Activities calendar

01 December 2017

21:45 - December 1, 2017

ఉత్తర్ ప్రదేశ్ : స్థానిక ఎన్నికల్లో బిజెపి భారీ విజయం సాధించడంతో కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. 16 నగర పాలక సంస్థలకు గాను 14 స్థానాలను బిజెపి కైవసం చేసుకుంది. బిఎస్‌పి 2 నగర పాలక స్థానాలను గెలుచుకుంది. వారణాసి, గోరఖ్‌పూర్‌, ఘజియాబాద్‌, రాయ్‌బరేలి, ఆగ్రా,ఫిరోజాబాద్‌, అయోధ్య, మధుర, లక్నో, కాన్పూర్‌, సహరాన్‌పూర్‌, మొరదాబాద్‌, ఝాన్సీ, బరేలీల్లో బీజేపీ మేయర్‌ అభ్యర్థులు విజయం సాధించారు. అలీఘర్‌, మీరట్‌లో బీఎస్‌పీ మేయర్‌ అభ్యర్థులు గెలుపొందారు. తమ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల కారణంగానే బీజేపీకి ప్రజలు ఘనవిజయం అందించారని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ అన్నారు. స్థానిక ఎన్నికల్లో రెండో స్థానంలో బహుజన్ సమాజ్ పార్టీ నిలిచింది. మూడో, నాలుగో స్థానాల్లో సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ ఉన్నాయి. ఆమ్‌ ఆద్మీ పార్టీ యూపీలో బోణి కొట్టింది. ఆప్‌కు 3 నగర పంచాయితీలు, నగర పాలిక పరిషత్‌లో ఒక చోట గెలుపొందింది. 652 పురపాలక స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటిల్లో 16 నగర నిగమ్‌లు, 198 నగరపాలిక పరిషత్‌లు, 438 నగర పంచాయతీలు ఉన్నాయి.

కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి ఉత్తరప్రదేశ్ స్ధానిక ఎన్నికలు గట్టి షాక్‌ ఇచ్చాయి. రాహుల్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న అమేథి నగర పంచాయితీలో బిజెపి విజయం సాధించింది. అమేథి నగర్‌ పంచాయితీలో బీజేపీ అభ్యర్థి చంద్రమా దేవి 1035 ఓట్ల తేడాతో కాంగ్రెస్‌ను ఓడించారు. అమేథితో పాటు సోనియా గాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్న రాయ్‌ బరేలీలోనూ బీజేపీ విజయం సాధించింది. యూపీ స్ధానిక ఎన్నికల్లో అత్యధిక మేయర్‌ స్ధానాలను, నగర పంచాయితీలను బీజేపీ కైవసం చేసుకుంది.

21:44 - December 1, 2017

హైదరాబాద్ : ఎయిర్‌సెల్‌-మ్యాక్సిస్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు చెన్నైలోని నాలుగు ప్రాంతాల్లో, కోల్‌కతాలోని రెండు ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. మాజీ ఆర్థికమంత్రి చిదంబరం బంధువుల ఇళ్లల్లో కూడా తనిఖీలు చేశారు. కార్తి చిదంబరం మామ ఎస్‌ కైలాసం, రామ్‌జీ నటరాజని, సుజయ్‌ సాంబమూర్తి ఇంట్లో సోదాలు నిర్వహించారు. 2006లో జరిగిన ఎయిర్‌సెల్‌-మ్యాక్సిస్‌ ఒప్పందంలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఎయిర్‌సెల్‌లో 3 వేల 500 కోట్లు పెట్టుబడులు పెట్టడానికి మారిషస్‌కు చెందిన మ్యాక్సిస్‌ కేంద్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరింది. 600 కోట్లు పైబడిన విదేశీ పెట్టుబడులకు అనుమతి ఇచ్చే అధికారం ప్రధానమంత్రి నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీకి మాత్రమే ఉంది. అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం సొంతంగా నిర్ణయం తీసుకుని అనుమతులు ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. 

 

21:42 - December 1, 2017

హైదరాబాద్ : ఓఖి తుపాను తమిళనాడు, కేరళ, లక్షద్వీప్‌ను అతలాకుతలం చేస్తోంది. బలమైన ఈదురుగాలులతో వందలాది చెట్లు నేలకూలాయి. లక్షద్వీప్‌లో ఎగిసిపడుతున్న అలలతో తీర ప్రాంతం భీకరంగా ఉంది. తుపాను ధాటికి ఇప్పటివరకూ 14 మంది మరణించారు. 30 మంది జాలర్లు గల్లంతయ్యారు. వీరిలో 8 మందిని రక్షించారు. తుపాను ధాటికి తమిళనాడులో 10 మంది, కేరళలో నలుగురు మరణించారు.

కేరళకు చెందిన 30 మంది మత్స్యకారులు గురువారం నుంచి కనిపించకుండా పోయారు. వారిలో 8 మంది జాలర్లను నేవీ రక్షించింది. మిగతావారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. లక్షద్వీప్‌లోని కల్పెనీ ద్వీపం సమీపంలో ఐదు జాలర్ల పడవలు మునిగాయి. ఇందులో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని అధికారులు తెలిపారు. కన్యాకుమారిపై తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది. కన్యాకుమారి వద్ద సముద్రం ఉప్పొంగడంతో సుచీంద్రం ఆలయం లోపలికి సముద్రపు నీరు చొచ్చుకువచ్చింది. ఆలయంలోని ముఖమంటపం నీటితో నిండిపోయింది.

భారీ వర్షాలతో పాటు బలమైన ఈదురుగాలులు వీయడంతో వందల సంఖ్యలో చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఓఖీ తుపాను అరేబియా సముద్రం వైపు మళ్లడంతో పెను తుపానుగా మారినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మినికాయ్‌ దీవులకు 110 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న ఓఖీ 17 కిలోమీటర్ల వేగంతో వాయువ్య దిశగా కదులుతోంది. దీని ప్రభావంతో మరో 24 గంటల్లో తీరం వెంబడి గంటకు 110 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని.... తమిళనాడు, కేరళ, లక్షద్వీప్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను హెచ్చరించారు.

21:37 - December 1, 2017

హైదరాబాద్ : రాష్ట్రంలో ఉన్న హిజ్రాలపై తెలంగాణ సర్కార్‌ సర్వే చేయిస్తోంది. ఈ బాధ్యతను టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్స్‌కు అప్పగించింది. ఈ సంస్థ సర్వేను ప్రారంభించింది. డిసెంబర్ మొదటి వారంలో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఆ రిపోర్ట్‌ అందిన తర్వాత హిజ్రాలకు పెన్షన్, ఉద్యోగ, ఉపాధి మార్గాలు కల్పిస్తామని.. ప్రభుత్వం చెబుతోంది. 

21:35 - December 1, 2017

హైదరాబాద్ : ఇప్పటి వరకూ కోటి 35 లక్షల భూ రికార్డులను ప్రక్షాళన చేశామని సీఎస్‌ ఎస్పీ సింగ్‌ చెప్పారు. 91 శాతం క్లియర్‌ చేశామని... మిగతావి అసైన్డ్‌, కోర్టు వివాదాల్లో ఉన్నాయని చెప్పారు. రెవెన్యూ అధికారులతో సీఎస్‌ భేటి అయి.. భూ సమగ్ర సర్వేపై చర్చించారు. ఈ డిసెంబర్‌లో మొత్తం పూర్తి చేస్తామని సీఎస్‌ చెప్పారు. జనవరి 1 నాటికి పాస్ పుస్తకాలు పంపిణీ ప్రారంభిస్తామన్నారు. ఈ బేటీలో రెవెన్యూ అధికారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సీఎస్‌కి వివరించారు.  

21:35 - December 1, 2017

హైదరాబాద్ : జీఈఎస్ నిర్వహణ ద్వారా కేసీఆర్ సాధించిందేంటో చెప్పాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. కేటీఆర్‌కు పబ్లిసిటీ కల్పించడం కోసమే హడావిడి చేశారని ఆరోపించారు. రాష్ట్రం పరువు తీయడంతో పాటు.. ప్రభుత్వ ఖజానాపై భారం మోపారని టీకాంగ్రెస్‌ నేతలు నిప్పులు చెరిగారు. సదస్సులో చూపించినవేమీ నిజాలు కావని వీహెచ్ ఏకంగా ఇవాంక ట్రంప్‌కు లేఖ రాశారు. హైదరాబాద్‌లో జరిగిన గ్లోబల్ సమ్మిట్‌ను తెలంగాణ సర్కార్‌ నిర్వహించిన తీరుపై తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు నిప్పులు చెరిగారు. సదస్సు మొత్తం కేటీఆర్ షోగా మారిందని ఎద్దేవా చేశారు. ఇవాంక రావడం వల్ల తెలంగాణకు ఒరిగిన ప్రయోజనమేంటని ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల కోట్లాది రూపాయలు వృధా చేసిన కేసీఆర్.. సమ్మిట్ మొత్తం తన కుమారుడు కేటీఆర్‌కు పబ్లిసిటీ కోసం వాడుకున్నారని ఆరోపించారు.

జీఈఎస్ నిర్వహణ ద్వారా తెలంగాణ ప్రజల పరువు తీయడంతో పాటు.. ప్రభుత్వ ఖజానాను నిర్వీర్యం చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క మండిపడ్డారు. గత ప్రభుత్వాలు చేసిన వాటిని తామే చేశామని గొప్పలు చెప్పుకునేందుకు సదస్సును వాడుకున్నారని భట్టి విక్రమార్క ఆరోపించారు. సదస్సులో మహిళా ప్రజాప్రతినిధులకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కేటీఆర్‌ అన్నీతానై వ్యవహరించారని వీహెచ్ మండిపడ్డారు. సదస్సులో చూపించినవేవీ నిజాలు కావని ఇవాంక ట్రంప్‌కు లేఖ రాసినట్లు చెప్పారు. మహిళా సాధికారికత పేరుతో సదస్సు నిర్వహించిన రాష్ట్రంలో.. ఒక్క మహిళా మంత్రి ప్రాతినిధ్యం లేకపోవడం దురదృష్టకరమన్నారు. మరోవైపు మెట్రో రైలు ప్రారంభానికి కనీస ప్రోటోకాల్ పాటించలేదని కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తారు. నగరంలో ఉన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను ఆహ్వానించకపోవడాన్ని తప్పుపట్టారు. 

చర్చల అనంతరం స్పందిస్తామన్న కాపు నేతలు..

విజయవాడ : కాపులను బీసీల్లో చేర్చడంపై కాపు నేతలు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఐదు శాతం రిజర్వేషన్ మాత్రమే కల్పించడంపై కొంత నిరుత్సాహంగా ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం దీనిపై చర్చల అనంతరం స్పందిస్తామని కాపు జేఏసీ నేతలు పేర్కొంటున్నారు. 

బీసీ సంఘాల ఆగ్రహం..

విజయవాడ : కాపులను బీసీల్లో చేర్చుతూ ఏపీ కేబినెట్ నిర్ణయం పట్ల బీసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. రేపు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చినట్లు సమాచారం. 

21:29 - December 1, 2017

పశ్చిమగోదావరి : పోలవరం ప్రాజెక్ట్‌ విషయంలో కేంద్రం మొండి చేయి చూపించే ప్రయత్నంలో పడిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. కేంద్ర ప్రభుత్వం .. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలతో చెలగాటమాడుతోందని ఆరోపించారు. విభజన చట్టంలోని హామీలను కేంద్రం అమలు చేయడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పోలవరం ప్రాజెక్ట్ సాధించుకోవడం కోసం కృషి చేస్తామన్నారు.

గుంటూరు : నరేంద్రమోదీ ప్రభుత్వం ఏపీకి పూర్తిగా అన్యాయం చేసిందని CPI నాయకులు రామకృష్ణ ఆరోపించారు. కేంద్రం మోసంపై ఏపీ ప్రభుత్వం ఆలస్యంగా స్పందించిందన్నారు. అలాగే ముఖ్యమంత్రి తన స్థాయి దిగజారి ప్రవర్తిస్తున్నాడని ప్రస్తుత పోలవరం సమస్యల ఆయనకు ఒక అగ్నిపరిక్షేనన్నారు. బీజేపీ దద్దమ్మలను నమ్ముకుని ఏపీకి అన్యాయం చేయవద్దని కోరారు. 

ఏపీకి కేంద్రం అన్యాయం చేసింది - సీపీఐ..

విజయవాడ : నరేంద్రమోదీ ప్రభుత్వం ఏపీకి పూర్తిగా అన్యాయం చేసిందని CPI నాయకులు రామకృష్ణ ఆరోపించారు. కేంద్రం మోసంపై ఏపీ ప్రభుత్వం ఆలస్యంగా స్పందించిందన్నారు. 

21:26 - December 1, 2017

కర్నూలు : పోలవరం ప్రాజెక్ట్‌ విషయంలో చంద్రబాబునాయుడు నానా రభస చేస్తున్నారని.. వైసీపీ అధినేత జగన్ అన్నారు. కేంద్రం రాసిన లేఖను ప్రజలు చూడరు కదా అని.. చంద్రబాబు ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టుగా బిల్డప్‌ ఇచ్చారని అన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నిజానికి లేఖలో టెండర్లు పిలిచిన ప్రక్రియ సరిగా లేదని..కేంద్రం రాసిందని...ఆయన చెప్పారు. లోపాలను సరిచేసిన తర్వాత.. టెండర్‌ను పిలవాలని పేర్కొన్నారని చెప్పారు. దీంతో చంద్రబాబు నాయుడు చేస్తున్న మోసం కేంద్రం కూడా గుర్తించిందని జగన్‌ అన్నారు. 

ప్రజలతో చెలగాటమాడుతున్న ప్రభుత్వాలు - మధు...

విజయవాడ : పోలవరం ప్రాజెక్ట్‌ విషయంలో కేంద్రం మొండి చేయి చూపించే ప్రయత్నంలో పడిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. కేంద్ర ప్రభుత్వం .. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలతో చెలగాటమాడుతోందని ఆరోపించారు. విభజన చట్టంలోని హామీలను కేంద్రం అమలు చేయడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పోలవరం ప్రాజెక్ట్ సాధించుకోవడం కోసం కృషి చేస్తామన్నారు.

బాబు బిల్డప్ ఇస్తున్నారన్న జగన్...

కర్నూలు : పోలవరం ప్రాజెక్ట్‌ విషయంలో చంద్రబాబునాయుడు నానా రభస చేస్తున్నారని.. వైసీపీ అధినేత జగన్ అన్నారు. కేంద్రం రాసిన లేఖను ప్రజలు చూడరు కదా అని.. చంద్రబాబు ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టుగా బిల్డప్‌ ఇచ్చారని అన్నారు.

21:21 - December 1, 2017

 

విజయవాడ : పోలవరం ప్రాజెక్టు పనులు నిలిపివేయాలంటూ కేంద్రం రాసిన లేఖపై ఏపీలో రాజకీయ రగడ జరుగుతోంది. ఇందుకు చంద్రబాబు కేంద్రాన్ని నిందిస్తుంటే.. టీడీపీ మిత్రపక్షమైన బీజేపీ సహా ఇతర ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి వైఖరిని తప్పుపడుతున్నాయి. మరోవైపు ఎవరు ఎన్ని అడ్డంకులు, అవరోధాలు సృష్టించినా పోలవరం ప్రాజెక్టుపై వెనుకడుగు వేసే ప్రసక్తేలేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పోవలరం నిర్మాణంతోపాటు రాష్ట్రాభివృద్ధికి చేయూత ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్న విషయాన్ని మరోసారి గుర్తు చేశారు. రాష్ట్రాభివృద్ధిలో ముడిపడివున్న అతి సున్నితమైన పోలవరం అంశాన్ని రాజకీయం చేయొద్దని టీడీఎల్‌పీ సమావేశంలో పార్టీలకు విజ్ఞప్తి చేశారు.

అమరావతిలో తెలుగుదేశం శాసనసభాపక్షం సమావేశం జరిగింది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరుతోపాటు రాష్ట్రాభివృద్ధికి ప్రభుతం తీసుకుంటున్న చర్యలపైనా సమావేశంలో చర్చించారు. అమరావతిలో ప్రభుత్వ ఉద్యోగులు, కార్యదర్శులు, శాసనసభ్యులకు నిర్మిస్తున్న వసతి, సచివాలయం కొత్త నమూనాల గురించి సీఎం శాసనసభ్యుల దృష్టికి తెచ్చారు.

విభజనతో అన్ని విధాల నష్టపోయిన రాష్ట్రానికి చేయూత ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని చంద్రబాబు టీడీఎల్‌పీ భేటీలో అన్నారు. పోలవరం పనులు నిలిపివేయాలంటూ కేంద్ర జలనవరుల శాఖ కార్యదర్శి అమర్‌జిత్‌సింగ్‌ రాసిన లేఖపై ప్రధాని మోదీతో మాట్లాడాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. పోలవరం ఆపాలంటూ కేంద్రం రాసిన లేఖపై రాజకీయ పార్టీలు రకరకాల వ్యాఖ్యలు చేస్తున్న తరుణంలో చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. పోలవరం లేఖను బీజేపీ-టీడీపీ సంబంధాలతో ముడిపెట్టడాన్ని తప్పు పట్టారు. పార్టీ ప్రజాప్రతినిధులెవ్వరూ కూడా దీనిపై రాజకీయ వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించారు.

మరోవైపు పోలవరం లేఖపై చంద్రబాబు తీవ్రంగా స్పదిస్తున్న తీరును బీజేపీ తప్పుపడుతోంది. పద్నాలుగు వందల కోట్ల స్పిల్‌వే టెండర్ల ప్రక్రియలో లోపాలు ఉండటం వలనే కేంద్రం జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మండపడ్డారు. పోలవరం నిర్మాణాన్ని నీరుకార్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని వైసీపీ ఆరోపించింది. కేంద్రం నిర్మిస్తామని చెప్పినా... దరిద్రపు ఆలోచనలతోనే చంద్రబాబు ఈ ప్రాజెక్టు బాధ్యతలను భుజాలకెత్తుకున్నారని వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు సీపీఐ కూడా.. మోదీ బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపిస్తూ.. చంద్రబాబు ఇప్పటికైనా అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకు వెళ్లాలని పార్టీ కార్యదర్శి నారాయణ డిమాండ్‌ చేశారు. పోలవరంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాటకాలు ఆడుతున్నాయిన ఏపీ పీసీసీ చీఫ్‌ రఘువీరెడ్డి విమర్శించారు. పోలవరం పనులు నిలిపివేయాలంటూ కేంద్రం రాసిన లేఖపై పరస్పర నిందారోపణలు చేసుకుంటున్న రాజకీయ పార్టీలకు లోక్‌సత్తా నేత జయప్రకాశ్‌నారాయణ్‌ చురకలు అంటించారు. కేంద్రం స్పష్టత ఇచ్చే వరకు పోలవరంపై రగులుతున్న రాజకీయ రగడ సమసిపోయే అవకాశాలు కనిపించడంలేదని భావిస్తున్నారు. 

