Activities calendar

04 December 2017

21:52 - December 4, 2017

లండన్ : భారత్‌కు అప్పగింత కేసుకు సంబంధించి కింగ్‌ఫిషర్ అధినేత విజయ్ మాల్యా లండన్‌ కోర్టుకు హాజరయ్యారు. తనపై నిరాధార ఆరోపణలు చేశారని ఈ సందర్భంగా మాల్యా అన్నారు. కోర్టు ముందే తాను అన్ని విషయాలు వెల్లడించినున్నట్లు పేర్కొన్నారు. లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ కోర్టులో మాల్యా విచారణ కొనసాగుతోంది. సీబీఐ, ఈడీకి చెందిన అధికారులు విచారణకు హాజరయ్యారు. భారతీయ బ్యాంకులకు 9 వేల కోట్లు ఎగ్గొట్టిన మాల్యా గత రెండేళ్ల నుంచి లండన్‌లో తలదాచుకుంటున్నారు

21:50 - December 4, 2017

ఢిల్లీ :  కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అధ్యక్షపదవిని చేపట్టేందుకు అంతా సిద్ధమైంది. పార్టీ అధ్యక్ష పదవి ఎన్నిక కోసం రాహుల్‌ నామినేషన్‌ వేశారు. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, అహ్మద్‌పటేల్, ఆనంద్‌ శర్మ, షీలా దీక్షిత్‌, జ్యోతిరాదిత్య సింధియా వంటి సీనియర్‌ కాంగ్రెస్‌ నేతల సమక్షంలో రాహుల్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. రాహుల్‌ రాజకీయ గురువుగా భావించే సీనియర్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌ గైర్హాజరు కావడం గమనార్హం. రాహుల్‌ గాంధీకి పలువురు సీనియర్‌ నేతలు అభినందలు తెలియజేశారు. రాహుల్‌ను కాంగ్రెస్‌ పార్టీ డార్లింగ్‌గా మన్మోహన్‌ సింగ్‌ పేర్కొన్నారు. పార్టీ వారసత్వాన్ని, ఒరవడిని ముందుకు తీసుకెళ్తారన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.ఎవరు ఏమనుకుంటున్నారు...అన్నది ప్రధానం కాదని...కాంగ్రెస్‌ పార్టీని పటిష్ట పరచేందుకే రాహుల్‌ను అధ్యక్ష పదవికి ఎంపిక చేశామని మరో సీనియర్‌ నేత మల్లికార్జున్ ఖర్గే చెప్పారు.తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ నుంచి 3 సెట్ల నామినేషన్‌ దాఖలు చేశామని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. రాహుల్‌ నేతృత్వంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో దేశంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌ విజయం సాధిస్తుందన్న ధీమా వ్యక్తం కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్‌ గడువు సోమవారంతో ముగిసిందని ఎన్నికల పరిశీలకుడు రామచంద్రన్‌ తెలిపారు. రాహుల్‌ తప్ప కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవికి ఎవరూ నామినేషన్‌ వేయలేదు. దీంతో ఆయన ఎన్నిక లాంఛనప్రాయమే కానుంది. త్వరలోనే రాహుల్‌ అధ్యక్ష ఎన్నిక ఖరారయ్యే అవకాశం కన్పిస్తోంది. 

ఓయూ పరిధిలో రేపు, ఎలుండి జరగాల్సిన పరీక్షలు వాయిదా

హైదరాబాద్ : ఓయూ పరిధిలో రేపు ఎల్లుండి జరగాల్సిన పరీక్షలను వాయిదా పడ్డాయి. వాయిదా పడ్డ పరీక్షల తేదీలను త్వరలో ప్రకటిస్తామని ఓయూ అధికారులు తెలిపారు. 

తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. భక్తులు 15 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 4గంటల సమయం పడుతుంది. 

21:35 - December 4, 2017

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లా లింగాలపల్లిలో దారుణం జరిగింది. డిగ్రీ సెకండ్‌ ఇయర్‌ విద్యార్థిని చాప కృష్ణప్రియాంక పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుంది. కాలేజీ అధ్యాపకుడి లైంగిక వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రియాంక మృతదేహంతో భద్రాచలం వెళ్తున్న కుటుంబ సభ్యులను జగన్నాథపురంలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మృతురాలి బంధువులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.  

21:33 - December 4, 2017

కరీంనగర్ : సంబంధించి ఫార్మా కంపెనీ ప్రతినిధులను సిపి కార్యాలయానికి పిలిపించి కమిషనర్ కమలాసన్ రెడ్డి విచారించారు. మిలటోనియా 2 ఎంజీ డ్రగ్‌ నాగరాజుపై ప్రయోగించినట్లు సీపీ తెలిపారు. 4 ఏళ్లలో 10 సార్లు క్లినికల్‌ ట్రయల్స్‌కు వెళ్లాడని స్పష్టం చేశారు. 2 రోజుల్లో ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్టు వస్తుందని.. ఆ నివేదికతో ఎలా చనిపోయాడో తెలుస్తుందన్నారు. ఎథిక్స్‌ కమిటీ రిపోర్టు మేరకు చర్యలు తీసుకుంటమన్నారు. కరీంనగర్‌ జిల్లాలో 60 మంది ఔషధ ప్రయోగ బాధితులున్నట్లు వెల్లడించారు. క్లినికల్‌ ట్రయల్స్‌కు ముందు నాగరాజు వీడియో కౌన్సెలింగ్‌ టేపులను పోలీసులు బయటపెట్టారు. 

21:30 - December 4, 2017

సియోల్ : నవ్యాంధ్ర ప్రదేశ్‌కు పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా చంద్రబాబు దక్షిణకొరియాలో పర్యటిస్తున్నారు. కియా మోటార్స్ హెడ్ క్వార్టర్స్‌ సందర్శించి బిజినెస్ సెమినార్‌లో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని చంద్రబాబు కొరియన్ కంపెనీలను కోరారు. తయారీ రంగంలో ఇండియా దూసుకువెళ్తోందని పెట్టుబడులకు ఏపీలో అపారమైన అవకాశాలు ఉన్నాయని ఆయన వివరించారు. దక్షిణ కొరియా సాధించిన ప్రగతి స్ఫూర్తిదాయకమని ఆయనీ సందర్భంగా వ్యాఖ్యానించారు. భౌగోళికంగా, జనాభా పరంగా ఆంధ్రప్రదేశ్‌కు, దక్షిణ కొరియాకు సారూప్యతలు ఉన్నాయన్న బాబు.. భారత్ లుకీస్ పాలసీని ఏపీ సాకారం చేస్తుందని చెప్పారు.

 పూసన్‌ న్యూపోర్టు కంపెనీ...
బూసన్‌ సిటీలోని పూసన్‌ న్యూపోర్టు కంపెనీ, మేకిన్‌ ఇండియా సెంటర్‌, నాక్‌-శాన్‌ నేషనల్‌ ఇండస్ట్రియల్‌ కాంప్లెక్స్‌‌లను చంద్రబాబు సందర్శించారు. అంతకుముందు ఐరిటెక్ కంపెనీ సీఈవో కిమ్ డెహోన్‌నూ ఆయన కలిశారు. రాష్ట్రంలో సెన్సర్లు, డ్రోన్లు, ఐవోటీ, క్లౌడ్ లాంటి.. సాంకేతిక విధానాలను ప్రవేశపెట్టామని కిమ్‌కు చంద్రబాబు వివరించారు. భూములకు యునిక్ ఐడీని కేటాయించే విధానానికి శ్రీకారం చుట్టామని చంద్రబాబు తెలిపారు. ఈనెల 10 తరువాత ఏపీకి వస్తామని కిమ్ డెహోన్ చంద్రబాబుకు తెలిపారు. కొరియా కార్ల దిగ్గజ వ్యాపార సంస్థ కియా 13,500 కోట్ల పెట్టుబడులతో అనంతపురం జిల్లాలో ఆటోమొబైల్‌ ప్రాజెక్టు నెలకొల్పుతోంది. ఈ స్ఫూర్తితో రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు చంద్రబాబు దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పాటు కొనసాగే.. ఈ టూర్లో రెండు ఎంవోయూలు కుదుర్చుకోవడంతోపాటు ఆరు ద్వైపాక్షిక భేటీల్లో చంద్రబాబు పాల్గొంటారు.

21:29 - December 4, 2017

సిద్దిపేట : ఉస్మానియూ యూనివర్సిటీలో ఆదివారం ఆత్మహత్యకు పాల్పడిన ఎమ్మెస్సీ విద్యార్థి మురళి అంత్యక్రియలు ముగిశాయి. సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ మండలంలోని మురళి స్వగ్రామమైన దౌలాపూర్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. గ్రామస్థులు, మృతుని బంధువులు మినహా ఇతరులెవ్వరినీ గ్రామంలోకి పోలీసులు అనుమతించలేదు. అంతకుముందు మురళి మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియూ యూనివర్సిటీ నుంచి తరలించే సమయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉస్మానియా యూనివర్శిటిలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే పోలీసులు మురళి మృతదేహాన్ని తరలించేందుకు ప్రయత్నించారు. అర్థరాత్రి సమయంలో వసతి గృహాల పైనుంచి విద్యార్థులు రాళ్లు రువ్వడంతో వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో విశ్వవిద్యాలయంలో పోలీసులు భారీగా మోహరించారు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించగా విద్యార్థులు అడ్డుకున్నారు. పరిహారంపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చేవరకు మృతదేహాన్ని తరలించేది లేదంటూ భీష్మించుకు కూచున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

తీవ్ర ఉద్రిక్తతలు.....
తీవ్ర ఉద్రిక్తతలు, భారీ బందోబస్తు మధ్యే మురళి మృతదేహాన్ని పోలీసులు ఓయూ నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆందోళనకు దిగిన విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు లాఠీఛార్జి చేయగా నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఆ తర్వాత గాంధీ ఆస్పత్రికి మురళి మృతదేహాన్ని తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అక్కడి నుంచి మురళి స్వగ్రామానికి మృతదేహాన్ని తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.

21:25 - December 4, 2017

హైదరాబాద్ : నిరుద్యోగ సమస్యకు కచ్చితమైన పరిష్కారం లభించేంతవరకు ప్రభుత్వంపై తమ పోరాటం కొనసాగుతుందని టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం తేల్చిచెప్పారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా కొలువులకై కొట్లాట సభ సక్సెస్‌ అయ్యిందన్నారు. హైదరాబాద్ ఎల్బీనగర్‌లో జరిగిన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కొలువులన్నీ భర్తీ చేస్తామని అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ ... మూడేళ్లైనా ఆ హామీని నెరవేర్చలేదన్నారు. దీంతో నిరుద్యోగులు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు. నిరుద్యోగ సమస్యను ఎజెండాపైకి తీసుకురావడం కేసీఆర్‌ సర్కార్‌కు నచ్చడం లేదన్నారు. అందుకే ఉద్యమకారులను, టీజేఏసీ నేతలను వ్యక్తిగతంగా టార్గెట్‌ చేశారని మండిపడ్డారు. తక్షణమే ప్రభుత్వం ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

20:26 - December 4, 2017

మన ఉద్యోగాలు..మనవే..నినాదాలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి..అంకె భారీగా ఊరిస్తూనే ఉంది.. అమలుపైనే అసలు సందేహాలు..ఓ పక్క సమర్ధింపులు.. మరోపక్క కొట్లాటలు..మూడున్నరేళ్లు గడుస్తుంది.. ఇంకెప్పుడని రోడ్డెక్కుతున్నారు.. ఆందోళనకు దిగుతున్నారు.. తెలంగాణలో నిరుద్యోగులకు ఒరిగిందేమిటి? లక్షల ఉద్యోగాలంటూ ప్రభుత్వం చెప్పేది కాకి లెక్కలేనా? నిరుద్యోగుల ఆశలు నెరవేరేదెపుడు? కొలువుల కొట్లాట ఏ దారిలో నడవనుంది? కొలువు దొరుకుతుందన్న నమ్మకం లేదు. సర్టిఫికెట్లు దేనికీ పనికి రానివిగా మారిపోతున్నాయి. కోచింగ్ సెంటర్లలో ఏళ్లు గడిచిపోతున్నాయి.. ఆశలు తీరవు..హామీలు ఆగవు.. బతుకుపోరు నానాటికీ బరువుగా మారుతున్న దృశ్యం..

 

అసలు తెలంగాణలో ఎందరు నిరుద్యోగులున్నారు? ఎన్ని ప్రభుత్వోద్యోగాలు ఖాళీగా ఉన్నాయి? సర్కారు గతంలో ఏం చెప్పింది.. ఇప్పుడేం చెప్తోంది?తెలంగాణ ప్రభుత్వం గత మూడున్నరేళ్లలో ఎన్ని ప్రభుత్వోద్యోగాలు కల్పించింది? ప్రైవేటురంగం ఎన్ని ఉద్యోగాల కల్పనకు అవకాశాలు ఇచ్చింది? అంకెలు స్పష్టంగా కనపడుతున్నాయి.. నిరుద్యోగుల సంఖ్య స్పష్టంగా కనిపిస్తోంది. సర్కారు దాటవేతలూ స్పష్టమౌతున్నాయి.. ఉపాధి కల్పన సర్కారు బాధ్యత కాదా? ఉద్యోగాలు జనరేట్ అయ్యే పరిస్థితులు కల్పించాల్సిన ప్రభుత్వాలు ఒప్పందాల ఆడంబరాలకే పరిమితమౌతున్నాయా? తెలుగు రాష్ట్రాల్లో నిరుద్యోగుల భవిష్యత్తు అంధకారమేనా?దేశంలో ప్రభుత్వోద్యోగాలు తగ్గిపోతున్నాయి. సర్కారు తన బాధ్యతలను వదుల్చుకుంటున్న తరుణంలో, పబ్లిక్ సెక్టార్ నుంచి చాలా బాధ్యతలు ప్రైవేటు పరం అవుతున్నాయి.. కానీ, ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయని ప్రభుత్వాలు ప్రైవేటు రంగాన్ని కూడా అంతే నిర్లక్ష్యం చేయటం ఇప్పుడు కనిపిస్తున్న దృశ్యం.. చిన్నా చితకా పని దొరకటానికే నానా కష్టాలు పడాల్సిన పరిస్థితి. ఆ మధ్య పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏలు చదివిన వారు కూడా రావటం పరిస్థితి తీవ్రత అద్దం పడుతోంది.

 

ఉపాధి కల్పించాల్సిన బాధ్యత కచ్చితంగా ప్రభుత్వానిదే. ఉపాధి అవకాశాలు పెరిగే వాతావరణం కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే. ప్రభుత్వ రంగ ఖాళీలను భర్తీ చేయాల్సిన పని సర్కారుదే.. కానీ, సరళీకరణ విధానాల పరుగులో ప్రభుత్వాలు పెట్టుబడులు, లాభాలు అంటూ నేలవిడిచి సాము చేస్తూ ప్రజాసంక్షేమాన్ని గాలికొదులుతున్నాయి. మాటలకే పరిమితమౌతూ కార్పొరేట్ పెద్దలకు అనుకూల నిర్ణయాలతో నిరుద్యోగులను నట్టేట ముంచుతున్నాయి.. ఈ పరిస్థితిలో మార్పు రాకపోతే … తెలుగు రాష్ట్రాల నిరుద్యోగ లోకానికి భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమించటమే మార్గం అవుతుంది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

 

 

 


 

 

కోర్టు తీర్పు ప్రకారమే టీఆర్టీ : కడియం

హైదరాబాద్ : హైకోర్టు ఆదేశాలకు లోబడి 10 జిల్లాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని, కొంత మంది కావాలని ప్రతీ దానికి కోర్టుకు వెళ్తున్నారని విద్య శాఖ మంత్రి కడియం అన్నారు. కొలువులకై కొట్లాట ఎవరు చేస్తున్నారో, ఆ నాయకులు ఎవరో మాకు తెలుసు అని ఆయన అన్నారు. సిద్దాంత విభేదలున్నా వాళ్లంతా కలిసి పని చేస్తున్నారని అన్నారు. 

