Activities calendar

17 December 2017

21:30 - December 17, 2017
21:27 - December 17, 2017

హైదరాబాద్ : ఆదిలాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో గిరిజన తెగల మధ్య జరుగుతున్న దాడులను అరికట్టడంతో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు వెంటనే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను డిమాండ్‌ చేశారు. 

21:26 - December 17, 2017

వరంగల్ : కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీసు రూల్స్‌ను ప్రకటిస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో వరంగల్‌లో జరిగిన విద్యా సదస్సుకు కడియం ముఖ్యఅతిథిగా హాజయర్యారు. రాజకీయ జోక్యం లేకుండా ఉపాధ్యాయుల బదిలీలు చేసినట్టు చెప్పారు. ఈ విషయంలో ఎవరి వద్దైనా లంచం తీసుకున్నట్టు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్‌ విసిరారు. గాడితప్పిని విద్యావ్యవస్థను సరిదిద్దేందకు ఐదేళ్లు పడుతుందన్నారు. కొత్తగా రూపొందిస్తున్న ఉపాధ్యాయుల సర్వీసు రూల్స్‌ తుది దశంలో ఉన్నాయని చెప్పారు. 

21:24 - December 17, 2017

హైదరాబాద్ : ప్రపంచ తెలుగు మహాసభల్లో కవులు, సాహితీవేత్తలు తమకు అవమానం జరిగిందని నిరసనగళం వినిపించారు. పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నిర్వాహకులు సాహితీవేత్తలు, ప్రతినిధులకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వడం లేదని ఆందోళనకు దిగారు. కవి సమ్మేళనానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నామని.. వేదిక మీద కాకుండా కవి సమ్మేళనం ప్రత్యేక గదుల్లో ఏర్పాటు చేస్తున్నారని వాపోయారు. అలాగే ప్రశంసాపత్రం, శాలువా చేతికి ఇచ్చి పంపిస్తున్నారని వీసీతో కవులు వాగ్వాదానికి దిగారు. మరోవైపు మహాసభల నిర్వహణాతీరుపై ప్రతిపక్షనేతలు అసహనం వ్యక్తం చేశారు.

ప్రపంచ తెలుగు మహాసభల్లో తమకు అవమానం జరిగిందని సాహితీ వేత్తలు నిరసనగళం వినిపించారు. వివిధ అంశాల్లో ప్రదర్శనలిస్తామని ప్రపంచ వ్యాప్తంగా సుమారు 8వేల కవులు, కళాకారులు, సాహితీ వేత్తలు పేర్లు నమోదు చేసుకున్నారు. ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలో వీరందరికీ బృహత్‌ కవిసమ్మేళనం ఏర్పాటు చేశారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన కవులకు ఆడిటోరియంలో అవకాశం రాకపోవడంతో పొట్టి శ్రీరాములు తెలుగువిశ్వవిద్యాలయంలో వీరికి అవకాశం ఇచ్చారు.

విశ్వవిద్యాలయానికి చేరుకున్న సాహితీవేత్తలకు నిర్వహకులు అందరికీ అవకాశం ఇవ్వడం కుదరదని చెప్పారు. పేర్లు న‌మోదు చేసుకున్నా అవ‌కాశం రాని వారికి ప్రత్యేకంగా మ‌రో వేదిక‌పై క‌వితలు చ‌దివే అవ‌కాశంతో పాటు స‌న్మానాలు చేస్తామ‌న్నారు. వ‌ర్సిటీలోని మొద‌టి అంత‌స్తులోని ఒక గ‌దిలో కవులందరినీ ఒకేచోట వరుసగా సామూహిక సన్మానాలు నిర్వహించారు. ఒకే శాలువా, ఒకే బొకేతో 250 మంది సాహితీవేత్తలకు సన్మానం చేసి చేతులు దులుపుకున్నారు నిర్వహకులు. సన్మానం చేసినట్లు కనీసం శాలువా లేదా పుష్పగుచ్చం కూడా ఇవ్వకపోవడంతో కవులు అవాక్కయ్యారు. సన్మానంలో అందించాల్సిన కనీస మర్యాదలు కూడా ఇవ్వకపోవడంతో అవమానంగా భావించిన సాహితీవేత్తలు విశ్వవిద్యాలయం ఆవరణలో ధర్నా నిర్వహించారు. అందరికీ సమాన అవకాశం కల్పించాలని, ప్రాంతాలకతీతంగా కవులు, కళాకారులకు గుర్తింపు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

ఆందోళన చేస్తున్న వారివద్దకు వచ్చిన వర్సిటీ వీసీ ఎస్వీస‌త్యనారాయ‌ణ ఆందోళన చేస్తున్న వారిపై విరుచుకుపడ్డారు. ఇప్పటికిప్పుడు సిగ‌రెట్ పెట్టె మీద క‌విత‌లు రాసుకు వ‌చ్చి అవ‌కాశం ఇవ్వాలంటే సాధ్యం కాదని, మూడు వేలు, శాలువా, బొకే ఇవ్వాల‌ని గొంతెమ్మ కొర్కెలు కోరవద్దని క‌వుల‌పై మండిప‌డ్డారు. దీంతో ఒక రూములో బంధించి, సామూహిక స‌న్మానం పేరుతో క‌వుల‌ను కించ‌ప‌రచ‌డం స‌రికాదని, నిర్వహ‌కులు తమ వైఖ‌రి మార్చుకోవాలని సాహితీవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు మహాసభల నిర్వహణా తీరుపై కాంగ్రెస్‌ నేత వి హనుమంతరావు మండిపడ్డారు. ప్రతిపక్షనేతలను, ఏపీ ముఖ్యమంత్రిని సభలకు పిలవకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసీఆర్‌ కుటుంబసభలా తెలుగు మహాసభలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో మ‌ర్యాద‌కు లోటు రావ‌ద్దని సీఎం కేసీఆర్ ఆదేశించినా నిర్వహ‌కులు మాత్రం చిన్న శాలువా ఇచ్చే ద‌గ్గర క‌క్కుర్తి ప‌డ్డార‌నే విమ‌ర్శలు వినిపిస్తున్నాయి. 

21:23 - December 17, 2017

హైదరాబాద్ : ప్రపంచ తెలుగు మహాసభలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ప్రపంచ నలుమూలల నుండి భాషాభిమానులు మహాసభలకు పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. సాహితీప్రియుల సహకారంతో తెలుగు మహాసభలు ఘనంగా నిర్వహించుకుంటున్నామన్న కేసీఆర్‌ మహాసభల ముగింపు రోజు చారిత్రాత్మకమైన నిర్ణయాలు వెల్లడిస్తామని తెలిపారు.

బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్‌లో శతావధానం ఆసక్తికరంగా సాగింది. జీఎం రామశర్మ శతావధానంలో పృచ్ఛకులుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవహరించారు. అనంతరం శతావధానులను కేసీఆర్‌ సన్మానించారు. దేదీప్యమానంగా తెలుగు మహాసభలు జరుగుతున్నాయన్న కేసీఆర్‌, కవి సమ్మేళనాలు, చర్చలు చాలా ఆసక్తికరంగా సాగుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. సాహితీవేత్తలకు ఆదరణ తగ్గిందని, ఇకపై ఆలాంటి పరిస్థితి రాబోదన్నారు. సభ నిర్వహణ, అతిథులకు భోజన సదుపాయం బాగున్నాయని అన్నారు. సభల ముగింపు రోజున చరిత్రాత్మకమైన నిర్ణయాలు వెల్లడిస్తామని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారు హర్షించేలా తీర్మానాలు ప్రకటిస్తామని సీఎం తెలిపారు.

మరోవైపు తెలుగు మహాసభలు సందర్భంగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన కథా సదస్సులో మంత్రి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. పలువురు రచయితలు రాసిన పుస్తకాలను ఆవిష్కరించారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్న మంత్రి తెలుగు భాషాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందన్నారు. తెలుగు మహాసభల్లో ఏర్పాటు చేసిన ప్రదర్శనలు సాహితీవేత్తలను ఆకట్టుకున్నాయి. మహాసభల సందర్భంగా ఏర్పాటు చేసిన విందు.. భోజన ప్రియులను ఆకట్టుకుంది. 

21:21 - December 17, 2017

విశాఖపట్టణం : శ్రీలంకతో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత్‌ ఘన విజయం సాధించింది. శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ 85 బంతుల్లో 100 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. శ్రేయస్‌ అయ్యర్‌ 65 పరుగులతో చెలరేగడంతో లంక నిర్దేశించిన 216 పరుగుల లక్ష్యం ఏ మూలకూ చాలలేదు. భారత్‌ 32.1 ఓవర్లకే ఆటను ముగించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 2-1 తేడాతో గెలుచుకుంది. అంతకు ముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన లంక 44.5 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. తరంగ 95, సమర విక్రమ 42 పరుగులు మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. భారత బౌలర్లలో కుల్‌దీప్‌ యాదవ్‌ 3, చాహల్‌ 3, పాండ్యా 2, బూమ్రా 1, భువనేశ్వర్‌ ఒక వికెట్‌ తీశారు.

రాహుల్ విందు..

ఢిల్లీ : కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు..ఆఫీస్ బేరర్స్, పీసీసీ అధ్యక్షులు..సీనియర్ నేతలకు ఏఐసీసీ కాంగ్రెస్ అధ్యక్షుడు విందు ఇచ్చారు. ఈ విందులో పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. 

భారత్ ఘన విజయం...

విశాఖపట్టణం : అభిమానుల ఆశలు నెరవేరాయి. విశాఖలో లంకతో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. శిఖర్ ధావన్ సెంచరీ చేశాడు. 

ఎల్బీ స్టేడియంలో సాహితీ సభ..

హైదరాబాద్ : మూడో రోజు ప్రపంచ తెలుగు మహాసభలు కొనసాగుతున్నాయి. ఎల్బీ స్టేడియంలో సాహితీ సభ జరుగుతోంది. మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, మంత్రి తుమ్మల, కసిరెడ్డి వెంకట్ రెడ్డి, గోరటి వెంకన్నలు హాజరయ్యారు. అనంతరం సాంస్కృతిక సమావేశం జరుగుతోంది. 

ఎన్నికల్లో గెలవడం పట్ల సిద్ధూ సంతోషం...

పంజాబ్ : అమృత్ సర్ మున్సిపల్ ఎన్నికల్లో గెలవడం పట్ల కాంగ్రెస్ నేత సిద్ధూ సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితులైన రాహుల్ కు మొదటి విజయమన్నారు.

 

19:47 - December 17, 2017

రెడియో మిర్చీలో బ్రేకింగ్ న్యూస్ గా పేరొందిన 'కిరణ్' 'మళ్లీ రావా' సినిమాతో అలరించారు. సుమంత్..ఆకాంక్ష సింగ్ జంటగా నటించిన ఈ సినిమా ఇటీవలే విడుదలైంది. ఈ సందర్భంగా డైలాగ్ రైటర్, యాక్టర్, రెడియో 'మిర్చి' కిరణ్ తో టెన్ టివి ముచ్చటించింది. చలన చిత్ర విశేషాలు..జీవిత విషయాలు..ఇతరత్రా వాటిపై ఆయన మాట్లాడారు. చిన్పప్పటి నుండి తనకు సినిమాలంటే ఆసక్తి ఉందని, ఎప్పటికైనా సినిమాల్లోనే ఉండాలని అనిపించిందన్నారు. రెడియో 'మిర్చీ'లో జాయిన్ అయి...రైటర్..సీరియల్స్ నటన..ఇలా కొనసాగిందన్నారు. 'అనుష్క’ తనకు ఎంతో ఇష్టమైన నటి అని తెలిపారు.'రుద్రమదేవి' సినిమా ప్రమోషన్ లో ఆమెను కలవడం జరిగిందని, ఎంతో సంతోషం కలిగిందన్నారు. 'కాశీ' అంటే తనకు ఎంతో ఇష్టమైన ప్లేస్ అని తెలిపారు. 

