Activities calendar

05 December 2017

22:06 - December 5, 2017

ఢిల్లీ : ఢిల్లీ టెస్ట్‌పై టీమిండియా పట్టు బిగించింది. 410 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు భారత బౌలర్ల ధాటికి మరోసారి తేలిపోయింది. 4వ రోజు  ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆధిపత్యం ప్రదర్శించిన విరాట్‌ ఆర్మీ...విజయానికి 7 వికెట్ల దూరంలో నిలిచింది. 

ఢిల్లీ టెస్ట్‌లో టీమిండియా విజయం దాదాపుగా ఖాయమైంది.4వ రోజు సమిష్టిగా రాణించిన విరాట్‌ ఆర్మీ...విజయానికి చేరువగా వచ్చింది. 356 పరుగులకు 9 వికెట్లతో 4వ రోజు ఆట కొనసాగించిన శ్రీలంక జట్టు ఓవర్‌నైట్‌ స్కోర్‌కు మరో 17 పరుగులు మాత్రమే జోడించి ఆలౌటైంది. 163 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌కు ధావన్‌,రోహిత్‌,విరాట్‌ కొహ్లీ హాఫ్‌ సెంచరీలతో తిరుగులేని ఆధిక్యాన్నందించారు. 

తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన ధావన్‌ టెస్టుల్లో 6వ హాఫ్‌సెంచరీతో పాటు 2వేల పరుగుల మైలురాయిని సైతం అధిగమించాడు. విరాట్‌ కొహ్లీ 15వ టెస్ట్‌ హాఫ్‌ సెంచరీతో పూర్తి చేయగా...రోహిత్‌ శర్మ 9వ హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు. 52.2 ఓవర్లలో 5 వికెట్లకు 246 పరుగులు చేసిన భారత్‌ జట్టు ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. 

410 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు 6వ ఓవర్‌లో ఓపెనర్‌ సమర విక్రమ వికెట్‌ కోల్పోయింది. 16వ ఓవర్‌లో మరో ఓపెనర్‌ కరుణరత్నేను మహమ్మద్‌ షమీ ఔట్‌ చేయగా ....నైట్‌ వాచ్‌మెన్‌ సురంగా లక్మల్‌ను జడేజా  బోల్తా కొట్టించాడు. 31 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన లంక జట్టు కష్టాల్లో పడింది.లంక విజయానికి ఇంకా 379 పరుగులు కావాలి. పదునైన భారత బౌలింగ్‌ ఎటాక్‌ ముందు 5వ రోజు శ్రీలంక బ్యాట్స్‌మెన్‌ నిలబడతారో లేదో అనుమానమే. ఆఖరి రోజు లంచ్‌కు ముందే లంకను ఆలౌట్‌ చేసి సిరీస్‌ను విజయంతో ముగించాలని టీమిండియా తహతహలాడుతోంది.

22:02 - December 5, 2017

విశాఖ : కేంద్రంలోని బీజేపీ సర్కార్‌.... ప్రభుత్వ రంగ సంస్థలను మూసేసే పనిలో పడింది. విశాఖ నగర పరిధిలోని అనేక పరిశ్రమలను శరవేగంగా స్టాటజిక్‌ సేల్‌ పేరుతో అమ్మేసే కార్యక్రమం మొదలైంది. ఇప్పటికే హిందుస్థాన్‌ జింక్‌ను మూసివేసి అందులోని కార్మికులను రోడ్డున పడేసిన కేంద్రం... ఇప్పుడు డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాను కారుచౌకగా అమ్మేసే ప్రయత్నాలకు తెరలేపింది. డీసీఐ ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఓ కార్మికుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది.

డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ అంటే ఏమిటో చాలా మందికి తెలియదు. సముద్ర తీరంలో లోతు తక్కువగా ఉండడం వల్ల పోర్టుల్లోకి వచ్చే భారీ షిప్‌లకు ఇబ్బందులు తలెత్తుతాయి. దానిని దృష్టిలో ఉంచుకుని తీర ప్రాంతంలో ఇసుక మేట వెయ్యకుండా ఎప్పటికప్పుడు డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ద్వారా సముద్రతీరంలో చర్యలు తీసుకుంటారు. ఇలా దేశంలోని అన్ని మేజర్‌ పోర్టుల్లో డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ తన సేవలను విస్తృతంగా అందిస్తోంది.  డీసీఐను 1976లో విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేశారు. ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, హల్దియా, కొచ్చిన్‌లలో దీనికి శాఖలు ఉన్నాయి.ప్రపంచంలోని 10 డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్లలో  విశాఖ కేంద్రంగా నడిచే డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఒకటిగా రికార్డుకెక్కింది. ఇది ఏడాదికి సుమారు 600 కోట్లకుపైగా టర్నోవర్‌ను కలిగి ఉంది. 

డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో 51శాతం వాటాలను వ్యూహాత్మకంగా అమ్మాలని కేంద్ర కేబినెట్‌ నోట్‌ సిద్ధం చేసింది. డీసీఐను ప్రైవేటీకరించాలని నిర్ణయించింది.  ఇది ఆ సంస్థ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. డీసీఐని ప్రైవేటీకరిస్తే అందులో పనిచేస్తోన్న సుమారు వెయ్యిమంది కార్మికులు రోడ్డున పడే ప్రమాదముంది. ప్రభుత్వం ఇప్పటి వరకు  ప్రభుత్వ రంగ సంస్థలను నష్టాలలో ఉన్నాయనే నెపంతో అమ్మేస్తున్నాయి. కాని డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఇందుకు పూర్తిగా విరుద్దం. 2015 -16 సంవత్సరాల్లో 80కోట్ల నికర లాభం ఆర్జించింది.  అంతేకాదు... ఇప్పటి వరకు దాదాపు 213 కోట్ల రూపాయలు పన్నుల రూపంలో ప్రభుత్వానికి చెల్లించింది. ఇప్పటికీ డీసీఐ 5వేలకోట్ల రూపాయల ఆస్తులను కలిగి ఉంది. అయినా డీసీఐను కేంద్ర ప్రభుత్వం ఎందుకు ప్రైవేటీకరించాలనే నిర్ణయం తీసుకుందో ఎవ్వరికీ అర్థంకాని పరిస్థితి.

లాభాల్లో ఉన్న డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌కు చెందిన 51శాతం వాటాలను విక్రయించాలని కేంద్రం నిర్ణయించడంతో  కార్మికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు, ఉద్యోగులు, కార్మిక సంఘాల నేతలు  ఆందోళనకు దిగాయి. కొన్ని రోజులుగా విశాఖ జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం దగ్గర ధర్నా చేస్తున్నారు. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోవడంతో కార్మికుల్లో ఆందోళన పెరిగింది. ఉద్యోగుల్లో అభద్రతా భావం ఎక్కువైంది. ఈ నేపథ్యంలోనే డీసీఐలో అడ్మిన్‌ విభాగంలో పనిచేస్తోన్న పర్మినెంట్‌ ఉద్యోగి  వెంకటేష్‌ రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.  తన చావుతోనైనా ప్రభుత్వం డీసీఐను ప్రైవేటీకరించాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సూసైడ్‌ నోట్‌లో రాశాడు. వెంకటేష్‌ మృతితో అతని కుటుంబంలో విషాదం నెలకొంది.

ఆత్మహత్యకు పాల్పడిన వెంకటేష్‌ కుటుంబ సభ్యులను సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్‌ నర్సింగరావు పరామర్శించారు. జిల్లా ఆస్పత్రిలో వెంకటేష్‌ మృతదేహానికి నివాళులు అర్పించారు.  ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేసే ప్రయత్నాలను వెంకటేష్‌ మృతితోనైనా ప్రభుత్వం నిలిపివేయాలని కోరారు. లేకుంటే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. 

వెంకటేష్‌ మృతితో డీసీఐలోని కార్మిక సంఘాలు తమ ఆందోళన మరింత ఉధృతం చేశాయి. డీసీఐ కార్మికులు, ఉద్యోగులు విధులను బహిష్కరించి ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం చేశారు. వెంకటేష్‌ కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, అతని కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా డీసీఐను  ప్రైవేటీకరణ చేయాలన్న నిర్ణయాన్ని మోదీ ఉపసంహరించుకోకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 

 డ్రెడ్జింగ్‌ కార్మికుడు వెంకటేష్‌ మృతి అందరినీ కలచివేస్తోంది.  అంతేకాదు డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ను ప్రైవేటీకరించానల్ని నిర్ణయాన్ని విపక్షాలు సైతం వ్యతిరేకిస్తున్నాయి. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. వెంకటేష్ కుటుంబ సభ్యులను పరామర్శించనున్నట్టు  పవన్‌ తెలిపారు. 

21:58 - December 5, 2017

మహబూబ్ నగర్ : జిల్లాలో దళితులపై దాడి చేసిన మంత్రి లక్ష్మారెడ్డిని అరెస్ట్ చేయాలనీ టీ మాస్ పోరమ్ డిమాండ్ చేసింది. మంత్రి పర్యటనకు వచ్చిన సందర్బంలో..సమస్యలపై ప్రశ్నించిన దళితులను మంత్రి కొట్టారని, అతన్ని అరెస్ట్ చేసి, బర్తరప్ చేయాలని డిమాండ్ చేశారు. ఓయూ విద్యార్థి మురళి మృతికి ప్రభుత్వమే కారణమన్నారు. 

 

21:56 - December 5, 2017

హైదరాబాద్ : రవీంద్ర భారతిలో ఐఎఏస్ అధికారి రాజశేఖర్ వుంద్రుస్ రచించిన 'అంబేద్కర్ గాంధీ పటేల్ ద మేకింగ్ ఆఫ్ ఇండియాస్ ఎలక్టొరల్ సిస్టమ్' పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి,  సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ. రాఘవులు, మాజీ ఐఎఏస్ కాకి మాధవరావు, చుక్కా రామయ్య, మల్లెపల్లి లక్ష్మయ్య పాల్గొన్నారు. పుస్తకాన్ని జైపాల్ రెడ్డి ఆవిష్కరించారు. అంబేడ్కర్, గాంధీ, పటేల్‌ ఆలోచనలను మంచి దృక్పథంతో పుస్తకరూపంలో తీసుకురావడాన్ని వక్తలు అభినందించారు. 

 

21:53 - December 5, 2017

హైదరాబాద్ : బీసీలకు రాజకీయ, ఆర్థిక, సామాజిక , పారిశ్రామిక రంగాల్లో ప్రాధాన్యం దక్కినప్పుడే వారి అభివృద్ధి సాధ్యమని బీసీ ప్రజాప్రతినిధుల సమావేశం అభిప్రాయపడింది. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని తీర్మానించింది. దళిత చట్టాల మాదిరిగానే బీసీలకు చట్టాలు తీసుకురావాలని నేతలు ప్రతిపాదించారు. అసెంబ్లీ కమిటీహాల్‌లో మూడు రోజులపాటు జరిగిన బీసీ ప్రజాప్రతినిధుల సమావేశాలు ముగిశాయి. మరో రెండు రోజుల్లో సీఎంకు ప్రతినిధి బృందం నివేదిక సమర్పించనుంది.

తెలంగాణలోని బీసీ ప్రజాప్రతినిధుల మూడు రోజుల సమావేశాలు మంగళవారం ముగిశాయి. వెనుకబడిన వర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై ఈ మూడు రోజులు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. దాదాపు 200 డిమాండ్లతో ఓ నివేదిక సిద్ధం చేశారు. మరో రెండు రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆ నివేదికను అందించనున్నారు.

బీసీలు అన్నిరంగాల్లో అభివృద్ధి చెందేందుకు తీసుకోవాల్సిన అంశాలపైనే ఈ సమావేశాల్లో ప్రధానంగా చర్చ జరిగింది. రాజకీయ, ఆర్థిక, సామాజిక, పారిశ్రామిక రంగాల్లో ప్రాధాన్యం దక్కితే అభివృద్ధి సాధ్యమన్న అభిప్రాయం నేతల్లో వ్యక్తమైంది. చట్టసభల్లో రిజర్వేషన్లు తెచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం వద్దకు అఖిలపక్షాన్ని సీఎం కేసీఆర్‌ తీసుకెళ్లాలని సమావేశం తీర్మానించింది.  బీసీల కోసం ప్రత్యేకంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి నియోజకవర్గాల వారీగా బీసీ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ ఏర్పాటు చేయాలని అభిప్రాయపడ్డారు. సివిల్స్‌, గ్రూప్స్‌లాంటి  పరీక్షలకు ప్రత్యేకంగా శిక్షణాకేంద్రాలను ప్రారంభించాలని ప్రతిపాదించారు.  కాంట్రాక్టుల కేటాయింపులో కూడా రాయితీలు ఇవ్వాలని, డిక్కీ తరహాలోనే బిక్కీని ఏర్పాటు చేసి పరిశ్రమల స్థాపనకు బీసీలకు ఆర్థికంగా తోడ్పాటునందించాలని సమావేశం ఏకాభిప్రాయం వ్యక్తం చేసింది.

ప్రభుత్వం రాజకీయాలతో సంబంధంలేకుండా అన్ని పార్టీల నేతలతో చర్చించడం ఆహ్వానించదగ్గ పరిణామమని ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య అన్నారు. బీసీ ప్రజాప్రతినిధుల సమావేశాల్లో చేసిన ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించాలన్నారు. మొత్తానికి బీసీ ప్రజాప్రతినిధుల సమావేశంలో నేతలు కీలక నిర్ణయాలనే తీసుకున్నారు. ఇటు రాజకీయ పరమైన అంశాలతోపాటు అటు ఆర్థికపరమైన అంశాలతో ముడిపడిన ప్రతిపాదనలు చేశారు. మరి వీటిని కేసీఆర్‌ సర్కార్‌ ఏమేరకు అంగీకరించి అమలు చేస్తుందో వేచి చూడాలి.

21:48 - December 5, 2017

హైదరాబాద్ : మెట్రో స్టేషన్లపై పార్కింగ్ సమస్య త్వరగా పరిష్కరించాలని సూచించారు మంత్రి కేటీఆర్. మెట్రో రైలుకు వస్తున్న భారీ స్పందన నేపథ్యంలో రైళ్ల సంఖ్యను పెంచేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలన్నారు. వచ్చే ఫిబ్రవరి నాటికి ప్రయాణికుల సంఖ్యను బట్టి ఫ్రీక్వెన్సీని పెంచుతామని మంత్రికి హెచ్ ఎమ్మార్ అధికారులు తెలిపారు. 