21:10 - December 1, 2017

విజయవాడ : కాపుల రిజర్వేషన్ లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నాడు జరిగిన ఏపీ కేబినెట్ లో సుదీర్ఘంగా దీనిపై చర్చించింది. ఈ భేటీ కంటే ముందుగా మంజునాథ కమిషన్ నివేదిక ప్రభుత్వానికి అందింది. కేబినెట్ లో మంజునాథ కమీషన్ సభ్యులు పాల్గొన్నారు.

గత ఎన్నో సంవత్సరాలుగా కాపులను బీసీల్లో చేర్చాలని పోరాటం జరుగుతున్న సంగతి తెలిసిందే. గతంలో పాదయాత్ర చేసిన సందర్భంలో కాపులను బీసీల్లో చేర్చుస్తామని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా కాపుల రిజర్వేషన్ పై ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడంతో కాపు ఉద్యమ నేత ముద్రగడ ఆందోళన చేపట్టారు. అనంతరం ప్రభుత్వం పలు హాహీలు గుప్పించింది.

ఇదిలా ఉంటే మంజునాథ కమిషన్ శుక్రవారం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం..దీనిపై ఏపీ కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చించారు. చివరకు కాపు బలిజ, తెలగ, ఒంటరి కులాలకు ఐదు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. కాపుల కోసం బీసీ ఎఫ్ కేటగిరి ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. శనివారం కేబినెట్ మరోసారి భేటీ అయి దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది. అనంతరం అసెంబ్లీలో దీనిపై తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్ అంశాన్ని 57 శాతానికి పెంచాలని..తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ తరహాలో రిజర్వేషన్ కల్పించాలని ఏపీ ప్రభుత్వం కోరనుంది. మరి కేంద్రం..ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

దళితుల ఆచూకీ లభ్యం..

నిజామాబాద్ : బీజేపీ నేత భరత్ రెడ్డి దాడి చేసినట్లుగా వచ్చిన ఆరోపణల అనంతరం కనిపించకకుండా పోయిన ఇద్దరు దళితుల ఆచూకీ లభ్యమైంది. నిజామాబాద్ ఏసీపీ కార్యాలయంలో వారిని పోలీసులు విచారిస్తున్నారు. 

బీసీల్లో కాపులు - ఏపీ మంత్రులు..

విజయవాడ : కాపులను బీసీలో చేర్చాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని, అసెంబ్లీ ఉన్నందున నిర్ణయాలు ఇప్పుడే చెప్పలేమని ఏపీ మంత్రులు పేర్కొన్నారు. కాపులకు టిడిపి ఇచ్చిన హామీలను నిలబెట్టుకొంటోందని తెలిపారు. 

20:43 - December 1, 2017

ఆ రాష్ట్రాలే ఎందుకు దళితులపై దాడుల్లో ముందున్నాయి..? ఆ రాష్ట్రాలే ఎందుకు మహిళలపై దాడుల్లో ముందున్నాయి? ఏ దన్ను చూసుకుని చెలరేగిపోతున్నారు? ఏ అండతో ఈ దాడులు సాగిస్తున్నారు? నేషనల్ క్రైమ్ రికార్డ్స్ జాబితా ఆలస్యంగా ఎందుకు రిలీజ్ అయింది? క్రూరంగా ఘోరంగా సాగుతున్న నేరాల తీరుపై ప్రత్యేక కథనం.. ఆలస్యంగా ఎందుకు విడుదల చేశారు? భయపడ్డారా? ఎన్నికల్లో ఈ చిట్టా ప్రభావితం చేస్తుందని వెనుకంజ వేశారా? దళితులపై మహిళలపై తమ రాష్ట్రాల్లో పెరుగుతున్న నేరాలను చెప్పుకోలేక వాయిదా వేశారా? నేషనల్ క్రైమ్ రికార్డ్స్ జాబితా ఎందుకు ఆలస్యంగా విడుదలయింది? అందులో హైలైట్స్ ఏంటి?

బీజెపీ పాలిత రాష్ట్రాల్లో క్రైమ్ రేట్ పెరుగుతోందా? దళితులు, మహిళలపై దాడులు జరుగుతున్నాయా? కేసుల సంఖ్య ఏం చెప్తోంది? కేంద్రం, రాష్ట్రంలో ఉన్న అధికారాన్ని అండగా చేసుకుని కమలం కార్యకర్తలు చెలరేగిపోతున్నారా? ముఖ్యంగా నేరాలకు అడ్డాగా దేశంలో అతి పెద్ద రాష్ట్రం యూపీ నిలవడాన్ని ఎలా చూడాలి?

ఏపీ తెలంగాణలు పోటీపడుతున్నాయి..ఒకదానితో వెంట మరొకటి నేను ముందంటే నేను ముందని దూసుకెళ్తున్నాయి.. అభివృద్ధిలోకాదు.. క్రైమ్ రేట్ లో.. హత్యలు, కిడ్నాప్ లు, మహిళలపై దాడుల్లో రెండు తెలుగు రాష్ట్రాలు పోటాపోటీగా ఉన్నాయి. ఇక దేశంలోనే అత్యంత అవినీతి రాష్ట్రంగా మహారాష్ట్ర తన ఘనతను నిలబెట్టుకుంది

టీజర్ ఎన్ని చట్టాలున్నా, రాజ్యాంగ రక్షణలు ఘోషిస్తున్నా.. పరిస్థితిలో మార్పు కనిపించటంలేదు.. వివరాలు చిన్న బ్రేక్ తర్వాత..
మహిళల హక్కులను కాలరాస్తున్నారు..బాలలపై దాడులు అడ్డూ అదుపు లేకుండా జరుగుతున్నాయి. దళితులపై కులదురహంకారంతో విరుచుకుపడుతున్నారు.. ఎన్ని చట్టాలున్నా, రాజ్యాంగ రక్షణలు ఘోషిస్తున్నా.. పరిస్థితిలో మార్పు కనిపించటంలేదు.. 2017 క్రైమ్ రికార్డ్స్ ఈ అంశాలను స్పష్టంగా చెప్తోంది. పైగా ఈ నేరాల్లో నిందితులకు శిక్ష పడిన సందర్భాలూ తక్కువే..

నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ మన సమాజ పరిస్థితిని స్పష్టంగా చెప్తున్నాయి. ఏ వర్గాలను అణచివేస్తున్నారు. ఎవరిపై దాడులు చేస్తున్నారు. దానికి కారణాలేంటి? అనే అంశాలు ఈ గణాంకాలను గమనిస్తే తెలుస్తుంది. వివిధ రాష్ట్రాల్లో దళితులు, మహిళలపై పెరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్న అంశం. సత్వరం జాగ్రత్తపడి తగని చర్చలు తీసుకోవలసిన అవసరాన్ని ఈ గణాంకాలు చెప్తున్నాయి. పూర్తి విశ్లేషణకు వీడియో క్లిక్ చేయండి. 

ఏపీ కేబినెట్ నిర్ణయాలు..

విజయవాడ : కాపులను బీసీలో చేర్చేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. బీసీ ఎఫ్ కేటగిరిని ఏర్పాటు చేసి కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకుంది. శనివారం ఉదయం మరోసారి కేబినెట్ భేటీ అయి ఆమోదించనుంది. రేపు ఉదయం 9గంటలకు కాపు రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని నిర్ణయం తీసుకుంది.

 

20:21 - December 1, 2017

అరే ఈ తెలంగాణలున్న ప్రతిపక్షాలోళ్లకు ఏం పనిలేనట్టుందివా..? టీఆర్ఎస్ నాయకుడు బస్టాండ్ జాగను కబ్జావెట్టిండు అంటె.. పెట్టడా మరి..? ప్రభుత్వం చర్యలు దీస్కోవాలె ఆయన మీద అని బోధన్ కాడ అఖిలపక్షం నాయకులు డిమాండ్ జేస్తున్నరట.. అరే నాయన.. కబ్జావెట్టినోడే సర్కారు మన్షాయే ఇగ మీకు ఏం జెప్పాలే చెప్పుండ్రి..గీ ముచ్చట జూడాలంటే వీడియో క్లిక్ చేయండి. 

సీఎస్ తో రెవెన్యూ అధికారుల భేటీ...

హైదరాబాద్ : సీఎస్ తో రెవెన్యూ అధికారులు భేటీ అయ్యారు. సమగ్ర భూ సర్వేపై చర్చించారు. భూ రికార్డులో భాగంగా కోటి 35 లక్షళ ప్రక్షాళన జరిగినట్లు, 10,806 గ్రామాలకు గాను 7,363 గ్రామాల్లో సమగ్ర భూ సర్వే పూర్తయ్యిందని అధికారులు పేర్కొంటున్నారు. అసైన్డ్, కోర్టు వివాదాల్లో మిగతా భూములున్నాయని, డిసెంబర్ లో మొత్తం భూ ప్రక్షాణల చేస్తామని పేర్కొన్నారు. జనవరి 1నాటికి పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తామని సీఎస్ కు రెవెన్యూ అధికారులు తెలిపారు. 

శబరిమలలో రోడ్డు ప్రమాదం..

అనంతపురం : శబరిమలలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శబరిమలలో విధులు ముగించుకుని తిరిగి వస్తున్న పోలీసు వ్యాన్ ను కేరళ ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఏడుగురు పోలీసులకు తీవ్రగాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

19:33 - December 1, 2017

అరే నాయనా..? తెలంగాణ సర్కారోళ్లు.. జర్ర మీరీ డ్రామాలు బంజేయుండ్రిరా నాయనా..? బ్రహ్మదలిస్తె ఆవుసుకు కొద్వనా..? మొగడు తలిస్తె దెబ్బలకు కొద్వనా..?..అంబర్ పేట అన్మంతన్న ఉన్నతాన ఉండెతట్టు లేడుగదా..? అరే నాయన ఎటువోతున్నదిరో లోకము.? డాక్టర్ టీవీ స్టూడియోల గూసుంటడు.. పేషెంట్ ఇంటికాడుంటది.. అరే గాంధీ తాతకు అప్పట్ల బుర్ర ఎల్గనట్టుందిగని.. గంగెద్దు కింద వన్నడు గద్దరన్న.. తన్ను తన్నుమని తన్నిపిచ్చుకోని మరీ సప్పట్లు గొట్టిచ్చుకున్నడు తాత..అరే ఈ తెలంగాణలున్న ప్రతిపక్షాలోళ్లకు ఏం పనిలేనట్టుందివా..? నల్లనీళ్లకాడనో శాతబాయికాడనో ఎట్లుంటదమ్మా పంచాది..? గీ గరం..గరం..ముచ్చట్ల కోసం వీడియో క్లిక్ చేయండి....

19:31 - December 1, 2017

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఏమవుతుంది ? 2019 వరకు నిర్మాణం పూర్తవుతుందా ? సీఎం చంద్రబాబు నాయుడు ఎలా స్పందించనున్నారు ? పోలవరం పనుల టెండర్లు ఆపాలని కేంద్రం నుండి లేఖ రావడంతో సీఎం చంద్రబాబు నాయుడు గురువారం అసెంబ్లీలో ఓ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. పనులు కేంద్రానికి అప్పగించేందుకు సిద్ధమని ప్రకటించారు. దీనితో రాజకీ ప్రకంపనలు మొదలయ్యాయి. ఈ అంశాలపై టెన్ టివి విజయవాడ స్టూడియోలో జరిగిన ప్రత్యేక చర్చలో గన్ని ఆంజనేయులు (టిడిపి ఎమ్మెల్యే), పార్థసారధి (మాజీ మంత్రి, వైసీపీ నేత), తుమ్మల పద్మ (బీజేపీ మహిళా యువమోర్చా) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

19:26 - December 1, 2017

మొదట హిట్స్ మీద హిట్స్ కొట్టి తరువాత స్క్రిప్ట్స్ ఎంపికలో కన్ ఫ్యూజ్ అయిన సాయిధరమ్ తేజ్ కొంచెం గ్యాప్ తీసుకుని కమర్షియాలిటీ తో పాటు దేశభక్తి కూడా మిక్స్ చేస్తూ జవాన్ అనే సినిమా చేసాడు.రైటర్ BVS రవి డైరెక్షన్ లో ప్రెసెంట్ టైం లో లక్కీ గర్ల్ గా పేరుతెచ్చుకున్న మెహ్రీన్
హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజే ఆడియన్స్ ముందుకు వచ్చింది.ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది ?

సినిమా కథ...
ఈ సినిమా కథ విషయానికి వస్తే.....చిన్నపటినుండి క్రమశిక్షణ అంటూ పెరిగిన జై.. DRDO లో జాబ్ సంపాదించడమే టార్గెట్ గా ఫిక్స్ అవుతాడు.చిన్నతనం నుండి వైల్డ్ నేచర్ అలవాటయిన కేశవ్ ఎలాగయినా ఎదగాలని అడ్డదాదారులు తొక్కి క్రిమినల్ గా మారతాడు.అయితే DRDO రూపొందించిన ఆక్టోపస్ అనే మిస్సైల్ లాంచర్ కోసం 5oo కోట్ల భారీ డీల్ ఒప్పుకుంటాడు కేశవ.అయితే ఆక్టోపస్ ని ఎవరో దొంగిలించబోతున్నారు అని తెలుసుకుని వాళ్ళ నుండి ఆక్టోపస్ ని రక్షించి DRDO లో ఉద్యోగం కూడా సంపాదించుకుంటాడు జై.దాంతో జై పై పగబట్టి అతనితోనే ఆక్టోపస్ ని తెప్పించడానికి అతని ఫామిలీ ని టార్గెట్ చేస్తాడు కేశవ్. ఈ విషయం తెలుసుకున్న జై కేశవ నుండి ఎలా తన ఫ్యామిలీ ని రక్షించుకున్నాడు, ఆక్టోపస్ కేశవ్ కి దక్కకుండా ఎలా అడ్డుకున్నాడు అన్నది మిగతా కథ.

నటీ నటుల ప్రతిభ...
నటీనటుల విషయానికి వస్తే.... ఈ సినిమా విజయం తన కెరీర్ కి కీలకంగా మారడంతో లుక్ నుండి యాక్టింగ్ వరకు చాలా కేర్ తీసుకున్నాడు తేజు.చాలా స్టైలిష్ గా కనిపించిన తేజు నటనపరంగా కూడా బాగా ఇంప్రూవ్ అయ్యాడు.జై క్యారెక్టర్ లో ఒదిగిపోయి నటించాడు.ఎమోషన్స్ పండించడంలో,డైలాగ్స్ చెప్పేటప్పడు డిక్షన్ లో గాని చాలా మెచ్యూరిటీ చూపించాడు.ఇక విలన్ గా తెలుగు తెరకు పరిచయమయిన హీరోయిన్ స్నేహ భర్త ప్రసన్న కూడా స్టైలిష్ విలన్ గా ఆకట్టుకున్నాడు. అతనికి హేమ చంద్ర చెప్ప్పిన డబ్బింగ్ బాగా హెల్ప్ అయింది. ప్రసన్న రూపంలో టాలీవుడ్ కి మరో విలన్ దొరికాడు. ఇక హీరోయిన్ మెహ్రీన్ ఈ సినిమాలో మునుపెన్నడూ లేనంత గ్లామరస్ గా కనిపించింది. ముఖ్యంగా పాటల్లో ఆమె లుక్స్ యూత్ ని, మాస్ ని బాగా ఆకట్టుకుంటాయి. నటన పరంగా పెద్దగా స్కోప్ లేదు,ఉన్నంతలో కూడా ఆమె పెద్దగా ఎఫర్ట్ పెట్టలేదు. మిగతా నటీనటులంతా తమ పరిధిమేర పరవాలేదనిపించారు.

టెక్నిషీయన్స్...
టెక్నీషియన్స్ విషయానికి వస్తే.... మొదటి సినిమా వాంటెడ్ తో దారుణమయిన డిజాస్టర్ అందుకున్న BVS రవి ఈ సారి పేట్రియాటిక్ టచ్ తో ఉండే యాక్షన్ కథ రాసుకున్నాడు. అయితే సినిమాలో చాలా సన్ని వేశాలు మాత్రం రొటీన్ గా ఉన్నాయి. లవ్ ట్రాక్ కూడా చాలా లైటర్ గా ఉండడంతో అస్సలు ఫీల్ లేదు. హీరో, విలన్ లింక్ అప్, ఆక్టోపస్ సేవింగ్, ఇంటర్వెల్ బ్యాంగ్స్ లో తన రైటర్ గా తన ప్రతిభ చూపించాడు రవి. క్లయిమాక్స్ కూడా బాగానే డీల్ చేసాడు. కానీ హడావిడిగా ముగించినట్టు అనిపించింది. పేట్రియాటిక్ టచ్ తో ఉండే డైలాగ్స్ బాగున్నాయి. ఇక మ్యూజిక్ డైరెక్టర్ థమన్ చాలా ఎఫర్ట్ పెట్టి మ్యూజిక్ చేసాడు. పాటలు పరవాలేదనిపించేలా ఉన్నాయి. ఆర్.ఆర్ మాత్రం సీన్స్ ఎలివేషన్ లో బాగా ఉపయోగపడింది. కెమెరా వర్క్ కూడా బాగుంది. ఎడిటింగ్ చాలా స్టైలిష్ గా ఉంది. గ్రాఫిక్స్ క్వాలిటీ వల్ల విజువల్స్ కి రిచ్ లుక్ వచ్చింది. నిర్మాణ విలువలు బావున్నాయి.

ఓవర్ ఆల్ గా చెప్పాలంటే.... హీరో, విలన్ బ్రెయిన్ గేమ్ హైలైట్ గా తెరకెక్కిన జవాన్ అన్ని వర్గాలకు రీచ్ అయ్యే కంటెంట్ తో వచ్చింది. అయితే అక్కడక్కడా రొటీన్ టచెస్ ఉండడంవల్ల కొంచెం డిజప్పాయింట్ గా అనిపిస్తుంది. అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి మార్కులు వేయించుకునే లక్షణాలున్న, ఈ సినిమా ఫైనల్ గా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందోచూడాలి.

ప్లస్ పాయింట్స్:
సాయిధరమ్ తేజ్ నటన
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
ఫైట్స్,కెమెరా వర్క్
ప్రొడక్షన్ వాల్యూస్
మైనస్ పాయింట్స్ :
కధలో రొటీన్ టచెస్
ఫార్ములా స్క్రీన్ ప్లే
వీక్ గా ఉన్న ఎమోషన్స్
నాటకీయత ఎక్కువైన బ్రెయిన్ గేమ్
రేటింగ్ గురించి తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.....

