Activities calendar

24 December 2017

21:46 - December 24, 2017

మనీలా : ఓ పక్క భారీ తుపానుతో ఫిలిప్పీన్స్‌ దేశం వణికిపోతుంటే... మరోపక్క ఓ షాపింగ్‌మాల్‌లో జరిగిన అగ్నిప్రమాదం 37 మందిని బలితీసుకుంది. మనీలాలోని ఓన్సీసీ మాల్‌లోని ఫర్నీచర్‌ దుకాణంలో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు క్షణాల్లో పైఅంతస్తు వరకు వ్యాపించడంతో 37 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెప్తున్నారు. ప్రమాదానికి కారణాలు తెలుసుకునే పనిలో అధికారులు ఉన్నారు. సమాచారం తెలుసుకున్న ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు రోడ్రిగో ద్యుతర్తే కుమార్తె, నగర మేయర్‌ సారా ఘటనాస్థలిని పరిశీలించారు.

21:45 - December 24, 2017

కరీంనగర్ : టీఆర్‌ఎస్‌ పాలనను టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ తీవ్రంగా విమర్శించారు.తెలంగాణలో టీఆర్‌ఎస్‌ పాలన మేడిపండు చందంగా ఉందని పొన్నాల లక్ష్మయ్య అన్నారు. కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. సైన్స్‌ కాంగ్రెస్‌ నిర్వహించకపోవడం తెలంగాణ ప్రభుత్వ వైఫల్యమే అన్నారు. దేశంలో రైతు ఆత్మహత్యల నివారణకు ఈ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని పొన్నాల ప్రశ్నించారు. ఫామ్‌ హౌస్‌కు-ప్రగతిభవన్‌ మధ్య పాలన సాగుతోందని దుయ్యబట్టారు. విభజన హామీ గురించి పార్లమెంట్‌లో చర్చించారా..? అని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ప్రశ్నించారు. నియోజకవర్గాల పునర్విభజన తప్ప మరో అంశంపై దృష్టి పెట్టడంలేదని ఆయన అన్నారు. బీజేపీతో కుమ్మక్కై టీఆర్‌ఎస్‌ విభజన హామీల గురించి పట్టించుకోవడం లేదని పొన్నం మండిపడ్డారు.

21:44 - December 24, 2017

హైదరాబాద్ : విశిష్ట అతిథులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో రాజ్‌భవన్‌ కళకళలాడింది. శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ హైదరాబాద్‌ వచ్చిన సందర్భంగా... ఆయన గౌరవార్థం గవర్నర్‌ రాజ్‌భవన్‌లో విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి దంపతులు రాగా వారికి గవర్నర్‌ దంపతులు ఆత్మీయ స్వాగతం పలికారు. ఆ తర్వాత ప్రముఖులందరినీ గవర్నర్‌ నరసింహన్‌.. రాష్ట్రపతి దంపతులకు పరిచయం చేశారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌, చంద్రబాబుతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అధికారులు విందులో పాల్గొన్నారు. పవన్‌ కల్యాణ్‌, చిరంజీవిలు ఇద్దరు చంద్రులతో భేటీ కావడం ఆసక్తి రేపుతోంది.

21:42 - December 24, 2017

చెన్నై : ఆర్కే నగర్‌ ఉప ఎన్నిక ఫలితాల ఉత్కంఠకు తెరపడింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్‌ జయకేతనం ఎగురవేశారు. 40,707 ఓట్ల భారీ మెజార్టీతో అన్నాడీఎంకే అభ్యర్థి మధుసూదనన్‌పై విజయం సాధించారు. ఇది జయలలిత మెజార్టీ కంటే ఎక్కువ. జయలలిత కంటే దినకరన్‌ 1162ఓట్లు అధికంగా సాధించి రికార్డు సృష్టించారు. పోలైన మొత్తం ఓట్లలో దినకరన్‌కు 89,013 ఓట్లు వచ్చాయి. అంటే 50.32శాతం ఓట్లు సాధించారు. ఇక అన్నాడీఎంకే తరపున బరిలో నిలిచిన మధుసూదన్‌కు 48,306 ఓట్లు వచ్చాయి. మూడో స్థానంలో డీఎంకే నిలిచింది. డీఎంకే అభ్యర్థి మరుదు గణేషన్‌కు 24,651 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో సత్తాచాటాలనుకున్న డీఎంకే డిపాజిట్‌ కోల్పోయింది. ఇక తమిళనాడులో పాగా వేయాలని భావించిన బీజేపీకి పరాభవమే మిగిలింది. బీజేపీ అభ్యర్థికి నోటాకు వచ్చిన ఓట్ల కంటే తక్కువగా వచ్చాయి. మరోవైపు దినకరన్‌ తొలి రౌండ్‌ నుంచి ఆధిక్యత ప్రదర్శించారు. అది తుది రౌండ్‌ వరకు కొనసాగింది. ఓటర్లు ఏకపక్షంగా తీర్పునిచ్చారు. దినకరన్‌ గెలుపుతో ఆయన మద్దతుదార్లు, అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. ఒకరికొకరు స్వీట్లు పంచుకున్నారు. బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.

గెలుపు ఖాయమని ముందే భావించిన దినకరన్‌
తన గెలుపు ఖాయమని ముందే భావించిన దినకరన్‌.. జయలలిత సమాధి దగ్గర ఆమెకు నివాళులు అర్పించారు. అమ్మకు అసలైన వారసుడిని తానేనని చెప్పారు. ఎంజీఆర్‌, అమ్మ ఆశీస్సులు తనకే ఉన్నాయని తెలిపారు. పళనిస్వామి ప్రభుత్వం మరో మూడు నెలల్లో కూలిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు మద్దతుగా నిలిచిన ఆర్కేనగర్‌ నియోజకవర్గ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అమ్మవారసుడిగా ఆర్కేనగర్‌ ప్రజలు తనను ఎన్నుకున్నారని... తమదే నిజమైన ఏఐఏడీఎంకే అని చెప్పారు. పార్టీ గుర్తు, పార్టీ పేరు ఎవరికి వెళ్లిందనేది ఇక్కడ విషయంకాదని... 1.5 కోట్ల కార్యకర్తలు తమతోనే ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. ఆర్కే నగర్‌ ఉప ఎన్నికలో ఓడింది డీఎంకే కాదని.... ఎన్నికల సంఘానిదే ఓటమని డీఎంకే నేత స్టాలిన్‌ అన్నారు. ఎన్నికల్లో ధన ప్రవాహానికి ఎన్నికల సంఘం అడ్డుకట్టవేయలేకపోయిందని మండిపడ్డారు. ఈసీకి ఇదొక మాయని మచ్చని అభివర్ణించారు.

