Activities calendar

06 December 2017

22:27 - December 6, 2017

హైదరాబాద్‌ : నగరంలో డిసెంబర్ 6 బ్లాక్ డే ప్రశాంతంగా కొనసాగింది. ముందుజాగ్రత్తగా పాతబస్తీలో భారీగా పోలీసులు మోహరించి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. 144 సెక్షన్‌ అమలు చేయడంతో పాటు కీలక ప్రాంతాల్లో ర్యాపిడ్‌ యాక్షన్‌ బలగాలను  మోహరించారు. పాతబస్తీ వ్యాప్తంగా మొత్తం 60 సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నట్టు గుర్తించి....10 ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. ప్రార్థనా మందిరాలు, మసీదుల వద్ద భారీగా బలగాలను మోహరించారు. మొత్తం 3500 మంది సిబ్బంది భద్రతా విధుల్లో ఉన్నట్టు పోలీస్‌ ఉన్నతాధికారులు తెలిపారు. సౌత్‌జోన్‌ పోలీసులు సుమారు 30 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. పాతబస్తీలో ర్యాలీలు, నిరసనలపై నిషేధం విధించారు. 

 

22:25 - December 6, 2017

జయశంకర్‌ భూపాలపల్లి : జిల్లా రెంగొండ మండలం గోరికొత్తపల్లిలో సంచలనం సృష్టించిన చిన్నారి రేష్మ అత్యాచారం, హత్య కేసులో నిందితుడు కనకం శివను పోలీసులు అరెస్టు చేశారు. శివని బహిరంగంగా ఉరి తేయాలని రేష్మ బంధువులు, గ్రామస్తులు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. పాత కక్షల నేపథ్యంలో ఈనెల 4న శివ రేష్మను అత్యాచారం చేసి హత్య చేశాడు. శివ అన్న కుమార్ ప్రేమ విషయంలో రేష్మ తండ్రి రాజు అడ్డుపడటంతో కుమార్ పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో రాజుపై కక్ష పెంచుకున్న శివ ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు స్ధానికులు చెబుతున్నారు. శివపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు భూపాలపల్లి డీఎస్పీ రవికుమార్ చెప్పారు. 

22:22 - December 6, 2017

కరీంనగర్ : తెలంగాణలో ఔషధ ప్రయోగాలపై ఆర్థికమంత్రి ఈటల తీవ్రంగా స్పందించారు. కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన... క్లినికల్‌ ట్రయల్స్‌ వ్యవహారంపై జస్టిస్ గోపాల్ రెడ్డి కమిటీ ఇచ్చిన నివేదికను డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్‌ ఇండియాకు సమర్పించామన్నారు. క్లినికల్ ట్రయల్స్ అంశం రాష్ట్ర పరిధిలో లేనప్పటికీ... విచారణలో నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఫార్మా కంపెనీలను హెచ్చరించారు. 

22:18 - December 6, 2017

హైదరాబాద్ : రాజ్యాంగ నిర్మాత దాదా సాహెబ్ డా.బీఆర్. అంబేడ్కర్‌ 61 వర్ధంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాలు ఘన నివాళులు అర్పించాయి. రాజకీయ పార్టీలు, దళిత సంఘాలు, యువజన సంఘాల ఆధ్వర్యంలో అంబేడ్కర్ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. అంబేడ్కర్ అడుగు జాడల్లో నడవాలని నేతలు పిలుపునిచ్చారు.

బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ 61 వర్థంతి సందర్భంగా ట్యాంక్‌ బండ్‌ వద్ద అంబేద్కర్‌ విగ్రహానికి టీమాస్‌ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్వీకేలో జరిగిన సెమినార్‌లో... సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, టీ మాస్ నేతలు పాల్గొన్నారు. కింది స్ధాయి వర్గాలకు అంబేడ్కర్ ఆశించిన స్ధాయిలో ఫలితాలు దక్కడం లేదన్నారు తమ్మినేని వీరభద్రం. టిమాస్ ఆధ్వర్యంలో సామాజిక న్యాయ సాధనకోసం పోరాటం చేస్తామన్నారు ప్రొ.కంచ ఐలయ్య. 

అంబేద్కర్ వర్థంతి సందర్భంగా హైదరాబాద్ పీపుల్స్ ప్లాజా నుండి ట్యాంక్ బండ్‌ అంబేద్కర్‌ విగ్రహం వరకు 5కె రన్‌ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పిడమర్తి రవి, శాసనమండలి విప్‌ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, ఓయూ వీసీ, విద్యార్థులు పాల్గొన్నారు. 

జగిత్యాల జిల్లాలోని తహసిల్ చౌరస్తాలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ, సీపీఎం నేత సారంగపాణి పాల్గొన్నారు. మరోవైపు కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాలతో పాటు మల్లపూర్ మండలంలోని పలు గ్రామాలలో అంబేడ్కర్ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. వనపర్తి జిల్లాకేంద్రంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండి.జబ్బార్‌తో పాటు సీపీఎం నేతలు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. విజయవాడ పాత బస్టాండ్‌ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఇతర నేతలు ఘన నివాళులు అర్పించారు. 
గుంటూరు లాడ్జ్ సెంటర్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి మంత్రి నక్కా ఆనందబాబు, కలెక్టర్ కోన శశిధర్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాజధానిలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి నక్కా ఆనందబాబు తెలిపారు. 

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో వైసీపీ ఆధ్వర్యంలో అంబేడ్కర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నేతలు పిలుపునిచ్చారు. 

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అంబేడ్కర్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఒంగోలులో మాల మహానాడు ఆధ్వర్యంలో జరిగిన  అంబేడ్కర్ వర్ధంతి కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దనరావు, జిల్లా కలెక్టర్ నవీన్ చంద్ తదితరులు పాల్గొన్నారు. 

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఓఎన్ జీసీ కార్యాలయంలో అంబేడ్కర్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఓఎన్ జీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డీఎమ్‌ఆర్. శేఖర్ ఆధ్వర్యంలో ఉద్యోగులు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. పలువురు బౌద్ధ భిక్షువులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విశాఖ పోర్టు చావులమదం వద్ద పోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని పోర్టు చైర్మన్ కృష్ణబాబు ఆవిష్కరించారు. పోర్టు సర్కిల్ వద్ద అతి పెద్ద అంబేడ్కర్ విగ్రహాన్ని నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. 

22:12 - December 6, 2017

విజయవాడ : పోలవరం విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం తన వైఖరి ఏంటో ఇటు ప్రజలకు.. అటు రైతాంగానికి స్పష్టం చేయాలని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. ముఖ్యంగా నిర్వాసితుల సమస్యలను బాధ్యతగా భావించి బాధితులకు త్వరితగతిన నష్టపరిహారం చెల్లించాలన్నారు. అటు ఎన్డీయే, ఇటు టీడీపీ ప్రభుత్వం పోలవరాన్ని అడ్డుపెట్టుకుని ప్రజల జీవనాడి అయిన ప్రాజెక్టును నిర్వీర్యం చేయాలనుకోవడం సమంజసం కాదని మధు అన్నారు. 
     

 

22:09 - December 6, 2017

అనంతపురం : 28వ రోజు తరిమెలలో పాదయాత్ర చేస్తున్న జగన్ సీఎం చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు రావాలని అసత్యపు హామీలిచ్చారన్నారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో అన్ని అబద్ధాలు, మోసాలే ఉన్నాయన్నారు. ఎన్నికల మానిఫెస్టో తీసుకొచ్చి ప్రతి పేజిని ఒక కులానికి మోసం చేయడానికి కేటాయించారన్నారు. గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న రైతులకు అండగా ఉన్నామని చెప్పేందుకే తాను పాదయాత్ర చేస్తున్నానన్నారు. 

22:07 - December 6, 2017

గుంటూరు : ప్రభుత్వాస్పత్రి నర్సింగ్‌ కాలేజీలో ర్యాగింగ్‌ అంశం కలకలం రేపుతోంది. నన్నపనేని రాజకుమారికి.. ఫిర్యాదు చేయడంపై... ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ రాజునాయుడు విద్యార్థినులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ర్యాగింగ్ ఘటన వివరాలను బయట వ్యక్తులకు ఎందుకు చెప్పారని విద్యార్ధినులను ప్రశ్నించినట్లు సమాచారం. ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్ధులను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. రాజునాయుడు వైఖరిపై ఎస్ఎఫ్ఐ విద్యార్ధి సంఘ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

 

22:02 - December 6, 2017

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టుల బాట పట్టారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ప్రాజెక్ట్‌ పనులు పరిశీలించడానికి కరీంనగర్ చేరుకున్నారు. 2రోజుల పాటు సాగే పర్యటనలో పనుల పురోగతిని  సీఎం పర్యవేక్షించనున్నారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో.. సీఎం కేసీఆర్‌ రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన బుధవారం సాయంత్రం హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో  కరీంనగర్‌కు చేరుకున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, టీఆర్‌ఎస్‌ నేతలు ఘన స్వాగతం పలికారు. ఉత్తర తెలంగాణ భవన్‌లో సీఎం బసచేశారు.

పర్యటనలో భాగంగా కేసీఆర్‌ గురువారం ఉదయం తుపాకుల గూడెం, మేడిగడ్డ, అన్నారం, కన్నెపల్లి, సుందిళ్ల, గోలివాడలో జరుగుతున్న  కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పనులను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలిస్తారు. మధ్యాహ్నం మంథని మండలం సిరిపురం వద్ద నిర్మిస్తున్న అన్నారం రిజర్వాయర్ పనులను సందర్శిస్తారు.  భోజనం అనంతరం  రామగుండంలోని గోలివాడ పంప్‌ హౌజ్‌ పనులను కూడా పరిశీలించి.. రాత్రికి అక్కడే ఎన్టీపీసీలో బస చేస్తారు. 

తిరిగి శుక్రవారం ఉదయం కాళేశ్వరం 6, 8లకు సంబంధించిన  అండర్ గ్రౌండ్ టన్నెల్ పనులను కేసీఆర్‌ పరిశీలించనున్నారు. అనంతరం మిడ్ మానేరు ప్రాజెక్టు పనులను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించి.. అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.  సమావేశమయ్యాక  హైదరబాద్ బయల్దేరుతారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పోలీస్‌లు భారీ భద్రత  ఏర్పాటు చేశారు.  మహరాష్ట్రలో ఎన్‌కౌంటర్ నేపథ్యంలో...  తెలంగాణ సరిహద్దు అటవీ ప్రాంతాల్లో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.  

22:01 - December 6, 2017

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌ నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు పంపింది. ఈనెల 15న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. 2018 డీఎస్సీ ద్వారా 12,370 టీచర్‌ పోస్టుల భర్తీకి మంత్రి గంటా షెడ్యూల్‌ ప్రకటించారు. జూన్‌ 12 నాటికి ఉపాధ్యాయులకు పోస్టింగ్‌లు ఇవ్వాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. 

డీఎస్సీ ప్రకటన కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఏపీ నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2018 డీఎస్సీపై  మంత్రి గంటా షెడ్యూల్‌ ప్రకటించారు. మొత్తం 12వేల 370 టీచర్‌ పోస్టుల భర్తీకి ఈనెల 15న నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది జూన్‌12 నాటికి టీచర్‌ పోస్టింగులు ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈనెల 26 నుంచి ఫిబ్రవరి 2 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు అందుబాటులో ఉంటాయన్నారు. దరఖాస్తులకు చివరి తేది ఫిబ్రవరి 8 అని తెలిపారు.  

మార్చి 23,24,26 తేదీల్లో రాత పరీక్షలు నిర్వహిస్తామన్నారు మంత్రి గంటా. మార్చి 9 నుంచి హాల్‌ టిక్కెట్లును డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు. ఏప్రిల్‌ 9న ప్రాథమిక కీ విడుదల చేస్తామని..ఈ కీపై అభ్యంతరాలను ఏప్రిల్‌ 10 నుంచి 16 వరకు స్వీకరిస్తామన్నారు. ఏప్రిల్‌30న తుది కీ విడుదల చేస్తామన్నారు. మే 5న మెరిట్‌ లిస్ట్‌ ప్రకటిస్తామని చెప్పారు. మే 11న ప్రొవిజనల్‌ సెలక్షన్‌ విడుదల చేసి అభ్యర్థులకు సమాచారమిస్తామన్నారు. మే 14 నుంచి 19 వరకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలిస్తామన్నారు.  

ప్రకటించిన మొత్తం 12370 పోస్టుల్లో...స్కూల్‌ అసిస్టెంట్‌, ఎస్జీటీ, లాంగ్వేజ్‌ పండింట్‌ ఉద్యోగాలు 10,313... మోడల్‌ పాఠశాల టీచర్ల ఉద్యోగాలు 1197, ప్రత్యేక అవసరాలు కల్గిన విద్యార్థుల కోసం మరో 860 ఉద్యోగాలను భర్తీ చేస్తోంది ఏపీ ప్రభుత్వం. 

 

21:53 - December 6, 2017

విశాఖ : జనసేనాని పవన్‌కల్యాణ్‌... రాజకీయ నాయకుల తీరుపై.. విరుచుకుపడ్డాడు. తండ్రుల అధికారంతో.. తాము గద్దెనెక్కాలనుకునే కల్చర్‌ను ప్రస్తావిస్తూ.. జగన్‌, లోకేశ్‌లను పరోక్షంగా కడిగిపారేశాడు. అదే సమయంలో తనకు సీఎం కావాలన్న సరదా లేదని స్పష్టం చేశాడు. అసలు ముఖ్యమంత్రి పీఠం.. అధికారం కాదని.. ప్రజలకు సేవ చేసే బాధ్యత అని తేల్చి చెప్పాడు. మూడు రోజుల ఆంధ్రప్రదేశ్‌ పర్యటనలో.. తొలిరోజే.. అజ్ఞాతవాసి.. అధికార, విపక్ష నేతలపై మాటల తూటాలు పేల్చేశాడు. విశాఖలో డీసీఐ ఉద్యోగుల దీక్షలకు మద్దతు తెలిపిన పవన్‌.. సమస్యను కేంద్రం పరిష్కరించకుంటే బీజేపీ పతనం విశాఖ నుంచే మొదలవుతుందని హెచ్చరించారు.

