Activities calendar

15 December 2017

22:13 - December 15, 2017

బెంగళూరు : ప్రముఖ జర్నలిస్ట్‌ గౌరీ లంకేశ్‌ హత్య కేసులో ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి. ప్రముఖ రచయిత కల్బుర్గి, కమ్యునిస్ట్‌ లీడర్‌ గోవింద్ పన్సారేలను హత్య చేసిన గన్‌తోనే గౌరీ లంకేశ్‌ను కూడా హత్య చేశారని ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రాథమికంగా నిర్దారించింది. గౌరీ లంకేశ్‌ను చంపిన బుల్లెట్‌ ఆధారంగా ఫోరెన్సిక్‌ నిపుణులు ఈ నిర్ధారణకు వచ్చారు. పక్కా ప్రణాళిక తోనే ఈ ముగ్గురిని హత్య చేసుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. 

22:11 - December 15, 2017

ఢిల్లీ : ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వివిధ సేవలకు ఆధార్‌ అనుసంధానం చేసుకునే గడువును పొడిగించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఆధార్‌ను అనుసంధానం చేసుకునేందుకు ఈ ఏడాది డిసెంబరు 31 చివరి తేదీ కాగా...ఇప్పుడు ఆ గడువును వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగించారు. మొబైల్‌ ఫోన్‌కు ఆధార్‌ అనుసంధానం చేసుకునేందుకు కూడా మార్చి 31వరకు పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. కేంద్రం వివిధ పథకాలకు ఆధార్‌తో ముడిపెట్టడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. దీనిపై తుది విచారణ వచ్చే ఏడాది జనవరి 17 నుంచి చేపట్టనుంది. ఆధార్‌ తప్పనిసరి చేయాలన్న కేంద్రం తీసుకున్న నిర్ణయంపై స్టే విధించాలని పిటిషన్లు కోరారు.

22:10 - December 15, 2017

ఢిల్లీ : ట్రిపుల్ తలాక్ బిల్లుకు మోది క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును కేంద్రం పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది. ఆ తర్వాత ట్రిపుల్ తలాక్‌పై చట్టాన్ని రూపొందిస్తారు. ముస్లిం సాంప్రదాయం ప్రకారం భర్త మూడు సార్లు తలాక్ అని చెబితే.. భార్యతో విడాకులు జరిగినట్లే. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ట్రిపుల్‌ తలాక్‌ రాజ్యాంగ విరుద్ధమని... దీనిపై చట్టం తీసుకురావాలని కేంద్రానికి సూచించింది. ముస్లిం మహిళల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును తెస్తోంది. ఈ చట్టం అమలులోకి వస్తే తలాక్‌ చెప్పి విడాకులు ఇచ్చే భర్తకు మూడేళ్ల జైలు శిక్ష విధించే అవకాశముంది. ట్రిపుల్ తలాక్ కేసు కింద ముస్లిం మహిళలు కోర్టును ఆశ్రయించి భర్త నుంచి భరణం తీసుకునే ఛాన్సుంది. కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటి ఈ బిల్లును రూపొందించింది. ఈ కమిటీలో కేంద్రమంత్రులు సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీ, రవిశంకర్‌ ప్రసాద్, పిపి చౌదరి సభ్యులుగా ఉన్నారు. జమ్ముకశ్మీర్‌ మినహా ఈ చట్టం దేశమంతటా వర్తిస్తుంది.

22:09 - December 15, 2017

ఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్‌ గాంధీ శనివారం బాధ్యతలు స్వీకరించనుండడంతో ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయం ముస్తాబైంది. రాహుల్‌ పట్టాభిషేక మహోత్సవానికి భారీగా ఏర్పాట్లు చేశారు. విద్యుద్దీపాలతో పార్టీ కార్యాలయాన్ని అలంకరించారు.యువజన కాంగ్రెస్‌ కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. రాహుల్‌ పట్టాభిషేకానికి ఒకరోజు ముందే బాజా భజంత్రీలతో కార్యకర్తలు సందడి చేశారు. మరి కొందరు కార్యకర్తలు కార్యాలయం ఆవరణలో డాన్స్‌ చేశారు. ఎఐసిసి కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో ఉదయం 11 గంటలకు రాహుల్‌ గాంధీ తల్లి సోనియాగాంధీ నుంచి అధ్యక్ష పదవి బాధ్యతలను స్వీకరించనున్నారు.ఈ కార్యక్రమానికి సీనియర్‌ నేతలతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పిసిసి అధ్యక్షులు, తదతర నేతలు హాజరు కానున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తారు.

సంచలనం సృష్టించిన సోనియా వ్యాఖ్యలు
రాజకీయాల నుంచి తానిక రిటైర్‌ అవుతానని పార్లమెంట్‌ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ సోనియాగాంధీ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. దీనిపై స్పందించిన కాంగ్రెస్..సోనియా అధ్యక్ష బాధ్యతల నుంచి మాత్రమే రిటైర్‌ అవుతున్నారు...రాజకీయాల నుంచి కాదని ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలా ట్వీట్‌ చేశారు. ఆమె ఆశిస్సులు, సూచనలు పార్టీకి ఎల్లప్పుడూ ఉంటాయన్నారు.ఎఐసిసి అధ్యక్షురాలిగా సోనియాగాంధీ 19 ఏళ్ల పాటు బాధ్యతలు చేపట్టారు. 125ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీకి ఎక్కువ కాలం అధ్యక్షురాలిగా వ్యవహరించిన వ్యక్తిగా ఆమె చరిత్ర సృష్టించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ డిసెంబర్‌ 11న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్ష పదవికి రాహుల్‌ గాంధీ ఒక్కరే నామినేషన్ వేశారు. 47 ఏళ్ల రాహుల్‌ గాంధీ 2004లో రాజకీయాల్లోకి వచ్చారు. 2007లో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన రాహుల్‌- యువజన కాంగ్రెస్‌, ఎన్‌ఎస్‌యూఐ సారథ్య బాధ్యతలు నిర్వర్తించారు. 2013లో ఏఐసీసీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన రాహుల్- 2014 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ప్రచార బాధ్యతలను నిర్వర్తించారు. ఆ ఎన్నికల్లో బిజెపి చేతిలో కాంగ్రెస్‌ ఘోర పరాజయాన్ని చవిచూసింది. 

22:08 - December 15, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రంలో మొదటి సారిగా యశోద హాస్పిటల్స్‌లో రోబోటిక్ ట్రాన్స్ ప్లాంటేషన్‌ విజయవంతంగా నిర్వహించినట్టు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జీఎస్‌ రావు చెప్పారు. రోబో సాయంతో మూడు మూత్ర పిండాలు మార్చడం జరిగింది. ఈ శస్త్ర చికిత్స విజయవంతం కావడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. సెంటర్ ఫర్ నెఫ్రాలజీ, యూరాలజీ వైద్యులు సూరిబాబు, ఊర్మిళ, సురేష్ బాబుల బృందం ఆధ్వర్యంలో ఈ శస్త్రచికిత్స జరిగిందని.. డాక్టర్ జీఎస్‌ రావు చెప్పారు.

22:07 - December 15, 2017

హైదరాబాద్ : లైగింక వేధింపుల నుంచి విద్యార్థులు తమను తాము.. ఏ విధంగా కాపాడుకోవాలనే అంశంపై సికింద్రాబాద్ సీతాఫల్ మండి గౌతమ్ మోడల్‌ స్కూల్లో .. అవగాహాన సదస్సు నిర్వహంచారు. సీఐఐ యంగ్ ఇండియన్ సంస్థ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరిగింది. ప్రస్తుతం కాలంలో విద్యార్థులపై లైగింక దాడులు ఏ విధంగా జరుగుతున్నాయి. వాటి నుంచి తమను తాము ఎలా రక్షించుకోవాలో పిల్లలకు తెలియజేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టామని స్కూల్ ప్రిన్సిపాల్‌ షేక్ అబ్దుల్ నబీ అన్నారు. ఈ సదస్సు పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.

22:06 - December 15, 2017

నాగర్ కర్నూలు : సుధకార్‌ రెడ్డి హత్య కేసులో నాగర్‌కర్నూలు పోలీసులు సీన్‌ ఆఫ్‌ ఎఫెన్స్‌ను రీక్రియేట్‌ చేశారు. కేసులో A1గా ఉన్న రాజేష్‌ మహబూబ్‌నగర్‌ జిల్లాలోనే ఫతేపూర్‌ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ సుధాకర్‌ రెడ్డిని ఎలా దహనం చేసిన విషయాన్ని రాజేష్‌ ద్వారా తెలుసుకున్నారు. అదే ప్రాంతంలో హత్యకు ఉపయోగించిన గడ్డపార, చున్నీ, ప్లేట్‌, పెట్రోల్‌ బాటిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత నాగర్‌కర్నూలు తీసుకెళ్లారు. కోర్టు రాజేష్‌,స్వాతి ఇద్దరికి 14 రోజుల రిమాండ్‌ విధించింది. ఆ తర్వాత మీడియా ఎదుట పోలీసులు నిందితుడు రాజేష్‌ను ప్రవేశపెట్టారు. హత్యకు దారితీసిన పరిస్థితులు, స్వాతి వేసిన ప్లాన్‌ను పోలీసులు వివరించారు. రెండేళ్ల క్రితం ఓ రోజు స్వాతి ఫిజియోథెరపి చేయించుకుంది. అక్కడ ఫిజియోథెరపిస్ట్‌ రాజేష్‌ పరిచయమయ్యాడు. మరోవైపు వ్యాపారంలో బిజీగా ఉండటంతో సుధాకర్‌రెడ్డి భార్యను నిర్లక్ష్యం చేశాడు. అదే సమయంలో రాజేష్‌, స్వాతిల పరిచయం ప్రేమగా మారింది. అది వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో ఇద్దరూ కలిసి వేరే ప్రాంతానికి వెళ్లి లెఫ్‌లో సెటిల్‌ కావాలని ప్లాన్‌ చేశారు. దీనికి అడ్డుగా ఉన్న సుధాకర్‌ రెడ్డిని కడతేర్చాలని నిర్ణయించుకున్నారు.

కథ, స్క్రీన్‌ ప్లే, డైరెక్షన్‌ మొత్తం స్వాతినే
అయితే ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌లో కథ, స్క్రీన్‌ ప్లే, డైరెక్షన్‌ మొత్తం స్వాతినే నడిపింది. 26వ తేదీ రాత్రి నైలాన్‌ తాడు, గడ్డపార కొనుగోలు చేసిన రాజేష్‌ స్వాతికి ఇంటికి తెచ్చి ఇచ్చాడు. ఆ తర్వాత ఓ కాలేజ్‌ దగ్గర వేచివున్నాడు. రాత్రి 11 గంటల సమయంలో రాజేష్‌కు ఫోన్ చేసిన స్వాతి.. భర్త సుధాకర్‌ రెడ్డి నిద్రపోయాడని ఇంటికి రమ్మని చెప్పింది. ఇంటికి రాగానే రాజేష్‌ లైట్లు ఆపి సుధాకర్‌ రెడ్డిని కమన్‌పట్టితో తలపై బాదాడు. దీంతో స్పృహలోకి వచ్చిన సుధాకర్‌రెడ్డి గట్టిగా అరిచాడు. తాగిన మైకంలో కిందపడి దెబ్బలు తగిలాయని అతడిని నమ్మించింది. పైగా ఈ మధ్య మద్యం సేవించడం ఎక్కువైందని ప్రేమ ఒలకబోసింది స్వాతి. ఓ వైపు భర్తతో మాట్లాడుతూనే మరోవైపు రాజేష్‌కు సైగ చేసి బయటికివెళ్లిపోమంది. అదే రాత్రి సుధాకర్‌రెడ్డి అల్లుడి సాయంతో భర్తను ఆస్పత్రికి పంపి చికిత్స చేయించింది. ఆ తర్వాత ఇంటికి వచ్చిన సుధాకర్‌రెడ్డి నిద్రలోకి జారుకున్నాడు.

అల్లుడు ఇంటినుంచి వెళ్లిపోగానే.....
తెల్లవారుజామున 5.30 గంటలకు సుధాకర్‌రెడ్డి అల్లుడు ఇంటినుంచి వెళ్లిపోగానే మళ్లీ రాజేష్‌ను ఇంటికి పిలిపించింది స్వాతి. సుధాకర్‌రెడ్డికి మత్తు ఇంజెక్షన్‌ ఇచ్చి అతని ముఖంపై దిండుతో అదిమిపట్టింది. రాజేష్‌ కూడా కమన్‌పట్టితో తలపై బలంగా బాదాడు. పారిపోవడానికి ప్రయత్నించిన భర్తపై రోకలిబండతో స్వాతి దాడి చేసింది. చున్నీతో మెడకు బిగించి దారుణంగా హత్య చేశారు. సుధాకర్‌రెడ్డి కారులోనే మృతదేహంతో పాటు హత్యకు ఉపయోగించిన వస్తువులను ఫతేపూర్‌ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి దహనం చేశారు. ఆ తర్వాత ప్రియుడినే భర్త స్థానంలోకి తెచ్చేందుకు సుధాకర్‌ రెడ్డిపై యాసిడ్‌ దాడి జరిగినట్లు స్వాతి హైడ్రామా నడిపింది. హైదరాబాద్‌ తీసుకెళ్లి చికిత్స కూడా చేయించింది. రాజేష్‌ వాలకం, అతడు ప్రవర్తించిన తీరుతో అనుమానించిన సుధాకర్‌రెడ్డి కుటుంబసభ్యులు పోలీసులకు ఉప్పందించడంతో డొంకంతా కదిలింది. నిందితులిద్దరికి కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించడంతో... మహబూబ్‌ నగర్ జిల్లా సబ్ జైలుకు తరలించారు. 

22:04 - December 15, 2017

హైదరాబాద్ : 2019లో కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు ప్రతిపక్ష నేత జానారెడ్డి. తెలంగాణలో ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వంపై చాలా అసంతృప్తితో ఉన్నారని.. ఇప్పటికే ఆ విషయం ఆందోళనల ద్వారా తెలుస్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపుబాటలో సాగి.. బంగారు తెలంగాణ సాధించేందుకు తమ వంతు కృషి చేస్తామని జానారెడ్డి తెలిపారు.

22:03 - December 15, 2017

ఆదిలాబాద్ : జిల్లా హస్నాపూర్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆదివాసీలు లంబాడీల మధ్య ఘర్షణ జరిగింది. కొమురంభీం విగ్రహానికి చెప్పుల దండ వేయడాన్ని నిరసిస్తూ ఉట్నూరులో ఆదివాసీలు ధర్నా చేశారు. తిరిగి వెళ్తున్న ఆదివాసీలపై హస్నాపూర్‌లో లంబాడీలు రాళ్ల దాడి చేశారు. దీంతో ఇరువర్గాలు పరస్పరం ఘర్షణ పడ్డారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

22:02 - December 15, 2017

గుంటూరు : అమరావతి నిర్మాణం పూర్తయ్యాక అక్కడ ఉంటే 20ఏళ్ల ఆయుష్షు పెరుగుతుందన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా బ్లూ-గ్రీన్ సిటీ నిర్మిస్తామని తెలిపారు. విజయవాడలో జరుగుతున్న అమరావతి డీప్ డైవ్ సెమినార్ ముగింపు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సదస్సుకు పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ, CRDA అధికారులు, 40 కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. అమరావతిని ప్రపంచశ్రేణి నగరంగా తీర్చిదిద్దడానికి అవసరమైన మౌలిక వసతుల కల్పనపై సెమినార్‌లో చర్చించారు. కొత్త రాజధాని నిర్మాణం దేవుడిచ్చిన వరమన్న చంద్రబాబు.. అడిగిన వెంటనే మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు ఒప్పుకున్నందుకు సింగపూర్‌ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచంలోని ఐదు నగరాల్లో ఒకటిగా అమరావతి నిర్మాణం చేయడమే తన లక్ష్యమన్నారు చంద్రబాబు.

