Activities calendar

07 December 2017

22:13 - December 7, 2017

గుజరాత్‌ : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీని  రోజుకో ప్రశ్నతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ  తొమ్మిదవ ప్రశ్నను ట్విట్టర్‌లో సంధించారు. గుజరాత్‌లో రైతుల సమస్యను ప్రస్తావిస్తూ ప్రధానిని దుయ్యబట్టారు. బిజెపి పంటలకు గిట్టుబాటు ధర కల్పించలేదని, రుణ మాఫీ చేయలేదని, పంట బీమా సొమ్ము చెల్లించకుండా రైతులను ప్రధాని వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. భూములను లాక్కుని అన్నదాతలను అనాథలుగా మార్చారని... ప్రధాని రైతుల పట్ల సవతి తల్లి ప్రేమ చూపుతున్నారని రాహుల్‌ విమర్శించారు. గుజరాత్‌ ఎన్నికల తొలివిడత ప్రచారం నేటితో ముగియనుండడంతో అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు తారాస్థాయికి చేరాయి. గుజరాత్‌ అసెంబ్లీకి తొలివిడత ఎన్నిక డిసెంబర్‌ 9న జరగనుంది.

 

22:11 - December 7, 2017

ఢిల్లీ : నోట్లరద్దు, జిఎస్‌టి అంశాలకు సంబంధించి మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ మరోసారి మోది ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. ప్రధాని నిర్ణయంతో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారని, కొత్త ఉద్యోగాలు రాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. జిఎస్‌టి అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. నోట్ల రద్దు నిర్ణయంతో  కోట్లాది రూపాయల నల్లధనం తెల్లగా మారిందని మోదీ సర్కార్‌పై మన్మోహన్‌ మండిపడ్డారు. నోట్ల రద్దు వంటి భారీ తప్పిదాలకు భవిష్యత్‌లో పూనుకోవద్దని ప్రధాని మోదీకి మాజీ ప్రధాని హితవు పలికారు. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజ్‌కోట్‌లో అధ్యాపకులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. యూపీఏ హయాంలో అవినీతికి పాల్పడ్డవారిపై విచారణకు ఆదేశించడం జరిగిందని...బిజెపి హయాంలో మాత్రం ఎలాంటి విచారణ జరగడం లేదని మన్మోహన్‌ అన్నారు. నర్మాద ప్రాజెక్ట్‌ విషయంలో మోది తనతో ఎప్పుడూ మాట్లాడలేదని చెప్పారు.

 

22:08 - December 7, 2017

గుజరాత్‌ : అసెంబ్లీ ఎన్నికల తొలి విడత ప్రచారం ముగిసింది. మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు గానూ.. 89 స్థానాలకు డిసెంబర్‌ 9 శనివారం పోలింగ్‌ జరగనుంది. తొలి విడత జరిగే ఎన్నికల్లో సౌరాష్ట్ర, పశ్చిమ గుజరాత్‌, కచ్‌ ప్రాంతాలున్నాయి. గుజరాత్‌ సీఎం విజయ్‌రూపాని సహా 977 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీలు ఈ ఎన్నికలను వ్యక్తిగత ప్రతిష్ఠగా తీసుకొని విస్తృతంగా ప్రచారం చేశారు. సౌరాష్ట్ర, కచ్‌ ప్రాంతాల్లో అధిక స్థానాలు ఉండడంతో ఇక్కడ ఆధిక్యత సంపాదించడం అన్ని పార్టీలకు కీలకంగా మారింది. సౌరాష్ట్ర, పశ్చిమ గుజరాత్‌లలో ప్రధాని మోదీ 14 బహిరంగ సభల్లో పాల్గొన్నారు. వారం రోజుల పాటు రాహుల్‌ ప్రచారం చేశారు.  మిగిలిన స్థానాలకు డిసెంబర్‌ 14న పోలింగ్‌ జరగనుంది.

 

22:06 - December 7, 2017

రంగారెడ్డి : జిల్లాలోని యాచారం మండలంలో నిర్మించ తలపెట్టిన ఫార్మాసిటీకి అడ్డంకులు తొలగడం లేదు. ఫార్మాసిటీ కోసం  నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ రసాభాసగా మారింది. రైతులంతా తమ భూములు ఇవ్వబోమని... తమ ప్రాంతంలో ఫార్మాసిటీ ఏర్పాటు వద్దంటూ ఆందోళనకు దిగారు. ఫార్మాసిటీ భూసేకరణలో అవకతవకలకు పాల్పడిన వారిని ముందుగా శిక్షించాలని స్థానికులు పట్టుబట్టారు. ఒకే ప్రాంతంలోని రైతులకు పరిహారం ఇచ్చే విషయంలోనూ తేడాలు చూపుతున్నారని మండిపడ్డారు. కాలుష్యం లేని కంపెనీలను ఏర్పాటు చేస్తామని తమను మభ్యపెట్టి... చివరికి ప్రాణాలు తీసే ఫార్మా కంపెనీలకు భూములు ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ సుందర్‌ అబ్నార్‌, ఇబ్రహీంపట్నం ఆర్‌డీవో మధుకర్‌రెడ్డి వారించినా ప్రజలు వినిపించుకోలేదు.  భూములు కోల్పోయిన రైతుల కుటుంబంలో అర్హులైన వారికి ఉద్యోగాలు ఇస్తామని. అనర్హులకు నెలకు 2500 పెన్షన్‌ ఇస్తామని చెప్పినా అంగీకరించలేదు. ప్రజల ఆందోళనతో సమావేశంలో గందరగోళం ఏర్పడింది. దీంతో ప్రజాభిప్రాయసేకరణ అర్దాంతరంగా ముగిసింది.

 

22:04 - December 7, 2017

రాజన్న సిరిసిల్ల : మిడ్‌ మానేరు ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కంది కట్కూర్ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. కంది కట్కూర్ గ్రామం వద్ద మిడ్ మానేరు ప్రాజెక్టును ప్రభుత్వం నిర్మిస్తోంది. ఇప్పటికే ఆ గ్రామంలోని వ్యవసాయ భూములన్నీ ప్రాజెక్టులో మునిగిపోయాయి. గ్రామాన్ని ఆనుకుని ప్రాజెక్టు ఆనకట్ట ఉండటంతో దానిలోని నీరు ఊట రూపంలో గ్రామంలోని ఇళ్లలోకి వస్తోందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అంతే కాకుండా పదేళ్ల క్రితం భూములు కోల్పోయిన తమకు ప్రభుత్వం చిల్లిగవ్వ ఇవ్వలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే సర్వం కోల్పోయిన తమను ప్రభుత్వం ఆదుకుని .. తమ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని కోరుతున్నారు. అంతవరకూ ఆనకట్టపై నుంచి దిగేది లేదని హెచ్చరిస్తున్నారు. 

 

22:03 - December 7, 2017

హైదరాబాద్ : విద్యా సంవత్సరం మధ్యలో ఇంజనీరింగ్‌ కాలేజీలు ఇష్టానుసారంగా ఫీజులు పెంచడం సరికాదని విద్యాశాఖమంత్రి కడియం శ్రీహరి అన్నారు. లక్షా 13వేలు ఉన్న ఫీజులను ఏకంగా రెండు లక్షలకు పెంచితే విద్యార్థుల తల్లిదండ్రులకు భారమవుతుందన్నారు. ఫీజుల నియంత్రణ కమిటీ నిర్దారించిన ఫీజుల ప్రకారమే విద్యార్థుల నుంచి వసూలు చేయాలని కడియం తేల్చి చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వం విద్యార్థులకు పూర్తిగా మద్దతుగా ఉంటుందన్నారు. కోర్టు ఆదేశాలపై వెకెట్‌ పిటిషన్‌ వేశామని.. అప్పీల్‌కు వెళ్తామన్నారు. 

 

22:00 - December 7, 2017
21:57 - December 7, 2017

ఢిల్లీ : 2019 కల్లా ప్రతి ఇంటికీ 24 గంటల విద్యుత్‌ అందించాలని కేంద్రం నిర్ణయం తీసుకుందన్నారు ఏపీ విద్యుత్‌ శాఖ మంత్రి కిమిడి కళా వెంకట్రావు. ఢిల్లీలో వివిధ రాష్ట్రాల విద్యుత్‌ శాఖ మంత్రులతో ఏర్పాటు చేసిన పునరుత్పాదక విద్యుత్‌ వినియోగం సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఏపీలో 2016 జూన్‌ నాటికే ప్రతి ఇంటికీ ఏపీ ప్రభుత్వం విద్యుత్‌ సరఫరా చేసిందన్నారు మంత్రి. విద్యుత్ సంస్కరణలలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందన్నారు కళా వెంకట్రావు. 

21:55 - December 7, 2017

అనంతపురం : పాదయాత్ర పేరుతో జగన్‌ సరికొత్త రాజకీయ నాటకానికి తెరలేపారన్నారు మంత్రి కాల్వ శ్రీనివాసులు. ప్రజాస్వామ్య వ్యవస్థలో బాధ్యతాయుతమైన విపక్షనేత చేస్తున్న దుష్ప్రచారం మంచిది కాదన్నారు. సైన్స్‌ సిటీ, లేపాక్షి నాలెడ్జ్ హబ్‌ లాంటి పేర్లతో జగన్‌ దోపిడీ చేస్తే...  కియా లాంటి ప్రాజెక్టులు తెచ్చి తాము రాయలసీమ అభివృద్ధికి పని చేస్తున్నామన్నారు. 

 

21:47 - December 7, 2017

విశాఖ : ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పర్యటన సాగుతోంది.  పర్యటనలో భాగంగా టీయూ 142 యుద్ధ విమాన ప్రదర్శనశాలను రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రారంభించారు. ఏయూలోని పలు భవన నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌... ఈరోజు విశాఖపట్నం చేరుకున్నారు. గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  ఆయనకు  ఘనంగా ఆహ్వానించారు. అనంతరం  నగరంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్రపతి పాల్గొన్నారు.

తొలుత విశాఖ సాగర తీరంలో ఏర్పాటు చేసిన టీయూ 142 యుద్ధ విమాన ప్రదర్శనశాలను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రారంభించారు. విమానాన్ని సందర్శించి.. ఆ విమాన విశేషాలను తెలుసుకున్నారు. తర్వాత  బీచ్‌రోడ్డులోని అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి.. నివాళులు అర్పించారు.  అనంతరం  ఆంధ్రయూనివర్సిటీలోని ఈ-క్లాస్‌ రూమ్‌ భవన సముదాయం, ఇంక్యుబేటర్ కేంద్ర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా.. రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. విశాఖకు రావడం ఇదే తొలిసారని.. చాలా ఆనందంగా ఉందని రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు.  అలాగే గర్నవర్‌ నరసింహన్‌, సీఎం చంద్రబాబనాయుడులు  రాష్ట్రపతి రాకపై సంతోషం వ్యక్తం చేశారు. విశాఖ చరిత్రలో ఇది ఒక మధుర స్మృతిగా అభివర్ణించారు. శుక్రవారం కూడా.. రాష్ట్రపతి మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని.. అనంతరం తిరిగి ఢిల్లీకి పయనం కానున్నారు. 


 

21:44 - December 7, 2017

విశాఖ : వైసీపీ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకమన్నారు ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి. విశాఖలో ఆందోళన చేస్తున్న డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఉద్యోగులను కలిసి మద్దతు తెలిపారు. అత్మహత్య చేసుకున్న డీసీఐ ఉద్యోగి వెంకటేష్‌కు నివాళులు అర్పించారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వ ఉదాసీనత వల్లే అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణకు గురౌతున్నాయని విజయసాయిరెడ్డి ఆరోపించారు.

 

21:36 - December 7, 2017

కరీంనగర్ : సాగునీటి ప్రాజెక్టులు సత్వరం పూర్తి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు.  వీలైనంత త్వరగా ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు నీరందించనున్నట్టు తెలిపారు. ప్రాజెక్టుల పర్యటనలో భాగంగా కేసీఆర్‌ మేడిగడ్డ బ్యారేజ్‌ సహా ఇతర పంప్‌హౌజ్‌లను పరిశీలించారు. ప్రభుత్వ ప్రాధాన్యతను గుర్తుంచుకుని అధికారులు, కాంట్రాక్ట్‌ ఏజెన్సీలు ప్రాజెక్టులు త్వరగా పూర్తయ్యేందుకు సహకరించాలన్నారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి ప్రాజెక్టుల సందర్శనలో బిజీబిజీగా గడుపుతున్నారు. ప్రాజెక్టుల పర్యటనలో భాగంగా కేసీఆర్‌ రెండోరోజు తుపాకుల గూడెం బ్యారేజ్, మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్ హౌజ్, అన్నారం బ్యారేజ్, సిరిపురం పంప్ హౌజ్ లను సందర్శించారు. పనులు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు.  బ్యారేజీలు, పంప్ హౌజ్ లు, కాలువల నిర్మాణ పనులు మూడు షిప్టుల్లో జరగాలని అధికారులను, వర్క్ ఏజెన్సీలను కేసీఆర్‌ ఆదేశించారు.  

తుపాకులగూడెం దగ్గర గోదావరి వరద ప్రవాహం గురించి కేసీఆర్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు.  ప్రస్తుతం 6వేల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉన్నట్టు అధికారులు సీఎంకు వివరించారు. 1132 మీటర్ల కాపర్‌ డ్యాం నిర్మాణం దాదాపుగా పూర్తి కావొచ్చినట్టు అధికారులు సీఎంకు తెలిపారు. మరో 150 మీటర్లు పూర్తయితే మొత్తం కాపర్‌ డ్యాం నిర్మాణం పూర్తవుతుందని వివరించారు. ప్రాజెక్టులకు అవసరమైన రోడ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని అధికారులకు సీఎం నిర్దేశించారు. తెలంగాణ ప్రభుత్వానికి ప్రాజెక్టులు పూర్తి చేయడమే లక్ష్యమని... ఈవిషయాన్ని అధికారులు, కాంట్రాక్ట్‌ ఏజెన్సీలు గుర్తుంచుకుని పనులు చేయాలన్నారు. 

సీఎం కేసీఆర్‌ పర్యటనకు పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. డీజీపీసహా పోలీసు అధికారులంతా బందోబస్తు పర్యవేక్షించారు. రెండోరోజు ప్రాజెక్టుల సందర్శన ముగించుకున్న కేసీఆర్‌ సాయంత్రం రామగుండంలని ఎన్టీపీసీకి చేరుకున్నారు. కేసీఆర్‌ అక్కడే బస చేస్తున్నారు. శుక్రవారం అక్కడి నుంచి తన పర్యటను కొనసాగించనున్నారు.
 

21:33 - December 7, 2017

గుంటూరు : పోలవరం ప్రాజెక్టుపై పవన్‌ది ఓ దారి.. జగన్‌ది మరోదారి అని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. పోలవరం పూర్తి కావాలని పవన్‌ ఆకాంక్షిస్తుంటే.. జగన్‌, దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. దక్షిణ కొరియా పర్యటన ద్వారా రాష్ట్రానికి రూ.5వేల కోట్ల మేర పెట్టుబడులు వస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. 

దక్షిణ కొరియాలో మూడురోజుల పర్యటన ముగించుకుని వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు.. పర్యటన వివరాలను మీడియాకు వివరించారు. దక్షిణకొరియా పర్యటన విజయవంతమైందన్న చంద్రబాబు.. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు అనేక బహుళ జాతి సంస్థలు ముందుకొస్తున్నాయన్నారు. అభివృద్ధిలో దక్షిణ కొరియాని ఆదర్శంగా తీసుకోవాలని, ఒకప్పుడు పేదరికంలో మగ్గిన ఆదేశం.. ఇప్పుడు అభివృద్ధిలో తిరుగులేని శక్తిగా ఎదిగిందన్నారు. కియా మోటార్స్‌కు చెందిన అనుబంధ సంస్థలు రాష్ట్రంలో ఏర్పాటు కానున్నట్లు చంద్రబాబు చెప్పారు. 37 కంపెనీలతో కూడిన పారిశ్రామిక బృందంతో.. ఏపీఈడీబీ.. లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ తీసుకున్నట్లు తెలిపారు. దీనివల్ల రూ.3వేల కోట్ల పెట్టుబడులు, రూ.7,171ఉద్యోగాలు వస్తాయన్నారు.  

పోలవరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు చంద్రబాబు. ఎక్కడా రాజీ పడే ప్రసక్తి లేదని చంద్రబాబు అన్నారు. . కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీతో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ పనులు చేసుకుంటూ సాగుతున్నామన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తికావాలని పవన్‌కల్యాణ్‌ ఆకాంక్షిస్తుంటే.. దీన్ని అడ్డుకోవాలని జగన్‌ చూస్తున్నారంటూ చంద్రబాబు విమర్శించారు.  మొత్తానికి కొరియా టూర్ విజయవంతమైందన్న చంద్రబాబు ఏపీలో ఆటో మొబైల్ ఇండస్ర్టీకి మంచి  కళ రాబోతున్నట్లు వెల్లడించారు. 