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల పర్యటనకు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ శ్రీకారం చుట్టారు. విశాఖలో ప్రభుత్వరంగ సంస్థ డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ను ప్రైవేటీకరించ వద్దంటూ.. తొమ్మిది రోజులుగా దీక్ష చేస్తున్న సంస్థ ఉద్యోగులను పవన్‌ కల్యాణ్‌ పరామర్శించారు. వారి ఉద్యమానికి తన మద్దతు ప్రకటించారు. ప్రైవేటీకరణ ఆందోళనతో.. సోమవారం ఆత్మహత్య చేసుకున్న డీసీఐ ఉద్యోగి వెంకటేష్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించారు.

డీసీఐ ఉద్యోగుల ఆందోళనకు సంఘీభావం ప్రకటించిన పవన్‌.. లాభాల బాటలో ఉన్న డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ను ప్రైవేటీకరించడం మానుకోవాలని డిమాండ్‌ చేశారు. సంస్థ ఎదుగుదల వెనుక వెయ్యి మంది ఉద్యోగుల కష్టం ఉందని... ఉద్యోగుల సమస్యలపై ప్రశ్నించడానికి విశాఖకు వచ్చానన్నారు. ప్రజా సమస్యల నుంచి స్థానిక ఎంపీలు కంభంపాటి హరిబాబు, అవంతి శ్రీనివాస్‌ తప్పించుకు తిరుగుతున్నారని.. ప్రజాసమస్యల పట్ల చిత్తశుద్ధిలేని వారికి 2019లో ఓట్లు అడిగే హక్కులేదన్నారు. 

మోదీ , చంద్రబాబు తనకు బంధువులు కాదని... ప్రజలకు మేలు చేస్తారనే గత ఎన్నికల్లో వారికి మద్దతు ఇచ్చానని పవన్‌కల్యాణ్‌ మరోమారు స్పష్టం చేశారు. ఇంతవరకూ ప్రధానిని తాను ఏదీ కోరలేదని, డీసీఐ ఉద్యోగుల సమస్య పరిష్కారం కోసం.. తొలిసారిగా మోదీకి లేఖ రాశానంటూ ప్రతిని ఆందోళన వేదికపై ప్రదర్శించారు.  ఒకవేళ సమస్య పరిష్కరించకపోతే బీజేపీ ఓటమి విశాఖ నుంచే మొదలవుతుందని హెచ్చరించారు.

డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా చరిత్రను పవన్‌ కల్యాణ్‌కు సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు నర్సింగరావు వివరించారు. అతి తక్కువ పెట్టుబడితో ప్రారంభించిన డీసీఐ పదేళ్లలోనే ప్రభుత్వానికి పన్నుల రూపంలో 200 కోట్లు చెల్లించిందని గుర్తు చేశారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం డీసీఐకి చెందిన 20శాతం వాటాలు అమ్మితే.. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం పూర్తిగా అమ్మేసే ప్రయత్నాలు మొదలుపెట్టిందన్నారు. డీసీఐ ప్రైవేటీకరించకుండా సీఎం చొరవ చూపేలా ఒత్తిడి తీసుకురావాలని పవన్‌ కల్యాణ్‌కు నర్సింగ్‌రావు సూచించారు. ఆత్మహత్య చేసుకున్న డీసీఐ ఉద్యోగి వెంకటేష్‌ కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని నర్సింగ్‌రావు  ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. వెంకటేష్‌ సూసైడ్‌ నోట్‌ను పోలీసులు బహిర్గతం చేయాలన్నారు.

అనంతరం విశాఖలో ఏర్పాటు చేసిన  జనసేన ఉత్తరాంధ్ర సమన్వయకర్తల సమావేశంలో పవన్‌ పాల్గొన్నారు. తన అభిప్రాయాలను వారితో పంచుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌, నారా లోకేష్‌పై పవన్‌ సెటైర్లు విసిరారు. తండ్రి చనిపోగానే ముఖ్యమంత్రి కావాలన్న జగన్‌ ప్రయత్నం నచ్చక, వారసత్వ రాజకీయాలు గిట్టక.. తాను వైసీపీకి మద్దతు ఇవ్వలేదన్నారు. వారసులు తమ ప్రతిభను నిరూపించుకుని రాజకీయాల్లోకి రావాలంటూ పరోక్షంగా నారా లోకేష్‌పై పవన్‌ సెటైర్లు విసిరారు.  యువత అంటే లోకేష్‌, జగన్‌కాదని.. ఆ రాష్ట్రంలోని యువతీ యువకులే యువతంటూ ఛమత్కరించారు. 

ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీలు చెరో లక్షకోట్లు దోపిడీ చేశాయని పవన్‌ విమర్శించారు. ఇలాంటి పార్టీలు ప్రజలకు ఏం చేస్తాయని ప్రశ్నించారు.  రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్‌తోపాటు బీజేపీ కూడా ఏపీకి ద్రోహం చేసిందన్నారు. నాడు ఏపీకి ప్రత్యేక హోదా కోసం డిమాండ్‌ చేసిన బీజేపీ ఇప్పుడు.. దాన్ని సాగదీస్తోందని మండిపడ్డారు. మొత్తానికి పవన్‌ కల్యాణ్‌ విశాఖ టూర్‌ జనసేన కార్యకర్తల్లో నూతనోత్తేజం నింపింది.

గీతం యూనివర్సిటీలో విద్యార్థి ఆత్మహత్య

విశాఖ : గీతం యూనివర్సిటీలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 8 వ అంతస్తు పైనుంచి దూకి రిషి అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ కు చెందిన రిషి ఫార్మసి మొదటి సంవత్సరం చదువుతున్నాడు.

 

20:37 - December 6, 2017

ఎవడిసొమ్ము ఎవడికి దానం చేస్తున్నారు ? అడ్డూ అదుపు లేకుండా ప్రైవేటు పరం చేస్తూ.. బ్రహ్మాండమైన లాభాలతో దూసుకుపోతున్న సంస్థ వాటాలు ఎలా అమ్మేస్తారు? యావత్ జాతి సమిష్టి ఆస్తిని ఏ ప్రయోజనాలతో నిర్వీర్యం చేస్తున్నారు. ఇవే ఆ కార్మికుల ప్రశ్నలు. ఇంకాలం పోరాటాలు, నిరసనలు సాగాయి. కానీ ఇప్పుడు ప్రాణత్యాగం జరగటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై ఈ రోజు వైడాంగిల్ స్టోరీ..
పబ్లిక్ కంపెనీలను సైలెంట్ గా అమ్మేస్తారు..... 
ఇదే అసలైన అభివృద్ధి నిర్వచనం అంటూ ప్రైవేటు పెట్టుబడులను అనుమతిస్తారు. పబ్లిక్ కంపెనీలను సైలెంట్ గా అమ్మేస్తారు. ప్రభుత్వం చెప్పే కారణాలేవైనా అంతిమంగా జరుగుతున్నది మాత్రం ఒకటే.. ప్రజల సొమ్ము ప్రైవేటు జేబుల్లోకి వెళ్లటం. ప్రభుత్వ సంస్థలు ప్రైవేటు పరం కావటం. దీన్ని అడ్డుకుని తీరుతాం అంటున్నాయి కార్మిక సంఘాలు. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

20:28 - December 6, 2017

బాబా సాహెబ్ను మరిచిన బాతాల పోశెట్టి, సర్కారు టీచర్లు బడికి సక్కగవోతలేరట, డబుల్ బెడ్రూం ఇండ్ల కాడ డ్రామాలు, రాజకీయం గాదిది.. రాజాకార్లు గారు మీరు, గుండ్ల గూడెంల దిగిన గుర్రం బాబా, తల్లిని చెట్టుకింద వదిలేసిన    కన్నకొడుకులు... ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం...
 

 

మెట్రో రైలు ప్రయాణికులకు స్వల్ప ఊరట

హైదరాబాద్ : మెట్రో రైలు ప్రయాణికులకు స్వల్ప ఊరట లభించింది. స్మార్ట్ కార్డు ప్రయాణికులకు రాయితీ పెంచారు. ఎల్ ఆండ్ టీ 5 శాతం నుంచి 10 శాతానికి పెంచింది.

తిరుమలలో 300 ప్రత్యేక దర్శనం నకిలీ టికెట్ల పట్టివేత

చిత్తూరు : తిరమలలో 300 ప్రత్యేక దర్శనం నకిలీ టికెట్లను పట్టుకున్నారు. ముంబై నుంచి శ్రీవారి దర్శనార్థం వచ్చిన 193 భక్తులు...దర్శనానికి వెళ్తున్న సమయంలో స్కాన్ చేస్తుండగా నకిలీ ప్రత్యేక దర్శనం టిక్కెట్లను పట్టుకున్నారు. ప్రశాంత్ అనే వ్యక్తి భక్తులను మోసం చేసినట్లు గుర్తించారు. భక్తులకు మరో మార్గం ద్వారా దర్శనానికి టీటీడీ అధికారులు పంపించారు. నకిలీ టిక్కెట్లపై టీటీడీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. 

 

19:55 - December 6, 2017

హలో మూవీ బ్యూటిఫుల్ రొమాంటిక్ స్టోరీ అని హీరో నాగార్జున అన్నారు. అఖిల్ హీరోగా నటిస్తున్న హలో మూవీ గురించి హీరో నాగార్జున మాట్లాడారు. మూవీ బ్యూటిఫుల్, రొమాంటిక్, యాక్షన్ ఫిల్మ్ అని అన్నారు. అఖిల్ తో సినిమా చేస్తున్నందుకు రెస్పాన్స్ బుల్ గా ఫీలవుతున్నానని తెలిపారు. గత రెండు సంవత్సరాలుగా మంచి సినిమా చేయాలని అఖిల్ అనుకుంటున్నారని పేర్కొన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

19:48 - December 6, 2017

జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రసంగంపై వక్తలు భిన్నవాదనలు వినిపించారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు తెలకపల్లి రవి, విశ్లేషకులు దిలీప్, ఏపీ బీజేపీ నేత అద్దెపల్లి శ్రీధర్, టీడీపీ నేత బుద్ధ వెంకన్న పాల్గొని, మాట్లాడారు. జాతీయ, రాష్ట్ర రాజకీయాలపై లోతుగా మాట్లాడారని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

19:42 - December 6, 2017

రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన పలు అసక్తరమైన విషయాలు తెలిపారు. పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గేమ్ ఆడుతున్నాయిని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు వస్తే పురుషోత్తపట్నం, పట్టిసీమ అవసరమే లేదన్నారు. కేంద్రభుత్వం ఏపీ ప్రజలను మనుషులుగా చూడడం లేదని వాపోయారు. విభజన చట్టంలోని హామీలన్నింటినీ అమలు చేస్తే ఏపీ రాష్ట్రంలో సమస్యలు ఉండేవి కాదన్నారు. కేంద్ర ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబుకు చెడిందన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

19:29 - December 6, 2017

కడప : జిల్లాలో.. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయడం వల్ల యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని పలువురు జర్నలిస్టులు  అన్నారు. జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని కలెక్టర్  బాబురావు నాయుడుకు.. జర్నలిస్ట్‌లు వినతిపత్రం అందజేశారు. ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని జర్నలిస్ట్‌ నాయకులు అన్నారు. ఉక్కు పరిశ్రమకు సంబంధించిన విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని కలెక్టర్ బాబురావు నాయుడు జర్నలిస్టులకు హామీ ఇచ్చారు.

 

19:28 - December 6, 2017

విశాఖ : వైజాగ్‌ ఫెస్ట్ అద్భుతంగా జరుగుతుందని, 5 రోజులలో లక్షా 50వేల మంది సందర్శించారన్నారు విశాఖ ఫెస్ట్‌ కార్యదర్శి అజా శర్మ. రానున్న 5 రోజులలో మరింత ఆసక్తిగా ఫెస్టివల్‌ను రూపొందించినట్లు తెలిపారు. షార్ట్‌ ఫిలిం ప్రదర్శన 9వ తేదీన ముగుస్తుందని, ఈ సభకు ఎల్.బీ.శ్రీరాం హాజరు అవుతారని తెలిపారు. పదో తేదీన గురజాడ సాహితీ వేదిక ముగింపు కార్యక్రమంలో కవితలు, కథల పోటీల్లో గెలిచిన వారికి బహుమతులు ఇవ్వనున్నట్లు తెలిపారు. 

 

19:26 - December 6, 2017

విజయవాడ : సోలార్ విద్యుత్‌ వినియోగంలో కృష్ణా జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు నెడ్‌ క్యాప్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌. వ్యవసాయ రంగంలో సోలార్‌ పంపు సెట్ల వినియోగం పెరిగిందని, దీనివల్ల విద్యుత్‌ సరఫరాకు ఆటంకం లేకుండా విద్యుత్‌ బిల్లుల్లో భారం లేకుండా చూశామని తెలిపారు. సోలార్ ఉత్పత్తి, వినియోగంపై నెడ్ క్యాప్ మేనేజర్ శ్రీనివాస్ తో టెన్ టివితో ఫేస్ టూ ఫేస్ నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

19:18 - December 6, 2017

విశాఖ : డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఉద్యోగులు చేస్తోన్న ఆందోళనకు సంఘీభావం చెప్పడానికి వచ్చిన జనసేనాని పవన్‌ కల్యాణ్‌కు సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్‌ నర్సింగరావు డీసీఐ చరిత్ర వివరించారు. అతి తక్కువ పెట్టుబడితో ప్రారంభించిన డీసీఐ... 10 ఏళ్లలో ప్రభుత్వానికి పన్నుల రూపంలో 200 కోట్లు చెల్లించిందన్నారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం డీసీఐకి చెందిన 20శాతం వాటాలు అమ్మేసిందని... ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం పూర్తిగా అమ్మేసే ప్రయత్నాలు మొదలుపెట్టిందని వివరించారు.

