Activities calendar

14 December 2017

21:55 - December 14, 2017

అనంతపురం : లంచల కోసమే ఎఫ్ సీఐ గోదాములు మూశారని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆరోపించారు. ఆయన ప్రజాసంకల్ప యాత్రకు స్వల్ప విరామన్ని ఇచ్చారు. రేపు కోర్టుకు హాజరుకవాల్సి ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 

21:53 - December 14, 2017

ఢిల్లీ : ఇంధన పొదుపులో హెరిటేజ్ సంస్థకు అవార్డు వచ్చింది. గురువారం ఢిల్లీలో జరిగిన జాతీయ ఇంధన పొదుపు సదస్సు కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పాల్గొన్నారు. కేంద్ర మంత్రి ఆర్కే సింగ్‌ చేతుల మీదుగా నారా బ్రాహ్మణి ఈ అవార్డును అందుకున్నారు. దేశంలో ఇంధన ఆదాలో ప్రతిభ కనబరిచిన పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్ధలకు కేంద్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. అవార్డులకు ఎంపికైన సంస్థల ప్రతినిధులకు రాష్ట్రపతి, కేంద్రమంత్రి అవార్డులను ప్రదానం చేశారు. పదేళ్లలో ఎనిమిది సార్లు అవార్డులు అందుకోవడం ఎంతో సంతోషంగా ఉందని హెరిటేజ్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి తెలిపారు.

21:52 - December 14, 2017

విశాఖ : భారత్‌,శ్రీలంక జట్టు క్రికెటర్లు విశాఖపట్నం చేరుకున్నారు.ACA,VDCA స్టేడియం వేదికగా జరుగనున్న సూపర్‌ సండే వన్డేలో సిరీస్‌ విజయంకోసం ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. 3 మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమాన ఆధిక్యంలో ఉన్నాయి.

21:51 - December 14, 2017

సంగారెడ్డి : జిల్లాలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బాబుమోహన్‌ చేపట్టిన దోమతెరల పంపిణీ కార్యక్రమం వివాదాస్పదంగా మారింది. అందోల్‌ మండలం రోళ్లపాడులోని ప్రభుత్వ ప్రాథమిక ఉన్నతపాఠశాలలో దోమతెరలను పంపిణీ చేశారు. పాఠశాల తరగతులు నిర్వహిస్తుండగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులనంతా ఓ గదిలోకి తరలించి మిగతా గదుల్లో టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలకు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే బాబుమోహన్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

21:49 - December 14, 2017

నల్లగొండ : పోడు వ్యవసాయం చట్టబద్ధమైన గిరిజనుల హక్కు అని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కరత్‌ అన్నారు. పోడు వ్యవసాయం చేస్తున్న ఆదివాసీలపై కేసులు పెడితే వారి తరఫున ఉద్యమిస్తామని హెచ్చరించారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ద్వితీయ మహాసభల్లో పాల్గొన్న బృందా కరత్...కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై నిప్పులు చెరిగారు. న్యాయం కోసం జరుగుతున్న పోరాటంలో అనేక మంది రైతులపై అక్రమ కేసులు పెట్టారని.. అయినా తప్పుడు కేసులకు భయపడాల్సిన అవసరం లేదన్నారు. అంతకుముందు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ద్వితీయ మహాసభలు ప్రారంభమైన సందర్భంగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బృందాకరత్‌ సహా రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, బి. వెంకట్‌తోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు. 

21:49 - December 14, 2017

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబుపై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ ప్రశంసలు గుప్పించారు. హైదరాబాద్‌లో ఐటీ రంగం అభివృద్ధికి పునాది వేసింది చంద్రబాబే అన్నారు. హైదరాబాద్‌ మాదాపూర్‌లోని జరిగిన మిషన్ ఇన్నోవేషన్ సదస్సులో మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. హైదరాబాద్ లో ఐటీ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని... దానికి మూలం చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఐటీ అభివృద్ధి... మౌళిక సదుపాయాల కల్పనలో తెలంగాణ ప్రభుత్వం ముందుందన్నారు. 

21:48 - December 14, 2017

గుంటూరు : ప్రజల్లో సంతృప్తి స్థాయి పెంచడమే లక్ష్యంగా 'రియల్ టైమ్ గవర్నెన్స్‌' ప్రవేశపెట్టామని, అధికారులు మరింత జవాబుదారీతనంతో పనిచేసినప్పుడే ఇది సాధ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజా వినతుల్లో ప్రతి సమస్యను పరిష్కరించాలని, ముందుగా ఆర్ధికేతర వినతులపై దృష్టి పెట్టాలని జిల్లాల కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇవాళ పలు అంశాలపై చంద్రబాబు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వినతుల పరిష్కారంలో ప్రజా సంతృప్తి ప్రస్తుతం 59 శాతమే వుందని, దీనిని 80 శాతానికి తీసుకువెళ్లాలని సూచించారు. వందశాతం టాయిలెట్లు నిర్మించిన తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాలను ముఖ్యమంత్రి అభినందించారు. ఓడీఎఫ్ సాధనలో మిగతా జిల్లాలు పుంజుకోవాలని సూచించారు.

21:47 - December 14, 2017

కొత్తగూడెం : జిల్లా.. టేకులపల్లి అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ కాల్పుల్లో సీపీఐ ఎంఎల్‌ చండ్రాపుల్లారెడ్డి బాట దళ సభ్యులు ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో దళ కమాండర్ నరసింహతో పాటు సమ్మయ్య, నరేశ్‌, సుభాశ్‌, మధు, బోయిని ఓం ప్రకాశ్‌, రామస్వామి, రశీద్‌ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. చనిపోయిన నరసింహ నల్గొండ జిల్లా.. చౌటుప్పల్‌ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన వ్యక్తి అని.. వీరిపై పలు కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.

ఆత్మరక్షణ కోసం ప్రతి కాల్పులు
నీళ్ల మడుగు అటవీ ప్రాంతంలో.. నక్సలైట్లు సమావేశమవుతున్నారనే సమాచారం రావడంతో వారిని చుట్టుముట్టామని.. ఆ సమయంలో అక్కడ 20 మంది ఉన్నారని పోలీసులు చెప్పారు. లొంగిపోయేందుకు అవకాశం ఇచ్చినా కాల్పులు జరపడంతో.. ఆత్మరక్షణ కోసం ప్రతి కాల్పులు జరిపామని పోలీసు అధికారులు అంటున్నా... ఇది ముమ్మాటికి బూటకపు ఎన్‌కౌంటర్‌ అని ప్రజా సంఘాల నేతలు అంటున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతున్నారు. కాగా పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. 

21:43 - December 14, 2017

ఆహ్మాదాబాద్ : గుజరాత్‌లో 22 ఏళ్లపాటు అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి సీఎం పీఠాన్ని కైవసం చేసుకుంటుందని ఎగ్జిట్‌ పోల్స్‌ తేల్చాయి. గుజరాత్‌ ఎన్నికలను ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న రాహుల్‌గాంధీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. జీఎస్టీ అమలు తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో అత్యంత ప్రాధాన్యమేర్పడింది. గుజరాత్‌లో రెండో దశ పోలింగ్‌ ముగియడంతో.. వివిధ సంస్థలు తమ సర్వే ఫలితాలను వెల్లడించాయి. 182 అసెంబ్లీ స్థానాల్లో మెజార్టీ సీట్లను బీజేపీ గెలుచుకుంటుందని దాదాపుగా అన్ని సర్వేలూ తేల్చాయి. టైమ్స్‌ నౌ-వీఎంఆర్‌ సర్వే... బీజేపీకి 109 సీట్లు, కాంగ్రెస్‌కు 70 సీట్లు, ఇతరులు 3చోట్ల గెలుపొందుతారని తెలిపింది. రిపబ్లిక్‌టీవీ-సీ ఓటర్‌ ఎగ్జిట్‌ పోల్స్‌లో బీజేపీకి 108 స్థానాలు, కాంగ్రెస్‌కు 74సీట్లు వస్తాయని తేలింది. ఏబీపీ- సీఎస్‌డీఎస్‌ సర్వే ప్రకారం బీజేపీకి 91 నుంచి 99, కాంగ్రెస్‌కు 78 నుంచి 86, ఇతరులు 3 నుంచి 7 సీట్లలో గెలుపొందుతారని తెలుస్తోంది. న్యూస్‌ ఎక్స్‌ చానల్‌ -బీజేపీకి 110 నుంచి 120 సీట్లు, కాంగ్రెస్‌కు 65 నుంచి 75 సీట్లు, ఇతరులు 2 నుంచి 4 సీట్లు గెలుచుకుంటారని వెల్లడించింది.

బలమైన రాష్ట్ర నాయకత్వం కొరవడటం
గుజరాత్‌లో కాంగ్రెస్‌కు సంస్థాగత నిర్మాణం పటిష్టంగా లేకపోవడం, బలమైన రాష్ట్ర నాయకత్వం కొరవడటం అవరోధాలుగా నిలిచాయని సర్వేలు తెలిపాయి. రాహుల్‌ గాంధీపైనే ఆ పార్టీ అతిగా ఆధారపడటం కూడా లోపంగా పరిణమించిందని విశ్లేషించాయి. గ్రామీణ ప్రాంతాల మాదిరిగా పట్టణ ప్రాంతాలపై కాంగ్రెస్‌ దృష్టి సారించకపోవడం మైనస్‌గా మారిందని, ఓట్ల శాతంలో బీజేపీ స్వల్ప ఆధిక్యం ఉంటుందని సర్వేలు తేల్చాయి. 22 ఏళ్లుగా అధికారంలో ఉండటం పటేళ్ల ఉద్యమం, జీఎస్‌టీ, నోట్ల రద్దు, దళితులపై దాడులు బీజేపీ దూకుడును నిలువరించినట్లు సర్వేలు వెల్లడించాయి. అలాగే పత్తి, వేరుశనగకు మద్దతు ధర లేకపోవడం రైతుల్లో బీజేపీ పట్ల వ్యతిరేకతను పెంచిందని సర్వేలు స్పష్టం చేశాయి. ఈ కారణంతోనే గత ఎన్నికల్లో వచ్చినన్ని స్థానాలు ఈసారి దక్కించుకునే పరిస్థితి లేదని తేల్చాయి.

హిమాచల్‌ప్రదేశ్‌లోనూ బీజేపీ...
అటు హిమాచల్‌ప్రదేశ్‌లోనూ బీజేపీ విస్పష్ట ఆధిక్యంతో పాలనా పగ్గాలు చేపడుతుందని ఎగ్జిట్‌ పోల్స్‌ తేల్చి చెప్పాయి. 68 స్థానాలున్న హిమాచల్‌లో మెజార్టీ స్థానాలను బీజేపీ గెలుచుకుంటుందని స్పష్టం చేశాయి. టైమ్స్‌ నౌ వీఎంఆర్‌, 51 స్థానాల్లో బీజేపీ, 16 స్థానాల్లో కాంగ్రెస్‌, ఒక స్థానంలో ఇతరులు గెలుపుందుతారని తెలిపింది. ఇండియాటుడే ప్రకారం బీజేపీ 47 నుంచి 55 స్థానాల్లో, కాంగ్రెస్‌ 13 నుంచి 20 స్థానాల్లో, ఇతరులు 2 స్థానాల్లో గెలలవనున్నారు. ఏబీపీ-సీఎస్‌డీఎస్‌ సర్వే.. బీజేపీకి 32 నుంచి 38 స్థానాలు, కాంగ్రెస్‌కు 16 నుంచి 22 సీట్లు వస్తాయని తెలిపింది. ఆజ్‌తక్‌-యాక్సిస్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం బీజేపీ 47 నుంచి 55 స్థానాల్లో, కాంగ్రెస్‌ 13 నుంచి 20 స్థానాల్లో, ఇతరులు 2 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలున్నాయి. న్యూస్‌ ఎక్స్‌ సర్వే, బీజేపీ 42 నుంచి 50 స్థానాల్లో, కాంగ్రెస్‌ 18 నుంచి 24 స్థానాల్లో, ఇతరులు 2 సీట్ల వరకు గెలుచుకుంటారని తెలిపింది. మొత్తానికి హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీలో బీజేపీ పాగా వేయడం ఖాయమని అన్ని సర్వేలు తేల్చాయి. హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో వీరభద్రసింగ్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ సర్కార్‌పై ప్రభుత్వ వ్యతిరేకత పెద్దగా లేకున్నా సిట్టింగ్‌ ఎమ్మెల్యేలపై నెలకొన్న వ్యతిరేకత బీజేపీకి కలిసివస్తోందని సర్వేలు తేల్చాయి. సీఎంగా బీజేపీ అభ్యర్థి ప్రేమ్‌ కుమార్‌ ధుమాల్‌ వైపు మొగ్గు చూపారని సర్వేలు స్పష్టం చేశాయి. 

21:36 - December 14, 2017

తెలుగు మహాసభల కోసం అందురు ఎదురు చూస్తున్నారని, మొదట ఏర్పాట్లు 6వేల మంది చేశామని కానీ 7వేలకు పైగా అతిథులు వస్తున్నారని తెలుగు యూనివర్సిటీ వీసీ ఎస్వీ సత్యనారాయణ అన్నారు. తెలుగు మహాసభల గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి వీడియో క్లిక్ చేయండి.

మెట్ పల్లిలో ఎక్సైజ్ ఎస్సైల సస్పెన్షన్

కరీంనగర్/జగిత్యాల : జిల్లా మెట్ పల్లిలో ఇద్దరు ఎక్సైజ్ ఎస్సైలను సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో చిరంజీవి, రాములు ఉన్నారు. గుడుంబా విక్రయదారుల పునరావాసం కోసం మంజూరైన రూ.50లక్షల పరిహారంలో అవినీతికి పాల్పడినట్లు ఎస్సైలపై ఆరోపణాలు రావడంతో విచారణ చేసిన ఉన్నతధికారులు అవనీతి నిర్ధారణ చేసి పై చర్యలు తీసుకున్నారు. 