 

21:28 - December 7, 2017

రాజమండ్రి : ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో జనసేనాని మాటల తూటాలు పేలుతునే ఉన్నాయి. టీడీపీ, వైసీపీ, బీజేపీలే లక్ష్యంగా ఆయన విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తాను ఇంకా నేర్చుకుంటానంటూనే అధికార, ప్రతిపక్షాల తప్పులను ఎత్తి చూపుతున్నారు. సీఎం కావడమే రాజకీయం కాదని.. సామాజిక మార్పు తీసుకురావడమే అసలైన రాజకీయమంటూ పాలిటిక్స్‌కు తనదైన నిర్వచనం ఇచ్చారు పవన్‌. అంతేకాదు.... డబ్బులు లేకుండా రాజకీయాలు చేయడమెలాగో చూపిస్తానంటూ ఖద్దరు చొక్కాలకు సవాల్‌ విసిరారు.
ఉభయ గోదావరి జిల్లాలో బిజీబిజీగా పవన్   
పవన్‌ కల్యాణ్‌ ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటన ఉత్సాహంగా సాగుతోంది. నిన్న విశాఖ జిల్లాలో పర్యటించిన పవన్‌..  ఇవాళ ఉభయ గోదావరి జిల్లాలో బిజీబిజీగా గడిపారు. రాజమహేంద్రవరంలో ఉభయగోదావరి జిల్లాల జనసేన కార్యకర్తలతో పవన్‌ కల్యాణ్‌ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్‌... జగన్‌పై రెండోరోజూ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. జగన్‌ టార్గెట్‌గా  పదునైన విమర్శలు చేశారు. తమ సమస్యలు పరిష్కరించమని ప్రజలు కోరితే.. తాను సీఎం అయ్యేవరకు ఆగాలంటూ జగన్‌ చెప్పడం సరికాదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా ఎన్నో పనులు చేయించవచ్చని సూచించారు. . సీఎం కావడమే రాజకీయంకాదని...  సామాజికంగా మార్పు తేవడమే అసలైన రాజకీయమని జగన్‌పై విసుర్లు విసిరారు.
పరకాల ప్రభాకర్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డ పవన్‌  
ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్‌పై పవన్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పరకాలకు కమిట్‌మెంట్‌లేదని వ్యాఖ్యానించారు. కమిట్‌మెంట్‌లేని వ్యక్తులు ఏపార్టీలో ఉన్నా నష్టమేనని చెప్పారు.  పీఆర్‌పీలో తనకు స్వేచ్ఛలేదంటూ చిరంజీవిపై ఆరోపణలు చేసిన పరకాల ప్రభాకర్‌ ఇప్పుడు టీడీపీలో ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలన్నారు.  సతీమణి కేంద్రమంత్రి అయినా పరకాల ఎందుకు ప్రత్యేక హోదా తీసుకురాలేదని ప్రశ్నించారు. 
పోలవరం ప్రాజెక్టును సందర్శించిన పవన్ 
అంతకుముందు పవన్‌ కల్యాణ్‌ పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్మితమవుతున్న పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. రాజమహేంద్రవరం నుంచి కారులో పోలవరానికి చేరుకున్న పవన్‌కు అభిమానులు స్వాగతం పలికారు. అనంతరం పవన్‌ హిల్‌ వ్యూ నుంచి పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు.  నిర్మాణ పనులు సాగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా.. రాష్ట్రప్రభుత్వ తీరుపై సూటి విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రాజెక్టు కోసం వేలకోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుపెడుతున్నప్పుడు ఏ ప్రభుత్వానికి అయినా అకౌంటబిలిటీ ఉండాలన్నారు. పరిహారం, ఇతర విషయాల కోసం 33వేలకోట్లు ఖర్చు అవుతాయంటున్న టీడీపీ ప్రభుత్వం.. కేంద్రం లెక్కలు అడిగితే ఎందుకు నీళ్లు నములుతోందని ప్రశ్నించారు. ఖర్చుపెట్టేవారు బాధ్యతాయుతంగా లేకపోతే నిలదీయడానికి తాను వెనుకాడబోనని హెచ్చరించారు.
చంద్రబాబు ప్రభుత్వానికి పోలవరం నిర్మించడం సాధ్యం కాదన్న పవన్‌ 
చంద్రబాబు ప్రభుత్వానికి పోలవరం నిర్మించడం సాధ్యంకాదని పవన్‌ తేల్చి చెప్పేశారు. అమరావతి రాజధానిలో పరిపాలన భవనం కట్టడానికే నాలుగేళ్లు కష్టపడిన చంద్రబాబు ప్రభుత్వం... 2018లోగా పోలవరం నిర్మాణాన్ని ఎలా పూర్తి చేస్తుందన్న అనుమానాలు వ్యక్తం చేశారు. మరో ఏడాదిలో ప్రాజెక్టు పూర్తిచేయడం అసాధ్యమన్నారు పవన్‌. ప్రాజెక్టు నిర్మాణంలో నిధుల ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేయాలని పవన్‌ డిమాండ్‌ చేశారు. డబ్బులుంటేనే రాజకీయాలు చేయాలన్న పరిస్థితి ప్రస్తుత సమాజంలో నెలకొందన్నారు. డబ్బులు లేకపోయినా రాజకీయాలు చేయవచ్చని నిరూపిస్తానన్నారు. ఏపీలో అధికార, ప్రతిపక్షాలు ఒకరికొకరు అవినీతిపై పుస్తకాలు వేసుకున్నారని ఎద్దేవా చేశారు. 

21:06 - December 7, 2017

ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణ సస్యశ్యామలమే : సీఎం కేసీఆర్

కరీంనగర్ : రీడిజైనింగ్ తో తెలంగాణ దశ మారిందని సీఎం కేసీఆర్ అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టు పనులు యుద్ధ వాతావరణాన్ని తలిపించేలా సాగుతున్నాయని తెలిపారు. ప్రాణాలు అడ్డుపెట్టయినా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పారు. ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణ సస్యశ్యామలం అవుతుందన్నారు. 

 

మేడారంలో రిజర్వాయర్ పనులను అడ్డుకున్న మత్స్యకారులు

పెద్దపల్లి : ధర్మారం మండలం మేడారంలో రిజర్వాయర్ పనులను మత్స్యకారులు అడ్డుకున్నారు. చెరువును రిజర్వాయర్ గా మార్చడంతో నష్టపోతున్నామని మత్స్యకార్మిక కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

 

20:33 - December 7, 2017

కాళేశ్వరం కట్టు కథలిప్పిన మల్లన్న, కడియం శ్రీహరిని ఓడించిన విద్యార్థిని, బహుజనుల విభజనలో చంద్రులు బిజీ, మిడ్ మానేరు కట్టమీదికెక్కిన బాధితులు, పాయకాన్ల పైసలు పంచుకతిన్నరు, శశిభూషణ్ శర్మపై కేసు నమోదు.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

ఉపాధ్యాయురాలిపై ప్రిన్సిపల్ లైంగిక వేధింపులు

వికారాబాద్ : తాండూరు నారాయణ ఇంటర్నేషనల్ స్కూల్ లో కీచకపర్వం వెలుగు చూసింది. ఉపాధ్యాయురాలిపై ప్రిన్సిపల్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ప్రిన్సిపల్ నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 

20:25 - December 7, 2017

కార్పొరేట్, ప్రైవేట్ విద్యాలయాలు ఇష్టానుసారంగా ఫీజులను పెంచుతున్నారని వక్తలు అన్నారు. ఇష్టానుసారంగా ఫీజులను పెంచుతున్నారని తెలిపారు. 'కార్పొరేట్ విద్యాలయాలు.. ఫీజుల పెంపు' అనే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సిద్ధార్థ విద్యా సంస్థల చైర్మన్ నాగయ్య, టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి, ఎస్ ఎఫ్ ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కోట రమేష్ పాల్గొని, మాట్లాడారు. ఫీజులపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ

హైదరాబాద్ : ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయ్యారు. మహాసభల ఏర్పాట్లపై చర్చించారు.  

సుందిళ్ల బ్యారేజ్ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్

పెద్దపల్లి : సుందిళ్ల బ్యారేజ్ వద్దకు సీఎం కేసీఆర్ చేరుకున్నారు. సుందిళ్ల బ్యారేజ్ పనులను సీఎం పరిశీలించారు. 

కెరీర్ గేట్ వే కన్సల్టెన్సీ ప్రధాన నిర్వాహకుడు అరవింద్ గుప్తా అరెస్టు

హైదరాబాద్ : మెడికల్, ఇంజనీరింగ్ సీట్లు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న కెరీర్ గేట్ వే కన్సల్టెన్సీ ప్రధాన నిర్వాహకుడు అరవింద్ గుప్తా అరెస్టు చేశారు. నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రూ.5.5 లక్షల నగదు, కంప్యూటర్లను  స్వాధీనం చేసుకున్నారు. గతంలో అరవింద్ గుప్తాపై 25 చీటింగ్ కేసులు ఉన్నాయి. 

 

19:46 - December 7, 2017
19:43 - December 7, 2017

పశ్చిమ గోదావరి : పవన్ కల్యాణ్ టీడీపీ ఏజెంట్‌లా పోలవరంలో పర్యటించారని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. పవన్‌కి నాలుగేళ్లుగా పోలవరం ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. ఈమేరకు ఆమెతో టెన్ టివి నిర్వహించింది. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ 2018 నాటికి ఎట్టి పరిస్థితుల్లో పోలవరం పూర్తవదన్నారు. కేవలం ముడుపుల కోసమే కాంట్రాక్టర్లను మారుస్తున్నారని రోజా విమర్శించారు. 

 

19:38 - December 7, 2017
19:36 - December 7, 2017

అనంతపురం : వాల్మీకులను ఎస్టీల్లో చేర్చే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా పుట్టపర్తిలో గిరిజనులు ఆందోళన చేపట్టారు. గణేష్ సర్కిల్‌ నుండి ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. గిరిజన మనోభావాలు దెబ్బతీసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని  గిరిజన నేతలు మండిపడ్డారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొనకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. 

 

19:34 - December 7, 2017

కడప : జిల్లాలో స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని ఉక్కు ఫ్యాక్టరీ సాధన కమిటీ డిమాండ్‌ చేసింది. స్టీల్‌ప్లాంట్‌ సాధన కోసం ఎస్‌ఎఫ్‌ఐ - డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో సాగుతోన్న జీపుయాత్ర కడప జిల్లాలోని బద్వేలు చేరింది. ఈ సందర్భంగా జీపుయాత్రకు విద్యార్థులు, యువకులు ఘన స్వాగతం పలికారు. తక్షణమే కడపలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని. ఉక్కు ఫ్యాక్టరీ సాధన కమిటీ కన్వీనర్‌ ఆంజనేయులు డిమాండ్‌ చేశారు. రాయలసీమలోని ప్రాజెక్టులనూ పూర్తి చేయాలన్నారు. ఈనెల 15 నుంచి జరిగే పార్లమెంట్‌ సమావేశాల్లో దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఉక్కు ఫ్యాక్టరీ సాధన కోసం ఈనెల 15న కడపలో జరిగే బహిరంగ సభలో విద్యార్థులు, యువకులు, మేధావులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. 

 

19:32 - December 7, 2017

తూర్పు గోదావరి : పోలవరం ప్రాజెక్టు వాస్తవ పరిస్థితిని పరిశీలించేందుకు ప్రతిపక్ష  వైసీపీ బృందం పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించింది.  ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, రోజా, మరికొందరు కీలకనేతలు ఈ పర్యటనలో ఉన్నారు. విజయవాడలో బయలుదేరి నేరుగా పోలవరం ప్రాజెక్టుకు చేరుకున్న నేతలు ప్రాజెక్టు స్పిల్ వే, స్పిల్ చానల్, డయాఫ్రాం వాల్‌తో పాటు నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు. వైసీపీ బృందానికి ప్రాజెక్ట్ ఇంజినీర్లు  పనులు ఎంత వరకు జరిగాయో ఇంకా ఎంత పని జరగాల్సి ఉందో వివరించారు. 

 

19:30 - December 7, 2017

విశాఖ : ఆత్మహత్య చేసుకున్న డీసీఐ ఉద్యోగి వెంకటేష్‌ కుటుంబానికి ఏపీ సీఎం చంద్రబాబు 5లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించినట్టు సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్‌ నర్సింగరావు తెలిపారు. వెంకటేష్‌ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ సీహెచ్‌ నర్సింగరావు ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం చంద్రబాబు కలిసింది. వెంకటేష్‌ కుటుంబానికి ఆర్థికసాయం చేసి అతని కుటుంబాన్ని ఆదుకోవాలని చంద్రబాబు కోరారు. దీనికి స్పందించిన చంద్రబాబు.. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాదు... డీసీఐ ప్రైవేటీకరణ జరగకుండా చూడాలని సీఐటీయూ నేతలు కోరగా.. కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని హామీనిచ్చారు.

19:24 - December 7, 2017

తూర్పుగోదావరి : కార్యకర్తలతో సమావేశానికి ముందు పవన్‌కల్యాణ్‌ పోలవరం ప్రాజెక్టు సందర్శించారు. పనులు జరుగుతున్న తీరును అక్కడి అధికారులను అడిగి  తెలుసుకున్నారు. పోలవరంపై ప్రజల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత  టీడీపీ ప్రభుత్వానికి ఉందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో నిధుల ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేయాలని పవన్‌ డిమాండ్‌ చేశారు. లేదంటే.. 2019 ఎన్నికల్లో ఫలితం అనుభవించాల్సి వస్తుందని జనసేన అధినేత స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రభుత్వానికి పోలవరం కట్టడం సాధ్యం కాదని పవన్‌ కల్యాణ్ అన్నారు. అమరావతి రాజధానిలో పరిపాలనా భవనం కట్టడానికే నాలుగేళ్లు కష్టపడిన బాబు ప్రభుత్వం .. 2018లోగా పోలవరం నిర్మాణం పూర్తిచేస్తామనడంపై పవన్‌ అనుమానం వ్యక్తం చేశారు. మరో ఏడాదిలో ప్రాజెక్టు పూర్తిచేయడం అసాధ్యం అన్నారు. మరోవైపు ప్రాజెక్టు విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని కూడా పవన్‌ తప్పుపట్టారు. 
 

19:19 - December 7, 2017

రాజమండ్రి : వైసీపీ అధినేత జగన్‌పై రెండోరోజూ జనసేనాని పవన్‌ కల్యాణ్‌ విమర్శనాస్త్రాలు గుర్పించారు. ప్రజలు సమస్యలు తీర్చమని అడిగితే సీఎం అయితే చేస్తానని చెప్పడమేంటన్నారు.  అప్పటి వరకు ప్రజలు తమ సమస్యలతో ఆగాలా అంటూ జగన్‌ను ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న పవన్... కార్యకర్తలతో సమావేశమయ్యారు. ప్రతిపక్షంలో ఉన్నా ప్రభుత్వంతో ఎన్నో పనులు చేయించవచ్చని సూచించారు. సీఎం అయితేనే రాజకీయం కాదు.. సామాజిక మార్పు  తీసుకురావడమే రాజకీయమన్నారు. ప్రజారాజ్యం పార్టీలో నిస్వార్థంగా పనిచేసే వారులేకపోవడంతోనే ఆ పార్టీ మనుగడ సాగించలేకపోయిందని పవన్‌ అన్నారు. పీఆర్‌పీలో నిస్వార్థంగా పనిచేసే వారు ఉండి ఉంటే.. ప్రజారాజ్యం నిలబడేదన్నారు. ఇప్పుడు చిరంజీవి సీఎం అయ్యేవారని చెప్పారు. 
పరకాల ప్రభాకర్‌పై పవన్‌ మండిపాటు
ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్‌పై పవన్‌ కల్యాణ్‌ రెండోరోజూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజారాజ్యం పార్టీలో స్వేచ్చలేదని పరకాల చెప్పడం అవాస్తవమన్నారు. పీఆర్‌పీలో ఉంటూ అదే ఆఫీసులో స్వేచ్ఛ గురించి మాట్లాడారంటేనే ఆ పార్టీలో ఎంత స్వేచ్ఛ ఉండేదో గుర్తించాలన్నారు. చిరంజీవి నోరులేని మనిషి కాబట్టే పరకాల ఆవిధంగా వ్యాఖ్యలు చేశారన్నారు. ఆ సమయంలో తాను ఆఫీసులో ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. ప్రత్యేక హోదాపై పవన్‌ ఎందుకు మాట్లాడం లేదంటున్న వారంతా... వారెందుకు మాట్లాడటం లేదో చెప్పాలన్నారు. 

 

సీపీఎం విజ్ఞప్తికి వెంటనే స్పందించిన సీఎం చంద్రబాబు

విశాఖ : సీఎం చంద్రబాబును సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్.నర్సింగరావు కలిశారు. డీసీఐ ప్రైవేటీకరణ కాకుండా చూడాలని..చినిపోయిన వెంకటేష్ కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.  సీపీఎం విజ్ఞప్తికి చంద్రబాబు వెంటనే స్పందించారు. వెంకటేష్ కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. 

 

19:01 - December 7, 2017

హైదరాబాద్ : కాలుష్యం కనిపించని భూతంలా ప్రజల ప్రాణాలను హరిస్తోంది. ప్రధానంగా వాయు కాలుష్యంతో చాలామంది అనారోగ్యం పాలవుతున్నారు. దేశంలోనే ఈ రక్కసి బారిన పడిన నగరాల్లో హైదరాబాద్ భయంకరమైన స్థాయికి చేరుతోంది.  దేశ రాజధాని ఢిల్లీలోని కాలుష్యంలో సగం మన భాగ్యనగరంలోనే ఉన్నట్లు అధ్యయనాల్లో తేలింది. 

రోజురోజుకూ వాతావరణంలో కాలుష్యం పెరిగిపోతోంది. కార్లు, బైకుల వినియోగం నానాటికీ ఎక్కువ కావడం వల్ల... పొగవల్ల కాలుష్యం, రేడియేషన్ పేరుకుపోతోంది. దీనివల్ల ప్రజలు  పలు రకాల జబ్బుల బారిన పడుతున్నారు. కంటికి కనిపించని ధూళికణాలు గాలిలో ప్రమాదకర స్థాయిలో పేరుకుపోయాయి..  కార్యాలయాల్లో కూర్చుని పని చేసేవారికంటే.... బయటి ప్రాంతాల్లో పని చేసే కార్మికులు, ట్రాఫిక్ పోలీసుల వంటి వారిపాలిట ఇది మరింత భయంకరంగా మారింది.