22:01 - December 15, 2017

హైదరాబాద్ : మన భాష, యాసను మనమే కాపాడుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. తెలుగు నేలను తాకకపోతే తనకు ఏదో కోల్పోయినట్లు ఉంటుందన్నారు. అందుకే జన్మభూమిలో నెలకొక్కసారైనా అడుగుపెట్టకుండా ఉండలేనన్నారు. భాష సహజమైన ప్రవాహమన్నారు. కన్న తల్లిదండ్రులు, గురువులు, మాతృభూమిని మరవొద్దన్నారు వెంకయ్య నాయుడు. గురువుకు ప్రత్యామ్నాయం గూగుల్ కాదని.. ఇంటర్నెట్ సెర్చ్ చేసేందుకైనా గురువు ఉండాల్సిందేనని.. తరగతి గది తరగని నిధి అన్నారు. తెలంగాణ గడ్డపై ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించడం అభినందనీయమన్నారు వెంకయ్యనాయుడు.

22:00 - December 15, 2017

హైదరాబాద్ : తెలుగు భాష కమ్మదనాన్ని ప్రపంచ తెలుగు మహాసభలు భావితరాలకు అందిస్తాయన్నారు తెలుగు రాష్ర్టాల గవర్నర్ నరసింహన్. తెలుగు మహాసభలను చూస్తుంటే భువన విజయం జరుగుతున్నట్లు ఉందన్నారు. నన్నయ నుంచి నారాయణ రెడ్డి వరకు ముందు వరసలో కూర్చున్నట్లు ఉందన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనటం మధురమైన అనుభూతన్నారు

 

21:59 - December 15, 2017

హైదరాబాద్ : తెలంగాణ అద్భుతమైన సాహిత్యాన్ని పండించిన మాగాణమని సీఎం కేసీఆర్ ఉద్ఘాటించారు. సిద్దిపేట అద్భుతమైన సాహితీ క్షేత్రమన్నారు. ఎంతోమంది సాహితీ కుసుమాలు వికసించిన నేల సిద్దిపేట అని కొనియాడారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎంతోమంది సాహితీవేత్తలు తెలంగాణలో ఉన్నారన్నారు. వందల కొద్దీ కవులు చక్కటి తెలుగులో.. తెలంగాణ భాష, యాసతో అనేక రచనలు చేశారన్నారు.సభలో ప్రసంగించిన కేసీఆర్‌... అనేక కవితలను చదివి వినిపించారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని ఆయన కొనియాడారు. 

21:58 - December 15, 2017

హైదరాబాద్ : భాగ్యనగరంలో అట్టహాసంగా ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి నిర్వహిస్తున్న మహాసభలకు ప్రపంచ నలుమూలలా నుంచి అనేకమంది భాషాభిమానులు, సాహితీవేత్తలు హాజరయ్యారు. ప్రపంచ తెలుగు మహాసభలకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరై... జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సీఎం కేసీఆర్‌ తన గురువు బ్రహ్మశ్రీ వేలేటి మృత్యుంజయశర్మ గారికి గురువందనం చేసి శాలువాతో సత్కరించారు. అనేకమంది ప్రముఖులు తెలుగు భాష ఔన్నత్యం గురించి తెలిపారు. ప్రపంచ తెలుగు మహాసభలకు 42 దేశాలనుంచి 400 మంది భాషాభిమానులు.. మొత్తం సభకు 8 వేల మంది ప్రతినిధులు హాజరయ్యారయ్యారు. తెలుగు మహాసభల సంరంభాన్ని ప్రకటించిన వెంటనే భారీ ఎత్తున బాణాసంచా కాల్చి సంబరాలు జరిపారు. 

సాహిత్య కుసుమం సినారె : కేసీఆర్

హైదరాబాద్ : సినారె తెలంగాణ గడ్డపై వికసించిన సాహిత్య కుసుమం అని సీఎం కేసీఆర్ అన్నారు. సరళమైన, కమ్మనైన పదాలతో సాహిత్యం అందించిన జ్ఞానపీఠం సి. నారాయణరెడ్డి అని అన్నారు. 

19:59 - December 15, 2017
19:31 - December 15, 2017
19:17 - December 15, 2017

ట్రిపుల్ తలాక్ నేరుమే కేంద్ర కేబినెట్

ఢిల్లీ : ట్రిప్రల్ తలాక్ ను కేంద్ర కేబినెట్ నేరంగా పరిగణించింది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ట్రిపుల్ తలాక్ పూ కేంద్రం బిల్లు ప్రవేశపెట్టనుంది. ట్రిపుల్ తలాక్ చెబితే మూడేళ్ల జైలు శిక్ష పడేలా బిల్లు రూపొందిచ్చనున్నారు. 

చెన్నమనేని రమేష్ పౌరసత్వ రివ్యూ పిటిషన్ తోసిపుచ్చిన కేంద్రం

కరీంనగర్/సిరిసిల్ల : వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరత్వం రివ్యూ పిటిషన్ కేంద్రం తోసిపుచ్చింది. ఆయన భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ 2017 ఆగస్ట్ 31న కేంద్రం హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. 

విశాఖలో ఈ వీసా కేంద్రం

ఢిల్లీ : విశాఖ ఎయిర్ పోర్టులో ఈ వీసా కేంద్రం ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపటి నుంచి విశాఖ ఎయిర్ పోర్టులో టూరిస్ట్ వీసా ఆన్ ఎరైవల్ సదుపాయం.

18:13 - December 15, 2017
18:11 - December 15, 2017

హైదరాబాద్ : రోబో అనగానే సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన రోబో సినిమాలో చిట్టి గుర్తుకొచ్చేస్తుంది. అందులో చిట్టి రోబో సర్జరీ అవసరం లేకుండా డెలివరీ చేసేస్తే అది చూసి మనం ఔరా .. అనుకున్నాం.రోబో సినిమాలో డెలివరీ సీన్ అది సినిమా కదా.. అని లైట్ తీసుకున్నాం. కానీ ఇప్పుడు నిజంగానే రోబోలు వైద్యరంగంలోకి అడుగుపెట్టడమే కాదు.. సర్జరీలు చేసేస్తున్నాయి. నిజానికి విదేశాల్లో వైద్యులు శస్త్రచికిత్సల్లో ఎప్పటినుంచో రోబోల సాయం తీసుకుంటున్నారు. దశాబ్దకాలంగా మనదేశంలోనూ అవయవమార్పిడి శస్త్ర చికిత్సల్లో రోబోల వాడకంలో ఉన్నాయి. న్యూఢిల్లీ, కొచ్చి, అహ్మదాబాద్, నడియాడ్‌లలో కిడ్నీ మార్పిడి చికిత్సల్లో రోబోలను ఉపయోగించారు కూడా. అయితే ఇప్పుడు తొలిసారిగా హైదరాబాద్‌లో రోబో సాయంతో మూడు కిడ్నీ ఆపరేషన్లను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు.

రోబోలు సర్జరీలు చేస్తే....
రోబోలు సర్జరీలు చేస్తే ఎలాంటి పరిస్థితులు ఎదురౌతాయనే భయం అక్కర్లేదంటున్నారు వైద్యులు. రోబో సాయంతో నిర్వహించే సర్జరీల వల్ల సాధారణ సర్జరీలతో పోలిస్తే నొప్పులు తక్కువగా ఉండటంతో పాటు శరీరంపై పెద్ద పెద్ద మచ్చలు పడవని వైద్యులు చెబుతున్నారు. ఇన్ ఫెక్షన్స్ అయ్యే అవకాశం తక్కువ కావడంతో యాంటీబయాటిక్ వాడకం కూడా తక్కువ అవుతుందని చెబుతున్నారు. రోగులు త్వరగా కోలుకుంటారని.. త్వరగానే డిశ్చార్జ్ అవ్వొచ్చని చెబుతున్నారు. తక్కువ కోతలతో ఎక్కువ రక్తం కోల్పోకుండా ఆపరేషన్ జరుగుతుందంటున్నారు. కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌కు సాధారణంగా 4 నుంచి 5 గంటలు పడితే.. రోబోల సాయంతో నిర్వహించే శస్త్రచికిత్సకు 3 నుంచి 4 గంటల్లో పూర్తవుతుందని వైద్యులు చెబుతున్నారు.

90 ల్లోనే విదేశాల్లో శస్త్ర చికిత్స
నిజానికి 90 ల్లోనే విదేశాల్లో శస్త్ర చికిత్సల్లో రోబోలను వినియోగించడం మొదలుపెట్టారు. ఇవి ఇప్పుడిప్పుడే మన దగ్గర అందుబాటులోకి వస్తున్నాయి. వీటి ధర భారీ మొత్తంలో ఉండటం వల్లే ఇక్కడ రోబోల వినియోగం ఆలస్యమైనట్లు తెలుస్తోంది. ఉదాహరణకు కిడ్నీ మార్పిడికి ఉపయోగించే రోబోటిక్ యంత్రాల ఖరీదు రూ.14 కోట్లట. ఒక్క రోబో కోసం అంత డబ్బు వెచ్చించడం అన్ని ఆసుపత్రులకు అయ్యే పని కాదంటున్నారు వైద్యులు.మొత్తానికి డాక్టర్లకు పని తగ్గిస్తూ.. రోగులకు ఉపశమనాన్నిస్తూ శస్త్ర చికిత్సలు కూడా చేసేస్తున్న రోబోలు భవిష్యత్‌లో ఇంకెన్ని విధాలుగా ఉపయోగపడతాయో...వేచి చూద్దాం. 

18:08 - December 15, 2017

హైదరాబాద్ : తెలుగు మహాసభలను నిరసిస్తూ ట్యాంక్ బండ్ వద్ద నిరసనకు బయలుదేరిన వరవరరావు బృందాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. బాగ్‌ లింగంపల్లి నుంచి ర్యాలీగా బయలుదేరిన వరవరరావు, ఇతర నేతలను.. నిరసన కార్యక్రమానికి వెళ్లకుండా పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు నిరసన జరిగే ట్యాంక్ బండ్‌ వద్ద కూడా భారీగా పోలీసులను మోహరించారు.

18:07 - December 15, 2017

హైదరాబాద్ : తను కాంగ్రెస్‌లోనే ఉన్నానని... పార్టీపై తనకు ఎలాంటి అసంతృప్తి లేదని.. మాజీ మంత్రి ముఖేశ్‌ గౌడ్‌ అన్నారు. తన కుటుంబం ఆపదలో ఉన్నప్పుడు అందరూ తనను పరామర్శించారని .. అందుకే ఆత్మీయ సమ్మేళనానికి అన్ని పార్టీల నేతలను ఆహ్వానించానని ఆయన అన్నారు. 2019లో గోషామహల్‌ నుంచే పోటీ చేస్తాననంటున్నారు. 

18:06 - December 15, 2017

మహబూబాబాద్ : జిల్లా మునికిచెర్ల దగ్గర మావోయిస్టు రాష్ట్ర కమిటీ మాజీ సభ్యుడు కోమళ్ల శేషగిరిరావు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. తొర్రూర్‌ మండలం వెలకట్టే గ్రామానికి చెందిన శేషగిరిరావు.. ఆర్థిక ఇబ్బందులతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు బంధువులంటున్నారు. శేషగిరిరావు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

18:05 - December 15, 2017

ఢిల్లీ : చెన్నమనేని రమేష్‌ భారతీయ పౌరసత్వంపై రివ్యూ పిటిషన్‌ను కేంద్ర హోంశాఖ తిరస్కరించింది. రమేష్‌ పౌరసత్వాన్ని రద్దు చేస్తూ 2017 ఆగస్ట్‌ 31న కేంద్రహోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. రమేష్‌ భారతీయ పౌరుడు కాదని తేల్చడం ఇది మూడోసారి. మరోవైపు హైకోర్టు, కేంద్ర హోంశాఖ చెప్పినా.. చెన్నమనేని ఇంకా ఎమ్మెల్యే పదవిని పట్టుకుని పాకులాడుతున్నారని బీజేపీ నేత ఆదిశ్రీనివాస్‌ ఆరోపించారు. వేములవాడ ప్రజలను, దేశాన్ని మోసం చేసిన రమేష్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. నకిలీ ధృవపత్రాలు సమర్పించిన రమేష్‌పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. 

18:04 - December 15, 2017

హైదరాబాద్ : హాస్యనటుడు విజయ్‌సాయి ఆత్మహత్యపై కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భార్య వనితారెడ్డి విజయ్‌సాయిని ఫోన్‌లో బెదిరించినట్లు ఓ ఆడియో క్లిప్‌ ఇప్పుడు కలకలం రేపుతోంది. తన ఈగోని రెచ్చగొడితే లైఫ్‌లాంగ్‌ గుర్తుండిపోతుందని..వనితా రెడ్డి చెప్పింది. తన రివెంజ్‌ ఎలా ఉంటుందో చూపిస్తానని ఫోన్ రికార్డింగ్‌లో నమోదైంది. 

కమెడియన్ విజయ్ ఆత్మహత్యలో కొత్తకోణం

హైదరాబాద్ : హాస్యనటుడు విజయ్‌సాయి ఆత్మహత్యపై కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భార్య వనితారెడ్డి విజయ్‌సాయిని ఫోన్‌లో బెదిరించినట్లు ఓ ఆడియో క్లిప్‌ ఇప్పుడు కలకలం రేపుతోంది. తన ఈగోని రెచ్చగొడితే లైఫ్‌లాంగ్‌ గుర్తుండిపోతుందని..వనితా రెడ్డి చెప్పింది. తన రివెంజ్‌ ఎలా ఉంటుందో చూపిస్తానని ఫోన్ రికార్డింగ్‌లో నమోదైంది. 

17:49 - December 15, 2017
17:48 - December 15, 2017

నేరేళ్ల బాధితుడి ఆత్మహత్యాయత్నం

సిరిసిల్ల : జిల్లా కలెక్టరేట్ ఎదుట నేరేళ్ల బాధితుడు ఈశ్వర్ ఆత్మహత్యాయత్నం చేకున్నాడు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు అక్కడే పోలీసులు అడ్డుకుని పోలీసు స్టేషన్ కు తరలించారు. 

17:47 - December 15, 2017

హైదరాబాద్ : వనితా రెడ్డి మోసాలకు తమ అబ్బాయి బలైపోయాడని హాస్యనటుడు విజయ్‌సాయి తండ్రి ఆరోపిస్తున్నారు. ఏ తప్పు చేయకపోతే 3 రోజులు ఎందుకు తప్పించుకుని తిరుగుతుందని ప్రశ్నించారు. తాను ఎప్పుడో మాట్లాడిన ఆడియో క్లిప్‌ను వనిత తనకు అనుకూలంగా మార్పులు చేసిందంటున్నారు. తన కొడుకు ఎలాంటి అనారోగ్యం లేదని వనిత అసత్య ప్రచారం చేస్తోందని.. ఆమె ఒక బ్లాక్‌మెయిలరని మండిపడ్డారు. 

17:46 - December 15, 2017

కృష్ణా : ఏపీ రాజధానిలో జనసేన పార్టీ కార్యాలయం నిర్మించాలనుకుంటున్న స్థలంపై వివాదం నెలకొంది. దీనిపై స్పందించిన జనసేన నేతలు... ఈ భూమికి ఎలాంటి వివాదం లేదంటున్నారు. అన్ని చట్టపరమైన అంశాలు పరిశీలించిన తర్వాతే భూమి లీజుకు తీసుకున్నామన్నారు. కొంతమంది చెబుతున్న కేసు వివరాలు... ఈ భూమి సర్వే నెంబర్‌ వేరు అని జనసేన నేత గద్దె తిరుపతిరావు అంటున్నారు. అలాగే భూయజమాని కూడా ఎలాంటి వివాదాలు లేవంటున్నారు. స్థల వివాదంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి దుర్గానాయుడు అందిస్తారు. 

