Activities calendar

11 December 2017

ఒక్కటైన విరాట్, అనుష్క

ఇటలీ : భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ భామ అనుష్క శర్మ పెళ్లితో ఒకటైయ్యారు. వీరి పెళ్లి ఇటలీలోని టస్కలీలో అత్యంత సన్నిహితుల మధ్య జరిగింది. వీరి పెళ్లి విషయాన్ని వారు ట్విట్టర్ ద్వారా తెలిపారు. 

22:01 - December 11, 2017

పవన్ కల్యాణ్ సంచలనం మీడియాకు తప్ప ఎవరికి కాదని, యూట్యూబ్ లో పెడితే లక్షల మంది చూస్తారని, రాజకీయాలు ఇన్ స్టాల్ మెంట్ పద్దతిలో రాజకీయాలు చేస్తే లాభం ఏం ఉండదని ప్రముఖ ప్రొ. నాగేశ్వర్ అన్నారు. పవన్ కల్యాణ్ పార్టీ పై మరింత విశ్లేషనకు వీడియో క్లిక్ చేయండి. 

21:53 - December 11, 2017

ఇటలీ : అవును టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పెళ్లి బాలీవుడ్ నటి అనుష్కతో పెళ్లి జరిగినట్టు అనుష్క ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. విరాట్, అనుష్కల ఈ రోజే జరిగినట్టు తెలుస్తోంది. వీరి పెళ్లి అత్యంత సన్నిహితుల మధ్య ఈరోజు అనగా సోమవారం ఇటలీ దేశంలోని టస్కలీలో జరిగింది. ప్రపంచలో అత్యంత ఖరీదైన హాలిగే స్పాట్ లో విరాట్, అనుష్కల పెళ్లి జరిగింది. ఈ పెళ్లికి బీసీసీఐ పెద్దలు, సచిన్, యువరాజ్, అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్ అను ఆహ్వానించారు.

21:52 - December 11, 2017

న్యూయార్క్ : అమెరికా మరోసారి బాంబు పేలుడు ఘటనతో ఉలిక్కిపడింది. న్యూయార్క్‌లోని మాన్‌ హటన్ వద్ద... టైమ్ స్క్వేర్ సమీపంలో పేలుడు జరిగింది. పోర్ట్ అథారిటీ బస్ టెర్మినల్ 42వ స్టాండ్ వద్ద పేలిన బాంబు దాటికి ఒకరికి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి భారీగా చేరుకున్న పోలీస్, ఫైర్ బృందాలు.. సహాయక చర్యలు చేపట్టాయి. తక్కువ సామర్థ్యమున్న పైప్ బాంబ్ పేల్చినట్టుగా నిపుణులు అనుమానిస్తున్నారు. 

21:50 - December 11, 2017

ఇస్లామాబాద్ : గుజరాత్‌ ఎన్నికల్లో పాకిస్తాన్‌ జోక్యం చేసుకుంటోందంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఆరోపణలపై పాక్‌ స్పందించింది. భారత ఎన్నికల చర్చలోకి పాకిస్తాన్‌ను లాగడం మానుకోవాలని పేర్కొంది. కల్పితమైన కుట్ర ఆరోపణలకు బదులు సొంత బలంతో ఎన్నికలను గెలిచే ప్రయత్నం చేయాలని మోదీకి సూచించింది. ఈ కుట్ర కథనాలు ఆధారరహితం, బాధ్యతా రాహిత్యమని పాక్‌ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి డాక్టర్‌ మహమ్మద్‌ ఫైజల్‌ ట్వీట్‌ చేశారు. ప్రధానిని నీచుడుగా పేర్కొన్నందుకు మణిశంకర్‌ అయ్యర్‌ను కాంగ్రెస్ బహిష్కరించింది. తనను అడ్డు తొలగించేందుకు పాక్‌కు చెందిన మాజీ అధికారులతో అయ్యర్‌ తన ఇంట్లో రహస్యంగా సమావేశమయ్యారని మోది ఆరోపించారు. ఈ సమావేశంలో.. పాక్‌ హై కమిషనర్, పాక్ మాజీ విదేశాంగ మంత్రి, భారత మాజీ రాష్ట్రపతి, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ పాల్గొన్నట్లు వార్తలొచ్చాయి. మోది ఆరోపణలను కాంగ్రెస్‌ ఖండించింది.

21:49 - December 11, 2017

ఢిల్లీ : గుజరాత్ ఎన్నికల్లో ఓటమి భయంతోనే ప్రధాని మోదీ కాంగ్రెస్‌పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ ధ్వజమెత్తారు. పాకిస్థాన్ నేతలతో కాంగ్రెస్ సీనియర్ నేతలు భేటీ అయ్యారని మోదీ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. పాకిస్థాన్ మాజీ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఓ వివాహ వేడుకకు హాజరయ్యారని ఆనంద్ శర్మ పేర్కొన్నారు. ఆ వేడుకకు చాలా మంది ప్రముఖులు కూడా హాజరయ్యారని తెలిపారు.. ఇంత మాత్రాన.. గుజరాత్ ఎన్నికల్లో పాక్ జోక్యం చేసుకుంటోందని అనడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని ఆనంద్ శర్మ డిమాండ్ చేశారు. ఉన్నట్టుండి ప్రధాని మోది పాకిస్తాన్‌ పర్యటనకు వెళ్లి నవాజ్‌ షరీఫ్‌ ఇంట్లో జరిగిన పెళ్లి వేడుకలో పాల్గొనడం ద్వారా భారత్‌ను అవమానపరిచారని ఆరోపించారు...2015లో బ్యాంకాక్‌లో ఇరు దేశాల భద్రతా సలహాదారుల మధ్య జరిగిన చర్చల వివరాలను ఇంతవరకు వెల్లడించలేదని ఆనంద్‌ శర్మ అన్నారు.

21:48 - December 11, 2017

ఢిల్లీ : గుజరాత్ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు పాకిస్థాన్ అధికారులతో చర్చించినట్లు ప్రధాని మోదీ చేసిన ఆరోపణలను ఖండిస్తూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఓ లేఖను విడుదల చేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం ప్రధాని మోదీ అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. అయ్యర్ ఇంట్లో జరిగిన విందు కార్యక్రమంలో గుజరాత్ ఎన్నికల గురించి ఎవరితోనూ మాట్లాడలేదని మాజీ ప్రధాని స్పష్టం చేశారు. ప్రధాని చేసిన ఆరోపణలు తనను ఎంతగానో బాధించాయని... ఈ విషయంలో మోది దేశ ప్రజలకు క్షమాపణ చెబుతారని ఆశిస్తున్నట్లు మన్మోహన్‌ పేర్కొన్నారు. గుజరాత్‌లో ఓటమి భయంతోనే ప్రధాని మోది నోటికి వచ్చినట్లుగా ఆరోపణలు చేస్తున్నారని మన్మోహన్ లేఖలో పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఆహ్వానం లేకుండానే పాకిస్థాన్‌కు వెళ్లారని ఆరోపించారు.

21:47 - December 11, 2017

నిజామాబాద్ : ఎట్టకేలకు బీజేపీ నేత భరత్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం అభంగపట్నంలో దళిత యువకులపై దాడి చేసి ఆపై కిడ్నాప్ చేసిన సంఘటనలో నెలరోజులుగా భరత్ రెడ్డి తప్పించుకు తిరుగుతున్నాడు. నాటకీయంగా పోలీసులు అతన్ని అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. అయితే భరత్ రెడ్డి రాజకీయ నేతల అండతో లొంగిపోయాడని అంటుండగా.. పోలీసులు మాత్రం అరెస్టు చేసామని చెప్పారు. నవంబర్ 11న సంఘటన జరిగినా పోలీసులు పట్టించుకోవటం లేదని దళిత సంఘాలు, ఓయూ జేఏసీ నాయకులు ఆందోళనలు చేపట్టారు. చివరికి పోలీసులు భరత్‌రెడ్డిని అరెస్ట్‌ చేసి మీడియాకు చూపారు. 

21:46 - December 11, 2017

కడప : విభజన హామీ చట్టంలో ఇచ్చిన విధంగా కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసే వరకు ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని ఉక్కు పరిశ్రమ సాధన సమితి హెచ్చరించింది. స్టీల్‌ ప్లాంటు ఏర్పాటు చేయాలని కోరుతూ ఈ నెల 13న సీపీఎం ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. ఇంటిగ్రేటెడ్‌ స్టీలు ప్లాంటు ఏర్పాటుతోనే సామాజిక న్యాయం జరుగుతుందని, చిన్నా చితకా పరిశ్రమ అంటే ఒప్పుకునేది లేదన్నారు. 13న కడపలో జరిగే సభకు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ముఖ్య అతిధిగా వస్తున్నారని ఉక్కు పరిశ్రమ సాధన సమితి సభ్యులు తెలిపారు.

21:45 - December 11, 2017

హైదరాబాద్ : మానసిక వేధింపులు, ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటే ఎన్ని సమస్యలనైనా తట్టుకోవచ్చు. అయిన వారు దూరమైతే ఆ బాధను వర్ణించలేం. ఒంటరైపోయామన్న ఆలోచన ఏమైనా చేయడానికి పురిగొల్పుతుంది. అతి ఆత్మహత్యైనా కావొచ్చు.. మరేదైనా కావొచ్చు. ఇప్పుడు కమెడియన్‌ విజయ్‌సాయి విషయంలోనూ అదే జరిగింది. తాను ఎదుర్కొన్న వేధింపులు, మానసిక సంఘర్షణ అతడిని కుంగదీశాయి. ఆత్మహత్యకు పురిగొల్పాయి. దీంతో యూసుఫ్‌గూడలోని తన ప్లాట్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆర్థిక ఇబ్బందులతో
విజయ్‌ ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడని అంతా భావించారు. అయితే అతడు చనిపోవడానికి కారణం అదికాదని తెలిసింది. సూసైడ్‌కు ముందు అతడు తీసుకున్న సెల్ఫీ వీడియోతో ఆత్మహత్య కొత్తమలుపు తిరిగింది. తన ఆత్మహత్యకు తన భార్య వనిత, వరలక్ష్మీ, విన్నీ బృందంతోపాటు పారిశ్రామికవేత్త శశిధర్‌, న్యాయవాది శ్రీనివాస్‌ కారణమని ఆ వీడియోలో ఆరోపించాడు. శశిధర్‌ ప్రోద్బలంతోనే వనిత తనను వేధిస్తున్నట్టు తెలిపాడు. తన భార్య చివరికి తన కూతురిని కూడా చూడనివ్వడం లేదన్నాడు. తన కారు, సామాన్లు తీసుకెళ్లడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్టు తెలిపాడు. లాయర్‌ శ్రీనివాస్‌ తనను మూడు కోట్లు డిమాండ్‌ చేసినట్టు వీడియోలో వివరించాడు. విజయ్‌ మృతదేహాన్ని మార్చురీలో చూసి అతడి భార్య వనిత బోరున విలపించారు. విజయ్‌ చావుకు తాను ఏమాత్రం కారణం కాదని తెలిపారు. విజయ్‌కు మరో అమ్మాయితో సంబంధం ఉందని.. ఆ విషయాన్ని తాను కళ్లారా చూశానన్నారు. అప్పటి నుంచే తమ మధ్య గొడవలు మొదలయ్యాయని... రెండేళ్ల నుంచే తాము విడివిడిగా ఉంటున్నామన్నారు. విడాకుల కోసం కోర్టును ఆశ్రయించానని.. కేసు కోర్టులో నడుస్తోందన్నారు. మూడు కోట్లు డిమాండ్‌ చేశామన్న ఆరోపణలో వాస్తవం లేదన్న ఆమె.. శశిధర్‌ ఎవరో తనకు తెలియదన్నారు.

భార్యాభర్తల మధ్య మనస్పర్థలు
భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడడంతోనే విజయ్‌ ఆత్మహత్య చేసుకున్నట్టు డీసీపీ వెంకటేశ్వర్‌రావు తెలిపారు. సూసైడ్‌ వీడియోలో ఆత్మహత్యకు కారణాలు చెప్పాడని... అందులో అన్ని అంశాలపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.మరోవైపు విజయ్‌ మృతికి మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ నేతలు నివాళులు అర్పించారు. నటుడు శివాజీరాజా, సురేష్‌... విజయ్‌ మృతిపై విచారం వ్యక్తం చేశారు. విజయ్‌ ఆత్మహత్య బాధాకరమని శివాజీరాజా అన్నారు. నటులకు ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని.. ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు.విజయ్‌ హాస్యనటుడిగా ఎన్నో సినిమాల్లో అలరించారు. టాలీవుడ్‌లో కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడిప్పుడే సినీ ఫీల్డ్‌లో ఎదుగుతున్న విజయ్‌ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. కుటుంబ సభ్యులతోపాటు సినీరంగంలో విజయ్‌ ఆత్మహత్య విషాదాన్ని నింపింది.