 

19:15 - December 6, 2017

గుంటూరు : ప్రభుత్వాస్పత్రి నర్సింగ్‌ కాలేజీలో ర్యాగింగ్‌ అంశం కలకలం రేపుతోంది. రాత్రిళ్లు నిద్రపోనివ్వకుండా వేధిస్తున్నారని.. మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌ నన్నపనేనికి.. నర్సింగ్ విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. దొరబాబు అనే సీనియర్ నర్సింగ్ విద్యార్థి.. తన చేత బలవంతంగా ఆల్కహాల్ తాగించాడని ఓ విద్యార్థిని ఆరోపించింది. మరో జూనియర్ విద్యార్థిని పట్ల అసభ్య ప్రవర్తించాడని  వారు నన్నపనేనికి తెలిపారు. ఈ విషయాన్ని ప్రిన్సిపల్ సరోజినీదేవి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని... ఆమె ప్రోద్బలంతోనే ర్యాగింగ్ జరుగుతోందని ఫిర్యాదు చేశారు. దీనిపై పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

 

19:06 - December 6, 2017

విశాఖ : దేశ రాజకీయాలు కుళ్లిపోయాయని... వాటిని మార్చేందుకు రాజకీయాల్లోకి కొత్తరక్తం రావాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. దోపిడీ రాజకీయాలు ఈరోజు వ్యవస్థను మార్చేశాయని ధ్వజమెత్తారు. ఎంతోకొంత మార్చాలనే తాను పాలిటిక్స్‌లోకి వచ్చానని చెప్పారు. సరదాల కోసం తాను పార్టీ పెట్టలేదని.. సమాజ మార్పుకోసమే పెట్టానని స్పష్టం చేశారు. జనసేన విలువలతో కూడిన పార్టీ అని చెప్పారు. విశాఖలో ఉత్తరాంధ్ర జనసేన సమన్వయకర్తల సమావేశం జరిగింది. దీనికి హాజరైన పవన్‌ కల్యాణ్‌... ప్రజా సమస్యలపై పోరాడటమే జనసేన లక్ష్యమన్నారు. అందుకే యువత, మహిళలు రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు.

 

18:41 - December 6, 2017

హైదరాబాద్ : బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ 61 వర్థంతి సందర్భంగా హైదరాబాద్‌లో పలువురు నివాళు లర్పించారు. ట్యాంక్‌ బండ్‌ వద్ద  అంబేద్కర్‌ విగ్రహానికి టీమాస్‌ నేతలు పూలమాలలు వేసి నివాళు లర్పించారు. రాజ్యాంగం నిర్దేశించిన ప్రకారం..సమాజంలో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు దక్కాలని టీమాస్‌  నేతలు డిమాండ్‌ చేశారు. తాను బీసీ నని చెప్పుకుంటున్న ప్రధాని మోదీ..రాజ్యాంగాన్ని సవరించి బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించేలా  ప్రయత్ని చేయాలని డిమాండ్‌ చేశారు.  తెలంగాణలో సామాజిక న్యాయం దక్కాలంటే  ప్రభుత్వాలు అంబేద్కర్‌ చూపిన మార్గాన్ని అనుసరించాలని టీమాస్‌ నేతలు అన్నారు. 

 

18:35 - December 6, 2017

భద్రాద్రి కొత్తగూడెం : మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మోర్రేడు వాగులోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన చిన్నారి మృతదేహాన్ని క్యారీ బ్యాగ్‌లో చుట్టి రాళ్ల మధ్యలో పడేసి పోయారు కొందరు వ్యక్తులు. స్ధానికుల సమాచారంతో పోలీసులు చిన్నారిని తరలించారు.  
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మోర్రేడులో దారుణం

 

18:32 - December 6, 2017

హైదరాబాద్‌ : ముషీరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. ఒకరోజు వయసున్న శిశువు మృతదేహాన్ని పాలిథిన్ కవర్‌లో చుట్టి కొందరు చెత్తకుప్పలో వదిలి వెళ్లిపోయారు. శిశువు మృతదేహాన్ని చూసి చలించినపోయిన స్ధానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృత శిశువును అక్కడి నుంచి తరలించారు. 

 

18:29 - December 6, 2017

హైదరాబాద్‌ : మెట్రో రైల్‌ ప్రాజెక్టులో అనుకోకుండా అగ్నిప్రమాదాలు జరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఉప్పల్‌లోని నాగోలు మెట్రో స్టేషన్‌లో మాక్ డ్రిల్ నిర్వహించారు. అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా అగ్నిమాపక అధికారి హరినాథ్ పర్యవేక్షణలో ఈ డ్రిల్ జరిగింది. అగ్నిప్రమాదం సంభవించినపుడు మెట్రో సిబ్బంది, ప్రయాణికులు ఎలా స్పందించాలన్న అంశంపై అధికారులు తమ విన్యాసాలతో అవగాహన కల్పించారు.


 

17:38 - December 6, 2017
17:37 - December 6, 2017
17:36 - December 6, 2017

కరీంనగర్ : జిల్లాలో కేసీఆర్ ప్రాజెక్టుల పరిశీలనకు ముందే.. స్తానికుల నుండి డిమాండ్లు వస్తున్నాయి. తమ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ...రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కంది కట్కూర్‌ గ్రామ మహిళలు మిడ్‌ మానేరు కట్టపై ఆందోళన చేపట్టారు. కంది కట్కూర్‌ గ్రామం వద్ద ప్రభుత్వం నిర్మిస్తున్న మిడ్‌ మానేరు ప్రాజెక్టుతో వ్యవసాయ భూములు ప్రాజెక్టులో మునిగిపోతున్నాయని మహిళలు ఆవేదన చెందారు. గ్రామాన్ని ఆనుకొనే ప్రాజెక్టు కట్ట ఉండడం, దానిలోకి నీరు రావడంతో విషపు పురుగులు ఇళ్లల్లోకి చొరబడుతున్నాయని గ్రామస్తులు వాపోయారు. ఈ విషయమై గతంలో ఎన్నో సార్లు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆందోళన చేపట్టామన్నారు. ఇప్పటికే సర్వం కోల్పోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని నినాదాలు చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

క్లినికల్ ట్రయల్స్ పై నివేదిక రావాలి : ఈటెల

కరీంనగర్ : క్లినికల్ ట్రయల్స్ అంశం రాష్ట్ర పరిధిలోకి లేకున్నా ఘటనలపై ఎప్పటికప్పుడు డ్రగ్ కంట్రోల్ జరరల్ ఆఫ్ ఇండియాకు తెలియజేస్తున్నామని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. జమ్మికుంట మండలం నాగంపేట జూన్ 2న నాగరాజు మృతిపై ఎఫ్ఎస్ఎల్ నివేదిక రావాల్సి ఉంది అని అయన అన్నారు. 

17:30 - December 6, 2017

విశాఖ : డీసీఐ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగులు చేపట్టిన ఆందోళన ఉధృతమవుతోంది. జీవీఎంసీ ఎదుట ఉన్న గాంధీ విగ్రహం దగ్గర ఉద్యోగులు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో ఉద్యోగులతోపాటు వెంకటేష్ కటుంబసభ్యులు పాల్గొన్నారు. తమవాడి మృతితో అయినా డీసీఐ ప్రైవేటీకరణ ఆగాలని వెంకటేష్ కుటుంబ సభ్యులు ఆకాంక్షించారు. 

 

కేసీఆర్ పర్యటనకు నిరసనల సెగ

కరీంనగర్ : కేసీఆర్ పర్యటనకు నిరసనల సెగ మొదలైంది. మిడ్ మానేరు కట్టపై కంది కట్కూర్ గ్రామస్థులు ఆందోళనక దిగారు. తమ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. 

కరీంనగర్ జిల్లాకు బయల్దేరిన కేసీఆర్

హైదరాబాద్/కరీంనగర్ : సీఎం కేసీఆర్ కరీంనగర్ పర్యటనకు బయల్దేరారు. ఈ రోజు రాత్రి నాయకులు, అధికారులతో ఆయన మాట్లాడనున్నారు. 

జగన్ పై పవన్ సంచలన వ్యాఖ్యలు

విశాఖ : వైసీపీ నేత జగన్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి చనిపోయాడాని తనే సీఎం అవుతానంటే ఎలా అని పవన్ ప్రశ్నించారు. జగన్ అంటే తనకు వ్యక్తిగతంగా వ్యతికేకత లేదని, జగన్ అధికార దుర్వినియోగంతో అడ్డగోలుగా సంపాధించారని, రాజకీయాల్లో కొంతమంది వేలకోట్లు వెనుకేసుకున్నారని వవన్ వ్యాఖ్యనించారు. 

డ్రాగా ముగిసిన ఢిల్లీ టెస్ట్

ఢిల్లీ : భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న మూడవ టెస్ట్ డ్రాగా ముగిసింది. టెస్ట్ సిరీస్ ను 1-0తో భారత్ కైవసం చేసుకుంది. వరుసగా 9 టెస్ట్ సిరీస్ లను కైవసం భారత్ చేసుకుంది. 9 టెస్టు సిరీస్ విజయాలతో ఆస్ట్రేలియా రికార్డు సమం చేసింది.

16:18 - December 6, 2017

కరీంనగర్ : సీఎం కేసీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. సాయంత్రం తీగలగుట్టపల్లిలోని కేసీఆర్‌ భవన్‌కు హెలిక్యాప్టర్‌లో చేరుకోనున్నారు.  అక్కడే రాత్రికి బస చేయనున్నారు. రేపు, ఎల్లుండి కాళేశ్వరం, మేడిగడ్డ తదితర ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు. సీఎం రాక సందర్భంగా కేసీఆర్ భవన్ వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం వీడియోలో చూద్దాం....

 

16:12 - December 6, 2017

విశాఖ : పోర్ట్ కళావాణి స్టేడియంలో జనసేన కార్యకర్తల సమావేశం జరగనుంది. ఈ కార్యక్రమానికి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హాజరై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయనున్నారు. తమ అధినేత అడుగుజాడల్లో నడుస్తామంటున్న జనసేన కార్యకర్తలతో టెన్ టివి ఫేస్ టూ ఫేస్ నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

16:05 - December 6, 2017

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌ నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు పంపింది. ఈనెల 15న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. 2018 డీఎస్సీ ద్వారా 12,370 టీచర్‌ పోస్టుల భర్తీకి మంత్రి గంటా షెడ్యూల్‌ ప్రకటించారు. జూన్‌ 12 నాటికి ఉపాధ్యాయులకు పోస్టింగ్‌లు ఇవ్వాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. డీఎస్సీ ప్రకటన కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఏపీ నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2018 డీఎస్సీపై  మంత్రి గంటా షెడ్యూల్‌ ప్రకటించారు. మొత్తం 12వేల 370 టీచర్‌ పోస్టుల భర్తీకి ఈనెల 15న నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది జూన్‌12 నాటికి టీచర్‌ పోస్టింగులు ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈనెల 26 నుంచి ఫిబ్రవరి 2 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు అందుబాటులో ఉంటాయన్నారు. దరఖాస్తులకు చివరి తేది ఫిబ్రవరి 8 అని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

పీఆర్పీని మూసేయడం బాధ కల్గించింది : పవన్

విశాఖ : పీఆర్పీని మూసేయడం నాకు బాధ కలిగించిందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. పీఆర్పీని దెబ్బతీసిందెవరో నాకు తెలుసునని, చిరంజీవికి ద్రోహం చేసిన వారికి చెప్పుతో బుద్ధి చెబుతానని పవన్ అన్నారు. 

జనసేన విలువలతో కూడుకున్న పార్టీ : పవన్

విశాఖ : జనసేన విలువలతో కూడుకున్న పార్టీ అని ఏ ఒక్క కులానికి సంబంధించిన పార్టీ కాదని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రాజకీయాల్లోకి కొత్త రక్తం రావాలని ఆయన తెలిపారు. 

15:59 - December 6, 2017

రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని వేములవాడ జ్యూడీషియల్‌ రిమాండ్‌లో చనిపోయిన కడమంచి వెంకటేష్‌ మృతదేహానికి అధికారులు రీపోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. ఆగస్ట్‌ 3న వెంకటేష్‌పై పోలీసులు తప్పుడు కేసు బనాయించడంతో పాటు చిత్రహింసలకు గురిచేయడం వల్లే తన భర్త చనిపోయాడని మృతుడి భార్య హైకోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాలతో వెంకటేష్‌ మృతదేహానికి అధికారులు రీ పోస్ట్‌మార్టం చేపట్టారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

15:56 - December 6, 2017

హైదరాబాద్ : భాగ్యనగరంలో పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్న సెల్‌ టవర్స్‌ వలన రేడియేషన్‌ విడుదలై జీవరాశి కి  అనేక సమస్యలు తలెతున్నాయి. సెల్‌ టవర్ల ప్రభావం వల్ల ఇప్పటికే  కొన్ని పక్షులు కనుమరుగయ్యాయి. ఇక మానవాళికి ఈ రేడియేషన్‌ వలన క్యాన్సర్‌ లాంటి ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు. విచ్చలవిడిగా వెలుస్తున్న సెల్‌ టవర్స్‌ను అదుపు చేయడంలో ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ ఏం చేస్తుందనేది ఇప్పుడు ప్రశార్ధకంగా మారింది. 