17:41 - December 15, 2017

సిరిసిల్ల : జిల్లా కలెక్టరేట్ ఎదుట నేరేళ్ల బాధితుడు ఈశ్వర్ ఆత్మహత్యాయత్నం చేకున్నాడు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు అక్కడే పోలీసులు అడ్డుకుని పోలీసు స్టేషన్ కు తరలించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

16:40 - December 15, 2017

హైదరాబాద్ : ప్రపంచ తెలుగు మహా సభల నిర్వహణ కేసీఆర్ ప్రచార ఆర్భాటమేనన్నారు కాంగ్రెస్ నేత డీకే అరుణ. కేసీఆర్ తనను పొగిడించుకోడానికి కోట్ల రూపాయల ప్రజాధన వృధా చేస్తున్నారని ఆరోపించారు. తెలుగు మహాసభల వల్ల తెలంగాణకు ఒరిగిందేమీ లేదన్నారు

16:39 - December 15, 2017

హైదరాబాద్ : ప్రపంచ తెలుగు మహాసభలను కాసేపట్లో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభిస్తారన్నారు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి. తెలంగాణలో తెలుగు భాషకు ఎంతో విలువ ఉందన్నారు నాయిని. తెలంగాణ ఉద్యమంలో అనేకమంది కవులు బయటకు వచ్చారన్నారు. తెలుగు మహాసభలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు.

16:38 - December 15, 2017

కృష్ణా : కాపు సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు కాపు కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కోట్ల శివశంకర్. కాపుల అభివృద్ధి కోసం ప్రత్యేక పథకాలు చేపడుతుందని తెలిపారు. కాపు కార్పొరేషన్‌ ద్వారా అందరికీ లబ్ది చేకూరేలా చేస్తామంటున్నారు.

16:37 - December 15, 2017

ఢిల్లీ : ఏపీ స్పెషల్ ప్యాకేజ్‌కి చట్టబద్ధత కల్పించాలని ఈ శీతాకాల సమావేశాల్లో కేంద్రాన్ని కోరుతామన్నారు టీడీపీ లోక్‌సభ పక్ష నేత తోట నర్సింహం. పోలవరంపై ప్రతిపక్షాలు అవస్తవాలు చెబుతున్నాయని ఆయన ఆరోపించారు. అసెంబ్లీ స్ధానాల పెంపు, రైల్వే జోను, కడపలో స్టీలు ఫ్యాక్టరీ ఏర్పాటుతో పాటు పలు అంశాలను పార్లమెంటులో ప్రస్తావిస్తామంటున్నారు.

16:36 - December 15, 2017

ఢిల్లీ : పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల ప్రారంభం రోజే రాజ్యసభ దద్దరిల్లింది. గుజరాత్‌ ఎన్నికల్లో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ పాకిస్తాన్‌తో కుమ్మక్కయ్యారని ప్రధాని మోది చేసిన ఆరోపణలపై కాంగ్రెస్‌ విపక్ష నేత గులాం నబీ ఆజాద్‌ కేంద్రాన్ని టార్గెట్‌ చేశారు. తొలిసారిగా మాజీ ప్రధాని, మాజీ ఉపరాష్ట్రపతి, అధికారుల పేర్లతో పాటు పాకిస్తాన్‌ ప్రస్తావన తీసుకురావడంపై పార్లమెంట్‌లో వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీనిపై మోది క్షమాపణ చెప్పాలని కోరుతూ కాంగ్రెస్‌ రాజ్యసభలో నోటీసు ఇచ్చింది. ఈ అంశంపై మాట్లాడేందుకు ఆజాద్‌ ప్రయత్నించగా రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు అనుమతించకపోవడంతో విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో ఛైర్మన్ సభను మధ్యాహ్నం రెండున్నరకు వాయిదా వేశారు. జేడీయూ బహిష్కృత నేతలు శరద్ యాదవ్‌, అలీ అన్వర్‌లను రాజ్యసభ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించడంపై రాజ్యసభలో కాంగ్రెస్, తదితర ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. బిహార్‌లో మహాకూటమి అధికారంలోకి వచ్చిందని...మహాకూటమికి వెన్నుపోటు పొడిచిన నితీష్‌కుమార్‌ రాజీనామా చేయాలని ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్‌ డిమాండ్‌ చేశారు. మహాకూటమి ద్వారా రాజ్యసభకు ఎన్నికైన శరద్ యాదవ్‌ను ఎలా బహిష్కరిస్తారని ఆయన ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ అంశంపై చర్చ అనవసరమని ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు ప్రకటించడంతో ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి ప్రవేశించి నినాదాలు చేశారు. దీంతో సభ 12 గంటలకు వాయిదా పడింది.

16:35 - December 15, 2017

పశ్చిమగోదావరి : జిల్లా ఏలూరు మండలం వెంకటాపురం ఉప ఎన్నిక తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ముగ్గురు వార్డు మెంబర్లను కిడ్నాప్‌ చేశారంటూ ఒక వర్గం ఆందోళకు దిగారు. మరో వర్గంతో గొడవకు దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పంచాయతీ కార్యాలయంలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. దీంతో ఉప సర్పంచ్‌ ఎన్నికలో గందరగోళం ఏర్పడింది. 

16:34 - December 15, 2017

చిత్తూరు : చం తీసుకుంటున్న ఎంఈవో సుధాకర్‌ రావును ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. ప్రైవేటు స్కూలు అనుమతి కోసం వెళ్లిన ఎమ్‌ఎన్‌ రాజును ఎంఈవో సుధాకర్‌ 22 వేలు లంచం అడిగాడు. దీంతో రాజు చిత్తూరు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఇవాళ లంచం తీసుకుంటుండగా ఎంఈవో సుధాకర్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కేసు రిజిస్టర్‌ చేసుకొని నగదును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. 

16:33 - December 15, 2017

హైదరాబాద్ : ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరయ్యే ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నామని తెలంగాణ సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ హరికృష్ణ తెలిపారు. అతిథులందరికీ కార్యక్రమ వివరాలు అందజేస్తున్నామన్నారు. తెలుగు మహాసభల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి పిలునిస్తోన్నమని ఆయన అన్నారు.

16:32 - December 15, 2017

నాగర్ కర్నూలు : సుధాకర్‌రెడ్డి హత్య కేసులో స్వాతి ప్రియుడు రాజేష్‌ను మరికాసేపట్లో నాగర్‌కర్నూలు మెజిస్ట్రేట్‌ ఎదుట పోలీసులు హాజరుపర్చనున్నారు. ఈ ఉదయం హైదరాబాద్‌లోని డీఆర్‌డీవో అపోలో ఆస్పత్రిలో అతన్ని అరెస్ట్‌ చేసిన పోలీసులు... నాగర్‌కర్నూలు తీసుకొచ్చారు. భర్త సుధాకర్‌రెడ్డి స్థానంలో ప్రియుడు రాజేష్‌ను తీసుకొచ్చేందుకు స్వాతి చేసిన కుట్ర మటన్ సూప్ కారణంగా బెడిసికొట్టింది. సుధాకర్‌రెడ్డి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో స్వాతి బండారం బట్టబయలైంది. ఆధార్ వేలిముద్రలతో స్వాతి ప్రియుడు దొరికిపోయాడు. సుధాకర్‌రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని .. స్వాతికి భర్త అంటే ఇష్టం లేకపోవడంతో హత్య చేశామని రాజేష్ చెప్పాడు. మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఇనుపరాడ్‌తో కొట్టి హత్య చేసినట్లు రాజేష్ పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. ఆ తరువాత ముఖంపై పెట్రోలు పోసుకుని గ్యాస్ స్టౌపై తలపెట్టినట్లు రాజేష్ వివరించాడు. ఇద్దరం కలిసి బతుకుదామనే ఈ హత్య చేసి అనంతరం సుధాకర్‌రెడ్డిని నిర్మానుష్య ప్రాంతంలో కాల్చివేసినట్లు రాజేష్ పోలీసులకు చెప్పాడు. 

16:11 - December 15, 2017

కరీంనగర్ : జిల్లా కేంద్రంలో ఓ పోలీస్ అధికారి ఓవరాక్షన్ చేశాడు. డ్యూటీ అనంతరం సిబ్బంది ఆ అధికారి వేధిస్తున్నాడు. స్థానికి టై టౌన్ పోలీస్ స్టేషన్ చేస్తున్న కానిస్టేబుల్ తిరుపతి డ్యూటీ అయ్యాక ఇంటికెళ్లాడు కానీ అదే స్టేషన్ లో ఏఎస్ఐ గా చేస్తున్న పాషా ఉన్నపళంగా స్టేషన్ రావాలని హుకుం జారీ చేయడంతో తిరుపతి లూంగీతోనే పోలీస్ స్టేషన్ వచ్చారు. పాషాపై కిందిస్థాయి సిబ్బంది వేధిస్తున్నారని ఆరోపణాలు ఉన్నాయి. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

16:05 - December 15, 2017

పోలీసులపై దాడికి యత్నించిన మట్కా బీటర్లు

కడప : జిల్లా వేంపల్లి వాసవి కాలేజీ సమీపంలో మట్కా బీటర్లు పోలీసులపై దాడికి యత్నించారు. 10 మంది మట్కా బీటర్ల అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వారి వద్ద నుంచి రూ.4.33లక్షలు స్వాధీనం చేసుకున్నారు. 

కర్నూలు జిల్లాలో విషాదం

కర్నూలు : జిల్లా సిరివెల్ల మండలం కోటకొండలో విషాదం చోటుచేసుకుంది. పెన్షన్ ఇవ్వడం లేదని వృద్ధురాలు ఆత్మహత్యాయత్నం చేశారు. వృద్ధురాలు లక్ష్మీదేవిని ఆసుపత్రికి తరలించారు. 

ఈ నెల 23న రాష్ట్రానికి గడ్కరీ

గుంటూరు : ఈ నెల 23న రాష్ట్రానికి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ రానున్నారు. గోదావరి పెన్నా అనుసంధానంపై ఆయనకు ప్రజెంటేషన్ సద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. 

14:57 - December 15, 2017

చలి కాలంలో వచ్చే చర్మ సమస్యలకు కారణాలను ఈ రోజు మానవి హెల్త్ కేర్ లో చూద్దాం...పూర్తి వివరాలకు వీడియో చూడండి.

టీడీపీ, బీజేపీ వర్గీయుల మధ్య ఘర్షణ

కర్నూలు : జిల్లా పాండ్యంలో టీడీపీ బీజేపీ నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. కాంట్రాక్టు పనుల కమిషన్ విషయంలో ఇరు పార్టీల నాయకుల మధ్య వివాదం రాజుకుంది. దీంతో టీడీపీ నాయకుడు పుల్లారెడ్డిపై బీజేపీ నాయకుడు సుబ్బరాయుడు దాడి చేశాడు.

14:38 - December 15, 2017

కళ్ల ముందే కట్టుకున్నావాడు ఘో మత్యకు గురైతే ఆమె మనస్సు పదే వేదన, బాధకు అంతు ఉంటుందా దానికి కారణమైన వారు తన కన్నావారైతే ఊహించేందుకు కూడా భయంకరమైన సంఘటన అటువంటి సందర్బన్ని ఎదురించి నిలబడింది ఓ యువతి. న్యాయం జరిగేంత వరకు పోరాడింది. అటు ఎడారి ఇటు మంచు కొండలు, చుట్టు పచ్చటి ప్రకృతి ఉండే దేశం అప్ఘానిస్తాన్ ఇప్పడు బాంబుల మోతతో దద్దరిలింతుంది. దేశంలో శాంతి నెలకొల్పడానికి 20 మంది యువతులు సైనిక శిక్షణ తీసుకుంటున్నారు. ఇలాంటి మరిన్ని వార్తల కోసం వీడియో చూడండి.

14:37 - December 15, 2017

కర్నూలు : జిల్లా పాండ్యంలో టీడీపీ బీజేపీ నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. కాంట్రాక్టు పనుల కమిషన్ విషయంలో ఇరు పార్టీల నాయకుల మధ్య వివాదం రాజుకుంది. దీంతో టీడీపీ నాయకుడు పుల్లారెడ్డిపై బీజేపీ నాయకుడు సుబ్బరాయుడు దాడి చేశాడు. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

14:22 - December 15, 2017

యాసంగి సీజన్ పై హరీష్ రావు వీడియో కాన్ఫరెన్స్

హైదరాబాద్ : యాసంగి సీజన్ లో సాగునీటి యాక్షన్ ప్లాన్ పై నీటిపారుదల శాఖ మంత్రి హారీష్ రావు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. యాసంగిలో మీడియం, మేజర్ ప్రాజెక్టుల కింద 16,84,211 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని అధికారులను హరీష్ ఆదేశించారు. 

ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లను పరిశీలించిన నాయిని, సీఎస్

హైదరాబాద్ : ఎల్బీ స్టేడియంలో ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లను హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి సీఎస్ ఎస్పీ.సింగ్  పరిశీలించారు. మహాసభలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని నాయిని తెలిపారు.  

రాజేష్ ను మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు

నాగర్ కర్నూలు : సుధాకర్ రెడ్డి హత్య కేసులో నిందితుడు రాజేష్ ను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. 

 

టీడీపీ నేతపై బీజేపీ నేత కత్తితో దాడి

కర్నూలు : పాణ్యంలో టీడీపీ, బీజేపీ నేతల మధ్య ఘర్షణ నెలకొంది. కాంట్రాక్టు పనుల కమిషన్ విషయంలో వివాదం చెలరేగింది. టీడీపీ నేత పుల్లారెడ్డిపై బీజేపీ నేత సుబ్బరాయుడు కత్తితో దాడి చేశాడు. పుల్లారెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. అతన్ని ఆస్పత్రికి తరలించారు. 

ఉప సర్పంచ్ ఎన్నికల్లో గందరగోళం

పశ్చిమ గోదావరి : ఏలూరు మండలం వెంకటాపురం పంచాయతీ కార్యాలయంలో ఉప సర్పంచ్ ఎన్నికల్లో గందరగోళం నెలకొంది. ఇరువర్గాల మధ్య ఘర్షణ, తోపులాట జరిగింది. ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. ఒక వర్గం వారు ముగ్గురు వార్డు మెంబర్లను కిడ్నాప్ చేశారని మరో వర్గం ఆందోళన చేపట్టింది. 

13:36 - December 15, 2017

ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా నగరం పండుగ శోభ నెలకొంది. ఈ మహాసభల ఏర్పాట్ల కీలక బాధ్యతలను ప్రభుత్వం డిప్యూటి సీఎం కడియం శ్రీహరికి అప్పగించారు. ఈ సందర్భంగా మరిన్ని విషయాలు తెలుసుకొనేందుకు టెన్ టివి ప్రయత్నించింది. అందులో భాగంగా డిప్యూటి సీఎం కడియంతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆయన ఏర్పాట్లు..తదితర విషయాలను ప్రస్తావించారు. గ్రూప్ 1, 2 అర్హత పరీక్షల్లో తెలుగు తప్పనసరి కాబోతుందా ? ప్రజా సాహిత్యాన్ని ఏజెండాలో విస్మరించారా ? తెలంగాణ పాటకు ఎందుకు గౌరవం దక్కలేదు ? గద్దర్, విమలక్క, జయరాజ్, అందెశ్రీలకు ఆహ్వానం అందలేదా ? ఇలాంటి అనేక ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

13:35 - December 15, 2017

రాజేష్ కు వైద్య పరీక్షలు పూర్తి

నాగర్ కర్నూల్ : సుధాకర్ రెడ్డి హత్య కేసులో నిందితుడు రాజేష్ కు వైద్య పరీక్షలు పూర్తి అయ్యాయి. కాసేపట్లో రాజేష్ ను మీడియా ముందుకు తీసుకురానున్నారు. నిందితురాలు స్వాతిని పోలీసులు కోర్టులోహాజరుపర్చారు. స్వాతికి 15 రోజుల రిమాండ్ విధించారు. ఆమెను మహబూబ్ నగర్ జైలుకు తరలించారు. 

