Activities calendar

21 December 2017

22:26 - December 21, 2017
22:24 - December 21, 2017

ఢిల్లీ : ట్వంటీ ట్వంటీ తొలి వరల్డ్‌ చాంపియన్‌ టీమిండియా ...టీ20 మాజీ చాంపియన్‌ శ్రీలంక మధ్య కీలక మ్యాచ్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది.టీ20ల్లో తిరుగులేని టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య 3 మ్యాచ్‌ల సిరీస్‌లోని 2వ మ్యాచ్‌కు ఇండోర్‌ హోల్కర్‌ క్రికెట్‌ స్టేడియంలో రంగం సిద్ధమైంది.కటక్‌ టీ20లో భారీ విజయం సాధించిన భారత్‌...రెండో మ్యాచ్‌తోనే సిరీస్‌ సైతం సొంతం చేసుకోవాలని  తహతహలాడుతోంది. 

టీ20ల్లో తిరుగులేని టీమిండియా....ఫటా ఫట్‌ ఫార్మాట్‌లో మరో సిరీస్‌పై కన్నేసింది.ట్వంటీ ట్వంటీ తొలి వరల్డ్‌ చాంపియన్‌ టీమిండియా....మాజీ చాంపియన్‌ శ్రీలంకపై టీ20 సిరీస్‌ విజయం సాధించాలని తహతహలాడుతోంది. 

ఇండోర్‌ హోల్కర్‌ క్రికెట్‌ స్టేడియం వేదికగా జరుగనున్న రెండో టీ20లో  టీమిండియా హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగబోతోంది. కటక్‌ టీ20లో తిరుగులేని టీమిండియా రెండో మ్యాచ్‌లోనూ అదే స్థాయి ప్రదర్శనతో సిరీస్‌ దక్కించుకోవాలని ప్లాన్‌లో ఉంది. రాహుల్‌,ధోనీ,మనీష్‌ పాండే రాణించడంతో తొలి టీ20లో భారీ స్కోర్‌ చేసిన భారత్‌....స్పిన్‌ ట్విన్స్‌  యజ్వేంద్ర చహాల్‌,కుల్దీప్‌ యాదవ్‌ల మ్యాజిక్‌తో 93 పరుగుల తేడాతో నెగ్గింది.

రాహుల్‌,శ్రేయస్‌ అయ్యర్‌,ధోనీ,మనీష్‌ పాండే ఫామ్‌లో ఉండటంతో భారత జట్టు బ్యాటింగ్‌లో ఎప్పటిలా బలంగా కనిపిస్తోంది.కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సైతం చెలరేగితే భారత్‌కు బ్యాటింగ్‌లో తిరుగుండదు. ధోనీ ఫామ్‌లో ఉండటం భారత్‌కు అదనపు బలం అనడంలో సందేహమే లేదు. 

తొలి టీ20లో లెగ్‌ స్పిన్‌ ట్విన్స్‌  కుల్దీప్‌ యాదవ్‌, యజ్వేంద్ర చహాల్‌ ఎంతలా చెలరేగారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తొలి టీ20లో ఆడిన జట్టుతోనే భారత జట్టు బరిలోకి దిగడం దాదాపు ఖాయం.

మరోవైపు తిసెరా పెరీరా సారధ్యంలోని శ్రీలంక జట్టు ఢీలా పడింది. జోరు మీదున్న భారత్‌కు చెక్‌ పెట్టి...సిరీస్‌ను సమం చేయాలని పట్టుదలతో ఉంది.కానీ తొలి టీ20లో అన్ని విభాగాల్లోనూ విఫలమవ్వడం లంక జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసిందనే చెప్పాలి. రెండో మ్యాచ్‌లోనూ తేలిపోతే లంక జట్టు సిరీస్‌పై ఆశలు వదులుకోవాల్సిందే.

ఇక టీ20 ఫేస్‌ టు ఫేస్‌ రికార్డ్‌లోనూ శ్రీలంకపై ఇండియాదే పై చేయిగా ఉంది.ఇప్పటివరకూ ఇరు జట్లు 12 టీ20ల్లో పోటీ పడగా భారత్‌ 8 మ్యాచ్‌ల్లో విజయం ధించగా...శ్రీలంక 4 మ్యాచ్‌ల్లో నెగ్గింది. టీమ్‌ కాంబినేషన్‌తో పాటు ట్రాక్ రికార్డ్‌ పరంగా ఇండోర్‌ మ్యాచ్‌లో ఇండియాకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయనడంలో అనుమానమే లేదు. మరి టీ 20ల్లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతుందో లేక శ్రీలంక మరోసారి సంచలనం సృష్టిస్తుందో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. 

22:21 - December 21, 2017
22:19 - December 21, 2017
22:15 - December 21, 2017

తమిళనాడు : చెన్నైలోని ఆర్కేనగర్‌ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. 75 శాతానికి పైగా పోలింగ్‌ నమోదైంది. ఉదయం 8గంటల నుంచే ఓటర్లు  పోలింగ్‌ బూత్‌ల వద్ద బారులు తీరి తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. 256 పోలింగ్‌ కేంద్రాల్లో భారీ భద్రత నడుమ ఓటింగ్‌ జరిగింది. మొత్తం 59 మంది అభ్యర్థులు ఉప ఎన్నిక బరిలో నిలిచారు. అన్నాడీఎంకే అభ్యర్థి మధుసూదనన్‌, డీఎంకే నుంచి గణేశన్‌, స్వతంత్య్ర అభ్యర్థి దినకరన్‌ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. 2 జి స్పెక్ట్రం కేసులో రాజా, కనిమొళి నిర్దోషులుగా తేలడంతో డిఎంకె తమ పార్టీ విజయంపై ఆశలు పెట్టుకుంది. ఈనెల 24న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అదేరోజు ఫలితం వెల్లడి కానుంది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతితో ఖాళీ అయిన ఆర్‌ కె నగర్‌కు ఉప ఎన్నిక నిర్వహించారు.

 

22:12 - December 21, 2017

ఢిల్లీ : రాజ్యసభలో తొలిసారిగా మాట్లాడాలనుకున్న క్రికెట్‌ దిగ్గజం సచిన్‌కు నిరాశే ఎదురైంది.  షెడ్యూల్‌ ప్రకారం 'రైట్‌ టు ప్లే అండ్‌ ఫ్యూచర్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ ఇన్‌ ఇండియా' అనే అంశంపై సచిన్‌ మాట్లాడేందుకు సిద్ధమయ్యారు. క్రీడల అంశంపై మాట్లాడేందుకు సచిన్ సభలో లేచి నిలుచున్నారు. అదే సమయంలో  ప్రధాని మోది వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్‌ సభ్యులు సచిన్‌ను మాట్లాడనివ్వకుండా గట్టిగా నినాదాలు చేశారు. ప్రధాని క్షమాపణలు చెప్పాలంటూ కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టారు. ఈ గందరగోళం నడుమ రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు సభను శుక్రవారానికి వాయిదా వేశారు. దీంతో సచిన్‌ సభలో తన అంశాన్ని ప్రస్తావించలేకపోయారు. 2012లో సచిన్‌ రాజ్యసభకు నామినేట్‌ అయ్యారు. సచిన్‌ సభకు సరిగా హాజరు కాకపోవడం వివాదంగా మారింది.

 

22:09 - December 21, 2017

ఢిల్లీ : ప్రధాని మోదీ ప్రభుత్వం ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ను కూడా నిర్వహించలేని దుస్థితిలో ఉందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. హైదరాబాద్‌ ఉస్మానియా యూనివర్సిటీలో వచ్చే నెల 3 నుంచి 7 వరకు జరగాల్సిన ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ వాయిదా పడింది. ఐఎస్‌సీని సకాలంలో నిర్వహించం కూడా మోదీ ప్రభుత్వానికి చేతకాదా ? అన్ని ఏచూరి ట్విట్టర్‌లో ప్రశ్నించారు. ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ నిర్వహించడంలో మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఘాటుగా విమర్శించారు. ఐఎస్‌సీని సకాలంలో నిర్వహంచలేకపోవడం శతాబ్దికాలంలో ఇదే మొదటిసారని ట్వీట్‌ చేశారు. 

 

22:07 - December 21, 2017

హైదరాబాద్ : తెలంగాణలో కార్పొరేట్‌ విద్యాసంస్థలపై నియంత్రణే లేకుండా పోయిందని టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం అన్నారు. కార్పొరేట్‌ విద్యాసంస్థలు పోతేనే .. ప్రైవేట్‌ విద్యాసంస్థలకు మనుగడ ఉంటుందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. 

గుర్తింపు పొందిన ప్రైవేట్ విద్యా సంస్థల జేఏసీ ఆధ్వర్యంలో  హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో  రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. రాష్ట్రంలో కార్పొరేట్‌ విద్యావ్యవస్థతో ప్రైవేట్‌ విద్యాసంస్థలకు తీవ్ర నష్టంవాటిల్లుతోందని సమావేశంలో పాల్గొన్న వక్తలు అభిప్రాయపడ్డారు. 

తెలంగాణ రాష్ట్రం వస్తే కార్పొరేట్‌ విద్యాసంస్థలపై నియంత్రణ వస్తుందని భావించినా.. అలా జరగలేదన్నారు టీజేఏసీ అధ్యక్షులు ప్రొఫెసర్‌కోదండరాం. కార్పొరేట్‌ విద్యతో  రాష్ట్ర వ్యాప్తంగా 5వేలకుపైగా పాఠశాలలు మూతపడ్డాయన్నారు. దీనివల్ల వేలాదిమంది ఉపాధ్యాయులు నిరుద్యోగులుగా మారారని కోదండరాం అన్నారు. నారాయణ ,చైతన్య కాలేజీ లు నిబంధనలు పాటించక పోయినా ..వాటిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవతం లేదు అని ఆయన విమర్శించారు.

సమావేశానికి హాజరైన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రైవేట్ విద్యా సంస్థలపై ముఖ్యమంత్రి కేసీఆర్ కక్ష గట్టారని  విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై అసెంబ్లీలో నిలదీసినా.. ప్రభుత్వం దున్నపోతుమీద వానకురిసిన చందంగానే వ్యవహరిస్తోందన్నారు. అసలు కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో  విద్యా వ్యవస్థ నాశనం అయ్యిందని ఉత్తమ్‌ మండిపడ్డారు. రౌండ్‌ టేబుల్‌ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు నరసింహరావు, ఎమ్మెల్యే ఆర్‌కృష్ణయ్య,టీడీపీ  నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి   కూడా పాల్గొని కేసీఆర్‌ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. వేలాదిమంది  నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్న ప్రైవేట్‌ విద్యాసంస్థలను నిర్లక్ష్యం చేయడం తగదని హితవు పలికారు. 

 

22:04 - December 21, 2017

ఢిల్లీ : 2జీ స్పెక్ట్రం కుంభకోణం కేసులో టెలికాం శాఖ మాజీ మంత్రి ఎ రాజా, డీఎంకే ఎంపీ కనిమొళికి ఊరట లభించింది. వీరిద్దరితో పాటు ఈ కేసులో నిందితులందరిని నిర్దోషులుగా ప్రకటించింది. యూపిఏ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు నిజం కావని కోర్టు తీర్పు రుజువు చేసిందని కాంగ్రెస్‌ పేర్కొంది. కోర్టు తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసిన సుబ్రహ్మణ్యస్వామి  ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని తెలిపారు.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2జీ స్పెక్ట్రం  కుంభకోణం కేసులో పటియాలా సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం  తీర్పు వెలువరించింది. టెలికాం శాఖ మాజీ మంత్రి ఎ. రాజా, డీఎంకే ఎంపీ కనిమొళితో పాటు నిందితులందరిని నిర్దోషులుగా తేల్చింది. నేరారోపణలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని కోర్టు పేర్కొంది. 

పటియాల హౌస్‌ కోర్టు తీర్పుతో డిఎంకె, కాంగ్రెస్‌ శ్రేణుల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. కాగ్‌ వినోద్‌ రాయ్‌, బిజెపిలను కాంగ్రెస్‌ టార్గెట్‌ చేసింది. 2జీ స్పెక్ట్రం కేసులో పటియాలా హౌజ్ కోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. ఈ విషయంలో యూపిఏ ప్రభుత్వంపై దుష్ప్రచారం జరిగిందన్నారు. 2జీ స్పెక్ట్రం కేటాయింపులకు సంబంధించి యూపిఏ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు నిజం కావని కోర్టు ఇచ్చిన తీర్పుతో రుజువైందని మన్మోహన్‌ చెప్పారు.

2 జి స్పెక్ట్రం కేసు తీర్పును రాజ్యసభలోనూ  కాంగ్రెస్‌ ప్రస్తావించింది. 2 జి స్కాంను అడ్డుపెట్టుకుని తప్పుడు ఆరోపణలతో బిజెపి అధికారాన్ని చేజిక్కించుకుందని విమర్శించింది. 2 జి స్పెక్ట్రంలో  లక్షా 76 వేల కోట్ల  స్కాం జరిగిందన్న ఆరోపణలు నిరాధారమని కోర్టు తేల్చిందని పేర్కొంది.

సీబీఐ కోర్టు తీర్పుపై డీఎంకే శ్రేణుల సంబరాలు మిన్నంటాయి. పటాకులు కాల్చి ఆనందాన్ని వ్యక్తం చేశారు. పటియాలా హౌజ్ కోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమని డీఎంకే పేర్కొంది. 2జి కేసుతో డీఎంకేను అంతం చేయాలని చూసినవాళ్లకు కోర్టు తీర్పు చెంప పెట్టు లాంటిందని అభిప్రాయపడింది. 2 జి స్పెక్ట్రం కేసులో కోర్టు తీర్పుపై ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ స్పందించారు. కోర్టు తీర్పును చూసి గర్వపడవద్దని కాంగ్రెస్‌కు హితవు పలికారు. 2జీ స్పెక్ట్రం కేటాయింపులను 2012లో సుప్రీంకోర్టు రద్దు చేసినప్పుడే కాంగ్రెస్‌ పార్టీ విఫల సిద్ధాంతాలు రుజువయ్యాయని విమర్శించారు.  

యూపిఏ ప్రభుత్వంలో టెలికాం శాఖ మంత్రిగా డి.రాజా ఉన్న సమయంలో 2 జీ స్పెక్ట్రం కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. 2జీ స్పెక్ట్రం అక్రమ కేటాయింపుల వల్ల 1.76 లక్షల కోట్లు నష్టం వాటిల్లినట్లు 2010లో కాగ్‌ కేంద్రానికి ఓ నివేదిక సమర్పించింది. దీంతో ప్రభుత్వం రాజాను పదవి నుంచి తప్పించింది. ఈ స్కాంలో సీబీఐ రెండు కేసులు, ఈడీ మరో కేసు నమోదు చేసింది. రాజా, కనిమొళితో పాటు టెలికమ్యూనికేషన్స్‌ మాజీ కార్యదర్శి సిద్దార్థ్‌ బెహురా, రాజా మాజీ ప్రయివేటు కార్యదర్శి ఆర్‌కే సంతాలియా తదితర 14 మందిపై చార్జిషీటు దాఖలైంది. 2011లో రాజాను అరెస్ట్‌ చేశారు. ఏడాది తర్వాత ఆయన బెయిలుపై విడుదలయ్యారు. పటియాలా హౌస్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ, ఈడీ హైకోర్టులో అప్పీల్ చేయాలని నిర్ణయించాయి. 

