Activities calendar
10 December 2017
నల్గొండ : తమది అభివృద్ధి దాహమైతే... కాంగ్రెస్‌ది అధికార దాహమన్నారు మంత్రి హరీష్‌రావు. నాగార్జునసాగర్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని సాగర్ ప్రాజెక్ట్ సందర్శించారు. సాగర్ నుంచి ఎడమ కాలువకు నీరు విడుదల చేసిన మంత్రి... చివరి ఆయకట్టుకు నీరు అందించడమే తమ లక్ష్యమన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రపంచ వ్యాప్తంగా గుర్తిస్తుంటే... ప్రతిపక్షాలు కోర్టుకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయన్నారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్టు 63వ వ్యవస్థాపక దినోత్సవం పురష్కరించుకుని మంత్రులు హరీష్‌రావు, జగదీష్‌రెడ్డి ప్రాజెక్ట్‌ను సందర్శించారు. ప్రాజెక్ట్ సమీపంలో నెహ్రూ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. సాగర్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సాగర్ నుంచి ఎడమ కాలువకు నీటిని విడుదల చేశారు.
యాసంగి కోసమే సాగర్ నుంచి ఎడమ కాల్వకు నీటిని విడుదల చేసినట్లు హరీష్‌రావు తెలిపారు. సాగర్ నుంచి 4 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వడమే తమ లక్ష్యమన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి చివరి విడత నీరు విడుదల చేస్తామన్నారు. సాగునీటి పారుదల శాఖ అధికారులు అద్భుతంగా పని చేస్తున్నారని వరల్డ్ బ్యాంక్ మనల్ని అభినందించారని హరీష్‌రావు అన్నారు. అధికారులంతా రైతులకు అందుబాటులో ఉండాలన్నారు.
ఇక మంత్రులు ఉదయసముద్రం ప్రాజెక్ట్ పనులను కూడా పరిశీలించారు. కాంగ్రెస్ వల్లే ప్రాజెక్ట్ ఆలస్యమైందన్నారు. ప్రాజెక్ట్ పనులు త్వరితగతిన పూర్తి చేసి... ఫిబ్రవరి వరకు నీళ్లు అందిస్తామన్నారు హరీష్‌రావు.
తమది అభివృద్ధి దాహమైతే... కాంగ్రెస్ అధికార దాహన్నారు హరీష్‌రావు. కాంగ్రెస్ హయాంలో సాగర్ ఆధునీకీకరణ పనులు 30శాతం మాత్రమే జరిగితే.... మూడేళ్లలో 65 శాతం పనులు పూర్తి చేశామన్నారు. అధికారం కోసమే కాంగ్రెస్ రాజకీయ పునరేకీకరణ అవసరమంటుందని... సిద్దాంతాలు పక్కనపెట్టి విపక్షాలు అధికారం కోసం పాకులాడుతున్నాయన్నారు. కాంగ్రెస్ నాయకులు అడుగడుగునా కోర్టుల కేసులతో ప్రాజెక్టులను అడ్డుకుంటుందన్నారు. ఇక సాగర్ నుంచి ఎడమ కాలువకు నీరు విడుదల చేయడం పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
విశాఖ : నగరంలోని గ్రీన్ పార్క్ హోటల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మిస్ వైజాగ్ పోటీలకు వ్యతిరేకంగా మహిళా సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు. ఫ్యాషన్ షోను అడ్డుకునేందుకు భారీ ఎత్తున మహిళా సంఘాలు హోటల్ వద్దకు తరలివచ్చాయి. దీంతో పోలీసులు మహిళలను అడ్డుకున్నారు. పోలీసులు, మహిళల మధ్య తోపులాట జరిగింది. పోలీసుల జులం నశించాలంటూ మహిళలు నినాదాలు చేశారు. అనంతరం పలువురు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...
టీడీపీ ఎంపీ జేసి దివాకర్ రెడ్డితో టెన్ టివి ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై ఆయన మాట్లాడారు. రాజకీయాల్లో యంగ్ అనేది కరెక్ట్ కాదన్నారు. రాజకీయాల నుంచి రిటైర్ అయితే బాగుంటుందేమని ఆలోచన చేస్తున్నారు. నేను వారసత్వం నుంచి రాజకీయాల్లోకి, పదవుల్లోకి రాలేదు. ముఖ్యమంత్రి కావాలనే ఆవేదనతో జగన్ మాట్లాడుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...
జనం పాటం. ప్రజల గొంతుక 'జనం పాట'. తెలుగు భాషకు ఎంతో ప్రాచీన చర్రిత ఉంది. తెలంగాణ పాటకు సమాజంలోని ప్రతి దశలోనూ ప్రత్యేకస్థానం ఉంది. తెలుగు మహాసభల సందర్భంగా వాడుక తెలుగును కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో గాయకుడు జయరాజ్, గాయకురాలు స్వర్ణ పాల్గొని, మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాట అంటే భయపడతరని, వణికిపోతారని తెలిపారు. జనం పాట అనేక ఉద్యమాలకు పునాది వేసిందన్నారు. పలు పాటలు పాడి వినిపించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...
మిస్ వైజాగ్ అందాల పోటీలకు వ్యతిరేకంగా మహిళలు ఆందోళన
ప్రపంచ హాకీ లీగ్ ఫైనల్స్ లో భారత్ కు కాంస్యం
కూడేరులో ప్రారంభమైన వైసీపీ పార్లమెంటరీ సమావేశం
విశాఖలో మహిళా సంఘాలు ఆందోళన
విశాఖ : మహిళా సంఘాలు ఆందోళన బాట పట్టాయి. ఫ్యాషన్ షోపై మహిళలు ఆందోళన చేపట్టారు. స్త్రీని అంగడి సరుకుగా చూసే ఫ్యాషన్ షో నిలిపివేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫ్యాషన్ షో నిర్వహించకూడదని ఆందోళన నిర్వహించారు. ఫ్యాషన్ షో అడ్డుకుంటామని హెచ్చరికలు చేశారు. మంత్రి గంటా శ్రీనివాస్ నివాసం ఎదుట మహిళా సంఘాలు ధర్నా నిర్వహించాయి. ఫ్యాషన్ షోకు గంటా వెళ్లడం సరికాదని మహిళలు అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....
సీఎం చంద్రబాబు నివాసంలో సీఆర్ డీఏ సమావేశం
ప్రాజెక్టు నిర్మాణంపై శ్వేతపత్రం విడుదల చేయాలి : బివి.రాఘవులు
గుంటూరు జిల్లాలో వ్యక్తి దారుణ హత్య
ఢిల్లీ : ఎన్నాళ్లో వేచిన కల నెరవేరబోతుంది. ప్రేమ పేరుతో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన జంట ఒక్కటి ఈ నెల 12న ఒకటి కాబోతున్నారు. విరాట్ కోహ్లీ-అనుష్క శర్మల పెళ్లిపై ఎంతో కాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నా.. తాజాగా వారిద్దరు ఈ వారంలో ఒకటి కాబోతున్నారు.. కల్యాణ ఘడియలు దగ్గర పడుతుండటంతో.. కోహ్లీ, అనుష్కతో పాటు వాళ్ల కుటుంబ సభ్యులంతా ఇటలీలోని మిలాన్‌కు పయనమయ్యారు.
భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ స్టార్ అనుష్క శర్మల వివాహ సందడి ప్రారంభమైంది. ఈనెల 12న వీరి వివాహం ఇటలీలోని మిలన్లో జరుగనుంది. ఈ ప్రేమ జంట ఇప్పటికే ఇటలీలోని మిలాన్‌కు చేరుకున్నారు. వీరి వివాహం అక్కడి ప్రఖ్యాత వైన్‌యార్డులో జరుగుతున్నట్లు తెలుస్తోంది.
