Activities calendar

20 December 2017

22:26 - December 20, 2017
22:25 - December 20, 2017

ఢిల్లీ : మాజీ కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి సి.ఎస్‌.కర్ణన్‌ జైలు నుంచి విడుదల అయ్యారు. సుప్రీంకోర్టు తీర్పును అవమానించారన్న ఆరోపణలపై కర్ణన్‌ను జూన్‌ 20న పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో సుప్రీంకోర్టు కర్ణన్‌కు 6 నెలల జైలు శిక్ష విధించింది.  శిక్ష పూర్తి కావడంతో ఆయనను ఇవాళ జైలు నుంచి విడుదల చేశారు. జైలు నుంచి ఆయన కోల్‌కతాలోని తన నివాసానికి వెళ్లిపోయారు. కోర్టు తీర్పును ధిక్కరించినందుకు ఓ సిట్టింగ్‌ జడ్జికి శిక్ష విధించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. దేశ వ్యాప్తంగా 20 మంది న్యాయమూర్తులపై అవినీతి ఆరోపణలు చేసినందుకు కర్ణన్‌పై కేసు నమోదైన విషయం తెలిసిందే. 

 

22:22 - December 20, 2017

ఢిల్లీ : కాలుష్యంపై యుద్ధం చేయడానికి ఆప్‌ ప్రభుత్వం సిద్ధమైంది. కాలుష్య నివారణ కోసం 'యాంటీ స్మాగ్‌ గన్‌'  పరికరాన్ని ప్రవేశపెట్టింది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా, పర్యావరణ శాఖ మంత్రి ఇమ్రాన్‌ హుస్సేన్‌ల ఆధ్వర్యంలో యాంటీ స్మాగ్‌ గన్‌ పని తీరును పరీక్షించారు. డ్రమ్ము ఆకారంలో ఉండే ఈ పరికరాన్ని వాటర్‌ ట్యాంక్‌కు అనుసంధానం చేస్తారు. ఎక్కడ పొగమంచు ఎక్కువగా ఉంటే అక్కడ దీన్ని వినియోగిస్తారు. యాంటీ స్మాగ్‌ గన్‌ నుంచి నీరు జల్లులా పడుతూ పొగమంచులోని దుమ్మూ ధూళిని నశింపచేస్తుంది. ఢిల్లీలో పొగమంచు కారణంగా వాతావరణ కాలుష్యం తీవ్రంగా పెరిగిపోయిన నేపథ్యంలో కేజ్రీవాల్‌ సర్కార్‌ ఈ చర్య చేపట్టింది.

22:20 - December 20, 2017

ఢిల్లీ : గుజరాత్‌ ఎన్నికల్లో ప్రధాని మోదీ మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌పై చేసిన విమర్శలపై పార్లమెంట్‌ దద్దరిల్లింది. ప్రధాని మోది పార్లమెంట్‌లో మన్మోహన్‌కు క్షమాపణలు చెప్పాలని రాజ్యసభలో కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. ప్రధాని క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. విపక్షాల గందరగోళం నడుమ రాజ్యసభ రేపటికి వాయిదా పడింది.

గుజరాత్‌ ఎన్నికల్లో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌పై ప్రధాని నరేంద్ర మోది చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు వరుసగా నాలుగవ రోజు కూడా పార్లమెంట్‌ను స్తంభింపజేశాయి. పార్లమెంట్‌ ఉభయ సభలు ప్రారంభమైన వెంటనే ఈ అంశాన్ని లేవనెత్తిన కాంగ్రెస్... దీనిపై చర్చ చేపట్టాలని డిమాండ్‌ చేశాయి. 

రాజ్యసభలో కాంగ్రెస్ ఈ అంశంపై చర్చించాలని పట్టుబట్టింది.  ఛైర్మన్‌ పోడియం వద్దకు దూసుకెళ్లిన కాంగ్రెస్‌ సభ్యులు ప్రధాని మోది మన్మోహన్‌కు క్షమాపణ చెప్పాలని నినాదాలు చేశారు. విపక్షాల గందరగోళం మధ్య రాజ్యసభ ఛైర్మన్ సభను 12 గంటల వరకు వాయిదా వేశారు.

తిరిగి ప్రారంభమైన సభలో ఎలాంటి మార్పులేదు. కాంగ్రెస్‌ డిమాండ్‌ను రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు తోసిపుచ్చారు. ప్రధాని మోది పార్లమెంట్‌లో చేయని వ్యాఖ్యలకు ఇక్కడ ఎలా క్షమాపణ చెబుతారని ప్రశ్నించారు. చైర్మన్‌ వ్యాఖ్యలపై సంతృప్తి చెందని కాంగ్రెస్‌ సభ్యులు తమ ఆందోళన కొనసాగించారు. విపక్షాల గందరగోళం మధ్య రాజ్యసభను ఛైర్మన్‌ 2 గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలో ఎలాంటి మార్పు లేకపోవడంతో రాజ్యసభ గురువారానికి వాయిదా పడింది.

మాజీ కాంగ్రెస్‌ నేత మణిశంకర్‌ అయ్యర్‌ ఇంట్లో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ పాకిస్తాన్‌కు చెందిన రాజకీయ నేతలతో గుజరాత్‌ ఎన్నికలపై చర్చించారని ప్రధాని నరేంద్ర మోది ఎన్నికల సభలో ఆరోపించిన విషయం తెలిసిందే. మన్మోహన్‌పై మోది తప్పుడు ఆరోపణలు చేశారని కాంగ్రెస్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

కటక్ టీ20 మ్యాచ్ లో భారత్ గెలుపు

కటక్ : శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో భారత్ గెలుపు గెలుపొందింది. 16 వోవర్లలో శ్రీలంక 87 పరుగులకు ఆలౌట్ అయింది. మొదట బ్యాంటింగ్ కు దిగిన భారత్ నిర్ణీత 20 వోవర్లలో మూడు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేశారు. 

22:13 - December 20, 2017

తమిళనాడు : చెన్నైలోని ఆర్కేనగర్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ రేపు జరగనుంది. పోలింగ్‌కు కావలసిన అన్ని ఏర్పాట్లను ఎన్నికల కమిషన్‌ పూర్తి చేసింది. దివంగత సిఎం జయలలిత మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది. జయలలిత మరణం తర్వాత తమిళనాడులో జరుగుతున్న తొలి ఎన్నిక ఇదే కావడంతో ప్రధాన పార్టీలన్నీ గెలుపై దృష్టి పెట్టాయి.
ఎన్నికల కమిషన్‌ అన్ని ఏర్పాట్లు పూర్తి 
చెన్నైలోని ఆర్‌కె నగర్‌ ఉపఎన్నికకు రంగం సిద్ధమైంది. గురువారం పోలింగ్‌ జరగనుండడంతో ఎన్నికల కమిషన్‌ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆర్‌ కె నగర్‌కు ప్రాతినిధ్యం వహించిన అన్నాడిఎంకే అధినేత్రి దివంగత సిఎం జయలలిత మృతితో ఇక్కడ ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికలో గెలుపు కోసం ప్రధాన పార్టీలైన అన్నాడిఎంకె, డిఎంకె ప్రచారం చివరిరోజు వరకూ అన్ని శక్తియుక్తులూ ఒడ్డాయి.
బరిలో 59 మంది అభ్యర్థులు 
ఆర్‌కె నగర్‌ ఉప ఎన్నికల బరిలో 59 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ ప్రధానంగా 'త్రిముఖ' పోటీ కనిపిస్తోంది. అధికార అన్నాడీఎంకే అభ్యర్థి ఇ.మధుసూదనన్, ఇండిపెండెంట్‌గా శశికళ వర్గం నేత టీటీపీ దినకరన్, ప్రతిపక్ష డీఎంకే అభ్యర్థి ఎన్.మరుదు గణేష్ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. 
ప్రధాన పార్టీలన్నీ గెలుపై దృష్టి 
జయలలిత మరణం తర్వాత తమిళనాడులో జరుగుతున్న తొలి ఎన్నిక ఇదే కావడంతో ప్రధాన పార్టీలన్నీ గెలుపై దృష్టి పెట్టాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సారథ్యంలోని అన్నాడీఎంకేకు ఈ ఉపఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది.  అన్నాడిఎంకే పార్టీ సింబల్‌ రెండాకులు పళని, పన్నీర్‌ వర్గానికే దక్కడంతో  గెలుపుపై ధీమాతో ఉన్నారు. మరోవైపు శశికళ మేనల్లుడు దినకరన్‌ కూడా గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు. ఆర్కే నగర్‌ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,28,234. వీరిలో పురుషులు 1,10,903, స్త్రీలు 1,17,232.  లింగమార్పిడి వ్యక్తులు 99 మంది ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. 
ఎన్నికల కమిషన్‌ ప్రత్యేక చర్యలు 
ఆర్కేనగర్ ఉప ఎన్నిక కీలకంగా మారడంతో ఎన్నికల కమిషన్‌ ప్రత్యేక చర్యలు చేపట్టింది. 21 మంది పరిశీలకులు ఎన్నికలను పర్యవేక్షించనున్నారు.  పోలింగ్‌ స్టేషన్ల వద్ద 2,500 మంది భద్రతా సిబ్బందిని మోహరించింది. 200కు పైగా నిఘా కెమెరాలు, 21 ఫ్లైయింగ్ స్క్వాడ్‌లు, 21 స్టాటిక్ సర్విలెన్స్ టీమ్‌లు, వీడియో రికార్డింగ్ పరికరాలతో కూడిన 20 మానిటరింగ్ టీమ్‌లు, 45 చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. ఆర్‌కె నగర్‌ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు డిసెంబర్‌ 24న జరుగుతుంది. అదేరోజు ఎన్నికల ఫలితాన్ని ప్రకటించనున్నారు. అన్నాడిఎంకేలో అంతర్గతపోరు , ప్రభుత్వ వైఫల్యంతో ఓటర్లు ఎవరికి పట్టం కడతారనే ఉత్కంఠ నెలకొంది.

 

22:06 - December 20, 2017

ప్రకాశం : చీరాల కస్తుర్బా విద్యాలయంలో ఆకలితో అలమటిస్తున్న  బాలికలపై 10 టీవీ ప్రసారం చేసిన కథనాలకు ప్రభుత్వం స్పందించింది. ఈ వ్యవహారంపై తక్షమే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జిల్లా విద్యాశాఖాధికారిని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో డీఈవో సుబ్బారావు చీరాల కేబీవీని సందర్శించి విచారణ జరిపారు. బాలికలను అడిగి వాస్తవాలను రాబట్టారు.  బాలికలకు భోజనం పెట్టకుండా రాగి సంకటితో  సరిపెడుతున్న ఉపాధ్యాయుల చర్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు.   ప్రభుత్వం నుంచి రేషన్‌ బియ్యం, ఇతర సరకులు అందకపోవడంతో రాగి సంకటి, ఉప్మా పెట్టామన్న ఉపాధ్యాయుల తీరుపై డీఈవో మండిపడ్డారు.ఇకపై ఏ లోటూ రాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

 

22:01 - December 20, 2017

మహబూబ్ నగర్ : జడ్చర్ల జనగర్జన సభలో రేవంత్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పాలమూరు జిల్లాలో కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు ప్రాజెక్టు పనులు ప్రారంభించింది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనన్నారు. కాంగ్రెస్‌ 8ఏళ్లలో 8,433 కోట్లు వెచ్చిస్తే.. టీఆర్‌ఎస్‌ 4 ఏళ్లలో 1289 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు, రాబడిని కేసీఆర్‌ కుటుంబం జల్సాలకు వెచ్చిస్తోందని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభించింది కేవలం దోచుకోవడం కోసమే అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ధ్వజమెత్తారు. 7 వేల కోట్ల రూపాయల సింగిల్‌ టెండర్‌ను ఆంధ్రా కాంట్రాక్టర్లకు అప్పనంగా కట్టబెట్టారని ఆరోపించారు. దేశంలో ఎక్కడా జరగని అవినీతి కేసీఆర్‌ నాయకత్వంలో జరుగుతుందని విమర్శించారు. 

