Activities calendar

02 December 2017

21:32 - December 2, 2017

ఢిల్లీ టెస్ట్‌ తొలి రోజే టీమిండియా డామినేట్‌ చేసింది. విరాట్‌ కొహ్లీ, విజయ్‌ల డబుల్‌ సెంచరీ భాగస్వామ్యంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్‌పై కన్నేసింది. టాస్‌ నెగ్గి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు ...టెస్ట్‌ స్పెషలిస్ట్‌ విజయ్‌, కెప్టెన్‌ కొహ్లీ సెంచరీలతో చెలరేగడంతో మొదటి రోజే 370 పరుగుల మార్క్ దాటింది. విజయ్‌-విరాట్‌ క్రీజ్‌లో పాతుకుపోవడంతో లంక బౌలర్లు మరోసారి తేలిపోయారు. విజయ్‌ ట్రేడ్‌మార్క్‌ టెస్ట్‌ ఇన్నింగ్స్‌ ఆడి 11వ సెంచరీ నమోదు చేశాడు. దూకుడుగా ఆడిన విరాట్‌ 20వ టెస్ట్‌ సెంచరీ పూర్తి చేశాడు. ఇద్దరూ కలిసి 3వ వికెట్‌కు 283 పరుగులు జోడించి భారత జట్టు భారీ స్కోర్‌కు పునాది వేశారు.267 బంతుల్లో 13 ఫోర్లతో 155 పరుగులు చేసిన విజయ్‌ ఔటైనా విరాట్‌ మాత్రం తడబడలేదు. 186 బంతుల్లో 16 ఫోర్లతో 156 పరుగులు చేసిన కొహ్లీ మరో డబుల్‌ సెంచరీ సాధించాలని తహతహలాడుతున్నాడు. తొలి రోజు ఆట ముగిసే సరికి భారత్‌ 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 371 పరుగులు చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో 600 పరుగులకు పైగా స్కోర్‌ చేసి లంక జట్టుపై ఒత్తిడి పెంచాలని భారత జట్టు పట్టుదలతో ఉంది.

21:29 - December 2, 2017

హైదరాబాద్ : భర్త చేతిలో ఘోరంగా మోసపోయింది. అయినా.. భార్యగా తన హక్కుల కోసం సంగీత చేస్తున్న పోరాటం 14వరోజుకు చేరింది. పగలు..రాత్రి..చలి ఏవీ లెక్కచేయకుండా అత్తింటి ముందే చంటిపాపతో నానా కష్టాలు పడుతోంది. ప్రజాప్రతినిధులు ముఖం చాటేసినా.... మహిళా సంఘాలు, ప్రజా సంఘాల మద్దతుతో పోరాటం కొనసాగిస్తోంది. నేతల తీరును నిరసిస్తూ... మహిళా సంఘాలు ఆందోళన ఉధృతం చేశాయి. అటు టీ మాస్ ఫోరం నేతలు సైతం మద్దతు పలికారు. LOOK

హైదరాబాద్‌ ఉప్పల్‌లో సంగీత న్యాయపోరాటం మొదలుపెట్టి 14రోజులు పూర్తైంది. ఆమెకు న్యాయం చేస్తామని ఎంపీ మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిలు హామీ ఇచ్చి ఏడురోజులు గడిచింది. అయినా ఆమెకు న్యాయం చేసే విషయంలో ఒక్క అడుగు ముందుకు పడలేదు. సంగీత భర్త, అత్త జైలులో ఉన్నా.. మామ బాల్‌రెడ్డి బెయిల్‌పై బయటకొచ్చి రోజులు గడుస్తున్నా.. సంగీతకు ఎటువంటి పరిష్కారం లభించలేదు. ఎటూ తేలని పరిస్థితిలో సంగీత అత్తింటి ముందు పోరాటం కొనసాగిస్తోంది. రాత్రింబవళ్లు చలిలో చంటిపాపతో ఇబ్బందులు ఎదుర్కుంటోంది.

మరోవైపు సంగీతకు అన్ని వర్గాల నుంచి మద్దతు పెరుగుతోంది. సంగీతకు న్యాయం చేయాలంటూ మహిళా జేఏసీ నేతలు ఉద్యమించారు. బోడుప్పల్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి వాహనాలను అడ్డుకున్నారు. ఆందోళన చేస్తున్న 8మంది మహిళా నేతల్ని అరెస్టు చేసి ఘట్‌కేసర్ పీఎస్‌కు తరలించారు. అయినా సంగీతకు న్యాయం చేసేవరకు తమ పోరాటం కొనసాగిస్తామని మహిళా సంఘాల నేతలు చెబుతున్నారు. అవసరమైతే ఎంపి కవిత ఇంటిని.. అసెంబ్లీని ముట్టడించేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.

సంగీత పోరాటానికి టీ మాస్ ఫోరం నేతలు సైతం మద్దతు పలికారు. ఎంపీ మల్లారెడ్డి సంగీతకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని టీమాస్ కన్వీనర్ జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. లేదంటే ఈనెల 8 నుంచి ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని హెచ్చరించారు. సంగీత పరిస్థితి చూసే వారి మనసు చలించిపోతోంది. అయినా ప్రజాప్రతినిధుల్లో మాత్రం కదలిక రావట్లేదు. న్యాయం చేస్తామని హామీలు ఇచ్చిన నేతలు ఇప్పుడు ఎందుకు కనపడకుండా పోయారని స్ధానికులు ప్రశ్నిస్తున్నారు. సత్వరమే సంగీతకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

టీమాస్ ఆధ్వర్యంలో జన భోజనాలు..

హైదరాబాద్ : ఆదివారం టీ మాస్ ఆధ్వర్యంలో కులాతీత భోజనాలు జరుగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా జన భోజనాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇందిరాపార్కులో జన భోజన కార్యక్రమంలో గద్దర్, విమలక్క, రాఘవులు, తమ్మినేని, ఐలయ్య తదితరులు పాల్గొననున్నారు. 

సోమవారం విశాల్ నామినేషన్ ?

చెన్నై : తమిళనాడులోని ఆర్కే నగర్ ఉప ఎన్నిక పోటీలో నటుడు విశాల్ బరిలో నిలువనున్నట్లు తెలుస్తోంది. స్వతంత్ర్య అభ్యర్థిగా సోమవారం ఆయన నామినేషన్ వేయనున్నట్లు సమాచారం. 

21:27 - December 2, 2017

హైదరాబాద్ : పెళ్లి చేసుకున్న పాపానికి ..తాళి కట్టిన వాడే నవవధువుకు నరకం చూపించాడు. కాళ్లపరాణి ఆరకముందే నరరూప రాక్షసుడిగా మారాడు. కోటి ఆశలతో మెట్టినింట్లో అడుగుపెట్టిన ఆమెకు..తొలిరాత్రినే కాళరాత్రిగా మార్చాడు. పైశాచికంగా చిత్రహింసలకు గురిచేస్తూ గొడ్డును బాదినట్లు బాదాడు. ప్రభుత్వ టీచర్‌ ఉద్యోగం..విద్యాదానం చేస్తారని సమాజంలో గౌరవం..ఎక్కడికెళ్లినా సార్‌ సార్‌ అంటూ నమస్కారాలు. బాధ్యాతాయుతమైన వృత్తిలో ఉన్న పంతులుకు తమ కూతురును ఇచ్చి పెళ్లి చేస్తే సుఖంగా చూసుకుంటాడని కన్నవారు ఎంతో ఆశ పడ్డారు. కట్నకానుకలకు ఏ లోటు రానివ్వకుండా ఘనంగా పెళ్లి చేశారు. కాని కొన్ని గంటల్లోనే ఆ టీచర్‌ విశ్వరూపం బయటపడింది. తొలిరాత్రే భార్యకు కాళరాత్రిగా మార్చి పెళ్లి అనే మధురానుభూతిని చేదు జ్ఞాపకంగా మిగిల్చాడు.

చిన్న తామరగుంటకు చెందిన శైలజకు..మోతరంగనపల్లికి చెందిన రాజేష్‌తో గురువారం వివాహం జరిగింది. అమ్మాయి MBA గ్రాడ్యుయేట్‌ కాగా.. వరుడు వి-కోటలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. రాత్రి శోభనం గదిలోకి వచ్చిన భార్యపై భర్త రాజేశ్ ఉన్మాదిగా విరుచుకుపడ్డాడు. పైశాచికంగా బ్లేడుతో దాడి చేశాడు. నోట్లో గుడ్డలు కుక్కి.. చేతులు, కాళ్లపై బ్లేడుతో గాయపరిచాడు. భార్య ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. తీవ్రంగా కొట్టడంతో.. ఆమె ముఖమంతా కమిలిపోయింది. గ‌దిలో చావు కేక‌లు పెడుతోన్న కూతురు గొంతు విని తండ్రి త‌లుపులు కొట్టగా,..గ‌దిలోంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన పెళ్లి కొడుకు పారిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ శైలజను తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వారి ఫిర్యాదుతో పోలీసులు శాడిస్ట్‌ మొగుడు రాజేశ్‌ను అదుపులోకి తీసుకొని.. కేసు నమోదు చేశారు. రాజేశ్‌ను కఠినంగా శిక్షించాలని వధువు కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు. జరిగిన దుర్మార్గం ఆలస్యంగా తెలుసుకున్న మహిళా సంఘాలు భగ్గుమంటున్నాయి. ఉన్మాది రాజేష్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. 

భారీ స్కోర్ పై కన్నేసిన భారత్..

ఢిల్లీ  : టెస్ట్‌ తొలి రోజే టీమిండియా డామినేట్‌ చేసింది. విరాట్‌ కొహ్లీ, విజయ్‌ల డబుల్‌ సెంచరీ భాగస్వామ్యంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్‌పై కన్నేసింది. టాస్‌ నెగ్గి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు ...టెస్ట్‌ స్పెషలిస్ట్‌ విజయ్‌, కెప్టెన్‌ కొహ్లీ సెంచరీలతో చెలరేగడంతో మొదటి రోజే 370 పరుగుల మార్క్ దాటింది. విజయ్‌-విరాట్‌ క్రీజ్‌లో పాతుకుపోవడంతో లంక బౌలర్లు మరోసారి తేలిపోయారు. విజయ్‌ ట్రేడ్‌మార్క్‌ టెస్ట్‌ ఇన్నింగ్స్‌ ఆడి 11వ సెంచరీ నమోదు చేశాడు. 

21:22 - December 2, 2017

విశాఖపట్టణం : జిల్లాలో రెండు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదం కొత్తమలుపు తిరిగింది. గాజువాక సమీపంలో ఓ ఆర్టీసీ ఉద్యోగి లారీ కింద పడి చనిపోయాడు. రిటైర్డ్‌ అవుతున్న రోజే అతను ప్రమాదంలో చనిపోయాడనుకొని అతని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఆశ్చర్యపోయే అంశం వెలుగులొకి వచ్చింది. అతను ప్రమాదంలో చనిపోలేదని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు సీసీ పుటేజ్‌లో కనిపించింది. దీంతో అతను ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడో అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

21:21 - December 2, 2017

హైదరాబాద్ : బీసీ సంఘాల మీటింగ్‌లో అన్ని కులాల సమస్యలపై ప్రభుత్వం దృష్టిపెట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్ చేశారు. మొక్కుబడిగా మీటింగ్ నిర్వహిస్తే కుదరదన్నారు. హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌ క్లబ్‌లో జరిగిన బీసీ కులాల సభలో ఆర్.కృష్ణయ్య పాల్గొన్నారు. ఆదివారం బీసీ కులాల 80 డిమాండ్లపై సీఎం కేసీఆర్‌ను కలవబోతున్నట్లు ఆయన చెప్పారు.

 

విశాఖలో రోడ్డు ప్రమాదం..కొత్త మలుపు...

విశాఖపట్టణం : జిల్లాలో రెండు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదం కొత్తమలుపు తిరిగింది. గాజువాక సమీపంలో ఓ ఆర్టీసీ ఉద్యోగి లారీ కింద పడి చనిపోయాడు. రిటైర్డ్‌ అవుతున్న రోజే అతను ప్రమాదంలో చనిపోయాడనుకొని అతని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఆశ్చర్యపోయే అంశం వెలుగులొకి వచ్చింది. అతను ప్రమాదంలో చనిపోలేదని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు సీసీ పుటేజ్‌లో కనిపించింది. దీంతో అతను ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడో అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

21:17 - December 2, 2017

విజయవాడ : కాపులను బీసీలో చేరుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై.. ఏపీలో మిశ్రమ స్పందన వస్తోంది. కాపు సంఘాలు హర్షం వ్యక్తం చేస్తుంటే.. బీసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో... బీసీల్లో చేర్చాలంటూ ... కాపు సామాజిక వర్గం చేసిన పోరాటానికి ఫలితం దక్కింది. కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ.. ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల కొందరు ఆనందం వ్యక్తం చేస్తే.. మరికొందరు.. మండిపడుతున్నారు.

కాపులకు రిజర్వేషన్‌ కల్పించడంతో... తిరుపతి, విశాఖపట్నంలలో కాపు సామాజిక వర్గీయులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడుకు ధన్యవాదాలు తెలియజేసుకున్నారు. కాపులను బీసీల్లో చేర్చే నిర్ణయంపై కాపు ఉద్యమ నేత... ముద్రగడ పద్మనాభం సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఐదు శాతం రిజర్వేషన్‌ల కల్పించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పది శాతం రిజర్వేషన్‌ కల్పించాలని ఆయన కోరారు. అలాగే కాపులను బీసీలో చేర్చడం కాపులకు చరిత్రలో మర్చిపోలేని రోజని, రిజర్వేషన్లతో కాపులకు మెరుగైన అవకాశాలు అందుతాయని పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు.

బీసీల్లో కాపులను చేర్చడాన్ని నిరసిస్తూ.. పలు జిల్లాలో బీసీ సంఘాల నాయకులు ఆందోళనలు చేశారు. ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి.. తమ వ్యతిరేకతను తెలియజేశారు. బీసీలకు అన్యాయం జరుగుతుందని .. నినదించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని బీసీ సంక్షేమ సంఘం కూడా ఖండించింది. వెంటనే నిర్ణయం వెనక్కి తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.

అదేవిధంగా వైసీపీ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా ప్రభుత్వ తీరుని తప్పుబట్టారు. కాపు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. అలాగే కాపు రిజర్వేషన్‌కు తాము వ్యతిరేకం కాకపోయినా.. బీసీలకు ఏ మేరకు న్యాయం చేయగలరో తేటతెల్లం చేయాలని కాంగ్రెస్‌ నాయకులు కోరుతున్నారు. అదేవిధంగా వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే నిర్ణయంపై కూడా భిన్న స్పందనలు వస్తున్నాయి. ఈ నిర్ణయంపై అనంతపురంలో.. వాల్మీకి నాయకులు సంబరాలు జరుపుకుంటే.. కర్నూలులో గిరిజన సంఘాలు ఆందోళన చేపట్టాయి. 

