Activities calendar

18 December 2017

21:26 - December 18, 2017
21:15 - December 18, 2017

సీఎంగా కేంద్ర మంత్రి ?

ఢిల్లీ : హిమాచల్‌ ప్రదేశ్‌లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం కనబరచడంతో సీఎంగా కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా పేరును పార్టీ అగ్ర నాయకత్వం పరిశీలిస్తోంది. పార్టీ సీఎం అభ్యర్థి ప్రేమ్‌ కుమార్‌ ధుమాల్‌ ఓటమి పాలవడంతో నడ్డా పేరు తెరపైకి వచ్చింది. 

జగన్ 39వ రోజు పాదయాత్ర..

అనంతపురం : వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి 39వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్ ఖరారైంది. మంగళవారం ఉదయం 8 గంటలకు ధర్మవరం మండలం తనకంటివారిపల్లె నుంచి వైఎస్ జగన్‌ పాదయాత్ర ప్రారంభిస్తారు. 

నగరానికి రానున్న రాష్ట్రపతి..

హైదరాబాద్ : ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హాజరుకానున్నారు. 19న మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు రామ్‌నాథ్ చేరుకుని రాజ్‌భవన్‌కు చేరుకుంటారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు ఎల్బీ స్టేడియంలో జరిగే తెలుగు మహాసభల ముగింపు ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు.

21:12 - December 18, 2017

విజయవాడ : గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఫలితాల్లో బీజేపీ విజయంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులతో కలిసి వ్యక్తిగత పర్యటనపై మాల్దీవుల్లో ఉన్న చంద్రబాబు... మోదీని అభినందిస్తూ ట్వీట్‌ చేశారు. ప్రధానితో ఫోన్‌లో మాట్లాడి అభినందనలు తెలిపారు.

21:10 - December 18, 2017

ఢిల్లీ : గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆశించిన పురోగతి సాధించలేకపోయింది. చావుతప్పి కన్ను లొట్టపోయిన చందంగా అధికారానికి అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌కు కేవలం ఏడు సీట్లు మాత్రమే అధికంగా సాధించగలిగింది. గతంలో కాంటే కాంగ్రెస్‌ తన పనితీరును బాగా మెరుగుపరుచుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌ సహా సహా కమలదళంలోని జాతీయ, రాష్ట్ర స్థాయిలో హేమాహేమీలు ప్రచారం చేసినా... 99 సీట్లకే పరిమితమైంది. చివరకు ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను కూడా కమలనాథులు అందుకోలేకపోయారు. బీజీపీ నాయకత్వం గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఎన్నెన్నో ఊహల్లో తేలిపోయింది. భారీ మెజారిటీ సాధిస్తామని.. 150 సీట్ల మార్కు చేరితీరతామని ఊదరగొట్టింది. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం కావడంతో గుజరాత్‌ ఎన్నికలు యావత్‌ దేశ ప్రజల దృష్టిని అమితంగా ఆకర్షించాయి. ప్రధాని మోదీ పనితీరుకు ఎన్నికల ఫలితాలు అద్దంపడతాయని ఆశించారు. కానీ కమలనాథులు ఆశించి మేర ఫలితాలు రాలేదు. ఘన విజయం సాధిస్తామని ధీమా వ్యక్తి చేసినా.. కేవలం 99 సీట్లకే పమితమయ్యారు.

మూడు ఎన్నికల నుంచి గుజరాత్‌లో బీజేపీ సీట్లు తగ్గుతూ వస్తున్నాయి. 2007 ఎన్నికల్లో 117 సీట్లు సాధించిన బీజేపీ 2012లో 115 స్థానాలకే పరిమితమైంది. ఇప్పుడైతే వంద మార్కును కూడా అందుకోలేక పోయింది. 2012 ఎన్నికలతో పోలిస్తే ఈసారి గణనీయంగా 16 సీట్లు తగ్గాయి. ఇదే సమయంలో కాంగ్రెస్‌ తన ఫలితాను మెరుగు పరుచుకుంటూ వస్తోంది. 2007లో 59 స్థానాలు సాధించిన కాంగ్రెస్‌.. 2012లో 61 సీట్లలో విజయం సాధించింది. ఈసారి 80 స్థానాల్లో నెగ్గి.. తన స్థానాన్నికొంతవరకు మెరుగుపరచుకుంది. గత ఎన్నికల కంటే ఈసారి 19 సీట్లు ఎక్కువగా గెలుచుకుంది.

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి సీట్లు తగ్గడానికి చాలా కారణాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు పడ్డ ఇబ్బందులు ఎన్నికలను ప్రభావితం చేశాయి. ఎన్నో పరిశ్రమలు మూతపడి, వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఇలాంటి వారంతా బీజేపీకి వ్యతిరేకంగా ఓటేశారు. ఈ ఏడాది జులై 1 నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్‌టీ కూడా గుజరాత్‌ ఓటర్లను ప్రభావితం చేసింది. ఈ పన్నుతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయి. జీఎస్‌టీతో ధరలు తగ్గుతాయని ఆశించిన ప్రజలకు ఆశాభంగం ఎదురవడంతో ఓట్ల బీజేపీకి వ్యతిరేకంగా మారారు. ముఖ్యంగా గ్రామీణ ఓటర్లు బీజేపీకి పూర్తిగా వ్యతిరేకంగా ఓటేసినట్లు ఫలితాల సరళి స్పష్టం చేసింది.

పటేల్‌ రిజర్వేషన్ ఉద్యమం కూడా బీజేపీ ఓటు బ్యాంకుకు గండికొట్టింది. హర్దిక్‌ పటేల్‌ నేతృత్వంలోని పాటీదార్‌ అనామత్‌ ఆందోళన సమితి కాంగ్రెస్‌తో చేతులు కలిపింది. పటేల్స్‌ బీజేపీకి వ్యతిరేకంగా మారడంతో... ఆ ప్రభావం ఎన్నికల ఫలితాలపై పడింది. సీట్లు పెంచుకోడానికి కాంగ్రెస్‌కు కొంతవరకు కలిసొచ్చింది. గుజరాత్‌ ఎన్నికల్లో రాహుల్‌గాంధీ విస్తృతంగా ప్రచారం చేశారు. రాహుల్‌ ప్రచారానికి విశేష స్పందన లభించింది. సోషల్‌ మీడియాలో కూడా రాహుల్‌కు మంచి ప్రచారం వచ్చింది. అధికారంలోకి రాలేకపోయినా.. 2012 ఎన్నికల కంటే సీట్లను మెరుగుపరచుకుంది. గుజరాత్‌లో అధికారంలోకి రావాలన్న ఆశ నెరవేరకపోయినా...భవిష్యత్‌కు ఆశావహ బాట వేసుకున్నామన్న భావం కాంగ్రెస్‌ నేతల్లో వ్యక్తమవుతోంది.

21:09 - December 18, 2017

ఢిల్లీ : జో జీతా హై వహి సికిందర్‌.. ఎస్‌.. గెలుపు గెలుపే కానీ ఆ గెలుపులో ఓ సంకేతం ఉంటుంది. ఓ సందేశం ఉంటుంది. ప్రతిష్ఠాత్మకమైన గుజరాత్‌ గెలుపు నేర్పిన పాఠం బీజేపీకి ఓ హెచ్చరిక. '150 ఫ్లస్‌' స్థానాల్లో గెలుస్తానంటూ ప్రచారం ప్రారంభించిన బీజేపీ గుజరాత్‌లో 100 లోపు స్థానాలకే పరిమితమైంది. దేశంలోనే బీజేపీ ప్రయోగాలకు వేదికగా, బలమైన రాష్ట్రంగా భావించే గుజరాత్‌లో 2014నాటి లోక్‌సభ ఫలితాలతో పోల్చిచూస్తే 60కి పైగా అసెంబ్లీ స్థానాల్లో బీజేపీకి ఆధిక్యం తగ్గిపోయింది. కనీసం 2012 నాటి అసెంబ్లీ ఫలితాలనైనా నిలబెట్టుకోలేకపోయింది. చావుతప్పి కన్నులొట్టబోయినట్లు బోటాబోటీ మెజారిటీతో గట్టెక్కింది. దేశ ప్రధాని, పార్టీ అధ్యక్షుడు పుట్టి పెరిగిన రాష్ట్రంలోనే బీజేపీకి ఎదురుగాలి వీస్తుందనేందుకు ఇదో సంకేతం. పైపెచ్చు గెలిచిన స్థానాల్లోనూ స్వల్ప ఆధిక్యంలో గట్టెక్కిన సీట్లు పదుల సంఖ్యలోనే ఉన్నాయి.

22 ఏళ్లుగా అధికారానికి ఆమడదూరంలో ఉన్న హస్తం పార్టీ నిర్మాణం కుచించుకుపోయింది. కుంగిపోయింది. చెప్పుకోదగ్గ పెద్ద నాయకుడు రాష్ట్రంలో లేకుండా పోయాడు. ఇన్ని బలహీనతలు ఉన్నప్పటికీ అధికారానికి 10 సీట్ల దూరం వరకు కాంగ్రెస్‌ నెగ్గుకురాగలిగిందంటే అది గొప్పవిషయమే. మత సమీకరణ, పాకిస్తాన్‌ వ్యతిరేకాస్త్రం, గుజరాత్‌ ఆత్మగౌరవం వంటి ఎమోషన్‌ సెంటిమెంట్‌ అస్త్రాలను విచ్చలవిడిగా, విస్తృతంగా ప్రయోగించింది బీజేపీ. రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థి స్థాయిలో ప్రధానే రంగంలోకి దిగి ప్రచారం నిర్వహించారు. బ్రాండ్‌ మోడీ ఫ్యాక్టర్‌ పనిచేసింది. ఫలితం మాత్రం రేపటి ప్రభావాలకు అద్దం పట్టింది. రానున్న ఎన్నికలు ఏక పక్షం కాదన్న హెచ్చరికను పంపింది.

గుజరాత్‌ స్థాయిలో బీజేపీకి బలమైన పార్టీ నిర్మాణం లేని కర్నాటక, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లలో వచ్చే సంవత్సరం ఎన్నికలు రాబోతున్నాయి. తాజాగా గుజరాత్‌ ఫలితం ఆయా రాష్ట్రాల బీజేపీ అవకాశాలపై ప్రభావం చూపితే కమలనాథులకు ఎదురీత తప్పదు. పైపెచ్చు సెంటిమెంట్‌ ప్రయోగించడానికి అవి మోడీ, అమిత్‌షాల సొంత రాష్ట్రాలు కాదు. 2019 ఎన్నికల్లో ప్రతిపక్షాలు కష్టపడాలని గుర్తుచేస్తున్నాయి.బీజేపీ ఆత్మవిమర్శ చేసుకోవాలనీ తెలియజేస్తున్నాయి. మోడీ మ్యాజిక్‌ మసకబారుతున్న సూచనలకు సొంతరాష్ట్రం గుజరాతే సంకేతంగా నిలుస్తోంది.

21:04 - December 18, 2017

ఢిల్లీ : గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి విజయం సాధించింది. గుజరాత్‌లో కాంగ్రెస్‌ నుంచి గట్టి పోటి ఎదుర్కొన్న బిజెపి వరుసగా ఆరోసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. మోది అభివృద్ధి పనులే కమల వికాసానికి కారణమని బిజెపి తెలిపింది. గుజరాత్‌లో తాము ఓడినా... పార్టీ శక్తిమంతంగా తయారైందని కాంగ్రెస్‌ పేర్కొంది. గుజరాత్‌లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాల ఫలితాలను ప్రకటించారు. బిజెపి 99 స్థానాలు, కాంగ్రెస్‌ 80 స్థానాలు, మూడు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపాని, స్వతంత్ర అభ్యర్థిగా పోటి చేసిన దళిత యువనేత జిగ్నేష్‌ మేవానీ విజయం సాధించారు. జిగ్నేష్‌ 63 వేల 471 ఓట్ల తేడాతో బిజెపి అభ్యర్థిని ఓడించారు.

2012 ఎన్నికలతో పోలిస్తే బిజెపి 16 సీట్లను కోల్పోగా...కాంగ్రెస్‌ పార్టీ 19 స్థానాలను తన ఖాతాలోకి వేసుకుంది. 2012లో బిజెపి 115, కాంగ్రెస్‌ 61, స్వతంత్ర అభ్యర్థులు 6 స్థానాల్లో విజయం సాధించారు. హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బిజెపి విజయం సాధించింది. మొత్తం 68 స్థానాలకు గాను బిజెపి 44 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌ 21, సిపిఎం 1, ఇద్దరు ఇండిపెండెంట్లు గెలిచారు. హిమాచల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి సిఎం అభ్యర్థి ప్రేమ్‌కుమార్‌ ధుమాల్‌ ఓటమి చెందారు. 2012 ఎన్నికల్లో కాంగ్రెస్‌ 36, బిజెపి 26, స్వతంత్రులు ఆరుగురు గెలుపొందారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 15 స్థానాలను కోల్పోగా...బిజెపికి 18 స్థానాలు ప్లస్‌ అయ్యాయి.

గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌లో కమల వికాసంపై బిజెపి హర్షం వ్యక్తం చేసింది. కోట్లాది మంది కార్యకర్తల కృషి, ప్రధాని మోది చేస్తున్న అభివృద్ధి పనులే విజయానికి కారణమని బిజెపి చీఫ్‌ అమిత్‌ షా అన్నారు. కులతత్త్వం, వారసత్వ రాజకీయాలు, ఓ వర్గాన్ని సంతృప్తిపరిచే విధానాలను ప్రజలు తిరస్కరించారని ఆయన తెలిపారు. గుజరాత్‌ ఎన్నికల్లో బిజెపికి గట్టి పోటీ ఇచ్చిందని కాంగ్రెస్‌ పేర్కొంది. ఫలితాలు ఎలా ఉన్నప్పటికి నైతిక విజయం కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకే దక్కుతుందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అశోక్‌ గెహ్లాట్‌ అభిప్రాయపడ్డారు. గుజరాత్‌ ఎన్నికల్లో రాహుల్‌ సంధించిన ప్రశ్నలకు మోది వైపు నుంచి ఇంతవరకు సమాధానం రాలేదన్నారు. అసలు సమస్యలను పక్కదోవ పట్టించి మోది తన స్థానికతను తెరపైకి తెచ్చారని విమర్శించారు. మూడంకెల స్థానాలకు దక్కించుకునేందుకు మోది, అమిత్‌షాలు చాలా కష్టపడాల్సి వచ్చిందని కాంగ్రెస్‌ ఎద్దేవా చేసింది.

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఈవీఎంల టాంపరింగ్‌కు పాల్పడిందని పాటీదార్‌ సామాజిక ఉద్యమ నేత హార్దిక్‌ పటేల్‌ ఆరోపించారు. ఈ ఎన్నికల్లో బిజెపి ఎలాంటి చాణక్య రణనీతి చూపలేదని...విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లి, టాంపరింగ్‌కు పాల్పడడం ద్వారా విజయం సాధించిందని విమర్శించారు. బిజెపికి వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. గుజరాత్‌లో గత 22 ఏళ్లుగా బిజెపి విజయ దుందుబి కొనసాగుతోంది. వరుసగా ఆరోసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. హిమాచల్‌లో ప్రతి ఐదేళ్లకు ప్రభుత్వాన్ని మార్చే ఓటర్లు ఈసారి కూడా అదే సాంప్రదాయాన్ని కొనసాగించారు.