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీత స్థాయికి చేరుకున్న పరిస్థితుల్లో దీనిపై చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో వాయు కాలుష్యం ఏ స్థాయిలో ఉందన్న విషయం కూడా చర్చకువచ్చింది. దీని ప్రభావం ప్రజల మీద ఏస్థాయిలో ఉంటుందన్నది ప్రధానంగా చర్చకొచ్చింది. భాగ్యనగరంలోని కాలుష్యంపై ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ ప్రొఫెసర్ మధుసూదన్ రావ్  ఆధ్వర్యంలో విద్యార్థులు పరిశోధన నిర్వహించారు.  జీహెచ్ ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో  గాలిలో ధూళి కణాలు అధిక స్థాయిలో ఉన్నట్లు వారి అధ్యయనంలో తేలింది. ఢిల్లీలోని కాలుష్యంలో సగ భాగం హైదరాబాద్ లో ఉన్నట్లు చెబుతున్నారు. స్పాట్...

పరిశోధక విద్యార్థులు కాలుష్యంపై ఒక సంవత్సరంపాటు నగరంలో మ్యాగ్నెటిక్ విధానంలో అధ్యయనం చేశారు.   హబ్సిగూడ నుంచి చర్లపల్లి, అమీర్ పేట్ నుంచి పటాన్ చెరువు, ఎల్బీనగర్ నుంచి శిల్పారామం. జేబీఎస్ నుంచి ఫలక్ నుమా, ఎల్బీనగర్ నుంచి అమీర్ పేట్, మియాపూర్ క్రాస్ రోడ్- బాచుపల్లి ప్రాంతాల్లో కాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉందని వారు తెలిపారు. ఇదంతా కూడా కంటికి కనిపించనంత సూక్ష్మంగా ఉందని తేల్చారు. 

హైదరాబాద్‌లో కాలుష్యం పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి.  వాటిలో ప్రధానంగా  శుభ్రంగా లేని రహదారులు... లెక్కకు మించి జరుగుతున్న భవన నిర్మాణాలు, కాలం తీరిన భవనాల తొలగింపు, ఎప్పటికప్పుడు చెత్తను తొలగించకపోవడం, చెత్తకు నిప్పుపెట్టడంతో గాలిలో కాలుష్యం ప్రమాద స్థాయికి చేరినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి నివారణ చర్యలు చేపట్టాలని.. లేకుంటే ఢిల్లీ లాంటి పరిస్థితి తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

18:58 - December 7, 2017

సంగారెడ్డి : ఓయూలో ఆత్మహత్య చేసుకున్న మురళీ కుటుంబాన్ని సంగారెడ్టి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పరామర్శించారు. విద్యార్థి మురళీ ఆకస్మికంగా మృతి చెందడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని, మృతిపై సమగ్ర విచారణ జరపాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. మురళీ కుటుంబానికి జగ్గారెడ్డి లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. 

 

18:54 - December 7, 2017

హైదరాబాద్ : సీఎం కేసీఆర్‌ ఓటుబ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు ఆరోపించారు. బీసీ డిక్లరేషన్ పేరుతో సీఎం ఓట్ల రాజకీయానికి తెరలేపారని మండిపడ్డారు. కేసీఆర్ బీసీలపై కపట ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. బీసీ డిక్లరేషన్‌పై అసెంబ్లీలో తీర్మాణం చేసి చేతులు దులుపుకుంటున్నారని విమర్శించారు.  కేసీఆర్ క్రిమిలేయర్ గురించి ఎందుకు మాట్లాడటం లేదని వీహెచ్ ప్రశ్నించారు. ఒక్క శాతం ఉన్న సీఎం సామాజిక వర్గానికి ఐదు మంత్రి పదవులిచ్చారని చెప్పారు.

 

18:48 - December 7, 2017

ఢిల్లీ : పునరుత్పాదక విద్యుత్‌ వినియోగంపై ఢిల్లీలో సదస్సు జరిగింది. వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యుత్‌ శాఖ మంత్రులు సదస్సుకు హాజరయ్యారు. అందరికీ విద్యుత్ ఇవ్వలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ఇందుకు సంబంధించి వివిధ రాష్ట్రాలలో జరుగుతున్న ఉత్పత్తిపై ఈ సదస్సులో చర్చించినట్లు తెలంగాణా విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. ఎవరి అంచనాలకు అందకుండా దేశంలో అన్ని వర్గాల విద్యుత్ వినియోగదారులకు 24 గంటల విద్యుత్ అందించే మొదటి రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించనుందని జగదీశ్వర్‌ రెడ్డి అన్నారు.

 

18:46 - December 7, 2017

హైదరాబాద్ : టీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలన ప్రజలు ఆశించిన విధంగా లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. తెలంగాణలో ప్రస్తుతం రాజకీయ ప్రత్యామ్నాయ వేదిక అవసరం ఉందన్నారు. హైదరాబాద్ ఎస్వీకేలో జరిగిన పొలిటికల్ ఫ్రంట్ సన్నాహక సమావేశంలో తమ్మినేనితో పాటు టీమాస్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో 119 నియోజక వర్గాల్లో పోటీ చేసేలా..ప్రయత్నం చేయాలన్నారు. జనవరిలో రాష్ట వ్యాప్తంగా ప్రచార జాతాలు, ఆందోళనలు చేపడతామని తెలిపారు. త్వరలోనే ఫ్రంట్‌పై క్లారిటీ వస్తుందని చెప్పారు.


 

17:54 - December 7, 2017

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొనసాగుతున్న సీఎం కేసీఆర్ పర్యటన

ఉమ్మడి కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సీఎం కేసీఆర్ టూర్ కొనసాగుతోంది. ప్రస్తుతం పెద్దపల్లి జిల్లాలో గోలివాడ ప్రాజెక్టును కేసీఆర్ పరిశీలిస్తున్నారు. ఉదయం నుంచి తుపాకులగూడెం, మేడిగడ్డ, కన్నెపల్లి, అన్నారం, సుందిళ్ల, సిరిపురం, గోలివాడ పంప్ హౌజ్, బ్యారేజీలను కేసీఆర్ ఏరియల్ సర్వే చేశారు. క్షేత్రస్థాయిలో పనుల తీరును అడిగి తెలుసుకున్నారు. పనుల వేగం మరింత పెంచాలని అధికారులను సీఎం ఆదేశించారు. 

17:39 - December 7, 2017

ఉమ్మడి కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సీఎం కేసీఆర్ టూర్ కొనసాగుతోంది. ప్రస్తుతం పెద్దపల్లి జిల్లాలో గోలివాడ ప్రాజెక్టును కేసీఆర్ పరిశీలిస్తున్నారు. ఉదయం నుంచి తుపాకులగూడెం, మేడిగడ్డ, కన్నెపల్లి, అన్నారం, సుందిళ్ల, సిరిపురం, గోలివాడ పంప్ హౌజ్, బ్యారేజీలను కేసీఆర్ ఏరియల్ సర్వే చేశారు. క్షేత్రస్థాయిలో పనుల తీరును అడిగి తెలుసుకున్నారు. పనుల వేగం మరింత పెంచాలని అధికారులను సీఎం ఆదేశించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

ఎర్రచందనం స్మగ్లర్లను చుట్టుముట్టిన పోలీసులు

కడప : రైల్వే కోడూరు మండలం తీండ్రగుంట వద్ద శేషాచలం ఆటవీప్రాంతంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. పోలీసులను ఎర్రచందనం స్మగ్లర్లు చుట్టుముట్టారు. పోలీసులు ఆత్మరక్షణకు గాల్లోకి కాల్పులు జరిపారు. టాస్క్ ఫోర్స్ ఐజీ కాంతారావు ఘటనాస్థలికి బయల్దేరారు. 

 

జర్నలిస్టులపై పోలీసుల నిర్బంధం

గుంటూరు : జిల్లాలో జర్నలిస్టులపై పోలీసులు దౌర్జన్యానికి దిగారు. హత్య కేసు కవరేజ్ కి వెళ్లిన జర్నలిస్టులను పోలీసులు నిర్బంధించారు. నిన్న ఉదయం విజయవాడలో కాళిదాసు అనే రౌడీ షీటర్ హత్య గావించబడ్డాడు. ఈ హత్య కేసులో ఇద్దరు అనుమానితులు తెనాలి కోర్టులో లొంగిపోయారు. లొంగుబాటు వార్త కవరేజ్ కు వెళ్లిన జర్నలిస్టులపై పోలీసులు దాష్టీకానికి పాల్పడ్డారు. కవరేజ్ చేయకుండా జర్నలిస్టులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తీరుపై జర్నలిస్టు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పోలీసుల తీరును కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు మల్లికార్జునరావు, మస్తాన్ వలీ ఖండించారు.

17:18 - December 7, 2017

గుంటూరు : జిల్లాలో జర్నలిస్టులపై పోలీసులు దౌర్జన్యానికి దిగారు. హత్య కేసు కవరేజ్ కి వెళ్లిన జర్నలిస్టులను పోలీసులు నిర్బంధించారు. నిన్న ఉదయం విజయవాడలో కాళిదాసు అనే రౌడీ షీటర్ హత్య గావించబడ్డాడు. ఈ హత్య కేసులో ఇద్దరు అనుమానితులు తెనాలి కోర్టులో లొంగిపోయారు. లొంగుబాటు వార్త కవరేజ్ కు వెళ్లిన జర్నలిస్టులపై పోలీసులు దాష్టీకానికి పాల్పడ్డారు. కవరేజ్ చేయకుండా జర్నలిస్టులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తీరుపై జర్నలిస్టు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పోలీసుల తీరును కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు మల్లికార్జునరావు, మస్తాన్ వలీ ఖండించారు. తక్షణమే జర్నలిస్టులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

విశాఖలో రాష్ట్రపతి కోవింద్ పర్యటన

విశాఖ : నగరంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పర్యటిస్తున్నారు. పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. 

 

 

పరకాల ప్రభాకర్ పై పవన్ కళ్యాణ్ ఫైర్

రాజమండ్రి : పరకాల ప్రభాకర్... చిరంజీవిని విమర్శించిన నాడు తాను పరకాల పక్కల ఉంటే పరిస్థితి వేరే ఉండేదన్నారు. చిరంజీవిపై విమర్శలు చేసిన పరకాల ప్రభాకర్...స్పెషల్ క్యాటగిరీ విషయంలో ఆయన సతీమణి నిర్మలా సీతారామన్ తో ఎందుకు మాట్లాడడం లేదని, మోడీని ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. చిరంజీవికి ఒక న్యాయం మోడీకి మరో న్యాయం అంటే కుదరదని చెప్పారు. 

నిస్వార్థపరులు లేకపోవడం వల్లే ప్రజారాజ్యం పార్టీ కూలిపోయింది : పవన్

రాజమండ్రి : ప్రజలకు మంచి చేయాలనే తపన చిరంజీవికి ఉండేదని తెలిపారు. ఉభయగోదారి జిల్లాల జనసేన కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై, మాట్లాడారు. చిరంజీవి చుట్టూ నిస్వార్థపరులు లేకపోవడం వల్లే ప్రజారాజ్యం పార్టీ కూలిపోయిందన్నారు. సినిమాలు చేయడం వృత్తి.. రాజకీయం ప్రవృత్తి అని తెలిపారు.

ప్రకృతి వనరులను అందరికీ సమానంగా పంచడమే రాజకీయం : పవన్

రాజమండ్రి : ప్రకృతి వనరులను అందరికీ సమానంగా పంచడమే రాజకీయమని వివరించారు. ఉభయగోదారి జిల్లాల జనసేన కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై, మాట్లాడారు. విధివిధానాలు లేకుండా రాజకీయాల్లోకి రాలేదన్నారు.

 

సీఎం కావడమే రాజకీయ మార్పు కాదు : పవన్ కళ్యాణ్

రాజమండ్రి : సీఎం కావడమే రాజకీయ మార్పు కాదని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఉభయగోదారి జిల్లాల జనసేన కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై, మాట్లాడారు. సామాజికంగా మార్పు తేవడమే రాజకీయమని అన్నారు. 

16:22 - December 7, 2017

రాజమండ్రి : సీఎం కావడమే రాజకీయ మార్పు కాదని...సామాజికంగా మార్పు తేవడమే రాజకీయమని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఉభయగోదారి జిల్లాల జనసేన కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై, మాట్లాడారు. ప్రకృతి వనరులను అందరికీ సమానంగా పంచడమే రాజకీయమని వివరించారు. విధివిధానాలు లేకుండా రాజకీయాల్లోకి రాలేదన్నారు. ప్రజలకు మంచి చేయాలనే తపన చిరంజీవికి ఉండేదని తెలిపారు. అయితే చిరంజీవి చుట్టూ నిస్వార్థపరులు లేకపోవడం వల్లే ప్రజారాజ్యం పార్టీ కూలిపోయిందన్నారు. సినిమాలు చేయడం తన వృత్తి అని.... రాజకీయం తన ప్రవృత్తి 
అని తెలిపారు. ట్విట్టర్ లోనే స్పందిస్తున్నానని..కొంతమంది తనపై విమర్శిస్తున్నారని..ఈరోజు నుంచి ప్రజాక్షేత్రంలోనే ఉంటానని చెప్పారు. దేనికైనా అనుభవం కావాలన్నారు. రాజకీయ పార్టీల నాయకులు ఒకరిపై మరొకరు భూతులు తిట్టుకుంటూ, జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసుకుంటున్నారని..అది సరికాదన్నారు. ఒక రాజకీయ పార్టీపై మరో పార్టీ వెటకారం, వ్యంగ్యపూరితంగా మాట్లాడుతుందన్నారు. పోలవరం ప్రాజెక్టు.. ఏంటో ఇప్పటికీ ఎవరికీ పూర్తిగా తెలియదన్నారు. కానీ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం వస్తున్న నిధులను మాత్రం కాజేస్తున్నారని ఆరోపించారు. పరకాల ప్రభాకర్... చిరంజీవిని విమర్శించిన నాడు తాను పరకాల పక్కల ఉంటే పరిస్థితి వేరే ఉండేదన్నారు. చిరంజీవిపై విమర్శలు చేసిన పరకాల ప్రభాకర్...స్పెషల్ క్యాటగిరీ విషయంలో ఆయన సతీమణి నిర్మలా సీతారామన్ తో ఎందుకు మాట్లాడడం లేదని, మోడీని ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. చిరంజీవికి ఒక న్యాయం మోడీకి మరో న్యాయం అంటే కుదరదని చెప్పారు. 

 

15:59 - December 7, 2017

మహిళలపై జరుగుతున్న లైంగిక, శారీరక దాడులపై ఐక్య రాజ్యసమితి ( ఐరాస) పక్షోత్సవాలు నిర్వహిస్తోంది. మహిళలపై జరుగుతున్న దాడులు, హింసతోపాటు పలు రకాల దాడులకు వ్యతిరేకంగా నవంబర్ 25 నుంచి మానవ హక్కుల దినోత్సవం డిసెంబర్ 10 వరకు ఐరాసా పలు సదస్సులు కొనసాగనున్నాయి. ఇదే అంశంపై ఇవాళ్టి మానవి స్పెషల్ ఫోకస్ నిర్వహించింది. ఆ వివరాలను వీడియోలో చూద్దాం... 

15:44 - December 7, 2017

హైదరాబాద్ : దళితులకు మూడెకరాల భూమి పంపిణీ పథకం  న‌త్తకు న‌డ‌క‌ నేర్పుతోంది.  కార్యక్రమం  ప్రారంభం నుంచి  మూడు అడుగుల ముందుకు.. ఆరు అడుగులు వెనక్కు అన్నచందంగా తయారైంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత  మూడేళ్లలో కేవలం 3741 మందికే భూ పంపిణీ జరిగిందంటే... ఈ పథకం అమలు తీరు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలో నత్తనడకన సాగుతున్న భూ పంపిణీ పథకంపై 10 టీవీ ప్రత్యేక కథనం... 

దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని తెలంగాణ ఉద్యమం నుంచి టీఆర్‌ఎస్‌ చెబుతూ వస్తోంది. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత భూ పంపిణీ పథకాన్ని టీఆర్‌ఎస్‌ అమల్లోకి తెచ్చింది. కానీ ఆరంభించిననాటి నుంచి కూడా ఈ కార్యక్రమం నత్తనడకన సాగుతోంది. ఉద్యమంలో భూ పంపిణీ పథకంపై టీఆర్‌ఎస్‌ చేసిన హడావుడికి, అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న తీరుకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ప్రభుత్వ భూమిలేకపోతే కొనైనా ఇస్తామని చెప్పిన టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.. ఆ తర్వాత విషయాన్ని విస్మరించారన్న విమర్శలున్నాయి. మూడేళ్లలో కేవలం 3,741 మందికే భూమి ఇచ్చారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 807మంది లబ్ధిదారులను ప్రభుత్వం గుర్తించింది. వీరికి 50 కోట్ల నిధులు విడుదల చేయాల్సి ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో  10వేల ఎకరాల భూమి కొనుగోలు చేసి పంపిణీ చేయాలని ఎస్సీ ఆర్థిక  సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నా...  ఇంతవరకు 93.80 కోట్ల రూపాయల వ్యయంతో 2005 ఎకరాలు మాత్రమే కొనుగోలు చేయగలిగారు. జగిత్యాల, జనగాం, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, వరంగల్‌ అర్బన్‌, యాదాద్రి భువనరిగి జిల్లాల్లో ఒక ఎకరా భూమి కూడా పంపిణీ చేయలేదు. ఖమ్మంలో 9మందికి, కుమ్రం భీం జిల్లాల్లో నలుగురికి మాత్రమే భూ పంపిణీ చేశారు. ఆదిలాబాద్‌లో 199 మందికి, జోగులాంబ-గద్వాల జిల్లాలో 77, సిద్దిపేట జిల్లాలో 71, వనపర్తిలో 75 మందికి పంపిణీ చేశారు. మిగతా జిల్లాల్లో పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది.