19:21 - December 1, 2017

విజయవాడ : రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని అందులో భాగంగా విదేశీ పర్యటన చేయనున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి సమాచార విభాగ అధిపతి పరకాల ప్రభాకర్ పేర్కొన్నారు. ఈనెల 3-6వ తేదీ వరకు దక్షిణ కొరియాలో పర్యటించనున్నారని, అక్కడ 8 వాణిజ్య, పారిశ్రామిక బృందాలతో సమావేశం కానున్నారని పేర్కొన్నారు. ఇందులో 6 ద్వైపాక్షిక చర్చలు, మరో రెండు పారిశ్రామిక గ్రూపులతో విడిగా సమావేశం కానున్నారని, అంతేగాకుండా కొరియా ప్రభుత్వ అధికారులతో భేటీ కానున్నారని తెలిపారు. దక్షిణ కొరియాలోని భారత రాయబార కార్యాలయం కియా మోటార్ ఏర్పాటు చేసే రెండు రోడ్ షోలో పాల్గొంటారని తెలిపారు. 

19:15 - December 1, 2017
19:14 - December 1, 2017

పశ్చిమగోదావరి : భర్తల ఆగడాలు ఆగడం లేదు. కట్నం కోసం..ఆడపిల్ల పుట్టిందనే అనేక కారణాలతో భార్యలను నానా హింసలకు గురి చేస్తున్నారు. ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలో సంగీత ఉదంతం తెలిసిందే. తాజాగా గోపాలపురం మండలం వెదుళ్లకుంటలో భర్త ఇంటి ఎదుట భార్య ఆందోళన చేపడుతోంది. తనకు న్యాయం చేయాలని కోరుతోంది.

మోహన కృష్ణ అనే వ్యక్తి బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నట్లు, 23 ఎకరాల్లో పొలాలున్నట్లు నమ్మించి శ్రీదేవిని వివాహం చేసుకున్నట్లు సమాచారం. శ్రీదేవికి తండ్రి లేడు. వివాహ సమయంలో 21 లక్షల కట్నం..భారీగా బంగారం మోహనకృష్ణకు ఇచ్చారని తెలుస్తోంది. నెల రోజుల తరువాత బెంగళూరులో ఉద్యోగం..ఎలాంటి ఆస్తిపాస్తులు లేవని శ్రీదేవి తెలుసుకున్నట్లు సమాచారం. కట్నం కింద వచ్చిన డబ్బులను తాకట్టు పెడుతూ కాలం వెళ్లదీసినట్లు, డబ్బులు అయిపోయిన అనంతరం అదనపు కట్నం తీసుకరావాలంటూ వేధించడం మొదలు పెట్టినట్లు సమాచారం. తనకు తండ్రి లేడని, సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అని కల్లబొల్లి మాటలు చెప్పారిన శ్రీదేవి పేర్కొంటోంది. గతంలో తనను చంపడానికి ప్రయత్నించారని, పొలిటికల్ గా చాలా బెదిరించారని తెలిపారు. తనకు న్యాయం చేయాలని కోరుతోంది. 

భార్యను వేధింపులకు గురి చేస్తున్న భర్త...

పశ్చిమగోదావరి : గోపాలపురం మండలం వెదుళ్లకుంటలో దారుణం చోటు చేసుకుంది. అదనపు కట్నం కోసం భార్యను వేధింపులకు భర్త గురి చేస్తున్నాడు. ఆడపిల్ల పుట్టాక భర్తలో రాక్షసత్యం బయటకొచ్చింది. ఏడాది పాటు పుట్టింట్లో వదిలేశాడు. అనంతరం న్యాయం కోసం వచ్చిన భార్య శ్రీదేవిపై మోహనకృష్ణ దాడికి పాల్పడ్డాడు. మహిళా సంఘాలతో కలిసి భర్త ఇంటి వద్ద భార్య ఆందోళన చేపడుతోంది. 

19:04 - December 1, 2017

ఏపీ కేబినెట్ లో మంజునాథ సభ్యులు..

విజయవాడ : ఏపీ కేబినెట్ సమావేశానికి మంజునాథ సభ్యులు హాజరయ్యారు. కమిషన్ ఇచ్చిన నివేదికకు కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. 

ఏపీ కేబినెట్..నిర్ణయాలు..

విజయవాడ : ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. 2017-20 నూతన ఐటీ పాలసీకి ఆమోదం...పోలవరం హైడ్రో పవర్ ప్రాజెక్టు..960 మె.వా. సామర్థ్యంతో పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి జెన్ కోకు అనుమతినిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. 12 యూనిట్లుగా పోలవరం హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం కానుంది. రూ. వెయ్యి కోట్ల రుణం తీసుకొనేందుకు వెసులుబాటు కల్పిస్తూ కేబినెట్ ఆమోదం త ఎలిపింది. 

బాబు డ్రామాలు కట్టబెట్టాలి - సీపీఐ..

విజయవాడ : రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతుంటే అక్రమ అరెస్టులు చేయడం సిగ్గు చేటని సీపీఐ నేత రామకృష్ణ పేర్కొన్నారు. కేంద్రం సహకరించడం లేదని సీఎం అనడం విడ్డూరంగా ఉందని, బాబు డ్రామాలు కట్టబెట్టాలని సూచించారు. వెంటనే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని సూచించారు. 

మూడు వెనుక బడిన జిల్లాలకు కమిటీ ఏర్పాటు..

హైదరాబాద్ : దేశంలో వెనుకబడిన జిల్లాల జాబితాలో ఖమ్మం కొమరం భీం, ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లిలో ఈ జిల్లాలో మానిటరింగ్ కు ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ నేతృత్వంలో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. 

18:52 - December 1, 2017

కరీంనగర్‌ : బాలీవుడ్ నటుడు సన్నిడియోల్ జిల్లాకు విచ్చేశారు. ఇప్పటికే తన సేవలను విస్తరించిన బాలకృష్ణ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ వారి బీకేటీ టైర్స్‌ షోరూంను సన్నిడియోల్ ప్రారంభించారు. బీకేటీ టైర్స్‌కు తాను బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడం సంతోషంగా ఉందన్నారు సన్నిడియోల్. బీకేటీ టైర్స్‌ పటిష్టతపై నిర్వాహకులు వివరించారు. 

18:51 - December 1, 2017

జగిత్యాల : ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తి గ్రామానికి చెందిన యువ రైతులు నిర్మిస్తున్న 'పడిపోయా నీ మాయలో' సినిమా ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. భారత్ ఆకృతి, కరీంనగర్‌కు చెందిన మహేశ్‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ఐదో తేదీన సినిమా ఆడియోను రిలీజ్ చేయనున్నారు. సినిమాను ఈ నెలలోనే రిలీజ్ చేస్తామని వారు తెలిపారు R.K.కాoపల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహించారని.. కరీంనగర్ జిల్లాకు చెందిన అరుణ్ గుప్తా.. సికింద్రాబాద్‌కు చెందిన సావేరియాలు హీరో, హీరోయిన్‌లగా నటించారని వారు తెలిపారు.

18:49 - December 1, 2017

హైదరాబాద్ : జీఈ సదస్సు నిర్వహణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వంపై వీ హన్మంతరావు విరుచుకుపడ్డారు. సదస్సులో మహిళా ప్రజాప్రతినిధులకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కేటీఆర్‌ అన్నితానై వ్యవహరించారని ఆరోపించారు. సదస్సులో చూపించనవేవీ నిజాలు కావని ఇవాంక ట్రంప్‌కు లేక రాసినట్లు చెప్పారు. మహిళా సాధికారత పేరుతో సదస్సు నిర్వహించిన రాష్ట్రంలో.. ఒక్క మహిళా మంత్రి ప్రాతినిధ్యం లేకపోవడం దురదృష్టకరమన్నారు. 

18:47 - December 1, 2017

హైదరాబాద్ : కొలువుల కొట్లాట సభకు టీజాక్‌ ఛైర్మన్‌ కోదండరామ్‌ ఎట్టకేలకు ప్రభుత్వం నుంచి అనుమతిసాధించారు. ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా పాలించడం లేదని కోదండరామ్‌ ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారిపై నిరంకుశంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. నిరుద్యోగుల సమస్య పరిష్కారానికి సమిష్టిగా కృషి చేయాలని పేర్కొన్నారు. మరిన్ని విషయాలకు వీడియో క్లిక్ చేయండి. 

17:30 - December 1, 2017

జగిత్యాల : దళితులపై ఇంకా వివక్ష..అగ్రవర్ణాల దాష్టీకం వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఎన్నో ఘటనలు వెలుగు చూస్తున్నా అధికారులు..సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గ్రామ బహిష్కరణ చేసిన సంఘటన సంచలనం సృష్టిస్తోంది. తమకు న్యాయం చేయాలని ఎస్పీ అనంత శర్మను బాధితులు కలిసి వినతిపత్రం సమర్పించారు. కోర్టు ఆదేశాలను పోలీసులు పట్టించుకోవడం లేదని వారు పేర్కొంటున్నారు. మాల సామాజిక వర్గానికి చెందిన 50 మందిని కుస్తాపూర్ గ్రామ పెద్దలు గ్రామ బహిష్కరణ చేసినట్లు తీర్మానం చేశారు. అగ్రవర్ఠాణలు గ్రామ బహిష్కరణ విధించడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బొందలు తవ్వడం లేదని..గుళ్లకు విరాళాలు ఇచ్చినా..ఇంకా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని కానీ తాము వ్యతిరేకించడంతో గ్రామ బహిష్కరణ చేశారని వారు మీడియాతో వాపోయారు. తమకు సహకరించిన వారికి రూ. 50వేలు జరిమాన విధించనున్నట్లు గ్రామ పెద్దలు తీర్మానం చేశారని ప్రతిని మీడియాకు చూపెట్టారు. గత సంవత్సరన్నర కాలంగా ఈ వివాదం నడుస్తోందని పేర్కొన్నారు. గ్రామపెద్దలను అరెస్టు చేయాలని ఎస్పీకి వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు. 

17:26 - December 1, 2017

నిజామాబాద్ : దళితులపై దాడులు జరిగితే..వివక్ష జరిపితే సంబంధిత కారకులైన వారిపై చర్యలు తీసుకోరా ? దళితులకు న్యాయం జరిగేదెన్నడూ..? నిజామాబాద్ జిల్లాలో ఓ ఘటన జరిగి రోజులవుతోంది. కానీ సర్కార్..ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు ఆందోళనలు..నిరసనలు కొనసాగుతున్నాయి.

అభంగపట్నంలో ఇద్దరు దళితులపై స్థానిక బీజేపీ నేత భరత్ రెడ్డి చేసిన దాష్టీకం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీనికి కారకుడైన భరత్ రెడ్డిని అరెస్టు చేయాలని ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఏదో ఒక రూపంలో ఆందోళనలు..నిరసనలు చేస్తూనే ఉన్నామని...25 రోజులు గడుస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమని అబ్బన్న అనే వ్యక్తి టెన్ టివికి తెలిపారు. మరి ఇప్పటికైనా చర్యలు తీసుకుంటారా ? లేదా ? అనేది చూడాలి. 

ఖమ్మంలో దారుణం

ఖమ్మం : జిల్లా కేంద్రంలోని ప్రకాశ్ నగర్ గీతాంజలి స్కూల్లో టీచర్ రెండవ తరగతి విద్యార్థిని సాయిపూజితను విచక్షణా రహితంగా కొట్టింది. ఇంటికెళ్లిన చిన్నారి పై దెబ్బలు కనబడడంతో తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యాన్ని నిలదీశారు. 

కొననసాగుతున్న ఏపీ కేబినెట్ సమావేశం

గుంటూరు : ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. సమావేశంలో ముఖ్యంగా మంజునాథ కమిషన్ నివేదిక గురించి చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే వాల్మీకి, బోయలను ఎస్టీ జాబితాలో చేర్చే అంశంపై, పోలవరంపై కేంద్రం లేఖపై ఎలా ముందుకు వెళ్లాన్న దానిపై కూడా చర్చిస్తున్నట్టు సమాచారం.

మేయర్ వ్యక్తి కాదు ఓ వ్యవస్థ : కోదండరామ్

హైదరాబాద్ : జీఈఎస్ సదస్సు ప్రభుత్వంలో లోపాన్ని ఎత్తిచూపించిందని, ప్రథమ పౌరున్ని అవమానించిందని టీ.జేఏసీ చైర్మన్ కోదండరామ్ అన్నారు. మేయర్ వ్యక్తి కాదు ఓ వ్యవస్థ అని ఆయన అన్నారు. అంతా నేనే అన్నట్టు కేసీఆర్ వ్యవరిస్తున్నారని, మహిళను మంత్రిగా చూడటానికి ఇష్టపడని ప్రభుత్వం మహిళ సాధికారత గురించి మాట్లాడటం హాస్యాస్పదమని ఆయన అన్నారు.

16:31 - December 1, 2017

హైదరాబాద్ : పోలవరం ప్రాజెక్టును ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏం చేయదల్చుకున్నారని వైసీపీ నేత ఉమ్మారెడ్డి సూటిగా ప్రశ్నించారు. పోలవరం నిర్మాణం విషయంలో పలు సందేహాలు వ్యక్తమౌతున్న సంగతి తెలిసిందే. గురువారం ఏపీ శాసనసభలో సీఎం చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనిపై ఉమ్మారెడ్డి మీడియాతో మాట్లాడారు. పోలవరం నిర్మాణ విషయంలో కేంద్రం కట్టుబడి లేదని..డబ్బులు కూడా ఇవ్వడం లేదనే లీకులు వస్తున్నాయని తెలిపారు. పోలవరం నిర్మాణం విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉందా ? లేదా ? అని ప్రశ్నించారు. అభివృద్ధి విషయంలో ప్రతిపక్షం విమర్శలు చేస్తే..ప్రభుత్వం పలు ఆరోపణలు గుప్పిస్తోందని తెలిపారు. 2018లోగా పోలవరం పూర్తి చేస్తామని..పదే పదే చెప్పారని గుర్తు చేశారు. ఇప్పటి వరకు పోలవరం పనులు ఎంత వరకు పూర్తయ్యాయో చెప్పకుండా...స్పష్టమైన మాటలు చెప్పకుండా ఏదో చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నారని తెలిపారు. పోలవరం నిర్మాణం విషయంలో అనేక ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయని, పోలవరాన్ని బాబు అసలు ఏం చేయబోతున్నారని ప్రశ్నించారు. 

కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ

గుంటూరు : కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఈ భేటీలో పోలవరం నిర్మాణంపై కేంద్రం రాసిన లేఖపై చర్చించే అవకాశం ఉంది. మంజునాథ్ కమిషన్ రిపోర్టు, నిరుద్యోగ భృతిని ఖరారు చేసే అవకాశం ఉంది. 

16:10 - December 1, 2017

ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోంది : కోదండరామ్

హైదరాబాద్ : కేసీర్ఆ ప్రభుత్వం నిదరంకుశంగా వ్యవహరిస్తోందని టీ. జేఏసీ చైర్మన్ కోదండరామ్ అన్నారు. ప్రశ్నిస్తే సభలకు అనుమతులివ్వని ప్రభుత్వం సన్ బర్న్ ఒకే అనడం దారుణమని, నిరుద్యోగ అంశంపై కొలువులకై కొట్లాట సభలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని కోదండరామ్ స్పష్టం చేశారు. 

పోలవరంపై కేంద్రం లేఖ బాధాకరం

గుంటూరు : పోలవరం పై కేంద్రం లేఖ బాధాకరమని, కొంత మంది బీజేపీ డూప్లికేట్ నేతలే పోలవరానికి అడ్డంకి అని మంత్రి అయ్యన్న పాత్రుడు, ఎమ్మెల్యే యరపతినేని అన్నారు. అసలైన బీజేపీ నేతల పోలవరం పూర్తికి కృషి చేస్తుంటే పురందశ్వరి, కన్నా, కావూరి లాంటి నేతలు అడ్డుపడుతున్నారని వారు ఆరోపించారు. 

ఏపీ సర్కార్ కు మంజునాథ కమిషన్ నివేదిక

గుంటూరు : ఏపీ ప్రభుత్వానికి మంజునాథ కమిషిన్ తన నివేదికను సమర్పించింది. ఇవాళ కేబినెట్ లో మంజునాథ కమిషన్ రిపోర్ట్ కీలక మారనుంది. రేపు అసెంబ్లీలో మంజునాథ నివేదికను సీఎం ప్రవేశపెట్టనున్నారు.

15:24 - December 1, 2017
15:23 - December 1, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ పై టిడిపి నేత రావుల చంద్రశేఖరరెడ్డి ఫైర్ అయ్యారు. జీఈఎస్ సదస్సులో ఒక్క మహిళ కూడా మాట్లాడకపోవడం శోచనీయమని, కేబినెట్ లో మహిళలకు అవకాశం ఇవ్వకపోవడానికి తగిన సంఖ్యా బలం లేకపోవడం మంత్రి కేటీఆర్ పేర్కొనడం హాస్యాస్పదమన్నారు. ఎమ్మెల్యేగా గెలవలేకపోయినా మండలి నుండి ఎన్నుకుని పలువురిని మంత్రులను చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా ఎందుకు చేయలేదని సూటిగా ప్రశ్నించారు. 

15:22 - December 1, 2017

హైదరాబాద్ : ఏఐసీసీ ఉపాధ్యక్షురాలు సోనియా గాంధీ ధృడసంకల్పం వల్లే తెలంగాణ వచ్చిందని టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. డిసెంబర్ 9వ తేదీన సోనియా జన్మదిన సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. శుక్రవారం గాంధీభవన్ టి.కాంగ్రెస్ నేతల సమావేశం జరిగింది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రాహుల్ నామినేషన్..సోనియా జన్మదిన కార్యక్రమాలపై సమావేశంలో నేతలు చర్చించారు. 

15:20 - December 1, 2017

చిత్తూరు : గాలేరు నగరి ప్రాజెక్టుపై టిడిపి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని వైసీపీ నేత రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ హాయాంలో 70 శాతం పనులు పూర్తయితే ఇప్పటి బడ్టెట్ లో సీఎం చంద్రబాబు నాయుడు ఒక్క రూపాయి కేటాయించలేదని, మిగిలిన 30 శాతం పూర్తి చేసేందుకు నాలుగేళ్లుగా నిధులు ఇవ్వడం లేదన్నారు. బడ్జెట్ లో రూపాయి కేటాయించకుండా ప్రాజెక్టును ఎలా పూర్తి చేస్తారని రోజా సూటిగా ప్రశ్నించారు. 

 

బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదు : శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్ : రాష్ట్రంలో బీజేపీ తో పొత్తు ప్రసక్తే లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బీసీలు బీజేపీని నమ్మే పరిస్థితుల్లో లేరని, కేంద్ర బడ్జెట్ పోలిస్తే రాష్ట్ర బడ్జెట్ లోనే బీసీలకు ఎక్కువ నిధులు కేటాయించామని ఆయన తెలిపారు. గణాంకాలు చూసుకోకుండా జీసీల మహాసంగ్రామం పేరిట బీజేపీ సభ నిర్వహించడం విడ్డూరంగా ఉందని శ్రీనివాస్ గౌడ్ ఎద్దేవా చేశారు. 

