Activities calendar

19 December 2017

22:01 - December 19, 2017

తమిళనాడు : చెన్నైలోని ఆర్కే నగర్‌ అసెంబ్లీ స్థానానికి ఈనెల 21న జరుగనున్న ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్‌కు ఉప ఎన్నిక జరుగుతోంది. అధికార అన్నా డీఎంకే, ప్రతిపక్ష డీఎంకే సహా అన్ని ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను నిలబెట్టాయి. 17 నెలల అన్నా డీఎంకే పాలనకు ఈ ఎన్నిక ప్రోగ్రెస్‌ రిపోర్టుగా భావిస్తున్నారు. జయలలిత మరణం తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. 
 

21:58 - December 19, 2017

ఢిల్లీ : గుజరాత్‌ ఎన్నికల్లో ప్రధాని మోదీ మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌పై చేసిన విమర్శలు పార్లమెంట్‌ను కుదిపేశాయి. మన్మోహన్‌కు మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేసింది. మన్మోహన్‌పై ప్రధాని మోదీ వ్యాఖ్యలను తప్పుబడుతూ కాంగ్రెస్‌ సభ నుంచి వాకౌట్‌ చేసింది. 
వాడి వేడిగా ప్రారంభమైన సమావేశాలు  
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మూడవరోజు కూడా వాడి వేడిగా ప్రారంభమయ్యాయి. గుజరాత్‌ ఎన్నికల్లో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌పై ప్రధాని నరేంద్ర మోది చేసిన వ్యాఖ్యలపై లోక్‌సభ అట్టుడుకింది. లోక్‌సభ ప్రారంభమైన వెంటనే ఈ అంశాన్ని లేవనెత్తిన కాంగ్రెస్... దీనిపై చర్చ చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనకు దిగింది. కాంగ్రెస్‌ డిమాండ్‌ను స్పీకర్‌ సుమిత్రా మహాజన్ తోసిపుచ్చారు. ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలపై సభలో చర్చించడం కుదరదని ఆమె స్పష్టం చేశారు. విపక్షాల గందరగోళం మధ్యే లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ప్రశ్నోత్తరాలను కొనసాగించారు.
కాంగ్రెస్‌ వాకౌట్‌ 
ఎన్నికలు ముగిసి ఫలితాలు కూడా వచ్చేసిన నేపథ్యంలో దీనిపై చర్చ అనవసరమని, సభను సజావుగా సాగేందుకు సహకరించాలని కేంద్ర మంత్రి అనంతకుమార్‌ కాంగ్రెస్‌ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. ఇదే అంశంపై జీరో అవర్‌లో చర్చకు అనుమతించాలని కాంగ్రెస్‌ పట్టుబట్టింది. ఆ పార్టీ నేత మల్లికార్జున్‌ ఖర్గే మాట్లాడేందుకు ప్రయత్నించగా స్పీకర్‌ అనుమతించక పోవడంతో సభ నుంచి కాంగ్రెస్‌ వాకౌట్‌ చేసింది. మరోవైపు లోక్‌సభలో ఆర్జేడి చీఫ్‌ లాలూప్రసాద్‌ యాదవ్‌కు జడ్‌ ప్లస్‌ భద్రతను తగ్గించడంపై ఆ పార్టీ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. లాలుకు ఏదైనా జరిగితే ప్రధాని మోది బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆర్జేడి హెచ్చరించింది. ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లుపై చర్చించాలని టిఎంసి సభలో పట్టుబట్టింది.

 

21:54 - December 19, 2017

గుంటూరు : నువ్వు తమలపాకుతో అట్లంటే.. నేను తలుపు చెక్కతో ఇట్లంట అన్నట్లుగా ఉంది ఏపీలో టీడీపీ..బీజేపీ పరిస్థితి. సైకిల్‌, కమలం పార్టీల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరుకుంది. పొత్తుతో టీడీపీనే లాభపడిందని కమలనాథులు అంటుంటే.. టీడీపీ దయవల్లే బీజేపీకి నాలుగు సీట్లైనా దక్కాయని సైకిల్‌ పార్టీ అంటోంది. ప్రస్తుతం వీరి కలహాల కాపురం ఏపీ రాజకీయాల్లో హీట్‌ పుట్టిస్తోంది. 
పరస్సర విమర్శలు 
టీడీపీ- బీజేపీ సంకీర్ణ ప్రభుత్వమే అయినా.. ఈ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. బీజేపీకి అంత సీన్‌ లేదంటూ టీడీపీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్‌ చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతోంది. ఈ వ్యాఖ్యలను బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్రంగా తప్పుబట్టారు. ఇప్పటికైనా రాజేంద్రప్రసాద్‌ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే మంచిదని ఆయన హితవు పలికారు. గతంలో చంద్రబాబు కాంగ్రెస్‌ సహకారంతోనే నేషనల్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌గా ఒకరిని ప్రధానమంత్రిని చేశారన్నారు. టీడీపీతో పొత్తు లేనప్పుడే తమకు 18 శాతం ఓట్లు వచ్చాయని.. టీడీపీతో కలిసి వెళ్లడం వలన 2004 ఎన్నికల్లో ఓడిపోయామన్నారు. ఇలాంటి చారిత్రక తప్పిదంతో దేశం నష్టపోయిందన్నారు. 10 సంవత్సరాలు కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. 2009లో టీడీపీ ఒంటరిగా పోటీ చేసి ఓడిపోయిందని గుర్తుచేశారు.
ప్రతిసారి మిత్రపక్షం చేతిలో మోసపోతున్నాం : సోమువీర్రాజు 
కాకినాడ మున్సిపల్‌ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తే తాము ఎక్కువ స్థానాల్లో గెలిసేవాళ్లమని, అయితే టీడీపీ వాళ్లు డబ్బులు ఖర్చు పెట్టి గెలిచారన్నారు. ప్రతిసారి మిత్రపక్షం చేతిలో మోసపోతున్నామని సోమువీర్రాజు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం పార్టీ కార్యకర్తలకు ఇళ్లు, రేషన్‌ కార్డులు, పింఛన్లు ఇప్పించుకోలేకపోతున్నామన్నారు. బీజేపీ ఎదుగుతుంటే అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ ఎదుగుతుందన్నప్పుడల్లా ప్రత్యేక హోదా అంశాన్ని తెరమీదకు తెస్తున్నారని సోము వీర్రాజు అన్నారు. ప్యాకేజీకి చంద్రబాబు ఒప్పుకున్నారని చెప్పారు. ప్యాకేజీ ద్వారా వచ్చేది 3వేల కోట్లు మాత్రమేనని... అయితే ఇవే కాకుండా బీజేపీ ప్రభుత్వం ఏపీకి ఎంతో చేసిందని చెప్పారు. బీజేపీతో పొత్తు వద్దనుకుంటే చంద్రబాబు చెప్పాలని సోము వీర్రాజు డిమాండ్‌ చేశారు. 
సోము వీర్రాజువి ఉత్తర కుమార ప్రగల్భాలు : రాజేంద్రప్రసాద్ 
అంతకు ముందు సోము వీర్రాజు వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్‌ స్పందించారు. సోము వీర్రాజు ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారని, ఏపీలో బీజేపీ బలోపేతం అవుతుందని పగటికలలు కంటున్నారని అన్నారు. టీడీపీ దయ వల్లే ఏపీలో బీజేపీకి నాలుగు సీట్లు వచ్చాయన్నారు. తమ దయ లేకుంటే బీజేపీకి ఆ సీట్లు కూడా వచ్చేవి కావన్నారు. గుజరాత్‌ ఎన్నికలు ఎలా జరిగాయో.. ఆంధ్రాలో ఎన్నికలు ఎలా జరుగుతున్నాయో ప్రజలు చూస్తున్నారని రాజేంద్రప్రసాద్‌ అన్నారు. ప్రజలే టీడీపీ, బీజేపీ ఎక్కడ ఉండాలో నిర్ణయిస్తారని చెప్పారు.
ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ పై సీఎం చంద్రబాబు ఆగ్రహం
ఈ సారి ఈ మాట‌ల యుద్ధానికి టిడిపి నేత తెర‌లేప‌డంతో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సీరియ‌స్ అయ్యారు. విదేశాల్లో ఉన్న చంద్రబాబు ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌కు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అనుమ‌తి లేనిదే ఎందుకు మాట్లాడావు అని మంద‌లించారు. రెండు పార్టీల మ‌ధ్య పొత్తు పెట్టుకున్నప్పటి నుండి ప్రతిసారి  ఏదో ఒక సంద‌ర్భంలో ఇలాంటి మాట‌ల యుద్ధాలే జ‌రుగుతున్నాయి. ఆరోప‌ణ‌లు-ప్రత్యారోపణలు చేసుకున్న ప్రతిసారి రెండు పార్టీల మ‌ధ్య పొత్తు ఉంటుందా అన్న సందేహం వ్యక్తమవుతోంది.

 

యువత పక్కదారి పట్టకుండా బీచ్ ఫెస్టివల్స్ : కళా వెంకట్రావ్

తూర్పుగోదావరి : కాకినాడలో బీచ్ ఫెస్టివల్ కు మంత్రి కళా వెంకట్రావ్ హాజరై, మాట్లాడారు. సంప్రదాయం, సంస్కృతి పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కళా వెంకట్రావ్ అన్నారు. యువత పక్కదారి పట్టకుండా ఇలాంటి బీచ్ ఫెస్టివల్స్ ఉపయోగపడతాయన్నారు. ఆనంద ఆదివారాన్ని ప్రజల కోసం ప్రవేశపెట్టామని చెప్పారు. 

 

తెలుగు కళలను ప్రోత్సహించడానికే బీచ్ ఫెస్ట్ : యనమల

తూర్పుగోదావరి : కాకినాడలో బీచ్ ఫెస్టివల్ కు మంత్రులు యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావ్ హాజరయ్యారు. తెలుగు కళలను ప్రోత్సహించడానికే బీచ్ ఫెస్ట్ అని యనమల అన్నారు. రాష్ట్రాభివృద్ధికి టూరిజం కీలకం అన్నారు. మన్యం జాతర,కోనసీమ ఉత్సవమునూ నిర్వహిస్తామని చెప్పారు. 

కాకినాడలో బీచ్ ఫెస్టివల్ కు హాజరైన మంత్రులు యనమల, కళా వెంకట్రావ్

తూర్పుగోదావరి : కాకినాడలో బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. బీచ్ ఫెస్టివల్ కు మంత్రులు యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావ్ హాజరయ్యారు.

 

 

తిరుపతిలో అరుదైన గుడ్లగూబలు ప్రత్యక్షం

తిరుపతి : బాలాజీకాలనీలోని ఓ అపార్ట్ మెంట్ లో అరుదైన గుడ్లగూబలు ప్రత్యక్షమయ్యాయి. గుడ్లగూబలను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి గుడ్లగూబలు ఇవీవలే విశాఖలో కనిపించాయి.

 

ముగిసిన ప్రపంచ తెలుగు మహాసభలు

హైదరాబాద్ : ఎల్బీస్టేడియంలో ప్రపంచ తెలుగు మహాసభలు ముగిశాయి. తెలుగు మహాసభల ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రామ్ నాత్ కోవింద్ హాజరై, ప్రసంగించారు.
  