 

ఫాతిమా విద్యార్థులతో కామినేని చర్చలు

గుంటూరు : కడప ఫాతిమా మెడికల్ కాలేజీ వ్యవహారంలో యాజమాన్యం సమక్షంలో విద్యార్థులతో మంత్రి కామినేని చర్చలు జరిపారు. విద్యార్థులపై పెట్టిన కేసులను  ఉపసంహరించుకోవాలని ఫాతిమా యాజమాన్యానికి మంత్రి సూచించారు. 

20:20 - December 14, 2017

అయ్యా తెలంగాణ ముఖ్యమంత్రిగారు.. మీరు గడ్కోపారి మనది ధనిక రాష్ట్రం.. మనది సంపన్న రాష్ట్రం అని సూరత్ లేని మాటలు జెప్పకుండ్రి సారు.. శిగ్గనిపిస్తున్నది ఆ మాటలు ఇంటుంటే.. ఓదిక్కు ధనిక రాష్ట్రమని మీరు ప్రగతి భవన్ల బాతాలు జెప్తుంటరు.. ఇంకో దిక్కు అసెంబ్లీల అధికార లెక్కలేమో అప్పులళ్ల జిక్కిన రాష్ట్రమని తేల్తది... ఏంది సారూ మీ తమాష..?

ప్రజలను ఎట్ల మోసం జేయాలనే ముచ్చట్లు పట్టభద్రులు కేంద్రంల నరేంద్రమోడీ.. రాష్ట్రంల చంద్రబాబు నాయుడు ఈళ్లిద్దరే ఉత్తిర్ణులైనోళ్లు.. వీళ్లు పగటిపూజనే జనానికి చందమామను సూపెడ్తరు.. రాత్రి పూట సూర్యున్ని సూపెడ్తరు.. పబ్లీకును ప్రతిరోజు మోసం జేయ్మంటె గూడ చేస్తరు అట్లేంలేదు.. దానికి ఇగ వాళ్ల కథలు ఏశాలు ఒక్కటుండయ్..

ఆ ఆయిపోయింది.. కాంట్రాక్టు ఉద్యోగుల పర్మినెంట్ ముచ్చట్టను జీవ సమాధి జేశిండు తెలంగాణ ముఖ్యమంత్రి గౌవరనీయులు.. పూజ్యులు.. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారూ.. ఏయ్ జర్ర టీఆర్ఎస్ గెల్వని ఒక్కటే దెబ్బకు అందరం పర్మినెంట్ అయితమని.. అహోరాత్రులు కష్టపడ్డ కాంట్రాక్టు బిడ్డలారా..? మిమ్ములను రెగ్యులరైజ్ జేస్తె చీఫ్ సెక్రెటరీ.. అసొంటోళ్లు జైలుకు వోతరని ఆ కథకు ఉరివెట్టి ఊకున్నడు సారూ..

బత్కమ్మకు చీరెల పంపిణీ.. సంక్రాంతికి చంద్రన్నకానుకలు రంజాన్కు.. ఇఫ్తార్ విందులు.. క్రిష్మస్కు.. కానుకలిచ్చుడు.. ఇవ్వేనా..? తెల్గు రాష్ట్రాలళ్ల ఏ హిందువన్న మాకు సంక్రాంతి కానుకలు ఎందుకియ్యరి కొట్లాడిండా..? ఏ ముస్లీమన్న రంజాన్ విందుకు ఎందుకు ఇయ్యరని ధర్నా జేశిండా..? ఏ క్రిష్టియన్ అన్న.. మాకు కానుకలియ్యాలే అని కయ్యానికి దిగిండా..? కని ప్రభుత్వాలు వాళ్లను కాకవట్టెతందుకు వడ్తున్న కథలు ఇవ్వి..

టీఆర్ఎస్ పార్టీల కుడికాలు వెట్టేశింది మాజీ మంత్రి ఉమామాధవరెడ్డి.. దీంతోని టీఆర్ఎస్ పార్టీ బలం ఇంక జర్రంత వెర్గిందని నేతలు చెప్పుకుంటున్నరు.. కని అది వాపును జూశి బలుపు అనుకునె సామెతనే అయ్యెతట్టున్నది.. టీఆర్ఎస్ పార్టీకి అసలైన దెబ్బ ఉమ్మడి నల్లగొండ జిల్లానుంచే తాకెతట్టనిపిస్తున్నది.. కారణం ఏంది అనేది ఈ కథల జూడుండ్రి..

ఆదివాసీ లంబాడీల నడ్మ రాజుకున్న పంచాది.. సారీ కొంతమంది రాజేశ్న పంచాది.. ఆఖరికి సమ్మక్క సారక్క జాతరకు గూడ తాకింది.. సమ్మక్కసారక్కకు వారసులం మేమంటే మేమని.. ఆదివాసీలు, లంబాడీలు.. పొర్కపొర్క గొట్టుకున్నరు.. పదిపదిహేను కార్ల అద్దాలు వల్గిపోయినయ్.. వనదేవతలను మళ్ల జనంల కెళ్లి వనంలకు వారిపోయెతట్టు అయ్యింది లడాయి..

హైద్రావాదుల సొంతిండ్లు గట్టుకోని బత్కుతున్న ప్రజలారా జర్ర జాగ్రత్త.. మీకు దెల్వకుంటనే మీ ఇండ్లను వేరేటోళ్లు అమ్మేస్తున్నరు.. మీ ప్రమేయం లేకుంటనే ఇండ్ల కాయిదాలు మారిపోతున్నయ్.. కోట్ల రూపాల విలువైన ఇండ్లు రాత్రికి రాత్రే రిజిస్ట్రేషన్లు జర్గిపోయి బ్యాంకు లోన్లు గూడ మంజూర్లైపోతున్నయ్.. కావట్టి మీ ఇల్లు మీదేనా కాదా ఒక్కసారి మళ్ల చెక్ జేస్కోండ్రి ఎందుకైనా మంచిది.. ఇగో ఒకాయిన పని ఇట్లనే అయ్యింది.

గొల్ల కుర్మోళ్లకు గొర్లు ఇస్తమన్నం ఇచ్చినం.. అవ్వి ఉంటె మాకేంది సస్తె మాకేంది.? అన్నట్టే ఉన్నది అధికారుల పనితనం.. పేరుకే పెద్ద పథకం.. గొల్లకుర్మోళ్లంత కోట్లకు కోట్లు సంపాయించి.. సర్కారుకే అప్పులిచ్చేంత కలరింగుల పురుడువోస్కున్న ఈ పత్కం. రోజుకింత అనారోగ్యం పాలైతున్నది.. ఈ గోర్లేందో ఆ కథేందో పోండ్రి..

 

20:17 - December 14, 2017

ఆల్రెడీ రేషన్ షాపులు అంతంత మాత్రంగా మారాయి? వాటిని గాలికొదిలి మాల్స్ పేరుతో కొత్త దోపిడీకి తెరలేపుతున్నారా? ప్రజాపంపిణీ వ్యవస్థ నుంచి ప్రభుత్వం సైడవ్వాలని చూస్తోందా? తక్కువ ధరలకే ఇస్తామంటూ మొదటికే మోసం తీసుకురానుందా? రిలయన్స్ లాంటి బడా సంస్థలు సామాన్యులకు తక్కువ ధరలకు ఎందుకిస్తాయి? రూపాయి పెట్టుబడి లేకుండా.. కోట్లు దండుకునే ఎత్తుగడా ఇది? చంద్రన్న మాల్స్ గుట్టేంటి? ఇదే ఈ రోజు వైడాంగిల్ స్టోరీ.. చంద్రన్నా ఎవరికోసమన్నా?రేషన్ షాపులను మరింత బలోపేతం చేసి సామాన్యుడి కడుపు నింపాల్సింది వదిలేసి.... మాల్స్ ఎందుకన్నా? గృహోపకరణాలు, సౌందర్య సాధనాలు కాదన్నా..బియ్యం,కందిపప్పు, నూనె, కావాలన్నా..!! రిలయన్స్, ఫ్యూచర్ గ్రూప్ లను..కాదు..మా బాగోగులు పట్టించుకో అన్నా..చంద్రన్నా .. అంటున్నాడు సామాన్యుడు..

మాల్స్ భాగస్వాములుగా రిలయన్స్, ఫ్యూచర్ గ్రూపునెలా ఎంపిక చేస్తారు?ప్రజలకవసరమైన సరుకులు సరఫరా చేయలేనంత చేతకానిదా ఏపీ సర్కారు?ప్రజాపంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాల్సింది పోయి... దాని ద్వారా కార్పొరేట్లకు ఆదాయాన్ని పంచుతున్నారా? ఎవరికోసం ఈ మాల్స్? ఎవరికి లాభం? చంద్రన్నమాల్స్ పై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. దేశమంతా జీఎస్టీ ఉంటే ఏపీలో సీఎస్టీ ఉందని, హెరిటేజ్ రిలయన్స్ లకు మేలు చేసేందుకే ఈ నిర్ణయమని వైసీపీమండిపడుతోంది. ప్రజాపంపిణీ వ్యవస్థ నడ్డి విరిచి సామాన్యుడిని దోపిడీ చేసి కార్పొరేట్లకు దోడిపెట్టే ప్రయత్నం ఇదని సీపీఎం విమర్శిస్తోంది..

చంద్రన్న మాల్స్‌ ద్వారా నిత్యావసర వస్తువులతో పాటు, గృహోపకరణాలు, సౌందర్య సాధనాలు తక్కువ ధరలకు వస్తాయా? అలా వస్తాయంటూ చెప్తున్న సీఎం మాటల్లో నిజమెంత? చంద్రన్న మాల్స్‌తో ప్రజలకు జరిగే మేలు కన్నా, కార్పొరేట్లకు చేకూరే లబ్ధి ఎక్కువా? రిలయన్స్ లాంటి సంస్థలు ఒక్క రూపాయి పెట్టుబడి కూడా పెట్టకుండా గ్రామీణ ప్రాంతాల్లో దందాకు దిగుతున్నాయా? దానికి ఏపీ సర్కారు వత్తాసు పలుకుతోందా? ప్రజలకోసం చేస్తున్నామని చెప్పే పనుల అసలు గుట్టు తేల్చాలి.. కాకులను కొట్టి గద్దలకు వేసే కుట్రలను వ్యతిరేకించాలి..సామాన్యుడిని వినిమయ సంస్కృతికి తరలించి సొమ్ము చేసుకునే కుట్రలను తిప్పి కొట్టాలి.. గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను దెబ్బతీస్తూ, చౌక దుకాణాలను నాశనం చేసే మాల్స్ ను వ్యతిరేకించాలనే వాదనలు పెరుగుతున్నాయి. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.


 

19:39 - December 14, 2017

గుజరాత్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ కు కొంత అశాజనకంగా ఉన్న మాట వాస్తమే అని, నోట్ల రద్దు, జీఎస్టీ, అక్కడ పాటిదార్ల ఉద్యమాల వల్ల బీజేపీకి వ్యతికంగా ఉంటుందని అందరు భావించామని సీపీఎం పార్టీ నాయకుడు నంద్యాల నర్సింహరెడ్డి అన్నారు. ఎగ్జిట్ పోల్స్ వాస్తం అవుతుందని తను అనుకోవడం లేదని, దేశావ్యాప్తంగా బీజేపీ పై వ్యతిరేకత పెరుగుతుందని కాంగ్రెస్ నేత బెల్లయ నాయక్ అన్నారు. తమ అంచనా ప్రకారం బీజేపీకి 120 సీట్లు వచ్చే ఆవకాశం ఉందని, హిమాచల్ ప్రదేశ్ చూసినట్టైయితే బీజేపీ గెలుపు స్పష్టంగా తెలుస్తోందని బీజేపీ నేత రాకేష్ రెడ్డి అన్నారు. ఎగ్జిట్ పోల్స్ చూసినట్టైయితే మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే సర్వే సంస్థలు పరిగణాలోకి తీసుకున్నారని, గుజరాత్ బీజేపీ కంచుకోట అక్కడ బీజేపీ 22ఏళ్లుగా అధికారంలో ఉందని టెన్ టివి ఇన్ పుట్ ఎడిటలర్ కృష్ణ సాయి రాం అన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

చంద్రబాబును కలసిన జేపీ

గుంటూరు : ఏపీ సీఎం చంద్రబాబును లోక్ సత్తా అధ్యక్షడు జయప్రకాష్ నారాయణ కలిశారు. సురాజ్య ఉద్యమంలో భాగంగా తన అనుభవాలను ఆయన సీఎంకు వివరించారు. సేవా హామీ, ప్రజారోగ్యం, విద్య, తదితర అంశాలపై కూలంకుష అధ్యయనాన్ని జేపీ సీఎం కు వివరించారు. 

18:59 - December 14, 2017

కృష్ణా : పేద చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లకు ఆంధ్రా ఆస్పత్రి నడుంబిగించింది. ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌, ఆంధ్రా హాస్పిటల్స్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఇకనుంచి గుండెకు సంబంధించిన చికిత్సలు ఉచితంగా నిర్వహిస్తామని.. BCCI సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌, ప్రముఖ వైద్య నిపుణులు రామారావు తెలిపారు. విజయవాడలోని ఆంధ్రా హాస్పిటల్‌ ఆధ్వర్యంలో గత రెండేళ్ల నుంచి 215 మంది చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లను విజయవంతం చేశామన్నారు. రాబోయే రోజుల్లో ఏపీలో గుండెజబ్బులున్న చిన్నారులను గుర్తించి ఉచితంగా చికిత్సలు చేస్తామని తెలిపారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ద్వారా ఎక్కువమంది పిల్లలకు గుండె వైద్యాన్ని అందించనున్నట్లు చెప్పారు.