జయలలిత మరణంతో ఆర్కేనగర్‌ ఉప ఎన్నిక
జయలలిత మరణంతో ఆర్కేనగర్‌ ఉప ఎన్నిక అనివార్యమైంది. అమ్మ మరణం తర్వాత మూడు వర్గాలు, ఆరు గ్రూపులుగా విడిపోయిన ఏఐడీఎంకే నేతలకు ఆర్కేనగర్‌ ఉప ఎన్నిక పెద్ద సవాల్‌గా మారింది. తొలుత రెండు గ్రూపులుగా ఉన్న పళనిస్వామి, పన్నీర్‌సెల్వం వర్గాలు ఏకమై... అన్నాడీఎంకే తరపున మధుసూదన్‌ను బరిలో దింపారు. జయలలితకు తామే అసలైన వారసులమని, అన్నాడీఎంకే ఎన్నికల గుర్తు తమకే కేటాయించాలని దినకరన్‌ వర్గం ఎన్నికల సంఘాన్ని, న్యాయస్థానాన్ని ఆశ్రయించినా ఫలితం లేకుండాపోయింది. దీంతో దినకరన్‌ బైపోల్‌లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. కుక్కర్‌ గుర్తును ఈసీ ఆయనకు కేటాయించింది. అయితే ఎన్నికల్లో జయలలిత మృతికి శశికళ కుటుంబ సభ్యులే కారణమని పన్నీర్‌సెల్వం, పళనిస్వామి వర్గీయులు విస్తృత ప్రచారం చేశారు. అమ్మ చనిపోయినప్పటి నుంచి శశిశకళ వర్గంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే పోలింగ్‌కు 24 గంటల ముందు అపోలో ఆసుపత్రిలో జయలలిత చికిత్స పొందినప్పటి దృశ్యాలు అంటూ ఓ వీడియో విడుదలయ్యింది. ఆ వీడియోలో జయలలిత ఆసుపత్రిలో జ్యూస్‌ తాగుతూ... టీవీ చూస్తున్నట్టు కనిపించారు. అమ్మ చనిపోయిన తర్వాతే ఆసుపత్రికి తీసుకెళ్లారంటూ అప్పటి వరకు ప్రచారం చేసిన మధుసూదన్‌ వర్గీయుల ఆరోపణలను దినకరన్‌ వర్గం తిప్పికొట్టింది. మొత్తంమీద పోలింగ్‌కు 24 గంటల ముందు వెట్రికేల్‌ విడుదల చేసిన అమ్మ వీడియో దినకరన్‌ విజయానికి దోహదపడిందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. 

 

21:35 - December 24, 2017

రాయలసీమను అనేక దశాబ్దలుగా ఫ్యాక్షన్ గొడలు ఉన్నాయని, ఒకరినొకరు చంపుకోవడం జరిగిందని, వారిలో మార్పు తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నామని, రాయలసీమల మార్పు వచ్చిందని టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అన్నారు. ఆయన గురించి మరిన్ని విషయాలను తెలుకునేందుకు వీడియో క్లిక్ చేయండి. 

21:19 - December 24, 2017
20:12 - December 24, 2017

తాలిపేరు ప్రాజెక్టు వద్ద ప్రమాదం

భద్రాద్రి : జిల్లా తాలిపేరు ప్రాజెక్టు వద్ద ప్రమాదం జరిగింది. ప్రాజక్టు సందర్శనకు వచ్చి స్కూల్ బస్సు బోల్తా పడింది. బూర్గంపహాడ్ మండలం లక్ష్మీపురంలోని శ్రీనివాస విద్యానేతన్ కు చెందిన బస్సు గా అధికారులు గుర్తించారు. ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. 

19:26 - December 24, 2017
19:15 - December 24, 2017
19:14 - December 24, 2017

టెంబిన్‌ తుపాను విరుచుకుపడింది. పెను విధ్వంసం సృష్టించింది. ఆ దేశంలో రెండో అతిపెద్ద ద్వీపమైన మిండనావోలో తుపాను తీవ్ర ప్రభావం చూపింది. పేదలు ఎక్కువగా నివసించే జామ్‌బోవాంగా ద్వీపకల్పం టెంబిన్‌ తుపానుకు అతలాకుతలమైంది. దక్షిణ ఫిలిప్పీన్స్‌లోని చాలా దీవులపై తుఫాను తీవ్ర ప్రభావం చూపింది. మిందనావో ప్రాంతంలోనే రెండు కోట్ల మంది ప్రజలు టెంబిన్‌తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జామ్‌బోవాంగా ద్వీపకల్పంలో వరదల ఉద్ధృతికి సాల్వడార్‌ నదిలో అనేక మంది కొట్టుకుపోయారు. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో వీచిన పెనుగాలులకు మిండనావో, పల్వాన్‌ ద్వీపాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పల్వాన్‌లో చాలా రిసార్ట్‌లు పూర్తిగా దెబ్బతిన్నాయి. టెంబిన్‌ తుపానుతో మిందనావోలోని లెనావో డెల్‌ నోర్టీ, లెనావో డెల్‌ సర్‌ ప్రాంతాలు పూర్తి ధ్వంసమయ్యాయి. రోజ్‌ నది వరదలు గ్రామాలకు గ్రామలను ముంచెత్తాయి. కొన్ని గ్రామాలు పూర్తిగా నామరూపాల్లేకుండా తుడిచిపెట్టుకోపోయాయి. టెంబిన్‌ తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఆకలి దప్పులతో అల్లాడిపోతున్నారు. సమాచారవ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైంది. రోడ్లు ధ్వంసమయ్యాయి. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో గాడాంధకారం నెలకొంది. సహాయ, పునరావాస కార్యక్రమలు అమలు చేద్దామన్నా... ఆయా ప్రాంతాలకు చేరుకునే పరిస్థితి లేదు. వాతావరణం అనుకూలిస్తే హెలికాప్టర్ల సహాయంతో ఆహారం, మంచినీటిని చేరవేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది.