 

21:57 - December 20, 2017

విశాఖ : జిల్లాలో తెలుగు తమ్ముళ్లు దుశ్శాసన పర్వానికి తెగబడ్డారు. భూఆక్రమణలను అడ్డుకున్న దళిత మహిళను వివస్త్రను చేసి, పైశాచికంగా దాడి చేశారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని తెలుగుదేశం నాయకులు యథేశ్చగా భూ కబ్జాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 
దళిత మహిళను వివస్త్రను చేసి, పైశాచిక దాడి 
విశాఖ జిల్లా పెందుర్తి మండలం జెర్రిపోతులపాలెంలో దారుణం జరిగింది. టీడీపీ నాయకుల భూఆక్రమణలకు అడ్డుపడ్డ దళిత మహిళను వివస్త్రను చేసి, పైశాచికంగా దాడికి పాల్పడ్డారు. ప్రభుత్వం ఇచ్చిన భూమిని సాగు చేసుకుంటూ ఓ దళిత మహిళ బతుకు వెళ్లదీస్తోంది. ఎన్టీఆర్‌ గృహ నిర్మాణం పథకం కింద ఇల్లు నిర్మించుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంది. ఎంతో  సారవంతమైన, విలువైన ఈ భూమిపై తెలుగుదేశం నాయకుల కన్నుపడిండి. ఎలాగైనా భూమిని కబ్జా చేయాలనుకున్నారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని దళితుల భూమిని ఆక్రమించుకునేందుకు బుల్‌డోజర్లను తీసుకొచ్చి... అరటి చెట్ల ధ్వంసానికి పూనుకున్నారు. ఈ దురాక్రమణను అడ్డుకునేందుకు  యత్నించిన భూమి హక్కుదారైన దళిత మహిళపై దాడికి పాల్పడ్డారు. తన భూమిని ఆక్రమించుకోవద్దంటూ  కాళ్లా, వేళ్లాపడి ప్రాధేయపడినా తెలుగు తమ్ముళ్లు కనికరించలేదు. భూమిని కాపాడుకునేందుకు జరిగిన ప్రతిఘటనలో దళిత మహిళ జాకెట్ చినిగిపోయినా, వస్త్రం కప్పేందుకు కూడా ప్రయత్నించకుండా చోద్యం చూస్తూ ఉండిపోయారు.  
టీడీపీ నాయకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు 
తెలుగుదేశం సర్పంచ్‌లు కోన శ్రీనివాసరావు, కనకరాజు.. జెర్రిపోతులపాలెంలో భూఆక్రమణలకు కారణమని బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితుల ఫిర్యాదుతో పెందుర్తి పోలీసులు దళిత మహిళపై దాడి చేసిన తెలుగుదేశం నాయకులపై ఎస్సీ, ఎస్టీ వేధింపు నిరోధక చట్టం కింది కేసు నమోదు చేశారు. మరోవైపు పెందుర్తిలో దళిత మహిళలపై టీడీపీ నాయకులు చేసిన దాడిని వైసీపీ ఖండించింది.  నిందులను అరెస్టుచేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. 
భూ ఆక్రమణలకు పాల్పడటం కొత్తేమీకాదు
విశాఖ జిల్లాలో తెలుగుదేశం నాయకులు భూ ఆక్రమణలకు పాల్పడటం ఇద్ది కొత్తేమీకాదు. గతంలో కూడా భూక్రమణలను అడ్డుకున్న మహిళలను పెందుర్తిలో తాళ్లలో కట్టేసి కొట్టిన ఘటనలు ఉన్నాయి. భూ ఆక్రమణలకు అడ్డువచ్చిన వారిని అడ్డు తొలగించుకునేందుకు సైతం  టీడీపీ నేతలు వెనుకాడటంలేదన్న ఆరోపణలున్నాయి. తెలుగుదేశం నాయకుల దాష్టీకాలు, దాడులు, దుర్మార్గాలను ప్రశ్నించే ప్రజా సంఘాల నేతలను కూడా బెదిరిస్తున్నారు. ప్రజా ప్రతినిధుల అండతోనే ఆక్రమణదారుల ఆగడాలు కొనసాగుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయినా అటు అధికారంలో ఉన్న మంత్రులు కానీ, ఇటు అధికారులు కానీ నోరు మెదపకపోవడంతో కబ్జాకోరుల దుర్మార్గాలకు అంతులేకుండా పోతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

 

21:52 - December 20, 2017

విశాఖ : పోలవరం ప్రాజెక్టు నిర్మాణం బాధ్యతను తాను వ్యక్తిగతంగా తీసుకుని 2019లోగా పూర్తి చేస్తానని కేంద్ర జలవనరులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరి హామీ ఇచ్చినట్లు ఏపీ బీజేపీ ఎంపీ హరిబాబు తెలిపారు. హరిబాబు నేతృత్వంలో బీజేపీ నేతలు కేంద్రమంత్రులను కలిసి విభజన హామీలు, రాష్ట్రానికి రావల్సిన నిధులపై చర్చించారు. పోలవరం కాంట్రాక్టర్‌, ఆర్థిక పరమైన ఇబ్బందులను తొలగిస్తానని గడ్కరీ హామీ ఇచ్చినట్లు చెప్పారు. అలాగే హోదాకు ధీటుగా ప్యాకేజీలో ఆర్థిక వనరులు అందజేస్తామని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ చెప్పినట్లు హరిబాబు తెలిపారు. కేంద్ర విద్యాసంస్థల ఏర్పాటు, భవనాల నిర్మాణంపై కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌తో చర్చించినట్లు బీజేపీ నేతలు తెలిపారు.

 

21:41 - December 20, 2017

తెలుగు తప్పని సరిమీద జనం కన్నెర్ర, పితృవియోగ నేతను పల్కరిచ్చిన సీఎం, మందక్రిష్ణ అరెస్టు మీద రగులిన ఎమ్మార్పీఎస్, మంత్రాలు జేస్తున్నదని చేశిండ్రు మర్డర్, పగటీలే ఇంట్లకు జొర్రిన చిరుత పులి...ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...  

 

21:20 - December 20, 2017

రామ్ గోపాల్ వర్మ వెబ్ సిరీస్ పై నేతలు అభ్యంతరం తెలిపారు. రామ్ గోపాల్ వర్మ వెబ్ సిరీస్ పై దృష్టి పెట్టారా ? అనే కడప ఫ్యాక్షనిజంపై సినిమాలు అనే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత త్రిపురనేని చిట్టి, సినీ విమర్శకులు కత్తి మహేష్, రచయిత కట్టా నర్సింహులు, ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి  పాల్గొని, మాట్లాడారు. రాయలసీమలో ఫ్యాక్సనిజంపై తీవ్రతరమైన సినిమాలు తీయడం సరికాదన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

20:56 - December 20, 2017

కృష్ణా : విజయవాడ వన్‌టౌన్‌లోని కేబీఎన్ కాలేజీలో ఇంటర్నెట్ వాడకంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇంటర్‌నెట్‌ వాడకం దాంతో కలిగే ప్రయోజనాలపై కూలకషంగా విద్యార్థులకు వివరించారు. విద్యతో పాటు టెక్నాలజీ పరంగా విద్యార్థులు ముందుకెళ్లాలని తమ విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దని అధ్యాపకులు సూచించారు. భవిష్యత్తు అంతా భావితరాలదేనని..సమాజం బాగుండాలంటే విద్యార్థులు మంచి స్థానాల్లో ఉన్నప్పుడే అదిసాధ్యపడుతుందన్నారు. 

 

20:54 - December 20, 2017

పశ్చిమ గోదావరి : అర్జావారి గూడెంలో 10ఎకరాల్లో 416 మంది లబ్ధిదారులకు మంత్రి జవహార్‌, ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. నియోజకవర్గంలో దాదాపు నాలుగు వేల ఇళ్ల స్థలాలకు పట్టాలు పంపిణీ చేశామని అన్నారు. అర్హులైన పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని ఎమ్మెల్యే వీరంజనేయులు అన్నారు. పత్తేపురంలో మద్యం షాపు వివాదంపై ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని మంత్రి జవహార్‌ అన్నారు. తన శాఖలో ఎలాంటి తప్పులు జరిగినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

20:52 - December 20, 2017

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు పరచాలని డిమాండ్‌ చేస్తూ పార్లమెంట్‌ స్ట్రీట్‌లో ఏపీ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలుగు ప్రజలను మోసం చేస్తున్నాయని.. పలువురు ఆరోపిస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కచ్చితంగా ఇవ్వాలని.. ఆంధ్రుల హక్కులను కాపాడుకోవాలని విద్యార్థులంటున్నారు. ఈ ధర్నాలో పలువురు ఏపీ నాయకులు పాల్గొని...సంఘీభావం తెలిపారు.

 

20:51 - December 20, 2017

ఢిల్లీ : హస్తినలోని ఏపీ భవన్‌లో ప్రజాపద్దుల కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించింది. గతంలో ఇచ్చిన సిపార్సులను ఏమాత్రం అమలు చేయలేదని పీఏసీ గుర్తించింది. అలాగే ఏపీ భవన్‌ ఖర్చులు, ఆదాయంపై సమీక్ష జరిపారు. రాబోయే  నాలుగు రోజుల్లో చిన్ననీటి పారుదల వ్యవస్థపై అధ్యయనం కోసం రాజస్థాన్‌ వెళ్తున్నట్లు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. 2003 నుంచి 2009 వరకు ఉన్న పాత కాగ్‌ రిపోర్టులను పరిశీలించారు. 

 

20:47 - December 20, 2017

అనంతపురం : ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై.. మేయర్ స్వరూప.. ధ్వజమెత్తారు. ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అనంతపురం నగర అభివృద్ధికి రాక్షసుడిలా అడ్డుతగులుతున్నారంటూ వ్యాఖ్యానించారు. గత నాలుగేళ్లలో ఒక్క రూపాయి అయినా నగర అభివృద్ధికి ఖర్చు చేశారా? అని ప్రశ్నించారు. వందకోట్లకుపైగా  తాము వివిధ పథకాల కింద ఖర్చు చేశామని.. ఈ విషయం ఏ వార్డుకు వెళ్లినా తెలుస్తుందన్నారు. ఎంపీగారు నల్ల అద్దాలు తీసి అభివృద్ధిని ఒక్కసారి చూడాలన్నారు. ఆయన సూటు వేసుకుంటే సరికాదు.. అందుకు సూటయ్యే పనులు చేయాలన్నారు. మూడు నెలలకోసారి చుట్టపు చూపులా వచ్చి ఏవో విమర్శలు చేయడం జేసీకే చెల్లుతోందన్నారు.

 

20:45 - December 20, 2017

విజయవాడ : డీఎస్సీని నిర్వహించడానికి ఏపీపీఎస్సీ సిద్ధంగానే ఉందని ఏపీపీఎస్సీ చైర్మన్‌ ఉదయ భాస్కర్‌ తెలిపారు. రేపు విజయవాడ ఆర్‌ అండ్‌ బీ బిల్డింగ్‌లో ఏపీపీఎస్సీ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. జనవరి 1 నుండి ఏపీపీఎస్సీ పూర్తి స్థాయి కార్యకలాపాలు విజయవాడ నుండే నిర్వహిస్తామని అన్నారు. ప్రభుత్వం నుండి పూర్తి స్థాయి వివరాలు, క్లియరెన్స్‌ వస్తే ప్రభుత్వం ప్రకటించిన సమయానికి డీఎస్సీ నియామకాలు పూర్తి చేయవచ్చని ఉదయ భాస్కర్‌ తెలిపారు.

 

భారత్ స్కోర్ 180 పరుగులు

కటక్ : భారత్, శ్రీలంక మధ్య తొలి టీ20 మ్యాచ్ జరుగుతోంది. భారత్ నిర్ణీత వోవర్లలో మూడు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. శ్రీలకం విజయలక్ష్యం 181 పరుగులుగా ఉంది. 

 

20:36 - December 20, 2017

విశాఖ : జిల్లాలోని పెందుర్తి మండలం జెర్రిపోతులపాలెంలో దారుణం జరిగింది. తెలుగు తమ్ముళ్లు దళిత మహిళపై దుశ్శాసన పర్వానికి పాల్పడ్డారు. ప్రభుత్వం పంపిణీ చేసిన భూములను ఆక్రమించుకునేందుకు టీడీపీ నాయకులు  ప్రయత్నించారు. బుల్‌డోజర్లలో భూములను చదును చేసేందుకు యత్నించిన తెలుగుదేశం నాయకులను అడ్డుకున్న దళిత మహిళపై దాష్టీకానికి పాల్పడ్డారు. భూఆక్రమణలను ప్రతిఘటించిన  మహిళపై  పైశాచికంగా దాడికి పాల్పడి వివస్త్రను చేశారు. 
 

20:27 - December 20, 2017

కర్నూలు : తుగ్గలి మండలం చెన్నంపల్లి కోటలో ప్రభుత్వ అనుమతి లేకుండా తవ్వకాలు జరపడంపై వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఆర్డీవో, డీఎస్పీ స్థాయి అధికారులు తవ్వకాలను పర్యవేక్షించడాన్ని ఆయన తప్పుపట్టారు. గతంలో దొంగలు నిధుల కోసం తవ్వకాలు జరిపేవారని.. ప్రస్తుతం ఎలాంటి ఆర్డర్స్‌ లేకుండా ప్రభుత్వం తవ్వకాలు చేపట్టిందని ఆయన మండిపడ్డారు. 15వ శతాబ్ధం నాటి కట్టడాన్ని స్వాధీనం చేసుకోవాలని కేంద్ర ఆర్కియాలజీ విభాగానికి చెప్పినట్లు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు.

 

20:24 - December 20, 2017

కర్నూలు : పత్తికొండ నియోజకవర్గం..చెన్నంపల్లిలో నిధుల వేట కొనసాగుతోంది. పోలీసు పహారాలో... జిల్లా అధికారులు నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నారు. అయితే వారం రోజుల నుంచి జరుపుతున్న తవ్వకాల్లో.. కేవలం ఎముకలు.. ఇనుము మాత్రమే బయటపడ్డాయి. నిధుల తవ్వకాలపై స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.... 

20:19 - December 20, 2017

ప్రకాశం : చీరాలలోని కస్తుర్బా పాఠశాలలో విద్యార్థినులు ఆకలితో అలమటిస్తున్నారు. ప్రభుత్వం నుంచి రావల్సిన బియ్యం, సరుకులు రాలేదని చెబుతున్న స్కూల్ సిబ్బంది... విద్యార్థులను ఆకలితో మాడుస్తున్నారు. మధ్యాహ్నం పూట ఉప్మా, సంకటితో సరిపెడుతున్నారు. దీంతో విద్యార్థినులు ఆకలి తీరక ఇబ్బంది పడుతున్నారు. ఈ ఘటనపై ప్రకాశం జిల్లా డీఈవో స్పందించారు. 