19:46 - December 17, 2017

విక్టరీ 'వెంకటేష్'..సౌందర్య జంటగా నటించిన సినిమా 'సూర్యవంశం' గుర్తుకు ఉండే ఉంటుంది కదా. అందులో వెంకటేష్ డబుల్ రోల్ నటన ఎంతో మందిని అలరించింది. తండ్రి చిన్న కొడుకును అంతగా పట్టించుకోకపోవడం..తదితర వాటితో ఈ సినిమా రూపొందింది. కానీ 'సూర్య వంశం' కథను తన చిన్నప్పుడు రాసుకున్నట్లు రేడియో 'మిర్చి' కిరణ్ పేర్కొన్నారు. ‘మళ్లీ రావా' సినిమాలో ఆయన నటించి అభిమానులను మెప్పించాడు. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలు వెల్లడించారు. తల్లిదండ్రులు తన సోదరుడిని రెసిడెన్షియల్ స్కూల్ లో పెట్టారని..తనను పంపించలేదన్నారు. ఇంటికి వచ్చిన సమయంలో స్పెషల్స్ వంటకాలు చేయడం..వంటివి చేసేవారని పేర్కొన్నారు. తనకు తక్కువ ఇంట్రెస్ చూపించారనే అనుమానం ఉండేదని..దాని నుండి కథ పుట్టుకొచ్చిందన్నారు. 

మౌఖిక వాజ్మయ భాషపై సాహిత్య సభ...

హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభలు కొనసాగుతున్నాయి. ఆదివారం సాయంత్రం ఎల్బీ స్టేడియంలో మౌఖిక వాజ్మయం భాషపై సాహిత్య సభ జరిగింది. ఈ సభకు మండలి చైర్మన్ స్వామి గౌడ్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పలువురు సాహితీ వేత్తలు హాజరయ్యారు.

19:12 - December 17, 2017

చిత్తూరు : మరుగుదొడ్ల నిర్మాణం కోసం ఇసుకను తరలిస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. మరుగుదొడ్లను నిర్మించుకోవాలని ప్రభుత్వం పేర్కొంటున్న సంగతి తెలిసిందే. చిత్తూరు జిల్లాలోని పుంగనూరు మండలంలోని ఓ కుటుంబం మరుగుదొడ్డి నిర్మాణం కోసం ఇసుకను తీసుకొచ్చేందుకు వెదళ్ల చెరువుకు వెళ్లారు. జ్యోతి, కిష్టప్ప, జ్యోతిలు 50 అడుగుల లోతులో ఉన్న గొయ్యిలోకి దిగారు. ఇసుకను లోడ్ చేసిన అనంతరం ట్రాక్టర్ ను డ్రైవర్ నడిపించాడు. కానీ ట్రాక్టర్ అదుపుతప్పి చెట్టును ఢీకొంది. మొదళ్లతో సహా చెట్టు నేల కూలడం..ఇసుక దిబ్బలు ఒక్కసారిగా కూలిపోయాయి. కింద ఉన్న వారిపై ఇసుక దిబ్బలు పడడంతో దుర్మరణం చెందారు. యదేచ్చగా ఇసుకను తరలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈఘటనపై జిల్లా అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. 

వెదళ్లచెరువులో విషాదం..

చిత్తూరు : పుంగనూరు మండలం వెదళ్ల చెరువులో విషాదం చోటు చేసుకుంది. ఇసుక దిబ్బలు కూలి ముగ్గురు మృతి చెందారు. మృతి చెందిన వారిలో ఇద్దరు మహిళలున్నారు. జేసీబీల సహాయంతో మృతదేహాలను బయటకు తీశారు. 

అర్టెంటినా యువతిపై దాడి..

వారాణాసి : ఆసి ఘాట్ వద్ద అర్జెంటినా దేశానికి చెందిన యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. యువతి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. 

విజిలెన్స్..ఇంజినీరింగ్ అధికారుల మధ్య సమన్వయ లోపం

చిత్తూరు : తిరుమల టిటిడి విజిలెన్స్..ఇంజినీరింగ్ అధికారుల మధ్య సమన్వయ లోపం తలెత్తింది. తిరువెంకటపథం రింగు రోడ్డు పనుల్లో బండరాలు పగులగొట్టడానికి వినియోగిస్తున్న 24 జిలెటిన్ స్టిక్స్, 36 డిటోనటర్లను టిటిడి స్వాధీనం చేసుకుంది. పేలుడు పదార్థాలు వాడకూడదని టిటిడి అధికారులు నిబంధన విధించారు. 

పెనుమాక రైతులతో వైసీపీ ఎమ్మెల్యే...

విజయవాడ : తాడేపల్లి మండలం పెనుమాక రైతులతో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. భూ సేకరణ ద్వారా భూములు తీసుకోమని చెప్పి పెనుమాకలో 630 ఎకరాలకు నోటీసులు ఇవ్వడం మోసమన్నారు. 

18:06 - December 17, 2017

కడప : క్రికెట్ బెట్టింగ్ లకు తెరపడడం లేదు. ఇండియా జట్టు ఆడుతున్న సమయంలో బెట్టింగ్ మాఫియా చెలరేగిపోతోంది. విశాఖపట్టణంలో భారత్ - శ్రీలంక జట్ల మధ్య మూడో వన్డే మ్యాచ్ జరుగుతోంది. దీనితో బెట్టింగ్ ముఠాలు రంగంలోకి దిగాయి. పలు ప్రాంతాల్లో బెట్టింగ్ లకు పాల్పడుతున్నారు. కడప, ప్రొద్దుటూరులో ఎక్కువగా బెట్టింగ్ లు జరుగుతున్నట్లు పోలీసులు నిర్ధారించారు. దీనితో ఆదివారం నగరంలో పలు ప్రాంతాల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఓ ప్రాంతంలో బెట్టింగ్ కు పాల్పడుతున్న పది మంది బుకీలను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్దనుండి 5.50 లక్షల నగదు, రూ. 10 సెల్ ఫోన్లు, ఒక టివిని స్వాధీనం చేసుకున్నారు. గత వారం రోజులుగా పోలీసులు దాడులు చేస్తూ 30 మందిని బుకీలను అదుపులోకి తీసుకున్నారు. 

వ్యవసాయం సంక్షభవంలో ఉంది : కోదండరామ్

హైదరాబాద్ : రాష్ట్రంలో వ్యవసాయం సంక్షోభంలో ఉందని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర రావడం లేదని టీజేఏసీ చైర్మన్ కోదండరామ్ అన్నారు.

17:36 - December 17, 2017

బీడబ్ల్యూఎఫ్‌ సూపర్‌ సిరీస్‌ ఫైనల్‌ టోర్నిలో పీవీ సింధు పోరాడి ఓడిపోయింది. జపాన్‌ షట్లర్‌ యమగూచి ఈ టోర్నిలో విజయం సాధించింది. 94 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో 21-15, 12-21, 19-21 తేడాతో సింధుని ఓడించి యమగూచి సిరీస్‌ను కైవసం చేసుకుంది. 21-15తో తొలి గేమ్‌ను సింధు కైవసం చేసుకుంది. అయితే, రెండో గేమ్‌ను 12-21తో ప్రత్యర్థి కైవసం చేసుకుని సింధుకు సవాల్‌ విసిరింది. దీంతో టైటిల్‌ గెలవాలంటే మూడో గేమ్‌లో గెలుపు తప్పనిసరి. అందరి దృష్టి మూడో గేమ్‌పైనే. అందుకు తగ్గట్టుగానే చివరి వరకు పోరు హోరాహోరీగా సాగింది. స్కోరు 19-19 వచ్చే వరకు స్కోర్లు చాలా దగ్గరగా వచ్చాయి. చివర్లో ఒత్తిడిని జయిస్తూ యమగూచి వరుసగా రెండు పాయింట్లు సాధించడంతో విజయం ఆమెను వరించింది. దీంతో సింధు రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

 

17:35 - December 17, 2017
17:17 - December 17, 2017

చిత్తూరు జిల్లాలో విషాదం

చిత్తూరు : జిల్లా పుంగనూరు మండలం వెదళ్లచెరువులో విషాదం జరిగింది. ఇసుక దిబ్బల కిందపడి ముగ్గురు కూలీలు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళ కూలీలు కూడ ఉన్నారు. 

17:11 - December 17, 2017

విశాఖపట్టణం : జిల్లాలో భారత్ - లంక జట్ల మధ్య మూడో వన్డే మ్యాచ్ కొనసాగుతోంది. తొలుత టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ను ఎంచుకుంది. ఆరంభం నుండి భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీనితో పరుగులు రాబట్టేందుకు లంక బ్యాట్స్ మెన్స్ శ్రమించాల్సి వచ్చింది. 44.5 ఓవర్లకే 215 పరుగులకే కుప్పకూలింది. యజ్వేంద్ర చాహల్ (3/46), కుల్ దీప్ యాదవ్ (3/42) విజృంభించారు. ఉపుల్ తరంగ (95), సమర విక్రమ (42) రాణించి ఆడడంతో ఆ స్కోరైనా నమోదైంది. పాండ్య 2, బుమ్రా, భువి తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్ లో భారత్ విజయం సాధించాలంటే 216 పరుగులు చేయాల్సి ఉంది. 

మహాసభలపై నిర్వహణ వీహెచ్ ఫైర్

హైదరాబాద్ : ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ తీరుపై వీహెచ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబ పండుగలా తెలుగు మహాసభలు ఉన్నాయని, కేసీఆర్ ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు. 

16:47 - December 17, 2017
16:36 - December 17, 2017

కడప : ఆయిల్ ట్యాంకర్ లో ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న ముఠాను ఫారెస్టు అధికారులు పట్టుకున్నారు. కడప జిల్లాలోని కనుమలోపల్లె కాలువ వద్ద అటవీ శాఖ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో ఆయిల్ ట్యాంకర్లను అధికారులు తనిఖీలు చేశారు. ట్యాంకర్ లోపల ఉన్న 95 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని ఘటనా స్థలంలో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పరారవుతున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా తమిళనాడు కు చెందిన వారని, పట్టుకున్న విలువ రూ. 2 కోట్ల విలువ ఉంటుందన్నారు. 

తెలుగు మహాసభల్లో కవుల నిరసనగళం....

హైదరాబాద్ : ప్రపంచ తెలుగు మహాసభల్లో కవులు నిరసన వ్యక్తం చేశారు. పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్శిటీ నిర్వహకులు సాహితీవేత్తలకు సరైన ప్రాతినిధ్యం లేదని కవులు ఆందోళన వ్యక్తం చేశారు. కవి సమ్మేళనానికి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న వేదిక మీద కవి సమ్మేళనం చేయకుండా ప్రత్యేక గదుల్లో ఏర్పాటు చేస్తున్నారని కవులు ఆవేదన వ్యక్తం చేశారు. 

