Activities calendar

29 November 2017

నాచారం ఈఎఎస్ ఐ ఆస్పత్రిలో దారుణం

హైదరాబాద్‌ : నాచారం ఈఎఎస్ ఐ ఆస్పత్రిలో ఘోరం చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన చిన్నారులను ఆస్పత్రి సిబ్బంది తారుమారు చేశారు. ఒకరి శిశువును, వేరొకరికి అప్పగించారు. దీంతో ఎవరి బిడ్డ.. ఎవరిదన్న విషయంలో గందరగోళం ఏర్పడింది. చివరకు డీఎన్ ఏ టెస్ట్‌ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో సిబ్బంది నిర్లక్ష్యంపై బంధువులు ఆందోళనకు దిగారు.     

అంబర్‌పేట్‌లో దారుణం

హైదరాబాద్ : అంబర్‌పేట్‌లోని బురుజుగల్లిలో దారుణం చోటుచేసుకుంది. విద్యా మోడల్‌ స్కూల్‌ యజమానురాలు లక్ష్మీ.. విద్యార్థులతో తన ఇంటి పనులు చేయించుకుంటుంది. స్కూల్‌ పిల్లలతో.. తన కుమారుడు పెళ్లి పనులు చేయిస్తుంది. దీనిపై బాలల హక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది.  స్కూల్‌ యజమానురాలుపై బాల కార్మిక నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేసింది. కాగా.. ఆ స్కూల్‌కి కనీసం గుర్తింపు కూడా లేదని తెలుస్తోంది. 

 

22:06 - November 29, 2017

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు తాను అతిపెద్ద మద్దతుదారునిగా ప్రకటించుకున్నారు. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ, దాని రాజకీయ విభాగం జమాత్ ఉద్ దవాలను కూడా తాను ఇష్టపడతానని చెప్పారు. ముంబై దాడుల మాస్టర్‌ మైండ్‌, జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్‌ను కూడా ముషర్రఫ్‌ ప్రశంసించారు. 2002లో లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థను ముషారఫ్ ప్రభుత్వం నిషేధించింది. నాడు నిషేధించిన ముషారఫే నేడు.. ఆ ఉగ్రవాద సంస్థను పొగడడం గమనార్హం.  2008 ముంబై దాడుల తర్వాత హఫీజ్‌ సయీద్‌ను ఉగ్రవాదిగా ప్రకటించిన విషయం తెలిసిందే.. 

 

22:04 - November 29, 2017

ఉత్తరప్రదేశ్ : సమాజ్‌వాదీ పార్టీ సంరక్షకుడు ములాయం సింగ్ యాదవ్ కోడలు అపర్ణ యాదవ్ పద్మావతి సినిమా పాటపై డాన్స్‌ చేయడం వివాదంగా మారింది. లక్నోలో జరిగిన ఓ ఫంక్షన్‌లో గూమర్ సాంగ్‌కు దీపికా పదుకునేను తీసిపోకుండా అపర్ణ స్టెప్పులేశారు. అపర్ణ డ్యాన్స్ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారింది. ఈ డ్యాన్స్‌పై సోషల్‌ మీడియాలో బెదిరింపులు వచ్చాయి. అపర్ణా యాదవ్‌ డాన్స్‌ను రాజ్‌పుత్‌లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ములాయం కుటుంబానికి చెందిన కోడలు ఇలా చేయడం సరికాదన్నారు. ఏ పాటనైతే తాము వ్యతిరేకిస్తున్నామో ఆ పాటపై అపర్ణ డాన్స్‌ చేయడం ద్వారా తమను అవమాన పరచారని కొందరు వ్యాఖ్యానించారు. బాలీవుడు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ చిత్రం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే.

 

22:02 - November 29, 2017

అహ్మదాబాద్ : గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సోమనాథ్‌ ఆలయాన్ని సందర్శించారు. సోమనాథ్‌ ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు జరిపారు.  ఈ సందర్భంగా రాహుల్‌ ఆలయంలోని నాన్‌ హిందూ రిజిస్టర్‌లో సంతకం చేసినట్లు ఆయన సంతకం వైరల్‌ అయింది. రాహుల్‌ హిందువు కాదని...హిందువుల ఓట్ల కోసమే ఆయన ఆలయాలను సందర్శిస్తున్నారని బిజెపి విమర్శించింది. బిజెపి విమర్శలను కాంగ్రెస్‌ తిప్పికొట్టింది. రాహుల్‌ శివ భక్తుడని... ఓటమి భయంతోనే బిజెపి కావాలని కుట్రకు పాల్పడుతోందని విమర్శించింది. అంతకు ముందు రాహుల్‌ గాంధీ గత అసెంబ్లీ ఎన్నికల్లో సిఎం హోదాలో మోదీ ఇచ్చిన హామీలపై ట్విట్టర్‌ వేదికగా విమర్శలు గుప్పించారు.  గుజరాత్‌లో 50 లక్షల పక్కా ఇళ్లు కట్టిస్తామని 2012లో మోదీ హామీ ఇచ్చారని... గత ఐదేళ్లలో బీజేపీ ప్రభుత్వం కేవలం 4.72 లక్షల ఇళ్లు మాత్రమే నిర్మించిందని రాహుల్‌ వెల్లడించారు. మీ హామీని నిలబెట్టుకోవాలంటే మరో 45 ఏళ్లు పడుతుందా? అంటూ ఎద్దేవా చేశారు. 

 

21:59 - November 29, 2017

వరంగల్‌ : కార్పొరేట్‌ ఆస్పత్రులకు.. దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేస్తున్నామని మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. వరంగల్‌ జిల్లాలో.. కాకతీయ వైద్య కళాశాల ఆవరణలో నిర్మిస్తున్న సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా  ప్రాంతీయ వైద్యశాల మొదలుకుని.. జిల్లా ఆస్పత్రుల్లో అనేక మార్పులు తీసుకువచ్చినట్టు మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు.  ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. 

21:58 - November 29, 2017

హైదరాబాద్‌ : నాచారం ఈఎఎస్ ఐ ఆస్పత్రిలో ఘోరం చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన చిన్నారులను ఆస్పత్రి సిబ్బంది తారుమారు చేశారు. ఒకరి శిశువును, వేరొకరికి అప్పగించారు. దీంతో ఎవరి బిడ్డ.. ఎవరిదన్న విషయంలో గందరగోళం ఏర్పడింది. చివరకు డీఎన్ ఏ టెస్ట్‌ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో సిబ్బంది నిర్లక్ష్యంపై బంధువులు ఆందోళనకు దిగారు.     


 

21:55 - November 29, 2017

హైదరాబాద్ : అంబర్‌పేట్‌లోని బురుజుగల్లిలో దారుణం చోటుచేసుకుంది. విద్యా మోడల్‌ స్కూల్‌ యజమానురాలు లక్ష్మీ.. విద్యార్థులతో తన ఇంటి పనులు చేయించుకుంటుంది. స్కూల్‌ పిల్లలతో.. తన కుమారుడు పెళ్లి పనులు చేయిస్తుంది. దీనిపై బాలల హక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది.  స్కూల్‌ యజమానురాలుపై బాల కార్మిక నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేసింది. కాగా.. ఆ స్కూల్‌కి కనీసం గుర్తింపు కూడా లేదని తెలుస్తోంది. 

 

21:51 - November 29, 2017

హైదరాబాద్ : తను పార్టీ మారుతున్నాననే వార్తల్లో వాస్తవం లేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సంపత్‌ కుమార్‌ అన్నారు. తన నియోజకవర్గ అవసరాల కోసమే మంత్రి హరీశ్‌రావుని కలిశానని.. కానీ కుట్ర పూరితంగానే తనపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. తన ప్రాణం ఉన్నంత వరకు కాంగ్రెస్‌లోనే ఉంటానని.. నీతిమాలిన రాజకీయాలు చేయనని అన్నారు.

 

21:48 - November 29, 2017

చిత్తూరు : చంద్రబాబునాయుడుకు అబద్ధాలు చెప్పడం తప్పా.. ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే  చిత్తశుద్ధి లేదని ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. గాలేరు నగరి ప్రాజెక్ట్‌ సాధనే లక్ష్యంగా వైసీపీ నేతలు చేపట్టిన పాదయాత్ర పుత్తూరుకు చేరుకుంది. ఈ సందర్భంగా గాలేరు-నగరి ప్రాజెక్ట్‌ సాధన కోసం పోరాటం సాగిస్తామని ఎమ్మెల్యే రోజా అన్నారు. తన సొంత జిల్లాలో ప్రాజెక్ట్‌కు చంద్రబాబునాయుడు  కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని..  ఈ జిల్లా రైతులపై ఆయనుకున్న నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమని ఆమె అన్నారు.  

21:40 - November 29, 2017

ఢిల్లీ : ఫాతిమా కాలేజీ విద్యార్థుల అంశంపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ.నడ్డాతో ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ కలిసి చర్చించారు. విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర అధికారులు ఎంసిఐతో సంయుక్త సమావేశం జరిపి.. తర్వాత విద్యార్థులకు ఏవిధంగా న్యాయం జరపాలో నిర్ణయిస్తామన్నారు. వచ్చే ఏడాది ఫాతిమా కాలేజీ బ్యాచ్‌ను జీరో చేసి ప్రస్తుత విద్యార్థులకు న్యాయం చేయాలని ఆలోచిస్తున్నట్లు కామినేని శ్రీనివాస్‌ చెప్పారు. ఈ ప్రతిపాదనకు సుప్రీంకోర్టు అనుమతి తీసుకుంటామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఫాతిమా విద్యార్థుల సమస్యపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తుందని కామినేని చెప్పారు. 

