Activities calendar

13 December 2017

21:44 - December 13, 2017

ప్రపంచ తెలుగు మహా సభలు ఏర్పాట్లు పూర్తి జరిగాయని, తెలంగాణ ఏర్పాడ్డ తర్వాత ఈ సభలు నిర్వహిచండం చాలా సంతోషకరమైన విషయామని తెలంగాణ టూరిజం కార్యదర్శి బుర్ర వెంకటేష్ అన్నారు. తెలుగు మహాసభల మరిన్ని విషయాలు ఆయన మాటాల్లోని తెలుసుకుద్దాం...

21:39 - December 13, 2017

మొహాలీ : మొహాలీ వన్డేలో భారత్‌కు పోటీనే లేకుండా పోయింది. తొలి వన్డే ఓటమితో విమర్శలు ఎదుర్కొన్న భారత్‌ రెండో వన్డేలో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆధిపత్యం ప్రదర్శించింది.రోహిత్‌ శర్మ డబుల్‌ సెంచరీ, శిఖర్‌ ధావన్‌, శ్రేయస్‌ అయ్యర్‌ హాఫ్‌ సెంచరీలతో భారత్‌ 50 ఓవర్లలో 392 పరుగులు చేసింది.ధావన్‌తో కలిసి 115 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించిన రోహిత్‌, శ్రేయస్‌ అయ్యర్‌తో కలిసి 213 పరుగులు జోడించిన రోహిత్‌ భారత్‌కు భారీ స్కోర్‌ అందించాడు.393 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు ఆరంభం నుంచే తడబడింది.ఏంజెలో మాథ్యూస్‌ సెంచరీతో పోరాడినా భారత బౌలర్ల ధాటికి మిగతా బ్యాట్స్‌మెన్‌ తేలిపోవడంతో లంక జట్టుకు ఓటమి తప్పలేదు.141 పరుగుల తేడాతో నెగ్గిన భారత జట్టు 3 మ్యాచ్‌ల సిరీస్‌ను1-1తో సమం చేసింది.డూ ఆర్‌ డై మ్యాచ్‌లో డబల్‌ సెంచరీతో భారత జట్టుకు విజయాన్నందించిన కెప్టెన్‌ రోహిత్ శర్మకు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డ్‌ దక్కింది.

21:38 - December 13, 2017

ఢిల్లీ : అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే భక్తులపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పలు ఆంక్షలు విధించింది. అమర్‌నాథ్ గుహలోకి వెళ్లే భక్తులు ఇకపై ఎలాంటి మంత్రోచ్ఛరణలు, జైజై నినాదాలు చేయకుండా చూడాలని అమర్‌నాథ్ ఆలయ బోర్డును ఎన్‌జిటి ఆదేశించింది. గుహలో భక్తులు గంటలు కొట్టడం, నినాదాలు చేయడం వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లనుందని హెచ్చరించింది. భక్తులు చిట్టచివరి చెక్‌పోస్ట్ దాటి తమ మొబైల్ ఫోన్లు, వస్తువులు తీసుకెళ్లరాదని, వాటిని దాచి ఉంచేందుకు స్టోర్ రూమ్ ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలించాలని అమర్‌నాథ్‌ బోర్డుకు ఎన్జీటీ సూచించింది. వాణిజ్య కార్యకలాపాలకి ఇస్తున్న ప్రాధాన్యత భక్తులకు సరైన మౌళిక వసతులు కల్పించడంలో శ్రద్ధ చూపడం లేదని ఎన్‌జిటి ఆలయబోర్డును తీవ్రస్థాయిలో తప్పుపట్టింది. వైష్ణోదేవి ఆలయ దర్శనానికి 50 వేలకు మించి భక్తులు మించరాదన్న ఎన్‌జిటి ఆదేశంపై సుప్రీంకోర్టు స్టే విధించింది.

21:37 - December 13, 2017

గుంటూరు : అమరావతిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న అసెంబ్లీ భవన నిర్మాణంలో ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్ర శాసనసభ భవనం కోసం నార్మన్‌ ఫోస్టర్‌ బృందం తాజాగా రూపొందించిన ఆకృతులపై.. చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశానికి సినీ దర్శకుడు రాజమౌళితో పాటు పలువురు పాల్గొని పలు సూచనలు చేశారు. గతంలో నార్మన్‌ ఫోస్టర్‌ రూపొందించిన పలు డిజైన్లకు చంద్రబాబు అనేక సూచనలు చేశారు. అలాగే లండన్‌ పర్యటనలో పోస్టర్‌ బృందాన్ని కలిసిన చంద్రబాబు... రాష్ట్ర సంస్కృతి, వారసత్వాలకు అద్దం పట్టేలా.. సృజనాత్మకంగా డిజైన్లు ఉండాలని సూచించారు. దీనికి అనుగుణంగా నార్మన్‌ ఫోస్టర్‌ ప్రతినిధులు డిజైన్లు రూపొందించారు. సచివాలయంలో సీఆర్డీఏ సమావేశంలో ఈ డిజైన్లపై సుదీర్ఘంగా చర్చించారు. రెండు డిజైన్లలో సూది మొన కలిగిన టవర్‌ ఒకటి ఉండగా,... డైమండ్‌ నమూనాలో మరో డిజైన్‌ సిద్దం చేశారు. అయితే ఇందులో చాలామంది టవర్‌ భవనం వైపు మొగ్గు చూపారు.

పబ్లిక్ డోమైన్ లో డిజైన్లు
దీంతో చంద్రబాబు.. ఈ డిజైన్లపై ప్రజాభిప్రాయం సేకరించిన తర్వాత ఫైనల్‌ చేయాలని నిర్ణయించారు. ఈ రెండు డిజైన్లను సీఆర్డీఏ పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టి... ప్రజాభిప్రాయం ప్రకారం నిర్ణయం తీసుకోనున్నారు. నార్మన్‌ ఫోస్టర్‌ రూపొందించిన రెండు డిజైన్లలో... ప్రజాభిప్రాయం ప్రకారం ఒకదానిని రెండు రోజుల్లో ఫైనల్‌ చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. రాజధానిలో నిర్మించే అసెంబ్లీ నిర్మాణం కోసం తాను కొన్ని డిజైన్లు రూపొందించానని.. అయితే వాటిని మీడియా సిటీకి వాడుకోనున్నట్లు చంద్రబాబు తెలిపారన్నారు రాజమౌళి. ఇక అమరావతి నిర్మాణంపై రెండు రోజులు వర్క్‌షాపు ఏర్పాటు చేయనున్నట్లు సీఆర్డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ తెలిపారు. వివిధ అంశాలపై 15 బృందాలతో చర్చిస్తామన్నారు. 

21:36 - December 13, 2017

ఢిల్లీ : కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. పోలవరంపై గత కొన్ని రోజులుగా నెలకొన్న అనేక వార్తల నేపథ్యంలో ఈ ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే ప్రాజెక్ట్‌కు సంబంధించిన అనేక అంశాలపై ఈ భేటీలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. 

20:59 - December 13, 2017

అడుక్క తినెటోనికి హక్కులెందుకు..? బనిసగ బత్కనేర్చినోనికి బర్గెలెందుకు..? బహుజన ప్రజలరా..? ఈ మాట ఎందుకు అంటున్న అంటే..? తెల్గు రాష్ట్రాలళ్ల బీసీల మీద అయితున్న గోసను జూడలేక చెప్తున్న.. అటు అధికారం మీ చేతికి అందదు.. ఇటు రాజకీయ రిజర్వేషన్ ఇయ్యరు.. ఎంతసేపు ఓటు అనే గొర్లుగనే బీసీలను జూస్తున్నరు నాయకులు.. ఈ బీసీలళ్లనే కొంతమంది చెంచాగాళ్లు మోపై.. వాళ్ల జనాన్నే ఆగం జేస్తున్నరు..

మళ్లెవ్వడన్న మీటింగుల పొంట రైతును రాజును జేశ్నం.. పెరుగన్నం తిని అర్గుమీద వండెతట్టు జేశ్నమని దొంగమాటలు జెప్తె మూతివలగొట్టుండ్రి ఎట్లైతె అట్లైతది.. నీయవ్వ తమాష కినవారేస్తె.. నెంబర్ నెంబర్ అని చెప్కతిర్గె సన్నాసులారా..? రైతులు ఆత్మహత్యలు జేస్కుంటుండంగ ఏడంగ నెంబర్ వన్ అయితిమిరా.. ఇగో మళ్లొక రైతు నేలరాలిండు

అయ్యా తెల్గుదేశం పార్టీ జాతి పితా.. వెన్నుపోటు దారుల సంఘం అంతర్జాతీయ అధ్యక్షా.. శ్రీ చంద్రాలు సారూ.. ఏడున్నవోగని.. జర్ర ఒక పెద్ద తాళం చేయిగొన్కొచ్చి.. హైద్రావాదులున్న ఎన్టీఆర్ ట్రస్టు భవన్కు.. ఏశేయ్.. ఎందుకంటె.. ఇగ ఉన్న ఇద్దరు ముగ్గురు నేతలు గూడ ఇయ్యాల్నో రేపో ప్రగతి భవన్ల కుడికాలు వెట్టవోతున్నరట.. మరి ఖాళీగుంటే ఏమొస్తది.. వీలైతె కిరాయికిచ్చేయ్..

తెలంగాణ ప్రభుత్వానికి చెవ్వులున్నయా..? ఉంటె అవ్వి ఇనవడ్తున్నయా లేవా..? చెవిటి సర్కారే ఉన్నట్టుంది గదా..? ముప్పైరోజుల సంది కాంట్రాక్టు ఉద్యోగులు ధర్నాలు జేస్తున్నరు.. మేము గొంతమ్మ కోర్కెలు ఏం గోర్తలేము.. మీరు మాకు ఇచ్చిన హామీనే అమలు జేయిమంటున్నం అని చెప్తుంటె.. వాళ్ల ముచ్చట ఇనెటోడే లేడాయే తెలంగాణ.. ఇది సంసారమేనా గడ్డమా..? తెలంగాణ..?

బర్తుడేలకు.. పెండ్లి రోజులకు.. స్పెషల్ డేలకు కేకులు కట్ జేస్తరుగదా..? కని కరీంనగర్ జిల్లా రేకుర్తి ఊరి జనం.. అధికారుల నిర్లక్ష్యానికి యాడాది మాష్కం జేశి.. కేకు కట్ జేశిండ్రు.. ఇట్ల జేస్తెనన్న అధికారులకు బుద్ది జ్ఞానం వస్తదో ఏమో అని ఇట్ల జేశినట్టున్నరు.. అయినా కేకు పైసలు దండుగగని.. మన అధికారులకు గంత పాటి సోయున్నదా..? ఏమంటరు..?

అరేయ్ ఈ భూమ్మీద ఎవ్వడన్న మంత్రగాడుంటే.. వానికి మంత్రాల ధమ్మే ఉంటే.. నేను ఇదే చెట్టుకింద గూసుంట మీరు మంత్రాలు ఏశి.. నన్ను ఈడికెళ్లి మాయం జేయుండ్రిరా సూద్దాం.. ఏం మన్షులు మోపైండ్రు ఈ ప్రజలు గూడ.. మంత్రాలు లేవు లొట్టపీసు ఏం లేవురా నాయనా అంటే.. అవ్విటి సుట్టే తిర్గుతరు.. మంత్రాలతోని మన్సులు సచ్చిపోయేదుంటే.. మంత్రాలతోనే సచ్చిపోయినోళ్లను బత్కియ్యొచ్చుగదా.?? అదుండది..