ఈ పథకం సక్రమంగా అమలు జరగకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎకరం భూమి కొనుగోలుకు 7 లక్షల రూపాయలకు మించరాదన్న నిబంధన విధించారు.  ఈ ధరకు భూమి లభించే అవకాశాలున్నా రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధుల జోక్యం ఎక్కువవుతోందన్న విమర్శలున్నాయి.  ప్రజా ప్రతినిధులు చూపించిన భూమినే  కొనుగోలు చేయాలన్న నిబంధనతో  నిధులు చేతులు మారుతున్నాయనే ఆరోపణలున్నాయి. వీరి జోక్యంతో  నాలుగైదు లక్షల  రూపాయలకు  లభించే భూమిని  7 లక్షల రూపాయల వరకు వెచ్చించాల్సి వస్తోందని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా చాలా మంది ఎమ్మెల్యేలు భూ పంపిణీ పథకంపై ఆసక్తి చూపకపోవడం కూడా నత్తనడకన సాగడానికి కారణమవుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకా  నాలుగున్నర నెలలే మిగిలివుంది. ఈ కొద్ది వ్యవధిలో  8వేల ఎకరాల భూమి కొనుగోలు చేసి, పంపణీ చేయడం  సాధ్యమయ్యే పనేనా.... అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

15:35 - December 7, 2017

హైదరాబాద్ : సీబీఐటీలో రెండురోజులుగా జరుగుతున్న పరినామాలు బాధకలిగించాయన్నారు మర్రి ఆదిత్యారెడ్డి. తమ తాతగారు స్థాపించిన  విద్యాలయంలో పేదవిద్యార్థులకు ఉన్నత చదువులు అందించాలనుకున్నాం. ఫీజుల పెంపుపై బోర్డుతో సమావేశం అవుతామన్నారు. ఫీజుల పెంపుపై రోల్‌బాక్‌ చేయకపోతే చర్యలు తీసుకోవాల్సి వస్తుందన్నారు. సీబీఐటీ కాలేజీలో మౌలిక వసతుల లేమి ఉందన్నారు కలేజీ ప్రిన్సిపల్‌ రవీందర్‌ రెడ్డి. ఈ విషయమై 9న మేనేజ్‌మెంట్‌తో మాట్లాడుతామని తెలిపారు. 

15:32 - December 7, 2017

విజయవాడ : నిన్న విజయవాడలో జరిగిన రౌడీ షీటర్‌ సుబ్బు హత్యకేసుపై కొందరు వ్యక్తులు వీడియోను రిలీజ్‌ చేశారు. రేవేంద్రపాటు పొలాల్లో వీడియో తీసి వాయిస్‌తో కూడిన వీడియో ఫుటేజీను గుర్తుతెలియని వ్యక్తులు మీడియాకు పంపారు. సుబ్బు హత్యకేసుతో తమకు ఎలాంటి సంబంధంలేపోయినా తమపై ఆరోపణలు వచ్చినందుకే లొంగిపోతున్నామని తెలిపారు.

 

15:26 - December 7, 2017

హైదరాబాద్ : సికింద్రాబాద్‌..బేగంపేట్.. ప్రకాశ్‌ నగర్‌లోని కేర్‌ నర్సింగ్‌ కాలేజ్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రిన్సిపాల్‌ వేధింపులకు వ్యతిరేకంగా.. ఆందోళన చేస్తున్న విద్యార్థుల పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై.. ఎస్‌ఐ మధు చేయిచేసుకున్నాడు. వీడియో తీస్తున్న మీడియాపై కూడా దాడికి ప్రయత్నించాడు. ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశాడు. 

15:24 - December 7, 2017

గుంటూరు : పోలవరం ప్రాజెక్టుపై కేంద్రంతో మాట్లాడేందుకు అఖిపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లాన్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ఇప్పుడు అఖక్షిపక్షాన్ని తీసుకెళ్లాల్సిన అవసరంలేదున్నారు. అవసరమైనప్పుడు చూద్దామన్నారు. పోలవరం పూర్తి కావాలని పవన్‌ కల్యాణ్‌ చేస్తుంటే వైసీపీ, కాంగ్రెస్‌లు ఆటంకాలు సృష్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.  పోలవరంను అడ్డుకున్నవారే పాదయాత్రలు చేస్తున్నారని పరోక్షంగా వైసీపీ అధినేత జగన్‌ను విమర్శించారు. 

 

ప్రజలకు మంచి చేయాలనే తపన చిరంజీవికి ఉంది : పవన్

తూర్పుగోదావరి : ప్రజలకు మంచి చేయాలనే తపన చిరంజీవికి ఉండేదని కానీ ప్రజారాజ్యంలో చిరంజీవి వెంట స్వార్థపరులు ఉండటం వల్లే పార్టీ కూలిపోయింది. చిరంజీవి నోరులేని వ్యక్తి కాబట్టే పరకాల ప్రభాకర్ ప్రజారాజ్యం వేదిక మీద నుంచి పార్టీని తిట్టిపోశారని పవన్ అన్నారు. 

ప్రతిపక్షంలో ఉన్న పనులు చేయవచ్చు : పవన్

తూర్పుగోదావరి : సీఎం అయ్యే వరకు ఆగండి అప్పుడు పనులు చేస్తామంటే కుదరదని, ప్రతిపక్షంలో ఉన్నా ప్రభుత్వంతో పనులు చేయించవచ్చునని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. 

సీఎం కావడమే రాజకీయా మార్పు కాదు : పవన్

తూర్పుగోదావరి : విధివిధానాలు లేకుంగా రాజకీయాల్లోకి రాలేదని, సీఎం కావాడమే రాజకీయా మార్పు కాదని, సామాజిక మార్ప తేవడమే రాజకీయమని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. 

14:10 - December 7, 2017

ఆయన నిర్మాణంలో నటించలాని చాలా మంది హీరోయిన్స్ అనుకుంటారు. ఆ నిర్మాత అడిగిన వెంటనే ఒప్పుకుంటారు. కానీ అటువంటి నిర్మాతకు సాయి పల్లవి షాక్ ఇచ్చింది. ఆ నిర్మాత ఎవరో కాదు దిల్ రాజు. దిల్ రాజు నిర్మాతగా నితిన్ హీరో శ్రీనివాస కల్యాణం అనే మూవీ తీయబోతున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా సాయి పల్లవిని సంప్రదిస్తే ఆమె నటించడానికి నిరాకరించిదట. నితిన్ తో సినిమా చేయాను అని తెగెసి చెప్పిందట ఎందుకంటే ఆ మూవీలో తన పాత్రకు ప్రాధ్యానత లేదని కారణం చెబుతుంది. సాయి పల్లవి ఇదే కారణమో లేక ఇక్కెమైన కారణంతో నో చెప్పిందో తెలియదు.

 

చంద్రబాబు వివరణ ఇవ్వాలి : రామకృష్ణ

కృష్ణా : రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందాలపై సీఎం చంద్రబాబు ప్రజలకు వివరణ ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. పోలవరం, అమరావతికి కేంద్ర సహకరించడం లేదని టీడీపీ నేతలు నోరు విప్పడం లేదని రామకృష్ణ అన్నారు. 

13:58 - December 7, 2017

ప్రముఖ నటి విజయశాంతికి ఓ కేసులో ఊరట లభించింది. విజయశాంతి తనను మోసం చేశారంటూ గతంలో ఇందర్ చంద్ అనే వ్యక్తి చెన్నై జార్జ్ టౌన్ కోర్టులో పిటిషన్ వేశారు. ఓ స్థల యాజమాని దానిని అమ్మడానికి విజయశాంతికి పవర్ ఆఫ్ పట్టాను ఇచ్చారు. ఆ స్థలాన్ని మొదట తనకు విక్రయించేందుకు ఒప్పందాలు జరిగిన తర్వాత ఆ స్థలాన్ని మరో వ్యక్తికి అమ్మిందని ఆయన పిటిషన్ పేర్కొన్నాడు. దీనిపై విచారించిన హైకోర్టు విజయశాంతి అనుకూలంగా తీర్పు చెప్పింది. 

కన్నెపల్లికి బయల్దేరిన కేసీఆర్

కరీంనగర్/భూపాలపల్లి : సీఎం కేసీఆర్ కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి అన్నారం బయల్దేరారు. కేసీఆర్ అన్నారం బ్యారేజీ నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. 

13:39 - December 7, 2017

శ్రీ నక్క యాదగిరి స్వామి ఆశీస్సులతో స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సుమంత్ హీరోగా, ఆకాంక్ష సింగ్ హీరోయిన్‌గా గౌతమ్ దర్శకత్వంలో రాహుల్ నక్క నిర్మించిన రొమాంటిక్ డ్రామా 'మళ్లీ రావా'. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని డిసెంబర్ 8న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ తరుణంలో చిత్ర హీరో..హీరోయిన్లతో టెన్ టివి ముచ్చటించింది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

13:31 - December 7, 2017
13:29 - December 7, 2017

నల్గొండ : శాలిగౌరారంలో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా చేపట్టింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇప్పుడు నిరాకరిస్తున్నాడని ప్రియురాలు వాపోయింది. ఇటుకల పహాడ్ గ్రామానికి చెందిన గాజుల నాగరాజు, అదే గ్రామానికి చెందని మౌనికలు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఒకే సామాజిక వర్గం కావడంతో పెళ్లి చేసుకోవాలని మౌనిక కోరింది. దీనికి నాగరాజు ఒప్పుకోలేదు. అనంతరం గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగింది. పెళ్లి చేసుకొనేందుకు ఒప్పించారు. కానీ అప్పటి నుండి కనిపించకుండా పోయిన నాగరాజు మంగళవారం ఇంటికి వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న మౌనిక అతని ఇంటికి చేరుకుని నిలదీసింది. పెళ్లి చేసుకోవాలంటే రూ. 15 లక్షలు కట్నం తీసుకరావాలని నాగరాజు చెప్పడాని పేర్కొంటూ మౌనిక ధర్నా చేపట్టింది. 

13:23 - December 7, 2017

మెదక్ : ఓయూలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి మురళీ కుటుంబం ఇంకా షాక్ లోనే ఉంది. ఉస్మానియాలో ఎమ్మెస్సీ చదువుతున్న మురళీ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. మృతుడి కుటుంబాన్ని టి.కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. సంగారెడ్డి జిల్లా జగదేవ్ పూర్ లో నివాసం ఉంటున్న వెంకటేష్ కుటుంబంతో టెన్ టివి మాట్లాడింది. తన సోదరుడు చాలా మంచి వ్యక్తి అని, ఏదో జరిగిందని మృతుడి సోదరుడు వాపోయాడు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

కన్నెపల్లి పంప్ హౌస్ పరిశీలించిన కేసీఆర్

భూపాలపల్లి/కరీంనగర్ : సీఎం కేసీఆర్ కన్నెపల్లి పంప్ హౌస్ ను పరిశీలించారు.  మేడిగడ్డ ఎగువన కన్నెపల్లి వద్ద భారీ పంప్ హౌస్ నిర్మాణం జరుగుతుందని గ్రావిటీ కాల్వ ద్వారా గోదావరి నీళ్లు ఎత్తిపోసేందుకు పంప్ హౌస్ ను కన్నెపల్లి వద్ద రూ.2826 కోట్ల వ్యయంతో భూ మట్టానికి 40 మీటర్ల దిగువన పంప్ హౌస్ కు 40 మెగావాట్ల సామర్థ్యంతో 11 పంపులు ఏర్పాటు చేశామని ఒక్కొక్క పంప్ ద్వారా ఎగువకు 23 వేల క్యూసెక్కులు, రోజుకు రెండు టీఎంసీలు ఎత్తిపోసేలా ప్రణాళిక రూపకల్పన చేశామని కేసీఆర్ తెలిపారు. 

13:19 - December 7, 2017
13:17 - December 7, 2017

ఢిల్లీ : ఆధార్ అనుసంధానంపై సుప్రీంలో విచారణ జరిగింది. మార్చి 31 వరకు పొడిగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్రం పేర్కొంది. ప్రస్తుతం ఆధార్ అనుసంధానికి ఆఖరి గడువు డిసెంబర్ 31గా ఉన్న సంగతి తెలిసిందే. మొబైల్, బ్యాకింగ్ సేవలు..సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసంధానం చేయడంపై పలువురు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తమ వ్యక్తిగత వివరాలు బయటకు పొక్కే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు. దీనిపై సుప్రీం గురువారం విచారణ చేపట్టింది. దీనిపై కేంద్రం తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇప్పటి వరకు ఆధార్ లేని వారికి మాత్రమే ఇది వర్తింప చేసే విధంగా చూస్తామన్నారు. మొబైల్ సేవలకు ఆధార్ అనుసంధానానికి ఆఖరి గడువు ఫిబ్రవరి 6గా నిర్ణయించినట్లు తెలుస్తోంది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది. 

13:14 - December 7, 2017

విజయవాడ : ప్రతిపక్షాలు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరిని కలిసిన కాంగ్రెస్ నేతలు ఈ అంశంపై ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం తన లక్ష్యమని తెలిపారు. పోలవరం నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తూ కోర్టుల్లో కేసులు వేస్తున్నారని పేర్కొన్నారు. ఎట్టిపరిస్థితుల్లో ప్రాజెక్టు పూర్తి చేయాలనే లక్ష్యంగా ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేయాలని ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు. 

ఆధార్ లింక్ పై సుప్రీంలో విచారణ

ఢిల్లీ : ఆధార్ అనుంసంధానంపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరిగింది. మార్చి 31 వరకు ఆధార్ అనుసంధానం గడువు పొడగించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర సుప్రీంకు తెలిపింది. ప్రస్తుతం ఆధార్ అనుసంధానికి ఆఖరి గడువు డిసెంబర్ 31గా ఉంది. మొబైల్ సేవలకు ఆధార్ అనుసంధానికి ఆఖరి గడువు ఫిబ్రవరి 6 తేదీ వరకు ఉంది.

మేడిగడ్డ నుంచి కన్నెపల్లికి బయల్దేరిన కేసీఆర్

కరీంనగర్/భూపాలపల్లి : సీఎం కేసీఆర్ మేడిగడ్డ నుంచి కన్నెపల్లి పంప్  హౌస్ కు  బయల్దేరారు. అక్కడ ఆయన పంప్ హౌస్ నిర్మాణాన్ని పరిశీలించనున్నారు. 

ఢిల్లీలో అంబేద్కర్ అంతర్జాతీయ కేంద్రం

ఢిల్లీ : రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అంతర్జాతీయ కేంద్రం దేశ రాజధానిలో ప్రారంభమైంది. శుక్రవారం దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఈ సెంటర్ ను ప్రారంభించారు. కేంద్రంలో ఏర్పాటు చేసిన రెండు అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరించి నివాళులర్పించారు. 

12:36 - December 7, 2017

గత కొంతకాలంగా పెరగుతూ వస్తున్న బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. స్థానికంగా జ్యూవెల్లర్ల నుంచి డిమాండ్ లేకపోవడం, అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ కొనసాగుతుండడంతో బులియన్ మార్కెట్ లో బంగారం ధరుల రూ 200 తగ్గింది. బుధవారం 10గ్రాముల బంగారం ధర రూ. 30,050 గా ఉంది. బంగారంతో పాటు వెండి ధరలు కూడ తగ్గాయి. 

12:35 - December 7, 2017

ఢిల్లీ : రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అంతర్జాతీయ కేంద్రం దేశ రాజధానిలో ప్రారంభమైంది. శుక్రవారం దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఈ సెంటర్ ను ప్రారంభించారు. కేంద్రంలో ఏర్పాటు చేసిన రెండు అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరించి నివాళులర్పించారు. గతేడాది ఏప్రిల్ 14వ తేదీన కేంద్రం నిర్మాణానికి మోడీ శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. 8 నెలల్లోనే నిర్మాణం పూర్తి చేసిన అధికారులను మోడీ అభినందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. స్వాతంత్రానంతరం అంబేద్కర్ ఆశయ సాధనకు సరైన కృషి జరగలేదన్నారు. కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రులు గెహ్లాట్, రామ్ దాస్ అత్వాలే, కేంద్ర మంత్రులు విజయ్ సంప్ల, విజయ్ ఘోయల్, కృష్ణపాల్ తదితరులు పాల్గొన్నారు. 

దక్షిణ కొరియా పర్యటన వివరాలు వెల్లడించిన సీఎం

గుంటూరు: అమరావతిలో దక్షిణకొరియా పర్యటన వివరాలను ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఏపీ ఆటో మొబైల్ హబ్ గా మారుతుందని, అభివృద్ధిలో దక్షిణకొరియా దూసుకుపోతుందని చంద్రబాబు తెలిపారు. 

12:20 - December 7, 2017

శ్వేత పత్రంల విడుదల చేయాలి : పవన్

పశ్చిమగోదావరి : పోలవరం ప్రాజెక్టు పై పూర్తి వివరాలు తెలుసుకునేందుకే ఇక్కడకు వచ్చా అని పవన్ కల్యాణ్ అన్నారు. ఒక ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్నప్పుడు అన్నికోణాల్లో ఆలోచించాలని, పెద్ద ప్రాజెక్టు నిర్మాణల్లో అవినీతి ఆరోపణలు సహజమని, ఆరోపణలపై విచారణ చేయాలని ఆయన కోరారు. పోలవరం కాంట్రాక్ట్ సంస్థ ఉన్న అర్హతలు ఏంటో చెప్పాలని, పోలరవంపై శ్వేతపత్రం విడుదల చేయాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. 

12:18 - December 7, 2017

పశ్చిమగోదావరి : పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. పోలవరం నిర్మాణంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పోలవరం ప్రాజెక్టును సందర్శించాలని నిర్ణయించడం ప్రాధాన్యత సంతరించుకుంది. గురువారం ఆయన పోలవరం ప్రాజెక్టును సందర్శించి జరుగుతున్న పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో పవన్ మాట్లాడారు.