18:57 - December 14, 2017

విజయనగరం : సమస్యల పరిష్కారం కోరుతూ విజయనగరం జిల్లాలోని వేదబయోటిక్‌ కార్మికులు ఆందోళనకు దిగారు. స్థానికులు తమ విధులకు ఆటంకం కలిగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలంటూ తమతో గొడవపడుతున్నారని వాపోతున్నారు. మంత్రి సుజయకృష్ణ రంగారావును కార్మికులు కలిసి సమస్యను పరిష్కరించాలని కోరారు. మరోవైపు అప్రెంటీస్‌ చేస్తున్న వారు కూడా రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇవ్వాలని అడగడం సబబు కాదని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు.

18:55 - December 14, 2017
18:36 - December 14, 2017

యానం : కేంద్రపాలిత ప్రాంతం యానంలో తాగుబోతును ఓ మహిళ చితకబాదింది. ఆ మహిళ సోదరితో బైక్ పై వెళ్తుండగా యువతితో తాగుబోతు అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో మహిళ పోకిరిని చెప్పుతో దేహశుద్ధి చేసింది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

18:30 - December 14, 2017

హైదరాబాద్ :తెలంగాణను , ప్రజా ఉద్యమ కవులను , కళాకారులను విస్మరించిన ప్రపంచ తెలుగు మహాసభలను బహిష్కరిస్తున్నామని అరుణోదయ సమితి నాయకురాలు విమలక్క తెలిపారు. పాలకులకు భజన చేసేవారికి తప్ప అసలైన ప్రజా ఉద్యమ కవులకు మహాసభల్లో చోటులేదన్నారు. అందెశ్రీ, గద్దర్, జయరాజ్, జయధీర్ తిరుమలరావు వంటి కవులను కళాకారులను విస్మరించారని ఆమె మండిపడ్డారు . ఎవరి కోసం సభలు జరుపుతున్నారని ఆమె ప్రశ్నించారు . తెలుగులోనే ప్రభుత్వ కార్యక్రమాలు ,జీవోలు విడుదల చేయాలనీ గత మహాసభలు తీర్మానించినా.. ఇప్పటికీ అమలు కాలేదని..ప్రభుత్వమే తెలుగును నిర్లక్ష్యం చేస్తోందని విమలక్క ఆవేదన వ్యక్తం చేశారు. హంగూ ,ఆర్బాటం, ప్రజా ధనం వృధా తప్ప మహాసభలతో ఒరిగిందేమీ లేదని విమలక్క అన్నారు. అందుకే ఈ సభలను బహిష్కరిస్తున్నట్లు తెలిపారు.

బీజేపీదే అధికారమంటున్న ఎగ్జిట్ పోల్స్

హైదరాబాద్ : హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ లో బీజేపీదే అధికారమని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. గుజరాత్ లో టైమ్స్ నౌ వీఎంఆర్ సర్వే ప్రకారం 182 స్థానాలకు గాను బీజేపీకి 109 స్థానాలు, కాంగ్రెస్ కు 70 స్థానాలు ఇతరులకు 3 స్థానాలు అభించే అకాశం ఉందని తెలుస్తోంది.హిమాచల్ ప్రదేశ్ లో ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా సర్వే ప్రకారం మొత్తం 58 స్థానాల్లో బీజేపీకి 47నుంచి 55 స్థానాలు, కాంగ్రెస్ కు 13నుంచి 20 స్థానాలు వస్తాయని తెలుస్తోంది.

18:09 - December 14, 2017

హైదరాబాద్ : హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ లో బీజేపీదే అధికారమని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. గుజరాత్ లో టైమ్స్ నౌ వీఎంఆర్ సర్వే ప్రకారం 182 స్థానాలకు గాను బీజేపీకి 109 స్థానాలు, కాంగ్రెస్ కు 70 స్థానాలు ఇతరులకు 3 స్థానాలు అభించే అకాశం ఉందని తెలుస్తోంది.హిమాచల్ ప్రదేశ్ లో ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా సర్వే ప్రకారం మొత్తం 58 స్థానాల్లో బీజేపీకి 47నుంచి 55 స్థానాలు, కాంగ్రెస్ కు 13నుంచి 20 స్థానాలు వస్తాయని తెలుస్తోంది. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

శంషాబాద్ చారినగర్ లో రేవ్ పార్టీ

రంగారెడ్డి : శంషాబాద్ చారినగర్ లోని రుక్ముద్దీన్ ఫాంహౌస్ లో రేవ్ పార్టీ జరిగింది నిర్వహకులు అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారు. పోలీసులు 11 మందిని అరెస్టు చేశారు. 

ఈసీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ ధర్నా

ఢిల్లీ : ఈసీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ ధర్నాకు దిగింది. గుజరాత్ లో తుది విడత పోలింగ్ కొనసాగుతుండగా ప్రధాని మోడీ రోడ్ షో నిబంధనలకు విరుద్ధమని కాంగ్రెస్ వాదిస్తోంది. మోడీకి ఈసీ ఎందుకు నోటిస్ ఇవ్వలేదని వారు ప్రశ్నించారు. 

ముగిసిన గుజరాత్ ఎన్నికల పోలింగ్

ఆహ్మాదాబాద్ : గుజరాత్ లో రెండవ విడత అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. రెండో విడతలో 93 నియోజవర్గాల్లో పోలింగ్ ముగిసింది. సమయం ముగిసినా క్యూలైన్లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. 

17:30 - December 14, 2017

హైదరాబాద్ : ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరు అవుతున్న అతిథులకు తిప్పలు తప్పడంలేదు. వారి కిట్లు పంచే విషయంలో అధికారులు నిర్ల్యంగా వ్యవరిస్తున్నారు. కొంత మంది గంటల కొద్ది కిట్ల కోసం నిరీక్షించాల్సి వచ్చింది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

17:27 - December 14, 2017
17:25 - December 14, 2017

ఆహ్మాదాబాద్ : గుజరాత్ లో రెండవ విడత అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. రెండో విడతలో 93 నియోజవర్గాల్లో పోలింగ్ ముగిసింది. సమయం ముగిసినా క్యూలైన్లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. మరింత సమాచారం కోసవీ వీడియో చూడండి.

17:21 - December 14, 2017

హైదరాబాబాద్ : శుక్రవారం నుంచి మొదలవుతున్న తెలుగు మహాసభలకు భాగ్యనగరం సిద్ధమవుతోంది. మహాసభలను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే తెలుగు సాహితీ వేత్తలను ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ సమావేశాలకు ఆహ్వానించింది. తాజాగా మహాసభల తేదీలు, వేదికలు.. కార్యక్రమాల వివరాలను ప్రభుత్వం విడుదల చేసింది. డిసెంబర్‌ 15న ఎల్బీస్టేడియంలోని పాల్కురికి సోమనాథ ప్రాంగణంలో తెలుగు మహాసభలు ప్రారంభం అవుతాయి. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే ప్రారంభ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి డాక్టర్.వెంకయ్యనాయుడు, గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ విద్యా సాగరరావు పాల్గొంటారు.

డిసెంబర్ 15న జరిగే కార్యక్రమాలు
సా. 6గంటలకు సాంస్కృతిక సమావేశం. సీతాకాంత్ మహాపాత్ర, ప్రతిభారాయ్‌లకు సత్కారం సా. 6:30 గంటలకు. డాక్టర్ రాజారెడ్డి, రాధారెడ్డి కూచిపూడి కళాకారుల..మన తెలంగాణ సంగీత నృత్య రూపకం. రా. 7.00 - 7:30 గంటలకు పాటకచేరి. రా. 7:30 - 9:00 గంటలకు జయ జయోస్తు తెలంగాణ (సంగీత నృత్య రూపకం)ఉంటాయి.

డిసెంబర్‌ 16 జరిగే కార్యక్రమాలు
ఉ. 10 గంటలకు అష్టావధానం ఉ. 10 గంటలకు తెలంగాణ పద్య కవితా సౌరభం (సదస్సు), ఉ. 10 గంటలకు బాల సాహిత్య సదస్సుమ 12:30 గంటలకు, హాస్యావధానంమ. 3 గంటలకు పద్యకవి సమ్మేళనం, మ. 3 గంటలకు తెలంగాణ వచన కవితా వికాసం (సదస్సు) మ. 4 గంటలకు హరికథ (లోహిత)మ. 4:30 గంటలకు నృత్యం (వైష్ణవి)మ. 4:45 గంటలకు సంగీతం (రమాశర్వాణి) సా. 5 గంటలకు తెలంగాణలో తెలుగు భాష వికాసం సాహిత్యసభ సా. 6:30 గంటలకు సాంస్కృతిక సమావేశంరా. 7:00- 7:30 గంటలకు శతగళ సంకీర్తన (భక్తరామదాసు సంకీర్తనల ఆలాపన)రా. 7:30 -7:45 గంటలకు కళాకారుడు మైమ్ మధు మూకాభినయం ప్రదర్శనరా. 7:45 నుంచి 8:00 గంటలకు వింజమూరి రాగసుధ నృత్యం రా. 8:00-8:15 గంటలకు షిర్నాకాంత్ బృంద కూచిపూడి నృత్యంరా. 8:15 - 9:00 గంటలకు డాక్టర్ అలేఖ్య నృత్యం

ప్రతి రోజు జరిగే కార్యాక్రమాలు 
డిసెంబర్ 16 నుంచి 19 వరకు రవీంద్రభారతిలో ..ప్రతిరోజు ఉ. 10 గంటలకు నుంచి రాత్రి 7 గంటలకు వరకు శతావధాన కార్యక్రమండిసెంబర్ 16 నుంచి 19 వరకు ప్రతిరోజు ఉ. 11 గంటలకు నుంచి రాత్రి 9 గంటలకు వరకు..రవీంద్రభారతి ఐసీసీఆర్ ఆర్ట్ గ్యాలరీలో యువ చిత్రోత్సవండిసెంబర్ 16 నుంచి 19 వరకు రవీంద్ర భారతి ప్రాంగణంలో కార్టూన్ ప్రదర్శన డిసెంబర్ 16 నుంచి 19 వరకు చిత్రమయి ఆర్ట్ గ్యాలరీలో ఛాయాచిత్ర ప్రదర్శనడిసెంబర్ 16 నుంచి 19 మాదాపూర్‌లో ఛాయాచిత్ర ప్రదర్శన డిసెంబర్ 17న జరిగే కార్యక్రమాల వివరాలుఉ. 10 గంటలకు కథా సదస్సు ఉ. 10 గంటలకు బాలకవి సమ్మేళనం ఉ. 10 గంటలకు జంట కవుల అష్టావధానం మ. 12:30 గంటలకు అక్షర గణితావధానం మ. 3 గంటలకు తెలంగాణ నవలా సాహిత్యం మ. 3 గంటలకు అష్టావధానం మ. 3 గంటలకు తెలంగాణ వైతాళికులు (రూపకం)సా. 5 గంటలకు మౌఖిక వాఙ్మయం భాష సాహిత్యసభసా. 5:30 గంటలకు నేత్రావధానం సా. 6 గంటలకు కథా,నవలా, రచయితల గోష్ఠిసా. 6 గంటలకు శ్రీప్రతాపరుద్ర విజయం (రూపకం)సా. 6:30 గంటలకు సాంస్కృతిక సమావేశం

డిసెంబర్ 18న జరిగే కార్యక్రమాల
ఉ. 10 గంటలకు తెలంగాణ మహిళా సాహిత్యం (సదస్సు) ఉ. 10 గంటలకు పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో తెలుగు ఉ. 10 గంటలకు - తెలంగాణ విమర్శ - పరిశోధన మ. 3 గంటలకు కవయిత్రుల సమ్మేళనం మ. 3 గంటలకు శతక, సంకీర్తనా, గేయ సాహిత్యం మ. 3 గంటలకు న్యాయ వ్యవహారాలు, ప్రభుత్వపాలనలో తెలుగు సా. 5 గంటలకు తెలంగాణ పాట-జీవితం సాహిత్య సభ సా. 6 గంటలకు కవి సమ్మేళనం సా. 6:30 గంటలకు సాంస్కృతిక సమావేశం

డిసెంబర్ 19న జరిగే కార్యక్రమాలు
ఉ. 10 గంటలకు - తెలంగాణలో తెలుగు - భాషా సదస్సు ఉ. 10 గంటలకు పబ్లిక్ గార్డెన్‌లోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం..వానమామలై వేదికపై తెలంగాణ చరిత్ర (సదస్సు) ఉ. 10 గంటలకు రవీంద్ర భారతి సమావేశ మందిరంలోని డా.ఇరివెంటి కృష్ణమూర్తి వేదికపై..తెలంగాణలో తెలుగు - భాషా సదస్సుఉ. 10 గంటలకు విదేశీ తెలుగువారితో గోష్ఠిమ. 2 గంటలకు తెలంగాణ సారస్వత పరిషత్ భవనంలోని..శతావధిని కోరుట్ల కృష్ణమాచార్య వేదికపై రాష్ర్టేతర తెలుగువారితో గోష్ఠి5రోజులు తెలుగు మహాసభలు ఘనంగా నిర్వహించిన అనంతరం 19వ తేదీ సాయంత్రం 5 గంటలకు తెలుగు విశ్వవిద్యాలయ ఆడిటోరియం బిరుదురాజు రామరాజు ప్రాంగణంలోని సామల సదాశివ వేదికలో జరిగే ముగింపు వేడుకల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్‌లు పాల్గొంటారు.

17:19 - December 14, 2017

ఆహ్మాదాబాద్ : గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోది అహ్మదాబాద్‌లోని నిషాన్‌ హైస్కూలులో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాధారణ పౌరుల వలె క్యూలైన్లో వెళ్లి మోది ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం మోది ఇంక్‌ వేసిన వేలును చూపిస్తూ రోడ్‌ షో గా వెళ్లడంపై కాంగ్రెస్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఓటు వేసిన అనంతరం ఓటర్లను మభ్యపెట్టేందుకు ప్రధాని రోడ్‌ షోలా వెళ్లారని...ఇది ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కింద వస్తుందని కాంగ్రెస్‌ ఈసీకి ఫిర్యాదు చేసింది. టీవీలో ఇంటర్వూ ఇచ్చినందుకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ఎన్నికల కమిషన్ నోటీసు పంపినట్లే ...ప్రధాని మోదికి కూడా నోటీసు పంపాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది.