భాగ్యనగరంలో సుమారు కోటి మంది జనాభా నివసిస్తున్నారు. అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సులకు  వేదికగా నిలిచింది. ఇలాంటి హైదరాబాద్ నగరం ఇప్పుడు సెల్ టవర్ కోరల్లో చిక్కుకుంది. ఎక్కడ చూసినా  సెల్ టవరే దర్శనమిస్తున్నాయి. దీంతో నగర వాసులు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న దుస్థితి నగరంలో చోటుచేసుకుంది. సెల్‌ టవర్ల నుంచి వెలువడుతున్న రేడియేషన్ సమస్యను ఇటీవల లోకాయుక్త సుమోటోగా స్వీకరించింది. దాని నుంచి వెలువడుతున్న రేడియో ధార్మిక కిరణాలు కేన్సర్‌కు కారణమవుతున్నాయని గుర్తించింది. 

సెల్‌టవర్‌ నుంచి వెలువడుతు న్న రేడియేషన్ చుట్టు పక్కల ప్రజలపై, పశు, పక్ష్యాదులపై తీవ్రప్రభావం చూపుతుందంటున్నారు డాక్టర్లు. రాష్ట్ర  ప్రభుత్వాలు,కేంద్ర ప్రభుత్వాలు దీనిపై స్పందిచాలన్నారు....మానవాళికి హాని  కలిగించే ఇలాంటి సెల్ టవర్స్ కు అనుమతులు ఇవ్వకుండా కఠినంగా వ్యవహరించాలన్నారు...జన సంద్రంలో కాకుండా దూర ప్రాంతంలో ఇలాంటి టవర్స్ ను ఏర్పాటు చేసుకోవాలన్నారు.లోకాయుక్త  ఈ సెల్ టవర్స్ సమస్యను సుమెటోగా స్వీకరించడం నిజంగా శుభపరిణామన్నారు.

జనావాసాల మధ్య విచ్చలవిడిగా సెల్‌ టవర్స్‌కి ప్రభుత్వం అనుమతులివ్వడంపై ప్రజలు మండిపడుతున్నారు. వీటిని అదుపు చేయడంలో ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ విఫలమయ్యాయని ఆరోపిస్తున్నారు. అక్రమంగా వెలసిన సెల్‌ టవర్లపై లోకా యుక్తా సుమోటోగా కేసును స్వీకరించడం నిజంగా గొప్ప విషయమని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

 

 

రాజకీయాలకు కొత్త వ్యవస్థ కావాలి : పవన్

విశాఖ : రాజకీయాలకు కొత్త వ్యవస్థ కావాలి అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. దోపిడీ రాజకీయాలు వ్యవస్థను మార్చేశాయని, రాజకీయ ప్రక్షాళనకు వచ్చా అని స్పష్టం చేశారు. తన కుటుంబం చాలా పెద్దదని, సరదాల కసం పార్టీ పెట్టలేదని, సత్యాగ్రహి సినిమా తీసి రాజకీయాలు మార్చుదామని అనుకున్నా సినిమా వల్ల మార్పు రాదని ఆపేశా అని పవన్ తెలిపారు. 

15:53 - December 6, 2017

హైదరాబాద్ : తెలంగాణలో పుట్టి పెరిగినవారిని ఆంధ్రకు వెళ్లి పనిచేయమనడం దారుణమని బీఎస్ ఎన్ ఎల్ ఎంప్లాయిస్‌ యూనియన్‌ తెలంగాణ సర్కిల్‌ ప్రధాన కార్యదర్శి సంపత్‌రావు అన్నారు. ఈ విషయమై వరంగల్‌ ఎంపీ దయాకర్‌ రావు, కరీంనగర్‌ ఎంపీ వినోద్‌ కుమార్‌లకు ఫిర్యాదు చేశామన్నారు. బీఎస్ ఎన్ ఎల్ యజమాన్యం తన వైఖరి మార్చుకోకపోతే ఉద్యమబాట పట్టాల్సి వస్తుందని సంపత్‌రావు హెచ్చరించారు. 

 

గుంటూరు ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో ర్యాగింగ్..

గుంటూరు : జల్లా ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో ర్యాగింగ్ చేస్తున్నారని మహిళా చైర్ పర్సన్ నన్నపనేనికి జూనియర్ నర్సింగ్ విద్యార్థులు ఫిర్యాదు చేశారు. రాత్రుళ్లు నిద్రపోనివ్వకుండా వేధిస్తున్నారని, దొరబాబు అనే సీనియర్ నర్సింగ్ విద్యార్థి తన చేత బలవంతంగా ఆల్క హాల్ తాగించాడని ఓ జూనియర్ విద్యార్థి వాపోయాడు. పిన్సిపాల్ సరోజినీదేవి దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

15:49 - December 6, 2017

అదిలాబాద్‌ : జిల్లాలో విషాదం జరిగింది. జిల్లాలోని బట్టిసావర్గం వద్ద రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. ఇవాళ ఉదయం టోలర్స్‌ కాలనీకి చెందిన కల్యాణి (21), బట్టసావర్గం దుబాగుడకు చెందిన ముకేష్‌ (25)లు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. 

 

15:45 - December 6, 2017

హైదరాబాద్ : బ్లాక్‌డే సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామన్నారు సౌత్‌జోన్‌ డీసీపీ సత్యనారాయణ. భద్రత కోసం కేంద్ర, రాష్ట్ర బలగాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత ఏర్పాటు చేశామంటున్న డీసీపీ సత్యనారాయణతో టెన్ టివి ఫేస్‌ టు ఫేస్‌ నిర్వహించింది. అదనంగా 10వేల సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని చెప్పారు. 

వెంకటేష్‌ మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహిస్తున్న అధికారులు

రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని వేములవాడ జ్యూడీషియల్‌ రిమాండ్‌లో చనిపోయిన కడమంచి వెంకటేష్‌ మృతదేహానికి అధికారులు రీపోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. ఆగస్ట్‌ 3న వెంకటేష్‌పై పోలీసులు తప్పుడు కేసు బనాయించడంతో పాటు చిత్రహింసలకు గురిచేయడం వల్లే తన భర్త చనిపోయాడని మృతుడి భార్య హైకోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాలతో వెంకటేష్‌ మృతదేహానికి అధికారులు రీ పోస్ట్‌మార్టం చేపట్టారు. 

 

15:39 - December 6, 2017

విశాఖ : బీజేపీ, టీడీపీకు పొలిటికల్ అకౌంటబిలిటీ లేకుండా పోయిందని జనసేన అధినేత పవన్‌ విమర్శించారు. గత ఎన్నికల్లో హామీలను నిలబెట్టుకోలేని పార్టీకలు 2019 ఎన్నికల్లో ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ టీడీపీకు వ్యతిరేకంగా జనసేన బరిలోకి దిగుతుందని పవన్ తెలిపారు.     

15:21 - December 6, 2017

విశాఖ : డీసీఐ ఉద్యోగుల పోరాటానికి జనసేన మద్దతు ఇస్తుందని పవన్‌ స్పష్టం చేశారు. లాభాల్లో ఉన్న డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ను అమ్మేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తప్పుపట్టారు. కొందరు వ్యక్తులను బాగు చేయడానికే సంస్థను ప్రైవేట్ పరం చేస్తున్నారని పవన్‌ విమర్శించారు. 

15:13 - December 6, 2017

కృష్ణా : విజయవాడలో మాజీ రౌడీషీటర్‌ సుబ్బు దారుణ హత్యకు గురయ్యాడు. ప్రత్యర్థులు సుబ్బును కత్తులతో పొడిచి కిరాతకంగా చంపారు. టీడీపీ నాయకుడు కాంట్రగడ్డ శ్రీనేయే ఈ హత్య చేయించాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. రెండేళ్ల క్రితం మృతుడి అన్నయ్య సత్యనారాయణ కూడా హత్యకు గురయ్యాడు. రౌడీ షీటర్‌ సుబ్బు హత్యతో విజయవాడ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మృతదేహాన్ని పోలీసులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇది పొలిటికల్‌ హత్యా కాదా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

14:46 - December 6, 2017

ఇటీవలి కాలంలో భార్యాభర్తలు విడాకులు తీసుకోవడం అధికమయ్యాయి. రోజుకు రోజకు విడాకుల కేసులు ఎక్కువయాయయి. ఇదే అంశంపై నిర్వహిచిన మానవి మైరైట్ కార్యక్రమంలో లాయర్ పార్వతి పాల్గొని, మాట్లాడారు. 
ఆ వివరాలు ఆమె మాటల్లోనే...
'భార్యాభర్తలు విడాకులు తీసుకోవడం అధికమయింది. హైదరాబాద్ నగరంలో రోజుకు సగటున 50 విడాకుల కేసులు దాఖలు అవుతున్నాయి. అనేక కారణాల వల్ల విడాకులు తీసుకుంటున్నారు. వీటిలో ప్రధానంగా ఆర్థిక పరమైన కారణాలతో విడాకులు తీసుకుంటున్నారు. మనీ డిమాండ్స్, కట్నం కోసం వేధింపులతో భార్యలు విడాకులు కోరుతున్నారు. 1961 లో వరకట్నం నిషేధం చట్టం వచ్చింది. అయినా ఇప్పటికీ వరకట్నం పేరుతో మహిళలను భర్తలు వేధిస్తున్నారు. విడాకులు తీసుకోవడానికి రెండో కారణం ఫిజికల్ రిలేషన్స్, మూడో కారణం  సంసారం పట్ల అవగాహన రాహిత్యం వల్ల విడాకులు తీసుకుంటున్నారు. వీటితోపాటు భార్యభర్తల మధ్య ఇరువైపుల నుంచి తల్లిదండ్రుల జోక్యం అధికమవ్వడం, మెంటల్ గా ప్రాబ్లమ్స్ ఎక్కువ కావడం, ఈగో ప్రాబ్లమ్, స్త్రీ, పరుష వివక్షత వల్ల కూడా విడాకులు కేసులు నమోదు అవుతున్నాయి. వివాహేతర సంబంధాలు ఎక్కువ అవుతన్నాయి'. అని తెలిపారు. భార్యభర్తలు ఒకరినొకరు అర్థం  చేసుకుని చక్కటి సంసార జీవితాన్ని గడపాలని సూచించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

ఆర్బీఐ ద్రవ్యపరపతి సమీక్ష

ముంబై : ఆర్బీఐ ద్రవ్యపరపతి విధానంపై సమీక్ష చేసింది. అర్బీఐ కీలక వడ్డిరేట్లను యథాతథంగా కొనసాగిస్తూ రెపో రేటు 6 మథాతథంగా ఉంచింది. 

ప్రధానికి జనసేనాని లేఖ...

ఢిల్లీ : ప్రధాని మోడీకి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ లేఖ రాశారు. విశాఖ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ సమస్యలపై 5 పేజీల లేఖ ప్రధానికి రాశారు. డీసీఐని ప్రైవేటీకరించొద్దని పవన్ లేఖలో కోరాడు. 

నేను ప్రజల పక్షం : పవన్

విశాఖ : నేను ఏ పార్టీ పక్షం కాదు ప్రజల పక్షం అని జనసేన అధ్యక్షుడు పవన్ అన్నారు. పదవులు ఉంటేనే సమస్యలు పరిష్కరిస్తామన్న విధానానికి స్వస్తిపలకాలని, రైలు ప్రమాదంలో జరిగితే నైతిక బాధ్యత వహిస్తూ లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేశారని పవన్ గుర్తు చేశారు. రాజకీయాల కోసం సొంత కుటుంబాన్ని వదిలిపెట్టా అని ఆయన తెలిపారు.

ప్రేమ జంట ఆత్మహత్య

ఆదిలాబాద్‌ : జిల్లాలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. జిల్లాలోని మావల మండలం సావర్‌గామ్‌లో బుధవారం ఈ విషాదం చోటు చేసుకుంది. రైలు కింద పడి ప్రేమికులు బలవన్మరణం చేసుకున్నారు. మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతులను ముఖేష్, కల్యాణిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

గెలుపు దిశగా భారత్

ఢిల్లీ : శ్రీలకంతో జరుగుతున్న మూడవ టెస్టులో భారత్ విజయం దిశగా పయాణిస్తుంది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 536, రెండవ ఇన్నింగ్స్ లో 246 పరుగులకు డిక్లేర్ చేసింది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్ లో 373 పరుగులకు అలౌట్ అయ్యింది. రెండవ ఇన్నింగ్స్ లో ప్రస్తుతం 5 వికెట్లకు 193 పరుగులు చేసింది. శ్రీలంక విజయానికి ఇంక 215 పరుగులు అవసరం. ప్రస్తుతం ఆ జట్టు చేతిలో 5 వికెట్లు ఉన్నాయి. 

13:25 - December 6, 2017

బీజేపీ ఓటమి విశాఖ నుంచే : పవన్

విశాఖ : డీసీఐ ఉద్యోగులకు మద్దతుగా ప్రధానికి లేఖ రాశా అని జనసేన అధ్యక్షుడు పవన్ అన్నారు. డీసీఐను ప్రవేటీకరిస్తే బీజేపీకి మొదటి ఓటమి విశాఖ నుంచే మొదలవుతుందని ఆయన అన్నారు. వెంకటేశ్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలవాలని, వారి కుటుంబానికి ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని కోరారు. 