పోలవరంపై తనకు సరియైన అవగాహన లేదని..తెలుసుకోవాలనే ఇక్కడకు వచ్చినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు ఏ ఒక్క ప్రభుత్వానిదో..ఏ ఒక్క పార్టీదో కాదని..ప్రజలదన్నారు. ప్రాజెక్టు వల్ల ఎంత లాభం..ఎంత నష్టం అన్నది పరిశీలించాలని, నిర్మాణంలో అడ్డంకులు పడుతున్నాయన్నారు. నిర్మాణం జాప్యం జరిగే కొద్ది వ్యయం విపరీతంగా పెరిగిపోయే అవకాశం ఉందని, 2018 నాటికి పూర్తవుతుందని ప్రభుత్వం చెప్పడం కరెక్టు కాదన్నారు. ఇలాంటి మాటలు చెబుతూ ప్రజలను మభ్య పెట్టవద్దని, ఎన్నికల రాజకీయాలు చేయవద్దని సూచించారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో పారదర్శకంగా ఉన్నామని చెబుతున్న ప్రభుత్వం ఎందుకు శ్వేతపత్రం విడుదల చేయడం లేదని సూటిగా ప్రశ్నించారు. కేంద్రం ఇస్తున్న నిధులు..ఇతరత్రా లెక్కలు తెలియచేయాలని, అవకతవకలు జరగలేదని చెబుతున్న ప్రభుత్వం అందుకనుగుణంగా ప్రకటన చేయాలన్నారు. పోలవరం పునరావాస కార్యక్రమాలు సక్రమంగా జరగాలని పవన్ సూచించారు. 

12:14 - December 7, 2017

విజయవాడ : దక్షిణకొరియా పర్యటన ముగించుకున్న సీఎం చంద్రబాబు నాయుడు అమరావతికి చేరుకున్నారు. బుధవారం అర్ధరాత్రి గన్నవరం చేరుకున్న బాబుకు ఏపీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పర్యటనకు సంబంధించిన విశేషాలను బాబు గురువారం మీడియాకు తెలియచేశారు.

5వేల కోట్లు పెట్టుబడులు వచ్చే విధంగా ఒప్పందాలు చేసుకున్నట్లు, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయన్నారు. జపాన్ కంపెనీలతో ఎప్పటి నుండో తాము పనిచేయడం జరుగుతోందని, ఆయా కంపెనీలు ఏపీకి రావాలని ఆకాంక్షించారు. ప్రపంచంలో ఉన్న నాలెడ్జ్ ను ఏపీకి తీసుకొచ్చే విధంగా కృషి చేయడం జరుగుతోందన్నారు. రాబోయే రోజుల్లో ఏపీ పరిశ్రమల హబ్ గా మారుతుందని పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ నేర్చుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 

మేడిగడ్డ బ్యారేజ్ పరిశీలించిన కేసీఆర్

కరీంనగర్/భూపాలపల్లి : సీఎం కేసీఆర్ మేడిగడ్డ చేరుకుని అక్కడ ఫోటో ఎగ్జిబిషన్ ను సీఎం కేసీఆర్, మంత్రులు ఈటల, హరీష్ రావు, ప్రభుత్వ సలహాదారు వివేక్, అధికారులు తిలకించారు. అనంతరం మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు. కాళేశ్వరం ఎత్తిపోతలలో భాగంగా మేడిగడ్డ సమీపంలో అంబట్ పల్లి వద్ద 100 మీటర్ల ఎత్తు, 1.6కిలోమీటర్ల వెడల్పుతో రూ.1849 కోట్లతో మొదటి ఆనకట్ట  నిర్మిస్తున్నామని కేసీఆర్ తెలిపారు. 

12:00 - December 7, 2017

ప్రతి ఏటా జరిగే ఐపీఎల్ మ్యాచ్ లు వచ్చే ఏడాది ఢిల్లీలో జరుగుతాయా లేదా అన్న వాదానలు వినిపిస్తున్నాయి.దీనికి కారణం ఢిల్లీలో వాయు కాలుష్యం ఎక్కువగా ఉండడమే ఢిల్లీ డేర్ డెవిల్స్ సొంత మైదానమైన ఫీరోజ్ షా కోట్ల లో జరిగే మ్యాచ్ లు అన్ని తిరుగునంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ మార్చనున్నట్లు వార్తలు వినబడుతున్నాయి.

ఆటగాళ్లకు ఇబ్బందులు..
భారత్ శ్రీలంక మధ్య జరిగిన మూడవ టెస్ట్ కు ఢిల్లీలో ఫీరోజ్ షా కోట్ల మైదానం వేదికగా నిలిచింది. అయితే ఈ టెస్టు జరుగుతున్న అన్ని రోజులు ఆటగాళ్లను వాయు కాలుష్యం ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో అందరికి తెలుసు. ఇరు జట్ల పెస్ బౌలర్లు అక్మల్, షమీ మైదానంలోనే వాంతులు చేసుకున్నారు. శ్రీలంక జట్టు ఏకంగా మాస్క్ లు ధరించి ఫీల్డింగ్ చేసింది. ఈ పరిస్థితిల్లో వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్ లో ఢిల్లీలో మ్యాచ్ లు నిర్వహిస్తే సమస్యలు తలెత్తె అవకాశం ఉందని బీసీసీఐ భావిస్తుంది.

పోలవరం ఏ ఒక్క ప్రభుత్వానిదో కాదు : పవన్

పశ్చిమగోదావరి : పోలవరం ప్రాజెక్టు  ఏ ఒక్క ప్రభుత్వానిదో, ఏ ఒక్క పార్టీదో కాదు అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ప్రాజెక్టు వల్ల లాభం ఎంత, నష్టం ఎంత అనేది పరిశీలించాలని, పునరావస కార్యక్రమాలు సక్రమంగా జరగాలని ఆయన కోరారు. 

11:53 - December 7, 2017

యాదాద్రి జిల్లా : చిన్న చిన్న వాటికే విద్యార్థులు తీవ్ర మనస్థాపానికి గురవుతున్నారు. క్షణికావేశంలో బలవన్మరణాలకు పాల్పడుతూ తల్లిదండ్రులకు తీరని శోకం కలిగిస్తున్నారు. తాజాగా జిల్లాలోని రాజుపేట మండలం రఘునాథపురం జెడ్పీ స్కూల్ లో అటెండర్ మందలించడానే కారణంతో ఓ విద్యార్థి తనువు చాలించాడు. వెంకటేష్ అనే విద్యార్థి 9వ తరగతి చదువుతున్నాడు. బుధవారం మధ్యాహ్న భోజనానికి లైన్ లో వెంకటేష్ నిలిచి ఉన్నాడు. లైన్ తప్పి ముందుకు రావడంతో అక్కడనే ఉన్న స్కూల్ అటెండర్ మందలించినట్లు తెలుస్తోంది. అంతేగాకుండా బెత్తంతో కొట్టినట్లు సమాచారం. తీవ్రమనస్థాపానికి గురైన వెంకటేష్ ఇంటికి వెళ్లి సమీపంలో ఉన్న చెట్టుకు ఉరేసుకుని మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఘటనకు కారణమైన అటెండర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

11:50 - December 7, 2017

భారత్ క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ బాలీవుడ్ నటి అనుష్క శర్మను పెళ్లి చేసుకుంటున్నాడని ఓ వార్త వైరల్ గా మారింది. వారిలో పెళ్లి ఇటలీలో జరుగుతుందని గురువారం కోహ్లీ ఇటలీ బల్దేరివెళ్తున్నాడని ప్రచారం ఒక్కసారిగా ఊపుందుకుంది. అందుకు కారణం లేకపోలేదు శ్రీలంకతో జరుగనున్న వన్డే, టీ20లకు కోహ్లీ దూరంగా ఉన్నారు కాబట్టి పెళ్లి కోసమే ఆయన వన్డే, టీ20ల దూరుమయ్యాడని అందురు అనుకుంటున్నారు. ఈ విషయంపై అనుష్క శర్మ మేనేజర్ స్పందించారు. మీడియాలో వారిద్దరి వివాహాం సంబంధించి వస్తున్న వార్తలను ఖండించారు. అందులో ఎంత మాత్రం నిజం లేదని ఆయన స్ఫష్టం చేశారు. 

11:46 - December 7, 2017

ప్రముఖ మలయాళ నటుడు దీలిప్ కుమార్ హీరోగా నటిచింన మలయాళీ  చిత్రం రామ్ లీలా. ఈ మూవీ పొటికల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కింది. ఈ మధ్యే విడుదలై మంచి పేరునే తెచ్చుకుంది. అయితే ఈ సినిమా తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరగుతున్నాయి. రామ్ లీలా రీమేక్ లో కల్యాణ్ రామ్ నటించే చాన్స్ ఉందని తెలుస్తోంది. ఈ స్టోరీ కల్యాణ్ రామ్ నచ్చడంతో ప్రస్తుతం ఆయన ఈ మూవీ తెలుగు హక్కుల కోసం ప్రయత్నిస్తున్నారని సమాచారం. కల్యాణ్ రామ్ ప్రస్తుతం ఎమ్మెల్యే అనే చిత్రంలో నటిస్తున్నాడు.

 

11:45 - December 7, 2017

కరీంనగర్ : తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల బాట పట్టారు. ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ప్రాజెక్ట్‌ పనులు పరిశీలించడానికి బుధవారం కరీంనగర్ చేరుకున్నారు. గురువారం ఉదయం తుపాకుల గూడెం సీఎం కేసీఆర్ చేరుకున్నారు. ఆయన వెంట మంత్రి హరీష్ రావు, డీజీపీలున్నారు.

మేడిగడ్డ, అన్నారం, కన్నెపల్లి, సుందిళ్ల, గోలివాడలో జరుగుతున్న కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పనులను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. మధ్యాహ్నం మంథని మండలం సిరిపురం వద్ద నిర్మిస్తున్న అన్నారం రిజర్వాయర్ పనులను సందర్శిస్తారు. భోజనం అనంతరం రామగుండంలోని గోలివాడ పంప్‌ హౌజ్‌ పనులను కూడా పరిశీలించి.. రాత్రికి అక్కడే ఎన్టీపీసీలో బస చేస్తారు. 

9వ తరగతి విద్యార్థి ఆత్మహత్య

యాదాద్రి : జిల్లా రాజాపేట మండలం రఘునాథపురంలో 9వ తరగతి విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మధ్యాహ్న భోజన సమయంలో అటెండర్ తిట్టడంతో మనస్థాపానికి గురయ్యాడని తోటి విద్యార్థులు చెబుతున్నారు. 

11:41 - December 7, 2017

మెదక్ : అభం..శుభం తెలియని చిన్నారులపై కామాంధులు రెచ్చిపోతున్నారు. కన్నుమిన్ను కానక వ్యవహరిస్తున్నారు కొందరు దుర్మార్గులు. తాజాగా ఓ ఆరేళ్ల బాలికపై కామాంధుడు అత్యాచారం జరిపి హత్యకు పాల్పడిన ఘటన సంచలనం సృష్టించింది. బీహార్ రాష్ట్రానికి చెందిన ఓ కుటుంబం పొట్ట చేత పట్టుకుని మనోహార్ బాద్...ముప్పేటి మండలానికి వచ్చి నివాసం ఉంటోంది. ఈ కుటుంబానికి చెందిన ఆరేళ్ల బాలిక ఖుష్బూ కిడ్నాపైంది. బీహార్ రాష్ట్రానికి చెందిన ఓ యువకుడిపై అనుమానం వచ్చిన పోలీసులు అతడిని అదుపులోకి విచారించారు. మద్యం మత్తులో ఉండడంతో ఎలాంటి విషయాలు వెల్లడించలేదు. గురువారం జరిగిన ఘోరం వెల్లడించాడు. మిషన్ భగీరథ పైపులో దాచిపెట్టిన బాలిక మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకన్నారు. తమ కుమార్తె మృతి చెందిందని తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. 

మేడిగడ్డకు చేరుకున్న సీఎం కేసీఆర్

కరీంనగర్/భూపాలపల్లి : జిల్లా మేడిగడ్డకు సీఎం కేసీఆర్ చేరుకున్నారు. ఆయన తుపాకులగూడెం వద్ద బ్యారెజీని పరిశీలించి మేడిగడ్డకు చేరుకున్నారు. 

11:25 - December 7, 2017

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ జనరల్ బాడీ ప్రత్యేక సమావేశం జరుగనుంది. మేయర్ బొంతు రామ్మోహన్ గౌడ్ అధ్యక్షతనలో జరిగే ఈ సమావేశంలో మిగిలిన నాలుగు వార్డుల్లో 114మంది వార్డు కమిటీ సభ్యుల నామిషేన్, వార్డు కమిటీల్లో మహిళా సభ్యుల నియామకంతో పాటు ఏరియా సభలకు మిగిలిన 276 ప్రతినిధుల నియామకంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. మిగిలినపోయి వార్డు ఏరియా, కమిటీ సభ్యులను ఎన్నుకోనున్నారు. సభ్యుల ప్రశ్నలు స్టాండింగ్, కమిటీ ఆమోదించిన తీర్మానాలపై కౌన్సిల్ చర్చించనుంది. డబుల్ బెడ్ రూం, నాలాల ఆక్రమణ..తదితర అంశాలపై కూలంకుశంగా చర్చించన్నునట్లు కార్పొరేటర్ మన్నె కవిత టెన్ టివికి తెలిపారు. అయిన వాటికి కూడా కాలేదని ప్రతిపక్షాలు ప్రశ్నలు సంధిస్తున్నారని, మేయర్ ప్రతొక్కరికీ అవకాశం కల్పిస్తున్నారని తెలిపారు. 

విద్యార్థులతో చర్చలకు వచ్చిన సీబీఐటీ

రంగారెడ్డి  : పెంచిన ఫీజులు తగ్గించాలని చేస్తున్న విద్యార్థుల ఆందోళనకు సీబీఐటీ యాజమాన్యం దిగి వచ్చింది. విద్యార్థులు చర్చలు జరపాడానికి సిద్ధమైంది. విద్యార్థులు ఏకకంగా రూ.2లక్షల ఫీజులు పెంచడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. 

11:14 - December 7, 2017

విజయవాడ : పోలవరంకు నేతలు క్యూ కడుతున్నారు. గత కొన్ని రోజులుగా పోలవరం నిర్మాణంపై పలు విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ యాత్ర చేపట్టింది. గురువారం వైసీపీ ప్రజాప్రతినిధులు పోలవరానికి బస్సుల్లో బయలుదేరారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నేత బోత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ప్రతిపక్ష బాధ్యతను నెరవేర్చడానికి పోలవరం సందర్శించనున్నట్లు తెలిపారు. సందర్శన అనంతరం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వెనుకనున్న అంశాలను ప్రజలకు తెలియచేస్తామని, 2019 వరకు ప్రాజెక్టు పూర్తి చేసేలా కేంద్ర..రాష్ట్ర ప్రభుత్వాలపై వత్తిడి తెస్తామని పేర్కొన్నారు. 

పోలవరాన్ని పరిశీలిస్తున్న పవన్

పశ్చిమగోదావరి : జిల్లా పోలవరం ప్రాజెక్టును జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సందర్శిస్తున్నారు. ఆయన ప్రాజెక్టు పనులను పరిశీలిస్తూ ఇంజనీర్లను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. మరో వైపు ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన పవన్ కు జనసేన కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. 

11:10 - December 7, 2017

పశ్చిమగోదావరి : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ పర్యటన కొనసాగుతోంది. మూడు రోజుల పాటు ఏపీలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. బుధవారం విశాఖలోని డీసీఐ ఉద్యోగుల దీక్షలకు మద్దతు తెలిపిన పవన్‌.. సమస్యను కేంద్రం పరిష్కరించకుంటే బీజేపీ పతనం విశాఖ నుంచే మొదలవుతుందని హెచ్చరించారు. గురువారం ఉదయం పోలవరం సందర్శనకు బయలుదేరారు.

పోలవరం ప్రాజెక్టు వద్దకు పవన్ చేరుకోగానే జనసేన కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పోలవరం ప్రాజెక్టు సైట్ ను సందర్శించారు. ప్రాజెక్టు వద్ద జరుగుతున్న పనుల తీరును అక్కడున్న అధికారులనడిగి తెలుసుకున్నారు. ఏరియల్ పాయింట్ నుండి పోలవరం ప్రాజెక్టును ఎస్ ఈ రమేష్ చూపిస్తూ వివరాలు తెలియచేశారు. తరువాత స్పిల్ వే పనులను పవన్ ప్రత్యేక్షంగా తిలకరించారు.

పవన్ చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. జై జనసేన..జై పవన్ అంటూ పెద్ద పెట్టున్న నినాదాలు చేశారు. ఇంజినీర్లతో మాట్లాడుతుండగా అభిమానుల కేకలతో పవన్ కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టుపై వస్తున్న విమర్శలు వస్తున్న తరుణంలో పవన్ పర్యటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న సరైందా ? కేంద్రం చెబుతున్న సరైందా ? 2019లోపు పోలవరం పూర్తవుతుందా ? లేదా ? అనే దానిపై పవన్ ఎలా స్పందిస్తారనేది చూడాలి. 

బంగాళఖాతంలో స్థిరంగా వాయుగుండం

విశాఖ : బంగాళఖాతంలో వాయుగుండం స్థిరంగా కొనసాగుతుంది. ఈ వాయుగుండం గోపాలపూర్ కు 970 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని, రానున్న 24 గంటల్లో ఉత్తరకోస్తాంధ్ర, దక్షిణ ఎడిషా జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 

తుపాకులగూడెం చేరుకున్న కేసీఆర్

కరీంనగర్/భూపాలపల్లి : జిల్లా తుపాకులగూడెంకు సీఎం కేసీఆర్ చేరుకున్నారు. అక్కడ నిర్మాణంలో ఉన్న కాళేశ్వరం బ్యారేజీ నిర్మాణా ప్రాంతాన్ని ఆయన పరిశీలించనున్నారు. 