 

21:37 - November 29, 2017

హైదరాబాద్‌ : నగరంలో మెట్రో పరుగులు ప్రారంభమయ్యాయి. ఉదయం 6 గంటలకు నాగోల్‌ నుంచి మియాపూర్‌కు మెట్రో తొలి కూత మొదలైంది. మెట్రోలో ప్రయాణించాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నగరవాసులు రైలు ఎక్కేందుకు ఉత్సాహం ప్రదర్శించారు. మెట్రోతో సమయం ఆదా అవుతుందని.. కాలుష్యం తగ్గుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఛార్జీలు అధికంగా ఉన్నాయని పెదవి విరుస్తున్నారు. 

నగర ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెట్రో కల సాకారమైంది. హైదరాబాద్‌లో మెట్రో పరుగులు ప్రయాణికులకు కొత్త అనుభూతిని మిగులుస్తున్నాయి. ఉదయం ఆరు గంటలకు ఒక రైలు నాగోలు స్టేషన్‌లో, మరో రైలు మియాపూర్‌ స్టేషన్‌లో బయల్దేరాయి. మెట్రోలో తొలిరోజు ప్రయాణించేందుకు ప్రజలు ఉత్సాహం చూపించారు. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు మెట్రో జర్నీకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. సెల్‌ ఫోన్‌లో ఫోటోలు తీసుకుంటూ.. సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. వేగంగా గమ్యాన్ని చేరుస్తున్న మెట్రో రైలు ప్రయాణాన్ని ఎంజాయ్‌ చేస్తున్నారు. 

మొదటి రోజు సుమారు లక్షమంది ప్రయాణించే అవకాశం ఉందని మెట్రో అధికారులు అంచనా వేశారు. ప్రతి పావుగంటకో రైలు చొప్పున మొత్తం 18 రైళ్లు తిరుగుతాయి. మెట్రో కార్డుల విక్రయం మొదలుపెట్టిన తర్వాత మూడు రోజుల్లోనే 12 వేలకుపైగా అమ్మడయ్యాయి. రద్దీకి అనుగుణంగా రైళ్ల సంఖ్యను పెంచాల్సి వస్తుందని అధికారులు తెలిపారు. 
మియాపూర్‌-నాగోలు రూట్‌లో 27.6 కిలోమీటర్ల మార్గంలో మొత్తం 24 మెట్రో స్టేషన్లున్నాయి. వీటి మధ్య ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలంటే దాదాపు రెండు గంటల సమయం పడుతోంది. అదే మెట్రోలోనైతే గంటలో ఆ చివరి నుంచి ఈ చివరికి చేరుకోవచ్చు. సాంకేతిక సర్దుబాట్ల తర్వాత ఈ సమయం మరింత తగ్గుతుందని మెట్రో వర్గాలు చెబుతున్నాయి. 

మెట్రో ప్రయాణానికి ఎల్‌అండ్‌టీ అధికారులు కొన్ని స్టేషన్లలో స్మార్ట్‌ కార్డులను విక్రయిస్తున్నారు. వీటిని కొనేందుకు 200 రూపాయలు చెల్లించాలి. ఇందులో రూ.100తో రీఛార్జి చేస్తారు. కార్డుకు 100 రూపాయలు తీసుకుంటారు. ఒకవేళ ఈ కార్డును మెట్రోస్టేషన్‌ కౌంటర్‌లో తిరిగి ఇచ్చేస్తే, 80 రూపాయలు వెనక్కు ఇస్తారు. ఉదయం ఆరింటికి రైళ్లు తిరగడం ప్రారంభమవుతున్నందున... ఐదు గంటల నుంచే కార్డుల్లో డబ్బులను రీఛార్జి చేసుకునే అవకాశం కల్పించారు. మరికొందరు మాత్రం మెట్రో ఛార్జీలు అధికంగా ఉన్నాయని పెదవి విరుస్తున్నారు. మెట్రో రైలులో ప్రయాణించాలని తెలంగాణలోని జిల్లాల నుంచి కూడా జనం తరలివస్తున్నారు.

21:31 - November 29, 2017

హైదరాబాద్ : స్త్రీ, పురుషులకు అన్ని రంగాల్లో సమానావకాశాలు కల్పించినప్పుడే ఏ దేశమైనా అభివృద్ధి చెందుతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సలహాదారు ఇవాంక అభిప్రాయపడ్డారు. ఇందుకు అమెరికా నిదర్శమన్నారు. పురుషులతో సమానంగా స్త్రీలు కూడా పని చేస్తున్నప్పటికీ వేతనాల్లో వ్యత్యాసం ఉండటం పట్ల హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో ఇవాంక ఆందోళన వ్యక్తం చేశారు. 

హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరుగుతున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో రెండో రోజు పలు అంశాలపై చర్చాగోష్ఠులు జరిగాయి. మహిళా పారిశ్రామికవేత్తల్లో నైపుణ్యం పెంపు.. అన్న అంశంపై జరిగిన ప్లీనరీలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సలహాదారు ఇవాంక, బ్రిటన్‌ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌ సతీమణి చెర్రీ, ఐసీఐసీఐ బ్యాంకు మేనేజింగ్‌ డైరెక్టర్‌ చందా కొచ్చర్‌, డెల్‌ సీఈవో కరేన్‌ క్వింటోస్‌ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ మోడరేటర్‌గా వ్యవహరించారు. 

మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నా సమాజం చిన్నచూపుచూడటం మంచిపరిణామం కాదని ఇవాంక అన్నారు. స్త్రీ, పురుష వ్యత్యాసం తగ్గాలని అభిప్రాయపడ్డారు. భారత్‌లో మహిళలకు ఉద్యోగావకాశాలు తక్కువగా ఉండడం వల్లే.. దేశం ఆర్థికంగా వెనుకబడి ఉందని బ్రిటన్‌ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌ సతీమణి చెర్రీ అభిప్రాయపడ్డారు. 
బైట్‌ః చెర్రీ, బ్రిటన్‌ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌ సతీమణి 

దేశంలోని ఉద్యోగుల్లో 25 శాతం కూడా మహిళలు లేకపోవడం పట్ల ఐసీఐసీఐ బ్యాంకు మేనేజింగ్‌ డైరెక్టర్‌ చందా కొచ్చర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. 

క్రీడా రంగంలో  మహిళ పాత్ర అన్న మరో అంశంపై జరిగిన చర్చాగోష్ఠిలో టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా, బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌తోపాటు పలు దేశాల  నుంచి  వచ్చిన క్రీడాకారులు పొల్గొన్నారు. క్రికెట్‌  వ్యాఖ్యాత హర్ష బోగ్లే ఈ  కార్యక్రమానికి మోడరేటర్‌గా వ్యవహరించారు. భారత్‌లో మహిళా క్రీడాకారులకు ప్రోత్సాహం లేకపోవడం పట్ల సానియా మీర్జా ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు క్రికెట్‌ను ప్రస్తావించారు. 

అన్ని రంగాల్లో స్త్రీ, పురుషులకు సమాన అవకాశాలు ఉండాలని భారత్‌ మహిళా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌  సూచించారు. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు రెండో రోజు మిస్‌ వరల్డ్‌ మానుషి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జీవితంలో ఏది సాధించాలన్నా ఆత్మవిశ్వాసం ముఖ్యమన్నారు. మరోవైపు జీఈఎస్‌లో పాల్గొన్న తర్వాత ఇవాంక చారిత్రక గోల్కొండ కోటను సందర్శించారు. కోట విశిష్టతను పర్యాటక శాఖ అధికారులు ఇవాంకకు వివరించారు. గోల్కొండ కోటలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. గోల్కొండ అందాలను చూసి ఇవాంక మురిసిపోయారు. 

గోల్కొండ కోటలో కొనసాగుతున్న విందు

హైదరాబాద్ : గోల్కొండ కోటలో విందు కొనసాగుతోంది. జీఈఎస్ ప్రతినిధులకు గోల్కొండ కోటలో ప్రభుత్వం విందు ఏర్పాటు చేసింది. జీఈఎస్ ప్రతినిధులు విందుకు హాజరయ్యారు.

 

శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఇవాంకా

హైదరాబాద్ : మాదాపూర్ ట్రైటెండ్ హోటల్ నుంచి ఇవాంకా ట్రంప్ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.

శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బయల్దేరిన ఇవాంకా

హైదరాబాద్ : మాదాపూర్ ట్రైటెండ్ హోటల్ నుంచి ఇవాంకా ట్రంప్ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు బయల్దేరారు. 

 

20:48 - November 29, 2017

నీలం రంగు నీటితో స్వచ్ఛంగా మెరిసే సంద్రాలు కావవి.. కాలుష్య కాసారాలు.. ఒక్కకమాటలలో చెప్పాలంటే  స్వచ్ఛ సముద్రాలు కాదు.. చెత్త సముద్రాలు.. కిలోమీటర్ల ఎత్తు పేరుకుంటున్న ప్లాస్టిక్ తో కడలి గర్భం డంప్ యార్డ్ లా మారుతోంది. ఈ ప్లాస్టిక్ వ్యర్థాల సమస్యకు పరిష్కారం లేదా? సమస్త జల చరాలూ అంతమౌతుంటే చూస్తూ ఉండాల్సిందేనా?  ఇదే ఈ రోజు వైడాంగిల్ స్టోరీ.. 
తప్పొకరిది శిక్ష మరొకరికి.. 
తప్పొకరిది శిక్ష మరొకరికి.. వ్యర్థాలకు కారణం ఒకరు.. బలవుతున్నది వేరొకరు..కానీ, నిర్లక్ష్యానికి శిక్ష కొన్ని సార్లు అనూహ్యం కూడా. ఇప్పటి తరం ప్రకృతి పట్ల చేస్తున్న తప్పులు ముందు తరాలను ఎలా శిక్షిస్తాయో ఊహించటం కూడా కష్టమే.. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

