అవమానం

హైదరాబాద్ : నగర మేయర్ కు అవమానం జరిగింది. మెట్రోరైలు ప్రారంభ శిలాఫలకంపై మేయర్ పేరు లేకపోవడంతో పాటు ప్రధాని ప్రయాణించే మెట్రో రైలు లో ఆయన చోటు దక్కలేదు. ప్రోటోకాల్ ప్రకారం మేయర్ పేరు ఉండాలి రాజకీయ నిపుణులు అంటున్నారు.

12:19 - November 28, 2017

హైదరాబాద్ : నగర మేయర్ కు అవమానం జరిగింది. మెట్రోరైలు ప్రారంభ శిలాఫలకంపై మేయర్ పేరు లేకపోవడంతో పాటు ప్రధాని ప్రయాణించే మెట్రో రైలు లో ఆయన చోటు దక్కలేదు. ప్రోటోకాల్ ప్రకారం మేయర్ పేరు ఉండాలి రాజకీయ నిపుణులు అంటున్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

మరి కాసేపట్లో బేగంపేట ఎయిర్ పోర్ట్ కు మోడీ

హైదరాబాద్ : మరి కాసేపట్లో ప్రధాని మోడీ బేగంపేట ఎయిర్ పోర్ట్ రానున్నారు. ప్రధానికి స్వాగతం పలికేందుకు సీఎం, కేసీఆర్, గవర్నర్ ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటున్నారు. ఎయిర్ పోర్టుకు చేరిన తర్వాత మోడీ ఐదు నిమిషాలపాటు బీజేపీ నేతలను కలుస్తారు. 

12:08 - November 28, 2017

హైదరాబాద్ : మరి కాసేపట్లో ప్రధాని మోడీ బేగంపేట ఎయిర్ పోర్ట్ రానున్నారు. ప్రధానికి స్వాగతం పలికేందుకు సీఎం, కేసీఆర్, గవర్నర్ ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటున్నారు. ఎయిర్ పోర్టుకు చేరిన తర్వాత మోడీ ఐదు నిమిషాలపాటు బీజేపీ నేతలను కలుస్తారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

11:49 - November 28, 2017

విట్ క్యాంపస్ ను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి

గుంటూరు : ఐనవోలులో విట్ ఏపీ క్యాంపస్ ను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. క్యాంపస్ లో సర్వేపల్లి రాధాకృష్ణ, సరోజినీ నాయుడు బ్లాక్ లను వెంకయ్య, చంద్రబాబు కలిసి ప్రారంభించారు. 

11:36 - November 28, 2017
11:21 - November 28, 2017

పాఠశాల భవనపై కూలిన విద్యుత్ స్తంభం

కరీంనగర్/సిరిసిల్ల : జిల్లా గీతానగర్ లో ప్రభుత్వ పాఠశాల పక్కన విద్యుత్ స్తంభం కూలి స్కూల్ బిల్డింగ్ పై పడింది. దీంతో ట్రాన్స్ ఫార్మర్ కింద పడింది. విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రమాదం తప్పింది. 

11:08 - November 28, 2017

హైదరాబాద్ : ప్రధాని మోడీ, ఇవాంక పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ మొత్తం భద్రత బలగాళ చేతుల్లోకి వెళ్లింది. నగరాన్ని నిఘా వర్గాలు ఎప్పకప్పుడు పరిశీలిస్తున్నాయి. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

ప్రాజెక్టు కోసం రోజు పాదయాత్ర

చిత్తూరు : జిల్లా నగరి సత్రవాడ నుంచి ఎమ్మెల్యే రోజా పాదయాత్ర మొదలపెట్టారు. గాలేరు, నగరి ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాలని రోజా ఈ పాదయాత్ర చేస్తున్నారు. ఈ యాత్ర నగరి నుంచి తిరుమలకు 3రోజులపాటు 5మండలాల్లో 88కి.మీ సాగనుంది. 

10:20 - November 28, 2017
10:14 - November 28, 2017

హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ : నరగంలో ప్రధాని మోడీ, ఇవాంక పర్యటన నేపథ్యంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఐఎస్ సదన్, డీఎంఆర్ఎల్ నుంచి చంద్రాయణగుట్ట వెళ్లే వాహనాలను మిధానీ జంక్షన్, బాలపూర్ మీదుగా మళ్లిస్తున్నారు. 