10:40 - December 7, 2017

భారత్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ రిసెప్షన్ ఢిల్లీలో ఘనంగా జరిగింది. తాజ్ మహల్ హోటల్ లో మంగళవారం ఏర్పాటు చేసిన ఫంక్షన్ కు భారత్ జట్టు ఆటగాళ్లు హాజరైయ్యారు. జహీర్ ఖాన్ వివాహా రిస్షెన్ కు అనుష్క శర్మతో కలిసి వచ్చిన కోహ్లీ ఈ విందుకు ఒక్కడే వచ్చాడు. భువీ విందుకు ధావన్, ఉమేశ్ యాదవ్, ఇషాంద్ శర్మ, సురేశ్ రైనా తన భార్యతో పాటు హాజరైయ్యారు. అంతేకాకుండా ధోని, ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మాథ్యూ హెడెన్ కూడా ఈ విందులో పాల్గొన్నారు.

 

పోలవరం చేరుకున్న పవన్

పశ్చిమగోదావరి : జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోలవరం చేరుకున్నారు. ఆయన పోలవరం ప్రాజెక్టు హిల్ వ్యూ నుంచి ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలిస్తున్నారు. అనంతరం పవన్ మీడియాతో మాట్లాడతారని తెలిసింది.

కాసేపట్లో జీహెచ్ఎంసీ కౌన్సిల్ భేటీ

హైదరాబాద్ : కాసేపట్లో జీహెచ్ఎంసీ కౌన్సిల్ భేటీ కానుంది. గతంలో మిగిలిపోయిన వార్డు కమిటీ సభ్యులు ఎన్నికపై, సభ్యులు ప్రశ్నలు, గత కొద్దినెలలుగా  స్టాండిండ్ కమిటీ ఆమోదించిన తీర్మానాలపై చర్చించనున్నారు. 

10:21 - December 7, 2017

విజయవాడ : వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం పలు చర్యలు తీసుకొంటోంది. బీసీల్లో మరింత వెనుకబడిన వారిని గుర్తించి వారిని పురోగతి సాధించేందుకు...పలు చర్యలు తీసుకొనేందుకు ఎంబీసీ ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. కార్పొరేషన్ ఛైర్మన్..ఎండీలను నియమించారు. ఈ సందర్భంగా ఎంబీసీ కార్పొరేషన్ ఎండీ నాగభూషణంతో టెన్ టివి మాట్లాడింది. సంచార జాతుల మహిళల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. పల్లె నిద్ర కార్యక్రమం ద్వారా ఎంబీసీ స్థితిగతులపై అధ్యయనం చేయడం జరుగుతుందని, ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా 90 శౄతం సబ్సిడీతో రుణాలు అందచేస్తామన్నారు. డిస్ట్రిక్ స్పెసిఫిక్ యాక్షన్ ప్లాన్ తో వెనుకబిన ప్రతి బీసీ కులం స్థితిగతులపై అధ్యయనం చేయడం జరుగుతుందన్నారు. అత్యంత వెనుకబడిన బీసీ కులాల అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. 

మనోహరబాద్ లో దారుణం

మెదక్ : జిల్లా మనోహరబాద్ మండలం ముత్తిరెడ్డిపల్లిలో దారుణం జరిగింది. ఆరేళ్ బాలికపై ఓ కామాంధుడు అత్యాచారం చేసి హత్య చేశాడు. మృత బాలిక బిహర్ కు చెందిన కలాం, హసీనా కూతురు కుష్బూగా పోలీసులు తెలిపారు. రవి అనే వ్యక్తి మాయమాటలు చెప్పి స్కూల్ నుంచి తీసుకెళ్లి ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు పోలీసులు నిర్ధారించారు. 

10:11 - December 7, 2017

రంగారెడ్డి : ప్రైవేటు కాలేజీలో ఫీజుల 'జులుం' కొనసాగుతోంది. పలు కళాశాలల్లో అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తుండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా సీబీఐటీ కాలేజ్ యాజమాన్యం పెద్ద మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారని..వెంటనే ఉన్నత విద్యా మండలి స్పందించాలని విద్యార్థులు..తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. గత రెండు రోజులుగా విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. అధిక మొత్తంలో యాజమాన్యం ఫీజులు వసూలు చేస్తుండడంపై విద్యార్థులు మండిపడుతున్నారు. లక్షలకు లక్షలు ఎక్కడి నుండి తేవాలని విద్యార్థులు..వారి తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. గురువారం నాడు జరుగుతున్న పరీక్షను బాయ్ కాట్ చేశారు. గండిపేట చౌరస్తా నుండి కాలేజీ వరకు భారీ ర్యాలీగా విద్యార్థులు వెళుతున్నారు. విద్యార్థులు చేపడుతున్న ఆందోళనలకు పలు విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి. యాజమాన్యం బెదిరింపులకు దిగుతుండడం సరికాదని వారు పేర్కొంటున్నారు. మరి విద్యార్థుల ఆందోళనపై ఉన్నతాధికారులు..ఉన్నత విద్యా మండలి ఎలా స్పందిస్తుందో చూడాలి. 

10:10 - December 7, 2017

చిత్తూరు : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. తిరుచ్చి జాతీయ రహదారి రతువరం కుడ్చి వద్ద ఆగి ఉన్న లారీని మినీ బస్సు ఢీకొంది. దీనితో 9 మంది అక్కడికక్కడనే మృతి చెందగా నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సులో మొత్తం 15 మంది ప్రయాణీకులున్నట్లు తెలుస్తోంది. మృతుల్లో ఇద్దరు మహిళలు..ముగ్గురు పిల్లలన్నారు. కన్యాకుమారి నుండి తిరుపతికి వస్తుండగా ఈ ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. వేగంగా బస్సు ప్రయాణిస్తుండడం..డ్రైవర్ నిద్ర మత్తులోకి జారుకోవడంతో ప్రమాదానికి గల కారణాలు తెలుస్తోంది. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

ప్రాజెక్టు సందర్శనకు బయల్దేరిన కేసీఆర్

కరీంనగర్ : సీఎం కేసీఆర్ తీగలగుట్ట పల్లి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శించడానికి బయల్దేరారు. ఆయన ఈ రోజు భూపాలపల్లి, పెద్దపల్లిల జిల్లాలో ఉన్న బ్యారేజీలను పరిశీలించనున్నారు. 

జమ్మూలో భూ ప్రకంపనలు

శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్ లో  భూ ప్రకంపనలు వచ్చాయి. ఈ భూ ప్రకంపనలు రిక్టర్ స్కేలుపై 5.1 తీవ్రతగా నమోదు అయింది. దీని ఎలాంటా నష్టం సంభవించలేదని అక్కడి అధికారులు తెలిపారు. 

ఫిజులు తగ్గించాలని సీబీఐటీ విద్యార్థుల ఆందోళన

హైదరాబాద్ : పెంచిన ఫీజులు తగ్గించాలని గండిపేటలోని సీబీఐటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఏకంగా రూ.2లక్షల ఫీజులు పెంచడంపై వారు నిరసన తెలియజేస్తున్నారు. విద్యార్థులు రెండు రోజులుగా తరగతులు బహిష్కరిస్తున్నారు. ఈ రోజు జరిగే పరీక్షలను విద్యార్థులు బాయ్ కాట్ చేశారు. వీరికి పలు విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి. 

09:39 - December 7, 2017

విజయవాడ : పోలవరం నిర్మాణ ప్రాజెక్టు స్థలానికి నేతలు క్యూ కడుతున్నారు. ఇటీవలే పోలవరం నిర్మాణంపై కేంద్రం లేఖ రాయడం..దానిపై సీఎం చంద్రబాబు నాయుడు ఘాటుగా స్పందించడంతో హాట్ టాపిక్ అయ్యింది. దీనిపై విపక్షాలు ప్రభుత్వంపై పలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు పోలవరం నిర్మాణ ప్రాజెక్టును సందర్శించేందుకు సిద్ధమౌతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. అదే సమయంలో వైసీపీ నేతలు కూడా వస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.

విజయవాడ నుండి ప్రత్యేక బస్సుల్లో వైసీపీ ప్రతినిధి బృందం బయలుదేరనుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వెనుక ఉన్న అంశాలను ప్రజలకు తెలియచేస్తామని, అంతేగాకుండా నిర్మాణంపై ఉన్న అనుమానాలను రాష్ట్ర ప్రభుత్వం నివృత్తి చేయాలని పార్థసారధి డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

09:35 - December 7, 2017

గుంటూరు : ప్రభుత్వాస్పత్రి నర్సింగ్‌ కాలేజీలో హైడ్రామా కొనసాగుతోంది. దొరబాబుతో పాటు మరికొంతమంది సీనియర్లు ర్యాగింగ్ కు పాల్పడుతున్నారని..లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని విద్యార్థినిలు పేర్కొంటున్న సంగతి తెలిసిందే. దీనిపై చర్యలు తీసుకోవాంటూ నర్సింగ్ విద్యార్థినిలు ఆందోళన చేపట్టారు. ఈ అంశంపై మహిళా ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారికి విద్యార్థినిలు ఫిర్యాదు చేశారు. నర్సింగ్ కళాశాలకు చేరుకున్న నన్నపనేని ఆరా తీశారు. కానీ ఆసుపత్రి సూపరిటెండెంట్ రాజా నాయుడు కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. ఎలాంటి ఘటనలు చోటు చేసుకున్నా తగిన విధంగా స్పందిస్తామని హామీనిచ్చే ప్రయత్నం చేశారు. నన్నపనేని వెళ్లిన అనంతరం రాజా నాయుడు విద్యార్థినిలను బెదిరించే ప్రయత్నం చేసినట్లు సమాచారం.

ఇదిలా ఉండగానే బుధవారం రాత్రి దొరబాబు ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించి హై డ్రామా సృష్టించే ప్రయత్నం చేశాడు. ఆసుపత్రి సూపరిటెండెంట్ రాజానాయుడు, కళాశాల ప్రిన్స్ పాల్ సరోజినిల ప్రోద్భలంతోనే ఇదంతా జరుగుతోందని విద్యార్థినిలు పేర్కొంటున్నారు. నర్సింగ్ కాలేజీలో ర్యాగింగ్, లైంగిక వేధింపులపై విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. 

నేడు వైసీపీ నేతల పోలవరం సందర్శన

విజయవాడ : నేడు వైసీపీ నేతలు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. కాసేపట్లో వారు విజయవాడ నుంచి ప్రత్యేక బస్సులో బయల్దేరనున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వెనుక ఉన్న అంశాలను ప్రజలకే తెలిజేయడమే ధ్యేయమని వైసీపీ నేతలు అంటున్నారు. 

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో హైడ్రామా

గుంటూరు : జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నర్సింగ్ కాలేజీలో హైడ్రామా చోటుచేసుకుంది. నిన్న జూనియర్ నర్సింగ్ విద్యార్థులు తమపై సీనియర్లు ర్యాంగింగ్ పాల్పడుతున్నారని, దొరబాబు అనే సీనియర్ విద్యార్థి లైంగికంగా వేధిస్తున్నాడని వారు మహిళ కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారికి ఫిర్యాదు చేశారు. దీంతో  ప్రిన్సిపాల్ సరోజిని, ఆసుపత్రి సూపరిండెండెంట్ రాజు నాయుడు, దొరబాబుతో ఆత్మహత్య డ్రామా అడించారు. దీని పుల విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 

09:21 - December 7, 2017

రాజమండ్రి : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ పర్యటన కొనసాగుతోంది. రాజమండ్రిలో బస చేసిన ఆయన కాసేపట్లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. ఇటీవలే పోలవరం నిర్మాణంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. దీనిపై కేంద్రం లేఖ రాయడం..సీఎం చంద్రబాబు నాయుడు ఘాటుగా స్పందించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని వదిలేసి చేతులెత్తి దండం పెడుతానని ఇటీవలే సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్న సంగతి తెలిసిందే. దీనితో పోలవరం నిర్మాణంపై పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారోనే దానిపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పోలవరం నిర్మాణాన్ని పరిశీలించిన అనంతరం రాజమండ్రిలో జరిగే సమన్వయకర్తల సమావేశంలో పవన్ పాల్గొని ప్రసంగించనున్నారు. పవన్ కు స్వాగతం పలికేందుకు..చూసేందుకు భారీగా అభిమానులు తరలివస్తున్నారు. 

కోరాపుట్ రాయ్ గఢ్ మార్గంలో పట్టాలు తప్పిన రైలు

పాట్నా :  కోరాపుట్ రాయ్ గఢ్ మార్గంలో 6రైలు బోగీలు పట్టాలు తప్పాయి. దీంతో ఆ మార్గంలో 6 రైళ్లను రద్దు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన ఈస్ట్ సెంట్రల్ రైల్వే సిబ్బంది మరమ్మతులు చేస్తున్నారు. 

08:48 - December 7, 2017

ఈ రోజుల్లో మనుషులకు సాధారణంగా ఉండే సమస్య జుట్టు ఉడిపోవడం దీనికి చాలా కారణాలు ఉన్నాయి. జట్టు వాతవారణ కాలుష్య వల్ల గానీ ఎప్పుడు షాంపులు వాడడం వల్ల గానీ, చుండ్రు వల్ల గానీ, నీరు వల్ల గానీ ఉడిపోతుంది. అయితే మనం స్నానం చేసే నీటిలో ఉప్పు శాతం అధికంగా ఉంటే జుట్టు చిట్లి వెంట్రుకాలు పొడిబారి ఉడిపోతాయి. కాబట్టి స్నానం చేసే నీరు ఉప్పు నీరు కాకుండా చూసుకోవాలి. అది తెలుసుకోవాలంటే ఓ జగ్ నీటిలో నీరు తీసుకుని అందులో డిటర్జెంట్ పౌడర్ వేసి బాగా కలపాలి నూరగా వస్తే నీరు మంచిదని అర్థం లేకుంటే ఆ నీరు స్నానానికి పనికి రాదు.

 

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. భక్తులు ఒక కంపార్టుమెంట్ లో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4గంటల సమయం పడుతుంది. 

08:28 - December 7, 2017

హైదరాబాద్ : అత్తింటి ఆరాళ్లాకు మరో మహిళ బలైంది. హైదరాబాద్ రామంతాపూర్ చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి గ్రీష్మ నందిని అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. అత్తింటి వారే తమ కుమార్తెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ఉప్పల్ పీస్ లో ఫిర్యాదు చేశారు. 2014 జూన్ 22వ తేదీన రామాంతాపూర్ కు చెందిన బ్యాంకు ఉద్యోగి దీపక్ తో గ్రీష్మ వివాహం జరిగింది. ఈ సమయంలో రూ. 15 లక్షలు కట్నం కింద ఇచ్చారు. పెళ్లయిన కొద్దికాలానికే అదనపు కట్నం కోసం దీపక్ వేధించడంతో మరో రూ. 15 లక్షలను గ్రీష్మ తల్లిదండ్రులు ఇచ్చారు. అయినా దీపక్ లో ఎలాంటి మార్పు రాలేదు. మరింత కట్నం తేవాలని వేధించాడు. కుల పెద్దలు పంచాయతీ పెట్టినా లాభం లేకుండా పోయింది. దీనితో దీప మానసికంగా కృంగిపోయింది. ఈ నేపథ్యంలో దీప ఉరి వేసుకుని చనిపోయిందని చౌటుప్పల్ ఉంటున్న తల్లిదండ్రులకు దీపక్ సమాచారం అందించాడు. తల్లిదండ్రులు రాకముందే గ్రీష్మ మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. గ్రీష్మ శరీరంపై గాయాలున్నాయని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఉప్పల్ పోలీసులకు గ్రీష్మ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. 

08:22 - December 7, 2017

మెగా స్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత తీసిన ఖైదీ నెంబర్ 150 ఎంతటి విజయాన్ని సాధించిదో అందరికి తెలుసు ఇప్పుడు చిరు అదే ఊపుతో మరో చిత్రం చేస్తున్నారు. అదే చారిత్రత్మకమైన సైరా నరసింహారెడ్డి ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. కీలకమైన పోరాట సన్నీవేశాలతో చిత్రికరణ షురూ చేశారు. హైదరాబాద్ లో వేసిన భారీ సెట్ లో ఈ దృశ్యాలను తెరకెక్కిస్తున్నారు. ఈ పోరాట ఘట్టానికి హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ లీ నేతృత్వం వహిస్తున్నారు. బుధవారం ప్రారంభమైన చిత్ర షూటింగ్ ఈ నెల 22వరుకు జరుగుతందని చిత్ర యూనిట్ తెలిపింది. ప్రముఖ స్వతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవత కథ ఆధారంగా ఈ చిత్రన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. 

08:20 - December 7, 2017

విజయవాడ : సీఎం చంద్రబాబు నాయుడు దక్షిణకొరియా పర్యటన ముగిసింది. బుధవారం అర్దరాత్రి విజయవాడకు చేరుకున్నారు. సియోల్ నుండి ముంబై చేరుకుని అక్కడి నుండి అమరావతికి చేరుకున్నారు. విమానాశ్రయంలో మంత్రులు దేవినేని, కొల్లు రవీంద్రలు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. అనంతరం గురువారం విశాఖకు వెళుతారు. రెండు రోజుల పర్యటన కోసం విశాఖకు వస్తున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు బాబు స్వాగతం పలుకనున్నారు. స్థానికంగా జరిగే కార్యక్రమాల్లో బాబు పాల్గొని రాత్రికి విశాఖలోనే బస చేస్తారు.

