Activities calendar

23 December 2017

22:00 - December 23, 2017

ఆధార్ అప్రమత్తతపై ప్రత్యేక నిపుణుడు శ్రీనివాస్ కొడాలితో 10 టివి ఇంటర్వ్యూ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన ఆధార్ కార్డు సబ్ మిట్ చేయడం, అనుసంధానానికి సంబంధించి మాట్లాడారు. ఆధార్ కార్డు విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:55 - December 23, 2017
21:53 - December 23, 2017

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో సంచలనం సృష్టించిన గ్యాంగ్‌ రేప్‌ కేసులో అడిషనల్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టు తీర్పు వెల్లడించింది. 19 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడిన నలుగురు నిందితులను దోషులుగా తేల్చిన కోర్టు- వారికి జీవిత ఖైదు విధించింది. అక్టోబరు 31న సాయంత్రం 7 గంటల సమయంలో బాధిత యువతి కోచింగ్ ఇనిస్టిట్యూట్ నుంచి ఇంటికి వెళ్తుండగా నలుగురు యువకులు ఆమెను అడ్డగించారు. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు వారి చెర నుంచి ఎలాగోలా తప్పించుకుని ఇంటికి చేరుకుంది. ఈ దారుణంపై పోలీసులు ముందు నిర్లక్ష్యం వహించినా...ప్రజల ఒత్తిడి మేరకు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్‌ చేశారు.

 

21:51 - December 23, 2017

గుజరాత్ : అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మరోసారి గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా రాహుల్‌ సోమ్‌నాథ్ ఆలయంలో శివుడికి పూజలు చేశారు. ఉదయం కేశోడ్ విమానాశ్రయం చేరుకున్న తర్వాత ఆయన రోడ్డు మార్గం ద్వారా సోమ్‌నాథ్‌కు వెళ్లారు. రాహుల్ సోమనాథుడికి పట్టువస్ర్తాలను సమర్పించారు. గుజరాత్‌ అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన పార్టీ ఎమ్మెల్యేలతో రాహుల్‌ సమావేశం నిర్వహించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 79 స్థానాలు గెలుచుకోవడంతో రాహుల్‌ కార్యకర్తల్లో మానసిక స్థయిర్యాన్ని పెంపొందించేందుకు యత్నిస్తున్నారు. తన పర్యటనకు ముందు రాహుల్‌ బిజెపిని మళ్లీ టార్గెట్‌ చేశారు. బిజెపి అబద్ధాల పార్టీగా ట్వీట్‌ చేశారు.   

 

21:48 - December 23, 2017

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌ సరిహద్దులో పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. రాజౌరి జిల్లాలోని కెరి సెక్టార్‌లో పెట్రోలింగ్‌ చేస్తున్న భారత జవాన్లపై పాకిస్తాన్‌ సైన్యం కాల్పులకు  తెగబడింది. ఈ కాల్పుల్లో ఆర్మీ మేజర్‌తో పాటు ముగ్గురు జవాన్లు అమరులయ్యారు. మరో జవానుకు గాయాలయ్యాయి. సాయంత్రం 4 గంటల సమయంలో ఈ కాల్పులు జరిగాయి. దీనిపై ఆర్మీ తరపున ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడ లేదు. పాక్‌ కాల్పులకు భారత జవాన్లు దీటుగా సమాధానమిస్తున్నారు. 

21:45 - December 23, 2017

గుంటూరు : ఏసుక్రీస్తు జననం ఒక సందేశం అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. క్రీస్తును నమ్ముకున్న వారికే జయమే కాని అపజయం ఉండదన్నారు. క్రిస్మస్‌ అంటే ప్రపంచమంతా జరుపుకునే ఏకైక పండుగ అని ఆయన అన్నారు. గుంటూరు లూథరన్‌ పాఠశాలలో ప్రభుత్వ  ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్‌ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సంబరాల్లో సీఎంతో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు. క్రైస్తవ మతపెద్దలు ప్రత్యేక ప్రార్థనలతో క్రిస్మస్‌ వేడుకలు ప్రారంభించారు. 

 

21:42 - December 23, 2017

ఢిల్లీ : దాణా కుంభకోణంలో కేసులో సిబిఐ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆర్జేడీ చీఫ్‌ లాలు ప్రసాద్‌ యాదవ్‌తో సహా 17 మందిని దోషిగా ప్రకటించింది. మాజీ సిఎం జగన్నాథ్‌ మిశ్రాతో పాటు మరో ఏడుగురిని నిర్దోషిగా ప్రకటించింది. దోషులకు జనవరి 3న కోర్టు శిక్షలు ఖరారు చేయనుంది. కోర్టు తీర్పుపై స్పందించిన లాలు...ఇది  ఓ రాజకీయ ఎత్తుగడగా పేర్కొంటూ బిజెపిపై మండిపడ్డారు. కోర్టు తీర్పు ఏకపక్షంగా ఉందని...న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయమిస్తామని పేర్కొన్నారు.
దాణా స్కాం కేసులో లాలును దోషి  
దాణా కుంభకోణం కేసులో రాంచిలోని సిబిఐ ప్రత్యేక కోర్టు తీర్పును వెలువరించింది. బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడి చీఫ్‌ లాలు ప్రసాద్‌ యాదవ్‌తో పాటు మరో 17 మందిని దోషులుగా ప్రకటించింది. కోర్టు తీర్పు నేపథ్యంలో లాలూను కోర్టు నుంచి నేరుగా బిర్సా ముండా జైలుకు తరలించారు. 2018, జనవరి 3న లాలుతో సహా దోషులందరికి కోర్టు శిక్షలను ఖరారు చేయనుంది.
జగన్నాథ్‌ మిశ్రాకు ఊరట 
దాణా కేసులో బిహార్‌ మాజీ సిఎం జగన్నాథ్‌ మిశ్రాకు ఊరట లభించింది. మిశ్రాతో పాటు ఏడుగురిని నిర్దోషులుగా తేల్చింది. 1996లో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ బిహార్‌ సిఎంగా ఉన్న సమయంలో పశువుల దాణా స్కాం వెలుగు చూసింది. దాణా కొనుగోళ్లలో 950 కోట్ల మేర అక్రమాలు జరిగాయి.  దాణా స్కాంపై మొత్తం ఐదు కేసులు నమోదయ్యాయి. 1994-96 మధ్య కాలంలో దాణా కోసం ట్రెజరరీ నుంచి అక్రమంగా డబ్బులు డ్రా చేశారన్నదానిపై సిబిఐ దర్యాప్తు జరిపింది. 1997లో లాలూ, మిశ్రాతో సహా 38 మందిపై చార్జీషీట్‌ దాఖలు చేసింది. 
ప్రస్తుత కేసులో 84.5 లక్షల దుర్వినియోగం
ప్రస్తుత కేసులో 84.5 లక్షల దుర్వినియోగానికి సంబంధించి సిబిఐ కోర్టు లాలును దోషిగా ప్రకటించింది. 1994..96 మధ్య జార్ఖండ్‌లోని దియోగఢ్‌ ట్రెజరీ నుంచి దాణా కోసం ఈ సొమ్మును లాలు అక్రమంగా డ్రా చేసినట్లు సిబిఐ చార్జీషీటు దాఖలు చేసింది. అంతకుముందు చియబస ట్రెజరీ నుంచి 37.5 కోట్లు నగదు అక్రమంగా ఉపసంహరించిన కేసులో లాలుకు సీబీఐ కోర్టు అయిదేళ్ల జైలుశిక్షతో పాటు 25 లక్షల జరిమానా విధించింది. ఈ తీర్పుతో కొన్నాళ్లు జైళ్లో గడిపిన లాలూ 2013లో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బయటకు వచ్చారు. 
లాలూ రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు 
దాణా స్కాంపై 22 ఏళ్లుగా విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో మాజీ అధికారులు ఇప్పటికే శిక్ష అనుభవించారు. నిందితులుగా ఉన్నవారిలో 11 మంది చనిపోయారు. మరో ముగ్గురు అప్రూవర్‌గా మారారు. దాణా స్కాంలో ఆర్జేడీ చీఫ్‌ లాలు ప్రసాద్‌ యాదవ్‌ నిందితుడిగా తేలడంతో ఆయన రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. ఆరేళ్లవరకు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేకుండా పోయింది. 

 

యూపీఏ లాగా పేలవంగా వ్యవహరిస్తున్న ఎన్డీఏ : జేపీ

హైదరాబాద్ : లోక్‌సత్తా నాయకులు జయప్రకాశ్ నారాయణ ప్రధాని మోడీపై జేపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీఏ ఎంత పేలవంగా, బలహీనంగా, అసమర్థంగా, నేరసమానంగా వ్యవహరించిందో అంతే రీతిలో ఎన్డీఏ కూడా వ్యవహరిస్తోందన్నారు. ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జయప్రకాశ్ నారాయణ ఈ వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగతంగా నిజాయితీగా ఉన్నానని చెప్పడం తప్పితే, మౌళిక సదుపాయాల్లో కొత్తదనం లేకపోయినా వేగం పెంచడం తప్ప మిగతా విషయాల్లో ఇసుమంత కూడా మార్పులేదని స్పష్టం చేశారు. మోదీ విషయంలో తన అంచనా అక్షరాలా తప్పైందని ఆయన తెలిపారు. అదంతా మన దురదృష్టం, మళ్లీ మళ్లీ ఈ జాతి నష్టపోతూనే ఉందని జేపీ చెప్పుకొచ్చారు. 

 

21:20 - December 23, 2017
21:19 - December 23, 2017
20:56 - December 23, 2017

ట్రాన్స్ జెండర్ కార్యకర్త వైజయంతీ వసంత మోగ్రీతో 10టివి వన్ టు వన్ నిర్వహించింది. ఈ సందర్భంగా వైజయంతీ వసంత మోగ్రీ మాట్లాడారు. ఆ వివరాలను వారి మాటల్లోనే..
'2016 ట్రాన్స్ జెండర్ చట్టం రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది. స్వేచ్ఛా, హక్కులను హరిస్తుంది. 2016 ట్రాన్స్ జెండర్ చట్టాన్ని రానివ్వమన్నారు. అమ్మాయిలను రేప్ చేసే తండ్రులు, అన్నలు ఉన్నారు. మాలో కూడా తప్పులు చేసేవారున్నారు. బీద ట్రాన్స్ జెండర్స్ కు విద్యా అవకాశాలు, రిజర్వేషన్లు, ఉద్యోగ అవకాశాలు, హెల్త్ కేర్ ఉండాలని' అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

20:45 - December 23, 2017

తెలంగాణ జేఏసోళ్లు వెట్టిన అమరవీరుల స్పూర్తి యాత్ర ఇయ్యాళ గూడ జోరుగనే అయ్యింది.. నిన్న నల్లగొండ కాడ బహిరంగ సభ వెట్టిండ్రు.. దానికి మంది బాగనే వచ్చిండ్రు.. ఇగ అదే జోషుతోని ఇయ్యాళ సూర్యాపేట కాడ గూడ సభ వెట్టిండ్రు.. మొత్తం మీద జేఏసీ మాత్రం ప్రతిపక్షాల కంటె ఫాస్టుల ప్రజలళ్లకు వోతున్నట్టనిపిస్తున్నది..

తెలంగాణ ప్రభుత్వ మన్సులు మంత్రులు గానీ.. ముఖ్యమంత్రిగానీ.. ఏడ తిర్గగల్గినా ఉస్మానియా యూనివర్సిటీల మాత్రం అడ్గువెట్టలేరు అంటున్నరు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు.. మంద క్రిష్ణ మాదిగను అరెస్టు జేసుడు ఎన్క ముఖ్యమంత్రి కుట్ర జేశిండు.. ఆ కుట్ర సంగతి మేము గూడ జూస్కుంట ఎట్లానేది అంటున్నరు.. నాల్గురోజుల సంది కుతకుత ఉడ్కుతున్నరు వాళ్లు..

నిజాం షుగర్ ఫ్యాక్టరీ గన్క తెర్వకపోతె.. తెలంగాణ ప్రభుత్వానికి సుక్కలు జూపెట్టెతట్టే ఉన్నరు చెర్కురైతులు.. ఇగ ముఖ్యంగ.. దేవనపల్లి కవితమ్మకు ఉన్నది గోస.. వందరోజులళ్ల తెరిపిస్త ఫ్యాక్టరీ అని ఓట్లప్పుడు జేప్పింది.. మళ్ల అటువోయి సూస్తలేదు జనం మంటమీదున్నరు.. వంటవార్పుల దాక గూడ వొయ్యింది ఉద్యమం..

ఒక మన్షికి పించిని ఎట్లియ్యాలే.. ఆయనకు అర్హత ఉన్నదా లేదా సూస్కోని ఇయ్యాలే మన తెల్గు రాష్ట్రాలళ్ల..  అంతేనా..? కని మీరంత ప్రతిపక్ష పార్టీకి ఓట్లేశిండ్రు గావట్టి మీకు పంచిని ఇయ్యం అంటె ఏమన్నట్టు చెప్పుండ్రి.. అయ్యా పొద్దుటూరు టీడీపీ నేత వరదరాజుల రెడ్డిగారు.. మీ అయ్యాజాగీరేమన్న అమ్మి ఇస్తున్నరా పించిండ్లు లేకపోతె.. మీ చంద్రబాబు ఇంట్లపైకం వంచుతున్నడా..? ఆ..