20:03 - December 4, 2017

ఢిల్లీ : టెస్ట్‌ 3వ రోజు టీమిండియా జోరుకు శ్రీలంక బ్రేక్‌ వేసింది. 131 పరుగులకు 3 వికెట్లతో 3వ రోజు ఆట కొనసాగించిన శ్రీలంక జట్టు భారత్‌కు ధీటుగా బదులిచ్చింది. కెప్టెన్‌ దినేష్‌ చాందిమల్‌, మాజీ కెప్టెన్‌ ఏంజెలో మాథ్యూస్‌లు ఫైటింగ్‌ ఇన్నింగ్స్‌తో శ్రీలంక జట్టు పోటీలో నిలిచింది. భారత బౌలింగ్‌ ఎటాక్‌కు సమర్ధవంతంగా ఎదుర్కొన్న ఈ ఇద్దరూ క్రీజ్‌లో పాతుకుపోయారు. సెంచరీలతో చెలరేగిన చాందిమల్‌,మాథ్యూస్‌ 4వ వికెట్‌కు 476 బంతుల్లో 181 పరుగులు జోడించారు.మాథ్యూస్‌ టెస్టుల్లో 8వ సెంచరీ నమోదు చేయగా....చాందిమల్‌ 10వ టెస్ట్ సెంచరీ పూర్తి చేశాడు.మాథ్యూస్‌ ఔటయ్యాక భారత బౌలర్ల జోరు ముందు మిగతా లంక బ్యాట్స్‌మెన్‌ తేలిపోయారు.దీంతో లంక 3వ రోజు ఆట ముగిసే సరికి లంక 9 వికెట్లు కోల్పోయి 356 పరుగులు చేసింది.తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 180 పరుగులు వెనుకబడి ఉన్న శ్రీలంక జట్టు...పోటీలో నిలవాలంటే అన్ని విభాగాల్లోనూ అంచనాలకు మించి రాణించాల్సిందే. మరోవైపు 4వ రోజే మ్యాచ్‌పై పట్టు బిగించాలని భారత జట్టు పట్టుదలతో ఉంది. 

19:58 - December 4, 2017

చెన్నై : తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కూతురు తానేనంటూ మంజుల అలియాస్‌ అమృత తెరపైకి రావడం కలకలం సృష్టించింది. ఓ తమిళ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో అమృత ఈ విషయాన్ని వెల్లడించారు. తన పెంపుడు తల్లి లలిత 2015లో మరణించారని...అప్పటివరకు తాను ఆమె కూతురుగానే భావించానని... 2017 మార్చిలో పెంపుడు తండ్రి సారథి చనిపోయే సమయంలో తాను జయలలిత కుమార్తేనని చెప్పినట్లు అమృత తెలిపారు. దివంగత తెలుగు సినీనటుడు శోభన్‌బాబు, జయలలిత దాంపత్య ఫలితంగానే తాను జన్మించానని అమృత చెబుతున్నారు.

తొలిసారిగా 1996 జూన్‌లో
తొలిసారిగా 1996 జూన్‌లో జయలలితను కలుసుకున్నట్లు...ఆమె తనని చూసి ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ముద్దుపెట్టుకోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఆ తర్వాత జయలలితను పలుమార్లు కలుసుకున్నానని అమృత తెలిపారు. జయలలిత ఆసుపత్రిలో చేరడానికి ముందు ఫోన్ చేస్తే తనని అక్కడికి రావద్దని వారించినట్లు పేర్కొన్నారు. శశికళ కుటుంబ సభ్యులు జయలలితను కలవకుండా అడ్డుకున్నారని అమృత చెప్పారు.బెంగుళూరులో ఉంటున్న అమృత తాను జయలలిత కుమార్తెనంటూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ కూడా వేశారు. 1980 ఆగస్టు 14న జయలలితకు తాను జన్మించినట్లు.... పెంపుడు తల్లిదండ్రుల వివరాలను పిటిషన్‌లో పేర్కొన్నారు. జయలలిత బతికున్నప్పుడు కుమార్తెనని ప్రకటించుకుంటే ఆమె కీర్తి ప్రతిష్ఠలు దిగజారుతాయని ఆ రహస్యాన్ని ఇన్నాళ్లు దాచి పెట్టానని అమృత పిటిషన్‌లో తెలిపారు. ఆమె పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు... కర్ణాటక హైకోర్టులో తేల్చుకోవాలని సూచించింది.జయలలిత మృతి నేపథ్యంలో... ఆమె వ్యక్తిగత జీవితాన్ని ఆసరాగా తీసుకొని తామే వారసులమంటూ పలువురు తెరపైకి వచ్చారు. అసలు జయకు వారసులున్నారా? లేదా ? అన్నది సస్పెన్స్‌గా మారింది.

 

19:56 - December 4, 2017

హైదరాబాద్ : హైకోర్టు ఆదేశాలకు లోబడి 10 జిల్లాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని, కొంత మంది కావాలని ప్రతీ దానికి కోర్టుకు వెళ్తున్నారని విద్య శాఖ మంత్రి కడియం అన్నారు. కొలువులకై కొట్లాట ఎవరు చేస్తున్నారో, ఆ నాయకులు ఎవరో మాకు తెలుసు అని ఆయన అన్నారు. సిద్దాంత విభేదలున్నా వాళ్లంతా కలిసి పని చేస్తున్నారని అన్నారు. 

19:49 - December 4, 2017

ముంబై : ప్రముఖ బాలీవుడ్ నటుడు శశికపూర్ కన్నుమూశారు. శశికపూర్ కోల్ కత్తాలో 1938 లో జన్మించారు. ఆయన 2011లో పద్మభూషణ్, 2015లో దాదాసహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. ఆయన హీరోగా 61 సినిమాల్లో నటించారు. మొత్తంగా 116 సనిమాల్లో శశికపూర్ నటించారు. 

19:42 - December 4, 2017

కృష్ణా : నకిలీ మందులు సరఫరా చేస్తోన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ అన్నారు. నకిలీ మందులు సరఫరా చేయాలంటేనే భయపడేలా చర్యలుంటాయని చెప్పారు. రాబోయే రోజుల్లో నకిలీ మందులను గుర్తించే కొత్త సాఫ్ట్‌వేర్‌ను అమల్లోకి తీసుకొస్తామన్నారు. ఏపీలో నకిలీ మందులను సరఫరా చేస్తోన్న ఓ ముఠాను విజయవాడ పోలీసులు పట్టుకున్నారు. మంత్రి కామినేని శ్రీనివాస్‌ పోలీసులను అభినందించారు. మందులు కొనుగోలు చేసే ప్రతిఒక్కరూ బిల్లులు తీసుకోవాలని సూచించారు. నకిలీ మందుల రాకెట్‌లో మొత్తం 8 మందిని అరెస్ట్‌ చేసినట్టు విజయవాడ సీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. ఆదాయం కోసం ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే పీడీ యాక్ట్‌ నమోదు చేస్తామని హెచ్చరించారు.

19:40 - December 4, 2017

రంగారెడ్డి : జిల్లా..ఇబ్రహీంపట్నం మండలం, ఆదిభట్ల పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బైక్‌ను .. టిప్పర్‌ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. చనిపోయిన ఇద్దరు హైదరాబాద్‌ బడంగ్‌ పేట్‌కు చెందిన శీల మహేశ్‌, లోకేశ్‌ దుర్గా ప్రసాద్‌లుగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

19:39 - December 4, 2017

ఢిల్లీ : రాహుల్‌ గాంధీ అధ్యక్ష పదవికి నామినేషన్‌ ప్రక్రియ ఒక చారిత్రాత్మక సందర్భమని కాంగ్రెస్‌ నేతలు కొనియాడారు. రాహుల్‌ గాంధీ నామినేషన్‌ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల నుంచి నాయకులు పాల్గొన్నారు. రెండు మూడు రోజుల్లో రాహుల్‌ అధ్యక్ష పదవి చేడతారని నేతలు తెలిపారు. భారతదేశంలో ఉన్న యువకులందరికీ రాహుల్‌ గాంధీ ప్రతినిధిగా ఉన్నారని కాంగ్రెస్‌ నేతలన్నారు.

గుంటూరు జిల్లాలోమ రోడ్డు ప్రమాదం

గుంటూరు : జిల్లా నరసరావు పేటలో విషాదం నెలకొంది. ఓ తల్లి ఇద్దరు కుమారులను రైలు కింద తోసేసి ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంది. మృతులు నాదెండ్ల మండంలం అత్తాపూరానికి చెందిన విజయలక్ష్మి, దిగ్విజయ్, గణేష్ సాయిగా గుర్తించారు. 

19:14 - December 4, 2017

భూపాలపల్లి : జిల్లాలో అత్యంత దారుణం జరిగింది. జిల్లాలోని రేగొండ మండలం గోరికొత్తపల్లిలో రేష్మ అనే చిన్నారి పై గుర్తుతెలియని దుండగులు అత్యాచారం చేసి హతమార్చారు. రాజు, ప్రవళిక దంపతుల కూతురు రేష్మ నిన్న పెళ్లి ఊరేగింపుకు వెళ్లి అదృశ్యమైంది. ఈ రోజు ఊరి పొలాల్లో ఆ చిన్నారి శవమై కనబడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

ఏడేళ్ల బాలికై అత్యాచారం, హత్య

భూపాలపల్లి : జిల్లా రేగొండ మండలం గోరికొత్తపల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఏడేళ్ల బాలిక పావనిని అత్యాచారం, హత్య చేశారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. 

8వ విద్యార్థిపై లైంగిక వేధింపులు

విజయనగరం : జిల్లా సాలూరు మండలంలో మామిడిపల్లిలో దారుణం చోటుచేసుకుంది. లైట్ హౌస్ క్రిస్టియన్ చిల్డ్రన్ హోం నిర్వహకుడు ప్రసాద్, అతని కుమారుడు షారున్ 8వ తరగతి విద్యార్థినిపై గత కొన్నేళ్లుగా లైంగిక దాడి చేస్తున్నారు. బాలిక గర్భం దాల్చడంతో బాలికను హాస్టల్ నుంచి ఇంటికి తరలించాడు. నెల రోజులుగా బాలిక స్కూల్ రావడంలేదని టీచర్స్ ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది. 

18:45 - December 4, 2017

విశాఖ : నగరవాసుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. సైన్స్‌ ఎగ్జిబిషన్‌, పుస్తక ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు, గృహోపకరణ వస్తువులు, ఫుడ్‌ కోర్టు, ప్రభుత్వ రంగ సంస్థల స్టాల్స్‌, ఉత్తరాంధ్ర చరిత్ర, ఎగ్జిబిషన్‌ షార్ట్‌ ఫిల్మ్స్‌ ఎగ్జిబిషన్‌లను ఏర్పాటు చేశారు. అబ్దుల్‌ కలాం పేరుతో ఏర్పాటు చేసిన సైన్స్‌ ఎగ్జిబిషన్‌లో విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులు ప్రదర్శించారు. మాయాజాలాల వెనుక ఉన్న సైన్సు కారణాలను వివరించే జనవిజ్ఞాన వేదిక ఆకర్షణీయ ప్రదర్శనలు అందిస్తోంది. హ్యాండ్స్‌ అండ్‌ లెర్నింగ్‌ ప్రోగ్రామ్స్‌, మ్యాజిక్‌ షోలతో విద్యార్థులు అదరగొడుతున్నారు. ప్రాజెక్టులు, సైన్సు మాయజాలం వంటివి కళ్లకు కట్టినట్లు చూయించడం చాలా ఆనందంగా ఉందని సందర్శకులు చెబుతున్నారు.పుస్తక ప్రదర్శన వల్ల చాలా ఉపయోగాలున్నాయని, తమకు నచ్చిన పుస్తకాలు ఇక్కడ లభిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని సందర్శకులు చెబుతున్నారు. విశాఖ ఫెస్ట్‌లో కళాకారులు, విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను అలరింపజేశాయి. జానపద, శాస్త్రీయ నృత్యాలతో పాటు యువతీ యువకులు బ్రేక్‌ డ్యాన్సులతో అదరగొట్టారు. 

18:42 - December 4, 2017

గుంటూరు : వ్యవసాయ రంగంలో నూతన సాంకేతికతను తీసుకు వచ్చేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ముఖ్యంగా పొలాల్లో పిచికారీ చేసినప్పుడు రైతులకు కలిగే ఆరోగ్య సమస్యల నివారణకు చర్యలు తీసుకోవాలని యోచిస్తోంది. పిచికారీ కోసం రైతులు గంటల తరబడి పొలాల్లో శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో అప్రయత్నంగా పురుగుమందులను గాలితో పాటు పీలుస్తూ అనారోగ్యం పాలవుతున్నారు. దీంతో ఇలాంటి సమస్యలకూ పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం.. సేద్యంలో డ్రోన్‌లను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. విదేశాల్లో పురుగు మందుల పిచికారి, భూసార పరిస్థితి, పంటలపై పురుగుల ప్రభావాన్ని గుర్తించేందుకు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. ఈ తరహాలోనే ఆంధ్రప్రదేశ్‌లోనూ డ్రోన్ల సేవలు వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రస్తుత రబీ నుంచే ఈ సేవలను ప్రయోగాత్మకంగా చేపట్టబోతోంది.ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో డ్రోన్లను వినియోగించుకుంటోంది.

విదేశాల నుంచి దిగుమతి
దీనికోసం డ్రోన్ల కార్పొరేషన్‌ ఏర్పాటుతో పాటు విదేశాల నుంచి దిగుమతి చేసుకునేందుకు కేంద్రం నుంచి అనుమతి తీసుకుంది. భూగర్భగనులశాఖలో డ్రోన్‌లను విరివిగా ఉపయోగిస్తున్నారు. డ్రోన్ల సాయంతో చిత్రాలు తీసి గనుల్లో ఎంత విస్తీర్ణంలో, ఎంత పరిమాణంలో ఖనిజం తవ్వారో విశ్లేషిస్తారు. రహదారుల నిర్మాణం, వాటి పరిస్థితిని తెలుసుకునేందుకు కూడా డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. ప్రాజెక్టు పనుల పరిశీలనకు, కాల్వల పరిస్థితిని తెలుసుకునేందుకు వీటి సేవలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ప్రదర్శనలు, బహిరంగ సభల్లోనూ డ్రోన్ల సాయంతో నిఘా చేపడుతున్నారు. మందు చల్లాల్సిన పొలాన్ని గుర్తించి కంప్యూటర్‌పై సంకేతాలు ఇస్తే చాలు నిర్దేశిత ప్రాంతంలోనే డ్రోన్‌ తిరుగుతూ మందు చల్లుతుంది. విద్యుత్‌ స్తంభాలు, చెట్లకు డ్రోన్లు తగలకుండా ముందే సూచనలు ఇస్తారు. పొలంలో కీటకాలు, పురుగుల తీవ్రతను గుర్తించి మందులు పిచికారి చేసే ఆధునిక డ్రోన్లు ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డ్రోన్‌లలో మూడు లీటర్ల నీటిని తీసుకువెళ్లే సామర్థ్యమున్నవి లక్షన్నర రూపాయలు.. అయిదు లీటర్ల సామర్థ్యమున్న డ్రోన్‌ మూడు లక్షలు, 20 లీటర్ల డ్రోన్‌ ఆరులక్షల రూపాయల మేర ధర పలుకుతోంది. వీటి వినియోగం వల్ల.. పురుగు మందుల వినియోగంలో వృథాను కూడా అరికట్టవచ్చు. వీటి ద్వారా పిచికారీ చేసేందుకు ఎకరానికి 600 వరకు అవుతుంది. ఇదే పనిని కూలీల ద్వారా చేస్తే 200 రూపాయల ఖర్చు అవుతుంది.