21:03 - December 18, 2017

ఢిల్లీ : చావు తప్పి కన్ను లొట్టపోవడం అంటే ఏంటో.. బీజేపీకి తెలిసొచ్చింది. దేశమంతటా తనదే హవా అని మిడిసిపడుతోన్న మోదీ మహాశయుడు.. సొంతింట్లోనే బతుకుజీవుడా అనుకునే పరిస్థితి వచ్చింది. ఓ దశలో.. ఓటమి ఛాయలను ముద్దాడిన కమల దళం.. స్వల్పతేడాతో బయటపడి హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకుంది. మిగతా రాష్ట్రాల్లో ప్రయోగించిన అమిత్‌ జాదూ ఇక్కడ పనిచేయలేదు. నోట్లరద్దు, జీఎస్‌టీ అమలుపై తమకు ఎంతటి కసి ఉందో.. సహజ వ్యాపార వర్గానికి చెందిన గుజరాత్‌ ఓటరు తన అస్త్రం ద్వారా తేల్చి చెప్పాడు. అప్రజాస్వామిక ధోరణులను మోదీ వీడకుంటే.. ఆర్థిక నిర్ణయాల ఏకపక్ష విధానాలను మోదీ, అమిత్‌, జైట్లీ త్రయం నిలువరించుకోకుంటే.. 2019లో దేశవ్యాప్తంగా ఎలాంటి ప్రతికూలత వస్తుందో ఈ రిజల్ట్‌ ద్వారా ఓ శాంపుల్‌ హెచ్చరిక చేశారు.. గుజరాత్‌ ఓటర్లు..! ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి నిరాశ పరిచినా.. కొత్తగా పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన రాహుల్‌కు.. ఇవి పాజిటివ్‌ సంకేతాలే అని చెప్పాలి. మోదీ జాదూ ముందు అసలు నిలవలేమో అనుకున్న కాంగ్రెస్‌... ఓడిపోతామేమో అని కమలదళం కలవరపడేలా గట్టి పోటీనే ఇచ్చింది. వచ్చే ఏడాది కర్నాటకలో జరిగే ఎన్నికల్లో.. పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చుకునే దిశగా.. ఈ రిజల్ట్స్‌ రాహుల్‌కు బూస్ట్‌ ఇచ్చాయని భావించొచ్చు. 

ఆర్కే నగర్ లో స్టాలిన్ ప్రచారం..

చెన్నై : తమిళనాడు రాష్ట్రంలోని ఆర్కే నగర్ ఉప ఎన్నిక ప్రచారంలో పలువురు నేతలు పాల్గొంటున్నారు. డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 

20:44 - December 18, 2017

గుజరాత్ ఎన్నికల ఫలితాలు బీజెపీ గుండెల్లో గుబులు రేపుతున్నాయా? చావుతప్పి కన్ను లొట్టపోయినట్టయిందా? గెలిచిన సంతోషం ఆస్వాదించలేని పరిస్థితిలో ఉందా? కాంగ్రెస్ కాస్త వ్యూహాత్మకంగా వ్యవహరించి ఉంటే, బీజెపీని బోల్తాకొట్టించగలిగేదా? గుజరాత్ ఫలితాలు ఏం చెప్తున్నాయి? మోడీ మంత్రకు, అమిత్ షా వ్యూహానికి కాలం చెల్లుతున్న ఆనవాళ్లు గుజరాత్ ఫలితాలతో స్పష్టమౌతున్నాయా? ఈ అంశంపై ప్రత్యేక కథనం..
భారత ప్రధాని కాస్తా గుజరాత్ లోకల్ లీడర్ లా గల్లీ గల్లీ తిరిగి శ్రమించాడు. ఎన్నో ఎత్తులు, పైఎత్తులతో నానా కష్టాలు పడి చివరికి గెలుపును సొంతం చేసుకుంది కమలదళం.. మరోపక్క మారుతున్న ఈక్వేషన్లు, మసకబారుతున్న ప్రభ, కొత్త శక్తులు ఆవిర్భావం కొన్ని చోట్ల దారుణ ఎదురుదెబ్బలు... ఇవన్నీ గుజరాత్ ఎన్నికల్లో బీజెపీ విస్మరించలేని అంశాలు.. ఎదురే లేదనే ధీమా ప్రదర్శించారు..దూసుకెళతామన్నారు..కానీ, వాస్తవం మరోలా కనిపించింది. మెజారిటీ సీట్లు సాధించినప్పటికీ, స్పష్టంగా గుజరాతీ ఓటరు విశ్వాసం కోల్పోయిన తీరు కనిపిస్తోంది. గుజరాత్ మోడల్ ప్రచారంలో, పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ గురించి చేసుకునే ప్రచారంలో వాస్తవంలేదనే అంశం స్పష్టంగా కనిపిస్తోంది.

యువరక్తం గెలుపు..గట్టిపోటీ ఇచ్చినా వ్యూహంలో సత్తా లేని కాంగ్రెస్.. బీరాలు పలికినా, ఫలితాల్లో స్పష్టంగా బీజెపీ పట్ల కనిపించిన వ్యతిరేకత.. ఇదీ గుజరాత్ ఎన్నికల పలితాలు చెప్తున్న విషయం. రాబోయే ఎన్నికల్లో ఇది స్పష్టమైన ప్రభావాన్ని చూపుతుందనే వాదనలు బలంగా ఉన్నాయి. ఓవరాల్ గా బీజెపీకి వార్నింగ్ బెల్ ని, కాంగ్రెస్ కి కాస్త ఓదార్పుని గుజరాత్ ఓటర్లు ఇచ్చారని చెప్పాలి. ఒక్కమాటలో చెప్పాలంటే ఇప్పుడు గుజరాత్ ఫలితాలు మోడీ సర్కారుకు స్పష్టమైన హెచ్చరికను అందించాయి. గెలుపు సాధించినప్పటికీ, అక్కడ కనిపిస్తున్న ప్రతికూలతలు, కమలదళాన్ని కలవర పరుస్తున్నాయి. చేసుకున్నవారికి చేసుకున్నంత అన్నట్టు...ఈ మూడున్నరేళ్లుగా మోడీ తీసుకున్న పలు నిర్ణయాల ప్రభావం ఇప్పుడు కనినిప్తోందనే వాదనలు పెరుగుతున్నాయి. ఇకనైనా తన విధానాల్లో మార్పు తీసుకురాకపోతే, బీజెపీ మరింత గడ్డు కాలం ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. పూర్తి విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి....

20:41 - December 18, 2017

ఢిల్లీ : గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ గెలుపుతో బీజేపీ పాలిత రాష్ట్రాల సంఖ్య 19కి పెరిగింది. హిమాచల్‌లో అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్‌..నాలుగు రాష్ట్రాలకే పరిమితమైంది. మరో ఆరు రాష్ట్రాల్లో తటస్థంగా అధికారంలో ఉన్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ, కాంగ్రెస్ ప్రతిష్టాత్మంగా భావించిన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు కమలదళానికి కొండంత బలాన్ని ఇచ్చాయి. రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ పాగా వేయడంతో దేశంలో ఆ పార్టీ పాలించే రాష్ట్రాల సంఖ్య 19కి పెరిగింది. మోదీ ప్రధాని అయ్యాక 8 రాష్ట్రాల్లో పార్టీ అధికారంలోకి వచ్చింది.

మరోవైపు చెయ్యి గుర్తు మరో వేలిని కోల్పోయింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఐదురాష్ట్రాలైన.. హిమాచల్ ప్రదేశ్, కర్నాటక, పంజాబ్, మిజోరామ్, మేఘాలయలో అధికారంలో ఉండగా.. తాజాగా హిమాచల్ ప్రదేశ్ చేజారడంతో ఇక ఆ పార్టీ కేవలం నాలుగు రాష్ట్రాలకే పరిమితమైంది. గుజరాత్‌లో 22 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీని ఓడించి పగ్గాలు చేపట్టాలనుకున్న రాహుల్‌ టీంకు పరాభవం తప్పలేదు.

నవంబర్ 9న జరిగిన హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 337 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అక్కడి ప్రజలు ఎన్నడూ లేనివిధంగా 75.28 శాతం మేర రికార్డు స్థాయిలో తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. 1985 నుంచి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చెరో విడత అధికారంలోకి వస్తూ ఉన్నాయి. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 68 స్థానాలకు గానూ కాంగ్రెస్ 36 చోట్ల విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. తాజా హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పరాభవంతో కమలం మరోసారి వికసించింది. మరోవైపు మిగిలిన ఆరు రాష్ట్రాల్లో కేరళ, త్రిపురలో సీపీఎం అధికారంలో ఉంది. తెలంగాణలో టీఆర్ఎస్, తమిళనాడులో AIADMK, ఒడిశాలో బిజూ జనతాదళ్, పశ్చిమబెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నాయి.

20:37 - December 18, 2017

ఢిల్లీ : ఈసారి ఎగ్జిట్‌ పోల్‌ అంచనాలు ఓ దశలో.. తల్లకిందులవుతున్న ఫీలింగ్‌ కలిగింది. అయితే.. చివరకు.. ఓ రెండు సంస్థల అంచనాలే నిజమయ్యాయి. అయితే అన్ని సంస్థలూ అంచనా వేసినట్లు.. గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లలో బీజేపీ అధికారం చేజిక్కించుకుంది. గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల ఎగ్జిట్‌ ఫలితాలు.. సర్వే సంస్థల అంచనాలకు కాస్త అటూఇటుగానే వెలువడ్డాయి. ముఖ్యంగా ఏబీపీ-సీఎస్‌డిఎస్‌ సంస్థ నిర్వహించిన సర్వేలోని అంచనాలు వాస్తవానికి చాలా దగ్గరగా ఉన్నాయి. మిగిలిన మీడియా సంస్థలు.. బీజేపీకి వందకు పైగా స్థానాలు వస్తాయని అంచనా వేయగా.. ఏబీపీ మాత్రం.. బీజేపీ 99 స్థానాలకు పరిమితం కావచ్చని తేల్చి చెప్పింది. అటు కాంగ్రెస్‌ విషయంలోనూ.. 78 నుంచి 86 స్థానాలు సాధించవచ్చని అంచనా వేయగా.. ఆపార్టీ 80 స్థానాలు గెలుచుకుంది. ఇక ఇండిపెండెంట్ల విషయంలో దాదాపుగా అన్ని సర్వే సంస్థలూ ఒకే రకమైన అంచనాలు వేశాయి. ఫలితం కూడా ఆప్రకారమే వెలువడింది.

హిమాచల్‌ ప్రదేశ్‌లో కూడా.. న్యూస్‌ ఎక్స్‌ సంస్థ ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు వాస్తవరూపం దాల్చాయి. ఈ సంస్థ.. బీజేపీ 42 నుంచి 50 స్థానాలు గెలుచుకుంటుందని, కాంగ్రెస్‌ 18 నుంచి 24 స్థానాలకు పరిమితమవుతుందని అంచనా వేసింది. ప్రస్తుత ఫలితాలు.. కొంచెం అటూఇటుగా ఇదే ప్రకారం ఉన్నాయి. మిగిలిన సర్వే సంస్థలన్నీ బీజేపీకి 50కి పైగానే స్థానాలు వస్తాయని లెక్కగట్టి.. అంచనాల్లో దెబ్బతిన్నాయి. 

20:35 - December 18, 2017

ఢిల్లీ : తమ ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలు సరైనవేనని గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు నిరూపించాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఢిల్లీలోని బిజెపి కార్యాలయంలో విజయోత్సవాల సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. జీఎస్‌టీ వల్ల తమ పార్టీ ఓడిపోతుందని చాలా మంది చెప్పారని, వారి ఆలోచనలు తప్పని రుజువైందని పేర్కొన్నారు. తాము చేపడుతున్న అభివృద్ధి పనులు, సంస్కరణలకు ప్రజలు అండగా ఉన్నారని ప్రధాని తెలిపారు. కాంగ్రెస్ కుల రాజకీయాలకు పాల్పడుతోందని మోదీ పరోక్షంగా దుయ్యబట్టారు.

బీజేపీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్...

ఢిల్లీ : బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కొనసాగుతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. 

పవన్ ఫ్యాన్స్ హంగామా..

హైదరాబాద్ : సినీ నటుడు పవన్ కళ్యాణ్ నటించిన 'అజ్ఞాత వాసి' సినిమా ఆడియో మంగళవారం విడుదల కానుంది. హైటెక్స్ లో నిర్వహించే ఈ ఆడియో కార్యక్రమాన్ని వీక్షించేందుకు పవన్ ఫ్యాన్స్ భారీగా నగరానికి చేరుకుంటున్నారు. ఆడియో వేడుక టికెట్ల కోసం హారిక అండ్ హాసిని ప్రొడక్షన్ హౌస్‌ వద్ద బారులు తీరారు. 

బీజేపీ నేతల సంబరాలు...

తూర్పుగోదావరి : రాజమహేంద్రవరంలో బీజేపీ నేతలు సంబరాలు జరుపుకున్నారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేయడంతో ఇక్కడ బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. 

తెలుగు మహాసభలు..4రోజు..

హైదరాబాద్ : ప్రపంచ తెలుగు మహాసభలు నాలుగో రోజు కొనసాగాయి. ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న పలు కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో సాహితీ అభిమానులు విచ్చేస్తున్నారు. సీనియర్ పాత్రికేయులకు సన్మానం చేశారు. 

19:57 - December 18, 2017

గుజరాత్ ఎన్నికల్లో బీజేపీని కాంగ్రెస్ కొట్టిందని..కానీ గాయపర్చలేదని ప్రముఖ విశ్లేషకులు..ప్రొ.నాగేశ్వర్ పేర్కొన్నారు. గుజరాత్..హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఆయన విశ్లేషించారు.

ఎగ్జిట్ పోల్స్ నిజం కాలేదు..
'ఎగ్జిట్ పోల్స్ నిజం కాలేదని ఫలితాలు చెబుతున్నాయి. 115 స్థానాలు గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయని...130 స్థానాలు వస్తాయని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చెప్పారని కానీ వచ్చింది 99 సీట్లు మాత్రమేనన్నారు. 16 సీట్లు తక్కువ రావడం అంటే చిన్న విషయం కాదని, ప్రజల జీవితాలను మెరుగుపరచే విధంగా సంస్కరణలు ఉంటే ఎవరైనా స్వాగతిస్తారని తెలిపారు. కానీ రైతులకు గిట్టుబాటు ధర లేక ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఎఫ్ ఆర్ డీఐ బిల్లు అనే సంస్కరణ తీసుకొస్తున్నారని, ఇలాంటి సంస్కరణలకు భారత దేశ ప్రజలు సిద్ధంగా ఉంటారా ? అని ప్రశ్నించారు. గుజరాత్ ఎన్నికల్లో ఔరంగజేబు వచ్చాడని..తనను అంతమొందించే విధంగా కుట్రలు జరుగుతున్నాయని ప్రధాన మంత్రి పేర్కొన్నారని గుర్తు చేశారు. ఎన్నికలకు ముందు సంస్కరణలు లేకపోవడం..ఎన్నికల ఫలితాల అనంతరం సంస్కరణలు అంటే ఎలా ? అని ప్రశ్నించారు.