17:18 - December 14, 2017

నల్లగొండ : నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ద్వితీయ మహాసభలు ప్రారంభమయ్యాయి. మహాసభల సందర్భంగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మాజీ ఎంపీ, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్‌, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, బి. వెంకట్‌తోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు. జిల్లాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. కళాకారుల ఆటపాటలు, డప్పుల దరువులతో ర్యాలీ ఉత్సాహంగా సాగుతోంది. 

17:16 - December 14, 2017

హైదరాబాద్ : యాభై కోట్ల రూపాయల భారీ వ్యయంతో నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలకు ఏర్పాట్లుకు పూర్తి కావచ్చాయి. మంత్రులు, అధికారలు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రపంచ తెలుగు మహాసభలకు ఎంతో ఘన చరిత్ర ఉంది. 1975లో మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాద్‌లో జరిగాయి. 42 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఈ మహాసభలకు భాగ్యనగరం వేదికైంది. ఈ మధ్యకాలంలో కౌలాలంపూర్‌ రెండో మహాసభలు, మారిషస్‌లో మూడో ప్రపంచ తెలుగు మహాసభలు, తిరుపతిలో నాల్గవ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించారు. ఈనెల 15 నుంచి 19 వరకు జరిగే ప్రపంచ తెలుగు మహాసభలకు హైదరాబాద్‌ సిద్ధమైంది. ప్రపంచం నలుమూలల నుంచి తెలుగు భాషాభిమానులు ఈ ఉత్సవాలకు హాజరవుతున్నారు. పలువురు సాహితీవేత్తలు ఈ పండుగలో పాల్గొంటున్నారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్వహిస్తున్న ఈ సభల్లో రెండువేల సంవత్సరాల సాహితీ నేపథ్యాన్ని గుర్తు చేసుకోనున్నారు.

తెలంగాణ వైతాళికులు భారీ కటౌట్లు
ఎల్బీ స్టేడియం ప్రధాన వేదికగా ఈ మహాసభలు జరుగుతున్నాయి. ఏడు వేదికలపై సాహిత్య సమాలోచనలు, చర్చాగోష్ఠిలు నిర్వహిస్తారు. ఈ సభలు జరిగే ప్రాంగణాలతోపాటు మహానగరాన్ని స్వాగతద్వారాలతో అందంగా తీర్చిదిద్దారు. వందకుపైగా స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. అన్ని ప్రాంతాలు శోభాయమానంగా కనిపిస్తున్నాయి. తెలంగాణ వైతాళికులు భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. రంగు రంగుల తోరణాలు, విద్యుత్‌ దీపాల ధగధగలతో నగరం శోభిల్లుతోంది. జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహాతలు ప్రతిభా రే, సీతాకాంత్‌ మహాపాత్ర, సత్యవ్రత శాస్త్రిని ప్రభుత్వం తరుపున ఆహ్వానించారు. అలాగే 14 భాషల్లో సాహిత్య అకాడమీ అవార్డులు అందుకున్న ప్రముఖులకు ఆహ్వానాలు పంపారు. అదేవిధంగా అన్ని భాషలకు చెందిన సాహితీ ప్రముఖులను ప్రపంచ తెలుగు మహాసభలకు ఆహ్వానించారు.

సాంస్కృతిక కార్యక్రమాలు
ప్రపంచ తెలుగు మహాసభలు జరిగే ఏడు వేదికలపై కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. రామదాసు కీర్తనలు, తందనాన రామాయణం, హరికథలు, సినీ విభావరి, జాపనద గీతాలు, నాటకాలు, తోలుబొమ్మలాట, బతుకమ్మ, కోలాటం, పేరిణి నృత్యాలతోపాటు ఆదివాసీ, గిరిజన కళారూపాలను ఏర్పాటు చేశారు. ఈ మహాసభలను అంత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రపంచ దృష్టికి ఆకర్షించే విధంగా తెలుగు మహాసభలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరయ్యే వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

17:14 - December 14, 2017

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీలో కాంట్రాక్టు సిబ్బంది సమస్యలపై సీఎం కేసీఆర్‌కు లేఖ రాస్తానన్నారు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. ఓయూ పరిపాలన భవనం ఎదుట నిరాహారదీక్షలు చేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు తమ్మినేనితో పాటు టీమాస్ నేతలు మద్దతు తెలిపారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందిని క్రమబద్దీకరించి ప్రభుత్వం వెంటనే వారి సమస్యలు పరిష్కరించాలని తమ్మినేని డిమాండ్ చేశారు. వారి న్యాయమైన పోరాటానికి సీపీఎం సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆయన తెలిపారు. 

17:13 - December 14, 2017

ఆహ్మాదబాద్ : గుజరాత్‌లో తుదివిడత పోలింగ్‌ కొనసాగుతోంది. అహ్మదాబాద్‌లోని రాణిప్‌ ప్రాంతంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. గాంధీనగర్‌లోని పోలింగ్‌ కేంద్రంలో ప్రధాని తల్లి హీరాబెన్‌ ఓటు వేశారు. నారాయణ్‌పూర్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్‌లోని ఘట్లోడియా ఎన్నికల కేంద్రంలో గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి ఆనందిబెన్‌ పటేల్‌, గాంధీనగర్‌ వసన్‌ గ్రామంలో కాంగ్రెస్‌ మాజీ నేత శంకర్‌ సిన్హ్‌ వాఘేలా ఓటు వేశారు. ఉత్తర, మధ్య గుజరాత్‌లోని 14 జిల్లాల పరిధిలోకి వచ్చే 93 నియోజకవర్గాల్లో బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యాన్ని ఈరోజు ఓటర్లు నిర్ణయించనున్నారు. ఓట్ల లెక్కింపు ఈ నెల 18న జరుగనుంది. 

మార్చి 1నాటికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు : సుప్రీం

ఢిల్లీ : ప్రజా ప్రతినిధులపై కేసుల విచారణకు హైకోర్టులతో చర్చించి 2018 మార్చి 1నాటికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని సుప్రీం కేంద్రాన్ని ఆదేశించింది. 

16:11 - December 14, 2017

ఢిల్లీ : ప్రజా ప్రతినిధులపై కేసుల విచారణకు హైకోర్టులతో చర్చించి 2018 మార్చి 1నాటికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని సుప్రీం కేంద్రాన్ని ఆదేశించింది. అలాగే ప్రజాప్రతినిధులపై కేసుల వివరాలు తెలుసుకునేందుకు కేంద్రానికి 2 నెలల సమయం ఇచ్చింది. ప్రజాప్రతినిధులపై కేసుల విచారణకు 12 ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తామని సుప్రీం కోర్టుకు కేంద్రం తెలిపింది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

విశాఖ చేరుకున్న క్రికెటర్లు

విశాఖ : భారత్, శ్రీలంక క్రికెటర్లు విశాఖ చేరుకున్నారు. వారికి ఎయిర్ పోర్టులో అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ నెల 17న శ్రీలంక, భారత్ మధ్య మూడవ వన్డే జరగనుంది.  

16:02 - December 14, 2017

జనసేనకు ఆదిలోనే హంసపాదు

గుంటూరు : జిల్లాలో జనసేన పార్టీ కార్యాలయం ఏర్పాటుకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. చినకాకని జనసేన పార్టీ కార్యాలయం స్థలం కోర్టు వివాదంలో చిక్కింది. ఆ స్థలం మైనారిటీలకు చెందిన వ్యక్తులదంటూ ముస్లిం ఐక్య వేదిక ఆరోపణాలు చేస్తోంది. ఆ స్థల వివాదం కేసు హైకోర్టులో ఉందన ఐక్య వేదిక వెల్లడించింది.

15:56 - December 14, 2017

గుంటూరు : జిల్లాలో జనసేన పార్టీ కార్యాలయం ఏర్పాటుకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. చినకాకని జనసేన పార్టీ కార్యాలయం స్థలం కోర్టు వివాదంలో చిక్కింది. ఆ స్థలం మైనారిటీలకు చెందిన వ్యక్తులదంటూ ముస్లిం ఐక్య వేదిక ఆరోపణాలు చేస్తోంది. ఆ స్థల వివాదం కేసు హైకోర్టులో ఉందన ఐక్య వేదిక వెల్లడించింది. 1958 నుంచి స్థలంపై యార్లగడ్డ సుబ్బారావు, మోహిద్దున్ జక్రియాల మధ్య వివాదం కొనసాగుతుందని, 1998లో గుంటూరు కోర్టులో యార్లగడ్డ సుబ్బారావు కు చుక్కెదురైందని, అదే సంవత్సరం హైకోర్టులో పిటిషన్ వేశామని ముస్లిం వర్గీయులు తెలిపారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

గుజరాత్ లో కొనసాగుతున్న పోలింగ్

ఆహ్మాదాబాద్ : గుజరాత్ లో తుది విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. మధ్యాహ్నం 2 గంటల వరకు 44 శాతం పోలింగ్ నమోదు అయినట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. 

నల్లగొండ పర్యటనలో బృందకారత్

నల్లగొండ : జిల్లా మిర్యాలగూడలో సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందకారత్ పర్యటిస్తున్నారు. ఆమె పుచ్చపల్లి సుందరయ్య విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. 

ఎఫ్ఆర్ డీఏ ప్రజావ్యతిరేక చర్చ : విజసాయిరెడ్డి

ఢిల్లీ : కేంద్రం తెస్తున్న ఎప్ఆర్ డీఏ బిల్లు ప్రజావ్యతిరేక చర్య అని ఈ బిల్లు ఆమోదం పొందకుండా ఇతర పార్టీలతో కలిసి పోరాడుతామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. రాజ్యసభలో ఉపరాష్ట్రపతి వెంకయ్య పార్టీ మారిన ఎంపీలపై అనర్హత వేటు వేయడాన్ని స్వాగతిస్తున్నామని విజయసాయిరెడ్డి అన్నారు. 

15:17 - December 14, 2017

టీఆర్ఎస్ లో చేరిన ఉమా మాధవరెడ్డి

హైదరాబాద్ : నల్లగొండ టీడీపీ నేత ఉమా మాధవరెడ్డి ప్రగతి భవన్ లో కేసీఆర్ సంక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఆమెతో పాటు తనయుడు సందీప్ రెడ్డి కూడా టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్బంగా కేసీఆర్ మాట్లాడుతు మాధవరెడ్డి  తనకు ఆత్మీయుడు అని తెలిపారు. 

14:40 - December 14, 2017

ప్రంపచంలో చావే సమస్యకు పరిష్కమైతే మనిషి రోజు ఎన్నిసార్లు చావలో, మనిషికి గెలుపే ముఖ్యమనుకుంటే ప్రతి రోజు జీవితాన్ని ఎన్నిసార్లు పొగొట్టుకోవాలో, ఒక్కసారి ఓడిపోయి చూడు గెలుపు విలువ ఎంటో తెలుస్తుంది అంటారు అనుభవజ్ఞులు. ఏదో ఒక సయంలో ఏదో ఒక సమస్యతో సతమత అవుతున్న మనిషికి సమస్యలను అధికమించెందుకు కవాలసిన ధైర్యం ఈ మాటల్లో మనకు తెలుస్తోంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో సమస్యలు, మరెన్నో సవాళ్లు ఇవన్నీ కలగలసిన జీవితంపై అవగాహన లేక కుంగుబాటు లోనై ఆత్మహత్యలకు పాల్పడేవారు ఎందురో. అటువంటి వారి కోసం గత 20 ఏళ్లుగా పని చేస్తున్న స్వచ్ఛంద సంస్థపై మానవి స్పెషల్ ఫోకస్. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

మేడారంలో ఉద్రిక్తత....

భూపాలపల్లి : జిల్లా మేడారంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మేడారం ట్రస్ట్ బోర్డు పాలకవర్గ ప్రమాణస్వీకారాన్ని ఆదివాసీలు అడ్డుకున్నారు. మంత్రి చందులాల్ తనయుడు ప్రహ్లాద్ పై ఆదివాసీల ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడారంలో ట్రస్ట్ బోర్డులో లంబాడీల పెత్తనమేంటని ఆదివాసీలు నిలదీశారు.

14:08 - December 14, 2017

భూపాలపల్లి : జిల్లా మేడారంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మేడారం ట్రస్ట్ బోర్డు పాలకవర్గ ప్రమాణస్వీకారాన్ని ఆదివాసీలు అడ్డుకున్నారు. మంత్రి చందులాల్ తనయుడు ప్రహ్లాద్ పై ఆదివాసీల ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడారంలో ట్రస్ట్ బోర్డులో లంబాడీల పెత్తనమేంటని ఆదివాసీలు నిలదీశారు. ప్రహ్లాద్ పై దాడికి యత్నం చేసి 15 కార్లను ధ్వంస చేశారు. దీంతో పోలీసులకు ఆదివాసీలకు మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

13:40 - December 14, 2017
13:37 - December 14, 2017

నల్లగొండ : జిల్లా మిర్యాలగూడలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ద్వితీయ మహాసభలు ప్రారంభమయ్యాయి. మహాసభల సందర్భంగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మాజీ ఎంపీ, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్‌, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, బి. వెంకట్‌తోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు. జిల్లాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. కళాకారుల ఆటపాటలు, డప్పుల దరువులతో ర్యాలీ ఉత్సాహంగా సాగుతోంది. 

13:32 - December 14, 2017

గుజరాత్‌ : రాష్ట్రంలో తుదివిడత పోలింగ్‌ కొనసాగుతోంది. అహ్మదాబాద్‌లోని రాణిప్‌ ప్రాంతంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. గాంధీనగర్‌లోని పోలింగ్‌ కేంద్రంలో ప్రధాని తల్లి హీరాబెన్‌ ఓటు వేశారు. నారాయణ్‌పూర్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్‌లోని ఘట్లోడియా ఎన్నికల కేంద్రంలో గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి ఆనందిబెన్‌ పటేల్‌, గాంధీనగర్‌ వసన్‌ గ్రామంలో కాంగ్రెస్‌ మాజీ నేత శంకర్‌ సిన్హ్‌ వాఘేలా ఓటు వేశారు. ఉత్తర, మధ్య గుజరాత్‌లోని 14 జిల్లాల పరిధిలోకి వచ్చే 93 నియోజకవర్గాల్లో బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యాన్ని ఈరోజు ఓటర్లు నిర్ణయించనున్నారు. ఓట్ల లెక్కింపు ఈ నెల 18న జరుగనుంది. 