మెట్రో రైలు ప్రారంభమైన తరువాత మొదటిసారి మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ప్రయాణికుల నుంచి వస్తున్న ఫీడ్‌ బ్యాక్‌తో పాటు మెట్రో స్టేషన్లలో  సౌకర్యాల ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. మెట్రో ప్రయాణికులకు అవసరమైన పార్కింగ్ సౌకర్యాలపై కేటీఆర్ ప్రత్యేకంగా చర్చించారు. అవసరమైన మేరకు పార్కింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో పాటు.. పార్కింగ్ ప్రాంతాలు ప్రజలకు తెలిసేలా అవగాహన కల్పించాలని కేటీఆర్ సూచించారు. మెట్రో ఫీడర్ల రూట్లలో మరిన్ని బస్సులను ఏర్పాటు చేసేలా ఆర్టీసీతో మాట్లాడాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రయాణీకుల నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్‌ పైన మంత్రి కేటీఆర్ సమావేశంలో చర్చించారు. మెట్రో స్టేషన్లలో తాగునీరు, టాయిలెట్ల ఏర్పాట్లపై త్వరగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీంతోపాటు వచ్చే ఏడాది జూన్ 1కి డెడ్‌లైన్ పెట్టుకుని ఐటీ కారిడార్ల మెట్రో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మెట్రో కారిడార్లలో చేపట్టిన ఫుట్ పాత్ల అభివృద్ధి పనులను మంత్రి సమీక్షించారు.

21:44 - December 5, 2017

ఢిల్లీ : పోలవరం ప్రాజెక్టును 2019 నాటికి పూర్తి చేయడానికి తన పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని ఏపీ సీఎం చంద్రబాబకు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ హామీ ఇచ్చారు. ప్రాజెక్టుకు 381 కోట్లు విడుదల చేయడానికి తాజాగా ఉత్తర్వులు ఇచ్చామన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై.. మంత్రి దేవినేని సారథ్యంలోని బృందం... గడ్కరీతో సమావేశమైంది. ఇదే సమయంలో కొరియా పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు పోలవరం వివాదంపై గడ్కరీతో ప్రత్యేకంగా ఫోన్‌లో మాట్లాడారు. పునరావాసం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఖర్చు చేసిన 2,800 కోట్లు ఇవ్వాల్సిందిగా చంద్రబాబు గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి వీలైనంత సాయం అందిస్తామని చంద్రబాబుకు హామీ ఇచ్చారు. 

ముగిసిన బీసీ ప్రజాప్రతినిధుల సమావేశం

హైదరాబాద్ : బీసీ ప్రజాప్రతినిధుల సమావేశం ముగిసింది. రెండు రోజుల్లో సీఎం కేసీఆర్ కు నివేదిక మూడు రోజులు బీసీల అభివృద్ధి కోసం చర్చలు జరిపామని మంత్రి జోగు రామన్న అన్నారు.  విద్యకు బీసీ వర్గాలు దూరంగా ఉన్నాయన్నారు. 

21:27 - December 5, 2017
21:14 - December 5, 2017

చెన్నై : ఆర్కే నగర్ ఉప ఎన్నికకు హీరో విశాల్ నామినేషన్ ను అంగీకరించారు. ముందు నామినేషన్ ను తిరస్కరించినా...విశాల్ వివరణ ఇచ్చిన తర్వాత రిటర్నింగ్ అధికారి నామినేషన్ ను స్వీకరించారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికలో విశాల్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

 

విశాల్ నామినేషన్ కు అంగీకారం

చెన్నై : ఆర్కే నగర్ ఉప ఎన్నికకు హీరో విశాల్ వేసిన నామిషనేషన్ ను అంగీకరించారు. విశాల్ వివరణ ఇచ్చిన తర్వాత నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి స్వీకరించారు. 

 

20:43 - December 5, 2017

రోగమొస్తే మందేసుకుంటాం.. కానీ, లేని రోగానికి మింగితే... కొత్త రోగాలొస్తాయి. మందుల కంపెనీల దృష్టిలో వాళ్లు ప్రయోగశాలలో జంతువులతో సమానం. అడ్డగోలుగా చేస్తున్న ప్రయోగాలే ఇందుకు ఉదాహరణ. నిస్సహాయతను, అజ్ఞానాన్ని ఆసరాగా చేసుకుని డ్రగ్స్ కంపెనీలు సాగిస్తున్న ఆగడాలకు చెక్ పెట్టేదెలా? దళారులతో ఎరవేస్తూ ప్రాణాలను బలితీసుకుంటున్న దారుణాన్ని ప్రభుత్వాలు ఎంత కాలం చూస్తూ ఊరుకుంటాయి? ఇదే ఈ రోజు వైడాంగిల్ స్టోరీ.. ప్రయోగాల పేరుతో ప్రాణాలు తీస్తున్నారు.. నిబంధనల ఊసులేదు.. కాసుల కక్కుర్తితో, పేదరికాన్ని ఆసరగా చేసుకుని డ్రగ్స్ కంపెనీలు చేస్తున్న ఆగడాలు తారాస్థాయికి చేరుతున్నాయి. దానికిపుడు కరీంనగర్ జిల్లా అడ్డాగా మారుతోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

20:37 - December 5, 2017

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ నామినేషన్ పై వక్తలు భిన్నవాదనలు వినిపించారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చ కార్యక్రమంలో విశ్లేషకులు నడింపల్లి సీతారామరాజు, బీజేపీ నేత ప్రకాశ్ రెడ్డి, కాంగ్రెస్ నేత కార్తీక్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు. వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలకాలన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

20:27 - December 5, 2017

జేఏసీ సభ మీద విచిత్ర వార్తలు, ముప్పైవేల ఉద్యోగాలు భర్తీ జేశ్నం, ఉస్మానియా యూనివర్సీల యుద్దం, గురిగింజ నీతులు జెప్తున్న జగనాలు, బీసీల నడ్మ పంచాది వెట్టిన చంద్రులు... ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

చీరాలలో విషాదం

ప్రకాశం : చీరాలలో విషాదం నెలకొంది. కొత్తపేట సెయింట్ పాల్ లోగస్ స్కూల్ భవనం వెనుక పంట చేనులోపడి ఎల్ కేజీ విద్యార్థి మహేష్ పవన్ మృతి చెందారు. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని బాలుడి మృతదేహంతో తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. 

 

మంత్రి నితిన్ గడ్కరీతో ఏపీ కాంగ్రెస్ నేతల సమావేశం

ఢిల్లీ : కేంద్ర జలవనరులశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతల సమావేశం జరుగనుంది. కేంద్రం పోలవరం నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని కాంగ్రెస్ నేతలు గడ్కరీకి విజ్ఞప్తి చేశారు.  

 

అయోధ్య వివాదం కేసుపై సుప్రీంకోర్టులో విచారణ

ఢిల్లీ : అయోధ్య వివాదం కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. 2019 సాధారణ ఎన్నికల తర్వాత విచారణ చేపట్టాలని సున్నీ వక్ఫ్ బోర్డు తరపు లాయర్ కపిల్ సిబాల్ తెలిపారు. సుప్రీం తీర్పు ఎన్నికలపై ప్రభావం చూపుతుందని సిబాల్ అన్నారు. కపిల్ సిబాల్ వాదనలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

హీరో విశాల్‌ అరెస్టు

తమిళనాడు : చెన్నై ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో హీరో విశాల్, జయలలిత మేనకోడలు దీపకు ఈసీ షాక్ ఇచ్చింది. నామినేషన్ పత్రాల్లో తప్పులున్నాయంటూ తిరస్కరించింది. నామినేషన్ తిరస్కరణకు నిరసనగా విశాల్ అభిమానులతో కలిసి రోడ్డుపై ధర్నా చేపట్టారు. అడ్డుకున్న పోలీసులు విశాల్‌ను అరెస్టు చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.  నామినేషన్ తిరస్కరణపై విశాల్ కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఉద్దేశపూర్వకంగానే తన నామినేషన్ తిరస్కరించినట్లు విశాల్ ఆరోపిస్తున్నారు. 

19:46 - December 5, 2017

తమిళనాడు : చెన్నై ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో హీరో విశాల్, జయలలిత మేనకోడలు దీపకు ఈసీ షాక్ ఇచ్చింది. నామినేషన్ పత్రాల్లో తప్పులున్నాయంటూ తిరస్కరించింది. నామినేషన్ తిరస్కరణకు నిరసనగా విశాల్ అభిమానులతో కలిసి రోడ్డుపై ధర్నా చేపట్టారు. అడ్డుకున్న పోలీసులు విశాల్‌ను అరెస్టు చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.  నామినేషన్ తిరస్కరణపై విశాల్ కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఉద్దేశపూర్వకంగానే తన నామినేషన్ తిరస్కరించినట్లు విశాల్ ఆరోపిస్తున్నారు. 

 

ఏపీలో 3 రోజులు పర్యటించనున్న పవన్ కల్యాణ్

హైదరాబాద్ : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్  ప్రజాక్షేత్రంలోకి అడుగుపెడుతున్నారు. రేపటి నుంచి ఏపీలో మూడు రోజులు పర్యటించనున్నారు. వైజాగ్, విజయనగరం, విజయవాడ, పశ్చిమగోదావరి, ఒంగోలు జిల్లాలో ఆయన టూర్ కొనసాగుతుంది. ముందుగా రేపు విశాఖ వెళ్తున్నారు. నిన్నఆత్మహత్య చేసుకున్న విశాఖ డ్రెడ్జింగ్ కార్పొరేషన్‌ ఉద్యోగి కుటుంబాన్ని పరామర్శించనున్నారు. తరువాత పశ్చిమగోదావరి జిల్లా ఆక్వా ఫుడ్ పార్క్ బాధితులతో భేటీ కానున్నారు. ఈనెల 8న ఫెర్రీ బోట్ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబ సభ్యులను ఒంగోలు వెళ్లి పరామర్శిస్తారు.

19:30 - December 5, 2017

విజయనగరం : వ్యవసాయం కోసం ప్రత్యేక బడ్జెట్  కేటాయించిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందన్నారు మంత్రి గంటా శ్రీనివాసరావు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. వరల్డ్ సాయిల్ డే సందర్భంగా విజయనగరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి గంటా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు ట్రాక్టర్లను పంపిణీ చేశారు. ఆయనతో పాటు మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు, జెడ్పీ చైర్‌పర్సన్ స్వాతిరాణి  ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

 

19:27 - December 5, 2017

అనంతపురం : మున్సిపాలిటీకి అవినీతి గబ్బు పట్టింది. అక్కడ కాంట్రాక్టర్లు, అధికారులు, పాలకులు మూకుమ్మడిగా దోచేస్తున్నారు. పర్సంటేజీల విషయంలో జరిగిన ఓ డీల్ విషయంలో కలగజేసుకున్నాడనే నెపంతో ఓ కాంట్రాక్టర్‌ ఏకంగా డీఈపై దాడికి తెగబడటం సంచలనం రేపింది. మరోవైపు దాడికి సంబంధించి ఇంటెలిజెన్స్ రిపోర్టును పోలీస్‌శాఖ డీజీపీకి పంపడంతో మున్సిపల్ వర్గాల్లో వణుకు మొదలైంది. 

అనంతపురం మున్సిపాలిటీ అవినీతిలో కూరుకుపోయింది. అక్కడ పైసలు ఇవ్వందే ఫైల్ కదిలే పరిస్థితి కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో సోమవారం పట్టపగలు నడిరోడ్డుపై డీఈ కిష్టప్పపై కాంట్రాక్టర్ నరసింహారెడ్డి దాడిచేయడం సంచలనం సృష్టించింది. ఏఈ ప్రసాద్‌తో పర్సంటేజీల విషయంలో జరుగుతున్న గొడవలో డీఈ కలగజేసుకున్నాడని కాంట్రాక్టర్‌ నరసింహారెడ్డి కిష్టప్పపై దాడి చేశాడు. కిష్టప్పపై దాడిని నిరసిస్తూ మున్సిపల్ ఉద్యోగులు ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో నరసింహారెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు పంపారు. అయితే అరెస్టైన సందర్భంలో నరసింహారెడ్డి బయటకి వచ్చాక అందరి భాగోతాలు బయటపెడతాననడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. 

కొద్దిరోజుల క్రితం మున్సిపల్ కార్పొరేషన్‌కు రూ.40 లక్షలు పెట్టి రోడ్లు ఊడ్చే స్వీపింగ్ యంత్రాన్ని కాంట్రాక్టర్ నరసింహారెడ్డి మధ్యవర్తిత్వంతో కొన్నారు. దీనిపై అనేక వివాదాలు నడుస్తున్నాయి. నాణ్యత లేదంటూ బిల్లును చెల్లించే విషయాన్ని నాన్చుతూ వస్తున్నారు. 40లక్షలకు బదులు... 25 లక్షలు మాత్రమే చెల్లించారు. దీంతో మిగతా 15లక్షలు చెల్లించాలని కాంట్రాక్టర్ నరసింహారెడ్డికి మున్సిపల్ అధికారులకు గొడవ జరుగుతోంది.. బిల్లుకు సంబంధించి ఏఈ ప్రసాద్ పర్సంటేజీ అడిగి సతాయించాడని.. వారు అడినంత ఇవ్వలేకపోయానని.. ఆ విషయంలో గొడవ జరుగుతుండగా.. డీఈ కిష్టప్ప  వచ్చి తనను దూషించాడని నరసింహారెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సహనం కోల్పోయిన కాంట్రాక్టర్ దాడికి తెగబడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నరసింహారెడ్డి పోలీసుల రిమాండ్‌లో ఉన్నాడు. 

ఈ నేపథ్యంలో అనంతపురం మున్సిపల్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి మరోసారి చర్చకు దారి తీసింది. నరసింహారెడ్డి తనవద్ద అందరి బాగోతాలు వున్నాయంటూ చెప్పడం చర్చనీయాంశంగా మారింది. అతనిని మీడియాతో మాట్లాడనివ్వకపోవడం వెనుక అధికార పార్టీ నేతల ఒత్తిడి ఉన్నట్లు తెలుస్తోంది. సంచలనం సృష్టించిన డీఈపై దాడి ఘటనకు సంబంధించిన ఇంటెలిజెన్స్ రిపోర్టును పోలీస్‌ శాఖ డీజీపీకి పంపినట్లు తెలుస్తోంది. ఈ దాడి ఘటన ఎక్కడికి దారి తీస్తుందో అన్న టెన్షన్ మున్సిపల్ వర్గాల్లో నెలకొంది. 

19:24 - December 5, 2017

అనంతపురం : ఏపీలో అవినీతి పాలన సాగుతోందన్నారు వైసీపీ అధినేత  వైఎస్.జగన్. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు డబ్బులిస్తూ ఆడియో, వీడియో టేపులతో దొరికిపోయినా.. చంద్రబాబు లాంటివారిపై  కేసులుండవని ఆరోపించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 27వరోజు జగన్ అనంతపురం జిల్లా పెదవడుగూరులో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు.  ఉదయం గుత్తిలో ప్రారంభమైన జగన్ పాదయాత్ర.. సాయంత్రం చిన్నవడుగూరులో ముగిసింది. రాత్రి అక్కడే బస చేసి రేపు ఉదయం జగన్ తిరిగి పాదయాత్ర ప్రారంభిస్తారు. 