50 శాతం రాయితీపై డ్రోన్లు
ఈ వ్యత్యాసాన్ని తగ్గించగలిగితే రైతులు డ్రోన్లను వినియోగించుకునే అవకాశాలున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం యాంత్రీకరణ పథకంలో భాగంగా ట్రాక్టర్లు, ఇతర యంత్రపరికరాలు ఇస్తున్న విధంగానే వ్యవసాయ, ఉద్యానశాఖల ద్వారా 50 శాతం రాయితీపై డ్రోన్లను అందించాల్సిన అవసరం ఉంది. చేతి పంపులు, తైవాన్‌ స్ప్రేయర్లలో పోసే మందులు డ్రోన్ల ద్వారా చల్లేందుకు వీలుండదు. హై వాల్యూమ్‌తో పనిచేసే వాటిని మాత్రమే ఉపయోగించాలి. డ్రోన్ల ద్వారా పురుగు మందుల పిచికారిపై ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నివేదిక రూపొందించింది. డ్రోన్ల ద్వారా ఉపయోగించే మందులు, వాటిని ఎంత పరిమాణంలో వాడాలనే విషయమై సూచనలు చేయనున్నట్లు ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏడీఆర్‌ రత్నప్రసాద్‌ తెలిపారు. రైతుల్ని ఈ విధంగా ప్రోత్సహించేందుకు తీసుకునే చర్యలు, ఎకరంలో మందు చల్లడానికి అయ్యే ఖర్చు, రాయితీ అంశాలను పరిశీలిస్తున్నామన్నారు. పదిరోజుల్లో దీనిపై విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

18:41 - December 4, 2017

కడప : రజకులను ఎస్సీజాబితాలోకి చేర్చాలని రాష్ట్ర రజక సంఘం అధ్యక్షుడు పాతపాటి అంజిబాబు డిమాండ్‌ చేశారు. 18 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్సీలుగా ఉన్న రజకులను ఏపీలో విస్మరించడం దారుణమన్నారు. కాపులను బీసీల్లోకి, వాల్మీకి బోయలను ఎస్టీల్లోకి చేర్చి రజకులను విస్మరించడంపై మండిపడ్డారు. ఇప్పటికైనా చంద్రబాబు రజకులను ఎస్సీ జాబితాలోకి చేర్చాలని లేదంటే ఉద్యమాలు చేసి సాధించుకుంటామని హెచ్చరించారు. 

18:39 - December 4, 2017

అనంతపురం : అబద్దాలు చెప్పడం, మోసాలు చేయడంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దిట్టని వైసీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. మూడేళ్లుగా అబద్దాలు, మోసాలతోనే చంద్రబాబు పాలన సాగిస్తున్నారని విమర్శించారు. అబద్దాలు చెప్పేవారు, మోసాలు చేసే వారు రాష్ట్రానికి నాయకుడిగా ఉండాలా అని ప్రశ్నించారు. అందుకే రానున్న ఎన్నికల్లో టీడీపీని ఓడించాలని కోరారు. జగన్‌ తన పాదయాత్రలో భాగంగా అనంతపురం జిల్లా గుత్తిలో జరిగిన సభలో ప్రసంగించారు. ఏపీకి ప్రత్యేక హోదాను చంద్రబాబు తెరమరుగు చేశారని ఆరోపించారు. 

18:38 - December 4, 2017

ఢిల్లీ : కాంగ్రెస్‌వి వారసత్వ రాజకీయాలన్న బీజేపీ నేతల వ్యాఖ్యలపై రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు మండిపడ్డారు. వారసత్వ రాజకీయాల గురించి బీజేపీ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. దేశం కోసం ఇందిరాగాంధీ కుటుంబం ఆత్మబలిదానాలు చేసిందని గుర్తు చేశారు. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన రాహుల్‌గాంధీపై విమర్శలు చేయడమేంటని KVP ప్రశ్నించారు. 

18:37 - December 4, 2017

తూర్పుగోదావరి : శాస్త్రీయ పద్ధతిలో జరిగిన కాపు రిజర్వేషన్లకు కేంద్రం అనుమతి బాధ్యతను తామే తీసుకుంటామని ఏపీ డిప్యూటీ సీఎం చినరాజప్ప తెలిపారు. దశాబ్ధాల పాటు పెండింగ్‌లో ఉన్న డిమాండ్‌ను నెరవేర్చిన ఘనత చంద్రబాబుకే దక్కిందని ఆయన అన్నారు. టీడీపీ హయాంలో బీసీల ప్రయోజనాలకు ఎలాంటి ఇబ్బంది వుండదని హామీ ఇచ్చారు.

18:25 - December 4, 2017

విజయనగరం : జిల్లా సాలూరు మండలంలో మామిడిపల్లిలో దారుణం చోటుచేసుకుంది. లైట్ హౌస్ క్రిస్టియన్ చిల్డ్రన్ హోం నిర్వహకుడు ప్రసాద్, అతని కుమారుడు షారున్ 8వ తరగతి విద్యార్థినిపై గత కొన్నేళ్లుగా లైంగిక దాడి చేస్తున్నారు. బాలిక గర్భం దాల్చడంతో బాలికను హాస్టల్ నుంచి ఇంటికి తరలించాడు. నెల రోజులుగా బాలిక స్కూల్ రావడంలేదని టీచర్స్ ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

బాలీవుడ్ నటుడు శశికపూర్ కన్నుమూత

ముంబై : ప్రముఖ బాలీవుడ్ నటుడు శశికపూర్ కన్నుమూశారు. శశికపూర్ కోల్ కత్తాలో 1938 లో జన్మించారు. ఆయన 2011లో పద్మభూషణ్, 2015లో దాదాసహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. ఆయన హీరోగా 61 సినిమాల్లో నటించారు. మొత్తంగా 116 సనిమాల్లో శశికపూర్ నటించారు. 

18:04 - December 4, 2017

మూడోరోజు ముగిసిన ఆట

ఢిల్లీ : శ్రీలంకతో జరుగుతున్న మూడవ టెస్టు మూడవ రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్ లో తొమ్మిది వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసింది. శ్రీలంక 180 పరుగుల వెనుకంజలో ఉంది. 

ఏపీ నిరుద్యోగులకు వయోపరిమితి పెంపు

గుంటూరు : ఏపీలో ప్రభుత్వ ఉద్యోగలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు వయో పరిమితి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 42 ఏళ్లకు వయోపరిమితి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీపీఎస్సీ, ఇతర ఉద్యోగాలకు జనరల్ కేటగిరి అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి 42 ఏళ్లకు పెంచారు. 

17:46 - December 4, 2017

ఉల్లి కోయకుండానే కన్నీళ్లు తెప్పించేస్తోంది. ధరల పెరుగుదలతో ఉల్లిపాయలు జనానికి అందుబాటులో లేకుండా పోయాయి. రేట్ల మంట ప్రజలకు తంటాగా మారింది. ఆకాశాన్ని అంటుతున్న ఉల్లి రేట్లతో ప్రజల గుండెలు మార్కెట్‌లో ఉల్లి లభ్యత తగ్గింది. ఉత్పత్తి, వినియోగానికి మధ్య విపరీతమైన వ్యత్యాసం ఉంది. గత ఏడాది ఉల్లి ధరలు పాతాళానికి పడిపోవడంతో రైతులు ఉల్లిసాగు తగ్గించారు. సాగుచేసిన పంట కూడా ఈ ఏడాది అక్టోబర్‌లో కురిసిన వర్షాలకు పూర్తిగా దెబ్బతింది. దీంతో ఉత్పత్తి తగ్గడంతో కిలో రూ.60లకు చేరింది. రైతు బజార్లలో ఉల్లి రూ.35కి అమ్మాలని మార్కెటింగ్‌ శాఖ నిర్ణయించడంతో బయట అంతకన్నా పెంచుతున్నారు. తెలంగాణ జిల్లాల నుంచి వస్తున్న తేమ ఉల్లిగడ్డలను రైతుబజార్లలో పెడుతూ ధర తక్కువగా చూపుతున్నారు.

తెలంగాణలో తగ్గిన ఉల్లి సాగు
తెలంగాణలో ఉల్లిసాగు గణనీయంగా తగ్గింది. ప్రస్తుత రబీలో 25 వేల ఎకరాల్లో సాగు కావాలి. కానీ ఇప్పటివరకు దీనిలో పదోవంతు కూడా సాగు కాలేదు. గత ఖరీఫ్‌లో 12,500 ఎకరాల్లో వేయాల్సి ఉండగా 8,500 ఎకరాల్లో మాత్రమే సాగైంది. రాయలసీమలో ఉల్లిపంట దెబ్బతిన్నంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. 2015-16 వ్యవసాయ సీజన్‌తో పోలిస్తే 2016-17లో దేశవ్యాప్తంగా 7.87 లక్షల టన్నుల ఉల్లిగడ్డల అధిక దిగుబడి మహారాష్ట్ర నుంచి వస్తున్న నాణ్యమైన ఉల్లికి విపరీతమైన డిమాండ్‌ ఉంది. దీంతో వ్యాపారులు కూడా రైతులకు ఎక్కువ చెల్లించి ఉల్లి కొనుగోలు చేస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో వీటిని ఎక్కువ రేటుకు విక్రయిస్తున్నారు. స్వదేశీ మార్కెట్‌లో ఉల్లి ధరలు పెరుతున్న నేపథ్యంలో రేట్లను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎగుమతులపై ఆంక్షలు విధించింది. ఈ ఏడాది జులైలో టన్ను ఉల్లి కనీస ఎగుమతి ధర 186 డాలర్లుండగా ఇప్పుడు 850 డాలర్లకు పెంచింది. దీంతో ఆసియా దేశాలకు ఎగుమతులు తగ్గినా... మన దేశంలో ఇంకా రేట్లు నియంత్రణలోకి రాలేదు. భారత్‌, పాక్‌ల నుంచి ఎగుమతులు తగ్గిపోవడంతో మలేషియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌ తదితర దేశాల్లో ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అయితే గత నెలలో ఉల్లి సాగు ప్రారంభమైంది. ప్రస్తుతం సాగులో ఉన్న ఉల్లి మార్కెట్‌లోకి వచ్చేందుకు మరో నెలపైనే పడుతుంది. పైగా ఇతర దేశాల నుంచి ఉల్లి ఎగుమతి ఆర్డర్ల డిమాండ్‌ ఉండడంతో ధరలు తగ్గే అవకాశాలు లేదని భావిస్తున్నారు.  

17:33 - December 4, 2017
17:31 - December 4, 2017

కరీంనగర్/ పెద్దపల్లి : జిల్లా మంథని నియోజకవర్గంలో అనసూయమ్మ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో జాబ్‌మేళా నిర్వహించారు. 18 నుండి 35 సంవత్సరాలలోపు ఉన్న నిరుద్యోగ యువతీ, యువకులకు ఓటు స్కిల్స్‌ కంపెనీ ద్వారా వివిధ రంగాల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్టు ట్రస్ట్‌ చైర్మన్ సునీల్‌ తెలిపారు. ట్రస్టు ద్వారా 500 మందికి శిక్షణ ఇప్పించి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. జాబ్‌మేళాలో ఎంపికైన అభ్యర్థులకు ఉచిత భోజనం, వసతి కల్పిస్తామని తెలిపారు. 

17:28 - December 4, 2017

మేడ్చల్ : జిల్లా.. శామీర్‌పేట్‌ మండలం ..అలియాబాద్ గ్రామంలో 39వ కుర్మల దసరా, దీపావళి సమ్మేళన కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్రంలో కుల సంఘాలను ప్రోత్సహించేందుకు సీఎం కేసీఆర్‌ కోట్లాది నిధులతో కృషి చేస్తున్నారని.. మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. కుర్మ, గొల్ల, యాదవుల సంక్షేమానికి ఐదు వేల కోట్లతో గొర్రెలను అంది స్తున్నారని చెప్పారు. అన్ని వర్గాలు అభివృద్ధి చెందితేనే బంగారు తెలంగాణ సాధ్యమని... ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక మంత్రి రేవన్‌ పాల్గొన్నారు.

17:26 - December 4, 2017

కరీంనగర్/జగిత్యాల : రైతులు ఆందోళన నిర్వహించారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి ఎస్సారెస్పీ కెనాల్‌ వద్ద 36వ కిలోమీటరు నుండి 45 కిలోమీటర్ల వరకు 9 కిలోమీటర్ల మేర మరమ్మతులు చేపట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. కాల్వలకు మరమ్మతుల పేరుతో...తమ పొలాల్లోకి నీరు రాకుండా అడ్డుకుంటారని దీంతో తమకు నష్టం జరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 7 గ్రామాల రైతులు ఎస్సారెస్పీ కాలువపై ఉన్న గేట్ల వద్దకు వచ్చి ఆందోళన నిర్వహించారు. అనంతరం మెట్‌పల్లికి ర్యాలీగా వచ్చి ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌కు తమ గోడును విన్నవించుకున్నారు. దీంతో పనులను నిలిపివేయాలని సంబంధిత అధికారులకు సూచించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

 

17:24 - December 4, 2017

మహబూబ్ నగర్ : రెండు పడకల గదుల ఇళ్లు పేదవాడి ఆత్మగౌరవానికి ప్రతీక అని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రతి పేదవాడికి ఇళ్లు ఇవ్వడమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ లక్ష్యమన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్ పల్లిలో 710 డబుల్ బెడ్ రూం ఇళ్లకు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. దాంతో పాటు నిర్మాణం పూర్తయిన 310 ఇళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా దేశంలో ఎవరికి సాధ్యంకానీ విధంగా రాష్ట్రంలో 18 వేల కోట్లతో 2 లక్షల 72 వేల డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. 

17:23 - December 4, 2017

హైదరాబాద్ : కోదండరాం స్వలాభం కోసం నిరుద్యోగ సమస్యపై పోరాడటం లేదని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య అన్నారు. ఇది నిరుద్యోగులందరి సమస్య అని చెప్పారు. నిరుద్యోగ సమస్యను ఏజెండాపైకి తీసుకురావడమే కోదండరాం చేసిన తప్పా అని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. అరెస్ట్‌లు, నిర్బంధాలతో ఉద్యమాలను ప్రభుత్వం ఎప్పుడూ ఆపలేదన్నారు. ఇప్పటికైనా కేసీఆర్‌ నిరుద్యోగుల్లో గూడుకట్టుకున్న అసంతృప్తిని గుర్తించాలని, వెంటనే ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమమంతా విద్యార్థుల త్యాగాల ఉద్యమమేనని ప్రజాగాయకుడు, యుద్ధనౌక గద్దర్‌ అన్నారు. కొట్లాడితేనే తెలంగాణ వచ్చిందని.... కొట్లాడే కొలువులు తెచ్చుకుందామని పిలుపునిచ్చారు. పోరాటంతోనే హక్కులు సాధించుకోవాలన్నారు. ఈ సందర్భంగా పాటలుపాడి నిరుద్యోగులను ఉత్సాహపరిచారు. 

విజయవాడలో నకిలీ మందులు

కృష్ణా : జిల్లా విజయవాడలో నకిలీ మందుల గుట్టురట్టైంది. ఈ కేసులో 8 మందని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  నకిలీ మందుల వ్యవహారం ఉత్తరాఖండ్ కేంద్రంగా జరుగుతున్నట్టు, వారు ప్రముఖ కంపెనీల పేరుతో నకిలీ మందుల తయారు చేస్తున్నట్టు తెలుస్తోంది. అక్టోబర్ 30న జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి చెందిన నకిలీ మందులు చలామణి అతున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది.

16:30 - December 4, 2017

గుంటూరు : జిల్లా అచ్చంపేట మండలం కొండూరులో ఉద్రిక్తత నెలకొంది. పేదలకు ప్రభుత్వం ఇచ్చిన భూములను అధికార పార్టీ నేతలు అక్రమించుకుని పంట వేశారు. అక్రమణకు గురైన భూముల్లో పంటను కోసుకునేందుకు సీపీఎం ఆధ్వర్యంలో రైతులు వెళ్లారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

కొలువులకై కొట్లాట సభకు భారీగా తరలివచ్చిన విద్యార్థులు

హైదరాబాద్ : సరూర్ నగర్ లో టీ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న కొలువులకై కొట్లాట సభకు విద్యార్థులు భారీగా తరలివచ్చారు. ఈ సభకు కోదండరామ్, గద్దర్, చాడ, చుక్కారామయ్య, జీవన్ రెడ్డి, శ్రావన్ హాజరైయ్యారు. 

ఖమ్మం జిల్లాలో నిలిచిన 108 వాహనాలు

ఖమ్మం : జిల్లాలో 108 వాహనాలు నిలిచిపోయాయి. డీజిల్ లేకపోవడమే వాహనాలు నిలిచిపోవడానికి కారణమని తెలుస్తోంది. గత 3 రోజులుగా ఒక్కొక్కటిగా 108 వాహనాలు ఆగిపోయాయి.