కేంద్రం నిర్ణయం తర్వాత రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం : కామినేని

ఢిల్లీ : ఫాతిమా కాలేజీ విద్యార్థుల సమస్యపై చివరి నిర్ణయం తెలపాలని కేంద్రాన్ని కోరామని మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. కేంద్రం నిర్ణయం తర్వాత రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. 

 

10 టివి కథనానికి స్పందించిన రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ

ప్రకాశం : చీరాల కస్తూర్బా పాఠశాలలో విద్యార్థినుల పస్తులపై 10 టివి కథనానికి రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ స్పందించింది. ఉన్నత విద్యాశాఖ ఆదేశాలతో డీఈవో విచారణ చేపట్టారు. పాఠశాల ఎస్ వో ఆమీదాబేగం నుంచి లిఖితపూర్వక వివరణ, విద్యార్థుల స్టేట్ మెంట్ ను డీఈవో సుబ్బారావు సేకరించారు. సిబ్బంది, విద్యార్థుల స్టేట్ మెంట్లను ఉన్నతాధికారులకు పంపిస్తామని డీఈవో అన్నారు.  

 

జగిత్యాల జిల్లాలో బాంబు కలకలం

జగిత్యాల : జిల్లాలో బాంబు కలకలం రేపింది. ఐఐటీ చుక్కా రామయ్య పాఠశాల సమీపంలో బాంబు పెట్టారని పోలీసులకు సమాచారం. పాఠశాల వద్ద బాండ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. సిబ్బంది, విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. పోలీసులు విద్యార్థులను ఇంటికి పంపించారు.
 

 

బాల్య వివాహాన్ని అడ్డుకున్న ఐసీడీఎస్ అధికారులు

ప్రకాశం : జిల్లాలో బాల్య వివాహాన్ని ఐసీడీఎస్ అధికారులు అడ్డుకున్నారు. అధికారులు కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అధికారులు వెళ్లిపోయిన తర్వాత బాలికను కుటుంబ సభ్యులు చిత్ర హింసలు పెట్టారు. బాలిక తప్పించుకుని మరోసారి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఐసీడీఎస్ అధికారుల సంరక్షణలో బాలిక ఉంది. 

 

19:24 - December 20, 2017

కామారెడ్డి : జిల్లాలోని ఎల్లారెడ్డిలో ముస్లింల శ్మశానవాటిక ప్రహరి నిర్మాణానికి రాజ్యసభ సభ్యులు దేవేందర్‌ గౌడ్‌ నిధులు విడుదల చేయడంపై ముస్లిం సోదరుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దేవేందర్‌గౌడ్‌ ఏ స్థానంలో ఉన్నా ఎల్లారెడ్డి అభివృద్ధిని మరిచిపోలేదని స్థానిక నేతలు కొనియాడారు. ఎంపీ లాడ్స్‌ నుంచి 3 లక్షల రూపాయలు మంజూరు చేసిన దేవేందర్‌గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఎల్లారెడ్డి అభివృద్ధి గురించి పట్టించుకోవడం లేదని ఆరోపించారు.   

 

19:22 - December 20, 2017

కామారెడ్డి : అంతర్జాతీయ జ్ఞాపక శక్తి పోటీల్లో భారత్‌కి మూడోస్థానం లభించింది. ఈ నెల 5 నుండి 8 వరకు చైనాలో జరిగిన పోటీల్లో మన దేశం నుండి 15 మంది పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లాకి చెందిన భరత్‌ గౌడ్‌కు మూడో స్థానం దక్కింది. ఐదు నిమిషాల్లో 228 నెంబర్లు చెప్పడం ద్వారా ఈ ఘనత సాధించినట్లు తెలిపాడు. 32 దేశాలకు చెందిన 310 మందిలో మూడో స్థానంలో నిలిచినట్లు భరత్‌ గౌడ్‌ తెలిపాడు. తన కుమారుడికి టాప్‌ ఫైవ్‌ మెంబర్స్‌లో ఒకడుగా నిల్వడం గర్వంగా ఉందని భరత్‌ తండ్రి అన్నారు.

 

19:19 - December 20, 2017

హైదరాబాద్ : తెలంగాణలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌కు తామే ప్రత్యామ్నాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఈమేరకు టెన్ టివి ఆయనతో ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. సామాజిక తెలంగాణ వచ్చే వరకు తమ పోరాటాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా మహాసభలకు హాజరైన ఆయన.. 31 పార్టీలు కలిసి బహుజన డెమొక్రటిక్‌ లెఫ్ట్‌ ఫ్రంట్‌గా ఏర్పడుతున్నట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో 119 స్థానాల్లో పోటీచేస్తామని చెప్పారు. 

 

19:13 - December 20, 2017

హైదరాబాద్‌ : బాలలు విద్యార్థి దశ నుంచే సానుకూల ఆలోచనా ధృక్పథాన్ని అలవరచుకోవాలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పిలుపు ఇచ్చారు. సానుకూల ఆలోచనలతో జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని సూచించారు. రెండు రోజుల  రాష్ట్ర పర్యటనలో భాగంగా చివరిరోజు బుధవారం హైదరాబాద్‌లో జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 
రాజ్‌భవన్‌ ఉన్నత పాఠశాలను సందర్శించిన రాష్ట్రపతి  
మంగళవారం హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌.. బుధవారం రాజ్‌భవన్‌ ఉన్నత పాఠశాలను సందర్శించారు. రాష్ట్ర  గవర్నర్‌ నరసింహన్‌, ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్‌ అలీ, సికింద్రాబాద్‌ ఎంపీ బండారు దత్తాత్రేయ, అధికారులు, అనధికారులు, పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు రాష్ట్రపతికి  స్వాగతం పలికారు. 
విద్యార్థులతో ముచ్చటించిన రాష్ట్రపతి
రాజ్‌భవన్‌ స్కూల్లో ఉన్న సౌకర్యాలను పరిశీలించిన రాష్ట్రపతి... విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం విద్యార్థులకు సందేశమిస్తూ... రాజ్‌భవన్‌ పాఠశాలను అత్యున్నత ప్రమాణాలతో నిర్వహిస్తున్న ప్రభుత్వాన్ని అభినందించారు. మొదట 150 మంది విద్యార్థులతో ప్రారంభమైన రాజ్‌భవన్‌ స్కూలు ఇప్పుడు 1100 మందికి పైగా విద్యార్థులకు చేరుకోవడం మంచి పరిణామన్నారు.  ఈస్కూల్లో స్వచ్ఛమైన మంచినీరు, డిజిటల్ లైబ్రరీ, పుస్తకాలు, కంప్యూటర్స్‌ వంటి సౌకర్యాలు ఉండటం ఆదర్శనీయమని ప్రశంసించారు. విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, యూనిఫాంలు  అందించడం  అభినందనీయమన్నారు. స్కూల్లో ఉన్న ఆధునిక సౌకర్యాలను విద్యార్థులు ఉపయోగించుకుని, కష్టపడి చదివి జీవితంలో పైకి రావాలని కోవింద్‌ సూచించారు. 
మహనీయుల జీవిత చరిత్రలను చదవి స్ఫూర్తి పొందాలి : రామ్‌నాథ్‌ 
స్వాతంత్ర్య సమరయోధులు, జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కాలం వంటి మహనీయుల జీవిత చరిత్రలను చదవి స్ఫూర్తి పొందాలని రామ్‌నాథ్‌ కోవింద్‌ విద్యార్థులకు  సూచించారు. విద్యార్థులు అడ్డదారుల్లో కాకుండా కష్టపడిచదవి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుని, సమాజానికి తమవంతు సేవ చేయాలని రాష్ట్రపతి కోరారు. 
బుద్ధుని విగ్రహాన్ని సందర్శించిన రామ్‌నాథ్‌ 
రాజ్‌భవన్‌ స్కూలు సందర్శన తర్వాత రామ్‌నాథ్‌ కోవింద్‌ హుస్సేన్‌సాగర్‌ తీరానికి చేరుకుని... ప్రత్యేక పడవలో బుద్ధుని విగ్రహం వద్దకు వెళ్లారు. జీబ్రాల్టర్‌ రాక్‌పై ఉన్న బుద్ధుని విగ్రహాన్ని సందర్శించి పుష్ఫాంజలి ఘటించారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బుద్ధ విగ్రహాన్ని సందర్శించిన తర్వాత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ హుస్సేన్‌సాగర్‌ వద్ద నుంచి నేరుగా బేగంపేట విమానాశ్రయం చేరుకున్నారు. బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్లిన రాష్ట్రపతికి విమానాశ్రయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌, గవర్నర్‌ నరసింహన్‌ ప్రభుత్వ అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు.

 

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రీలంక

కటక్ : భారత్, శ్రీలంక మధ్య తొలి టీ20 మ్యాచ్ జరుగనుంది. టాస్ గెలిచిన శ్రీలంక భారత్ కు బ్యాటింగ్ అప్పగించింది. శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకుంది. 

 

హైదరాబాద్ లో శిశువులను విక్రయిస్తున్న ముఠా అరెస్టు

హైదరాబాద్ : నగరంలో శిశువులను విక్రయిస్తున్న ముఠాను అరెస్టు చేశారు. పోలీసులు ముఠాను పట్టుకుని పది రోజుల శిశువును రక్షించారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలంలోని తండాకు చెందిన కేతావత్ దేవి, సేవ్య దంపతులకు పది రోజుల క్రితం ఆడపిల్ల పుట్టింది. ఈ శిశువును 8 మంది సభ్యులు రూ.15 వేలకు కొనుగోలు చేశారు. హైదరాబాద్ ఎల్ బీ నగర్ లోని వెంకటేశ్వరకాలనీకి చెందిన ఓ వ్యక్తికి రూ.80 వేలకు విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

17:48 - December 20, 2017

హైదరాబాద్ : నగరంలో శిశువులను విక్రయిస్తున్న ముఠాను అరెస్టు చేశారు. పోలీసులు ముఠాను పట్టుకుని పది రోజుల శిశువును రక్షించారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలంలోని తండాకు చెందిన కేతావత్ దేవి, సేవ్య దంపతులకు పది రోజుల క్రితం ఆడపిల్ల పుట్టింది. ఈ శిశువును 8 మంది సభ్యులు రూ.15 వేలకు కొనుగోలు చేశారు. హైదరాబాద్ ఎల్ బీ నగర్ లోని వెంకటేశ్వరకాలనీకి చెందిన ఓ వ్యక్తికి రూ.80 వేలకు విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
శిశువులను విక్రయిస్తున్న ముఠాలో ఇద్దరు పరుషులు, ఆరుగురు మహిళలు ఉన్నారు. పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

17:37 - December 20, 2017
17:35 - December 20, 2017

ప్రకాశం : జిల్లాలోని చీరాలలో దారుణం జరిగింది. కస్తూర్బా గాంధీ పాఠశాలల పరిస్థితి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా ఉంది. విద్యార్థినిలు ఆకలిలో అలమటిస్తున్నారు. చీరాలలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో విద్యార్థినిలు రెండు రోజులుగా ఆకలితో అలమటిస్తున్నారు. ఉప్మాతో కడుపునింపే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బియ్యం, సరుకులు రాలేదని పాఠశాల సిబ్బంది చెబుతున్నారు. తాగునీటి వసతి కూడా లేదు. విద్యార్థులకు వచ్చే కాస్మోటిక్ ఛార్జీల నుంచి కొంత డబ్బులు తీసుకుని మంచినీరును కొనుగోలు చేస్తున్నారు. బియ్యం అయిపోయాయని ఉదయం ప్రేయర్ లో చెప్పారని విద్యార్థినిలు చెబుతున్నారు. సేమియా, రాగి సంకటితో సరిపెడుతున్నారని చెప్పారు. 

ఏపీ ప్రభుత్వ పలు శాఖలకు స్కోచ్ అవార్డుల పంట

అమరావతి : ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖలకు స్కోచ్ అవార్డుల పంట పడింది. ఏపీ పంచాయతీరాజ్ శాఖ ఐదు స్కోచ్ అవార్డులు సాధించింది. స్కోచ్ సాంకేతిక విభాగంలో పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరాల శాఖల డ్యాష్ బోర్డుకు అవార్డు సాధించింది. జలవాణి కాల్ సెంటర్ స్కోచ్ బ్లూ ఎకానమీ అవార్డు సాధించించింది. ఐఓటీ ఎల్ ఈడీ లైట్ల పర్యవేక్షణకు స్కోచ్ మొబిలిటీ అవార్డు దక్కింది. ఆర్ ఎఫ్ ఐడీ కార్డు వినియోగించి చెత్త సేకరణ, పర్యవేక్షణకు స్కోచ్ బ్లూ ఎకానమీ అవార్డు లభించింది.

మంత్రి గంటా శ్రీనివాస్ రెడ్డిని కలిసిన యూటీఎఫ్ నేతలు

అమరావతి : మంత్రి గంటా శ్రీనివాస్ రెడ్డిని యూటీఎఫ్ నేతలు కలిశారు. డీఎస్సీ నిర్వహణ బాధ్యతలను ఏపీపీఎస్సీకి ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు. 