13:09 - December 6, 2017
13:07 - December 6, 2017

విశాఖపట్టణం : మళ్లీ జనసేనాన్ని గర్జించారు. పాలకుల విధానాలపై..ప్రజా సమస్యలపై నిలదీశారు. ‘జనం కోసం జైలుకెళ్తాను...లాఠీ దెబ్బలను తింటాను..మెనిఫెస్టోలను పెట్టిన అంశాలను బాబు..మోడీ అమలు చేయాలి...పదవులపై తనకు ఆశలేదని..అధికారానికి అనుభవం కావాలి..తాను కోపగించుకుంటే ఎలా ఉంటుందో చూపించగలను..సమస్యను శాంతియుతంగా పరిష్కారమయ్యేందుకు కృషి చేస్తా...తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు...ఏ పార్టీ మద్దతివ్వ'..అంటూ పవన్ కళ్యాణ్ గళమెత్తారు. గత కొంత కాలంగా వస్తున్న విమర్శలకు పవన్ సమాధానం చెప్పినట్లైంది.

గత కొన్ని రోజులుగా డీసీఐ ఉద్యోగుల ఆందోళనకు మద్దతు పలికేందుకు..ఆత్మహత్య చేసుకున్న వెంకటేష్ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన విశాఖ జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా ఉద్యోగుల ఆందోళనకు మద్దతు పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో 'పవన్' మాట్లాడారు. ఈ విషయంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లెటర్ రాస్తున్నట్లు, ఉద్యోగులకు మద్దతుగా రాయనున్నట్లు వెల్లడించారు. ప్రైవేటీకరిస్తే బీజేపీకి తొలి దెబ్బ విశాఖ నుండి జరుగుతుందన్నారు. తాను ఏ పార్టీకి మద్దతివ్వనని స్పష్టం చేశారు.

డీసీఐ ఉద్యోగుల ఆందోళనకు మద్దతు తెలియచేస్తున్నట్లు, వెంటనే దీనిపై స్పందించాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. చనిపోయిన వెంకటేష్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నష్టాల్లో ఉన్న వాటిని ప్రైవేటు చేయడంలో తప్పు లేదని, లాభాల్లో ఉన్న డీసీఐను ప్రైవేటీకరణ చేయాలని అనుకోవడం దారుణమన్నారు. డీసీఐకి పలు ప్రభుత్వ రంగ సంస్థలే భారీగా బకాయిలు పడి ఉన్నాయని,

సమస్య పరిష్కారానికి టిడిపి, బిజెపి ఎంపీలు ప్రయత్నించాలని సూచించారు. బాధలు పంచుకోవడానికి..నైతిక మద్దతు ఇవ్వడానికి ఇక్కడకు వచ్చినట్లు తెలిపారు. తాను గతంలో బీజేపీ, టీడీపీ పార్టీకి ప్రచారం చేయడం జరిగిందని, కానీ ప్రజా సమస్యలపై స్పందించని పార్టీలు..నేతలను నిలదీయడానికి సిద్ధమని ఆనాడే ప్రకటించానన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించలేని టిడిపి, బిజెపిలకు వచ్చే ఎన్నికల్లో ఓట్లడిగే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు.

రాష్ట్రం విడిపోయి నాలుగేళ్లైనా ఇంత వరకు అనేక సమస్యలు పరిష్కారం కాలేదని...ప్రజలకు అండగా ఉంటానని..సమస్యలపై కలిసి పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. కడుపు మండి మాట్లాడుతున్నానని..నాలుగు సంవత్సరాలు ఓపిక పట్టామని..ఏదో అద్భుతం జరుగుతుందని ఊహించడం జరిగిందన్నారు. విభజన సమస్యలు ఇంకా వెంటాడుతున్నాయని తెలిపారు. సమస్యల కోసం అండగా ఉంటానని..పోరాటం చేస్తానని స్పష్టం చేశారు.

బీజేపీ...టీడీపీ..కాంగ్రెస్ ఏ పక్షం తాను కాదని..తాను తెలుగు రాష్ట్రాల ప్రజల పక్షమన్నారు. దేశానికి బలమైన నాయకులు కావాలని, ప్రజల కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధమన్నారు. తాను ఏ పైరవీ కోసం ఇక్కడకు రాలేదని..సమస్యను శాంతియుతంగా పరిష్కారం అయ్యేందుకు కృషి చేస్తానన్నారు. బీజేపీ ఎంపీలు, టిడిపి ఎంపీలు, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఓటు బ్యాంకు రాజకీయాలు చేయవద్దని, ప్రజలు నష్టం కలిగే ఏ పార్టీకి తాను మద్దతివ్వనని, వచ్చే ఎన్నికల్లో ప్రజల పక్షాన ఉండే పార్టీకే తమ మద్దతు ఉంటుందన్నారు. బుగ్గకారులో తిరేగేందుకు యువత ఓట్లు వేయాలా ? అని ప్రశ్నించారు. ప్రతొక్క ఎంపీని గుర్తు పెట్టుకుంటామని పేర్కొన్నారు. జనసేన..పవన్ కళ్యాణ్ తప్పు చేస్తే నిలదీసే హక్కు ప్రజలకు ఉందన్నారు.

పవన్ స్పీచ్ వినాలంటే వీడియో క్లిక్ చేయండి. 

డీసీఐని ప్రైవేట్ పరం చేయడం సరికాదు : పవన్

విశాఖ : లాభాల్లో ఉన్న డీసీఐను ప్రైవేట్ పరం చేయడం సరికాదని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. నష్టాలను సాకుచూపి ప్రైవేట్ వ్యక్తులకు  ధారాదత్తం చేయొద్దని, డీసీఐ ఎదుగుదల వెనుక వెయ్యిమంది ఉద్యోగులు ఉన్నారని, మూడున్నరేళ్లు ఓపిక పట్టామని ఆయన తెలిపారు. ఈ రోజు వరకు కూడా విభజన సమస్యలు వెంటాడుతునే ఉన్నాయని ఆయన అన్నారు. 

12:45 - December 6, 2017

హైదరాబాద్ : డా.బి.ఆర్.అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కేర్ యువజన సంఘం ఆధ్వర్యంలో 5కె రన్ నిర్వహించారు. పీపుల్స్ ప్లాజా నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ఈ రన్ కొనసాగింది. శాసనమండలి విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పిడమర్తి రవి, ఓయూ వీసీ, విద్యార్థులు పాల్గొన్నారు.

బాబా సాహేబ్ అంబేద్కర్ 61వ వర్ధంతి సందర్భంగా పలువురు నివాళులర్పించారు. ట్యాంక్ బండ్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహానికి టీమాస్ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగం నిర్ధేశించిన ప్రకారం సమాజంలో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు దక్కాలని టీ మాస్ నేతలు పేర్కొన్నారు. తాను బీసీ అంటూ చెప్పుకుంటున్న ప్రధాని మోడీ రాజ్యాంగాన్ని సవరించి బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించేలా ప్రయత్నం చేయాలని ప్రొ.కంచె ఐలయ్య డిమాండ్ చేశారు. తమిళనాడులో ఎలాగో 69 శాతం రిజర్వేషన్లు ఉన్నాయో ఇక్కడ ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని అమలు చేసి అన్ని శూద్ర కులాలకు వాటి వాటి జనాభా ప్రాతిపదికన ఇవ్వాలని..రాజ్యాంగంలో వాటా...ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

తెలంగాణలో సామాజిక న్యాయం దక్కాలంటే అంబేద్కర్ చెప్పిన మార్గాన్ని ప్రభుత్వం నడుచుకోవాలని జాన్ వెస్లీ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న ఖాళీల పోస్టులను భర్తీ చేయాలని, 93 శాతం నిధులు కేటాయించి వాటికనుగుణంగా ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. సమానమైన వాటా దక్కడం కోసం టీమాస్ నేతృత్వంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. 

డీసీఐ ఉద్యోగులకు మద్దతు వచ్చా : పవన్

విశాఖ : డీసీఐ ఉద్యోగులకు మద్దతు తెలిపేందుకు వచ్చా అని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. మీ బాధలు పంచుకునేందుకు జనసేన ఉందని ఆయన అన్నారు. 

డీసీఐ ఉద్యోగుల ఆందోళన పాల్గొన్న పవన్ కల్యాణ్

విశాఖ : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ డీసీఐ ఉద్యోగుల ఆందోళనలో పాల్గొన్నారు. డీసీఐ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ డీసీఐ కార్యాలయం సీ హార్స్ జంక్షన్ ఉద్యోగుల రిలే దీక్షలు ఆయన మద్దతు తెలుపుతూ ఆత్మహత్య చేసుకున్న వెంకటేశ్ కు పవన్ నివాళి అర్పించారు. 

విజయవాడలో దారుణం

విజయవాడ : మాచవరంలో దారుణ హత్య జరిగింది. వేమురి సుబ్రహ్మణ్యాన్ని కొంత మంది దుండగులు హత్య చేశారు. అయ్యప్ప మాలలో ఉన్న వేమురి సుబ్రహ్మణ్యాన్ని కత్తులతో నరికిచంపారు. టీడీపీ యువనేతకు అనుచరుడిగా ఉన్నారు.

బీసీ అభివృద్ధికి ప్రణాళిక...

కృష్ణా : బీసీల్లో వెనకబడిన కులాల అభివృద్ధి, సంక్షేమానికి రూ.60లక్షలతో కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తున్నామని బీసీ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ నాగభూషణం అన్నారు. 32 కులాల అభివృద్ధి సంక్షేమానికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశామని, రాష్ట్రవ్యాప్తంగా సర్వే పూర్తి చేశామని ఆయన తెలిపారు. 

12:15 - December 6, 2017

విశాఖపట్టణం : డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ను ప్రైవేటీకరించవద్దంటూ ఉద్యోగులు చేపడుతున్న ఆందోళన తీవ్రతరమౌతోంది. గత నెల 27వ తేదీ నుండి రిలే నిరహార దీక్షలు చేపడుతున్న సంగతి తెలిసిందే. దురదృష్టవశాత్తు తీవ్ర మనస్థాపానికి గురైన డ్రెడ్జింగ్ కార్పొరేషన్‌ ఉద్యోగి వెంకటేష్ ఆత్మహత్య చేసుకోవడంతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆందోళన చేపడుతున్న ఉద్యోగులతో మాట్లాడడానికి జిల్లాకు వచ్చారు. ఆత్మహత్య చేసుకున్న వెంకటేష్ కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు.

ఈ సందర్భంగా ఆందోళన చేపడుతున్న ఉద్యోగులతో టెన్ టివి మాట్లాడింది. ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి వెళ్లే అవకాశం ఉందని ఉద్యోగులు పేర్కొంటున్నారు. లాభాల్లో ఉన్న డీసీఐ ఎలా ప్రైవేటీకరిస్తారని ప్రశ్నిస్తున్నారు. మరి జనసేనాని ఎలా స్పందిస్తారు ? కేంద్రానికి ఎలాంటి అల్టిమేటం..డిమాండ్లు ఇస్తారనేది వేచి చూడాలి. 

12:08 - December 6, 2017

పవన్ ఏ సమస్య తీసుకొచ్చిన పరిష్కరిస్తాం : గంటా

విశాఖ : ప్రభుత్వం దృష్టికి పవన్ కల్యాణ్ ఏ సమస్య తీసుకొచ్చినా పరిష్కరించేందుకు సిద్ధమని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. డీసీఐ ప్రైవేటీకరణ అంశాన్ని సీఎం దృష్టి తీసుకెళ్తామని, అలాంటి సంస్థలను కాపాడుకోవాలిసన అవసరం ఉందని ఆయన తెలిపారు. 

సీబీఐటీ ఇంజినీరింగ్ విద్యార్థుల ఆందోళన

రంగారెడ్డి : గండిపేట సీబీఐటీ ఇంజనీరింగ్ కళాశాలలో ఫీజుల పెంపును నిరసిస్తూ విద్యారులు ఆందోళనకు దిగారు. విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేస్తున్నారు. 

11:39 - December 6, 2017

ప్రస్తుతం ఉన్న జీవన విధానంలో చాలా మంది లావుగా ఉంటున్నారు. ఆధునిక ప్రపంచంలో చాలా ఉద్యోగాలు కూర్చుని చేసేవిగా ఉన్నాయి. ఎప్పుడు కూర్చోని పని చయడం వల్ల మానసికంగా మాత్రమే పని చేయగలము కానీ శరీరకంగా చేయలేము. అంతే కాక వెన్నుముక నొప్పి కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఇటువంటి వారు రోజు 2 నుంచి 3 కిలోమీటర్లు నడవడం వల్ల శరీరానికి మంచి వ్యాయమం అవుతుంది. అంతేకాక మనం లిప్ట్ లో కాకుండా మెట్ల ద్వారా వెళ్తే బాగుటుంది. కానీ కొంత మంది కిరాణ షాపు వెళ్లలాన్న వాహనాన్ని వాడుతున్నారు. అలా కాకుండా నడిచి వెళ్తే శరీరానికి ఎంతో మంచింది. మనిషి నడవడం వల్ల శరీరంలో ఉండే కొవ్వు కరుగుతుంది. తిన్నా ఆహరం తొందరగా జీర్ణం అవుతుంది. 

తీవ్ర వాయుగుండంగా మారిన అల్పపీడనం

విశాఖ : బాగళఖాతంలో ఏర్పాడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ తెలిపింది. వాయగుండం ప్రస్తుతం దక్షిణ అండమాన్ కు చేరువగా కొనసాగుతుంది. దీని కారణంగా రేపు, ఎల్లుండి కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను ఐఎండీ హెచ్చరించింది. 

అడిలైట్ టెస్ట్ లో ఇంగ్లాండ్ ఓటమి

యాషెష్ సిరీస్ : అడిలైడ్ లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న యాషెష్ సిరిస్ రెండవ టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఆస్ట్రేలియా 120 పరుగులతో విజయం సొంతం చేసుకుంది. ఐదు టెస్టులో సిరిస్ లో  ఆస్ట్రేలియా 2-0 ఆధ్యికంలో ఉంది. 