ఇది రెండోసారి....
టెంబిన్‌ తుపాను ప్రభావంతో ఫిలిప్పీన్స్‌లోని చాలా ప్రాంతాల్లో బురదమట్టి పేరుకుపోయింది. వరదనీరు నిల్చిపోవడంతో అంటువ్యాధులు ప్రభలే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. పదిరోజుల వ్యవధిలో ఫిలిప్పీన్స్‌ తుపాను తాకిడికి గురికావడం ఇది రెండోసారి. కాయ్‌ తక్‌ తుపానులో మధ్య ఫిలిప్పీన్స్‌ అతలాకుతలమైన పది రోజుల్లోనే టెంబిన్‌ సంభవించడంతో ఆ దేశం ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయింది. 2013లో ఫిలిప్పీన్స్‌లో సంభవించిన హయాన్‌ తుపాను తర్వాత టెంబిన్‌ అతి భయంకరమైనదిగా భావిస్తున్నారు. హయాన్‌ తుపానులో ఐదువేల మంది ప్రాణాలు కోల్పోగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. టెంబిన్‌ తుపాను సృష్టించిన విలయం నుంచి తేరుకునేందుకు ఫిలిప్పీన్స్‌కు చాలా కాలంపట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు.  

19:13 - December 24, 2017
19:12 - December 24, 2017
19:11 - December 24, 2017

సిమ్లా : హిమాచల్‌ప్రదేశ్‌ సీఎంగా బీజేపీ సీనియర్ నేత జైరామ్ ఠాకూర్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. అయితే సీఎం అభ్యర్ధి ధుమాల్ అనూహ్యంగా ఓటమి చవి చూశారు. దీంతో అక్కడ సీఎం ఎవరనే ఉత్కంఠ ఏర్పడింది. సీఎం రేసులో కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా పేరు ప్రముఖంగా వినిపించినప్పటికీ బీజేపీ అధిష్టానం జైరామ్ ఠాకూర్‌ వైపే మొగ్గుచూపింది. 52 ఏళ్ల ఠాకూర్ గతంలో పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించారు. మంత్రిగానూ పనిచేశారు. 

19:10 - December 24, 2017
19:08 - December 24, 2017
19:07 - December 24, 2017
19:06 - December 24, 2017

అనంతపురం :్ జనవరి ఫస్టున హిందూ దేవాలయాల్లో ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయవద్దని ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించాలని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్‌ చేశారు. లౌకికపార్టీ అని చెప్పుకుంటున్న టీడీపీ పాలనలో ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త అయిన మాణిక్యాలరావు దేవాదాయశాఖ మంత్రిగా ఉండడంతోనే ఇలాంటి ఉత్తర్వులు వచ్చాయని ఆరోపించారు. వెంటనే మాణిక్యాలరావును మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని ఆయన చంద్రబాబును డిమాండ్‌ చేశారు. ఇలాంటి ఉత్తర్వులతో ప్రజల మధ్య ఐక్యత లోపిస్తుందని, అది లౌకికవాదానికి ముప్పుగా పరిణమిస్తుందని అభిప్రాయపడ్డారు.

19:05 - December 24, 2017
19:04 - December 24, 2017
19:03 - December 24, 2017
18:58 - December 24, 2017

గుంటూరు : క్రీడాకారులకు ఏపీ ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తుందన్నారు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. గుంటూరు నగరంలోని ఎన్టీఆర్‌ స్టేడియంలో కమ్మజన సేవాసమితి ఆధ్వర్యంలో స్పోర్ట్స్‌ మీట్‌ 2017-18 క్రీడోత్సవాలను మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు ప్రారంభించారు. బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సింధును ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు క్రీడల్లో రాణించాలని మంత్రి ప్రత్తిపాటి విద్యార్థులకు సూచించారు. 

18:58 - December 24, 2017

విజయనగరం : స్వచ్ఛభారత్‌లో భాగంగా విజయనగరం జిల్లాను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ఆ జిల్లా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌. వచ్చే ఏడాది ఫిబ్రవరి 15 కల్లా విజయనగరం జిల్లాను బహిరంగ మల విసర్జన రహితంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే జిల్లా వ్యాప్తంగా ప్రతీ గ్రామంలో ఇంటింటికీ తప్పనిసరిగా మరుగుదొడ్డి నిర్మించే విధంగా భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే మూడు విడతలుగా మరుగుదొడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేపట్టారు. నాలుగో విడత నిర్మాణాలను ఈ నెల 25న ప్రారంభించనున్నారు.

ఫిబ్రవరి 15 కల్లా మరుగుదొడ్ల నిర్మాణాలు
ఫిబ్రవరి 15 కల్లా మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తి చేసి స్వచ్ఛ జిల్లాగా మార్చేందుకు జిల్లా కలెక్టర్ నుండి దిగువ స్థాయి ఉద్యోగి వరకు కంకణం కట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగానే అధికారులు, సిబ్బంది రేయింబవళ్లు పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఓడీఎఫ్‌పై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు వినూత్న కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారు. జామి తహసీల్దార్‌గా పనిచేస్తున్న కాకర ఆనందరావు మిగిలిన అధికారులకు భిన్నంగా అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నారు. మండలంలో గ్రీన్‌ ఛానెల్‌ విలేజ్‌గా ఎంపికైన అన్నంరాజుపేటలో డిసెంబర్‌ నెలాఖరి కల్లా బహిరంగ మల విసర్జన రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు తహసీల్దార్‌ ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. గ్రామ సర్పంచ్‌ సహకారంతో ప్రజల్లో చైతన్యం తెచ్చి, ప్రతి ఒక్కరూ మరుగుదొడ్డి నిర్మించుకునే విధంగా అవగాహన చేపడుతున్నారు. ఇందులో భాగంగానే పలు అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నారు.

ఇంటింటికీ తిరిగి ప్రచారం
కొవ్వొత్తుల ర్యాలీ, దేవాలయ సందర్శన, షార్ట్‌ఫిల్మ్‌ ప్రదర్శనతో పాటు వివిధ జానపద కళాప్రదర్శనలతో గ్రామంలో ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రతి రోజూ గ్రామాన్ని సందర్శిస్తూ ఓడీఎఫ్‌ లక్ష్యసాధనపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. పగలంతా వ్యవసాయం చేసుకునే గ్రామస్థులకు రాత్రి సమయంలో ఓడీఎఫ్‌పై అవగాహన కల్పిస్తున్నారు. మహిళలు ఆత్మ గౌరవంతో ఉండాలంటే ప్రతీ ఇంట్లో మరుగుదొడ్డి అవసరమని గ్రామంలోని మహిళలు అంటున్నారు. జిల్లా అధికారుల కృషితో ఇప్పుడు తమ గ్రామంలో అది సాధ్యమైందని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెలాఖరి కల్లా తమ గ్రామంలో వంద శాతం ఓడిఎఫ్ పూర్తవుతుందని, స్వచ్ఛ గ్రామంగా జిల్లాలో మొదటి స్థానంలో తమ గ్రామం నిలుస్తుందని మహిళలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద జిల్లాలో వంద శాతం ఓడిఎఫ్ లక్ష్యంగా అధికారులు చేస్తున్న కృషి మంచి ఫలితాల్ని ఇస్తుండటంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