మోడీకి అనుకూలంగా తీర్పు చెప్పారా ?
గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ ఎలా గెలిచింది ? కాంగ్రెస్ గట్టిపోటీనిచ్చినా పరాజయం కావడానికి కారణాలు ఏంటీ ? గుజరాత్ లో జీఎస్టీకి వ్యతిరేకంగా అక్కడి వ్యాపారులు తిరగబడ్డారని, మోడీకి అనుకూలంగా తీర్పు చెప్పారా ? అని ప్రశ్నించారు. 2014 సంవత్సరంలో 165 అసెంబ్లీ స్థానాలతో అధిక్యంతో ఉన్న పార్టీ ఇప్పుడు 99 స్థానాలు మాత్రమే వచ్చాయని తెలిపారు. అంటే 66 స్థానాలు కోల్పోయిందన్నారు. అక్కడ జాతీయ పార్టీలు తప్ప వేరే పార్టీలు లేవని..జాతీయ..రాష్ట్రీయ ఎన్నికలైనా అదే ట్రెండ్ ఉండాలని..ఆ ట్రెండ్ లేదన్నారు. 2014 సంవత్సరంలో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో అన్ని స్థానాలను బీజేపీ గెలుచుకుందని..అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుచుకుందన్నారు. ఇక గుజరాత్ లో ప్రస్తుత ఫలితాల ఓటింగ్ సరళి చూస్తే 2014లో బీజేపీకి 66.6 ఓటింగ్ శాతం ఉండేదని..ఇప్పుడు 54.04 శాతం వస్తుందని అంచనా అని పేర్కొన్నారు. 13 శాతం ఓటింగ్ తక్కువగా ఉందన్నారు. జీఎస్టీ ఎండార్స్ మెంట్ అందామా ? లాస్ అందమా ? అని ప్రశ్నించారు. 2012 ఎన్నికల సరళీ పోల్చి చూస్తే కాంగ్రెస్ కు అప్పుడు 61 సీట్లు వచ్చాయని..ఇప్పుడు 80 సీట్లు వచ్చాయని..అంటే 30 శాతం పెరిగిందని..ఈ సీట్లు ఎలా పెరిగాయని ప్రశ్నించారు. పాయింట్ ఏందంటే..బీజేపీ పట్ల వ్యతిరేకత ఉంది అని తెలిపారు.

ప్రత్యామ్నాయం ప్రజలు చూడాలి...
ఎన్నికల్లో గెలవాలంటే పార్టీ వ్యతిరేకత సరిపోదని..ఆ పార్టీని ఓడించే ప్రత్యామ్నాయం ప్రజలు చూడాలని ప్రముఖ విశ్లేషకులు నాగేశ్వర్ పేర్కొన్నారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ఫలితాలపై ఆయన విశ్లేషించారు. ఇందులో కాంగ్రెస్ విఫలం చెందిందని..అందుకే ఓడిపోయిందన్నారు. పటేళ్లు..కాంగ్రెస్ వైపు కొంత ఆకర్షితులయ్యారని..పటేల్ ఓటు మొత్తం రాలేదన్నారు. పటేళ్లకు వ్యతిరేకంగా ఉండే కులాలన్నింటినీ బీజేపీ ఏకం చేసిందని, గుజరాత్ లో కాంగ్రెస్ కు లీడర్ షిప్ లేదన్నారు. 29 గుళ్లు రాహుల్ తిరిగాడని..సాఫ్ట్ హిందుత్వంతో బలపడుతానని రాహుల్ భావించాడన్నారు. బలమైన ప్రతిపక్షం..స్థానిక నాయకత్వం లేకపోవడం..బీజేపీ సమాధానం చెప్పినట్లుగానే కాంగ్రెస్ సమాధానం చెప్పడం జరిగిందన్నారు. ఎక్కువగా మతభావాలు గుజరాతీల్లో ఉంటాయని..అందుకే సెన్సిటివ్ పదాలను ఉపయోగించారని తెలిపారు. ఇలాంటివి ఎన్నో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని తెలిపారు. ఇందులో కాంగ్రెస్ ఎదుర్కొనడంలో విఫలం చెందిందన్నారు.

2019లో ఇదే పరిస్థితి వస్తుందా ?
ఇటీవలే అమెరికాలో జరిగిన ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ విజయం సాధించాడని..కానీ తాజాగా అలబా స్టేట్ ఎన్నికలు జరిగాయని..అందులో ట్రంప్ అభ్యర్థి పరాజయం చెందాడన్నారు. 2012లో జగన్ మోహన్ రెడ్డి పార్టీ భారీ విజయాలు సాధించిందని..టిడిపి డిపాజిట్ గల్లంతయ్యింది..2014లో బాబు విజయం సాధించాడని తెలిపారు. ఒక ఎన్నికకు మరొక ఎన్నికకు పోలిక లేదని స్పష్టం చేశారు. ఇప్పుడే 66 సీట్లు కోల్పోతే రానున్న రెండు సంవత్సరాల్లో ఎన్ని కోల్పోతారో అని పేర్కొన్నారు. బీజేపీ..కాంగ్రెస్ ఉంటే ఒకసారి బీజేపీకి..మరోసారి కాంగ్రెస్ కు ప్రజలు అవకాశం ఇస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో చాలా రాష్ట్రాల్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ లేదని...1991 తరువాత దేశ వ్యాప్తంగా 50 ఓటింగ్ శాతం నాన్ కాంగ్రెస్..నాన్ బీజేపీ పార్టీలకు వచ్చాయన్నారు.
గుజరాత్ లో 22 ఏళ్ల నుండి కాంగ్రెస్ కు పవర్ ఫుల్ ఆర్గనైజింగ్ లేదని..సరైన నాయకత్వం లేదని తెలిపారు. సరైన విమర్శలు తిప్పికొట్టలేదని, బీజేపీ తెలివిగా విమర్శలు..ఆరోపణలు చేసిందన్నారు. మరింత విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి...

19:50 - December 18, 2017

ఎన్నికల్లో గెలవాలంటే పార్టీ వ్యతిరేకత సరిపోదని..ఆ పార్టీని ఓడించే ప్రత్యామ్నాయం ప్రజలు చూడాలని ప్రముఖ విశ్లేషకులు నాగేశ్వర్ పేర్కొన్నారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ఫలితాలపై ఆయన విశ్లేషించారు. ఇందులో కాంగ్రెస్ విఫలం చెందిందని..అందుకే ఓడిపోయిందన్నారు. పటేళ్లు..కాంగ్రెస్ వైపు కొంత ఆకర్షితులయ్యారని..పటేల్ ఓటు మొత్తం రాలేదన్నారు. పటేళ్లకు వ్యతిరేకంగా ఉండే కులాలన్నింటినీ బీజేపీ ఏకం చేసిందని, గుజరాత్ లో కాంగ్రెస్ కు లీడర్ షిప్ లేదన్నారు. 29 గుళ్లు రాహుల్ తిరిగాడని..సాఫ్ట్ హిందుత్వంతో బలపడుతానని రాహుల్ భావించాడన్నారు. బలమైన ప్రతిపక్షం..స్థానిక నాయకత్వం లేకపోవడం..బీజేపీ సమాధానం చెప్పినట్లుగానే కాంగ్రెస్ సమాధానం చెప్పడం జరిగిందన్నారు. ఎక్కువగా మతభావాలు గుజరాతీల్లో ఉంటాయని..అందుకే సెన్సిటివ్ పదాలను ఉపయోగించారని తెలిపారు. ఇలాంటివి ఎన్నో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని తెలిపారు. ఇందులో కాంగ్రెస్ ఎదుర్కొనడంలో విఫలం చెందిందన్నారు. మరింత విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి. 

19:43 - December 18, 2017

గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ ఎలా గెలిచింది ? కాంగ్రెస్ గట్టిపోటీనిచ్చినా పరాజయం కావడానికి కారణాలు ఏంటీ ? తదితర విషయాలపై ప్రముఖ విశ్లేషకులు నాగేశ్వర్ తో టెన్ టివి ముచ్చటించింది. ఈ సందర్భంగా ఎన్నికల ఫలితాలపై విశ్లేషించారు.

గుజరాత్ లో జీఎస్టీకి వ్యతిరేకంగా అక్కడి వ్యాపారులు తిరగబడ్డారని, మోడీకి అనుకూలంగా తీర్పు చెప్పారా ? అని ప్రశ్నించారు. 2014 సంవత్సరంలో 165 అసెంబ్లీ స్థానాలతో అధిక్యంతో ఉన్న పార్టీ ఇప్పుడు 99 స్థానాలు మాత్రమే వచ్చాయని తెలిపారు. అంటే 66 స్థానాలు కోల్పోయిందన్నారు. అక్కడ జాతీయ పార్టీలు తప్ప వేరే పార్టీలు లేవని..జాతీయ..రాష్ట్రీయ ఎన్నికలైనా అదే ట్రెండ్ ఉండాలని..ఆ ట్రెండ్ లేదన్నారు. 2014 సంవత్సరంలో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో అన్ని స్థానాలను బీజేపీ గెలుచుకుందని..అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుచుకుందన్నారు. ఇక గుజరాత్ లో ప్రస్తుత ఫలితాల ఓటింగ్ సరళి చూస్తే 2014లో బీజేపీకి 66.6 ఓటింగ్ శాతం ఉండేదని..ఇప్పుడు 54.04 శాతం వస్తుందని అంచనా అని పేర్కొన్నారు. 13 శాతం ఓటింగ్ తక్కువగా ఉందన్నారు. జీఎస్టీ ఎండార్స్ మెంట్ అందామా ? లాస్ అందమా ? అని ప్రశ్నించారు. 2012 ఎన్నికల సరళీ పోల్చి చూస్తే కాంగ్రెస్ కు అప్పుడు 61 సీట్లు వచ్చాయని..ఇప్పుడు 80 సీట్లు వచ్చాయని..అంటే 30 శాతం పెరిగిందని..ఈ సీట్లు ఎలా పెరిగాయని ప్రశ్నించారు. పాయింట్ ఏందంటే..బీజేపీ పట్ల వ్యతిరేకత ఉంది అని తెలిపారు. మరింత విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి...

18:44 - December 18, 2017
18:38 - December 18, 2017

హిమాచల్ ప్రదేశ్ : దాదాపు రెండు దశాబ్దాల తర్వాత... మంచుకొండల్లో ఎర్రజెండా రెపరెపలాడింది. హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం రెండోసారి గెలుపొందింది. సీపీఎం అభ్యర్థి రాకేశ్‌ సింఘా, సిమ్లా జిల్లాలోని థియోగ్‌ నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించారు. కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులను మట్టికరిపించి ఆయన జయకేతనం ఎగురవేశారు. అసెంబ్లీ వేదికగా మరోసారి ప్రజా సమస్యలు వినిపించేందుకు రాకేశ్‌ సింఘా సిద్ధమయ్యారు.

1993లో హిమాచల్‌ప్రదేశ్‌ రాజధాని సిమ్లా నుంచి విజయం సాధించిన రాకేశ్‌ సింఘా... ఈసారి థియోగ్‌ నుంచి బరిలో దిగారు. సిమ్లా జిల్లాలో ఇది కీలక అసెంబ్లీ స్థానం. రాకేశ్‌ సింఘా సామాజిక సేవనే వృత్తిగా మలచుకున్న ఉద్యమకారుడు. సీపీఎం సెంట్రల్‌ కమిటీ సభ్యుడిగానూ కొనసాగుతున్నారు. సీఐటీయూ నేతగా ఎన్నో కార్మిక ఉద్యమాలకు నేతృత్వం వహించారు. కార్మిక ఉద్యమాల సందర్భంగా కొన్నిస్వార్థశక్తులు చేసిన దాడుల్లో గాయపడ్డారు. అయినా వెరవకుండా ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో రాష్ట్రంలో ప్రముఖ నేతగా గుర్తింపు పొందారు.

థియోగ్‌ అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసిన రాకేశ్‌ సింఘాకు భారీగా ఓట్లు వచ్చాయి. బీజేపీ, కాంగ్రెస్‌కు పట్టున్నథియోగ్‌ నుంచి గెలుపొందిన రాకేశ్‌ సింఘాకు 25,546 ఓట్లు వచ్చాయి. రాకేశ్‌ సింఘాపై పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి రాకేశ్‌ వర్మకు 22,433 ఓట్లు దక్కాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి దీపక్‌ రహౌర్‌కు కేవలం 8,952 ఓట్లు మాత్రమే వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగిన దేవీరామ్‌ శర్మకు 637, రోషన్‌ లాల్‌కు 287 ఓట్లు వచ్చాయి. థియోగ్‌ అసెంబ్లీ స్థానం నుంచి రాకేశ్‌ సింఘా పోటీ చేయడం ఇది రెండోసారి. 2012 ఎన్నికల్లో కూడా ఇక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పట్లో పదివేల ఓట్లు సాధించారు. 2012 ఎన్నికల్లో థియోగ్‌ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి విద్యా స్టోక్స్‌ విజయం సాధించారు.కాంగ్రెస్‌, బీజేపీ ఎమ్మెల్యేల పనితీరును నిశితంగా పరిశీలించిన ఓటర్లు ఈసారి సీపీఎం వైపు మొగ్గు చూశారు. 

ప్రధాని కృతజ్ఞతలు..

ఢిల్లీ : గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీని గెలుపొందించడం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆయన ప్రసంగించారు. 

బీజేపీ కేంద్ర కార్యాలయంలో మోడీ..

ఢిల్లీ : బీజేపీ కేంద్ర కార్యాలయానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆయనికి ఘన స్వాగతం పలికి సన్మానించారు. 

18:18 - December 18, 2017

ఢిల్లీ : ఎన్నికల్లో ఓడిపోయినా గుజరాత్ అభివృద్ధిపై ప్రశ్నిస్తామని కాంగ్రెస్ స్పష్టం చేసింది. పాటీదారులు..రైతుల సమస్యలపై పోరాటం కొనసాగుతుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాల పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు పెద్దనేతలు ఓడిపోవడం బాధ కలిగినా ఆ పార్టీ నేతల వల్లే గుజరాత్ రాష్ట్రంలో పార్టీ శక్తివంతంగా ఎదిగిందన్నారు. గుజరాత్ రాష్ట్రానికి చెందని ఆరుగురు మంత్రులు ఓడిపోయారని గుర్తు చేశారు. ప్రధాన మంత్రి మోడీ సొంతూరు బీజేపీ పరాజయం చెందిందని, గుజరాత్ లో బీజేపీ మెజార్టీ మూడంకెల నుండి రెండంకెలకు పడిపోయిందన్నారు.