మెట్రోను జాతికి అంకితం చేయనున్న మోడీ

హైదరాబాద్ : ప్రధాని మోడీ మెట్రో ను నేడు జాతికి అంకితం చేయనున్నారు. మోడీ మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకుని అక్కడ నుంచి మియాపూర్ కు హెలికాప్టర్ లో చేరుకుంటారు. అక్కడ మెట్రో రైలు మోడీ ప్రారంభించానున్నారు.

09:19 - November 28, 2017

హైదరాబాద్ : ప్రధాని మోడీ మెట్రో ను నేడు జాతికి అంకితం చేయనున్నారు. మోడీ మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకుని అక్కడ నుంచి మియాపూర్ కు హెలికాప్టర్ లో చేరుకుంటారు. అక్కడ మెట్రో రైలు మోడీ ప్రారంభించానున్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

తీగలపై వ్రేలాడుతున్న రైతు మృతదేహం

కరీంనగర్/సిద్దిపేట : జిల్లా కోహెడ మండలం వరుకోలులో గత 16 గంటల నుంచి విద్యుత్ తీగలపై రైతు వీరారెడ్డి మృతదేహం వ్రేలాడుతుంది. మృతదేహం విషయంపై విద్యుత్ అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంలేదు. వీరారెడ్డి మృతికి విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణమని గ్రామస్తులు అంటున్నారు. 

09:05 - November 28, 2017

రాజధాని రైతుల ప్లాట్ల అభివృద్ధికి టెండర్లు

గుంటూరు : రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు జోన్ 5 గ్రామాల్లోని రైతుల ప్లాట్స్ అభివృద్ధికి సీఆర్టీఏ టెండర్లు పిలిచింది. మిగతా జోన్లకు త్వరలోనే టెండర్లు పిలుస్తామని సీఆర్డీఏ తెలిపింది. 

ట్రైడెంట్ హోటల్ చేరుకున్న ఇవాంక

హైదరాబాద్ : అమెరికా అధ్యక్ష సలహాదారు ఇవాంక ట్రంప్ ట్రైడెంట్ హోటల్ కు చేరుకున్నారు. ఆమె ఉదయం 3 గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. ఆమె మధ్యాహ్నం 2గంటల వరకు ట్రైడెంట్ హోటల్ లోనే ఉంటారు. 

08:04 - November 28, 2017

హైదరాబాద్ : అమెరికా అధ్యక్ష సలహాదారు ఇవాంక ట్రంప్ ట్రైడెంట్ హోటల్ కు చేరుకున్నారు. ఆమె ఉదయం 3 గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. ఆమె మధ్యాహ్నం 2గంటల వరకు ట్రైడెంట్ హోటల్ లోనే ఉంటారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

07:30 - November 28, 2017

హైదరాబాద్ కు మెట్రో రావడం ఎంతో గర్వంగా చెప్పుకునే అంశమని, 2014 ఆగస్టు 9 తేదీకి మెట్రో రైలు పరుగులు తీసింది. టీఆర్ఎస్ స్వలాభం కోసం మెట్రో ను పోడిగించిందని కాంగ్రెస్ నేత రామచంద్రారెడ్డి అన్నారు. మెట్రో పనులు వాయిదా వేయడం వల్ల 4వేల కోట్ల భారం పడిందని ఆయన అన్నారు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని, హైదరాబాద్ కంటే ముందు చిన్న చిన్న నగరాలకు మెట్రో వచ్చిందని సీపీఎం నేత నరసింహరెడ్డి అన్నారు. మెట్రో నగరంగా హైదరాబాద్ మారబోతుందని, మెట్రో ఎవరి వల్ల వస్తోందో ప్రజలు తెలుసాని, ప్రపంచ నుంచి ఎంతమంది పారిశ్రామికవేత్తలు వస్తున్నారని, తెలంగాణ మరింత అభివృద్ధికి టీఆర్ఎస్ కట్టుబడి ఉందని టీఆర్ఎస్ నేత రాకేష్ కుమార్ అన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