18:55 - December 24, 2017

కృష్ణా : క్రిస్మస్‌ వేడుకలకు విజయవాడ నగరం సిద్ధమైంది. చర్చ్‌లు, ప్రార్థనా మందిరాలు ఆకర్షణీయంగా మారాయి. వాడవాడలా సెమి క్రిస్మస్‌ సందడి నెలకొంది. ప్రత్యేక ప్రార్థనలు.. సాంస్కృతిక కార్యక్రమాలతో చర్చ్‌ల్లో పండుగ వాతావరణం చోటుచేసుకుంది. ఇప్పటికే క్రిస్మస్‌ గొప్పదనాన్ని.. ఫాదర్‌లు భక్తులకు తెలియజేస్తున్నారు.

పెద్ద ఎత్తున ఏర్పాట్లు
నగరంలోని గుణదల మేరీ మాత చర్చ్‌, విద్యాధరపురంలోని ఫిలదెల్పియా చర్చ్, పెనమలూరు ఆర్‌సీఎం చర్చ్, సింగ్ నగర్‌లోని సెయింట్ ఆన్ చర్చ్, బెంజ్ సర్కిల్లోని సెయింట్ క్యాతెడ్రల్‌ చర్చ్‌లలో భారీ ఎత్తున క్రిస్మస్‌ పండుగను నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. క్రిస్మస్‌ను పురస్కరించుకుని.. నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేకంగా అలంకరణలు చేశారు. క్రిస్మస్ వైభవాన్ని చాటేలా క్రిస్మస్ ట్రీలు, నక్షత్రాలు, రంగురంగుల విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. అలాగే చర్చ్‌లలో భక్తులను అలరించేలా... వివిధ రకాల బొమ్మలు, కొవ్వొత్తులు, పశువుల పాక సెట్‌లను ఏర్పాటు చేశారు. 

18:52 - December 24, 2017

విశాఖ : జిల్లా ఎస్‌.రాయవరం మండలం పి.ధర్మవరంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక రొయ్యల పరిశ్రమ వద్ద రోడ్డు పక్కన నిలుచున్న వారిపైకి టాటాఏస్‌ వాహనం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్రగాయలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుల్లో నాయుడు, నూకరాజు, రమణకు గాయాలతో బయటపడగా .. శ్రీనివాసరావు, గంగాధర్‌ పరిస్థితి ఆందోళన కరంగా ఉందని డాక్టర్లు తెలిపారు. ప్రమాదానికి కారణం అయిన టాటాఏస్‌ వాహనం డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

18:51 - December 24, 2017

పశ్చిమగోదావరి : జిల్లాలో యలమంచిలి మండలం కట్టుపాలెంలో మందుబాబుల ఆగడాలు భరించలేక... మద్యం షాపు ఎత్తేయాలంటూ మహిళలు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా మహిళలపై సదరు మందు బాబు తిట్లపురాణం అందుకున్నారు. మందుషాపు ఎత్తివేస్తే .. 5కిలోమిటర్ల దూరం వెళ్లాలంటూ మాటలతో రెచ్చిపాయారు. దీంతో మందుబాబుపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. స్థానిక బ్రాందీషాపు ముందు ధర్నాకు దిగారు. వెంటనే మద్యం దుకాణం తీసేయాలంటూ డిమాండ్‌ చేశారు. 

18:49 - December 24, 2017

కర్నూలు : జిల్లా తుగ్గలి మండలం చెన్నంపల్లి కోటలో గుప్త నిధుల కోసం కొనసాగుతున్న తవ్వకాలు 12 వ రోజుకు చేరుకున్నాయి. తవ్వకాల్లో రాజుల కాలం నాటి ఖడ్గం, కత్తులు, పిడిబాకులు బయటపడ్డాయి. భూమి లోపల ఖనిజ సంపదను కనిపెట్టేందుకు స్కానర్లు తెప్పించినా... గుప్త నిధుల ఆనవాళ్లు ఎక్కడా కనిపించలేదు. రెవెన్యూ, పోలీసు, పురావస్తు, గనులు, భూగర్భ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ తవ్వకాలు కొనసాగిస్తున్నారు. 

18:48 - December 24, 2017

తూర్పుగోదావరి : పోలవరం ప్రాజెక్టుకు అవసరమైతే కాఫర్‌ డ్యామ్‌ను వెంటనే నిర్మించుకోవచ్చని కేంద్ర జలవనరుల మంత్రి నితిన్‌ గడ్కరీ సలహాదారు సంజయ్‌ కోలా పుల్కర్‌ స్పష్టం చేశారు. కాఫర్‌ డ్యామ్‌ అవసరంలేదని తాను చెప్పిన్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని సంజయ్‌ తోసిపుచ్చారు. పోలవరం పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన సంజయ్‌... 2019 నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. 

ఆర్కేనగర్ లో దినకరన్ విజయం

చెన్నై : తమిళనాడులోని ఆర్కేనగర్ ఉపఎన్నికలో స్వతంత్ర అభ్యర్థి టీటీవీ దినకరన్ విజయం సాధించారు. ఆయన దాదాపు 40 వేల ఓట్ల తేడా గెలుపొందారు 

18:11 - December 24, 2017
18:02 - December 24, 2017

చెన్నై : తమిళనాడులోని ఆర్కేనగర్ ఉపఎన్నికలో స్వతంత్ర అభ్యర్థి టీటీవీ దినకరన్ విజయం సాధించారు. ఆయన దాదాపు 40 వేల ఓట్ల తేడా గెలుపొందినట్టు తెలుస్తోంది. రెండవ స్థానంలో అన్నాడీఎంకే అభ్యర్థి మధుసూదన్, మూడవ స్థానంలో డీఎంకే అభ్యర్థి మరుగు గణేష్ ఉన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

మాదాపూర్ డీసీపీ గంగిరెడ్డిపై బదలీ వేటు

హైదరాబాద్ : మాదాపూరర్ అడిషనల్ డీసీపీ గంగిరెడ్డిపై బదిలీ వేటు పడింది. గంగిరెడ్డిని హెడ్ క్వార్టర్ కు బదిలీ చేస్తూ పోలీసు ఉన్నధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

