Activities calendar

16 December 2017

22:00 - December 16, 2017

హైదరాబాద్ : కేసీఆర్ తెలంగాణ హీరో కాదు.. జీరో అని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సీపీఎం హైదరాబాద్  సెంట్రల్ సిటీ 21 వ మహాసభల్లో తమ్మినేని పాల్గొని, మాట్లాడారు. తెలంగాణ తెచ్చి  కేసీఆర్ ఏమీ సాధించలేకపోయారని ఆరోపించారు. స్వాతంత్ర్యం తెచ్చిన కాంగ్రెస్ ఏంటో తెలియడానికి 50 ఏళ్లు పట్టిందని.. కేసీఆర్ ఏంటో రాబోయే రోజుల్లో అందరికీ అర్ధం అవుతుందని అన్నారు. కమ్యూనిస్టు ఉద్యమాలను అడ్డుకుంటున్న శక్తుల ఆగడాలు, ఆటంకాలు అర్ధం చేసుకోవాలని తమ్మినేని అన్నారు. అంతకు ముందు తుకారంగేట్ నుంచి అడ్డగుట్టవరకూ భారీ ర్యాలీ జరిగింది. ర్యాలీలో పెద్ద ఎత్తున సీపీఎం నేతలు , కార్యకర్తలు పాల్గొన్నారు. 

 

21:56 - December 16, 2017

తూర్పు గోదావరి : పిఠాపురంలో జిల్లా 22వ సీపీఎం మహాసభలు జరుగుతున్నాయి. ఈ మహాసభలకు హాజరైన  సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు.. టీడీపీ వైఖరిపై విరుచుకుపడ్డారు. ప్రజాసమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రజాసమస్యలను లేవనెత్తుతున్న ప్రతిపక్షాలను నిరంకుశంగా అణిచివేసే దోరణి అవలంబిస్తున్నారన్నారు. 

 

21:52 - December 16, 2017

విశాఖ : హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధికి ఎంతో కృషి చేశానన్నారు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు. విశాఖలో జరుగుతున్న టెక్‌-2017 సదస్సును ప్రారంభించిన చంద్రబాబు.. ఏపీని నాలెడ్జ్ సొసైటీగా రూపొందించడమే తన లక్ష్యమన్నారు. ఐటీతో ప్రపంచం గ్లోబల్ విలేజ్‌గా మారిందని, ఇప్పుడు ఐవోటీ విప్లవం నడుస్తోందన్నారు. యువరక్తం, ఆంగ్ల భాషా నైపుణ్యం మనకు ప్లస్ పాయింట్ అని,.. నవ్యాంధ్రను గేమింగ్, యానిమేషన్ హబ్‌గా మారుస్తామన్నారు చంద్రబాబు. ఈ సదస్సు ద్వారా విశాఖ గేమింగ్‌, యానిమేషన్‌ రంగాల్లో దూసుకుపోతుందన్న ఆశాభావాన్ని చంద్రబాబు వ్యక్తం చేశారు. 

 

21:50 - December 16, 2017

హైదరాబాద్ : ఆదివాసీలు, లంబాడీలు సంయమనం పాటించాలని.. సమస్యలను చర్చలతో పరిష్కరించుకోవాలని అన్ని వామపక్షపార్టీలు సూచించాయి. షెడ్యూల్‌ తెగల ప్రజలు ఘర్షణలకు దిగడం ఆందోళనకరమని అన్నాయి. విబేధాలు, సమస్యల పరిష్కారానికి ఘర్షణలు, దాడులు ఎంత మాత్రం పరిష్కారం కాదని లెఫ్ట్‌ పార్టీలు అభిప్రాయపడ్డాయి. ఎస్టీల వివాదాన్ని కేసీఆర్‌ ప్రభుత్వం పట్టించుకోకుండా చోద్యం చూస్తుందని.. కొంతమంది స్వార్థ రాజకీయ శక్తులు చిచ్చును రేపుతున్నాయని వామపక్ష పార్టీలు ఆరోపించాయి. ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని..  షెడ్యూల్‌ తెగల మధ్య శాశ్వత పరిష్కారం ఆలోచించాలని డిమాండ్‌ చేశాయి. 

తెలంగాణలో కలెక్టర్ల బదిలీలు

హైదరాబాద్ : ఉట్నూరు అల్లర్ల నేపథ్యంలో ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌ జిల్లాల కలెక్టర్లపై బదిలీ వేటు పడింది. అలాగే పలువురు ఎస్పీలకు స్థాన చలనం కలిగింది. బదిలీల్లో భాగంగా వికారాబాద్ జిల్లా కలెక్టర్ దివ్యను.. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌గా నియమించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్‌కు వికారాబాద్ జిల్లా కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ ను.. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్‌గా నియమించారు. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలికి వరంగల్ రూరల్ జిల్లా బాధ్యతలు అప్పగించారు. నిర్మల్ కలెక్టర్‌గా ప్రశాంతిని నియమించారు.

కొత్తగా 9 మండలాల ఏర్పాటుకు ఏపీ కేబినెట్‌ ఆమోదం

గుంటూరు : ఏపీ కేబినెట్‌ ఐదున్నర గంటలుగా కొనసాగుతోంది. రాష్ట్రంలో కొత్తగా తొమ్మిది మండలాల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 2017 ఏపీ పోలీస్‌ ముసాయిదా బిల్లుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ఈ బిల్లుతో ముగ్గురు సభ్యులు ఉన్న ప్యానల్‌.. డీజీపీని ఎన్నుకునే అవకాశం ఉంది. ఇక కేబినెట్‌ సమావేశంలో పోలవరంపై చర్చ జరిగింది. తాజాగా పిలిచిన 1,480 కోట్ల టెండర్లను తాత్కాలికం నిలిపివేయాలని నిర్ణయించారు. దీనిపై నెల రోజుల తర్వాత నిర్ణయం తీసుకోవాలని మంత్రిమండలిలో నిర్ణయం తీసుకున్నారు. 

21:46 - December 16, 2017

హైదరాబాద్ : ఉట్నూరు అల్లర్ల నేపథ్యంలో ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌ జిల్లాల కలెక్టర్లపై బదిలీ వేటు పడింది. అలాగే పలువురు ఎస్పీలకు స్థాన చలనం కలిగింది. బదిలీల్లో భాగంగా వికారాబాద్ జిల్లా కలెక్టర్ దివ్యను.. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌గా నియమించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్‌కు వికారాబాద్ జిల్లా కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ ను.. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్‌గా నియమించారు. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలికి వరంగల్ రూరల్ జిల్లా బాధ్యతలు అప్పగించారు. నిర్మల్ కలెక్టర్‌గా ప్రశాంతిని నియమించారు. ఇక హైదరాబాద్ జాయింట్ సీపీ ప్రమోద్ కుమార్ కరీంనగర్ డీఐజీగా నియమితులయ్యారు. ప్రస్తుత కరీంనగర్ డీఐజీ రవి వర్మను డీజీపీ ఆఫీస్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. నిర్మల్ ఎస్పీ విష్ణు ఎస్. వారియర్‌ను ఆదిలాబాద్‌కు... కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ శ్రీనివాసులును డీజీపీ ఆఫీసుకు రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. నాగర్ కర్నూల్ ఎస్పీ కల్మేశ్వర్ ను.. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీగా బదిలీ అయ్యారు. నాగర్ కర్నూల్ ఎస్పీగా సన్ ప్రీత్ సింగ్‌ను నియమించారు.

 

21:44 - December 16, 2017

గుంటూరు : ఏపీ కేబినెట్‌ ఐదున్నర గంటలుగా కొనసాగుతోంది. రాష్ట్రంలో కొత్తగా తొమ్మిది మండలాల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 2017 ఏపీ పోలీస్‌ ముసాయిదా బిల్లుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ఈ బిల్లుతో ముగ్గురు సభ్యులు ఉన్న ప్యానల్‌.. డీజీపీని ఎన్నుకునే అవకాశం ఉంది. ఇక కేబినెట్‌ సమావేశంలో పోలవరంపై చర్చ జరిగింది. తాజాగా పిలిచిన 1,480 కోట్ల టెండర్లను తాత్కాలికం నిలిపివేయాలని నిర్ణయించారు. దీనిపై నెల రోజుల తర్వాత నిర్ణయం తీసుకోవాలని మంత్రిమండలిలో నిర్ణయం తీసుకున్నారు. 

 

21:37 - December 16, 2017

మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డితో టెన్ టివి వన్ టు వన్ నిర్వహించింది. 'ఏం అశించి టీఆర్ఎస్ పార్టీలోకి చేరారు..? ఉమా మాధవరెడ్డికి రాజ్యసభనా.. ఎమ్మెల్సీనా..?, నయీంతో ఉమా మాధవరెడ్డికి సంబంధాలున్నాయా..?, చివరిసారిగా నయూంను ఎప్పుడు చూశారు..?, యాదాద్రి జిల్లాలో కొడుకు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నాడు..?, ఉమా మాధవరెడ్డి చంద్రబాబుకు ఏం చెప్పారు..?' ఈ అంశాలపై ఆమె మాట్లాడారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం....

 

21:33 - December 16, 2017

నేరేళ్ల బాధితులకు తప్పని తిప్పలు...కలెక్టర్ ఆఫీసుల ఆత్మహత్యాయత్నం, ముప్పై ఎన్మిది వేల ఉద్యోగాలిచ్చినం..తలసానిగారూ.. అవ్వతోడు నిజమేనా?, మైసమ్మ గుడి మీద మానవుల దాడి...ఘట్ కేసర్ కాడ గలీజు గాళ్ల పని, అంబులెన్సును ఆపేశ్న పోలీసులు...వైద్యం అందక అండ్లున్న పేషెంటు మృతి, ఐపీఎస్ ఐడీ కార్డేసుకున్న అవారాగాడు..ట్రైనింగ్ కోసం జైలుకు వంపిన పోలీసులు, నాగుంబాముకు.. జెర్రిపోతుకు పెండ్లి..విశ్వశాంతి కళ్యాణం కథ జూడరాండ్రి.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

21:24 - December 16, 2017

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీలో రాహుల్ పాత్ర, జాతీయ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు అనే అంశాలపై ప్రొ.నాగేశ్వర్ తో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. 
రాజకీయాల్లో సంక్షోభం సహజం
'ప్రజాస్వామ్య రాజరికం కాంగ్రెస్ కే పరిమితం కాదు. భారత రాజకీయాల్లోనే ప్రజాస్వామిక రాజరికం ఉంది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో వారసత్వ రాజకీయాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి సంక్షోభం కొత్తకాదు. రాజకీయాల్లో సంక్షోభం సహజం. ప్రజా అనుకూల విధానాలతోనే నాయకులకు మంచి పేరు వస్తుంది. నాయకులు చరిత్రను సృష్టించలేరు. చరిత్రే నాయకులను సృష్టిస్తుంది. తెలంగాణ ఉద్యమం లేకుంటే కేసీఆర్, కేటీఆర్ ఈ స్థాయిలో ఉండేవారు కాదు. ఓటములను నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి. 
సరైన విధానాలు అనుసరిస్తే ఉపయోగం
బీజేపీ అనుసరించే విధానాలకు ప్రత్యామ్నాయంగా ఏ విధానాలు అవలంభిస్తారనే అంశంపై పైనే కాంగ్రెస్ పార్టీ బలోపేతం ఆధారపడుతుంది. మోడీ గొప్పనాయకుడు కాదు.. రాహుల్ చేతగాని నాయకుడు కాడు. పార్టీ ఓడిపోయే దశ వస్తే ఎలాంటి నాయకుడైన వేస్ట్.. పార్టీ గెలిచి దశ వస్తే ఎలాంటి నాయకుడైన గెలుస్తాడు. సందర్భాన్ని బట్టి నాయకులు తయారు అవుతారు. విధానాలు నిర్ణయించేది వయస్సు కాదు. విధానాలు అనుసరించే అంశమే ముఖ్యం. వయసు ఆధారిత సిద్ధాంతాన్ని నేను అంగీకరించను. సరైన విధానాలు అనుసరిస్తే ఉపయోగం. రాజకీయాల్లో చాలా మంది అసమర్థలు ఉన్నారు. 
ప్రజా ఉద్యమాలతోనే రాహుల్ కు ఇమేజ్
బలమైన ప్రజా ఉద్యమాలకు రాహుల్ నాయకత్వం వహిస్తేనే నాయకుడు అవుతాడు. ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి రాహుల్ కు మంచి నాయకుడిగా ఎదిగే అవకాశం ఉంది. ప్రజా సమస్యలపై రాహుల్ పోరాటాలు చేయాలి.. అందుకు పార్టీ యంత్రాంగాన్ని కదిలించాలి. ప్రజా ఉద్యమాలను నిర్మించాలి. బీజేపీ హిందూ పార్టీగానే ఉంది. ప్యాన్ ఇండియాగా ఏ పార్టీ లేదు. కాంగ్రెస్ పార్టీలో కేంద్రంలో ఉన్న ఒక నాయకుని చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. స్థానికంగా పార్టీని బలోపేతం చేసుకోవాలి'. అని అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:01 - December 16, 2017

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం అజ్ఞాతవాసి చిత్ర టీజర్‌ను విడుదలైంది. పంచ్‌డైలాగ్‌లకు దూరంగా సరిగమల సంగీతంతో టీజర్ రూపొందించారు. ఓ మై గాడ్‌ అనే ఒక్క డైలాగ్‌ను మాత్రమే పవన్‌ ఇందులో పలికారు. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2018 జనవరి 10న విడుదల కానుంది. 