21:44 - December 11, 2017

ఆహ్మాదబాద్ : గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్‌ గాంధీ బనాస్‌కాంఠా సభలో ప్రధాని మోదిని టార్గెట్‌ చేశారు. సినిమా ఫ్లాప్‌ అయినట్లే బిజెపి అభివృద్ధి కూడా ఫ్లాప్‌ అయిందని ధ్వజమెత్తారు. రైతులకు రుణమాఫి, గిట్టుబాటు ధర కల్పిస్తామన్న హామీలను నెరవేర్చలేదని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే కేవలం 10 రోజుల్లోనే రైతులకు రుణమాఫీ చేస్తామని రాహుల్‌ హామీ ఇచ్చారు. విదేశాల నుంచి నల్లధనాన్ని వెనక్కి రప్పించి ఒక్కొక్కొరి ఖాతాలో 15 లక్షలు వేస్తామన్న హామీ ఏమైందని నిలదీశారు. 

20:28 - December 11, 2017

సవాళ్లు కావలసినన్ని ఉన్నాయి.. కళ్లముందే గుజరాత్ ఎన్నికలు.. ఇంకాస్త ముందుకెళితే పలు రాష్ట్రాల ఎన్నికలతో పాటు, 2019 సార్వత్రిక ఎన్నికలు సిద్ధంగానే ఉన్నాయి. వీటితో పాటు..నిన్న మొన్నటి పార్టీ వైఫల్యాలు వెంటాడుతూ ఉంటే, పార్టీ కేడర్ ఎక్స్ పెక్టేషన్స్ మాత్రం భారీగా ఉన్నాయి. తరుణంలో పార్టీ పగ్గాలు చేపట్టాడు రాహుల్ గాంధీ.. మరి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని పరుగులు తీయిస్తారా...ఎంట్రీ ఇచ్చినప్పుడున్న అమాయకత్వం ఇప్పుడు లేకపోవచ్చు.. రాజకీయ క్షేత్రంలో క్రమంగా రాటుదేలుతున్న తీరు కనిపిస్తూ ఉండొచ్చు..ఇది కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకురాగలదా? గత వైఫల్యాలను అధిగమించి బీజెపీని దాటగలదా? ఇదే ఇప్పుడు రాహుల్ ముందున్న ప్రశ్న..వారసత్వ రాజకీయాలు మనదగ్గర సాధారణంగా మారిపోయాయి. కాంగ్రెస్ పార్టీలో గాంధీ కుటుంబం నుంచి నాయకత్వం లేకపోతే మిగతా నాయకులకు ఊపిరాడని పరిస్థితి. జాతీయ పార్టీగా అత్యున్నత స్థితితో పాటు, అత్యంత హీనమైన స్థితిని కూడా చూస్తున్న కాంగ్రెస్ శ్రేణుల్ని రాహుల్ ఏ మేరకు సమర్ధంగా నడిపించగలరనే అంశం ఇప్పుడు ఆసక్తికరంగా కనిపిస్తున్న అంశం..

నిజానికి రాహుల్ గాంధీ అనధికారికంగా ఎప్పుడో పగ్గాలు తీసుకున్నట్టే.. కానీ, ఇప్పుడుఅఫీషియల్ గా పార్టీ అధ్యక్షుడయ్యాడని చెప్పుకోవాలి.. ఈ తరుణంలో రాహుల్ ముందు సవాళ్లు సమీపంలో ఉన్నాయి. అగ్నిపరీక్ష లాంటి ఎన్నికలు కళ్లముందే ఉన్నాయి. ఇక పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది.. ఈ తరుణంలో రాష్ట్రాల ఎన్నికలతో పాటు... 2019 రాహుల్ ముందున్న సవాల్.. గతంలో ఉపాధ్యక్షుడిగా రాహుల్ ఎంట్రీ ఇచ్చినంత గొప్పగా ఆ తర్వాత రిజల్ట్ కనిపించలేదనే చెప్పాలి. అంటే, ప్రజానీకంలో పాతుకుపోవటానికి కొన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ పెద్దగా ఫలితం కనిపించలేదు. లోక్ సభ ఎన్నికల ఫలితాలు, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వరుసగా దెబ్బకొడుతూనే ఉన్నాయి. ఇవన్నీ, రాహుల్ సామర్ధ్యాన్ని స్పష్టం చేస్తున్నాయా? ఇప్పుడు పూర్తి స్థాయి బాధ్యతలు తీసుకున్న తర్వాత మార్పు వచ్చే అవకాశముందా?

జాతీయ పార్టీగా ఒకనాటి ప్రభ మళ్లీ రావాలంటే అంత తేలికేం కాదు. దాని కోసం శ్రమించాల్సి ఉంటుంది. జిమ్మిక్కులు, తాత్కాలిక మెరుపులు, వ్యంగాస్త్రాల ఉపన్యాసాలతో ప్రయోజనం తాత్కాలికమే. విధానాల మార్పు, ప్రజలకోసం ఉద్యమాలు చేయగలగటం పార్టీలకు, ఆ మార్గంలో త్యాగాలకు సిద్ధమౌతూ ప్రజా బాహుళ్యానికి చేరువ కావటమే రాజకీయ నాయకులకూ సరైన పరిష్కారం అవుతుంది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

20:26 - December 11, 2017

మంద క్రిష్ణ మాదిగ.. లక్షలాది మంది ఉద్యమకారులకు దశ దిశా నిర్దేశం జేశి గుండె ధైర్యం నింపిన వ్యక్తి ఆయన.. అందరికి గుండె ధైర్యం జెప్పె మంద క్రిష్ణ మాదిగ.. కన్నీళ్లు వెట్టిండు.. రెండున్నరేండ్ల కింద తెలంగాణ ప్రభుత్వం జేశిన కుట్రను బైటవెట్టి కనీళ్లు గాల్చిండు.. మంద క్రిష్ణ మాదిగను సంపెతందుకు సర్కారు ఏశిన కుట్రను మొట్టమొదటి సారిగ చెప్పిండు..

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కొంప కొల్లేరు గావోతున్నదా..? కేసీఆర్ మనుషులు గాంధీ భవన్ల జొర్రిండ్రా..? 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిని శాశించబోతున్న అదే కాంగ్రెస్ పార్టీ నేత ఎవ్వలో తెల్సిందా..? ఇప్పటికే మీకు ఆలోచన వచ్చుంటది.. అవును కేవీపీ రామచంద్రా రావు.. టీఆర్ఎస్ పార్టీని మళ్లొక సారి తెలంగాణల గెలిపిచ్చేతందుకు సాయశక్తుల కృషి జేస్తున్న నేత.. కావాల్నంటే గావాయి జూడుండ్రి..

మంత్రి కల్వకుంట్ల అజయ్ గారి మామ ఎంటవడ్డడుగదా..? రేవంత్ రెడ్డిగారు.. దొంగ సర్టిఫికేట్ వెట్టి సర్కారు నౌకరి సంపాయించిన కేటీఆర్ మామను ఎందుకు అరెస్టు జేస్తలేరు.. మీరు చర్యలు దీస్కుంటరా..? లేకపోతె నేను కోర్టుకు వోవాల్నా అంటున్నడు.. కేసీఆర్ ఇయ్యంపుడే ఇంత మోసం జేస్తె కేసీఆర్ ఎందుకు వట్టిచ్చుకుంటలేడనవట్టే..

ఆ తెలంగాణల సుర్వైనట్టే ఉందిగదా..? లడాయి.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఊర్లపొంటి గెదుముతున్నరు జనం.. మొన్న ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునితను సుడివెట్టిండ్రా.. ఇగో ఇప్పుడు ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి చుచ్చువోపిచ్చిండ్రు.. ఏం జేయాల్నో అర్థంగాక పరేషాన్ అయిపోయిండు జీవన్ రెడ్డి.. పాపం.. కని తెలంగాణల టీఆర్ఎస్ఎమ్మెల్యేల మీద యుద్దం సుర్వు జేశినట్టే ఉన్నరు జనం..

తెలంగాణల కాంగ్రెస్ పార్టోళ్లంట.. తెలంగాణ రాష్ట్రం కోసం అడ్డువడ్డోళ్లతోని సోపతి జేస్తున్నరట.. వాళ్ల సోపతి అధికారం కోసమే అంటున్నడు నీళ్ల మంత్రి హరీష్ రావుగారూ.. ఎట్లున్నదంటే ఈ ముచ్చట.. శిగ్గులేదా జీడిగింజా అంటే.. నల్లగున్న నాకేం శిగ్గు అన్నదట.. సరే కాంగ్రెసోళ్లు సుద్దపూసలు గాకపోవొచ్చుగని.. హరీష్ రావు గారు ఈ ముచ్చట జెప్తుంటే మరి దేనితోని నవ్వాల్నో తెలుస్తలేదు తెలంగాణ ఉద్యమకారులకు..

తెలంగాణ ప్రభుత్వానికి గింత పట్టింపులేదేమయ్యా.. ప్రైవేటు బడులళ్ల పాఠాలు జెప్పె సార్ల మీద..పాపం వాళ్లకు కడ్పులేదా..? ముఖ్యమంత్రిగారు పనిజేశినా చేయకపోయినా..? సచివాలయానికి వచ్చినా రాకున్న నెలనెలకు జీతం మాత్రం దీస్కుంటడు.. మరి ప్రైవేటు స్కూళ్ల పొంట జెప్పే సార్లకు యాడాది పొడ్గుత జీతం రావాల్నా వద్దా..? బడి పదినెళ్లే నడుస్తున్నదిగావట్టి పదినెళ్లే ఇస్తమంటే మరి తతిమ రెండు నెలలు ఎట్ల బత్కాలే వాళ్లు..?

నక్రేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారు చెడుగే ఉన్నట్టుండుగదా..? ఇద్వరకే ఆయన సుట్టు బొచ్చెడు పంచాదులు మోపైనయ్.. అవ్వట్లుండంగ మళ్ల నిన్న ఇంకోటి తల్గిచ్చుకున్నడు.. బ్యాంకు అధికారికి ఫోన్ జేశి డ్యాష్.. పలగొడ్త ఆడికొస్తె అంటున్నడు.. అంటె జబర్దస్తీ జేశిండు.. ఒక ఎమ్మెల్యేకు ఉండే హక్కులళ్ల.. అధికారుల బద్దలు వలగొట్టుడు గూడ ఉంటుండొచ్చునా..?

ఇల్లు గట్టెతందుకు బునాది దొవ్వుతుంటే.. అండ్ల కెళ్లి పెద్ద బాంబు బైటవడ్డది.. ఇద్వరకొకపారి ఇట్లనే బాంబు బైటవడ్తె అది ఏందో అని అప్పట్ల పలగొడ్తె ఇద్దరు సచ్చిపోయిండ్రు పేలి.. మళ్ల అదే ఊర్లె ఆరు కిలోల బర్వున్న బాంబు బైటవడెవర్కళ్ల.. జనం మస్తు భయపడ్తున్నరు.. ఆఖరికి పోలీసోళ్లు గూడ వచ్చి దాన్ని దీస్కపోయిండ్రు..

శిగ్గుశరం లేదేమయ్యా ఆ ఎమ్మెల్యేకు.. పొరగాళ్లకు కిర్ కేట్ పోటీలు వెడ్తరు పెడ్తె.. కబడ్డి పోటీలు వెడ్తరు.. లేకపోతె ఇంకేమన్న ఆటలు వెడ్తరుగని.. ఆడోళ్లకు మొగోళ్లకు ముద్దుల పోటీ వెడ్తడా..? వానికేమన్న శరమున్నదా చెప్పుండ్రి.. మన రాష్ట్రం ముచ్చటగాదిది జార్ఖాండ్ రాష్ట్రంల ఒక ఎమ్మెల్యేగాడు.. ముద్దుల పోటీ వెట్టి మూతులు నాకిపిచ్చిండు..

పాతబస్తీ ఫ్యామిలీ కోర్టులో దారుణం

హైదరాబాద్ : పాతబస్తీలో ఫ్యామిలో కోర్టులో దారుణం జరిగింది. మైనర్ బాలికను మూడో వివాహం చేసుకున్న కేసులో కోర్టకు హాజరైన అబ్బాస్ ఖాద్రి  కోర్టులోనే బాలికపై దాడికి యత్నించారు. 

న్యూయార్క్ లో బాంబు పేలుడు

అమెరికా : న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ సమీపంలో బాంబు పేలుడు జరిగింది. బాంబు పేలుడు ప్రాంతం నుంచి ప్రజలను పోలీసులు ఖాళీ చేయించారు. పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. 

భరత్ రెడ్డి అరెస్టు

నిజామాబాద్ : జిల్లా అభంగపట్నంలో దళితులపై దాడి చేసిన సంఘటనలో మాజీ బీజేపీ నేత భరత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. గతనెల 12న ఇద్దరు దలిత యువకులపై భరత్ రెడ్డి దాడి చేశాడు. ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు కిడ్నాప్ కేసులు కూడా నమోదు చేశారు. 