20:54 - December 19, 2017

గెలవటమైతే గెలిచారు.. కానీ, గెలిచిన ఆనందం లేకుండా పోతున్న తరుణం.. మసకబారుతున్న ప్రభ.. వరుసగా తగ్గుతున్న సీట్లు..ఓట్ల శాతం.. క్రమంగా లైట్ తీసుకుంటున్న గుజరాత్ ప్రజలు.. గుజరాత్ మోడల్ అంటూ ఊదరగొడుతున్న మాటల్లో డొల్లతనం.. ఆఖరికి మతం, జాతీయత లాంటి ఎమోషనల్ ఎలిమెంట్స్ వాడితే తప్ప ప్రయోజనం సాధించలేనితనం.. ముగ్గురు యువకులను చూసి వణికిపోయిన పరిస్థితి. ఇవన్నీ చూస్తే గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ .. గెలిచిందా? ఓడిందా అనే సందేహం రాకమానదు. ఇదే అంశంపై ఈ రోజు వైడాంగిల్ స్టోరీ చూద్దాం.. 
బీజేపీది ప్రగల్భాలే.. 
బీజెపీది ప్రగల్భాలే తప్ప.. వాస్తవంలో అంత లేదని గణాంకాలు చెప్తున్నాయి. మరోపక్క యువరక్తం గుజరాత్ లో చూపిన దూకుడు చర్చనీయాంశంగా మారింది. అక్కడ మారుతున్న పరిణామాలను, రాజకీయాలను స్పష్టం చేస్తోంది.  గుజరాత్ ప్రజలు మత సామరస్యాన్ని, లౌకిక రాజకీయాలను కోరుతున్నారని ఇదే పాఠాన్ని అసెంబ్లీ ఎన్నికల ద్వారా నేర్పారని అర్ధమవుతోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

20:36 - December 19, 2017

గుజరాత్ లో దిగజారి గెలిచిన కమలం...వికాస్ మాకొద్దన్న యాభై ఒక్కశాతం జనం, బీజేనీ, కాంగ్రెస్ను చుచ్చువోపిచ్చిన జిగ్నేష్... ఇండిపెండెంట్ గా గెలిచిన దళిత యువకుడు, ఏట్లె రాయిదీయని మేడం కూటికాడికి వాయే..షూగర్ ఫ్యాక్టరీ మర్శి ఖమ్మంల దిగిన కారు మేడం, రైతులకు గుబులు రేపిన గులాబీ పురుగు...నకిలీ పత్తి ఇత్తునాల కంపిని మీద చర్యలేవి?, మూడు రోజుల సంది తానాలు బందు...ట్యాంకరొచ్చిన నాడే పిల్లలకు నీళ్ల విందు, కాకినాడ సుట్టుముట్టు గుడుంబ అడ్డాలు...మేనిఫెస్టో మరిచిపోయినవా చంద్రాలు..? ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం....

 

20:30 - December 19, 2017

హైదరాబాద్ : కేంద్రం నుంచి విభజన హామీలు సాధించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. బయ్యారం స్టీల్ ప్లాంట్, పోలవరం ముంపు మండలాల వివాదం, హైకోర్టు విభజన, ఆస్తుల పంపకం, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి వంటి విషయాల్లో రాష్ట్రప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని పొంగులేటి ఆరోపించారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనైనా.. విభజన హామీలను పార్లమెంటులో ప్రస్తావించాలని పొంగులేటి సూచించారు. కేంద్రాన్ని అడిగేందుకు కేసీఆర్ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ పార్లమెంట్ సెషన్‌లోనైనా విభజన హామీలు ప్రస్తావించాలన్నారు. 

20:24 - December 19, 2017

గుంటూరు : రైతులు పంట నిల్వచేసుకోడానికి మోడరన్‌ కోల్డ్‌స్టోరేజిలు ఏర్పాటు చేస్తామని మార్కెటింగ్‌శాఖా మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు. రైతులకు న్యాయంచేయడానికే తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి. వ్యవసాయ రంగ అభివృద్ధిలో గత మూడు ఏళ్లలో జాతీయ సగటుకంటే ఏపీ చాల ముందన్నారు. అలాగే రైతులు పంట ఉత్పత్తులు నిల్వచేసుకోడానికి ఆధుని పరిజ్ఞానంతో కోల్డ్‌స్టోరేజిల నిర్మాణం చేపడుతున్నట్టు మార్కెటింగ్‌శాఖా మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు.

 

20:18 - December 19, 2017

ఢిల్లీ : తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు కేంద్రప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుందని ఏపీ వైద్యశాఖ మంత్రి  కామినేని శ్రీనివాస్‌ తెలిపారు. నేషనల్ పూల్‌లోకి తీసుకునేందుకు తెలుగు రాష్ట్రాల విద్యార్థులను చేర్చుకునేందుకు కేంద్రం అంగీకరించిందని కామినేని శ్రీనివాస్ అన్నారు. దీనివల్ల ఏపీ, తెలంగాణ విద్యార్థులు నేషనల్‌ లెవల్లో ఎంబీబీఎస్‌, పీజీ సీట్లకోసం పోటీపడే అవకాశం లభిస్తుందన్నారు. ప్రస్తుతం ఏపీలో 285 ఎంబీబీఎస్‌ సీట్లు మాత్రమే అందుబాటులో ఉండగా.. నేషనల్‌ పూల్లో చేరడం వల్ల ఏపీ విద్యార్థులకు దేశవ్యాప్తంగా 4482 సీట్లలో పోటీపడే అవకాశం కలిగిందన్నారు. అలాగే ఫాతిమా కాలేజీ విద్యార్థులకు న్యాయం చేసే దిశగా కేంద్రంతో మాట్లాడతామని చెప్పారు. 

 

20:10 - December 19, 2017
20:06 - December 19, 2017

ఢిల్లీ : తెలుగు ప్రపంచ భాష అని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై, తెలుగులో తన ప్రసంగాన్ని  ప్రారంభించారు. 'దేశ భాషలందు తెలుగు లెస్స' అని అభివర్ణించారు. తెలుగు మహాసభలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. దేశంలో ఎక్కువగా మాట్లాడే రెండో భాష తెలుగు అని అన్నారు. శ్రీకృష్ణ దేవరాయలు తెలుగు భాష అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని తెలిపారు. తెలుగు భాషకు ఎంతో చరిత్ర, విశిష్టత ఉందనన్నారు. ముగ్గురు తెలుగువారు రాష్ట్రపతిగా సేవలందించారని గుర్తు చేశారు. తొలి తెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్య అన్నారు. ఎన్నో దేశాల్లో తెలుగువారు ఖ్యాతి పొందారని తెలిపారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు బహుముఖ ప్రజ్ఞాశాలి అని అన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో తెలుగువారి త్యాగాలు మరువలేనివని పేర్కొన్నారు. రాయప్రోలు సుబ్బారావు రచించిన గేయం 'ఏ దేశమేగినా ఎందుకాలిడినా... ఏ పీఠమెక్కిన ఎవ్వరేమనినా...పొగడరా నీ తల్లి భూమి భారతిని...నిలుపురా నీజాతి నిండు గౌరవం'... వాక్యాలను పాడి తన ప్రసంగాన్ని ముగించారు. 

 

19:57 - December 19, 2017

హైదరాబాద్ : భాషా అభివృద్ధికి మీడియా పాత్ర కీలకమని రాష్ట్ర గవర్నర్ ఈఎస్ ఎల్ నరసింహన్ అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకల్లో పాల్గొని, ఆయన మాట్లాడారు. గవర్నర్ తెలుగులో ప్రసంగించి అందరినీ అలరించారు. భాషా రక్షణ కోసం కృషి కుటుంబం నుంచే మొదలు కావాలన్నారు. పిల్లల పుట్టిన రోజు వేడుకల్లో వారికి తెలుగు పుస్తకం బహుమతి ఇవ్వాలని సూచించారు. తెలుగు మహాసభలను వియవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. 

 

ప్రపంచ తెలుగు మహాసభల ముగింపువేడుకల్లో పద్యం పాడిన సీఎం కేసీఆర్

హైదరాబాద్ : ఎల్బీ స్టేడియంలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. మాట్లాడారు. ముగింపువేడుకల్లో సీఎం కేసీఆర్ పద్యం పాడి, అందరినీ అలరించారు.

19:46 - December 19, 2017

హైదరాబాద్ : తెలుగు భాష అభివృద్ధికి కృషి చేస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. తెలుగు మృతభాష కాకూడదని మహాసభల ప్రారంభోత్సవంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారని గుర్తు చేశారు. తెలుగు భాషను బతికించుకునేందుకు ప్రభుత్వం నిబద్ధతతో పని చేస్తుందని పేర్కొన్నారు. ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొని, మాట్లాడారు. తెలుగు మహాసభలు విజయవంతం అయ్యాయని తెలిపారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటింది తెలంగాణ అని అన్నారు. తెలుగు మహాసభలు ఎంతో సంతృప్తినిచ్చాయని చెప్పారు. ప్రతి ఏటా తెలంగాణ తెలుగు మహాసభలు డిసెంబర్ మాసంలో నిర్వహిస్తామని చెప్పారు. పస్ట్ క్లాస్ నుంచి 12 క్లాస్ వరకు ప్రతి క్లాస్ లో తెలుగు సబ్జెక్టుగా ఉంటుందన్నారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు తెలుగు భాష తప్పనిసరని తెలిపారు. తెలంగాణ గడ్డ మీద ఎవరైన చదువుకోవాలంటే తెలుగు సబ్జెక్టు తప్పనిసరిగా చదవాల్సిందేనని స్పష్టం చేశారు. తెలుగు భాషను అభివృద్ధి కోసం, తెలుగును జీవ భాషగా నిలిపి ఉంచేందుకు పాటుపడతామని చెప్పారు. జనవరిలో భాషా సాహితివేత్తల సదస్సును నిర్వహిస్తామన్నారు. భాషా పండితుల సమసల్యను పరిష్కరిస్తామని చెప్పారు. రిటైర్డ్ భాషా పండితుల పెన్షన్ లో కోతను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తెలుగు మహాసభలను సుసంపన్నం చేసిన అందరికీ ధన్యావాదాలు తెలిపారు. ప్రసంగం చివర్లో పద్యం పాడి తన ప్రసంగాన్ని ముగించారు. 

 

దేశ భాషలందు తెలుగు లెస్స : రాష్ట్రపతి

ఢిల్లీ : ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకల్లో పాల్గొన్న రాష్ట్రపతి తెలుగులో తన ప్రసంగాన్ని  ప్రారంభించారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని అన్నారు. తెలుగు మహాసభలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. దేశంలో ఎక్కువగా మాట్లాడే రెండో భాష తెలుగు అని అన్నారు. 

తెలుగులో ప్రసంగించిన గవర్నర్

హైదరాబాద్ : ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకల్లో ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ ఎల్ నరసింహన్ తెలుగులో ప్రసంగించి అందరినీ అలరించారు. భాష రక్షణకు కృషి కుటుంబం నుంచే మొదలు కావాలన్నారు. పిల్లల పుట్టిన రోజు నాడు  వారికి తెలుగు పుస్తకం బహుమతి ఇవ్వాలని సూచించారు.

 

తెలుగు భాష అభివృద్ధికి కృషి : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : తెలుగు మృతభాషగా కాకూడదని రాష్ట్రపతి అన్నారని అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొని, మాట్లాడారు. తెలుగు భాషను బతికించుకునేందుకు ప్రభుత్వం నిబద్ధతతో పని చేస్తుందన్నారు. ప్రతి ఏటా తెలంగాణ తెలుగు మహాసభలు డిసెంబర్ మాసంలో నిర్వహిస్తామని చెప్పారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు తెలుగు భాషను తప్పనిసరి సబ్జెక్టుగా చేస్తున్నట్లు తెలిపారు. 

18:58 - December 19, 2017

గుంటూరు : వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో బీజేపీ బలపడుతుందన్న సోము వీర్రాజు వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ స్పందించారు. సోము వీర్రాజు పగటి కలలుకంటూ ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారని అన్నారు. టీడీపీ దయ వల్లే ఏపీలో బీజేపీకి నాలుగు ఎమ్మెల్యే, రెండు ఎంపీ సీట్లు వచ్చాయన్నారు. మా దయ లేకుంటే బీజేపీకి ఆ సీట్లు కూడా వచ్చేవి కావన్నారు. గుజరాత్‌ ఎన్నికలు ఎలా జరిగాయో.. ఆంధ్రాలో ఎన్నికలు ఎలా జరుగుతున్నాయో ప్రజలు చూస్తున్నారని.. ప్రజలే టీడీపీ, బీజేపీ ఎక్కడ ఉండాలో నిర్ణయిస్తారని రాజేంద్ర ప్రసాద్‌ అన్నారు.