 

08:11 - December 7, 2017

పశ్చిమగోదావరి : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ పర్యటన కొనసాగుతోంది. మూడు రోజుల ఆంధ్రప్రదేశ్‌ పర్యటనలో తొలిరోజే.. అజ్ఞాతవాసి.. అధికార, విపక్ష నేతలపై మాటల తూటాలు పేల్చేశాడు. విశాఖలో డీసీఐ ఉద్యోగుల దీక్షలకు మద్దతు తెలిపిన పవన్‌.. సమస్యను కేంద్రం పరిష్కరించకుంటే బీజేపీ పతనం విశాఖ నుంచే మొదలవుతుందని హెచ్చరించారు. గురువారం ఆయన పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు.

పోలవరం నిర్మాణంపై గత కొన్ని రోజులుగా పలు విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. దీనితో పోలవరం అంశం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించడానికి వస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. అనంత‌రం మధ్యాహ్నం రాజమండ్రికి చేరుకుని జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లతో ఆయన స‌మావేశం అవుతారు. పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన అంశాల‌పై ప‌వ‌న్ త‌మ కార్యక‌ర్త‌ల‌కు సూచ‌న‌లు చేస్తారు. 

నేటితో ముగియునున్న గుజరాత్ ఎన్నికల ప్రచారం

ఆహ్మదబాద్ : గుజరాత్ మొదటి దశ ఎన్నికల ప్రచారం నేటి సాయంత్ర 5గంటలకు ముగియనుంది. నేడు బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీగా పార్టీల సభలు, విస్తృత ప్రచారాలు చేయనున్నాయి. ఈ నెల 9న గుజరాత్ మొదటి దశ ఎన్నికలు జరుగనున్నాయి. 

కాసేపట్లో పోలవరానికి పవన్..

రాజమండ్రి : జనసేన అధితనే పవన్ కళ్యాణ్ రాజమండ్రి నుండి పోలవరానికి బయలుదేరనున్నారు. ఆయన పోలవరం సందర్శించనున్నారు. అనంతరం మధ్యాహ్నం రాజమండ్రికి వచ్చి జనసేన సమన్వయకర్తలతో సమావేశం కానున్నారు. 

పెద్దాపురంలో అగ్నిప్రమాదం...

తూర్పుగోదావరి : జిల్లాలోని పెద్దాపురంలో రైస్ మిల్లులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రూ. 4కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.

 

నేడు విశాఖకు సీఎం చంద్రబాబు

గుంటూరు : ఏసీ సీఎం చంద్రబాబు నేడు విశాఖ వెళ్లానున్నారు. రాష్ట్రపతి రామ్ నాథ్ ఆయన స్వాగతం పలకనున్నారు. అనంతరం స్థానికంగా జరిగే కార్యక్రమలలో రాష్ట్రపతితో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. 

ముగిసిన బాబు దక్షిణాఫ్రికా టూర్..

విజయవాడ : సీఎం చంద్రబాబు నాయుడు దక్షిణాఫ్రికా పర్యటన ముగిసింది. బుధవారం అర్దరాత్రి విజయవాడకు చేరుకున్నారు. మంత్రులు దేవినేని, కొల్లు రవీంద్రలు ఘన స్వాగతం పలికారు. 

07:43 - December 7, 2017

వికరాబాద్ కు రేవంత్...

రంగారెడ్డి : టి.టిడిపికి రాజీనామా చేసి టి.కాంగ్రెస్ లోకి వెళ్లిన రేవంత్ రెడ్డి వికారబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. 

07:33 - December 7, 2017

జనసేనాని పవన్‌కల్యాణ్‌... రాజకీయ నాయకుల తీరుపై.. విరుచుకుపడ్డాడు. తండ్రుల అధికారంతో.. తాము గద్దెనెక్కాలనుకునే కల్చర్‌ను ప్రస్తావిస్తూ.. జగన్‌, లోకేశ్‌లను పరోక్షంగా కడిగిపారేశాడు. అదే సమయంలో తనకు సీఎం కావాలన్న సరదా లేదని స్పష్టం చేశాడు. అసలు ముఖ్యమంత్రి పీఠం.. అధికారం కాదని.. ప్రజలకు సేవ చేసే బాధ్యత అని తేల్చి చెప్పాడు. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో రామకృష్ణ (ఏపీ కాంగ్రెస్), శకుంతల (టిడిపి మాజీ మేయర్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

తిరుచ్చిలో ఘోర రోడ్డు ప్రమాదం...

చెన్నై : తమిళనాడులోని తిరుచ్చి ఎన్ హెచ్ పై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ - వ్యాన్ ఢీకొనడంతో 9 మంది మృతి చెందారు. ఐదుగురికి గాయాలయ్యాయి. 

06:41 - December 7, 2017

ఉద్యోగాలు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఇది హాట్‌ టాఫిక్‌. ఉద్యోగాలు కేంద్రంగా పార్టీలు, ప్రజాసంఘాలు, యువకులు ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు. ఉద్యోగ క్యాలెండర్‌ ప్రకటించి.. ఖాళీగా ఉన్న ప్రతి పోస్టును భర్తీ చేయాలని యువకులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ప్రైవేట్ రంగంలో కూడా పెద్ద ఎత్తున ఉపాధి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ అంశంపై టెన్ టివి జనపథంలో డీవైఎఫ్ఐ తెలంగాణ ప్రధాన కార్యదర్శి విజయ్‌ కుమార్‌ విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.....

06:39 - December 7, 2017

రంగారెడ్డి : జిల్లా... గండిపేటలోని CBIT కళాశాల విద్యార్థులు ఆందోళనబాట పట్టారు. ఫీజుల పెంపునకు వ్యతిరేకంగా వందలాది మంది విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి.. ధర్నా చేశారు. కాలేజ్‌ యాజమాన్యం భారీగా ఫీజులను పెంచిందంటూ.. విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. లక్షా 13 వేలు ఉన్న ఫీజును రెండు లక్షలకు పెంచారని.. దీంతో తమ చదువులు ఆగిపోయేటట్టు ఉన్నాయని వాపోయారు. ఫీజులు చెల్లిస్తేనే పరీక్షలకు అనుమతిస్తామని ఒత్తిడి చేస్తున్నారని వారు ఆరోపించారు. విద్యార్థుల జీవితాలతో CBIT కాలేజ్‌ యాజమాన్యం చెలగాటమాడుతుందని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి.

అయితే కళాశాలలో మెరుగైన సదుపాయాలు కోసం ఫీజులు పెంచక తప్పలేదని.. ఈ విషయాన్ని ముందే విద్యార్థులకు చెప్పామని సీబీఐటీ ప్రిన్సిపాల్‌ రవీందర్‌రెడ్డి అంటున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే ఫీజులు పెంచామని సమర్థించుకున్నారు. అయితే విద్యార్థులు మాత్రం విద్యా సంవత్సరం మధ్యలో ఫీజులు పెంచడాన్ని తప్పుపడుతున్నారు. విద్యార్థుల ఆందోళనతో గండిపేట రోడ్డుపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

06:36 - December 7, 2017

రాజమండ్రి : ఫైనాన్స్‌ వ్యాపారంలో నష్టం రావడంతో ఏదోలా కోట్లు గడించాలనుకున్నాడా ఆ ప్రబుద్ధుడు... ఒక్కనెలలో కోటీశ్వరుడైపోవాలనుకున్నాడు. అనుకున్నదే ఆలస్యం అన్నట్లు సంక్రాంతి పండగను లక్ష్యంగా చేసుకుని.. అచ్చు అసలు నోట్లలా నకిలీ నోట్లను తయారుచేసేయడం మొదలెట్టాడు. అత్తమామింట్లోనే మకాం పెట్టేసి... చివరికి పోలీసులకు పట్టుబడి.. కటకటాలపాలయ్యాడు.. ఆ దొంగనోట్ల ముఠా నాయకుడు

ఇక్కడ కనిపిస్తున్న బండిల్స్‌ విలువ.. అక్షరాల 26లక్షలు... రెండువేలు, ఐదువందలు, వంద రూపాయలతో పాటు ఇంకా పూర్తిగా మార్కెట్లో అందుబాటులోకి రాని 200నోట్లు కూడా ఉన్నాయి. కానీ మీరు అనుకున్నట్టుగా ఇవి అసలు నోట్లు కాదు. అసలు నోట్లకు ఏ మాత్రం తీసిపోని నకిలీ నోట్లు. కేవలం ఒక కలర్‌ ప్రింటర్‌ సహాయంతో తయారుచేయబడిన ఫేక్‌ కరెన్సీ ఇదంతా.. తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరు పోలీసు స్టేషన్ పరిధిలో మురళికొండ ప్రాంతానికి చెందిన తేటల శివారెడ్డి... ఉమా మహేశ్వరరావు సహాయంతో ఈ నోట్లను తయారుచేశాడు.

ఫైనాన్స్‌ వ్యాపారం చేసే శివారెడ్డికి.. ఆ వ్యాపారంలో నష్టం రావడంతో ఏకంగా దొంగనోట్లు ముద్రించి కోట్లు గడించాలనుకున్నాడు. తాను ముద్రించిన నోట్లను ఏదోలా సంక్రాంతి పండగకి చలామణి చేసేసి పెద్ద భవనాన్ని కట్టుకోవాలనుకున్నాడు. తూర్పుగోదావరి జిల్లాలో భారీ ఎత్తున జరిగే కోడిపందాల రూపంలో ఆ దొంగనోట్లను చలామణి చేయాలనుకుని ప్లాన్ వేసుకున్నాడు.

దొంగనోట్ల తయారీని టీవీలో చూసిన శివారెడ్డి తాను కూడా వాటిని తయారుచేయాలనుకున్నాడు. ఆలోచన వచ్చిందే తడువు కొత్తకలర్‌ ప్రింటర్‌‌, బండిల్స్‌ కొద్దీ బాండ్‌ పేపర్‌ ను కొనుగోలు చేశాడు. అంతే నోట్లపై సిల్వర్‌ స్క్రీన్‌ ను ఏర్పాటు చేసేందుకు గ్లిట్టర్‌ పెన్‌ లను కొన్నాడు. ఒక బాండ్‌ పేపర్‌కు మూడేసి నోట్ల చొప్పున కట్‌ చేసి.. ప్రింట్‌ చేయడం మొదలుపెట్టాడు. కోట్ల రూపాయల్లో ముద్రించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ముద్రించిన దొంగనోట్లను చలామణి చేసేందుకు, పార్టీలను తెచ్చేందుకు అనపర్తికి చెందిన ఉమామహేశ్వరరావు సహాయం తీసుకున్నాడు. అంతే కాదు బిలాస్ పూర్ వెళ్లిన ఉమామహేశ్వరరావు మూడు కేజీల బరువున్న వెండి బిస్కెట్ల ను తెచ్చి దానిపై బంగారు పూత పూసి గోల్డ్ బిస్కెట్లలా ఏజెన్సీ ఏరియాలో అమ్మేందుకు సిద్దమయ్యాడు. వీరి వ్యవహరం పోలీసులకు తెలియడంతో రంగంలోకి దిగి.. అరెస్ట్‌ చేశారు.

శివారెడ్డి ముఠా పై పోలీసులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ అనపర్తికి చెందిన ఉమామహేశ్వరరావు , శివారెడ్డి తో కలిసి చేయడంపైనా పోలీసులు ఆరాతీస్తున్నారు. రాష్ట్రంలోనే దొంగనోట్ల తయారీకి అడ్డాగా ఉన్న అనపర్తి పాత ముఠా సహాయంతోనే శివారెడ్డి ఈనోట్ల తయారీ మొదలుపెట్టాడా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ పెద్ద ఎత్తున దొంగనోట్ల తయారీ బయటపడడంతో మరోసారి అనపర్తి దొంగనోట్ల అంశం తెరపైకి వచ్చింది. 

06:33 - December 7, 2017

పెద్దపల్లి : ఇద్దరు విద్యార్ధుల మధ్య గొడవ.. ఓ విద్యార్ధి అంధుడయ్యేందుకు కారణమైంది. విద్యార్ధుల తల్లిదండ్రలు ఆందోళనకు దిగడంతో... ఇరువురి విద్యార్ధుల మధ్య పంచాయితి పెట్టాడు ప్రధానోపాధ్యాయుడు. ఇద్దరు విద్యార్థులు అంతలా గొడవ పడుతుంటే ఉపాధ్యాయులు ఏమి చేశారని విద్యార్ధి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పెద్దపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో శ్రీనివాస్‌, హరీష్‌లు 8వ తరగతి చదువుతున్నారు. ఐదు రోజుల క్రితం పాఠశాల ప్రార్ధన సమయంలో ఇద్దరు విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. దీంతో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో శ్రీనివాస్‌ కన్నుకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఉపాధ్యాయులు హుటాహుటిని ఆస్పత్రికి తరలించారు. కంటిచూపు పోయే పరిస్థితి ఉందని వైద్యులు చెప్పడంతో ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. శ్రీనివాస్‌ కంటిచూపు పోవడంతో... ఆస్పత్రికి వచ్చిన తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు.

శ్రీనివాస్‌ తల్లిదండ్రులు ప్రధానోపాధ్యాయుడితో వాగ్వాదానికి దిగారు. దీంతో... ప్రధానోపాధ్యాయుడు బాధిత విద్యార్థికి నష్టపరిహారం ఇప్పిస్తానని చెప్పాడు. ఇదిలావుంటే... ప్రధానోపాధ్యాయుడి తీరు శ్రీనివాస్‌ తల్లిదండ్రులు, బంధువులకు మరింత ఆగ్రహాన్ని తెప్పించింది. స్కూల్‌లో విద్యార్థులు గొడవ పడినా.. ఉపాధ్యాయులు ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనకు 10 రోజుల ముందు పాఠశాలతో విద్యార్ధుల మధ్య జరిగిన మరో గొడవలో ఓ విద్యార్ధి చేయి విరిగింది. అయితే విద్యార్ధులు చదుకోవాల్సిన పాఠశాలలో ఒకరిపై మరొకరు దాడులు చేసుకోవడం తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తుంది. ఒక వేళ జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని పలువురంటున్నారు. ఈ ఘటనపై విద్యాశాఖాధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. 

06:30 - December 7, 2017

ఆదిలాబాద్ : మరోసారి పత్తి రైతులు నిలువునా మోసపోయారు. పంట బాగా వస్తుందని నమ్మబలికితే.. కింగ్ రకం పత్తి విత్తనాలను కొనుగోలు చేశారు. పంట ఏపుగానే పెరిగింది... కానీ పూత, కాత మాత్రం రాలేదు. దీంతో.. ఆందోళన చెందిన రైతులు కంపెనీ ప్రతినిధులను నిలదీశారు. ఇంకా కొన్ని రోజులు ఆగితే... పంట వస్తుందని ఉచిత సలహాలు ఇచ్చారు. 

ఆదిలాబాద్‌ జిల్లాలో వర్షాలు సమృద్ధిగా కురవడతో రైతన్నలు పత్తి పంటను ఎక్కువగా సాగు చేశారు. తమ కంపెనీ విత్తనాలు ఉపయోగిస్తే పంట బాగా పండుతుందని ఓ కంపెనీ ప్రతినిధులు చెప్పడంతో... జైనథ్‌ మండలం మేడిగూడ(సి) రైతులు కింగ్‌ రకం పత్తి విత్తనాలు ఉపయోగించారు. పంటలు ఏపుగానే పెరిగినా... పూత, కాత లేకపోవడంతో.. అవి నకిలీ విత్తనాలమోనని రైతులు ఆందోళన చెందారు. ఈ వ్యవహారంపై కంపెనీ ప్రతినిధులను కలిశారు. అయితే.. వాతవరణంలో మార్పుల వల్లే... ఇలా జరిగిందని తప్పించుకునే ప్రయత్నం చేశారు.

కంపెనీ వ్యవహారంపై రైతులు మండిపడుతున్నారు. ఇతర రకాల విత్తనాలు ఉపయోగించిన రైతులకు దిగుబడి వస్తుండగా... తమ పరిస్థితి ఇలా తయారైందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నకిలీ విత్తనాలు కట్టబెట్టి తమను మోసం చేశారని వాపోతున్నారు. న్యాయం చేస్తామని...హామీ ఇచ్చిన కంపెనీ పట్టించుకోకపోవడంతో... రైతులంతా వ్యవసాయశాఖ ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకుంటామని వ్యవసాయ అధికారులు తెలిపారు. కింగ్‌ విత్తనాలు ఉపయోగించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్‌నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. నకిలీ విత్తనాలు విక్రయించిన కంపెనీపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి.. ఇలాంటి మోసపూరిత కంపెనీల నుండి రైతులను ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు. 

06:26 - December 7, 2017

హైదరాబాద్ : రాహుల్‌గాంధీ త్వరలోనే కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి చేపట్టనున్నారు. అయితే... తెలంగాణ నుంచి ఆయన టీమ్‌లో ఎవరున్నారు ? పార్టీలో పాత, కొత్త నాయకులను యువరాజు ఎలా సంతృప్తిపరచబోతున్నారు ? కాంగ్రెస్‌ ప్రిన్స్‌ సైన్యంలో ఎవరికి చోటు దక్కనుంది? తాజాగా ఇదే అంశం పార్టీలో హాట్‌ టాపిక్‌గా మారింది.

దేశంలో యావత్తు కాంగ్రెస్‌ శ్రేణులు ఎదురుచూస్తున్న రోజు రానే వస్తోంది. గాంధీ కుటుంబం నుంచి మరో ఆశాకిరణం ఏఐసీసీ పగ్గాలు చేపట్టబోతుంది. దీంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ కేడర్‌ సంబరాల్లో మునిగితేలుతుంది. మరోవైపు పార్టీ బరువును భుజానికెత్తుకుంటున్న రాహుల్‌.. తన టీమ్‌ను ఎలా రూపొందించుకుంటారనే దానిపై హాట్‌హాట్‌గా చర్చ జరుగుతోంది.