16:25 - December 17, 2017

హైదరాబాద్ : నగరంలో ప్రపంచ తెలుగు మహాసభలు కొనసాగుతున్నాయి. మూడో రోజు పలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. మహాసభలను అత్యంత అట్టహాసంగా నిర్వహిస్తున్నామని చెబుతున్నా అక్కడక్కడ అపశృతులు చోటు చేసుకుంటున్నాయి. మొదటి రోజే తమను పట్టించుకోవడం లేదని..పలు రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కవులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నిర్వాహకులు సాహితీవేత్తలకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వడం లేదని కవులు ఆందోళన వ్యక్తం చేశారు. కవి సమ్మేళనానికి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవడం జరిగిందని, వేదిక మీద కవి సమ్మేళనం చేయకుండా ప్రత్యేక గదుల్లో ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు. ప్రశంసా పత్రం, శాలువ చేతికి ఇచ్చి పంపించేస్తున్నారని కవులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. 

16:17 - December 17, 2017

ఢిల్లీ : ఏపీ కాంగ్రెస్‌ నాయకులు ఢిల్లీలో లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేత మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన చట్టంలోని హామీల అమలుకు పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే అంశంపై చర్చించారు. లోక్‌సభ చట్టంలోని 184వ రూల్‌ కింది ఈ అంశంపై నోటీసు ఇచ్చి చర్చకు వచ్చే విధంగా చూడాలని కోరారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు నిధుల మంజూరు, విశాఖ రైల్వే జోన్‌ వంటి అంశాలు పార్లమెంటులో చర్చకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీలో చర్చించి, దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఖర్గే హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏపీ కాంగ్రెస్ నేతలు మీడియాతో మాట్లాడారు.

పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని టిడిపి నేతలు ఆరోపించడం పట్ల కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ తప్పుబట్టారు. ఈ విషయాన్ని ఆధారాలతో సహా రుజువు చేయాలని సవాల్ చేశారు. రుజువు చేస్తే రాజ్యసభ సభ్యత్వాన్ని రాజీనామా చేయడమే కాకుండా ఏపీ ప్రజలకు ముఖం చూపెట్టకుండా ఎక్కడో ఒక చోట తలదాచుకుంటానని కేవీపీ పేర్కొన్నారు. 

16:12 - December 17, 2017
16:11 - December 17, 2017

కర్నూలు : నిధులు..నిక్షేపాలున్నాయని తవ్వకాలు చేపడుతున్నారు..ఇదంతా ఇతరులు చేస్తున్నది కాదు..ఏకంగా ప్రభుత్వ అధికారులు నిధులు..నిక్షేపాల కోసం తవ్వకాలు చేపడుతుండడం విశేషం.

జిల్లాలోని చెన్నంపల్లి కోటలో నిధి..నిక్షేపాలున్నాయని..వాటిని స్వాధీనం చేసుకోవాలని ఎంతో మంది ప్రయత్నించినట్లు తెలుస్తోంది. చివరకు ప్రభుత్వాధికారులు రంగంలోకి దిగి తవ్వకాలు చేపట్టారు. 200 మంది పోలీసులతో కోట చుట్టూ బస్తీ నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఎనిమిది రాళ్లను బ్లాస్ట్ చేశారు. తాజాగా ఇనుక ముక్క..ఎముక బయటపడడంతో ఉత్కంఠ నెలకొంది. గత ఐదు రోజులుగా ఈ తవ్వకాలు జరుగుతున్నాయి. తవ్వకాలు జరుపుతుండడం పట్ల స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పాత కట్టడాలు..కోటలను ధ్వంసం చేయవద్దని ఉన్నా..ప్రభుత్వ అధికారులు మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా తవ్వకాలు జరుపుతుండడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

కర్నూలులో బయటపడుతున్న అస్తిపంజరాలు

కర్నూలు : జిల్లా తుగ్గలి మండలం వెన్నంపల్లి కోటలో 5వ రోజు గుప్త నిధుల తవ్వకాలు కొనసాగిస్తున్నారు. తవ్వకాల్లో  అస్తిపంజరాలు బయపడుతున్నాయి. దీంతో చెన్నంపల్లి కోట చుట్టూ 200 మంది పోలీసుల పహారగా ఉన్నారు. 

రూ.200 కోట్లతో బిట్ కాయిన్ సంస్థ పరారీ

ప్రకాశం : వెలిగండ్ల మండలం బల్లవరంలో బిట్ కాయిన్ అనే బోగస్ కంపెనీ యాజమాన్యం రూ.200 కోట్లతో పరారైంది. బాధితుల ఫిర్యాదు రంగంలోకి దిగిన పోలీసులు విచారణ ప్రారంభించారు. 

15:41 - December 17, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పద్యాలు చదివి అందర్నీ అలరించారు. హైదరాబాద్ లో ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నాయి. మూడో రోజు పలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. సారస్వత పరిషత్ లో జీఎం రామశర్మ శతావధానం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పద్య రూపంలో అవధాని రామశర్మ వర్ణించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరయి అవధానిని సన్మానించారు. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ...తనకు సిద్దారెడ్డితో వివాదం చెలరేగిందని..మమ్మి..కాలం వచ్చింది..తెలుగు సాహిత్యం..పఠనం అంటే ఎవరు వస్తారో ..రారో ఇంత అట్టహాసంగా నిర్వహిస్తున్నారనితో తనతో అన్నారని తెలిపారు. కానీ ఎలాంటి ఇబ్బంది అవసరం లేదని..రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే ఈ మహాసభలు చరిత్రలో నిలిచిపోతుందని అప్ర్పుడు చెప్పడం జరిగిందన్నారు. మూడో రోజు వరకు ఎంతో బ్రహ్మాండంగా జరుగుతున్నాయని, అందుకు రవీంద్ర భారతి..ఇతర వేదికలు హాస్ ఫుల్ నిదర్శనమన్నారు. ఎల్బీ స్టేడియంలో సాయంత్రం వేళ్లలో జరిగే కార్యక్రమాలు తెలుగు అభిమానులు ఎంతో మంది పాల్గొంటున్నారని తెలిపారు. మహాసభలకు వివిధ రాష్ట్రాలు..దేశ..విదేశాల నుండి ఎంతో మంది ప్రతినిధులు పాల్గొంటున్నారని..వీరందరికీ సీఎస్ ప్రత్యక్షంగా ఏర్పాట్లు చేస్తున్నారని...సీఎస్ పర్యవేక్షణలో అద్భుత భోజనాలు అందిస్తూ అలరిస్తున్నారని తెలిపారు. ఇందుకు సీఎస్ ను అభినందినిస్తున్నట్లు పేర్కొన్నారు. తాను కూడా దారి తప్పిన బాటసారి...ఏ స్వార్థం లేకుండా తనకు గురువు గారు చదువు చెప్పడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా పద్యాలు చదివి అందర్నీ అలరించారు. మహాసభల ముగింపు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు చేస్తుందని..ఈ నిర్ణయాలు అందర్నీ సంతోష పరుస్తాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. 

15:34 - December 17, 2017

పశ్చిమగోదావరి : జిల్లా పాలకొల్లులోని మురళి అనే వ్యక్తి ఏటీఎమ్‌లో మనీ విత్‌డ్రా చేయగా మిస్‌ ప్రింట్‌ అయిన రెండువేల రూపాయల నోట్‌ వచ్చింది. ముందు నకిలీ నోటుగా భావించిన మురళి వరిజినల్‌ అని తేలడంతో బ్యాంకుకు వెళ్లి నోటు చూయించాడు. బ్యాంకు అధికారులు నోటు చెల్లదని చెప్పడంతో మురళి ఆశ్చర్యానికి గురయ్యాడు. సామాన్యునికి ఎంతో విలువైన రెండు వేల రూపాయల నోటును తప్పుగా ప్రింట్‌ చేయడం ఏంటని మురళి ప్రశ్నిస్తున్నాడు. ఇలాంటి నోట్లను పరిశీలించిన తర్వాతే విడుదల చేయాలని కోరతున్నాడు.  

వైభంగా తెలుగు మహాసభలు

హైదరాబాద్ : మూడో రోజు వైభంగా ప్రపంచ తెలుగు మహాసభలు సారస్వత పరిషత్ జీఎం రామశర్మ వతావధానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరైయ్యారు. సీఎం, అవధాని రామశర్మను సన్నానించారు. 

15:30 - December 17, 2017

ఢిల్లీ : ఏపీ కాంగ్రెస్‌ నాయకులు ఢిల్లీలో లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేత మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన చట్టంలోని హామీల అమలుకు పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే అంశంపై చర్చించారు. లోక్‌సభ చట్టంలోని 184వ రూల్‌ కింది ఈ అంశంపై నోటీసు ఇచ్చి చర్చకు వచ్చే విధంగా చూడాలని కోరారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు నిధుల మంజూరు, విశాఖ రైల్వే జోన్‌ వంటి అంశాలు పార్లమెంటులో చర్చకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీలో చర్చించి, దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఖర్గే హామీ ఇచ్చారు. 

15:29 - December 17, 2017

పశ్చిమగోదావరి : కాపులను బీసీల్లో చేర్చడాన్ని నిరసిస్తూ పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజక వర్గంలో బీసీ సంఘం నేతలు మంత్రి పితాని సత్యనారాయణ ఇంటిని ముట్టడించారు. బీసీలకు కాపులకు మధ్య చిచ్చు పెట్టేవిధంగా చంద్రబాబు ప్రవర్తిస్తున్నారని బీసీ సంఘం నేతలు మండి పడ్డారు. బీసీలందరూ సంయమనం పాటించాలని మంత్రి పితాని బీసీ సంఘం నేతలకు సూచించారు. బీసీల ఆందోళనను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తెస్తానని నేతలకు హామీ ఇచ్చారు. 

15:28 - December 17, 2017

సూర్యాపేట : జీవితంలో ఉన్నతంగా స్థిరపడ్డ వారంతా సొంత గడ్డకు సేవ చేయాలనుకున్నారు. సేవా వారోత్సవాల పేరుతో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. సూర్యాపేట జిల్లా సోలిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల అభివృద్ధికి నడుం బిగించిన తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ సభ్యులను గ్రామస్తులు అభినందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అమెరికాలో స్థిరపడిన తెలంగాణ ప్రాంత వాసులంతా కలిసి తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్‌గా ఏర్పడ్డారు. తెలంగాణ భాష, యాస, సంస్కృతిని కాపాడటమే ప్రధాన ఉద్దేశంగా TATA సంఘం ఆవిర్భవించింది. 2015 నుంచి TATA ఆధ్వర్యంలో తెలంగాణలో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం TATA సేవా డేస్ పేరుతో సేవా వారోత్సవాలు నిర్వహించాలని తలపెట్టారు. అందులో భాగంగా డిసెంబర్ 14 నుంచి 23 వరకూ వరంగల్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి , ఆయా గ్రామాలను దత్తత తీసుకోవడం, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాల్లో వాటర్ ప్లాంట్ల ఏర్పాటు , హెల్త్ కాంపుల నిర్వహణ , ప్రభుత్వ పాటశాలల్లో మౌలిక వసతుల కల్పన, గ్రంధాలయాల ఏర్పాటు చేయాలని సభ్యులు నిర్ణయించుకున్నారు. TATA అధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి, ప్రతినిధి మోహన్, ఎన్నారై రాజేందర్‌రెడ్డిల సొంత ఊరు సోలిపేట. అక్కడే చదువుకుని అమెరికాలో హార్ట్ స్పెషలిస్ట్‌గా స్థిరపడ్డ రాజేందర్‌రెడ్డి గతంలో సొంతూరులో స్కూలు భవనాన్ని నిర్మించగా.. తాజాగా TATA ఆధ్వర్యంలో అదే స్కూలుకి మౌలిక వసతుల కల్పనకు రెండున్నర లక్షల రూపాయలు విరాళం ఇచ్చారు. అనంతరం పాఠశాల విద్యార్ధులకు స్కూలు బ్యాగ్‌లను అందించారు. ఈ సందర్భంగా TATA ప్రతినిధులను గ్రామస్తులు కోలాటాల మధ్య గ్రామంలోకి సాదరంగా ఆహ్వానించారు. తమ పాఠశాలకు సహకరిస్తున్న TATA సభ్యులను ఘనంగా సత్కరించుకున్నారు. ఈ కార్యక్రమంలో TATA ప్రతినిధులతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 

15:25 - December 17, 2017

కరీంనగర్ : టీఆర్‌ఎస్‌కు ఉప ఎన్నిక తప్పేటట్టు లేదా ! నల్లగొండ ఉప ఎన్నికను దాట వేసుకుంటూ వస్తున్న గులాబీ పార్టీకి మరోచోట అది తప్పదా ? అంటే ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అది అవుననే అనిపిస్తోంది. ఇంతకు ఎక్కడ ఉప ఎన్నిక? ఏంటా పరిణామాలు...వాచ్‌ దిస్‌ స్టోరీ. టీఆర్‌ఎస్‌కు ఉప ఎన్నిక ఎదుర్కోవడం అనివార్యంగా కనిపిస్తోంది. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు భారత పౌరసత్వం లేదని కేంద్ర హోంశాఖ తేల్చడంతో... ఉప ఎన్నిక తప్పేటట్లు కనిపించడం లేదు.