22:00 - December 21, 2017

హైదరాబాద్‌ : నగరంలోని లాలాగూడలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేమించలేదని సంధ్యారాణి అనే యువతిపై ప్రేమోన్మాది కార్తీక్  పెట్రోల్‌పోసి నిప్పంటించాడు. 70 శాతం కాలిన గాయాలతో సంధ్యారాణి పరిస్థితి విషమంగా మారింది. దీంతో ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

21:57 - December 21, 2017
21:37 - December 21, 2017

ఎఫ్ ఆర్ డీఐ బిల్లు నష్టదాయకమని వక్తలు అన్నారు. 'బ్యాంక్ ల్లో మీ సొమ్ముకు గ్యారంటీ లేదా ? ఎఫ్ ఆర్ డీఐ చట్టంతో లాభమా ? నష్టమా ?' అనే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఈఎఫ్ ఐ) తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శి వెంకట్రామయ్య, బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు. ఎఫ్ ఆర్ డీఐ బిల్లు ప్రైవేటీకరణకు దారి తీస్తుందన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

21:15 - December 21, 2017

నేచురల్ స్టార్ నాని, సాయిపల్లవి హీరోహీయిన్ గా నటించిన ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఆండ్ లవ్ ఫిల్మ్ MCA ... మిడిల్ క్లాస్ అబ్బాయి... శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ నుంచి దిల్ రాజ్ సమర్పణలో శ్రీరామ్ వేణు డైరెక్షన్ లో వచ్చిన సినిమా ఇవాళ్టి మూవీ రివ్యూ టైమ్ లో ఉంది. రివ్యూ, చిత్ర విశేషాలు, ప్రేక్షకుల అభిప్రాయాలు, రేంటింగ్ వంటి అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం... 

 

ప్రేమించలేదని యువతిపై పెట్రోల్ పోసి, నిప్పంటించిన ప్రేమోన్మాది

హైదరాబాద్ : లాలాగూడలో ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రేమించలేదని సంధ్యరాణి అనే యువతిపై ప్రేమోన్మాది కార్తీక్ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. యువతికి తీవ్రగాయాలయ్యాయి. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం యువతిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. 
 

20:46 - December 21, 2017

చిత్తూరు : లడ్డూ పేరు వింటే చాలు.. మొదట గుర్తొచ్చేది తిరుపతి వెంకన్న లడ్డు.. తెలిసిన వారు ఎవరైనా తిరుపతి వెళ్లివచ్చారంటే మొదట అడిగేది లడ్డూ తెచ్చారా అని.. ఒకప్పడు తిరుపతి లడ్డూ చేతిలో అందనంత పెద్ద పరిమాణంలో... ఎంతో రుచితో ఉండేది. దీంతో తిరుపతి లడ్డూ ప్రపంచ ప్రఖ్యాతి చెందింది. అలాంటి లడ్డు క్రమేపీ పరిమాణం తగ్గుతూ.. ధర మాత్రం పెరుగుతూ వస్తోంది. సామాన్య భక్తులకు అందకుండా  పోతోంది.
రోజురోజుకి పెరుగుతున్న లడ్డూ ధర
శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఇంతటి విశిష్టమైన ఈ లడ్డూ ప్రసాదం రోజు రోజుకి పరిమాణం తగ్గుతూ.. ధర పెరుగుతూ వస్తోంది. తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని మొదట్లో బూందీగా ఇచ్చేవారు. అనంతరం బూందీ నుండి లడ్డూగా మార్చారు. దేవస్థానం భక్తులకు ప్రసాదం కోసం ఏటా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది.
1803 నుండి లడ్డూ విక్రయాలు
పల్లవుల కాలం నుండి కలియుగ దైవం శ్రీవారి ప్రసాదాల వితరణ ప్రారంభమైనట్లు చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. 1803 సంవత్సరంలో అప్పటి మద్రాసు ప్రభుత్వం తొలిసారిగా ఆలయంలో ప్రసాదాల విక్రయాన్ని ప్రారంభించింది. భక్తులు లడ్డూ కోసం పోటీ పడటంతో లడ్డూకి డిమాండ్‌ పెరిగిపోయింది. దీంతో లడ్డూ తయారీ చేసే దిట్టాలను పెంచారు. 
రోజు రోజుకి క్వాలిటీ తగ్గుతోందని ఆరోపిస్తున్న భక్తులు
శ్రీవారి భక్తులు మహాప్రసాదంగా భావించే లడ్డూ రోజు రోజుకి లడ్డూ క్వాలిటీ తగ్గుతోందని భక్తులు ఆరోపిస్తున్నారు. దీనికి తోడుగా ధరలను కూడా మరింత ప్రియం చేస్తున్నారు. తొలి రోజుల్లో లడ్డూ పరిమాణం కల్యాణోత్సవం లడ్డూ అంత ఉండేది. ధర కూడా ఎనిమిదణాలుగా ఉండేది. ఆ తర్వాత క్రమేపీ లడ్డు ధరలు పెరుగుతూ వచ్చాయి. రెండు రూపాయల నుండి.. ఐదు, పది, పదిహేను రూపాయలకు పెరిగింది. ఆ తర్వాత ఇరవైఐదు రూపాయలకు పెరిగింది..
రూ.25కి కేవలం పరిమితంగానే విక్రయం
సాధారణంగా భక్తులకు ఒక్కరికి పరిమితంగా లడ్డూలను రూ.25కి ఇచ్చేవారు. అలాగే సిఫారసు లేఖల ద్వారా వెల్లే వారికి కొన్ని అదనంగా లడ్డూలను ఇచ్చేవారు. అయితే ఇన్ని రోజులగా సిఫారసు లేఖ ద్వారా ఇచ్చే లడ్డూ ధరలను అమాంతం పెంచేశారు. రూ. 25గా ఉన్న లడ్డూ ధరను రూ.50కి పెంచేశారు.  కళ్యాణ లడ్డూ ధర రూ.100గా ఉన్న దానిని ప్రస్తతం రూ.200కి పెంచేశారు. ప్రియమైన శ్రీవారి లడ్డూ ధర పెరగుతుండటంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కంటే ఇప్పుడు లడ్డూ రుచి కూడా తగ్గుతుందని భక్తులు ఆరోపిస్తున్నారు. అధికారులు శ్రీవారి లడ్డూ రుచిని భక్తులకు దూరం చేయోద్దని.. ధరలను కూడా తగ్గించాలని కోరుకుంటున్నారు.

 

20:32 - December 21, 2017

దళిత, అగ్రకుల అధికారుల మధ్య వాట్సాప్‌ వార్‌

ఢిల్లీ : ఏపీ భవన్‌లో కులోన్మాదం వెలుగు చూసింది. దళిత, అగ్రకుల అధికారుల మధ్య వాట్సాప్‌ వార్‌ మొదలైంది. ఏపీ భవన్‌ అధికారులు రెండు వర్గాలుగా చీలిపోయారు. పదోన్నతి అంశంపై రగడ కొనసాగుతోంది. తన పదోన్నతిని అగ్రకులస్తులు అడ్డుకున్నారని ఆనందరావు అనే ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రకుల అధికారి దళితులను రాక్షసులతో పోల్చడం వివాదాస్పదంగా మారింది. క్షీరసాగర మథనంలో రాక్షసులు ఎంత కష్టపడ్డా ప్రాప్తం దక్కలేదంటూ ఆ అధికారి ఎద్దేవా చేశారు. డిప్యూటీ కమిషనర్‌ సూర్యనారాయణ తీరుపై దళిత అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిలక్ మార్గ్ పోలీస్ స్టేషన్‌లో సూర్యనారాయణపై ఫిర్యాదు చేశారు.

20:29 - December 21, 2017

ఢిల్లీ : ఏపీ భవన్‌లో కులోన్మాదం వెలుగు చూసింది. దళిత, అగ్రకుల అధికారుల మధ్య వాట్సాప్‌ వార్‌ మొదలైంది. ఏపీ భవన్‌ అధికారులు రెండు వర్గాలుగా చీలిపోయారు. పదోన్నతి అంశంపై రగడ కొనసాగుతోంది. తన పదోన్నతిని అగ్రకులస్తులు అడ్డుకున్నారని ఆనందరావు అనే ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రకుల అధికారి దళితులను రాక్షసులతో పోల్చడం వివాదాస్పదంగా మారింది. క్షీరసాగర మథనంలో రాక్షసులు ఎంత కష్టపడ్డా ప్రాప్తం దక్కలేదంటూ ఆ అధికారి ఎద్దేవా చేశారు. డిప్యూటీ కమిషనర్‌ సూర్యనారాయణ తీరుపై దళిత అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిలక్ మార్గ్ పోలీస్ స్టేషన్‌లో సూర్యనారాయణపై ఫిర్యాదు చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళితులు డిమాండ్‌ చేస్తున్నారు. 
దళిత ఉద్యోగి...
'దళితులకు అన్యాయం జరుగుతోంది. అన్ని విషయాల్లో దళితులను వివక్షతకు గురి చేస్తున్నారు. ఒకే కులానికి అన్ని చేస్తున్నారు. అగ్రకులస్తులు, బ్రాహ్మణులకు విద్యాఅర్హతలు లేకున్నా ప్రమోహన్ ఇచ్చారు.. కానీ దళితులకు విద్యా అర్హతులున్నా ప్రమోషన్ ఇవ్వలేదు' అని వాపోయారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

తారాస్థాయికి చేరుకున్న అనంతపురం తెలుగు తమ్ముళ్ల తగవు

అనంతపురం : జిల్లా తెలుగు తమ్ముళ్ల తగవు తారాస్థాయికి చేరుకుంది. జేసీ బ్రదర్స్‌, అనంతపురం మేయర్‌ మధ్య ముదిరిన వివాదం పెరిగి పెద్దదవుతోంది. రెండు వర్గాల నేతలు పోటాపోటీగా ప్రెస్‌మీట్‌లలో దుమ్మెత్తి పోసుకుంటున్నారు. జేసీ అనుచరుడు మద్దిపల్లి శివపై పోలీసులకు మేయర్‌ స్వరూప ఫిర్యాదు చేశారు. ఫోన్‌లో తనను దుర్భాషలాడినట్లు మేయర్‌ అభియోగంతో.. మద్దిపల్లి శివను పోలీసులు అరెస్టు చేశారు. శివ అరెస్టుకు నిరసనగా జేసీ అనుచరులు ఆందోళనకు దిగారు. తాడిపత్రి పోలీసు స్టేషన్‌ వద్ద జేసీ అనుచరుల ధర్నా చేపట్టారు. దీంతో అనంత, తాడిపత్రిలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

19:56 - December 21, 2017

అనంతపురం : జిల్లా తెలుగు తమ్ముళ్ల తగవు తారాస్థాయికి చేరుకుంది. జేసీ బ్రదర్స్‌, అనంతపురం మేయర్‌ మధ్య ముదిరిన వివాదం పెరిగి పెద్దదవుతోంది. రెండు వర్గాల నేతలు పోటాపోటీగా ప్రెస్‌మీట్‌లలో దుమ్మెత్తి పోసుకుంటున్నారు. జేసీ అనుచరుడు మద్దిపల్లి శివపై పోలీసులకు మేయర్‌ స్వరూప ఫిర్యాదు చేశారు. ఫోన్‌లో తనను దుర్భాషలాడినట్లు మేయర్‌ అభియోగంతో.. మద్దిపల్లి శివను పోలీసులు అరెస్టు చేశారు. శివ అరెస్టుకు నిరసనగా జేసీ అనుచరులు ఆందోళనకు దిగారు. తాడిపత్రి పోలీసు స్టేషన్‌ వద్ద జేసీ అనుచరుల ధర్నా చేపట్టారు. దీంతో అనంత, తాడిపత్రిలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

 

పబ్బులో కేంద్ర మాజీమంత్రి కుమారుడు హల్ చల్

హైదరాబాద్ : పబ్బులో కేంద్ర మాజీమంత్రి కుమారుడు హల్ చల్ చేశాడు. నిన్న అర్ధరాత్రి కళ్యాణ్ అనే యువకుడితో ఘర్షణకు దిగారు. కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ కుమారుడు సాయి. ఇరువర్గాలు బాటిళ్లతో పరస్పరం దాడి చేసుకున్నాయి. పబ్బు యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీ ఫుటేజీ పరిశీలించిన జూబ్లీహిల్స్ పోలీసులు సాయిని ప్రశ్నించారు. అనంతరం సాయికి పోలీసులు నోటీసులు అందించారు. 

 

19:46 - December 21, 2017

నాగర్ కర్నూలు : జిల్లాలోని కల్వకుర్తి సీబీఎం ఆస్పత్రిలో మహిళకు డాక్టర్లు అరుదైన శస్త్రచికిత్స చేశారు. ఆపరేషన్ చేసి యువతి కడుపులో నుంచి 8 కిలోల కణితిని వైద్యులు తొలగించారు. జిల్లాలోని ఉప్పునుంతల మండలం తిర్మలాపూర్ కు చెందిన సైదమ్మ (22) అనే యువతి కడుపు నొప్పితో కల్వకుర్తిలోని సీబీఎం ఆస్పత్రిలో చేరారు. వైద్య పరీక్షల్లో కడుపులో కణితి ఉందని తేలడంతో ఆమెకు ఆపరేషన్ చేశారు. డా.వంశీకృష్ణ ఆధ్వర్యంలో ఈ శస్త్రచికిత్స జరిగింది. వైద్య పరిభాషలో ఈ కణితిని ఒబేరియన్ ట్యూమర్ గా పిలుస్తారని డాక్టర్లు చెప్పారు. కణితి తొలగించి ప్రాణాలు కాపాడిన డాక్టర్లకు బాధిత మహిళ సైదమ్మ కృతజ్ఞతలు తెలిపారు. 

 

19:29 - December 21, 2017

గుంటూరు : ప్రతిపక్షనేత జగన్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మీకు భగవంతుడి ఆశీస్సులు ఉండాలని ట్విటర్‌లో చంద్రబాబు విషెష్‌ పెట్టారు. మరోవైపు జగన్‌ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్‌లోనే కేంద్ర కార్యాలయంలో వైసీపీ నేతలు కేక్‌ కట్‌యచేశారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. పేదలకు చీరలపంపిణీ చేశారు. అటు కడపజిల్లా పులివెందులలో మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి  జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.  