 

నగరానికి రానున్న రాష్ట్రపతి..

హైదరాబాద్ : ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హాజరుకానున్నారు. 19న మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు రామ్‌నాథ్ చేరుకుని రాజ్‌భవన్‌కు చేరుకుంటారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు ఎల్బీ స్టేడియంలో జరిగే తెలుగు మహాసభల ముగింపు ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు.

ఎన్నిక ఫలితాలపై రాహుల్ స్పందన..

ఢిల్లీ : హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. ప్రజాతీర్పును కాంగ్రెస్‌ పార్టీ అంగీకరిస్తోందని, రెండు రాష్ట్రాల్లోనూ కొత్త ప్రభుత్వాలకు అభినందనలు తెలిపారు. 

బీజేపీ నైతికంగా ఓడిందన్న మమత...

కోల్ కతా : గుజరాత్ లో బీజేపీ నైతికంగా ఓటమిపాలైందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. గుజరాత్ లో బీజేపీ విజయం సాధించడంపై ‘ట్విట్టర్’ ద్వారా ఆమె స్పందించారు. 

బీజేపీకి బాబు అభినందనలు..

విజయవాడ : గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడంపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన తన ట్వీట్ ద్వారా అభినందనలు తెలిపారు. '

17:37 - December 18, 2017

పశ్చిమగోదావరి : జిల్లాలోని మొగల్తూరు మండలం కాళీపట్నంలో రైతులు ఆందోళన నిర్వహించారు. రోడ్డుపై వంట వార్పు నిర్వహించారు. కాళీపట్నం మీదుగా నిర్మిస్తున్న 216 జాతీయ రహదారి విస్తరణలో భాగంగా భూములు..ఇళ్ల స్థలాలు కోల్పోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని కాళీపట్నం రైతులు డిమాండ్ చేశారు. జాతీయ రహదారి అధికారులు, రెవిన్యూ అధికారులు, రైతు వ్యతిరేక విధానాలు విడనాడి రైతులకు వెంటనే న్యాయం చేయాలని కాళీపట్నం రైతులు కోరుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు అక్కడకు చేరుకుని రైతులతో మాట్లాడారు. గతంలో కాళీపట్నం జమీందారీ భూముల విషయంలో రైతులకు ప్రభుత్వం అనుకూలంగా చెప్పినా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. వారం రోజుల్లో రైతులకు నష్టపరిహారం అందేలా చూస్తానని చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. 

17:30 - December 18, 2017

నల్గొండ : మిర్యాలగూడలో మూడు రోజుల పాటు నిర్వహించిన వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు విజయవంతమయ్యాయని వ్య.కా.స. రాష్ట్ర కార్యదర్శి వెంకటరాముడు పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఈ సందర్భంగా సభలలో పలు తీర్మానాలు చేయడం జరిగిందన్నారు. ఉపాధి హామీ కింద రెండు లక్షల మంది మేట్లు పనిచేస్తున్నారని, వీరిని పర్మినెంట్ తగిన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మేట్ల వ్యవస్థను రద్దు చేయాలని ప్రభుత్వం చూస్తోందని, దీనిని వ్యతిరేకిస్తూ ఈనెల 27, 28, 29వ తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజా ప్రతినిధుల నివాసాల ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 

టీఎస్ పీఎస్సీ మూడవ వార్షికోత్సవం

హైదరాబాద్ : టీఎస్ పీఎస్సీ మూడవ వార్షికోత్సవం జగిరింది. టీఎస్ పీఎస్సీ ఉద్యోగ సమాచారం మ్యాగజన్ ను అల్లం నారాయణ అవిష్కరించారు. దేశంలోనే టీఎస్ పీఎస్సీ మంచి పేరు తెచ్చుకుందని చైర్మన్ గంటా చక్రపాణి అన్నారు. 

17:12 - December 18, 2017

ముంబై : కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు రాహుల్ గాంధీపై శివసేన ప్రశంసలు కురిపించింది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. శివసేన పత్రిక సామ్నా ఎడిటోరియల్ పేర్కొన్నారు. ఫలితాల కోసం ఆశించకుండా కాంగ్రెస్ హోరాహోరీ పోరాడిందని శివసేన ఉద్దవ్ ఠాక్రే పేర్కొన్నారు. క్లిష్టమైన సమయంలో కాంగ్రెస్ అధ్యక్ష పదవి స్వీకరించిన రాహుల్ కు అభినందనలు తెలియచేస్తున్నట్లు వెల్లడించారు. ఓటమి భయంతో పెద్ద పెద్ద వారే వెనుకంజ వేస్తుండగా తుది ఫలితాలు పట్టించుకోకుండా రాహుల్ ఎన్నికల యుద్ధానికి దిగారని కితాబిచ్చారు. ఈ నమ్మకమే రాహుల్ ను ముందుకు నడిపిస్తుందని ఠాక్రే తెలిపారు. 

17:04 - December 18, 2017

ఖమ్మం : హైదరాబాద్ పాటు అన్ని నగరాలకు ఐటీని విస్తరించాలనే లక్ష్యంతో ఖమ్మంలో ఐటీహబ్‌ నిర్మాణాన్ని చేపట్టామన్నారు ఎంపీ కవిత. ఖమ్మంలో నూతనంగా నిర్మిస్తున్న ఐటీహబ్‌ నిర్మాణాన్ని కవిత, ఎమ్మెల్యే అజయ్‌కుమార్‌తో కలిసి పరిశీలించారు. ఐటీహబ్‌ నిర్మాణంతో ఖమ్మం నగరంలోని యువతకు మంచి అవకాశాలు ఏర్పడతాయని తెలిపారు. ఖమ్మం ఐటీహబ్‌ నిర్మాణం ఇన్‌స్పిరేషన్‌తో త్వరలో నిజామాబాద్‌లో కూడా ఐటీహబ్‌ నిర్మాణం చేపడుతామన్నారు కవిత. 

17:02 - December 18, 2017

తూర్పుగోదావరి : సారా మహమ్మారిని నియంత్రించాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా తుని వీరవరపుపేటలో మహిళలు కదం తొక్కారు. తమ పేటలో అక్రమంగా సారా విక్రయిస్తున్న దుకాణాలలోకి అబ్కారి సిబ్బందితో కలిసి వెళ్లి సారా ప్యాకెట్లను ధ్వంసం చేశారు. సారా తాగొచ్చి ఇళ్లలోని మగవారు వేధించడంతో పాటు.. యువకులు దానికి బానిసై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు అక్రమంగా సారా విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

17:00 - December 18, 2017

హైదరాబాద్ : విశ్వ భాషలందు తెలుగు లెస్స అనే రోజు రావాలన్నది తన ఆకాంక్ష అని స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. కారణాలు..కారకులు ఎవరైనా తెలంగాణ సాహిత్యం, ప్రతిభ అణచివేయబడ్డాయన్న మాట వాస్తవమన్నారు. కాకతీయ రాజుల వైభవంపై తాను రచన చేస్తున్నట్లు మధుసూదనాచారి తెలిపారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభలు నాల్గోరోజు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివ‌ర్శిటిలో తెలంగాణ విమ‌ర్శ-ప‌రిశోధ‌న పేరుతో జరిగిన కార్యక్రమంలో మధుసూదనాచారితో పాటు పలువురు సాహితీ వేత్తలు పాల్గొన్నారు. 

16:57 - December 18, 2017

ఢిల్లీ : గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఈవీఎంల టాంపరింగ్‌కు పాల్పడిందని పాటీదార్‌ సామాజిక ఉద్యమ నేత హార్దిక్‌ పటేల్‌ ఆరోపించారు. ఎవరికి అనుమానం రానివిధంగా టాంపరింగ్‌ జరిగిందన్నారు. ఈ ఎన్నికల్లో బిజెపి ఎలాంటి చాణక్య రణనీతి చూపలేదని...కేవలం డబ్బులు వెదజల్లి గెలుపొందిందని హార్దిక్‌ విమర్శించారు. బిజెపికి వ్యతిరేకంగా పాటీదార్‌ రిజర్వేషన్ల డిమాండ్‌తో పాటు రైతులు, నిరుద్యోగం తదితర సమస్యలపై తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

16:55 - December 18, 2017

హిమాచల్‌ప్రదేశ్‌ : అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం బోణీ కొట్టింది. సిమ్లా జిల్లాలోని థియోగ్‌ నియోజవకర్గం నుంచి సీపీఎం అభ్యర్థి రాకేశ్‌ సింఘా ఘన విజయం సాధించారు. హిమాచల్‌ అసెంబ్లీకి ఆయన గెలవడం ఇది రెండోసారి. హిమాచల్‌ప్రదేశ్‌లో సిపిఎం పార్టీ కీలక నేతగా ఉన్న రాకేశ్‌ సింఘా ఓ సామాజిక కార్యకర్త. వ్యవసాయదారుడు. సీపీఎం సెంట్రల్‌ కమిటీ సభ్యుడు కూడా. వాంగ్‌టూ కార్చమ్‌ హైడ్రాలిక్‌ సంస్థ కార్మికుల సమ్మెకు మద్దతుగా పోరాటం చేస్తుంటే కొన్ని శక్తులు ఈయనపై దాడి చేశాయి.

రైతులు, మహిళలు, దళితులు, కార్మిక వర్గాలు, పేదల సమస్యలపై రాకేశ్‌ సింఘా ఎన్నో పోరాటాలు చేశారు. థియోగ్‌లోని స్కూళ్లు, ఇతర ప్రభుత్వ సంస్థల్లో ఏర్పడ్డ ఖాళీలను భర్తీ చేసేందుకు కృషి చేశారు. గుడియా అంశంలో సింఘా ఒత్తిడికి లోనైన ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించింది. రైతులకు చెందిన ఆపిల్‌ చెట్లను నరకడాన్ని వ్యతిరేకిస్తూ సింఘా నేతృత్వంలో పెద్ద ఆందోళన జరిగింది. రాకేశ్‌ సింఘా హిమాచల్ అసెంబ్లీకి ఎంపిక కావడం ఇది రెండోసారి. 1993లో సింఘా సిమ్లా నియోజకవర్గం నుంచి గెలుపొందారు. సింఘా హిమాచల్‌ ప్రదేశ్‌ వర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ పట్టా తీసుకున్నారు. సింఘా గెలుపుపై సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అభినందనలు తెలిపారు.

16:31 - December 18, 2017

ఢిల్లీ : గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలుపొందింది. కానీ గుజరాత్ లో కాంగ్రెస్ గట్టిపోటినిచ్చింది. ఈ ఫలితాలపై కాంగ్రెస్ నేతలు సోమవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. హిమాచల్ ప్రదేశ్ బీజేపీ సీఎం అభ్యర్థి వెనుకంజలో ఉండిపోయారని, ఆ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తమవైపే ఉందని ప్రజలు గమనించారని తెలిపారు. గుజరాత్ లో విజయం సాధించడం పట్ల బీజేపీకి అభినందనలు తెలియచేయడం జరిగిందని, ప్రలోభాలు పెట్టే బదులు ఇచ్చిన హామీలు అమలుపై దృష్టి సారించాలని తమ పార్టీ పేర్కొంటోందన్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించడంలో ఈసీ కూడా ఒక కీలకమని, ఈవీఎం విషయంలో సుప్రీంకోర్టు పలు వ్యాఖ్యలు చేసిందన్నారు. ఈవీఎంల విషయంలో రూ. 26వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోందని పేర్కొన్నారు. 

16:21 - December 18, 2017

ఢిల్లీ : గుజరాత్, హిమాచల్ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టబోతోందని,ఆ రాష్ట్ర ప్రజలకు కార్యకర్తల తరపున..తన తరపున అభినందనలు..కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలపై ఆయన మీడియాతో మాట్లాడారు. గుజరాత్ లో మరోసారి మోడీకి అవకాశం ఇచ్చారని..ఈ విజయాలు బీజేపీ నేతలు..కార్యకర్తల కృషి వల్లే జరిగిందన్నారు. మోడీ తీసుకుంటున్న విధానాలు..కేంద్ర చర్యలు కూడా విజయానికి ఒక కారణమన్నారు. గుజరాత్ రాష్ట్రంలో అసెంబ్లీ..పార్లమెంట్ ఎన్నికలు జరిగినా ప్రతి దానిలో విజయం సాధిస్తూ వచ్చామన్నారు. ఓట్ల శాతం కూడా పెరిగిందని చెప్పుకొచ్చారు. హిమాచల్ ప్రదేశ్ లో కూడా ఓట్ల శాతం అధికం సాధించామని, దేశంలో జరిగే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తూ వస్తున్నామన్నారు. బీజేపీ 14 రాష్ట్రాల్లో అధికారంలో కొనసాగుతుండగా 5 రాష్ట్రాల్లో బీజేపీ మద్దతుతో అధికారంలో ఉన్నామన్నారు. మొత్తంగా 19 రాష్ట్రాల్లో అధికారం ఉన్నట్లు, త్వరలో నాలుగు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తామన్నారు. 

15:52 - December 18, 2017
15:50 - December 18, 2017

కరీంనగర్ : జిల్లా జమ్మికుంటలో క్లినికల్ ట్రయల్స్ బాధిత కుటుంబాల ఆందోళన ఇంకా కొనసాగుతోంది. ధర్నాలు..రాస్తారోకో లతో నిరసన తెలిపారు. ప్రభుత్వం న్యాయం చేయాలంటూ రక్తంతో కేసీఆర్ కు లేఖ రాశారు. క్లినికల్ ట్రయల్స్ సంస్థలు తమ కుటుంబాలను రోడ్డున పడేశాయని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశారు. రక్తంతో రాసిన లేఖను కేసీఆర్ కు పోస్టు చేశారు. మరి సీఎం కేసీఆర్ స్పందిస్తారా ? లేదా ? అనేది చూడాలి. 

15:29 - December 18, 2017

'సూరత్ లో ఈవీఎంల ట్యాపరింగ్'

గుజరాత్ : ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని పటేళ్ల ఉద్యమ నేత హార్దిక్ పటేల్ ఆరోపించారు. సూరత్, రాజ్ కోట్, అహ్మద్ బాద్ లో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని పేర్కొన్నారు. 

15:08 - December 18, 2017

ఢిల్లీ : హిమాచల్..గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. అధిక సంఖ్యలో సీట్లను చేజిక్కించుకుని తామే అధికారంలోకి వస్తామని బీజేపీ చెప్పిన సంగతి తెలిసిందే. కానీ అధికారం చేపట్టడానికి మ్యాజిక్ ఫిగర్ సాధించినా అనుకున్న స్థానాలను మాత్రం సంపాదించలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ గట్టిపోటీనిచ్చిందనే చెప్పవచ్చు. 182 అసెంబ్లీ స్థానాలున్న గుజరాత్ లో మ్యాజిక్ ఫిగర్ 92గా ఉంది. 92 స్థానాలు కైవసం చేసుకున్న బీజేపీ మరో 8 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ 75 స్థానాల్లో విజయం సాధించి 5 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతోంది. ఇతరులు 2 స్థానాల్లో గెలుపొంది 1 స్థానంలో అధిక్యం కనబరుస్తున్నారు.

