Activities calendar

12 December 2017

22:13 - December 12, 2017

విశాఖ : రెండు సార్లు వన్డే వరల్డ్‌ చాంపియన్‌ భారత్‌, శ్రీలంకతో అసలు సిసలు సమరానికి సన్నద్ధమైంది. భారత్‌,శ్రీలంక రెండో వన్డేకు మొహాలీలోని పంజాబ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ క్రికెట్‌ స్టేడియంలో రంగం సిద్ధమైంది. తిసెరా పెరీరా సారధ్యంలోని శ్రీలంక మరోసారి సంచలనం సృష్టించాలని తహతహలాడుతుండగా....తొలి వన్డేలో తేలిపోయిన టీమిండియా సెకండ్‌ వన్డేలో నెగ్గి సిరీస్‌ సమం చేయాలని పట్టుదలతో ఉంది.ప్రపంచంలో అత్యుత్తమ బ్యాటింగ్‌ లైనప్‌ కలిగిన భారత జట్టు తొలి వన్డేలో 112 పరుగులకే కుప్పకూలింది.ధోనీ ఫైటింగ్‌ హాఫ్‌ సెంచరీతో పరువుదక్కించుకున్న భారత్‌...రెండో వన్డేలో స్థాయికి తగ్గట్టుగా రాణించాలని భావిస్తోంది.ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌ గాడిలో పడితే భారత బ్యాటింగ్‌కు తిరుగుండదు.ధోనీ ఫామ్‌లో ఉండటం భారత్‌కు పెద్ద ప్లస్‌ పాయింట్‌ అనడంలో అనుమానమే లేదు.

భారత్‌ బౌలింగ్‌ ఎటాక్‌
చహాల్‌, జస్ప్రీత్‌ బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌లతో భారత్‌ బౌలింగ్‌ ఎటాక్‌ పదునుగానే ఉంది. తొలి వన్డేలో విఫలమైన శ్రేయస్‌ అయ్యర్‌, దినేష్‌ కార్తీక్‌ స్థానాల్లో అజింక్య రహానే, కే ఎల్‌ రాహుల్‌ను ఆడించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.మరోవైపు శ్రీలంక జట్టు రెట్టించిన ఉత్సాహంతో ఉరకలేస్తోంది. ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి ధరమ్‌సాల వన్డేలో సంచలన విజయం సాధించిన లంక సిరీస్‌ విజయం సాధించి భారత్‌కు షాకివ్వాలని భావిస్తోంది.ఇక వన్డే ఫేస్‌ టు ఫేస్‌ రికార్డ్‌లోనూ శ్రీలంకపై ఇండియాదే పై చేయిగా ఉంది.ఇప్పటివరకూ ఇరు జట్లు 156 వన్డేల్లో పోటీ పడగా భారత్‌ 88 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా...శ్రీలంక 56 మ్యాచ్‌ల్లో నెగ్గింది.మరి ఈ డూ ఆర్‌ డై వన్డేలో టీమిండియా స్థాయికి తగ్గట్టుగా రాణిస్తుందో లేదో తెలియాలంటే మరికొద్దిగంటలు వెయిట్ చేయాల్సిందే. కానీ శ్రీలంక జట్టును తక్కువ అంచనా వేస్తే భారత జట్టుకు మరోసారి భంగపాటు తప్పదు.  

22:11 - December 12, 2017

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా BSNL ఉద్యోగులు, కార్మికులు రెండు రోజుల పాటు సమ్మె చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం, టెలికాం శాఖ తమ సమస్యలను పట్టించుకోవడం లేదని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. వేతన సవరణ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. మూడవ పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, రెండవ పీఆర్సీలో మిగిలిన పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సెల్ టవర్ల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి బిఎస్ఎన్ఎల్‌ని ముక్కలు చేయాలని కుట్రలు చేస్తున్నారని ఉద్యోగ సంఘాల నేతలు మండిపడ్డారు. వెంటనే సెల్ టవర్ల విభాగాన్ని ఏర్పాటు చేసే యోచనను విరమించుకోవాలన్నారు.

22:09 - December 12, 2017

హైదరాబాద్ : మటన్‌సూప్‌..బలవర్దకమైన ఆహారం..నాన్‌వెజ్‌ ప్రియులకు ఎంతో ఇష్టమైనది. కానీ ఓ మటన్‌సూప్‌ నాగర్‌కర్నూలు జిల్లా సుధాకర్‌రెడ్డి హత్య కేసు చిక్కుముడి వీడేలా చేసింది. ఆ మటన్‌సూపే భర్తను చంపి ప్రియుడిని మార్చేందుకు యత్నించిన స్వాతి గుట్టును రట్టు చేసింది. సంచలనం సృష్టించిన నాగర్‌కర్నూలు సుధాకర్‌ రెడ్డి హత్యకేసులో కొత్తకోణం బయటపడింది. భర్త సుధాకర్‌రెడ్డిని హత్య చేసి ప్రియుడి రాజేశ్‌ను ఆ స్థానంలో పెట్టాలని స్వాతి పన్నిన పథకం ఎలా బయటపడిందన్న విషయం హాట్‌టాఫిక్‌గా మారింది. స్వాతి ప్రియుడు రాజేశ్‌కు ఉన్న అలవాట్లే అతడు సుధాకర్‌రెడ్డి కాదన్న నిజాన్ని బయటపెట్టాయి. హైదరాబాద్‌లోని అపోలో డీఆర్‌డీఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజేశ్‌కు ఆస్పత్రి సిబ్బంది మటన్‌ సూప్‌ ఇచ్చారు. కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న వారికి బలవర్దకమైన ఆహారంగా ఆస్పత్రిలో మటన్‌ సూప్‌ ఇస్తుంటారు.

కుటుంబసభ్యులకు అనుమానం
అయితే రాజేష్‌ సూప్‌ తాగేందుకు నిరాకరించాడు. మరోవైపు సుధాకర్‌రెడ్డికి మటన్‌ సూప్‌ అంటే ఎంతో ఇష్టం. దీంతో సుధాకర్‌రెడ్డి కుటుంబసభ్యులకు అనుమానం వచ్చింది. ఆ అనుమానంతోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.రంగంలోకి దిగిన పోలీసులు ఆస్పత్రిలో స్వాతిని ప్రశ్నించడంతో డొంకంతా కదిలింది. ప్రియుడితో కలిసి భర్త సుధాకర్‌రెడ్డినిహత్య చేసినట్లు అంగీకరించింది. రాజేష్‌ శాఖహారి కావడం వల్లే మటన్‌ సూప్‌ తాగేందుకు నిరాకరించాడని..ఆ క్లూనే వారి దారుణాలను బయటపెట్టిందని పోలీసులు తెలిపారు. ఇప్పటికే స్వాతిని రిమాండ్‌కు తరలించిన పోలీసులు.. ప్రియుడు రాజేశ్‌ను అదుపులోకి తీసుకోనున్నారు. ఆస్పత్రిలో కోలుకున్న వెంటనే అతన్ని అరెస్ట్‌ చేయనున్నారు. 

22:08 - December 12, 2017

హైదరాబాద్ : ఉపాధ్యాయ నియామక పరీక్ష నోటిఫికేషన్‌కు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సవరణ చేసింది. పాత 10 జిల్లాలకు అనుగుణంగా మార్పులు చేసింది. ప్రత్యేక బీఈడీ, డీఈడీ చదివిన వారు కూడా పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించింది. గతంలో 8,792 పోస్టుల భర్తీ కోసం.. 31 జిల్లాల ప్రాతిపదికన నోటిఫికేషన్‌ ఇవ్వడంతో కొంతమంది కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు.. రాష్ట్ర ప్రభుత్వం జీవోను సవరించి విడుదల చేసింది. ఈనెల 15తో ముగియనున్న గడువును... 30వ తేదీ వరకు పొడిగించింది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని టీఎస్‌పీఎస్సీ స్పష్టం చేసింది. అయితే.. జిల్లాలను అభ్యర్థులు అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది. 

22:05 - December 12, 2017

హైదరాబాద్ : బీసీ సబ్‌ప్లాన్‌ ఏర్పాటుపై మంత్రి జోగురామన్న బీసీ కులాల అభిప్రాయాలను రేపు... సీఎం కేసీఆర్‌కు నివేదించనున్నారు. బీసీ సబ్‌ప్లాన్‌ ఏర్పాటుకు ఇది మొదటి ప్రతిపాదనగా మంత్రి తెలిపారు. మొత్తం 20 ప్రతిపాదనలతో నివేదిక ఇవ్వనున్నట్లు జోగు రామన్న స్పష్టం చేశారు.

22:02 - December 12, 2017

హైదరాబాద్ : రైతులు నూటికి నూరు శాతం తమ ఆటోస్టార్టర్లు తొలగించుకుంటేనే వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇవ్వడం వల్ల లాభం కలుగుతుందన్నారు సీఎం కేసీఆర్‌. డిసెంబర్ 31 అర్ధరాత్రి నుంచి వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా ప్రారంభించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో... ప్రగతి భవన్‌లో మంత్రులు, అధికారులు, విద్యుత్‌శాఖ అధికారులతో కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. విద్యుత్‌శాఖ 12 వేల కోట్లకు పైగా వ్యయం చేసి.. రైతులకు 24 గంటలు విద్యుత్‌ ఇచ్చేందుకు సిద్ధమైందన్నారు సీఎం. రైతుల మేలు కోసమే 24 గంటల కరెంట్‌ ఇవ్వాలని నిర్ణయించామని... తమను తాము నష్టపరుచుకునే విధంగా రైతులు వ్యవహరించరనే నమ్మకం తనకుందన్నారు సీఎం. గతంలో కరెంటుపై నమ్మకం లేక ఆటోస్టార్టర్లు పెట్టుకున్నారని... ఇప్పుడు కరెంట్‌ 24 గంటలు అందుబాటులో ఉంటుంది కాబట్టి ఆటోస్టార్టర్ల అవసరం లేదన్నారు. మంత్రులు, ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులతో పాటు విద్యుత్‌శాఖ అధికారులు ఆటోస్టార్టర్ల వల్ల కలిగే అనర్ధాలను రైతులకు వివరించాలన్నారు సీఎం.

ప్రతికూల ఫలితాలు వచ్చే ప్రమాదం
ఆటోస్టార్టర్లు పూర్తిగా తొలగించుకోకపోతే ప్రతికూల ఫలితాలు వచ్చే ప్రమాదం కూడా ఉందని పలువురు అభిప్రాయపడ్డారు. దీనిపై స్పందించిన కేసీఆర్‌... వ్యవసాయానికి 24 గంటల సరఫరాతో రైతులు పూర్తిస్థాయిలో లబ్ధి పొందే వ్యూహం ఖరారు చేయాలన్నారు. ఆటోస్టార్లర్లు తొలగించుకోవడంతో పాటు... అవసరం మేరకు మోటార్లతో నీరు తోడుకునేలా రైతుల్లో అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. రైతులను ఒప్పించి వంద శాతం ఆటోస్టార్టర్లు తొలగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. 24 గంటలు విద్యుత్ సరఫరా వల్ల మంచి ఫలితాలు సాధించేందుకు అందరూ సమిష్టి పాటుపడాలన్నారు కేసీఆర్‌. 24 గంటల విద్యుత్‌ సరఫరా భారన్ని అంతా ప్రభుత్వమే భరిస్తుందని విద్యుత్‌ సంస్థలకు కేసీఆర్ హామీ ఇచ్చారు. జనవరి 1 నుంచి ఇచ్చే కరెంట్‌ ఖర్చును ఈ ఏడాది బడ్జెట్‌ నుంచి కేటాయిస్తామని... వచ్చే బడ్జెట్‌లో విద్యుత్‌ సబ్సిడీలకిచ్చే డబ్బులను అదనంగా కేటాయిస్తామని తెలిపారు. అత్యంత క్రమశిక్షణతో నడుస్తున్న విద్యుత్‌ సంస్థలను కాపాడుకుంటామన్నారు కేసీఆర్‌. ఇక వచ్చే ఏడాది నుంచి ఎత్తిపోతల పథకాలయ్యే విద్యుత్‌ బిల్లులను కూడా ప్రభుత్వమే భరిస్తుందన్నారు కేసీఆర్‌. వచ్చే ఏడాది వర్షాకాలం నుంచి కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల లిఫ్టులు పని చేస్తాయి కాబట్టి అందుకు విద్యుత్‌ శాఖ అధికారులు సిద్ధంగా ఉండాలని కేసీఆర్‌ సూచించారు. 

22:01 - December 12, 2017

గుంటూరు : రేపు ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. పోలవరం ప్రాజెక్టుపై జలవనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరితో చర్చించనున్నారు. మధ్యాహ్నం పోలవరం ప్రాజెక్టు ఆర్థిక అంశాలపై సీఎంతో భేటీ అయిన త్రిసభ్య కమిటీ సమావేశం తర్వాత గడ్కరికి ఫోన్‌ చేశారు. ప్రాజెక్టు వివరాలను గడ్కరికి వివరించారు. అయితే ఢిల్లీకి రావాలని చంద్రబాబును గడ్కరి ఆహ్వానించారు. 

21:59 - December 12, 2017

గుంటూరు : పోలవరం ప్రాజెక్టుపై ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలకు ఉన్న సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనన్నారు సీఎం చంద్రబాబునాయుడు. అమరావతిలో వివిధ శాఖల కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అంశం చర్చకు వచ్చింది. ఒడిశా ప్రభుత్వం సుప్రీంకోర్టుకు రాసిన లేఖను సీఎం పేషీ అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన చంద్రబాబు... జాతీయ ప్రాజెక్టు కావడంతో ముఖ్యమంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రధానిదేనని స్పష్టం చేశారు. దీనిపై ఇప్పటికే తాను ఒడిశా సీఎంతో మాట్లాడానని, రాజకీయ ఒత్తిడి వల్లే పోలవరం విషయంలో ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారన్నారు. ఛత్తీస్‌గఢ్‌ సీఎంకు పరిస్థితి వివరించాక ఆయన మౌనంగానే ఉన్నారన్నారు. ఇక పోలవరం లెక్కలన్నీ.. ఆన్‌లైన్‌లో పెట్టాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రాజెక్ట్‌కు గతంలో పెట్టిన ఖర్చు,.. రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చుల వివరాలను పొందుపర్చాలన్నారు. అలాగే ఇప్పటివరకు కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలను కూడా ఆన్‌లైన్‌లో పెట్టాలన్నారు చంద్రబాబు.

రెండు త్రైమాసికాల్లో మెరుగైన ఫలితాలు
రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరం రెండు త్రైమాసికాల్లో మెరుగైన ఫలితాలు సాధించినా నిర్దేశిత లక్ష్య సాధనలో ఉన్న ఇబ్బందులు, రాబోయే కాలంలో 15.64 శాతం వృద్ధి ఎలా సాధించాలనే అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ప్రతి త్రైమాసికం నాకో పరీక్ష అని చంద్రబాబు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లతో మాట్లాడిన చంద్రబాబు.. ఇది సన్నాహక సమావేశమన్నారు. నాలెడ్జ్‌ మనలోనే ఉన్నంత వరకు అది థియిరీ మాత్రమేనని... క్షేత్రస్థాయికి వెళ్లి అమలు జరిగినప్పుడే దానికి సార్ధకత జరుగుతుందన్నారు చంద్రబాబు.