 

20:59 - December 16, 2017

హైదరాబాద్ : తన కుమారుడిని కోడలు వనితారెడ్డి బ్లాక్‌మెయిల్‌ చేసిందని విజయ్‌ తండ్రి సుబ్బారావు ఆరోపించారు. తన కుమారుడికి ఎలాంటి వివాహేతర సంబంధాలు లేవని.. ప్రస్తుతం బయటకు వచ్చిన ఫోటోలు షార్ట్‌ఫిలింలోనివని ఆయన చెప్పారు. విజయ్‌తో సన్నిహితంగా ఉన్న అమ్మాయి బయటకు వస్తే అన్ని విషయాలు తెలుస్తాయంటున్న సుబ్బారావుతో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలను తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

20:53 - December 16, 2017

ఢిల్లీ : వచ్చే ఎన్నికల్లో ప్రియాంక గాంధీ రాయబరేలి లోక్‌సభ నుంచి పోటీ చేస్తారని మీడియాలో కథనాలు హల్‌ చల్‌ చేశాయి. దీనిపై ప్రియాంకా గాంధీ స్పందించారు. రాయబరేలీ నుంచి తాను పోటీ చేయబోతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ప్రియాంక స్పష్టం చేశారు. ఆ స్థానంలో తన తల్లి సోనియా గాంధీనే పోటీ చేస్తారని చెప్పారు. తాను చూసిన శక్తిమంతమైన మహిళల్లో సోనియా గాంధీ ఒకరని...ఆమె సేవలు పార్టీకి చాలా అవసరమని పేర్కొన్నారు. మరోవైపు రాహుల్‌ గాంధీ పట్టాభిషేకానికి  ప్రియాంకా గాంధీ తన భర్త రాబర్ట్‌ వాద్రాతో కలిసి హాజరయ్యారు. ప్రియాంకా గాంధీ అందర్నీ పలకరిస్తూ సందడి చేశారు.

 

20:51 - December 16, 2017

ఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్‌ గాంధీ బాధ్యతలను స్వీకరించారు. నెహ్రూ కుటుంబం నుంచి కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి చేపట్టిన ఆరో వ్యక్తిగా రాహుల్‌ నిలిచారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన రాహుల్‌కు సోనియాగాంధీ అభినందనలు, ఆశీస్సులు తెలియజేశారు. అధ్యక్షుడిగా రాహుల్‌ తన తొలి ప్రసంగంలోనే బిజెపిని టార్గెట్‌ చేశారు. బిజెపి దేశంలో మంటలు రేపుతోందని, హింసను వ్యాపింపజేస్తోందని మండిపడ్డారు. 

కాంగ్రెస్‌ పార్టీలో నూతన శకం ఆరంభమైంది. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్‌ గాంధీ బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్‌ ఎన్నికల సంఘం అధ్యక్షుడు రామచంద్రన్‌ -పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన రాహుల్‌ గాంధీకి ధృవీకరణ పత్రాన్ని అందజేశారు.

కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రాహుల్‌ గాంధీ తన తొలి ప్రసంగంలోనే బిజెపిని టార్గెట్‌ చేశారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని 21వ శతాబ్ధం వైపు తీసుకువెళ్లిందని, కానీ ప్రధాని మోదీ మాత్రం దేశాన్ని మళ్లీ మధ్యయుగంలోకి తీసుకువెళ్తున్నారని విమర్శించారు. దేశంలో ఒకసారి మంటలు రేగితే దాన్ని చల్లార్చడం అంత సులువు కాదన్నారు. వాళ్లు మంటలు రేపితే మనం చల్లార్చుదామన్నారు. దేశంలో బిజెపి హింసను సృష్టిస్తోందని...ఆ హింస దేశవ్యాప్తంగా ప్రజ్వరిల్లుతోందని రాహుల్‌ విమర్శించారు. బీజేపీ విద్వేషాలను ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలు మాత్రమే నిలువరించగలరని.... రాహుల్ తెలిపారు. 
రాహుల్‌ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సందర్భంగా సోనియాగాంధీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ అధ్యక్షురాలిగా తన ప్రస్తానాన్ని గుర్తు చేసుకుంటూ రాజీవ్‌ గాంధీతో పెళ్లయ్యాకే రాజకీయాలతో పరిచయమైందని తెలిపారు. గాంధీ, నెహ్రూ కుటుంబం  దేశం కోసం ఆస్తులు, కుటుంబ జీవనాన్ని త్యాగం చేసిందన్నారు. ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీ హత్యోదంతాలు తన జీవితాన్ని పూర్తిగా మార్చి వేశాయని చెప్పారు. రాహుల్‌గాంధీని శక్తిమంతమైన నేతగా సోనియా పేర్కొన్నారు. తన కుమారుడు రాహుల్‌ను ప్రశంసించడం భావ్యం కాదని... చిన్నతనంలోనే అతను హింస ప్రభావాన్ని ఎదుర్కొని నిలబడ్డాడని.... రాజకీయాల్లోకి వచ్చాక ఎన్నో వ్యక్తిగత విమర్శలను ఎదుర్కొన్నారని ఆమె తెలిపారు. దేశంలో భయానక వాతావరణం నెలకొందని, రాజ్యాంగ విలువలపై దాడి జరుగుతోందని సోనియా ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన కాంగ్రెస్‌ వెనకడుగు వేసే ప్రసక్తే లేదని...దేశ శ్రేయస్సు కోసం మా పోరాటం కొనసాగుతుందని సోనియా స్పష్టం చేశారు.

కాంగ్రెస్‌ పార్టీకి ఇది చారిత్రాత్మకమైన రోజని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అభివర్ణించారు. రాహుల్‌ గాంధీ దేశవ్యాప్తంగా పర్యటించారని...దేశంలోని అన్ని సమస్యలపై ఆయనకు అవగాహన ఉందన్నారు. రాహుల్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ ఉన్నత శిఖరాలకు చేరుతుందన్న ఆకాంక్షను వ్యక్త పరిచారు.

రాహుల్‌ అధ్యక్ష పదవీ స్వీకార వేడుక సందర్భంగా ఏఐసీసీ ప్రధాన కార్యాలయమంతా పండుగ వాతావరణం నెలకొంది. ఆ ప్రాంగణమంతా రాహుల్‌.. రాహుల్‌ నినాదాలతో హోరెత్తిపోయింది. టపాసులు కాలుస్తూ.. మిఠాయిలు పంచుకుంటూ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.


 

ట్రాన్స్ జెండర్ పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం

అమరావతి : ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ట్రాన్స్ జెండర్ పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ట్రాన్స్ జెండర్లకు రూ.1500 పెన్షన్, ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులకు ఆమోదం తెలిపారు.

ఏపీలో 9 అర్బన్ మండలాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం

అమరావతి : ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ఏపీలో 9 అర్బన్ మండలాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 

 

2017 ఏపీ పోలీస్ ముసాయిదా బిల్లుకు ఏపీ కేబినెట్ ఆమోదం

అమరావతి : ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. 2017 ఏపీ పోలీస్ ముసాయిదా బిల్లుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.

2వ రోజు కొనసాగుతున్న ప్రపంచ తెలుగు మహాసభలు

హైదరాబాద్ : ప్రపంచ తెలుగు మహాసభలు 2వ రోజు కొనసాగుతున్నాయి. తెలంగాణ తెలుగు భాషా వికాసంపై సాహిత్య సభ నిర్వహిస్తున్నారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, కవులు, రచయితలు, సాహితీవేత్తలు హాజరయ్యారు. 

 

టేబుల్ ఐటమ్ గా పోలవరం అంశం

అమరావతి : ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. టేబుల్ ఐటమ్ గా పోలవరం అంశాన్ని తీసుకున్నారు. 23న కేంద్రమంత్రి గడ్కరీ రాక సందర్భంగా చర్చించనున్నారు. 

 

20:15 - December 16, 2017

విజయనగరం : సర్ప కల్యాణం..! ఇదేంటి అనుకుంటున్నారా..? అవునండి పాముల పెళ్లి...! పాములేంటి..? వాటికి పెళ్లేంటి అని మళ్లీ ఆశ్చర్యపోకండి.. ఈ కార్యక్రమం విజయనగరం జిల్లాలో జరిగింది. రెండు విషసర్పాలకు కన్నులపండువగా కల్యాణం జరిపించి.. ఒక్కటి చేశారక్కడి ప్రజలు.

పాములకు పెళ్లిళ్లు జరగడం తెలుగు రాష్ట్రాల ప్రజలకు వింతగానే ఉంటుంది. కానీ ఈ తరహా ఆచారం తమిళనాడులో చాలాకాలంగానే సాగుతోంది. అదే పద్ధతిలోనే ఇప్పుడు విజయనగరం జిల్లా పార్వతీపురంలో సంప్రదాయ బద్ధంగా.. అచ్చంగా మనుషులకు చేసినట్లుగానే కల్యాణం జరిపించారు. 

విశ్వశాంతి కోసం.. పూర్వం పర్లాకిమిడి మండలం రాజులు ఇలాగే నాగుల వివాహం జరిపించేవారట. ఇప్పుడు పార్వతీపురం లోని దుర్గమ్మ ఆలయాన్ని కాలసర్పదోషం వేధిస్తోందట. దాని నివారణతో పాటు.. విశ్వశాంతికీ.. సర్పకల్యాణమే పరిష్కారమని సిద్ధాంతులు సూచించారట. ఇంకేముందీ.. జనం తక్షణమే రంగంలోకి దిగి.. నాగుపాముకు, నాగజెర్రికి వివాహం చేయించారు. 

లోకకల్యాణార్థం అంటూ జరిపిన పాములకు పెళ్లికి.. జనం తండోపతండాలుగా హాజరయ్యారు. తామూ ఓ చేయి వేసి స్నానాలు చేసి.. బాసికాలు కట్టి.. అక్షితలు వేసి.. పెళ్లి జరిపించేశారు. ఇంతా చేసి.. ఈ పెళ్లి ఆ పాములకు ఇష్టమో లేదో అంటూ గుసగుసలాడినవారూ లేక పోలేదు. ఏమైనా, రాకెట్‌యుగంలో కూడా.. ఇంకా ఇలాంటి ఆచారాలతో.. పాములను హింసించడం  ఏంటని సైన్స్‌ ప్రియులు ప్రశ్నిస్తున్నారు. 

20:08 - December 16, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభల సందర్బంగా.. ఎల్బీ స్డేడియంలో అనేక రకాల స్టాల్స్‌ ఏర్పాటు చేశారు. ఇందులో ప్రధానంగా బందరు లడ్డూ అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. దాదాపు 60 సంవత్సరాల చరిత్ర ఉన్న మచీలిపట్నం మల్లయ్య స్వీట్స్‌కు చెందిన బందరు లడ్డును కోనుగోలు చేసేందుకు పలువురు ఆసక్తి కనబరుస్తున్నారు. తమకు స్టాల్‌ పెట్టుకునేందుకు అవకాశం కల్పించిన తెలంగాణ ప్రభుత్వానికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. బందరు లడ్డుకు చెందిన మరిన్ని విశేషాలను వీడియోలో చూద్దాం...

 

20:05 - December 16, 2017

విశాఖ : ఎంపీ హరిబాబు ఇంటిని జనసేన కార్యకర్తలు ముట్టడించారు. డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాను ప్రైవేటు పరం చేస్తుంటే ఎందుకు మాట్లాడటం లేదని జనసేన కార్యకర్తలు ప్రశ్నించారు. దక్షణ భారతదేశంపై ఎందుకు వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. 

20:04 - December 16, 2017

రాజమండ్రి : మత్తు మందులు అమ్ముతున్న ఐదుగురు ముఠా సభ్యులను రాజమండ్రి వన్‌టౌన్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజమండ్రి మెయిన్‌ రోడ్డులో విజయ టాకీస్ వెనుక వీధి.. సాయి కృష్ణ థియేటర్‌ రోడ్డు వద్ద అర్ధరాత్రి అనుమానంగా సంచరిస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారించామని.. వారి దగ్గర భారీ స్థాయిలో మత్తు ఇంజక్షన్లు, మత్తు మందులు లభ్యమయ్యాయని పోలీసులు చెప్పారు. అలాగే వారి దగ్గర నుంచి ఐదు సెల్‌ఫోన్లు, మూడు వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. వీరు ఈ మత్తు ఇంజక్షన్లను  ఒక్కొక్కటీ ఐదు రూపాయలకు కొని వాటిని మార్కెట్‌లో రెండు వందలకు విక్రయిస్తున్నట్టు ఎస్పీ బి. రాజకుమారి చెప్పారు.  వీరిపై డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ ఆక్ట్ కింద పలు సెక్షన్ల కింద కేసులను నమోదు చేశామని ఆమె చెప్పారు.

 

19:48 - December 16, 2017

అనంతపురం : జిల్లాలోని పుట్టపర్తి చిత్రావతి నదిలో ఇసుక మాఫియాపై 10టీవీలో ప్రసారమైన కథనాలపై అధికారులు స్పందించారు. ఇంచార్జ్ కలెక్టర్‌ రమామణి ఆర్డీవోతో విచారణకు ఆదేశించారు. రూ.4 కోట్లు విలువ చేసే ఇసుకను రికవరి చేస్తామని రమామణి చెప్పారు. 

