Activities calendar

30 November 2017

21:31 - November 30, 2017

పశ్చిమ బెంగాల్ : రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పొరపాటున టార్చ్‌లైట్‌ను పట్టుకుని మైక్ అనుకొని మాట్లాడబోయారు. కోల్‌కతాలో ఓ వేదికపై జరిగిన ఈ ఘటనకు సంబంధించిన 16 సెకన్ల వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎప్పడూ హడావుడిగా కనబడే మమతా ... అదే జోష్‌లో స్టేజ్ మీద ఉన్న ఓ వ్యక్తి చేతి నుంచి సడన్‌గా టార్చ్‌లైట్‌ను అందుకున్నారు. అదే మైక్ అనుకున్న దీదీ.. తన నోటి దగ్గర పెట్టి ప్రసంగం చేయబోయారు. టార్చ్ వెలుతురు తన ముఖంపై పడుతున్నా.. ఆమె అలాగే మాట్లాడేందుకు ప్రయత్నించారు. దీన్ని గమనించిన సిబ్బంది.. వెంటనే ఆమె చేతిలో ఉన్న టార్చ్‌ను లాగేశారు. ఆ తర్వాత మైక్ అందుకుని మమత తన ప్రసంగం మొదలుపెట్టారు. 

21:30 - November 30, 2017

ఢిల్లీ : తమిళనాడు, కేరళ రాష్ట్రాలను ఓఖీ తుపాను వణికిస్తోంది. తుఫాను ప్రభావంతో తీర ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తుపాను ధాటికి వందలాది చెట్లు నేలకూలాయి. ఓఖీ బీభత్సానికి నలుగురు మృతి చెందారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఓఖీ తుఫానుగా మారింది. తుఫాను ప్రభావంతో తమిళనాడు, కేరళ, లక్షద్వీప్‌లలో భారీ వర్షాలు కురుస్తుండడంతో జనజీవనం స్తంభించిపోయింది.

భారీ వర్షాలకు కన్యాకుమారి జిల్లా అతలాకుతలమైంది. బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. బలమైన గాలులు వీస్తుండడంతో వందలాది చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. కరెంట్‌ లేక పలు ప్రాంతాలు అంధకారంలో మునిగిపోయాయి. తుపాను ధాటికి ఇప్పటివరకు నలుగురు మృతిచెందారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు అందించడానికి ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి. రోడ్లపై పడిపోయిన చెట్లను తొలగించడానికి జిల్లా అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. తిరునల్వేలి, టుటికొరిన్‌, విరుద్‌నగర్‌, తంజావూర్‌, తదితర జిల్లాల్లో స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలను మూసివేశారు. వర్షాల కారణంగా పలు రైళ్లు రద్దయ్యాయి. మరో 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.

భారీ వర్షం వల్ల పవిత్ర పుణ్యక్షేత్రం శబరిమలకు వెళ్లే రహదారులు మూసివేశారు. దీంతో శబరిమల ఆలయంలో గురువారం సాయంత్రం 6గంటల నుంచి శుక్రవారం ఉదయం 7గంటల వరకు దర్శనం నిలిపివేశారు. సన్నిధానం, పంబ వద్ద ఉన్న భక్తులు సురక్షిత ప్రాంతాలను వెళ్లాలని అధికారులు సూచించారు. చెట్ల వద్ద, పల్లపు ప్రాంతాల్లో ఉండరాదని, నదులు, సరస్సులో స్నానాలు చేయవద్దని హెచ్చరించారు. 

21:28 - November 30, 2017
21:27 - November 30, 2017

కర్నూలు : ఏపీకి 15 ఏళ్లు ప్రత్యేక హోదా కావాలన్న చంద్రబాబు.. కేసులకు భయపడి హోదా అంశాన్ని కేంద్రం ముందు తాకట్టు పెట్టారని వైసీపీ అధినేత జగన్‌ మండిపడ్డారు. మహాసంకల్ప యాత్రలో భాగంగా కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం బిల్లేకల్‌ వద్ద జగన్‌ ప్రసంగించారు. చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని జగన్‌ మండిపడ్డారు. అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు.

కేంద్రంపై కడియం విమర్శలు...

హైదరాబాద్ : ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక ఆడపిల్లల విద్య కోసం ప్రత్యేక పథకాలు ఏవీ రూపొందించలేదన్నారు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి. మోడల్ స్కూల్స్‌ స్కీమ్‌ను కూడా ఎత్తివేశారని ఆరోపించారు.

21:25 - November 30, 2017

హైదరాబాద్ : ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక ఆడపిల్లల విద్య కోసం ప్రత్యేక పథకాలు ఏవీ రూపొందించలేదన్నారు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి. మోడల్ స్కూల్స్‌ స్కీమ్‌ను కూడా ఎత్తివేశారని ఆరోపించారు. ఇప్పటికే ఇస్తున్న నిధులలోనూ కేంద్రం కోత విధించిందని కడియం శ్రీహరి అన్నారు. హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లో జరిగిన మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్‌ ప్రతినిధులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మోడల్‌ స్కూల్స్‌ను కాపాడుకోవాలనే ఉద్దేశంలో రాష్ట్ర ప్రభుత్వమే సంవత్సరానికి 200 కోట్ల రూపాయలు భరిస్తోందని కడియం శ్రీహరి చెప్పారు.  

ప్రగతి భవన్ లో కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష...

హైదరాబాద్ : తెలుగు భాషాభివృద్ధి కోసం పాటుపడుతున్న సాహితీవేత్తలందరి సమక్షంలో హైదరాబాద్‌లో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ సూచించారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతితో పాటు తెలుగు భాష మాట్లాడే ప్రముఖులందరినీ మహాసభలకు ఆహ్వానించాలని చెప్పారు.

21:23 - November 30, 2017

హైదరాబాద్ : తెలుగు భాషాభివృద్ధి కోసం పాటుపడుతున్న సాహితీవేత్తలందరి సమక్షంలో హైదరాబాద్‌లో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ సూచించారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతితో పాటు తెలుగు భాష మాట్లాడే ప్రముఖులందరినీ మహాసభలకు ఆహ్వానించాలని చెప్పారు. డిసెంబర్ 15 నుంచి హైదరాబాద్‌లో జరిగే ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లపై ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ ఉన్నతస్ధాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు హరీష్‌రావు, ఈటెల రాజేందర్, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, సీఎస్‌ ఎస్పీసింగ్, డీజీపీ మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రమణాచారితో పాటు పలువురు ప్రముఖులు సమీక్షలో పాల్గొన్నారు. తెలుగు మహాసభల ప్రధాన వేదిక ఎల్బీ స్టేడియం డిజైన్‌ను.. హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాల్సిన తోరణాల డిజైన్లను పరిశీలించిన సీఎం వాటిని ఆమోదించారు. 

21:21 - November 30, 2017

 

విజయవాడ : పోలవరం ప్రాజెక్టు పనులను నిలిపివేయాలన్న కేంద్ర నీటిపాదుల శాఖ కార్యదర్శి అమర్‌జిత్‌ సింగ్‌ లేఖపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ఈ లేఖ రాష్ట్ర ప్రజల్లో లేనిపోని గందరగోళాన్ని సృష్టిస్తోందని అసెంబ్లీలో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలకు ఈ లేఖ ఆయుధంగా మారిందని ఆందోళన వెలిబుచ్చారు. దీనిపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో మాట్లాడాలని నిర్ణయించారు. అలాగే పోలవరం సహా విభజన చట్టంలోని హామీల అమలుపై ప్రధాని మోదీని కలిసి విన్నవించనున్నట్టు సభ దృష్టికి తెచ్చారు. ఏపీ పునర్విభజన చట్టంలోని హామీల అమలుపై అసెంబ్లీలో స్పల్పవ్యవధి చర్చ జరిగింది. చర్చలో పాల్గొన్న టీడీపీ సభ్యులు విభజన తర్వాత రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. రెవెన్యూ లోటు భర్తీకి కేంద్రం సరైన చర్యలు చేపట్టని అంశాన్ని ప్రస్తావించారు. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు నిధుల మంజూరు వంటి అంశాల్లో అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్రంలోని ప్రతిపక్షాల నుంచి ఎదురవుతున్న అడ్డుకుంలపై సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. విభజన చట్టంలోని హామీల అమలుపై సభలో జరిగిన చర్చకు సమాధానం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు... పోలవరం విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ప్రాజెక్టు ప్రారంభం నుంచి ప్రతిపక్షాలతో అవరోధాలు ఎదురవుతున్నాయన్నారు. ఏపీ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రధాన కాంట్రాక్టర్ల నుంచి కొన్ని పనులను వేరుచేసి నవంబర్‌ 18న కొత్తగా టెండర్లు పిలిచారు.

అయితే ఈ టెండర్లను నిలిపివేయాలంటూ కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి అమర్‌జిత్‌ సింగ్‌ రాసిన లేఖపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్న తరుణంలో కేంద్రం రాసిన లేఖ గందరగోళానికి దారి తీస్తోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అందరూ ఒప్పుకుని, సకాలంలో పూర్తి చేస్తామని హామీ ఇస్తే పోలవరం నిర్మాణాన్ని కేంద్రానికి అప్పగించేందుకు సిద్ధమని చంద్రబాబు స్పష్టం చేశారు. పోలవరం నిర్మాణం ఆలస్యమైతే జరిగే నష్టంపై చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం లేఖతో ఒకసారి కాంట్రాక్టర్లు వెళ్లిపోతే తిరిగి రప్పించడం ఎంతో కష్టమని సభ దృష్టికి తెచ్చారు. అనంతరం చంద్రబాబు మీడియాలో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ.. పోలవరం టెండర్ల విషయంలో కేంద్రం ఆపమంటే ఆపేస్తానని వ్యాఖ్యానించారు. కేంద్రం అదే వైఖరితోఉంటే వాళ్లకు అప్పగించి నమస్కారం పెడతానన్నారు. పనులు ఆరు నెలల పాటు ఆగిపోతే మళ్లీ దారిలో పెట్టడం కష్టమని ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరంపై ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో అర్థం కావడంలేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.


మరోవైపు చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రాన్నికోరుతూ చంద్రబాబు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. అలాగే ఈ ఏడాది ఫిబ్రవరిలో అమరావతిలో జరిగిన జాతీయ మహిళా పార్లమెంటరీ సదస్సులో ఆమోదించిన తీర్మానాలతో రూపొందించిన అమరావతి డిక్లరేషన్‌ను అమలు చేయాలని కేంద్రాన్నికోరుతూ చంద్రబాబు ప్రవేశపెట్టిన మరో తీర్మానాన్ని కూడా అసెంబ్లీ ఆమోదించింది. అలాగే ఏపీ భూసేకరణ చట్ట సవరణ సహా ఎనిమిది బిల్లులను పాస్‌ చేసింది. రాష్ట్ర విభజన చట్టంలోని హామీలు చంద్రబాబు సమాధానం ముగిసిన తర్వాత స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు అసెంబ్లీని శనివారానికి వాయిదా వేశారు. 

 

21:13 - November 30, 2017

రాంకీ పవర్ ప్లాంట్ లో భారీ పేలుడు...

మేడ్చల్ : కాప్రా మండలం నందమూరి నగర్ లో రాంకీ పవర్ ప్లాంట్ నిర్మాణంలో భారీ పేలుడు సంభవించింది. భూగర్భంలో బ్లాస్టింగ్ ల వల్ల ఓ ఇంట్లో టీవీతో సహా ఫర్నీచర్ ధ్వంసమైంది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. బ్లాస్టింగ్ లతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. 

బాబుతో బీజేపీ నేతల భేటీ..

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబుతో ఏపీ బీజేపీ నేతలు భేటీ అయ్యారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ భేటీలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరి పాత్ర ఏమిటీ ? అనే అంశంపై చర్చించినట్లు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. 

ప్రధానితో మిస్ వరల్డ్..

ఢిల్లీ : మిస్ వరల్డ్ కిరీటాన్ని కైవసం చేసుకన్న మానుషీ ఛిల్లార్ గురువారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిశారు. కిరీటాన్ని కైవసం చేసుకోవడం పట్ల అప్పట్లోనే ట్విట్టర్ లో ప్రధాని మోడీ అభినందనలు తెలియచేసిన సంగతి తెలిసిందే. 

విద్యార్థినిలకు కలెక్టర్ పరామర్శ..

విజయవాడ : జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీలో ఆత్మహత్యాయత్నం చేసిన ముగ్గురు విద్యార్థినిలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిని కలెక్టర్ లక్ష్మీకాంతం పరామర్శించారు. ఫొటోలు యూ ట్యూబ్ లో తోటి విద్యార్థిని చెప్పడంతో భయంతోనే ఈ ప్రయత్నం చేశారని తెలిపారు. ఫొటోలు..వీడియోలను తీసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. 

