Activities calendar

08 December 2017

నెల్లూరు పోలీసుల అదుపులో క్రికెట్ బుకీ

నెల్లూరు : బెంగళూరులో క్రికెట్ బుకీ కృష్ణసింగ్ ను నెల్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత నెలలోనే బెయిల్ పై కృష్ణసింగ్ విడుదలయ్యారు. హైదరాబాద్ లో జాతీయ స్థాయి బుకీని పట్టుకున్న నేపథ్యంలో మరోసారి కృష్ణసింగ్ ను విచారించనున్నట్లు సమాచారం. 

22:01 - December 8, 2017

అహ్మదాబాద్ : గుజరాత్‌లో తొలి విడత ఎన్నికల పోలింగ్‌ మరి కొద్ది గంటల్లోనే జరుగనున్న తరుణంలో ఎట్టకేలకు బిజెపి ఎన్నికల మెనిఫెస్టోను విడుదల చేసింది. 'సంకల్ప్‌ పాత్ర' పేరుతో పార్టీ మేనిఫెస్టోను కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అహ్మదాబాద్‌లో విడుదల చేశారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధర, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో తప్పుడు హామీలు గుప్పించిందని జైట్లీ విమర్శించారు. కాంగ్రెస్ హామీలన్నీ రాజ్యాంగపరంగా కానీ, ఆర్థికపరంగా అమలుకు సాధ్యం కావని ఎద్దేవా చేశారు. బీజేపీ రెండు దశాబ్దాల పాలనలో గుజరాత్ ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. గుజరాత్ ఐక్యతకు, రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికి బీజేపీ కట్టుబడి ఉందని... సామాజిక ఏకీకరణ కాంగ్రెస్‌కు నష్టం మిగల్చనుందని జైట్లీ అన్నారు. బిజెపి మెనిఫెస్టోను విడుదల చేయకపోవడంపై కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విమర్శలు చేసిన నేపథ్యంలో... బిజెపి విజన్‌ డాక్యుమెంట్‌ను విడుదల చేయడం గమనార్హం.

 

21:58 - December 8, 2017

అహ్మదాబాద్ : గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు గానూ.. 89 స్థానాలకు... శనివారం పోలింగ్‌ జరగనుంది. తొలిదశలో సౌరాష్ట్ర, పశ్చిమ గుజరాత్‌, కచ్‌ ప్రాంతాలున్నాయి. గుజరాత్‌ సీఎం విజయ్‌రూపాని సహా 977 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీలు ఈ ఎన్నికలను వ్యక్తిగత ప్రతిష్ఠగా తీసుకొని విస్తృతంగా ప్రచారం చేశారు. సౌరాష్ట్ర, కచ్‌ ప్రాంతాల్లో అధిక స్థానాలు ఉండడంతో ఇక్కడ ఆధిక్యత సంపాదించడం అన్ని పార్టీలకు కీలకంగా మారింది. మిగిలిన స్థానాలకు డిసెంబర్‌ 14న పోలింగ్‌ జరగనుంది. 

21:55 - December 8, 2017

హైదరాబాద్ : ప్రభుత్వ వాగ్దానాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారానికై పెద్ద ఎత్తున ఉద్యమ కార్యచరణ చేపట్టాలని నిర్ణయించింది టీమాస్‌. ఈ మేరకు ఎస్వీకేలో టీ మాస్‌ స్టీరింగ్‌ కమిటీ, జిల్లా కన్వీనర్ల సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, భవిష్యత్‌ ఉద్యమ కార్యచరణపై టీమాస్‌ నేతలు ఈ సమావేశంలో చర్చించారు. 

ప్రజా సమస్యల అధ్యయనం కోసం జనంలోకి వెళ్లాలని టీమాస్‌ నిర్ణయించింది. ప్రజలను సంఘటితం చేసేందుకు జనవరి 2 నుండి 10 వరకు టీ మాస్‌ కార్యకర్తలంతా గ్రామాల్లోకి తరలి వెళ్లి సమస్యలపై అధ్యయనం చేయాలని నేతలు సూచించారు. ప్రజల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే మండల కేంద్రాల్లో దీక్షలు, జిల్లా కలెక్టరేట్‌ల ముందు సామూహిక ధర్నాలు చేపట్టాలని నిర్ణయించారు. మూడున్నర సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు నిర్దిష్టమైన విధానాన్ని ప్రకటించాలని టీమాస్ నేతలు డిమాండ్ చేశారు. 

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేసి, ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అమలుకు చట్టం చేయాలని గద్దర్‌ డిమాండ్‌ చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ చట్టంలో లోపాలు సవరించి, బీసీ, మైనార్టీలకు సబ్‌ప్లాన్‌ చట్టం చేయాలన్నారు. కోర్టులు కొట్టివేసేవిదంగా ప్రభుత్వం నోటిపికేషన్లు ఇస్తోందని కంచ ఐలయ్య విమర్శించారు. విద్యార్థులను, ఉద్యోగులను ఆత్మహత్యల వైపుకు మొగ్గు చూపే ఉద్యోగ ప్రకటనలు చేయవద్దన్నారు. కేరళలో ఉన్న పంచాయితీ రాజ్‌ చట్టాన్ని తెలంగాణలో అమలు పరచాలని... ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని టీమాస్‌ నేతలు డిమాండ్‌ చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం టీమాస్‌ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు నేతలు సిద్ధమవుతున్నారు. 

21:52 - December 8, 2017

కడప : ఖమ్మం, కడప జిల్లాలో ఉక్కు కర్మాగారాల ఏర్పాటు అంశంపై మరో 10 రోజుల్లో నివేదిక వస్తుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ప్రొద్దుటూరులో అమృత్ పథకం క్రింద అభివృద్ధి పనులకు వెంకయ్యనాయుడు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత అనిబిసెంట్ పురపాలక ఉన్నత పాఠశాల శతాబ్ది ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కన్నతల్లిని, మాతృభూమిని, చదువుకున్నపాఠశాలను మరువకూడదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. గూగుల్ కంటే గురువే గొప్పవాడన్న విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవలన్నారు. 

 

21:35 - December 8, 2017
21:28 - December 8, 2017

వీడి మెదడులో ఈ దుర్మార్గాన్ని నూరిపోసిందెవరు? వీడినింత అమానుషంగా మార్చిన నమ్మకాలేంటి? వీడినింత క్రూరంగా మార్చిన విలువలెక్కడివి? ఏ మతం చెప్పింది? ఏ సమాజం పెంచింది? ఏ రాజకీయం నేర్పింది? ఆలోచించాల్సిన తరుణం వచ్చింది. మతం పేరుతో సమాజాన్ని సజీవంగా తగులబెట్టే విలువలను పెట్రోల్ తో తగలబెట్టాల్సిన సమయం వచ్చింది. పరిస్థితి చేయిదాటుతోంది. అవును..రాజస్థాన్ లో జరిగిన దారుణం ఇదే సంకేతాలిస్తోంది. ఇదే అంశంపై ఈ రోజు వైడాంగిల్ స్టోరీ చూద్దాం.. 

ఉన్మాదం, క్రూరత్వం, ఒళ్లు జలదరించే పైశాచికత్వం.. సాటి మనిషిని దారుణంగా హింసించి సజీవంగా కాల్చేసిన దుర్మార్గం.. ఎవర్నెవరు ప్రేమిస్తే మీకెందుకు..? ఎవర్నెవరు పెళ్లి చేసుకుంటే మీకెందుకు? ఇది లౌకిక దేశం.. ఈ దేశం ఏ మతానిదీకాదు.. మత ఉన్మాదులది అసలే కాదు..

ఇద్దరూ శత్రువుల కాదు.. ఇద్దరి మధ్యా గొడవలున్న ఆధారాలూ లేవు.. కానీ, ఏం జరిగింది? ఓ మనిషిని సుత్తితో దారుణంగా కొట్టి... సజీవ దహనం చేసేంత క్రూరత్వం ఎందుకొచ్చింది? పైగా దాన్నో ఘనకార్యంగా భావిస్తున్న పరిస్తితి ఎందుకొచ్చింది? సాటి మనిషిని ద్వేషించి చంపే వరకు తీసుకొచ్చిన అంశమేంటి? అడుగడుగునా అసహనం.. పక్కవాడి నీడను కూడా సహించలేనితనం.. ఎందుకు? 

ఎవరెవర్ని పెళ్లి చేసుకోవాలో, చేసుకోవచ్చో నిర్దేశించటానికి ఎవరికీ హక్కులేదు. ప్రేమ పెళ్లి ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన విషయాలు. ఏం హిందూ అమ్మాయిని ఓ ముస్లిం పెళ్లి చేసుకోకూడదా? తప్పుపట్టడానికి మీరెవరు? ఆ ఇద్దరికీ లేని ఇబ్బంది ఈ ఉన్మాదులకు ఎందుకు? ఎందుకీ అసహనం..?

మతం వ్యక్తిగతం...ప్రేమ, పెళ్లి వ్యక్తిగతం.. వీటిని సమాజానికి దేశానికి ఆపాదించి ప్రజల జీవితాలను నిర్దేశిస్తామంటే కుదరని పని. ఓ మతానికి చెందిన విలువలను ఈ దేశ ప్రజలపై రుద్దుతామంటే సహించరాని విషయం.ప్రేమలు, పెళ్లిళ్లు, ఆహార అలవాట్లు, జీవన శైలి.. ఇవన్నీ చట్టబద్ధంగా, రాజ్యాంగానికి లోబడి ఉండాలి తప్ప ఉన్మాదులు గీసే గీతలకు లోబడి కాదు.. ఈ నిజాన్ని గ్రహించకపోతే, రాజస్థాన్ లో జరిగిన దారుణం చివరిది కాకుండా పోయే ప్రమాదం ఉంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

21:14 - December 8, 2017

చంద్రాలు ఆస్తులు ప్రకటించిన లోకేశం, కొండ పోచమ్మ కాడ హరీష్ రావు దండు...హరీష్ రావు యువసేన దాష్టీకం, ఫార్మా సిటీ మాకొద్దంటున్న జనాలు, ఎమ్మెల్యే గొంగిడి సునితకు సుక్కలు, ఇండియా జైళ్ల మీద అల్గుతున్న మాల్య.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం....

21:08 - December 8, 2017

ఢిల్లీ : గుజరాత్‌ ఎన్నికల ప్రచార సభల్లో తగ్గించిన జిఎస్‌టిని ప్రచారం చేయవద్దని ఎలక్షన్‌ కమిషన్‌ ఆదేశించింది. ఇటీవల 178 వస్తువులపై జిఎస్‌టిని తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని తనకనుకూలంగా మార్చుకోవాలని బిజెపి భావిస్తోంది. ఇది ఓటర్లను ప్రభావితం చేస్తుందని ఈసీ పేర్కొంది. వస్తువులు, సేవల పేర్లు తీసుకోకుండా పన్నును సరళీకరించినట్లు చెబితే అభ్యంతరం లేదని తెలిపింది. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నోట్లరద్దు, జిఎస్‌టి అంశాలపై మోది ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌ టార్గెట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ రెండు అంశాలు బిజెపి నష్టం కలిగించాయి. దీంతో నష్ట నివారణ కోసం జిఎస్‌టి కౌన్సిల్‌ సమావేశం 178 వస్తువులపై టాక్స్‌ను తగ్గించింది. 

21:06 - December 8, 2017

బీహార్ : ఐఆర్‌సీటీసీ హోటల్ కేటాయింపుల స్కాంకు సంబంధించి ఆర్‌జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఐఆర్‌సీటీసీ హోటల్ కేటాయింపుల కుంభకోణంలో దర్యాప్తులో భాగంగా పట్నాలోని 45 కోట్ల విలువైన మూడు ఎకరాల భూమిని జప్తు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వివరించింది. లాలూ కుటుంబ సభ్యుల పేరిట ఉన్న ఈ భూమిలో ఓ మాల్‌ కడుతున్నారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఈ భూమిని జప్తు చేశారు. లీజుపై హోటల్‌ను ఇచ్చినందుకు బదులుగా ఈ భూమి లాలు కుటుంబానికి దక్కింది. లాలూ సతీమణి రబ్రీదేవిని గత వారం పట్నాలో ఇదే కేసులో ఈడీ ప్రశ్నించింది. లాలూ కుమారుడు తేజస్వి యాదవ్, కుమార్తె మిసా భారతిలను కూడా ఈడీ ప్రశ్నించింది.

 

 

21:03 - December 8, 2017

ముంబై : ప్రధాని నరేంద్ర మోదీకి మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎంపీ షాకిచ్చారు. గోండియా పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన నానా పటోల్ తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ప్రధాని మోదీ నిర్ణయాల వల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు పంపిన రాజీనామా  లేఖలో తెలిపారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ కూడా తన రాజీనామా నిర్ణయానికి కారణమని నానా పటోల్‌ పేర్కొన్నారు. నానా బీజేపీ పార్టీలో రెబల్‌గా మారారు. గతంలో పటోల్ కాంగ్రెస్ పార్టీలోనూ పనిచేశారు. 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆయన బీజేపీలో చేరారు. ఎన్‌సీపీ నేత ప్రఫుల్ పటేల్‌ను నానా పటోల్ ఓడించారు.

20:56 - December 8, 2017

ఢిల్లీ : పాకిస్తాన్‌ జైలులో మగ్గుతున్న కులభూషణ్‌ జాదవ్‌ను కలిసేందుకు పాక్‌ ప్రభుత్వం ఆయన తల్లికి, భార్యకు వీసా మంజూరు చేసింది. డిసెంబర్‌ 25 క్రిస్టమస్‌ రోజున జాదవ్‌ను భార్య, తల్లి కలిసేందుకు తాము అంగీకరిస్తున్నట్లు పాక్‌ విదేశాంగ కార్యాలయం అధికారిక ప్రతినిధి మహ్మద్‌ ఫైజల్‌ చెప్పారు. ఆ రోజు భారత హైకమిషన్‌కు చెందిన స్టాఫ్‌ మెంబర్‌ కూడా వారితోపాటు ఉండనున్నారని తెలిపారు. పాక్ పర్యటన సందర్భంగా జాదవ్‌ తల్లి, భార్యను ప్రశ్నలతో విసిగించొద్దని భారత విదేశాంగ శాఖ పాకిస్తాన్‌కు విజ్ఞప్తి చేసింది. పాకిస్తాన్‌లో గూఢచర్యం, ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డాడన్న ఆరోపణలతో జాదవ్‌ను ఏప్రిల్‌లో అరెస్టు చేసి ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే. ఇటీవల జాదవ్‌ను కలిసేందుకు ఆయన భార్యకు తల్లికి అవకాశం ఇవ్వాలని భారత్‌ పాకిస్తాన్‌ను కోరింది. 

 

20:52 - December 8, 2017

ఢిల్లీ : గుజరాత్‌ ఎన్నికల పర్యటనలో భాగంగా కాంగ్రెస్‌ మాజీ నేత మణిశంకర్‌ అయ్యర్‌పై ప్రధాని నరేంద్రమోది సంచలన ఆరోపణలు చేశారు. మణిశంకర్‌ అయ్యర్‌ పాకిస్తాన్‌ పర్యటన సందర్భంగా తనను అడ్డు తొలగించేందుకు కుట్ర పన్నారని మోది ఆరోపించారు. ఆయన అక్కడ ఎవరితో ఏం మాట్లాడారో సోషల్‌ మీడియాలో వచ్చిందని తెలిపారు. మోదిని అడ్డు తొలగించకపోతే భారత్‌, పాకిస్తాన్‌ సంబంధాలు బాగుండవని అక్కడ జరిగిన చర్చల్లో అయ్యర్‌ వ్యాఖ్యానించినట్లు మోది చెప్పారు.