20:58 - December 2, 2017

వైసీపీ అధ్యక్షుడు జగన్ పై పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి సంచలన ఆరోపణలు గుప్పించారు. ఇటీవలే ఈమె టిడిపి కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పార్టీ మారడానికి గల కారణాలు..దారి తీసిన పరిస్థితులు తెలుసుకొనేందుకు టెన్ టివి ప్రయత్నించింది. అందులో భాగంగా ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరితో టెన్ టివి అసిస్టెంట్ ఎడిటర్ సతీష్ ఫేస్ టు ఫేస్ నిర్వహించారు. ఇచ్చిన మాట తప్పారని..ఈ మాట అడిగినందుకు తన ఆత్మగౌరవం దెబ్బ తీశారని పేర్కొన్నారు. అరకు నియోజకవర్గంలో బలోపేతం చేయాలని..జగన్ బాధ్యతలు ఇచ్చారని..ఇందుకు తన శక్తివంచన మేర కృషి చేయడం జరిగిందని..అందుకు ఒక వ్యక్తిని జగన్ కు పరిచయం చేసినట్లు తెలిపారు. అరకు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆ వ్యక్తిని నియమించనున్నట్లు..పలుమార్లు ప్రకటించారని తెలిపారు. కానీ అనూహ్యంగా కుంభారావు బాబు అనే వ్యక్తిని తెరమీదకు తెచ్చారని..ఎలా తెచ్చారో తెలియదని..వెంటనే తాను జగన్ పీఎకు ఫోన్ చేయడం జరిగిందన్నారు. వెంటనే తాను విజయసాయిరెడ్డికి ఫోన్ చేస్తే నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని, కుంభరావు స్థానికేతర గిరిజనుడు కాబట్టే తాను వ్యతిరేకించడం జరిగిందన్నారు.

ఇడుపుల పాయకు వచ్చిన జగన్ ను తాను ..తన కేడర్ కలువడం జరిగిందన్నారు. అరకు..పాడేరు నియోజకవర్గాల్లో పార్టీ గెలుస్తుందని, కుంభరావు అరకు ఎమ్మెల్యే..నీకేంటి నష్టం..పార్టీకి ఏం చేశావు ? అని జగన్ ప్రశ్నించడంతో తాను అవక్కావడం జరిగిందన్నారు. పూర్తి అభిప్రాయాల కోసం వీడియో క్లిక్ చేయండి....

20:47 - December 2, 2017

వైసీపీ అధ్యక్షుడు జగన్..ఎంపీ విజయసాయిరెడ్డిలు తన ఆత్మగౌరవాన్ని దెబ్బ తీశారని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పేర్కొన్నారు. ఇటీవలే ఈమె టిడిపి కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పార్టీ మారడానికి గల కారణాలు..దారి తీసిన పరిస్థితులు తెలుసుకొనేందుకు టెన్ టివి ప్రయత్నించింది. అందులో భాగంగా ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరితో టెన్ టివి అసిస్టెంట్ ఎడిటర్ సతీష్ ఫేస్ టు ఫేస్ నిర్వహించారు. ఇందులో ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ సంచలన ఆరోపణలు గుప్పించారు.

నైతికతకు కట్టుబడి ఉన్నట్లు, ఆత్మాభిమానం చాలా గొప్పది..ముఖ్యమని అభివర్ణించారు. ఆత్మగౌరవం దెబ్బతింటే ఆ మనిషి ఉన్న పరిస్థితుల్లో ఆ మనిషి నిర్ణయం తీసుకొంటాడని తెలిపారు. జగన్..విజయిసాయిరెడ్డిలు తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని సంచలన ఆరోపణలు గుప్పించారు. ఇచ్చిన మాట తప్పారని..ఈ మాట అడిగినందుకు తన ఆత్మగౌరవం దెబ్బ తీశారని పేర్కొన్నారు. అరకు నియోజకవర్గంలో బలోపేతం చేయాలని..జగన్ బాధ్యతలు ఇచ్చారని..ఇందుకు తన శక్తివంచన మేర కృషి చేయడం జరిగిందని..అందుకు ఒక వ్యక్తిని జగన్ కు పరిచయం చేసినట్లు తెలిపారు. అరకు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆ వ్యక్తిని నియమించనున్నట్లు..పలుమార్లు ప్రకటించారని తెలిపారు. కానీ అనూహ్యంగా కుంభారావు బాబు అనే వ్యక్తిని తెరమీదకు తెచ్చారని..ఎలా తెచ్చారో తెలియదని..వెంటనే తాను జగన్ పీఎకు ఫోన్ చేయడం జరిగిందన్నారు. వెంటనే తాను విజయసాయిరెడ్డికి ఫోన్ చేస్తే నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని, కుంభరావు స్థానికేతర గిరిజనుడు కాబట్టే తాను వ్యతిరేకించడం జరిగిందన్నారు. ఇడుపుల పాయకు వచ్చిన జగన్ ను తాను ..తన కేడర్ కలువడం జరిగిందన్నారు. అరకు..పాడేరు నియోజకవర్గాల్లో పార్టీ గెలుస్తుందని, కుంభరావు అరకు ఎమ్మెల్యే..నీకేంటి నష్టం..పార్టీకి ఏం చేశావు ? అని జగన్ ప్రశ్నించడంతో తాను అవక్కావడం జరిగిందన్నారు. పూర్తి అభిప్రాయాల కోసం వీడియో క్లిక్ చేయండి....

ఆర్కే నగర్ బీజేపీ అభ్యర్థి...

చెన్నై : తమిళనాడులోని ఆర్కే నగర్ ఉప ఎన్నిక త్వరలోనే జరగనుంది. దీనితో ఆయా పార్టీల అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. బీజేపీ అభ్యర్థిగా నాగ రాజ్ ను ఆ పార్టీ ప్రకటించింది. 

బారాముల్లాలోని పీఎస్ పై దాడి..

జమ్మూ కాశ్మీర్ : ఉగ్రవాదులు రెచ్చిపోతూనే ఉన్నారు. బారాముల్లాలోని ఓ పీఎస్ పై ఉగ్రవాదులు గ్రెనైడ్ పై దాడి చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

ఆర్కే నగర్ ఉప ఎన్నిక పోటీలో విశాల్..

చెన్నై : తమిళనాడులోని ఆర్కే నగర్ ఉప ఎన్నిక పోటీలో నటుడు విశాల్ బరిలో నిలువనున్నట్లు తెలుస్తోంది. స్వతంత్ర్య అభ్యర్థిగా సోమవారం ఆయన నామినేషన్ వేయనున్నట్లు సమాచారం. 

20:16 - December 2, 2017

తంబూలాలిచ్చేశ్నం తన్నుక సావుండ్రి.. అన్నట్టున్నది.. అటు చంద్రాలు..కొల్వులకై కొట్లాట సభ గట్టిగనే జేస్తట్టున్నరుగదా తెలంగాణ జేఏసోళ్లు..ఆర్ఎస్ఎస్ గూండాలు.. బీజేపీ అగ్రవర్ణ శాల్తీలు.. తెలంగాణ పోలీసులు.. ఉమ్మడిగా నిర్మించిన అభాంగపట్నం సీన్మ ట్రైలర్ రిలీజైంది.. నిన్న మన ముచ్చట్లళ్ల జెప్పుకోలేదా.. ఒక టీవీ ఛానెళ్ల గూసోని ఒక దొంగ డాక్టర్ గాడు..చెప్పేటియి శ్రీరంగ నీతులు.. దూరేటియి ఏవో అన్నట్టు.. ఒకడు తెల్లారి లేస్తె పవిత్రమైన పురణాలు వేధాలు వల్లిస్తడు..లంచానికి మంచమేస్తట్టున్నరుగదా..? సర్కారు మన్సులు.. ఓదిక్కు బాతాల పోశెట్టిగారేమో.. శీశీశీశీ.. ఎంత పపిస్టోళ్లు మోపైండ్రమ్మా..? ఈ భూమ్మీద.. విజయ్ మాల్యా అంటె అందరికి లోకువే అయిపోయింది.. విలాస పురుషుడు... అమ్మాలయి లోలుడు.. గీ అన్నీ ముచ్చట్లు జూడాలంటే వీడియో క్లిక్ చేయండి. 

20:14 - December 2, 2017

ఆర్ఎస్ఎస్ గూండాలు.. బీజేపీ అగ్రవర్ణ శాల్తీలు.. తెలంగాణ పోలీసులు.. ఉమ్మడిగా నిర్మించిన అభాంగపట్నం సీన్మ ట్రైలర్ రిలీజైంది.. ఆర్ఎస్ఎస్ భరత్ రెడ్డి నిర్మాణ సారధ్యంలో.. కమలం బ్యానర్ పై తెరకెక్కిన ఈ చిత్రం దళిత బహుజన ప్రేక్షకులను ఉర్రూత లూగిస్తున్నది.. చిత్రంలో ప్రాథాన పాత్రలో నటించిన దళితులు విజయోత్సవ సభలు ముగించుకోని అభంగపట్నం జేరుకున్నరు.. గీ ముచ్చట జూడాలంటే వీడియో క్లిక్ చేయండి...

ట్రైనీ వైద్యులపై వేధింపులు..

హైదరాబాద్ : గాంధీ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్లను వేధింపులకు గురి చేస్తున్న నలుగురు ల్యాబ్ టెక్నిషీయన్స్ లను పోలీసులు అరెస్టు చేశారు. ల్యాబ్ పరీక్షల్లో మార్కులు వేయాలంటే చెప్పిన మాట వినాలంటూ వేధింపులకు పాల్పడుతున్న మహ్మద్ అక్రమ్, అంథోస్, సబెస్టియన్, మధుబాబు, దుర్గాదాస్ లను పోలీసులు అరెస్టు చేశారు. 

20:00 - December 2, 2017

ఢిల్లీ : కేరళ, తమిళనాడు రాష్ట్రాలను ఓక్ఖీ తుపాను అతలాకుతలం చేస్తోంది. ప్రకృతి వైపరీత్యానికి ఇప్పటికే 13 మంది ప్రాణాలు కోల్పోయారు. రెండు రాష్ట్రాల్లోనూ వంద మందికి పైగా మత్స్యకారులు ఇప్పటికీ సముద్రంలోనే చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు.. అధికారులు.. యుద్ధనౌకలను వినియోగిస్తున్నారు. మరోవైపు.. డిసెంబర్‌ ఐదు నుంచి.. ఆంధ్రప్రదేశ్‌లో అల్పపీడన ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఓక్ఖీ తుఫాను.. దక్షిణాదిని ముఖ్యంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాలను అల్లకల్లోలం చేస్తోంది. తమిళనాడులోని తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాపై.. ఓక్ఖీ ప్రభావం అధికంగా కనిపిస్తోంది. ఓక్ఖీ కారణంగా తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఇప్పటికే 13 మంది మరణించారు. కేరళ, తమిళనాడు, లక్షద్వీప్‌లకు చెందిన సుమారు 531 మంది మత్స్యకారులు సముద్రంలో చిక్కుకున్నారు. వీరిలో 393 మందిని రక్షించారు. తమిళనాడులో ఇప్పటికీ 60 మంది జాడ తెలియడం లేదు. గల్లంతైన వారి ఆచూకీ కోసం యుద్ధనౌకలు గాలిస్తున్నాయి. తీరం వెంబడి కోస్ట్‌గార్డ్‌, వైమానిక, నావికాదళాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి.

తుపాను దెబ్బకు తమిళనాట.. సుమారు నాలుగు వేలకు పైగా విద్యుత్‌ లైన్‌లు దెబ్బతిన్నాయి. దీంతో.. కన్యాకుమారి జిల్లా మొత్తం అంధకారంలో ఉండిపోయింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్తు పునరుద్ధరణకు తమిళనాడు ప్రభుత్వం 25 కోట్ల రూపాయలను కేటాయించింది. అమిత వేగంగా వీస్తోన్న గాలుల వల్లే అత్యధిక నష్టం సంభవించిందని అధికారులు చెబుతున్నారు. తుపాను కారణంగా.. తమిళనాట.. పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ప్రధాని నరేంద్రమోదీ.. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి ఫోన్‌ చేసి.. రాష్ట్రంలోని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

అటు కేరళలోనూ తుపాను తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. రాష్ట్రానికి వచ్చిన పర్యటకులు.. ముఖ్యంగా సముద్రతీర ప్రాంతాల్లోని హోటళ్లలో బస చేసిన వారు.. బయటకు రావద్దని ఆ రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. మృతుల కుటుంబాలకు కేరళ ప్రభుత్వం పదేసి లక్షల రూపాయల మేర పరిహారం ప్రకటించింది. ఒక్ఖీ తుపాను.. లక్షద్వీప్‌ను కూడా అతలాకుతలం చేస్తోంది. లక్షద్వీప్‌ పరిధిలోని కాల్పేని ద్వీపంలో వర్షం ధాటికి సముద్ర నీటిమట్టం బాగా పెరిగింది. కొబ్బరిచెట్లు కూకటివేళ్లతో సహా ఒరిగిపోయాయి. తీరంలో ఆపిన బోట్లు దెబ్బతిన్నాయి. లక్షద్వీప్‌ పరిధిలో 31 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే వెయ్యికి పైగా ప్రజలు ఇందులో తలదాచుకుంటున్నారు. ప్రస్తుతం తుపాను లక్షద్వీప్‌ వద్ద ఉంది. ఇది వచ్చే 48 గంటల్లో ముంబై, గుజరాత్‌ దిశగా సాగే అవకాశం ఉందని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.

మరోవైపు.. డిసెంబర్‌ ఐదు తర్వాత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కూడా తుపాను గండం పొంచివుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. డిసెంబర్‌ ఐదున అల్పపీడనం బలపడి.. నెల్లూరు, చిత్తూరు జిల్లాలపై ప్రభావం చూపుతుందని వెల్లడించింది. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ప్రవహించే సువర్ణముఖి, కాళింగి నదుల్లో ప్రవాహం పెరిగే అవకాశం ఉందని, నెల్లూరు జిల్లాలోని సోమశిల, కండలేరు ప్రాజెక్టులకు భారీగా వరదనీరు వచ్చి చేరే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. అప్రమత్తంగా ఉండాలని, రెండు జిల్లాల అధికారులకు ప్రభుత్వం సూచించింది. 