విరాట్, అనుష్కలు వేర్వేరుగా తమ సన్నిహితులను కూడా వెంట పెట్టుకుని మిలన్‌కి చేరుకున్నారు. ఇక సెలెబ్రిటీ డిజైనర్ సవ్యసాచి ముఖర్జీ అనుష్క వివాహ దుస్తులను డిజైన్ చేయగా,.. మేకప్ ఆర్టిస్టులు, వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్లను కూడా మిలాన్‌కు తీసుకెళ్లారు. అనుష్క కుటుంబ పూజారి మహరాజ్ అనంత బాబా కూడా వీరితో పాటు... మిలాన్ వెళ్లారు.
విరాట్..అనుష్క జంట కొంతమందికే ఆహ్వానించినట్లు తెలిసింది. అత్యంత సన్నిహితుల మధ్య జరగనున్న కోహ్లీ, అనుష్కల వివాహానికి అతిథులు ఎవరనేదా నిపై స్పష్టత లేకపోయినా బ్యాటింగ్ దిగ్గజం సచిన్, యువరాజ్ సింగ్‌లకు ఆహ్వానం దక్కినట్టు సమాచారం. మరోవైపు అనుష్క తన తొలి హీరో షారుఖ్‌తో పాటు ఆమిర్, డైరెక్టర్లు ఆదిత్య చోప్రా, మనీశ్ శర్మను కూడా ఆహ్వానించింది.
అనుష్క శర్మ నివాసముండే అపార్ట్మెంట్ వాసులకు కూడా పెళ్లి ఆహ్వానం అందింది. కానీ వీరిలో కొందరికే ఇటలీ వెళ్లే అవకాశముందట. కోహ్లీతో తన కూతురు వివాహం జరుగుతుందని, ముంబైలో జరిగే రిసెప్షన్‌కు అంతా రావాలంటూ అనుష్క తండ్రి స్వయంగా ఆహ్వానించారని అపార్ట్మెంట్ వాసులు సంతోషంతో తెలిపారు.
ఇటలీలోని టస్కనీ ప్రాంతంలోని ఓ ఎస్టేట్‌లో శనివారం నుండి పెళ్లికి ముందు జరిగే ఇతర వేడుకలు జరుగుతున్నాయి. ఎటుచూసినా పచ్చని మైదానాలతో పాటు చక్కటి ల్యాండ్స్కేప్లకు ఈ ప్రాంతం పెట్టిన పేరు. అయితే పెళ్లి మాత్రం మిలాన్‌లోని ఖరీదైన హోటల్లో జరిగే అవకాశముంది. మరోవైపు వీరిద్దరి వివాహం ఈనెల 12న కాదు 15న జరుగుతుందని కొందరు చెబుతున్నారు. మొత్తానికి ఎన్నో రోజులుగా కోహ్లీ-అనుష్కలు పెళ్లి చేసుకుంటున్నారన్న ప్రచారానికి ఈ వారంలో తెరపడనుంది. ఇండియాలో కాకుండా ఇటలీలో వారిద్దరూ ఒకటి కాబోతున్నారు.
హైదరాబాద్ : అక్రమ కట్టడంపై మహిళలు కన్నెర్ర జేశారు. సికింద్రాబాద్ బేగంపేటలోని మాతాజీ నగర్లో రాత్రికి రాత్రి వెలిసిన కట్టడన్ని నేలకూల్చారు. బస్తీలో కులాయి వద్ద ఉన్న ఖాళీ స్థలం తనదంటూ ఓ వ్యక్తి డాక్యుమెంట్ తీసుకువచ్చాడు. దీంతో బస్తీ వాసులు మన్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయగా ఎటువంటి నిర్మాణం చేపట్టవద్దని చెప్పారు. అయితే సెలవు రోజు కావడంతో రాత్రికి రాత్రి నిర్మాణం చేపట్టేశారు. దీంతో బస్తీ వాసులు ,మహిళలు పెద్ద ఎత్తున చేరుకొని..గడ్డపారలతో ఆ నిర్మాణం నేలమట్టం చేశారు. పదిహేనేళ్ళుగా ప్రభుత్వ స్థలంగా ఉన్న భూమి ఒక్క సారిగా ప్రైవేట్ పరం ఎలా అయ్యిందని బస్తీవాసులు ప్రశ్నించారు.
ఢిల్లీ : హస్తినలోని సీపీఎం కేంద్ర కార్యాలయంలో పొలిట్ బ్యూరో సమావేశం ముగిసింది. రెండు రోజుల పాటు జరిగిన సమావేశాల్లో దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు, మతోన్మాద దాడులు, రాజకీయ పరిస్థితులపై చర్చించారు. హైదరాబాద్‌లో సీపీఎం 22వ అఖిల భారత మహాసభలో ప్రవేశపెట్టనున్న రాజకీయ ముసాయిదాపై పొలిట్‌బ్యూరోలో చర్చించారు. పొలిట్‌బ్యూరోలో ఏయే నిర్ణయాలు తీసుకున్నారనే దానిపై బీవీ రాఘవులుతో టెన్ టివి ఫేస్ టూ ఫేస్ నిర్వహించింది. త్రిపుర ఎన్నికలు, కేరళలో ఓఖీ తుఫాను ప్రభావంపై చర్చించినట్లు తెలిపారు. జెరూసలేంపై ట్రంప్ నిర్ణయాన్ని ఖండించారు. ట్రంప్ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని పేర్కొన్నారు.
ఢిల్లీ : పోలవరం ప్రాజెక్టును టీడీపీ, కాంగ్రెస్‌లు ధన యజ్ఞంగా మార్చాయని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. పోలవరం ప్రాజెక్టును కామధేనువులా కాంగ్రెస్, టీడీపీ వాడుకుంటున్నాయని విమర్శించారు. పోలవరంతో ఆటలాడుకుంటున్నారని మండిపడ్డారు. పోలవరంపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో నిర్మాణ ఖర్చు పెరగడమే కాకుండా.. ఆలస్యమవుతుందని తెలిపారు. పోలవరం నిర్మాణంపై వాస్తవాలన్నీ బహిర్గతం చేయాలన్నారు. అఖిలపక్షం ఏర్పాటు చేసి వాస్తవాలు బహిర్గతం చేయాలని చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

హిమాచల్ ప్రదేశ్ : ధర్మశాల వన్డేలో శ్రీలంక ఘన విజయం సాధించింది. భారత్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. లంక 20.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. భారత్ 112 ఆలౌట్ కాగా శ్రీలంక మూడు వికెట్లకు 114 పరుగులు చేసి విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్‌లో 1..0 ఆధిక్యంలో శ్రీలంక నిలిచింది.