 

19:45 - December 16, 2017

గుంటూరు : ఈ నెల 20 నుండి 26 వరకు చంద్రన్న క్రిస్మస్‌ కానుక,.. జనవరి 1 నుండి 16 వరకు చంద్రన్న సంక్రాంతి కానుకలు అందజేస్తామని మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. 226 రూపాయలు విలువ చేసే కిట్‌లో 7 రకాల వస్తువులు అందజేస్తామని తెలిపారు. లబ్ధిదారులకు ఇచ్చే వస్తువుల్లో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 

 

విశాఖ జిల్లాలో చెలరేగిన మంటలు

విశాఖ : కంచరపాలెం సమీపంలో కప్పరాడ కొండపై మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగిసిపడుతుండటంతో... స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కొండవాలు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారిని అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. మంటలు భారీగా చెలరేగడంతో.. అదుపు చేయడం కష్టంగా ఉంది. 

19:31 - December 16, 2017

విశాఖ : కంచరపాలెం సమీపంలో కప్పరాడ కొండపై మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగిసిపడుతుండటంతో... స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కొండవాలు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారిని అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. మంటలు భారీగా చెలరేగడంతో.. అదుపు చేయడం కష్టంగా ఉంది. 

 

19:18 - December 16, 2017

గుంటూరు : ఏపీ కేబినేట్‌ సమావేశం రెండు గంటలుగా కొనసాగుతోంది. 10 అజెండాలపై భేటీలో చర్చిస్తున్నారు. టేబుల్ ఐటమ్‌గా పోలవరం అంశాన్ని తీసుకున్నారు. 23న గడ్కరీ రాక నేపథ్యంలో పోలవరానికి సంబంధించిన పలు అంశాలపై చర్చిస్తున్నారు. పోలవరం, 23న నితిన్ గడ్కరీ రాక, ఏపీ అసెంబ్లీ డిజైన్స్‌ కు ఆమోదంపై చర్చ జరుగుతోంది. కొత్త పెన్షన్లు, జనవరి 2 నుంచి జన్మభూమి కార్యకర్ంతో పాటు ... అశోక్ లేలాండ్ సంస్థకు భూ కేటాయింపులపై చర్చిస్తున్నారు. 2014 పోలీస్ యాక్ట్‌ను కేబినెట్ ఉపసంహరించనుంది. కర్నాటక తరహాలో ఏపీ ప్రభుత్వమే డీజీపీని నియమించేలా...ఆర్డినెన్స్‌కు మంత్రివర్గం ఆమోద ముద్ర వేయనుంది. ఏపీ అసెంబ్లీ డిజైన్లపై కూడా కేబినెట్ చర్చిస్తోంది. టవర్ ఆకృతి డిజైన్‌కు మంత్రివర్గం ఓకే చెప్పనుంది. జనవరి 2 నుంచి 11 వరకు జన్మభూమి కార్యక్రమంపై చర్చిస్తున్నారు. కొత్త పెన్షన్లు ఇచ్చే అంశంపై మంత్రివర్గంలో డిస్కషన్ జరుగుతోంది. 

19:05 - December 16, 2017

హైదరాబాద్ : హాస్యనటుడు విజయ్‌సాయికి వేరే అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయని వనితారెడ్డి సోదరుడు రామచంద్రారెడ్డి తెలిపారు. ఓ మోడల్‌తో విజయ్‌కి రెండో పెళ్లి కూడా జరిగిందని చెప్పారు. అక్క వనిత దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. అన్ని వివరాలతో వనితారెడ్డి పోలీసుల ముందుకు వస్తుందని తెలిపారు. విజయ్‌ ఆత్మహత్యకు తన అక్క కారణం కాదని రామచంద్రారెడ్డి చెప్పారు.    

18:59 - December 16, 2017

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలు రెండో రోజు కొనసాగుతున్నాయి. నాంపల్లిలోని ఇందిరా ప్రయదర్శిని ఆడిటోరియంలో 700 మంది కవులతో కవి సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ ఖ్యాతిని కవులను కళాకారులను ప్రపంచ స్థాయిలో చాటి చెప్పేందుకు ఈ సభలను జరుపుతున్నట్టు ఆర్ధికశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ అన్నారు. ఈమేరకు ఆయనతో టెన్ టివి ఫేస్ టూ ఫేస్ నిర్వహించింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గజ్జకట్టిన కవులను, కళాకారులను విస్మరించారని వస్తున్న వార్తలపై స్పందిస్తామని అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

18:54 - December 16, 2017

హైదరాబాద్ : అప్పుడు ఇప్పుడు అంటూ గడువు పెంచుతూ వస్తున్న ఎల్‌ఆర్‌ఎస్‌ ఫైళ్లను క్లియర్‌ చెయ్యడంలో వేగం పెంచింది జీహెచ్‌ఎంసీ... ఇప్పటి వరకు జరిగిన ఆలస్యంపై చర్చించిన అధికారులు వేగం పెంచారు. ప్రత్యేక మేళాలను ఏర్పాటు చేస్తూ పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిష్కరిస్తున్నారు. మరోవైపు గతంలో పెట్టిన మేళాలో ఇచ్చిన దరఖాస్తులు ఇప్పుడు కూడా క్లియర్‌ చెయ్యలేదంటూ దరఖాస్తు దారులు మండిపడుతున్నారు. మరికొన్ని రోజుల్లో అన్ని ఫైళ్లు క్లియర్‌ అవుతాయని జీహెచ్‌ఎంసీ వర్గాలు అంటున్నారు.
లే అవుట్‌ రెగ్యూలరైజేషన్‌ స్కీమ్‌కు ప్రభుత్వం అనుమతి
లే అవుట్‌ రెగ్యూలరైజేషన్‌ స్కీమ్‌కు 2016 అక్టోబర్‌లో ప్రభుత్వం అనుమతిచ్చింది. ఆరు నెలల్లో దరఖాస్తులన్నింటిని డిస్పోజ్‌ చేస్తామని అప్పట్లో ప్రకటించింది. అయితే వివిధ కారణాలతో ఈ కార్యక్రమం ఆలస్యమవుతోంది. ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీమ్‌ను వేగంగా పూర్తి చేయ్యాలని అధికారులు నిర్ణయించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం 85,337 దరఖాస్తులు రాగా.  వాటిలో 12,000 వరకు మాత్రమే జీహెచ్‌ఎంసీ ఎల్‌ఆర్‌ఎస్‌ ఆమోద పత్రాలు ఇచ్చింది.
13,335 దరఖాస్తుల తిరస్కరణ
జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్‌ అధికారులు 13,335 దరఖాస్తులును పరిశీలించగా... కనీస రుసుము 10వేల రూపాయలు కూడా చెల్లించకపోవడంతో వాటిని ప్రైమరీ దశలోనే తిరస్కరించారు. చెరువు శిఖం భూములు, ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్న భూములు, ప్రభుత్వ భూములు, నాలాల్లో ఉన్న భూముల్లోని లేఅవుట్లకు కూడా రెగ్యూలరైజేషన్‌ దరఖాస్తులు వచ్చాయి. ఇలాంటివి 3,675 దరఖాస్తులను తిరస్కరించారు. ఇప్పటి వరకు పరిశీలించిన వాటిలో 39,024 దరఖాస్తుల్లో పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో డాక్యుమెంట్లు లేవని.. వాటిని సబ్మిట్‌ చెయ్యాలంటూ దరఖాస్తు దారులను కోరారు. అయితే వీరిలో కేవలం 6000 మంది మాత్రమే స్పందించగా... మిగిలినవారు ఇంకా డాక్యుమెంట్లు సబ్మిట్‌ చెయ్యలేదు.
ఇంకా పరిశీలించాల్సిన 9,000 దరఖాస్తులు
ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం వచ్చిన దరఖాస్తుల్లో ఇంకా 9,000 దరఖాస్తులను పరిశీలించాల్సింది ఉంది. క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాల్సిన దరఖాస్తుల్లో అత్యధికంగా ఈస్ట్‌జోన్‌లో ఉన్నాయి. దాంతో హెడ్‌ ఆఫీస్‌.. ఇతర సర్కిళ్లకు చెందిన టౌన్‌ ప్లానింగ్‌ అధికారులను రంగంలోకి దింపి అవసరమైన పత్రాలు పరిశీలించి అక్కడికక్కడే సమస్యలు పరిష్కరిస్తున్నారు. దరఖాస్తుదారులు నెలల తరబడి అధికారుల చుట్టూ తిరుగుతున్న తమ పనులు పూర్తి కావడం లేదంటున్నారు. ముందు జరిగిన మేళాలో నా దరఖాస్తు పరిస్థితేంటో ఇప్పుడు కూడా అలానే ఉందంటున్నారు. ఓ వైపు ప్రభుత్వం రెగ్యూలరైజేషన్‌ స్కీం ప్రవేశపెట్టి ఏడాది దాటిన ఇంకా పూర్తి కాలేదు. అధికారులు వేగం పెంచుతున్నామని చెప్పినా.. మేళాలు చేపడుతున్నా అధికారులు సరైన సమాధానం ఇవ్వడం లేదని కొందరు దరఖాస్తుదారులు అంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చొరవ తీసుకుని తమ సమస్యలు పరిష్కరిచాలని కొరుతున్నారు.

18:30 - December 16, 2017

హైదరాబాద్‌ : నగరంలోని మాదాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఎన్‌సీసీ కన్‌స్ట్రక్షన్‌ ప్రధాన కార్యాలయంలో లిఫ్ట్‌ రిపేరింగ్‌ చేస్తున్న ఇద్దరు కార్మికులు మృత్యువాత పడ్డారు. బిల్డింగ్‌ సెల్లార్‌లో లిఫ్ట్‌ రిపేర్‌ చేస్తున్న నాగరాజు, రమేష్‌లపైకి.. హటాత్తుగా పదకొండో అంతస్తు నుండి లిఫ్ట్‌ ఒక్కసారిగా కిందకు పడటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ఆసుపత్రికి తరలించచే ప్రయత్నం చేస్తుండగా.. మృతుల బంధువులు అడ్డుకున్నారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలంటూ డిమాండ్‌ చేశారు. పోలీసులు మృతదేహాలను బలవంతంగా తరలించారు.

 

 

17:53 - December 16, 2017

హైదరాబాద్ : హాస్యనటుడు విజయ్‌సాయికి వేరే అమ్మాయితో అఫైర్‌ ఉన్నట్లు అతని భార్య వనితారెడ్డి ఆరోపించారు. విజయ్‌సాయి మరో యువతితో సన్నిహితంగా ఉన్న ఫొటోలను ఆమె మీడియాకు పంపించారు. విజయ్‌సాయి ఆత్మహత్యకు తాను కారణం కాదన్నారు. అన్ని విషయాలతో పోలీసుల ముందు లొంగిపోతానని తెలిపారు. పోలీసులకు సారీ చెప్పారు. వనితారెడ్డి, అడ్వకేట్‌ శ్రీనివాస్‌ నాలుగు రోజులుగా అజ్ఞాతంలోనే ఉన్నారు. వీరి కోసం పోలీసులు రెండు బృందాలుగా గాలిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

17:47 - December 16, 2017

తొలిపరిచయం సినిమా టీమ్ తో టెన్ టివి చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో, హీరోయిన్ వెంకీ, లాస్య, డైరెక్టర్ రాధాకృష్ణ, మ్యూజిక్ డైరెక్టర్ ఇంద్రగంటి మాట్లాడారు. వారు తమ సినీ అనుభవాలను తెలిపారు. తొలిపరిచయం సినిమా విశేషాలను వివరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

17:30 - December 16, 2017
17:29 - December 16, 2017
17:27 - December 16, 2017
17:26 - December 16, 2017

సంగారెడ్డి : ఏఐసీసీ అధ్యక్షునిగా రాహుల్‌గాంధీ బాధ్యతలు స్వీకరించడంతో.. సంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సహాలు వెల్లువిరుస్తున్నాయి. సంగారెడ్టి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్టి ఆధ్వర్యంలో కార్యకర్తలు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. రాహుల్‌ గాంధీ నాయకత్వంలో పార్టీ బలోపేతమౌతుందని జగ్గారెడ్డి అన్నారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. 2019లో రాహుల్‌గాంధీ నాయకత్వంలో... కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. సోనియా కుటుంబం ప్రజాసేవకు అంకితమైందన్నారు. గతంలో ప్రధాని పదవి చేపట్టే అవకాశం వచ్చినా వద్దన్నారని గుర్తు చేశారు. 

 

17:13 - December 16, 2017

పశ్చిమ గోదావరి : జిల్లాలోని ఏలూరులోని సెయింట్‌ జోసఫ్‌ దంత వైద్యశాల ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి జిల్లాతో పాటు పలు ప్రాంతాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సూపర్ స్పెషాలిటీ వైద్య నిపుణులతో రోగ నిర్దారణ పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. 

 

17:12 - December 16, 2017

తూర్పుగోదావరి : అ... అంటే అమలాపురం అన్న పాట మనకు తెలుసు. కానీ అమలాపురం వాసులు మాత్రం.. అ అంటే అభివృద్ధి అంటూ పాడుకుంటున్నారు. అవును..! ఇప్పుడు అడుగడుగునా అభివృద్ధి కార్యక్రమాలతో అమలాపురం కొత్తందాలు సంతరించుకుంటోంది. విశేషమైన అభివృద్ధి కార్యక్రమాలు ఓవైపు.. స్వచ్ఛత చర్యలు మరోవైపు అమలాపురం రూపురేఖలనే మారుస్తోంది. 