20:24 - November 30, 2017

మామూలుగా గాలి పీల్చక పోతే చస్తారు.. కానీ, ఇక్కడ గాలి పీల్చినందుకు చస్తున్నారు..ఇది మామూలు గాలి కాదు.. ఊపిరితిత్తులను రోజుకింత కొరుక్కు తినేస్తోంది. ఇది ఏ ఒక్క ప్రదేశానికో, నగరానికో పరిమితం కాదు.. దేశంలోని పెద్ద పెద్ద నగరాలనుంచి, చిన్న స్థాయి పట్టణాల వరకు ఇదే పరిస్థితి. ఒక్కమాటలో చెప్పాలంటే వాయు కాలుష్యం అంతులేకుండా పెరుగుతోంది. ప్రాణాంతకంగా మారుతోంది. ఈ అంశంపై ప్రత్యేక కథనం...ఆకాశహర్మ్యాలు.. సకల సౌకర్యాలు..అత్యంత నాగరికం.. ఇక్కడ దొరకనిది లేదు.. అందనిది లేదు. కానీ, ఈ నగరాలే.. ప్రాణాలను తీసేస్తున్నాయి. ఆక్సిజన్ ని మింగేస్తూ, ప్రమాదకర వాయువులను అందిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. దేశమంతా కాలుష్య కాసారంలా మారుతోంది. ఆక్సిజన్ తక్కువ.. కార్బన్ ఎక్కువ.. పీలిస్తే రోగాలు ఖాయం..అటు ఢిల్లీ నుండి ఇటుహైదరాబాద్ వరకు..

కరీంనగర్ నుండి ఖమ్మం లాంటి పట్టణాల వరకు ఇదే తీరు. నిత్యం పెరుగుతున్న వాయు కాలుష్యం లక్షలాదిమందిని రోగాలపాల్జేస్తోంది.. ఉసురు తీస్తోంది. దేశానికే కాదు.. కాలుష్యానికీ క్యాపిటల్ గా నిలుస్తోంది.. పట్టపగలే పొగమంచు పేరుకుని ఎదురుగా వచ్చే వాహనాలే కనిపించని పరిస్థితి. పొల్యూషన్ లో బీజింగ్ ని దాటి శరగవేగంగా దూసుకుపోతోంది ఢిల్లీ.. ఢిల్లీలో ప్రజారోగ్యం ఇప్పటికే ప్రమాదంలో ఉంది. ఇదిలాగే సాగితే కొన్నాళ్లకు దేశ రాజధానిలో ఎలాంటి పరిస్థితి నెలకొంటుందో ఊహించటం కూడా కష్టమే..అన్ని అనర్ధాలకు కారణం కారణం ఏమిటి? నగరాలు ఎందుకు ఇంత కాలుష్య భరితంగా మారుతున్నాయి. ఒక్క భారత్ లోనే కాదు.. అనేక వర్ధమాన దేశాల గాలి ప్రమాదకరంగా ఎందుకు మారుతోంది? ఊహించని అనర్ధాలకు ఎందుకు కారణం అవుతోంది. దీనిని నియంత్రింకపోతే ఎలాంటి అనర్థాలు జరిగే అవకాశాలున్నాయి?

ప్రమాదపు చివరి అంచులో ఉన్నాం. వాయుకాలుష్యం ఇదే రీతిలో పెరిగితే దేశంలో సగం జనాభా ఆస్పత్రుల్లోనే మకాం పెట్టే పరిస్థితులు వచ్చినా ఆశ్చర్యపడాల్సిందే లేదు. పర్యావరణ ముప్పునుండి ఈ భూగోళాన్ని కాపాడుకోటానికి ఎలాంటి మార్గాలున్నాయి? వాయు కాలుష్యం.. గ్లోబల్ వార్మింగ్ కు కారణంగా మారకుండా నియంత్రించే మార్గాలే లేవా? ముందూ వెనుకా చూడకుండా అభివృద్ధి కోసం పరుగులో మిగుల్చుకుంటున్నది, పోగుచేస్తున్నది అపారమైన కాలుష్యాన్ని మాత్రమే. దీన్నిలాగే కొనసాగిస్తే ఇప్పటికే వెల్లువెత్తుతున్న విపత్తులు మరింత ఉగ్రరూపం దాల్చి ప్రపంచదేశాలను అన్ని రకాలుగా కబళించటం ఖాయం..అన్నిటికంటే ముందు నూట ముప్ఫై కోట్లతో నిండిన నిండు కుండలాంటి భారతదేశానికి ఈ పరిణామాలు వీలైనంత త్వరగా మేల్కొవలసిన అవసరాన్ని సూచిస్తున్నాయి. పూర్తి విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి…

20:23 - November 30, 2017

జీహెచ్ఎంసీ అధికారులకు ధమ్ముంటే.. ఆడ శీన్మ నటుడు అక్కినేని నాగార్జున అనె దొంగ.. కబ్జాకోర్.. ఎన్ కన్వెన్షన్ కాడ కబ్జావెట్టిండు.. చెర్వు శిఖం భూమిని ఆక్రమించిండు.. మన అధికారులకు ధమ్ముంటే వాడు గట్టుకున్న దాన్ని కూలగొట్టి చెర్వు శిఖం భూమిని చెర ఇడ్పియ్యమనుండ్రి సూద్దాం.. అదే పేదోడు ఎవ్వడన్న ఇంచు భూమి అటీటు జర్గితె వాని ఇంటికి జేసీబీలు సూటివెడ్తరు..పూర్తి ముచ్చట కోసం వీడియో క్లిక్ చేయండి. 

20:18 - November 30, 2017

అరే నాయనా ఈ బట్టెవాయి మాటలు ఇంటుంటే.. అవద్దాలే ఆత్మహత్య జేస్కోని సచ్చిపోతయా ఎట్ల అనిపిస్తున్నది.... అమ్మా దేవనపల్లి దొరసాని.. అలియాస్ కల్వకుంట్ల కవితగారు.. మీరు తక్షణమే రాజీనామా జేయాల్నంట.. మొన్ననే కండువా మార్చి తెల్గుదేశంల జేరిన ఎమ్మెల్యే మేడం ఉన్నదిగదా..? గిడ్డి ఈశ్వరీ మేడం.. అగో ఆమే ఏమంటున్నదంటే...ఆ తెలంగాణలున్న బీసీ ప్రజలారా.?? మీరు అసలైన సర్కాసు జూశే యాళ్లైంది.. అనుకుంటనే ఉన్న ఇప్పటికే ఆల్చమైంది చంద్రాలు మాట్లాడక.. మెట్రో రైలును మేము దెచ్చినమంటే మేమే దెచ్చినం అని అన్నిపార్టీలోళ్ల తలా ఒక చెయ్యేశిండ్రు.. యాదాద్రి లచ్చిమి నర్సింహా స్వామికి ప్రాణహాని ఉన్నట్టే అనిపిస్తున్నది..: జీహెచ్ఎంసీ అధికారులకు ధమ్ముంటే.. గీ గరం గరం ముచ్చట్లు చూడాలంటే వీడియో క్లిక్ చేయండి....

ముగ్గురు విద్యార్థినిల ఆత్మహత్యాయత్నం...

విజయవాడ : జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థినిలు ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం సృష్టించింది. 

20:01 - November 30, 2017

మూడు రోజుల పాటు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగిన ప్రపంచ పారిశ్రామివేత్తల సదస్సు ముగిసింది. జీఈఎస్‌ ముగింపు కార్యక్రమానికి హాజరైన తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌... ఈ సదస్సుతో హైదరాబాద్‌ ప్రాధాన్యత మరింత పెరిగిందన్నారు. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొన్న దేశ, విదేశీ ప్రతినిధులు ఈ కార్యక్రమంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఈ సదస్సు ఏం సాధించింది ? తదితర పరిణామాలపై టెన్ టివి ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ చర్చలో గోపాల్ రావు (తెలంగాణ పారిశ్రామిక వేత్తల సమాఖ్య సంయుక్త కార్యదర్శి), శశికుమార్ (ఎకనామిస్టు), యామిని (పారిశ్రామిక వేత్త)లు పాల్గొని అభిప్రాయాలు తెలిపారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

19:59 - November 30, 2017

హైదరాబాద్‌ : మూడు రోజుల పాటు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగిన ప్రపంచ పారిశ్రామివేత్తల సదస్సు ముగిసింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌... జీఈఎస్‌తో టెక్నాలజీ రంగంలో హైదరాబాద్‌ ప్రతిష్ఠ మరింత ఇనుమడించిందన్నారు. మహిళలకు అన్ని రంగాల్లో సమానావకాశాలు అన్న అంశంపై విస్తృతంగా చర్చించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సలహాదారు ఇవాంకాట్రంప్‌ మహిళా సాధికారతకు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. కేంద్ర ప్రభుత్వం, అమెరికా కలిసి సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహించాయి. ప్రధాని ప్రారంభించిన సదస్సుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సలహాదారు ఇవాంక ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొత్తం 150 దేశాల నుంచి 1500 మంది ప్రతినిధులు జీఈఎస్‌లో పాల్గొన్నారు. సదస్సులో మహిళా సాధికారతపై విస్తృత స్థాయిలో చర్చలు జరిగాయి.

మొదటి రోజు సదస్సు ప్రారంభం తర్వాత జరిగిన చర్చాగోష్ఠిలో ఇవాంకతోపాటు రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పాల్గొన్నారు. రెండో రోజు.. పారిశ్రామికరంగంలో మహిళ భాగస్వామ్యం పెంపుపై జరిగిన చర్చలో ఇవాంకతోపాటు బ్రిటన్‌ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌ సతీమణి చెర్రీ, ఐసీఐసీఐ బ్యాంకు మేనేజింగ్‌ డైరెక్టర్‌ చందా కొచ్చర్‌ పాల్గొన్నారు. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ మోడరేటర్‌గా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో.. ఇవాంక, చెర్రీ బ్లెయిర్‌, చందా కొచ్చర్‌... భారత్‌లో ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మహిళలకు ప్రాధాన్యత పెరగాల్సిన అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. మహిళా పారిశ్రామికవేత్తలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు, ప్రభుత్వాలు ముందుకు రాకపోవడంపై ఆందోళన వ్యక్తమైంది.

క్రీడల్లో మహిళల భాగస్వామ్యం అన్న అంశంపై జరిగిన చర్చలో టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా, మహిళా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌, బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌, క్రికెట్‌ వ్యాఖ్యాత హర్ష్‌ బోగ్లే పాల్గొన్నారు. క్రీడల్లో మహిళలకు తగిన ప్రోత్సాహం లేకపోవడం పట్ల సానియా మీర్జా, మిథాలీ రాజ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తమ్మీద ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు ఆద్యంతం ఉత్సాహభరిత వాతావరణంలో జరగడం పట్ల కార్యక్రమానికి హాజరైన ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. సదస్సులో పాల్గొన్న తెలుగు ప్రతినిధులు స్టార్టప్స్‌ను మరింత ప్రోత్సించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. జీఈఎస్‌ ముగింపు కార్యక్రమానికి హాజరైన తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌... ఈ సదస్సుతో హైదరాబాద్‌ ప్రాధాన్యత మరింత పెరిగిందన్నారు. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొన్న దేశ, విదేశీ ప్రతినిధులు ఈ కార్యక్రమంపై సంతృప్తి వ్యక్తం చేశారు. 

ముగిసిన ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు...

హైదరాబాద్‌ : నగరంలో మూడు రోజుల పాటు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగిన ప్రపంచ పారిశ్రామివేత్తల సదస్సు ముగిసింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌... జీఈఎస్‌తో టెక్నాలజీ రంగంలో హైదరాబాద్‌ ప్రతిష్ఠ మరింత ఇనుమడించిందన్నారు.  

టీఆర్టీ దరఖాస్తు గడవు పొడిగింపు..

హైదరాబాద్ : టీఆర్‌టీ దరఖాస్తు గడువును పొడిగించారు. డిసెంబర్ 15 వరకు టీఆర్‌టీ గడువును పొడిగిస్తూ టీఎస్‌పీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. వాస్తవానికి ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకునేందుకు ఇవాళ్టితో గడువు పూర్తి కానున్న సంగతి తెలిసిందే. 

మెట్రో స్టేషన్ ను సందర్శించిన డీజీపీ..మెట్రో ఎండీ..