13:30 - December 15, 2017

నల్గొండ : భారత దేశ వ్యాప్తంగా ప్రధాన మోడీ విధానాల పట్ల వ్యతిరేకత ఉందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ పేర్కొన్నారు. జిల్లాలో వ్య.కా.స ద్వితీయ మహాసభలు జరుగుతున్నాయి. మహాసభల్లో పాల్గొనేందుకు వచ్చిన బృందా కారత్ తో టెన్ టివి మాట్లాడింది. ఈ సందర్భంగా దేశంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులను ఆమె విశ్లేషించారు. గుజరాత్ ఎన్నికల్లో మోడీ చేసినా కామెంట్లు అభ్యంతకరమైనవని, ప్రధాని స్థాయి నుండి కామెంట్లు రావడం విచారకరమన్నారు. ప్రజల అభివృద్ధికి కేరళ ప్రభుత్వమే నిదర్శనమని వ్యాఖ్యానించారు. 

13:28 - December 15, 2017

మహబూబ్ నగర్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సివిల్‌ కాంట్రాక్టర్‌ సుధాకర్‌ రెడ్డి హత్య కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఏ 1నిందితుడు రాజేశ్‌ను శుక్రవారం పోలీసులు మీడియా ముందు హాజరు పరిచారు. అంతకంటే ముందు రాజేష్ ను పత్తేపురంలో అటవీ ప్రాంతానికి తీసుకొచ్చారు. ఇక్కడే సుధాకర్ రెడ్డిని హత్య చేశారు. అనంతరం పీఎస్ కు వైద్యులను తీసుకొచ్చి రాజేష్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. తరువాత మీడియా ఎదుట రాజేష్ ను ప్రవేశ పెట్టారు. మరోవైపు ఏ 2 నిందితురాలిగా ఉన్న స్వాతిని కోర్టు ఎదుట ప్రవేశ పెట్టారు. మరో 15 రోజుల పాటు కస్టడీ విధిస్తున్నట్లు కోర్టు తీర్పును వెలువరించింది. తిరిగి మహబూబ్ నగర్ జిల్లా జైలుకు పోలీసులు తీసుకొచ్చారు. 

కాపుల అభివృద్ధి సంక్షేమానికి ప్రత్యేక ప్రణాళిక : కోట్ల శివశంకర్

విజయవాడ : రాష్ట్రంలో  కాపుల అభివృద్ధి సంక్షేమానికి ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తామని కాపు కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కోట్ల శివశంకర్ అన్నారు. కాపుల్లో ఉన్న వెనుకబాటు తనాన్ని నిర్మూలిస్తామని తెలిపారు. యువతకు విద్య, ఉపాధి, శిక్షణ రంగాలకు ప్రత్యేక నిధులు కేటాయించామని చెప్పారు. విదేశీ విద్య కోసం ఒక్కో అభ్యర్థికి రూ.10 లక్షలు అందిస్తున్నామని తెలిపారు. కాపుల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం రూ.100 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. 

 

టీడీపీ యువనేత అనుచరుడు సుబ్రహ్మణ్యం హత్య కేసును ఛేదించిన పోలీసులు

విజయవాడ : టీడీపీ యువనేత అనుచరుడు సుబ్రహ్మణ్యం హత్య కేసును పోలీసులు ఛేదించారు. నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు మీడియా ముందుకు నిందితులను తీసుకురానున్నారు. 

13:18 - December 15, 2017

ఢిల్లీ : తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ అంశాలని పార్లమెంట్ లో ప్రస్తావిస్తామని ఎంపీ జితేందర్ రెడ్డి పేర్కొన్నారు. పార్లమెంట్ సమావేశాలు శుక్రవారం నుండి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా టెన్ టివి ఆయనతో మాట్లాడింది. అసెంబ్లీ స్థానాల పెంపుపై క్లారిటీ తీసుకుంటామని, బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు.., ఎయిమ్స్ కు నిధులతో పాటు వెనుకబడిన జిల్లాలకు నిధులు కేటాయించామని అడిగామన్నారు. హైవేలు, స్పోర్ట్స్ వంటి ప్రధాన అంశాలను ప్రస్తావిస్తామని చెప్పుకొచ్చారు. మరిన్ని విషయాలకు వీడియో క్లిక్ చేయండి. 

13:12 - December 15, 2017

న్యూఢిల్లీ : జాతీయ కాంగ్రెస్ పార్టీలో సమూల మార్పులు వస్తున్నాయా ? యువ నాయకత్వానికి ప్రాధాన్యం ఇస్తారా ? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు వినిపిస్తున్నాయి. శుక్రవారం ఏఐసీసీ అధ్యక్షురాలిగా 19 ఏళ్లుగా ఉన్న సోనియా గాంధీ సంచలన ప్రకటన చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొని బయటకు వస్తున్న సోనియా మీడియాతో మాట్లాడారు. తాను రాజకీయాల నుండి తప్పుకోనున్నట్లు వెల్లడించారు. దీనితో శనివారం ఏఐసీసీ అధ్యక్ష పదవిని రాహుల్ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. రాహుల్ అధ్యక్ష పదవి చేపట్టిన అనంతరం పార్టీలో మార్పులు తీసుకరావాలని కాంగ్రెస్ పెద్దలు యోచిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా యువతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నట్లు టాక్. ఉత్తర్ ప్రదేశ్ లోని రాయ్ బరేలీ నుండి సోనియా ఎంపీగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈమె అధ్యక్షురాలిగా ఉన్నప్పుడు వరుసగా రెండుసార్లు యూపీకు అధికార పీఠం దక్కింది. 

ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం

తిరుపతి : ఓ అవినీతి తిమింగలం ఏసీబీకి చిక్కింది. రూ.22 వేల లంచం తీసుకుంటూ ఎంఈవో సుధాకర్ రావు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. 

 

భద్రాద్రి జిల్లాలో ఎన్ కౌంటర్ పై హైకోర్టులో పిటిషన్

హైదరాబాద్ : భద్రాద్రి జిల్లాలో ఎన్ కౌంటర్ పై హైకోర్టులో పిటిషన్ వేశారు. 8 మందిని అక్రమంగా తీసుకొచ్చి చంపారని పౌర హక్కుల సంఘం హైకోర్టులో లంచ్ మోహన్ పిటిషన్ వేసింది. 8 మృతదేహాలకు రీపోస్టుమార్టం చేయించాలని, ఘటనపై ప్రత్యేక విచారణ జరిపించాలని పిటిషనర్లు పేర్కొన్నారు. మధ్యాహ్నం హైకోర్టు పిటిషన్ ను విచారించనుంది.
  

సుధాకర్ రెడ్డి హత్య కేసులో స్వాతికి 15 రోజుల రిమాండ్

నాగర్ కర్నూలు : సుధాకర్ రెడ్డి హత్య కేసులో నిందితురాలు స్వాతికి 15 రోజుల రిమాండ్ విధించారు. స్వాతిని మహబూబ్ నగర్ జైలుకు తరలించారు. 

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టీ.టీడీపీ సీనియర్ నేతల భేటీ

హైదరాబాద్ :ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టీ.టీడీపీ సీనియర్ నేతల భేటీ అయ్యారు. పల్లెపల్లెకు తెలుగుదేశం కార్యక్రమంపై చర్చించనున్నారు.  ఈ సమావేశానికి టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ హాజరయ్యారు.

12:38 - December 15, 2017

హైదరాబాద్ : విక్టరీ వెంకటేష్ , దర్శకుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కబోతుంది. హారిక అండ్‌ హాసిని పతాకంపై 'జులాయి', 'సన్నాఫ్‌ సత్యమూర్తి', 'అ..ఆ' వంటి చిత్రాలతో అభిరుచి గల నిర్మాతగా ఎస్‌.రాధాకృష్ణ (చినబాబు) పరిశ్రమలో మంచి గుర్తింపు పొందారు. ప్రస్తుతం పవన్‌కళ్యాణ్‌తో 'అజ్ఞాతవాసి' చిత్రాన్ని త్రివిక్రమ్‌ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఆయన ఇటీవల ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ప్రొడక్షన్‌ నెం.5గా ఓ చిత్రాన్ని ప్రారంభించారు. ఇదిలా ఉంటే, ప్రొడక్షన్‌ నెం.6గా వెంకటేష్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఓ చిత్రాన్ని నిర్మించనున్నట్లు మంగళవారం ప్రకటించారు. వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా ఉంటుందని గతంలో పలు వార్తలు వినిపించినప్పటికీ అవి కార్యరూపం దాల్చలేదు. ఈ డిఫరెంట్‌ కాంబినేషన్‌లో నిర్మాత రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించడం ఓ విశేషం. 

12:30 - December 15, 2017

ఢిల్లీ : ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సంచలన ప్రకటన చేశారు. శుక్రవారం నాడు ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలకు హాజరై తిరిగి వెళుతుండగా సోనియా గాంధీ కీలక ప్రకటన చేశారు. తాను రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. 19ఏళ్లుగా ఆమె కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీనితో ఏఐసీసీ అధ్యక్ష పదవి బాధ్యతలను శనివారం రాహుల్ చేపట్టనున్నట్లు సమాచారం. ఉత్తర్ ప్రదేశ్ నుండి రాయ్ బరేలి నుండి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. 2013లో రాహుల్‌గాంధీ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.

  • ఆలిండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టబోయే రాహుల్ గాంధీ.. కాంగ్రెస్‌లో ఐదో తరానికి చెందిన వారు.
  • నెహ్రూ-గాంధీ కుటుంబం నుంచి ఆరో వ్యక్తిగా చెప్పవచ్చు.
  • 132 ఏళ్ల వయసు కలిగిన కాంగ్రెస్ పార్టీ పగ్గాలు 45 ఏళ్ల పాటు నెహ్రూ-గాంధీ కుటుంబం చేతిలోనే ఉన్నాయి.
  • 19 ఏళ్ల పాటు కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ అత్యంత ఎక్కువ కాలం ఆ బాధ్యతలు నిర్వర్తించారు.
  • జవహర్‌లాల్ నెహ్రూ 11 ఏళ్ల పాటు కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు.
  • ఇందిరాగాంధీ ఏడేళ్లు, రాజీవ్ గాంధీ ఆరేళ్లు, మోతీలాల్ నెహ్రూ రెండేళ్లు కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నారు.
  • రాహుల్ పట్టాభిషేకానికి ముహూర్తం ఎప్పుడో సిద్ధమైందనే సంగతి తెలిసిందే. కానీ 2016లో రాజకీయ ఒత్తిళ్ల కారణంగా సోనియాగాంధీ కాంగ్రెస్ పగ్గాలు విడిచిపెట్టలేకపోయారనే విమర్శలున్నాయి. 

కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష బాధ్యతలను రాహుల్ కు అప్పగించనున్న సోనియాగాంధీ

ఢిల్లీ : రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు కాంగ్రెస్ జాతీయ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రకటించారు. పార్లమెంట్ నుంచి బయటకు వెళ్తున్న సమయంలో సోనియాగాంధీ మీడియాకు తెలిపారు. రేపు కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష బాధ్యతలు రాహుల్ గాంధీ స్వీకరించనున్నారు. రేపు కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష బాధ్యతలను రాహుల్ గాంధీకి సోనియాగాంధీ అప్పగించనున్నారు. 19 ఏళ్లుగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలిగా సోనియా కొనసాగారు.  

రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు సోనియాగాంధీ ప్రకటన

ఢిల్లీ : రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రకటించారు. పార్లమెంట్ నుంచి బయటకు వెళ్తున్న సమయంలో సోనియాగాంధీ మీడియాకు తెలిపారు.

12:11 - December 15, 2017

హైదరాబాద్ : నగరంలో ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభానికి రంగం సిద్ధమౌతోంది. ఎల్బీ స్టేడియంలో ఇందుకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పంచ తెలుగు సభల ప్రారంభ సమావేశానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ముగింపు సభకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. తెలంగాణ వైభవాన్ని చాటే ముప్ఫై నిమిషాల నిడివిగల డాక్యుమెంటరీని ప్రదర్శిస్తారు. తెలంగాణ సంస్కృతి..కళలు..చరిత్రను అందులో పొందుపరిచే విధంగా చూడాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. రాజ రాధారెడ్డి గ్రూప్ డాక్యుమెంటరీని రూపొందించింది. గత 30 రోజులుగా వీరు ప్రాక్టీస్ చేశారు. ఈ సందర్భంగా గ్రూప్ కు సంబంధించిన వారితో టెన్ టివి మాట్లాడింది. తెలుగు తల్లి..తల్లి తెలంగాణ..బతుకమ్మ..రామప్ప టెంపుల్..పోతన్న తదితర విషయాలన్నీ ప్రోగ్రాంలో పేర్కొనడం జరిగిందని కౌశల్య పేర్కొన్నారు. మొత్తంగా ఈ ప్రోగ్రామ్ లో 30 నిమిషాలలో తెలంగాణ కళలు..చరిత్ర తెలిసిపోతుందన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

12:11 - December 15, 2017

విభిన్న కథా చిత్రాల్లో నటిస్తూ సమంత రాణిస్తోంది. ఇటీవల మహిళా ప్రాధాన్యత కలిగిన చిత్రాలు చేసేందుకు ఆమె ఆసక్తి చూపిస్తోన్న నేపథ్యంలో 'మహానటి' చిత్రంలో సావిత్రిగా నటించే అవకాశం మొదట సమంతనే వరించిందట. ఆ వివరాలను నిర్మాత స్వప్నా దత్‌ చెప్పారు. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో అలనాటి మేటి నటి సావిత్రి జీవితం ఆధారంగా 'మహానటి' సినిమా తెరకెక్కుతోంది. ఇందులో కీర్తి సురేష్‌ సావిత్రి పాత్రను పోషిస్తుంది. సమంత మరో కీలక పాత్రధారి. ఈ చిత్రం గురించి స్వప్నా దత్‌ చెబుతూ... 'సావిత్రి పాత్రకు కీర్తి సురేష్‌ కంటే ముందు సమంతే సైన్‌ చేశారు. ఆ పాత్రలో కొత్త వారిని తీసుకుంటే బాగుంటుందని దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ భావించారు. అందుకే కీర్తి సురేష్‌ని ఎంపిక చేసుకున్నాం' అని అన్నారు. 

 

12:05 - December 15, 2017

హైదరాబాద్ : నారా రోహిత్‌, జగపతిబాబు ప్రధాన పాత్రధారులుగా నటిస్తూ, పరుచూరి మురళి దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'ఆటగాళ్ళు'. 'గేమ్‌ విత్‌ లైఫ్‌' అనేది ట్యాగ్‌లైన్‌. ఈ చిత్రాన్ని ఫ్రెండ్స్‌ మూవీ క్రియేషన్స్‌ పతాకంపై వాసిరెడ్డి రవీంద్ర, వాసిరెడ్డి శివాజీ, మక్కెన రాము, వడ్లపూడి జితేంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా చిత్ర బృందం తెలియజేస్తూ, 'విలక్షణమైన నటుడు జగపతిబాబు, నారా రోహిత్‌ ఢీ అంటే ఢీ అనే పాత్రల్లో నటిస్తున్నారు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించుకోవడం హ్యాపీగా ఉంది. బ్రహ్మానందం మరో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. టిపికల్‌ స్క్రిప్ట్‌తో, వైవిధ్యమైన కథాంశంతో దర్శకుడు పరుచూరి మురళి ఈ చిత్రాన్ని తీర్చిద్దిద బోతున్నారు. తెలుగు సినిమా ప్రేక్షకులకు ఓ సరికొత్త సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది. లవ్‌తోపాటు వినోదం పుష్కలంగా ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం' అని తెలిపింది. ఈ చిత్రానికి కెమెరా: విజయ్ సి.కుమార్‌, సంగీతం: సాయి కార్తీక్‌.