13:30 - December 14, 2017

పశ్చిమగోదావరి : జిల్లా ఆకివీడు మండలం దుంపగడప ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో తెలుగు లెక్చరర్‌ వేధిస్తున్నాడంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. క్లాసులు బాయ్‌కాట్‌ చేసి లెక్చరర్ జాన్‌వెస్లీ పై చర్యలు తీసుకోవాలని ధర్నా చేపట్టారు. ప్రిన్సిపల్‌కి ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా ఆయన కూడా అసభ్యంగా మాట్లాడుతున్నాడని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను వేధిస్తున్న ప్రిన్సిపాల్‌, లెక్చరర్లపై చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు కోరుతున్నారు. విద్యార్థినుల బాధలు వినాలంటే వీడియో క్లిక్ చేయండి. 

13:29 - December 14, 2017

హైదరాబాద్ : ముషీరాబాద్‌ పరిధిలోని బాకారంలో నాలుగేళ్ల బాలుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. జియగూడ కు చెందిన విజయలక్ష్మి డెలివరి కోసం రాంనగర్‌కు వచ్చింది. విజయలక్ష్మి కొడుకు కౌశల్‌ నిన్న రాత్రి 7 గంటల నుండి కనిపించక పోవడంతో ముషీరాబాద్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. రాత్రి పదిగంటలకు మేడపై కౌశల్‌ ఉన్నాడని తెలియడంతో బాలుడిని తీసుకొని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే నాలుగు గంటల క్రితమే కౌశల్‌ మృతి చెందాడని వైద్యులు తెలిపారు. 

13:27 - December 14, 2017

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లా టేకుల పల్లి అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. సిపి బాట దళానికి పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఎనమిది మంది సిపి బాట దళ సభ్యులు మృతి చెందారు. టేకుల పల్లి మండలం నీళ్లమడుగు అటవీ ప్రాంతంలో దళ సభ్యులు ఉన్నారన్న అనుమానంతో పోలీసులు కాల్పులు జరిపారు.  

మిషన్ ఇన్నోవేషన్ సదస్సు...

హైదరాబాద్ : టెక్ మహీంద్ర క్యాంపస్ లో మిషన్ ఇన్నోవేషన్ సదస్సు జరిగింది. ఐటీ రంగంలో హైదరాబాద్ కు ప్రత్యేక గుర్తింపు ఉందని, శిక్షణ..నైపుణ్యంతో యువతకు విస్తృత అవకాశాలున్నాయన్నారు. టీ హబ్ -2 నిర్మాణం దశలో ఉందని, దిగ్గజ ఐటీ కంపెనీలు హైదరాబాద్ కు వస్తున్నాయన్నారు. ఐటీలో మేటీ కంపెనీలు హైదరాబాద్ లో పనిచేస్తున్నాయని, ఐటీ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. 

ఎర్నాకుళం కేసులో తీర్పు...

కేరళ : ఏర్నాకుళం గతేడాది సంచలనం సృష్టించిన 30 ఏళ్ల న్యాయవిద్యార్థి అత్యాచారం కేసులో దోషికి ఉరిశిక్ష పడింది. మంగళవారం న్యాయస్థానం తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. గురువారం ఉరిశిక్ష ఖరారు చేసింది. 

మేడారంలో ఉద్రిక్తత...

జయశంకర్ భూపాలపల్లి : మేడారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మేడారం ట్రస్టు బోర్డు విషయంలో ప్రభుత్వ జీవోపై ఆదివాసీలు ఎదురు తిరిగారు. మంత్రి చందులాల్ కుమారుడికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మేడారం జాతరలో లంబాడీల జోక్యం సహించబోమని హెచ్చరించారు. మంత్రి చందూలాల్ కుమారుడు ప్రహల్లాద్, పోలీసులపై రాళ్లు..కుర్చీలు విసరడంతో ఉద్రిక్తత చోతు చేసుకుంది. ట్రస్టు బోర్డు పాలకవర్గ ప్రమాణ స్వీకారాన్ని ఆదివాసీ ఆందోళనకారులు అడ్డుకున్నారు. 

ఎల్బీ స్టేడియంలో సీపీ, డీసీపీ,

హైదరాబాద్ : ఎల్బీ స్టేడియంలో ప్రపంచ తెలుగు మహాసభల భద్రతా ఏర్పాట్లను సీపీ శ్రీనివాస రావు, సెంట్రల్ జోన్ డీసీపీ జోయస్ డెవిడ్ పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లపై అధికారులకు సూచించారు. 

కిట్ల పంపిణీలో గందరగోళం...

హైదరాబాద్ : ప్రపంచ తెలుగు మహాసభల ఆహ్వాన కిట్లలో గందరగోళం నెలకొంది. హైదరాబాద్ వాసులకు మాత్రమే కిట్ల పంపిణీ ఉందని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాల నుండి వచ్చిన సాహితీ వేత్తలు ఆందోళన పడుతున్నారు. అధికారులు సరైన సమాచారం ఇవ్వడం లేదని నిరసన వ్యక్తం చేశారు. కిట్ల పంపిణీని మధ్యాహ్నం 2గంటలకు అధికారులు వాయిదా వేశారు. 

కొనసాగుతున్న గుజరాత్ పోలింగ్..

గుజరాత్ : రాష్ట్రంలో రెండో దశ పోలింగ్ కొనసాగుతోంది. గురువారం ఉదయం నుండి ఓటు వేసేందుకు బారులు తీరారు. మధ్యాహ్నానానికి 30 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. 

తెలుగు మహాసభల ఏర్పాట్లు...

హైదరాబాద్ : భాగ్యనగరంలో ఐదు రోజుల పాటు సంపూర్ణ సాహిత్య వాతావరణం ఏర్పడబోతోందని...గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్ పేర్కొంటున్నారు. శుక్రవారం నుండి ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. 

12:27 - December 14, 2017

హైదరాబాద్ : భాగ్యనగరంలో ఐదు రోజుల పాటు సంపూర్ణ సాహిత్య వాతావరణం ఏర్పడబోతోందని...గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్ పేర్కొంటున్నారు. శుక్రవారం నుండి ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. చీకటి మరుగున పడిపోయిన తెలంగాణ చరిత్ర..సాహిత్య కారులను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం..సాహిత్యకారులు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా టెన్ టివితో ఆయన మాట్లాడారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

12:21 - December 14, 2017

ముంబై : తొలి మేడిన్ ఇండియా స్కార్పియన్ ఐఎన్ఎస్ కల్వరి నౌకాదళంలో చేరింది. గురువారం ఉదయం కల్వరి జలాంతర్గామిని నౌకాదళానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ అప్పచెప్పి జాతికి అంకితం చేశారు. డీజిల్ ఎలక్ర్టిక్ సబ్ మెరైన్ ను ఫ్రాన్స్ సహకారంతో నిర్మించారు. 1.566 టన్నుల బరువైన ఈ సబ్ మెరైన్ హిందూ మహాసముద్రంలో డీప్ సీ ప్రడేటర్ గా కల్వరి పనిచేయనుంది. భారత్ - ఫ్రాన్స్ మధ్య వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యానికి కల్వరి చక్కటి ఉదాహరణ అని పీఎం మోడీ పేర్కొన్నారు. సముద్రమార్గం ద్వారా ప్రవేశించే ఉగ్రవాదం..డ్రగ్స్ సరఫరా ..అక్రమ చేపల వేట మరింత ధీటుగా ఎదుర్కోవడంలో భారత్ కీలక పాత్ర పోషించనుందన్నారు.

 

12:15 - December 14, 2017

మేడ్చల్ : వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ బిడ్డ చనిపోయాడని పేర్కొంటూ హైదరాబాద్ - వరంగల్ జాతీయ రహదారిపై బంధువులు ఆందోళనకు దిగారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పీఎస్ పరిధిలోని ఫీర్జాదిగూడలో అంకుర ఆసుపత్రిలో అంకుర ఆసుపత్రిలో చిన్నారి మృతి చెందింది. బాలుడి మృతదేహంతో కుటుంబసభ్యులు రోడ్డుపై బైఠాయించారు. దీనితో భారీగా ట్రాఫిక్ స్తంభించింది.

 

12:10 - December 14, 2017

హైదరాబాద్ : తాము విడిచి ఉండలేక సుధాకర్ రెడ్డిని హత్య చేయడం జరిగిందని రాజేష్ పేర్కొన్నారు. సుధాకర్ రెడ్డి హత్య కేసులో ఏ1 నిందితుడు రాజేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. డీఆర్డీఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజేష్ డిశ్చార్జ్ కావడంతో నాగర్ కర్నూలు పోలీసులు అదుపులోకి తీసుకుని నాగర్ కర్నూలుకు తీసుకొచ్చారు. అనంతరం మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చనున్నారు. ఇప్పటికే స్వాతిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
భర్త స్థానంలో ప్రియుడు రాజేష్ ను తీసుకొచ్చేందుకు స్వాతి కుట్రపన్నిన సంగతి తెలిసిందే. స్వాతి ప్లాన్ ను మటన్ సూప్ మలుపు తిప్పింది. సుధాకర్ రెడ్డి తల్లిదండ్రుల ఫిర్యాదుతో స్వాతి కుట్ర బట్టబయలైంది. ఆధార్ వేలిముద్రలతో స్వాతి ప్రియుడు రాజేష్ దొరికిపోయాడు.
ఈ సందర్భంగా పోలీసులు జరిపిన విచారణలో రాజేష్ పలు విషయాలు వెల్లడించాడు. 'ఇద్దరం కలిసి బతుకుదామనే సుధాకర్ రెడ్డిని హత్య చేశాం. తన ముఖంపై పెట్రోల్ పోసుకుని గ్యాస్ స్టవ్ పై తల పెట్టడంతో సుమారు 30 శాతం మేర కాలిపోయింది. హత్య అనంతరం నిర్మానుష్య ప్రాంతంలో కాల్చివేశాం. స్వాతి..సుధాకర్ రెడ్డి కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. సుధాకర్ రెడ్డితో తనకు ఎలాంటి విబేధాలు లేవు’.అని రాజేష్ పేర్కొన్నాడు. 

నాగర్ కర్నూలులో రాజేష్..

హైదరాబాద్ : సుధాకర్ రెడ్డి హత్య కేసులో ఏ 1 నిందితుడు రాజేష్ ను పోలీసులు అరెస్టు చేసి నాగర్ కర్నూలుకు తీసుకొచ్చారు. కాసేపట్లో మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచనున్నారు. 

12:01 - December 14, 2017

వబాలా క్రియేషన్స్ బ్యానర్‌పై నీరజ్ శ్యామ్, నైరా షా.. హీరో, హీరోయిన్‌గా తెరకెక్కుతున్న చిత్రం 'ఇ ఈ'. రామ్ గ‌ణ‌ప‌తిరావు ద‌ర్శ‌కుడు. ల‌క్ష్మ‌ణ‌రావు నిర్మాత‌. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ని చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. సుధాకర్ ఇందులో ప్రముఖ పాత్రలో నటిస్తున్నారు. ఫ్యామిలీ సెంటిమెంట్, లవ్, కామెడీ, భక్తి.. అబ్బో ఒక్కటేమిటి అన్ని ఎమోషన్స్‌ని దర్శకుడు ఇందులో పరిచయం చేశారు. అలాగే డైలాగ్స్ కూడా చాలా కొత్తగా ఉండటంతో ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేలా ఉంది. ముఖ్యంగా అమ్మ గొప్పతనం గురించి తెలిపేలా ఇందులో ఓ మంచి సాంగ్ ఉండటం విశేషం. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ తో టెన్ టివి ముచ్చటించింది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

11:29 - December 14, 2017

నల్గొండ : మిర్యాలగూడలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ద్వితీయ మహాసభలు ప్రారంభం కానున్నాయి. మహాసభల ప్రారంభం సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. మహాసభలను అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ్ రాఘవన్, మాజీ ఎంపీ బృందా కారత్, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డిలు ప్రారంభించనున్నారు. మహాసభల్లో పాల్గొనేందుకు వివిధ జిల్లాల నుండి 600 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. మహాసభలు మూడు రోజుల పాటు కొనసాగనున్నాయి. మహాసభల సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం బ్యానర్లు..తోరణాలు ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి టెన్ టివితో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో హామీలిచ్చారని, అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తామని చెప్పి మచ్చుకు కొన్ని కట్టించారని విమర్శించారు. దళితులకు మూడెకరల భూమి ఇస్తామని చెప్పారని..9లక్షల ఎకరాల భూమి ఇవ్వాల్సి ఉందన్నారు. పేదరికాన్ని దూరం చేయడంలో..అసమానతలు తొలగించడంలో..వ్యవసాయ కార్మికులకు ఉపాధి కల్పించడం..కూలీ రేట్లు ఇతరత్రా విషయాల్లో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలిపారు. ఈ అంశాలన్నింటిపై చర్చ చేయడం జరుగుతుందని...అనంతరం తీర్మానాలు ప్రవేశ పెట్టనున్నట్లు తెలిపారు. 

తమిళనాడులో కూలిన ఆలయ మండపం...

చెన్నై : తమిళనాడులో తిరుచందూర్ ఆలయం మండపం కుప్పకూలింది. ఒకరు మృతి చెందగా శిథిలాల కింద మరికొందరున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. 

ముషిరాబాద్ లో బాలుడు అనుమానాస్పద మృతి...