 

18:55 - December 19, 2017
18:48 - December 19, 2017

కేరళ : ప్రధానమంత్రి నరేంద్రమోది ఓఖీ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఉదయం మంగళూరు నుంచి ప్రత్యేక మిలటరీ విమానంలో వెళ్లిన ప్రధాని మోదీ మొదట లక్షద్వీప్‌లో కవరత్తిలో పర్యటించారు.  అక్కడ ఆయన ఓఖీ బాధితులను పరామర్శించారు. ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వత ప్రధాని కేరళలోని తిరువనంతపురంకు చేరుకున్నారు. మోదీకి కేరళ సీఎం పినరయి విజయన్‌ స్వాగతం పలికారు. కేరళలలో మత్స్యకారులను, రైతులను కలుసుకొని వారితో మాట్లాడారు. అక్కడి నుంచి కన్యాకుమారికి వెళ్లిన ప్రధానికి తమిళనాడు గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌, సిఎం పళనిస్వామి స్వాగతం పలికారు.  తమిళనాడులో ఓఖీతో నష్టపోయిన బాధితులను ప్రధాని పరామర్శించారు. 

 

18:45 - December 19, 2017

ఢిల్లీ : పెట్రోల్ ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి చేర్చే విషయాన్ని రాజ్యసభలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.  బీజేపీ 19 రాష్ర్టాల్లో అధికారంలో ఉన్నందున... పెట్రోల్‌ను జీఎస్టీ పరిధిలోకి  తెచ్చేందుకు కేంద్రానికి ఉన్న అడ్డంకి ఏంటని కాంగ్రెస్‌ నేత చిదంబంరం ప్రశ్నించారు. దీనికి జైట్లీ సమాధానమిస్తూ...పెట్రోల్ ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. జీఎస్టీ కిందికి పెట్రోల్‌ను తీసుకురావాలంటే రాష్ర్టాలు అంగీకరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ అంశంపై రాష్ట్రాలు త్వరలో ఏకాభిప్రాయం సాధిస్తాయన్న ఆశాభావాన్ని జైట్లీ వ్యక్తం చేశారు. 

ఎల్బీ స్టేడియం చేరుకున్న రాష్ట్రపతి రామ్ నాథ్

హైదరాబాద్ : ఎల్బీ స్టేడియంలో ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, గవర్నర్ నరసింహన్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. పూర్ణకుంభంతో రాష్ట్రపతికి స్వాగతం పలికారు.

ఎల్బీ స్టేడియంలో ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకలు

హైదరాబాద్ : ఎల్బీ స్టేడియంలో ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడులకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ముఖ్య అతిధిగా హాజరవ్వనున్నారు. 

17:48 - December 19, 2017

 ఢిల్లీ : విశాఖలోని డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ప్రైవేటీకరణ వెనుక కొందరు వ్యక్తుల స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయని వైసీపీ ఎంపీ విజయ్‌సాయి రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. డీసీఐలో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న 73.74 ఈక్విటీని అమ్మకానికి పెట్టారని.. దీంతో డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ విశాఖ నుంచి వెళ్లిపోయే ప్రమాదం ఉందన్నారు. 1700 మంది ఉద్యోగులను వీధిన పడేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తమ పార్టీ వ్యతిరేస్తున్నట్టు విజయ్‌సాయిరెడ్డి తెలిపారు. 

 

17:45 - December 19, 2017

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. బీజేపీకి అంత సీన్‌ లేదంటూ టీడీపీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్‌ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబు కాంగ్రెస్‌ సహకారంతోనే నేషనల్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌గా ఒకరిని ప్రధానమంత్రిని చేశారని గుర్తు చేశారు. టీడీపీతో పొత్తు లేనప్పుడే తమకు 18 శాతం ఓట్లు వచ్చాయని..  టీడీపీతో కలిసి వెళ్లడం వలన 2004 ఎన్నికల్లో ఓడిపోయామన్నారు. ఇలాంటి నిర్ణయం చరిత్ర తప్పిదమన్నారు. 10 సంవత్సరాలు కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. 2009లో టీడీపీ ఒంటరిగా పోటీ చేసి ఓడిపోయిందని గుర్తు చేశారు. ప్రతిసారి మిత్రపక్షం చేతిలో మోసపోతున్నామని సోము వీర్రాజు ఆవేదన వ్యక్తం చేశారు. కనీపం పార్టీ కార్యకర్తలకు ఇళ్లు, రేషన్‌ కార్డులు, పింఛన్లు ఇప్పించుకోలేక పోతున్నామన్నారు. బీజేపీ ఎదుగుతుంటే అడ్డుకునేందుకు టీడీపీ కుట్ర చేస్తుందన్నారు. బీజేపీతో పొత్తు వద్దనుకుంటే చంద్రబాబు చెప్పాలని సోమువీర్రాజు అన్నారు. 

 

మోదీ పట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిందన్న రాహల్

ఢిల్లీ : మోదీ పట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ అన్నారు. గుజరాత్ మోడల్ ను ప్రజలు తిరస్కరించారని తెలిపారు. బీజేపీ నేతలు అసత్య ప్రచారంతో ఓటర్లను మభ్యపెట్టారని విమర్శించారు.

 

రైతులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చూసుకుంటాం : మంత్రి సోమిరెడ్డి

గుంటూరు : వ్యవసాయానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి  సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బందుల లేకుండా చూసుకుంటామన్నారు. రైతుల విషయంలో ఇబ్బందులు వస్తే అధిగమిస్తామని చెప్పారు. అవగాహన రాహిత్యంతో కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.

కాసేపట్లో ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకలు

హైదరాబాద్ : కాసేపట్లో ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ హాజరుకానున్నారు. బేగంపేట విమానాశ్రయంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కు గవర్నర్‌ నరసింహన్‌, సీఎం కేసీఆర్‌, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, రాష్ట్ర మంత్రులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. 

17:33 - December 19, 2017

గుంటూరు : వ్యవసాయానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి  సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బందుల లేకుండా చూసుకుంటామన్నారు. రైతుల విషయంలో ఇబ్బందులు వస్తే అధిగమిస్తామని చెప్పారు. అవగాహన రాహిత్యంతో కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. పొరుగున ఉన్న కర్నాటక, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న సేవలకంటే తమ ప్రభుత్వం రైతులకు మెరుగైన సేవలు చేస్తుందన్నారు. 

 

17:22 - December 19, 2017

హైదరాబాద్ : తన హక్కుల సాధన కోసం సంగీత చేస్తున్న దీక్ష 31వ రోజుకు చేరుకుంది. భర్త, అత్తమామల నిరాదరణకు గురై బోడుప్పల్‌లో న్యాయం కోసం దీక్ష చేస్తున్న సంగీతను తెలంగాణ బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు పరామర్శించారు. సంగీత పోరాటానికి సంఘీభావం ప్రకటించారు. సంగీత బిడ్డ అభిత సంరక్షణ బాధ్యతలను తమకు అప్పగించాలని కోరారు. అభిత హక్కులకు భంగం కలిగితే ప్రభుత్వం జోక్యం చేసుకుని తల్లి, బిడ్డలను వేరుచేసే అధికారం ఉందని సంగీత దృష్టికి తెచ్చారు. తన రెండేళ్ల చిన్నారి అభితకు ఏ లోటూ రాకుండా చూసుకుంటానని సంగీత తెలిపారు. తన బిడ్డ సంరక్షణను తానే చూసుకుంటానని పేర్కొన్నారు. 

17:13 - December 19, 2017

హైదరాబాద్ : ప్రపంచ తెలుగు మహాసభలకు రాష్ట్రపతి రామ్‌నాధ్‌కోవింద్‌ వస్తున్న సందర్భంగా రాష్ట్ర సాంస్కృతికశాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. ముగింపు సభలకు ఎల్బీస్టేడియం సిద్ధమైంది. ముగింపు వేడుకలను ఎల్బీస్టేడియంలోనే దాదాపు 35వేల మంది వీక్షిస్తారని సాంస్కృతిశాఖ డైరెక్టర్‌ బుర్ర వెంకటేశం అంటున్నారు. మరిన్ని వివరాలను 

 

ఓయూ ఆర్ట్స్ కాలేజీ భవనంపైకెక్కిన ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు

హైదరాబాద్ : ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ భవనం ఎక్కారు. మంద కృష్ణమాదిగను విడుదల చేయాలని, ఆయనపై కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

 

కాకినాడలో భాష్యం స్కూల్ విద్యార్థి ఆత్మహత్య

తూర్పుగోదావరి : కాకినాడలో భాష్యం స్కూల్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భాష్యం స్కూల్ లో విద్యార్థుల మధ్య ఘర్షణ నెలకొంది. ఓ విద్యార్థి తల్లి తనను మందలించిందనే మనస్తాపంతో 9 వ తరగతి విద్యార్థి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 

16:37 - December 19, 2017

హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ప్రపంచ తెలుగు మహాసభలు ఘనం జరుగుతున్నాయి. ఈ నెల 15న ప్రారంభమైన తెలుగు మహాసభలు నేటి సాయంత్రంతో ముగుస్తున్నాయి. మొదటిసారి 1975 సం.లో ప్రపంచ తెలుగు మహాసభలు ఏప్రిల్ 12 నుంచి 19 వరకు జరిగాయి. మలేషియాలో రెండో ప్రపంచ తెలుగు మహాసభలు, మారిషస్ లో మూడో ప్రపంచ తెలుగు మహాసభలు, 2012సం.లో తిరుపతిలో నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి. హైదరాబాద్ లో జరుగుతున్న తెలుగు మహాసభలపై మానవి స్పెషల్ ఫోకస్ నిర్వహించింది. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

 

భువనగిరి రైల్వేస్టేషన్‌లో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

యాదాద్రి భువనగిరి : ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం కోపల్లికి చెందిన ధనుంజయ్, కోమలిలు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి రైల్వేస్టేషన్‌లో పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

16:15 - December 19, 2017

హైదరాబాద్ : రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, టీఅసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, మంత్రులు రాష్ట్రపతి రామ్ నాత్ కు ఘన స్వాగతం పలికారు. ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకల్లో రాష్ట్రపతి పాల్గొననున్నారు. ఈనేపథ్యంలో ఎల్బీ స్టేడియం పరసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. భారీగా పోలీసులు మోహరించారు. 

16:11 - December 19, 2017

హైదరాబాద్ : తెలుగు మహాసభల్లో కార్టూనిస్టులకు ప్రాధాన్యత ఇవ్వలేదని నవతెలంగాణ ఎడిటర్‌ ఎస్‌.వీరయ్య అన్నారు. ఎల్బీస్టేడియంలో ఏర్పాటు చేసిన నవతెలంగాణ బుక్‌స్టాల్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాలో మాట్లాడారు. ఎన్నో ఏళ్ల తర్వాత జరుగుతున్న తెలుగు మహాసభల్లో సాహితీవేత్తలు, కవులకు కనీస గౌరవం ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. భాషతో పాటు అక్షరాలకూ అత్యంత ప్రాముఖ్యత ఉందని తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పుస్తకాలు కీలక పాత్ర వహించాయన్నారు.   

 

16:01 - December 19, 2017

ఖమ్మం : దేశంలో బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయం సీపీఎం పార్టీయేనని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఖమ్మంలో జరుగుతున్న జిల్లా 20వ మహాసభల్లో పాల్గొన్న ఆయన.. సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధే లక్ష్యంగా సీపీఎం పోరాడుతుందన్నారు. గుజరాత్‌లో బీజేపీ బోటాబోటీ మెజార్టీతో బయటపడిందని.. కాంగ్రెస్‌ ప్రత్యామ్నాయం చూపించలేకపోయిందన్నారు. దేశంలో ఎర్రజెండా సత్తాచాటే అవకాశం వచ్చిందని తమ్మినేని అన్నారు. తెలంగాణలోని 119 స్థానాల్లో సీపీఎం పోటీ చేస్తుందని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ప్రత్యామ్నాయ ఫ్రంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తమ్మినేని తెలిపారు.

 

15:57 - December 19, 2017

హైదరాబాద్ : గుజరాత్‌ ఫలితాలు బీజేపీ పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను రుజువు చేస్తున్నాయని సీపీఐ వ్యాఖ్యానించింది. కమలనాథుల సీట్లు గణనీయంగా తగ్గిన విషయాన్ని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి గుర్తు చేశారు. ప్రధాని మోదీ సంస్కరణలకు వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేశారన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తికి అద్దం పడుతున్నాయని తెలిపారు. సంస్కరణల్లో భాగంగా లోక్‌సభ, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న మోదీ ప్రదిపాదనను సీపీఐ వ్యతిరేకమన్నారు. 