చెన్నమనేని రమేష్‌ 2009లో ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. అయితే ఆయన ప్రత్యర్థి.. రమేష్‌కు భారత పౌరసత్వం లేదని ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ వివాదం అప్పటినుంచి కొనసాగుతోంది. అయితే అప్పటినుంచి విచారణ ఎదుర్కొంటున్న రమేష్‌కు ఎక్కడా కూడా అనుకూలమైన తీర్పు రాలేదు. ఇక 2014 ఎన్నికల్లో మూడోసారి ఎన్నికైన చెన్నమనేనిపై.. మరోసారి ప్రత్యర్ధి అభ్యర్థి ఫిర్యాదు చేశాడు. రమేష్‌కు భారత పౌరసత్వం లేదని కేంద్ర హోంశాఖ గతంలోనే తన నిర్ణయాన్ని వెల్లడించింది. అయితే... దీనిపై రమేష్‌ రివ్యూ పిటిషన్‌ వేయగా మరోసారి విచారణ చేపట్టింది. అనేక అంశాలు పరిశీలించి... రమేష్‌కు భారత పౌరసత్వం లేదని కేంద్ర హోంశాఖ తేల్చింది. అయితే విచారణ ఏకపక్షంగా సాగిందంటూ రమేష్‌ ఆరోపిస్తున్నారు. కేవలం సాంకేతిక అంశాలనే పరిగణనలోకి తీసుకున్నారంటున్నారు. తనకు 2009 ఫిబ్రవరి 3వ తేదీనే భారత పౌరసత్వం లభించిందని... 2009 ఫిబ్రవరి 25వ తేదీ నుంచి అమలు చేస్తున్న నిబంధనలు తనకు వర్తించవంటున్నారు చెన్నమనేని రమేష్‌. దీంతో కేంద్ర హోంశాఖ నిర్ణయంపై మరోసారి హైకోర్టులో తేల్చుకునేందుకు చెన్నమనేని సిద్దమవుతున్నారు.

అయితే... ఒకవేళ చెన్నమనేనికి వ్యతిరేకంగా కోర్టు తీర్పు వస్తే... వేములవాడలో ఉప ఎన్నిక జరిగే అవకాశం కనిపిస్తోంది. నల్లగొండ ఉప ఎన్నికను దాట వేస్తూ వస్తున్న గులాబీ పార్టీకి... వేములవాడలో తప్పేటట్లు కనిపించడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

14:22 - December 17, 2017

ఢిల్లీ : తమకు ప్రత్యేక బిల్లు తీసుకరావాలని డిమాండ్ చేస్తూ ట్రాన్స్ జెండర్లు కదం తొక్కారు. దేశ రాజధాని ఢిల్లీలో వారు భారీ ఎత్తున ఆందోళన చేశారు. పార్లమెంట్ లో కేంద్రం ట్రాన్స్ జెండర్ 2016 బిల్లును ప్రవేశ పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై ట్రాన్స్ జెండర్లు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ బిల్లు ఆమోదం అయితే తమ ఉనికి కనమరుగవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల ట్రాన్స్ జెండర్లు పాల్గొన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి..

14:19 - December 17, 2017

కామారెడ్డి : జిల్లా నిజాం సాగర్ మండలం కేంద్రంలో కర్రె కృష్ణారెడ్డి భూ స్వామి దళితులను మోసం చేశారు. వారి భూములను చదును చేస్తానని చెప్పి ఏకంగా 13 ఎకరాలను కబ్జా చేసేశాడు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి బాధితులు తీసుకెళ్లారు. కానీ ఆ అధికారులు పట్టించుకోలేదు. దీనితో ఎంపీసీఐ ఆధ్వర్యంలో దళితులు నిజాంసాగర్ ఆర్ ఐ వద్దకు వెళ్లారు. తమకు న్యాయం చేయాలని వినతపత్రం సమర్పించారు. కృష్ణారెడ్డికే అధికారులు వత్తాసు పలుకుతున్నారని, వెంటనే ఆ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 

14:13 - December 17, 2017
14:12 - December 17, 2017

రాజమండ్రి : వైసీపీ అధ్యక్షుడు జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర కొనసాగుతోంది. ఈసందర్భంగా ఆయన పలు హామీలు గుప్పిస్తున్నారు. జగన్ ఇస్తున్న హామీలపై ఏపీ మంత్రి యనమల ఘాటుగా స్పందించారు. ఆదివారం రాజమండ్రికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలు ఆశించిన మేరకు న్యాయం చేస్తే ఏ రాజకీయ పార్టీ...ఏ నాయకుడికి విముక్తి ఉంటుందన్నారు. ఇష్టమొచ్చినట్లు హామీలు ఇస్తే ఆ హామీలు అమలవుతాయా ? లేదా ? అనేది ప్రజలు నిర్ణయించుకుంటారని తెలిపారు. ఇక పోలవరం అంశంపై కూడా ఆయన మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, కేంద్రం నేషనల్ ప్రాజెక్టు కింద తీసుకుందని గుర్తు చేశారు. గడువు సమయానికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని మంత్రి యనమల మరోసారి స్పష్టం చేశారు. 

తొలి వికెట్ కోల్పోయిన శ్రీలంక

విశాఖ : శ్రీలంక తొలి వికెట్ కోల్పోయింది. 15 పరుగుల వద్ద గుణతిలక ఔట్ అయ్యారు. భారత్, శ్రీలంక మధ్య విశాఖలో ఆఖరి వన్డే మ్యాచ్ జరుగుతోంది. 

13:40 - December 17, 2017

గుంటూరు : రాష్ట్రంలోని విభిన్న ప్రతిభావంతులు, వృద్ధుల అభివృద్ధి సంక్షేమానికి ఏపీ సర్కార్‌ ప్రత్యేక నిధులు కేటాయించిందని విభిన్న ప్రతిభావంతులు, వృద్ధుల కార్పొరేషన్‌ చైర్మన్‌ గోనుగుంట్ల కోటేశ్వరరావు అన్నారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. సమాజంలో వివక్షకు గురువుతున్న హ్యాండీకాప్స్‌కు వారిలోని శక్తిని వెలికితీసి... వారిని స్వయం సమృద్ది దిశగా తీసుకెళ్లానికి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందంటున్నారు. రాష్ట్రంలో విభిన్న ప్రతిభావంతులు, వృద్ధుల కోసం కార్పొరేషన్‌ అమలు చేస్తున్న పథకాల తీరుతెన్నులపై ఆయన మాట్లాడారు. 47.60 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నామని చెప్పారు. 2500 వాహనాలను త్వరలో అందించబోతున్నామని తెలిపారు. విభిన్న ప్రతిభావంతులకు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విభిన్న ప్రతిభావంతులకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ద్వారా శిక్షణ ఇస్తామని చెప్పారు. 
-

ఎమ్మెల్సీ రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సభ

నల్లగొండ : ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్ ఎన్నికైన సందర్బంగా చండూరులో ఎమ్మెల్సీ రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. చౌటప్పల్ మండలం మల్కారం వద్ద ఆందోల్ మైసమ్మకు రాజగోపాల్ పూజలు నిర్వహించి ర్యాలీగా బయల్దేరారు. 

13:26 - December 17, 2017

నల్గొండ : జిల్లాలోని చండూరులో ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సభ నిర్వహించనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ బాధ్యతలు స్వీకరించడంతో అభినందన సభ నిర్వహిస్తున్నారు. భారీ ఎత్తున కార్యకర్తలు తరలివస్తున్నారు. చౌటుప్పల్ మండలం మల్కారం వద్ద అందోల్ మైసమ్మకు కోమటిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చండూర్ కు కోమటిరెడ్డి ర్యాలీగా బయల్దేరారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

13:09 - December 17, 2017

విశాఖ : కాసేపట్లో విశాఖ వన్డే మ్యాచ్ ప్రారంభం కానుంది. భారత్, శ్రీలంక మధ్య మూడో, ఆఖరి వన్డే మ్యాచ్ జరుగనుంది. భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ పై ఉత్కంఠ నెలకొంది. రోహిత్ మళ్లీ డబుల్ సెంచరీ చేయాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. 

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

విశాఖ : శ్రీలంకతో జరుగుతున్న మూడవ వన్డేలో భారత్ టాస్ గెలిచి  ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో మొహాలీ జట్టుతోనే భారత్ బరిలోకి దిగనున్నారు. 

మూడవ రోజు తెలుగు మహాసభలు

హైదరాబాద్ :  రవీంద్రభారతిలో మూడో రోజు ప్రపంచ తెలుగు మహాసభలు భాగంగా ముదిగొండ అమరనాథ శర్మ చేత ముత్యంపేట గౌరీ శంకరశర్మల అష్టావధానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ జితేందర్ రెడ్డి హాజరైయ్యారు. 

12:57 - December 17, 2017

హైదరాబాద్ : మనో వికాసానికి ... మరో ప్రపంచానికి బాటలు..! విలువలను నేర్పించి.. చైతన్యాన్ని రగిలించే కరదీపికలు..! భాషను .. యాసను.. ఒక తరం నుంచి ఇంకో తరానికి ప్రవహింపజేసే.. వారధులు.. పుస్తకాలు..! సంస్కృతిని తరతరాలకు అందించడంలో కీలకపాత్ర పోషించే రచనలు.. ప్రపంచ తెలుగు మహాసభల్లో  ఒకే చోట కొలువుదీరాయి. భాషా ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ప్రత్యేక ఆకర్షణగా పుస్తక ప్రదర్శనశాల  
పురాణాల దగ్గర నుంచి... ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందిన రచనలన్నీ... ఒక దగ్గరే కొలువుదీరాయి. పెద్దబాలశిక్ష మొదలుకుని.. విప్లవ గాథల వరకూ అన్ని ఒకే చోటే దర్శనమిస్తున్నాయి. దీంతో ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఎల్‌బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శన శాల  ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ పుస్తక ప్రదర్శన అన్ని వర్గాల ప్రజలను అలరిస్తోంది.
బుక్‌ ఫెయిర్‌..47 బుక్‌ స్టాల్స్‌ 
ఈ బుక్‌ ఫెయిర్‌లో మొత్తం 47 బుక్‌ స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. పురాణాలు, ఇతిహాసాలు, కథలు, కవితలు, జీవిత చరిత్రలు, నవలలు, నవలికలు.. వ్యాసాలు.. పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను ఈ ప్రదర్శనలో ఉంచారు. సభల్లో భాషాభిమానులు.. వేలాదిమంది పాల్గొంటున్న దృష్ట్యా ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు చెబుతున్నారు. ఈ బుక్‌ ఫెయిర్‌లో పుస్తకాలపై డిస్కౌంట్‌ను కూడా అందించడంతో.. పుస్తప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమకు కావాల్సిన పుస్తకాలను కొనుగోలు చేసుకుంటున్నారు.

