Activities calendar

03 December 2017

మురళీ సూసైడ్ పై స్పందించాలి - జస్టిస్ చంద్రకుమార్..

హైదరాబాద్ : ఓయూలో విద్యార్థి మురళీ సూసైడ్ పై ప్రభుత్వం స్పందించాలని జస్టిస్ చంద్రకుమార్ డిమాండ్ చేశారు. రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయని భావించిన యువత కేసీఆర్ నిరకుంశ పాలనతో భంగపడ్డారన్నారు. 

21:28 - December 3, 2017

సోమవారం నామినేషన్ వేయనున్న రాహుల్...

ఢిల్లీ : కాంగ్రెస్‌ చీఫ్‌ రేసులో ఎవరూ లేకపోవడంతో రాహుల్‌ ఎన్నిక ఏకగ్రీవమవుతుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. షెడ్యూల్‌ ప్రకారం సోమవారం మధ్యాహ్నం 3 గంటలతో పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్‌ గడువు ముగియనుంది. రాహుల్‌ సోమవారం నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.

జగన్ 26వ రోజు పాదయాత్ర...

అనంతపురం : వైసీపీ అధ్యక్షుడు జగన్‌ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా 26వ రోజు సోమవారం అనంతపురం జిల్లాలోకి ప్రవేశించనుంది. కడప..కర్నూలు జిల్లాలో పాదయాత్ర జరిగిన సంగతి తెలిసిందే. 

కోహ్లీ డబుల్ సెంచరీ..

ఢిల్లీ : కోహ్లీ మరోసారి పరుగుల వరద పారించాడు. ఆకాశమే హద్దుగా మరోసారి విశ్వరూపం ప్రదర్శించాడు. శ్రీలంకతో మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో డబుల్‌ సెంచరీతో విజృంభించాడు. 238 బంతుల్లో 20 ఫోర్లతో డబుల్‌ సెంచరీ మార్కును చేరాడు. 

21:20 - December 3, 2017

హైదరాబాద్ : బీసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం కేసీఆర్‌ అన్నారు. బీసీల సంక్షేమం-అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై బీసీ వర్గాలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలోని కమిటీ హాలులో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో సగానికి పైగా ఉన్న బీసీల కోసం ప్రజాప్రతినిధులు సమయం వెచ్చించి, లోతుగా అధ్యయనం చేసి విధానాలు రూపకల్పన చేయాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. బీసీల అభ్యున్నతి కోసం ఇప్పటికే ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేసిందని చెప్పారు. బీసీల జీవన ప్రమాణాలు మరింతగా పెరగాలంటే మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరముందన్నారు. రాజకీయాలకతీతంగా బీసీ వర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు అన్ని కులాల అభిప్రాయాలు తీసుకుని ఏం చేయాలో ప్రభుత్వానికి దిశా నిర్ధేశం చేయాలని సీఎం కోరారు.

సీఎం చెప్పిన విధంగా తమ వంతు కృషిగా బీసీల డిమాండ్‌ లను విశ్లేషించి నివేధిక ఇస్తామని బీసీ సంఘం నేత ఆర్‌.కృష్ణయ్య అన్నారు. బీసీ కుల దృవీకరణ పత్రాల్లో ఉన్న అవకతవకలను సీఎం దృష్టికి తీసుకెళ్తామని..పూర్తి స్థాయిలో విశ్లేషించి బీసీలకు న్యాయం చేకూరేలా మా వంతు కృషిగా నివేధిక అందిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్‌ అన్నారు.

బీసీల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు తీసుకుందని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో బీసీల కోసం కేవలం 19 రెసిడెన్షియల్ స్కూళ్లు మాత్రమే ఉండేవని.. తెలంగాణ వచ్చిన తర్వాత కొత్తగా 123 రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేశామన్నారు. వీటి ద్వారా 91,520 మంది బీసీ పిల్లలకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్య అందుతుందన్నారు. బీసీల కోసం కళ్యాణలక్ష్మి కార్యక్రమం అమలు చేస్తుండటంతో పేదింటి ఆడపిల్లలకి పెండ్లి బాధలు తప్పాయని సీఎం అన్నారు. మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లు పెట్టడం వల్ల రాష్ట్రంలో 50 మంది బిసిలకు మార్కెట్ చైర్మన్లు అయ్యే అవకాశం కలిగిందన్నారు. బీడీ కార్మికులకు భృతి ఇవ్వాలనే నిర్ణయం వల్ల ఎక్కువ మంది బీసీలు, అందులోనూ పద్మశాలిలకు ఎక్కువ మేలు కలిగిందన్నారు.

రాష్ట్రంలో కుల వృత్తుల వారిని, చేతి వృత్తులను నమ్ముకునే వారిని ప్రోత్సహిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ తెలిపారు. సమైక్య రాష్ట్రంలో హైదరాబాద్‌లో కల్లు దుకాణాలు మూసివేశారని.. దీనివల్ల గీతకార్మికులు ఉపాధి కోల్పోయారన్నారు. తెలంగాణ వచ్చిన వెంటనే కల్లు దుకాణాలు పునరుద్ధరించడంతో.. రాష్ట్రంలోని గీత కార్మికులకు ఎంతో మేలు కలిగిందన్నారు. గీత కార్మికుల కోసం రూ.1200 కోట్ల వ్యయంతో కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు.

పవర్ లూమ్‌లను వందశాతం ప్రభుత్వ ఖర్చుతో ఆధునికీకరిస్తున్నామని కేసీఆర్‌ అన్నారు. 50 శాతం సబ్సిడీతో నూలు, రసాయనాలు నేతకార్మికులకు అందిస్తున్నామని.. వారు తయారు చేసిన దుస్తులు, ఇతర ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. వరంగల్ లో టెక్స్ టైల్ పార్కు పెట్టడం వల్ల ఇతర ప్రాంతాలకు వలసలు పోయిన వారు తిరిగి సొంత గడ్డకు వస్తున్నారని చెప్పారు. సిరిసిల్లలో కాటన్ టు గార్మెంట్ పద్ధతిలో వస్త్ర పరిశ్రమను విస్తరిస్తున్నామని సీఎం అన్నారు. గొల్ల కురుమలకు 75 శాతం సబ్సిడీపై గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టామని సీఎం కేసీఆర్‌ గుర్తుచేశారు. పథకం ప్రారంభించిన నాలుగు నెలల సమయంలోనే 29.50లక్షల గొర్రెల పంపిణీ చేశామన్నారు. ఇప్పటికి లక్షా 41వేల కుటుంబాలకు గొర్రెల పంపిణీ జరిగిందని.. మొత్తం 7.30 లక్షల కుటుంబాలకు గొర్రెల పంపిణీ చేస్తామన్నారు. ఈ పథకం ద్వారా గొల్ల, కురమల జీవితంలో గొప్ప మార్పు వస్తున్నదన్నారు.

మత్సకారులకు 100 శాతం సబ్సిడీపై చేపల పంపిణీ చేశామని.. 5వేల కోట్ల రూపాయాలతో మత్స్య పరిశ్రమను అభివృద్ధి చేస్తున్నట్లు సీఎం తెలిపారు. రజకులకు, నాయీ బ్రాహ్మణులకు కూడా అవసరమైన ఆర్థిక సహాయన్ని అందిస్తామన్నారు. విశ్వ బ్రాహ్మణుల కుల వృత్తులను ప్రోత్సహించడానికి రూ.250 కోట్లతో కార్యక్రమాలు అమలు చేస్తామని సీఎం ప్రకటించారు. బీసీ ప్రజాప్రతినిధులంతా రెండు మూడు రోజులు సమావేశాలు నిర్వహించుకుని తమకు ఏం కావాలో నిర్ణయించుకున్న తర్వాత అసెంబ్లీలో చర్చించి అవసరమైన తీర్మానాలు, చట్టాలు, జీవోలు తేవాలని సీఎం నిర్ణయించారు.

21:11 - December 3, 2017

హైదరాబాద్ : ఓయూ మానేరు హాస్టల్ లో మురళీ అనే విద్యార్థి బలవన్మరణం చేసుకోవడానికి గల కారణం దొరికింది. అతని రూంలో సూసైడ్ నోట్ లభ్యమైంది. అందులో తాను పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే కారణంతో సూసైడ్ చేసుకుంటున్నట్లు లేఖలో ఉన్నట్లు తెలుస్తోంది. కాసేపటి క్రితం ప్రొ.కోదండరాం, జస్టిస్ చంద్రకుమార్ ఘటనా స్థలికి చేరుకున్నారు.
మెదక్ జిల్లాకు చెందిన మురళీ ఎమ్మెస్సీ ఫిజిక్స్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తోటి స్నేహితుడు ఆత్మహత్య చేసుకోవడంతో వర్సిటీ విద్యార్థులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం తరలించేందుకు సిద్ధమౌతున్న పోలీసులను విద్యార్థులు అడ్డుకున్నారు. పోలీసులే సూసైడ్ నోట్ ను తారు మారు చేసినట్లు విద్యార్థులు పేర్కొంటూ ఆందోళన చేయడంతో మానేరు హాస్టల్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. 

మానేరు హాస్టల్ కు కోదండరాం..జస్టిస్ చంద్రకుమార్..

హైదరాబాద్ : మానేరు హాస్టల్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మెదక్ జిల్లాకు చెందిన విద్యార్థి మురళీ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. పోలీసులే సూసైడ్ నోట్ ను తారుమారు చేశారని ఆరోపిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. కాసేపటి క్రితం ప్రొ. కోదండరాం, జస్టిస్ చంద్రకుమార్ లు మానేరు హాస్టల్ కు చేరుకున్నారు. 

20:43 - December 3, 2017

పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణం కేంద్రమే నిర్మాణం చేయాలని కాంగ్రెస్ ఎంపీ కేవీపీ పేర్కొన్నారు. ఆయన ఇటీవలే హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆర్తిక సమస్యలతో సతమతమౌతున్న అవసరం లేని పోలవరం భారాన్ని మోయాల్సినవసరం లేదన్నారు. కానీ రాష్ట్రమే నిర్మాణం చేయాలన్న ఏపీ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వెనుక మతలబేంటో తెలియడం లేదన్నారు. పోలవరం నిర్మాణానికి అన్ని అనుమతులూ తీసుకువచ్చింది దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డేనని ఆయన చెప్పారు. పోలవరం నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న వైఖరి..కేంద్రం స్పందన..ఇతర విషయాలపై తెలుసుకొనేందుకు టెన్ టివి ప్రయత్నించింది. అందులో భాగంగా ఆయనతో ఇన్ పుట్ ఎడిటర్ కృష్ణ సాయిరాం ముచ్చటించారు. పూర్తి విషయాలకు వీడియో క్లిక్ చేయండి. 

20:11 - December 3, 2017

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుకు ఉన్న మిత్రుల్లో చిత్తూరు టిడిపి ఎంపీ శివప్రసాద్ ఒకరు. దళితుల అంశంపై బాబుపై విమర్శలు గుప్పించారని గతంలో ఆయనపై పలు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం ఏ పార్టీలో చేరుతారనేది సస్పెన్స్ గా నిలిచింది. కానీ ఇప్పటికే వైసీపీ పార్టీ ముఖ్య నేతలతో శివప్రసాద్ పార్టీ మారడంపై చర్చలు జరిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ పార్టీ మారినా చిత్తూరు నుంచే శివప్రసాద్‌కు అవకాశం కల్పించే విధంగా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలపై తెలుసుకొనేందుకు శివప్రసాద్ తో టెన్ టివి చర్చించింది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

20:06 - December 3, 2017
19:52 - December 3, 2017

'శుభలేఖ సుధాకర్' కు ఆరోగ్యం బాగా లేదని.. ఆయన్ను కూడా ఆదుకోవాలని ఓ కాలర్ క్యారెక్టర్ నటుడు 'దిల్' రమేష్ కు సూచించారు. దీనిపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి పుకార్లు నమ్మవద్దని..సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు ఎన్నో వస్తున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎక్కువగా యూ ట్యూబ్ లో ఇలాంటి ఎన్నో అవాస్తమైన వీడియోలు ప్రసారం చేస్తున్నాయని, ఇలాంటి రావడం బాధాకరమన్నారు. తాను చనిపోలేదని..బాగా ఉన్నానని.. స్వయంగా ఆ వ్యక్తి మీడియాకు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. తాను వాకింగ్ చేస్తుంటే..అన్ని కోల్పోయి రోడ్డున పడ్డాడని..తనపై కూడా వార్తలు వస్తే అయ్యో..అలాంటిదేమి లేదని తాను వివరణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. మీడియా..ఇతర ఛానెల్స్..వారు పూర్తిగా వార్తలు తెలుసుకుని ప్రసారం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు 'దిల్' రమేష్ పేర్కొన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

19:29 - December 3, 2017

ఒక పద్ధతి లేనిది అంటూ ఉన్నది 'సినిమా'నేని క్యారెక్టర్ నటుడు 'దిల్' రమేష్ పేర్కొన్నారు. చదువు అవసరం లేదని..టాలెంట్ ఉన్నా టైం బాగుండాలని పేర్కొన్నారు. ‘దిల్' రమేష్ తో టెన్ టివి ముచ్చటించింది. ఈసందర్భంగా ఆయన పరిశ్రమకు ఎలా వచ్చారు ? వచ్చిన కాలంలో ఎదుర్కొన్న అనుభవాలు..ఇతరత్రా విషయాలు తెలియచేశారు.