20:50 - December 8, 2017

ఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ తనకు ఎలాంటి శిక్ష విధించినా అంగీకరిస్తానని ఆ పార్టీ నుంచి సస్పెండ్‌ అయిన నేత మణిశంకర్ అయ్యర్ చెప్పారు. ప్రధాని మోదీని 'నీచ జాతికి చెందిన వ్యక్తి' అంటూ వ్యాఖ్యలు చేసిన మాజీ కేంద్ర మంత్రి మణిశంకర్‌ అయ్యర్‌ను కాంగ్రెస్‌ సస్పెండ్‌ చేసింది. గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో తన వ్యాఖ్యల ప్రభావం కాంగ్రెస్‌ పార్టీపై పడుతుందంటే తాను ఏ శిక్షకైనా సిద్ధమేనని అయ్యర్‌ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తనకు చాలా మేలు చేసిందని.... కాంగ్రెస్ లేకపోతే దేశానికి భవిష్యత్తు లేదని మణిశంకర్‌ అయ్యర్‌ అన్నారు. తాను ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేయలేదని...హిందీ మాతృభాష కాకపోవడం వల్ల ఆ పదంపై అవగాహన లేక అలా వ్యాఖ్యానించానని అయ్యర్‌ మోదీకి క్షమాపణ చెప్పారు.

 

20:46 - December 8, 2017

కాకినాడ : ఒకప్పుడు... వేల కోట్ల రూపాయల వ్యాపారం... ఇప్పుడు వందల కోట్లకు పడిపోయింది..! లక్షల టన్నుల్లో ఉండే టర్నోవర్‌... వేల టన్నులకు దిగజారింది..! కాకినాడలోని ఎడిబుల్‌ ఆయిల్‌ పరిశ్రమ మాఫియా కోరల్లో చిక్కుకుని కొంచెం కొంచెంగా కుదేలవుతోంది. ఆయిల్‌ను చోరీ చేసి..  కొంతమంది సొమ్ము చేసుకుంటే.. పారిశ్రామికవేత్తలు నష్టాల్లో కూరుకుపోతున్నారు.

మాఫియా కోరల్లో చిక్కుకుని.. కాకినాడలో ఎడిబుల్‌ ఆయిల్‌ వ్యాపారం... పూర్తిగా దెబ్బతింది. పెద్దఎత్తున ఆయిల్‌ను దొంగిలించడంతో కంపెనీలు మూతబడుతున్నాయి.  ఏడాదికి రెండు లక్షల టన్నుల ఎడిబుల్ ఆయిల్ దిగుమతి చేసుకునే కాకినాడ పోర్టు ఇప్పుడు 70 వేల టన్నులకు పడిపోయింది. ఒకప్పుడు నెలకు నాలుగువేల కోట్ల రూపాయలు జరిగే వ్యాపారం.. ఇప్పుడు నాలుగు వందల కోట్లకు పడిపోయింది.  దీంతో పది నుంచి పదిహేను కంపెనీలుండే  వాకలపూడి ప్రాంతంలో కొన్నింటిని మూసివేస్తే... మరికొన్ని కంపెనీలు కృష్ణపట్నం పోర్టుకు మకాం మార్చేశాయి. 

ఒకరోజు కాదు.. రెండు రోజులు కాదు.. నెలల తరబడి.. ఆయిల్‌ను చోరీ చేస్తూ.. సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల కాకినాడలో పట్టుబడిన ఆయిల్‌ మాఫియా సభ్యులు 18 నెలలపాటు 20 టన్నుల ఆయిల్‌ను దోచుకున్నామని చెప్పారు. అయితే.. దొంగిలించిన ఆయిల్‌ ఇంకా ఎక్కువే ఉంటుందని పారిశ్రామికవేత్తలు అంటున్నారు. సాధారణంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న క్రూడ్‌ ఆయిల్‌ పైపులైన్ల ద్వారా ఇక్కడకు చేరుకునేటప్పటికి గురుత్వాకర్షణ శక్తి కారణంగా కొంత పోతుంది. అంటే 4 వందల టన్నుల ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటే ఫ్యాక్టరీకి చేరుకునేసరికి మూడు  టన్నుల ఆయిల్ పోతుంది. ఈ మాఫియా కారణంగా  40 టన్నులు ఆయిల్‌ పోయిందని పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు. 

ఈ ప్రాంతంలో 2000 వేల సంవత్సరం నుంచే ఆయిల్ మాఫియా..పుంజుకుంది. పెద్ద పెద్ద నాయకుల అండతోనే.. ఈ మాఫియా యథేచ్ఛగా సాగుతున్నట్టు తెలుస్తోంది. టీడీపీ కాకినాడ నగర వాణిజ్య విభాగ అధ్యక్షుడు  గ్రంధి బాబ్జికి చెందిన ధనలక్ష్మి ఆయిల్ కంపెనీయే దొంగిలించిన ఆయిల్‌ను కొనుగోలు చేసిందని పోలీసులే చెప్పారు. దీంతో పోలీసులు కూడా  ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికైనా.. ఆయిల్‌ మాఫియాకు అడ్డుకట్ట  వేయకపోతే.. ఇక్కడున్న పోర్టుతో పాటు.. ఇక్కడున్న కంపెనీల భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది.

కాకినాడలో ఆయిల్ మాఫియా రెచ్చిపోతుంది. మాఫియా అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది..! ప్రమాదాలకు ఎదురెళ్లి..! హత్యలు చేసి మరీ.. తమ దందాను కొనసాగిస్తున్నాయి. అధికారులు.. ప్రజాప్రతినిధులే.. మాఫియాకు అండగా నిలుస్తున్నారు.  

విదేశాల నుంచి కాకినాడ పోర్టుకు చేరుకుంటున్న ఆయిల్‌ను.. గుట్టు చప్పుడు కాకుండా స్వాహా చేస్తున్నారు. ఆయిల్ సరఫరా అయ్యే ఎన్సీఎస్‌ కంపెనీ పైపులైన్‌కు కన్నం పెట్టి.. ఆయిల్‌ను దోచుకుంటున్నారు. అండర్ గ్రౌండ్ ట్యాంకులను ఏర్పాటు చేసి ఆయిల్‌ను తరలిస్తున్నారు.  ఆయిల్‌నే కాదు. పెట్రో ఉత్పత్తులను సైతం వదలడం లేదు.  అలాగే ట్యాంకర్ల ద్వారా వెళ్తుంటే.. వాటిని మధ్యలోనే  ఆపి చోరీలకు పాల్పడుతున్నారు..

ట్యాంకర్ల యజమానులు చేతులు కలపడంతో..ఈ ఆయిల్ మాఫియా యథేచ్ఛగా  ఆయిల్‌ దందాను సాగిస్తోంది.  తన దందాకు అడ్డువచ్చిన వారి ప్రాణాలు తీస్తోంది. కాకినాడలో సంచలనమైన ఓబులనేని అబ్బు హత్య ఆయిల్ మాఫియా చేసిందే. ఆ తరువాత 2005లోనూ మరో రెండు హత్యలు ఆయిల్ మాఫియా వల్ల జరిగాయి.  అలాగే ఇద్దరు పోలీసున్నతాధికారులు.. ఆయిల్ మాఫియాలో రెండు వర్గాలకు కొమ్ముకాస్తూ బాహాటంగానే దెబ్బలాడుకున్నారని.. పోర్టు డైరెక్టర్ కోయా ప్రవీణ్ చెబుతున్నారు. 

పోలీసు అధికారులు, ట్యాంకర్ల యజమానులే కాదు.. పోర్టు వ్యవహారాల్లో కీలకంగా ఉండే అలీషా కనుసన్నల్లో ఈ ఆయిల్‌ మాఫియా సాగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్వయంగా కాకినాడ ఎమ్మెల్యే కొండబాబునే ఈ ఆరోపణలు చేశారు. ఈ హత్యల నేపథ్యంలో  పలు ప్రాంతాల్లో సెక్యూరిటీ గార్డులు విధులు నిర్వహించలేమని.. పై అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. దీంతో కాకినాడ నగర భద్రతకు ఆయిల్ మాఫియా పెనుముప్పుగా మారింది. 

 

20:42 - December 8, 2017

పశ్చిమగోదావరి  : గరగపర్రులో తమకు జరుగుతున్న అన్యాయంపై దళితులు ఉద్యమిస్తుంటే ప్రభుత్వం నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు ఆరోపించారు. ఇటు తెలంగాణలో నేర చరిత్ర ఉన్న బీజేపీ నేత భరత్‌రెడ్డిని ఇప్పటి వరకూ పోలీసులు పట్టుకోలేకపోవడం ప్రభుత్వ అసమర్ధత నిదర్శనం అన్నారు. దళితుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఢిల్లీలో అఖిల భారత హక్కుల సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన సదస్సుకి బీవీ.రాఘవులుతో పాటు దళిత సంఘాల నేతలు, ఏపీ, తెలంగాణ ఎస్సీ, ఎస్టీ నాయకులు హాజరయ్యారు. గరగర్రు దళితులకు జరిగిన అన్యాయాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన 10 టీవీకి  ఈ సందర్భంగా నేతలు అభినందనలు తెలిపారు. 
అఖిల భారత దళిత హక్కుల సమాఖ్య ఆధ్వర్యంలో సదస్సు

 

20:37 - December 8, 2017

గుంటూరు : ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబసభ్యుల ఆస్తుల వివరాలను  ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేశ్‌ ప్రకటించారు. చంద్రబాబు కుటుంబ సభ్యుల మొత్తం ఆస్తుల విలువ 75.06 కోట్లు.  వీరు నిర్వహిస్తున్న హెరిటేజ్ వార్షిక ఆదాయం 2వేల 648 కోట్లు కాగా నికర లాభం 66.82 కోట్ల రూపాయలు. అమరావతిలోని సీఎం నివాసంలో సీఎం చంద్రబాబు, భువనేశ్వరి, బ్రహ్మణి, దేవాన్ష్‌ల ఆస్తుల వివరాలను లోకేశ్ మీడియాకు వెల్లడించారు. 

ఎప్పటిలాగే సీఎం చంద్రబాబు కుటుంబసభ్యులు ఆస్తుల వివరాలను ప్రకటించారు. చంద్రబాబు తనయుడు ..మంత్రి లోకేశ్ అమరావతిలో జరిగిన మీడియా సమావేశంలో ఆస్తుల వివరాలను వెల్లడించారు. చంద్రబాబు నికర ఆస్తి విలువ  రూ. 2.53 కోట్లు కాగా ఆయన భార్య భువనేశ్వరి నికర ఆస్తులు రూ.25.41 కోట్లుగా లోకేశ్ తెలిపారు. 

లోకేష్‌ ఆస్తుల విలువ రూ.15.21 కోట్లు కాగా ఆయన సతీమణి బ్రహ్మణి  నికర ఆస్తుల విలువ 15.01 కోట్లు. కొడుకు దేవాన్ష్‌ నికర ఆస్తులు రూ.11.54 కోట్లని లోకేశ్ తెలిపారు. ఇక తమ  కుటుంబం నిర్వహిస్తున్న హెరిటేజ్ సంస్థ  వార్షిక  ఆదాయం  రూ.2 వేల 648 కోట్లు కాగా..ఖర్చు రూ.2 వేల 501కోట్లు.. పన్నుల చెల్లింపుల అనంతర నికర లాభం రూ. 66 కోట్లని లోకేశ్ స్పష్టం చేశారు. తమ ఆస్తులను ప్రకటించటం ఇది వరుసగా ఏడోసారని తెలిపారు. దేశంలో మరే రాజకీయ కుటుంబం తమ మాదిరిగా ఆస్తులు ప్రకటించట్లేదని లోకేశ్ అన్నారు. తమ కుటుంబంపై ఆరోపణలు చేసే ముందు  ప్రతిపక్ష నేత వైఎస్.జగన్ తన ఆస్తులను ప్రకటించాలని లోకేశ్  డిమాండ్ చేశారు. 

ఆస్తుల వివరాలను ప్రకటించిన అనంతరం వారసత్వ రాజకీయాలపై జనసేన అధినేత పవన్ చేసిన వ్యాఖ్యలపై లోకేశ్ స్పందించారు. రాజకీయాల్లోకి వారసులుగా వచ్చిన మాట వాస్తవమేనని.. అయితే ప్రజామోదం ఉంటేనే దానిని కొనసాగించగలరని లోకేశ్ స్పష్టం చేశారు. 

అసెంబ్లీకి రాకుండా పోలవరంపై అఖిలపక్షం అంటూ వైసీపీ డిమాండ్ చేయడమేంటని లోకేశ్ మండిపడ్డారు. కాపు రిజర్వేషన్లపై తమ పార్టీ వైఖరి ఏమిటో ఇప్పటికీ వైసీపీ నేతలు స్పష్టంగా చెప్పలేకపోతున్నారని....,  బోయలను ఎస్టీల్లో చేర్చాలని తీర్మానం చేసినా దానిపై ఏం మాట్లాడలేదని లోకేశ్  విమర్శించారు. 

20:29 - December 8, 2017

హైదరాబాద్ : రామంతాపూర్‌లో సాప్ట్‌వేర్ ఇంజినీర్ గ్రీష్మనందిని భర్త ఇంటిముందు బంధువుల ఆందోళన కొనసాగుతోంది. గ్రీష్మ మృతదేహంతో రెండురోజులుగా ధర్నా చేస్తున్నారు. భర్త, అత్తమామ వేధింపుల వల్లే గ్రీష్మ సూసైడ్ చేసుకుందని వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ గ్రీష్మ మృతదేహాన్ని అక్కడే పాతిపెట్టేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. అత్తింటివారొచ్చి అంత్యక్రియలు నిర్వహించాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. గ్రీష్మ తల్లిదండ్రులను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.  

 

20:26 - December 8, 2017

కరీంనగర్ : కాళేశ్వరం బ్యారేజీ పనులు 2018 నాటికి పూర్తి చేయాలని..అప్పుడే రైతులకిచ్చిన మాట నెరవేరుతుందని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ప్రాజెక్టులు సందర్శించిన సీఎం...కాళేశ్వరం బ్యారేజీ పనులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు టన్నెల్‌ పనుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేసిన సీఎం... శనివారం హైదరాబాద్‌లో రివ్యూ సమావేశం ఏర్పాటు చేయనున్నారు. 

అనంతరం మేడారం నుంచి రామడుగు వరకు జరుగుతున్న పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు. మేడారం నుంచి లక్ష్మీపూర్ వరకు జరుగుతున్న టన్నెల్‌, కెనాల్‌ పంప్‌హౌస్‌ పనులు పరిశీలించారు. మేడారం, లక్ష్మీపూర్ ద్వారా లిఫ్టు చేసిన నీటిని వరద కాల్వలో 99వ కిలోమీటర్ వద్ద కలపాలని సీఎం కేసీఆర్ చెప్పారు. ప్రతి రోజు 2 టీఎంసీల నీటిని పంప్ చేయడానికి ఏర్పాటు చేయాలని సూచించారు. వరద కాల్వ ద్వారా ఒక టీఎంసీ నీటిని ఎస్సారెస్పీకి, మరో టీఎంసీని మిడ్ మానేరుకు పంపాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అన్ని పనులు సమాంతరంగా, పటిష్టంగా చేపట్టి.. సకాలంలో పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. 