19:40 - December 11, 2017

తెలుగు జాతి భాష, సంస్కృతిని దశదిశలతో చటిచెప్పెందుకు తెలంగాణ ప్రభుత్వం తెలుగు మహాసభలు జరపబోతుంది. తెలుగు భాష ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది, తెలుగు భాష ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే విషయాలను గురించి తెలకపల్లి రవి తన మాటల్లో తెలిపారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

19:35 - December 11, 2017
19:32 - December 11, 2017

హైదరాబాద్ : కమెడియన్‌ సాయి విజయ్ ఆత్మహత్య వెనుక దాగున్న అసలు వాస్తవాలు ఒక్కోటి వెలుగు చూస్తున్నాయి. తాను చనిపోవడానికి ముందు విజయ్‌ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. అందులో తన చావుకు గల కారణాలు వివరించాడు. తన చావుకు భార్య వనిత, వరలక్ష్మి, విన్నీతోపాటు వ్యాపారవేత్త శశిధర్‌, అడ్వకేట్ శ్రీనివాస్‌ కారణమని చెప్పాడు. వనిత శశిధర్‌కు దగ్గరైందని.. ఆమెను శశిధర్‌ వ్యాపార అవసరాల కోసం వినియోగించుకుంటున్నాడని ఆరోపించారు. శశిధర్‌ ప్రోద్భలంతోనే వనిత తనను వేధిస్తోందని వివరించాడు. చివరికి తన కూతురిని కూడా భార్య చూడనివ్వడం లేదని ఆరోపించాడు. తన కారు, సామాన్లు తీసుకెళ్లారని చెప్పాడు. దీనిపై పీఎస్‌లో ఫిర్యాదు చేసినట్టు తెలిపాడు. వనితలాంటి వారిని వదిలిపెట్టవద్దని సెల్ఫీ వీడియోలో కోరాడు. మరో విజయ్ భార్య సెల్ఫి వీడియోలో విజయ్ చేసిన ఆరోపణాల్లో నిజం లేదని అన్నారు. నిజలు త్వరలో తెలుస్తాయని ఆమె తెలిపారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

సీఎంకు వినూత్న పద్ధతిలో మహిళ ఫిర్యాదు

విజయవాడ : వినూత్న పద్దతిలో ఓ మహిళ సీఎంకు ఫిర్యాదు చేశారు. వితంతు పించన్ రాకుండా అడ్డుపడుతున్నారని సీఎం ఫిర్యాదు చేసేందిరు క్యాంపస్ ఆఫీస్ కు ఓ మహిళ వచ్చింది. సీఎంను కలిసేందుకు పోలీసులు అనుమతించకపోవడంతో ఆఫీసు ముందున్న సీసీకెమెరా వద్ద నిలబడి తన ఆవేదనను సీఎంకు తెలిపారు. 

19:17 - December 11, 2017

నాన్న మాటలు ఆమె భవిష్యత్ ను నిర్దేశించాయి. చిన్ననాటి ఆలోచనలు ఆమెలో సేవ గుణాన్ని పెంచాయి. కష్టాలను చలించేపోయే ఆమె మనసత్వం ఎంతో మంది చిన్నారులకు మంచి భవిష్యత్ ను ఇస్తోంది. సేవ భావం కొందరికి మాత్రమే స్వంతం. తమకు లేకపోయిన పక్కవారి సంతోషం కోరుకునేవారు. అలాంటి అరుదైన లక్ష్యణానికి ప్రతికగా నిలిచిన ఓ యువతి కథనంతో మీ ముందుకు వచ్చింది ఈనాటి స్ఫూర్తి. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

పోలవరం నిధులు విడుదల చేసిన కేంద్రం

ఢిల్లీ : పోలవరం ప్రాజెక్ట్ కు కేంద్రం 318.22కోట్లను కేంద్రం విడుదల చేసింది. ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు పెట్టిన ఖర్చులో భాగంగా ఈ నిధులను కేంద్రం విడుదల చేసింది. పీఎంకేఎస్ వై కింద పోలవరానికి కేంద్రం నిధులు విడుదల చేస్తోంది. 

మోడీ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన మన్మోహన్

ఢిల్లీ : గుజరాత్ లో బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ నేతల పాక్ అధికారులతో చర్చించారని మెడీ ఆరోపణాలపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్రంగా స్పందించారు. రాజకీయ లబ్ది కోసమే మోడీ అసత్య ఆరోపణలు చేస్తున్నాడని, అయ్యర్ ఇంట్లో జరిగిన విందులో గుజరాత్ ఎన్నికల గురించి ఎవరితో మాట్లాడాలేదని ఆయన తేల్చి చెప్పారు. కేవలం ఇండో పాక్ సంబంధాల గురించే చర్చించామని ఆయన తెలిపారు. 

18:36 - December 11, 2017
18:34 - December 11, 2017

తూర్పుగోదారవరి : రాజమహేంద్రవరంలో టీడీపీ రాజకీయం రసరంజకంగా మారుతోంది. రాజమహేంద్రవరంలో టీడీపీ బలంగా ఉన్నప్పటికీ వైసీపీలోకి చేరిన ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావును చంద్రబాబు తిరిగి పార్టీలోకి ఆహ్వానించారు. ఆదిరెడ్డికి పార్టీ బాధ్యతలు అప్పగించారు. ఇటీవల ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహణలో సిటీ నియోజకవర్గానికి ఆయనే నేతృత్వం వహించారు. అదే ఇప్పుడు అధికార పార్టీని అవస్థల్లోకి నెడుతున్నట్టు కనిపిస్తోంది.

ఇప్పటికే వర్గాల మధ్య వైరం
నగరంలో ఇప్పటికే ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ వర్గాల మధ్య వైరం నడుస్తోంది. మధ్యలో నగర మేయర్‌ రజనీ శేషసాయి కూడా ఇటీవల గన్ని కృష్ణ పట్ల కొంత దూకుడు ప్రదర్శించి అభాసుపాలైంది. ఈ వ్యవహారం ఇలా ఉంటే ఇప్పుడు ఆదిరెడ్డితో పాటు ఆయన తనయుడు ఆదిరెడ్డి వాసు కూడా నగరంలో తమదే పెత్తనం అన్నట్లుగా పార్టీని గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. బుచ్చయ్య చౌదరి, గన్ని కృష్ణలను కాదని, తానే నగర పార్టీని నడిపిస్తున్న నాయకుడినని చెప్పుకుంటున్నాడు. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో తానే ఎమ్మెల్యే కాబోతున్నట్టు ఆదిరెడ్డి ప్రకటించుకోవడంతో మిగిలిన నేతలు మండిపడుతున్నారు.

హైకమాండ్‌కు కొత్త తలనొప్పులు
ఇటు కార్పొరేషన్‌లోనూ, అటు పార్టీ కమిటీల్లోనూ పెత్తనం కోసం సాగుతోన్న ఆధిపత్య పోరు హైకమాండ్‌కు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. టీడీపీ అధిష్టానం నేతలకు క్లాస్‌ తీసుకున్నప్పటికీ పెద్దగా మార్పు రావడం లేదు. అందులోనూ ఆదిరెడ్డి వ్యవహారం తీవ్ర కలహాలకు దారితీసేలా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రెస్‌ క్లబ్‌ ఎదురుగానే ఎమ్మెల్యే బుచ్చయ్యతో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి వాగ్వాదానికి దిగడం చర్చనీయాంశమైంది. ఆదిరెడ్డి అప్పారావుతో పాటు ఆయన తనయుడు కూడా నగరంలో పుట్టిన రోజు పేరుతో ఫ్లెక్సీ రాజకీయాలకు తెరలేపడం పలువురిని విస్మయానికి గురి చేస్తోంది.ఈ వ్యవహారంపై టీడీపీ సీరియస్‌గానే దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. లేకుంటే కార్యకర్తల్లో అయోమయం ఏర్పడక తప్పదు. 

18:32 - December 11, 2017

ప్రకాశం : జిల్లా ఒంగోలులో విషాదం చోటుచేసుకుంది. స్థానిక సంతపేటకు చెందిన శ్యామల తన ఏళ్ళ కొడుకు పార్టివ్ రెడ్డి తో సహా ఇక్కడి అగ్రహారం రైల్వే గాటు వద్ద రైలు కింద పడి తనువు చాలించారు. అయితే ఘటనకు పూర్తి కారణాలు తెలియరాలేదు.  

18:31 - December 11, 2017

విశాఖ : రాజకీయాలలో ప్రజలు ఎవరినైనా ఓడిస్తారన్నారు కేంద్రమంత్రి అశోక గజపతిరాజు. కొందరు మాకు ఓడించే శక్తి ఉందంటున్నారు... కాదని ఎవరంటారు అని పరోక్షంగా వవన్ వ్యాక్షలపై ఆయన స్పందించారు. మరికొందరు ముప్పై ఏళ్లు తామే అధికారంలో ఉంటామని చెబుతున్నారు... కానీ అది కూడా అసాధ్యమన్నారు

18:27 - December 11, 2017

పశ్చిమగోదావరి : తప్పుడు ఆరోపణలతో పోలవరం ప్రాజెక్టు పనులకు అడ్డుపడొద్దని, ప్రజల మనోభావాలు దెబ్బతీస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారని ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టు భావితరాలకు భద్రత అని గుర్తు చేశారు. పోలవరం నిర్వాసితులకు ఉదారంగా కాదు బాధ్యతగా పునరావాసం కల్పిస్తామని, ప్రాజెక్టు ఆగిపోయే పరిస్థితి వస్తే ఎంతవరకైనా వెళ్తామని చంద్రబాబు స్పష్టంచేశారు. పోలవరంలో కాంక్రీట్‌ వర్క్స్‌ మినహా ఇతర పనులు వేగవంతం చేశామని, కాంక్రీట్‌ పనులు పూర్తిచేసి కాఫర్‌ డ్యాం నిర్మిస్తే.. వచ్చే ఏడాదిలో గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వొచ్చన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌పై 12 వేల 560 కోట్లు ఖర్చుచేశామని, కేంద్రం నుంచి రూ.4 వేల 329 కోట్లు ఇచ్చిందని.. ఇంకా 3 వేల 100 కోట్లు ఇవ్వాలని గుర్తు చేశారు. పవర్‌ ప్రాజెక్ట్‌కు 4 వేల కోట్లు ఇవ్వాలని, 2013 చట్టంతో భూసేకరణ వ్యయం 11 రెట్లు పెరిగిందని చెప్పారు. యూపీఏ తెచ్చిన చట్టం వల్లే పరిహారం ఖర్చు బాగా పెరిగిందని, ఆ చట్టం ప్రకారం నిర్వాసితులకు ఇవ్వాలో వద్దో.. విపక్షాలు చెప్పాలన్నారు. 98 వేల గిరిజన కుటుంబాలకు పునరావాసం కల్పించాలని, ప్రతి కుటుంబానికి సగటున రూ.18 లక్షలు చెల్లించాల్సి వస్తుందని బాబు తెలిపారు. పోలవరం వివరాలు ఎప్పటికప్పుడు ప్రకటిస్తున్నామని, శ్వేతపత్రం ఎందుకని ఆయన ప్రశ్నించారు. 

18:26 - December 11, 2017

హైదరాబాద్ : మీడియా ప్రీమియర్ లీగ్ సీజన్-2, 2017 నాకౌట్ టోర్నమెంట్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. టౌర్నమెంట్‌కు సంబందించిన కప్‌, టీమ్ జర్సీలను ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, భారత్ స్టార్ క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌ లాంఛనంగా ప్రారంభించారు. ఈ టీ-20 క్రికెట్ సిరీస్ అత్తాపూర్‌లోని విజయానంద్ గ్రౌండ్‌లో జరగనుంది. ఈ సిరీస్‌లో మొదటి మ్యాచ్‌ 10 టీవీతో Nటీవి తలపడనుంది. నిత్యం పని ఒత్తిడిలో ఉండే మీడియా మిత్రులకు ఆటలు ఉల్లాసాన్ని ఇస్తాయని.. అలాగే మీడియా ఐక్యత నెలకొంటుందని నిర్వాహకులు అన్నారు. 

18:24 - December 11, 2017

కరీంనగర్ : జిల్లా ధర్మారం మండలం నంది మేడారం రిజర్వాయర్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. చెరువు నిర్మాణంతో ఉపాధి కోల్పోయారు. దీంతో మత్స్యకారులు పనులను అడ్డుకొని ఆందోళన చేస్తున్నారు. దీంతో ఐదు రోజులుగా పనులు నిలిచి పోవడంతో రిజర్వాయర్‌ వద్ద భారీగా పోలీసులు బలగాలను మోహరించారు.