విశ్వనాథ్ ఇచ్చిన కాంప్లిమెంట్ జీవితంలో ఎప్పటికీ మరిచిపోనని తెలిపారు. ప్రకాశం జిల్లా కందుకూరులో ఒక ఊరులో తాను జన్మించడం జరిగిందని, కేవలం నటించాలనే ఉద్ధేశ్యంతో అన్నీ వదిలేసి హైదరాబాద్ కు రావడం జరిగిందన్నారు. రూ. 1300 జీతంతో విజన్ కలర్ ల్యాబ్ లో మేనేజర్ గా పనిచేయడం జరిగిందన్నారు. ఎక్కడో తనకు ఆశావాదం ఉండేదని..ఏదైనా చేయాలనే సంకల్పం తనలో ఉండేదన్నారు. 'సీతారామరాజు' అనే చిత్రంలో తాను మొదటిసారిగా నటించానని అలా నటిస్తూ ఉన్నానని 'దిల్' సినిమా తనకు 49వ సినిమా అని..ప్రస్తుతం శ్రీకాంత్ హీరోగా వస్తున్న సినిమా తనకు 179వ సినిమా అని తెలిపారు. 16 సంవత్సరాల జర్నీలో ఎందుకు కష్టాలు పడుతున్నానని ఆలోచించలేదన్నారు. ఫేమ్ వస్తేనే డబ్బులు వస్తాయి..ఇది ఒక్క ఫిల్మ్ ఇండ్రస్ట్రీ ద్వారానేనని తెలిపారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

ఓయూ మానేరు హాస్టల్ వద్ద ఉద్రిక్తత...

 

హైదరాబాద్ : ఓయూ మానేరు హాస్టల్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇంకా బాత్ రూంలోనే విద్యార్థి మృతదేహం ఉంది. రూ. 50లక్షలు నష్టపరిహారం ప్రకటించాకే పోస్టుమార్టానికి తరలించాలని నిరుద్యోగ జేఏసీ డిమాండ్ చేస్తోంది. సీఎం నియోజకవర్గానికి చెందిన విద్యార్థి మురళీ ఆత్మహత్య చేసుకోవడం ప్రభుత్వానికి సిగ్గు చేటని తెలిపారు. నిరుద్యోగులు ఆత్మహత్యల బాట పట్టకముందే ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు ఒకేసారి విడుదల చేయాలని నిరుద్యోగ జేఏసీ ఛైర్మన్ మానవతా రాయ్ డిమాండ్ చేశారు. 

 

'రెడ్డీస్ ల్యాబ్ లో ఔషధ ప్రయోగం జరిగింది'...

కరీంనగర్ : 2008-2009 వరకు హైదరాబాద్ డా.రెడ్డీస్ ల్యాబ్ లో తనపై ఔషధ ప్రయోగాలు చేశారని దేవీ ప్రసాద్ పేర్కొన్నాడు. ప్రస్తుతం వరంగల్ ఎంజీఎంలో అతడికి చికిత్స అందిస్తున్నారు. 

బీసీల కోసం కొత్త పథకాలు రూపొందించాలి - కేసీఆర్...

హైదరాబాద్ : బీసీల అభివృద్ధి కోసం రాష్ట్ర పరిధిలో ఉన్న అన్ని అంశాలపై సానుకూల నిర్ణయానికి సిద్ధంగా ఉన్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను అమలు చేద్దామని, బీసీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సాహించడానికి టీఎస్ఐఐసీ ఇచ్చే భూముల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. బీసీల కోసం కొత్త పథకాలు రూపొందించాలని, ఇచ్చిన నివేదికనే అమలు చేస్తామన్నారు. 

బీసీలకు ఏం కావాలో నిర్ణయించాలి - కేసీఆర్...

హైదరాబాద్ : బీసీ ప్రజాప్రతినిధులు రెండు..మూడు రోజుల పాటు బీసీలకు ఏం కావాలో నిర్ణయించాలని వీటిపై అసెంబ్లీలో చర్చించి అవసరమైతే జీవోలు..చట్టాలు..జీవోలు తేవాలని కేసీఆర్ నిర్ణయించారు. 

ప్రధానిపై వత్తిడి తెస్తాం - కేసీఆర్..

హైదరాబాద్ : చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ల అమలు కోసం పార్లమెంట్ లో చట్టం తేవాలని కేంద్రాన్ని కోరుతామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలు చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు రావాలని కోరుతున్నాయని...ఈ విషయంలో అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానిపై వత్తిడి తెస్తామన్నారు. కేంద్రంలో బీసీ సంక్షేమ శాఖ ఏర్పాటు చేయాలని, పదోన్నతులల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని, బీసీల డిమాండ్లపై అసెంబ్లీలో ఒక రోజు మొత్తం పూర్తిస్థాయి చర్చ చేపట్టే విధంగా చూడాలని స్పీకర్ ను కేసీఆర్ కోరారు. 

బీసీ కులాల అభిప్రాయాలను సేకరిస్తామన్న ఆర్.కృష్ణయ్య...

హైదరాబాద్ : అన్ని పార్టీల బీసీ ప్రజా ప్రతినిధులతో సీఎం సమీక్షించడం చరిత్రలో ఎప్పుడూ జరగలేదని ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య తెలిపారు. సమగ్ర బీసీ డిక్లరేషన్ ఇవ్వాలని సీఎం కోరడం జరిగిందని, అన్ని బీసీ కులాల అభిప్రాయాలు సేకరించి నివేదిక ఇస్తామన్నారు. 

సోమవారం నుండి బీసీలపై చర్చలు - లక్ష్మణ్..

హైదరాబాద్ : బీసీల సంక్షేమంపై విస్తృతంగా చర్చించి నివేదిక ఇవ్వాలని సీఎం కోరడం జరిగిందని బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ పేర్కొన్నారు. రేపటి నుండి చర్చలు ప్రారంభించడం జరుగుతుందన్నారు. 

18:26 - December 3, 2017

గుంటూరు : ప్రపంచంలోనే అత్యున్నత సాంకేతికతతో క్యాన్సర్ రోగులకు చికిత్స అందిస్తున్నట్లు గుంటూ ఓమెగా ఆసుపత్రి ఎండీ నాగకిశోర్ పేర్కొన్నారు. నగరంలో 110 పడకల ఆసుపత్రిలో పెట్ స్కాన్, లీనియర్ యాక్సిలేటర్, డిజిటల్ మామోగ్రఫీ, ఎంఆర్ఐ పరికరాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. క్యాన్సర్ చికిత్సలో అన్ని విభాగాలను ఒక్కచోట చేర్చి సర్జికల్, మెడికల్ అంకాలజిస్టుల పర్యవేక్షణలో అత్తుమ శిక్షణ అందించడం జరుగుతోందని, క్యాన్సర్ చికత్సలో రెండో స్థానంలో ఓమెగా ఉందని ఆసుపత్రి సీఈవో శ్రీధర్ పేర్కొన్నారు. 

18:25 - December 3, 2017

చిత్తూరు : ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన తిరుపతిలో కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. పవిత్రమైన ఈ ఆలయంలో పందుల సంచరించడం చర్చానీయాంశమైంది. మాడవీధుల వద్ద పటిష్ట బందోబస్తు ఉన్నా పందుల గుంపు ఒకటి వచ్చింది. దీనితో అక్కడ భద్రత పర్యవేక్షిస్తున్న విజిలెన్స్ సిబ్బంది పందులను గదిమేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. కాటేజ్, అతిథి గృహాలకు సమీపంలో కనబడే పందులు మాడవీధుల్లో సంచరించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

బీసీ ప్రజాప్రతినిధులతో సీఎం సమీక్ష

హైదరాబాద్ : అన్ని పార్టీల బీసీ ప్రజాప్రతినిధులతో సీఎం సమీక్ష నిర్వహించారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ల అమలు కోసం పార్లమెంట్ లో చట్టం తేవాలని కేంద్రాన్ని కోరతామని సీఎం అన్నారు. రాష్ట్రంలో అన్ని పార్టీలు చట్టసభల్లో బీసీలకు  రిజర్వేషన్లు కావాలని కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. 

18:16 - December 3, 2017

కర్నూలు : సీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ అధ్యక్షుడు జగన్ విమర్శలు కొనసాగిస్తూనే ఉన్నాయి. ఆయన చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కొనసాగుతోంది. కర్నూలు జిల్లాలోని ఎర్రగుడిలో జరిగిన బహిరంగసభలో చంద్రబాబుపై పలు విమర్శలు గుప్పించారు. అబద్దాలతో బాబు పాలన సాగిస్తున్నారని, రాష్ట్ర వృద్ధి రేటుపై బాబు చెబుతున్నవన్నీ అబద్ధాలేనని కొట్టిపారేశారు. అమెరికా, యూకే, ప్రాన్స్, చైనాలో జీడీపీ మూడు నుండి ఆరు శాతం వరకు ఉంటే ఏపీ 12 శాతం వృద్ధి రేటు సాధించిందని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఒకవేళ బాబు చెప్పిందే నిజమైతే ప్రపంచంలో నెంబర్ వన్ స్థానంలో ఏపీ ఉండేదన్నారు. 

18:13 - December 3, 2017

విజయవాడ : చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారని, సోమ్ము చేసుకోవడానికే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారని మాజీ ఎంపీ ఉండవల్లి ఘాటు విమర్శలు చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రంతో సంబంధం లేకుండానే పోలవరం నిర్మాణం చేపట్టారని, పట్టిసీమ వద్దని చెప్పినా బాబు పట్టించుకోలేదన్నారు. ప్రాజెక్టు కోసం 17,500 క్యూబిక్ ఫీట్ల తవ్వింది దివంగత వైఎస్ హాయంలోనేనని తెలిపారు. కాపు రిజర్వేషన్లపై ఉండవల్లి స్పందించారు. మంజునాథ రిపోర్టు లేకుండానే అసెంబ్లీలో ప్రవేశ పెట్టడం..తీర్మానం చేయడం ఎంతవరకు కరెక్టని ప్రశ్నించారు. 

అనంతపురంలో ప్రవేశించిన జగన్ పాదయాత్ర

అనంతపురం : వైసీపీ నేత జగన్ చేస్తున్న పాదయాత్ర నేడు అనంతపురంలోకి ప్రవేశించింది. పాదయాత్ర కర్నూలు జిల్లాలో పూర్తి కాగానే అనంతలో ప్రారంభమైంది.

17:54 - December 3, 2017

వికలాంగులకు సమాజంలో ఎలాంటి భద్రత ఉంది ? వికలాంగుల విషయంలో ప్రభుత్వం ఎలాంటి చిత్తశుద్ధి ప్రదర్శిస్తోంది. ? వికలాంగుల డిమాండ్స్ ఏంటీ ? వారి సమస్యలు ఏంటీ ? తదితర విషయాలపై అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా టెన్ టివి ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ చర్చలో గోరింక నర్సింహ ( వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర అధ్యక్షులు), బండ జగన్ (తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

రెండవ రోజు ముగిసిన ఆట

ఢిల్లీ : భారత్, శ్రీలకం మధ్య జరుగుతున్న మూడవ టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్ లో 131/3 పరుగులు చేసింది. అంతకు ముందు భారత్ తొలి ఇన్నింగ్స్ ను  536 వద్ద డిక్లేర్డ్ చేసింది. 

17:45 - December 3, 2017

కరీంనగర్‌ : సీపీఐ జెండాలను తొలగించడం వివాదాస్పదమైంది. సీపీఐ చేపట్టిన పోరుబాట సభ సందర్భంగా ప్రధాన కూడళ్లలో సీపీఐ ఎర్రజెండాలను ఏర్పాటు చేశారు. అయితే నగర పాలక సిబ్బంది కమాన్‌ వద్ద ఏర్పాటు చేసిన జెండాలను తొలగించి ట్రాక్టర్‌లో వేయడంతో సీపీఐ నాయకులు ఆందోళనకు దిగారు. అనుమతి తీసుకున్నప్పటికీ జెండాలను ఎలా తొలగించారంటూ సీపీఐ కార్యకర్తలు ట్రాక్టర్‌ టైర్లలో గాలి తీసేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తొలగించిన జెండాలను ఏర్పాటు చేసేలా చేస్తామని తెలిపారు. అయితే టీఆర్ఎస్‌తో పాటు మిగితా పార్టీల జెండాలను నెలలు గడుస్తున్నా ఎందుకు తొలగించడంలేదంటూ సీపీఐ నాయకులు మండిపడంతో అధికారులు వెనక్కి తగ్గారు. 