అయినా తెలంగాణ పోలీసోళ్లను అనుడు గూడ తప్పేతీయుండ్రి.. ఎందుకంటె వాళ్లు ఉత్తములు అని అనుకుంటే.. అట్లెట్ల నిర్లక్ష్యం జేస్తున్నరని ప్రశ్నించొచ్చు.. వాళ్లపనితనం తెలుస్తలేదా పబ్లీకుకు.. హైద్రావాదుల బిర్యానీ దినుకుంట.. కాలు మీద కాలేస్కోని గూసున్న భరత్ రెడ్డిగాన్ని వట్టెతందుకే వాళ్లకు నెలవట్టింది.. ఇగ చెడ్డీ గ్యాంగును ఏడ వట్టాలే..

విరాట్ కొహ్లీ.. ఎట్ల న్యాయమైతది తమ్మీ నీకు..? మేము సప్పట్లు గొడ్తెనే గదా... నువ్వే ఇంత పెద్దోనివైతివి.. మేము అభిమానిస్తెనేగదా.?. నీకు అన్నికోట్ల ఆస్తి వెర్గే.. మేము మా టైమంత వేస్టు జేస్కోని నీ ఆట జూస్తెనే గదా నీకు ఇంతగనం కీర్తొచ్చింది.. కోట్ల మంది భారత అభిమానులను గాదని గటెటో వొయ్యి పెండ్లీ జేస్కున్నవ్ లే..? 

20:57 - December 13, 2017

పాట కదిలిస్తుంది.. పరుగులు పెట్టిస్తుంది.. ప్రవహించేలా చేస్తుంది...భాషలో మాటకెంత ప్రాధాన్యం ఉందో.. పాటకు అంతకంటే ఎక్కువే ఉందని చెప్పాలి. ముఖ్యంగా తెలుగు గడ్డపై జరిగిన అనేకానేక ఉద్యమాల్లో ప్రజల కోసం గొంతెత్తిన పాట సాధించిన విజయం అసామాన్యం. అది తెలంగాణ సాయుధ పోరాటమైనా, విప్లవోద్యమమైనా, ప్రత్యేక తెలంగాణ ఉద్యమమైనా ఏ సందర్భంలో అయినా తెలుగు పాట దగద్ధగమంటూ వెలిగింది. ఉద్యమ స్ఫూర్తిని రెప రెపలాడిచింది. ఒక్క మాటలో చెప్పాలంటే పాటకు మనిషికి ఉన్నంత చరిత్ర ఉంది. అందులో తెలుగు ప్రజాపాటది త్యాగపూరితమైన చరిత్ర. వీరోచితమైన చరిత్ర.. అందుకే పాటకు సలాం...చెప్తూ.. ప్రపంచ తెలుగు మహా సభల సందర్భంగా తెలుగు పోరాట పాటపై ప్రత్యేక కథనం.. తిరుగుబాటు చేయనిదే మార్పు రాదు.. పాలకులతో కొట్లాడందే మార్పు రాదు. మరి ఆ ఉద్యమాలను వెలిగించటానికి నాయకత్వం ఒక్కటే సరిపోదు.. దారి చూపే కళా రూపాలు కావాలి. దానికి పాటను మించింది మరొకటి లేదు. అందుకే తెలుగు ప్రజల ఉద్యమ పాటల చరిత్ర ఎంతో ఘనమైనది..

పోరాటం ఉదయించాలంటే పాట కావాలి..ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తి నిండాలంటే పాట కావాలి..సమాజాన్ని ఏక తాటిపై నిలబెట్టి ఒకే దిశలో పరిగెత్తించాలంటే పాటను మించిన సాధనం మరొకటి ఉంటుందా? అందుకే తెలుగు నేలపై జరిగిన ప్రతి ఉద్యమంలో పాట ప్రధాన భాగం.. మోగే డప్పు, చిర్రా చిటికెన పుల్లా....ఆకాశాన్ని సవాల్ చేసే స్వరం.. ఇంత కంటే ఉద్యమాన్ని వెలిగించటానికి మరే ఆయుధమైనా బలాదూరే.. తీయనైన తెలుగు భాషలో ఎన్నో సృజన స్వరూపాలు.. కథ, నవల, కవిత ఇలా ఎన్నున్నా.. పాటకున్న ప్రాధాన్యత అంతులేనిది. అందుకే తెలుగు గడ్డమీద పాటలేని ఉద్యమాన్ని, పాట వినిపించని పోరాటాన్ని ఊహించలేం. ప్రతి ఉద్యమంలో పాట ముందు వరుసలో నిలబడింది.. అవును పాటకు సలాం.. పెను నిద్దుర వదిలించిన పాటకు సలాం.. పాలకులను ప్రశ్నించిన పాటకు సలాం.. ఉద్యమ పతాకను రెపరెపలాండించిన పాటకు సలాం.. తెలుగు పాటకు సలాం. తెలుగు భాషకు సలాం..  

అధికారంలోకి వస్తే ప్రతి రైతుకు రూ. 12,500 పెట్టుబడి

అనంతపురం : తము అధికారంలోకి వస్తే ప్రతి రైతన్నకు సంవత్సరానికి రూ.12,500 ఇస్తామని ప్రజాసంకల్ప యాత్రంలో జగన్ ప్రజలకు హామీ ఇచ్చారు. 

19:30 - December 13, 2017

తెలంగాణ స్వరాష్ట్రం సాధించిన తర్వాత మన చేసుకుంటున్న ప్రపంచ తెలుగు మహాసభలు భవిష్యత్ తరాలకు కూడా ఉపయోగపడుతుందని, మరోసారి మన జాతి మూలాన్ని, మన సంస్కృతిని అందరికి తెలిసే విధంగా ఉంటుందని బాల సాహిత్యం కమిటీ సభ్యుడు పాత్తిపక మోహన్ అన్నారు. తెలంగాణ సిద్ధించిన తర్వాత ప్రపంచ తెలుగు మహాసభల సందర్బంగా తెలంగాణ తనలోకి తొంగి చూసుకుంటుందని నవల కమిటీ సభ్యుడు పెద్దింటి ఆశోక్ అన్నారు. 1975లో ప్రపంచ తెలుగు మహాసభలు పెట్టారని, ఈసారి తెలంగాణ కొత్త రాష్ట్రం లో మహిళ సాహిత్యాని ఒక్క రోజు కేటాయించడం శుభపరిణామని, తెలంగాణ లో మహిళ కవులు లేరాని ఆంధ్ర వారు ప్రచారం చేశారని మహిళ సాహిత్య కమిటీ సభ్యురాలు జూపాక సుభద్ర అన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

మొహలీ వన్డేలో భారత్ ఘన విజయం

మొహలీ : శ్రీలంకతో జరుగుతున్న రెండవ వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. 141 పరుగులతో భారత్ విజయం సాధించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా రోహిత్ ఎంకైయ్యారు. 

వైద్యఆరోగ్య శాఖలో 2,108 ఉద్యోగాలు

హైదరాబాద్ : వైద్యఆరోగ్య శాఖలో 2,108 ఉద్యోగాల భర్తీకి అనుమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. టీఎస్ పీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. పోస్టుల్లో స్టాఫ్ నర్సులు 1,603, టెక్నికల్ అసిస్టెంట్లు110, టెక్నీపియన్లు 61, గ్రేడ్ 2 ఫార్మాసిస్టుల 58, ల్యాబ్ టెక్నీషియన్లు 39, జూనియర్ అసిస్టెంట్లు 30 ఉన్నాయి. 

19:10 - December 13, 2017

పశ్చిమగోదావరి : జిల్లా ఆకివీడు సమతానగర్‌లో మద్యం షాపును తొలగించాలంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. మద్యం షాపునకు అనుమతి ఇవ్వవద్దంటూ అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ ధర్నా చేపట్టారు. ప్రజల సమస్యలను పట్టించుకోని సర్పంచ్‌... మద్యం షాపును ప్రారంభించడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రమైతే... రోడ్డుపై నడవలేని పరిస్థితి ఉందని మహిళలంటున్నారు. ఆలయం ఉన్నా ఎలా అనుమతి ఇచ్చారని మహిళలు ప్రశ్నిస్తున్నారు. 

19:09 - December 13, 2017

విశాఖ :జిల్లా అనకాపల్లి మండలం మామిడిపాలెం గ్రామంలో రెండుకుటుంబాల మధ్య వైరం 50 మూగ జీవాలను బలిగొంది. మామిడి పాలెంలో నివాసం ఉంటున్న కొండబాబు మేకలను పెంచుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. నిన్న సాయంత్రం మేకలను తీసుకువచ్చి దడిలో కట్టివేశాడు. కాసేపటికే మేకలు మంటలలో చిక్కుకొని పూర్తిగా కాలిపోయాయి. అయితే గతంలో ఊరిలో ఉన్న ఒక వ్యక్తితో జరిగిన గొడవ వలన ఆ వ్యక్తి ఈ పని చేసి ఉంటాడని కొండబాబు ఆరోపిస్తున్నాడు. బాధిత కుటుంబాన్ని నియోజక వర్గ ఇంచార్జి పరుచూరి భాస్కరరావు పరామర్శించి వారికి ఆర్థిక సాయం అందించారు. 

19:08 - December 13, 2017

గుంటూరు : కలల రాజధాని అమరావతిలో నిర్మించ తలపెట్టిన అసెంబ్లీ భవనానికి తుది డిజైన్లు ఖరారు చేసే పనిలో పడింది ప్రభుత్వం. నార్మన్‌ ఫోస్టర్‌ బృందం తాజాగా రూపొందించిన రెండు డిజైన్లపై సచివాలయంలో సవివరంగా చర్చ జరిగింది. ఒక డిజైన్‌ సూది మొన ఉన్న టవర్‌ కాగా... రెండోవది చతురస్ర ఆకారంలో ఉన్న భవనంగా తీర్చిదిద్దారు. ఈ రెండింటిలో సూది మొన ఉన్న ఆకృతి టవర్‌కు అత్యధికులు మొగ్గు చూపారు. అయితే... రెండు డిజైన్లను CRDA డొమైన్‌లో పెట్టి ప్రజాభిప్రాయం ప్రకారమే తుది నిర్ణయం తీసుకుంటామని నారాయణ తెలిపారు.

18:34 - December 13, 2017

చంద్రబాబుకు కేవీపీ లేఖ

కృష్ణా : పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబుకు కేవీపీ లేఖ రాశారు. ఆ లేఖలో పోలవరం అంచనాలు పెంచుతూ గందరగోళం సృష్టిస్తున్నారని, పోలవరాన్ని కేంద్రమే నిర్మిస్తామన్నా, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆ నిర్మాణ బాధ్యత తీసుకుందని ఆయన ప్రశ్నించారు. పోలరవంపై అన్ని రాజకీయ పక్షాలకు అనుమానాలున్నాయని ఆయన పేర్కొన్నారు. 

సరూర్ నగర్ స్టేడియంలో లంబాడీల శంఖారావం

హైదరాబాద్: సరూర్ నగర్ స్టేడియంలో లంబాడీల శంఖారావం జరిగింది. సభలో టీఆర్ఎస్ నాయకుల ప్రసంగాలను లంబాడీలు అడ్డుకున్నారు. 

18:07 - December 13, 2017
17:58 - December 13, 2017

రంగారెడ్డి : జిల్లా నార్సింగ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అల్కపురి టౌన్‌షిప్‌లో దారుణం చోటుచేసుకుంది. అయిదేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడి ఆపై హత్య చేశాడో యువకుడు. మధ్యప్రదేశ్‌కి చెందిన దినేష్‌ అనే యువకుడు ఈ ఘటనకి పాల్పడ్డాడు. పాపా తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేసి.. కేసు నమోదు చేశారు.