19:56 - December 2, 2017
19:53 - December 2, 2017

నాగర్ కర్నూలు : దళిత మహిళ మృతికి కారణమైన ఎస్‌ఐను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ నాగర్‌ కర్నూలు..వంగూర్‌ మండలంలో దళిత సంఘాల నాయకులు ర్యాలీ నిర్వహించారు. వంగూర్‌ ప్రధాన కూడలిలో రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా పోలీసులు వారిని అడ్డుకుని.. అరెస్ట్‌ చేశారు. బండపల్లి లింగమ్మ అనే మహిళ మృతి కేసును పక్కదారి పట్టిస్తున్న ఎస్‌ఐ వీరబాబును విధుల నుంచి తొలగించాలని.. బాధిత కుటుంబానికి 20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని దళిత నాయకులు డిమాండ్‌ చేశారు. 

19:52 - December 2, 2017

శ్రీకాకుళం : జిల్లా పొందూరు మండలంలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోరనే భయంతో కనిమెట్టకు చెందిన పవన్‌, మొదలవలసకు చెందిన రేణుక ప్రాణాలు తీసుకున్నారు. గ్రామ శివారులోని తోటలో ఉరి వేసుకుని తనువు చాలించారు. తెలిసి తెలియని వయసులో ఇద్దరూ విగత జీవులుగా చెట్టుకు వేలాడటం గ్రామస్థులను కలిచివేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. 

19:50 - December 2, 2017

చిత్తూరు : జిల్లా గంగాధర నెల్లూరులో దారుణం జరిగింది. ఓ శాడిస్ట్‌ భర్త పెళ్లయిన తొలిరోజే భార్యపై బ్లేడుతో దాడికి తెగబడ్డాడు. బ్లేడుతో కాళ్లు, చేతులు కోసి పైశాచిక ఆనందం పొందాడు. తీవ్రంగా గాయపడ్డ బాధితురాలిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గంగాధర నెల్లూరులో టీచర్‌గా పనిచేస్తున్న రాజేష్‌..ఎంబీఏ చదువుతున్న యువతిని పెళ్లి చేసుకున్నాడు.  

19:48 - December 2, 2017

హైదరాబాద్ : ఏపీ ప్రభుత్వం కాపులను బీసీలో కలపడాన్ని బీసీ సంక్షేమ సంఘం ఖండించింది. ప్రభుత్వ తీరుపై తాము ఆందోళన చెందుతున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కాపులకు రిజర్వేషన్లు కల్పించారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే.. పోరాటం చేస్తామని ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. 200 సెంటర్లలో ప్రజలు కదిలి నిరసన వ్యక్తం చేశారని తెలిపారు. ఉన్న రాయితీలు దెబ్బతింటాయని బీసీల్లో ఆందోళన నెలకొని ఉందని, బీసీ సంఘాలు పిలవాలని..తగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మభ్య పెట్టే ప్రకటనలు చేస్తే మాత్రం ఊరుకోమని కృష్ణయ్య హెచ్చరించారు. 

19:46 - December 2, 2017

విజయవాడ : కాపులను బీసీల్లోకి చేరుస్తూ.. ఏపీ శాసనసభ తీర్మానం చేసింది. వెనుకబడిన కులాల జాబితాలో.. కాపుల కోసం కొత్తగా ఎఫ్‌ అనే గ్రూప్‌ను సృష్టించి.. దానిద్వారా, కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు ఐదు శాతం మేర రిజర్వేషన్‌లు కల్పించనున్నట్లు తీర్మానంలో ప్రతిపాదించారు. రాజకీయాల్లో తప్ప, విద్య, ఉద్యోగావకాశాల్లో ఈ రిజర్వేషన్‌లు వర్తిస్తాయి. రాజ్యాంగ సవరణ అవసరమైన దృష్ట్యా.. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపనున్నారు. మరోవైపు, వాల్మీకులను ఎస్టీ జాబితాలోకి చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ మరో తీర్మానాన్ని కూడా అసెంబ్లీ ఆమోదించింది. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ కోడెల వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ రెండు కీలక తీర్మానాలను ఆమోదించింది. కాపులను బీసీల్లోకి చేర్చే తీర్మానం ఒకటైతే.. వాల్మీకి, బోయలను ఎస్టీ జాబితాలోకి చేర్చాలన్న తీర్మానం మరోటి. ప్రశ్నోత్తరాలను రద్దు చేసి మరీ.. ప్రభుత్వం ఈ తీర్మానాలను ప్రతిపాదించింది. కాపులను బీసీల్లో చేర్చే బిల్లును, బీసీ సంక్షేమ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. కాపుల కోసం.. వెనుకబడిన కులాల జాబితాలో కొత్తగా ఎఫ్‌ కేటగిరీని సృష్టించారు. దీనికింద, కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు తీర్మానంలో ప్రతిపాదించారు. అన్ని వర్గాలూ సమానంగా అభివృద్ధి చెందాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని తీర్మానాన్ని ప్రవేశపెట్టిన అచ్చెన్నాయుడు వెల్లడించారు.

తీర్మానంపై మాట్లాడిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు.. బీసీలకు ఏమాత్రం అన్యాయం జరగకుండా.. కాపులకు రిజర్వేషన్‌లు కల్పిస్తున్నామన్నారు. ఎవరూ కోరకున్నా.. పాదయాత్ర సందర్భంగా.. కాపుల కష్టాలు చూసిన తానే.. రిజర్వేషన్‌ల ప్రస్తావన తెచ్చానన్నారు. బ్రిటిష్‌ హయాంలో బీసీలుగా ఉన్న కాపులు.. కాలక్రమంలో రిజర్వేషన్‌లను ఎలా కోల్పోయారో చంద్రబాబు వివరించారు. 2014లో ఇచ్చిన హామీకి కట్టుబడి.. 2016లో జస్టిస్‌ మంజునాథ కమిషన్‌ వేశామని తెలిపారు. కమిషన్‌ నివేదిక మేరకే.. కాపులకు రిజర్వేషన్‌లు కల్పిస్తున్నామని, బీసీలకు ఏమాత్రం అన్యాయం జరగబోదని చంద్రబాబు వివరించారు. తీర్మానంపై చర్చ సందర్భంగా మాట్టాడిన తెదేపా ఎమ్మెల్యే బోండా ఉమ, సుప్రీంకోర్టు తీర్పును గమనంలో ఉంచుకుని.. కాపులకు రిజర్వేషన్‌లు కల్పించే అంశంపై లోతుగా కసరత్తు చేశామన్నారు.

సుదీర్ఘ చర్చ అనంతరం.. కాపులకు రిజర్వేషన్‌లు కల్పించే తీర్మానాన్ని.. ఏపీ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆ వెంటనే.. వాల్మీకి, బోయలను ఎస్టీ జాబితాలోకి చేర్చాలంటూ ప్రతిపాదించిన తీర్మానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభలో ప్రవేశపెట్టారు. దీనిపై మాట్లాడిన రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు.. ఈ తీర్మానం తరాలుగా అణగారిన బోయ, వాల్మీకుల జీవితాల్లో కొత్త ఆశలను చిగురింప చేస్తోందని అన్నారు. కాపులకు 5 శాతం రిజర్వేషన్లను కల్పించడంతో, ప్రస్తుతం ఏపీలో రిజర్వేషన్ల శాతం 55కు చేరింది. రిజర్వేషన్‌లు 50 శాతానికి మించరాదన్న సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో.. రాజ్యాంగ సవరణ కోరుతూ.. ఈ తీర్మానాన్ని తక్షణమే కేంద్ర ప్రభుత్వానికి పంపాలని శాసనసభ నిర్ణయించింది. 

మమతతో అఖిలేష్ భేటీ...

కోల్ కతా : ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పశ్చిమ బెంగాల్ కు చేరుకున్నారు. కోల్ కతాలో రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీతో భేటీ అయ్యారు. 

ఈడీ ఆఫీసు నుండి వెళ్లిన రబ్రీదేవి...

పాట్నా : బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి పాట్నాలోని ఈడీ ఎదుట హాజరయ్యారు. కాసేపటి క్రితం ఆమె బయటకు వెళ్లారు. రైల్వే హోటల్స్ టెండర్ల కేసులో ఆమె పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. 

ఆదివారం కులాతీత భోజనాలు...

హైదరాబాద్ : ఆదివారం టీ మాస్ ఆధ్వర్యంలో కులాతీత భోజనాలు జరుగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా జన భోజనాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇందిరాపార్కులో జన భోజన కార్యక్రమంలో గద్దర్, విమలక్క, రాఘవులు, తమ్మినేని, ఐలయ్య తదితరులు పాల్గొననున్నారు. 

అనసూయమ్మ మృతిపై తెలంగాణ సీపీఎం సంతాపం...

హైదరాబాద్ : అన్నే అనసూయమ్మ మృతిపై సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ సంతాపం వ్యక్తం చేసింది. తన జీవితం మొత్తం ప్రజా సేవకే అంకితం చేశారని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని పేర్కొన్నారు. 

అనసూయమ్మ ఇక లేరు...

తూర్పుగోదావరి : ఏలూరులో ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధురాలు, సీపీఎం సీనియర్ నాయకురాలు అన్నె అనసూయమ్మ (92) కన్నుమూశారు. స్వాతంత్రోద్యమ సమయంలో జైలుకెళ్లడంతో పాటు గాంధీజీ ఏలూరు వచ్చిన సమయంలో ఒంటిపై ఉన్న బంగారాన్ని మొత్తాన్ని అనసూయమ్మ ఇచ్చేశారు. నాటి నుండి నేటి వరకు అనసూయమ్మ నగలు ధరించలేదు. భర్త అన్నె వెంకటేశ్వరరావుతో కలిసి భూ పోరాటాలు చేశారు. పేదలకు వేలాది ఎకరాలు పంపిణీ చేయడంలో అనసూయమ్మ కీలక పాత్ర పోషించారు. 

18:42 - December 2, 2017
18:41 - December 2, 2017

విశాఖపట్టణం : కాపులను బీసీల్లో చేర్చాలని ఏపీ కేబినెట్ తీర్మానించడంపై విశాఖ కాపు సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో పలువురు కాపు నేతలు మాట్లాడారు. సీఎం చంద్రబాబు నాయుడికి కాపు సమాఖ్య కార్యదర్శి కరణం రెడ్డి నర్సింగరావు ధన్యవాదాలు తెలియచేశారు. వెంటనే కేబినెట్ తీర్మానాన్ని కేంద్రానికి పంపించి షెడ్యూల్ 9లో చేర్చాలని ఆయన కోరారు. తమ చిరకాల వాంఛ నేడు నెరవేరడం సంతోషంగా ఉందన్నారు.

 

18:40 - December 2, 2017
18:34 - December 2, 2017

కర్నూలు : ఒంటి మీద డ్రస్ ఉందనే కావచ్చు..ఏమైనా చేయొచ్చని కొందరు పోలీసులు అనుకుంటున్నారు. అలా అనుకున్న వారంతా ఊచలు లెక్కపెడుతూ..సస్పెండ్ లకు గురవుతున్నారు. లంచాలకు మరిగిన పలువురు పోలీసుల భాగోతాలు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. అదోని వన్ టౌన్ పీఎస్ లో గత 15 రోజుల క్రితం డబ్బులు డిమాండ్ చేస్తూ ఇద్దరు కానిస్టేబుళ్లు దొరికిపోయారు. వీరిని సస్పెండ్ చేసిన ఘటన మరిచిపోకముందే మరో ఘటన చోటు చేసుకుంది. టూ టౌన్ సీఐ శివశంకర్ ఓ బార్ యజమానిని ఎలా బెదిరించాడనే వాయిస్ రికార్డ్స్ బయటకు పొక్కాయి. మాముళ్లు ఇవ్వాలంటూ ఇద్దరు కానిస్టేబుళ్లు డిమాండ్ చేయడం..దీనికి రెడ్డి వైన్స్ కు చెందిన యజమాని గోపాల్ రెడ్డి తిరస్కరించినట్లు తెలుస్తోంది. దీనితో స్వయంగా సీఐ శివశంకర్ నేరుగా గోపాల్ రెడ్డికి ఫోన్ చేశారు. దీనికి సంబంధించని వాయిస్ ని గోపాల్ రెడ్డి రికార్డు చేశాడు. దీనిని సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో ఉన్నతాధికారులు స్పందించారు.

లంచానికి డిమాండ్ చేసిన శివశంకర్ ను..ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. 

18:29 - December 2, 2017

కడప : ప్రమోషన్లు..ఉన్నత పదవులు సంపాదించాలంటే అవసరమైన సర్టిఫికేట్ పొందడం కోసం పరీక్షల్లో ఉద్యోగులు ఏకంగా మాస్ కాపీయింగ్ కు పాల్పడ్డారు. పరీక్షా హాల్ లో ఏకంగా చూచి రాతలు రాస్తూ టెన్ టివి కెమెరాకు అడ్డంగా దొరికిపోయారు. ఈఘటన బుగ్గలేటిపల్లెలో చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న భారత్ మహిళా ఇంజినీరింగ్ కాలేజీలో ఏఎంఐ డిపార్ట్ మెంట్ పరీక్షలు నిర్వహించారు. కనీసం ఇన్విజిలేటర్ లేకుండా పరీక్షలు నిర్వహించడం గమనార్హం. మాస్ కాపీయింగ్ కోసం భారీగా డబ్బులు ముట్టచెప్పినట్లు సమాచారం.

ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ డిపార్ట్ మెంట్ వారు పరీక్షలు నిర్వహిస్తారు. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ ఉద్యోగులు డిప్లామా కోర్సులు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. దీనిపైనే ప్రమోషన్లు...ఉన్నత పదవులు ఇస్తుంటారు. ఈ సర్టిఫికేట్ సంపాదించడం కోసం పరీక్షల్లో ఉత్తీర్ణత హాజరు కావాల్సి ఉంటుంది. పరీక్షలో ఉత్తీర్ణత కోసం ఒక్కో ఉద్యోగి నుండి రూ. 5వేలు తీసుకున్నట్లు సమాచారం. దీనితో పుస్తకాలు తెచ్చి కాపీయింగ్ కు పాల్పడ్డారు. ఇన్విజిలేటర్ లేకుండా పరీక్షలు నిర్వహించారు. తమిళనాడు, ఏపీకి చెందిన పలువురు ఉద్యోగులు ఈ పరీక్షలు రాశారు. 