ధర్మశాల వన్డేలో భారత్ ఓటమి
కర్నూలు : జిల్లాలోని డోన్‌లో దారుణం జరిగింది. ఓ మద్యం దుకాణం వద్ద చిరు వ్యాపారుల మధ్య ఘర్షణ చెలరేగింది. పరస్పరం దాడులతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ వరదరాజులు అనే వ్యక్తి రక్షణ కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయించాడు. అయితే ఫిర్యాదు నమోదు చేయకుండా ఓ పోలీస్ అధికారి వరదరాజును చితకబాదినట్లు తెలుస్తోంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాధితుడు యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అతడి పరిస్థితి విషమించడంతో కర్నూల్ ఆసుపత్రికి తరలించారు. డోన్ పోలీసులపై చర్యలు తీసుకోవాలని బాధితుడి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
తిరుమలలో పలు హోటళ్లు సీజ్
ఢిల్లీ : దంగల్ నటి జైరా వాసిమ్కు విమానంలో దారుణమైన అనుభవం ఎదురైంది. తాను ఎయిర్ విస్తారా విమానంలో ఢిల్లీ నుంచి ముంబై వెళ్తుండగా.. జైరా వెనుక సీట్లో కూర్చున్న ఓ వ్యక్తి ఆమె సీటుపై కాలు పెట్టాడు. అందుకు జైరా అభ్యంతరం చెప్పడంతో తీసివేశాడు. ఆ తర్వాత తాను నిద్రపోతున్న సమయంలో తన మెడపై ఆ వ్యక్తి కాలితో తన మెడపై తడిమాడని జైరా తెలిపింది. మెడపై, భుజంపై ఆ వ్యక్తి కాలితో తడమడంతో జైరా తీవ్ర మనస్తాపం చెందినట్టూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్చేసిన వీడియోలో తెలిపింది. విస్తారా ఎయిర్‌లైన్ సిబ్బందికి తెలిపినా పట్టించుకోలేదని వాపోయింది. మరోవైపు జైరావాసిమ్ వేధింపుల ఘటనపై కేంద్ర పౌర విమానయానశాఖ సీరియస్ అయ్యింది. విస్తారా ఎయిర్‌లైన్స్ యాజమాన్యాన్ని వివరణ కోరింది. పోలీసులు ముంబైలో వసీమ్ బస చేస్తోన్న హోటల్‌కు వెళ్లి ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు. వసీమ్‌పై సహచర ప్రయాణికుడు అసభ్యంగా ప్రవర్తించడం పట్ల జాతీయ మహిళా కమిషన్ కూడా తీవ్రస్థాయిలో స్పందించింది. జైరా వసీమ్‌ను వేధించిన వ్యక్తిపై విస్తారా సిబ్బంది చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ డిమాండ్ చేసింది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించి విస్తారాకు నోటీసులు ఇస్తున్నట్లు జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ తెలిపారు. విస్తారాపై చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర డీజీపీకి కూడా నోటీసులు ఇచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. జైరా వసీమ్‌కు అన్ని విధాలా అండగా ఉంటామని రేఖా శర్మ స్పష్టం చేశారు.
ఒంగోలు : ఒంటరిగా ఉన్న మహిళలను హతమార్చి, వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలు తస్కరించిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 19 సవర్ల బంగారు ఆభరణాలు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కందుకూరు పట్టణంలో సోమేపల్లి లక్ష్మీదేవి, సింహాద్రిపురంలో ఒంటరిగా నివసిస్తున్న కొల్లా నారాయణమ్మ, కంచర్ల లక్ష్మమ్మల వద్ద నగదు దోచుకొని హత్య చేశానని నిందితుడు అంగిరించిట్లు ఎస్పీ సత్య ఏసుబాబు తెలిపారు. చోరీ సొత్తును రికవరీ చేశామన్నారు. ఈ కేసులను చేదించిన కందుకూరు డీఎస్పీ, సీఐలతో పాటు అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
ప్రకాశం : దర్శి సబ్జైల్లో రిమాండ్ ఖైదీ కుంచాల రమేష్ అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు అధికారులు చెప్తున్నారు. మద్దిపాడు మండలం గుళ్లాలపల్లికి చెందిన కుంచాల రమేష్ విలాసాలకు అలవాటుపడి దొంగగా మారాడు. మరికొంత మందితో కలిసి ఓ ముఠా ఏర్పడి పలు దొంగతనాలకు పాల్పడ్డాడు. అక్టోబర్ 10న రమేష్ ముఠా పోలీసులకు చిక్కింది. దీంతో ముఠా సభ్యులందరినీ పోలీసులు జైలుకు పంపారు. అయితే మిగతా వారంతా బెయిల్‌పై విడుదలయ్యారు. రమేష్‌కు మాత్రం బెయిల్ రాకపోవడంతో తీవ్ర మనస్థాపానికిగురై ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు చెప్తున్నారు.
నల్గొండ : తమది అభివృద్ధి దాహమైతే.. కాంగ్రెస్‌ది అధికార దాహమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. నాగార్జున సాగర్ 63వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సాగర్ ఎడమ కాలువకు మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి నీటిని విడుదల చేశారు. యాసంగి కోసమే సాగర్ నుంచి ఎడమ కాల్వకు నీటిని విడుదల చేసినట్లు మంత్రి స్పష్టం చేశారు. సాగర్ నుంచి 4 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వటమే తమ లక్ష్యమని మంత్రి తెలిపారు. నార్కట్‌పల్లి మండలంలో ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించారు.
విజయనగరం : జిల్లాలో ప్రభుత్వ సమగ్ర ఆర్థిక కార్యాలయ భవన సముదాయానికి మంత్రి గంటా శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. సుమారు పది కోట్ల రూపాయలతో భవనాన్ని నిర్మిస్తున్నామని.. నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని మంత్రి గంటా అన్నారు. ప్రభుత్వ శాఖలకు సంబంధించి ఇప్పటి వరకు సొంత భవనాలు లేకపోవడం శోచనీయమని మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు అన్నారు. త్వరితగతిన భవన నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.
చిత్తూరు : తిరుమలలోని హోటల్స్‌కు టీటీడీ షాకిచ్చింది. అద్దె బకాయిలు, విధించిన జరిమానాలు చెల్లించకపోవడంతో పలు హోటళ్లను టీటీడీ అధికారులు సీజ్ చేశారు. తిరుమలలో మొత్తం 10 హోటళ్లను మూసివేశారు. అయితే... నిన్న నోటీసులు ఇచ్చి ఇవాళ హోటళ్లు మూసివేయడంతో వ్యాపారులు ఆందోళనకు దిగారు. భారీగా పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తుంటే... సమయం ఇవ్వకుండా షాపులు మూసివేస్తే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఆదివారం నాడు హోటళ్లను సీజ్ చేయడంతో... తిరుమలకు విచ్చేసిన భక్తులు కూడా ఇబ్బందులు పడుతున్నారు.
పోలవరంపై త్రిసభ్య కమిటీ భేటీ
హైదరాబాద్ లో మరో డ్రగ్స్ రాకెట్ ముఠా అరెస్టు
క్లీనికల్ ట్రయల్స్ బాధితుడి కుటుంబసభ్యుల న్యాయ పోరాటం
విజయనగరం : జిల్లా కేంద్రంలో వివాహిత ఆత్మహత్మ తీవ్ర విషాదం నింపింది. ఓ అపార్ట్ మెంట్‌పై నుంచి దూకి అమల అనే మహిళ బలవన్మరణం చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. పక్కింటి వారి నుంచి తీసుకున్న అప్పు చెల్లించలేదని.. వారు మందలించడం వల్లే ఆత్మహత్యకు పాల్పడిందని భర్త జగన్నాథం చెబుతున్నాడు.
నాగర్ కర్నూలు : ప్రియుడితో కలిసి భర్తను చంపిన స్వాతి కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. సుధాకర్ రెడ్డి తండ్రి హార్ట్ పేషెంట్ కావడంతో కొడుకు మరణవార్తను ఈరోజు తెలిపారు. దీంతో తల్లి కన్నీరుమున్నీరవుతోంది. మరోవైపు పోలీసులు కిలాడీ లేడి స్వాతిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సుధాకర్ రెడ్డిని చంపిన స్థలం నవాబ్ పేటకు స్వాతిని తీసుకుపోయి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మేడ్చల్ : విద్యార్థులు చార్మినార్ చూడటానికి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్థులకు గాయాలు అయ్యాయి. స్కూల్ బస్సులో విద్యార్థులు సిరిసిల్ల నుంచి హైదరాబాద్ లోని చార్మినార్ చూడటానికి వస్తున్నారు. మార్గంమధ్యలో మేడ్చల్ జిల్లాలోని శామీర్‌పేట మండలం ఆలియాబాద్ వద్ద ముందు వెళ్తోన్న స్కూల్ బస్సును వెనుక నుంచి వచ్చిన టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్థులకు గాయాలు అయ్యాయి. దీంతో వారిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి అతివేగమే కారణంగా తెలుస్తోంది.