15:05 - December 1, 2017

ఎక్కడో అఫ్రికాలో పుట్టి ప్రపంచాన్ని వణికించిన వ్యాధి హెచ్ఐవీ ఎయిడ్స్ ఈ వ్యాధికి మందును ఇంతవరకు కనుగొనలేదు. దీనికి నివరాణ ఒక్కటే మార్గం. ఎయిడ్స్ భారతదేశాన్ని వణికించింది. ప్రస్తుతం ఎయిడ్స్ వ్యాధి కేసులు తగ్గుతున్న అక్కడక్కడ బయట పడుతుండడం ఆందోళన కల్గిస్తున్న అంశం. అయితే ఈ వ్యాధి వచ్చినవారు క్రమం తప్పకుండా మందులు వాడితే వారి జీవన ప్రమాణం పెరుగుతుందని డాక్టర్లు చెబుతున్నారు. హెచ్ఐవీ అనే ఈ ప్రాణంతక వైరస్ మానవ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత మానవ రోగ నిరోధక శక్తిని దెబ్బతీస్తుంది. తద్వారా మనిషికి ఏ చిన్నగా గాయామైన, జ్వరం వచ్చిన తగ్గదు. ఇక తెలంగాణ రాష్ట్ర వియానికొస్తే నిరుటితో పోలిస్తే ఈ ఏడాది ఎయిడ్స్ కేసుల సంఖ్య పెరిగింది. ఈ ఏడాది మొదటి అర్థసంవత్సరంలో 2,84,180 ఎలీసా పరీక్షలు చేసుకోగా అందులో 5,789 కేసులు పాజిటివ్ అని తెలింది. గత ఏడాది 5,87,738 మందికి పరీక్షలు చేయగా 11,043 మంది ఎయిడ్స్ ఉన్నట్టు నిర్ధారణ అయింది. అంటే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 1.94 శాతం పెరిగే అవకాశలు కనిపిస్తున్నాయి.

జిల్లాల వారిగా చూస్తే...
తెలంగాణలో జిల్లాల వారిగా చూస్తే ఎయిడ్స్ వ్యాధి బారిన పడుతున్న వారు ఎక్కువ గల జిల్లాల్లో హైదరాబాద్ ముందు ఉంది. మెదక్ జిల్లాలో 19,335 మంది పరీక్షించుకోగా అందులో 574 మందికి హెచ్ఐవీ ఉందని తేలింది. నల్లగొండలో 27,812 మంది పరీక్షలు చేసుకొగా 738 మందికి వ్యాధి బయపడింది. హైదరాబాద్ లో 1024 మంది ఎయిడ్స్ వచ్చిన్నట్టు ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి. కొత్త జిల్లావారిగా చూస్తే సిరిసిల్ల, సంగారెడ్డి, జగిత్యాల మొదటి మూడు స్థానాల్లో ఉన్నట్టు తెలుస్తోంది.
మధ్య వయస్సు వారే ఎక్కువగా...
కొత్త ఎయిడ్స్ బారిన పడుతున్న వారిలో చాల వరకు 40 పై వారే ఉంటున్నారు. కొంత మంది 40 ఏళ్లు దాటగానే వాళ్ల పిల్లలు సెటిలైన తర్వాత ఈజీ మనీ కోసం అసంఘీక కార్యక్రమాలకు పునుకుంటున్నారు. నలభైకి చేరుకున్న వ్యాధి బారిన ఫర్వాలేదన్న ధీమాతో ఉన్నట్లు ఆధ్యయనంలో వెల్లడైయింది. గతంలో ఎయిడ్స్ వాస్తే ఎవరిక చెప్పుకునేవారు కాదు, వారిక సమాజం నుంచి ఎన్నో అవమానాలు ఎదురైయ్యేవి కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఈ వ్యాధి వచ్చిన వారు దాదాపు 10 నుంచి 20 సంవత్సరాలు బ్రతుకుతున్నారు. ఎయిడ్స వ్యాధి బారిన పడుతున్న వారిలో గ్రామీణ ప్రాంతాలవారు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.
వ్యభిచారుల్లో తగ్గుతున్న వ్యాధి తీవ్రత....
రాష్ట్రంలో న్యాకో లెక్కల ప్రకారం హైరిస్క్ స్టేజిలో ఉన్నవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. 2016,2017 లెక్కల ప్రకారం రాష్ట్రంలో 56, 086 మంది సెక్స్ వర్కర్స్ ఉండగా వారిలో 12,417 మంది స్వలింగ సంపర్కులు(హోమో సెక్స్) ఉన్నారు. 1,015 మంది మత్తు బానిసలు, 311 మంది ట్రాన్స్ జెండర్స్ ఉన్నారు. వీరిలో చాల మంది నిత్యం హెచ్ఐవీ టెస్టులు చేయించుకుంటున్నారు. కండోమ్స్ వాడితేనే వారు శృంగారానికి అంగీకరిస్తున్నారు. 

14:51 - December 1, 2017

ప్రకృతిలో కొలువుదీరిన వర్ఱనను చూస్తే మనస్సు ఆనందంతో నిండిపోతుంది. అందులో నీటిలో తేలియాడుతూ మనస్సులను పలుకరించే కలువ పువ్వులు చూస్తే ఆనందించే వారుండరు. అదే కలువ అద్దంపై కొలువై ఉంటే ఎలా ఉంటుంది ? కంటికి ఇంపైన రంగుతో అద్దంపై కొలువైన కలువ యొక్క సొగసు చూడాలంటే వీడియో క్లిక్ చేయండి. 

14:45 - December 1, 2017

వరల్డ్ వెయిట్ లిఫ్ట్ లో భారత క్రీడాకారిణి సైకోమ్ మీరాబాయ్ చాను స్వర్ణపతకం సాధించింది...రియో ఓలింపిక్స్ లో చాను ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. లోక్ సభ సెక్రటరీ జనరల్ గా తెలుగు మహిళ స్నేహలత శ్రీవాత్సవ నియమితురాలైంది...సామాజిక అంశాల పట్ల పలువురు మహిళలు స్పందిస్తుంటారు. అందులో సెలబ్రెటీలు కూడా ఉంటారు. టాలీవుడ్ కు చెందిన నటీమణులు సమంత..రకూల్ ప్రీత్ సింగ్..స్పందిస్తున్నారు. అవయవదానం చేస్తున్నట్లు రకూల్ ప్రకటించడం విశేషం..నవ జాత శిశువులు రోగాలు..అనారోగ్యాల బారిన పడుతూ మృత్యువాత పడడం చూస్తూనే ఉంటాం..ఇందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా శిశు మరణాలు తగ్గడం లేదు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న ఓ యువతి 'శిశుజాతి'పై యాప్ ను సృష్టించింది....జీఎస్టీ ప్యానెల్ లో పురుషులు అధికంగా ఉన్నారని..జీఎస్టీ ప్యానల్ ఎంపికలో మహిళలకు అధిక ప్రాధాన్యం కల్పించలేదని నివృత్తి రాయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు..కర్నాటక ప్రభుత్వ రాష్ట్ర కార్యదర్శిగా తెలుగు మహిళ రత్నప్రభ నియమితులయ్యారు...అతివల ఆత్మబలాన్ని చాటి చెప్పేందుకు ఆరుగురు భారత ధీర వనితలు నావికా సాగర్ యాత్ర న్యూజిలాండ్ కు చేరుకుంది...నిర్భయ తరహాలో మహారాష్ట్రలో జరిగిన ఘటన సంచలనం సృష్టించింది...ఇందులో నిందితులకు జీవిత ఖైదుతో పాటు జరిమాన విధించారు...దీనిపై పూర్తి విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి....

14:44 - December 1, 2017

ఇక అర్చకులు ప్రభుత్వ ఉద్యోగులే....

హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అర్చకులకు, ఆలయ ఉద్యోగులకు వేతన చెల్లింపులకు ప్రభుత్వ శ్రీకారం చుట్టింది. అర్చక, ఆలయ ఉద్యోగులకు వేతన చెక్కులను ఇచ్చే పనిని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రంలో అర్చక, ఆలయ ఉద్యోగులకు డిసెంబర్ 1 చారిత్రాత్మక రోజు అని మంత్రి అన్నారు.

14:22 - December 1, 2017

యాదాద్రి : భువనగిరి జిల్లాకు చెందిన అధికార పార్టీకి చెందిన నేతలు..కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఓ సభకు తీసుకొచ్చిన కళాశాల విద్యార్థుల మెడలో గులాబీ కండువాలు కప్పడం చర్చనీయాంశమైంది. భువనగిరిలో మంత్రి జగదీష్ రెడ్డి పర్యటిస్తున్నారు. అంబేద్కర్ భవన నిర్మాణం ప్రారంభం సందర్భంగా ఓ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు పద్మావతి..ఇతర నర్సింగ్ కళాశాలకు చెందిన మెదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులను స్థానిక టీఆర్ఎస్ నేతలు..కార్యకర్తలు సభకు తీసుకొచ్చారు. సభకు తీసుకొచ్చేముందు వారి మెడలో గులాబీ కండువాలు కప్పడం వివాదాస్పదమౌతోంది. ఇందులో మైనర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. 

విద్యార్థులకు కండువా కప్పిన టీఆర్ఎస్ కార్యకర్తలు

యాదాద్రి భువనగిరి : జిల్లాలో మంత్రి జగదీశ్ రెడ్డి పర్యటన సందర్భంగా సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు టీఆర్ఎస్ కార్యక్రతలు  కళాశాల విద్యార్థులకు టీఆర్ఎస్ కండవా కప్పి సభకు తీసుకొచ్చారు. 

14:15 - December 1, 2017

విజయవాడ : పోలవరం నిర్మాణంపై విరుద్ధ ప్రకటనలతో ప్రజల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పోలవరం పనుల టెండర్లు ఆపాలని కేంద్రం నుండి లేఖ రావడంతో సీఎం చంద్రబాబు నాయుడు గురువారం అసెంబ్లీలో ఓ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. పనులు కేంద్రానికి అప్పగించేందుకు సిద్ధమని ప్రకటించారు. కానీ శుక్రవారం నాడు జరిగిన టిడిఎల్పీ సమావేశంలో మాత్రం సీఎం బాబు కొంత మెతకవైఖరిని కనబర్చినట్లు సమాచారం.

శుక్రవారం నాడు జరిగిన టిడిఎల్పీ సమావేశం కాసేపటి క్రితం ముగిసింది. ఈ సమావేశం అనంతరం ఎమ్మెల్యే జలీల్ ఖాన్ విందు ఏర్పాటు చేశారు. అసెంబ్లీలో జరిగిన తీరు..ప్రతిపక్షం లేకుండానే సభ జరగడం..ఇందుకు ప్రజలకు ఏ విధమైన సమాచారం అందింది..దానిపై చర్చించారు.

మరోవైపు పోలవరం అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. కేంద్రంతో ఏ విధంగా సహకారం తీసుకోవాలి దానిపై బాబు వివరించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ...కేంద్ర మంత్రి గడ్కరి..లతో సమావేశమవుతానని...భూ సేకరణ చట్టం ప్రకారం అధిక భారం రాష్ట్రంపై పడుతుందని..ఇందుకు కేంద్రం సహకారం అందించాలని కోరనున్నట్లు తెలిపినట్లు సమాచారం. కేంద్రంతో ఘర్షణ కాకుండా సఖ్యతతో మెలగాలని భావిస్తున్నట్లు, ఈ నేపథ్యంలో కేంద్రంపై విమర్శలు..వ్యాఖ్యలు చేయవద్దని బాబు సూచించినట్లు తెలుస్తోంది. పోలవరం అభివృద్ధితో కూడుకున్న అంశమని పేర పేర్కొన్నారు. ఇటీవలే జరిగిన టిడిపి నేతల ఘర్షణపై బాబు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలకు హితబోధ చేశారని చెప్పవచ్చు. 

విభజన సమస్యలు పరిష్కారం కాలేదు

గుంటూరు : విభజన సమస్యలు, పరిష్కారాలపై స్టేటస్ రిపోర్ట్ ఇచ్చామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏపీ అత్యధిక వృద్ధి రేటు సాధించినా విభజన సమస్యలతో ఇప్పటికీ ఇబ్బందులున్నాయని ఆయన అన్నారు. 

ఖానాపూర్ లో దారుణం

నిర్మల్ : జిల్లా ఖానాపూర్ లో దారుణం జరిగింది. రెండు నెలల చిన్నారిని కన్న దండ్రే చంపాడు. భార్యతో గొడవపడి బాబును విసిరేయడంతో మెడ విరిగి బాబు చనిపోయాడు. 

13:53 - December 1, 2017

హైదరాబాద్ : జేఏసీ చైర్మన్‌ కోదండరాం..బీజేపీ నేత లక్ష్మణ్‌తో భేటి అయ్యారు. కొలువుల కొట్లాట సభకు లక్ష్మణ్‌ను ఆహ్వానించారు. కొలువుల కోసం యువత చేస్తున్న పోరాటానికి మద్దతునివ్వాలని కోరారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సభలు పెట్టుకోవడానికి కష్టమవుతుందని, ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే.. ప్రభుత్వం తట్టుకోవడం లేదని కోదండరామ్‌ అన్నారు. నగరంలో నిర్బంధ వాతావరణం కొనసాగుతోందని ఆరోపించారు. అలాగే తెలంగాణ రాష్ట్రం కోసం ..పోరాడిన యువతే.. ఈరోజు మరో ఉద్యమానికి తెరతీసిందని లక్ష్మణ్‌ అన్నారు. నిరుద్యోగం, విద్యా వ్యవస్థల పట్ల టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. 

 

విద్యార్థిని కిడ్నాప్ కలకలం

కర్నూలు : జిల్లాలోని నంద్యాలలో విద్యార్థిని కిడ్నాప్‌ కలకలం సృష్టిస్తోంది. విద్యార్థిని బ్యూటీ పార్లర్‌కు వెళ్లి వస్తుండగా దుండగులు ఏపీ 21 ఏక్యూ 0006 నెంబర్‌ కారులో వచ్చి ఎత్తుకెళ్లారు. అడ్డుకునేందుకు యత్నించిన వారిని కారుతో ఢీకొట్టి పరారయ్యారు.

 

కర్నూలులో కిడ్నాప్ కలకలం

కర్నూలు : జిల్లా నంద్యాలలో కిడ్నాప్ కలకలం రేగింది. గుర్తుతెలియని దుండగులు ఓ విద్యార్థినిని కారులో ఎత్తుకెళ్లారు. అడ్డుకునేందుకు యత్నించిన వారిని కారు ఢీకొట్టి దుండగులు పరారైయ్యారు. 

13:49 - December 1, 2017

కర్నూలు : జిల్లాలోని నంద్యాలలో విద్యార్థిని కిడ్నాప్‌ కలకలం సృష్టిస్తోంది. విద్యార్థిని బ్యూటీ పార్లర్‌కు వెళ్లి వస్తుండగా దుండగులు ఏపీ 21 ఏక్యూ 0006 నెంబర్‌ కారులో వచ్చి ఎత్తుకెళ్లారు. అడ్డుకునేందుకు యత్నించిన వారిని కారుతో ఢీకొట్టి పరారయ్యారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

కాంగ్రెస్ నేతలను కలిసిన కోదండరామ్

హైదరాబాద్ : టీ. జేఏసీ నేత కోదండరామ్ గాంధీభవన్ లో కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీని కలిశారు. కొలువులకై కొట్లాట సభకు వారిని మద్దతు కోరారు.  

13:47 - December 1, 2017

గుంటూరు : అమరావతిని నాలెడ్జ్ సిటీగా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతిలో జరుగుతున్న టీడీఎల్పీ సమావేశంలో మాట్లాడారు. ఇప్పటికే చాలా పనులు ప్రారంభమయ్యాయని.. లండన్ బేస్‌డ్‌ ఇండో యూకే  మోడికల్‌ కాలేజ్‌, ఆస్పత్రి కూడా ప్రారంభమవుతుందని అన్నారు. ప్రైవేట్‌ రంగానికి చెందిన హెచ్‌సీఎల్‌ వంటి కంపెనీలు కూడా రాబోతున్నాయని తెలిపారు. సింగపూర్‌ సీడ్ కాపిటల్‌ కంపెనీ కూడా వస్తుందని చెప్పారు.

 

మహారష్ట్ర కాంగ్రెస్ కార్యాలయంపై నవ నిర్మాణ సేన దాడి

ముంబై : మహారాష్ట్రలోని కాంగ్రెస్ కార్యాలయంపై మహారాష్ట్ర నవ నిర్మాణ సేన దాడి చేసి అక్కడ ఫర్నిచర్ ధ్వసం చేసింది. 

13:43 - December 1, 2017

గుంటూరు : గత మూడేళ్లుగా రాష్ట్ర జీడీపీ 15 శాతం ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. భవిష్యత్ లోనూ ఇదే విధంగా ముందుకు వెళ్లాల్సిన అసవరముందన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఇదే వృద్ధి కొనసాగించాలన్నారు. 

రియలర్ట్ ఆత్మహత్య

మహబూబాబాద్ : జిల్లాలో విషాదం నెలకొంది. పోలీసులు మోసగించారని ఓ రియలర్ట్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. నెల్లికుదురు మండల కేంద్రంలో రియల్టర్ తిరుమల్ రావు ఆత్మహత్యకు పాల్పడ్డారు. 

13:36 - December 1, 2017

మహబూబాబాద్ : జిల్లాలో విషాదం నెలకొంది. పోలీసులు మోసగించారని ఓ రియలర్ట్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. నెల్లికుదురు మండల కేంద్రంలో రియల్టర్ తిరుమల్ రావు ఆత్మహత్యకు పాల్పడ్డారు. హైదరాబాద్ కు చెందిన ఏఎఎస్ ఐ వెంకటేశ్వరరెడ్డి, సీఐ మోహన్ కారణమంటూ సూసైట్ నోట్ లో పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తనను పోలీసులు మోసగించారని సూసైట్ నోట్ రాశారు. అప్పుల బాధ పెరిగిపోయిందని తిరుమలరావు ఆవేదన వ్యక్తం చేశారు. 
తిరుమల్ రావు శాంతినికేతన్ స్కూల్ నడుపుతున్నారు. నష్టాలు రావడవంతో టీఆర్ ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు అమ్మారు. స్కూల్ లో శంకర్ నాయక్ క్యాంపు ఆఫీస్ ఏర్పాటు చేశారు. తను ఇన్నాళ్లు నడిపిన స్కూల్ లోనే తిరుమల్ రావు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

కేంద్రంపై విమర్శలు చేయొద్దు : సీఎం చంద్రబాబు

గుంటూరు : పోలవరం విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు అన్నారు. పోలవరం నిర్మాణం, అభివృద్ధికి చేయూత నివ్వడం కేంద్రప్రభుత్వం బాధ్యత అన్నారు. కేంద్రంపై విమర్శలు చేయొద్దని నేతలను సూచించారు. పోలవరం అభివృద్ధితో కూడుకున్నది..రాజకీయ తగదని హితవు పలికారు. కేంద్రం లేఖపై ప్రధాని, గడ్కరీతో మాట్లాడుతున్నానని చెప్పారు. 