అంతకుముందు రామగుండం ఎన్టీపీసీలో నిర్మాణంలో ఉన్న 8వ యూనిట్ పనులను సీఎం పరిశీలించారు.  మధ్యాహ్నం అధికారులతో సమీక్ష నిర్వహించిన కేసీఆర్‌.. కాళేశ్వరం ప్రాజెక్టుపై శనివారం ఉదయం 11 గంటలకు సమీక్ష ఉంటుందని సంబంధిత అధికారులకు, కాంట్రాక్టు సంస్థలు, ఇంజనీర్లు హాజరుకావాలని ఆదేశించారు. ఆతర్వాత జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్‌లో పంప్‌హౌస్ పనులు పరిశీలించారు. అనంతరం హెలిక్యాప్టర్‌లో మిడ్ మానేరు ప్రాజెక్టుపై ఏరియల్‌ సర్వే నిర్వహించారు. అటు నుంచి నేరుగా హైదరాబాద్‌ చేరుకున్నారు. 

కరీంనగర్ జైలు సూపరింటెండెంట్ శివకుమార్ బదిలీ

కరీంనగర్ : జిల్లా జైలు సూపరింటెండెంట్ శివకుమార్ బదిలీ అయ్యారు. మాజీ ఏఎస్ ఐ మోహన్ రెడ్డి కటుంబ సభ్యులకు నేరుగా ములాఖత్ ఇచ్చిన ఘటనలో ఆయనపై బదిలీ వేటు పడింది. మహబూబ్ నగర్ జైలుకు శివకుమార్ ను బదిలీ చేశారు. కరీంనగర్ జైలు సూపరింటెండెంట్ గా దశరథ రామిరెడ్డిని నియమించారు.

ఏపీలో రెండు యూనవర్సిటీలకు వీసీల నియామకం

అమరావతి : రెండు యూనవర్సిటీలకు వీసీల నియామకం జరిగింది. అనంతపురం జేఎన్టీయూ వీసీగా ఎస్.శ్రీనివాస్ కుమార్, శ్రీకాకుళం అంబేద్కర్ వర్సిటీ వీసీగా కునా రాంజీని నియమించారు. 

కల్లూరులో కాకతీయ షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత

ఖమ్మం : కల్లూరులో కాకతీయ షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. రైతులు, ఫ్యాక్టరీ యాజమాన్యం మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. రైతులను పోలీసులు చెదరగొడుతున్నారు. రైతులకు వామపక్షాలు మద్దతు తెలిపారు.
 

సంగీత కేసులో కొత్త ట్విస్ట్

మేడ్చల్ : జిల్లాలో సంగీత కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. సంగీతపై చర్యలు తీసుకోవాలని మామ బాల్ రెడ్డి పిటిషన్ వేశారు. హైకోర్టులో మామ బాల్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. తమ కుటుంబ సభ్యులపై సంగీత తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపిందని బాల్ రెడ్డి పిటిషన్ లో పేర్కొన్నారు. 

 

చిత్తూరు జిల్లాలో దారుణం

చిత్తూరు : జిల్లాలోరి వరిగపల్లె గ్రామంలో దారుణమైన ఘటన వెలుగుచూసింది. పొలం వివాదంలో.. ప్రత్యర్థులు... భార్య, భర్తను ట్రాక్టర్‌తో తొక్కించి చంపారు. ఈ ఘటనలో భార్య విమలమ్మ మృతి చెందగా, భర్త జగన్నాథరెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. 

 

19:45 - December 8, 2017

ఎప్పటి నుండో హిట్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసీ చూసి అలసిపోయిన సుమంత్, ఈ మధ్య ట్రెండ్ మారింది అన్న విషయం లేట్ గా గ్రహించాడు.. అందుకే మారి న ట్రెండ్ కి అనుగూణంగా సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాడు... అలా ఆ ప్రొసెస్ లో గౌతమ్ అనే కొత్త డైరక్టర్ చెప్పిన ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మళ్లీ రావా కి ఓకే చెప్పాడు..  టీజర్ ట్రైలర్స్ తోనే ఫీల్ ఉందని కన్వేచేసిన మళ్ళీ రావా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో.. సుమంత్ నమ్మకాన్ని నిలబెట్టిందా లేదా.. ఆడియన్స్ కి ఎలాంటి అనుభూతిని ఇచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం..
సినిమా కథ 
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. టీనేజ్ లో లవ్ తరువాత బ్రేకప్ అనే పాయింట్ తోనే తెరకెక్కింది మళ్ళీ రావా.. కాని ఒకే వ్యక్తి జీవితంలో ఒకే అమ్మాయితో మూడు సార్లు బ్రెకప్ అయితే.వాళ్ల జీవితాలు ఎలా మౌల్డ్ అవుతాయి.తిరిగి కలుసుకున్నప్పుడు వాళ్ల మధ్య ఎలాంటి బావోద్వేగాలు కలుగుతాయి.. అనే విషయాన్ని చాలా రియలిస్ట్ గా చూపించాడు.. అదే సినిమా కథ. కాకపోతే ఇదే కథను ఫాస్ట్ , ప్రజంట్, ఫ్యూచర్ మిక్స్ప్ స్క్రీన్ ప్లేలో ప్రజంట్ చేయడం వల్ల కొత్త సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది...
నటీనటులు
నటీనటుల విషయానికి వస్తే కెరీర్ లో ఇప్పటి వరకూ భిన్నమైన సినిమాలు చేసిన సుమన్ ఫస్ట్ టైం ఒక సిన్సీయర్ అండ్ రియలిస్టిక్ ప్రేమికుడి పాత్రలో ఒదిగిపోయి నటించాడు.. ఈ కథ ఎంచుకోవడంతోనే సగం విజయం సాధించిన సుమంత్, ఆ కథను నమ్మి, అందులో తన పాత్రను అర్ధం చేసుకుని, అవసరమైన వేరియేషియన్స్ తో నాచ్యూరల్ గా నటించాడు..  అక్కడక్కడ తడబడినా.. పెద్దగా ఇబ్బంది అనిపించలేదు.. ఇక బాలీవుడ్ హీరోయిన్.. ఆకాంక్ష సింగ్ అంజలీ పాత్రలో చాలా చక్కగా, డిగ్నిఫైడ్ లుక్ తో అలరించింది..  కొన్ని చోట్ల కొంచె ఆర్టిఫిషియల్ గా సాగినా... ఆమె నటన  ఓవర్ ఆల్ గా మెప్పించింది.  మాస్టర్ సాత్విక్, బేబీ ప్రితీ అస్త్రానీ చాలా క్యూట్ గా కనిపించి. బెస్ట్ ఫర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నారు. ఇక మిగతా నటీనటులు అందరూ కూడా చాలా మంది కొత్త వారే అయినా కూడా సహజమైన నటనతో అలరించారు.. 
టెక్నీషయన్సన్ 
టెక్నీషయన్సన్ విషయానికి వస్తే.. గౌతం తిన్నసూరి ఈ కథపై చాలా హార్డ్ వర్క్ చేశాడు. అతను రాసుకున్న స్క్రీన్ ఫ్లే చూస్తే.. ఈ పాయింట్ పై అతను ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడో అర్ఠం అవుతుంది.. అతని స్క్రీన్ ప్లేకి తోడుగా మ్యూజిక్ డైరక్టర్, లిరిసిస్ట్ అడుగుడుగునా ఈ సినిమాలో ఫీల్ ని నింపి, సోల్ ను నిలబెట్టడానికి చాలా బాగా కృషి చేశారు. మాటలు కూడా చాలా సహజ సిద్దంగా అందరికి అర్ధం అయ్యేలా రాసుకున్నారు డైరక్టర్. ఐటీ కంపెనీ బ్యాక్ డ్రాప్ లో రాసుకున్న డైలాగ్స్.. టీనేజ్ లో విలేజ్ కామెడీ బాగా వర్కౌట్ అయ్యాయి.. ఇక మ్యూజిక్ డైరక్టర్ శ్రావణ్ బరద్వాజ్ సినిమాకు ప్రాధాన బలంగా నిలిచాడు.. ప్రతి సన్నివేశాన్ని ఆ సన్నివేశంలో ఆర్టిస్ట్ ల నటనను.. తగిన మూడ్ ని తన మ్యూజిక్ తో ఎలివేట్ చేయడానికి విపరీతంగ ప్రయత్నించి సక్సెస్ అయ్యాడు.. అలాగే సినిమాటోగ్రాఫర్ సతీష్ ముత్యాల ఇచ్చిన రిసొర్స్ లో రిచ్ అవుట్ పుట్ ఇచ్చాడు.. సినమాకు ఫీల్ అద్దడంలో అతని కృషికూడా చాలా ఉంది.. మిగతా టెక్నీషియన్స్ అయితే డైరక్టర్ విజన్ మేరకు పనిచేసి ఆకట్టుకున్నారు
ఫీల్ గుడ్ మూవీగా మళ్ళీ రావా
ఓవర్ ఆల్ గా చెప్పాలి అంటే కథ పాతదే అయినా, స్క్రీన్ ప్లే కొత్తగా ఉండటంతో ఫీల్ఎంటర్ టైన్ మెంట్ బ్యాలన్స్ చేస్తూ సాగడంతో మంచి ఫీల్ గుడ్ మూవీగా నిలిచింది మళ్ళీ రావా.. అయితే దర్శకుడు వాడిని ట్రూ అండ్ ఫోర్త్ స్క్రీన్ ప్లే కొంచె  అక్కడక్కడ కన్ఫ్యూజ్ క్రియేట్ చేయగా, స్లొ నేరేషన్ చెప్పుకోదగ్గ మైనస్ లుగా నిలిచాయి.. అయినప్పటికీ కూడా చాలా కాలం తరువాత యూత్ ను మల్టీఫ్లక్స్ ఆడియన్స్ ను శాటిస్ఫై చేసే సినిమాగా మళ్ళీ రావే నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి... 
ప్లస్ పాయింట్స్
స్క్రీన్ ప్లే, మాటలు
డైరక్టర్
మ్యూజిక్
సినిమాటోగ్రాఫీ
నటీనటుల సహజ నటన
మైనస్ పాయింట్స్
సింపుల్ కథ
స్లో నేరేషన్ 
అక్కడక్కడ మిస్ అయిన ఫీల్

రేటింగ్
2.25/5

19:26 - December 8, 2017

కడప : ప్రభుత్వం రైతులను అన్ని విధాల ఆదుకుంటుంటే  ప్రతిపక్ష నేత జగన్ పాదయాత్రలో రైతులు నాశనం అయిపోయారంటూ వ్యాఖ్యానించడం సరికాదన్నారు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి.  రైతుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపాల్సింది పోయి వారిని మరింత కృంగదీసేలా జగన్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కడప ఆర్ ఆండ్ బీ గెస్ట్‌ గెస్ట్ హౌస్‌లో జరిగిన కార్యకర్తల సమావేశంలో సోమిరెడ్డి పాల్గొన్నారు. వ్యవసాయంలో టెక్నాలజీని వాడుకోవడంలో ఏపీ ముందుందన్నారు సోమిరెడ్డి... రైతుల్ని ఆదుకోవడంలో కూడా ఏపీ సర్కారే ముందుందని స్పష్టం చేశారు. 

 

 

19:23 - December 8, 2017

చిత్తూరు : టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తిరుమలలో తనిఖీలు నిర్వహించారు. 39 కోట్లతో ...270 గదులు ఉండేలా నిర్మిస్తున్న వకుళమాత భవన్‌తో పాటు, 43 కోట్లతో నిర్మిస్తున్న శ్రీవారి సేవాసదన్ నిర్మాణ పనులను పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్ మరియు ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వకుళామాత భవన్, శ్రీవారి సేవాసదన్‌ ఏప్రిల్ నాటికి అందుబాటులోకి తీసుకురానున్నట్లు అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. తనిఖీలలో ఈవోతో పాటు తిరుమల జేఈవో శ్రీనివాసరాజు పాల్గొన్నారు. 

 

19:18 - December 8, 2017

చిత్తూరు : జిల్లాలోరి వరిగపల్లె గ్రామంలో దారుణమైన ఘటన వెలుగుచూసింది. పొలం వివాదంలో.. ప్రత్యర్థులు... భార్య, భర్తను ట్రాక్టర్‌తో తొక్కించి చంపారు. ఈ ఘటనలో భార్య విమలమ్మ మృతి చెందగా, భర్త జగన్నాథరెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

19:09 - December 8, 2017

గుంటూరు : జిల్లాలోని చినకాకానిలో జనసేన పార్టీ కార్యాలయానికి కమ్యూనిస్టు నేత యార్లగడ్డ సుబ్బారావు కుటుంబం 3 ఎకరాల 42 సెంట్ల స్థలాన్ని లీజుకు ఇచ్చారు. పవన్‌ కల్యాణ్‌ కమ్యూనిస్టులతో సన్నిహితంగా ఉండటం హర్షనీయమని యార్లగడ్డ సుబ్బారావు కుటుంబ సభ్యులు అభిప్రాయపడింది. పవన్‌ రాకతో ఏపీ రాజకీయాల్లో మార్పులు వస్తాయంటున్న యార్లగడ్డ కుటుంబసభ్యులతో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. ఆ వివరాలను వీడియోలో చూద్దాం...   
పవన్‌ రాకతో ఏపీ రాజకీయాల్లో మార్పులు వస్తాయి- యార్లగడ్డ కుటుంబసభ్యులు

 

19:04 - December 8, 2017

గుంటూరు : కమ్యూనిస్టులు ప్రజల కోసం పోరాటం చేస్తారని.. తానూ అదే బాటలో పయనిస్తానని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. సినిమాల్లో సమస్యలు పరిష్కరించే హీరో క్యారెక్టర్‌ కన్నా.. నిజ జీవితంలో సమస్యలు పరిష్కరించడమంటేనే తనకు ఇష్టమని పవన్‌ అన్నారు. గుంటూరు జిల్లా చినకాకానిలో జనసేన పార్టీ కార్యాలయ నిర్మాణానికి స్థలం ఇచ్చిన కమ్యూనిస్టు పార్టీకి చెందిన యార్లగడ్డ సుబ్బారావు కుటుంబాన్ని పవన్‌ అభినందించారు.  చినకాకానికి  రైల్వే గేటు పక్కన 3 ఎకరాల 42 సెంట్ల స్థలాన్ని యార్లగడ్డ కుటుంబసభ్యులు మూడేళ్లపాటు జనసేన కార్యాలయానికి లీజుకు ఇచ్చారు. 

 

19:01 - December 8, 2017

విజయవాడ : కులాలకీ, మతాలకీ అతీతంగా రాజకీయాలు ఉండాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. విజయవాడ స్టూడెంట్స్‌ సెమినార్‌లో పాల్గొన్న పవన్‌ ఫాతిమా కాలేజీ విద్యార్థులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కుల మతాలకు అతీతంగా.. మనిషికి జరిగే అన్యాయాన్ని ప్రశ్నిస్తానని పవన్‌ అన్నారు. విభజించు పాలించు అనే సిద్ధాంతాన్ని కొన్ని రాజకీయ పార్టీలు తీసుకున్నాయని.. దాన్ని జనసేన ఆచరించదని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. 