16:29 - December 24, 2017

హైదరాబాద్ : మాదాపూరర్ అడిషనల్ డీసీపీ గంగిరెడ్డిపై బదిలీ వేటు పడింది. గంగిరెడ్డిని హెడ్ క్వార్టర్ కు బదిలీ చేస్తూ పోలీసు ఉన్నధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. షార్ట్ ఫిలిం డైరెక్టర్ యోగిని డీసీపీ బూటు కాలితో తన్నడం వివాదం చేలరేగడంతో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

దినకరన్ కు 68,712 ఓట్లు

చెన్నై : తమిళనాడులోని ఆర్కేనగర్ ఉపఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. ప్రస్తుతం 14వ రౌండ్ ముగిసే సయయానికి దినకరన్ 68,712 ఓట్లు సాధించి 31,538 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

16:13 - December 24, 2017

చెన్నై : తమిళనాడులోని ఆర్కేనగర్ ఉపఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. ప్రస్తుతం 14వ రౌండ్ ముగిసే సయయానికి దినకరన్ 68,712 ఓట్లు సాధించి 31,538 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రెండవ స్థానంలో అన్నాడీఎంకే అభ్యర్థి మధుసూదన్ ఉన్నారు. ఇది ఇలా ఉంటే 3నెలల్లో ప్రభుత్వం పడిపోతుందని దినకరన్ సంచలన వ్యాఖ్య చేశారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

జయలలిత సమాధికి నివాళు అర్పించిన దినకరన్

చైన్నై : ఆర్కేనగర్ ఉపఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. స్వాతంత్ర అభ్యర్థి దినకరన్ విజయం దిశగా సాగుతున్నారు. ఆయన మెరీన బీచ్ లోని జయలలిత సమాధికి నివాళులు అర్పించారు. 

15:11 - December 24, 2017

కొనసాగుతున్న ఆర్కేనగర్ కౌంటింగ్

చెన్నై : తమిళనాడులో ఆర్కేనగర్ ఉపఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. టీటీవీ దినకరన్ కు 44,094, అన్నాడీఎంకే అభ్యర్థి మధుసుదన్ కు 22,013 ఓట్లు వచ్చాయి. దాదాపు దినకరన్ గెలిచే అవకాశం ఉంది.

15:09 - December 24, 2017

చెన్నై : తమిళనాడులో ఆర్కేనగర్ ఉపఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. టీటీవీ దినకరన్ కు 44,094, అన్నాడీఎంకే అభ్యర్థి మధుసుదన్ కు 22,013 ఓట్లు వచ్చాయి. దాదాపు దినకరన్ గెలిచే అవకాశం ఉంది. మరింత సమాచారం వీడియో క్లిక్ చేయండి.

బైక్ ను ఢీకొన్న ఎమ్మెల్యే కారు.

జనగామ : జిల్లా కొడకండ్ల మండలం వెలిశాల వద్ద ఇల్లందు ఎమ్మెల్యే కోర కనకయ్య కారు బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యాదయ్య అనే వ్యక్తి మృతి చెందాడు.

15:05 - December 24, 2017

జనగామ : జిల్లా కొడకండ్ల మండలం వెలిశాల వద్ద ఇల్లందు ఎమ్మెల్యే కోర కనకయ్య కారు బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యాదయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

200 కీ.మీలకు చేరిన జగన్ పాదయాత్ర

అనంతపురం : జిల్లా కదిరి మండలం కటార్ పల్లిలో జగన్ పాదయాత్ర 600 కి.మీ పూర్తి చేశారు. 600 కి.మీలు పూర్తి చేసుకున్న సందర్బంగా జగన్ మొక్కను నాటారు.

3నెలల్లో ప్రభుత్వం పడిపోతుంది : దినకరన్

చెన్నై : ఆర్కేనగర్ ఉపఎన్నికల్లో దినకరన్ అధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ సందర్బంగా ఆయన మూడు నెల్లలో పళాని స్వామి ప్రభుత్వం కుప్పకులుతుందని చెప్పారు. 

13:28 - December 24, 2017
13:09 - December 24, 2017

చెన్నై : ఆర్కే నగర్ ఎన్నికల్లో ప్రజలు వినూత్న తీర్పు ఇస్తున్నారు. అన్నాడీఎంకే కాదు..డీఎంకే కాదని..ప్రజలు దినకరన్ వైపు మొగ్గు చూపారు. ఆర్కే నగర్ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. ప్రస్తుతం ఆరో రౌండ్ కౌంటింగ్ ముగిసింది. మొదటి నుండే ఆధిపత్యంలో కొనసాగుతున్న దినకరన్ అదే స్టాండ్ నిలబెట్టుకున్నారు. మొత్తం 14వేల ఓట్ల అధిక్యంలో కొనసాగుతున్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

కర్నూలు నేతలతో చంద్రబాబు భేటీ

గుంటూరు : కర్నూలు నేతలతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికల అభ్యర్థి గురించి వారు చర్చించారు. ఎమ్మెల్సీ రేసులో  కేఈ ప్రభాకర్, చల్లా రామకృష్ణారెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు. ఈ సమావేశానికి ఎంపీ బుట్టా రేణుక హాజరైయ్యారు. టీడీపీ చేరిన తర్వాత రేణుక పార్టీ భేటీకి రావడం ఇదే మొదటిసారి.

12:41 - December 24, 2017

ఢిల్లీ : ఫిలిప్పీన్స్‌లో టెంబిన్‌ తుపాను విరుచుకుపడింది. పెను విధ్వంసం సృష్టించింది. ఆ దేశంలో రెండో అతిపెద్ద ద్వీపమైన మిండనావోలో తుపాను తీవ్ర ప్రభావం చూపింది. పేదలు ఎక్కువగా నివసించే జామ్‌బోవాంగా ద్వీపకల్పం టెంబిన్‌ తుపానుకు అతలాకుతలమైంది. దక్షిణ ఫిలిప్పీన్స్‌లోని చాలా దీవులపై తుఫాను తీవ్ర ప్రభావం చూపింది. మిందనావో ప్రాంతంలోనే రెండు కోట్ల మంది ప్రజలు టెంబిన్‌తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జామ్‌బోవాంగా ద్వీపకల్పంలో వరదల ఉద్ధృతికి సాల్వడార్‌ నదిలో అనేక మంది కొట్టుకుపోయారు. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో వీచిన పెనుగాలులకు మిండనావో, పల్వాన్‌ ద్వీపాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పల్వాన్‌లో చాలా రిసార్ట్‌లు పూర్తిగా దెబ్బతిన్నాయి.

