Activities calendar

09 December 2017

బీజాపూర్ సీఆర్పీఎఫ్ క్యాంపులో దారుణం

ఛత్తీస్ ఘడ్ : బీజాపూర్ సీఆర్పీఎఫ్ క్యాంపులో దారుణం జరిగింది. సహచరులపై తోటి జవాన్ శాంత్ కుమార్ కాల్పులకు తెగబడ్డారు. రైఫిల్ తో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు.  మృతులు ఎస్సై వీకే శర్మ, ఎస్సై మేగ్ సింగ్, ఏఎస్ ఐ రాజ్బీర్, కానిస్టేబుల్ జీఎస్ రావు. మరో ఏఎస్ ఐ గజనంద్ కు గాయాలయ్యాయి. మృతదేహాలను బీజాపూర్ నుంచి బసగుదాకు తరలించారు. నిందితుడు శాంత్ కుమార్ ను అరెస్టు చేశారు.

22:20 - December 9, 2017

ఛత్తీస్ ఘడ్ : బీజాపూర్ సీఆర్పీఎఫ్ క్యాంపులో దారుణం జరిగింది. సహచరులపై తోటి జవాన్ శాంత్ కుమార్ కాల్పులకు తెగబడ్డారు. రైఫిల్ తో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు.  మృతులు ఎస్సై వీకే శర్మ, ఎస్సై మేగ్ సింగ్, ఏఎస్ ఐ రాజ్బీర్, కానిస్టేబుల్ జీఎస్ రావు. మరో ఏఎస్ ఐ గజనంద్ కు గాయాలయ్యాయి. మృతదేహాలను బీజాపూర్ నుంచి బసగుదాకు తరలించారు. నిందితుడు శాంత్ కుమార్ ను అరెస్టు చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

22:06 - December 9, 2017

ఢిల్లీ : జెరుసలేం అంశంలో ఐక్యరాజ్యసమితిలో అమెరికాకు ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇజ్రాయిల్ రాజధానిగా జెరుసలేంను ప్రకటించడాన్ని తిరస్కరించింది. ట్రంప్‌ నిర్ణయంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశం జరిపింది.  15 సభ్య దేశాలకు గాను 8 దేశాలు ప్రపంచ శాంతి, భద్రతకే ప్రాధాన్యత నిచ్చాయి. ట్రంప్ నిర్ణయాన్ని తప్పుపట్టాయి. జెరూసలేం ఇజ్రాయిల్, పాలస్తీనాలకు రాజధానిగా పేర్కొంటూ... దీనిపై చర్చల ద్వారానే ఇరు దేశాలు పరిష్కరించుకోవాలని యురోపియన్ యూనియన్‌కు చెందిన అయిదు దేశాలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. దీంతో అమెరికా ఈ అంశంలో ఒంటరిగా మారింది. అమెరికా దౌత్యవేత్త నిఖ్కీ హేలీ మాత్రం ట్రంప్ నిర్ణయాన్ని సమర్థించారు. ఐక్యరాజ్యసమితి నిర్ణయం ఇజ్రాయిల్ పట్ల తమ శత్రుత్వాన్ని చూపుతన్నదని ఆరోపించారు.

 

22:05 - December 9, 2017

ఢిల్లీ : పబ్లిసిటీ పేరిట మోది ప్రభుత్వం విచ్చలవిడిగా ఖర్చు చేసేస్తోంది. బిజెపి మూడున్నరేళ్ల పాలనలో ఇప్పటివరకు 3,775 కోట్ల రూపాయలు ప్రచారానికి ఖర్చు చేశారు. సమాచార హక్కు కింద దాఖలు చేసిన ఓ పిటిషన్‌ ఆధారంగా ఈ విషయం వెల్లడైంది. ఏప్రిల్‌ 2014 నుంచి అక్టోబర్‌ 2017 దాకా ఎలక్ట్రానిక్‌, ప్రింట్‌ మీడియా, అవుట్‌డోర్‌ పబ్లిసిటీ పేరుతో 3,775 కోట్లు ఖర్చు చేశారు. రేడియో, డిజిటల్‌ సినిమా, దూరదర్శన్‌, ఇంటర్నెట్‌, ఎస్‌ఎంఎస్‌, టీవీ తదితర ఎలక్ట్రానిక్‌ మీడియా అడ్వర్‌టైజ్‌మెంట్ల కోసం 1,656 కోట్లు, ప్రింట్‌ మీడియాకు 1,698 కోట్లు, హోర్డింగ్లు, పోస్టర్లు, బుక్‌లెట్లు, క్యాలెండర్లు తదితర  ఔట్‌డోర్‌ అడ్వర్‌టైజ్‌మెంట్ల కోసం 399 కోట్లు కేంద్రం ఖర్చు పెట్టింది. ఒక ఏడాది బడ్జెట్‌లో ఏదైనా ఓ శాఖ కోసం కేటాయించే నిధుల కంటే ఇది చాలా ఎక్కువ. 

 

22:03 - December 9, 2017

తమిళనాడు : ప్రముఖ తమిళ నటుడు విశాల్ నామినేషన్ వ్యవహారంలో వివాదాస్పదంగా వ్యవహరించిన ఆర్కే నగర్ ఎన్నికల రిటర్నింగ్  అధికారిపై వేటు పడింది. విశాల్‌ నామినేషన్‌ ఉదంతంపై  ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలకు దిగడంతో ఈసీ తీవ్రంగా స్పందించింది. విశాల్‌ నామినేషన్ పత్రాలను తిరస్కరించిన  అధికారి వేలుస్వామిని వెనక్కి పిలిచింది. వేలుస్వామి స్థానంలో ఐఏఎస్‌ అధికారి ప్రవీణ్‌ పీ నాయర్‌ని   నూతన రిటర్నింగ్‌ అధికారిగా నియమించింది. విశాల్  సమర్పించిన నామినేషన్ అసంపూర్తిగా ఉందని రిటర్నింగ్ అధికారి తిరస్కరించిన విషయం తెలిసిందే. విశాల్‌ నామినేషన్‌ తిరస్కరించడంపై డిఎంకె తీవ్రంగా స్పందించింది. ఎన్నికల కమిషన్ పాలక పార్టీతో కుమ్మక్కయిందని స్టాలిన్‌ ఆరోపించారు. రిటర్నింగ్‌ అధికారిని వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేసింది.


 

22:01 - December 9, 2017

అహ్మదాబాద్ : గుజరాత్‌లో తొలి విడత పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం ఐదు గంటల వరకు 68 శాతం పోలింగ్‌ నమోదైంది. పలుచోట్ల పోలింగ్‌ బూత్‌లలో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్‌ ఆలస్యమైంది. ఈవీఎంలలో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న కాంగ్రెస్‌ ఆరోపణలను బిజెపి ఖండించింది. ఓటమి భయంతోనే కాంగ్రెస్‌ ఆరోపణలు చేస్తోందని విమర్శించింది.

గుజరాత్‌లో తొలి విడత శాసనసభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్‌లోని 89 స్థానాలకు ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. తొలి విడత ఎన్నికల్లో  సాయంత్రం 5 గంటల వరకు 68 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. గత ఎన్నికలతో పోలిస్తే పోలింగ్‌ తక్కువ శాతం నమోదైంది. 2012 తొలివిడత ఎన్నికల్లో 71.3 శాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

సూరత్‌, పోర్‌బందర్‌ తదితర ప్రాంతాల్లోని పోలింగ్‌ బూత్‌లలో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్‌ ఆలస్యమైంది. కొన్ని ఈవీఎంలకు బ్లూటూత్‌ కనెక్షన్‌ పెట్టి రిగ్గింగ్‌ పాల్పడినట్లు కాంగ్రెస్‌ ఆరోపించింది. దీంతో ఎన్నికల అధికారులు వెంటనే ఈవీఎంలను మార్చి వాటి స్థానంలో కొత్త వాటిని పెట్టారు. కాంగ్రెస్‌ ఆరోపణలను బిజెపి ఖండించింది.

గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, బీజేపీ గుజరాత్ చీఫ్ జితూభాయ్ వాఘాని, కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్, క్రికెటర్ ఛటేశ్వర్ పుజార తదితర ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. బరూచ్‌లోని బహుమలిలో ఓ పెళ్లి జంట ఓటు వేశాకే పెళ్లి పీటలు ఎక్కారు. 

గుజరాత్‌ అసెంబ్లీలో మొత్తం 182  స్థానాలుండగా.. తొలిదశలో 89 శాసనసభ నియోజకవర్గాలకు పోలింగ్‌ జరిగింది. 2 కోట్ల 12 లక్షల మంది ఓటర్లు 977 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. మిగిలిన 93 స్థానాలకు డిసెంబర్‌ 14న రెండో విడత పోలింగ్ జరగనుంది. డిసెంబర్‌ 18న గుజరాత్ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉంటుంది. 

ప్రధానమంత్రి నరేంద్రమోది, కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ గుజరాత్‌ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. 22 ఏళ్లుగా గుజరాత్‌లో బిజెపి అధికారంలో ఉంది. తిరిగి అధికారాన్ని నిలబెట్టుకునేందు బిజెపి శాయశక్తులా కృషి చేసింది. బిజెపి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉండడంతో కాంగ్రెస్‌ అధికారంపై ఆశలు పెట్టుకుంది. ప్రజా తీర్పు ఎలా ఉంటుందన్నది డిసెంబర్‌ 18 వరకు వేచి చూడాలి.

21:59 - December 9, 2017

తూ గో : ఆటోలో ప్రయాణిస్తున్న దంపతుల పాలిట లారీ మృత్యుశకటంగా మారింది. రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది. తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి దగ్గర ఆటోను లారీ ఢీకొట్టడంతో భార్యాభర్తలు అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురి పరిస్థితి  విషమంగా ఉండటంతో వారిని తుని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


 

21:57 - December 9, 2017

శ్రీకాకుళం : జిల్లాలో షేర్ మార్కట్ పేరుతో కోట్ల రూపాయల మోసానికి పాల్పడిన 'ఇండి ట్రేడ్' బ్రోకర్ టంకాల శ్రీరాంను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. సంతకవిటి మండలం తాలాడలోని ఇండిట్రేడ్ కార్యాలయంలో పోలీసులు తనిఖీలు నిర్వహించిన పోలీసులు నిందితుల నుంచి పోలీసులు పూర్తి సమాచారం సేకరించారు. దాదాపు 25 కోట్ల రూపాయలు ఇండి ట్రేడ్‌లో పెట్టుబడులు పెట్టినట్లు బాధితులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో నిందితుల బ్యాంకు లావాదేవీలు, బినామీ ఆస్తుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.  తాలాడలోని ఇండిట్రేడ్ కంపెనీ కార్యాలయంలో రికార్డులను పరిశీలించిన పోలీసులు ఉన్నతాధికారులకు పూర్తి నివేదిక అందజేస్తామని చెప్పారు. 

21:54 - December 9, 2017

హైదరాబాద్‌ : నగరంలో ఆదివాసీలు కదం తొక్కారు. తమ హక్కుల కోసం ముక్త కంఠంతో నినదించారు. ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలంటూ ఆత్మగౌరవ సభను నిర్వహించారు. ఆదివాసీల సంక్షేమాన్ని గత పాలకులు విస్మరించారని నేతలు మండిపడ్డారు. విద్యా, ఉద్యోగ, ఉపాధిలో ఆదివాసీలకు  నష్టం జరుగుతోందని అన్నారు. 

హక్కుల కోసం ఆదివాసీలు పోరుబాట పట్టారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలంటూ  డిమాండ్‌ చేస్తూ హైదరాబాద్‌లో సభ నిర్వహించారు. ఆదివాసీల హక్కుల పోరాట సమితి - తుడుందెబ్బ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆదివాసీల ఆత్మగౌరవం పేరుతో జరిగిన  ఈ బహిరంగ సభకు వరంగల్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం జిల్లాలతోపాటు ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర నుంచి ఆదివాసీలు పెద్ద సంఖ్యలో వచ్చారు.  ఈ సభకు గోండు, గోమ, చెంచు, నాయక్‌కోడ్‌, పర్టానా, కొల్లం, కొండరెడ్లు, ఎరుకల, యానాది, ఆదివాసీ, మన్నేవార్‌ తదితర ఉప కులాలకు చెందిన ప్రజలు తరలివచ్చారు. 

ఆదివాసీల ఆత్మగౌరవ సభలో పాల్గొన్న  పార్లమెంటరీ ఎస్సీ,ఎస్టీ  కమిటీ చైర్మన్‌ పగాన్‌సింగ్‌ కుల్తే.. ఆదివాసీల పోరాటానికి సంఘీభావం ప్రకటించారు. ఆదివాసీల ఉద్యమానికి తమ పార్టీ అండగా నిలుస్తుందన్నారు. ఆదివాసీల హక్కులను పూర్వంలో బ్రిటీష్‌, నైజాం నవాబులు అణచివేయాలని చూస్తే కుమ్రంభీం విల్లంబులతో వారిపై పోరాటం చేశారని కుమ్రంభీం మనువడు సోనేరావు అన్నారు. నేడు ఆదివాసీల ఉనికి కోసం మనం మరోసారి అదే  స్ఫూర్తితో ఉద్యమించాలని పిలుపునిచ్చారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే వరకు పోరాటం ఉధృతం చేయాలన్నారు.

ఇదే సభకు హాజరైన సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య...గతంలో పాలించిన పాలకులు ఆదివాసీల సంక్షేమాన్ని విస్మరించారని విమర్శించారు. విద్యా, ఉపాధిలో ఆదివాసీలకు  నష్టం జరుగుతోందని చెప్పారు.  జీవో నంబర్‌ 3ను మార్చేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కుట్ర చేస్తోంటే.. అసెంబ్లీ సాక్షిగా ఆదివాసీల ఏకైక ఎమ్మెల్యేగా తాను  ప్రభుత్వ చర్యలను వ్యతిరేకించానని గుర్తు చేశారు. వలసదారులు, చొరబాటుదారుల పేర్లతో ఆదివాసీలను  ప్రభుత్వం అణచివేసే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. దీన్ని వెంటనే ఆపేయాలని డిమాండ్‌ చేశారు.

ఆదివాసీల సభలో  టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కోవా లక్ష్మీబాయి మాట్లాడుతుండగా ఆదివాసీలు అడ్డుకున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆదివాసీల కోసం కేసీఆర్‌ కుమ్రంభీం జిల్లా ఏర్పాటు చేశారని కోవా లక్ష్మి తెలిపారు. తమ ప్రభుత్వం ఆదివాసీల అభివృద్ధి కోసం కృషి చేస్తోందని చెప్పారు.

 

21:43 - December 9, 2017
21:41 - December 9, 2017

హైదరాబాద్ : మంత్రి కేటీఆర్‌పై రేవంత్‌ రెడ్డి విమర్శలు గుప్పించారు. గుంటూరు, పూనె, అమెరికాలో చదువుకున్న కేటీఆర్‌కు తెలంగాణలో చెప్రాసీ ఉద్యోగానికి కూడా అర్హత లేదన్నారు. కేటీఆర్‌ తండ్రి కేసీఆర్‌ సీఎం అయినందునే ఆయనకు మంత్రి పదవి వచ్చిందని ఎద్దేవా చేశారు. గాంధీభవన్‌లో మాట్లాడిన రేవంత్‌.. కేసీఆర్‌ సర్కార్‌పై మండిపడ్డారు. 

 

బోధన్ స్టేషన్ లో సిర్పూర్..కాగజ్ నగర్ ఎక్స్ ప్రెస్ రైలు నిలిపివేత

పెద్దపల్లి : బోధన్ స్టేషన్ లో సిర్పూర్..కాగజ్ నగర్ ఎక్స్ ప్రెస్ రైలును నిలిపివేశారు. విద్యుత్ సమస్య తలెత్తడంతో రైలును నిలిపివేశారు. 