18:19 - December 2, 2017

చిత్తూరు : తనలో ఉన్న లోపం చెబుతావా ? అంటూ పెళ్లయిన మొదటి రోజే భార్యపై ఓ భర్త శాడిస్టుగా ప్రవర్తించాడు. ఇష్టమొచ్చినట్లుగా కొరుకుతూ...బ్లేడుతో గాయాలపాలు చేస్తూ పైశాచికత్వ ఆనందాన్ని పొందాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన జిల్లాలోని గంగాధర నెల్లూరు ప్రాంతంలో చోటు చేసుకుంది. రాజేష్ అనే వ్యక్తి టీచర్ గా పనిచేస్తున్నాడు. ఇతనికి శైలజతో గత నెల 30వ తేదీన వివాహం జరిగింది. వివాహం అనంతరం మొదటి రాత్రికి పెద్దలు ఏర్పాటు చేశారు. కానీ రాజేష్ సంసారానికి పనికి రాడని శైలజ గుర్తించింది. దీనిపై ప్రశ్నించింది. ఏడ్చుకుంటూ పది గంటల ప్రాంతంలో బయటకొచ్చింది. కానీ అక్కడనే ఉన్న పెద్దలు శైలజనను మళ్లీ శోభనం గదిలోకి పంపించాడు. పెద్దలకు చెబుతావా అంటూ రాజేష్ ఒక్కసారిగా శాడిస్టుగా మారిపోయాడు. గదిలో ఉన్న బ్లేడుతో ఇష్టమొచ్చినట్లుగా గాయపరచడం..కొరకడం వంటివి చేశాడు. కేకలు వేస్తున్నా ఎవరూ తలుపులు తీయలేదు. చివరకు శైలజ పెద్ద పెట్టున్న కేకలు వేయడంతో కుటుంబీకులు తలుపులు తెరిచారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న శైలజను ఆసుపత్రికి తరలించారు. 20 లక్షలు ఇచ్చి ఘనంగా పెళ్లి చేశామని..కానీ అబ్బాయికి లోపం ఉందని తమకు తెలియదని..తమ బిడ్డకు నరకం చూపించాడని పిల్ల కుటుంబీకులు రోదిస్తూ పేర్కొన్నారు. 

శాడిస్టు భర్త పైశాచికత్వం..

చిత్తూరు : జిల్లాలోని గంగాధర నెల్లూరులో శాడిస్టు భర్త పైశాచికత్వం బయటపడింది. పెళ్లయిన తొలి రోజే బ్లేడుపై దాడికి పాల్పడ్డాడు. కాళ్లు చేతులు కోశాడు. భార్యకు తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. 

నిరుద్యోగ భృతిపై కమిటీ వేశామన్న బాబు..

విజయవాడ : నిరుద్యోగ భృతిపై కమిటీ వేయడం జరిగిందని, 21 నుండి 35 వయస్సున్న వారికి నిరుద్యోగ భృతి కల్పించనున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దీనిపై చర్చ జరగాల్సి ఉందని, పల్స్ సర్వేను ప్రామాణికంగా తీసుకుంటామన్నారు. నిరుద్యోగులకు ఎంత భూమి ఉండాలనే దానిపై దానిపై చర్చలు జరరుపుతున్నట్లు పేర్కొన్నారు. 

బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలి - మాయావతి...

ఢిల్లీ : ప్రజాస్వామ్యంపై బీజేపీకి నమ్మకం ఉంటే 2019 ఎన్నికల్లో ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలని బీఎస్పీ చీఫ్ మాయావతి డిమాండ్ చేశారు. ప్రజలు తమవైపు ఉన్నారని బీజేపీ నమ్మితే ఆ విధంగా చేయాలని సూచించారు. 

కాపు రిజర్వేషన్లపై ముద్రగడ స్పందన..

విజయవాడ : 5 శాతం రిజర్వేషన్లు ఆమోదయోగ్యం కాదని కాపు ఉద్యమ నేత ముద్రగడ తేల్చిచెప్పారు. అసెంబ్లీలో బిల్లు ఆమోదిస్తే ఒరిగేదేమి లేదని, 9వ షెడ్యూల్ లో చేరిస్తేనే తమకు అసలైన పండుగ అని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు భోజనం పెడుతామని చెప్పి టిఫిన్ పెడుతున్నారని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. కాపులు పోరాడి రిజర్వేషన్లు సాధించుకున్నారని, జగన్ కు అమ్ముడు పోయాననే మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

17:35 - December 2, 2017

హైదరాబాద్ : గ్రేటర్‌లో కాంగ్రెస్‌ పార్టీ నీరుగారిపోతోందా? రోజురోజుకు హస్తంపార్టీ హైదరాబాద్‌లో నిస్తేజంగా మారుతోందా? రాష్ట్రమంతా కాంగ్రెస్‌ జోష్‌గా ఉన్న గ్రేటర్‌లో డీలా పడటానికి కారణమేంటి? గులాబీ పార్టీ మూడేళ్ల పాలనపై ఒంటికాలుపై లేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ... రాష్ట్రమంతా తన జోరు పెంచింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాయిస్‌పెంచి... ప్రజాక్షేత్రంలోకి వెళ్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ క్యాడర్‌లో నూతనోత్తేజం నింపుతోంది. ఆపరేషన్‌ ఆకర్ష్‌కు తెరలేపి అధికార పార్టీకి ఝలక్‌ ఇస్తోంది. రాష్ట్రమంతటా కాంగ్రెస్‌ దూకుడు ప్రదర్శిస్తోంది. కానీ రాష్ట్రానికి గుండెకాయలాంటి హైదరాబాద్‌లో మాత్రం వింత పరిస్థితిని ఎదుర్కొంటోంది. అదే ఇప్పుడు పీసీసీకి తలనొప్పిగా మారింది.

కర్ణుడి చావుకు కారణాలు అనేకం అన్నట్టు తయారైంది గ్రేటర్‌లో కాంగ్రెస్‌ పరిస్థితి. గ్రేటర్‌ ఎన్నికల్లో పార్టీ ఓటమి ఇందుకు ఒక కారణమైతే.... అధికారపార్టీ దూకుడు పెంచడం మరో కారణం. అంతేకాదు... ఆపరేషన్‌ ఆకర్ష్‌తో అధికార టీఆర్‌ఎస్‌ గ్రేటర్‌లోని కాంగ్రెస్‌ నేతలను కారెక్కించుకోవడం మరో ప్రధాన కారణం. గ్రేటర్‌ కాంగ్రెస్‌ ముఖ్యనేతల తీరు పార్టీకి శాపంగా మారిందన్నది క్యాడర్‌ వాదన. గతంలో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఒక వెలుగు వెలిగిన నేతలు... ఇప్పుడు పార్టీకి అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడంతో అది క్యాడర్‌పై తీవ్ర ప్రభావం చూపెడుతోంది. గతంలో మంత్రులుగా పనిచేసిన దానం నాగేందర్‌, ముఖేష్‌గౌడ్‌ వ్యవహారశైలి గ్రేటర్‌లో పార్టీనిక నష్టం చేస్తుందన్న అభిప్రాయం క్యాడర్ టూ లీడర్‌ వరకు వ్యక్తం అవుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ముఖేష్‌గౌడ్‌ నాటి నుంచి నేటి వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. గాంధీభవన్‌వైపే ఆయన కన్నెత్తి చూడటం లేదు. తన కుమారుడిని కాంగ్రెస్‌ పార్టీ గ్రేటర్‌లో మేయర్‌ అభ్యర్థిగా ప్రకటించినా... ఆయన పార్టీ కోసం చేసిందేమీ లేదన్నది క్యాడర్ వాదన.

గ్రేటర్‌ కాంగ్రెస్‌ మరో ముఖ్యనేత దానం నాగేందర్ వ్యవహారశైలి పార్టీని మరింత డీలా పడేలా చేసిందన్నది బహిరంగ రహస్యమే. దానం టీఆర్‌ఎస్‌లోకి వెళ్లేందుకు చేసిన ప్రయత్నాలతో మొత్తం క్యాడర్‌ డీలా పడేలా చేసింది. ఇప్పటికీ ఆయన వైఖరి మాత్రం అలాగే ఉందన్న అభిప్రాయం క్యాడర్‌లో వ్యక్తమవుతోంది. పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవిని ఆశిస్తున్న దానం.... దింపుడు కల్లం ఆశలతో పార్టీలో కొనసాగుతున్నారన్న చర్చ నడుస్తోంది. అందుకే అప్పుడప్పుడు ఓ కార్యక్రమంలో మెరిసి... ఆ తర్వాత మాయమవుతున్నారన్న అభిప్రాయం నేతల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యనేతలంతా ఇలా మొహం చాటేస్తుండడంతో గ్రేటర్‌లో కార్యక్రమాలకు నాయకత్వం వహించేవారే కరువయ్యారు. గ్రేటర్‌లో ఉన్న నాయకులంతా సీనియర్లుకావడం, మొన్నటి వరకు మంత్రులుగా పనిచేయడంతో వీరందరినీ సమన్వయం చేయడం పార్టీ ముఖ్యులకు సైతం తలనొప్పిగా మారింది. క్యాడర్‌లో జోష్‌ ఉన్నాకూడా అది పార్టీలో కనిపించడం లేదు. ఇకనైనా హైకమాండ్‌ గ్రేటర్‌ కమిటీని ఏర్పాటు చేసి.. పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది. 

17:34 - December 2, 2017

జగిత్యాల : పట్టణంలోని.. పోచమ్మవాడలో దారుణం చోటుచేసుకుంది. అనారోగ్యంతో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని... ఇంటి యజమాని ఇంట్లోకి రానివ్వలేదు. గత్యంతరం లేక రోడ్డుపైనే అంత్యక్రియలు ఏర్పాట్లు చేశారు. చెప్పులు కుట్టుకుని.. జీవనం సాగించే రామకృష్ణ.. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ.. కింద పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన రామకృష్ణని హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని తీసుకురాగా.. ఇంట్లోకి పోనివ్వకుండా.. ఇంటి ఓనర్‌ అడ్డుకున్నాడు. దీంతో స్థానికులు.. రోడ్డుపైనే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. చుట్టు పక్కల వాళ్లే డబ్బులు వేసుకుని.. దహన సంస్కారం చేశారు. కాగా.. రామకృష్ణకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని.. ప్రభుత్వమే వారిని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

17:33 - December 2, 2017

సంగారెడ్డి : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాయని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు ఆరోపించారు. సంగారెడ్డి జిల్లాలో సీపీఎం తొలి జిల్లా మహాసభలను ప్రారంభించేందుకు ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనతో టెన్ టివి ముచ్చటించింది. ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని చెప్పిన ప్రభుత్వాలు ఆ విషయాన్నే విస్మరించాయని అయన అన్నారు. దేశస్ధాయిలో అన్ని రంగాలు ఒకటై ప్రత్యామ్నాయ డిమాండ్‌తో ముందుకు రాబోతున్నట్లు రాఘవులు చెప్పారు. బీసీ ప్రజా ప్రతినిధులతో కేసీఆర్ సమావేశం కావడం సంతోషకర విషయమన్న రాఘవులు ఈ అంశంలో పలు సంఘాల సలహాలు తీసుకోవాలని సూచించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

17:31 - December 2, 2017

హైదరాబాద్ : కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నిక నామమాత్రమే అంటూ మహారాష్ట్ర పీసీపీ కార్యదర్శి షెహజాద్ చేసిన వ్యాఖ్యలను మాజీ ఎంపి వీ.హనుమంతరావు ఖండించారు. అధ్యక్ష పదవి ఎన్నికపై ఇలా మాట్లాడటం సరికాదన్నారు. స్టేట్‌మెంట్లు ఇచ్చేవారు ధైర్యముంటే నామినేషన్ వేసి మాట్లాడాలని సూచించారు. కొందరు కుటుంబ పాలన అంటూ విమర్శలు చేస్తున్నారన్న వీహెచ్.. రాహుల్ కుటుంబానికి.. ఇతర కుటుంబాలకు చాలా వ్యత్యాసముందన్నారు. 

17:30 - December 2, 2017

హైదరాబాద్ : పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలను నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఎల్బీ నగర్ మహిళా కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి గాంధీభవన్ ఆవరణలో ర్యాలీతో పాటు .. వంటా వార్పు నిర్వహించారు. ఈ నిరసనలో మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. 

డబ్బులు డిమాండ్ చేసిన సీఐ...

కర్నూలు : అదోని టూ టౌన్ పీఎస్ లో మద్యం వ్యాపారికి పోన్ చేసిన సీఐ డబ్బులు డిమాండ్ చేశారు. కాల్ రికార్డ్స్ లను వాట్సప్ లో పెట్టడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. డబ్బులు డిమాండ్ చేసిన సీఐ శివశంకర్ సస్పెన్షన్ తో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. 

17:06 - December 2, 2017

ఢిల్లీ టెస్టులో ముగిసిన తొలి రోజు ఆట

ఢిల్లీ : శ్రీలంకతో జరగుతున్న మూడవ టెస్టులో తొలిరోజు ఆటముగిసే సమయానికి భారత్ 4 వికెట్ల నష్టానికి 371 పరుగులు చేసింది.

చిత్తూరు జిల్లాలో దారుణం

చిత్తూరు : జిల్లా గంగాధర నెల్లూరు లో దారుణం జరిగింది. పెళ్లయిన తొలిరోజే భార్యపై భర్త దాడి చేశాడు. దాడిలో భార్యకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. 

మండలిలో కాపు రిజర్వేషన్ పై చర్చ

గుంటూరు : ఏపీ శాసన మండలిలో కాపు రిజర్వేసన్ల పై చర్చ జరిగింది. కాపులకు రిజర్వేషన్లపై 2016లో జస్టిస్ మంజునాథ కమిషన్ వేశాం. బీసీ కమిషన్ అన్ని జిల్లాల్లో తిరిగి కాపుల ఆర్థక, సామాజిక స్థితిగతులను ఆధ్యయనం చేసిందని, బ్రిటీష్ హయాంలో కాపులు బీసీల్లో ఉన్న మాట వాస్తవమని సీఎం చంద్రబాబు అన్నారు. 

16:10 - December 2, 2017

ప్రెస్ క్లబ్ లో బీసీ కుల సంఘాల సభ

హైదరాబాద్ : బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో బీసీ కుల సంఘాల సభ జరిగింది. బీసీల్లో ఒక్కో కులానికి 10 ఎకరాలు, రూ.10 కోట్లు ఇవ్వాలన ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. 

కాపు రిజర్వేషన్ పై యాదవుల జేఏసీ ఆందోళన

ప్రకాశం : జిల్లా ఒంగోలులో కాపు రిజర్వేషన్లు  వ్యతిరేకిస్తూ యాదవ జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. యాదవులు గుండు గీయించుకుని, అర్దనగ్న ప్రదర్శనలతో బిక్షాటన చేశారు. రాజకీయాల కోసం తమ కడుపుకొట్టవద్దని నినాదాలు చేశారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాల వేశారు. 