 

13:23 - December 1, 2017

గుంటూరు : పోలవరం విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు అన్నారు. పోలవరం నిర్మాణం, అభివృద్ధికి చేయూత నివ్వడం కేంద్రప్రభుత్వం బాధ్యత అన్నారు. కేంద్రంపై విమర్శలు చేయొద్దని నేతలను సూచించారు. పోలవరం అభివృద్ధితో కూడుకున్నది..రాజకీయ తగదని హితవు పలికారు. కేంద్రం లేఖపై ప్రధాని, గడ్కరీతో మాట్లాడుతున్నానని చెప్పారు. 

 

13:18 - December 1, 2017

ఢిల్లీ : అథ్లెటికో మ్యాడ్రిడ్‌ కమ్‌ ఫ్రెంచ్‌ స్ట్రైకర్‌ అంటోనియో గ్రీజ్‌మన్‌ అరుదైన సిజర్స్‌ కిక్‌తో అదరగొట్టాడు. చాంపియన్‌ లీగ్‌ కీలక గ్రూప్‌ మ్యాచ్‌లో ఇటాలియన్‌ క్లబ్‌ రోమా జట్టుపై గ్రీజ్‌మన్‌ కొట్టిన సిజర్స్‌ కిక్‌ గోల్‌ సాకర్‌ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించింది. కీలక సమయంలో గ్రీజ్‌మన్‌ కొట్టిన గోల్‌ అథ్లెటికో మ్యాడ్రిడ్‌ జట్టుకు విజయాన్నందించడం మాత్రమే కాదు ...చాంపియన్స్‌ లీగ్‌ చరిత్రలో అత్యుత్తమ గోల్‌గా ఎంపికైంది. సరైన సమయంలో బంతిని అందుకోవడంతో పాటు  పర్‌ఫెక్ట్‌ టైమింగ్‌తో గోల్‌ పోస్ట్‌లోకి షూట్‌ చేసి గ్రీజ్‌మన్‌ వీక్షకులను ఆశ్చర్యపోయేలా చేశాడు. దశాబ్దాల చరిత్ర కలిగిన చాంపియన్స్‌ లీగ్‌లో నమోదైన అత్యుత్తమ సిజర్స్‌ కిక్‌ గోల్‌ కొట్టిన స్ట్రైకర్‌గా గ్రీజ్‌మన్‌ రికార్డ్‌ నెలకొల్పాడు.

 

13:14 - December 1, 2017

గుంటూరు : ఆక్వా కల్చర్ పై ఫోకస్ పెట్టామని సీఎం చంద్రబాబు అన్నారు. ఆక్వా కల్చర్ పంట పెట్టినవారికి ఇప్పుడు డాలర్ల పంట అన్నారు. టీడీఎల్పీ సమావేశంలో మాట్లాడిన సీఎం మాట్లాడారు. అక్వా కల్చర్ లో 40 వృద్ధి వస్తుందన్నారు. హార్టికల్చర్ లో కూడా 30 నుంచి 35 శాతం వృద్ధి రావాల్సివుందన్నారు. ఇన్ ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తామని చెప్పారు. అగ్రికల్చర్ నుంచి హార్టికల్చర్ కు షిప్టు చేశామని తెలిపారు. డెయిరీ, పౌల్ట్రీ పై ఎక్కువగా ఫోకస్ పెట్టామని చెప్పారు. కొరియన్ సిటీని అనంతపురం జిల్లాలో స్థాపిస్తున్నామని పేర్కొన్నారు. చాలా పరిశ్రమలు వస్తాయన్నారు.

 

12:54 - December 1, 2017

నిజామాబాద్‌ : జిల్లాలోని అభంగపట్నంలో బీజేపీ నేత చేతిలో అవమానానికి గురైన దళిత యువకల ఆచూకీ ఇంకా లభించలేదు. ఘటన జరిగి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు నిందితుడిని కూడా పోలీసులు పట్టుకోలేదు. ముగ్గురి ఆచూకి కోసం టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగినా నిందితుడు భరత్ రెడ్డి, ఇద్దరు దళితులు ఎక్కడున్నారనేది ఇంకా మిస్టరీగానే ఉంది. 

నిజామాబాద్‌ జిల్లా అభంగపట్నంకి చెందిన బీజేపీ మాజీ నాయకుడు భరత్‌రెడ్డి ఇద్దరు దళితులను మురికి కుంటలో ముంచి.. ముక్కు నేలకు రాయించి రాక్షసత్వాన్ని ప్రదర్శించిన విషయం తెలిసిందే. మొరం అక్రమ తవ్వకాలను అడ్డుకున్నారనే ఆగ్రహంతో బచ్చల రాజేశ్వర్, కొండ్రా లక్ష్మణ్‌ను భరత్‌ రెడ్డి దూషిస్తూ హింసించాడు. గ్రామంలో జరిగే అక్రమ మట్టి తవ్వకాలు, ఇసుక దందాలకు అండగా నిలుస్తాడనే విమర్శలూ భరత్‌రెడ్డిపై ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే... రాజేశ్వర్, లక్ష్మణ్‌ ఇద్దరు... భరత్ రెడ్డిని అడ్డుకున్నారు. దీంతో ఇద్దరిని కుంటలో ముంచి వేధించాడు. అయితే ఈ దృశ్యాలను... 

10టీవీ బయట పెట్టడంతో భరత్‌రెడ్డి అప్రమత్తమయ్యాడు.  ఆ తరువాత నుంచి కనిపించడం లేదు. అటు ఇద్దరు బాధితులు కూడా కనిపించడపోవడంతో... కుటుంబసభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. భరత్‌ రెడ్డే వారిని ఈనెల 12న కిడ్నాప్‌ చేసినట్లు  ఆరోపిస్తూ.. బాధితుల కుటుంబసభ్యులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు భరత్‌రెడ్డిపై కిడ్నాప్‌ కేసు కూడా నమోదు చేశారు. బాధితులను అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి కారులోనే కిడ్నాప్‌ చేసినట్లు తెలియడంతో జిల్లాలో కలకలం రేపుతోంది. ఆ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నా.. ఇంకా భరత్ రెడ్డి ఎక్కడున్నాడన్న విషయం మాత్రం తెలియట్లేదు. పరారీలో ఉన్న భరత్‌రెడ్డి కోసం రాష్ట్ర టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సైతం వేట కొనసాగిస్తున్నారు. 

భరత్‌రెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి... ఇద్దరు దళితులను రక్షించాలని డిమాండ్ చేస్తూ... దళిత, విద్యార్థి, ప్రజాసంఘాలు నవీపేట్, అభంగపట్నం గ్రామాల్లో భారీ ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించాయి. వివిధ వర్శిటీల నుంచి విద్యార్థి సంఘాలు ఈ ఆందోళన కార్యక్రమానికి తరలివచ్చి మద్దతు తెలిపాయి. భరత్‌రెడ్డిని వెంటనే అరెస్ట్‌ చేయని పక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని దళిత సంఘాలు హెచ్చరించాయి.

3 వారాలవుతున్నా... భరత్ రెడ్డిని ఇంకా అరెస్ట్‌ చేయకపోవడంతో బాధిత కుటుంబాలు భయాందోళన చెందుతున్నాయి. బాధిత కుటుంబాలకు రక్షణ కల్పించి.. భరత్‌రెడ్డిని వెంటనే పట్టుకుని అరెస్ట్‌చేయాలని కేవీపీయస్‌ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేస్తామన్నారు. భరత్ రెడ్డికి అధికార పార్టీ నేతలతో పాటు బీజేపీ నేతల్లో ఒకరిద్దరు అతన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే భరత్‌రెడ్డిని వెంటనే పట్టుకుని అరెస్ట్‌ చేయాలని లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని... ప్రజాసంఘాలు, దళిత సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

12:50 - December 1, 2017

నల్లగొండ : జిల్లా ప్రభుత్వాసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. ప్రసవానికి వచ్చిన గర్భిణి రజిత మృతి చెందింది. అయితే డాక్టర్లు సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరిండచడంతోనే రజిత చనిపోయిందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. సంబంధిత డాక్టర్లను సస్పెండ్ చేయాలని ఆస్పత్రి ముందు ధర్నాకు దిగారు.

 

12:46 - December 1, 2017

గుంటూరు : పోలవరం ప్రాజెక్టుతో ఎన్నో ఉపయోగాలున్నాయని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఈమేరకు ఆయన టెన్ టివితో మాట్లాడారు. ప్రాజెక్టులో ఎలాంటి జాప్యం జరగకూడదన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయం అన్నారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పారు. 

 

టీఆర్ ఎస్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో రియల్టర్ ఆత్మహత్య

మహబూబాబాద్ : నెలికుదురులో టీఆర్ ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ క్యాంప్ ఆఫీస్ లో రియల్టర్ ఆత్మహత్య చేసుకున్నారు. భూమి రిజిష్ట్రేషన్ విషయంలో ఏఎస్ ఐ వెంకటేశ్వర్ రెడ్డి, సీఐ మోహన్ మోసం చేశారని సూసైడ్ నోట్ రాశారు. 

 

లక్ష్మణ్ ను కలిసిన కోదండరామ్

హైదరాబాద్ : టీ జేఏసీ చైర్మన్ కోదండరామ్ బీజేపీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ కలిశారు. తమ తలపెట్టె కొలువుల కొట్లాట సభకు మద్దతు ఇవ్వాలని ఆయన లక్ష్మణ్ కోరారు. 

నల్లగొండలో దారుణం

నల్లగొండ : జిల్లా ప్రభుత్వాసుపత్రిలో దారుణం జరిగింది. ప్రసవానికి వచ్చిన గర్భిణి రజిత మృతి చెందింది. డాక్టర్లు సెల్ ఫోన్ మాట్లాడుతూ వైద్యం సరిగా చేయాలేదని రజిత బంధువులు ఆరోపిస్తున్నారు. డాక్టర్లును సస్పెండ్ చేయాలని వారు ఆసుపత్రి ముందు ధర్నాకు దిగారు. 

బీజేపీ నేత లక్ష్మణ్ ను కలిసిన కోదండరాం

హైదరాబాద్ : బీజేపీ కార్యాలయంలో లక్ష్మణ్ ను కోదండరాం కలిశారు. కొలువుల కొట్లాటకు మద్దతు ఇవ్వాలని కోరారు.

 

నల్లగొండ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం

నల్లగొండ : జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది. ప్రసవానికి వచ్చిన గర్బిణి మృతి చెందారు. డాక్టర్లు సెల్ ఫోన్ మాట్లాడుతూ ఆపరేషన్ చేశారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.

12:25 - December 1, 2017

కృష్ణా : జిల్లాను అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో ప్రథమస్థానంలో ఉంచుతామని జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం తెలిపారు. ఈమేరకు ఆయన టెనో టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. రెండు నెలల్లో బందరు పోర్టు నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయన్నారు. విజయవాడ మహానగర పాలకసంస్థ పనులు చురుగ్గా సాగుతున్నాయని పేర్కొన్నారు. కనకదుర్గ ఫ్లైవోవర్ పనులు వేగతవంతం చేశామని చెప్పారు.

 

మంత్రుల్లో పనితీరుకు ర్యాంకులు

గుంటూరు : టీడీఎల్పీ సమావేశంలో సభ్యుల పనితీరు, మంత్రుల పనితీరు పై ర్యాంకులు ప్రకటించారు. సబ్జెక్టుల వారీగా 11రోజుల్లో 8 రోజులు చంద్రబాబు ఉత్తమ ప్రదర్శన చంద్రబాబుతో పాటు ఒక్కో పర్యాయం యనమల, అచ్చెన్న ఉత్తమ ప్రదర్శన దక్కించుకున్నారు. లోకేష్ రెండు రోజులు ఉత్తమ ప్రదర్శన దక్కించుకున్నారు. మంత్రి కాల్వ ఒక్క రోజు దక్కించుకున్నారు.

రోడ్డు ప్రమాదలపై ఎన్ సీఆర్ బీ నివేదిక

హైదరాబాద్ : రోడ్డు ప్రమాదాలపై ఎన్ సీఆర్ బీ నివేదిక విడుదల చేసింది. తెలంగాణలో 5.5 శాతం రోడ్డు ప్రమాదాలు పెరిగాయని నివేదికలో పేర్కొన్నారు. తెలంగాణలో 30,061 రోడ్డు ప్రమాదాల్లో 6569 తీవ్ర ప్రమాదాలు, 11వేలే స్వల్ప ప్రమాదాలు ఉన్నాయి. రోడ్డు ప్రమాదాల్లో 7110 మంది మృత్యువాత పడ్డారు.

12:08 - December 1, 2017

ఢిల్లీ : ప్రొఫెషనల్‌  వింగ్‌ సూట్‌ డైవర్లు విన్స్‌ రెఫెట్‌,ఫ్రెడ్‌ ఫ్యుగన్‌ బేస్‌ జంపింగ్‌లో మరో వరల్డ్‌ రికార్డ్‌ సృష్టించారు. వ్యక్తిగత వింగ్‌సూట్‌ విభాగాల్లో 4 సార్లు వరల్డ్‌ చాంపియన్స్‌గా నిలిచిన విన్స్‌ రెఫెట్‌,ఫ్రెడ్‌ ఫ్యుగన్‌ ఇప్పటివరకూ మరే ఇతర వింగ్‌సూట్‌ డైవర్లు చేయని సాహసమే చేశారు. స్పెయిన్‌లోని ఎంపురియాబ్రావా పర్వతాలపై నికి యూరప్‌లోనే అత్యంత ఎత్తైన పర్వతంగా పేరుంది. ఈ పర్వతంపై నుంచి వింగ్‌సూట్‌ డైవింగ్‌ చేసిన ఈ ఇద్దరూ....3వేల మీటర్ల ఎత్తులో ఎగురుతోన్న ఎయిర్‌క్రాఫ్ట్‌లోకి విజయవంతంగా డైవ్‌ చేసి ఔరా అనిపించారు. ఎడ్వంచరస్‌ స్పోర్ట్స్‌ వరల్డ్‌లో ఇప్పుడు ఇదే హాట్‌ టాపిక్‌.

 

వైకుంఠ ఏకాదశికి విస్తృతస్థాయి ఏర్పాట్లు

చిత్తూరు : తిరుమలలో వైకుంఠ ఏకాదశికి టీటీడీ అధికారులు విస్తృతస్థాయి ఏర్పాట్లు చేస్తున్నారని, 29న వైకుంఠ ఏకాదశి, 30న ద్వాదశి అని టీటీడీ ఈవో తెలిపారు. సర్వదర్శనంలో నూతన విధానం తీసుకొస్తున్నామని, రెండో వారం నుంచి టైమ్ స్లాట్ విధానం తీసుకొస్తున్నామని తెలిపారు. 

11:58 - December 1, 2017

హైదరాబాద్‌ : అత్తాపూర్‌ నలందనగర్‌లో ఆర్టీఏ  అధికారి రవీందర్‌ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో అధికారులు సోదా చేస్తున్నారు. 


 

11:56 - December 1, 2017

జమ్మూకాశ్మీర్ : వివాహేతర సంబంధం మూడు ప్రాణాలను బలిగొన్నది. భార్య తోటి సైనికుడితో సన్నిహిత బంధాన్ని కొనసాగిస్తుండటంతో తట్టుకోలేక ఓ జవాన్ తుపాకీతో ఇద్దరినీ కాల్చి చంపాడు. అంతటితో ఆగక సదరు సైనికుడి భార్యనూ హతమార్చాడు. జమ్మూ కాశ్మీర్‌లో ఈ సంఘటన జరగగా.. పాల్వంచ మండలం సంగం గ్రామంలో కలకలం సృష్టించింది. సంగం గ్రామానికి చెందిన ఇంజలపు సురేందర్ జమ్మూ కాశ్మీర్‌లో ఆర్మీ జవాన్‌గా పని చేస్తున్నాడు ఇతడికి ఏడేళ్ల క్రితం లావణ్యతో వివాహం జరిగింది. మూడు సంవత్సరాల క్రితం కుటుంబంతో కలిసి జమ్మూ కాశ్మీర్ లో నివాసం ఉంటుంన్నారు. ఈక్రమంలో లావణ్య వేరే జవాన్ తో వివాహేతర సంబంధం ఏర్పరుచుకుంది. సురేందర్ రాత్రి విధులు నుంచి ఇంటికి రాగా..  భార్య సదరు జవాన్ తో సన్నిహితంగా ఉండడం చూసి...  ఆగ్రహోదగ్ధుడై సురేందర్‌.. తన చేతిలో ఉన్న తుపాకీతో లావణ్య,సదరు జవాన్‌ను కాల్చి చంపాడు. తుపాకీ శబ్దంతో పక్క ఇంట్లో ఉన్న జవాన్ భార్య సురేందర్ ఇంటికి వచ్చింది. రక్తపు మడుగులో ఉన్న భర్తను చూసి హతాశురాలైంది.వెంటనే తేరుకుని సురేందర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది ఎందుకు నా భర్తను చంపావంటూ నిలదీసింది ఆగ్రహం చల్లారని సురేందర్ ఆమెను కూడా తుపాకీతో కాల్చి చంపాడు. తుపాకీతో నేరుగా పోలీసులకు సరెండర్ అయ్యాడు.

 

11:53 - December 1, 2017

తూర్పుగోదావరి : పోలవరం ప్రాజెక్ట్‌ పనులకు అవరోధాలు తొలిగేటట్టు కనిపించడం లేదు. ఆది నుంచి పోలవరం ప్రాజెక్ట్‌కు ఆటంకాలు, సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. తాజాగా స్పిల్ వే, స్పిల్ ఛానల్‌కు సంబంధించి ఏపీ ప్రభుత్వం జారీ చేసిన టెండర్లను తక్షణం నిలిపివేయాలని కేంద్రం ఆదేశించింది. దీంతో ప్రాజెక్ట్‌ అనుకున్న సమయానికి పూర్తవుతుందా? లేదా అనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

నిధుల దగ్గరి నుంచి.. పనుల నిర్వహణ వరకూ పోలవరం ప్రాజెక్ట్‌కు ఆది నుంచి అనేక అడ్డంకులు కలుగుతూనే ఉన్నాయి. పనులు, వ్యయాల విషయంలో పారదర్శకత లేదనే.. ఆరోపణలు కూడా  ఉన్నాయి. తాజాగా పోలవరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి  కేంద్రం జల వనరుల శాఖ మరో షాక్‌ ఇచ్చింది. స్పిల్ వే, స్పిల్ ఛానల్‌కు సంబంధించి  జారీ చేసిన టెండర్లను తక్షణం నిలిపివేయాలని ఆదేశించింది. జాతీయ హైడ్రో పవర్ కార్పొరేషన్ అధ్యయనం చేసేంత వరకు పనులను నిలిపివేయాలని సూచించింది. కొన్నిరోజుల్లో ఎన్ హెచ్ పీసీ బృందం పోలవరానికి వస్తుందని ఏపీ ప్రభుత్వానికి తెలిపింది. 

