Activities calendar

22 December 2017

శ్రీలంకపై భారత్ ఘన విజయం

బెంగుళూరు : రెండో 20టీ మ్యాచ్ లో శ్రీలంకపై భారత్ ఘన విజయం సాధించారు. భారత్  ఐదు వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక 171 పరుగులకు ఆలౌట్ అయింది. 

22:30 - December 22, 2017
22:28 - December 22, 2017
22:26 - December 22, 2017
22:24 - December 22, 2017
22:15 - December 22, 2017

ఢిల్లీ : ప్రధాని నరేంద్రమోది, బిజెపి నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ధ్వజమెత్తారు. బిజెపి ఫౌండేషనే ఓ అబద్ధాల పుట్ట అని మండిపడ్డారు. రాహుల్‌ గాంధీ నేతృత్వంలో తొలిసారిగా కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం పలు అంశాలపై చర్చించింది.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితుడైన తర్వాత రాహుల్ గాంధీ అధ్యక్షతన తొలిసారిగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది.  ఈ సమావేశానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియాగాంధీ తదితర సీనియర్‌ నేతలు హాజరయ్యారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు, 2జీ కేసులో తీర్పు, పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న తీరుపై సిడబ్లుసి చర్చించింది.

సమావేశం అనంతరం రాహుల్‌ గాంధీ మీడియాతో మాట్లాడుతూ బిజెపిని, ప్రధాని మోదిని టార్గెట్‌ చేశారు. నోట్లరద్దు, గబ్బర్‌సింగ్‌ టాక్స్‌... బిజెపి చెబుతున్నవన్నీ అబద్ధాలేనని ఒక్కొక్కటిగా రుజువు అవుతోందని మండిపడ్డారు.  2జీ స్పెక్ట్రం కేసులో వచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ....నిజం ఏమిటో దేశ ప్రజలందరూ తెలిసుకున్నారని రాహుల్ అన్నారు.
బైట్‌ రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు

మోది గుజరాత్‌ అభివృద్ధి ఓ బూటకమని ఎన్నికల ఫలితాలు నిరూపించాయని రాహుల్‌ తెలిపారు. రఫేల్ ఒప్పందం, అమిత్‌షా కొడుకు సంపాదనపై ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారని రాహుల్‌ నిలదీశారు. జయ్‌ షా 50 వేల పెట్టుబడి పెడితే అది మూడు నెలల్లో 80 కోట్లయిందని, అదెలా సాధ్యమని అడిగితే జవాబుండదని పేర్కొన్నారు. ఓ పారిశ్రామికవేత్తకు లాభం చేకూర్చేందుకే రాఫెల్‌ ఒప్పందం కుదుర్చుకున్నారని రాహుల్‌ విమర్శించారు. తాను లేవనెత్తిన ప్రశ్నలకు ప్రధాని ఇంతవరకు సమాధానం ఇవ్వలేదని రాహుల్‌ ధ్వజమెత్తారు.

నల్లధనాన్ని వెలికి తీసి ప్రతి ఒక్కరి ఖాతాలో 15 వేలు జమ చేస్తామని మోదీ ప్రజలను నమ్మంచి...వంచించారని రాహుల్‌ అన్నారు. అసలు బీజేపీ ఫౌండేషనే ఓ అబద్ధాల పుట్ట అని ఎద్దేవా చేశారు. 

 

22:13 - December 22, 2017

బెంగుళూరు : ఇండోర్‌లో శ్రీలంకకు భారత్ చుక్కలు చూపించింది. కెప్టెన్ రోహిత్ శర్మ చెలరేగడంతో... భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 261 పరుగులు చేసింది. టీమిండియా సారథి రోహిత్‌ శర్మ 43 బంతుల్లో 118 రన్స్ చేశాడు. ఓ దశలో 35 బంతుల్లోనే చరిత్రలో వేగవంతమైన సెంచరీ బాదేసి.. డేవిడ్‌ మిల్లర్‌ రికార్డును సమం చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 12 బౌండరీలు.. 10 సిక్సర్లు ఉండటం విశేషం. తరువాత రాహుల్ కూడా విజృంబించాడు. 49 బంతుల్లో 89 పరుగులు చేశాడు. చివర్లో ధోనీ 28 రన్స్ చేయడంతో స్కోర్ 260కి చేరింది. మొత్తం మ్యాచ్‌లో 21 ఫోర్లు, 21 సిక్సులు ఉండటం విశేషం. 

 

21:48 - December 22, 2017

ప్రేమోన్మాదులు రెచ్చిపోతున్నారు. ప్రేమించకపోతే ఘాతుకాలు పాల్పడుతున్నారు. తాజాగా నిన్న హైదరాబాద్ లో ఓ యువతిపై ప్రేమోన్మాది పెట్రోల్ పోసి తగలబెట్టాడు. తీవ్ర గాయపడిన యువతి మృతి చెందింది. ఈ సందర్భంగా నిర్వహించిన చర్చ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త దేవి, సినీ దర్శకులు సునీల్ కుమార్ రెడ్డి, అనిత క్లినికల్ సైకాలజిస్ట్ పాల్గొని, మాట్లాడారు. 'సినిమాలు, సోషల్ మీడియా, ఇంటర్ నెట్ పిల్లలపై చెడు ప్రభావాన్ని చూపుతున్నాయి. 
'పరిపాలన వైఫల్యం చెందినప్పుడు కఠిన చట్టాలు తీసుకురావడానికి వెళ్తారు. చట్టాలు తీసుకరావడం వల్ల ఫలితాలు రావు' తల్లిదండ్రులు పిల్లలన సక్రమ పద్ధతిలో, క్రమశిక్షణతో పెంచాలి' అని అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

21:30 - December 22, 2017

జేఏసీ చైర్మన్ కోదండరాం సారు మొండిపట్టోడే ఉన్నట్టుండుగదా..? యాత్రలు జేయనియ్యం అడ్డుకుంటమని తెలంగాణ ప్రభుత్వం ఎన్ని శిక్కులు వెట్టినా.. అమరుల స్పూర్తి యాత్ర జర్గవల్సిందే.. మేము ప్రజలళ్ల తిర్గవల్సిందే అన్నట్టు.. మళ్ల సుర్వు జేశిండు యాత్ర.. ఇయ్యాళ ఉమ్మడి నల్లగొండ జిల్లాల అయితున్నది.. 

ఏయ్ అనంతపురం పోలీసులు.. ఏం తమాష జేస్తున్నరా..? నేను జేసీ ప్రభాకర్ రెడ్డిని.. నా అణుచరున్ని అరెస్టు జేశేంత మొనగాళ్లైండ్రా మీరు..? అని తాడిపత్రి ఎమ్మెల్యే పోలీసోళ్లను బెదిరిచ్చి తన అనుచరున్ని ఇడిపిచ్చుకపోయిండు.. ఓ జేసీ ప్రభాకర్ రెడ్డి.. నువ్వేమన్న మొనగానివనుకుంటున్నవా.?? మొగులు మీదికెళ్లి ఊశిపడ్డోనివా..? నీకేం సప్రేటు సట్టాలుంటావ్ వా..? 

అంబర్ పేట అన్మంతన్న వాస్తవానికి కడ్పుల ఏం దాస్కునె మన్షిగాదు.. మన్సుల ఏదనిపిస్తె అదే అంటనే ఉంటడు.. ముంగట ఎవ్వలున్నది ఏం కథ సూడనే సూడడు.. ఎంతటోన్నిగూడ ఏం రాబాబు అంటడు.. అన్మంతన్న ముచ్చట ఇప్పుడెందుకంటె.. మొన్న జడ్చర్ల సభల గట్టిగనే చమక్కులు ఇశిరిండు.. ఏరిపెట్టిన అన్ని సూస్కోండ్రిగ..

తెలంగాణ ప్రభుత్వమా..? నీతాన ఏతులేనా ఏమన్న పనిజేశేది గూడ ఉన్నదా..? పాపం క్రిష్టియన్లను ఇంకెన్నేండ్లు సుడివెడ్తరు సార్లూ..? రెండువేల పద్నాలుగుల చెప్తిరి ముచ్చట.. పెద్ద క్రిష్టియన్ భవన్ గడ్తమని.. వచ్చె సారి వేడుకలు అండ్లనే అంటిరి.. మూడేండ్ల పొద్దాయే.. ఇద్వర్ దాక.. బునాది దొవ్వింది లేదు.. ఇంతకు తమరిని అడ్గినోడు ఎవ్వడు..? తమరెందుకు ఈ పనికిరాని హామీలిచ్చిండ్రు అనే పరేషాన్లున్నరు జనం..

జగిత్యాల జిల్లా మల్యాల పోలీసు స్టేషన్లకు గొర్లొచ్చినయ్.. నల్పై మూడు గొర్లను అరెస్టు జేశి స్టేషన్కు వట్కొచ్చిండ్రు పోలీసోళ్లు.. సర్కారిచ్చిన గొర్లను అమ్ముకుంటున్నరని అవ్విటిని దీస్కొచ్చిండ్రు.. మరి ఆ గొర్లకు గూడ థర్డ్ డిగ్రీ ఏయగాళ్ల మన ఫ్రెండ్లీ పోలీసులు ఏశినా ఏస్తరు.. ఓ గొర్ల ఓనరు లెక్కవెట్టుకో పోలీసోళ్ల చేతులకు వొయ్యినప్పుడు ఎన్నిగొర్లున్నయ్.. మళ్ల బైటికొచ్చెతప్పుడు ఎన్నున్నయే అనేది..

అయ్యా తెలంగాణ ముఖ్యమంత్రిగారూ.. మీకు నెలనెల జీతమొస్తలేదా సారూ..? పనిజేశినా చేయకపోయినా.. జీతం మాత్రం రూపాయి కట్ గాకుంట వస్తున్నదిగదా.?? మీకు మీ మంత్రులకు ఎమ్మెల్యేలకు.. కష్టజేయనోళ్లకు జీతాలొస్తయ్.. కని పొద్దంత ఊడ్సి తూడ్సి పనిజేశెటోళ్లకు నాల్గు నెల్లకోపారి గూడ జీతం ఇయ్యకపోతె ఇదేం పద్దతన్నట్టు చెప్పు..?

అయ్యో పాడుగాను ఏమైందో ఏమో.. ఉత్తపుణ్యానికే ఏడ్గురు సచ్చిపోయిండ్రు ఒక్కటే ఇంట్ల.. యాదగిరి గుట్ట పక్కపొంటున్న రాజపేట మండలం కాడ.. నిన్న రాత్రి మరి ఏం దిన్నరో ఏం కథనో.. పన్నోళ్లు పన్నట్టే పాణం బొయ్యిగనవడ్డరు.. కూలినాలి జేస్కునెతందుకొచ్చినోళ్లు.. వాళ్ల ఇంటికొచ్చిన సుట్టాలు అందరు జీవిడ్సిండ్రు.. ఎంకువైరీ జేస్తున్నరట.. పాపం..

అప్పుదీస్కున్నోడు అప్పుగడ్తలేడని తీస్కునోళ్ల ఇంటోళ్లను ఇంట్ల వెట్టి తాళమేశిండు ఒకాయిన.. మరి ఇదే లెక్క ప్రకారం హామీలిచ్చి అమలు జేయని ప్రభుత్వాన్ని గూడ మనం ఇట్లనే ఒక ఇంట్లేశి తాళమేయాలన్నట్టా..? అరే ఇదెక్కడి లోకంరా నాయనా..? అప్పుదీస్కున్నోడు ఎల్లో ఎల్లకనో అవస్థవడ్తుంటే.. ఇంటోళ్లను నిర్బంధించుడు ఎంత వరకు మంచిది చెప్పుండ్రి..

ఓరినాయనో దొంగలు గూడ పెద్దగ కష్టపడకుంటనే దొంగతనాలు జేస్తున్నరుగదా?? మర్రి సూశెవర్కళ్ల మాయం.. వంగితె మాయం జేశినోళ్లను జూశ్నంగని.. వంగకముందుకే మాయం జేశెటోళ్లను మాత్రం ఇప్పుడిప్పుడే సూస్తున్నం.. అంత పది సెకన్లే.. పదిసెకన్లళ్లనే ఐదు లక్షల రూపాలు ఎట్ల దొంగతనం జేశిండ్రో సూడుండ్రి.. 

 

20:54 - December 22, 2017

విశాఖ : జిల్లాలోని పరవాడ మండలం రావాడలో దారుణం జరిగింది. విధులు ముగించుకుని తిరిగి వెళ్తున్న ఆర్టీసీ డ్రైవర్‌ కొత్తపల్లి పైడయ్యనాయుడు హత్యకు గురయ్యాడు. విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న నాయుడును గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు విచారణ చేపట్టారు. హత్యకు భూవివాదాలు కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. హతుడి సోదరుడు కుమారులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. 