మేము కొట్టినట్టు జేస్తం మీరు ఏడ్సినట్టు జేయుండ్రి.. ఆపాటికి సంకురాత్రి ఒడ్సిపోతది.. మీ కోడి పందాల కోరిక తీర్తది.. మనమంత గల్సి కోర్టును ఫూల్ జేద్దాం అన్నట్టు జెప్తున్నడు ఆంధ్రా హోంమంత్రి గారు.. కోడి పందాలు ఆడుకోండ్రి.. మేము అడ్డుకోము.. హైకోర్టు జెప్పిన దాని ప్రకారం నడ్సినట్టు యాక్టింగ్ జేస్తమంటున్నడు.. ఒక మంత్రిగారు మాట్లాడవల్సిన మాటనేనా ఇది..?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంల పోలీసోళ్లు ప్రజలకు సేవలు జేశేది.. ఇప్పుడు పరిపాలకులకు సేవలు జేసుడు వెట్టిండ్రు.. ఈ కథ ఇట్ల మారిన ముచ్చటకు ఫ్రెండ్లీ పోలీసు అని ఒక నామకరణం జేశి ఇడ్సిపెట్టిండ్రు.. వాస్తవానికి ఫ్రెండ్లీ పోలీసు అంటే.. ప్రజలతోని ఫ్రెండ్లీగాదు పాలకులతోని ఫ్రెండ్లీ అన్నట్టు.. గా పోలీసాయిన గంగిరెడ్డి కండకావురం సూడుండ్రి ఎట్లున్నదో..

దొంగలకు సద్దిగట్టుట్ల కరీంనరగ్ పోలీసోళ్లను మించి ముంగటికి వొయ్యిండ్రుగదా..? కడప పోలీసోళ్లు.. స్మశాన వాటికను కబ్జావెట్టినోళ్లను ఇడ్సిపెట్టి.. అదే స్మశానంల పీనిగేకు దహన సంస్కారాలు జేస్తందుకొచ్చినోళ్లను ఇయ్యర మయ్యర గొట్టిండ్రు.. అరే నాయన ఇంత కావురం ఎందుకో ఏమో..? ప్రజలంటె మీ చేత తన్నులు తినెతందుకే వుట్టిండ్రనుకుంటున్నరా ఎట్ల..? సూడుండ్రమ్మా..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ సారు జర్ర ఆత్మగళ్ల మన్షే ఉన్నట్టున్నడు.. సాటి మన్షికి అపాయం అయ్యిందని తెల్వంగనే ఎంటనే కారు ఆపి.. కాపాడి.. దావఖానకు గొంచవొయ్యి వైద్యం జేపిచ్చిండంటే.. గొప్పోడన్నట్టేగదా..? అందేకే స్పీకర్ సారు నిన్న మీరు జేశిన మంచిపనికి మల్లన్న ముచ్చట్ల తర్పున దండం బెడ్తున్నం.. 

తెలంగాణ రాష్ట్రంల మన్సులకిచ్చినట్టు కోతులకు గూడ ఓటు హక్కిస్తె అవ్వే ముఖ్యమంత్రి అయ్యెంత మందున్నది అవ్విటియి.. ఏం కోతులు అబ్బబ్బబ్బ.. అవ్విటిని సముదాయించెతందుకు ప్రత్యేక దళాలు వెట్టెకాలమొస్తదో ఏమో.. కోతుల ముచ్చటెందుకంటె.. మాజీ నల్లగొండ జిల్లా మోత్కురు కాడ కోతికి కరెంటి శాకు దల్గిందట కాపాడిండ్రు..

19:52 - December 23, 2017
19:51 - December 23, 2017

కర్నూలు : జిల్లాలోని చెన్నంపల్లి కోటలో గుప్తనిధుల కోసం తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 12మందితో గ్రామ కమిటీని వేసి పర్యవేక్షిస్తున్నారు. తవ్వకాల్లో నిధి దొరికితే తమ గ్రామ అభివృద్ధికి ఇవ్వాలంటున్న చెన్నంపల్లి గ్రామస్తులతో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

19:43 - December 23, 2017

కృష్ణా : విజయవాడ.. బందరురోడ్డులోని పీడబ్ల్యూడీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన ఫ్లవర్‌ షోను మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రారంభించారు. రోజ్ సొసైటీ, ఉద్యానవన శాఖల ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. నేటి నుంచి క్రిస్మస్ వరకూ ఈ ప్రదర్శన కొనసాగనుంది. 22 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు ప్లవర్ షో పాల్గొని తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. సన్న, చిన్నకారు రైతులు రూపొందించిన వ్యవసాయ పనిముట్లు ప్రదర్శనలో హైలెట్‌గా నిలవనున్నాయి. ప్రదర్శనలు పెట్టిన పువ్వులు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.  

 

19:39 - December 23, 2017

కృష్ణా : తెలుగు రాష్ర్టాల్లో క్రిస్మస్ సందడి నెలకొంది. ఊరు వాడ సెమీ క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రార్థనలు, చిన్నారుల నృత్యగీతాలు ఆహుతులను అలరిస్తున్నాయి. కృష్ణా జిల్లా నందిగామ మండలం మాగల్లు గ్రామంలో న్యూ షాలొం గాస్పెల్‌ మినిస్ర్టీస్‌ వారు నిర్వహించిన సెమీ క్రిస్మస్‌ సెలబ్రేషన్‌ గ్రాండ్‌గా జరిగింది. 

 

19:27 - December 23, 2017

అనంతపురం : ప్రభుత్వ చీఫ్‌ విప్‌ పల్లె రఘునాథరెడ్డిపై... వైసీపీ పుట్టపర్తి సమన్వయకర్త దుద్దకుంట శ్రీధర్‌రెడ్డి.. మండిపడ్డారు. నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు రమ్మని సవాల్‌ విసిరారు. నియోజకవర్గంలో ఎక్కడ అభివృద్ధి జరిగిందో.. చెప్పాలన్నారు. హంద్రీనీవా కాలువకు సంబంధించి.. రైతుల భూములను అక్రమంగా లాక్కుంటున్నారని.. సరైన పరిహారం ఇవ్వకపోగా.. అన్నదాతలను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. 2013 చట్టం ప్రకారం .. భూములు కోల్పోయిన వారికి పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 

 

19:12 - December 23, 2017

గుంటూరు : అమరావతిలోని రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ సెంటర్‌లో వివిధ అంశాలపై అధికారులతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పర్యటనపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈనెల 27న ఉదయం 10.30కి ఏఎన్ యూలో ఇండియన్ ఎకనమిక్ సమ్మిట్‌‌కు రాష్ట్రపతి రానున్నారు. ఈనెల 27న ఉదయం 11.45 గంటలకు వెలగపూడి సచివాలయానికి రాష్ట్రపతి వస్తారు... అనంతరం మధ్యాహ్నం 12గంటలకు ఫైబర్ గ్రిడ్‌ను ప్రారంభించనున్నారు. అనంత‌రం చంద్రబాబు రాష్ట్రప‌తికి విందు ఇవ్వనున్నారు. సచివాలయంలో రాష్ట్రపతికి పోలవరం ప్రాజెక్టు, అమరావతి నగర నిర్మాణం వంటి అంశాలపై వర్చువల్ ప్రెజెంటేషన్ చేయ‌నుంది ప్రభుత్వం. రాష్ట్రప‌తి రాక నేపథ్యంలో ప్రభుత్వం భద్రతా ఏర్పాట్లు భారీగా చేస్తోంది. 

 

19:10 - December 23, 2017

గుంటూరు : హైదరాబాద్‌కు ఐటీ కంపెనీలు తీసుకురావడానికి ఎన్నో ప్రయాసలు పడ్డానని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు సమావేశం జరిగింది. అప్పట్లో ఐటీ కంపెనీల ప్రతినిధులను మా ఇంటికి తీసుకెళ్లి ఆతిథ్యం ఇచ్చేవాడినని, సబ్జెక్టు తెలియకపోయినా అన్నీ నేర్చుకునే వాళ్లమని చంద్రబాబు అన్నారు. ఆనాడు అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా లేవని, పత్రికల్లో వచ్చిన క్లిప్పింగ్స్ అన్నీ పేషీలో సీనియర్ అధికారి తనకు అందించేవారని చెప్పారు. నిత్యం అవన్నీ చదివి సబ్జెక్టుపై పట్టు సంపాదించామని చంద్రబాబు తెలిపారు. అంతేగాక హైదరాబాద్‌కు తొలి ఎమిరేట్స్ విమాన సర్వీసు తీసుకురావడానికి ఎంతో శ్రమించాల్సి వచ్చిందని, ఆ రోజుల్లో ఐటీకి ప్రత్యేకంగా వ్యవస్థ లేదని, పేషీలోని ఒకరు ఐటీ శాఖను నిర్వహించేవారని గతాన్ని గుర్తు చేసుకున్నారు. ఐటీ శాఖలో అవినీతి అసలు కనిపించకూడదని, నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యానికి వీల్లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. 

 

 

 


 

హారికను వేధించలదు : డైరెక్టర్ యోగి

హైదరాబాద్ : తను హారికను వేధించలేదని షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ యోగి టెన్ టీవీతో చెప్పారు. రూ.10వేలు తిరిగి ఇవ్వలేదని ఆరోపణలు చేస్తోందని, డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని చెప్పినా పోలీసులు వినడంలేదని ఆయన అన్నారు. అడిషనల్ డీసీపీ తనను విచక్షణా రహితంగా కొట్టారని, తనను బూటు కాలుతో తన్నే వీడియోను హారికనే చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

19:02 - December 23, 2017

హైదరాబాద్ : సింగరేణి ఎన్నికల సందర్భంగా ఓట్ల కోసం అధికార పార్టీ అనుబంధ సంఘం.. ఎన్నో హామీలను కార్మికులకు ఇచ్చింది. ప్రధానంగా వారసత్వ ఉద్యోగాలతో పాటుగా బినామీ పేర్లతో ఉద్యోగం చేస్తున్న గని కార్మికుల సొంత పేర్లుగా మార్పు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో కార్మికులు నమ్మి టీబీజీకేఎస్‌ను గెలిపించారు. యూనియన్‌ గెలిచి రెండు నెలలు దాటినా.. ఇప్పటి వరకు ఆ హామీ ఊసే లేకపోవడంతో కార్మికుల్లో ఆందోళన మొదలైంది.
ఎన్నికల సమయంలో అనేక హామీలు
సింగరేణి ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్‌ పార్టీ అనుబంధ సంఘమైన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాన్ని గెలిపించుకునేందుకు కార్మికులకు ఇవ్వని హమీ లేదు. ప్రధానంగా వారసత్వ ఉద్యోగాలతో పాటుగా బినామి పేర్లతో ఉద్యోగం చేస్తున్న గని కార్మికుల సొంత పేర్లు మార్పు చేస్తామని హమీ ఇవ్వడంతో కార్మికులు ఆనంద పడ్డారు. ఏళ్ల తరబడి భయం భయంగా మారు పేర్లతో విధులు నిర్వహించే కార్మికులు ఇక మీదట దర్జాగా తమ పేరుతో కొనసాగే అవకాశం వస్తుందని టీబీజీకేఎస్‌ని గెలిపించారు. యూనియన్‌ గెలిచి రెండు నెలలు కావస్తున్నా ఇంత వరకు హామీ ఊసే లేకపోవడంతో కార్మికుల్లో ఆందోళన మొదలైంది.
మారుపేరుతో ఉన్న కార్మికులకు అనేక ఇబ్బందులు
ఎన్నికల సమయంలో టీబీజీకేఎస్‌ తరపున ప్రచారం చేసిన టీఆర్‌ఎస్‌ ఎంపీ కవిత.. మారు పేర్లతో ఉన్న వేలమంది కార్మికులకు.. వన్‌ టైం నేమ్‌ కరెక్షన్‌ కింద సొంత పేరుగా మారుస్తామని హామీ ఇచ్చారు. స్వయాన ఎంపీ కవిత హామీ ఇవ్వడంతో.. కార్మికులంతా టీబీజీకేఎస్‌కి మద్దతు తెలిపి గెలిపించుకున్నారు. ఉద్యోగ విరమణ పొందిన తరువాత పింఛన్‌ పొందే సమయంలో మారుపేరుతో ఉన్న కార్మికులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.  ఇప్పటికే 600 మంది కార్మికులు ఉద్యోగ విరమణ పొందగా.. 200 మంది కార్మికులు బినామీ పేర్లతో ఉద్యోగం చేసిన వారు ఉన్నారు. రిటైర్‌మెంట్‌ నాటికైనా వారి సొంత పేరును మార్చుకునే అవకాశం లేకుండా పోయింది. ఎన్నికల సందర్భంగా  గొప్పలు చెప్పిన ఎంపి కవిత గెలిచిన తరువాత కార్మికులకు ఇచ్చిన హామీల ప్రసక్తే తీయక పోవడంతో కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పేరు సమస్యతో పింఛన్‌ నిలిచి పోయి ఇబ్బందులు
ప్రస్తుతం సింగరేణి వ్యాప్తంగా దాదాపు 3500 కార్మికులు మారు పేర్లతోనే ఉద్యోగం చేస్తున్నారు. మారు పేరు హామీని నెరవేర్చకపోవడంతో కార్మికులకు పింఛన్‌ పొందే సమయంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బినామి పేర్లను మార్పు చేసినట్లయితే సిఎం పీఎఫ్ సైతం పేరు మార్చుకునే అవకాశం ఏర్పడుతుంది. సీఎం పీఎఫ్‌ ఆఫీస్‌ నుంచి రిటైర్డ్‌ కార్మికుల పింఛన్ కోసం బయో మెట్రిక్‌ విధానం అమలు చేయడం.. దానికి ఆధార్‌ కార్డును లింక్‌ చేయాలని ఆదేశాలు వెలువడడంతో కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. గనిలో ఒక పేరు ఉంటే ఇంటి వద్ద సొంత పేర్లతో ఆధార్‌ కార్డులు ఉండడంతో చాల మందికి పింఛన్‌ లు నిలిచి పోయి ఇబ్బందులు పడుతున్నారు. 
కార్మికుల ఆందోళన
రెండు నెలలు గడిచినా మారు పేర్ల ప్రస్తావన రాక పోవడంతో కార్మికులు ఆందోళనకు గురవుతూ.. టీబీజీకేఎస్‌ నాయకుల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికే ఎంపి కవిత దృష్టికి మారు పేర్ల ప్రస్తావన తీసుకెళ్లినప్పటికీ ..వేచి చూడమనే సమాధానం కార్మిక నాయకులకు వచ్చినట్లు తెలుస్తుంది.