18:23 - December 11, 2017

హైదరాబాద్ : గిరిజనుడి ఆవకాశాలను కొల్లగొట్టిన కేటీఆర్ మామపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్‌ వియ్యంకుడు పాకాల హరినాథ్‌ ఎస్టీ సర్టిఫికెట్‌తో ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారిగా ఉద్యోగం సంపాదించి ప్రభుత్వాన్ని మోసం చేశారన్నారు. రిటైర్డ్‌ అయ్యి ఇప్పటికీ దాదాపు 50 వేల రూపాయల పెన్షన్‌ తీసుకుంటున్న హరినాథ్‌పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పాలకులు వారి మీద, వారి కుటుంబ సభ్యులపై ఆరోపణలు వచ్చినప్పుడు పారదర్శికంగా వ్యవహరించాలన్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే కోర్టును ఆశ్రయిస్తామని రేవంత్‌రెడ్డి చెప్పారు. 

ముగిసిన చంద్రబాబు పోలరవరం పర్యటన

పశ్చిమగోదావరి : ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం పర్యటన ముగిసింది. అనంతరం పోలరవరం పనులపై ఇంజనీర్లు కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించారు. పోలవరం నుంచి విజయవాడకు ఆయన పయనమైయ్యారు. 

భార్య వేధింపులతోనే విజయ్ ఆత్మహత్య

హైదరాబాద్ : కమెడియన్ సాయి విజయ్ ఆత్మహత్యలో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. విజయ్ సెల్ఫీ వీడియోలో తన చావుకు కారణాలను వివరించాండు. భార్య వనితతోపాటు మరో ఇద్దరు వ్యక్తుల వేధింపుల వల్లే తను ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిపాడు. విజయ్ భార్య వనిత వ్యాపారవేత్త శశిధర్ తో సన్నిహితంగా ఉంటోందని విజయ్ తన సెల్ఫీ వీడియో తెలిపారు.అక్రమసంబంధాల గురించి అత్తమామలకు చెప్పిన పట్టించుకోలేదని, కనీసం తన కూతురిని కూడా తన భార్య చూడనివ్వలేదని ఆయన వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు.

17:59 - December 11, 2017

హైదరాబాద్ : కమెడియన్ సాయి విజయ్ ఆత్మహత్యలో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. విజయ్ సెల్ఫీ వీడియోలో తన చావుకు కారణాలను వివరించింది. భార్య వనితతోపాటు మరో ఇద్దరు వ్యక్తుల వేధింపుల వల్లే తను ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిపాడు. విజయ్ భార్య వనిత వ్యాపారవేత్త శశిధర్ తో సన్నిహితంగా ఉంటోందని విజయ్ తన సెల్ఫీ వీడియో తెలిపారు.అక్రమసంబంధాల గురించి అత్తమామలకు చెప్పిన పట్టించుకోలేదని, కనీసం తన కూతురిని కూడా తన భార్య చూడనివ్వలేదని ఆయన వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

17:54 - December 11, 2017
17:52 - December 11, 2017

హైదరాబాద్ : కమెడియన్ సాయి విజయ్ ఆత్మహత్యలో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. విజయ్ సెల్ఫీ వీడియోలో తన చావుకు కారణాలను వివరించింది. భార్య వనితతోపాటు మరో ఇద్దరు వ్యక్తుల వేధింపుల వల్లే తను ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిపాడు. విజయ్ భార్య వనిత వ్యాపారవేత్త శశిధర్ తో సన్నిహితంగా ఉంటోందని విజయ్ తన సెల్ఫీ వీడియో తెలిపారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

 

15:54 - December 11, 2017
15:53 - December 11, 2017

యాదాద్రి భువనగిరి : జిల్లా అనాజిపురంలో ఎస్సీ, ఎస్టీ ఎంపీటీసీ, సర్పంచ్ లకు అవమానం జరిగింది. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ కు ఎంపీటీసీ, సర్పంచ్ లను ఆహ్వానించ లేదు. స్టేజీ పైకి వెళ్లిన ఎంపీటీసీని పోలీసులు లాక్కెళ్లారు. మంత్రి జగదీశ్వర్ రెడ్డి సమక్షంలో ఎస్సీ ప్రజాప్రతినిధికి అవమానం జరిగింది. ప్రోటో కాల పాటించడం లేదని ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

15:42 - December 11, 2017
15:40 - December 11, 2017

కరీంనగర్ : జిల్లాలో ఏబీవీపీ విద్యార్థులు దౌర్జన్యానికి దిగారు. బరితెగించి దుశ్చర్యకు పూనుకున్నారు. ఎస్ ఎఫ్ ఐ మహాసభలను ఏబీవీపీ విద్యార్థులు అడ్డుకున్నారు. ఏబీవీపీ, ఎస్ ఎఫ్ ఐ విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. విద్యార్థి సంఘాల ఘర్షణతో కరీంనగర్ లో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

15:34 - December 11, 2017

గుంటూరు : రాజధాని భవనాల డిజైన్లపై ఏపీ సర్కార్ ప్రజాభిప్రాయం సేకరించనుంది. పబ్లిక్ డొమైన్ లో పెట్టి అభిప్రాయాలను ప్రభుత్వం తీసుకోనుంది. రేపు సీఎం చంద్రబాబు, సీఆర్డీఏ అధికారులతో దర్శకుడు రాజమౌళి భేటీ కానున్నారు. రాజధాని శాశ్వత భవనాల డిజైన్లను ప్రభుత్వం 2,3 రోజుల్లో ఖరారు చేయనుంది. ఎల్లుండి ఫైనల్ డిజైన్లు ఖరారు చేసే అవకాశం ఉంది. ముందుగా నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులు, సీఆర్డీఏ అధికారులతో రాజమౌళి భేటీ కానున్నారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ కానున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

15:26 - December 11, 2017

ఢిల్లీ : ఈనెల 22న పోలవరం ప్రాజెక్టును కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సందర్శించనున్నారు. ఆ రోజే ప్రాజెక్టు మీద సమీక్ష  చేయనున్నారు. అనుకున్న సమయంలోగా ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పారు. పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయన్నారు. ఏపీ సర్కార్ కు అన్ని విధాలా సహకారం అందిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనులు పూర్తి చేస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులన్నీ క్లియర్ చేస్తున్నామన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

15:17 - December 11, 2017

హైదరాబాద్ : బొమ్మరిల్లు కమెడియన్ విజయ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. యూసుఫ్ గూడలో తన నివాసంలో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పెళ్లైన కొన్ని రోజులకే దంపతుల మధ్య మనస్పర్థలు వచ్చాయి. గొడవలు తారాస్థాయి చేరుకోవడంతో దంపతులు విడిగా ఉంటున్నారు. విజయ్ ఆత్మహత్యకు ఆయన భార్య వనిత వేధింపులే కారమని అతని సన్నిహితులు చెబుతున్నారు. కుటుంబ కలహాలతోనే విజయ్ డిప్రెషన్ లోకి వెళ్లాడని అతని తల్లిదండ్రులు అంటున్నారు. బొమ్మరిల్లు, అమ్మాయిలు అబ్బాయిలు, ధనలక్ష్మీ తలుపుతడితే వంటి పలు చిత్రాల్లో ఆయన నటించారు. విజయ్ మృతితో టాలీవుడ్ తీవ్ర మనస్థాపానికి గురైంది. ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగారు. కన్నీరుమున్నీరవుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..  

 

13:42 - December 11, 2017

పశ్చిమగోదావరి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ప్రతి సోమవారం పోలవరంపై సమీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పోలవరంపై వస్తున్న విమర్శలు..ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై ఆయన మాట్లాడారు. పోలవరంపై రూ.3957 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలిపారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలలో అర్థం లేదని తెలిపారు. 95వేల కుటుంబాలు నిరాశ్రలవుతున్నారని, అందులో 47వేల గిరిజన కుటుంబాలున్నాయన్నారు. గిరిజనుల మేలు కోసం రూ. 2900 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఒక ఎకరానికి రూ. 6.25 లక్షలు, ఇలా మొత్తంగా రూ. 17-18 లక్షలు పరిహారం చెల్లిస్తున్నట్లు వెల్లడించారు. రూ. 32వేల కోట్ల రూపాయలవుతోందని..గిరిజనులకు పరిహారం ఇచ్చే విషయంలో సుముఖత ఉన్నారో తెలుపాలని ప్రతిపక్షాలకు సూచించారు. 3446 కుటుంబాలకు పరిహారం కల్పించినట్లు తెలిపారు. 2 లక్షల మందికి పునరావసం కల్పించడం జరుగుతోందని, 60వేల 256 ఎకరాల భూ సేకరణ చేయాల్సి ఉంటుందని తెలిపారు.

ప్రతిపక్షం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తోందని..ఎలాంటిది విడుదల చేయాలన్నారు. 194.6 టీఎంసీల నీరు స్టోరేజ్ ఉంటుందని..119 డెడ్ స్టోరేజీ.. 548 గ్రామాలకు తాగునీరు అందించే అవకాశం ఉందన్నారు. సుజల స్రవంతిని కూడా కనెక్ట్ చేసుకోవడం జరుగుతుందని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. 

13:27 - December 11, 2017

హైదరాబాద్ : తెలుగు సినిమా రంగంలో మరో విషాదం చోటు చేసుకుంది. తీవ్రమైన మనస్థాపానికి లోనైన కమెడియన్ విజయ్ అలియాస్ పొట్టి విజయ్ ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేగింది. ఆర్థిక పరిస్థితులే కారణమని తెలుస్తోంది.

యూసుఫ్ గూడలో నివాసం ఉంటున్న విజయ్ తన రూంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఓ సినిమాలో ఇతను నిర్మాతగా వ్యవహరించినట్లు..పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. కానీ ఈ సినిమా విడుదల కాకపోవడంతో పీకల్లోతూ కష్టాల్లో కూరకపోయినట్లు సమాచారం. సమాచారం తెలుసుకున్న సినీ నటులు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. విజయ్ మృతదేహానికి నివాళులర్పించేందుకు సినీ రంగానికి చెందిన నటులు..నిర్మాతలు యూసుఫ్ గూడకు వెళ్లనున్నారు. 

13:21 - December 11, 2017

బాలకృష్ణ హీరోగా ఫ్యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో 2001లో విడుదలైన చిత్రం నరసింహనాయుడు... బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. బాలకృష్ణ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచిపోయిందీ చిత్రం. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌ను తెరపైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట. ఇందుకోసం రైటర్‌ చిన్నికృష్ణ ఓ కథను సిద్ధం చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం ట్రెండ్‌కు తగ్గట్టుగా మలిచిన ఈ కథ విని బాలకృష్ణ వెంటనే గ్రీన్‌ సిగల్‌ ఇచ్చారని సమాచారం. ప్రస్తుతం ఆయన కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో 'జై సింహా'లో నటిస్తున్నారు. 102వ సినిమాగా రూపొందుతున్న ఇది సంక్రాంతికి విడుదల కానుంది. 

 

హైదరాబాద్ లో చికిత్స పొందుతున్న స్వాతి ప్రియుడు రాజేష్

హైదరాబాద్ : నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో స్వాతి  ప్రియుడు రాజేష్ చికిత్స పొందుతున్నారు. రాజేష్ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఏ క్షణంలోనైనా అతన్ని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. సుధాకర్ రెడ్డి హత్య, యాసిడ్ దాడి డ్రామాలో స్వాతిని పోలీసులు విచారిస్తున్నారు. 

 

13:13 - December 11, 2017

మహబూబ్ నగర్ : భర్త కంటే ప్రియుడే ఎక్కువయ్యాడు ఆమెకు... మూడు ముళ్లు వేసి.... ఏడడుగులు నడిచిన భర్త కన్నా... ప్రేమికుడే లోకమయ్యాడు. ఇందుకు అడ్డు ఉన్న భర్తను కడతేర్చింది. అంతటితో ఆగకుండా... ప్రియుడినే భర్త స్థానంలోకి తీసుకువచ్చింది. అతనే తన భర్త అని అందిరిని నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ... అబద్దం బయటపడడంతో... కి'లేడి' వ్యవహారమంతా బట్టబయలైంది.

హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజేష్ ను అదుపులోకి తీసుకొనేందుకు నాగర్ కర్నూలు పోలీసులు నగరానికి చేరుకున్నారు. ఏ క్షణంలోనైనా అదుపులోకి తీసుకొననున్నారని తెలుస్తోంది.

హౌసింగ్‌ బోర్డు కాలనీలో స్వాతి-సుధాకర్‌రెడ్డి దంపతులు కొంతకాలంగా నివాసం ఉంటున్నారు. అయితే స్వాతికి రాజేష్‌ అనే వ్యక్తితో ప్రేమాయణం మొదలైంది. ఇంకేముంది అడ్డువున్న భర్తను తొలగించుకునేందుకు ప్రియుడితో కలిసి భార్య పన్నాగం పన్నింది. ఒకరోజు రాజేష్‌, స్వాతి కలిసి సుధాకర్‌రెడ్డిని హతమార్చారు. అనంతరం నవాబ్‌పేట వద్ద కాల్చి బూడిద చేశారు. అనంతరం స్వాతి-రాజేశ్‌ కలిసి ఓ మాస్టర్‌ ప్లాన్‌ వేశారు. భర్త స్థానంలో రాజేశ్‌ను తీసుకురావాలని.. పథకం పన్నారు. ఇందుకోసం ఎవరూ గుర్తు పట్టకుండా ఉండడం కోసం.. రాజేశ్‌ తన ముఖంపై యాసిడ్‌ పోసుకున్నాడు. ఇక స్వాతి తన నటనను ప్రదర్శించింది. కొంతమంది దుండగులు వచ్చి తన భర్తపై యాసిడ్‌ పోశారని అందరిని నమ్మించింది. హుటాహుటిన రాజేశ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లి ట్రీట్‌మెంట్‌ చేయించింది. చివరకు అత్తామామలను కూడా నమ్మించింది. రాజేశ్‌ ట్రీట్‌మెంట్‌కు అయిన ఖర్చును కూడా వారితోనే పెట్టించింది.