20:53 - December 22, 2017

అఖిల్ సినిమాతో డిజాస్టర్ అందుకున్న అక్కినేని మూడో తరం నటవారసుడైన అఖిల్ నుహీరోగా నిలబెట్టాలని రంగంలోకి దిగి అన్నివిధాలుగా కేర్ తీసుకుని చేసినసినిమా హలో..మనం డైరెక్టర్ విక్రమ్. కె. కుమార్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుండడంతో ఈ సినిమాపై హ్యూజ్ హైప్ క్రియేట్ అయ్యింది. అలా భారీ అంచనాల మధ్య విడుదలైన ఈసినిమా ఎలా ఉ:ది..? అఖిల్ కి తొలి హిట్ దక్కిందా లేదా.. నాగార్జున నమ్మకం ఎంత వరకూ నిలబడిందో ఇప్పుడు చూద్దాం.
కథ     
సినిమా కథ విషయానికొస్తే.. చాలా రొటీన్ లైన్. చిన్నప్పుడే కలిసి ప్రాణస్నేహితులుగా మారతారు శ్రీను, జున్ను. జున్ను వాళ్ల నాన్నకు  ట్రాన్స్ ఫర్ కావడంతో న్యూడిల్లీ వెళ్లిపోతుంది. అనాధ అయిన శ్రీనుని ప్రకాష్, సరోజిని లు దత్తత తీసుకుని అవినాష్ అని పేరు పెట్టుకుని పెంచుతారు. అయితే చిన్నప్పుడు జున్ను, శ్రీను ల మధ్య ఏర్పడిన స్నేహం వాళ్లతో పెరిగి ఎఫెక్షన్ గా మారుతుంది. అయితే ఈ లోగా ..జున్ను వాళ్ల నాన్నకి యు.ఎస్ ట్రాన్స్ ఫర్ అవుతుంది. ఆ అమ్మాయి ఇంకో వారం రోజుల్లో అమెరికా వెల్లిపోవడంతో చివరిసారిగా శ్రీనును వెతికే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ కు వస్తుంది. జున్నునే తన సోల్ మేట్ అని అర్థమైన శ్రీను కూడా వెతుకుతుంటాడు. కానీ వేరే పేర్లతో కలుసుకున్న జున్ను,శ్రీను ఒకరినొకరు ఎలా కలిశారు ..? ఎలా గుర్తుపట్టారు అన్నది సినిమాచూసి తెలుసుకోవాల్సిందే.
నటీనటులు..
నటీనటుల విషయానికొస్తే..మొదటి సినిమాలో ఒక్కడాన్సులు మినహా అన్ని విషయాల్లో నిరాశపరచిన అఖిల్...ఈ సినిమాలో చాలా ఇంప్రూవ్ మెంట్ చూపించాడు. నటనపరంగా కూడా చాలా ఇంప్రూవ్ అయ్యాడు. ఫైట్స్ లో కూడా  చాలా హార్డ్ వర్క్ తో రిస్కీ షాట్స్ చేసి మెప్పించాడు.  ఎమోషనల్ సీన్స్ లో తనను తాను డెవలప్ చేసుకుంటే అన్నపూర్ణ కాంపౌండ్ నుంచి మరో మంచి హీరో వచ్చినట్టే. ఇక హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ ..డీసెంట్ లుక్స్ తో ఇంప్రెస్ చేసింది. నటనపరంగా లిమిటెడ్ స్కోప్ ఉన్న రోల్  చేసి బానే మెప్పించింది. అయితే మంచి ఫర్ ఫార్మర్ గా పేరుతెచ్చుకునే అవకాశాలు ఎక్కువున్నాయి. రమ్యకృష్ణ , జగపతిబాబు తమ పాత్రలను చాలా ఈజీగా క్యారీ చేసి సినిమాకి ప్లస్ గా నిలిచారు. అనీష్ కురువిల్ల, సత్య కృష్ణన్, పోసాని, అజయ్.. తమ పాత్ర నిడివి తక్కువగా ఉన్నప్పటికీ వాళ్ల నటనతో మెప్పించారు.
టెక్నీషియన్స్...
టెక్నీషియన్స్ విషయానొకస్తే..ఇష్క్, మనం సినిమాలతో టాలెంటెడ్ డైరెక్టర్ గా , సెన్సిబుల్ రైటర్ గా పేరుతెచ్చుకున్న  విక్రమ్ కె. కుమార్..ఈ సినిమా వరకూ మాత్రం ఫీల్ ఉన్న ఫ్లాట్ లైన్ ని  స్టోరీ ప్లాట్ గా తీసుకున్నాడు. అయితే సోల్ మేట్ అన్న పదానికి మీనింగ్  చెప్పడానికి చైల్డ్ హుడ్ ఎపిసోడ్ ని కాస్త్ ఎక్కువగా సాగదీశాడు. ఇక అలాగే మిగతా స్టోరీలో కూడా ఎంటర్ టైన్ మెంట్ కోషియంట్ బాగా తగ్గింది. ఫీల్ మీద  ఎక్కువ కాన్ సన్ ట్రేట్ చేసిన విక్రమ్ కె. కుమార్ కు నెరేషన్ లో గ్రిప్పింగ్ తగ్గింది. దాంతో అక్కడక్కడా బాగా ఎగిసిన గ్రాఫ్..కొన్ని చోట్ల మాత్రం బాగా పడిపోయింది. సెకండాఫ్ లో చిన్న చిన్న లాగ్స్ ఉండడం కూడా సినిమాకు కాస్త్ మైనస్ గా మారింది. డైరెక్టర్ విక్రమ్ వరకూ పూర్తిగా సంతృప్తి పరచకపోయినా...చాలావరకూ మెప్పించాడనే చెప్పాలి. ఇక మ్యూజిక్  అనూప్ రూబెన్స్, సినిమాటోగ్రాఫర్ పి.ఎస్ . వినోద్.. ఇలా అంతా కూడా మనం సినిమాకు పనిచేసిన  టెక్నీషియన్స్ ఈ సినిమాకు వర్క్ చేశారు. ముఖ్యంగా అనూప్ రూబెన్స్ కి  ఈ సినిమా  50వ సినిమా కావడం, మ్యూజిక్ కి బాగా స్కోప్ ఉండడంతో సినిమా స్తాయిని పెంచే సంగీతాన్ని అందించాడు. పాటలతో ఆకట్టుకున్న అనూప్, బ్యాక్ గ్రౌండ్  స్కోర్ లో కూడా తన మార్క్ చూపించి.. సినిమాని నెక్ట్స్ లెవల్ కి తీసుకెళ్లాడు.  పి.ఎస్ . వినోద్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. ముఖ్యంగా ఫైట్స్ , పాటల్లో సినిమా గ్రాండియర్ ను  బాగా ఎలివేట్ చేశాడు.  ఎడిటింగ్ చాలా క్రిస్ప్ గా ఉంది. రన్ టైమ్ ఈ సినిమాకి ప్లస్. నిర్మాత నాగార్జున ఈ సినిమాతో అఖిల్ ను అన్ని రకాలుగా మెప్పిచే హీరోగా ప్రజెంట్ చెయ్యడానికి శ్రమించాడని అర్ధమవుతుంది. నిర్మాణ విలువలు బావున్నాయి.  

ఓవరాల్ గా చెప్పాలంటే హలో అనే క్లాస్ టైటిల్ తో థియేటర్స్ లోకొచ్చిన ఈ సినిమా మల్టీప్లెక్స్ ఆడియన్స్ కి, యూత్ కి  ఎక్కువగా కనెక్ట్ అయ్యే అవకాశాలున్నాయి. ఫైట్స్ అండ్ సాంగ్స్ కూడా పాష్ ఎట్ మాస్మియర్ ఉండడంతో.. బి,సి సెంటర్స్ లో ఎంతవరకూ ఫేర్ చేస్తుందో చూడాలి. అఖిల్ సెకండ్ మూవీగా విక్రమ్ కె. కుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఈ హలో సినిమా ఫీల్ గుడ్ అండ్ క్యూట్ లవ్ స్టోరీగా 2017 కు మంచి ముగింపు ఇచ్చిందని చెప్పవచ్చు.

ప్లస్..
అఖిల్ అప్పియరెన్స్
మ్యూజిక్
సినిమాటోగ్రఫీ
ప్రొడక్షన్ వాల్యూస్

మైనస్
ఫ్లాట్ స్టోరీలైన్
రొటీన్ స్క్రీన్ ప్లే
తగ్గిన ఎంటర్ టైన్ మెంట్

రేటింగ్..
2.5

రెండో టీ20 మ్యాచ్ లో భారత్ 260 పరుగులు

బెంగళూరు : రెండో టీ20 మ్యాచ్ లో భారత్ 260 పరుగులు చేసింది. ఐదు వికెట్ల నష్టానికి 260 పరుగలు చేసింది. చిన్నస్వామి స్టేడియంలో భారత్, శ్రీలంక రెండో టీ20 మ్యాచ్ జరుగుతోంది. శ్రీలంక లక్ష్యం 261 పరుగులుగా ఉంది. 

నాల్గో వికెట్ కోల్పోయిన భారత్

బెంగుళూరు : శ్రీలంకతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో భారత్ నాల్గో వికెట్ కోల్పోయింది. 254 పరుగుల వద్ద నాల్గో వికెట్ కోల్పోయింది. 

 

మూడో వికెట్ కోల్పోయిన భారత్

బెంగుళూరు : శ్రీలంకతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. 253 పరుగుల వద్ద హార్డిక్ పాండ్య (10) జౌట్ అయ్యాడు. 

రెండో వికెట్ కోల్పోయిన భారత్

బెంగుళూరు : శ్రీలంకతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. 245 పరుగుల వద్ద రాహుల్ (89) చేశాడు. 49 బంతుల్లో 89 పరుగులు చేశాడు. 

20:28 - December 22, 2017

విజయవాడ : 2013 భూ సేకరణ చట్ట సవరణ బిల్లును టీడీపీ ప్రభుత్వ వెంటనే ఉపసంహరించుకోవాలని...సీపీఎం ఏపీ కార్యదర్శి మధు డిమాండ్‌ చేశారు. విజయవాడలోని హన్మంతరాయ గ్రంథాలయంలో భూ హక్కుల పోరాట కమిటీ రాష్ట్ర సదస్సు జరిగింది. ఈ సందర్భంగా.. భూ సేకరణ చట్ట సవరణ బిల్లు అమల్లోకి తెస్తే.. పేదలు, దళితుల వర్గాల దగ్గర ఎకరం భూమి కూడా లేకుండా పోతుందని మధు అన్నారు. ప్రభుత్వం.. పేదల భూములను ప్రైవేట్‌, కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తోందని..ఆరోపించారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా అన్ని పార్టీలు కలసి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.
విజయవాడలో భూ హక్కుల పోరాట కమిటీ రాష్ట్ర సదస్సు  

 

20:23 - December 22, 2017

ఢిల్లీ : కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీతో వైసీపీ ఎంపీలు సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ప్రైవేటీకరణ, దుగరాజపట్నం పోర్టు ఏర్పాటు అంశాలపై గడ్కరీతో చర్చించారు. పోలవరం ప్రాజెక్టును 2019 కల్లా పూర్తి చేస్తామని గడ్కరీ తెలిపారన్నారు మేకపాటి రాజమోహన్‌. లాభాలలో ఉన్న డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ప్రైవేటీకరించవద్దని గడ్కరీని కోరినట్లు విజయ్‌సాయిరెడ్డి తెలిపారు.  

 

20:19 - December 22, 2017

నెల్లూరు : జిల్లాలో పెన్నా నదిపై నిర్మిస్తున్న బ్యారేజీ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. పెన్నా బ్యారేజీ, సంగం బ్యారేజీలను త్వరలో పూర్తిచేస్తామన్నారు. రాష్ట్రంలో 63శాతం మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారన్నారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులన్నీ త్వరలో పూర్తిచేసి.. రైతాంగానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా ప్రభుత్వం సహాకరిస్తుందన్నారు.

20:12 - December 22, 2017

పశ్చిమగోదావరి : కోడి పందేలు జరుపుకోవచ్చని డిప్యూటీ సీఎం చిన రాజప్ప అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా.. పాలకొల్లులో మహిళలచేత ఏర్పాటు చేసిన.. మెప్మా బజార్‌లను మంత్రి చిన రాజప్ప ప్రారంభించారు. సంక్రాంతి సందర్భంగా పండుగ సంప్రదాయాలకి ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. కోడి పందేలా విషయంలో ప్రభుత్వం, కోర్టు ఆదేశాలకు లోబడి జరుపుకోవాలని సూచించారు. కాపు రిజర్వేషన్‌ బిల్లును కేంద్రానికి పంపినట్లు తెలిపారు. కాపు విద్యార్ధులకు కూడా స్కాలర్‌షిప్‌లను ఇవ్వాలని ప్రభుత్వం జీవో జారీ చేసిందని చిన రాజప్ప అన్నారు. 

 

రెండో టీ20 మ్యాచ్ లో రోహిత్ శర్మ సెంచరీ

 హైదరాబాద్ : రెండో టీ20 మ్యాచ్ లో రోహిత్ శర్మ సెంచరీ చేశాడు. 35 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. టీ20 మ్యాచ్ లో ఫాస్టెస్టు సెంచరీ రికార్డును రోహిత్ శర్మ సమం చేశాడు. 

 

19:35 - December 22, 2017

హైదరాబాద్ : సంక్రాంతి అనగానే.. కోడిపందేలతో పాటు.. హరిదాసులూ గుర్తుకొస్తారు. చేతిలో చిడతలు, భుజంపై తంబుర, తలపై అక్షయపాత్రతో.. హరి సంకీర్తనలతో వీధివీధీ.. ఇల్లిల్లూ తిరుగుతూ ఉంటారు. అలా వచ్చిన హరిదాసుకు జనం తోచిన రూపంలో దానం ఇస్తారు. ఇది ఒకప్పటి హరిదాసుల ఆహార్యం. కాలం మారింది.. హరిదాసుల యాచన తీరూ మారింది. ఇప్పుడంతా హైటెక్‌..! తలపై ఉండాల్సిన అక్షయపాత్రను.. బైక్‌ హెడ్‌ డూమ్‌ దగ్గర..అమర్చుకుని బైక్‌పై ఠీవిగా కూర్చుని.. ఇల్లిల్లూ తిరిగేస్తున్నారు. అంతేనా.. నోటికి పనిలేకుండా బైక్‌కే ఓ మైక్‌ సెట్ అమర్చుకుని.. హరిసంకీర్తనలు వినిపించేస్తున్నారు. కాలికి.. నోటికి కష్టం కలగకుండా సాగిపోతున్న మోడర్న్ హరిదాసులను చూసి.. ఆతరం వారు ఔరా అంటున్నారు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోన్న అలాంటి వీడియో 10టీవీ ప్రేక్షకుల కోసం.. 

 

18:54 - December 22, 2017

హైదరాబాద్ : సంధ్యారాణి హత్య కేసులో... నిందితుడిని వీలైనంత త్వరగా కఠిన శిక్ష విధించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. ప్రభుత్వం వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి.. విచారణ వేగంగా పూర్తి చేయాలని ప్రగతి శీల మహిళా సంఘం విజ్ఞప్తి చేసింది. విచారణ ఆలస్యం కావడం వల్ల పలు సందర్భాల్లో నిందితులు తప్పించుకుంటున్నారని మహిళా సంఘం నేతలు వాపోయారు.
 

 

18:01 - December 22, 2017

హైదరాబాద్‌ : లాలాగూడలో ప్రేమోన్మాది దాడిలో గాయపడ్డ సంధ్యారాణి మృతి చెందింది. ప్రేమను నిరాకరించిందన్న కోపంతో కార్తీక్‌ అనే యువకుడు సంధ్యారాణిపై గురువారం రాత్రి పెట్రోలు పోసి నిప్పంటించాడు. తీవ్ర గాయాలతో ఉన్న ఆమెను స్ధానికులు 108లో గాంధీ ఆసుపత్రికి తరలించారు. 80 శాతం గాయాలతో చికిత్స పొందుతున్న సంధ్యారాణి పరిస్థితి విషమించడంతో కన్నుమూసింది. సంధ్యారాణి మృతికి కారకుడైన ప్రేమోన్మాది కార్తీక్‌ను కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. 