 

19:13 - December 21, 2017

కర్నూలు : జిల్లా చెన్నంపల్లె కోటలో గుప్తు నిధుల కోసం జరుపుతున్న తవ్వకాలను జిల్లా కలెకర్ట్‌ సత్యనారాయణ సమర్థించుకున్నారు. ఈమేరకు కలెక్టర్ సత్యనారాయణంతో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. తవ్వకాల్లో ఎలాంటి నిధి, నిక్షేపాల దొరికినా గ్రామాభివృద్ధికి ఉపయోగిస్తామని చెప్పారు. ఈ స్థల ప్రాధాన్యతను బట్టే తవ్వకాలు చేపట్టామని తెలిపారు. ఈ ప్రాంతంలో బంగారు నిక్షేపాలు, ఖనిజాల అన్వేషణ జరుగుతోందని చెప్పారు. ప్రజల నుంచి అందిన విజ్ఞప్తులతోనే తవ్వకాలు చేపట్టామని తెలిపారు. 

 

19:00 - December 21, 2017

కడప : ఉక్కు పరిశ్రమై కేంద్రమంత్రి చౌదరీ బీరేంద్రసింగ్‌తో చర్చించామని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. కేంద్రం మంత్రి చౌదరి బీరేంద్రసింగ్‌తో ఏపీ మంత్రులు, ఎంపీలు భేటీ అయ్యారు. అనంతరం సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కడప ఉక్కుపై విభజన చట్టంలో స్పష్టత లేదని కేంద్రం అంటోందన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని కోరామన్నారు. దీనికోసం ఈనెల 27న టాస్క్‌ఫోర్స్‌ కడపజిల్లాలో పర్యటిస్తుందన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలన తర్వాత ఉక్కుపరిశ్రమ ఏర్పాటుపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని మంత్రి సోమిరెడ్డి తెలిపారు. 

 

18:50 - December 21, 2017

కర్నూలు : పత్తికొండ బాలికల ఉన్నత పాఠశాల వద్ద కిడ్నాపర్లు హల్ చల్ చేశారు. 9 వ తరగతికి చెందిన ఐదుగురు విద్యార్థినులను దుండగులు కిడ్నాప్ చేశారు. రెండు ఆడోల్లో విద్యార్థినులను దుండగులు ఎత్తుకెళ్లారు. చేతులను బ్లేడ్ లతో కోసి పత్తికొండ ఆస్పత్రి వద్ద విద్యార్థినులను వదిలి దుండగులు పరారయ్యారు. పత్తికొండ ప్రభుత్వ ఆస్పత్రిలో విద్యార్థినులు ఇందూ, హైమావతి, ఆశ, పూజిత, మరో విద్యార్థిని చికిత్స పొందుతున్నారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

విద్యార్థనుల కిడ్నప్

కర్నూలు : పత్తికొండ బాలికల ఉన్నత పాఠశౄల వద్ద 9వ తరగతికి చెందిన ఐదుగురు విద్యార్థునుల కిడ్నాప్ చేశారు. 2 ఆటోల్లో విద్యార్థునులను గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. చేతులను బ్లేడ్ లతో కోసి పత్తికొండ ఆసుపత్రి వద్ద విద్యార్థులను వదిలి పరారైయ్యారు. ఇందూ, హైమావతి, ఆశ, పూజిత మరో విద్యార్థి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

జగన్ కు సీఎం జన్మదిన శుభకాంక్షలు

గుంటూరు : వైసీపీ అధ్యక్షుడు జగన్ కు సీఎం చంద్రబాబు జన్మదిన శుభకాంక్షలు తెలిపారు. భగవంతుని ఆశీస్సులతో పాటు సంతోషకరమైన జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు.

17:53 - December 21, 2017

హైదరాబాద్ : ప్రజాసమస్యల  పరిష్కారంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని టీజేఏసీ నేత కోదండరాం అన్నారు. చంచల్‌గూ జైల్లో ఉన్న ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణమాదిగను కోదండరాం పరామర్శించారు. కేసీఆర్‌ ప్రభుత్వం  నిరసన తెలపడమే నేరంగా  చూస్తోందని కోదండరాం విమర్శించారు. ఇప్పటికైనా ఎస్సీవర్గీకరణపై సీఎం కేసీఆర్‌ అఖిలపక్షాలను ఢిల్లీకి తీసుకెళ్లాలని కోదండరాం డిమాండ్‌ చేశారు. 

 

17:50 - December 21, 2017

హైదరాబాద్ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అమరుల స్ఫూర్తియాత్రను టీజేసీ సిద్ధం అయింది. శుక్రవారం ఉదయం 8.30కు ఎల్బీనగర్‌లోని శ్రీకాంతాచారి విగ్రహానికి నివాళులర్పించి యాత్రను ప్రారంభిస్తామని జేఏసీ చైర్మన్‌ కోదండరాం తెలిపారు. సాయంత్రానికి నల్లగొండలోని ఎన్జీకాలేజీ గ్రౌండ్స్‌లో బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. తర్వాత శనివారం నల్లగొండ నుంచి మిర్యాలగూడ మీదుగా హుజూర్‌నగర్‌, కోదాడ, అక్కడ నుంచి సూర్యాపేటకు  యాత్ర కొనసాగుతుందని కోదండరాం తెలిపారు. శనివారం సూర్యాపేటలో బహిరంగసభ నిర్వహిస్తామన్నారు. ప్రధానంగా ఉమ్మడి నల్లగొండజిల్లాలో నిరుద్యోగుల సమస్యలపై దృష్టిపెడుతున్నామని కోదండరాం తెలిపారు. 

 

17:46 - December 21, 2017

హైదరాబాద్‌ : ప్రపంచ తెలుగు మహాసభలకు వందల కోట్ల రూపాయల ప్రజాధాన్ని వృధా చేశారని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీ ఆరోపించారు. ఈ మహాసభలతో ఎవరికీ ప్రయోజనంలేదని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సొంత డబ్బా కొట్టుకోడానికి ఈ మహాసభలు ఉపయోగడ్డాయని షబ్బీర్‌ అలీ వ్యాఖ్యానించారు. ప్రపంచ తెలుగు మహాసభలపై శ్వేతపత్రం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. 

 

17:40 - December 21, 2017

నల్గొండ : సామాజిక న్యాయ సాధన కోసం కొత్త ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. నల్గొండ జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడారు. వామపక్ష పార్టీలు, దళిత, బహుజన సంఘాలు, కుల సంఘాలతో కొత్త ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నుట్లు ప్రకటించారు. ఇప్పటికే వామపక్షపార్టీలతో సంప్రదింపులు జరుగుతున్నాయని తెలిపారు. జనవరి 28న హైదరాబాద్ కు దళిత నేతలు ప్రకాశ్ అంబేద్కర్, జిగ్నేష్ మేవాని వస్తున్నారని చెప్పారు. జనవరి 28భేటీ తర్వాత కొత్త ఫ్రంట్ పై మరింత క్లారిటీ వస్తుందన్నారు. గత 25 ఏళ్లుగా అనుసరించిన పొత్తుల విధానాన్ని సవరించుకుంటున్నామని తెలిపారు.

మందకృష్ణను వెంటనే విడుదల చేయాలి : తమ్మినేని

నల్లగొండ : ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను వెంటనే విడుదల చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. కృష్ణ కు బెయిల్ రాకుండా అడ్డుకోవడం కక్ష సాధింపే అని, భారతి మృతికి ప్రభుత్వానిదే బాధ్యత అని ఆయన అన్నారు.

వీణా వల్లభరావుకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

ఢిల్లీ : వీణ వల్లభరావుకు సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించారు. అనువాదం విభాగంలో విరామమెరుగని పయనం అనే పుస్తకానికి గాను వల్లభరావుకు అవార్డు వచ్చింది. పంజాబ్ భాషలోని ఖానాబదోష్ ఆత్మకథను తెలుగులోకి అనుదించారు. 

16:42 - December 21, 2017
16:41 - December 21, 2017
16:37 - December 21, 2017

రాజన్న సిరిసిల్ల : జిల్లాలో దారుణం జరిగింది. వడ్డీ వ్యాపారి దారుణానికి పాల్పడ్డాడు. అప్పు తీర్చాలంటూ మూడు రోజులుగా మహిళలను గృహనిర్బంధం చేశాడు. బట్టల దుకాణం కోసం కృష్ణహరి అనే వ్యక్తి వడ్డీ వ్యాపారి ఆంజనేయులు వద్ద రూ.2 లక్షలు అప్పు తీసుకున్నాడు. వస్త్ర వ్యాపారంలో నష్టం రావడంతో కృష్ణహరి ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. దీంతో అప్పు తీర్చాలంటూ కృష్ణహరి భార్య, తల్లిని వడ్డీవ్యాపారి వేధిస్తున్నాడు. అప్పు తీర్చాలని ఆ ఇద్దరు మహిళలను ఇంట్లో వేసి మూడు రోజులుగా గృహనిర్బంధం చేశాడు. వడ్డీవ్యాపారి ఆంజనేయులు వేధింపుల నుంచి కాపాడాలని బాధితులు వేడుకుంటున్నారు. మహిళలని కూడా చూడకుండా ఇంటికి తాళం వేసి వెళ్తున్నాడని వాపోయారు. 

 

సిరిసిల్లలో దారుణం

సిరిసిల్ల : జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. మూడు రోజులగా ఓ మహిళను వడ్డీ వ్యాపారి గృనిర్బంధం చేశాడు. అంతేకాకుండా అప్పు తీర్చాలంటూ మహిళలను బెదిరిస్తున్నాడు. బట్టల దుకాణం కోసం కృష్ణహరి అనే వ్యక్తి వడ్డీ వ్యాపారి దగ్గర రూ.2లక్షలు తీసుకున్నాడు.  వస్త్ర వ్యాపారంలో నష్టం రావడంతో కృష్ణ హరి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దీంతో అప్పు తీర్చాలంటూ కృష్ణ హరి తల్లిని, భార్యని వ్యాపారి వేధిస్తున్నాడు. 

ఉక్కుశాఖ మంత్రిని కలిసిన కడప టీడీపీ నేతలు

ఢిల్లీ : కడప టీడీపీ నేతలు ఉక్కుశాఖ మంత్రిని కలిశారు. వారు కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై చర్చించారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహకారం అందిస్తామని కేంద్రమంత్రికి చెప్పామని సోమిరెడ్డి అన్నారు. 

16:15 - December 21, 2017

హైదరాబాద్ : ప్రముఖ రచయిత దేవీప్రియకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. గాలిరంగు కవితా సంపుటికి అవార్డు దక్కింది. 'రన్నింగ్ కామెంట్రి', 'అమ్మాచెట్టు', 'నీటిపుట్ట', 'చేప చిలుక', 'తుపాను తుమ్మెద', 'గరీబు గీతాలు', 'పిట్ట కూడా ఎగిరిపోవలసిందే' వంటి ప్రముఖ రచనలు దేవీప్రియ చేశారు.
దేవీప్రియ...
'జాతీయ గౌరవం రావడం చాలా సంతోషంగా ఉంది. అది ముఖ్యమైన మైలురాయి. చాలా సంతృప్తిగా ఉంది. అవార్డు ప్రకటించిన కేంద్ర సాహిత్య అకాడమీకి, ఆ వార్తను ప్రసారం చేసిన 10టివికి ధన్యావాదాలు తెలిపారు. అచెలంచెలుగా ఎదుగుతూ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఈస్థాయికి వచ్చాను' అని అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

రైస్ పుల్లింగ్ మోసాలకు పాల్పడుతున్నవారి అరెస్టు

హైదరాబాద్ : రైస్ పుల్లింగ్ మోసాలకు పాల్పడుతున్న నలుగురిని నార్త్ జోన్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.34.19లక్షలు, ఇన్నోవా కారు, 3 రాగి చెంబులను స్వాధీనం చేసుకున్నారు. 

రైస్ పుల్లింగ్ మోసాలకు పాల్పడుతున్న నలుగురి అరెస్టు

హైదరాబాద్ : రైస్ పుల్లింగ్ మోసాలకు పాల్పడుతున్న నలుగురిని నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.34.19 లక్షలు, ఇన్నోవా కారు, 3రాగి చెంబులు స్వాధీనం చేసుకున్నారు. 

 

 

జయలలిత మృతిపై కొనసాగుతోన్న విచారణ

చెన్నై : జయలలిత మృతిపై విచారణ కొనసాగుతోంది. మాజీ సీఎస్ రామ్మోహన్ రావును ఆర్ముగస్వామి కమిషన్ ఐదు గంటలపాటు ప్రశ్నించింది. 

15:57 - December 21, 2017

ఢిల్లీ : 2 జి స్పెక్ట్రం కేసు తీర్పును రాజ్యసభలో  కాంగ్రెస్‌ ప్రస్తావించింది. ఈ ఆరోపణల కారణంగా మీరు అధికారంలోకి వచ్చారని...మేము విపక్షంలో కూర్చున్నామని ఆజాద్‌ బిజెపిని ఉద్దేశించి విమర్శించారు. లక్షా 76 వేల కోట్ల 2 జి స్కాం జరిగిందన్న ఆరోపణలు నిరాధారమని రుజువైందన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్‌, ఆర్థికమంత్రి చిదంబరంతో పాటు పలువురిపై అనవసర ఆరోపణలు చేశారని ధ్వజమెత్తారు. అసలు కుంభకోణమే జరగలేదని...యూపీఏ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేశారని ఆజాద్‌ బిజెపిపై విరుచుకుపడ్డారు. 

 

15:56 - December 21, 2017

ఢిల్లీ : 2జీ స్పెక్ట్రం కేసులో పటియాలా హౌజ్ కోర్టు తీర్పును మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్వాగతించారు. కోర్టు తీర్పును గౌరవిస్తున్నామని చెప్పారు. 2జీ స్పెక్ట్రం కేటాయింపులకు సంబంధించి యూపిఏ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు నిజం కావని కోర్టు ఇచ్చిన తీర్పుతో తేలిందని మన్మోహన్ సింగ్ అన్నారు. యూపిఏ ప్రభుత్వంపై దుష్ప్రచారం జరిగిందని పేర్కొన్నారు.