 

12:47 - December 17, 2017

మనం తినే ఆహారంలో సమతుల్యం పాటించడం వల్ల మన శరీరానికి కావాలసిన శక్తిని పొందుతాము. మనకు సహజంగా దొరికే పండ్లను, దుంప్పలను, కూరగాయాలను ఆహారంగా తీసుకుంటే మన ఎటువంటి అనారోగ్యం దారి చేరాదు. అయితే ప్రస్తుతం చాలా మందికి కంటి సమస్యలు వస్తున్నాయి. చిన్న పిల్లలకు సైతం కళ్ల జోడు పెట్టుకుంటున్నారు. దానికి కారణం వారి ఆహారపు అలవాట్లు. వారి కళ్లు బాగుండాలంటే వారికి పాలు, గుడ్డు, క్యారెట్ ఇవ్వాలి. వీటిలో ఏ విటమిన్ ఉంటుంది. క్యారెట్ తినడం వల్ల చర్మం కూడా పొడిపారకుండా తాజాగా ఉంటుంది.

12:46 - December 17, 2017

హీరోయిన్ భావన, కన్నడ సినీ నిర్మాత నవీన్ ల పెళ్లి వచ్చే నెల జరగనుంది. ఈ ఏడాది మార్చి 9న వీరి నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. జనవరి 22న కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు మధ్య భావన, నవీన్ ఒక్కటవ్వనున్నారు. 2002లో భావన ఓ మలయాళ చిత్రంలో నటిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత పలు తెలుగు, తమిళ్, కన్నడ సిమాల్లో నటించారు.

12:43 - December 17, 2017

అనంతపురం : జిల్లాలో ఇసుక మాఫియా అడ్డూ అదుపూ లేకుండా బరితెగిస్తోంది... ఇసుక అక్రమ తరలింపు ద్వారా.. ప్రభుత్వ ఖజానాకు కోట్లాది రూపాయలు గండి కొడుతోంది. అధికారులు ఎవరిని ప్రశ్నించినా.. తమకేమీ తెలియదనో.. నిందితులపై చర్యలు తీసుకుంటామనో దాటవేస్తున్నారు. కరవు జిల్లాలో ఇష్టారాజ్యంగా సాగుతోన్న ఇసుక మాఫియా దందాపై టెన్‌టీవీ  స్పెషల్‌ ఫోకస్‌
యధేచ్చగా ఇసుక  అక్రమ రవాణా
అనంతపురం జిల్లాలో ఇసుక మాఫియా అక్రమాలకు బ్రేకుల్లేకుండా పోయాయి. ముఖ్యంగా పుట్టపర్తి నియోజకవర్గంలో.. ఇసుక మాఫియాసురులు అధికారపక్షం దన్నుతో చెలరేగిపోతున్నారు. డ్యామ్‌ నిర్మాణం పేరిట.. చిత్రావతి నది నుంచి కోట్లాది రూపాయల విలువ చేసే ఇసుకను తవ్వి తరలిస్తున్నారు. ఇప్పటికే.. ఈ ప్రాంతం నుంచి సుమారు నాలుగు కోట్ల రూపాయల విలువైన ఇసుకను మాఫియా తరలించింది. తద్వారా ప్రభుత్వ ఖజానాకు కన్నం పెట్టేస్తోంది. 
ఇసుక దోపిడీ కోసమే ఎస్సార్‌ కన్‌స్ట్రక్షన్స్‌ కాంట్రాక్ట్‌
ఎస్సార్‌ కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ ద్వారా అక్రమార్కులు ఇసుకను అక్రమంగా తవ్వి తరలిస్తున్నారన్నారన్న ఆరోపణలున్నాయి. అసలు ఇసుక దోపిడీ కోసమే ఈ సంస్థ డ్యామ్‌ కాంట్రాక్ట్‌ తీసుకుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్థానికులు ఇరిగేషన్‌ డీఈతో  వాగ్వాదానికి దిగారు. చెక్‌డ్యామ్‌ పనుల పేరుతో రాత్రికి రాత్రే  ఇసుకను కర్నాటకకు  అక్రమంగా తరలిస్తున్నారు... ఇప్పటికే   కోట్లాది రూపాయల విలుచేసే ఇసుకను దోచుకున్నారు.  ఈ వ్యవహారంపై కాంగ్రెస్‌ పార్టీ ఆందోళన కొనసాగిస్తోంది. ఇసుక దోపిడీపై ఇరిగేషన్‌ డీఈ ఉమేష్‌చంద్రను ప్రశ్నిస్తే.... తనకేమీ తెలియదని సమాధానం ఇచ్చారు. తాను ఎవరికీ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని అంటున్నారు. 
జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్ళిన టెన్‌టీవీ   
పుట్టపర్తిలో యధేచ్చగా సాగుతున్న ఇసుక దోపిడీ వ్యవహారాన్ని టెన్‌టీవీ జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్ళింది...  ఇసుక దోపిడీదారులపై స్పెషల్‌ ఆఫీసర్‌తో విచారణ చేయించి, చట్టప్రకారం చర్యలు తీసుకుంటానమి కలెక్టర్‌ అన్నారు. ఇసుక మాఫియా వ్యవహారంపై  కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఆర్డీవో రంగంలోకి దిగారు. జరుగుతున్న పరిణామాల ఆధారంగా,  ఇరిగేషన్‌ డీఈ, తహసిల్దార్, సీఐలపై  ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై చిత్రావతి నదిపై నిఘా ఉంచాలంటూ  ఆదేశించారు...   అన్ని శాఖల అధికారులు  సమన్వయంతో పనిచేయాలని ఆర్డీవో అన్నారు. మొత్తానికి ఇసుక మాఫియాపై అధికారులంతా సీరియస్‌గానే స్పందిస్తున్నారు... నిందితులపై కఠిన చర్యలు తీసుంటామని కూడా అంటున్నారు. అయితే.. ఇసుక రవాణా మాత్రం యధేచ్చగా సాగుతూనే ఉండడం ఆందోళనను కలిగిస్తోంది. తీసుకునే చర్యలేవో  వెంటనే తీసుకుని నష్టాన్ని నివారించాలని ప్రజలు కోరుతున్నారు.

12:40 - December 17, 2017

విశాఖ : నేడు ఉత్కంఠ పోరుకు విశాఖ సిద్ధమైంది. ఇండియా, శ్రీలంకల మధ్య జరగనున్న మూడో వన్డేకు వైఎస్సార్ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అభిమానుల కోలాహలంతో స్టేడియం ఆవరణ సందడిగా మారిపోయింది. మూడో వన్డేలో ఇండియా గెలుపు ఖాయమంటున్న అభిమానులతో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

12:29 - December 17, 2017

కడప : రాజంపేటలో భారీగా డ్రగ్స్ ను పట్టుకున్నారు. పది మంది సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. రెండు కిలోల హెరాయిన్ తోపాటు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా వెల్లడించడం లేదు. ముఠాలో విద్యార్థులున్నట్లు గుర్తించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

12:13 - December 17, 2017

చెన్నై : తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితను ఊపిరాడని స్థితిలో ఆసుపత్రికి తీసుకువచ్చినట్లు అపోలో ఆసుపత్రి యాజమాన్యం వెల్లడించింది. వెంటనే తగిన చికిత్స చేయడంతో ఆమె కోలుకున్నారని అపోలో ఛైర్మన్ ప్రతాప్‌ సి రెడ్డి మీడియాకు తెలిపారు. ప్రపంచంలోనే నిపుణులైన వైద్యులను పిలిపించి జయలలితకు మంచి చికిత్స అందించినప్పటికీ ఆమె మనకు దక్కకపోవడం దురదృష్టకరమన్నారు. జయలలిత మృతిపై విచారణ జరుపుతున్న ఏకసభ్య కమిషన్ అందరి అనుమానాలను నివృతి చేస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. 

12:10 - December 17, 2017

అమెరికా : హెచ్ 1బీ వీసాల నిబంధనలు మరింత కఠినతరం అయ్యాయి. హెచ్ 1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు అమెరికాలో ఉద్యోగాలు చేయకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోనుంది. ఈ విషయాన్ని యూఎస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీ అధికారికంగా వెల్లడించింది. ట్రంప్‌ ప్రభుత్వం అవలంభిస్తున్న 'బై అమెరికన్‌, హైర్‌ అమెరికన్‌' పాలసీ విధానంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఈ నిబంధన తీసుకురావడానికి గల కారణాలను డీహెచ్‌ఎస్‌ వెల్లడించలేదు. ట్రంప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక... హెచ్ 1బీ జారీ కఠినతరం చేసేందుకు ఇప్పటికే అమెరికా పలు ఆంక్షలను విధిస్తూ వస్తోంది. 

 

12:06 - December 17, 2017

తూర్పు గోదావరి : కాకినాడ బీచ్ ఫెస్టివల్ సక్సెస్ చేయాలంటూ 2కే రన్ నిర్వహించారు. కాకినాడ నగరంలో జరిగిన ఈ రన్‌ను ఎమ్మెల్యే కొండబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగర్ మేయర్ సుంకర పావని, జేసీ మల్లిఖార్జున్ పాల్గొన్నారు. బీచ్ ఫెస్ట్‌ను జయప్రదం చేయాలని నేతలు విజ్ఞప్తి చేశారు.

 

12:05 - December 17, 2017

కామారెడ్డి : జిల్లాలోని కేంద్రంలోని పంచముఖి హనుమాన్‌ దేవాలయం ఆలయ ప్రహారీ గోడకు వేసిన టీఆర్‌ఎస్‌ గులాబీ రంగును మార్చేశారు ఆలయ అధికారులు. ఆలయ ప్రహారీకి గులాబీ రంగు వేయడం వివాదాస్పదంగా మారింది. 10టీవీలో కథనం ప్రసారమవడంతో అధికారులు రంగు మార్చేశారు. ఆలయ కమిటీ చైర్మన్‌ను తొలగించాలంటూ భక్తులు, ప్రజాసంఘాలు డిమాండ్‌ చేస్తున్నారు. 

 

11:53 - December 17, 2017

విశాఖ : భారత్‌-శ్రీలంక ఆఖరి వన్డేకు  సై అంటే సై అంటున్నాయి. లో స్కోరింగ్‌ తొలి వన్డేలో లంక జట్టు సునాయాస విజయం సాధించగా... హై స్కోరింగ్‌ సెకండ్‌ వన్డేలో భారత్‌ భారీ స్కోర్‌ సాధించి సిరీస్‌ను సమం చేసింది. శ్రీలంక,భారత్‌  వన్డే ఫేస్‌ టు ఫేస్‌ రికార్డ్‌ ఓ సారి చూద్దాం.... 

భారత్‌-శ్రీలంక వన్డే సిరీస్‌ క్లైమాక్స్‌ వన్డేకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోన్న 3 వన్డేలో సిరీస్‌లో ఆఖరి మ్యాచ్‌కు ఇరు జట్లు సై అంటే సై అంటున్నాయి. లో స్కోరింగ్‌ తొలి వన్డేలో లంక జట్టు సునాయాస విజయం సాధించింది. హై స్కోరింగ్‌ సెకండ్‌ వన్డేలో భారత్‌ భారీ స్కోర్‌ సాధించి సిరీస్‌ను సమం చేసింది.