ఇక హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 68 స్థానాలకు జరిగిన పోలింగ్ లో బీజేపీ 21 స్థానాల్లో గెలుపొంది 24 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ 9 స్థానాల్లో గెలిచి 10 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతోంది. ఇతరులు మూడు స్థానాల్లో విజయం సాధించగా 1 స్థానంలో అధిక్యంలో కొనసాగుతున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి...

ఎన్ కౌంటర్ పై హైకోర్టు ఆదేశాలు..

హైదరాబాద్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకుపల్లి వద్ద జరిగిన ఎన్ కౌంటర్ పై హైకోర్టులో విచారణ జరిగింది. నక్సల్స్ శవపరీక్షల నివేదికలు..వాటి వీడియో రికార్డింగులను సమర్పించాలని పోలీసు శాఖకు హైకోర్టు ఆదేశించింది. 

14:52 - December 18, 2017

2017 ప్రపంచ తెలుగు మహాసభలకు కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం వేదికగా నిలిచింది. ఈ మహాసభల్లో కవులు..రచయితలు..రచయిత్రులు..కళాకారులు...పాల్గొంటున్నారు. తెలుగు భాష యొక్క ప్రాభవాన్ని వారు చాటనున్నారు. తెలుగు సాహిత్యంలో మహిళల పాత్ర ఎలా ఉంది ? అనే అంశంపై టెన్ టివి మానవి ప్రత్యేక చర్చ చేపట్టింది. ఈ చర్చలో సమ్మెట ఉమాదేవి (రచయిత్రి) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

గుజరాత్ లో ఫలితం...

గుజరాత్ : రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. వరుసగా ఆరోసారి అధికారం దక్కించుకున్నట్లైంది. మ్యాజిక్ ఫిగర్ ను చేరుకున్న బీజేపీ 92 స్థానాల్లో గెలుపొందింది. మరో ఎనిమిది స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. 

14:39 - December 18, 2017

కామారెడ్డి : నాయకులు తలుచుకుంటే ఎంతకైనా తెగిస్తారు.నియోజకవర్గం తమ తాత జాగీర్‌ అనుకుంటారు. లేని ఉద్యోగాలు సృష్టించగలరు... ఉన్న ఉద్యోగాలు పోగొట్టగలరు. చివరికి కోర్టు ఆదేశాలు కూడా నాయకులకు లెక్కలోకి రావు, కామారెడ్డిజిల్లాలో ఓ ఎమ్మెల్యే నిర్వాకంతో ఇద్దరు చిరుద్యోగులు జీవనాధారం కోల్పోయారు. 
బిస్వాపూర్ పీఏసీఎస్‌లో అన్యాయం 
వీరిపేర్లు రాజు, బల్వంత్‌రెడ్డి.. వీరు కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామంలోని వ్యవసాయ సహకార సంఘంల్లో గత 32 సంవత్సరాల నుంచి కార్యదర్శులుగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఉన్నట్టుండి వీరిని పాలకవర్గం గత ఏడాది విధుల నుంచి తొలగించింది. కనీసం కారణం చెబుతూ షోకాజ్‌ నోటీసుకూడా ఇవ్వలేదు. దీంతో జీవనాధారం కోల్పోయిన ఈ చిరుద్యోగులు .. న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం.. వీరిని డ్యూటీలోకి తీసుకోవాలని ఆదేశించింది. అయితే కోర్టు తీర్పు ఇచ్చి నెలరోజులు గడుస్తున్నా.. తమకు న్యాయం జరగలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
నేతలు, అధికారులు కమ్మక్కు
స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్దన్‌, అధికారులు కుమ్మక్కై తమ జీవినాధారంపై దెబ్బకొట్టారని బాధితులు ఆరోపిస్తున్నారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని, ఈవిషయం కోర్టుకూడా రుజువైనందునే తమను డ్యూటీలోకి తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించిందంటున్నారు. అయితే సహకార సంఘం అద్యక్షులు మాత్రం .. తమను డ్యూటీలోకి తీసుకోవాలంటే ముందుగా స్థానిక  ఎమ్మెల్యేను కలిసిరావాలంటూ బెదిరస్తున్నారని  బాధితులు వాపోతున్నారు. పార్టీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇప్పించేందుకే తమను డ్యూటీలోకి రానీయడంలేదని  బాధితులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు ఎమ్మెల్యే గంపగోవర్దన్‌ బ్యాంకుల్లో కూడా దొంగలోన్లు ఇప్పించడంలో ఘనుడని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఉద్యోగాలు పోవడంతో తమ కుటుంబాలు రోడ్డునపడ్డాయని బాధితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా తమను డ్యూటీలోకి తీసుకోకుంటే.. కుటుంబసభ్యులతో కలిసి ఆందోళనకు దిగుతామని  తేల్చి చెబుతున్నారు. 

 

14:25 - December 18, 2017

విజయవాడ : ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని నిరసిస్తూ విజయవాడలో మున్సిపల్‌ కార్మిక సంఘాలు సమ్మెకు దిగాయి. కార్మికులకు వ్యతిరేకంగా ఉన్న జీవో 279ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని మున్సిపల్‌ సంఘాల జేఏసీ నేతలు హెచ్చరిస్తున్నారు. 

 

14:20 - December 18, 2017

మహారాష్ట్ర : ముంబయిలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. సాకినాక ప్రాంతంలోని ఓ ఫుడ్‌ షాపులో సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 12 మంది మృతిచెందారు.. పలువురు గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయకచర్యలు చేపట్టారు. అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. 

 

14:17 - December 18, 2017

గుంటూరు : ఏపీలో తొమ్మిది మంది ఐపీఎస్‌లను బదిలీ చేశారు. ఎస్. శ్యాంసుందర్...అసిస్టెంట్ ఇనస్పెక్టర్ జనరల్ అఫ్ పోలీసు(లీగల్), బి. ఉదయ భాస్కర.. ఎస్పీ సిఐడి, ఎ. నయిమ్ అస్మి...ఓ ఎస్ డి కడప, ఐశ్వర్య రస్తోగి...ఓ ఎస్డి, అనంతపురం, ఎం. దీపిక... ఎఎస్పీ పార్వతీపురం, అమిత్ బర్దార్...ఎఎస్పీ పాడేరు, కె. ఆరిఫ్ హఫీజ్.. ఎఎస్పీ నర్సీపట్నం, వి.అజిత..ఎఎస్పీ రంపచోడవరం, ఎస్. గౌతమి...అసాల్ట్ కమాండర్, గ్రేహౌండ్స్ బదిలీ చేశారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం కాసేపట్లో ఉత్తర్వులు జారీ చేయనుంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

14:16 - December 18, 2017

ఢిల్లీ : గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ, కాంగ్రెస్ నువ్వా..నేను అన్నట్టుగా సాగాయి. కానీ రెండు రాష్ట్రాల్లో మాత్రం బీజేపీ కొద్దిగా హావా వీచింది. గుజరాత్ రాష్ట్రంలో 150 సీట్లలో తాము గెలుస్తామని గొప్పలు చెప్పుకున్న బీజేపీ నేతలు ఆ స్థాయిలో రాణించలేకపోయారు. మొత్తంగా అధికారం నిలబెట్టుకొనే దిశలో వెళుతున్న బీజేపీ ఓట్ల శాతంలో వెనుకంజ వేసిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. గుజరాత్ లో బీజేపీ 83, కాంగ్రెస్ 58 స్థానాల్లో విజయం సాధించాయి. గుజరాత్ సీఎం విజయ్ రూపానీ, డిప్యూటి సీఎం నితిన్ పటేల్ గెలుపొందారు. ఇక్కడ దళిత యువనేత జిగ్నేష్ మేవానీ విజయం సాధించడం గమనార్హం. ఇక హిమాచల్ ప్రదేశ్ విషయానికొస్తే బీజేపీ 17, కాంగ్రెస్ 6, సీపీఎం 1, స్వతంత్ర్య అభ్యర్థి ఒకరు గెలుపొందారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

14:13 - December 18, 2017

ఢిల్లీ : హిమాచల్‌ప్రదేశ్‌లో సీపీఎం బోణీ కొట్టింది. సిమ్లా జిల్లాలోని థియోగ్‌ నియోజవకర్గం నుంచి సీపీఎం అభ్యర్థి రాకేశ్‌ సింఘా ఘన విజయం సాధించారు. రాకేశ్‌ సింఘా సామాజిక కార్యకర్త. వ్యవసాయదారుడు. సీపీఎం సెంట్రల్‌ కమిటీ సభ్యుడు కూడా. వాంగ్‌టూ కార్చమ్‌ హైడ్రాలిక్‌ సంస్థ కార్మికుల సమ్మెకు మద్దతుగా పోరాటం చేస్తుంటే  కొన్ని శక్తులు ఈయనపై దాడికి దిగాయి. 1993-96 మధ్య కాలంలో సింఘా హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీలో సిమ్లా నియోజకవర్గం ఎమ్మెల్యేగా కొనసాగారు. హిమాచల్‌ ప్రదేశ్‌ వర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ పట్టా తీసుకున్నారు. సింఘా గెలుపుపై సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అభినందనలు తెలిపారు.

 

14:10 - December 18, 2017

సిమ్లా : హిమాచల్ ప్రదేశ్ లో సీపీఎం విజయబావుటా ఎగరవేసింది. రాష్ట్రంలో సీపీఎం బోణి కొట్టింది. థియోగ్ నియోజకవర్గంలో విజయదుందుభి మోగించింది. సిమ్లా జిల్లాలోని థియోగ్‌ నియోజవకర్గం నుంచి సీపీఎం అభ్యర్థి రాకేష్ సింఘా ఘన విజయం సాధించారు. 3వేల ఓట్లకు పైగా మెజారిటీతో గెలుపొందారు. దేశంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ప్రత్యామ్నాయం సీపీఎం పార్టీ ఉందని నిరూపించింది. రాకేశ్‌ సింఘా సామాజిక కార్యకర్త, వ్యవసాయదారుడు. సీపీఎం సెంట్రల్‌ కమిటీ సభ్యుడు కూడా. వాంగ్‌టూ కార్చమ్‌ హైడ్రాలిక్‌ సంస్థ కార్మికుల సమ్మెకు మద్దతుగా పోరాటం చేస్తుంటే కొన్ని శక్తులు ఈయనపై దాడికి దిగాయి. 1993..96 మధ్య కాలంలో సింఘా హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీలో సిమ్లా నియోజకవర్గం ఎమ్మెల్యేగా కొనసాగారు. హిమాచల్‌ ప్రదేశ్‌ వర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ పట్టా తీసుకున్నారు. 

13:44 - December 18, 2017

ఢిల్లీ : కాంగ్రెస్, బీజేపీలకు ఆల్టర్నేటివ్ గా లెఫ్ట్ పార్టీలు ఉన్నదగ్గర ప్రజలు లెఫ్ట్ పార్టీలను గెలిపించారని సీపీఎం జాతీయ కార్యదర్శివర్గ సభ్యులు వి.శ్రీనివాస్ రావు అన్నారు. అజెండాను బీజేపీ రిగ్గింగ్ చేసిందన్నారు. బీజేపీ... అభివృద్ధిని పక్కన పెట్టి..కులమతాలు, ఉద్యోగాల సెంటిమెంట్ ను ముందుకు తీసుకొచ్చారని తెలిపారు. 2003లో బీజేపీ గెలిచిందని.. 2004 లో ఓడిపోయిందని గుర్తు చేశారు. గుజరాత్ లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి బీజేపీకి చాలెంజ్ అవుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో గుజరాత్ లో బీజేపీకి షాక్ తగులుతుందని తెలిపారు. ప్రజ అనుకూల విధానాలే ఎజెండాగా ముందుకెళ్తేనే ప్రజలు ఆధరిస్తాని చెప్పారు. 

12:33 - December 18, 2017

హైదరాబాద్ : సామ్రాజ్యవాద దేశాలకు బీజేపీ తలొగ్గిందని ప్రొ.హరగోపాల్ అన్నారు. జీఎస్ టీ కావాలని దేశ ప్రజలు అడగలేదన్నారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా నిర్వహించిన చర్చా కార్యక్రమంలోఆయన మాట్లాడారు. బీజేపీపై సామ్రాజ్యవాద దేశాల ఒత్తిడి ఉందన్నారు.   

 

12:27 - December 18, 2017

హిమాచల్ ప్రదేశ్ : థియోగ్ నియోజకవర్గంలో సీపీఎం గెలుపొందింది. థియోగ్ నియోజకవర్గంలో సీపీఎం అభ్యర్థి రాకేష్ సింఘా సీసీఎం విజయం సాధించారు. 3వేల ఓట్లకు పైగా ఆధిక్యంతో గెలుపొందారు. 

 

12:05 - December 18, 2017

హైదరాబాద్ : ఆర్ధిక విధానాల్లో కాంగ్రెస్, బీజేపీకి తేడా లేదని ప్రొ. హరగోపాల్ అన్నారు. గుజరాత్, హిమాచల్ అసెంబ్లీ ఎన్నికలు ఫలితాల నేపథ్యంలో నిర్వహించిన చర్చ కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. బీజేపీకి డెడికేట్ క్యాడర్ ఉందన్నారు. కమ్యూనిస్టులందరినీ చంపేయాలని బీజేపీ నేత వ్యాఖ్యానించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.   

 

11:49 - December 18, 2017

అహ్మదాబాద్ : గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లలో బీజేపీ ఆధిక్యంలో ఉంది. గుజరాత్ లో బీజేపీ ఆరోసారి ప్రభుత్వం ఏర్పాటు దిశగా వెళ్తోంది. హిమాచల్ ప్రదేశ్ లోనూ కమలం గెలుపు దిశగా పయనిస్తోంది. గుజరాత్ రాజ్ కోట్ వెస్టు నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి విజయ్ రూపానీ గెలుపొందారు. 4700 ఓట్ల మెజారిటీతో విజయ్ రూపానీ గెలుపొందారు. రెండు రాష్ట్రాల్లో తమదే విజయమని రాజ్ నాథ్ సింగ్ అన్నారు. జమాల్ పూర్ లో కాంగ్రెస నేత ఇమ్రాన్ ఖేడివాలా విజయం సాధించారు. పార్లమెంట్ సమావేశాలకు మోడీ హాజరయ్యారు. మోడీ విక్టరీ సింబల్ చూపించారు. స్టాక్ మార్కెట్లు కోలుకుంటున్నాయి. ఒకానొక దశలో 700 పాయింట్లు కోల్పోయిన మార్కెట్..బీజేపీ అధిక్యం రావడంతో స్టాక్ మార్కెట్ లాభాల్లో వస్తోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

11:24 - December 18, 2017

హైదరాబాద్ : గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై వక్తలు భిన్నవాదనలు వినిపించారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో కాంగ్రెస్ నేత కార్తీక్ రెడ్డి, బీజేపీ నేత ప్రకాశ్ రెడ్డి, సీపీఎం కేంద్ర కార్యదర్శివర్గసభ్యులు వి.శ్రీనివాసరావు, బీజేపీ నేత లక్ష్మీనారాయణ పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

హిమాచల్ ప్రదేవ్ సీపీఎం అభ్యర్థి అధిక్యం

హిమాచల్ ప్రదేశ్ : సిమ్లా జిల్లా థియోగ్ నియోజవర్గంలో సీపీఎం అభ్యర్థి రాకేష్ సంఘా 4700 ఓట్ల అధిక్యం ఉన్నారు.