కాళేశ్వరం ప్రాజెక్టుపై ముగిసిన సీఎం కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం కేసీఆర్ సమీక్ష ముగిసింది. సమీక్షకు అధికారులు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. తెలంగాణ నీటి కష్టాలను కష్టాలను కడతేర్చే ప్రయత్నంలో కాళేశ్వరం ప్రాజెక్టు అత్యంత కీలకం అన్నారు. హైదరాబాద్ కు తాగునీరు అందించడంలో పాటు పాత 7 జిల్లాలకు నీటి అవసరాలు తీర్చే ప్రాజెక్టు కాళేశ్వరం అని అన్నారు.  

 

20:47 - December 9, 2017

ప్రపంచ తెలుగు మహాసభలపై కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్ తో టెన్ టివి వన్ టు వన్ నిర్వహించింది. శ్రీనివాస్ ప్రపంచ తెలుగు మహాసభలపై మాట్లాడారు. పలు కవితలు చెప్పారు. పద్యాలు, పాటలు పాడి వినిపించారు. పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం... 

20:38 - December 9, 2017

'సప్తగిరి ఎల్ ఎల్ బి' సినిమా టీమ్ తో టెన్ టివి స్పెషల్ షో నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో సప్తగిరి, కాశిష్ వోహ్రా, డైరెక్టర్ చరణ్ పాల్గొని, మాట్లాడారు. సప్తగిరి మాట్లాడుతూ సినిమా విశేషాలు తెలిపారు. తన సినీ కెరీర్ గురించి వివరించారు. కాలర్ అడిగిన ప్రశ్నకు 'నేనే మగజాతి ఆణిముత్యం' అని అన్నారు. 'నన్ను హాస్య నటుడు, హోరో'గా రెండు రకాలుగా చూడొచ్చు అని తెలిపారు. సినిమాలోని పలు డైలాగ్స్ పలికి వినిపించారు. హీరోయిన్, డైరెక్టర్ సినిమా గురించి వివరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

కాంగ్రెస్ లో ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ రేవంత్ రెడ్డి : సర్వే

హైదరాబాద్ : కాంగ్రెస్ లో ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ రేవంత్ రెడ్డి అని సర్వే సత్యనారాయణ అన్నారు. జానారెడ్డిపై సర్వే సత్యనారాయణ సెటైర్లు, జానా అమాయకత్వం వల్లే కేసీఆర్ సీఎం అయ్యారని తెలిపారు. ఆనాడు జానారెడ్డి జేఏసీ అని కౌగిలించుకున్నందుకే కేసీఆర్ సీఎం అయ్యారు. కాంగ్రెస్ వస్తే నీవు... టీఆర్ ఎస్ వస్తే నేనూ అని జానారెడ్డి, కేసీఆర్ అనుకున్నట్లున్నారని సర్వే అన్నారు. 

 

తార్నాకలో చిట్టీల పేరుతో మోసం

హైదరాబాద్ : తార్నాకలో చిట్టీల పేరుతో మోసం జరిగింది. చిరు వ్యాపారుల నుంచి రూ.15 కోట్లు వసూలు చేసి 2 నెలలుగా పరారీలో ఉన్న చిట్టీల వ్యాపారి మాణిక్ రెడ్డిపై బాధితులు సీసీఎస్ లో ఫిర్యాదు చేశారు. బాధితుల్లో 100 మంది చిరు వ్యాపారులు ఉన్నారు. 

 

రైతుల సమన్వయంతో విద్యుత్ లైన్లు వేయాలి : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు పనులపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. పంప్ హౌజ్ లలో మోటార్లను పరిశీలించేందుకు 26 మంది ఇంజనీర్లతో ప్యానెల్ ను నియమించారు. రైతుల సమన్వయంతో విద్యుత్ లైన్లు వేయాలన్నారు. రామడుగు నుంచి వచ్చే నీటిని వరద కాలువలో కలిపే ప్రదేశంలో ఉధృతిని తట్టుకునే పటిష్ట నిర్మాణం చేపట్టాలన్నారు. దీని కోసం డిజైన్లు తయారు చేయాలని సూచించారు. 

 

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముగిసిన తొలి విడత పోలింగ్

గుజరాత్ : అసెంబ్లీ ఎన్నికలకు తొలి విడత పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 62 శాతం పోలింగ్ నమోదు అయింది. సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్ లోని 89 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ జరిగింది. సాయంత్రం 5 వరకు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం ఇచ్చారు. 14 న మిగిలిన స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. 18న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగనుంది. 

దళితులపై దాడి ఘటనపై జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు రాములు విచారణ

నిజామాబాద్ : అభంగపట్నంలో దళితులపై దాడి ఘటనపై జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు రాములు విచారణ చేపట్టారు. పోలీసుల తీరుపై రాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులపై దాడి చేసిన భరత్ రెడ్డిని 24 గంటల్లో అరెస్టు చేయాలని బాధిత దళితులకు మూడెకరాల చొప్పున భూమి, రూ. 8 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని కలెక్టర్ ను ఆదేశించారు. 

చెడ్డీ గ్యాంగ్ కోసం సైబరాబాద్ పోలీసుల విస్తృత గాలింపు

హైదరాబాద్ : నగరంలో వరుస చోరీలకు పాల్పడుతున్న చెడ్డీ గ్యాంగ్ కోసం సైబరాబాద్ పోలీసుల విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. మియాపూర్ పీఎస్ పరిధి గోకుల్ ఫ్లాట్స్ ఏరియాలో చెడ్డీ గ్యాంగ్ కోసం 13 బృందాలు గాలింపు చేపట్టారు. 

 

కాళేశ్వరం ప్రాజెక్టు పనులపై సీఎం కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు పనులపై సీఎం కేసీఆర్ సమీక్ష చేపట్టారు. పలు అంశాలపై చర్చించారు.  

19:29 - December 9, 2017
19:26 - December 9, 2017
19:24 - December 9, 2017
19:15 - December 9, 2017

హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎంసెట్‌ స్కాం కేసు వేగవంతం చేశారు సీఐడీ అధికారులు. రెండు సంవత్సారలుగా దర్యాప్తు చేస్తున్న సీఐడీ... ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్బీ సింగ్‌ను ఇప్పటికే అరెస్ట్‌ చేశారు. ఎస్బీ సింగ్‌ ఇచ్చిన ఆధారాలతో కేసును త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 

ఎంసెట్‌ స్కాం కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు సీఐడీ అధికారులు. పేపర్‌ లీకేజీలో ప్రధాన సూత్రధారి ఎస్బీ సింగ్‌ను ఇప్పటికే తెలంగాణ సీఐడీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే ఈ కేసులో ఇంకా ఎవరెవరు ఉన్నారనే విషయంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు 63 మంది నిందితులను అరెస్ట్‌ చేసిన సీఐడీ...విద్యార్థుల నుండి వసూలు చేసిన 3 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందితులు విందు, వినోదాలకే నగదును పెద్ద ఎత్తున ఖర్చు చేసినట్లు సీఐడీ గుర్తించింది. నోట్ల రద్దుతో సీఐడీ, నిందితుల నుండి పెద్దగా నగదు రికవరీ చేయలేకపోయిందనే విమర్శలు ఉన్నాయి. 

ఎస్బీ సింగ్ దర్యాప్తులో వెల్లడైన కొన్ని ఆధారాలతో సీఐడీ అధికారులు జేఎన్టీయూ యాజమాన్యంకు నోటీసులు జారీ చేశారు. పేపర్ తయారు అయిన దగ్గర నుండి బయటకు వెళ్లే వరకు మినిట్‌ టూ మినిట్ తమకు పూర్తి  వివరాలు ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో జేఎన్టీయూ ప్రింటింగ్ ప్రెస్ యాజమాన్యం పూర్తి వివరాలను సీఐడీ అధికారులకు  సమర్పించారు.

అయితే పేపర్ లీకేజీకి ఈ ఏడాదే బీజం పడలేదని తెలుస్తోంది. 2005 నుండి ఎన్నో ఏళ్లుగా లీకవుతూనే ఉంది. కానీ లీకైన ఒక్కో పేపర్ ఒక్కో రాష్ట్రానికి చెందినదిగా గుర్తించింది తెలంగాణ సీఐడీ. 2005 సంవత్సరంలోనే పంజాబ్ మెడికల్ ఎంట్రన్స్ పేపర్ లీకేజీతో బోణి కొట్టిన ఎస్బీసింగ్ 11 ఏళ్లలో 10 ప్రశ్నా పత్రాలు లీక్ చేశాడు. ఢిల్లీలోని కపూర్ ప్రింటింగ్ ప్రెస్ నుండి పేపర్‌ లీకైందని గుర్తించిన సీఐడీ...ఎస్బీ సింగ్.. ఇంకా ఎన్ని రాష్ట్రాల్లో పేపర్లు లీక్ చేశాడన్నదానిపై తేల్చాల్సి ఉంది. 

ఇప్పటికే ఈ కేసులో అనేక కీలక అంశాలు సేకరించిన సీఐడీ దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని త్వరలోనే ఈ కేసుపై చార్జ్‌షీట్‌ వేయడానికి కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. 

18:18 - December 9, 2017

విశాఖ : విహారయాత్రకు వెళ్లి తిరిగివస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. విహారయాత్రకు వెళ్లి వస్తుండగా తిరుగుప్రయాణంలో యారాడ కొండ దిగుతుండగా అనకాపల్లి సిటీ పబ్లిక్ స్కూల్ బస్ కు బ్రేక్ లు ఫెయిల్ అయ్యాయి. దీంతో స్కూల్ బస్సు మరో రెండు స్కూల్ బస్సులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి. మరో 40 మంది విద్యార్థులకు గాయాలు అయ్యాయి. గాయపడిన విద్యార్థులను అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు. విశాఖలోని కేర్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 120 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, అనకాపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణ విచారం వ్యక్తం చేశారు. అయితే ప్రమాదంపై స్కూల్ యాజమాన్యం నుంచి ఎలాంటి ప్రకటన వెలుడలేదు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

18:01 - December 9, 2017
17:59 - December 9, 2017
17:58 - December 9, 2017
17:48 - December 9, 2017
17:46 - December 9, 2017

మహబూబాబాద్ : తొర్రూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది. సరైన వైద్యం అందక నిండు ప్రాణం బలైంది. తొర్రూరు మండలం సోమారం గ్రామానికి చెందిన దశరథ అనే వ్యక్తి కుటుంబ కలహాలతో పురుగుమందు తాగాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు తొర్రూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. వైద్యులు అందుబాటులో లేకపోడడంతో నర్సులు చెట్టుకిందనే వైద్యం చేశారు. దీంతో సరైన వైద్యం అందక దశరథ చనిపోయాడు. మృతుడి బంధువులు వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతని మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.

తొర్రూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం

మహబూబాబాద్ : తొర్రూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణం బలైంది. తొర్రూరు మండలం సోమారం గ్రామానికి చెందిన దశరథ...కుటుంబ కలహాలతో పురుగుమందు తాగారు. చికిత్స నిమిత్తం అతన్ని తొర్రూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దశరథకు నర్సులు వైద్యం చేశారు. వైద్యులు లేకపోవడంతో చెట్టుకిందే నర్సులు చికిత్స చేశారు. సరైన వైద్యం అందక అతను మృతి చెందారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

విశాఖ జిల్లాలో రోడ్డు ప్రమాదం

విశాఖ : యారాడ కొండపై రెండు స్కూల్ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 50 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. బ్రేకులు ఫెయిల్ కావడంతో ప్రమాదం సంభవించింది. 

 

సీబీఐటీ ఇంజనీరింగ్ కాలేజీ ఫీజులు యథాతథం : మేనేజ్ మెంట్ బోర్డు

హైదరాబాద్ : సీబీఐటీ ఇంజనీరింగ్ కాలేజీ ఫీజులు యథాతథంగా ఉంటాయని...పాత ఫీజునే కొనసాగిస్తామని సీబీఐటీ మేనేజ్ మెంట్ బోర్డు నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వ సర్క్యూలర్ తర్వాతే ఫీజులు పెంచుతామని తెలిపింది. ప్రస్తుతం వాయిదా వేసిన పరీక్షలు 22 నుంచి కొనసాగిస్తామని చెప్పింది. 

జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు రాములును అడ్డుకున్న దళిత సంఘాలు

నిజామాబాద్ : నవీపేట మండలం అభంగపట్నంలో జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు రాములు పర్యటించారు. దళితులపై బీజేపీ నేత భరత్ రెడ్డి దాడి ఘటనపై విచారణ చేసేందుకు రాములు వచ్చారు. రాములును దళిత సంఘాలు అడ్డుకున్నాయి. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. బీజేపీ నేత కావడం వల్లే విచారణలో జాప్యం చేశారని దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

జనసేనను బీజేపీలో విలీనం చేయాలని అమిత్ షా అడిగారు : పవన్ కళ్యాణ్

ప్రకాశం : జనసేనను బీజేపీలో విలీనం చేయాలని అమిత్ షా అడిగారని పవన్ కళ్యాణ్ అన్నారు. అమిత్ షా ప్రతిపాదనను నేను అంగీకరించలేదని తెలిపారు. ప్రజల కోసమే టీడీపీకి మద్దతు తెలిపానని పేర్కొన్నారు. నా ఆశయాలకు తూట్లు పాడిస్తే మరో పవన్ ను చూస్తారని పేర్కొన్నారు. 2019 నాటికి పార్టీ శ్రేణులు ఎన్నికలకు సంసిద్ధం కావాలన్నారు. 

 

శ్రీపతి ఫార్మా ల్యాబ్ లో విష వాయువు లీక్

నల్గొండ : చిట్యాల మండలం గుండ్రాంపల్లి శివారులోని శ్రీపతి ఫార్మా ల్యాబ్ లో విష వాయువు లీక్ అయింది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులకు అస్వస్థత కల్గింది. నార్కెట్ పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. ఓ కార్మికుడి పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. 

 

సమాజం బాగుపడాలనే రాజకీయాల్లోకి వచ్చా : పవన్ కళ్యాణ్

ప్రకాశం : సమాజం బాగుపడాలనే కలతో రాజకీయాల్లోకి వచ్చానని పవన్ కళ్యాణ్ తెలిపారు. పార్టీని ఎలా నడిపిస్తానని నాపై చాలామందికి సందేహాలు వచ్చాయన్నారు. స్వామి వివేకానంద తనకు ఆదర్శమన్నారు. రాజకీయాల్లో అకౌంటబిలిటీ, ట్రాన్స్ పరెన్సీ సోషల్ రెస్పాన్సిబిలిటీ అవసరమన్నారు. భావితరాల భవిష్యత్ కోసం జనసేన పార్టీ పెట్టి రాజకీయ కూలీగా మారారని తెలిపారు. తనను మీ ఇంట్లో వాడిగా భావించండన్నారు. 

 

16:33 - December 9, 2017

లారీలో మంటలు

తూర్పుగోదావరి : జిల్లాలోని మల్లేపల్లి వద్ద 16వ జాతీయ రహదారిపై లారీలో అగ్నిప్రమాదం జరిగింది. బియ్యం లోడ్ తో లారీ ప.బెంగాల్ నుంచి కేరళ వెళ్తోంది. మార్గమధ్యంలో తూర్పుగోదావరి జిల్లాలోని మల్లేపల్లి వద్ద 16వ జాతీయ రహదారిపై లారీ క్యాబిన్ లో వంట చేస్తుండగా గ్యాస్ పేలింది. దీంతో మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్ కు గాయాలు అయ్యాయి. 