అంతా సవ్యంగానే జరుగుతుందని స్వాతి-రాజేశ్‌లు భావిస్తున్న సమయంలో అసలు కథ బయటపడింది. ఆస్పత్రిలో కోలుకుంటున్న రాజేశ్‌ను చూసి కుటుంబసభ్యులకు అనుమానం వచ్చింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది తమ కుమారుడు కాడని తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. దీంతో వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో స్వాతి బాగోతం బయటపడింది. 

నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ ఎదుట మహిళ ఆందోళన

నాగర్ కర్నూలు : జిల్లా కలెక్టరేట్ ఎదుట మహిళ ఆందోళన చేపట్టింది. పెళ్లి పేరుతో కానిస్టేబుల్ ప్రవీణ్ మోసం చేశాడంటూ ఏడాది కూతురితో అలివేలు అనే మహిళ ఆందోళనకు దిగింది. 

 

అక్రమంగా కెమికల్ డ్రమ్ములు వదిలివెళ్తున్న ముఠా అరెస్టు

యాదాద్రి : జిల్లాలో పలుగ్రామాల్లో అక్రమంగా కెమికల్ డ్రమ్ములు వదిలివెళ్తున్న ముఠా గుట్టురట్టు అయింది. 8 మంది సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్, విజయవాడ, బీదర్ నుంచి కెమికల్ డ్రమ్ములు తెస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. విజేత కెమికల్స్, గోల్డెన్ స్టిక్ కెమికల్స్, కేఎంటి కెమికల్స్, జారుపక్ష కెమికల్స్ పై కేసు నమోదు చేశారు. 

పోలవరం నిర్మాణం పనులు పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబు

పశ్చిమ గోదావరి : సీఎం చంద్రబాబు పోలవరం చేరుకున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులను సీఎం పరిశీలిస్తున్నారు. 

సీబీఐటీ విద్యార్థుల ఆందోళనపై స్పందించిన ప్రిన్సిపల్

రంగారెడ్డి : సీబీఐటీ విద్యార్థుల ఆందోళనపై ప్రిన్సిపల్ రవీందర్ రెడ్డి స్పందించారు. కళాశాలకు వారం రోజులు సెలవు ప్రకటించారు. తల్లిదండ్రులతో మరోసారి సమావేశమై ఫీజులపై నిర్ణయం తీసుకుంటామని ప్రిన్సిపల్ చెప్పారు. 

 

ఎస్ ఎఫ్ ఐ మహాసభలను అడ్డుకునేందుకు ఏబీవీపీ కార్యకర్తల యత్నం

కరీంనగర్ : ఎస్ ఎఫ్ ఐ జిల్లా మహాసభలను అడ్డుకునేందుకు ఏబీవీపీ కార్యకర్తలు యత్నించారు. రాజేశ్వరీ కాలేజీ ఆవరణలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, ఘర్షణ చోటుచేసుకుంది. 

పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలో ఉద్రిక్తత

పెద్దపల్లి : కాల్వశ్రీరాంపూర్ మండలంలో ఉద్రిక్తత నెలకొంది. నీళ్లకంఠ చెరువు భూముల్లో రోడ్డు పక్కన ఉన్న అక్రమ కట్టడాలను తొలగించేందుకు అధికారులు యత్నించారు. స్థానికులు అధికారులను అడ్డుకున్నారు. తమ జీవనోపాధి కోల్పోతామని అధికారులతో వాగ్వాదానికి దిగారు. భారీ బందోబస్తు నడుమ ఆక్రమణలను తొలగించారు. 

12:36 - December 11, 2017

హైదరాబాద్ : సీబీఐటీ కళాశాలకు వారం రోజుల పాటు సెలవు ప్రకటిస్తున్నట్లు కళాశాల ప్రిన్స్ పాల్ వెల్లడించారు. ఫీజుల పెంపును నిరసిస్తూ గండిపేట సీబీఐటీ కాలేజీ విద్యార్థులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. గత ఐదు రోజులుగా ఈ ఆందోళన కొనసాగుతోంది. సోమవారం శంకర్ పల్లి చౌరస్తాలో సీబీఐటీ కాలేజీకి చెందిన బస్సులను అడ్డుకున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని చెదరగొట్టే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తతకు దారి తీసింది.

దీనితో మరోసారి సీబీఐటీ కాలేజీ యాజమాన్యం స్పందించింది. కళాశాలకు వారం రోజుల పాటు సెలవు ప్రకటిస్తున్నట్లు..పరీక్షలన్నీ రద్దు చేశామని ప్రిన్స్ పాల్ రవీందర్ రెడ్డి వెల్లడించారు. దీనికి విద్యార్థులు శాంతించినట్లు సమాచారం. గత ఐదు రోజులుగా జరుగుతున్న పరిణామాలపై చర్చిస్తామని, విద్యార్థులు..వారి తల్లిదండ్రులతో మాట్లాడుతామని కళాశాల ప్రిన్స్ పాల్ రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికైనా సమస్య తీరుతుందా ? లేదా ? అనేది చూడాలి. 

12:29 - December 11, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య ఆత్మహత్యల పర్వం ఎక్కవగా కొనసాగుతోంది. రకరకాల కారణాల వల్ల తీవ్ర మనోవేదనకు గురవుతున్న వాళ్లందరూ.. ఆత్మహత్యే శరణ్యమని బలవన్మరణానికి పాల్పడుతున్నారు. సినిమాల్లో అవకాశాలు రాకపోవడం..వచ్చిన సినిమాలు మిస్ కావడంతో పలువురు నటులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. తాజాగా కమెడియన్ విజయ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

'బ్యాక్ ప్యాకెట్' సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. అనంతరం పలు చిత్రాల్లో కామెడీ పాత్రలు చేసి ప్రేక్షకులను అలరించాడు. 'బొమ్మరిల్లు’, 'అమ్మాయిలు అబ్బాయిలు’ చిత్రాల్లో కూడా నటించారు. కానీ కొంతకాలంగా సినిమా అవకాశాలు లేక విజయ్ డిప్రెషన్లోకి వెళ్లినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సోమవారం యూసఫ్ గూడలోని తన ప్లాట్‌లో సోమవారం సూసైడ్ చేసుకున్నాడు. ఇతను ఒక సినిమాలో పెట్టుబడి పెట్టినట్లు...పెట్టిన పెట్టుబడికి వడ్డీలు కట్టలేని పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. మరోవైపు కుటుంబ కలహాలు కూడా ఉన్నట్లు వాదన వినిపిస్తోంది. 

12:21 - December 11, 2017

హైదరాబాద్ : ఓ ఆర్ఎంపీ చేసిన వైద్యానికి ఓ పసికందు బలైంది. ఈ విషాద ఘటన నగరంలోని వారాసీగూడలో చోటు చేసుకుంది. వారాసీగూడలో ఉంటున్న ఓ దంపతులకు 14 నెలల చిన్నారి ఉంది. ఈ చిన్నారి జ్వరం..జులుబు రావడంతో పార్సీగుట్టలో ఉన్న ఆర్ఎంపీ ప్రకాష్ దగ్గరకు వెళ్లారు. దీనితో ఒక టానిక్ ఇచ్చారని తల్లిదండ్రులు తెలిపారు. కానీ టానిక్ వేసిన తరువాత పాప వాంతులు చేసుకుందని మరలా అదే డాక్టర్ వద్దకు తీసుకెళ్లడం జరిగిందన్నారు. పాపకు సీరియస్ ఉందని..వెంటనే గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించాడని వాపోయారు. గాంధీకి వెళ్లగా..పాప అప్పటికే చనిపోయిందని వైద్యులు నిర్ధారించారని రోదించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆర్ఎంపీని అరెస్టు చేశారు. 

హాస్యనటుడు విజయ్ ఆత్మహత్య

హైదరాబాద్ : హాస్యనటుడు విజయ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. యూసుఫ్‌గూడలోని తన ఫ్లాట్‌లో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో గత కొంతకాలంగా విజయ్ డిప్రెషన్ లో ఉన్నాడు. సినిమాల్లో అవకాశాల్లేకే  ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. 

ఆర్ ఎంపీ డాక్టర్ వైద్యానికి చిన్నారి బలి

హైదరాబాద్ : నగరంలో ఆర్ ఎంపీ డాక్టర్ వైద్యానికి చిన్నారి బలైంది. వైద్యం వికటించి 14నెలల పసి పాప మృతి చెందింది. చిన్నారి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. వైద్యం చేసిన ఆర్ ఎంపీ డాక్టర్ ను పోలీసులు అరెస్టు చేశారు.  

పోలవరం చేరుకున్న సీఎం చంద్రబాబు

పశ్చిమగోదావరి : సీఎం చంద్రబాబు పోలవరం చేరుకున్నారు. కాసేపట్లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులను సీఎం పరిశీలించనున్నారు. 

11:52 - December 11, 2017

రామ్ చరణ్, సమంత హీరో హీరోయిన్స్ గా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'రంగస్థలం'. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సి.వి.ఎం) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను శనివారం చిత్రబృందం విడుదల చేసింది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ''శ్రీమంతుడు', 'జనతా గ్యారేజ్‌' వంటి సూపర్‌ హిట్‌ చిత్రాల తర్వాత మా బ్యానర్‌లో రూపొందుతున్న ఎగ్జైటింగ్‌ ప్రాజెక్ట్‌ ఇది. మెగా పవర్‌స్టార్‌ రామచరణ్‌ లుక్‌తో సినిమా ఫస్ట్‌లుక్‌ను రిలీజ్‌ చేశాం. ఇప్పటికే దీనికి అద్భుతమైన స్పందన వస్తోంది. చిట్టిబాబు పాత్రలో రామ్‌చరణ్‌ మాస్‌ యాక్టింగ్‌, సమంత గ్లామర్‌ ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తిచేసి సినిమాను వచ్చే ఏడాది మార్చి 30న సమ్మర్‌ స్పెషల్‌గా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఇది మా బ్యానర్‌ వ్యాల్యూస్‌ను పెంచడమే కాకుండా మా సంస్థకు హ్యాట్రిక్‌ హిట్‌ అందించే సినిమా అవుతుంది' అని అన్నారు. 

 

నకిలీ విత్తనాల తయారీదారులు, విక్రయించేవారిని అరెస్టు చేయాలి : సీఎం చంద్రబాబు

అమరావతి : నకిలీ విత్తనాల తయారీదారులను విక్రయించేవారిని అరెస్టు చేయాలని సీఎం చంద్రబాబు అన్నారు. రైతులను మోసగించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతపురంలో పంట రుణాల పంపిణీ వేగవంతం చేయాలన్నారు. ప్రపంచంలో మెరుగైన విజ్ఞానం రాష్ట్రానికి తెచ్చే బాధ్యత తనదన్నారు. వ్యవసాయంలో సుస్థిర అభివృద్ధి సాధించాలన్నారు. రైతుల ఆదాయం పెరగాలని కోరారు. 

 

గండికోట రిజర్వాయర్ కు 6 వేల క్యూసెక్కుల నీరు : సీఎం చంద్రబాబు

అమరావతి : నీరు...ప్రగతి, వ్యవసాయం పరోగతిపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. గోదావరి, కృష్ణా డెల్టాలలో రబీ పనులు త్వరగా ముగించేలా చూడాలన్నారు. గండికోట రిజర్వాయర్ కు 6 వేల క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నామని తెలిపారు. 

 

నీరు...ప్రగతి, వ్యవసాయం పరోగతిపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

అమరావతి : నీరు...ప్రగతి, వ్యవసాయం పరోగతిపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ముందస్తు నాట్లకు వెళ్లడం వల్ల ఈ ఖరీఫ్ లో అధిక దిగుబడి సాధ్యమైందని సీఎం అన్నారు. ముందస్తు నాట్ల రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందుల వినియోగం తగ్గించగలిగామని తెలిపారు. తెగుళ్లను అరికట్టి పూర్తిగా అడ్డుకట్ట వేయాలన్నారు. రాబోయే ఖరీఫ్ సేద్యానికి ఇప్పటి నుంచే అన్ని శాఖలు సన్నద్ధం కావాలన్నారు. 