17:57 - December 13, 2017

నల్లగొండ : టీడీపీకి ఉమా మాధవరెడ్డి గుడ్‌బై చెప్పేశారు. పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యురాలుగా ఉన్న ఉమా మాధవరెడ్డి.. పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామ చేశారు. రాజీనామ లేఖని చంద్రబాబుకి పంపారు. ప్రస్తుత పరిస్థితుల్లో గత్యంతరం లేకనే రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. రేపు ఉదయం సీఎం కేసీఆర్‌ సమక్షంలో ఉమామాధవరెడ్డి, ఆమె తన కుమారుడు సందీప్‌ రెడ్డితో కలిసి టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు.  

17:56 - December 13, 2017

హైదరాబాద్ : హోంగార్డులపై ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. ప్రగతిభవన్‌లో హోంగార్డులతో సమావేశమైన కేసీఆర్‌.. హోంగార్డుల జీతం 20 వేల రూపాయలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ప్రతి ఏడాది వెయ్యి రూపాయలు పెంచుతామన్నారు. హోంగార్డులను పర్మినెంట్‌ చేయాలని భావించామని అయితే... కాంటాక్ట్‌ లెక్చరర్లను పర్మినెంట్‌ చేస్తే ప్రతిపక్షాలు కోర్టులకు వెళ్లాయి. హోంగార్డులను పర్మినెంట్‌ చేసిన మూడు రాష్ట్రాల్లో కొట్టి వేశారు. అందుకే అలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా హోంగార్డులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు కేసీఆర్‌. హోంగార్డులలో ఉన్నవారిని ప్రత్యేక కానిస్టేబుళ్ల నియామకాల్లో హోంగార్డులకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించనున్నట్లు కేసీఆర్‌ తెలిపారు. ఇక హోంగార్డులందరికీ వారు కోరుకున్న ప్రాంతంలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు నిర్మిస్తామన్నారు కేసీఆర్‌. 

కర్నూలు జిల్లాలో పెద్దపులు సంచారం

కర్నూలు : జిల్లా వెలుగోడు మండలం జమ్మినగర్ తంగా శివారులో మూడు పెద్ద పులు సంచరిస్తున్నట్టు తెలియడంతో గ్రామస్తులు, తండా వాసులు భయాందోళనకు గురరౌతున్నారు. 

17:11 - December 13, 2017

అమరావతి నిర్మాణంలో ఉడత పాత్ర : రాజమౌళి

గుంటూరు  : రాజధాని అమరావతి నిర్మాణంలో తన పాత్ర రామసేతు నిర్మాణంలో ఉడత పాత్రలాంటిదని దర్శకుడు రాజమౌళి అన్నారు. రాజధాని నిర్మాణానికి తను సూచించిన డిజైన్లను నార్మన్ ఫోస్టర్స్ పరిగణలోకి తీసుకోలేదని ఆయన తెలిపారు. 

చంద్రబాబును కలిసిన బీజేపీ నేతలు

కృష్ణా  : ఏపీ సీఎం చంద్రబాబు ను బీజేపీ ఎంపీ హరిబాబు,  మంత్రి కామినేని, ఎమ్మెల్యే వష్ణుకుమార్ రాజు కలిశారు. పార్లమెంట్ సమావేశాల దృష్ట్యా సీఎంను వారు సీఎం ను కలిశారు. ప్రత్యేక ప్యాకేజీ అమలు, ప్రాజెక్టులు రెవెన్యూ లోటు అంశాలపై చంద్రబాబు వారితో చర్చించారు. 

16:02 - December 13, 2017
15:57 - December 13, 2017

ఢిల్లీ : దేశ పార్లమెంట్ అవరణలో ప్రధాని మోడీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కలివిడిగా గడిపారు. అంతే కాదు రాహుల్ గాంధీ సుష్మాస్వరాజ్ తో పాటు పలువురు మంత్రులతో మాట్లాడారు. 

15:54 - December 13, 2017

కడప : కేంద్ర ప్రభుత్వంపై సీపీఎం జాతీయకార్యదర్శి సీతారాం ఏచూరి నిప్పులు చెరిగారు. కడపలో ఉక్కుపోరు యాత్రలో పాల్గొన్న ఆయన...విభజన హామీలను అమలుపరచడంలో మోదీ సర్కార్ ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు. స్పెషల్‌ స్టేటస్‌తో పాటు రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ, కడపలో ఉక్కుఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని చెప్పి మాటతప్పారని ఆరోపించారు. ప్రజా ఉద్యమాలను బలపరిస్తే తప్ప వాగ్దానాలు అమలు కావన్నారు. కడపలో ఉక్కుఫ్యాక్టరీ ఏర్పాటు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తామని సీతారాం అన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

15:53 - December 13, 2017

అగ్రా : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌తో కలిసి ఉద్యమంలో పాల్గొనే ప్రసక్తే లేదని ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే స్పష్టం చేశారు. ఇకపై తాను చేసే సామాజిక ఉద్యమాల్లో కేజ్రీవాల్‌ను కలుపుకోవడం జరగదని అన్నాహజారే ప్రకటించారు. జన్‌లోక్‌పాల్‌ బిల్లు తేవడంపై బిజెపి, కాంగ్రెస్‌ పార్టీలకు చిత్తశుద్ధి లేదని ఆయన విమర్శించారు. యూపీలోని ఆగ్రాలో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్న అన్నాహజారే ఈ వ్యాఖ్యలు చేశారు. అవినీతికి వ్యతికంగా అన్నాహజారే 2011 చేపట్టిన ఉద్యమంలో కేజ్రీవాల్‌ కీలకంగా పనిచేసిన విషయం తెలిసిందే. 2018 మార్చి 23న ఢిల్లీలో రైతులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు అన్నాహజారే తెలిపారు.

15:52 - December 13, 2017

జైపూర్ : రాజస్థాన్‌లోని పాళి జిల్లాలో తమిళనాడు పోలీసులపై కాల్పులు జరిగాయి. గతనెల చెన్నైలోని బంగారు దుకాణంలో కన్నం వేసి 3.5 కేజీల బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ దోపిడీ దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నించగా వారు పోలీసులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సీఐ మృతి చెందగా, మరికొందరికి గాయాలయ్యాయి. 

15:48 - December 13, 2017

హైదరాబాద్ : రాజకీయ ప్రత్యామ్నాయం వైపు కృషి పెంచే దిశగా జనవరి చివరి వారం.. లేదా ఫిబ్రవరి మొదటి వారంలో రాజకీయ ఫ్రంట్ ఆవిర్భావ ప్రకటన చేసే అవకాశం ఉందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు ఫిరాయింపుదారులను ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్నాయని అన్నారు. రాజకీయ ఫ్రంట్‌లో ప్రొ.కోదండరామ్‌ను భాగస్వాములు కావాల్సిందిగా కోరామని తమ్మినేని అన్నారు. రాబోయే కాలంలో కాంగ్రెస్, బీజేపీ, టీఆర్‌ఎస్‌లతో పొత్తు పెట్టుకునే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. 2018 ఏప్రిల్ 18 నుంచి 22 వరకు హైదరాబాద్‌లో జరగనున్న సీపీఎం అఖిల భారత మహాసభలకు సంబంధించిన లోగో ఆవిష్కరించారు. 

15:47 - December 13, 2017

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌లో టెట్‌ పరీక్షకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదలైంది. విద్యాశాఖ మంత్రి ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ నెల 18 నుండి 30 వరకు అప్లికేషన్‌లు స్వీకరిస్తారు. ఆన్‌లైన్‌ అప్లికేషన్లు జనవరి 1 వరకు స్వీకరిస్తారు. జనవరి 9 నుండి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని మంత్రి తెలిపారు. జనవరి 17 నుండి 27 వరకు పరీక్షలు జరగుతాయన్నారు. ఉదయం తొమ్మిదిన్నర నుండి మధ్యాహ్నం 12 వరకు అలాగే మధ్యాహ్నం రెండున్నర నుండి 5 గంటల వరకు పరీక్ష జరగుతుందని తెలిపారు. ఫిబ్రవరి 8వ తేదీన పరీక్ష ఫలితాలు వెల్లడిస్తామన్నారు. 

హోంగార్డుల కనీస వేతనం రూ.20వేలకు పెంపు

హైదరాబాద్ : హోంగార్డుల కనీస వేతనం రూ.20వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హోంగార్డుల జీతం రూ.12 వేల నుంచి రూ.20 వేలకు పెంచి ప్రతి ఏడాది కనీఏసం  రూ.1000 పెంచుతామని కేసీఆర్ తెలిపారు. కోరుకున్న జిల్లాల్లో వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లును కేటాయిస్తామని, వారికి టీఎస్ పీఎస్సీ లో 25 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. 

సీఆర్ డీఏలో డిజైన్లను సీఎం ఫైనల్ చేశారు

గుంటూరు : సీఆర్ డీలోపలు డిజైన్లను సీఎం చంద్రబాబు ఫైనల్ చేశారు. హైకోర్టు నమూనాను స్థూపాకారంగానూ, అసెంబ్లీ నిర్మాణం డైమండ్, టవర్ రూపాల్లో ఉండే డిజైన్ లను చంద్రబాబు ఎంపిక చేశారు. 

15:12 - December 13, 2017

నార్సింగి అల్కాపూరి టౌన్ షిప్ దారుణం

రంగారెడ్డి : జిల్లా అల్కాపూరి టౌన్ షిప్ లో దారుణం జరిగింది. అయిదేళ్ల చిన్నారిపై ఓ యువకుడు అత్యాచారం చేసి హత్య చేశాడు. నింధితుడు దినేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహేష్ మధ్యప్రదేశ్ వాసి అని తెలుస్తోంది. 

మొహలీ వన్డేలో రోహిత్ డబుల్ సెంచరీ

మొహలీ : శ్రీలంకతో జరగుతున్న రెండో వన్డేలో భారత ఆటగాడు రోహిత్ శర్మ డబుల్ సెంచరీ చేశాడు. 151 బంతుల్లో రోహిత్ డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. ప్రపంచ వన్డే చరిత్రలో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఆటగాడిగా రోహిత్ రికార్డ్ సృష్టించాడు. 

15:07 - December 13, 2017
15:06 - December 13, 2017

మొహలీ : శ్రీలంకతో జరగుతున్న రెండో వన్డేలో భారత ఆటగాడు రోహిత్ శర్మ డబుల్ సెంచరీ చేశాడు. 151 బంతుల్లో రోహిత్ డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. ప్రపంచ వన్డే చరిత్రలో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఆటగాడిగా రోహిత్ రికార్డ్ సృష్టించాడు. రోహిత్ శ్రీలంకపై ఇది రెండో డబుల్ సెంచరీ. 

14:44 - December 13, 2017
14:40 - December 13, 2017

హైదరాబాద్ : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సుధాకర్ రెడ్డి హత్య కేసులో ప్రధాన నింధితుడిగా ఉన్న రాజేష్ ను అపోలో వైద్యులు కాసేపట్లో డిశ్చార్జి చేయనున్నారు. రాజేష్ పూర్తిగా కోలుకున్నాడని వైదుయలు తెలిపారు. అతడిని డిశ్చార్జి చేస్తున్నట్టు కుటుంబ సభ్యులకు, పోలీసులకు చెప్పామని వారు తెలిపారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

14:39 - December 13, 2017

గుంటూరు : ఏపీ సచివాలయంలో సీఆర్ డీఏ సమావేశం కొనసాగుతోంది. సమావేశంలో శాసన సభ, సెక్రటేరియటల్, హైకోర్టు డిజైన్స్ పై చంద్రబాబుకు నార్మన్ ఫోస్టర్ బృందం ప్రజెంటేషన్ ఇస్తోంది. భవంతి బాహ్య కుడ్యాలపై త్రిడైమెన్షియల్ పిక్చర్స్, సూర్యుడు ఉదయించే రాష్ట్రం కనుక సూర్యుడి ఇమేజ్, పురాతన నాణేలు, రాచరిక చిహ్నాలు, పూర్ణకుంభ చిత్రాలను పరిశోధించి ఫోస్టర్ బృందాని రాజమౌళీ అందించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

కాసేపట్లో రాజేష్ డిశ్చార్జి

హైదరాబాద్ : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సుధాకర్ రెడ్డి హత్య కేసులో ప్రధాన నింధితుడిగా ఉన్న రాజేష్ ను అపోలో వైద్యులు కాసేపట్లో డిశ్చార్జి చేయనున్నారు. రాజేష్ పూర్తిగా కోలుకున్నాడని వైదుయలు తెలిపారు. అతడిని డిశ్చార్జి చేస్తున్నట్టు కుటుంబ సభ్యులకు, పోలీసులకు చెప్పామని వారు తెలిపారు. 