16:22 - December 9, 2017

తూర్పుగోదావరి : జిల్లాలోని మల్లేపల్లి వద్ద 16వ జాతీయ రహదారిపై లారీలో అగ్నిప్రమాదం జరిగింది. బియ్యం లోడ్ తో లారీ పశ్చిమ బెంగాల్ నుంచి కేరళ వెళ్తోంది. మార్గమధ్యంలో తూర్పుగోదావరి జిల్లాలోని మల్లేపల్లి వద్ద 16వ జాతీయ రహదారిపై లారీ క్యాబిన్ లో వంట చేస్తుండగా గ్యాస్ స్టవ్ పేలింది. దీంతో అగ్నిప్రమాదం సంభవించింది. లారీ దగ్ధం అయింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్ కు గాయాలు అయ్యాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

16:12 - December 9, 2017
16:10 - December 9, 2017

జనగామ : కాలం మారినా పరిస్థితుల్లో మార్పులు రావడం లేదు. ప్రపంచమంతా వాయు వేగంతో అభివృద్ధి వైపుకు దూసుకోపోతున్నా... ఇంకా కొన్ని గ్రామాల్లో కనీస మౌలిక వసతులు కనిపించడం లేదు. భవిష్యత్‌కు బాటలు వేయాల్సిన చిన్నారులు చదువుకునేందుకు తరగతి గదులు లేక చెట్ల కిందే చదువుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఎండకు ఎండుతూ.. చలికి వణుకుతూ.. పాఠాలను అభ్యసిస్తున్న మీదికొండ స్కూల్‌ పరిస్థితిపై 10టీవీ ప్రత్యేక కథనం.
సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న మీదికొండ పాఠశాల
జనగామ జిల్లా.. స్టేషన్‌ ఘణపూర్‌ మండలంలోని మీదికొండ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో గ్రామంలోని పాఠశాల శిథిలావస్థకు చేరుకుంది. ప్రభుత్వం ఓ వైపు ప్రైవేట్‌ స్కూల్స్‌కి పోటీగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని చెప్తున్నా... అవన్నీ మాటలకే పరిమితమయ్యాయి. గ్రామంలోని పాఠశాలలో పిల్లలు కూర్చోడానికి తరగతి గదులు కూడా లేకపోవడంతో చెట్లకింద కూర్చొనే విద్యనభ్యసిస్తున్నారు. 
శిథిలావస్థలో తరగతి గదులు
పాఠశాలలో మూడు గదులున్నా.. అవి పూర్తిగా శిథిలావస్థలో ఉన్నాయని పాఠశాల ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు. ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితి ఉందని.. అందుకే చెట్లకిందనే పాఠాలు చెబుతున్నామన్నారు. గ్రామంలో ఇంటింటికి తిరిగి పాఠశాలలో విద్యార్ధుల సంఖ్యను 160కి పెంచినట్లు ప్రధానోపాధ్యాయుడు తెలిపారు. గదులు, టీచర్ల భర్తీపై ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. కనీసం పిల్లల దాహార్తిని కూడా తీర్చే పరిస్థితి లేదంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా పట్టించుకొని అదనపు గదులను నిర్మించాలని కోరుతున్నారు. 
పాఠశాల సమస్యలను పరిష్కరించాలి 
పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించినట్లు సర్పంచ్‌ చెబుతున్నారు. దీంతో పాఠశాలలో విద్యార్ధుల సంఖ్య పెరిగిందన్నారు. కానీ వారికి సౌకర్యాలు మాత్రం కరువయ్యాయన్నారు. తరగతి గదులు, టీచర్లను పెంచితే సమస్యలు తీరుతాయని అంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చదివించాలని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది కానీ పాఠశాలల్లో కనీస వసతులను ఏర్పాటు చేయడాన్ని మరచిపోయిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకొని పాఠశాల సమస్యలను పరిష్కరించాలని ఉపాధ్యాయులు, గ్రామస్తులు కోరుతున్నారు. 

 

15:58 - December 9, 2017

కృష్ణా : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి భవానీదీక్ష విరమణలు ప్రారంభంకానున్నాయి. వేలాదిగా భవానీదీక్షాపరులు ఇంద్రకీలాద్రికి తరలిరానున్నారు. దీంతో దుర్గగుడి  అధికారులు ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వినాయకుడి గుడి నుంచి అమ్మవారి సన్నిధానం వరకు మూడు కిలోమీటర్ల మేర క్యూలైన్లు ఏర్పాటు చేశారు. రేపటి నుంచి ఐదు రోజులపాటు సాగే దీక్షా విరమణల కోసం అధికారుల చేసిన ఏర్పాట్లపై మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

15:53 - December 9, 2017


హైదరాబాద్ : మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. లైంగిక దాడులకు గురైన బాధితుల కోసం స్పెషల్ చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టు ప్రారంభం కానుంది. సత్వర న్యాయం అందించాలన్న ఉద్దేశంతో సుప్రీం కోర్ట్ ఆదేశాల మేరకు ఈ స్పెషల్ కోర్ట్  హైదరాబాద్‌లో ఏర్పాటు కానుంది.  సొంత ఇంటిని తలపించే వాతావరణంలో ఉండే ఈ స్పెషల్ కోర్ట్ దక్షిణ భారత దేశంలోనే మొదటిది..
తొలిసారిగా చైల్డ్ ఫ్రెండ్లీ కోర్ట్ ఏర్పాటు 
దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో చైల్డ్ ఫ్రెండ్లీ కోర్ట్ ఏర్పాటు కానుంది. ఈ స్పెషల్ కోర్టును హైదరాబాద్‌లోని భరోసా సెంటర్‌లో ప్రారంభించనున్నారు.ఈ ప్రత్యేక కోర్టు ఫోక్స్ చట్టం ప్రకారం కొనసాగుతుంది. గత ఏడాది మేనెలలో ప్రారంభమైన షీ టీమ్స్ భరోసా సెంటర్ లో ఇంతవరకూ  2 వేల 9వందల కేసులు నమోదయ్యాయి. వీటిని వేగంగా పరిష్కరించేందుకు చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశిచ్చింది. ఆ మేరకు హైకోర్టు 2012 చైల్డ్ రైట్స్ ఫోక్స్ యాక్ట్ ప్రకారం చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టు అందుబాటులోకి రానుంది. 
మహిళా భద్రతకు తెలంగాణలో షీ టీమ్స్
మహిళల భద్రత కోసం తెలంగాణ రాష్ట్రంలో షీ టీమ్స్ ఏర్పాటు చేశారు. నేరాలు అరికట్టేందుకు ఫ్రెండ్లీ పోలీసింగ్ తోపాటు... చైల్డ్ ఫ్రెండ్లీ కోర్ట్ ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని పోలీస్ శాఖ గతంలోనే తీసుకుంది. వారి నిర్ణయానికి తగ్గట్టుగానే స్పెషల్ చైల్డ్ కోర్ట్ ఏర్పాటుకు హై కోర్ట్ కూడా అనుమతి ఇచ్చింది. మహిళా భద్రత, బాలల సంక్షేమం, అత్యాచార, గృహ హింస, లైంగిక వేధింపులు, లైంగిక దాడులకు గురైన చిన్నారుల కేసుల్లో భరోసా కేంద్రం అండగా నిలుస్తుంది. బాధితులకు చైల్డ్ ఫ్రెండ్లీ కోర్ట్ ద్వారా సత్వర న్యాయం చేసేందుకు ఈ స్పెషల్ కోర్ట్ అందుబాటులోకి రానుంది. ఇప్పటి వరకూ నమోదైన 2 వేల 9 వందల కేసుల్లో 270 కేసులు పరిష్కారం అయ్యాయి. వీటిలో  న్యాయసహాలు, వైద్యపరీక్షలు, పునరావాసం, పరిహారం వంటి సేవలందించామని షీ టీమ్స్ చీఫ్ స్వాతి లక్రా తెలిపారు. 
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాంగ్మూలం ఇచ్చే వెసులుబాటు 
స్పెషల్ చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టుకు బాధితులు నేరుగా హాజరు కావాల్సిన అవసరం లేదు. కేవలం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాంగ్మూలం ఇచ్చే వెసులుబాటు ఉంటుంది. దీంతోపాటు  బాధితులకు సౌకర్యాలు, సదుపాయాలు కూడా ఈ కోర్టు ద్వారా అందుబాటులోకి రానున్నాయి.  కోర్టులో బాధితులకు, నిందితులకు విచారణ వేర్వేరుగా నిర్వహిస్తారు. బాధితులు కనిపించకుండా ప్రత్యేక గదులు కూడా ఉంటాయి. భరోసా కేంద్రంలో కౌన్స్ లింగ్, క్లినికల్ సైకాలజిస్ట్, న్యాయవాది, న్యాయసలహా, మహిళా పోలీస్ అధికారులను అందుబాటులో ఉంచుతారు. ఈ చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టు నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు జడ్జీ అద్వర్యంలో కొనసాగనుంది.  
చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టులో సొంత ఇంటిని తలపించే వాతావరణం 
చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టులో సొంత ఇంటిని తలపించే వాతావరణం ఉంటుంది. దీంతో మైనర్ బాధితులు కూడా నిర్భయంగా సాక్ష్యం చెప్పే అవకాశం ఉంటుంది. దక్షిణ భారత దేశంలోనే  తొలిసారి పూర్తి స్థాయిలో భరోసా కేంద్రం అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఢిల్లీ, గోవాలో మాత్రమే ఇలాంటివి ఉన్నాయి... బాధితులకు సత్వర న్యాయం అందించాలనే ఉద్దేశంతో... విచారణ, వాదనలు వంటి సేవలన్నీ ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు ప్రభుత్వం చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టును ఏర్పాటు చేస్తోంది.  దశలవారీగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఈకోర్టును ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు  కూడా రూపొందించింది. వచ్చే నెలలో  ఏర్పాటు కానున్న ఈ ప్రత్యేక కోర్టు పట్ల మహిళాలోకం ఆనందం వ్యక్తం చేస్తోంది. 

 

లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి : సానేరావు

హైదరాబాద్ : నగరంలోని సరూర్ నగర్ స్టేడియంలో ఆదివాసుల మహాసభ జరుగుతోంంది. ఈ సందర్భంగా కుమ్రంభీమ్ మనువడు సానేరావు మాట్లాడుతూ గిరిజనుల హక్కుల కోసం నాడు బ్రిటిష్ పాలకులను, నిజాంను ఎదుర్కొన్నామని.. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే వరకు పోరాటం కోనసాగిస్తామని హెచ్చరించారు. 

 

15:39 - December 9, 2017

హైదరాబాద్ : మీరు పిల్లల్ని స్కూల్స్‌కు పంపుతున్నారా.. చికిత్స కోసం హాస్పిటల్‌కు వెళ్తున్నారా... బడా షాపింగ్‌ మాల్‌లో షాపింగ్‌ చేస్తున్నారా.. అయితే మీరు కొంత జాగ్రతగా ఉండాల్సిందే... ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్‌లో చాలామంది ఫైర్‌ సేప్టీ నిబంధనలు పాటించడంలేదు. దీంతో ఏదైనా జరగరానిది జరిగితే.. అంతే సంగతులు.. తాజాగా నగరంలోని చాలా భవనాలు ఫైర్‌ సేఫ్టీ నిబంధనలు పాటించడం లేదని అధికారుల తనిఖీల్లో బయటపడింది. 

హైదరాబాద్‌ నగరంలో హస్పిటల్స్‌, స్కూల్స్‌, షాపింగ్‌ మాల్స్‌లు ఫైర్‌ సేప్టీ నిబంధనలు తుంగలో తొక్కుతున్నాయి. స్కూల్స్, హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్‌ను ఏర్పాటు చేయాలంటే.. ఖచ్చితంగా ఫైర్‌ డిపార్టుమెంట్ నుంచి నో అబ్జెక్షన్‌ సర్టిపికెట్‌ తీసుకోవాలి. కొందరు నిబంధనలు పాటిస్తుండగా.. మరికొన్ని స్కూల్స్‌, హస్పిటల్స్‌, షాపింగ్‌ మాల్స్‌లకు ఎన్‌ఒసీ ఉన్నా కానీ ఫైర్‌సేప్టీ వైలేషన్స్‌కు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఫైర్‌ సేప్టీ పాటించని స్కూల్స్‌, హస్పిటల్స్‌, షాపింగ్‌ మాల్స్‌లో పొరపాటున అగ్ని ప్రమాదం జరిగితే.. ఆ నష్టం ఎంతో దారుణంగా ఉంటుంది.  

ఇటీవల హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలో అగ్నిమాపక అధికారులు తనీఖీలు చేపట్టగా అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 130 స్కూల్స్‌, హాస్పిటల్స్‌  ఫైర్‌ నిబంధనలు పాటించడంలేదని తేలింది. దీంతో అధికారులు మొత్తం 82 హస్పిటల్స్‌, విద్యా సంస్థలు, షాపింగ్‌ మాల్స్‌ యాజమానులపై కేసులు నమోదుచేసి.. జరిమానాలు కూడా విధించారు. 

తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 72 హాస్పిటల్స్‌కు ఫైర్ డిపార్టుమెంట్‌ ఎన్‌ఒసీ జారి చేసింది. అందులో ఫైర్‌ సేప్టీ నిబంధనలు పాటించని 21 హాస్పిటల్స్‌కు విచారణ నోటీసులు జారీ చేశారు అధికారులు. అలాగే ఆకస్మిక తనీఖీలు చేప్పటినప్పుడు 16 హాస్పిటల్స్‌ కనీసం ఫైర్‌ రూల్స్‌ కూడా పాటించడంలేదని తేలింది. ఇక ఐదు హాస్పిటల్స్‌ అయితే ప్రతిరోజు ఫైర్‌ సేప్టీ సరిగా ఉందా లేదా అనేది కూడా చెక్‌ చేసుకోవడం లేదు. మూడు హాస్పిటల్స్‌లకు కోర్టు జరిమానాలు కూడా విధించాయి. అలాగే 18 హాస్పిటల్స్‌లపై అధికారులు కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

ఒక హాస్పిటల్స్‌ కాదు.... చాలా స్కూల్స్‌ కూడా ఫైర్‌ సేప్టీ నిబంధనలు పాటించడంలేదు. అంతేకాదు... చాలా హాస్పిటల్స్‌, స్కూల్స్‌లకు ఫైర్‌ డిపార్టుమెంట్‌ నుంచి కనీసం ఎన్‌ఒసీ కూడా లేదని అధికారులు గుర్తించారు. షాపింగ్‌ మాల్స్‌, స్కూల్స్‌, హాస్పిటల్స్‌ ఖచ్చితంగా ఫైర్‌ విభాగం నుంచి ఎన్‌ఒసీ తీసుకోవాలి. రెగ్యూలర్‌గా ఫైర్‌ సేప్టీ చెక్‌ చేసుకుని నిబంధనలు పాటించాలి. లేకుంటే కేసులు నమోదు చేసి భారీగా జరిమానాలు విధిస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజల్లో అగ్నిమాపక వ్యవస్థపై అవగాహన కలిగేలా  ప్రతి శుక్రవారం మాక్‌ డ్రిల్స్‌ నిర్వహిస్తోంది ఫైర్‌ డిపార్టుమెంట్‌. అగ్నిమాపక ప్రమాదాలను ఎలా నియంత్రించాలనే దానిపై అవగాహన కల్పించటానికి పాఠశాలలు, కళాశాలతోపాటు హాస్పిటల్స్‌లో ప్రతి శుక్రవారం డ్రిల్‌ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 

 

 

15:31 - December 9, 2017

విశాఖ : కైలాసగిరిపై చిరుతలు సంచరిస్తున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో మంత్రి గంటా శ్రీనివాసరావు కైలాసగిరిని సందర్శించారు. అయితే అవి పులులా కాదా అన్నది తేలాల్సి ఉందన్నారు. కైలాసగిరిపై లభించిన ఆనవాళ్లతో వాటి జాడ కనుగొనే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. అవసరం అయితే సీసీ కెమెరాలు పెట్టి పూర్తిగా అన్వేషిస్తామన్నారు. అప్పటివరకు కైలాసగిరిపై పర్యాటకుల్ని అనుమతించబోమన్నారు. గతంలో కూడా కొన్ని ప్రాంతాల్లో చిరుతల సంచారం కనిపించడంతో, అటవీ అధికారులు అప్రమత్తమయ్యాని తెలిపారు. 