హైదరాబాద్ : ముషిరాబాద్ లో బాలుడు కౌశల్ అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. ఇంటి ముందు ఆడుకుంటుండగా బాలుడు కనిపించకుండా పోయాడు. అనంతరం ఓ బిల్డింగ్ పై విశాల్ మృతదేహం లభించింది. కౌశల్ ను హత్య చేశారని బంధువులు పేర్కొంటున్నారు. 

జగన్ పాదయాత్ర 35వ రోజు...

అనంతపురం: వైఎస్‌ జగన్‌ చేపట్టిన పాదయాత్ర 35వ రోజుకి చేరుకుంది. గురువారం ఉదయం రాప్తాడు మండలంలోని గంగలకుంట నుంచి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం అయ్యింది.

11:12 - December 14, 2017

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. ఒక్కసారిగా భద్రాద్రి కొత్తగూడెం ఉలిక్కిపడింది. టేకులపల్లి అటవీ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. చండ్రపుల్లారెడ్డి బాట దళానికి చెందిన ఐదుగురు నక్సల్స్ హతమయినట్లు సీఐ సారంగపాణి పేర్కొన్నారు.

చండ్రపుల్లారెడ్డి కొత్త దళాన్ని ఏర్పాటు చేశారు. ఈ అజ్ఞాత దళంపై పలు కేసులు కూడా నమోదైనట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే టేకులపల్లి అటవీ ప్రాంతంలో వీరు సమావేశమయ్యారని పోలీసులకు సమాచారం అందింది. దీనితో టేకులపల్లి పోలీసులు, గ్రే హౌండ్స్ దళాలు కూంబింగ్ నిర్వహించాయి. నక్సల్స్ కొంతమంది కంటపడ్డారు. పోలీసులపైకి మావోయిస్టులు కాల్పులు జరపడంతో పోలీసులు ప్రతిఘటించారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు నక్సల్స్ మృత్యువాతపడ్డారు. వీరి వద్ద ఐదు వెపన్స్ స్వాధీనం చేసుకున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

భారత ఒలింపిక్ సంఘంలో ఓటు వేసేందుకు అవకాశం..

ఢిల్లీ : నేడు జరిగే భారత ఒలింపిక్ సంఘం ఎన్నికల్లో ఏపీ తరపున పాల్గొనేందుకు ఎంపీ సీఎం రమేష్ సంఘానికి అర్హత లభించింది. సీఎం రమేష్ సంఘానికి ఐవోఏ అర్హత కల్పించింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడితో ఎంపీ సీఎం రమేష్, కోశాధికారులు కలిశారు. ఒలింపిక్ సంఘాల నుండి ఎంపీలు ఇద్దరూ తప్పుకోవాలని చంద్రబాబు ఆదేశించారని..దీనితో తాను రాజీనామా చేసినట్లు సీఎం రమేష్ పేర్కొన్నారు. భారత ఒలింపిక్ సంఘంలో ఓటు వేసేందుకు అవకాశం రావడం పట్ల సీఎం చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. 

10:50 - December 14, 2017
10:33 - December 14, 2017

కడప : తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల ఆత్మహత్యలకు తెరపడడం లేదు. ఎక్కడో ఒక చోట విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా కడప జిల్లాలో పదో తరగతి విద్యార్థిని హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సింహాద్రీపరంలో ఉన్న కస్తూర్బా స్కూల్ లో లింగాల మండలానికి చెందిన వెంకటేశ్వరీ చదువుతోంది. ఆరో తరగతి నుండి ఇక్కడే చదువుతోంది. బుధవారం సాయంత్రం వెంకటేశ్వరీ తన తండ్రితో ఫోన్ లో మాట్లాడినట్లు సమాచారం. చదువు...ఆటల్లో బాగా రాణిస్తున్నట్లు పేర్కొన్నట్లు తెలుస్తోంది. అనంతరం గురువారం ఉదయం హాస్టల్ లోని గదిలో ఉరి వేసుకుని విగతజీవిగా కనిపించింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. 

10:23 - December 14, 2017

హైదరాబాద్ : సుధాకర్ రెడ్డి హత్య కేసులో ఏ1 నిందితుడు రాజేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. డీఆర్డీఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజేష్ డిశ్చార్జ్ కావడంతో నాగర్ కర్నూలు పోలీసులు అదుపులోకి తీసుకుని మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చనున్నారు. ఇప్పటికే స్వాతిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. భర్త స్థానంలో ప్రియుడు రాజేష్ ను తీసుకొచ్చేందుకు స్వాతి కుట్రపన్నిన సంగతి తెలిసిందే. స్వాతి ప్లాన్ ను మటన్ సూప్ మలుపు తిప్పింది. సుధాకర్ రెడ్డి తల్లిదండ్రుల ఫిర్యాదుతో స్వాతి కుట్ర బట్టబయలైంది. ఆధార్ వేలిముద్రలతో స్వాతి ప్రియుడు రాజేష్ దొరికిపోయాడు. 
ఈ సందర్భంగా పోలీసులు జరిపిన విచారణలో రాజేష్ పలు విషయాలు వెల్లడించాడు. 'ముఖంపై పెట్రోల్ పోసుకుని గ్యాస్ స్టవ్ పై తల పెట్టడంతో సుమారు 30 శాతం మేర కాలిపోయింది. ఇద్దరం కలిసి బతుకుదామనే సుధాకర్ రెడ్డిని హత్య చేశాం. హత్య అనంతరం నిర్మానుష్య ప్రాంతంలో కాల్చివేశాం. స్వాతి..సుధాకర్ రెడ్డి కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. సుధాకర్ రెడ్డితో తనకు ఎలాంటి విబేధాలు లేవు’.అని రాజేష్ పేర్కొన్నాడు. 

బిట్ కాయిన్ సంస్థలపై ఐటీ దాడులు...

హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా బిట్ కాయిన్ సంస్థలపై ఐటీ దాడులు నిర్వహించింది. ఆర్ బీఐ వార్నింగ్ తో బిట్ కాయిన్ సంస్థల్లో సోదాలు జరిగాయి. హైదరాబాద్, ఢిల్లీ, ఘజియాబాద్, బెంగళూరు, చెన్నైలో హైదరాబాద్ బీసీటీఎక్స్ సంస్థ నిర్వహిస్తున్న ఎన్ ఏన్ కేపిటల్ ఎక్జైంజ్ లో ఐటీ సోదాలు జరిపింది. నల్లధనం, ఎన్నారైల పెట్టుబడులపై ఆరా తీసింది. ప్రముఖులు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించింది.

ఓటేసిన అమిత్ షా..

గుజరాత్ : అసెంబ్లీ మలివిడత ఎన్నికలు కొనసాగుతున్నాయి. పలువురు ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నానరు. నారాయాణపూర్ లో ఓటు హక్కును బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వినియోగించుకున్నారు.  

స్వాతిని విచారిస్తున్న పోలీసులు...

నాగర్ కర్నూలు : భర్తను చంపిన కేసులో స్వాఃతిని పోలీసులు విచారిస్తున్నారు. డీఆర్ డీఓ ఆసుపత్రిలో స్వాతి ప్రియురాలు రాజేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. 

09:18 - December 14, 2017

ఖమ్మం : రఘునాథపాలెం మండలంలో విషాదం చోటు చేసుకుంది. వేపకుంట మాజీ సర్పంచ్, రైతు భుక్యా రామ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. రామ మూడెకరాలతో పాటు మరో కొన్ని ఎకరాలను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేశాడు. లక్షల రూపాయలు అప్పులు తీసుకొచ్చి మిర్చి..పత్తి పంటలు వేశాడు. కానీ ఆ పంటలకు గిట్టుబాటు ధర రాకపోవడంతో రామా తీవ్రమనస్థాపానికి గురయ్యాడు. మొత్తం రూ. 8 లక్షలు అప్పులు కట్టాల్సి ఉండడంతో మనోవేదనకు గురయ్యాడు. గిట్టుబాటు ధర రాకపోవడం..అప్పులు చెల్లించలేని పరిస్థితిలో ఉండడంతో పురుగుల మందు సేవించి బలవన్మారణానికి పాల్పడ్డాడు. ఇతని కుటుంబాన్ని ఆదుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. 

09:13 - December 14, 2017

భద్రాద్రి కొత్తగూడెం : నీళ్ల మడగు అటవీ ప్రాంత్రంలో చండ్రపుల్లారెడ్డి వర్గీయులు..పోలీసుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో చండ్రపుల్లారెడ్డికి చెందిన ఆరుగురు వ్యక్తులు మృతి చెందారు. జనశక్తి మావోయిస్టులు..లొంగిపోయిన నక్సలైట్లు చండ్రపుల్లారెడ్డి పేరిట దళాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఖమ్మం, కొత్తగూడెం, వరంగల్ జిల్లాలో చండ్రపుల్లారెడ్డి దళంపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారని, బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలుస్తోంది. నీళ్ల మడుగు అటవీ ప్రాంతంలో వీరు బస చేసినట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీనితో పోలీసులు బుధవారం కూంబింగ్ నిర్వహించడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. 

టేకులపల్లి ఫారెస్టులో కాల్పులు...

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని టేకులపల్లి ఫారెస్టులో సిపి బాట దళానికి...పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో సిపి బాట దళానికి చెందిన ఆరుగురు మృత్యువాత పడ్డారు. 

ఉత్తరకాశీ వద్ద కూలిన బ్రిడ్జి...

ఉత్తరాఖండ్ : గంగోత్రి జాతీయ రహదారిలోని ఉత్తరకాశీ వద్ద రాకకపోకలు నిలిచిపోయాయాయి. ఓవర్ లోడ్ తో వెళుతున్న లారీతో బ్రిడ్జి నేలకూలింది. 

పీఎం తల్లి ఓటు...

గుజరాత్ : రాష్ట్రంలో రెండో దశ పోలింగ్ కొనసాగుతోంది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ ఓటు హక్కును వినియోగించుకోవడానికి గాంధీనగర్ లోని ఓ బూత్ కు వద్దకు చేరుకున్నారు. 

08:20 - December 14, 2017

గుజరాత్ లో రెండో దశ పోలింగ్ ప్రారంభం...

గుజరాత్‌ : రాష్ట్ర అసెంబ్లీ రెండో దశ ఎన్నికల పోలింగ్‌ గురువారం ప్రారంభమైంది. పోలింగ్‌ ఉదయం 8 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. రెండో విడతలో 98 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్‌ జరగనుంది. 

08:08 - December 14, 2017

గుజరాత్‌ : రాష్ట్ర అసెంబ్లీ రెండో దశ ఎన్నికల పోలింగ్‌ గురువారం ప్రారంభమైంది. పోలింగ్‌ ఉదయం 8 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. రెండో విడతలో 98 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్‌ జరగనుంది. 851 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మెహసానా నియోజకవర్గం నుంచి అత్యధికంగా 34 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. జలోడ్‌ అసెంబ్లీ స్థానం నుంచి కేవలం ఇద్దరు అభ్యర్థులే పోటీ పడుతున్నారు. రెండో దశ పోలింగ్‌లో 2 కోట్ల 22 లక్షలకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కోటి 15 లక్షలకు పైగా పురుష ఓటర్లు, కోటి 7 లక్షలకు పైగా మహిళా ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెస్‌ పార్టీల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. పోలింగ్‌ సజావుగా సాగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. డిసెంబర్‌ 18న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

07:39 - December 14, 2017

ఆంధ్రప్రదేశ్‌ జీవనాడి పోలవరం ప్రాజెక్టును 2018 నాటికి పూర్తి చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించారు. ఈ విషయంలో ఎవరికీ ఎటువంటి అనుమానాలు కానీ, అపోహలు కానీ అవసరంలేదని రెండు ప్రభుత్వాలు స్పష్టం చేశాయి. పెండింగ్‌ బిల్లులు చెల్లించేందుకు కేంద్రం అంగీకరించింది. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన ప్రత్యేక చర్చలో సూర్యప్రకాష్ (టిడిపి), మధుసూధన్ (వైసీపీ)లు పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

06:48 - December 14, 2017

అంగన్‌ వాడీలు ప్రభుత్వా చాలా కార్యక్రమాల్లో వీరి పాత్ర చాలా కీలకమైంది. కానీ సరైన ఉద్యోగ భద్రత ఉండదు. కనీస వేతనం ఉండదు. సంవత్సరాల తరబడి పనిచేసినా.. రిటైర్‌మెంట్‌ తర్వాత ఎటువంటి పెన్షన్‌ ఉండదు. ఇది మా పరిస్థితి అని అంగన్‌ వాడీలు ఆందోళన బాట పట్టారు. అంగన్‌ వాడీల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ఏలా ఉన్నాయనే అంశంపై టెన్ టివి జనపథంలో తెలంగాణ అంగన్‌ వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

06:45 - December 14, 2017

హైదరాబాద్ : కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం తమ జాతి పట్ల ఆరోపణలు, విష ప్రచారం చేస్తున్నారని లంబాడీ ప్రముఖులు మండిపడ్డారు. ఆరోపణలు తిప్పికొట్టేందుకు..తమ ఐక్యతను చాటుకునేందుకు లంబాడా శంఖారావం నిర్వహించినట్లు తెలిపారు. కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలను నేతలు ఖిండించారు. లంబాడాలు, ఆదివాసీల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. లంబాడాల ఎస్టీ హోదా రద్దు చేయాలని ఆదివాసీలు డిమాండ్ చేస్తుండగా.. అటు లంబాడాలు సైతం పోటాపోటీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆదివాసీలపై నిరసన గళమెత్తుతున్నారు. హైదరాబాద్‌ సరూర్‌నగర్‌లో లంబాడాల శంఖారావం పేరిట బహిరంగ సభను నిర్వహించారు. తమ జాతిపై వస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టేందుకు ఈ సభ నిర్వహించినట్లు తెలిపారు.