కొనసాగుతున్న సీఆర్డీఏ సమావేశం

గుంటూరు : ఏపీ సచివాలయంలో సీఆర్ డీఏ సమావేశం కొనసాగుతోంది. సమావేశంలో శాసన సభ, సెక్రటేరియటల్, హైకోర్టు డిజైన్స్ పై చంద్రబాబుకు నార్మన్ ఫోస్టర్ బృందం ప్రజెంటేషన్ ఇస్తోంది. భవంతి బాహ్య కుడ్యాలపై త్రిడైమెన్షియల్ పిక్చర్స్, సూర్యుడు ఉదయించే రాష్ట్రం కనుక సూర్యుడి ఇమేజ్, పురాతన నాణేలు, రాచరిక చిహ్నాలు, పూర్ణకుంభ చిత్రాలను పరిశోధించి ఫోస్టర్ బృందాని రాజమౌళీ అందించారు. 

తెలుగు భాష అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్నదేంటీ ? : తమ్మినేని

హైదరాబాద్ : తెలుగు భాషకు అధికార పార్టీలే విలన్ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగు భాషపై మాటలు చెప్పడం కాదు...తెలుగు భాషను అమలు చేసి చూపించాలన్నారు. తెలుగు భాష అభివృద్ధికి గత ప్రభుత్వాలు, ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన ఏ జీవో అమలు లేదన్నారు. తెలుగు భాషా, సాహిత్యం కోసం ప్రభుత్వం చేస్తున్న కృష్టి ఏంటని ప్రశ్నించారు. మహాసభలు, వంటకాలు కాదని... తెలుగు భాషను అమలు చేసి చూపించాలన్నారు

కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలి : ఏచూరి

కడప : ప్రజా పోరాటాలతోనే ఉక్కు పరిశ్రమ సాధ్యమవుతుందని సీపీఎం జాతాయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకరాకపోతే ఏపీకి ప్రత్యేకహోదా, రాయలసీమకు ప్రత్యేకహోదా రాదని, కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు సాధ్యం కాదన్నారు. కేంద్రం, ఏపీ ప్రభుత్వం తమ వాగ్దానాలను పూర్తి చేసే పరిస్థితిలో లేరని చెప్పారు. రెండు ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని చెప్పారు. అందుకు ప్రజా ఉద్యమాలను బలపర్చాలని కోరారు. కడపలో నిర్వహించిన సీపీఎం బహిరంభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. కడపలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని ఏచూరీ డిమాండ్ చేశారు.

రాయలసీమపై వివక్ష : ఎమ్మెల్సీ డా.గేయానంద్

కడప : కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు రాయలసీమపై త్రీవ వివక్షచూపుతున్నాయని ఎమ్మెల్సీ డా.గేయానంద్ అన్నారు. కడపలో జరిగిన సీపీఎం బహిరంగసభలో ఆయన మాట్లాడారు. రాయలసీమకు అనేక రకాలుగా అన్యాయం జరిగిందన్నారు. రాయలసీమ అంటే అంత నిర్లక్ష్యమా అన్నారు. కర్నూలులో త్రిపుల్ అటీ ఏర్పాటు చేస్తామని చెప్పి., ఇప్పటివరకు చేయలేదన్నారు. 

బొగ్గు బ్లాక్‌ల స్కాంలో మధుకోడాకు ఎదురుదెబ్బ

జార్ఖండ్‌ : బొగ్గు బ్లాక్‌ల కుంభకోణంలో జార్ఖండ్‌ మాజీ సీఎం మధుకోడాకు సీబీఐ ప్రత్యేక కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.  మధుకోడా సహా మరో నలుగురిని దోషులుగా తేల్చింది.  కేంద్ర బొగ్గుగనులశాఖ మాజీ కార్యదర్శి హెచ్‌సీ గుప్తా, జార్ఖండ్‌ ప్రభుత్వ మాజీ కార్యదర్శి అశోక్‌బసు, మరో ప్రభుత్వ అధికారి ఈ కేసులో దోషులుగా నిర్దారించింది. నలుగురూ నేరపూరిత కుట్రకు పాల్పడినట్టు వెల్లడించింది. వీరికి రేపు శిక్ష ఖరారు చేయనుంది. అయితే ఇదే కేసులో న్యాయస్థానం మరో నలుగురిని నిర్దోషులుగా తేల్చింది.

14:12 - December 13, 2017

హైదరాబాద్ : తెలుగు భాషకు అధికార పార్టీలే విలన్ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగు భాషపై మాటలు చెప్పడం కాదు...చేతలు కావాలన్నారు. తెలుగు భాష అభివృద్ధికి గత ప్రభుత్వాలు, ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన ఏ జీవో అమలు కాలేదన్నారు. తెలుగు భాషా, సాహిత్యం కోసం ప్రభుత్వం చేస్తున్న కృష్టి ఏంటని ప్రశ్నించారు. మహాసభలు, వంటకాలు కాదని... తెలుగు భాషను అమలు చేసి చూపించాలన్నారు. 

14:05 - December 13, 2017
14:01 - December 13, 2017

హైదరాబాద్ : శంషాబాద్‌ పహాడి షరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌ సరిహద్దులో రేవ్‌ పార్టీ హల్‌చల్‌ చేసింది. నగరానికి చెందిన 13 మంది యువకులు మంగళవారం రాత్రి ముగ్గురు యువతులతో కలిసి ఎయిర్‌పోర్టుకు సమీపంలోని ఓ గెస్ట్‌ హౌస్‌లో రేవ్‌ పార్టీ నిర్వహించారు. అశ్లీల నృత్యాలు చేస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు 13 మంది యువకులతో పాటు ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. 

 

13:58 - December 13, 2017

కడప : ప్రజా పోరాటాలతోనే ఉక్కు పరిశ్రమ సాధ్యమవుతుందని సీపీఎం జాతాయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకరాకపోతే ఏపీకి ప్రత్యేకహోదా, రాయలసీమకు ప్రత్యేకహోదా రాదని, కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు సాధ్యం కాదన్నారు. కేంద్రం, ఏపీ ప్రభుత్వం తమ వాగ్దానాలను పూర్తి చేసే పరిస్థితిలో లేరని చెప్పారు. రెండు ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని చెప్పారు. అందుకు ప్రజా ఉద్యమాలను బలపర్చాలని కోరారు. కడపలో నిర్వహించిన సీపీఎం బహిరంగసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. కడపలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని ఏచూరీ డిమాండ్ చేశారు. విజభన చట్టంలోనే ఈ అంశం ఉందన్నారు. ఆ హామీని వెంటనే అమలు చేయకుంటే ప్రజా పోరాటాలు తప్పవన్నారు. ఏపీలో నాలుగేళ్లుగా ఏ అభివృద్ధి లేదన్నారు. ఏపీలో అమరావతి తప్ప వేరే చర్చ లేదన్నారు.. అమరావతి కోసం రైతుల నుంచి బలవతంగా ప్రభుత్వం భూములు లాక్కున్నారని పేర్కొన్నారు. మతతత్వ ప్రభుత్వంతో వెళ్లొద్దని సీఎం చంద్రబాబుకు చెప్పినా వినలేదన్నారు. మోడీ ప్రతి ఏటా రెండు కోట్ల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని...ఇప్పుడు ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నారో మనందరికీ తెలుసన్నారు. కొత్త ఉద్యోగాలు ఏమోగానీ...ఉన్న ఉద్యోగాలు పోతున్నాయన్నారు. మోడీ పాలనలో వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. ప్రజలు కోసం మోడీ చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. 2 కోట్ల కొత్త ఉద్యోగాలు సృష్టిస్తామని చెప్పారు..కానీ ఇప్పటి వరకు కల్పించలేదన్నారు. ప్రతి ఏడాది 80 వేల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని స్వయానా ప్రభుత్వమే చెప్పిందన్నారు. 
కానీ రైతుల ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వ చర్యలు శూన్యమన్నారు. ఉద్యోగాల్లో వృద్ధి రేటు పది సంవత్సరాల కిందికి దిగజారిందన్నారు. 67 వేల మందిని ఉద్యోగాలను తొలగించారని తెలిపారు. 96 లక్షల మంది నిరుద్యోగులయ్యారు. 

 

యూకేజీ విద్యార్థిని చితకబాదిన టీచర్

నల్లగొండ : అనుముల మండలం హాలియా బ్రిలియంట్ స్కూల్ లో యూకేజీ విద్యార్థి మణికంఠను టీచర్ చితకబాదారు. విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు.  

 

13:27 - December 13, 2017

కడప : కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు రాయలసీమపై త్రీవ వివక్షచూపుతున్నాయని ఎమ్మెల్సీ డా.గేయానంద్ అన్నారు. కడపలో జరిగిన సీపీఎం బహిరంగసభలో ఆయన మాట్లాడారు. రాయలసీమకు అనేక రకాలుగా అన్యాయం జరిగిందన్నారు. రాయలసీమ అంటే అంత నిర్లక్ష్యమా అన్నారు. కర్నూలులో త్రిపుల్ అటీ ఏర్పాటు చేస్తామని చెప్పి., ఇప్పటివరకు చేయలేదన్నారు. ఉక్కు పరిశ్రమ నిర్మిస్తాని చెప్పారు కానీ అమలుకు నోచుకోలేదన్నారు. కర్నూలులో సెంట్రల్ యూనిర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు...కానీ ఇంతవరకు పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టలేదన్నారు. మన్నవరం ప్రాజెక్టు వస్తే వేలాది మంది ఉద్యగాలు వస్తాయన్నారు. రాయలసమీ సుభిక్షంగా ఉండాలంటే 4 వందల టీఎంసీల నీరు కావాలని చెప్పారు. రాయలసీమ జిల్లాలకు జరుగుతున్న అన్యాయాన్ని అన్ని పార్టీలు ప్రశ్నించాలన్నారు. 

13:09 - December 13, 2017

హైదరాబాద్ : రెండురోజులపాటు సంతోషంగా గడపాలని కోరుకుంటున్నట్లు కమెడియన్ విజయ్‌సాయి ఆత్మహత్యకు ముందు భార్య వనితకు ఫోన్‌లో విజ్ఞప్తి చేశాడు. ఇదే తన చివరి కోరికగా చెప్పాడు. ఆ తరువాత ఇంకెప్పుడు ఇంటికి రానని.. మిస్ కాల్ కూడా ఇవ్వనని చెప్పాడు. తనకు కోపం కలిగించేలా మాట్లాడొద్దని.. తాను జీవితాలు నాశనం చేసే వ్యక్తిని ఆవేదన వ్యక్తం చేశాడు. 