15:17 - December 9, 2017

రాజమండ్రి : పోలవరం ప్రాజెక్ట్ విషయంలో చంద్రబాబు తీరుపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మండిపడ్డారు. సీఎం బలహీనతల వల్లే కేంద్రాన్ని నిలదీయడంలో విఫలమవుతున్నారని వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తికాకపోతే రాజకీయంగా చంద్రబాబుకి ఎదురుదెబ్బ తగలడం ఖాయం అన్నారు. వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. 2020.. 2021నాటికి కూడా ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం లేదని విమర్శించారు. పనులు జరగకుండానే బిల్లులు చెల్లించడంపై తన వద్ద ఉన్న ఆధారాలు ఉన్నాయని, వాటిని త్వరలో బయట పెడతానని అన్నారు. 

 

15:09 - December 9, 2017

హైదరాబాద్‌ : నగరంలో జరుగుతున్న సభకు తెలంగాణ వ్యాప్తంగా ఆదివాసీలు తరలివచ్చారు. వేలాదిగా తరలి వచ్చిన ఆదివాసీలతో సరూర్‌నగర్‌లోని సభా ప్రాంగణం కిటకిటలాడింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీలో ఆదివాసీలు,లంబాడా తెగల మధ్య వర్గపోరు.. నేపథ్యంలో ఈ సభ జరుగుతోంది. గిరిజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో పలువురు నేతలు మాట్లాడారు.

ఒంగోలులో కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ సమావేశం

ప్రకాశం : ఒంగోలులో కార్యకర్తలతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. నేను ఒంగోలు, నెలూరులో చదివానని తెలిపారు. సమాజం బాగుపడాలనే కలతో రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. 

 

31 శాతం పోలింగ్ నమోదు...

గుజరాత్ : రాష్ట్రంలో మొదటి దశ పోలింగ్ కొనసాగుతోంది. సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్ లో 89 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. 12 గంటల వరకు 31 శాతం పోలింగ్ నమోదైంది. 

13:37 - December 9, 2017

మహబూబ్ నగర్ : కొలిచిన వారికి కొంగు బంగారమై నిలుస్తోంది ఆ అమ్మవారు.. ఆమెను దర్శించుకుంటే 100 జన్మల పుణ్యఫలం లభిస్తుందని విశ్వసిస్తారు భక్తులు.. జీవితంలో ఒకసారైనా అమ్మవారిని దర్శనం చేసుకోవాలని ఆరాటపడతారు.. మహబూబ్‌నగర్ జిల్లాలో వెలసిన ఆ అమ్మవారే కాళీకాదేవి.. ప్రతి ఏటా అమ్మవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ ఏడాది కూడా అమ్మవారి బ్రహ్మోత్సవాలు వేలాది మంది భక్తుల మధ్య ప్రారంభమయ్యాయి...మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం రాంచంద్రపురం గ్రామం ఇది.. కోరిన కోర్కెలు తీర్చే దేవతగా శ్రీశ్రీశ్రీ కాళీకాదేవి అమ్మవారు ఇక్కడ పూజలందుకుంటున్నారు.. రామచంద్రాపురం గుట్టపై వెలిసిన ఈ దేవత పేదలపాలిట ఆరాధ్యదైవంగా నిలిచింది. జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఏకంగా తొమ్మండుగురు దేవతా విగ్రహాలు ప్రతిష్టింపబడి ఉండటం విశేషం.. పెళ్లిళ్లు. సంతానం.. వ్యాపారం.. ఉద్యోగం కోసం ఈ దేవతను కొలిచిన వారంతా తమ కోరికలు తీరుతాయని ప్రగాఢ విశ్వాసం.. దీంతో రోజు రోజుకు దేవాలయం ప్రాచుర్యం పొందుతూ వస్తోంది.. ప్రతి ఏటా మార్గశిర శుద్ద ఏకాదశి నుండి మార్గశిర బహుళ పంచమి వరకు అమ్మవారి బ్రహ్మోత్సవాలు 15 రోజులపాటు సాగుతాయి. ఈ సారి కూడా బ్రహ్మత్సవాలు వేలాది మంది భక్తుల మధ్య

రాంచంద్రాపురం గ్రామానికి చెందిన దివంగత ప్రజాప్రతినిధి కుర్వ మల్లయ్య.. నేతృత్వంలో ఇక్కడ దేవాలయం నిర్మాణం జరిగింది. మల్లయ్యకు ఒకనాడు కాళీమాత కలలో కనిపించి తాను ఈ గ్రామ గుట్టపై వెలిశానని చెప్పిందట..దీంతో 1987లో కాళీమాత ఆలయాన్ని ప్రతిష్టించడం జరిగింది.. బండలోపల ఎతైన ప్రదేశంలో ప్రతిష్టించిన కాళీకామాత విగ్రహం అందరిని ఆకర్షిస్తోంది.. వీటితోపాటు భూలక్ష్మీదేవి, ఎల్లమ్మ, పరుశురాముడు, గంగాదేవి, తుల్జాభవాని, పోలేరమ్మ, కనకదుర్గ, నాగదేవత విగ్రహాలను ఏర్పాటు చేశారు. దేవతలందరూ ఒకేచోట కొలువైన నేపథ్యంలో 1988 నుంచి ప్రతి ఏటా డిసెంబర్ లో కాళీకదేవి బ్రహ్మోత్సవాలు జరుపుతున్నారు. కుర్వమల్లయ్య చనిపోయిన తర్వాత తనయుడు రాహుల్‌తో పాటు కుటుంబీకులు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.. జాతర ముఖ్యోద్దేశ్యం పొలిమేర గ్రామాల్లోని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని తన తండ్రి జాతర ప్రారంభించారని మల్లయ్య కుమారుడు రాహుల్‌ అన్నారు. రైతులంతా సుఖంగా ఉండాలని తన తండ్రి కోరిక అని తెలిపాడు.

25 ఎకరాల విస్తీర్ణం ఉన్న ఈ ప్రాంతంలో కుర్వమల్లయ్య తనయుడు రాహుల్‌ తన సొంత ఖర్చులతో బ్రహ్మోత్సవాలు జరిపిస్తున్నాడు. ఆలయ అభివృద్ధి సహాయం చేయాలని స్థానిక ఎమ్మెల్యేకు రాహుల్‌ వినతిపత్రం అందజేశాడు. సామాజిక సేవలో ముందుండే మల్లయ్య మరణించడం ఆ తర్వాత రాహుల్ తన తండ్రి ఆశయాలను మోస్తూ అమ్మవారి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం కూడా ఆలయ అభివృద్ధి కృషి చేయాలని స్థానికులు, భక్తులు కోరుతున్నారు.

13:34 - December 9, 2017

హైదరాబాద్ : మధ్య తరగతి వారి నుంచి .. ప్రజా ప్రతినిధుల పిల్లల వరకూ అందరూ తమ పిల్లల్ని ఆ కాలేజ్‌లో చదివించాలని తహతహలాడతారు. ఆ కాలేజ్‌లో సీటు రావాలంటే ఆషామాషీ ర్యాంకులు సరిపోవు. తెలుగు రాష్ట్రాల్లో టాప్ మోస్ట్ కాలేజ్‌గా పేరొందిన ఆ కాలేజ్‌ కీర్తి ఇప్పుడు మసకబారుతోంది. మధ్య తరగతి విద్యార్ధులకు ఉన్నత విద్య అందించాలనే లక్ష్యంతో ఏర్పడిన ఆ కాలేజ్‌ ఇప్పుడు ధనార్జనే ధ్యేయంగా వ్యాపారం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పేరొందిన CBIT కాలేజీలో ఫీజుల జులుంపై టెన్ టీవీ ప్రత్యేక కథనం.

CBIT...తెలుగు రాష్ట్రాల్లో ఈ కాలేజ్ పేరు తెలియని విద్యార్ధులు కానీ.. తల్లిదండ్రులు కానీ ఉండరు. విద్యార్ధులకు నంబర్ వన్ విద్యను అందించడంలో పేరు ప్రఖ్యాతులు గడించిన ఈ కాలేజీ ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. ఉన్నత విద్యామండలి, TFTRC నిబంధనలను తుంగలో తొక్కుతూ .. యాజమాన్యం అమాంతంగా ఫీజులు పెంచేయడాన్ని నిరసిస్తూ రెండురోజులుగా విద్యార్ధులు ఆందోళన చేస్తున్నారు. పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేశారు. ఫస్టియర్ సెమిస్టర్ పరీక్షల్ని బాయ్‌కాట్ చేశారు. అడ్మిషన్ బ్లాక్‌ను ముట్టడించారు.

గతంలో బడుగు బలహీన వర్గాల విద్యార్ధులు ఉన్నత చదువులు చదువుకోవాలనే ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి గండిపేట ఏరియాలో 130 ఎకరాల భూమిని చైతన్య భారతి ట్రస్టుకు కేటాయించారు. కొండా వెంకట్ రంగారెడ్డి తనయుడు.. జస్టిస్ మాధవరెడ్డి 13 మంది సభ్యులతో చైతన్య భారతి ఎడ్యుకేషనల్ ట్రస్టును ఏర్పాటు చేశారు. 1979లో ఆవిర్భవించిన సీబీఐటీ 37 ఏళ్లలో లక్షా 20 వేలకు పైగా విద్యార్ధులకు ఉన్నతమైన బాటలు వేసింది. ఈ కాలేజీలో చదువుకున్న పూర్వ విద్యార్ధులు కోట్ల రూపాయల డొనేషన్లు అందించారు. అయితే కాలక్రమంలో... ట్రస్ట్ సభ్యుల్లో ఏడుగురు మరణించారు. ప్రస్తుతం ఉన్న నలుగురితో పాటు వారి తనయులు వైస్రాయ్ హోటల్ అధినేత ప్రభాకర్‌రెడ్డితో కలిసి సీబీఐటీ సొసైటీ పేరుతో కొత్త ట్రస్టును ఏర్పాటు చేశారు.

అప్పట్లో సీబీఐటీ కాలేజీ ఏర్పాటుకు కారణాలు వేరైతే తాజాగా కొత్త ట్రస్టు వ్యవహారం మరోలా ఉంది. 2009లో కొత్తగా ఏర్పడిన ట్రస్టు ఈ నిధులను తమ సొంత ఖాతాల్లో వేసుకుందనే ఆరోపణలు ఉన్నాయి. ఇక తాజాగా కాలేజీ నిర్వహణకు సొమ్ములు లేవంటూ ట్రస్టు సీట్లను వేలం వేసి ఇష్టారాజ్యంగా అమ్మకాలు చేపట్టింది. దీనిపై మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి తనయుడు మర్రి ఆదిత్యా రెడ్డి అవేదన వ్యక్తం చేశారు. త్వరలో యాజమాన్యంతో జరిగే చర్చల్లో తాను పాల్గొని సీబీఐటీ సొసైటీ చేస్తున్న అవినీతిని బట్టబయలు చేస్తామని ఆదిత్యారెడ్డి చెబుతుంటే అసలు సొసైటీలో ఎటువంటి అవినీతి జరగలేదంటున్నారు కాలేజీ ప్రిన్సిపాల్ రవీందర్‌రెడ్డి. ఇంతకీ చైతన్య భారతి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ పూర్వ విద్యార్ధులు కాలేజీకి అందించిన ఫండ్స్ ఏ మేరకు ఉన్నాయి? వాటిలో ఎంత ఖర్చయ్యాయి? ఈ విషయంలో మాత్రం కొత్త ట్రస్టు సభ్యులు నోరు మెదపడం లేదు. మొత్తంగా విద్యారంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాందించిన సి.బి.ఐ.టి కాలేజీ వ్యవహారం ఇప్పుటు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. 

13:32 - December 9, 2017

నల్లగొండ : జిల్లా హాలియా వద్ద నాగార్జున సాగర్‌ ఎడమ కాలువలో జింక ప్రత్యక్షమైంది. గమనించిన స్థానికులు వల సాయంతో జింకను బయటకు తీసి కాపాడారు. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తామని తెలిపారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చి జింకను అప్పగిస్తామన్నారు స్థానికులు. 

13:31 - December 9, 2017

శ్రీకాకుళం :పోలవరం ఆగిపోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబే కారణమన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు. విభజన చట్టంలో భాగంగా పోలవరం బాధ్యత కేంద్రం తీసుకుంటామంటే ఎందుకు టీడీపీ బాధ్యత తీసుకుందని ప్రశ్నించారు. కేవలం కమీషన్ల కోసమే పోలవరం బాధ్యత తీసుకుందని ఆరోపించారు. 2017 రేటు ప్రకారం టెండర్లు పిలుస్తామని రాష్ట్రం పేర్కొనడంపై కేంద్రం ప్రశ్నించిందని...కమిషన్ల తగాదా ? ఏమీ తగాదా అంటూ ప్రశ్నించారు. 

13:29 - December 9, 2017

విశాఖపట్టణం : విశాఖ అభివృద్ధికి కేంద్రం మరింతగా సాయం చేస్తుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. హుద్‌హుద్‌ తుఫాను విధ్వంసం సమయంలో విశాఖ నగర ప్రజలు ధైర్యాన్ని ప్రదర్శించారని వెంకయ్య అన్నారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అలాగే యువత ప్రతిఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఆరాట పడ్డం మానుకోవాలని వెంకయ్య అన్నారు. చదువుకున్న వారు ప్రభుత్వ పథకాలతో స్వయం ఉపాధిని పొందాలని ఉపరాష్ట్ర పతి సూచించారు. హుదూద్ తుపాన్ ఇక్కడి వారికి పీడకలగా మిగిలిపోయిందని, మొక్కవోని ధైర్యంతో తుపాన్ ను ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. తుపాన్ లో జరిగిన సహాయక చర్యల్లో విశేషంగా కృషి చేశారని, శ్మశాన స్థలంతో పాటు 200 ఇళ్లను మంజూరు చేయడం జరుగుతుందన్నారు. గ్రామ ప్రజలకు ఉపాధి కావాల్సినవసరం ఉందన్నారు. 

13:27 - December 9, 2017

విజయవాడ : టీడీపీ - బీజేపీలకు సపోర్ట్‌ చేసినందుకు తాను బాధపడుతున్నానని జనసేన అధ్యక్షుడు పవన్‌ అన్నారు. ఒంగోలులో పడవ ప్రమాద బాధితులను పలకరించిన ఆయన.. పడవ ప్రమాదంలో చనిపోయిన మృతుల ఆత్మలకు శాంతికలగాలని కోరుకుంటున్నట్టు పవన్‌ అన్నారు. టీడీపీకి సపోర్టు చేసి అధికారంలోకి రావడానికి కారణం అయిన తాను.. ప్రభుత్వ తప్పిదానికి నైతిక బాధ్యతగా మృతుల కుటుంబాలకు సభా ముఖంగా సారీ చెప్పారు. బాధ్యతను గుర్తు చేయడానికి మాత్రమే తాను ఇక్కడకు రావడం జరిగిందన్నారు. లోపాలున్న సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..తదితర కార్యాచరణ తీసుకోవాల్సి ఉండేదన్నారు. పడవ ప్రమాదంలో బాధ్యత లేదా ? అని లండన్ లో ఉన్న ఓ బాలుడు తనను ప్రశ్నించాడని, దీనితో తాను ఆలోచించి ఇక్కడకు రావడం జరిగిందన్నారు. మనస్పూర్తిగా క్షమాపణలు చెబుతున్నట్లు పవన్ వెల్లడించారు. 