11:31 - December 6, 2017

విశాఖపట్టణం : ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మధ్యాహ్నానికి తీవ్రవాయుగుండంగా మారనుంది. దీని ప్రభావంగా కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. మత్స్యకార్మికులు ఎలాంటి పరిస్థితుల్లో సముద్రంలోకి వెళ్లవద్దని సూచించింది. ప్రస్తుతం దక్షిణ అండమాన్ కు చేరువలో పయనిస్తున్న వాయుగుండం సోమవారం మధ్యాహ్ననికి కాకినాడ తీరం దాటే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే కోస్తాంధ్రలో వాతావరణం మారిపోయింది. 

11:19 - December 6, 2017
11:14 - December 6, 2017

విశాఖపట్టణం : డ్రెడ్జింగ్ కార్పొరేషన్ లో జరగుతున్న పరిణామాలపై సినీ నటుడు, జనసేన అధినేత 'పవన్ కళ్యాణ్' ఎలా స్పందిస్తారనేది ఉత్కంఠగా మారింది. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా ఆయన నేడు విశాఖపట్టణానికి చేరుకున్నారు. ఎయిర్ పోర్టుకు భారీగా అభిమానులు చేరుకుని పవన్ చూసేందుకు ఎగబడ్డారు. ఎయిర్ పోర్టు నుండి నేరుగా ఆయన పార్క్ హోటల్ కు చేరుకున్నారు. 11.00-11.30 గంటల మధ్యలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఉద్యోగులు చేపడుతున్న ఆందోళనకు సంఘీభావం వెల్లడించనున్నారు. అనంతరం ఆత్మహత్య చేసుకున్న డ్రెడ్జింగ్ ఉద్యోగి కుటుంబాన్ని 'పవన్' పరామర్శించనున్నారు.

ప్రభుత్వ రంగంలోని డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(డీసీఐఎల్‌)ను పూర్తిగా ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రం పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. దీనితో అక్కడ పనిచేస్తున్న కార్మికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రైవేటు పరం చేయవద్దంటూ గత కొన్ని రోజులుగా కార్మికులు ఆందోళన చేపడుతున్నారు. 

11:10 - December 6, 2017

అనంతలో సాగుతున్న జగన్ ప్రజా సంకల్పయాత్ర

అనంతపురం : వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేస్తున్న జగన్ ప్రజా సంకల్ప యాత్ర నేడు కొట్టాలపల్లి నుంచి ప్రారంభమౌతుంది. నేడు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి జగన్ పూల మాలవేసి నివాళులర్పించారు. జగన్ యాత్ర నాగలపురం క్రాస్, గంజకుంటపల్లి మీదుగా తరిమెల వరకు కొనసాగుతుంది. 

11:01 - December 6, 2017

వివాదాలతో వాయిదా పడుతు వస్తున్న సంజయ్ లీలా భన్సాలీ పద్మావతి న్యూఇయర్ విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. అప్పటికి వివాదాలు వీడకుంటే సంక్రాంతి వరకైనా విడుదల చేయాలని పట్టుదలతో ఉంది. అయితే ఈ మూవీ డిసెంబర్ 1 విడుదల కావాల్సింది ఉంది కానీ ఇంక సెన్సార్ నుంచి అనుమతి రాకపోవడం, సినిమా విడుదలపై ఓ వర్గం ప్రజలు ఆందోళన చేస్తుండడం, కొన్ని రాష్ట్రలో పద్మావతి పై నిషేధం వింధిండం వల్ల డిసెంబర్ 1న విడుదల కాలేదు. గుజరాత్ ఎన్నికలు ముగిసిన తర్వాత, సెన్సార్ అనుమతి వచ్చిన వెంటనే విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ చిత్రంలో రణ్ వీర్ సింగ్, షాహిద్ కపూర్, దీపిక పదుకొణె నటించారు. 

విశాఖలో పవన్

విశాఖ : జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. ఆత్మహత్య చేసుకున్న డీసీఐ ఉద్యోగి వెంకటేశ్ కుటుంబాన్ని ఆయన పరామర్శంచనున్నారు. ప్రైవేటీకరణపై పోరాడుతున్న ఉద్యోగులకు పవన్ మద్దతు ప్రకటించనున్నారు. అనంతరం  ఉత్తరాంధ్ర జనసేన సమన్వయకర్తలతో సమావేశం కానున్నారు. 

మహారాష్ట్రలో భారీ ఎన్ కౌంటర్

ముంబై : మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా జలగనూర్ పీఎస్ పరిధిలోని కల్లేడ్ అటవీప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఏడుగురు మావోయిస్టులు చనిపోయారు. 

10:27 - December 6, 2017

హైదరాబాద్ : డిసెంబర్ 6వ తేదీ సందర్భంగా నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రధానంగా పాతబస్తీపై దృష్టి కేంద్రీకరించ అక్కడ భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 60 సమస్యత్మాక ప్రాంతాలను గుర్తించారు. అందులో పది ప్రాంతాలు అతిసమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. 3500 సిబ్బంది భద్రతను పర్యవేక్షిస్తున్నారు. 30 మంది అనుమానితులను సౌత్ జోన్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ర్యాలీలు, సభలపై నిషేధం విధించిన పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. 

అయోధ్యలో భారీ బందోబస్తు...

అయోధ్య : డిసెంబర్ 6న పురస్కరించుకుని అయోధ్య నగరంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. 

జగన్ పాదయాత్ర...

అనంతపురం : వైఎస్ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర కొనసాగుతోంది. కొట్టాలపల్లి నుండి జగన్ పాదయాత్ర ప్రారంభమైంది. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నాగలాపురం క్రాస్, గంజకంట పల్లి మీదుగా తరిమెల వరకు పాదయాత్ర కొనసాగనుంది. 

10:14 - December 6, 2017

విశాఖపట్టణం : జనసేనాని పవన్ కళ్యాణ్ నగరానికి చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో చేరుకున్న పవన్ చూసేందుకు అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. జనసేనానికి సంబంధించిన పార్టీ కీలక నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎయిర్ పోర్టు బయట వేచి ఉన్న అభిమానులకు 'పవన్' అభివాదం చేస్తూ వెళ్లారు. విశాఖ డ్రెడ్జింగ్ కార్పొరేషన్‌ ఉద్యోగి కుటుంబాన్ని పవన్ పరామర్శించనున్నారు. తరువాత పశ్చిమగోదావరి జిల్లా ఆక్వా ఫుడ్ పార్క్ బాధితులతో భేటీ కానున్నారు. ఈనెల 8న ఫెర్రీ బోట్ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబ సభ్యులను ఒంగోలు వెళ్లి పరామర్శిస్తారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధి మురళి కుటుంబాన్ని కూడా పవన్ పరామర్శించనున్నారు.

పార్టీకి సంబంధించిన సమన్వయం..పార్టీపై వస్తున్న విమర్శలకు ఈ పర్యటనతో పవన్ సమాధానం చెప్పనున్నారు. తొలి దశలో సమస్యలపై అధ్యయనం..పరిశీలన..అవగాహన..ప్రభుత్వాలతో చర్చలు..అనంతరం పోరాటం...చేస్తామని పవన్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. నిన్న..మొన్నటి వరకు జిల్లాల కన్వీనర్లు..పార్లమెంట్ నియోజవకర్గ ఇన్ ఛార్జీలను జనసేన నియమించుకున్న సంగతి తెలిసిందే. ప్రజా సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానంపై పవన్ ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తోంది. విశాఖ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ను ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తుండడంతో కార్మికులు ఉద్యమాలు చేస్తున్నారు. ఆర్డర్లు ఇవ్వకుండా నిర్వీర్యం చేస్తుండడంతో కార్పొరేషన్ భవిష్యత్ పై ఆందోళన నెలకొంది. ప్రధానంగా విశాఖ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ పై పవన్ ఎలా స్పందిస్తారనే ఉత్కంఠ నెలకొంది. పూర్తి విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి. 

09:34 - December 6, 2017

టీమిండియా యంగ్ గన్ మెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డు నెలకొల్పాడు. 2017లో అన్ని ఫార్మాట్ లలో కలిపి టాప్ స్కోరర్ గా నిలిచాడు. 11 సెంచరీలు చేశాడు. మూడు మ్యాచ్ లలో సిరీస్ లో టాప్ స్కోరర్ గా నిలిచిన విరాట్ కోహ్లీ 2017 క్యాలెండర్ మరెవరికీ సాధ్యం కాని రికార్డు నమోదు చేశాడు. 2017లో వన్డే, టీ -20, టెస్టు ఫార్మాట్ లో మొత్తం 2818 పరుగులు చేశాడు. 2005లో రికీ పాంటింగ్ అన్ని ఫార్మాట్ లో కలిపి 2833 పరుగులు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. రికీ పాటింగ్ రికార్డును బద్దలు కొట్టేందుకు కేవలం 15 పరుగులు దూరంలో కోహ్లీ నిలిచాడు. శ్రీలంక వన్డే, టీ 20 మ్యాచ్ లకు కోహ్లీకి సెలెక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. దీనితో పాటింగ్ రికార్డును బద్దలు కొట్టే అవకాశం లేదు. 

09:22 - December 6, 2017

కర్నూలు : ఉల్లిపాయలకు కర్నూలు పెట్టింది పేరు. గత కొంతకాలంగా నష్టాలతో తీవ్ర ఇబ్బందులు పడిన ఉల్లి రైతులు ప్రస్తుతం కొంత కొలుకొంటున్నారు. మంచి ధర వస్తుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో క్వింటాలుకు రూ. 1500 ఉంటే ఇప్పుడు రూ. 2500-రూ. 3000 ధర పలుకొతోంది. ఈ సందర్భంగా ఉల్లి రైతులతో టెన్ టివి మాట్లాడింది. క్వింటాలుకు రూ. 2500 ధర స్థిరంగా ఉంటే గిట్టుబాటు అవుతుందని పేర్కొంటున్నారు. ఉల్లి పంటకు మంచి ధరలు వస్తున్నాయని, నాణ్యమైన పంటలకు ధర ఇంకా ఎక్కువ వస్తోందని తెలిపారు. ధరలు ఇదే విధంగా ఉండేలా ప్రభుత్వం పలు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

09:16 - December 6, 2017

విశాఖపట్టణం : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖకు చేరుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆయన పర్యటించనున్న సంగతి తెలిసిందే. వైజాగ్, విజయనగరం, విజయవాడ, పశ్చిమగోదావరి, ఒంగోలు జిల్లాలో ఆయన టూర్ కొనసాగుతుంది. విశాఖపట్టణంలో సోమవారం ఆత్మహత్య చేసుకున్న విశాఖ డ్రెడ్జింగ్ కార్పొరేషన్‌ ఉద్యోగి కుటుంబాన్ని పరామర్శించనున్నారు. తరువాత పశ్చిమగోదావరి జిల్లా ఆక్వా ఫుడ్ పార్క్ బాధితులతో భేటీ కానున్నారు. ఈనెల 8న ఫెర్రీ బోట్ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబ సభ్యులను ఒంగోలు వెళ్లి పరామర్శిస్తారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధి మురళి కుటుంబాన్ని కూడా పవన్ పరామర్శించనున్నారు.
తొలి విడత పర్యటనలో సమస్యలను పరిశీలించడం.. అధ్యయనం చేయడం.. అవగాహన చేసుకోవడం .. రెండో విడత ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం.. సమస్య పరిష్కారం కాకపోతే మూడో విడత పోరాటానికి వేదికగా మారుస్తామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. 

09:11 - December 6, 2017

విశాఖపట్టణం : నగరంలో ఇసుక అక్రమ రవాణా ఇంకా కొనసాగుతోంది. అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ ప్రభుత్వం చెబుతున్నా అక్రమార్కులు లెక్క చేయడం లేదు. తాజాగా విశాఖపట్టంలోని పెందుర్తి మండలం చిన్న ముసిడివాడలో డీఎస్పీ సీఎం నాయుడు ఆధ్వర్యంలో సిబ్బంది తనిఖీలు చేపట్టారు. అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుందని గుర్తించారు. 8 ఇసుక లారీలను సీజ్ చేశారు. రెవెన్యూ అధికారుల పనితీరుపై డీఎస్పీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి ఓ నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి ఇవ్వనున్నట్లు డీఎస్పీ పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. 

అక్రమ ఇసుక్ర రవాణా..అడ్డుకున్న సిబ్బంది...

విశాఖపట్టణం : జిల్లాలో విజిలెన్స్ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. డీఎస్ సీఎం నాయుడు ఆధ్వర్యంలో ఈ తనిఖీలు కొనసాగాయి. అక్రమ ఇసుక రవాణానను విజిలెన్స్ సిబ్బంది అడ్డుకున్నారు. 8 ఇసుక లారీలను సీజ్ చేశారు. రెవెన్యూ అధికారుల తీరుపై డీఎస్పీ అసంతృప్తి వ్యక్తం చేశారు. పెందుర్తి మండలం చిన్నముసిడివాడలో ఈ తనిఖీలు కొనసాగనున్నాయి. 

విశాఖకు పవన్...

విశాఖపట్టణం : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖకు చేరుకున్నారు. డ్రెడ్డింగ్ కార్పొరేషన్ ఉద్యోగుల దీక్షకు పవన్ మద్దతు తెలుపనున్నారు. ఆత్మహత్య చేసుకున్న వెంకటేష్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. 

07:32 - December 6, 2017

బీసీలు ఎదురు చూస్తున్న బీసీ సబ్ ప్లాన్ ఇక లేనట్టే. మూడు రోజుల పాటు బీసీల అభివృద్ధి..సంక్షేమంపై నిర్వహించిన సమావేశంలో బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటుపై చర్చకు వచ్చినా..ఆ అంశాన్ని పక్కన పెట్టాలని సర్కార్ సూచించినట్లు సమాచారం. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చలో జూలకంటి (సీపీఎం), కాచం సత్యనారాయణ (టీఆర్ఎస్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

విశాఖకు పవన్ కళ్యాణ్..