07:18 - November 28, 2017

దేశం మొత్తంలో గ్రామీణ బ్యాంకుల్లో 90వేల మంది పనిచేస్తున్నారు. 1976లో గ్రామీణ బ్యాంకులపై పార్లమెంట్ లో చట్టం చేశారు. దీని ఉద్దేశ్యం గ్రామీణ ప్రాంతాల వారికి బ్యాంకింగ్ సౌకార్యం కల్పించాలని ప్రభుత్వం గ్రామీణ బ్యాంకులు తీసుకొచ్చింది. ముఖ్యంగా రైతులకు గ్రామీణ బ్యాంకులు ఏర్పాటు చేయబడ్డాయని ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ఎంప్లాయిస్ యూనియన్ నేషనల్ సెక్రెటరీ జనరల్ ఎస్. వెంకటేశ్వర రెడ్డి అన్నారు. దీంట్లో సామాజిక సేవ ధృక్పథంతో గ్రామీణ బ్యాంకులు ఏర్పాటు చేశారు. కానీ ఇవీ స్థాపిత లక్ష్యాలకు దూరుంగా జరగుతున్నట్టు కనిపిస్తోందని ఆయన అన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

హైదరాబాద్ చేరుకున్న ఇవాంక్ ట్రంప్

హైదరాబాద్: ఇవాంక ట్రంప్ తెల్లవారుజామున 3గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. ఆమె షెడ్యూల్ ప్రకారం ఇవాళ తెల్లవారుజాము 3 గంటలకు ఇవాంక శంషాబాద్‌ చేరుకున్నారు. అటునుంచి తాను బసచేయనున్న ట్రైడెంట్‌ హోటల్‌కు చేరుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు అమె అక్కడే ఉంటారు. ఆ తరువాత 3 గంటలకు హెచ్ఐసిసికి చేరుకుంటారు. 3 నుంచి 4.25 గంటల వరకు జీఈఎస్ సదస్సులో పాల్గొంటారు. 4.25కి ప్రధాని మోదీతో భేటీ అవుతారు. సాయంత్రం 5.50కి తిరిగి ట్రైడెంట్‌ హోటల్ కు చేరుకుంటారు. 

నేడు తెలంగాణలో కేంద్రమంత్రి హర్దీరిసింగ్ పర్యటన

హైదరాబాద్ : నేడు తెలంగాణ లో కేంద్ర మంత్రి మర్దీస్ సింగ్ పూరీ పర్యటించనున్నారు. ఆయన డబుల్ బెడ్ రూం ఇళ్లను పరిశీలించనున్నారు. 

నేటి నుంచి ప్రపంచ వ్యాపారవేత్తల సదస్సు

హైదరాబాద్ : నేటి నుంచి నగరంలో ప్రపంచ వ్యాపావేత్తల సదస్సును ప్రారంభం కానుంది. ఈ సదస్సు ను ప్రధాని మోడీ నేటి సాయంత్రం లాంఛనంగా ప్రారంభించనున్నారు. 

నేడు హైదరాబాద్ కు మోడీ

హైదరాబాద్ : నేడు హైదరాబాద్ ప్రధాని మోడీ రానున్నారు. మధ్యాహ్నాం 1.10లకు వాయుసేనకు చెందిన విమానంలో బేగంపేట ఎయిపోర్ట్ కు చేరుకుంటారు. ప్రధానికి స్వాగతం పలకడానికి గవర్నర్, సీఎం, మంత్రులు, ఉన్నధికారులు సిద్దమైయ్యారు.  

07:05 - November 28, 2017

నాగ్ పూర్ : టెస్ట్‌ టాప్‌ ర్యాంకర్‌ టీమిండియా అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా అదరగొడుతోంది. తొలి టెస్ట్‌లో డ్రాతోనే సరిపెట్టుకున్న కొహ్లీ అండ్‌ కో...నాగ్‌పూర్‌ టెస్ట్‌లో మాత్రం ఆల్‌రౌండ్‌ షోతో ఆధిపత్యం ప్రదర్శించి ఇన్నింగ్స్‌ విజయం టీమిండియా స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ పోటీలు పడి సెంచరీల మోత మోగించడంతో పాటు అశ్విన్‌ స్పిన్‌ మ్యాజిక్‌ ముందు లంక బ్యాట్స్‌మెన్‌ తేలిపోవడంతో భారత్‌కు పోటీనే లేకుండా పోయింది.405 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన లంక జట్టు భారత బౌలర్లు సమిష్టిగా చెలరేగడంతో తేలిపోయింది. అశ్విన్‌,జడేజా, ఇషాంత్‌ శర్మ,ఉమేష్‌ యాదవ్‌ పోటీలు పడి మరీ వికెట్లు తీయడంతో లంక 166 పరుగులకే కుప్పకూలింది.