15:47 - December 19, 2017

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌కు ఉప ఎన్నిక తప్పేటట్టు లేదా ! నల్లగొండ ఉప ఎన్నికను దాట వేసుకుంటూ వస్తున్న గులాబీ పార్టీకి మరోచోట అది తప్పదా ? అంటే ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అది అవుననే అనిపిస్తోంది. ఇంతకు ఎక్కడ ఉప ఎన్నిక? ఏంటా పరిణామాలు... వాచ్‌ దిస్‌ స్టోరీ. 
టీఆర్‌ఎస్‌కు ఉప ఎన్నిక ఎదుర్కోవడం అనివార్యం  
టీఆర్‌ఎస్‌కు ఉప ఎన్నిక ఎదుర్కోవడం అనివార్యంగా కనిపిస్తోంది. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు భారత పౌరసత్వం లేదని కేంద్ర హోంశాఖ తేల్చడంతో... ఉప ఎన్నిక తప్పేటట్లు కనిపించడం లేదు. చెన్నమనేని రమేష్‌ 2009లో ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. అయితే ఆయన ప్రత్యర్థి.. రమేష్‌కు భారత పౌరసత్వం లేదని ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ వివాదం అప్పటినుంచి కొనసాగుతోంది. అయితే అప్పటినుంచి విచారణ ఎదుర్కొంటున్న రమేష్‌కు ఎక్కడా కూడా అనుకూలమైన తీర్పు రాలేదు. ఇక 2014 ఎన్నికల్లో మూడోసారి ఎన్నికైన చెన్నమనేనిపై.. మరోసారి ప్రత్యర్ధి అభ్యర్థి ఫిర్యాదు చేశాడు. 
రమేష్‌కు భారత పౌరసత్వం లేదని వెల్లడించిన కేంద్ర హోంశాఖ  
రమేష్‌కు భారత పౌరసత్వం లేదని కేంద్ర హోంశాఖ గతంలోనే తన నిర్ణయాన్ని వెల్లడించింది. అయితే... దీనిపై రమేష్‌ రివ్యూ పిటిషన్‌ వేయగా మరోసారి విచారణ చేపట్టింది. అనేక అంశాలు పరిశీలించి... రమేష్‌కు భారత పౌరసత్వం లేదని కేంద్ర హోంశాఖ తేల్చింది. అయితే విచారణ ఏకపక్షంగా సాగిందంటూ రమేష్‌ ఆరోపిస్తున్నారు. కేవలం సాంకేతిక అంశాలనే పరిగణనలోకి తీసుకున్నారంటున్నారు. తనకు 2009 ఫిబ్రవరి 3వ తేదీనే భారత పౌరసత్వం లభించిందని... 2009 ఫిబ్రవరి 25వ తేదీ నుంచి అమలు చేస్తున్న నిబంధనలు తనకు వర్తించవంటున్నారు చెన్నమనేని రమేష్‌. దీంతో కేంద్ర హోంశాఖ నిర్ణయంపై మరోసారి హైకోర్టులో తేల్చుకునేందుకు చెన్నమనేని సిద్ధమవుతున్నారు. అయితే... ఒకవేళ చెన్నమనేనికి వ్యతిరేకంగా కోర్టు తీర్పు వస్తే... వేములవాడలో ఉప ఎన్నిక జరిగే అవకాశం కనిపిస్తోంది. నల్లగొండ ఉప ఎన్నికను దాట వేస్తూ వస్తున్న గులాబీ పార్టీకి... వేములవాడలో తప్పేటట్లు కనిపించడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

 

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు ఘనస్వాగతం

హైదరాబాద్ : రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, స్పీకర్ మధుసూదనాచారి, మంత్రులు రాష్ట్రపతికి పలికారు. ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకల్లో రాష్ట్రపతి పాల్గొననున్నారు. ఎల్బీ స్టేడియం పరసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. భారీగా పోలీసులు మోహరించారు.

 

బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న రాష్ట్రపతి కోవింద్

హైదరాబాద్ : రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు కార్యక్రమంలో పాల్గొననున్నారు. నేటి సాయంత్రంతో ప్రపంచ తెలుగు మహాసభలు ముగియనున్నాయి. 

 

15:31 - December 19, 2017

సీఎం కేసీఆర్ కుటుంబాన్ని కాపాడినందుకే మహేందర్ రెడ్డికి డీజీపీ పదవి : రేవంత్ రెడ్డి

హైదరాబాద్ : మీడియాతో చిట్ చాట్ లో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ కుటుంబాన్ని కాపాడినందుకే మహేందర్ రెడ్డికి డీజీపీ పదవి ఇచ్చారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దొంగపాస్ పోర్టుతో గుజరాత్ మహిళలను కేసీఆర్ కుటుంబం యూఎస్ ఏ కు పంపించారని ఆరోపణలు చేశారు. ఈ కేసులో పోయం బాపురావు, కాసిపేట లింగయ్యలపై అక్రమ కేసులు పెట్టారని పేర్కొన్నారు.  

15:12 - December 19, 2017

ఢిల్లీ : గుజరాత్‌ ఎన్నికల్లో మాజీ ప్రధాని మన్మోహన్‌పై ప్రధాని నరేంద్ర మోది చేసిన ఆరోపణలు పార్లమెంట్‌ ఉభయ సభలు దద్దరిల్లాయి. ప్రధాని మోది క్షమాపణ చెప్పాలని రాజ్యసభలో కాంగ్రెస్‌ సభ్యులు పట్టుబట్టారు. దీంతో రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. లోక్‌సభలోనూ మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌పై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై చర్చించాలని కాంగ్రెస్, ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లుపై చర్చించాలని టిఎంసి సభలో ఆందోళనకు దిగాయి. ఆర్జేడి చీఫ్‌ లాలూప్రసాద్‌ యాదవ్‌కు భద్రతను తగ్గించడంపై ఆ పార్టీ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. విపక్షాల గందరగోళం మధ్యే లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ప్రశ్నోత్తరాలను కొనసాగించారు.

 

15:08 - December 19, 2017

హైదరాబాద్‌ : ఉప్పల్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. చిలుకానగర్‌ సమీపంలో చిన్నారిని స్కూల్‌కు తీసుకువెళ్తుండగా.. వేగంగా వచ్చిన లారీ యాక్టివాను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మూడో తరగతి చదువుతున్న చిన్నారి భూమిక మృతి చెందింది. చిన్నారి తల్లి పరిస్థితి విషమంగా ఉంది.

నేటి సాయంత్రంతో ముగియనున్న ప్రపంచ తెలుగు మహాసభలు

హైదరాబాద్ : ప్రపంచ తెలుగు మహాసభలు నేటి సాయంత్రం ముగియనున్నాయి. ముగింపు వేడుకులకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ హాజరు కానున్నారు. ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

 

లలిత జ్యుయలర్స్‌లో చోరీ చేసింది ప్రేమజంటే

హైదరాబాద్ : సోమాజీగూడ సర్కిల్‌లోని లలిత జ్యుయలరీస్‌లో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. సీసీ కెమెరా ఆధారంగా ఓ ప్రేమజంట పనిగా పోలీసులు నిర్ధారించారు. నిన్న మధ్యాహ్నం 1:40 నిముషాలకు నగల దుకాణానికి వచ్చిన కరీముల్లా, వాణిలు సేల్స్‌మ్యాన్ దృష్టిని మళ్లించి 66 గ్రాముల బంగారం చోరీ చేశారు. స్టాక్‌లో తేడా రావడం గమనించిన సిబ్బంది సీసీ ఫుటేజ్‌ను పరిశీలించడంతో చోరీ వ్యవహారం బయటపడింది.

14:57 - December 19, 2017

హైదరాబాద్ : సోమాజీగూడ సర్కిల్‌లోని లలిత జ్యుయలరీస్‌లో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. సీసీ కెమెరా ఆధారంగా ఓ ప్రేమజంట పనిగా పోలీసులు నిర్ధారించారు. నిన్న మధ్యాహ్నం 1:40 నిముషాలకు నగల దుకాణానికి వచ్చిన కరీముల్లా, వాణిలు  సేల్స్‌మ్యాన్ దృష్టిని మళ్లించి 66 గ్రాముల బంగారం చోరీ చేశారు. స్టాక్‌లో తేడా రావడం గమనించిన సిబ్బంది సీసీ ఫుటేజ్‌ను పరిశీలించడంతో చోరీ వ్యవహారం బయటపడింది. కృష్ణాజిల్లా నందిగామకు చెందిన కరీముల్లా, వాణిలు చోరీ సొత్తును నందిగామలోని ఓ ఫైనాన్స్ కంపెనీలో కుదువపెట్టినట్లు తెలుస్తోంది. బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చిన వీరిద్దరూ సికింద్రాబాద్‌లోని సింథికాలనీలోని హాస్టల్స్‌లో ఉంటున్నారు. ఆర్ధిక ఇబ్బందుల కారణంగా వీరిద్దరూ రాంగ్ రూట్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ప్రేమజంటను అదుపులోకి తీసుకున్న పంజాగుట్ట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

 

13:41 - December 19, 2017

ఆహ్మాదాబాద్ : గుజరాత్‌ ఎన్నికల్లో కొన్ని జిల్లాల ఓటర్లు బీజేపీకి షాక్ ఇచ్చారు.. నాలుగు జిల్లాల్లో బీజేపీకి గట్టి దెబ్బే తగిలింది. అక్కడ బీజేపీ ఖాతాకు తెరవలేని పరిస్థితి ఎదురైంది. అమ్రేలీ, నర్మద, డాంగ్స్, తాపి జిల్లాల్లో అధికార పార్టీ ఒక్క స్థానంలోనూ గెలవలేకపోయింది. ఆనంద్‌ జిల్లాలో ఏడు ఎమ్మెల్యే స్థానాల్లో కాంగ్రెస్‌పార్టీ ఐదు స్థానాలను దక్కించుకుంది. బీజేపీ కేవలం రెండు స్థానాలతో సరిపెట్టుకోవాల్సివచ్చింది.పోరుబందర్‌ జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో బీజేపీ, కాంగ్రెస్‌ చెరొక్క స్థానం గెలుచుకున్నాయి.. ఏడు జిల్లాల్లో బీజేపీ , కాంగ్రెస్ హోరాహోరీగా తలపడ్డాయి. బనస్కంత , కచ్, బతాద్‌, ద్వారకా, ఖేడా, మహిసాగర్, సంబర్కంత, జిల్లాల్లో రెండు పార్టీలు ఢీ అంటే ఢీ అన్న రీతిలో స్థానాలు గెలిచాయి. వెయ్యిలోపు ఓట్లతో ఏడుగురు బీజేపీ అభ్యర్థులు గెలిచారు.

ప్రతి సారీ బీజేపీ సీట్లు కోల్పోతూనే
గుజరాత్‌ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన ప్రతి సారీ బీజేపీ సీట్లు కోల్పోతూనే వస్తోంది. గత నాలుగు ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన సీట్లను పరిశీలిస్తే.. తడవతడవకూ తగ్గుతూ వచ్చాయి. 2002లో 182 అసెంబ్లీ స్థానాలకు గాను 127 సీట్లను దక్కించుకోగా.. 2007లో 117, 2012లో 115, 2017లో 99కి పడిపోతూ వచ్చాయి. ఈ సారి ఐతే మ్యాజిక్‌ ఫిగర్‌కు చేరువైంది. 2002లో కాంగ్రెస్‌ 51, 2007లో 59, 2012లో 61, 2017లో 80 స్థానాలు సాధించుకుంది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ ఓట్ల శాతం తగ్గుముఖం పట్టింది. 2014 పార్లమెంటు ఎన్నికలతో పోలిస్తే.. ఈ సారి బీజేపీ ఓటు శాతం దిగజారింది. 2014లో గుజరాత్‌లో బీజేపీకి 59. 1 ఓట్లు రాగా.. 26 పార్లమెంట్ స్థానాలను క్లీన్‌స్వీప్‌ చేసింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటు బ్యాంకు కాంగ్రెస్‌తోపాటు ఇతర పార్టీలు లాక్కున్నాయి. ఈ ఎన్నికల్లో గుజరాత్‌లో 49. 1శాతం, హిమాచల్‌లో 48. 8 శాతం ఓట్లు బీజేపీకి వచ్చాయి. గుజరాత్‌లో నాలుగు శాతం, హిమాచల్‌లో ఐదు శాతం ఓట్లు తగ్గిపోయాయి.