ప్రస్తుత సిరీస్‌లో  పోటీ హోరాహోరీగా సాగుతోన్నా...వన్డే ఫేస్‌ టు ఫేస్‌ రికార్డ్‌లోనూ శ్రీలంకపై ఇండియాదే పై చేయిగా ఉంది.ఇప్పటివరకూ ఇరు జట్లు 157 వన్డేల్లో పోటీ పడగా భారత్‌ 89 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా...శ్రీలంక 56 మ్యాచ్‌ల్లో నెగ్గింది.

టీమ్‌ కాంబినేషన్‌,ట్రాక్ రికార్డ్ పరంగా టీమిండియాకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నా....సంచలనాలకు మారుపేరైన శ్రీలంక జట్టును అసలే మాత్రం తక్కువ అంచనా వేయలేం. విశాఖపట్నం వేదికగా జరుగనున్న సూపర్‌ సండే వన్డే కోసం క్రికెట్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

నేడు భారత్, శ్రీలంక మూడో వన్డే

విశాఖ : శ్రీలంకతో సిరీస్‌ నిర్ణయాత్మక వన్డేకు టీమిండియా సన్నద్ధమైంది. 3 మ్యాచ్‌ల సిరీస్‌ ఆఖరి వన్డేకు స్టీల్‌ సిటీ విశాఖపట్నంలో రంగం సిద్ధమైంది. ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి వన్డేలో తేలిపోయి, సెకండ్‌ వన్డేలో సంచలన విజయం సాధించిన భారత్‌ సిరీస్‌ విజయం సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగబోతోంది. 

11:35 - December 17, 2017

కర్నూలు : నారాయణ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటనలో భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. నగర శివారులోని నన్నూరు నారాయణ బాలిక కాలేజీలో ధరణి అనే విద్యార్థిని ఎంపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. అనారోగ్యంతో ఉన్న ధరణి నిన్న కాలేజీ మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసిందని తెలుస్తోంది. ఆమెను ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. అయితే కళ్లు తిరిగి పడిపోయిందని కాలేజీ యాజమాన్యం, పోలీసులు అంటున్నారు. అయితే ఇదంతా కట్టుకథ అంటూ ఎస్ ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆందోళనకు దిగింది. 

 

ఐసిస్ తో సంబంధాలున్నాయనే అనుమానంతో ఐదుగురిపై కేసు

కేరళ : ఐసిస్ తో సంబంధాలున్నాయనే అనుమానంతో కొచ్చిలో ఐదుగురిపై ఎన్ ఐఏ కేసు నమోదు చేసింది. 

11:01 - December 17, 2017

పశ్చిమ గోదావరి : జిల్లాలోని ఏలూరులో పద్మవిభూషణ్ నటసామ్రాట్ డాక్టర్‌ అక్కినేని 4వ అంతర్జాతీయ పురస్కార ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి  జస్టిస్ జాస్తి చలమేశ్వర్ హాజరయ్యారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, కళాతపస్వి  కె.విశ్వనాధ్, సినీరత్న గొల్లపూడి మారుతీరావు, కెప్టెన్ అన్నెదివ్య, అక్కినేని తనయ నాగసుశీల, రాజకీయ నాయకులు, వివిధ రంగాల ప్రముఖలు హాజరయ్యారు. తొమిది మంది  పురస్కార గ్రహీతలకు ఘన సన్మానం చేశారు. అక్కినేని దేవదాసు సినిమా రిలీజ్‌ రోజున తాను పుట్టానని సుప్రీంకోర్టు జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ అన్నారు. వివిధ రంగాల్లో ప్రతిభావంతులను ఏలూరులో సన్మానించడం సంతోషంగా ఉందన్నారు అక్కినేని నాగేశ్వరరావు కుమార్తె నాగసుశీల. ఈ కార్యక్రమంలో  వంగపండు తన బృందంతో చేసిన జానపద నృత్యాలు అందరిని అలరించాయి. 

 

10:59 - December 17, 2017

గుంటూరు : నార్మన్ పోస్టర్ సంస్థ రూపొందించిందిన ఏపీ అసెంబ్లీ టవర్ డిజైన్‌కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. నిన్నటి సమావేశంలో టవర్ డిజైన్‌కు మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 250 మీటర్ల పొడవు, ఎత్తు, వెడల్పుతో అసెంబ్లీ నిర్మాణం ఉంటుంది. ఈ డిజైన్ ప్రత్యేకతలను మంత్రి నారాయణ టెన్ టివికి వివరించారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

10:50 - December 17, 2017

మహబూబాబాద్‌ : ఫేస్‌బుక్‌ ప్రేమ ఓ యువతి జీవితాన్ని నాశనం చేసింది. మహబూబాబాద్‌లో ఉంటున్న అరుణ్‌.... హైదరాబాద్‌లో ఉన్న మైనర్‌ బాలికతో ఫేస్‌బుక్‌లో పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. కొన్ని రోజులు మహబూబాబాద్‌లో ఉంచి... ఆ తర్వాత యాదగిరిగుట్టలో వివాహం చేసుకున్నాడు. ఓ బిడ్డకు తల్లి అయిన తర్వాత... శివానిని అరుణ్‌ వదిలేశాడు. నీతో ఎలాంటి సంబంధం లేదని ఆరోపిస్తున్నాడు. దీంతో శివాని... పోలీసులకు, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. గత ఐదారురోజులుగా శివాని, అరుణ్‌లకు పోలీసులకు కౌన్సిలింగ్‌ నిర్వహిస్తున్నారు. తనకు, తన బిడ్డకు న్యాయం చేయాలని శివాని కోరుతోంది. ఇప్పటివరకు బాగున్న అరుణ్‌... వాళ్ల తల్లిదండ్రుల మాటలు నమ్మి... నన్ను వదిలించుకోవాలనుకుంటున్నాడని శివాని ఆవేదన వ్యక్తం చేస్తోంది. 

 

దేవాదుల ప్రాజెక్ట్ పనుల్లో విషాదం

భూపాలపల్లి : దేవాదుల సొరంగం పనులు జరుగుతుండగా విషాదం నెలకొంది. సొరంగం పైకప్పు కూలి ఇద్దరు కూలీలు దుర్మరణం పాలయ్యారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా వెంకటాపూర్‌ మండలం ఇంచెంచెరువుపల్లి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులను నేపాల్‌కు చెందిన దిలీప్‌, బిస్తుగా పోలీసులు గుర్తించారు. 

10:31 - December 17, 2017

మేడ్చల్ : జిల్లాలోని ఆల్వాల్ నారాయణ హైస్కూల్‌లో టీచర్ కొట్టడంతో విద్యార్థికి గాయాలయ్యాయి. హోంవర్క్ చేయలేదని టీచర్ కొట్టడంతో.. బెంచ్ పక్కన రాడ్ తలకు తగడలంతో... తీవ్రగాయమైంది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లి.. చికిత్స చేయించారు. టీచర్‌పై చర్యలు తీసుకోవాలని స్కూల్ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. 

 

10:26 - December 17, 2017

విశాఖపట్నం : ఏపీలో టూరిజం ఇంకా అభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖలో హెలీ టూరిజం ప్రారంభించిన ఆయన టూరిజం అభివృద్ధి ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. హెలీ టూరిజం ద్వారా అత్యవసర పరిస్థితులలో వైద్య సదుపాయం అందించే అవకాశం ఉందని చంద్రబాబు అన్నారు. త్వరలో విశాఖలో కూడా సీ ప్లేన్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన వెల్లడించారు. 

 

10:22 - December 17, 2017

హైదరాబాద్‌ : నార్త్‌జోన్‌ పరిధిలోని అనేక హోటళ్లపై పోలీసులు ఏకకాలంలో దాడులు చేశారు. తాజ్ డెక్కన్ హాటల్, తాజ్ బంజారా హోటల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. ఆన్‌లైన్‌ హైటెక్‌ సెక్స్‌ రాకెట్‌ గుట్టు రట్టు చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా ప్రముఖ హోటళ్లను ఎంచుకుని వ్యభిచారానికి పాల్పడుతున్నట్లు సమాచారం రావడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు వెండి తెర నటి, బుల్లితెర కథానాయికలను అరెస్ట్‌ చేశారు. తాజ్ డెక్కన్ హాటల్ లో వ్యభిచారం నిర్వహిస్తూ హీరోయిన్ రిచా సక్సేనా, కాస్ట్యూమ్ డిజైనర్ మనీష్ పట్టుబడ్డారు. తాజ్ బంజారా హోటల్ లో వ్యభిచారం చేస్తూ బెంగాలీ సీరియల్ నటి సుబ్రచటర్జీ పట్టుబడ్డారు. తాజ్ బంజారా హోటల్ మేనేజర్ వెంకట్ రావును పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అలాగే మరో ఇద్దరు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు... 55 వేల నగదుతో పాటు... సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

బీడబ్ల్యుఎఫ్ సూపర్ సిరీస్ ఫైనల్స్.. నేడు మహిళల సింగిల్స్ ఫైనల్

దుబాయ్ : బీడబ్ల్యుఎఫ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ లో నేడు మహిళల సింగిల్స్ ఫైనల్ జరుగనుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు సింధు వర్సెస్ యమగూచి. 

07:53 - December 17, 2017

కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఎన్నికపై వక్తలు భిన్నవాదనలు వినిపించారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో బీజేపీ నేత విష్ణు, కాంగ్రెస్ నేత నర్సారావు, విశాలాంధ్ర సంపాదకులు ముత్యాలప్రసాద్ పాల్గొని, మాట్లాడారు. కాంగ్రెస్ లో వారసత్వ, కుటుంబ రాజకీయాలు ఉన్నాయన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

07:46 - December 17, 2017

విశాఖ : శ్రీలంకతో సిరీస్‌ నిర్ణయాత్మక వన్డేకు టీమిండియా సన్నద్ధమైంది.3 మ్యాచ్‌ల సిరీస్‌ ఆఖరి వన్డేకు  స్టీల్‌ సిటీ విశాఖపట్నంలో రంగం సిద్ధమైంది. తొలి వన్డేలో తేలిపోయి, సెకండ్‌ వన్డేలో సంచలన విజయం సాధించిన భారత్‌ సిరీస్‌ విజయం సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగబోతోంది. 

వన్డే వరల్డ్‌ చాంపియన్స్‌ భారత్‌, శ్రీలంక జట్లు అసలు సిసలు సమరానికి సన్నద్ధమయ్యాయి. భారత్‌,శ్రీలంక ఆఖరి వన్డేకు విశాఖపట్నంలోని ఏసీఏ, వీడీసీఎ స్టేడియంలో రంగం సిద్ధమైంది. రోహిత్‌ శర్మ నాయకత్వంలోని భారత జట్టు సిరీస్‌ విజయం సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగబోతుండగా...తిసెరా పెరీరా సారధ్యంలోని శ్రీలంక మరోసారి సంచలనం సృష్టించాలని పట్టుదలతో ఉంది.

తొలి వన్డేలో తేలిపోయి... సెకండ్‌ వన్డేలో సంచలన విజయం సాధించిన భారత్‌ సిరీస్‌ సమం చేసి పోటీలో నిలిచింది. మొహాలీ వన్డేలో ఆతిధ్య భారత్‌ ఎంతలా ఆధిపత్యం ప్రదర్శించిందో అందరికీ తెలిసిందే.హార్డ్‌ హిట్టింగ్‌ బ్యాట్స్‌మెన్‌ రోహిత్‌ శర్మ డబుల్‌ సెంచరీతో పాటు బౌలర్లు సమిష్టిగా చెలరేగడంతో రెండో వన్డేలో టీమిండియాకు తిరుగేలేకుండా పోయింది. 