 

18:59 - December 8, 2017

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీలో గత ఆదివారం ఆత్మహత్య చేసుకున్న మురళీ కుటుంబాన్ని కాంగ్రెస్‌ నాయకుడు, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పరామర్శించారు. కుటుంబ సభ్యుల బాధను అడిగి తెలుసుకున్నారు. కుటుంబానికి అండగా ఉంటానన్న జగ్గారెడ్డి... లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు.

ఉస్మానియాలో ఆత్మహత్య చేసుకున్న మురళి కుటుంబాన్ని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి పరామర్శించారు. మురళి గురించి అతని కుటుంబ సభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. దేలాపూర్‌కు చెందిన మురళి చదువులో ముందుండేవాడని అతని కుటుంబసభ్యులు జగ్గారెడ్డికి తెలిపారు. బీఎస్సీ, బీఈడీ పూర్తి చేసిన మురళి ఉస్మానియా వర్సిటీ పీజీ ప్రవేశ పరీక్షలో టాపర్‌గా నిలిచాడన్నారు. ఎంఎస్సీలో ఫిజిక్స్‌ మెటీరియల్‌ సైన్స్‌ను ఎంచుకొని చదువు కోవాలనుకున్నాడు. కాని ఇంతలోనే ఈ ఘోరం జరిగిందని కుటుంబ సభ్యులు వాపోయారు. 

తన కొడుకు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని మురళి తల్లి చెబుతోంది. తన కుమారుడి మరణంపై విచారణ జరపాలని కోరింది. మురళి ఆత్మహత్యపై స్పందించిన జగ్గారెడ్డి మురళి కుటుంబానికి ఆర్థిక సహాయార్థం లక్షరూపాయలను అందించారు. తెలంగాణ వస్తే కొలువులు వస్తాయనుకున్న యువకుల కలలు కల్లలయ్యాయని ప్రభుత్వంపై...జగ్గారెడ్డి విరుచుకుపడ్డారు. మురళి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. సర్కార్ నిర్ణయాలతో... ఉద్యోగం రాదన్న ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్న మురళి కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలంటున్నారు స్థానికులు.  

గ్రీష్మనందిని భర్త ఇంటిముందు కొనసాగుతున్న బంధువుల ధర్నా

హైదరాబాద్ : రామంతాపూర్‌లో సాప్ట్‌వేర్ ఇంజినీర్ గ్రీష్మనందిని భర్త ఇంటిముందు బంధువుల ఆందోళన కొనసాగుతోంది. గ్రీష్మ మృతదేహంతో రెండురోజులుగా ధర్నా చేస్తున్నారు. భర్త, అత్తమామ వేధింపుల వల్లే గ్రీష్మ సూసైడ్ చేసుకుందని వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ గ్రీష్మ మృతదేహాన్ని అక్కడే పాతిపెట్టేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బంధువులు రామంతాపూర్...ఉప్పల్‌ రోడ్డుపై ధర్నాకు దిగారు. 

18:28 - December 8, 2017

హైదరాబాద్ : రామంతాపూర్‌లో సాప్ట్‌వేర్ ఇంజినీర్ గ్రీష్మనందిని భర్త ఇంటిముందు బంధువుల ఆందోళన కొనసాగుతోంది. గ్రీష్మ మృతదేహంతో రెండురోజులుగా ధర్నా చేస్తున్నారు. భర్త, అత్తమామ వేధింపుల వల్లే గ్రీష్మ సూసైడ్ చేసుకుందని వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ గ్రీష్మ మృతదేహాన్ని అక్కడే పాతిపెట్టేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బంధువులు రామంతాపూర్...ఉప్పల్‌ రోడ్డుపై ధర్నాకు దిగారు. ధర్నాతో ట్రాఫిక్ జాం అయింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

18:24 - December 8, 2017

హైదరాబాద్ : వంద శాతం ఫలితాలు సాధించేందుకు ప్రిన్సిపల్స్‌ కృషి చేయాలన్నారు డిప్యూటి సీఎం కడియం శ్రీహరి. హైదరాబాద్‌లోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఇంటర్మీడియట్‌ విద్యా శాఖపై సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఇంటర్మీడియట్‌ విద్యా వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటుందని కడియం తెలిపారు. 

 

17:57 - December 8, 2017

ఉమ్మడి కరీంనగర్ : జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ముగిసింది. మధ్యాహ్నం మిడ్‌మానేరు ప్రాజెక్టును ఏరియా సర్వే చేసిన అనంతరం... ముఖ్యమంత్రి హైదరాబాద్ బయల్దేరి వెళ్లారు. తన 2 రోజుల పర్యటనలో 3 బ్యారేజ్‌లు, 4 పంప్‌హౌజ్‌లు, 2 రిజర్వాయర్లు, ఒక అండర్ గ్రౌండ్ టన్నెల్‌ను కేసీఆర్ పరిశీలించారు. అనుకున్న సమయానికి ప్రాజెక్టులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కాళేశ్వరంపై రేపు ఉదయం 10 గంటలకు సీఎం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి హాజరుకావాలని అధికారులు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులను కేసీఆర్ ఆదేశించారు. మరిన్ని వివరాలు వీడియోలో చూద్దాం...

 

17:54 - December 8, 2017

అఖిల భారత దళిత హక్కుల సమాఖ్య ఆధ్వర్యంలో సదస్సు

ఢిల్లీ : అఖిల భారత దళిత హక్కుల సమాఖ్య ఆధ్వర్యంలో ఢిల్లీలో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు, దళిత సంఘాల నేతలు, ఏపీ తెలంగాణా ఎస్సీ, ఎస్టీ నాయకులు హాజరయ్యారు. ఏపీ, తెలంగాణలో దళితులపై దాడులు, సాంఘీక బహిష్కరణలపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. గరగపర్రులో దళితుల వివక్షను వెలుగులోకి తెచ్చిన 10 టివికి దళిత సంఘాల నాయకులు అభినందనలు తెలిపారు. 

ప్రజల కోసం అంకితమైన వారు కమ్యూనిస్టులు : పవన్ కళ్యాణ్

విజయవాడ : కుల మతాలకు అతీతంగా పార్టీలు ఉండాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వియవాడలో జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో పవన్ పాల్గొని, మాట్లాడారు. కులాలను విడగొట్టి పాలించు విధానానికి జనసేన వ్యతిరేకమని పేర్కొన్నారు. అన్ని కులాలు ఐక్యంగా ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. న్యాయం అందరికీ ఒకే విధంగా ఉండాలన్నారు. ప్రజల కోసం అంకితమైన వారు కమ్యూనిస్టులని కొనియాడారు. కమ్యూనిస్టు నేత యార్లగడ్డ సుబ్బారావు కుటుంబీకులు ఇచ్చిన స్థలంలో జనసేన కార్యాలయం నిర్మాణం కావడం సంతోషకరమన్నారు. జనవరిలో 10 వేల నుంచి 15 వేల మందితో ఒక వర్క్ షాప్ పెడతానని చెప్పారు. 

 

17:51 - December 8, 2017

ఢిల్లీ : అఖిల భారత దళిత హక్కుల సమాఖ్య ఆధ్వర్యంలో ఢిల్లీలో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు, దళిత సంఘాల నేతలు, ఏపీ తెలంగాణా ఎస్సీ, ఎస్టీ నాయకులు హాజరయ్యారు. ఏపీ, తెలంగాణలో దళితులపై దాడులు, సాంఘీక బహిష్కరణలపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. గరగపర్రులో దళితుల వివక్షను వెలుగులోకి తెచ్చిన 10 టివికి దళిత సంఘాల నాయకులు అభినందనలు తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

17:44 - December 8, 2017

విజయవాడ : కుల మతాలకు అతీతంగా పార్టీలు ఉండాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. విజయవాడలో జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో పవన్ పాల్గొని, మాట్లాడారు. కులాలను విడగొట్టి పాలించు విధానానికి జనసేన వ్యతిరేకమని పేర్కొన్నారు. అన్ని కులాలు ఐక్యంగా ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. న్యాయం అందరికీ ఒకే విధంగా ఉండాలన్నారు. ప్రజల కోసం అంకితమైన వారు కమ్యూనిస్టులని కొనియాడారు. కమ్యూనిస్టు నేత యార్లగడ్డ సుబ్బారావు కుటుంబీకులు ఇచ్చిన స్థలంలో జనసేన కార్యాలయం నిర్మాణం కావడం సంతోషకరమన్నారు. జనవరిలో 10 వేల నుంచి 15 వేల మందితో ఒక వర్క్ షాప్ పెడతానని చెప్పారు. 

 

17:01 - December 8, 2017
16:59 - December 8, 2017

ఢిల్లీ : మహిళల హక్కుల సాధన కోసం పోరాటాలను ఉధృతం చేయాలని ఐద్వా నిర్ణయించింది. ఢిల్లీలో ఐద్వా ఆధ్వర్యంలో జరిగిన సేవ్ ఇండియా సదస్సులో పలువురు వక్తలు ప్రసంగించారు. దేశంలో మహిళలపై పెరుగుతున్న హింస, విద్వేశ పూరిత ప్రచారాల వల్ల జరుగుతున్న ప్రమాదకర పరిణామాలు, మహిళల హక్కులు, ఆరోగ్యం, ఆహారం, భద్రత, జీవనోపాధి అంశాలపై ప్రధానంగా చర్చించారు. ముస్లింలపై, దళితులపై, క్రిస్టియన్లపై సంఘ్ పరివార్ పాల్పడుతున్న దాడులను ఐద్వా ఖండించింది. మహిళాహక్కుల పరిరక్షణకు ప్రజాస్వామ్య శక్తులను ఏకం చేసి పోరాటాలు కొనసాగించాలని తీర్మానించింది. ఈ సదస్సులో బృందాకరత్, సుభాషిణి అలీ, మరియం ధావలే, మాలినీ భట్టాచార్య, దుర్గాస్వామి, నీనా శర్మ, కీర్తి సింగ్ తదితరులు పాల్గొన్నారు. 


 

16:56 - December 8, 2017

ఢిల్లీ : దేశంలో మహిళలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఐద్వా నిరసన గళమెత్తింది. దేశ రాజధానిలో సేవ్‌ ఇండియా పేరుతో మహిళా హక్కులు పరిరక్షించాలని సదస్సు నిర్వహించింది. ఈమేరకు ఐద్వా నాయకురాలు పుణ్యవతితో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని పుణ్యవతి డిమాండ్‌ చేశారు. మహిళా హక్కులను కాలరాయడమంటే ప్రజాస్వామ్యాన్ని నిరాకరించడమే అని అన్నారు. మహిళా హక్కులు పరిరక్షించాలని డిమాండ్ చేశారు. 

 

16:49 - December 8, 2017

తూర్పుగోదావరి : పోలవరం ప్రాజెక్ట్ అవకతవకల్లో ఎవరి పాత్ర ఎంటో త్వరలోనే ఆధారాలతో బయటపెడతానని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. పోలవరంపై శ్వేతపత్రం ఎందుకు విడుదల చేయాలని సీఎం చంద్రబాబు ప్రశ్నించడం విచిత్రంగా వుందన్నారు. ఇప్పటికే ఆర్టీఐ ద్వారా పోలవరం ప్రాజెక్ట్‌పై కేబినెట్‌ తీర్మానాల సమాచారం కోరిన ఉండవల్లి.. ధవళేశ్వరంలోని పోలవరం ఇరిగేషన్‌ కార్యాలయంలో మరిన్ని వివరాలు సేకరించారు.  

 

16:23 - December 8, 2017

భద్రాద్రి : జిల్లాలోని అశ్వారావుపేటలో ఆబ్కారీ పోలీసుల తీరు వివాదాస్పదమవుతోంది. తెల్లబెల్లం అమ్మడం నేరమంటూ...కిరాణా వ్యాపారిని ఆబ్కారీ సిఐ ఇందుమతి చితకబాదింది. ఇలా జరగడం ఇది రెండోసారి. సిఐ తీరును ఖండించిన వ్యాపారులు.. ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ ఆందోళనకు దిగారు. సిఐపై చర్యలు తీసుకోవాలంటూ అశ్వారావుపేట వ్యాపారస్తులు రాస్తారోకో నిర్వహిచారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

15:46 - December 8, 2017
15:45 - December 8, 2017

మహిళా వార్తల సమాహారం మానవి న్యూస్. డబ్బు మైకానికి బాల్యం ఛిద్రమైతుంది. పసిపిల్లల ఆరణ్య రోధన. మేకప్ ఫౌండేషన్...కాస్మోటిక్ జిలుగల మాటున బాల్యం ఛిద్రం, పోలీసులుపైకి రాళ్లు రువ్విన అమ్మాయే రాష్ట్ర ఫుట్ బాల్ జట్టుకు కెప్టెన్, మహిళలపై వేధింపులు.. ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ సోదరికి వేధింపులు, పాట్నాలో బ్యాండ్ వాయిస్తున్న మహిళలు... మహిళా బ్యాండ్, ఆకట్టుకుంటున్న రుక్మిణి వర్మ చిత్రాలు, 12 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడితే ఉరిశిక్ష విధించాలని మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఆమోదించింది. వీటిలో పలు మహిళా వార్తల వివరాలను వీడియోలో చూద్దాం...  

 

కిరాణా వ్యాపారిని చితకబాదిన ఆబ్కారీ సిఐ

భద్రాద్రి : జిల్లాలోని అశ్వారావుపేటలో ఆబ్కారీ పోలీసుల తీరు వివాదాస్పదమవుతోంది. తెల్లబెల్లం అమ్మడం నేరమంటూ..కిరాణా వ్యాపారిని ఆబ్కారీ సి.ఐ. ఇందుమతి చితకబాదింది. ఇలా జరగడం ఇది రెండోసారి. సి.ఐ. తీరును ఖండించిన వ్యాపారులు.. ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ ఆందోళనకు దిగారు.

 

15:39 - December 8, 2017

హైదరాబాద్ : అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం వచ్చే నెలలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాలని టీ మాస్‌ ఫోరం నిర్ణయించింది. జనవరి 2 నుంచి 10 వరకు గ్రామ గ్రామన సభలు, సమావేశాలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తారు. అదే నెల చివరివారంలో కలెక్టరేట్లను ముట్టడించాలని నిర్ణయించింది.  అణగారిన వర్గాలకు ఇచ్చిన హామీలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేయాలని టీ మాస్‌ ఫోరం నేత జాన్‌ వెస్లీ డిమాండ్‌ చేశారు. 

 

15:36 - December 8, 2017

హైదరాబాద్ : టీ మాస్‌ సామాజిక విప్లవ సంస్థ అని కంచ ఐలయ్య చెప్పారు. హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతున్న టీ మాస్‌ సమావేశంలో ఐలయ్య మాట్లాడారు. కుల నిర్మూలన దిశగా టీ మాస్‌ జీజాలు వేస్తుందని, రాజకీయ శక్తి దీనిని నడిపిస్తుందన్నారు. కుల నిర్మూలన దిశగా బీజాలు వేస్తుందని తెలిపారు. 

 

15:32 - December 8, 2017

పశ్చిమగోదావరి : జిల్లాలోని ఏలూరు మండలం.. శ్రీపర్రులో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. సాగునీటి కోసం.. గ్రామస్థులు ఆందోళనకు దిగారు. కొల్లేరులోని  మూడో కాంటూరును కుదించి అక్కడ ఉన్న సొసైటీ భూములకు నీరు పెట్టుకునే అవకాశం ఇవ్వాలని కోరగా..అటవీశాఖ అధికారులు నిరాకరించారు. దీంతో  అటవీ శాఖ అధికారులు.. గ్రామస్థుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

చంద్రబాబుతో టీటీడీపీ ముఖ్య నేతల భేటీ

హైదరాబాద్ : ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో చంద్రబాబుతో టీటీడీపీ ముఖ్య నేతల భేటీ అయ్యారు. పలు అంశాలపై చర్చిస్తున్నారు. 