కరీంనగర్ లో కలకలం రేపుతున్న ఔషధ ప్రయోగాలు

కరీంనగర్: జిల్లాలో ఔషధ ప్రయోగాలు కలకలం రేపుతున్నాయి. నాగరాజు కౌన్సిలింగ్ ఇస్తున్న వీడియో టేపులను పోలీసులు బయట పెట్టారు. 5 నెలల క్రితం నాగరాజు అనే వ్యక్తి క్లినికల్ ట్రయల్స్ వికటించి మరణించాడు.

15:56 - December 4, 2017

కర్నూలు : జిల్లాలో తన భూమిని కబ్జా చేశారంటూ కలెక్టరేట్ వద్ద ఈర్లపాడుకు చెందిన రైతు శ్రీనివాసులు సెల్ టవర్ ఎక్కాడు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పటించుకోవడం లేదంటూ రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

15:52 - December 4, 2017

హైదరాబాద్ : తెలంగాణలో నిరుద్యోగం తీవ్రంగా ఉందని టీ జేఏసీ చైర్మన్ కోదండరామ్ అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం క్యాలెండర్ ఇయర్ ప్రకటించి ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కొలువులకై కొట్లాట సభకు వచ్చే వారిని పోలీసులు అడ్డుకుంటున్నారని ఆయన అన్నారు.

15:48 - December 4, 2017

కరీంనగర్ : జిల్లాలో ఔషధ ప్రయోగాలు కలకలం రేపుతున్నాయి. నాగరాజు కౌన్సిలింగ్ ఇస్తున్న వీడియో టేపులను పోలీసులు బయట పెట్టారు. 5 నెలల క్రితం నాగరాజు అనే వ్యక్తి క్లినికల్ ట్రయల్స్ వికటించి మరణించాడు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

15:42 - December 4, 2017

ఖమ్మం : జిల్లాలో 108 వాహనాలు నిలిచిపోయాయి. డీజిల్ లేకపోవడమే వాహనాలు నిలిచిపోవడానికి కారణమని తెలుస్తోంది. గత 3 రోజులుగా ఒక్కొక్కటిగా 108 వాహనాలు ఆగిపోయాయి. ఇంత వరకు అధికారులు పట్టించుకోవడం లేదు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

15:35 - December 4, 2017

హైదరాబాద్ : విద్యార్థులో నిరాశ నెలకొందని ప్రముఖ విద్యవేత్ చుక్కా రామయ్య అన్నారు. ప్రభుత్వం దేని కోసమైతే ఏర్పాడిందో అది చేయడం లేదని, కోదండరామ్ పై విమర్శలు చేయడంపై సరికాదని, ఆయన అతని కోసమో, పదవి కోసమో పోరాటం చేయడంలేదని విద్యార్థుల కోసమే పోరాటం చేస్తున్నారని రామయ్య అన్నారు.

ప్రారంభమైన కొలువులకై కొట్లాట సభ

హైదరాబాద్ : సరూర్ నగర్ లో టీ. జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న కొలువులకై కొట్లాట సభ ప్రారంభమైంది. సభ వేదికకు మొదటి అమరుడు శ్రీకాంత్ చారి పేరు పెట్టారు. సభ ప్రారంభమయ్యే ముందు అమరవీరులకు టీ.జేఏసీ, వివిధ పార్టీల నాయకులు వివాళులు అర్పించారు.

కొండూరులో ఉద్రిక్తత....

గుంటూరు : జిల్లా అచ్చంపేట మండలం కొండూరులో ఉద్రిక్తత నెలకొంది. పేదలకు ప్రభుత్వం ఇచ్చిన భూములను అధికార పార్టీ నేతలు అక్రమించుకుని పంట వేశారు. అక్రమణకు గురైన భూముల్లో పంటను కోసుకునేందుకు సీపీఎం ఆధ్వర్యంలో రైతులు వెళ్లారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు.

సెల్ టవర్ ఎక్కిన రైతు...

కర్నూలు : జిల్లాలో తన భూమిని కబ్జా చేశారంటూ కలెక్టరేట్ వద్ద ఈర్లపాడుకు చెందిన రైతు శ్రీనివాసులు సెల్ టవర్ ఎక్కాడు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పటించుకోవడం లేదంటూ రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

15:04 - December 4, 2017

నల్లగొండ : జిల్లా మర్రిగూడ మండలం చర్లగూడెం రిజర్వాయర్ వద్ద భూ నిర్వాసితులు పనులు అడ్డుకునేందుకు వచ్చారు. పోలీసులు నిర్వాసితులను అడ్డుకోవడంతో పోలీసులకు, నిర్వాసితులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తతంగా మారి ఘర్షణ చోటుచేసుకుంది. ఘర్షణలో సీఐ బాలగంగిరెడ్డి,10 మంది రైతులకు గాయాలయ్యాయి. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

మహబూబ్ నగర్ జిల్లాలో కేటీఆర్ పర్యటన

మహబూబ్ నగర్ : జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. క్రిస్టియన్ పల్లిలో 320 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటీఆర్ ప్రారంభించారు. అబ్ధిదారులతో సామూహిక గృమూహిక గృహప్రవేశం చేయించారు.

14:48 - December 4, 2017

కడప : జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌ రెడ్డి అభివృద్ధి పనులకు అడ్డంపడుతూ టీడీపీ నాయకులపై విమర్శలు చేయడం హాస్యాస్పదం అన్నారు కమాలపురం టీడీపీ ఇంచార్జ్‌ పుత్త నరసింహారెడ్డి. కమలాపురం నియోజకవర్గ పరిధిలోని సర్వరాయసాగర్‌ ప్రాజెక్టును ఇతర చెరువులను ఆయన పరిశీలించారు. నీటితో చెరువులను చూసి హర్షం వ్యక్తం చేశారు. కమాలాపురం నియోజకవర్గంలో అభివృద్ధి పనుల్లో జాప్యం జరగడానికి కారణం రవీంద్రనాథ్‌ రెడ్డి అని ఎద్దేవా చేశారు.

14:47 - December 4, 2017

కరీంనగర్ : టెన్‌టీవీ కథనాలతో పోలీసుల్లో కదలిక వచ్చింది. కరీంనగర్‌జిల్లాలో ప్రజలపై ఔషదాల ప్రయోగం కేసులో విచారణ వేగవంతం అయింది. ఇవాళ సీపీ కమలాసన్‌ రెడ్డి ఎదుట ఫాఫర్మాకంపెనీల ప్రతినిధులు హాజరైయ్యారు. అటు బాధితుల కుటుంబాలు కూడా విచారణకు హాజరయ్యారు. 

14:46 - December 4, 2017

కడప : జిల్లా ప్రొద్దుటూరు హోమస్‌ పేటవీధిలో కన్వ మార్ట్‌ ఫ్యామిలీ స్టోర్‌ రెడిమేడ్‌ షోరూమ్‌ ప్రారంభమైంది. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని తమ షోరూంను రూపొందించామని యాజమాన్యం తెలిపింది. ప్రముఖ వ్యాపార వేత్త బూసెట్టి.రామ్మోహన్‌ రావు ముఖ్య అతిథిగా హాజరై షోరూం ప్రారంభించారు.

14:45 - December 4, 2017

కడప : కాపులను బీసీలో చేరుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కడపజిల్లా రైల్వేకోడూరులో కాపులు హర్షం వ్యక్తం చేశారు. నగరంలో భారీ ర్యాలీ తీశారు. అనంతరం ఎన్టీఆర్ , శ్రీకృష్ణదేవరాయ విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో స్ధానిక టీడీపీ ఇంఛార్జ్‌ కస్తూరి విశ్వనాథనాయుడుతో పాటు పలువురు కాపు నేతలు పాల్గొన్నారు. 

14:44 - December 4, 2017

హైదరాబాద్ : కొలువులకై కొట్లాట సభలో పాల్గొనేందుకు హైదరాబాద్‌ వస్తున్న నిరుద్యోగులను పోలీసులు అరెస్టు చేయడాన్ని కాంగ్రెస్‌ నేతలు తప్పు పట్టారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ నిరంకుశ పాలనకు ఈ నిర్బంధమే నిదర్శనమని సీఎల్‌పీ ఉపనేత జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. హైకోర్టు అనుమతిలో నిర్వహిస్తున్న కొలువులకై కోట్లాట సభకు పోలీసులు ఆటంకాలు కల్పించడం కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని జీవన్‌రెడ్డి మండిపడ్డారు. మరోవైపు ఉస్మానియా యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి మురళి రాసిన సూసైడ్‌ నోట్‌ను పోలీసులు మార్చివేశారని టీపీసీసీ అధికార ప్రతినిధి శ్రవణ్‌ ఆరోపించారు. 

14:40 - December 4, 2017

గెలుపు ఒటములు ప్రతి ఒక్కరి జీవితంలో సర్వసాధారణం. ఒటమిని సవాలుగా తీసుకుంటే గెలుపును సాధించగలము. అటువంటి పోరాట పటిమఉంటే అంగవైకల్యాం కూడా తల వంచక తప్పదు. ఆత్మఅభిమానం ముందు అవమానాలు చిన్నబోక మానవు. వైకల్యాం అధిమి పడితే చేధించుకున్న బతుకు చిత్రాన్ని మార్చుకుంటున్న ప్రతిభవంతులు ఎందరో ఉన్నారు. ప్రతిభపాటవలతో ఈసడించుకున్న వ్యవస్థను ఒడించిన విభిన్న ప్రతిభవంతురాలు వారి జీవితాలలో విజయ కేతనాలుగా నిలిచారు. వైకల్యాన్ని జయించిన వారి స్ఫూర్తి గాథలేన్నో ఎన్నోన్నో డిసెంబర్ ప్రపంచ డిసెబుల్ డే సందర్బంగా పలు స్ఫూర్తిదాయక కథనాలతో మీ ముందుక వచ్చింది మానవి స్ఫూర్తి. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

నల్లగొండలో ఉద్రిక్తత

నల్లగొండ : జిల్లా మర్రిగూడ మండలం చర్లగూడెం రిజర్వాయర్ వద్ద భూ నిర్వాసితులు పనులు అడ్డుకునేందుకు వచ్చారు. పోలీసులు నిర్వాసితులను అడ్డుకోవడంతో పోలీసులకు, నిర్వాసితులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తతంగా మారి ఘర్షణ చోటుచేసుకుంది. ఘర్షణలో సీఐ బాలగంగిరెడ్డి,10 మంది రైతులకు గాయాలయ్యాయి. 

14:14 - December 4, 2017

తమిళ చిత్రాన్ని నిర్మాత కృష్ణారెడ్డి తెలుగులో 'ఇంద్రసేన'గా విడుదల చేశారు. విజయ్ ఆంటోని, మహిమా, డయానా చంపిక హీరోహీరోయిన్లుగా జి.శ్రీనివాసన్‌ దర్శకత్వంలో చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా ఇటీవల రిలీజ్ అయింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో విజయ్ ఆంటోని మాట్లాడుతూ.. 'చాలా తక్కువ టైమ్‌లోనే తెలుగు ప్రేక్షకులు నాపై ఇంత ప్రేమాభిమానాలను చూపించడం చాలా ఆనందంగా ఉంది. వారిని అలరించే సినిమాలు తీసేందుకు ప్రయత్నిస్తున్నా. 'ఇంద్రసేన' మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. అన్ని వర్గాల నుంచి మంచి స్పందన లభిస్తోంది. సినిమా గురించి పాజిటివ్‌గా మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌ బాగా ఆదరిస్తున్నారు' అని అన్నారు. 

సభా ప్రాంగణానికి చేరుకున్న కోదండరామ్

హైదరాబాద్ : సరూర్ నగర్ లో జరుగుతున్న టీ. జేఏసీ కొలువులకై కొట్లాట సభా ప్రాంగణానికి కోదండరామ్ చేరుకున్నారు. సభలో ప్రస్తుతం సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 

మరో నిరుద్యోగి ఆత్మహత్య...

నిర్మల్ : జిల్లా కుంటాల మండలం లింబాద్రిలో విషాదం నెలకొంది. భూమేశ్ అనే నిరుద్యోగి ఉద్యోగం వచ్చే అవకాశం లేదని ఆత్మహత్య చేసుకున్నాడు. భూమేశ్ ఎంఎస్సీ బీఈడీ చేశాడు. ఆదివారం రాత్రి ఇంట్లో భూమేశ్ ఉరి వేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

14:10 - December 4, 2017

రోబో 2.0 రిలీజ్ డేట్ మరోసారి వాయిదా పడింది. జనవరిలో విడుదల చేయాల్సిన సినిమాను ఏప్రిల్‌లో రిలీజ్‌కు ప్లాన్‌ చేస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్‌, అమీజాక్సన్‌ హీరో, హీరోయిన్లుగా అక్షయ కుమార్‌ విలన్‌గా శంకర్‌ దర్శకత్వంలో '2.0' చిత్రం తెరకెక్కుతున్న విషయం విదితమే. ఈ సందర్భంగా నిర్మాత, లైకా ప్రొడక్షన్‌ క్రియేటివ్‌ హెడ్‌ రాజు మహాలింగం మాట్లాడుతూ.. 'సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, గ్రేట్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'రోబో' ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మళ్ళీ ఇదే కాంబినేషన్‌లో 'రోబో' చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న '2.0' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కి తగ్గట్టుగానే భారతీయ సినిమాల్లోనే 450 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ వాల్యూస్‌తో హాలీవుడ్‌ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం' అని అన్నారు. 

 

14:09 - December 4, 2017

నిర్మల్ : నిన్న ఓయూలో జరిగిన విద్యార్థి మురళి ఆత్మహత్య జరిగిన కొన్ని గంటలకే మరో విద్యార్థి ఆత్మహత్య కు పాల్పడ్డాడు. నిర్మల్ జిల్లా కుంటాల మండలం లింబాద్రిలో భూమేశ్ అనే నిరుద్యోగి ఉద్యోగం వచ్చే అవకాశం లేదని ఆత్మహత్య చేసుకున్నాడు. భూమేశ్ ఎంఎస్సీ బీఈడీ చేశాడు. ఆదివారం రాత్రి ఇంట్లో భూమేశ్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కొలువులకై కొట్లాట సభ జరుగుతున్న తరుణంలో విద్యార్థులు ఆత్మహత్యలు పాల్పడాడం తీవ్ర ఆందోళనలకు గురి చేస్తున్నాయి. తెలంగాణ కోసం విద్యార్థులు బలిదానలు ఎలా చేశారో కొలువు కోసం కూడా విద్యార్థులు ఆత్మబలిదానలు చేయడం పట్ల మేధావి వర్గం ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఏ లక్ష్యం కోసమైతే తెలంగాణ కోసం పోరాడమే ఆ లక్ష్యాని సాధించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని టీ. జేఏసీ నేతలు అంటున్నారు. మరి మురళి, భూమేశ్ మరణాలతో అయిన ప్రభుత్వానికి కనివిప్పు కల్గుతుందో చూడాలి. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

14:06 - December 4, 2017

హైదరాబాద్ : కొలువులకై కొట్లాట సభలో పాల్గొనేందుకు హైదరాబాద్‌ వస్తున్న నిరుద్యోగులను పోలీసులు అరెస్టు చేయడాన్ని కాంగ్రెస్‌ నేతలు తప్పు పట్టారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ నిరంకుశ పాలనకు ఈ నిర్బంధమే నిదర్శనమని సీఎల్‌పీ ఉపనేత జీవన్‌రెడ్డి  వ్యాఖ్యానించారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. హైకోర్టు అనుమతిలో నిర్వహిస్తున్న కొలువులకై కోట్లాట సభకు పోలీసులు ఆటంకాలు కల్పించడం కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని జీవన్‌రెడ్డి మండిపడ్డారు. మరోవైపు ఉస్మానియా యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి మురళి రాసిన సూసైడ్‌ నోట్‌ను పోలీసులు మార్చివేశారని టీపీసీసీ అధికార ప్రతినిధి శ్రవణ్‌ ఆరోపించారు. 
 