స్పిల్ వే , స్పిల్‌ ఛానల్‌లోని పనుల నిమిత్తం పిలిచిన టెండర్లు.. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్టు కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి రాసిన లేఖలో ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా టెండర్లు స్వీకరించేందుకు మూడు వారాల కంటే తక్కువగా వ్యవధిని ఇచ్చారని..  కనీసం 45 రోజులైన సమయం ఇవ్వాలని పేర్కొనట్టు తెలుస్తోంది. నవంబర్ 22వ తేదీకి కూడా ఈ-టెండర్ నోటీస్ ప్రభుత్వ వెబ్‌సైట్‌లో కనిపించకపోవడాన్ని ప్రస్తావించినట్టు  సమాచారం. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని టెండర్ ప్రక్రియపై పున:పరిశీలన చేయాలని, సమస్యలు పరిష్కారమయ్యే వరకూ టెండర్‌ను వెంటనే నిలిపివేయాలని 27న పంపిన లేఖలో స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.  దీంతో రాష్ట్ర ప్రభుత్వం పోలవరం పనుల విషయంలో సందిగ్ధంలో పడింది. 

ఇప్పటికే  పోలవరం పనులు నిలిపివేయాలని కోరుతూ ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాయగా.. రాజ్యసభ సభ్యుడు కేవీపీ కూడా పోలవరం పనులపై ఏపీ సీఎం చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. ప్రాజెక్ట్‌ నిర్మాణ వ్యయాలు, నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పుడు కేంద్రం కూడా టెండర్లను నిలిపివేయమనడంతో.. రాష్ట్ర ప్రభుత్వం దిక్కుతోచని స్థితిలో పడింది. దీంతో 2018-2019 నాటికి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 


 

టీడీఎల్పీ సమావేశం

గుంటూరు : నేడు టీడీఎల్పీ సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో పోలవరంపై కేంద్రం తీరు, బీజేపీతో అనురించాల్సిన వైఖరి, అసెంబ్లీ సమావేశాలు జరగుతున్న తీరు, ఇంటింటికి టీడీపీ కార్యక్రమంపై చర్చించనున్నారు. 

పెషావర్ లో ఉగ్రవాదుల దాడి

పాకిస్తాన్ : పెషావర్ లో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. అగ్రికల్చర్ డైరెక్టర్ కార్యాలయంపై దాడి చేశారు. ఉగ్రవాదుల కాల్పుల్లో నలుగురికి గాయాలయ్యాయి. 

 

11:42 - December 1, 2017

హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్ నయీం పోలీసు తుటాకు హతమైనా ఆ పేరుతో ఇంకా దందాలు కొనసాగుతున్నాయి...నయీం అనుచరుడు శేషన్న పేరుతో రియల్టర్లను బెదిరిస్తున్న నగేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్యాంగ్‌స్టర్ నయీం...ఈ పేరు ఒకప్పుడు గడగడలాడించగా...పోలీసుల తూటాకు నయీం హతమయ్యాడు..అయితే ఇక నయీం ఆగడాలకు చెక్ పడిందనుకున్నా జాడలు మాత్రం కన్పిస్తూనే ఉన్నాయి...నగరంలోనేగాకుండా.. చుట్టూ ఉన్న జిల్లా ప్రాంతాల్లో నయీం అనుచరులమంటూ హడావుడి చేసేవారున్నారు...ప్రధానంగా నయీం ఎన్‌కౌంటర్‌ తర్వాత ఇప్పటికీ జాడలేని శేషన్న పేరుతో కూడా దందాలు చేస్తున్నారు కొందరు..హైదరాబాద్‌లో రియల్టర్లను బెదిరించి దోచుకునే ప్లాన్ చేసిన శేషన్న పేరుతో హల్‌చల్ చేస్తున్న యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు...

నయీం ప్రధాన అనుచరుడు శేషన్న పేరుతో బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు వసూలు చేస్తున్న నగేశ్ అనే వ్యక్తిని సరూర్‌నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రియల్టర్లే టార్గెట్‌గా వారి డ్రైవర్లను మచ్చిక చేసుకుని నగేశ్ ఇటువంటి దందాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. తాజాగా ఓ రియల్టర్‌ మహేష్‌ను కోటి 50 లక్షలు డిమాండ్ చేయగా పోలీసులకు సమాచారం అందించారు..వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నగేశ్‌ను  సినీ ఫక్కీలో అరెస్టు చేశారు. గ్యాంగ్‌స్టర్ నయీం, అనుచరుడు శేషన్న పేరుతో కొనసాగుతున్న దందాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి...

భార్య, మరో ఇద్దరిని కాల్చిన జవాన్

శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్ లో భార్య, మరో ఇద్దరిని సురేందర్ అనే జవాన్ కాల్చి చంపారు. వేరే వ్యక్తితో భార్య లావణ్య వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానంతో లావణ్య, మరో జవాన్ ను సురేందర్ కాల్చి చంపాడు. తుపాకీ శబ్ధం విని సురేందర్ ఇంటికి వచ్చిన జవాన్ భార్య ఎందుకు చంపావని నిలదీసింది. ఆమెను కూడా కాల్చి చంపాడు. నిందితుడు పోలీసులు అదుపులో ఉన్నారు.

 

యూపీలో స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు

లక్నో : యూపీలోని స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. 16 మున్సిపాలిటీలకు గాను 12 స్థానాల్లో బీజీపీ విజయం సాధించింది.

నేడు తెలంగాణలో రిజిస్ట్రేషన్లు నిలిపివేత

హైదరాబాద్ : కొత్త సర్పంచ్ సర్వర్ అనుసంధానం కారణంగా నేడు తెలంగాణలో రిజిస్ట్రేషన్లు నిలిపివేయనున్నారు. 

 

టిడిపిలో చేరిన ఆళ్లగడ్డ వైసీపీ కార్యకర్తలు

గుంటూరు : ఆళ్ల గడ్డ నియోజవర్గానికి చెందిన 200 మంది  వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. మంత్రి అఖలప్రియ, ఎమ్మెల్యే బ్రహ్మనంద రెడ్డి ఆధ్వర్యంలో వారు టీడీపీలో చేరారు. 

11:21 - December 1, 2017

హైదరాబాద్ : రాజేంద్రనగర్‌లో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్పీడ్‌గా వెళ్తున్న బైక్‌ డివైడర్‌ను ఢీ కొనడంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. నార్సింగి గ్రామానికి చెందిన తిరుపతి, బండ్లగూడ గ్రామానికి చెందిన పవన్‌ ఇద్దరు కలిసి లంగర్‌హౌజ్‌ నుండి బండ్లగూడకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే వీధి దీపాలు లేకపోండం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా అనేక ప్రమాదాలు జరిగాయని, అధికారులు చొరవ తీసుకొని వీధి దీపాలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. 

 

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

రంగారెడ్డి : గండిపేట మండలం సన్ సిటీ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి బైక్ డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. 

 

నేటి నుంచి హాకీ వరల్డ్ లీగ్

ఢిల్లీ : నేటి నుంచి హాకీ వరల్డ్ లీగ్ జరుగనుంది. సాయంత్రం 4.45 జర్మనీ వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ ప్రారంభం కానుంది. రాత్రి 7.30 గంటలకు భారత్ తో ఆస్ట్రేలియా తలపడనుంది. 

 

11:05 - December 1, 2017

పశ్చిగోదావరి : జిల్లాలోని కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెంలో విషాదం చోటు చేసుకుంది. చెట్టుకు ఉరేసుకుని యువతి, యువకుడు ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమ వ్యవహారమే వీరిద్దరి ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది. నల్గొండ జిల్లాకు చెందిన చింత లావణ్య, ఖమ్మం జిల్లాకు చెందిన గుగ్గిల్ల రాంబాబు వీరిద్దరు గత రాత్రి ఇంట్లో చెప్పకుండా వచ్చి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాలు దర్యాప్తులో తెలుస్తాయని పోలీసులు చెప్పారు. 

 

10:38 - December 1, 2017

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై వక్తలు భిన్నవాదనలు వినిపించారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఏపీ కాంగ్రెస్ అధికారి ప్రతినిధి జీవీ రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు రామకృష్ణ ప్రసాద్ పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

10:33 - December 1, 2017

హైదరాబాద్ : హెచ్ ఐసీసీలో మూడురోజులపాటు జరిగిన జీఈఎస్‌తోపాటు.. మెట్రో రైలు ప్రారంభోత్సవం, ఇతర కార్యక్రమాలు విజయవంతం కావడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఎవరికీ ఎటువంటి ఆటంకం కలగకుండా భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసు శాఖను కేసీఆర్‌ ప్రత్యేకంగా అభినందించారు. మరోవైపు కేంద్ర హోంశాఖ, అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ నుంచి తెలంగాణ పోలీసులకు ప్రశంసలు వెల్లువెత్తాయి. 

ఓవైపు మెట్రో రైలు ప్రారంభోత్సవం, మరోవైపు జీఈఎస్‌ ప్రారంభోత్సవ వేదికలు.. ఒకే రోజు ఎనిమిది చోట్ల అత్యంత ప్రాధాన్యత ఉన్న కార్యక్రమాలు.. ఇక దేశ ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఇవాంకా ట్రంప్, బ్రిటన్ మాజీ ప్రధాని సతీమణి చెర్రీ బ్లెయిర్‌తో సహా  150 దేశాల నుంచి వచ్చిన అనేక మంది ప్రముఖులు.. ఎవరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా అసాధారణ రీతిలో భద్రతా ఏర్పాట్లు చేశారు తెలంగాణ పోలీసులు. రాష్ట్రంలో మొదటిసారి జరిగిన అతిపెద్ద కార్యక్రమం విజయవంతం కావడంలో తెలంగాణ పోలీసులు కీలక పాత్ర పోషించారు. అత్యున్నత ప్రమాణాలతో .. అత్యంత హుందాగా పనిచేసిన తెలంగాణ పోలీసు శాఖకు సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. 

రాష్ట్ర పోలీసుల పనితీరును ప్రశంసిస్తూ కేంద్రం తమకు సందేశం పంపినట్లు కేసీఆర్ తెలిపారు. మరోవైపు అమెరికా సీక్రెట్ ఏజన్సీ నుంచి, కేంద్ర హోం శాఖ నుంచి, నీతి ఆయోగ్ నుంచి, వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రముఖుల నుంచి కూడా తెలంగాణ పోలీసులకు ప్రశంసలు లభించాయి. ఒకే రోజు...  నగరంలో... అనేక మంది ప్రముఖులు, వేర్వేరు చోట్ల పర్యటనలు, వేర్వేరు కార్యక్రమాలు, అనేక విభాగాల జోక్యం.. ఇంత క్లిష్ట పరిస్థితుల్లోనూ డీజీపీ మహేందర్ రెడ్డి అందరినీ సమన్వయ పరుస్తూ అతి పెద్ద కార్యక్రమాన్ని విజయవంతం చేశారని సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 

ఇవాంక రాకతో అమెరికా సీక్రెట్ సర్వీస్‌ ప్రత్యేకంగా జోక్యం చేసుకుంది. ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు రావడంతో కేంద్ర హోం శాఖ కూడా ఎప్పటికప్పుడూ పరిస్థితిని ఆరా తీసింది. ఇంటెలిజెన్స్ , గ్రేహౌండ్స్, ఎస్ఐబి సహా పోలీసు శాఖలోని దాదాపు అన్ని విభాగాలు వేర్వేరు వ్యూహాలు తయారు చేసుకున్నాయి. వీటన్నింటిని సమన్వయం చేస్తూ హైదరాబాద్‌లో  పోలీసు శాఖ అత్యంత సమర్థవంతంగా విధులు నిర్వర్తించింది. తెలంగాణ పోలీసు శాఖ ముందస్తు ప్రణాళిక, వ్యూహం ప్రకారం ముందుకు పోవడంతో ఎక్కడా ఎలాంటి లోటు లేకుండా.. కనీసం ట్రాఫిక్ జామ్ కాకుండా దిగ్విజయం కాగలిగింది. అమెరికన్ సీక్రెట్ ఏజన్సీ భద్రతా వ్యూహాలకు అనుగుణంగా తెలంగాణ పోలీసులు ప్లాన్‌లను రూపొందించుకుని చివరి క్షణంలో ఏ మార్పులు జరిగినా దానికి తగ్గట్లు స్పందించారు. అందుకే ఇవాంకా పర్యటన ముగించుకుని వెళ్ళిపోయే సందర్భంగా అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారులు డీజీపీ మహేందర్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు.

 

ఆర్టీఏ అధికారి ఇంటిపై ఏసీబీ దాడులు

హైదరాబాద్ : అత్తాపూర్ నలందనగర్ లో ఆర్టీఏ అధికారి రవీందర్ ఇంటిపై ఏసీబీ దాడులు చేసింది. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.

10:20 - December 1, 2017

హైదరాబాద్ : ప్రపంచ తెలుగు మహాసభలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ప్రగతి భవన్‌లో అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రంచవ్యాప్తంగా తెలుగు ప్రముఖులు, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతితోపాటు తెలుగు మాట్లాడే సీఎంలను, గవర్నర్లను, ఇతర ప్రముఖులను ఆహ్వానించాలని స్పష్టంచేశారు. డిసెంబర్ 15 నుంచి 19 వరకు నిర్వహించే ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లపై  ప్రగతిభవన్‌లో సీఎం సీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తెలుగుభాషతోపాటు ఇతర భారతీయ భాషల సాహితీదిగ్గజాలను ఆహ్వానించి, సన్మానించాలని నిర్ణయించారు. 

డిసెంబర్‌ 15న ప్రారంభోత్సవ సభకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మారిషస్ వైస్ ప్రెసిడెంట్ పరమశివమ్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు హాజరవుతారని సీఎం తెలిపారు.  రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్ ముగింపు సభలో ముఖ్యఅతిథిగా పాల్గొంటారని చెప్పారు.  ఎల్బీస్టేడియంలో నిర్వహించే తెలుగు మహాసభల ప్రధాన వేదిక  డిజైన్‌ను, నగరంలో అలంకరించనున్న తోరణాల డిజైన్లను సీఎం పరిశీలించి  ఆమోదించారు. 

మహాసభలు జరిగే నాలుగు రోజుల పాటు నగరంలో ట్రాఫిక్, పార్కింగ్ నిర్వహణను సమర్థంగా చేయాలన్నారు.  ఎల్బీస్టేడియంలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు ప్రధాన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. స్టేడియంలో తెలంగాణ ఫుడ్‌స్టాల్స్, వివిధ కళా ప్రక్రియల స్టాల్స్ నిర్వహించాలని అధికారులకు సీఎం సూచించారు. తెలంగాణ సంస్కృతి, చరిత్ర, సంప్రదాయాలు ప్రతిబింబించేలా లేజర్‌షోలు ఏర్పాటుచేయాలన్నా రు. ఎయిర్‌పోర్టు, బస్టాండు, రైల్వేస్టేషన్లలో రిసెప్షన్ సెంటర్లను ఏర్పాటుచేయాలన్నారు.నగరమంతా ఏర్పాటు చేయబోయే స్వాగత తోరణాల్లో సాహితీ ప్రముఖుల పేర్లు పెట్టాలని సూచించారు. సంగీత సాహిత్య కళారంగాలలో కృషిచేసిన ప్రతిభామూర్తులను ఎంపికచేసి ప్రభుత్వం తరపున సత్కరించనున్నారు.మహాసభల సందర్భంగా జరిగే కార్యక్రమాలకు మంత్రులు, ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలన్నారు. అలాగే  సైనానెహ్వాల్, పీవీ సింధు, మిథాలీరాజ్, సానియామీర్జా లాంటి  క్రీడాకారులకు కూడా 
ఆహ్వానం పంపాలన్నారు. 

మహాసభలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేందుకు పోస్ట్‌లశాఖతో సమన్వయం చేసుకుని ప్రత్యేక స్టాంప్‌ను విడుదల చేయాలన్నారు. తెలుగు పండుగలు సంవత్సరాలు, నెలలు, కార్తెలతో కూడిన పుస్తకాలను ముద్రించి పంపిణీచేయాలన్నారు. ఈ సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, తెలుగు వర్సిటీ వీసీ ఎస్వీ సత్యనారాయణ, అధికారభాషాసంఘం అధ్యక్షుడు ప్రభాకర్‌రావు, గ్రంథాలయ పరిషత్తు చైర్మన్ శ్రీధర్, సీఎంవో ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, సీఎస్ ఎస్పీ సింగ్, డీజీపీ మహేందర్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.  

 

10:07 - December 1, 2017

ప.గో : జిల్లాలోని కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెంలో విషాదం నెలకొంది. చెట్టుకు ఉరేసుకుని యువతి, యువకుడు ఆత్మహత్యకు చేసుకున్నారు. ప్రేమజంటగా అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నల్గొండ జిల్లాకు చెందిన యువతీయువకుడు బైక్ పై వచ్చి పశ్చిమ గోదావరి జిల్లాలోని కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెంలోని పులివాగు దగ్గర చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికులు పోలీసులకు సమచారం ఇచ్చారు. వీరు గతకొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే పెద్దలకు విషయం తెలిసి తమను విడతీస్తారేమోనని భయంతో ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

యాసిడ్ దాడి ఘటనలో చికిత్స పొందుతూ మహిళ మృతి

వరంగల్ : యాసిడ్ దాడి ఘటనలో చికిత్స పొందుతూ మహిళ మృతి చెందారు. బుధవారం మాధవిపై యాసిడ్ దాడి జరిగింది. తీవ్ర గాయాలైన మాధవిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మాధవి మృతి చెందింది. 

09:58 - December 1, 2017

వరంగల్ : యాసిడ్ దాడి ఘటనలో చికిత్స పొందుతూ మహిళ మృతి చెందారు. బుధవారం మాధవిపై యాసిడ్ దాడి జరిగింది. తీవ్ర గాయాలైన మాధవిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మాధవి మృతి చెందింది. వరంగల్‌ జిల్లాలోని ఐనవోలు మండలం గర్మిల్లపల్లి శివారులో బుధవారం వివాహిత మాధురిపై చందు, రాకేష్, అనీల్ లు యాసిడ్‌ దాడికి పాల్పడ్డారు. దాడిలో గాయపడిన యువతిని.. స్థానికులు ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మాధవి మృతి చెందింది. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్ లోని ఓ పెట్రోల్ బంక్ లో మాధురి పని చేస్తోంది. చందు పరిచయం అయ్యాడు. ప్రేమ పేరుతో ఆమెను వేధించాడు. దీంతో ఆమె ఉద్యోగం మానేసింది. ఈనేపథ్యంలో చందు మాధవిని ఆటోలో తీసుకెళ్లి ఆమెకు మత్తు మందు ఇచ్చి యాసిడ్ దాడికి పాల్పడ్డాడు.  