రెండో వికెట్ కోల్పోయిన శ్రీలంక
కరీంనగర్ : జిల్లాలోని జమ్మికుంటలో క్లీనికల్ ట్రయల్ బాధితుడు అశోక్ కుటుంబ సభ్యులు న్యాయపోరాటానికి దిగారు. గాంధీ చౌరస్తాలో చిన్నపిల్లలతో సహా బైఠాయించారు. పోలీసులు తమకు అన్యాయం చేస్తూ ఫార్మా కంపెనీలకే వత్తాసు పలుకుతున్నారన్నారు. ఫార్మా కంపెనీ ఫిర్యాదు చేస్తే తన కొడుకు మతిస్థిమితంతో మహిళలను వేధిస్తున్నాడని తప్పుగా రాసి సంతకాలు తీసుకున్నారని అశోక్ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...
తొలి వికెట్ కోల్పయిన శ్రీలంక
హిమాచల్ ప్రదేశ్ : ధర్మశాల వన్డేలో భారత్ 112 పరుగులకే కుప్పకూలింది. శ్రీలంక బౌలర్లు చెలరేగడంతో రోహిత్ సేన.. కేవలం 38.2 ఓవర్లనే ఆలౌట్ అయ్యింది. టాప్ ఆర్డర్ అంతా పేక మేడలా కుప్పకూలింది... 29 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్ట సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధోనీ చివరి వరకు పోరాడాడు. దీంతో భారత్ ఈ మాత్రమైనా స్కోర్ చేయగలిగింది. ధోనీ ఒక్కడే అత్యధికంగా 65 పరుగులు చేశాడు.
పేకమేడలా కూలిన టాప్ ఆర్డర్
తూర్పు గోదావరి : గోదావరి తీరం అంటేనే ప్రకృతి రమణీయతకు, పచ్చదానికి మారు పేరు. అంతేకాదు ఆధ్యాత్మిక చింతనకు నెలువు కూడా. తీరం వెంబడి కొలువైన ఆలయాల్లో నిత్యం భక్తుల సందడి కనిపిస్తుంది. అందులోనూ విశిస్ట ప్రాముఖ్యత కలిగిన మందపల్లి ఆలయం మరింత నిండుగా కనిపిస్తుంది. ఏటేటా పెరుగుతున్న భక్తసందోహంతో మందపల్లి శనేశ్వరాలయం మరింత ఖ్యాతి గడిస్తోంది. దేశ, విదేశాల్లోని వేల మంది భక్తులు తరలివస్తున్న మందపల్లి ఆలయ ప్రస్థానంపై ప్రత్యేక కథనం..
భిన్నమైన శనేశ్వరాలయం
కోనసీమలో అనేక ప్రముఖ ఆలయాలు ఉన్నాయి. వీటిలో మందపల్లిలో కొలువైన శనేశ్వరాలయం వాటిలో భిన్నమైనది. ఇక్కడ శనిదేవుడే ఈశ్వరుడిని ప్రతిష్టించారని భక్తులు నమ్ముతారు. అందుకు తగ్గట్టుగానే మందేశ్వర ఆలయాన్ని శనేశ్వరుడిగా కొలుస్తారు భక్తులు. కొత్తపేట మండలంలోని మందపల్లిలో ఉన్న శనేశ్వరాలయం విజయవాడకు 140, కాకినాడకు 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాజమండ్రికి 38 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీంతో మందపల్లి ఆలయానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. వారికి రైలుమార్గం అయితే రాజమండ్రి, రోడ్డుమార్గం అయితే రావులపాలెం సౌకర్యవంతంగా ఉంటుంది. శనేశ్వరాలయంలో శనివారం రోజున భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. శని త్రయోదశి నాడైతే భక్తులు పోటెత్తుతారు. ప్రతీనెలా మాసశివరాత్రికి కూడా భక్త సందోహం కనిపిస్తుంది. శనిత్రయోదశి నాడైతే ఏకంగా లక్ష మందికిపైగా భక్తులు దర్శనం కోసం క్యూ కడతారు.
శివలింగానికి నువ్వుల నూనెతో అభిషేకం
శనేశ్వరాలయంలో శనిచే ప్రతిష్టించబడిన శివలింగానికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి.. నువ్వులు, బెల్లం కలిపి తిలపిష్ట నివేదిన చేస్తే ఎంతో మేలు జరుగుతుందని భక్తుల విశ్వాసం. అందుకే తైలాభిషేకం నిర్వహిస్తుంటారు. దూర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా ఆన్లైన్ ద్వారా ఆలయ సేవలు పొందుతున్నారు. శనేశ్వరాలయానికి భక్తుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండడంతో వారికి తగ్గట్టుగా ఆలయ పాలకవర్గం ఏర్పాట్లు చేస్తోంది. భక్తులు బస చేయడానికి కాటేజీలు నిర్మించారు. అభిషేకాలు నిర్వహించుకోవడానికి అభిషేక మండపాలు నిర్మించారు. క్యూలైన్లో ఉన్న భక్తులకు మెరుగైన సేవలు అందించే ఏర్పాట్లు చేసినట్టు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బండారు సత్యనారాయణమూర్తి తెలిపారు.
విరాళాలతో మరింత అభివృద్ధి కార్యక్రమాలు
భక్తులు ఆలయానికి ఇచ్చే విరాళాలతో మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. స్వామివారి సన్నిధికి స్వయంగా రాలేనివారు ఎంవో, డీడీల ద్వారా తైలాభిషేకం జరిపించుకునే అవకాశం కల్పించారు. పేరు, గోత్రం, పూర్తి చిరునామా రాసి మనీఆర్డర్గానీ, పోస్టాఫీస్ ద్వారా గానీ పంపిస్తే వారి పేరుతో తైలాభిషేకం నిర్వహిస్తున్నారు. వారికి పోస్టు ద్వారానే కుంకుమ, ప్రసాదాలు అందజేసేలా ఏర్పాట్లు చేశారు. స్వయంగా ఆలయానికి రాలేనివారు, విరాళాలు పంపాలనుకునే వారు అకౌంట్ నంబర్ 55900100001045, బ్యాంక్ ఆఫ్ బరోడా, కొత్తపేట బ్రాంచ్‌కు పంపవచ్చు. ఏటేటా భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో... దర్శనం, తీర్థ ప్రసాదాలు తీసుకునే సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా... ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ అధికారులు తెలిపారు.
ప్రధానంగా మందపల్లి శనేశ్వరాలయం
కోనసీమ కొంగుబంగారంగా చెప్పుకునే పలు ఆలయాల పరంపరలో మందపల్లి శనేశ్వరాలయం ప్రధానంగా మారుతోంది. పెరుగుతున్న భక్తుల తాకిడితో నిత్యం కళకళలాడుతోంది. భక్తుల సంఖ్యకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్న అధికారులు మరిన్ని అబివ్రుద్ధి కార్యక్రమాకలు శ్రీకారం చుడుతున్నారు. దేశదేశాల్లో ఉన్న భక్తులందరికీ సేవలు అందించే రీతిలో కొత్త కార్యక్రమాలు చేపడుతున్నారు. మొత్తంగా శనేశ్వరాలయం మరింత ఖ్యాతినార్జించే దిశలో, భక్తులకు చేరువయ్యేలా ప్రయత్నాలు సాగుతున్నాయి.