టెంబిన్‌ తుపానుతో మిందనావోలోని లెనావో డెల్‌ నోర్టీ, లెనావో డెల్‌ సర్‌ ప్రాంతాలు పూర్తి ధ్వంసమయ్యాయి. రోజ్‌ నది వరదలు గ్రామాలకు గ్రామలను ముంచెత్తాయి. కొన్ని గ్రామాలు పూర్తిగా నామరూపాల్లేకుండా తుడిచిపెట్టుకోపోయాయి. టెంబిన్‌ తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఆకలి దప్పులతో అల్లాడిపోతున్నారు. సమాచారవ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైంది. రోడ్లు ధ్వంసమయ్యాయి. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో గాడాంధకారం నెలకొంది. సహాయ, పునరావాస కార్యక్రమలు అమలు చేద్దామన్నా... ఆయా ప్రాంతాలకు చేరుకునే పరిస్థితి లేదు. వాతావరణం అనుకూలిస్తే హెలికాప్టర్ల సహాయంతో ఆహారం, మంచినీటిని చేరవేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది.

టెంబిన్‌ తుపాను ప్రభావంతో ఫిలిప్పీన్స్‌లోని చాలా ప్రాంతాల్లో బురదమట్టి పేరుకుపోయింది. వరదనీరు నిల్చిపోవడంతో అంటువ్యాధులు ప్రభలే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. పదిరోజుల వ్యవధిలో ఫిలిప్పీన్స్‌ తుపాను తాకిడికి గురికావడం ఇది రెండోసారి. కాయ్‌ తక్‌ తుపానులో మధ్య ఫిలిప్పీన్స్‌ అతలాకుతలమైన పది రోజుల్లోనే టెంబిన్‌ సంభవించడంతో ఆ దేశం ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయింది. 2013లో ఫిలిప్పీన్స్‌లో సంభవించిన హయాన్‌ తుపాను తర్వాత టెంబిన్‌ అతి భయంకరమైనదిగా భావిస్తున్నారు. హయాన్‌ తుపానులో ఐదువేల మంది ప్రాణాలు కోల్పోగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. టెంబిన్‌ తుపాను సృష్టించిన విలయం నుంచి తేరుకునేందుకు ఫిలిప్పీన్స్‌కు చాలా కాలంపట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు.  

12:27 - December 24, 2017

హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్

హైదరాబాద్ : నగరానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేరుకున్నారు. ఆయన సీఎం కేసీఆర్ పలువురు మంత్రులు స్వాగతం పలికారు. రామ్ నాథ్ కోవింద్ శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చారు. ఆయన బొల్లారంలో రాష్ట్రపతి భవన్ లో నాలుగు రోజుల బస చేస్తారు.

కాపర్ డ్యామ్ వద్దని చెప్పలేదు : సంజయ్

తూర్పుగోదావరి : పోలవరం కాపర్ డ్యాంమ్ వద్దని చెప్పాలేదని, సాంకేతిక అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని మాత్రమే తెలిపామని, పోలవరాన్ని సకాలంలో పూర్తి చేసే ప్రయత్నంలో ఆన్నామని కేంద్ర జలవనురుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సలహాదారు సంజయ్ అన్నారు.

12:19 - December 24, 2017

సూపర్ స్టార్ మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం భరత్ అనే నేను. ఈ మూవీలోని ఓ పాటలో మహేష్ బాబు పాట ఆధ్యంతం పంచకట్టుతోను ఉంటారని తెలుస్తోంది. శ్రీమంతుడు సినిమాలో లూంగీతో కనిపించిన మహేష్ ఇప్పుడు పంచకట్టు కనిపించబోతున్నారు. 

12:10 - December 24, 2017

చెన్నై : ఆర్కే నగర్ తీర్పు...తమిళ ప్రజల తీర్పు అని శశికళ వర్గం నేత టిటివి దినకరన్ వ్యాఖ్యానించారు. ఆర్కే నగర్ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ కౌంటింగ్ లో మొదటి నుండి దినకరన్ అధిక్యాన్ని కనబరుస్తూ వస్తున్నారు. విజయం తథ్యమని అని భావించిన దినకరన్ చెన్నైకి చేరుకుంటున్నారు. ఈ సందర్భంగా మధురై ఎయిర్ పోర్టు వద్ద ఆయనకు ఆయన అభిమానులు, అనచరులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ...జయలలిత వారసత్వాన్ని తాను కొనసాగిస్తానని..మూడు నెలల్లో పళనీ స్వామి ప్రభుత్వం పడిపోతుందని జోస్యం చెప్పారు.

నాలుగో రౌండ్ ముగిసే సరికి దినకరన్ 10626 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు. మొత్తంగా 38, 180 ఓట్లు లెక్కించారు. అందులో దినకరన్ కు 20, 298 ఓట్లు..అన్నాడీఎంకే అభ్యర్థి మధుసూధన్ కు 9, 672, డీఎంకే అభ్యర్థి మరుదు గణేష్ కు 5, 091 ఓట్లు సాధించారు.

ఇక దినకరన్ ఇంటి వద్ద ఆయన అభిమానులు, అనుచరులు సంబరాలు జరుపుకుంటున్నారు. బాణాసంచా పేలుస్తూ అన్నాడీఎంకే కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. పార్టీని దినకరన్ కు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలు ఏ మాత్రం ఫలితం ఇలా ఉంటుందని ఊహించలేదని తెలుస్తోంది. 

12:02 - December 24, 2017

ముస్లింగా పుట్టిన ప్రతి ఒక్కరు మక్కాకు వెళ్లాని భావిస్తారు. అలా సినీ కమెడియన్ అలీ ముస్లింల పవిత్ర స్థలమైన మక్కాకు వెళ్లాడు. అయితే అలీ ఎప్పుడు కనిపించిన చాలా చెలకిగా కినిపిస్తారు కానీ ఆయన మక్కాలో ధరించిన వస్త్రధరణ ఒకటి ఇప్సుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ ఫొటో లో ఆలీ సీరియస్ గా వారి సాంప్రదాయం ప్రకారం దుస్తులు ధరించి ఉన్నారు. 