పచ్చని కొబ్బరి చెట్లు.. చెంతనే గోదావరి పరవళ్లు.. ఆంధ్ర కేరళగా అలరారుతోన్నఅమలాపురం..అభివృద్ధిలో దూసుకెళుతోన్న కోనసీమ నగరం.. అ.. అంటే అభివృద్ధి అంటూ ఆలపిస్తోన్న అమలాపురం... అవును.. పచ్చందనాల కోనసీమలోని సుందరనగరం అమలాపురం.. ఇప్పుడు అభివృద్ధి పథంలో శరవేగంగా దూసుకుపోతోంది. ఆంధ్ర కేరళగా పేరుగాంచిన కోనసీమ చాలాకాలంగా, అభివృద్ధికి ఆమడదూరంలో ఉంది. ఐతే... ఇప్పుడు.. అమలాపురం అభివృద్ధికి నిర్వచనంలా మారిపోయింది.  ఓ పక్క స్వచ్ఛత.... మరో పక్క అభివృద్ధి కార్యక్రమాలతో అమలాపురం దూసుకుపోతోంది...

సొంత లాభం తప్ప ప్రజల గురించి పట్టించుకోని ఈరోజుల్లో...  అమలాపురం అభివృద్ధికి చిరునామాగా మారిందంటే.. పురపాలక సంస్థ చైర్మన్‌ గణేశే కారణమంటారిక్కడి ప్రజలు.  చిక్కాల వినాయకరావు అలియాస్‌ గణేశ్‌... మునిసిపల్‌ చైర్మన్‌గా పదవిని చేపట్టింది మొదలు అమలాపురం అభివృద్ధిపైనే ప్రత్యేక శ్రద్ధను పెట్టారు. అనతి కాలంలోనే  పట్టణాన్ని స్వచ్ఛతలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపారు. ఈ దిశగా, గణేశ్‌ చేసిన కృషి, పట్టుదలను ప్రజలు మెచ్చుకుంటున్నారు.

ప్రతిరోజు ఉదయం ఆరు గంటలనుంచే  పట్టణంలో తిరుగుతూ... పారిశుద్ధ్య పనులను దగ్గరుండి పర్యవేక్షించడం గణేశ్‌కు అలవాటు...  ప్రజలకు కూడా పారిశుద్ధ్యంపై  అవగాహన కలిగిస్తూ...  స్వచ్చతను పాటించేలా చేస్తున్నారు.     కనీస వసతులు కూడా  లేక ప్రజలకు అసౌకర్యంగా ఉన్న మూడు శ్మశాన వాటికలను అభివృద్ధి చేశారు. అక్కడ కోటీ ఇరవై లక్షల రూపాయలతో కొత్త భవనాలను నిర్మించారు.  పరిశుభ్రమైన వాతావరణంతోపాటు నీటి వసతులను మెరుగు పరిచేందుకు మున్సిపల్ ఛైర్మన్ గణేష్‌ ఎంతో కృషి చేశారు. 

ఎక్కడైనా... ఎప్పుడైనా ఏ ఒక్కరితోనో అభివృద్ధి జరగాలంటే... కష్టమైన పనే...అదేవిధంగా అమలాపురాన్ని అభివృద్ధి చేయాలన్న గణేష్‌ కృషి, పట్టుదలకు ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, అయితాబత్తుల ఆనందరావుల సహకారం తోడైంది. వారి దన్నుతో పట్టణంలోని ఎర్రవంతెన, నల్లవంతెనల మీదుగా ఈదరపల్లి వరకూ సుమారు పది కోట్ల రూపాయలతో బైపాస్‌ రోడ్డును నిర్మించడంతోపాటు...  కాలువ గట్ల రివిట్‌మెంట్‌ పనులు చేపట్టారు. ఈ అభివృద్ధి వెనుక ప్రజలతో పాటు చాలా మంది సహకారం ఉందని మున్సిపల్‌ ఛైర్మన్‌ గణేష్‌ అంటున్నారు.

అమలాపురం పట్టణానికి ల్యాండ్‌ మార్కు‌గా  చెప్పుకునే గడియార స్తంభాన్ని నలభై ఏడు లక్షల రూపాయలతో అత్యాధునికంగా తీర్చిదిద్దారు గణేశ్‌. నిరుపయోగంగా  ఉన్న తామర చెరువును సుమారు రెండు కోట్ల రూపాయల ఖర్చుతో ఆధునీకరించేందుకు నడుంబిగించారు. మరోవైపు యాభై లక్షల రూపాయలతో హార్టికల్చర్‌ను అభివృద్ధి చేస్తూ... చంద్రన్న బాటలో పయనిస్తున్నారు. అంతేకాదు... పట్టణంలోని ముఖ్య కూడళ్ళలో డివైడర్ల నిర్మాణంతో   ట్రాఫిక్‌ నియంత్రణకు గణేష్‌ పాటుపడుతున్నారు.

మారుమూల ప్రాంతాల ప్రజలకు  కూడా పరిశుభ్రమైన మంచినీరు అందించడమే ధ్యేయంగా పనిచేస్తున్నారు గణేష్‌.  పట్టణంలో మంచినీటిని అందించే చెరువును పునరుద్ధరణకు పూనుకున్నారు. లక్షలాది రూపాయలతో  పూడిక తీయించి    అతిపెద్ద చెరువుగా తయారు చేస్తున్నారు.. దీంతో  వేసవిలో మంచినీటి ఎద్దడి అన్న మాటే వినిపించదంటున్నారు..  మంచినీటి చెరువుగట్లను  దృఢంగా నిర్మించడంతోపాటు చక్కని వాకింగ్‌ ట్రాక్‌లుగానూ... ఆటవిడుపు కేంద్రాలుగానూ మార్చారు.  

చేయి చేయి కలుపుదాం... మన ఊరిని మనమే బాగు చేసుకుందాం... అన్న నినాదంతో మున్సిపల్‌ ఛైర్మన్‌ గణేష్‌  ప్రజలందరినీ అభివృద్ధిలో  భాగం చేస్తున్నారు.    పట్టణ ప్రథమ పౌరుడుగా ప్రజలకు కావల్సిని అన్ని రకాల మౌళిక సదుపాయాలను కల్పించడమే తన బాధ్యత అని గణేష్‌ అంటారు.

16:58 - December 16, 2017

హైదరాబాద్ : హాస్యనటుడు విజయ్ సాయికి వేరే అమ్మాయితో అఫైర్ ఉన్నట్లు ఆయన భార్య వనితారెడ్డి ఆరోపించారు. విజయ్ సాయి నేహా అనే మరో యవతితో సన్నిహితంగా ఉన్న ఫోటోలను వనిత బయటపెట్టారు. నాలుగు రోజులుగా వనితారెడ్డి, అడ్వకేట్ శ్రీనివాస్ అజ్ఞాతంలో ఉన్నారు. వనితా రెడ్డి, శ్రీనివాస్ కోసం పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

16:27 - December 16, 2017

జగిత్యాల : జిల్లాలోని మల్లాపూర్ మండలం ముత్యంపేటలో షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. షుగర్ ఫ్యాక్టరీ తెరిచే వరకు ప్రభుత్వానికి సంబంధించిన పన్నులు కట్టబోమని గ్రామస్తులు తీర్మానం చేశారు. ప్రభుత్వానికి చెల్లించే ఇంటిపన్ను, నల్లాబిల్లు, కరెంట్ బిల్లు తదితర పన్నులు కట్టబోమని తీర్మానం చేసి గ్రామపంచాయితీ కార్యాలయానికి అతికించారు. విద్యుత్తు బిల్లులు వసూలు చేయడానికి వచ్చిన అధికారులను గ్రామ పంచాయతీలో ముత్యంపేటవాసులు నిర్బంధించారు. ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలని లేకపోతే ఆందోళనలు ఉధృత్తం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

 

16:21 - December 16, 2017
16:16 - December 16, 2017

హైదరాబాద్ : ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని ప్రముఖ సాహితీ వేత్త గౌరీ శంకర్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగంగా మహాసభలు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. మరుగున పడ్డ సాహిత్యాన్ని వెలుగులోకి తెచ్చేందుకు మహాసభలు ఉపయోగపడుతాయంటున్న గౌరీ శంకర్‌తో టెన్ టివి ఫేస్‌ టు ఫేస్‌ నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

విజయవాడ బయల్దేరిన సీఎం చంద్రబాబు

విశాఖ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు విజయవాడ బయల్దేరారు. విజయవాడ చేరుకున్న అనంతరం ఆయన కేబినెట్ భేటీకి అధ్యక్షత వహించనున్నారు. 

కాసేపట్లో ఏపీ మంత్రివర్గ సమావేశం

గుంటూరు : కాసేపట్లో ఏపీ మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ భేటీలో టెబుల్ ఐటమ్ గా పోలవరం అంశాన్ని తీసుకోనున్నారు. 23న కేంద్ర మంత్రి గడ్కరీ రాక పై , 2014 పోలీస్ యక్ట్ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవడంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

16:07 - December 16, 2017

రాష్ట్రంలో క్రమంగా తెల్ల బంగారం అయిన పత్తి రేటు పెరుగుతుంది. ప్రస్తుతం క్వింటాల్ పత్తికి రూ.4600 ఉంది. గత నెల కింద పత్తి సరైన ధర లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అప్పుడే దాదాపు సగానికి పైగా అమ్ముడు పోయింది. దీంతో ఇప్పుడు పత్తికి డిమాండ్ పెరిగింది. పత్తి ధర పెరగడానికి ముఖ్య కారణం దిగుబడి తగ్గడం. తెలంగాణ దసరా తర్వాత కురిసిన వర్షాలకు పత్తి పంట తీవ్రంగా నష్టపోయింది. ఆ తరువాత వ్యాధులు సోకడంతో దిగుబడి భారీగా తగ్గింది.   

16:02 - December 16, 2017

ఢిల్లీ : రాహుల్ ఏఐసీసీ పగ్గాలు చేపట్టడం శుభపరిణామమన్నారు ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి. క్లిష్టపరిస్థితుల్లో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడం రాహుల్ సాహసోపేతమైన నిర్ణయంగా రఘువీరా చెప్పారు. దేశంలో అందర్నీ కలుపుకుంటూ పోవాలని రాహుల్ ఇచ్చిన పిలుపుతో తామంతా ముందుకు సాగుతామన్నారు కాంగ్రెస్ సీనియర్ షబ్బీర్ అలీ. రాహుల్ పదవులు ఆశించి వస్తున్నారంటూ బీజేపీ విమర్శించడం తగదన్నారు కాంగ్రెస్ నేత కేవీపీ.రామచంద్రరావు. పదవులే కావాలనుకుంటే ఈపాటికే సొంతం చేసుకునేవారని ఆయన దేశం కోసం, పార్టీ కోసం వారు చేసిన వారు చేసిన త్యాగాలకు ఖచ్చితమైన ఫలితం వస్తుందని కేవీపీ అన్నారు. 

 

విజయ్ అక్రమ సంబంధాలపై ఫోటోలు విడుదల చేసిన వనిత

హైదరాబాద్ : నటుడు విజయ్ అక్రమ సంబంధాలపై భార్య వనిత రెడ్డి ఫోటోలు విడుదల చేశారు. ఇంట్లోనే ఇతర అమ్మాయిలతో విజయ్ గడిపేవాడని ఆమె ఆరోపించారు. విజయ్ అక్రమ సంబంధాలను ప్రశ్నిస్తే తనపై దాడి చేశాడని వనిత అంటుంది. అక్రమ సంబంధాలు భరించలేక విజయ్ ని వదిలేశా ఆమె తెలిపింది.

15:44 - December 16, 2017

గుంటూరు : మరికాసేపట్లో ఏపీ కేబినేట్‌ సమావేశం కానుంది. ప్రజల మద్దతు ఎక్కువగా పొందిన అసెంబ్లీ డిజైన్స్‌ను నేడు ఫైనల్‌  చేసే అవకాశాలున్నాయి. అలాగే జనవరి 12న ప్రకటించనున్న నిరుద్యోగ భృతి అంశంపై కేబినేట్‌లో స్పష్టత రానుంది. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఏపీ ఐఐసీకి భూకేటాయింపులు చేస్తూ కేబినేట్‌ ఆమోదం తెలపనుంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

షుగర్ ఫ్యాక్టరీ తెరిపించాలంటూ ఆందోళన

జగిత్యాల : జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ తెరిపించాలంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. షుగర్ ఫ్యాక్టరీ తెరిచే వరకు ప్రభుత్వానికి పన్నులు కట్టమని గ్రామస్తులు తీర్మానం చేశారు. ఇంటిపన్ను, నల్లాబిల్లు కరెంటు బిల్లు చెల్లించబోమని వారు తెల్చి చెబుతున్నారు

20నుంచి చంద్రన్న క్రిస్మస్ కానుకలు

గుంటూరు : ఈ నెల 20 నుంచి 26 వరకు చంద్రన్న క్రిస్మస్ కానుకల కిట్లు పంపిణీ చేయనున్నట్లు పౌరసరపరాల శాఖ మంత్రి ప్రత్తిపటి పుల్లారాము అన్నారు.  జనవరి 1 నుంచి 16 వరకు  చంద్రన్న సంక్రాంతి కానుకల కిట్లు కూడా పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు. 

కొత్తగూడెంలో జరిగింది బుటకపు ఎన్ కౌంటర్ : విమలక్క

హైదరాబాద్ : కొత్తగూడెంలో జరిగిన ఎన్ కౌంటర్ బూటకపు ఎన్ కౌంటర్ అని విమలక్క అన్నారు. ఎన్ కౌంటర్ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. 

14:27 - December 16, 2017

తెలుగు రాష్ట్రాల్లో చింత పండు ధర ఆకాశాన్ని అట్టుతుంది. గతంలో ఎప్పుడు లేనివిధంగా చింత పండు కేజీకి రూ.150 నుంచి రూ.200 పలుకుతుంది. వసతి గృహాల్లో చింతపండు రోజు ఉండాల్సిందే అటువంటి చింతపండు ధర పెరగడంతో హాస్టల్లో సంబార్ పెట్టడడం తగ్గించారు. సామాన్యుడికి పచ్చి పులుసు అంటే ప్రాణం కానీ చింతపండు రేటు చూస్తే ఆ ప్రాణమే పోయేలా ఉంది. రానున్న రోజులో కొత్త చింతపండు వచ్చే అకాశం ఉంది కాబట్టి రేటు తగ్గే అవకాశం ఉంది.