 

12:00 - December 15, 2017

హైదరాబాద్ : క్షణికావేశాలతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతూ తల్లిదండ్రులకు తీరని శోకం మిగులిస్తున్నారు. టీచర్ కొట్టిందని...విద్యార్థులు అవమానపరిచారని..ప్రిన్స్ పాల్ మందలించడాని...ఇతరత్రా కారణాలతో విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. తాజాగా పరీక్షకు అనుమతించలేదని ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన నగరంలోని అంబర్ పేట.., పటేల్ నగర్ లో చోటు చేసుకుంది. అమృత నారాయణగూడలో ఉన్న హెచ్ ఆర్ డి కళాశాలలో బీఎస్సీ గ్రూప్ చదువుతోంది. ఇటీవలే పరీక్షలు ప్రారంభమయ్యాయి. కానీ గురువారం కళాశాలకు అమృత పది నిమిషాల ఆలస్యంగా వచ్చింది. దీనితో హెచ్ ఆర్ డి కళాశాల యాజమాన్యం పరీక్షకు అనుమతించలేదు. తీవ్ర మనస్థాపానికి గురైన అమృత ఇంటికి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. హెచ్చార్డీ కళాశాల యాజమాన్యం పూర్తి బాధ్యత వహించాలని..తమ కుమార్తె బాగా చదువుకుంటుందని..తమది పేద కుటుంబం అని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. 

11:59 - December 15, 2017

హైదరాబాద్ : హీరోయిన్ పూజా హెగ్డేకు కొత్త ప్రాజెక్టులు క్యూ కడుతున్నాయి. అటు ప్రత్యేక పాటల్లోనూ నటించేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా యవ హీరో నితిన్‌తో కలిసి నటించే అవకాశం పూజాను వరించిందట. ప్రస్తుతం నితిన్‌ సతీష్‌ వెగేశ్న దర్శకత్వంలో 'శ్రీనివాస కళ్యాణం'లో నటించబోతున్నారు. దిల్‌రాజు నిర్మాత. ఈ సినిమాలో నితిన్‌ సరసన నటించబోయే కథానాయిక పాత్ర కోసం పలువురిని సంప్రదించగా చివరకు చిత్ర బృందం పూజాను ఫైనల్‌ చేసినట్టు తెలుస్తుంది. నితిన్‌తో పూజాకిది తొలి చిత్రమవుతుంది.

 

11:59 - December 15, 2017

మహబూబ్ నగర్ : సుధాకర్ రెడ్డి హత్య కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేపట్టారు. ఇప్పటికే స్వాతిని అరెస్టు చేసి విచారిస్తున్న సంగతి తెలిసిందే. భర్త సుధాకర్ రెడ్డి హత్య కేసులో భార్య స్వాతి..ప్రియుడు రాజేష్ నిందితులు. భర్త ప్లేస్ లో ప్రియుడు రాజేష్ ను ఉంచేందుకు స్వాతి వేసిన ప్లాన్ బెడిసి కొట్టింది. చికిత్స పొందుతున్న రాజేష్ ను నాగర్ కర్నూలు పోలీసులు గురువారం అరెస్టు చేసి నాగర్ కర్నూలుకు తీసుకొచ్చారు. అనంతరం సుధాకర్ రెడ్డిని హత్య చేసిన ఫత్తేపూర్ అటవీ ప్రాంతానికి శుక్రవారం ఉదయం తీసుకొచ్చి విచారించారు. విచారణలో పలు విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. పీఎస్ కు వైద్యులను పిలిపించి రాజేష్ ను పరిక్షీంచారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

పరీక్షకు అనుమంతిచకపోవడంతో విద్యార్థిని సూసైడ్

హైదరాబాద్ : అంబర్ పేటలోని పటేల్ నగర్ లో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. నారాయణగూడలోని హెచ్ ఆర్ డీ కాళాశాలలో అమృత అనే విద్యార్థిని చదువుతోంది. అమృత పరీక్ష హాల్ కు ఆలస్యంగా వెళ్లింది. పరీక్ష రాయనివ్వకుండా యాజమాన్యం ఆమెను వెనక్కి పంపించింది. పరీక్షకు అనుమంతిచకపోవడంతో మనస్తాపం చెందిన అమృత ఇంటికివచ్చి ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 

అక్రమాస్తుల కేసులో తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా

హైదరాబాద్ : అక్రమాస్తుల కేసులో వైసీపీ అధినేత జగన్ సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది. 

పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగుతాయని ఆశిస్తున్నా : మోడీ

ఢిల్లీ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సజావుగా సాగుతాయని ఆశిస్తున్నానని ప్రధాని మోడీ అన్నారు. ఉభయసభల్లో అర్థవంతమైన చర్చలకు విపక్షాలు సహకరిస్తాయని భావిస్తున్నానని తెలిపారు. అన్ని అంశాలపై సమగ్ర చర్చ జరగాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. 

కేబినెట్ కొత్త మంత్రులను సభకు పరిచయం చేసిన మోడీ

ఢిల్లీ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. కేబినెట్ కొత్త మంత్రులను ప్రధాన మోడీ సభకు పరిచయం చేశారు. 

 

11:31 - December 15, 2017
11:24 - December 15, 2017

ఢిల్లీ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు శుక్రవారం నుండి ప్రారంభమయ్యాయి. రాజ్యసభలో ఛైర్మన్ వెంకయ్య నాయుడు మాజీ సభ్యుల మృతికి సంతాప తీర్మానం ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా పలు రంగాల్లో విజయాలు సాధించిన వారికి రాజ్యసభ డిప్యూటి స్పీకర్ అభినందనలు తెలియచేశారు.

లోక్ సభలో నూతనంగా కేబినెట్ లోకి వచ్చిన వారిని సభకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పరిచయం చేశారు. లోక్ సభ సెక్రటరీ జనరల్ గా తెలుగు మహిళ స్నేహలత శ్రీవాత్సవ నియమితురాలైనట్లు..సభకు స్పీకర్ సుమిత్రా మహజన్ పరిచయం చేశారు. ఈ పదవి చేపట్టనున్న తొలి మహిళగా స్నేహలత నిలిచిందని స్పీకర్ పేర్కొన్నారు. అనంతరం ఇటీవలి కాలంలో మృతి చెందిన మాజీ సభ్యులకు లోక్ సభ సంతాపం తెలియచేసింది.

ఆర్థిక వ్యవస్థ, జీఎస్టీ, రైతుల సమస్యలపై కేంద్రాన్ని నిలదీయాలని విపక్షాలు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేగాకుండా ఈడీ, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థల దుర్వినియోగాన్ని ప్రతిపక్షాలు ప్రస్తావించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఈ శీతాకాల పార్లమెంట్‌ సమావేశాల్లో కేంద్రం 14 కొత్త బిల్లులను ప్రవేశపెట్టనుంది. ఇందులో ముస్లిం మహిళల హక్కులకు సంబంధించిన ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు కూడా ఉంది. 25 పెండింగ్‌ బిల్లులను కూడా మళ్లీ టేబుల్‌పైకి తెచ్చే అవకాశం ఉంది. 

ఘట్ కేసర్ లో వ్యభిచారం ముఠా గుట్టురట్టు

మేడ్చల్ : ఘట్ కేసర్ లో వ్యభిచారం ముఠా గుట్టురట్టు అయింది. ముగ్గురు మహిళలు, ఇద్దరు నిర్వహికులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ముగ్గురు మోడల్స్, మూవీ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నారు. 

 

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం

ఢిల్లీ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. నేటి నుంచి 14 రోజులపాటు సమావేశాలు కొనసాగనున్నాయి. పలు అంశాలపై సభ్యులు చర్చించనున్నారు. 

 

ఆధార్ అనుంసంధానం గడువు పెంపు

ఢిల్లీ : ఆధార్ కార్డ్ అనుంసంధానం గడువును పెంచారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆధార్ అనుంసంధానం గడువును మార్చి 31వరకు సుప్రీంకోర్టు పొడిగించింది. 

 

విజయ్ సాయి హత్య కేసులో భార్య వనిత, అడ్వకేట్ శ్రీనివాసులు పరారీ

హైదరాబాద్ : హాస్యనటుడు విజయ్ సాయి హత్య కేసులో భార్య వనిత, అడ్వకేట్ శ్రీనివాసులు పరారు అయ్యారు. వనిత కోసం ప్రత్యేక బృందాలను పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ముగ్గురు నిందితులకు సంబంధించి కాల్ డేటా సేకరిస్తున్నారు.

10:31 - December 15, 2017

హైదరాబాద్ : ప్రపంచ తెలుగు మహాసభలకు భాగ్య నగరం సిద్ధమైంది. శుక్రవారం నుంచి మహాసభలు ప్రారంభంకానున్నాయి. 19వ తేదీ వరకు ఈ సభలు జరుగుతాయి. ప్రపంచ తెలుగు సభల ప్రారంభ సమావేశానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ముగింపు సభకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.

ప్రతి రోజు...
ఎల్‌బీ స్టేడియంలో సాయంత్రం 5.30 నుంచి రాత్రి 9.30 వరకు కార్యక్రమాలు జరుగనున్నాయి.
మూడు రోజుల పాటు రెండేసి గంటలు సాహిత్య సదస్సులు.. రెండున్నర గంటల పాటు సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి.
లలితకళా తోరణంలో జానపద కళల ప్రదర్శన ..
రవీంద్ర భారతిలో శాస్త్రీయ కళల ప్రదర్శన,
రవీంద్ర భారతి మినీ స్టేడియంలో అష్టావధానాలు, సారస్వత పరిషత్‌లో శతావధానం, ఇండోర్ స్టేడియంలో బృహత్ కవి సమ్మేళనాలు ఉంటాయి.

నేడు...
6గంటలకు సాంస్కృతిక సమావేశం. సీతాకాంత్ మహాపాత్ర, ప్రతిభారాయ్‌లకు సత్కారం.
సా. 6:30 గంటలకు డాక్టర్ రాజారెడ్డి, రాధారెడ్డి కూచిపూడి కళాకారుల..మన తెలంగాణ సంగీత నృత్య రూపకం.
రా. 7.00 - 7:30 గంటలకు పాట కచేరి
రా. 7:30 - 9:00 గంటలకు జయ జయోస్తు తెలంగాణ (సంగీత నృత్య రూపకం) ఉంటాయి. 

10:25 - December 15, 2017
10:24 - December 15, 2017

మహబూబ్ నగర్ : భార్య..స్వాతి..ప్రియుడు రాజేష్ చేతుల్లో హత్యకు గురికాబడిన సుధాకర్ రెడ్డి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే స్వాతిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్న సంగతి తెలిసిందే. తీవ్రగాయాల పాలై హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొంది గురువారం డిశ్చార్జ్ అయిన రాజేష్ ను పోలీసులు అరెస్టు చేసి నాగర్ కర్నూలుకు తీసుకెళ్లారు. అనంతరం అతడిని విచారించారు. ఈ విచారణలో పలు అంశాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే శుక్రవారం ఉదయం నాగర్ కర్నూలు పోలీసులు పత్తేపురంలో అటవీ ప్రాంతానికి ఏ 1 నిందితుడు రాజేష్ ను తీసుకొచ్చారు. ఇక్కడే సుధాకర్ రెడ్డిని మట్టుపెట్టిన సంగతి తెలిసిందే. ఘటనాస్థలంలో రాజేష్ ను పోలీసులు విచారించారు. అనంతరం ఈ స్థలానికి వైద్యులను కూడా తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. 

కాసేపట్లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం

ఢిల్లీ : కాసేపట్లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆర్ధిక వ్యవస్థ, జీఎస్ టీ, రైతుల సమస్యలపై విపక్షాలు కేంద్రాన్ని ప్రశ్నించనున్నాయి. ఈడీ, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థల దిర్వినియోగాన్ని విపక్షాలు ప్రస్తావించనున్నాయి. ట్రిపుల్ తాలక్ తోపాటు 14 కొత్త బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుంది. 

 

సుధాకర్ రెడ్డి హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం

నాగర్ కర్నూలు : సుధాకర్ రెడ్డి హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మహబూబ్ నగర్ పత్తేపూర్ హత్య జరిగిన ప్రాంతానికి నిందితుడు రాజేష్ ను పోలీసులు తీసుకెళ్లారు. 

 

09:36 - December 15, 2017

 

నల్గొండ : జిల్లాను మంచు దుప్పటి కమ్ముకుంది. శుక్రవారం ఉదయం 9.30గంటలవుతున్నా మంచు వీడడం లేదు. విజయవాడ -హైదరాబాద్, అద్దంకి, నార్కెట్ పల్లి రహదారులపై మంచు కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించకపోవడంతో పలు ప్రమాదాలు ఎదురవుతున్నట్లు సమాచారం. విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై బొలెరో వాహనం బోల్తా పడడంతో నలుగురికి గాయాలయ్యాయి. ఇదిలా ఉంటే ఈ వాతావరణాన్ని జిల్లా ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు...

09:32 - December 15, 2017

కరీంనగర్ : కుటుంబ సమస్యలు..ఆర్థిక సమస్యలు..ఇతరత్రా కారణాలతో మహిళలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వారితో పాటు కుమారులు..కుమార్తెలను కూడా తీరని లోకాలకు తీసుకెళుతున్నారు. కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు మండలం ఊటూరులో విషాదం చోటు చేసుకుంది. తల్లి, ఇద్దరు కుమారులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇంటి నుండి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వీరు ఐదు రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. మృతులు లక్ష్మి, వెంకటరమణ, శ్రీనివాసులుగా గుర్తించారు. వీరు స్థానికంగా బంగారు నగలకు మెరుగు పరుస్తూ జీవనం సాగిస్తుంటారు. శ్రీనివాస్ మానసికస్థితి సరిగ్గా లేకపోవడం..వెంకటరమణ వైవాహిక జీవితం సరిగ్గా లేకపోవడం..కుటుంబసమస్యలు ఏర్పడడంతో వీరంతా ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

09:26 - December 15, 2017

నిర్మల్ : తెలుగు రాష్ట్రాల్లో బలవన్మరణాలు..హత్యలు..వరకట్న హత్యలు..దోపిడిలు..నేర పూరిత సంఘటనలు పెరిగిపోతున్నాయి. క్షణికావేశంలో పలువురు ఆత్మహత్యలకు పాల్పడుతుండగా...కుటుంబ సమస్యలతో మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రధానంగా గృహిణిలు..చిన్నారులతో సహా ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాం. తాజాగా నిర్మల్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ తల్లి, ఇద్దరు కుమారుల మృతదేహాలు బావిలో లభ్య పడడం సంచలనం సృష్టించింది. వీరిని అత్తింటి వారే చంపేసి ఉంటారని మృతురాలి సోదరుడు ఆరోపిస్తున్నాడు.

కడెం మండలంలోని పెర్కపల్లెలో ఓ ఇంటికి సమీంపలో ఉన్న పంట పొలం బావిలో ముగ్గురు మృతదేహాలు లభ్యమయ్యాయి. చనిపోయింది సుద్దాల లక్ష్మీ (30), శ్రీజ (7), సిద్ధు (5) గా గుర్తించారు. అత్తింటి వారే చంపారని మృతురాలి సోదరుడు ఆరోపిస్తున్నాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపడుతున్నారు. 

ఇద్దరు చిన్నారులతో తల్లి సూసైడ్...

నిర్మల్ : కడెం (మం) పెర్కపల్లెలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు చిన్నారులతో సహా బావితో దూకి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. మృతులు సుద్దాల లక్ష్మి (30), శ్రీజ (7), సిద్ధు (5) గుర్తించారు. 

ఊటూరులో విషాదం...

కరీంనగర్ : మానకొండూరు (మం) ఊటూరులో విషాదం చోటు చేసుకుంది. తల్లి, ఇద్దరు కుమారులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంటి నుండి దుర్వాసన రావడంతో పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. ఐదు రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతులు : లక్ష్మీ, వెంకటరమణ, శ్రీనివాసులుగా గుర్తించారు. 