అతిపెద్ద విజయం...
ఇన్నింగ్స్‌ 239 పరుగులతో నెగ్గిన భారత జట్టు 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.నాగ్‌పూర్‌ టెస్ట్‌లో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన విరాట్‌ కొహ్లీ మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచాడు.భారత్‌కు టెస్టుల్లో ఇదే అతి పెద్ద ఇన్నింగ్స్‌ విజయం కావడం విశేషం.2007లో భారత్‌ బంగ్లాదేశ్‌పై ఇన్నింగ్స్‌ 239 పరుగుల తేడాతో నెగ్గింది.ఇదే జోరు కొనసాగిస్తే 3వ టెస్ట్‌తో పాటు సిరీస్‌ నెగ్గడం టీమిండియాకు పెద్ద కష్టమేమీ కాదు.

07:04 - November 28, 2017

ఆహ్మాదబాద్ : గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెస్‌ పార్టీలు గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాయి. గెలుపు గుర్రాలకే అధిక ప్రాధాన్యత నిస్తూ టికెట్ల కేటాయింపులో ఆచీ తూచీ వ్యవహరిస్తున్నాయి. ఈ రెండు పార్టీలు కూడా చాలా మంది సిటింగ్‌ ఎమ్మెల్యేలకు ఈసారి మొండి చేయి చూపాయి. దీంతో ఇరుపార్టీల్లోనూ అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ గత రాత్రి 76 మంది అభ్యర్థుల పేర్లతో కూడిన మూడో జాబితాను విడుదల చేసింది. ఇందులో చాలా మంది సిటింగ్‌ ఎమ్మెల్యేలకు చోటు దక్కలేదు. తమ నేతలకు టికెట్‌ దక్కకపోవడంతో కాంగ్రెస్‌ కార్యకర్తలు అహ్మదాబాద్‌, గాంధీనగర్‌ తదితర ప్రాంతాలలోని పార్టీ కార్యాలయాల్లో విధ్వంసానికి పాల్పడ్డారు.

బిజెపి కూడా 34 మంది అభ్యర్థులతో
బిజెపి కూడా 34 మంది అభ్యర్థులతో కూడిన తుది జాబితాను విడుదల చేసింది. ఇందులో 12 మంది సిటింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్‌ దక్కగా.. ఐదుగురు సిటింగ్‌ ఎమ్మెల్యేలకు షాకిచ్చింది. వీరిలో ప్రస్తుత మంత్రి రోహిత్‌ పటేల్‌ కూడా ఉన్నారు. మాజీ సిఎం ఆనందీబెన్‌ పటేల్‌కు కూడా టికెట్‌ కేటాయించ లేదు. అయితే, ఆమె ఇది వరకే పోటీ చేయనని ప్రకటించారు.మరోవైపు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు దళిత యువనేత జిగ్నేష్‌ మేవానీ ప్రకటించారు. బనస్కాంత జిల్లా వడ్‌గావ్‌ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు మేవానీ పేర్కొన్నారు. మతతత్వ పార్టీకి వ్యతిరేకంగా అసెంబ్లీలో గళం వినిపించాలని ఉద్యమకారుల ఉత్సాహం మేరకు తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్‌ వెలుపలి నుంచి తనకు మద్దతు ఇచ్చిందని జిగ్నేష్‌ తెలిపారు. దీంతో సిటింగ్‌ ఎమ్మెల్యే మనిభాయ్‌ వాఘేలాను కాంగ్రెస్‌ పోటీ నుంచి తప్పించినట్లు తెలుస్తోంది.

యువనేత హార్దిక్‌ పటేల్ కాంగ్రెస్‌కు మద్దతు
ఇప్పటికే పాటీదార్‌ యువనేత హార్దిక్‌ పటేల్ కాంగ్రెస్‌కు వెలుపలి నుంచి మద్దతు ప్రకటించారు. ఓబీసికి చెందిన అల్పేశ్‌ ఠాకూర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. స్థానికంగా ప్రజాదరణ పొందిన ఈ ముగ్గురు యువనేతల మద్దతు కాంగ్రెస్‌కు ఎంతవరకు లాభం చేకూరుస్తుందన్నది వేచి చూడాలి.గుజరాత్‌ అసెంబ్లీలోని మొత్తం 182 స్థానాలకు డిసెంబర్‌ 9, 14 తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్‌ జరగనుంది. డిసెంబర్‌ 18న ఫలితాలు వెలువడనున్నాయి.