 

క్రికెట్ బెట్టింగ్ లో కొత్త వ్యూహం

హైదరాబాద్ : క్రికెట్ బెట్టింగ్ లో బుకీలు కొత్త వ్యూహం అనుసరిస్తున్నారు. క్రికెట్ మజా మొబైల్ అప్లికేషన్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తుండగా ఏడుగురు క్రికెట్ బుకీలను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో వీరు ఐపీఎల్, బీపీఎల్ బెట్టింగ్ నిర్వహించారు.

మిషన్ భగీరథ పనుల్లో ప్రమాదం

నాగర్ కర్నూలు : జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరులో మిషన్ భగీరథ పనుల్లో ప్రమాదం జరిగింది. 11 మంది కార్మికులు తీవ్రగాయలయ్యారు. 

పాక్ బలగాల కాల్పులు

శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్ లోని రాజౌరీ సెక్టార్ లో పాక్ బలగాలు కాల్పులకు తెగబడ్డాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు జవాన్ మృతి చెందారు. ఒకరికి గయామైంది. 

మేడారం జాతరకు రూ.80 కోట్లు

హైదరాబాద్ : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండగా సమక్క-సరక్క జాతరకు రూ.80 కోట్లు విడుదల చేశామని డీప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. ఈ నిధులను సక్రమంగా వినయోగించాలని అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. 

17:30 - December 23, 2017

హయత్ నగర్ లో ఓ ఇంటిపై ఎస్ వోటీ పోలీసుల దాడి

హైదరాబాద్ : హయత్ నగర్ లో ఓ  ఇంటిపై ఎస్ వోటీ పోలీసులు దాడులు చేశారు. ఆ ఇంట్లోని 30 కిలోల గంజాయి, కారు, 12వేలు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. గంజాయిని విశాఖ నుంచి తీసుకొచ్చి హయత్ నగర్ లో కాలేజీ విద్యార్థులకు విక్రయిస్తున్నారు. 

16:44 - December 23, 2017
16:40 - December 23, 2017

చిత్తూరు : ప్రజా సమస్యలే ఎజెండాగా ప్రభుత్వంపై పోరాడుతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. మదనపల్లిలో జరుగుతున్న సీపీఎం జిల్లా 12 వ మహాసభలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మధు టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. రైతు ఆత్మహత్యలు, కార్మికులు, వేతనాలు, దళితులపై దాడుల అంశాలపై చర్చిస్తామని చెప్పారు. రైతు రుణమాఫీ చేయాలి, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో దళితులపై పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయని..వివక్ష కొనసాగుతుందన్నారు. రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు. అసంఘటిత కార్మికులకు కనీస వేతనాలు లేవని తెలిపారు. రైతాంగం, కార్మిక సమస్యలపై పెద్దఎత్తున ఉద్యమాలు నిర్మించాలని మహాసభల్లో కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. కనీస వేతనాల చట్టాన్ని అమలు జరుపాలని డిమాండ్ చేశారు. పట్టాలున్నా టీడీపీ ప్రభుత్వం దళితుల భూములను గుంజుకుంటుందన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించకపోతే పోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. 

16:25 - December 23, 2017

హైదరాబాద్ : మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్రాన్ని కోరుతామని తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. దేవాదాయ శాఖ మంత్రి త్వరలో ఢిల్లీ వెళ్లి సంబంధిత మంత్రిని కలుస్తారని తెలిపారు. మేడారం జాతరపై సమీక్ష నిర్వహించిన ఆయన..వచ్చే ఏడాది 15 జనవరి వరకు ఇచ్చిన నిధులు సక్రమంగా వినియోగించాలని అధికారులను ఆదేశించారు. జనవరి 31 నుండి జరిగే జాతరకు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు. జాతరకు 80 కోట్లు నిధులు విడుదల చేస్తామన్నారు. జనవరి 18న మరోసారి సమీక్ష నిర్వహిస్తామన్నారు. 

 

16:21 - December 23, 2017

నెల్లూరు : పద్మశ్రీ అవార్డ్ ఇప్పిస్తామంటూ రూ. 4కోట్లకు మోసం చేసిన ఘటన నెల్లూరు జిల్లాలో బయటపడింది. ప్రస్తుతం గుంటూరు సీసీఎస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న కాకర్ల శేషరావు... నెల్లూరు జిల్లా గూడూరుకి చెందిన రమణయ్యనాయుడుకు పద్మశ్రీ ఇస్తామని నమ్మబలికాడు. అందుకోసం అతని వద్ద రూ.4 కోట్లు తీసుకున్నాడు. ఇప్పుడు ఆ ఊసే ఎత్తకపోవడంతో... మోసపోయాయని భావించిన నిందితుడు.. గూడూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో  ఫిర్యాదు చేశాడు. దీంతో గూడూరు పోలీసులు... శేషరావును అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

16:19 - December 23, 2017

గుంటూరు : జిల్లాలోని అచ్చంపేటలో వజ్రాలు కొంటామని వ్యాపారిని మోసం చేసిన నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వ్యాపారి వద్ద నుంచి వజ్రాలు దొంగిలించి నెంబర్‌ ప్లేట్‌ లేని కారులో పారిపోతుండగా చామర్రు గ్రామస్తులు వెంటాడి వారిని పట్టుకున్నారు. అనంతరం అచ్చంపేట పోలీసులకు అప్పగించారు. కారుతో పాటు వజ్రాలు, భారీగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. 

 

16:17 - December 23, 2017

విజయనగరం : జిల్లాలోని పార్వతీపురంలో ఐటీడీఏ 71వ పాలకవర్గ సమావేశం ప్రారంభమైంది. మరోవైపు గిరిజన సమస్యలపై ఐటీడీఏ ఆఫీస్‌ ముందు సీపీఎం, ఎస్‌ఎఫ్‌ఐ, సీఐటీయూ ధర్నా చేపట్టింది. పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో పలువురికి గాయాలయ్యాయి. వసతి గృహాల్లో మెస్‌చార్జీల పెంపుతో పాటు పౌష్టికాహారం అందించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం బోయ, వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చే నిర్ణయాన్ని వెనక్కితీసుకోవాలన్నారు. 279 జీవో రద్దు చేసి కార్మికులకు న్యాయం చేయాలని నిరసన తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

16:09 - December 23, 2017

ఢిల్లీ : రెండో దాణా స్కాంలో రాంచీ సీబీఐ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ను కోర్టు దోషిగా నిర్ధారించింది. ఈ కేసులో మరో 15 మందిని దోషులుగా తేల్చింది. బీహార్ మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రాకు ఊరట లంభించింది. జగన్నాథ్ మిశ్రాతోపాటు మరో ఏడుగురిని నిర్దోషులుగా ప్రకటించింది. ఆరు కేసుల్లో లాలూ ఇన్ వాల్వ్ అయివున్నారు. లాలూను కోర్టులోనే అరెస్టు చేసి జైలుకు పంపించే అవకాశముంది. మరికొద్ది సేపట్లో లాలూను జైలుకు తరలించనున్నారు. జనవరి 3న లాలూకు కోర్టు శిక్ష ఖరారు చేయనుంది. 
1991..94లో దాణా స్కాం కేసు 
1991..94లో దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ చీఫ్‌,.. మాజీ సీఎం లాలూప్రసాద్‌ యాదవ్‌, జగన్నాథ్‌ మిశ్రా సహా 22 మందిపై కేసు నమోదైంది. ట్రెజరీ నుంచి అక్రమంగా నగదు డ్రా చేసినట్లు అభియోగాలు నమోదయ్యాయి. 1997 అక్టోబర్‌ 27న సీబీఐ చార్జీషీట్‌ నమోదు చేసింది. ఈ విచారణ జరుగుతున్న కాలంలో 11 మంది చనిపోగా... ముగ్గురు అప్రూవర్లుగా మారిపోయారు. ఇన్నాళ్లుగా కొనసాగుతున్న విచారణలో... ఈరోజు తీర్పు వెలువడింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

లాలూప్రసాద్ ను దోషిగా తేల్చిన సీబీఐ కోర్టు

బీహర్ : దాణా స్కాం కేసులోమ లాలూ ప్రసాద్ యాదవ్ ను రాంచీ సీబీఐ కోర్టు దోషిగా తేల్చింది. జనవరి 22న కోర్టు ఆయన శిక్ష ఖరారు చేయనుంది. లాలూ కోర్టు నుంచి నేరుగా జైలుకు వెళ్లనున్నారు. 

15:51 - December 23, 2017

ఢిల్లీ : దాణా కుంభకోణం కేసులో కాసేపట్లో రాంచీ సీబీఐ కోర్టు తుది తీర్పు వెలువరించనుంది. 1991-94లో దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ చీఫ్‌,.. మాజీ సీఎం లాలూప్రసాద్‌ యాదవ్‌, జగన్నాథ్‌ మిశ్రా సహా 22 మందిపై కేసు నమోదైంది. ట్రెజరీ నుంచి అక్రమంగా నగదు డ్రా చేసినట్లు అభియోగాలు నమోదయ్యాయి. 1997 అక్టోబర్‌ 27న సీబీఐ చార్జీషీట్‌ నమోదు చేసింది. ఇన్నాళ్లుగా కొనసాగుతున్న విచారణలో... ఈరోజు తీర్పు వెలువడనుంది. ఈ విచారణ జరుగుతున్న కాలంలో 11 మంది చనిపోగా... ముగ్గురు అప్రూవర్లుగా మారిపోయారు. కోర్టు విచారణకు హాజరయ్యేందుకు లాలూ రాంచీకి చేరుకున్నారు. ఇవాళ్ల కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందేమోనని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 

 

15:48 - December 23, 2017

ఢిల్లీ : ఫోర్బ్స్‌ సంపాదనాపరులు జాబితాలో మన క్రీడాకారులు సత్తాచాటారు. 2017లో టాప్‌ -100లో 21 మంది క్రీడాకారులే ఉన్నారు. విరాట్‌ కోహ్లీ, మహేంద్రసింగ్‌ ధోని ఆటగాళ్లలో టాప్‌ ప్లేస్‌లో నిలిచారు. కాగా ఓవరాల్‌ జాబితాలో మొదటి రెండు స్థానాల్లో బాలీవుడ్‌ స్టార్స్‌  సల్మాన్‌ ,షారూక్‌ నిలిచారు. 
100 సెలబ్రిటీల్లో 21 మంది క్రీడాకారులే  
అమెరికాకు చెందిన ప్రముఖ బిజినెస్‌ మ్యాగజైన్‌ ఫోర్బ్స్‌ జాబితాలో పలువురు భారత క్రీడాకారులకు చోటుదక్కింది. శుక్రవారం విడుదల చేసిన 2017 టాప్‌-100 సెలబ్రిటీల్లో 21 మంది క్రీడాకారులు చోటు దక్కించుకున్నారు. క్రికెట్‌, బ్యాడ్మింటన్‌, టెన్నిస్‌, గోల్ఫ్‌, ఫుట్‌బాల్‌ ఇలా వివిధ విభాగాలకు చెందిన ఆటగాళ్లు ఫోర్బ్స్‌లో చోటు దక్కించుకున్నారు. 
టాప్‌ 3లో నిలిచిన కోహ్లీ 
గత ఏడాదితో  పోలిస్తే ఈసారి ఆదాయం తగ్గినప్పటికీ టీమిండియా కెప్టెన్‌ కోహ్లీ టాప్‌-3లో నిలిచాడు. గత ఏడాది అతని ఆదాయం రూ.134. 44 కోట్లు కాగా ఈ ఏడాది అది రూ.100.72 కోట్లకు పడిపోయింది. క్రీడాకారుల జాబితాను మాత్రమే పరిగణలోనికి తీసుకుంటే కోహ్లీ అందరికంటే ముందున్నాడు.కోహ్లీతర్వాత  82.5కోట్లతో సచిన్‌, 63.77 కోట్లతో ధోనీ నిలిచారు. అటు  ఒలింపిక్స్‌ రజతపతక విజేత పీవీ సింధు 57.25కోట్లతో ఓవరాల్‌గా 13వ స్థానంలోనూ, క్రీడాకారుల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది. కాగా ఓవరాల్‌ జాబితాలో బాలీవుడ్ స్టార్స్‌  సల్మాన్‌ నెంబర్‌ వన్‌గా, షారూక్‌ రెండో స్థానంలో నిలిచారు. 