 

17:50 - December 22, 2017

ఢిల్లీ : హస్తినలో కాంగ్రెస్‌ వర్కింగ్‌కమిటీ సమావేశం జరుగుతోంది. ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో సీడబ్ల్యూసీ భేటీ అయ్యారు. రాహుల్‌గాంధీ కాంగ్రెస్‌ అధ్యక్షపగ్గాలు చేపట్టాక జరగుతున్న మొదటి భేటీ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. గుజరాత్‌, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై భేటీలో సమీక్ష జరపనున్నారు. ముఖ్యంగా 2019 ఎన్నికల నాటికి దేశవ్యాప్తంగా పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో రాహుల్ తోపాటు మన్మోహన్‌ సింగ్, ఏకే ఆంటోని, అహ్మద్‌పటేల్‌, చిదంబరం, అంబికాసోని భేటీకీ హాజరయ్యారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

17:39 - December 22, 2017
17:39 - December 22, 2017

హైదరాబాద్ : ప్రేమోన్మాది కార్తీక్ దాడిలో సంధ్యారాణి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. లాలాపేటలో నివాసం ఉంటున్న సంధ్యారాణిపై కార్తీక్ గురువారం సాయంత్రం పెట్రోల్ పోసి నిప్పంటించాడు. 85 శాతానికి పైగా కాలిన గాయాలతో సంధ్యారాణి గాంధీ ఆసుపత్రిలో చికిత్స ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని లాలాగూడలోని ఆమె నివాసానికి తరలించారు. 
సంధ్యారాణి మంచిగా పని చేసేది : షాపు నిర్వహకుడు 
సంధ్యారాణి మంచిగా పని చేసేదని ఆమె పని చేసిన షాపు నిర్వహకుడు తెలిపారు. ఏ పని చేసినా చక్కగా చేసేది అన్నారు. కార్తీక్ రెండు సంవత్సరాల క్రితం తన షాపులో 2నెలలు పని చేశాడు. ఆర్థికలావాదేవీల విషయంలో గొడవ జరిగితే ఆఫీస్ కు రావద్దని చెప్పామని.. అప్పటి నుంచి కార్తీక్ ఉద్యోగం మానేశాడని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

గుంటూరులో సహకార సంఘం పేరిట మోసం

గుంటూరు : పొన్నూరు మండలం చింతలపూడిలో విశ్వశక్తి పరస్పర సహాయక సహకార సంఘం పేరుతో రుణాలు ఇస్తామంటూ మహిళల వద్ద డబ్బులు వసూల చేసి రుణాలు ఇప్పించకుండానే నిర్వాకులు పరారైయ్యారు.

17:27 - December 22, 2017

హైదరాబాద్ : సంధ్యారాణి హత్య కేసులో నిందితుడు కార్తీక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిపై ముందుగా హత్యాయత్నం కేసు పెట్టిన పోలీసులు, సంధ్యారాణి మృతి తర్వాత హత్య కేసుగా మార్చారు. నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు కూడా పెట్టామంటున్న డీసీపీ సుమతితో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం

ఢిల్లీ : కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో సీడబ్ల్యుసీ భేటీ జరుగుతుంది. రాహుల్ అధ్యక్షపగ్గాలు చేపట్టాకా జరుతున్న తొలి సమావేశం ఇది. ఈ భేటీకి పార్టీ సీనియర్లు, వ్యూహకర్తలు హాజరైయ్యారు. 

17:23 - December 22, 2017

హైదరాబాద్ : సంధ్యారాణిని హత్య చేసిన...  ప్రేమోన్మాది కార్తీక్‌ను కఠినంగా శిక్షించాలని ఆమె కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ప్రేమోన్మాది కార్తీక్ ను చంపేయాలన్నారు. సంధ్యారాణి చివరి కోరిక కూడా ఇదేనని చెబుతున్నారు. తమ బిడ్డ ఎట్లా చనిపోయిందో.. అలా వాన్ని చంపేయాలన్నారు. వాన్ని కూడా పెట్రోల్ పోసి చంపేయాలన్నారు. చంపేయాలని సంధ్యారాణి తల్లి, అన్న, సోదరి అంటున్నారు. కార్తీక్ అరాచకానికి పాల్పడ్డారని.. అతన్ని కఠినంగా శిక్షించాలని స్థానికులు అంటున్నారు. మమ్మల్ని ఏం చేయలేరని ఇలాంటి ప్రేమోన్మాదులు రెచ్చిపోతూ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

మరోసారి గుజరాత్ సీఎంగా విజయ్ రూపానీ

ఆహ్మాదబాద్ : మరోసారి గుజరాత్ సీఎంగా విజయ్ రూపానీ కాబోతున్నారు. డిప్యూటీ సీఎంగా నితిన్ పటేల్ ఎంపిక చేశారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించిన అనంతరం విజయ్ రూపానీ, నితిన్ పటేల్ పేర్లను అరుణ్ జైట్లీ ప్రతిపాదించారు. 

ప్రభుత్వంపై ప్రతిఘటన తప్పదు : సున్నం రాజయ్య

తూర్పుగోదావరి : జిల్లా పోలవరం విలీన మండలాల గిరిజన భూముల్లో కందకాలు తవ్వడాన్ని నిలిపివేయాలని యంత్రాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేకపోతే తీవ్ర ప్రతిఘటన తప్పదని భద్రాచలం సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య హెచ్చరించారు.

16:42 - December 22, 2017

ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్

కడప : 9 మంది ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. మోస్ట్ వాంటెడ్ అంతర్జాతీయ స్మగ్లర్ సుబాన్ రియాజ్ కూడా అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.1.5 కోట్ల విలువైన 59 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐదు వాహనాలను, 9 సెల్ ఫోన్లను సీజ్ చేశారు.

16:33 - December 22, 2017

సమగ్రవార్తల సమాహారం మానవి న్యూస్ కు స్వాగతం. అమిత్ షా కు  ట్విట్టర్ లో మంచు లక్ష్మీ కౌంటర్, దంగల్ సినీ నటి జైరాకు లైంగిక వేధింపులు, హెరిటేజ్ సంస్థకు ఇంధన పొదుపు జాతీయ అవార్డు, త్రిపుల్ తలాక్...వంటి మహిళా వార్తలకు సంబంధించిన పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం... 

16:27 - December 22, 2017

హైదరాబాద్ : ప్రేమోన్మాదానికి మరో యువతి బలైంది. తన ప్రేమను నిరాకరిస్తుందనే కారణంతో ప్రేమోన్మాది చేసిన దాడిలో సంధ్యారాణి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. లాలాపేటలో నివాసం ఉంటున్న సంధ్యారాణిపై కార్తీక్ గురువారం సాయంత్రం పెట్రోల్ పోసి నిప్పంటించాడు. 85 శాతానికి పైగా కాలిన గాయాలతో సంధ్యారాణి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కానీ శుక్రవారం ఉదయం ఆమె తుదిశ్వాస విడిచింది. పోస్టుమార్టం అనంతరం సంధ్యారాణి మృతదేహాన్ని లాలాగూడలోని ఆమె నివాసానికి తరలించారు. సాయంత్రం అంత్యక్రియలు జరుగనున్నాయి. ఘటనపై స్థానికులు, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రేమోన్మాదిని కఠినంగా శిక్షించాలని..ఉరి తీయాలని..ఇలాంటి ఘటనలు జరుగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రస్తుతం కార్తీక్ పోలీసుల అదుపులో ఉన్నాడు.
ప్రేమోన్మాది కార్తీక్‌పై 354డీ, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు : డీసీపీ సుమతి  
సంధ్యారాణిపై దాడి చేసి మరణానికి కారకుడైన ప్రేమోన్మాది కార్తీక్‌పై 354డీ, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసినట్లు డీసీపీ సుమతి చెప్పారు. కార్తీక్‌కి కఠిన శిక్ష పడేలా తాము చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఆడపిల్లలకు ఏదైనా సమస్య ఎదురైతే పదిమందికి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 

 

ఫేస్ బుక్ లైవ్ లో మాట్లాడిన సచిన్

ఢిల్లీ : రాజ్యసభలో తను మాట్లాడాల్సిన ప్రసంగాన్ని సచిన్ టెండూల్కర్ ఫేస్ బుక్ లైవ్ లో మాట్లాడారు. అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో యవత ఫిట్ నెస్ కు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రస్తుత సమాజంలో ఫిట్ నెస్ తక్కువ సయం కేటాయిస్తున్నారని సచిన్ అన్నారు.

కర్నూలులో తవ్వకాల నిలిపివేత

కర్నూలు : జిల్లా తుగ్గలి మండలం చెన్నంపల్లి కోటలో తవ్వకాలను ప్రభుత్వం నిలిపివేసింది. పెద్ద బండరాయి అడ్డురావడంతో తవ్వకాలను నిలిపివేశారు. బండను పేల్చేందుకు ఉన్నధికారుల అనుమతి కోసం స్థానిక అధికారులు ఎదురు చూస్తున్నారు. 

16:15 - December 22, 2017

ఢిల్లీ : రాజ్యసభ ఆరవరోజు కూడా వాయిదా పడ్డాయి. మన్మోహన్‌కు ప్రధాని క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లారు. సభ సజావుగా సాగేందుకు, బిల్లులను ఆమోదించేందుకు తాము సిద్ధమేనని ఆజాద్‌ అన్నారు. మాజీ ప్రధానిపై ప్రధాని చేసిన ఆరోపణల అంశంపై కమిటీ తేల్చేవరకు సభ జరగడం సబబు కాదని ఆనంద్‌ శర్త పేర్కొన్నారు. దీంతో రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు సభను బుధవారానికి వాయిదా వేశారు. 

16:09 - December 22, 2017

మేడ్చల్ : జిల్లాలోని కుషాయిగూడలోని ఓక్‌వాలె పాఠశాల ఆన్యూవల్ డే ఘనంగా జరిగింది. కార్యక్రమంలో భాగంగా విద్యార్ధులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, డ్యాన్సులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ జనార్ధన్‌రెడ్డి, స్థానిక నేతలు పాల్గొన్నారు.

 

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబై : స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయి లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 184 పాయింట్లు లాభపడి 33,940 వద్ద ముగిసింది. నిఫ్టీ 53 పాయింట్లు లాభపడి 10,493 వద్ద ముగిసింది.

16:08 - December 22, 2017

ఢిల్లీ : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌ రావు నేతృత్వంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ నాయకుల బృందం కేంద్ర మంత్రులతో సమావేశం అయ్యారు. సమ్మక్క సారలమ్మల జాతరను జాతీయ పండుగగా గుర్తించి పర్యాటకంగా తీర్చిదిద్దాలని  కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీని కోరినట్లు బీజేపీ నేత లక్ష్మణ్‌ తెలిపారు. తెలంగాణాలో రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా పరిగణించడంతో కీలకపాత్ర పోశించిన కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీకి బీజేపీ నేతలు ధన్యవాదాలు తెలిపారు. వచ్చే ఏడాది జరగబోయే సమ్మక్క సారలమ్మ జాతరకు కేంద్రమంత్రులను ఆహ్వానించారు.   

16:02 - December 22, 2017

హైదరాబాద్ : తన చెల్లికి జరిగిన అన్యాయం ఇంకే ఆడపిల్లకి జరగకూడదని సంధ్యారాణి సోదరుడు విజ్ఞప్తి చేస్తున్నాడు. ఇలాంటి ఘటనలు జరిగినపుడు తప్పు చేసిన వారిని పోలీసులు విడిచిపెట్టకుండా తగిన గుణపాఠం నేర్పాలని అంటున్నాడు. చనిపోయిన తన చెల్లి ఇంకెప్పటికీ రాదని.. మరో చెల్లికి ఇలాంటి అన్యాయం జరగకూడదని కన్నీటి పర్యంతమయ్యాడు. 

 

సూర్యాపేటలో ఎమ్మార్పీఎస్ రాస్తారోకో

సూర్యాపేట : హైవేపై ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు రాస్తారోకోకు దిగారు. మందకృష్ణ మాదిగను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.  వారు ధర్నా చేస్తున్న సమయంలోనే తుమ్మల కాన్వాయ్ అటు వైపు రావడంతోమ వారు ట్రాఫిక్ లో చిక్కుకున్నారు. మంత్రి కాన్వాయ్ ని చూసిన ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు కాన్వాయ్ రాళ్లతో దాడి చేశారు.

15:59 - December 22, 2017

హైదరాబాద్ : సంధ్యారాణిపై దాడి చేసి మరణానికి కారకుడైన ప్రేమోన్మాది కార్తీక్‌పై 354డీ, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసినట్లు డీసీపీ సుమతి చెప్పారు. కార్తీక్‌కి కఠిన శిక్ష పడేలా తాము చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఆడపిల్లలకు ఏదైనా సమస్య ఎదురైతే పదిమందికి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 

15:57 - December 22, 2017

రంగారెడ్డి : జిల్లాలోని ఇబ్రహీంపట్నంలోని కూరగాయల మార్కెట్‌ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ దుకాణాలను తొలగించవద్దంటూ వ్యాపారులు ఆందోళన చేపట్టారు. దీంతో 11 మంది మహిళా వ్యాపారులను పోలీసులు ఈడ్చుకెళ్లి అరెస్ట్‌ చేశారు. 

 

15:47 - December 22, 2017

హైదరాబాద్ : అశోక్‌నగర్‌లోని పీపుల్స్‌ హైస్కూల్‌ టీచర్‌ నిర్వాకానికి పాల్పడ్డారు. స్కూల్‌ ఫీజ్‌ కట్టలేదంటూ ముగ్గురు పిల్లల్ని టీచర్‌ కొట్టింది. హైదరాబాద్‌ అశోక్‌నగర్‌లోని పీపుల్స్ హైస్కూల్‌లో చదువుతున్న పిల్లలను ఫీజ్‌ కట్టనందుకే కొట్టారని.. స్కూల్‌ ప్రిన్సిపల్‌తో పిల్లల తల్లిదండ్రులు ప్రిన్స్‌పల్‌తో వాగ్వాదానికి దిగారు. స్కూల్ ముందు విద్యార్ధి సంఘాలు ఆందోళనకి దిగాయి. పిల్లల తల్లిదండ్రులకు విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి. స్కూల్‌ టీచర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. స్కూల్‌ యాజమాన్యం మాత్రం..ఫీజ్‌ విషయంలో కొట్టలేదని.. డిసిప్లేన్‌ విషయంలో.. విద్యార్ధినిని మందలించామంటున్నారు. 

 

సూర్యాపేట శిలాఫలకం చోరీ

సూర్యాపేట : జిల్లాలో సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసిన శిలాఫలకం చోరీ గురైంది. అక్టోబర్ 12న కలెక్టరేట్ భవన నిర్మాణం కోసం కోమటికుంట వద్ద శిలాఫలకానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. శిలఫలకం కోసం 2 రోజులుగా గుట్టుచప్పుడు కాకుండా అధికారులు వెతుకుతున్నారు. 

ఫీజ్ కట్టలేదని విద్యార్థులను చితకబాదిన టీచర్

హైదరాబాద్ : అశోక్ నగర్ లో పీపుల్స్ హైస్కూల్ లో స్కూల్ పీజ్ కట్టలేదంటూ ముగ్గురు పిల్లలను టీచర్ చితకబాదారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ప్రిన్సిపాల్ తో వాగ్వాదానికి దిగారు. 

కరీంనగర్ నుంచి తిరుపతి రోజు రైలు నడపాలి : కేసీఆర్

కరీంనగర్ : సీఎం కేసీఆర్ కేంద్ర రైల్వే శాఖ మంత్రికి లేఖ రాశారు. అందులో కరీంనగర్ నుంచి తిరుపతికి ప్రస్తుతం వారానికి ఒక్కరోజు మాత్రమే రైలు ఉందని, ఆ రైలును ప్రతి రోజు నడపాలని సీఎం లేఖలో పేర్కొన్నారు. 

కేంద్ర మంత్రి గోయల్ కేసీఆర్ లేఖ

హైదరాబాద్ : తెలంగాణలో రైల్వేలైన్లను అభివృద్ధి చేయాలంటూ కేంద్ర రైల్వే శాఖ  మంత్రి పియూష్ గోయల్ కి కేసీఆర్ లేఖ రాశారు. ఆ లేఖను కరీంనగుర్ ఎంపీ వినోద్ గోయల్ కు అందించారు. కొత్తపల్లి నుంచి మనోహరాబాద్ రైల్వేలైనుకు నిధులు కేటాయించాలని లేఖలో సీఎం పేర్కొన్నారు.