 

 

19:22 - December 5, 2017

విశాఖ : డ్రెగ్జింగ్ కార్పొరేషన్‌ను ప్రైవేటీకరిస్తారని ఆందోళన చెంది ఆత్మహత్య చేసుకున్న డీసీఐ ఉద్యోగి వెంకటేష్‌ కుటుంబసభ్యులను సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు నర్సింగరావు పరామర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా ప్రైవేటీకరణ విధానాలను విడనాడాలని ఆయన అన్నారు. ప్రభుత్వరంగ పరిశ్రమల్లో ఉన్న కార్మికులు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారని నర్సింహారావు తెలిపారు. 

19:20 - December 5, 2017

దక్షిణకొరియా : ఏపీలో ఎప్పుడూ పెట్టుబడులకు స్నేహపూర్వక వాతావరణం ఉంటుందని, ఏపీకి సీఎన్‌బీసీ స్టేట్ ఆఫ్ ద ఇయర్ పురస్కారం వచ్చిందని చంద్రబాబు తెలిపారు. దక్షిణకొరియాలో రెండోరోజు పర్యటనలో భాగంగా బూసన్ సిటీలో బిజినెస్ సెమినార్‌లో చంద్రబాబు పాల్గొన్నారు. కియా మోటార్స్‌ను అడగండి...ఏపీ సమర్ధత ఏంటో చెబుతుందన్నారు. ఏపీలో ఉత్తమ పారిశ్రామిక విధానం అమలులో ఉందని, పెట్టుబడులకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు అత్యుత్తమ ప్యాకేజీని ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. 

19:17 - December 5, 2017

ఢిల్లీ : కేంద్ర జలవనరుల శాఖా మంత్రి నితిన్‌ గడ్కరీ మాటలు వింటే 2018 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తికాదని తేలిపోయిందని ఏపీసీసీ అధ్యక్షుడు రఘవీరా రెడ్డి అన్నారు. ఢిల్లీలో నితిన్‌ గడ్కరీతో ఏపీ కాంగ్రెస్‌ నేతలు సమావేశమయ్యారు. పోలవరం పునరావాసంపై  కేంద్రానికి బాధ్యత లేనట్లుగా చెబుతున్నారని రఘువీరా మండిపడ్డారు. పోలవరంపై టీడీపీ, బీజేపీ డ్రామాలాడుతున్నాయని అన్నారు. పంపకాలలో తేడాలు రావడం వల్లే ఈ సమస్య వచ్చిందని రఘువీరారెడ్డి ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు కుక్కలు చింపిన విస్తరిగా మారిందని విమర్శించారు. పార్లమెంటులో పోలవరం ప్రాజెక్టు అంశాన్ని లేవనెత్తుతామని రఘువీరా రెడ్డి తెలిపారు.

 

19:15 - December 5, 2017

హైదరాబాద్ : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్  ప్రజాక్షేత్రంలోకి అడుగుపెడుతున్నారు. రేపటి నుంచి ఏపీలో మూడు రోజులు పర్యటించనున్నారు. వైజాగ్, విజయనగరం, విజయవాడ, పశ్చిమగోదావరి, ఒంగోలు జిల్లాలో ఆయన టూర్ కొనసాగుతుంది. ముందుగా రేపు విశాఖ వెళ్తున్నారు. నిన్నఆత్మహత్య చేసుకున్న విశాఖ డ్రెడ్జింగ్ కార్పొరేషన్‌ ఉద్యోగి కుటుంబాన్ని పరామర్శించనున్నారు. తరువాత పశ్చిమగోదావరి జిల్లా ఆక్వా ఫుడ్ పార్క్ బాధితులతో భేటీ కానున్నారు. ఈనెల 8న ఫెర్రీ బోట్ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబ సభ్యులను ఒంగోలు వెళ్లి పరామర్శిస్తారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

మెట్రో రైలుపై సీఎం కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్ : మెట్రో రైలుపై సీఎం కేసీఆర్ సమీక్ష చేశారు. రైళ్ల సంఖ్యను పెంచడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలన్నారు. 

19:09 - December 5, 2017

బీజేపీ శాసన సభాపక్ష నేత విష్ణుకుమార్ రాజుతో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. ఈ సందర్భంగా జాతీయ, రాష్ట్ర రాజకీయాలపై ఆయన మాట్లాడారు. ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. చంద్రబాబు పాలనను ఎండగట్టారు. ఏపీ నూతన రాజధాని నిర్మాణం పనులపై మాట్లాడారు. నిర్మాణం పనుల్లో అలసత్వాన్ని ప్రశ్నించారు. గాలి మాటలు సరికాదన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

18:25 - December 5, 2017

మహబూబ్‌నగర్‌ : జిల్లాలో మంత్రి కేటీఆర్‌ ఉత్సాహంగా, ఉల్లాసంగా పర్యటించారు. జిల్లా కేంద్రంలో మయూరి పార్క్‌లో పర్యటించిన మంత్రి... పలు ప్రారంభోత్సవాలు చేశారు. ఎప్పుడు బిజీబిజీగా ఉండే కేటీఆర్‌...పార్క్‌లో పర్యటించి ఉల్లాసంగా గడిపారు.

పాలమూరు జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. జిల్లా కేంద్రం సమీపంలోని మయూరి నర్సరీని సందర్శించారు. 300 వందల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పార్క్‌లో పలు ప్రారంభోత్సవాలు చేశారు. ఓపెన్‌ ఎయిర్‌ జిమ్‌, జిప్‌ సైక్లింగ్‌, హంసల కొలను, ఆర్చరీ, కరెన్సీ పార్క్‌, రైఫిల్‌ షూటింగ్‌ ఈవెంట్లను ప్రారంభించారు. 

ఎప్పుడూ విధుల్లో బిజీబిజీగా గడిపే కేటీఆర్‌... ఈ సందర్భంగా కాస్తా ఉల్లాసంగా గడిపారు. పార్క్‌లో తిరిగి అందరిని అలరించారు. మయూరీ నర్సరీ అభివృద్ధికి మరింత చేస్తామన్నారు కేటీఆర్‌. పార్క్‌కు వచ్చే సందర్శకుల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం... పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 

18:20 - December 5, 2017

కరీంనగర్ : పేదరికం...ఆర్థిక సమస్యలు...నిరుద్యోగం ఫార్మా కంపెనీలకు  వరంగా మారుతున్నాయి.  ఔషధ ప్రయోగాలతో  సామాన్యుల జీవితాలతో ఫార్మా సంస్థలు  చెలగాటమాడుతున్నాయి. ఔషధ ప్రయోగాలు వికటించి అంతు చిక్కని వింత వ్యాధుల బారిన పడుతూ  అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు.  కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో లోటస్, అపెటెక్స్‌, రెడ్డి ల్యాబ్స్ ఫార్మా కంపెనీల క్లినికల్‌ ట్రయల్స్‌ భాదితులు ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు. ఫార్మా కంపెనీలు నిర్వహిస్తున్న క్లినికల్‌ ట్రయల్స్‌ కిల్లర్‌ ట్రయల్స్‌గా మారుతున్నాయి. పేదలు, నిరుద్యోగుల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని ఈ  సంస్థలు నిర్వహిస్తున్న ఔషధ ప్రయోగాలు కొన్నిసార్లు వికటిస్తున్నాయి. దీంతో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొందరు ఆస్పత్రిపాలవుతున్నారు. ఇంకొందరు మతిస్థిమితం కోల్పోయి అచేతనస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. వెరసి ఇలాంటివారి కుటుంబాలు వీధనపడుతున్నాయి. 

కరీంనగర్ జిల్లాలో క్లినికల్‌ ట్రయల్స్‌ కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయి. ఈ ప్రయోగాలతో నాగంపేటకు చెందిన నాగరాజు ప్రాణాలుల కోల్పోతే..జమ్మికుటం మండలం కొతపల్లికి చెందిన అశోక్‌ మతిస్థిమితం కోల్పోయాడు. సురేశ్‌ ఆస్పత్రి పాలయ్యాడు. వీరికి తోడు తాజాగా మరో కేసు వెలుగులోకి వచ్చింది. కొత్తపల్లిలో మరో క్లినికల్‌ ట్రయల్స్‌ కేసు వెలుగులోకి వచ్చింది. తన పేరు, వివరాలు గోప్యంగా ఉంచాలని బాధితుడు విజ్ఞప్తి చేశాడు. ఔషధ ప్రయోగం వికటించడంతో  బాధితుడు షుగర్‌ వ్యాధితో బాధపడుతున్నాడు. ఇలాంటి పరిస్థితి మరొకరికి రాకూడదని ఆవేదన వ్యక్తం చేశారు. హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న బాధితుడిపై 30 సార్లు క్లినికల్‌ ట్రయల్స్‌ జరిగాయి. ఫార్మా కంపెనీల ఏజెంట్ల మాయమాటలు నమ్మి..  క్లినికల్‌ ట్రయల్స్‌కు ఒప్పుకుంటే .. ఇప్పుడు తన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. 

క్లినికల్‌ ట్రయల్స్‌ వికటించడంతో నాగంపేటకు చెందిన నాగరాజు అస్వస్థతతో ఈ ఏడాది  జూన్ 16న మృతి చెందాడు. మొదటగా నాగరాజు అనారోగ్యంతో మృతి చెందాడని అందరు భావించినప్పటికీ,  కుటుంబ సభ్యులకు లభించిన ఆధారాలను పరిశీలిస్తే ... లోటస్ పార్మా కంపెనీ జరిపిన  ఔషధ ప్రయోగంతోనే చనిపోయాడని తేలంది. దీంతో జూన్‌ 18 న జమ్మికుంట పోలీసులకు పిర్యాదు చేరారు. 19న నాగరాజు మృతదేహనికి కేఎంసి వైద్యులు పోస్ట్ మార్టం నిర్వహించారు. 28 రోజుల్లోనే  పూర్తి నివేదిక ఇస్తామని  కాకతీయ మెడికల్ కళాశాల వైద్యులు చెప్పినా, ఇప్పటి వరకు అది వెలుగుచూడలేదు. అయితే కౌన్సెలింగ్‌ తర్వాతే వీరంతా క్లినికల్‌ ట్రయల్స్‌కు ఒప్పుకున్నారు. నాగరాజు పోస్టుమార్టం నివేదిక రాకపోవడంపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

క్లినికల్‌ ట్రయల్స్‌లో చనిపోయిన నాగరాజు  బెంగుళూరుకు చెందిన లోటస్ పార్మా కంపెనీ ఔషధ ప్రయోగాలకు ఒప్పుకున్నాడు. ఇతడి పై మిలోటోనియా 2 ఎంజీ నిద్ర మాత్రలను పరీక్షించారు.  నాగరాజు తో పాటు పలు ప్రాంతాలకు చెందిన  మరో 59 మందిపై కూడా ఈ  ప్రయోంగం చేశారు.  నాలుగేళ్లలో నాగరాజుపై 10 సార్లు ఔషధ ప్రయోగం జరిగింది.  అయితే ఒక్క నాగరాజే  మృతి  చెందినట్టు  ఫార్మా ప్రతినిధులు చెప్తున్నా... ఇంకెంతమంది  ప్రాణాలు కోల్పోయారో, ఎందరు అన్యారోగ్యంతో కొట్టుమిట్టాడుతున్నారో.. అన్న అనుమానాలు  తలెత్తున్నాయి.  అయితే 60 మందికి కలిపి గ్రూప్ ఇన్సూరెన్స్‌  చేశామని లోటస్‌ కంపెనీ ప్రతినిధులు చెప్తున్నా..  నాగరాజు కుటుంబానికి ఇంత వరకు పరిహరం మాత్రం అందలేదు.

క్లినికల్‌ ట్రయల్స్‌తో వీధినపడిన నాగరాజు కుటుంబం దయనీయ స్థితి ఈ విధంగా ఉంటే... గత  నెల  28న జమ్మికుంట మండలం కొత్తపల్లికి చెందిన అశోక్ అస్వస్థతకు గురయ్యాడు. లోటస్ ఫార్మా ల్యాబ్ లోనే అశోక్‌ పై నాలుగేళ్లలో 10 సార్లు ఔషధ ప్రయోగాలు చేశారు.  ఇవి వికటించడంతో  మతి స్థిమితం కోల్పోయిన అశోక్‌ ప్రస్తుతం   హైదరాబాద్ ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. అశోక్ మానస్థితి కోల్పయిన కొన్ని రోజుల్లోనే  కొత్తపల్లి  గ్రామానికే చెందిన బోగె సురేశ్‌ రక్తం వాంతులతో అనారోగ్యం పాలయ్యాడు. పరిస్థితి విషమించడంతో ప్రస్తుతం  వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇతడిపై  30 సార్లు ఔషద ప్రయోగాలు జరిగినట్టు నిర్ధారణ అయింది. ఆర్ధిక అవసరాలతోనే సురేశ్‌  క్లినికల్‌ ట్రయల్స్‌కు ఒప్పుకున్నాని చెబుతున్నారు.  

కరీంనగర్ ఉమ్మడి జిల్లాను  పార్మా కంపెనీలు ఔషదా ప్రయోగాల కోసం ఎంచుకున్నాట్లు వరుసగా వెలుగు చూస్తున్న  ఘటనలతో అర్థం అవుతోంది.  ఇందుకు కారణాలు లేకపోలేదు.  సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం క్యాన్సర్, హృద్రోగం, క్షయ, పక్షవాతం, ఆస్తమా, ఫైలేరియాలతోపాటు  ఇతర వ్యాధుల్లో కరీంనగర్ జిల్లా మొదటి స్థానంలో ఉంది. ఈ నేపధ్యలోనే  ఆయా వ్యాధులకు సంబందించి ప్రయోగాల కోసం పార్మా కంపెనీలు ఉమ్మడి జిల్లాలోని సామాన్యలు...వ్యాదిగ్రస్తులకు డబ్బుల ఎర వేస్తు ప్రయోగాలు చేస్తున్నాయని చెబుతున్నారు.
విచారణపై పోలీసుల వాదన మరోలా 
క్లినికల్‌ ట్రయల్స్‌ కేసులు విచారణపై  పోలీసుల వాదన మరోలా ఉంది. ఈ కేసు దర్యాప్తు  తమ పరిధిలోకి రాదంటున్నారు. డ్రగ్స్‌ అండ్ కాస్మోటిక్స్‌ యాక్టు కింది కేంద్ర ఔషధ నియంత్రణ మండలి దర్యాప్తు చేయాల్సి చెబుతున్నారు. ఔషధ ప్రయోగాలు వికటించిన కేసుల్లో బాధితుల సంఖ్య  పెరుగుతోంది. పోలీసులు ఫిర్యాదు అందుతున్నాయి. అయితే ఈ కేసులు పోలీసుల విచారణ పరిధిలోకి రావని చట్ట నిబంధనలు చెబుతున్నాయి. దీంతో బాధితులు దిక్కతోచని స్థితిలో పడ్డారు. 