 

కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ

గుంటూరు : కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ డిజైన్స్ ఫైనల్ చేసే అవకాశం ఉంది. అలాగే జనవరి 12న ప్రకటించనున్న నిరుద్యోగ భృతిపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏపీఐఐసీకి భూ కేటాయింపులు చేస్తూ  కేబినెట్ ఆమోదం తెలపనుంది. 

13:49 - December 16, 2017

టీం ఇండియా కోచ్ రవిశాస్త్రి, స్టార్ బ్యాట్స్ మెన్ యువరాజ్ సింగ్, సౌత్ అఫ్రికా ఆటగాడు గిబ్స్ వీరందరికి ఒకే సరూప్యత ఉంది. అదేంటో తెలుసా ఒకే ఒవర్ లో 6 సిక్స్ లు కొట్టడం. అయితే ఇప్పుడు వారి సరసన జడేజా నిలిచాడు. ప్రస్తుతం అతడు సౌరాష్ట్ర తరుపు మ్యాచ్ లు అడుతున్నాడు. అమ్రేలి జట్టుతో జరిగిన మ్యాచ్ లో జామ్ నగర్ జట్టు తరుపున ఆడిన జదేజా 69 బంతుల్లో 15 ఫోర్లు, 10 సిక్సర్లతో విరుచుకుపడి 154 పరుగులు సాధించాడు. 

13:29 - December 16, 2017

హైదరాబాద్ : తెలంగాణతో చిక్కటి తన అనుబంధాన్ని ఆత్మీయంగా గుర్తు చేసుకున్నారు వంగపండు. తెలంగాణ జిల్లాల పోరాట పటిమను చాటుతూ తన గళాన్ని మరోసారి సవరించారాయన. తెలుగు భాష అంతరించిపోతుంటే చూస్తూ ఊరకే ఉన్న ఏలికలను వంగపండు తూర్పారబట్టారు. ప్రజలూ అమ్మభాషను మరచిపోవడం సమంజసం కాదంటూ హితవు పలికారు. ఇలాంటి తరుణంలో.. హైదరాబాద్‌లో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించడాన్ని వంగపండు ప్రశంసించారు. అయితే, ఆ సభల్లో పాల్గొనేందుకు ఆహ్వానం అందకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. అయినాసరే, సభలు దిగ్విజయంగా జరగాలని ఆయన ఆకాంక్షించారు. తనకు ఆహ్వానం అందకున్నా.. ప్రపంచ తెలుగు మహాసభలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు వంగపండు. మాతృభాష అంతరించకూడదన్నదే తన ఉద్దేశమంటూ.. స్వరం సవరించుకున్నారు. తెలుగుతల్లి వేదననూ వంగపండు తన స్వరంలో వినిపించారు. మరి ఆయన పాటల కోసం వీడియో క్లిక్ చేయండి. 

13:25 - December 16, 2017

హైదరాబాద్ : ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంటోంది. మహాసభలకు వచ్చేవారికి పలు రకాల తెలుగు పుస్తకాలను పరిచయం చేసేందుకు ఈ పుస్తక ప్రదర్శన చేపట్టారు. మహాసభలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనపై మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

13:24 - December 16, 2017

హైదరాబాద్ : తెలంగాణలో 24 గంటల కరెంట్‌ ఇచ్చే దిశగా ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. మహానగరాభివృద్ధిలో ప్రజలను భాగం చేసేందుకు చేపట్టిన హమారా షహార్‌ కార్యక్రమాన్ని కుత్బుల్లాపూర్‌లో కేటీఆర్‌ ప్రారంభించారు. కార్యక్రమం ప్రారంభమైన అనంతరం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం అభివృద్ధిపై లఘు చిత్రం ప్రదర్శించారు. ప్రజల భాగస్వామ్యం లేనిదే అభివృద్ధి సాధ్యపడదని, ప్రజల దగ్గరికే పాలన తీసుకురావడానికి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మంత్రి. 

13:22 - December 16, 2017

ఢిల్లీ : కాంగ్రెస్ పార్టీలో అత్యంత శక్తివంతమైన మహిళగా సోనియాగాంధీ పనిచేశారని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. 19 ఏళ్ల పాటు పార్టీ సమర్ధవంతంగా పనిచేసేందుకు సోనియా కృషి చేశారని అన్నారు. 10 ఏళ్ల కాంగ్రెస్ అధికారంలో సోనియా చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నామని మన్మోహన్ చెప్పారు. కాంగ్రెస్ అధికారంలో దేశ అభివృద్ధి రేటు 7.8 శాతంకు పెంచగలిగామని మన్మోహన్ అన్నారు. 

13:21 - December 16, 2017

ఢిల్లీ : కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రాహుల్‌ గాంధీ తన ప్రసంగంలో బిజెపిని టార్గెట్‌ చేశారు. దేశంలో బిజెపి మత విద్వేషాలు రెచ్చగొడుతోందని ధ్వజమెత్తారు. దేశంలో బిజెపి మతం పేరిట మంటలు రేపుతోందని విమర్శించారు. అయితే ఆ మంటలను కాంగ్రెస్‌ చల్లార్చుకంటూ వస్తోందని రాహుల్‌ అన్నారు. వాళ్లు మంటలు రేపితే ఆర్పాలని...కోపం ప్రదర్శిస్తే...మనం ప్రేమను పంచాలని కాంగ్రెస్‌ శ్రేణులకు రాహుల్‌ సూచించారు. దేశ భవిష్యత్తు కోసం కాంగ్రెస్‌ కట్టుబడి ఉందని...ఇందుకోసం ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్‌ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

తల్లిగా చెప్పడం సరికాదు : సోనియా

ఢిల్లీ : రాహుల్ గురించి తల్లిగా చెప్పడం సరికాదని సోనియా గాంధీ అన్నారు. రాహుల్ పై బీజేపీ అనేక దాడులు చేసిందని, బీజేపీ దాడుల నుంచి రాహుల్ రాటుదేలాడని ఆమె అన్నారు.

రాహుల్ కు అభినందనలు తెలిపిన సోనియా

ఢిల్లీ : సోనియా తన కుమారునికి అభినందనలు తెలిపారు. పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు తను అధ్యక్ష బాధ్యతలు చేపట్టి పార్టీ 2 సార్లు అధికారంలో తీసుకొచ్చానని సోనియా అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తల సహకారంతోనే ఇది సాధ్యమైంది అని ఆమె స్పష్టం చేశారు. పార్టీని ఏకతాటిపై నడిపించేందుకు శాయశక్తులా కృషి చేశానని, ఇందిరగాంధీ తనను కూతురిలా చూశారని సోనియా తెలిపారు. దేశంలో ప్రస్తతం భయానక వాతావరణం నెలకొందని ఆమె అన్నారు.

12:30 - December 16, 2017

ప్రపంచ సినీ రంగంలో అత్యున్నతమైనవి అస్కార్ అవార్డులు. ప్రతి ఏడాది ఈ అస్కార్ అవార్డులు ప్రకటిస్తారు. ఉత్తమ విదేశి చిత్రం విభాగంలో మన దేశం నుంచి ఒకే ఒక చిత్రం అస్కార్ నామినేషన్ పోటీపడింది. ఆ చిత్రమే న్యూటన్ అయితే ఉత్తమ విదేశి విభాగంలో మొత్తం 92 సినిమాలు పోటీ పడగా అందులో 9 చిత్రాలు మాత్రమే అర్హత సాధించాయి. కానీ అందులో న్యూటన్ చిత్రం లేకపోవడంతో ఈ సారి కూడా భారత్ అస్కార్ లేదని స్ఫష్టమైంది. వందల కోట్లతో, ఏడాదికి 4వేల పైగా సినిమాలు తీస్తున్న భారత దేశంలో ఒక్క సినిమా కూడా అస్కార్ నామినెట్ కాకపోవడం దారుణం. 

12:29 - December 16, 2017
12:28 - December 16, 2017
12:25 - December 16, 2017
12:22 - December 16, 2017

ఢిల్లీ : దేశం కోసం కాంగ్రెస్ అంకితమని..కార్యకర్తలే పార్టీకి బలమని..కార్యకర్తలను రక్షించుకుంటామని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన రాహుల్ పేర్కొన్నారు. ఏఐసీసీ హెడ్ క్వార్టర్స్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. 13 సంవత్సరాల క్రితం తాను రాజకీయాల్లోకి అడుగు పెట్టినట్లు, ఈ దేశం మీద నమ్మకంతోనే తాను రాజకీయాల్లోకి అడుగు పెట్టినట్లు తెలిపారు. ఈ తరుణంలో ఎన్నో నేర్చుకున్నట్లు తెలిపారు. ప్రజలకు సేవ చేయడమే రాజనీతి అని, ప్రస్తుతం రాజకీయాల స్వరూపం మారిపోయిందని...రాజకీయాలు అనేవి ప్రజలకు అస్త్రాలాంటివన్నారు.

మోడీ దేశాన్ని వెనక్కి తీసుకెళుతున్నారు...
భారత దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకొచ్చింది కాంగ్రెస్ అని, కానీ ఇప్పటి ప్రధాని దేశాన్ని వెనక్కి తీసుకెళుతున్నారని విమర్శించారు. ప్రజల ఆలోచనలు..అలవాట్ల మీద దాడి జరుగుతోందన్నారు. కాంగ్రెస్ పార్టీ అనేది దేశ ప్రజల మధ్య ఒక వారధి లాంటిదన్నారు. ప్రజల మధ్య విధ్వేషాలు సృష్టించే శక్తులు చెలరేగుతున్నాయని, బీజేపీ కారణంగా దేశమంతా హింస చెలరేగుతోందన్నారు. మంట అంటుకున్నప్పుడు చల్లార్సిందేనని...అదే బీజేపీకి చెబుతున్నామన్నారు. దేశంలో ఇలాంటిదే బీజేపీ చేస్తోందని..వీటిని ఆర్పేది ఒక్క కాంగ్రెస్...కార్యకర్తలేనన్నారు. వారు మంట పెడుతారు..తాము ఆర్పుతామని..వాళ్లు కోప్పడం చేస్తారని..తాము సముదాయించడం జరుగుతుందన్నారు.

కార్యకర్తలకు పిలుపు...
దేశంలో మత సామరస్యం వెల్లివెరిసే విధంగా...శాంతి సౌభ్రాత్వాలతో వెల్లివెరిసే విధంగా యువత కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త నినాదం దేశం వింటుందన్నారు. కార్యకర్తలను రక్షించుకోవడం తన బాధ్యత అని, తాను నేర్చుకోవడానికి..నేర్పించడానికి కృషి చేస్తానన్నారు. అబద్ధాలు..తప్పుడు ప్రచారాలతో తమపై దాడులు చేస్తున్నారని, కాంగ్రెస్ అతి వృద్ధ పార్టీనే కాదని...అత్యంత యువ పార్టీ కూడా అని తెలిపారు. 

ప్రజా సేవే రాజనీతి : రాహుల్ గాంధీ

ఢిల్లీ : ప్రజలకు సేవ చేయడమే రాజనీతి అని కానీ ప్రస్తుతం ప్రజలను మోసం చేయడమే రాజనీతిగా మారిందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. దేశాన్ని మోడీ తిరోగమనంలోకి తీసుకెళ్తున్నారని ఆయన ఆరోపించారు. 

12:15 - December 16, 2017

ఢిల్లీ : సమస్యలు ఎన్ని ఎదురైనా..వెనుకడుగు వేసేది లేదని..దేశం కోసం..దేశ ప్రజల కోసం పనిచేయాలని కార్యకర్తలకు సోనియా గాంధీ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా రాహుల్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా సోనియా ప్రసంగించారు. పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడుతున్న రాహుల్ కు తన ఆశీస్సులు అందచేస్తున్నట్లు తెలిపారు. చివరిసారిగా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ప్రసంగించడం జరుగుతోందని, రాహుల్ నాయకత్వంలో అందరూ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. అధ్యక్షురాలిగా ఎన్నుకున్న సమయంలో ఇక్కడ తాను నిలబడిన సమయంలో తాను ఎంతో భయపడడం జరిగిందని, ఇంత పెద్ద బాధ్యతను ఏ విధంగా నిర్వహించగలను అనే ప్రశ్న ఉదయించడం జరిగిందన్నారు.

ఎన్నో త్యాగాలు....
రాజీవ్ గాంధీతో వివాహం అనంతరం తనకు రాజకీయాలకు పరిచయమైనట్లైందన్నారు. స్వాతంత్రోద్యమ సమయంలో గాంధీ కుటుంబం ఎంతో కోల్పోయిందని, దేశం గురించే ఎక్కువగా ఆలోచించే వారని, తనను ఒక కూతురిగా చూసుకున్నారని పేర్కొన్నారు. ఈ కుటుంబం నుండి తాను ఎంతో నేర్చుకున్నట్లు, ఇందిర హత్య అనంతరం తాను ఎంతో బాధ పడడం జరిగిందని..సొంత అమ్మను తీసుకెళ్లారని భావించడం జరిగిందన్నారు.