 

15:54 - December 21, 2017

ఢిల్లీ : సంచలన  2జీ కుంభకోణం కేసులో నిందితులుగా ఉన్న ఏ.రాజా, కనిమొళిలకు ఊరట లభించింది. వారిద్దరిని నిర్దోషులుగా నిర్ధారిస్తూ పటియాలా హౌస్ కోర్టు తీర్పు వెలువరించింది. కోర్టు తీర్పుతో డీఎంకే నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ కేసులో నిందితులకు ఉన్న అందరినీ నిర్ధోషులుగా తేల్చింది కోర్టు. ఆరు సంవత్సరాల అనంతరం సీబీఐ స్పెషల్ కోర్టు తీర్పు వెల్లడించింది. వినోద్‌రాయ్ నేతృత్వంలో 2010లో సీబీఐ తొలి చాటర్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో ఏ.రాజాతో పాటు టెలికాం కార్యదర్శి సిద్దార్ధ్ బెహూరా, మరో 12 మందిపై సీబీఐ అభియోగాలు మోపింది. స్పెక్ట్రం ధరలు నిర్ణయించడంలో అవకతవకలు జరిగాయని ప్రభుత్వ ఖజానాకు రూ.1.76 లక్షల కోట్లు నష్టం వాటిల్లినట్లు కాగ్ నివేదిక సమర్పించింది. స్వాన్ టెలీకాంకు అర్హత లేకపోయినప్పటికీ 15 కోట్ల 37 లక్షలకే లైసెన్సులకు అనుమతులిచ్చినట్లు నివేదిక తెలిపింది. బిడ్ దక్కించుకున్న 9 కంపెనీలు ప్రభుత్వానికి రూ.10 వేల 772 కోట్లు మాత్రమే చెల్లించాయి. తప్పుడు పత్రాలతో ఆ కంపెనీలు లైసెన్సులు పొందినట్లు విచారణలో వెల్లడైనట్లు కాగ్ నివేదిక తెలిపింది. అయితే ఈ నేరాన్ని నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలం అయినందుకు అందరినీ నిర్దోషులుగా తేలుస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది.  

 

15:52 - December 21, 2017

హైదరాబాద్ : జనవరి 3 నుంచి 7వరకు జరగాల్సిన సైన్స్‌కాంగ్రెస్‌ను వాయిదా పడింది. ఉస్మానియా వర్సిటీలో పరిస్థితులు, భద్రతా కారణాలతో సైన్స్‌ కాంగ్రెస్‌ను వాయిదా వేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయని ఓయూ వీసీ రామచంద్రం తెలిపారు. నిర్వహణ తేదీలను త్వరలో ప్రకటిస్తామన్నారు. మరోవైపు ఈనెల 27న కోల్‌కతాలో ఇస్కా సమావేశం యధాతథంగా జరుగుతుందని వీసీ రామచంద్రం అన్నారు. 

 

రంగారెడ్డి జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

రంగారెడ్డి : మంచాల మండలం ఎల్లమ్మతండాలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానానికి పాల్పడ్డారు. అఖిల, శ్రీకాంత్ పరిస్థితి విషమంగా ఉంది. వారిని చికిత్స నిమిత్తం ఇబ్రహీంపట్నం ఆస్పత్రికి తరలించారు. 

జయలలిత మృతి పై కొనసాగుతున్న విచారణ

చెన్నై : జయలలిత  మృతి పై విచారణ కొనసాగుతుంది. మాజీ సీఎస్ రామ్మోహన్ రావు ను 5 గంటలపాటు ఆర్ముగస్వామి కమిషన్ ప్రశ్నించింది. 

కొనసాగుతోన్న ఆర్ కే నగర్ ఉపఎన్నిక పోలింగ్

చెన్నై : ఆర్ కే నగర్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3గంటల వరకు 57.16 శాతం పోలింగ్ నమోదు అయింది. 

నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య

కృష్ణా : నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ట్రిపుల్ ఐటీ భవనం పై నుంచి విద్యార్థి కిందికి దూకాడు. తీవ్ర గాయాలపాలైన అతన్ని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ విద్యార్థి మృతి చెందాడు. 

 

15:35 - December 21, 2017

హైదరాబాద్‌ : క్రిస్మస్‌ క్రైస్తవులకు ముఖ్యమైన పండుగ. ఏసుక్రీస్తు జన్మదినంగా జరుపుకునే ఈ పండుగకు భాగ్యనగరం అందంగా ముస్తాబైంది. నగరంలో ఎటుచూసినా క్రిస్మస్‌ షాపింగ్‌ సందడే కనిపిస్తోంది. క్రిస్మస్‌ వేడుకలకు భాగ్యనగరం ముస్తాబవుతోంది. క్రిస్మస్‌ను ఘనంగా జరుపుకునేందుకు క్రైస్తవులు రెడీ అవుతున్నారు. నగరంలో ఇప్పటికే పలు షాపులు ఆకర్షణీయంగా మారాయి. దీంతో క్రిస్మస్‌ షాపింగ్‌ ఊపందుకుంది. ప్రధాన షాపులు, హోల్‌సేల్‌ దుకాణాలు అందంగా ముస్తాబు చేశారు. దీంతో షాపులన్నీ కొనుగోలు దారులతో కిటకిటలాడుతున్నాయి.
డిసెంబర్‌ నెలరాగానే హైదరాబాద్‌లో క్రిస్మస్‌ సందడి  
వాస్తవానికి డిసెంబర్‌ నెలరాగానే హైదరాబాద్‌లో క్రిస్మస్‌ సందడి మొదలైంది. హోటల్స్‌లో కేకు మిక్సింగ్‌ కార్యక్రమాలు నడిచాయి. క్రైస్తవుల ముంగిళ్లలో క్రిస్మస్‌ ట్రీలు ప్రత్యక్షమయ్యాయి. ఎక్కడ చూసినా రంగురంగుల నక్షత్రాలు, క్రిస్మస్‌ ట్రీలు, ఫ్లవర్స్‌, డిజిటల్‌ లైటింగ్‌, శాంటాక్లాజ్‌ దర్శనమిస్తున్నాయి. పలురకాల వెరైటీ డెకరేషన్‌ ఐటెమ్స్‌ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. 
ప్రత్యేక ఆకర్షణ ఎక్స్‌మాస్‌ ట్రీ, శాంటాక్లాజ్
క్రిస్మస్‌ రాకతో శాంటాక్లాజ్‌, ఎక్స్‌మాస్‌ ట్రీస్‌ కోసం చిన్నారుల ఎదురుచూపులు మొదలయ్యాయి. ఈ సంప్రదాయ వేడుకలకు ఇతర రాష్ట్రాల నుంచి డెకరేషన్‌ ఐటెమ్స్‌ నగరంలో కొలువుదీరాయి. వెరైటీ ఐటమ్స్‌ కొనుగోలుతో క్రైస్తవులు బిజీ అయ్యారు. క్రిస్‌మస్‌లో ప్రత్యేక ఆకర్షణ ఎక్స్‌మాస్‌ ట్రీ, శాంటాక్లాజ్‌. హైదరాబాద్‌ షాపుల్లో ఇవి కనువిందు చేస్తున్నాయి. క్రిస్మస్‌ సందర్భంగా తమ ఇళ్లను రంగు రంగు నక్షత్రాలు, గంటలతో డెకరేట్‌ చేయడం పరిపాటి. చర్చిలతోపాటు క్రైస్తవులు తమ ఇళ్లలో అందమైన స్టార్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. క్రిస్మస్‌ ఐటెమ్స్‌ను  హోల్ సేల్, రిటైల్ మార్కెట్లలో గత ఏడాదితో పోలిస్తే ఈసారి సరసమైన ధరలకే విక్రయిస్తున్నారు. మొత్తానికి క్రిస్మస్ సమీపిస్తుండడంతో హైదరాబాద్ కలర్ ఫుల్ గా మారింది. ఇక ప్రభుత్వం అధికారికంగా వేడుకలను నిర్వహించనుంది. క్రైస్తవ సోదరులు షాపింగ్స్ తో పాటు కావలసిన వస్తువుల కొనుగోలుతో బిజిబిజి అయ్యారు.

 

15:23 - December 21, 2017
15:22 - December 21, 2017

రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని సిరిసిల్ల పట్టణంలో విషాదం జరిగింది. బివై నగర్‌కు చెందిన విజయ (60), లక్ష్మి(30) అనే తల్లీకూతుళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే కొడుకు వేదింపులు తట్టుకోలేక ఈ ఆత్మహత్యకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. 

 

15:18 - December 21, 2017

ఖమ్మం : జిల్లాలోని వైరా మండలం పినపాక వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ అదుపు తప్పి రహదారి పక్కన ఉన్న హోటల్‌లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో దావీదు అనే వ్యక్తితో పాటు యామిని అనే ఐదేళ్ల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. హోటల్‌లోకి దూసుకెళ్లిన లారీని క్రేన్‌ సాయంతో బయటకు తీశారు. ఘటనా స్థలాన్ని మంత్రి తుమ్మల పరిశీలించారు. డ్రైవర్‌ మద్యం మత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. డ్రైవర్‌పై కేసు నమోదు చేశామన్నారు. 
 
 

 

రచయత దేవిప్రియకు కేంద్ర సాహిత్య ఆకాడమీ అవార్డు

ఢిల్లీ : రచయత దేవిప్రియకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును సెలక్షన్ కమిటీ ప్రకటించింది. దేవిప్రియ రచించిన గాలిరంగు కవితా సంపుటికి ఆ అవార్డు వచ్చింది. 

15:04 - December 21, 2017

ఢిల్లీ : 2జీ కేసులో నేరం జరగలేదని తీర్పు రావడం దురదృష్టకరమని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు అన్నారు. కోర్టు తీర్పులో లోపం ఉందా.? ప్రాసిక్యూషన్ విఫలమైందా ? తేలాల్సి ఉందని తెలిపారు. కేసును బీజేపీ నీరు గార్చిందన్న ఆరోపణలు వాస్తవం కాకపోవచ్చన్నారు. పూర్తి జడ్జిమెంట్ ఇంకా రావాల్సి ఉందని చెప్పారు. 2జీ స్పెక్ట్రం కుంభకోణం అతి పెద్ద కుంభకోణమని.. యూపీఏ హయాంలో జరిగిందన్నారు.  

తెలంగాణలో ఇద్దరు ఐఏఎస్ ల వదిలీ

హైదరాబాద్ : తెలంగాణలో ఇద్దరు ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. ప్లానింగ్ ప్రిన్సిపాల్ సెక్రటరీగా రామకృష్ణారావు, డైరెక్టర్ జనరల్ ఎంసీఆర్ హెచ్ ఆర్డీగా బీపీ ఆచార్యను నియమిస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. 

14:41 - December 21, 2017

లౌక్యం తర్వాత హీరో గోపిచంద్ కు చెప్పుకోదగ్గ విజయం సాధించలేదు. గౌతమ్ నంద, ఆక్సిజన్ సినిమాలు అశించిన స్థాయిలో హిట్ కాకపోవడంతో బ్లాక్ బస్టర్ అయ్యే సినిమా చేయ్యాలని చూస్తున్నారు. అందుకు దగ్గట్టుగా చక్రి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. రాధా మోహన్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో హీరోయిన్ గా మెహ్రీన్ నటించనున్నారు. ఈ మూవీ గురించి చక్రి మాట్లాడుతూ డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపోదిస్తున్నామని, స్కీన్ ప్లే ఆసక్తి కరంగా ఉంటుందని తెలిపారు.

టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర పర్యటన

గుంటూరు : టీడీపీ ఎస్సీ ఎల్ ఆధ్వర్యంలో 82 రోజుల పాటు రాష్ట్రంలో ని దళితవాడలో పర్యటిస్తామని ఎస్సీ కార్పొరేషన్ జూపూడి ప్రభాకర్ అన్నారు. పర్యటనపై దళితులతో కోఅర్డినేషన్ కమిటీలు నియమిస్తామని ఆయన తెలిపారు. 

14:10 - December 21, 2017

పెళ్లి చూపులు సినిమాతో హీరో వెండి తెరకు పరిచమయ్యాడు విజయ్ దేవరకొండ. ఆ తర్వాత ద్వారక మూవీ వచ్చింది కానీ ఇది హిట్ కాలేదు. కానీ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి టాలీవుడ్ లో సెన్సెషనల్ క్రియేట్ చేసింది. ఈ మూవీలో విజయ్ యాక్టింగ్ కు ప్రముఖుల ప్రశంసలు వచ్చాయి. విజయ్ ప్రముఖ దర్శకుడు మణిరత్నం తో చేసే సినిమా చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. కానీ విజయ్ ఆ ప్రాజెక్ట్ లో నటించేందుకు ఇష్టపడలేదని తెలుస్తోంది. విజయ్, మణిరత్నం మధ్య జరిగిన చర్చ జరిగినట్టు విజయ్ పారితోషకం విషయంలో నటించేందుకు ఒప్పుకోలేదని తెలుస్తోంది. మణిరత్నం ఈ మూవీని మల్లీస్టారర్ గా తెరకెక్కిస్తున్నారు. ఇందులో శింభు, అరవింద్ స్వామి, విజయ్ సేతుపతి, జ్యోతిక ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.  

రాచకొండ పరిధిలో ఈ ఏడాది 20487 కేసులు

హైదరాబాద్ : రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది 20487 కేసులు నమోదైయ్యాయని అందులో ప్రాపర్టీ కేసులు 3002, దోపిడీలు 216, చైన్ స్నాచింగ్ కేసులు 208, దృష్టి మరల్చి దోపిడీలు 63, ఎస్ వోటీ కేసులు 835, గుట్కా, పీడీ యాక్ట్ లు 33, డ్రగ్స్ కేసులు 18 ఉన్నాయని సీపీ మహేష్ భగవత్ తెలిపారు. 

కడప ఇరిగేషన్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

కడప : ఇరిగేషన్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. రూ.30 వేలు లంచలం తీసుకుంటూ ఏఈ రియాజ్ అహ్మద్ ఏసీబీకి పట్టుబడ్డాడు. 

13:34 - December 21, 2017

కర్నూలు : పత్తికొండ నియోజకవర్గం..చెన్నంపల్లిలో నిధుల వేట కొనసాగుతోంది. పోలీసు పహారాలో... జిల్లా అధికారులు నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నారు. అయితే వారం రోజుల నుంచి జరుపుతున్న తవ్వకాల్లో.. కేవలం ఎముకలు.. ఇనుము మాత్రమే బయటపడ్డాయి. ఈ తవ్వకాలపై టెన్ టివి అధికారులతో ముచ్చటించింది. గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టడం లేదని...ఆదోని ఆర్డీవో ఓబులేషం పేర్కొన్నారు. జొన్నగిరి ప్రాంతంలో విలువైన ఖనిజం ఉందన్న ప్రచారంతోనే తాము తవ్వకాలు చేపట్టినట్లు, ప్రస్తుతం ఎలాంటివి బయటపడలేదని..కలెక్టర్ ఆదేశాల ప్రకారం తవ్వకాలు చేపట్టడం జరిగిందన్నారు. 