07:03 - November 28, 2017

సిద్దిపేట : తెలంగాణలో ప్రజా వంచన పాలన సాగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఘోరంగా విఫలమయ్యారని మండిపడ్డారు. సామాజిక తెలంగాణ-సమగ్రాభివృద్ధికై చాడ వెంకటరెడ్డి చేపట్టిన పోరుబాట యాత్ర సిద్దిపేట చేరిన సందర్భంగా పట్టణంలో సభ నిర్వహించారు. డబుల్‌ బెడ్‌ రూము ఇళ్లు, లక్షల ఉద్యోగాల భర్తీ ఏమైందని చాడ ప్రశ్నించారు. 

07:02 - November 28, 2017

పశ్చిమగోదావరి : జిల్లా నీటిపారుదల శాఖ అధికారుల నిర్వాహకంతో ఉండి గ్రామానికి చెందిన వరి రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేపలు, రొయ్యల చెరువులు యజమానులు ఒత్తిడితో కాల్వలకు నీరు విడుదల చేశారు. దీంతో పనల మీద ఉన్న వరి పొలాల్లోకి నీరు చేరడంతో పంట తడిచిపోయింది. కాల్వలకు నీరు విడుదల చేయొద్దని తహసీల్దార్‌తోపాటు నీటిపారుదల, వ్యవసాయ శాఖ అధికారులకు మొరపెట్టుకున్నా ఎవరూ వినిపించుకోలేదని పంట నష్టపోయిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

07:01 - November 28, 2017

హైదరాబాద్ : పేదలకు గృహ వసతి కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ విమర్శించారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లపై మహిళలు పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయని మండిపడ్డారు. ఉప్పల్‌లో జరిగిన బైండ్ల సామాజికవర్గం మహిళా విభాగం సమావేశంలో పాల్గొన్న కోదండరామ్‌... రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడ్డారు. బైండ్ల సామాజికవర్గం ఉపాధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. 

07:00 - November 28, 2017

హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా వచ్చే ఏడాది సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం అనుమతులు మంజూరు చేస్తున్న నేపథ్యంలో పనుల వేగం పెంచాలని కాళేశ్వరంపై నిర్వహించిన సమీక్షలో ఇంజినీర్లకు సూచించారు. పంపు హౌస్‌, సొరంగం, కాల్వలన సిద్ధం చేయాలని ఆదేశించారు. భూసేకరణను వేగవంతం చేయాలని ప్రాజెక్టు పరిధిలోని జిల్లా కలెక్టర్లు, ఆర్డీవోలకు సూచించారు. అనుమతుల ప్రక్రియ కొలిక్కి వస్తున్న నేపథ్యంలో పనుల పరోగతిపై ఇంజనీర్లు, కాంట్రాక్టు ఏజెన్సీలు దృష్టి పెట్టాలని హరీశ్‌రావు కోరారు. 

06:48 - November 28, 2017

హైదరాబాద్ : ఇవాంక ట్రంప్‌..ఇప్పుడు పరిచయం అక్కర్లేని పేరు. వైట్‌హౌస్‌లో చక్రం తిప్పే పవర్‌ఫుల్‌ లేడీ. శ్వేతసౌధంలో సలహాదారు హోదాలో అధికార కేంద్రంగా పనిచేస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు తన గారాల పట్టి ఇవాంక చెప్పిందే వేదం. తండ్రి వెంటే ఉండే ఈ బ్యూటీ.. అంతర్జాతీయ వేదికలపై అమెరికా ప్రతినిధిగా పాల్గొంటుండటంతో.. ఇప్పుడు అందరి దృష్టి ఇవాంక ట్రంప్‌పైనే పడింది. ఆమె ఏం మాట్లాడుతారు? ఎలాంటి నిర్ణయాలు ప్రకటిస్తారు? భారత్‌, అమెరికా సంబంధాల గురించి ఆమె మదిలో ఏముంది ? ఇలా పలు ప్రశ్నలు అందరిలోనూ ఉత్కంఠ రేపుతున్నాయి.