పటీదార్‌ అనామత్‌నేత హార్దిక్‌ పటేల్
ఈ ఎన్నికల్లో బీజేపీ అక్రమాలకు పాల్పడిందని ప్రతి తీవ్రంగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్‌వల్లే గుజరాత్‌లో బీజేపీ గెలిచిందని పటీదార్‌ అనామత్‌నేత హార్దిక్‌ పటేల్ విమర్శించారు. సూరత్, రాజ్‌కోట్‌, అహ్మాదాబాద్‌, ప్రాంతాల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్‌కు గురయ్యాయని ఆయన ఆరోపించారు.. ఫలితాల వెల్లడికి ముందురోజు కూడా హార్దిక్‌ ఈవీఎంలపై అనుమానాలను వ్యక్తం చేశారు. డబ్బు పంపిణీ, ఏవీఎంలు హ్యాకింగ్‌ చేసి బీజేపీ గెలిచిందని దుయ్యబట్టారు.ప్రజాస్వామ్య దేశంలో ఓటు ఎవరికి వేశామో అది వారికే వెళ్ళిందా లేదా అన్నదానిపైన నా ఆందోళనంతా అని హార్దిక్‌ అన్నారు. బనాస్కాంత జిల్లా వాడ్గామ్‌ నియోజకవర్గం నుంచి దళిత ఉద్యమనేత జిగ్నేష్‌ మెవానీ ఘన విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి విజయ్‌ కుమార్‌ హర్ఖా భాయ్‌ని 18,150 ఓట్లతో మట్టికరిపించారు. మెవానీకి కాంగ్రెస్, ఆప్‌ పార్టీ మద్ధతునివ్వగా.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేశారు.. విజయాన్ని అందించిన ప్రజలకు మెవానీ కృతజ్ఞతలు తెలిపారు. అసలు పోరాటం ఇప్పుడే మొదలైందని.. బీజేపీకి వ్యతిరేకంగా సర్వశక్తులూ ఒడ్డి పోరాడానని చెప్పారు. గుజరాత్, హిమాచల్‌ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీది అనైతిక విజయమని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.. అక్రమాలకు పాల్పడిన బీజేపీ గెలిచినా ఓడినట్లేనని అంటున్నారు. ఢీ అంటే ఢీ అన్నరీతిలో గట్టి పోటీనిచ్చిన కాంగ్రెస్‌ ఓడి గెలిచిందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఏకపక్షంగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కొనసాగిస్తే 2019 ఎన్నికల్లో ప్రధాని మోదీని ఇంటికి పంపడం ఖాయన్న సంకేతాలను ఓటర్లు స్పష్టంగా తేల్చారు.

13:39 - December 19, 2017

హైదరాబాద్ : కులం, మతం, అబద్ధాల ప్రాతిపదికన గుజరాత్‌లో మోడీ అధికారంలోకి వచ్చారని కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి విమర్శించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడి ఎన్నికల్లో నెగ్గారని ఆరోపించారు. సొంత ఊరిలో ఓటమి పాలైన మోడీ దేశ ప్రజలకు వివరణ ఇవ్వాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ప్రధానితో పోటీపడి బీజేపీని ఎదుర్కున్న గుజరాత్ కాంగ్రెస్ కార్యకర్తలను అభినందించి తీరాలన్న రేవంత్‌ రెడ్డి.. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ తరపున వారికి అభినందనలు తెలిపారు. వారిని ఆదర్శంగా తీసుకుని పనిచేస్తామని రేవంత్‌రెడ్డి అన్నారు. 

13:38 - December 19, 2017

ఢిల్లీ : గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తొలిసారిగా స్పందించారు. ఎప్పుడూ అవినీతి, అభివృద్ధిపై మాట్లాడే ప్రధాని ఈ ఎన్నికల్లో వాటి ప్రస్తావనే తీసుకురాలేదని రాహుల్‌ విమర్శించారు. అమిత్‌ షా కుమారుడు జయ్‌షా, రాఫెల్‌ విమానాల స్కాంపై మోది నోరు విప్పలేదని ధ్వజమెత్తారు. జిఎస్‌టి, నోట్లరద్దుపై కూడా ఆయన మాట్లాడలేదన్నారు. ఈ ఎన్నికల్లో తమకు మంచి ఫలితాలే ఇచ్చాయనే రాహుల్‌ అన్నారు. డబ్బు, విద్వేషాలుప్రేమను పంచిన గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల్లో గెలిచిన బిజెపికి అభినందనలు తెలిపారు.

13:37 - December 19, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో హవా కొనసాగించిన అన్ని ప్రధాన రాజకీయపార్టీలకు హైదరాబాద్ జిల్లా ప్రత్యేకమే. ఇక్కడ పాగా వేయాలని రాజకీయ పార్టీలు ఎన్ని ప్రయత్నాలు చేసినా సక్సెస్ కాలేకపోతున్నాయి. ఈ ప్రాంతం MIM కనుసన్నల్లో ఉండటమే అందుకు కారణం. మైనార్టీలు మెజార్టీగా ఉండే నియోజకవర్గాల్లో పట్టు సాధించేందుకు నేరుగా రంగంలోకి దిగినా ఫలితం ఉండదనే ఇప్పటి వరకు సీఎం కేసీఆర్‌ అంటి ముట్టనట్లుగానే వ్యవహరించారు. తాజాగా హైదరాబాద్‌లో మొదలైన మెట్రో రైలు వ్యవహారం ఓల్డ్‌సిటీని తాకడంతో అదే అస్త్రంగా వాడుకునేందుకు అధికార పార్టీ సిద్ధమవుతోంది. ఓల్డ్‌సిటీలో కూడా మెట్రో పనులు మొదలు పెట్టాలని అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేస్తోంది

ఎంఐఎం మినహా అన్ని రాజకీయపార్టీలు..
ఎంఐఎం మినహా అన్ని రాజకీయపార్టీలు, స్ధానిక ప్రజా సంఘాలు మెట్రోను ఓల్డ్ సిటీకి విస్తరించాలని డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా ఓల్డ్ సిటీలో మెట్రో రైల్ జాక్ చేపట్టిన ఆందోళనల్లో టీఆర్‌ఎస్ నేతలు ఎక్కువగా కనిపించారు. రాజకీయాలకు అతీతంగా మెట్రో ఉద్యమం జరుగుతోందని ప్రచారం జరుగుతున్నా.. మెట్రో రైలుకు ఎంఐఎం మద్దతు ఇవ్వడం లేదన్న సంకేతాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీఆర్‌ఎస్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉండటంతో మెట్రో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని మెట్రో జాక్ ప్రకటనలు కూడా చేస్తోంది. ఓవైపు ఎంఐఎంతో దోస్తీగా ఉంటూనే టీఆర్‌ఎస్ మరోవైపు కుర్చీ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. 

13:36 - December 19, 2017

హైదరాబాద్ : ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకలకు ఎల్బీ స్టేడియం సిద్ధమవుతోంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న ముగింపు సభకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవిద్, గవర్నర్ నరసింహన్ ఇతర ప్రముఖులు హాజరవుతారు. ముగింపు వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన కోసం కళాకారులు రిహార్సల్ చేస్తున్నారు.

13:31 - December 19, 2017

కర్నూలు : జిల్లా కేంద్రంలోని ఓమ్నీ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన ఎనిమిదేళ్ల చిన్నారి మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే చిన్నారి మృతి చెందిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వైద్యులు ఆపరేషన్ చేయకుండా ఆరోగ్యశ్రీ డబ్బుల కోసమే ప్రయత్నించారని ఆసుపత్రిపై దాడి చేశారు. తమ కూతురు రెండు సార్లు ఆపరేషాన్లు చేశారని వారు తెలిపారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

గుజరాత్ లో సాంకేతికంగా కాంగ్రెస్ గెలిచింది : రేవంత్

హైదరాబాద్ : గుజరాత్ లో సాంకేతికంగా బీజేపీ గెలిచినా నైతిక గెలుపు కాంగ్రెస్ దే అని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అన్నారు.మోడీ సొంత నియోజకర్గంలో ఓడిపోయారని రేవంత్ గుర్తు చేశారు. 

వైన్ షాప్ వద్దంటూ మహిళ సంఘాల ఆందోళన

పశ్చిమగోదావరి : జిల్లా నిడమర్రు మండలం పత్తేపురంలో గ్రామస్తుల ఆందోళనకు దిగారు. తమ గ్రామంలో మద్యం షాపు వద్దంటూ గ్రామస్తులు పోరాటం చేస్తున్నారు. గత 10 రోజులుగా గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు.

13:04 - December 19, 2017

పశ్చిమగోదావరి : జిల్లా నిడమర్రు మండలం పత్తేపురంలో గ్రామస్తుల ఆందోళనకు దిగారు. తమ గ్రామంలో మద్యం షాపు వద్దంటూ గ్రామస్తులు పోరాటం చేస్తున్నారు. గత 10 రోజులుగా గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. ఆందోళనలో పలువురు అనారోగ్యానికి గురైయ్యారు. గ్రామస్తుల ఆందోళనకు సీపీఎం, ఐద్వా మద్దతు తెలిపింది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

12:32 - December 19, 2017

ఆసుపత్రిలో ఎనిమిదేళ్ల చిన్నారి మృతి

కర్నూలు : జిల్లా కేంద్రంలోని ఓమ్నీ ఆసుపత్రిలో ఎనిమిదేళ్ల చిన్నారి మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే చిన్నారి మృతి చెందిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వైద్యులు ఆపరేషన్ చేయకుండా ఆరోగ్యశ్రీ డబ్బుల కోసమే ప్రయత్నించారని ఆసుపత్రిపై దాడి చేశారు.

ఎమ్మార్పీఎస్ కార్యకర్తల ఆందోళన

నిజామాబాద్ : జిల్లా కంటేశ్వర్ లో ఎమ్మార్పీఎస్ కార్యకర్తల ఆందోళనకు దిగారు. మందకృష్ణను తక్షణం విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మందకృష్ణ అరెస్టుకు నిరసనగా ఓ కార్యకర్త బీఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కాడు.

12:05 - December 19, 2017

నిజామాబాద్ : జిల్లా కంటేశ్వర్ లో ఎమ్మార్పీఎస్ కార్యకర్తల ఆందోళనకు దిగారు. మందకృష్ణను తక్షణం విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మందకృష్ణ అరెస్టుకు నిరసనగా ఓ కార్యకర్త బీఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కాడు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

లక్షద్వీప్ లో ప్రధాని మోడీ పర్యటన

కరవత్తి : ప్రధాని నరేంద్ర మోడీ అక్షద్వీప్ లో పర్యటిస్తున్నారు. ఒఖీ తుపాన్ అనంతర పరిస్థితులపై ఆయన సమీక్ష నిర్వహిస్తున్నారు. 

11:47 - December 19, 2017

హైదరాబాద్ : ఈనెల 15 నుంచి హైద‌రాబాద్‌లో ప్రారంభమైన ప్రపంచ తెలుగు మహాసభలు వైభవంగా జరుగుతున్నాయి. ఎల్బీ స్టేడియం ప్రధాన వేదిక కాగా.. మరో ఏడు వేదికలపై సాహిత్య సమాలోచనలు, చర్చాగోష్టిలు నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున సాహితివేత్తలు, కవులు ఈ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. అయితే ప్రధాన వేదిక ఎల్బీ స్టేడియంలో కార్యక్రమాలు ప్రారంభమయ్యే సమయానికి గంట ముందే అన్ని వేదికలపై కార్యక్రమాలు పూర్తయ్యేలా చూడాలని సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఒక్క రవీంద్రభారతి మినహా అన్ని వేదికలపైనా అర్ధరాత్రి అవుతున్నా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కేసీఆర్ సూచించిన షెడ్యూల్ ప్రకారం అధికారులు సమయపాలన పాటించకపోవడంతో చాలా మంది క‌వులు, క‌ళాకారులు, సాహితీవేత్తలు ఎల్‌బీస్టేడియంలో అద్భుతంగా జ‌రుగుతున్న కార్యక్రమాలను తిల‌కించ‌లేక‌పోతున్నారు.