అయితే... రాహుల్‌ తన టీమ్‌ ఎలా ఉండాలనే దానిపై స్పష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏయే రాష్ట్రాల నుంచి ఎవరెవరికి చోటు కల్పించాలనే దానిపై ఇప్పటికే కసరత్తు పూర్తయినట్లు తెలుస్తోంది. పార్టీలో కోటరీ సాంప్రదాయాలకు చెక్‌ పెట్టేలా టీమ్‌ కూర్పు ఉండేలా జాగ్రత్తలు తీసుకోబోతున్నారట. పాత, కొత్త తరాన్ని మిళితం చేస్తూ... సీనియర్ల అనుభవంతో పాటు.. యువశక్తిని కలుపుతూ తన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.

రాహుల్‌ ప్రత్యేకంగా కొన్ని రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు పలువురు నేతలంటున్నారు. అందులో తెలంగాణకు సముచిత స్థానం కల్పించబోతున్నారని... టీ-కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. తెలంగాణ నుంచి రాహుల్‌ టీమ్‌లో కొంతమందికి పదవులు కట్టబెడుతూనే... రాష్ట్రంలో కూడా కొన్ని పదవులు భర్తీ చేసి ఓ కొత్త లుక్‌ ఇచ్చేలా కసరత్తు చేస్తున్నారని పార్టీ వర్గాలంటున్నాయి. ప్రస్తుత పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ను కొనసాగిస్తూనే.. ఆయన టీమ్‌ను మరింత బలపేతం చేయనున్నట్లు సమాచారం.

ఇక రాహుల్‌ బృందంలో చోటు దక్కించుకునే నేతల జాబితా భారీగానే ఉండబోతుందట. ఈ లిస్ట్‌లో తెలంగాణకు ఒక సీడబ్ల్యూసీ, ఒక ప్రధాన కార్యదర్శి, ఐదు కార్యదర్శుల పదవులు ఇవ్వనున్నట్లు సమాచారం. సీనియర్‌ నేత జైపాల్‌రెడ్డిని సీడబ్ల్యూసీలోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధాన కార్యదర్శి పదవికి పీసీసీ మాజీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య, వీహెచ్‌లు పోటీ పడుతున్నారు. ఇందులో పొన్నాలకు మెరుగైన అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏఐసీసీ కార్యదర్శులుగా ఉన్న చిన్నారెడ్డి, మధుయాష్కీలను కొనసాగించే అవకాశాలున్నాయి. అయితే... మరో కార్యదర్శి అయిన వీహెచ్‌ స్థానంలో... ఎస్సీ సామాజికవర్గానికి చెందిన మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహకు పదవి దక్కే అవకాశం ఉంది. ఇక ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన కేంద్ర మాజీమంత్రి బలరాంనాయక్‌ను కమిటీలోకి తీసుకోనున్నట్లు సమాచారం. ఇక బ్రాహ్మణ వర్గం నుంచి మాజీ మంత్రి శ్రీధర్‌బాబు, పీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అరికెల వేణుగోపాల్‌రావులలో ఎవరికో ఒకరికి అవకాశం కల్పించనున్నట్లు పార్టీ వర్గాలంటున్నాయి.

ఇక రాష్ట్రం విషయానికొస్తే... పీసీసీలో మరో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవిని బీసీ సామాజికవర్గానికి ఇవ్వాలని రాహుల్‌ నిర్ణయించారట. ఈ పదవి కోసం మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌, మాజీ మంత్రి దానం నాగేందర్‌లు పోటీ పడుతున్నారు. అయితే తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన పొన్నం ప్రభాకర్‌కు ఈ పదవి ఇవ్వడం ద్వారా ఉద్యమకారుల్లో పార్టీపై సానుకూలత లభిస్తుందని యోచిస్తున్నారు. దామోదర రాజనర్సింహకు ఏఐసీసీ కార్యదర్శిగా అవకాశం కల్పిస్తూనే... అదనంగా రాష్ట్రంలో మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌ పదవి కట్టబెట్టే అవకాశం ఉంది. మరోవైపు సినీనటి విజయశాంతి సేవలను దక్షిణాదిలో మరింత ఉపయోగించుకునే విధంగా పదవి ఇచ్చే యోచనలో రాహుల్‌ ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా... ఇటీవల పార్టీలో చేరిన రేవంత్‌రెడ్డి సేవలను పార్టీకి ఉపయోగించుకోవాలని రాహుల్‌ నిర్ణయించినట్లు సమాచారం. రేవంత్‌కు పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ పదవి ఇస్తూ.. తన కోర్‌ టీమ్‌లో రేవంత్‌ను ఉంచుకునేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. అలాగే సీనియర్ల నుండి ఎలాంటి అసంతృప్తి తలెత్తకుండా యువరాజు చూసుకుంటున్నారని పార్టీ వర్గాలంటున్నాయి. ఇదిలావుంటే... రాహుల్‌ టీమ్‌లో చేరేందుకు పలువురు తహతహలాడుతున్నారు. ఏ అవకాశాన్ని వదులుకోకుండా.. లాబీయింగ్‌ ముమ్మరం చేస్తున్నారు. మరి యువరాజు టీమ్‌లో ఎవరికి పదవులు దక్కుతాయో చూడాలి. 

06:24 - December 7, 2017

హైదరాబాద్ : తెలంగాణలో కొత్తగా చెరువుల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మిషన్ కాకతీయ నాలుగో దశకింద ఆదిలాబాద్‌లో 26, మెదక్‌లో 8 కొత్త చెరువుల నిర్మాణం చేపట్టనున్నారు. మిషన్ కాకతీయ పథకం కింద పాత చెరువుల పునరుద్ధరణతోపాటు కొత్త చెరువులను నిర్మించనున్నారు. ఈ పథకం నాల్గో దశలో కొత్త చెరువుల నిర్మాణాన్ని చేపడుతున్నట్టు నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 8, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా 26 చెరువుల తవ్వకానికి అనుమతులతో పాటు.. నిధులు మంజూరు చేసినట్టు నీటిపారుదల శాఖ మంత్రి పేర్కొన్నారు.

ఈ పథకం కింద ఉమ్మడి మెదక్ జిల్లాలో కంగ్టి మండలం సుకల్ తీర్థ్ గ్రామంలో కొత్తగా కాకివాగు చెరువును నిర్మించనున్నారు. ఇప్పటికే ప్రభుత్వం వంద ఎకరాలకు పైగా భూమిని సేకరించనుంది. అలాగే ఇర్కపల్లి గ్రామంలోనూ కొత్త చెరువుకోసం 96 ఎకరాలు, కేశ్వర్ గ్రామంలో వంద ఎకరాలు, ఊటపల్లి గ్రామంలో 285 ఎకరాల భూమి, ఎస్గి గ్రామంలో 72 ఎకరాలను ప్రభుత్వం సేకరించనుంది. నారాయణఖేడ్ మండలం జగన్నాధపూర్ గ్రామంలోనూ భూసేకరణకు చర్యలు తీసుకోనున్నారు. ఈ కొత్త చెరువుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ త్వరిగతగిన పూర్తి చేయాలని స్థానిక శాసనసభ్యులకు, మూడు జిల్లాల కలెక్టర్లకు, ఇంజినీర్లకు మంత్రి హరీష్ విజ్ఞప్తి చేశారు. 

06:21 - December 7, 2017

హైదరాబాద్ : వచ్చే ఏడాది చివరి నాటికి ఇంటింటికి ఇంటర్నెట్‌ అందించే లక్ష్యంతో పని చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి కేటీఆర్‌. మిషన్‌ భగీరథ పనులు నిర్ణీత గడువులోగా పూర్తవుతున్న నేపథ్యంలో... ఇంటింటికి ఇంటర్నెట్‌ పనులు మరింత వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇంటింటికి ఇంటర్నెట్‌ పథకం పనులు మరింత వేగవంతం చేయాలన్నారు మంత్రి కేటీఆర్‌. ఐటీ, పరిశ్రమల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన కేటీఆర్‌... మిషన్‌ భగీరథ పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయనున్న నేపథ్యంలో... ఇంటింటికి ఇంటర్నెట్‌ పనుల్లో వేగం పెంచాలన్నారు. ఈ పథకానికి అవసరమైన నిధులపై సమగ్రంగా చర్చించారు. కేంద్ర ప్రభుత్వం భారత్‌ నెట్‌ కింద అందిస్తున్న ఆర్థిక సహాయంతో పాటు.. రాష్ట్ర ప్రభుత్వం తరపున కావాల్సిన ఆర్థిక సహకారాన్ని అధికారులు మంత్రికి వివరించారు. తెలంగాణ ఫైబర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌కు విజయ బ్యాంక్‌ అందించే 561 కోట్ల రూపాయల రుణ పత్రాలను బ్యాంకు అధికారులు కేటీఆర్‌కు అందజేశారు.

వచ్చే ఏడాది చివరినాటికి ప్రతి ఇంటికి ఇంటర్నెట్‌ అందించడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయన్నారు కేటీఆర్‌. ఈ మార్పులు ప్రపంచానికి చూపేందుకు మహేశ్వరం మండలంలోని నాలుగు గ్రామాల్లో చేపడుతున్న టెక్నాలజీ డెమాన్‌స్ట్రేషన్‌ నెట్‌వర్క్‌ జనవరి మొదటి వారంలో పూర్తవుతుందని అధికారులు మంత్రికి తెలిపారు. ఇంటింటికి ఇంటర్నెట్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత చేకూరే ప్రయోజనాలను ఈ నెట్‌వర్క్‌ తెలియజేయనుంది. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టులో 10 కంపెనీలు పాంచుపంచుకుంటున్నాయి.

హైదరాబాద్‌ ఫార్మా సిటీ భూసేకరణ, అనుమతుల ప్రక్రియను కూడా కేటీఆర్‌ సమీక్షించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి త్వరలోనే పర్యావరణ అనుమతులు వస్తాయని అధికారులు తెలిపారు. టీయస్‌ ఐఐసీ చేపట్టిన అనేక ప్రాజెక్టులు, పార్క్‌ల నిర్మాణ పురోగతిని కేటీఆర్‌ అడిగి తెలుసుకున్నారు. టీహబ్‌-2, ఇమేజ్‌ టవర్‌, టీ వర్క్స్‌ పనులను సమీక్షించిన కేటీఆర్‌.. వచ్చే ఏడాది మే నాటికి టీ-వర్క్స్‌ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. 

పోలవరానికి వైసీపీ..జనసేన..

విజయవాడ : పోలవరానికి నేతలు క్యూ కడుతున్నారు. గత కొన్ని రోజులుగా పోలవరం నిర్మాణంపై విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఏపీ పర్యటనలో ఉన్న సిన నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోలవరం నిర్మాణాన్ని పరిశీలించనున్నారు. వైసీపీ నేతలు కూడా నిర్మాణాన్ని సందర్శించనున్నారు. 

ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్...

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు పంపింది. ఈనెల 15న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. 2018 డీఎస్సీ ద్వారా 12,370 టీచర్‌ పోస్టుల భర్తీకి మంత్రి గంటా షెడ్యూల్‌ ప్రకటించారు. జూన్‌ 12 నాటికి ఉపాధ్యాయులకు పోస్టింగ్‌లు ఇవ్వాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు.

కొనసాగుతున్న కేసీఆర్ పర్యటన..

పెద్దపల్లి : సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల బాట కొనసాగుతోంది. గురువారం ఉదయం తుపాకుల గూడెం, మేడిగడ్డ, అన్నారం, కన్నెపల్లి, సుందిళ్ల, గోలివాడలో జరుగుతున్న కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పనులను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలిస్తారు. మధ్యాహ్నం మంథని మండలం సిరిపురం వద్ద నిర్మిస్తున్న అన్నారం రిజర్వాయర్ పనులను సందర్శిస్తారు. భోజనం అనంతరం రామగుండంలోని గోలివాడ పంప్‌ హౌజ్‌ పనులను కూడా పరిశీలించి.. రాత్రికి అక్కడే ఎన్టీపీసీలో బస చేస్తారు. 

నర్సింగ్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం...

గుంటూరు : ప్రభుత్వాస్పత్రి నర్సింగ్‌ కాలేజీలో ర్యాగింగ్‌ అంశం కలకలం రేపుతోంది. రాత్రిళ్లు నిద్రపోనివ్వకుండా వేధిస్తున్నారని..మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారికి.. నర్సింగ్ విద్యార్థినులు ఫిర్యాదు చేశారు.

'కేసీఆర్ ను కలిసే అవకాశం కల్పించాలి'...

పెద్దపల్లి : జిల్లా మంథని మండలం సిరిపురంలో నిర్మిస్తున్న సుందిళ్ల బ్యారేజీ భూ నిర్వాసితులు సమావేశమయ్యారు. గురువారం సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా సిరిపురం, గుంజపడుగు, ఉప్పట్ల గ్రామాల భూ నిర్వాసితులు కేసీఆర్‌ను కలిసే అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

కులాంతర వివాహాల ప్రోత్సాహానికి కేంద్రం స్కీం...

ఢిల్లీ : కులాంతర వివాహాలను ప్రోత్సహించేందుకు కేంద్రం స్కీం పెట్టింది. దళితులను కులాంతర వివాహం చేసుకునే జంటకు 2.5 లక్షలు చెల్లిస్తోంది. అక్రమాలను అరికట్టేందుకు ఈ మొత్తాన్ని రెండు వాయిదాలలో చెల్లిస్తోంది. తాజాగా దళిత యువతి, యువకులను కులాంతర వివాహం చేసుకునే జంట ఆదాయం ఏడాదికి 5 లక్షలు మించకూడదన్న నిబంధనను ఎత్తివేసింది. 

అంబేద్కర్..పటేల్ లకు కాంగ్రెస్ అన్యాయం - మోడీ...

ఢిల్లీ : డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్, సర్దార్ వల్లభాయ్‌ పటేల్‌కు కాంగ్రెస్‌ అన్యాయం చేసిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీలో నెహ్రూ ప్రభావం కారణంగా అంబేద్కర్‌కు రాజ్యాంగ సభలో చోటు దక్కడమే గగనమైందని మోది అన్నారు. గుజరాత్‌లోని ధంధుకా ఎన్నికల సభలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

రాహుల్ క్షమాపణలు...

ఢిల్లీ : ధరల పెరుగుదల విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తూ ట్విట్టర్‌లో తప్పుడు ధరల గణాంకాల వివరాలు పెట్టినందుకు కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ క్షమాపణలు చెప్పారు. నేను నరేంద్ర భాయ్‌ మాదిరి కాదు... నేను ఓ సాధారణ మనిషినని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 

యోగికి పెళ్లి జరిపించారు...

ఉత్తరప్రదేశ్ : రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు పెళ్లి జరిగింది. ఓ సన్యాసికి పెళ్లేంటని ఆశ్చర్యపోతున్నారా? తమ డిమాండ్ల సాధన కోసం అంగన్‌వాడీ కార్యకర్తలు యోగి పెళ్లి జరపడం ద్వారా వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఆందోళనలో భాగంగా ఓ మహిళ యూపీ సీఎం ఫొటోను పక్కన పెట్టుకొని దండలు మార్చుకోవడం ద్వారా పెళ్లి చేసుకున్నారు. 

ట్రిపుల్ తలాక్ కు యూపీ గ్రీన్ సిగ్నల్...

ఢిల్లీ : ట్రిపుల్ తలాక్‌పై కేంద్రం తయారు చేసిన ముసాయిదా బిల్లును ఉత్తరప్రదేశ్ ఆమోదించింది. మంగళవారం రాత్రి సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో సమావేశమైన కాబినెట్ ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఆ బిల్లుకు మొదట మద్దతు తెలిపిన రాష్ట్రంగా యూపీ నిలిచింది.

ముస్లిం సంస్థల నిరసనలు..

ఢిల్లీ : అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేతను వ్యతిరేకిస్తూ ఉత్తరప్రదేశ్‌లో ముస్లిం సంస్థల నిరసనలు చేపట్టారు. ఫైజాబాద్‌లోని బేనీగంజ్‌ మసీదుపై ఆందోళనకారులు నల్లజెండా ఎగరవేశారు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్, గజియాబాద్, అలీగఢ్, హాథరస్, సహరాన్‌పూర్‌లో బాబ్రీమసీదు పునర్నిర్మాణం చేపట్టాలని కోరుతూ పోస్టర్లు వెలిశాయి.

అల్లాడుతున్న హనీప్రీత్..

ఢిల్లీ : డేరా సచ్చా సౌదాలో నెంబర్‌ టూగా చక్రం తిప్పిన గుర్మీత్‌ దత్తపుత్రిక హనీప్రీత్‌ ఇన్‌సా పరిస్థితి దయనీయంగా మారింది. డేరాలో రాజభోగాలు అనుభవించిన హనీప్రీత్‌కు.. తన కేసును పోరాడలేని పరిస్థితి ఏర్పడింది. లాయర్‌కు ఇవ్వడానికి డబ్బుల్లేక హనీప్రీత్‌ జైలులో అల్లాడిపోతోంది. 

భారత్‌-శ్రీలంక టెస్టు డ్రా...

ఢిల్లీ : భారత్‌-శ్రీలంక మధ్య 5 రోజుల పాటు ఆసక్తికరంగా సాగిన ఢిల్లీ టెస్ట్‌ డ్రాగా ముగిసింది. ఆఖరి రోజు దనుంజయ డిసిల్వా, రోషన్‌ డిసిల్వా , దిక్వెల్లా ఫైటింగ్‌ ఇన్నింగ్స్‌లతో శ్రీలంక జట్టు ఓటమి నుంచి గట్టెక్కింది. 87 ఓవర్లు బౌలింగ్‌ చేసిన భారత బౌలర్లు 2 వికెట్లు మాత్రమే పడగొట్టగలిగారు.3 మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్‌ 1-0తో సొంతం చేసుకుని సీజన్‌ను విజయంతో ముగించింది. 

Don't Miss