 

తిరుమలలో టీటీడీ ఈవో తనిఖీలు

చిత్తూరు  : తిరుమలలో టీటీడీ ఈవో తనిఖీలు చేపట్టారు. నిర్మాణంలో ఉన్న వకులమాత భవన్, శ్రీవారి సేవా సదన్, ఔటర్ రింగ్ రోడ్డు మూడో దశ పనులను ఈవో పరిశీలించారు.

 

15:10 - December 8, 2017

పవన్ ను కలిసిన రైతు కుటుంబసభ్యులు

గుంటూరు : చినకాకానిలో జనసేన పార్టీ అధినేత పవన్ ను పార్టీ కార్యాలయానికి భూములిచ్చిన రైతు కుటుంబ సభ్యులు  కలిశారు. 

 

ఓయూ పరీక్షలు వాయిదా..

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ పీజీ సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ నెల 11 నుంచి ప్రారంభం కావలసిన వివిధ పీజీ కోర్సుల పరీక్షలను వచ్చే ఏడాది జనవరి 22 నుంచి నిర్వహించనున్నట్లు ఓయూ అధికారులు తెలిపారు.

పాన్ ఆధార్ లింక్ మార్చి 31 వరకు..

ఢిల్లీ : బ్యాంకు ఖాతాలు..పాన్ కార్డులను ఆధార్ తో అనుసంధానం చేసుకోవాలనే గడువును మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది.

13:36 - December 8, 2017

ఆదిలాబాద్ : తమ డిమాండ్ల సాధన కోసం ఆదివాసీలు ఆందోళన బాట పట్టారు. చలో హైదరాబాద్ కు పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్ లో భారీ బహిరంగసభ ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి 'తుడుం దెబ్బ' ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ జరుగనుంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

13:34 - December 8, 2017

హైదరాబాద్ : సమాన పనికి తగిన వేతనం ఇవ్వకుండా శ్రమ దోపిడి చేస్తున్నారంటూ 21 రోజులుగా నారాయణ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకుల పోరాటం కొనసాగుతోంది. తమ సమస్యలపై యాజమాన్యం స్పందించడం లేదని అధ్యాపకులు వాపోతున్నారు. వెంటనే సమస్యలు పరిష్కరించాలని దిల్ సుఖ్ నగర్ లో అధ్యాపకులు మహాధర్నా చేపట్టారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

13:27 - December 8, 2017

విజయవాడ: ఏపీ ప్రతిపక్షం వైసీపీనుద్ధేశించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలు వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో ఏపీ విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్షంపై పలు విమర్శలు చేశారు. అసెంబ్లీని ఉపయోగించుకుని అద్బుతాలు చేయొచ్చని, వైసీపీలో కష్టపడే తత్వం కనిపించడం లేదన్నారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చ జరగాలని..23వేల మంది కార్మికుల సమస్యలపై ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయడం లేదని ప్రతిపక్షాన్ని ఉద్ధేశించి ప్రశ్నించారు. 

13:22 - December 8, 2017

నల్గొండ : సీపీఐ ఎం.ఎల్‌ (న్యూడెమోక్రసీ) చంద్రన్న వర్గానికి చెందిన సాగర్ ను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అతనితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు. కానీ దీనిని పోలీసులు అధికారికంగా నిర్దారించలేదు. అనారోగ్య కారణాలతో మిర్యాలగూడ నుండి హైదరాబాద్ కు సాగర్ వెళుతున్న విషయాన్ని పోలీసులు పక్కా సమాచారం తెలుసుకున్నారు. చంద్రన్న వర్గానికి చెందిన ఇద్దరు సానుభూతి పరులతో వెళుతున్న సాగర్ ను మిర్యాలగూడలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

13:20 - December 8, 2017
13:19 - December 8, 2017

ముగిసిన పవన్ సమావేశం..

విజయవాడ : వివిధ రంగాలకు చెందిన వారితో సినీ నటుడు, జనసేన అధినేత పపవన్ జరిపిన సమావేశం ముగింది. విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగులు, కాంట్రాక్టు లెక్చరర్లు..ఉద్యోగులు, ఫాతిమా విద్యార్థులు..ఇతరులతో ఆయన సమావేశం జరిపారు. 

ఫాతిమా విద్యార్థులను రీ లోకేట్ చేయాలి - పవన్..

విజయవాడ : వంద మంది ఫాతిమా విద్యార్థులను తప్పకుండా రీ లోకేట్ చేయాలని..యాజమాన్యం చేసిన తప్పుకు విద్యార్థులను ఎలా బలి చేస్తారని సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఎదిగే పిల్లలకు కాలం ఖర్చు అవుతుందని..డబ్బులు విసిరేసి రాలేదని..మానవతా దృష్టితో ఆలోచించాలన్నారు.  

'ఆడ తల్లుల కన్నీళ్లు రాష్ట్రానికి మంచిది కాదు'..

విజయవాడ : ఆడ తల్లుల కన్నీళ్లు..రాష్ట్రానికి..దేశానికి మంచిది కాదని సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రభుత్వానికి..ప్రజలకు మాత్రం తెలియచేయగలనని..ప్రభుత్వం ఈ సమస్యను ఎలా పరిష్కరించవచ్చో ప్రతిపక్షాలు తెలియచేయాలని..టిడిపి తప్పు చేస్తుంది అనుకుంటే...నిలదీసే హక్కు ప్రతిపక్షాలకు ఉందన్నారు. ప్రతిపక్షాన్ని తక్కువ అంచనా వేయవద్దు అని సూచించారు. 

కాంట్రాక్టు లెక్చరర్లు..ఉద్యోగులపై పవన్ స్పందన..

విజయవాడ : పుష్కరాలకు తాను వ్యతిరేకం కాదని..వెయ్యి కోట్లు ఖర్చు పెట్టే బదులు అందులో కొంత భాగం లెక్చరర్లు..ఉద్యోగులకు ఇస్తే బాగుంటుందని సినీ నటుడు, జనసేన అధినేత పేర్కొన్నారు. కాంట్రాక్టు లెక్చరర్లు..ఉద్యోగుల బాధను తాను అర్థం చేసుకోగలనని..వారు పేర్కొంటున్న కోర్కెలు సమంజసమేనన్నారు. 

పోలవరంపై బాబు టెలీకాన్ఫరెన్స్...

విజయవాడ : పోలవరంపై సీఎం చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ కృషిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని...పోలవరానికి కేంద్రం విడుదల చేస్తున్న నిధుల వివరాలను..రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న వివరాలను ఎప్పటికప్పుడు వివరించడం జరుగుతోందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను మంత్రులకు అందచేయాలని మంత్రి దేవినేని ఉమకు సూచించారు. 

12:42 - December 8, 2017

కాంట్రాక్టు లెక్చరర్లతో పవన్..

విజయవాడ : తమను వెట్టిచాకిరి కంటే హీనంగా పని చేయించుకుంటున్నారని కాంట్రాక్టు లెక్చరర్లు పేర్కొన్నారు. సినీ నటుడు పవన్ తో వారు భేటీ అయ్యారు. 17 సంవత్సరాల నుండి తాము కాంట్రాక్టు వ్యవస్థలో పనిచేయడం జరుగుతోందని, 4వేల నుండి వేతనం నుండి పనిచేస్తున్నామని పేర్కొన్నారు. తాము పడుతున్న బాధలు బయటకు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నామన్నారు. 

12:25 - December 8, 2017

విజయవాడ : 'మేము ప్రభుత్వ ఉద్యోగులం..అయిన్నంత మాత్రనా ప్రభుత్వం తమను రాసుకుందా ? ప్రభుత్వం ప్రకటించే సంక్షేమ పథకాలు..వివిధ పథకాలు అమలు చేయాలంటే ప్రభుత్వ ఉద్యోగులు కీలకం..రాత్రింబవళ్లు..మొగుడు..పిల్లలు లేకుండా పని చేస్తున్నాం..ఇంత చేస్తున్నప్పుడు తమ సమస్యలపై ప్రభుత్వం ఎందుకు స్పందించదు'..అంటూ ఓ ప్రభుత్య ఉద్యోగురాలు ప్రశ్నించింది. విజయవాడలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో సీపీఎస్ ఉద్యోగులు భేటీ అయ్యారు. తమ సమస్యలు పరిష్కరించే విధంగా ప్రభుత్వంపై వత్తిడి చేయాలన్నారు. 18 రాష్ట్రాల్లో సీపీఎస్ రద్దు చేయాలనే పోరాటాలు కొనసాగుతున్నాయని ఉద్యోగులు పేర్కొన్నారు. సీపీఎస్ విధానంపై తాను అధ్యయనం చేయాల్సినవసరం ఉందని..ఇందుకు తగిన నిపుణులతో భేటీ అయి వివరాలు సేకరించడం జరుగుతుందన్నారు. 1.80వేల కుటుంబాలకు సంబంధించిన అంశమన్నారు. ఆయా విషయాల్లో సీఎం అయితే తాము అది చేస్తామని..ఇది చేస్తామని చెబుతారని ఒకవేళ 2019లో జగన్ సీఎం అయితే ఇదే చెబుతారని..వ్యక్తులు మారితే వ్యవస్థలో మార్పు రాదని..వ్యవస్థలో మార్పు రావాలని పవన్ పేర్కొన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

సీపీఎస్ స్టడీ చేస్తాను -- పవన్..

విజయవాడ  : 18 రాష్ట్రాల్లో సీపీఎస్ రద్దు చేయాలనే పోరాటాలు కొనసాగుతున్నాయని ఉద్యోగులు పేర్కొన్నారు. పలువురు ఉద్యోగులు పవన్ ను కలిశారు. సీపీఎస్ విధానంపై తాను అధ్యయనం చేయాల్సినవసరం ఉందని..ఇందుకు తగిన నిపుణులతో భేటీ అయి వివరాలు సేకరించడం జరుగుతుందన్నారు. 

పవన్ ను కలిసిన కాంట్రాక్టు ఉద్యోగులు..

విజయవాడ : కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు పలువురు ఉద్యోగులు పేర్కొన్నారు. విజయవాడలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను వారు కలిశారు. ఈ సందర్భంగా వారు చెబుతున్న సమస్యలను పవన్ వింటున్నారు. 

సీబీఐటీ ఎదుట విద్యార్థుల ధర్నా..

రంగారెడ్డి : సీబీఐటీ ఎదుట విద్యార్థుల ధర్నా కొనసాగుతోంది. కాలేజీలోకి విద్యార్థులు గోడ దూకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అరెస్టు చేసిన వారిని రాజేంద్రగర్ పీఎస్ కు తరలించారు. 

విద్యాశాఖపై కడియం సమీక్ష...

హైదరాబాద్ : జూ.కాలేజీల ప్రిన్స్ పాల్స్, అధికారులతో ఇంటర్ మీడియట్ విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి డిప్యూటి సీఎం కడియం శ్రీహరి, ఇంటర్ మీడియట్ విద్యాశాఖ కార్యదర్శి అశోక్ లు హాజరయ్యారు. 

ఏపీ విద్యుత్ కాంట్రక్టు కార్మికులకు జనసేన మద్దతు..

విజయవాడ : ఏపీ విద్యుత్ కాంట్రక్టు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు. విజయవాడలో ఆయన తో భేటీ అయ్యారు. జనవరి 27వ తేదీలోపు స్పందించాలని లేనిపక్షంలో తాము సమ్మెలోకి వెళుతామని పేర్కొంటూ సమ్మె నోటీసు ఇవ్వడం జరిగిందన్నారు. సమ్మెలోకి పోతే జనసేన మద్దతిస్తుందా ? అని ప్రశ్నించారు. ఇందుకు తప్పకుండా మద్దతిస్తుందని పవన్ ప్రకటించారు. 

11:42 - December 8, 2017

విజయవాడ : ఏపీ రాష్ట్రంలో తాము ఎన్నో సమస్యలు..ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఏపీ విద్యుత్ కాంట్రక్టు కార్మికులు పేర్కొన్నారు. ఏపీ రాష్ట్రంలో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో వారు భేటీ అయ్యారు. గత ఎన్నో ఏళ్లుగా న్యాయబద్ధమైన కోరికను ప్రభుత్వం తీర్చడం లేదని వారు పేర్కొన్నారు. విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై పవన్ ఆసక్తిగా విన్నారు. విద్యుత్ రంగంలో కాంట్రాక్టు వ్యవస్థను తీసివేయాలని..సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని..తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్నట్లుగా వేతనం ఇచ్చే విధంగా చూడాలని కోరారు.

బాధలు..ఇబ్బందులు..సమస్యలు తెలుసుకోవడానికి టైం ఇచ్చిన జనసేన అధినేతకు 24వేల మంది కార్మికుల ఐక్యవేదిక తరపున అభినందనలు తెలియచేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో 24వేల మంది విద్యుత్ కార్మికులున్నారని, 6-8-10-12 వేల వేతనం వస్తోందని...రెగ్యులరైజ్ లేదా..క్రమబద్ధీకరించాలని..సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తాము కోరడం జరిగిందన్నారు. మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో నలుగురి చేత కమిటీ ఏర్పాటు జరిగిందని, 2/94 చట్టం ప్రకారం సుప్రీంకోర్టు చట్టం అడ్డంగా ఉందని ఎలాంటి రెగ్యులరైజ్ చేయడం జరగదన్నారు.

మేనిఫెస్టోలో పేజీ 30లో వారు హామీనిచ్చారని, ఇందుకు సవరణ చేస్తే రెగ్యులరైజ్ చేసే అవకాశం ఉందన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పడం జరిగిందని ఆ విధంగా చేయాలని తాము కోరడం జరుగుతోందని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే విద్యుత్ ముఖ్యమని..హుదూద్ తుపాన్ సమయంలో 24గంటల్లో విద్యుత్ ను పునరుద్ధరించామని, రాత్రింబవళ్లు పని చేశామన్నారు. ప్రభుత్వ పెద్దలే ఉన్నారని..గుండు గుత్తగా కొంతమంది వ్యక్తుల చేతుల్లోకి సంస్థను అప్పచెప్పేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేయాలని, తమకు నేరుగా జీతాలు ఇచ్చే విధంగా చూడాలని..తెలంగాణలో అదే విధంగా ఇస్తున్నారన్నారు.

కాంట్రాక్టు వ్యవస్థను తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడేనన్నారు. 2003లో చట్టానికి సవరణలు చేసిందని..ఆనాడు సమయంలో తాము పోరాటం చేయడం జరిగిందన్నారు. దివంగత వైఎస్ ను ఆనాడు కలవడం జరిగిందని, ఇది పాలసీ స్టడీ చేయాలని చెప్పారని తెలిపారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

విద్యుత్ కాంట్రాక్టు కార్మికులతో పవన్..

విజయవాడ : విద్యుత్ కాంట్రాక్టు కార్మికులతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎదుర్కొంటున్న సమస్యలను వారు పవన్ కు తెలియచేశారు. 