15:28 - December 2, 2017

హైదరాబాద్ : వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో ఎస్వీకేలో తెలంగాణ వికలాంగుల సాంస్కృతిక ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలువురు వికలాంగులు తమ కళా ప్రదర్శనతో అందర్నీ ఆకట్టుకున్నారు. వికలాంగుల్లో చైతన్యం వారిలో దాగి ఉన్న కళా నైపుణ్యాన్ని తీసుకరావడానికి ఈ కార్యక్రమం చేపట్టినట్లు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక సభ్యులు పేర్కొన్నారు. వికలాంగుల అభివృద్దికి ప్రభుత్వ సాయం తప్పనిసరి అని సభ్యులు పేర్కొన్నారు. 

15:24 - December 2, 2017

హైదరాబాద్ : టి.టిడిపి ఎమ్మెల్యే, బీసీ నేత ఆర్.కృష్ణయ్యను టీజేఏసీ ఛైర్మన్ కోదండరాం కలిశారు. కొలువుల కొట్లాట సభకు మద్దతివ్వాలని..సభకు రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా కోదండరాం మీడియాతో మాట్లాడుతూ సభను విజయవంతం చేయాలని కోరినట్లు, తమకు మద్దతు తెలియచేసినందుకు కృష్ణయ్యకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ఏర్పడినా సమస్యలు తీరలేదని ఆర్.కృష్ణయ్య తెలిపారు. 1200 మంది చనిపోయారని, ఉద్యోగాలు..తెలంగాణ బాగు పడుతదని..గొప్ప అవకాశాలు వస్తాయని భావించి వారందరూ ప్రాణాలు వదులుకున్నారని తెలిపారు. 

15:13 - December 2, 2017

కరీంనగర్ : 'మమ్మల్ని ఎందుకు వెలెశారు ? ఏం తప్పు చేశాం..తమతో ఎవరూ మాట్లాడుతలేరు' అంటూ గ్రామ బహిష్కరణకు గురైన వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల జిల్లా కుస్తాపూర్ లో 55 దళిత కుటుంబాలను అగ్రవర్షాలు బహిష్కరించడం కలకలం రేగింది. కట్టుబాటు ఉల్లంఘిస్తే రూ. 50 వేలు జరిమాన విధిస్తామని ఆంక్షలు విధించారు. ఈ సందర్భంగా బహిష్కరణకు గురైన వారితో టెన్ టివి మాట్లాడింది. ఈ సందర్భంగా తమకు జరిగిన అన్యాయాన్ని ఏకరవు పెట్టారు. ఇంకా వెట్టి చాకిరీ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారని, గత సంవత్సరం నుండి ఈ సమస్య ఎదుర్కొంటున్నామన్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

15:11 - December 2, 2017

హైదరాబాద్ : అత్తింటి నుండి న్యాయం కావాలని సంగీత చేస్తున్న పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది. మూడు పెండ్లీలు చేసుకున్న శ్రీనివాస్ రెడ్డి చేతిలో మోసపోయిన భార్య సంగీత న్యాయపోరాటానికి దిగి 14 రోజులు దాటుతోంది. ఇటీవలే స్థానిక ఎంపీ మల్లారెడ్డి జోక్యం చేసుకుని పలు హామీలు గుప్పించారు. న్యాయం చేస్తానని ఎంపీ పేర్కొన్నా ఇంతవరకు ఆమెకు న్యాయం జరగడం లేదు. ఆమె ఆరోగ్యం క్షీణిస్తున్నా..నాయకులు..అత్తింటి వాళ్లు మాత్రం స్పందించడం లేదు..చలి సైతం లెక్క చేయకుండా చిన్న పాపతో పోరాడుతోంది.

శనివారం ఉప్పల్ కమాన్ వద్ద సంగీతకు మద్దతుగా మహిళా సంఘాలు రోడ్డెక్కాయి. దీనితో భారీ ఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. ఆందోళన చస్తున్న మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై వారు ప్రతిఘటించారు. మహిళా పోలీసులు లేకుండానే తమను అరెస్టు చేశారని, రాస్తారోకో చేయగానే పోలీసోళ్లు ఎందుకు వచ్చారని సూటిగా ప్రశ్నించారు. సంగీతకు న్యాయం జరిగేంత వరకు పోరాటం తప్పదని పేర్కొన్నారు. 

ఢిల్లీ టెస్టులో కోహ్లీ సెంచరీ

ఢిల్లీ : భారత్, శ్రీలంక మధ్య జరుగుతన్న మూడవ టెస్టులో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు. 110 బంతుల్లో కోహ్లీ సెంచరీ పూర్తి చేశాడు. కోహ్లీకి తన టెస్టు కెరీర్ లో 20 వ సెంచరీ. 

మంజునాథ కమిషన్ జప్యం : నారాయణ

గుంటూరు : నివేదిక ఇవ్వడంలో మంజునాథ కమిషన్ జప్యం చేసిందని మంత్రి నారాయణ అన్నారు. కాపు రిజర్వేషన్ మెజారిటీ సభ్యులు ఆమోదించారని ఆయన అన్నారు.రిజర్వేషన్  50 శాతం దాటితే కేంద్రం 9వ సెడ్యూల్లో పెట్టాలని ఆయన అన్నారు.

14:40 - December 2, 2017

విలక్షణ నటుడు కమలహాసన్ కుమార్తె శ్రుతి హాసన్ లండన్ కు చెందిన నటుడు మైఖేల్ కోర్సేల్ తో డేటింగ్ చేస్తోందట. వీరి ప్రేమ వ్యవహారంపై పలుమార్లు మీడియాలో వార్తలు రాగా వాటిని శ్రుతి కొట్టిపడేసింది. అయితే ఇవి రుమార్లు కావని సీరియస్ రిలేషన్ షిప్ అని తెలుస్తోంది. శ్రుతి తన ప్రియుడిని ఈ మధ్యే అమ్మ సారికకు పరిచయం చేసిందట. వీరి ప్రేమకు తల్లిదండ్రులిద్దరు మద్దతు ఉండడంతో వారి వివాహామే తరువాయి అన్నట్టు తెలుస్తోంది.

14:36 - December 2, 2017

విజయవాడ : పోలవరం నిర్మాణంపై రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏపీ బీజేపీ, టీడీపీ నేతల మధ్య విమర్శలు చెలరేగుతున్నాయి. బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు టిడిపి నేతలు కౌంటర్ ఇస్తున్నారు. పోలవరం ప్రాజెక్టును విభజన చట్టం ప్రకారం కేంద్రం నిధులు కేటాయించాలని టిడిపి ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు డిమాండ్ చేశారు. అమరావతిలో ఆయన టెన్ టివితో మాట్లాడారు. పోలవరానికి ఇప్పటి వరకు కేంద్రం సహకరించడం..ప్రధాన మంత్రి సహకరించడం పట్ల ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు తెలిపారు. కానీ చీఫ్ సెక్రటరీ అమర్ జీత్ సింగ్ కొన్ని ప్రలోభాలకు లోనై శరవేగంతో ముందుకు వెళుతున్న ఈ ప్రాజెక్టుకు ఆయన అడ్డంకులు వేశారని..బ్రేకులు వేశారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై టిడిపి ప్రభుత్వం రూ. 3,.500 నిధులు ఖర్చు చేసిందన్నారు. కేంద్రం నుండి నిధులు రావాల్సినవసరం ఉందని, నిధులు విడుదల చేయాలని బీజేపీ నేతలు మాట్లాడుతారని ఆశించామని కానీ అలా జరగలేదన్నారు. కాపులను బీసీల్లో చేర్చడం చరిత్రలో మరిచిపోని రోజని ఆయన హర్షం వ్యక్తం చేశారు. 

ఢిల్లీ టెస్టులో మురళీ విజయ్ సెంచరీ

ఢిల్లీ : శ్రీలంకతో జరుగుతున్న మూడవ టెస్టులో భారత ఓపెనర్ మురళీ విజయ్ సెంచరీ సాధించాడు. 163 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన విజయ్ తన కెరీర్ లో 11వ సెంచరీ చేశాడు. 

14:21 - December 2, 2017

చిత్తూరు : ఏ నాటి నుండో డిమాండ్ ఉన్న కాపు..బలిజలను బీసీల్లో చేరుస్తూ టిడిపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కాపు నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలిపిరి వద్ద కాపు..బలిజ నేతలు శ్రీవారికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాబుపై ప్రశంసల జల్లు కురిపించారు. మంచి ఉద్యోగ, ఉన్నత ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. బీసీలకు నష్టం లేకుండా కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని బాబు చెబుతూ వస్తున్నారని, అదే విధంగా చేశారని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

కొలువులకై కొట్లాట సభకు ఏర్పాట్లు పూర్తి

హైదరాబాద్ : ఈ నెల 4న నిర్వహించే కొలువులకై  కొట్లాట సభకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయని టీ. జేఏసీ చైర్మన్ కోదండరామ్ అన్నారు. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు సభకు జరుపుకోవడానికి అనుమతి ఉందని ఆయన తెలిపారు. కొలువులకై కొట్లాట సభకు వివిధ పార్టీల మద్దతు కోరామని, అలాగే కొలువులకై కొట్లాట సభకు ప్రజా సంఘాలను ఆహ్శానించామని అయిన అన్నారు. సభను విజయవంతం చేయాలని అన్ని వర్గాలను కోరుతున్నామని తెలిపారు. 

14:14 - December 2, 2017
13:49 - December 2, 2017

గుంటూరు : కాపుల రిజర్వేషన్‌ బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ ఉదయం సభ ప్రారంభం కాగానే ఈ బిల్లును బీసీ సంక్షేమ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సభలో ప్రవేశపెట్టారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు పలువురు నేతలు ఈ బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొని మాట్లాడారు. కాపులకు బీసీ ఎఫ్‌ కేటగిరీగా 5 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ ఈ బిల్లును తీసుకువచ్చారు. 
వాల్మీకీ బోయలు ఎస్టీ జాబితాలో  
వాల్మీకీ బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలంటూ సభలో చంద్రబాబు తీర్మానం ప్రవేశపెట్టారు. వాల్మీకీ బోయల దశాబ్దాల డిమాండ్‌కు అసెంబ్లీ మద్దతు తెలుపుతోందని అన్నారు. బోయలను ఎస్టీ జాబితాలో చేర్చడం అత్యంత అవసరమని చెప్పారు. ఈ కులాలను షెడ్యూలు తెగలలో చేర్చడానికి కావలసిన చర్యలు తీసుకోవాలని కేంద్రప్రభుత్వాన్ని   కోరుతూ ఏకగ్రీంగా తీర్మానించారు చంద్రబాబు.
చంద్రబాబుకు మంత్రి కాలువ ధన్యవాదాలు 
వాల్మీకి బోయలను షెడ్యూలు తెగల జాబితాలో చేరుస్తూ తీర్మానం చేసిన చంద్రబాబుకు మంత్రి కాలువ శ్రీనివాస్‌ ధన్యవాదాలు తెలిపారు. అనాధిగా వాల్మీకి బోయలు పడుతున్న బాధలను తన పాదయాత్రలో గుర్తించిన చంద్రబాబు అసెంబ్లీలో తీర్మానం పెట్టి రాష్ట్రంలోని ఇరవై లక్షల వాల్మీకి బోయలకు ఆరాధ్య దైవం అయ్యారని అన్నారు.

 

13:42 - December 2, 2017

తూర్పుగోదావరి : కాపులకు బీసీ హోదాపై పలువురు మండిపడుతున్నారు. వైసీపీ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా ప్రభుత్వ తీరుని తప్పుబడుతున్నారు. కాపు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమానికి కూడా సిద్ధమంటున్నారు. కాపు రిజర్వేషన్లపై జగన్‌ నిర్ణాయాన్ని కూడా ధిక్కరిస్తానంటున్న పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌తో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌. నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

13:24 - December 2, 2017
13:22 - December 2, 2017

గుంటూరు : కాపు రిజర్వేషన్ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఏపీ అసెంబ్లీలో కాపుల రిజర్వేషన్ బిల్లును మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు. కాపులకు బీసీ... ఎఫ్ కేటరిగిగా 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు ఆమోదం తెలిపారు. సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. షెటిల్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్ కు డిప్యూటీ కలెక్టర్ పోస్టు ఇస్తూ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగీవ్రంగా తీర్మానించింది. అలాగే వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించింది. కేంద్ర బిల్లును కేంద్రప్రభుత్వానికి పంపిస్తామని చెప్పారు. వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చుతూ తీసుకున్న నిర్ణయాన్ని కాలువ శ్రీనివాసులు స్వాగతించారు. సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.
 

13:16 - December 2, 2017

గుంటూరు : కాపుల రిజర్వేషన్ కోసం 2016సం.లో మంజునాథ కమిషన్ వేశామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏపీ అసెంబ్లీలో కాపుల రిజర్వేషన్ బిల్లును మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఈ కమిషన్ రాష్ట్రంలో ఉన్న కాపులందరి ఆర్థిక స్థితిగతులపై అధ్యయనం చేసిందన్నారు. 1970లో అనంతరాయ్ కమిషన్ వచ్చిందన్నారు.  1982లో మురళీధర్ రావు కమిషన్ వచ్చిందన్నారు. 2004, 2009ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన మ్యానిఫెస్టోలో పెట్టిందని పేర్కొన్నారు. బీసీలకు నష్టం కలిగించేవిధంగా ఈ ప్రభుత్వం వ్యవహరించదన్నారు. 2016 సం.లో పాదయాత్రలో ప్రజల సమస్యలను అధ్యయనం చేశామని చెప్పారు. కాపుల స్థితిగతులను గుర్తించానని...తనకు ఎవరూ చెప్పలేదన్నారు. తాను కాపు రిజర్వేన్ల ఇవ్వాలని నిర్ణయించానని తెలిపారు. ఈస్ట్ గోదావరి జిల్లా పిఠాపురంలో కాపులను బీసీలో చేర్చుతానని చెప్పినట్లు గుర్తు చేశారు. రామకృష్ణుడు, చినరాజప్పలతో చర్చించినట్లు తెలిపారు. బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నముక వంటిదన్నారు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు. బీసీలు లేనిదే తెలుగుదేశం పార్టీలేదన్నారు. ఎట్టిపరిస్థితిల్లో బీసీలకు ఎక్కడా అన్యాయం జరగకుండా రిజర్వేషన్లు తీసుకువస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్ని నెరవేరుస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. కాపులకు రిజర్వేషన్లు కోసం 2016లో జస్టిస్‌ మంజునాథ కమిషన్‌ వేశామన్నారు. 1956 రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి ప్రభుత్వం రెండు లిస్ట్‌లను ఏర్పాటు చేసి తెలంగాణలో ఒక విధంగా ఆంధ్రలో ఒక విధంగా పెట్టారని అన్నారు. ఏలాంటి సర్వేలు చేయకుండానే కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలను బీసీ నుండి తీసేశారని అన్నారు. సమాజంలో స్థిరత్వం ఉండాలన్నారు. అంబేద్కర్ చూపించిన స్ఫూర్తి రిజర్వేషన్లు..అని అన్నారు. సమాజంలో సాంఘిక, ఆర్థిక, సామాజిక అసమానతలు ఉన్నాయని తెలిపారు. ఎవరి రెకమండేషన్ లేకుండా పేదవారికి సంక్షేమ కార్యక్రమాలను అందజేస్తామని చెప్పారు. ప్రజా సాధికార సర్వే చేశామని చెప్పారు. బీసీలకు టీడీపీ ఎన్నటికీ నష్టం చేకూర్చదన్నారు.