రెండు పారిశ్రామిక కారిడార్లలో 7 నోడ్లు
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర అవతరణ దినోత్సవాలను కూడా నిర్వహించుకోవడం లేదన్నారు చంద్రబాబు. తలసరి ఆదాయంలో మిగిలిన రాష్ట్రాలకే ముందుండేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నామన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలపై పూర్తి ఫోకస్‌ పెట్టి మెరుగైన ఫలితాలు సాధిస్తున్నామన్నారు. రెండు పారిశ్రామిక కారిడార్లలో 7 నోడ్లు వచ్చే అవకాశముందన్నారు. రాష్ట్రంలో చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యేకంగా MSMW కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తున్నామన్నారు. విజయవాడ శివారు జక్కంపూడిలో ఎకనామిక్ సిటీ నిర్మాణం... దేశంలోనే రోల్‌ మోడల్‌గా నిలుస్తుందన్నారు చంద్రబాబు. ప్రస్తుతానికి సేకరించిన 235 ఎకరాల్లోనే పనులు ప్రారంభించాలని అధికారులను సీఎం రుస్తుంజీ ఆధ్వర్యంలో అప్పట్లో పాలనాపరమైన సంస్కరణలు తీసుకొచ్చామని... ఇప్పుడు సాంకేతిక రంగ ప్రవేశంతో పరిస్థితులు మారిపోయాయన్నారు చంద్రబాబు. పాలనాపరమైన అంశాలలో మళ్లీ అవసరమైన మార్పులు తీసుకురావాల్సిన అవసరముందన్నారు. పౌర సంబంధ సేవలు, పాలనాపరమైన విధానాలలో కొన్ని శాఖలు తమ బిజినెస్‌ రూల్స్‌ మార్చుకోవాల్సిన అవసరముందన్నారు చంద్రబాబు. స్వయం సమృద్దే లక్ష్యంగా వచ్చే ఏడాది జనవరి 2 నుంచి 'జన్మభూమి-మాఊరు' కార్యక్రమాన్ని నిర్వహిచాలని యోచిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. 

రేపు సీఎం వద్దకు బీసీ కులాల నివేదిక

హైదరాబాద్ : రేపు బీసీ కులాల అభిప్రాయాల నివేదికను సీఎం కేసీఆర్ కు మంత్ర జోగు రామన్న అందచేయనున్నారు. వారి నివేదికలో మొదటి ప్రతిపాదనగా బీసీ సబ్ ప్లాన్ ఉంది. 

ఓయూలో జాతీయ సైన్స్ కాంగ్రెస్

హైదరాబాద్ : జాతీయ సైన్స్ కాంగ్రెస్ కు సారి ఉస్మానియా యూనివర్శిటీ అతిథ్యం ఇవ్వనుంది. ఉస్మానియా శతాబ్ది ఉత్సవాల సందర్బంగా సైన్స్ కాంగ్రెస్ కి ఓయూ అతిథ్యం ఇచ్చే అవకాశం వచ్చింది.

గవర్నర్ తో సీఎం కేసీఆర్ భేటీ

హైదరాబాద్ : తెలుగు రాష్ఱ్రాల గవర్నర్ నరసింహన్ తెలంగాణ సీఎం కేసీఆర్ కలిశారు, ప్రపంచ తెలుగు మహాసభలకు నరసింహన్ కేసీఆర్ ఆహ్వానించారు. 

20:41 - December 12, 2017

మీ సొమ్ముకు భరోసా పోతోందా? భద్రంగా బ్యాంకుల్లో ఉందనుకున్న సొమ్ము ఏ రాత్రో చడీ చప్పుడు కాకుండా గుటుక్కుమంటుందా? బ్యాంకులు ఏ మాత్రం నమ్మకాన్ని ఇవ్వటానికి రెడీగా లేవా? ఇప్పటికే జీఎస్టీ, నోట్ల రద్దు.. అంటూ ప్రయోగాలు చేసిన మోడీ సర్కారు.. ఐఎఫ్ డి ఆర్ బిల్లుతో బ్యాకింగ్ రంగాన్ని సామాన్యులకు ఉపయోగపడని విధంగా, అపనమ్మకంగా మార్చే ప్రమాదం ఉందా. ప్రపంచం ఏ స్థాయిలో ఆర్ధిక ఒడిదుడుకులను చూసినా, మన దేశం ఒకింత సురక్షితంగా ఉందనే చెప్పాలి. దీనికి కారణం మన సుస్థిమైన బ్యాంకింగ్ వ్యవస్థ. ఇందులో కూడా వేలకు వేలు అప్పులిచ్చి... బ్యాంకులు వసూలు చేయటేని సందర్భాలున్నా.. ఇప్పటికైనా సామాన్యుడి నమ్మకాన్ని కోల్పోలేదనే చెప్పాలి. మరి ఈ పరిస్థితి భవిష్యత్తులో కనిపించదా?

ఈ మాటలోనే కొండంత భరోసా.. అంతులేని భద్రత..మన సొమ్ము ఎటూ పోదన్న నమ్మకం.. భవిష్యత్తు పట్ల ఆశ.. మరి ఇదంతా గతం కానుందా? భవిష్యత్తులో బ్యాంకుల తీరు పూర్తిగా మారనుందా? ఇప్పటివరకు బ్యాంకులు దివాలా తీస్తే ఏం చేసేవారు? ఎఫ్ ఆర్ డీ ఐ చట్టంగా మారితే జరిగే మార్పులేంటి?ఇలాగే సాగితే బ్యాంకుల ప్యూచర్ ఏంటో అర్ధం కాని సిచ్యుయేషన్.. సామాన్యుడి సొమ్ము ఏమవుతుందో చెప్పలేని పరిస్థితి. ఓ పక్క బడాబాబులకు వేల కోట్లు ధారాదత్తం చేసే బ్యాంకులు సామాన్యుడి సొమ్ము విషయంలో కుట్రలకు దిగుతున్నాయి. కష్టపడి సంపాదించిన సొమ్మును కాజేసే నీచప్రయత్నాలకు దిగుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. మోడీ సర్కారు సామాన్యుడి జీవితాలతో చేస్తున్న ప్రయోగాలే ఇవి అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ రంగంలోనిదంతా ప్రైవేటు పరంచేసే ప్రయత్నాలు..జాతి ఆస్తులను ఎగనమ్మే కుట్రలు..ఉమ్మడి సొత్తును కాజేసే దారుణ ప్రయత్నం.. సుస్థిర బ్యాంకింగ్ వ్యవస్థను బలహీన పరిచే ప్రయత్నాలు..బ్యాంకుల అప్పుల భారాన్ని ప్రజలపై రుద్దే కుట్రలు.. ఇవన్నీ ఇప్పుడు కనిపిస్తున్న అంశాలు.. ఇవేవీ మన దేశానికి సురక్షితం కాదని పరిశీలకులు తేల్చి చెప్తున్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

 

 

20:38 - December 12, 2017

అమ్మా చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభమ్మా..? మందికేనా మీరు నీతులు జెప్పేది లేకపోతె మీరు గూడ ఏమన్న పాటించేది ఉంటదా..? మీ ముఖ్యమంత్రిగారు ఇట్లనే జెప్పిండా..? మీరు గెల్వంగనే.. వాన్ని తన్నుండ్రి.. వీన్ని దన్నుండ్రి.. ఎదురుదిర్గినోన్ని గెదిమికొట్టుండ్రి.. ప్రజలని గూడ జూడకుండ్రి అని చెప్పిండా ఎట్ల..? ఎట్లాని గొట్టినవ్ టోల్ గోళ్లను..? ఏం కథ..?

ప్రజలను గల్వలేనంత బిజీగున్నరా ఎట్ల తెల్గురాష్ట్రాల ముఖ్యమంత్రులు.. తెలంగాణ ముఖ్యమంత్రిగారైతె ప్రగతి భవన్ల అడ్గేవెట్టనియ్యడు అది వేరే ముచ్చటగని.. కనీసం ప్రజలమన్షిని అని చెప్కతిర్గె చంద్రాలన్న ప్రజలను కల్వకపోతె.. మరి ఆయన ముఖ్యమంత్రి గిరి ఎందుకు..? ఏం కథ..? విజయనగరం జిల్లా కెళ్లొచ్చిన ఒక మహిళ చంద్రాలు దొర్కుతలేడని ఏం ఉపాయం జేశిందో సూడుండ్రిగ..

అరే నాయన ఈ నారాయణఖేడ్ పోలీసోళ్లకు ప్రత్యేక చట్టాలు.. ప్రత్యేక అర్హతలు ఏమన్న ఇచ్చిండ్రా ఎట్ల..? ప్రజల సొమ్ముతోని జీతం దీస్కుంట ప్రజలకు సేవ జేయుండ్రిరా వారీ అంటే ప్రజలను గొడ్లను గొట్టినట్టు గొట్టిస్తున్నరు.. మరి ఎవ్వని బిర్రు జూస్కోని ఈ తీర్గ ఎగురుతున్నరో ఏమోగని.. తినేది మొగని సొమ్ము పాడేది ఎవ్వలి పాటనో అన్నట్టు ప్రజలిచ్చెజీతం దీస్కుంట.. నాయకులకు కొమ్ముగాస్తున్నరుగదా..?

ధైర్యం నాతాన దండిగున్నది.. చెప్పులు దేపోరా మొగడా నిప్పులళ్ల దుంకుతా అన్నదట ఎన్కటికి ఒకామే.. సేమ్ కరీంనగర్ జిల్లా జమ్మికుంట పోలీసోళ్లు పనిగూడ అట్లనే ఉన్నది.. వీళ్లే దొంగలకు సద్దిగట్టి వీళ్లే అక్రమార్కులను రక్షించుకుంటుంటే.. వీళ్లు పోలీసోళ్లు ఎట్లైతరు..? బ్రోకర్లు గదా కావాల్సింది..? ఔషధ ప్రయోగం కేసును ఎట్ల ఆగం జేశిండ్రో సూడుండ్రి..

అభివృద్ధిని జేస్తుంటె అడ్డుకుంటున్నరని విపక్షాలను తిట్టె తెలంగాణ ప్రభుత్వం.. మరి అభివృద్ధి జేయుండ్రి అని జనం మొత్తుకుంటుంటె గూడ ఎందుకు జేస్తలేదు ఒక్కొక్కతాన.. నంది మేడారం పనులు జల్దిన కంప్లీట్ జేశి.. యాసంగి పంటకు గూడ నీళ్లు అందెతట్టు జూడుమని అక్కడి జనం మొత్తుకుంటున్నరు.. మరి ఎందుకు జేస్తలేరు.. అండ్ల ఏం మిగుల్తలేవా ఎట్ల..?

తండ్రి వికలాంగుడు.. ముగ్గురు ఆడపిల్లలు చిన్నచిన్నోళ్లు.. ఉన్నది రెండు ఎక్రాల భూమి.. ఈ భూమిని సర్కారోళ్లు ప్రాజెక్టుల పేరుతోని గుంజుకోవాల్నని సూస్తున్నరట.. సర్కారు సద్విచ్చె పాయమాలుతోని ముగ్గురు ఆడివిల్లల పెండ్లీలు అయ్యి వాళ్ల భవిష్యత్తు మార్తదా..? ఎవ్వలికి జెప్పుకోవాల్నో అర్థంగాక.. ఆ ఆడపిల్లలు ఏడ్సుకుంట ఏమంటున్నరో ఇనుండ్రి..

తెలంగాణ పోలీసోళ్లే గొప్పోళ్లు అనుకున్నంగని.. ఆంధ్రా పోలీసోళ్లు గూడ అత్యంత ప్రతిభావంతులు తయ్యారైండ్రుగదా..? ఠాగూర్ సీన్మల సచ్చిపోయిన శవానికి వైద్యం జేశే సీను ఉంటదిగదా..? అగో అదే యాదికొస్తున్నది ఈళ్ల పనితనం జూస్తుంటే.. సచ్చి స్వర్గానికి జేరిన డీఎస్పీగారికి ట్రాన్స్ ఫర్ ఆర్డర్ వంపిండ్రంటే తమాష గాకపోతే ఏందిది..?

ఆవుకు పెండ్లీలు జేయంగ జూశ్నం.. శ్రీమంతాలు జేయంగ జూశ్నంగని.. సచ్చిపోయిన ఆవుకు సావు జేయంగ జూశిండ్రా.. అది గూడ మన్సులకు ఎట్ల జేస్తరో ఒక సచ్చిపోయిన ఆవుకు అట్లనే జేశిండ్రు.. మాజీ నల్లగొండ జిల్లా అడ్డగూడూరు మండలం.. కోటమర్తి ఊర్లె అయ్యింది ఈ గమ్మతి ముచ్చట.. ఆవు అంత్యక్రియల కాడికి వాండ్రి పొయ్యొద్దం.. ఖర్చయ్యేదున్నదా..?

టీఆర్టీ దరఖాస్తు గడువు పొడిగింపు

హైదరాబాద్ : హైకోర్టు ఆదేశాలతో టీఎస్ పీఎస్సీ టీఆర్టీ నోటిఫికేషన్ సవరించింది.  టీఆర్టీ దరఖాస్తు గడువును ఈనెల 30 వరకు పొడిగించారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేసుకోవడం అవసరం లేదని టీఎస్పఈఎస్సీ తెలిపింది. 

శ్రీకాకుళంలో దారుణం

శ్రీకాకుళం : పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. స్థానిక తిలక్‌నగర్ కాలనీలో ప్రియురాలిపై యువకుడు కత్తితో దాడి చేశాడు. అనంతరం తాను పొడుచుకున్నాడు. ఈఘటనలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, యువతి పరిస్ధితి విషమంగా ఉంది. 

19:27 - December 12, 2017

దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు ఓ కవి కానీ తెలుగు బాష గురించి మాట్లాడమే కాకుండా ప్రభుత్వ వ్యవహారిక భాషలో తెలుగు వినియోగించడం వల్ల తెలుగు భాషకు మంచి గుర్తింపు వస్తుందని మోదుగుపూలు ఎడిటర్ భూపతి వెంకటేశ్వర్లు అన్నారు. మన తెలంగాణ ఉచ్చరణ భాష అస్థిత్వాన్ని కోల్పోయిందని, చరిత్రలో ఉర్దూ, తర్వాత ఆంధ్రవారి భాష తెలంగాణ భాషను తొక్కిపెట్టారని, భాషకు అస్థిత్వం రావాలంటే దానిపై చర్చలు జరగాల్సిన అవసరం ఉందని మహాసభల నిర్వహణ కమిటీ సభ్యులు నాళేశ్వర్ శంకర్ అన్నారు. ఐదు ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వంచడంపై సంతోషం కానీ సామాన్య ప్రజలను గొంతుక వినిపించేవారిని ప్రభుత్వం విస్మరిస్తుందని, హాటత్తుగా తెలుగు మహాసభలు నిర్వహించడం వల్ల సామాన్య కవులకు నష్టం కల్గించే విషయమని ప్రొ. తిరుమలరావు అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

19:26 - December 12, 2017

శ్రీకాకుళం : పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. స్థానిక తిలక్‌నగర్ కాలనీలో ప్రియురాలిపై యువకుడు కత్తితో దాడి చేశాడు. అనంతరం తాను పొడుచుకున్నాడు. ఈఘటనలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, యువతి పరిస్ధితి విషమంగా ఉంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

19:25 - December 12, 2017

గుంటూరు : నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో అత్యంత ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరిశ్రమల ఏర్పాటుకు యువ పారిశ్రామికవేత్తలు సన్నద్ధమవుతున్నారు. యువ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం మంచి ప్రోత్సాహం లభిస్తుండడంతో.. అనేకమంది పారిశ్రామికవేత్తలు అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగంగా విదేశాల్లో ఆదరణ పొందిన ఎలక్ట్రికల్‌ వెహికల్స్‌ను రాజధానికి పరిచయం చేయబోతుంది చందన కార్పొరేషన్‌. ఎలక్ట్రికల్‌ వెహికల్స్‌ కేంద్రం అమరావతిలో ఏర్పాటు చేయడానికి యువ పారిశ్రామికవేత్త,... చందన కార్పొరేషన్‌ ఎండీ వెంకటరమణ ముందుకొచ్చారు. ఈ యూనిట్‌ను దక్షిణ కొరియా సహకారంతో ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా దక్షిణ కొరియా బృందం ఇటీవలే ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ను కలిశారు. ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని లోకేశ్‌ హామీ ఇచ్చారు. దీంతో త్వరలోనే ఎలక్ట్రికల్‌ వెహికల్స్‌ ఉత్పత్తి కేంద్రాన్ని 'ఆవరా' ఎలక్ట్రికల్‌ వెహికల్‌ పేరుతో అమరావతిలో ప్రారంభించనున్నట్లు చందన కార్పొరేషన్‌ తెలిపింది.