రాజీవ్ హత్య కలిచివేసింది...
అనంతరం తనకు తాను మార్చుకున్నట్లు, ఈ నేపథ్యంలో తన కుమారుడు..కుమార్తెలను రాజకీయాల నుండి దూరంగా పెట్టాలని అనుకున్నట్లు తెలిపారు. కానీ తాను ఆలోచించి అలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. రాజీవ్ గాంధీ హత్య తనను తీవ్రంగా కలిచివేసిందని..పార్టీ గురించి..కార్యకర్తల గురించి ఆలోచించాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇందిరా..రాజీవ్ బలిదానం వ్యర్థం కావద్దనే ఉద్దేశ్యంతో తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు వెల్లడించారు. అందరూ తనకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు తెలిపారు.

అందుకే పరాజయాలు..
దేశ ప్రజల బాగు కోసం ఇతర పార్టీలతో కలిసి పనిచేయడం జరిగిందన్నారు. ప్రధానిగా ఉన్న సమయంలో మన్మోహన్ బాగా పనిచేశారని కితాబిచ్చారు. దేశంలోని ఎంతో మంది పేదలకు కాంగ్రెస్ మేలు చేసిందని, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీపై పలు విధాలుగా దాడి చేయడంతో పలు ఎన్నికల్లో పార్టీ పరాజయం చెందిందన్నారు. పార్టీ పరాజయం పాలైనా కార్యకర్తలు..మనో ధైర్యం కోల్పోలేదన్నారు. ఎన్ని జరిగినా వెనకడుగు వేసేది లేదని ఖరాఖండిగా చెప్పారు. దేశ ప్రజల కోసం పనిచేయాలని...ఎన్ని పరిస్థితులైనా ఎదురొడ్డి నిలవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాహుల్ గురించి గొప్పగా చెప్పడం తల్లిగా సరికాదని, చిన్నప్పటి నుండి చూసిన పరిణామాలతో హింసపై వ్యతిరేకం పెంచుకున్నాడన్నారు. అనంతరం జరిగిన పరిణామాలతో ధైర్యం పెంచుకున్నాడని తెలిపారు. తనకు సహకరించిన వారందరికీ...తనతో వెంట నడిచిన వారికి అభినందనలు..కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు సోనియా వెల్లడించారు. 

12:05 - December 16, 2017

బొగ్గు కుంభకోణంపై సీబీఐ కోర్టు తీర్పు

ఢిల్లీ : బొగ్గు కుంభకోణంపై ప్రత్యేక సీబీఐ కోర్టు తీర్పు వెల్లడించింది.కోర్టు జార్ఖండ్ మాజీ సీఎం మధుకోడాకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి హెచ్ సీ గుప్తాకు కూడా మూడేళ్ల జైలు శిక్ష విధించింది.

నిషేధిత మందులు అమ్ముతున్నవారి అరెస్ట్

తూర్పుగోదావరి : జిల్లా లో నిషేధిత మందలు, ఇంజక్షన్లు విక్రయిస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

11:49 - December 16, 2017

న్యూ ఇయర్ వేడుకను క్యాష్ చేసుకునేందుకు చాలా మంది తారలు పోటీ పడుతుంటారు. 31 నైట్ తమ డ్యాన్స్ తో కుర్రాకరను ఉర్రుతలుగిస్తారు. ఇలా తారలు తమ జెబుల్లో కోట్ల రూపాయలు వేసుకుంటారు. ఈ సంవత్సరం కూడా 31 నైట్ క్యాష్ చేసుకుందమని మాజీ పోర్న్ స్టార్ ప్రస్తుత బాలీవుడ్ నటి సన్నీ లియోన్ భావించింది. అందుకు తగ్గట్టుగానే న్యూ ఇయర్ సందర్బంగా కర్ణాటకలో సన్నీ లియోన్ షో చేయడానికి ఒప్పుకుంది. అయితే సన్నీ లియోన్ తమ గడ్డపై అడుగు పెడితే యువత పడయిపోతారని తమ సంస్కృతి దెబ్బతింటుందని కర్ణాటకలో ఉద్యమామే ప్రారంభమైంది. దీంతో సన్నీ షో కు పోలీసులు అనుమతి నిరాకరించామని చెబుతున్నారు. షో క్యాన్సిలేషన్ పై అధికారిక సమాచారం రాలేదంటున్నారు నిర్వాహకులు. ఆమె ఇక్కడ నగ్నంగా ప్రదర్శన ఇవ్వడం లేదని.. ఓ ఫ్యామిలీ ఈవెంట్ లో పాల్గొనేందుకే వచ్చిందని చెబుతున్నారు.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్

ఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ బాధ్యతల స్వీకరించారు. రాహుల్ కాంగ్రెస్ పార్టీ 49 గా అధ్యక్షుడిగా ఉండనున్నారు. ఈ కార్యక్రమానికి సోనియా, మన్మోహన్ సింగ్ హాజరైయ్యారు.

మన నగరం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కేటీఆర్

హైదరాబాద్ : మంత్రి కేటీఆర్ మన నగరం కార్యాక్రమానికి శ్రీకారం చుట్టారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ లో మన నగరం కార్యక్రమాన్ని కేటీఆర్ ప్రారంభించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 30 సర్కిళ్ల లో సమస్యలను తెలుసుకునేందుకు మన నగరం కార్యాక్రమం చేపట్టామని ఆయన తెలిపారు.

11:11 - December 16, 2017

మనకు సహజంగా లభించే పండు నిమ్మ దీంతో మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనం తిన్న ఆహారం బాగా జీర్ణం కావాలంటే నిమ్మరసం తాగితే చాలు. దుస్తుల పై ఉన్న మరకలను పొగొట్టడానికి మంచి సువాసను కూడా నిమ్మ ఉపయోగపడుతుంది. నిమ్మ వల్ల మనకు సీ విటమిన్ లభిస్తుంది. వంటింటి పత్రలకు ఉన్న జిడ్డుని నిమ్మతో వదిలించవచ్చు. 

11:10 - December 16, 2017

పవన్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న అజ్ఞాతవాసి ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఈ నెల 19న సాయంత్రం జరగనుంది. పవన్ కల్యాణ్ హీరోగా, అనూ ఇమ్మానోయల్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి మాట మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. ఇంతకు ముందు వీరి కాంబినేషన్ లో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది చిత్రాలు బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అజ్ఞాతవాసి మూవీని వచ్చే నెల అంటే జనవరి 10న విడుదల చేయనున్నారు. 

లడ్డు ధరలు పెంచిన టీటీడీ

చిత్తూరు : తిరుమల శ్రీవారి లడ్డు ధరలు పెంచడానికి టీటీడీ నిర్ణయం తీసుకుంది. అయితే ఇది కేవలం సిఫార్సు లేఖలపై జారీ చేసే లడ్డులకు మాత్రం ధరలు పెంపు ఉంటుందని టీటీడీ తెలిపింది. కల్యాణోత్సవం అడ్డు ధర రూ.200, వడ ధర రూ.100 గా టీటీడీ పెంచింది. పెరిగిన ధరలు ఈ నెల 25 నుంచి అములులోకి వచ్చే అవకాశం ఉంది. 

ఉప్పల్ ఎస్సై, ఏఎస్సైల సస్పెన్షన్

హైదరాబాద్ : ఉప్పల్ ఎస్సై సుధీర్ కృష్ణ, ఏఎస్సై శ్రీశైలంలపై సస్పెన్షన్ వేటు వేశారు. కుషాయిగూడలో మహిళ ఆత్మహత్య కేసును తప్పుదోవ పట్టించారని వారిపై రాచకొండ సీపీ సస్పెండ్ చేశారు.

10:31 - December 16, 2017

చిత్తూరు : ప్రముఖ పుణ్యక్షేత్రంగా పిలవబడే తిరుమలకు దేశ..విదేశాల నుండి భారీగా భక్తులు తరలివస్తుంటారు. భక్తులు సమర్పించిన కానుకలతో టిటిడికి భారీగానే ఆదాయం వస్తోంది. కానీ కొన్ని కమిటీలు ఈ టిటిడికి నష్టాన్ని కలిగిస్తున్నారు. శాసనమండలి..శాసనసభ ఏర్పాటు చేసిన ఎథిక్స్ కమిటీలు శ్రీవారి ఆదాయానికి గండి కొడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కమిటీ సభ్యులతో పాటు వందలాది మంది శ్రీవారి దర్శనం ఉచితంగానే చేసుకుంటున్నారు. వీరి దర్శనం..ఏర్పాట్లు కారణంగా సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇటీవలే నాలుగు కమిటీలు తిరుమలకు వచ్చారు. మొదటి కమిటీ సభ్యులు 180 మందిని..రెండో కమిటీ 130 మందిని...మూడో కమిటీ 300 మందిని శ్రీవారి దర్శనం కోసం తమతో పాటు తీసుకెళ్లారు. ఎలాంటి టికెట్లు కొనుగోలు చేయకుండానే శ్రీవారి దర్శనం చేసుకోవడంతో శ్రీవారి ఆదాయానికి గండి కొట్టినట్లైందనే విమర్శలున్నాయి.

తాజాగా మరొక కమిటీ తిరుమలకు వచ్చింది. నలుగురు సభ్యులే వచ్చినా శ్రీవారి దర్శనం కోసం వంద మంది వెళ్లడం గమనార్హం. కమిటీతో సంబంధం లేని వారు నిబంధనలు ఉల్లంఘించి దర్శనం చేసుకున్నారు. పది రోజుల్లో నాలుగోసారి కమిటీ పర్యటించడం విశేషం. దీనితో సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎలాంటి టికెట్లు కొనుగోలు చేయకుండానే శ్రీవారిని దర్శించుకోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. పై నుండి వత్తిళ్ల కారణంగా అధికారులు ఏం మాట్లాడడం లేదని తెలుస్తోంది. శాసనమండలి..శాసనసభలో చర్చించి కమిటీ పర్యటనలపై నిర్ణయం తీసుకోవాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 

టెన్ టీవీ ఎఫెక్ట్...

అనంతపురం : టెన్ టీవీలో ఇసుకు మాఫియా పై ప్రసారమైన కథనాలకు ఇంచార్జ్ కలెక్టర్ రమారాణి స్పందించారు. ఇసుక మాఫియా పై ఆమె విచారణకు ఆదేశించారు.  పుట్టపర్తి చిత్రావతి నది నుంచి ఇసుకు అక్రమ తరలింపుపై ఆర్డీవోతో విచారణ చేయిస్తామని ఆమె తెలిపారు. రూ.4కోట్ల విలువ చేసే 400 టిప్పర్లను ఇసుకను రికవరీ చేస్తామని రమా రాణి చెప్పారు. 

10:16 - December 16, 2017

హైదరాబాద్ : నగరంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఎల్బీ స్టేడియంలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు జ్యోతిని ప్రజ్వరిల్లించి మహాసభలను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో ఉభయ రాష్ట్రాల గవర్నర్, సీఎం, మంత్రులు, ఇతరులు పాల్గొన్నారు. రెండో రోజైన శనివారం పలు కార్యక్రమాలు జరుగునున్నాయి. రవీంద్ర భారతి ప్రధాన సభా మందిరలో తెలుగు మహాసభ కార్యక్రమాలు. యశోదారెడ్డి ప్రాంగణం, బండారు అచ్చుమాంబ వేదికలుగా ఏర్పాటు. ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో తెలుగు మహాసభల వేడుకల కార్యక్రమాలు జరుగనున్నాయి.

  • ఉదయం 10గంటలకు..మధ్యాహ్నం 3గంటలకు బాల సాహిత్యం సదస్సులు.
  • సా. 5గం.: తెలంగాణలో తెలుగు భాష వికాసం సాహిత్యసభ
  • సా. 6:30: సాంస్కృతిక సమావేశం
  • రా. 7:00- 7:30: శతగళ సంకీర్తన (భక్తరామదాసు సంకీర్తనల ఆలాపన)
  • రా. 7:30 -7:45: కళాకారుడు మైమ్ మధు ముకాభినయం ప్రదర్శన
  • రా. 7:45-8:00: వింజమూరి రాగసుధ నృత్యం
  • రా. 8:00-8:15: షిర్నాకాంత్ బృంద కూచిపూడి నృత్యం
  • రా. 8:15 - 9:00: డాక్టర్ అలేఖ్య నృత్యం

శ్రీవారి మెట్ట ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ కూబింగ్

చిత్తూరు : శ్రీవారి మెట్ట అటవీ ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ కూబింగ్ నిర్వహిస్తుండగా ఎర్రచందన స్మగ్లర్ ఎదురు పడడంతో వారిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ఉట్నూరులో 144 సెక్షన్..

~ఉట్నూరు ఘటనలో ఎవరూ చనిపోలేదని, నార్నూరు మండలం హుస్నాపూర్ వద్ద రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చనిపోయారని డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. వీరి ఫొటోలను పెట్టి ఘర్షణల్లో చనిపోయినట్లు అసత్యప్రచారం చేశారని, ఉట్నూరులో 144 సెక్షన్ విధించినట్లు వెల్లడించారు. 

09:34 - December 16, 2017
09:29 - December 16, 2017

చిత్తూరు : తామే నిబంధనలు చెప్పే వాళ్లం..తమకేం నిబంధనలు అనుకున్నారో ఏమీ కానీ అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన వారే నిబంధనలు ఉల్లంఘించారు. ప్రముఖ ఆలయ క్షేత్రంలో ఈ నిబంధనల్లు ఉల్లంఘించడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. తిరుమలకు ఎథిక్స్ కమిటీ చేరుకుంది. పది రోజుల్లోనే ఎథిక్స్ కమిటీ సభ్యులు నాలుగో సారి తిరుమలకు రావడం గమనార్హం. శ్రీవారి దర్శనం కోసం కమిటీ సభ్యులతో పాటు వంద మంది వెళ్లారు. కమిటీతో సంబంధం లేని వారు కూడా వెళ్లి నిబంధనల్లు ఉల్లంఘించారు. దీనిపై ఎథిక్స్ కమిటీ...టిటిడి ఎలా స్పందిస్తుందో చూడాలి. 