హైదరాబాద్ : అమీర్‌పేట మెట్రో స్టేషన్‌ను మెట్రో ఎండీ ఎన్వీఎస్..డీజీపీ మహేందర్ రెడ్డి, అదనపు డీజీపీ అంజనీ కుమార్ లు పరిశీలించారు. అనంతరం మెట్రో స్టేషన్ల వద్ద ఉన్న పార్కింగ్ సమస్యలపై ఆయన మీడియాతో మాట్లాడారు.

 

మద్యం తాగి ట్రైన్ ఎక్కారో...

హైదరాబాద్ : మెట్రో రైలులో కొందరు మద్యం తాగి ప్రయాణించినట్లు గుర్తించామని... ఇక నుంచి మద్యం తాగి మెట్రో రైలులో ప్రయాణిస్తే జరిమానాలు విధిస్తామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు.

 

19:44 - November 30, 2017
19:42 - November 30, 2017
19:41 - November 30, 2017

విజయవాడ : పోలవరం ప్రాజక్టులో భారీ అవినీతి జరిగినట్లు కేంద్రం గమనించిందన్నారు వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ. అదే అంశంపై కేంద్రం రాష్ట్రానికి లేఖ రాసినట్లు బొత్స చెప్పారు. కాంట్రాక్టుల కోసమే పోలవరం నిర్మాణం చంద్రబాబు తన చేతుల్లోకి తీసుకున్నారని విమర్శించారు. విభజన చట్టం ప్రకారం కేంద్రమే పోలవరం కట్టాలని ప్రతిపక్షంగా ఎన్నిసార్లు చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం వినిపించుకోలేదని బొత్స సత్యనారాయణ అన్నారు. 

19:41 - November 30, 2017

విజయవాడ : రాష్ట్రంలోని అన్ని పాఠశాల్లో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అమ్మకు వందనం కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. తల్లులను స్కూళ్లకు పిలిపించి, పిల్లలతో కాళ్లు కడిగించి, పాదాభివందనం చేయించే కార్యక్రమమే అమ్మకు వందనం. మరో వైపు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మహిళల కోసం ప్రత్యేక పారిశ్రామికవాడల ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. మహిళా సాధికారతపై అసెంబ్లీలో జరిగిన చర్చకు సమాధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయాలను వెల్లడించారు. 

19:40 - November 30, 2017

విజయవాడ : రాష్ట్ర ప్రజలు అంగీకరిస్తే పోలవరాన్ని కేంద్రానికి అప్పగిస్తానని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తనకు ఎలాంటి భేషజాలు లేవన్న ఆయన... ప్రాజెక్టు పూర్తికావడమే తన లక్ష్యమన్నారు. సుమోటోగా తీసుకునైనా పోలవరం ప్రాజెక్టును కేంద్రం నిర్మించవచ్చని చంద్రబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టు ఆలస్యమైతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నష్టపోతాయని... ప్రాజెక్టు వ్యయం పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పీఎం అపాయింట్‌మెంట్‌ అడుగుతున్నానన్నారు. పోలవరానికి సహాయం చేయలేమని కేంద్రం చెబితే ఓ నమస్కారం పెట్టి తప్పుకుంటామని మీడియా చిట్‌చాట్‌లో చంద్రబాబు తెగేసి చెప్పారు. 

పోలవరం నిర్మాణంలో భారీ అవినీతి - బోత్స...

విజయవాడ : పోలవరం ప్రాజక్టులో భారీ అవినీతి జరిగినట్లు కేంద్రం గమనించిందన్నారు వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ. అదే అంశంపై కేంద్రం రాష్ట్రానికి లేఖ రాసినట్లు బొత్స చెప్పారు. 

పోలవరం కేంద్రానికి అప్పగిస్తా..అంగీకరిస్తేనే - బాబు...

విజయవాడ : రాష్ట్ర ప్రజలు అంగీకరిస్తే పోలవరాన్ని కేంద్రానికి అప్పగిస్తానని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తనకు ఎలాంటి భేషజాలు లేవన్న ఆయన... ప్రాజెక్టు పూర్తికావడమే తన లక్ష్యమన్నారు. 

నగరంలో ఒపియమ్ డ్రగ్

హైదరాబాద్ : నరగంలో ఒపియమ్ డ్రగ్ పట్టుబడింది. మహిపాల్ సింగ్ అనే వ్యక్తి టూవీలర్ ద్వారా డ్రగ్ ను సరఫరా చేస్తున్నాడు. సింగ్ 700గ్రాముల డ్రగ్ సరఫరా చేస్తుండగా ఎక్సైజ్ పోలీసులు అతని అరెస్టు చేశారు. అతను రాజస్థాన్ నుంచి డ్రగ్ తెచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తున్నాడు. 

17:30 - November 30, 2017

హైదరాబాద్ : నరగంలో ఒపియమ్ డ్రగ్ పట్టుబడింది. మహిపాల్ సింగ్ అనే వ్యక్తి టూవీలర్ ద్వారా డ్రగ్ ను సరఫరా చేస్తున్నాడు. సింగ్ 700గ్రాముల డ్రగ్ సరఫరా చేస్తుండగా ఎక్సైజ్ పోలీసులు అతని అరెస్టు చేశారు. అతను రాజస్థాన్ నుంచి డ్రగ్ తెచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తున్నాడు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

17:19 - November 30, 2017

మేడ్చల్ : 12రోజులుగా దీక్ష చేస్తున్న సంగీతకు న్యాయం చేయాలని మహిళా విద్యార్ధి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. SFI ఆధ్వర్యంలో విద్యార్ధినులు ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వం ఆమెకు ఇచ్చిన హామీలను తక్షణం అమలు చేయాలని.. లేదంటే తాము ఆందోళన ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. 

17:18 - November 30, 2017

కొత్తగూడెం : ల్లా కొత్తగూడెంలో గిరిజనులు చేపట్టిన ఆత్మగౌరవ ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తమ హక్కుల సాధన కోసం జిల్లా వ్యాప్తంగా ఉన్న 10వేల మంది గిరిజనులు ఆత్మ గౌరవ ర్యాలీకి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గిరిజనులంతా ర్యాలీగా కలెక్టర్ కార్యాలయానికి తరలివచ్చారు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన గిరిజనులు, పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

17:16 - November 30, 2017

మహబుబ్ నగర్ : నిరుద్యోగ సమస్య తొలిగిపోయే వరకు ప్రభుత్వంపై పోరాటం చేస్తామని టీజేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ అన్నారు. మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన ర్యాలీలో కోదండరామ్‌ పాల్గొన్నారు. వచ్చే నెల 4వ తేదీన హైదరాబాద్‌లో జరిగే కొలువుల కొట్లాట సభను విజయవంతం చేయాలన్నారు. ఫిబ్రవరి నుంచి ప్రభుత్వం తీరుపై ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని కోదండరామ్‌ అన్నారు. 

17:09 - November 30, 2017

మెట్రో భద్రతపై పోలీస్ సమావేశం

హైదరాబాద్ : డీజీపీ మహేందర్ రెడ్డి అమీర్ పేట మెట్రో స్టేషన్ ను పరిశీలించారు. అనంతరం స్టేషన్లలో భద్రతపై పోలీస్ ఉన్నతాధికారుల సమావేశం నిర్వహించబోతున్నారు. 

17:05 - November 30, 2017

హైదరాబాద్ : డీజీపీ మహేందర్ రెడ్డి అమీర్ పేట మెట్రో స్టేషన్ ను పరిశీలించారు. అనంతరం స్టేషన్లలో భద్రతపై పోలీస్ ఉన్నతాధికారుల సమావేశం నిర్వహించబోతున్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

శబరిమలలో భారీ వర్షం

తిరుగునంతపురం :  కేరళలోని శబరిమలలో భారీ వర్షం కురిసంది. భారీ వర్షంతో శబరిమలకు వెళ్లే రహదారులను  మూసివేశారు. శబరిమలలో సాయంత్ర 6 గంటల నుంచి రేపు ఉదయం 7గంటల వరకు దర్శనం నిలివేయనున్నారు. 

అరేబియా సముద్రంలోకి ఓక్కీ తుఫాన్

విశాఖ : బంగాళఖాతం నుంచి కన్యాకుమారి మీదుగా ఏర్పాడిన ఓక్కీ తుఫాన్ అరేబియా సముద్రంలోకి వెళ్లింది. దీని ప్రభావం వల్ల దక్షణ తమిళనాడు, దక్షిణ కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఓక్కీ తుఫాన్ వల్ల కన్యాకుమారిలో ఐదుగురు మృతి చెందారు. 

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబై : భారీ నష్టాలతో స్టాక్ మార్కెట్లు ముగిశాయి. సెన్సెక్స్ 453 పాయింట్ల నష్టంతో 33,149 వద్ద ముగిసింది. నిఫ్టీ 147 పాయింట్ల నష్టంతో 10,214 వద్ద ముగిసింది. 

16:07 - November 30, 2017

ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి చిత్ర నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో హట్ టాఫిక్ గా మారింది. దేశానికి మంచి నాయకుడు కావాలనే ఉద్దేశంతోనే దేశ ప్రజలు మోడీని ప్రధానిగా ఎనుకున్నారని, కానీ ఆయన తీరు చూస్తే కొంత మందికే ప్రదాన మంత్రి అనే ఫీలింగ్ కలుగుతోందని ఆయన అన్నారు. ముఖ్యంగా బీజేపీ వాళ్లు సినిమాలపై విరుచుకుపడుతున్నారని, ఉడ్తా పంజాబ్, మెర్సల్, పద్మావతి ఇలా సినిమాలపై దాడులు జరుగుతున్న మీరు మౌనంగా ఉంటున్నారని, మౌనం సమ్మతం అన్నట్టుగానే కనిపిస్తుందని అన్నారు. 

16:07 - November 30, 2017
15:53 - November 30, 2017

హీరో రామ్ తో దిల్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఇదివరకు రామ్ తో కలిసి దిల్ రాజు రామ రామ కృష్ణ కృష్ణ సినిమా తీశాడు. చాలా కాలం తర్వాత దిల్ రాజు మళ్లీ రామ్ తీస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ చిత్రానికి నేను లోకల్ మూవీ ఫేమ్ నక్కిన శ్రీనాథరావు దర్శకత్వం వహించనున్నారు. ఇందులో సహజ నటుడు ప్రకాశ్ రాజు కీలక పాత్ర చేయనున్నట్టు సమాచారం. ఈ చిత్ర షూటింగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభిస్తామని, మిగతా నటీనటుల వివరాలు త్వరలో వెల్లడిస్తామని శ్రీ వెంకశ్వర క్రియేషన్స్ సంస్థ తెలిపింది.

బ్యాంక్ ను మోసం చేసిన కేసులో కోర్టు తీర్పు

హైదరాబాద్ : నారాయణ గూడలో విజయ బ్యాంక్ ను మోసం చేసిన కేసులో సీబీఐ కోర్టు తీర్పు వెల్లడించింది. సీబీఐ కోర్టు జైలు ఐదుగురికి ఐదేళ్ల చొప్పున జైలు శిక్ష విధించింది. నిందితుల్లో విజయ బ్యాంక్ మేనేజర్ రాజగోపాల్ రెడ్డి, ఉదయ్ శంకర్, రామోజీరావు, సాయి సీతారాం, అబ్బరాజు వెంకటసుబ్బారావు ఉన్నారు. 

15:35 - November 30, 2017

చెన్నై : రెండాకుల గుర్తుపై అన్నాడీఎంకేలో వర్గపోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. పళని-పన్నీర్‌ వర్గానికి రెండాకుల గుర్తు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ శశికళ వర్గం నేత దినకరన్‌ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. రెండాకుల గుర్తు పళని-పన్నీర్‌ వర్గానికి కేటాయిస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. రెండాకుల గుర్తును తమకే కేటాయించాలంటూ పళని-పన్నీర్‌ వర్గం, దినకరన్‌ వర్గం ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించాయి. దీనిపై విచారణ చేపట్టిన ఈసీ... పళని-పన్నీర్‌ వర్గానికి రెండాకుల గుర్తును కేటాయిస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

15:34 - November 30, 2017

చెన్నై : తమిళనాడులోని ఆర్కేనగర్‌ ఉప ఎన్నికకు అధికార అన్నాడీఎంకే అభ్యర్థిని ఖరారు చేసింది. ఎఐఎడిఎంకె ప్రిసీడియం ఛైర్మన్‌ ఈ.మధుసూదన్‌ను తమ అభ్యర్థిగా ప్రకటించింది. చెన్నైలోని పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం మధుసూదనన్ అభ్యర్థిత్వాన్ని ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. పార్టీ పార్లమెంటరీ బోర్టు కోఆర్డినేటర్‌గా పన్నీర్‌సెల్వం, కో కోఆర్డినేటర్‌గా పళనిస్వామి వ్యవహరిస్తున్నారు. ఏప్రిల్‌లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ మధుసూదన్‌ పోటీ చేశారు. అప్పుడు పన్నీర్‌ సెల్వం వర్గం తరఫున అన్నాడీఎంకే పురట్చి తలైవి అమ్మ పార్టీ నుంచి ఆయన పోటీచేశారు. అయితే కొన్ని పార్టీలు డబ్బులిచ్చి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశాయన్న ఆరోపణలు రావడంతో ఆ ఎన్నికలను రద్దు చేశారు. దీంతో మరోసారి ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. డిఎంకె అభ్యర్థిగా మరుదు గణేష్, శశికళ వర్గం నుంచి టిటివి దినకరన్‌ పోటీలో ఉంటారు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణంతో ఆర్‌కె నగర్‌ ఖాళీ అయింది. ఆర్‌కె నగర్‌కు డిసెంబర్‌ 21న ఉప ఎన్నిక జరగనుంది. డిసెంబర్‌ 24న ఎన్నికల ఫలితం వెలువడనుంది.