కార్తీక్ మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు

హైదరాబాద్ : నిన్న సంధ్యారాణి పై దాడి చేసిన నింధితుడు కార్తీక్ ను మీడియా  ముందు ప్రవేశపెట్టారు. సంధ్యారాణిని కొంతకాలంగా కార్తీక్ ప్రేమిస్తున్నాడని, పెళ్లి చేసుకోవాలని ప్రపోజ్ కూడా చేశాడని, కార్తీక్ ఉద్యోగం లేకపోవడంతో సంధ్య రిజక్ట్ చేసినట్టు డీసీపీ సుమతి తెలిపారు. 

13:27 - December 22, 2017

యాదాద్రి భువనగిరి : జిల్లాలోని రాజాపేటలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు అనుమానాస్పదస్థితిలో మృత్యువాతలో తనకు ఎలాంటి సంబంధం లేదని కోళ్ల ఫారం యజమాని పేర్కొన్నారు. ఈ ఘటన జిల్లాలో కలకలం రేపింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు, జాయింట్ కలెక్టర్ ఘటనాస్థలికి చేరుకుని సమీక్షించారు. సిద్ధిపేట జిల్లాలోని జగ్ దేవ్ పూర్ మండలానికి చెందిన బాలనర్సయ్య (65), భారతమ్మ (58), కూతురు తిరుమల (39), అల్లుడు బాలరాజు (44), చిన్నారులు శ్రావణి (14), చింటు (12), బన్నీ (8) మృతి చెందిన వారిలో ఉన్నారు. వీరు పనిచేసే కోళ్ల ఫారం యజమానిపై గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆ యజమానితో టెన్ టివి మాట్లాడింది. కోళ్ల ఫాంలో కొన్ని పనులను గురువారం పూర్తి చేశారని, వారిని ఒకటి..రెండు సార్లు పిలిచినా రాలేదన్నారు. అనంతరం తాను రాకపోవడంతో ఇంటికి వెళ్లి రాత్రి సమయంలో కాల్ చేయడం జరిగిందని..కానీ ఎలాంటి రెస్పాన్ లేకపోవడంతో పక్కింటి పొలం వ్యక్తికి ఫోన్ చేయడం జరిగిందన్నారు. ఆయన వారు ఉంటున్న ప్రాంతం వద్దకు వెళ్లి పిలిచినా ఇంట్లో నుండి ఎలాంటి స్పందన రాలేదని..రాత్రి 3గంటల సమయంలో ఫోన్ చేశానన్నారు. తిరిగి తాను షెడ్ వద్దకు రావడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా బోన్ గిరి డీసీపీ కూడా మాట్లాడారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

ప్రత్యేక హోదా వస్తుదంటే ఇప్పుడే రాజీనామా చేస్తాం : వైసీపీ ఎంపీలు

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా వస్తుదంటే తము ఇప్పుడే రాజీనామా చేస్తామని వైసీపీ ఎంపీలు అన్నారు. తము రాజీనామా చేస్తే ప్రశ్నించే వారు ఎవరు ఉండరని వారు అన్నారు.

13:21 - December 22, 2017

హైదరాబాద్ : నేరెడ్ మెట్ లో దారుణ హత్య జరిగింది. నడి రోడ్డుపై ఓ వ్యక్తి మరొక వ్యక్తిని కత్తులతో నరికి చంపేశాడు. నగరంలో జరుగుతున్న పలు దారుణ ఘటనలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. లాలాగూడలో ప్రేమోన్మాది దాడి చేసిన ఘటనలో యువతి ప్రాణాలు కోల్పోయిన ఘటన మరిచిపోకముందే మరో ఘటన చోటు చేసుకుంది.

దిల్ సుఖ్ నగర్ కు చెందిన సుహాసినితో చందర్ వివాహం జరిగింది. కానీ ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో సుహాసిని కోర్టులో కేసు వేసింది. ఈ నేపథ్యంలో మల్కాజ్ గిరి కోర్టుకు చందర్ హాజరవుతూ వస్తున్నాడు. శుక్రవారం కూడా కోర్టుకు హాజరై వస్తుండగా సుహాసిని సోదరుడు వినయ్ ఒక్కసారిగా కత్తులతో విరుచకపడ్డాడు. తీవ్రంగా గాయపడిన కిరణ్ అక్కడికక్కడనే మృతి చెందాడు. గతంలో అనేక పర్యాయాలు వినయ్ పై దాడికి ప్రయత్నాలు జరిగాయని మృతుడి తండ్రి పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

జనవరి 2నుంచి జన్మభూమి మా ఊరు

గుంటూరు : జనవరి 2 నుంచి జన్మభూమి మా ఊరు కార్యక్రమానిరి 51 రెవెన్యూ డివిజన్ లలో బాధ్యతలు నిర్వహించేందకు ప్రభుత్వం ఆలిండియా సర్వీస్ అధికారులను నియమించింది.

13:14 - December 22, 2017

బాలీవుడ్ కండాల వీరుడు సల్మాన్ ఖాన్, హీరోయిన్ శిల్పా శెట్టిపై ముంబై, ఢిల్లీలో కేసు నమోదయ్యాయి. ఓ టీవీ షోలో వారు ఎస్సీల గురించి అసభ్యకరంగా మాట్లాడారని వారిపై వాల్మీకి వర్గానికి చెందిన కార్యకర్తలు వీరి పై కేసు వేశారు. దీనిపై ఐఅండ్ బీ శాఖ, ముంబై పోలీస్ కమిషనర్లు వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని నేషనల్ కమిషన్ ఆఫ్ ఎస్సీ(ఎన్సీఎస్సీ) ఆదేశాలు జారీ చేసింది. సల్మాన్ నటించిన ''టైగర్ జిందా హై'' ప్రచార నిమిత్తం శిల్పాశెట్టి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న రియాల్టీ షోలో పాల్గొన్నారు. ఇందులో ఓ జట్టు చేసిన డ్యాన్స్ గురించి సల్మాన్, శిల్పా మాట్లాడుతూ భాంగి వారిల ఉందంటూ కమెంట్ చేశారు.  

విశాఖలో చోరీల ముఠా అరెస్ట్

విశాఖ : జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న 15 మంది ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 1.66 కిలోల బంగారం, 6 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు. 

యాదవుల ఛలో సచివాలయం

గుంటూరు : తమ సమస్యలను పరిష్కారం కోసం ఛలో సచివాలయానికి యాదవ సంఘాలు పిలుపునిచ్చాయి. పోలీసుల ఉండవల్లి సెంటర్ లో యాదవులను అడ్డుకున్నారు. యాదవులను తాడేపల్లి పీఎస్ కు తరలించారు. 

12:40 - December 22, 2017

ఈ ఏడాది తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద విజయాలు దక్కాయని చెప్పవచ్చు. ఐఎండీబీ ప్రతి ఏటా ఇండియన్ టాప్-10 సినిమాల లిస్ట్ తయారు చేస్తుంది. యూజర్ల ఆధారంగా ఈ ర్యాకింగ్ ఉంటుంది. ఇలా తయారు చేసిన టాప్-10 ఇండియన్ చిత్రాల్లో తెలుగు నుంచి 3 మూవీస్ చోటు సంపాదించుకున్నాయి. ఇండియన్ బిగ్గెస్ట్ మూవీగా నిలిచిన బాహుబలి 2 ఐఎండీబీ లిస్ట్ లో టాప్ 2 లో ఉంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన చిత్రం అర్జున్ రెడ్డి చిన్న సినిమా అయిన ఐఎండీబీ లిస్ట్ లో టాప్ 3 నిలిచి సంచలనం సృష్టించింది. తెలుగు సినిమాగా రూపొంది తమిళ్, తెలుగు విడుదలైన సినిమా ఘాజీ టాప్ 6లో నిలిచింది.

ఐఎండీబీ టాప్ 10 మూవీస్

1. విక్రమ్ వేద

2. బాహుబలి ది కంక్లూజన్

3. అర్జున్ రెడ్డి

4. సీక్రెట్ సూపర్ స్టార్

5. హిందీ మీడియం

6. ఘాజీ

7. టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ

8. జాలీ ఎల్ఎల్ బీ 2

9. మెర్శల్

10. ది గ్రేట్ ఫాదర్ 

12:38 - December 22, 2017

కాకినాడ : బీచ్ ఫెస్టివల్ చివరి రోజు ప్రముఖ సంగీత దర్శకుడు రెహ్మాన్ టీం ప్రదర్శన ఘనంగా సాగింది. రెహ్మాన్ తన బృందంతో కలిసి తెలుగు..తమిళం..హిందీ పాటలు పాడుతూ ప్రజలను ఉర్రూతలూగించారు. రాష్ట్రానికి చెందిన నేతలు..అధికారులు పాల్గొని రెహ్మాన్ సంగీతాన్ని ఆస్వాదించారు. 

12:35 - December 22, 2017

అనంతపురం : వైసీపీ అధ్యక్షుడు జగన్ పై ప్రభుత్వ చీప్ విప్ పల్లె రఘునాథరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పుట్టపర్తిపై మాట్లాడే అర్హత జగన్ కు లేదని, ప్రజలను తప్పుదోవ పట్టించే పనులను మానుకోవాలని హితవు పలికారు. ఎన్నికల్లో ప్రజలు అప్పుడే గుణపాఠం చెప్పారని, ప్రజలు నమ్మరని..ఉన్న ఎమ్మెల్యేలు దూరం చేసుకొనేలా ప్రవర్తించడం మానుకోవాలన్నారు. ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఛిన్నాభిన్నం అవుతుందని ప్రజలు గ్రహించారని, ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే వారు..రేపో మాపో జైలుకు వెళ్లే వారు ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకోరని తెలిపారు.

12:30 - December 22, 2017

యాదాద్రి భువనగిరి : జిల్లాలోని రాజాపేటలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృత్యువాత పడిన సంఘటన సంచలనం సృష్టిస్తోంది. ఇంట్లో మృతదేహాలు ఎక్కడికక్కడ పడేసి ఉన్నాయి. వీరు ఆత్మహత్య చేసుకున్నారా ? లేక హత్య చేశారా ? అనేది తెలియరావడం లేదు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. తిన్న ఆహారంలో విషం కలిసి ఉందని ప్రచారం జరుగుతోంది.

సిద్ధిపేట జిల్లాలోని జగ్ దేవ్ పూర్ మండలానికి చెందిన బాలనర్సయ్య (65), భారతమ్మ (58), కూతురు తిరుమల (39), అల్లుడు బాలరాజు (44), చిన్నారులు శ్రావణి (14), చింటు (12), బన్నీ (8) మృతి చెందిన వారిలో ఉన్నారు. కానీ వారిని ఎక్కడ చంపేసి ఇక్కడ తీసుకొచ్చి పడేశారని...వాస్తవాలు తెలిసే దాక మృతదేహాలను కదలించడానికి వీలు లేదని కుటుంసభ్యులు ఖరాఖండిగా తేల్చి చెబుతున్నారు. ఘటనాస్థలిని జాయింట్ కలెక్టర్, డీసీపీ, ఇతర పోలీసు అధికారులు పరిశీలించారు. 

12:24 - December 22, 2017

హైదరాబాద్ : పెట్రోల్ పోసి నిప్పంటించడం వికృత చర్య అని డీసీపీ సుమతి పేర్కొన్నారు. లాలాపేటలో ప్రేమోన్మాది కార్తీక్ చేసిన దాడిలో సంధ్యారాణి చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూసింది. ఘటన అనంతరం ఉన్మాదిని పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై ప్రజల్లో తీవ్ర ఆగ్రవేశాలు వ్యక్తమయ్యాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని..ఉరిశిక్ష వేయాలని డిమాండ్స్ చేస్తున్నారు. గాంధీ ఆసుపత్రి మార్చురీ వద్ద సంధ్యారాణి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఈ సందర్భంగా నిందితుడిని మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు. డీసీపీ సుమతి మాట్లాడుతూ...ఘటన జరగడం దురదృష్టకరమని, ఎలాంటి బెదిరింపులు..వేధింపులు అయినా ఇంటి వారికి..పోలీసులకు సమాచారం అందించాలని పేర్కొన్నారు. అమ్మాయి చక్కగా ఉంటుందని ఎంతో టాలెంట్ పర్సన్ అని..కార్తీక్ మాత్రం ఏడో క్లాస్ వరకు చదవడం..అవారాగా తిరగడం జరిగిందని తెలిపారు. ప్రేమించాలని వేధిస్తుండడం...అమ్మాయి మాత్రం తిరస్కరించడం జరిగిందన్నారు. లక్కీ ట్రేడ్స్ లో ఇద్దరూ కలిసి పనిచేయడం జరిగిందని, కానీ తగిన విధంగా పనిచేయకపోవడంతో యజమాని అతడిని తీసివేయడం జరిగిందన్నారు. సంధ్యారాణి కూడా పనిచేయవద్దని కార్తీక్ చెప్పడం...గతంలో అతను ఫోన్ ఇచ్చినా సంధ్యారాణి తిరిగి యజమానికిచ్చేసిందని..తనకు ఇష్టం లేదని ఆ యజమానితో పేర్కొనడం జరిగిందన్నారు. షాపు యజమాని గతంలో కార్తీక్ ను మందలించడం జరిగిందని, ఎలా అయినా సరే అమ్మాయిని దక్కించుకోవాలని...లేనిపక్షంలో ఎవరికీ దక్కవద్దనే ఆలోచనితో ఇంత ఘాతుకానికి ఒడిగట్టాడని పేర్కొన్నారు. ఘటన జరిగిన అనంతరం బ్లూ మూన్ హోటల్ సమీపంలోనే కార్తీక్ ను అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. మల్కాజ్ గిరి ప్రాంతంలో పెట్రోల్ తీసుకున్నాడని, సీసీ టీవీ ఆధారంగా పలు ఆధారాలు లభ్యమయ్యాయని తెలిపారు. 