 

15:43 - December 23, 2017

హైదరాబాద్ : క్రిస్మస్‌ సమీపిస్తుండడంతో భాగ్యనగరం ముస్తాబవుతోంది. యేసు జన్మదిన వేడుకల సందర్భంగా ఇప్పటికే నగరంలోని పలు చర్చిలు కలర్‌ఫుల్‌గా ముస్తాబయ్యాయి. గ్రేటర్‌లో చర్చిలన్నీ క్రిస్మస్‌ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. యేసు పుట్టినరోజు వేడుకల సందర్భంగా భాగ్యనగరం ఆధ్యాత్మికతను సంతరించుకుంది.  నగరంలో ఇప్పటికే  క్రిస్మస్‌ సందడి నెలకొంది. చర్చిల ముస్తాబు, షాపింగ్‌లతో క్రైస్తవులు బిసీబిసీగా గడుపుతున్నారు. నగరంలో ఎటు చూసినా షాపింగ్‌మాల్స్‌ వినియోగదారులతో కిటకిటలాడుతున్నాయి. డిసెంబర్‌ 25న క్రిస్మన్‌ను పురస్కరించుకొని డిసెంబర్‌ 24 అర్థరాత్రి నుండే యేసు క్రీస్తు జన్మదిన సారాంశాన్ని లోకానికి చాటే ఉపదేశాన్ని అందించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 
ప్రార్థనా మందిరాలు అందంగా ముస్తాబు
నగరంలో ప్రార్థనా మందిరాలు అందంగా ముస్తాబవుతున్నాయి. రంగురంగుల నక్షత్రాలు, గంటలతో చర్చిలు కనువిందు  చేస్తున్నాయి. కమ్మని కేకులు, స్వీట్లు నోరూరిస్తున్నాయి. శాంటాక్లాజ్‌  రాక కోసం చిన్నారుల ఎదురు చూపులు మొదలయ్యాయి. క్రిస్మస్‌ అంటే కేవలం అలంకరణలు, వంటకాలు, కానుకలు ఇచ్చిపుచ్చుకోవడమే కాకుండా ఆత్మీయ అంతరార్థం మరుగున పడిపోకుండా చూసుకోవడమే దీని వెనకున్న అంతరార్థం అంటున్నారు చర్చి ఫాదర్లు. యేసు మానవ అవతారంలో భూలోకానికి విచ్చేసిన దినంగా పేదలకు సాయం చేయాలని సూచిస్తున్నారు. అప్పుడే అది హ్యాపీ క్రిస్మస్‌ అవుతుందని ఫాదర్‌లు సూచిస్తున్నారు. 
రాజ్య భవనంలో చెట్టును ఏర్పాటు చేసిన విక్టోరియా రాణి  
18వ శతాబ్ధంలో విక్టోరియా రాణి తన రాజ్య భవనంలో ఒక చెట్టును ఏర్పాటు చేయడంతో అది ప్రాచుర్యం పొంది క్రిస్మస్‌ ట్రీగా పేరుగాంచిందని క్రైస్తవులు చెబుతుంటారు. ఆ చెట్టుకు దీపాలు పెట్టి అలంకరించడం సంప్రదాయంగా వస్తుందని, అప్పటి నుండి క్రిస్మస్‌ చెట్టును పళ్లు, కానుకలతోనే కాక దీపాలతో కూడా అలంకరిస్తున్నారు క్రైస్తవులు. ఆనందానికి, పచ్చదనానికి, సిరిసంపదలకు ఈ చెట్టును చిహ్నంగా భావిస్తారు. కావున ప్రాచుర్యంలోనూ క్రిస్మస్‌ అలంకరణలో భాగమైంది క్రిస్మస్‌ ట్రీ. 
ప్రత్యేక ఆకర్శణగా శాంటాక్లాజ్‌  
క్రిస్మస్ సందర్భంగా శాంటాక్లాజ్‌ ప్రత్యేక ఆకర్శణగా నిలుస్తారు. క్రిస్మస్‌ ఫాదర్‌ మనసున్న వ్యక్తిగా ఇతరులకు సాయం చేసే గొప్ప వ్యక్తిగా నిలుస్తారు. ఇటు పల్లెల్లో, పట్టణాల్లో పండగ వేడుకల కోసం డిసెంబర్‌ మొదటి వారం నుండే అడ్వాన్స్‌ క్యారెల్స్‌, సెమి క్రిస్మస్‌ కార్యక్రమాలతో ఆధ్యాత్మికత వాతావరణం నెలకొంది. క్రిస్మస్‌ త్యాగమూర్తి యొక్క జన్మ ప్రాముఖ్యతను వ్యక్తిగతంగా అనుభవించేందుకు నెలరోజుల నుండే ప్రణాళికలతో సిద్ధమయ్యారు క్రైస్తవులు. క్రిస్మస్‌ సంబరాలు అంబరాన్నంటేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక క్రిస్మస్‌ వేడుకలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిండంతో అధికారయంత్రాంగం కూడా ఏర్పాట్లను ముమ్మరం చేసింది. 
 

 

15:36 - December 23, 2017

హైదరాబాద్ : తెలంగాణలో మరింత జోరు పెంచేందుకు టీ కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఇప్పటికే రేవంత్‌రెడ్డిని పార్టీలో చేర్చుకున్న కాంగ్రెస్ .. టీఆర్‌ఎస్ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలే టార్గెట్‌గా ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపుతోంది. టీఆర్‌ఎస్ నేతలు టచ్‌లో ఉన్నారంటున్న కాంగ్రెస్ నేతలు  తెలంగాణలో రాహుల్ టూర్‌కు ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. తెలంగాణలో జరగనున్న సమ్మక్క-సారక్క గిరిజన జాతర, నిరుద్యోగ గర్జనలకు రాహుల్‌గాంధీని రప్పించడం ద్వారా గులాబీపార్టీకి చెక్‌పెట్టాలన్నది కాంగ్రెస్ వ్యూహరచనగా కనిపిస్తోంది. మరి టీ కాంగ్రెస్ వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయి?  వాచ్‌ ది స్టోరి.                              
టీ కాంగ్రెస్ దూకుడు 
తెలంగాణలో టీ కాంగ్రెస్ దూకుడు పెంచుతోంది. మొన్నటి దాకా వలసలతో ఉక్కిరిబిక్కిరైన కాంగ్రెస్ ఇప్పుడు ఆపరేషన్ ఆకర్ష్‌తో అధికారపార్టీకి చుక్కలు చూపించడానికి సిద్ధమవుతోంది. రేవంత్‌రెడ్డిని తమ పార్టీలో చేర్చుకుని వలసలకు బ్రేక్‌ వేసిన హస్తం నేతలు.. ఇదే అస్త్రంతో టీఆర్‌ఎస్‌కు ఝలక్‌ ఇచ్చేందుకు స్కెచ్ గీస్తున్నారు. 
టీఆర్‌ఎస్ సిట్టింగ్‌లపై దృష్టి పెట్టిన టీ కాంగ్
ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీ కాంగ్‌ ఇప్పుడు టీఆర్‌ఎస్ సిట్టింగ్‌లపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా తమతో టచ్‌లో ఉన్న నేతలపై ఒత్తిడి పెంచాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మొదటగా టీఆర్‌ఎస్ బలంగా ఉన్న ఉత్తర తెలంగాణ నుండే ఆపరేషన్ ఆకర్ష్ షురూ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిసైడైనట్లు తెలుస్తోంది. తమ అధినేతైన రాహుల్‌ గాంధీ సమక్షంలోనే ఈ చేరికలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఉత్తమ్‌కుమార్ రెడ్డి భావిస్తున్నారట. అందుకోసం తెలంగాణలో రాహుల్ పర్యటనలకు రూపకల్పన చేస్తోంది టీపీసీసీ. 
ఎస్టీలకు దగ్గరయ్యేందుకు కాంగ్రెస్ వ్యూహ రచన
మొద‌టి విడ‌త‌లో టిఆర్‌స్‌కు బ‌ల‌మైన ప‌ట్టున్న వ‌రంగ‌ల్ , క‌రీంన‌గ‌ర్, నిజామాబాద్‌ల‌కు చెందిన గులాబి సిట్టింగ్ ల‌ను హ‌స్తం గూటికి చేర్చుకోబోతోందట టీ కాంగ్రెస్. అంతే కాకుండా.. తెలంగాణ‌లో జ‌రిగే గిరిజ‌న జాత‌ర‌.. సమ్మక్క -సార‌క్క జాత‌ర‌కు రాహుల్ ర‌ప్పించేందుకు రెడీ అవుతుంది పీసీసీ. దీనికోసం ఇప్పటికే ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి రాహుల్‌కి ఆహ్వానం పంపారట. ఇలా రాహుల్‌ను జాతరకు ఆహ్వానించడం ద్వారా రాష్ట్రంలోని ఎస్టీలకు మరింత దగ్గర కావొచ్చన్నది కాంగ్రెస్ వ్యూహ రచనగా కనిపిస్తోంది. అంతేకాకుండా త్వరలో నిరుద్యోగ గర్జనను నిర్వహించి దానికి సైతం రాహుల్‌ను రప్పించేందుకు టీ కాంగ్రెస్ ప్రయత్నాలు ప్రారంభించింది. 
టీఆర్‌ఎస్ దీన్ని ఎలా ఎదుర్కుంటుంది? 
ప్రస్తుతం మంచిరోజులు లేకపోవడంతో సంక్రాంతి తరువాత టీ కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్‌ ద్వారా తమ బలాన్ని మరింత పెంచుకునేందుకు సిద్ధమవుతోంది. మరి కాంగ్రెస్ వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయి? టీఆర్‌ఎస్ దీన్ని ఎలా ఎదుర్కుంటుంది? అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.

 

అధిష్టానం ఆదేశిస్తే గజ్వేల్ లో పోటీ చేస్తా : ఎమ్మెల్యే కోమటిరెడ్డి

హైదరాబాద్ : మంచి పనులు చేస్తే ప్రజలే అవార్డులు ఇస్తారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి తెలిపారు. అధిష్టానం ఆదేశిస్తే గజ్వేల్ లో పోటీ చేస్తానని చెప్పారు. 

రాష్ట్రంలో అసమర్ధ ప్రభుత్వం : కోమటిరెడ్డి

హైదరాబాద్ : రాష్ట్రంలో అసమర్ధ ప్రభుత్వం ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. కేటీఆర్ కు  ఎవరు అవార్డులు ఇస్తున్నారో తెలియడం లేదని మంచి పనులు చేస్తే ప్రజలే అవార్డులు ఇస్తారని ఆయన అన్నారు. 

విజయనగరం జిల్లాలో దౌర్జన్యం

విజయనగరం : పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయం ముందు సీపీఎం, సీఐటీయూ, ఎస్ ఎఫ్ ఐ ధర్నా చేపట్టాయి. పోలీసులు ఆందోళనకారులపై లాఠీచార్జీ చేశారు. ఈ ఘటనలో పలువురు ఆందోళనకారులకు గాయాలయ్యాయి. 

15:24 - December 23, 2017

చిత్తూరు : ఇప్పటివరకూ రాష్ట్రాల్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలు రైతాంగానికి సబ్సిడీలో కోత పెట్టాయని... అప్పటి నుంచే రైతుల ఆత్మహత్యలు మొదలయ్యాయని సీపీఎం ఏపీ రాష్ర్ట కార్యదర్శి మధు విమర్శించారు. జిల్లాలోని మదనపల్లిలో సీపీఎం జిల్లా 12వ మహాసభలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ జిల్లాలో రెండురోజులపాటు జరగనున్న మహాసభల్లో రైతాంగం ఎదుర్కుంటున్న సమస్యలపై చర్చిస్తామన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే పోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు.

 

15:20 - December 23, 2017

నాగర్‌ కర్నూల్‌ : జిల్లాలో వ్యాపారి సుధాకర్‌ రెడ్డి హత్యకేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన స్వాతిని మహబూబ్‌ నగర్‌ జైలు నుండి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. రెండు రోజుల పాటు నాగర్‌ కర్నూల్‌ పీఎస్‌లో స్వాతిని పోలీసులు విచారించనున్నారు. 

 

సీబీఐ కోర్టుకు చేరుకున్న లాలూ ప్రసాద్ యాదవ్, జగన్నాథ్ మిశ్రా

రాంచీ : దాణ కుంభకోణం కేసులో కాసేపట్లో సీబీఐ కోర్టు తీర్పు వెలువడనుంది. ఆర్జేడీ చీఫ్, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్, జగన్నాథ్ మిశ్రా సహా 22 మందిపై కేసు నమోదు చేశారు. 1991-1994 కాలంలో ట్రెజరీ నుంచి అక్రమంగా డబ్బులు డ్రా చేశారని ఆరోపణలు వీరిపై ఉన్నాయి. కాసేపట్లో తీర్పు రానున్న తరుణంలో లాలూ రాంచీకి చేరుకున్నారు.

 

సంధ్యారాణి కుటుంబసభ్యులను పరామర్శించిన మంత్రి పద్మారావు

హైదరాబాద్ : లాలాపేటలో ప్రేమోన్మాది దాడి ఘటనలో గాయపడి మృతి చెందిన సంధ్యారాణి కుటుంబ సభ్యులను మంత్రి పద్మారావు పరామర్శించారు. రూ. 2లక్షల చెక్కు అందజేశారు. సంధ్యారాణి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇప్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. 