సాహితీ అభిమానులు పెదవి విరుపు
ఇక మహాసభలు జరుగుతున్న తీరుపై సాహితీ అభిమానులు పెదవి విరుస్తున్నారు. కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు పెట్టి ప్రభుత్వం హడావిడి చేస్తోంది తప్ప ఎక్కడా తెలుగు భాషకు భద్రత కల్పించే దిశగా చర్యలు కనిపించడం లేదని విమర్శిస్తున్నారు. ఇక వేదికలపై మాట్లాడే వక్తలు సైతం తెలుగు భాష పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో కనీసం సూచించకపోవడాన్ని తప్పు పడుతున్నారు. ఇక మహా సభల ముగింపు రోజు చారిత్రాత్మకమైన నిర్ణయాలు వెల్లడిస్తామని కేసీఆర్ చెప్పిన నేపథ్యంలో ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రాచీన సాంప్రదాయ సాహిత్య ఒరవడిలో మనం ముందుకు సాగాలంటూ సీఎం కేసీఆర్‌ తన ప్రసంగంలో పిలుపునిచ్చారు. ఈ విషయాన్ని పక్కన పెట్టిన కొందరు కవులు ఎక్కువగా సీఎం కేసీఆర్‌ను కీర్తిస్తూ పద్యాలు అల్లడాన్ని తప్పు పడుతున్నారు. తమకు కేటాయించిన విలువైన సమయాన్ని వినియోగించుకోకుండా అతిధులుగా వచ్చిన మంత్రులు, ఇతర సన్మానితులను పద్య విద్యతో పొగడడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు లలితకళాతోరణంలో తెలంగాణ వైభవం సంస్కృతి ఉట్టిపడేలా జానపద, ఒగ్గు, చిందు, యక్షగానం, బాగోతం ఇలా పలు కార్యక్రమాలకు మహాసభల నిర్వాహకులు షెడ్యూల్ తయారు చేశారు. కానీ సీఎం ఆదేశాలతో లలిత కళాతోరణంలోని సాంస్కృతిక కార్యక్రమాలను రద్దు చేశారు. దీంతో జానపద కళాకారులు తీవ్ర నిరాశకు లోనయ్యారు.

పలు దేశాలు, రాష్ట్రాలు, జిల్లాల నుంచి 8 వేల మంది
తెలుగు మహాసభలకు పలు దేశాలు, రాష్ట్రాలు, జిల్లాల నుంచి 8 వేల మంది హాజరవుతారని నిర్వాహకులు ముందునుంచి చెబుతూ వచ్చారు. అయితే అందుకు తగ్గ ఏర్పాట్లు చేయకపోవడంతో సభలకు వచ్చేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ సభా ప్రాంగణంలో 320 మంది.. ఇందిరా ప్రియదర్శిని ప్రాంగణంలో 250 మంది, రవీంద్రభారతి మినీ హాలులో 300 మంది.. సారస్వత పరిషత్ సభా మందిరంలో 400 మంది మాత్రమే కూర్చునే అవకాశం ఉంది. వెయ్యి మంది కూర్చునే అవకాశం ఉన్న రవీంద్రభారతిలో కూడా జనం కిటకిటలాడుతున్నారు. సీట్లు లేక .. ప్రాంగణాల బయట చెట్ల కింద చాలామంది భాషాభిమానులు గడపాల్సిన పరిస్థితి నెలకొంది. మొత్తానికి ఓవైపు తెలుగు మహా సభలు ఘనంగా జరుగుతున్నాయని చెబుతున్నా.. కొందరు అధికారుల సమయపాలన కారణంగా సాహితీప్రియులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. 

11:46 - December 19, 2017

ఢిల్లీ : విభజన చట్టం ప్రకారం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలన్నారు టీఆర్‌ఎస్‌ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌. అసెంబ్లీ స్థానాల పెంపు, హైకోర్టు విభజన, 9,10 సంస్థల విభజన అంశాలను పరిష్కరించాలని కేంద్రాన్ని కోరుతున్నామని... ఇదే అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తుతామన్నారు.

11:41 - December 19, 2017

ఆదిలాబాద్ : జిల్లా ఏజెన్సీలో ఆదివాసీ వర్గానికి మరో వర్గానికి జరుగుతున్న వివాదంపై పరిశీలన చేసేందుకు పోలీసు ఉన్నతాధికారులు ఉట్నూరు ప్రాంతంలోని గ్రామాలలో పర్యటించారు. ఆదివాసీలతో మాట్లాడారు. రెచ్చగొట్టేవారి ఉచ్చులో పడొద్దని ఐజీ నాగిరెడ్డి ఈ సందర్భంగా వారికి సూచించారు. అనంతరం పీఎస్‌కు వెళ్లి అధికారులతో సమావేశం నిర్వహించారు. శాంతిభద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా ఊరుకోమని వివాదానికి కారణమౌతున్న వారు ఎలాంటివారైనా వదిలిపెట్టేది లేదని ఐజీ నాగిరెడ్డి చెప్పారు. 

11:40 - December 19, 2017

ఆహ్మాదాబాద్ : నన్ను చంపడానికి కాంగ్రెస్‌పార్టీ కుట్రలు చేసింది.. హస్తంపార్టీ నేతలు పాకిస్థాన్‌తో చేతులు కలిపారు.. పాక్‌లో కొందరికి సుపారీ ఇచ్చారు. ఇదీ.. గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలు. సరిగ్గా ఇదే అంశం గుజరాత్‌ ఓటర్లపై పనిచేసిందా..? అవుననే అంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు.

మణిశంకర్‌ అయ్యర్‌ వ్యాఖ్యలే
మాజీ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మణిశంకర్‌ అయ్యర్‌ వ్యాఖ్యలే గుజరాత్‌లో తమ పార్టీ ఆశలు గల్లంతు చేశాయని కాంగ్రెస్‌ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. మణిశంకర్‌ అయ్యర్‌ పెట్టిన చిచ్చుతో రెండో దశ ఎన్నికల్లో బీజేపీ వైపు ఓటర్లు మొగ్గారన్న అభిప్రాయాలు వస్తున్నాయి. వాస్తవానికి మొదటి దశ ఎన్నిక ఎన్నికలు జరిగిన 19 జిల్లాల్లోని 98 స్థానాల్లో కాంగ్రెస్‌కు ఓటింగ్‌ శాతం పెరగింది. కాని తుదిదశలో మోదీ అమిత్‌షా టీం సాగించిన ప్రచారంతో కాంగ్రెస్‌ ఆశలు గల్లంతయ్యాయంటున్నారు. రెండో దశలో ఉత్తర, మధ్య గుజరాత్‌ జిల్లాల్లో మొత్తం 93 స్థానాలకు పోలింగ్‌ జరిగింది. ఖచ్చితంగా ఈ ఏరియాల్లోనే బీజేపీకి భారీగా ఓటింగ్‌ జరగడం.. కాంగ్రెస్‌పై చేసిన విషప్రచారమే అంటున్నారు హస్తంపార్టీ నేతలు.

బీజేపీ ఎంతకైనా తెగిస్తుందని
గెలవడం కోసం బీజేపీ ఎంతకైనా తెగిస్తుందని పాటీదార్‌ ఉద్యమనేతలు మొందటి నుంచి విమర్శలు మొదలు పెట్టారు. సరిగ్గా అదే సరళిలో .. సానుభూతికోసం.. పొరుగుదేశంతో కలిసి కుట్రపన్నారంటూ.. దాంతోపాటు తనను నీచుడంటూ విమర్శించారంటూ మోదీ ప్రచారాన్ని హోరెత్తించారు. మణిశంకర్‌ అయ్యర్‌ సారీ చెప్పినా.. ఇదే విషయాన్ని మోదీ పదేపదే ప్రజల ముందు ప్రస్తావించారు. దీంతో గెలుపు వరిస్తుందనుకున్న గుజరాత్‌లో ఓటమి మూటగట్టుకోవాల్సి వచ్చిందని కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు. మొత్తానికి గుజరాత్‌లో 20ఏళ్లుగా అధికారన్ని అంటిపెట్టుకుని ఉన్న కమలం పార్టీలో మొదటిసారి కలవరం మొదలైందని హర్షం వ్యక్తం అవడం కొసమెరుపు. 

11:18 - December 19, 2017

అనంతపురం : జిల్లా పెనుగొండలోని కియా కార్ల పరిశ్రమకు చెందిన ఇద్దరు కార్మికులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వీరి మృతి పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరపుతున్నారు. కార్మికులు వాహనంలో డోర్లు మూసుకుని పడకోవడంతో ఊపిరి ఆడకపోవడంతో వారు చనిపోయినట్టు తెలుస్తోంది.మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ పై చంద్రబాబు ఆగ్రహాం

గుంటూరు : ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ పై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహాం వ్యక్తం చేశారు. మిత్రమపక్షమైన బీజేపీపై తన అనుమతి లేకుండా విమర్శలు చేస్తారని, భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు జరగుండా చూసుకోవాలని రాజేంద్రప్రసాద్ ను సీఎం హెచ్చరించారు.

11:13 - December 19, 2017

గుంటూరు : ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ పై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహాం వ్యక్తం చేశారు. మిత్రమపక్షమైన బీజేపీపై తన అనుమతి లేకుండా విమర్శలు చేస్తారని, భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు జరగుండా చూసుకోవాలని రాజేంద్రప్రసాద్ ను సీఎం హెచ్చరించారు. ఏదైనా పార్టీ అనుమతితోనే మాట్లాడాలని చంద్రబాబు స్పష్టం చేశారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

11:07 - December 19, 2017

పాలిటిక్స్ లోకి పరుచూరి

విశాఖ : మంత్రి గంటా శ్రీనివాసరావుకు ప్రధాన అనుచరుడిగా పరుచూరి భాస్కరరావుకు మంచి పేరుంది. ప్రత్యూష కంపెనీ డైరెక్టర్‌గా పారిశ్రామిక వర్గాలకు, గంటా శ్రీనివాసరావుల ప్రతి విజయం వెనుకా ఉండేది, వ్యూహాలు రచించేది పరుచూరే. 1999 నుండి అనకాపల్లిలో ఎంపీగా గెలిచిన నాటి నుండి 2014 ఎన్నికల్లో భీమిలి గెలుపు వరకు అన్నింటా గంటా విజయాలలో పరుచూరిదే కీలక పాత్ర. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో కూడా పరుచూరి కీలకంగా వ్యవహరించారు.

నియోజక వర్గానికి ఇంచార్జిగా
ఏ నియోజక వర్గానికి ఇంచార్జిగా పనిచేసినా పరుచూరి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటారు. అనకాపల్లి పార్లమెంట్‌ నియోజక వర్గంలో స్వంత నిధులతో చెరువుల పూడికలు తీయించడం, భీమిలి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని జనచైతన్య యాత్రలకంటే ముందే ప్రతి పంచాయితీలో నియోజక వర్గబోర్డులు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా తెలుగుదేశం హయాంలో చేసిన అభివృద్ధిని ప్రతి ఇంటికీ తీసుకువెళ్లారు. ఇక ప్రజారాజ్యం పార్టీ నుండి అనకాపల్లిలో గంటా గెలిచిన తర్వాత పరుచూరి గంటా మహిళా శక్తి, యువసేన, గంటా ఎస్సీ, ఎస్టీ సెల్‌ అనే విభాగాలు ఏర్పాటు చేశారు. కార్యకర్తలకు ఏ చిన్న సమస్య వచ్చినా నేనున్నాను అంటూ ధైర్యం చెప్పేవారు పరుచూరి. అభివృద్ధి కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికైనా వెనకాడని నైజం ఆయనది. అనకాపల్లి డంపింగ్‌ యార్డు తరలింపుతో అనకాపల్లి వాసులకు ఆయన మరింత దగ్గరయ్యారు. అనకాపల్లిలోని మామిడాల పాలెంలో మూగజీవాలు చనిపోతే ఆర్థిక సాయం చేశారు పరుచూరి. అంతేకాదు కార్యకర్తల్లో ఎవరు అనారోగ్యం పాలైనా వారిని పరామర్శించడంతో పాటు వారికి ఆర్థిక సాయం కూడా చేసేవారు.