 

 

 

టెస్టుల్లో 5వేల పరుగుల దాటిన విరాట్ కోహ్లి

ఢిల్లీ : శ్రీలంకతో జరగుతున్న మూడవ టెస్టులో విరాట్ కోహ్లి 5 వేల పరుగుల మైలురాయిని దాటాడు. టెస్టుల్లో  5 వేల పరుగుల దాటిన 11వ బ్యాట్స్ మెన్ గా కోహ్లి రికార్డు సృష్టించాడు. 

సీపీఎం వంగూరు మండల కార్యదర్శి సి.ఆంజనేయులు అరెస్టు

నాగర్ కర్నూల్ : వంగూరు మండలం పోలీసులు ఓవరాక్షన్ చేశారు. సీపీఎం వంగూరు మండల కార్యదర్శి, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు సీ.ఆంజనేయులుతోపాటు మరికొంతమంది కార్యకర్తలను పోలీసులు అకారణంగా అరెస్టు చేశారు. రంగాపూర్ గ్రామంలోని స్వగృహంలో నిద్రిస్తున్న ఆంజనేయులును అర్ధరాత్రి 1 గంటకు అరెస్టు చేసి, వెల్దండ మండల పోలీసు స్టేషన్ కు తరలించారు. బండపల్లి లింగమ్మ అనే దళిత మహిళ కల్తీ కల్లు తాగి మృతి చెందారు. కల్తీ కల్లు వ్యాపారి బాలస్వామిగౌడ్ ను అరెస్టు చేయాలని, అతనికి వత్తాసు పలుకుతూ...

13:06 - December 2, 2017

పవన్ స్టార్ పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న మూడవ చిత్రం అజ్ఞాతవాసి. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తెరకెక్కిస్తున్నారు. సుమారు రూ.100 కోట్లతో ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇంతకు ముందు వీరి కలయికలో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది భారీ విజయాలు సాధించాయి. అజ్ఞాతవాసిపై కూడా పవన్ అభిమానులే కాకుండా, మిగతా వారు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మూవీని హాలీవుడ్ చిత్రం ది హెయర్ అప్పారెంట్ కథ ఆధారంగా త్రివిక్రమ్ కథ సిద్ధం చేశాడని తెలుస్తోంది. ఇది నిజమే కాదు తెలియదు. ది హెయర్ అప్పారెంట్ సినిమాలో ఓ ధనవంతుడు ఉంటాడు. అతనికి ఇద్దరు భార్యలు ఉంటారు. అయితే ఆయన ఓ ప్రమాదం మరణిస్తాడు. అతని మొదటి భార్యకు ఓ కొడుకు ఉంటాడు. అతను ఎక్కడికో వెళ్లిపోతాడు. ధనవంతుని మరణం తర్వాత అతని ఆస్తిని కాజేయడానిక కొంత మంది యత్నిస్తారు. వారి నుంచి ఆస్తిని కాపాడాలని ధనవంతుని రెండో భార్య మొదటి భార్య కొడుకు సహాయంతో వారిని అడ్డుకుంటుంది. అజ్ఞాతవాసి సంక్రాంతికి విడుదల కాబోతుంది. ఈ వార్త నిజమో కాదు సినిమా చూశాక తెలుస్తోంది....

వాల్మీకి బోయలు గుర్తింపుకు నోచుకోలేదు : కాల్వ

గుంటూరు : వాల్మీకి బోయాలను పడుతున్న కష్టాలను పాదయాత్రలో చంద్రబాబు చూశారని అందుకే వారిని ఎస్టీల్లో చేర్చాలని చంద్రబాబు నిర్ణయించుకున్నాడని కాల్వ శ్రీనివాసులు అన్నారు. చాలా కమిషన్లు సిఫార్సులు చేసినా వాల్మీకి బోయలు తగిన గుర్తింపునకు నోచుకోలేదని ఆయన అన్నారు. 

కాపుల రిజర్వేషన్ పై బీసీల ఆందోళనలు

తూర్పుగోదావరి : జిల్లా కాకినాడ కలెక్టరెట్ ఎదుట కాపులను బీసీల్లో చేర్చడాన్ని నిరసిస్తూ బీసీ సంఘాలు ఆందోళనకు దిగాయి. టైర్లు తగలబెట్టిన ఆందోళనకారులు చంద్రబాబు దిష్టిబొమ్మా దహనం చేశారు. ఈ ఆందోళనలో సుభాష్ చంద్రబోస్ పాల్గొన్నారు.

అవగాహన కోసం సమావేశం

హైదరాబాద్ : జ్యోతిరావుపూలే మార్గాన్నే సీఎం కేసీఆర్ అనుసరిస్తున్నారని, బీసీ సమస్యలపై అవగాహనకు మచ్చేందుకే బీసీ సంఘాలతో సమావేశమయ్యామని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కొన్ని సమస్యలను బీసీ సంఘాల నేతలు మా దృష్టికి తెచ్చారని, వాటిని సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చేస్తామని ఆయన అన్నారు. 

12:28 - December 2, 2017

వాల్మీకి బోయలను ఎస్టీల్లో చేర్చాలని తీర్మానం

గుంటూరు : వాల్మీకి బోయలను ఎస్టీల్లో చేర్చాలని ఏసీ సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. 

కాపు రిజర్వేషన్ బిల్లు ఏకగ్రీవం

గుంటూరు : కాపులను బీసీ ఎఫ్ కేటగిరిగా 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లును అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. 

11:55 - December 2, 2017

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న మూవీ భారత్ అనే నేను చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్ ఉండడంతో ఈ సినిమా పాటలపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు ఈ సినిమా ఆడియో రైట్స్ లహరి మ్యూజిక్ భారీ ధర పెట్టి కొన్నారు. కొరటాల శివ, మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఇది. శ్రీమంతుడుతో దుమ్మురెపిన ఈ ఇద్దరు భరత్ అనే నేను వస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని ఏప్రిల్ 27 విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. 

హామీ మేరకే రిజర్వేషన్ : చంద్రబాబు

గుంటూరు : ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్నున్నామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు, ఆ మేరకే కాపుల రిజర్వేషన్లు కల్పిస్తున్నామని తెలిపారు. 2004,2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తమ మ్యానిఫెస్టోలో పెట్టిందని ఆయన గుర్తు చేశారు. కాపుల రిజర్వేషన్ కోసం 2016లో జస్టిస్ మంజునాథ కమిషన్ వేశామని ఆయన తెలిపారు. 

బీసీ సంఘాలతో ముగిసిన ఎమ్మెల్యేల భేటీ

హైదరాబాద్ : బీసీ సంఘాలతో టీఆర్ఎస్ బీసీ ఎమ్మెల్యేల సమావేశం ముగిసింది.  ఈ సమావేశంలో బీసీ సంఘాల నేతలు, శ్రీనివాస్ గౌడ్, ప్రకాష్  గౌడ్, వినయ్ భాస్కర్ పాల్గొన్నారు.

బీసీ సంఘాలతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ

హైదరాబాద్ : బీసీ సంఘాలతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమావేశమైయ్యారు. శ్రీనివాస్ గౌడ్, వినయ్ కుమార్, ప్రకాశ్ గౌడ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. రేపు శాసన సభలో కమిటీ హాల్ లో బీసీ ప్రతినిధులతో సీఎం కేసీఆర్ భేటీలో చర్చించే అంశలపై బీసీ సంఘాల నేతలతో సమాలోచనలు చేస్తున్నారు. 

11:11 - December 2, 2017

కాపు రిజర్వేషన్ తో నష్టం సుభాష్ చంద్రబోస్

తూర్పుగోదావరి : కాపు రిజర్వేషన్ పై సీఎం చంద్రబాబు నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని వైసీపీ ఎమ్మెల్సీ సుభాష్ చంద్రబోస్ అన్నారు. ఆర్థిక ప్రాతిపాదికన రిజర్వేషన్లు చెల్లవని సుప్రీం కోర్టు పలుమార్లు తీర్పులు కూడా ఇచ్చిన ప్రభుత్వానికి బుద్ధి రాలేదని ఆయన అన్నారు. ముద్రగడ ఉద్యమంతోనే ఆదరాబాదరా ప్రకటనలు చేశారని, కాపులకు బీసీ హోదాపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని ఆయన స్పష్టం చేశారు. బీసీలకు జరుగుతున్న అన్యాయంపై జగన్ నిర్ణయాన్ని ధిక్కరించైనా ముందుకెళ్తామని సుభాష్ చంద్రబోస్ అన్నారు.

కమిషన్ నివేదిక మేరకే రిజర్వేషన్

గుంటూరు : మంజునాథ కమిషన్ 20 నెలల పాటు అన్ని జిల్లాలో తిరిగి, అన్ని ప్రాంతాల నుంచి కమిషన్ సమాచారం సేకరించి కాపుల కోసం రూ.2,100 కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని, బీసీ కమిషన్ నివేదికను కూలకషంగా చర్చించామని అచ్చెనాయుడు అన్నారు.

10:55 - December 2, 2017

భారత్ మహిళ క్రికెట్ మహిళ సంచలనం, భారత్ క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ ఫిట్ నెస్ విషయంలో తనకు కోహ్లినే స్ఫూర్తి అని ఆమె తెలిపింది. సీఎన్ఎన్ న్యూస్ 18 అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి హాజరైన మిథాలీ పై విధంగా మాట్లాడారు. 2017 ప్రపంచ కప్ ఫైనల్స్ భారత్ తీసుకుకెళ్లినందుకు ఆమె అఛీవ్ మెంట్ అవార్డు ప్రధానం చేశారు. 

10:51 - December 2, 2017

కర్నూల్ : జిల్లాలోని ఎమ్మిగనూరు లో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో 3నెలల గర్భిణిని గొడ్డలితో విచక్షణ రహితంగా నరికాడు ఓ భర్త. తీవ్ర రక్తస్రావం జరిగి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా స్థానికులు ఆస్పత్రికి తరలించారు. భార్యని నరికిన భర్త సంజీవయ్యనగర్‌లో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

10:47 - December 2, 2017

నిజామాబాద్‌ : జిల్లాలోని నవీపేట మండలం అభంగపట్నంలో కిడ్నాప్‌కు గురైన దళితన యువకులు రాజేష్‌, లక్ష్మణ్‌ల ఆచూకీ లభ్యమైంది. బీజేపీ నేత భరత్‌ రెడ్డి దాడి తర్వాత నుండి ఇద్దరు కనిపించకుండా పోయారు. ట్రేస్‌ అవుట్‌ చేసి బాధితులను పోలీసులు పట్టుకొని నిజామాబాద్‌ ఎసీపీ కార్యాలయంలో విచారిస్తున్నారు. అయితే భరత్‌ రెడ్డి తమను కిడ్నాప్‌ చేశాడని బాధితులు చెబుతున్నారు. భరత్‌ రెడ్డి నుండి తప్పించుకునేందుకు పోలీసులకు అబద్దం చెప్పామన్నారు. 

 

10:43 - December 2, 2017

గుంటూరు : ఏపీ అసెంబ్లీలో కాపు రిజర్వేషన్ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కాపులకు బీసీ.. ఎఫ్ కింద 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లు చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు కాపు రిజర్వేషన్ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. బీసీలకు ఎక్కడా అన్యాయం జరగకుండా ఎఫ్ కేటగిరిగా చేర్చామని తెలిపారు. బీసీలకు ఏ, బీ,సీ,డీ,ఈ, ఎఫ్ కింద 29 శాతం అమలవుతుందన్నారు. బీసీలకు ఎలాంటి అన్యాయం జరగదని హామీ ఇచ్చారు. అన్యాయం జరిగితే తనకు, సీఎం చంద్రబాబుకు దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ఈ బిల్లుకు అందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాలని కోరారు. కాపు రిజర్వేషన్ ఏపీలో రావణ కాష్టంలా కాలుతోందన్నారు. కాపు రిజర్వేషన్ ను అసరాగా చేసుకుని రాష్ట్రంలో అశాంతిని కల్గించే ఘటనలు చూశామని తెలిపారు. కాపు రిజర్వేషన్ల సమస్యను పరిష్కరించే అవకాశాన్ని సీఎం చంద్రబాబు... తనకు కల్పించడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. సీఎం తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కాపులను బీసీల్లో చేర్చమని ఎవరూ అడగలేదని...పాదయాత్ర సందర్భంగా చంద్రబాబు దృష్టికి వచ్చిన అంశాల ఆధారంగా కాపులను బీసీల్లో చేర్చాలని మేనిఫెస్టోలో చేర్చామని తెలిపారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా, ఇచ్చిన వాగ్ధానాన్ని టీడీపీ ప్రభత్వం, సీఎం చంద్రబాబు అమలు చేశారని అభినందించారు.  తెలుగుదేశం అంటే సమాజిక న్యాయం... సామాజిక న్యాయం అంటే తెలుగుదేశం అని అభివర్ణించారు. ఇప్పటి వరకు బీసీలకు ఏ,బీ,సీ,డీ,ఈ కింద 29 శాతం రిజర్వేషన్ అమలవుతుందని...ఇక నుంచి ఏ, బీ, సీ, డీ, ఈ, ఎఫ్ గా 29 శాతం రిజర్వేషన్ అమలవుతుందన్నారు. నూటికి నూరు శాతం మేనిఫెస్టోను అమలు చేస్తోన్న ప్రభుత్వం టీడీపీ, సీఎం చంద్రబాబు అని తెలిపారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి, అంకితం భావం ఉందన్నారు. పేదరిక నిర్మూళనే లక్ష్యంగా టీడీపీ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సాధికారిత సర్వే చేయించామని తెలిపారు. రాష్ట్రంలో కాపులు 38 లక్షల 9 వేల 362,  తెలగ 4 లక్షల 81 వేలు, బలిజ 7లక్షల 51 వేల 31, ఒంటరి 13 వేల 58 మంది ఉన్నారని పేర్కొన్నారు. ఈ నాలుగు కులాల్లో 5.8 శాతం మంది పూరి గుడిసెల్లో జీవిస్తున్నారని తెలిపారు. 47.7 శాతం అసంఘటిత రంగంలో ఉన్నారని తెలిపారు. 69. 8 2 శాతం మంది నిర్లక్ష్యరాస్యులుగా ఉన్నారని చెప్పారు. 5.6 శాతం పట్టబద్రులుగా ఉన్నారని పేర్కొన్నారు. 1.1 శాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ఈ కులాల్లో చాలా మంది పేదవారున్నారని తెలిపారు. చంద్రబాబుపై నమ్మకం ఉందని.. బీసీలకు అన్యాయం జరుగదన్నారు. బీసీల పునాదులపై మీద పుట్టిన పార్టీ టీడీపీ అని తెలిపారు. టీడీపీ పార్టీ వల్లే బీసీలు సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి అయ్యారని తెలిపారు. ఈ ఈ బిల్లును గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 9లో పెట్టాలని కోరతామని చెప్పారు. బీసీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. బీసీలకు అన్యాయం జరిగితే తాము ఎందుకు ఊరుకుంటామని చెప్పారు. కాపులను బీసీల్లో చేర్చాలని సీఎం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. బీసీలకు అన్యాయం జరిగితే పోరాడుతామని హామీ ఇచ్చారు. ఏకగీవ్రంగా ఆమోదించాలని కోరారు. సీఎం చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. చంద్రబాబు సమస్యలను అధిగమించి ముందు కెళ్తారని చెప్పారు. కాపులను బీసీల్లో చేర్చితే అన్యాయం జరుగుతుందని....అందుకు బీసీలు ఏకం కావాలని బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్య అంటున్నారని పేర్కొన్నారు. బీసీలకు 
ఎందుకు అన్యాయం జరిగిందన్నారు. బీసీలకు అన్యాయం జరిగిందని సాక్ష్యాలు చూపిస్తే రాజీనామా చేస్తానని 
చెప్పారు.
ప్రతిపక్ష పార్టీది రెండు నాల్క ధోరణి : అచ్చెన్నాయుడు 
ప్రతిపక్ష పార్టీకి సామాజిక బాధ్యత ఉండాలన్నారు. ప్రతిపక్షం ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. కాపు రిజర్వేషన్లపై అనవసర రాద్ధాంతం చేస్తూ లబ్ధి పొందాలని చూస్తున్నారని చెప్పారు. ప్రతిపక్షం పార్టీ రెండు నాల్క ధోరణితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