14:56 - December 23, 2017

హైదరాబాద్ : ఫిల్మ్‌ డైరెక్టర్‌ యోగి, హీరోయిన్‌ హారిక కేసును దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ విశ్వప్రసాద్‌ అన్నారు. యోగి ఇతర అమ్మాయిలతో కూడా అసభ్యకరంగా ప్రవర్తించినట్లు తెలిసిందన్నారు. యోగిపై 34(A), 34(D), 506, 509 కేసులు పెట్టామన్నారు. హారిక కంప్లైంట్‌ మేరకు కేసును పూర్తిగా విచారణ జరిపుతామని తెలిపారు. అలాగే అడిషనల్ డీసీపీ గంగిరెడ్డి తీరుపై సీపీకి తెలిపినట్లు తెలిపారు. 

 

14:52 - December 23, 2017

హైదరాబాద్ : షార్ట్‌ ఫిల్మ్‌ డైరెక్టర్‌ యోగి కొంతకాలంగా తనపట్ల అభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని... షార్ట్‌ ఫిల్మ్‌ నటి హారిక ఆరోపించారు. తనకు షార్ట్‌ ఫిల్మ్‌లో అవకాశమిస్తానని నమ్మించి... అనేకసార్లు డబ్బులు తీసుకున్నాడన్నారు. తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగినందుకు తనను బెదిరించాడని హారిక అంటోంది. మరోవైపు పోలీసుల సమక్షంలో తనను అసభ్యపదజాలంతో దూషించడంతోనే డీసీపీ ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు హారిక. చాలామంది మహిళల పట్ల యోగి ఇలాగే ప్రవర్తించాడని ఆమె ఆరోపిస్తున్నారు.

 

డీసీపీ గంగిరెడ్డి వ్యవహారంపై విచారణకు ఆదేశించిన డీజీపీ

హైదరాబాద్: సైదరాబాద్ డీసీపీ గంగిరెడిఓ్డ వ్యవహారం, జవహార్ నగర్ ఇన్ స్పెక్టర్ ఉమామహేశ్వర్ పై డీజీపీ మహేందర్ రెడ్డి విచారణకు ఆదేశించారు. 

పద్మశ్రీ అవార్డులు ఇప్పిస్తామని మోసం

నెల్లూరు : నామినేటెడ్ పదవులు, పద్మశ్రీ అవార్డులు ఇప్పిస్తామని సర్కిల్ ఇన్ స్పెక్టర్ శేషారావు మోసం చేశారు. గూడూరుకు చెందిన వ్యాపారి రమణయ్య, డాక్టర్ శ్రీధర్ నుంచి రూ.2.2 కోట్లు శేషారావు వసూలు చేశారు.  

వజ్రల దోపిడీకి యత్నం

గుంటూరు : అచ్చంపేటలో వజ్రాల వ్యాపారి ఖాసింసీరా నుంచి రూ.10 లక్షల విలువైన వజ్రంను గుర్తుతెలియని నలుగురు దుండగులు ఎత్తుకెళ్లారు. వారు పారిపోతుండగా స్థానికులు, పోలీసులు కలిసి పట్టుకున్నారు. 

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

కడప : జిల్లా పుల్లంపేట మండలం చవనవారిపల్లిలో దారుణం చోటుచేసుకుంది.ఎన్టీఆర్ నగర్ లో శివ, అరుణ ఇద్దరు దంపతులు, కొన్నాళ్ల కిత్రమే వీరికి విహహం జరిగింది. అయితే పెళ్లి ముందు అరుణ సుభాష్ అనే వ్యక్తి ప్రేమాయణం సాగించింది. వారి ప్రేమను ఒప్పకొని పెద్దలు శివ ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి తర్వాత కూడా అరుణ సభాష్ తో వివాహేతర సంబంధం కొనసాగించింది. వీరి వ్యవహారం భర్త శివకు తెలియడంతో పలమార్లు హెచ్చరించాడు. తమ అక్రమా సంబంధానికి భర్త శివ అడ్డుపడుతన్నాడని అరుణ, ఆమె ప్రియుడు సుభాష్, అతని స్నేహితులతో కలిసి భర్తను హత్య చేసింది.

13:31 - December 23, 2017

కడప : అక్రమ సంబంధాలు ప్రాణాలు తీస్తున్నాయి. తమ విషయం ఎక్కడ తెలుస్తోందనని ఒకరు..అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో కొంతమంది భార్యలు కర్కశంగా మారుతున్నారు. దారుణంగా భర్తలను హత్య చేస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్ సినీ ఫక్కీలో భర్తను ప్రియుడితో కలిసి స్వాతి హత్య చేయించిన సంగతి తెలిసిందే. తాజాగా కడపలో మరో ఘటన చోటు చేసుకుంది.

జిల్లాలోని పుల్లంపేట మండలం చవనవారిపల్లెలో ఎన్టీఆర్ నగర్ లో శివ..అరుణ దంపతులు ఉంటున్నారు. కానీ పెళ్లికి ముందే అరుణకు సుభాష్ తో ప్రేమాయణం ఉండేది. ఇది క్రమ క్రమాన అక్రమ సంబంధాన్ని దారి తీసింది. పెళ్లైనా సుభాష్ తో అరుణ సంబంధం కొనసాగించేది. భార్య వ్యవహారం తెలిసిన శివ పలుమార్లు హెచ్చరించాడు.

చివరగా అడ్డుగా ఉన్న తన భర్తను తొలగించుకోవాలని అరుణ నిర్ణయించుకుని అందుకు తగిన పక్కా ప్లాన్ వేసింది. ఓ ప్రాంతానికి రావాలని శివ..అరుణలకు సుభాష్ అతని స్నేహితులు చెప్పారు. అక్కడకు వెళ్లిన శివకు పీకలదాక మద్యాన్ని తాగించారు. అనంతరం కత్తులతో పొడిచి చంపేశారు. స్కూటర్ పై శివ మృతదేహాన్ని తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో పాతిపెట్టారు. తమ కుమారుడు కనిపించడం లేదని, అరుణపై అనుమానంతో శివ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో ఈ విషయం బయటపడింది. 

13:17 - December 23, 2017
13:13 - December 23, 2017

జార్ఖండ్ : బీహార్ లో ఉత్కంఠ కొనసాగుతోంది. లాలూ ప్రసాద్ యాదవ్ భవితవ్యం ఎలా ఉంటుంది ? ఆయనపై ఎలాంటి తీర్పు వస్తుందోనని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ‘దాణా' కుంభకోణంపై శుక్రవారం సీబీఐ స్పెషల్ కోర్టు శివపాల్ సింగ్ న్యాయమూర్తి వెలువరించనున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ భవితవ్యం ఏంటో ఈ కోర్టు తీర్పు నిర్ణయించనుంది.

25 సంవత్సరాల నుండి ఈ కేసు విచారణ జరుగుతోంది. 1991-94 మధ్యకాలంలో దియోగఢ్ (ఇప్పుడు దియోగఢ్ జార్ఖండ్ లో ఉంది) ట్రెజరీ నుండి దాణా కోసం రూ. 89 లక్షలను ఫోర్జరీ సంతకాలు చేసి డ్రా చేసినట్లు లాలూతో పాటు 34 మందిపై కేసులు నమోదు చేశారు. సీబీఐ అధికారులు దీనిపై విచారణ చేపట్టారు. 1997 అక్టోబర్ 27న సీబీఐ ఛార్జీషీట్ దాఖలు చేసింది. విచారణ సమయంలో 11 మంది చనిపోగా ముగ్గురు అప్రూవల్ గా మారిపోయారు. తీర్పు సందర్భంగా లాలూ పలు వ్యాఖ్యలు చేశారు. ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని..బీజేపీ కావాలనే తనను టార్గెట్ చేస్తోందని పేర్కొంటున్నారు. మరి లాలూతో పాటు జగన్నాథమిశ్రాలపై ఎలాంటి తీర్పు వస్తుందో వేచి చూడాలి. 

దాణా స్కాంలో కాసేపట్లో సీబీఐ తీర్పు

రాంచీ : కాసేపట్లో సీబీఐ కోర్టు దాణ కుంభకోణం కేసులో తీర్పు వెల్లడించనుంది. ఆర్జేడీ చీఫ్, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్, జగన్నాథ్ మిశ్రా సహా 22 మందిపై కేసు నమోదు చేశారు. 1991-1994 కాలంలో ట్రెజరీ నుంచి అక్రమంగా డబ్బులు డ్రా చేశారని ఆరోపణలు వీరిపై ఉన్నాయి. కాసేపట్లో తీర్పు రానున్న తరుణంలో లాలూ రాంచీకి చేరుకున్నారు.

అధికారులతో చంద్రబాబు సమావేశం

గుంటూరు : అమరావతిలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ లో వివిధ అంశాలపై అధికారులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పర్యటనపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. 

12:41 - December 23, 2017

దిల్ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై వేణుశ్రీరామ్ దర్శకత్వంలో నాని, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ఎంసీఏ ఈ చిత్రం విడుదలైన తొలిరోజే 15 కోట్లు కలెక్షన్లు రాబటింది. సినిమా పై మిశ్రమ స్పందన వచ్చిన తెలుగురాష్ట్రాల్లో తొలి రోజే 11 కోట్లు వసూళు చేసింది. దీంతో దిల్ రాజ్ హిట్ సినిమాల్లో ఎంసీఏ నిలించింది. ఈ చిత్రం విడుదలైన తర్వాతి రోజే పైరసీ బయటకు వచ్చిన వసూళ్లలో మాత్రం వెనుకబడలేదు. 

మేడారం జాతరపై డీప్యూటీ సీఎం కడియం సమీక్ష

హైదరాబాద్ : గిరజన పండుగైన అయిన మేడారం సమక్క-సారక్క జారతపై డీప్యూటీ సీఎం కడియం శ్రీహరి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రులు చందూలాల్, ఇంద్రకరణ్ రెడ్డి హాజరైయ్యారు.

12:28 - December 23, 2017

కొంత మంది తము తినే ఆహరంలో కరివేపాకు( కాల్యమాకు) వస్తే తీసివేస్తారు. కానీ దీని వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలిస్తే అలా చేయారు. రక్తంలో చక్కెర స్థాయిలు సమతూకంలో ఉండాలంటే... కొన్ని రోజులు కరివేపాకును ఆహారంలో కలిపి తీసుకుని చూడండి. ఈ ఆకులో పీచు ఎక్కువగా ఉండటంతో రక్తంలోని చక్కెర స్థాయి పెరగకుండా ఉంటుంది.శరీరంలో అధిక కొవ్వును తగ్గించే గుణం ఈ ఆకులో ఉంది. ఇది బరువు పెరగకుండా శరీరాన్ని నియంత్రిస్తుంది.

దాణా స్కాం నుంచి బయటపడతా : లాలు

ఢిల్లీ : తను దాణా కుంభకోణం బయటపడతనాని అర్జేడీ అధ్యక్షడు లాలు ప్రసాద్ యాదవ్ అన్నారు. 2 జీ స్కాం, ఆదర్శ్ స్కామ్ లలాగే తన పై తీర్పు వస్తుందని ఆయన తెలిపారు. బీజేపీ తనపై కుట్ర చేస్తుందని ఆయన ఆరోపించారు. 

రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం

జైపూర్ : రాజస్థాన్ లోని సవామ్ మాధోపూర్ లో  ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు ఓ బస్సు వంతెన పై నుంచి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 27 మంది మృతి చెందారు. మరో 10 గాయాలయ్యాయి. బస్సు స్టీరింగ్ అదుపు తప్పడంతోనే ఈ దుర్ఘటన జరిగినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. 

12:06 - December 23, 2017

పెళ్లి చూపులు సినిమాతో క్లాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి తో మాస్ పేక్షకుల్లోకి చోచ్చుకుపోయారు. అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ రేంజ్ ఒకేసారి టాప్ లోకి వెళ్లింది. ఈ సినిమా ఐఎండీబీ 2017 జాబితాలో ఏకంగా మూడో స్థానాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం విజయ్ చేతిలో 5పైగా సినిమాలు ఉన్నాయి. అయితే ఆయన తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా అడుగుపెడుతున్నట్టు తెలుస్తోంది. గతంలో విక్రమ్ తో ఇరుమురుగన్ చేసిన దర్శకుడు ఆనంద్ శంకర్ ఈ మధ్య విజయ్ ఓ కథ వినిపించారట. ఆ కథ నచ్చడంతో సినిమాకు ఓకే అన్నట్టు వార్తలు వస్తున్నాయి. 

11:57 - December 23, 2017

నేడు స్వాతిని ప్రశ్నించనున్న పోలీసులు

నాగర్ కర్నూలు : భర్త సుధాకర్ రెడ్డిని ప్రియుడితో కలిసి హత్య చేసిన స్వాతిని నేడు పోలీసులు విచారించనున్నారు. ఆమెను సాయంత్రం 5 గంటల వరకు విచారిస్తారు. 

11:38 - December 23, 2017

కరీంనగర్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రూరల్ మండలం గుంటూరు పల్లిలో ప్రాథమిక పాఠశాలలో మధుసూధన్ అనే ఉపాధ్యాయుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. శుక్రవారం సాయంత్రం పాఠశాల సమయం అయిపోయిన తరువాత మధుసూధన్ ఇంటికి వెళ్లలేదు. రాత్రి సమయంలో పాఠశాల సమీపంలో ఉన్న చెట్టుకు ఉరేసుకుని మృతి చెందాడు.