11:50 - December 24, 2017

చెన్నంపల్లికోటలో వద్ద ఉత్కంఠ

కర్నూలు : జిల్లా తుగ్గలి మండలం చెన్నంపల్లికోట వద్ద ఉత్కంఠ నెలకొంది. కోటలో 12వ రోజు తవ్వకాల్లో ఎలాంటి గుప్తనిధులు అనావాళ్లు కనిపించలేదు. కానీ ఖడ్గం, కత్తి, పిడుబాకులు, ఏనుగుదంతాలు మాత్రం లభ్యమైయ్యాయి. 

11:48 - December 24, 2017
11:47 - December 24, 2017

కొనసాగుతున్న ఆర్కేనగర్ ఉపఎన్నిక కౌటింగ్

చెన్నై : తమిళనాడులోని ఆర్కేనగర్ ఉపఎన్నిక పోలింగ్ కౌటింగ్ కొనసాగుతోంది. టీటీవీ దినకరన్ 15,868, అన్నాడీఎంకే 7033, డీఎంకే 3750 ఓట్లను సాధించాయి. 

ప్రకాశం పంతులకు నివాళులు..

ప్రకాశం : బ్యారేజీ నిర్మించి 60 ఏళ్ల అయిన సందర్భంగా మంత్రి దేవినేని ప్రకాశం పంతులు విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ప్రకాశం బ్యారేజ్ 60 ఏళ్లుగా 13 లక్షల ఎకరాలకు సాగు నీరందిస్తోందని తెలిపారు. బ్యారేజీ ప్రాముఖ్యతను తెలిపేందుకు 29న ఓ కార్యక్రమం చేపట్టనున్నట్లు, బ్యారేజీ నిర్మాణంలో పాలు పంచుకున్న వారికి సీఎం చంద్రబాబు నాయుడు సన్మానిస్తారని తెలిపారు. 

దినకరన్ కు 10.421 ఓట్లు...

చెన్నై : ఆర్కేనగర్ కౌంటింగ్ కొనసాగుతోంది. మూడో రౌండ్ ముగిసే సరికి టిటివి దినకరన్ కు 10, 421 ఓట్లు..అన్నాడీఎంకే అభ్యర్థి మధుసూధన్ కు 4, 521 ఓట్లు..డీఎంకే అభ్యర్థి మరుదు గణేష్ కు 2, 383 ఓట్లు పోలయ్యాయి.

బీజేపీ అభ్యర్థికి 60 ఓట్లు..నోటాకు 100 ఓట్లు పోలయ్యాయి. 

11:12 - December 24, 2017

చెన్నై : ఆర్కే నగర్ ఉప ఎన్నిక కౌంటింగ్ లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జయ మద్దతు దారుడు తానేనంటూ చెప్పుకుంటున్న టిటివి దినకరన్ స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. కౌంటింగ్ లో దినకరన్ దూసుకెళుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. దినకరన్ ఆధిక్యంలో కొనసాగుతుండడంతో అన్నాడీఎంకే జీర్ణించుకోలేకపోతోంది. పలు ఉద్రిక్తతల నడుమ కౌంటింగ్ కొనసాగుతోంది.

జయ మరణానంతరం ఏడాది తరువాత ఉప ఎన్నిక జరిగింది. క్విన్స్ మేరీ కళాశాలలో కౌంటింగ్ ను ఉదయం 8గంటలకు ప్రారంభించారు. పోస్టల్ బ్యాలెట్..మొదటి రౌండ్ లో దినకరన్ అధిక్యం కనబరుస్తూ వచ్చారు. చివరకు రెండో రౌండ్ లో కూడా ఆయన అధిక్యంలో కొనసాగారు. కౌంటింగ్ కేంద్రంలో ఉన్న అన్నాడీఎంకే ఏజెంట్లు దినకరన్ ఏజెంట్లతో వాగ్వాదం దిగారు. ఒకరినొకరు కుర్చీలు విసురుకున్నారు. జరుగుతున్న పరిణామాలతో అధికారులు కౌంటింగ్ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయించారు. అర గంట అనంతరం మళ్లీ కౌంటింగ్ ను కొనసాగించారు. మూడు రౌండ్ ముగిసే సరికి టిటివి దినకరన్ కు 10, 421 ఓట్లు..అన్నాడీఎంకే అభ్యర్థి మధుసూధన్ కు 4, 521 ఓట్లు..డీఎంకే అభ్యర్థి మరుదు గణేష్ కు 2, 383 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థికి 60 ఓట్లు..నోటాకు 100 ఓట్లు పోలయ్యాయి.

దినకరన్ ఇంటి వద్ద ఆయన అనుచరులు సంబరాలు చేస్తున్నారు. పటాకులు కాలుస్తూ అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. 19 రౌండ్ వరకు దినకరన్ అధిక్యం కొనసాగిస్తారా ? లేదా ? అనేది చూడాలి. 

ఏఐఎంపి లా బోర్డు అత్యవసర సమావేశం..

లక్నో : ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డు అత్యవసర భేటీ నిర్వహించింది. లక్నోలో జరుగుతున్న ఈ సమావేశానికి ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తదితరులు హాజరయ్యారు. పార్లమెంట్ లో ప్రవేశ పెట్టే ట్రిపుల్ తలాక్ బిల్లుపై చర్చిస్తున్నారు. 

6120 ఓట్ల ఆధిక్యంలో దినకరన్..

చెన్నై: ఆర్కేనగర్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు తిరిగి ప్రారంభమైంది. ఏఐఏడీఎంకే, దినకరన్ ఏజెంట్ల మధ్య వాగ్వాదంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కాసేపు నిలిచిపోయింది. మూడో రౌండ్ లో 6,120ఓట్ల ఆధిక్యంలో టిటివి దినకరన్ కొనసాగుతున్నారు. 

తిరిగి కౌంటింగ్ ప్రారంభం..

చెన్నై : ఆర్కేనగర్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు తిరిగి ప్రారంభమైంది. ఏఐఏడీఎంకే, దినకరన్ ఏజెంట్ల మధ్య వాగ్వాదంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కాసేపు నిలిచపోయింది. దినకరన్ కు 5339 ఓట్లు, అన్నాడీఎంకే అభ్యర్థి మధుసూధన్ కు 2738, డీఎంకే అభ్యర్థి మరుదు గణేష్ కు 1182 ఓట్లు పోలయ్యాయి. 