13:26 - December 9, 2017

గుంటూరు : ఫెర్రీ పడవ ప్రమాద ఘటనలో బాధిత కుటుంబాల సభ్యులను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రమాదం జరిగిన తీరు..అనంతరం జరిగిన పరిణామాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. జనసేన అధినేత ఎదుట కన్నీరు పెట్టుకున్నారు. అయినవారిని కోల్పోయి దుఖంలో ఉంటే ప్రభుత్వం నుంచి కనీస సానుభూతి లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి....

రాజకీయ కూలీగా మారినా - పవన్..

ప్రకాశం: తాను ఒంగోలు, నెల్లూరు జిల్లాలో చదువుకున్నట్లు సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సమాజం బాగుపడాలనే కలతో రాజకీయాల్లోకి వచ్చినట్లు, పార్టీని ఎలా నడిపిస్తావని తనపై చాలా మందికి సందేహాలు వ్యక్తం చేశారన్నారు. స్వామి వివేకానంద తనకు ఆదర్శమని, రాజకీయాల్లో అకౌంటబిలిటీ..ట్రాన్స్ పరెన్సీ...సోషల్ రెస్పాన్సిబిలిటీ..అవసరమన్నారు. భావితరాల కోసం జనసేన పార్టీ పెట్టి రాజకీయ కూలీగా మారినట్లు పేర్కొన్నారు. 

వృద్ధి రేటుపై బాబు సమీక్ష..

విజయవాడ : రియల్ టైం గవర్నెర్స్ ప్రణాళిక శాఖ ఉమ్మడిగా వ్యూహాన్ని ఖరారు చేసేలా దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. మరింత వృద్ధి రేటుకు ఆస్కారం ఉన్న శాఖలపై దృష్టి సారించాలని, ఏయే రంగంలో వృద్ధి రేటు పెరుగుదలలో సమగ్రంగా ఈనెల 12న ప్రభుత్వాధికారులు, వివిధ విభాగాధిపతులతో రెండంకెల వృద్ధి రేటు దిశగా జరుగుతున్న అభివృద్ధి సత్ఫలితాలిస్తున్నాయన్నారు. 

12:29 - December 9, 2017

గుంటూరు : జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అనుబంధ సంస్థ కళాశాలలో లైంగిక వేధింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని వైసీపీ డిమాండ్ చేసింది. ఈమేరకు శనివారం వైసీపీ నేతల లేళ్ల అప్పిరెడ్డితో పాటు మరికొంత మంది నేతలు జీజీహెచ్ ఆసుపత్రిని సందర్శించి కళాశాలలో జరుగుతున్న వ్యవహారంపై అధికారులను నిలదీశారు. వేధింపుల ఘటన జరిగి రెండు రోజులు గడుస్తున్నా విచారణ పేరిట కాలయాపన చేస్తున్నారని వైసీపీ నేతలు పేర్కొన్నారు. 

12:23 - December 9, 2017

గుజరాత్ : మళ్లీ ఈవీంఎల ట్యాంపరింగ్ అంశం తెరపైకి వచ్చింది. గుజరాత్ రాష్ట్రంలో మొదటి దశ పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. గుజరాత్‌లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలుండగా.. తొలిదశలో సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్‌లోని 89 శాసనసభ నియోజకవర్గాలకు పోలింగ్‌ జరగనుంది. మొత్తం 2.12 కోట్ల మంది ఓటర్లు ఈరోజు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం 11గంటల వరకు కేవలం 21 శాతమే పోలింగ్ నమోదైంది. భారీగా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవడానికి తరలివస్తున్నారు.

ఉదయం ప్రారంభమైన పోలింగ్ లో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ శాతం తక్కువ నమోదు కావడానికి కారణమని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈవీఎంలు ట్యాంపరింగ్ కు గురవుతున్నాయని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈవీఎంలు వైఎఫ్ కి కనెక్టయి ఉన్నాయని..దీనివల్ల ట్యాంపరింగ్ జరిగే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ అభ్యర్థి ఆరోపించారు. 

గుజరాత్ లో పోలింగ్..

గుజరాత్ : రాష్ట్రంలో మొదటి దశ పోలింగ్ కొనసాగుతోంది. రాజ్ కోట్ లో క్రికెటర్ పుజారా, బరూచ్ లో కాంగ్రెస్ ఎంపీ అహ్మద్ పటేల్ లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 11గంటల వరకు 21 శాతం పోలింగ్ నమోదైంది. 

12:10 - December 9, 2017
11:56 - December 9, 2017

గుంటూరు : నర్సింగ్ కాలేజీలో ర్యాగింగ్..లైంగిక వేధింపుల ఘటనకు ఫుల్ స్టాప్ పడడం లేదు. గత నాలుగు రోజులు క్రితం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి నర్సింగ్ కళాశాల విద్యార్థినిలపై ర్యాగింగ్...లైంగిక వేధింపులు చేశారని ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. విద్యార్థినిలను పీఎస్ లో ఫిర్యాదు చేసినా బాధితులపై ఎలాంటి చర్యలు తీసుకోకోపవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తక్షణం స్పందించే విధంగా అధికారులకు ఆదేశాలివ్వాలని..న్యాయం చేయాలని గుంటూరు అర్బన్ ఎస్పీకి విద్యార్థినిలు ఫిర్యాదు చేశారు.

ఇటీవలే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి నర్సింగ్ కళాశాల విద్యార్థినిలపై ర్యాగింగ్..లైంగిక వేధింపులు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అనంతరం దీనిపై విద్యార్థినిలు ఆందోళన చేపట్టడం...మహిళా కమిషన్ ఛైర్మన్ నన్నపనేని స్పందిండం జరిగింది. కానీ అనంతరం అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. అందులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దొరబాబు ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. దొరబాబు, రాజేశ్వరీలను అరెస్టు చేయాలని..ప్రిన్స్ పాల్, జీజీహెచ్ సూపరింటెండెంట్ ను సస్పెండ్ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. మరి ప్రభుత్వం..అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి. 

11:42 - December 9, 2017

పడవ ప్రమాద కారకులకు శిక్ష పడాలన్న పవన్..

ఒంగోలు : పడవ ప్రమాదం కారకులైన వారికి శిక్ష పడాలని..నిందుతులు తప్పించుకొని తిరగడం అసలు సిసలైన విషాదమని సినీ నటుడు, జనసేనత అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. 

11:39 - December 9, 2017

ఒంగోలు : టూరిజం శాఖ మంత్రిగా ఉన్న అఖిల ప్రియకు సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలు సూచనలు చేశారు. ఫెర్రీ ఘాట్ బోటు ప్రమాదంలో బాధిత కుటుంబాలను పవన్ పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఎక్స్ గ్రేషియా ఇచ్చి నేతలు చేతలు దులుపుకోవాలని చూస్తున్నారని, ఇరిగేషన్ మినిస్టర్, టూరిజం మినిస్టర్, టిడిపిపై దాడి చేయడానికి రాలేదని...వారి బాధ్యతలను గుర్తు చేయడానికి వచ్చానన్నారు. ప్రభుత్వాలు, ప్రభుత్వ అధికారులు..మంత్రులు..అధికారులు ఎవరైనా సరే సున్నితంగా వ్యవహరించాలని, మానవతాదృక్పథంతో ఆలోచించాలని సూచించారు. ఓటు అనే బోటు మీద తీరం చేరాక ఇతర విషయాలను మరిచిపోవద్దన్నారు.


అతి కొద్దికాలంలో తండ్రి..తల్లిని మంత్రి అఖిల ప్రియ కొల్పోయారని, గతంలో పీఆర్పీలో ఉన్న సమయంలో భూమ కుటుంబంతో మాట్లాడేవారని తెలిపారు. బాధిత కుటుంబాల బాధ ఎక్కువగా మంత్రి అఖిలప్రియకు తెలుస్తుందన్నారు. గతంలో వైసీపీ ఉన్న సమయంలో తనను ఇక్కడకు రావద్దని సూచించారని, వస్తే ఓడిపోతానని పేర్కొనడం జరిగిందని గుర్తు చేశారు. దీనితో తాను ఎన్డీయే ఒప్పందానికి విరుద్ధంగా రాలేదని..పరోక్షంగా అఖిల ప్రియ గెలుపుకు కృషి చేయడం జరిగిందన్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో కూడా అభ్యర్థిని నిలబడించలేదన్నారు. మొత్తంగా అఖిల ప్రియ కుటుంబానికి రెండుసార్లు కృషి చేశానన్నారు. మంత్రి అఖిల ప్రియ ఒంగోలుకు వచ్చి ఫెర్రీ ఘాట్ బోటు ప్రమాద బాధితులతో స్వయంగా మాట్లాడాలని సూచించారు.

లైవ్ జాకెట్లు లేకుండా బోటుపై వెళ్లే అవకాశం లేదని, కానీ కొంతమంది నిబంధనలు తుంగలో తొక్కేస్తారని పేర్కొన్నారు. కంటితడుపుగా ఎక్స్ గ్రేషియా ప్రకటించారని, ఎక్స్ గ్రేషియాతో ప్రాణాలు తిరిగి రావని పేర్కొన్నారు. కొద్దిమందిని రక్షించిన మత్స్యకార్మికులు, గజ ఈతగాళ్లను ఎందుకు గుర్తించలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తాత్కాలిక వ్యాపార ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తున్నారని, సీరియస్ గా తీసుకోవాలని సూచించారు. 

11:33 - December 9, 2017

ప్రకాశం : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సామాజిక బాధ్యత ఉందని ఫెర్రీ ఘాట్ బోటు ప్రమాదంలో బాధిత కుటుంబం పేర్కొంది. ఏ1 కన్వెన్షన్ సెంటర్ లో ఫెర్రీ ఘాట్ లో బోటు ప్రమాద బాధితులను సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించారు. సామాజిక బాధ్యతతో ఇక్కడకు వచ్చిన పవన్ కు కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు ఓ మహిళ పేర్కొన్నారు. తమ్ముడు..అన్నయ్య..లా ఉండాలని..నేనున్నానని నమ్మకం కలిగిచే విధంగా చూడాలని పవన్ ను కోరారు. అనుమతి లేని బోట్లలో ఎక్కించారని...60 రూపాయల తీసుకోవాల్సి ఉంటే రూ. 300 తీసుకున్నారని, లైఫ్ జాకెట్లు కూడా ఇవ్వలేదన్నారు. ఇది మరిచిపోలేని దుర్ఘటన అని తెలిపారు. 

కొనసాగుతున్న సంగీత పోరాటం...

హైదరాబాద్ : బోడుప్పల్ లో భర్త ఇంటి ఎదుట సంగీత న్యాయపోరాటం చేస్తోంది. 21 రోజులుగా మహిళా సంఘాలతో కలిసి సంగీత దీక్ష చేపడుతోంది. తన ఇంటిని ఖాళీ చేసేలా ఆదేశాలివ్వాలని హైకోర్టును సంగీత మామ బాల్ రెడ్డి ఆశ్రయించారు. 

అఖిల ప్రియ రావాలన్న పవన్..

విజయవాడ : మంత్రి అఖిల ప్రియ ఒంగోలుకు వచ్చి ఫెర్రీ ఘాట్ బోటు ప్రమాద బాధితులతో స్వయంగా మాట్లాడాలని సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచించారు. అఖిల ప్రియ బాధితుల బాధలు వినాల్సినవసరం ఉందని సూచించారు. 

అఖిల ప్రియ గెలుపుకు తాను ఒక కారణం - పవన్..

ఒంగోలు : మంత్రి అఖిల ప్రియ కుటుంబానికి తాను రెండుసార్లు కృషి చేశానని సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఫెర్రీ ఘాట్ బోటు ప్రమాద బాధితులతో ఆయన మాట్లాడారు. వైసీపీ ఉన్న సమయంలో పవన్ రావద్దని అఖిల ప్రియ సూచించడంతో ఎన్డీయే ఒప్పందానికి విరుద్ధంగా రాలేదని..అనంతరం నంద్యాల ఉప ఎన్నికల్లో కూడా అఖిల ప్రియ గెలుపుకు పరోక్షంగా కృషి చేశానన్నారు. 

బాధ్యతలను గుర్తు చేయడానికి వచ్చాను -పవన్..

ఒంగోలు : తాను ఏ మంత్రిపై...కానీ టిడిపి ప్రభుత్వంపై దాడి చేయడానికి రాలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇరిగేషన్ మినిస్టర్, టూరిజం మినిస్టర్, టిడిపిపై దాడి చేయడానికి రాలేదని, బాధ్యతలను గుర్తు చేయడానికి వచ్చానన్నారు. 

పడవ ప్రమాద బాధిత కుటుంబాలతో పవన్...

ఒంగోలు : పడవ ప్రమాద బాధిత కుటుంబాలతో పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. ఎన్టీఆర్ కళాక్షేత్రంలో స్వయంగా బాధితుల వద్దకు వెళ్లిన పవన్ ప్రమాదం జరిగిన తీరు..అనంతరం జరిగిన పరిణామాలు..వారు పడుతున్న బాధలను అడిగి తెలుసుకున్నారు. 

10:23 - December 9, 2017

విశాఖపట్టణం : భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు విశాఖ జిల్లాలో పర్యటిస్తున్నారు. శనివారం ఉదయం వాక్ థాన్ ను వెంకయ్య జెండా ఊపి ప్రారంభించారు. బీచ్ రోడ్డులోని కాళీమాత ఆలయం నుండి పార్క్ హోటల్ వరకు వాక్ థాన్ జరిగింది. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ..జీవిత నడక ఎలాగూ కొనసాగుతోందని..అందులో భాగంగా ఉదయాన్నే నడక సాగించాలని సూచించారు. పాతమిత్రులు ఒక రోజు గడిపే వీలుగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విశాఖకు మరో మణిహారంగా ఏయూ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు అయ్యిందని, అంతర్జాతీయ, జాతీయ చర్చా వేదికలకు అలవాలం కావాలని పిలుపునిచ్చారు. సాయంత్రం బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ ను వెంకయ్య ప్రారంభించనున్నారు. 

10:14 - December 9, 2017
10:10 - December 9, 2017

గుజరాత్ : తమను మళ్లీ గెలిపించాలంటూ ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థులు దేవాలయానికి వెళ్లి పూజలు చేసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ప్రత్యేక పూజలు చేసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలో మొదటి దశ పోలింగ్ శనివారం ఉదయం 8గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఉదయం 10గంటల వరకు పది శాతం పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. గుజరాత్‌లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలుండగా.. తొలిదశలో సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్‌లోని 89 శాసనసభ నియోజకవర్గాలకు పోలింగ్‌ జరగనుంది. మొత్తం 2.12 కోట్ల మంది ఓటర్లు ఈరోజు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ కు 26వేల ఈవీఎంలను అధికారులు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. సున్నితమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఈసీ పర్యవేక్షిస్తోంది. ఓటు వేసేందుకు యువత ముందుకు రావాలని ఈసీ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. 

కొనసాగుతున్న గుజరాత్ పోలింగ్..

గుజరాత్ : రాష్ట్ర మొదటి దశ పోలింగ్ కొనసాగుతోంది. సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్‌లోని 89 శాసనసభ నియోజకవర్గాలకు పోలింగ్‌ జరుగుతోంది. పది గంటల వరకు పది శాతం పోలింగ్ నమోదైంది. 

మొదలైన జగన్ పాదయాత్ర...

అనంతపురం: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర అనంతపురంలో కొనసాగుతోంది. సింగమనల నియోజకవర్గం పాపినేని పాలెం నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. జంబులదిన్నె తండా, గార్లదిన్నె మీదుగా మర్తాడ్‌ వరకు యాత్ర కొనసాగనుంది.