11:26 - December 11, 2017

ఢిల్లీ : అభంగపట్నంలో జరిగిన ఘటనను ఆల్ ఇండియా దళిత్ రైట్స్ ఫెడరేషన్ ఖండించింది. ఇద్దరు దళితులపై బీజేపీ నేత భరత్ రెడ్డి దాడికి పాల్పడడం..వారిని నీటి కుంటలో మునిగే విధంగా చేయడం..ముక్కును నేలకు రాయించడం..తదితర దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అనంతరం 22 రోజులుగా అజ్ఞాతంలో ఉన్న భరత్ రెడ్డిన జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని నిజామాబాద్ కు తరలించి విచారిస్తున్నారు. ఈ సందర్భంగా ఏఐడీఆర్ఎఫ్ జాతీయ అధ్యక్షులు టెన్ టివితో మాట్లాడారు. బీజేపీ నేత భరత్ రెడ్డిని అరెస్టు చేయడం పట్ల తెలంగాణ పోలీసులను అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం 24గంటల్లోగా బాధితులకు పరిహారం చెల్లించాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 

11:21 - December 11, 2017

హైదరాబాద్ : వరకట్న మరణాలు అధికమౌతున్నాయి. భర్త..అత్తింటి వారు వేధింపులు తట్టుకోలేక పలువురు గృహిణిలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు..అత్తింటివారే హత్య చేస్తున్నారు..తాజాగా నాగోల్ లో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అత్తింటి వారి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుందని మృతురాలి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.

ఆనంద్..లావణ్యలకు ఆరు నెలల క్రితం వివాహం జరిగింది. పెళ్లి కాకముందు ఆనంద్ ఉద్యోగం చేసేవాడని..పెళ్లి అనంతరం ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉంటున్నాడని తెలుస్తోంది. ఇదిలా ఉంటే సోమవారం లావణ్య అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. పుట్టింటి నుండి డబ్బులు తేవాలని ఆనంద్...అత్తింటి వారు వేధించే వారని లావణ్య కుటుంబీకులు పేర్కొంటున్నారు. ఆనంద్ ను కఠినంగా శిక్షించాలని మినిస్టర్ దగ్గర డ్రైవర్ గా పనిచేస్తున్న లావణ్య సోదరుడు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఆనంద్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. 

11:15 - December 11, 2017

హైదరాబాద్ : సీబీఐటీ విద్యార్థులు మరోసారి రోడ్డెక్కారు. ఫీజుల పెంపును నిరసిస్తూ గండిపేట సీబీఐటీ కాలేజీ విద్యార్థులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. గత ఐదు రోజులుగా ఈ ఆందోళన కొనసాగుతోంది. సోమవారం శంకర్ పల్లి చౌరస్తాలో సీబీఐటీ కాలేజీకి చెందిన బస్సులను అడ్డుకున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని చెదరగొట్టే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తతకు దారి తీసింది.

గతంలో చేసిన ఆందోళనతో సీబీఐటీ కళాశాల యాజమాన్యం దిగొచ్చింది. విద్యార్థులకు వెసులుబాటు కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఫీజులు కట్టనక్కర్లేదు...పాత ఫీజులు ప్రకారం కట్టాలని..సూచించింది. దీనికి విద్యార్థులు ఒప్పుకోవడం లేదు. అందర్నీ అందులో చేర్చాలని..అఫిడవిట్ లో ఉన్న విద్యార్థులను కూడా చేర్చాలని..ఇందుకు లిఖితపూర్వకంగా హామీనివ్వాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అంతేగాకుండా ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా విద్యార్థులు చేస్తున్న ఆందోళనతో కళాశాల యాజమాన్యం దిగొస్తుందా ? ప్రభుత్వం ఏవైనా చర్యలు తీసుకుంటుందా ? లేదా ? అనేది చూడాలి. 

వివాహిత అనుమానాస్పద మృతి

హైదరాబాద్ : నాగోల్ లో విషాదం నెలకొంది. ఓ వివాహిత అనుమానాస్పద మృతి చెందారు. ఈ ఏడాది ఆగస్టులో ఆనంద్ తో లావణ్య వివాహం అయింది. పెళ్లైన నాటి నుంచి ఆనంద్ ఉద్యోగం చేయడం లేదు. ఈనేపథ్యంలో లావణ్య అనుమానాస్పదంగా మృతి చెందారు. అత్తింటి వేధింపులే కారణమని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. లావణ్య భర్త ఆనంద్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

 

ఆ వసతి గృహాలు 2018 డిసెంబర్ నాటికి పూర్తి : మంత్రి నారాయణ

అమరావతి : ఐఏఎస్, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారుల వసతి గృహాలను 2018 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని మంత్రి నారాయణ అన్నారు. షీర్ వాల్ టెక్నాలజీతో నిర్మాణాలు చేస్తున్నామని తెలిపారు. రాజధాని పనులు మొత్తం ప్రారంభమయ్యాయని చెప్పారు. వారానికి రెండు రోజులు నిర్మాణ పనులు పరిశీలిస్తామని పేర్కొన్నారు. రెండు, మూడు రోజుల్లో అసెంబ్లీ సహా అన్ని డిజైన్లు ఖరారు చేస్తామన్నారు. డిజైన్లపై రాజమౌళితో ప్రిలిమినరీ మీటింగ్ నిర్వహించామని తెలిపారు. 

ఎమ్మెల్యే, ఐఏఎస్ అధికారుల వసతి గృహాల పనుల ప్రారంభం

అమరావతి : ఎమ్మెల్యే, ఐఏఎస్ అధికారులు, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ క్లాస్ 1,2,3,4 ఉద్యోగుల వసతి గృహాల పనులు ప్రారంభం అయ్యాయి. 85 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 3840 అపార్ట్ మెంట్లు నిర్మాణం జరుగనుంది. మొత్తం61 టవర్స్, ఒక్కో టవర్ ను జీప్లస్ 12గా నిర్మాణం చేయనున్నారు. 

సీఎం చంద్రబాబును కలిసిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురువు రవిశంకర్

అమరావతి : సీఎం చంద్రబాబును ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురువు రవిశంకర్ కలిశారు. 

సీఎం చంద్రబాబును కలిసిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురువు రవిశంకర్

అమరావతి : సీఎం చంద్రబాబును ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురువు రవిశంకర్ కలిశారు. 

ప్రకాశం జిల్లాలో ఇరువర్గాలు ఘర్షణ

ప్రకాశం : సంతమాగులూరు బీసీ కాలనీలో ఇరువర్గాలు ఘర్షణ పడ్డారు. స్థల విషయంలో సర్పంచ్ వీరనారాయణ, తన్నీరు రవి వర్గీయులు సరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఏడుగురికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు.

ఈనెల 13న మ.2 గం.లకు టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ

అమరావతి : ఈనెల 13న మధ్యాహ్నం 2 గంటలకు టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ జరుగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం కానుంది. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. 

మరోసారి సీబీఐటీ కాలేజీ విద్యార్థులు ఆందోళన

హైదరాబాద్ : మరోసారి సీబీఐటీ కాలేజీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఫీజు నియంత్రణపై ఈనెల 9న జరిగిన చర్చలో యాజమాన్యం ఇచ్చిన వెసులుబాటును విద్యార్థులు తిరస్కరించారు. శంకరపల్లి చౌరస్తాలో సీబీఐటీ బస్సులను విద్యార్థులు, విద్యార్థి సంఘం నేతలు అడ్డుకున్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. 

ముగ్గురు ఉగ్రవాదుల హతం...

ఢిల్లీ : ఉత్తర కాశ్మీరంలో ఉగ్రవాదులు..భారత బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం కాగా..మరొక ఉగ్రవాదిని సజీవంగా దొరికాడు.

09:46 - December 11, 2017

కరీంనగర్ : రోజంతా బ్యాంకులో లావాదేవీలు ఏం నడుపుతాం...ఒక్కసారైనా మందేద్దాం అని అనుకున్నాడో ఏమీ గానీ ఓ బ్యాంకు మేనేజర్ అదే పని చేశాడు. ఏకంగా ప్రజాప్రతినిధులతో మందు సేవించాడు. ఇది చూసిన బ్లూ కోర్టు పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది.

రామడుగు మండలం గోపాల్ రావు పేటలో ఆంధ్రా బ్యాంకు ఉంది. దీనికి చంద్రశేఖర్ బ్యాంకు మేనేజర్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ బ్యాంకులో 5వ తేదీ రాత్రి అధికారిక పార్టీ ఉప సర్పంచ్ నేరేళ్ల రాజుతో చంద్రశేఖర్ ఏకంగా మందు సేవించారు. మద్యం సేవిస్తున్నారని సమాచారం రావడంతో బ్లూ కోర్టు పోలీసులు వెళఙ్ల పరిశీలించారని, మద్యం సేవించినందుకు వారిని అదుపులోకి తీసుకన్నట్లు పోలీసు అధికారి తెలిపారు. 

09:39 - December 11, 2017

రాజమహేంద్రవరం : 'తమను వండుకోనివ్వడం లేదు..ఏ పని చేయనీయడం లేదు..రెండు నెలలుగా బాధిస్తున్నారు...ఎమ్మెల్యే..ఎంపీ చెప్పారంటూ సీపీ బెదిరిస్తున్నాడు..ఉన్న ఫళంగా వెళ్లిపోవాలంటే ఎక్కడకు పోవాలి'..అంటూ బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఇందిరా సత్యనగర్ లో నివాసం ఉంటున్న వంద నివాసాలు ఖాళీ చేయాలంటూ నగర కార్పొరేషన్ అధికారులు నోటీసులు ఇవ్వడంపై అక్కడి వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఉంటున్న తమను ఎలా ఖాళీ చేయాలని చెబుతారని, ఇక్కడ తాము లోకాయుక్తకు వెళ్లడం జరిగిందని..ఇళ్లు కట్టించి ఇవ్వాలని తీర్మానం చేసిందన్నారు. కానీ నగర కార్పొరేషన్ అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు.

పునరావాసం కల్పించాలంటూ ఇందిరా సత్యనగర్ వాసులు ఆందోళన చేశారు. నోటీసులివ్వడాన్ని నిరసిస్తూ ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక్కడనే తాము చాలాకాలంగా ఉంటున్నామని...ప్రస్తుతం అధికారులిచ్చి నోటీసులతో తాము రోడ్డున పడ్డామని వారు పేర్కొంటున్నారు. లోకాయుక్త తీర్పులోనూ పునరావాసం కల్పించాలని ఆదేశాలున్నా ఖాతరు చేయడం లేదని పేర్కొంటున్నారు.

09:30 - December 11, 2017

కర్నూలు : నందికొట్కూరు వద్ద మిడుతూరు వద్ద ఓ లారీ ఒకరి ప్రాణాలు తీసింది. పాదాచారులపైకి దూసుకెళ్లడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. జిందాల్ కంపెనీకి చెందిన ఓ లారీ అతివేగంతో పాదాచారులపైకి దూసుకొచ్చింది. పాలప్యాకెట్లు..ఇతరత్రా పనులపై బయటకు వచ్చిన ప్రజలు పరుగులు తీశారు. అక్కడనే ఉన్న సలాం...మరొక వ్యక్తిపైకి లారీ దూసుకొచ్చింది. సలాం అక్కడికక్కడనే మృతి చెందాగా మరొక వ్యక్తికి గాయాలయ్యాయి. ఇతడిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మిడుతూరులో లారీ బీభత్సం...

కర్నూలు : నందికొట్కూరు వద్ద మిడుతూరులో లారీ బీభత్సం సృష్టించింది. పాదాచారులపైకి ఓ జిందాల్ కంపెనీ లారీ దూసుకెళ్లడంతో ఒకరు మృతి చెందారు. బాధితులను ఆసుపత్రికి తరలించారు. 

09:22 - December 11, 2017

హైదరాబాద్ : దళితులపై దాడి చేయడమే కాకుండా ముక్కుతో నేలకు రాయించడం..నీటి కుంటలో మునక వేయించడానే ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేత భరత్ రెడ్డిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసినట్లు వార్తలొస్తున్నాయి. కానీ భరత్ రెడ్డి లొంగిపోయినట్లు తెలుస్తోంది. దాడి ఘటన అనంతరం భరత్ రెడ్డి 22 రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.

నిజామాబాద్ జిల్లాలోని అభంగపట్నంలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న ఇద్దరు దళితులపై భరత్ రెడ్డి దాడికి పాల్పడినట్లు, ఇందుకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దీనితో భరత్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని పలు సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. అనంతరం ఇద్దరు దళితులు కూడా కనిపించకపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కొన్ని రోజుల అనంతరం వారిద్దరూ మీడియా ఎదుట వచ్చి తాము నటించామని పేర్కొన్నారు. తరువాత తమను బెదిరించడంతో ఆ విధంగా చెప్పామని దళితులు పేర్కొన్నారు. ఆ ఇద్దరు దళితులకు పోలీసులు రక్షణ కల్పించారు. ప్రస్తుతం భరత్ రెడ్డిని నిజామాబాద్ జిల్లాకు తరలిస్తున్నారు. దీని గురించి పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి. 