12:22 - December 22, 2017

పవన్ కల్యాణ్ ఈ మాట వింటేనే అతని అభిమానుల్లో వైబ్రెషన్ మొదలౌతుంది. అయితే పవన్ తన అభిమానులను అలరించిడానికి ఏదో ఒకటి చేస్తుంటాడు. అందులో ఒకటి సినిమాల పాట పాడడం. పవన్ ఖుషి సినిమా నుంచి సినిమాలో చిన్నపాటి బిట్ పాట పాడడం మొదలు పెట్టాడు. అత్తారింటికి దారేది సినిమాలో కటమరాయుడ పాటతో ఉర్రుతలుగించారు. ప్రస్తుతం ఆయన చేసిన చిత్రం అజ్ఞాతవాసి ఈ చిత్రంలో పవన్ తన గొంతును వినిపించారు. ఆడియో రిలీజ్ సమయానికి ఈ పాట రికార్డు కాకపోడంతో ఆ పాట ఆడియోలో లేదు. ప్రస్తుతం పవన్ కొంత సమయం చిక్కాడంతో ఆ పాటను రికార్డు చేశారు. ఈ పాట కొడుకా కోటేశ్వరా అని మొదలౌతుంది. ఈ చిత్రం వచ్చే నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

12:11 - December 22, 2017

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిచింన చిత్రం అర్జున్ రెడ్డి. ఈ సినిమా యుతుకు బాగా కనెక్ట్ అయింది. ఈ మూవీలో విజయ్ అర్జున్ రెడ్డి గెటప్ లో గడ్డంతో ఓ కొత్త ట్రెండ్ సెట్ చేశాడు. ఈ స్టైల్ చాలా మంది యుతు ఫాలో అవుతున్నారు. కొంత మంది అర్జున్ రెడ్డి ఫొటోలను మార్ఫింగ్ చేసి వేరే వేరే హీరోలకు సెట్ చేస్తున్నారు. ఇలా కోలీవుడ్ స్టార్ హీరోలందరికి మార్ఫింగ్ చేశారు. 

గడ్కరీ, అల్పోన్స్ ను కలసిన రాష్ట్ర బీజేపీ నేతలు

ఢిల్లీ : కేంద్రమంత్రులు గడ్కరీ, అల్ఫోన్స్ ఓరంను తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకులు మురళీధర్ రావు, లక్ష్మణ్ కలిశారు. సమ్మక్క సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని మంత్రులను వారు కోరారు.

విజయవాడ మున్సిపల్ కార్మికులతో సెక్రటరీ చర్చలు

కృష్ణా : విజయవాడ మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులతో మున్సిపల్ సెక్రటరీ చర్చలు జరుపుతున్నారు. జీవో నెం.279ను రద్దు చేయాలని కార్మిక, ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 010 పద్దు కింద వేతనాలు ఇవ్వాలని పలు డిమాండ్లతో సీఐటీయూ, స్వతంత్ర సంఘాల ఆధ్వర్యంలో 5 రోజులుగా ఉద్యోగులు, కార్మికులు సమ్మె చేస్తున్నారు.

11:56 - December 22, 2017

చిత్తూరు : వైకుంఠ పర్వదినం సందర్భంగా తిరుమలలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. 1.70 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకొనే అవకాశం ఉందని తిరుమల జేఈవో శ్రీనివాసరాజు తెలిపారు. ఆయనతో టెన్ టివి మాట్లాడింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వీఐపీల కోసం పద్మావతి ఎంక్వయిరీ కార్యాలయం సమీపంలో కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని, ఏడు లక్షల లడ్డూలు సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని క్యూ లైన్లను విస్తరించడం జరిగిందని, భక్తుల కోసం నారాయణ గిరి ఉద్యానవనంలో తాత్కాలికంగా 15 షెడ్లను నిర్మించినట్లు చెప్పారు. ఇంకా ఎలాంటి విషయాలు వెల్లడించారో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి...

రాజ్య సభ 27కు వాయిదా..

ఢిల్లీ : రాజ్యసభ ను చైర్మన్ ఈనెల 27 కు వాయిదా వేశారు.  మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై మోడీ చేసిన వ్యాఖ్యల కాంగ్రెస్ పట్టుబట్టడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో సభను వాయిదా వేశారు.

 

11:32 - December 22, 2017

కె.ఎస్ రవికుమార్ డైరక్షన్ లో నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న చిత్రం జై సింహా చిత్ర టీజర్ ను చిత్ర యూనిట్ గురువారం విడుదల చేసింది. టీజర్ కు అభిమానుల్లో మంచి స్పందన వస్తోంది. ఈ చిత్ర ఆడియో ఈ నెల24న విజయవాడలో విడుదల చేయనున్నారు. బాలకృష్ణ జై సింహా వచ్చే నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో నయనతార, నటాషా దోషి, హరిప్రియ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

11:31 - December 22, 2017

యాదాద్రి భువనగిరి : జిల్లాలోని రాజాపేటలో ఏడుగురు మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. అనుమానాస్పదస్థితిలో వీరు మృతి చెందడంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. సిద్ధిపేట జిల్లాలోని జగ్ దేవ్ పూర్ మండలానికి చెందిన బాలనర్సయ్య (65), భారతమ్మ (58), కూతురు తిరుమల (39), అల్లుడు బాలరాజు (44), చిన్నారులు శ్రావణి (14), చింటు (12), బన్నీ (8) మృతి చెందిన వారిలో ఉన్నారు. కానీ వారిని ఎక్కడో చంపేసి ఇక్కడ తీసుకొచ్చి పడేశారని...ఘటనలో కోళ్ల ఫారం యజమానిపై అనుమానం ఉందని పేర్కొన్నారు. వాస్తవాలు తెలిసే దాక మృతదేహాలను కదలించడానికి వీలు లేదని కుటుంసభ్యులు ఖరాఖండిగా తేల్చి చెబుతున్నారు.
మృతి చెందిన ఘటనపై జాయింట్ కలెక్టర్ టెన్ టివితో మాట్లాడారు. పేదరికానికి చెందని వారిగా తెలుస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సిన ఆర్థిక సహాయం అందచేయడం జరుగుతోందని తెలిపారు. ప్రస్తుతం మృతదేహాలు తరలించడం..ఇతరత్రా వాటిపై దృష్టి సారించడం జరిగిందన్నారు. 

11:24 - December 22, 2017

ఇండియన్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మల రిసెప్షన్ గురువారం ఢిల్లీలో ఘనంగా జరిగింది. కోహ్లీ అందంగా కుడ్త వేసుకుని అనుష్క చీర కట్టుకుని చూడముచ్చటగా కనువిందు చేశారు.ఈ వివాహ విందుకు పలువురు ప్రముఖులు, కోహ్లీ బంధువులు పాల్గొన్నారు. కోహ్లీ, అనుష్క ఇటలీలో పెళఙ్ల చేసుకున్న విషయం తెలిసిందే. 

ప్రతిపక్షాలవి అసత్య ప్రచారలు : దేవినేని

గుంటూరు : పోలవరం ప్రాజెక్టు అడ్డుకునేందుకు వైసీపీ, కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేస్తున్నాయని ఏపీ మంత్రి దేవినేని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టు గాలికొదిలేసినవారే ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. వైవీ సుబ్బారెడ్డికి పోలవరం పై మాట్లాడే అర్హత లేదని, పోలవరం కాంట్రాక్టు పనులు జగన్ కు ఇవ్వనందుకే వైసీపీ పుట్టిందని ఆయన అన్నారు.

ప్రతిపక్షాలది అసత్య ప్రచారలు : దేవినేని

గుంటూరు : పోలవరం ప్రాజెక్టు అడ్డుకునేందుకు వైసీపీ, కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేస్తున్నాయని ఏపీ మంత్రి దేవినేని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టు గాలికొదిలేసినవారే ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. వైవీ సుబ్బారెడ్డికి పోలవరం పై మాట్లాడే అర్హత లేదని, పోలవరం కాంట్రాక్టు పనులు జగన్ కు ఇవ్వనందుకే వైసీపీ పుట్టిందని ఆయన అన్నారు.

సీబీఐ కోర్టు హాజరైన జగన్

హైదరాబాద్ : వైసీపీ అధినేత వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టులో హాజరైయ్యారు. ప్రస్తుతం ఆయన పాదయాత్ర అనంతపురంలో కొనసాగుతుంది.

హైదరాబాద్ లో మహిళలకు భద్రత కరువైంది : దత్తాత్రేయ

హైదరాబాద్ : నగరంలో మహిళలకు భద్రత కరువైందని, మహిళలపై దాడులు పెరుగుతున్నాయని బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ అన్నారు. మరణించిన సంధ్యరాణి కుటుంబానికి 10 లక్షల ఎక్స్ గ్రేషియా, డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  

10:44 - December 22, 2017

నిన్న విడుదలైన ఎంసీఏ మూవీ నేడు ఫేస్ బుక్ లో దర్శనమిచ్చింది. అధికారులు, సినీ నిర్మాతలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న పైరసీ ఆగడం లేదు. రెండు రోజుల క్రితం దిల్ రాజ్, అల్లు శిరీష్ వెళ్లి సైబర్ క్రైమ్ పోలీసులను కలిసిన లాభం లేకపోయింది. సినిమా విడుదలైన వెంటనే పైరసీ చేసే సత్తా ఉందని నిర్మాతలను బెదిరిస్తున్న వారు ఎంసీఏ చిత్రాన్ని ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. శుక్రవారం ఉదయం 1గంటకు మున్నా డార్లింగ్ అనే ఫేస్ బుక్ ఐడీ నుంచి అప్ లోడ్ అయినట్టు తెలిసింది. ఇప్పటికే 8 వేల మంది పైగా ఫేస్ బుక్ లో ఎంసీఏను వీక్షించారు.  

10:34 - December 22, 2017

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుండి వారు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం నాడు కూడా వారు ఆందోళన చేపట్టనున్నారు. గుజరాత్ ఎన్నికల్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై ప్రధాన మంత్రి మోడీ పలు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దేశ భద్రతకు సంబంధించిన అంశాలను ఆయన తెరమీదకు తీసుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే మోడీ క్షమాపణలు చెప్పాలని..లేనిపక్షంలో ఒక నోట్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. మరి కేంద్ర ప్రభుత్వం..మోడీ ఎలా స్పందిస్తారో చూడాలి. 

పార్లమెంట్ లో కొనసాగుతున్న కాంగ్రెస్ ఆందోళన

ఢిల్లీ : పార్లమెంట్ లో కాంగ్రెస్ సభ్యుల ఆందోళన కొనసాగుతోంది. మన్మోహన్ సింగ్ వపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ క్షమాపణ చేప్పాల్సిందే అని రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుల ఆందోళన దిగారు. 

10:27 - December 22, 2017

యాదాద్రి భువనగిరి : జిల్లాలోని రాజాపేటలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి ఎలా చెందారనే దానిపై మిస్టరీ వీడడం లేదు. సిద్ధిపేట జిల్లాలోని జగ్ దేవ్ పూర్ మండలానికి చెందిన బాలనర్సయ్య (65), భారతమ్మ (58), కూతురు తిరుమల (39), అల్లుడు బాలరాజు (44), చిన్నారులు శ్రావణి (14), చింటు (12), బన్నీ (8) మృతి చెందిన వారిలో ఉన్నారు. ఘటనపై ఇప్పటి వరకు ఏం చెప్పలేమని..ఇంట్లో దొరికిన ఆహార పదార్థాలను సేకరించడం జరిగిందని బోన్ గిరి డీసీపీ పేర్కొన్నారు. ఇతర వాటిని సీజ్ చేయడం జరిగిందన్నారు. శాంపిల్స్ నివేదిక వచ్చిన అనంతరం వివరాలు తెలిసే అవకాశం ఉందన్నారు. మృతి చెందిన వారి కుటుంబసభ్యులు తలోరకంగా చెబుతున్నారని, చనిపోవడానికి గల కారణాలపై క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుందన్నారు.

మృతి చెందిన కుటుంబం నాగ భూషణంకు చెందిన కోళ్ల ఫారంలో పనిచేస్తూ అక్కడే ఉన్న నివాసంలో ఉంటున్నారు. ఘటనపై టెన్ టివి ఇతరులతో మాట్లాడే ప్రయత్నం చేసింది. నాగ భూషణం రాత్రి..ఉదయం వేళ వారి ఇంటికి వచ్చి తలుపులు కొట్టినా వారు లేవలేదని..వెంటనే తనకు విషయం చెప్పారని సతీష్ పేర్కొన్నారు. తాము వచ్చి లేపగా అప్పటికే మృతి చెందారని, పోలీసులకు సమాచారం అందించడం జరిగిందన్నారు. 

10:16 - December 22, 2017

హైదరాబాద్ : 'నా బిడ్డ ఎట్ల పోయిందో..వాడు అట్లనే పోవలె..వాడిని అట్లనే చెయ్యాలి..గతంలో వైఎస్ ఎట్ల చేసిండో..కేటీఆర్ అట్లనే చేయ్యాలి' అంటూ మృతి చెందిన సంధ్యారాణి తల్లి వేడుకొంటోంది.

లాలాపేటలో కార్తీక్ అనే ప్రేమోన్మాది సంధ్యారాణి యువతిపై కిరోసిన్ పోసి నిప్పంటించిన సంగతి తెలిసిందే. చికిత్స పొందుతూ గాంధీ ఆసుపత్రిలో శుక్రవారం తుదిశ్వాస విడిచింది. ఈ సందర్భంగా టెన్ టివితో సంధ్యారాణి తల్లి మాట్లాడింది. ఆఫీసులో పనిచేస్తుండే వాడని..గతంలో పని చేసి మానేశాడని యజమాని పేర్కొన్నాడని తెలిపింది. కార్తీక్ వేధించేవాడని తనకు చెప్పలేదని...పోలీసుల వల్లే న్యాయం జరగదని..ప్రభుత్వమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో గతంలో వైఎస్ ఎలా చేశారో ప్రస్తుత మంత్రి కేటీఆర్ అలానే చేయాలని కోరారు. మరి మంత్రి కేటీఆర్ ఎలా స్పందిస్తారు ? ప్రభుత్వం స్పందిస్తుందా ? లేదా ? అనేది చూడాలి. 

10:11 - December 22, 2017

హైదరాబాద్ : ప్రేమోన్మాది దాడిలో చికిత్స పొందుతూ సంధ్యారాణి మృతి చెందడం బాధాకరమని మాజీ కేంద్ర మంత్రి దత్తాత్రేయ పేర్కొన్నారు. లాలాపేటలో కార్తీక్ అనే ప్రేమోన్మాది సంధ్యారాణి యువతిపై కిరోసిన్ పోసి నిప్పంటించిన సంగతి తెలిసిందే. చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచింది. ఈ సందర్భంగా దత్తాత్రేయ గాంధీ ఆసుపత్రికి వెళ్లి ఆమె కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..దారుణమైన సంఘటన అని, మానవత్వం లేని ఘటన అని అభివర్ణించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. మహిళలపై రోజు రోజుకు అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని, నగరంలో ఇలాంటి ఘటనలు అనేకం జరుగుతున్నాయన్నారు. ఘటనపై తాను పోలీసులతో, సీపీతో మాట్లాడడం జరిగిందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరడం జరిగిందన్నారు. సీసీ టీవీ ఫుటేజ్ ల ద్వారా నేరాలు తగ్గుతున్నాయని చెబుతున్న ప్రభుత్వం ఈ ఘటనపై ఎలాంటి సమాధానం చెబుతారని ప్రశ్నించారు. వెంటనే మృతి చెందిన సంధ్యారాణి కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం..డబుల్ బెడ్ రూం కేటాయించాలని డిమాండ్ చేశారు. గాంధీ ఆసుపత్రిలో సకాలంలో వైద్యం అందించడం లేదని సంధ్యారాణి కుటుంబసభ్యులు ఆరోపించడం దిగ్ర్భాంతి కలుగ చేస్తోందన్నారు. 