 

16:35 - December 20, 2017
16:27 - December 20, 2017

ప్రకాశం : జిల్లాలోని చీరాలలో దారుణం జరిగింది. కస్తూర్బా గాంధీ పాఠశాలల పరిస్థితి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా ఉంది. రెండు రోజులుగా కస్తూర్బా పాఠశాలలో విద్యార్థినిలు ఆకలితో అలమటిస్తున్నారు. ఉప్మాతో కడుపునింపే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బియ్యం, సరుకులు రాలేదని పాఠశాల సిబ్బంది చెబుతున్నారు. తాగునీటి వసతి కూడా లేదు. విద్యార్థులకు వచ్చే కాస్మోటిక్ ఛార్జీల నుంచి కొంత డబ్బులు తీసుకుని మంచినీరును కొనుగోలు చేస్తున్నారు. బియ్యం అయిపోయాయని ఉదయం ప్రేయర్ లో చెప్పారని విద్యార్థినిలు చెబుతున్నారు. సేమియా, రాగి సంకటితో సరిపెడుతున్నారని చెప్పారు. 
ఎస్ ఎఫ్ ఐ నేత రఘురాం.. 
కస్తూర్బా పాఠశాల పరిస్థితి పేరు గొప్ప..ఊరు దిబ్బ అన్న చందంగా ఉంది. విద్యార్థినిలు  ఆకలితో అలమటిస్తున్నారు. విద్యార్థినులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వాలు బ్రహ్మాండంగా చెబుతున్నాయి..కానీ వారిని పట్టించుకోవడం లేదన్న విషయం ఈ ఘటనతో తేటతెల్లమైంది. ప్రభుత్వం కావాలనే కస్తూర్బా పాఠశాలలను మూసివేయాలని చూస్తున్నారు. సమస్యలను ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. అధికారుల సరైన పర్యవేక్షణ ఉండాలి.  పాఠశాలలకు నిధులు ఇవ్వాలి. పెరిగిన ధరలకనుగుణంగా కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలి. అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు' అన్నారు. 

 

16:01 - December 20, 2017

కడప : జిల్లా సెంట్రల్ జైలులో ఓ ఖైదీ ఆత్మహత్యకు పాల్పడ్డారు. పంచతో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు చేసుకున్నాడు. గుంటూరు జిల్లాకు చెందిన శ్రీనివాస్ రెడ్డికి చీటింగ్ కేసులో గుంటూరు జిల్లా కోర్టు పది నెలల జైలు శిక్ష విధించింది. కడప సెంట్రల్ జైలులో శ్రీనివాస్ రెడ్డి శిక్ష అనుభవిస్తున్నాడు. మూడు నెలల శిక్ష పూర్తి అయింది. ఈనేపథ్యంలో జైలులో తను ఉంటున్న బ్యారక్ లో పంచతో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. జైలు సిబ్బంది అతన్ని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శ్రీనివాస్ రెడ్డి మృతి చెందాడు.  

 

15:56 - December 20, 2017

బాల్య వివాహాల నిరోధక చట్టం అనే అంశంపై నిర్వహించిన మావని మైరైట్ కార్యక్రమంలో లాయర్ పార్వతి పాల్గొని, మాట్లాడారు. 1929సం.లో బాల్య వివాహాల నిరోధక చట్టం వచ్చిందని చెప్పారు. పేదరికం, నిరక్షరాస్యత, ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాల వారిలో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. ఆడపిల్ల భద్రత దృష్ట్యా, కుటుంబసభ్యుల ఒత్తిడి వల్ల చిన్న వయస్సులో ఆడపిల్లలకు బాల్య వివాహాలు చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 4 లక్షల బాల్య వివాహాలు జరిగాయని పేర్కొన్నారు. 13 నుంచి 16 వయస్సు గల ఆడపిల్లలకు బాల్య వివాహాల సంఖ్య చాలా అధికంగా ఉందన్నారు. బాల్య వివాహాలను చట్టం దృష్టికి తీసుకెళ్తే నివారించే అవకాశం ఉంటుందని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

15:49 - December 20, 2017

విశాఖ : డీసీఐను ప్రైవేటీకరిస్తే చూస్తు ఊరుకోం అంటూ మెరుపు సమ్మెకు దిగారు కార్మికులు. సంస్ధ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గత నెల 28 నుంచి డీసీఐ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. కార్మికులు చేస్తున్నసమ్మెకు డీసీఐ ఉద్యోగులతో పాటుగా డ్రెడ్జింగ్ షిప్స్‌పై పనిచేస్తున్న ఉద్యోగులు కూడా మద్దతిచ్చారు. డీసీఐ సమ్మెపై మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

మెహిదీపట్నం ఆలివ్‌ ఆస్పత్రిలో దారుణం

హైదరాబాద్‌ : ఓ ఆస్పత్రి డాక్టర్ల నిర్లక్ష్యంతో తొమ్మిదేళ్ల బాలుడి ప్రాణాలు గాలిలో కలిశాయి. 10 నెలల క్రితం జరిగిన ఘటన ఆలస్యంగా బయటపడింది. మూడో తరగతి చదువుతున్న హార్దిక్‌ స్కూల్‌లో ఆడుకుంటూ గ్లాస్‌ పగలడంతో గాయపడ్డాడు. వెంటనే హార్దిక్‌ను మెహిదీపట్నంలోని ఆలివ్‌ ఆస్పత్రిలో చేర్చారు. చేతికి గాయమైన బాలుడికి సరైన వైద్యం అందించకపోవడంతో మృతి చెందాడు.

 

15:43 - December 20, 2017

హైదరాబాద్‌ : ఓ ఆస్పత్రి డాక్టర్ల నిర్లక్ష్యంతో తొమ్మిదేళ్ల బాలుడి ప్రాణాలు గాలిలో కలిశాయి. 10 నెలల క్రితం జరిగిన ఘటన ఆలస్యంగా బయటపడింది. మూడో తరగతి చదువుతున్న హార్దిక్‌ స్కూల్‌లో ఆడుకుంటూ గ్లాస్‌ పగలడంతో గాయపడ్డాడు. వెంటనే హార్దిక్‌ను మెహిదీపట్నంలోని ఆలివ్‌ ఆస్పత్రిలో చేర్చారు. చేతికి గాయమైన బాలుడికి సరైన వైద్యం అందించకపోవడంతో మృతి చెందాడు. బాలుడి మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని... విచారణ చేపట్టిన మెడికల్‌ బోర్డు అక్టోబర్‌ 25న నివేదిక ఇచ్చింది. తాజాగా నివేదిక రావడంతో... హార్దిక్‌ కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

 

చెన్నంపల్లి కోటలో కొనసాగుతోన్న తవ్వకాలు

కర్నూలు : జిల్లాలోని చెన్నంపల్లి కోటలో 8వరోజు తవ్వకాలు కొనసాగుతున్నాయి. వారం రోజులుగా ఈ కోటలో నిధుల కోసం అన్వేషణ కొనసాగుతోంది. ఇప్పటివరకు 30 అడుగుల లోతు వరకు కోటలో తవ్వకాలు జరపగా సొరంగం, ఏనుగు దంతం బయటపడింది. తవ్వకాలలో ఎలాంటి నిధులు దొరక్కపోవడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. 
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

15:29 - December 20, 2017

కర్నూలు : జిల్లాలోని చెన్నంపల్లి కోటలో 8వరోజు తవ్వకాలు కొనసాగుతున్నాయి. వారం రోజులుగా ఈ కోటలో నిధుల కోసం అన్వేషణ కొనసాగుతోంది. ఇప్పటివరకు 30 అడుగుల లోతు వరకు కోటలో తవ్వకాలు జరపగా సొరంగం, ఏనుగు దంతం బయటపడింది. తవ్వకాలలో ఎలాంటి నిధులు దొరక్కపోవడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. 
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

పంచతో ఉరేసుకుని ఖైదీ ఆత్మహత్య

కడప : సెంట్రల్ జైలులో ఖైదీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన పంచతో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. జైలు సిబ్బంది అతన్ని రిమ్స్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. 

డీఎస్సీ నిర్వహణపై మంత్రి గంటా సమీక్ష

గుంటూరు : డీఎస్సీ నిర్వహణపై మంత్రి గంటా శ్రీనివాస్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ హాజరయ్యారు. ఖాళీలు, రోస్టర్, సెమిస్టర్ తదితర అంశాలపై చర్చిస్తున్నారు.

13:36 - December 20, 2017

నేచుర‌ల్ స్టార్ 'నాని' మరో హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. వరుస హిట్ సినిమాలు చేస్తూ దర్శక..నిర్మాతలకు వరంగా మారాడు. తాజాగా ఆయన మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమా 'ఎంసీఏ' (మిడిల్ క్లాస్ అబ్బాయి'. 'నాని'కి జంట‌గా ఇటీవ‌ల 'ఫిదా'తో తెలుగువారి మ‌న‌సుల్ని దోచుకున్న 'సాయిప‌ల్ల‌వి' నటించింది. శ్రీరామ్ వేణు ద‌ర్శ‌క‌త్వం వ‌స్తున్న ఈ సినిమాలో 'నాని'కి వదినగా నటి 'భూమిక' నటించింది. చిత్రం డిసెంబర్ 21వ తేదీన రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా టెన్ టివి 'నాని'తో ముచ్చటించింది. ఆయన ఎలాంటి విశేషాలు వెల్లడించారో వీడియో క్లిక్ చేయండి. 

13:32 - December 20, 2017

ఢిల్లీ : ప్రత్యేక హోదాపై మళ్లీ ఆందోళనలు మిన్నంటుతున్నాయి. పార్లమెంట్ స్ట్రీట్ లో ఏపీ విద్యార్థి జేఏసీ ఆందోళన చేపట్టింది. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలంటూ ధర్నా చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయని, ప్రత్యేక హోదా ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనన్నారు. పార్లమెంట్ సమస్యలు లేవనెత్తకుండా నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా డిమాండ్ తో విద్యార్థుల చేస్తున్న ఆందోళనలో కేవీపీ, ఏపీ, సీపీఐ కార్యదర్శి రామకృష్ణ ప్రసాద్, చలసాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 

ఏపీ విద్యార్థి జేఏసీ ఆందోళన...

ఢిల్లీ : పార్లమెంట్ స్ట్రీట్ లో ఏపీ విద్యార్థి జేఏసీ ఆందోళన చేపట్టింది. ఏపీకి ప్రత్యేక హోదా హామలు అమలు చేయాలని డిమాండ్ చేపట్టింది. ప్రత్యేక హోదా డిమాండ్ తో విద్యార్థుల చేస్తున్న ఆందోళనలో కేవీపీ, ఏపీ, సీపీఐ కార్యదర్శి రామకృష్ణ ప్రసాద్, చలసాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 

పోలవరం పురోగతిపై...

ఢిల్లీ : పోలవరం పురోగతిపై ఉప రాష్ట్రపతి సమక్షంలో సమీక్ష జరుగుతోంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి, మంత్రి కామినేని, ఎంపీ హరిబాబు, ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, ఉన్నతాధికారులు హాజరయ్యారు. పోలవరం ప్రాజెక్టు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారంపై చర్చిస్తున్నారు. 

జయ వీడియోపై ఈసీ ఆగ్రహం...

చెన్నై : జయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దృశ్యాలను వీడియో ద్వారా బహిర్గతం చేయడంపై ఈసీ సీరియస్ అయ్యింది. టిటివి దినకరన్ వర్గంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు, ఎమ్మెల్యే వెట్రివేల్ పై చర్యలు తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. వీడియో విడుదల చేయడం ఎన్నికల నియమావళికి విరుద్ధమని, ఏ ఉద్ధేశ్యంతో వీడియో రిలీజ్ చేయాలో చెప్పాలని ఈసీ ప్రశ్నించింది. 

13:18 - December 20, 2017

హైదరాబాద్ : సంగీత ఇక న్యాయం జరుగదా ? న్యాయం చేస్తానని చెప్పిన పెద్దలు ఎక్కడికి పోయారు ? అత్తా మామలు ఎక్కడకు వెళ్లారు ? ఎందుకు న్యాయం జరగడం లేదు ? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

భర్త చేతిలో ఘోరంగా మోసపోయింది. అయినా.. భార్యగా తన హక్కుల కోసం సంగీత చేస్తున్న పోరాటం 32వ రోజుకు చేరింది. పగలు..రాత్రి..చలి ఏవీ లెక్కచేయకుండా అత్తింటి ముందే చంటిపాపతో నానా కష్టాలు పడుతోంది. ప్రజాప్రతినిధులు ముఖం చాటేసినా మహిళా సంఘాలు, ప్రజా సంఘాల మద్దతుతో పోరాటం కొనసాగిస్తోంది. నేతల తీరును నిరసిస్తూ... మహిళా సంఘాలు ఆందోళన ఉధృతం చేశాయి. ఈ సందర్భంగా సంగీత..మహిళా సంఘం నేతలతో టెన్ టివి మాట్లాడింది. మరిన్ని విషయాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

13:13 - December 20, 2017
13:03 - December 20, 2017
12:29 - December 20, 2017

లోక్ సభలో అదే లొల్లి..

ఢిల్లీ : కాసేపటి కిత్రం లోక్ సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రారంభం అయిన వెంటనే కాంగ్రెస్ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. డా.సాహెబ్ సే మాఫీ మాంగో' అంటూ పెద్దపెట్టున నినాదాలు చేయడంతో సభను మధ్యాహ్నం 2గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు. 