గుంటూరు : జిల్లాలోని తాడేపల్లి మండలం కొలనుకొండ వద్ద ఉదయం జరిగిన పేలుడు ఘటనలో ఐదేళ్ల బాలుడు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పెయింటర్‌గా పనిచేసి జీవనం సాగించే నాగరాజు తన నివాసం వద్ద పాత పెయింట్ డబ్బాను కోస్తుండగా పేలుడు సంభవించింది. దీంతో నాగరాజు, అతని భార్య భవాణి, తల్లి నాగమణి తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ఘటనలో ముగ్గురికి కాళ్లు, చేతులు చిధ్రమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
విజయవాడ : భవానీ దీక్షల విరమణతో ఇంద్రకీలాద్రిపై సందడి నెలకొంది. దీక్షా విరమణల సందర్భంగా తొలిరోజు అమ్మవారి దర్శనం కోసం భవానీలు వేలాదిగా తరలివస్తున్నారు. కాలినడకన అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మాల విరమణ గావిస్తూ తమ వెంటతెచ్చుకున్న నేతి కొబ్బరికాయలను హోమగుండంలో వేసి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇంద్రకీలాద్రిపై భవానీల రద్దీపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం....
కృష్ణా : బెజవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షా విరమణలు అత్యంత వైభోవోపేతంగా ప్రారంభమయ్యాయి. దుర్గగుడి ఈవో సూర్యకుమారి హోమ గుండం వద్ద పూజా కార్యక్రమాలను నిర్వహించి దీక్షా విరమణలను ప్రారంభించారు. తొలి రోజు అమ్మవారి దర్శనం కోసం భవానీలు వేలాదిగా తరలివచ్చారు.
అనంతపురం : ఏపీలో అధికారపార్టీ నేతలు దోపిడి దొంగల మాదిరిగా దోచుకుంటున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చివరికి ఉపాధి హామీ పథకాన్నీ వదల్లేదన్నారు. పేదలు చేసిన కూలీకి డబ్బులు చెల్లించని సర్కార్... టీడీపీ నేతలు జేసీబీలతో చేసే పనులకు మాత్రం చెల్లింపులు చేస్తోందని దుయ్యబట్టారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం గోళ్ల గ్రామంలో ఇందిరమ్మ రాజ్యం - ఇంటింటా సౌభాగ్యం కార్యక్రమం ప్రారంభించారు. వీధివీధినా తిరుగుతూ ప్రజలను అడిగి వారి సమస్యలు తెలుసుకున్నారు.
గుంటూరులో పేలుడు..బాలుడు మృతి..
పోలవరానికి నితిన్ గడ్కరి...
గంటా ఇంటి ముందు మహిళా సంఘాల ధర్నా...
29 రన్లు...7 వికెట్లు..
ఆర్మూర్ లో డిప్యూటి సీఎం పర్యటన...
బైక్ ను ఢీకొన్న లారీ...
తిరుమలలో హోటళ్లపై కఠిన చర్యలు..
ఘోరంగా విఫలమవుతున్న భారత్ బ్యాట్స్ మెన్స్...
నెల్లూరులో ఆప్ నేతల పర్యటనలు..
'దంగల్' నటికి వేధింపులు..
భరత్ రెడ్డిని అరెస్టు చేయాలి...

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ రాష్ట్ర పర్యటన ముగిసింది. విజయవాడ, ఒంగోలులో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మాటల తూటాలు పేల్చారు. ప్రజాప్రతినిధులపై పలు విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా టెన్ టివిలో జరిగిన ప్రత్యేక చర్చలో మల్లాది విష్ణు (వైసీపీ), గఫూర్ (సీపీఎం), రామకృష్ణ ప్రసాద్ (టిడిపి) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం వీడియో క్లిక్ చేయండి.

ధర్మశాల : సొంతగడ్డపై భారత్ మరో వన్డే సిరీస్‌కు సన్నద్ధమైంది.శ్రీలంకతో 3 మ్యాచ్‌ల సిరీస్‌లోని తొలి వన్డేకు ధర్మశాలలో రంగం సిద్ధమైంది. రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత్‌కు తిసెరా పెరీరా సారధ్యంలోని శ్రీలంక జట్టు సవాల్ విసురుతోంది. తొలి వన్డేలోనే నెగ్గి సిరీస్‌ను విజయంతో ఆరంభించాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. ఇన్స్టంట్ వన్డే ఫార్మాట్లలో తిరుగులేని ఇండియానే వన్డే సిరీస్‌లో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగబోతోంది. రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత్‌కు తిసెరా పెరీరా సారధ్యంలోని శ్రీలంక జట్టు సవాల్ విసురుతోంది. ఇన్స్టంట్ వన్డే ఫార్మాట్లలో తిరుగులేని ఇండియా సొంతగడ్డపై మరో సిరీస్ సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగబోతోంది.
వన్డే సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్,అజింక్య రహానే, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, మనీష్ పాండే, కేదార్ జాదవ్, దినేష్ కార్తీక్, ధోనీ, హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చహాల్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్ , సిద్దార్ధ్ కౌల్ ఉన్నారు.విరాట్ కొహ్లీ స్థానంలో వైస్‌కెప్టెన్ రోహిత్ శర్మ తొలి సారిగా వన్డేల్లో భారత్‌కు నాయకత్వం వహించనున్నాడు. మరోవైపు తిసెరా పెరీరా సారధ్యంలోని శ్రీలంక జట్టుపై పెద్దగా అంచనాల్లేవు.ఉపుల్ తరంగా,ఏంజెలో మాథ్యూస్,కుషాల్ పెరీరా,దిక్వెల్లా, సురంగా లక్మల్ వంటి సీనియర్ల మీదనే లంక భారం వేసింది.
ఇక వన్డే ఫేస్ టు ఫేస్ రికార్డ్‌లోనూ శ్రీలంకపై ఇండియాదే పై చేయిగా ఉంది.ఇప్పటివరకూ ఇరు జట్లు 155 వన్డేల్లో పోటీ పడగా భారత్ 88 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా...శ్రీలంక 55 మ్యాచ్‌ల్లో నెగ్గింది.3 నెలల క్రితమే జరిగిన శ్రీలంకతో 5 మ్యాచ్‌ల సిరీస్‌ను భారత జట్టు క్లీన్ స్వీప్ చేసింది. విరాట్ కొహ్లీ లేకుండానే బరిలోకి దిగబోతున్నా....టీమిండియాకే వన్డే సిరీస్‌లో విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు.మరి తొలి వన్డేలో టీమిండియా ఎప్పటిలానే ఆధిపత్యం ప్రదర్శిస్తుందో ....లేక శ్రీలంక జట్టు సంచలనం సృష్టిస్తుందో తెలియాలంటే మరికొద్దిగంటలు వెయిట్ చేయాల్సిందే.
లంతో టీమిండియా వన్డే...

శ్రీకాకుళం : ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ 15 రాష్ట్ర విద్యా, వైజ్ఞానిక మహాసభలు శ్రీకాకుళంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. సమాజ నిర్మాతలు ఉపాధ్యాయులేననీ.. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి ఉపాధ్యాయులకే సాధ్యమన్నారు కేరళ ఎంపి రాజేష్. 13 జిల్లాల నుంచి ప్రతినిధులు పాల్గొన్న ఈ మహాసభలు మరో రెండు రోజులు కొనసాగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే స్వయం పోషక స్వతంత్ర పాఠశాలల ముసాయిదా చట్టంపై విధాన పత్రాన్ని ప్రవేశపెట్టి వివిధ రాజకీయ పక్షాల అభిప్రాయాలను క్రోడీకరించేందుకు ఈ మహాసభలను వేదికగా చేసుకుంది. అందుకోసం అన్ని పార్టీల నేతలను ఈ సభలకు ఆహ్వానించింది. 13 జిల్లాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు.