క్లినికల్‌ ట్రయల్స్‌ కేసుల విచారణ డ్రగ్స్‌ అండ్‌ కాస్మొటిక్స్‌ చట్ట పరిధిలోకి వస్తుందని పోలీసులు చెబుతున్నారు. భారత ఔషధ నియంత్ర విభాగం డైరెక్టర్‌ జరనల్‌.. డీసీజీఐ విచారణ చేపట్టాల్సి ఉంటుందని కరీంనగర్‌ పోలీసు కమిషన్‌ కమలాసన్‌రెడ్డి చెబుతున్నారు. ఇలాంటి కేసుల్లో ఏవైనా చర్యలు తీసుకోవాల్సి వస్తే ఫోరెన్సిక్‌ నివేదికలు వెలుగు చూసిన తర్వాత నిర్లక్షమని తేలితే... చర్యలు తీసుకునే అవకాశం ఉటుందని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇలాంటి కేసుల్లో ఐపీసీలోని సెక్షన్‌ 337 కింద కేసులు నమోదు చేస్తున్నారు. ప్రత్యామ్నాయం లేక రోడ్డు ప్రమాదాలకు వర్తించే ఈ సెక్షన్‌ కింద ఔషధ ప్రయోగాల  కేసులు నమోదు చేస్తున్నారు. డబ్బుకు ఆశపడి చాలా మంది స్వచ్ఛందంగా  ఔషధ ప్రయోగాలకు ఒప్పుకుంటున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది. నిబంధనల ప్రకారం ఒకసారి క్లినికల్‌ ట్రయల్‌ నిర్వహించిన తర్వాత మూడు నెలలపాటు మరోసారి ఔషధ ప్రయోగాలు  చేయించుకోకూడదు. కానీ కొంతమంది వరుసగా ఔషధ పరీక్షలు చేయించుకుంటున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.  

ఇలాంటి కేసులు దర్యాప్తు, విచారణ తమ పరిధిలోకి రాదని పోలీసులు తేల్చి చెప్పడం బాధితులకు అశనిపాతంగా మారింది. డీసీజీఐ  విచారణ ఎప్పటి కొలిక్కి వస్తుందో  చెప్పలేని పరిస్థితి. ఏ ప్రలోభాలకు లొంగి ఎలాంటి నివేదిక ఇస్తారో తెలియదు. ఫోరెన్సిక్‌ నివేదికలు కూడా ఎప్పుడు వస్తాయో తెలియని అయోమయ పరిస్థితి. దీంతో ఏమి చేయాలోపాలులోని క్లినికల్‌ ట్రయల్స్‌ బాధితులు.. ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టారు. న్యాయం కోసం కోర్టును ఆశ్రయించాలన్న ఆలోచనలో ఉన్నారు.


 

చిన్నారి తన్విత వివాదంపై హైకోర్టులో పటిషన్

హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన తన్విత వివాదం ఎట్టకేలకు హైకోర్టుకు చేరింది. తన్విత వివాదంపై హైకోర్టులో మరో పటిషన్ దాఖలు అయింది. తన్వితను చైల్డ్ వెల్ఫేర్ కమిటీలో ఉంచడం చట్ట విరుద్ధమని పిటిషన్ వేశారు. హైకోర్టులో ప్రవేశపెట్టాలని పెంపుడు తల్లి హెబియస్ కార్పస్ దాఖలు చేశారు. ఆమె వేసిన పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. పిటిషన్ పై చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, తన్విత కన్నతల్లి, పోలీసులకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

17:43 - December 5, 2017

హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన తన్విత వివాదం ఎట్టకేలకు హైకోర్టుకు చేరింది. తన్విత వివాదంపై హైకోర్టులో మరో పటిషన్ దాఖలు అయింది. తన్వితను చైల్డ్ వెల్ఫేర్ కమిటీలో ఉంచడం చట్ట విరుద్ధమని పిటిషన్ వేశారు. హైకోర్టులో ప్రవేశపెట్టాలని పెంపుడు తల్లి హెబియస్ కార్పస్ దాఖలు చేశారు. ఆమె వేసిన పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. పిటిషన్ పై చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, తన్విత కన్నతల్లి, పోలీసులకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

17:34 - December 5, 2017

రేపు రిమాండ్ ఖైదీ వెంకటేష్ మృతదేహానికి రీపోస్టుమార్టం

కరీంనగర్ : రిమాండ్ ఖైదీ వెంకటేష్ మృతదేహానికి రీ పోస్టుమార్టం చేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈనెల 10 లోపు రీ పోస్టుమార్టం జరపాలంటూ కోర్టు ఆదేశించింది. వేములవాడకు చెందిన కడమంచి వెంకటేష్ ను దొంగతనం కేసులో పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సమయంలో ఆగస్టు 3న వెంకటేష్ మృతి చెందారు. పోలీసుల చిత్రహింసల వల్లే తన భర్త చనిపోయాడంటూ మృతుడి భార్య రేణుక హైకోర్టును ఆశ్రయించింది. తన భర్తను దొంగతనం కేసులో ఇరికించి, థర్డ్ డిగ్రీ ప్రయోగించడంతో మృతి చెందాడని రేణుక కోర్టుకు తెలిపింది. రీపోస్ట్ మార్టం నిర్వహించి న్యాయం చేయాలని కోర్టును వేడుకుంది.

17:31 - December 5, 2017

కరీంనగర్ : రిమాండ్ ఖైదీ వెంకటేష్ మృతదేహానికి రీ పోస్టుమార్టం చేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈనెల 10 లోపు రీ పోస్టుమార్టం జరపాలంటూ కోర్టు ఆదేశించింది. వేములవాడకు చెందిన కడమంచి వెంకటేష్ ను దొంగతనం కేసులో పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సమయంలో ఆగస్టు 3న వెంకటేష్ మృతి చెందారు. పోలీసుల చిత్రహింసల వల్లే తన భర్త చనిపోయాడంటూ మృతుడి భార్య రేణుక హైకోర్టును ఆశ్రయించింది. తన భర్తను దొంగతనం కేసులో ఇరికించి, థర్డ్ డిగ్రీ ప్రయోగించడంతో మృతి చెందాడని రేణుక కోర్టుకు తెలిపింది. రీపోస్ట్ మార్టం నిర్వహించి న్యాయం చేయాలని కోర్టును వేడుకుంది. హైకోర్టు ఆదేశాలతో రేపు వెంకటేష్ మృతదేహానికి రీ పోస్ట్ మార్టం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మృతదేహానికి రేపు రీపోస్టుమార్టం నిర్వహించనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

హైదరాబాద్ చైతన్యపురిలో విషాదం

హైదరాబాద్ : నగరంలోని చైతన్యపురిలో విషాదం నెలకొంది. ప్రేమించినవాడు మోసం చేయడంతో ఓ వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడింది. ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో తీవ్ర మనస్థాపం చెందిన యువతి ఆత్మహత్య చేసుకుంది. 

16:58 - December 5, 2017

హైదరాబాద్ : నగరంలోని చైతన్యపురిలో విషాదం నెలకొంది. ప్రేమించినవాడు మోసం చేయడంతో ఓ వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడింది. ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో తీవ్ర మనస్థాపం చెందిన యువతి ఆత్మహత్య చేసుకుంది. జగిత్యాల జిల్లాకు చెందిన వైద్యురాలు హైదరాబాద్ లోని చైతన్యపురిలో ప్రాక్టీస్ చేస్తోంది. ఈక్రమంలో నరేష్ తో ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. కొన్నాళ్లుగా గీతాకృష్ణ, నరేష్ ప్రేమించుకుంటున్నారు. అయితే పెళ్లి చేసుకోవాలని గీతాకృష్ణ కోరగా అందుకు నరేష్ నిరాకరించాడు. తను మోసపోయానని గ్రహించిన గీతా...తన గదిలో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న గీతా తల్లిదండ్రులు ఉటాహుటిన హైదరాబాద్ కు వచ్చారు. బెడ్ పై విగతజీవిగా పడి ఉన్న తమ కూతును చూసి కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

16:43 - December 5, 2017

కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావుతో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. ఈ సందర్భంగా కేవీపీ మాట్లాడుతూ జాతీయ, రాష్ట్ర రాజకీయాలపై మాట్లాడారు. ప్రత్యేకంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై మాట్లాడారు. పోలవరం నిర్మాణం బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు. అనవసరపు భారాన్ని సీఎం చంద్రబాబు ప్రజలపై మోపుతున్నారని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఆయన ఎండగట్టారు. మోడీ, చంద్రబాబు పాలనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

16:35 - December 5, 2017

మహారాష్ట్ర : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఓఖీ తుపాను మహారాష్ట్రను తాకింది. దీంతో ముంబయిలో ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. ఇక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. నగరంలోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. రైల్వే స్టేషన్ల వద్ద అదనపు భద్రతను ఏర్పాటుచేశారు. జాలర్లు సముద్రంలోకి వెళ్లరాదని ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. బుధవారం ఉదయం నాటికి ఓఖీ తుపాను గుజరాత్‌ తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఓఖీ తుపాను ధాటికి కేరళ, తమిళనాడులో 20 మంది ప్రాణాలు కోల్పోయారు.

 

16:31 - December 5, 2017

శ్రీనగర్ : జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదులకు, భద్రతాబలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. మృతి చెందిన ఈ ముగ్గురు ఉగ్రవాదులు గతంలో అమర్‌నాథ్‌ యాత్రికులపై దాడి చేసిన వారని జమ్ముకశ్మీర్‌ డిజిపి శేషుపాల్‌ వెయిడ్‌ తెలిపారు. మృతి చెందిన వారిలో బషీర్‌ స్థానిక మిలిటెంట్‌ కాగా... అబూ పుర్కాన్, అబూ మావియా పాకిస్తాన్‌కు చెందినవారు. ఈ ఎన్‌కౌంటర్‌తో అమర్‌నాథ్‌ యాత్రీకులపై దాడి చేసిన నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారని డిజిపి వెల్లడించారు. సోమవారం మధ్యాహ్నం శ్రీనగర్‌ జాతీయ రహదారిపై వెళ్తున్న ఆర్మీ వాహన శ్రేణిపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఓ జవాను మృతి చెందాడు. మరొకరు గాయపడ్డారు. గత జులై 10న అమర్‌నాథ్‌ యాత్రికులపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 8 మంది మృతి చెందగా.. మరో 19 మంది గాయపడిన విషయం తెలిసిందే.

 

16:29 - December 5, 2017

ఢిల్లీ : 2 జీ స్పెక్ట్రం కేసులో తుది తీర్పు డిసెంబర్‌ 21న వెలువడనుంది. ఢిల్లీలోని పాటియాలా కోర్టు ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ కేసుకు సంబంధించి డిఎంకె ఎంపీ కనిమొళి కోర్టు విచారణకు హాజరయ్యారు. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంపై సిబిఐ రెండు కేసులు నమోదు చేయగా...ఈడీ మరో కేసు వేసింది. సిబిఐ చార్జీషీట్‌లో మాజీ టెలికాం మంత్రి రాజా, ఎంపీ కనిమొళిల పేర్లు ఉన్నాయి. 2జీ స్పెక్ట్రమ్ కింద 122 లైసెన్సులు ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి సుమారు 31 వేల కోట్ల నష్టం వచ్చినట్లు సీబీఐ ఆరోపణలు చేసింది. ఇదే కేసులో రాజా, కనిమొళితో పాటు మరో 19 మందిపై 2014లో ఈడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది.

 

16:28 - December 5, 2017

విజయవాడ : విద్యుత్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగులను సీఎం చంద్రబాబు మోసం చేశారని సీపీఎం ఏపీ రాష్ట్రకార్యదర్శి మధు ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఉద్యోగాలు క్రమబద్దీకరస్తామని చెప్పి.. మూడున్నరేళ్లు గడిచినా ఇచ్చిన మాట నెరవేర్చడం లేదన్నారు. విజయవాడలో విద్యుత్‌ కాంట్రాక్టు ఉద్యోగుల నిరసనకు మద్దతు పలికిన ఆయన... సమస్యను ప్రభుత్వం పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. 

 

యాదాద్రి జిల్లాలో రైతు ఆత్మహత్యాయత్నం

యాదాద్రి : జిల్లాలోని ఆత్మకూరు(యం) మండల తహసీల్దారు కార్యాలయం ముందు రైతు అట్ల నర్సింహారెడ్డి ఆత్మహత్యాయత్నం చేశాడు. పొలంలో తన బోరు పక్కనే మరో వ్యక్తి బోరు వేయడంతో అతని బోరుబావి ఎండిపోయింది. ఈ విషయాన్ని తహసీల్దారుకు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోకపోవడంతో మనస్థాపం చెందాడు. తహసీల్దారు కార్యాలయం ముందు పురుగుల మందు తాగాడు. నర్సింహారెడ్డిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ డాక్టర్‌ లేకపోవడంతో భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

16:22 - December 5, 2017

యాదాద్రి : జిల్లాలోని ఆత్మకూరు(యం) మండల తహసీల్దారు కార్యాలయం ముందు రైతు అట్ల నర్సింహారెడ్డి ఆత్మహత్యాయత్నం చేశాడు. పొలంలో తన బోరు పక్కనే మరో వ్యక్తి బోరు వేయడంతో అతని బోరుబావి ఎండిపోయింది. ఈ విషయాన్ని తహసీల్దారుకు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోకపోవడంతో మనస్థాపం చెందాడు. తహసీల్దారు కార్యాలయం ముందు పురుగుల మందు తాగాడు. నర్సింహారెడ్డిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ డాక్టర్‌ లేకపోవడంతో భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 
 

 

షీటీమ్స్‌ భరోసా కేంద్రంలో స్పెషల్‌ చైల్డ్‌ ఫ్రెండ్లీ కోర్టు ప్రారంభం

హైదరాబాద్ : షీటీమ్స్‌ భరోసా కేంద్రంలో స్పెషల్‌ చైల్డ్‌ ఫ్రెండ్లీ కోర్టు ప్రారంభం అయింది. దేశంలో తొలిసారిగా స్పెషల్‌ చైల్డ్‌ ఫ్రెండ్లీ కోర్టు ఏర్పాటు చేశారు. అడిషనల్‌ మెట్రోపాలిటన్‌ స్పెషల్‌ కోర్టు భరోసా కేంద్రంలో ఏర్పాటు చేశారు. దీనికి హైకోర్టు కూడా అనుమతించిందని స్వాతి లక్రా తెలిపారు. 

 

16:19 - December 5, 2017

హైదరాబాద్ : షీటీమ్స్‌ భరోసా కేంద్రంలో స్పెషల్‌ చైల్డ్‌ ఫ్రెండ్లీ కోర్టు ప్రారంభం అయింది. దేశంలో తొలిసారిగా స్పెషల్‌ చైల్డ్‌ ఫ్రెండ్లీ కోర్టు ఏర్పాటు చేశారు. అడిషనల్‌ మెట్రోపాలిటన్‌ స్పెషల్‌ కోర్టు భరోసా కేంద్రంలో ఏర్పాటు చేశారు. దీనికి హైకోర్టు కూడా అనుమతించిందని స్వాతి లక్రా తెలిపారు. 