ఇవాంక వ్యక్తిగత జీవితంలో అనేక విభిన్న అంశాలు
ఇవాంక వ్యక్తిగత జీవితంలో అనేక విభిన్న అంశాలు కనిపిస్తాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య సంతానమే ఇవాంక. 1981, అక్టోబర్ 30న జన్మించింది. ఓ పక్క చదువుకుంటూనే మరో పక్క మోడలింగ్‌లో కూడా అవకాశాలు చేజిక్కించుకుంది. 14 ఏళ్ల వయసులోనే మోడిలింగ్‌ను స్టార్ట్ చేసింది. 1997లో సెవంటీన్ మ్యాగ్ జైన్ కవర్ పేజ్ పై దర్శనమిచ్చింది. మిస్ యూఎస్ఏ పోటీల్లో వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించింది. 2004లో ఎకనామిక్స్ లో డిగ్రీ తీసుకుంది. ఫ్రెంచ్ భాషపై కూడా మంచి పట్టున్న ఇవాంకా తండ్రి గొప్ప వ్యాపార వేత్త అయినా తమ వ్యాపార సంస్థల్లో అడుగు పెట్టాలని నిర్ణయించుకుంది. అనుభవం కోసం బయటి సంస్థల్లో కొద్దికాలంపాటు పనిచేసి వ్యాపారంలో మెళకువలు నేర్చుకుంది. ట్రంప్‌ ఆర్గనేజైషన్‌లో ఇవాంక ఎగ్జిక్యూటివ్ వైస్‌ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తోంది. అంతేకాదు ఇవాంక బ్రాండ్‌ పేరుతో వ్యాపారం నిర్వహిస్తోంది. ది అప్రెంటీస్‌ అనే టీవీషోకి న్యాయనిర్ణేతగా వ్యవహరించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తండ్రితో పాటు ప్రచారంలో క్రీయాశీలకంగా పాల్గొన్నారు. రాజకీయ నిర్ణయాల్లో కూతురు ఇవాంక సలహాలు ట్రంప్ తూ.చ. తప్పకుండా పాటిస్తారట. అందుకే ఈ ఏడాది మార్చిలో ఆమెకు వైట్‌హౌస్‌ సలహాదారుగా అధికారిక హోదా ప్రకటించారు

బుధవారం ఛార్మినార్‌ టూర్‌కు....
గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ సదస్సుకు ఇవాంక స్టార్‌ అట్రాక్షన్‌గా మారారు. మంగళవారం ఇవాంక జీఈ సదస్సుకు హాజరువుతారు. రాత్రి తాజ్‌ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇచ్చే డిన్నర్‌కు అటెండ్ అవుతారు. బుధవారం ఛార్మినార్‌ టూర్‌కు వెళ్తారు. లాడ్‌ బజార్‌లో బ్యాంగిల్స్ షాపింగ్స్ చేస్తారు. ఇక ఈవెనింగ్ గోల్కొండలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే ట్రీట్‌కు హాజరవుతారు. 

06:47 - November 28, 2017

హైదరాబాద్: ఇవాంక ట్రంప్ తెల్లవారుజామున 3గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. ఆమె షెడ్యూల్ ప్రకారం ఇవాళ తెల్లవారుజాము 3 గంటలకు ఇవాంక శంషాబాద్‌ చేరుకున్నారు. అటునుంచి తాను బసచేయనున్న ట్రైడెంట్‌ హోటల్‌కు చేరుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు అమె అక్కడే ఉంటారు. ఆ తరువాత 3 గంటలకు హెచ్ఐసిసికి చేరుకుంటారు. 3 నుంచి 4.25 గంటల వరకు జీఈఎస్ సదస్సులో పాల్గొంటారు. 4.25కి ప్రధాని మోదీతో భేటీ అవుతారు. సాయంత్రం 5.50కి తిరిగి ట్రైడెంట్‌ హోటల్ కు చేరుకుంటారు. ఆ తరువాత రాత్రి 8 గంటలకు ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఏర్పాటుచేసిన విందులో పాల్గొంటారు. రాత్రి 10. 40కి తిరిగి ట్రైడెంట్‌ హోటల్‌కు చేరుకుంటారు. 29వ తేదీన కూడా ఆమె నగరంలోనే ఉంటారు. ఆరోజు ఉదయం 10 గంటలకు హెచ్ఐసిసికి చేరుకుని జీఈఎస్ సదస్సులో పాల్గొంటారు. తిరిగి 11 గంటలకు ట్రైడెంట్‌ హోటల్‌కు చేరుకుంటారు.

నేడు హైదరాబాద్ కు ఇవాంక

హైదరాబాద్ : నేడు హైదరాబాద్ లో ఇవాంక ట్రంప్ పర్యటించనున్నారు. ఆమె ప్రపంచ వ్యాపారవేత్తల సదస్సులో పాల్గొననున్నారు. జీఈఎస్ సదస్సులో ఇవాంక రెండు రోజుల పాటు పాల్గొంటారు.  

Don't Miss