14:03 - December 4, 2017

హైదరాబాద్ : కొలువులకై కొట్లాట సభకు వెళుతున్న వారిపై పోలీసుల నిర్బంధం కొనసాగుతోంది. హైదరాబాద్‌ విద్యానగర్‌లో సభకు వెళుతున్న దాదాపు 200 మంది విద్యార్థులను పోలీసులు అడ్డకున్నారు. పోలీసుల తీరుపై విద్యార్థుల మండిపడుతున్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తోందన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

13:58 - December 4, 2017

కాకినాడ : కాపులను బీసీలను చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ కాకినాడలో బీసీ సంఘాలు ధర్నా చేపట్టాయి. బీసీ సంఘ ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశాయి. కాపులను బీసీలో చేర్చి బీసీల హక్కులు కాలరాస్తున్నారని బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

ఓయూలో ఉద్రిక్తత

హైదరాబాద్ : ఓయూలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు, విద్యార్థుల మధ్య ఘర్షణ నెలకొంది. ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. విద్యార్థి సంఘం నేతలను పోలీసులు అరెస్టు చేశారు.

13:54 - December 4, 2017

హైదరాబాద్ : ఓయూలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు, విద్యార్థుల మధ్య ఘర్షణ నెలకొంది. ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. విద్యార్థి సంఘం నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఆర్ట్స్ కాలేజీ ప్రాంతాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

సభకు రాకుండా విద్యార్థులను అడ్డుకుంటున్న పోలీసులు

హైదరాబాద్‌ : సరూర్‌నగర్‌లో కొలువుల కొట్లాట సభ ఇవాళ మధ్యహ్నం ఒంటిగంటకు జరగనుంది. సభకు రాకుండా విద్యార్థులను పోలీసులు అడ్డుకుంటున్నారు. నిరుద్యోగులు, విద్యార్థులపై పోలీసులు నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారు. టీప్రభుత్వం తీరుపై విద్యార్థులు మండిపడుతున్నారు. సభకు రాకుండా విద్యార్థులను పోలీసులు అడ్డుకుంటున్నారని..ఈనేపథ్యంలో ఇప్పటికే సభ విజయంతం అయిందన్నారు. 

విద్యార్థులపై పోలీసుల నిర్బంధం

హైదరాబాద్‌ : సరూర్‌నగర్‌లో కొలువుల కొట్లాట సభ ఇవాళ మధ్యహ్నం ఒంటిగంటకు జరగనుంది. సభకు రాకుండా విద్యార్థులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. నిరుద్యోగులు, విద్యార్థులపై పోలీసులు నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారు. పోలీసులు, టీప్రభుత్వంపై విద్యార్థులు మండిపడుతున్నారు. తెలంగాణ సాధించింది విద్యార్థుల అరెస్టులకేనా..అని ప్రశ్నించారు. అరెస్టులను ఖండించారు. 

13:43 - December 4, 2017

హైదరాబాద్‌ : సరూర్‌నగర్‌లో కొలువుల కొట్లాట సభ ఇవాళ మధ్యహ్నం ఒంటిగంటకు జరగనుంది. సభకు రాకుండా విద్యార్థులను పోలీసులు అడ్డుకుంటున్నారు. నిరుద్యోగులు, విద్యార్థులపై పోలీసులు నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారు. టీప్రభుత్వం తీరుపై విద్యార్థులు మండిపడుతున్నారు. సభకు రాకుండా విద్యార్థులను పోలీసులు అడ్డుకుంటున్నారని..ఈనేపథ్యంలో ఇప్పటికే సభ విజయంతం అయిందన్నారు. 
విద్యార్థులు
'నీవు.. నీ కొడుకుకు మా ఉసురు తగిలుతుంది. కేసీఆర్..ఉస్మానియా యూనివర్సిటీలో బొందపెడ్తం. కేసీఆర్ ఖబడ్తార్... దొర అహంకారాన్ని అణిచివేస్తాం...దొర తనానన్ని ప్రజలు సహించం. ప్రభుత్వానికి సిగ్గులేదు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి. ఉద్యోగాల నోటిఫికేషన్ వేస్తలేరని అనేకమంది ఆత్మబలిదానం చేసుకుంటున్నారని.. వారి ఉసురు మీకు తగుల్తది. ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. ప్రభుత్వాన్ని వెంటాడి, వేధిస్తాం. 2019ఎన్నికల్లో కేసీఆర్ ను ఓడిస్తామని' హెచ్చరించారు.  

 

13:30 - December 4, 2017

హైదరాబాద్‌ : మరికాసేపట్లో హైదరాబాద్‌లో కొలువులకై కొట్లాట సభ ప్రారంభం కానుంది. జిల్లాల వ్యాప్తంగా పోలీసులు నిర్బంధాలను కొనసాగుతున్నాయి. ఎక్కడికక్కడ జేఏసీ నేతలను అరెస్టు చేస్తున్నారు. పోలీలసు తీరుపై టీజాక్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తోందని విమర్శిస్తున్నారు. తెలంగాణ సాధించింది విద్యార్థుల అరెస్టులకేనా..అని ప్రశ్నించారు. అరెస్టులను ఖండించారు. అరెస్టులు అప్రజాస్వామికమన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులపై సీఎం కేసీఆర్ చిన్నచూపు చూస్తున్నారని మండిపడ్డారు. రాత్రి 12 గంటలకు విద్యార్థులపై దాడులు చేసి అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ అరెస్టులు బాధాకరమన్నారు. విద్యార్థులను పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నారు. కోర్టు అనుమతి ఇచ్చినా... పోలీసులు అడ్డుకుంటూ నిర్బంధిస్తున్నారని వాపోయారు. ఓయూలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి మురళీకి రూః.50 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. వరంగల్, నల్గొండ జిల్లాలతోపాటు పలు జిల్లాల నుంచి సభకు వస్తున్న నిరుద్యోగులు, విద్యార్థులను అడ్డుకుంటున్నారు. మరిన్నివివరాలను వీడియోలో చూద్దాం...

 

13:08 - December 4, 2017
13:07 - December 4, 2017

కరీంనగర్ : అక్రమ ఔషదాల ప్రయోగంపై విచారణను పోలీసులు వేగవంతం చేశారు. సీపీ కలమాలసన్‌ రెడ్డి ఎదుట ఫార్మాకంపెనీల ప్రతినిధులు హాజరైయ్యారు. కమిషనర్‌ కార్యాలయానికి ముగ్గురు ప్రతినిధులు వచ్చారు. అటు బాధితుల కుటుంబాలు కూడా విచారణకు హాజరయ్యారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

12:58 - December 4, 2017

హైదరాబాద్‌ : సరూర్‌నగర్‌లో కొలువుల కొట్లాట సభ ఇవాళ మధ్యహ్నం ఒంటిగంటకు ఉంటుందని జేఏసీ చైర్మన్‌ కోదండరాం అన్నారు. సభకు నిరుద్యోగులు, యువత పెద్ద ఎత్తున తరలిరావాలని కోదండరాం పిలుపునిచ్చారు. జేఏసీ ఉద్యమాన్ని చూసి భయపడుతున్న కేసీఆర్‌ ప్రభుత్వం.. అడుగుడుగునా నిర్బంధాలు విధిస్తోందని ఆరోపించారు. నిర్బంధాలు ఎన్ని ఉన్నా సభను జరిపి తీరుతామని కోదండరాం స్పష్టం చేశారు. 
నిరుద్యోగులు, విద్యార్థులు 
'కొలువుల కొట్లాట సభకు విద్యార్థులు, నిరుద్యోగులను పోలీసులు అడ్డుకుంటున్నారు. నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారు. స్టేడియం లోపలికి వచ్చే మార్గంలో డీఎస్ పీతోపాటు పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తూ..లోపలికి రాన్విడం లేదు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు, అవాంతరాలు కలిగించినా కొలువుల కొట్లాట సభ నిర్వహిస్తాం. కోదండరాంను చూసి కేసీఆర్ భయపడుతున్నడు. ప్రొ.జయశంకర్, కోదండరాం లేకపోతే కేసీఆర్ ఎక్కడిది. కేసీఆర్ కుటుంబంలో ఎవరైనా ఆత్మ బలిదానం చేశారా ? కొడుకు కేటీఆర్, అల్లుడు హరీష్ రావులకు మంత్రి పదవులు ఇచ్చారు. కూతురు కవితను ఎంపీ చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ నియంత పాలన సాగుతుంది. నియంత పాలనకు చరమ గీతం పాడుతాం. సభకు కోర్టు అనుమతి ఇచ్చింది. కానీ పోలీసులు నిర్బంధిస్తున్నారు. పోలీసులను అండగా పెట్టుకుని ప్రభుత్వం పాలన సాగిస్తోంది. విద్యార్థి ఉద్యమాలను ఆపలేరు. కోదండరాంను చూస్తే కేసీఆర్ కు చమలు పడ్తున్నాయి. కోదండరాం కార్యకర్త కాదు.. శక్తి. సభకు రాకుండా పోలీసులు, ప్రభుత్వం అడ్డుకుంటుంది. ఓయూలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి మురళీని మృతదేహాన్ని  సినీ ఫక్కీలో తరలించారు. విద్యార్థులపై అర్ధరాత్రి పోలీసులు లాఠీచార్జ్ చేశారు. టీ.ప్రభుత్వాన్ని భూస్థాపితం చేస్తాం. 2019 ఎన్నికలలో ఓటుతో కేసీఆర్ కు సమాధానం చెబుతామని' హెచ్చరించారు. 

 

దౌల్తాబాద్ లో భారీగా మోహరించిన పోలీసులు

సిద్ధిపేట : నిన్న ఓయూలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి మురళీ మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామం దౌలాబాద్‌కు తరలించారు. ఈసందర్భంగా గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. ఓయూ ఎంసీఏ విద్యార్థి మురళీ నిన్న ఓయూ హాస్టల్‌ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.  

12:37 - December 4, 2017

సిద్ధిపేట : నిన్న ఓయూలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి మురళీ మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామం దౌలాబాద్‌కు తరలించారు. ఈసందర్భంగా గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. ఓయూ ఎంసీఏ విద్యార్థి మురళీ నిన్న ఓయూ హాస్టల్‌ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.  

 

సియోల్‌లో చంద్రబాబుకు స్వాగతం

దక్షిణ కొరియా : పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన లక్ష్యంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం దక్షిణ కొరియాలో పర్యటిస్తోంది. ఆదివారం రాత్రి ఢిల్లీ నుంచి బయలుదేరిన చంద్రబాబు ఇవాళ తెల్లవారుజామును సియోల్‌ చేరుకున్నచంద్రబాబుకు వినాశ్రాయంలో ఘనస్వాగతం లభించింది. దక్షిణస్త్రకొరియాలోని ప్రవాసతెలుగువారు, సియోల్‌లోని భారత రాయబార కార్యాలయ అధికారులు చంద్రబాబుకు స్వాగతం పలికారు. 

12:32 - December 4, 2017

అనంతపురం : వైసీపీ అధ్యక్షుడు జగన్‌ చేస్తున్న ప్రజా సంకల్ప పాదయాత్ర నేటి నుంచి అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది. కడప, కర్నూలు జిల్లాల్లో పూర్తి చేసుకున్న యాత్ర బసినేపల్లి వద్ద అనంతపురం జిల్లాలో ప్రవేశించింది. బసినేపల్లి నుంచి పాదయాత్ర ప్రారంభం అయింది.  ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇరవై రోజుల పాటు  యాత్ర కొనసాగుతుంది. జిల్లాలో 250 కి.మీ. మేర జగన్‌ పాదయాత్ర చేస్తారంటున్న అనంతపురం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ అనంత వెంకట్రామిరెడ్డితో ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

 

12:26 - December 4, 2017

దక్షిణ కొరియా : పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన లక్ష్యంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం దక్షిణ కొరియాలో పర్యటిస్తోంది. ఆదివారం రాత్రి ఢిల్లీ నుంచి బయలుదేరిన చంద్రబాబు ఇవాళ తెల్లవారుజామును సియోల్‌ చేరుకున్నచంద్రబాబుకు  వినాశ్రాయంలో ఘనస్వాగతం లభించింది. దక్షిణస్త్రకొరియాలోని ప్రవాసతెలుగువారు, సియోల్‌లోని  భారత రాయబార కార్యాలయ అధికారులు చంద్రబాబుకు స్వాగతం పలికారు. మూడు రోజుల పాటు ఈ పర్యటన కొనసాగుతుంది. ఇవాళ మొదటి రోజు సియోల్‌లో కియా మోటార్స్‌  అనుంబంధ సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై ప్రజెంటేషన్‌ ఇచ్చారు.  బూసాస్‌ పోర్టు సిటీని కూడా చంద్రబాబు బృందం సదర్శించనుంది. ఈనెల 6న సాయంత్రం దక్షిణ కొరియా నుంచి  చంద్రబాబు స్వదేశం పయనమవుతారు. ఆర్థిక మంత్రి మంత్రులు యనమల రామకృష్ణుడు, పరిశ్రమల శాఖ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సమాచార సలహాదారు పరకాల ప్రభాకర్‌, ఉన్నతాధికారులు సాయిప్రసాద్‌, ఆరోఖ్యరాజ్‌, ఎ.బాబు, జాస్తి కృష్ణకిశోర్‌ ఈ బృందంలో ఉన్నారు. 
పెట్టుబడులే లక్ష్యంగా చంద్రబాబు టూర్‌ 

12:23 - December 4, 2017

హైదరాబాద్ : నారాయణ కాలేజీ ఆడియోటేపుల వ్యవహారం హెచ్‌ఆర్‌సీకి చేరింది. నారాయణ కాలేజీ ఆడియోటేపుల వ్యవహారంపై ఇవాళ మానవహక్కుల కమిషన్‌లో వాదనలు జరగనున్నాయి. విద్యార్థుల  ఆత్మహత్యలు, లైంగిక వేధింపులు, డబ్బుల మార్పిడీపై..విచారణకు బీసీ సంక్షేమ సంఘం డిమాండ్‌ చేస్తోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

12:18 - December 4, 2017

హైదరాబాద్‌ : సరూర్‌నగర్‌లో కొలువుల కొట్లాట సభ ఇవాళ మధ్యహ్నం ఒంటిగంటకు ఉంటుందని జేఏసీ చైర్మన్‌ కోదండరాం అన్నారు. సభకు నిరుద్యోగులు, యువత పెద్ద ఎత్తున తరలిరావాలని కోదండరాం పిలుపునిచ్చారు. జేఏసీ ఉద్యమాన్ని చూసి భయపడుతున్న కేసీఆర్‌ ప్రభుత్వం.. అడుగుడుగునా నిర్బంధాలు విధిస్తోందని ఆరోపించారు. నిర్బంధాలు ఎన్ని ఉన్నా సభను జరిపి తీరుతామని కోదండరాం స్పష్టం చేశారు. 

 

12:14 - December 4, 2017

ఢిల్లీ : కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి రాహుల్‌ గాంధీ నామినేషన్‌ వేశారు. రాహుల్‌ అభ్యర్థిత్వాన్ని సోనియా, మన్మోహన్‌ సింగ్‌ ప్రతిపాదించారు. నాలుగు సెట్ల నామినేషన్‌ పత్రాలపై 40 మంది నేతల సంతకాలు చేశారు. ఇవాళే రాహుల్‌ను పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశం ఉంది. 

12:03 - December 4, 2017

నిర్మల్ : బాసర సరస్వతి ఆలయంలో పూజారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. అర్చకులు ఆలస్యంగా రావడంతో అమ్మవారి అభిషేకం అరగంట లేటయింది. అధికారులు, అర్చకుల నిర్లక్ష్యంపై  భక్తులు ఆగ్రహం వక్తం చేస్తున్నారు. 

బాసర సరస్వతి ఆలయంలో పూజారుల నిర్లక్ష్యం

నిర్మల్ : బాసర సరస్వతి ఆలయంలో పూజారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. అర్చకులు ఆలస్యంగా రావడంతో అమ్మవారి అభిషేకం అరగంట లేటయింది. అధికారులు, అర్చకుల నిర్లక్ష్యంపై  భక్తులు ఆగ్రహం వక్తం చేస్తున్నారు. 