 

కర్నూలు లో దారుణం

కర్నూలు : జిల్లా ఎమ్మిగనూర్ లో దారుణం  చోటు చేసుకుంది.ఓ భర్త భార్యపై అనుమానంతో గొడ్డలితో నరికి చంపాడు. అనంతరం భర్త చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొన ఊపిరితో కొట్టుమిట్టడాతున్న భార్యను ఆసుపత్రికి తరలించారు. 

అభంగపట్నం దళిత యువకుల ఆచూకీ లభ్యం

నిజామాబాద్ : నవీపేట మండలం అభంగపట్నంలో కిడ్నాప్ గురైన రాజేష్, లక్ష్మణ్ ల ఆచూకీ లభ్యం అయింది. మమ్మల్ని భరత్ రెడ్డి కిడ్నాప్ చేశాడని లక్ష్మణ్, రాజేశ్వర్ తెలిపారు. భరత్ రెడ్డి నుంచి తప్పించుకోవడానికే పోలీసులు అబద్ధం చప్పామని వారు అన్నారు. 

09:58 - December 2, 2017

గుంటూరు : కాపులను బీసీలో చేర్చే ముసాయిదా బిల్లుకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. నేరుగా కాపు రిజర్వేషన్ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. బీసీ కమిషన్ నివేదికకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపారు. కాపులను బీసీ...ఎఫ్ కేటగిరిగా 5శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేబినెట్ లో ఆమోదం తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

టీడీపీ అంటే సామాజిక న్యాయం : మంత్రి

గుంటూరు : టీడీపీ అంటేనే సామాజిక న్యాయమని మంత్రి అచ్చెన్న నాయుడు అన్నారు. పేద నిర్మూలనే లక్ష్యంగా టీడీపీ ప్రభుత్వం పని చేస్తుందని, గతంలో ఉన్న ప్రభుత్వాలు కాపులను బీసీల్లో చేర్చకుండా చంద్రబాబును విమర్శిస్తున్నారని ఆయన అన్నారు. 

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంకుకున్న భారత్

ఢిల్లీ : శ్రీలంకతో మొదలు కానున్న మూడవ టెస్టులో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కాసేపట్లో భారత్ శ్రీలంక మధ్య టెస్టు ప్రారంభం కానుంది. 

అసెంబ్లీలో కాపు రిజర్వేషన్ బిల్లు

గుంటూరు : ఏపీ అసెంబ్లీలో కాపు రిజర్వేషన్ బిల్లును మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశాపెట్టారు. కాపులకు బీసీ ఎఫ్ కేటగిరిగా 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లు ఆయన బిల్లు ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు బీసీలకు ఏ, బీ, సీ,డీ,ఈ కేటరిగిరి కింద 29 శాతం రిజర్వేషన్ అమలవుతుందని, గ్రూప్ ఏ కింద 7 శాతం, గ్రూప్ బీ కింద 10 శాతం, గ్రూప్ సీ కింద 1 శాతం, గ్రూప్ డీ కింద 7 శాతం, గ్రూప్ ఈ కింద 4 శాతం రిజర్వేషన్లు ఉన్నాయన్నారు. 

బీసీ ఎఫ్ లోకి కాపులు

గుంటూరు : కాపులను బీసీల్లో చేర్చే ముసాయిదా బిల్లుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అసెంబ్లీ ప్రశ్నోత్తరాలను రద్దు చేసి నేరుగా కాపు రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టనుంది. బీసీ కమిషన్ నివేదికకు ఏపీ మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. కాపులకు బీసీ ఎఫ్ కేటగిరిగా 6 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది.

09:05 - December 2, 2017

ఒక్కప్పటి పోర్న్ స్టార్, ప్రస్తుత యాక్టర్ సన్నీ లియోన్ మళ్లీ యాహూ సెర్చ్ లో మొదటి స్థానం దక్కిందచుకుంది. యాహు సెర్చ్ ఇంజన్ లో అత్యధిక మంది నెటిజన్లు సన్నీలియోన్ కోసం సెర్చ్ చేసినట్టు ఆ సంస్థ ప్రకటించింది. ఈ ఏడాది ముగుస్తుండంతో యాహు తమ సెర్చ్ ఇంజన్ లో ఎవరి కోసం ఎక్కువ వెతికారో వారి జాబితాను ఒక్కొటిగా ప్రకటిస్తుంది. భారత సినిమా హీరోయిన్లలో సన్నీ గురించి నెటిజన్లు ఎక్కువగా వెతికినట్టు యాహూ తెలిపింది. ఆ తర్వాతి స్థానంలో ప్రియాంక చోప్రా, ఐశ్వర్య రాయ్ ఉన్నారు. ఇక నటుల విసయానికొస్తే వినోద్ ఖన్నా మొదటి స్థానంలో ఉన్నారు. ఆయన మృతి చెందిన సమయంలో ఆయన గురించి తెలుసుకునేందు అధికులు యాహూ సెర్చ్ ఇంజన్ లో శోధించారు. 

పశ్చిమగోదావరిలో రోడ్డు ప్రమాదం

పశ్చిమగోదావరి : జిల్లా కాళ్ల మండలం జక్కరం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని నలుగురు యువకులు మృతి చెందారు. 

08:52 - December 2, 2017

టీసర్కార్ పై ప్రజల్లో వ్యతిరేకత ఉందని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వినయ్ కుమార్, టీఆర్ఎస్ నేత కాసం సత్యనారాయణ గుప్తు పాల్గొని, మాట్లాడారు. టీఆర్ ఎస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించిందని విమర్శించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

08:48 - December 2, 2017

పశ్చిమ గోదావరి : జిల్లాలో రోడ్డు ప్రమాదం విషాదం నింపింది. కాళ్ల మండలం జక్కారం వద్ద జరిగిన ఎదురెదురుగా వస్తున్న ఆటో -బైకు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడి కక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. 

 

08:40 - December 2, 2017

గుంటూరు : కాసేపట్లో ఏపీ కేబినెట్‌ సమావేశం కానుంది. కాపు రిజర్వేషన్లపై మంజునాథ కమిషన్‌ నివేధికపై చర్చ జరగనుంది. కాపు రిజర్వేషన్లపై ఆమోదం తెల్పనుంది. కాపులను బీసీ ఎఫ్‌ కేటగిరిగా గుర్తించి 5శాతం రిజర్వేషన్లు ఇస్తూ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టనుంది. నిరుద్యోగ భృతి అమలుపై కూడా అసెబ్లీలో ఇవాల చర్చించనుంది.

 

నేడు ఏపీ కేబినెట్ సమావేశం

హైదరాబాద్ : నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరుగనుంది. ఉదయం 8.30 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు. 

 

నేడు ఆర్టీసీ ఖమ్మం రీజియన్ లో సమ్మె

ఖమ్మం : నేడు ఆర్టీసీ ఖమ్మం రీజియన్ లో బీకేయూ రీజియన్ సమ్మెకు పిలుపునిచ్చింది. సమ్మెలో పాల్గొనాలని కార్మికులకు విజ్ఞప్తి చేసింది.  

 

నేడు సీపీఎం రంగారెడ్డి జిల్లా మహాభలు

రంగారెడ్డి : నేడు సీపీఎం రంగారెడ్డి జిల్లా మహాభలు జరుగనున్నాయి. మహాసభలను పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు ప్రారంభించనున్నారు. ఈ సమావేశాలకు పార్టీ కేంద్రకమిటీ నాయకులు చుక్కా రాములు, ఎస్.వీరయ్య హాజరవ్వనున్నారు. 

 

08:09 - December 2, 2017

ఢిల్లీ : భారత్‌, శ్రీలంక జట్ల మధ్య ఆఖరి టెస్ట్‌కు రంగం సిద్ధమైంది. ఐసీసీ టెస్ట్ టాప్‌ ర్యాంకర్‌ టీమిండియా సొంతగడ్డపై మరో సిరీస్‌ విజయం సాధించి చరిత్ర సృష్టించాలని పట్టుదలతో ఉంది. నాగ్‌పూర్‌ టెస్ట్‌ను నాలుగు రోజుల్లోనే నెగ్గి జోరు మీదున్న  భారత్‌ ఆఖరి టెస్ట్‌లోనూ నెగ్గి సిరీస్‌ కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. ఢిల్లీ ఫిరోజ్‌ షా కోట్లా స్టేడియం వేదికగా జరుగనున్న 3వ టెస్ట్‌లో కొహ్లీ అండ్‌ కో హాట్‌ఫేవరెట్‌గా బరిలోకి దిగబోతోంది.

ట్రెడిషనల్‌ టెస్ట్‌ ఫార్మాట్‌లో తిరుగులేని టీమిండియా...సొంతగడ్డపై మరో సిరీస్‌ విజయం కోసం తహతహలాడుతోంది. భారత్‌, శ్రీలంక జట్ల మధ్య  మూడు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లోని ఆఖరి టెస్ట్‌కు ఢిల్లీ ఫిరోజ్‌ షా కోట్లా స్టేడియంలో కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. ఐసీసీ టెస్ట్ టాప్‌ ర్యాంకర్‌ టీమిండియాకు...6వ ర్యాంకర్‌ శ్రీలంక సవాల్‌ విసురుతోంది.టెస్ట్‌ ఫార్మాట్‌లో తిరుగులేని జైత్రయాత్ర కొనసాగిస్తోన్న టీమిండియా..సిరీస్‌ విజయం సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగబోతోంది.

టెస్ట్‌ టాప్‌ ర్యాంకర్‌ టీమిండియా ట్రెడిషనల్‌ ఫార్మాట్‌లో మరో అరుదైన రికార్డ్‌పై కన్నేసింది.గత రెండు సీజన్లుగా సొంతగడ్డపై సిరీస్‌ ఓటమంటూ లేని భారత్‌ మరో సిరీస్‌ నెగ్గి  చరిత్ర సృష్టించాలని పట్టుదలతో ఉంది.కోల్‌కతా ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా ముగిసిన తొలి టెస్ట్‌ను డ్రాతో సరిపెట్టుకున్న భారత్‌...నాగ్‌పూర్‌ టెస్ట్‌లో మాత్రం ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆధిపత్యం ప్రదర్శించి నాలుగు రోజుల్లోనే నెగ్గింది.

యాంగ్రీ యంగ్‌ గన్‌ విరాట్‌ కొహ్లీ నాయకత్వంలోని  టీమిండియా...రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఉరకలేస్తోంది.విరాట్‌ కొహ్లీ,మురళీ విజయ్‌,చటేశ్వర్‌ పుజారా, రోహిత్‌ శర్మ సూపర్‌ ఫామ్‌లో ఉండటంతో భారత బ్యాటింగ్‌ లైనప్‌ దుర్భేధ్యంగా ఉంది.  ఉమేష్‌ యాదవ్‌,ఇషాంత్‌ శర్మ వంటి మేటి ఫాస్ట్‌ బౌలర్లతో  పేస్‌ బౌలింగ్‌ లైనప్‌ పదునుగా ఉంది.ఇక స్పిన్‌ ట్విన్స్‌ రవీందర్ జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌ ఎంతలా ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారో అందరికీ తెలిసిందే. 

మరోవైపు దినేష్‌ చాందిమల్‌ సారధ్యంలోని శ్రీలంక జట్టు అయోమయంలో ఉంది. తొలి టెస్ట్‌లో ఫర్వాలేదనిపించినా....రెండో టెస్ట్‌లో మాత్రం తేలిపోయింది.భారత జట్టుతో పోల్చుకుంటే అన్ని విభాగాల్లోనూ బలహీనంగా ఉన్న లంక జట్టు ఆఖరి టెస్ట్‌లో అంచనాలకు మించి రాణించకపోతే సిరీస్‌ ఓటమి తప్పదు. 

ఇక ఫేస్‌ టు ఫేస్‌ రికార్డ్‌లోనూ శ్రీలంకపై భారత్‌దే పై చేయిగా ఉంది. ఇరు జట్లు ఇప్పటివరకూ 43 టెస్టుల్లో పోటీపడగా....20 మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించింది. 7 మ్యాచ్‌ల్లో మాత్రమే శ్రీలంక విజయం సాధించగలిగింది. ఢిల్లీ ఫిరోజ్‌ షా కోట్లా స్టేడియం వేదికగా జరుగనున్న ఆఖరి టెస్ట్‌లో కొహ్లీ అండ్‌ కో హాట్‌ఫేవరెట్‌గా బరిలోకి దిగబోతోంది.3 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉన్న భారత్‌కే సిరీస్‌ విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయనడంలో అనుమానమే లేదు.