09:12 - December 15, 2017

ఢిల్లీ : కాసేపట్లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆలస్యంగా ప్రారంభమైనా ఈ సమావేశాల్లో కేంద్రాన్ని నిలదీయాలని విపక్షాలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభానికి ముందే రాజ్యసభ విపక్ష నేత గులాం నబీ ఆజాద్ నేతృత్వంలో విపక్షాలు సమావేశం కానున్నాయి. ఆర్థిక వ్యవస్థ, జీఎస్టీ, రైతుల సమస్యలపై కేంద్రాన్ని నిలదీయాలని విపక్షాలు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేగాకుండా ఈడీ, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థల దుర్వినియోగాన్ని ప్రతిపక్షాలు ప్రస్తావించే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే ఈ శీతాకాల పార్లమెంట్‌ సమావేశాల్లో కేంద్రం 14 కొత్త బిల్లులను ప్రవేశపెట్టనుంది. ఇందులో ముస్లిం మహిళల హక్కులకు సంబంధించిన ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు కూడా ఉంది. 25 పెండింగ్‌ బిల్లులను కూడా మళ్లీ టేబుల్‌పైకి తెచ్చే అవకాశం ఉంది.

కాసేపట్లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు...

ఢిల్లీ : కాసేపట్లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రాజ్యసభ విపక్ష నేత గులాం నబీ ఆజాద్ నేతృత్వంలో విపక్షాలు సమావేశం కానున్నాయి. ఆర్థిక వ్యవస్థ, జీఎస్టీ, రైతుల సమస్యలపై కేంద్రాన్ని నిలదీయాలని విపక్షాలు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

బాంబు బెదిరింపు ఫోన్ కాల్...

ఢిల్లీ : ఖాన్ మార్కెట్ లో బాంబు ఉందని గుర్తు తెలియని వ్యక్తులు చేసిన ఫోన్ కాల్ తో పోలీసులు అప్రమత్తమయ్యారు. డాగ్ స్వ్కాడ్, బాంబు నిర్వీర్యం చేసే నిపుణులు మార్కెట్ ను తనిఖీ చేశారు. కానీ ఎలాంటి బాంబు లేదని నిర్దారించినట్లు తెలుస్తోంది.

డ్రైవర్ లెస్ కారులో లోకేష్...

అమెరికా : ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అమెరికాలో పర్యటిస్తున్నారు. సాన్ ప్రాన్సిస్కోలోని గూగుల్ ఎక్స్ కార్యాయంలో ఏపీ ప్రభుత్వం, గూగుల్ ఎక్స్ కంపెనీ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా డ్రైవర్ లేని కారులో మంత్రి లోకేష్ ప్రయాణించారు. 

08:32 - December 15, 2017
08:30 - December 15, 2017

విజయవాడ : సాన్ ప్రాన్సిస్కోలోని గూగుల్ ఎక్స్ కార్యాయంలో ఏపీ ప్రభుత్వం, గూగుల్ ఎక్స్ కంపెనీ మధ్య ఒప్పందం కుదిరింది. ఏపీ ప్రభుత్వం తరపున మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఈ ఒప్పందం జరిగింది. ఒప్పందంలో భాగంగా ఏపీలో డెవలప్ మెంట్ సెంటర్ ను గూగుల్ ఏర్పాటు చేయనుంది. మొదటిసారిగా గూగుల్ ఎక్స్ ఇండియాలో అడుగుపెట్టనుంది. త్వరలో విశాఖ జిల్లాలో సెంటర్ ను ఏర్పాటు చేయనుంది. ఆధునాతన టెక్నాలజీని అభివృద్ధి చేసేందుకు డెవలప్ మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఏపీలోని 13జిల్లాలో 2 వేల ఫ్రీ స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్ లింక్స్ గూగుల్ ఎక్స్ ఏర్పాటు చేయనుందని, అందులో భాగంగా ఫైబర్ కేబుల్ అవసరం లేకుండానే మొబైల్ డేటా, వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. సర్టిఫికేట్ లెస్ గవర్నెన్స్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు, రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అమలు తీరును ప్రజలను అడిగి తెలుసుకొంటున్నట్లు పేర్కొన్నారు. 

08:19 - December 15, 2017
08:16 - December 15, 2017

విజయవాడ : ప్రైవేటు బస్సు ప్రమాదాలు అక్కడకక్కడ జరుగుతూనే ఉన్నాయి. నిర్లక్ష్యంగా నడుపుతూ ప్రమాదాలకు ప్రైవేటు బస్సు డ్రైవర్లు కారణమౌతున్నారు. నగరంలో కాళేశ్వరీ ట్రావెల్స్ కు చెందిన ప్రైవేటు బస్సు రోడ్డుపై బోల్తా కొట్టింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

విశాఖపట్టణం నుండి హైదరాబాద్ కు కాళేశ్వరీ బస్సు వెళుతోంది. బస్సులో మొత్తం 40 మంది ప్రయాణీకులున్నారు. దుర్గగుడి ఫ్లై ఓవర్ నిర్మాణం కారణంగా వేరే రోడ్డు గుండా డ్రైవర్ బస్సును నడిపాడు. కానీ పైడూరు పాడు దగ్గరకు రాగానే బస్సు పల్టీ కొట్టింది. గాయాలైన నలుగురిని గొల్లపూడిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. త్వరగా వెళ్లడానికి ఇతర మార్గం ఎంచుకోవడం...డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడమే ప్రమాదానికి గల కారణమని తెలుస్తోంది.

08:12 - December 15, 2017

హైదరాబాద్ : గుప్త నిధులు ఉన్నాయా ? ఈ ప్రశ్నకు ఉన్నాయని..లేవని జవాబులు వినిపిస్తుంటాయి. కానీ అవి అంత ఈజీగా దొరికేవి కావని పలువురు పేర్కొంటుంటారు. గుప్త నిధుల గురించి తరచుగా వింటూనే ఉంటాం. గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతూ పలువురు పట్టుబడుతుంటారు. తాజాగా యాచారం మండలం మేడిపల్లిలో అర్ధరాత్రి ఓ పాడుపడిన భవనంలో తవ్వకాలు జరుపుతున్నట్లు స్థానికులు గమనించారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలంలోకి చేరుకున్న పోలీసులకు ఓ మహిళ..ముగ్గురు యువకులు తవ్వకాలు జరుపుతున్నట్లు గమనించారు. గుంటూరు జిల్లాకు చెందిన వీరంతా కుషాయిగూడలోని ఓ ఆశ్రమానికి చెందిన వారీగా నిర్ధారించారు. గుప్తనిధులున్నాయనే పక్కా సమాచారం మేరకు తవ్వకాలు చేసినట్లు వారు పేర్కొంటున్నట్లు సమాచారం. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం.... జర్నలిస్ట్ మృతి

ముంబాయి  : మహారాష్ట్రలోని కుర్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ జర్నలిస్ట్ మృతి చెందాడు. రెండు ఆటోలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న జర్నలిస్ట్ ప్రశాంత్ త్రిపాఠి మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

నేడు రెండో రోజు సీఆర్ డీఏ వర్క్ షాపు

విజయవాడ : నేడు రెండో రోజు సీఆర్ డీఏ వర్క్ షాపు జరుగనుంది. వర్క్ షాపు ముగింపు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. 

 

విజయవాడలో టీడీపీ ఎస్సీ కార్యకర్తల శిక్షణా తరగతులు

విజయవాడ : టీడీపీ ఎస్సీ కార్యకర్తల శిక్షణా తరగతులు జరుగనున్నాయి. సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. 

నేడు ఏఎన్‌యూలో పరిశీలించనున్న ఢిల్లీ బృందం

గుంటూరు : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో రాష్ర్టీయ ఉచ్ఛత శిక్షా అభియాన్‌ (రూసా) నిధుల వినియోగం పరిశీలనకు ఢిల్లీ అధికారుల బృందం శుక్రవారం వస్తున్నట్లు అంతర్జాతీయ విద్యార్థి విభాగం కో ఆర్డినేటర్‌ ఆచార్య జీవీఎస్‌ఆర్‌ ఆంజనేయులు తెలిపారు. రూసా నిధులు వర్సిటీకి 20కోట్లు కేటాయించగా తొలిదఫా 5 కోట్ల నిధులు మంజూరయ్యాయన్నారు. ఆ మొత్తంతో హిందీ భవన్‌పై రెండో అంతస్తు, కంప్యూటర్‌ సెంటర్‌, బాలుర, బాలికల వసతి గృహాల సముదాయాల నిర్మాణ దశలను బృందం పరిశీలిస్తుందని ఆయన తెలిపారు. ఢిల్లీ బృందం వెంట రాష్ట్ర రూసా డైరెక్టర్‌ పాండాదాస్‌ ఉంటారని ఆయన పేర్కొన్నారు. 

ఏపీలో 2 వేల ఫ్రీ స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్ లింక్స్ ఏర్పాటు చేయనున్న గూగుల్ ఎక్స్

అమెరికా : ఏపీ ప్రభుత్వం, గూగుల్ ఎక్స్ కంపెనీ మధ్య ఒప్పందం కుదిరింది. సాన్ ప్రాన్సిస్కోలోని గూగుల్ ఎక్స్ కార్యాయంలో ఒప్పందం కుదిరింది. మంత్రి లోకేష్ ఆధ్యర్యంలో ఐటీ శాఖ అధికారులు, గూగుల్ ఎక్స్ కంపెనీ సీఈవో ఆస్ట్రో టెల్లర్ మధ్యం ఒప్పందం కుదుర్చుకున్నారు. ఏపీలోని 13జిల్లాలో 2 వేల ఫ్రీ స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్ లింక్స్ గూగుల్ ఎక్స్ ఏర్పాటు చేయనున్నారు. ఫైబర్ కేబుల్ అవసరం లేకుండానే మొబైల్ డేటా, వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి.  

 

బస్సు బోల్తా...

విజయవాడ : పైడూరుపాడులో కాళేశ్వరి ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులకు గాయలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. 

07:40 - December 15, 2017

సూర్య, కీర్తి సురేష్‌ జంటగా విగేష్‌ శివన్‌ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన 'తాన సెరంధ కూటమ్‌' చిత్రాన్ని యు.వి క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు తెలుగులో 'గ్యాంగ్‌' పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, 'తెలుగు, తమిళంలో సూర్యకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే ఆయన తమిళంలో విగేష్‌ శివన్‌ దర్శకత్వంలో నటించిన చిత్రాన్ని తెలుగులో 'గ్యాంగ్‌' పేరుతో విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ ఎలా ఆకట్టుకుంటుందో, దాన్ని మించి ఫస్ట్‌లుక్‌ టీజర్‌ ఆకట్టుకుంటోంది. ఫస్ట్‌ టైమ్‌ టీజర్‌లో సూర్య తెలుగులో డబ్బింగ్‌ చెప్పడం తెలుగు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఆయన మాటలు చాలా ముద్దుగా ఉండటంతో టీజర్‌ని రిపీటెడ్‌గా చూస్తున్నారు. విడుదల చేసిన కొన్ని గంటల్లోనే మిలియన్‌ వ్యూస్‌ వచ్చాయి. అంతేకాదు ఇప్పుడిది సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా నిలవడం హ్యాపీగా ఉంది. 'బాహుబలి' వంటి చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రమ్యకృష్ణ, కార్తీక్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్‌ సంగీతం అందించిన పాటలు చాలా బాగా వచ్చాయి. ఇందులో హీరోయిన్‌ కీర్తి సురేష్‌ నటన హైలైట్‌గా నిలవనుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న విడుదల చేయబోతున్నాం' అని చెప్పారు.

 

07:39 - December 15, 2017

హైదరాబాద్ : హీరో మోహన్‌బాబు ప్రధాన పాత్రలో నటిస్తూ శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్‌ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం 'గాయత్రి'. అరియానా, వివియానా, విద్యానిర్వాణ సమర్పకులు. నిఖిలా విమల్‌ టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న ఈ చిత్రంలో మంచు విష్ణు, శ్రియ కీలక పాత్రధారులు. మదన్‌ రామిగాని దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి చిత్ర బృందం తెలియజేస్తూ.. 'రామానాయుడు స్టూడియోలో చివరి షెడ్యూల్‌ గురువారంతో పూర్తయ్యింది. ఇందులో మంచు విష్ణు ఓ శక్తివంతమైన పాత్రలో కనిపించ నున్నారు. విష్ణు సరసన శ్రియ నటించగా, వీరిపై ఇటీవల రామోజీ ఫిల్మ్‌ సీటీలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. బ్రహ్మానందం, అనసూయ భరద్వాజ్‌ మరో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సక్సెస్‌ఫుల్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎస్‌.ఎస్‌.థమన్‌ సంగీతం సమకూరుస్తున్నారు. మరో వైపు పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి 9న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. విభిన్నమైన కథాంశంతో వస్తున్న ఈ చిత్రం అన్ని వర్గాలను మెప్పిస్తుంది' అని తెలిపింది. ఈ చిత్రానికి కెమెరా: సర్వేష్‌ మురారి, ఆర్ట్‌: చిన్నా, ఎడిటర్‌: ఎం.ఎల్‌.వర్మ.

 

07:36 - December 15, 2017

హైదరాబాద్ : మాస్ మహారాజ్ రవిజేత హీరోగా కళ్యాణ్‌ కృష్ణ డైరెక్షన్ లో ఓ సినిమా రానుంది. 'సోగ్గాడే చిన్ని నాయన', 'రారండోయ్ వేడుక చూద్దాం' వంటి హిట్ చిత్రాలు ఇచ్చిన కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో సినిమా చేసేందుకు రవితేజ సిద్ధమయ్యారు. ఎస్‌.ఆర్‌.టి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకోనున్న ఈ చిత్రం గురించి నిర్మాత రామ్‌ తాళ్లూరి మాట్లాడుతూ... 'మా బ్యానర్‌లో మాస్‌ రాజా రవితేజ హీరోగా మొదటి సినిమాను రూపొందిం చడం చాలా ఆనందంగా ఉంది. కళ్యాణ్‌ కృష్ణ చేసిన రెండు చిత్రాలు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలిచి విజయం సాధించాయి. కుటుంబ ప్రేక్షకుల్లో కళ్యాణ్‌ చిత్రాలకు ఓ ప్రత్యేకత ఉంది. మాస్‌ రాజా రవితేజ సినిమా అంటే అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా ప్రకటించడంతో ఆడియెన్స్‌లో మా ప్రాజెక్ట్‌పై క్రేజ్‌ నెలకొంది. డిసెంబర్‌ నెలాఖరు నుంచి ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం' అని అన్నారు. 

 

07:28 - December 15, 2017

గుజరాత్‌ అసెంబ్లీ మలివిడత ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. తుది దశ ఎన్నికల్లో 68.70 శాతం పోలింగ్‌ నమోదైంది. ప్రధాని నరేంద్రమోది ఓటు వేసిన తర్వాత ఇంక్‌ వేసిన వేలును చూపిస్తూ రోడ్‌ షో నిర్వహించడంపై కాంగ్రెస్‌ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది. గుజరాత్‌ పీఠం బీజేపీదేనన్న ఎగ్జిట్‌పోల్స్‌ ప్రకటించాయి. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన ప్రత్యేక చర్చలో వీరయ్య (నవ తెలంగాణ ఎడిటర్), మాధవి (బీజేపీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

ఏపీ ప్రభుత్వం, గూగుల్ ఎక్స్ కంపెనీ మధ్య ఒప్పందం

అమెరికా : ఏపీ ప్రభుత్వం, గూగుల్ ఎక్స్ కంపెనీ మధ్య ఒప్పందం కుదిరింది. సాన్ ప్రాన్సిస్కోలోని గూగుల్ ఎక్స్ కార్యాయంలో ఒప్పందం కుదిరింది. మంత్రి లోకేష్ ఆధ్యర్యంలో ఐటీ శాఖ అధికారులు, గూగుల్ ఎక్స్ కంపెనీ సీఈవో ఆస్ట్రో టెల్లర్ మధ్యం ఒప్పందం కుదుర్చుకున్నారు. ఏపీలో డెవలప్ మెంట్ సెంటర్ ను త్వరలో విశాఖలో గూగుల్ ఎక్స్ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనుంది. అధునాతన టెక్నాలజీలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా గూగుల్ ఎక్స్ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనుంది. 