15:31 - November 30, 2017

రాజమహేంద్రవరం : ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు ఆడింది ఆట.. పాడింది పాటగా మారింది. రాజమండ్రిలో ఉన్నతాధికారులు విధులకు డుమ్మాకొట్టి సొంత పనులను చక్కదిద్దుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు కార్యాలయాలకు రాకపోవడంతో కిందిస్థాయి సిబ్బంది సైతం విధుల పట్ల అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. రాజమహేంద్రవరంలోని ఉద్యానవనశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కార్యాలయంలో అధికారుల తీరు గురించి వీడియో క్లిక్ చేయండి. 

15:29 - November 30, 2017

శ్రీకాకుళం : మార్కెట్లో అమ్ముతోంది కిలో 40 రూపాయలు, రైతులకు ఇస్తోంది ఒక్కరూపాయి. శ్రమకోర్చి పంటలు పండించిన రైతులకు అప్పులు మిగులుతుండగా.. శ్రమ ఫలితం మాత్రం దళారుల జేబుల్లోకి చేరుతోంది. శ్రీకాకుళం జిల్లాలో కాలీఫ్లవర్‌, క్యాబేజీరైతులు దళారుల చేతిలో దారుణంగా మోసపోతున్నారు. శ్రీకాకుళం జిల్లా పేరు చెబితేనే అందరికీ కూరగాయల వ్యవసాయం గుర్తుకు వస్తుంది. జిల్లా నలుమూలల నుంచే కాకుండా.. ఒరిస్సా వరకూ ఇక్కడి కూరగాయలకు మంచి డిమాండు ఉంది. జిల్లాలోని పాలకొండ, సీతంపేట, వీరఘట్టంతోపాటు కూరగాయల పంటలకు అనుకూలంగా ఉండే ఏజెన్సి ప్రాంతంలో గిరిజనరైతులు కూరగాయల పంటలనే సాగుచేస్తున్నారు.

వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా ఉండే శ్రీకాకుళంజిల్లా గిరిజన రైతులను దళారులు దారుణంగా మోసగిస్తున్నారు. వీరఘట్టం మండలంలో ప్రతిఏడాది వందలాది ఎకరాల్లో కాలిఫ్లవర్ పంటను వేస్తారు. అధిక ధరకు విత్తనాలు కొని.. విపత్తులకు ఎదురొడ్డి మరీ పంటలు వేసిన కర్షకులకు చివరికి అప్పులే మిగులుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో కిలో నలభై రూపాయల పైన కాలిఫ్లవర్ అమ్మకాలు జరుగుతున్నాయి. ఒక్కో పువ్వు చొప్పున అయినా పాతిక రూపాయలు పైనే పలుకుతోంది. కాని అవి పండిస్తున్న రైతులకు మాత్రం పువ్వుకు కేవలం రూపాయో.. రెండు రూపాయలో మాత్రమే అందుతున్నాయి. పొలం నుంచి మార్కెట్‌కు వెళ్ళే సమయం లోనే ఈ మార్కెట్ మాయాజాలం అంతా జరుగుతోంది.

పంటను నిల్వచేసుకోడానికి, మార్కెటింగ్‌కు సరైన సౌకర్యాలు లేకుండా పోయాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో తమ కష్టాన్ని తక్కువ ధరకే దళారులకు అప్పజెప్పుతున్నారు గిరిజన రైతులు. స్థానికంగా కూరగాయలకు స్టోరేజి సదుపాయం కల్పించడంతో పాటు, ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలని గడచిన కొన్నేళ్లుగా గిరిజనులు కోరుతున్నారు. అయితే వారి వేదన పాలకులు పట్టించుకోవడం లేదు. శ్రీకాకుళం జిల్లాలో ఈ దందాను పట్టించుకునేవారు లేకపోవడంతో దళారులు ఆడింది ఆట పాడిందే పాటగా మారింది. ఇప్పటికైనా వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ అధికారులు స్పందించి,దళారుల చేతిలో మోసపోతున్న గిరిజన రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. 

15:27 - November 30, 2017

కరీంనగర్ : ప్రభుత్వ నియమ నిబంధనలు విద్యాసంస్థల మనుగడకే ప్రశ్నార్ధకంగా మారాయంటూ.. ప్రభుత్వ గుర్తింపు విద్యాసంస్థలు మండిపడుతున్నాయి. దీంతో తమ సత్తా చాటుకునేందుకు ఉద్యమాలను ఉధృతం చేస్తున్నాయి. ఇప్పటికే కరీంనగర్ వేదికగా ఆత్మగౌరవ సభ నిర్వహించిన కేజీ టూ పీజీ విద్యాసంస్థలు.. నల్గొండ జిల్లా వేదికగా పోరు బాట పట్టాయి. ప్రభుత్వ విదానాలు సరళీకృతం చేయకుంటే ఆందోళనలు ఉదృతం చేస్తామంటున్న విద్యాసంస్థల నిర్వాహకులతో టెన్ టివి ముచ్చటించింది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

 

8 బిల్లులకు శాసనసభ ఆమోదం

గుంటూరు : ఏపీ శాసన సభ 8 బిల్లులకు ఆమోదం తెలిపింది. ఏపీ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి, ఏపీ పౌరసేవల హామీ, యూనివర్సిటీల్లో నియామకాలు, ఏపీపీఎస్సీకి అప్పగిస్తూ, భూ సేకరణ, పునరావాస పరిహార పారదర్శకత హక్కు సవరణ, వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయ రెండో సవరణ, వడ్డీ వ్యాపారుల నియంత్రణ, ఏపీ జలవనరుల అభివృద్ధి కార్పొరేషన్, నీటిపారుదల వ్యవస్థల యాజమన్య సవరణల బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. 

15:17 - November 30, 2017

జియో తన కస్టమర్లకు ఊరటనిచ్చే ప్రకటన చేసింది. జియో ప్రకటించిన ట్రిఫుల్ క్యాష్ బ్యాక్ ఆఫర్ ను డిసెంబర్ 15 తేదీవరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. కస్టమర్ల నుంచి వస్తున్న విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్ట కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. రూ.399 ప్లాన్ జియో యాప్ లేదా సైట్ ద్వారా రీచార్జు చేసుకుంటే వారికి రూ.400 విలువ గల ఓచర్లు లభిస్తాయి. ఒక్కొ ఓచరు విలువ రూ.50 ఉంటుంది.   

 

జమ్మూకాశ్మీర్ లో దారుణం

శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్ లోని కిష్టావర్ జిల్లా దులాస్టిలో దారుణం చేటుచేసుకుంది. సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ సురీందర్ భార్యతో పాటు మరో ఇద్దరిని హత్య చేశాడు. భార్యపై అనుమానంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది. మృతుల్లో నాసిక్ జిల్లాకు చెందిన కానిస్టేబుల్ రాజేశ్ ఉన్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన సురీందర్ 2014లో సీఐఎస్ఎఫ్ లో చేరాడు. 

14:49 - November 30, 2017

మహిళల పట్ల కొందరు నాయకులు..కొందరు ప్రజాప్రతినిధులు అనుచిత వ్యాఖ్యలు చేయడం సాధారణంగా మారిపోయాయి. ఇప్పుడు మరింత నిస్సిగ్గుగా మహిళలపై అవమానకరంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. వీరు ప్రజాప్రతినిధులా ? రాజ్యాంగపరంగా పాలన చేసే వారా ? నాయకులేనా ? ప్రశ్నించకోక తప్పదు. సమాజంలో సగభాగం ఉండడమే కాకుండా అన్ని రంగాల్లో పురుషుల కంటే ఎక్కువ ప్రతిభ కనబరుస్తున్న మహిళలను చులకగనా..అవమానకరంగా...మాట్లాడడం ఎలా చూడాలి ?

దిగజారుడు వ్యాఖ్యలతో మహిళా లోకాన్ని అవమానపరుస్తున్న నాయకులు..నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి ? ఈ అంశాలపై టెన్ టివి మానవి 'వేదిక' చర్చను చేపట్టింది. ఈ చర్చలో ఇందిరా శోభన్ (టి.కాంగ్రెస్), అనురాధ (ఐఎఫ్ టియు స్టేట్ జాయింట్ సెక్రటరీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

జీఈఎస్ సదస్సులో ప్రొటోకాల్ పాటించలేదు - పొంగులేటి..

హైదరాబాద్ : జీఈఎస్ సదస్సు నిర్వాహణలో ప్రొటోకాల్ పాటించకుండా ప్రజాప్రతినిధులను అవమానించారని ఎమ్మెల్సీ పొంగులేటి పేర్కొన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను రాజకీయాల కోసం అవమానించడం సరికాదని, మేయర్ పదవికి ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. ప్రొటోకాల్ పాటిచంకుండా జరిగిన పొరపాటుకు కారణాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. 

14:36 - November 30, 2017

విజయవాడ : ఏపీ శాసనసభలో గురువారం రెండు తీర్మానాలను ఆమోదించారు. సీఎం చంద్రబాబు నాయుడు మహిళా పార్లమెంట్ సదస్సు విజయవంతం..మహిళలకు రిజర్వేషన్ అంశాలపై తీర్మానాలు ప్రవేశ పెట్టారు. అంతకంటే ముందు సీఎం చంద్రబాబు మాట్లాడారు. పిల్లలను లేబర్ గా మారిస్తే కఠినంగా శిక్షిస్తామని..పీడీ యాక్టు ప్రయోగిస్తామని ఆనాడు చెప్పడం జరిగిందని సభకు తెలిపారు. మహిళా పార్లమెంట్ సదస్సు..చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్..తీర్మానాలను ప్రవేశ పెడుతున్నట్లు పేర్కొన్నారు. మహిళా పార్లమెంట్ సదస్సు విజయవంతం కృషి స్పీకర్ కోడెల ఎనలేని కృషి చేశారని..ఇందుకు శాసనసభ అభినందిస్తోందన్నారు. అమరావతిలో మహిళా పార్లమెంట్ జరగడం అభినందనీయమని..ఈ కార్యక్రమం ఇక్కడ జరగడం గర్వకారణమన్నారు. ఒక స్పూర్తిదాయక కార్యక్రమమన్నారు. మహిళా పార్లమెంట్ సదస్సుకు అందరూ సహకరించారని, అందరూ సహకరించిన బట్టే విజయవంతమైందని స్పీకర్ కోడెల పేర్కొన్నారు. మహిళలకు 33.33 రిజర్వేషన్ కోసం బాబు తీర్మానం ప్రవేశ పెట్టారు. అనేక మంది వీరవనితలు పుట్టిన ఘనతలో మహిళలు అనేక రంగాల్లో రాణిస్తున్నారని,

మహిళలు ఆకాశంలో సగభాగమనేది అక్షరసత్యమని..భారతీయ కుటుంబ వ్యవస్థలో మహిళలే నిజమైన యజమానులన్నారు. కార్పొరేట్ సంస్థలను ఒంటి చేత్తో పాలిస్తున్నారని..క్రీడారంగాల్లో..ఇలా ఎన్నో రంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో మహిళలు ముందున్నారని..చట్టసభలో వీరి ప్రాతినిధ్యం పెరగాలని సభ భావిస్తోందన్నారు. చట్టసభల్లో వీరికి సరియైన ప్రాతినిధ్యం లేకపోవడం సభ విచారం వ్యక్తం చేస్తోందని పేర్కొన్నారు. 

బాబుతో జేసీ తనయుడు..

విజయవాడ : టిడిపిలో గుర్నారథ రెడ్డి చేరికను జేసీ దివాకర్ రెడ్డి, అనంతపురం పార్టీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని జేసీ తనయుడు పవన్ కుమార్ రెడ్డి, గుర్నాథరెడ్డిలు కలిశారు. 