13:28 - December 21, 2017

ఖమ్మం :జిల్లాలోని నేలకొండపల్లి పట్టణంలో డబుల్ బెడ్ రూం లబ్దిదారుల ఎంపికలో గందరగోళం నెలకొంది. లబ్దిదారులను ఎంపిక చేసేందుకు నిర్వహించిన గ్రామసభలో ఎంపిక లిస్టు లోపాయికారీగా జరిగిందంటూ గ్రామస్తులు కన్నెర్ర చేశారు. శుక్రవారం గృహప్రవేశాల కార్యక్రమానికి మంత్రి తుమ్మల హాజరు కానున్నారు. నిరుపేదలను, గతంలో పట్టాలిచ్చిన వారిని విస్మరించారరని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. దీనితో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకారులను అడ్డుకొనే ప్రయత్నం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

అదుపు తప్పి జనంపై వచ్చిన లారీ

ఖమ్మం : జిల్లా వైరా మండలం పినపాక వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ లారీ అదుపు తప్పి జనం మీదకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడేళ్ల పాప మృతి చెందింది మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. 

13:24 - December 21, 2017

చెన్నై : 2జి స్కాం కేసులో పాటియాల కోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైందని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ పేర్కొన్నారు. ఈ కేసులో కనిమొళి, రాజాతో పాటు నిందితులందరినీ నిర్దోషులగా ప్రకటించింది. ఈసందర్భంగా స్టాలిన్ మీడియాతో మాట్లాడారు. కోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు, డీఎంకేను అంతం చేయాలని చూసిన వారికి తీర్పు చెంప పెట్టులాంటిదని వ్యాఖ్యానించారు. పాటియాల కోర్టు తీర్పుతో డీఎంకే శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. 

13:20 - December 21, 2017

చెన్నై : 2 జి స్కాం కేసులో నిందితులుగా ఉన్న వారందరినీ పాటియాల కోర్టు నిర్దోషులగా ప్రకటించడంపై లాయర్లు సంతోషం వ్యక్తం చేశారు. నేరాన్ని నిరూపించడంలో ప్రాసిక్యూషన్ ఘోరంగా విఫలం చెందిందని, ఆరేళ్ల తరువాత వాస్తవాలు బయటకొచ్చాయని తెలిపారు. కేవలం రాజకీయ దురేద్ధశ్యంతోనే ఇది జరిగిందని పేర్కొన్నారు. ఇంకా వారి మాటల్లోనే వినాలంటే వీడియో క్లిక్ చేయండి.

తిరుచ్చి శివ సంతోషం...
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2 జి స్కాంలో పాటియాల కోర్టు తీర్పును వెలువరించింది. రాజా, కనిమొళితో పాటు నిందితులందరినీ నిర్దోషలుగా ప్రకటించింది. కోర్టు తీర్పుపై డీఎంకే స్పందించింది. ఈ కేసులో ఎలాంటి స్కాం జరగలేదని కోర్టు ద్వారా నిరూపితమైనందుకు సంతోషంగా ఉందని డీఎంకే నేత తిరుచ్చి శివ పేర్కొన్నారు. దేశ ప్రజల ముందు ఏ తప్పు చేయలేదని ఈ తీర్పు ద్వారా వెల్లడైందన్నారు. 

2018-2019 బడ్జెట్ రూపకల్పన జరుగుతోంది : యనమల

తూర్పుగోదావరి : 2018-2019 బడ్జెట్ రూపకల్పన జరుగుతోందని  ఆర్థిక మంత్రి యనమల తెలిపారు. ఈ బడ్జెట్ లో ప్రజాసమస్యల పరిష్కారం, ఇరిగేషన్ రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన అన్నారు. గడిచిన మూడేళ్లలో రూ.60వేల కోట్ల అప్పు చేశామని, బీజేపీ టీడీపీ మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. 

12:51 - December 21, 2017

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్వరలో నిర్మాత మారబోతున్నట్టు సినీ వర్గాల్లో టాక్ నడస్తోంది. ఆయన తండ్రి అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ స్థాపించి నిర్మాత గా ఉన్న విషయం తెలిసిందే. అయితే అర్జున్ తన సొంత పేరిట అంటే బన్నీ అని నిర్మాణ సంస్థ ప్రారంభించబోతునట్లు తెలుస్తోంది. బన్నీ ప్రస్తుతం నా పేరు సూర్య నా ఇళ్లు ఇండియ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీకి వక్కతం వంశీ దర్శకత్వం వహిస్తున్నారు.   

12:46 - December 21, 2017

అనంతపురం : ప్రజా క్షేత్రంలో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ జగన్మోహన్‌రెడ్డి ముందుకెళ్తున్నారన్ని వైఎస్సార్‌ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వైవీ శివారెడ్డి పేర్కొన్నారు. ఇవాళ జగన్మోహన్‌ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా అనంతపురం జిల్లాలో మహిళలకు వెయ్యి కుట్టు మిషిన్లు ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు, వైసీపీ కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని శివారెడ్డి కోరారు. 

12:44 - December 21, 2017

ఖమ్మం : తెలంగాణ రాష్ట్రంలో వాహనాల ప్రమాదాలకు చెక్ పడడం లేదు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం..మద్యం మత్తులో వాహనాలు నడుపుతుండడంతో ఘోరాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల్లో నిండు జీవితాలు ఆర్పిపోతున్నాయి. హయత్ నగర్ లో ఓ కాలేజీ బస్సు సృష్టించిన బీభత్సంలో బాలిక మృతి చెందిన ఘటన మరిచిపోకముందే మరో ఘటన చోటు చేసుకంది. తాగిన మత్తులో డ్రైవర్ డీసీఎం వ్యాన్ నడపడంతో చిన్నారి బలైంది. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది

కొత్తగూడెం నుండి హైదరాబాద్ కు వస్తున్న డీసీఎం డ్రైవర్ మద్యం సేవించాడు. వైరా మండలం పినపాక వద్ద లారీ అదుపుతప్పి జనం మీదకు దూసుకెళ్లింది. దీంతో ఏడేళ్ల పాప అక్కడికక్కడే మరణించింది. ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. అయితే లారీ మత్తు మద్యం మత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.  

విజయవాడలో ఏపీపీఎస్సీ కార్యాలయం

కృష్ణా : విజయవాడలో ఏపీపీఎస్సీ కార్యాలయాన్ని చైర్మన్ ఉదయభాస్కర్ ప్రారంభించారు. ఆర్అండ్ బీ భవనంలోని రెండో అంతస్తును ఏపీపీఎస్సీ కార్యాలయానికి ప్రభుత్వం కేటాయించింది. 35వేల చ. అ విస్తీర్ణంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.

12:40 - December 21, 2017

హైదరాబాద్‌ : రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌లో 2017 ఆన్వల్‌ ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు. ఈ సంవత్సరం నమోదైన కేసుల వివరాలను పోలీసులు వెల్లడించారు. 3వేల రెండు ప్రాపర్టీ కేసులు నమోదవగా, దోపిడీ కేసులు 216 నమోదయ్యాయి. దృష్టి మరలించి చేసిన దోపిడీలు 63, అలాగే సాట్‌ కేసులు 835, గుట్కా, పీడీ యాక్టు కేసులు 33, డ్రగ్స్‌ కేసులు 18 నమోదయ్యాయి. ఫేక్‌ బాబాలు ఏడుగురు అరెస్ట్‌ అయ్యారు. 

ఎంపీలకు వీప్ జారీ చేసిన బీజేపీ

ఢిల్లీ : బీజేపీ తమ పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసింది. రేపు పార్లమెంట్ తప్పనిసరిగా హాజరుకావాలని పార్టీ ఎంపీలకు ఆదేశాలు జారీ చేశారు.

12:25 - December 21, 2017

తమిళనాడు : ఆర్కే నగర్ బై పోల్ కొనసాగుతోంది. జయ మరణానంతరం ఏడాది తరువాత ఎన్నిక జరుగుతోంది. ఉదయం 8గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ప్రజలు భారీగానే ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. 11గంటల వరకు 23.74 పోలింగ్ శాతం నమోదైందని ఎన్నికల అధికారులు పేర్కొంటున్నారు. ఇదే ఒరవడి కొనసాగితే 60 శాతానికి పైగా పోలింగ్ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. 256 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఉప ఎన్నిక బరిలో దినకరన్ సహా 59 మంది అభ్యర్థులు ఎన్నికలో బరిలో ఉన్నారు.

ఏఐఏడీఎంకే నుండి ఇ. మధుసూధన్, స్వతంత్ర అభ్యర్థిగా టిటివి దినకరన్, డీఎంకే నుండి ఎన్. మరుదు గణేష్ లు బరిలో ఉన్నారు. దేశాన్ని కుదిపేసిన 2జి స్పెక్ట్రం కుంభకోణంలో పాటియాల కోర్టు తీర్పును వెలువరించింది. ఇందులో కనిమొళి, ఎ.రాజాలు నిర్ధోషలుగా వెల్లడించింది. దీనితో డీఎంకే సంబరాలు చేసుకొంటోంది. 

12:22 - December 21, 2017

వర్మ ఇతను టాలీవుడ్ లోనే డిఫరెంట్ దర్శకుడు. ఆయన చేసిన ప్రతి ట్విట్ట్, ఆయన చేసే ప్రతి కామెంట్ ఎప్పుడు సెన్సెషనల్ సృష్టిస్తుంది. గతంలో రాయలసీమ బ్యాక్ డ్రప్ లో రక్త చరిత్ర 1,2 తీశాడు. తర్వాత ఎన్టీఆర్ జీవితంపై కూడా సినిమా తీయున్నట్టు ఆయన ప్రకటించారు. అయితే ఆయన తాజాగా కడప అనే వెబ్ సిరిస్ ట్రైలర్ రిలీజ్ చేసిన విషయం అందరికి తెలిసిందే. ఈ సిరిస్ ఓ వర్గం పూర్తి మద్దతు ఇస్తు కడప సిరిస్ ఎదురు చూస్తుంది. కానీ అక్కడ ఉన్ మేధావి వర్గం మాత్రం కడప సిరిస్ ను వ్యతిరేకిస్తుంది. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, అన్నమచార్యులు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ గ్రహితలు బిఎన్ రెడ్డి, నాగిరెడ్డి జన్మించిన ఈ గడ్డను ఫ్యాక్షన్ అంటూ పోల్చడం దారుణమని అంటుంంది. ఈ కడప సిరిస్ ప్రభుత్వం అడ్డుకోవాలని డిమాండ్ చేస్తోంది. 

12:12 - December 21, 2017

ఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2జి స్పెక్ట్రం కుంభకోణం కేసు తుది తీర్పు వచ్చేసింది. టెలికాం శాఖ మాజీ మంత్రి ఎ.రాజా, డీఎంకే ఎంపీ కనిమొళి నిర్దోషలుగా ప్రకటించింది. ఈమేరకు గురువారం పటియాల కోర్టు తీర్పును వెలువరించింది. వీరితో పాటు ఈ కేసులో నిందితులుగా పేర్కొన్న అందర్నీ నిర్దోషులుగా ప్రకటించడం గమనార్హం. సరైన సాక్ష్యాధారాలు లేనందునే వారిని నిర్దోషులుగా తేల్చినట్లు న్యాయస్థానం పేర్కొంది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో అప్పీల్ చేయనున్నట్లు సీబీఐ వర్గాలు పేర్కొంటున్నాయి. కోర్టు తీర్పుతో డీఎంకే శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.

 • యూపీఏ ప్రభుత్వ హాయాంలో ఈ కుంభకోణం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆనాడు మిత్రపక్షమైన డీఎంకేకు పట్టుబట్టి పలు శాఖలను సాధించుకుంది.
 • అందులో భాగంగా డీఎంకేకి చెందిన రాజా టెలికమ్యూనికేషన్ శాఖ మంత్రి పనిచేశారు.
 • ఆయన నేతృత్వంలో 2 జి స్పెక్ట్రం కేటాయింపుల్లో భారీ అవినీతి జరిగిందని ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
 • 2జీ స్పెక్ట్రం అక్రమ కేటాయింపుల వల్ల రూ.1.76 లక్షల కోట్లు నష్టం ఏర్పడినట్లు కేంద్ర ప్రభుత్వానికి కాగ్‌ ఒక నివేదిక సమర్పించింది.
 • భారీ మొత్తంలో కుంభకోణం కావడంతో సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ) రెండు కేసులు పెట్టింది. అలాగే ఎన్‌ఫోర్సుమెంటు డైరక్టరేట్‌ (ఈడీ) మరో కేసు నమోదు చేసింది.
 • కాగ్ ఆరోపణలు చేయడంతో 2010లో ఎ.రాజాను అప్పటి ప్రభుత్వం పదవి నుండి తప్పించింది.
 • సీబీఐ పెట్టిన రెండు కేసుల్లో రాజా, డీఎంకే అధినేత కరుణానిధి కుమార్తె, రాజ్యసభ సభ్యురాలు కనిమొళి తదితరులు ఉన్నారు.
 • టెలికమ్యూనికేషన్స్‌ మాజీ కార్యదర్శి సిద్దార్థ్‌ బెహురా, రాజా మాజీ ప్రయివేటు కార్యదర్శి ఆర్‌కే సంతాలియా తదితర 14 మందిపై చార్జిషీటు దాఖలు చేశారు.
 • 2011లో రాజాను అరెస్టు చేశారు. ఏడాది పాటు జైల్లో ఉన్న రాజా ఆ తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు. 
12:05 - December 21, 2017

కృష్ణా : విజయవాడ ఆర్డీవో ఆఫీస్ ఏవో ఏసీబీ చిక్కాడు. నెల్లూరులోని ఆయన నివాసంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అక్రమాస్తులు ఉన్నట్టు ఆరోపణలు రావడంతో ఆయన ఇళ్లలో ఏబీసీ దాడులు చేస్తోంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

మండి బస్టాండ్ కు బాంబు బెదిరింపు...

హిమాచల్ ప్రదేశ్ : మండి బస్టాండుకు బాంబు బెదిరింపు వచ్చింది. దీనితో బాంబు స్వ్కాడ్..డాగ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించారు. ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. 

మోత్కుపల్లి అరెస్టు...

హైదరాబాద్ : ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద టి.టిడిపి నేత మోత్కుపల్లి మౌన దీక్ష చేపట్టారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆయన్ను అరెస్టు చేసి పీఎస్ కు తరలించారు. ఎస్సీ వర్గీకరణ కోసం సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో వ్యవహరించాలని, అఖిలపక్షాన్ని ఢిల్లీ ఎప్పుడు తీసుకెళుతారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. మాదిగ జాతి చావో..రేవో తేల్చుకోవాల్సినవసరం ఉందని, మందకృష్ణపై కేసులు ఎత్తివేసి విడుదల చేయాలన్నారు. 

రూ. 60 వేల కోట్లు అప్పులు - యనమల...