దక్షిణ కొరియా ప్రతినిధులతో ప్రభుత్వం ఒప్పందం
విద్యుత్‌ వాహనాలను తయారు చేసే సంస్థలను సీఎం చంద్రబాబు ప్రోత్సహిస్తున్నట్లు సంస్థ ఎండీ వెంకటరమణ తెలిపారు. లోకేశ్‌ ఆధ్వర్యంలో దక్షిణ కొరియా ప్రతినిధులతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. వాహనాలను అమరావతిలో తయారు చేస్తామని.. ఈ వాహనం ఒకసారి వాహనం చార్జ్‌ చేస్తే సుమారు 250 కిలోమీటర్ల మేర నడుస్తుందన్నారు. ఈ వాహనాల ద్వారా ఎలాంటి కాలుష్యం ఉండదని, ఇతర ఖర్చులు లేకుండా.. వాహనదారులకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. మూడు రకాల ధరల్లో ఈ వాహనాన్ని ప్రవేశపెట్టనున్నట్లు వెంకటరమణ తెలిపారు. తొలిసారి దేశంలో పూర్తిగా మహిళలతో.. ఈ ప్రాజెక్ట్‌ కొనసాగుతుందన్నారు. వచ్చే ఏడాది ఉగాది నుంచి వాహనాలు అందుబాటులోకి వస్తాయన్నారు. రాబోయే ఐదేళ్లలో బ్యాటరీతో నడిచే ద్విచక్ర వాహనాల విక్రయాలను అధికం చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు వెంకటరమణ. ఎలక్ట్రిక్‌ వాహనాల ప్లాంట్‌ నెలకొల్పేందుకు ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహకారం లభిస్తుందన్నారు దక్షిణ కొరియా ప్రతినిధులు. అనుకున్న సమయానికే వినియోగదారులకు ఎలక్ట్రిక్‌ వాహనాలు అందిస్తామన్నారు. మొత్తానికి నవ్యాంధ్ర రాజధానిలో వచ్చే ఏడాది ఉగాది ఉంచి.. కాలుష్యం వెదజల్లని ఎలక్ర్టిక్‌ వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. 

19:24 - December 12, 2017

కడప : విభజన చట్టంలో రాయలసీమకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ... ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ సంఘాలు రాయలసీమలో బైక్‌ ర్యాలీ చేపట్టారు. నవంబర్‌ 29 నుంచి రాయలసీమలో చేపట్టిన బైక్‌ ర్యాలీ... రేపు కడప చేరుకోనుంది. కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ, అనంతపురం జిల్లా సెంట్రల్‌ యూనివర్సిటీ, కర్నూలులో రైల్వే వ్యాగన్ల నిర్మాణం చేపట్టాలని విద్యార్థి సంఘ నేతలు డిమాండ్‌ చేశారు. టీటీడీలో 10వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు. బైక్‌ ర్యాలీ ముగింపు సభకు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి హాజరుకానున్నట్లు విద్యార్థి సంఘ నేతలు తెలిపారు. విద్యార్థులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. 

19:23 - December 12, 2017

కర్నూలు : ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్యురిటి గార్డ్‌ల పరిస్థితి దయనీయంగా మారుతోంది. 200మంది సెక్యూరీటి గార్డులు ఆరు నెలలుగా వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఆసుపత్రిలో రక్తం అమ్ముకుని వారి జీవనం సాగిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ.. తమ సమస్యలను పరిష్కరించాలని ఇవాళ ఆసుపత్రి సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.

19:22 - December 12, 2017

కృష్ణా : ఏపీ దేవాదాయ అదనపు కమిషనర్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌ ఇంటిపై ఏసీబీ దాడులు చేసింది. ఏకకాలంలో హైదరాబాద్‌, కదిరి, విజయవాడ, రాజమండ్రితో సహా 18 ప్రాంతాల్లో 21 బృందాలు సోదాలు నిర్వహించారు. చంద్రశేఖర్‌ కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లల్లోనూ తనిఖీలు చేశారు. దాడులో భారీ ఎత్తున కూడబెట్టిన అక్రమ ఆస్తులు వెలుగుచూశాయి. విజయవాడ పటమటలో కోట్ల విలువ చేసే ఐదంతస్తుల భవనం,.. గొల్లపూడిలో కోటిన్నర రూపాయల విలువ చేసే భవనం, అనంతపురం జిల్లా కదిరిలో కుటుంబ సభ్యుల పేరున 32 ఎకరాల స్థలంలో సోలార్‌ ప్లాంట్‌ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. 

19:21 - December 12, 2017

విజయనగరం : జిల్లా... బొబ్బిలి మండలంలో విషాదం చోటుచేసుకుంది. బనుకురువాని వలస వద్ద క్వారీ బాంబు పేలి ఇద్దరు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో వెంకట్‌, అచ్చయ్య ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ప్రమాదానికి కారణమైన సర్వాజీ మాంగనీస్‌ కంపెనీ సిబ్బందిపై గ్రామస్థులు దాడి చేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

19:18 - December 12, 2017

ఢిల్లీ : పోలవరం నిర్మాణంపై అభ్యంతరాలను తెలుపుతూ ఒరిస్సా దాఖలు చేసిన పిటిషన్‌ను ఇవాళ సుప్రీంకోర్టు విచారించింది. పోలవరం నిర్మాణంపై ఒరిస్సా సీఎం ప్రధానమంత్రికి లేఖ రాసినట్టు ఆ రాష్ట్రం తరపు న్యాయవాదులు సుప్రీంకు తెలిపారు. ముంపు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో అన్ని చర్చించాలని కూడా లేఖలో రాసినట్టు వివరించారు. ఒరిస్సా వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం... ఒరిస్సా, చత్తీస్‌గఢ్‌, ఏపీ ముఖ్యమంత్రులు కూర్చొని సమస్య పరిష్కరించాలని సూచించింది. అధికారుల స్థాయిలో సమస్య పరిష్కారం కాదన్న అభిప్రాయం వ్యక్తం చేసింది. తదుపరి విచారణ వచ్చే ఏడాది ఫిబ్రవరి రెండో వారానికి వాయిదా వేసింది.

19:17 - December 12, 2017

కృష్ణా : చంద్రన్న విలేజ్‌ మాల్స్‌తో సామాన్యులకు నష్టమే తప్ప లాభం లేదని వైసీపీ నేత మల్లాది విష్ణు అన్నారు. రిలయన్స్‌, ఫ్యూచర్‌ గ్రూపులకు లాభం చేకూర్చే విధంగా చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. గతంలో వైఎస్‌ హయాంలో చౌకధరల దుకాణాలు సరిగ్గా నడిచేవని.. ఇప్పుడు చంద్రబాబు నిర్వీర్యం చేశారని మల్లాది విష్ణు ఆరోపించారు.

19:12 - December 12, 2017

గుంటూరు : సీఎం చంద్రబాబు ప్రారంభించిన చంద్రన్న విలేజ్‌ మాల్స్‌కు వ్యతిరేకంగా ఏపి సెక్రటేరియట్‌ సమీపంలో ఉన్న మల్కాపురంలోని చౌకదుకాణం వద్ద సీపీఎం నాయకులు ధర్నా నిర్వహించారు. సచివాలయంకు సమీపంలోని మల్కాపురం గ్రామంలో ధర్నా చేయటం ద్వారా ఉద్యమాన్ని సచివాలయం నుంచే ప్రారంభిస్తున్నామని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బాబూరావు తెలిపారు. 

19:04 - December 12, 2017

గుంటూరు : రేషన్ షాపు డీలర్లకు అధిక ఆదాయం, వినియోగదారులకు సరసమైన ధరలకే వస్తువులు లభించేలా 'చంద్రన్న విలేజ్ మాల్'కు శ్రీకారం చుట్టినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. రేషన్ షాపు డీలర్లు, వినియోగదారులకు వీటిని నూతన సంవత్సర కానుకగా అందిస్తున్నామని అన్నారు. విజయవాడ, గుంటూరులో పైలెట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసిన 'చంద్రన్న విలేజ్ మాల్'ను ఆయన సచివాలయం నుంచి ఆన్‌లైన్‌లో ప్రారంభించారు. పేదవారికి నాణ్యమైన వస్తువులను, చౌక ధరలకు అందించాలనే లక్ష్యంతో 'చంద్రన్న విలేజ్ మాల్స్‌ రాష్ట్రమంతటా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 28 వేలకు పైగా వున్న చౌకధరల దుకాణాలను 'చంద్రన్న విలేజ్ మాల్'గా నవీకరిస్తున్నామని, మొదటిదశలో 6 వేల 500 రేషన్ షాపులు అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. 

కొత్త సంవత్సంర కానుకగా విలేజ్ మాల్స్ : చంద్రబాబు

గుంటూరు : రేషన్ షాపు డీలర్లకు, వినియోగదారులకు చంద్రన్న విలేజ్ మాల్స్ ను కొత్త సంవత్సరం కానుకగా అందిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. రేషన్ షాపు డీలరుకు అధిక ఆదాయం పొందేందుకు వినయోగదారులకు తక్కువ ధరకు వస్తువులు కొనేందుకు చంద్రన్న విలేజ్ మాల్స్ ఉపయోగపడతాయిన ఆయన అన్నారు. 

17:53 - December 12, 2017

వరంగల్ : పాల్కురికి సోమనాథుడు 1160 - 1240లకు చెందిన తెలుగు కవి.. వరంగల్ సమీపంలోని పాల్కురికి గ్రామంలో శ్రియాదేవి, విష్ణురామదేవుడు దంపతలుకు జన్మించారు. బ్రాహ్మణ వంశంలో జన్మించిన పాల్కురికి సోమనాథుడు మహా శివుడి మీద అనురాగంతో వీరశైవ మత దీక్ష తీసుకున్నారు. వీరశైవ దీక్ష అంటే అప్పట్లో మామూలు విషయం కాదు.. ఖచ్చితంగా కులగోత్రాల పట్టింపును విడిచిపెట్టాలి. తల్లిదండ్రులను.. కులాన్ని వదిలి శివ,పార్వతులనే తల్లిదండ్రులుగా భావించి పూజించాలి. శివుడి మీద ఉన్న ఆయన భక్తి వీర మహేశ్వర వ్రతంపై అడుగులు వేయించింది. సాహిత్యం మీద ఉన్న ఇష్టం రచనల వైపు నడిపించింది. అలా ఆయన కవిత్వం భక్తి మార్గంలో పరుగులు పెట్టింది.

వీరశైవ పునరుజ్జీవానికి సోమనాథుడు ప్రామాణికం
సోమనాథునికి దీక్షనిచ్చిన గురువు గురు లింగాచార్యుడు, శిక్షా గురువు కట్టకూరి పోతి దేవర. సాహిత్య గురువు కరస్థలి విశ్వనాథయ్య..వీరశైవ పునరుజ్జీవానికి సోమనాథుడు ప్రామాణిక మత గ్రంథాలను రచించారు. వీరశైవులు ఆయనను భృంగదీశ్వరుని అవతారంగా భావించే వారు. సోమనాథుని భాష, భావం, రూపం అన్నింటా ఓ కొత్త పంథా కనిపించేది. దేశ భాషల్లో రచనలు చేస్తేనే అవి చేరవలసిన వారికి చేరతాయని గ్రహించిన సోమనాథుడు ద్విపదలోనూ.. జాను తెలుగులోనూ సులభశైలిలో కావ్యాలను రచించారు. సోమనాథుడు తెలుగులో బసవపురాణం, వృషాధిప శతకం, చతుర్వేద సారం, పండితారాధ్య చరిత్ర, గద్యలు, పంచకాలు, అష్టకాలు రచించారు. సంస్కృత భాషలో సోమానాథ భాష్యం, రుద్ర భాష్యం, వృష భాష్టకం, త్విధ లింగాష్టకం వంటి పలు రచనలు చేశారు. కన్నడ భాషలో సద్గురు, చెన్న బసవ, రగడలతో పాటు.. బసవలింగ నామావళిని రచించారుఅలనాటి తెలుగు రచన తత్త్వంలో నృత్యకళకు సంబంధించి అనేక వర్ణనలు వెలిశాయి. పండితారాధ్య పర్వత ప్రకరణంలో జానపద నృత్యాలను అద్భుతంగా వర్ణించి సోమనాథుడు జేజేలు అందుకున్నారు. నృత్యకళకు, శైవ మతానికి పరస్పర సంబంధాన్ని మేళవించి సాహిత్య అభిమానులను మెప్పించారు పాల్కురికి సోమనాథుడు. దేశీ నృత్యాలను, యక్షగాన కళా రూపాలను, దేశీ నాటక సంప్రదాయాలను పండితారాధ్య చరిత్రలో అద్భుతంగా వర్ణించారు. తెలుగుభాష ఖ్యాతిని దశదిశలా ఇనుమడింపచేసిన పాల్కురికి సోమనాథుని రచనలు చిరస్మరణీయం. 

17:49 - December 12, 2017

రంగారెడ్డి : మాయా లేదు.. మంత్రం లేదు.. డాక్టర్లు.. మందులతో పనే లేదు.. ఎంత పెద్ద రోగమైనా ఈ బాబా చేయి తాకితే పారిపోవాల్సిందే...రోగం నయం చేసే పేరుతో ఓ దొంగ బాబా చేస్తున్న వికృత చేష్టలకు పరాకాష్ట ఇది. ఏదో మారుమూల పల్లెల్లో ఇలాంటి దొంగబాబాల ఆగడాలు విన్నాం. చూసాం.. తాజాగా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో తన చేతివాటంతో ఈ ముసలి దొంగబాబా కామ వాంఛలు తీర్చుకుంటున్నాడు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. అతని మాటలు నమ్మిన అమాయక మహిళలను లోబర్చుకుంటూ దందా చేస్తున్నాడు. తాజాగా ఇతగాడి బాగోతం 10టీవీ కెమెరాకు

పేద, మధ్య తరగతి మహిళలే టార్గెట్‌
పేద, మధ్య తరగతి మహిళలే టార్గెట్‌గా ఈ నకిలీ బాబా కొన్నేళ్ల క్రితం మొయినాబాద్‌లో మకాం పెట్టాడు. మహిళలు, టీనేజర్లు, చిన్నారులు ఇలా ఎవరు పడితే వారిని రోగాలు నయం చేస్తానని నమ్మించి వికృత చేష్టలకు పాల్పడుతున్నాడు. చికిత్స పేరుతో పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడు. ఇక మంత్రం వేశానంటూ తాయెత్తుల పేరు చెప్పి వందల రూపాయలు దండుకుంటున్నాడు. కాలం వేగంగా పరుగులు పెడుతున్నా.. ఇంకా మూఢనమ్మకాలు మాత్రం రాజ్యమేలుతున్నాయనడానికి ఈ ఉదంతం ఓ ఉదాహరణ. ఇప్పటికైనా ఇలాంటి బాబాల ఆగడాలకు జనం చెక్‌ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇక ఈ బాబా వికృత చేష్టలు చూసిన సిటీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో కూడా మనం వేచి చూడాలి. 