11:19 - December 8, 2017

విజయవాడ : తమకు న్యాయం చేయాలని కోరుతూ ఎన్నో రోజులుగా పోరాటం చేస్తున్న ఫాతిమా కళాశాల విద్యార్థులకు జనసేన భరోసా ఇచ్చింది. ఏపీ రాష్ట్రంలో మూడు రోజులుగా జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. మూడో రోజు విజయవాడలో పలువురితో భేటీ అయ్యారు. ఫాతిమా కళాశాలకు చెందిన విద్యార్థులు ఆయన్ను కలిసి సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా వారికి పవన్ భరోసా ఇచ్చారు. తిరిగి కళాశాల్లోకి వెళ్లే విధంగా చూస్తానని, సమస్య పరిష్కారమయ్యేంత వరకు ఉంటానని..తనకు వారం రోజుల సమయం ఇవ్వాలని పవన్ సూచించారు. ఫాతిమా కళాశాల విద్యార్థులు ఎలాంటి తప్పు చేయలేదని, వంద మంది కళాశాల విద్యార్థులను ఇతర కళాశాల్లోకి తీసుకోవడానికి దారులు ఉంటాయన్నారు. ఫాతిమా స్టూడెంట్స్ సమస్యపై సంబంధిత మంత్రులతో మాట్లాడుతానన్నారు. చిన్న సమయంలో తాను ఇలాంటి సమస్యలు చూడడం జరిగిందని, ప్రత్యేక హోదా ఇప్పటి వరకు ఇవ్వలేకపోయారని...పేర్కొన్నారు.

పవన్ ఘాట్ హెచ్చరికలు..
ఏ పార్టీయైనా..ఏ ప్రభుత్వమైనా..ప్రతిపక్షమైనా...ఎవరైనా విద్యార్థుల భవిష్యత్ తో ఆడుకొంటే ఊరుకొనేది లేదన్నారు. వారు చేస్తున్న పోరాటంలో తాను ముందుంటానన్నారు. ఎవరూ బెదిరించినా..భయపడవద్దని వీరి వెనుక జనసేన ఉంటుందన్నారు. విద్యార్థులపై చేయి పడితే చూస్తూ ఊరుకోనని, ఈ సమస్య పరిష్కరించడానికి తనకు వారం రోజుల సమయం ఇవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా తాము ఇన్ని రోజులు ఎదుర్కొన్న ఇబ్బందులు..సమస్యలను ఫాతిమా స్టూడెంట్స్ పవన్ కు తెలియచేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

ఫాతిమా స్టూడెంట్స్ తప్పు చేయలేదన్న పవన్..

విజయవాడ : వంద మంది కళాశాల విద్యార్థులను ఇతర కళాశాల్లోకి తీసుకోవడానికి దారులు ఉంటాయని, విద్యార్థులు తప్పు చేయలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఫాతిమా స్టూడెంట్స్ సమస్యపై సంబంధిత మంత్రులతో మాట్లాడుతానన్నారు. 

న్యాయం చేసే విధంగా చూడాలన్న ఫాతిమా స్టూడెంట్స్..

విజయవాడ : తమకు న్యాయం చేసే విధంగా చూడాలని ఫాతిమా స్టూడెంట్స్ జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ను కోరారు. వారితో పవన్ మాట్లాడుతున్నారు. 

పవన్ తో ఫాతిమా స్టూడెంట్స్..

విజయవాడ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఫాతిమా కళాశాల విద్యార్థులు కలిశారు. ఏపీ రాష్ట్రంలో పవన్ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. 

10:35 - December 8, 2017

విశాఖపట్టణం : దేశ రక్షణలో నౌకాదళం కీలక పాత్ర పోషిస్తోందని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పేర్కొన్నారు. విశాఖపట్టణంలో ఆయన రెండో రోజు పర్యటనలో భాగంగా తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రాన్ని సందర్శించారు. తొలి జలాంతర్గమి ఐఎస్ఎస్ కల్వరి స్వర్ణోత్సవాల్లో కోవింద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నావికుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. మేకింగ్ ఇండియాలో భాగంగా కేంద్ర ప్రభుత్వం జలాంతర్గాముల నిర్మాణాలకు ప్రాధాన్యతనిస్తోందని, త్రివిద దళాల్లో నౌకాదళం ఎంతో కీలకమైనదని అభివర్ణించారు. 

10:17 - December 8, 2017

విజయవాడ : తన తండ్రి ఆస్తుల్లో పెద్దగా మార్పు లేదని, మార్కెట్ విలువ ప్రకారమే ఆస్తుల విలువ మారుతూ వస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. వరుసగా ఏడో సారి నారా వారి ఆస్తులను ఆయన వెల్లడించారు. కుమారుడు దేవాన్ష్ ఆస్తుల్లోనూ మార్పు లేదన్నారు. చంద్రబాబు నికర ఆస్తులు రూ. 2.53 కోట్లు, భువనేశ్వరి ఆస్తులు రూ. 25.41 కోట్లు, లోకేశ్ నికర ఆస్తులు రూ. 15.21 కోట్లు, బ్రహ్మణి నికర ఆస్తులు రూ.15.01 కోట్లు, దేవాన్ష్ నికర ఆస్తులు రూ.11.54 కోట్లు అని తెలిపారు. తమపై కొంతమంది ఆరోపణలు చేస్తున్నారని, ఆరోపణలు చేసే ముందు వాళ్ల ఆస్తులు ప్రకటిస్తే బాగుంటుందని సూచించారు. పద్ధతి ప్రకారం వ్యాపారం చేయడం తప్పుకాదని, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా తమ ఆస్తుల వివరాలను ప్రకటించాలన్నారు. 

బాబు ఆస్తులు 2.53 కోట్లు..

విజయవాడ : తన తండ్రి ఆస్తుల్లో పెద్దగా మార్పు లేదని, మార్కెట్ విలువ ప్రకారమే ఆస్తుల విలువ మారుతూ వస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. వరుసగా ఏడో సారి నారా వారి ఆస్తులను ఆయన వెల్లడించారు. కుమారుడు దేవాన్ష్ ఆస్తుల్లోనూ మార్పు లేదన్నారు. చంద్రబాబు నికర ఆస్తులు రూ. 2.53 కోట్లు, భువనేశ్వరి ఆస్తులు రూ. 25.41 కోట్లు, లోకేశ్ నికర ఆస్తులు రూ. 15.21 కోట్లు, బ్రహ్మణి నికర ఆస్తులు రూ.15.01 కోట్లు, దేవాన్ష్ నికర ఆస్తులు రూ.11.54 కోట్లు అని తెలిపారు.

హెరిటేజ్ నుండే ఆదాయం - నారా లోకేష్..

విజయవాడ : 1992లో హెరిటేజ్ సంస్థను ప్రారంభించామని, తమ కుటుంబానికి ‘హెరిటేజ్’ నుంచే ఆదాయం వస్తోందని ఏపీ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలపై పలు ఆరోపణలు గుప్పించారు. వారసులుగా అవకాశం వచ్చిన మాట వాస్తవమే, కానీ, ప్రజామోదం ఉంటేనే నిలబడగలమని అన్నారు. వైసీపీ అధినేత జగన్ ఎందుకు పాదయాత్ర చేస్తున్నారో తెలియదని, పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కోరుకుంటుటే ప్రాజెక్టు పూర్తి కాకూడదని వైసీపీ నేతలు దేవుడ్ని ప్రార్థిస్తున్నారని విమర్శించారు.

10:09 - December 8, 2017

విజయవాడ : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ పర్యటన కొనసాగుతోంది. విశాఖపట్టణం, పోలవరం ప్రాజెక్టును సందర్శించిన పవన్ నేడు విజయవాడలో పర్యటించనున్నారు. మధ్యాహ్నాం మేరిస్టెల్లా కాలేజీలో ఇండోర్ స్టేడియంలో జనసేన కార్యకర్తలతో సమావేశం కానున్నారు. అంతకంటే ముందు ఫాతిమా కాలేజీ విద్యార్థులు..కాంట్రాక్టు లెక్చరర్లు, విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలను తెలుసుకొనేందుకు పవన్ దృష్టి సారించారు. అందులో భాగంగా ఎంపిక చేసిన కాంట్రాక్టు లెక్చరర్లు, విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల నేతలతో పవన్ సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా టెన్ టివి ఆయా రంగాల నేతలు..ఫాతిమా విద్యార్థులతో మాట్లాడింది. తమ సమస్యలు వినడానికి పవన్ కళ్యాణ్ ఒప్పుకోవడం సంతోషంగా ఉందన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

విజయవాడకు పవన్...

విజయవాడ : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడకు చేరుకున్నారు. ఫాతిమా కాలేజీ విద్యార్థులు, కాంట్రాక్టు లెక్చరర్లు, విద్యుత్ కాంట్రాక్టు కార్మికులతో పవన్ భేటీ కానున్నారు. 

09:31 - December 8, 2017

విజయవాడ : తాము ఒక పద్ధతి ప్రకారం వెళుతున్నామని సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన నారా వారి ఆస్తులను ప్రకటించారు. గత ఆరేళ్లుగా ఆయన ఆస్తులను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళుతున్నామని, ఆదాయం వస్తుందంటే హెరిటేజ్ సంస్థ నుండి..రెంటల్స్ కారణమన్నారు. ఏ రాజకీయ కుటుంబం చేయని విధంగా ఆస్తులను ప్రకటించడం జరుగుతోందన్నారు. ఆరోపణలు చేయవచ్చు కానీ అంతకంటే ముందు ఆస్తులను ప్రకటించాలని, అలా చేయకపోతే ప్రజలు నమ్మరని తెలిపారు. 2004 కంటే ఎంతుంది ? ఇప్పటి వరకు ఆస్తులు ఎంతున్నాయో చెప్పాలని సూచించారు. గతంలో దివంగత వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో హెరిటేజ్ కంపెనీపై ఎన్నో ఛార్జీషీట్ లు దాఖలు చేశారని గుర్తు చేశారు. కానీ ఏమి నిరూపించలేకపోయారని, వైసీపీ నేతలు కూడా ఆస్తులను ప్రకటించాలని సూచించారు. జగన్ అక్రమమార్గంలో ఆస్తులను సంపాదించుకున్నారని ఆరోపించారు. పోలవరం నిర్మాణంపై జగన్..పవన్ కు చాలా తేడా ఉందని, పోలవరం నిర్మాణం కావద్దని జగన్ కోరుకుంటున్నారని తెలిపారు.

సీఎం చంద్రబాబు నాయుడు ఆస్తుల్లో పెద్దగా మార్పులేవని, బాబుకు రూ. 3కోట్ల అప్పులున్నాయన్నారు. ఉన్న ఇల్లును కూల్చివేసి కొత్తగా ఇల్లు కట్టుకోవడం జరిగిందని, ఇందుక రూ. 4 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. లోకేష్ ఆస్తుల విలువ రూ. 15.20 కోట్లు, బ్రాహ్మణి ఆస్తుల విలువ రూ. 15 కోట్లు. 

09:25 - December 8, 2017

పెద్దపల్లి : కాలేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా ఓ చెరువు ఉనికి కోల్పోతుంది. దీంతో అనేక మత్స్యకార కుటుంబాల రోడ్డున పడ్డాయి. తమకు జీవనాధారం పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని మత్స్యకారులు ఆందోళన బాట పట్టారు. గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన మత్స్యకారులు ప్రాజెక్ట్‌ పనులను అడ్డుకున్నారు. సీఎం పర్యటనలోనైనా తమ సమస్యను పరిష్కరించాలని మత్స్యకారులు డిమాండ్‌ చేస్తున్నారు. ఓవైపు కాళేశ్వరం పనులు వేగవంతం పుంజుకుంటుండగా... పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మేడారంలో మత్స్యకారులు ఆందోళన బాట పట్టారు.

ఈ సందర్భంగా మత్స్యకారుల సంఘం బాలకృష్ణ టెన్ టివితో మాట్లాడారు. గండి పెట్టడం అన్యాయమని, రెండు వేల మత్స్యకార్మికుల పొట్ట కొట్టారని తెలిపారు. ప్రభుత్వ చీప్ విప్ కొప్పుల ఈశ్వర్..కాంట్రాక్టర్లు కుమ్మక్కాయ్యారన్నారు. 47 రోజులుగా ఆందోళన చేస్తున్నా సర్కార్ స్పందించలేదని, ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పోలీసులు హల్ చల్ చేస్తున్నారని పేర్కొన్నారు. తాము సీఎం కేసీఆర్ సభను అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తామన్నారు.

ధర్మారం నంది మేడారం రిజర్వాయర్ మత్స్యకార్మికులు ఆందోళన చేస్తున్నారు. చెరువుగా ఉన్న సమయంలో ఎంతోమంది మత్స్యకార్మికులు జీవనోపాధి పొందారు. కానీ ప్రస్తుతం చెరువు నామరూపాలు లేకుండా పోతుండంతో నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేపోతోంది. దీనితో ప్రభుత్వ వైఖరిని నిరిసిస్తూ ఆందోళన బాట పట్టారు. ఆర్థికంగా నష్టపోకుండా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నట్లు మత్స్యకార్మికులు పేర్కొంటున్నారు. మరి వీరి సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందా ? లేదా ? అనేది చూడాలి. 

నందిమేడారం రిజర్వాయర్ వద్ద ఆందోళన...

పెద్దపల్లి : ధర్మారంలో నందిమేడారం రిజర్వాయర్ వద్ద రెండు రోజులుగా మత్స్యకారులు ఆందోళన చేపడుతున్నారు. చెరువును రిజర్వాయర్ గా మార్చడంతో నష్టపోయిన తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు మోహరించారు. 

ప్రజంటేషన్ ఆఫ్ కలర్స్ ఉత్సవం..

విశాఖపట్టణం : ఐఎన్ఎస్ సర్కార్ మైదానంలో ప్రజంటేషన్ ఆఫ్ కలర్స్ ఉత్సవం జరిగింది. రాష్ట్రపతి కోవింద్, గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబు నాయుడులు పాల్గొన్నారు. నౌకాదళంలోకి సబ్ మెరైన్ ప్రవేశించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఉత్సవం జరుగుతోంది. భారతీయ నౌకాదళంలో 167 డిసెంబర్ 8వ తేదీన బలాంతర్గమి విభాగం ప్రారంభించారు. తొలి జలాంగర్గామి ఐఎన్ఎస్ కల్వరి. పరేడ్ లో 39 మంది అధికారులు, 621 మంది నావికలు పాల్గొన్నారు. 

ఆస్తులను ప్రకటించిన నారా లోకేష్..

విజయవాడ : నారా కుటుంబం ఆస్తులను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ ఆస్తుల వివరాలను ప్రకటించారు. వరుసగా ఏడో సారి ఆస్తులను ప్రకటించారు. 

09:12 - December 8, 2017

స్కూల్ లో కాల్పులు..

మెక్సికో : న్యూమెక్సికో హై స్కూల్‌లో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా 14మందికిపైగా విద్యార్థులకు గాయాలయ్యాయి. అజ్టెక్‌లోని అజ్టెక్ హైస్కూల్‌లో కాల్పులు జరిపిన దుండగుడు కూడా పోలీసుల కాల్పుల్లో మరణించినట్లు తెలిసింది.