తూర్పుగోదావరి : 2018-19 బడ్జెట్ రూపకల్పన జరుగుతోందని ఏపీ ఆర్థిక మంత్రి యనమల వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కారం, ఇరిగేషన్ రంగాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు, గడిచిన మూడేళ్లలో రూ. 60వేల కోట్ల అప్పు చేయడం జరిగిందన్నారు. బీజేపీ - టిడిపి మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నట్లు తెలిపారు.

డీఎంకే సంబురాలు...

తమిళనాడు : చెన్నైలోని కనిమొళి ఇంటి వద్ద, డీఎంకే కార్యాలయం వద్ద సందడి నెలకొంది. కాసేపటి క్రితం పాటియాల కోర్టు సంచలనం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. రూ. 1.76 లక్షల కోట్ల 2జీ స్కాం కేసులో పటియాలా హౌస్ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. కీలక నిందితులైన డీఎంకే చీఫ్ కరుణానిధి కుమార్తె కనిమొళి, కేంద్ర మాజీ టెలికాం మంత్రి ఎ.రాజాలను నిర్దోషులుగా ప్రకటించింది. దీనితో డీఎంకే శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. 

మధ్యాహ్నం 2గంటలవరకు రాజ్యసభ వాయిదా

ఢిల్లీ : మధ్యాహ్నం 2 గంటల వరకు రాజ్య సభ వాయిదా పడింది. 2జీ స్కాం పై ప్రతిపక్షాలు చర్చకు పట్టుపట్టడంతో చైర్మన్ సభను వాయిదా వేశారు.

11:11 - December 21, 2017

ప్రస్తుతం టాలీవుడ్ లో మారుమ్రోగుతున్న సినిమా అజ్ఞాతవాసి. ఈ నెల 16న రిలీజైన చిత్ర టీజర్ కు అడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. 19 న జరిగిన ఆడియో రిలీజ్ ఫక్షన్ ఇలా అజ్ఞాతవాసి చిత్రం గురించి సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. ఈ నెల 26న అజ్ఞాతవాసి ట్రైలర్ విడుదల చేయనున్నారు. దీంతో సినీ ప్రేక్షకులు ఫోకస్ అంత అజ్ఞాతవాసి సినిమా పడనుంది. ఈ చిత్ర వచ్చే ఏడాది జనవరి 10 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. 

కనిమొళి, రాజా నిర్దోషులటా...కోర్టు తీర్పు

ఢిల్లీ : టూ జీ కేసులో తీర్పు వెల్లడించిన పాటియాల ప్రత్యేక కోర్టు 2జీ స్కాంలో కనిమొళి, రాజా ను కోర్టు నిర్ధోషులగా కోర్లు తేల్చింది. కోర్టు తీర్పతో డీఎంకే శ్రేణుల సంబరాలు జరుపుకుంటున్నారు.

11:09 - December 21, 2017

ఢిల్లీ : టూ జీ కేసులో తీర్పు వెల్లడించిన పాటియాల ప్రత్యేక కోర్టు 2జీ స్కాంలో కనిమొళి, రాజా ను కోర్టు నిర్ధోషులగా కోర్లు తేల్చింది. కోర్టు తీర్పతో డీఎంకే శ్రేణుల సంబరాలు జరుపుకుంటున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ వాయిదా

హైదరాబాద్ : ఓయూలో జరగాల్సిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ వాయిదా పడింది. జనవరి 3 నుంచి 7 వరకు జరగాల్సిన సైన్స్ కాంగ్రెస్ తదుపరి కార్యాచరణపై ఈ నెల 27 న  ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ప్రతినిధులు భేటీ కానున్నారు. 

10:26 - December 21, 2017

చెన్నై : తమిళనాడులోని ఆర్కేనగర్ లో ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు పోలీంగ్ జరగునుంది. ఆర్కేనగర్ ఉపఎన్నిక కోసం 256 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఉప ఎన్నిక బరిలో దినకరన్ సహా 59 మంది అభ్యర్థులు ఎన్నికలో బరిలో ఉన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి. 

10:21 - December 21, 2017

ఢిల్లీ : కాసేపట్లో టూ జీ స్కామ్ కేసులో తీర్పు వెలవడనుంది. ఈ రోజుం పటియాల హౌస్ కోర్టు తీర్పు ఇవ్వనుంది. టెలికాం శాఖ మాజీ మంత్రి, డీఎంకే నేత ఎ.రాజా పటియాల హౌస్ కోర్టుకు చేరుకున్నారు. పటియాల హౌస్ కోర్టుకు కరుణానిధి కూతురు, డీఎంకే ఎంపీ కనిమొళి చేరుకున్నారు. 

కొనసాగుతున్న ఆర్కేనగర్ ఉపఎన్నిక

చెన్నై : తమిళనాడులోని ఆర్కేనగర్  లో ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు పోలీంగ్ జరగునుంది. ఆర్కేనగర్ ఉపఎన్నిక కోసం 256 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

09:25 - December 21, 2017

రాజన్న సిరిసిల్ల : తెలుగు రాష్ట్రాల్లో అవినీతి అధికారుల తీరు మారడం లేదు. ఏసీబీ అధికారులు దాడులు చేస్తూ వారిని పట్టుకుంటున్నా..ఇతరుల్లో మాత్రం భయం కలగడం లేదు. ఇటీవలే ఏసీబీ అధికారులు చేసిన దాడుల్లో వందల కోట్ల రూపాయల ఆస్తులు బయపడిన సంగతి తెలిసిందే. తాజాగా వేములవాడ ఆలయ సూపరింటెండెంట్ రాజేందర్ ఇంటిపై ఏసీబీ దాడులు నిర్వహించింది. ఏసీబీ సుదర్శన్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. అతని నివాసంతో పాటు కుటుంబసభ్యుల నివాసాలపై కూడా సోదాలు చేస్తున్నారు. నాలుగు బృందాలుగా విడిపోయి సోదాలు నిర్వహిస్తున్నారు. రాజేందర్ కు చెందిన ఓ లాడ్జ్ పై కూడా దాడులు చేసినట్లు సమాచారం. సోదాల్లో భారీగా ఆస్తులు..బంగారం బయటపడినట్లు తెలుస్తోంది.

రాజేందర్ ఆలయ సూపరింటెండెంట్ నిర్వహిస్తూనే ఇతర బాధ్యతలు కూడా చూస్తున్నారు. లడ్డూ ప్రసాదానికి సంబంధించిన కీలక బాధ్యతలు...శానిటేషన్ ఇన్స్ పెక్టర్ విధులు కూడా చూస్తున్నారు. దీనితో భారీగానే అవినీతికి పాల్పడినట్లు తెలుస్తోంది. దాడుల అనంతరం ఎంత అవినీతికి పాల్పడ్డారో తెలియనుంది. 

09:20 - December 21, 2017

హైదరాబాద్ : మాదాపూర్ లో రాత్రి కలకలం రేగింది. ఓ షాపులో సిలిండర్ పేలడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలు గురయ్యారు. మాదాపూర్ లో ఉన్న భవానీ స్టీల్ షాప్ లో సిబ్బంది సిలిండర్ రీ ఫిల్లింగ్ చేస్తున్నారు. ఒక్కసారిగా సిలిండర్లు పేలిపోయాయి. మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. పేలుడు శబ్దానికి స్థానికులు తీవ్ర భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు. షాపు పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తోంది. సిబ్బంది అందించిన సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి.

09:15 - December 21, 2017

చిత్తూరు : తిరుమల తిరుపతి..ప్రఖ్యాతి గాంచిన ఆలయం. శ్రీవారి దర్శనం చేసుకోవడానికి దేశ..విదేశీ..వివిధ రాష్ట్రాల నుండి ఎంతో మంది భక్తులు తిరుమలకు వస్తుంటారు. ఇక్కడి శ్రీవారికి ఎంత ప్రాముఖ్యత ఉందో..లడ్డూకు కూడా అంతే క్రేజ్ ఉంది. ఎంతో రుచికరంగా ఉండడంతో పాటు భక్తిప్రవత్తులతో ఈ లడ్డూను తీసుకొంటుంటారు. కానీ ఈ లడ్డూ ధరలను టిటిడి అధికారులు పెంచేశారు. అయితే దర్శనం టికెట్లపై పొందే లడ్డూ ధరలు యథాతథంగా ఉండనున్నాయి. సామాన్య భక్తులకు అందించే లడ్డూ ధరల్లో ఎలాంటి మార్పు ఉండదని టిటిడి స్పష్టం చేసింది.

సర్వదర్శనం..దివ్యదర్శనంలో తిరుమల శ్రీవారిని దర్శించుకొనే వారికి రాయితీ పద్ధతిలో టిటిడి లడ్డూలను అందచేస్తుంటుంది. కొందరు ఎక్కువ లడ్డూలు కొనుగోలు చేయడానికి సిఫార్సు లేఖలు సైతం ఇస్తుంటారు. ఇలాంటి సిఫార్సు లేఖపై జారీ చేసే లడ్డూల ధరలు భారీగా పెంచేసింది. చిన్న లడ్డూ రూ.25 నుంచి రూ.50కి పెంచారు. అలాగే పెద్ద లడ్డూ రూ.100 నుంచి రూ.200కి పెంచారు. వడ రూ.25 నుంచి రూ.100కి పెంచారు. పెరిగిన ధరలు గురువారం నుంచి అమల్లోకి వస్తాయని టీటీడీ అధికారులు తెలిపారు.

కానీ లడ్డూ తయారీలో భారీగా ఖర్చు వస్తోందని తెలుస్తోంది. ఈ ఖర్చు నుండి బయటపడడానికి భారీగా ధరలు పెంచేసిందని తెలుస్తోంది. ఒక చిన్న లడ్డూ తయారు చేయాలంటూ రూ. 37.50..కళ్యాణోత్సవం లడ్డూ తయారీకి రూ. 150...వడ తయారు చేయడానికి రూ. 80 ఖర్చు అవుతోందని సమాచారం. మరి పెంచిన లడ్డూ ధరలపై ఎలాంటి స్పందనలు వ్యక్తమౌతాయో చూడాలి. 

వేములవాడ సూపరింటెండెంట్ నివాసంపై ఏసీబీ దాడులు..

సిరిసిల్ల : వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం సూపరింటెండెంట్ రాజేందర్ ఇంటిపై ఏసీబీ దాడులు నిర్వహించింది. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. 

పార్లమెంట్ లో మారని తీరు..

ఢిల్లీ : పార్లమెంట్ ఉభయసభలో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. లోక్ సభ..రాజ్యసభలలో కాంగ్రెస్ సభ్యులు సమావేశాలు ప్రారంభమైనప్పటి నుండి నిరసనలతో హోరెత్తిస్తున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ప్రధాని మోడీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. 

బంద్ కు పిలుపునిచ్చిన ఆర్జేడీ...

బీహార్ : నేడు ఆర్జేడీ బంద్ కు పిలుపునిచ్చింది. అందులో భాగంగా గురువారం ఉదయం పార్టీ నేతలు దర్బంగా రైల్వే స్టేషన్ లో ఓ రైలును ఆపివేశారు. ఇసుక తవ్వకాలపై నూతనంగా తీసుకొచ్చిన విధానాన్ని నిరసిస్తూ ఆర్జేడీ బంద్ కు పిలుపునిచ్చింది. 

తిరుమల లడ్డూ ధరలు పెరిగాయి...

చిత్తూరు : తిరుమల సిఫార్సులపై మంజూరు చేసే లడ్డూ ప్రసాదం ధరలు పెంచారు. చిన్న లడ్డూ ధర రూ. 25 నుండి రూ. 50కి పెంచారు. కళ్యాణోత్సవం లడ్డూ రూ. 100 నుండి రూ. 200కు...వడ ధర రూ. 25 నుండి రూ. 100...పెంచిన ధరలు నేటి నుండి అమల్లోకి రానున్నాయి. సాధారణ భక్తులకు ఇచ్చే లడ్డూ ధరలు యథాతథంగా ఉండనున్నాయి. 

08:30 - December 21, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత అధికమౌతోంది. గురువారం భారీగా పొగమంచు కమ్ముకోవడం..చలితో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. విశాఖ ఏజెన్సీలో మాత్రం పరిస్థితి దమనీయంగా మారిపోయింది. మినుములూరు లో 4 డిగ్రీలు, అమ్మవారి పాదాల వద్ద 5 డిగ్రీలు, మాడుగుల మండలం కొత్తపల్లి జలపాతంలో నీరు గడ్డకట్టింది. ఆదిలాబాద్ లో 3.8 డిగ్రీలకు ఉష్ణోగ్రత నమోదైంది. ఇక ఢిల్లీలో పరిస్థితి అదే విధంగా ఉంది. ఏకంగా 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. భారీగా పొగమంచు కమ్ముకోవడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

08:08 - December 21, 2017

తమిళనాడు : ఆర్కేనగర్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. జయలలిత మరణం అనంతరం ఉప ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే. కానీ ఎమ్మెల్యే, ఎంపీ మృతి చెందితే ఆరు నెలల్లోపు ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. కానీ అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవడంతో ఏడాది కాలంగా ఉప ఎన్నిక జరగలేదు. హైకోర్టు జోక్యంతో ఎన్నికల సంఘం ఎన్నికలు తప్పనిసరిగా నిర్వహించాల్సి వచ్చింది. గురువారం పోలింగ్ జరుగుతోంది. ఉదయం 8గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ఏఐఏడీఎంకే నుండి ఇ. మధుసూధన్, స్వతంత్ర అభ్యర్థిగా టిటివి దినకరన్, డీఎంకే నుండి ఎన్. మరుదు గణేష్ లు బరిలో ఉన్నారు.

 • ఆర్‌కె నగర్‌ ఉప ఎన్నికల బరిలో 59 మంది అభ్యర్థులు నిలిచారు.
 • మొత్తం ఓటర్ల సంఖ్య 2,28,234. వీరిలో పురుషులు 1,10,903, స్త్రీలు 1,17,232. లింగమార్పిడి వ్యక్తులు 99 మంది ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.
 • 21 మంది పరిశీలకులు ఎన్నికలను పర్యవేక్షించనున్నారు.
 • పోలింగ్‌ స్టేషన్ల వద్ద 2,500 మంది భద్రతా సిబ్బందిని మోహరించింది.
 • 200కు పైగా నిఘా కెమెరాలు, 21 ఫ్లైయింగ్ స్క్వాడ్‌లు, 21 స్టాటిక్ సర్విలెన్స్ టీమ్‌లు, వీడియో రికార్డింగ్ పరికరాలతో కూడిన 20 మానిటరింగ్ టీమ్‌లు, 45 చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశారు.
 • ఆర్‌కె నగర్‌ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు డిసెంబర్‌ 24న జరుగుతుంది. అదేరోజు ఎన్నికల ఫలితాన్ని ప్రకటించనున్నారు. అన్నాడిఎంకేలో అంతర్గతపోరు , ప్రభుత్వ వైఫల్యంతో ఓటర్లు ఎవరికి పట్టం కడతారనే ఉత్కంఠ నెలకొంది.