17:43 - December 3, 2017

హైదరాబాద్ : గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో అక్రమాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. కాంట్రాక్టర్లు, కొందరు అవినీతి అధికారులు రూల్స్‌ను బ్రేక్‌ చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. 15ఏళ్లు నిండిన బల్దియా బండ్లను రోడ్డెక్కనివ్వమంటున్న అధికారులు... ప్రైవేట్‌ వ్యక్తులు ఎలాంటి వెహికిల్స్‌ నడిపించినా పట్టించుకోవడం లేదు. అగ్రిమెంట్‌ను తుంగలోతొక్కి పాత వాహనాలను రోడ్డు ఎక్కిస్తున్నారు. పనిచేయాల్సిన వాహనాలు పనిచేయకపోయినా ఎంచక్కా బిల్లులు మాత్రం పాసైపోతున్నాయి. జీహెచ్‌ఎంసీ చెత్త రవాణాలో కాంట్రాక్టర్లు, అధికారుల కాసులలీలపై 10టీవీ ప్రత్యేక కథనం..

జీహెచ్‌ఎంసీ దేశంలోనే పెద్ద కార్పొరేషన్ల వరసలో ఉన్న లోకల్‌బాడీ. కోటికిపైగా జనాభా ఉన్న సిటీలో ప్రతిరోజు 4వేల టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. ఈ చెత్తను నగరంలోని కాలనీలు, బస్తీలు, బల్క్‌ గార్బెజ్‌ పాయింట్ల నుంచి ట్రాన్స్‌ఫర్‌ కేంద్రాలకు, అక్కడి నుంచి జవహర్‌నగర్‌ డంపింగ్‌ కేంద్రానికి తరలించడానికి బల్దియాకు ప్రత్యేక రవాణా విభాగం పనిచేస్తుంది. ఇందుకోసం కోట్లాది రూపాయలు ఖర్చుచేస్తోంది బల్దియా. ఒకటి రెండేళ్ల క్రితం వరకు జీహెచ్‌ఎంసీనే చెత్త రవాణాను చేపట్టేది. ఇందుకోసం 773 వాహనాలు ఉండేవి. వాటి రిపేర్లు, డీజిల్‌ వంటి వ్యవహారాలను తమ పార్కింగ్‌ యార్డుల్లోనే చేసుకునేది బల్దియా. అయితే వాహనాల నిర్వహణలో పెద్దమొత్తంలో అక్రమాలు వెలుగు చూడడంతోపాటు కార్పొరేషన్‌ వాహనాలు పాతబడిపోవడంతో వాటిలో 290 వాహనాలను తొలగించారు.

తగ్గించిన వాహనాల స్థానంలో కొత్త వాహనాలను బల్దియా అధికారులు కొనుగోలు మాత్రం చేయలేదు. వాటి స్థానంలో అద్దె వాహనాలను సమకూర్చుకోవడం మొదలుపెట్టారు. తొలగించిన వాహనాల స్థౄనంలో 234 అద్దె వాహనాలను రోడ్డెక్కించారు. వీటిలో 82... 25 టన్నర్ల లారీలు,71 మినీ టిప్పర్లు , 30 డంపర్‌ ప్లెసర్లు, 29 జేసీబీలు, 15 బాబ్‌కాట్స్‌, ట్రాక్టర్లు, లోడర్లు వంటివి బల్దియా శానిటేషన్‌లో చేరిపోయాయి. వీటి నిర్వహణ కోసం ప్రతినెలా కోట్లాది రూపాయల అద్దెలు చెల్లిస్తోంది. అద్దె వాహనాల ఏర్పాటు... కొంతమంది అధికారులు, కాంట్రాక్టర్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. అగ్రిమెంట్‌ను బుట్టదాఖలు చేసిన ఈ గ్యాంగ్‌ .. తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తోంది. అధికారయంత్రాంగం మామూళ్ల మత్తులో జోగుతూ.... అద్దె వాహనాలకు ఇష్టానుసారంగా బిల్లులు చెల్లింపు చేస్తున్నారు. ఇమ్లీబన్‌ ట్రాన్స్‌ఫర్‌ కేంద్రంలో అద్దె వాహనాల వివరాలు ఎలా సేకరిస్తున్నారో చూడండి. కేవలం చివరి నాలుగు అంకెలు వేసి వదిలేస్తున్నారు. ఇది బల్దియా నిర్వహిస్తోన్న రికార్డు. దీని ద్వారానే బిల్లులు చెల్లిస్తారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

పాతవాహనాల స్థానంలో కొత్త వాహనాలు అద్దెకు ఏర్పాటు చేశామంటున్న అధికారులు.. ఎలాంటి వాహనాలు పనిచేస్తున్నాయి, వాటి కండిషన్‌ ఏంటి అన్నది మాత్రం పట్టించుకోవడం లేదు. జీహెచ్‌ఎంసీ తొలగించిన వాహనాల కంటే కండిషన్‌ మరీ లో ఉన్న వాహనాలతో చెత్త రవాణా చేస్తున్నారని సిబ్బంది చెబుతున్నారు. అద్దె వాహనాలు రోజు ఎంత చెంత తరలిస్తుందో కూడా లెక్కలు లేవు.

జేసీబీలు, అద్దె వాహనాలు పనిచేసినా, చేయకపోయినా పూర్తిస్థాయిలో బిల్లులు మాత్రం చెల్లిస్తున్నారు. రెండు వాహనాలకు బదులు ఒకదానితో పనిచేసినా బిల్లులు మాత్రం మూడింటికి ఇచ్చేస్తున్నారు. కాంట్రాక్టర్లు ఇచ్చే ముడుపులకు ఆశపడి కొందరు అధికారులు బల్దియా ఖజానాకు గండికొడుతున్నారు. అంతేకాదు...ట్రాన్స్‌పర్‌ కేంద్రాల నుంచి జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డుకు వెళ్లే దూరాన్ని ఎక్కువ చూపుతూ బిల్లులు నొక్కేస్తున్నారు. కిందిస్తాయి అధికారులు, సిబ్బంది అక్రమాలపై బల్దియా బాస్‌ దృష్టి సారించకపోతే ఖజానా గుళ్లవడం ఖాయం. ఇప్పటికైనా ట్రాన్స్‌పోర్టు విభాగంలో జరుగుఉతన్న అక్రమాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

17:40 - December 3, 2017

హైదరాబాద్ : రైతులకు మేలు చేసే విధంగా ప్రభుత్వం అనేక కొత్త మార్కెట్లను అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు మంత్రి హరీష్‌రావు. హైదరాబాద్ బోయినపల్లిలో వ్యవసాయ మార్కెటింగ్ శాఖలో ఈ-సేవలపై శిక్షణా తరగతులను హరీష్‌రావు ప్రారంభించారు. మార్కెటింగ్ శాఖ అధికారులు చక్కగా పనిచేస్తున్నారన్న మంత్రి హరీష్‌రావు.. టెక్నాలజీ రైతులకు అన్ని విధాల ఉపయోగపడేలా ఉండాలని సూచించారు. 

17:38 - December 3, 2017

హైదరాబాద్ : రాష్ట్రంలోని బీసీల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకెళ్తుందని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. అసెంబ్లీలోని కమిటీ హాల్‌లో అన్ని పార్టీలకు చెందిన బీసీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం కేసీఆర్ సమావేశం కొనసాగుతోంది. బలహీన వర్గాల కోసం ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కేసీఆర్ వివరించారు. బీసీల అభివృద్ధికి సంబంధించి.. ఆయా వర్గాల నుంచి చాలా డిమాండ్లు వస్తున్నాయన్నారు. బీసీల సంక్షేమం కోసం మరిన్ని కార్యక్రమాలు అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. బీసీ ప్రజాప్రతినిధులు రెండు రోజుల పాటు అన్ని విషయాలపై చర్చించి ఏకాభిప్రాయానికి రావాలని సూచించారు. ప్రజాప్రతినిధుల సూచనలకు అనుగుణంగా కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తామని కేసీఆర్ పేర్కొన్నారు.

17:24 - December 3, 2017

హైదరాబాద్ : ఓయూలో విషాదం చోటు చేసుకుంది. ఎమ్మెస్సీ రెండో సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇతని ఆత్మహత్యకు గల కారణాలు తెలియడం లేదు. కానీ టీఆర్టీలో జరుగుతున్న జాప్యం కారణంగానే మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడా ? అనేది తెలియాల్సి ఉంది.

మెదక్ జిల్లాకు చెందిన మురళీ ఎమ్మెస్సీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. గత మూడు నాలుగు సంవత్సరాలుగా కాంపిటేటివ్ పరీక్షలకు హాజరవుతున్నాడు. అందులో భాగంగా టీఆర్టీ పరీక్ష కూడా సిద్ధమౌతున్నాడు. కానీ టీఆర్టీ విషయంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మానేరు హాస్టల్ లో ఉంటున్న మురళీ బాత్ రూంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులు..ప్రజా సంఘాలు ఘటనా స్థలికి చేరుకున్నారు. పోలీసులు కూడా అక్కడకు చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

నీళ్లు..నిధులు..నియామకాలుతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి ఉద్యోగాల కల్పన లేకపోవడంతో నిరుద్యోగులు తీవ్ర నిరుత్సాహంలో ఉన్న సంగతి తెలిసిందే. తెలంగాణ ఉద్యమ సమయంలో ఓయూ విద్యార్థులు కీలక పాత్ర పోషించారు. అంతే గాకుండా పలువురు ప్రాణత్యాగం కూడా చేశారు. మురళీ బలవన్మరణం వెనుక కారణాలు తెలియాల్సి ఉంది. 

17:20 - December 3, 2017

ఉల్లి ధర సామాన్య ప్రజల్ని కన్నీరు పెట్టిస్తోంది..గతంలో ఎన్నడు లేని విధంగా ఉల్లి విపరితగా పెరుగుతోంది. ఉల్లి ధరలతో ఆసియా దేశాలు విలవిలాడుతున్నాయి. అతి పెద్ద ఉత్పత్తి దేశమైనా భారత్ ఉల్లిపై ఎగుమతిపై ఆంక్షలు విధించడంతో అంతర్జాతీయ మార్కెట్లో ఉల్లి ధర కొండెక్కుతుంది. బంగ్లాదేశ్, మలేషియాలో కిలో ఉల్లి ధర రూ.102 కు చేరుకుంది. ఇండియా విషయానికొస్తే కిలో ఉల్లి రూ.50 నుంచి రూ.70 పలుతుంది.

జేసీకి ఎమ్మెల్సీ సోము వీర్రాజు సవాల్

అనంతపురం : జేసీకి దమ్ముంటే రాయలసీమలో హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తి చేయాలని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సవాల్ చేశారు.

17:00 - December 3, 2017

ఓయూలో విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్ : ఓయూ మానేరు హాస్టల్ లో ఎమ్మెస్సీ మెదటి సంవత్సరం చదువుతున్న మురళి అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్ బాత్ రూంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మురళియ మెదక్ జిల్లా చెందినవాడిగా తెలుస్తోంది.

16:40 - December 3, 2017

పశ్చిమగోదావరి : స్వాతంత్ర్య సమరయోధురాలు, సీపీఎం సీనియర్ నాయకురాలు అన్నె అనసూయమ్మ అంతియాత్ర పూర్తయ్యింది. ఆమె స్వగృహం నుండి సీపీఎం కార్యాలయం వరకు అంతిమయాత్ర కొనసాగింది. సీపీఎం కార్యాలయంలో అనసూయమ్మ భౌతికకాయానికి ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, తదితరులు నివాళులర్పించారు. అనంతరం అనసూయమ్మ పార్థీవదేహాన్ని వైద్య విద్యార్థుల పరిశోధన కోసం అప్పగించారు. అనేక ఉద్యమాలను ముందుండి నడిపించిన మహిళా ఉద్యమ నాయకురాలిగా అనసూయమ్మ నిలిచారని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. 1952లో పార్టీ జిల్లా కమిటీకి ఎన్నికయ్యారని, ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారని తెలిపారు. జైలు జీవితం గడిపారని..అహర్నిశలు పేదల కోసం పనిచేశారని కొనియాడారు. అనసూయమ్మ కోరిక మేరకు ఆమె కళ్లను దానం చేయడం జరిగిందని ఆమె మనవడు తెలిపారు. 

16:40 - December 3, 2017

సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటిస్తున్న చిత్రం టైగర్ జిందా హై చిత్రంలోని రెండవ పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇటివల స్వాగ్ సే కరేంగే అనే పాటను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పాట ప్రేక్షకుల్లో చోచ్చుకుపోయింది. ఇంతలోనే చిత్ర యూనిట్ దిల్ దియానా అంటూ సాగే మరో సాంగ్ ను విడుదల చేసింది. ఈ పాట కూడా అందరి ఆకట్టుకుంటుంది. ఈ మూవీకి అలీ అబ్బాస్ జఫర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్ 22న పేక్షకుల ముందుకు రానుంది. సల్మాన్ ఖాన్ 2012 వచ్చిన ఏక్ థా టైగర్ సీక్వెల్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

16:36 - December 3, 2017

విశాఖపట్టణం : అధికారుల కళ్లు గప్పి తరలించాలని అనుకున్న గంజాయి ముఠా పాచిక పారలేదు. డీఆర్ఐ అధికారులు జరిపిన తనిఖీల్లో 600కేజీల గంజాయి పట్టుబడింది. పాడేరు నుండి వరంగల్ కు ఓ టాటా ఏసీ వాహనం వెళుతోంది. అధికారులకు తెలియకుండా ఉండేందుకు వాహనంపై కప్పు భాగంలో గంజాయి సంచులను ఉంచారు. నర్సీపట్నం వద్ద రాగానే డీఆర్ఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. వాహనంపై భాగంలో అనుమానం వచ్చి చూడగా గంజాయి సంచులు బయటపడ్డాయి. పట్టుబడిన 600 కేజీల గంజాయిని విలువ రూ. 60 లక్షలు ఉంటుందని..కానీ బహిరంగ మార్కెట్ లో కోట్ల రూపాయలు విలువ చేస్తుందని తెలుస్తోంది. డ్రైవర్ ను అరెస్టు చేసి వాహనాన్ని సీజ్ చేశారు.