08:25 - December 8, 2017
08:18 - December 8, 2017

మెక్సిక్ : ఓ పాఠశాలలో ఆగంతకుడు కాల్పులకు తెగబడ్డాడు. గురువారం ఉదయం జరిగినఈ ఇద్దచరు మృతి చెందారు. డజను మందికి పైగా గాయపడినట్లు తెలిసింది. న్యూ మెక్సికోలోని అల్బుకుర్కేకు సుమారు 180 మైళ్ల దూరంలో ఉన్న అజ్‌టెక్‌ హైస్కూల్‌లో ఈ ఘటన జరిగింది. మృతుల్లో ఇద్దరు విద్యార్థులతో పాటు కాల్పులకు పాల్పడిన వ్యక్తి ఉన్నట్లు భావిస్తున్నారు. అయితే కాల్పులకు తెగబడిన వ్యక్తి ఎలా చనిపోయాడన్నదానిపై స్పష్టత రాలేదు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడా లేక యాదృచ్ఛికంగా జరిగిందా అన్నది తెలియరాలేదు. విద్యార్థులందరినీ పాఠశాల నుంచి బయటికి పంపించి ప్రత్యేక బస్సుల్లో ఇళ్లకు తరలించారు.   

08:10 - December 8, 2017

తూర్పుగోదావరి : మారేడుపల్లి ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టైగర్ క్యాంపు వద్ద టాటాఎస్ వాహనం లోయలో పడిపోయింది. నలుగురు మృతి చెందగా 14 మందికి గాయాలయ్యాయి. చింతూరులో క్రిస్ మిస్ వేడుకల్లో పాల్గొని వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులు కాకినాడ వాసులుగా గుర్తించారు. 

07:30 - December 8, 2017

ప్రాజెక్టుల పర్యటనలో భాగంగా కేసీఆర్‌ తుపాకుల గూడెం బ్యారేజ్, మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్ హౌజ్, అన్నారం బ్యారేజ్, సిరిపురం పంప్ హౌజ్ లను సందర్శించారు. పనులు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. బ్యారేజీలు, పంప్ హౌజ్ లు, కాలువల నిర్మాణ పనులు మూడు షిప్టుల్లో జరగాలని అధికారులను, వర్క్ ఏజెన్సీలను కేసీఆర్‌ ఆదేశించారు. కేసీఆర్ పర్యటన నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వాసితులు అడ్డుకుంటారని భావించి వారిని గృహ నిర్భందం చేశారు. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో వీరయ్య (విశ్లేషకులు), సమ్మారావు (టీఆర్ఎస్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

07:25 - December 8, 2017

మొదట్లో సహకార ఫ్యాక్టరీ అది. ఆ తర్వాత కాలంలో ప్రైవేటు యాజమాన్యం చేతుల్లోకి వెళ్లింది. ఇప్పుడు ఆ ప్రైవేటు యాజమాన్యం ఆ ఫ్యాక్టరీని మూసివేస్తుంది. అర్థాంతరంగా మూసివేయడంతో తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు దానిలో పని చేస్తున్న ఉద్యోగులు, దాన్ని నమ్ముకున్న చెరుకు రైతులు. ఇదీ కృష్ణా జిల్లా హనుమాన్‌ జంక్షన్‌లో ఉన్న డెల్టా చక్కెర కర్మాగారం ఉద్యోగుల, రైతుల పరిస్థితి. గత కొన్నాళ్లుగా వారంతా ఆందోళన చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం రాజకీయ కారణాలతో సరిగా స్పందించడంలేదని విమర్శలున్నాయి. దీనిపై టెన్ టివి జనపథంలో ఆంధ్రప్రదేశ్‌ తూర్పు క్రిష్ణ సీపీఎం జిల్లా కార్యదర్శి రఘు విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

మారేడుపల్లి లో రోడ్డు ప్రమాదం..

తూర్పుగోదావరి : మారేడుపల్లి ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టైగర్ క్యాంపు వద్ద టాటాఎస్ వాహనం లోయలో పడిపోయింది. నలుగురు మృతి చెందగా 14 మందికి గాయాలయ్యాయి. చింతూరులో క్రిస్ మిస్ వేడుకల్లో పాల్గొని వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. 

06:46 - December 8, 2017
06:39 - December 8, 2017

గుజరాత్ : రాష్ట్ర ఎన్నికల ప్రచారం చివరి రోజు నేతల మధ్య దూషణల పర్వం తీవ్రస్థాయికి చేరింది. కాంగ్రెస్‌ నేత మణిశంకర్‌ అయ్యర్‌ ప్రధాని మోదిని నీచుడిగా పేర్కొంటే... మణిశంకర్‌ది మొగలుల సంస్కారమని మోది ఎదురు దాడికి దిగారు. అయ్యర్‌ వ్యాఖ్యలను తప్పు పట్టిన రాహుల్‌...అది కాంగ్రెస్‌ సంస్కారం కాదని... ప్రధానికి క్షమాపణ చెప్పాలని సూచించారు. రాహుల్‌ సూచన మేరకు మణిశంకర్‌ అయ్యర్ క్షమాపణ చెప్పారు. హిందీ భాషపై అవగాహన లేక అలా వ్యాఖ్యానించానన్నారు.

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార ప్రతిపక్షాల నేతలు ఒకరిపై మరొకరు దూషణలకు దిగారు. ఢిల్లీలో అంబేద్కర్‌ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోది.. నెహ్రూ, గాంధీ కుటుంబాన్ని టార్గెట్‌ చేస్తూ పరోక్ష విమర్శలు చేశారు. జాతి నిర్మాణానికి డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ చేసిన కృషికి- నెహ్రూ, గాంధీ కుటుంబం తగిన గుర్తింపు నివ్వలేదని ప్రధాని మోది విమర్శించారు.

మోది వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత మణి శంకర్ అయ్యర్ తీవ్రంగా స్పందించారు. అంబేద్కర్ అతిపెద్ద ఆకాంక్షను వాస్తవం చేయడానికి గొప్పగా కృషి చేసిన వ్యక్తి జవహర్‌లాల్‌ నెహ్రూ అని తెలిపారు. అలాంటి కుటుంబంపై మోది చెడుగా మాట్లాడుతున్నారని అయ్యర్‌ మండిపడ్డారు. ప్రధాని మోదీని నీచుడు...సభ్యత లేనివాడని...చెత్త రాజకీయాలు చేస్తున్నారని అయ్యర్‌ అన్నారు.

అయ్యర్‌ వ్యాఖ్యలను కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తప్పు పట్టారు. బిజెపి, ప్రధాని కాంగ్రెస్‌ పార్టీపై నిత్యం విమర్శలు చేయడానికి రోత భాషను ఉపయోగిస్తూ ఉంటారు. అది వారి సంస్కారం. కాంగ్రెస్‌కు ప్రత్యేకమైన సంస్కృతి, వారసత్వం ఉన్నాయి. ప్రధానిని ఉద్దేశించి మణి శంకర్ అయ్యర్ సంబోధించిన తీరును నేను సమర్థించను. కాంగ్రెస్‌ పార్టీ, నేను వెంటనే మోదీకి క్షమాపణలు చెప్పాలని అయ్యర్‌ను కోరుతున్నాం అని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. మరోవైపు అయ్యర్‌ వ్యాఖ్యలపై మోది కూడా స్పందించారు. తనని నీచుడుగా పేర్కొనడం ద్వారా గుజరాత్‌ను అవమానపరిచారని పేర్కొన్నారు. మణిశంకర్‌ది మొగలుల సంస్కారమని...ఉన్నత, నీచ అనే సంస్కారం భారత్‌లో లేదన్నారు. మణిశంకర్ అయ్యర్ 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో కూడా నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. 'చాయ్‌వాలా' అంటూ అవహేళన చేశారు. చాయ్‌వాలాను మోది తనకు అనుకూలంగా మార్చుకున్న విషయం తెలిసిందే.

06:35 - December 8, 2017

విశాఖపట్టణం : విశాఖ ఫెస్ట్‌ను ప్రముఖ కవి గోరేటి వెంకన్న సందర్శించారు. ఫెస్ట్‌లో భాగంగా జరిగిన తెలుగు భాషా వికాసం సదస్సుకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఆధునిక సాహిత్యానికి ఆధ్యుడు గురజాడ అని గోరేటి వెంకన్న అన్నారు. ఉత్తరాంధ్ర సాహితీ సౌరభాలు వెదజల్లే నేలన్నారు. ఉత్తరాంధ్ర కవులు తమ రచనల ద్వారా గత వాతావరణాన్ని కొనసాగిస్తున్నారని అన్నారు. తల్లి చనుబాలకున్న స్వచ్చత దేనికీ రాదని సహజత్వం వదిలి నియాన్ వెలుగుల కోసం మనిషి పాకులాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఫెస్ట్‌లు సాహిత్య వాతావరణం విస్తరించడానికి దోహదపడతాయని గోరేటి అన్నారు.

06:34 - December 8, 2017

నిజామాబాద్ : సంగీతమంటే చెవి కోసుకుంటారు కొందరు.. పాటలు వింటూ ప్రపంచాన్ని మరిచి పోయే వారు కూడా ఉంటారు. కానీ, ఓ మూగజీవి ఈ సంగీతానికి బానిసగా మారింది. మనిషన్నాక కాసింత కళాపోషనుండాలనే సినిమా డైలాగును ఈ గోమాత కూడా అమలు చేస్తోంది. మూగ జీవి అయినంత మాత్రాన కళాపోషణ ఉండకూడదా? అని ప్రశ్నించే రీతిలో సంగీతాస్వాధన చేస్తోంది. ప్రతీ రోజు పాటలు వింటూ తన దినచర్యను ప్రారంభించే ఈ గోమాత, ఆ పాటలే లేకుంటే నానాయాగీ చేస్తోందట. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో పాటలు వినే గోమాత కథేమిటో చూద్ధాం.

నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన కొల్లిపర శ్రీకాంత్ రెండేళ్ళ కిందట ఓ ఆవును కొనుగోలు చేశారు. రూ.28 వేలకు ఒంగోలు దేశవాళి ఆవును తీసుకొచ్చి పోషిస్తున్నాడు. పాల వ్యాపారం కోసం తీసుకొచ్చిన ఆవు ప్రతీ రోజు ఉదయం సమీపంలోని రామాలయంలో వచ్చే పాటలను ఆస్వాదించేదని యజమాని శ్రీకాంత్‌ చెప్తున్నాడు. సంగీతాన్ని ఆస్వాదించినంత సేపు కడుపు నిండా గడ్డి మేసేదని.. ఆ పాటలు ఆగిపోయిన వెంటనే కొమ్ములాడిస్తూ, గంతులేస్తూ నానా గొడవ చేసేదంటున్నాడు.

ఆవును చేస్తున్న నానాయాగీని భరించలేని శ్రీకాంత్‌ వినూత్నమైన ఆలోచన తట్టింది. సెల్ ఫోనులో పాటలు పెట్టి దాని చెవి దగ్గర పెట్టినపుడు ఆనందంగా తలాడిస్తూ ప్రశాంతంగా ఉండడాన్ని గమనించిన శ్రీకాంత్‌... భక్తి పాటలను ఓ మెమోరీ కార్డులో లోడ్‌ చేయించాడు. ఆ కార్డును ఓ సెల్‌ఫోన్‌ వేసి... ఆవు మెడకు కట్టి.. పాటలు వినిపిస్తున్నాడు. అలా, పాటలు వింటున్నంత సేపు గోవు ప్రశాంతంగా ఉంటుందన్నాడు. సంగీతానికి అనుగుణంగా తలాడిస్తూ, మేత మేస్తూ ఆనందంగా కనిపిస్తోందని.. ప్రస్తుతం పాటలు వినడం దాని దినచర్యగా మారిందంటున్నాడు.

భక్తి గీతాలు వింటూ దినచర్యను సాగించే ఈ గోమాత గ్రామస్తులకు ఓ దేవతారూపంలో కనిపిస్తోందని గ్రామస్తులు చెబుతున్నారు. సహజంగానే గోవును పూజిస్తూ, ఆరాధించే స్థానికులు.. ఈ సంగీతాభిమానికి పసుపు, కుంకమలు పెట్టి పూజిస్తున్నారు. ఈ గోవు తమకు దేవతగా మారిందని, ఇది తమ ఇంటికి వచ్చాక వ్యాపారం బాగా సాగుతోందని యజమాని శ్రీకాంత్ చెబుతున్నారు. మొత్తానికి మనుషులకే కాదు గోమాతలకు కూడా సంగీతంపై మక్కువ ఉన్నట్లు నిజామాబాద్‌ లోని గోమాతను చూస్తే అర్ధమవుతోంది.

06:31 - December 8, 2017

హైదరాబాద్ : చెత్తపై స‌మరానికి జిహెచ్ఎంసి కౌన్సిల్ హాల్ వేదిక‌గా మారింది. హైద‌రాబాద్ న‌గ‌రాన్ని స్వచ్ఛ న‌గ‌రంగా మార్చే క్రమంలో చేప‌డుతున్న కార్యక్రమాలు నామ‌మాత్రంగానే సాగుతున్నాయ‌ని సాక్షాత్తూ అధికార పార్టీకి చెందిన కార్పోరేట‌ర్లే ఆందోళ‌న వ్యక్తం చేశారు. స్వచ్ఛ కార్యక్రమాల‌ను హ‌డావిడిగా నిర్వహించే కంటే చిత్తశుద్ధితో చేప‌ట్టిన‌ట్లయితే ప్రజ‌ల్లో చైత‌న్యం పెరుగుతుంద‌ని కార్పొరేట‌ర్లు సూచించారు. ఎల్ఈడి లైట్లు ఏర్పాటుతోపాటు ప‌లు స‌మ‌స్యల‌పై పాలకమండలి చ‌ర్చించింది.

గ్రేట‌ర్ హైద‌రాబాద్ ను అంత‌ర్జాతీయ న‌గ‌రంగా తీర్చిదిద్దేందుకు చేస్తున్న ప‌లు కార్యక్రమాల‌లో చిత్తశుద్ధి లోపించింద‌ని ప్రజాప్రతినిధులు ఆందోళ‌న వ్యక్తం చేశారు. మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ అధ్యక్షత‌న‌ నిర్వహించిన జిహెచ్ఎంసి స‌ర్వస‌భ్య స‌మావేశం ప‌లు అంశాల‌పై చ‌ర్చించింది. జీహెచ్ఎంసీ స‌ర్వస‌భ్య స‌మావేశంలో అధికార పార్టీకి చెందిన‌ కార్పోరేట‌ర్లే అధికారుల‌పై మండిప‌డ్డారు. జిహెచ్ఎంసి యంత్రాంగం స‌మస్యల‌పై స్పందించ‌డం లేదని స‌మావేశంలో త‌మ గోడు వెళ్ల బోసుకున్నారు. కాల‌నీల‌లో స‌మ‌స్యలపై కార్పోరేట‌ర్లు ఇంటింటికి వెళ్లి ప్రజ‌ స‌మ‌స్యలు తెలుసుకుంటున్నామని.. ఇత‌ర శాఖ‌ల‌ అధికారులు మాత్రం త‌మ‌తో క‌లసి రావ‌ట్లేద‌ని మేయ‌ర్ దృష్టికి తెచ్చారు కార్పొరేట‌ర్లు.

గ్రేట‌ర్ పారిశుధ్య నిర్వహ‌ణ‌ అద్వాన్నంగా త‌యారైంద‌ని.. న‌గ‌రంలో ఏక్కడ చూసినా చెత్త కుప్పలే ద‌ర్శన‌మిస్తున్నాయని కార్పోరేట‌ర్లు గ‌ళ‌మెత్తారు. జీహెచ్ఏంసీలో చెత్త సేక‌ర‌ణ కోసం ఏర్పాటు చేసిన ఆటోలు స‌రిపోవ‌డం లేద‌న్నారు. గ‌తంలో అవ‌లంబించిన ట్రైసెకిళ్ళ విధానాన్ని అమలు చేయాల‌ని వారు డిమాండ్ చేశారు. స‌భ్యుల విజ్ఞప్తుల‌ను ప‌రిగ‌న‌ణ‌లోకి తీసుకున్న క‌మిష‌న‌ర్ మ‌రో రెండు నెల‌ల్లో కొత్తగా 500 ఆటోల‌ను కోనుగోలు చేస్తామని తెలిపారు.