కార్యకర్తల నుండి వస్తున్న ఒత్తిడి
ఎన్ని అభివృద్ధి పనులు చేసినప్పటికీ ఏ పార్టీ నామినేటెడ్‌ పదవులు ఆశించలేదు పరుచూరి. కాని ఇప్పుడు కార్యకర్తల నుండి వస్తున్న ఒత్తిడి నేపథ్యంలో పరుచూరి రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నారని సమాచారం. పరుచూరి గనక రాజకీయాల్లోకి వస్తే ఆయనకు అనేక మంది అభిమానులున్న అనకాపల్లి నుండే పోటీ చేయాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే గంటాతో ఎలాంటి విబేధాలు లేవని చెబుతున్నా ఇటీవల పరుచూరిని భీమిలి నియోజకవర్గ ఇంచార్జి బాధ్యతల నుండి తొలగించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆయన అభిమానులు స్వంతంగా పోటీచేయాలని కోరుతున్నారు. అభిమానుల కోరికను పరుచూరి సమ్మతించినట్లు సమాచారం. అయితే ఏ పార్టీ నుండి పోటీ చేస్తారనేది సస్పెన్స్‌గా మారింది. ఇప్పటికే సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా పీలా గోవింద సత్యనారాయణ ఉన్నారు. దీనితో కొత్తగా వస్తున్న జనసేన పార్టీ వైపు ఆసక్తి కనబరుస్తున్నారా లేక ఏ పార్టీ నుండి సీటు తెచ్చుకుంటారో అన్నది వేచి చూడాలి. 

11:03 - December 19, 2017

చెన్నై : తమిళనాడులోని మధురై జిల్లా తిరుమంగలం వద్ద కారు బోల్తా పడి నలుగురు అయ్యప్ప భక్తులు మృతి చెందారు. అనంతపురం జిల్లా పామిడి మండలానికి చెందిన ఐదుగురు పోలీసులు హుండాయ్‌ కారులో శబరిమలైకు వెళ్లారు. అక్కడినుంచి తిరిగి వస్తుండగా.. మధురై సమీపంలోని తిరుమంగలం వద్ద కారు డివైడర్‌ను ఢీకొని లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఎస్‌ఐ రఘు, కానిస్టేబుళ్లు చిన్న, మాధవరెడ్డి, నరేష్‌లు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. 

10:30 - December 19, 2017

జమ్మూలో ఎన్ కౌంటర్

శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్ షోపియాన్ జిల్లాలో ఆర్మీకి, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. ఒక జవాన్ కు గాయపడ్డాడు. మరో ఉగ్రవాదికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 

10:21 - December 19, 2017

శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్ షోపియాన్ జిల్లాలో ఆర్మీకి, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. ఒక జవాన్ కు గాయపడ్డాడు. మరో ఉగ్రవాదికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వాన్పొరా ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

కియా కార్ల పరిశ్రమకు చెందిన ఇద్దరు కార్మికుల మృతి

అనంతపురం : జిల్లా పెనుగొండలోని కియా కార్ల పరిశ్రమకు చెందిన ఇద్దరు కార్మికులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వీరి మృతి పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరపుతున్నారు.

09:07 - December 19, 2017

సిద్దిపేట : జిల్లా అక్కన్న పేట మండలం తురుకవాణికుంటులో విషాదం చోటుచేసుకుంది. పురుగుల మందు తాగి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నం చేశారు. వారిలో ముగ్గురు మృతి చందారు. మృతి చెందిన వారిలో తండ్రి భగవాన్ రెడ్డి, కూతురు రోజా, కొడుకు రాజు ఉన్నారు. భార్య రాజవ్వ పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను ఆసుపత్రికి తరలించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

సిద్దిపేట జిల్లాలో విషాదం

సిద్దిపేట : జిల్లా అక్కన్న పేట మండలం తురుకవాణికుంటులో విషాదం చోటుచేసుకుంది. పురుగుల మందు తాగి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నం చేశారు. వారిలో ముగ్గురు మృతి చందారు. మృతి చెందిన వారిలో తండ్రి భగవాన్ రెడ్డి, కూతురు రోజా, కొడుకు రాజు ఉన్నారు. భార్య రాజవ్వ పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను ఆసుపత్రికి తరలించారు. 

తమిళనాడులో ప్రమాదం..తెలంగాణ వాసుల మృతి..

చెన్నై : తమిళనాడులోని తిరుమంగళంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన కారు బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో తెలంగాణకు చెందిన నలుగురు భక్తులు మృతి చెందారు.

బైరామల్ గూడలో అగ్నిప్రమాదం

హైదరాబాద్ : ఎల్బీనగర్ బైరామల్ గూడలోని ఓ స్ర్కాప్ గోదాంలో అగ్నిప్రమాదం జరిగింది. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అర్పుతున్నారు. షాట్ సర్క్యుట్ వల్లే అగ్నిప్రమాదం జరిగనట్టు తెలుస్తుంది. 

నేడు హైదరాబాద్ రాష్ట్రపతి

హైదరాబాద్ : రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేడు హైదరాబాద్ కు రానున్నారు. మధ్యాహ్నం 2.55కు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి రాజ్ భవన్ కు వెళ్తారు. సాయంత్రం 5 గంటలకు ఎల్బీ స్టేడియంలో తెలుగు మహాసభల ముగింపు ఉత్సవాల్లో పాల్గొంటారు. రాత్రికి రాజ్ భవన్ బస చేసి రేపు ఉదయం 10.30 లకు బుద్ధ విగ్రహానికి నివాలళులర్పించి ఢిల్లీకి తిరిగి వెళ్లన్నారు.

నేడు అనంతలో జగన్ ప్రజాసంకల్ప యాత్ర

అనంతపురం : జిల్లాలోని తనకంటివారిపల్లె జగన్ ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభం కానుంది. కృష్ణాపురం, రామసాగరం, యాడలంకపల్లెలో ఈ రోజు పాదయాత్ర కొనసాగుతోంది.

07:49 - December 19, 2017

నరేంద్ర మోడీ గారు చెప్పిన వాటిలో వాస్తవం లేదని, గుజరాత్ ఆయన స్వంత రాష్ట్రం కానీ అక్కడ బీజేపీకి అశించిన స్థాయిలో సీట్లు రాలేదని, మోడీ గుజరాతీల్లో ప్రాంతీయత రెచ్చగొట్టి ప్రధాని స్థాయిని దిగదర్చారని, మోడీ నైతికంగా ఓడిపోయారని సీపీం కార్యవర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. బీజేపీ గుజరాత్ 150 సీట్లు వస్తాయిన ప్రకటించిందని ఎందుకంటే మోడీ గుజరాత్ చెందిన వ్యక్తి, అమిత్ షా కూడా గుజరాత్ చెందిన వ్యక్తి అని అయిన కూడా అక్కడ కాంగ్రెస్ పుంజుకుందని, అయితే ఇక్కడ తొమ్మిది సీట్లు అటు ఇటు అయితే ఫలితం వేరేలా ఉండేదని, కాంగ్రెస్ కొంత వరకు క్యాడర్ లేకపోవడం వల్ల కూడా కాంగ్రెస్ సీట్ల తగ్గడానికి కారణమని ఏపీ పీసీసీ ప్రధాన కార్యదర్శి గౌతమ్ అన్నారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ప్రజలు బీజేపీని గెలిపించినందుకు కృతజ్ఞతలు చెబుతున్నామని, గుజరాత్ 22ఏళ్లు అధికారం తర్వాత మళ్లీ కూడా అధికారంలోకి రావడం గొప్ప విషయామని బీజేపీ నేత ప్రేమేందర్ అన్నారు. గుజరాత్ లో రెండు జాతీయ పార్టీలు కుల, మత, ప్రాంతా రాజకీయాలు చేశాయని, 22ఏళ్లుగా బీజేపీ ఉన్న వ్యతిరేకతను కాంగ్రెస్ క్యాష్ చేసుకోలేకపోయిందని టీఆర్ఎస్ నేత రాకేష్ అన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

07:35 - December 19, 2017

తెలంగాణలో వ్యవసాయకార్మికుల పరిస్థితి ఎలా ఉంది. కేసీఆర్‌ సర్కార్‌ వ్యవసాయ కార్మికులకు ఇచ్చిన హామీలు గత మూడున్నరేళ్లుగా అమలవుతున్నాయా. ఉపాధిహామీ కార్మికులు, రేషన్‌డీలర్లు, కౌలు రైతుల పరిస్థితి ఎలా ఉంది. ఈ అంశాలపై ఈ నెల 14,15,16 తేదీల్లో మిర్యాలగూడలో జరిగిన వ్యవసాయ కార్మిక సంఘ మహాసభల్లో ఎలాంటి చర్చ జరిగింది. మూడు రోజుల పాటు మిర్యాలగూడ వ్యవసాయ కార్మిక మహాసభలు ఘనంగా జరిగాయని, ఈ సభలకు రాష్ట్ర వ్యాప్తంగా 1000 మందికి పైగా హాజరైయ్యారని, వ్యవసాయ కూలీలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ముఖ్యంగా ఉపాధి హామీలో కార్మికులను తొలగిస్తున్నారని వ్యవసాయ కార్మికసంఘం కార్యదర్శి వెంకట్ రామలు అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

07:34 - December 19, 2017

హైదరాబాద్ : ఐసీపీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా టాప్‌గేర్‌లో దూసుకుపోతోంది. శ్రీలంకతో వన్డేసిరీస్‌ విజయంతో టీమ్‌విభాగంతోపాటు, వ్యక్తిగత ర్యాంకుల్లో ఆటగాళ్లు ర్యాంకులు మెరుగుపరుచుకున్నారు.

రోహిత్‌ శర్మ ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానం..
టీమిండియా తాత్కాలిక సారథి రోహిత్‌ శర్మ ఐసీసీ బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానానికి ఎగబాకాడు. మొహాలి వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో బాదిన డబుల్‌ సెంచరీతో రెండు స్థానాలు మెరుగయ్యాడు. దీంతో తొలిసారి అతడి ఖాతాలో 800+ రేటింగ్‌ పాయింట్లు చేరాయి. శ్రీలంక సిరీస్‌లో రోహిత్‌తో పాటు ఓపెనింగ్‌కు దిగి.. 168 పరుగులు చేసిన శిఖర్‌ ధావన్‌ 14వ ర్యాంకుకు చేరుకున్నాడు. ఇక ప్రస్తుతం రెస్ట్‌మోడ్‌లో ఉన్న టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ 876 పాయింట్లతో ఐసీసీ వన్డేర్యాంకింగ్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అటు దక్షిణాఫ్రికా స్టార్‌ ఏబీ డివిలియర్స్‌ 872 పాయింట్లతో రెండో ర్యాంకును నిలబెట్టుకున్నాడు.

మణికట్టుమాంత్రికులు యజ్వేంద్ర చాహల్‌, కుల్‌దీప్‌యాదవ్‌
ఇక బౌలర్ల విభాగంలో మణికట్టుమాంత్రికులు యజ్వేంద్ర చాహల్‌, కుల్‌దీప్‌యాదవ్‌ వ్యక్తిగత విభాగాల్లో టాప్‌గేర్‌లో దూసుకుపోతున్నారు. చాహల్‌ 23 స్థానాలు ఎగబాకి 28 ర్యాంకుచేరుకోగా.. కుల్‌దీప్‌ యాదవ్‌ 16 స్థానాలు ఎగబాకి 56వ ర్యాంకుకును సొంతం చేసుకున్నాడు. ఇక స్పీడ్‌స్టర్‌ పాండ్య 10 స్థానాలు మెరుగై 45వ ర్యాంకును సాధించాడు. ఇక టీమ్‌ విభాగంలో కొద్దిలో టాప్‌ర్యాంకును కోల్పోయిన టీమిండియా ..రెండో ప్లేస్‌లో నిలిచింది. శ్రీలంకతో వన్డేసిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసినట్టైతే.. టాప్‌ర్యాంకు భారత్‌ సొంతం అయ్యేది. కాని ధర్మశాల వన్డేలో ఓటమితో రెండో స్థానం దక్కింది. ప్రస్తుతం వన్డేర్యాంకింగ్‌లో 120పాయింట్లతో సౌత్‌ఆఫ్రికా టాప్‌ప్లేస్‌లో ఉండగా ..119 పాయింట్లతో టీమ్‌ఇండియా రెండో స్థానంలో నిలిచింది. 