దళిత మహిళపై టిడిపి నేతల దుశ్చర్య..

పెందుర్తి: సభ్యసమాజం తలదించుకునేలా దళిత మహిళను టిడిపి నేతలు వివస్త్రను చేశారు. ఈ ఘటన పెందుర్తి మండలం జెర్రిపోతులపాలెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దళితుల భూమిని ‘ఎన్టీఆర్‌ గృహకల్ప’ పేరుతో ఆక్రమించుకునేందుకు ప్రయత్నించగా ఆ మహిళ అడ్డుకుంది. దీనితో నేతలు ఆమెపై దాడి చేసి బట్టలను చించేసి గాయపరిచారు. 

12:20 - December 20, 2017

చెన్నై : అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుత్ను జయ ఫుటేజ్ ను టిటివి దినకరన్ వర్గానికి చెందిన వెట్రివేల్ బయపెట్టారు. దీనితో ఈ వీడియో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. సెప్టెంబర్ 25వ తేదీన జయలలిత ఆసుపత్రిలో ఉన్న దృశ్యాలని దినకరన్ వర్గం చెబుతోంది. గురువారం ఆర్కే నగర్ ఉప ఎన్నిక కావడం..జయ మృతి చెందిన ఏడాది తరువాత విజువల్స్ బహిర్గతం చేయడం.. సెంటిమెంట్ గా వెట్రివేల్ ఈ వీడియోను బయటపెట్టినట్లు సమాచారం. నిరాధారణమైన ఆరోపణలు చేస్తున్నందునే అమ్మ వీడియో విడుదల చేయాల్సి వచ్చిందని, అమ్మను ఆసుపత్రికి తీసుకొచ్చే సమయంలో మరణించారని పన్నీర్ సెల్వం తో సహా అందరూ చెప్పారని గుర్తు చేశారు. జయ ఆసుపత్రిలో ఉన్నంతకాలం అదే మాట చెప్పారని, అమ్మ మరణం విసయంలో అందరూ నాటకాలు ఆడారని పేర్కొన్నారు. మరికొన్ని వీడియోలు తమ వద్ద ఉన్నాయని, అవసరమైనప్పుడు విడుదల చేస్తామన్నారు. మరింత విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి...

'బహుజన డెమెక్రటిక్ లెఫ్ట్ ఫ్రంట్ ఏర్పాటు'...

ఖమ్మం : జిల్లాలో 20వ సీపీఎం జిల్లా మహాసభలు జరుగుతున్నాయి. ఈ సభల్లో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్..కాంగ్రెస్ ను ఓడించడం...సీపీఎంను గెలిపించాలని ప్రజల్లోకి వెళుతామన్నారు. తెలంగాణలో బహుజన డెమెక్రటిక్ లెఫ్ట్ ఫ్రంట్ ఏర్పాటు అయినట్లు, ఆవిర్భావ సదస్సుకు ప్రకాష్ కారత్, అంబేద్కర్ మనువడు ప్రకాష్ అంబేద్కర్ లు హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. ఫ్రంట్ లో బీఎస్పీ చేరికపై మాయావతితో చర్చలు జరుపుతున్నట్లు, త్వరలో సీపీఐ, న్యూ డెమోక్రసీ అంగీకారం తెలుపనున్నాయన్నారు.

మాజీ జడ్జి కన్నన్ విడుదల..

కోల్ కతా : మాజీ కలకత్తా హైకోర్టు జడ్జీ కన్నన్ జైలు నుండి విడుదలయ్యారు. జూన్ 20వ తేదీన ఆయన అరెస్టు అయిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టును తీవ్రంగా విమర్శిస్తూ ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. 

11:45 - December 20, 2017

విశాఖపట్టణం : దళితులపై వివక్ష..దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఏపీ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో దళితలను సాంఘీక బహిష్కరణ చేయడం...దాడులు చేయడం తదితర ఘటనలు వెలుగులోకి వసస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ దళిత మహిళపై అధికార పార్టీకి చెందిన నేతలు దాడికి పాల్పడ్డారు. స్థల వివాదంపై ఈ ఘటన చోటు చేసుకుంది. పెందుర్తి మండలం జెర్రిపోతులపాలెంలో దళితులకు ప్రభుత్వం స్థలాలిచ్చింది. ఈ భూములపై కొందరి కన్ను పడడం..వాటిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. దీనిపై దళిత మహిళ నిలదీసింది. ఆగ్రహానికి గురైన ఓ నేత ఆమెపై దాడికి పాల్పడ్డాడు. జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లినట్లు..దీనితో ఆమె బట్టలు చినిగిపోయినట్లు తెలుస్తోంది. తనన కులం పేరిట దూషించారని మహిళ పీఎస్ లో ఫిర్యాదు చేసింది. 

రాష్ట్రపతికి వీడ్కోలు..

హైదరాబాద్ : భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ బేగంపేట విమానశ్రయానికి చేరుకున్నారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొన్న ఆయన నేడు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరారు. 

ముంబై - పూణె జాతీయ రహదారిపై..

ఢిల్లీ : ముంబై - పూణె జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా ఏడుగురికి గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

11:32 - December 20, 2017

జగన్ 40వ రోజు..

అనంతపురం : వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన మహాసంకల్ప పాదయాత్ర కొనసాగుతోంది. 40వ రోజు బుధవారం ఉదయం వెంకటాపురం క్రాస్‌ రోడ్డు నుంచి పాదయాత్రను చేపట్టారు. 

11:19 - December 20, 2017

తమిళనాడు : ఆర్కే నగర్ ఉప ఎన్నిక ముందు ఓ సంచలనం బహిర్గతమైంది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అయ్యింది. కాసేపటి క్రితం టిటివి దినకరన్ వర్గం ఈ వీడియోను బయటపెట్టింది. ఉప ఎన్నిక నేపథ్యంలో సెంటిమెంట్ ను క్యాష్ చేసుకోవాలనే ఉద్ధేశ్యంతోనే ఈ వీడియో బహిర్గతం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. 

జయలలిత మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమయిన సంగతి తెలిసిందే. ఆమె మృతి అనంతరం రాష్ట్రంలో తీవ్రమైన రాజకీయ సంక్షోభం నెలకొంది. పన్నీర్..పళనీ స్వామి వర్గాలు ఏకమై అధికారాన్ని చేజిక్కించుకున్నారు. జయ ముఖ్య వ్యక్తి శశికళ జైలుకు వెళ్లింది. ఇదిలా ఉంటే ఆమె మృతి అనంతరం ఆర్కే నగర్ ఉప ఎన్నికకు గతంలో ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేశారు. కానీ ప్రచారంలో భారీగా డబ్బులు వెదజల్లుతుండడంతో ఎన్నికను వాయిదా వేశారు.

డిసెంబర్ 21వ తేదీన ఉప ఎన్నిక జరుగనుంది. ఈ నేపథ్యంలో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జయకు సంబంధించిన ఓ వీడియో బయటకు పొక్కింది. టిటివి దినకరన్ వర్గం ఈ వీడియోను బహిర్గతం చేసింది. గత ఏడాది సెప్టెంబర్ 27వ తేదీన ఈ వీడియో ఉన్నట్లు తెలుస్తోంది. వీడియోలో జయ ఏటవాలుగా కూర్చొన్నారు...ఓ ద్రవాన్ని ఆమె సేవిస్తుండడం కనిపిస్తోంది. కానీ ఈ వీడియోలో జయ గుర్తు పట్టలేని పరిస్థితిలో ఉన్నారు. ఆసుపత్రికి తీసుకొచ్చే ముందే జయ మృతి చెందారని..అనేక ఆరోపణలున్నాయి. దీనితో జయ మృతిపై విచారణ జరిపించాలని డిమాండ్ వినిపించడంతో ప్రభుత్వం ఆర్మూగ స్వామి నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రస్తుతం విచారణ చేపడుతోంది. ఉప ఎన్నిక నేపథ్యంలో బయటపడిన జయ వీడియో ఎలాంటి సంచనాలు నమోదు చేస్తుందో చూడాలి. 

జయ వీడియో కలకలం..

తమిళనాడు : దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీడియో బయటపడింది. ఆర్కే నగర్ ఉప ఎన్నికకంటే ముందు టిటివి దినకరన్ వర్గం ఈ వీడియోను బయటపెట్టింది. 

11:03 - December 20, 2017

బుద్ధుడికి రాష్ట్రపతి నివాళులు...

హైదరాబాద్ : నగరంలోని హుస్సేన్ సాగర్ లో ఉన్న బుద్ధ విగ్రహానికి భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నివాళులర్పించారు. ఆయన వెంట ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, డిప్యూటి సీఎం మహమూద్ ఆలీ, తదితరులున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 

మాజీ ఎయిర్ మార్షల్ కు బెయిల్ మంజూరు...

ఢిల్లీ : మాజీ ఎయిర్ మార్షల్ జస్పాల్ సింగ్ కు పాటియాల కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ. 2 లక్షల నగదు పూచికత్తుతో బెయిల్ మంజూరు చేసింది. మే 30, 2018కి కేసు విచారణకు వాయిదా వేసింది. 

బీజేడీ ఆందోళన...

ఢిల్లీ : పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద బీజేడీ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఒడిశా - ఛత్తీస్ గడ్ రాష్ట్రాల మధ్య వివాదంగా ఉన్న మహనది నీటి పంపకాలపై వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. 

కింద పడిన కేంద్ర మంత్రి..

ఢిల్లీ : కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కృష్ణ రాజ్ కిందపడిపోయారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో జరుగుతున్న బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశానికి ఆయన హాజరయ్యారు. ప్రమాదవశాత్తు కిందపడిపోయారు. వెంటనే అక్కడున్న సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. 

10:25 - December 20, 2017

రంగారెడ్డి : మృత్యువు ఏ వైపు నుండి..ఏ రూపంలో వస్తుందో తెలియదు. ఒకరు చేసిన తప్పు కారణంగా నిండు ప్రాణాలు రోడ్డు ప్రమాదాల్లో గాలిలో కలసిపోతున్నాయి. ఓ ఫంక్షన్ కు వెళుతున్న బాలికను ఓ బస్సు చిదిమేసింది. అబ్దుల్లాపూర్ పెట్ మండలంలో సెయింట్ మేరీ కాలేజీ బస్సు బీభత్సం సృష్టించింది. పెద్ద అంబర్ పేటలో బుధవారం ఉదయం వేగంగా వెళుతున్న కాలేజీ బస్సు అదుపు తప్పింది. ముందు వెళుతున్న ఆర్టీసీ బస్సును ఢీకొంది. అమాంతం ద్విచక్రవాహన దారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బిందు బాలిక ప్రాణాలు కోల్పోయింది. కొత్తపేటలో నివాసం ఉంటున్న బిందు తన బాబాయి తో కలిసి ఓ ఫంక్షన్ కు వెళుతోంది. ప్రమాదం జరగడంతో రెండు..మూడు కిలో మీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని సమీక్షించారు. 

ట్యాంక్ బండ్ పై రాష్ట్రపతి...

హైదరాబాద్ : భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ట్యాంక్ బండ్ కు చేరుకున్నారు. హుస్సేన్ సాగర్ లో ఉన్న బుద్ధుడి విగ్రహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

ప్రైవేటు కాలేజీ బస్సు బీభత్సం...

హైదరాబాద్ : పెద్ద అంబర్ పేటలో ఓ ప్రైవేటు కాలేజీ బస్సు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి కారు, రెండు ఆటోలను బస్సు ఢీకొంది. కొత్తపేటకు చెందిన మధుశాలని (12) మృతి చెందింది. నలుగురికి గాయాలు కావడంతో వీరిని ఆసుపత్రికి తరలించారు. 

10:16 - December 20, 2017

హైదరాబాద్ : ఉప్పల్ లోని నల్ల చెరువుకట్ట సమీపంలో తెలంగాణ ఆర్టీసీ సంస్థకు చెందిన రెండు బస్సులపై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. గత వారంలో కూరగాయాల మార్కెట్ లో గుర్తు తెలియని దుండగులు ఓ షాపును దగ్ధం చేసిన సంగతి తెలిసిందే. బస్సులను దగ్ధం చేసింది కూడా ఆ దుండగులేనని పోలీసులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. రెండు బస్సులు పాక్షికంగా కాలిపోయాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దుండగుల కోసం గాలిస్తున్నారు. 

10:13 - December 20, 2017

ఢిల్లీ : పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమై నాలుగు రోజులు గడిచిపోయాయి. కానీ ఈ సమావేశాల్లో కాంగ్రెస్ తీవ్ర ఆందోళన చేపడుతోంది. మాజీ ప్రధాని మన్మోహన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు సభను అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే. వెంటనే దీనిపై ప్రధాని మోడీ క్షమాపణలు చెప్పాలని పట్టుబడుతోంది. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పాక్ అంశాన్ని ఎందుకు తెరలేపారని, కోర్టుల దృష్టికి ఎందుకు తీసుకెళ్లడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదిలా ఉంటే సభలో ఎలాంటి వ్యూహం అనుసరించాలనే దానిపై బీజేపీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్ లో ప్రధాని మోడీ పార్టీ ఎంపీలకు దిశా..నిర్ధేశం చేయనున్నారు. బుధవారం పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో ఈ సమావేశం జరుగుతోంది. కేంద్ర మంత్రులు..హాజరయ్యారు. బీజేపీ పార్టీ సభ్యులకు త్రీ లైన్ విప్ జారీ చేయనున్నట్లు, పార్లమెంట్ సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాలని విప్ లో పేర్కొననుంది. రానున్న నాలుగు రోజుల పాటు సమావేశాలు కీలకమని..ఆ రోజుల్లో ట్రిపుల్, ఎఫ్ ఆర్ డీఐ లాంటి కీలక బిల్లులు సభ ముందుకొస్తాయని..ఈ నేపథ్యంలో సభ్యులు సభకు గైర్హాజర్ కావొద్దని పేర్కొటోంది.