11:12 - December 18, 2017
11:11 - December 18, 2017

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై వక్తలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన ప్రత్యేక చర్చ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు నంద్యాల నర్సింహ్మారెడ్డి, బీజేపీ నేత ప్రకాశ్ రెడ్డి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్  పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

10:52 - December 18, 2017
10:43 - December 18, 2017

అహ్మదాబాద్ : గుజరాత్ లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తోంది. ఓ దశలో బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా తలపడ్డాయి. రూరల్ ప్రాంతాల్లో కాంగ్రెస్ దూసుకెళుతోంది. అర్బన్ ప్రాంతాల్లో బీజేపీ స్వల్ప ఆధీక్యంలో ఉంది. స్టాక్ మార్కెట్ పై గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం పడింది. స్టాక్ మార్కెట్ పతనమైంది. సెన్సెక్స్ 700 పాయింట్లకు తగ్గింది. 

10:27 - December 18, 2017

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఓటింగ్ కౌంటింగ్ లైవ్ అప్డేట్స్ :

గుజరాత్ -182

Party Lead Won
BJP 00 99
Congress 0 80
Others 00 03

హిమాచల్ ప్రదేశ్-68

Party Lead Won
BJP 03 41
Congress 02 19
Others 00 03

- ఢిల్లీ : గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీని గెలుపొందించడం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆయన ప్రసంగించారు. 

- హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. ప్రజాతీర్పును కాంగ్రెస్‌ పార్టీ అంగీకరిస్తోందని, రెండు రాష్ట్రాల్లోనూ కొత్త ప్రభుత్వాలకు అభినందనలు తెలిపారు. 

- విజయవాడ : గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడంపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన తన ట్వీట్ ద్వారా అభినందనలు తెలిపారు.

- కోల్ కతా : గుజరాత్ లో బీజేపీ నైతికంగా ఓటమిపాలైందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. గుజరాత్ లో బీజేపీ విజయం సాధించడంపై ‘ట్విట్టర్’ ద్వారా ఆమె స్పందించారు. 

-గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై రాహుల్ గాంధీ ట్విట్టర్లో స్పందించారు. కాంగ్రెస్ ఓటమిని స్వీకరిస్తుందని, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ప్రజలు తనపై చూపిన ప్రేమకు ధన్యవాదలు తెలిపారు. 

-మోడీ అభివృద్ధికి ప్రజలు పట్టకట్టారని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు.

-బీజేపీని గెలిపించిన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు, కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదులు తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.

-మోడీకి ప్రకాష్ రాజ్ లేఖ రాశాడు. అందలో బీజేపీ 150 సీట్లు గెలుస్తుందని అన్నారు. మరి ఏమైందని ఆయన ప్రశ్నించారు. విభజన రాజకీయాలు ఇక్కడ పనిచేయవని, దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని ప్రకాష్ రాజ్ అన్నారు.

-గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ల్లో బీజేపీ గెలుపు మోడీ ట్వీట్ చేశాడు. అభివృద్ధి గెలిచింది...గుజరాత్ గెలిచిందని, హిమాచల్ ప్రదేశ్ లో కమల వికసించిందని ఆయన ట్వీట్ చేశాడు.

-మొదటి మ్యాచ్ లో రాహుల్ గాంధీ డకౌట్ అయ్యాడని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కమెంట్ చేశారు.

-ఢిల్లీ బీజేపీ కార్యాలయానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేరుకున్నారు. కాసేపట్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు.

-గుజరాత్ లో ముస్లింల పాధాన్యత పెరుగుతుందనడానికి ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే నిరద్శరనమని ఎంఐఎం అధ్యక్షుడు అసద్ ద్దీన్ ఓవైసీ అన్నారు.

-గుజరాత్ లో బీజేపీ గెలుపునకు చాణక్య నీతి కారణం కాదని ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే బీజేపీయ విజయం సాధించిందని హార్ధిక్ పటేల్ అన్నారు. తమ పోరాటం ఆగదని, ఈవీఎంల ట్యాంపరింగ్ తో గెలిచిన బీజేకీ శుభాకాంక్షలు అని పటేల్ తెలిపాడు.

-గుజరాత్ లోని ఏడు జిల్లాలో బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీ తలబడ్డాయి.

- గుజరాత్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. వరుసగా ఆరోసారి అధికారం దక్కించుకున్నట్లైంది. మ్యాజిక్ ఫిగర్ ను చేరుకున్న బీజేపీ 92 స్థానాల్లో గెలుపొందింది. మరో ఎనిమిది స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. 
-గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో ప్రజల భారీ విజయాన్ని అందించారని రక్షణ మంత్రి నిర్మాల సీతారామన్ అన్నారు

-హిమాచల్ ప్రదేశ్ సీఎం గా ప్రస్తుత కేంద్ర మంత్రి  జేపీ నడ్డాను ప్రకటించే అవకాశం ఉంది. సీఎం అభ్యర్థి ప్రేమ్ కుమార్ ఓడిపోవడంతో నడ్డా పేరును బీజేపీ అధినాయకత్వం పరిశీస్తున్నట్లు తెలుస్తోంది.

-పట్టుదలతో పని చేస్తే విజయం సాధించడం తథ్యమని దానికి నిరద్శనం గుజరాత్ , హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు.

-గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ గెలుపు ఆనందంగా ఉందని, బీజేపీ తర్వాతి టార్గెట్ తెలంగాణ, కర్ణాటక అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు.

-హిమాచల్ ప్రదేశ్ బీజేపీ సీఎం అభ్యర్థి ప్రేమ్ కుమార్ ఓటమిపాలయ్యారు.

-కాంగ్రెస్ కు అర్థిక్ పటేల్ మంత్రం పనిచేయలదేని రాజకీయ విశ్లేకులు అంటున్నారు.

-కాసేపట్లో రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడునున్నారు. 

-గుజరాత్ లో ఫేస్ 1 ఎన్నికలకు ఫేస్ 2 ఎన్నికలకు తేడా ఉందని, ఫేస్ 1 ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటాపోటీ నెలకొంది, కానీ ఫేస్ 2 ఎన్నికల్లో బీజేపీ పై చేయి సాధించిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

-పోర్ బందర్, భావ్ నగర్ లో ఈస్ట్ లో బీజేపీ అభ్యర్థుల ముందంజ 

-అమ్రేలిలో కాంగ్రెస్ అభ్యర్థి పరేష్ ధవాని విజయం సాధించారు.

-సిధ్ పూర్ లో బీజేపీ అభ్యర్థి జయనారాయణ్ వ్యాస్ ఓటమి పాలయ్యారు. పోరుబందర్ లో అర్జున్ మోద్ వాడియా ఓటమి చెందారు.

-భావ్ నగర్ వెస్ట్ బీజేపీ అభ్యర్థి బీతు వైజ్ఞాని గెలుపొందారు. వాట్వాలో బీజేపీ అభ్యర్థి ప్రదీప్ సిన్హా జడేజా విజయం సాధించారు.

-మెహసానాలో బీజేపీ అభ్యర్థి నితిన్ పటేల్ విజయం సాధించారు.

-హిమాచల్ ప్రదేశ్ లోని థియోగ్ నియోజవర్గంలో సీపీఎం గెలుపుపొందింది. సీపీఎం అభ్యర్థి రాకేశ్ సింఘా 3000 పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

-గుజరాత్ ఎన్నికల ప్రచారంల చివరలో మోడీ నిరాశకు గురైయ్యారని ప్రొ. హరగోపాల్ అన్నారు.

-గుజరాత్ ప్రజల భావోద్వేగాలను ప్రధాని మోడీ వాడుకున్నారని కాంగ్రెస్ నేత దాసోజ్ శ్రావణ్ అన్నారు. 

-గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ ఓటింగ్ శాతం తగ్గిందని రాజకీయా విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో కంటే ప్రస్తుతం బీజేపీ భారీ గా ఓట్ల శాతం కోల్పోయింది.

- గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ల్లో బీజేపీ జోష్ కొనసాగుతుంది. గుజరాత్ ఆరోసారి ప్రభుత్వం ఏర్పాటు దిశగా బీజేపీ పయాణిస్తోంది. 

-గుజరాత్ లోని మణినగర్ నియోజవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి సురేష్ పటేల్ విజయం సాధించారు.

-గాంధీనగర్, మోర్బీ, పఠాన్, దహోద్, గిర్ సోమానాథ్, జానాగఢ్, సురేంద్రనగర్ జిల్లాలో కాంగ్రెస్ అధిక్యంలో కొనసాగుతోంది.

-ఆహ్మాదాబాద్, భావ్ నగర్, జామ్ నగర్, మెహసానా, చోటాఉదేపూర్, రాజ్ కోట్, సూరత్ , వల్సద్, బారుచ్, పంచ్ మహల్, వడోదర జిల్లాల్లో బీజేపీ అధిక్యంలో కొనసాగుతుంది.

-ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారన్న హార్థిక్ పటేల్ వ్యాఖ్యలపై ఈసీ స్పందించింది. ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యే అవకాశంలేదని స్పష్టం చేసింది.

-ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. బాణసంచా, స్వీట్లు పంచుకుంటున్నారు.

- గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. ఈ ఫలితాలను ఊహించినవే అని ఆయన అన్నారు. ప్రజలు మోడీ మద్దతు ఇచ్చారని రాజ్ నాథ్ తెలిపారు.

సోనియా గాంధీతో రాహుల్ భేటీ అయ్యారు. గుజరాత్ ఎన్నికల ఫలితాలపై వారు చర్చించినట్టు తెలుస్తోంది. రాహుల్ మధ్యాహ్నం 2 గంటలకు వీడియాతో మాట్లాడనున్నారు.

- గుజరాత్ లోని నడ్గామ్ లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన దళిత నేత జిగ్నేష్ మేవానీ విజయం సాధించారు. ఆయన 10,785 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

- గుజరాత్ లోని 6 జిల్లాల్లో ఇంక బీజేపీ ఖాతా తెరవలేదు. ఆనంద్, దాంగ్స్, తాపి, అమ్రేలీ, నర్మద, పోర్ బందర్ లో బీజేపీ అభ్యర్థి  అధిక్యంలో లేరు. ఇటు కాంగ్రెస్ సైతం 2 జిల్లాలో ఖాత తెరవలేదు.

ఇలీష్ బ్రిడ్జ్ లో బీజేపీ అభ్యర్థి రాకేష్ షా గెలుపొందారు. జమాల్ పూర్ లో కాంగ్రెస్ అభ్యర్థి ఇమ్రాన్ ఖేడివాలా విజయం సాధించారు.
- గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల లెక్కింపు కొనసాగుతోంది. ప్రస్తుతం బీజేపీ 5 స్ధానాల్లో విజయం సాధించి 97 స్థానాల్లో అధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 1 స్థానంలో విజయం సాధించి 76 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతోంది.

- గుజరాత్ లోని రాజ్ కోట్ వెస్ట్ నిజయోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి విజయ్ రూపానీ విజయం సాధించారు. 4,700 ఓట్ల మెజార్టీతో ఆయన విజయం సాధించారు.

- కాసేపట్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ప్రధాని మోడీతో సమావేశం కానున్నారు. వారు గుజరాత్ ఎన్నికల ఫలితాలపై చర్చించే అవకాశం ఉంది. 

10.48 AM
 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల లెక్కింపు కొనసాగుతుంది. ప్రస్తుతం బీజేపీ 3 స్థానాల్లో, కాంగ్రెస్ 1 స్థానంలో విజయం సాధించింది.  బీజేపీ 100 స్థానాల్లో, కాంగ్రెస్ 75 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతోంది.

10.40 AM 
     - జిల్లాలో మొత్తం 21 స్థానాలకు బీజేపీ 17 స్థానాల్లో, కాంగ్రెస్ 4 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతుంది. బనస్కంత జిల్లాలో 9 స్థానాల్లో బీజేపీ 7, కాంగ్రెస్ 2 స్థానంలో అధిక్యంలో ఉంది. రాజ్ కోట్ జిల్లాలో 8 స్థానాల్లో బీజేపీ 6, కాంగ్రెస్ స్థానాల్లో అధిక్యంలో ఉంది. 

10.30
- సూరత్, రాజ్ కోట్, వడోదర నగరాల్లో బీజేపీ అధిక్యంలో కొనసాగుతోంది. తాపి, అమ్రేలి, ద్వారక, గిర్ సోమనాథ్, పోర్ బందర్ జిల్లాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది.
- రతన్ పూర్ లో అల్వేష్ ఠాకూర్(కాంగ్రెస్) అధిక్యంలో కొనసాగుతున్నారు. వద్గాంలో జిగ్నేశ్ మేవానీ ( ఇండిపెండెంట్ ) ముందంజలో ఉన్నారు. రాజ్ కోట్ వెస్ట్ లో విజయ్ రూపాని (బీజేపీ) అధిక్యంలో ఉన్నారు.
-గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల లెక్కింపు కొనసాగతోంది. ప్రస్తుతం బీజేపీ 104 స్థానాల్లో, కాంగ్రెస్ 75 స్థానాల్లో ఇతరులు 4 స్థానాల్లో అధిక్యంలో ఉన్నారు. 

వెనుకంజలో హీమాచల్ ప్రదేశ్ బీజేపీ సీఎం అభ్యర్థి

సిమ్లా : హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల లెక్కింపు కొనసాగుతుంది. బీజేపీ సీఎం అభ్యర్థి ప్రేము కుమార్ వెనుకంజలో ఉన్నారు.

గుజరాత్ లో బీజేపీ 106, కాంగ్రెస్ 71 స్థానాల్లో అధిక్యం

ఆహ్మాదాబాద్ : గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికల లెక్కింపు కొనసాగుతుంది. ప్రస్తుతం బీజేపీ 106, కాంగ్రెస్ 71 స్థానాల్లో అధిక్యంలో ఉంది.

10:06 - December 18, 2017

ఢిల్లీ : గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. 700 పాయింట్లుకు సెన్సెక్స్ పడిపోయింది. గుజరాత్ లో బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. రూరల్ ప్రాంతాల్లో కాంగ్రెస్ దూకుడుగా ఉంది. 

కచ్, సౌరాష్ట్రల్లో కాంగ్రెస్ ముందంజ

ఆహ్మాదాబాద్ : కచ్, సౌరాష్ట్రలో కాంగ్రెస్ ముందంజలో ఉంది. మొత్తం 54 స్థానాల్లో కాంగ్రెస్ 35, బీజేపీ 17 స్థానాల్లో అధిక్యంలో ఉంది.