నిబంధనలు పాటించని ఎథిక్స్ కమిటీ..

తిరుమల : తిరుమలలో ఎథిక్స్ కమిటీ ఎథిక్స్ పాటించలేదు. పది రోజుల్లోనే ఎథిక్స్ కమిటీ సభ్యులు నాలుగో సారి తిరుమలకు వచ్చారు. కమిటీతో సంబంధం లేని వ్యక్తులు శ్రీవారి దర్శనంలో చేసుకుని నిబంధనల్లు ఉల్లంఘించారు. మొత్తం వంద మంది సభ్యులు దర్శించుకున్నట్లు సమాచారం. 

09:19 - December 16, 2017

ఢిల్లీ : దేశ రాజధానిలో కాంగ్రెస్ నేతల సందడి కనిపిస్తోంది. ఏఐసీసీ అధ్యక్ష పదవి బాధ్యతలను రాహుల్ చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏఐసీసీ కార్యాలయం వద్ద రాహుల్ ప్లకార్డులు..బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, కాంగ్రెస్ కీలక నేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్ర సీఎంలు, రాష్ట్రాల అధ్యక్షులు..తదితరులు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ తో టెన్ టివి మాట్లాడింది. రాహుల్ గాంధీ అధ్యక్షుడు కావాలని ఎంతో మంది ఎదురు చూస్తున్నారని, ప్రధానంగా యువత ఎక్కువ ఆసక్తి పెట్టుకుందన్నారు. అంతేగాకుండా సోనియా హెల్త్ బాగా లేదన్నారు. ప్రధాన మంత్రి మోడీని ఢీకొట్టే గల శక్తి ఒక్క రాహుల్ కే మాత్రమే ఉందని, ఈ విధంగా ఇతర పార్టీలు కూడా వ్యాఖ్యానిస్తున్నారని పేర్కొన్నారు. రాహుల్ కు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని సోనియా తప్పుకున్నట్లు ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. గతంలోనే ఈ అవకాశం వచ్చినా రాహుల్ సున్నితంగా తిరస్కరించారని, ప్రజల్లో ఉండి సమస్యలపై దృష్టి సారించాలని రాహుల్ యోచించినట్లు తెలుస్తోందన్నారు. 

ఏజెన్సీలో విజృంభిస్తున్న చలి...

విశాఖపట్టణం : ఏజెన్సీలో చలి విజృంభిస్తోంది. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతలగాలులతో చలి ఒక్కసారిగా పెరిగింది. దీంతో ఇంట్లోంచి బయటకు వచ్చేందుకు మన్యం ప్రజలు భయపడుతున్నారు. 

08:36 - December 16, 2017

కాసేపట్లో ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్ బాధ్యతలు...

ఢిల్లీ : ఏఐసీసీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ బాధ్యతలను చేపట్టనున్నారు. ఉదయం 11గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పాలిత సీఎంలు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్రాల అధ్యక్షులు, ముఖ్యులు పాల్గొననున్నారు. 

07:55 - December 16, 2017

సర్కారు బడిలె సద్వు జెప్పె పంతులు పదవికోసం.. టెట్టు పాస్ గావాలె..హోంగార్డుల మీద వరాల వాన అనంగనే పాపం వాళ్లుగూడ పాల ప్యాకెట్లు బాగనే గొన్నరు... ఎన్ కౌంటర్.. ఇది పేరుకే ఇరువర్గాల నడ్మ కాల్పులు.. ఎదురుకాల్పులు అనిపిస్తదిగని.. ఆడ ఏముండది..పార్టీ అధిష్టానం మాటలు వట్టిచ్చుకోకుంట ఎవ్వలు వ్యవహరించినా ముమ్మాటికి తప్పై అయితది అంటున్నడు విద్యావంతుడు.. నాగార్జున సాగర్ కట్టకు గులాబీ రంగేయ జూశి.. మంది దిట్టంగనే మళ్ల దాన్ని చెడిపేశిండ్రు.. అయ్యా ఆందోల్ ఎమ్మెల్యే బాబు మోహన్ గారు.. అంటెనేమో.. అగో మల్లన్న నోరు బైటవెట్టిండని మొత్తుకుంటవ్.. వంద రోజుల తర్వాత హైద్రావాదుల ఒక్క గుంత గనిపిచ్చినా.. వెయ్యిరూపాల నజరానా ఇస్తాని చెప్పిన జీహెచ్ఎంసీ కమీషనర్ ఎటువొయ్యిండో....గీ ముచ్చట్లు జూడాలంటే వీడియో క్లిక్ చేయండి. 

07:34 - December 16, 2017

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్‌ గాంధీ శనివారం బాధ్యతలు స్వీకరించనుండడంతో ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయం ముస్తాబైంది. రాహుల్‌ పట్టాభిషేక మహోత్సవానికి భారీగా ఏర్పాట్లు చేశారు. మరోవైపు ప్రపంచ తెలుగు మహాసభలు నగరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన ప్రత్యేక చర్చా వేదికలో వినయ్ కుమార్ (విశ్లేషకులు), కైలాష్ (టి.కాంగ్రెస్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

మిజోరాం, మేఘాలయకు వెళ్లనున్న మోడీ..

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మిజోరాం, మేఘాలయలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించనున్నారు. 

అడ్డగుట్టలో సీపీఐ(ఎం) సిటీ 21వ మహాసభలు...

హైదరాబాద్ : అడ్డగుట్టలో సీపీఐ(ఎం) సిటీ 21వ మహాసభలు జరుగనున్నాయి. రెండు రోజుల పాటు ఈ సభల్లో తెలంగాణ సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభధ్రం ప్రారంభోపన్యాసం చేయనున్నారు. సికింద్రాబాద్ తుకారంగేట్ నుండి ప్రదర్శన జరుగనుంది. 

విశాఖకు రానున్న బాబు..

విశాఖపట్టణం : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జిల్లాలో పర్యటించనున్నారు. టెక్ కాన్ఫరెన్స్ ను చంద్రబాబు ప్రారంభించనున్నారు. మూడు రోజుల పాటు ఈ కాన్ఫరెన్స్ జరుగనుంది. 

హెలీ టూరిజం ప్రారంభించనున్న బాబు..

విజయవాడ : నేడు హెలీ టూరిజాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. ఈనెల 28 నుండి జరగబోయే విశాఖ ఉత్సవ్ నుండి హెలీ టూరిజం అందుబాటులోకి రానుంది. 

మధ్యాహ్నం ఏపీ మంత్రివర్గ సమావేశం...

విజయవాడ : ఏపీ మంత్రివర్గ సమావేశం మధ్యాహ్నం 3గంటలకు జరుగనుంది. అసెంబ్లీ డిజైన్లకు మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. 

06:49 - December 16, 2017
06:45 - December 16, 2017

రంగారెడ్డి : కోర్టు ఆదేశాలు ఉన్నా బేఖాతరు చేస్తారు.. రాత్రికి రాత్రే అక్రమంగా ఇళ్లుకట్టేస్తారు..గొడలకు తెల్లసున్నాలు వేసీ కలరింగ్‌ ఇస్తారు. రాజధాని శివారు ప్రాంతాల్లోని రైతుల స్ధలాల్లో తెల్లవారేసరికే అక్రమ కట్టడాలు వెలుస్తున్నాయి. పోలీసుల సపోర్ట్‌కూడా ఉండటంతో కబ్జాదారులు మరింతగా రెచ్చిపోతున్నారు. రంగారెడ్డిజిల్లా ఘట్‌కేసర్‌ మండల పరిధిలో జరుగుతున్న కబ్జాలపై 10టివి స్పేషల్ ఫోకస్..

గ్యాంగ్‌స్టర్ నయీమ్ అంతమైనా.. ఆ తరహా నేరాలు మాత్రం ఆగలేదు. నకిలీ పత్రాలు సృష్టించి భూ కబ్జాలకు పాల్పడుతున్న ముఠాల ఆగడాలు రోజురోజుకు మితిమీరి పోతున్నాయి. అధికార పార్టీ నేతలు, పోలీసుల సపోర్ట్‌ ఉండటంతో కబ్జాదారులకు అడ్డేలేకుండా పోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం ముత్యాలగూడలోని సర్వే నెంబర్ 1లోఉన్న ఈ 5 ఎకరాల భూమి ఇపుడు కబ్జాకోరల్లో చిక్కుకుంది. స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకుడు చంద్రమౌళి గౌడ్ తమ భూమిని బలవంతంగా అగ్రిమెంట్‌ చేయించుకున్నారని ఈ రైతు కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. గతంలో నయీంగ్యాగ్‌తో సంబంధాలు నెరిపిన ఈ కబ్జాదారుల నుంచి తమకు ప్రాణహాని ఉందని ఈ రైతు కుటుంబం ఆందోళన పడుతోంది.

మొదట 21 ఎకరాలు ఉన్న భూమిని 1955 నుంచి సత్తయ్య, బాలయ్య అనే రైతుల కుటుంబాలు సాగు చేస్తున్నాయి. కాగా 1971లో సత్తయ్య కు, 1980లో బాలయ్యకు ఈ భూమిపై హక్కులు సంక్రమించాయి.1988లో వీరికి పట్టాదార్‌ పాస్‌పుస్తకాలు కూడా వచ్చాయి. తర్వాత కొంతకాలానికి సత్తయ్య తన భూమిని అమ్ముకోగా..బాలయ్య కుటుంబం ఇప్పటికీ ఈ భూమిలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో రియల్‌ఎస్టేట్‌ భూం రావడంతో ఈ భూముల విలువ అమాంతం పెరిగిపోయింది. దీంతో కబ్జాదారుల కన్ను ఈ భూమిపై పడింది. భూమికి సంబంధించిన దొంగడాక్యుమెంట్లు సృష్టించారు. తమ భూ దందాకు గతంలో సత్తయ్య అమ్మిన భూమి తాలూకు అగ్రిమెంట్‌ ఉపయోగించుకున్నారు. బాలయ్య భూమికూడా ఇదే సర్వేనంబర్‌లో ఉండటంతో అక్రమార్కుల పని మరింత ఈజీ అయింది. సత్తెయ్య అమ్మిన 8ఎకరాల 27గుంటల భూమితోపాటు బాలయ్యకుటుంబానికి చెందిన 5 ఎకరాల పొలాన్ని కూడా శివరాజ్‌ అనే వ్యక్తి తనపేరుతో అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడు.

తర్వాత చిన్నచేపను పెద్ద చేప మింగినట్టు ..శివరాజ్‌ను బెదిరించిన కొమ్మడి సంజీవరెడ్డి తన బినామీ అయిన మాధవరెడ్డిపేరుతో ఈ భూమిని రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నట్టు బాధితలు ఆరోపిస్తున్నారు. అయితే తనను బెదిరించి భూమిని రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారని.. నియీంకేసు దర్యాప్తు చేస్తున్న సిట్‌కు శివరాజ్‌ ఫిర్యాదు చేశాడు. ఇలా తమ పొలంపై ఇంత తతంగం జరుగుతుందన్న విషయం తెలియని బాలయ్య కుటుంబం.. ఈ భూమిలో వ్యవసాయం చేస్తూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా స్థానిక టీఆర్‌ఎస్‌ నేత చంద్రమౌళీగౌడ్‌ .. ఈ భూమి విడిచి వెళ్లిపోవాలని బాలయ్య కుటుంబానికి బెదిరింపులు మొదలు పెట్టాడు. అంతటితోనే ఆగలేదు రాత్రికి రాత్రే జేసీబీలు, టిప్పటర్లతో బాలయ్య భూమిని ఆక్రమించేశారు. ఇప్పటికే ఈ భూమిపై కోర్టు స్టేటస్‌కో ఆర్డర్‌ ఉంది. అయినా కబ్జాదారులకు అవేవీ పట్టడంలేదు.. పైగా పోలీసుల అండకూడా తోడవడంతో.. అక్రమార్కులను ప్రశ్నించేవారే లేకుండా పోయారు. ఇప్పటికైనా కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుని తమ భూమిని ఇప్పించాలని బాలయ్య కుటుంబం ప్రభుత్వాన్ని వేడుకుంటోంది. 

06:40 - December 16, 2017

గుంటూరు : జనసేన పార్టీ కార్యాలయ నిర్మాణానికి ఎంచుకున్న స్థలంపై వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ భూమి తమదంటే తమదంటూ ఇద్దరు వ్యక్తులు వాదిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల కుట్రతోనే ఇలా చేస్తున్నారంటూ ఆ ఇద్దరు వ్యక్తులూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. జనసేన కూడా.. ఇది రాజకీయ కుట్రేనని ఆరోపిస్తోంది.

గుంటూరు జిల్లా.. చిన కాకానిలో పార్టీ కార్యాలయం కోసం జనసేన లీజుకు తీసుకున్న ఐదు ఎకరాల భూమి.. వివాదానికి కేంద్రంగా మారింది. గత నెల 21న ఈ స్థలాన్ని జనసేన నేతలు, మూడున్నరేళ్ల లీజుకు తీసుకున్నారు. పవన్‌ కల్యాణ్‌ కూడా భూ యజమానులను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. అయితే శంకుస్థాపన తరుణంలో... లీజుకు తీసుకున్న స్థలంపై గొడవ మొదలైంది.