ఉద్యోగాల పేరిట ఘరానా మోసం

విజయవాడ : ఉద్యోగాల పేరిట ఘరానా మోసం జరిగింది. మాడ్విక్ సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్ సంస్థ లక్షల్లో డబ్బు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. 150 మంది నిరుద్యోగులు మాచవరం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 

 

సీఎం కేసీఆర్ ను కలిసిన నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు

హైదరాబాద్ : ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను నీతి ఆయోగ్ ఉపాధ్యాక్షుడు రాజీవ్ కుమార్, సభ్యులు రాజేశ్ కలిశారు. వ్యవసాయ అభివృద్ధి సంబంధిత అంశాలపై చర్చించారు. రైతుల ఆదాయం రెట్టింపునకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

 

20:21 - November 29, 2017

రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన సాగుతోందని వక్తలు విమర్శించారు. మెట్రో రైలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ కు అవమానం జరిగిందన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి, టీఆర్ ఎస్ నేత మన్నె గోవర్థన్, కాంగ్రెస్ నేత శ్రీనివాస్ పాల్గొని, మాట్లాడారు. మెట్రో రైలు ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకంపై మేయర్ పేరు లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మేయర్ కు తగిన గౌరవం, మర్యాద ఇవ్వకుండా, ప్రొటో కాల్ పాటించకుండా అవమానించిందన్నారు. వరంగల్ లో యువతిపై జరిగిన యాసిడ్ దాడి దారుణమన్నారు. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. యాసిడ్ దాడి హత్యతో సమానమని.. దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

20:09 - November 29, 2017

గుంటూరు : విద్యార్థుల ఆత్మహత్యకు కారణమయ్యే కాలేజీల యాజమాన్యాలపై కఠిన చర్యలు తప్పవని ఏపీ అసెంబ్లీ హెచ్చరించింది. నిబంధలనకు విరుద్ధంగా కాలేజీలను నిర్వహిస్తే గుర్తింపు రద్దు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. మార్కుల కోసం విద్యార్థులతో బట్టీ పట్టించే  చదవుల నుంచి కాలేజీలు బయపట పడాలని సూచించారు. జీవితంలో స్థిరపడేలా  ప్రయోగాత్మక, అనుభపూర్వక అధ్యయనానికి ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు కాలేజీ యాజమాన్యాలను కోరారు. 
విద్యార్థుల ఆత్మహత్యలపై తీవ్ర ఆందోళన 
విద్యార్థుల ఆత్మహత్యలపై ఏపీ అసెంబ్లీలో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఈ అంశంపై టీడీపీ సభ్యుడు తెనాలి శ్రావణ్‌ కుమార్‌ ప్రవేశపెట్టిన సావధాన తీర్మానంపై విస్తృత చర్చ జరిగింది. చర్చల్లో పాల్గొన్న టీడీపీ, బీజేపీ సభ్యులు... రాష్ట్రంలో  రైతుల ఆత్మహత్యలు తగ్గినా... విద్యార్థుల బలవన్మరణాలు కలవరపెడుతున్న అంశాన్ని సభ దృష్టికి తెచ్చారు. వీటి నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు, సలహాలు ఇచ్చారు. 
విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే విద్యాలయాలపై కఠిన చర్యలు 
కార్పొరేట్‌ కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులను రోబోలు, యంత్రాలుగా మారుస్తున్న అంశాన్ని ఎమ్మెల్యేలు సభ దృష్టికి తెచ్చారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు అవిశ్రాంతంగా చదివిస్తూ, పరీక్షలు నిర్వహిస్తూ విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురిచేస్తున్న అంశాన్ని ప్రస్తావించారు. సెలవు రోజుల్లో కూడా క్లాసులు నిర్వహిస్తున్న కార్పొరేట్ కాలేజీల వైఖరిని తప్పుపట్టారు. ఇలాంటి విధానాలన్నీ విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురిచేస్తూ, ఆత్మహత్యల వైపు పురిగొల్పుతున్న అంశాన్ని సభ దృష్టికి తెచ్చారు. విద్యార్థుల ఆత్మహత్యలపై  సభలో జరిగిన చర్చకు మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సమాధానమిచ్చారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం చేసుకుని... ఏ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 
ఆర్థిక పరిస్థితిపై చర్చకు మంత్రి యనమల సమాధానం
ఆ తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై జరిగిన చర్చకు మంత్రి యనమల రామకృష్ణుడు సమాధానం ఇచ్చారు. విభజన తర్వాత రెవెన్యూ లోటును కేంద్రం భర్తీ చేయకపోవడం, కేంద్ర ప్రభుత్వ పథకాలకు నిధుల్లో కోత విధించడం, కొన్ని స్కీములను  పూర్తిగా రాష్ట్రాలకు బదిలీ చేయడంతో ప్రభుత్వంపై భారం ఎక్కవు అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.  ఈ సందర్భంగా ఉజ్వల డిస్కం ఎష్యూరెన్స్‌ యోజన బాండ్లను  యనమల ఉదాహరించారు. గ్రామీణ ప్రాంతాల్లో కుక్కలు, పందుల నియంత్రణ అధికారాన్ని జిల్లా కలెక్టర్ల నుంచి తొలగించి, గ్రామ పంచాయతీలకు కట్టబెడుతూ... మంత్రి లోకేశ్‌ ప్రవేశపెట్టిన ఏపీ పంచాయతీరాజ్‌ చట్ట సవరణ బిల్లుకు  అసెంబ్లీ ఆమోదం తెలిపింది. 
సభ రేపటికి వాయిదా 
ఏపీ అద్దె నియంత్రణ చట్ట సవరణ బిల్లు, వ్యవసాయ భూములను  వ్యవసాయేతర  కార్యకలాపాలకు ఉపయోగించే ఏపీ అగ్రికల్చర్‌ ల్యాండ్‌ కన్వర్జెన్స్‌ చట్ట సవరణ బిల్లు, న్యాయవాదులు సంక్షేమ నిధి చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు సభను గురువారానికి వాయిదా వేశారు. 

 

20:01 - November 29, 2017

వరంగల్‌ : జిల్లాలోని ఐనవోలు మండలం గర్మిల్లపల్లి శివారులో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ యువతిపై యాసిడ్‌ దాడికి పాల్పడ్డారు. దాడిలో గాయపడిన యువతిని.. స్థానికులు ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. దుండగులు పరారీలో ఉన్నారు.  

 

19:58 - November 29, 2017

అనంతపురం : రాష్ట్ర పోలీసు క్రీడా పోటీలకు అనంతపురం జిల్లా వేదికవుతోంది. నాలుగేళ్లగా వాయిదా పడుతున్న రాష్ట్ర పోలీసు క్రీడా పోటీలను అనంతపురం జిల్లాలో నిర్వహించేందుకు  రాష్ట్ర హోంశాఖ తుది నిర్ణయం తీసుకుంది. వచ్చె నెల 4 నుంచి 9 వరకు ఐదు రోజుల పాటు క్రీడా పోటీలు జరగనున్నాయి. క్రీడా పోటీల ప్రారంభోత్సవానికి రాష్ట్ర పోలీసు డీజీపీ సాంబశివరావు హజరవుతున్నారని, ముగింపు, బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం చిన్నరాజప్ప హాజరవుతారని జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్ కుమార్ చెప్పారు. ఈ పోటీల కోసం... పోలీసులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి అన్ని విభాగాలకు చెందిన రెండు వేల మంది క్రీడాకారులు ఈ పోటీలకు హాజరవనున్నారు. 

 

19:45 - November 29, 2017

కడప : జనసేన పార్లమెంటరీ నియోజకవర్గ శిక్షణా తరగతులను వచ్చే నెల 7వ తేదీ నాటికి పూర్తి చేయాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని పార్లమెంటరీ స్థానాల నుంచి 20 మంది వంతున కార్యకర్తలను ఎంపిక చేసి, హైదరాబాద్‌లో రాష్ట్ర స్థాయి శిక్షణ ఇస్తున్నారు. 2019 ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసే లక్ష్యంతో ఈ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్టు జనసేన ఉపాధ్యక్షుడు మహేందర్‌రెడ్డి చెప్పారు. 

 

గోల్కొండ కోటలో ప్రారంభమైన విందు

హైదరాబాద్ : గోల్కొండ కోటలో విందు ప్రారంభం అయింది. జీఈఎస్ ప్రతినిధులకు గోల్కొండ కోటలో ప్రభుత్వం విందు ఏర్పాటు చేసింది. జీఈఎస్ ప్రతినిధులు గోల్కొండ కోటకు చేరుకున్నారు. 

 

19:36 - November 29, 2017

ఢిల్లీ : రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఏపీ పర్యటన షెడ్యూల్ ఖరారు అయింది. డిసెంబర్ 7, 8 వ తేదీల్లో విశాఖలో జరిగే సబ్ మెరైన్ కలర్స్ ప్రజెంటేషన్ ప్రోగ్రాం కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ హాజరుకానున్నారు. రాష్ట్రపతితోపాటు గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. అలాగే డిసెంబర్ 9, 10వ తేదీల్లో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రొద్దుటూరు, విశాఖలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 

 

ఉప్పల్ లో జూనియర్ ఆర్టిస్టు అరెస్టు

హైదరాబాద్ : ఉప్పల్ లో జూనియర్ ఆర్టిస్టును పోలీసులు అరెస్టు చేశారు. అన్ లైన్ లో వ్యభిచారం నిర్వహిస్తున్న జూనియర్ ఆర్టిస్టు లక్ష్మీని అరెస్టు చేశారు. అత:పురం, హైస్కూల్ సీరియళ్లలో లక్ష్మీ అలియాస్ వర్షిత, అలియాస్ పుణ్యవతి నటించారు.

తిరుపతి గాజులమండ్యం పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం

చిత్తూరు : తిరుపతిలోని గాజులమండ్యం పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం సంభవించింది. మల్లాది డ్రగ్స్ లో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. 