శనివారం ఉదయం గ్రామస్తులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలంలో సూసైడ్ నోట్ లభ్యమైంది. తన జీవితంలో సాధించచలేకపోతున్నట్లు..ఓటమి ఎదురవుతోందని..సీఎం కేసీఆర్ కుటుంబం తన కుటుంబాన్ని ఆదుకోవాలని లెటర్ లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే మధుసూధన్ రెండు..మూడు నెలల్లోనే ఉద్యోగ విరమణ పొందాల్సి ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. 

ఉపాధ్యాయుడు సూసైడ్..

కరీంనగర్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రూరల్ మండలం గుంటూరు పల్లిలో ప్రాథమిక పాఠశాలలో మధుసూధన్ ఉపాధ్యాయుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. 

కర్నూలులో స్థానిక సంస్థల ఎన్నికల వేడి...

కర్నూలు : జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి రగులుకుంది. అభ్యర్థుల ఎంపికలో పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. అందులో భాగంగా నేడు జిల్లా టిడిపి నేతలతో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. అభ్యర్థుల ఎంపికపై అభిప్రాయ సేకరణ జరుగనుంది. ఇప్పటికే జిల్లా నేతల అభిప్రాయాలను జిల్లా ఇన్ ఛార్జీ, మంత్రి కాల్వ శ్రీనివాసులు సేకరించారు. అభ్యర్థుల ఎంపికపై నేతల అభిప్రాయాలు తీసుకోవాలని వైసీపీ నిర్ణయించింది. జిల్లాలో 184 మంది జెడ్పీటీసీలు, ఎంపీటీసీలున్నాయి. 

11:20 - December 23, 2017

విజయవాడ : విశాఖపట్టణంలో దళిత మహిళపై జరిగిన దాడిపై సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో స్పందించారు. శుక్రవారం ఉదయం వరుసుగా ఆయన ట్వీట్లు సంధించారు. ఈ ఘటన గురించి విన్న తరువాత తాను బాధపడడం జరిగిందని, ఈ ఘటనలో టిడిపి నేతలున్నట్లు ప్రచారం జరుగుతోందన్నారు. ఈ దారుణానికి ఒడిగట్టిన నేరస్తులపై పోలీసులు, ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రశ్నించారు. దీనివల్ల ప్రజల్లోకి చెడు సంకేతాలు వెళుతాయని, కారంచెడు..చుండూరు ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని హితవు పలికారు.

రోహిత్ వేముల మరణం దేశవ్యాప్తంగా ఎంతటి ఉద్రిక్తతను రేకెత్తించిందో ఆలోచించుకోవాలని... అధికారులు మౌనాన్ని వీడాలని పేర్కొన్నారు. తాను వ్యక్తిగతంగా అక్కడకు వెళ్లాలని భావించినా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర వత్తిడి వస్తుందని..ఇతరత్రా సమస్యలు ఏర్పడుతాయని పేర్కొన్నారు. ఈ ఘటనపై వెంటనే చర్య తీసుకోవాలని... నిస్సహాయ మహిళకు అండగా నిలబడాలని విశాఖ జిల్లా కలెక్టర్, ఎస్పీలను కోరుతున్నానని ఆయన అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

11:13 - December 23, 2017

జైపూర్ : రాజస్థాన్ లో జరిగిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. బస్సు నదిలో పడిపోవడంతో 26 మంది మృతి చెందగా 10 మందికి గాయాలయ్యాయి. ప్రమాదంపై రాజస్థాన్ సర్కార్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియచేస్తున్నట్లు వెల్లడించింది. సాయంత్రంలోగా పరిహారం ప్రకటించే అవకాశం ఉంది. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. నదిలో పడిపోయిన బస్సును బయటకు తీశారు. పలువురు గల్లంతైనట్లు తెలుస్తోంది. వీరి ఆచూకి కోసం గజ ఈతగాళ్లు ప్రయత్నిస్తున్నారు.

మధ్యప్రదేశ్ కు చెందిన కొంతమంది ప్రయాణీకులు రాజస్థాన్ లోని రామ్ దేవ్రా ప్రాంతానికి ప్రైవేటు బస్సులో వెళుతున్నారు. సవాయ్ మధోపూర్ లోని దుబి వద్ద బనస్ నదిపై ఉన్న వంతెన దాటుతోంది. ఓ వాహనాన్ని ఓవర్ టేక్ చేయడం..అతివేగంగా ఉండడంతో బస్సు అదుపు తప్పింది. దీనితో 30 ఫీట్ల ఎత్తు నుండి కింద పడిపోయింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 27 మంది దుర్మరణం చెందారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

ప్రమాదంపై రాజస్థాన్ ప్రభుత్వం దిగ్ర్భాంతి...

జైపూర్ : రాజస్థాన్ లో జరిగిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. బస్సు నదిలో పడిపోవడంతో 26 మంది మృతి చెందగా 10 మందికి గాయాలయ్యాయి. ప్రమాదంపై రాజస్థాన్ సర్కార్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియచేస్తున్నట్లు వెల్లడించింది.

డిచ్ పల్లిలో గ్యాస్ సిలిండర్ల పేలుడు..

నిజామాబాద్ : డిచ్ పల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ షాపులో చిన్న సిలిండర్లు పేలిపోయాయి. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. అక్రమంగా గ్యాస్ నింపుతుండడంతోనే ఈ ఘటన చోటు చేసుకుందని తెలుస్తోంది. పేలుడు శబ్దంతో జనాలు పరుగులు తీశారు. 

దళిత మహిళపై దాడిపై పవన్ స్పందన...

విశాఖపట్టణం : పెందుర్తిలో ఓ దళిత మహిళను అందరూ చూస్తుండగా చీరను చింపి అవమానించిన ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి ఏపీ ప్రభుత్వం నుంచి ప్రజలు వివరణ కోరుతున్నారని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. ఈ దారుణానికి ఒడిగట్టిన నేరస్తులపై పోలీసులు, ప్రభుత్వం ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని... దీనివల్ల ప్రజల్లోకి చెడు సంకేతాలు వెళతాయని అన్నారు. 

జగన్ 42వ రోజు..

అనంతపురం: వైసీపీ అధ్యక్షుడు జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర 42వ రోజుకు చేరుకుంది. శనివారం ఉదయం బుక్కపట్నం మండలం బొగ్గాలపల్లి నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడ నుంచి ప్రజాసంకల్పయాత్ర కదిరి నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది.

సోమ్ నాథ్ ఆలయానికి రాహుల్..

గుజరాత్ : ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమ్ నాథ్ ఆలయాన్ని సందర్శించనున్నారు. ఇటీవలే ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ ఎమ్మెల్యేలతో ఆయన సమావేశమయ్యేందుకు గుజరాత్ వచ్చారు. 

10:31 - December 23, 2017

న్యూఢిల్లీ : మొన్న 2 జి స్కాం తీర్పు వచ్చేసింది..ఆదర్శ్ స్కాంలపై కూడా తీర్పులు వచ్చేశాయి. అందులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ఊరట లభించే తీర్పులు వచ్చాయి. తాజాగా 'దాణా' స్కాం పై కూడా తీర్పు రాబోతోంది. ఈ తీర్పు కూడా అదే విధంగా ఉంటుందా ? లేదా ? అనేది కాసేపట్లో తేలనుంది. సీబీఐ స్పెషల్ కోర్టు కాసేపట్లో శివపాల్ సింగ్ న్యాయమూర్తి వెలువరించనున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ భవితవ్యం ఏంటో ఈ తీర్పు నిర్ణయించనుంది.

25 సంవత్సరాల నుండి ఈ కేసు విచారణ జరుగుతోంది. 1991-94 మధ్యకాలంలో దియోగఢ్ (ఇప్పుడు దియోగఢ్ జార్ఖండ్ లో ఉంది) ట్రెజరీ నుండి దాణా కోసం రూ. 89 లక్షలను ఫోర్జరీ సంతకాలు చేసి డ్రా చేసినట్లు లాలూతో పాటు 34 మందిపై కేసులు నమోదు చేశారు. సీబీఐ అధికారులు దీనిపై విచారణ చేపట్టారు. 1997 అక్టోబర్ 27న సీబీఐ ఛార్జీషీట్ దాఖలు చేసింది. విచారణ సమయంలో 11 మంది చనిపోగా ముగ్గురు అప్రూవల్ గా మారిపోయారు. తీర్పు సందర్భంగా లాలూ పలు వ్యాఖ్యలు చేశారు. ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని..బీజేపీ కావాలనే తనను టార్గెట్ చేస్తోందని పేర్కొంటున్నారు. మరి లాలూతో పాటు జగన్నాథమిశ్రాలపై ఎలాంటి తీర్పు వస్తుందో వేచి చూడాలి. 

10:10 - December 23, 2017

రాజస్థాన్ : సవాయో మాధోపూర్ లో ఘోరమైన దుర్ఘటన సంభవించింది. ప్రమాదవశాత్తు ఓ బస్సు వంతెన పై నుండి నదిలోకి పడిపోవడంతో 12 మంది మృత్యువాత పడ్డారు. సమాచారం తెలుసుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. పలువురు గల్లంతయినట్లు తెలుస్తోంది. శనివారం ఓ బస్సు ప్రయాణీకులతో వెళుతోంది. మాధోపూర్ లోని దుబి వద్దనున్న ఓ వంతెన పై నుండి వెళుతోంది. ప్రమాదవశాత్తు అదుపు తప్పడంతో నదిలోకి పడిపోయింది. బస్సుపై 30 మీటర్ల పై నుండి కింద పడిపోవడంతో ప్రమాద తీవ్రత అధికంగా ఉంది. అంతే గాకుండా నదిలో నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో ప్రయాణీకులు ఊపిరిపీల్చుకోవడంలో కష్టం కావడంతో దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. నదిలో నుండి బస్సును వెలికి తీశారు. గాయాలపాలైన 24 మందిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్ కూడా మృతి చెందినట్లు సమాచారం. 

జంపన్న..రజిత లొంగుబాటు..

ఛత్తీస్ గడ్ : మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు జంపన్న అతని భార్య రజితలు లొంగిపోయారు. జంపన్నపై రూ. కోటి రివార్డు ఉంది. ఆంధ్ర - ఒడిషా స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడిగా జంపన్న వ్యవహరిస్తున్నారు. 

పట్టాలు తప్పిన రాయలసీమ ఎక్స్ ప్రెస్...

నిజామాబాద్ : ఇందల్వాయి (మం) సిర్నాపల్లిలో రాయలసీమ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. 

రాజస్థాన్ లో ఘోర ప్రమాదం...

రాజస్థాన్ : రాష్ట్రంలో ఘోర ప్రమాదం సంభవించింది. సవాయ్ మదోపూర్ లోని దుబి వద్ద ఓ బస్సు బ్రిడ్జిపై నుండి నదిలోకి పడిపోయింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు. మరో 24 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. 

గుజరాత్ కు రాహుల్...

గుజరాత్ : ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గుజరాత్ కు రానున్నారు. ఇటీవలే జరిగిన ఎన్నికల్లో గెలిచిన పార్టీ ఎమ్మెల్యేలతో ఆయన సమావేశం కానున్నారు. 

08:24 - December 23, 2017
08:23 - December 23, 2017

హైదరాబాద్ : తెలంగాణ పోలీసుల్లో కొంతమంది రాష్ట్ర..ఖాకీ..పరువు తీస్తున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అని సర్కార్ చెబుతున్నా..పలు ఘటనలు అది నిజం కాదని నిరూపిస్తున్నాయి. తాజాగా ఓ షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ చేసిన ఫిర్యాదుపై డీసీపీ వీరంగం సృష్టించాడు. ఏకంగా ఫిల్మ్ డైరెక్టర్ ను పీఎస్ లోనే లాగి కొట్టి...తన్నాడు..ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

తనను ఫిల్మ్ డైరెక్టర్ యోగి డబ్బులు ఇవ్వకుండా వేధిస్తున్నాడంటూ గచ్చిబౌలి పీఎస్ లో షార్ట్ ఫిల్మ్ హీరోయిన హరిక ఫిర్యాదు చేసింది. దీనిపై మాదాపూర్ అడిషినల్ డీసీపీ గండిరెడ్డి ఆ డైరెక్టర్ ను పీఎస్ కు పిలిపించారు. స్టేషన్ లో 'నిన్ను ఎవడూ తన్నలేదా..ఎక్కడుంటవురా' అంటూ తన్ని..చెంపపై లాగిపెట్టి కొట్టాడు. డీసీపీ వీరంగం దృశ్యాలు బయటకొచ్చాయి. తాను ఎలాంటి బాకీ పడలేదని యోగి పేర్కొంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం డీసీపీ వీరంగానికి సంబంధించని దృశ్యాలు వైరల్ అవడంతో పోలీసు ఉన్నతాధికారులు స్పందించే అవకాశం ఉంది. ఫిల్మ్ డైరెక్టర్ యోగి కూడా మీడియా ముందుకొచ్చే అవకాశం ఉంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియనున్నాయి. 

డీసీపీ గంగిరెడ్డి వీరంగం...

హైదరాబాద్ : గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో మాదాపూర్ అడిషనల్ డీసీపీ గంగిరెడ్డి వీరంగం సృష్టించారు. ఫిల్మ్ డైరెక్టర్ యోగిని బూటు కాలితో గంగిరెడ్డి తన్నాడు. వీడియోలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. యోగి వేధిస్తున్నాడంటూ ఫిల్మ్ హీరోయిన్ హారిక ఫిర్యాదు చేసింది. యోగిని స్టేషన్ పిలిచి వీరంగం సృష్టించాడు. 