 

13:05 - December 13, 2017

హైదరాబాద్ : సికింద్రాబాద్‌ అసెంబ్లీ నియోజవర్గం సీతాఫల్‌మండి డివిజన్‌లోని సుభాష్‌ చంద్రబోస్ నగర్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. డబుల్‌ బెడ్రూం ఇళ్లు వద్దని చెబుతున్నా 16 కుటుంబాలను బలవంతంగా ఖాళీ చేయించారు రెవెన్యూ అధికారులు. అడ్డుకున్న సికింద్రాబాద్‌ మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌, మాజీ మేయర్‌ కార్తీక రెడ్డిలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

 

13:01 - December 13, 2017

రాజస్థాన్ : రాజస్థాన్‌లోని పాళి జిల్లాలో తమిళనాడు పోలీసులపై కాల్పులు జరిగాయి. గతనెల చెన్నైలోని బంగారు దుకాణంలో కన్నం వేసి 3.5 కేజీల బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ దోపిడీ దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నించగా వారు పోలీసులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సీఐ మృతి చెందగా, మరికొందరికి గాయాలయ్యాయి.

12:55 - December 13, 2017

జార్ఖండ్‌ : బొగ్గు బ్లాక్‌ల కుంభకోణంలో జార్ఖండ్‌ మాజీ సీఎం మధుకోడాకు సీబీఐ ప్రత్యేక కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.  మధుకోడా సహా మరో నలుగురిని దోషులుగా తేల్చింది.  కేంద్ర బొగ్గుగనులశాఖ మాజీ కార్యదర్శి హెచ్‌సీ గుప్తా, జార్ఖండ్‌ ప్రభుత్వ మాజీ కార్యదర్శి అశోక్‌బసు, మరో ప్రభుత్వ అధికారి ఈ కేసులో దోషులుగా నిర్దారించింది.  నలుగురూ నేరపూరిత కుట్రకు పాల్పడినట్టు వెల్లడించింది. వీరికి రేపు శిక్ష ఖరారు చేయనుంది. అయితే ఇదే కేసులో న్యాయస్థానం మరో నలుగురిని నిర్దోషులుగా తేల్చింది. కలకత్తా కేంద్రంగా పనిచేస్తోన్న వినీ ఐరన్‌ అండ్‌ స్టీల్‌ ఉద్యోగ్‌ లిమిటెడ్‌కు జార్ఖండ్‌లోని రాజ్హరా బొగ్గు బ్లాక్‌ కేటాయించడానికి కోడా సహా మిగతా నిందుతులు కలిసి కుట్ర చేశారని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం స్పష్టం చేసింది. 

 

సమాచార కమిషనర్ల ఎంపికపై త్రిసభ్య కమిటీ సమావేశం

గుంటూరు : నేడు సమాచార కమిషనర్ల ఎంపికపై త్రిసభ్య కమిటీ భేటీ కానుంది. ఈ కమిటీలో సభ్యులుగా సీఎం చంద్రబాబు, జగన్, యనమల రామృకృష్ణుడు ఉన్నారు. సమావేశానికి హాజరు కాలేనని జగన్ ప్రభుత్వానికి సమచారం అందించారు.

12:52 - December 13, 2017

గుంటూరు : నేడు సమాచార కమిషనర్ల ఎంపికపై త్రిసభ్య కమిటీ భేటీ కానుంది. ఈ కమిటీలో సభ్యులుగా సీఎం చంద్రబాబు, జగన్, యనమల రామృకృష్ణుడు ఉన్నారు. సమావేశానికి హాజరు కాలేనని జగన్ ప్రభుత్వానికి సమచారం అందించారు. తన తరపున ప్రతినిధి వస్తారని ప్రభుత్వానికి జగన్ తెలిపారు. నిబంధనల ప్రకారం వేరే వ్యక్తులకు అవకాశం లేదని ప్రభుత్వం వెల్లడించించింది. సమాచార కమిషనర్ల ఎంపికకు సమయం లేదని న్యాయనిపుణులు అంటున్నారు. భేటీ వాయిదా కుదరదని న్యాయ నిపుణులు తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

ఎన్ టీఆర్ మరణానికి కారణమైన చంద్రబాబు : రోజా

హైదరాబాద్ : పిల్లను ఇచ్చిన మామను సీఎం చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈమేరకు ఆమె మీడియాతో మాట్లాడారు. ఎన్ టీఆర్ మరణానికి చంద్రబాబు కారణమని ఆరోపించారు. రాజకీయ అవహగాన లేని, ప్రజల మీద ప్రేమ లేని లోకేష్ ను మంత్రిని చేశారని చెప్పారు. నిత్యవసర ధరలను తగ్గించాలన్నారు. రేషన్ షాప్ లో పది సరుకులు ఇవ్వాలని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజలతో కలిసి తరిమికొడతామన్నారు.

ఏపీ ప్రభుత్వంపై ఎమ్మెల్యే రోజా మండిపాటు

హైదరాబాద్ : ఏపీ ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు కుటుంబానికి ధన దాహం తీరలేదా అని అన్నారు. ఆస్తులు పెరిగినా చంద్రబాబుకు ధన దాహం తీరలేదన్నారు. ఈమేరకు ఆమె మీడియాతో మాట్లాడారు. చంద్రన్నమాల్స్ పేరుతో రేషన్ షాపులను నిర్వీర్యం చేస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 

12:38 - December 13, 2017

హైదరారాద్ : ఏపీ ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు కుటుంబానికి ధన దాహం తీరలేదా అని అన్నారు. ఆస్తులు పెరిగినా చంద్రబాబుకు ధన దాహం తీరలేదన్నారు. ఈమేరకు ఆమె మీడియాతో మాట్లాడారు. చంద్రన్నమాల్స్ పేరుతో రేషన్ షాపులను నిర్వీర్యం చేస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని 28 వేల రేషన్ షాపులను నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని తెలిపారు. మళ్లీ సీఎం అయితానో లేదోనన్న భయం పట్టుకుందన్నారు. అందుకే ఇప్పుడే దోచుకుని... దాచుకుంటున్నారని విమర్శించారు. గతంలో ప్రజలకు మజ్జిగ పంపిణీ పథకంలో హెరిటేజ్ పెరుగునే వాడాలని హుకుం జారీ చేశారని తెలిపారు. తన లాభం కోసం సంక్షేమ కార్యక్రమాలను మార్చుకుంటున్నారని ఆరోపించారు. కార్పొరేట్ దోపిడీకి పంచపెట్టే ప్లాన్ చేస్తున్నారని తెలిపారు. రాజధాని నిర్మాణం పేరుతో పేదల భూములను లాక్కున్నారని విమర్శించారు. ఇసుక దందాలో వందల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. పిల్లను ఇచ్చిన మామను వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. ఎన్ టీఆర్ మరణానికి చంద్రబాబు కారణమని ఆరోపించారు. రాజకీయ అవహగాన లేని, ప్రజల మీద ప్రేమ లేని లోకేష్ ను మంత్రిని చేశారని చెప్పారు. నిత్యవసర ధరలను తగ్గించాలన్నారు. రేషన్ షాప్ లో పది సరుకులు ఇవ్వాలని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజలతో కలిసి తరిమికొడతామన్నారు.

 

12:09 - December 13, 2017

కడప : నగరంలో ఉక్కుపరిశ్రమ ఏర్పాటు చేయాలంటూ ఇవాళ సీపీఎం, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరుగనుంది. ఈ సభకు సీపీఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ, సీఐటీయూ ఏపీ రాష్ట్ర కార్యదర్శి గఫూర్‌తోపాటు మరికొందరు నేతలు హాజరుకానున్నారు. ఉక్కుపరిశ్రమ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో గత నెల 29న ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో చేపట్టిన బైక్‌ర్యాలీ కాసేపట్లో కడప చేరుకోంది. ఈ సందర్భంగా గఫూర్‌ మాట్లాడుతూ విభజన సందర్భంగా కేంద్రప్రభుత్వం కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిందన్నారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. కడప ఉక్కు రాయలసీమ హక్కు అని అన్నారు. కడపం నుంచి ఇనుప ఖనిజం జపాన్, చైనాకు ఎగుమమతి అవుతుందన్నారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయకపోతే యువత అడుగుడుగా నిలదీస్తారని పేర్కొన్నారు. ఉక్కు పరిశ్రమను సాధించేవరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. 

 

11:57 - December 13, 2017

గుంటూరు : అమరావతిలో సీఆర్ డీఏ సమావేశం ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం ప్రారంభం జరుగుతోంది. అసెంబ్లీ, హైకోర్టు డిజైన్లపై చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి దర్శకుడు రాజమౌళి, న్మారన్ ఫోస్టర్ ప్రతినిధులు, మంత్రి నారాయణ, సీఆర్ డీఏ ఉన్నతాధికారులు హాజరయ్యారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్ డీఏ సమావేశం

అమరావతి : సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్ డీఏ సమావేశం ప్రారంభం అయింది. ఈ సమావేశానికి దర్శకుడు రాజమౌళి, న్మారన్ ఫోస్టర్ ప్రతినిధులు, మంత్రి నారాయణ, సీఆర్ డీఏ ఉన్నతాధికారులు హాజరయ్యారు. అసెంబ్లీ, హైకోర్టు డిజైన్లపై చర్చిస్తున్నారు.  
 

బొగ్గు కుంభకోణంలో సీబీఐ కోర్టు తీర్పు

ఢిల్లీ : బొగ్గు కుంభకోణంలో సీబీఐ కోర్టు తీర్పు వెలువరించింది. జార్ఖండ్ మాజీ సీఎం మధుకోడాను దోషిగా ప్రకటించింది. బొగ్గు గనుల శాఖ మాజీ కార్యదర్శి ఎస్పీ గుప్తాను కూడా కోర్టు దోషిగా ప్రకటించింది. సీబీఐ కోర్టు రేపు శిక్ష ఖరారు చేయనుంది. 