13:54 - November 30, 2017

వాట్సప్ తమ వినియోగదారులను అకట్టుకోవడానికి ఎప్పుడు ఎదో ఒక ఫీచర్ ను వాట్సప్ అడ్ చేస్తూ వస్తుంది. తాజాగా వాట్సప్ ఓ కొత్త ఫిచర్ ప్రవేశపెట్టింది. సాధారణంగా మనకు వాట్సప్ లో యూట్యూబ్ లింక్స్ వాస్తే వాటిని ఓపెన్ చేయాలంటే యూట్యూకు వెళ్లెవారు కానీ వాట్సప్ ఇప్పుడు తీసుకొచ్చిన ఫీచర్ ద్వారా చాట్ లో భాగంగానే వీటిని అక్కడే ప్లే చేసుకొవచ్చు.

మీడియాతో జేసీ చిట్ చాట్

గుంటూరు: అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చిట్ చాట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో తను పోటీ చేయనని, పార్లమెంట్ లో చేయడానికి ఏం లేదని అన్నారు. మా అబ్బాయి పార్లమెంట్ కు పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తన్నారని జేసీ తెలిపారు. పవన్ కల్యాణ్ ఆయన అన్నే శాపమని అన్నారు. 

13:46 - November 30, 2017

హైదరాబాద్ : మెట్రో ప్రయాణికులకు కొత్త కష్టాలు మొదలయ్యాయి. అమీర్‌పేట మెట్రో స్టేషన్‌ వద్ద వాహనాలకు పార్కింగ్‌ సౌకర్యం లేకపోవడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ట్రాఫిక్‌ పోలీసులు... స్టేషన్‌ వద్ద నిలిపి వుంచిన వాహనాలను పీఎస్‌కు తరలించారు. దీనిపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

 

13:44 - November 30, 2017

గుంటూరు : సాయంత్రం అనంతపురం మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి టీడీపీలో చేరుతున్నారు. ఈ నేపథ్యం ప్రస్తుత ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో గురునాథ్‌రెడ్డి చేరికకు తాను హాజరుకానని తెలిపారు. గురునాథ్‌రెడ్డి పక్కన ఫొటోకు కూడా తాను ఇష్టపడటం లేదని అంటున్నారు. చంద్రబాబు పక్కన నిల్చోడానికి కూడా గురునాథ్‌రెడ్డి సరిపోడని వ్యాఖ్యానించారు. కబ్జాలు, హత్యలే గురునాథ్‌రెడ్డి చరిత్ర అని ఘాటుగా విమర్శించారు. జేసీ గ్రూపు కబట్టే గురునాథ్‌రెడ్డిని టీడీపీలో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. నిఖార్సుగా ఉంటే లాభం లేదని అర్థం అవుతోందన్నారు.

 

13:38 - November 30, 2017

ఢిల్లీ : అసెంబ్లీలో పోలవరంపై అసత్యాలు చెప్పారని చంద్రబాబుకు కేవీపీ బహిరంగ లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టును అడ్డుకుంటున్నానని నాపై అసత్య ప్రచారాలు చేసినా... ప్రాజెక్ట్‌ పూర్తి కోసం తన వంతు ప్రయత్నం చేస్తున్నారన్నారు కేవీపీ. పోలవరం ప్రాజెక్ట్‌ ఘనత అంతా తనదేనని చంద్రబాబు చెప్పుకుంటున్నారని... వైఎస్‌ హయాంలోనే అనుమతులు వచ్చిన విషయం మర్చిపోయారంటున్నారు. పోలవరం నిధుల విషయంలో కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిలదీయడం లేదన్నారు. కేంద్రమే నిధులు ఇస్తామని చెప్పినప్పుడు... నాబార్డు నుండి ఎందుకు నిధులు తీసుకుంటున్నారని కేవీపీ ప్రశ్నించారు. పోలవరం నిర్మాణం, నిధులపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాలని కేవీపీ డిమాండ్‌ చేశారు. 

 

13:38 - November 30, 2017

2019 సాధారణ ఎన్నికలకు ఇంక సంవత్సరంన్నర ఉంది. జనాసేన పార్టీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఇప్పటి నుంచి రాజకీయా కదనరంగలోకి దూకాలి దానికి కోసం పవన్ పద్దతి ప్రకారంలో వెళ్తున్నట్టు తెలుస్తోంది. పవన్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం అజ్ఞాతవాసి ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్టు సమాచారం. ఈ చిత్రం తర్వాత పవన్ 8 నెలల్లో మరో రెండు సినిమాలు చేయడానికి సిద్ధమైతున్నట్టు తెలుస్తోంది. ఈ రెండు సినిమాలు రీమేక్ అని టాక్. తమిళంలో అజిత్ నటించిన వేదాళం ను రీమేక్ మూవీ చేయనున్నారు. దీనికి టీ.ఎన్ నీశన్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ మూవీని 3 నుంచి 4 నెలల్లో పూర్తి చేసి సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరి రీమేక్ లో చేయననున్నాడు. ఈ మూవీని కూడా 4 నెలల్లో పూర్తి చేసి ఆయన రాజకీయాల్లోకి పూర్తిగా వెళ్లనున్నట్టు తెలుస్తోంది. 

13:23 - November 30, 2017

టెలికాం రంగంలోకి జియో అడుగిడిన నాటి భారత్ టెలికాం చరిత్రంలో నూతన ఆధ్యయం మొదలైందని చెపొచ్చు. అప్పటి వరకు ఒక నెల అన్ లిమిడెట్ కాలింగ్ కవాలంటే రూ.600 లతో రీచార్జ్ చేసుకోవాలి కాని ఇప్పుడు అది రూ.199 చేరిందంటే అది జియో చలవే అని చప్పుకొవచ్చు. ఇప్పుడు ఉన్న నెట్ వర్క్ లు తమ కస్టమర్లను కాపాడుకోవడానికి ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఎయిర్‌టెల్ Rs 199, Rs 149 రెండు ప్లాన్లలో అన్ లిమిటెడ్ లోకల్ కాల్, STD కాల్స్ తోపాటు 1 GB డేటా లభిస్తుంది. రూ. 149 ప్లాన్ లో 300 MB డేటా లభిస్తుంది. ఎయిర్‌టెల్ అందిస్తున్న నెల రోజుల అన్‌లిమిటెడ్ ప్లాన్లు తెలుగు రాష్ట్రాలకు మాత్రమే. వొడాఫోన్ రూ. 199 ప్లాన్ ఈ ప్లాన్ లో రోజుకు 1GB డేటా చొప్పున అన్ లిమిటెడ్ లోకల్ కాల్, STD కాల్స్ లభిస్తాయి. మొత్తం వ్యాలిడిటీ 28 రోజులు. అయితే ఇందులో వారానికి 1000 (వెయ్యి) నిమిషాలు మాత్రమే వాడుకోవాలి. అది దాటితే నిమిషానికి 30 పైసలు ఛార్జ్ చేస్తారు. అలాగే రోజుకు 250 నిమిషాలతో పాటు 300 నంబర్లకన్నా ఎక్కువ నెంబర్లకు చేస్తే రూ. 30 పైసలు వసూలు చేస్తారు. ఇక జియో అందిస్తున్న రూ.199 ప్లాన్ లో 28 రోజులు పాటు 4.2 GB డేటా లభిస్తుంది. అన్ లిమిటెడ్ లోకల్ కాల్, STD కాల్స్ ఉంటాయి. రోజుకు 0.15 జిబి మాత్రమే వాడుకోవాలి. బీఎస్ఎన్ఎల్ కూడా రూ.187 తో రోజుకు 1జిబీ డేటా, అపరిమిత కాల్స్ ను 28 పాటు అందిస్తోంది.

13:22 - November 30, 2017

హైదరాబాద్ : 15 ఏళ్ల ప్రాయంలోనే పారిశ్రామికవేత్తగా ఎదిగి ఇవాంక ట్రంప్‌ ప్రశంసలు అందుకుంది రెయాన్‌ కమలోవ. అజుర్‌బయిజాన్ దేశానికి చెందిన ఈ యువ మహిళా పారిశ్రామికవేత్త 15 ఏళ్ల ప్రాయంలోనే ఓ పరిశ్రమను స్థాపించి అందరికీ ఆదర్శంగా నిలిచింది. రెయాన్‌తో టెన్ టివి ఫేస్‌ టు ఫేస్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆలోచనలకు అడ్డుకట్ట వేయొద్దన్నారు. ఆలోచనలను ఆచరణలో పెడితేనే విజయమని తెలిపారు. ప్రయత్నాలను ఆపొద్దని చెప్పారు.

 

13:08 - November 30, 2017
13:07 - November 30, 2017

గుంటూరు : ఎంతో మంది మహిళలు బలి కావడానికి, మరెంతో మంది మహిళలు ఆత్మహత్యలు చేసుకోవడానికి గత కాంగ్రెస్ పాలకులే కారణమని టీడీపీ ఎమ్మెల్యే పీతల సుజాత ఆరోపించారు. నేడు అలాంటి ఘటనలు జరిగితే వెంటనే చర్యలు తీసుకుంటూ ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. ఏపీ అసెంబ్లీలో ఆమె మాట్లాడారు. ప్రతి డ్వాక్రా మహిళలకు కూడా నాయకత్వ లక్షణాలు కావాలని...ఆ నాయకత్వ లక్షణాలను పెంపొందించే విధంగా సపోర్ట్ చేయాలని సీఎం చంద్రబాబు చెబుతున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు డ్వాక్రా సంఘాలను అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. డ్వాక్రా సంఘాలను సీఎం బలోపేతం చేస్తున్నారని పేర్కొన్నారు. డ్వాక్రా సంఘాలకు ఎన్నో అవకాశాలు ఇస్తున్నారని తెలిపారు. సీఎం చంద్రబాబు టెక్నాలజీని అందిపుచ్చుకున్నారని చెప్పారు. 'హైదరాబాద్ బిర్యానీ కంటే ఐటీ రంగం బాగుందని ఇవాంకా ట్రంప్' అన్న విషయాన్ని ఆమె ప్రస్తావించారు. హైదరాబాద్ లో ఐటీ రంగాన్నికి చంద్రబాబు బీజం వేసి.. అభివృద్ధి చేశారని తెలిపారు. సాఫ్ట్ వేర్ రంగంలో ఎంతోమంది మహిళలు స్థిరపడ్డారని పేర్కొన్నారు. 

 

12:47 - November 30, 2017

గుంటూరు : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కమిటీ వేశామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రోడ్డు ప్రమాదాలపై ఏపీ అసెంబ్లీలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వల్ల చాలా ప్రమాదాలు తగ్గాయన్నారు. గతంలో కంటే ప్రమాదాలు తగ్గాయని చెప్పారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కమిటీ వేశామని తెలిపారు. 

 

12:38 - November 30, 2017

హైదరాబాద్ : నాగోల్ మెట్రో స్టేషన్ లో ప్రయాణికుల రద్దీ తగ్గింది. నిన్నటి కంటే ఇవాళ రద్దీ తక్కువగా ఉంది. ప్రయాణికుల రద్దీ అంతంతమాత్రంగానే ఉంది. రెండో రోజు ప్రయాణికుల రద్దీ తగ్గింది. మెట్రో రైలుతో ప్రయాణం సులభతరం అవుతుందని, ట్రాఫిక్ సమస్య తలెత్తే అవకాశం ఉండదని నగరవాసులు అంటున్నారు. మరికొంతమంది ప్రయాణికులు టిక్కెట్ల ధర అధికంగా ఉందని అంటున్నారు. మంగళవారం ప్రధాని నరేంద్రమోడీ మెట్రో రైలును ప్రారంభించారు. ప్రారంభోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

అర్కే నగర్ ఉపఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థి ప్రకటన

చెన్నై : తమిళనాడులోని అర్కేనగర్ ఉపఎన్నిక అన్నాడీఎంకే అభ్యర్థిగా ఈ మధుసూదన్ పేరును ఆ పార్టీ ఖరారు చేసింది. మధుసూదన్ ప్రస్తుతం అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్ గా ఉన్నారు. 

12:37 - November 30, 2017

క్రికెట్ దేవుడు సచిన టెండూల్కర్ ధరించిన 10 నెంబర్ జేర్సీని ఇక చరిత్రలోకి వెళ్లిపోనుందా అంటే బీసీసీఐ ప్రతినిధులు అవును అంటున్నారు. సచిన్ 24 ఏళ్ల కేరీర్ మొత్తం ఈ జేర్సీ ధరించి క్రికెట్ ఆడాడు. 2012 లో సచిన్ రిటైర్ అయిన తర్వాత ఈ నెంబర్ జేర్సీ ఎవరు ధరించలేదు. అయితే ఇటివల బౌలర్ శార్దూల్ ఠాకూర్ 10 జేర్సీ వేసుకరావడంతో అభిమానులు అతని మండిపడ్డారు. దీనిపై బీసీసీఐ ఓ నిర్ణయం తీసుకొనున్నట్టు తెలుస్తోంది. 10 నెంబర్ జేర్సీకి రిటైర్మెంట్ ఇవ్వాలని నిర్ణయించింది.