హైదరాబాద్ :సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడు రోజుల పాటు ఏపీలో పర్యటించనున్నారు. విశాఖ, విజయనగరం, ప.గో, కృష్ణా, ప్రకాశం జిల్లాలో ఆయన పర్యటించనున్నారు. అందులో భాగంగా నేడు విశాఖకు వెళ్లనున్నారు. డ్రెడ్డింగ్ కార్పొరేషన్ ఉద్యోగుల దీక్షకు పవన్ మద్దతు తెలుపనున్నారు. ఆత్మహత్య చేసుకున్న వెంకటేష్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. 

కరీంనగర్ కు సీఎం కేసీఆర్...

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ కరీంనగర్ జిల్లాకు వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు ఆయన పర్యటించనున్నారు. కాళేశ్వరం పనులను కేసీఆర్ పరిశీలించనున్నారు. రేపు..ఎల్లుండి పరిశీలన..రామడుగు పంపు హౌజ్ వద్ద సమీక్ష చేయనున్నారు. 

ప్రపంచ హాకీ లీగ్ లో...

ఢిల్లీ : ప్రపంచ హాకీ లీగ్ లో ఆస్ట్రేలియా - స్పెయిన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. సాయంత్రం 5గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. రాత్రి 7.30గంటలకు బెల్జియం జట్టుతో భారత్ తలపడనుంది.

బాక్ల్ డే..

హైదరాబాద్ : బ్లాక్ డే సందర్భంగా పాతబస్తీలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సౌత్ జోన్ డీసీపీ పేర్కొన్నారు. 3500 మందితో వివిధ విభాగాల పోలీస్ ఫోర్స్ తో నిఘా ఏర్పాటు చేసినట్లు, సౌత్ జోన్ లో 60 సమస్యాత్మక ప్రాంతాలు, 10 అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించినట్లు తెలిపారు. 

07:08 - December 6, 2017

ఇప్పటివరకు ప్రైవేటీకరణ విధిస్తూ కార్మికులు, ఉద్యోగులు ఆందోళన చేయడం చూశాం..కానీ ఇప్పుడు ఏకంగా ఒక ఉద్యోగి ఆత్మహత్య చేసుకోవడం సంచలనం కలిగిస్తోంది. తన చావుతోనైనా కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిచి డీసీఐ ప్రైవేటీకరణను ఆపాలని సూసైడ్‌ నోట్‌ రాసి డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఉద్యోగి వెంకటేష్‌ ఆత్మహత్య చేసుకోవడం ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానంపై చర్చకు దారితీసింది. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు తిరుపతి నుండి సీఐటీయూ ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్‌ విశ్లేషింఆచరు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

06:45 - December 6, 2017

చెన్నై : విశాల్‌ సమర్పించిన నామినేషన్‌ పత్రాలు అసంపూర్తిగా ఉన్నాయని... విశాల్‌ను బలపరుస్తూ సంతకాలు చేసిన పది మందిలో ఇద్దరి సంతకాలు సరిగా లేకపోవడంతో ఆయన నామినేషన్‌ను తిరస్కరించినట్టు ఈసీ స్పష్టం చేసింది. ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాల్‌ ఆర్కేనగర్‌ రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. పోలీసులు ఆయనను అరెస్ట్‌ చేశారు. ఉద్దేశ పూర్వకంగానే తన నామినేషన్‌ తిరస్కరించారని , దీని వెనుక కుట్ర ఉందని విశాల్‌ ఆరోపించారు.

300 మంది అనుచరులతో కలిసి సోమవారం సాయంత్రం చివరి నిమిషంలో విశాల్‌ అట్టహాసంగా నామినేషన్‌ దాఖలు చేశారు. జయలలిత మేనకోడలు కూడా ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. అఫిడవిట్‌లో లోపాల కారణంగా దీపా జయకుమార్‌ నామినేషన్‌ తిరస్కరించామని ఎన్నికల సంఘం ప్రకటించింది. తన నామినేషన్ తిరస్కరణ వెనుక కుట్ర ఉందంటూ దీప ఆరోపించారు.

ఆర్కేనగర్‌ నియోజవర్గంలో విశాల్‌ గట్టి పోటీ ఇచ్చే అవకాశముందని రాజకీవర్గాల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయన నామినేషన్‌ తిరస్కరణకు గురికావడం చర్చనీయాంశమైంది. విశాల్, దీపల నామినేషన్లు తిరస్కరణకు గురి కావడంతో అన్నాడిఎంకే, డిఎంకె, శశికళ మేనల్లుడు దినకరన్‌ల మధ్యే ప్రధాన పోటీ జరిగే అవకాశముంది.జయలలిత మృతితో ఆర్కేనగర్‌ అసెంబ్లీ స్థానానికి ఖాళీ ఏర్పడిన విషయం తెలిసిందే. ఈనెల 21న ఉప ఎన్నిక పోలింగ్‌ జరగనుంది.

06:43 - December 6, 2017

విశాఖపట్టణం : వైజాక్ ఫెస్ట్ కార్యక్రమం విశాఖ వాసులను ఆకట్టుకుంటుంది. ఫెస్ట్‌ని తిలకించడానికి విశాఖ పోర్ట్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌ కృష్ణబాబు కూడా విచ్చేశారు. ఫెస్ట్‌లో ఏర్పాటు చేసిన బుక్‌ స్టాల్స్‌లో కలియతిరిగారు. ఫెస్ట్‌లో భాగంగా జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రజాకవి వంగపండు హాజరయ్యారు. ఫెస్ట్‌కి విచ్చేసిన సందర్శకులను తన పాటలతో ఉర్రూతలూగించారు. ఇలాంటి ఫెస్ట్ లను విశాఖ నగరంలో ఏర్పాటు చెయ్యడం ఎంతో సంతోషంగా ఉందని కృష్ణబాబు అన్నారు. పుస్తక పఠనం చాలా మంచిదని అందరూ పుస్తక పఠనం అలవరుచుకోవాలని.. బుక్‌ ఫెస్ట్‌లను ఏర్పాటు చేసిన నిర్వాహకులను ఆయన కొనియాడారు.

చదవటం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలన్నారు నవ తెలంగాణ ఎడిటర్ ఎస్.వీరయ్య. చదవడానికి, నేర్చుకోవడానికి వయస్సుతో సంబందం లేదని అభిప్రాయపడ్డారు. కరీంనగర్ జిల్లాలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటి ఏర్పాటు చేసిన పుస్తక మహోత్సవ ప్రదర్శనలో వీరయ్య పాల్గొన్నారు. అక్షరాయుధం పాత్ర లేకుండా ఆధునిక సమాజంలో పోరాటం లేదని... మార్పు కూడా రాదన్నారు. జాతీయోద్యమం, తెలంగాణ సాయుధ పోరాటల వెనుక అక్షరం ఉందని...ప్రతి ఒక్కరూ పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకోవాలని వీరయ్య సూచించారు.

 

06:38 - December 6, 2017

విశాఖపట్టణం : నగరంలో జరుగుతున్న వైజాగ్‌ ఫెస్ట్‌ కార్యక్రమం అందర్నీ అలరిస్తోంది. ఫెస్ట్‌లో భాగంగా ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాలు పిల్లల్ని, పెద్దల్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. విశాఖ అంటేనే ప్రభుత్వ రంగ సంస్ధలకి పెట్టిందిపేరు. స్టీల్‌ ప్లాంట్‌, షిప్‌ యార్డ్‌, హెచ్పీసీఎల్‌ వంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నా.. ఇతరులను అందులోనికి అనుమతించరు. ఈ ప్రభుత్వ రంగ సంస్థల నమూనాలను ఫెస్ట్‌లో ఏర్పాటు చేసి వీక్షకులను కట్టిపడేశారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనితీరును.. అవి చేసే ఉత్పత్తులు ఏ విధంగా ఉపయోగపడతాయో స్టాల్స్‌లో వివరించారు. ప్రధానంగా స్టీల్ ప్లాంట్ పనితీరు ఏ విధంగా ఉంటుందో.. ఏర్పాటు చేసిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.. స్టీల్‌ ప్లాంట్‌లోకి ఎవ్వరికి అనుమతి లేదు కాబట్టి... ఈ ప్రదర్శనతో స్టీల్ ప్లాంట్ పనితీరు తెలిసిందన్నారు విద్యార్థులు.

కేవలం స్టీల్‌ ప్లాంట్‌ షిప్‌ యార్డ్‌ మాత్రమే కాకుండా.. అనేక ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వివరాలు కూడా ఆయా సంస్ధలు స్టాల్స్‌ను ఏర్పాటు చేశాయి.. దీంతో విద్యార్ధులు పెద్ద సంఖ్యలో ఈ స్టాల్స్ ను సందర్శించి.. తమకు తెలియని అనేక ప్రభుత్వ రంగ సంస్ధల గురించి తెలుసుకుంటున్నారు.. ఇలాంటి ఫెస్ట్‌ నిర్వహించడం వల్ల పిల్లలకి విజ్ఞానాన్ని సులువుగా అందించవచ్చని సందర్శకులు అభిప్రాయపడుతున్నారు. విజ్ఞాన సంబంధిత కార్యక్రమాలే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటుచేశారు. ఫెస్ట్‌ని సందర్శించడానికి వచ్చిన యువత అక్కడ ఏర్పాటు చేసిన మ్యూజిక్‌కు అనుగుణంగా డాన్స్‌లు చేస్తూ సందడిచేశారు.

మొత్తానికి వైజాగ్‌ ఫెస్ట్‌ పిల్లలు, పెద్దలను ఆకట్టుకుంటూ యువతలో కొత్త జోష్‌ని నింపుతుంది. ప్రతి ఏటా ఇలాంటి ఫెస్ట్‌లు జరగడం ద్వారా శాస్త్ర విజ్ఞానాన్ని పిల్లలకు అందించడానికి వీలుంటందని అంటున్నారు. అంతేకాకుండా విశాఖకి కూడా ఈ ఫెస్ట్‌తో మంచి పేరు దక్కుతుందని సందర్శకులు తెల్పుతున్నారు.

06:35 - December 6, 2017

నిజామాబాద్ : కామారెడ్డి జిల్లాలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పథకం వివాదాస్పదమవుతోంది. ఇళ్ల నిర్మాణం కోసం సేకరించిన భూమి.. తమదేనంటూ కొంతమంది కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు స్టే విధించింది. వెంటనే పనులు నిలిపివేయాలని ఆదేశించింది. అయితే.. అధికారులు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా నిర్మాణాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఆ భూమినే నమ్ముకుని జీవనం సాగిస్తున్న బాధితులు.. ప్రభుత్వ తీరుపై రోడ్డున పడ్డారు. కామారెడ్డి జిల్లా బిక్నూరు మండలంలోని ప్రభుత్వ విప్‌ ఎమ్మెల్యే గంప గొవర్దన్‌ సొంత గ్రామం బస్వాపూర్ గ్రామంలో నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల నిర్మాణాలు వివాదాస్పదంగా మారాయి. గ్రామంలో చేపడుతున్న డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణాలపై హైకోర్టు స్టే విధించింది. ఆ స్థలాలు తమవేనంటూ బాధితులు హైకోర్టును ఆశ్రయించటంతో... కోర్టు నిర్మాణాలను నిలిపివేసి స్థలాన్ని అప్పగించాలని ఆదేశించింది. అయితే... కోర్ట్‌ స్టే విధించినప్పటికీ అధికారులు మాత్రం పనులు యధేచ్చగా కొనసాగిస్తున్నారు. దీంతో బాధితులు నిర్మాణ స్థలం వద్ద నిరసనలు తెల్పుతున్నారు.

బస్వాపూర్ గ్రామంలోని సర్వే నంబర్ 256 భూమిని 1956 సంవత్సరంలో గ్రామానికి చెందిన ఇట్టబోని రామయ్యకు 5 ఎకరాల 3 గుంటల భూమిని ప్రభుత్వం అందచేసింది. రామయ్య వారసులు నేటి వరకు వ్యవసాయం చేస్తూ వచ్చారు. ఇటీవల డబుల్ బెడ్ రూమ్‌ల స్థల సేకరణలో భాగంగా రెవెన్యూ అధికారులు.. తమకు ఎలాంటి నోటిసులు ఇవ్వకుండానే తీసుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.

డబుల్ బెడ్ రూం ఇళ్ల శంకుస్థాపన సమయంలో బాధితులు అడ్డుపడకుండా 14 మందిని అరెస్టు చేశారు. హై కోర్ట్‌ స్టే ఇచ్చినప్పటికీ అధికారులు పనులు చేస్తుండటంతో రామయ్య కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. తమకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారని.. ఇన్ని రోజులు భూమి ఉందన్న ఆశతో ఉన్న తమకు.. ఇప్పుడు అధికారులు భూమి లాక్కోవడంతో ఏం చేయాలో తెలియడం లేదని రామయ్య భార్య ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వం వెంటనే పనులు నిలిపివేసి... తమ భూమి తమకు అప్పగించాలని వేడుకుంటోంది. హైకోర్టు తీర్పును ధిక్కరించి మరీ... అధికారులు నిర్మాణాలు చేపట్టడం బాధాకరం. పేదల భూములు లాక్కొని ఇళ్లు కట్టించడమేంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే... ఉన్నతాధికారులు ఈ విషయంలో జోక్యం చేసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నారు. 