 

07:21 - December 15, 2017

ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరుకానున్న 40 దేశాల ప్రతినిధులు

హైదరాబాద్ : నేటి నుంచి ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభం కానున్నాయి. ఈ సభలు ఈనెల 19 వరకు కొనసాగనున్నాయి. ఈ మహాసభలకు 40 దేశాల ప్రతినిధులు హాజరుకానున్నారు. జాతీయ గీతంతో మహాసభలు ప్రారంభం కానున్నాయి. ఎల్ బీ స్టేడియంలో ఏర్పాట్లు చేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ, మహారాష్ట్ర గవర్నర్లు హాజరుకానున్నాయి. తొలిరోజు ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభం వేడుకలు, రెండో రోజు నుంచి సాహితీ సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగునున్నాయి. 

 

07:19 - December 15, 2017

ఢిల్లీ : పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి. వివిధ అంశాలపై కేంద్రాన్ని నిలదీసేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయి. జిఎస్‌టి, ఆర్థిక వ్యవస్థ, రైతుల సమస్యలపై మోది సర్కార్‌ను నిలదీయనున్నాయి. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు వచ్చే ఏడాది జనవరి 5న ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు ఢిల్లీలో సమావేశమయ్యాయి. రాజ్యసభ విపక్షనేత గులాంనబీ ఆజాద్‌ నేతృత్వంలో విపక్షాల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్‌ పార్టీతో పాటు వామపక్షాలు, ఎస్పీ, ఆర్జేడి, తృణమూల్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ తదితర పార్టీలు హాజరయ్యాయి.

ఈ సమావేశంలో పార్లమెంట్‌లో లేవనెత్తాల్సిన అంశాలపై విపక్షాలు చర్చించాయి. దిగజారుతున్న ఆర్థికవ్యవస్థ, జిఎస్‌టి, రైతుల సమస్యతో పాటు ఈడీ, సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడంపై మోది ప్రభుత్వాన్ని నిలదీయాలని విపక్షాలు నిర్ణయించాయి. గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా పార్లమెంట్‌ సమావేశాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

శీతాకాల పార్లమెంట్‌ సమావేశాల్లో కేంద్రం 14 కొత్త బిల్లులను ప్రవేశపెట్టనుంది. ఇందులో ముస్లిం మహిళల హక్కులకు సంబంధించిన ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు కూడా ఉంది. 25 పెండింగ్‌ బిల్లులను కూడా మళ్లీ టేబుల్‌పైకి తెచ్చే అవకాశం ఉంది. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు వచ్చే ఏడాది జనవరి 5 వరకు జరగనున్నాయి.

06:49 - December 15, 2017

సీపీయస్‌ విధానాన్ని రద్దు చేయాలి. పాత పెన్షన్‌ విధానాన్ని కొనసాగించాలి. ఇది దేశవ్యాప్తంగా ఉద్యోగ కార్మిక వర్గాలు ఎకతాటిగా చేస్తున్న డిమాండ్‌. పని చేయగల వయసు మొత్తాన్ని ఉద్యోగానికి కేటాయించినప్పుడు రిటైర్‌మెంట్‌ అయిన తర్వాత పెన్షన్‌ మా హక్కు అని.. ఆ హక్కును ప్రభుత్వాలు కాల రాస్తున్నారని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకి సీపీయస్‌ విధానాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు. పాత పెన్షన్‌ విధానానికి, దీనికి తేడా ఎమిటి అనే అంశంపై టెన్ టివి జనపథంలో మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

06:46 - December 15, 2017

గుజరాత్ : అసెంబ్లీ మలివిడత ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. తుది దశ ఎన్నికల్లో 68.70 శాతం పోలింగ్‌ నమోదైంది. ప్రధాని నరేంద్రమోది ఓటు వేసిన తర్వాత ఇంక్‌ వేసిన వేలును చూపిస్తూ రోడ్‌ షో నిర్వహించడంపై కాంగ్రెస్‌ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది. మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు గాను తొలిదశలో 89 నియోజకవర్గాలకు డిసెంబర్‌ 9న ఎన్నికలు నిర్వహించగా మిగతా 93 స్థానాలకు ఇవాళ పోలింగ్‌ జరిగింది. మలిదశ ఎన్నికల్లో సాయంత్రం 5 గంటలకు ఓటింగ్‌ ముగిసే సమయానికి శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. పోలింగ్‌ ప్రారంభమైన తొలి గంటల్లోనే పలువురు ప్రముఖులు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోది, మోది తల్లి హీరాబెన్‌, బిజెపి చీఫ్‌ అమిత్‌షా, కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ, గుజరాత్ మాజీ సిఎం ఆనందిబెన్‌ పటేల్, కాంగ్రెస్‌ మాజీ నేత శంకర్‌సిన్హ్‌ వాఘేలా తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.

ప్రధాని మోది అహ్మదాబాద్‌లోని నిషాన్‌ హైస్కూలులో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం మోది ఇంక్‌ వేసిన వేలిని చూపిస్తూ తన వాహనంపై నిల్చుని రోడ్‌ షో నిర్వహించారు. మోది రోడ్‌షోపై కాంగ్రెస్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. పోలింగ్‌ రోజున రోడ్‌ షో నిర్వహించడం ద్వారా ప్రధాని ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఆరోపించింది. టీవీలో ఇంటర్వూ ఇచ్చినందుకు కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసిందని...ప్రధాని మోది నిర్వహించిన రోడ్‌ షో పై కూడా ఈసీ చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. పిఓఎం ఆదేశాల మేరకే ఎన్నికల కమిషన్‌ నడచుకుంటోందని....బిజెపి నేతలు కోడ్‌ ఉల్లంఘనకు పాల్పడుతున్నప్పటికి చర్యలు తీసుకోవడం లేదని కాంగ్రెస్‌ ఆరోపించింది.

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోసం బిజెపి, కాంగ్రెస్‌లు హోరా హోరీగా తలపడ్డాయి. ప్రధానమంత్రి నరేంద్రమోది, కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ గుజరాత్‌ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. గత 22 ఏళ్లుగా గుజరాత్‌లో అధికారంలో ఉన్న బిజెపి తిరిగి అధికారాన్ని నిలబెట్టుకునేందు అన్నిరకాల ప్రయత్నాలు చేసింది. బిజెపి ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతను తనకు అనుకూలంగా మారుతుందన్న ఆశతో కాంగ్రెస్‌ ఉంది. ప్రజా తీర్పు ఎలా ఉండబోతోందన్నది డిసెంబర్‌ 18న వెలువడే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాలి. ఎగ్జిట్‌పోల్స్‌ మాత్రం బిజెపికి అనుకూలంగా తీర్పు చెప్పాయి.

06:41 - December 15, 2017

హైదరాబాద్ : స్వాతి అంటే నాకు పిచ్చి ప్రేమ? ఆమె కోసం నేను ఏమైనా చేస్తా? ముఖాన్ని కూడా కాల్చుకుని భరించలేని నొప్పిని సైతం ఆనందంగా అనుభవించా? అందుకే ఆమెకు ఇష్టం లేని భర్త అడ్డు తొలగించడంలో సహాయం చేశా?.. ఇవి స్వాతి కేసులో... ఆమె ప్రియుడు రాజేష్‌ వాంగ్మూలం. ఇవాళ రాజేశ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. సుధాకర్‌ రెడ్డి హత్య కేసులో నాగర్‌కర్నూలు పోలీసులు స్పీడ్‌ పెంచారు. స్వాతి ప్రియుడు రాజేష్‌ను హైదరాబాద్‌ అపోలో ఆస్పత్రిలో అరెస్ట్ చేసి నాగర్‌కర్నూల్‌ తరలించారు. ఆ తర్వాత మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారు. అనంతరం తమ కస్టడీలోకి తీసుకుని రాజేష్‌ను సుదీర్ఘంగా విచారించారు. పోలీసులు స్వాతితో పరిచయం దగ్గరినుంచి, వారిద్దరి మధ్య బంధం, సుధాకర్‌ను హత్య చేసిన తీరు గురించిన వివరాలపై ఆరా తీశారు.

సుధాకర్‌ రెడ్డి మెడపై అనస్థిషియా ఇంజక్షన్‌ గుచ్చి తలపై ఇనుపరాడ్డుతో దాడి చేసి హతమార్చినట్లు రాజేష్‌ చెప్పాడు. మృతదేహాన్ని కారులో ఫతేపూర్‌ అటవీప్రాంతానికి తీసుకెళ్లి కాల్చివేసినట్లు చెప్పాడు. ఆ తరువాత ముఖంపై పెట్రోలు పోసుకుని గ్యాస్ స్టౌపై తలపెట్టినట్లు రాజేష్ వివరించాడు. నాగర్‌కర్నూలులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఆపరేషన్‌ థియేటర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న తన స్నేహితుడు నరేష్‌ మత్తు ఇంజక్షన్‌ సరఫరా చేసినట్లు తెలిపాడు. రాజేష్‌ ఇచ్చిన వివరాలతో నరేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

స్వాతి అంటే తనకెంతో ఇష్టమని, ఆమెకు తన భర్తంటే అసహ్యమని చెప్పినందునే హత్యకు సహకరించినట్లు రాజేష్ వెల్లడించాడు. వ్యక్తిగతంగా తనకు సుధాకర్‌తో పరిచయం కూడా లేదన్నాడు. స్వాతిపై ప్రేమతోనే భరించలేని నొప్పిని సైతం ఓర్చుకున్నట్లు చెప్పాడు. ముఖాన్ని కాల్చుకునేందుకు కూడా వెనుకాడలేదన్నాడు. తనకు మాంసాహారం తినడం చిన్నప్పటి నుంచి అలవాటు లేదని చెప్పాడు. సుధాకర్‌ రెడ్డి హత్యకు ఉపయోగించిన వస్తువులు ఎక్కడ దాచారన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

06:39 - December 15, 2017

అనంతపురం : లంచాలకు కక్కుర్తిపడి వందలాది కుటుంబాలకు ఉపాధినిచ్చే ఎఫ్‌సిఐ గోదాములను మూసివేశారని వైసిపి అధినేత వైఎస్ జగన్‌ విమర్శించారు. ప్రజా సంకల్ప యాత్ర 35వ రోజు అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది. రాప్తాడు నియోజక వర్గం గంగులకుంట నుంచి కందుకూరు, హంపాపురం, చిగిచెర్ల వరకు కొనసాగింది. యాత్రలో భాగంగా ప్రజలను కలుసుకొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నేటితో రాప్తాడు నియోజక వర్గంలో ప్రజా సంకల్ప యాత్ర ముగిసింది. తిరిగి 16 నుంచి ధర్మవరం నియోజక వర్గంలో 36వ రోజు ప్రజా సంకల్ప యాత్ర కొనసాగుతుంది. భోజన విరామం అనంతరం శుక్రవారం కోర్టుకు హజరు కావాల్సి ఉండటంతో హైదరాబాద్ కు బయలు దేరి వెళ్ళారు.

 

06:36 - December 15, 2017

విజయవాడ : ఏపీలో విద్యాప్రమాణాలు రోజు రోజుకు దిగజారుతున్నాయని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌ నారాయణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలల్లో ఫలితాల సాధన కోసం పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌ జరుగుతోందని ఆరోపించారు. సురాజ్య ఉద్యమంలో భాగంగా 13 జిల్లాల్లో చేసిన పర్యటనలో అధ్యనం చేసిన అంశాలను ముఖ్యమంత్రి చంద్రబాబకు జేపీ వివరించారు. ప్రభుత్వ స్కూళ్లలో విద్యాప్రమాణాలు ఘోరంగా ఉన్న విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. 

నేడు మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ విందు సమావేశం

హైదరాబాద్ : నేడు మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ విందు సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ ఎస్ నేతలను ఆహ్వానించారు.

 

06:34 - December 15, 2017

విజయవాడ : విద్యానగరి అమరావతి సిగలో మరో కలికితురాయి చేరనుంది. ఏపీ రాజధానిలో అంతర్జాతీయ ప్రమాణాలతో మెగా యూనివర్సిటీ ఏర్పాటుకు కామన్‌వెల్త్‌ ఆఫ్‌ పెన్సిల్వేనియా ముందుకొచ్చింది. పెన్సిల్వేనియా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఏర్పాటు చేసే ఈ విశ్వవిద్యాలయానికి భూమి కేటాయించేందుకు ఏపీ ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. ఏపీ రాజధాని అమరావతిలో మరో కొత్త విశ్వవిద్యాలయం కొలువుతీరనుంది. అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీ ఇక్కడ ఉన్న విద్యా సంస్థను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. పెన్సిల్వేనియా స్టేట్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయింది. అమరావతిలో మెగా యూనివర్సిటీ ఏర్పాటుకు ఆసక్తివ్యక్తం చేసింది. ఈమేరకు రెండు రాష్ట్రాల అధికారులు అంగీకార పత్రాలను మార్చుకున్నారు.

అమరావతిలో మెగా యూనివర్సిటీ ఏర్పాటుకు ఏపీ ఎకనామిక్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు, పెన్సిల్వేనియా స్టేట్‌ సిస్టమ్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ మధ్య ఈ మేరకు అంగీకారం కుదిరింది. రాష్ట్రంలో ఉన్నత విద్యను మరింత మెరుగుపరిచేందుకు పెన్సిల్వేనియా యూనివర్సిటీ ముందుకు వచ్చింది. లక్ష మంది విద్యార్థులు ప్రమాణాలు మెరుగుపరుచుకునే విధంగా శిక్షణ ఇస్తుంది. అలాగే అధ్యాపకుల వృత్తిపరమైన అభివృద్ధికి కోర్సులు నిర్వహిస్తుంది. పరిశోధనలకు ప్రాధాన్యత ఇస్తుంది. ఈ విషయంలో వ్యూహాత్మక భాగస్వామిగా వ్యవహరిస్తుంది. దీనిని కార్యరూపంలో పెట్టేందుకు మార్గసూచీని రూపొందించుకోవాలని అధికారులు నిర్ణయించారు. రాష్ట్రాన్ని విజ్ఞాన కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు.. పెన్సిల్వేనియా ప్రతినిధి బృందానికి వివరించారు.

06:31 - December 15, 2017

విజయవాడ : ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలనను మరింతగా వారి దగ్గరకు తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ ను ప్రవేశపెట్టిన తర్వాత ప్రజల్లో సంతృప్తి స్థాయి పెరిగిందని, దీనిని మరింత పెంచేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు అధికారులు జవాబుదారీతనంలో పనిచేయాలని జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కోరారు.

ప్రజల నుంచి అందే వినతుల్లో ఆర్థికేతరమైన అన్ని సమస్యలను పరిష్కరించాలని చంద్రబాబు కోరారు. వచ్చే జన్మభూమి కార్యక్రమం నాటికి దీనిని పూర్తి చేయాలని ఆదేశించారు. వినతుల పరిష్కారంలో 59 శాతంగా ఉన్న ప్రజల సంతృప్తిని 80 శాతానికి తీసుకెళ్లాలని అధికారుల దృష్టికి తెచ్చారు. వచ్చే ఏడాది మార్చి 31 కల్లా స్వచ్చాంధ్రప్రదేశ్‌ లక్ష్యాన్ని సాధించాలని ఆదేశించారు. బహిరంగ మలమూత్ర విసర్జన నిరోధంలో కొన్ని జిల్లాలు వెనుకబడి ఉండటానికి గల కారణాలను జిల్లా కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఓడీఎఫ్‌తోపాటు వ్యర్థాల నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాలు సంపూర్ణంగా ఓడీఎఫ్‌ సాధించిన విషయాన్ని ప్రస్తావించిన చంద్రబాబు.. నాలుగు రోజుల్లో గుంటూరు జిల్లాను కూడా ఓడీఎఫ్‌గా ప్రకటిస్తామని చెప్పారు.