 

కర్నూలులో దారుణం

కర్నూలు : జిల్లాలో వ్యక్తి హత్య కలకలం రేపింది. పసుపుల రుద్రవరం గ్రామాల శివారులో బోయ కృష్ణను ప్రత్యర్థులు హతమార్చారు. గతంలో కురబ రాముడును జీపుతో ఢీ కొట్టి చంపిన కేసులో కష్ణ ముద్దాయిగా ఉన్నాడు. ఉదయం 7-30గంటల సమయంలో బైక్‌పై వెళుతున్న స్కార్పియోతో ఢీ కొట్టడంతో కష్ణ అక్కడికక్కడే మృతి చెందినట్టు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

11:59 - December 4, 2017

కర్నూలు : జిల్లాలో వ్యక్తి హత్య కలకలం రేపింది. పసుపుల రుద్రవరం గ్రామాల శివారులో బోయ కృష్ణను ప్రత్యర్థులు హతమార్చారు. గతంలో కురబ రాముడును జీపుతో ఢీ కొట్టి చంపిన కేసులో కష్ణ ముద్దాయిగా ఉన్నాడు. ఉదయం 7-30గంటల సమయంలో బైక్‌పై వెళుతున్న స్కార్పియోతో ఢీ కొట్టడంతో కష్ణ అక్కడికక్కడే మృతి చెందినట్టు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

క్లినికల్ ట్రయల్ కేసు వ్యవహారంలో విచారణ వేగవంతం

కరీంనగర్ : క్లినికల్ ట్రయల్ కేసు వ్యవహారంలో విచారణ వేగవంతం అయింది. సీపీ కార్యాలయంలో విచారణకు ఫార్మా కంపెనీ నిర్వహకులు హాజరయ్యారు.  

క్లినికల్ ట్రయల్ కేసు వ్యవహారంలో విచారణ వేగవంతం

కరీంనగర్ : క్లినికల్ ట్రయల్ కేసు వ్యవహారంలో విచారణ వేగవంతం అయింది. సీపీ కార్యాలయంలో విచారణకు ఫార్మా కంపెనీ నిర్వహకులు హాజరయ్యారు.  

కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి నేడు రాహుల్‌ నామినేషన్‌

ఢిల్లీ : కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి రాహుల్‌గాంధీ ఇవాళ నామినేషన్‌ దాఖలు వేయనున్నారు. ఐఏసీసీ అధ్యక్షుణ్ని ఎన్నుకునేందుకు ఈనెల 1న నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. నామినేషన్‌ వేసేందుకు ఇవాళ చివరి రోజు. రాహుల్‌ నామినేషన్‌కు భారీ ఏర్పాట్లు చేశారు. 

నామినేషన్‌ వేసేందుకు బయల్దేరిన హీరో విశాల్‌

తమిళనాడు : చెన్నైలోని ఆర్కే నగర్‌ అసెంబ్లీ స్థానానికి ఈనెల 21న ఉప ఎన్నిక జరుగనుంది. తమిళ నటుడు విశాల్‌ ఈ స్థానం స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. ఇవాళ నామినేషన్‌ వేసేందుకు తన అనుచరులతో కలిసి బయలుదేశారు. నామినేషన్‌ వేసేందుకు వెళ్తూ మార్గమధ్యంలో కామ్‌రాజ్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. జయలలిత మృతితో ఖాళీ అయిన ఆర్కే నగర్‌కు ఉప ఎన్నిక జరుగుతోంది. ఇప్పటికే డీఎంకే, అన్నా డీఎంకేతోపాటు శశికళ మేనల్లుడు దినకరన్‌ నామినేన్లు వేశారు. 

11:38 - December 4, 2017

తూర్పుగోదావరి : అంగవైకల్యం ఉన్నా ఆత్మవిశ్వాసానికి కొదువలేదని నిరూపించారు విభిన్న ప్రతిభావంతులు. కాకినాడ జేఎన్‌టీయూలో వికలాంగుల సంక్షేమ శాఖ నిర్వహించిన విభిన్న ప్రతిభావంతుల దినోత్సవానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. పలు పాఠశాలలకు చెందిన బాలబాలికలు సంగీతం, నృత్య ప్రదర్శనల్లో తమ ప్రతిభను చాటారు. కాకినాడ ఎంపీ తోట నరసింహం బహుమతులు ప్రధానం చేశారు. 
 

 

11:31 - December 4, 2017

తమిళనాడు : చెన్నైలోని ఆర్కే నగర్‌ అసెంబ్లీ స్థానానికి ఈనెల 21న ఉప ఎన్నిక జరుగనుంది. తమిళ నటుడు విశాల్‌ ఈ స్థానం స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. ఇవాళ నామినేషన్‌ వేసేందుకు తన అనుచరులతో కలిసి బయలుదేశారు. నామినేషన్‌ వేసేందుకు వెళ్తూ మార్గమధ్యంలో కామ్‌రాజ్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. జయలలిత మృతితో ఖాళీ అయిన ఆర్కే నగర్‌కు ఉప ఎన్నిక జరుగుతోంది. ఇప్పటికే డీఎంకే, అన్నా డీఎంకేతోపాటు శశికళ మేనల్లుడు దినకరన్‌ నామినేన్లు వేశారు. 
 

11:28 - December 4, 2017

చిత్తూరు : హీరో రామ్‌చరణ్‌ ఉపాసన దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయల అర్చకులు దగ్గరుండి రామచరణ్‌ దంపతులకు స్వామివారి దర్శనం చేయించారు. స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని రామచరణ్‌ అన్నారు. 

 

మెదక్‌ జిల్లాలో దారుణం

మెదక్‌ : జిల్లాలోని తూఫ్రాన్‌ మండలం రావెళ్లి గ్రామ శివారులో దారుణం జరిగింది. ఏడునెలల గర్బీణీపై దుండగులు అత్యాచారయత్నం చేశారు. దుండగుల నుంచి తప్పించుకునేందుకు కదులుతున్న డీసీఎం వాహనం నుంచి బాధితురాలు కిందకు దూకేసింది. తీవ్ర గాయాలపాలైన మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. 

11:14 - December 4, 2017

మెదక్‌ : జిల్లాలోని తూఫ్రాన్‌ మండలం రావెళ్లి గ్రామ శివారులో దారుణం జరిగింది. ఏడునెలల గర్బీణీపై దుండగులు అత్యాచారయత్నం చేశారు. దుండగుల నుంచి తప్పించుకునేందుకు కదులుతున్న డీసీఎం వాహనం నుంచి బాధితురాలు కిందకు దూకేసింది. తీవ్ర గాయాలపాలైన మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. రావెళ్లి పంచాయతీ పరిధి పోతరాజ్‌పల్లికి చెందిన ఉడే రేగొండ, కళావతి దంపతులు పాతదుస్తులు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. శనివారం మేడ్చల్‌ జిల్లా కొంపల్లిలో పాతదుస్తులు విక్రయించిన కళావతి... రాత్రి 10 గంటల సమయంలో తన 7సంవత్సరాల  కుమార్తెతో కలిసి హైదరాబాద్‌ నుంచి నిజామాబాద్‌ వైపు వెళ్తున్న డీసీయంలో ఎక్కింది.  అందులో ఉన్న డ్రైవరు, మరో వ్యక్తి కళావతి పై అత్యాచారయత్నం చేశారు. 44వ జాతీయ రహదారిపై రావెళ్లి శివారులో కరీంగూడ వద్ద ఆమె దిగాల్సిన చోట వాహనం ఆపకుండా ముందుకు వెళ్తుండటంతో భయాందోళనకు గురై ఒక్కసారిగా కిందకు దూకింది. అరకిలో మీటరు ముందుకెళ్లిన తర్వాత దుండగులు.. బాలికను, పాతదుస్తుల మూటను రహదారి పక్కన వదిలేసి వెళ్లిపోయారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘనాస్థలానికి వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం స్వగ్రామం తరలించారు. కాగా  మృతురాలిది నిరుపేద కుటుంబం కావడంతో పోతరాజుపల్లి గ్రామస్తులే చందాలు వేసుకుని అంత్యక్రియలను పూర్తిచేశారు. 

 

10:48 - December 4, 2017
10:44 - December 4, 2017

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులను భర్తీ చేయాలని వక్తలు డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చ కార్యక్రమంలో విశ్లేషకులు తెలకపల్లి రవి, టీడీపీ నేత దుర్గప్రసాద్, టీఆర్ ఎస్ నేత శేఖర్ రెడ్డి, వైసీపీ నేత కొణిజేటి రమేష్ పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

టీజేఏసీ నేతల ఇళ్లలో పోలీసులు సోదాలు

నల్గొండ : టీజేఏసీ నేతల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించాయి. కొలువులకై కొట్లాట సభ నేపథ్యంలో పలువురు టీజాక్ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. సభకు వెళ్లేందుకు వాహనాలు పెట్టవద్దని ప్రైవేట్ వాహనాల యజమానులను బెదిరించారు.  

10:34 - December 4, 2017

ఢిల్లీ : కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి రాహుల్‌గాంధీ ఇవాళ నామినేషన్‌  దాఖలు  వేయనున్నారు. ఐఏసీసీ అధ్యక్షుణ్ని ఎన్నుకునేందుకు ఈనెల 1న నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. నామినేషన్‌ వేసేందుకు ఇవాళ చివరి రోజు. రాహుల్‌ నామినేషన్‌కు భారీ ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, పార్టీ సీనియర్‌ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. రాహుల్‌ స్వయంగా నాలుగు నామినేషన్లు  దాఖలు చేస్తారు. వీటిలో సోనియా, మన్మోహన్‌సింగ్‌ ప్రతిపాదకులుగా ఉంటారు.  ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యుటు, పార్టీ రాష్ట్ర విభాగాల నేతలు మరో 75 నామినేషన్లు వేస్తారు. రాహుల్‌ ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేసే అవకాశం ఉండటంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. నామినేషన్ల దాఖలు గడువు ముగిసిన తర్వాత ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించ వచ్చని భావిస్తున్నారు. 

10:31 - December 4, 2017

నల్గొండ : జిల్లాలోని అడవిదేవులపల్లి మండలం చిట్యాల గ్రామంలో రెండు వర్గాల మధ్య పాతపక్షలు భగ్గుమన్నాయి. చిట్యాలలో పిట్టల సాయన్న, బొమ్మనబోయిన నాగేశ్వరరావు వర్గాల మధ్య కొంతకాలంగా భూవివాదాలు కొనసాగుతున్నాయి. పొలం నుంచి మట్టి తరలింపు వివాదాస్పదంగా  మారింది. దీనిని  ప్రశ్నించిన నాగేశ్వరరావు కుటుంబ సభ్యులపై సాయన్న వర్గీయులు దాడి చేశారు. ఇళ్లలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి, రెండు బైక్‌లు దహనం చేశారు.  ఈ గొడవల్లో గాయపడ్డ ఇద్దర్ని మిర్యాలగూడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు  నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 

 

జయశంకర్‌ జిల్లాలో మావోయిస్టు పోస్టర్ల కలకలం

జయశంకర్‌ భూపాలపల్లి : జిల్లాలోని వెంకటాపురం మండలం విజయపురి కాలనీలో వెలసిన మావోయిస్టుల పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఈనెల 2 నుంచి 8 వరకు పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ... పీఎల్‌జీఏ..  వారోత్సవాలకు మవోయిస్టుల పిలుపు ఇచ్చారు. ఈ నేపథ్యంలో  విజయపురి కాలనీ ప్రధాన రహదారిపై వెలసిన పోస్టర్లు చర్చనీయాంశంగా మారాయి. హిందు ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడాలని  కోరారు. పోలీసుల ఏజెంట్లు, ఇన్ఫార్మర్లను శిక్షించాలని, గ్రామ గ్రామాన రక్షణ దళాలు ఏర్పాటు కావాలని మావోయిస్టు చర్ల శబరి కమిటీ పిలుపు ఇచ్చింది. 

 

10:27 - December 4, 2017

జయశంకర్‌ భూపాలపల్లి : జిల్లాలోని వెంకటాపురం మండలం విజయపురి కాలనీలో వెలసిన మావోయిస్టుల పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఈనెల 2 నుంచి 8 వరకు పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ... పీఎల్‌జీఏ..  వారోత్సవాలకు మవోయిస్టుల పిలుపు ఇచ్చారు. ఈ నేపథ్యంలో  విజయపురి కాలనీ ప్రధాన రహదారిపై వెలసిన పోస్టర్లు చర్చనీయాంశంగా మారాయి. హిందు ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడాలని  కోరారు. పోలీసుల ఏజెంట్లు, ఇన్ఫార్మర్లను శిక్షించాలని, గ్రామ గ్రామాన రక్షణ దళాలు ఏర్పాటు కావాలని మావోయిస్టు చర్ల శబరి కమిటీ పిలుపు ఇచ్చింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

 

10:16 - December 4, 2017

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దక్షిణ కొరియాకు పర్యటనకు బయల్దేరారు. ఇవాళ సియోల్‌ చేరుకోనున్న బాబు.. భారత రాయబారి విక్రమ్‌ దొరైస్వామితో భేటీ అవుతారు. అనంతరం దాసన్‌ నెట్‌వర్క్‌ చైర్మన్‌ నామ్‌ మెయిన్‌వూతో సమావేశమవుతారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ఈ పర్యటన కొనసాగనుంది. మూడు రోజుల పాటు కొనసాగనున్న ఈ పర్యటనలో.. ఆర్థికమంత్రి యనమల, పరిశ్రమల శాఖమంత్రి అమర్నాథ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌ కూడా ఉన్నారు. 

 

26 వ రోజు జగన్ ప్రజా సంకల్పయాత్ర ప్రారంభం

అనంతపురం : 26 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభం అయింది. బసినేపల్లి నుంచి జగన్ పాదయాత్ర ప్రారంభించారు.  

 

10:12 - December 4, 2017

అనంతపురం : నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు మృతి చెందారు. ప్రైవేట్‌ బస్సు హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు వెళ్తోంది. బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. మార్గంమధ్యలో అనంతపురం జిల్లా రుద్రంపేట బైపాస్‌రోడ్డు సమీపంలో తెల్లవారుజామున 4.30గంటలకు ఒక్కసారిగా లారీ టైర్‌ పంచరైంది. దీంతో అదుపుతప్పిన లారీ ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌ గణేశ్‌, లారీ క్లీనర్‌ రావత్ అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో 20 మంది గాయపడ్డారు. వారిని అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒక్కసారిగా లారీ టైర్‌ పంచరైందని.. దీంతో అదుపుతప్పిన లారీ ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టినట్టు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

09:56 - December 4, 2017

హైదరాబాద్ : విద్యార్థి ఆత్మహత్యతో ఓయూలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. రాత్రి క్యాంపస్‌లోకి పోలీసులు రాకుండా విద్యార్థులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు హాస్టల్‌ గదుల్లోకి వచ్చి మరీ లాఠీచార్జ్‌ చేశారు. పరిస్థితిని కవర్‌చేస్టున్న మీడియా ప్రతినిధులపైనా ఖాకీలు దురుసుగా ప్రవర్తించారు. దీనిపై ఇవాళ డీజీపీకి ఫిర్యాదు చేయాలని జర్నలిస్టు సంఘాలు నిర్ణయించాయి. మరోవైపు మురళీ మృతదేహానికి గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి..  సిద్ధిపేట జిల్లాలోని స్వగ్రామం దౌలాబాద్‌కు తరలించారు. మరోవైపు ఇవాళ కొలువుల కొట్లాట సభ నేపథ్యంలో ఓయూలో పోలీసులు భారీగా మోహరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

09:47 - December 4, 2017

హైదరాబాద్ : విద్యార్థి మురళీ ఆత్మహత్యతో ఉస్మానియా యూనివర్సిటీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అర్ధరాత్రి విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. మీడియా ప్రతినిధులపైనా భాకీలు దురుసుగా ప్రవర్తించారు. పోలీసుల తీరుపై జర్నలిస్టు సంఘాలు మండిపడుతున్నాయి. ఇవాళ డీజీపీని జర్నలిస్టు సంఘాలు కలవనున్నాయి. గాంధీ ఆస్పత్రిలో మురళి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి అయింది. స్వగ్రామం సిద్ధిపేట జిల్లా దౌల్తాబాద్ కు మురళి మృతదేహాన్ని తరలించారు. మురళీ ఆత్మహత్యకు నిరసనగా ఓయూ జేఏసీ నేడు వర్సిటీ బంద్ కు పిలుపునిచ్చారు. కొలువుల కొట్లాట సభ నేపథ్యంలో ఓయూలో భారీగా పోలీసులు మోహరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ పోలీసులు తమపై దౌర్జన్యం చేశారని... దురుసుగా ప్రవర్తించారని వాపోమయారు. ఇది రాచరిక వ్యవస్థనా..ప్రజాస్వామ్య వ్యవస్థనా అని ప్రశ్నించారు. 