 

16:32 - December 3, 2017

ఉద్రిక్తతంగా మారిన సీపీఐ పోరుబాట

కరీంనగర్ : జిల్లాకేంద్రంలోని సర్కార్ గౌండ్ లో సీపీఐ పోరుబాట బహిరంగ సభలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీపీఐ కార్యకర్తలు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కార్యకర్తలు పోలీసులు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తతంగా మారడంతో సీపీఐ నేతలు పోలీసులను బయటకు పంపించారు. 

16:28 - December 3, 2017

ఢిల్లీ : స్థానిక ఫీరోజ్ షా కోట్ల మైదానంలో భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న మూడవ టెస్టులో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. శ్రీలంక ఆటగాళ్లు గాల్లో కాలుష్యం ఉందని ఆటకు పదే పదే అంతరాయాన్ని కల్గించారు. దీంతో ఈ పరిణామలతో ఆగ్రహించిన కెప్టెన్ కోహ్లీ జట్టు స్కోరు 536/7 వద్ద డిక్లేర్ చేశాడు. అప్పటికి క్రిజ్ లో వృద్ధిమాన్ సహా, రవిచంద్రన్ అశ్విన్ ఉన్నారు. 

16:27 - December 3, 2017

హైదరాబాద్ : కుల భోజనాలు వ్యతిరేకిస్తూ ఇందిరాపార్కులో 'టీ మాస్' జన వన భోజనాలు చేపట్టింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపట్టింది. ఇందిరాపార్కులో చేపట్టిన ఈ కార్యక్రమంలో కుటుంబసమేతంగా పలువురు హాజరయ్యారు. రాఘవులు, తమ్మినేని, టి.టిడిపి నేత ఎల్ .రమణ, విమలక్క, గద్దర్, జాన్ వెస్లీ, మాదాల రవి తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టెన్ టివి పలువురు నేతలతో మాట్లాడింది. ప్రభుత్వ..ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం సాగిస్తామని టీ మాస్ నేతలు పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని విమలక్క పేర్కొన్నారు. పూలే..అంబేద్కర్ వర్ధంతుల సందర్భంగా టీ మాస్ జన వన భోజనాలు కార్యక్రమాలు నిర్వహిస్తోందని జాన్ వెస్లీ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కులాలకతీతంగా జనభోజనాలు నిర్వహిస్తున్నట్లు, కులాంతర వివాహాలు చేసుకున్న వారికి సన్మానం నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 200 కేంద్రాల్లో జన భోజనాలు నిర్వహించడం జరుగుతోందని జాన్ వెస్లీ పేర్కొన్నారు. కులాలకు వ్యతిరేకంగా..కులాలు అన్నీ సమానమంటూ టీ మాస్ తీసుకున్న జన భోజనాలు గొప్ప కార్యక్రమమని సినీ నటుడు మాదాల రవి కొనియాడారు. సామాజిక న్యాయం కోసం పోరాడుతున్న టీ మాస్ కు అభినందనలు తెలియచేస్తున్నట్లు పేర్కొన్నారు. 

విశాఖలో గంజాయి కలకలం

విశాఖ : జిల్లా నర్సీపట్నం వద్ద గంజాయి పట్టుబడింది. గంజాయిని వ్యానులో అక్రమంగా తరలిస్తుండగా 600కిలోల గంజాయి డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. 

16:16 - December 3, 2017

మనం తిన్నా ఆహారం అధికంగా ఉండే క్యాలరీలు కొవ్వు రూపంలో నిల్వ ఉంటాయి. ఇలా మేలగా పొట్ట పెరగడం ఆ తర్వాత మనిషి లవుగా మారుతారు. దీనికి కారణం కొంత మంది తిన్నా తర్వాత వెంటనే నిద్రలోకి వెళ్తారు. ఇలా చేయడం వల్ల తిన్నా ఆహారం జీర్ణం కాకుండా పొట్టరావడం అనేది జరుగుతుంది. అంతేకాక మనం ఎంత ఆహారం తిన్నామో దానికి తగ్గట్లుగా ఫీజికల్ వర్క్ చేయాలి. నడవడం కాని, వ్యాయమాలు చేయడం కాని చేయాలి. పొట్టు తగ్గలంటే ముందుగా మనం తీసుకునే ఆహారంలో నియామలు పాటించాలి. చిప్స్, వేపుళ్లు, శీతలపానీయాలు తగ్గించాలి. రాత్రి అల్పహారం తీసుకుంటే త్వరగా జీర్ణమౌతుంది. అపార్ట్ మెంట్లల్లో ఉన్నావారు లిప్ట్ లో మెట్ల ద్వారా నడిస్తే కాస్త శరీరానికి పని కల్పించినవారమౌతాం. రోజుకు కనీసం 6నుంచి 8గంటలు నిద్రపోవాలి.  

16:03 - December 3, 2017

మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం సైరా. ఈ చిత్రాన్ని ఆయన కుమారుడు రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి సంగీత దర్శకుడు ఎఆర్ రెహమన్ తప్పుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ చిత్రానికి సంగీతం ఎవరు అందిస్తారని మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మూవీకి థమన్ ని సంగీత దర్శకుడిగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.

మేడ్చల్ లో గంజాయి పట్టివేత

మేడ్చల్ : జిల్లా ఘట్కేసర్ వద్ద 300 కిలోల గంజాయి పట్టుబడింది. పట్టుబడిన గంజాయి విలువ రూ.35 లక్షలు ఉంటుందని అంచనా. ఎక్సైజ్ పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. 

అన్నె అనసూయమ్మ అంతిమయాత్ర...

పశ్చిమగోదావరి : ఏలూరులో సీపీఎం సీనియర్ నాయకురాలు అన్నె అనసూయమ్మ అంతియాత్ర పూర్తయ్యింది. సీపీఎం కార్యాలయంలో అనసూయమ్మ భౌతికకాయానికి ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు నివాళురల్పించారు. ఈ సందర్భంగా అనసూయమ్మ కళ్లను కుటుంబసభ్యులు దానం చేశారు. 

15:47 - December 3, 2017

'బిచ్చగాడు' సినిమాతో తెలుగు నాట సంచలన విజయం సాధించిన 'విజయ్ ఆంటోని' అనంతరం ఇతర సినిమాలు విడుదలైనా అంతగా ఆకట్టుకోలేకపోయాడు. దీనితో మరోసారి తనకు స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టిన సెంటిమెంట్ నే విజయ్ అంటోని అమ్ముకున్నాడు. ‘ఇంద్రసేన' పేరిట ప్రేక్షకుల ముందుకు ఇటీవలే వచ్చాడు. ఈ సినిమా మంచి టాక్ నే సంపాదించుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ తో టెన్ టివి ముచ్చటించింది. మరి వారు ఎలాంటి విశేషాలు తెలియచేశారు. కాలర్స్ ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారు ? తదితర విషయాల కోసం వీడియో క్లిక్ చేయండి.విజయ్ ఆంటోని, డయానా చంపికా, మహిమా, జ్యువెల్ మేరి, రాధా రవిలు నటించగా చిత్రానికి సంగీతం విజయ్ ఆంటోని..దర్శకత్వం జి. శ్రీనివాసన్..,నిర్మాత రాధికా శరత్ కుమార్, ఫాతిమా విజయ్ ఆంటోనిలు వ్యవహరించారు. 

15:43 - December 3, 2017

ఖమ్మం : తెలంగాణ గొర్రెల..మేకల పెంపకం దార్ల సంఘం రెండో మహాసభలో పాల్గొనడానికి వచ్చిన తనను వెళ్లనీయకుండా ప్రభుత్వం..పోలీసులు అడ్డు పడడం అప్రజాస్వాకమని టీ మాస్ నేత, ప్రొ. కంచ ఐలయ్య పేర్కొన్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సభలో పాల్గొనడానికి వచ్చిన కంచ ఐలయ్యను పోలీసులు నిర్భందించారు. వెంటనే హైదరాబాద్ కు వెళ్లిపోవాలని పోలీసులు ఆదేశించారు. ఈ సందర్భంగా కంచ ఐలయ్యతో టెన్ టివి ముచ్చటించింది. గొల్ల కురుమల జీవితాలు..వారి సమస్యలపై అధ్యయనం చేయడానికి వచ్చిన తనను నిర్భందించడం సబబు కాదన్నారు. తాను ఇల్లీగల్ వ్యక్తిని కాదని..తెలంగాణ ఓటర్ ని..భారతదేశ పౌరుడని పేర్కొన్నారు. 

15:37 - December 3, 2017

ఖమ్మం: తెలంగాణ గొర్రెల..మేకల పెంపకం దార్ల సంఘం రెండో మహాసభల్లో పాల్గొనడానికి వచ్చిన టీమాస్ నేత, ప్రొ.కంచ ఐలయ్యను పోలీసులు అరెస్టు చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. సీపీఎం కార్యాలయంలో ఉన్న ఆయన్ను పోలీసులు ముందస్తుగానే అరెస్టు చేశారు. ఆయన్ను అరెస్టు చేయవద్దంటూ పోలీసులకు కార్యకర్తలు అడ్డు తగిలారు. పోలీసులకు..కంచ ఐలయ్య వర్గీయుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఒక్కసారిగా పరిస్థితి మొత్తం ఉద్రిక్తంగా మారింది. పోలీసుల జులుం నశించాలని..ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి....

15:27 - December 3, 2017

విజయవాడ : బీసీలకు కేటాయించిన రిజర్వేషన్ లను కాపులకు వర్తింప చేయడానికి వీల్లేదని బీసీ సంఘం నేతలు స్పస్టం చేస్తున్నారు. కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. దీనితో ఆదివారం విజయవాడలోని లెనిన్ సెంటర్ వద్ద ఆం.ప్ర. బి.సి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బీసీలకు సమస్యలకు ఎదురవుతుంటే కాపులను బీసీల్లో చేర్చుస్తూ మరింత సమస్యల సుడిగుండంలో నెట్టారని ప్రభుత్వానికి తగదని, వెంటనే దీనిని ఆపకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. 

15:21 - December 3, 2017

హైదరాబాద్ : బీసీ సాధికారితపై ప్రత్యేక దృష్టి సారించిన సీఎం కేసీఆర్ బీసీ ప్రజాప్రతినిధులతో ఆదివారం భేటీ అయ్యారు. ఇప్పటికే ఈ అంశంపై ఆయన ఓ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ కమిటీ హాల్ లో జరుగుతున్న ఈ సమావేశం ఇంకా కొనసాగుతోంది. మరో రెండు రోజుల పాటు ఈ సమావేశం కొనసాగనుందని తెలుస్తోంది. ఈ సమావేశాల్లో సభ్యులు చర్చించి తనకు నివేదిక ఇవ్వాలని, సభ్యులు ఎలాంటి సూచలను ఇచ్చినా ప్రభుత్వం అమలు చేస్తుందని కేసీఆర్ సూచించారు. ఈ సమావేశానికి శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, పలువురు మంత్రులు, అన్ని పార్టీలకు చెందిన బీసీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సమావేశం సందర్భంగా బీసీలకు సీఎం మరిన్ని వరాలు ప్రకటించే అవకాశం ఉంది. 

15:17 - December 3, 2017

వరంగల్ : కరీంగనర్ జిల్లా హుజురాబాద్‌ నియోజకవర్గంలో ఔషధ ప్రయోగాలు వికటించాయి. బెంగళూకు చెందిన అపాటెక్స్ ఫార్మా నిర్వహించిన క్లినికల్‌ ట్రయల్స్‌తో నాగంపేటకు చెందిన నాగరాజు ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరు అశోక్‌, సురేశ్‌ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. అశోక్‌ మతిస్థిమితం కోల్పోగా... సురేశ్‌ వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందతుఉన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం...

బాబుపై వైసీపీ ఎంపీల ఫైర్...

నెల్లూరు : సీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీలు ఫైర్ అయ్యారు. 7వ తేదీన పోలవరం సందర్శిస్తామని, పోలవరంపై కేంద్రంపై నిందలు వేసి సీఎం తప్పించుకుంటున్నారని మేకపాటి, వైవీ, వర ప్రసాద్ లు పేర్కొన్నారు. పోలవరం విషయాన్ని పక్కదారి పట్టించేందుకు కాపు రిజర్వేషన్లను తెరమీదకు తీసుకొచ్చారని తెలిపారు. 

కంచ ఐలయ్య అరెస్టును నిరసిస్తూ ఆందోళనలు...

ఖమ్మం : టీ మాస్ నేత కంచ ఐలయ్యను పోలీసులు అరెస్టు చేశారు. సీపీఎం కార్యాలయం నుండి గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం బహిరంగసభకు వెళుతుండగా బలవంతంగా ఆయన్ను అరెస్టు చేశారు. అరెస్టును నిరసిస్తూ కార్యకర్తలు పోలీసుల వాహనాలు అడ్డు పడ్డారు. పోలీసుల జులుం నశించాలంటూ నినాదాలు చేశారు. 