16:16 - December 5, 2017

హైదరాబాద్ : సర్పంచుల వ్యవస్థను తెలంగాణ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని టీటీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌ రెడ్డి విమర్శించారు. పంచాయతీరాజ్‌ చట్ట సవరణకు విదేశీ పర్యటనలు చేయాల్సిన అవసరం లేదన్నారు. కేరళలాంటి రాష్ట్రాల్లో పంచాయతీరాజ్‌ వ్యవస్థ పటిష్టంగా నడుస్తోందని... రాష్ట్ర అధికారులు కేరళలో పర్యటించి పంచాయతీరాజ్‌ వ్యవస్థపై అధ్యయనం చేయాలని సూచించారు.  సర్పంచ్‌ల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో పంచాయతీరాజ్‌ చట్ట సవరణపై రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్‌ సీనియర్‌నేత వి. హనుమంతరావు... పంచాయతీరాజ్‌ వ్యవస్థను బలోపేతం చేసేందుకు  రాజీవ్‌గాంధీ అనేక సంస్కరణలు తీసుకొచ్చారని చెప్పారు.  వాటిని కేసీఆర్‌ సర్కార్‌ భూస్థాపితం చేసేందుకు కుట్రలు చేస్తోందని వీహెచ్ ఆరోపించారు.


 

16:14 - December 5, 2017

కృష్ణా : విజయవాడలో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు కదంతొక్కారు. సీఐటీయూ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్ నుంచి జింఖానా గ్రౌండ్ వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. సమానపనికి సమానవేతనం, సర్వీసుల రెగ్యులరైజ్ చేయాలని కార్మికులు డిమాండ్‌ చేశారు. ఈ ర్యాలీకి సీపీఎం, సీపీఐ, జనసేన, వైసీపీ నాయకులు మద్దతు తెలిపారు. 

16:13 - December 5, 2017

కృష్ణా : విజయవాడలో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు కదంతొక్కారు. సీఐటీయూ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్ నుంచి జింఖానా గ్రౌండ్ వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. సమానపనికి సమానవేతనం, సర్వీసుల రెగ్యులరైజ్ చేయాలని కార్మికులు డిమాండ్‌ చేశారు. ఈ ర్యాలీకి సీపీఎం, సీపీఐ, జనసేన, వైసీపీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ నేత గఫూర్ మాట్లాడుతూ ప్రభుత్వానికి కార్మికులంటేనే గిట్టదన్నారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో ప్రభుత్వం వెట్టి చాకిరీ చేయించుకోవాలని చూస్తోందని చెప్పారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కార్మికులు అడుగుతున్నారని పేర్కొన్నారు. పెట్టుబడిదారులకు చంద్రబాబు ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సమరభేరికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని తెలిపారు. కార్మికుల పోరాటానికి పూర్తి మద్దతు ఇస్తామని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

15:57 - December 5, 2017

ఖమ్మం : జిల్లాలో ఆపద్బంధు సేవలు నిలిచిపోయాయి. డీజిల్ లేకపోవడంతో ఎక్కడికక్కడ 108 వాహనాలు ఆగిపోయాయి. జిల్లాలో 3 రోజులుగా 108 వాహన సేవలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. డీజిల్ బకాయిలు భారీగా పెరుకుపోయినా ఉన్నతాధికారులు స్పందించడం లేదు. దీంతో అత్యవసర వైద్య సేవలు పొందాల్సిన రోగులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. 

పేదలపాలిట సంజీవని 108 వాహాన సేవలు ఖమ్మం జిల్లాలో మూడు రోజులుగా నిలిచిపోయాయి. డీజిల్‌ లేకపోవడంతో వాహనాలు ముందుకు కదలడం లేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. డీజిల్ పోయించేందుకు డబ్బులు లేవని అధికారులు చెబుతున్నారని 108 వాహన సిబ్బంది తెల్పుతున్నారు.

ఖమ్మం జిల్లాలోని 22 మండలాలకు సంబంధించి 108 వాహనాలు 14 ఉన్నాయి. వీటిలో డీజిల్ కొరతతో 11 వాహనాలు నిలిచిపోయాయి. మూడు వాహనాలు మాత్రమే నడుస్తున్నాయి. వచ్చే ఫోన్ కాల్స్ మొత్తానికి ఆ మూడు వాహనాలే దిక్కువడంతో ప్రజల ప్రాణాలు గాల్లోకలిసిపోతున్నాయని తెలుస్తోంది. మూడు రోజుల నుండి 108 వైద్య సేవలకు అంతరాయం కలిగినా...  అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. 

ఖమ్మంతో పాటు సత్తుపల్లి, మధిర, వైరా, తల్లాడ, కల్లూరు, కూసుమంచి , నేలకొండపల్లి, తిరుమలాయపాలెం మండలాలు రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రలను ఆస్పత్రులకు తరలించేందుకు 108 సేవలు అందుబాటులో లేకుండాపోయాయి. మరోవైపు అనారోగ్యానికి గురైన రోగులు, గర్భిణీలు సరైన సమయంలో ఆస్పత్రికి చేరుకోలేక ప్రాణాలు కోల్పోతున్నారు. గతంలో రోజుకో ఒక్కో వాహనంలో సిబ్బంది 10 కేసులను పరిష్కరిస్తే... తాజాగా ఉన్న మూడు వాహనాలపై అధిక భారం పడుతుందని 108 సిబ్బంది అంటున్నారు. 

మొత్తానికి జిల్లాలో 14 వాహనాలకు సుమారు 20 లక్షల రూపాయల వరకు డీజిల్ బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ డబ్బులను చెల్లించకపోతే..  డీజిల్ పోసే ప్రసక్తే లేదని పెట్రోల్ బంక్ యాజమానులు చెబుతున్నారు. ఇదిలావుంటే..  ప్రభుత్వం కావాలనే 108 వాహనాలను నిలిపివేస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే 108 బకాయిలు చెల్లించి... ప్రజల ప్రాణాలు పోకుండా కాపాడాలని పలువురు కోరుతున్నారు. 

15:51 - December 5, 2017

హైదరాబాద్ : గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో అక్రమాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. కాంట్రాక్టర్లు, కొందరు అవినీతి అధికారులు రూల్స్‌ను బ్రేక్‌ చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు.  15ఏళ్లు నిండిన బల్దియా బండ్లను రోడ్డెక్కనివ్వమంటున్న అధికారులు... ప్రైవేట్‌ వ్యక్తులు ఎలాంటి వెహికిల్స్‌ నడిపించినా పట్టించుకోవడం లేదు. అగ్రిమెంట్‌ను తుంగలోతొక్కి పాత వాహనాలను రోడ్డు ఎక్కిస్తున్నారు. పనిచేయాల్సిన వాహనాలు పనిచేయకపోయినా ఎంచక్కా బిల్లులు మాత్రం పాసైపోతున్నాయి. జీహెచ్‌ఎంసీ చెత్త రవాణాలో కాంట్రాక్టర్లు, అధికారుల కాసులలీలపై 10టీవీ ప్రత్యేక కథనం..

జీహెచ్‌ఎంసీ దేశంలోనే పెద్ద కార్పొరేషన్ల వరసలో ఉన్న లోకల్‌బాడీ. కోటికిపైగా జనాభా ఉన్న సిటీలో ప్రతిరోజు 4వేల టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. ఈ చెత్తను నగరంలోని కాలనీలు, బస్తీలు, బల్క్‌ గార్బెజ్‌ పాయింట్ల నుంచి ట్రాన్స్‌ఫర్‌ కేంద్రాలకు, అక్కడి నుంచి జవహర్‌నగర్‌ డంపింగ్‌  కేంద్రానికి తరలించడానికి బల్దియాకు ప్రత్యేక రవాణా విభాగం పనిచేస్తుంది. ఇందుకోసం కోట్లాది రూపాయలు ఖర్చుచేస్తోంది బల్దియా. ఒకటి రెండేళ్ల క్రితం వరకు జీహెచ్‌ఎంసీనే చెత్త రవాణాను చేపట్టేది. ఇందుకోసం 773 వాహనాలు ఉండేవి. వాటి రిపేర్లు, డీజిల్‌ వంటి వ్యవహారాలను తమ పార్కింగ్‌ యార్డుల్లోనే చేసుకునేది బల్దియా.  అయితే వాహనాల నిర్వహణలో పెద్దమొత్తంలో అక్రమాలు వెలుగు చూడడంతోపాటు కార్పొరేషన్‌ వాహనాలు పాతబడిపోవడంతో వాటిలో 290 వాహనాలను తొలగించారు.

తగ్గించిన వాహనాల స్థానంలో కొత్త వాహనాలను బల్దియా అధికారులు కొనుగోలు మాత్రం చేయలేదు.  వాటి స్థానంలో అద్దె వాహనాలను సమకూర్చుకోవడం మొదలుపెట్టారు. తొలగించిన వాహనాల స్థౄనంలో 234 అద్దె వాహనాలను రోడ్డెక్కించారు. వీటిలో 82... 25 టన్నర్ల లారీలు,71 మినీ టిప్పర్లు  , 30 డంపర్‌ ప్లెసర్లు, 29 జేసీబీలు, 15 బాబ్‌కాట్స్‌, ట్రాక్టర్లు, లోడర్లు వంటివి బల్దియా శానిటేషన్‌లో చేరిపోయాయి. వీటి నిర్వహణ కోసం ప్రతినెలా కోట్లాది రూపాయల అద్దెలు చెల్లిస్తోంది.  అద్దె వాహనాల ఏర్పాటు... కొంతమంది అధికారులు, కాంట్రాక్టర్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. అగ్రిమెంట్‌ను బుట్టదాఖలు చేసిన ఈ గ్యాంగ్‌ .. తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తోంది. అధికారయంత్రాంగం మామూళ్ల మత్తులో జోగుతూ.... అద్దె వాహనాలకు ఇష్టానుసారంగా బిల్లులు చెల్లింపు చేస్తున్నారు.  ఇమ్లీబన్‌ ట్రాన్స్‌ఫర్‌ కేంద్రంలో అద్దె వాహనాల వివరాలు ఎలా సేకరిస్తున్నారో చూడండి. కేవలం చివరి నాలుగు అంకెలు వేసి వదిలేస్తున్నారు. ఇది బల్దియా నిర్వహిస్తోన్న రికార్డు. దీని ద్వారానే బిల్లులు చెల్లిస్తారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

పాతవాహనాల స్థానంలో కొత్త వాహనాలు అద్దెకు ఏర్పాటు చేశామంటున్న అధికారులు.. ఎలాంటి వాహనాలు పనిచేస్తున్నాయి, వాటి కండిషన్‌ ఏంటి అన్నది మాత్రం పట్టించుకోవడం లేదు. జీహెచ్‌ఎంసీ తొలగించిన వాహనాల కంటే కండిషన్‌ మరీ లో ఉన్న వాహనాలతో చెత్త రవాణా చేస్తున్నారని సిబ్బంది చెబుతున్నారు. అద్దె వాహనాలు రోజు ఎంత చెంత తరలిస్తుందో కూడా లెక్కలు లేవు.

జేసీబీలు, అద్దె వాహనాలు పనిచేసినా, చేయకపోయినా పూర్తిస్థాయిలో బిల్లులు మాత్రం చెల్లిస్తున్నారు. రెండు వాహనాలకు బదులు ఒకదానితో పనిచేసినా బిల్లులు మాత్రం మూడింటికి ఇచ్చేస్తున్నారు. కాంట్రాక్టర్లు ఇచ్చే ముడుపులకు ఆశపడి కొందరు అధికారులు బల్దియా ఖజానాకు గండికొడుతున్నారు.  అంతేకాదు...ట్రాన్స్‌పర్‌ కేంద్రాల నుంచి జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డుకు వెళ్లే దూరాన్ని ఎక్కువ చూపుతూ బిల్లులు నొక్కేస్తున్నారు. కిందిస్తాయి అధికారులు, సిబ్బంది అక్రమాలపై బల్దియా బాస్‌ దృష్టి సారించకపోతే ఖజానా గుళ్లవడం ఖాయం. ఇప్పటికైనా ట్రాన్స్‌పోర్టు విభాగంలో జరుగుఉతన్న అక్రమాలపై  దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

15:47 - December 5, 2017

ఇంటి పని, బైటపనితో ఒత్తిడికి గురువుతున్న మహిళలు అనేక పనులతో తమ ఆరోగ్యం గురించి పట్టించుకోవడం లేదు. మహిళలు..అరోగ్య సమస్యలు...అనే అంశంపై మానవి వేదిక నిర్వహించిన చర్చా కార్యక్రమంలో గైనకాలజిస్టు నర్మద, న్యూట్రీషనిస్టు సుజాత పాల్గొని, మాట్లాడారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆహారాన్ని సమయానికి, సమపాల్లో  తీసుకోవాలన్నారు. ఒబేసిటీ వల్ల రెగ్యులర్ గా పిరియడ్స్ రావన్నారు. ఒబేసిటీ వల్ల డయాబెటిస్, హైపో థైరాయిడ్స్, హైబీసీ వస్తుందని తెలిపారు. టైమ్ కు ఆహారం తీసుకోవాలని పేర్కొన్నారు. తిన్న తర్వాత వన్ హవర్ తర్వాత నిద్రించాలని 
సూచించారు. ఆహారంలో ప్రొటీన్స్ ఉండే విధంగా చూసుకోవాలన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

15:41 - December 5, 2017

మంత్రి బీరేందర్ సింగ్ ను కలిసిన ఎంపీ పొంగులేటి, ఎమ్మెల్యే జలగం

ఢిల్లీ : కేంద్ర ఉక్కుశాఖ మంత్రి బీరేందర్ సింగ్ ను ఖమ్మం ఎంపీ పొంగులేటి, ఎమ్మెల్యే జలగం వెంకట్రావు కలిశారు. బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై చర్చించారు.

 

15:15 - December 5, 2017

అనంతపురం : మున్సిపల్ డీఈ కిష్టప్పపై దాడిని నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. చేపట్టారు. అనంతపురం మున్సిపల్ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. పట్టపగలు నడిరోడ్డుపై ఒక అధికారిపై దాడికి తెగబడటంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు కాంట్రాక్టర్ నర్సింహ్మారెడ్డిపై డీఈ కిష్టప్ప ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు నర్సింహ్మారెడ్డిని అరెస్టు, చేసి రిమాండ్ కు తరలించారు. 

మంత్రి బీరేందర్ సింగ్ ను కలిసిన ఎంపీ పొంగులేటి, ఎమ్మెల్యే జలగం

ఢిల్లీ : కేంద్ర ఉక్కుశాఖ మంత్రి బీరేందర్ సింగ్ ను ఖమ్మం ఎంపీ పొంగులేటి, ఎమ్మెల్యే జలగం వెంకట్రావు కలిశారు. బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై చర్చించారు.