ఆర్కే నగర్ పోలింగ్ ప్రారంభం...

తమిళనాడు : చెన్నైలోని ఆర్కేనగర్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ నేడు జరుగుతోంది. పోలింగ్‌కు కావలసిన అన్ని ఏర్పాట్లను ఎన్నికల కమిషన్‌ పూర్తి చేసింది. దివంగత సిఎం జయలలిత మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది. జయలలిత మరణం తర్వాత తమిళనాడులో జరుగుతున్న తొలి ఎన్నిక ఇదే కావడంతో ప్రధాన పార్టీలన్నీ గెలుపై దృష్టి పెట్టాయి. ఏఐఏడీఎంకే నుండి ఇ. మధుసూధన్, స్వతంత్ర అభ్యర్థిగా టిటివి దినకరన్, డీఎంకే నుండి ఎన్. మరుదు గణేష్ లు బరిలో ఉన్నారు. 

బాయిలర్ పేలుడు..ముగ్గురు కార్మికుల మృతి...

బీహార్ : గోపాల్ గంజ్ లో సాసా ముసా షుగర్ మిల్ లో బాయిలర్ పేలింది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు మృతి చెందారు. కొంతమంది కార్మికులకు గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

07:37 - December 21, 2017

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం బాధ్యతను తాను వ్యక్తిగతంగా తీసుకుని 2019లోగా పూర్తి చేస్తానని కేంద్ర జలవనరులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరి హామీ ఇచ్చినట్లు ఏపీ బీజేపీ ఎంపీ హరిబాబు తెలిపారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం జెర్రిపోతుల ప్రాంతంలో తెలుగు తమ్ముళ్లు దుశ్శాసన పర్వానికి తెగబడ్డారు. దళిత మహిళపై దాడి చేసి వివస్త్రను చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన ప్రత్యేక చర్చలో డి.వి.కృష్ణ (సీపీఎం) మన్నె సుబ్బారావు (టిడిపి) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

కాసేపట్లో ఆర్కే నగర్ ఉప ఎన్నిక..

చెన్నై : ఆర్కే నగర్ లో కాసేపట్లో ఉప ఎన్నిక జరుగనుంది. జయలలిత మృతి అనంతరం ఈ ఎన్నిక జరుగతోంది. ఏఐఏడీఎంకే నుండి ఇ. మధుసూధన్, స్వతంత్ర అభ్యర్థిగా టిటివి దినకరన్, డీఎంకే నుండి ఎన్. మరుదు గణేష్ లు బరిలో ఉన్నారు. 

షాను కలిసిన కర్నాటక బీజేపీ నేతలు..

ఢిల్లీ : కర్నాటక రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాను కలిశారు. బుధవారం జరిగిన ఈ భేటీలో రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. 

మోడీని కలిసిన కోహ్లీ దంపతులు..

ఢిల్లీ : ప్రముఖ క్రికెటర్ కోహ్లీ..బాలీవుడ్ నటి అనుష్క దంపతులు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిశారు. ఇటీవలే వారు వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మోడీ నూతన దంపతులకు విషెస్ తెలిపారు. 

పార్లమెంట్ ఎదుట పలు బిల్లులు..

ఢిల్లీ: పార్లమెంట్ ముందుకు కేంద్రం పలు బిల్లులు తీసుకరానుంది. కీలకంగా ఉన్న ట్రిపుల్ తలాక్ బిల్లు కూడా అందులో ఉంది. ఇది చిట్టంగా మారితే తలాక్ చెప్పిన వారికి మూడేళ్ల జైలు శిక్ష పడనుంది. 

పెరిగిన చలి..

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. విశాఖ ఏజెన్సీలో భారీగా పొగమంచు కమ్ముకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

కోహ్లీ - అనుష్క దంపతుల వివాహ రిసెప్షన్..

ఢిల్లీ : నేడు టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ - అనుష్క దంపతులు వివాహ రిసెప్షన్ జరుగనుంది. ఈ రిసెప్షన్ లో క్రికెటర్లు..బాలీవుడ్ ప్రముఖులు పాల్గొననున్నారు. 

గాంధీకి మంత్రి లక్ష్మారెడ్డి...

హైదరాబాద్ : నేడు గాంధీ ఆసుపత్రికి మంత్రి లక్ష్మారెడ్డి రానున్నారు. ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. 

06:49 - December 21, 2017

ఉన్నంత కాలం బాగానే ఉంది.. పొమ్మనేటప్పుడే అడ్డా మీద కూలీలకంటే దారుణంగా ఉంది పరిస్థితి. ఐటి రంగం భవితేమిటి? మెడపై లే ఆఫ్ కత్తి వేలాడుతుంటే అంతులేని ఒత్తిడితో టెకీలు ఏం కాబోతున్నారు? తెల్లారితే ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో తెలియదు. ఏ నిమిషం హెచ్చార్ నుండి మెయిల్ వస్తుందో అర్ధం కాని అయోమయం లక్షలాది సాఫ్ట్ వేర్ ఉద్యోగులను తీవ్రమైన అభద్రతలో పడేస్తోంది. ఈ పరిస్థితికి కారణం ఎవరు? దీనికి పరిష్కారం ఏమిటి? అసలు ఐటి ఉద్యోగాలు ఎందుకు తగ్గుతున్నాయి? రిక్రూట్ మెంట్ ఎందుకు పడిపోతోంది? ఈ అంశంపై టెన్ టివి జనపథంలో కిరణ్‌చంద్ర విశ్లేషించారు. పూర్తి విశ్లేషణకు వీడియో క్లిక్ చేయండి. 

06:47 - December 21, 2017

భారత్ - శ్రీలంక మధ్య జరిగిన తొలి టీ-20 మ్యాచ్‌లో టీమ్‌ ఇండియా గ్రేట్‌ విక్టరీ సాధించింది. శ్రీలంకను చిత్తుగా ఓడించింది. భారత స్పిన్నర్ల ధాటికి శ్రీలంక జట్టు 87 పరుగులకే కుప్పకూలింది. దీంతో 93 పరుగుల తేడాతో భారీ విజయాన్ని టీమ్‌ ఇండియా అందుకుంది. మూడు టీ-20ల సిరీస్‌లో భారత్‌ 1-0 ఆధిక్యం సాధించింది.

టాస్‌ ఓడిపోయిన టీమ్‌ ఇండియా ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. భారత్‌ ఆది నుంచే దూకుడు ప్రదర్శించింది. ఓపెనర్‌ లోకేష్‌ రాహుల్‌ 48 బంతుల్లో 61 రన్స్‌చేసి శుభారంభం అందించాడు. మరో ఓపెనర్‌ రహిత్‌శర్మ 13 బాల్స్‌లో 17రన్స్‌ చేసి ఔటైనా... యువ ఆటగాడు శ్రేయస్‌ అయ్యార్‌ దూకుడుగా ఆడాడు. వరుసగా చక్కని బౌండరీలు బాదేశాడు. మాథ్యూస్‌ వేసిన తొమ్మిదో ఓవర్‌లో బ్యాక్‌వర్డ్‌ స్క్వేర్‌లెగ్‌లో అద్భుతమైన సిక్స్‌ బాదాడు. ఇదే ఊపులో ప్రదీప్‌ వేసిన 10వ ఓవర్‌ చివరి బంతికి అర్థశతకం సాధించాడు.

స్కోరు బోర్డు వేగంగా కదులుతున్న దశలో మంచు ప్రభావం కనిపించింది. క్రీజులో కుదురుకున్న శ్రేయస్‌ ... 12వ ఓవర్‌లో ప్రదీప్‌ వేసిన 4వ బంతిని అప్పర్‌ షాట్‌ ఆడబోయి ఔటయ్యాడు. అప్పటికి టీమిండియా స్కోరు 101. ఆ తర్వాత పది పరుగులకే పెరీరా బౌలింగ్‌లో రాహుల్‌ క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన ధోని, మనీష్‌పాండే మెరుపులు మెరిపించారు. ఆచితూచి ఆడుతూనే భారీ షాట్లు బాదేశారు. వీరిద్దరు చివరి నాలుగో ఓవర్లలో 61 పరుగులు సాధించారు. 20 ఓవర్లలో భారత్‌ మూడు వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది.

181 రన్స్‌ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ఆటగాళ్లు ఆరంభంలో మెరుపులు మెరిపించారు. అయితే భారత బౌలర్లు దూకుడు ముందు మాత్రం నిలబడలేకపోయారు. జట్టుస్కోరు 46 పరుగుల వరకు కాస్త నిలకడగా ఆడిన లంక్‌ బ్యాట్స్‌మెన్లు ఆ తర్వాత వరుసగా పెవిలియన్‌ బాట పట్టారు. తరంగా 23 పరుగులు చేయగా.. కుషల్‌ 19, డిక్‌వెలా 13, చమీరా 12 మినహా మిగతా ఆటగాళ్లు సింగిల్‌ డిజిట్‌ స్కోర్‌కే ఔట్‌ అయ్యారు. దీంతో శ్రీలంక 16 ఓవర్లకు 87 పరుగులు చేసి ఆలౌట్‌ అయ్యింది.

భారత బౌలర్లలో చాహల్‌ విజృంభించాడు. కీలక 4 వికెట్లు పడగొట్టి లంక నడ్డి విరిచాడు. హార్థిక 3, కుల్దీప్‌ 2, జయదేవ్‌ 1 వికెట్‌ తీశాడు. చాహల్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. కటక్‌ టీ -20 విజయంతో మూడు టీ -20ల సిరీస్‌ను భారత్‌ 1-0తేడాతో ఆధిక్యం సాధించింది.

06:45 - December 21, 2017

హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్‌ ఇచ్చేందుకు అధికార టీఆర్‌ఎస్‌ సిద్ధమవుతోంది. 2019 ఎన్నికల నాటికి బలపడేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నాలు ముమ్మరం చేయడంతో... అధికారపార్టీ కూడా ధీటుగా ఎదుర్కొనేందుకు రెడీ అవుతోంది. కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు గులాబీ బాస్‌ స్కెచ్‌ వేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై గులాబీ బాస్‌ దృష్టి సారించారు. గ్రామస్థాయి నుంచి అన్ని రాజకీయ పార్టీల నేతలను కారెక్కించుకుంటోన్న గులాబీ పార్టీ ఇప్పుడు.. జిల్లాల వారీగా ప్రతిపక్ష పార్టీ నేతలను టార్గెట్‌ చేసింది. కాంగ్రెస్‌ పార్టీలో బలమైన నాయకులుగా ముద్రపడిన నేతలను కారెక్కించుకునేందుకు పావులు కదుపుతోంది. కాంగ్రెస్‌లో పదవులులేని నేతలను లక్ష్యంగా చేసుకుని ఆయా ప్రాంతాల్లో ప్రతిపక్ష పార్టీని దెబ్బకొట్టేందుకు సిద్ధమవుతోంది. ఎమ్మెల్యేల వరకు జరిగిన ఆపరేషన్‌ ఆకర్ష్‌ అస్త్రాన్ని ఇప్పుడు అదే స్థాయి నేతలను, మాజీ మంత్రులను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయోగించాలని డిసైడ్‌ అయ్యింది. ఇందుకోసం ప్రణాళికలు రచిస్తోంది.

కాంగ్రెస్‌ పార్టీకి బలమైన జిల్లాలుగా రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌తోపాటు నల్లగొండ జిల్లాకు పేరుంది. ఈ జిల్లాల్లో కాంగ్రెస్‌ నేతలను అధికారపార్టీ టార్గెట్‌ చేసింది. పెద్ద సంఖ్యలో కారెక్కించుకునేందుకు స్కెచ్‌ వేస్తోంది. ఇప్పటికే ఆయా జిల్లాలకు చెందిన ప్రతిపక్ష పార్టీ నేతలతో అధికారపార్టీలోని కీలక నేతలు టచ్‌లో ఉన్నట్టు సమాచారం. అధికారపార్టీలో జరుగుతున్న చర్చల ప్రకారం రంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, ప్రతాప్‌రెడ్డిని కారెక్కించుకోనున్నట్టు తెలుస్తోంది. ఇక గ్రేటర్‌ హైదరాబాద్‌కు చెందిన మాజీ మంత్రులు దానం నాగేందర్‌, ముఖేష్‌గౌడ్‌ సైతం గులాబీపార్టీ తీర్ధం పుచ్చుకోనున్నట్టు సమాచారం. మెదక్‌ జిల్లాకు చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, గీతారెడ్డి కూడా కారెక్కేందుకు సిద్ధమన్న సంకేతాలు వెలువడుతున్నాయి.

జిల్లాల్లోని సెకండరీ నాయకత్వాన్ని సైతం టీఆర్‌ఎస్‌ టార్గెట్‌ చేసింది. పార్టీల్లో చేర్చుకుంటోన్న నేతలకు రాబోవు ఎన్నికల్లో పోటీ చేసే అవకావం కల్పిస్తామన్న హామీ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవైపు ఇతర పార్టీ నేతలను తమ పార్టీలో చేర్చుకుంటూ జోరుమీదున్న కాంగ్రెస్‌కు.... టీఆర్‌ఎస్ ఊహించని షాక్‌ ఇచ్చేందుకు రెడీ అవుతోంది.

06:41 - December 21, 2017

హైదరాబాద్ : ఆర్టీసీ యాజమాన్యం అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున పోరాటం చేయాలని ఎంప్లాయూస్‌ యూనియన్‌ మహాసభలు తీర్మానించాయి. వేతన సవరణ ఒప్పంద కాలపరిమితి ముగిసి 9 నెలలు గడుస్తున్నా.. ఇంతవరకు కొత్త వేతన సవరణను చేపట్టిన తెలంగాణ ప్రభుత్వ చర్యను మహాసభలు తప్పుపట్టాయి. వేతన సవరణ జరిగే వరకు 30 శాతం తాత్కాలిక భృతి చెల్లించాలని హైదారాబాద్‌లో జరిగిన టీఎస్‌ ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రెండో మహాసభలు డిమాండ్‌ చేశాయి.