14:18 - December 3, 2017

హైదరాబాద్ : జన భోజనాలతో జన తెలంగాణకు మార్గం సుగమం చేయాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు పిలుపునిచ్చారు. 'మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్లాలి' అన్నారు. అప్పుడే భారతదేశం మన దేశమని, తెలంగాణ మన తెలంగాణ అని ముందుకు పోతుందని తెలిపారు. ఇందిరాపార్కులో టీమాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జన భోజనాలు కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. ఎవరిని పూజించాలో, ఎవరిని పూజించకూడదో ఎవరో శాసిస్తే అది సమాజం అనిపించుకోదన్నారు. ఎవరిని వివాహం చేసుకోవాలో..ఎవరిని వివాహం చేసుకోకూడదో ఎవరో చెప్తే మానవత్వం అనిపించుకోదన్నారు. కులాంతర, మతాంతర వివాహాలు చేసుకుంటే కాపురాలు చేయించబోమని.. అవసరమైతే ప్రాణాలు తీస్తామంటే అది మంచి సమాజం అనిపించుకోలేదన్నారు. పద్మావతి సినిమా ఆడించ కూడదని దేశవ్యాప్తంగా కొంతమంది ఆందోళనలు చేస్తున్నారని చెప్పారు. సినిమా ఎలా తీయాలో..ఎలా తీయొద్దనేది తీసే వారి ఇష్టమన్నారు. చూడాలో లేదో మనం నిర్ణయించుకోవాలన్నారు. చూడాలని మనల్ని ఎవరూ బలవంతం పెట్టరని పేర్కొన్నారు. 'సినిమాలు ఎలా తీయాలో నీవే చెప్పి.. నీకు నచ్చని సినిమా తీస్తే థియేటర్లను ధ్వంసం చేస్తామనడం ప్రజాస్వామ్య సమాజం అవ్వదని' చెప్పారు. ఏ కులం, మతం వారైన సమాజంలో స్వేచ్ఛగా బతికే వాతారణానికి సృష్టిస్తున్నామా లేదా అని మనం ఆలోచించుకోవాలన్నారు. అలా చేయకపోతే మనం మానవులం కాదని.. మనది మానవ సమాజం అనిపించుకోదన్నారు. అటువంటి స్ఫూర్తితోటి టీమాస్ పని చేస్తుందన్నారు. అందుకోసం అందరం కలిసి రావాలన్నారు. బంగారు తెలంగాణ కావాలంటే మానవులు కూడా బంగారం మారాలన్నారు. 

బీసీ సంఘాలతో కొనసాగుతున్న సీఎం భేటీ

హైదరాబాద్ : బీసీ సంఘాల నాయకులతో, ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ భేటీ కొనసాగుతోంది. ఈ సమావేశం మరో రెండు గంటలపాటు కొనసాగనుంది. సభ్యులు చర్చించి తనకు నివేదిక ఇవ్వాలని సీఎం కేసీఆర్ వారిని కోరారు. 

కంచె ఐలయ్య అరెస్ట్

ఖమ్మం : జిల్లాలో గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం మహాసభలో పాల్గొనేందుకు వచ్చిన కంచె ఐలయ్యను పోలీసులు అరెస్టు చేశారు. ఐలయ్య ఉంటే సభకు అనుమతి ఇవ్వమంటు పోలీసులు అడ్డుతగులుతున్నారు. 

13:53 - December 3, 2017

కర్నూలు : నగరంలో రోడ్డు ప్రమాదంలో ఒకరు చనిపోయారు. డీసీఎం వ్యాన్ ఆటోను ఢీకొనగా.. ఒకరి మృతి చెందగా....నలుగురికి గాయాలయ్యాయి. ఆటోలో ఉన్న ఐదుగురు ఒకే కుటుంబానికి చెందిన వారిగా  గుర్తించారు. ఉదయం కూరగాయలు కొనేందుకు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. 

13:50 - December 3, 2017

కరీంనగర్‌ : ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్‌ నియోజకవర్గంలో ఔషధ కంపెనీల ఆడగాలు సృతిమించిపోయాయి. పేదల అమాయకత్వాన్ని ఆసరాగా  చేసుకుని లోటస్‌, అపాటెక్స్‌ ఫార్మా కంపెనీలు  నిర్వహించిన క్లినికల్‌ ట్రయల్స్‌ వికటించాయి. ఈ ఔషధ ప్రయోగాల్లో నాగంపేటకు చెందిన నాగరాజు ప్రాణాలు కోల్పోయాడు. సురేశ్‌ ఆస్పత్రిపాలయ్యాడు. అశోక్‌ మతిస్థిమితం కోల్పోయాడు. క్లినికల్‌ ట్రయల్స్‌తో మృతి చెందిన నాగరాజు కుటుంబ వీధినపడింది. తమ కుటుంబానికి దిక్కు లేకుండా పోయిందని నాగరాజు కుటుంబం కన్నీరు మున్నీరు అవుతోంది. 
 

13:47 - December 3, 2017

కరీంనగర్ : హుజురాబాద్‌లో క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించిన ఔషధ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ నేత పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. ఔషధ ప్రయోగాలు వికటించడంతో ప్రాణాలు కోల్పోయిన నాగంపేటకు చెందిన నాగరాజు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామంటున్న పొన్నం ప్రభాకర్ తో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. లేకపోతే ఉద్యమం తప్పదన్నారు. ఇలాంటి ఫార్మా కంపెనీలను మూసివేయాలన్నారు. ప్రభుత్వం తనకు పట్టనట్లుగా వ్యవహరిస్తోందని విమర్శించారు. సీఎం, మంత్రులు ప్రభుత్వంలో ఉన్నారా.. లేదా అని నిలదీశారు. ప్రభుత్వం ఉందా.. లేదా..అని ప్రశ్నించారు. ప్రభుత్వంలో నిర్లిప్తత నెలకొని ఉందన్నారు. 

 

13:43 - December 3, 2017

ఖమ్మం : నేడు ఖమ్మంలో తెలంగాణా గొర్రెల, మేకల పెంపకందారుల సంఘం మహాసభ జరగనుంది. మహాసభలో పాల్గొనేందుకు కంచె ఐలయ్య ఖమ్మం వచ్చారు. అయితే ఐలయ్య వస్తే.. సభకు అనుమతి ఇవ్వబోమని పోలీసులు స్పష్టం చేశారు. సిపిఎం కార్యాలయం నుంచి ర్యాలీకి కూడా అనుమతి నిరాకరించారు. ఐలయ్యను అరెస్టు చేసేందుకు సిపిఎం కార్యాలయానికి పోలీసులు రావడంతో.. ఉద్రిక్తత తలెత్తింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

మన భోజనాలు

హైదరాబాద్ : ఇందిరా పార్క్ లో జరుగుతున్న మన భోజన కార్యక్రమానికి సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హాజరైయ్యారు. పలు సామాజిక, ప్రజాసంఘాల నేతలు కూడా హాజరైయ్యారు. 

13:38 - December 3, 2017

ఖమ్మం : తెలంగాణ గొర్రెలు మేకల పెంపకందారుల సంఘం 2వ రాష్ట్ర మహాసభలు నేడు ఖమ్మంలో ప్రారంభం కానున్నాయి. నగరంలోని పటేల్‌ స్టేడియం నుండి పెవిలియన్ గ్రౌండ్‌ వరకు భారీ ప్రదర్శన జరగనుంది. ఈ బహిరంగ సభలో ప్రొఫెసర్‌ కంచె ఐలయ్య పాల్గోనున్నారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ మహాసభలపై మరింత సమాచారం వీడియాలో చూద్దాం...

 

ఉత్తమ్ తో డీసీసీలు, ముఖ్య నాయకుల సమావేశం

హైదరాబాద్ : గాంధీనగర్ టీపీసీసీ ఛీప్ ఉత్తమ్ అధ్యక్షతన డీసీసీలు, ముఖ్య నాయకుల సమావేశం నిర్వహిస్తున్నారు. బూత్ లెవెల్ లో సోషల్ మీడియా కో ఆర్డినేటర్స్ నియమాకం, రుణమాఫీ, ఓటర్ల నమోదు, భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నట్టు సమాచారం. 

13:07 - December 3, 2017

హైదరాబాద్ : అసెంబ్లీ కమిటీ హాల్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్... బీసీ ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, పలువురు మంత్రులు, అన్ని పార్టీలకు చెందిన బీసీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సమావేశం సందర్భంగా బీసీలకు సీఎం మరిన్ని వరాలు ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అమలవుతున్న పథకాలపై కూడా సీఎం సమీక్షించనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

బీసీ సంఘాలతో సీఎం కేసీఆర్ భేటీ

హైదరాబాద్ : బీసీ సంఘాలతో సీఎం కేఆర్ సమావేశమయ్యారు. ఈ భేటీలో వారు బీసీ సంక్షేమం, అభివృద్ధి పై చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశానికి బీజేపీ నేత, మాజీ మంత్రి దత్తాత్రేయ హాజరైయ్యారు. 

12:51 - December 3, 2017

విశాఖ : విశాఖ ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్‌ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన వైజాగ్‌ ఫెస్టివల్‌ సందర్శకులను ఆకట్టుకుంటోంది. విజ్ఞానం, వినోదం, శాస్త్రీయతను ఒకే గొడుగు కిందికు తీసుకొచ్చి ఈ ఫెస్టివల్‌ నిర్వహిస్తున్నారు. సైన్స్‌ ఎగ్జిబిషన్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 
వైజాగ్‌ ఫెస్టివల్‌ కు ప్రజల నుంచి మంచి స్పందన 
వైజాగ్‌ ఫెస్టివల్‌ కు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. సందర్శకుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. పది రోజుల పాటు జరిగే ఈ ఫెస్టివల్‌లో సైన్స్‌ ఎగ్జిబిషన్‌, పుస్తక ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సైన్స్‌ ఎగ్జిబిషన్‌లో విద్యార్థులు పలు ప్రాజెక్టులు ఏర్పాటు చేశారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం పేరుతో నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనలో హైడ్రాలిక్‌ జాక్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. శరీరధర్మశాస్త్రం , బాడీ మాస్‌ ఇండెక్స్‌ ప్రదర్శనలను ప్రజలు ఎక్కువగా చూస్తున్నారు. ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, గుండె పనితీరును తెలిపే ప్రదర్శనాంశాలు  కూడా ప్రజలను ఆకట్టుకొంటున్నాయి. ఇలాంటి ప్రదర్శనలను  ప్రభుత్వం ప్రోత్సాహం కూడా  అవసరమని  సూచిస్తున్నారు. తొమ్మిది విభాగాల్లో నిర్వహిస్తున్న వైజాగ్‌ ఫెస్ట్‌లో పుస్తక ప్రదర్శన  ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. చరిత్ర, సంస్కృతి, సాహిత్యం, సైన్స్‌ పుస్తకాలను ప్రజలు ఎక్కువగా కొంటున్నారు. పుస్తకప్రియులకు ఈ ప్రదర్శన కొత్త అనుభూతినిస్తోంది. 
వైజాగ్‌ ఫెస్టివల్‌లో సాంస్కృతిక ప్రదర్శనలు 
వైజాగ్‌ ఫెస్టివల్‌లో కళాకారులు, విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు సందర్శకులను ఆకట్టుకొంటున్నాయి. అల్లు రామలింగయ్య ప్రాంగణంలో జరుగుతున్న నృత్య ప్రదర్శనలు అలరిస్తున్నాయి. సమకాలీన ప్రజా సమస్యలపై ప్రజానాట్య మండలి కళాకారుల గేయ ప్రదర్శనలు, నృత్యరూపకాలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. విజ్ఞానాన్ని పంచే వేదికగా ఉందంటూ... వైజాగ్‌ ఫెస్ట్‌ నిర్వాహకులను ప్రజలు అభినందిస్తున్నారు.  
 

హైదరాబాద్ లో దారుణం

హైదరాబాద్ : ఎస్ఆర్ నగర్ లో దారుణం చోటుచేసుకుంది. ఎస్ఆర్ నగర పరిధిలోని వెస్ట్ శ్రీనివాస్ నగర్ లో ఓ కర్కశ తల్లి వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని కన్న కూతురిని చిత్రహింసలకు గురి చేస్తోంది.  నాలుగేళ్ల కూతరిని తల్లి, మారు దండ్రి కలిసి పెనంపై కూర్చోబెడ్డంతో బాలికకు తీవ్ర గాయలయ్యాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందిచారు. 