శిఖర్‌ ధావన్‌,శ్రేయస్‌ అయ్యర్‌, ధోనీ ఫామ్‌లో ఉండటం, రోహిత్‌ శర్మ జోరు మీదుండటం భారత్‌కు పెద్ద ప్లస్‌ పాయింట్‌ అనడంలో అనుమానమే లేదు. వాషింగ్టన్‌ సుందర్‌ ,యజ్వేంద్ర చహాల్‌,హార్దిక్‌ పాండ్య, జస్ప్రీత్‌ బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌లతో భారత్‌ బౌలింగ్‌ మునుపెన్నడూ లేనంతలా ఎటాక్‌ పదునుగా ఉంది.ఆఖరి వన్డేలోనూ మొహాలీ మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే భారత జట్టు బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

మరోవైపు శ్రీలంక జట్టు అంచనాలకు మించి రాణించాలని భావిస్తోంది. ధరమ్‌శాల  వన్డేలో భారత్‌కు షాకిచ్చిన లంక మొహాలీ వన్డేలో మాత్రం తేలిపోయింది. రెండో వన్డేలో అన్ని విభాగాల్లో విఫలమవ్వడం లంక జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసిందనడంలో సందేహమే లేదు.కానీ శ్రీలంకను తక్కువ అంచనా వేస్తే మాత్రం ఫలితం తారుమారయ్యే అవకాశాలు లేకపోలేదు. నిర్ణయాత్మక వన్డేలో నెగ్గి టీమిండియా సిరీస్‌తో పాటు సీజన్‌ను విజయంతో ముగించాలని తహతహలాడుతోంది.మరి ఆఖరి వన్డేలో నెగ్గి సిరీస్‌ విజేతగా నిలిచేదెవరో తెలియాలంటే మరికొద్దిగంటలు వెయిట్ చేయాల్సిందే.

07:45 - December 17, 2017

చెన్నై : తమిళనాడుకు చెందిన 20 మంది మత్స్యకారులకు పెను ప్రమాదం తప్పింది.  చెన్నైలోని కాశిమేడుకు చెందిన 20 మంది జాలర్లు ఓ పడవలో తెల్లవారుజామున చేపల వేటకు బయలుదేరారు. ఉదయం 8 గంటల సమయంలో బంగాళాఖాతంలోని తూర్పు దిశగా తీరానికి వంద కిలోమీటర్ల దూరంలో నడి సముద్రానికి చేరుకున్నారు. జాలర్లు చేపల కోసం వలలు వేసేందుకు సిద్ధమవుతుండగా  పడవ మధ్య కింది భాగంలో రంధ్రాన్ని గమనించారు. ఆ రంధ్రం నుంచి పడవలోకి నీరు రావడంతో అప్రమత్తమయ్యారు. ప్రమాదాన్ని గ్రహించిన జాలర్లు ధైర్యంగా రంధ్రాన్ని మూసివేసే ప్రయత్నం చేస్తూనే నీటిని బయటకు తోడేశారు. అక్కడి నుంచి ఒడ్డుకు చేరుకునేందుకు వారు తీవ్రంగా శ్రమించారు. ఈసీఆర్‌ రోడ్డులోని పెరుందురై కుప్పం తీరానికి చేరుకోవడంతో జాలర్లు ఊపిరి పీల్చుకున్నారు.

 

సెక్స్ రాకెట్ ముఠా అరెస్టు

హైదరాబాద్ : నగరంలో సెక్స్ రాకెట్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. తాజ్ డెక్కన్ హాటల్, తాజ్ బంజారా హోటల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. తాజ్ డెక్కన్ హాటల్ లో వ్యభిచారం నిర్వహిస్తూ హీరోయిన్ రిచాసక్సేనా, కాస్ట్యూమ్ డిజైనర్ పట్టుబడ్డారు. 

 

07:35 - December 17, 2017

జార్ఖండ్‌ : బొగ్గు కుంభకోణం కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది. జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి మధు కోడాకు మూడేళ్లు జైలుశిక్షతో పాటు రూ.25 లక్షల జరిమానా విధించింది. కోల్‌కతాకు చెందిన విని ఐరన్, స్టీల్‌ ఉద్యోగ్‌ లిమిటెడ్‌ కంపెనీకి.. జార్ఖండ్‌లోని రాజారా నార్త్‌ బొగ్గు బ్లాక్‌ కేటాయింపుల విషయంలో అవకతవకలు జరిగాయని కేసు నమోదు అయింది. ఈ కేసులో మధు కోడా, గుప్తాలతో పాటు జార్ఖండ్‌ మాజీ సీఎస్‌ ఏకే బసు హస్తముందని సీబీఐ  కోర్టు దోషులుగా తేల్చింది. 

 

07:32 - December 17, 2017

హైదరాబాద్ : హాస్యనటుడు విజయ్‌సాయి ఆత్మహత్య వెనుక ట్విస్టుల మీద ట్విస్టులు బయటకు వస్తున్నాయి. విజయ్‌కు వివాహేతర సంబంధాలు ఉన్నాయంటూ ఆయన భార్య వనితారెడ్డి ఆరోపించారు. విజయ్‌ మరో అమ్మాయితో సన్నిహితంగా ఉన్న ఫోటోలను బయటపెట్టారు. మరోవైపు తన కుమారుడికి ఎలాంటి సంబంధాలు లేవని.. ఆ ఫోటోలు షార్ట్‌ ఫిలింలోనివని విజయ్‌ తండ్రి సుబ్బారావు తెలిపారు.
రీలు రీలుకో ట్విస్టు 
కమెడియన్‌ విజయ్‌ సాయి ఆత్మహత్య కేసులో రీలు రీలుకో ట్విస్టు వెలుగు చూస్తోంది.  విజయ్‌ ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను ఆయన భార్య వనితారెడ్డి మీడియాకు విడుదల చేశారు. విజయ్‌సాయి ఆత్మహత్యకు తాను కారణం కాదని తెలిపారు. త్వరలోనే మరికొన్ని వీడియోలు, ఆడియోలతో వచ్చి పోలీసులకు లొంగిపోతానని వనిత వెల్లడించారు. విజయ్‌ నిజ స్వరూపం ఏమిటో అందరికీ తెలియాల్సిన అవసరం ఉందని అందుకే వీటిని బయటపెడుతున్నట్లు చెప్పారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, పోలీసులు తనను క్షమించాలని విజ్ఞప్తి చేస్తూ ఓ సెల్ఫీ వీడియోను వనిత మీడియాకు పంపారు. 
మోడల్‌తో విజయ్‌కి రెండో పెళ్లి జరిగింది : రామచంద్రారెడ్డి 
ఓ మోడల్‌తో విజయ్‌కి రెండో పెళ్లి జరిగిందని వనితారెడ్డి సోదరుడు రామచంద్రారెడ్డి ఆరోపించారు. అందుకు సంబంధించిన ఆధారాలు వనిత దగ్గర ఉన్నాయని చెప్పారు. 
నా కుమారున్ని వనితారెడ్డి బ్లాక్‌మెయిల్‌ చేసింది : విజయ్‌ తండ్రి సుబ్బారావు 
మరోవైపు తన కుమారుడిని వనితారెడ్డి బ్లాక్‌మెయిల్‌ చేసిందని విజయ్‌ తండ్రి సుబ్బారావు ఆరోపించారు. తన కుమారుడికి ఎలాంటి వివాహేతర సంబంధాలు లేవని.. ప్రస్తుతం బయటకు వచ్చిన ఫోటోలు షార్ట్‌ఫిలింలోనివని ఆయన చెప్పారు. విజయ్‌తో సన్నిహితంగా ఉన్న అమ్మాయి బయటకు వస్తే అన్ని విషయాలు తెలుస్తాయన్నారు. విజయ్‌ ఆత్మహత్యలో ఇప్పటి వరకు రెండు కుటుంబాల మధ్య నెలకొన్న రచ్చ.. కొత్త ఫోటోలతో మరిన్ని మలుపులు తిరుగబోతోంది. 

 

07:26 - December 17, 2017

తూర్పుగోదావరి : జిల్లాలోని పిఠాపురంలో  సీపీఎం 22వ జిల్లా మహాసభలు ఘనంగా జరుగుతున్నాయి.ఈ మహాసభలకు హాజరైన  సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు.. టీడీపీ వైఖరిపై విరుచుకుపడ్డారు. ప్రజాసమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రజాసమస్యలను లేవనెత్తుతున్న ప్రతిపక్షాలను నిరంకుశంగా అణిచివేసే ధోరణి అవలంబిస్తున్నారని మధు విమర్శించారు. 
అట్టహాసంగా ప్రారంభమైన మహాసభలు
తూర్పుగోదావరి జిల్లా  పిఠాపురంలో సీపీఎం శ్రేణులు కదం తొక్కాయి. తూర్పుగోదావరి జిల్లా 22 మహాసభలు అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. ఈసందర్భంగా పిఠాపురం కొత్త బస్టాండు నుంచి కోటగుమ్మం సెంటర్‌ మీదుగా ఉప్పాడ సెంటర్‌ వరకు భారీ ప్రదర్శన జరిగింది. ప్రజానాట్యమండలి డప్పుల విన్యాసాలు మార్మోగాయి. అంబేద్కర్‌, భగత్‌సింగ్‌, చెగువేరా, అల్లూరి సీతారామరాజు, కార్మిక కర్షక కళారూపాలతోపాటు హిందూ, ముస్లిం, క్రైస్తవ కళారూపాలు ప్రజలను ఆకట్టుకున్నాయి.
పెరుగుతున్న టీడీపీ ప్రభుత్వ ఆగడాలు : మధు 
మహాసభల్లో సీపీఎం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శి పి మధు పాల్గొన్నారు. టీడీపీ ప్రభుత్వ ఆగడాలు అంతకంతకూ పెరుగుతున్నాయని మధు విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో సీఎం చంద్రబాబు వైఖరి ఏరుదాటాక తెప్ప తగలేసినట్టే ఉందన్నారు. కాకినాడ ఎస్‌ఈజడ్‌ భూములను రైతులకు  తిరిగి ఇస్తామన్న హామీ ఇంతవరకు అమలు కాలేదన్నారు. రైతుల భూములను తిరిగి ఇప్పించేవరకు సీపీఎం, వామపక్షాలు పోరాడతాయని మధు అన్నారు. దివీస్‌ పేరుతో పంపాదిపేట, తాటాకులపాలెం తదితర గ్రామాల్లో ప్రజలపై పోలీసుల ను ఉసిగొల్పిన ప్రభుత్వం  అరాచకంగా సృష్టించదని మధు మండిపడ్డారు. ఎన్ని నిర్బంధాలు విధించినా, దివీస్‌కు వ్యతిరేకంగా పెద్దఎత్తున ఉద్యమించి కాలుష్య కారక ఫ్యాక్టరీని తిప్పికొట్టిన ఘనత సిపిఎంకే దక్కిందన్నారు. 
ప్రజాసమస్యలపై ఉద్యమించడానికి కార్యాచరణ 
రొబోయే నెల రోజుల్లో ప్రజాసమస్యలపై ఉద్యమించడానికి కార్యాచరణ రూపొందిస్తామని సీపీఎం నేతలు అన్నారు.  రాష్ట్రంలో సిపిఐతోపాటు , న్యూడెమోక్రసీ, సిపిఐఎంఎల్‌, లిబరేషన్‌, ఇతర ప్రజాపక్షాలు, కార్మిక సంఘాలతో ఐక్య పోరాటాలు చేయనున్నామని  మధు వెల్లడించారు. అటు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ను కూడా కలిసిరావాల్సిందిగా సీపీఎం నేతలు పిలుపునిచ్చారు. 