ఉరేసుకుని యువతీయువకుడి ఆత్మహత్య

ప.గో : జిల్లాలోని కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెంలో విషాదం నెలకొంది. చెట్టుకు ఉరేసుకుని యువతి, యువకుడు ఆత్మహత్యకు చేసుకున్నారు. ప్రేమజంటగా అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

దక్షిణ తమిళనాడుకు ఒచ్చి తుపాను గండం

చెన్నై : దక్షిణ తమిళనాడుకు ఒచ్చి తుపాను గండం పొంచివుంది. రాగల 24 గంటలపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తిరునల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారి జిల్లాలో అధికారులు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. హెల్ఫ్ లైన్ నెంబర్లు కేటాయించారు. తీరం వెంట గాలుల తీవ్రత పెరిగింది. 

 

09:28 - December 1, 2017

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లో రెండు వేర్వేరు చోట్ల జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. బుద్గాంలో నలుగురు, సోపోర్‌లో ఒకరు హతమయ్యారు. బుద్గాం జిల్లాలోని ఓ గ్రామంలో ఉగ్రవాదులు ఓ ఇంట్లో దాగి ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించాయి. తనిఖీలు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బందిపైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆర్మీ జరిపిన ఎదురు కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఎన్‌కౌంటర్‌లో ఓ జవానుతో పాటు మరో ఇద్దరు పౌరులు గాయపడ్డినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. కాల్పులు కొనసాగుతున్నాయి. మరోవైపు బారాముల్లాలోని సోపోర్‌ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. జమ్ముకశ్మీర్‌లో ఈ ఏడాది ఇప్పటివరకు 200 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.

 

09:26 - December 1, 2017

అహ్మాదాబాద్ : గుజరాత్‌  అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్‌ ఆచి తూచి అడుగులు వేస్తోంది. బిజెపిని ఇరకాటంలో పెట్టేందుకు వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. ప్రధాని నరేంద్రమోదిపై విమర్శలు గుప్పిస్తూ ఓటర్ల దృష్టిని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. గుజరాత్‌లో అత్యధిక సంఖ్యలో ఉన్న హిందువుల ఓట్లపై కాంగ్రెస్‌ ఈసారి ప్రత్యేకంగా కన్నేసింది. గుజరాత్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ వ్యూహం ఫలించేనా?

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అధికారాన్ని దక్కించుకునే దిశగా కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అడుగులు వేస్తున్నారు. గుజరాత్‌లో 90 శాతం ప్రజలు హిందువులే కావడంతో కాంగ్రెస్‌ వారి ఓట్లపై ప్రత్యేక దృష్టి సారించింది. పాటీదార్‌ ఉద్యమ నేత హార్దిక్‌ పటేల్, దళిత యువనేత జిగ్నేష్‌ మేవానీ ఓబిసి నేత అల్పేష్‌ ఠాకూర్‌లతో చేతులు కలపడానికి ఇదీ ఓ కారణమే. రాహుల్‌ ఇప్పటివరకు 20కి పైగా హిందూ ఆలయాలను సందర్శించారు. తన పర్యటనలో భాగంగా రాహుల్‌ తొలుత హిందూ ఆలయాన్ని సందర్శించిన తర్వాతే ఎన్నికల సభల్లో పాల్గొనడం గమనార్హం.

రాహుల్‌ సోమనాథ్‌ ఆలయాన్ని సందర్శించడం వివాదాస్పదమైంది.  నాన్‌ హిందూ రిజిస్టర్‌లో రాహుల్‌ చేసినట్లుగా ఉన్న సంతకం వైరల్‌ అయింది. హిందూయేతరులే నాన్‌ హిందూ రిజిస్టర్‌లో సంతకం చేస్తారని... రాహుల్‌ హిందువు కాదని ఈ అంశంపై బిజెపి రాద్దాంతం చేసింది. రాహుల్‌ గాంధీ సందర్శకుల పుస్తకంలో చేసిన సంతకాన్ని కాంగ్రెస్‌ పార్టీ  విడుదల చేసింది. రాహుల్‌ గాంధీ చేతి రాతలకు, సోమ్‌నాథ్‌ ఆలయ పుస్తకంలోని రాహుల్‌ చేతి రాతకు, సంతకానికి ఎక్కడా పోలిక లేకపోవడం గమనార్హం.  రాహుల్‌ గాంధీ ఒక్క సందర్శకుల పుస్తకంలో మినహా మరే పుస్తకంలో సంతకం చేయలేదంటూ సోమ్‌నాథ్‌ ఆలయం ట్రస్ట్‌ కార్యదర్శి పీకే లహరి స్పష్టం చేశారు.

ప్రధాని మోదీయే స్వచ్ఛమైన  హిందువు కాదని... కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కపిల్‌ సిబ్బల్‌ అన్నారు. మోది ఎన్నిసార్లు గుడికి వెళ్లారు? మోది హిందూ ధర్మాన్ని వదిలి పెట్టి హిందుత్వను పట్టుకుని వేళాడుతున్నారని విమర్శించారు.

గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో సోషల్‌ మీడియాను కూడా కాంగ్రెస్‌ విస్తృతంగా వినియోగిస్తోంది. రాహుల్‌ ఏర్పాటు చేసిన ప్రత్యేక డిజిటల్‌ టీం మోది ప్రభుత్వాన్ని లక్ష్యం చేసుకుని విమర్శలు గుప్పిస్తోంది.  గుజరాత్‌లో 50 లక్షల పక్కా ఇళ్లు కట్టిస్తామని 2012లో మోదీ హామీ ఇచ్చారని... గత ఐదేళ్లలో బీజేపీ ప్రభుత్వం కేవలం 4.72 లక్షల ఇళ్లు మాత్రమే నిర్మించిందని రాహుల్‌ విమర్శించారు.  మీ హామీని నిలబెట్టుకోవాలంటే మరో 45 ఏళ్లు పడుతుందా? అంటూ ట్విట్టర్‌ వేదికగా మోదీని ఎద్దేవా చేశారు. 

ప్రధాని మోది తీసుకున్న నిర్ణయాలను టార్గెట్‌ చేస్తూ కాంగ్రెస్‌ బిజెపిని ఎండగడుతోంది. నోట్లరద్దు, జిఎస్‌టి తదితర నిర్ణయాలతో భారత ఆర్థికవ్యవస్థ దిగజారిందని, ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయని విమర్శలు గుప్పిస్తోంది. జిఎస్‌టిని గబ్బర్‌సింగ్‌ టాక్స్‌గా రాహుల్‌ అభివర్ణించారు. రాఫెల్‌ విమానాల కొనుగోలులో అక్రమాలు, అమిత్‌షా కుమారుడు జయ్‌షా అక్రమ ఆస్తులను ప్రస్తావించారు. గుజరాత్‌ ఎన్నికలకు భయపడి మోది ప్రభుత్వం శీతాకాల పార్లమెంట్‌ సమావేశాలను వాయిదా వేసిందని కాంగ్రెస్‌ దుయ్యబట్టింది. గుజరాత్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌... రాహుల్‌ గాంధీ అనుసరిస్తున్న వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయన్నది వేచి చూడాలి. 

 

09:24 - December 1, 2017

చిత్తూరు : తిరుమల శ్రీవారి దర్శనం ఇక మరింత సులభంగా మారనుంది. గంటల తరబడి క్యూలైన్లలో నిల్చునే అగచాట్లు తప్పనున్నాయి. ఇప్పటికే అమల్లో ఉన్న  టైంస్లాట్‌ విధానాన్ని ఇక నుంచి సర్వదర్శనం భక్తులకూ అందుబాటులోకి  వస్తోంది. దీనికోసం ఇప్పటికే  టీటీడీ కసరత్తు మొదలు పెట్టింది.  డిసెంబర్‌ రెండో వారం నుంచి ప్రయోగాత్మకంగా టైంస్లాట్‌ విధానం అమలు చేస్తామని టీటీడీ అధికారులు అంటున్నారు. 

తిరుమలేసుని దర్శనం అనగానే ముందుగా గుర్తుకొచ్చేది ఎంతకీ తరగని క్యూలైన్లు, కంపార్టుమెంట్లలో గంటల తరబడి నిరీక్షించే భక్తులు... ఇక ఈ అగచాట్లకు చెల్లుచెప్పాలని టీటీడీ కసరత్తు చేస్తోంది. సర్వదర్శనం భక్తులకు కూడా టైంస్లాట్ విధానం అమల్లోకి తెస్తోంది. టైంస్లాట్ విధానంవల్ల సాధారణభక్తులు కూడా టోకెన్లు పొంది ఎంతటి రద్దీ ఉన్నా.. కేటాయించిన సమయంలో స్వామిని దర్శించుకోవచ్చు. దీంతో సర్వదర్శనంలో వచ్చే భక్తులు కూడా  రెండు గంటల్లోపుగానే  శ్రీవారిని దర్శించుకునే వీలు కలుగుతుందని టీటీడీ అధికారులు అంటున్నారు. 

 
ఇప్పటికే 300 రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లతోపాటు  నడకదారి దివ్యదర్శం భక్తులకు  టైం స్లాట్ టోకెన్లు జారీ చేస్తున్నారు.  ఈవిధానంలో నిత్యం 40 వేలమందివరకు  భక్తులు రెండు గంటల్లోనే శ్రీవారిని దర్శించుకుంటున్నారు. అదే టైంస్లాట్ విధానాన్ని ఇపుడు సామాన్య భక్తులకు కూడా అమలు చేయడానికి టిటిడి అధికారులు  ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే టైం స్లాట్ టోకెన్ పొందాలంటే ఆధార్ కార్డును తప్పనిసరి చేశారు. ఒక్కసారి టోకెన్ పొందిన వారికి  48 గంటల వరకు మరోటోకెన్ పొందే అవకాశం ఉండదు. డిసెంబర్‌ రెండో వారం నుంచి ప్రయోగాత్మకంగా చేపడుతున్న సర్వదర్శనం టైంస్లాట్‌ విధానాన్ని  వచ్చే ఏడాది  ఫిబ్రవరి నుంచి పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు టీటీడీ సన్నద్ధమవుతోంది. టైంస్లాట్ విధానం ద్వారా నిత్యం 22 వేల నుంచి 38 వేల మంది భక్తులకు సర్వదర్శనం టోకెన్లు జారీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమలలో 14 ప్రాంతాలలో 107 కౌంటర్లు ద్వారా టోకెన్లు జారీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.  

ఒకవేళ  ఆధార్‌కార్డు లేనివారు, లేదా ఆధార్‌కార్డు చూపించడానికి ఇష్టపడని వారు ఎప్పటిలాగానే  పాతవిధానంలో  సర్వదర్శనం చేసుకోవచ్చని టీటీడీ అధికారులు అంటున్నారు. మొత్తానికి  తిరుమలేశుని దర్శనం శీఘ్రంగా జరగనుందన్న టీటీడీ అధికారుల ప్రకటనతో  సామన్య భక్తుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. 

 

09:20 - December 1, 2017

కామారెడ్డి : అరవై ఏళ్లు గడిచాయి. కానీ అక్కడ అభివృద్ధి అనే మాటే ఎప్పుడూ వినిపించలేదు. ఇప్పుడిప్పుడే మార్పు మొదలైంది. గ్రామస్తులు, ప్రజా ప్రతినిధుల సమిష్టి కృషితో ఇప్పుడు ఆ గ్రామం ముందుకు దూసుకుపోతోంది. కామారెడ్డి జిల్లా, బాన్సువాడ మండలం, దేశాయ్‌పేట గ్రామ విజయగాథపై 10 టీవీ ప్రత్యేక కథనం. 

ఇది కామారెడ్డి జిల్లా, బాన్సువాడ మండలంలోని దేశాయిపేట గ్రామం. గడిచిన ఎన్నో ఏళ్లుగా ఈ గ్రామం అభివృద్ధికి నోచుకోలేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా పరిస్థితులుండేవి.  ఇప్పుడిప్పుడే  ఇక్కడి పరిస్థితుల్లో మార్పు వస్తోంది. ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ చాలా మంది ఉపాధ్యాయులుగా, ఇతర ప్రభుత్వ ఉద్యోగులుగా పని చేస్తున్నారు. వాళ్లందరి సహకారంతో ఈ గ్రామంలో అనేక అభివృద్ధి పథకాలు వేగంగా అమలవుతున్నాయి. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవడంలో ఈ గ్రామం ముందు వరసలో ఉంది. మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అండదండలు ఉండటంతో.. గ్రామస్తులు సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. గత 60 ఏళ్లలో జరగని అభివృద్ధిని.. ఈ మూడేళ్ల కాలంలో సాధించినట్లు స్థానిక ప్రజా ప్రతినిధులు చెబుతున్నారు. 

దేశాయిపేటలో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, మిషన్ భగీరథ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఇంటింటికీ మంచి నీటి కొళాయిలను ఏర్పాటు చేశారు. వాటిని మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి చేతుల మీదగా ప్రారంభించారు. మిషన్ భగీరథలో భాగంగా నిర్మించిన వాటర్‌ ట్యాంక్‌లకు పైపులైన్లు వేసి గ్రామంలో సిద్ధంగా ఉంచారు. ఇక కాళేశ్వరం నుంచి పైపులైన్ల ద్వారా నీరు వచ్చిన వెంటనే గ్రామంలోని ప్రతీ ఇంటికీ స్వచ్ఛమైన మంచినీరు అందుతుందని గ్రామ సర్పంచ్ చెప్పారు. 

ఇదిలా ఉంటే ఎక్కడా లేని విధంగా నిరు పేదలైన ప్రతీ ఒక్కరికీ తమ సొంతింటి కల నిజమవుతోంది. గ్రామంలో 50 డబుల్ బెడ్‌ రూమ్‌ ఇళ్లు నిర్మిస్తున్నట్టు ప్రజా ప్రతినిధులు చెబుతున్నారు. పనులు పూర్తి చేసి త్వరలోనే అర్హులైన నిరుపేద కుటుంబాలకు అందజేయనున్నారు. రోజురోజుకీ గ్రామంలో జనాభా పెరిగిపోతోంది. దీంతో వాళ్లు ఒకే ఇంట్లో ఎక్కువ మంది ఉండలేక వేరే ప్రాంతాల్లో అద్దెకు ఉంటున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్‌.. ప్రతీ ఒక్క కుటుంబం గౌరవంగా ఉండేలా ఇళ్లు కట్టిస్తున్నట్లు ప్రజా ప్రతినిధులు చెబుతున్నారు. అద్దె ఇళ్లలో ఉన్న కుటుంబాలకు సొంతింటి కల నెరవేరనుంది. దేశాయ్‌పేట అభివృద్ధికి సహకరిస్తున్న మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మొత్తానికి ఇప్పుడు ఈ ఊరి స్వరూపమే మారిపోయింది. 

 

09:18 - December 1, 2017

అనంతపురం : అనంత సాగు,తాగు నీటి అవసరాలకు ఆ జలాశయం ఆయువు పట్టు. పాలకుల ఆనాలోచిత నిర్ణయాలు, కాంట్రాక్టర్ల అవినీతి, అక్రమాలు రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయి. ప్రభుత్వాలు మారిన విధంగానే పాలకుల నిర్ణయాలు మారుతుండటంతో  ఆ జలాశయానికి శాపంగా మారింది. ప్రాజెక్టు నిర్మాణ దశ నుంచే వేసిన తప్పటడుగులు..నిర్మాణ లోపాలు,  అవినీతి, అక్రమాలు వెరసి అనంత రైతన్న నోట్లో మట్టి కొడుతున్నాయి. లీకేజీల ప్రాజెక్టుగా దర్శనమిస్తున్న పెన్నహోబిళం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్  దుస్థితిపై టెన్ టివి  ప్రత్యేక కథనం..
 
అనంతపురం జిల్లాలోని కొర్రకోడు దగ్గర నాలుగు దశాబ్దాల క్రితం పెన్నహోబిళం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్మాణానికి నాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి శంకుస్థాపన చేశారు.  ఈ జలాశయానని 5.5 టీఎంసీల సామర్థ్యంలో నిర్మాణ పనులు చేపట్టారు. పనులు ఒక దశకు చేరుకున్న తర్వాత జలాశయం సామర్ధ్యాన్ని 11.01 టీఎంసీలకు పెంచుతూ అందుకు అనుగుణంగా నిర్మాణ పనులను మార్పు చేశారు. సామర్థ్యాన్ని పెంచడంతోపాటు నిర్మాణ అంచనాలు పెరగడం,భూ సేకరణ అన్ని మార్పు చేయాల్సి రావడంతో తొలుత పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌ కోర్టును ఆశ్రయించాడు. చేసిన పనులకు నిధులు విడుదల చేయకపోవడం లాంటి కారణాలతో కొన్నేళ్లపాటు జలాశయం నిర్మాణం పనులు పూర్తిగా నిలిచిపోయారు. దీంతో యంత్ర సామాగ్రి తుప్పుపట్టి పోయింది. వివాదాలు పరిష్కరించి తిరిగి నిర్మాణం పనులు చేపడ్డంలో జరిగిన జాప్యం, సామర్థ్యపు అంచనాలు మారిపోవడంతో నిర్మాణంలో లోపాలను  సరిదిద్దే అవకాశాలు వీలులేకుండా పోయింది. 