11:44 - December 13, 2017

హైదరాబాద్ : అధికార పార్టీలో ఎమ్మెల్యేల అత్యుత్సాహం గులాబి పార్టీకి కొత్త చిక్కులు తెచ్చి పెడుతోంది. అధికారులకు, ఎమ్మెల్యేలకు సమన్వయం కొరవడుతుండడం కొత్త వివాదాలకు దారితీస్తోంది. తాజాగా ఎమ్మెల్యే వీరేశం వ్యవహారం అధికార పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. 
గులాబీ బాస్‌కు కొత్త చిక్కులు 
శాసనసభ్యలు వ్యవహరిస్తున్న తీరు గులాబి దళపతి కేసిఆర్ కు కొత్త చిక్కులే  తెచ్చిపెడుతోంది. పార్టీ తరపున శాసనసభకు  మెజార్టీ నేతలు కొత్తగా ఎన్నిక కావడంతో.. వారికి ముఖ్యమంత్రి కేసిఆర్ శిక్షణా శిబిరాలను నిర్వహించారు. ప్రజాసబంధాలు ఎలా కొనసాగించాలి , ప్రభుత్వంలో ఉంటూ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడాలన్న విషయాలపై అవగాహన కల్పించారు. ప్రభుత్వం కొలువు దీరిన కొత్తలోనే   పార్టీ నేతలకు నిపుణులు అన్ని అంశాలపై  సూచనలిచ్చారు. కాని  ఎమ్మెల్యేల పనితీరు మాత్రం ఇందుకు భిన్నంగా నడుస్తోందన్న అభిప్రాయం అధికార పార్టీ నేతల్లోనే వ్యక్తం అవుతోంది.  
అధికారులపై ఎమ్మెల్యే తిట్ల దండకం
శాసనసభ్యులమనే విషయాన్ని కూడా నేతలు విస్మరిస్తూ.. బూతు పురుణాలు అందుకుంటున్నారు.  ప్రజలకు జవాబుదారిగా ఉండాల్సిన నేతలే అధికారులపై విరుచుకు పడుతుండడంతో అధికారుల్లో కూడా కలవరం రేపుతోంది. కింది స్థాయి అధికారుల నుంచి జిల్లా కలెక్టర్ల వరకు శాసనసభ్యుల చేత బెదిరింపులు ఎదుర్కోవాల్సి వస్తోంది.  కొన్ని రోజుల క్రితం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల  వీరేశం సతీమణి పోలీస్టేషన్ కు వెళ్లి పోలీసులతో వాగ్వాదానికి దిగడం దూమారం రేపింది. అది మరిచిపోక ముందే  స్వయంగా ఎమ్మెల్యే వీరేశం  ఓ అధికారిని  ఫోన్ లో హెచ్చరించిన తీరు ఇప్పుడు చర్చనీయంశంగా మారింది. 
ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ బెదిరింపులు.. ఉన్నతాధికారుల్లో కలవరం 
గతంలో కూడా ఇలాంటి సంఘటనలు  పెద్ద ఎత్తునే చోటు చేసుకున్నాయి.  ఎమ్మెల్యే శంకర్ నాయక్ జిల్లా కలెక్టర్ పట్ల వ్యవహరించిన తీరు  ఉన్నతాధికారుల్లో కూడా ఆందోళన  వ్యక్తం అయ్యేలా చేసింది. ముఖ్యమంత్రి కేసిఆర్ ఈ ఘటనలో  జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.  చొప్పదండి ఎమ్మెల్యే శోభ స్థానిక అధికారులను మందలించిన తీరు...అచ్చంపేట ఎమ్మెల్యే బాల్ రాజ్ ఓ అధికారి పై చేయి చేసుకోవడం వంటి సంఘటనలు నియోజకవర్గాల్లో అధికారులను భయభ్రాంతులకు గురి చేశాయి. జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆ జిల్లా కలెక్టర్‌తో ఏర్పడ్డ విబేధాలు కూడా ఇంకా సమసిపోలేదు. శాసనసభ్యులు, అధికారులతో వ్యవహరిస్తున్న తీరు పాలనపై కూడా పడే అవకాశం ఉందని అధికార వర్గాలు అంటున్నాయి.  ముఖ్యమంత్రి కేసిఆర్ శిక్షణా శిబిరాలు నిర్వహించినా , హెచ్చరికలు  చేస్తున్నా  గులాబి నేతల్లో మార్పు రాకపోవడం సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 

 

కాసేపట్లో కడపలో సీపీఎం బహిరంగ సభ

కడప : నగరంలో ఉక్కుపరిశ్రమ ఏర్పాటు చేయాలంటూ ఇవాళ సీపీఎం, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరుగనుంది. ఈ సభకు సీపీఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ, సీఐటీయూ ఏపీ రాష్ట్ర కార్యదర్శి గఫూర్‌తోపాటు మరికొందరు నేతలు హాజరుకానున్నారు. 

11:38 - December 13, 2017

కడప : నగరంలో ఉక్కుపరిశ్రమ ఏర్పాటు చేయాలంటూ ఇవాళ సీపీఎం, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరుగనుంది. ఈ సభకు సీపీఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ, సీఐటీయూ ఏపీ రాష్ట్ర కార్యదర్శి గఫూర్‌తోపాటు మరికొందరు నేతలు హాజరుకానున్నారు. ఉక్కుపరిశ్రమ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో గత నెల 29న ఎస్‌ఎఫ్‌ఐ - డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో చేపట్టిన బైక్‌ర్యాలీ కాసేపట్లో కడప చేరుకోంది. బహిరంగ సభపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం...

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రీలంక

మొహాలీ : శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్, శ్రీలంక మధ్య రెండో వన్డే మ్యాచ్ జరుగనుంది. 

అదృశ్యమైన ముగ్గురు చిన్నారుల ఆచూకీ లభ్యం

హైదరాబాద్‌ : నగరంలోని టోలిచౌకిలో అదృశ్యమైన ముగ్గురు చిన్నారుల ఆచూకి లభ్యమైంది. ముంబయి సమీపంలోని కళ్యాణి పట్టణంలో చిన్నారులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. చిన్నారులను తీసుకువచ్చేందుకు బంజారాహిల్స్‌ పోలీసు బృందాలు ముంబాయికి బయలుదేరాయి. అయితే చిన్నారులను ఓ స్వచ్చంద సంస్థ చేరదీసినట్లు తెలుస్తోంది. 

11:05 - December 13, 2017

హైదరాబాద్‌ : నగరంలోని టోలిచౌకిలో అదృశ్యమైన ముగ్గురు చిన్నారుల ఆచూకి లభ్యమైంది. ముంబయి సమీపంలోని కళ్యాణి పట్టణంలో చిన్నారులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. చిన్నారులను తీసుకువచ్చేందుకు బంజారాహిల్స్‌ పోలీసు బృందాలు ముంబాయికి బయలుదేరాయి. అయితే చిన్నారులను ఓ స్వచ్చంద సంస్థ చేరదీసినట్లు తెలుస్తోంది. తాము  తల్లిదండ్రులకు భారం కాబోమంటూ ఆ ముగ్గురు చిన్నారులు ఓ లేఖరాసి నిన్న ఇంటి నుంచి వెళ్లిపోయారు. ముంబై రైల్వేస్టేషన్‌లో అనుమానాస్పదంగా తచ్చాడుతుండడంతో ఓ స్వచ్ఛంద సంస్థ వీరిని చేరదీసింది. వివరాలు తెలుసుకుని బంజారాహిల్స్‌ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో చిన్నారుల కోసం బంజారాహిల్స్‌ పోలీసులు ముంబై బయలుదేరి వెళ్లారు.   

 

10:43 - December 13, 2017

హైదరాబాద్ : హాస్యనటుడు విజయ్ సాయి ఆత్మహత్య ఆయన భార్య వనిత స్పందించారు. తన భర్త చావుకి తాను కారణం కాదంటూ సెల్ఫీ వీడియోలో కన్నీరు పెట్టుకున్నారు. అందరూ తానే కారణం అనడం బాధకలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త చనిపోవడానికి తానే కారణమైతే ఆ శిక్ష అనుభవిస్తానని వనిత సెల్ఫీ వీడియోలో చెప్పారు.

 

10:34 - December 13, 2017

వికారాబాద్ : జిల్లాలోని పరిగి గౌరమ్మకాలనీలో విషాదం చోటు చేసుకుంది. ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన కూతుర్ని కాపాడపోయిన తల్లి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనలో కూతురు చనిపోయింది. కుటుంబ కలహాలతో కూతురు అంబిక కిరోసిన్ పోసి నిప్పంటించుకుంది. ఆమెను కాపాడుకుందామని వెళ్లిన తల్లి సుగుణ పరిస్థితి విషమంగా ఉంది. సుగుణ భర్త రవీందర్ రెండేళ్ల క్రితం చనిపోవడంతో టీ కొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబంలో చోటు చేసుకున్న వివాదాల కారణంగా  ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

10:27 - December 13, 2017

వనపర్తి : వనపర్తి మండలం పెద్దగూడెం గ్రామంలో దారుణం జరిగింది. 4 రోజుల క్రితం అదృశ్యమైన చిన్నారి నాగేశ్వరి హత్యకు గురైంది. దుండగులు ఓ చిన్నారిని హత్య చేసి పూడ్చిపెట్టారు. వనపర్తి మండలం పెద్దగూడెం గ్రామానికి చెందిన ఆంజనేయులు, కల్పన దంపతుల కుమార్తె నాగేశ్వరి 4 రోజుల క్రితం అదృశ్యమైంది. నాగేశ్వరిని గ్రామంలోని బస్టాండు సమీపంలోని ఓ ఇంట్లో హత్య చేసి పూడ్చారన్న అనుమానంతో గ్రామస్తులు తవ్వి చూశారు. రాజేశ్వరి శవం కనిపించడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఆ ఇళ్లు కడుతున్న మేస్త్రీయే ఈ హత్య చేసి ఉంటాడని కుటుంబసభ్యులు చెబుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

10:18 - December 13, 2017

హైదరాబాద్‌ : నగరంలోని టోలిచౌకిలో ముగ్గురు చిన్నారులు అదృశ్యమయ్యారు. 'అమ్మానాన్నలకు భారం కాకుండా, దూరంగా ఉంటాం' అంటూ లెటర్‌ రాసి ఇంటి నుండి వెళ్లిపోయారు. టోలిచౌకి ప్రాంతానికి చెందిన అఫ్సా సబేరి (15), అస్మా సబేరి (12), కైఫ్‌ సబేరి(11) అనే ముగ్గురు చిన్నారులు ముంబాయికి వెళ్లిపోతున్నామంటూ ఫోన్‌ చేసి చెప్పారు. బంజారాహిల్స్‌ పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. లేఖను స్వాధీనం చేసుకొని చిన్నారుల కోసం గాలింపు చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..


 

పరిగి గౌరమ్మ కాలనీలో విషాదం

వికారాబాద్ : జిల్లాలోని పరిగి గౌరమ్మకాలనీలో విషాదం చోటు చేసుకుంది. ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన కూతుర్ని కాపాడపోయిన తల్లి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనలో కూతురు చనిపోయింది. 

వనపర్తి మండలం పెద్దగూడెంలో దారుణం

వనపర్తి : వనపర్తి మండలం పెద్దగూడెం గ్రామంలో దారుణం జరిగింది. 4 రోజుల క్రితం అదృశ్యమైన చిన్నారి నాగేశ్వరి హత్యకు గురైంది. గ్రామానికి చెందిన ఆంజనేయులు, కల్పన దంపతుల కుమార్తె నాగేశ్వరిని గ్రామంలోని బస్టాండు సమీపంలోని ఓ ఇంట్లో హత్య చేసి పూడ్చారన్న అనుమానంతో గ్రామస్థులు తవ్వి చూశారు. రాజేశ్వరి శవం కనిపించడంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఆ ఇళ్లు కడుతున్న మేస్త్రీయే ఈ హత్య చేసి ఉంటాడని కుటుంబసభ్యులు చెబుతున్నారు. 

హైదరాబాద్ లో ముగ్గురు చిన్నారుల అదృశ్యం

హైదరాబాద్‌ : నగరంలోని టోలిచౌకిలో ముగ్గురు చిన్నారులు అదృశ్యమయ్యారు. అమ్మానాన్నలకు భారం కాకుండా, దూరంగా ఉంటాం అంటూ లెటర్‌ రాసి ఇంటి నుండి వెళ్లిపోయారు. టోలిచౌకి ప్రాంతానికి చెందిన అఫ్సా సబేరి, అస్మా సబేరి, కైఫ్‌ సబేరిలు ముంబాయికి వెళ్లిపోతున్నామంటూ ఫోన్‌ చేసి చెప్పారు. బంజారాహిల్స్‌ పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. లేఖను స్వాధీనం చేసుకొని చిన్నారుల కోసం గాలింపు చేస్తున్నారు. 

08:39 - December 13, 2017

హైదరాబాద్ : కమెడియన్ విజయ్ సాయి ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆత్మహత్యకు ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో వివరాలు, కాల్ డేటా ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్ కు  విజయ్ సాయి సెల్ ఫోన్ పంపారు. నేడు విజయ్ తల్లిదండ్రులు నుంచి పోలీసులు వాంగ్మూలం తీసుకోనున్నారు. సెల్ఫీ వీడియోలో పేర్కొన్న పేర్ల ఆధారంగా ఇప్పటికే భార్య వనిత, లాయర్ శ్రీనివాస్, శశిధర్ పై కేసు నమోదు చేశారు. వనిత అసత్య ఆరోపణలు చేస్తోందని విజయ్ తల్లిదండ్రులు అంటున్నారు. విజయ్ సాయి అంత్యక్రియలకు భార్య వనిత హాజరు కాలేదు. కుమార్తె కుందనను హాజరుకానివ్వకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

కమెడియన్ విజయ్ సాయి ఆత్మహత్య కేసులో దర్యాప్తు ముమ్మరం

హైదరాబాద్ : కమెడియన్ విజయ్ సాయి ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆత్మహత్యకు ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో వివరాలు, కాల్ డేటా ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్ కు  విజయ్ సాయి సెల్ ఫోన్ పంపారు. నేడు విజయ్ తల్లిదండ్రులు నుంచి పోలీసులు వాంగ్మూలం తీసుకోనున్నారు. 