ఓడీఎఫ్‌ లక్ష్య సాధన కోసం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా 16,36,713 మరుగుదొడ్లు నిర్మించాల్సి ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంపై 94 శాతం మంది ప్రజలు సంతృప్తితో ఉన్న అంశాన్ని ప్రస్తావించారు. విద్యుత్‌ చార్జీలు పెంచబోమని చెప్పిన చంద్రబాబు... 24 గంటల విద్యుత్‌ సరఫరా, ప్రతి ఇంటికి వంట గ్యాస్‌ కనెక్షన్‌ కార్యక్రమాలు విజయవంతమైన అంశాన్ని ప్రస్తావించారు. నూరు శాతం ఎల్‌ఈడీ వీధి దీపాల ఏర్పాటుపై అధికారులు దృష్టి పెట్టాలని చంద్రబాబు ఆదేశించారు.

06:28 - December 15, 2017

హైదరాబాద్ : పార్లమెంటు శీతాకాల సమావేశాలకు టీఆర్‌ఎస్‌ సిద్ధమైంది. ఉభయ సభల్లో లేవనెత్తాల్సిన అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. విభజన చట్టంలోని హామీల అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును పార్లమెంటులో ఎండగట్టేందుకు గులాబీ దళం రెడీ అయింది. విభజన చట్టంలోని హామీల అమలుపై ఉయభ సభల్లో ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నిర్ణయించారు.

రాష్ట్ర విభజన చట్టంలోని హామీల అమలులో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై గులాబీ పార్టీ గుర్రుగా ఉంది. చట్టపరమైన హామీల అమలుపై కేంద్ర ఉదాసీనంగా వ్యవహరిస్తున్న తీరుపై టీఆర్‌ఎస్‌ అసంతృప్తితో ఉంది. ఆంధ్రప్రదేశ్‌ విషయంలో చాలా వరకు సానుకూలంగా ఉంటున్న కేంద్రం....తెలంగాణ వ్యవహారంలో మాత్రం చిన్న చూపు చూస్తోందన్న అభిప్రాయాన్ని గులాబి నేతలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ అభివృద్ధికి తాము డిమాండ్ చేస్తున్న అంశాలను కూడా కేంద్రం పరిగణలోకి తీసుకోవడం లేదన్న ఆవేదన టీఆర్‌ఎస్‌ ఎంపీల్లో కనిపిస్తోంది. వచ్చే నెల 5 వ తేదీ వరకు మొత్తం... 14 రోజుల పాటు జరిగే పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్రానికి సంబంధించిన అన్ని కీలకం అంశాలూ చర్చకు వచ్చేలా చేయాలని టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నిర్ణయించింది.

విభజన చట్టంలో ప్రస్తావించిన చాలా అంశాలు కేంద్రంలో అపరిష్కృతంగా ఉన్న అంశంపై టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చర్చించారు. తెలంగాణలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు, హైదరాబాద్‌లో ఉన్న ఉమ్మడి హైకోర్టు విభజన, కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, కొత్త రైల్వే లైన్ల నిర్మాణం వంటి అంశాలను లోక్‌సభ, రాజ్యసభలో లేవనెత్తాలని టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీలో నిర్ణయం తీసుకున్నారు. శాసనసభ స్థానాల పెంపు, తెలంగాణలో ఎయిమ్స్‌ ఏర్పాటు, బయ్యారం ఉక్కు కర్మాగారం వంటి అంశాలను పార్లమెంటు వేదికగా కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు.

సాగునీటి ప్రాజెక్టుల విషయంలోను కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని టీఆర్ ఎస్ తప్పుబడుతోంది. ఏపీలోని పోలవరంకు నిధులు కేటాయిస్తూ... తెలంగాణలో కీలకమైన కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులకు మొండిచేయి చూపడాన్ని టీఆర్‌ఎస్‌ ఎంపీలు తప్పు పడుతున్నారు. పలు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో చేసిన తీర్మానాల అమలుపై కేంద్రం స్పందించని విషయాన్ని గుర్తు చేస్తున్నారు. విద్య, ఉద్యోగాల్లో మైనార్టీలకు రిజర్వేషన్లు, చట్టసభల్లో మహిళలు, బీసీలకు రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ అంశాలపై కేంద్రంపై వత్తిడి తెస్తామని ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. రాష్ట్రానికి సంబంధించిన సాధ్యమైనన్ని ఎక్కువ విషయాలను ఉభయ సభల్లో ప్రస్తావనకు వచ్చే విధంగా చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌.. టీఆర్‌ఎస్‌ ఎంపీలను ఆదేశించారు. 

నేటి నుంచి ప్రపంచ తెలుగు మహాసభలు

హైదరాబాద్ : నేటి నుంచి ప్రపంచ తెలుగు మహాసభలు జరుగనున్నాయి. ఈ మహాసభలకు 40 దేశాల ప్రతినిధులు హాజరుకానున్నారు. జాతీయ గీతంతో మహాసభలు ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు బమ్మెర పోతన వేదికగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభ ఉపన్యాసం చేయనున్నారు. 

 

06:24 - December 15, 2017

హైదరాబాద్ : ఎక్కడకు వెళ్లాలో తెలియదు... ఎవరిని కలవాలో తెలియదు...బస ఎక్కడ ఏర్పాటు చేశారో అంతకన్నా తెలియదు. ఇదీ ఇతర రాష్ట్రాల నుంచి ప్రపంచ తెలుగు మ‌హాస‌భ‌ల్లో పాల్గొనేందుకు వచ్చిన సాహితీప్రియుల ఆవేదన. ప్రపంచ తెలుగు మ‌హాస‌భ‌లకు వస్తున్న భాషాప్రియులను పట్టించుకునే వారే కరువయ్యారని పెదవి విరుస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మ‌హాస‌భ‌ల ఏర్పాట్లపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పలువురు సాహితీప్రియులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మ‌హాస‌భల్లో పేర్లు నమోదు చేస్తుకున్న కవులు, రచయితలకు ఇస్తున్న కిట్ల పంపిణిలో గందర‌గోళం నెల‌కొంది. శుక్రవారం నుంచి మహాసభలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో..ఆన్‌లైన్‌లో పేర్లు రిజిస్ట్రర్‌ చేకుకున్నవారికి ర‌వీంద్రభార‌తిలో కిట్ల పంపిణి కార్యక్రమం చేపట్టారు. ఈ కిట్లలో తెలంగాణ చ‌రిత్రకు సంబంధించిన బుక్ లెట్, తెలుగు వాచ‌కం, గుర్తింపు కార్డు, ప్రశంసా ప‌త్రం పొందుప‌రిచారు. అయితే ప్రస్తుతం హైదరాబాద్‌ పరిసర ప్రాంతాలకు చెందిన వారికి మాత్రమే కిట్ల పంపిణి చేస్తున్నట్లు చెప్పడంతో.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన సాహితీప్రియులు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు భాషపై అభిమానంతో వ్యయప్రయాసలకొర్చి దూరప్రాంతాల నుంచి వచ్చామని..అధికారుల స్పందన సరిగా లేదని సాహితీప్రియులు వాపోతున్నారు.. ఇతర రాష్ట్రాల నుంచి వ‌చ్చిన వారికి కిట్ల పంపిణి, భోజన వసతి, బస ఏర్పాట్లపై కనీస సమాచారం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మ‌హాస‌భ‌లు ప్రారంభం కాక‌ముందే, రిజిస్ట్రేష‌న్ గ‌డువు ముగిసిపోయిందని చెప్పడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని సాహితీవేత్తలు కోరుతున్నారు.

06:23 - December 15, 2017

హైదరాబాద్ : ప్రపంచ తెలుగు మహాసభలకు భాగ్య నగరం సిద్ధమైంది. తెలుగు సాహితీకారులకు ఆతిథ్యం ఇచ్చేందుకు.. చార్‌ సౌ షహర్‌.. సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో.. నేడు ప్రారంభంకానున్న ప్రపంచ తెలుగు మహాసభల విశేషాలపై 10.టి.వి. రిపోర్ట్...ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రపంచ తెలుగు మహా సభలు హైదరాబాద్‌లో శుక్రవారం నుంచి ప్రారంభంకానున్నాయి. 19వ తేదీ వరకు ఈ సభలు జరుగుతాయి. ప్రపంచ తెలుగు సభల ప్రారంభ సమావేశానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ముగింపు సభకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.

కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజూ ఎల్‌బీ స్టేడియంలో సాయంత్రం 5.30 నుంచి రాత్రి 9.30 వరకు కార్యక్రమాలు జరుగనున్నాయి. మూడు రోజుల పాటు రెండేసి గంటలు సాహిత్య సదస్సులు.. రెండున్నర గంటల పాటు సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి. అలాగే లలితకళా తోరణంలో జానపద కళల ప్రదర్శన .. రవీంద్ర భారతిలో శాస్త్రీయ కళల ప్రదర్శన, రవీంద్ర భారతి మినీ స్టేడియంలో అష్టావధానాలు, సారస్వత పరిషత్‌లో శతావధానం, ఇండోర్ స్టేడియంలో బృహత్ కవి సమ్మేళనాలు ఉంటాయని సంబంధిత అధికారులు తెలిపారు.

ఈ సభలకు ఇతర దేశాల నుంచి ఐదు వందల మంది... ఇతర రాష్ర్టాల నుంచి 1500 మంది ప్రతినిధులు రానున్నారు. స్థానికంగా ఆరు వేల మంది వరకూ హాజరుకానున్నారు. అలాగే ప్రభుత్వం ఈ సభలకు జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీతలు ప్రతిభా రే, సీతాకాంత్ మహాపాత్రో, సత్యవ్రత శాస్త్రీలను ఆహ్వానించింది. అలాగే 14 భాషలలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు అందుకున్న సాహితీమూర్తులను ఆహ్వానించారు. అదేవిధంగా వివిధ రాష్ట్రాలకు చెందిన కవులు, పండితులు, విమర్శకులు, సాహితీవేత్తలు సభలకు వస్తున్నారు. ఆహూతులను అలరించేలా స్టేడియం లోపల ఎనిమిది విశిష్ట ద్వారాలను ఏర్పాటు చేశారు.. ఆ ద్వారాలకు సుప్రసిద్ధ కవుల పేర్లు పెట్టారు.

మహాసభల్లో పాల్గొనే అతిథులు కనివినీ ఎరగని అద్భుతమైన విందును ఆస్వాదించబోతున్నారు. తెలంగాణలోని దాదాపు అన్ని ప్రముఖ వంటలు.. మెనూలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విందులో సకినాలు, మలీద ముద్దలు, సర్వపిండి, చింతకాయ తొక్కు, పచ్చిపులుసు, పుంటికూర తొక్కు, గుత్తివంకాయ కూర, పచ్చిమిరపకాయ తొక్కు, బొబ్బెర గుడాలు, శనిగ గుడాలు, ఇలా సుమారు 40 రకాల వంటలను ప్రతినిధులకు వడ్డించనున్నారు... సభల నేపథ్యంలో నగరంలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీంతో విద్యుత్‌ అలంకరణలతో... నగరం కొత్త కాంతులీనుతోంది. అన్ని పార్కులు, కూడళ్లలో పవర్ క్యాన్ దీపాలను ఏర్పాటు చేశారు.. నగరంలోని అన్ని ప్రధాన రహదారుల వెంబడీ పండుగ వాతావరణం కనిపిస్తోంది. 

చర్లపల్లి సెంట్రల్ జైలు వార్డర్ సస్పెండ్..

హైదరాబాద్ : చర్లపల్లి సెంట్రల్ జైలు వార్డర్ రఫీక్ ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. విచారణ తరువాత చర్లపల్లి జైలు డిప్యూటి సూపరింటెండెంట్ చింతల దశరథంపై కూడా చర్యలకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. 

తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం..

చిత్తూరు : తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ అదుపు తప్పడంతో ఒకరికి గాయాలయ్యాయి. మద్యం మత్తులో వాహనం నడిపినట్లు తెలుస్తోంది....

గుజరాత్ పోలింగ్..ఎగ్జిట్ పోల్స్...

ఢిల్లీ : గుజరాత్‌ పీఠం మళ్లీ బీజేపీదేనా? హిమాచల్‌.. కమలదళం ఖాతాలో చేరుతుందా..? ఈ ప్రశ్నలకు అవుననే అంటున్నాయి ఎగ్జిట్‌ పోల్స్‌. హోరాహోరీగా తలపడిన గుజరాత్‌లో బీజేపీ మరోసారి సీఎం పీఠాన్ని దక్కించుకుంటుందని సర్వేలు తేల్చాయి. అటు హిమాచల్‌లో కాంగ్రెస్‌కు పరాభవం తప్పదని అన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ ఘంటాపథంగా తేల్చిచెప్పాయి. 

ముగిసిన గుజరాత్ మలివిడత ఎన్నికల పోలింగ్...

ఢిల్లీ : గుజరాత్‌ అసెంబ్లీ మలివిడత ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. తుది దశ ఎన్నికల్లో 68.70 శాతం పోలింగ్‌ నమోదైంది. ప్రధాని నరేంద్రమోది ఓటు వేసిన తర్వాత ఇంక్‌ వేసిన వేలును చూపిస్తూ రోడ్‌ షో నిర్వహించడంపై కాంగ్రెస్‌ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది.

మహాసభలో తెలంగాణ వంటకాలు..

హైదరాబాద్ : ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనే అతిథులు కనివినీ ఎరగని అద్భుతమైన విందును ఆస్వాదించబోతున్నారు. తెలంగాణలోని దాదాపు అన్ని ప్రముఖ వంటలు.. మెనూలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విందులో సకినాలు, మలీద ముద్దలు, సర్వపిండి, చింతకాయ తొక్కు, పచ్చిపులుసు, పుంటికూర తొక్కు, గుత్తివంకాయ కూర, పచ్చిమిరపకాయ తొక్కు, బొబ్బెర గుడాలు, శనిగ గుడాలు, ఇలా సుమారు 40 రకాల వంటలను ప్రతినిధులకు వడ్డించనున్నారు.

జనసేనకు ఆదిలోనే చుక్కెదురు..

గుంటూరు : జనసేనకు ఆదిలోనే చుక్కెదురైంది. చినకాకనిలో ఉన్న పార్టీ కార్యాలయ స్థలంపై వివాదం చోటుచేసుకుంది. ఆ స్థలం మైనార్టీకి చెందిన వ్యక్తులదంటూ ముస్లిం ఐక్య వేదిక ఆరోపిస్తోంది. ఈ స్థలంపై 1958 నుంచి యార్లగడ్డ సుబ్బారావు, ముగ్ధం మోహిద్దున్‌- జక్రియాల మధ్య వివాదం నడుస్తోంది.

వ్య.కా.స. ద్వితీయ మహాసభలు...రెండో రోజు..

నల్గొండ : జిల్లా మిర్యాలగూడలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ద్వితీయ మహాసభలు కొనసాగుతున్నాయి. మొదటి రోజు జరిగిన సభలో బృందా కరత్ పాల్గొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై నిప్పులు చెరిగారు. 

హెరిటేజ్ సంస్థకు అవార్డు..

ఢిల్లీ : ఇంధన పొదుపులో హెరిటేజ్ సంస్థకు అవార్డు వచ్చింది. గురువారం ఢిల్లీలో జరిగిన జాతీయ ఇంధన పొదుపు సదస్సు కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పాల్గొన్నారు. కేంద్ర మంత్రి ఆర్కే సింగ్‌ చేతుల మీదుగా నారా బ్రాహ్మణి ఈ అవార్డును అందుకున్నారు.

నేటి నుండి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు

ఢిల్లీ : పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి. శీతాకాల పార్లమెంట్‌ సమావేశాల్లో కేంద్రం 14 కొత్త బిల్లులను ప్రవేశపెట్టనుంది. ఇందులో ముస్లిం మహిళల హక్కులకు సంబంధించిన ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు కూడా ఉంది. 25 పెండింగ్‌ బిల్లులను కూడా మళ్లీ టేబుల్‌పైకి తెచ్చే అవకాశం ఉంది. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు వచ్చే ఏడాది జనవరి 5 వరకు జరగనున్నాయి.

Don't Miss