అనంత రైతన్న పాలిట సాగునీటి సంజీవనిగా నిలవాల్సిన పెన్నహోబిళం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కాస్తా అరకొర నీటిని కూడా నిల్వ చేయలేని లీకేజీల ప్రాజెక్టుగా మారింది.  పెన్నహోబిళం జలాశయం నిర్మాణానికి ఇప్పటికే 300 కోట్ల రూపాయలు వ్యయం చేశారు. జిల్లాలో 1996లో కురిసిన వర్షాలకు వరదలు రావడంతో పెన్నహోబిళం జలాశయం డొల్లతనం  బయటపడింది. ప్రాజెక్టులో ఎక్కడ చూసిన లీకేజీలు రావడంతో.... అధికారులు విద్యుత్ ఉత్పత్తిని నిలిపి వేశారు. పెన్నహోబిళం జలాశయం లీకేజీలను నివారించడానికి అప్పట్లో సిడబ్ల్యుసి నిపుణుల కమిటి పరిశీలించి లీకేజీలున్న ప్రాంతాల్లో గ్రౌటింగ్ చేయాలని నిర్ణయింది.  నాటి నుంచి  నేటి వరకు .. అంటే రెండు దశాబ్దాలుగా లీకేజీలను నివారించేందుకు గ్రౌటింగ్ పనులు చేపడుతూనే ఉన్నారు. ప్రాజెక్టు మొత్తంలో 23 చోట్ల లీకేజీలను గుర్తించి గ్రౌటింగ్ పనులు చేపడుతూ వస్తున్నా లీకేజీలను నివారించింది లేదూ.... కనీసం నాలుగు టిఎంసిల నీటిని నిల్వ చేసింది లేదు. ఇప్పటి వరకు చేపట్టిన గ్రౌటింగ్ పనులకే  18 కోట్లు వ్యయం చేశారు. అయినా పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేదు.
బైట్: రాంభూపాల్‌, సీపీఎం అనంత జిల్లా కార్యదర్శి
 6 నుంచి 12 బ్లాకుల మధ్య ఎక్కువగా లీకేజీలు 

ప్రాజెక్టులోని 6నుంచి 12 బ్లాకుల మధ్య నీటి లీకేజీలు అధికంగా ఉన్నాయి. ఇప్పటి వరకు చేపట్టిన గ్రౌటింగ్ పనుల వల్ల 18 చోట్ల లీకేజీలు 80 శాతం వరకు ఆగిపోయాయని చెబుతున్న అధికారులు కనీసం రెండు టిఎంసిల నీటిని ఎందుకు నిల్వ చేయలేక పోతున్నారని ప్రశ్నిస్తే అందుకు సమాధానం మాత్రం రాదు. లీకేజీల వల్ల ప్రతిఏటా అధికారులు, ఇంజనీర్ల జేబులు నిండటం మినహా లీకేజీలు ఆగిపోతాయనే ఆశలు ఆడియాశలవుతున్నాయి. 

ప్రాజెక్టులో ఇప్పటి వరకు 1.06 టిఎంసిల నీటిని మాత్రమే నిల్వ చేస్తున్నారు.  ఎందుకంటే అంతుకు మించి నీటిని నిల్వ చేస్తే మరిన్ని లీకేజీలు వెలుగు చూస్తాయనే ఆందోళన కనిపిస్తోంది. ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు ఇప్పటి వరకు పెన్నహోబిళం జలాశయం లీకేజీల నివారణపై చిత్తశుద్థితో ప్రయత్నించిన సందర్భాలు మచ్చుకైనా లేవు. తుంగభద్ర జలాశయం నుంచే వచ్చే నీటిని పెన్నహోబిళం జలాశయానికి మళ్ళించి విద్యుత్ ఉత్పత్తి ద్వారా దిగువ ప్రాంతంలో ఉన్న పెనకచెర్ల జలాశయంలో నీటిని నిల్వ చేస్తున్నారు. జలాశయంలో పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేయగలిగితే లక్ష ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. అంతేకాదు....ధర్మవరం కుడి కాలవ ద్వారా జిల్లాలోని అనేక చెరవులు, కుంటలకు నీటిని నింపవచ్చు. అసియా ఖండంలోనే అతిపెద్ద తాగునీటి ప్రాజెక్టు శ్రీరామరెడ్డి తాగునీటి ప్రాజెక్టును పెన్నహోబిళం జలాశయం దగ్గరే ఏర్పాటు చేశారు. శ్రీ సత్యసాయి బాబా తాగునీటి పథకం, అనంతపురం నగర ప్రజలకు తాగునీటిని అందించే పిఎబిఆర్ తాగునీటి పథకాలకు పెన్నహోబిళం జలాశయం నుంచే నీటిని అందిస్తున్నారు. అటు సాగునీరు, ఇటు తాగునీటి అవసరాలకు ఎంతో కీలకంగా మారిన పెన్నహోబిళం జలాశం లీకేజీలతో కునారిల్లుతుండటం అనంత రైతన్నకు తీరని శాపంగా మారుతోంది.

09:15 - December 1, 2017

అనంతపురం : సమృద్ధిగా సాగునీటి నిల్వలు...భారీ వర్షాలతో కళకళలాడుతున్న జలాశయాలు, చెరువులు అయినా చెరువులకు నీటి విడుదలలో అనంత నాయకులు నీటి రాజకీయాలు. తమ ప్రాంత ప్రయోజనాలే ముఖ్యమంటూ జలవనరులశాఖ అధికారులపై వత్తిడితో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇన్నాళ్లు కరువుతో అల్లాడిన అనంత రైతన్నకు ఇప్పుడు నీటి విడుదలలో రాజకీయాలు కొత్త కష్టాలను తెచ్చిపెట్టాయి. జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టులకు, చెరువులకు నీళ్ళు రావడంతో రైతన్నల కళ్ళలో ఆనందనం కనిపించింది. హంద్రీనీవా కాలువ ద్వారా జిల్లాకు వచ్చే నీటిని జిల్లా అంతా సమానంగా విడుదల అయ్యేలా చూడాల్సిన నాయకులు నీటి రాజకీయాలు చేస్తూ రైతులను ఆందోళనకు గురిచేస్తున్నారు. 

అనంతపురం జిల్లాలో మొత్తం 1265  చెరువులుండగా.. మొన్న కురిసిన వర్షాలకు 532 చెరువులకు నీరు చేరినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే హంద్రీనీవా కాలువ ద్వారా జిల్లాలోని జలాశయాలు, చెరువులకు పూర్తిస్ధాయితో నీటిని నింపుకునే అవకాశముంది. ఈ కాలువ ఇప్పటివరకు ద్వారా జిల్లాలోని గుంతకల్లు, ఉరవకొండ, శింగనమల, తాడిప్రతి, రాప్తాడు, ధర్మవరం, పెనుగొండ, పుట్టపర్తి నియోజకవర్గాల పరిధిలోని వందకు పైగా చెరువులకు నీటిని విడుదల చేశారు.

అయితే జిల్లాలో ఎవరికి వారు పైప్రాంతంలోని నేతలు ముందుగా తమ ప్రాంతంలోని చెరువులకు నీటిని విడుదల చేయాలని ఆదేశించడంతో...అధికారులంతా తలలు పట్టుకుంటున్నారు. పుట్టపర్తి, బుక్కపట్నం, కొత్తచెరువు మండలాల పరిధిలోని బుక్కపట్నం చెరువు జిల్లాలోనే అతి పెద్దది. అర టీఎంసీకి పైగా నీటి సామర్ధం కలిగిన చెరువుకు ఎనిమిదేళ్ళుగా నీరు లేక తాగునీటి కోసం ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గతంలో సీఎం చెప్పినప్పుడు నీరు విడుదల చేశారని అన్నారు. ఇప్పుడు బుక్కపట్నం చెరువుకు నీటి విడుదలకు అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

బుక్కపట్నం చెరువు కింద 10 వేల ఎకరాల ఆయకట్టు భూమి సాగవుతోంది. మరో 200 గ్రామాలకు తాగునీరు అందుతోంది. అంతేకాక బుక్కపట్నం చెరవులో నీటిని నింపడం వల్ల చేపల పెంపకంతో మత్స్యకారులకు ఉపాధి లభించనుంది. అయితే ఈ చెరువుకు నీటిని విడుదల చేయాలని ఇప్పటికే పలుమార్లు అధికారులను, జిల్లా కలెక్టర్‌ను ఆదేశించినట్లు ప్రభుత్వ చీఫ్‌ విప్‌ పల్లె రఘునాథరెడ్డి తెలిపారు.

జలవనరులశాఖ అధికారులు మాత్రం పైప్రాంతంలోని చెరువులకు నీటిని విడుదల చేయడం వల్ల.. దిగువ ప్రాంతంలోని చెరువులకు నీరు చేరడంలో అలస్యమవుతోందని అంటున్నారు. మరో వారం రోజుల్లో పూర్తిస్థాయిలో బుక్కపట్నం చెరువుకు నీటిని విడుదల చేసి పది రోజుల్లోగా నీటిని నింపుతామంటున్నారు. 

07:12 - December 1, 2017

గుంటూరు : ఓవైపు ప్రజా సంకల్పయాత్ర పేరుతో వైసీపీ అధినేత జగన్‌ ప్రజల్లోకి దూసుకుపోతుంటే.. మరోవైపు పార్టీ నుంచి నేతల వలసలు మాత్రం ఆగడం లేదు. పార్టీని బలోపేతం చేయాలన్న జగన్‌ ప్రయత్నాలు.. కీలక నేతలు పార్టీని వీడటం వైసీపీని కలవరపెడుతోంది. ఏపీలో  ప్రతిపక్ష వైసపీ వలసలతో సతమతమవుతోంది. ఇప్పటికే 22 మంది సిట్టింగ్ శాసనసభ్యులు, పలువురు శాసనమండలి సభ్యులు టీడీపీ గూటికి చేరిపోగా  తాగాజా అనంతపురంజిల్లాలో మాజీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు పెద్ద ఎత్తున టీడీపీ కండువా కప్పుకున్నారు. వరుసగా నాయకులు వెళ్లపోతున్న నాయకులను అడ్డుకోడానికి వైసీపీ అధిష్ఠానం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడంలేదు. 

వచ్చే  సాధారణ ఎన్నికల నాటికి  పార్టీ నేతలను ఏకత్రాటిపై తెచ్చి ,అధికారం  పీఠం అందుకోవాలని భావిస్తున్న జగన్‌..  సుదీర్ఘ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. కాని పార్టీ అధినేత ప్రయత్నాలు ఫలించే సూచనలు లేవని వైసీపీ నాయకులు చర్చించుకుంటున్నారు. పాదయాత్ర మొదలైనాటి నుంచి కీలక నేతలు  ఒక్కొక్కరుగా చేజారి పోతున్నారు. మొన్నటికి మొన్న ఇద్దరు మహిళా నేతలు పార్టీకి గుడ్‌బై చెప్పగా.. తాజాగా అనంతపురం మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ అనుచరుడిగా గుర్తింపు పొందిన  గుర్నాథ్‌రెడ్డి చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో అనంతపురంజిల్లాలో వైసీపీకి   గట్టి ఎదురుదెబ్బ తగిలనట్టేననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

మరోవైపు మరికొంత మంది కీలక నేతలు సైకిల్ ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నారన్న టీడీపీ నేతల సంకేతాలతో వైసిపి అధిష్ఠానాన్ని ఆలోచనలో పడేస్తోంది. నాయకుల వలసలను అడ్డుకోడానికి ఫ్యాన్‌గుర్తుపార్టీ చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్‌అవుతాయో వేచిచూడాలి. 

07:09 - December 1, 2017

గుంటూరు : అనంతపురం మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి ఆయన అనుచరులు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ కార్యక్రమానికి మంత్రులు పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులు, దేవినేని ఉమ, ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి హాజరయ్యారు. చంద్రబాబు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ముగ్దుడినై టీడీపీలో చేరుతున్నట్లు గుర్నాథ్‌రెడ్డి చెప్పారు. నేతలంతా కలిసి మెలసి పనిచేస్తారని మంత్రి దేవినేని, ఎంపీ జేసీ స్పష్టం చేశారు.

 

07:07 - December 1, 2017

హైదరాబాద్ : మెట్రోరైలులో భద్రతకు అధిక ప్రాధన్యత ఇస్తున్నామన్నారు  తెలంగాణ డీజీపి మహేందర్ రెడ్డి. ప్రయాణికుల భద్రత, సెక్యూరిటి అంశాలపై మెట్రోరైలు అధికారులతో ఆయన మాట్లాడారు.  అమీర్‌పేట మెట్రోస్టేషన్‌ను సందర్శించిన డీజీపీ  భద్రతపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈనెల 28న ప్రధాని చేతులమీదుగా ప్రారంభమైన మెట్రోరైలు ప్రయాణికులకు సైకర్యాలు, భద్రతపై  డీజీపీ  మహేందర్‌రెడ్డి ఆరా తీసారు.  అమీర్ పేట్ లో ఉన్న మెట్రో స్టేషన్ నుసందర్శిచి అక్కడ   భద్రత అంశాలను పరిశీలించారు.  మొత్తం  30 కిలోమీటర్ల మేర 24 స్టేషన్లలో  మెట్రోరైలు పరుగులు మొదలవండతో ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు.. మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి.  రెండు రోజులు  2లక్షలకు పైగా పౌరులు మెట్రోలో ప్రయాణించారన్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పోలీసులు అధికారులకు మెట్రోరైలు సెక్యూరిటీ బాధ్యతలు అప్పగించామని  డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. 

మొత్తం 30 కిలోమీటర్ల పరిధిలో 24 స్టేషన్లలో  600 మంది పోలీసులతో భారీ   బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. భద్రతార్యవేక్షణ కు అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నామన్నారు. ప్రతి  మెట్రోరైలు స్టేషన్ లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను బంజారాహిల్స్‌ ఏర్పాటు చేస్తున్న కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం  చేస్తామన్నారు. మెట్రోరైలు లో ప్రయాణించే వారందరూ పోలీసులకు సహకరించాలని ప్రయాణికులను డిజిపి విజ్ణప్తి చేశారు.  

మెట్రో  స్టేషన్లలో  భద్రతాపరమైన అంశాలపై ప్రతేక నిఘా ఏర్పాటు చేశామని దీని కోసం అన్ని మెట్రోరైలు స్టేషన్లో సీసీటీవీ కెమెరాల ద్వారా భద్రత పర్యవేక్షణ చేస్తున్నట్టు మెట్రోరైల్‌ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. ప్రతి చోట 
ఆకతాయిలపై ప్రత్యేక నిఘా ఉంటుందని  ప్రయాణికులకు, మెట్రో ఆస్తులకు ఎలాంటి  ఇబ్బంది కలిగించినా..   కఠిన చర్యలు తీసుకుంటామని ఎండీ ఎన్వీఎస్ రెడ్డి హెచ్చరించారు.  మరోవైపు పలు మెట్రో స్టేషన్లలో పార్కింగ్‌ పెద్ద సమస్యగా మారింది. అమీర్‌పేటలో పార్కింగ్‌ చేసిన వాహనాలను పోలీస్టేషన్‌కు తరలించడంపై ప్రయాణికుల నుంచి వ్యతిరేకత వస్తోంది. పోలీసుల తీరుపై మండిపడుతున్నారు. దాంతో పాటు చార్జీల భారాన్ని కూడా కొంత తగ్గించాలని హైదరాబాద్‌ పబ్లిక్‌ కోరుతున్నారు. అయితే పార్కింగ్‌ సమస్యలను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదిస్తున్నామని.. త్వరలోనే పార్కింగ్‌ సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు మెట్రో ఎండీ. కొద్ది రోజుల పాటు చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తినా.. పౌరులు సహకరించాలని డీజీపీ మహేందర్‌రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.  

07:00 - December 1, 2017

గుంటూరు : ఒక వేళ పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం చేయలేమని.. రాష్ట్ర ప్రభుత్వం అంటే.. కేంద్ర ప్రభుత్వం ఆ నిర్మాణాన్ని పూర్తి చేస్తుందని బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణు కుమార్ రాజు అన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌.. నేషనల్‌ ప్రాజెక్ట్‌ అని.. దాని నిర్మాణానికి నిధులు కేంద్రం సమకూరుస్తుందని విష్ణుకుమార్‌ రాజు అన్నారు.  ఆ కమిట్‌మెంట్‌కు కేంద్రం కట్టుబడే ఉంటుందని ఆయన అన్నారు. ఒక వేళ రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఎత్తేస్తే.. కేంద్రమే దానిని పూర్తి చేస్తుందన్నారు.

 

06:56 - December 1, 2017

గుంటూరు : ఇవాళ ఏపీ మంత్రివర్గ సమావేశం జగరనుంది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలు ప్రస్థావనకు వచ్చే అవకాశం ఉంది. పోలవరం నిర్మాణం, కేంద్రంలేఖ, నిరుద్యోగ భృతి తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. సాయంత్రం మూడు గంటలకు జరగనున్న భేటీలో ముఖ్యంగా పోలవరం అంశంపై కేంద్రంతో ఎలా వ్యవహరించాలన్న అంశంపై   మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. 
ఆసక్తికరంగా మంత్రివర్గ సమావేశం  
పోలవరంపై కేంద్రంలేఖ, సీఎం చంద్రబాబు సీరియస్‌గా స్పందించిన నేపథ్యంలో... ఇవాళ జరగనున్న మంత్రివర్గ సమావేశం ఆసక్తికరంగా మారింది. ఏపీ పునర్విభజన చట్టంపై శాసనసభలో స్వల్ప వ్యవధి చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి  పోలవరం అంశాన్ని ప్రస్తావించారు. ప్రాజెక్టు ప్రారంభం నుంచి ప్రతిపక్షాలతో అవరోధాలు ఎదురవుతుయన్న సీఎం .. ప్రాజెక్టును త్వరితంగా  పూర్తి చేసేందుకు ప్రధాన కాంట్రాక్టర్ల నుంచి కొన్ని పనులను వేరుచేసి,  నవంబర్‌ 18న కొత్తగా టెండర్లు పిలిచామన్నారు. అయితే ఈ టెండర్లను నిలిపివేయాలంటూ కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి అమర్‌జిత్‌ సింగ్‌ రాసిన లేఖపై  చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. కేంద్రం సాయం  చేయకుంటే.. ఓ దండంపెట్టి ప్రాజెక్టు నిర్మాణాన్ని వారికే వదిలేస్తామనడం చర్చనీయాంశం అయింది. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగే మంత్రి వర్గభేటీలో పోలవరం అంశంలో ఇప్పటివరకు కేంద్రం నుంచి అందిసాయం, రాష్ట్ర ప్రభుత్వ చేసిన పనులు తదిరాలపై సమగ్రంగా చర్చించే అవకాశం ఉంది.  దాంతోపాటు రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలులో కేంద్రం నుంచి అరకొర సాయమే అందుతోందని భావిస్తున్న సీఎం ..దీనిపై త్వరలో ప్రధానిని కలవాలని కూడా నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. 
నిరుద్యోగ భృతిపై గత ఎన్నికల్లో హామీ 
మరోవైపు గత సాధారణ ఎన్నికల సందర్భంలో పార్టీ  ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులకు భృతి కల్పించే అంశంపై కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉంది. గతంలో ప్రకటించిన ప్రకారం ఇంటర్‌ పూర్తిచేసిన వారి నుంచి ప్రారంభించి.. రాష్ట్రంలో ప్రతి నిరుద్యోగికి 1500 రూపాయల భృతి ఇచ్చే అంశం సాధ్యాసాధ్యాలపై చర్చించి ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

 

ఉ. 7 గం.ల వరకు శబరిమలలో దర్శనం నిలిపివేత

కేరళ : ఉదయం 7 గంటల వరకు శబరిమలలో దర్శనం నిలిపివేశారు. వర్షం కారణంగా శబరిమలకు వెళ్లే రహదారులను మూసివేశారు.

 

Don't Miss