 

08:20 - December 13, 2017

చంద్రన్న మాల్స్ కావు అవి రిలయన్స్ మాల్స్, అంబానీ మాల్స్ అని అని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్.బాబురావు, టీడీపీ ప్రధాన కార్యదర్శి లాల్ వజీర్ పాల్గొని, మాట్లాడారు. రేషన్ షాపులను కార్పొరేట్ రిటైల్ సేల్స్ షాపులుగా మార్చారని విమర్శించారు. రేషన్ వ్యవస్థకు ప్రభుత్వం సమాధి కడుతుందన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు.  మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

08:11 - December 13, 2017

మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ జనరల్‌ సెక్రటరీ ఉమామహేశ్వర్‌ రావు డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'స్వచ్ఛ భారత్‌.. పొద్దున లేస్తే మన కేంద్ర, రాష్ట్ర పాలకులు ఇచ్చే నినాద. మరి ఈ దేశాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్న కార్మికులకి ఈ ప్రభుత్వం చేస్తున్న దేమిటి..? వారి సమస్యలపై పాలకులకు ఉన్న చిత్తశుద్ధి ఎంత..? ఈ ప్రశ్నలు ఇప్పుడు మున్సిపల్‌ కార్మికుల సమ్మె నేపథ్యంలో చర్చనీయాంశంగా మారాయి'. ఇదే అంశంపై ఆయన మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

08:05 - December 13, 2017

శ్రీనగర్ : జమ్ము-కశ్మీర్‌ను మంచు దుప్పటి కప్పేసింది. మంచు వర్షం నేపథ్యంలో శ్రీనగర్-జమ్ము జాతీయ రహదారిని మూసివేయడంతో దేశంలోని ఇతర ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ హిమపాతం కారణంగా ఐదుగురు జవాన్లు అదృశ్యమయ్యారు.
విస్తారంగా మంచు వర్షం 
జమ్ముకశ్మీర్‌లో మంగళవారం తెల్లవారుజాము నుంచి విస్తారంగా మంచు వర్షం కురుస్తోంది. ఈ సీజన్‌లో కశ్మీర్‌ లోయను తొలిసారిగా మంచు దుప్పటి కప్పేసింది. రోడ్లన్నీ హిమపాతంతో నిండిపోయాయి.... వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి....జనజీవనం స్తంభించింది....
మంచు కారణంగా ప్రజలకు ఇబ్బందులు 
మంచు కురిసే వేళలో కశ్మీర్‌ లోయ అందాన్ని వర్ణించడానికి పదాలు చాలవు.... కానీ మంచు కారణంగా అక్కడి ప్రజలు మాత్రం బయటకు రాలేని పరిస్థితి. హిమపాతంతో చలి తీవ్రత విపరీతంగా పెరగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చలి నుంచి తట్టుకోవడానికి నిప్పుల కుంపట్లను ఆశ్రయిస్తున్నారు.
విమాన రాకపోకల నిలిపివేత
మంచువర్షం నేపథ్యంలో శ్రీనగర్ విమానాశ్రయానికి విమాన రాకపోకలను నిలిపేయడంతోపాటు శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిని మూసివేశారు. దీంతో కశ్మీర్‌ లోయకు దేశానికి మధ్య సంబంధాలు తెగిపోయినట్లయింది. వైష్ణోదేవి ఆలయానికి బ్యాటరీ కారు మార్గంలో వెళ్లే రహదారిని కూడా మూసివేశారు. డిసెంబర్‌ 15 వరకు హిమపాతంతో పాటు వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఐదుగురు సైనికులు అదృశ్యం
హిమాపాతం కారణంగా ఐదుగురు సైనికులు అదృశ్యమయ్యారు. గురేజ్‌ సెక్టార్‌లో ముగ్గురు, కుప్వారాలోని నౌగామ్‌ సెక్టార్‌లో ఇద్దరు జవాన్ల ఆచూకి తెలియడం లేదని ఆర్మీ పేర్కొంది. ఐదుగురు జవాన్లను రక్షించేందుకు ఆర్మీ ఆపరేషన్ చేపట్టింది. నౌగామ్‌ సెక్టార్‌లో విపరీతంగా మంచు కురుస్తుండడంతో సహాయకచర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. ఐదుగురు సైనికులు సోమవారం రాత్రి నుంచి కనిపించడం లేదు. గురేజ్‌ సెక్టార్‌లో సైన్యంలో పోర్టర్‌గా పనిచేస్తున్న 29 ఏళ్ల గులాం కాదిర్‌ ఖాన్‌ హిమపాతానికి ప్రాణాలు కోల్పోయాడు.
ఉత్తర భారతదేశంలో పలుచోట్ల మంచు 
మరోవైపు హిమాచల్‌ ప్రదేశ్‌లోని సిమ్లా, మనాలీలోలో మంచు కురుస్తోంది. పచ్చగా ఉండాల్సిన చెట్లు మంచుతో తెల్లగా మిళ మిళ మెరుస్తున్నాయి. చలి విపరీతంగా ఉండడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావడం లేదు. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీతో పాటు ఉత్తర భారతదేశంలో పలుచోట్ల మంచు కురుస్తోంది.


 

07:59 - December 13, 2017

కాకినాడ : అర్భాటమే తప్ప పనులు ముందుకు సాగడం లేదు.  ఫెస్టివల్‌కు ముహూర్తం ముంచుకొస్తున్నా ఎక్కడిపనులు అక్కడే ఉన్నాయి.  ఆఖరి నిమిషం హడావిడిలో కాంట్రాక్టర్లు పనుల నాణ్యతకు తిలోదకాలిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.  కాకినాడ బీచ్ లో ఆడంబరంగా చేపడుతున్న నిర్మాణాల మన్నిక ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతోంది. ప్రహసనంగా సాగుతున్న కాకినాడ బీచ్‌ ఫెస్టివల్‌ పనులపై  10టీవీ ప్రత్యేక కథనం...
ఈనెల 19 నుంచి కాకినాడ బీచ్‌ ఫెస్టివల్‌
కాకినాడ బీచ్ లో ప్రతీ ఏటా బీచ్ ఫెస్ట్ ను నిర్వహిస్తున్నారు. మూడేళ్ల నుంచి ఈ ఫెస్టివల్‌కు పర్యటకులు, ప్రజల నుంచి మంచి స్పదనం లభిస్తోంది. గతంలో సంక్రాతి సమయంలో నిర్వహించిన కాకినాడ బీచ్‌ ఫెస్టివల్‌ను ఈసారి ముందుకు తీసుకొచ్చారు. ఈనెల 19 నుంచి కాకినాడ బీచ్‌ ఫెస్టివల్‌ను నిర్వహించనున్నారు. ఏఆర్ రెహమాన్ లాంటి ఉద్దండులు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లాంటి లెజెండ్స్ తో సంగీత ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. దాంతో ఇప్పుడు అందరి ద్రుష్టి ఎన్టీఆర్ బీచ్ ఫెస్ట్ మీద పడింది.బీచ్‌ ఫెస్టివల్‌కు భారీ సంఖ్యలో పర్యాటకులు పోటెత్తే అవకాశం కనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు వేగవంతం చేయాలని ప్రభుత్వం తలపెట్టింది. సాగరమాల ప్రాజెక్టులో భాగంగా మూడేళ్ల క్రితం 80 కోట్ల రూపాయల వ్యయంతో ప్రారంభించిన బీచ్ అభివృద్ధి పనులకు మోక్షం కలగకపోవడంతో ఇప్పుడు హడావిడి మొదలైంది.  బీచ్ ఫెస్ట్ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కార్తీకేయ మిశ్రా...పనుల్లో జాప్యంపై  మండిపడ్డారు. 
నిర్మాణాల్లో కనీస జాగ్రత్తలు మృగ్యం 
గడువు ముగిసినా పనులు పూర్తికాకపోవడంతో.. కాంట్రాక్టర్లు ఇప్పుడు హడావుడిగా పనులు చేస్తూ, నాణ్యతకు తిలోదకాలిస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.  బీచ్ లో ఇసుకపై చేపట్టే  నిర్మాణాల్లో  కనీస  జాగ్రత్తలు కూడా తీసుకోవడంలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హడావిడిగా చేస్తున్న పనులపై అధికారుల పర్యవేక్షణ కూడా కొరవడింది. పర్యాటక శాఖలో కొందరు అధికారులు కాంట్రాక్టర్ తో కుమ్మక్కయ్యి పనుల నాణ్యతను పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. బీచ్ ఫెస్ట్ కోసం హడావుడిగా చేస్తున్న పనులు ఎంతకాలం నిలుస్తాయో చూడాలి. 

 

07:52 - December 13, 2017

చిత్తూరు : ఏపీలో విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తిరుపతిలో నారాయణ కాలేజీ విద్యార్థి శ్రీహర్ష ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజీ హాస్టల్‌ గదిలో ఉరి వేసుకుని శ్రీహర్ష ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నారాయణ మెడికల్‌ అకాడమీలో చదువుతున్న శ్రీహర్ష ఒత్తిడి కారణంగానే ఆత్మహత్య చేసున్నాడని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.  

 