17:48 - December 12, 2017

హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్‌పార్టీ జోరు పెంచింది. మొన్నటి దాకా టీఆర్‌ఎస్‌ ఆక‌ర్ష్‌తో విల‌విల లాడిన కాంగ్రెస్‌ ఇప్పుడు అదే అస్త్రాన్ని ప‌క్కా గా అమ‌లు చేస్తూ.. గులాబి బాస్‌కు చుక్కలు చూపిస్తుంది. రేవంత్‌ను పార్టీలో చేర్చుకోవ‌డంతో.. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌లో కొత్త ఉత్సాహం వచ్చింది. దీంతో మరింత దూకుడు పెంచిన కాంగ్రెస్‌.. ఇదే టెంపోను కొన‌సాగిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్‌ ఆక‌ర్ష్‌కు తెర‌లేపింది. రేవంత్ హ‌స్తం గూటికి చేర‌డంతో టీ టీడీపీ డీలా పడింది. ఇదే అదనుబా భావించిన కాంగ్రెస్‌... ఇతర నేతలను టార్గెట్‌ చేసింది. జిల్లాల్లోని నేతల నుంచి రాష్ట్రస్థాయి నేతల వరకు అందరినీ పార్టీలో చేర్చుకుంటోంది. ఇప్పటికే రేవంత్‌తోపాటు.. 20 నియోజ‌క‌వ‌ర్గాల‌కు చెందిన ముఖ్య నేత‌లు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. టీఆర్‌ఎస్‌తో పొస‌గ‌ని టీడీపీ నేతలు కాంగ్రెస్‌ గూటికి చేరుతున్నారు.

ప్రతి రోజు ఎక్కడో ఓ చోట
ఉత్తమ్‌, భ‌ట్టి విక్రమార్క, రేవంత్‌ రెడ్డి ,ష‌బ్బీర్‌ ఆలీ, డీకే అరుణ‌, జైపాల్‌ రెడ్డిల స‌మ‌క్షంలో ప్రతి రోజు ఎక్కడో ఓ చోట ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకుంటున్నారు. టీడీపీ, టీఆర్‌ఎస్‌సహా ఇతర ఆపార్టీల్లోని సెకండరీ క్యాడర్‌ కాంగ్రెస్‌ కండువా కప్పుకుంటున్నారు. అంతేకాదు...ఎంపిటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్‌లతోపాటు మాజీ ప్రజాప్రతినిధులు సైతం కాంగ్రెస్‌లో చేరుతుండడంతో ఆ పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. మొత్తానికి మొన్నటి దాకా వ‌ర‌స ఓట‌మిలు, వ‌ల‌స‌ల‌తో ఉక్కిరి బిక్కరి అయిన కాంగ్రెస్ పార్టీలోకి.. నేతల చేరిక‌లు ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. ఇదే తీరును కొనసాగించి 2019లో అధికారమే ధ్యేయంగా ముందుకు సాగుతోంది హస్తం పార్టీ.

17:46 - December 12, 2017

హైదరాబాద్ : కమెడియన్ విజయ్‌సాయి ఆత్మహత్య కేసు నిముషానికో టర్నింగ్ తీసుకుంటోంది. అత్తింటి వారు ప్లాన్ ప్రకారమే తనపై నిందలు మోపుతున్నారంటోంది విజయ్‌సాయి భార్య వనిత. విజయ్‌ సాయి చేసిన తప్పులు కప్పి పుచ్చడానికే తనను అవమానాల పాలు చేస్తున్నారని ఆరోపించింది. విజయ్‌సాయి మరణానికి తాను కారణం కాదని.. ఈ విషయంలో తాను భయపడేది ఏమీ లేదని వనిత స్పష్టం చేశారు. అయితే మామపై తనకు అనుమానాలున్నాయన్నారు.

17:45 - December 12, 2017

హైదరాబాద్ : అధికార దాహం టీఆర్‌ఎస్‌ పార్టీకే ఉందని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ అన్నారు. పక్క పార్టీల ప్రజాప్రతినిధులను సంతలో గొడ్లను కొన్నట్లు కొనుగోలు చేసి బలాన్ని పెంచుకున్నారని ఆరోపించారు. తెలంగాణకు వ్యతిరేకులైన తలసాని, తుమ్మల, మహేందర్‌రెడ్డి, ఎర్రబెల్లి, కొండా సురేఖ ఎలా టీఆర్‌ఎస్‌లో చేరారో చెప్పాలని శ్రవణ్‌ డిమాండ్‌ చేశారు. తెలంగాణ తల్లి, తెలుగు తల్లి వేరువేరు అన్న సీఎం కేసీఆర్‌.. హైదరాబాద్‌లో తెలుగు సభలను ఎలా నిర్వహిస్తారని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన తర్వాతే తెలుగు మహా సభలను నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. జానపద కళలలను వెలికి తీసిన ప్రొఫెసర్‌ తిరుమల రావు, అందెశ్రీ, గద్దర్‌, విమలక్కకు సంబంధం లేకుండా మహా సభలు నిర్వహించడాన్ని శ్రవణ్‌ తప్పుపట్టారు. 

17:44 - December 12, 2017

హైదరాబాద్ : తెలంగాణలో పేదలపై ఔషధ ప్రయోగాలు జరగడంపై టీటీడీపీ ఆందోళన వ్యక్తం చేసింది. పేదల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌ రమణ ఆరోపించారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఔషధ ప్రయోగాలతో మృతిచెందిన కుటుంబాలకు 25 లక్షల రూపాయల పరిహారం ఇప్పించాలని.. వారి కుటుంబ సభ్యుల్లో అర్హులకు ఉద్యోగ అవకాశం కల్పించాలని రమణ అన్నారు. నిరుద్యోగులు, పేదలపై ప్రయోగాలు చేస్తున్న ఔషధ కంపెనీలపై చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

17:43 - December 12, 2017

హైదరాబాద్ : తెలంగాణలో టీడీపీకి మరో షాక్. మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి.. తెలుగుదేశంకు గుడ్‌బై చెబుతున్నారు. ఆమె టీఆర్‌ఎస్‌లోకి చేరేందుకు సిద్ధమయ్యారు. ఇవాళ కుమారుడు సందీప్ రెడ్డితో కలిసి క్యాంప్‌ ఆఫీస్‌లో ముఖ్యమంత్రి KCRను కలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కేసీఆర్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధమని తెలిపారు. ఈనెల 14న మధ్యాహ్నం 12 గంటలకు అనుచరులతో కలిసి ఉమా మాధవరెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు.

కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి షెడ్యూల్ విడుదల

కర్నూలు : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల చేశారు. ఈసీ ఈ నెల 19న నోటిఫికేషన విడుదల చేయనుంది. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 26 తుది గడువు విధించారు. జనవరి 12న పోలింగ్, 16న ఓట్ల లెక్కింపు ఉంటుంది. 

బొబ్బిలి బంకురువలస క్వారీలో పేలుడు

విజయనగరం : జిల్లా బొబ్బలి మండలం బంకురువలస క్యారీలో బాంబు పేలుడు జరిగింది. ఈ పేలుడులో ఇద్దరు కూలీలు మృతి చెందారు. మృతుల్లో అంజయ్య(50), మరడాన వెంకట్రావ్(35) ఉన్నారు. 

కాంచీపురంలో దారుణం

తమిళనాడు : రాష్ట్రంలోని కాంచీపురం జిల్లా పమ్మల్ లో దారుణం జరిగింది.  భార్య తల్లి, ఇద్దరు పిల్లలను గొంతు కోసి చంపి దామోదరన్  తాను ఆత్మహత్య చేసుకున్నాడు. 

టీఆర్ఎస్ లో చేరునున్న ఉమమాధవరెడ్డి

హైదరాబాద్ : టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను టీడీపీ నేత ఉమమాధవరెడ్డి, భువనగిరి టీడీపీ అధ్యక్షుడు సందీప్ రెడ్డి కలిశారు. వారు ఈ నెల 14న టీఆర్ఎస్ పార్టీలో చేరుబోతున్నట్టు తెలుస్తోంది. 

16:14 - December 12, 2017

విశాఖ : విశాఖ లో క్రికెట్‌ సందడి మెుదలైంది..ఈ నెల 17వ తేది ఇండియా శ్రీలంక మద్య జరగనున్న వన్‌ డే క్రికేట్‌ మ్యాచ్‌ కు స్టేడియం వేదికయ్యింది. దీనికి సంభందించి టిక్కెట్లు ఇప్పటికే ఆన్‌ లైన్‌ లో సంగం పైగా అమ్ముడైపోయాయి. మరో వైపు ఈ రోజు నుండి విశాఖ వేదికగా నాలుగు చోట్లు టిక్కెట్లు విక్రయం ప్రారంభించారు. దీనితో క్రికెట్ అభిమానులు ఉత్సహంగా టిక్కెట్లు కోనుగోలు చేస్తూ ఇండియా గెలవాలంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్న క్రికెట్ అభిమానులతో మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

16:13 - December 12, 2017

చెన్నై : తమిళనాడులోని ఉడుమలైపేటలో శంకర్‌ అనే యువకుడి పరువుహత్య కేసులో జిల్లా సెషన్స్‌ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. హత్య కేసులో ఆరుగురికి ఉరి శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. శంకర్‌ ప్రియురాలి తండ్రి, సోదరుడితో సహా ఆరుగురికి ఉరిశిక్ష విధించింది. 13 మార్చి 2016లో శంకర్‌ను నడిరోడ్డుపై దారుణంగా హత్య చేశారు. సిసి కెమెరా దృశ్యాల ఆధారంగా కోర్టు తీర్పు వెలువరించింది. 

16:12 - December 12, 2017

హైదరాబాద్ : ఆత్మహత్యకు పాల్పడ్డ కమెడియన్ విజయ్ మృతదేహానికి ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తికావడంతో.. ఆయన మృతదేహాన్ని యూసుఫ్ గూడలోని ఇంటికి తరలించారు. అతని భౌతికకాయాన్ని కడసారి చూసేందుకు బంధుమిత్రులు, సినీ ప్రముఖులు, స్నేహితులు భారీ ఎత్తున తరలివచ్చారు. విజయ్ తల్లిదండ్రులు కుమారుడు విజయ్‌ మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ సాయంత్రం విజయ్ అంత్యక్రియలు పంజాగుట్ట శ్మశానవాటికలో నిర్వహించనున్నారు. విజయ్ మృతి బాధకరమని నటుడు, దర్శకుడు రవిబాబు అన్నారు.

మటన్ సూప్ తో అనుమానం

నాగర్ కర్నూలు : నాగర్‌ కర్నూలు జిల్లాలో భార్య స్వాతి, ఆమె ప్రియుడు చేతిలో హత్యకు గురైన సుధాకర్‌రెడ్డి కేసులో మరో ట్విస్ట్ ఎదురైంది. భర్తను హత్య చేసేందుకు స్వాతి వేసిన ప్లాన్‌కు మటన్ సూప్ చెక్ పెట్టింది. యాసిడ్ గాయాలతో సుధాకర్‌రెడ్డి స్ధానంలో నాటకీయంగా ఆసుపత్రిలో చేరిన రాజేష్‌కు ఆసుపత్రి సిబ్బంది మటన్ సూప్‌ అందించారు. అయితే రాజేష్‌ వెజిటేరియన్ కావడంతో మటన్ సూప్‌ వద్దని నిరాకరించాడు. నిజానికి సుధాకర్‌రెడ్డికి మటన్ సూప్ అంటే ప్రాణం. ఈ ఒక్క విషయంలో స్వాతి ప్లాన్ ఫెయిలై అడ్డంగా దొరికిపోయింది.

హత్య కేసులో ఆరుగురికి ఉరి శిక్ష విధించిన కోర్టు

చెన్నై : తమిళనాడులోని ఉడుమలైపేటలో శంకర్‌ అనే యువకుడి పరువుహత్య కేసులో జిల్లా సెషన్స్‌ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. హత్య కేసులో ఆరుగురికి ఉరి శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. శంకర్‌ ప్రియురాలి తండ్రి, సోదరుడితో సహా ఆరుగురికి ఉరిశిక్ష విధించింది. 13 మార్చి 2016లో శంకర్‌ను నడిరోడ్డుపై దారుణంగా హత్య చేశారు.

16:06 - December 12, 2017

ప్రస్తుతం ఉన్న సమాజంలో చాలా మంది తల్లిదండ్రులు పిల్లలను కిడ్ కేర్ లో ఉంచుతున్నారు. అలా కిడ్ కేర్ లో పిల్లలను ఉంచడం వల్ల పిల్లలపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీనిపై చర్చించడానికి పిల్లల మానిసిక నిపుణురాలు జ్యోతి రాజా, పిల్లల వైద్యనిపుణురాలు డా. నళిని వచ్చారు. పూర్తి వివరాలకువ వీడియో క్లిక్ చేయండి.

16:05 - December 12, 2017

నాగర్ కర్నూలు : నాగర్‌ కర్నూలు జిల్లాలో భార్య స్వాతి, ఆమె ప్రియుడు చేతిలో హత్యకు గురైన సుధాకర్‌రెడ్డి కేసులో మరో ట్విస్ట్ ఎదురైంది. భర్తను హత్య చేసేందుకు స్వాతి వేసిన ప్లాన్‌కు మటన్ సూప్ చెక్ పెట్టింది. యాసిడ్ గాయాలతో సుధాకర్‌రెడ్డి స్ధానంలో నాటకీయంగా ఆసుపత్రిలో చేరిన రాజేష్‌కు ఆసుపత్రి సిబ్బంది మటన్ సూప్‌ అందించారు. అయితే రాజేష్‌ వెజిటేరియన్ కావడంతో మటన్ సూప్‌ వద్దని నిరాకరించాడు. నిజానికి సుధాకర్‌రెడ్డికి మటన్ సూప్ అంటే ప్రాణం. ఈ ఒక్క విషయంలో స్వాతి ప్లాన్ ఫెయిలై అడ్డంగా దొరికిపోయింది. అంతకు ముందు రాజేష్‌ను అనుమానిస్తున్న సుధాకర్‌రెడ్డి కుటుంబీకులకు మటన్ సూప్ నిరాకరించడంతో అనుమానం బలపడింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రాజేష్, స్వాతి బండారం బయటపడింది. 

16:04 - December 12, 2017

హైదరాబాద్ : తన అక్కపై అత్తింటి వారు కావాలని నిందలు వేస్తున్నారని వనిత తమ్ముడు ఆరోపిస్తున్నాడు. విజయ్‌కి వేరే మహిళతో సంబంధాలు ఉన్న మాట వాస్తవమని .. అందుకు సంబంధించిన ఆధారాలు కోర్టు వద్ద ఉన్నట్లు స్పష్టం చేశారు. కోర్టు తీర్పు తన అక్కకు అనుకూలంగా ఉందంటున్నాడు.

ఫైబర్ గ్రిడ్ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఆహ్వానిస్తాం : చంద్రబాబు

గుంటూరు : ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను ఆహ్వానిస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. జనవరి 2 నుంచి 10 రోజులపాటు జన్మభూమి మా ఊరు కార్యక్రమం ప్రారంభం అవుతుందని ఆయన ప్రకటించారు. 

పోలవరంపై సుప్రీం విచారణ కొత్త ట్విస్ట్ : చంద్రబాబు

గుంటూరు : పోలవరంపై సుప్రీంకోర్టులో ఇవాళ జరిగిన వాదనలను సీఎంకు అధికారులు వివరించారు. ముంపు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరపాలని ఒడిశా ప్రభుత్వం కోర్టును కోరినట్లు అధికారులు సీఎం కు తెలిపారు. 