09:26 - December 9, 2017

విశాఖపట్టణం : కైలాసగిరిని ఫారెస్టు అధికారులు ఖాళీ చేయించారు. కొండపైకి ఎవరినీ అనుమతించడం లేదు. పర్యాటక క్షేత్రమైన కైలాసగిరి చూసేందుకు భారీగా పర్యాటకులు తరలివస్తుంటారు. శుక్రవారం సాయంత్రం రెండు చిరుతలు సంచరిస్తున్నట్లు నిర్ధారించారు. వాటికి సంబంధించిన పాదముద్రలను గుర్తించారు. సమాచారం తెలుసుకున్న మంత్రి గంటా శ్రీనివాసరావు అక్కడకు చేరుకుని అధికారులకు పలు సూచనలు చేశారు. జూ సిబ్బంది చేరుకుని చిరుతల కోసం గాలింపులు చేపడుతున్నారు. 

గిరిజనుల దారుణ హత్య...

విశాఖపట్టణం : మాడుగుల (మం) గౌరీపుట్టు వద్ద ఇద్దరు గిరిజనులు హత్యకు గురయ్యారు. పోలీస్ ఇన్ఫార్మర్ల నెపంతో మావోయిస్టులు హత్య చేశారు. కోలకాని సూర్య, ముక్కాల కిషోర్ గా గుర్తించారు. 

09:09 - December 9, 2017

ఒంగోలు : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒంగోలు కు పయనమవుతున్నారు. ఫెర్రీ ఘాట్ లో బోటు ప్రమాద ఘటనలో మృతి చెందిన కుటుంబీకులను ఆయన పరామర్శించనున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆయన విదేశాల్లో ఉండడం..తాను త్వరలోనే బాధిత కుటుంబీకులను పరామర్శిస్తానని ఆనాడు పవన్ హామీనిచ్చారు. అందులో భాగంగా ఆయన నేడు ఒంగోలు జిల్లాకు రానున్నారు. ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఈ కార్యక్రమం జరుగనుంది. పవన్ కళ్యాణ్ వసున్నాడని తెలుసుకున్న అభిమానులు భారీగానే కళాక్షేత్రానికి చేరుకుంటున్నారు. కానీ పరిమితికి మించిన వారిని మాత్రమే లోనికి అనుమతినిస్తున్నారు. జనసేన పార్టీ ముఖ్య నేతలు..పవన్ అనుచరులు అక్కడకు చేరుకుని ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఈ పరామర్శ అనంతరం 1500 మంది జనసేన కార్యకర్తలతో భేటీ కానున్నారు.

 

08:30 - December 9, 2017

ఆదిలాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీలో ఆదివాసీలు, లంబాడా తెగల మధ్య వర్గపోరు చిచ్చురేపుతోంది. ఇరువర్గాల మధ్య ఆధిపత్యపోరు రోజు రోజుకు శృతిమించుతోంది. వలస లంబాడాలపై ఆదివాసీల్లో వ్యతిరేక జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఏకగ్రీవ తీర్మానాలతో పోరుబాటకు సిద్ధమవుతున్నారు. వలస లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే వరకు మా ఉద్యమం కొనసాగుతూనే ఉంటుందన్నారు.

తమ గ్రామాల్లో లంబాడా టీచర్లపై నిషేధం విధించాలంటూ ఆదివాసీలు డిమాండ్ చేస్తున్నారు. జైనూర్ మండలం మార్లవాయి బాలుర ఆశ్రమ పాఠశాలలో లంబాడా టీచర్లు తమ పిల్లలకు చదువులు చెప్పొద్దంటూ గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఆ తర్వాత నార్మూరు పాఠశాలలకు ఆదివాసీలు తాళాలు వేసి నిరసన తెలిపారు. దీంతో ఏడుగురు టీచర్లు జైనూర్ పోలీసులతో పాటు విద్యా శాఖాధికారులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పరిస్థితిని సమీక్షించి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. జైనూర్‌లో ఆదివాసీ ఇళ్లల్లో అద్దెకు ఉన్న టీచర్లను వెంటనే ఖాళీ చేయాలని పట్టుబట్టారు. 1950కంటే ముందు ఉన్న లంబాడాలపై తమకెలాంటి అభ్యంతరం లేదని, ఆ తర్వాత మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారిపైనే తమ పోరాటమంటున్నారు.

ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంతాల్లో మొదలైన వర్గపోరు .. మహారాష్ట్ర మన్యానికి విస్తరిస్తోంది. 2017 అక్టోబర్‌ 6న జోడెన్‌ఘాట్‌ ఆదివాసి మ్యూజియంలోని లంబాడా స్త్రీ విగ్రహాన్ని ఆదివాసీలు తగులబెట్టడంతో రెండు తెగల మధ్య ఘర్షణ మొదలైంది. దీంతోపాటు 1976లో అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి తెగగా ప్రకటించడం. మహారాష్ట్ర ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి తెగగా గుర్తించకపోవడంతో అక్కడి లంబాడి తెగలు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు వలస వచ్చినట్లు తెలుస్తోంది. డిసెంబర్‌ 9న హైదరాబాద్‌లో భారీ బహిరంగసభ నిర్వహించేందుకు ఆదివాసీలు సన్నద్ధమయ్యారు. అవసరమైతే ఢిల్లీలోనూ ఉద్యమించేందుకు వెనకాడేది లేదంటున్నారు. 

ఓటు వేస్తున్న గుజరాతీలు..

గుజరాత్ : రాష్ట్రంలో మొదటి దశ ఎన్నికల పోలింగ్ కాసేపటి క్రితం ప్రారంభమైంది. సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్‌లోని 89 శాసనసభ నియోజకవర్గాలకు పోలింగ్‌ జరగనుంది. మొత్తం 2.12 కోట్ల మంది ఓటర్లు ఈరోజు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు. 

08:21 - December 9, 2017

ప్రకాశం : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ పర్యటన కొనసాగుతోంది. గత మూడు రోజులుగా ఆయన పలు జిల్లాల్లో పర్యటిస్తూ పలు రంగాలకు చెందిన సమస్యలను తెలుసుకుంటున్నారు. నాలుగో రోజు శనివారం ఒంగోలు జిల్లాలో పవన్ పర్యటించనున్నారు. ఇటీవలే ఫెర్రీ ఘాట్ లో బోటు మునిగిన ఘటనలో మృతి చెందిన కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు. మధ్యాహ్నం ప్రకాశం జిల్లా జనసేన కార్యకర్తలతో ఆయన భేటీ కానున్నారు. ఈ పర్యటనలో పవన్ ఎలాంటి మాటల తూటాలు పేలుస్తారో చూడాలి. 

08:06 - December 9, 2017

ఢిల్లీ : గుజరాత్‌లో తొలి దశ ఎన్నికల సమరం ప్రారంభమైంది. కాసేపటి క్రితం పోలింగ్ ప్రారంభమైంది. గుజరాత్‌లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలుండగా.. తొలిదశలో సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్‌లోని 89 శాసనసభ నియోజకవర్గాలకు పోలింగ్‌ జరగనుంది. మొత్తం 2.12 కోట్ల మంది ఓటర్లు ఈరోజు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

  • తొలి దశ ఎన్నికల్లో బీజేపీ 89 స్థానాల్లో పోటీ చేస్తోంది.
  • కాంగ్రెస్‌ రెండు స్థానాలు మినహా 87 స్థానాల్లో బరిలో ఉంది.
  • బీఎస్పీ 64, ఎన్సీపీ 30 స్థానాల్లో పోటీ పడుతోంది.
  • గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపాని రాజ్‌కోట పశ్చిమ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు.
  • మొత్తం 977 మంది బరిలో ఉన్నారు. వీరిలో 443 మంది అభ్యర్థులు స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు. ఇక పోటీలో 57 మంది మహిళలున్నారు.
  • తొలి దశ ఎన్నికలకు ఈసీ అన్ని ఏర్పాటు పూర్తి చేసింది.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీలు ఈ ఎన్నికలను వ్యక్తిగత ప్రతిష్ఠగా తీసుకొని విస్తృతంగా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. సౌరాష్ట్ర, కచ్‌ ప్రాంతాల్లో అధిక స్థానాలు ఉండడంతో ఇక్కడ ఆధిక్యత సంపాదించడం అన్ని పార్టీలకు కీలకంగా మారింది. మిగిలిన స్థానాలకు డిసెంబర్‌ 14న పోలింగ్‌ జరగనుంది. 

గుజరాత్ లో పోలింగ్ ప్రారంభం...

ఢిల్లీ : గుజరాత్‌లో తొలి దశ ఎన్నికల సమరం ప్రారంభమైంది. కాసేపటి క్రితం పోలింగ్ ప్రారంభమైంది. గుజరాత్‌లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలుండగా.. తొలిదశలో సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్‌లోని 89 శాసనసభ నియోజకవర్గాలకు పోలింగ్‌ జరగనుంది. మొత్తం 2.12 కోట్ల మంది ఓటర్లు ఈరోజు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

07:32 - December 9, 2017

గుజరాత్‌లో తొలి దశ ఎన్నికల సమరానికి సర్వం సిద్ధమైంది.. గుజరాత్‌లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలుండగా.. తొలిదశలో సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్‌లోని 89 శాసనసభ నియోజకవర్గాలకు పోలింగ్‌ జరగనుంది. మొత్తం 2.12 కోట్ల మంది ఓటర్లు ఈరోజు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో పర్యటనలో మాటల తూటాలు పేలుస్తున్నారు. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో బండారి రవి కుమార్ (సీపీఎం), శ్రీధర్ (బీజేపీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

మెట్రో స్టేషన్ ఎదుట టి.వైసీపీ ధర్నా...

హైదరాబాద్ : నేడు ఉదయం 9.45గంటలకు మియాపూర్ మెట్రో స్టేషన్ ఎదుట తెలంగాణ వైసీపీ ధర్నా చేపట్టనుంది. మెట్రో స్టేషన్ లకు వైఎస్ఆర్ పేరు పెట్టాలని...మెట్రో ఛార్జీలు తగ్గించాలని తెలంగాణ వైసీపీ డిమాండ్ చేస్తోంది. 

విశాఖలో ఉప రాష్ట్రపతి పర్యటన...

విశాఖపట్టణం : నేడు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. 

బాపనపల్లిలో జగన్ పాదయాత్ర...

అనంతపురం : వైసీపీ అధ్యక్షుడు జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర కొనసాగుతోంది. శుక్రవారం పాదయాత్రకు బ్రేక్ ఇచ్చిన జగన్ నేడు బాపనపల్లిలో పాదయాత్ర కొనసాగనుంది. 

06:48 - December 9, 2017

గుజరాత్‌ : ఓ ట్రాలీ ఆటో హల్‌చల్‌ చేసింది. బరూచీలో స్టార్‌ చేసి ఉన్న ట్రాలీ ఆటో డ్రైవర్‌ లేకుండానే రోడ్డుపై పరుగులు తీసింది. అతి వేగంగా వెళ్తూ డివైడర్‌ను... పలు వాహనాలను ఢీకొట్టింది. చివరకు ఓ ట్యాంకర్‌ను ఢీకొట్టి ఆగింది. రోడ్డుపై ఇష్టమొచ్చినట్లు ఆటో పరుగులు పెట్టడంతో వాహనదారులు గందరగోళానికి గురయ్యారు. ఈ ఘటనలో పలువురు వాహనదారులకు గాయాలయ్యాయి. ఓ బైక్‌పై వెళ్తున్న వ్యక్తి ఈ దృశ్యాలను తన కెమెరాలో బంధించాడు.

06:46 - December 9, 2017

ఎన్నాళ్లో వేచిన కల నెరవేరబోతుంది. ప్రేమ పేరుతో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన జంట ఒక్కటి కాబోతుంది. విరాట్‌ కోహ్లీ-అనుష్క శర్మల పెళ్లిపై ఎంతో కాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నా.. తాజాగా వారిద్దరి హడావుడి చూస్తుంటే.. కల్యాణ ఘడియలు దగ్గర పడినట్లు కనిపిస్తోంది. ఈనెల 12న ఈ జంట ఒక్కటి పెళ్లి చేసుకోవడంతో... కోహ్లీ, అనుష్కతో పాటు వాళ్ల కుటుంబ సభ్యులంతా ఇటలీలోని మిలాన్‌కు పయనమైనట్లు తెలుస్తోంది. భారత క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, బాలీవుడ్‌ స్టార్‌ అనుష్క శర్మల వివాహ సందడి ప్రారంభమైంది. అయితే.. అధికారికంగా వీరి పెళ్లిపై ఇరు వర్గాల నుంచి ఎలాంటి సమాచారం లేకపోయినా... జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈనెల 12న వీరి వివాహం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రేమ జంట ఇప్పటికే స్విట్జర్జాండ్‌ మీదుగా ఇటలీలోని మిలాన్‌కు చేరుకున్నట్లు సమాచారం. వీరి వివాహం అక్కడి ప్రఖ్యాత వైన్‌యార్డులో జరుగుతున్నట్లు తెలుస్తోంది.

పెళ్లి కోసం అనుష్క తన తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి ముంబై నుంచి స్విస్‌ ఎయిర్‌వేస్‌లో ఇటలీకి ప్రయాణమైంది. మీడియా కంటపడిన అనుష్కను పెళ్లి గురించి ప్రస్తావించకుండా సమాధానం చెప్పకుండానే వెళ్లిపోయింది. ఇక కోహ్లీ మాత్రం ఢిల్లీ నుంచి బయల్దేరాడు. తనను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు ముఖానికి మాస్క్‌ ధరించాడు. కోహ్లీ ఫ్యామిలీ, సన్నిహితులు కూడా మిలాన్‌కు బయల్దేరినట్లు తెలుస్తోంది. ఇక సెలెబ్రిటీ డిజైనర్ సవ్యసాచి ముఖర్జీ అనుష్క వివాహ దుస్తులను డిజైన్‌ చేయగా,.. మేకప్‌ ఆర్టిస్టులు, వెడ్డింగ్‌ ఫొటోగ్రాఫర్లను కూడా మిలాన్‌కు తీసుకెళ్తున్నారు. అనుష్క కుటుంబ పూజారి మహరాజ్‌ అనంత బాబా కూడా వీరితో పాటు... మిలాన్‌ వెళ్లారు. మొత్తానికి ఎన్నో రోజులుగా కోహ్లీ-అనుష్కలు పెళ్లి చేసుకుంటున్నారని ప్రచారం జరుగుతుండగా... తాజాగా వారిద్దరూ ఒకటి కాబోతున్నారు. 

06:44 - December 9, 2017

విశాఖపట్టణం : ఇంతటి అద్భుతమైన ప్రదేశాన్ని చూసిన పర్యాటకుల ఆనందానికి అవధులే ఉండవు. అయితే.. ఇక్కడే స్టే చేసి ప్రకృతి అందాలను మరింత ఆస్వాదించాలనుకున్న పర్యాటకులకు.. ఇక్కడి పరిస్థితులు నిరాశ పరుస్తున్నాయి. ఉండేందుకు సరైన వసతులు లేకపోవడంతో పర్యాటకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి వెదర్‌ను పర్యాటకులు ఎంతగానో ఎంజాయ్‌ చేస్తుంటారు. ఇలాంటి ప్రాంతం మన రాష్ట్రంలో ఉండడం మన అదృష్టం అంటున్నారు పర్యాటకులు. ఇక్కడే పుట్టి పెరిగినా... ఇంతవరకు ఇలాంటి అందాలను ఆస్వాదించకపోవడం బాధాకరంగా ఉందంటున్నారు పలువురు పర్యాటకులు. అయితే.. ఇంత చక్కని ప్రదేశంలో సరైన వసతులు లేవంటున్నారు పర్యాటకులు. ప్రభుత్వం వసతులు కల్పిస్తే లంబసింగి వచ్చే పర్యాటకుల సంఖ్య ఇంకా పెరుగుతుందంటున్నారు. తొలి సారి విచ్చేసి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న పర్యాటకుల అనుభూతి అనిర్వచనీయం. ఇక్కడ సరైన వసతులు లేకపోయినప్పటికీ... పర్యాటకులంతా రాత్రి సమయాల్లో టెంట్లు వేసుకుని ఎంజాయ్‌ చేస్తున్నారు. ముఖ్యంగా వీకెండ్‌ డేస్‌ను ఇక్కడ సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు.