09:48 - December 18, 2017

అహ్మదాబాద్ : గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలో బీజేపీ ప్రముఖ అభ్యర్థులు వెనుకంజలో ఉన్నారు. గుజరాత్ లో కాంగ్రెస్ దూకుడు స్పష్టంగా కనిపిస్తోంది. బీజేపీకి కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తోంది. ఉత్తర, దక్షిణ గుజరాత్ లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ దూసుకుపోతోంది. గుజరాత్ లో కాంగ్రెస్, బీజేపీలు సమ ఉజ్జీలుగా ఉన్నాయి. లీడ్స్ లో కాంగ్రెస్ కంటే పది స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది. గుజరాత్ లో బీజేపీ 87, కాంగ్రెస్ 84 స్థానాల్లో అధిక్యంలో ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ 29, కాంగ్రెస్ 19 స్థానాల్లో అధిక్యంలో ఉన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

కొనసాగుతున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల లెక్కింపు

ఆహ్మాదాబాద్ : గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల లెక్కింపు కొనసాగుతుంది. గుజరాత్ లో 96 స్తానాల్లో బీజేపీ ముందంజలో ఉంది. కాంగ్రెస్ 83 స్థానాల్లో  అధిక్యంలో ఉంది. అటు హిమాచ్ ప్రదేశ్ లో బీజేపీ 38, కాంగ్రెస్ 18 స్థానాల్లో అధిక్యంలో ఉంది. 

09:28 - December 18, 2017

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అంసెబ్లీ ఎన్నికల ఫలితాలపై వక్తలు భిన్న వాదనలు వినిపించారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు తెలకపల్లి రవి, టీడీపీ నేత దుర్గప్రసాద్, కాంగ్రెస్ అధికారి ప్రతినిధి ఇందిరాశోభన్ పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

స్టాక్ మార్కెట్లు పతనం

ముంబై : గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వస్తున్న సందర్బంలో స్టాక్ మార్కెట్లు నష్టపోయాయి. సెన్సెక్స్ 200 పాయింట్లు నష్టపోయింది.

గుజరాత్ లో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ

ఆహ్మాదబాద్ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరి పోరు కొనసాగుతుంది. మొదట బీజేపీ ముందంజలో ఉన్న ప్రస్తుతం పోరు నువ్వ నేన అన్న విధంగా సాగుతోంది.

గుజరాత్ సెంట్రలో కాంగ్రెస్ అభ్యర్థి ఆనంద్ ముందంజ

ఆహ్మాదాబాద్ : గుజరాత్ సెంట్రంల్ లో కాంగ్రెస్ అభ్యర్థి ఆనంద్ ముంద్వి నదియాడ్లక్ల ముందంజలో ఉన్నారు.

09:21 - December 18, 2017

ఎస్సీ వర్గీకరణ సమస్యను పరిష్కరించాలని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు తెలకపల్లి రవి, టీడీపీ నేత దుర్గప్రసాద్, బీజేపీ నేత అల్జాపూర్ శ్రీనివాస్, కాంగ్రెస్ అధికారి ప్రతినిధి ఇందిరాశోభన్, టీఆర్ ఎస్ పొలిట్ బ్యూరో సభ్యులు ఎర్రొళ్ల శ్రీనివాస్ పాల్గొని, మాట్లాడారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...
 

గుజరాత్ లో స్పష్టమైన అధిక్యం దిశగా బీజేపీ

ఆహ్మాదాబాద్ : గుజరాత్ లో స్పష్టమైన అధిక్యం దిశగా బీజేపీ కొనసాగుతుంది. పోరుబందర్, భవననగర్ ఈస్ట్ బీజేపీ ముందజలో ఉంది. మెహసానాలో ముందంజలో డిప్యూటీ సీఎం నితిన్ ఉన్నారు.

08:59 - December 18, 2017

ఇంధన వనరులను పొదుపు చేయాలని ఎనర్జీ ప్రోఫెషనల్‌ ఎక్సిక్యూటివ్‌ ఇంజనీర్‌ ఇనుగుర్తి శ్రీనివాసాచారి అన్నారు. డిసెంబర్‌ 14 జాతీయ ఇంధన వనరుల పొదుపు దినోత్సవం నుండి నడుస్తున్న ఇంధన వనరుల పొదుపు వారోత్సవాల సందర్భంగా ఇదే అంశంపై నిర్వహించిన జనపధం ప్రత్యేక చర్చలో ఆయన పాల్గొని, మాట్లాడారు. ఇంధన వనరులు తరిగిపోతున్నాయా.. వాటిని కాపాడుకోవాల్సిన తక్షణ బాద్యత మనమీద ఉందా... ఏ రకంగా సహజ వనరుల్ని కాపాడుకుంటే భవిష్యత్‌ తరాలకు మంచి చేసిన వాళ్లమవుతాం. ఈ ప్రశ్నలు ఇప్పడు తన చర్చ పరిధిని పెంచుకుంటున్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

08:54 - December 18, 2017

అహ్మదాబాద్ : గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం అయింది. రాష్ట్రంలోని 33 జిల్లాలోని 37 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. హిమాచల్‌ ప్రదేశ్‌ లో 68 స్థానాలకు ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 

 

08:37 - December 18, 2017

ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లో ఐసిస్‌ఉగ్రవాదులు తెగబడ్డారు. బలూచిస్థాన్ రాష్ట్రరాజధాని క్వెట్టాలోని ఓ చర్చిలో ఆత్మాహుతి దాడి జరిపారు. ఈ దాడిలో 9 మృతి చెందగా.. మరో 50 మందికి పైగా గాయాల పాలయ్యారు. క్రిస్ట్‌మస్‌ పండుగ రానున్న సంపదర్భంగా స్థానిక బెథెల్ మెమోరియల్ చర్చిలో భక్తులు ప్రార్థనలు చేస్తున్నారు. ఈ సమయంలో భారీగా పేలుడు పదార్థాలు తీసుకొచ్చిన ఆత్మాహుతి దళం సభ్యులు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఇద్దరు ముష్కరులు చర్చిలోకి తీసుకు రావడానికి ప్రయత్నించడంతో .. ఒకరిని గేటువద్దే భద్రతాదళాలు అడ్డుకుని కాల్చేశాయి. అయితే ఒకరు మాత్రం చర్చిలోపలకి దూసుకుపోయి తనను తాను పేల్చేసుకున్నట్టు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. ఈ భయానక దాడితో పాకిస్తాన్‌ వ్యాప్తంగా హై అలర్ట్‌ ప్రకటించారు. చర్చిల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు ఈ దాడికి తామే పాల్పడినట్టు ఐసిస్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన వార్తా సంస్థ అమక్‌ న్యూస్‌ ఏజెన్సీ తెలిపింది. 

 

08:34 - December 18, 2017
08:33 - December 18, 2017

కడప : తెలుగు సాహిత్య చరిత్రలో మధ్య యుగానికి చెందిన కవి వేమన. క్రీ.శ. 17వ శతాబ్దంలో జీవించిన వేమన ప్రజల జీవితాన్ని దగ్గరగా పరిశీలించి ప్రజలభాషలో పద్యాలు చెప్పిన సాహితీవేత్త. ప్రజాకవి, లోకకవి, విశ్వకవి, యోగిగా వేమన తెలుగవారందరికీ సుపరిచితుడు. తెలుగు భాషకు ఎంతో కృషి చేసిన చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ద్వారా వేమన పద్యాలు వెలుగులోకి వచ్చాయంటే  వేమన గొప్పతనం అర్ధం చేసుకోవచ్చు. 

ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు.. అంటూ .. మనుషుల్లో గొప్పవారి గురించి చెప్పినా.. అల్పుడెపుడు బల్కు నాడంబరముగాను.. అంటూ వ్యక్తిత్వాల గురించి వివరించినా.. సరళమైన తెలుగులో .. లోతైన భావంతో.. నీతిని జోడించి  సౌమ్యంగా పద్యాన్ని చెప్పడం ఒక్క వేమనకే సాధ్యం. 

వానలో తడవని వారు.. వేమన పద్యం చదవని తెలుగువాడు ఉండరని లోకోక్తి. పండితులకే కాదు.. పామరులకు  కూడా అర్థమయ్యే భాషలో పద్యాలు చెప్పి ప్రజల్ని మెప్పించిన కవి, వేమన. వేమన పద్యాలన్నీ ఇంచుమించు ఆటవెలదిలో ఉండి నాలుగు పాదాలలో చివరిపాదం 'విశ్వదాభిరామ వినురవేమా'అనే మకుటంతో ముగుస్తుంది. వేమన ప్రతీ పద్యం ఒక ఆణీముత్యమే.

వేమన జీవితం గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. అందులో కొన్ని కల్పితాలు కూడా ఉన్నాయి. యోగి వేమన కడప జిల్లా వాసి .చిట్వేలు మండలం మైలపల్లి గ్రామంలో 1650 - 1750 మధ్య కాలంలో జీవించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. గండికోట మహారాజు వద్ద సైనికుడిగా వేమన పనిచేశారు. యవ్వనంలో వేశ్యా లోలుడై తన దగ్గర ఉన్న ఆస్తినంతా వారికి ధారపోశాడు. ఒక సందర్భంలో తన వదిన వల్ల ఆయనకు జ్ఞానోదయమైందని చెబుతారు. తన తప్పు తెలుసుకుని ఇహపర సుఖాలపై వ్యామోహం వదిలి ఊరూరా తిరిగి నీతిని ,ఆత్మ ,ఆర్థిక, కుల సంస్కారాలను బోధించాడని అంటారు. వేమన తమ జిల్లావాడు కావడం తమకెంతో గర్వకారణమంటారు మైలపల్లి వాసులు.

తెలుగు భాషకై ఎంతో కృషి సల్పిన బ్రౌన్ అక్కడక్కడా చల్లాచదురై ఉన్న పద్యాలన్నీ సేకరించి తెలుగు వారికి అందించాడు. వేమన పద్యాలు యునెస్కోవారు గుర్తించి అనేక భాషల్లోకి అనువదించారు. తెలుగువారికి జీవిత సత్యాల్ని బోధించిన వేమన చివరికి కడప దగ్గరి పామూరుకొండ గుహలో సమాధి చెందారని చెబుతారు. ఆయన సమాధి అనంతపురం కదిరి తాలూకాలోని కటారుపల్లెలో ఇప్పటికీ ఉంది.  

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం

అహ్మదాబాద్ : గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం అయింది. 

08:09 - December 18, 2017

ప్రకాశం : ఓ వైపు వర్షా భావం.. మరోవైపు తీవ్రమైన కరువు పరిస్థితులు.. ప్రజలకు గుక్కెడు మంచినీరైనా అందించాలని అధికారుల సంకల్పానికి కొందరు ఆదిలోనే గండి కొడుతున్నారు. ప్రజల త్రాగునీరు అవసరాలకు వాడుకొవాల్సిన విలువైన మంచి నీటిని అడ్డదారిలో దారి మళ్లించి రాత్రికిరాత్రే సాగునీరు క్రింద ఏరులై పారిస్తున్నారు. ఈ నీటి చౌర్యాన్ని చూసిన అధికారులు.. ఆశ్చర్యపోయారు.
త్రాగునీరు సాగునీటికి మళ్లింపు  
ప్రకాశం జిల్లా పీసీ పల్లె మండలం అలవపాడు గ్రామం కొత్తూరు వద్ద త్రాగునీటిని సాగునీటికి మళ్లిస్తున్న ఘటన వెలుగుచూసింది. కనిగిరి నియోజకవర్గంలోని  పెదచెర్లోపల్లి మండల గ్రామాలతో పాటుగా.. 39గ్రామాలకు ఆర్‌డబ్ల్యూఎస్‌ పథకం కింద అధికారులు మంచినీటిని సరఫరా చేస్తున్నారు.  పీసీ మండంల పరిధిలో కొద్ది రోజుల నుండి నీరు రావడం ఆలస్యమవుతోందని.. సక్రమంగా సరఫరా కూడా కావడం లేదని గ్రామస్థులు అధికారులకు పలుసార్లు ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన అధికారులు   
ఫిర్యాదులు ఎక్కువ రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. కనిగిరి ప్రధాన నీటి ట్యాంక్‌ నుండి నీరు క్రమం తప్పకుండా విడుదలౌతుందని అధికారులు గ్రహించారు. దీంతో ఎక్కడైనా నీటిపైప్‌ లీకేజ్‌ అవుతుందేమోఅని చెక్‌ చేశారు. లీకేజ్‌లు ఎక్కడ లేకపోవడంతో... ఎక్కడైనా నీరు అక్రమంగా మళ్లిస్తున్నారా అని అనుమానం మొదలైంది. దీంతో అధికారులు సిబ్బందితో పలుచోట్ల నిఘా పెట్టారు. ఇక్కడే అంతా విస్తుపోయే సంఘటన వెలుగుచూసింది.
అక్రమంగా నీటి మళ్లింపు  
పీసీ పల్లి మండలంలోని అలవలపాడు కొత్తూరు వద్ద మాదేరపు నరసింహా అనే వ్యక్తి తన పొలంలోకి అక్రమంగా నీటిని వాడుతుండటం గమనించారు. మంచినీరు సరఫరా అవుతున్న నీటిపైప్‌లైన్‌ నుండి  ఎవ్వరికి అనుమానం రాకుండా భూమిలోపల ప్రత్యేక పైప్‌లైన్‌ ఏర్పాటు చేసుకున్నాడు. దీంతో తన 12 ఎకరాల పొలానికి నీటి మళ్లించుకుంటూ పొలం పండించుకుంటున్నాడు. గ్రామానికి వెళ్తున్న నీటి పైప్‌లైన్‌కి గేట్‌వాల్‌ అమర్చి.. తన పొలానికి నీటిని తరలించుకుంటున్నాడు.  నిఘా పెట్టిన అధికారులు అర్ధరాత్రి సమయంలో నీరు మళ్లిస్తుండగా పట్టుకున్నారు. నీటిని అక్రమంగా వాడుకుంటున్న అతనిపై కేసు నమోదు చేయాలని ఆరడ్ల్యూఎస్‌ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నిందితునిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న గ్రామస్తులు 
ఇన్ని రోజులు నీరు సక్రమంగా రాకపోవడానికి అధికారుల నిర్లక్ష్యం అనుకున్న గ్రామస్థులు.. సంఘటన బయట పడటంతో ఒక్కసారిగా విస్తుపోయారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితునిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్‌ చేస్తున్నారు.

 

07:59 - December 18, 2017

కర్నూలు : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను మోసం చేస్తోందని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమాఖ్య నాల్గవ మహాసభల సందర్భంగా కర్నూలులో భారీ ర్యాలీ జరిగింది. జిల్లా పరిషత్‌  కార్యాలయం నుంచి పాతబస్టాండ్‌ వరకు జరిగిన ర్యాలీలో వేలాది మంది కాంట్రాక్టు, అవుట్‌  సోర్సింగ్‌ ఉద్యోగులు పాల్గొన్నారు. తమ సర్వీసులను క్రమబద్ధీకరిస్తామని ఎన్నికల్లో సమయంలో ఇచ్చిన హామీని చంద్రబాబు ఇచ్చిన హామీని  అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించారని ఉద్యోగ సంఘాల నేతలు నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ శ్రీనివాసులురెడ్డి విమర్శించారు. 
 