భరత్ రెడ్డి లొంగిపోయాడా ?

హైదరాబాద్ : దళితులను దారుణంగా అవమానించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ మాజీ నేత భరత్‌రెడ్డి ఎట్టకేలకు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు వార్తలు వెలువడుతున్నాయి. దాదాపు నెలరోజుల నుంచి భరత్‌రెడ్డి అజ్ఞాతంలో ఉన్న సంగతి తెలిసిందే. పోలీసులు గాలిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో పోలీసుల ఎదుట లొంగిపోయినట్టు తెలుస్తోంది. ఇద్దరు దళితులపై దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దాడికి పాల్పడిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. 

నగరంలో చలి..

హైదరాబాద్ : నగరంలో చలి తీవ్రత పెరుగుతోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదివారం కనిష్ట ఉష్ణోగ్రత 15.9 డిగ్రీలుగా నమోదయ్యింది. ఉదయం..రాత్రి వేళల్లో బయటకు రావడానికి జనాలు జంకుతున్నారు. 

సీపీఎం నేతల గృహనిర్భందం...

తూర్పుగోదావరి : సెజ్ గ్రామాల్లో టిడిపి నేతలు ఇంటింటికి టిడిపి కార్యక్రమం నిర్వహించనుంది. అడ్డుకుంటారనే నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా సీపీఎం నేతలను పోలీసులు గృహ నిర్భందం చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి శేషబాబ్జీ, రైతు సంఘం నేత నాగేశ్వరరావుతో పాటు పలువురి నేతలను హౌస్ అరెస్టు చేశారు. 

08:03 - December 11, 2017
07:52 - December 11, 2017

గుజరాత్ ఎన్నికల్లో పాక్ జోక్యం చేసుకొంటోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆరోపణలు గుప్పించారు. దీనిపై కాంగ్రెస్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. పాకిస్థాన్‌ హైకమిషనర్‌తో కాంగ్రెస్‌ నేత మణిశంకర్‌ అయ్యర్‌, మాజీ ప్రధాని మనోహ్మన్‌ సింగ్‌ రహస్యంగా ఎందుకు భేటీ కావాల్సి వచ్చిందని మోడీ ప్రశ్నించారు. మరోవైపు సాగర్‌ నుంచి ఎడమ కాలువకు నీరు విడుదల చేసిన మంత్రి... చివరి ఆయకట్టుకు నీరు అందించడమే తమ లక్ష్యమన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రపంచ వ్యాప్తంగా గుర్తిస్తుంటే... ప్రతిపక్షాలు కోర్టుకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో నంద్యాల నర్సింహరెడ్డి (సీపీఎం), రాకేష్ (టీఆర్ఎస్), ఆచారీ (బీజేపీ), మహేష్ (టి.కాంగ్రెస్) నేతలు పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

జగన్ పాదయాత్ర 32వ రోజు...

అనంతపురం: వైసీపీ అధినేత జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర 32వ రోజుకు చేరుకుంది. ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలం నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. 

ఉగ్రవాదులు హతమయ్యారు...

జమ్మూ కాశ్మీర్ : బారాముల్లాలోని ఓ ప్రాంతాల్లో ఉగ్రవాదులకు..భారత బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఒక ఉగ్రవాదికి గాయాలయినట్లు తెలుస్తోంది. భారత బలగాలు సెర్చ్ నిర్వహిస్తున్నారు. 

పొగమంచుతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం...

ఢిల్లీ : దేశ రాజధానిని పొగమంచు వీడడం లేదు. ఈ కారణంగా రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. సోమవారం 17 ట్రైన్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. రెండు రైళ్ల సమయాల్లో మార్పులు చేయగా పది రైళ్లను రద్దు చేశారు. 

మాల్యా అప్పగింతపై కోర్టులో విచారణ...

లండన్‌: కింగ్‌ఫిషర్‌ సంస్థల మాజీ అధినేత, రుణ ఎగవేతదారు విజయ్‌ మాల్యాను భారత్‌కు అప్పగించే కేసును లండన్‌ వెస్ట్‌మినిస్టర్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు సోమవారం విచారించనుంది. బ్యాంకుల నుంచి తీసుకున్న వేల కోట్ల రుణాలను ఎగవేసి, లండన్‌ కు పారిపోయారని మాల్యా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. 

అహ్మదాబాద్ కు రాహుల్...

గుజరాత్ : నేడు అహ్మదాబాద్, జనస్ కంఠ, వడోదర, గాంధీనగర్ లో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ పర్యటించనున్నారు. ఆయా ప్రాంతాల్లో నిర్వహించే ఎన్నికల ప్రచార బహిరంగసభల్లో పాల్గొననున్నారు. 

ప.గో.కు రానున్న హడ్కో ఛైర్మన్...

పశ్చిమగోదావరి : నేడు హడ్కో ఛైర్మన్ జిల్లాలో పర్యటించనున్నారు. మహదేవపట్నంలో రూ. 2కోట్ల హడ్కో నిధులతో అభివృద్ధి పనులను రవికాంత్ ప్రారంభించనున్నారు. 

07:04 - December 11, 2017

ఇంట్రో ప్రైవేటీకరణ..ఈ పేరు వింటేనే కార్మిక, ఉద్యోగ వర్గాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగి ఆత్మహత్య చేసుకోవడం చూశాం. ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ లో ప్రైవేటీకరణను నిరసిస్తూ బీఎస్ఎన్‌ఎల్ ఎంప్లాయిస్ సమ్మెకు సిద్థమయ్యారు. ఈ సమ్మెకు గల కారణాలు, వారి డిమాండ్లపై టెన్ టివి జనపథంలో బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు సాంబశివ, రమేష్ విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి... 

పోలవరంపై త్రిసభ్య కమిటీ భేటీ...

విజయవాడ : నేడుపోలవరం ప్రాజెక్టుపై త్రిసభ్య కమిటీ సమావేశం జరుగనుంది. పోలవరం నిర్మాణంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. 

06:37 - December 11, 2017

చెన్నై : నటుడు విశాల్ ఎన్నికలలో పోటీ వ్యవహారం.. చెన్నై నిర్మాతల మండలిలో కుంపటి రగిలిస్తోంది. ఎన్నికలలో పోటీకి విశాల్‌ యత్నించడం... అధికారులు తిరస్కరించినప్పటికీ...ఇప్పుడు అదే వ్యవహారం నిర్మాతల మండలి, నడిగర్‌ సంఘంలో విభేదాలకు దారి తీసింది. ఈ అంశంపై నిర్మాతల మండలి కార్యవర్గ సమావేశంలో తీవ్ర ఘర్షణ తలెత్తిది. విశాల్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో.. కొందరు విశాల్‌ తన పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. అంతేకాకుండా... కొంతమంది విశాల్‌పైకి దాడికి యత్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సమావేశంలో గందరగోళం నెలకొనడంతో... విశాల్‌ అక్కడినుండి వెళ్లిపోయారు. కొంతమంది కావాలని తనను టార్గెట్‌ చేశారని... నిర్మాతల మండలికి, రాజకీయాలకు సంబంధం లేదన్నారు విశాల్‌. రాజకీయాలు తన పర్సనల్‌ వ్యవహారమన్నారు. దీనిపై పలువురు నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాల్‌కు గర్వం పెరిగిందన్నారు టి రాజేందర్‌. 

06:33 - December 11, 2017

హైదరాబాద్ : మల్కాజిగిరిలోని ఆనంద్ బాగ్ బృందావన్ గార్డెన్స్ లో చిన్నతరహా కుటీర పరిశ్రమల ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. బ్రాహ్మణ సమాజం ఆధ్వర్యంలో ఈ ఎగ్జిబిషన్‌ను నిర్వహించారు. ఇందులో సుమారు రెండు వందల స్టాల్స్ ఏర్పాటు చేశారు. చిన్నతరహా కుటీర పరిశ్రమల్లో ఉత్పత్తి అయిన వస్తువులు అందరికీ అందుబాటు ధరల్లో ఉన్నాయి. అన్ని రకాల వస్తువులు, వ్యాపారస్తుల సేవలతో పాటు బ్రాహ్మణ సంక్షేమ పథకాల అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బ్రాహ్మణ పరిషత్ తెలంగాణా ప్రభుత్వ సలహాదారుడు సముద్రాల వేణుగోపాల చారి పాల్గొన్నారు . 

06:31 - December 11, 2017

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం పెన్షన్‌ వ్యవస్థను ప్రైవేటీకరణ చేసేందుకు కుట్ర చేస్తోందని....ఆ కుట్రను అడ్డుకునేందుకు ఉద్యమించాలని ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ అన్నారు. కార్పొరేట్‌ శక్తులను బలోపేతం చేసేందుకు పెన్షన్‌ వ్యవస్థను ప్రైవేటీకరణ చేస్తున్నారని ధ్వజమెత్తారు. పెన్షన్‌ నిధులను అంబానీ,ఆదానిలకు రుణాలుగా ఇస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ సుందరయ్యవిజ్జాన కేంద్రంలో నేషనల్ ఫెడరేషన్ ఆఫ్‌ పోస్టల్‌ ఎంప్లాయిస్ తెలంగాణ సర్కిల్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సుకు ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 

06:30 - December 11, 2017

విశాఖపట్టణం : ఏషియా ఫౌండేషన్‌తో కలిసి క్యాన్సర్ భాదితులను ఆదుకోడానికి తాము కూడా ముందుంటామని సీఐటీయు రాష్ర్ట అధ్యక్షడు సీహెచ్.నర్సింరావు అన్నారు. ఏషియన్ ఫౌండేషన్ ప్రతిఏటా ఐదు వందల మంది కేన్సర్‌ బాధితులకు పెన్షన్లు అందిస్తుంది. వారిలో ఓ 200 మందికి సీఐటీయూ తరపున సాయం చేస్తామన్నారు నర్సింగరావు. ప్రభుత్వాలు క్యాన్సర్ పై అవగాహన కల్పించడంతో పాటు మేరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలన్నారు. ఈ సందర్భంగా ఏషియా షౌండేషన్ అధ్వర్యంలో విశాఖ బీచ్ రోడ్ లోని వైఎంసీఏ వద్ద విద్యార్ధులు నిర్వహించిన ప్లాష్ మాబ్ ఆకట్టుకుంది. 

06:28 - December 11, 2017

కర్నూలు : జిల్లా డోన్‌లో దారుణం జరిగింది. ఓ మద్యం దుకాణం వద్ద చిరు వ్యాపారుల మధ్య ఘర్షణ చెలరేగింది. పరస్పరం దాడులతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ వరదరాజులు అనే వ్యక్తి రక్షణ కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయించాడు. అయితే ఫిర్యాదు నమోదు చేయకుండా ఓ పోలీస్‌ అధికారి వరదరాజును చితకబాదాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాధితుడు యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అతడి పరిస్థితి విషమించడంతో కర్నూల్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసుల తీరువల్లే వరదరాజులు మృతిచెందాడని.. డోన్ పోలీసులపై చర్యలు తీసుకోవాలని బాధితుడి బంధువులు డిమాండ్ చేశారు. 

06:26 - December 11, 2017

కడప : అసలే దుర్మార్గుడు ఆపై పోలీస్‌ ఉద్యోగం.. ఇక అడ్డే లేదన్నట్టు రెచ్చిపోయాడా ఖాకీ. అక్రమ కేసులు పెట్టిస్తానంటూ.. పలువురు మహిళలను లొంగదీసుకున్నాడు. ముగ్గురు మహిళలను వివాహం చేసుకున్నాడు. భర్త వేధింపులు భరించలేక మహిళాకమిషన్‌ ను ఆశ్రయించింది మూడో భార్య. కడప జిల్లాలో ఓ పోలీస్‌ హెడ్‌కానిస్టేబుల్‌ బాగోతం ఇది. ఈమె పేరు యశోద. వయసు 23 ఏళ్ళు. ఇద్దరు పిల్లలు. 13 ఏళ్ల వయసులో 7వ తరగతి చదువుతుండగా.. తనపై అత్యాచారం చేసిన హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖర్‌.. బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తోంది. తనకు అయినవారు ఎవరూ లేకపోవడంతో.. చంద్రశేఖర్‌ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేవాడని యశోద ఆవేదనగా చెబుతోంది. పైగా ఈమధ్య ఇతర మగాళ్లతో గడపాలంటూ వేధిస్తున్నాడని ఏపీ మహిళాకమిషన్‌ చైర్మన్‌ నన్నపనేని రాజకుమారి ఎదుట కన్నీరు పెట్టుకుంది.