07:50 - December 13, 2017

హైదరాబాద్ : హాస్యనటుడు విజయ్‌ సాయి అంత్యక్రియలు ఎర్రగడ్డ శ్మశానవాటికలో ముగిశాయి. భార్య వనిత రాకుండానే విజయ్‌ సాయి అంత్యక్రియలు జరిగాయి. విజయ్ పార్థివ దేహాన్ని కడసారి చూసేందుకు పెద్ద సంఖ్యలో స్నేహితులు, కుటుంబసభ్యులు, బంధువులు తరలివచ్చారు. బాధాతప్త హృదయాలతో ఘనంగా నివాళి అర్పించారు. 
విజయ్‌సాయిని కడసారి చూసేందుకు పోటెత్తిన అభిమమానులు 
సినీ వినిలాకశంలో నవ్వుల పువ్వులు పూయించిన విజయ్‌ సాయి ఇక సెలవంటూ వెళ్లిపోయాడు. హాస్యనటుడు విజయ్‌సాయిని కడసారి చూసేందుకు ఆయన ఇంటికి బంధువులు, స్నేహితులు, అభిమమానులు పోటెత్తారు. విజయ్ మృతదేహానికి ఉస్మానియాలో పోస్టుమార్టం అనంతరం యూసఫ్‌గూడలోని ఆయన ఇంటికి తరలించారు. సినీ ప్రముఖులు, నటీనటులు విజయ్‌ పార్థివదేహాన్ని సందర్శించి ఘనంగా నివాళులు అర్పించారు. విజయ్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. 
తీవ్ర ఆవేదనకు గురైన డైరెక్టర్‌ రవిబాబు 
విజయ్‌ మృతదేహాన్ని చూసి డైరెక్టర్‌ రవిబాబు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. విజయ్‌ చనిపోయాడన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నానని చెప్పారు.  ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండే విజయ్‌ సాయిని విగతజీవిగా చూడాల్సి వస్తుందనుకోలేదన్నారు. అన్ని మెళకువలు నేర్పించి సినీ ఇండస్ట్రీకి విజయ్‌ని తానే పరిచయం చేశానని చెప్పారు. 
భార్య లేకుండా విజయ్‌ అంత్యక్రియలు 
ఆ తర్వాత యూసుఫ్‌గూడ నుంచి ఎర్రగడ్డ శ్మశానవాటిక వరకు విజయ్‌ అంతిమయాత్ర కొనసాగింది. ఎర్రగడ్డ శ్మశాన వాటికలో కుటుంబ సభ్యులు శోకాతప్త హృదయాల మధ్య విజయ్ సాయి అంత్యక్రియలు ముగిశాయి. అక్కడ ఆయనకు దహన సంస్కారాలు నిర్వహించారు. భార్య వనితారెడ్డి లేకుండా విజయ్‌ తండ్రి అంత్యక్రియలు నిర్వహించారు.  
తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి  
మరోవైపు ప్రేమించి పెళ్లి చేసుకున్న తాను విజయ్‌ను చంపుకొనేంత పిచ్చిదాన్ని కాదని ఆయన భార్య వనిత అన్నారు. విజయ్‌కు తండ్రితోనే గొడవలున్నాయని ఆమె ఆరోపించారు. ఒంగోలులో ఉన్న ఆస్తిని పాప పేరుమీద రాయాలన్న విషయంపై ఇద్దరు గొడవపడినట్లు చెప్పింది. తాము విడిపోవడానికి కారణం విజయ్‌ వివాహేతర సంబంధాలే కారణమని ఆరోపించింది. మరోవైపు విజయ్‌ది ఆత్మహత్యే అని ఉస్మానియా ఫోరెన్సిక్‌ వైద్యులు తేల్చారు. మెడనరాలు తెగడం వల్లే చనిపోయాడని స్పష్టం చేశారు. ఏదీ ఏమైనా హాస్యనటుడు విజయ్‌సాయి ఆత్మహత్యతో తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. 

 

07:42 - December 13, 2017

హైదరాబాద్ : ఈనెల 15 నుంచి 19 వరకు హైదరాబాద్‌లో జరుగునున్న ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతం చేసే బాధ్యతలను టీఆర్‌ఎస్‌ నేతలు తమ భుజానికి ఎత్తుకున్నారు.  పేరుకు తెలుగు మహాసభలే అయినా.....పార్టీ నేతలు పెద్ద ఎత్తున హాజరు కావాలని  ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశించారు. 
మహాసభలకు టీఆర్‌ఎస్‌ నాయకత్వం 
ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఈ సదస్సులో గులాబీ గుబాళింపు చూపించాలన్న ఉద్దేశంతో టీఆర్‌ఎస్‌ నాయకత్వం ఉంది. తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులతో పాటు  కవులు, సాహితీ ప్రియులు పెద్ద ఎత్తున హాజరయ్యే ప్రపంచ సదస్సులో కూడా అధికార పార్టీ గులాబీ గుబాళింపు చూపించాలన్న ఉద్దేశ్యంతో ఉంది.  హైదరాబాద్ లో నిర్వహించే సదస్సుకు పెద్ద ఎత్తున నేతలు కూడా హాజరు కావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.  అందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ నేతలు తెలంగాణ భవన్ లో  భేటీ అయి  సింగిల్ పాయింట్ ఎజెండాతో సమావేశాన్ని ముగించారు.  గ్రేటర్ పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పోరేటర్లు   తెలుగు మహాసభలకు హాజరు కావాలని మంత్రులు  తలసాని, నాయిని నర్సింహరెడ్డి కోరారు.
తెలుగు సాహితీ వేత్తలకు ఆహ్వానం
తెలుగు సాహితీ వేత్తలను పెద్ద ఎత్తున ఈ సమావేశాలకు ఆహ్వానించింది. అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న సభలు కావడంతో...... ప్రభుత్వ పరంగా అదే స్థాయిలో ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. హైదరాబాద్ లో తెలుగు మహాసభలను నిర్వహించడాన్ని ముఖ్యమంత్రి కూడా సీరియస్ గా తీసుకుంటున్నారు. ప్రభుత్వపరంగా  జరుగుతున్న ఏర్పాట్లలో ఏ లోటూ కనిపించకుండా చూడరాదన్న ఆదేశాలు ఇప్పటికే అధికారులకు ఇచ్చారు.
టీఆర్ ఎస్ నేతల తీరు అయోమయం 
ఎంతో ప్రాధాన్యతగా భావించి ముఖ్యమంత్రి  కేసీఆర్‌ గ్రేటర్ నేతలకు బాధ్యతలు అప్పగించినా.....సమావేశంలో పార్టీ  నాయకులు వ్యవహరించిన తీరు అయోమయానికి గురిచేసింది. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఏర్పాటు చేసిన సమావేశం 15 నిమిషాల్లో ముగించి తమ బాధ్యత పూర్తయిందనించారు.

 

07:38 - December 13, 2017

గుంటూరు : పదవులు తీసుకున్న వారు పని చేయకుంటే ఊరుకునేది లేదని... అమరావతిలో జరిగిన  టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు హెచ్చరించారు. 40 నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి బాగోలేదని... త్వరలోనే ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జ్‌లతో సమావేశమవుతానన్నారు. పరిస్థితి మెరుగు పడకుంటే ..కొత్త వారిని ఎంపిక చేస్తానని చంద్రబాబు స్పష్టం చేవారు. పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో ఒకరిద్దరు మంత్రులు మినహా మరేవరూ సరిగా పని చేయడం లేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. సమావేశంలో మంత్రులు సునీత, అఖిలప్రియను చంద్రబాబు సున్నితంగా మందలించారు. పయ్యావుల, కొత్తపల్లి సుబ్బారాయుడు, వర్ల రామయ్య ఇంకా పని బాగా పని చేయాలని చంద్రబాబు సూచించారు. 

 

07:35 - December 13, 2017

ఢిల్లీ : ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఢిల్లీలో పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో భేటీ అవుతారు. పోలవరం నిర్మాణ పురోగతి, నిథులుపై ఇద్దరూ చర్చిస్తారు. ఈనెల 15 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రాంరంభం కానున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీతో చంద్రబాబు సమావేశం అవుతారు. ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై టీడీపీ ఎంపీలకు దిశానిర్దేశం చేస్తారు.
నితిన్‌ గడ్కరీతో సీఎం చంద్రబాబు భేటీ
పోలవరం ప్రాజెక్టుపై ఇవాళ ఢిల్లీలో కీలక సమావేశం జరుగనుంది. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో జరిగే భేటీలో ఈ ప్రాజెక్టు నిర్మాణంపై సవివరంగా చర్చిస్తారు. పోలవరంపై గడ్కరీతో జరిగే భేటీలో ప్రాజెక్టు పురోగతి, నిధుల అంశం ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టును జాప్యం లేకుండా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో  ప్రధాన కాంట్రాక్టర్ల నుంచి కొన్ని పనులు విభజించి రాష్ట్ర ప్రభుత్వం పిలిచిన టెండర్లను కేంద్రం నిలిపివేసింది.  ఈ అంశం వివాదాస్పదమైంది. అప్పట్లోనే గడ్కరీని కలిసేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. అయితే ఆ సయంలో గడ్కరీ లండన్‌లో ఉండటం, చంద్రబాబు దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లడంతో భేటీ కాలేకపోయారు. గడ్కరీ లండన్‌ నుంచి తిరిగొచ్చిన తర్వాత దక్షిణ కొరియాలో ఉన్న చంద్రబాబు ఫోన్‌ చేసి పరిస్థితిని వివరించారు. ఆ తర్వాత గడ్కరీ ఢిల్లీలో రాష్ట్ర మంత్రి దేవినేని ఉమ,  ప్రభుత్వ అధికారులతో నిర్వహించిన  ప్రత్యేక సమావేశంలో కూడా కాంట్రాక్టర్ల మార్పు ఉండదని స్పష్టం చేశారు. ప్రధాన కాంట్రాక్టర్లతోనే పనులు వేగంగా చేయిస్తామని చెప్పడంతో రాష్ట్రం ఏమీ చేయలేకపోయింది. ఈ నేపథ్యంలో ఇవాళ చంద్రబాబు, గడ్కరీ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. 
ఈనెల 22న పోలవరం సందర్శించనున్న గడ్కరీ 
ఇప్పటికే ఒకసారి పోలవరం ప్రాజెక్టును సందర్శించి, జరుగుతున్న పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన నితిన్‌ గడ్కరీ.. ఈనెల 22న మరోసారి పరిశీలించనున్నారు. పోలవరంను సకాలంలో పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై గడ్కరీ ఎప్పటికప్పడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం నియమించిన వివిధ కమిటీల  నివేదికలు సతర్వం అందే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. 
ఈనెల 15 నుంచి పార్లమెంటు శీతాకాల భేటీ 
మరోవైపు గడ్కరీతో భేటీకి ముందు చంద్రబాబు  ఢిల్లీలోనే తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈనెల 15 నుంచి పార్లంమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉభయ సభల్లో పార్టీ అనుసరించాల్సి వ్యూహంపై చర్చిస్తారు. విభజన చట్టంలోని హామీల అమలకు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే అంశంపై పార్టీ ఎంపీలకు దిశా నిర్దేశం చేస్తారు. రెవెన్యూ లోటు భర్తీ, విశాఖ రైల్వై జోన్‌ ఏర్పాటు, హిందూపురంలో కేంద్ర విశ్వవిద్యాలయం, విజయనగరం జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం నిర్మాణంపై చర్చిస్తారు. 
విశాఖ రైల్వే జోన్‌పై  ప్రైవేటు  మెంబర్‌ బిల్లుకు నోటీసు
ప్రధానంగా విశాఖ రైల్వే జోన్‌ విషయంలో విభజన చట్టంలో ఇచ్చిన హామీని కేంద్ర విస్మరిస్తోందన్న అసంతృప్తితో చంద్రబాబు ఉన్నారు.  ఈ అంశంపై లోక్‌సభలో ప్రైవేటు మెంబర్‌ బిల్లు పెట్టేందుకు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు నోటీసు ఇచ్చారు. ఈ నేపథ్యంలో బిల్లుపై ఎలా వ్యవహరించాలన్న అంశంపై లోక్‌సభ సభ్యులుకు చంద్రబాబు సూచనలు చేస్తారు. 
 

 

నేడు ఢిల్లీలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం

ఢిల్లీ : హస్తినలో సాయంత్రం టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం జరుగనుంది. అమరావతిలో జరగాల్సిన సమావేశాన్ని ఢిల్లీకి మార్చారు. 

 

నేడు సీఎం కేసీఆర్ కు బీసీ కులాల అభిప్రాయ నివేదిక

హైదరాబాద్ : నేడు బీసీ కులాల అభిప్రాయం నివేదికను సీఎం కేసీఆర్ కు మంత్రి జోగు రామన్న అందజేయనున్నారు. బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలని మొదటి ప్రాతిపాదన. పలు ప్రతిపాదనలతో నివేదిక ఇవ్వనున్నారు. 

 

నేడు కడపలో మాజీ ఎంపీ సీతారాం ఏచూరి పర్యటన

కడప : నగరంలో నేడు మాజీ ఎంపీ సీతారాం ఏచూరి పర్యటించనున్నారు. ఉక్కు ఫ్యాక్టరీ స్థాపన కోసం ఎస్ ఎఫ్ ఐ, డీవైఎఫ్ ఐ ఆధ్వర్యంలో జరగనున్న బహిరంగసభకు ఏచూరి హాజరుకానున్నారు. 

 

Don't Miss