మరోవైపు ప్రతిపక్ష నాయకులతో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ సమావేశం కానున్నారు. సభ సమాయాన్ని వృధా చేయవద్దని..మోడీ క్షమాపణలు చెప్పాలనే దానిని బయటే పరిష్కరించుకొనే విధంగా చూడాలని జైట్లీ సూచించనున్నారు. సాయంత్రం జరిగే ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం వెలువడనుందో చూడాలి.

డీసీఐ ఉద్యోగుల మెరుపు సమ్మె...

విశాఖపట్టణం : డీసీఐ ఉద్యోగులు, కార్మికుల మెరుపు సమ్మె నిర్వహించారు. నేటి నుండి మూడు రోజుల పాటు డీసీఐ ఉద్యోగులు, కార్మికులు సమ్మె చేయనున్నారు. డీసీఐ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 25 రోజులుగా దీక్షలు చేపడుతున్న సంగతి తెలిసిందే. 

బీజేపీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్..

ఢిల్లీ : బీజేపీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్ ప్రారంభమైంది. పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో జరుగుతున్న ఈ సమావేశానికి కాసేపటి క్రితం భారత ప్రధాని మోడీ హాజరయ్యారు. 

డీఎస్సీ నిర్వాహణపై మంత్రి గంటా సమావేశం...

విజయవాడ : డీఎస్సీ నిర్వహణను ఏపీపీఎస్సీకి అప్పగించాలా ? లేక పాతపద్ధతిలోనే నిర్వహించాలా ? ఏ నిర్ణయం తీసుకోవాలనే దానిపై మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. 

కాసేపట్లో బుద్ధ విగ్రహం వద్దకు రాష్ట్రపతి..

హైదరాబాద్ : భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ హుస్సేన్ సాగర్ బుద్ధ విగ్రహం వద్దకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో లుంబినీ పార్కును, పరిసర ప్రాంతాలను సుందరంగా అలంకరించారు. ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య రాష్ట్రపతి వెళ్లనున్నట్లు సమాచారం. 

ఉప్పల్ లో రెండు బస్సుల దగ్ధం...

హైదరాబాద్ : ఉప్పల్ చెరువు కట్ట సమీపంలో పార్కింగ్ చేసిన రెండు ఆర్టీసీ బస్సులకు గుర్తు తెలియని దుండగులు మంగళవారం అర్ధరాత్రి నిప్పంటించారు. ఉప్పల్ డిపోకు చెందిన బస్సులుగా తెలుస్తోంది. 

రైల్వే స్టేషన్ పై మావోల దాడి..

బీహార్ : మసుసూదన్ రైల్వే స్టేషన్ పై అర్ధరాత్రి మావోయిస్టులు దాడి జరిపారు. రైల్వేస్టేషన్ లో రైల్వే ఆస్తులను తగులబెట్టారు. అసిస్టెంట్ స్టేషన్ మేనేజర్, ఇద్దరు సిబ్బందిని మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. 

08:08 - December 20, 2017

చిత్తూరు : తమకు కుమారుడు డాక్టర్ అవుతాడని అనుకున్న ఆ తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలింది. ఓ వైద్య విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. ఛత్తీస్ గడ్ లోని బిలాస్ పూర్ కు చెందిన వైభవ్ కుప్పంలోని పీఈఎస్ వైద్య కళాశాలలో ఎండీగా చేస్తున్నాడు. ఎంతో ఇష్టంగా భావించి సైకియాట్రి కోర్సును ఎంపిక చేసుకున్నాడని సమాచారం. మొదటి సంవత్సరం బాగానే చదివినట్లు తెలుస్తోంది. కానీ ఒక్కసారిగా ఏమైందో కానీ ఆదివారం రాత్రి హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు చేసుకున్నాడు. తోటి విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు ఛత్తీస్ గడ్ నుండి చిత్తూరు జిల్లాకు బయలుదేరారు. ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. దీనితో వైభవ్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో అంతుచిక్కడం లేదు. కానీ వైభవ్ సూసైడ్ కు ప్రేమ వ్యవహారమే కారణమని ప్రచారం జరుగుతోంది. 

ఢిల్లీలో 15 రైళ్ల రద్దు...

ఢిల్లీ : దేశ రాజధానిలో పొగ మంచు దట్టంగా అలుముకొంటోంది. దీని కారణంగా రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. 20 రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా 15 రైళ్లను రద్దు..2 రైళ్ల రాకపోకల్లో మార్పు చేశారు. 

07:38 - December 20, 2017

సైకిల్‌, కమలం పార్టీల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరుకుంది. పొత్తుతో టీడీపీనే లాభపడిందని కమలనాథులు అంటుంటే.. టీడీపీ దయవల్లే బీజేపీకి నాలుగు సీట్లైనా దక్కాయని సైకిల్‌ పార్టీ అంటోంది. ప్రస్తుతం వీరి కలహాల కాపురం ఏపీ రాజకీయాల్లో హీట్‌ పుట్టిస్తోంది. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన ప్రత్యేక చర్చా వేదికలో అద్దెపల్లి శ్రీధర్ (బీజేపీ), చందు సాంబశివరావు (టిడిపి) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

3.8 డిగ్రీల ఉష్ణోగ్రత..

ఆదిలాబాద్ : జిల్లాపై చలి పంజా విసురుతోంది. చలిగాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.ఏకంగా 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

06:49 - December 20, 2017

ఎన్నికల ముందు ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన పాలకులు ఆ హామీని నిలబెట్టుకోవాలి. విభజన చట్టం లో చెప్పిన వైజాగ్ రైల్వేజోన్ ,ఉక్కు పరిశ్రమ లాంటి వాటిని వెంటనే ఏర్పాటు చేయాలి. లక్షల కోట్ల పెట్టుబడులు వేలాది ఉద్యోగాలు అని ఊదరగొడుతున్న మాటలు ఆచరణలో చూపాలి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి... ఈ డిమాండ్లతో భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య ఆంధ్రప్రదేశ్ అంతటా యువజన యాత్ర చేసింది. ఈ యాత్ర విశేషాలపై టెన్ టివి జనపథంలో డీవైఎఫ్‌ఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి సూర్యారావు విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

06:46 - December 20, 2017

ట్వంటీ ట్వంటీ తొలి వరల్డ్‌ చాంపియన్‌ టీమిండియా ...టీ20 మాజీ చాంపియన్‌ శ్రీలంక మధ్య అసలు సిసలు సిరీస్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. టీ20ల్లో తిరుగులేని టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య 3 మ్యాచ్‌ల సిరీస్‌లోని తొలి మ్యాచ్‌కు కటక్‌ బారాబతి క్రికెట్‌ స్టేడియంలో రంగం సిద్ధమైంది. శ్రీలంకపై టెస్ట్‌, వన్డే సిరీస్‌ విజయాలు సాధించి జోరు మీదున్న టీమిండియా టీ20 సిరీస్‌ను సైతం సొంతం చేసుకోవాలని తహతహలాడుతోంది. సంచలనాలకు మారుపేరైన శ్రీలంక జట్టు టీ20 సిరీస్‌లో అయినా టీమిండియా జోరుకు బ్రేక్‌ వేయాలని పట్టుదలతో ఉంది.

టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో రోహిత్‌ శర్మ, కె ఎల్‌ రాహుల్‌, దినేష్‌ కార్తీక్‌, శ్రేయస్‌ అయ్యర్‌, మనీష్‌ పాండే, ధోనీ, విజయ్‌శంకర్‌, హార్దిక్‌ పాండ్య,దీపక్‌ హుడా, కుల్దీప్‌ యాదవ్‌, యజ్వేంద్ర చహాల్‌, జస్ప్రీత్‌ బుమ్రా,మహమ్మద్‌ సిరాజ్‌, వాషింగ్టన్‌ సుందర్‌, బసిల్‌ తంపి ఉన్నారు.రోహిత్‌ శర్మ తొలి సారిగా టీ20ల్లోనూ భారత్‌కు పూర్తి స్థాయి కెప్టెన్‌గా నాయకత్వం వహించనున్నాడు.

రోహిత్‌ శర్మ, శ్రేయస్‌ అయ్యర్‌,ధోనీ ఫామ్‌లో ఉండటంతో పాటు హార్డ్‌ హిట్టింగ్‌ ఆల్‌ రౌండర్లు హార్దిక్‌ పాండ్య,దీపక్‌ హుడాలతో భారత బ్యాటింగ్‌ లోయర్‌ ఆర్డర్‌లోనూ బలంగా ఉంది.కానీ బౌలింగ్‌లో బుమ్రా మినహా అనుభవజ్ఞుడైన పేస్‌ బౌలర్‌ లేకపోవడంతో భారత జట్టు లెగ్‌ స్పిన్‌ ట్విన్స్‌ కుల్దీప్‌ యాదవ్‌, యజ్వేంద్ర చహాల్‌ మీద భారీ అంచనాలే పెట్టుకుంది.

మరోవైపు తిసెరా పెరీరా సారధ్యంలోని శ్రీలంక జట్టు భారత్‌కు షాకివ్వాలని ప్లాన్‌లో ఉంది. ఉపుల్‌ తరంగా,ఏంజెలో మాథ్యూస్‌, కుషాల్‌ పెరీరా, దిక్వెల్లా, తిసెరా పెరీరా వంటి సీనియర్లతో పాటు ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లున్నా... సమిష్టిగా రాణించడం మీదనే లంక విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. టీమ్‌ కాంబినేషన్‌తో పాటు ట్రాక్ రికార్డ్‌ పరంగా టీమిండియాకే తొలి మ్యాచ్‌లో విజయావకాశాలు ఎక్కువగా ఉన్నా...టీ 20ల్లో శ్రీలంకను తక్కువ అంచనా వేయలేం. మరి కటక్‌ టీ20లో నెగ్గి భారత్‌ సిరీస్‌లో శుభారంభం చేయగలదో లేదో చూడాలి.

2007లో తొలి టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా చాంపియన్‌గా నిలిచింది.2014లో భారత్‌నే ఓడించి శ్రీలంక తొలి సారి టీ20 వరల్డ్‌ కప్‌ సొంతం చేసుకుంది. తొలి టీ20కి కటక్‌లోని బారాబతి క్రికెట్‌ స్టేడియం ఆతిధ్యమివ్వబోతుండగా...డిసెంబర్‌ 22న ఇండోర్‌లోని హోల్కర్‌ క్రికెట్‌ స్టేడియం వేదికగా రెండో టీ20 జరుగనుంది.
డిసెంబర్‌ 24న ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగనున్న 3వ టీ20 మ్యాచ్‌తో శ్రీలంక టూర్‌కు తెరపడనుంది. 

ఇక టీ20 ఫేస్‌ టు ఫేస్‌ రికార్డ్‌లోనూ శ్రీలంకపై ఇండియాదే పై చేయిగా ఉంది.ఇప్పటివరకూ ఇరు జట్లు 11 టీ20ల్లో పోటీ పడగా భారత్‌ 7 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా...శ్రీలంక 4 మ్యాచ్‌ల్లో నెగ్గింది. మరి ఈ డూ ఆర్‌ డై వన్డేలో టీమిండియా స్థాయికి తగ్గట్టుగా రాణిస్తుందో లేదో తెలియాలంటే మరికొద్దిగంటలు వెయిట్ చేయాల్సిందే. కానీ శ్రీలంక జట్టును తక్కువ అంచనా వేస్తే భారత జట్టుకు మరోసారి భంగపాటు తప్పదు.  

06:43 - December 20, 2017

మెదక్ : అన్నార్తుల ఆకలి తీర్చడం కోసం వెలసిన దేవాలయం అది. పరమత సహనాన్ని చాటుతూ శాంతికి...ప్రేమకు ప్రతీకగా నిలిచిన ఆధ్యాత్మిక కట్టడం అది. తరాలు కాల గర్భంలో కలిసిపోతున్నా చెక్కుచెదరకుండా నిర్భయంగా...నిశ్చలంగా నిలబడ్డ ప్రార్థనా మందిరం అది. అదే ఆసియాలోనే అతిపెద్ద కట్టడం మెదక్‌ చర్చ్‌. అక్కడ అడుగుపెడితే చాలు ఆధ్యాత్మిక పరిమళాలు...అల్లంత దూరాన్నుంచి చూసినా నిండుగా గాంభీర్యంగా.. కనిపించే మీనార్‌. కరుణామయుడే ప్రేమగా తన మందిరానికి పిలుస్తున్నాడని క్రైస్తవులు భావించే అత్యద్భుత ఆధ్యాత్మిక కట్టడం మెదక్‌ చర్చ్‌..