తొలిరోజు కార్యక్రమానికి కేరళ ఎంపీ రాజేష్, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, యు.టి.ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీలు నాగేశ్వరరావు, శ్రీనివాసరెడ్డి, బాలసుబ్రమణ్యం, మాజీ ఎమ్మెల్సీ కే.నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. సీపీఎస్ విధానానికి వ్యతిరేకంగా ఎల్డీఎఫ్ కట్టుబడి ఉందన్నారు కేరళ ఎంపీ రాజేశ్. కేరళలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత భోజనం, వసతులు, కల్పించడం వల్ల విద్యార్ధుల హాజరు శాతం పెరిగిందన్నారు. మెరుగైన విద్య అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారన్నారు.
ఈసారి బడ్జెట్లో విద్యారంగానికి 21వేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు ఎంపి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యలపై పార్లమెంట్ సమావేశాల్లో చర్చిస్తానన్నారు. ఇక ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొన్న ఈ మహాసభలో పలు తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. తొలుత యు.టి.ఎఫ్ పతాకాన్ని ఆవిష్కరించి మహాసభలను ప్రారంభించారు. అనంతరం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
మహబూబ్ నగర్ : ఆపరేషన్ ఆకర్ష్‌తో అనేకమంది ఎమ్మెల్యేలను చేర్చుకున్న గులాబీ పార్టీ... ఇంకా బలంగా ఉన్న ప్రత్యర్థుల నియోజకవర్గాలపై దృష్టి సారించింది. ఇప్పటి నుంచే పార్టీని బలోపేతం చేసి... వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు వ్యూహాలు రచిస్తోంది. ప్రధానంగా కొన్ని నియోజకవర్గాల బాధ్యతలను ఒకరిద్దరు మంత్రులతో పాటు.. ఎమ్మెల్యేలకు అప్పగించింది. దీంతో మంత్రులు నిత్యం అదే నియోజకవర్గాల్లో పర్యటించడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
టీఆర్ఎస్ మరోసారి అధికార పగ్గాలు చేజిక్కించునేందుకు అనేక వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా ప్రతిపక్ష నేతలు బలంగా ఉన్న నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఉత్తర తెలంగాణలో పార్టీకి ఎలాంటి ఇబ్బంది లేదనే ధీమాతో నేతలు ఉన్నా.... ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పార్టీ బలోపేతంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. గతంలో మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానం నుంచి ఎన్నికైనా.. అక్కడ గులాబీ పార్టీ అనుకున్న స్థాయిలో బలపడకపోవడంతో వచ్చే ఎన్నికలే టార్గెట్‌గా గులాబీ బాస్ స్కెచ్‌లు వేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కంటే... ప్రధానంగా కొడంగల్ నియోజకవర్గానికి అధిక ప్రాధాన్యతిస్తున్నట్లు తెలుస్తోంది.
కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో... ఉప ఎన్నిక వచ్చే అవకాశముందన్న ప్రచారం జరుగుతోంది. ఉప ఎన్నిక అయినా... సాధారణ ఎన్నికలు వచ్చినా అక్కడ పార్టీ బలోపేతంపై గులాబీ నేతలు దృష్టి సారించారు. బలమైన ప్రత్యర్థి లేకపోవడమే రేవంత్‌కు కలిసి వస్తుందన్న అభిప్రాయం టీఆర్ఎస్ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. దీంతో వచ్చే ఎన్నికల నాటికి పార్టీ కేడర్‌ను గాడిన పెట్టి... బలమైన అభ్యర్థిని రంగంలోకి దించాలని గులాబీ దళపతి యోచిస్తున్నారు. అందులో భాగంగానే మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆ నియోజకవర్గ బాధ్యతలను అప్పగించారు. మహబూబ్‌నగర్, వికారాబాద్ జిల్లాలకు చెందిన మంత్రులు లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు, మహేందర్‌రెడ్డిలతో పాటు.. మరో మండలానికి ఇద్దరు ఎమ్మెల్యేలను ఇన్‌చార్జ్‌లుగా నియమించారు.
ఇక బాధ్యతలు తీసుకున్న అమాత్యులు తరచూ కొడంగల్ నియోజకవర్గంలో పర్యటిస్తూ.. పార్టీ బలోపేతానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే ప్రభుత్వ పరంగా పెండింగ్ ఉన్న పనులన్నింటిని పూర్తి చేసి.. అభివృద్ధి మంత్రంతో రేవంత్‌కు చెక్ పెట్టాలని అధికార పార్టీ పావులు కదుపుతోంది. మరోవైపు పర్యటనలలో రేవంత్‌పై ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక రేవంత్ కూడా అధికార పార్టీ... ముఖ్యంగా కేసీఆర్‌పై విరుచుకుపడుతున్నారు. దీంతో ప్రతి నిత్యం అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. దీంతో కొడంగల్ నియోజకవర్గంలో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ ఇప్పటి నుంచే మొదలైంది.
విజయవాడ : రియల్‌టైమ్ గవర్నెన్స్, ప్రణాళిక శాఖ, సీఎం కార్యాలయ అధికారులు ఉమ్మడిగా వివిధ శాఖల వృద్ధిరేటుపై వ్యూహాన్ని ఖరారు చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించారు. మరింత వృద్ధిరేటుకు ఆస్కారం ఉన్న శాఖలపై దృష్టిసారించాలని సూచించారు. వృద్ధిరేటు ఆశాజనకంగా లేని రంగాలు, ఆశాజనకంగా ఉన్న రంగాలను సమగ్రంగా విశ్లేషించాలన్నారు. వృద్ధిరేటు పెంపు కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఈనెల 12న హెచ్‌వోడీలతో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. రెండంకెల వృద్ధిరేటు దిశగా జరుగుతున్న అభివృద్ధి సత్ఫలితాలిస్తోందని చంద్రబాబు అన్నారు. ఆదాయం పెరిగే అవకాశం ఉన్న పర్యాటక, పరిశ్రమల రంగాలపై ప్రత్యేక దృష్టిసారించాలని ఆదేశించారు. వివిధ శాఖల వృద్ధిరేటుపై శాఖాధిపతులతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
గుంటూరు : జనసేన అధినేత పవన్ పంచ్ డైలాగులతో కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేసిన ఆయన..జవాబుదారీతనం అంటే ఏమిటో ముందు బీజేపీ తెలుసుకోవాలన్నారు. లంచాలు తీసుకోలేదు కాబట్టే తాను కేంద్రాన్ని నిలదీస్తున్నానన్నారు. తప్పులు చేసినప్పుడు ఎదుటివారిని ప్రశ్నించలేమన్నారు. టీడీపీ, వైసీపీలు హామీలను మర్చిపోయినా..జనసేన మాత్రం మర్చిపోదన్నారు. ప్రత్యేక హోదా అంశంపై బీజేపీ, టీడీపీలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు. ఆరునూరైనా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనన్నారు. బీజేపీ, టీడీపీ, వైసీపీలు ప్రత్యేకహోదాను చిన్న విషయంగా భావించాయని... జవాబుదారీతనం లేకపోవడమే ఇందుకు కారణమన్నారు. హోదా కోసం అన్ని పార్టీలు కలసి పని చేయాలని జనసేనాని సూచించారు. నైతిక బలం నిష్పత్తి తక్కువ ఉన్నప్పుడు మాత్రమే అధికార, ప్రతిపక్ష పార్టీలు కేంద్రాన్ని నిలదీసి అడగలేవన్నారు.