 

ఓయూలో భారీగా పోలీసుల మోహరింపు

హైదరాబాద్ : నేడు నగరంలో టీజేఏసీ ఆధ్వర్యంలో కొలువుల కొట్లాట సభ జరుగనుంది. యూనివర్సిటీలో కొలువుల కొట్లాట సభ నేపథ్యంలో ఓయూలో భారీగా పోలీసులు మోహరించారు. 

మురళి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి

హైదరాబాద్ : విద్యార్థి మురళీ ఆత్మహత్యతో ఉస్మానియా యూనివర్సిటీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. గాంధీ ఆస్పత్రిలో మురళి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి అయింది. స్వగ్రామం సిద్ధిపేట జిల్లా దౌల్తాబాద్ కు మురళి మృతదేహాన్ని తరలించారు. మురళీ ఆత్మహత్యకు నిరసనగా ఓయూ జేఏసీ నేడు వర్సిటీ బంద్ కు పిలుపునిచ్చారు. కొలువుల కొట్లాట సభ నేపథ్యంలో ఓయూలో భారీగా పోలీసులు మోహరించారు.

విద్యార్థి ఆత్మహత్య.. ఓయూలో ఉద్రిక్తత

హైదరాబాద్ : విద్యార్థి మురళీ ఆత్మహత్యతో ఉస్మానియా యూనివర్సిటీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అర్ధరాత్రి విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. మీడియా ప్రతినిధులపైనా భాకీలు దురుసుగా ప్రవర్తించారు. పోలీసుల తీరుపై జర్నలిస్టు సంఘాలు మండిపడుతున్నాయి. ఇవాళ డీజీపీని జర్నలిస్టు సంఘాలు 
కలవనున్నాయి. 

09:29 - December 4, 2017

హైదరాబాద్ : విద్యార్థి మురళీ ఆత్మహత్యతో ఉస్మానియా యూనివర్సిటీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అర్ధరాత్రి విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. మీడియా ప్రతినిధులపైనా భాకీలు దురుసుగా ప్రవర్తించారు. పోలీసుల తీరుపై జర్నలిస్టు సంఘాలు మండిపడుతున్నాయి. ఇవాళ డీజీపీని జర్నలిస్టు సంఘాలు 
కలవనున్నాయి. గాంధీ ఆస్పత్రిలో మురళి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి అయింది. స్వగ్రామం సిద్ధిపేట జిల్లా దౌల్తాబాద్ కు మురళి మృతదేహాన్ని తరలించారు. మురళీ ఆత్మహత్యకు నిరసనగా ఓయూ జేఏసీ నేడు వర్సిటీ బంద్ కు పిలుపునిచ్చారు. కొలువుల కొట్లాట సభ నేపథ్యంలో ఓయూలో భారీగా పోలీసులు మోహరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

09:16 - December 4, 2017

విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్‌ ఎలక్ట్రిసిటీ కాంట్రక్ట్‌ కార్మిక సంఘాల ఐక్యవేదిక సెక్రటరీ జనరల్‌ ఎం. బాలకాశి డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'విద్యుత్‌ సరఫరా ద్వారా అందరి ఇండ్లల్లో వెలుగులు నింపుతారు. కానీ వారి జీవితాల్లో ఉన్న చీకట్లు మాత్రం ఇంకా తొలగట్లేదు. ఇది విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికుల పరిస్థితి. ఉద్యోగ భద్రత, కనీస వేతన డిమాండ్‌తో ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్నారు. నిరవధిక నిరాహార దీక్ష చేసిన ఫలితం లేకపోవడంతో 5వ తేదీన బహిరంగ సభకి పిలుపునిచ్చారు. నిరవధిక సమ్మెకైనా సిద్ధమంటున్నారు. దీనికి గల కారణాలు, కార్మికుల సమస్యలపై ఆయన మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

09:07 - December 4, 2017

కరీంనగర్ : పేదల అమాయకత్వమే ఔషధ కంపెనీలకు పెట్టుబడిగా మారింది. నిరుద్యోగమే ఫార్మా సంస్థల క్లినికల్‌ ట్రయల్స్‌కు వరం అవుతోంది. వెరసి.. ఔషధ కంపెనీలు పేదలు, నిరుద్యోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ఔషధ ప్రయోగాలు వికటించి ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. ఫార్మా కంపెనీల ప్రయోగాలకు ఒక వ్యక్తి బలికాగా, మరొకరు ఆస్పత్రి పాలయ్యారు. ఇంకొకరు మతిస్థిమితం కోల్పోయి అచేతనంగా పడివున్నారు. దీంతో ఆయా కుటుంబాలకు దిక్కులేకుండా పోయింది. 
క్లినికల్‌ ట్రయల్స్‌ కలకలం 
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఫార్మా కంపెనీల క్లినికల్‌ ట్రయల్స్‌ కలకలం సృష్టిస్తున్నాయి. ఔషధ ప్రయోగాలు వికటించి కుటుంబాలకు కుటుంబాలే వీధినపడుతున్నాయి. పేదరికం, నిరుద్యోగాన్ని అసరాగా చేసుకుని ఔషధ కంపెనీలు తమ ఏజెంట్ల ద్వారా అమాయకుల్ని బుట్టలో వేసుకొంటున్నాయి. ఈ ప్రయోగాలు వికటిస్తుండటంతో  కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొందరు ఆస్పత్రిపాలవుతున్నారు. ఇంకొందరు మతిస్థిమితం కోల్పోయి అచేతనస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. 
ఔషధ ప్రయోగాలకు ఒప్పందాలు 
బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ కేంద్రాలుగా పనిచేస్తున్న కొన్ని ఫార్మా కంపెనీలు హుజూరాబాద్‌లో ఏజెంట్లను నియమించుకున్నాయి. వీరు పేదలు, నిరుద్యోగులను మాయమాటతో నమ్మించి బుట్టలో వేసుకుంటున్నారు. ఔషధ ప్రయోగాలకు ఒప్పిస్తూ, ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. అంగీకరించిన వారిని బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ తీసుకెళ్లి మూడు, నాలుగు వారాల పాటు అక్కడే ఉంచుతూ, ఫార్మా కంపెనీతో క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించే విధంగా చేస్తున్నారు. ఔషధ కంపెనీల ప్రయోగాలకు ఒప్పుకున్న వారి చేతిలో అంతో ఇంతో పెట్టి సరిపెట్టుకుంటున్న ఏజెంట్లు... ఫార్మా సంస్థల నుంచి లక్షలు  తీసుకుంటున్నారు. ప్రయోగాలు వికటించినప్పుడు తమకేమీ సంబంధంలేదన్నట్టుగా వ్యవహరిస్తుండటంతో బాధిత కుటుంబాలు వీధిన పడుతున్నాయి. 
అశోక్ కుమార్ కు తీవ్ర అనారోగ్యం 
జమ్మికుంట మండలం కొత్తపల్లికి చెందిన అశోక్ కుమార్ తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. ఆ తర్వాత వింతగా ప్రవర్తించడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆ తర్వాత ఆరా తీయడంతో బెంగళూరులో అశోక్‌ కుమార్‌పై క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించినట్లు తెలుసుకున్నారు. అశోక్‌ హైదరాబాద్‌లో ఓ దళారి మాటలు నమ్మి బెంగుళూర్‌లోని ఓ ఫార్మా కంపెనీకి వెళ్లడంతో అతనిపై ఔషధ ప్రయోగాలు నిర్వహించారు. ఆ తర్వాత ఇంటికి చేరుకున్న అశోక్‌ ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది. మానసిక రోగిలా ప్రవర్తించడంతో బాధితుడిని హైదరాబాద్ ఎర్రగడ్డ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జరిగిన దారుణంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 
200 మంది క్లినికల్‌ ట్రయల్స్‌ బాధితులు 
ఈ ఘటన మరిచిపోకముందే అదే గ్రామానికి చెందిన మరో యువకుడు బోగె సురేష్ రక్తం వాంతులు చేసుకోవడంతో అతన్ని జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు. అంతకుముందు మీడియాతో మాట్లాడిన బాధితుడు.. కేవలం జమ్మికుంట ప్రాంతంలోనే 200 మందికిపైగా క్లినికల్‌ ట్రయల్స్‌ బాధితులున్నారని చెప్పాడు. సురేష్‌, అశోక్‌ కుమార్‌పై లోటస్‌, అపెటెక్స్ ఫార్మా కంపెనీలు ఔషధ ప్రయోగం జరిపినట్లు వారి వద్ద లభించిన పత్రాల ఆధారంగా తెలుస్తుంది.
క్లినికల్‌ ట్రయల్స్‌కు నాగరాజు బలి 
హుజూరాబాద్‌ నియోజవర్గంలో క్లినికల్‌ ట్రయల్స్‌ వ్యవహారం ఎన్నో కుటుంబాల్లో చిచ్చురేపుతోంది. 5 నెలల క్రితం నాగంపేటకు చెందిన నాగరాజు లోటస్‌ ఫార్మా క్లినికల్‌ ట్రయల్స్‌కు బలయ్యాడు. ఈ వ్యవహారం అప్పట్లో తీవ్ర సంచలనం రేపింది. ఔషధ కంపెనీల గుట్టును 10 టీవీ వెలుగులోకి తెచ్చింది. నాగరాజు చనిపోవడంతో అతని కుటుంబం చిన్నాభిన్నమైంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు నాగరాజు మృతదేహానికి శవపరీక్షలు నిర్వహించారు. అయితే వైద్యులు ఇంతవరకు పోస్ట్‌మార్టం నివేదిక ఇవ్వలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 5 నెలలు గడిచినా తమకు న్యాయం జరగలేదని వాపోతున్నారు. 
ఔషధ ప్రయోగాల నిర్వహణపై ఖండిస్తున్న విపక్షాలు  
అమాయకులపై ఔషధ ప్రయోగాలు నిర్వహించడాన్ని విపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. డబ్బు ఎరవేసి వారి జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడుతున్నారు. బాధిత కటుంబాలకు లోటస్‌, అపాటెక్స్‌ కంపెనీలు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 
హుజూరాబాద్‌ లో 400 మందిపై ఔషధ ప్రయోగాలు 
ఒకరు కాదు...ఇద్దరు కాదు ఒక్క హుజూరాబాద్‌ ప్రాంతంలోనే 400 మందిపై ఔషధ ప్రయోగాలు జరిపారని సమాచారం. మరోవైపు రంగంలోకి దిగిన పోలీసులు ఏజెంట్ల కోసం వేట ప్రారంభించారు. క్లినికల్‌ ట్రయల్స్‌ కోసం పనిచేస్తున్నఏజెంట్లలో ఎంతమందిని పట్టుకుంటారో చూడాలి. 

08:54 - December 4, 2017

హైదరాబాద్ : కుల భోజనాలను వ్యతిరేకిస్తూ హైదరాబాద్ ఇందిరాపార్క్‌లో టీమాస్ ఆధ్వర్యంలో జన వనభోజనాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు సామాజిక సంఘాలకు చెందిన నేతలు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. కుల వివక్ష రూపుమాపాలని , కులాలకతీతంగా అన్ని వర్గాలు ఏకం కావాలని నేతలు పిలుపు నిచ్చారు.
ఎక్కడ వివక్ష జరిగినా పోరాటం : బివి.రాఘవులు
టీ మాస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరా పార్క్‌లో నిర్వహించిన జన వన భోజనాలు కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమంలో పలు సామాజిక, ప్రజా సంఘాల నేతలు, కార్యకర్తలు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. కులం, మతం, రంగు పేరుతో ఎక్కడ వివక్ష జరిగినా అక్కడ తాము పోరాటం చేస్తామన్నారు సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు. కులభోజన వ్యవస్థ నిర్మూలన కోసమే జన వన భోజనాలు నిర్వహిస్తున్నట్లు విమలక్క చెప్పారు. ఇటువంటి కులాతీత జన భోజన కార్యక్రమాలు నిరంతరం జరగాలని నేతలు పిలుపునిచ్చారు. సమాజాన్ని పట్టి పీడిస్తున్న కుల వివక్షను రూపుమాపాలని నేతలు ఆకాంక్షించారు. 
కులాంతర వివాహ దంపతులకు అభినందనలు 
జన వనభోజన కార్యక్రమంలో కులాంతర వివాహం చేసుకున్న దంపతులను అభినందించారు. గద్దర్, విమలక్క ఆటపాటలతో అలరించారు. అంబేడ్కర్ జీవిత చరిత్రపై ప్రదర్శించిన నాటకం ఆకట్టుకుంది. 

08:21 - December 4, 2017

హైదరాబాద్ : సరూర్‌నగర్‌ స్టేడియంలో టీ.జేఏసీ నిర్వహించ తలపెట్టిన 'కొలువుల కొట్లాట' సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మ.1.30 నుంచి 6 గంటల వరకు సభ జరుగనుంది. 50 వేల మంది నిరుద్యోగులు వస్తారని అంచనా. బహిరంగ సభకు భారీ ఎత్తున నిరుద్యోగులు తరలి రానున్నట్లు టీజేఏసీ నేతలు చెబుతున్నారు. ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. సభ ఏర్పాట్లపై మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

08:14 - December 4, 2017

విశాఖ : భారత నౌకాదళ దినోత్సవం సందర్భంగా.. విశాఖలో నావికాదళ విన్యాసాలు జరుగుతున్నాయి. శత్రు దుర్బేద్యంగా ఉన్న తూర్పు నావికాదళం తీరంలో ఈ విన్యాసాలు కొనసాగుతున్నాయి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తూర్పు నౌకాదళం ఏర్పాటు తీరు... నావికాదళ  విన్యాసాలపై ప్రత్యేక కథనం. 
అధికారుల ఏర్పాట్లు 
ఇవాళ భారత నౌకాదళ దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు విశాఖ తూర్పు తీరం సిద్ధమైంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భారత రక్షణ రంగంలో నేవీది కీలకపాత్ర. 2011లో సముద్ర మార్గం ద్వారా వచ్చిన ముష్కరులు ముంబైపై దాడిచేయడంతో... తూర్పు తీరంపై భారత నావికాదళం భద్రతపై మరింత దృష్టి సారించింది.  హెచ్‌పిసీఎల్‌, విశాఖ స్టీల్‌ప్లాంట్‌తో పాటు... విశాఖ పోర్టు ఉండడంతో తూర్పు తీరాన్ని శత్రు దుర్బేద్యంగా మార్చారు. 
1933 అక్టోబర్‌లో విశాఖలో పటేం పోర్ట్‌ ఏర్పాటు
1933 అక్టోబర్‌లో విశాఖలో పటేం పోర్ట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సమయంలోనే తూర్పు తీర ప్రాధాన్యతను శత్రు దేశాలు గుర్తించాయి. రెండో ప్రపంచ యుద్ద సమయంలో 1941 ఏ్రపిల్‌ 6న జపాన్‌.. విశాఖ మీద బాంబు వేశాయి. దీంతో తూర్పు నౌకాదళానికి పునాదిగా 1947లో ఇంగ్లీష్‌వారు... రెండో ప్రపంచ యుద్దంలో బర్మాకు సరుకులు, ఆయుధాలు రవాణా చేసేందుకు ఇక్కడ హెర్‌ మెజెస్టీ ఇండియన్‌షిప్‌ సర్కార్స్‌ అనే బేస్‌ను స్థాపించారు. ఆనాటి నుంచి అది తూర్పు తీరాన్ని రక్షించి 'తూర్పు నౌకాదళం'గా మారింది. 
డిసెంబర్‌ 4న నేవీ డే నిర్వహణ  
1971 డిసెంబర్‌ 4న తూర్పు నావికాదళం చరిత్రలో మరిచిపోలేని రోజు. భారత నౌకాదళం కరాచీ నౌకాశ్రయం మీద బాంబులతో దాడి చేసి తుత్తునియలుగా చేసింది. ఈ సంఘటనను 'ఆపరేషన్‌ ట్రైడెంట్‌' అని రహస్య నామం పెట్టారు. అప్పటి నుంచి డిసెంబర్‌ 4న నేవీ డేగా జరుపుకుంటున్నారు. 
తూర్పు నావికాదళం ఎన్నో సహకారాలు 
తూర్పు నౌకాదళం.. అటు ముంబై నుంచి ఇటు అండమాన్‌ వరకు ఉన్న తీరాన్నంతా పహారా కాస్తుంది. అత్యాధునిక నౌకలు రాడార్‌లకు ఏమాత్రం చిక్కని సబ్‌మెరైన్‌లు తూర్పు తీరం సొంతం. స్వదేశంలో నిర్మించిన నౌకలే కాకుండా... విదేశాల నుంచి కొనుగోలు చేసిన నౌకలతో నేవీ ఎప్పటికప్పుడు తమ సంపత్తిని పెంచుకుంటోంది. తీరం వెంబడి గస్తీ కాయడమే కాకుండా... సునామీ లాంటి విపత్తుల సమయంలోనూ తూర్పు నావికాదళం ఎన్నో సహకారాలు అందిస్తోంది. 
తీర ప్రాంత రక్షణకు శక్తి వంచన లేకుండా కృషి : నేవీ చీఫ్ 
రానున్న పదేళ్లలో భారత తీర ప్రాంత రక్షణకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు నేవీ చీఫ్‌ కరంభీర్‌ సింగ్‌. వచ్చే పదేళ్లలో 190 వార్‌ షిప్స్‌తో పాటు... 450 ఎయిర్‌క్రాఫ్ట్‌లు మరిన్ని సబ్‌మెరైన్లు అందుబాటులోకి వస్తాయన్నారు. మొత్తానికి నేవీ డే పురస్కరించుకుని.. సాగర తీరంలో జరిగే విన్యాసాలను చూసేందుకు నగరవాసులు ఉవ్విళ్లూరుతున్నారు. 