మెదక్‌ పట్టణంలో ఉన్న ఈ పురాతన చర్చ్‌ ఆసియాఖండంలోనే ప్రఖ్యాతి గాంచింది. గోతిక్ పునరుజ్జీవన తరహాలో కట్టిన ఈ చర్చికి 1914లో పునాదిరాయి పడితే 1924కు నిర్మాణం పూర్తయింది. లండన్‌కు చెందిన రెవరాండ్ చార్లెస్ వాకర్ ప్రోస్నేట్ అనే మతగురువు మెదక్ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ ప్రాంతమంతా కరువు కాటకాలతో, అనారోగ్యాలు, ఆకలితో అలమటిస్తోంది. ఇక్కడి వారికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రోస్నేట్ చర్చ్‌ నిర్మాణానికి పూనుకున్నాడు. పనికి ఆహార పథకంలాంటి దానిని ప్రవేశపెట్టి చర్చ్‌ నిర్మాణంలో అందరూ పాలపంచుకునేలా పని కల్పించాడు. 12 వేల మంది కార్మికులు 10 సంవత్సరాల పాటు శ్రమించి అత్యద్భుత కట్టడాన్ని నిర్మించారు. ఇందుకావలసిన నిధులను పస్నేట్‌ ఇంగ్లాండ్‌ నుంచే విరాళాలుగా సేకరించాడు. అప్పటిలో చర్చ్‌ నిర్మాణానికి ఖర్చయినది కేవలం 14 లక్షల రూపాయలు మాత్రమే. అలా మహోన్నత ఉద్దేశంతో, శ్రమజీవుల చెమట నుంచి పుట్టినదే మెదక్‌ చర్చ్.

ఇటలీ దేశస్తులతో పాటు భారత దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నిర్మాణ రంగ నిపుణులు, కళాకారులు చర్చిని అత్యంతసుందరంగా రూపుదిద్దారు. ఈ చర్చికి 200 అడుగుల పొడవు, 100 అడుగుల వెడల్పుతో ఉన్న కేథడ్రాల్ ఉంది. అతి పెద్దగా ఉండే ఈ కేథడ్రాల్‌లో ఒకేసారి 5,000 మంది ప్రార్ధన చేసుకోవొచ్చు. బ్రిటన్ నుంచి ప్రత్యేకంగా దిగుమతి చేసిన ఆరు వేర్వేరు రంగుల మొసాయిక్ టైల్స్ ఈ చర్చిలో ఉన్నాయి. ఈ చర్చికి చెందిన గచ్చు పనిని ఇటలీ తాపీ వారు చేశారు. ఇంగ్లాండ్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన అద్దాలపై యేసు ప్రతిమ.. క్రీస్తు జీవన విధానం తెలియజేసే అందమైన అక్షరాలతో దేవుడి చరిత్ర ముద్రించి ఉంటుంది. కుడి వైపు క్రీస్తు జననం.. ఎడమ వైపు శిలువ వేసిన దృశ్యం.. ముందు భాగంలో యేసు పునఃరుద్దరణం చిత్రాలు అద్భుతంగా దర్శనమిస్తాయి. సూర్యకిరణాలు తాకగానే ఈ చిత్రాలు మరింత ప్రకాశవంతంగా వెలుగుతుండటం ఈ చర్చ్‌ ప్రత్యేకత.

పూర్తిగా రాళ్లు, దంగుసున్నాన్ని ఉపయోగించి నిర్మించిన ఈ చర్చ్‌లో ప్రతీ అడుగు ఒక కళాఖండమే. పిల్లర్లు, బీములు లేకుండా రెండు అంతస్తులతో విశాలమైన ప్రార్థనా మందిరాన్ని, 175 అడుగుల ఎత్తైన శిఖరాన్ని నిర్మించడంతో నాటి పనితనానికి నిదర్శనం. చారిత్రక కట్టడంగాను, ఆధ్యాత్మిక కేంద్రంగాను ప్రఖ్యాతిగాంచిన మెదక్‌ చర్చ్‌ను చూసేందుకు దేశవిదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. క్రిస్మస్‌ పర్వదినాల్లో పర్యాటకుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. క్రిస్మస్‌ సందర్భంగా ఈ చర్చ్ విద్యుత్‌కాంతులతో మరింత శోభాయమానంగా ఉంటుంది. ఒక్క క్రైస్తవులే కాదు మిగతా మతాలవారు క్రిస్మస్‌ పర్వదినాల్లో ఈచర్చ్‌కు వచ్చి ప్రార్థనల్లో పాల్గొనడం పరమతసహనానికి ఓ నిదర్శనం.

06:40 - December 20, 2017

తమిళనాడు : ఒక ఉప ఎన్నిక యావత్‌ దేశం తనవైపు చూసేలా చేస్తోంది. ఢిల్లీ నుంచి గల్లీ వరకు అందరి చూపులు అక్కడే. పరాజితులు ఎవరు.. విజయం సాధించేది ఎవరన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. అదే ఆర్కే నగర్‌ బై ఎలక్షన్‌. జయలలిత నియోజకవర్గం కావడమే అందుకు కారణం. రెండాకులు మావే.. విజయం మాదే అంటున్న డీఎంకే ఒకవైపు, గుర్తు లేకున్నా కార్యకర్తలు మావైపు ఉన్నారంటున్న దినకరన్‌ మరోవైపు... ప్రభుత్వ వ్యతిరేకతే మాకు విజయాన్ని ఇస్తుందన్న ధీమా డీఎంకే మరోవైపు. త్రిముఖ పోరుతో ఉత్కంఠ రేపుతోన్న ఆర్కేనగర్‌ ఉప ఎన్నికపై 10టీవీ ప్రత్యేక కథనం..

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి మృతితో ఆర్కేనగర్‌ అసెంబ్లీ స్థానం ఖాళీ అయ్యింది. ఇప్పుడు ఈ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. మంగళవారంతో ప్రచారం ముగిసింది. ఆర్కే నగర్‌ ఉప ఎన్నిక ఇప్పుడు ప్రజలందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆర్కే నగర్‌లో గెలుపు ఎవరిదన్న ఉత్కంఠ సర్వత్రా రేకెత్తిస్తోంది. బరిలో నిలిచిన అభ్యర్థులు గెలుపుకోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. భారీగా ఖర్చ చేస్తున్నారు. ఎన్నికల సంఘం సైతం దీనిపై పెడుతున్న ఖర్చు కొత్త రికార్డు సృష్టిస్తోంది. భారత ఎన్నికల చరిత్రలో ఇది అత్యంత ఖరీదైన ఎన్నికగా చరిత్రలో నిలిచిపోనుంది. విచ్చలవిడిగా డబ్బు పంపిణీ జరుగుతోందని ఆరోపణలు రావడంతో ఎన్నికల సంఘం నియోజకవర్గంలో విస్తృత ఏర్పాట్లు చేసింది. రేపు పోలింగ్‌ జరుగనుంది. పోలింగ్‌ జరిగే ప్రాంతాల్లో భారీ సంఖ్యలో కెమెరాలు ఏర్పాటు చేయడంతోపాటు 2500 మంది భద్రతా సిబ్బందిని మోహరించింది.

సాధారణంగా ఉపఎన్నిక ఖర్చు 50 లక్షల నుంచి 60 లక్షల రూపాయల వరకు అవుతుంది. RK నగర్‌ ఉపఎన్నికకు ఎన్నికల సంఘం చేస్తున్న ఖర్చు 3 కోట్ల రూపాయలు. కెమెరాల కోసమే 50 లక్షల రూపాయలు ఖర్చు చేసింది. ఎన్నికలు సజావుగా సాగేందుకు పరిశీలకులుగా 21 మంది IAS అధికారులను ఎన్నికల సంఘం రంగంలోకి దింపింది. అంతే కాదు 21 ఫ్లైయింగ్‌ స్క్వాడ్లు పనిచేస్తున్నాయి. డబ్బు పంపిణీని అరికట్టేందుకు రాత్రి పూట కూడా గస్తీ నిర్వహిస్తున్నారు. ఇందులో IAS, IPS ఆఫీసర్లు కూడా ఉన్నారు.

ఇక గెలుపుపై ఎవరి ధీమా వారిది. అమ్మ పాలన, అధికారం తమనే గెలిపిస్తుందని అన్నాడిఎంకె అటుంటే వారు నమ్మకద్రోహులు తామే నిజమైన వారసుడిని అంటూ శశికళ మేనల్లుడు దినకరన్ మరోవైపు బింకాలు పోరున్నాడు. వీరి నడుమ ప్రతిపక్ష డిఎంకె అసలు ప్రభుత్వమే లేదని అన్నింట విఫలమంటూ తమదే గెలుపనే ప్రచారం హోరెత్తించింది. మొత్తానికి గత పదిహేను రోజులుగా మారుమోగిన అభ్యర్థుల ప్రచారం ఎట్టకేలకు ముగిసింది. గతంలో ఎన్నిక వాయిదా పడిన అనుభవాల దృష్ట్యా ఎన్నికల సంఘం డబ్బు ప్రవాహంపై ప్రత్యేక నిఘా పెట్టింది.

ఆర్కే నగర్‌ ఉప ఎన్నిక బరిలో మొత్తం 59 మంది అభ్యర్థులు ఉన్నారు. వీరిలో ఓ మహిళా అభ్యర్థి కూడా ఉన్నారు. రెండాకుల గుర్తు అధికార అన్నాడీఎంకేకు దక్కడంతో దినకరన్‌ ప్రెషర్ కుక్కర్‌ గుర్తుపై పోటీ చేస్తున్నారు. ఆర్కే నగర్‌ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,28,234. వీరిలో పురుషులు 1,10,903, స్త్రీలు 1,171,232. లింగమార్పిడి వ్యక్తులు 99 మంది ఉన్నారు. పోలింగ్‌కు మరికొన్ని గంటలే సమయం ఉండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. త్రిముఖ పోటీలో గెలుపు ఎవరిని వరిస్తుందన్న ఆసక్తి నెలకొంది. మరి ఓటర్లు ఎవరికి పట్టంకట్టనున్నారో.

06:37 - December 20, 2017

ఢిల్లీ : కాళేశ్వరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇచ్చినందుకు కేంద్ర పర్యావరణశాఖ కార్యదర్శికి మంత్రి హరీష్‌రావు దన్యవాదాలు తెలిపారు. అటవీ అనుమతులు, పర్యావరణ అనుమతులు రావడంతో కాళేశ్వరం పనులు వేగంగా జరుగుతాయన్నారు. కేంద్ర జలవనరుల సంఘంలో 8 డైరెక్టర్లలో అనుమతులు వచ్చాయని.. మరో రెండు డైరెక్టర్లలో అనుమతులు రావల్సి ఉందన్నారు. తొందరగా ఆ అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర జలవనరుల శాఖ అధికారులను కోరారు. అలాగే తెలంగాణలో కందులు, మినుములకు మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో షీప్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ను ఏర్పాటు చేయాలని హరీష్‌రావు కోరారు. 

06:35 - December 20, 2017

పశ్చిమగోదావరి : గ్రామస్తులంతా ఏకమయ్యారు. ఊరు నుంచి మద్యం మహమ్మారిని తరమికొట్టేందుకు నడుంబిగించారు. గ్రామంలో ఉన్న మద్యం దుకాణాన్ని తొలగించాలంటూ ఉద్యమాన్ని ఉద్ధృతం చేశారు. ఆందోళనలతో ఆ ఊరు అట్టుడుకుతోంది. సర్వోదయ ఉద్యమనేత చింతలపాటి మూర్తిరాజు సొంతూరు పశ్చిమగోదావరి జిల్లా పత్తేపురంలో మద్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్న మహిళలపై 10 టీవీ ప్రత్యేక కథనం..

వేళాపాళా లేదు. సమయం, సందర్భం లేదు. అన్ని రోజులు, ఎల్లవేళలా మద్యం అందుబాటులో ఉంటుంది. మందుబాబులు పూటుగా తాగుతారు. అల్లరి చిల్లరిగా తిరుగుతారు. మహిళలను తూలనాడుతారు. గ్రామ నడిబొడ్డున అంగన్‌వాడీ కేంద్రం పక్కనే ఉన్న మద్యం దుకాణంతో బాలలు ఎన్నో అవస్థలు ఎదుర్కొంటున్నారు. మద్యంతో ఎదురువుతున్న అనర్థాలతో విసిగిపోయిన మహిళలు గ్రామం నుంచి వైన్‌ షాపును తొలగించాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనకు దిగారు. షాపును ఎత్తివేయకపోతే సామూహికంగా జలసమాధి అవుతామని హెచ్చరిస్తూ చెరువులో దిగి నిరసన వ్యక్తం చేశారు. ఈ ఉద్యమంలో కొందరు మహిళలు కూడా అనారోగ్యానికి గురయ్యారు.

పత్తేపురం మహిళల ఆందోళనతో దిగొచ్చిన రెవెన్యూ, పోలీసు, ఎక్సైజ్‌ అధికారులు గ్రామాన్ని సందర్శించి, మద్యం దుకాణాన్ని తొలగిస్తామని హామీ ఇవ్వడంతో ఉద్యమం విరమించారు. వారం రోజులు గడిచినా ఇచ్చిన హామీ నెరవేరకపోవడంతో మళ్లీ ఆందోళన బాట పట్టారు. మద్యానికి వ్యతిరేకంగా పత్తేపురం మహిళలు చేస్తున్న ఆందోళనకు సీపీఎం, ఐద్వా నేతలు మద్దతు పలికారు. కూలి డబ్బులను మగాళ్లు మద్యం కోసం తగేస్తుండటంతో పిల్లా, పాపలతో కుటుంబాలు పస్తులుండే పరిస్థితులు వస్తున్నాయని మహిళలు ఆందోన వ్యక్తం చేస్తున్నారు.