07:32 - December 19, 2017

హైదరాబాద్ : బీఎస్ఎన్ఎల్ ఏపీ, తెలంగాణ సర్కిళ్ల ఆధ్వర్యంలో ఆల్ ఇండియా 17వ క్రీడా పోటీలను హైదరాబాద్ గచ్చిబౌలీలోని జీఎంసీ బాలయోగి ఇండోర్‌ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ టెలికాం డిస్ట్రిక్ట్ జనరల్ మేనేజర్ కె.రామ్‌చంద్ తెలిపారు. ఈ నెల 19 నుండి 22 వరకు జరిగే పోటీలకు దేశంలోని 13 సర్కిళ్ల నుండి 90 మంది పాల్గొంటున్నారని ఆయన అన్నారు. పోటీల ప్రారంభోత్సవంలో జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి పాల్గొంటారని రామ్‌చంద్ చెప్పారు.బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు అందిస్తున్న ఆఫర్లను టీఎస్ టెలికాం సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ వి.సుందరం వివరించారు. 

07:31 - December 19, 2017

విజయవాడ : అగ్రీగోల్డ్‌ ఏజెంట్లు, ఖాతాదారులు 30 గంటల సత్యాగ్రహానికి దిగారు. ప్రభుత్వం తమకిచ్చిన హామీలు నెరవేర్చలేదని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనలు నిర్వహించారు. విజయవాడలో ఏజెంట్లు, ఖాతాదారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

07:30 - December 19, 2017

హైదరాబాద్ : రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఇవాళ ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరవుతారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆహ్వానం మేరకు ఆయన ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు హైదరాబాద్‌ చేరుకోనున్న రాష్ట్ర పతి ..సాయంత్రం ఐదు గంటలకు ఎల్బీస్టేడియానిలోని ముగింపు వేడుకల్లో పాల్గొంటారు. అనంతర ఢిల్లీకి బయలుదేరి వెళతారు.

07:29 - December 19, 2017

హైదరాబాద్ : ప్రపంచ తెలుగు మహాసభలు నాల్గో రోజు మానవజీవితాన్ని పాటతో పోల్చే కార్యక్రమం జరిగింది. ఈకార్యక్రమంలో ప్రముఖ కవులు సుద్దాల అశోక్ తేజ, సిరివెన్నెల సీతారామశాస్త్రి, రసమయి బాలకిషన్‌తోపాటు పలువురు సాహితీవేత్తలు పాల్గొన్నారు. బిల్డింగ్‌లు కట్టే మేస్త్రీ దగ్గర తాను అసిస్టెంట్‌గా పనిచేస్తున్నప్పుడు తన మదిలో పుట్టిన పాటను సుద్దాల అశోక్‌ తేజ వినిపించిన తీరు ఆహూతుల మనస్సుకు హత్తుకుంది. 

07:28 - December 19, 2017

హైదరాబాద్ : ఎల్బీస్టేడియంలో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో సినీతారలు మెరిశారు. నాల్గవరోజు మహాసభలకు నాటి సూపర్‌స్టార్‌ కృష్ణ, విజయనిర్మల, సీనియర్‌ నటి జమున, దర్శకులు రాఘవేంద్రరావు, రాజమౌళీ, నిర్మాత అల్లుఅరవింద్‌ హాజరయ్యారు. వారితోపాటు కథానాయకులు వెంక‌టేశ్‌, జ‌గ‌ప‌తి బాబు, విజ‌య్ దేవరకొండ‌ కార్యక్రమంలో పాల్గొని తెలుగు సభలకు మరింత ఆకర్షణ తెచ్చారు.

సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు...
సినీ కుటుంబం తరపున సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు చెబుతున్నానని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. 'తెలుగు'ను ఎందుకు గుర్తించాలి..? గౌరవించాలి..? అన్న దానితో పాటు దాని ప్రత్యేకత గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అన్నారు. భవిష్యత్‌ తరాలకు తెలుగు మాధుర్యాన్ని పంచాలంటే 1 నుంచి 12వ తరగతి వరకు తెలుగును తప్పని సరిచేయాలని చిరంజీవి అన్నారు. తెలుగు పదం వింటేనే తన తనువు పులకిస్తుందని హీరో బాలకృష్ణ అన్నారు. ఐదు వేల సంవత్సరాల క్రితమే తెలుగు జాతికి పునాది పడిందని చరిత్రను చదువుకుంటే మనకు అర్థమౌతుందని అన్నారు. తెలుగు భాషలో గోదావరి ఒంపులు, కృష్ణవేణి సొంపులు, నెల్లూరి నెరజాణ తనం, రాయలసీమ రాజసం, తెలంగాణ మాగాణం సిరులు ఉన్నాయన్నారు. తెలుగు వారిగా పుట్టినందుకు అందరూ గర్వపడాలన్నారు బాలయ్య.

ప్రపంచ తెలుగు మహాసభలను అత్యద్భుతం..
ప్రపంచ తెలుగు మహాసభలను అత్యద్భుతంగా నిర్వహిస్తున్నారని ప్రముఖ నటుడు మోహన్ బాబు ప్రశంసించారు. దేశభాషలందు తెలుగు లెస్స అని.. అనే సూక్తిని .. పత్రి తెలుగుబిడ్డకు జ్ఞాపకం చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు సారధ్యంలో సినీ సంగీత విభావరి ఆహూతులను ఉర్రూతలూగించింది. గాయనీ,గాయకులు పాడిన పాటలు అందర్నీ ఆకట్టుకున్నాయి. నాల్గవరోజు కార్యక్రమాలకు గవర్నర్ నరసింహన్‌తోపాటు మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, డిప్యూటీ సీఎం కడియం హాజరయ్యారు. 

07:25 - December 19, 2017

హైదరాబాద్ :గుజరాత్‌లో మొత్తం 182 శాసనసభ స్థానాలు ఉన్నాయి. వీటిలో 99 బీజేపీకి, 80 కాంగ్రెస్‌కు లభించాయి. మూడు నియోజకవర్గాల్లో ఇతరులు గెలిచారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 92 మంది ఎమ్మెల్యేలు అవసరం. అయితే 2012లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి 115 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌కు 61 మంది ఎమ్మెల్యేలు ఉండేవారు. తాజా ప్రజా తీర్పును 2012నాటి ఫలితాలతో పోల్చినపుడు బీజేపీకి 16 స్థానాలు తగ్గిపోగా, కాంగ్రెస్‌ 19 స్థానాలు అధికంగా లభించాయి.గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రచారం చేసుకున్నంత స్థాయిలో పురోగతి సాధించలేకపోయింది. చావుతప్పి కన్ను లొట్టపోయిన చందంగా తయారైంది కాషాయపార్టీ పరిస్థితి. అధికారానికి అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌కు కేవలం ఏడు సీట్లు మాత్రమే అధికంగా సాధించగలిగింది. గతంతో పోలిస్తే కాంగ్రెస్‌ తన బలం బాగా పుంజుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌ సహా సహా కమలదళంలోని జాతీయ, రాష్ట్ర స్థాయి హేమాహేమీలు ప్రచారం చేసినా... చచ్చీబతికీ 99 సీట్లతో సరిపెట్టుకుంది. చివరకు ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలకు కూడా కమలనాథులు పూర్తిగా చేరువకాలేకపోయారు.

నోటాకు ఏకంగా 1.8 శాతం ఓట్లు
గుజరాత్‌ ఎన్నికల్లో పోలైన ఓట్లు, నోటాకు వచ్చిన ఓట్లను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. నోటాకు ఏకంగా 1.8 శాతం ఓట్లు వచ్చాయి. బీఎస్పీ, ఎన్సీపీలకంటే నోటాకే ఎక్కువ ఓట్లు రావడం విశేషం.. నోటాను కూడా ఒక పార్టీగా గుర్తిస్తే.. అది భాజపా, కాంగ్రెస్‌ తర్వాత మూడో స్థానంలో నిలింది. ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం గుజరాత్‌ ఎన్నికల్లో నోటాకు 5,40,566 ఓట్లు వచ్చాయి. 1.8 శాతం ఓటర్లు ఏపార్టీకి ఓటు వేసేందుకు ఇష్టపడలేదని తెలుస్తోంది. నోటాకు వచ్చిన ఓట్లు కాంగ్రెస్‌కే పడి ఉంటే ఫలితాలు మరో విధంగా ఉండేవని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే 15 స్థానాల్లో విజేతలు, పరాజితుల మధ్య తేడా దాదాపు వెయ్యి ఓట్లే.

అటు హిమాచల్ ప్రదేశ్‌లో అధికార కాంగ్రెస్‌కు బీజేపీ చెక్‌పెట్టగలిగింది. ఈ రాష్ట్రంలో మొత్తం 68 శాసనసభ నియోజకవర్గాలు ఉండగా.. బీజేపీకి 44, కాంగ్రెస్‌కు 21, ఇతరులకు మూడు స్థానాలు లభించాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 35 మంది ఎమ్మెల్యేలు అవసరం. 2012లో బీజేపీకి 26 మంది ఎమ్మెల్యేల బలం ఉండేది, తాజాగా ఈ బలం 44కు పెరిగింది. కాంగ్రెస్ బలం 36 నుంచి 21కి తగ్గింది.

వాపు చూసి బలుపుగా భ్రమపడింది...
హిమాచల్ విజయాన్ని పక్కనపెడితే.. బీజేపీ నాయకత్వం గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఎన్నెన్నో ఊహల్లో విహరించింది. వాపు చూసి బలుపుగా భ్రమపడింది. భారీ మెజారిటీతో.. 150 సీట్ల మార్కు చేరితీరతామని ఏకంగా ప్రధాని మోదీ బహిరంగసభల్లో ఊదరగొట్టారు. ప్రధాని మోదీ, బీజేపీ ఊహ వ్యూహకర్త అమిత్‌షా సొంత రాష్ట్రం కావడంతో గుజరాత్‌ ఎన్నికలు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని అమితంగా ఆకర్షించాయి. ప్రధానిగా మోదీ పనితీరుకు ఎన్నికల ఫలితాలు అద్దం పడతాయని ఆశించారు. కానీ ఓటర్లు మాత్రం కమలనాథుల ఆశలమీద నీళ్లు చల్లారు. ఘన విజయం సాధిస్తామని కాషాయంపార్టీ జోరుగా ప్రచారం చేసుకున్నా.. ఓటర్లు మాత్రం కేవలం 99 సీట్లకే పరిమితం చేశారు. 

నేడు తెలుగు మహాసభల ముగింపు వేడుకలు

హైదరాబాద్ : నేడు ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకలు జరగనున్నాయి. ముగింపు వేడుకల్లో ముఖ్యఅతిథిగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పాల్గొననున్నారు. 

నేడు, రేపు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ : నగరంలో రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో నగరంలో నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. అలాగే భారీ భద్రత ఏర్పాట్లు కూడా చేయనున్నారు.

నేడు ఉత్తరాంధ్ర కాంగ్రెస్ నేతల భేటీ

విశాఖ : నేడు ఉత్తరాంధ్ర జిల్లాల కాంగ్రెస్ నేతలు సమావేశం కానున్నారు. ఈ భేటీకి పీసీసీ చీఫ్ రఘువీరా హాజరు కానున్నారు. 

నేటి నుంచి కర్నూలు స్థానిక సంస్థ ఎమ్మెల్సీ నామినేషన్

కర్నూలు : నేటి కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవి నామినేషన్లు స్వీకరించనున్నారు. నేటి 26 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. శిల్పా చక్రపాణి రెడ్డి రాజీనామాతో ఎమ్మెల్సీ సీటు ఎన్నిలు వచ్చాయి.

Don't Miss