07:27 - December 23, 2017

ప్రధాని నరేంద్రమోది, బిజెపి నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ధ్వజమెత్తారు. బిజెపి ఫౌండేషనే ఓ అబద్ధాల పుట్ట అని మండిపడ్డారు. రాహుల్‌ గాంధీ నేతృత్వంలో తొలిసారిగా కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం పలు అంశాలపై చర్చించింది. 2జీ కేసులో తీర్పు, పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న తీరుపై సిడబ్లుసి చర్చించింది. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో వినయ్ కుమార్ (విశ్లేషకులు), మాధవి (బీజేపీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

07:20 - December 23, 2017

జగన్ పాదయాత్ర...

అనంతపురం : వైసీపీ అధ్యక్షుడు జగన్ పాదయాత్రను మళ్లీ కొనసాగించనున్నారు. శుక్రవారం కోర్టుకు హాజరైన సంగతి తెలిసిందే. నల్లమాడ నుండి పాదయాత్ర కొనసాగనుంది. 

నగరానికి ఉప రాష్ట్రపతి...

హైదరాబాద్ : నగరంలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పంజాగుట్ట, బంజారాహిల్స్, బేగంపేట, తార్నాకాలో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. 

దాణా కేసులో తీర్పు..

బీహార్ : దాణా కేసులో నేడు సీబీఐ కోర్టు తీర్పు చెప్పనుంది. దాణా కేసులో మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్, జగన్నాథమిశ్రాలపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే.

 

నల్గొండలో టీజేఏసీ అమరుల స్పూర్తి యాత్ర...

నల్గొండ : నేడు జిల్లాలో రెండో రోజు టీజేఏసీ అమరుల స్పూర్తి యాత్ర కొనసాగనుంది. టీజేఏసీ ఛైర్మన్ కోదండరాం యాత్రలో పాల్గొంటున్నారు. 

శామిర్ పేట మండలంలో రోడ్డు ప్రమాదం...

మేడ్చల్ : శామిర్ పేట మండలంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు యువతులు దుర్మరణం చెందగా మరొకరికి గాయాలయ్యాయి. 

06:48 - December 23, 2017

ఢిల్లీ : ఇండోర్‌ టీ -20 మ్యాచ్‌లోనూ టీమ్‌ ఇండియా జోరు కొనసాగింది. హోల్కార్‌ స్టేడియం వేదికగా జరిగిన రెండో టీ -20లో భారత్‌ శ్రీలంకను చిత్తు చేసింది. 88 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు టీ -20ల సిరీస్‌ను 2-0తో టీమ్‌ ఇండియా కైవసం చేసుకుంది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ ఇండియా మొదటి నుంచీ దూకుడు ప్రదర్శించింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌ టీమ్‌ ఇండియాకు శుభారంభం అందించారు. రోహిత్‌ శర్మ 118 రన్స్‌తో చెలరేగగా.... రాహుల్‌ 89 రన్స్‌తో ఆదుకున్నాడు. దీంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. తొలుత 23 బందుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో హాఫ్‌ సెంచరీ సాధించిన రోహిత్‌.. ఆ తర్వాత మరో 12 బాల్స్‌లోనే మిగతా యాభై పరుగులు పూర్తి చేశాడు. 35 బంతుల్లో 11బౌండరీలు, 8 సిక్సర్లతో సెంచరీ సాధించి అంతర్జాతీయ టీ -20ల్లో ఫాస్టెస్ట్‌ సెంచరీ సాధించిన రికార్డు సమం చేశాడు. 108 రన్స్‌ను రోహిత్‌ కేవలం ఫోర్లు, సిక్సర్ల రూపంలోనే రాబట్టాడు.

జట్టు స్కోరు 165 పరుగుల వద్ద రోహిత్‌ ఔటయ్యాడు. ఆ తర్వాత రాహుల్‌ హాఫ్‌ సెంచరీ చేశాడు. జట్టు స్కోరు 243 రన్స్‌ దగ్గర రాహుల్‌ పెవిలియన్‌ చేరాడు. ధోనీ కూడా సొగసైన షాట్లతో అలరించాడు. 20 ఓవర్లలో టీమ్‌ ఇండియా 5 వికెట్లు కోల్పోయి 260 పరుగులు చేసింది.

భారత్‌ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక అత్యంత దూకుడుగా ఆడింది. తొలి వికెట్‌ను 36రన్స్‌ దగ్గర కోల్పోయిన లంక... ఆపై విజృంభించింది. తరంగా, కుశాల్‌ పెరీరా బౌండరీల మోత మోగించారు. ఈ జోడీకి జట్టు స్కోరు 145 రన్స్‌ దగ్గర చాహల్‌ బ్రేక్‌ ఇచ్చాడు. తరంగాను అవుట్‌ చేసి టీమ్‌ ఇండియా శిబిరంలో జోష్‌ నింపాడు. ఆ తర్వాత కుల్దీప్‌ వేసిన 15 ఓవర్‌లో లంక మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ ఓవర్‌ తొలి బంతికి కెప్టెన్‌ తిషాల్‌ పెరీరా, ఆ తర్వాత బంతికి కుశాల్‌ పెరీరా ఔటయ్యాడు. ఇక ఐదో బంతికి గుణరత్నేను కూడా పెవిలియన్‌కు పంపాడు. దీంతో 161 పరుగులకు లంక 5 కీలక వికెట్లు చేజార్చుకుంది.

తర్వాతి ఓవర్‌ను వేసిన చాహల్‌ వరుస బంతుల్లో చతురగ డిసిల్వా, సమరవిక్రమను అవుట్‌ చేశాడు. ఆ ఓవర్‌ ఐదో బంతికి అకిల ధనంజయను పెవిలియన్‌ పంపాడు. ఈ రెండు ఓవర్లలో శ్రీలంక ఆరు వికెట్లు కోల్పోయింది. అప్పటి వరకు ఉత్కంఠను రేపిన మ్యాచ్‌ కాస్తా ఏకపక్షంగా మారిపోయింది. దీంతో 172 పరుగులకు శ్రీలంక ఆలౌట్‌ అయ్యింది. భారత బౌలర్లలో చాహల్‌ 4 వికెట్లు తీయగా.. కుల్దీప్‌ మూడు వికెట్లు పడగొట్టాడు. హార్థిక్‌, ఉనద్కట్‌ చెరో వికెట్‌ తీశారు. 118రన్స్‌ చేసి టీమ్‌ ఇండియా విక్టరీలో కీలకపాత్ర పోషించిన రోహిత్‌శర్మకు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. ఇండోర్‌ విజయంతో మూడు టీ-20ల సిరీస్‌ను భారత్‌ 2-0 తేడాతో కైవసం చేసుకుంది.

06:42 - December 23, 2017

యాదాద్రి భువనగిరి : పిల్లాపాపలతో ఆనందంగా ఉండే కుటుంబం .. తెల్లవారేసరికి విగతజీవులుగా మారారు. ఇద్దరు చిన్నారులు సహా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందడం యాదాద్రి జిల్లా రాజపేటలో కలకలం రేపింది. సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ మండలం మునిగడప గ్రామానికి చెందిన దుబ్బాసి బాలరాజు - తిరుమల దంపతులు కొద్ది రోజుల క్రితం రాజపేటలోని కోళ్లఫారంలో పనికి కుదిరారు. వీరికి ఇద్దరు కుమారులు చింటూ, బన్నీ . రెండు రోజుల క్రితం బాలరాజు అత్తామాలు.. బాలనర్సయ్య, భారతమ్మ కూతురును, మనవళ్లను చూడ్డానికి ఇక్కడికి వచ్చారు. కాగా శుక్రవారం తెల్లవారుజామున కుటుంబసభ్యులందరూ ఒకేసారి చనిపోవడం స్థానికంగా కలకలం రేపింది.

అయితే బాలరాజు కుటుంబసభ్యుల మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది ఆత్మహత్యకాదని ..ఎవరో హత్యచేసి ఇలా ఆత్మహత్యగా చిత్రీకరించారంటున్నారు. ఆహారంలో విషం కలిపి అందరినీ హతమార్చి ఉంటారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే కోళ్ల ఫారం యజమాని మాత్రం మృతుడు బాలరాజు మూర్చవ్యాధితో బాధపడేవాడని.. ఇంకా పలు అనారోగ్య కారణాలతోనే కుటుంబం యావత్తు ఆత్మహత్యకు పాల్పడిందనే వాదన వినిపిస్తున్నారు. కాగా బాలరాజు కుటుంబానికి అప్పులు ఉన్నాయని మృతుల బంధువులు అంటున్నారు.. అప్పుల బాధతోనే కుటుంబ సభ్యులందరూ ఆత్మహత్య చేసుకున్నారని చెబుతున్నారు.

అయితే పోస్టుమార్టం అనంతరం డాక్టర్లు మరో కొత్త విషయం చెబుతున్నారు. చలికాలం కావడంతో గదిలో పెట్టుకున్న నిప్పుల కుంపటితోనే ప్రమాదం ముంచుకొచ్చిందంటున్నారు. ఏడుగురూ చిన్న గదిలోనే పడుకోవడం.. దాంతోపాటు నిప్పుల కుంపటి నుంచి కార్పన్‌డైయాక్సైడ్‌, కార్పన్‌మోనాక్సైడ్‌ రిలీజ్‌ అయి .. గదిలో ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోయాయంటున్నారు. ప్రధానంగా కార్పన్‌ మోనాక్సైడ్‌ వల్లే వారికి తెలియకుండానే మృత్యుఒడిలోకి చేరిపోయి ఉంటారని డాక్టర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం పోర్టుమార్టం నమూనాలను ఫోరెన్సిక్‌ పరిక్షలకు పంపిచారు. ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్టు వచ్చిన తర్వాతే ఏ విషయం బయటికి వచ్చే అవకాశం ఉందంటున్నారు. మొత్తానికి అప్పులబాధలు, కుటుంబ కలహాలు, విషప్రయోగం, నిప్పులకుంపటి నుంచి వెలువడిన విషవాయువులు.. ఇలా.. ఇప్పటికైతే అన్నీ అనుమానాలే ఉన్నాయి. మరోవైపు కోళ్లఫారం యజమాని నాగభూషణంపై అనుమానితుడిగా కేసునమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏదిఏమైనా ఫోరెన్సిక్‌ రిపోర్టు వచ్చిన తర్వాతే ఈ డెత్‌ మిస్టరీకి సమాధానం వచ్చే అవకాశం ఉంది. 

06:40 - December 23, 2017

హైదరాబాద్ : ప్రేమోన్మాదానికి మరో యువతి బలైంది. ప్రేమించలేదన్న అక్కసుతో సికింద్రాబాద్‌ లాలాగూడకు చెందిన సంధ్యారాణిపై.. కార్తీక్‌ పెట్రోలు పోసి నిప్పటించిన కేసులో బాధితురాలు గాంధీ ఆస్పత్రిలో ప్రాణాలు తుదిశ్వాస విడిచింది. కార్తీక్‌ను అరెస్టు చేసిన పోలీసులు... కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కార్తీక్‌ అనే జులాయి.. గురువారం సాయంత్రం.. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే.. పెట్రోలు పోసి నిప్పంటించడంతో.. తీవ్ర గాయాలపాలైన సంధ్యారాణి.. శుక్రవారం ఉదయం గాంధీ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచింది. ఏడో తరగతి వరకు చదివిన కార్తీక్‌ జులాయిగా తిరుగుతూ ఏడాది కాలంగా సంధ్యారాణిని ప్రేమ పేరిట వేధిస్తూ వస్తున్నాడు.

గురువారం సాయంత్రం తను పనిచేస్తున్న దుకాణంలో.. విధులు ముగించుకుని తిరిగివెళ్తుండగా.. ముందుస్తు పథకం ప్రకారం కార్తీక్‌ వెంబడించి. తన ప్రేమ విషయాన్ని మళ్లీ ప్రస్తావించాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. దీంతో కార్తీక్‌ తన వెంట తెచ్చుకున్న పెట్రోలును సంధ్యారాణిపై నిప్పటించి పారిపోయాడు. ఈ ఘటనలో 64 శాతం కాలిన గాయాలతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సంధ్యారాణి ప్రాణాలు కోల్పోయింది.

సంధ్యారాణి మృతితో... కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎదిగొచ్చిన కూతురు పేదరికంలో ఉన్నకుటుంబాన్ని అదుకొంటుందని ఆశించిన సమయంలో ఈ దారుణం జరిగిందని సంధ్యారాణి తల్లి సావిత్రి గుండలవిసేలా రోధిస్తున్నారు. ప్రేమోన్మాది దాడిలో కూతురును పోట్టుకున్న సంధ్యారాణి తల్లిని సావిత్రిని ఓదార్చడం ఎవరితరం కాలేదు. ప్రేమ పేరుతో సంధ్యారాణిని వేధిస్తున్న విషయం తన దృష్టికి రాలేదని, వస్తే ఇంత దారుణం జరిగి ఉండేదికాదని బాధితురాలి తల్లి సావిత్రి, ఇతర కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. సంధ్యారాణి మృతికి కారణమైన కార్తీక్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడిపై ఐపీసీలోని 307, 354(డీ) సెక్షన్లతోపాటు ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింది కేసు నమోదు చేశారు.

గాంధీ ఆస్పత్రిలో సంధ్యారాణి మృతదేహాన్ని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ పరిశీలించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం, సంధ్యారాణి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందచేశారు. బంధుమిత్రుల అశ్రునయనాల మధ్య సంధ్యారాణి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. రాష్ట్ర పాడిపరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తదితరులు అంత్యక్రియలకు హాజరయ్యారు. 