13:50 - December 12, 2017

హైదరాబాద్ : స్వచ్ఛ్ సర్వేక్షణ్‌లో మెరుగైన ర్యాంకింగ్ సాధించ‌డ‌మే ల‌క్ష్యంగా బ‌ల్దియా పావులు వ్యూహాలు రూపొందిస్తోంది.  గ‌తేదాది వ‌చ్చిన ర్యాంకు మెరుగు ప‌రుచుకోవ‌డం కోసం  ప్రయత్నాలు ప్రారంభించింది. పోటీలో మంచి మార్కులు సాధించడానికి తడిపొడి చెత్తను వేరుగా సేకరించాలని డిసైడ్‌ అయింది. దీనికోసం స్వచ్‌దూత్‌లను రంగంలోకి దించడానికి బల్దియా అధికారులు రెడీ అయ్యారు. 
అగ్రస్థానం సాధించేందుకు బ‌ల్దియా అధికారులు స్కెచ్ 
స్వచ్‌ భార‌త్ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న స్వచ్ స‌ర్వేక్షణ్‌ పోటిలో అగ్రస్థానం సాధించ‌డ‌మే లక్ష్యంగా బ‌ల్దియా అధికారులు స్కెచ్ వేస్తున్నారు. ఈ ఎడాది స్వచ్ స‌ర్వేక్షన్ లో దాదాపు 4వేల ప‌ట్టణాలు,  న‌గ‌రాలు పోటి ప‌డుతున్నాయి. చేత్తను త‌డి పోడిగా వేరు చేయడం,  బహిరంగ మలమూత్ర విసర్జన లేకుండా చూడటం.. సిటి వీధుల‌ను  చెత్తర‌హితంగా చేయడంతోపాటు శానిటేష‌న్  కార్యక్రమాల్లో సాంకేతిక‌తను జోడించాలని అధికారులు నిర్ణయించారు. 
స‌రికొత్త పథ‌కానికి శ్రీకారం 
సిటిలోని ప్రతి ఇంటి నుండి త‌డి, పోడి చెత్త వేరుగా సేక‌రించ‌డం కోసం స‌రికొత్త పథ‌కానికి శ్రీకారం చూట్టింది.  ఇప్పటికే  ఇంటింటికి రెండు బుట్టలు ఇవ్వడంతోపాటు ఇంటింటి నుండి చెత్త సేక‌రించేందుకు  ఆటో రిక్షాల‌ను అందుబాటులోకి తెచ్చింది. అయితే చాలా ఇళ్లనుండి త‌డి పోది  చెత్త వేరుకావ‌డం లేదు. చెత్తంతా క‌లిపి ఒకే బుట్టులో వేస్తున్నారు. దాంతో సిటిలో పంపిణీ చేసిన బుట్టలు, ఆటోలు వృధాగా మారిపోతున్నాయి. దీనికి విరుగుడుగా స్వచ్‌దూత్‌ పేరుతో మహిళా కార్యకర్తలను రంగంలోకి దించుతున్నారు. ఈ స్వచ్చ కార్యకర్తలు త‌మ‌కు కేటాయించిన ప్రాంతాల్లో ప్రతి ఇంటికి వెళ్లి.. తడిపొడి చెత్తను వేరు చేయాల్సిన అవసరాన్ని వివరిస్తారు.  దీనికోసం అందుకోసం ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు చెప‌ట్టింది బ‌ల్దియా.
స్వచ్‌దూత్‌లకు రూ.10వేల వేతనం 
ఇలా నియామకం అయిన ప్రతి స్వచ్ దూత్ కు నెలకు  10వేల గౌర‌వ వేత‌నం ఇవ్వనున్నారు. అయితే ఆటో రిక్షాకు పూర్తిస్థాయిలో త‌డి పోడి చెత్తను వేర్వేరుగా ఇచ్చిన చోట మాత్రమే వీరికి మాత్రమే పూర్తిగా డ‌బ్బులు చెల్లిస్తారు. స్వచ్ఛ్ దూత్ లు సామజిక కార్యకర్తలుగా గుర్తించి ముందు ముందు మరెన్నో ప్రభుత్వ కార్యక్రమాలలో భాగస్వామ్యం అయ్యేందుకు కూడా అవ‌కాశం క‌ల్పిస్తామ‌న్నారు బ‌ల్దియా అధికారులు.   
సిటిజన్స్‌ నుంచి ఫీడ్‌బ్యాక్ 
ఈ స్వచ్చ కార్యకర్తలకు మరో పనికూడా అప్పగించనున్నారు. ఆయా ఏరియాల్లో స్వచ్చ కార్యక్రమాల అమలుపై సిటిజన్స్‌ ఏమనుకుంటన్నారో.. ఫీడ్‌బ్యాక్‌ ఇవ్వాల్సి ఉంటుంది. సిటిజన్స్‌ నుంచి మంచి స్పందన రావాలంటే.. లోకల్‌బాడీలు మరింత సమర్థంగా పనిచేయాల్సి ఉంటుంది. ఇలా సిటీలో జరిగే ప్రతి పారిశుద్ధ్యపనిలో స్వచ్‌కార్యకర్తల పర్యవేక్షణ ఉంటే.. సర్వేక్షణ్‌లో మంచి మార్కులు సాధించ వచ్చని జీహెచ్‌ఎంసీ అధికారులు 
అంచనా వేస్తున్నారు. 

13:46 - December 12, 2017

సంగారెడ్డి : జిల్లాలోని నారాయణఖేడ్‌లో ఖాకీలు ప్రజలపై జులుం ప్రదర్శించారు. నిరసన తెలుపుతున్న ప్రజలపై లాఠీలు ఝలిపించారు. దొరికిన వారికి దొరికినట్టు చితకబాదారు. పోలీసుల లాఠీచార్జీలో పలువురికి గాయాలు అయ్యాయి. నారాయణఖేడ్‌లో ప్రతి మంగళవారం సంత జరుగుతుంది. అయితే ఇక్కడ ట్రాఫిక్‌ జామ్‌ అవుతోందని...  పోలీసులు సంతను తరలించారు. దీంతో ప్రజలు సంతను తరలించరాదంటూ ఆందోళనకు దిగారు. ప్రజలంతా ధర్నా నిర్వహించారు. దీంతో ఆగ్రహించిన పోలీసులు ఆందోళనకారులపై లాఠీచార్జ్‌ చేశారు. మహిళలని చూడకుండా చితకబాదారు. పలువురుకి గాయాలయ్యాయి. దీంతో నారాయణఖేడ్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

13:38 - December 12, 2017

మేడ్చల్ : డంపింగ్‌ యార్డును ఎత్తివేయాలని..అక్రమ పవర్ ప్లాంట్ నిర్మించవద్దని మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్‌ డంపింగ్ యార్డు వద్ద ప్రజా సంఘాలు చేపట్టిన మహా ధర్నా ఉద్రిక్తతకు దారి తీసింది. ఉదయం నుంచి సీపీఐ, కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ నేతలు ఆందోళన చేస్తున్నారు. డంపింగ్ యార్డు వద్ద భారీగా మోహరించిన పోలీసులు ఆందోళనకారులను బలవంతంగా అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 

 

13:36 - December 12, 2017
13:33 - December 12, 2017
13:30 - December 12, 2017

చంద్రశేఖర్ ఆస్తుల పై కొనసాగుతున్న సోదాలు

విజయవాడ : ఏపీ దేవాదాయశాఖ అదనపు కమిషనర్ చంద్రశేఖర్ ఇంట్లో ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, రాజమండ్రి సహా 9 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మంచి ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 

చంద్రశేఖర్ ఆస్తుల పై కొనసాగుతున్న సోదాలు

విజయవాడ : ఏపీ దేవాదాయశాఖ అదనపు కమిషనర్ చంద్రశేఖర్ ఇంట్లో ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, రాజమండ్రి సహా 9 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మంచి ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 

13:22 - December 12, 2017

గుంటూరు : ఏపీ దేవాదాయ అదనపు కమిషనర్‌ చంద్రశేఖర్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్‌, కదిరి, రాజమండ్రిసహా 9 ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. చంద్రశేఖర్‌ కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లల్లోనూ ఏసీబీ తనిఖీలు నిర్వహిస్తోంది. ఈ తనిఖీల్లో భారీగా అక్రమాస్తులు వెలుగు చూస్తున్నట్టు తెలుస్తోంది. కీలక డాక్యుమెంట్లు, బంగారు ఆభరణాలుసహా భారీగా నగదును ఏసీబీ స్వాధీనం చేసుకుంటోంది.

13:19 - December 12, 2017

పశ్చిమగోదావరి : పోలవరం నిర్మాణంపై అభ్యంతరాలను తెలుపుతూ ఒరిస్సా దాఖలు చేసిన పిటిషన్‌ను ఇవాళ సుప్రీంకోర్టు విచారించింది. పోలవరం నిర్మాణంపై ఒరిస్సా సీఎం ప్రధానమంత్రికి లేఖ రాసినట్టు ఆ రాష్ట్రం తరపు న్యాయవాదులు సుప్రీంకు తెలిపారు. ముంపు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో అన్ని చర్చించాలని కూడా లేఖలో రాసినట్టు వివరించారు. ఒరిస్సా వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం... ఒరిస్సా, చత్తీస్‌గఢ్‌, ఏపీ ముఖ్యమంత్రులు కూర్చొని సమస్య పరిష్కరించాలని సూచించింది. అధికారుల స్థాయిలో సమస్య పరిష్కారం కాదన్న అభిప్రాయం వ్యక్తం చేసింది. తదుపరి విచారణ వచ్చే ఏడాది ఫిబ్రవరి రెండో వారానికి వాయిదా వేసింది.

 

మేడ్చల్ డంపింగ్ యార్డు వద్ద ఉద్రిక్తత

మేడ్చల్ : జిల్లా జవహర్ నగర్ డంపింగ్ యార్డు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. డంపింగ్ యార్డు ఎత్తివేయాలని, పవర్ ప్లాంట్ నిర్మింవొద్దని అఖిలపక్ష నేతలు ఆందోళనకు సిద్ధమయ్యారు. దీంతో డంపింగ్ యార్డు వద్ద పోలీసులును భారీగా మోహరించారు. 

13:08 - December 12, 2017

విశాఖ : జిల్లాలోని పాయకరావుపేటలోని శ్రీప్రకాశ్‌ విద్యాలయంలో ఇద్దరు విద్యార్థులు అదృశ్యమయ్యారు. బి. హర్ష, నర్సీచేతన్‌ శివదుర్గ వీరబాబు అనే విద్యార్థులు కనిపించకుండా పోయారు. స్కూల్‌ ప్రిన్సిపాల్‌, వార్డెన్‌ మందలించారని విద్యార్థులు తీవ్ర మనస్తాపం చెందారు. దీంతో ఎవ్వరికీ చెప్పకుండా హాస్టల్‌ వదిలి పోయినట్టు తెలుస్తోంది. దీనిపై యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

12:53 - December 12, 2017

కడప : ప్రైవేట్ విద్యాలయాల్లో విద్యార్థుల మరణాలు పెరిగుతున్నాయి. మరో విద్యా కుసుమం నేలరాలింది. ప్రైవేట్ స్కూల్ లో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కడప మౌంట్ ఫోర్డ్ స్కూలులో 9వ తరగతి చదువుతున్న విద్యార్ధి చరణ్‌రెడ్డి ఆత్మహత్య కలకలం సృష్టిస్తోంది. చరణ్‌రెడ్డి టై తో ఉరివేసుకున్నాడు. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా చరణ్‌రెడ్డిని స్కూలు యాజమాన్యం రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. బాలుడి తల్లిదండ్రులు స్కూలు వద్ద ఆందోళనకు దిగారు. స్కూలు యాజమాన్యం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. 

 

కడపలో విషాదం....

కడప : జిల్లా కేంద్రంలోని మౌంట్ స్కూలులో 9వ తరగతి విద్యార్థి చరణ్ ఆత్మహత్య చేసుకున్నారు. చరణ్ రెడ్డి తన కట్టుకున్న టై తోనే ఉరివేసుకున్నాడు. స్కూల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వకుండా రిమ్స్ కు తరలించారు. దీంతో స్కూల్ వద్ద చరణ్ తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. 

12:47 - December 12, 2017

హైదరాబాద్ : కమెడియన్ విజయ్‌సాయి ఆత్మహత్య కేసు నిముషానికో టర్నింగ్ తీసుకుంటోంది. అత్తింటి వారు ప్లాన్ ప్రకారమే తనపై నిందలు మోపుతున్నారంటోంది విజయ్‌సాయి భార్య వనిత. విజయ్‌ సాయి చేసిన తప్పులు కప్పి పుచ్చడానికే తనను అవమానాల పాలు చేస్తున్నారని ఆరోపించింది. విజయ్‌సాయి మరణానికి తాను కారణం కాదని.. ఈ విషయంలో తాను భయపడేది ఏమీ లేదని వనిత స్పష్టం చేశారు. అయితే మామపై తనకు అనుమానాలున్నాయన్నారు వనిత.  విజయ్‌కి .. మామ సుబ్బారావుకి మధ్య ఆస్తి తగాదాలున్నట్లు ఆమె చెప్పారు. ఒక సైట్‌ని తన కూతురు కుందన పేరు మీద రాసివ్వమని విజయ్‌.. తండ్రి సుబ్బారావుతో గొడవపడుతుండేవారని.. ఈ నేపథ్యంలోనే మళ్లీ గొడవ జరిగి ఉండొచ్చని వనిత అనుమానం వ్యక్తం చేశారు. ఆదివారం కుందనను తీసుకెళ్లేందుకు హ్యాపీగా వచ్చిన విజయ్‌సాయి అంత సడెన్‌గా చనిపోవాలని ఎందుకు నిర్ణయం తీసుకున్నాడో అర్ధం కావట్లేదని వనిత వెల్లడించారు. 

 

12:44 - December 12, 2017

హైదరాబాద్ : కమెడియన్ విజయ్‌సాయి మృతదేహానికి పోస్టు మార్టం పూర్తైంది. ఉస్మానియా ఆసుపత్రిలో వైద్యులు పోస్టుమార్టం పూర్తి చేశారు. అనంతరం విజయ్‌సాయి మృతదేహాన్ని యూసఫ్‌గూడలోని ఇంటికి తరలించారు. సాయంత్రం విజయ్‌సాయి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 

12:28 - December 12, 2017

కరీంనగర్ : రాష్ట్రంలో అధికార టీఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఆగడాలు రోజు రోజుకూ మితిమీరిపోతున్నాయి. అధికార అండతో దౌర్జన్యానికి దిగుతూ దాడులకు పాల్పడుతున్నారు. నిన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ ఎంపీటీసీ, సర్పంచ్ లను మంత్రి జగదీశ్ రెడ్డి దుర్బాషలాడారు. తాజాగా టీఆర్ ఎస్ ఎమ్మెల్యే శోభ, ఆమె భర్తతోపాటు గన్ మెన్  టోల్ గేట్ వద్ద హల్ చల్ చేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ తిమ్మాపూర్ మండలం రేణిగుంట టోల్ గేట్ వద్ద చొప్పదండి ఎమ్మెల్యే శోభ, ఆమె భర్తతోపాటు గన్ మెన్ హల్ చల్ చేశారు. వీఐపీగా గుర్తించడంలేదంటూ సిబ్బందిపై ఎమ్మెల్యే శోభ దాడి చేశారు. గొడవ దృశ్యాలను సెల్ ఫోన్ లో చిత్రీకరిస్తుండగా సిబ్బంది మొబైల్ ను శోభ లాక్కెళ్లింది. నానా బూతులు తిడుతూ దాడి చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. గతంలో ఇదే టోట్ గేట్ వద్ద పెద్దపల్లి జిల్లాకు చెందిన ఎమ్మెల్యే వీరంగం సృష్టించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.... 