 

వరంగల్ ఎంజీఎం నుంచి క్లినికల్ ట్రయల్స్ బాధితుడు అదృశ్యం

వరంగల్ : ఎంజీఎం నుంచి క్లినికల్ ట్రయల్స బాధితుడు బోగ సురేష్ అదృశ్యం అయ్యాడు. జమ్మికుంట మండలం కొత్తపల్లికి చెందిన సురేష్.. ఉదయం నుంచి కనిపించకుండాపోయారు.  

 

ఢిల్లీ టెస్టులో ధావన్ హాఫ్ సెంచరీ

ఢిల్లీ : ఢిల్లీ టెస్టులో శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీ చేశారు. 83 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. టెస్టుల్లో ఐదో హాఫ్ సెంచరీ
పూర్తి చేశాడు.

 

13:43 - December 5, 2017

కృష్ణా : రాష్ట్ర పోలీస్‌ శాఖలో పలు విభాగాలకు అధికారుల కొరత ఏర్పడింది. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారుల బదిలీల్లో జరుగుతున్న జాప్యం కారణంగా ఈ శాఖలో కీలక విభాగాలు దిక్కులు చూస్తున్నాయి. విజిలెన్స్‌ అండ్ ఎన్ ఫోర్స్‌మెంట్, పీఅండ్ఎల్, తూనికలు-కొలతలు ఇలా కీలకమైన శాఖలను పట్టించుకునే నాథుడే లేరు. ఐజీ స్థాయి అధికారులు ఈ విభాగాల్లో కీలకపాత్ర పోషించాలి. కానీ ఇన్‌చార్జ్‌లతోనే నెట్టుకొస్తున్నారు. కీలకమైన విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి హోంశాఖ కార్యదర్శి అనురాధను ఇన్‌చార్జ్‌గా నియమించిన ప్రభుత్వం ఏడాదిన్నరకు పైగా అక్కడ ఐజీ పోస్టు భర్తీ చేయలేదు. అలాగే పీఅండ్ఎల్ విభాగం ఐజీ మధుసూదనరెడ్డి కేంద్ర సర్వీసులకు వెళ్లడంతో ఇన్‌చార్జ్ ఆర్గనైజేషన్స్ ఐజీ కుమార విశ్వజీత్‌కు అప్పగించారు.

సీపీ గౌతమ్ సవాంగ్‌ కు పదోన్నతి
అలాగే విజయవాడ కమిషనరేట్‌కు అడిషనల్‌ సీపీ పోస్టు ఏడాదిన్నరకు పైగా ఖాళీగా ఉంది. అడిషనల్‌ డీజీ ర్యాంక్‌ అధికారిని కమిషనర్‌గా నియమించింది. ఏడీజీగా ఉన్న సీపీ గౌతమ్ సవాంగ్‌ పదోన్నతి పొంది డీజీ ర్యాంక్ అధికారి అయినా ఆయనే విధుల్లో కొనసాగుతున్నారు. అటు అమరావతి కమిషనరేట్ ఏర్పాటుకు మాత్రం అడుగులు ముందుకు పడలేదు. దీంతో డీఐజీ స్థాయి అధికారి రమణ కుమార్‌ను విజయవాడ అదనపు జాయింట్ సీపీగా నియమించారు. అలాగే నాలుగు జిల్లాల గుంటూరు రేంజ్‌లో ఉన్న ఐజీ సంజయ్‌ని పోలీస్‌ ట్రైనింగ్‌కి బదిలీ చేసి అక్కడ డీఐజీ స్థాయి అధికారి వీవీ గోపాల్‌రావును ప్రభుత్వం నియమించింది. కోస్తా ఐజీ కుమార విశ్వజీత్‌ను ఆర్గనైజేషన్స్‌కు బదిలీ చేసినా ఆ స్థానంలో ఎవరినీ నియమించలేదు. అలాగే ఏలూరు రేంజ్‌కు డీఐజీ లేరు. మెరైన్ పోలీస్ విభాగానికి ఐజీ పోస్టు కూడా అదే విధంగా అధికారుల బదిలీల విషయంలో కూడా ప్రభుత్వం నాన్చుడి ధోరణిని అవలంబిస్తోంది. జూన్ చివరివారంలో ఎస్పీల బదిలీ ప్రక్రియ చేపట్టారు. అయితే ఆ కసరత్తు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. అలాగే చాలా విభాగాలకు స్టాఫ్ ఆఫీసర్స్ కొరత నెలకొంది. ఫోరెన్సిక్‌కు డైరెక్టర్ లేకపోవడంతో ప్రభుత్వ సలహాదారు గాంధీ ఆ విభాగాన్ని చూసుకుంటున్నారు. లీగల్ విభాగం ఐజీ దామోదర్‌కు అదనంగా హైవే సేఫ్టీ బాధ్యతలు అప్పగించారు. రవాణా శాఖకు కమిషనర్‌గా ఐజీ బాలసుబ్రహ్మణ్యంను నియమించారు.

ఐపీఎస్‌ల అధికారుల బదిలీలు రెండేళ్లకోసారి
సాధారణంగా సీనియర్‌ ఐపీఎస్‌ల అధికారుల బదిలీలు రెండేళ్లకోసారి లేదంటే పనితీరును బట్టి జరుగుతూ ఉంటాయి. కానీ బదిలీల ప్రక్రియలో స్తబ్దత నెలకొనడంతో.. ఏపీలోని చాలా ప్రాంతాల్లో కొందరు పోలీస్‌ అధికారులు.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో చాలా కేసులు పేరుకుపోతున్నాయి. కొందరు ఎస్‌ఐలు, సీఐలు ఠాణాల్లో సెటిల్‌మెంట్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రాజకీయ నాయకుల అండదండలతో విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలుకూడా ఉన్నాయి.ఏదిఏమైనా ప్రభుత్వం వెంటనే ఐపీఎస్‌ల బదిలీలతో పాటు ఎస్‌ఐ, సీఐ స్థాయి అధికారులను బదిలీల జాబితాలో చేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఢిల్లీ టెస్టులో ధావన్ హాఫ్ సెంచరీ

ఢిల్లీ : శ్రీలంకతో జరుగుతున్న మూడవ టెస్టులో ఇండియా ఓపెనర్ శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీ చేశాడు. టెస్టుల్లో ధావన్ ఇది 5వ హాఫ్  సెంచరీ. 

రైలు కింద పడి యువకుడు మృతి

విజయనగరం : జిల్లాలో డీసీఐ కాంట్రాక్టు ఉద్యోగి వెంకటేశ్ అనే ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం సాయంత్రం వెంకటేశ్ మృతదేహన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. డీసీఐ ప్రైవేటీకరించడంపై వెంకటేశ్ మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు.

ఏవోబీలో ఎదురుకాల్పులు

విశాఖ : ఏవోబీ సరిహద్దు గోముంగి మధ్యగరువు మధ్యలో మావోయిస్టులకు పోలీసులుకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు ల్యాండ్ మైన్ పేల్చారు.

13:23 - December 5, 2017

విశాఖ : డ్రెగ్జింగ్ కార్పోరేషన్ ను ప్రైవేటీకరించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్నికి వ్యతిరేఖంగా కార్మక సంఘాలు కద తొక్కుతున్నాయి. వారం రోజులుగా నిరవదిక నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేదని కార్మికులు మండిపడుతున్నారు. డీసీఐ ఉద్యోగి వెంకటేష్ విజయనగరం జిల్లా నెర్లిమర్ల వద్ద అత్మహత్య చెసుకున్నాడు. ఈ నేపథ్యంలో కార్మిక సంఘాలు తమ అందోళను మరింత ఉదృతం చెశాయి. డీసీఐ ఉద్యోగులు అధికారులు విధులను బహిష్కరించి ప్రధాని మోడీ దిష్టి బోమ్మను దగ్దం చెశారు. వెంకటేశ్‌ కుటుంబానికి పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు. డీసీఐ ప్రైవేటీకరణ ఉపసంహరించుకోక పోతే కుటుంబంతో సహా అత్మహత్యలకు సిద్దపడతామని కార్మికులు హెచ్చరిస్తున్నారు.

 

 

17వ రోజుకు చేరుకున్న సంగీత దీక్ష

మేడ్చల్ : న్యాయం కోసం సంగీత పోరాటం కొనసాగుతుంది. పాపతో పాటు భర్త ఇంటి ముందు సంగీత న్యాపోరాటం చేస్తోంది. ఆమె పోరాటానికి నేడు 17వ రోజుకు చేరుకుంది. అది కుటుంబ సమస్య ఇక చేసేదేం లేదని ఎంపీ, ఎమ్మెల్యే అంటున్నారు. సంగీత మామ బాల్ రెడ్డి ఆస్తిలో చిల్లగవ్వకూడా ఇవ్వనని, సంగీతను కోడలిగా అంగీకరించనని తెగెసి చెబుతున్నాడు.

13:16 - December 5, 2017

విజయనగరం : జిల్లాలో డీసీఐ కాంట్రాక్టు ఉద్యోగి వెంకటేశ్ అనే ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం సాయంత్రం వెంకటేశ్ మృతదేహన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. డీసీఐ ప్రైవేటీకరించడంపై వెంకటేశ్ మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

13:12 - December 5, 2017

విశాఖ : ఏవోబీ సరిహద్దు గోముంగి మధ్యగరువు మధ్యలో మావోయిస్టులకు పోలీసులుకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు ల్యాండ్ మైన్ పేల్చారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

కానిస్టేబుళ్ల పైసా వసూల్

సూర్యాపేట : చిలుకూరుకు చెందిన ముగ్గురు పోలీసులపై ఎస్పీ చర్యలు తీసుకున్నారు. ఎస్పీ హెడ్ కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుల్స్ ను సస్పెండ్ చేశారు. సస్పెండైనా వారిలో హెడ్ కానిస్టేబుల్ జగన్నాథం, కానిస్టేబుల్స్ అబ్దుల్ సమ్మద్, సాంబయ్యలు ఉన్నారు. బేతవోలులో పేకాట ఆడుతున్న వారి నుంచి డబ్బులు వసూలు చేశారని వీరిపై చర్యలు తీసుకున్నారు. 

శాడిస్టు భర్త రాజేశ్ లైంగిక పరీక్షలు

చిత్తూరు : పెళ్లిరోజే భార్యను చిత్రహింసలకు గురిచేసిన రాజేశ్ కు లైంగిక పరీక్షలు నిర్వహించేందుకు చిత్తూరు కోర్టు అనుమతి ఇచ్చింది. నేడు రాజేష్ కు స్విమ్స్ లో వైద్యపరీక్షలు నిర్వహించనున్నారు. మరోవైపు చిత్తూరు ఆసుపత్రిలో శైలజ కోలుకుంటుంది.

12:37 - December 5, 2017
12:37 - December 5, 2017

మేడ్చల్ : న్యాయం కోసం సంగీత పోరాటం కొనసాగుతుంది. పాపతో పాటు భర్త ఇంటి ముందు సంగీత న్యాపోరాటం చేస్తోంది. ఆమె పోరాటానికి నేడు 17వ రోజుకు చేరుకుంది. అది కుటుంబ సమస్య ఇక చేసేదేం లేదని ఎంపీ, ఎమ్మెల్యే అంటున్నారు. సంగీత మామ బాల్ రెడ్డి ఆస్తిలో చిల్లగవ్వకూడా ఇవ్వనని, సంగీతను కోడలిగా అంగీకరించనని తెగెసి చెబుతున్నాడు. పూర్తి వివరాలకువ వీడియో క్లిక్ చేయండి. 

12:25 - December 5, 2017

సూర్యాపేట : చిలుకూరుకు చెందిన ముగ్గురు పోలీసులపై ఎస్పీ చర్యలు తీసుకున్నారు. ఎస్పీ హెడ్ కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుల్స్ ను సస్పెండ్ చేశారు. సస్పెండైనా వారిలో హెడ్ కానిస్టేబుల్ జగన్నాథం, కానిస్టేబుల్స్ అబ్దుల్ సమ్మద్, సాంబయ్యలు ఉన్నారు. బేతవోలులో పేకాట ఆడుతున్న వారి నుంచి డబ్బులు వసూలు చేశారని వీరిపై చర్యలు తీసుకున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

12:18 - December 5, 2017

చిత్తూరు : పెళ్లిరోజే భార్యను చిత్రహింసలకు గురిచేసిన రాజేశ్ కు లైంగిక పరీక్షలు నిర్వహించేందుకు చిత్తూరు కోర్టు అనుమతి ఇచ్చింది. నేడు రాజేష్ కు స్విమ్స్ లో వైద్యపరీక్షలు నిర్వహించనున్నారు. మరోవైపు చిత్తూరు ఆసుపత్రిలో శైలజ కోలుకుంటుంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

కదంతొక్కిన విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు

కృష్ణా : జిల్లా విజయవాడలో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు కదం తొక్కారు. సీఐటీయూ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ నుంచి జింఖానా గ్రౌండ్స్ వరకు ప్రదర్శన చేశారు. సమస్యలు పరిష్కరించాలని, సర్వీసులు రెగ్యులరైజ్ చేయాలని వారు డిమాండ్ చేశారు.  

భూపాలపల్లిలో మావోయిస్టుల పోస్టర్లు

భూపాలపల్లి : జిల్లా వెంకటాపురం మండలం విజయపురికాలనీ ప్రధాన రహదారిపై మావోయిస్లు పోస్టర్లు వెలిశాయి. పీఎల్జీఏ వారోత్సవాలను జయప్రదం చేయాలని ఆ పోస్టర్లులో పిలుపునిచ్చారు.

12:03 - December 5, 2017

గుంటూరు : అమరావతిలోని ఏపీ సచివాలయం రెండో బ్లాక్‌లో పాము కలకలం సృష్టించింది. హోంశాఖ సెక్షన్‌లో ఇది కనిపించింది. పారిశుధ్య కార్మికులు చెత్త తొలగిస్తుండగా కనిపించిన పాము కనిపిడచంతో హడలిపోయారు. ఆ తర్వాత దీనిని చంపేశారు. 

12:02 - December 5, 2017

ఆదిలాబాద్ : చలి పంజా విసురుతోంది. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల,ఆసిఫాబాద్ కొమురంభీం, జిల్లాల ప్రజలు గజగజలాడుతున్నారు. రాత్రి ఉష్ణోగ్రతలు అమాంతం పడిపోవడంతో చలితీవ్రత ఎక్కువైంది. ప్రస్తుతం ఆదిలాబాద్‌ జిల్లాలో ఆరు డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. సాయంత్రం 6 గంటలకే జిల్లా కేంద్రాలతో పాటు గ్రామాల్లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. పెరిగిన చలి తీవ్రత దృష్ట్యా పిల్లలు,వృద్దులు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 

11:59 - December 5, 2017

నల్లగొండ : జిల్లాలో రెవెన్యూ అధికారులు బరితెగించారు. పెదవూర మండల తహశీల్దార్‌ కార్యాలయాన్ని బార్‌ గా మార్చేశారు. పట్టపగలే మందుకొడతూ ఎంజాయ్‌ చేశారు. మండలంలోని చలకుర్తి గ్రామంలో తప్పుడు రిజిష్ట్రేషన్లకు సహకరించినందుకు కొందరు అక్రమార్కులు విందు ఏర్పాటు చేశారు. తహశీల్దార్‌ విజయ్‌కుమార్‌, డిప్యూటీ తహశీల్దార్‌ రవీంద్ర రాజుతోపాటు మరికొందరు స్థానికులు మందుపార్టీ చేసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాన్ని బార్‌గా మార్చిన తహశీల్దార్‌పై స్థానికులు మండిపడుతున్నారు. 