రెండాకుల గుర్తుపై హైకోర్టుకు దినకరన్

చెన్నై : రెండాకుల గుర్తుపై ఈసీ తీసుకున్న నిర్ణయంపై శశికళ మేనల్లుడు టీవీవీ దినకరన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అన్నాడీఎంకే పార్టీ గుర్తు తమకే కేటాయించాలని ఆయన పిటిషన్ లో పేర్కొన్నాడు. 

12:06 - November 30, 2017

ఆర్బీఐ కొత్త రూపాయి నోట్ విడుదల చేసింది. అయితే మన దగ్గర కొన్ని సంవత్సరాల ముందు కూడా రూపాయి నోట్, రెండు రూపాయాల నోట్ ఉండేది కాని వాటిని ఆర్బీఐ నిషేధించింది. గత సంవత్సరం జరిగిన నోట్ల రద్దు తర్వాత దేశంలో చిల్లర సమస్య చాలా తీవ్రంగా ఏర్పాడింది. ఈ చిల్లర సమస్య అధికమించాడానికి రూ.500 నోట్ తీసుకొచ్చింది. ఆయిన కూడా పరిస్థితిలో మార్ప రాకపోవడంతో రూ.200 నోట్ తీసుకొచ్చింది. ఈ నోట్ మార్కెట్లో చాలా తక్కువ కనిపిస్తున్నాయి. దీంతో అర్బీఐ మళ్లీ రూపాయి నోట్ తీసుకొచ్చింది.

12:00 - November 30, 2017
11:58 - November 30, 2017

హైదరాబాద్ : ప్రారంభమై రెండు రోజులు కాకముందే మెట్రో రైలు కష్టాలు మొదలయ్యాయి. మెట్రో ప్రయాణికులకు కొత్త కాష్టాలు ప్రారంభం అయ్యాయి. అమీర్ పేట మెట్రో స్టేషన్ వద్ద ప్రయాణికులకు పార్కింగ్ కష్టాలు మొదలయ్యాయి. స్టేషన్ వద్ద ఉన్న వాహనాలను ట్రాఫిక్ పోలీసులు తరలిస్తున్నారు. మంగళవారం ప్రధాని నరేంద్రమోడీ మెట్రో రైలును ప్రారంభించారు. మెట్రో ప్రారంభోత్సవం కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. అయితే పార్కింట్ స్థలాన్నిఏర్పాటు చేయడాన్ని విస్మరించారు. దీంతో మెట్రో ప్రయాణికులను పార్కింగ్ సమస్య వెంటాడుతోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

రెండో రోజు మెట్రోకు తగ్గిన రద్దీ

హైదరాబాద్ : ఎంతో హట్టహసంగా ప్రారంభైన మెట్రో రెండో రోజు ప్రయాణికుల లేక చిన్న బోయింది. మరో వైపు అమీర్ పేట్ మెట్రో స్టేషన్ వద్ద పార్కింగ్ చేసిన బైక్ లను ట్రాఫీక్ పోలీసులు స్టేషన్ తరలించారు. 

11:49 - November 30, 2017

హైదరాబాద్ : ప్రారంభమై రెండు రోజులు కాకముందే అప్పుడే నగరవాసులకు మెట్రో రైలు కష్టాలు మొదలయ్యాయి. ఉప్పల్ మెట్రో స్టేషన్ లో ప్రయాణికుల రద్దీ తగ్గింది. ఉప్పల్ మెట్రో స్టేషన్ లో ప్రయాణికుల రద్దీ అంతంతమాత్రంగానే ఉంది. రెండో రోజు ప్రయాణికుల రద్దీ తగ్గింది. పార్కింగ్ సమస్య తలెత్తింది. మంగళవారం ప్రధాని నరేంద్రమోడీ మెట్రో రైలును ప్రారంభించారు. మెట్రో స్టేషన్ ప్రారంభోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

11:43 - November 30, 2017

ఈ మధ్య 30 ఏళ్ల వారికే బట్ట తల రావడంతో జరగుతుంది. అయితే వెంట్రుకాలు ఉడిపోవడానికి కారణం హర్మోన్ల సమాతుకంగా లేకపోవడం, చుండ్రు వల్ల, కాలుష్యం. జుట్టు ఉడిపోవడాన్ని కొంత వరకు తగ్గించేందుకు కొబ్బరి నూనెతో అలివ్ నూనె కలిపి పెట్టుకోవడం వల్ల జుట్టుకు బలం చేకురుతుంది. దీంతో రాలిపోవడం తగ్గుతుంది. గుడ్డు ను కూడా నెత్తికి పెట్టుకుంటే వెంట్రుకాలు రాలిపోయే చాన్న్ తగ్గుతుంది. 

11:43 - November 30, 2017

వరంగల్ : వివాహితపై యాసిడ్ దాడి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నిందితులు చందు, రాకేష్, అనీల్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏసీపీ, సీఐ, ఇద్దరు కానిస్టేబుల్స్ తో కూడిన ప్రత్యేక బృందం కేసును విచారిస్తున్నారు. యాసిడ్ దాడిలో త్రీవంగా గాయపడ్డ బాధితురాలికి ఎంజీఎంలో మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఆమె అరోగ్యపరిస్థితి విషమంగా ఉంది. ప్రాణాపాయస్థితిలో ఉన్నారు. వరంగల్‌ జిల్లాలోని ఐనవోలు మండలం గర్మిల్లపల్లి శివారులో నిన్న వివాహిత మాధురిపై చందు, రాకేష్, అనీల్ లు యాసిడ్‌ దాడికి పాల్పడ్డారు. దాడిలో గాయపడిన యువతిని.. స్థానికులు ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మేనమామ చందుతో బాధితురాలు మాధురికి వివాహం అయింది. బిడ్డ పుట్టిన తర్వాత విడిపోయారు. ఆ తర్వాత ఆమె పెట్రోల్ బంక్ లో పని చేస్తోంది. అక్కడ ఓ వ్యక్తి తనను ప్రేమంచాలంటూ యువతిని నిత్యం వేధిస్తున్నాడు. ఈనేపథ్యంలో యువతిపై యాసిడ్ దాడి జరిగింది. బాధితురాలు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. 

 

ఏపీఅసెంబ్లీ డిస్పెన్సరీలో మంత్రి తనిఖీ

గుంటూరు : అమరావతి ఏపీ అసెంబ్లీలో ఉన్న డిస్పెన్సరీని వైద్యఆరోగ్య శాఖ మంత్రి కామినేని ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ఎంతమంది డాక్టర్లు అందుబాటులో ఉన్నారో మంత్రి అడిగి తెసుకున్నారు. డ్యూటీ డాక్టర్లు యూనిఫాం ధరించకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు తిరిగే సభలో డాక్టర్లు యూనిఫాంలో లేకపోతే ఎలా గుర్తిస్తారని మంత్రి ప్రశ్నించాడు.

11:17 - November 30, 2017

హైదరాబాద్ : నగరంలోని నాచారం ఈఎస్ ఐ ఆస్పత్రిలో ఘోరం జరిగింది. ఆస్పత్రి సిబ్బంది నిర్వాకం బయటపడింది. అప్పుడే పుట్టిన చిన్నారులను సిబ్బంది తారుమారు చేశారు. కాన్పు కోసం వచ్చిన ఇద్దరు మహిళలు మనీషా, అఖిలలను ఆస్పత్రి సిబ్బంది లోపలికి తీసుకెళ్లారు. ప్రసూతి అనంతరం శిశువులకు టీకాలు ఇచ్చే సమయంలో తారుమారు అయ్యారు. ఆస్పత్రి సిబ్బంది ఒకరి శిశువు, వేరొకరికి అప్పగించారు. ఎవరి బిడ్డ..ఎవరిదన్న విషయంలో గందరగోళం నెలకొంది. సిబ్బంది నిర్లక్ష్యంపై చిన్నారుల బంధువులు ఆందోళనకు దిగారు. సిబ్బంది ఇచ్చిన శిశువు తమ శిశువు కాదని మనీషా కుటుంబం చెబుతోంది. వేరే వారి శిశువును తమకు ఇచ్చారని చెప్పారు. శిశువులకు డీఎన్ ఏ టెస్టు చేయించాలని తెలిపారు. తమ బాబును తమకు ఇవ్వాలని మనీష కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఇదిలావుంటే మరో మహిళ అఖిల మాత్రం తమ బాబును తమకు అప్పగించారని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

ఐనవోలు యాసిడ్ దాడి ఘటనలో నిందితుల అరెస్ట్

వరంగల్ : జిల్లా ఐనవోలులో మహిళపై యాసిడ్ దాడి ఘటనలో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. నిందితుల్లో చందు, రాకేష్, అనీల్ ఉన్నారు. బాధితురాలు ప్రస్తుతం ఎంజీఎంలో చికిత్స పొందుతుంది. 

11:03 - November 30, 2017
10:58 - November 30, 2017

గుంటూరు : రైల్వే గేట్స్, క్రాసింగ్ ల వద్ద రద్దీని బట్టి ఆర్ వోబీల కోసం కమిటీ నివేదిక ఇస్తే ఆర్ వోబీ నిర్మాణం కోసం ప్రతిపాదనలు తయారు చేయడం జరుగుతుందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి సీహెచ్ అయ్యన్నపాత్రుడు అన్నారు. బ్రిడ్జీ నిర్మాణాకికి అయ్యే ఖర్చులో 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం, 50 శాతం కేంద్రప్రభుత్వం నిధులతో పూర్తి చేయాల్సివుంటుందని తెలిపారు. భూసేకరణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదని చెప్పారు. రాష్ట్రంలో 122 ఆర్ వోబీలు మంజూరు అయ్యాయని అన్నారు. వీటిలో 58 ఆర్ వోబీలను పూర్తి చేశామని తెలిపారు. 21 ఆర్ వోబీలు పని పురోగతిలో ఉన్నాయని... 43 ఆర్ వోబీలు అలైన్  మెంట్, డిజైన్లు, ఎస్టిమేట్స్ దశలో ఉన్నాయని తెలిపారు. అలైన్ మెంట్, డిజైన్లు, ఎస్టిమేట్స్ పూర్తి అయిన తర్వాత కేంద్రప్రభుత్వ రైల్వే బోర్టుకు పంపించాల్పిన అవసరముందన్నారు.  21 ఆర్ వోబీలను త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు. 
 

 

10:56 - November 30, 2017

గుంటూరు : రోడ్డు ప్రమాదాల్లో ఏపీ రాష్ట్రం మూడో స్థానంలో ఉందని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. దేశంలోని స్టార్ట్ సిటీల్లో ఏపీ రాష్ట్రం మూడో స్థానంలో ఉందన్నారు. యువత విపరీతమైన స్పీడ్ తో వెళ్తున్నారని తెలిపారు. బైక్ రేసింగ్ లకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. అందరం కలిసి రోడ్డు ప్రమాదాలను నివారించాలన్నారు. 

నాచారం ఈఎస్ఐ సిబ్బంది నిర్వాకం

హైదరాబాద్ : నాచారంలోని ఈఎస్ఐ ఆసుపత్రిలో సిబ్బంది నిర్వాకంతో సమస్య మొదలైంది. ఆసుపత్రి సిబ్బంది అప్పుడే పుట్టిన ఇద్దరు చిన్నారులను తారుమారు చేసి వారి తల్లులకు అప్పగించారు. ఒకరి శిశువును మరొకరికి అప్పగించడంతో ఆసుపత్రిలో కందరగోళం ఏర్పాడింది. దీంతో ఇద్దరి శిశువుల బంధువులు ఆందోళనకు దిగారు. 