10:02 - December 22, 2017

ఢిల్లీ : ఏపీ భవన్ లో తన పదోన్నతిని అగ్రకులస్తులు అడ్డుకున్నారని ఆనందరావ్ ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆనందరావు పదోన్నతి వ్యవహారం చిలిచిలికి గాలివానలా మారింది. దీనికి వాట్సప్‌ వేదికగా మారింది. అగ్రకుల అధికారి దళితులను రాక్షసులతో పోల్చడంతో మరింత వివాదస్పదమైంది. ఈ సందర్భంగా టెన్ టివి ఆనంద రావ్ తో మాట్లాడింది. వాట్సప్ లో దళితులను రాక్షసులుగా పోల్చిన డిప్యూటి కమిషనర్ సూర్యనారాయణపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అర్హత ఉన్న వారికి పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

గాంధీ ఆసుపత్రికి దత్తన్న..

హైదరాబాద్ : మాజీ కేంద్ర మంత్రి దత్తాత్రేయ గాంధీ ఆసుపత్రికి వచ్చారు. ప్రేమోన్మాది దాడిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంధ్యారాణి కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. 

ఆర్జేడీ నేత కాల్చివేత..

బీహార్ : ఆర్జేడీ నేత హరెరామ్ యాదవ్ ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. సమస్తిపూర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.

09:36 - December 22, 2017

నల్గొండ : రాజాపేటలో ఓ ఇంట్లో ఏడుగురు మృతదేహాలు బయటపడడం కలకలం రేపింది. వారు తిన్న ఆహారంలో విషం కలిసిందని తెలుస్తోంది. కానీ వారే ఆహారంలో విషం కలుపుకుని తిన్నారా ? అనేక అనుమానాలు కలుగుతున్నాయి. డాగ్ స్వ్కాడ్ టీం ఘటనాస్థలికి రానుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ సందర్భంగా బోన్ డీసీపీతో టెన్ టివి మాట్లాడింది. నాగ భూషణంకు చెందిన కోళ్ల ఫారమ్ లో కూలి పని కోసం కుటుంబం వచ్చిందని పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం యజమాని వచ్చి చూసేసరికి వారి మృతదేహాలు కనిపించాయని తెలిపారు. మటన్..ఫ్రైడ్ రైస్..మద్యం బాటిల్ ఘటనా స్థలంలో ఉందని తెలిపారు. విచారణలో విషయాలు వెల్లడవుతాయని పేర్కొన్నారు. వారికి ఎలాంటి అప్పులు..గొడవలు లేవని కుటుంబసభ్యురాలు పేర్కొంటున్నారు.

సిద్ధిపేట జిల్లాలోని జగ్ దేవ్ పూర్ మండలానికి చెందిన బాలనర్సయ్య (65), భారతమ్మ (58), కూతురు తిరుమల (39), అల్లుడు బాలరాజు (44), చిన్నారులు శ్రావణి (14), చింటు (12), బన్నీ (8)లు రాజపేటకు ఇటీవలే వచ్చారు. నాగ భూషణంకు చెందిన కోళ్ల ఫారంలో పనిచేస్తూ అక్కడే ఉన్న నివాసంలో ఉంటున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

రాజపేటకు బోన్ గిరి డీఎస్పీ..

యాదాద్రి భువనగిరి : రాజపేటకు బోన్ గిరి డీఎస్పీ చేరుకున్నారు. ఓ ఇంటిలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందడం కలకలం రేగింది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేపడుతున్నారు. 

09:14 - December 22, 2017

హైదరాబాద్ : తన ప్రేమను నిరాకరించిందని ప్రేమోన్మాది కార్తీక్ చేసిన దాడిలో సంధ్యారాణి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. గాంధీ ఆసుపత్రిలోని మార్చురీ వద్ద కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈఘటనపై స్థానికులు...ఇతరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్తీక్ ను కఠినంగా శిక్షించాలని...అతడికి ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు.

లాలాపేటలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. లాలాపేటలోని భజన సమాజ్‌ వీధిలో నివాసం ఉంటున్న సావిత్రమ్మకు ఆరుగురు పిల్లలతో ఉంటోంది. ఆమె చిన్న కూతురు సంధ్యారాణి స్థానిక లక్కీ ట్రేడర్స్‌ అల్యూమినియం దుకాణంలో పనిచేస్తోంది. కాగా అదే ప్రాంతంలో ఉండే కార్తీక్ అనే వ్యక్తి తనను ప్రేమించాలని నిత్యం వేధించేవాడు. ఈ క్రమంలో సంధ్యారాణి రోజూలాగే గురువారం పని ముగించుకుని ఇంటికి వస్తోంది. ఆ సమయంలో ఆమెను అడ్డగించిన కార్తీక్ ప్రేమ విషయాన్ని మరోసారి వ్యక్తపరిచాడు. సంధ్యారాణి వ్యతిరేకించడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కార్తీక్ వెంట తెచ్చుకున్న కిరోసిన్ పోసి నిప్పంటించాడు. 80 శాతానికి గాయాలైన సంధ్యారాణిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కానీ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు.

నానాటికీ సమాజంలో ప్రేమోన్మాదం పెరిగిపోతోంది. తరచుగా జరుగుతున్న ఇలాంటి సంఘటనలతో అమ్మాయిల తల్లిదండ్రులు భయాందోళనకు గురువుతున్నారు. ఇలాంటి నేరాలు తగ్గాలంటే... కఠిన శిక్షలు మాత్రమే కాకుండా... సమాజంలో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని విశ్లేషకులు అంటున్నారు.

08:23 - December 22, 2017

యాదాద్రి భువనగిరి : ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతదేహాలు ఓ ఇంట్లో లభ్యం కావడం సంచలనం సృష్టించింది. మృతి చెందిన వారిలో వృద్ధులు..చిన్న పిల్లలున్నారు. వీరు ఆత్మహత్య చేసుకున్నారా ? లేక ఎవరైనా చంపేశారా ? అనేది తెలియరావడం లేదు. కానీ మృతదేహాలు బట్టి చూస్తే ఆత్మహత్య చేసుకున్నారని తెలుస్తోంది. కానీ ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారో తెలియరావడం లేదు.

రాజపేటలో ఓ కోళ్ల ఫారం వద్దనున్న నివాస గృహంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. ఓ కోళ్ల ఫారం వద్ద ఉన్న నివాస గృహంలో వీరి మృతదేహాలు బయటపడ్డాయి. బాలనర్సయ్య (65), భారతమ్మ (58), కూతురు తిరుమల (39), అల్లుడు బాలరాజు (44), చిన్నారులు శ్రావణి (14), చింటు (12), బన్నీ (8). నాగభూషణం అనే వ్యక్తికి చెందిన కోళ్లఫారంలో కూలి పనిచేయడానికి కొన్ని రోజుల క్రితం ఆ కుటుంబం ఒప్పందం కుదుర్చుకుంది. మృతులంతా జగదేవ్ పూర్ మండలం మునిగడప వాసులు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

ఆర్జేడీ బంద్ వల్లే వ్యక్తి మృతి అంటున్న బంధువులు..

బీహార్ : ఆర్జేడీ ఇచ్చిన బంద్ వల్లే తమ కుటుంబానికి చెందిన వ్యక్తి మృతి చెందాడని కుటుంబసభ్యులు పేర్కొంటున్నారు. కతిహార్ ప్రాంతంలో సరైన సమయంలో ఆసుపత్రికి తీసుకెళ్లకపోవడంతో మృతి చెందాడని వారు మీడియాకు తెలిపారు. 

08:10 - December 22, 2017

హైదరాబాద్ : ప్రేమోన్మాదానికి మరో యువతి బలైంది...తన ప్రేమను నిరాకరిస్తుందనే కారణంతో ప్రేమోన్మాది చేసిన దాడిలో సంధ్యారాణి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. ఈ విషాద ఘటన నగరంలో చోటు చేసుకుంది. దీనిపై స్థానికులు, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రేమోన్మాదిని కఠినంగా శిక్షించాలని..ఉరి తీయాలని..ఇలాంటి ఘటనలు జరుగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రస్తుతం కార్తీక్ పోలీసుల అదుపులో ఉన్నాడు. లాలాపేటలో నివాసం ఉంటున్న సంధ్యారాణిపై కార్తీక్ గురువారం సాయంత్రం పెట్రోల్ పోసి నిప్పంటించాడు. 85 శాతానికి పైగా కాలిన గాయాలతో సంధ్యారాణి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కానీ శుక్రవారం ఉదయం ఆమె తుదిశ్వాస విడిచింది. ఈ ఘటనపై పోలీసు అధికారులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 

నానాటికీ సమాజంలో ప్రేమోన్మాదం పెరిగిపోతోంది. తరచుగా జరుగుతున్న ఇలాంటి సంఘటనలతో అమ్మాయిల తల్లిదండ్రులు భయాందోళనకు గురువుతున్నారు. ఇలాంటి నేరాలు తగ్గాలంటే... కఠిన శిక్షలు మాత్రమే కాకుండా... సమాజంలో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని విశ్లేషకులు అంటున్నారు.

సంధ్యారాణి కన్నుమూత...

హైదరాబాద్ : ఉన్మాది దాడిలో గాయపడిన సంధ్యారాణి మృతి చెందింది. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. ప్రేమించలేదని సంధ్యారాణిపై కార్తీక్ పెట్రోల్ పోసి నిప్పంటించిన సంగతి తెలిసిందే. 

07:29 - December 22, 2017

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2జీ స్పెక్ట్రం కుంభకోణం కేసులో పటియాలా సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించింది. టెలికాం శాఖ మాజీ మంత్రి ఎ. రాజా, డీఎంకే ఎంపీ కనిమొళితో పాటు నిందితులందరిని నిర్దోషులుగా తేల్చింది. నేరారోపణలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని కోర్టు పేర్కొంది. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో ఎస్. వీరయ్య (నవతెలంగాణ ఎడిటర్), మహేష్ (టి.కాంగ్రెస్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి...

యాదాద్రి భువనగిరి : రాజపేటలో విషాదం చోటు చేసుకుంది. ఓ కోళ్ల ఫారం వద్దనున్న నివాస గృహంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. ఓ కోళ్ల ఫారం వద్ద ఉన్న నివాస గృహంలో వీరు మృతదేహాలు బయటపడ్డాయి. బాలనర్సయ్య (65), భారతమ్మ (58), కూతురు తిరుమల (39), అల్లుడు బాలరాజు (44), చిన్నారులు శ్రావణి (14), చింటు (12), బన్నీ (8). నాగభూషణం అనే వ్యక్తికి చెందిన కోళ్లఫారంలో కూలి పనిచేయడానికి కొన్ని రోజుల క్రితం ఆ కుటుంబం ఒప్పందం కుదుర్చుకుంది. మృతులంతా జగదేవ్ పూర్ మండలం మునిగడప వాసులు. 

06:53 - December 22, 2017

దేశంలో అన్నదాత సంక్షోభంలో ఉన్నాడా... అందరికి అన్నం పెట్టే రైతు.. ఆత్మహత్య చేసుకునే వైపు ఎందుకు వెళ్తున్నాడు. అందరికీ అవసరమైన పంటకు.. కనీస మద్దతు ధర ఎందుకు దోరకట్లేదు. ఈ ప్రశ్నలు ప్రస్తుతం తమ చర్చ పరిధిని పెంచుకుంటున్నాయి. ఒక వైపు రైతాంగం ఎప్పుడూ లేని విధంగా ఉద్యమాలు చేస్తుండగా.. ప్రభుత్వాల్లో మాత్రం ఆశించినంత చలనం రావట్లేదనే విమర్శ బలంగా ఉంది. ఈ అంశంపై టెన్ టివి జనపథంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి సాగర్‌ విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

06:51 - December 22, 2017

హైదరాబాద్ : ఓ వైపు.. నక్షత్రాలు ముంగిట చేరి మెరుపులు చిందిస్తున్నాయి..! మరోవైపు విద్యుత్‌ కాంతులతో క్రిస్మస్‌ ట్రీలు దగదగలాడుతున్నాయి..! ఎటు చూసినా అందమైన బొమ్మలు...సందడి చేస్తున్నాయి..! అలంకార వస్తువులతో భాగ్య నగరం ఆకర్షణీయంగా మారింది.. క్రిస్మస్‌ పండుగ సందర్భంగా... కలర్‌ఫుల్‌గా తయారైంది.

హైదరాబాద్‌లో క్రిస్మస్‌ సందడి నెలకొంది. క్రిస్మస్‌కు సంబంధించిన షాపింగ్‌తో నగరం కళకళలాడుతోంది. అమ్మకాలు, కొనుగోళ్లుతో క్రిస్మస్ షాపింగ్ ఊపందుకుంది. హోల్ సేల్ డెకరేషన్స్‌ షాపులన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. పండుగ సందర్భంగా.. క్రైస్తవ సోదరులు తమ ఇళ్లను అందంగా డెకరేట్‌ చేసుకోవడానికి పెద్దఎత్తున అలంకరణ వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. దీంతో నక్షత్రాలు, క్రిస్మస్ ట్రీలు, స్టార్స్, ఫ్లవర్స్, డిజిటల్ లైటింగ్, సాంటక్లాజ్‌ పలురకాల వెరైటీ డెకరేషన్స్‌ ఐటమ్‌లను షాపుల్లో పెట్టి వినియోగదారులను ఆకట్టుకుంటున్నారు. వీటిపై ప్రత్యేక డిస్కౌంట్‌లను కూడా అందిస్తున్నారు. దీంతో.. షాపులన్నీ రద్దీగా మారాయి. షాపుల్లో అందుబాటులో ఉంచిన ఐటమ్స్‌ చూసి...వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొత్త కొత్త వెరైటీలు పెట్టారని.. ధరలు కూడా తక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. మొత్తానికి నగరానికి క్రిస్మస్‌ కళ వచ్చేసింది. ప్రభుత్వం కూడా ఈసారి అధికారికంగా క్రిస్మస్ వేడుకలను నిర్వహించనున్నడంతో.. క్రిస్మస్‌ సంబరాలు.. అంబరాన్ని అంటనున్నాయి. 

06:49 - December 22, 2017

ప్రకాశం : కాకినాడ బీచ్‌ ఫెస్టివల్‌ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ప్రోటోకాల్‌ నుంచి పాసుల వరకూ తగాదాలే తగాదాలు. నిర్వాహణ లోపం.. సందర్శకులకు నిరాశ పరిస్తే.. అధికారుల వ్యవహార శైలి వివాదాలకు మరింత ఆజ్యం పోస్తోంది. కోట్లు గుమ్మరించి... నిర్వహిస్తున్న కాకినాడ బీచ్‌ ఫెస్టివల్‌ చుట్టూ వివాదాలు అలుముకున్నాయి. ఏర్పాట్లలో లోపాలు.. అధికారుల వ్యవహార శైలి వల్ల.. కార్యక్రమం అబాసుపాలవుతోంది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ ఫెస్టివల్‌కు ఆరున్నర కోట్లు ఖర్చు చేశారు. సందర్శకులను ఆకర్షించేందుకు... పుష్ప ప్రదర్శనతో పాటు హెలీరైడ్, పారా సెయిలింగ్‌, పారా గ్లైడింగ్‌, స్పీడ్‌ బోటింగ్‌, మ్యూజికల్‌ షో.. ఇంటర్నేషనల్‌ ఐకాన్‌ ఏ ఆర్‌ రెహమాన్‌ షో కూడా ఏర్పాటు చేశారు. అయితే ప్రతీసారి జరిగే.. బీచ్‌ ఫెస్టివల్‌కు లక్షలాది మంది రాగా.. ఈసారి అంతమంది కనిపించలేదు. దీంతో జిల్లా యంత్రాంగం.. కలవరపాటుకు గురైంది.