మద్యం దుకాణం యజమానికి అనుకూలంగా అధికారులు వంతపాడటాన్ని పత్తేపురం మహిళలు తప్పుపడుతున్నారు. పత్తేపురం నుంచి మద్యం దుకాణం తొలగిస్తామని అధికారులు ఇచ్చిన హామీ నెరవేరకపోవడంతోగ్రామస్తులు జిల్లా కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఊరిజనం వద్దన్నప్పుడు మద్యం షాపును ఎందుకు తొలగించలేదని ఎక్సైజ్‌ అధికారులు మందలించారు. అయినా పత్తేపురంలో నేటికీ మద్యం దుకాణం కొనసాగుతోంది ? అధికారులు ఇచ్చిన హామీ ఎందుకు నెరవేరడంలేదు ? మద్యం షాపు కొనసాగింపు వెనుక ఎవరి ప్రమేయం ఉంది ? ఎవరి ఒత్తిడికి లొంగి అధికారులు మిన్నకుంటున్నారు... అన్న ప్రశ్నలు ఇప్పుడు పత్తేపురం పరిసరాల్లో చర్చనీయాంశంగా మారాయి. 

06:32 - December 20, 2017

విశాఖపట్టణం : గుజరాత్‌ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు గిఫ్ట్‌ అన్నారు ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నేతృత్వంలో ఇకపై జరిగే అన్ని ఎన్నికల్లో పార్టీ విజయం సాధిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ద్రోణంరాజు సత్యనారాయణ 85వ జయంతోత్సవ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భారీగా పార్టీ నేతలు, కార్యకర్తలు తరలిరావడంతో కాంగ్రెస్‌లో నూతనోత్సాహం కనిపించింది. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి.. తమ పార్టీ అధినేత రాహుల్‌ను ఆకాశానికి ఎత్తారు. 

06:30 - December 20, 2017

హైదరాబాద్ : 2019 ఎన్నికలకు టీ కాంగ్రెస్‌ ఇప్పటి నుంచే సమాయాత్తం అవుతోంది. అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. గుజరాత్‌లో రాహుల్‌గాంధీ సంధించిన ఫార్ములాను తెలంగాణలోనూ అమలు చేయాలని నేతలు భావిస్తున్నారు. గుజరాత్‌ ఎన్నికలను తెలంగాణ పాలిటిక్స్‌తో మిక్స్‌ చేస్తూ అధికారం చేజిక్కించుకోవాలని ఆశపడుతున్నారు. గుజరాత్‌ ఎన్నికల ప్రచారం దేశ వ్యాప్తంగా పొలిటికల్‌ హీట్‌ పెంచింది. ఇప్పుడు అక్కడ వచ్చిన ఫలితాలు కూడా వేడి పెంచుతున్నాయి. ప్రధాని మోదీ, అమిత్‌షాల సొంత ఇలాఖా కావడంతో దేశం మొత్తంగా గుజరాత్‌ ఫలితాలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇక తెలంగాణలో అయితే ఇది మరింత జోరు చర్చకు తెరలేపింది. గుజరాత్‌ పాలిటిక్స్‌ను తెలంగాణతో మిక్స్‌ చేసి నేతలు తమదైన శైలిలో విశ్లేషించుకుంటున్నారు.
గుజరాత్‌లో అట్టడుగున ఉన్న కాంగ్రెస్తో రాహుల్‌గాంధీ మోదీకి చెమటలు పట్టించారు. అధికారం దక్కకపోయినా ప్రధానిని కలవరపాటుకు గురిచేశారు. రాహుల్‌ దెబ్బకు ప్రధాని మోదీ, అమిత్‌షా రాష్ట్ర నేతలను తలపిస్తూ ప్రచారాన్ని చేశారని తెలంగాణలోని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. రాహుల్‌ను ఎదుర్కొనేందుకు మోదీ, అమిత్‌షాతోపాటు 182 మంది ప్రముఖులను రంగంలోకి దింపారని.. గుజరాత్‌లో తాము ఓడినా నైతిక విజయం తమదేనని వాదిస్తున్నారు.

గుజరాత్‌లో రాహుల్‌గాంధీ అమలు చేసిన ఫార్ములాను తెలంగాణ పాలిటిక్స్‌కు మిక్స్‌ చేసి కాంగ్రెస్‌ నేతలు మరీ విశ్లేషిస్తున్నారు. అక్కడ హార్థిక్‌పటేల్‌, అల్ఫేష్‌ ఠాకూర్‌, జిగ్నేష్‌ మేవానిలాంటి త్రయం... 2019 ఎన్నికల్లో దర్శనమివ్వబోతోందంటున్నారు. కోదండరాం, మందకృష్ణ మాదిగ, ఆర్‌. కృష్ణయ్యలను తెలంగాణ త్రయంగా పోల్చుతున్నారు. సామాజిక ఉద్యమాలకు పురిటిగడ్డ అయిన తెలంగాణలో ఇప్పటికే కొనసాగుతున్న సంఘాలు, ఉద్యమ నాయకులు కాంగ్రెస్‌తో కలిసి నడుస్తారన్న విశ్వాసాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణలో 90శాతం ఓట్లలో టీఆర్‌ఎస్‌ - కాంగ్రెస్‌ మధ్య కేవలం 5శాతమే తేడా ఉందని.. మిగిలిన పది శాతం ఓట్లలో మిగిలిన పార్టీలు ఉన్నాయని హస్తం నేతలు అంచనా గడుతున్నారు. కేసీఆర్‌ను గద్దె దింపాలంటే ఆ మిగిలిన పదిశాతంలో ఉన్నవారు, కాంగ్రెస్‌ వైపు చేరుతారన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్‌తో ఢీ అంటే ఢీ అంటున్న టీజేఏసీ చైర్మన్‌ కోదండరాంను హార్థిక్‌పటేల్‌తో పోల్చుతున్నారు కాంగ్రెస్‌ నేతలు. బీసీ, ఎస్సీల ఉద్యమ నేతలుగా ఉన్న ఆర్‌. కృష్ణయ్య, మందకృష్ణ మాదిగ హస్తంపార్టీతో కలిసి నడిచే అవకాశముందని విశ్లేషిస్తున్నారు.

గుజరాత్‌లో ఓడినా ప్రధాని మోదీకి కాంగ్రెస్‌ చుక్కలు చూపించిందని ఖుషీలో ఉన్న టీ కాంగ్రెస్‌ నేతలు.. గుజరాత్‌లో రాహుల్‌గాంధీ అమలు చేసిన ఫార్ములానే తెలంగాణలో అమలు చేస్తామని చెప్తున్నారు. కేసీఆర్‌ను గద్దె దింపేందుకు సర్వశక్తులు ఒడ్డుతామని అంటున్నారు. మరి టీ కాంగ్రెస్‌ నేతల ఆశలు, అంచనాలు, విశ్లేషణలు ఏ మేరకు వర్కవుట్‌ అవుతాయో వేచిచూడాలి.

06:28 - December 20, 2017

హైదరాబాద్ : ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా ముగిశాయి. తెలుగు భాష ప్రపంచంలోనే గొప్పదని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. దేశంలో హిందీ తర్వాత అత్యధికంగా మాట్లాడే భాష తెలుగని ఆయన తెలిపారు. ముగింపు వేడుకల్లో పాల్గొన్న రాష్ట్రపతి తెలుగు ప్రజలంరికీ శుభాకాంక్షలు తెలిపారు. ముగింపు వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోసారి పద్యాలను ఆలపించి అలరించారు. ఇక నుంచి ప్రతిఏడాది తెలంగాణ తెలుగు మహాసభలు జరుపుతామని కేసీఆర్‌ ప్రకటించారు. ముగింపు వేడుకలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. తెలుగులో సోదర.. సోదరీమణుల్లారా.. అని తన ఉపన్యాసాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి.. తెలుగు భాష ప్రపంచంలోనే గొప్పదన్నారు. దేశంలో హిందీ తర్వాత అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు అన్నారు. దేశభాషలందు తెలుగు లెస్స అన్న కృష్ణరాయల ప్రసిద్ధ వ్యాక్యాన్ని గుర్తుచేశారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని రాష్ట్రపతి కోవింద్‌ అన్నారు. ముగింపు వేడుకల్లో మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ..తెలంగాణ రాష్ట్రంలో విజయవంతంగా మహాసభలు నిర్వహించుకుని తెలుగువారి ఘనతను ప్రపంచానికి చాటామన్నారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి పద్యాలను చదవి ఆహూతులను అలరించారు.

1974లో డిగ్రీ విద్యార్థిగా ఇదే స్టేడియంలో ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరై తిలకించిన విషయాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. నాలుగు దశాబ్దాల తర్వాత ముఖ్యమంత్రి హోదాలో తెలుగు మహాసభల వేదికలో మాట్లాడటం గర్వంగా ఉందన్నారు. తెలుగు భాషాభివృద్ధికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందన్నారు. తెలుగు భాష క్రమంగా మృతభాషగా మారుతోందన్న ఉపరాష్ట్రపతి ఆవేదనను ఈ సందర్భంగా కేసీఆర్‌ గుర్తుచేశారు. అమ్మభాషను బతికించుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుందన్నారు. దానిలో భాగంగా ఇక నుంచి ప్రతీ ఏడాది డిసెంబర్ మొదటి వారంలో రెండు రోజుల పాటు వైభవంగా తెలంగాణ తెలుగు మహాసభలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి పక్రటించారు. వచ్చే జనవరిలో సాహితీ సదస్సు నిర్వహించి భాషాభివృద్ధి ప్రణాళికను ప్రకటిస్తామన్నారు.

ముగింపు వేడుకలు ఆధ్యంతం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతబింబించాయి. చివరి రోజుకావడంతో.. భాషాభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున వేడుకకు హాజరయ్యారు. దాదాపు 35వేల సామర్థ్యం కలిగిన ఎల్బీస్డేడియం జనంతో కటికిటలాడింది. ఈ సందర్భంగా ప్రదర్శించిన పలు లఘుచిత్రాలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా తెంగాణ సంస్కృతిలో భాగమైన బతుకుమ్మ, హోళీ పండుగలపై ప్రదర్శించిన షార్ట్‌ఫిల్ములు ఆకట్టుకున్నాయి. ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన బాణసంచా మెరుపులు కార్యక్రమానికే ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. 

కుప్పంలో మెడికల్ విద్యార్థి ఆత్మహత్య...

చిత్తూరు : కుప్పంలో మెడికల్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వైభవ్ దేవ్ హాస్టల్ గదిలో ఉరి వేసుకున్నాడు. పీఈఎస్ మెడికల్ కాలేజీలో పీజీ చదువుతున్నాడు. ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. 

డిసెంబర్ నుండి టి. తెలుగు మహాసభలు - కేసీఆర్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహాసభలను అత్యంత వైభవంగా నిర్వహించిందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గౌరవంగా తెలుగు మహాసభలు నిర్వహించుకొని ప్రపంచానికి చాటిచెప్పామని తెలిపారు. ఇక నుంచి ప్రతీ ఏడాది డిసెంబర్ మొదటి వారంలో రెండు రోజుల పాటు తెలంగాణ తెలుగు మహాసభలు నిర్వహిస్తామని సీఎం ప్రకటించారు. 

సైకిల్..కమలం మధ్య మాటల యుద్ధం...

విజయవాడ : ఏపీలో టీడీపీ..బీజేపీ పరిస్థితి. సైకిల్‌-కమలం పార్టీల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరుకుంది. పొత్తుతో టీడీపీనే లాభపడిందని కమలనాథులు అంటుంటే.. టీడీపీ దయవల్లే బీజేపీకి నాలుగు సీట్లైనా దక్కాయని సైకిల్‌ పార్టీ అంటోంది. ప్రస్తుతం వీరి కలహాల కాపురం ఏపీ రాజకీయాల్లో హీట్‌ పుట్టిస్తోంది. 

'119 స్థానాల్లో సీపీఎం పోటీ'..

హైదరాబాద్ : తెలంగాణలోని 119 స్థానాల్లో సీపీఎం పోటీ చేస్తుందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ప్రత్యామ్నాయ ఫ్రంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తమ్మినేని తెలిపారు.

ఆర్కే నగర్ ప్రచారం సమాప్తం...

తమిళనాడు : చెన్నైలోని ఆర్కే నగర్‌ అసెంబ్లీ స్థానానికి ఈనెల 21న జరుగనున్న ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్‌కు ఉప ఎన్నిక జరుగుతోంది. అధికార అన్నా డీఎంకే, ప్రతిపక్ష డీఎంకే సహా అన్ని ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను నిలబెట్టాయి. 17 నెలల అన్నా డీఎంకే పాలనకు ఈ ఎన్నిక ప్రోగ్రెస్‌ రిపోర్టుగా భావిస్తున్నారు.

యూపీలో రోడ్డు ప్రమాదం..

ఉత్తర్ ప్రదేశ్ : దట్టమైన పొగ మంచు కారణంగా ఉత్తరప్రదేశ్‌లో మరోసారి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంచు వల్ల రోడ్డుపై ముందు ఏముందో కూడా స్పష్టంగా కనిపించకపోవడంతో లక్నో, ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌ హైవేపై పది కార్లు ఒకదాని కొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

Don't Miss