11:58 - December 5, 2017

మెదక్ : జిల్లా మనోహరాబాద్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఎన్‌హెచ్‌ 44 పక్కనే ఉన్న బయోమాస్‌ బ్రిక్స్‌ కంపెనీలో మంటలు చెలరేగాయి. ఉయదం 7.30కు జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగినట్టు ఫ్యాక్టరీ యాజమాన్యం చెబుతోంది. ఇటుకలను కాల్చడానికి ఉపయోగించే రంపపు పొట్టుకు నిప్పు అంటుకోవడంతో మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. 

11:57 - December 5, 2017

కరీంనగర్ : జిల్లా జమ్మికుంట మండలం కొత్తపల్లిలో మరో క్లినికల్‌ ట్రయల్స్‌ కేసు వెలుగులోకి వచ్చింది. తన పేరు, వివరాలు గోప్యంగా ఉంచాలని బాధితుడు విజ్ఞప్తి చేశారు. ఔషధ ప్రయోగం వికటించడంతో బాధితుడు షుగర్‌ వ్యాధితో బాధపడుతున్నాడు. క్లినికల్‌ ట్రయల్స్‌కు ముందు షుగర్‌ వ్యాధిలేదు. ఇలాంటి పరిస్థితి మరొకరికి రాకూడదని ఆవేదన వ్యక్తం చేశారు. హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న బాధితుడిపై 30 సార్లు క్లినికల్‌ ట్రయల్స్‌ జరిగాయి. 

11:51 - December 5, 2017

శీతాకాలం రాగానే పెదవులపై తడి అరి పగలడం ప్రారంభమౌతుంది. అలా కాకుండ ఉండలంటే ఏముంది వ్యాసిలెన్ లేక లిప్ కేర్ పెడితే సరిపోతుందని చాలా మంది అనుకుంటారు. కానీ అవి అన్ని కృత్రిమ పద్ధతలు. సహజంగా పెదవులు తాజాగా ఉండాలంటే చెంచా చొప్పున తేనె, చక్కెర, బాదంనూనె పెదవులకు రాసుకోవాలి. కొన్ని గులాబీ రేకుల్ని తీసుకుని వాటిని ముద్దలా చేసి అందులో కాస్త బాదం నూనె వేయాలి. తర్వాత పెదవులకు పూతలా రాయాలి.   

బీసీ ప్రజాప్రతినిధుల సమావేశం

హైదరాబాద్ : మూడో రోజు బీసీ ప్రజా ప్రతినిధుల సమావేశం ప్రారంభమైంది. ప్రజాప్రతినిధులు కేసీఆర్ కు నివేదిక ఇవ్వనున్నారు. బీసీ అభివృద్ధి తీసుకోవాల్సిన చర్చలపై ప్రతిపాదనలతో నివేదిక సమర్పించనున్నారు. 

ఏపీ సచివాలయం బ్లాక్ లో పాము కలకలం

గుంటూరు : అమరావతి ఏపీ సచివాలయం రెండో బ్లాక్ పాము కలకం రేగింది. పారిశుద్ద్య కార్మికులు చెత్త తొలగిస్తూండగా పాము కనిపించింది. దీంతో వారు పాము అరుస్తూ బయటకు వచ్చారు. 

10:50 - December 5, 2017

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి యూరప్ వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ మధ్య జై లవకుశ సినిమా విజయం, బిగ్ బాస్ షో తో బిజీగా గడిపిన ఎన్టీఆర్ ప్రస్తుతం ఏ సినిమా షూటింగ్ లేదు కాబట్టి ఆయన భార్య, కుమారుడితో కలిసి విదేశాలకు వెళ్లినట్లు సమాచారం. ఆయన తిరిగి వచ్చిన తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. అంతే కాదు రాజమౌళి మల్లీస్టారర్ మూవీలో కూడా ఎన్టీఆర్ చేయనున్నారు. అయితే ఇది వరకే ఆయన యూరప్ వెళ్లాల్సి ఉంది కానీ ఆయన కుమారుడు అభయ్ వీసా సమస్య వల్ల కాస్త ఆలస్యమైనట్టు తెలుస్తోంది. 

10:30 - December 5, 2017

హైదరాబాద్ : కోఠిలోని డీఎంఈ ఆఫీసు భవనం పై ఎక్కి ఏఎన్ఎంలు ఆందోళన దిగారు. ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

10:27 - December 5, 2017

పశ్చిమగోదావరి : కాపులను బీసీల్లో చేర్చాడాన్ని నిరసిస్తూ భీమవరం అంబేద్కర్ బీసీ సంఘాలు పిలుపునిచ్చాయి. దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులను నిలపివేయడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

మేడ్చల్ అగ్నిప్రమాదం

మేడ్చల్ : జిల్లా కిష్టాపూర్ లో ఓ పరిశ్రమలో మంటలు చెలరేగాయి. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. పరిశ్రమలో టిష్యూ పేపర్స్ ఎక్కువగా నిలువ ఉండడం వల్ల మంటలు భారీగా వస్తున్నాయి.

10:24 - December 5, 2017

మేడ్చల్ : జిల్లా కిష్టాపూర్ లో ఓ పరిశ్రమలో మంటలు చెలరేగాయి. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. పరిశ్రమలో టిష్యూ పేపర్స్ ఎక్కువగా నిలువ ఉండడం వల్ల మంటలు భారీగా వస్తున్నాయి. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

డీఈపై దాడి చేసిన కాంట్రాక్టర్

అనంతపురం : జిల్లాలో ఓ కాంట్రాక్టర్ రెచ్చిపోయాడు. వాటర్ స్వీపింగ్ డీఈ కిష్టప్ప పై కాంట్రాక్టర్ నరసింహ రెడ్డి దాడి చేశాడు. నడిరోడ్డుపై డీఈనీ కాంట్రాక్టర్ చితబాదారు. బిల్లులు చేయలేదంటూ దాడి చేసినట్టు తెలుస్తోంది. డీఈ కిష్టాప్ప పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

కరీంనగర్ లో మరో క్లినకల్ ట్రయల్ బాదితుడు

కరీంనగర్ : జిల్లా జమ్మికుంట మండలం కొత్తపల్లిలో మరో క్లినికల్ గ్రయల్స్ కేసు బయటపడింది. ఔషధ ప్రయోగాలు వికటించడంతో బాధితుడు షుగర్ వ్యాధితో బాధపడుతున్నాడు. అంతేకాకుండా ఛాతినొప్పి, కడుపు నొప్పి, కాళ్లు చేతుల్లో వణుకు రావడంతో ఓ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్నాడు. బాధితుడు హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా చేస్తున్నాడు.

10:18 - December 5, 2017

అనంతపురం : జిల్లాలో ఓ కాంట్రాక్టర్ రెచ్చిపోయాడు. వాటర్ స్వీపింగ్ డీఈ కిష్టప్ప పై కాంట్రాక్టర్ నరసింహ రెడ్డి దాడి చేశాడు. నడిరోడ్డుపై డీఈనీ కాంట్రాక్టర్ చితబాదారు. బిల్లులు చేయలేదంటూ దాడి చేసినట్టు తెలుస్తోంది. డీఈ కిష్టాప్ప పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

10:13 - December 5, 2017

కరీంనగర్ : జిల్లా జమ్మికుంట మండలం కొత్తపల్లిలో మరో క్లినికల్ గ్రయల్స్ కేసు బయటపడింది. ఔషధ ప్రయోగాలు వికటించడంతో బాధితుడు షుగర్ వ్యాధితో బాధపడుతున్నాడు. అంతేకాకుండా ఛాతినొప్పి, కడుపు నొప్పి, కాళ్లు చేతుల్లో వణుకు రావడంతో ఓ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్నాడు. బాధితుడు హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా చేస్తున్నాడు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

భీమవరం బంద్ పిలుపునిచ్చిన బీసీ

పశ్చిమగోదావరి : కాపులను బీసీల్లో చేర్చాడాన్ని నిరసిస్తూ భీమవరం బంద్కఉ బీసీ సంఘాలు పిలుపునిచ్చాయి. దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులను నిలపివేయడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. 

పోలవరంను సందర్శించనున్న హైడ్రోపవర్ కార్పొరేషన్

పశ్చిమగోదావరి : నేడు పోలవరం ప్రాజెక్టును నేషనల్ హైడ్రోపవర్ కార్పొరేషన్ అధికారులు సందర్శించనున్నారు. 

09:32 - December 5, 2017

అనంతపురం : జిల్లాలో జగన్‌ ప్రజా సంకల్పయాత్ర కొనసాగుతోంది. రాష్ట్రంలో టీడీపీ పాలన ప్రజాకంఠకంగా తయారైందని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అంటున్నారు.

09:30 - December 5, 2017

గుంటూరు : జిల్లా నరసరావుపేటలో విషాదం నెలకొంది. స్థానిక రైల్వేస్టేషన్‌ 3వ గేట్‌ వద్ద గూడ్స్‌ రైలు కిందపడి.. ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు నాదెండ్ల మండలం అప్పాపురానికి చెందిన విజయలక్ష్మిగా గుర్తించారు. పిల్లలు దిగ్విజయ్‌,గణేష్ సాయి మార్టూరులో చదువుతున్నారు. మార్టూరు నుంచి పిల్లలను నరసరావుపేట కు తీసుకు వచ్చిన విజయలక్ష్మీ ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు కారణాలు తెలియడంలేదు. కేసు నమోదు చేసిన నర్సరావుపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

09:29 - December 5, 2017

విశాఖ : ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖ వాతారవణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈనెల ఏడో తేదీ నాటికి మధ్య, ఉత్తర కోస్తాలపై వాయుగుండం ప్రభావం ఉండే అవకాశం ఉందని వెదర్‌ అపడేట్స్‌ వెలువడుతున్నాయి. దీనికి సంబంధించి భాతర అంతరీక్ష పరిశోధనా సంస్థ ఇప్పటికే ఏపీ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. ఇస్రో అంచనా ప్రకారం ఈ నెల ఏడో తేదీ నుంచి వర్షాలు ప్రారంభమయ్యే అవకాశముంది. వాయుగుండం ప్రభావంతో తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఈ నెల 8న భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. విశాఖ, తూర్పుగోదావరిజిల్లాల తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని వాతారవణశాఖ అధికారులు తెలిపారు.   

09:27 - December 5, 2017

తూర్పుగోదావరి : జిల్లా నిడదవోలు మండలం శెట్టిపేట రామాలయం వీధిలో అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌లో జరిగిన ఈ ఘటనలో ఓ ఇల్లు దగ్ధమైంది. దీనిని గమనించిన చుట్టుపక్కల వారు గృహ యజమాని పాఠంశెట్టి వెంకట్రావు కుటుంబం సభ్యులు బయటకు తీసుకురావడంతో ప్రాణాపాయం తప్పింది. ఇంట్లోని సామాగ్రి కాలిబూడిదైంది. రెండు లక్షల రూపాయల వరకు ఆస్తినష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

27రోజుకు చేరిన జగన్ ప్రజా సంకల్ప యాత్ర

అనంతపురం : నేటితో జగన్ ప్రజా సంకల్ప యాత్ర 27 రోజుకు చేరుకుంది. నేడు పాదయాత్ర గుత్తి శివారు పెద్దవడలూరు నుంచి ప్రారంభించనున్నారు.

విశాఖ మన్యంలో పడిపోయిన ఉష్ణోగ్రతలు

విశాఖ : మన్యంలో ఉష్ణోగ్రతలు కనిష్టంగా పడిపోయాయి. లంబసింగిలో 5, చింతపల్లిలో7 డిగ్రిలకు ఉష్ణోగ్రతులు పడిపోయాయి.

09:05 - December 5, 2017

విశాఖ : మన్యంలో ఉష్ణోగ్రతలు కనిష్టంగా పడిపోయాయి. లంబసింగిలో 5, చింతపల్లిలో7 డిగ్రిలకు ఉష్ణోగ్రతులు పడిపోయాయి. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

నేడు గుజరాత్ లో మోడీ ఎన్నికల ప్రచారం

ఆహ్మదాబాద్ : నేడు గుజరాత్ లో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఆయన నేడు సూరత్, ధందుక, రహెడ్, నేత్రంగ్ సభల్లో పాల్గొననున్నారు. 

07:24 - December 5, 2017

కొలువులకై కొట్లాట చాల అవసరమైందని, మన రాష్ట్రం వస్తే మన ఉద్యోగాలు వస్తాయని విద్యార్థులు భావించారని, కానీ మూడున్నర సంవత్సరాల కాలంలో చూస్తే ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయాలేదని, అందుకే విద్యార్థుల్లో ఆందోళన పెరుగుతుందని, టీఆర్టీపై అనాడే సీపీఎం చెప్పిందని సీపీఎం నేత బి. వెంకట్ అన్నారు. సభకు వచ్చే వారిని పోలీసులు అడ్డుకున్నారని, టీఆర్ఎస్ పార్టీ భయపడుతుందని ఆయన అన్నారు. తెలంగాణలో కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని బ్రతుకనివ్వడం లేదని అన్నారు. మెగాన్ని గొట్టి మొగశాలకెక్కిందని, ప్రజలు అడుగుతున్న ప్రశ్నకు జవాబు ఇవ్వలేక ప్రభుత్వం దాడి చేస్తుందని, మూడు సంవత్సరాలు గడిచిన ప్రభుత్వం ఎటువంటి నియామకాలు చెపట్టలేదని కాంగ్రెస్ నేత కైలాష్ అన్నారు. ప్రభుత్వాలు ఏ సభ జరిగిన భద్రత కారణాల దృష్ట్యా చెక్ పాయింట్లు ఏర్పాటు చేస్తారని, సభకు వాపక్షా కార్యకర్తలు వచ్చారు తప్ప విద్యార్థులు రాలేదని టీఆర్ఎస్ నేత గోవర్థన్ రెడ్డి అన్నారు. పూర్తి వివరాలకువ వీడియో చూడండి. 

నేడు విద్యసంస్థల బంద్ కు జేఏసీ పిలుపు

హైదరాబాద్ : నేడు తెలంగాణలో విద్యసంస్థల బంద్ కు జేఏసీ పిలుపునిచ్చింది. ఓయూలో విద్యార్థులపై లాఠీచార్జీకి నిరసనగా వారు బంద్ కు పిలుపునించారు. బంద్ ను విజయవంతం చేయాలని జేఏసీ విద్యార్థి నాయకలు పిలుపునిచ్చారు.