19:17 - November 29, 2017

గుంటూరు : వైసీపీ అధినేత జగన్‌కు గిరిజనుల అభివృద్ధి అంటే గిట్టదని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆరోపించారు. సోషల్ మీడియాలో తనపై వచ్చిన ఓ వీడియోపై గిడ్డి ఈశ్వరి స్పందించారు. గిరిజన మహిళ అయిన తనపై కుట్రలు పన్నుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసత్యాలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని... జగన్‌పై ఎస్సీ, ఎస్టీ కేసులు పెడతానని ఆమె తెలిపారు. పార్టీ కోసం మూడున్నరేళ్లు కష్టపడితే జగన్‌ తనకు మానసిక క్షోభ మిగిల్చారని గిడ్డి ఈశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. 

19:14 - November 29, 2017

చిత్తూరు : తిరుపతిలోని గాజులమండ్యం పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం సంభవించింది. మల్లాది డ్రగ్స్ లో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

యువతిపై దుండగులు యాసిడ్ దాడి

వరంగల్ : ఐనవోలు మండలం గర్మిల్లపల్లి శివారులో దారుణం జరిగింది. యువతిపై దుండగులు యాసిడ్ దాడి చేసి, పరారయ్యారు. యువతి తీవ్రంగా గాయపడింది. చికిత్స కోసం ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు. యువతి పరిస్థితి విషమంగా ఉంది. 

రేపు చైనా వెళ్లనున్న ఏచూరి

ఢిల్లీ : సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి రేపు చైనాకు వెళ్లనున్నారు. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా ఆహ్వానం మేరకు వెళ్లనున్నారు. రేపటి నుంచి బీజింగ్ లో సీపీసీ అత్యున్నతస్థాయి సమావేశాలు జరుగనున్నాయి.

 

 

తండ్రీకొడుకులపై దాడి..తండ్రి మృతి

జనగామ : జిల్లాలోని పాలకుర్తి మండలం గూడూరులో భూ తగాదాలు భగ్గుమన్నాయి. తండ్రి వెంకటయ్య, కొడుకు రాజుపై గొడ్డళ్లతో ఆరుగురు ప్రత్యర్థులు దాడి చేశారు. రాజు అక్కడికక్కడే మృతి చెందారు. వెంకటయ్య పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్ ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు. ప్రధాన నిందితుడు కొమురయ్య సహా ఐదుగురు నిందితులు లొంగిపోయారు. 

18:18 - November 29, 2017

జనగామ : జిల్లాలోని పాలకుర్తి మండలం గూడూరులో భూ తగాదాలు భగ్గుమన్నాయి. తండ్రి వెంకటయ్య, కొడుకు రాజుపై గొడ్డళ్లతో ఆరుగురు ప్రత్యర్థులు దాడి చేశారు. రాజు అక్కడికక్కడే మృతి చెందారు. వెంకటయ్య పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్ ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు. ప్రధాన నిందితుడు కొమురయ్య సహా ఐదుగురు నిందితులు లొంగిపోయారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

17:44 - November 29, 2017

హైదరాబాద్ : మెట్రోరైలు నగర వాసులకు కొత్త అనుభూతినిస్తోంది. ఈ రోజు ఉదయం 6 గంటల నుండే నగరవాసులతో మెట్రో స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. తార్నాక, హబ్సీగూడ మెట్రో రైల్వేస్టేషన్ల వద్ద మెట్రో రైళ్లో ప్రయాణం చేస్తు సంతోషపడుతున్నారు. మెట్రో ట్రైన్‌ చాలా బాగుందని ప్రయాణికులు ఆనందంగా చెబుతున్నారు. మెట్రో ప్రారంభం కావడం వల్ల ట్రాఫిక్‌ సమస్యలు, ప్రమాదాలు తగ్గుతాయని ఆశిస్తున్నారు. నాగోల్‌ నుండి మియాపూర్‌ వరకు మెట్రో రైళ్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు టెన్ టివితో మాట్లాడారు. మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం...

 

17:41 - November 29, 2017

హైదరాబాద్ : రాత్రికి రాత్రే ఎవరూ గొప్ప క్రీడాకారులు కాలేరని టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా స్పష్టం చేశారు. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో భాగంగా రెండో రోజు క్రీడా పరిశ్రమలో వ్యాపార విజయం అంశంపై జరిగిన సెషన్‌లో సానియామీర్జా, పుల్లెల గోపిచంద్, మిథాలీ రాజ్ పాల్గొన్నారు. కొత్త క్రీడాకారులకు మరిన్ని ప్రోత్సాహకాలు అవసరముందని సానియా అన్నారు. భారత్‌లో క్రీడాకారులు క్రికెట్ నుంచి అన్ని ఆటల వైపు మొగ్గు చూపుతున్నారని పుల్లెల గోపీచంద్ పేర్కొన్నారు. అయితే సరైన ప్రోత్సాహం, సహకారం అవసరమన్నారు.

 

17:36 - November 29, 2017

హైదరాబాద్‌ : నగర పర్యటనలో ఉన్న ఇవాంకా ట్రంప్... మధ్యాహ్నం గోల్కొండ కోటను సందర్శించారు. భారీ భద్రతా మధ్య ఆమె ఈ చారిత్రక కోటకు చేరుకున్నారు. చారిత్రక నేపథ్యం కల్గిన ఈ కోట ప్రాశస్త్యాన్ని, విశిష్టతను పర్యాటక శాఖ అధికారులు ఇవాంకకు వివరించారు. ఈ సందర్భంగా కోటలో ఏర్పాటుచేసిన స్టాళ్లను ఆమె పరిశీలించారు. మరోవైపు అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సుకు విచ్చేసిన 1500 మంది ప్రతినిధులకు రాష్ట్ర ప్రభుత్వం గోల్కొండ కోటలోనే విందు ఇస్తోంది. సాయత్రం 6 గంటల నుంచి రాత్రి 9గంటల వరకు విందు కొనసాగనుంది. అయితే ఈ విందుకు ఇవాంకా హాజరు కావడం లేదు. 

 

గోల్కొండ కోటను సందర్శించిన ఇవాంకా ట్రంప్

హైదరాబాద్ : ఇవాంకా ట్రంప్ గోల్కొండ కోటను సందర్శించారు. గోల్కొండ కోటలో జీఈఎస్ ప్రతినిధులకు రాష్ట్ర ప్రభుత్వం విందు ఏర్పాటు చేసింది. 1500 మంది ప్రతినిధులకు రాత్రి గోల్కొండ కోటలో విందు ఏర్పాటు చేశారు. గోల్కొండ కోట, పరిసరాల్లో భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. గోల్కొండ కోటలో భద్రతను డీజీపీ పర్యవేక్షించారు.

 

జయలలిత బిడ్డకు తండ్రి శోభన్ బాబే : లలిత

చెన్నై : జయలలిత మేనత్త కుమార్తె లలిత సంచలన వ్యాఖ్యలు చేసింది. జయలలిత బిడ్డకు తండ్రి శోభన్ బాబే అని స్పష్టం చేశారు. జయలలిత డెలివరీ సమయంలో శోభన్ బాబు పక్కనే ఉన్నారని తెలిపారు.

డిసెంబర్ 1న ఏపీ కేబినెట్ సమావేశం

అమరావతి : డిసెంబర్ 1న ఏపీ కేబినెట్ సమావేశం జరుగనుంది. సాయంత్ర 5 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ఈ భేటీలో పలు అంశాలపై చర్చించారు. 

ఏపీలో పర్యటించనున్న రాష్ట్రపతి

అమరావతి : ఏపీలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పర్యటించనున్నారు. డిసెంబర్ 7, 8 తేదీల్లో విశాఖలో జరిగే సబ్ మెరైన్ కలర్స్, ప్రజెంటేషన్ కార్యక్రమంలో రాష్ట్రపతితో పాటు గవర్నర్, ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. 

 

ప్రియుడితో కలిసి మాజీ ప్రియుడిని హత్య చేసిన ప్రియురాలు

గుంటూరు : తాడేపల్లి ఎన్ టీఆర్ కరకట్ట వద్ద దారుణం జరిగింది. ప్రియుడితో కలిసి ప్రియురాలు మాజీ ప్రియుడిని హత్య చేసింది. మాజీ ప్రియుడు రాజయ్యను ప్రియుడు సుధాకర్ తో కలిసి గాయత్రి హత్య చేసింది. మృతదేహాన్ని తన ఇంట్లోని సెప్టిక్ ట్యాంక్ లో గాయత్రి పూడ్చి పెట్టింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

 

పత్తికొండ వ్యవసాయ మార్కెట్ లో ఉద్రిక్తత

కర్నూలు : పత్తికొండ వ్యవసాయ మార్కెట్ లో ఉద్రిక్తత నెలకొంది. టమాట కొనుగోలు చేయకుండా వ్యాపారులు కుమ్మక్కు అయ్యారు. రైతులు ఆందోళన చేపట్టారు. వ్యాపారులతో వాగ్వాదం చోటుచేసుకుంది. 