12:47 - December 3, 2017

హైదరాబాద్ : అమ్మతనం మంటగలిసింది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తోందని కసాయి తల్లి కుమార్తెను చిత్రహింసలు పెట్టింది. అభం శుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిని కన్నతల్లే చిత్రహింసలు పెట్టిన ఘటన హైదరాబాద్ ఎస్సార్ నగర్‌లో వెలుగుచూసింది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తోందని ప్రియుడితో కలిసి కుమార్తెను వేడి పెనంపై కూర్చోపెట్టడంతో చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. 
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

12:41 - December 3, 2017

హైదరాబాద్ : అమీర్‌పేట్‌ మెట్రో స్టేషన్‌లో బ్యాగ్‌ కలకలం సృష్టించింది. బ్యాగ్‌లో బాంబ్‌ ఉందని అనుమానించిన పోలీసులు బాంబ్‌ స్వ్కాడ్‌తో తనిఖీలు చేపట్టారు. బ్యాగ్‌లో ఏమీలేదని తేలడంతో పోలీసులు, రైల్వే సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. బ్యాగ్‌ను... మెట్రో స్టేషన్‌లో పని చేస్తున్న సెక్యూరిటీ గార్డుదిగా గుర్తించారు. 

 

12:37 - December 3, 2017

విజయనగరం : జిల్లాలోని విషాదం నెలకొంది. విషతుల్యమైన బావి నీళ్లు తాగడంతో ఇద్దరు రైతులు మృతి చెందారు. గుర్ల మండలం కెల్ల గ్రామంలో పదిమంది రైతులు పంట పోలాల్లో వరి చేను ఊడుస్తున్నారు. దాహం వేయడంతో పక్కనే తోటలో క్రిమి సంహారక మందులు వాడి వదిలేసిన డబ్బాతో సమీప బావిలో నీళ్లు తెచ్చి త్రాగారు. దీంతో పది మంది రైతులు అస్వస్తతకు గురయ్యారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇద్దరు రైతులు మృతి చెందారు. మరో ఎనిమిది మంది రైతులు చికిత్స పొందుతున్నారు. విషతుల్యమైన బావి నీళ్లు తాగడం వల్లనే ఘటన జరిగిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

మహబూబాబాద్ లో ఉద్రిక్తత

మహబూబాబాద్ : జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. ఎస్టీ రిజర్వేసన్లపై అంబాడీలు, ఆదివాసీలు పోటాపోటీ సభలు నిర్వహించడానికి సిద్దమైయ్యారు. పోలీసులు బహిరంగ సభలకు పోలీసులు అనుమతిచ్చలేదు. అక్కడ భారీగా పోలీసుల మోహరించారు. 144 సెక్షన్ విధించారు. 

12:16 - December 3, 2017
12:15 - December 3, 2017

విజయవాడ : పేద, మధ్యతరగతి, అనాథ పిల్లలను ఆదుకునేందుకు విజయవాడలో మేరీ స్టెల్లా ఉమెన్స్‌ కాలేజ్‌లో సూపర్ మోడల్ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థినులు ర్యాంప్‌వాక్‌తో అదరగొట్టారు. సాంస్కృతిక కార్యక్రమాలతో ఉర్రూతలూగించి వివిధ పోటీల్లో ఉత్సాహంగా గడిపారు. ఈ ఈవెంట్ల ద్వారా వచ్చే నగదును పేద పిల్లల కోసం ఖర్చు చేస్తామని నిర్వాహకులు తెలిపారు. 

 

ఈ నెల 27న వైసీపీ పోలవరం బస్సుయాత్ర

గుంటూరు : ఈనెల 7న పోరలవరానికి వైసీపీ నేతలు బస్సు యాత్ర చేయనున్నారు. జగన్ ఆదేశాల మేరకు పోలవరం ప్రాజెక్టును వైసీపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు సందర్శించనున్నారు. 

12:07 - December 3, 2017

ప.గో : రోటరీ క్లబ్‌ ఆఫ్‌ ఏలూరు ఆధ్వర్యంలో ఎయిడ్స్‌ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎయిడ్స్ బారిన పడిన పిల్లలకు సహాయం చేయడానికి ఏలూరు ఎంపీ మాగంటి బాబు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి, రోటరీ క్లబ్‌ ఎలైట్‌ ప్రసిడెంట్‌ కొట్టు మనోజ్‌లు కలిసి 5కె రన్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు భారీ ఎత్తున పాల్గొన్నారు. డిసెంబర్‌ 1 ఎయిడ్స్‌ డే సందర్భంగా ఎయిడ్స్‌ పై అవగాహన కల్పించి భవిష్యత్‌లో దీని బారిన పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ర్యాలీ నిర్వహించినట్లు నిర్వహకులు తెలిపారు.
మాగంటి బాబు, ఎమ్మెల్యే బడేటి బుజ్జి డాన్స్‌ 
ఏలూరు ఎంపీ మాగంటి బాబు, ఎమ్మెల్యే బడేటి బుజ్జి డాన్స్‌ చేశారు. రోటరీ క్లబ్‌ ఆఫ్‌ ఎలూరు ఎలైట్‌... ఎయిడ్స్‌పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో వీరిద్దరు డాన్స్‌వేసి అలరించారు. అలాగే తీన్మార్‌  డప్పు మోగించి అందర్నీ ఆకట్టుకొన్నారు.

 

11:59 - December 3, 2017

సంగారెడ్డి : జిల్లాలోని పుల్కల్‌ మండలం రాయిపాడ్‌లో జరిగిన అంతర్జాతీయ ఫార్మా కల్చర్‌ సదస్సు ముగిసింది. 72 దేశాలకు చెందిన 750 మంది ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారు. ముగింపు కార్యక్రమానికి తెలంగాణ ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి, ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం  నారాయణ తదితరులు హాజరయ్యారు. విదేశీ ప్రతినిధులు స్థానికులతో మమేకమయ్యారు. ఫార్మా సదస్సు ముగింపు సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. 

11:57 - December 3, 2017

విజయనగరం : శివారు కేఎల్‌ పురంలో విద్యార్థిని అశ్విని అనుమాస్పద మృతి మిస్టరీని పోలీసులు చేధించారు. తీవ్రంగా కాలిన గాయాలతో ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయిన అశ్విని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. సీతంపేటలో బీటెక్‌ చదివిన అశ్విని ఉద్యోగ ప్రయత్నంలో విఫలమవడంతో జీవితంపై  విరక్తితో ఆత్మహత్య చేసుకుందని అనుమానిస్తున్నారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు కేసు మిస్టరీని చేదించారు. అశ్విని తన వెంట తెచ్చుకున్న బాటిల్‌లోని పెట్రోలను ఒంటిపై పోసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు జిల్లా ఎస్‌పీ పాల్‌ రాజ్‌ చెప్పారు. 
 

 

11:55 - December 3, 2017

అనంతపురం : జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి కాసుల కక్కుర్తి వ్యక్తి ప్రాణాలు బలిగొంది. రాప్తాడు మండలం పాలచర్లకు చెందిన చంద్రమోహన్‌కు పెళ్లై మూడేళ్లయినా పిల్లలు పుట్టకపోవడంతో శ్రీనివాస ఆస్పత్రి వైద్యులను సంప్రదించాడు.  సంతాన సాఫల్యం కోసం ఆపరేషన్‌ చేస్తామని చెప్పి కుటుంబ సభ్యుల అనుమతి లేకుండానే చంద్రమోహన్‌కు ఆపరేషన్‌ నిర్వహించారు. శస్త్రచికిత్స వికటించడంతో చంద్రమోహన్‌ మృతిచెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో ఫర్నీచర్‌ ధ్వంసం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న జిల్లాకు చెందిన మంత్రి పరిటాల సునీత సోదరుడు బాలాజీ, మృతుడి బంధువులు, పోలీసులు కలిసి ఆస్పత్రి యాజమాన్యంతో చర్చలు జరిపిన సమస్యను పరిష్కరించారు. మృతుడి కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఇస్తామని హామీ ఇవ్వడంతో  చంద్రమోహన్‌ బంధువులు ఆస్పత్రి నుంచి మృతదేహాన్ని తీసుకెళ్లారు.   
 

విజయనగరం జిల్లాలో విషాదం

విజయనగరం : జిల్లా గుర్ల మండలం కెల్ల గ్రామంలో విషాదం జరిగింది. పంట పొలాల్లో వరిచేను ఊడుస్తుండగా 10 మంది రైతులు అస్వస్థతకు గురైయ్యారు. అందులో ఇద్దరు మృతి చెందారు. ఆసుపత్రిలో మరో 8 మంది రైతులు చికిత్స పొందుతున్నారు. విషతుల్యామైన నేల బావినీరు  తాగడమే కారణమని అనుమానిస్తున్నారు. 

11:51 - December 3, 2017

గుంటూరు : బీసీ కమిషన్‌లోని మెజారిటీ సభ్యులు ఇచ్చిన నివేదిక ఆధారంగానే కాపు రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకున్నామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారమే కాపు రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో పెట్టాని టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో చెప్పారు. బీసీ రిజర్వేషన్లలో కోత పెట్టకుండానే కాపులకు ఈ సౌకర్యం కల్పించామన్నారు. రాజకీయలబ్ధి కోసం కొన్ని రాజకీయ పార్టీలు కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాల పట్ల అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు కోరారు. నివేదిక ఇవ్వలేదని బీసీ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ మంజునాథ చేసిన వ్యాఖ్యలతో కాపు రిజర్వేషన్ల అంశం వివాదాస్పదంగా మారింది. అలాగే  కాపు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కొన్ని బీసీ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సంయమనంతో వ్యవహరించాలని చంద్రబాబు సూచించారు. ఈ మొత్తం వ్యవహారం సమన్వయ బాధ్యతలను మంత్రులు కళావెంకట్రావు, అచ్నెన్నాయుడు, ఎమ్మెల్సీ జనార్దన్‌రావుకు అప్పగించారు. 
 

 

11:47 - December 3, 2017

హైదరాబాద్ : నగర మెట్రోకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఉదయం అమీర్ పేట స్టేషన్‌లో బాంబు ఉన్నట్లు కాల్ రావడంతో..  పోలీసులు అప్రమత్తమయ్యారు. తనిఖీలు చేపట్టి చివరకు ఫేక్‌కాల్‌గా తేల్చారు. కాల్ చేసిన వ్యక్తిని గుర్తించే పనిలో ప్రస్తుతం పోలీసులు ఉన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

11:46 - December 3, 2017

ఢిల్లీ : హస్తిన టెస్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీతో చెలరేగాడు. 238 బంతుల్లో విరాట్ డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. టెస్టుల్లో విరాట్ కిది ఆరో డబుల్ సెంచరీ. కెప్టెన్‌గా కూడా ఆరో డబుల్ సెంచరీ కావడంతో లారా పేరున ఉన్న అత్యధిక డబుల్ సెంచరీల రికార్డును విరాట్ అధిగమించాడు. టెస్టుల్లో 20 సెంచరీలు పూర్తి చేశాడు. 

 

లడ్డూ, వడ ప్రసాదాల ధరలు పెంచుతూ టీటీడీ నిర్ణయం

చిత్తూరు : తిరుమలలో ప్రైవేటు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు విక్రయించే లడ్డూ, వడ ప్రసాదాల ధరలు పెంచుతూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. కల్యాణోత్సవం లడ్డూ ధరను 100 నుంచి 200 రూపాయలకు పెంచింది. సాధారణ లడ్డూ ధర 25 నుంచి 50కి పెంచారు. చిన్నలడ్డూ ధర రూ.3.5 నుంచి రూ.7కు పెంచారు. వడ ప్రసాదం ధర 25 నుంచి 100కి పెంచుతూ ఆదేశాలు జారీచేశారు. సిఫార్సులపై జారీ చేసే లడ్డూ ధరను కూడా టీటీడీ పెంచే యోచనలో ఉంది. 

 

అనంతపురం జిల్లాలో ఏనుగుల బీభత్సం

అనంతపురం : జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. గజరాజుల దాడిలో రెండురోజుల్లో ఇద్దరు రైతులు మృతి చెందారు. డి.హీరేహాళ్‌ మండలం మురడి గ్రామంలో పొలంలో ఉన్న ఏకాంబర అనే రైతుపై ఏనుగుల దాడి చేయగా ఆయన అక్కడికక్కడే చనిపోయాడు. నిన్న హనకనహాల్‌ గ్రామంలో రైతు మల్లప్ప కూడా ఇదే విధంగా చనిపోయాడు. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా... అటవీశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. 

11:40 - December 3, 2017

చిత్తూరు : తిరుమలలో ప్రైవేటు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు విక్రయించే లడ్డూ, వడ ప్రసాదాల ధరలు పెంచుతూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. కల్యాణోత్సవం లడ్డూ ధరను 100 నుంచి 200 రూపాయలకు పెంచింది. సాధారణ లడ్డూ ధర 25 నుంచి 50కి పెంచారు. చిన్నలడ్డూ ధర రూ.3.5 నుంచి రూ.7కు పెంచారు. వడ ప్రసాదం ధర 25 నుంచి 100కి పెంచుతూ ఆదేశాలు జారీచేశారు. సిఫార్సులపై జారీ చేసే లడ్డూ ధరను కూడా టీటీడీ పెంచే యోచనలో ఉంది. 

 

11:38 - December 3, 2017

అనంతపురం : జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. గజరాజుల దాడిలో రెండురోజుల్లో ఇద్దరు రైతులు మృతి చెందారు. డి.హీరేహాళ్‌ మండలం మురడి గ్రామంలో పొలంలో ఉన్న ఏకాంబర అనే రైతుపై ఏనుగుల దాడి చేయగా ఆయన అక్కడికక్కడే చనిపోయాడు. నిన్న హనకనహాల్‌ గ్రామంలో రైతు మల్లప్ప కూడా ఇదే విధంగా చనిపోయాడు. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా... అటవీశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో గ్రామస్తులు 
భయాందోళనకు గురవుతున్నారు. 