నేడు గడ్కరీని కలవనున్న ఏపీ కాంగ్రెస్ నేతలు

ఢిల్లీ : ఏపీ కాంగ్రెస్ నేతుల నేడు కేంద్ర జలవనురుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలవనున్నారు. వారు పోలవరం పై ఆయనకు వినతి పత్రం సమర్పించనున్నారు. 

విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగుల ఛలో హైదరాబాద్

శ్రీకాకుళం : నేడు విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఛలో విజయవాడకు పిలుపునిచ్చారు. తమను రెగ్యూలర్ చేయాలని వారు ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. 

ఓయూలో పరీక్షలు వాయిదా...

హైదరాబాద్ : ఓయూలో పరిధిలో నేడు, రేపు జరగాల్సిన పరీక్షలను ఓయూ అధికారులు వాయిదా వేశారు. మళ్లీ పరీక్షలు ఎప్పడు నిర్వహించలనేది త్వరలో ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. నేడు విద్యసంస్థల బంద్ సందర్బంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 

06:44 - December 5, 2017

రేషన్ డీలర్లు పరిష్కారం చేయాలేదని, ప్రభుత్వం వారిని భయపెట్టిందని, ప్రజాస్వామ్యంలో చర్చల ద్వారా సమస్యను పరిష్కారించుకోవాలని, రేషన్ డీలర్ల కోరిక పెద్దది కాదని, వారి డిమాండ్ న్యాయ సమ్మతమైందని, కానీ ప్రభుత్వం మాత్రం ఒటెత్తుపొకడగా వెళ్తుతందని, వారికి ఆందోళనకు తెలంగాణ వ్యవసాయరంగం పూర్తి మద్దతు ఇస్తుందని, అలాగే ప్రభుత్వం సబ్సిడీ ఎత్తెసే కుట్ర చేస్తుందని తెలంగాణ వ్యవసాయ కార్మిసంఘం వెంకట రమణ అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

06:36 - December 5, 2017

విశాఖ : నేవీడే విన్యాసాలు ఘనంగా సాగాయి. 1971వ సంవత్సరంలో పాకిస్థాన్‌లోని కరాచీ హార్బర్‌పై భారత నౌకాదళ మిసైల్‌బోట్లు పెద్దఎత్తున దాడులు చేసి అతిపెద్ద విజయాన్ని సాధించిపెట్టాయి. తూర్పు నౌకాదళంపై దాడి చేయడానికి విశాఖ తీర సమీపానికి వచ్చిన పాకిస్థాన్‌ నౌక పి.ఎన్‌.ఎస్‌.ఘాజీ జలాంతర్గామిని తూర్పు నౌకాదళ యుద్ధనౌకలు దాడి చేసి ముంచేశాయి. ఈ విజయాన్ని పురస్కరించుకోని ప్రతి ఏటా విశాఖలో నేవీ డే నిర్వహిస్తున్నారు.

నేవీ, ఆర్మీ, ఎయిర్‌ ఫోర్స్‌ చేసిన విన్యాసాలు
కార్యక్రమంలో నేవీ, ఆర్మీ, ఎయిర్‌ ఫోర్స్‌ చేసిన విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ప్యారాచూట్‌తో జంపింగ్‌ విన్యాసాలు సందర్శకులను ఆశ్చర్యపరిచాయి. ఆపదలో ఉన్నవారిని రక్షించడం, శత్రువులపై దాడిచేసే పధ్దతులను నావికా దళాలు చేసిన తీరు స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచాయి.యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, హెలికాప్టర్లు, విమానాలు, అంతకు మించి నావికుల వీరోచిత కార్యక్రమాలతో నేవీ శక్తి సామర్ధ్యాలు తెలిసేలా చేసాయి.. పెట్రో బాంబులతో శత్రుమూకలను ఎలా ధ్వంసం చేస్తారో ప్రత్యక్షంగా చూపెట్టారు.

ఆకాశంలో 20వేల అడుగుల ఎత్తున
మెరికల్లాంటి కమాండోలు చేసిన విన్యాసాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. అలాంటి కమాండోలను తీర్చిద్దే కేంద్రం విశాఖలో ఉండటం విశేషం. తూర్పునౌకాదళంలో కమాండోలు అన్ని విపత్కర పరిస్థితులను ఎదుర్కునేలా శిక్షణ ఇస్తారు. ఆకాశంలో 20వేల అడుగుల ఎత్తున ఎగురుతున్న విమానంలోంచి పారాచూట్‌ సాయంతో దూకేసి భూమిపై కావాల్సిన ప్రాంతంలో కచ్చితంగా దిగే సామర్థ్యం ఉన్న వారు ఉన్నారంటే నౌకాదళ సామర్ధ్యాలను అర్ధం చేసుకోవచ్చు. భారత నౌకాదళానికి యుద్ధనౌకల మీద నుంచే కాకుండా.. సముద్రం అడుగున ప్రయాణించే జలాంతర్గాముల నుంచి కూడా.. శక్తిమంతమైన క్షిపణులను ప్రయోగించి సత్తాఉందని నేవీ అధికారులు తెలిపారు. భూమిపైనా, ఆకాశంలోనూ, సముద్రంలోనూ ఎంచుకున్న లక్ష్యాలపై మెరుపుదాడులు చేసే సామర్థ్యం ఉందని అన్నారు. మొత్తానికి నేవీ డే పురస్కరించుకొని విశాఖ నగరంలో దేశాన్ని మన ఆర్మీ క్లిష్ట పరిస్థితుల్లో ఏ విధంగా రక్షిస్తుందో ప్రత్యేక్షంగా తిలకించే అదృష్టం దక్కింది. 

06:35 - December 5, 2017

ఢిల్లీ : రాహుల్‌గాంధీ... కాంగ్రెస్‌ పార్టీ ఆలిండియా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేందుకు ముహూర్తం ఖరారైంది. అధ్యక్షుడిగా ప్రకటించడమే తరువాయి.. పార్టీని భుజాన ఎత్తుకోనున్న రాహుల్‌... పార్టీని సరికొత్త రీతిలో పరుగులు పెట్టించేందుకు తహతహలాడుతున్నారు. ఇప్పటికే అండర్‌గ్రౌండ్‌ వర్క్‌ను పూర్తి చేసిన రాహుల్‌... దాన్ని పక్కా ప్రణాళికతో అమలు చేసేందుకు సిద్దమయ్యారు. తన టీమ్‌ ఎలా ఉండాలనే దానిపై ఇప్పటికే కసరత్తు చేసిన రాహుల్‌.. పార్టీలో కొత్త సంస్కరణలకు తెరలేపబోతున్నారు.

సంస్థాగతంగా బలోపేతం...
అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న రాహుల్‌.. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గ్రౌండ్‌ రిపోర్ట్‌ను సేకరించిన యువనేత టీమ్‌... వాటికి పదును పెడుతున్నట్లు సమాచారం. బూత్‌ స్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు ప్రతి ఒక్కరిని పార్టీతో అనుసంధానం చేయడం... పార్టీ పిలుపునిస్తే.. కదనరంగంలోకి దిగేలా రెడీ చేస్తున్నారు. దీనికోసం శక్తి యాప్‌లాంటి వాటిని ఉపయోగిస్తూ.. దీనిని అదనంగా సోషల్‌ మీడియాను విరివిరిగా వాడుకోవాలని రాహుల్‌ భావిస్తున్నారు. ఇక పార్టీలో సరికొత్త ప్రయోగానికి రాహుల్‌ శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో నెలకొనే గందరగోళానికి చెక్‌ పెట్టేందుకు వ్యూహం రచిస్తున్నారు. ఢిల్లీలో ముఖ్య నేతల లాబీయింగ్‌తో అభ్యర్థులను ఎంపిక చేస్తారనే అపవాదును తొలగించేందుకు కసరత్తు చేస్తున్నారు.

గెలుపు గుర్రాలను వెతికి....
అమెరికా ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో అనుసరించే విధానాన్ని.. అమలు చేయాలనే యోచనలో రాహుల్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకుగాను క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న నేతను ఎంపిక చేయబోతున్నారు. పార్టీలో గెలుపు గుర్రాలను వెతికి పట్టుకునే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. టికెట్‌ కోసం పోటీపడుతున్న ఆశావాహులలో మంచి అభ్యర్థిని ఎంపిక చేయాలని.. అవసరమైతే వారి మధ్య ఓటింగ్‌ నిర్వహించాలని భావిస్తున్నారట. ఇలా చేస్తే... పార్టీ కోసం పని చేసే వారికి అవకాశం దక్కుతుందంటున్నారు. అంతేకాకుండా... ఆయారాం... గయారాంలకు చెక్‌ పెట్టడంతో పాటు... సీల్డ్‌ కవర్‌ పాలిటిక్స్‌ అపవాదు నుండి పార్టీని బయటకు తీసుకురావాలని భావిస్తున్నారు రాహుల్‌. రాజస్థాన్‌, కర్నాటక, మధ్యప్రదేశ్‌, తెలంగాణ ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాలను పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద ఎంపిక చేసి.. అమలు చేయాలని యువ నేత భావిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి రాహుల్‌గాంధీ.. కాంగ్రెస్‌లో నూతన శకాన్ని మొదలుపెట్టేందుకు సిద్దమవుతున్నారు. పార్టీ కట్టుబాట్లను కాపాడుకుంటూ... పార్టీ విధేయతకు పెద్ద పీట వేస్తూ.. పార్టీ కేడర్‌ టూ లీడర్‌ను ఒక్కటి చేయడమే లక్ష్యంగా ముందుకెళ్లబోతున్నారు యువరాజు. మరి రాహుల్‌ వ్యూహాలు ఏ మేరకు ఫలితాలను ఇస్తాయో చూడాలి.

 

06:34 - December 5, 2017

నిర్మల్ : తెలంగాణలో.. ఉద్యోగం రాలేదని మనస్తాపంతో మరో నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిర్మల్‌ జిల్లా.. కుంటాల మండలం లింబాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎమ్మెస్సీ బీఈడీ పూర్తి చేసిన బదుల భూమేశ్‌ ఉద్యోగం రాకపోవడంతో.. భూమేశ్‌ తీవ్ర నిరాశకు గురయ్యాడు. అందరూ నిద్రపోతున్న సమయంలో, ఇంట్లో దూలానికి ఉరి తీవ్ర మనస్తాపానికి గురైన భూమేశ్‌భూమేశ్‌ నాలుగు సంవత్సరాల క్రితం ఎమ్మెస్సీ బీఈడీ పూర్తి చేశాడు. ఎన్నో పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకున్నాడు. కానీ ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్‌లు పడలేదు. మరోవైపు భూమేశ్‌ తండ్రి , అన్నలు అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో తల్లి, వదిన, పిల్లల పోషణ భారంపై భూమేశ్‌పై పడింది. దీంతో చిన్నా చితక ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో భూమేశ్‌ మానసికంగా కుంగిపోయాడని.. తీవ్ర మనస్తాపానికి గురయ్యాడని.. కుటుంబ సభ్యులు చెబుతున్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం మెల్కోని ఉద్యోగాల నియామకాలపై దృష్టి సారించాల్సి అవసరం ఎంతైనా ఉందంటున్నారు తెలంగాణ మేధావులు. 

06:32 - December 5, 2017

హైదరాబాద్ : తొమ్మిది నెలల నిరీక్షణ.. మూడు నెలలుగా అనుమతి కోసం ఎదురుచూపులు.. అఖరికి కోర్టు మెట్లెక్కి అనుమతి.. ఇలా ఎన్నో ప్రయాసలు పడి సాధించుకున్న అనుమతితో సరూర్‌నగర్‌ స్టేడియంలో నిర్వహించిన టీ-జేఏసీ 'కొలువుల కొట్లాట సభ' విజయవంతమైంది. భారీ ఎత్తున నిరుద్యోగులు, పలు పార్టీల నేతలు, ప్రజాసంఘాలు నాయకులు తరలివచ్చారు.

విద్యార్థుల బలిదానాలు, ఆత్మహత్యల ఫలితంగా
విద్యార్థుల బలిదానాలు, ఆత్మహత్యల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో... మూడేళ్లలో కేసీఆర్‌ ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు కాంగ్రెస్‌ నేత జీవన్‌రెడ్డి. మూడేళ్లుగా నామమాత్రంగా నోటిఫికేషన్లు విడుదల చేశారన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. సభకు హాజరైన యువతలో ధైర్యం నింపే విధంగా పలువురి ప్రసంగం కొనసాగింది. ప్రభుత్వ కొలువులు రాలేదని నిరాశపడాల్సిన అవసరం లేదన్నారు విమలక్క. తెలంగాణలోని ప్రతి విద్యార్తిలో పోరాట పటిమ ఉందని... ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దన్నారు. ఎమ్మెల్యే స్థానం ఖాళీ కాగానే.. మూడు నెలలో ఉప ఎన్నికలు పెట్టి ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎన్నికల కమిషన్‌ ఉన్నట్లుగా... ప్రభుత్వ కొలువు ఖాళీ కాగానే భర్తీ చేసేందుకు ఉద్యోగ నియామక కమిషన్‌ ఉండాలన్నారు మాజీ ఎమ్మెల్సీ ప్రొ.నాగేశ్వర్‌. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఎన్ని పోస్టులను భర్తీ చేసిందో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. కోదండరాం స్వలాభం కోసం నిరుద్యోగ సమస్యపై పోరాడటం లేదన్నారు ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య. ఇది నిరుద్యోగులందరి సమస్య అని.. దీనిపై పోరాటం చేయడమే కోదండరామ్‌ తప్పా అని ప్రశ్నించారు.

పోలీసుల తీరుపై కోదండరామ్‌ మండిపాటు
సభ నిర్వహించేందుకు కోర్టు అనుమతి ఇచ్చినా... పోలీసులు వ్యవహరించిన తీరుపై కోదండరామ్‌ మండిపడ్డారు. సభ సక్సెస్‌ అవుతుందనే అక్కసుతోనే.. విద్యార్థులను రాకుండా అడ్డుకున్నారన్నారు. కొలువులకై కొట్లాట సభతో తమ ఉద్యమం ఆగదని... భవష్యత్‌లోనూ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాడుతామన్నారు. విద్యార్థుల త్యాగాల బలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో నిజాం రాజులా కేసీఆర్‌ పాలన సాగిస్తున్నారన్నారు ప్రజాగాయకుడు గద్దర్‌. రాష్ట్రం ఏర్పడిన తర్వాత... కేసీఆర్‌ అండ్‌ ఫ్యామిలీకే రాజకీయ కొలువులు లభించాయన్నారు. కేసీఆర్‌ ఇప్పటికైనా కళ్లు తెరిచి నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలన్నారు. ఈ సందర్బంగా గద్దర్‌ పాడిన పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. మొత్తానికి సభ సక్సెస్‌ కావడంతో టీ-జేఏసీ నేతలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదే స్ఫూర్తితో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేసేందుకు టీ-జేఏసీ సిద్దమవుతోంది. 

Don't Miss