 

విజయ్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి

హైదరాబాద్ : కమెడియన్ విజయ్ సాయి మృతదేహానికి పోస్టుమార్టం ముగిసింది. అనంతరం అతని భౌతికకాయాన్ని యూసఫ్ గూడలోని నివాసానికి తరలించారు. 

పోలవరంపై సుప్రీంలో విచారణ

ఢిల్లీ : పోలవరం నిర్మాణంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పోలవరం నిర్మాణంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఒడిశా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తదుపరి విచారణ ఫిబ్రవరి రెండో వారానికి వాయిదా వేసింది. ముంపు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం జరపాలని ఒడిశా కోర్టును కోరింది. సీఎంల సమావేశానికి ముఖ్యమంత్రులు అంగీకరించారు. 

12:07 - December 12, 2017

హైదరాబాద్ : కమెడియన్ విజయ్ సాయి మృతదేహానికి మరికాసేపట్లో పోస్టుమార్టం జరుగనుంది. ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం చేయనున్నారు. సాయంత్రం విజయ్ సాయి అంత్యక్రియలు జరుగనున్నాయి. తన మరణానికి భార్య, మరో ఇద్దరు కారణమంటూ విజయ్ సెల్ఫీ వీడియో తీశారు. 

నేడు సాయంత్రం విజయ్ సాయ్ అంత్యక్రియలు

హైదరాబాద్ : నేడు సాయంత్రం కమెడియన్ విజయ్ సాయి అంత్యక్రియలు జరగునున్నాయి.  కాసేపట్లో అతని మృతదేహానికి పోస్టుమార్టం చేయనున్నారు. 

11:47 - December 12, 2017

హైదరాబాద్ : కమెడియన్ విజయ్ సాయి భార్య వనిత మీడియాకు సెల్ఫీ వీడియో పంపారు. అత్తింటి వారు ప్లాన్ ప్రకారమే తనను అవమానాల పాలు చేస్తున్నారని తెలిపారు. వాళ్ల అబ్బాయి తప్పు కప్పి పుచ్చడానికే తనపై నిందలు వేస్తున్నారని పేర్కొన్నారు. 'ఇది సరికాదు..నిజాలు ఎప్పటికైనా తెలుస్తాయి' అని ఆమె అంటున్నారు. విజయ్ సాయి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే.  

 

వార్డెన్ మండలించాడని విద్యార్థులు అదృశ్యం

విశాఖ : జిల్లా పాయకరావు పేట శ్రీప్రకాష్ విద్యాలయంలో ఇద్దరు విద్యార్థులు అదృశ్యమయ్యారు. వార్డెన్ మందలించాడని వీరబాబు, హర్ష అనే ఇద్దరు విద్యార్థులు హాస్టల్ నుంచి వెళ్లిపోయారు. పల్లలు వెళ్లిపోయిన యాజమాన్యం పట్టించుకోవడంలేదని విద్యార్థుల తల్లిదండ్రులు  పీఎస్ ఫిర్యాదు చేశారు.

నారాయణఖేడ్ లో ఉద్రిక్తత

సంగారెడ్డి : జిల్లా నారాయణఖేడ్ రాజీవ్ గాంధీ చౌరస్తాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రైతు బజార్ తరలింపు నిరసిస్తూ రైతులు, వ్యాపారులు ఆందోళనకు దిగారు. పోలీసులు ఆందోళనను అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. 

11:38 - December 12, 2017
11:33 - December 12, 2017

ఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రాహుల్‌ గాంధీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిసెంబర్‌ 16న పార్టీ అధ్యక్షునిగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. నెహ్రూ గాంధీ కుటుంబం నుంచి పార్టీ బాధ్యతలు అందుకోనున్న ఐదో వ్యక్తిగా రాహుల్‌ నిలవనున్నారు. 
16న అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టనున్న రాహుల్‌   
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్షపదవికి నామినేషన్ ఉపసంహరణ గడువు సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు ముగిసింది. ఈ పదవి కోసం మొత్తం 89 నామినేషన్‌ ప్రతిపాదనలు వచ్చాయి. రాహుల్‌ మినహా ఎవరూ నామినేషన్‌ వేయకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ రామచంద్రన్ ప్రకటించారు. డిసెంబర్‌ 16న బాధ్యతలు రాహుల్‌ అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టనున్నారు.
సోనియాగాంధీ 19 ఏళ్ల పాటు కొనసాగి రికార్డు 
కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో సోనియాగాంధీ  అత్యధిక కాలం 19 ఏళ్ల పాటు కొనసాగి రికార్డు సృష్టించారు.  కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడిగా పనిచేసిన రాహుల్ డిసెంబర్‌ 16న సోనియాగాంధీ నుంచి పూర్తి స్థాయిలో అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్నారు. నెహ్రూ-గాంధీ కుటుంబం నుంచి కాంగ్రెస్‌ పార్టీ బాధ్యతలు అందుకోనున్న ఐదో వ్యక్తిగా రాహుల్‌ నిలవనున్నారు.
రాహుల్ నేతృత్వంలో పార్టీ మరింత బలోపేతం : నేతలు 
రాహుల్‌ చాలా సౌమ్యుడని.. రైతులు, బడుగు, బలహీన వర్గాల వారికి అండగా నిలిచారని...ఆయన నేతృత్వంలో పార్టీ మరింత బలోపేతమవుతుందన్న ఆశభావాన్ని కాంగ్రెస్‌ నేతలు వ్యక్తం చేస్తున్నారు. రాహుల్‌గాంధీని పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించడంతో ఢిల్లీలోని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు.
2004లో రాజకీయాల్లోకి రాహుల్‌  
47 ఏళ్ల రాహుల్‌ గాంధీ 2004లో రాజకీయాల్లోకి వచ్చారు. 2007లో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన రాహుల్‌- యువజన కాంగ్రెస్‌, ఎన్‌ఎస్‌యూఐ సారథ్య బాధ్యతలు నిర్వర్తించారు. 2013లో ఏఐసీసీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన రాహుల్- 2014 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ప్రచార బాధ్యతలను నిర్వర్తించారు. ఆ ఎన్నికల్లో మోది సారథ్యంలోని బిజెపి చేతిలో కాంగ్రెస్‌ ఘోర పరాజయాన్ని చవిచూసింది. గుజరాత్‌, హిమాచల్‌ ఎన్నికల ఫలితాలకు రెండు రోజుల ముందు అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు. దేశంలోనే అతి పురాతనమైనదిగా పేరొందిన కాంగ్రెస్‌ పార్టీకి పునర్వైభవం తీసుకురావడమన్నది రాహుల్‌కు సవాల్‌ లాంటిదే.

 

11:26 - December 12, 2017

హైదరాబాద్ : తెలుగు భాషా సాహిత్య చరిత్రలో సరికొత్త యుగం ఆవిష్కారం కాబోతోంది. భాగ్యనగరంలో ఐదు రోజుల పాటు జరగనున్న ప్రపంచ తెలుగు మహాసభలు నూతన శకానికి నాంది పలుకబోతున్నాయి. చరిత్రలో నిలిచిపోయే విధంగా.. మహాసభల నిర్వహణకు  ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహాసభల కోసం నగరం సర్వాంగ సుందరంగా  ముస్తాబవుతోంది. 
ఎల్బీ స్టేడియంలో ప్రత్యేక ఏర్పాట్లు
ప్రపంచ తెలుగు మహాసభల కోసం హైదరాబాద్‌ నగరం అందంగా ముస్తాబవుతోంది. విద్యుత్‌ కాంతులతో శోభయమానంగా  మారనుంది. 15 నుంచి 19 వరకు జరగనున్న ఈ సభల కోసం  ఎల్బీ స్టేడియాన్ని సిద్ధం చేస్తున్నారు. అలాగే మహాసభలు అందరినీ ఆకర్షించేలా.. ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. 
ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్న లేజర్‌షో
ఈ సభల్లో లేజర్‌ షో ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతుంది.  సుద్దాల అశోక్‌తేజ రాసిన అదిగో పోతన అనే పాటపై 25 నిమిషాలపాటు రూపొందించిన  లేజర్ షోను స్టేడియంలో ప్రదర్శించబోతున్నారు.  అలాగే మహాసభల ఆరంభ, ముగింపు కార్యక్రమాల్లో ఫైర్‌వర్క్స్ ముచ్చటగొలిపే విధంగా ఉండనున్నాయి. ఐదు నిమిషాలపాటు ఆకాశం నుంచి పూలవర్షం కురిసే తరహాలో ఫైర్ షాట్స్ ఉండనున్నాయి.
రాబోతున్న వేలాది మంది ప్రతినిధులు 
స్వరాష్ట్రం నుంచే కాకుండా తెలంగాణేతర ప్రాంతాల నుంచి, వివిధ దేశాల నుంచి వేలాది ప్రతినిధులు, అతిథులు ఈ సభలకు రాబోతున్నారు.  సుమారు 40 దేశాల నుంచి 200 మంది ప్రతినిధులు మహాసభలకు హాజరయ్యేందుకు తమ సమ్మతి తెలియజేశారు. 36 మంది పండితులను, కవులను, భాషా నిపుణులను తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ తరపున ఆహ్వానించారు. అతిథులందరికీ అవసరమైన రవాణా, వసతి సౌకర్యాలు కల్పించడమే కాకుండా, అపూర్వమైన రుచులను వారు ఆస్వాదించేందుకు అన్ని సన్నాహాలు చేస్తున్నాయి.

11:25 - December 12, 2017

బాహుబలితో దేశ సినీ చరిత్రలో రికార్డు క్రియేట్ చేసిన దర్శధీరుడు రాజమౌళి ఇప్పుడు ఓ మల్టీస్టారర్ చిత్రం తీయబోతున్నారు. అందులో ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా చేయనున్నా సంగతి తెలిసిందే. అయితే హీరోయిన్లు ఎవరు అనేది అందరిలో ఆసక్తి నెలకొంది. ఎన్టీఆర్ సరసన అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా చేయబోతున్నట్లు సమాచారం. ఇమ్మాన్యుయేల్ అజ్ఞాతవాసిలో పవన్ సరసన నటించారు. ప్రస్తుతం ఆమె అల్లు అర్జున్ మూవీ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియాలో నటిస్తున్నారు. అంతే కాదు బోయపాటి దర్శకత్వంలో చరణ్ చేయబోతున్న చిత్రంలో కూడా అనును హీరోయిన్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ హీరోయిన్ దొరికింది మరి చరణ్ ఎవరు తెలియాల్సి ఉంది.

11:19 - December 12, 2017

గుంటూరు : ఏపీ డీఎస్పీల బదిలీల ఉత్తర్వుల జారీలో అధికారుల నిర్వాకం బయటపడింది. మృతి చెందిన ఓ అధికారికి బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ జీవోలో మృతి చెందిన తిరుమల ఎస్బీ డీఎస్పీ రామాంజనేయులు పేరు ఉంది. 6 నెలల క్రితం రామాంజనేయులు మరణించారు. రామాంజనేయులు హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చేయాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

తెలంగాణలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు

హైదరాబాద్ : తెలంగాణలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. పలు చోట్ల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైయ్యాయి. ఆసిఫాబాద్ జిల్లా గిన్నెదరిలో6.6, వాంకిడిలో7.8డిగ్రీలు నమోదు జరిగింది. 

శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే రోజా

చిత్తూరు : నగరి ఎమ్మెల్యే రోజా శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా వీఐపీ దర్శనాలపై మరోసారి రోజా తీవ్ర విమర్శంలు చేశారు. బ్రేక్ దర్శనంతో లిస్ట్ 1 అనర్హులకు కేటాయిస్తున్నారని ఆమె ఆరోపించారు. 

11:01 - December 12, 2017

చత్తీస్‌గఢ్‌ : గడ్చిరోలిలో మావోయిస్టుల బంద్‌ నడుస్తోంది. ఐదుగురు మావోయిస్టులను పోలీసులు కాల్చి చంపినందుకు నిరసనగా బంద్‌ నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ చర్యను నిరసిస్తూ సెల్‌టవర్లను కాల్చివేశారు. బీజేపీ ప్రభుత్వానికి, మతోన్మాదానికి వ్యతిరేకంగా బ్యానర్లు వెలిశాయి. బంద్‌ను విజయంతం చేయాలని మావోయిస్టుల పిలుపునిచ్చారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

10:55 - December 12, 2017

నాగర్‌కర్నూలు : జిల్లాలో ప్రియుడితో కలిసి భర్తను హతమార్చి... ఆపై ప్రియుడిపై యాసిడ్‌పోసి ఆస్పత్రిలో చేర్చిన ప్రేమాంతకురాలు స్వాతి కేసులో ఇవాళ రాజేష్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసే అవకాశముంది. ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు. అయితే ప్రియుడు రాజేష్‌ను స్వాతి ఆస్పత్రిలో చేర్చుతున్న విజువల్స్‌ను 10టీవీ సంపాదించి. ప్రియుడిని స్టెచర్‌పై స్వాతి తీసుకెళ్తున్నట్టు విజువల్స్‌లో స్పష్టమైంది. రాజేష్‌తో సెటిలైపోయేందుకు స్వాతి మాస్టర్‌ ప్లాన్‌ వేసింది. కానీ స్వాతి ప్లాన్‌ను సుధాకర్‌రెడ్డి తల్లిదండ్రులు బట్టబయలు చేశారు. మరిన్ని వివరాలను వీడియలో చూద్దాం...

విజయ్‌సాయి తండ్రి, భార్య వనితల ఆడియో టేపు సంచలనం

హైదరాబాద్ : కమెడియన్ విజయ్‌ సాయి ఆత్మహత్య కేసులో మరో కొత్త ట్విస్ట్‌ ఎదురైంది. విజయ్‌సాయి తండ్రి సుబ్బారావు, భార్య వనితలు మాట్లాడిన ఆడియో టేపు సంచలనం కలిగిస్తోంది. వీరిద్దరి మధ్య జరిగిన ఆసక్తికరమైన సంభాషణ చర్చనీయాంశంగా మారింది. కొడుకు విజయ్‌సాయిని దూరంగా పెట్టమని మామ సుబ్బారావు వనితకు ఫోన్‌లో సూచించారు. ఏమున్నా లాయర్‌తో మాట్లాడుకోమని చెప్పమంటూ కోడలికి సలహా ఇచ్చారు. మనవరాలు కుందన చదువుని డిస్ట్రబ్ చేయకండని.. అవసరమైతే ఫోన్ నంబర్ మార్చేసుకోమంటూ కోడలు వనితకు సుబ్బారావు సూచించారు. 

10:51 - December 12, 2017

హైదరాబాద్ : కమెడియన్ విజయ్‌ సాయి ఆత్మహత్య కేసులో మరో కొత్త ట్విస్ట్‌ ఎదురైంది. విజయ్‌సాయి తండ్రి సుబ్బారావు, భార్య వనితలు మాట్లాడిన ఆడియో టేపు సంచలనం కలిగిస్తోంది. వీరిద్దరి మధ్య జరిగిన ఆసక్తికరమైన సంభాషణ చర్చనీయాంశంగా మారింది. కొడుకు విజయ్‌సాయిని దూరంగా పెట్టమని మామ సుబ్బారావు వనితకు ఫోన్‌లో సూచించారు. ఏమున్నా లాయర్‌తో మాట్లాడుకోమని చెప్పమంటూ కోడలికి సలహా ఇచ్చారు. మనవరాలు కుందన చదువుని డిస్ట్రబ్ చేయకండని.. అవసరమైతే ఫోన్ నంబర్ మార్చేసుకోమంటూ కోడలు వనితకు సుబ్బారావు సూచించారు. కుందనని దూరం చేయకూడదని విజయ్‌తో మాట్లాడిస్తున్నాని వనిత చెప్పారు. కోర్టంటే విజయ్‌కి భయంలేదన్నారు. విజయ్‌ తనను బెదిరిస్తున్నాడని పేర్కొన్నారు. కుందన దగ్గరకు విజయ్‌ని వెళ్లనీయకండని చెప్పారు.
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.... 