 

07:13 - December 17, 2017

హైదరాబాద్ : ప్రపంచ తెలుగు మ‌హాస‌భ‌ల్లో తెలంగాణ వంట‌కాలు ఘుమ‌ఘుమ‌లాడుతున్నాయి..ప‌ల్లె దారి ప‌డితే త‌ప్పా..దొర‌క‌ని  ఆరుదైన వంట‌కాలు నోరూరిస్తున్నాయి. అన్నిరకాల వంటకాలు ఒకే చోట ల‌భిస్తుండ‌డంతో భాగ్యనగర్‌ వాసులు తెలుగు వంటకాల రుచులను ఆస్వాదిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

07:11 - December 17, 2017

హైదరాబాద్ : తెలుగు మహాసభలు వైభవంగా కొనసాగుతున్నాయి. సాహితీచర్చలు, క‌విస‌మ్మేళాలు నిర్వహించారు. ఎల్ .బిస్టేడియంలో జరిగిన తెలంగాణ‌లోసాహితీవికాసం కార్యక్రమంలో డిప్యూటిసి.ఎం క‌డీయం శ్రీహారి పాల్గొన్నారు. ర‌వీంద్రబార‌తిలో జరిగిన  యువ‌చిత్రోత్సవం విశేషంగా ఆక‌ట్టుకుంది.
గుభాళిస్తున్న తెలుగు పరిమళాలు 
భాగ్యనగరంలో ప్రపంచ తెలుగు మహాసభలు తెలుగు పరిమళాలు గుభాళిస్తున్నాయి. సాహితీచర్చలు, పద్యపఠనాలు, ఆటపాటలు మార్మోగుతున్నాయి. రెండవరోజు కార్యక్రమాల్లో సాహితీవేత్తల అద్యక్షత‌న జ‌రిగిన ప‌లుకార్యక్రమాలు బాషాభిమానుల‌ను ప్రత్యేకంగా అల‌రించాయి. దశాబ్దాలుగా సాహితీస‌వంత్రిలో ప్రావీణ్యం క‌న‌బ‌రిచిన వారికిస‌త్కారాలు నిర్వహించారు... తెలుగు విశ్వవిద్యాల‌యం ఆడిటోరియంలోని బిరుదు రాజురామాజు ప్రాంగ‌ణంలో  ఆచార్య అనుమాండ్ల  భూమ‌య్య, అద్యక్షత‌న ఈ సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు.  కావ్యాల్లో ప‌ద్యక‌వితావైశిష్ట్యం, తెలంగాణ‌ ప్రబంధాలు, ఆధునిక పద్య క‌విత‌సామాజిక‌త‌, వ్యాఖ్యాత‌లు చ‌ర్చాగోష్ఠి నిర్వహించారు.. 
తెలంగాణ వచ‌న క‌వితావికాసంపై స‌ద‌స్సు
మ‌ధ్యహ్నం 3గంట‌ల‌కు తెలంగాణ వచ‌న క‌వితావికాసంపై స‌ద‌స్సు జరిగింది. హైదారాబాద్ బుక్ పేర్ నిర్వహ‌కులు జూలూరిగౌరిశంక‌ర్ అధ్యక్షతన ఈ కార్యక్రమంలో పలువురు కవులు, సాహితీ అభిమానులు పాల్గొన్నారు.  ఈసందర్భంగా వ‌చ‌న‌ క‌విత్యం వ‌స్తువైవిధ్యంలో వ‌స్తున్నమార్పుల‌పై వ‌క్తలు ప్రసంగించారు .
హాస్యావధానం, ప‌ద్యక‌వి స‌మ్మేళ‌నం  
అటు ర‌వీంద్రబార‌తిలో జరిగిన హాస్యావధానం, ప‌ద్యక‌వి స‌మ్మేళ‌నం ఆహూతులను అలరించాయి. దాంతోపాటు బాల‌ల‌ సాహిత్యస‌ద‌స్సువిద్యార్ధుల‌ను యువ సాహితీవేత్తల‌ను అక‌ట్టుకుంది. యువ‌చిత్రోత్సవంలో ఎంపిక‌చేసిన‌ ల‌ఘుచిత్రాల‌ను పైడిజ‌య‌రాజు ప్రివ్యూ థీయయేట‌ర్‌లో ప్రదర్శించారు.  రాష్ట్ర సాధన ఉద్యమ స‌మ‌యంలో వచ్చిన  సాహిత్యం.. ప్రజలకు ఏంతో ఊపునిచ్చాయ‌ని డిప్యూటి సిఎం క‌డియం అన్నారు. కళాకారుల ఆట,పాటలు ఉద్యమకారులకు వెయ్యి ఎనుగుల బ‌లాని అందించాయ‌న్నారు. మరోవైపు మహాసభల్లో సందర్శకులు తెలంగాణ వంటకాలను ఆస్వాధిస్తున్నారు. అసలు సిసలు తెలుగుదనం వంటకాల్లోనే ఉందంటున్నారు.  

 

07:05 - December 17, 2017

హైదరాబాద్ : రాహుల్‌గాంధీ ఏఐసీసీ అధ్యక్ష పగ్గాలు చేపట్టినందుకు కాంగ్రెస్‌ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. రాహుల్‌ కుటుంబం మొత్తం ప్రజాసేవకే అంకితమయ్యారని నేతలంటున్నారు. రాహుల్‌ సారధ్యంలోని కాంగ్రెస్‌ పార్టీ...  2019లో అధికారంలోకి వస్తుందని నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

 

06:59 - December 17, 2017

గుంటూరు : అమరావతిలో జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అసెంబ్లీ టవర్ ఆకృతికి కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్తగా రాష్ట్రంలో తొమ్మిది మండలాల ఏర్పాటుతో పాటు... 2017 ఏపీ పోలీస్ ముసాయిదా బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పోలవరంపై తాజాగా పిలిచిన 14వందల 80 కోట్ల టెండర్లను తాత్కాలికంగా నిలిపివేయాలని సమావేశంలో నిర్ణయించారు. 
అసెంబ్లీ టవర్‌ ఆకృతికి మంత్రివర్గం ఆమోదం 
ఎపీ మంత్రి మండలి పలుకీలక నిర్ణయాలు తీసుకుంది. డిజిపి నియామకం, అసెంబ్లీ డిజైన్స్ , చంద్రన్న పెళ్లి కానుకు, పోలవరంలాంటి కీలక అంశాల పై   నాలుగు గంటల పాటు చర్చించారు. అమరావతిలో శాశ్వత అసెంబ్లీ డిజైన్ కోసం నార్మన్ పోస్టర్స్ సూచించిన 'టవర్'  ఆకృతిని పైనల్‌గా ఖరారు చేశారు. శాశ్వత అసెంబ్లీ భవనాన్ని మొత్తం 7.8 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం చేయనున్నారు.  అసెంబ్లీ భవనం చుట్టూ 125 ఎకరాల్లో నీటిని ఏర్పాటు చేసి, భవనం ఆక్రుతి నీటిలో ప్రతిబింభించేలా నిర్మాణం చేయనున్నారు. దాంతోపాటు రాష్ట్రంలో కొత్తగా 9 మండలాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు మంత్రులు తెలిపారు. విశాఖ,విజయవాడ అర్బన్‌ ఏరియాల్లో 3 మండలాలు కొత్తగా రానున్నాయి. అటు గుంటూరు, నెల్లూరు, కర్నూలో ఒక్కో అర్బన్‌ మండలం ఏర్పాటు కానున్నాయి. 
పోలవరం పూర్తివివరాలు అందించాలని నిర్ణయం
ఇక కీలకమైన  పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన  ఈ నెల 23   కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రాబోతుండడంతో,   పోలవరం పూర్తి వివరాలు కేంద్ర మంత్రికి వివరించాలని క్యాబినెట్ నిర్ణయింది.  ముఖ్యంగా కేంద్ర చెప్పినట్లుగానే , 1450 కోట్ల పనుల టెండర్లను మరో నెల రోజులు పాటు వేచి చూడాలన్న నిర్ణయాన్ని తీపుకున్నారు.  వివిధ పనులకోసం ప్రభుత్వం నిర్మాణ సంస్థకు ఇచ్చిన మొబిలైజేషన్ అడ్వాన్స్ మొత్తాన్ని  రికవరీ చేసే ప్రక్రియను మరో ఏడాది పొడిగించాలని డెసిషన్‌ తీసుకున్నారు.  మరోవైపు డిసెంబర్  27న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతులు మీదుగా రాష్ట్ర ఫైబర్ గ్రిడ్  ప్రారంభోత్సవం జరిపించాలని ఏపీ మంత్రిమండలి  నిర్ణయించింది
పోలీస్ యాక్ట్ 2014 కు సవరణలు  
డిజిపి ఎంపికకు సంబధించి గత కొంతకాలంగా సాగుతున్న సస్పెన్స్ కు క్యాబినెట్  తెర దించింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పోలీస్ యాక్ట్ 2014 అముల్లో ఉంది. ఈ చట్టాన్ని సవరించి ప్రస్తుతం డీజీపీ నియామకం విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించాలని మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు. డీజీపీ నియామకాన్ని ఇప్పుడు కొత్తగా రాష్ట్ర పరిధిలోకి తెచ్చేందుకు  యాక్ట్ 9 ఆఫ్ 2014ను సవరిస్తూ ఆర్డినెన్సు తీసుకురావడానికి మంత్రిమండలి నిర్ణయించింది.
ఫిబ్రవరి నుంచి చంద్రన్న పెళ్లికానుక 
ఇక చంద్రన్న పెళ్లి కానుక పథకాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి నుండి ప్రారంభించాలని క్యాబినెట్ నిర్ణయించింది.  బీసీ,  ఎస్‌సీ,  ఎస్‌టీ,  మైనారిటీలకు ఈ కానుక అందిస్తారు. బీసీలకు రూ.30వేలు,  ఎస్‌సీ,  ఎస్‌టీలకు రూ.50  వేలు పెళ్లికానుక ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అలాగే సమాజంలో చిన్నచూపునకు గురవుతున్న హిజ్రాల కోసం ట్రాన్స్‌జెండర్ పాలసీ తీసుకురావాలని మంత్రిమండలి నిర్ణయించింది. 

 

నేడు పంజాబ్ లో స్థానిక సంస్థలకు ఎన్నికలు

చండీఘర్ : పంజాబ్ లో నేడు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగనున్నాయి. 3 మున్సిపల్ కార్పొరేషన్లు, 32 మున్సిపల్ కౌన్సిల్ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. 

 

నేడు ఢిల్లీలో హిజ్రాల భారీ ధర్నా

ఢిల్లీ : నేడు ఢిల్లీలో హిజ్రాలు భారీ ధర్నా చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న  ట్రాన్స్ జెండర్ 2018 బిల్లును హిజ్రాలు వ్యతిరేకిస్తున్నారు. 

నేడు కుటుంబ సమేతంగా మాల్దీవులకు సీఎం చంద్రబాబు

హైదరాబాద్ : నేడు కుటుంబ సమేతంగా మాల్దీవులకు సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు.  22న తిరిగి అమరావతికి రానున్నారు. 

నేడు ఉద్యమ కార్యాచరణను ప్రకటించనున్న ప్రొ.కోదండరాం

హైదరాబాద్ : నేడు నిరుద్యోగ, రైతాంగ సమస్యలపై ఉద్యమ కార్యాచరణను ప్రొ.కోదండరాం ప్రకటించారు. 

Don't Miss