16:47 - November 29, 2017
16:46 - November 29, 2017
16:43 - November 29, 2017
16:36 - November 29, 2017

అనంతపురం : మరో విద్యాకుసుమం రాలిపోయింది. రుద్రంపేటలోని సివి రామన్ కాలేజీ హాస్టల్‌ లో ఇంటర్మీడియట్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. రామగిరి మండలం వెంకటాపురంకు చెందిన లక్ష్మిదేవి కూతురు శ్రావణి అనంతపురం రుద్రంపేటలోని సివి రామన్‌ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. తలనొప్పి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొందని కాలేజీ యాజమాన్యం చెబుతుంటే.. తన కూతురిని హత్య చేశారని పేరెంట్స్‌ ఆరోపించారు. కాలేజీ ముందు విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. పెద్ద ఎత్తున విద్యార్థులు చనిపోతుంటే కాలేజీ యాజమాన్యాలు మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

16:18 - November 29, 2017

గుంటూరు : గ్రామాల్లో వీధి కుక్కలు, పందుల  నియంత్రణాధికారాన్ని జిల్లా కలెక్టర్ల నుంచి తొలగించి పంచాయతీలకు అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రి లోకేశ్‌ ప్రవేశపెట్టిన పంచాయతీరాజ్‌ చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకు జిల్లా కలెక్టర్లకు ఈ అధికారం ఉందని లోకేశ్‌ తెలిపారు. వీధి కుక్కలు, పందుల దాడుల్లో  చిన్న పిల్లలు బలవుతున్న అంశంపై సభలో ఆందోళన వ్యక్తమైంది. పందులు, కుక్కల బెడదపై సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. 

16:06 - November 29, 2017

విజయవాడ : తుందుర్రు మెగా ఆక్వా ఫుడ్ పార్కుకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఛలో అసెంబ్లీ కార్యక్రమం విజయవాడలో ఉద్రిక్తతలకు దారితీసింది. ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లాలో రైతులను అరెస్ట్ చేయగా మరికొంతమంది విజయవాడకు చేరుకున్నారు. ధర్నా చౌక్ నుంచి అసెంబ్లీకి ప్రదర్శనగా వెళ్దామనుకోగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో రైతులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో పలువురికి గాయాలయ్యాయి. మహిళల చేతుల గాజులు పగిలి రక్తం కారుతున్నా పోలీసులు వారి మొర ఆలకించకుండా బలవంతంగా వ్యాన్‌లోకి ఎక్కించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసులు అరెస్ట్ చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం  చేశారు. ఆక్వా రైతుల అరెస్ట్ పై మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి నరసింహా అందిస్తారు.          

 

ఇవాంకా ట్రంప్, ప్రధాని మోదీ పర్యటనకు రాత్రి బెదిరింపు కాల్

హైదరాబాద్ : ఇవాంకా ట్రంప్, ప్రధాని మోదీ టూర్‌కు రాత్రి బెదిరింపు కాల్ వచ్చింది. డీజీపీ కంట్రోల్ రూమ్‌కు నిన్నరాత్రి 9 గంటల 46 నిమిషాలకు కాల్ వచ్చింది. ఫలక్‌నుమా పరిసరాల్లో బాంబు పెట్టినట్టు ఆగంతకులు చెప్పడంతో... పోలీసులు అప్రమత్తమయ్యారు. విషయంగా గోప్యంగా ఉంచిన పోలీసులు... రాత్రంతా తనిఖీలు చేపట్టారు. చివరకు ఫేక్‌ కాల్‌గా తేల్చారు. ఇంటర్నెట్ వాయిస్ కాల్  ద్వారా కాల్ వచ్చినట్లు గుర్తించిన పోలీసులు.. ఆ వ్యక్తిని గుర్తించే పనిలో ఉన్నారు. 

15:59 - November 29, 2017

హైదరాబాద్ : ఇవాంకా ట్రంప్, ప్రధాని మోదీ టూర్‌కు రాత్రి బెదిరింపు కాల్ వచ్చింది. డీజీపీ కంట్రోల్ రూమ్‌కు నిన్నరాత్రి 9 గంటల 46 నిమిషాలకు కాల్ వచ్చింది. ఫలక్‌నుమా పరిసరాల్లో బాంబు పెట్టినట్టు ఆగంతకులు చెప్పడంతో... పోలీసులు అప్రమత్తమయ్యారు. విషయంగా గోప్యంగా ఉంచిన పోలీసులు... రాత్రంతా తనిఖీలు చేపట్టారు. చివరకు ఫేక్‌ కాల్‌గా తేల్చారు. ఇంటర్నెట్ వాయిస్ కాల్  ద్వారా కాల్ వచ్చినట్లు గుర్తించిన పోలీసులు.. ఆ వ్యక్తిని గుర్తించే పనిలో ఉన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

15:55 - November 29, 2017

నిజామాబాద్ : పేదరికంలో మగ్గిపోతూనే డాక్టర్‌ అయ్యాడు. తన చదువు పేదలకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నాడు. అంతటితోనే సంతృప్తి పడలేదు. నిత్యం గిరిజన తండాల్లో తిరుగుతూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. నిజామబాద్ జిల్లా కేంద్రంలో డాక్టర్‌ మోతీలాల్‌ ప్రజల చేత శహబాష్‌ అనిపించుకుంటున్నారు.
పేదరికం బాధిస్తున్నా పట్టుదలగా చదువు పూర్తి 
నిజామాబాద్ జిల్లా గాంధారి మండలం వెంకటాపూర్ తండాకు చెందిన మోతిలాల్ చిన్నప్పటి నుండి డాక్టర్‌ కావాలనే కోరిక ఉండేది. కాని వైద్యవిద్య చదవాలంటే మాములు మాట కాదు. లక్షల రూపాయల ఖర్చవుతుంది. పేదరికంబాధిస్తున్నా   పట్టుదలగా చదివారు.  ప్రభుత్వ హాస్టల్స్‌లో  ఉంటూ స్కూల్‌ విద్యాను పూర్తిచేశారు. యంబిబిస్‌లో ర్యాంక్ సంపాధించారు మోతీలాల్‌నాయక్‌. డాక్టర్‌ అయ్యాక తన చదువు, వైద్యం పేద ప్రజలకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో సేవాసంస్థను స్థాపించారు. శశాంక్‌ఫౌండేషన్‌ పేరుతో ద్వారా నిజామాబాద్‌ జిల్లాకేంద్రంలో ప్రజలకు ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నారు.   
వృత్తి వైద్యం..ప్రవృత్తి సమాజ సేవ 
ఓవైపు వైద్యవృత్తిని నిర్వహిస్తూనే..మరోవైపు  తన ప్రవృత్తి అయిన సమాజసేవను ప్రారంభించారు. గత 20 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్తగా కొనసాగుతున్నారు.  నిత్యం జిల్లాలోని పలు తండాల్లో పర్యటిస్తూ గిరిజనుల సమస్యలను తీర్చడానికి కృషిచేస్తున్నారు. ఈ క్రమంలో రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీపడాలని నిర్ణయించుకున్నట్టు డాక్టర్‌ మోతీలాల్‌ చెబుతున్నారు. వైద్యుడిగా ఎదిగి,  పేదలకు సేవలు అందిస్తున్న గిరిజబిడ్డ  రాజకీయాల్లోనూ రాణించాలని నిజామాబాద్‌జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు.  

 

ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

అనంతపురం : ప్రైవేట్ కాలేజీలో మరో విద్యా కుసుమం రాలింది. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. రుద్రంపేటలోని సీవీ రామన్ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కాలేజీ హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాలేజీ ముందు విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టారు. 

15:48 - November 29, 2017

కరీంనగర్ : అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సుకు హాజరైన ఇవాంకాకు కరీంనగర్‌లో రూపుదిద్దుకున్న అద్బుత కళారూపాన్ని తెలంగాణ ప్రభుత్వం బహుమతిగా అందించనుంది. జాతీయ స్థాయిలో పేరుగాంచిన కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రి సంస్థ ఇవాంక కోసం ప్రత్యేకంగా వెండి కళారూపాన్ని తయారు చేసింది. ఈ రోజు ఇవాంకకు కేసీఆర్‌ తీపి జ్ఞాపికను బహుకరించనున్నారు. మరి ఇవాంకకు ఇస్తున్న సిల్వర్‌ ఫిలిగ్రిని తయారు చేయడం తమకు సంతోషంగా ఉందంటున్న ఫిలిగ్రీ తయారీదారులతో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

15:43 - November 29, 2017

అనంతపురం : మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరుతున్నారు. రాష్ట్రాభివృద్ధికి సీఎం చంద్రబాబు చేస్తున్న కృషికి ఆకర్శితులమయ్యే పార్టీలో చేరుతున్నామని గురునాథ్‌రెడ్డి తెలిపారు. ఈమేరకు ఆయనతో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. కొత్త రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ అభివృద్ధికి దోహదపడకుండా వ్యవహరిస్తుందన్నారు. విమర్శించడం ఒక్కటే పనిగా జగన్‌ పెట్టుకున్నారని చెప్పారు. 

 

నేను పడ్డ కష్టం జగన్ కు కనిపించలేదా ? : గిడ్డి ఈశ్వరి

అమరావతి : పార్టీ కోసం మూడున్నరేళ్లు తాను పడ్డ కష్టం జగన్ కు కనిపించలేదా అని గిడ్డి ఈశ్వరి ప్రశ్నించారు. తనకు మానిసిక క్షోభ మిగిల్చారని అన్నారు. జగన్ పార్టీ పెట్టింది సీఎం అవ్వడానికి కాదా అని నిలదీశారు. జగన్ పై ఎస్సీ, ఎస్టీ కేసులు పెడతానని హెచ్చరించారు. జగన్ కు గిరిజనుల అభివృద్ధి గిట్టదని చెప్పారు. 

15:06 - November 29, 2017
15:04 - November 29, 2017

గుంటూరు : ఇకపై విద్యాసంస్థలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు సీఎం చంద్రబాబు. విద్యాసంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. కార్పొరేట్‌ విద్యాసంస్థలు పోటీని తట్టుకునేందుకు... విద్యార్థులకు ఎలాంటి క్రీడలు, మానసిక ఉల్లాసం లేకుండా చదివించడం వల్ల ఒత్తిడితో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు చంద్రబాబు. ఇకపై విద్యాసంస్థల్లో విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే... విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు సీఎం. 