08:04 - December 2, 2017

ఢిల్లీ : భారత్‌ పర్యటనలో ఉన్న అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. పలు కీలక అంశాలపై ఇద్దరు నేతలు చర్చించారు. ఈ విషయాన్ని మోదీ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేశారు. ఒబామాను కలుసుకోవడం పట్ల మోదీ సంతోషం వ్యక్తం చేశారు. అధ్యక్ష పదవీకాలం పూర్తైన తర్వాత  ఒబామా మన ప్రధాని మోదీని కలవడం ఇదే మొదటిసారి. మోదీని కలుసుకోవడానికి ముందు హిందూస్థాన్‌ టైమ్స్‌ లీడర్‌షిప్‌ సదస్సులో ఒబామా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. భారత్‌-అమెరికాలు కలిసిపనిచేస్తే ఎలాంటి సమస్యలపైనా పరిష్కారం అవుతాయన్నారు. పారిస్‌ వాతావరణ ఒప్పందంలో మోదీ కీలక పాత్ర పోషించారని  ఒబామా అభినందించారు. 

 

07:56 - December 2, 2017

విశాఖ : వైజాగ్‌ఫెస్ట్‌ ఘనంగా ప్రారంభం అయింది. బుక్‌ఫెయిర్‌ తోపాటు కళారూపాలు, సైన్స్‌ఎగ్జిబిషన్‌ ఆటక్టుకుంటున్నాయి.  ప్రారంభ కార్యక్రమంలో పలువుకు కవులు, గాయకులతోపాటు వివిధరంగాల ప్రముఖులు పాల్గొని ప్రసంగించారు. 

విశాఖలో ప్రారంభమైన వైజాగ్‌ఫెస్ట్‌ పలువురిని ఆకర్షిస్తోంది. విజ్ఙానం, వినోదాన్ని పంచేలా పుస్తకాలు, కళాప్రదర్శనలు  పదిరోజుల పాటు జరగనున్నాయి. ప్రారంభ కార్యక్రమానికి హాజరైన పలువురు ప్రముఖులు వైజాగ్‌ ఫెస్ట్‌ నిర్వహకులకు అభినందనలు తెలిపారు. 

ఉత్తరాంధ్ర అంటే  కళా ,సాహిత్యరంగాలు వంశధారల ప్రవహిస్తాయని ప్రముఖ కవి-గాయకుడు సుద్దాల అశోక్‌తేజ అన్నారు. ఫెస్టివ్‌ను నవయుగ వైతాళికలు గురజాడ అప్పారావు రాసిన దేశమును ప్రేమించుమన్న గీతంతో ప్రారంభించడం అభినందనీయం అని సుద్దాల అన్నారు. అభ్యుదయం, ధిక్కారం, విజ్ఞానం, సైంటిఫిక్ విజన్‌ ఒకే గొడుకు కిందకు తీసుకు రావడంపై సుద్దాల హర్షం ప్రకటించారు. రాష్ట్రాలుగా విడిపోయినా.. తెలుగు ప్రజలు విడిపోలేదని అశోక్‌తేజ అన్నారు. 

డిసెంబర్‌ 1న ప్రారంభం అయిన వైజాగ్‌ ఫెస్టివ్‌ ఈనెల 10 వరకు కొనసాగతుందని నిర్వహకులు  తెలిపారు. 100 స్టాల్స్‌ ఏర్పాటు చేశారు. బుక్‌ఫెస్టివల్‌లో అరుదైన పుస్తకాలు  ప్రదర్శనకు ఉంచారు. దాదాపు 5వేల మంది యువకులు సైన్స్‌ , కళా ప్రదర్శనలు ఇస్తున్నారని ఈ బుక్‌ఫెయిర్‌ నిర్వాహకులు తెలిపారు.   

ప్రస్తుత సమాజంలో మూఢనమ్మకాలు, జోతిష్యం అంటురోగాల్లా  వ్యాపిస్తున్నాయని, వాస్తవాలు తెలుసుకోవాలంటే విజ్ఞానశాస్త్ర పుస్తకాలు చదవాలని వక్తలు పిలుపునిచ్చారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత  ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు. ఎలక్ట్రానిక్‌ మీడియా విజృంభిస్తున్న కాలంలో  కూడా పుస్తకాల ప్రాధాన్యత ఏమాత్రం తగ్గలేదని వక్తలు గుర్తుచేశారు. సజీవ స్రవంతిలా పుస్తకాల నుంచి విజ్ఞానం భవిష్యత్‌ తరాలకు అందుతూనే ఉంటుందన్నారు. బుక్‌ఫెయిర్‌ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న సుద్దాల అశోక్‌తేజ పాడిన పలు గీతాలు సభికులను ఆలోచింపజేశాయి. 

07:53 - December 2, 2017

హైదరాబాద్ : ఎన్నికలకు సమయం సమీపిస్తున్న కొద్ది అధికార పార్టీ వ్యూహాలకు మరింత పదను పెడుతోంది. ప్రభుత్వం ఏర్పాటై మూడేళ్ల తర్వాత బిసి జపాన్ని గులాబి దళం మొదలు పెట్టింది. బిసి నేతలతో త్వరలో సమావేశమై వెనుక బడిన వర్గాల అభివృద్ధికి తాము చిత్త శుద్ధితో వ్యవహరిస్తామన్న సంకేతాలను ముఖ్యమంత్రి ఇవ్వనున్నారు.
బిసిల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యాచరణ 
తెలంగాణాలో బిసిల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించేందుకు అధికార పార్టీ ఓ అడుగు ముందుకు వేసింది. ఇప్పటికే  ఎంబీసీల పెరుతో కార్పోరేషన్ ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం మిగిలిన వర్గాలకు దగ్గరయ్యే ప్రయత్నాలను  మొదలు పెట్టింది.ఇటీవల జరిగిన శాసనసభా సమావేశాల్లో ముఖ్యమంత్రి కెసిఆర్ బిసి ప్రజాప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహిస్తామన్న ప్రకటన చేయడంతో....అందుకు ముహూర్తం ఖరారు చేసింది. డిసెంబర్ 3వ తేదీన అసెంబ్లీ కమిటీ హాల్ లో బిసి ప్రజాప్రతినిధులతో సమావేశాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో  ప్రభుత్వ పరంగా ఇప్పటికే బిసిల కోసం అమలు చేస్తున్న పథకాలను వివరించడంతో పాటు  రాబోయే రోజుల్లో  అమలు చేసే సంక్షేమ పథకాలపై ముఖ్యమంత్రి బిసి నేతలకు వివరించనున్నారు. 
ప్రభుత్వ పథకాల్లో బీసీలకు 50శాతం కేటాయించాలి
మరోవైపు ప్రభుత్వ పథకాల్లో 50 శాతం బీసీలకు కేటాయించాలని...వచ్చే ఎన్నికల్లో 50 శాతం సీట్లు ఇవ్వాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బిసి కార్పొరేషన్లు, ఫెడరేషన్‌కు జనాభా ప్రతిపాదికన బడ్జెట్ కేటాయించాలని పట్టుబడుతున్నాయి. విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు 50 శాతానికి పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. మొత్తానికి బీసీ మంత్రం మరోసారి వల్లెవేస్తున్న కారుగుర్తుపార్టీ ఆ వర్గాలను ఎంతవరకు మెప్పిస్తోందో వేచి చూడాలి. 


 

07:50 - December 2, 2017

హైదరాబాద్ : ఎపీలో పోలవరం ప్రాజెక్టు వ్యవహారం పోలిటికల్ హీట్ పెంచుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మరో సారి మాటల యుద్ధం రాజుకుంది. ఓ వైపు ప్రతిపక్ష నేత పాదయాత్ర జరుగుతున్న సమయంలో ఈ వ్యవహారం  తెరపైకి రావడంతో.... ప్రతిపక్ష పార్టీ ఈ అంశాన్ని మరింత సీరియస్ గా తీసుకుంటోంది.

ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ  పాదయాత్ర చేస్తున్న  ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డికి మరో అస్త్రం దొరికింది. నిన్న మొన్నటి వరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని   ప్రధాన అంశంగా భావించిన వైసీపీ పోలవరం ప్రాజెక్టును కూడా అదే  స్థాయిలో తమకు రాజకీయ లబ్ది కోసం వాడుకునేందుకు సిద్ధమవుతోంది. ప్రభుత్వ వైఫల్యంవల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జాప్యం జరుగుతోందని.. దీనిపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని వైసీపీ అధినాయకత్వం రెడీ అయింది.
 

ప్రాజెక్టు నిర్మాణ విషయంలో నెలకొన్న పరిస్థితులపై వైసిపి ముఖ్య నేతలు  సమావేశమై చర్చించారు. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలన్న వాదనను నేతలు తెరపైకి తెస్తున్నారు. కాసుల కోసం కక్కుర్తి పడుతూ రాష్ట్ర ప్రభుత్వం పోలవరం నిర్మాణ బాధ్యతలను తీసుకుందని వైసిపి నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై త్వరలో అన్ని జిల్లాల్లో సభలు, సమావేశాలు నిర్వహించాలని వైసిపి నిర్ణయం తీసుకుంది. మొత్తానికి పోలవరంపై కేంద్రంలేఖ రూపంలో విపక్షపార్టీకి  కొత్త అస్త్రం దొరికిట్టైంది. అధికారపార్టీని విమర్శలతో  ఉక్కిరిబిక్కిరి చేసేందుకు అవకాశం దొరకడం  వైసీపీ నేతల్లో ఉత్సాహం నింపింది. 

07:46 - December 2, 2017

గుంటూరు : ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రధాన హామీలు నెరవేర్చేదిశగా చంద్రబాబు సర్కార్‌ అడుగులు వేస్తోంది. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని ఏపీ మంత్రివర్గం నిర్ణయించింది. మంజునాథ కమిషన్‌ నివేదికపై చర్చించిన ప్రభుత్వం... కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకుంది. మరోవైపు నిరుద్యోగభృతిపై కేబినెట్‌ చర్చించింది. ఇవాళ అసెంబ్లీలో ఈ రెండు అంశాలపై తీర్మానం చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది.  
కాపులను బీసీల్లో చేర్చాలని నిర్ణయం
సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఏపీ కేబినెట్‌ సుదీర్ఘంగా చర్చించి కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మంత్రివర్గం నిశ్చయించింది. బీసీ-ఎఫ్‌గా విభజించి...కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు ఈ రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కాపులకు విద్య, ప్రభుత్వ ఉద్యోగాలు, ఆర్థిక ప్రయోజనాల అంశాలలో మాత్రమే ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయని... ఎలాంటి రాజకీయ పదవులకు రిజర్వేషన్లు వర్తించవని మంజునాథన్‌ కమిషన్‌ తన నివేదికలో స్పష్టం చేసింది. ఇప్పటికే రిజర్వేషన్లు పొందుతున్న బీసీల ప్రయోజనాలకు ... కాపులకు కల్పించే రిజర్వేషన్లతో ఎలాంటి భంగం వాటిల్లదని పేర్కొంది.  కాపు రిజర్వేషన్ల అంశంపై ఈరోజు శాసనసభలో చర్చించి.. చట్టాన్ని చేసి గవర్నర్‌కు పంపించనున్నారు. రాష్ట్రంలో రిజర్వేషన్ల కోటా 50శాతం మించడంతో ఆమోదం కోసం కేంద్రానికి ఈ చట్టాన్ని పంపనుంది. కాపులకు 5శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకోవడంపై మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు వాల్మీకీ, బోయలను ఎస్టీల్లో చేర్చాలని సత్యపాల్‌ కమిటీ ఇచ్చిన నివేదికకు కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. వాల్మీకీ, బోయలను ఎస్టీల్లో చేర్చాలన్న కోరుతూ తీర్మానం చేసింది. ఎంతమంది సీఎంలు పాలించినా కాపులను అణగదొక్కారుతప్ప వారికి న్యాయం చేయలేదని ఏపీ కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ రామానుజయ్య అన్నారు. చంద్రబాబు మాత్రమే కాపులకు జరిగిన నష్టాన్ని గుర్తించి.... రిజర్వేషన్‌ కల్పించారని అన్నారు. 
మంజునాథన్‌ కమిషన్‌ రిపోర్ట్‌పై వివాదం
కాపు రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంజునాథన్‌ కమిషన్‌ రిపోర్ట్‌పై వివాదం నెలకొంది. కమిషన్‌ చైర్మన్‌గా ఉన్న రిటైర్డ్‌ జడ్జి మంజునాథన్‌ కాపు రిజర్వేషన్ల నివేదికను ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంది.  అయితే చైర్మన్‌ కాకుండా కమిషన్‌ సభ్యులుగా ఉన్న శ్రీమంతుల సత్యనారాయణ, మల్లెల పూర్ణచంద్రావు, సుబ్రమణ్యం నివేదిక అందజేశారు.  కమిషన్‌ చైర్మన్‌గా ఉన్న మంజునాథన్‌ కాపు రిజర్వేషన్లను వ్యతిరేకించారని.. అందుకే ఆయన నివేదిక అందజేయలేదన్న ప్రచారం జరుగుతోంది...
నిరుద్యోగ భృతిపై చర్చ 
నిరుద్యోగ భృతిపైనా మంత్రివర్గ సమావేశం చర్చించింది. 18 నుంచి 35 ఏళ్ల వయసు నిరుద్యోగులకు 1500 మేర భృతి ఇవ్వాలని ఇప్పటికే కేబినెట్‌ సబ్‌కమిటీ సిఫారసు చేసింది. అయితే ఎవరిని నిరుద్యోగులుగా పరిగణించాలనే దానిపై విధివిధానాలు ఖరారు చేయనున్నారు. ఉపసంఘం సిఫార్సులతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రిమండలి ఆదేశించింది. ఈ ప్రతిపాదనను శనివారం శాసనసభలో సభ్యుల ముందు ఉంచి అభిప్రాయాలను సేకరించిన తరువాత చట్టరూపం ఇవ్వాలని నిర్ణయించింది.

నేటి నుంచి భారత్, శ్రీలంక మూడో టెస్టు మ్యాచ్

ఢిల్లీ : నేటి నుంచి భారత్, శ్రీలంక మూడో టెస్టు మ్యాచ్ జరుగనుంది. ఫిరోజ్ షా కోట్ల వేదికగా ఉదయం 9.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 

Don't Miss