అంతకుముందు ఫెర్రీఘాట్ పడవ ప్రమాదంలో మృతిచెందిన ప్రకాశం జిల్లా వాసుల కుటుంబాలను పవన్ కల్యాణ్ పరామర్శించారు. వారికి జనసేన అండగా ఉంటుందని తెలిపారు. టీడీపీ - బీజేపీలకు సపోర్ట్ చేసినందుకు తాను బాధపడుతున్నానని జనసేన అధ్యక్షుడు పవన్ అన్నారు. ఒంగోలులో పడవ ప్రమాద బాధితులను పలకరించిన ఆయన.. పడవ ప్రమాదంలో మృతుల ఆత్మలకు శాంతికలగాలని కోరుకుంటున్నట్టు పవన్ అన్నారు. టీడీపీకి సపోర్టు చేసి అధికారంలోకి రావడానికి కారణం అయిన తాను.. ప్రభుత్వ తప్పిదానికి నైతిక బాధ్యతగా మృతుల కుటుంబాలకు సభా ముఖంగా సారీ చెప్పారు. ఏపీ పర్యాటక మంత్రి భూమా అఖిలప్రియకు పవన్ కొన్ని సూచనలు చేశారు. అఖిలప్రియ భేషజాలకు పోరాదని... పడవ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబసభ్యులను కలిసి పరామర్శించాలని అన్నారు.
ఆ తర్వాత ఒంగోలు జనసేన కార్యకర్తలతో పవన్ కల్యాణ్ సమావేశం నిర్వహించారు. ప్రపంచాన్ని మార్చింది ఎప్పుడూ ఒక్కడేనని జనసేన కార్యకర్తలు చాలా శక్తిమంతంగా రూపొందాలన్నారు. భావితరాల భవిష్యత్తు కోసం జనసేన పార్టీ పెట్టి రాజకీయ కూలీగా మారానన్నారు. ప్రత్యేక హోదా ఉద్యమం సామ, దాన, భేద పద్ధతుల తర్వాతనే దండోపాయంగా తన పోరాటం ఉంటుందని, రాజకీయాల్లో ఎకౌంటబిలిటీ లేకపోతే రాను రాను ప్రజా ఉద్యమాలు పెరుగుతాయని చెప్పారు. హోదా సాధించేవరకు జనసైన్యం లక్ష్యంతో అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. కులమత రాజకీయాలు దేశాన్ని ముందుకు నడపలేవన్నారు. అధార్ లింక్ అంశంపైనా కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఆధార్ అంటూ అదరగొడుతుందని.. కేంద్రంలోని పెద్దలు ఎంతమంది ఆ పని చేశారో చేయడానికి సిద్దంగా ఉన్నారో చెప్పాలన్నారు. మలినమైన మనసుతో కుళ్లు రాజకీయాలు చేస్తుంటే స్వచ్ఛ బారత్ ఎలా సాధ్యమని ప్రశ్నించారు పవన్. తెలంగాణలో కుల రాజకీయాలు లేకపోవడం వల్లే ఉద్యమ స్ఫూర్తితో అందరూ స్వరాష్ట్రాన్ని సాధించుకున్నారని చెప్పారు పవన్. ఏపీలో కూడా జనసేన కార్యకర్తలు ప్రత్యేక హోదా సాధించేవరకు విశ్రమించొద్దన్నారు.
హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్ని శరవేగంగా పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులపై రెండు రోజులపాటు క్షేత్రస్థాయి పర్యటన అనంతరం కేసీఆర్ ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు తక్కువ వ్యవధిలో అనుమతులు సాధించడానికి కృషి చేసిన మంత్రి హరీష్‌రావుతో పాటు అధికారులను ఈ సందర్భంగా కేసీఆర్ అభినందించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. మంత్రులు హరీష్‌రావు, ఈటెల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ ఎస్పీ సింగ్, మిషన్ భగీరధ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, నీటి పారుదల శాఖ అధికారులు, ట్రాన్స్‌కో డైరెక్టర్లు, కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన బ్యారేజీలు, కాలువలు, టన్నెళ్లు, పంప్ హౌజ్‌లు, సబ్ స్టేషన్ల పనులను ఒక్కొక్కటిగా కేసీఆర్ సమీక్షించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు భూసేకరణ, నిధుల సమీకరణ, అటవీ అనుమతులు తదితర అంశాల్లో ఎలాంటి అవాంతరాలు లేనందున ప్రాజెక్టు పనులు శరవేగంగా పూర్తి చేయాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు చివరి దశ పర్యావరణ అనుమతి త్వరలోనే వస్తుందని.. అప్పటికి డిజైన్లు, ఇతర నిర్మాణాల ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని కేసీఆర్ అధికారులకు సూచించారు. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కోర్టులో సమర్పించిన అఫడవిట్‌కు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. బడ్జెట్లో రూ.25 వేల కోట్లు కేటాయించామని, మరో రూ. 20 వేల కోట్లు బ్యాంకుల ద్వారా సమకూర్చినట్టు కేసీఆర్ తెలిపారు.
పంపు హౌజ్‌లలో మోటార్లను పరిశీలించేందుకు 26 మంది ఇంజనీర్లతో కూడిన ప్యానెల్‌ను సీఎం కేసీఆర్ నియమించారు. రైతుల సమన్వయంతో విద్యుత్ లైన్లు వేయాలని.. దీనికి సంబంధించి ప్రజా ప్రతినిధులు, అధికారులు, రైతులతో కరీంనగర్లో సమావేశం నిర్వహించాలని మంత్రి ఈటెల రాజేందర్‌ను కేసీఆర్ కోరారు. వరద కాలువలోకి కాళేశ్వరం నుంచి నీరు వచ్చిన తరువాత ఉండే పరిస్థితిని అంచనా వేసి డిజైన్లు రూపొందించే బాధ్యతను ఇఎస్పీ మురళీధర్‌కు సీఎం అప్పగించారు.
మిడ్ మానేరు డ్యామ్ నిర్మాణంపైనా కేసీఆర్ చర్చించారు. డ్యామ్ నిర్మాణం పూర్తైందని.. రివిట్మెంట్ చేస్తున్నామని.. 25 గేట్లకు గానూ.. 10 గేట్లు బిగించామని.. అధికారులు సీఎంకు తెలిపారు. జనవరి నెలాఖరుకల్లా మిడ్ మానేరుకు సంబంధించిన పనులన్నీ వంద శాతం పూర్తి కావాలని సీఎం అధికారులకు ఆదేశించారు. మిడ్‌మానేరు నుంచి మల్కపేట రిజర్వాయర్ వరకు వెళ్లే టన్నెల్ నిర్మాణ పనులను, రిజర్వాయర్ పనులను కేసీఆర్ సమీక్షించారు. ఆగస్టు నాటికి టన్నెల్ నిర్మాణం పూర్తి చేస్తామని.. సెప్టెంబర్ నాటికి రిజర్వాయర్ పూర్తి చేస్తామని అధికారులు చెప్పారు. సమావేశంలో మంత్రి హరీష్ రావుతో పాటు అధికారులపై కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. గోదావరిపై నిర్మించే ప్రాజెక్టుల విషయంలో మహారాష్ట్రతో ఒప్పందాలు కుదర్చడంలో హరీష్ ఎంతో కృషి చేశారని సీఎం కేసీఆర్ కితాబిచ్చారు.
కత్తి మహేష్ పై కేసు నమోదు ?