 

డిసెంబర్ 1న కాంగ్రెస్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం

హైదరాబాద్ : డిసెంబర్ 1న కాంగ్రెస్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరుగనుంది. కొత్త సచివాలయం నిర్మాణం అవసరం లేదనే అంశంపై చర్చించనున్నారు. పార్లమెంట్ సమావేశాలు జరిగే సమయంలో అఖిలపక్షంతో కలిసి ఢిల్లీ వెళ్లేందుకు ప్లాన్ చేశారు. 

 

13:55 - November 29, 2017

పవన్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా నటిస్తున్న చిత్రం అజ్ఞాతవాసి. ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా తర్వాత పవన్ సినిమాలు వదిలేసి రాజకీయంపై దృష్టి పెడతాడా లేక సినిమాలు చేస్తూ రాజకీయం చేస్తాడా అంటే రెండోది చేయబోతున్నట్టు తెలుస్తోంది. అజ్ఞాతవాసి తర్వాత పవన్ ఓ రీమేక్ మూవీ చేస్తున్నట్టు సమాచారం. తమిళంలో అజిత్ నటించిన వేదాళం తెలుగులో రీమేక్ చేయాలని అనుకుంటున్న పవన్ ఇప్పుడు ఆ ప్రాజెక్టుకు పచ్చ జెండా ఉపినట్టు తెలుస్తోంది. పవన్ కేరిర్ ఇంత వరకు చేసిన సినిమాల్లో సగానికి పైగా రీమేక్ లు ఉన్నాయి. 

13:41 - November 29, 2017

తెలుగు భాషపై ఏపీ అసెంబ్లీలో సావధాన తీర్మానం

గుంటూరు : తెలుగు భాష పై ఏపీ శాసనసభలో ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ సావధాన తీర్మానం ప్రవేశపెట్టారు. తెలుగు భాషపై సభలో చంద్రబాబు మాట్లాడుతూ తెలుగు భాషను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. 7 విభాగల్లో తెలుగు అభివృద్ధి చేయాలని కోరారు, పాలనలో తెలుగు అమలు చేయాలని కోరారని ఆయన అన్నారు.   

పోలీసులపై మండలి చైర్మన్ ఆగ్రహం

గుంటూరు : అసెంబ్లీ భద్రత నిర్వహిస్తున్న పోలీసులపై శాసన మండలి చైర్మన్ ఎన్ఎండీ ఫరూక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపు కార్పొరేషన్ ద్వారా సీఎం కార్లు పంపిణీ చేస్తుండగా మండలి చైర్మన్ కాన్వాయ్ రావడంతో వాహనాన్ని పోలీసులు ఆపారు. వేరే మార్గం గుండా వెళ్లాలని చెప్పడంతో ఫరూక్ ఆగ్రహించి పోలీసుల తీరుపై చీఫ్ మార్షల్ ను వివరణ కోరారు. 

స్కూల్ బస్సుకింద పడి విద్యార్థి మృతి

ప్రకాశం : జిల్లా మార్టూరు మండలం రాజుపాలెం శాంతినగర్ లో విషాదం నెలకొంది. స్కూల్ బస్సుకింద పడి నాల్గో తరగతి విద్యార్థి మృతి చెందాడు. 

13:34 - November 29, 2017

విశాఖ : రైళ్లు ఢీ కొట్టడంతో సుమారు 40 గొర్రెలు మృతిచెందాయి. విశాఖపట్నం పెందుర్తి రైల్వే స్టేషన్‌ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పెందుర్తి వంతెన దగ్గర పట్టాలు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. రైల్వే ట్రాక్‌కు దగ్గరలో పడుకున్న గొర్రెల కాపరికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

13:31 - November 29, 2017

హైదరాబాద్ : తొలిరోజు మెట్రో రైలులో ప్రయాణించేందుకు నగరవాసులు ఉత్సాహపడుతున్నారు. ఉదయం నుంచి అనేకమంది మెట్రో రైలులో ప్రయాణించారు. మెట్రో రైలు ప్రయాణం అద్బుతంగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక మెట్రోలో తొలిరోజు ప్రయాణం చేసేందుకు పలు స్కూలు యాజమాన్యాలు పిల్లలను తీసుకువస్తున్నారు. ఎస్‌ఆర్‌ నగర్‌లో మెట్రో రైలులో ప్రయాణించేందుకు వచ్చిన విద్యార్థులతో మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి ముచ్చటించారు. 

13:30 - November 29, 2017
13:30 - November 29, 2017
13:27 - November 29, 2017
13:19 - November 29, 2017

హైదరాబాద్ : రెండవ రోజు జీఈఎస్ సదస్సులో భాగంగా ఇవాళ ప్లీనరీ జరిగింది. దానికి మంత్రి కేటీఆర్ మాడరేటర్‌గా వ్యవహరించారు. ఈ ప్లీనరలో ప్యానలిస్టులుగా ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ చందా కొచ్చార్, ఇవాంకా ట్రంప్, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ సతీమణి చెర్రీ, డెల్ ఈఎంసీ కరేన్ క్వింటోస్‌లు ఉన్నారు. సాంకేతికరంగం అభివృద్ధితో మహిళలకు, మహిళా పారిశ్రామికవేత్తలకు అపార అవకాశాలు అందుబాటులోకి వచ్చినట్లు ఇవాంక ట్రంప్ అన్నారు. మహిళలు ఉద్యోగాలు చేస్తూ ఆర్థికంగా కుటుంబాలకు అండగా ఉంటున్నారన్నారు ఇవాంక. మహిళా పారిశ్రామికవేత్తల్లో నైపుణ్యాన్ని పెంచాలన్న ఉద్దేశంతో ఈ ప్లీనరీని నిర్వహించినట్లు కేటీఆర్‌ తెలిపారు. 

12:04 - November 29, 2017

పిల్లల కోసం కెరీర్ ను వదులుకుంటున్నారు : కొచ్చారు

హైదరాబాద్ : బిడ్డకు జన్మనిచ్చే సమయంలో చాలామంది కెరీర్ ను వదులుకుంటారని కానీ ఇలాంటి ఆలోచన చేయొద్దని ఐసీఐసీఐ చైర్మన్ చందాకొచ్చార్ అన్నారు. సీఎస్ఆర్ ద్వారా గ్రామీణ మహిళ వృద్ధికి పాటుపడుతున్నామని మహిళల్లో ఆత్మస్థైర్యాన్ని నింపినప్పుడే ముందుకెళ్లగలమని, మహిళలకు ఇంటి నుంచే పనిచేసే అవకాశాలు మరింత మెరుగుపరచాలని ఆమె తెలపారు.

పెట్టుబడి సమస్యగా మారింది : చెర్రీ

హైదరాబాద్ : వ్యాపార ప్రారంభానికి పెట్టుబడి సమస్యగా మారిందని బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ సతీమణి చెర్రీ అన్నారు. 

12:01 - November 29, 2017

కాకతీయ మెడికల్ కాలేజీలో గంజాయి కలకలం

వరంగల్ : కాకతీయ మెడికల్ కాలేజీలో గంజాయి కలకలం రేగింది. పుట్టినరోజు వేడుకల్లో మెడికోలు గంజాయి తీసుకున్నారు. గంజాయి మోతాదు ఎక్కువ కావడంతో వారిలో కొంత మంది అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఈ ఘటనపై రంగంలోకి దిగిన మెడికల్ కాలేజీ అధికారులు విచారణ జరిపి 22మంది విద్యార్థులపై 2 నెలలపాటు సస్పెన్షన్ విధించారు.

కాపు కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి

గుంటూరు : కాపు కార్పొరేషన్ ద్వారా ఉపాధి కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. రూ.1.20కోట్లతో కార్ల కొని 16 మందికి ఉపాధి కల్పిస్తున్నామని, ఎన్టీఆర్ ట్రస్ట్ సౌజన్యంతో వారికి ఉపాధి నైపుణ్యాభివృద్ధి కల్పిస్తున్నామమని ఆయన తెలిపారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు మరిన్ని నిధులు ఖర్చు పెట్టి ఉపాధి కల్పించడానికి సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు ప్రకటించారు.

చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి

గుంటూరు : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి కలిశారు. టీడీపీలో మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి చేరికను ప్రభాకర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 

11:13 - November 29, 2017

వరంగల్ : కాకతీయ మెడికల్ కాలేజీలో గంజాయి కలకలం రేగింది. పుట్టినరోజు వేడుకల్లో మెడికోలు గంజాయి తీసుకున్నారు. గంజాయి మోతాదు ఎక్కువ కావడంతో వారిలో కొంత మంది అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఈ ఘటనపై రంగంలోకి దిగిన మెడికల్ కాలేజీ అధికారులు విచారణ జరిపి 22మంది విద్యార్థులపై 2 నెలలపాటు సస్పెన్షన్ విధించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

రెండోరోజు కొనసాగుతున్న జీఈఎస్ సదస్సు

హైదరాబాద్ : హెచ్ఐసీసీలో రెండో రోజు ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు కొనసాగుతుంది. సదస్సులో ఇవాంక, బ్రిటన్ మాజీ అధ్యక్షుడు బ్లెయిర్ సతీమణి చెర్రి పాల్గొన్నారు. సదస్సుకు సమన్వయకర్తగా కేటీఆర్ వ్యవహరిస్తున్నారు.

10:08 - November 29, 2017

జీఈఎస్ ప్రతినిధుల కోసం ముస్తాబైన గోల్కొండ

హైదరాబాద్ : జీఈఎస్ ప్రతినిధుల విందు కోసం గోల్కొండ కోటను ముస్తాబు చేశారు. ఈ విందులో 2500 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. వింద కారణంగా నేడు గోల్కొండ కోటలోకి పర్యాటకులకు అనుమతి నిలిపపివేశారు. 