06:31 - December 6, 2017

హైదరాబాద్ : మిషన్‌ కాకతీయ నాలుగో దశ టైం లైన్లను విధిగా పాటించాలన్నారు మంత్రి హరీష్‌రావు. ఈనెలాఖరుకు ప్రతిపాదనలు రూపొందించి.. జనవరిలో పనులు ప్రారంభించాలని ఆదేశించారు. నాలుగో దశలో 5,703 చెరువుల పునరుద్దరణ చేపట్టనున్నామని.. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలన్నారు. వివిధ కారణాలతో తిరస్కరించిన పనులను మరోసారి పంపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మిషన్‌ కాకతీయ నాలుగో దశ పనులను జనవరి మొదటివారంలోనే ప్రారంభించాలని అధికారులను మంత్రి హరీష్‌రావు ఆదేశించారు. ఈ దశలో 5,703 చెరువులను పునరుద్దరించనున్నట్లు హరీష్‌రావు తెలిపారు. మిషన్‌ కాకతీయలో ప్రజల భాగస్వామ్యాన్ని ఇంకా పెంచాలని సూచించారు. మిషన్‌ కాకతీయ పనులలో ఆయకట్టు స్థిరీకరణ,.. అదనపు ఆయకట్టుకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఈఈలు క్షేత్రస్థాయిలో పనులను నిరంతరం పర్యవేక్షించాలన్నారు.

ఈ దశలో చేపట్టనున్న చెరువుల జాబితా ముందుగానే అందిస్తున్న నేపథ్యంలో... పూడిక మట్టిని రైతులు వాడుకునే విధంగా వ్యవసాయ అధికారులు పర్యవేక్షించాలన్నారు హరీష్‌రావు. ఇప్పటివరకు రాష్ట్రంలో 2,500 సాయిల్‌ లాబ్‌ టెస్ట్‌లు ఏర్పాటు చేశామన్నారు. అధికారులు ఇంకా పూడికతీత మట్టిలో ఉండే పోషకాలపై ప్రజలు, రైతుల్లో అవగాహన కల్పించలన్నారు. మిషన్‌ కాకతీయలో కొందరు చేసే తప్పులకు మొత్తం కార్యక్రమం అబాసుపాలవుతోందని.. ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలన్నారు. నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. ఇక మిషన్‌ కాకతీయ పనులను విజయవంతం చేయాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రతినిధులను భాగస్వాములను చేయాలని హరీష్‌రావు సూచించారు. ఇకపై 10 రోజులకోసారి పనులపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తామన్నారు. 

06:27 - December 6, 2017

హైదరాబాద్ : జనసేనాని ప్రజల్లోకి వస్తున్నారు. ఇన్నాళ్లు పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టిన పవన్... ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి దిగుతున్నారు. నేటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో మూడు విడతలుగా పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో యువత నిస్పృహలో ఉందన్న జనసేనాని.. వారిని జాగృతం చేసేందుకు `చ‌లో రే చ‌లో రే చ‌ల్‌` గీతాన్ని విడుదల చేస్తున్నట్టు చెప్పారు. వైజాగ్, విజయనగరం, విజయవాడ, పశ్చిమగోదావరి, ఒంగోలు జిల్లాలో ఆయన టూర్ కొనసాగుతుంది. ముందుగా రేపు విశాఖ వెళ్తున్నారు. సోమవారం ఆత్మహత్య చేసుకున్న విశాఖ డ్రెడ్జింగ్ కార్పొరేషన్‌ ఉద్యోగి కుటుంబాన్ని పరామర్శించనున్నారు. తరువాత పశ్చిమగోదావరి జిల్లా ఆక్వా ఫుడ్ పార్క్ బాధితులతో భేటీ కానున్నారు. ఈనెల 8న ఫెర్రీ బోట్ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబ సభ్యులను ఒంగోలు వెళ్లి పరామర్శిస్తారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధి మురళి కుటుంబాన్ని కూడా పవన్ పరామర్శించనున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో మూడు విడతలుగా పర్యటిస్తున్నట్లు పవన్ చెప్పారు. తొలి విడత పర్యటనలో సమస్యలను పరిశీలించడం.. అధ్యయనం చేయడం.. అవగాహన చేసుకోవడం .. రెండో విడత ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం.. సమస్య పరిష్కారం కాకపోతే మూడో విడత పోరాటానికి వేదికగా మారుస్తామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. యువతలో రాజకీయపార్టీలు, ప్రభుత్వాలు ఆశలు రేకెత్తించి వాటిని అమలు చేయకపోతే వచ్చే దుష్పరిణామాలకు వెంకటేష్, మురళీల ఆత్మహత్యలే నిదర్శనమన్నారు పవన్ కల్యాణ్. యువతలో నిరాశ చోటు చేసుకోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. యువత నిరాశ నిస్పృహలకు లోను కావొద్దని పవన్ విజ్ఞప్తి చేశారు. విలువైన ప్రాణాలను తీసుకుని తల్లిదండ్రులకు శోకం మిగల్చవద్దని సూచించారు. యువతను జాగృతం చేయడానికి జనసేన తరపున 'ఛలో రే ఛలో' పాటను విడుదల చేస్తున్నట్లు పవన్ తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత స్వర్గీయ అంబేడ్కర్ 61వ వర్ధంతి సందర్భంగా పవన్ ఘన నివాళులు అర్పించారు. ఆయన ఆశలు, ఆశయాలకు అనుగుణంగా జనసేన పయనిస్తుందన్నారు పవన్ కల్యాణ్. 

06:24 - December 6, 2017

ఢిల్లీ : పోలవరం ప్రాజెక్ట్‌ ద్వారా 2018 కల్లా నీళ్లు అందించడమే లక్ష్యమన్నారు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ. పోలవరం పనులపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన మంత్రి.... 15 రోజులకోసారి ప్రాజెక్ట్‌ పనులు పర్యవేక్షిస్తానన్నారు. దేశమంతటా 7.2 లక్షల కోట్లు పనులు చేయించిన తనకు... గడువులోగా ప్రాజెక్ట్‌ ఎలా పూర్తి చేయాలో తెలుసన్నారు. పనులు త్వరితగతిగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఏపీలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్ట్‌పై కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వమించారు. గత కొన్ని రోజులుగా ప్రాజెక్ట్‌ నిర్మాణంపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఈ భేటీ నిర్వహించారు. ఈ భేటీలో మంత్రి దేవినేని ఉమ, ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీ ప్రతినిధితో పాటు అధికారులు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో గడ్కరీ సీరియస్‌ అయినట్లు తెలుస్తోంది. 2018కి ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్ట్‌ పూర్తి చేయాల్సిందేనన్నారు. ఆశించిన లక్ష్యం మేరకు పనులు పూర్తి కాకపోతే ఊరుకునేది లేదని హెచ్చరించారు. లక్ష్యానికి అనుగుణంగా కాంట్రాక్టర్‌ పనులు చేయాలని... సబ్‌ కాంట్రాక్టర్లు కూడా పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ప్రధాన కాంట్రాక్టర్‌ డబ్బులు ఇవ్వకపోతే... తామే ఇస్తామన్నారు గడ్కరీ. ఇకపై ప్రతి 15 రోజులకోసారి ప్రాజెక్టును సందర్శిస్తానన్నారు. సమన్వయ పనులను అధికారులు వెంటనే పరిష్కరించుకోవాలని సూచించారు. సీఎం ఏర్పాటు చేసిన కమిటీ వెంటనే నివేదిక ఇవ్వాలని ఆదేవించారు. పోలవరం టెండర్ల వ్యవహారంలో కాంట్రాక్టర్లకు సంబంధం లేదన్నారు. కాంట్రాక్టర్లు తమ పని తాము చేయాలన్నారు. నిధుల విషయంలో ఎలాంటి సందేహం వద్దని భరోసా ఇచ్చారు గడ్కరీ. ఇక ఈనెల 22న పోలవరం పనులను పరిశీలిస్తానని గడ్కరీ స్పష్టం చేశారు. మొత్తానికి గత కొన్ని రోజులుగా హాట్‌టాపిక్‌గా మారిన పోలవరం పనులపై గడ్కరీ స్పష్టత ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 2018 డిసెంబర్‌ నాటికి ప్రాజెక్ట్‌ పనులు పూర్తి చేస్తామన్నారు. 

కడపకు చేరిన 'ఉక్కుపోరు యాత్ర'....

కడప : జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ చేపట్టిన ఉక్కుపోరుయాత్ర మైదుకూరు చేరుకుంది. కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ సాధన కోసం విద్యార్థులు ఉద్యమించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా మాజీ నాయకులు జి చంద్రశేఖర్‌ పిలుపునిచ్చారు.

తన్విత వివాదంలో మరో పిటిషన్....

హైదరాబాద్ : చిన్నారి తన్విత వివాదంలో హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. తన్వితను చైల్డ్ వెల్ఫేర్ కమిటీలో ఉంచడం చట్టవిరుద్ధమని .. హైకోర్టులో ప్రవేశపెట్టాలని పెంపుడు తల్లి స్వరూప హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది.

దీక్షకు దిగిన యశ్వంత్ సిన్హా...

మహారాష్ట్ర : విదర్భ ప్రాంతంలోని రైతుల డిమాండ్‌ను పరిష్కరించే వరకూ తన దీక్ష కొనసాగుతుందని బిజెపి సీనియర్‌ నేత, మాజీ కేంద్ర ఆర్థికమంత్రి యశ్వంత్‌ సిన్హా స్పష్టం చేశారు. మహారాష్ట్ర రైతుల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ యశ్వంత్‌ సిన్హా సొంత పార్టీకి వ్యతిరేకంగా దీక్షకు దిగారు. 

గుజరాతీ వంటకాలకు 'రాహుల్' ఫిదా...

గుజరాత్ : కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ గుజరాతి వంటకాలకు ఫిదా అయిపోయారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అంజార్‌ సభలో గుజరాతీ వంటకాలు తనకు చాలా ఇష్టమని రాహుల్‌ చెప్పారు. ఖాక్రా గుజరాతీ, అచార్ గుజరాతీ, మూంగ్‌ఫలీ గుజరాతీ.. వంటకాల రుచులతో మీరంతా నన్ను చెడగొట్టారు. ఈ ఫుడ్ తిని నేనిప్పుడు లావెక్కుతున్నానని రాహుల్ సరదాగా వ్యాఖ్యానించారు. 

అయోధ్య భూ వివాదం..విచారణ..

ఢిల్లీ : అయోధ్య భూ వివాదంపై కేసు విచారణను సుప్రీంకోర్టు వచ్చే ఏడాది ఫిబ్రవరి 8కి వాయిదా వేసింది. ఈ కేసుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతత్వంలోని ముగ్గురు జడ్జిల బెంచ్ విచారణ జరుపుతోంది. సున్నీ బోర్డు తరఫున వాదనలు వినిపించిన కపిల్‌ సిబాల్‌... కేసుకు సంబంధించిన అన్ని పత్రాలు తమకు చేరలేదని కోర్టుకు విన్నవించారు.

మహారాష్ట్రను తాకిన 'ఓఖీ'...

హైదరాబాద్ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఓఖీ తుపాను మహారాష్ట్రను తాకింది. ముంబయిలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. నగరంలోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

'అమ్మ'కు నివాళులు..

చెన్నై : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ప్రథమ వర్ధంతి సందర్భంగా అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. చెన్నైలోని మెరీనా బీచ్‌లోని జయలలిత సమాధి వద్దకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ముఖ్యమంత్రి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం 'అమ్మ'కు ఘన నివాళి అర్పించారు. 

2జీ స్పెక్ట్రం కేసులో తుది తీర్పు..

ఢిల్లీ : 2 జీ స్పెక్ట్రం కేసులో తుది తీర్పు డిసెంబర్‌ 21న వెలువడనుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ కేంద్ర మంత్రి రాజా, ఎంపి కనిమొళి హాజరు కావాలని ఢిల్లీలోని పాటియాలా కోర్టు ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి డిఎంకె ఎంపీ కనిమొళి కోర్టు విచారణకు హాజరయ్యారు.

ఛగన్ ఆస్తుల జప్తు..

ఢిల్లీ : మనీల్యాండరింగ్‌ కేసుకు సంబంధించి మహారాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం ఛగన్‌ భుజ్‌బల్‌కు చెందిన 20.41 కోట్ల ఆస్తులను జప్తు చేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఆదేశించింది. పీఎంఎల్‌ఏ చట్టం కింద భుజ్‌బల్‌ ఆస్తులను అటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టు ఈడీ పేర్కొంది.

శరద్ యాదవ్ పై వేటు..

ఢిల్లీ : జనతాదళ్ యునైటెడ్ పార్టీ సీనియర్‌ నేత... రాజ్యసభ సభ్యులు శరద్‌యాదవ్‌పై అనర్హత వేటు పడింది. జేడీయూకు చెందిన అలీ అన్వర్, శరద్ యాదవ్‌లు రాజ్యసభ సభ్యులు కారని చైర్మెన్ వెంకయ్యనాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. ఇటీవల జేడీయూకు దూరమైన వీరిద్దరు పార్టీ ఆదేశాలను ధిక్కరిస్తూ ప్రతిపక్షాలు నిర్వహిస్తున్న సభలకు హాజరవుతున్నారు.

ముగ్గురు ఉగ్రవాదుల హతం...

ఢిల్లీ : జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదులకు, భద్రతాబలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. మృతి చెందిన ఈ ముగ్గురు ఉగ్రవాదులు గతంలో అమర్‌నాథ్‌ యాత్రికులపై దాడి చేసిన వారని జమ్ముకశ్మీర్‌ డిజిపి శేషుపాల్‌ వెయిడ్‌ తెలిపారు.

విజయానికి చేరువలో టీమిండియా...

ఢిల్లీ : టెస్ట్‌పై టీమిండియా పట్టు బిగించింది. 410 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు భారత బౌలర్ల ధాటికి మరోసారి తేలిపోయింది. 4వ రోజు ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆధిపత్యం ప్రదర్శించిన విరాట్‌ ఆర్మీ...విజయానికి 7 వికెట్ల దూరంలో నిలిచింది.

Don't Miss