06:36 - December 23, 2017

హైదరాబాద్ : ఇంటర్నెట్‌ మూవీ డేటా బేస్‌లో పది భారతీయ సినిమాలు సత్తాచాటాయి. కోలీవుడ్‌ మూవీస్‌ విక్రమ్‌ వేధ' తొలిస్థానంలోనిలవగా రెండు, మూడు స్థానాల్లో 'బాహుబలి: ది కన్‌క్లూజన్‌', 'అర్జున్‌రెడ్డి' చిత్రాలు నిలిచాయి. ఐఎండీబీ- 2017జాబితాలో 10 భారతీయ సినిమాలు టాప్‌ ప్లేస్‌లో నిలిచాయి. కోలీవుడ్‌ మూవీ 'విక్రమ్‌ వేధ' అరుదైన ఘనత సాధించింది. విజయ్‌ సేతుపతి, మాధవన్‌ ప్రధాన తారాగణంగా నటించిన 'విక్రమ్‌ వేధ' తొలిస్థానంలో నిలిచింది. ఇక రెండు, మూడు స్థానాల్లో 'బాహుబలి: ది కన్‌క్లూజన్‌', 'అర్జున్‌రెడ్డి' చిత్రాలు ఉన్నాయి. తొలి మూడు స్థానాల్లో దక్షిణభారత చిత్ర పరిశ్రమకు చెందిన సినిమాలు ఉండటం ఈసారి విశేషం. 2017లో ప్రజలకు బాగా చేరువైన టాప్‌ 10 భారత సినిమాల జాబితాను ఐఎండీబీ ప్రకటించింది.

ఇక టాప్‌ టెన్‌లో ఇతర మూవీలు.. 4వస్థానంలో సీక్రెట్‌ సూపర్‌స్టార్‌, 5 హిందీ మీడియం, 6వస్థానంలో ఘాజీ మూవీ నిలవగా , సెవెన్త్‌ ప్లేస్‌లో టాయిలెట్‌ ఏక్‌ప్రేమ్‌కథ, 8 జాలీ ఎల్‌.ఎల్‌.బి, 9వ ప్లేస్‌లో మెర్సల్‌.. ఇక పదవ స్థానంలో ది గ్రేట్‌ ఫాదర్ మూవీస్‌ నిలిచాయి. ఇక నటుల విషయానికి వస్తే .. మొదటి రెండు స్థానాల్లో సల్మాన్‌ఖాన్‌, షారుక్‌ఖాన్‌ నిలిచారు. ఇటు దక్షిణభారత చిత్రపరిశ్రమ నుంచి తమన్నా, ప్రభాస్‌, అనుష్క.. వరుసగా 4,6,8 స్థానాల్లో చోటు దక్కించుకున్నారు. ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా ఈ సినిమాలకు స్థానాల్ని నిర్ణయించించినట్టు ఐఎండీబీ ప్రకటించింది. 

06:34 - December 23, 2017

ఢిల్లీ : ఫోర్బ్స్‌ సంపాదనాపరులు జాబితాలో మన క్రీడాకారులు సత్తాచాటారు. 2017లో టాప్‌ 100లో 21 మంది క్రీడాకారులే ఉన్నారు. విరాట్‌ కోహ్లీ, మహేంద్రసింగ్‌ ధోని ఆటగాళ్లలో టాప్‌ ప్లేస్‌లో నిలిచారు. కాగా ఓవరాల్‌ జాబితాలో మొదటి రెండు స్థానాల్లో బాలీవుడ్‌ స్టార్స్‌ సల్మాన్‌, షారూక్‌ నిలిచారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఆదాయం తగ్గినప్పటికీ టీమిండియా కెప్టెన్‌ కోహ్లీ టాప్‌-3లో నిలిచాడు. గత ఏడాది అతని ఆదాయం రూ.134. 44 కోట్లు కాగా ఈ ఏడాది అది రూ.100.72 కోట్లకు పడిపోయింది. క్రీడాకారుల జాబితాను మాత్రమే పరిగణలోనికి తీసుకుంటే కోహ్లీ అందరికంటే ముందున్నాడు.కోహ్లీ తర్వాత 82.5కోట్లతో సచిన్‌, 63.77 కోట్లతో ధోనీ నిలిచారు. అటు ఒలింపిక్స్‌ రజతపతక విజేత పీవీ సింధు 57.25కోట్లతో ఓవరాల్‌గా 13వ స్థానంలోనూ, క్రీడాకారుల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది. కాగా ఓవరాల్‌ జాబితాలో బాలీవుడ్ స్టార్స్‌ సల్మాన్‌ నెంబర్‌ వన్‌గా, షారూక్‌ రెండో స్థానంలో నిలిచారు. 

06:30 - December 23, 2017

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ క్రైస్తవ సోదరులకు వరాలు ప్రకటించారు. రాష్ట్రంలో పాత చర్చిల రిపేర్లు, కొత్త చర్చిల నిర్మాణానికి పది కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. హైదరాబాద్‌లో జరిగిన క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్న కేసీఆర్‌... కేక్‌ కట్ చేశారు. ఈ సందర్భంగా క్రైస్తవులకు సందేశమిస్తూ... జెరూసలెం వెళ్లే క్రైస్తవుల వసతికి సబ్సిడీ ఇస్తామని హామీ ఇచ్చారు. వచ్చే క్రిస్మస్‌ నాటికి క్రైస్తవ భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తామని, దీనిపై ఉన్నకోర్టు కేసు పరిష్కారమయ్యే విధంగా వ్యక్తగత శ్రద్ధ తీసుకుంటానని చెప్పారు. స్మశానాల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని రకాల అనుమతులు ఇస్తూ కేంద్ర నిర్ణయం తీసుకుందని ఈ సందర్భంగా కేసీఆర్‌ చెప్పారు. 

06:28 - December 23, 2017

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వానికి కొత్త కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికే నిరుద్యోగుల నిరసనలతో సతమతవుతోన్న టీఆర్‌ఎస్‌ సర్కార్‌కు... ఇప్పుడు కొత్త కష్టాలు ప్రారంభమయ్యాయి. ఒకవైపు సీఎం కేసీఆర్‌ అన్ని వర్గాల ప్రజలను సంతృప్తి పరిచేందుకు చర్యలు తీసుకుంటున్నారని నేతలు చెబుతోంటే.. అందుకు భిన్నంగా అన్ని వర్గాల నుంచి అసంతృప్తులు రాజుకుంటున్నాయి. ఇప్పటికే ఎస్టీల్లో చిచ్చు రాజుకుంది. అటు ఆదివాసీలు, ఇటు గిరిజనులు హక్కుల పేరుతో ప్రభుత్వంపై పోరుకు రెడీ అవుతున్నారు. ఎవరికి వారే తమకు న్యాయం కావాలంటూ భాగ్యనగరంలో భారీ సభలు నిర్వహించారు. ఈ వ్యవహారంతో తల బొప్పికట్టిన అధికారపార్టీకి.. ఇప్పుడు మరో చిక్కు వచ్చి పడింది. ఎస్సీ వర్గీకరణ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది.

గిరిజనుల రిజర్వేషన్లను 12శాతానికి పెంచుతామంటూ ప్రభుత్వం ప్రకటనలు చేస్తోంది. అయితే ఎస్టీలు ఇప్పుడు రెండు వర్గాలుగా చీలి పోయారు. బలనిరూపణ చేసుకునే పనిలో పడ్డారు. లంబాడాలను గిరిజనుల జాబితా నుంచి తొలగించాలన్న డిమాండ్‌ తీవ్ర రూపం దాల్చింది. ఈ వ్యవహారం ఆదివాసీలు, లంబాడీల మధ్య ప్రత్యక్ష దాడులకు దారి తీసింది. దీంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు సీఎం కేసీఆర్‌ రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఆదివాసీ నేతలుగా అధికార పార్టీ తరపున ప్రాతినిథ్యం వహిస్తోన్న ఎంపీ నగేష్‌, ఎమ్మెల్యే కోవా లక్ష్మిని తీవ్రంగా మందలించి లంబాడీలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాన్ని ఆపే బాధ్యతను ఉంచినట్టు తెలుస్తోంది.

ఒకవైపు ఎస్టీల సమస్య సమసిపోకముందే... ఎస్సీ వర్గీకరణ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఎస్సీ వర్గీకరణకు జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ ఎంఆర్‌పీఎస్‌ చేస్తున్న ఆందోళనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మందకృష్ణ మాదిగ అరెస్ట్‌ తర్వాత గులాబీ నేతలకు క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తప్పడం లేదు. మంత్రి తుమ్మల కాన్వాయ్‌పై ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు రాళ్లవర్షం కురిపించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై అఖిలపక్ష నేతలను ఢిల్లీకి తీసుకెళ్లడంలో సీఎం కేసీఆర్‌ నిర్లక్ష్యం చేస్తున్నారన్నది ఎమ్మార్పీఎస్‌ ప్రధాన ఆరోపణ. ప్రతిపక్ష పార్టీలు మాదిగల ఉద్యమానికి మద్దతు తెలపడంతో గులాబీపార్టీ మెడకు ఉచ్చు బిగిసేలా కనిపిస్తోంది.

టీఆర్‌ఎస్‌ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన మైనార్టీ రిజర్వేషన్ల పెంపు హామీపైనా వివాదాలు చుట్టుముట్టే అవకాశం కనిపిస్తోంది. తీవ్రమవుతున్న ఉద్యమాలను ఎలా కట్టడి చేయాలో తెలియక గులాబీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. అయితే ముఖ్యమంత్రి కేసిఆర్ రంగంలోకి దిగితే ఆ సమస్యలకు పరిష్కారం దక్కుతుందన్న ధీమాను గులాబి నేతలు వ్యక్తం చేస్తున్నారు.

బాబా సెక్స్ రాకెట్ గుట్టు రట్టు...

ఢిల్లీ : డేరా సచ్చా సౌదా గుర్మీత్‌ బాబాను ఇంకా మరవక ముందే ఢిల్లీలో బాబా వీరేంద్ర దేవ్‌ దీక్షిత్‌ రాసలీలల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆధ్మాత్మిక విశ్వవిద్యాలయం పేరిట కొన్నేళ్లుగా బాబా సాగిస్తున్న సెక్స్‌ రాకెట్‌ గుట్టు రట్టయ్యింది. ఒకరు కాదు...ఇద్దరు కాదు....వంద మందికి పైగా మహిళలను ఆశ్రమంలో బంధించి నరకం చూపుతున్నట్లు వెల్లడైంది..

గుజరాత్ సీఎంగా...

గుజరాత్ : రాష్ట్ర ముఖ్యమంత్రిగా విజయ్‌ రూపాని మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. బిజెపి శాసనసభాపక్షం విజయ్‌ రూపానీని ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఉపముఖ్యమంత్రిగా నితిన్‌ పటేల్‌కు మరో అవకాశం కల్పించింది. 

హిమాచల్ ప్రదేశ్ సీఎం ఎవరు ?

ఢిల్లీ : హిమాచల్‌ ప్రదేశ్‌లో అధికారాన్ని చేజిక్కించుకున్న బీజేపీకి ముఖ్యమంత్రిగా ఎవరిని పెట్టాలనే విషయంలో తర్జన భర్జన పడుతోంది. సీఎం ఎంపికపై సమావేశం జరుపుతున్న బిజెపి పరిశీలన బృందానికి పార్టీ కార్యకర్తల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురవుతోంది.  

పాక్ కు రావత్ షరతు..

ఢిల్లీ : భారత్‌తో శాంతి చర్చలు జరపడానికి ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ పాకిస్తాన్‌కు షరతు విధించారు. పాకిస్తాన్‌ తక్షణమే జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం నిలిపి వేయాలన్నారు. ఉగ్రవాదానికి పాకిస్తాన్‌ మద్దతు ఇవ్వడం మానుకుంటేనే.. ఇరు దేశాల మధ్య చర్యలు సాధ్యమవుతాయని ఆయన స్పష్టం చేశారు. 

రాజ్యసభలో మారని తీరు...

ఢిల్లీ : రాజ్యసభ ఆరవరోజు కూడా వాయిదా పడ్డాయి. మన్మోహన్‌కు ప్రధాని క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లారు. దీంతో రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు సభను బుధవారానికి వాయిదా వేశారు. 

చవాన్ కు ఊరట...

ఢిల్లీ : ఆదర్శ్‌ కుంభకోణంలో కాంగ్రెస్‌ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ చవాన్‌కు ముంబై హైకోర్టులో ఊరట లభించింది. ఆదర్శ్‌ హౌసింగ్‌ సొసైటీ స్కాం కేసులో చవాన్‌ను ప్రాసిక్యూట్‌ చేసేందుకు మహారాష్ట్ర గవర్నర్‌ ఇచ్చిన అనుమతిని హైకోర్టు రద్దు చేసింది. 

అమెరికాకు ఘోర పరాజయం..

ఢిల్లీ : ఐక్యరాజ్యసమితిలో అమెరికాకు ఘోర పరాజయం ఎదురైంది. ఇజ్రాయెల్ రాజధానిగా జెరుసలెంను గుర్తిస్తూ అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని ఐక్యరాజ్యసమితి వ్యతిరేకించింది. ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చేసిన తీర్మానానికి భారత్‌తో సహా 128 దేశాలు మద్దతు తెలిపాయి. కేవలం 9 దేశాలు మాత్రమే అమెరికాకు మద్దతుగా నిలిచాయి. 35 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి.

Don't Miss