11:35 - December 3, 2017

కరీంనగర్‌ : జిల్లాలోని హుజురాబాద్‌ నియోజకవర్గంలో ఔషధ ప్రయోగాలు వికటించాయి. బెంగళూకు చెందిన అపాటెక్స్ ఫార్మా నిర్వహించిన క్లినికల్‌ ట్రయల్స్‌తో నాగంపేటకు చెందిన నాగరాజు ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరు అశోక్‌, సురేశ్‌ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు.  అశోక్‌ మతిస్థిమితం కోల్పోగా... సురేశ్‌ వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందతుఉన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం...

 

అదృశ్యమైన యువకుడి కథ సుఖాంతము

హైదరాబాద్ : మల్కాజ్ గిరిలో గతన నవంబర్ లో అదృశ్యమైన సాయిచైతన్య క్షేమంగా తల్లిదండ్రుల చెంతకు చేరుకున్నాడు. ప్రియురాలు మోసం చేసిందని మనస్తాపంతో అతను ఇళ్లు వదిలి వెళ్లిపోయాడు. 

11:25 - December 3, 2017

కర్నూలు : జిల్లాలోని డోన్‌లో దారుణం వెలుగుచూసింది. ప్రేమ పేరుతో ప్రియురాని మోసం చేయడంతో... 8 నెలల గర్భిణి అని కూడా చూడకుండా...దారుణంగా హత్య చేశాడు. 10రోజులుగా తమ కూతురి ఆచూకీ కనిపించకపోవడంతో.. కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది. ప్రియురాలు రమిజను హత్య చేసిన ప్రియుడు సిద్ధు... మృతదేహాన్ని కొండల్లో పాతిపెట్టాడు. నిందితుడు పోలీసుల ముందు లొంగిపోయాడు.

 

11:23 - December 3, 2017

ఢిల్లీ : టెస్ట్‌లో భారత్‌ జట్టు భారీస్కోర్‌పై కన్నేసింది. తొలి రోజే శ్రీలంకపై ఆతిధ్య భారత్‌ ఆధిపత్యం ప్రదర్శించింది. కెప్టెన్‌ విరాట్‌ కొహ్ల, టెస్ట్ స్పెషలిస్ట్‌ మురళీ విజయ్‌ సెంచరీలతో చెలరేగడంతో భారత జట్టు తొలి రోజే 370 పరుగుల మార్క్ దాటింది.

ఢిల్లీ టెస్ట్‌ తొలి రోజే టీమిండియా డామినేట్‌ చేసింది. విరాట్‌ కొహ్లీ, విజయ్‌ల డబుల్‌ సెంచరీ భాగస్వామ్యంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్‌పై కన్నేసింది. టాస్‌ నెగ్గి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు ...టెస్ట్‌ స్పెషలిస్ట్‌ విజయ్‌, కెప్టెన్‌ కొహ్లీ సెంచరీలతో చెలరేగడంతో మొదటి రోజే 370 పరుగుల మార్క్ దాటింది. విజయ్‌-విరాట్‌ క్రీజ్‌లో పాతుకుపోవడంతో లంక బౌలర్లు మరోసారి తేలిపోయారు. విజయ్‌ ట్రేడ్‌మార్క్‌ టెస్ట్‌ ఇన్నింగ్స్‌ ఆడి 11వ సెంచరీ నమోదు చేశాడు. దూకుడుగా ఆడిన విరాట్‌ 20వ టెస్ట్‌ సెంచరీ పూర్తి చేశాడు.

ఇద్దరూ కలిసి 3వ వికెట్‌కు 283 పరుగులు జోడించి భారత జట్టు భారీ స్కోర్‌కు పునాది వేశారు.267 బంతుల్లో 13 ఫోర్లతో 155 పరుగులు చేసిన విజయ్‌ ఔటైనా విరాట్‌ మాత్రం తడబడలేదు. 186 బంతుల్లో 16 ఫోర్లతో 156 పరుగులు చేసిన కొహ్లీ మరో డబుల్‌ సెంచరీ సాధించాలని తహతహలాడుతున్నాడు. తొలి రోజు ఆట ముగిసే సరికి భారత్‌ 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 371 పరుగులు చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో 600 పరుగులకు పైగా స్కోర్‌ చేసి లంక జట్టుపై ఒత్తిడి పెంచాలని భారత జట్టు పట్టుదలతో ఉంది.

11:13 - December 3, 2017

ఢిల్లీ : బ్యాడ్మింటన్ తెలుగుతేజం కిదాంబి శ్రీకాంత్‌కు ఏపీ ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్‌ హోదా కల్పించింది. ఇందుకు సంబంధించిన బిల్లుకు శనివారం శాసనసభ ఆమోదం తెలిపింది. గతంలో ఒలింపిక్‌ పతక విజేత పీవీ సింధుకు ఏపీ ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్‌ హోదా కల్పించింది. గుంటూరుకు చెందిన కిదాంబి శ్రీకాంత్‌ ఈ ఏడాది నాలుగు సూపర్‌ సిరీస్‌ టైటిల్స్‌ను కైవసం చేసుకున్నాడు. జూన్‌లో ఇండోనేషియా ఓపెన్‌తో పాటు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ నెగ్గిన శ్రీకాంత్‌ అక్టోబరులో డెన్మార్క్‌ ఓపెన్‌, ఆ తర్వాత ఫ్రెంచ్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌లు నెగ్గి ఒకే ఏడాది నాలుగు సూపర్‌ సిరీస్‌ టైటిళ్లు గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. శ్రీకాంత్‌ అసాధారణ ప్రతిభను గుర్తించిన ఏపీ ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్‌ హోదాతో గౌరవించింది.

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం టెలీకాన్ఫరెన్స్

గుంటూరు : ఏపీ సీఎం చంద్రబాబు టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కాపు రిజర్వేసన్లు, బీసీ సంఘాల ఆందోళన, మంజునాథ వివాదంపై నేతలకు సీఎం చంద్రబాబు సూచనలు చేశారు. 

11:10 - December 3, 2017

కరీంనగర్‌ : జిల్లాలో మరోసారి క్లినికల్ ట్రయల్స్ వ్యవహారం వెలుగుచూసింది. బెంగళూరుకు చెందిన లోటస్ ఫార్మా కంపెనీ ఘోరాలకు జమ్మికుంటకు చెందిన సురేష్‌ అనే యువకుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతడ్ని బంధువులు జమ్మికుంట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. జమ్మికుంటలో 200 మంది క్లినికల్ ట్రయల్స్ బాధితులు ఉన్నట్టు సమాచారం. మరోవైపు ఈ క్లినికల్ ట్రయల్స్ వ్యవహారంపై మంత్రి ఈటల సీరియస్ అయ్యారు. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు సూచించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

11:07 - December 3, 2017

తమిళనాడు : చెన్నైలోని ఆర్కే నగర్‌  అసెంబ్లీ స్థానానికి జరుగనున్న ఉప ఎన్నికల్లో తమిళ నటుడు విశాల్‌ బరిలో దిగనున్నారు. ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా  రేపు నామినేషన్‌  వేయనున్నట్టు విశాల్‌ ప్రకటించారు.  అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న విశాల్‌కు తమిళనాడులో అభిమానులు ఎక్కుగా ఉన్నారు. ప్రజా సమస్యలపై వెంటనే స్పందించే విశాల్‌.. 2015 డిసెంబర్‌లో చెన్నైలో సంభవించిన వరదల్లో పలు సహాయ కార్యక్రమాలు అమలుచేసి ప్రజల మన్ననలు పొందారు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణంతో ఖాళీ అయిన  ఆర్కే నగర్‌ అసెంబ్లీ స్థానానికి ఈనెల 21న ఉపఎన్నిక జరుగనుంది. 23న ఓట్లు లెక్కిస్తారు. ఇప్పటికే అన్నాడీఎంకే, డీఎంకే అభ్యర్థులతోపాటు శశికళ మేనల్లుడు దినకరన్‌ శుక్రవారం నామినేషన్లు సమర్పించారు. 

10:59 - December 3, 2017

విశాఖపట్నం : నగరంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్‌ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన వైజాగ్‌ ఫెస్టివల్‌ ప్రజలను విశేషంగా ఆకర్షిస్తోంది. విజ్ఞానం, వినోదం, శాస్త్రీయలతను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి వైజాగ్‌ ఫెస్ట్‌ నిర్వహిస్తున్నారు. తొమ్మిది విభాగాల్లో ఫెస్టివల్‌ నిర్వహిస్తున్నారు. వీటిలో సైన్స్‌ ఎగ్జిబిషన్‌, పుస్తక ప్రదర్శన జనాన్ని ఆకట్టుకుంటున్నాయి. సైన్స్‌ ఎగ్జిబిషన్‌కు మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం పేరు పెట్టారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరిస్తున్నాయి. సందర్శకులు ఫుడ్‌ కోర్టులో రకరకాల రుచులు ఆస్వాదిస్తున్నారు.
 

విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ

ఢిల్లీ : టీమిండియా క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ శ్రీలంకతో జరుగుతున్న మూడో, ఆఖరి టెస్టు మ్యాచ్ లో డబుల్ సెంచరీ చేశారు. 238 బంతుల్లో డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. టెస్టులో విరాట్ ఆరో డుబుల్ సెంచరీ చేశాడు. కెప్టెన్ గా ఆరో డబుల్ సెంచరీతో లారా రికార్డును అధిగమించారు.
 

 

10:52 - December 3, 2017

హైదరాబాద్‌ : నగరంలోని జూబ్లీహిల్స్‌లో రాత్రి రోడ్డుప్రమాదం జరిగింది. రోడ్‌ నెంబర్ 45లో రెండు కార్లు ఢీ కొన్న ఘటనలో బీటెక్‌ విద్యార్థి నితిన్‌వర్మ మృతి చెందాడు. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. కారులో ఉన్న యువకులు మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.... 

ఎవరికి అన్యాయం జరగదు : చంద్రబాబు

గుంటూరు : కాపు రిజర్వేషన్ల వల్ల ఏ వర్గానికి అన్యాయం జరగకుండానే కాపులకు రిజర్వేషన్లు కల్పించామని చంద్రబాబు నాయుడు అన్నారు. ఇచ్చిన మాట మేరకు హామీ నెరవేర్చామని, నింధనల ప్రకారమే కాపు రిజర్వేషనల్ల బిల్లు సభలో పెట్టామని ఆయన అన్నారు.

అమీర్ పేట్ మెట్రో స్టేషన్ లో బ్యాగ్ కలకలం

హైదరాబాద్ : అమీర్ పేట్ మెట్రో స్టేషన్ లో ఓ  బ్యాగ్ కలకలం రేపింది. వెంటనే రంగంలోకి దిగిన బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. చివరికి బ్యాగ్ లో ఏమి లేదని తేల్చారు. ఆ బ్యాగ్ మెట్రో స్టేషన్ లో పని చేస్తున్న సెక్యూరీటీ గార్డ్ గా గుర్తించారు. 

08:38 - December 3, 2017

కరీంనగర్ : జిల్లాలో మరో క్లినికల్ ట్రయల్ బాధితుడు ఘటన వెలుగులోకి వచ్చింది. జమ్మికుంటలో బెంగళూరుకు చెందిన లోటస్ ఫార్మా కంపెనీ ఘోరాలు బయటపడ్డ పడ్డాయి. ఔషధ ప్రయోగాలతో సురేష్ అనే యువకుడికి తీవ్ర అస్వస్థత కలిగింది. బంధువులు అతన్ని జమ్మికుంట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. జమ్మికుంటలో 200 మంది క్లినికల్ ట్రయల్స్ బాధితులున్నారు. మంత్రి ఈటల రాజేందర్ నియోజకవర్గంలోనే 3 కేసులు బయటపడ్డాయి. క్లినికల్ ట్రయల్స్ వ్యవహారంపై మంత్రి ఈటల సీరియస్ అయ్యారు. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు ఈటల సూచించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

08:30 - December 3, 2017

హైదరాబాద్ : నగరంలోని జూబ్లీహిల్స్ లో పోలీసులు డ్రంక్ ఆండ్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 20 మందిపై కేసు నమోదు చేశారు. వీరి నుంచి 14 కార్లు, ఆరు బైక్ లు సీజ్ చేశారు. మద్యం మత్తులో కారు నడిపిన సినీ హాస్యనటుడు నవీన్ మీడియాను చూసి పారిపోతున్న నవీన్ ను పోలీసులు పట్టుకున్నారు. అతని కారును సీజ్ చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

నేటి నుంచి జాతీయ చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్

ప్రకాశం : ఒంగోలులో నేటి నుంచి జాతీయ చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్ జరుగనుంది. చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్ కాంగ్రెస్ ను మంత్రి శిద్ధా రాఘవయ్య ప్రారంభించనున్నారు. 13 జిల్లాలకు చెందిన 130 మంది విద్యార్థులు పాల్గొననున్నారు.
 