అన్నదమ్ముల్లా ఉన్న ఆదివాసీలు, లంబాడాల మధ్య చిచ్చుపెట్టి విభజించి పాలించు నినాదంతో కొందరు అసత్య ఆరోపణలు చేస్తున్నారని లంబాడా నేతలు ఆరోపించారు. కొందరు లంబాడీలపై అసత్య ఆరోపణలు చేయడం దారుణమన్నారు. ఇదంతా రాజకీయ లబ్ది కోసం స్వార్థపరులు చేస్తున్న కుట్ర అని.. ఈ విషయాన్ని గోండు, కోయ మిత్రులు అర్థం చేసుకోవాలని ఎంపీ సీతారాం నాయక్‌ అన్నారు. కోయ, గోండులు లంబాడాలకు అన్యాయం చేస్తున్నారని ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ ఆరోపించారు. ఆదివాసీలే కాదు తామూ ఎస్టీలమే అన్నారు. లంబాడాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఏజెన్సీలో ఉద్యోగాల లెక్కలు తీస్తే 80 శాతం ఆదివాసీలతోనే భర్తీ చేశారని ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ అన్నారు. గిరిజనులను చీల్చి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. రిజర్వేషన్ల పెంపు కోసం అందరూ ఐక్యంగా పోరాటం చేయాలని లంబాడా నేతలు పిలుపునిచ్చారు. మనస్పర్థల వల్ల రిజర్వేషన్లకు ప్రమాదం జరిగే అవకాశముందని హెచ్చరించారు. కలహాలు మాని కలుసుందామన్నారు. 

06:41 - December 14, 2017

విజయవాడ : ఉపాధ్యాయ అర్హత పరీక్ష, టెట్‌ షెడ్యూల్‌ను ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి ప్రభుత్వం టెట్‌ పరీక్ష నిర్వహిస్తోందని.. టెట్‌ అర్హత సాధిస్తేనే ఉపాధ్యాయ నియామక పరీక్షకు అర్హులవుతారన్నారు. ప్రైవేటు, సాంఘిక సంక్షేమ శాఖ, ఐటీడీఏలు నిర్వహించే ఉపాధ్యాయ నియామకాలకు టెట్‌ అవసరమన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. నోటిఫికేషన్‌ ఈ నెల 14న విడుదల చేస్తున్నట్లు విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు చెప్పారు. టెట్‌ ఫీజును ఈ నెల 18 నుంచి 30 వరకు చెల్లించవచ్చన్నారు. ఆన్‌ లైన్‌ ద్వారా ఈ నెల 18 నుంచి 2018 జనవరి 1వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. డిసెంబర్‌ 19వ తేదీ నుంచి 31వ తేదీ వరకు పని వేళల్లో హెల్ప్‌ డెస్క్‌ సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు. దరఖాస్తులు, ఇతర అంశాలకు సంబంధించి ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు ఈ నెల 19 నుంచి 30 వరకు స్వీకరిస్తామని చెప్పారు. జనవరి 9వ తేదీ నుంచి హాల్‌ టికెట్లను డౌన్‌ లోడ్‌ చేసుకోవచ్చిని తెలిపారు. టెట్‌ షెడ్యూల్‌కు సంబంధించి పూర్తి వివరాల కోసం

జనవరి17 నుంచి 27 వరకు టెట్‌ పరీక్షలు జరుగుతాయన్నారు. టెట్‌లో రెండు పేపర్లు ఉంటాయని తెలిపారు. మొదటి పేపర్‌కి డీఎడ్ వారు మాత్రమే అర్హులన్నారు. పేపర్‌-2కి బీఈడీ వారు అర్హులని తెలిపారు. మొదటి పేపర్‌కు ఇంటర్‌లో 50 శాతం మార్కులు పొందిన వారు అర్హులని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 45 శాతం మార్కులు పొంది ఉంటే సరిపోతుందని తెలిపారు.

మొదటి సెషన్‌ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండవ సెషన్‌ మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. జనవరి 29న ప్రాధమిక కీ విడుదల చేస్తామని.. కీ పై అభ్యంతరాలను జనవరి 29 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు తెలుపవచ్చన్నారు. ఫిబ్రవరి 6న ఫైనల్‌ కీ విడుదల చేసి.. ఫిబ్రవరి 8న ఫలితాలు ప్రకటిస్తామని మంత్రి గంటా తెలిపారు. ఒకసారి టెట్‌ అర్హత సాధిస్తే ఏడేళ్ల వరకు అవకాశం ఉంటుందని చెప్పారు. మరోవైపు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ బాధ్యత ఏపీపీఎస్సీకి అప్పగించే ఆలోచనలో ఉన్నట్లు మంత్రి గంటా తెలిపారు. జూన్ నాటికి పోస్టులు భర్తీ చేయవలసి ఉన్నందున, సాధ్యాసాధ్యాలను పరిశీలించవలసి ఉందన్నారు. ఏపీపీఎస్సీ చైర్మన్‌ తో పాటు. సీఎం చంద్రబాబుతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు.

06:38 - December 14, 2017

విజయవాడ : టూరిజం అభివృద్ధి వైపు ఏపీ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు జలాశయాల్లో పర్యాటక రంగానికి ఊపు తెచ్చేందుకు.. ఏకంగా సీ ప్లేన్‌లను తీసుకొస్తోంది. విజయవాడలో ప్రయోగాత్మకంగా రైడ్‌లో సీప్లేన్‌ రైడ్‌లో సీఎం చంద్రబాబు విహరించారు. అలా అలా కృష్ణమ్మ అలలపై రెక్కవిప్పిన జల విహంగం.. చూపరులకు కనువిందు చేసింది. నీటిలో దూసుకుపోయే జల విహంగాలు మనకూ వచ్చేస్తున్నాయి.. అలల్ని తాకుతూ.. రివ్వున గాల్లోకి దూసుకుపోయే సీప్లేన్లు ఇక మన టూరిజరంలో ఆహ్లాదాన్ని రెట్టిపు చేయనున్నాయి. మొన్న గుజరాత్‌లో ప్రధాని మోదీ, తాజాగా విజయవాడలో చంద్రబాబు.. సీప్లేన్లలో ప్రయాణించి భవిష్యత్‌ టూరిజం రూపురేఖలను కళ్లకు కట్టారు. టూరిజం అభివృద్ధిలో భాగంగా విజయవాడ కృష్టా బ్యారేజిలో జరిగిన ప్రయోగాత్మక రన్‌లో సీఎం చంద్రబాబు విహరించారు.

ఈ సీప్లేన్‌లు పర్యాటక రంగానికే కాదు భవిష్యత్తులో ప్రయాణానికి సరికొత్త నిర్వచనం చెప్పబోతున్నాయి. దీనిలో మొత్తం 10 నుంచి 12 సీట్లు ఉంటాయి. ఇది ఎగరడానికి కేవలం 300 మీటర్ల రన్‌వే చాలు. రయ్ మంటూ గాల్లోకి దూసుకుపోతాయి. అన్నట్టు ఈ జలవిహంగానికి మరో స్పెషల్ ప్యూచర్ ఉంది. ఇటు నీటిలోనూ, అటు నేలపై ల్యాండ్ అవడం దీని ప్రత్యేకత. నీటిలో ల్యాండ్‌ అయ్యేందుకు కేవలం మూడుఅడుగుల లోతు ఉంటే చాలు అంటున్నారు ఏవీయేషన్‌ అధికారులు. దేశంలోని ప్రధాన రిజర్వాయర్లు, నదులు, సరస్సుల్లో ఈ సీ ప్లేనులు అనుకూలంగా ఉండడంతో కేంద్ర ప్రభుత్వం వీటిపై ప్రత్యేక దృష్టి సారించింది. భవిష్యత్తులో ప్రత్యామ్నామ ప్రయాణ మార్గంగా దీన్ని తీర్చి దిద్దేందుకు ఏపీ సర్కార్‌ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రంలో ఉన్న దాదాపు వెయ్యి కిలోమీటర్ల సముద్ర తీరాన్ని టూరిజం హబ్‌గా మార్చేందుకు .. ఈ సీ ప్లేన్‌లు బాగా ఉపకరిస్తాయని ప్రభుత్వం అంచానా వేస్తోంది. దీంతో రాష్ట్రంలో యువతకు భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు కలుగుతాయంటున్నారు కేంద్ర మంత్రి అశోక గజపతిరాజు.

ఇప్పటికే గుజరాత్‌, ఏపీలో విజయవంతంగా టెస్ట్‌ రన్‌ పూర్తి చేసుకున్న ఈ సీప్లేన్‌ను దేశవ్యాప్తంగా నదులు, జలాశయాల్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకున్నారు. దీన్లో భాగంగా దేశంలో 106 వాటర్ వేల్స్‌ను రూపొందించేందుకు కేంద్రప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. మొత్తానికి రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల టూరిజంలో ఈ జలవిహంగాలే కనువిందు చేయనుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

06:35 - December 14, 2017

నిజామాబాద్ : గులాబీపార్టీలో అసమ్మతి కుంపటి సెగలు కక్కుతోంది. నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. నిజామాబాద్‌జిల్లాలో బాజిరెడ్డి వర్సెస్‌ భూపతిరెడ్డి పాలిటిక్స్‌.. సస్పెన్లకు దారితీసేలా ఉంది. ఎమ్మెల్సీ భూపతిరెడ్డిని పార్టీ నుంచి సస్పెన్స్‌ చేయాలని.. పార్టీ ఇంచార్జ్‌లు కేసీఆర్‌కు లేఖరాయడం.. నిజామాబాద్‌ జిల్లా రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది.

నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, ఎమ్మెల్సీ భూపతి రెడ్డి మధ్య విభేధాలు రచ్చకెక్కాయి. ఇప్పటికే ఒకరిపై మరొకరు కేసులు నమోదు చేసుకునే స్థాయికి పరిస్థితులు వెళ్లాయి. ఇటీవల జరిగిన పార్టీ శాసనసభా పక్ష సమావేశంలో కూడా కేసీఆర్‌ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి వ్యవహారంపై సీరియస్‌గా స్పందించారు. ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో జోక్యం చేసుకోరాదని చెప్పినా.. భూపతిరెడ్డి తీరులో మార్పు రాలేదని పార్టీనేతలు భావిస్తున్నారు. దీంతో భూపతిరెడ్డికి వ్యతిరేకంగా టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజాప్రతినిధులు ఏకమైయ్యారు. జిల్లాపార్టీ ఇంచార్జ్‌లు.. తులఉమ, ఎంపీ కవిత ఆధ్వర్యంలో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి నివాసంలో భేటీ అయిన ఎమ్మెల్యేలు.. భూపతిరెడ్డికి వ్యతరేకంగా తీర్మానం చేశారు. ఎమ్మెల్సీపై సస్పెన్షన్‌ వేటు వేయాలని ముఖ్యమంత్రికి సిఫారస్‌ చేస్తూ లేఖ రాశారు.

నేతల మధ్య ఆదిపత్యపోరును సహించేది లేదని గులాబీబాస్‌ మొదటి నుంచి మందలిస్తున్నా... అంతర్గతపోరు మాత్రం పొగలు కక్కుతూనే ఉంది. అన్ని జిల్లాల్లో నేతల మధ్య చిటపటల సంబంధాలే ఉన్నా.. నిజామాబాద్‌ జిల్లాలో తాజాగా బహిర్గతమయ్యాయి. ఇపుడు ఎమ్మెల్సీ భూపతిరెడ్డిపై పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్‌ సస్పెన్షన్‌ వేటు వేస్తారా..? వేటు వేస్తే జిల్లాపార్టీలో పరిణామాలు ఎలా ఉంటాయి..? ఇపుడు కారుగుర్తుపార్టీలో ఇదే చర్చ నడుస్తోంది. గులాబీబాస్‌ ఏ నిర్ణయంపై తీసుకుంటారన్న దానిపై నిజామాబాద్‌ టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది. 

06:32 - December 14, 2017

హైదరాబాద్ : హోంగార్డుల జీతం 12 వేల నుంచి 20 వేల రూపాయలకు పెంచుతూ సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగం క్రమబద్దీకరించేందుకు సాంకేతిక అంశాలు అడ్డంకిగా ఉన్నా... హోంగార్డులు గౌరవంగా బతికేందుకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. పోరాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలనేదే తన లక్ష్యమన్నారు కేసీఆర్‌. ప్రతి ఏడాది వెయ్యి రూపాయలు జీతం పెంచుతామని హామీ ఇచ్చారు. పెంచిన జీతం జనవరి నుంచే చెల్లిస్తామన్నారు. ప్రగతిభవన్‌లో హోంగార్డులతో సమావేశమైన కేసీఆర్‌... హైదరాబాద్‌ లాంటి నగరాల్లో 12 వేల జీతంతో జీవనం కొనసాగించడం కష్టమని... అందుకే హోంగార్డుల జీతం పెంచుతున్నట్లు ప్రకటించారు.

మన ఆదాయమంతా మన ప్రజలకు చెందాలనే లక్ష్యంతోనే ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడమని కేసీఆర్‌ స్పష్టం చేశారు. హోంగార్డులను పర్మినెంట్‌ చేసేందుకు అనేక సాంకేతిక ఇబ్బందులున్నాయని... రోస్టర్‌ విధానం లేకుండా పర్మినెంట్‌ చేయడం సాధ్యం కాదన్నారు. మూడు రాష్ట్రాల్లో హోంగార్డులను పర్మినెంట్‌ చేస్తే కోర్టులు కొట్టివేశాయని గుర్తు చేశారు. అయితే.. ఉద్యోగం పర్మినెంట్‌ కాకపోయినా... ఆత్మగౌరవంతో బతికే విధంగా హోంగార్డుల జీతం పెంచుతున్నామని కేసీఆర్‌ అన్నారు. ప్రస్తుతం పని చేస్తున్న హోంగార్డులను... కానిస్టేబుళ్లుగా తీసుకుంటామన్నారు. అందుకోసం ప్రత్యేక కానిస్టేబుళ్ల నియామకంలో హోంగార్డులకు 25 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామన్నారు. రిజర్వ్‌డ్‌ కానిస్టేబుళ్ల నియామకంలో 15శాతం, డ్రైవర్‌ నియమాకంలో 20శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని చెప్పారు. రోస్టర్ అమలు చేస్తూనే హోంగార్డులపై నియామక అధికారులు కాస్త దయ చూపాలని... పరీక్ష కూడా సాధారణ అభ్యర్థులతో కాకుండా హోంగార్డులకు ప్రత్యేకంగా నిర్వహించాలని సూచించారు. కానిస్టేబుల్ పరీక్ష రాసే హోంగార్డులకు వయోపరిమితి 40 ఏళ్లకు పెంచుతామన్నారు.