10:44 - December 12, 2017

గుంటూరు : సమాజ సేవను నేటి యువత బాధ్యతగా తీసుకోవాలని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సూచించారు. తక్కెళ్లపాడులోని సిబార్ దంత వైద్యకళాశాల వార్షికోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. వైద్యులంటే రోగుల పాలిట దైవంతో సమానమని.. అదే విధంగా రోగులకు సేవ చేయాలని విద్యార్ధులకు జేడీ సూచించారు.  సిబార్‌ వైద్య కళాశాలలో చదివిన వారు ఎందరో విదేశాలలో దంత వైద్యులుగా స్థిరపడ్డారని కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎల్‌. క్రిష్ణ ప్రసాద్‌  తెలిపారు. బీడీఎస్‌, ఎండీఎస్‌లలో టాపర్లకు మెడల్స్‌తో పాటు నగదు పురస్కారాన్ని జేడీ లక్ష్మీనారాయణ చేతుల మీదుగా అందజేశారు. 
సిబార్‌ దంత వైద్యకళాశాల వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరు

నకిలీ సర్టిఫికెట్ల తయారీ ముఠా గుట్టురట్టు

హైదరాబాద్ : నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్నా ముఠా వ్యవహారం గుట్టురట్టైంది. ముగ్గురు సభ్యుల ముఠాను సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ముఠా వద్ద నుంచి కంప్యూటర్, కలర్ ప్రింటర్, స్టాంప్ లు, లెటర్ హెడ్స్ నకిలీ సర్టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. 

గడ్చిరోలిలో మావోయిస్టుల బంద్

చత్తీస్ గఢ్ : గడ్చిరోలిలో మావోయిస్టుల బంద్ కు పిలుపునిచ్చారు. ఐదుగురు మావోయిస్టులను కాల్చి చంపినందుకు నిరసనగా బంద్ చేపట్టారు. సెల్ టవర్లను మావోయిస్టులు కాల్చి వేశారు.  బీజేపీ ప్రభుత్వం, మతోన్మాదానికి వ్యతిరేకంగా బ్యానర్లు వెలిశాయి. బంద్ ను విజయవతం చేయాలని కరపత్రాలు పడేశారు. 

 

టోల్ గేట్ వద్ద ఎమ్మెల్యే భర్త హల్ చల్

కరీంనగర్ : జిల్లా తిమ్మాపూర్ మండలం గుండ్లపల్లి టోల్ గేట్ వద్ద చొప్పదండి టీఆర్ఎస్ ఎమ్మెల్యేల బోడిగే శోభ, భర్త, గన్ మెన్ హల్ చల్ చేశారు. వీఐపీగా గుర్తించడంలేదంటూ సిబ్బంది పై దాడికి యత్నించారు. గొడవ దృశ్యాలను సెల్ ఫోన్ లో చిత్రీకరిస్తుండగా సిబ్బంది మొబైల్ ఫోన్ లాక్కెళ్లారు. 

ఏపీ దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ ఇంటిపై ఏసీబీ దాడులు

విజయవాడ : దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ ఇంటిపై ఏసీబీ దాడులు చేసింది. హైదరాబాద్, రాజమండ్రిలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. మూడు ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు గుర్తించారు. భారీగా ఆస్తులు వెలుగుచూస్తున్నాయి.  

 

ఏపీలో డీఎస్సీల బదిలీ ఉత్తర్వుల జారీలో అధికారుల నిర్వాకం

గుంటూరు : ఏపీలో డీఎస్సీల బదిలీ ఉత్తర్వుల జారీలో అధికారుల నిర్వాకం బయటపడింది. చనిపోయిన వ్యక్తి రామాంజనేయులును బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆరు నెలల క్రితం రామాంజనేయులు చనిపోయారు. 

ఢిల్లీలో పొగమంచు కారణంగా 27 రైళ్లు ఆలస్యం

ఢిల్లీ : నగరంలో పొగమంచు కారణంగా 27 రైళ్లు ఆలస్యం నడవనున్నాయి. ఒక రైలు సమయాల్లో మార్పు, 15 రైళ్ళను రద్దు చేశారు. 

08:52 - December 12, 2017

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చ కార్యక్రమంలో బీజేపీ నేత నరేష్ , కాంగ్రెస్ నేత రామచంద్రారెడ్డి పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

08:33 - December 12, 2017

ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని స్టాఫ్‌ ఆండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌డబ్య్లూఎఫ్‌) నాయకులు వీఎస్‌ రావ్‌ డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం కార్యక్రమంలో ఆర్టీసీ కార్మికులు ఆందోళన బాట పట్టారు. పని భారం పెంచుతున్నారు. కార్మిక చట్టాలు అమలు లేదు. పే స్కేల్‌ లేదు. ఇది ఆర్టీసీ కార్మిక సంఘాలు చెప్తున్న మాట. వారి ఆందోళనకి దారి తీసిన పరిస్థితులు, ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వ విధానం తదితర అంశాలపై వీఎస్‌ రావ్‌ మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

08:29 - December 12, 2017

హైదరాబాద్ : కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల విదానాలపై విసుగెత్తి.. ఇన్నాళ్లు ప్రజలు రోడ్డెక్కి ఆందోళన చేసిన ఘటనలు చూశాం.. తాజాగా ట్రాన్స్‌ జెండర్స్‌ రోడ్డెక్కబోతున్నారు.. తమ హక్కులకు భంగం కల్గించేలా ఉన్నా.. బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళన బాటపడ్డబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ట్రాన్స్‌జెండర్‌ పర్సన్స్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ రైట్స్‌ బిల్లు రద్దు చేయాలని వారు పిడికిలిబిగించబోతున్నారు. వారి ఆందోళనకు టీ-మాస్‌ మద్ధతు ప్రకటించింది.
ప్రోటెక్షన్‌ ఆఫ్‌ రైట్స్‌ బిల్లును రద్దు చేయాలని డిమాండ్‌
ట్రాన్స్‌ జెండర్స్‌ హక్కులను కాలరాసే విధంగా ఉన్న  ప్రొటెక్షన్‌ ఆఫ్‌ రైట్స్‌ బిల్లు రద్దుకై తెలంగాణ హిజ్రా సంఘాలు ఆందోళన బాటపట్టడానికి సిద్ధమయ్యాయి.  బిల్లును రద్దు చెయ్యాలంటూ హిజ్రా ఇంటర్‌ సెక్స్‌ ట్రాన్స్‌జెండర్స్‌ సమితి, తెలంగాణ ట్రాన్స్‌జెండర్స్‌ పీపుల్స్‌ అసోసియేషన్‌, తెలంగాణ ఇంటలెక్చువల్‌ ఫోరం డిమాండ్‌ చేసింది. బిల్లుకు వ్యతిరేకంగా ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు..
ట్రాన్స్‌ జెండర్‌ 2016 బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళన 
ట్రాన్స్‌జెండర్స్‌ బిల్లు-2016ను వ్యతిరేకిస్తూ ఆయా సంఘాలు ఇప్పటికే దశవారిగా ఆందోళనలు చేస్తున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న బిల్లు హిజ్రాల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని వాపోతున్నారు. కేంద్రం తీసుకువచ్చే బిల్లుతో లాభం కంటే తమకు నష్టం ఎక్కువుందని వారు అంటున్నారు. హిజ్రా గుర్తింపు కోసం స్క్రీనింగ్‌ టెస్ట్‌ చేయడం సరికాదంటున్నారు. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ట్రాన్స్‌ జెండర్స్‌ బిల్లు కమీటిలో ట్రాన్స్‌ జెండర్స్‌ సభ్యులుగా లేకుండా.. వైద్యఆరోగ్యశాఖ అధికార్ల సమక్షంలో స్క్రీనింగ్‌ టెస్ట్‌పై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు..
2014లో సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించిందన్న ట్రాన్స్‌ జెండర్స్‌
ఎన్నో ఏళ్లగా తమ సమస్యలను పట్టించుకోని పాలకులు.. ప్రొటెక్షన్‌ ఆప్‌ రైట్స్‌  పేరుతో తమ హక్కులను పూర్తిగా కాలరేసే ప్రయత్నం చేస్తుందని హిజ్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2014 ఏప్రిల్‌లో సుప్రీం కోర్ట్‌ ట్రాన్స్‌ జెండర్స్‌ హక్కుల పరిరక్షణకు తీర్పు వెల్లడించిందన్నారు. నల్సన్‌ మరియు యూ.ఓ.ఐ ట్రాన్స్‌ జెండర్స్‌పై రిపోర్ట్‌ ను పక్కకు పెట్టి తమ హక్కులకు భంగం కలిగేలా కేంద్రం వ్యవహరిస్తుందని అంటున్నారు. తెలంగాణలో తమిళనాడు తరహాలో హిజ్రా ట్రాన్స్‌జెండర్‌ సంక్షేమ మండలి ఏర్పాటు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. 
సంక్షేమ పథకాల్లో భాగస్వామ్యం కల్పించాలని డిమాండ్‌
ట్రాన్స్‌జెండర్స్‌కి మద్దతుగా టీమాస్‌
ట్రాన్స్‌జెండర్‌ మహిళలకు సంక్షేమ పథకాల్లో భాగ్యస్వామ్యం కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రొటెక్షన్‌ ఆఫ్‌ రైట్స్‌ బిల్లును అడ్డుకునేందుకు ఈనెల 15న  ఢిల్లీకి బయలుదేరి.. 17న ఆందోళన చేయనున్నట్లు తెలిపారు. చట్టపరమైన హక్కులను కాపాడుకునేందుకు ట్రాన్స్‌ జెండర్స్‌ చేస్తున్న పోరాటానికి టి మాస్ బాసటగా నిలిచింది.

08:20 - December 12, 2017

అహ్మదాబాద్ : గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోది, కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, పాటీదార్‌ నేత హార్దిక్‌ పటేల్ మంగళవారం అహ్మదాబాద్‌లో నిర్వహించే రోడ్‌షోలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. శాంతి భద్రతల దృష్ట్యా రోడ్‌ షోకు అనుమతి నిరాకరించినట్లు పేర్కొన్నారు. శాంతి భద్రతలతో పాటుగా, ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.  గుజరాత్‌ రెండోదశ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. రెండో విడత ఎన్నికల్లో భాగంగా 93 శాసనసభ స్థానాలకు డిసెంబర్‌ 14న పోలింగ్‌ జరగనుంది. ప్రచారానికి ఒకేరోజు గడువు ఉండడంతో బిజెపి, కాంగ్రెస్‌లు తమ శక్తినంతా కూడదీస్తున్నాయి.

 

08:16 - December 12, 2017

హైదరాబాద్ : నగరంలోని బైరామల్ గూడలో అగ్నిప్రమాదం జరిగింది. బిస్కెట్ కంపెనీలో మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు కంపెనీ మొత్తం వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు. భారీగా ఆస్తినష్టం జరిగిందని అంచనా.  

నేడు 33వ రోజు జగన్ పాదయాత్ర

అనంతపురం : నేడు 33వ రోజు జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర కొనసాగనుంది. నేడు చిన్నంపల్లి క్రాస్ నుంచి జగన్ పాదయాత్ర ప్రారంభం కానుంది. కురుకుంట బీసీ కాలనీ సజ్జల కాల్వ క్రాస్ లో ప్రజలతో జగన్ ముఖాముఖి నిర్వహించనున్నారు. వైఎస్సార్ కాలనీ, అక్కంపల్లి మీదుగా పాపంపేట వరకు పాదయాత్ర, సాయంత్రం బహిరంగ సభ నిర్వహించనున్నారు. 

 

నేడు విశాఖలో భారత్, శ్రీలకం మూడో వన్డే టికెట్ల విక్రయాలు

విశాఖ : ఉదయం 11 గంటల నుంచి భారత్, శ్రీలకం మూడో వన్డే టికెట్ల విక్రయాలు జరుగనున్నాయి. ఈనెల 17న భారత్, శ్రీలంక మూడో వన్డే మ్యాచ్ జరుగనుంది. 

 

నేడు కమెడియన్ విజయ్ అంత్యక్రియలు

హైదరాబాద్ : ఉదయం 10 గంటలకు ఉస్మానియా ఆస్పత్రిలో హాస్యనటుడు విజయ్ మృతదేహానికి పోస్టుమార్టం చేయనున్నారు. సాయంత్రం అంత్యక్రియలు జరుగనున్నాయి. 

 

బైరామల్ గూడలో అగ్నిప్రమాదం

హైదరాబాద్ : బైరామల్ గూడలో అగ్నిప్రమాదం జరిగింది. బిస్కెట్ కంపెనీలో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు. 

 

07:47 - December 12, 2017

హైదరాబాద్ : మీడియా ప్రీమియర్ లీగ్ సీజన్..2,  2017 నాకౌట్ టోర్నమెంట్  ఇవాళ్టి నుంచి ప్రారంభం అవుతోంది.  టౌర్నమెంట్‌కు సంబందించిన కప్‌, టీమ్ జర్సీలను ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, భారత్ స్టార్ క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌ లాంఛనంగా ప్రారంభించారు. ఈ టీ-20 క్రికెట్ సిరీస్ అత్తాపూర్‌లోని విజయానంద్ గ్రౌండ్‌లో జరగనుంది. ఈ సిరీస్‌లో మొదటి మ్యాచ్‌ 10 టీవీతో ఎన్ టీవి తలపడుతోంది.  నిత్యం పని ఒత్తిడిలో ఉండే మీడియా మిత్రులకు ఆటలు ఉల్లాసాన్ని ఇస్తాయని.. అలాగే మీడియా ఐక్యత నెలకొంటుందని నిర్వాహకులు అన్నారు. 