10:05 - November 29, 2017

ఆహ్మాదబాద్ : గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెస్‌ల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. అధికారమే లక్ష్యంగా బిజెపి, కాంగ్రెస్‌ పార్టీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ముఖ్యంగా స్వరాష్ట్రంలో జరుగుతున్న ఈ ఎన్నికలు ప్రధాని మోదికి ప్రతిష్టాత్మకంగా మారాయి. గుజరాత్‌కు మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నరేంద్రమోది ప్రధాని కేంద్రానికి వెళ్లిపోవడంతో రాష్ట్రంలో బిజెపి పరిస్థితి నానాటికి దిగజారుతూ వచ్చింది. అవినీతి ఆరోపణలు... అస్తవ్యస్త పాలన... పాటీదార్, ఓబిసి, దళిత ఉద్యమాలు ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కరి చేశాయి. దీంతో గతంలో ఎప్పుడూ లేనివిధంగా బిజెపికి ఎదురుగాలి వీస్తోంది. వీటికి తోడు మోది ప్రభుత్వం తీసుకున్న నోట్లరద్దు, జిఎస్‌టి నిర్ణయాలపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. వీటికి తోడు బిజెపి చీఫ్‌ అమిత్‌షా, మాజీ సిఎం ఆనందీబెన్‌ పటేల్‌ మధ్య విభేదాలు... సిఎం బాధ్యతలు చేపట్టిన విజయ్‌ రూపానీ బలమైన నేత కాకపోవడం... కాంగ్రెస్‌కు అనుకూలంగా మారినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇన్ని ప్రతికూలతల మధ్య కూడా మోది చరిష్మా తమను అధికారంలోకి తెస్తుందని బిజెపి పార్టీవర్గాలు విశ్వసిస్తున్నాయి.

1990 నుంచి అధికారానికి దూరమైన కాంగ్రెస్‌
మరోవైపు 1990 నుంచి అధికారానికి దూరమైన కాంగ్రెస్‌ తిరిగి అధికారాన్ని కైవసం చేసుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. నోట్లరద్దు, జిఎస్‌టిల నిర్ణయాలతో దేశ ఆర్థికవృద్ధి మందగించిందని బిజెపి ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తోంది. బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన సామాజిక ఉద్యమాలను కాంగ్రెస్‌ పార్టీ తనకు అనూకూలంగా మార్చుకుంది. పాటీదార్‌ ఉద్యమనేత హార్దిక్‌ పటేల్, దళిత యువనేత జిగ్నేష్‌, ఓబిసి నేత అల్పేష్‌ ఠాకూర్‌ల మద్దతుతో కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఎన్నికల్లో ఆత్మవిశ్వాసంతో దూసుకెళ్తున్నారు. ఈ సామాజిక సమీకరణాలు కాంగ్రెస్‌కు ఎంతవరకు లాభం చేకూరుస్తాయన్నది వేచి చూడాలి.

నేడు వ్యవసాయం, మహిళలపై జీఈఎస్ సదస్సు

హైదరాబాద్ : నేడు రెండో రోజు జీఈఎస్ సదస్సులో మహిళా సాధికారత, వ్యవసాయం, పెట్టుబడులు, వ్యాపార మెలకువలు, ఆరోగ్యం, క్రీడలు, మీడియా వినోద రంగాలపై దాదాపు 25 సమావేశాలు జరగనున్నాయి. 

09:20 - November 29, 2017

హైదరాబాద్ : నేడు రెండో రోజు జీఈఎస్ సదస్సులో మహిళా సాధికారత, వ్యవసాయం, పెట్టుబడులు, వ్యాపార మెలకువలు, ఆరోగ్యం, క్రీడలు, మీడియా వినోద రంగాలపై దాదాపు 25 సమావేశాలు జరగనున్నాయి. ఈ రోజు సదస్సు కు కేటీఆర్ సమన్వయకర్తగా వ్యవహరించనున్నారు. 

నేడు కాగజ్ నగర్ లో బీజేపీ ప్రజాపోరు సభ

ఆసిఫాబాద్ : జిల్లా కాగజ్ నగర్ లో నేడు బీజేపీ ప్రజా పోరు సభ జరగనుంది. ఈ సభకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ హాజరు కానున్నారు. 

09:09 - November 29, 2017

 

ఢిల్లీ : పద్మావతి సినిమా నిలిపివేయాలని సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషిన్ పై సుప్రీం విచారణ జరిపింది. పద్మావతి నలివేయాలేమని, ప్రస్తుతం సినిమా సెన్సర్ చేతిలో ఉన్నప్పుడు వివిధ రాష్ట్రల ముఖ్యమంత్రులు సినిమాపై వ్యాఖ్యలు చేయడం మంచికాదని కోర్టు అభిప్రాయపడింది. ఈ సినిమా పై నిర్ణయం తీసుకునే అధికారం సెన్సర్ కు ఉందని కోర్టు తేల్చి చెప్పింది.

09:05 - November 29, 2017

నేడు ఢిల్లీకి కామినేని, ఫాతిమా విద్యార్థులు

ఢిల్లీ : నేడు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాను, కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి పీతి సూదన్, ఎంసీఐ ప్రతినిధులను మంత్రి కామినేని, కడప ఫాతిమా విద్యార్థులు కలవనున్నారు.

08:19 - November 29, 2017

హైదరాబాద్ : సామాన్య ప్రయాణికులకు మెట్రో అందుబాటులోకి వచ్చింది. ఈ రోజు ఉదయం 6గంటలకు మొదటి మెట్రో ప్రారంభమైంది. మొదటి సర్వీసు నాగోల్ టూ మియాపూర్ మధ్య ప్రారంభమైంది. ఉదయం 6గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మెట్రో సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఒక్కొ రైలు 3 కోచ్ లు ఉన్నాయి. కోచ్ 330 ప్రయాణించాడానికి వీలుంటుంది. ఈ రోజు లక్ష మంది ప్రయాణించే అవకాశం ఉందని అంచన వేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి. 

21వ రోజుకు చేరిన జగన్ ప్రజా సంకల్ప యాత్ర

కర్నూలు : వైసీపీ అధ్యక్షడు వైఎస్ జగన్ చేస్తున్న ప్రజా సంకల్ప యాత్ర 21వ రోజుకు చేరుకుంది. నేడు గోనెగండ్ల మండలం లో పాదయాత్ర కొనసాగుతుంది. 

08:05 - November 29, 2017

హైదరాబాద్ : సామాన్య ప్రయాణికులకు మెట్రో అందుబాటులోకి వచ్చింది. ఈ రోజు ఉదయం 6గంటలకు మొదటి మెట్రో ప్రారంభమైంది. మొదటి సర్వీసు నాగోల్ టూ మియాపూర్ మధ్య ప్రారంభమైంది. ఉదయం 6గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మెట్రో సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఒక్కొ రైలు 3 కోచ్ లు ఉన్నాయి. కోచ్ 330 ప్రయాణించాడానికి వీలుంటుంది. ఈ రోజు లక్ష మంది ప్రయాణించే అవకాశం ఉందని అంచన వేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి. 

ప్రారంభమైన మెట్రో రైలు ప్రయాణం

హైదరాబాద్ : సామాన్య ప్రయాణికులకు మెట్రో అందుబాటులోకి వచ్చింది. ఈ రోజు ఉదయం 6గంటలకు మొదటి మెట్రో ప్రారంభమైంది. మొదటి సర్వీసు నాగోల్ టూ మియాపూర్ మధ్య ప్రారంభమైంది. ఉదయం 6గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మెట్రో సర్వీసులు అందుబాటులో ఉంటాయి. 

నేడు ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన ఆక్వాఫుడ్ వ్యతిరేక సమితి

గుంటూరు : నేడు ఛలో అసెంబ్లీకి తుండుర్రు ఆక్వాఫుడ్ పార్క్ వ్యతిరేక పోరాట సమితి పిలునిచ్చింది. 

07:20 - November 29, 2017

హైదరాబాద్ మెట్రో రైలు ప్రారంభోత్సవంలో నగర ప్రథమ పౌరుడు పేరులేకపోవడం ప్రభుత్వం బీసీల ఇస్తున్న ప్రాముఖ్యత అర్థమైందని, అంతేకాకుండా ప్రారంభం కాకుండానే హైదరాబాద్ మెట్రో చార్జీల్లో రికార్డు సృష్టించిందని, సామాన్య మానవుడు మెట్రో రైల్లో ప్రయాణించే చాన్స్ ఉండదని సీపీఎం నేత బండరి రవికుమార్ అన్నారు. ప్రపంచం గర్వించదగ్గ మహిళ పారిశ్రమిక సదస్సు నిన్న జరిగిందని, సౌత్ ఇండియాలో ఇలా జరగడం మొదటిసారి అని మోడీ అన్నారని టీఆర్ఎస్ నేత రాజమోహన్ అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

నేడు అర్కేనగర్ అభ్యర్థిని ప్రకటించనున్న అన్నాడీఎంకే

చెన్నై : అర్కేనగర్ ఉపఎన్నిక కు అన్నాడీఎంకే పార్టీ అభ్యర్థిని ప్రకటించనుంది. డిసెంబర్ 21న అర్కే నగర్ ఉపఎన్నిక జరగునుంది. జయలలిత మరణంతో ఇక్కడ ఖాలీ ఏర్పాడింది. 

నేటి నుంచి అందుబాటులోకి మెట్రో

హైదరాబాద్ : నేటి నుంచి మోట్రో రైలు సర్వీసు సామాన్యులకు అందుబాటులోకి రానుంది. ప్రతి రోజు ఉదయం 6 నుంచి రాంత్రి 10గంటల వరకు మెట్రో సర్వీసులు అందుబాటులో ఉంటాయి.