ఈ మహాసభల్లో వేతన సవరణపై ప్రధానంగా చర్చించారు. కొత్త వేతన సవరణను వెంటనే చేపట్టాలని, అప్పటి వరకు కార్మికులు, ఉద్యోగులందరికీ 30 శాతం తాత్కాలిక భృతి ఇవ్వాలని డిమాండ్‌ చేశాయి. ఆర్టీసీలో కొన్ని విభాగాల మూసివేతలు, కార్మికులు తీసివేతలపై చర్చించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదువేల మంది కార్మికులు రిటైరైతే.. వీరి స్థానంలో కొత్తగా నియామకాలు చేపట్టని యాజమాన్యం చర్యను ఎంప్లాయూస్‌ యూనియన్‌ మహాసభలు తప్పుపట్టాయి. కొత్త నియామకాలు లేకపోవడంతో ఉన్న ఉద్యోగులపై రోజు రోజుకు పనిభారం పెరుగుతోందన్న ఆందోళన వ్యక్తమైంది. తెలంగాణలో అద్దె బస్సులు ఉండవని ఉద్యమంలో ఇచ్చిన హామీకి విరుద్ధంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకుంటున్న నిర్ణయాలను ఆపాలని డిమాండ్‌ చేశాయి. తెలంగాణలో ప్రైవేటు బస్సు ఆపరేటర్ల అక్రమ రవాణను అరికడతామన్న కేసీఆర్‌... అధికారంలోకి వచ్చిన తర్వాత మరిన్ని ప్రైవేటు బస్సులకు అనుమతులు ఇవ్వడాన్ని మహాసభలు తప్పు పట్టాయి. ఇలాంటి చర్యలకు వ్యతిరేకంగా పలు తీర్మానాలు ఆమోదించడంతో పాటు, పలు డిమాండ్లను ప్రభుత్వం, సంస్థ యాజమాన్యం ముందు ఉంచాయి.

ఆర్టీసీ ఆస్పత్రిలో డాక్టర్ల పోస్టులను భర్తీ చేయని సంస్థ యాజమాన్యం చర్యను ఎంప్లాయూస్‌ యూనియన్‌ మహాసభలు తప్పుపట్టాయి. మందుల పంపిణీ ప్రైవేటీకరణపై యూనియన్‌ నేతలు మండిపడ్డారు. ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం సంస్థ యాజమాన్యంతో కుమ్మక్కై కార్మిక వ్యతిరేక విధానాలు వంతపాడుతోందని ఎంప్లాయీస్‌ యూనియన్‌ మహాసభలు ఆరోపించాయి. వీటిని ఆపకపోతే భవిష్యత్‌లో ఉద్యమం తప్పదని హెచ్చరించాయి. 

06:39 - December 21, 2017

ఢిల్లీ : బిజినెస్‌ వరల్డ్‌ ఐదో స్మార్ట్‌ సిటీస్‌ కాంక్లేవ్‌ అవార్డుల ప్రదానోత్సవం ఢిల్లీలో ఘనంగా జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి రెండు అవార్డులు దక్కాయి. కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పూరి చేతుల మీదుగా తెలంగాణ ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌.... లీడర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు అందుకున్నారు. పట్టణాభివృద్ధికి మౌలిక వసతులు కల్పిస్తున్న రాష్ట్రంగా తెలంగాణకు లభించిన మరో అవార్డును పట్టణాభివృద్ధిశాఖ కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌, తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ అరవింద్‌కుమార్‌ అందుకున్నారు. పట్టణ మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని కేటీఆర్‌ ఈ సందర్భంగా అన్నారు. గతంలో తెలంగాణలో విద్యుత్‌లోటు ఉండేదని.. ఇప్పుడు దాన్ని అధిగమించామన్నారు. 2018 జనవరి 1 నాటికి సాగుకు 24 గంటల విద్యుత్‌ ఇవ్వగలిగే స్థాయికి ఎదిగామన్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి సురక్షిత నీరు అందించబోతున్నామని తెలిపారు. 

06:37 - December 21, 2017

హైదరాబాద్ : గ్రేటర్‌ హైదరాబాద్‌లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు..చిన్నారుల తల్లిదండ్రులను కలవరపెడుతున్నాయి. ఏ వాహనం ఎలా దూసుకొస్తుందో..ఏ వాహనం మృత్యుశకటంగా మారుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. విశ్వనగరంగా మారుతున్న భాగ్యనగరంలో రహదారి భద్రత గాల్లో దీపంగా మారుతోందా? తప్పు వాహనాలు నడుపుతున్న డ్రైవర్లదా? తప్పులు చేస్తున్నా పట్టించుకోని ట్రాఫిక్‌ పోలీసులదా? హైదరాబాద్‌ మహానగరంలో సేఫ్‌ జర్నీ అన్నది ఆర్భాట ప్రకటనలకే పరిమితమవుతోంది. లారీలు, స్కూలు బస్సుల డ్రైవర్లు నిబంధనలు ఉల్లంఘిస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.రోడ్లపైకి వచ్చి ముక్కుపచ్చలారని చిన్నారులను బలితీసుకుంటున్నా అడిగేవారే కనిపించడం లేదు. ట్రాఫిక్‌, ఆర్టీఏ అధికారులకు.. జరిమానాలు విధించడంపై ఉన్న శ్రద్ధ ప్రమాదాల నివారణపై లేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్‌పేటలో ఓ కాలేజీ బస్సు బీభత్సం సృష్టించింది. సెయింట్‌ మేరీస్‌ ఇంజినీరింగ్‌ కాలేజీకి చెందిన బస్సు పెద‍్ద అంబర్‌పేటవద‍్ద అదుపు తప్పి ఎదురుగా వెళుతున‍్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఆతర్వాత.. రోడ్డుపక‍్కనున‍్న బైకులపైకి దూసుకెళ్ళింది. దీంతో బైక్‌పై ఉన్న మధుశాలిని అనే బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. మూడు బైకులు ధ్వంసం అయ్యాయి. హైదరాబాద్‌ ఉప్పల్‌లో మృత్యుశకటంగా మారి చిన్నారి భూమికను చిదిమేసిన ఇసుక లారీ ప్రమాదంలో నివ్వెరపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. నిషేధిత సమయంలో లారీ నడుపుతున్నా ట్రాఫిక్‌ పోలీసులు చలాన్లతో సరిపెట్టడం ఈ దారుణానికి కారణమైందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

నగరంలో రాత్రి 10.30 నుంచి ఉదయం 6 గంటల వరకు మాత్రమే భారీ వాహనాలు రాకపోకలు సాగించాలి. కానీ భూమికను బలితీసుకున్న లారీ... ఉదయం 8 గంటల ప్రాంతంలో ఉప్పల్‌ ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో స్వేచ్ఛగా రాకపోకలు సాగించింది. ఏపీ 29 వీ 7539 లారీ నిషేధిత సమయంలో నడపడం మూడు నెలల్లో ఇది మూడోసారి అని తెలుస్తోంది. ఉల్లంఘనకు పాల్పడి చలాన్లు కట్టి తప్పించుకోవడం లారీ యజమానికి షరా మాములుగా మారింది. పదేపదే నిషేధిత సమయాల్లో దూసుకువస్తున్న ఇలాంటి లారీలకూ ట్రాఫిక్‌ పోలీసులు జరిమానాలు విధిస్తున్నారు. ఒకసారి చలాన్‌ విధించిన తర్వాత 24 గంటల వరకు ఆ వాహనంపై అదే ఉల్లంఘనకు సంబంధించిన మరో చలాన్‌ విధించే ఆస్కారం లేకపోవడంతో రెచ్చిపోతున్నారు.

ట్రాఫిక్‌ పోలీసులు స్థానిక ఇసుక వ్యాపారుల మాముళ్ల మత్తులో తూగుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. భూమికను చిదిమేసిన ఇసుక లారీ పదేపదే నిషేధిత సమయంలో ఉప్పల్‌ ప్రాంతంలో ఎలా రాకపోకలు సాగించింది? రెండుసార్లు ఉల్లంఘనకు పాల్పడ్డ వాహనంపై ట్రాఫిక్‌ అధికారులు ఎందుకు నిఘా పెట్టలేకపోయారు? ఇలా ఎన్నో అనుమానాలు, మరెన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రహదారి నిబంధనలు అతిక్రమించే వారి పట్ల ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

06:31 - December 21, 2017

హైదరాబాద్ : సంచలనం సృష్టించిన తెలంగాణ డ్రగ్స్‌ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ అధికారులు రిపోర్ట్‌ను కోర్టుకు సమర్పించారు. రెండు రోజుల్లో ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల నివేదిక కూడా రానుంది. అయితే.. బ్లడ్‌ శాంపిల్స్‌ తీసుకున్నవారిలో ఐదుగురివి పాజిటివ్‌ రావడంతో... వారు ఎవరనేదానిపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది.

డ్రగ్స్ కేసు విచారణ మళ్లీ ఊపందుకోనుంది. ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌.. ఎఫ్.ఎస్.ఎల్ రిపోర్ట్‌ ఆధారంగా నిందితులపై చార్జిషీట్‌ దాఖలు చేయనుంది. ఇప్పటికే ఈ రిపోర్ట్‌ను... కోర్టుకు సమర్పించారు. విచారణలో ప్రధాన నిందితుడు కెల్విన్‌తో పాటు మొత్తం 12 మంది దగ్గర నుంచి బ్లడ్‌ శాంపిల్స్ సేకరించారు. ఇందులో సినిమా ఇండస్ట్రీకి చెందిన పూరి జగన్నాధ్, హీరో తరుణ్, సుబ్బరాజు కూడా ఉన్నారు. వీరిలో ఐదుగురు.. డ్రగ్స్ వాడినట్టుగా.. ఫోరెన్సిక్‌ అధికారులు నిర్ధారించారు. ఆ ఐదుగురు ఎవరనేదానిపై ఇప్పుడు సస్పెన్స్‌ కొనసాగుతోంది. అయితే డ్రగ్స్‌ వాడితే వాళ్లను బాధితులుగా .. అదే డ్రగ్స్‌ను అమ్మితే.. నిందితులుగా పరిగణిస్తారు. ఈ మేరకు డ్రగ్స్‌ వాడినట్టు రిపోర్టులు వచ్చిన వారు వినియోగించారా? అమ్మకాలు జరిపారా ? అనేది ఎక్సైజ్‌ శాఖ సిట్‌ తేల్చనుంది. ఏదిఏమైనా.. ఈ ఐదుగురులో సినీ ప్రముఖులు ఉన్నారా? లేదా? అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రచారం కోసమే విచారణ చేశారనే అపవాదును ఎక్సైజ్‌ శాఖ మూటగట్టుకుంది. మరీ ఈ కేసులో నిందితులకు శిక్షలు పడతాయ లేదో ... వేచి చూడాలి. 

మళ్లీ తెరపైకి డ్రగ్స్ కేసు...

హైదరాబాద్ : సంచలనం సృష్టించిన తెలంగాణ డ్రగ్స్‌ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ అధికారులు రిపోర్ట్‌ను కోర్టుకు సమర్పించారు. రెండు రోజుల్లో ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల నివేదిక కూడా రానుంది. అయితే.. బ్లడ్‌ శాంపిల్స్‌ తీసుకున్నవారిలో ఐదుగురివి పాజిటివ్‌ రావడంతో... వారు ఎవరనేదానిపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది.

గుప్త నిధుల తవ్వకాలపై ఉత్కంఠ...

కర్నూలు :జిల్లా తుగ్గలి మండలంలోని చెన్నమరాయుని కోటలో.. అధికారులే నిధుల కోసం తవ్వకాలు జరపడం.. కలకలం సృష్టిస్తోంది. ఈ అధికారిక తవ్వకాలపై.. విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో గుప్త నిధుల అన్వేషణపై ఉత్కంఠ నెలకొంది. 

జేసీపై మేయర్ ఆగ్రహం...

అనంతపురం : ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై.. మేయర్ స్వరూప.. ధ్వజమెత్తారు. ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అనంతపురం నగర అభివృద్ధికి రాక్షసుడిలా అడ్డుతగులుతున్నారంటూ వ్యాఖ్యానించారు. గత నాలుగేళ్లలో ఒక్క రూపాయి అయినా నగర అభివృద్ధికి ఖర్చు చేశారా? అని ప్రశ్నించారు. 

నేడు ఏపీపీఎస్సీ కార్యాలయం ప్రారంభం...

విజయవాడ : డీఎస్సీని నిర్వహించడానికి ఏపీపీఎస్సీ సిద్ధంగానే ఉందని ఏపీపీఎస్సీ చైర్మన్‌ ఉదయ భాస్కర్‌ తెలిపారు. నేడు విజయవాడ ఆర్‌ అండ్‌ బీ బిల్డింగ్‌లో ఏపీపీఎస్సీ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. జనవరి 1 నుండి ఏపీపీఎస్సీ పూర్తి స్థాయి కార్యకలాపాలు విజయవాడ నుండే నిర్వహిస్తామని అన్నారు.

ఆర్కే నగర్ ఉప ఎన్నిక..

తమిళనాడు : చెన్నైలోని ఆర్కేనగర్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ నేడు జరగనుంది. పోలింగ్‌కు కావలసిన అన్ని ఏర్పాట్లను ఎన్నికల కమిషన్‌ పూర్తి చేసింది. దివంగత సిఎం జయలలిత మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది. జయలలిత మరణం తర్వాత తమిళనాడులో జరుగుతున్న తొలి ఎన్నిక ఇదే కావడంతో ప్రధాన పార్టీలన్నీ గెలుపై దృష్టి పెట్టాయి.

పార్లమెంట్ లో అదే గందరగోళం...

ఢిల్లీ : గుజరాత్‌ ఎన్నికల్లో ప్రధాని మోదీ మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌పై చేసిన విమర్శలపై పార్లమెంట్‌ దద్దరిల్లింది. ప్రధాని మోది పార్లమెంట్‌లో మన్మోహన్‌కు క్షమాపణలు చెప్పాలని రాజ్యసభలో కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. మాజీ కాంగ్రెస్‌ నేత మణిశంకర్‌ అయ్యర్‌ ఇంట్లో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ పాకిస్తాన్‌కు చెందిన రాజకీయ నేతలతో గుజరాత్‌ ఎన్నికలపై చర్చించారని ప్రధాని నరేంద్ర మోది ఎన్నికల సభలో ఆరోపించిన విషయం తెలిసిందే. మన్మోహన్‌పై మోది తప్పుడు ఆరోపణలు చేశారని కాంగ్రెస్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

యాంటీ స్మాగ్ గన్...

ఢిల్లీ : కాలుష్యంపై యుద్ధం చేయడానికి ఆప్‌ ప్రభుత్వం సిద్ధమైంది. కాలుష్య నివారణ కోసం 'యాంటీ స్మాగ్‌ గన్‌' పరికరాన్ని ప్రవేశపెట్టింది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా, పర్యావరణ శాఖ మంత్రి ఇమ్రాన్‌ హుస్సేన్‌ల ఆధ్వర్యంలో యాంటీ స్మాగ్‌ గన్‌ పని తీరును పరీక్షించారు. డ్రమ్ము ఆకారంలో ఉండే ఈ పరికరాన్ని వాటర్‌ ట్యాంక్‌కు అనుసంధానం చేస్తారు.

Don't Miss