ఇక ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు పెంచిన విధంగా ట్రాఫిక్‌ హోంగార్డులకు అలవెన్స్‌లు ఇస్తామని కేసీఆర్‌ ప్రకటించారు. హైదరాబాద్‌లో పని చేసే హోంగార్డులకు బస్‌పాస్‌ సౌకర్యం కల్పిస్తామన్నారు. అలాగే హోంగార్డులు కోరుకున్న చోట డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు నిర్మిస్తామన్నారు. పోలీసు, హోంగార్డుల కుటుంబానికి వైద్య బీమా సదుపాయం కల్పిస్తామని... పోలీసు అస్పత్రుల్లో పోలీసులతో సమానంగా హోంగార్డులకు వైద్య సదుపాయం అందజేయనున్నట్లు తెలిపారు. మహిళా హోంగార్డులకు మహిళా పోలీసులతో సమానంగా 6 నెలల ప్రసూతి సెలవులిస్తామన్నారు.

పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఎవరూ ఇబ్బంది పడకూడదని కేసీఆర్‌ అన్నారు. జీతం పెంచడంతో పాటు... అనేక సౌకర్యాలు కల్పించినందుకు కేసీఆర్‌కు హోంగార్డులు కృతజ్ఞతలు తెలిపారు. మొత్తానికి ఎన్నో ఏళ్లుగా అంతంత మాత్రంగా బతుకులు వెళ్లదీస్తున్న హోంగార్డుల జీవితాల్లో కేసీఆర్‌ నిర్ణయం ఆనందాన్ని నింపింది. 

06:30 - December 14, 2017

హైదరాబాద్ : ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణకు భాగ్యనరం సిద్ధమైంది. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ మహాసభలకు ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. నగరాన్ని అంగరంగ వైభవంగా ముస్తాబు చేశారు. యాభై కోట్ల రూపాయల భారీ వ్యయంతో నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలకు ఏర్పాట్లుకు పూర్తి కావచ్చాయి. మంత్రులు, అధికారలు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రపంచ తెలుగు మహాసభలకు ఎంతో ఘన చరిత్ర ఉంది. 1975లో మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాద్‌లో జరిగాయి. 42 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఈ మహాసభలకు భాగ్యనగరం వేదికైంది. ఈ మధ్యకాలంలో కౌలాలంపూర్‌ రెండో మహాసభలు, మారిషస్‌లో మూడో ప్రపంచ తెలుగు మహాసభలు, తిరుపతిలో నాల్గవ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించారు.

ఈనెల 15 నుంచి 19 వరకు జరిగే ప్రపంచ తెలుగు మహాసభలకు హైదరాబాద్‌ సిద్ధమైంది. ప్రపంచం నలుమూలల నుంచి తెలుగు భాషాభిమానులు ఈ ఉత్సవాలకు హాజరవుతున్నారు. పలువురు సాహితీవేత్తలు ఈ పండుగలో పాల్గొంటున్నారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్వహిస్తున్న ఈ సభల్లో రెండువేల సంవత్సరాల సాహితీ నేపథ్యాన్ని గుర్తు చేసుకోనున్నారు.

ఎల్బీ స్టేడియం ప్రధాన వేదికగా ఈ మహాసభలు జరుగుతున్నాయి. ఏడు వేదికలపై సాహిత్య సమాలోచనలు, చర్చాగోష్ఠిలు నిర్వహిస్తారు. ఈ సభలు జరిగే ప్రాంగణాలతోపాటు మహానగరాన్ని స్వాగతద్వారాలతో అందంగా తీర్చిదిద్దారు. వందకుపైగా స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. అన్ని ప్రాంతాలు శోభాయమానంగా కనిపిస్తున్నాయి. తెలంగాణ వైతాళికులు భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు.

రంగు రంగుల తోరణాలు, విద్యుత్‌ దీపాల ధగధగలతో నగరం శోభిల్లుతోంది. జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహాతలు ప్రతిభా రే, సీతాకాంత్‌ మహాపాత్ర, సత్యవ్రత శాస్త్రిని ప్రభుత్వం తరుపున ఆహ్వానించారు. అలాగే 14 భాషల్లో సాహిత్య అకాడమీ అవార్డులు అందుకున్న ప్రముఖులకు ఆహ్వానాలు పంపారు. అదేవిధంగా అన్ని భాషలకు చెందిన సాహితీ ప్రముఖులను ప్రపంచ తెలుగు మహాసభలకు ఆహ్వానించారు.

ప్రపంచ తెలుగు మహాసభలు జరిగే ఏడు వేదికలపై కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. రామదాసు కీర్తనలు, తందనాన రామాయణం, హరికథలు, సినీ విభావరి, జాపనద గీతాలు, నాటకాలు, తోలుబొమ్మలాట, బతుకమ్మ, కోలాటం, పేరిణి నృత్యాలతోపాటు ఆదివాసీ, గిరిజన కళారూపాలను ఏర్పాటు చేశారు. ఈ మహాసభలను అంత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రపంచ దృష్టికి ఆకర్షించే విధంగా తెలుగు మహాసభలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరయ్యే వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 

06:26 - December 14, 2017

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ జీవనాడి పోలవరం ప్రాజెక్టును 2018 నాటికి పూర్తి చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించారు. ఈ విషయంలో ఎవరికీ ఎటువంటి అనుమానాలు కానీ, అపోహలు కానీ అవసరంలేదని రెండు ప్రభుత్వాలు స్పష్టం చేశాయి. పెండింగ్‌ బిల్లులు చెల్లించేందుకు కేంద్రం అంగీకరించింది. నిర్వాసితుల పునరావాస పథకంతోపాటు సవరించిన అంచనాలపై పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని.. ముఖ్యమంత్రి చంద్రబాబుతో నిర్వహించిన భేటీలో కేంద్ర జలనవరలు శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ హామీ ఇచ్చారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ, కేంద్ర, రాష్ట్ర పభుత్వ అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై చర్చించారు. పనుల పురోగతి, నిధుల విడుదల, సవరించిన అంచానాలు, నిర్వాసితుల పునరావాసం, పునర్నర్మాణం వంటి అంశాలు ఈ భేటీలో చర్చకు వచ్చాయి. పోలవరం ప్రధాన కాంట్రాక్టర్‌ నుంచి కొన్ని పనులు వేరుచేసి, కొత్తవారికి అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం పిలిచిన టెండర్ల అంశం చర్చకు వచ్చింది. ప్రస్తుతం పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌కు నెల రోజుల గడువు ఇవ్వాలని నిర్ణయించారు. పనుల్లో పురోగతి లేకపోతే కొత్త టెండర్లపై అప్పుడు నిర్ణయం తీసుకునే అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకారానికి వచ్చాయి.

పోలవరం ప్రాజెక్టును 2018 నాటికి పూర్తి చేసే విధంగా రెండు ప్రభుత్వాలు సమన్వయంతో పని చేయాలని గడ్కరీ, చంద్రబాబు భేటీలో నిర్ణయించారు. జరుగుతున్న పనులపై ఏరోజుకు ఆరోజు నివేదిక తెప్పించుకునే విధంగా కేంద్ర నీటిపారుదల శాఖ కార్యదర్శి తరుపున పోలవరంలో ఒక ప్రతినిధిని నియిమిస్తారు. కేంద్ర జలవనరుల మంత్రి సలహాదారు మూడు రోజులకు ఒకసారి పోలవరం పనులపై నివేదిక ఇచ్చే ఏర్పాటు చేశారు. ప్రతి పదిహేను రోజులకు ఒకసారి పోలవరం పనులు ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని గడ్కరీ నిర్ణయించారు. అంచనాల ఆధారంగా ఇప్పటి వరకు చేసిన పనులకు పెండింగ్‌ బిల్లులను చెల్లించేందుకు కేంద్రం అంగీకరించింది.

పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలపై కూడా ఈ భేటీలో చర్చకు వచ్చింది. అయితే వీటిపై కేంద్ర అధికారులు కొన్ని సందేహాలు వ్యక్తం చేయడంతో మరో వారంలో అన్ని వివరణలతో మరోసారి నివేదిక పంపాలని నిర్ణయించారు. ప్రాజెక్టును పూర్తిచేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే అంశంపైనే ఎక్కువగా చర్చించారు. భూసేకరణ చట్టం ప్రకారం పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పించే అంశంపై ఈ సమావేశంలో సవివరంగా చర్చించారు. ఎనిమిది మండలాల్లోని 371 గ్రామాల్లో పునరావాసం, పునర్నిర్మాణ పథకం అమలుపై సమీక్షించారు. మొత్తం లక్షా 92 వేల 259 మందికి పునరావాసం కల్పించాలని లెక్క తేల్చారు. 95,472 కుటుంబాలకు పునర్నర్మాణం చూపించాలని నివేదించారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఇందుకు 30 వేల కోట్లకు పైగా కావాల్సి వస్తుందని ఏపీ ప్రభుత్వం నివేదించింది. అయితే ఈ అంశంపై పరిశీలించిన నిర్ణయం తీసుకుంటామని నితిన్‌ గడ్కరీ హామీ ఇచ్చారు. గడ్కరీతో నిర్వహించిన భేటీ తర్వాత 2018 నాటికి పోలవరం నుంచి గ్రావిటీ ద్వారా నీరు ఇవ్వగలమన్న ఆశాభావంతో చంద్రబాబు ఉన్నారు. 

ప్రపంచ తెలుగు మహాసభలకు ఆహ్వాన కిట్లు...

హైదరాబాద్ : ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరయ్యే ప్రతినిధులకు నేటి నుండి ఆహ్వాన కిట్లను తెలంగాణ సాహిత్య అకాడమీ పంపిణీ చేయనుంది. 

అమరావతి నిర్మాణంపై వర్క్ షాప్...

విజయవాడ : అమరావతి నిర్మాణంపై నేటి నుండి రెండు రోజుల పాటు నిపుణులతో వర్క్ షాప్ నిర్వహించనుంది. మౌలిక సదుపాయాలు, నాలెడ్జ్ ఎకానమీ, నిర్మాణ రీతులు, ఉద్యోగాల కల్పన, సుస్థిర ఆర్థికాభివృద్ధి అంశాలతో పాటు నవ నగరాల నిర్మాణంపై చర్చలు జరుగనున్నాయి. 

ఏపీ టెట్ పరీక్ష నోటిఫికేషన్ విడుదల...

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో టెట్‌ పరీక్షకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదలైంది. విద్యాశాఖ మంత్రి ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ నెల 18 నుండి 30 వరకు అప్లికేషన్‌లు స్వీకరిస్తారు. ఆన్‌లైన్‌ అప్లికేషన్లు జనవరి 1 వరకు స్వీకరిస్తారు.

అమర్ నాథ్ భక్తులపై ఎన్జీటీ ఆంక్షలు...

ఉత్తరాఖండ్ : అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే భక్తులపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పలు ఆంక్షలు విధించింది. అమర్‌నాథ్ గుహలోకి వెళ్లే భక్తులు ఇకపై ఎలాంటి మంత్రోచ్ఛరణలు, జైజై నినాదాలు చేయకుండా చూడాలని అమర్‌నాథ్ ఆలయ బోర్డును ఎన్‌జిటి ఆదేశించింది. గుహలో భక్తులు గంటలు కొట్టడం, నినాదాలు చేయడం వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లనుందని హెచ్చరించింది.

గుజరాత్ లో సెకండ్ ఫేజ్ ఎన్నికలు...

గుజరాత్ : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు రెండో దశ ఎన్నికల పోలింగ్‌ గురువారం జరగనుంది. పోలింగ్‌ ఉదయం 8 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. రెండో విడతలో 98 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. 851 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 

గుజరాత్ లో విజయం తథ్యమన్న రాహుల్...

ఢిల్లీ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం తథ్యమని రాహుల్‌గాంధీ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికైన రాహుల్‌ గాంధీ జిఎస్‌ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు. 

మోడీతో మన్మోహన్ సింగ్...

ఢిల్లీ : గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా కత్తులు దూసుకున్న అధికార విపక్షాల నేతలు పార్లమెంట్‌ ఆవరణలో కలివిడిగా కనిపించారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్న ప్రధాని మోది, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను పలకరించారు. 

మెత్తబడిన ఉత్తర కొరియా...

ఢిల్లీ : క్షిపణి పరీక్షల ద్వారా అమెరికాపై కయ్యానికి కాలు దువ్విన ఉత్తరకొరియా కొంచెం మెత్తబడినట్లు కనిపిస్తోంది. అమెరికాతో యుద్ధాన్ని నిరోధించడం చాలా ముఖ్యమని ఉత్తర కొరియా అధికారులు చెప్పినట్లు ఐక్యరాజ్యసమితి ప్రతినిధి తెలిపారు. 

రోహిత్ శర్మ హిస్టరీ క్రియేట్...

ఢిల్లీ : టీమిండియా హార్డ్‌ హిట్టింగ్‌ బ్యాట్స్‌మెన్‌...రోహిత్‌ శర్మ హిస్టరీ క్రియేట్‌ చేశాడు. శ్రీలంకపై కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడిన రోహిత్‌ డబల్‌ సెంచరీతో వన్డేల్లో వరల్డ్‌ రికార్డ్‌ నమోదు చేశాడు.ఇన్‌స్టంట్‌ వన్డే ఫార్మాట్‌లో ఇప్పటివరకు ఎవ్వరికీ సాధ్యం కాని రికార్డ్‌తో ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో హాట్‌ టాపిక్‌గా మారాడు.

Don't Miss