 

07:42 - December 12, 2017

శ్రీకాకుళం : జిల్లాలో గడచిన మూడు రోజులుగా జరిగిన యూటీఎఫ్ 15వ రాష్ట్ర మహాసభలు విజయవంతం అయ్యాయి. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి వచ్చిన యూటీఎఫ్‌ ప్రతినిధులతోపాటు.. పలువురు రాజకీయ, సామాజికవేత్తలు పాల్గొన్నారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ మహాసభల్లో నూతన పెన్షన్ విధానం, సీపీఎస్‌ను రద్దు చెయ్యాలన్న ప్రధాన డిమాండ్ తో పాటు... పలు తీర్మానాలను చేశారు. 
సమస్యలను పరిష్కరించేవరకూ పోరాటం : నేతలు
శ్రీకాకుళంలో యూటీఎఫ్ 15వ రాష్ట్ర మహాసభలు దిగ్విజయంగా జరిగాయి. ప్రభుత్వం సమస్యలపై వెంటనే స్పందించి పరిష్కరించే వరకూ తమ పోరాటం ఆగదని ఈ సభల్లో పాల్గొన్న ప్రతినిధులు హెచ్చరించారు. సీపీఎస్‌ను రద్దయ్యే వరకూ పోరాడుతామని  ప్రకటించారు. అలాగే  పీఆర్‌సీ నూతన కమిటీల నియామకం, సీఆర్‌సీ ఎరియర్లు, డీఏ బకాయిలు చెల్లించాలని అన్నారు.. ఆదాయ పన్ను రేట్ల సవరణతోపాటు.. మున్సిపల్ టీచర్లకు ట్రెజరీల ద్వారా పీఎఫ్ అకౌంట్లు నిర్వహించాలని యూటీఎఫ్ ప్రతినిధులు డిమాండ్‌ చేశారు.  
సీసీఈ పరీక్షా విధానం సమీక్షించాలి     
మున్సిపల్ ట్రైబల్ వెల్పేర్ టీచర్లను ఉమ్మడి సర్వీస్ రూల్స్‌లో చేర్చి... సీసీఈ పరీక్షా విధానాన్ని సమీక్షించాలని కోరారు. తూర్పుగోదావరి జిల్లా విలీన మండలాల్లో ప్రత్యేక డీఎస్సీ నిర్వహించడంతోపాటు.. విద్యారంగంలో ఉపాధ్యాయినిలు, విద్యార్థినిలు ఎదుర్కొనే సమస్యలు, మౌళిక వసతులపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.  
పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
ఎయిడెడ్ పాఠశాలల్లో ఖాళీలు భర్తీ కాక అనేక పాఠశాలలు మూతపడే స్థితికి చేరుకుంటున్నాయి. ఇలాంటి పాఠశాలలపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. అలాగే ఎయిడెడ్ టీచర్లకు హెల్త్ కార్డుల మంజూరు చేయాలని కోరారు.  మధ్యాహ్న భోజన పథకంలో సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు యోచన విరమించుకోవాలని యూటీఎఫ్ ప్రతినిధులు  డిమాండ్ చేశారు. విజయవంతంగా సాగిన ఈ మహాసభల్లో పాల్గొన్న  నాయకులు ఐక్య పోరాటాలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం పలు సమస్యలను పరిష్కరించే వరకూ అలుపెరగని పోరాటానికి సిద్ధం కావాలన్నారు.

 

07:38 - December 12, 2017

విజయవాడ : వింతంతు పింఛన్‌కు ఆమె అన్ని  విధాలా అర్హురాలు... ఐనా పింఛన్‌ అందడంలేదు..  తన బాధను ముఖ్యమంత్రికి చెప్పుకునేందుకు వెళితే... పోలీసులు అడ్డుకున్నారు... ఇక సీఎంను కలవడం అసాధ్యమని తెలుసుకున్న ఆమె వినూత్నపద్ధతిలో విన్నవించుకుంది... అదెలాగో  చూడండి.. 
అర్హతలున్నా .. అందని వితంతు పింఛన్‌
ఈమె పేరు కాంతమ్మ .. విజయనగరం జిల్లా బుచెం చెరువు గ్రామస్తురాలు . ఇటీవలే కొడుకును కోల్పోయింది . తనకు వితంతు పింఛన్‌ తీసుకునేందుకు అన్ని అర్హతలూ ఉన్నా... స్థానిక నేతలు అడ్డుపడుతున్నారని ఆమె సిఎంకు ఫిర్యాదు చెయ్యడానికి విజయవాడకు వచ్చింది. గతంలో విశాఖ పట్నం లో సీఎంను కలవవడానికి ప్రయత్నిస్తే  పోలీసులు తోసేశారని వాపోయింది . ఇక విజయవాడలోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి ఎదురైంది. దీంతో  ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో... ఇక సీసీ టీవీ నే నమ్ముకుంది . విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయం ముందున్న సీసీ టీవీ వద్ద నిలబడి .. సిఎంకు దానిద్వారానే తన బాధ విన్నవించే ప్రయత్నం చేసింది .  
అనర్హులకే  ప్రభుత్వ పథకాలు
అడ్డదారుల్లో అనర్హులెందరో ప్రభుత్వ పథకాలను అనుభవిస్తుంటే.. ఈమెలాంటి అసలైన అర్హులు ఆదుకునే నాథుడు లేక అభాగ్యులుగా మిగిలిపోతున్నారు... తనతో పాటు అనాథలైన తన కొడుకు పిల్లలకూ ఆధారం లేదనీ .. దయచేసి తనకు పింఛన్‌ను ఇప్పించాలంటూ ఆమె సీసీ కెమెరా ముందు ప్రాధేయపడింది... ఈ దృశ్యం  చూసిన వాళ్ల మనసు చలించిపోయింది.  రియల్ టైమ్‌ గవర్నెన్స్ అంటూ...  తన ఆఫీసు నుంచే లైవ్ లో..  ప్రజల సమస్యలను పరిష్కరిస్తా అంటున్న సీఎ చంద్రబాబు  ఇంతకూ ఈ ధీన మహిళ వ్యధను ఈ విధంగానైనా వినే ఉంటారో..?  లేదో.... సామాన్యులకు అందుబాటులోకి రాని హైటెక్‌ సీఎం... కనీసం ఈ సీసీ కెమెరా ద్వారానైనా   కాంతమ్మ తెలుసుకుని.. న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు...

 

07:35 - December 12, 2017

హైదరాబాద్ : మెట్రో మెరుపులు ఓల్డ్‌సిటీకి లేవా..? జేబీఎస్‌ టూ ఫలక్‌నుమా కారిడార్‌ను ఇమ్లీబన్‌ వరకే సరిపెడుతున్నారా..?  పాతబస్తీలో మెట్రో వస్తే తమ రాజకీయాలు సాగవన్న ఉద్దేశ్యంతోనే ఈ కుట్రకు తెరతీశారా..? ఎంఐఎం, టీఆర్‌ఎస్‌ నేతల కుమ్మక్కుతోనే పాతబస్తీకి మెట్రో రైలు దూరం అవుతోందా..? ఈ ప్రశ్నలకు పాతబస్తీ జనం అవుననే అంటున్నారు. ఫలక్‌నుమా వరకు వెంటనే మెట్రోపనులు ప్రారంభించాలని సీపీఎం ఆధ్వర్యంలో ఓల్డ్‌సిటీ జనం పోరుబాట పట్టారు. 
మెట్రోరైలు భాగ్యం తమకు లేదా : ఓల్డ్‌ సిటీ జనం 
మెట్రోరైలు భాగ్యం తమకు లేదా అని ఓల్డ్‌ సిటీ జనం ప్రశ్నిస్తున్నారు. తమ ఏరియాకు మెట్రోరైలు రాకుండా రాజకీయ కుట్రలు సాగుతున్నాయని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాతబస్తీలో వెంటనే మెట్రో పనులు చేపట్టాలని  పోరుబాట పట్టారు. టీమాస్‌, సీపీఎం ఆధ్వర్యంలో మెట్రోరైల్‌ భవన్‌ వద్ద  ధర్నాకు దిగారు. 
జేబీఎస్‌ ఫలక్‌నుమా కారిడార్‌కు రాజకీయ గ్రహణం !
షెడ్యూల్ ప్రకారం ఈ ఎడాది జూలై నాటికే  72కిలో మీట‌ర్ల మెట్రో రైల్ సిటిజ‌న్స్ కి అందుబాటులోకి రావాలి. కాని ఇప్పటి వ‌ర‌కు కేవ‌లం 30కిలో మీట‌ర్లు మాత్రమే మెట్రో స‌ర్వీసులు ప్రారంభమయ్యాయి. ఇక మిగిలిన 66 కిలోమీటర్ల మెట్రో మార్గం పనులు మరో ఏడాదిలో పూర్తి అవుతాయని ప్రభుత్వం చెబుతోంది. దాన్లోభాగంగా ప్రస్తుతం పలు ఏరియాల్లో నిర్మాణపనులు వేగంగా సాగుతున్నాయి. అయితే.. జేబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు ప్రతిపాదించిన కారిడార్‌కు రాజకీయ గ్రహణం పట్టిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇమ్లీబన్‌ బస్‌స్టాండ్‌ వరకే  పనులు సరిపెడుతున్నారు. దీనిపై ఓల్డ్‌ సిటీ జనం మండిపడుతున్నారు.
మజ్లీస్‌పార్టీ వాదనలపై పాతబస్తీ జనం మండిపాటు 
మెట్రోరైల్‌వల్ల ఓల్డ్‌సిటీలో పలు చారిత్రక కట్టడాలకు నష్టం కలుగుతుందని .. మజ్లీస్‌పార్టీ నేతలు వాదించడంపై పాతబస్తీ జనం మండిపడుతున్నారు. చారిత్రక కట్టడాలకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా కారిడార్‌ నిర్మాణం జరుగుతుందని ఇప్పటికే ప్రభుత్వం, ఎల్‌ అండ్‌ టీ సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయినా.. ఫలక్‌నుమా వరకు సాగాల్సిన పనులను ఇమ్లీబన్‌ వరకు సరిపెట్టడంలో ఆంతర్యం ఏంటని సీపీఎం నేతలు ప్రశ్నిస్తున్నారు.  మెట్రో వస్తే ..యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి, సిటిలోని  దూర ప్రాంతాల‌కు వెళ్లి ఉద్యోగాలు చేసుకునే వీలు కలుగుతుంది. ఇదే జరిగితే ఇక తమ వెంట తిరిగేవారే ఉండరని ఎంఐఎం, టీఆర్‌ఎస్‌ పార్టీలు భయపడుతున్నాయని సీపీఎం నేతలు అంటున్నారు. అందుకే ఓల్డ్‌ సిటీకి మెట్రో రాకుండా కుట్రలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఓల్డ్‌సిటీ అభివృద్ధిని అడ్డుకుంటే చూస్తూ ఊరుకోమని సీపీఎం నేతలు  హెచ్చరిస్తున్నారు.  ఇప్పటికైనా ముందుగా ప్రతిపాదించిన ప్రకారం ఫలక్‌నుమా వరకు మెట్రో పనులు ప్రారంభించాలని ఓల్డ్‌సిటీ పబ్లిక్‌ కోరుతున్నారు. లేదంటే సీపీఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తేల్చి చెబుతున్నారు.  

 

07:28 - December 12, 2017

గుంటూరు : తప్పుడు ఆరోపణలతో పోలవరం ప్రాజెక్టు పనులకు అడ్డుపడొద్దని, ప్రజల మనోభావాలు దెబ్బతీస్తే తగిన మూల్యం తప్పదని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన ఆయన.. ఎలాంటి అవినీతికి తావులేకుండా పోలవరం పూర్తి చేస్తామన్నారు. మరోవైపు ఈనెల 22న కేంద్రమంత్రి గడ్కరీ పోలవరంకు రానున్నారు.
గడువులోగా పూర్తి చేస్తాం : చంద్రబాబు
ఆంధ్రపదేశ్‌కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును గడువులోగా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని  ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ఆయన... కాపర్‌ డ్యామ్‌, డయాఫ్రం వాల్‌ పనులను పరిశీలించారు. పనుల తీరును ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు.
తగిన మూల్యం తప్పదు : చంద్రబాబు 
పోలవరం ప్రాజెక్టు పనులకు అడ్డుపడితే తగిన మూల్యం తప్పదని చంద్రబాబు హెచ్చరించారు. పోలవరంలో కాంక్రీట్‌ వర్క్స్‌ మినహా ఇతర పనులు వేగవంతం చేశామని, కాంక్రీట్‌ పనులు పూర్తిచేసి కాఫర్‌ డ్యాం నిర్మిస్తే.. వచ్చే ఏడాదిలో గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వొచ్చన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌పై 12 వేల 560 కోట్లు ఖర్చుచేశామని, కేంద్రం రూ.4 వేల 329 కోట్లు ఇచ్చిందని.. ఇంకా 3 వేల 100 కోట్లు ఇవ్వాలని గుర్తు చేశారు. పవర్‌ ప్రాజెక్ట్‌కు 4 వేల కోట్లు ఇవ్వాలని, 2013 చట్టంతో భూసేకరణ వ్యయం 11 రెట్లు పెరిగిందని చెప్పారు. 98 వేల గిరిజన కుటుంబాలకు పునరావాసం కల్పించాలని, ప్రతి కుటుంబానికి సగటున రూ.18 లక్షలు చెల్లించాల్సి వస్తుందని బాబు తెలిపారు. పునరావాస ప్యాకేజీ వల్ల ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.54వేల కోట్లకు చేరుకుందన్నారు. పోలవరం వివరాలు ఎప్పటికప్పుడు ప్రకటిస్తున్నామని, శ్వేతపత్రం ఎందుకని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రాజెక్టు విషయంలో ఎలాంటి రాజీ పడబోమని అడ్డుకుంటే చూస్తూ వూరుకోబోమని చంద్రబాబు హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన తర్వాత సీఎం చంద్రబాబు అధికారులతో సమావేశమయ్యారు. పనుల్లో వేగం పెంచాలని సూచించారు. రాబోయే మూడు నెలలు పనులకు అనుకూలమని అధికారులకు సూచించారు. 
ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తాం  : గడ్కరీ  
మరోవైపు పోలవరం ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తామని కేంద్ర జలవనరుల శాఖా మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో కలిసే 2018లోగా ప్రాజెక్టును పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. ఈ నెల 22న పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తానని ఆ తర్వాత పూర్తి స్థాయిలో సమీక్ష జరుపుతానని తెలిపారు. తమ వద్ద ఒక్క బిల్లు కూడా పెండింగ్‌లో ఉండదని.. ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించాలని అధికారులను ఆదేశించినట్టు గడ్కరి తెలిపారు.
పోలవరం ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచి అనుకున్న సమయానికి పూర్తి చేయాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కృత నిష్చయంతో ఉన్నాయి. మరి ప్రాజెక్టు ఎప్పటి లోగా పూర్తవుతుందో చూడాలి.

 

07:22 - December 12, 2017

గుంటూరు : సీఆర్డీఏ అధికారులు, దర్శకుడు రాజమౌళితో ఇవాళ  సీఎం చంద్రబాబు  భేటీ కానున్నారు. అమరావతి శాశ్వత భవనాల డిజైన్లపై చర్చిస్తారు. రాజధాని డిజైన్లను  2, 3 రోజుల్లో ప్రభుత్వం ఖరారు చేయనున్న నేపథ్యంలో ముందుగా నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులు, సీఆర్డీఏ అధికారులతో రాజమౌళి భేటీ అవుతారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం అవుతారు.  రేపు  ఫైనల్ డిజైన్లు ఖరారు చేసే అవకాశం ఉంది. రాజధాని భవనాల డిజైన్లను పబ్లిక్ డొమైన్‌లో పెట్టి ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

 

మంత్రులు, సెక్రటరీలు, శాఖాధితులతో సీఎం చంద్రబాబు సమావేశం

అమరావతి : సచివాలయంలో ఉదయం 10.30 గంటలకు మంత్రులు, సెక్రటరీలు, శాఖాధితులతో సీఎం సమావేశం జరుగనుంది. వృద్ధి రేటు, అభివృద్ధి, సంక్షేమ పథకాలపై చర్చించనున్నారు. 

 

నేడు గోదావరి నదీ యాజమాన్య బోర్డు భేటీ

హైదరాబాద్ : నేడు గోదావరి నదీ యాజమాన్య బోర్డు భేటీ కానుంది. ఈ సమావేశాలో ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖ అధికారులు పాల్గొననున్నారు. 

 

శాడిస్ట్ భర్త రాజేష్ కు పాటెన్సీటెస్ట్ పై నేడు కోర్టు తీర్పు

చిత్తూరు : శాడిస్ట్ భర్త రాజేష్ కు పాటెన్సీటెస్ట్ పై నేడు కోర్టు తీర్పు రానుంది. 

నేటి నుంచి ఓయూలోని హాస్టల్స్ కు సెలవు

హైదరాబాద్ : సైన్స్ కాంగ్రెస్ నేపథ్యంలో నేటి నుంచి వచ్చే నెల 15 వరకు ఓయూలోని హాస్టల్స్ కు సెలవు ప్రకటించారు.

 

Don't Miss