మంచు సోయగాలతో పాటు... వలస పూల సుగంధ పరిమళాలు టూరిస్ట్‌లను అబ్బురపరుస్తున్నాయి. ప్రతి ఒక్కరూ ఈ అందాలను చూసి తీరాల్సిందేనని పర్యాటకలంటున్నారు. ఇప్పుడిప్పుడే ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. టూరిస్ట్‌లకు కోసం ఓ రిసార్ట్‌ను నిర్మించింది. మరికొన్ని రిసార్ట్స్‌లను ప్రైవేట్‌-ప్రభుత్వ భాగస్వామ్యంతో నిర్మిస్తున్నారు. ఇక్కడకు వచ్చే పర్యాటకులు తనివి తీరా ప్రకృతి అందాలను ఆస్వాదించే విధంగా ఏర్పాట్లు చేస్తోంది. అయితే... ఈ పనులు త్వరగా పూర్తి చేస్తే ఆంధ్రా కాశ్మీరం అందాలను ఆస్వాదించే పర్యాటకుల సంఖ్య ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. 

06:42 - December 9, 2017

విశాఖపట్టణం : ఓవైపు మంచు తుంపరులు.. మరోవైపు వలస పూల సోయగాలు. ఆహ్లాదకరమైన వాతావరణం... మనసును ఉత్తేజ పరిచే ప్రకృతి అందాలు. ఇవన్నీ చూడాలంటే ఏ కాశ్మీర్‌కో... స్విట్జర్లాండ్‌కో వెళ్లాల్సిందే. కానీ... మన ఆంధ్రప్రదేశ్‌లోనే అలాంటి ప్రదేశం ఉందంటే నమ్ముతారా ? ప్రతి ఏడాది పర్యాటకులను అబ్బురపరుస్తున్న ఆ సౌందర్య ప్రదేశాన్ని మనం చుట్టొద్దామా...! ఆహ్లాదకరమైన ప్రకృతి.. అబ్బురపరిచే సోయగాలు చూడాలంటే ఒకప్పుడు ఏ కాశ్మీర్‌కో... ఊటీకి వెళ్లాల్సి వచ్చేంది. కానీ... అంతకంటే అందమైన ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌లోనే కనువిందు చేస్తోంది. దీంతో గత కొన్నేళ్లుగా చలికాలం వచ్చిందంటే చాలు... ప్రతి ఒక్కరి మనసు లంబసింగి వైపే మళ్లుతోంది.

విశాఖ జిల్లాలో సముద్ర మట్టానికి 3500 అడుగుల ఎత్తులో ఉంది ఈ లంబసింగి. చింతపల్లి వెళ్లే మార్గంలో నర్సీపట్నం దాటిన తర్వాత 60 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ప్రాంతం. నాలుగేళ్ల క్రితం ఒక్కసారిగా వాతావరణం సున్నా డిగ్రీలకు పడిపోవడంతో.. ఈ ప్రాంతం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ గ్రామం పూర్తిగా గిరిజన ప్రాంతం. కేవలం రెండు వేల మంది మాత్రమే జీవనం సాగిస్తున్న కుగ్రామం. పోడు వ్యవసాయం చేసుకుని బతుకు వెళ్లదీసుకునే వైనం. కానీ... గత కొంత కాలంగా ఈ ప్రాంతానికి పర్యాటకులు పోటెత్తడంతో... గిరిజనులు బతుకుల్లో వెలుగులు నిండుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం కూడా ఈ ప్రాంతాన్ని పర్యాటక రంగంగా తీర్చిదిద్దుతోంది. ..

లంబసింగిలో ఉదయం 10 గంటలైనా మంచు దుప్పటి తొలగిపోదు... మధ్యాహ్నం 3 అయితే చాలు... మళ్లీ చల్లని గాలులు వీస్తుంటాయి. ఇళ్ల నుంచి బయటకు రావాలంటే చలి చంపుతుంటుంది. మరోవైపు దట్టమైన మంచు కురుస్తూనే ఉంటుంది. డిసెంబర్‌, జనవరి నెలల్లో ఇక్కడ ఉష్ణోగ్రతలు మైనస్‌కు చేరుకుంటాయి. అయితే.. ఈ కాలంలో.. ఈ ప్రకృతి అందాలను తిలకించేందుకు అందమైన అనుభూతి పొందేందుకు పర్యాటకులు లంబసింగికి క్యూ కడుతుంటారు. ఈ ప్రాంతానికి ఉన్న మరో పేరు కొర్రబయలు. ఈ కాలంలో ఆరు బయట నిలబడితే చలికి కొయ్యబారాల్సిందే. అందుకే ఈ పేరు వచ్చిందని గ్రామస్తులంటారు. తూర్పు కనుమలలోని దట్టమైన అడవుల మీదుగా చల్లని గాలులు వీస్తూ ఉండడం వల్ల తీవ్రమైన చలి ఉంటుంది.

లంబసింగి అందాలు చూడాలంటే రెండు కళ్లు చాలవంటే అతిశయోక్తి కాదేమో. ఇక్కడ ప్రకృతి రమణీయత ఎంతో అద్భుతంగా ఉంటుంది. తెల్ల చీర కట్టుకున్న పల్లె పడుచు ఎంతో సోయగంగా ఉంటుందో.. తెల్లని మంచు దుప్పటి కప్పుకున్న అడవి అంతే ముచ్చటగా ఉంటుంది. పక్కనున్న మనుషులు కూడా కనపడనంత ఉధృతంగా మంచు కురుస్తుంటుంది. ఈ అనుభూతి ఎంతో అద్భుతంగా ఉందని పర్యాటకులంటున్నారు. మిగతా ప్రాంతాల్లో అంతంత మాత్రమే ఉండే పర్యాటకులు... చలికాలంలో బారులు తీరుతుంటారు. ఈ వెదర్‌ను ఎంతో ఎంజాయ్‌ చేస్తుంటారు. అయితే.. ప్రభుత్వం ఇంకా వసతులు కల్పిస్తే లంబసింగి ఎంతో అభివృద్ధి చెందుతుందంటున్నారు. 

06:39 - December 9, 2017

హైదరాబాద్ : అదనపు కట్నం మరో మహిళ ప్రాణాలు బలిగొన్నది. గ్రీష్మ మృతికి భర్త, అత్తామామలే కారణమంటూ బంధువులు మృతదేహంతో ఆందోళన చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. భర్త ఇంటి ముందే గ్రీష్మ మృతదేహాన్ని ఖననం చేసేందుకు బంధువుల యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. గ్రీష్మ భర్తను కఠినంగా శిక్షించేదాకా ఆందోళన విరమించేది లేదని బంధువులు హెచ్చరించారు. హైదరాబాద్ ఉప్పల్ పీఎస్ పరిధిలోని రామంతాపూర్ గణేశ్‌నగర్‌లో అదనపు కట్నం వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గ్రీష్మ భర్త ఇంటి ముందు బంధువుల ఆందోళన కొనసాగుతూనే ఉంది. గ్రీష్మ భర్త దీపక్‌, అత్తమామలను కఠినంగా శిక్షించే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేస్తున్నారు.

ఈ నెల 6వ.. బుధవారం మధ్యాహ్నం రామంతాపూర్ గణేష్ నగర్‌లో గ్రీష్మ అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. అయితే... దీపక్, అత్తమామలే గ్రీష్మను చంపి ఆత్మహత్యగా చిత్రకరిస్తున్నారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. గ్రీష్మ ఒంటిపై గాయాలు ఉండడమే ఈ అనుమానానికి తావిస్తుందని పలువురంటున్నారు.

ఇదిలావుంటే... గ్రీష్మ మృతదేహంతో ఆందోళన చేస్తున్న బంధువులు ఆమె మృతదేహాన్ని దీపక్‌ ఇంటి ముందు పాతిపెట్టేందుకు యత్నించారు. అయితే... వీరిని పోలీసులు అడ్డుకున్నారు. పలువురు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అత్తింటి వారొచ్చి అంత్యక్రియలు నిర్వహించాలని బంధువులు డిమాండ్‌ చేస్తున్నారు. గ్రీష్మకు న్యాయం చేసే వరకు తమ ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేస్తున్నారు. గ్రీష్మ మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బంధువులు కోరుతున్నారు. 

06:37 - December 9, 2017

విజయవాడ : పవిత్రమైన ఆలయం వివాదాల్లోకి మళ్లుతుంది. ఆయిల్‌ మాఫియా సెగ.. ఆలయాన్ని తాకింది. ఆలయమే కేంద్రంగా.. వివాదం రాజుకుంటోంది. స్థానిక రాజకీయాల్లో కలకలం సృష్టిస్తోంది. స్మార్ట్ సిటీలో బాలత్రిపుర సుందరి ఆలయ వ్యవహారం ఆసక్తిగా మారుతోంది. కాకినాడలో బయటపడిన ఆయిల్‌ మాఫియా మరకలు ఇప్పుడు బాలత్రిపుర సుందరి ఆలయానికి అంటుకున్నాయి. దీంతో ఆందోళనలకు.. ఆలయమే కేంద్రంగా మారింది. ఇటీవల ఆయిల్ మాఫియా ముఠాను అరెస్ట్‌ చేసిన పోలీసులు ఆలయ చైర్మన్‌ గ్రంథి బాబ్జీ తనయుడిపై కూడా కేసు నమోదు చేయడంతో స్థానికంగా వివాదం రాజుకుంది.

గ్రంథి బాబ్జీ తనయుడుపైన కేసు నమోదు చేయడంతో పాటు.. వారికి చెందిన ధ‌న‌ల‌క్ష్మీ ఆయిల్స్ ద్వారానే అక్రమ ఆయిల్‌ని మార్కెట్లోకి తరలిస్తున్నట్టు పోలీసులు నిర్ధారించారు. దాంతో కోట్ల రూపాయల మాఫియాకు గ్రంథి బాబ్జీ అండగా ఉన్నార‌నే ఆరోప‌ణ‌లు గుప్పుమ‌న్నాయి. అలాగే గతంలో అమ్మవారికి సమర్పించిన బంగారు చీర విషయంలోనూ అవకతవకలు జరిగాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు బాల‌త్రిపుర సుంద‌రి ఆలయ చైర్మన్‌గా ఉన్న గ్రంథి బాబ్జీని ఆ పదవి నుంచి తొలగించాలని ప్రత్యర్థులు ఆందోళనకు దిగారు. కాగా ఆయిల్ మాఫియా నేప‌థ్యంలో కొన్ని ఫిర్యాదులు త‌మ దృష్టికి వచ్చాయని పోలీసుల నుంచి పూర్తి స‌మాచారం తీసుకుని ఉన్నతాధికారులకు నివేదిస్తామ‌ని ఈవో చెబుతున్నారు. ఏది ఏమైనా..పాలక వర్గానికి వ్యతిరేకంగా.. నిరసనలు వెల్లువెత్తడంతో.. ఏం జరుగుతుందోననే ఆసక్తి అందరిలో నెలకొంది.

06:32 - December 9, 2017

విజయవాడ : తెలంగాణాలో పార్టీకి పూర్వ వైభ‌వం తెచ్చేందుకు అండ‌గా ఉంటాన‌న్నారు చంద్రబాబు. తెలంగాణ త‌మ్ముళ్లను వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సిద్ధం చేస్తూ.. పార్టీ బ‌లోపేతంపై బాబు దృష్టి సారించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భ‌వ‌న్ లోపార్టీ ముఖ్యనేత‌ల‌తో సుదీర్ఘంగా చ‌ర్చించి పార్టీ నేత‌ల‌కు దిశానిర్దేశం చేశారు. నేత‌లు పార్టీని వీడినా.. ప్రజ‌ల్లో పార్టీకి ఆదర‌ణ త‌గ్గలేద‌న్నారు. రాష్ట్ర ఆవిర్భావం త‌ర్వాత‌.. తెలంగాణాలో తీవ్రంగా న‌ష్ట పోయిన తెలుగుదేశం పార్టీ బ‌లోపేతంపై చంద్రబాబు క‌స‌ర‌త్తు మొద‌లు పెట్టారు. మ‌రో ఏడాదిన్నర వ్యవ‌ధిలో ఎన్నిక‌ల‌ను ఎదుర్కోవాల్సి ఉన్న నేప‌థ్యంలో నేత‌ల‌కు భ‌రోసా ఇచ్చేందుకు బాబు రంగంలోకి దిగారు. పార్టీ సీనియ‌ర్ నేత‌లు, పొలిట్ బ్యూరో స‌భ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులతో విడివిడిగా భేటీ అయి నేత‌ల అభిప్రాయాలు తెలుసుకున్నారు. పార్టీ బ‌లోపేతానికి తీసుకోవాల్సిన అంశాల‌ను చ‌ర్చించారు.

నేత‌ల వ‌ల‌స‌ల‌తో నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న నాయ‌క‌త్వ స‌మ‌స్యను ముందుగా ప‌రిష్కరించుకోవాల‌ని చంద్రబాబు సూచించారు. పార్లమెంటరీ ఇంచార్జ్ లు, అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్‌లను యుద్ధప్రాతిప‌దిక‌న నియ‌మించాల‌ని, పార్టీ క‌మిటీల నియామ‌కాన్ని మ‌హానాడులోపు పూర్తి చేయాల‌ని ఆదేశించారు. పార్టీ బ‌లోపేతానికి ప్రజాస‌మ‌స్యల‌పై దృష్టి సారించి ప్రజ‌ల్లోకి వెళ్లేందుకు ప‌లు కార్యక్రమాల‌ను తీసుకోవాల‌ని బాబు సూచించారు. జ‌న‌వ‌రి 18 వ తేదీనుంచి మార్చి 29 వ తేదీ వ‌ర‌కు ప‌ల్లెప‌ల్లెకు తెలుగుదేశం కార్యక్రమాన్ని చేప‌ట్టాల‌ని ఆదేశించారు. పార్టీని క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లేందుకు 70 రోజుల కార్యాచ‌ర‌ణ‌ను అమ‌లు చేయాల‌ని నేత‌ల‌కు సూచించారు. తెలంగాణాలో అభివృద్ధి తెలుగుదేశం పార్టీద్వారానే జ‌రిగింద‌న్న విష‌యాన్ని ప్రజ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని సూచించారు.

టిఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వ‌చ్చినా కొత్తగా ఎలాంటి అభివృద్ధి జ‌రగ‌లేద‌న్న అభిప్రాయాన్ని బాబు వ్యక్తం చేశారు. ప్రతీ నెల‌లో ఒక రోజు తెలంగాణా నేత‌ల‌తో ప్రత్యేకంగా స‌మావేశాలు ఏర్పాటు చేసుకోవ‌డంతో పాటు.. ప్రతి వారం టెలికాన్ఫ్‌రెన్స్‌ ద్వారా నేత‌లంద‌రికీ అందుబాటులో ఉంటాన‌ని హామీఇచ్చారు. త్వర‌లో నియోజ‌క‌వ‌ర్గాల వారిగా శిక్షణా శిభిరాల‌ను ఏర్పాటు చేయాల‌ని ముఖ్య నేత‌ల స‌మావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ప‌రంగా బ‌హిరంగ స‌భ‌ల‌ను నిర్వహిస్తే హాజ‌రు కావాల‌ని.. అప్పుడే కార్యక‌ర్తల్లో కూడా ధైర్యం వ‌స్తుంద‌ని కొంత మంది నేత‌లు బాబును కోరారు. పొత్తుల గురించి ఎవ‌రు మాట్లాడాల్సిన అవ‌స‌రం లేద‌ని.. పార్టీ బ‌లోపేతం అయితే... పొత్తు కోసం ఇత‌ర పార్టీలే మనల్ని సంప్రదిస్తాయన్నారు చంద్రబాబు. మొత్తానికి బాబు దిశానిర్ధేశంతో మళ్లీ టీడీపీ క్యాడర్‌లో కొంచెం జోష్‌ వచ్చినట్లు కన్పిస్తోంది. మరి వచ్చే ఎన్నికలనాటికి టీ-టీడీపీ నేతలు అధికార టీఆర్‌ఎస్‌, ప్రతిపక్ష కాంగ్రెస్‌కి పోటీని ఎలా ఇస్తారో వేచి చూడాలి.

06:29 - December 9, 2017

విజయవాడ : కులాలకీ, మతాలకీ అతీతంగా రాజకీయాలు ఉండాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. మనిషికి జరిగే అన్యాయాన్ని ప్రశ్నిస్తానన్న ఆయన.. విభజించు పాలించు సిద్ధాంతానికి జనసేన వ్యతిరేకమని చెప్పారు. 3వ రోజు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటించిన పవన్‌ను.. ఫాతిమా కాలేజీ విద్యార్థులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, పెన్షన‌ర్లు కలిసి తమ గోడు చెప్పుకున్నారు. స‌మ‌స్యల ప‌రిష్కారానికి తన వంతు కృషి చేస్తానని వారికి పవన్‌ హామీ ఇచ్చారు. అనంతరం అమ‌రావ‌తిలో నిర్మించబోయే జనసేన పార్టీ కార్యాల‌య ప్రాంతాన్ని పవన్‌ సంద‌ర్శించారు.

మూడో రోజు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ పర్యటన విజ‌య‌వాడ, అమరావతిలో బిజీ బిజీగా కొనసాగింది. విజ‌య‌వాడ‌ ధ‌ర్నాచౌక్‌, ముర‌ళి పార్ఛూన్‌ వద్ద ఆందోళ‌న నిర్వహిస్తున్న ఫాతిమా విద్యార్థులు, విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులు, పెన్షన‌ర్లు, ఏపీ స్పేస్ కాంట్రాక్ట్ ఉద్యోగుల స‌మ‌స్యలను పవన్‌ అడిగి తెలుసుకున్నారు. ముందుగా ఫాతిమా మెడిక‌ల్ కాలేజీ విద్యార్థులతో పవన్‌ భేటీ అయ్యారు. రెండేళ్లుగా అందరి చుట్టూ తిరుగుతున్నా.. తమకు న్యాయం జరగలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల స‌మ‌స్య విన్న పవన్‌ స‌మ‌స్య ప‌రిష్కారానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు.

అనంతరం కాంట్రాక్ట్ విద్యుత్ ఉద్యోగులు పవన్‌ను కలిసి తమ సమస్యలు వివరించారు. 24వేల కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరించే ప‌రిష్కారం చేయాల‌ని కోరారు. గ‌తంలో ఉన్న ముఖ్యమంత్రులను క‌లిసినా ఫ‌లితం లేద‌న్నారు. ఆ త‌ర్వాత కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీంపై తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఉద్యోగులు పవన్‌కి వివరించారు. సీపీఎస్‌ విధానం వల్ల తమకు తక్కువ మొత్తంలో పెన్షన్‌ వస్తుందని పవన్‌కు చెప్పారు. తమ సమస్యపై ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. సీపీఎస్‌ విధానం రద్దుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు.

అనంతరం ఏపీ స్పేస్ అప్లికేష‌న్ సెంట‌ర్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ప‌వ‌న్‌ను క‌లిసారు. ఐఎఫ్‌ఎస్ అధికారి గుప్తా వ‌ల్ల త‌మ‌కు అన్యాయం జ‌రిగింద‌ని ప‌వ‌న్‌కు తెలిపారు. 15 నెల‌లుగా విజ‌య‌వాడ ధ‌ర్నా చౌక్ లో నిర‌స‌న తెలుపుతున్నా ప్రభుత్వం ప‌ట్టించుకోలేద‌న్నారు. స‌మ‌స్య విన్న ప‌వ‌న్ పైస్థాయి అధికారుల‌తో మాట్లాడ‌తాన‌ని హామీ ఇచ్చారు.

స‌మ‌స్యలు తెలుసుకుంటూనే ప్రతిప‌క్ష నేత జ‌గ‌న్ పై ప‌వ‌న్ క‌ల్యాన్ మ‌రోసారి విమ‌ర్శలు గుప్పించారు. ఏపీలో ఇన్ని స‌మ‌స్యలు ఉంటే అసెంబ్లీలో పోరాడాల్సిందిపోయి, టీవీల ముందు మాట్లాడితే ఏమొస్తుంద‌న్నారు. ప్రజ‌ల త‌రుపున పోరాడే అదృష్టం ప్రతిప‌క్షానిద‌న్నారు. కానీ అది ఏపీలో జ‌ర‌గ‌డంలేద‌న్నారు. జ‌గ‌న్ ముఖ్యమంత్రని చెప్పుకోవ‌డం విని విని చిరాకొచ్చింద‌న్నారు. ముర‌ళి ఫార్చూన్‌లో స‌మ‌స్యలు విన్న అనంత‌రం పవన్‌ కల్యాణ్‌ గుంటూరు జిల్లా పెద‌కాకానిలో జనసేన తాత్కాలిక పార్టీ కార్యాలయ స్థలాన్ని పరిశీలించారు. ప‌రిశీల‌న అనంత‌రం మంగ‌ళ‌గిరిలో పార్టీ కార్యక‌ర్తలు, అభిమానుల‌తో స‌మావేశం ఏర్పాటు చేసారు. కమ్యూనిస్టులు ప్రజల కోసం పోరాటం చేస్తారని.. తానూ అదే బాటలో పయనిస్తానని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

అనంతరం విజ‌య‌వాడ‌ స్టెల్లా కాలేజ్ లో పార్టీ కార్యక‌ర్తలు, నాయ‌కుల‌తో పవన్‌ స‌మావేశమయ్యారు. కులాలకీ, మతాలకీ అతీతంగా రాజకీయాలు ఉండాలని పవన్‌ అన్నారు. కుల అనుకూల‌ విధానాల‌కు జ‌న‌సేన వ్యతిరేక‌మ‌న్నారు. సమాజం ముందుకు వెళ్లాలంటే అంబేద్కర్ ఆశయాలు అవ‌స‌ర‌మన్న ప‌వ‌న్... వంగవీటి రంగాని చంపడం తప్పని, ఆయ‌న తప్పు చేసి ఉంటే చట్టాలు ఉన్నాయ‌న్నారు. రంగాను చంప‌డం ద్వారా సంబంధంలేని కుటుంబాలు ఆ సమయంలో ఇబ్బంది పడ్డాయ‌న్నారు. విజయవాడలో ఇంకా కులాల వ్యవస్థ మారలేదన్నారు.

అంత‌కు ముందు తనకు ప‌రిటాల ర‌వి గుండు కొట్టించారనేది ప్రచారం మాత్రమేనని పవన్‌ తెలిపారు. ఆ ప్రచారం చేయించింది టీడీపీ వాళ్లేన‌ని.. అవ‌న్నీ మ‌న‌సులో పెట్టుకోకుండా ప్రజ‌ల కోస‌మే టీడీపీకి స‌పోర్ట్ చేసిన‌ట్లు ప‌వ‌న్ తెలిపారు. అన్ని చేసిన టీడీపీకి ఎందుకు మద్దతు ఇచ్చానంటే కులాల మధ్య ఐక్యత కోసమేనని పవన్‌ తెలిపారు. కులాల మధ్య ఐక్యత సాధిస్తే అమరావతి అద్భుతమైన రాజధాని అవుతుందన్నారు. అభియోగాలు లేకుండా ఉంటే జగన్ కు మద్దతు తెలపడానికి ఎటువంటి అభ్యoతరాలు లేవని పవన్‌ అన్నారు. మొత్తానికి 3వ రోజు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప‌వ‌న్ టూర్‌ స‌క్సెస్‌ ఫుల్‌గా ముగిసింది. ఏపీలో విద్యార్థులు, ఉద్యోగులు, పెన్షన‌ర్ల స‌మ‌స్యల‌ు తెలుసుకున్నప‌వ‌న్‌ ప‌రిష్కారానికి కృషి చేస్తామ‌ని హామీ ఇచ్చారు. 

06:25 - December 9, 2017

ఢిల్లీ : గుజరాత్‌లో తొలి దశ ఎన్నికల సమరానికి సర్వం సిద్ధమైంది.. గుజరాత్‌లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలుండగా.. తొలిదశలో సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్‌లోని 89 శాసనసభ నియోజకవర్గాలకు పోలింగ్‌ జరగనుంది. మొత్తం 2.12 కోట్ల మంది ఓటర్లు ఈరోజు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తొలి దశ ఎన్నికల్లో బీజేపీ 89 స్థానాల్లో పోటీ చేస్తుండగా, కాంగ్రెస్‌ రెండు స్థానాలు మినహా 87 స్థానాల్లో బరిలో ఉంది. ఇక బీఎస్పీ 64, ఎన్సీపీ 30 స్థానాల్లో పోటీ పడుతోంది. గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపాని రాజ్‌కోట పశ్చిమ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. మొత్తం 977 మంది బరిలో ఉండగా... వీరిలో 443 మంది అభ్యర్థులు స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు. ఇక పోటీలో 57 మంది మహిళలున్నారు. తొలి దశ ఎన్నికలకు ఈసీ అన్ని ఏర్పాటు పూర్తి చేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీలు ఈ ఎన్నికలను వ్యక్తిగత ప్రతిష్ఠగా తీసుకొని విస్తృతంగా ప్రచారం చేశారు. సౌరాష్ట్ర, కచ్‌ ప్రాంతాల్లో అధిక స్థానాలు ఉండడంతో ఇక్కడ ఆధిక్యత సంపాదించడం అన్ని పార్టీలకు కీలకంగా మారింది. మిగిలిన స్థానాలకు డిసెంబర్‌ 14న పోలింగ్‌ జరగనుంది.

 

కాళేశ్వరం బ్యారేజీపై రివ్యూ సమావేశం..

హైదరాబాద్ : కాళేశ్వరం బ్యారేజీ పనులు 2018 నాటికి పూర్తి చేయాలని..అప్పుడే రైతులకిచ్చిన మాట నెరవేరుతుందని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ప్రాజెక్టులు సందర్శించిన సీఎం...కాళేశ్వరం బ్యారేజీ పనులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు టన్నెల్‌ పనుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేసిన సీఎం... శనివారం హైదరాబాద్‌లో రివ్యూ సమావేశం ఏర్పాటు చేయనున్నారు. 

ఐద్వా సేవ్ ఇండియా సదస్సు...

ఢిల్లీ : మహిళల హక్కుల సాధన కోసం పోరాటాలను ఉధృతం చేయాలని ఐద్వా నిర్ణయించింది. ఢిల్లీలో ఐద్వా ఆధ్వర్యంలో జరిగిన సేవ్ ఇండియా సదస్సులో పలువురు వక్తలు ప్రసంగించారు. దేశంలో మహిళలపై పెరుగుతున్న హింస, విద్వేశ పూరిత ప్రచారాల వల్ల జరుగుతున్న ప్రమాదకర పరిణామాలు, మహిళల హక్కులు, ఆరోగ్యం, ఆహారం, భద్రత, జీవనోపాధి అంశాలపై ప్రధానంగా చర్చించారు.

కాసేపట్లో గుజరాత్ తొలి దశ ఎన్నికల పోలింగ్...

ఢిల్లీ : గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు గానూ.. 89 స్థానాలకు... శనివారం పోలింగ్‌ జరగనుంది. తొలిదశలో సౌరాష్ట్ర, పశ్చిమ గుజరాత్‌, కచ్‌ ప్రాంతాలున్నాయి. గుజరాత్‌ సీఎం విజయ్‌రూపాని సహా 977 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

బీజేపీ ఎన్నికల మెనిఫెస్టో విడుదల...

గుజరాత్‌ : రాష్ట్రంలో తొలి విడత ఎన్నికల పోలింగ్‌ మరి కొద్ది గంటల్లోనే జరుగనున్న తరుణంలో ఎట్టకేలకు బిజెపి ఎన్నికల మెనిఫెస్టోను విడుదల చేసింది. 'సంకల్ప్‌ పాత్ర' పేరుతో పార్టీ మేనిఫెస్టోను కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అహ్మదాబాద్‌లో విడుదల చేశారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధర, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చింది. 

ఏ శిక్ష విధించినా అంగీకరిస్తా - మణిశంకర్..

ఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ తనకు ఎలాంటి శిక్ష విధించినా అంగీకరిస్తానని ఆ పార్టీ నుంచి సస్పెండ్‌ అయిన నేత మణిశంకర్ అయ్యర్ చెప్పారు. ప్రధాని మోదీని 'నీచ జాతికి చెందిన వ్యక్తి' అంటూ వ్యాఖ్యలు చేసిన మాజీ కేంద్ర మంత్రి మణిశంకర్‌ అయ్యర్‌ను కాంగ్రెస్‌ సస్పెండ్‌ చేసింది. 

కులభూషణ్ తల్లికి..భార్యకు వీసా మంజూరు..

ఢిల్లీ : పాకిస్తాన్‌ జైలులో మగ్గుతున్న కులభూషణ్‌ జాదవ్‌ను కలిసేందుకు పాక్‌ ప్రభుత్వం ఆయన తల్లికి, భార్యకు వీసా మంజూరు చేసింది. డిసెంబర్‌ 25 క్రిస్టమస్‌ రోజున జాదవ్‌ను భార్య, తల్లి కలిసేందుకు తాము అంగీకరిస్తున్నట్లు పాక్‌ విదేశాంగ కార్యాలయం అధికారిక ప్రతినిధి మహ్మద్‌ ఫైజల్‌ చెప్పారు. 

బీజేపీకి ఎంపీ షాక్...

ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీకి మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎంపీ షాకిచ్చారు. గోండియా పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన నానా పటోల్ తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ప్రధాని మోదీ నిర్ణయాల వల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు పంపిన రాజీనామా లేఖలో తెలిపారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. 

గూగుల్ కంటే గురువే గొప్ప - వెంకయ్య...

కడప : ఖమ్మం, కడప జిల్లాలో ఉక్కు కర్మాగారాల ఏర్పాటు అంశంపై మరో 10 రోజుల్లో నివేదిక వస్తుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ప్రొద్దుటూరులో అమృత్ పథకం క్రింద అభివృద్ధి పనులకు వెంకయ్యనాయుడు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత అనిబిసెంట్ పురపాలక ఉన్నత పాఠశాల శతాబ్ది ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కన్నతల్లిని, మాతృభూమిని, చదువుకున్నపాఠశాలను మరువకూడదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. గూగుల్ కంటే గురువే గొప్పవాడన్న విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవలన్నారు.  

లాలూ ఆస్తుల జప్తు..

బీహార్ : ఐఆర్‌సీటీసీ హోటల్ కేటాయింపుల స్కాంకు సంబంధించి ఆర్‌జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఐఆర్‌సీటీసీ హోటల్ కేటాయింపుల కుంభకోణంలో దర్యాప్తులో భాగంగా పట్నాలోని 45 కోట్ల విలువైన మూడు ఎకరాల భూమిని జప్తు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వివరించింది. 

Don't Miss