కార్యక్రమంలో కనీస సదుపాయాలు లేకపోవడంతో..సందర్శకులు నిరాశకు గురైనట్టు తెలుస్తోంది. ముఖ్యంగా.. బాత్ రూమ్‌లు వీఐపీలకే ఏర్పాటు చేయడం.. రెండు కిలో మీటర్ల ముందుగానే పార్కింగ్ ఏర్పాటు.. మంచినీటి సదుపాయం కల్పించకపోవడంపై.. సందర్శకులు పెదవి విరుస్తున్నారు. అలాగే మొదటి రోజు మ్యూజిక్‌ షో నిరాశాజనకంగా సాగిందని సందర్శకులు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు.. అధికారులూ.. వర్సెస్‌ ప్రజాప్రతినిధులు అన్న చందంగా ఈ ఫెస్టివల్‌ సాగింది. కార్యక్రమ నిర్వహణలో అధికారులు .. ప్రజా ప్రతినిధులకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని .. స్థానిక నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రజా ప్రతినిధులకు సరిపడా పాస్‌లు ఇవ్వకపోవడం.. ఆహ్వాన పత్రాల్లో పంచాయతీ ప్రతినిధుల పేర్లు వేయకపోవడంపై గుర్రుగా ఉన్నారు. అధికారులు తమను లెక్కచేయకుండా.. వ్యవహరించారనే ఆరోపణతో.. కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి ఈ ఫెస్టివల్‌కు దూరంగా ఉన్నారు. దీంతో ఈ విషయం స్థానికంగా చర్చానీయాంశంగా మారింది. హోంమంత్రి చిన్నరాజప్ప కూడా దీనిపై స్పందిస్తూ సాగర సంబరాల తర్వాత.. అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే కలెక్టర్‌ కార్తీకేయ మిశ్రా వీవీఐపీ, వీఐపీ గ్యాలరీలో తిరుగుతూ.. సెల్ఫీలు దిగడం... నిర్వహణను పటిష్టంగా పర్యవేక్షించక పోవడంపై కూడా స్థానిక ప్రజాప్రతినిధులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. 

06:46 - December 22, 2017

నెల్లూరు : జిల్లా చెందిన శ్రీనివాసులురెడ్డి అనే అంధుడు.. ఇండియన్ ఫారిన్‌ సర్వీసెస్‌ చెన్నైలో బ్రాంచ్‌ సెక్రటేరియట్‌ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్‌టర్నల్‌ ఎఫైర్స్‌నందు విధులు నిర్వహిస్తున్నారు. అంధుడైనా అహర్నిశలూ కష్టపడి... అకుంఠిత దీక్షతో 2009లో సివిల్‌ సర్వీసెస్‌కు అర్హత సాధించారు. దేశవ్యాప్తంగా ఎన్నో సన్మానాలు, పురస్కారాలు అందుకున్న శ్రీనివాసులురెడ్డికి కుటుంబ సమస్యలతో సతమతం అవుతున్నారు. తనపై కక్షగట్టిన సొంతకుటుంబ సభ్యులే తన ఉద్యోగానికి ఎసరు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ.. మానసిక వేదనకు గురిచేస్తున్నారని తన తల్లితో కలిసి మీడియా ముందు తమ గోడును వెళ్ళబోసుకున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని న్యాయం చేయాలని కోరుకుంటున్నారు. శ్రీనివాసులు రెడ్డిని అంతం చేసేందుకు తమ బంధువులే కుట్ర పన్నుతున్నారని ఆయన తల్లి కన్నీరుమున్నీరుగా రోదిస్తోంది. ప్రభుత్వం తమకు రక్షణ కల్పించి ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తోంది. 

06:44 - December 22, 2017

ప్రకాశం : జిల్లా చీరాలలోని కస్తూర్బా విద్యాలయ విద్యార్థుల పస్తులపై 10టీవీ ప్రసారం చేసిన కథనాలకు స్థానిక ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ స్పందించారు. పాఠశాలను సందర్శించి విద్యార్థులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. సిబ్బంది మధ్య తలెత్తిన విబేధాల కారణంగా విద్యార్థులకు భోజనం పెట్టకపోవడాన్ని ఆయన సీరియస్‌గా తీసుకున్నారు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యహరించిన ఎస్‌వో, అటెండర్‌, ఏఓలపై చర్యలు తీసుకోవాలంటూ సర్వశిక్షా అభియాన్‌ పీవోకు సిఫారసు చేశారు. పది రోజుల్లో పాఠశాలలో ఆర్‌వో ప్లాంట్‌తోపాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలంటూ అధికారులను ఆదేశించారు. తమ కష్టాలపై కథనాలు ప్రసారం చేయడంతో సకాలంలో భోజనాలు పెడుతున్నారంటూ విద్యార్థులు 10టీవీకి కృతజ్ఞతలు తెలిపారు. 

06:42 - December 22, 2017

హైదరాబాద్ : ప్రముఖ రచయిత, పాత్రికేయుడు దేవీప్రియకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. గాలిరంగు కవితా సంపుటికి ఈ అవార్డు దక్కింది. రన్నింగ్‌ కామెంట్రి ద్వారా ఆయన.. చేసిన వ్యంగ్య కవితలు తెలుగు నాట విశేష ఆదరణ పొందాయి. అమ్మాచెట్టు, నీటిపుట్ట, చేప చిలుక, తుపాను తుమ్మెద, గరీబు గీతాలు, పిట్ట కూడా ఎగిరిపోవలసిందే వంటి ప్రముఖ రచనలు చేశారు దేవిప్రియ. తన రచనలకు ప్రజలే స్ఫూర్తి అని పేర్కొన్నారు. ఇంకా ఎలాంటి విషయాలు మాట్లాడారో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

06:40 - December 22, 2017

జడ్చర్ల : విపక్ష నేతలు చేస్తోన్న ఆరోపణలను ధీటుగా ఎదుర్కొనలేక అధికార టీఆర్‌ఎస్‌ నేతలు సతమతమవుతున్నారు. విపక్షాల సూటి విమర్శలకు సరైన సమాధాలు ఇవ్వకుండా అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. విపక్ష నేతల విమర్శలు తమకు సంబంధమే లేదన్నట్టు కొంతమంది తప్పించుకుంటోంటే... మరికొంత మంది మాత్రం ధీటుగా సమాధానం చెప్పలేకపోతున్నారు. టీఆర్‌ఎస్‌ సర్కార్‌లో మెజార్టీ మంత్రులు మొదటిసారి మంత్రి పదవి పొందినవారే ఉన్నారు. ఈ మంత్రుల్లో అనుభవలేమి కొట్టొచ్చిన్నట్టు అప్పుడప్పుడు బయటపడుతోంది. అంతేకాదు... ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలకు ధీటుగా ఎదుర్కోవడంతో విఫలం అవుతున్నారు. ప్రభుత్వంతో కీలకంగా వ్యవహరిస్తున్న మంత్రులు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

రేవంత్‌రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన తర్వాత ప్రభుత్వంపై దూకుడు పెంచారు. అటు ప్రభుత్వంపైనా, ఇటు మంత్రులపైనా పదునైన విమర్శలు సంధిస్తున్నారు. మొన్నటికి మొన్న జడ్చర్లలో కాంగ్రెస్‌ జనగర్జన సభ నిర్వహించింది. ఈ సభలో పాల్గొన్న రేవంత్‌రెడ్డి మంత్రి లక్ష్మారెడ్డిని టార్గెట్‌ చేశారు. జడ్చర్లలో 100 పడకల ఆస్పత్రిని తీసుకురావడంలో లక్ష్మారెడ్డి విఫలం అయ్యారని విమర్శించారు. అంతేకాదు... మంత్రి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో మునిగితేలుతున్నారని.. వందలాది ఎకరాల భూములు కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలను గాలికొదిలి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారంటూ సూటిగా విమర్శించారు.

రేవంత్‌రెడ్డి విమర్శలపై వివరణ ఇచ్చేందుకు లక్ష్మారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ సభకు స్పందన కరువైందని విమర్శించారు. ఇక తనపై రేవంత్‌రెడ్డి ఆరోపణలకు ధీటైన సమాధానం మాత్రం చెప్పలేకపోయారు. ఒకానొక దశలో అవును తాను రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారినే అంటూ అయోమయ వ్యాఖ్యలు చేశారు. తనను డాక్టర్‌ కాదన్న రేవంత్‌రెడ్డి ఆరోపణలకు గతంలోనే సమాధానం ఇచ్చానని అసలు విషయం దాటవేశారు లక్ష్మారెడ్డి. అంతేకాదు... రేవంత్‌పై అసహనంతో ఊగిపోయారు. బ్లాక్‌ మెయిలర్‌ అంటూ అసహనాన్ని వ్యక్తం చేశారు. కేటీఆర్‌ మామపైనా రేవంత్‌రెడ్డి గతంలో వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌ మామ ఎస్టీ సర్టిఫికెట్‌తో ఉద్యోగం పొందారని... రిటైర్డ్‌ అయిన తర్వాత ఫెన్షన్‌ కూడా పొందుతున్నారని ఆరోపించారు. అయితే అధికారపార్టీ నేతలు మాత్రం రేవంత్‌ ఆరోపణలపై ఇప్పటికీ స్పష్టమైన సమాధానం చెప్పకుండా దాటవేశారు. ఇప్పుడు లక్ష్మారెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు అదే దారిని అనుసరిస్తున్నారు. 

06:36 - December 22, 2017

హైదరాబాద్ : నిఘా కెమెరాలు విస్తృతమయ్యాయి. కొత్త నియామకాలు చేపట్టడంతో పోలీసుల సంఖ్య పెరిగింది. పోలీసులకు ప్రభుత్వం ఆధునిక వాహనాలను సమకూర్చింది. అయినా 2017లో రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో నేరాల సంఖ్య పెరగడం ఆందోళనకర పరిణామంగా భావిస్తున్నారు. గొలుసు దొంగతనాలు, హత్యలు, దోపీడీలు రాచకొండ పోలీసులకు సవాల్‌గా మారాయి. రెండేళ్లు పూర్తి చేసుకున్న రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో క్రైమ్‌ రేట్‌ ఏ విధంగా ఉందో ఓసారి పరిశీలిద్దాం. తెలంగాణ ఏర్పాటైన తర్వాత జంట నగరాల్లో పోలీసు కమిషనరేట్ల సంఖ్య పెరిగింది. హైదరాబాద్‌, సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్లను విభజించి కొత్తగా రాచకొండ కమిషనరేట్‌ ఏర్పాటు చేశారు. రెండేళ్ల నుంచి మహేశ్‌ భగవత్‌ కమిషనర్‌గా పని చేస్తున్నారు.

2016తో పోలిస్తే 2017లో రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో నేరాల సంఖ్య కొద్దిగా పెరిగిందని కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ ప్రకటించిన గణాంకాలు చెబుతున్నాయి. కొత్త నియామకాలు జరిగినా కమిషనరేట్‌కు అవసరమైన సంఖ్యలో పోలీసు సిబ్బంది లేకపోవడంతో నమోదైన కేసుల పరిష్కారంలో సమస్యలు ఎదుర్కొన్నారు. డబ్బు కోసం రెండు హత్యలు జరిగితే ఈ కేసుల్లో నిందితులను పట్టుకున్నారు. పన్నెండు బందిపోటు దొంగతనాలు జరిగితే 9 కేసులను ఛేదించారు. మొత్తం 72 దోపిడీలు జరిగితే 49 కేసుల్లో నిందితులను పట్టుకున్నారు. దొంగతనాలు, దోపీడీ కేసుల్లో 23 కోట్ల 39 లక్షల 90 వేల 646 రూపాయలు నష్టం జరిగితే... 10 కోట్ల 93 లక్షల 35 వేల 554 రూపాయాలను స్వాధీనం చేసుకున్నారు. రికవరీ రేటు 47 శాతం మాత్రమే. గొసులు దొంగతనాలు కూడా ఎక్కువగానే జరిగాయి. రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని స్పెషల్‌ ఆపరేషన్స్‌ టీములు 835 కేసులను పట్టుకున్నాయి. వీటిలో ఆహారకల్తీ, మహిళల అక్రమ రవాణా, నకిలీ నోట్ల చెలామణి వంటి కేసులు ఉన్నాయి.

నైజీరియా, గోవా ముఠాలు డ్రగ్స్‌ సరఫరా కేసులను రాచకొండ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. కొత్త ఫింగర్‌ ప్రింటింగ్‌ టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో కొన్ని కేసుల్లో చాలా స్వల్ప వ్యవధిలో నేరస్తులను పట్టుకున్నారు. సీసీ టీవీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా కూడా మరికొన్ని కేసులను ఛేదించారు. నేరాల నియంత్రణలో సీసీటీవీ కెమెరాల పాత్ర పెరుగుతోండటంతో కాలనీ నివాసితుల సంక్షేమ సంఘాల సహకారంతో సామాజిక సీసీటీవీ కెమెరా వ్యవస్థను విస్తృతం చేయాలని రాచకొండ పోలీసులు నిర్ణయించారు. 

06:33 - December 22, 2017

విశాఖపట్టణం : జిల్లా పెందుర్తి మండలం జెర్రిపోతులపాలెంలో ఎస్సీ మహిళపై టీడీపీ నాయకుల దాడి ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. దళిత మహిళపై దాడి ఘటనపై ఆయన ఆరా తీశారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌తో సీఎం చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. ఒక మహిళలకు లక్ష, మరో మహిళకు 25వేల పరిహారం తక్షణమే చెల్లించాలని ఆదేశించారు. అంతేకాదు.. ఇళ్ల కేటాయింపుల్లో ఎస్సీలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

 

06:31 - December 22, 2017

కడప : ఉక్కు కర్మాగార ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. కేంద్రమంత్రి బీరేందర్‌సింగ్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈనెల 27న క్షేత్రస్థాయి పరిశీలన జరిపి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఎస్‌ఎఫ్‌ఐ - డీవైఎఫ్‌ఐ వరుస ఆందోళనలతో కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కదిలింది.

ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలంటూ ఎస్‌ఎఫ్‌ఐ - డీవైఎఫ్‌ఐ చేస్తోన్న పోరాటం ఫలించేలా కనిపిస్తోంది. కొన్నాళ్లుగా కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలంటూ ఎస్‌ఎఫ్‌ఐ - డీవైఎఫ్‌ఐ వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహించాయి. జీపుజాతాలు, బైక్‌ ర్యాలీలు నిర్వహించాయి. ఈనెల 12న కడపలో భారీ బహిరంగ సభను సైతం నిర్వహించాయి. ఈ సభకు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ సైతం హాజరయ్యారు. విభజన హామీలోని హామీని వెంటనే అమలు చేయాలని నేతలంతా నినదించారు. లేకుంటే ప్రజాందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎస్‌ఎఫ్‌ఐ - డీవైఎఫ్‌ఐ ఆందోళనలతో కేంద్రంలో కదలిక వచ్చింది. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్రాటుపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఛాంబర్‌లో గురువారం సమీక్ష జరిగింది. ఈ సమీక్షలో కేంద్రమంత్రులు బీరేందర్‌సింగ్‌, సుజనాచౌదరి, ఏపీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డితోపాటు టీడీపీ ఎంపీలు పాల్గొన్నారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్రమంత్రి బీరేందర్‌సింగ్‌ స్పష్టం చేశారు. ఈ అంశంపై ఏర్పడిన కమిటీ నెల క్రితమే నివేదిక ఇచ్చిందన్నారు. మరో నెలలో పూర్తిస్థాయి నివేదిక వస్తుందని చెప్పారు. ఉక్కు కర్మాగారం ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తుందో చెప్పాల్సి ఉందన్నారు. ఈనెల 27న జరిగే సమావేశంలో ఎలాంటి పరిశ్రమ, ఎవరు ఏమేం సమకూర్చాలి అనే అంశాలపై రోడ్‌ మ్యాప్‌ ఖారరయ్యే అవకాశముందన్నారు.

సంక్రాంతి నాటికి ఉక్కు కర్మాగారంపై తుది నిర్ణయం వెలువడే అవకాశముందని కేంద్రమంత్రి సుజనాచౌదరి చెప్పారు. ఈనెల 27న టాస్క్‌ఫోర్స్‌ కడప జిల్లాలో పర్యటిస్తుందని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. క్షేత్రస్థాయిలో పరిశీలన తర్వాత ఉక్కుపరిశ్రమ ఏర్పాటుపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందన్నారు. మొత్తానికి విద్యార్థి, యువజన సంఘాల ఆందోళనలతో కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి.

06:28 - December 22, 2017

హైదరాబాద్ : నగరంలో ప్రేమన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమించలేదన్న కోపంతో ఓయువతిపై కిరోసిన్‌ పోసి నిప్పంటించి పరారయ్యాడు. సుమారు ఎనభైశాతం కాలిన గాయాలతో ఆయువతి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. లాలాపేటలోని భజన సమాజ్‌ వీధిలో సావిత్రమ్మ తన ఆరుగురు పిల్లలతో కలిసి నివాసముంటోంది. ఆమె చిన్న కూతురు సంధ్యారాణి స్థానిక లక్కీ ట్రేడర్స్‌ అల్యూమినియం దుకాణంలో పనిచేస్తోంది. కాగా అదే ప్రాంతంలో ఉండే కార్తీక్ అనే వ్యక్తి తనను ప్రేమించాలని నిత్యం వేధించేవాడు. ఈ క్రమంలో సంధ్యారాణి రోజూలాగే పనిముగించుకుని ఇంటికి వస్తుండగా... ఆ ప్రేమోన్మాది ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

శాంతినగర్‌లోని ఎంసీహెచ్‌ కాలనీ విద్యామందిర్‌ స్కూల్‌ వీధిలో సంధ్యారాణి నడుకు వస్తోంది. అదేసమయంలో ఎదురుగా బైక్‌ పై కార్తీక్‌ వచ్చాడు. నీతో ఐదు నిమిషాలు మాట్లాడాలని ఆపాడు. అందుకు ఆమె నిరాకరించింది. దీంతో ఆవేశానికి లోనైన కార్తీక్‌ తన వెంట తెచ్చుకున్న కిరోసిన్‌ను ఆయువతిపై పోసి నిప్పంటించి పారిపోయాడు. మంటలు అంటుకోవడంతో ఆయువతి కేకలు పెట్టింది. అది గమనించిన స్థానికులు మంటలు ఆర్పేశారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గాయపడ్డ యువతిని 108 వాహనంలో గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా ఘాతుకాని పాల్పడిన కార్తీక్‌ పోలీసులకు ఫోన్‌ చేసి నిప్పంటించింది తానేనని చెప్పి... తన ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేశాడు. తర్వాత నిందితుడు నేరుగా లాలాగూడ పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయినట్టు తెలుస్తోంది. నానాటికీ సమాజంలో ప్రేమోన్మాదం పెరిగిపోతోంది. తరచుగా జరుగుతున్న ఇలాంటి సంఘటనలతో అమ్మాయిల తల్లిదండ్రులు భయాందోళనకు గురువుతున్నారు. ఇలాంటి నేరాలు తగ్గాలంటే... కఠిన శిక్షలు మాత్రమే కాకుండా... సమాజంలో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని విశ్లేషకులు అంటున్నారు.

06:25 - December 22, 2017

ఢిల్లీ : ఏపీ భవన్‌ సాక్షిగా కుల ఉన్మాదం వెలుగు చూసింది. దళిత, అగ్రకుల అధికారుల మధ్య వాట్సాప్‌ వార్‌ మొదలైంది. ఏపీ భవన్‌ అధికారులు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఈ వ్యవహారం పోలీస్‌ కేసులదాకా వెళ్ళింది. బాధ్యతగల అధికారుల అనాగకరిక తీరు హాట్‌టాఫిక్‌గా మారింది. డిజిటల్‌ యుగంలోనూ అనాగరిక కులగజ్జితో సమాజం కునారిల్లుతోంది. ఏపీభవన్‌ సాక్షిగా కుల ఉన్మాదం వెలుగలోకి వచ్చింది. దళిత, అగ్రకులాల అధికారుల మధ్య వాట్సప్‌ వార్‌ తార స్థాయికి చేరింది. దీంతో ఏపీభవన్‌ అధికారులు రెండు వర్గాలు చీలిపోయారు. పదోన్నతి విషయంలో రగిలిన ఈగొడవ కుల కుంపటిని రాజేసింది. తన ప్రమోషన్‌ను అగ్రకులస్తులు అడ్డుకున్నారని ఆనందరావు అనే ఉద్యోగి ఆరోపిస్తున్నారు.

ఏపీ భవన్‌ అధికారుల మధ్యవాట్సప్‌ గ్రూప్‌లో మాటల యుద్ధానికి తెరలేసింది. కమిషనర్‌ పోస్టులను తగ్గించేందుకు అగ్రకుల అధికారులు ఒత్తిడి చేశారని దళిత అధికారులు ఆరోపిస్తున్నారు. తనకు ప్రమోషన్‌ రాకుండా అడ్డుకున్నారని చెబుతున్నారు. ఏకే సింఘాల్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా ఉన్న సమయంలో ముగ్గురు సహాయ కమిషనర్లు, ఒక జాయింట్‌పోస్ట్ మంజూరు చేయాలని సిఫార్సు చేశారు. కానీ... వాటిని కుదిస్తూ... తనకు అన్యాయం చేస్తున్నారని ఆనందరావు మెసేజ్‌ పెట్టారు.

ఆనందరావు పదోన్నతి వ్యవహారం చిలిచిలికి గాలివానలా మారింది. దీనికి వాట్సప్‌ వేదికగా మారింది. అగ్రకుల అధికారి దళితులను రాక్షసులతో పోల్చడంతో మరింత వివాదస్పదమైంది. క్షీరసాగర మథనంలో దేవతలు, రాక్షసులు ఇద్దరూ కష్టపడ్డారని.. వారిలో దేవతలకే ఫలితం దక్కిందన్నారు. ఎంత కష్టపడినా రాక్షసులకు ఫలితం దక్కలేదంటూ ఎద్దేవాచేస్తూ... వాట్సప్‌లో మెసేజ్‌ పెట్టారు. దీంతో డిప్యూటీ కమిషనర్‌ సూర్యనారాయణ తీరుతో దళితులు మనస్తాపం చెందారు. దళిత అధికారులంతా ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిలక్‌మార్గ్‌ పోలీస్‌ స్టేషన్‌లో సూర్యనారాయణపై ఫిర్యాదు చేశారు. ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

అధికారుల వాట్సప్‌ సందేశాలు ఎస్సీఎస్టీ కేసు దాకా దారి తీయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కులపిచ్చితో వ్యవహరిస్తున్న ఏపీ భవన్‌ అధికారుల తీరుపట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు ఇప్పటికైనా తమ బాధ్యతలను గుర్తించి... ఈ గొడవకు ముగింపు పలకాలని పలువురు కోరుతున్నారు.

సీడబ్ల్యూసీ భేటీ...

ఢిల్లీ : సాయంత్రం 4.30గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ అధ్యక్షతనలో సీడబ్ల్యూసీ భేటీ కానుంది. 2019 ఎన్నికలే లక్ష్యంగా పార్టీలో మార్పులకు రాహుల్ శ్రీకారం చుట్టనున్నారు. 

ట్రిపుల్ తలాక్ బిల్లు..పాసయ్యేనా ?

ఢిల్లీ : నేడు లోక్ సభకు ట్రిపుల్ తలాక్ బిల్లు రానుంది. పార్టీ సభ్యులు తప్పనిసరిగా హాజరు కావాలని బీజేపీ పార్టీ విప్ జారీ చేసింది. 

నల్గొండలో టీజేసీ అమరుల స్పూర్తి యాత్ర...

నల్గొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అమరుల స్ఫూర్తి యాత్రను టీజేసీ సిద్ధం చేసింది. శుక్రవారం ఉదయం 8.30కు ఎల్బీనగర్‌లోని శ్రీకాంతాచారి విగ్రహానికి నివాళులర్పించి యాత్రను ప్రారంభిస్తామని జేఏసీ చైర్మన్‌ కోదండరాం తెలిపారు. సాయంత్రానికి నల్లగొండలోని ఎన్జీకాలేజీ గ్రౌండ్స్‌లో బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు.

ఉక్కు పరిశ్రమ...కడపలో 27న టాస్క్ ఫోర్స్ పర్యటన..

ఢిల్లీ : ఉక్కు పరిశ్రమ కోసం.. కేంద్రానికి ఏపీ మంత్రుల విన్నవించారు. దీనితో ఈనెల 27న కడప జిల్లాలో టాస్క్‌ఫోర్స్‌ పర్యటించనుంది. 

ఓయూలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ వాయిదా...

ఢిల్లీ : ప్రధాని మోదీ ప్రభుత్వం ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ను కూడా నిర్వహించలేని దుస్థితిలో ఉందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. హైదరాబాద్‌ ఉస్మానియా యూనివర్సిటీలో వచ్చే నెల 3 నుంచి 7 వరకు జరగాల్సిన ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ వాయిదా పడింది. 

జనవరిలో కొత్త రాజకీయ ఫ్రంట్...

నల్గొండ : తెలంగాణ రాష్ట్రంతోపాటు దేశంలో కొత్త రాజకీయ ఫ్రంట్‌కు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. నకిరేకల్లులో నల్లగొండజిల్లా సీపీఎం మహాసభల్లో పాల్గొన్న ఆయన .. జనవరిలో కొత్త రాజకీయ ఫ్రంట్‌ ప్రకటన చేస్తామన్నారు. ఇప్పటికే పలు వామపక్షపార్టీలతో మాట్లాడామని .. ఇంకా సీపీఐ, న్యూడెమొక్రసీ పార్టీలతో సంప్రదింపులు జరుగుతున్నాయన్నారు.

దేవీప్రియకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం..

విజయవాడ : ప్రముఖ రచయిత, పాత్రికేయుడు దేవీప్రియకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. గాలిరంగు కవితా సంపుటికి ఈ అవార్డు దక్కింది. రన్నింగ్‌ కామెంట్రి ద్వారా ఆయన.. చేసిన వ్యంగ్య కవితలు తెలుగు నాట విశేష ఆదరణ పొందాయి. అమ్మాచెట్టు, నీటిపుట్ట, చేప చిలుక, తుపాను తుమ్మెద, గరీబు గీతాలు, పిట్ట కూడా ఎగిరిపోవలసిందే వంటి ప్రముఖ రచనలు చేశారు దేవిప్రియ. 

బీచ్ ఫెస్టివల్..వివాదాలు..

విజయవాడ : కాకినాడ బీచ్‌ ఫెస్టివల్‌ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ప్రోటోకాల్‌ నుంచి పాసుల వరకూ తగాదాలే తగాదాలు. నిర్వాహణ లోపం.. సందర్శకులకు నిరాశ పరిస్తే.. అధికారుల వ్యవహార శైలి వివాదాలకు మరింత ఆజ్యం పోస్తోంది. 

మాస్టర్ బ్లాస్టర్ కు నిరాశ..

ఢిల్లీ : రాజ్యసభలో తొలిసారిగా మాట్లాడాలనుకున్న క్రికెట్‌ దిగ్గజం సచిన్‌కు నిరాశే ఎదురైంది. షెడ్యూల్‌ ప్రకారం 'రైట్‌ టు ప్లే అండ్‌ ఫ్యూచర్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ ఇన్‌ ఇండియా' అనే అంశంపై సచిన్‌ మాట్లాడేందుకు సిద్ధమయ్యారు. క్రీడల అంశంపై మాట్లాడేందుకు సచిన్ సభలో లేచి నిలుచున్నారు. అదే సమయంలో ప్రధాని మోది వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్‌ సభ్యులు సచిన్‌ను మాట్లాడనివ్వకుండా గట్టిగా నినాదాలు చేశారు.

ఆర్కే నగర్ 75 శాతం పోలింగ్...

తమిళనాడు : చెన్నైలోని ఆర్కేనగర్‌ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. 75 శాతానికి పైగా పోలింగ్‌ నమోదైంది. ఉదయం 8గంటల నుంచే ఓటర్లు పోలింగ్‌ బూత్‌ల వద్ద బారులు తీరి తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. 256 పోలింగ్‌ కేంద్రాల్లో భారీ భద్రత నడుమ ఓటింగ్‌ జరిగింది. మొత్తం 59 మంది అభ్యర్థులు ఉప ఎన్నిక బరిలో నిలిచారు. 

మరో సిరీస్ పై కన్నేసిన టీమిండియా...

ఢిల్లీ : టీ20ల్లో తిరుగులేని టీమిండియా....ఫటా ఫట్‌ ఫార్మాట్‌లో మరో సిరీస్‌పై కన్నేసింది. ట్వంటీ ట్వంటీ తొలి వరల్డ్‌ చాంపియన్‌ టీమిండియా..మాజీ చాంపియన్‌ శ్రీలంకపై టీ20 సిరీస్‌ విజయం సాధించాలని తహతహలాడుతోంది. ఇండోర్‌ హోల్కర్‌ క్రికెట్‌ స్టేడియం వేదికగా జరుగనున్న రెండో టీ20లో టీమిండియా హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగబోతోంది. కటక్‌ టీ20లో తిరుగులేని టీమిండియా రెండో మ్యాచ్‌లోనూ అదే స్థాయి ప్రదర్శనతో సిరీస్‌ దక్కించుకోవాలని ప్లాన్‌లో ఉంది. 

Don't Miss