07:57 - December 18, 2017

రంగారెడ్డి : ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సీపీఎం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి భూపాల్‌ విమర్శించారు. జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం పోల్కపల్లిలో జరిగిన పార్టీ మండల మహాసభల్లో పాల్గొన్న భూపాల్‌.. రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడ్డారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణ పథకం నీరుకారిపోయిందన్నారు. దళితులకు మూడెకరాల భూమి పంపిణీ ప్రహసంనగా మారిందని విమర్శించారు. మరోవైపు శంషాబాద్‌ నుంచి ఇబ్రహీంపట్నం మీదుగా మాచర్లకు రైల్వేలైన్‌ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ చొరవ తీసుకోవాలని భూపాల్‌ డిమాండ్‌ చేశారు. 

 

07:53 - December 18, 2017

మంచిర్యాల : జిల్లా కేంద్రంలో కామ్రెడ్స్‌ కదం తొక్కారు. జిల్లా ప్రధమ మహాసభలకు సీపీఎం శ్రేణులు పెద్ద ఎత్తున హాజరైయ్యాయి. తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మహాసభలకు హాజరై ప్రసంగించారు. కేంద్ర, రాష్ట్ర ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడతామని తమ్మినేని అన్నారు. జీఎస్టీ రూపంలో మధ్య తరగతి ప్రజలపై మోయలేని భారం వేశారని తమ్మినేని విమర్శించారు. 70ఏళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రజలను ఆర్థికంగా ముందుకు నడపలేక పోయిందన్నారు. దేశ ప్రగతికి వామపక్షాలే ప్రత్యామ్నా యమని తమ్మినేని అన్నారు. 

 

07:50 - December 18, 2017

హైదరాబాద్ : అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణ గురించి ప్రపంచానికి తెలిపే రాయబారులుగా ఎన్నారైలు పాటుపడాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. చైనీయులను ఆదర్శంగా తీసుకుని తెలంగాణ అభివృద్ధిలో భాగం కావాలని ప్రపంచ తెలుగు మహాసభల వేదికగా సీఎం కోరారు.
ఎన్‌ఆర్‌ఐలు తెలంగాణకు రాయబారులుగా పనిచేయాలి
అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్రం గురించి యావత్ ప్రపంచానికి తెలిపే  రాయబారులుగా పనిచేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలంగాణ ఎన్.ఆర్.ఐ.లకు పిలుపునిచ్చారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనడానికి 42 దేశాల నుంచి వచ్చిన ప్రతినిథులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో ఆదివారం రాత్రి విందు ఇచ్చారు.చైనాలో ఆర్థిక సంస్కరణలు తెచ్చిన తర్వాత వివిధ దేశాల్లో స్థిరపడిన చైనీయులే మొదట అక్కడ పెట్టుబడి పెట్టి  అభివృద్ధికి కీలకంగా మారారని అన్నారు., తెలంగాణ ఎన్.ఆర్.ఐ.లు కూడా ఇదే ఒరవడి ప్రదర్శించి, తెలంగాణ అభివృద్దిలో భాగస్వాములు కావాలని సిఎం కోరారు. 
ఆదాయ వృద్ధి రేటులో అగ్రస్థానం
ఉద్యమ కాలంలో తెలంగాణ ఎలా ఉండాలనుకున్నామో... అలాగే దూసుకుపోతోందని సీఎం కేసీఆర్‌ చెప్పారు. 17 శాతానికి పైగా ఆదాయ వృద్ధిరేటుతో దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ నిలిచిందన్నారు.. 2024 నాటికి తెలంగాణ బడ్జెట్ ఐదు లక్షల కోట్లు ఉండబోతున్నట్లు ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారని తెలిపారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ప్రాజెక్టుల నిర్మాణం లాంటి కార్యక్రమాలు అద్భుతంగా అమలవుతున్నాయని... అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి కూడా వివరించారు.  ఇవన్నీ  ప్రపంచానికి వివరించి తెలంగాణకు  పెద్దమొత్తంలో పెట్టుబడులు  వచ్చేలా  కృషి చేయాలని అన్నారు. తెలంగాణ బిడ్డలుగా మీ కర్తవ్యాన్ని నెరవేర్చాలని  ముఖ్యమంత్రి  కోరారు.
సమైక్య రాష్ట్రంలో తెలంగాణపై నిర్లక్ష్యం
''సమైక్య ఆంధ్రప్రదేశ్ లో  తెలంగాణ  తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని సీఎం కేసీఆర్‌ అన్నారు.  తెలంగాణ అస్తిత్వమే ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చిందన్నారు.   అలాంటి పరిస్థితుల్లో  తెలంగాణ రాష్ట్రం డిమాండ్  చేస్తే... కేంద్ర ప్రభుత్వంపాటు   వివిధ రాజకీయ పార్టీల నుంచి అనేక ప్రశ్నలు వచ్చాయి..  దేశరాజధానిలో ఎవరితో మాట్లాడినా మనల్ని ఆంధ్రవారిగానే  పరిగణించారని గుర్తు చేశారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికొచ్చే ఆదాయంలో 70 శాతం వరకు తెలంగాణ నుంచే వచ్చేది. కానీ 10, 15 శాతం కూడా తెలంగాణ కోసం ఖర్చు చేయలేదని కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.   తెలంగాణకు పూర్వ వైభవం తెచ్చుకుంటున్నాం'' అని ముఖ్యమంత్రి చెప్పారు.

 

07:38 - December 18, 2017

అహ్మదాబాద్ : ఇవాళ గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ప్రధానంగా గుజరాత్‌ ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం కావడం, కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా రాహుల్‌ గాంధీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి వెలువడుతున్న ఫలితాలు కావడంతో రాజకీయంగా ఆసక్తిని నెలకొంది. ఆరోసారి అధికార పగ్గాలు చేపట్టాలని బీజేపీ  చూస్తుండగా.. రెండు దశాబ్దాల సుదీర్ఘ ప్రతిపక్ష పాత్రకు స్వస్తిపలికి అధికారం హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్‌ ఉవ్విళ్లూరుతోంది.
ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తి 
గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాలోని 37 కేంద్రాల్లో జరిగే ఓట్ల లెక్కింపునకు ఎన్నికల కమిషన్‌ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మోదీ ప్రధాని అయిన తర్వాత జరిగిన అభివృద్ధికి తార్కణంగా ఈ ఎన్నికల ఫలితాలను రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
బీజేపీ, కాంగ్రెస్‌లు విస్తృతంగా ప్రచారం 
గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు విస్తృతంగా ప్రచారం చేశాయి. ప్రధాని మోదీ నేతృత్వంలో బీజేపీ రంగంలోకి దిగగా, కాంగ్రెస్‌ను అన్నీ తానై రాహుల్‌గాంధీనే నడిపించారు. మోదీ, అమిత్‌షా ద్వయం రామాలయం, గుజరాత్‌ ఎన్నికల్లో పాకిస్థాన్‌ జోక్యం వంటి అంశాలే అస్త్రంగా కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. అయితే గుజరాత్‌ అభివృద్ధిని  బీజేపీ  గాలికొదిలేయడంతో  రాష్ట్ర భవిష్యత్‌ ప్రశ్నార్థంగా మారిందని, కాంగ్రెస్‌ తీవ్ర విమర్శలు గుప్పించింది. దీనితో పాటు పాటిదార్‌ రిజర్వేషన్‌, ఓబీసీ వంటి అంశాలతో కుల సంఘాల అండతో  బీజేపీని ఎలాగైనా  గద్దె దింపాలన్న  లక్ష్యంతోనే కాంగ్రెస్‌ అడుగులు వేసింది. 
గతంతో పోలిస్తే ఈసారి 2.91శాతం తగ్గిన పోలింగ్‌ 
కొంత కాలంగా హార్దిక్‌ పటేల్‌ నేతృత్వంలో పాటిదార్‌లకు రిజర్వేషన్లు కల్పించాలని ఆందోళన చేస్తుండగా, ఓబీసీ రిజర్వేషన్ల కోసం అల్పేశ్‌ ఠాకూర్‌, దళితులపై జరుగుతున్న దాడులను వ్యతిరేకిస్తూ జిగ్నేశ్‌ మెవాని ఆందోళన చేస్తున్నారు. మొత్తం రాష్ట్ర జనాభాలో పాటీదార్‌ వర్గం 12 శాతం ఉంది. దీంతో ఎలాగైనా బీజేపీ ని అధికారం నుంచి తప్పించాలని కాంగ్రెస్‌ పాటీదార్‌లతో చేతులు కలిపి ఎన్నికలకు వెళ్లింది. రెండు దశల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సగటున 68.41శాతం ఓటింగ్‌ నమోదైంది. ఈనెల  9న తొలివిడత 89 స్థానాలకు ఎన్నికలు జరగ్గా 66.75శాతం ఓటింగ్‌ నమోదైంది. ఈనెల  14న రెండో దశలో 93 స్థానాలకు జరిగిన పోలింగ్‌లో 69.99శాతం నమోదైంది. 2012 ఎన్నికల్లో 71.32శాతం ఓటింగ్‌ నమోదు కాగా, ఈసారి 2.91శాతం తగ్గింది. ఈ ఎన్నికల్లో బీజేపీ  విజయం సాధిస్తుందని ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడిస్తుండగా, అధికారం ఎవరి చేతుల్లోకి వెళ్తుందనేది సోమవారం తేలనుంది. 
సోమవారం ఉ.8 గంటల నుంచి ఫలితాలు 
సోమవారం ఉదయం 8 గంటల నుంచి ఫలితాలు వెలువడనున్నాయి. మధ్యాహ్నానికి  పూర్తి స్థాయి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.. గుజరాత్‌లో రెండు దశాబ్దాలకు పైగా  బీజేపీ అధికారంలో ఉంది.  182 అసెంబ్లీ స్థానాలు ఉండగా... 92 మ్యాజిక్‌ నెంబర్. మరోవైపు 140 మంది ఇంజనీర్ల సాయంతో ఈవీఎంలను  టాంపరింగ్ చేశారంటూ... పాటిదార్ ఉద్యమ నాయకుడు హార్ధిక్ పటేల్ బీజేపీపై ఆరోపణలు చేశారు.  ఈ ఆరోపణలను కూడా గుజరాత్‌సీఎం విజయ్‌ రూపానీ తోసిపుచ్చారు. అయితే అపజయం భయంతోనే బీజేపీ ఎన్నికల్లో అడ్డదార్లు తొక్కిందని కాంగ్రెస్‌నేతలు విమర్శిస్తున్నారు. 
నేడు హిమాచల్‌ ప్రదేశ్‌ ఫలితాలు 
హిమాచల్‌ ప్రదేశ్‌ ఫలితాలు కూడా సోమవారమే వెలువడనున్నాయి. 68 స్థానాలకు    జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం  ఎన్నికల కమిషన్‌  ర్పాట్లు పూర్తి చేసింది. ఇక్కడ మ్యాజిక్ నెంబర్ 35 కాగా.... ఫలితాలు తమకే అనుకూలంగా వస్తాయన్న ధీమాలో అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీ   ఉన్నాయి.   ఇక్కడ విజయం ఒకసారి కాంగ్రెస్ పార్టీని వరిస్తే...   మరోసారి బీజేపీకే అధికార పీఠం దక్కుతుండటం విశేషం.  ఆ లెక్క ప్రకారం చూస్తే... ఈసారి విజయం బీజేపీ వంతు...  ఎగ్జిట్ ఫలితాలు కూడా అదే చాటుతున్నాయి.. ఐతే ఎగ్జిట్ పోల్స్‌ను లైట్‌గా తీసుకోవాలని కాంగ్రెస్‌ అంటోంది. మరి...ఎవరి నమ్మకం నిజమవుతుందో తెలుసుకోవాలంటే.... వేచి చూడాల్సిందే...  

 

ఎస్సీవర్గీకరణపై ఇచ్చిన హామీని మరిచిన కేసీఆర్‌ : మందకృష్ణ మాదిగ

హైదరాబాద్ : అర్ధరాత్రి ట్యాంక్‌ బండ్‌పై ఎమ్మార్పీఎస్‌ హల్‌చల్ చేసింది. సికింద్రాబాద్‌ సిఖ్‌ విలేజ్‌ ఏరియాలో జరిగిన ఎమ్మార్పీఎస్‌ సభ నుంచి ఒక్కసారిగా కార్యకర్తలు ట్యాంక్‌బండ్‌వైపు దూసుకెళ్లడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు అడ్డుకుని కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు, పోలీసుల మధ్య ఘర్షణ నెలకొంది. పలువురు పోలీసులు, కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఇద్దరు మహిళలకు తీవ్రగాయాలయ్యాయి. మందకృష్ణమాదిగను అరెస్టు చేసి, రహస్య ప్రాంతానికి తరలించారు. ఎస్సీవర్గీకరణపై కేసీఆర్‌ ఇచ్చిన హామీని మరిచారని మందకృష్ణ విమర్శించారు. 

మందకృష్ణమాదిగ అరెస్టు

హైదరాబాద్ : అర్ధరాత్రి ట్యాంక్‌ బండ్‌పై ఎమ్మార్పీఎస్‌ హల్‌చల్ చేసింది. సికింద్రాబాద్‌ సిఖ్‌ విలేజ్‌ ఏరియాలో జరిగిన ఎమ్మార్పీఎస్‌ సభ నుంచి ఒక్కసారిగా కార్యకర్తలు ట్యాంక్‌బండ్‌వైపు దూసుకెళ్లడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు అడ్డుకుని కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు, పోలీసుల మధ్య ఘర్షణ నెలకొంది. పలువురు పోలీసులు, కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఇద్దరు మహిళలకు తీవ్రగాయాలయ్యాయి. మందకృష్ణమాదిగను అరెస్టు చేసి, రహస్య ప్రాంతానికి తరలించారు.

07:29 - December 18, 2017

హైదరాబాద్ : అర్ధరాత్రి ట్యాంక్‌ బండ్‌పై ఎమ్మార్పీఎస్‌ హల్‌చల్ చేసింది. సికింద్రాబాద్‌ సిఖ్‌ విలేజ్‌ ఏరియాలో జరిగిన ఎమ్మార్పీఎస్‌ సభ నుంచి ఒక్కసారిగా కార్యకర్తలు ట్యాంక్‌బండ్‌వైపు దూసుకెళ్లడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు అడ్డుకుని కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు, పోలీసుల మధ్య ఘర్షణ నెలకొంది. పలువురు పోలీసులు, కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఇద్దరు మహిళలకు తీవ్రగాయాలయ్యాయి. మందకృష్ణమాదిగను అరెస్టు చేసి, రహస్య ప్రాంతానికి తరలించారు. ఎస్సీవర్గీకరణపై కేసీఆర్‌ ఇచ్చిన హామీని మరిచారని మందకృష్ణ విమర్శించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

నేడు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో ఎన్నికల ఫలితాలు విడుదల

అహ్మదాబాద్ : గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. గుజరాత్ లోని 33 జిల్లాలో 37 ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు.

 

Don't Miss