08:00 - December 4, 2017

పశ్చిమ గోదావరి : అధికారం అండతో బరితెగించారు. 50 లక్షల ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులతో సొంత పొలాలకు రోడ్లు వేసుకున్నారు. రోడ్డు విస్తరణ పేరుతో 60ఏళ్ల వృద్ధుడి ఇంటిని తొలగించారు. అడిగినందుకు ఆ వృద్ధుడిపైనే దాడిచేశారు. అవమానభారంతో ఆ వృద్ధుడు పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసి చావుతో పోరాడుతున్నాడు. 

ఇక్కడ కనిపిస్తున్న వృద్ధుడి పేరు గొట్టిముక్కల సత్యనారాయణ రాజు....వయస్సు 60 సంవత్సరాలపైబడి ఉంటుంది. తన భార్యతో కలిసి గత 30ఏళ్లుగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు లోని చిత్రాయి చెరువు గట్టు సమీపంలో పూరి గుడిసెలో నివాసం ఉంటున్నారు... సత్యన్నారాయణ రాజు ఇంటి సమీపంగా రోడ్డు విస్తరణ జరుగుతుంది. మున్సిపల్ చైర్మన్ వల్లభు నారాయణ మూర్తి ... మున్సిపల్ sc, st సబ్ ప్లాన్ నిధులతో సొంత ప్రయోజనాల కోసం నిర్మించుకొంటున్నారు. రోడ్డు విస్తరణలో సత్యనారాయణ రాజు ఇంటిని తొలగించారు.

ఇలా ఎందుకు చేస్తున్నారని సత్యనారాయణ దంపతులు ప్రశ్నించారు.  దీంతో వృద్ధుడు అని కూడా చూడకుండా మున్సిపల్‌ చైర్మన్‌ అండతో కొంతమంది సత్యనారాయణపై దాడి చేశారు.  అవమాన భారంతో సత్యనారాయణ రాజు పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చావుతో పోరాటం చేస్తున్నాడు.

మున్సిపల్‌ చైర్మన్‌ రైతులపట్ల దౌర్జన్యం  చేస్తున్నాడు.  రైతులను బెదిరించి వారి భూములను లాక్కుంటున్నారు. అలా లాక్కున్న భూమిలో తమకు అనుకూలంగా రోడ్డు వేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వారి అక్రమాలను ప్రశ్నిస్తే  దాడి చేస్తున్నారని రైతులు వాపోయారు. ఇప్పటికైనా మున్సిపల్‌ చైర్మన్‌ తన దౌర్జన్యాన్ని తగ్గించుకుని పేదలు, రైతుల భూములను లాక్కోకుండా ఉండాలని రైతులు కోరుతున్నారు.  జరిగిన అక్రమాలపై ప్రభుత్వం విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.
 

07:52 - December 4, 2017

కరీంనగర్ : తెలంగాణ రాష్ట్రం సాధించడంతోనే ప్రజలకు న్యాయం జరగలేదని, సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి  సాధించేవరకు ఐక్య ఉద్యమాలు కొనసాగిస్తామని కమ్యూనిస్టులు కరీంనగర్‌ వేదికగా ప్రకటించారు. విద్య, వైద్యంతోపాటు రైతాంగం సమస్యలను  పరిష్కరించడంలో కేసీఆర్‌ సర్కార్‌ విఫలమైందని ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై పోరు తప్పదని లెఫ్ట్‌పార్టీలోపాటు కాంగ్రెస్‌ , టీడీపీ, ప్రజాసంఘాల నేతలు హెచ్చరించారు. సీపీఐ చేపట్టిన పోరుబాట ముగింపు సభ కరీంనగర్‌లో జరిగింది. ఈ సభకు హాజరైన నేతలంతా  సామాజిక న్యాయం జరిగే వరకు ఐక్యంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.
సీపీఐ పోరుబాట ముగింపు
తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి  పేరుతో సీపీఐ చేపట్టిన పోరుబాట కార్యక్రమం ముగిసింది. 60 రోజులపాటు 31 జిల్లాల్లో కొనసాగిన పోరుబాట యాత్ర 7,500 కిలోమీటర్లు కొనసాగింది. ఈ పోరుబాట ముగింపు సందర్భంగా కరీంనగర్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించారు.  ఈ సభకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, సీపీఐ జాతీయ నేతలు డి. రాజా, నారాయణతోపాటు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, టీపీసీసీ ప్రెసిడెంట్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి,  ప్రజాగాయకుడు గద్దర్‌, విమలక్క, సినీ నటుడు మాదాల రవి హాజరయ్యారు.
అమలుకాని టీసర్కార్ హామీలు : సురవరం 
టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా ప్రజలు సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. ప్రజల తరపున సిపిఐ తిరుగులేని పోరాటాలను కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు.  దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్న టీఆర్‌ఎస్‌.. ఈ మూడేళ్ల పాలనలో కనీసం పదివేల ఎకరాలను పంచలేకపోయిందని విమర్శించారు. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుతో తెలంగాణకు ఏం ప్రయోజనం జరిగిందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.
సామాజిక న్యాయం ఐక్య ఉద్యమాలు : తమ్మినేని 
బంగారు తెలంగాణ అంటున్న టిఆర్ఎస్ ప్రభుత్వం...దానికి అర్థం మాత్రం చెప్పలేక పోతోందని సిపిఎం తెలంగాణ రాష్ట్ర  కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. తెలంగాణ విద్య, వైద్యం, ఉద్యోగం అందరికి అందడంలేదన్నారు. టిఆర్ఎస్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల్లో ఒక్కటి కూడ పూర్తి చేయలేదంటూ మండిపడ్డారు. సామాజిక న్యాయం కోసం కలిసి వచ్చే పార్టీలతో కలిసి ఐక్య ఉద్యమాలు చేయడానికి సిపిఎం, సిపిఐ పార్టీలు సిద్ధంగా ఉన్నాయని తమ్మినేని ప్రకటించారు.
టిఆర్ఎస్ అధికారంలో దళితులపై పెరిగుతున్న దాడులు 
టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు పెరిగాయని...రైతుల చేతులకు సంకెళ్లు పడుతున్నాయంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. రైతులను ఆదు కోవడంలో  కేసీఆర్‌ ప్రభుత్వం విఫలం అయ్యిందని ధ్వజమెత్తారు. రైతు పంటలకు కనీసం గిట్టుబాటు ధరను కల్పించలేని ప్రభుత్వం... కాంట్రాక్టర్లకు  మాత్రం 20వేల కోట్ల రూపాయలను ఎక్కడి నుంచి చెల్లిస్తోందని  ప్రశ్నించారు. మొత్తానికి ఇటివల కాలంలో సిపిఎం,సిపిఐ సామాజిక న్యాయం...సమగ్ర అభివృద్ది తో చేపట్టిన పాదయాత్రలు, పోరుబాటలు విజయవంతం అవడంతో  క్యాడర్‌లో నయా జోష్ నెలకొంది.  రెట్టించిన ఉత్సాహంతో కామ్రేడ్లు భవిష్యత్ ఉద్యమాల కు సిద్దం అవుతున్నారు.

 

07:44 - December 4, 2017

గుంటూరు : కాపు రిజర్వేషన్లపై ఆంధ్రప్రదేశ్‌లో రగడ కొనసాగుతోంది. ఓ వైపు ప్రభుత్వం బీసీలకు అన్యాయం జరగలేదని స్పష్టం చేస్తున్నా.. బీసీ నేతలు మాత్రం మండిపడుతున్నారు. కొన్ని పార్టీలు రాజకీయ లబ్ధి కోసం కులాలను రెచ్చగొడుతున్నాయని, దీనిపట్ల టీడీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు మంత్రులు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. 
చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్‌ 
రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఏ వర్గానికి అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పించినట్లు సీఎం చంద్రబాబు  చెప్పారు. చాలాకాలంగా ఉన్న కాపుల డిమాండ్‌ను నేరవేర్చామని, ఇచ్చిన మాటకు కట్టుబడ్డామన్నారు. బీసీలకు రిజర్వేషన్లలో కోత పెట్టకుండానే కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని గతంలో చెప్పామని.. ఇప్పుడు చేసి చూపించామన్నారు. కాపు రిజర్వేషన్లు, బీసీ సంఘాల ఆందోళన, మంజునాథ కమిషన్‌ అంశాలపై నేతలకు పలు సూచనలు చేశారు. తెలంగాణలో కొన్ని కులాలను బీసీ జాబితా నుంచి తొలగించినప్పుడు మాట్లాడని ఆర్‌.కృష్ణయ్య కాపు రిజర్వేషన్లపై అనవసర విమర్శలు చేస్తున్నారని కొందరు నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.
బీసీ సంక్షేమ సంఘం ధర్నా 
మరోవైపు బీసీలకు కేటాయించిన రిజర్వేషన్లను కాపులకు వర్తింపజేయడానికి వీల్లేదన్నారు బీసీ సంఘం నేతలు. ఈమేరకు కాపులను బీసీల్లో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ విజయవాడ లెనిన్ సెంటర్‌లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించాయి. బీసీలకు ఎలాంటి అన్యాయం జరగలేదని ప్రభుత్వం స్పష్టం చేసినా.. మరోవైపు కాపులను బీసీల్లో చేర్చడాన్ని బీసీ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. బీసీలకు సమస్యలు ఎదురవుతుంటే కాపులను బీసీల్లో చేర్చి మరిన్ని సమస్యలు సృష్టించడం ప్రభుత్వానికి తగదని బీసీ నేతలు అంటున్నారు. ఈ చర్యను ప్రభుత్వం ఆపకపోతే రాబోయేకాలంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని బీసీ నేతలు హెచ్చరిస్తున్నారు. 

 

07:40 - December 4, 2017

హైదరాబాద్‌ : ఓయూలో అర్ధరాత్రి మరోసారి విద్యార్థులు ఆందోళనకు దిగారు. మురళికి న్యాయం చేసేవరకు  మృతదేహాన్ని తరలించేందుకు వీలు లేదని విద్యార్థులు.. పోలీసులను అడ్డుకున్నారు. దీంతో భారీగా మోహరించిన పోలీసులు విద్యార్థులపై లాఠీచార్జ్‌ చేశారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఉస్మానియాలో ఉద్రిక్తతపై మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

07:35 - December 4, 2017

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి మురళి ఆత్మహత్యతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ వైఖరి కారణంగానే మురళి ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మరోవైపు మురళి ఆత్మహత్యను పక్కదారి పట్టించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని విద్యార్థులంటున్నారు. మురళికి న్యాయం చేయాలంటూ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. దీంతో యూనివర్సిటీలో భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు విద్యార్థుల ఆందోళనకు పలు పార్టీల నేతలు సంఘీభావం తెలుపుతున్నారు. 
మురళి రూమ్‌లో సూసైడ్‌ నోట్‌ 
ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి మురళి ఆత్మహత్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే మురళి కొంతకాలంగా తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని....  ఎవరితో మాట్లాడేవాడు కాదని  తోటి విద్యార్థులు చెబుతున్నారు. మరోవైపు పోలీసులు మురళి రూమ్‌లో సూసైడ్‌ నోట్‌ సంపాదించారు. మురళి రాసిన సూసైడ్‌ నోట్‌ను పోలీసులు మార్చారంటూ తోటి విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. మానేరు హాస్టల్‌ ఎదురుగా ధర్నాకు దిగారు.  దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తత ఏర్పడింది.  మురళి మృతదేహాన్ని తరలించేందుకు వచ్చిన వీసీని విద్యార్థులు అడ్డుకున్నారు. మరోవైపు అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు విగతజీవిగా మారడంతో సత్యనారాయణ రాజు తల్లి కన్నీరుమున్నీరైంది. తమ కొడుకును పై చదువుల కోసం పంపితే శవమై తిరిగివచ్చాడని బోరుమన్నారు. టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం మురళి మృతదేహానికి నివాళులు అర్పించారు. 
మురళి మృతదేహానికి చంద్రకుమార్‌ నివాళులు 
మాజీ జస్టిస్‌ చంద్రకుమార్‌ సైతం మురళి మృతదేహానికి నివాళులు అర్పించారు. విద్యార్థులు కొలువుల కోసం ఆత్మహత్య పాల్పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మురళి కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అర్ధరాత్రి ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు మరోసారి ఆందోళనకు దిగారు. మురళి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా విద్యార్థులను పోలీసులను అడ్డుకున్నారు. పరిహారంపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చేవరకు మృతదేహాన్ని తరలించేందుకు అంగీకరించమన్నారు. విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో యూనివర్సిటీలో పోలీసులు భారీగా మోహరించారు. 

 

నేడు ఓయూ బంద్ కు విద్యార్థి సంఘాల పిలుపు

హైదరాబాద్ : విద్యార్థి మురళీ ఆత్మహత్యకు నిరసనగా నేడు ఓయూ బంద్ కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. 
 

నేడు తూ.గో జిల్లా బంద్ కు బీసీ ఐక్య వేదిక పిలుపు

తూ.గో : నేడు జిల్లా బంద్ కు బీసీ ఐక్య వేదిక పిలుపునిచ్చారు. కాపులను బీసీల్లో చేర్చడాన్ని నిరసిస్తూ బంద్ కు పిలుపునిచ్చారు. 

 

విద్యార్థి మురళీ మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలింపు

హైదరాబాద్ : ఓయూ మానేరు హాస్టల్ లో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డారు. విద్యార్థి మురళీ మృతదేహాన్ని గాంధీ పోలీసులు ఆస్పత్రికి తరలించారు. 

 

ఓయూ మానేరు హాస్టల్ లో విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్ : ఓయూ మానేరు హాస్టల్ లో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డారు. హాస్టల్ బాత్ రూంలో ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. సిద్ధిపేట జిల్లా జయదేవ్ పూర్ మండలం దౌలాపూర్ కు చెందిన మురళి ఎమ్మెస్సీ మొదటి సంవత్సరం చదువుతున్నారు.

 

రుద్రంపేటలో రోడ్డు ప్రమాదం

అనంతపురం : రుద్రంపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. 

 

Don't Miss