 

తమిళనాడులో ఓఖీ తుపాను బీభత్సం

చెన్నై : తమిళనాడులో ఓఖీ తుపాను బీభత్సం సృష్టించింది. మరో 24 గంటలపాటు అక్కడక్కడ వర్షాలు పడనున్నాయ. సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులను కోస్ట్ గార్డ్ రక్షించారు. తుపాను ప్రభావంతో కన్యాకుమారి జిల్లా తీవ్రంగా నష్టపోయింది. కన్యాకుమారిలో సహాయకచర్యల కోసం సీఎం పళనిస్వామి రూ.25 కోట్ల విడుదల చేశారు. గల్లంతైన వారి వివరాలు ప్రభుత్వానికి తెలియజేయాలని సూచించారు. 

07:34 - December 3, 2017

కాపు రిజర్వేషన్లపై వక్తలు భిన్నవాదనలు వినిపించారు. కాపు రిజర్వేషన్ బిల్లుకు ఏపీ అసెంబ్లీలో ఏకగీవ్రంగా ఆమోదం తెలిపారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో వైసీపీ నేత మండలి హనుమంతరావు, టీడీపీ నేత చందూ సాంబ శివరావు, బీసీ జన సభ రాష్ట్ర కన్వీనర్ గంగాధర్ పాల్గొని, మాట్లాడారు. కాపు రిజర్వేషన్ బిల్లు శాస్త్రీయబద్ధంగా లేదన్నారు. కాపు రిజర్వేషన్లపై హైడ్రామా నడుస్తోందన్నారు. కాపులను బీసీలో చేర్చడం చారిత్రక తప్పిదమని గంగాధర్ అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...  

 

నేడు ఢిల్లీ వెళ్లనున్న సీఎం చంద్రబాబు

అమరావతి : ఇవాళ రాత్రికి సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు కేంద్రమంత్రులు నితన్ గడ్కరీ, అరుణ్ జైట్లీతో సమావేశం కానున్నారు.
 

గుజరాత్ లో నేడు మోడీ ఎన్నికల ప్రచారం

అహ్మదాబాద్ : గుజరాత్ లో నేడు మోడీ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. బరూచ్, సురేందర్ నగర్, రాజ్ కోటలో మోడీ ప్రచారం చేయనున్నారు. 

 

నేడు ఢిల్లీ వెళ్లనున్న టీపీసీసీ నేతలు

హైదరాబాద్ : నేడు టీపీసీసీ నేతలు ఢిల్లీ వెళ్లనున్నారు. ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాహుల్ పేరును సూచిస్తూ సంతకాలు చేసిన పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ కు నేతలు ఇవ్వనున్నారు.

నేడు 25 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర

 కర్నూలు : నేడు 25 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర చేయనున్నారు. మదనాంతపురం క్రాస్ రోడ్డు నుంచి యాత్ర ప్రారంభం కానుంది. 

 

బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ డ్రంక్ ఆండ్ డ్రైవ్

హైదరాబాద్ : నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ డ్రంక్ ఆండ్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 20 మందిపై కేసు నమోదు చేశారు. 14 కార్లు, ఆరు బైక్ లు సీజ్ చేశారు. సినీ హాస్యనటుడు నవీన్ మద్యం మత్తులో కారు నడిపారు. మీడియాను చూసి నవీన్ పరారవుతుండగా పోలీసులు పట్టుకున్నారు. 
 

నేడు టీ..మాస్ ఆధ్వర్యంలో కులాతీత జన భోజనాలు

హైదరాబాద్ : నేడు టీ..మాస్ ఆధ్వర్యంలో కులాతీత జన భోజనాలు ఏర్పాటు చేయనున్నారు. టీమాస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జన భోజనాల కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందిరాపార్కులో జన భోజన కార్యక్రమంలో పాల్గొననున్నారు. ప్రజా గాయకుడు గద్దర్, ప్రజా గాయకురాలు విమలక్క, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు, సీపీఎం రాష్ట్ర కార్యద తమ్మినేని వీరభద్రం, సమాజిక కార్తకర్త ప్రొ. కంచ ఐలయ్య పాల్గొననున్నారు. 

 

07:02 - December 3, 2017
07:01 - December 3, 2017

జగిత్యాల : ఓ పోలీస్‌ ఆన్‌డ్యూట్‌లోనే పీకలదాకా మద్యం సేవించి హల్‌చల్‌ సృష్టించాడు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం పీఎస్‌లో పోచయ్య ఏఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం డ్యూటీలో ఉండగానే పీలకదాకా మద్యం సేవించాడు. కొత్తపల్లి మండలం వెలిచాల క్రాస్‌రోడ్‌ దగ్గర మద్యం మత్తులో తూలాడు. పక్కనున్న వారిని అసభ్య పదజాలంతో దూషించాడు. అంతేకాదు... దుర్భాషలాడుతూ హంగామా చేశాడు.

06:58 - December 3, 2017

గుంటూరు : పార్టీ ఫిరాయింపుదార్లపై చర్యలు తీసుకోవాలంటూ వైసీపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించింది. వైసీపీ తీసుకున్న ఈ నిర్ణయం ఆ పార్టీకి కలిసివచ్చిందా? లేక అధికారపార్టీకి కలిసివచ్చిందా? వైసీపీ నిర్ణయంతో లాభం ఏ పార్టీకి జరిగింది.?  నష్టమెవరికి మిగిలింది ? ప్రజా సమస్యల పరిష్కారానికి వైసీపీ నిర్ణయం దోహదపడిందా? ఇంతకీ వైసీపీ నిర్ణయంపై రాష్ట్రంలో జరుగుతున్న చర్చ ఏంటి?  లెట్స్‌ వాచ్‌దిస్‌ స్టోరీ..
అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాని వైసీపీ
పోలవరం నిర్మాణం, రాజధాని నగర ప్రగతి.. అనేక సంక్షేమ కార్యక్రమాల అమలులో లోటుపాట్లు... అభివృద్ధి కార్యక్రమాల అమల్లో జాప్యం... ఇలాంటి అనేక సమస్యలు ఏపీలో ఉన్నాయి. ఈ అంశాలపై ప్రభుత్వాన్ని  నిలదీసేందుకు సరైన వేదిక అసెంబ్లీయేనని చెప్పాలి. ప్రతిపక్షానికి ఇంతకంటే మించిన వేదిక మరొకటి ఉండదు.  సమస్యలపై ప్రభుత్వ తీరును ఎండగడుతూనే.. తమ విధానాన్ని ప్రజలకు చెప్పేందుకు సరైన వేదిక అసెంబ్లీ సమావేశాలు. కానీ ఏపీలోని ప్రతిపక్షపార్టీ వైసీపీ ఆ అవకాశాన్ని వదులుకుంది.  పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలనే డిమాండ్‌తో సభకు హాజరుకాకూడదని వైసీపీ నిర్ణయించింది. దీంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు శాసనసభ సమావేశాలకు హాజరుకాలేదు. ప్రతిపక్షం ఒక్కరోజు కూడా సభకు హాజరుకాకపోవడమనేది ఒక చరిత్రే. కానీ ఇది ప్రజాస్వామ్యంలో సరైన పని కాదన్న విమర్శలు కూడా వైసీపీపై వచ్చాయి.  అధికారపార్టీపై నిప్పులు చెరిగే కాంగ్రెస్‌లాంటి పార్టీలతోపాటు... ఉండవల్లి లాంటి సీనియర్‌ పొలిటీషియన్‌ కూడా ప్రతిపక్ష తీరును తప్పుపడుతున్నారు. వైసీపీ తన నిర్ణయంతో ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశాన్ని కోల్పోయిందని చెబుతున్నారు.
బోటు ప్రమాదంపై సర్కార్‌ను నిలదీసే చాన్స్‌ మిస్సైన వైసీపీ
ఏపీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయిన తర్వాత ఇబ్రహీంపట్నం ఫెర్రీఘాట్‌ దగ్గర బోటు ప్రమాదం జరిగింది. పదుల సంఖ్యలో ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ ఘటనకు ఇటు టూరిజంశాఖ.. అటు ఇరిగేషన్‌ శాఖ నిర్లక్ష్యం ఉంది. ఇంతపెద్ద ప్రమాదం జరిగితే ప్రతిపక్షం మాత్రం అసెంబ్లీ సమావేశాలకు మాత్రం హాజరుకాలేదు. ఫలితంగా ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపి.. బాధిత కుటుంబాలకు మరింత న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే అవకాశాన్ని వైసీపీ చేజార్చుకుంది. సభకు వైసీపీ హాజరైఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 
కాపులకు రిజర్వేషన్లపై ప్రభుత్వ ఏకపక్ష ధోరణి
కాపు రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోవడం, ఆ వెంటనే సభలో బిల్లు ప్రవేశపెట్టడం చకాచకా జరిగిపోయింది. ఇదే సమయంలో బీసీ కమిషన్‌ చైర్మన్‌ మంజునాథ్‌ కొంత అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం కూడా జరిగింది. కమిషన్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తోన్న మంజునాథ్‌ నివేదిక ఇవ్వకుండానే సభ్యులుగా ఉన్నవారు  ఇచ్చిన నివేదికను బేస్‌ చేసుకుని ప్రభుత్వం కాపు రిజర్వేషన్‌ బిల్లు రూపొందించడం కొంత వివాదాఆనికి దారితీసింది. కీలకమైన, సున్నితమైన రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన కాపు రిజర్వేషన్ల బిల్లుపై జరిగిన గందరగోళాన్ని సభలో ప్రస్తావించే దిక్కులేకుండా పోయింది.  వైసీపీ సభకు హాజరుకాకపోవడం మూలంగా అత్యంత కీలకమైన బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ప్రతిపక్షం వాయిస్‌ లేకుండానే బిల్లు ఆమోదం పొందింది. 
ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం కోల్పోయిన వైసీపీ
టీడీపీ అధికారంలోకి వచ్చాక పెండింగ్‌లో పెట్టిన అత్యంత కీలకమైన వాగ్దానం నిరుద్యోగ భృతి. నిరుద్యోగ భృతికి సంబంధించిన కసరత్తు కొన్ని నెలలుగా జరుగుతున్నా... ఇప్పటికీ దాన్ని ప్రభుత్వం అమలు చేయలేక పోయింది. ఇప్పటికీ పూర్తిస్థాయిలో విధివిధానాలు రూపకల్పన చేసే దిశగా ఇంకా కసరత్తు  చేస్తూనే ఉంది. వైసీపీ సభకు వచ్చుంటే నిరుద్యోగ భృతిపై ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేసే అవకాశం చిక్కేది. కానీ ఈ అవకాశాన్ని సైతం వైసీపీ కోల్పోయింది. సమావేశాలు జరుగుతున్న సమయంలోనే అనేక అంశాలు వివాదాస్పదమయ్యాయి. నంది అవార్డులు మొదలుకొని విద్యార్థుల ఆత్మహత్యల వరకు చర్చనీయాంశమయ్యాయి. వీటిపై ప్రభుత్వాన్ని నిలదీసి ఇరకాటంలో పడవేసే అవకాశాన్ని వైసీపీ చేజార్చుకుందనే చెప్పక తప్పదు.  మొత్తంగా చూస్తే వైసీపీ సభకు హాజరుకావొద్దని తీసుకున్న నిర్ణయం ఆపార్టీ ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశాన్ని కోల్పోయింది. అధికారపార్టీ తప్పులను ఎత్తిచూసే చాన్స్‌ను మిస్‌ అయ్యింది. ఈ నిర్ణయం అటు వైసీపీలోనూ అంతర్గతంగా అసంతృప్తిని రాజేసిందనే చెప్పాలి.

 

06:50 - December 3, 2017

అనంతపురం : కాపులను బీసీల్లో, వాల్మీకులను ఎస్టీల్లో చేరుస్తామని టీడీపీ ప్రభుత్వం మరోసారి ప్రజలను వంచన చేసే ప్రయత్నం చేస్తోందన్నారు ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి.  ఇదే అంశాన్ని పార్లమెంటులో బిల్లు తెస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా మడకశిరలో ఇందిరమ్మ ఇంటింటా సౌభాగ్యం కార్యక్రమంలో రఘువీరా పాల్గొన్నారు. అన్ని కులాలవారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు.

 

నేడు మేడిపల్లి పీఎస్ పరిధిలో 144 సెక్షన్

మేడ్చల్ : నేడు మేడిపల్లి పీఎస్ పరిధిలో 144 సెక్షన్ విధించారు. వేద పాఠశాల విషయంలో నిర్వాహకులకు, నిర్మాత బొమ్మాక మురళికి మధ్య వివాదం తలెత్తింది. బొమ్మాక మురళి వేద పాఠశాలకు వ్యతిరేకంగా ఉన్నారు. నేడు ర్యాలీకి ఇరువైపులా ఏర్పాట్లు చేశారు. ర్యాలీలు, ధర్నాలకు పోలీసులు అనుమతివ్వలేదు.

 

రోడ్డ ప్రమాదంలో విద్యార్థి మృతి

హైదరాబాద్ : జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లో రెండు కార్లు ఢీకొన్నాయి. బీటెక్ విద్యార్థి నితిన్ వర్మ మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. యువకులు మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 

Don't Miss