గ్రేట‌ర్‌లో ప్రధాన రోడ్లు భాగానే ఉన్నప్పటికీ గ‌ల్లీ రోడ్లు అధ్వానంగా ఉన్నాయ‌ని కొందరు కార్పోరేటర్లు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఎల్ఈడీ లైట్ల విష‌యంలోనూ విస్తృత‌మైన చ‌ర్చజ‌రిగింది. వేగంగా ఎల్ఈడి లైట్ల‌ను ఏర్పాటు చెయ్యడంలో హైద‌రాబాద్ న‌గరం ముందున్న సవాల్‌ అని మేయ‌ర్ అన్నారు. లైట్ల ఏర్పాటులో వ‌స్తున్న ఇబ్బందుల‌ను త్వర‌లో అధిగమిస్తామ‌ని స‌భ్యుల దృష్టికి తెచ్చారు. స‌మావేశంలో 114 మంది వార్డు క‌మీటీ స‌భ్యుల‌ను, 276 మంది ఏరియా స‌భ ప్రతినిధుల‌ను ఎన్నుకున్నారు కార్పొరేట‌ర్లు. కోన్ని వార్డుల్లో సభ్యుల ఎన్నిక‌ను వాయిదా వేశారు మేయ‌ర్ బోంతు రామ్మోహ‌న్. నిధుల విషయంలో ఇప్పటికైతే ఇబ్బందులు లేవ‌ని ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయన్నారు. ఇటీవ‌ల మెట్రో రైల్ ప్రారంభం సందర్భంగా మేయ‌ర్‌ స్ధానిక కార్పోరేట‌ర్లను ప‌ట్టించుకోలేద‌ని స‌భ‌లో దుమారం రేగింది. ఇకనైనా రానున్న రోజుల్లో ప్రోటోకాల్‌ పాటించేలా చ‌ర్యలు తీసుకోవాలంటు స‌భ ఏక‌గ్రీవంగా తీర్మానం చేసింది.

06:29 - December 8, 2017

విశాఖపట్టణం : ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పర్యటన సాగుతోంది. పర్యటనలో భాగంగా టీయూ 142 యుద్ధ విమాన ప్రదర్శనశాలను రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రారంభించారు. ఏయూలోని పలు భవన నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు. గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకు ఘనంగా ఆహ్వానించారు. అనంతరం నగరంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్రపతి పాల్గొన్నారు. తొలుత విశాఖ సాగర తీరంలో ఏర్పాటు చేసిన టీయూ 142 యుద్ధ విమాన ప్రదర్శనశాలను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రారంభించారు. విమానాన్ని సందర్శించి.. ఆ విమాన విశేషాలను తెలుసుకున్నారు. తర్వాత బీచ్‌రోడ్డులోని అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి.. నివాళులు అర్పించారు. అనంతరం ఆంధ్రయూనివర్సిటీలోని ఈ-క్లాస్‌ రూమ్‌ భవన సముదాయం, ఇంక్యుబేటర్ కేంద్ర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా.. రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. విశాఖకు రావడం ఇదే తొలిసారని.. చాలా ఆనందంగా ఉందని రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. అలాగే గవర్నర్ నరసింహన్‌, సీఎం చంద్రబాబనాయుడులు రాష్ట్రపతి రాకపై సంతోషం వ్యక్తం చేశారు. విశాఖ చరిత్రలో ఇది ఒక మధుర స్మృతిగా అభివర్ణించారు. శుక్రవారం కూడా.. రాష్ట్రపతి మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని.. అనంతరం తిరిగి ఢిల్లీకి పయనం కానున్నారు. 

06:27 - December 8, 2017

హైదరాబాద్ : ప్రపంచ తెలుగు మహాసభలను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించేందుకు తెలంగాణ సర్కార్‌ కసరత్తు చేస్తోంది. ఐదు రోజుల పాటు జరిగే మహాసభలకు 40 దేశాల నుంచి 150 మంది హాజరుకానున్నారు. తెలంగాణ జీవన సౌందర్యాన్ని జగత్తుకు చాటే విధంగా మహాసభలు నిర్వహించాలని... వచ్చే అతిథులకు ఎలాంటి లోటు రాకుండా చూడాలని అధికారులకు పాలకులు సూచించారు. తెలంగాణ యాస, భాష, జీవన సౌందర్యాన్ని ప్రపంచమంతా పరివ్యాప్తి చేసే విధంగా ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించేందుకు తెలంగాణ సర్కార్‌ కసరత్తు చేస్తోంది. ఈనెల ఈ నెల 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఐదు రోజుల పాటు జరిగే.. ప్రపంచ తెలుగు మహాసభలకు అందరూ ఆహ్వానితులేనని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లపై సచివాలయంలో కడియం సమీక్షా సమావేశం నిర్వహించారు.

ప్రపంచ తెలుగు మహాసభలకు 7,920 మంది అతిథులు నమోదు చేసుకున్నారన్నారు కడియం. 40 దేశాల నుంచి 160 మంది ప్రతినిధులు... ఇతర రాష్ట్రాల నుంచి 1167 మంది ప్రతినిధులు హాజరు కానున్నారని తెలిపారు. ఈ మహాసభలకు విదేశాల నుంచి 37 మంది, ఇతర రాష్ట్రాల నుంచి 56 మందిని ఆహ్వానిస్తున్నామన్నారు కడియం. ఈ మహాసభలకు విదేశాల్లో ఉన్న తెలుగు రచయితలు, సంగీతకారులు, నృత్యకారులు, ఇతర రాష్ట్రాలలో ఉన్న తెలుగు భాష పండితులు, రచయితలు అందరినీ ఆహ్వానించి వారి సమక్షంలోనే ఈ సభలను గొప్పగా నిర్వహించనున్నట్లు తెలిపారు.

తెలుగు మహాసభలకు హాజరయ్యే ప్రతినిధులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కడియం తెలిపారు. ఇక ప్రపంచ తెలుగు మహాసభలలో తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేయడంలో భాగంగా తెలంగాణ వంటకాలు, రచనలు, తెలంగాణ చరిత్ర, చేనేతలు, చేతివృత్తులు, కళా ప్రదర్శనలు, తెలంగాణ ఆలయాలు, నాణాలకు సంబంధించిన స్టాల్స్‌ ఏర్పాట్లు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. ఎక్కడెక్కడ ఏయే కార్యక్రమాలు జరుగుతున్నాయో తెలిపే విధంగా.. కార్యక్రమాల వివరాలు ప్రచురించి.. అందరికీ అందజేస్తామన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకుంటున్న ఈ సభలకు అందరూ ఆహ్వానితులేనన్నారు కడియం. తెలంగాణకు సబంధించిన వారు, భాషపై అభిమానం ఉన్నవారు, సాహిత్యకారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని సభలను విజయవంతం చేయాలన్నారు. 

06:25 - December 8, 2017

పెద్దపల్లి : కాలేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా ఓ చెరువు ఉనికి కోల్పోతుంది. దీంతో అనేక మత్స్యకార కుటుంబాల రోడ్డున పడ్డాయి. తమకు జీవనాధారం పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని మత్స్యకారులు ఆందోళన బాట పట్టారు. గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన మత్స్యకారులు ప్రాజెక్ట్‌ పనులను అడ్డుకున్నారు. సీఎం పర్యటనలోనైనా తమ సమస్యను పరిష్కరించాలని మత్స్యకారులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఓవైపు కాళేశ్వరం పనులు వేగవంతం పుంజుకుంటుండగా... పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మేడారంలో మత్స్యకారులు ఆందోళన బాట పట్టారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్‌లో భాగంగా... నందిమేడారం పెద్ద చెరువుకు గండి కొట్టడంతో మత్స్యకారులంతా రోడ్డున పడ్డారు. దీంతో ఆగ్రహించిన మత్స్యకారులు.. తమను ఆదుకోవాలంటూ... గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రిజర్వాయర్‌ పనులను అడ్డుకుని నిరసన తెలియజేశారు. మత్స్యకారుల ఆందోళనకు ప్రతిపక్షాలు మద్దతు తెలిపాయి. దీంతో పనులన్నీ నిలిచిపోయాయి. తమను ఆదుకునే వరకు తమ ఆందోళన విరమించేంది లేదని మత్సకారుల కుటుంబాలు ప్రాజెక్ట్‌ కట్టపైనే భీష్మించుకుని కూర్చున్నాయి. తమను ప్రభుత్వం ఆదుకునే వరకు ఆందోళన విరమించేది లేదంటున్నారు. ఓ వైపు సీఎం కేసీఆర్‌ పర్యటన... మరోవైపు మత్స్యకార్మికుల ఆందోళనతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. 

టిడిపి రాష్ట్ర కార్యవర్గం సెంట్రల్ కమిటీ భేటీ...

హైదరాబాద్ : నేడు టిడిపి రాష్ట్ర కార్యవర్గం సెంట్రల్ కమిటీ భేటీ కానుంది. ఈ భేటీలో పలు అనుబంధ సంఘాల నేతలు పాల్గొననున్నాయి. 

కడపకు రానున్న ఉప రాష్ట్రపతి...

కడప : నేడు ప్రొద్దుటూరులో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పర్యటించనున్నారు. బీసెయింట్ మున్సిపల్ హై స్కూల్ శతాబ్ది ఉత్సవాల్లో ఆయన పాల్గొననున్నారు. 

జగన్ పాదయాత్రకు బ్రేక్..

విజయవాడ : వైసీపీ అధ్యక్షుడు జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రకు నేడు తాత్కాలిక బ్రేక్ పడింది. శుక్రవారం సీబీఐ కోర్టుకు జగన్ హాజరు కావాల్సిన నేపథ్యంలో పాదయాత్రకు ఒక రోజు బ్రేక్ పడింది. 

కొనసాగుతున్న కేసీఆర్ ప్రాజెక్టుల బాట..

కరీంనగర్ : రెండోరోజైన గురువారం ప్రాజెక్టుల సందర్శన ముగించుకున్న కేసీఆర్‌ సాయంత్రం రామగుండంలని ఎన్టీపీసీకి చేరుకున్నారు. కేసీఆర్‌ అక్కడే బస చేస్తున్నారు. శుక్రవారం అక్కడి నుంచి తన పర్యటను కొనసాగించనున్నారు.

డీసీఐ ఉద్యోగికి ఏపీ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా...

విజయవాడ : ఆత్మహత్య చేసుకున్న డీసీఐ ఉద్యోగి వెంకటేష్‌ కుటుంబానికి ఏపీ సీఎం చంద్రబాబు 5లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించినట్టు సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్‌ నర్సింగరావు తెలిపారు. వెంకటేష్‌ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ సీహెచ్‌ నర్సింగరావు ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం చంద్రబాబు కలిసింది. 

విశాఖలో రాష్ట్రపతి...

విశాఖపట్టణం : ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పర్యటన సాగుతోంది. పర్యటనలో భాగంగా టీయూ 142 యుద్ధ విమాన ప్రదర్శనశాలను రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రారంభించారు. ఏయూలోని పలు భవన నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు. శుక్రవారం కూడా.. రాష్ట్రపతి మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని.. అనంతరం తిరిగి ఢిల్లీకి పయనం కానున్నారు. 

కడప జిల్లాకు చేరుకున్న జీపు యాత్ర...

కడప : జిల్లాలో స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని ఉక్కు ఫ్యాక్టరీ సాధన కమిటీ డిమాండ్‌ చేసింది. స్టీల్‌ప్లాంట్‌ సాధన కోసం ఎస్‌ఎఫ్‌ఐ - డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో సాగుతోన్న జీపుయాత్ర కడప జిల్లాలోని బద్వేలు చేరింది. ఈ సందర్భంగా జీపుయాత్రకు విద్యార్థులు, యువకులు ఘన స్వాగతం పలికారు. తక్షణమే కడపలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని. ఉక్కు ఫ్యాక్టరీ సాధన కమిటీ కన్వీనర్‌ ఆంజనేయులు డిమాండ్‌ చేశారు.

గుజరాత్ లో డిసెంబర్ 9న పోలింగ్...

గుజరాత్ : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తొలి విడత ప్రచారం ముగిసింది. మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు గానూ.. 89 స్థానాలకు డిసెంబర్‌ 9 శనివారం పోలింగ్‌ జరగనుంది. తొలి విడత జరిగే ఎన్నికల్లో సౌరాష్ట్ర, పశ్చిమ గుజరాత్‌, కచ్‌ ప్రాంతాలున్నాయి. గుజరాత్‌ సీఎం విజయ్‌రూపాని సహా 977 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

'నేను సీఎం అభ్యర్థిని కాదు'...

సూరత్ : గుజరాత్‌ ఎన్నికల్లో పోస్టర్‌ వార్‌ మొదలైంది. సూరత్‌లో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ పోస్టర్లు వెలిశాయి. అహ్మద్‌ పటేల్‌ను ముఖ్యమంత్రి పదవిలో నిలిపేందుకు కాంగ్రెస్‌కు ఓటేయాలని ముస్లింలకు పిలుపు ఇస్తూ సూరత్‌లోని పలు ప్రాంతాల్లో పోస్టర్లు వెలిశాయి. తాను కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థిని కాదని, భవిష్యత్‌లోనూ సీఎం రేసులో ఉండబోనని స్పష్టం చేశారు. 

మోడీ సర్కార్ పై మన్మోహన్ ఫైర్...

ఢిల్లీ : నోట్ల రద్దు, జిఎస్‌టి అంశాలకు సంబంధించి మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ మరోసారి మోది ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. ప్రధాని నిర్ణయంతో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారని, కొత్త ఉద్యోగాలు రాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. జిఎస్‌టి అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. నోట్ల రద్దు నిర్ణయంతో కోట్లాది రూపాయల నల్లధనం తెల్లగా మారిందని మోదీ సర్కార్‌పై మన్మోహన్‌ మండిపడ్డారు.

మోడీకి రాహుల్ 9వ ప్రశ్న...

ఢిల్లీ : గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీని రోజుకో ప్రశ్నతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తొమ్మిదవ ప్రశ్నను ట్విట్టర్‌లో సంధించారు. గుజరాత్‌లో రైతుల సమస్యను ప్రస్తావిస్తూ ప్రధానిని దుయ్యబట్టారు. బిజెపి పంటలకు గిట్టుబాటు ధర కల్పించలేదని, రుణ మాఫీ చేయలేదని, పంట బీమా సొమ్ము చెల్లించకుండా రైతులను ప్రధాని వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు.

రవి శంకర్ పై ఎన్జీటీ ఆగ్రహం..

ఢిల్లీ : 'ఆర్ట్ ఆఫ్ లివింగ్‌' వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌పై నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్ మండిపడింది. 2016 మార్చిలో నిర్వహించిన ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాల కారణంగానే యమునా నది మైదాన ప్రాంతం దెబ్బతిందని తెలిపింది. ఇందుకు రవిశంకర్‌దే బాధ్యతగా పేర్కొంది.

Don't Miss