10:52 - November 30, 2017

విశాఖ : ఇబ్రహీంపట్నం వద్ద జరిగిన బోటు ప్రమాద ఘటన మరువకముందే విశాఖ జిల్లాలో మరో ఘటన జరిగింది. జిల్లాలోని ఎస్.రాయవరం మండలం బంగారమ్మపాలెం వద్ద సముద్రంలో మర పడవ బోల్తా పడింది. చేపల వేటకు వెళ్లిన ఇద్దరు మత్స్యకారులు మృతి చెందారు. మరో మత్య్యకారుడు త్రీవంగా గాయపడ్డారు. మృతులు మైలపల్లి సత్తయ్య, ఉమ్మిడి సోమేష్ లుగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన రాజారావును ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అతనికి చికిత్స అందిస్తున్నారు. ఇద్దరు మత్స్యకారుల మృతితో గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

జమ్మూలో ఎనకౌంటర్

శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్ లోని బుద్గాం జిల్లాలో ఆర్మీకి, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది మరణించినట్టు సమాచారం ఇంక పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

నాచారం ఈఎస్ ఐ ఆస్పత్రిలో ఘోరం

హైదరాబాద్ : నగరంలోని నాచారం ఈఎస్ ఐ ఆస్పత్రిలో ఘోరం జరిగింది. ఆస్పత్రి సిబ్బంది నిర్వాకం బయటపడింది. అప్పుడే పుట్టిన చిన్నారులను సిబ్బంది తారుమారు చేశారు. కుటుంబ నియంత్రణ కోసం ఇద్దరు మహిళలను ఆస్పత్రి సిబ్బంది లోపలికి తీసుకెళ్లారు. టీకాలు ఇచ్చే సమయంలో శిశువులు తారుమారు అయ్యారు. ఒకరి శిశువు, వేరొకరికి అప్పగించారు. ఎవరి బిడ్డ..ఎవరిదన్న విషయంలో గందరగోళం నెలకొంది. సిబ్బంది నిర్లక్ష్యంపై చిన్నారుల బంధువులు ఆందోళనకు దిగారు. 

శ్రీకాకుళంలో ఏనుగుల గుంపు సంచారం

శ్రీకాకుళం : జిల్లా మెటియాపుట్టి, చాతరలో ఏనుగుల గుంపు సంచారం చేస్తుండడంతో గ్రామస్తులు భయాందోళనుకు గురౌతున్నారు. 

09:46 - November 30, 2017

హైదరాబాద్ : నగరంలోని నాచారం ఈఎస్ ఐ ఆస్పత్రిలో ఘోరం జరిగింది. ఆస్పత్రి సిబ్బంది నిర్వాకం బయటపడింది. అప్పుడే పుట్టిన చిన్నారులను సిబ్బంది తారుమారు చేశారు. కుటుంబ నియంత్రణ కోసం ఇద్దరు మహిళలను ఆస్పత్రి సిబ్బంది లోపలికి తీసుకెళ్లారు. టీకాలు ఇచ్చే సమయంలో శిశువులు తారుమారు అయ్యారు. ఒకరి శిశువు, వేరొకరికి అప్పగించారు. ఎవరి బిడ్డ..ఎవరిదన్న విషయంలో గందరగోళం నెలకొంది. సిబ్బంది నిర్లక్ష్యంపై చిన్నారుల బంధువులు ఆందోళనకు దిగారు. సిబ్బంది ఇచ్చిన శిశువు తమ శిశువు కాదని మనీషా కుటుంబం చెబుతోంది. డీఎన్ ఏ టెస్టు చేయించాలని కోరుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

ఎస్ ఐపై టీఆర్ ఎస్ నేత దాడి

హైదరాబాద్ : నగరంలోని మానదన్నపేట పోలీస్ స్టేషన్ లో టీఆర్ ఎస్ నేత ఇబ్రహీం హల్ చల్ చేశారు. గత కొన్నేళ్లుగా ఇబ్రహీం సోదరి సమీర్ ను ప్రేమిస్తోంది. పెద్దలకు తెలియడంతో ప్రేమికులను బెదిరించారు. నిన్న సాయంత్రం ఇబ్రహీం సోదరి కనిపించకుండా పోయింది. ఇబ్రహీం కుటుంబ సభ్యులు సమీర్ కు ఫోన్ చేసి బెదిరించారు. దీంతో ప్రేమ జంట పోలీసులను ఆశ్రయించింది. పీఎస్ లోనే సమీర్ పై ఇబ్రహీం చేయచేసుకున్నారు. అడ్డుకోబోయిన ఎస్ ఐపై కూడా ఇబ్రహీం దాడి చేశాడు. దీంతో పోలీసులు ఇబ్రహీంను అదుపులోకి తీసుకున్నారు.

 

09:36 - November 30, 2017

హైదరాబాద్ : నగరంలోని మానదన్నపేట పోలీస్ స్టేషన్ లో టీఆర్ ఎస్ నేత ఇబ్రహీం హల్ చల్ చేశారు. గత కొన్నేళ్లుగా ఇబ్రహీం సోదరి సమీర్ ను ప్రేమిస్తోంది. పెద్దలకు తెలియడంతో ప్రేమికులను బెదిరించారు. నిన్న సాయంత్రం ఇబ్రహీం సోదరి కనిపించకుండా పోయింది. ఇబ్రహీం కుటుంబ సభ్యులు సమీర్ కు ఫోన్ చేసి బెదిరించారు. దీంతో ప్రేమ జంట పోలీసులను ఆశ్రయించింది. పీఎస్ లోనే సమీర్ పై ఇబ్రహీం చేయచేసుకున్నారు. అడ్డుకోబోయిన ఎస్ ఐపై కూడా ఇబ్రహీం దాడి చేశాడు. దీంతో పోలీసులు ఇబ్రహీంను అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

అనంతపురం : జిల్లాలోని గుట్టూరు వద్ద టిప్పర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. 

09:22 - November 30, 2017

అనంతపురం : జిల్లాలోని గుట్టూరు వద్ద టిప్పర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. 

 

శ్రీకాకుళం జిల్లాలో ఏనుగుల గుంపు సంచారం

శ్రీకాకుళం : మెలియాపుట్టి, చాతరలో ఏనుగుల గుంపు సంచరిస్తున్నాయి. దీంతో గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారు. 

నేడు ఏపీ శాసనమండలిలో పలు అంశాలపై ప్రశ్నోత్తరాల్లో చర్చ

గుంటూరు : నేడు ఏపీ శాసనమండలిలో ప్రశ్నోత్తరాల్లో సెల్ఫ్ ఫైనాన్స్ డ్ ఇండిపెండెంట్ పాఠశాలల చట్టం, ఆటోమెటిక్ అడ్వాన్స్ డ్ స్కిల్స్ పై ఉద్యోగులకు ఆరోగ్య పథకం వర్తింపు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సౌకర్యాలు, ఆరోగ్య కేంద్రాల నిర్వహణపై చర్చించనున్నారు. ఆరోగ్య రక్ష పథకం అమలు, మహిళా ఉద్యోగులకు ప్రసూతి, పిల్లల సంక్షరణ సెలవులపై చర్చ జరుగనుంది. రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థ, మహిళా శిశు సంక్షేమంపై మండలిలో లఘు చర్చ జరుగనుంది. 

నేడు ఏపీ అసెంబ్లీలో 8 బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

గుంటూరు : ఏపీ అసెంబ్లీలో నేడు 8 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. జలవనరులు, ఉద్యాన వర్సిటీ, మనీ లాండర్స్ బిల్లులు ప్రవేశపెట్టనుంది. పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి, ఏపీపీఎస్సీ... భూసేకరణ, పునరావాసం బిల్లులకు నేడు ఆమోదం తెలపనుంది. 

 

ఏపీ అసెంబ్లీలో పలు అంశాలపై ప్రశ్నోత్తరాల్లో చర్చ

గుంటూరు : భూగర్భ డ్రైనేజీ నీటి శుద్ధి, పంచాయతీరాజ్ సంస్థల బలోపేతం, రోడ్డు ప్రమాదాలు, కార్పొరేట్ పాఠశాల్లో బలహీన వర్గాలకు సీట్ల కేటాయింపు వంటి తదితర అంశాలపై ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో చర్చ జరుగనుంది. ఎమ్మెల్యేల విజ్ఞాపనలపై అధికారుల క్రియారాహిత్యంపై ప్రశ్నలు..సమాధానాలు ఉంటాయి.

 

07:54 - November 30, 2017

అనుమతి లేని కాలేజీలను వాటి హాస్టల్స్ పై చర్యలను వెంటనే చేపట్టాలని వక్తలు అన్నారు. కాలేజీ, వాటి హాస్టల్స్ లో విద్యార్థుల ఆత్మహత్యలపై నిర్వహించిన చర్చ కార్యక్రమంలో టీడీపీ నేత విద్యాసాగర్, సీపీఎం ఏపీ రాష్ట్ర నేత సీహెచ్. బాబురావు పాల్గొని, మాట్లాడారు. నిబంధనలు ఉల్లంఘించిన కాలేజీలపై చర్య ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. విద్యను కార్పొరేటీకరణ చేయడం ఆపివేయాలన్నారు. ప్రభుత్వ మాటలు తప్ప చేతలు లేవని విమర్శించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

నేడు 22వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర

కర్నూలు : 22వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర జరుగనుంది. ఆలూరు నియోజవర్గంలోని ఆస్పరి మండలం కారుమంచి నుంచి నేడు పాదయాత్ర ప్రారంభం కానుంది. 

 

నేడు ఏపీ అసెంబ్లీలో నార్మన్ పోస్టర్ డిజైన్ల ప్రదర్శన

అమరావతి : నేడు ఏపీ అసెంబ్లీలో నార్మన్ పోస్టర్ డిజైన్ల ప్రదర్శన జరుగనుంది. 

07:41 - November 30, 2017

108 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ ఏపీ రాష్ట్ర నాయకులు ఏవీ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 108 ఉద్యోగులను వేతనాలు పెంచాలన్నారు. కనీస వేతనాలు ఇవ్వాలని కోరారు. 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని చెప్పారు. వైద్య ఆరోగ్య రంగం ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగాలని పేర్కొన్నారు. 'ఎవ్వరికి ఎక్కడ ఏ ప్రమాదం జరిగిన టక్కున మనకు గుర్తొచ్చేది 108. ఎలాంటి అత్యవసర పరిస్థితి ఏర్పడిన మనల్ని మొదటి ఆదుకునేవి 108 సిబ్బంది. ఇప్పుడు ఏపీలో 108 సిబ్బంది ఆందోళన బాట పట్టారు. అందరి భద్రత చూసే మాకు ఉద్యోగ భద్రత కావాలి అని కార్మిక చట్టాల ప్రకారం ఏని గంటలు ఉండాలి అని కనీస వేతనాలు అందించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు'. ఇదే అంశంపై నాగేశ్వరరావు మాట్లాడారు. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం.... 

 

07:36 - November 30, 2017

విజయవాడ : పర్యావరణానికి పెనుప్రమాదంగా మారిన ప్లాస్టిక్‌ ఇపుడు విజయవాడ నగరాన్ని ముంచెత్తుతోంది. ప్రతి దానికి ప్లాస్టిక్‌ క్యారీబ్యాకులనే వినియోగిస్తుండంతో.. నగరం అంతా కాలుష్య కాసారంగా మారిందని బెజవాడ ప్రజలు వాపోతున్నారు. 
ప్లాస్టిక్‌ పరేషాన్‌ 
విజయవాడలో ప్లాస్ట్‌ వాడకం ప్రమాదకర స్థాయికి చేరింది. నియంత్రించాల్సిన అధికార యంత్రాంగం  మాత్రం  మొద్దునిద్రపోతోందని విమర్శలు వస్తున్నాయి.  ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగుల నిషేధం అంటున్నప్పటికీ.. అమల్లో అధికారులు ఘోరంగా విఫలం అవుతున్నారు.
నీటి ప్రవాహం కలుషితం 
క్యారీ బ్యాగులతో, ప్లాస్టిక్ వస్తువలతో డ్రైనేజీలు, కాలువలు సైతం వ్యర్థాలతో నిండిపోతున్నాయి. నీటి ప్రవాహాన్ని కలుషితం చేస్తున్నాయి. యథేచ్ఛగా క్యారీ బ్యాగులు చలామణి అవుతున్నా అరికట్టాల్సిన అధికార యంత్రాంగం చలనం లేకుండా వ్యవహారిస్తోంది. దీంతో వీటి వాడకంపై ప్రజలు అవగాహన చేసుకోలేకపోతున్నారు. టీ, కాఫీ, పాలు ఇలా వేడివేడి పానీయాలన్నీ క్యారీ బ్యాగులు, ప్లాస్టిక్ కరమైన వాటిలో తాగి త్వరితగతిన అనారోగ్యానికి బారినపడుతున్న విషయం ప్రజలకు ప్రభుత్వాలు కనువిప్పు కల్గించలేకపోతున్నాయి.
ఆహార పదార్థాలు విషతుల్యం 
వేడివేడి ఆహార పదార్థాలు ప్యాకింగ్ చేసేందుకు అత్యంత ప్రమాదకర పాలిథిన్ పేపర్లు, సంచులు వినియోగిస్తున్నారు. ఆ వేడికి రసాయన ప్రక్రియ జరిగి ఆహార పదార్థాలు విషతుల్యమవుతున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. నగరాలు, పట్టణాల నుంచి మారుమూల పల్లెల వరకూ క్యారీ బ్యాగులు, ప్లాస్టిక్ వాడకాలు విస్తరించి విపత్కర పరిస్థితులకు దారితీస్తున్నాయి. ప్లాస్టిక్‌ క్యారీబ్యాకుల స్థానంలో జనపనార, గోగునార సంచులు, కాగితపు సంచులను ప్రోత్సహిస్తే పర్యావరణానికి మేలు జరుగుతుందని బెజవాడ ప్రజలు అంటున్నారు.  
పాలిథిన్ సంచుల వినియోగంతో అధికారులకు కాసుల వర్షం 
పాలిథిన్ సంచుల వినియోగం కొంతమంది అధికారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. నిజాయితీగా తమ విధులను నర్వహించాల్సిన అధికారులు ముడుపులు దండుకుంటూ  తయారీదారులపై, అమ్మకం, వాడకం దారులపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ముఖ్యంగా తయారీదారులను కట్టడి చేస్తే  కొంతమేరకైనా ప్రజలు రోగాలు బారిన పడకుండా కాపాడవచ్చు. ఇప్పటికైన ప్రజారోగ్య శాఖలు స్పందించి క్యారీ బ్యాగులు, ప్లాస్టిక్ సంచులను నిషేధించాలని విజయవాడ ప్రజలు కోరుతున్నారు.  