06:52 - November 29, 2017

బీసీల పట్ల తెలంగాణ ప్రభుత్వ విధానం ఏంటీ ? డిసెంబరు 3న కేసీఆర్‌ నిర్వహిస్తున్న బీసీ ప్రజాప్రతినిధుల సమావేశంలో బీసీలు కోరుకుంటున్న చర్చ ఏంటీ ? ప్రస్తుతం బీసీలు వినిపిస్తున్న ప్రధాన డిమండ్‌ ఏమిటి? కేసీఆర్ అధికారంలోకి రాకుముందు బీసీల కోసం ప్రత్యేక నోట్ విడుదల చేశారు. తాము అధికారంలోకి రాగానే 5వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారని, సబ్ ప్లాన్ సాధన కోసం మేము బీసీ సంక్షేమ మంత్రి జోగు రామన్నను, ఈటెల రాజేందర్ ను కూడా కలిశామని జోగు రామన్న తమతో సబ్ ప్లాన్ కంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నామని అన్నారని, బీసీలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చెందలంటే బీసీలకు కేటాయించే బడ్జెట్ పెంచాలని అని బీసీ సబ్ ప్లాన్ సాధన సమితి కార్యదర్శి గోపాల్ అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

06:51 - November 29, 2017

శ్రీకాకుళం : జిల్లా హిరమండలం లోని వంశధార నిర్వాసిత గ్రామాలు కన్నీటి పర్యంతమవుతున్నాయి. భూములను త్యాగం చేసిన నిర్వాసితుల గోడు పట్టించుకోకుండా, న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకుండా.. ఇల్లు కూల్చివేసి తరిమేస్తుండటంతో చేసేదేమీ లేక నిర్వాసితులు ఉసూరుమంటూ ఊళ్లు వదిలి వెళుతున్నారు.

7500 కుటుంబాలు నిర్వాసితులు
వంశధార రిజర్వాయర్ కోసం కొత్తూరు, ఎల్.ఎన్.పేట, హిరమండలం మండలాల్లోని ఇరవై గ్రామాలకు చెందిన 7500 కుటుంబాలు నిర్వాసితులుగా మారాయి. వీరితో పాటు మరో మూడువేల ఫ్యామిలీలు కూడా ఎఫెక్ట్‌ అవుతున్నాయి. దాదాపు పన్నెండు వేల ఎకరాల భూసేకరణతో మూడు మండలాల్లోని ఇరవై గ్రామాలకు ఖాళీ చెయ్యాలని సర్కారు ఆదేశిచించింది. నిర్వాసిత ప్యాకేజిలో భాగంగా ఇతర ప్రాంతాల్లో నిర్మించిన కాలనీలు ఇంకా పూర్తి కాలేదు. అక్కడ సౌకర్యాలు సైతం అరకొరగానే ఉన్నాయి. సౌకర్యాలు లేని చోటుకు ఎందుకు వెళ్లమంటారని ప్రశ్నిస్తే.. ప్రభుత్వం ఆదేశం అంటూ అధికారులు దౌర్జన్యం చేస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లను బుల్ డోజర్లతో కూల్చివేస్తుండటంతో కృష్ణాపురం గ్రామస్థులు ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నారు. తాతలు, తండ్రులు కాలం నుండి ఉన్న జ్ఞాపకాలను శిథిలం చేస్తుండటంతో బరువెక్కిన గుండెతో గ్రామాన్ని విడిచి వెళుతున్నారు.

చివరిసారిగా దండం పెట్టుకొంటున్నారు...
అటు మరో రెండు నెలల వ్యవధిలో హిరమండలం, కొత్తూరు, లక్ష్మీనర్సుపేట మండలాల్లోని మిగతా నిర్వాసిత గ్రామాలను కూడా ఖాళీ చేయించేందుకు సర్కారు సన్నద్ధమవుతోంది. ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో నిర్వాసితులు ఆవేదన చెందుతున్నారు. తాతలు తండ్రుల కాలం నుంచి గొప్పగా వెలిగిన తమ గ్రామాలు మట్టిలో కలసిపోతుండటంతో... చివరిసారిగా దండం పెట్టుకొంటున్నారు. కన్నతల్లిలాంటి ఊరును వదిలేస్తూ కన్నీటితో తరలిపోతున్నారు.  

06:49 - November 29, 2017

చిత్తూరు : తిరుమలేసుని దర్శనం అనగానే ముందుగా గుర్తుకొచ్చేది ఎంతకీ తరగని క్యూలైన్లు, కంపార్టుమెంట్లలో గంటల తరబడి నిరీక్షించే భక్తులు... ఇక ఈ అగచాట్లకు చెల్లుచెప్పాలని టీటీడీ కసరత్తు చేస్తోంది. సర్వదర్శనం భక్తులకు కూడా టైంస్లాట్ విధానం అమల్లోకి తెస్తోంది. టైంస్లాట్ విధానంవల్ల సాధారణభక్తులు కూడా టోకెన్లు పొంది ఎంతటి రద్దీ ఉన్నా.. కేటాయించిన సమయంలో స్వామిని దర్శించుకోవచ్చు. దీంతో సర్వదర్శనంలో వచ్చే భక్తులు కూడా రెండు గంటల్లోపుగానే శ్రీవారిని దర్శించుకునే వీలు కలుగుతుందని టీటీడీ అధికారులు అంటున్నారు.

ఇప్పటికే 300 రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు
ఇప్పటికే 300 రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లతోపాటు నడకదారి దివ్యదర్శం భక్తులకు టైం స్లాట్ టోకెన్లు జారీ చేస్తున్నారు. ఈవిధానంలో నిత్యం 40 వేలమందివరకు భక్తులు రెండు గంటల్లోనే శ్రీవారిని దర్శించుకుంటున్నారు. అదే టైంస్లాట్ విధానాన్ని ఇపుడు సామాన్య భక్తులకు కూడా అమలు చేయడానికి టిటిడి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే టైం స్లాట్ టోకెన్ పొందాలంటే ఆధార్ కార్డును తప్పనిసరి చేశారు. ఒక్కసారి టోకెన్ పొందిన వారికి 48 గంటల వరకు మరోటోకెన్ పొందే అవకాశం ఉండదు. డిసెంబర్‌ రెండో వారం నుంచి ప్రయోగాత్మకంగా చేపడుతున్న సర్వదర్శనం టైంస్లాట్‌ విధానాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు టీటీడీ సన్నద్ధమవుతోంది. టైంస్లాట్ విధానం ద్వారా నిత్యం 22 వేల నుంచి 38 వేల మంది భక్తులకు సర్వదర్శనం టోకెన్లు జారీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమలలో 14 ప్రాంతాలలో 107 కౌంటర్లు ద్వారా టోకెన్లు జారీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

ఆధార్‌కార్డుతో టోకెన్లు
ఒకవేళ ఆధార్‌కార్డు లేనివారు, లేదా ఆధార్‌కార్డు చూపించడానికి ఇష్టపడని వారు ఎప్పటిలాగానే పాతవిధానంలో సర్వదర్శనం చేసుకోవచ్చని టీటీడీ అధికారులు అంటున్నారు. మొత్తానికి తిరుమలేశుని దర్శనం శీఘ్రంగా జరగనుందన్న టీటీడీ అధికారుల ప్రకటనతో సామన్య భక్తుల్లో హర్షం వ్యక్తం అవుతోంది.

06:48 - November 29, 2017

హైదరాబాద్ : వీంద్రభారతిలో సంకల్ప్‌దివస్‌ పేరుతో సుచిర్ ఇండియా పౌండేషన్ నిర్వహించిన కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంది. రామన్ మెగాససే అవార్డు గ్రహీత హరిష్ హండే, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ సలహదారు వేణుగోపాచారీ, మంగోలీయా రాయబారి గాంచింగ్యాన్‌ బోల్డ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మానసిక వికలాంగుల కోసం సుచిరిఇండియా చైర్మన్ కిరణ్ కుమార్ చేస్తున్న సేవా కార్యక్రమాలను వక్తలు అభినందించారు. ఈసందర్బంగా ప్రేరణ వెల్పేర్ సోసైటి, శ్రీవిద్య స్కూల్ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.  

06:48 - November 29, 2017

కడప : కడప ఉక్కు రాయలసీమ హక్కు అంటూ యువజన, విద్యార్థిసంఘాలు పోరుబాట పట్టాయి. రాయలసీమలో ఉక్కుపరిశ్రమ నిర్మాణం సాధించాలన్న లక్ష్యంతో మంగళవారం నుంచి రాయలసీమ వ్యాప్తంగా పర్యటించడానికి జీపుజాతా ప్రారంభమైంది. మరిన్ని వివరాలకు వీడియో చూడండి.

06:47 - November 29, 2017

హైదరాబాద్: ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఇవాంకా ట్రంప్‌కు ఘనంగా విందు ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. జీఈ సమ్మిట్‌కు హాజరైన పారిశ్రామికవేత్తల్లో ముఖ్యులు ఈ విందులో పాల్గొన్నారు. మరోవైపు ఫలక్‌నుమా ప్యాలెస్‌ నుంచి ఇవాంకా ట్రైడెంట్‌ హోటల్‌కు చేరుకున్నారు. ప్రధాని మోదీ శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి వెళ్లారు.  

విద్యుత్ షాక్ తో ఇద్దరు మృతి

యాదాద్రి : జిల్లా వలిగొండ మంలం వెల్వర్తి గ్రామంలో విషాదం నెలకొంది. విద్యుత్ షాక్ తో ఇద్దరు మృతి చెందారు. మృతులు శేఖర్, లింగం ముదిరాజ్ గా గుర్తించారు.

కడపలో విషాదం

కడప : జిల్లా దువ్వూరు మండలం సల్లబసయ్యపల్లె వద్ద తెలుగు గంగ కాల్వలో ఈతకు వెళ్లి ముగ్గురు మృతి చెందారు. మృతులు ప్రొద్దూటూరు మండలం గొల్లవరం వాసులుగా గుర్తించారు. 

Don't Miss