ఇదిగో ఈ ఫోటోలో కనిసిస్తున్న ఇతడే హెడ్‌కానిస్టేబుల్‌ చంద్రశేఖర్. కడప జిల్లా ఓబులవారిపల్లె మండల కేంద్రంలో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఒంటిమీద ఖాకీ డ్రెస్‌ ఉందన్న పొగరుతో.. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు. ఇప్పటికే మూడు పెళ్లిల్లు చేసుకున్నాడు. మండల పరిధిలో కీచకుడిగా మారిన హెడ్‌కానిస్టేబుల్‌ బాగోతాన్ని ఆయన మూడో భార్య యశోద బయటపెట్టింది. తనను వ్యభిచారం చేయాలంటూ నిత్యం వేధిస్తున్నాడని మహిళా కమిషన్‌ చైర్మన్‌ ముందు మొరపెట్టుకుంది. తన పెళ్లి ఫోటోలు, పిల్లల ఫోటోలు.. ఇతర బాధలు పెట్టిన ఆధారాలన్నింటిని చైర్మన్‌ ముందు బయటపెట్టింది బాధితురాలు. అంతటితోనే ఆగలేదు.. తప్పుడు కేసులు పెట్టి పరువు తీస్తానంటూ.. పలువురు మహిళలను వేధించి లొంగదీసుకున్నాడని బాధితురాలు ఆరోపిస్తోంది.

యశోధ ఫిర్యాదుపై స్పందించిన మహిళా కమిషన్‌ చైర్మన్‌ వెంటనే పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను ఫోన్ ద్వారా వివరించారు. హెడ్‌కానిస్టేబుల్‌ చంద్రశేఖర్ పై వెంటనే చర్యలు తసుకోవాలని ఆదేశించారు. నిందితుణ్ణి తక్షణం విధుల నుంచి, నిర్భయ చట్టం కింద కేసును నమోదు చేయాలన్నారు. మహిళా కమిషన్‌ ఆదేశాలతో అయినా ఈ కీచక ఖాకీపై కఠిన చర్యలు తీసుకుని, బాధితులకు న్యాయం చేయాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి. 

06:23 - December 11, 2017

విజయవాడ : వచ్చే ఎన్నిక‌ల్లో తమ వారసులను బరిలోకి దింపేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు రెడీ అవుతున్నారు. ఇప్పటినుంచే వారిని ప్రమోట్ చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. 2019 ఎన్నిక‌ల‌ బరిలో నిలవబోతున్న టీడీపీ వారసులు ఎవరు.....? ఇంతకీ ఆ పార్టీ అధినేత దృష్టిలో ఉన్న అభ్యర్థులు ఎవరు...? వాచ్ దిస్ స్టోరి..

టీడీపీలో ఇక నుంచి వార‌సులే కీ రోల్ పోషించ‌బోతున్నారా... అంటే ఔననే అంటున్నారు కొంద‌రు నేత‌లు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ వారసుల‌ను పోటీలో నిలిపేందుకు ఇప్పటినుంచే గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. వారికి పోలిటిక‌ల్ ట్రైనింగ్ సైతం ఇప్పిస్తున్నారు. ఇందులో ముందువరసలో ఉన్న నేత అనంత‌పురం ఎంపి జెసి దివాక‌ర్ రెడ్డి. జెసి తన కుమారుడు ప‌వ‌న్ కుమార్ రెడ్డిని అనంత ఎంపిగా నిల‌బెట్టేందుకు పావులు క‌దుపుతున్నారు. ప్రస్తుతం జెసి దివాక‌ర్ రెడ్డి ఎంపిగానూ... ఆయ‌న సోద‌రుడు ప్రభాక‌ర్ రెడ్డి తాడిప‌త్రి ఎమ్మెల్యేగానూ ఉన్నారు. ఐతే వ‌చ్చే ఎన్నిక‌ల్లో మాత్రం త‌న కుమారుడు జెసి ప‌వ‌న్ ను ఎంపిగా నిల‌బెట్టాల‌ని ప్రయ‌త్నాలు చేస్తున్నారు జెసి. ఈ మధ్య పలు సందర్బాలలో జెసి త‌న మ‌న‌సులో మాట‌ని బ‌య‌ట పెట్టారు. జెసి లాంటి సీనియ‌ర్ నేత కేవలం ఒక‌్క ఎంపి సీటుతోనే స‌రిపెట్టుకుంటాడా... అంటే అది ఇప్పుడే చెప్పలేని ప‌రిస్థితి. ఖ‌చ్చితంగా మ‌రో సీటు కూడా అడిగే అవ‌కాశాలు ఎక్కువే క‌నిపిస్తున్నాయి.

జేసీ బాటలోనే టీడీపీలోని మరికొందరు నేతలు తమ వారసులను రంగంలోకి దింపేందుకు ఇప్పటినుంచే స్కెచ్ వేస్తున్నారు. కొంతమంది వ‌య‌సు రీత్యా ప్రత్యక్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుని త‌మ వారసుల‌తో రంగప్రవేశం చేయించాలని భావిస్తున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన సీనియ‌ర్ నేత‌లు బోజ్జల గోపాల‌ కృష్ణారెడ్డి, గాలి ముద్దు కృష్ణమ‌ నాయుడు అదే యోచ‌నలో ఉన్నారు. ఈ ఇద్దరు నేత‌ల‌కు వ‌య‌సు పై బ‌డ‌టంతో త‌మ వార‌సుల‌ను రంగంలోకి దించితే ఎలా ఉంటుంద‌న్న ఆలోచ‌నలో ఉన్నారు. బోజ్జల త‌న‌యుడు సుధీర్ రెడ్డి వ‌చ్చే ఎన్నిక‌ల్లో శ్రీ‌కాళ‌హ‌స్తి నుంచి పోటిచేస్తార‌ని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇటీవల నియోజకవర్గ నేతలంతా సుధీర్ ని ఇంచార్జ్ గా నియమించాలని పార్టీ అధినేత చంద్రబాబుని కోరారు.

చిత్తూరు జిల్లా నగిరి నుంచి గాలి ముద్దు కృష్ణ మ‌నాయుడు త‌న‌యుడు భాను పోటీకి ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. చిత్తూరు నుంచి కె. సత్యప్రభ పాలిటిక్స్ నుంచి రిటైర్మెంట్ తీసుకుని తన కుమారుడు శ్రీనివాస్ ని బరిలో దించాలన్న వ్యూహంలో ఉన్నట్లు తెలుస్తోంది. అటు అనంత‌పురం జిల్లాకు చెందిన మంత్రి ప‌రిటాల సునీత త‌న‌యుడు శ్రీ‌రామ్ పొలిటిక‌ల్ ఎంట్రీపై కూడా జోరుగా ఊహ‌గానాలు వినిపిస్తున్నాయి. ఇక శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి సీనియర్ గౌతు శ్యాంసుందర్ శివాజీ తన కుమార్తె శిరీష ను ఈ సారి ఎన్నికల పోరులోకి దింపుతారనే ప్రచారం జరుగుతోంది. ఇక ప్రకాశం జిల్లాలో సీనియ‌ర్ నేత క‌ర‌ణం బ‌ల‌రామ్ కుమారుడు వెంక‌టేష్ గ‌తంలో పోటి చేసి ఓడిపోయారు. క‌ర‌ణం బ‌లరామ్ కు ఎమ్మెల్సీ ఇచ్చిన నేప‌థ్యంలో వెంక‌టేష్ ప‌రిస్థితి సందిగ్ధంగా మారింది.

ఇక నెల్లూరు జిల్లాలో ఆనం వివేక తన కుమారున్ని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించాలని భావిస్తున్నారు. ఇప్పటినుంచే కుమారుడి సీటు కోసం ప్రయ‌త్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఇక క‌ర్నూల్ జిల్లాలో టిజి వెంక‌టేష్, డిప్యూటి సియం కెయి కృష్ణమూర్తి వార‌సులు రంగంలోకి దిగుతారన్న ప్రచారం జరుగుతోంది. నంద్యాల నుంచి మండలి చైర్మన్ ఫరూఖ్ తనయుడు ఫిరోజ్ పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. గుంటూరు జిల్లాలో సీనియ‌ర్ నేత రాయ‌పాటి సాంబ‌శివరావు త‌న‌యుడు రంగారావు పోటి చేయాల‌ని భావిస్తున్నారు. అటు పశ్చిమగోదావరి జిల్లా సీనియర్ నేత బోళ్ల బుల్లిరామయ్య మనవడు రాజీవ్ కూడా ఏలూరు ఎం.పి గా పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కృష్ణా జిల్లాలో దేవినేని వార‌సులు అవినాష్‌, చందు వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటి చేస్తారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. మరో వైపు విశాఖ లో మంత్రి చింత‌కాయ‌ల అయ్యన్నపాత్రుడు తన కుమారుడు విజయ్ కూడా పోటి చేసే ఆలోచనలో ఉన్నారు. అటు పెందుర్తి ఎమ్మెల్యే బండారు స‌త్యనారాయ‌ణ మూర్తి కుమారుడు అప్పల నాయుడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటి చేయాల‌ని ఆశ‌ప‌డుతున్నారు. స్పీకర్ కోడెల కూడా తన కుమారుడు శివరామ్ కు సీటు ఆశిస్తున్నట్లు సమాచారం. ఐతే వీరంతా వీలైతే త‌మ‌కు ఒక టికెట్‌ ఇవ్వడంతో పాటు... త‌మ వారసుల‌కూ టికెట్ సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గాలు పెరిగే అవ‌కాశాలు ఉన్నాయ‌ని వార్తలు వినిపిస్తున్న నేప‌థ్యంలో ఎవ‌రి స్థాయిలో పావులు కదుపుతున్నారు. నియోజ‌క‌వ‌ర్గాల పెరిగినట్లైతే ఒక్కో జిల్లాకు సుమారు మూడు, నాలుగు నియోజ‌క‌వ‌ర్గాలు పెరిగే అవ‌కాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయా నేతలు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొద‌లు పెట్టారు.

జమ్మూ కాశ్మీర్ లో భూ ప్రకంపనాలు..

జమ్మూ : జమ్మూ కాశ్మీర్ లో భూ ప్రకంపనాలు చోటు చేసుకున్నాయి. సోమవారం ఉదయం 4.28 నిమిషాలకు ఈ ఘటన చోటు చేసుకుంది. రిక్టర్ స్కేల్ పై 4.5గా నమోదైంది. 

చెన్నైలో నిర్మాతల మండలిలో విబేధాలు..

చెన్నై : సినీ నటుడు విశాల్ ఎన్నికలలో పోటీ వ్యవహారం సొంత గూటిలో కుంపటి రగిలిస్తోంది. ఎన్నికలలో పోటీకి విశాల్‌ యత్నించడం, అధికారులు తిరస్కరించినప్పటికీ... ఇప్పుడు అదే వ్యవహారం నిర్మాతల మండలి, నడిగర్‌ సంఘంలో విభేదాలకు దారి తీసింది. ఈ అంశంపై నిర్మాతల మండలి కార్యవర్గ సమావేశంలో తీవ్ర ఘర్షణ తలెత్తింది.

ఇటలీలో ఒక్కటి కాబోతున్న అనుష్క..కోహ్లీ..!

ఢిల్లీ : ప్రేమ పేరుతో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన అనుష్క..కోహ్లీ లు ఈ నెల 12న ఒకటి కాబోతున్నారు. విరాట్‌ కోహ్లీ-అనుష్క శర్మల పెళ్లిపై ఎంతో కాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నా.. తాజాగా వారిద్దరు ఈ వారంలో ఒకటి కాబోతున్నారు. మొత్తానికి ఎన్నో రోజులుగా కోహ్లీ-అనుష్కలు పెళ్లి చేసుకుంటున్నారన్న ప్రచారానికి ఈ వారంలో తెరపడనుంది. ఇండియాలో కాకుండా ఇటలీలో వారిద్దరూ ఒకటి కాబోతున్నారు. 

అమరావతిపై రాజమౌళి ప్రజెంటేషన్...

విజయవాడ : రాజధాని అమరావతి పరిపాలన నగరం, శాసనసభ భవనాల నిర్మాణాలపై సీఆర్‌‌డీఏ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఫోస్టర్ అండ్ పార్టనర్స్ రూపొందించిన పలు ఆకృతులపై దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి ప్రజెంటేషన్ ఇచ్చారు.

బుమ్రా ఇంట్లో విషాదం..

ఢిల్లీ : టీమిండియా క్రికెటర్ బుమ్రా ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. బుమ్రా తాత సంతోష్ కన్నుమూశారు. గుజరాత్ లోని సబర్మతి నదిలో మృతదేహం లభ్యమైంది. కొడుకును చూసేందుకు వెళ్లిన సంతోష్ డిసెంబర్ 5వ తేదీ నుండి కనిపించుకుండా పోయారు. 

ట్రాఫిక్ ఎస్ఐ ఆత్మహత్యాయత్నం...

తూ.గో. : రాజమహేంద్రవరంలో ట్రాఫిక్ ఎస్ఐ ప్రభాకర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించారు. 

డోన్ ఎస్ఐ కొట్టాడని...

కర్నూలు : డోన్ లో చిరు వ్యాపారి వరదరాజులు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డోన్ ఎస్ఐ తీవ్రంగా కొట్టడంతో మనస్థాపంతో వరదరాజులు యాసిడ్ తాగాడు. కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్ఐ కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. 

Don't Miss