జనసేన తీసుకున్న స్థలం మైనారిటీకి చెందిన వ్యక్తులదని ముస్లిం ఐక్య వేదిక వాదిస్తోంది. ఈ స్థలంపై 1958 నుంచి యార్లగడ్డ సుబ్బారావు, ముగ్ధం మోహిద్దున్ జక్రియాల మధ్య వివాదం నడుస్తోందని అంటున్నారు. 1998లో గుంటూరు కోర్టులో యార్లగడ్డ సుబ్బారావుకు ఎదురుదెబ్బ తగిలిందని... ఆ స్థలంపై హైకోర్టు స్టే ఇచ్చిందన్నది మైనారిటీ నేతల వాదన.

అయితే అన్ని చట్టపరమైన అంశాలు పరిశీలించిన తర్వాతే భూమి లీజుకు తీసుకున్నామని... జనసేన నేతలు అంటున్నారు. మైనార్టీ నేతలు చెబుతున్న కేసు వివరాలు... ఈ భూమి సర్వే నెంబర్‌ వేరు అని జనసేన నేతలు చెబుతున్నారు. అటు స్థలం యజమానిగా చెబుతున్న వేంకటేశ్వరరావు కూడా.. ఇది తన స్థలమేనని వాదిస్తున్నారు. 1958లో తన తండ్రి ఈ స్థలాన్ని కొన్నారని, అప్పటి నుంచి తామే సాగుచేసుకుంటున్నామని అంటున్నారు. ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరిస్తున్నారు.

ఈ విషయంపై స్పందించిన జనసేన అధినేత స్థలం, వివాదంలో ఉంటే లీజుని రద్దు చేసుకుంటామని ప్రకటించారు. అంతేకాకుండా దీని వెనుక రాజకీయ కుట్ర ఉందనే అనుమానాన్ని పవన్ వ్యక్తం చేశారు. అవసరమైతే న్యాయ పోరాటం చేయాలని పార్టీ నేతలకు సూచించారు. 

06:37 - December 16, 2017

విజయవాడ : ఏపీ ప్రభుత్వం మరో బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టింది. గోదావరి -పెన్నా నదుల అనుసంధానంపై దృష్టిపెట్టింది. ఇప్పటికే జియో టెక్నికల్‌ అధ్యయనం పూర్తి చేసిన సర్కార్‌.. నిధుల అన్వేషణలో పడింది. ప్రాజెక్టుకోసం దాదాపు 80వేల కోట్ల రూపాయలు వ్యయం అవుతాయని అంచనా వేస్తున్న బాబు సర్కార్‌.. కేంద్రం నుంచి తగినంతం సాయం పొందాలని భావిస్తోంది.

పట్టిసీమ లిఫ్ట్‌ద్వారా గోదావరి జలాలను కృష్ణానదికి తెచ్చిన ఏపీ ప్రభుత్వం ..మ‌రో భారీ ప్రాజెక్ట్ కు శ్రీ‌కారం చుడుతోంది. గోదావ‌రి - పెన్నా న‌దులు అనుసంధానం చేయాల‌ని నిర్ణయించారు.. దీన్లో భాగంగా 320 టీఎంసీల గోదావరి మిగులు జలాలను పెన్నాకు తరలించే ప్రాజెక్టుపై కసరత్తు మొదలైంది. ఇప్పటికే లైడార్, హైడ్రోగ్రాఫిక్ సర్వే పూర్తికాగా, జియో టెక్నికల్ అధ్యయనం ముగింపుదశకు వచ్చింది. గోదావరి-పెన్నా అనుసంధానం ద్వారా రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు తాగు-సాగు నీరు సరఫరా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గోదావరి-పెన్నా సంగమ ప్రాజెక్టుపై శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రికి వాప్‌కాస్ సంస్థ నివేదిక అందించింది.

గోదావరి -పెన్నా అనుసంధానం కోసం సుమారు రూ. 80 వేల కోట్లరూపాయల వ్యయం కానుందని, 320 టీఎంసీల గోదావరి జలాలను ఎత్తిపోతల పథకం ద్వారా తరలించేందుకు 3,625 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుందని 'వాప్‌కాస్' ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ మహత్తర పథకం పూర్తికావాలంటే 32 వేల ఎకరాల భూమిని సేకరించాల్సి వుందని, ఇందులో 7 వేల ఎకరాల అటవీ భూమి వుందని తెలిపారు. పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజ్ మధ్యలో రెండు సొరంగాలు తవ్వాలని, బొల్లపల్లి దగ్గర రిజర్వాయర్ నిర్మించాలని ముఖ్యమంత్రికి వాప్‌కాస్‌ ప్రతినిధులు వెల్లడించారు.

పోలవరం ప్రాజెక్టు నుంచి సంగం బ్యారేజ్ వరకు 701 కి.మీ. మేర కాలువలు నిర్మించాల్సి వుంటుందని చెప్పారు. దీంతో రాష్ట్రంలో సుమారు 1,500 టీఎంసీల వరకు జలాలను నిల్వ చేసుకునేందుకు అవకాశం కలుగుతుందని వాప్‌కాన్‌ ప్రతినిధులు నివేదిక అందించారు. మ‌రో వైపు రాజధాని అమ‌రావ‌తి భ‌విష్యత్ అవ‌స‌రాలకోసం కృష్ణా న‌దిపై మరో బ్యారేజ్ నిర్మాణానికి చెపట్టనున్నారు..పులిచింతల ప్రాజెక్టుకు 60 కి.మీ. దిగువన, ప్రకాశం బ్యారేజ్‌కు 23 కి.మీ ఎగువన కొత్తగా బ్యారేజ్ నిర్మించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. వైకుంఠపురం దగ్గర కృష్ణా నదిపై నిర్మించే ఈ బ్యారేజ్‌కు రూ. 3,278 కోట్లు వ్యయం కానుందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈనెల 23న పోలవరం ప్రాజెక్టు సందర్శనకు కేంద్ర మంత్రి గడ్కరీ వస్తున్నందున .. ఆయన ఈ గోదావరి-పెన్నా అనుసంధానం ప్రాజెక్టుపై చర్చించాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్టు తెలుస్తోంది. 

06:35 - December 16, 2017

హైదరాబాద్‌ : నగరంలో నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలను బహిష్కరించాలని పలువురు రచయితలు పిలుపునిచ్చారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ శ్రీశ్రీ విగ్రహం వద్ద నిరసన తెలపడానికి వచ్చిన విరసం రచయితలను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అంతకు ముందు బాగ్ లింగం పల్లి నుంచి విరసం నేత వరవరరావు ఆధర్యంలో చేపట్టిన ర్యాలీని కూడా పోలీసులు అడ్డుకొని వారిని అరెస్ట్ చేశారు. ప్రభుత్వం తెలుగు మహాసభలను సరియైన మార్గంలో నిర్వహించం లేదని రచయిత రవిచంద్ర ఆరోపించారు. తెలుగు భాషాభిమానులకు సరైన గుర్తింపు దక్కలేదన్నారు. 

06:33 - December 16, 2017

హైదరాబాద్ : తెలుగు మహాసభల్లో పాల్గొన్న ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ తెలుగులో మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారు. హైదరాబాద్‌లో హిందూ, ముస్లింలు పాలు-నీళ్లలా కలిసి ఉండటం ఈ ప్రాంతం గొప్పతనమన్నారు. భాగ్యనగరం తెలుగు, ఉర్దూల ఐక్యతకు నిదర్శనమన్నారు. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ది చెందుతుందన్నారు అసదుద్దీన్‌. 

06:31 - December 16, 2017

హైదరాబాద్ : నగరంలో ప్రపంచ తెలుగు మహాసభలు వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహా పలువురు ప్రముఖులు తెలుగు పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. తెలుగు నుడికారాలకు నాంది పలికిన అలనాటి కవులు, సాహితీవేత్తలు, భాషాపండితుల నుంచి నేటి తరం కవుల వరకు తెలుగు భాషాభివృద్ధికి చేసిన కృషిని అందరూ స్మరించుకున్నారు. 

ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌, మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కవులు, సాహితీవేత్తలు భాషాభిమానులు పాల్గొన్నారు. మొతం 42 దేశాలు, మనదేశంలోని 17 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం నుంచి 8 వేల మంది ప్రతినిధులు ఈ మహాసభలకు హాజరవుతున్నారు. ఎల్బీ స్డేడియం పాల్కురి సోమనాథుడి ప్రాంగణం, బమ్మెరపోతన వేదికపై నుంచి ప్రసంగించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. తెలంగాణ గడ్డపై ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అభినందించారు. మాతృభాష పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు. అమ్మభాషను ఎవరూ మరువొద్దన్నారు. ఇతర రాష్ట్రాల్లోని తెలుగువారికోసం పాఠశాలలు ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని వెంకయ్యనాయుడు గుర్తు చేశారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో ప్రసంగించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. బాల్యంలో ఎదురైన భాషాపరమైన ఇబ్బందులను గుర్తు చేసుకున్నారు. చిన్నప్పుడు పూతరేకులు పదానికి అర్థం తెలియకపోతే తన గురువు మృత్యుంజయ శర్మ... విజయవాడలోని ముదిగొండ వీరభద్రయ్యకు లేఖ రాసి తెలుసుకు చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.

సామాన్యులకు అర్థమయ్యే పదాలతో సాహిత్యం రాసిన పోతన, వేమన, సరళమైన భాషలో సాహిత్యాన్ని అందిచిన సీ నారాయణరెడ్డి, అందెశ్రీ, గోరట వెంకన్న వంటి కవులను కేసీఆర్‌ గుర్తు చేశారు. రాష్ట్రంలో ఒకటి నుంచి పదవ తరగతి వరకు భాషను ఒక సబ్జెక్టుగా నేర్చుకోవాలని ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసిన విషయాన్ని ప్రస్తావించిన కేసీఆర్‌.. తెలంగాణలో భాషా పండితులు ఎదుర్కొంటున్న సమస్యలను పది రోజుల్లో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభోత్సవం కార్యక్రమం ఆద్యంతంలో ప్రదర్శించిన నతృప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. నగరంలోని ఏడు వేదికలపై జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో ఇవాళ్టి నుంచి సాహితీ సదస్సులు, చర్చాగోష్ఠులు నిర్వహిస్తారు. 

టూరిస్ట్ వీసా ఆన్ ఎరైనల్ ప్రారంభం...

విశాఖపట్టణం : నేటి నుండి టూరిస్ట్ వీసా ఆన్ ఎరైనల్ ప్రారంభం కానుంది. ఈ వీసా ద్వారా 147 దేశాల పర్యటకులు నేరుగా విశాఖకు చేరుకునే అవకాశం ఉంది. 

చెన్నమనేని రమేష్ భారతీయ పౌరసత్వం..

ఢిల్లీ : చెన్నమనేని రమేష్‌ భారతీయ పౌరసత్వంపై రివ్యూ పిటిషన్‌ను కేంద్ర హోంశాఖ తిరస్కరించింది. రమేష్‌ పౌరసత్వాన్ని రద్దు చేస్తూ 2017 ఆగస్ట్‌ 31న కేంద్రహోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. రమేష్‌ భారతీయ పౌరుడు కాదని తేల్చడం ఇది మూడోసారి. 

రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం..

రాజన్న సిరిసిల్ల : జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ఈశ్వర్‌ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈశ్వర్‌ తంగళ్లపల్లి మండలం నేరేళ్ల లారీల దగ్ధం ఘటనలో బాధితుడు. తనకు వెంటనే న్యాయం చేయాలంటూ ఈశ్వర్‌ కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు కొట్టిన దెబ్బలతో తాను ఏ పని చేసుకోలేని పరిస్థితులో ఉన్నానని... అసలు నన్ను ఎందుకు కొట్టారో వాస్తవం చెప్పాలన్నాడు ఈశ్వర్‌.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా...

ఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్‌ గాంధీ శనివారం బాధ్యతలు స్వీకరించనుండడంతో ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయం ముస్తాబైంది. రాహుల్‌ పట్టాభిషేక మహోత్సవానికి భారీగా ఏర్పాట్లు చేశారు. విద్యుద్దీపాలతో పార్టీ కార్యాలయాన్ని అలంకరించారు.

ఆధార్ అనుసంధానం గడువు పెంపు...

ఢిల్లీ : ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వివిధ సేవలకు ఆధార్‌ అనుసంధానం చేసుకునే గడువును పొడిగించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఆధార్‌ను అనుసంధానం చేసుకునేందుకు ఈ ఏడాది డిసెంబరు 31 చివరి తేదీ కాగా...ఇప్పుడు ఆ గడువును వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగించారు. మొబైల్‌ ఫోన్‌కు ఆధార్‌ అనుసంధానం చేసుకునేందుకు కూడా మార్చి 31వరకు పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. 

సుప్రీంలో కాంగ్రెస్ కు ఎదురు దెబ్బ..

ఢిల్లీ : సుప్రీంకోర్టులో కాంగ్రెస్‌ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ యంత్రాల్లోని ఓట్లను ఆడిట్ చేయాలన్న కాంగ్రెస్ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నందున తాము ఎలక్షన్‌ కమిషన్‌ అధికారాల్లో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. 

గౌరీ లంకేశ్‌ హత్య కేసులో ఆసక్తికర అంశాలు...

ఢిల్లీ : ప్రముఖ జర్నలిస్ట్‌ గౌరీ లంకేశ్‌ హత్య కేసులో ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి. ప్రముఖ రచయిత కల్బుర్గి, కమ్యునిస్ట్‌ లీడర్‌ గోవింద్ పన్సారేలను హత్య చేసిన గన్‌తోనే గౌరీ లంకేశ్‌ను కూడా హత్య చేశారని ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రాథమికంగా నిర్దారించింది. 

Don't Miss