హైదరాబాద్ : తొలిసారి గాంధీభవన్‌కు వచ్చిన రేవంత్‌రెడ్డి.. కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. విద్యార్థుల బలిదానాలు, సోనియా త్యాగఫలంతో రాష్ట్రం సాధించుకుంటే... నేడు కొంతమంది చేతుల్లో రాష్ట్రం బందీగా మారిందన్నారు. రాష్ట్రం వచ్చినా.. యువత బలిదానాలు ఆగడం లేదన్నారు. టీఆర్ఎస్, కేసీఆర్‌పై ధర్మయుద్దానికి అందరూ సిద్దంగా ఉండాలని రేవంత్ పిలుపునిచ్చారు. సోనియాగాంధీ పుట్టినరోజు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పురష్కరించుకుని గాంధీభవన్‌లో కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌రెడ్డి.. తొలిసారి గాంధీభవన్‌కు భారీ ఎత్తున ర్యాలీగా వచ్చారు.
తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకునేందుకు కాంగ్రెస్‌లో చేరానన్నారు రేవంత్‌రెడ్డి. విద్యార్థుల బలిదానాలు, సోనియాగాంధీ త్యాగఫలంతో తెలంగాణ వస్తే... నేడు రాష్ట్రమంతా నలుగురు చేతుల్లో బందీగా మారిందన్నారు రేవంత్‌రెడ్డి. తెలంగాణ అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమని.. అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు. ప్రభుత్వం, కేసీఆర్‌పై అందరూ ధర్మయుద్దానికి సిద్దంగా ఉండాలని రేవంత్ పిలుపునిచ్చారు. తొలిసారి గాంధీభవన్‌లో మాట్లాడిన రేవంత్‌రెడ్డి... కేసీఆర్, కేటీఆర్‌పై విరుచుకుపడ్డారు. కేసీఆర్, కేటీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌కు పిల్లనిచ్చిన మామ తప్పుడు ధృవీకరణ పత్రంతో ఉద్యోగం చేశాడని... ఇప్పుడు రిటైర్ అయ్యాక పెన్షన్ కూడా తీసుకుంటున్నాడన్నారు. కేసీఆర్‌కు చిత్తశుద్ది ఉంటే వెంటనే ఆయనను అరెస్ట్ చేయాలని రేవంత్ డిమాండ్ చేశాడు. కేసీఆర్‌కు కౌంట్‌డౌన్ మొదలైందని... రోజులు లెక్కపెట్టుకోవాల్సిందేనన్నాడు రేవంత్. భారతదేశ చరిత్రలో కీలకమైన చట్టాలు తీసుకువచ్చిన ఘనత సోనియా గాంధీకే దక్కుతుందన్నారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.
2019లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సోనియా గాంధీకి బహుమతిగా ఇవ్వాలని ఉత్తమ్ పిలుపునిచ్చారు. ఇక.. ఏ లక్ష్యంతో అయితే సోనియా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారో ఆ లక్ష్యాల కోసం పని చేద్దామన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క మొత్తానికి ఇన్ని రోజులు మౌనంగా ఉన్న రేవంత్‌రెడ్డి... మళ్లీ కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. అయితే... ఈసారి గాంధీభవన్ వేదికగా మాట్లాడడంతో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది.
హైదరాబాద్ : భర్త కంటే ప్రియుడే ఎక్కువయ్యాడు ఆమెకు... మూడు ముళ్లు వేసి.... ఏడడుగులు నడిచిన భర్త కన్నా... ప్రేమికుడే లోకమయ్యాడు. ఇందుకు అడ్డు ఉన్న భర్తను కడతేర్చింది. అంతటితో ఆగకుండా... ప్రియుడినే భర్త స్థానంలోకి తీసుకువచ్చింది. అతనే తన భర్త అని అందిరిని నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ... అబద్దం బయటపడడంతో... కి'లేడి' వ్యవహారమంతా బట్టబయలైంది. వివాహేతర సంబంధాలు ఎంతకైనా తెగిస్తాయి. కడుపున పుట్టిన బిడ్డలైనా... కట్టుకున్నవారైనా అడ్డు తొలగించుకునేందుకు వెనుకాడరు. ఇలాంటి ఘటనలు నిత్యం ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉంటాయి. కానీ అంతకంటే ఘోరంగా... సినిమాను తలపించేలా ఒక ఘటన నాగర్‌కర్నూలు జిల్లాలో జరిగింది.
హౌసింగ్ బోర్డు కాలనీలో స్వాతి-సుధాకర్‌రెడ్డి దంపతులు కొంతకాలంగా నివాసం ఉంటున్నారు. అయితే స్వాతికి రాజేష్ అనే వ్యక్తితో ప్రేమాయణం మొదలైంది. ఇంకేముంది అడ్డువున్న భర్తను తొలగించుకునేందుకు ప్రియుడితో కలిసి భార్య పన్నాగం పన్నింది. ఒకరోజు రాజేష్, స్వాతి కలిసి సుధాకర్‌రెడ్డిని హతమార్చారు. అనంతరం నవాబ్‌పేట వద్ద కాల్చి బూడిద చేశారు. అనంతరం స్వాతి-రాజేశ్ కలిసి ఓ మాస్టర్ ప్లాన్ వేశారు. భర్త స్థానంలో రాజేశ్‌ను తీసుకురావాలని.. పథకం పన్నారు. ఇందుకోసం ఎవరూ గుర్తు పట్టకుండా ఉండడం కోసం.. రాజేశ్ తన ముఖంపై యాసిడ్ పోసుకున్నాడు. ఇక స్వాతి తన నటనను ప్రదర్శించింది. కొంతమంది దుండగులు వచ్చి తన భర్తపై యాసిడ్ పోశారని అందరిని నమ్మించింది. హుటాహుటిన రాజేశ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించింది. చివరకు అత్తామామలను కూడా నమ్మించింది. రాజేశ్ ట్రీట్మెంట్కు అయిన ఖర్చును కూడా వారితోనే పెట్టించింది.
అంతా సవ్యంగానే జరుగుతుందని స్వాతి-రాజేశ్‌లు భావిస్తున్న సమయంలో అసలు కథ బయటపడింది. ఆస్పత్రిలో కోలుకుంటున్న రాజేశ్‌ను చూసి కుటుంబసభ్యులకు అనుమానం వచ్చింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది తమ కుమారుడు కాడని తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. దీంతో వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో స్వాతి బాగోతం బయటపడింది. అయితే.. ఆమె ఇప్పటికీ కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది తన భర్తేనని బుకాయిస్తోంది. అయితే... రాజేశ్ కోలుకున్న తర్వాత ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించాలని కూడా స్వాతి ప్లాన్ వేసిందట. కానీ... చివరి నిమిషంలో వ్యవహారమంతా బయటపడడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు నిజాలు వెలికితీసే పనిలో పడ్డారు. ఒక మహిళ... తన వివాహేతర సంబంధాన్ని కొనసాగించడం కోసం కట్టుకున్న భర్తను.. కడతేర్చడంతో పాటు... భర్త స్థానంలోకి ప్రియుడినే తీసుకురావాలనుకున్న స్వాతి ఆలోచనను విన్న స్థానికులంతా అవాక్కవుతున్నారు.
అమెరికా : అగ్రరాజ్యంలో మరోసారి కాల్పుల కలకలం నెలకొంది. చికాగోపార్కింగ్ ప్రాంతంలో కొంతమంది దుండగులు .. హైదరాబాద్‌కు చెందిన అక్బర్‌పై కాల్పులు జరిపారు. తీవ్రగాయాలైన అక్బర్‌ను ఆస్పత్రికి తరలించారు. అక్బర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అక్బర్ ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లాడు. అక్బర్ కుటుంబ సభ్యులు మల్లాపూర్‌లో ఉంటున్నారు. కాల్పుల సంఘటన తెలుసుకుని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. అమెరికా వెళ్లేందుకు తమకు వీసా ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.