 

07:31 - November 30, 2017

హైదరాబాద్ : ఈసారి ఎంసెట్‌ నిర్వహణ ఎలా..? ఆన్‌లైన్లోనా..? లేదా ఎప్పటిలాగనే రాతపరీక్షా..? ఆన్‌లైన్‌ పరీక్షలు ప్రభుత్వ కాలేజీల్లోనే నిర్వహించడం సాధ్యమా..? గత ఏడాది సహకరించని ప్రైవేట్‌ విద్యాసంస్థలు ఈసారి ఓకే అంటాయా..? పైగా ఇక నుంచి అన్ని సెట్స్‌ ఆన్‌లైన్లోనే అంటున్న ప్రభుత్వం ఆదిశగా చర్యలు తీసుకుంటోందా ..? ప్రభుత్వ కాలేజీల్లో అరకొర కంప్యూటర్లతో ఆన్‌లైన్‌ ఎంసెట్‌ సాధ్యమా..? ఇపుడు ఇవే ప్రశ్నలు వేధిస్తున్నాయి తెలంగాణ విద్యామండలిని. 
ఎంసెట్ నిర్వహణపై అధికారుల మల్లగుల్లాలు 
తెలంగాణాలో ఎంసెట్ నిర్వహణపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈసారి ఆన్‌లైన్లో పరీక్షలు నిర్వహించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయంచడంతో.. అధికారులు ఆదిశగా కసరత్తు మొదలుపెట్టారు. ఆన్‌లైన్‌ ఎగ్జామ్స్‌ అనేది వినడానికి ఈజీగానే ఉన్నా.. ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే అన్ని సెట్స్‌ నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయం  సమస్యగా మారింది. ప్రభుత్వ విద్యాసంస్థల్లో సౌకర్యాల లోపం అధికారుల ముందరికాళ్లకు బంధంగా మారింది. 
ప్రభుత్వ కాలేజీల్లోనే పరీక్షల నిర్వహణ ఎలా ?
గతేడాది ఇంజనీరింగ్‌లో లక్షా 41వేల మంది, అగ్రీకల్చర్‌ విభాగంలో 79వేల విద్యార్ధులు దరాఖాస్తు చేసుకున్నారు. ఈసారి కూడా అదేసంఖ్యలో పరీక్ష రాసే అవకాశం వుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రభుత్వ కాలేజీల్లోనే పరీక్షలు నిర్వహించడం కుదిరేపని కాదని ఉన్నత విద్యామండలి అధికారులు అభిప్రాయపడుతున్నారు. దీనికోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు.
ఫీజు బకాయిలతో సహకరించని ప్రైవేట్‌ కాలేజీలు 
ఆన్‌లైన్‌లో సెట్స్‌ నిర్వహణకు ప్రైవేట్‌కాలేజీల సహాయ నిరాకణ సమస్యగా మారింది. ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించని కారణంగా ప్రైవేటు విద్యాసంస్థలు సెట్స్‌ నిర్వహణకు సహకరించలేదు. దీంతో ప్రైవేట్‌ కాలేజీలను ప్రసన్నం చేసుకునేందుకు ఉన్నత విద్యామండలి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికోసం ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలను ముందుగా క్లీయర్‌చేస్తే ప్రవేట్‌ కాలేజీలు సహకరిచే అవకాశం ఉందని  అధికారులు అంచనా వేస్తున్నారు. ఫీజు బకాయిలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి సూచిస్తున్నట్టు సమాచారం. 
ఆన్‌లైన్‌ పరీక్షలపై విద్యార్థులకు అవగాహన
ఆన్‌లైన్‌లో ఎంసెట్‌ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో డిసెంబర్‌ నుంచే విద్యార్థులకు అవగాహన కల్పిస్తామని అధికారులు అంటున్నారు. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో చదివే విద్యార్థుల కోసం ఆయా జిల్లా కేంద్రాల్లో ఆన్‌లైన్‌ మాక్‌టెస్టులు కూడా నిర్వహించే యోచనలో వున్నారు. మరోవైపు ఇప్పటికే ప్రయివేటు, కార్పొరేట్‌ కాలేజీల్లో మాక్‌టెస్టులు ప్రారంభమయ్యాయి. దీంతో ప్రభుత్వ కాలేజీ విద్యార్థులు నష్టపోకుండా ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని విద్యామండలి అధికారులు అంటున్నారు. 
ఈసారి టీఎస్‌ ఆన్‌లైన్‌ కు ఎంసెట్‌ నిర్వహణ బాధ్యత
గతేడాది ఎంసెట్ నిర్వహణ బాధ్యత అంతా సిజిజి నిర్వహించింది. ఈ యేడాది అన్నీ సెట్స్ నిర్వహణ బాధ్యతను టీఎస్‌ఆన్‌లైన్‌కు అప్పగించనున్నారు. ఇప్పటికే టీఎస్‌ఆన్‌లైన్‌తో సమావేశం నిర్వహించిన ఉన్నత విద్యామండలి అధికారులు  వచ్చేనెల మొదటివారంలో మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. ప్రవేశ పరీక్షల నిర్వహణ, విధివిధానాలు, పరీక్షల తేదీ, కన్వీనర్ల ఎంపిక లాంటి అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో వచ్చేనెల 20వ తేదీ నాటికి ప్రవేశ పరీక్షల తేదీలు, కన్వీనర్ల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసే అవకాశం వుంది. 

 

07:27 - November 30, 2017

హైదరాబాద్ : 'మహిళలే ఫస్ట్‌.. అనే నినాదంతో నడుస్తున్న గ్లోబల్‌ సమ్మిట్‌లో కీలక మహిళానేత కనిపించలేదు ఎందుకు..? రాష్ట్రంలో ఉన్న ఒకేఒక మహిళా ఎంపీ కవిత.. సదస్సులో ఎందుకు కనిపించలేదు..? ముఖ్యమంత్రి కుటుంబ రాజకీయాలే దీనికి కారణమా..? తన రాజకీయ వారసుడిగా కేటీఆర్‌ను ఎస్టాబ్లిష్‌ చేసేందుకే సీఎం కేసీఆర్‌ కూతురును అడ్డుకున్నారా..? మహిళల పట్ల ముఖ్యమంత్రి వివక్షకు ఈ సంఘటనే నిదర్శనం అనే విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో ఇపుడు ఇదేవిషయం హాట్‌ టాపిక్‌గా మారింది.  
తెలంగాణా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా జీఈఎస్ సదస్సు  
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జీఈఎస్ సదస్సు తెలంగాణా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్‌లో  గ్లోబల్‌సమ్మిట్‌  రాజకీయ  చర్చకు కూడా దారితీసింది.  ముఖ్యమంత్రి కెసిఆర్  సదస్సులో పాల్గొన్నా... మంత్రి కెటిఆర్‌కు పెద్దపీఠ దక్కింది.  ఈ సదస్సులో  కెటిఆర్‌పైనే ఫోకస్‌ నిలిచింది. కాని 'విమెన్‌ఫస్ట్‌-ప్రాస్పరిటీ ఫర్‌ఆల్‌ ' అనే  థీమ్‌తో నడిచిన సదస్సులో ..రాష్ట్రంలో ఉన్న ఒకేఒక మహిళా ఎంపీకి అన్యాయం జరిగిందనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.   
సదస్సులో కనిపించని ఎంపీ కవిత 
జీఈ సదస్సులో 52 శాతం మంది మహిళా పారిశ్రామిక వేత్తలే పాల్గొన్నారు. అయినా తెలంగాణా రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఏకైక మహిళా ఎంపీ  కవిత.. సదస్సుకు హాజరు కాకపోవడం హాట్ టాపిక్ గా మారింది.   కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, సుష్మాస్వరాజ్ లాంటి  నేతలు ఈ సదస్సుకు మొదటి రోజు హాజరయ్యారు. వారితో  ఎంతో సన్నిహితంగా ఉంటూ... సమర్ధవంతమైన నేతగా గుర్తింపు  ఉన్నా.. ఎంపీ కవిత సదస్సుకు హాజరు కాకపోవడానికి కారణాలు ఏమిటన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. ఇప్పటికే మహిళా మంత్రులకు క్యాబినెట్లో స్థానం దక్కలేదన్న విమర్శలను కేసీఆర్‌ ప్రభుత్వం ఎదుర్కొంటోంది. 
గులాబీపార్టీ రాజకీయాలే కవితను అడ్డుకున్నాయా ? 
మహిళలు  మెజార్టీగా హాజరైన ఈ అంతర్జాతీయ సదస్సులో  రాష్ట్రానికి  చెందిన కీలక మహిళా నేత కనిపించకపోవడానికి గులాబీపార్టీ రాజకీయలే కారణం అని పొలిటికల్‌ కామెంట్లు నడుస్తున్నాయి. తన రాజకీయ వారసునిగా కేటీఆర్‌ను నిలిపేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుమారుణ్ని ప్రోత్సహిస్తున్నారనే వాదనలు వస్తున్నాయి. మహిళల పట్ల సీఎం కేసీఆర్‌కు ఉన్న వివక్షకు ఎంపీ కవిత గ్లోబల్‌సమ్మిట్‌కు హాజరవక పోవడంమే నిదర్శనం అనే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వంలో కీలక మంత్రి హరీశ్‌రావు కూడా జీఈ సదస్సులో కనిపించకపోవడంపై కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి. కుమారుణ్ని తన వారసుడిగా ప్రకటించడంలో భాగంగానే గ్లోబల్‌సమ్మిట్‌లో కేసీఆర్‌ కూడా అంత యాక్టివ్‌గా ఉండలేదనే  చర్చలు రాజకీయవర్గాల్లో నడుస్తున్నాయి. విమెన్‌ఫస్ట్‌ అనే నినాదంతో నడిచిన సదస్సులో రాష్ట్రం నుంచి ఉన్న ఒకేఒక మహిళా ఎంపీకి దక్కాల్సిన గౌరవం ఇదేనా అనే కామెంట్లు  సర్వత్రా వినిపిస్తున్నాయి.   

 

నేడు ప.గో జిల్లాలో కేరళ వ్యవసాయ శాఖ మంత్రి బృందం పర్యటన

ప.గో : నేడు పెరవలి మండలం ముక్కామలలో కేరళ వ్యవసాయ శాఖ మంత్రి సునీల్ కుమార్ బృందం పర్యటించనున్నారు.

నేడు టీడీపీలో చేరనున్న వైసీపీ నేత గుర్నాథరెడ్డి

అమరావతి : నేడు వైసీపీ నేత గుర్నాథరెడ్డి టీడీపీలో చేరనున్నారు. చంద్రబాబు సమక్షంలో గుర్నాథరెడ్డి టీడీపీలో  చేరునున్నారు. 

నేడు చైనా వెళ్లనున్న సీతారాం ఏచూరి

ఢిల్లీ : సీసీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి నేడు చైనా వెళ్లనున్నారు. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా ఆహ్వానం మేరకు చైనాకు వెళ్తున్నారు. నేటి నుంచి బీజింగ్ లో సీపీసీ అత్యున్నతస్థాయి సమావేశాలు జరుగనున్నాయి.

 

నేడు సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్

అమరావతి : సెక్రటరీలు, హెచ్ వోడీలు, కలెక్టర్లతో నేడు సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.

 

Don't Miss