10:22 - December 24, 2017

చెన్నై : ఆర్కే నగర్ ఉప ఎన్నిక విషయంలో...ఉప ఎన్నిక అనంతరం..కౌంటింగ్ విషయంలో కూడా ఉత్కంఠ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జయ మరణానంతరం ఏడాది అనంతరం ఉప ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. భారీగా డబ్బులు పంచుతున్నారని అప్పట్లో ఎన్నికను ఈసీ వాయిదా వేసింది. అనంతరం కోర్టు ఆదేశాలతో ఎన్నిక నిర్వహించారు. దీనికి సంబంధించిన కౌంటింగ్ ను ఆదివారం క్విన్స్ మేరీ కళాశాలలో నిర్వహించారు.

ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభించారు. అనూహ్యంగా పోస్టల్ బ్యాలెట్..రౌండ్లలో టిటివి దినకరన్ అనూహ్యంగా దూసుకపోతున్నారు. రెండు రౌండ్లు ముగిసే సరికి 5వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో దినకరన్...డీఎంకే అభ్యర్థి మరుదు గణేషన్ 1156 ఓట్లు..అన్నాడీఎంకే అభ్యర్థి మధుసూధన్ కు 2737 ఓట్లు వచ్చాయి. ఒక్కసారిగా టిటివి దినకరన్ ముందుకు దూసుకెళుతుండడంతో కౌంటింగ్ కేంద్రంలో అన్నాడీఎంకే పార్టీ శ్రేణులు ఘర్షణలకు దిగారు. కౌంటింగ్ కేంద్రంలోనే ఘర్షణకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అధికారులపై కూడా జులుం ప్రదర్శించినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా జరిగిన పరిణామాలతో అధికారులు స్పందించారు. కౌంటింగ్ ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. 

దినకరన్ ఇంటి వద్ద సంబరాలు..

చెన్నై: జయ వారుసుడిని తానేనంటూ చెప్పుకుంటున్న టిటివి దినకరన్ ఇంటి వద్ద ఆయన అనుచరులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఉప ఎన్నిక ఫలితాల్లో ఆయన ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 

శిశువును పీక్కుతిన్న కుక్కలు...

రాజన్న సిరిసిల్ల : వేములవాడ మూలవాగులో దారుణం చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన శిశువును గుర్తు తెలియని వ్యక్తులు పడేసివెళ్లారు. శిశువును కుక్కలు పీక్కుతిన్నాయి. 

ఆర్కే నగర్ కౌంటింగ్ తాత్కాలికంగా నిలిపివేత..

చెన్నై : ఆర్కే నగర్ ఉపఎన్నికల ఓట్ల లెక్కింపులో గందరగోళం నెలకొంది. దినకరన్, అన్నాడీఎంకే ఏజెంట్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో తాత్కాలికంగా కౌంటింగ్ నిలిపివేశారు. 

09:22 - December 24, 2017

గుంటూరు : ఏపీ సీఎం చంద్రబాబునాయుడు క్రైస్తవులపై వరాల జల్లు కురిపించారు. గుంటూరులో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్‌ వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పేద క్రైస్తవుల కోసం భారీస్థాయిలో బడ్జెట్‌ పెంచుతామని ప్రకటించారు. గుంటూరులోని లూథరన్‌ పాఠశాలలో... ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. క్రిస్మస్‌ ఏ ఒక్క రాష్ర్టమో, దేశమో కాకుండా యావత్‌ ప్రపంచం జరుపుకునే పండుగ అని ఆయన అన్నారు. రోజురోజుకూ ప్రజల్లో క్రీస్తుపైన విశ్వాసం రెట్టింపు స్థాయిలో పెరుగుతోందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో మత సామరస్యాన్ని కాపాడటంతోపాటు.. పేద క్రైస్తవులకు అండగా నిలుస్తామని చెప్పారు. భారీ సంఖ్యలో క్రైస్తవులు హాజరైన ఈ వేడుకల్లో సీఎంతోపాటు మంత్రులు పత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, జవహర్‌, ఎంపీలు రాయపాటి సాంబశివరావు, గల్లా జయదేవ్‌, పలువురు మతపెద్దలు పాల్గొన్నారు.

ఈ క్రిస్మస్‌ వేడకల్లో సీఎం చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. మేరీ క్రిస్మస్‌... హ్యాప్పీ క్రిస్మస్‌ అని తాను చెప్పడమే కాకుండా అందరితో పలికించాడు. సేవ, కరుణ, ప్రేమను బోధించేందుకు క్రీస్తు మానవ రూపంలో జన్మించారని, క్రీస్తును నమ్ముకున్న ప్రతి ఒక్కరికీ శుభం కలుగుతుందని అన్నారు. ఎన్టీఆర్‌ గుంటూరులోని ఆంధ్రా క్రైస్తవ కళాశాలలోనే చదివి... గొప్ప రాజకీయనాయకుడుగా... నటుడిగా గొప్పస్థాయికి ఎదిగారని అన్నారు. ఎన్టీఆర్‌ పేరుతో అక్కడ ఒక బ్లాకును నిర్మిస్తామని చెప్పారు.

సీఎం చంద్రబాబు క్రిస్మస్‌ వేడుకల వేదిక సాక్షిగా... క్రైస్తవులపై వరాల వర్షం కురిపించారు. క్రిస్టియన్ల సంక్షేమానికి 75 కోట్లు కేటాయించామని ఏపీ సీఎం స్పష్టం చేశారు. చర్చిల మరమ్మతులకు మూడు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. వచ్చే క్రిస్మస్ నాటికి గుంటూరులో క్రిస్టియన్ భవన్‌ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. పేదలు కూడా పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతోనే క్రిస్మస్‌ కానుక అందిస్తున్నామని అన్నారు. వచ్చే బడ్జెట్‌లో క్రైస్తవుకు గణనీయంగా కేటాయింపులు పెంచుతామని ప్రకటించారు.

ఆర్థిక బలం ఉంటే... ఎవరైనా ఏదైనా సాధిస్తారని...కానీ.. దైవకృప ఉంటే లేని స్థితిలో గొప్ప కార్యాలను సాధించడం సాధ్యమవుతుందని క్రైస్తవ మతపెద్దలు అన్నారు. ఇలాంటి అద్భుతాలు ఎంతో మంది జీవితాల్లో జరిగాయని చెప్పారు. అలాగే ఏపీ సీఎం కూడా కొత్తరాష్ట్రంలో తలపెట్టిన రాజధాని నిర్మాణం కూడా దేవుని దయతో పూర్తికావాలని వారంతా కాంక్షించారు. 

2వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో దినకరన్...

చెన్నై : ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఫలితాల్లో టిటివి దినకరన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 2వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో దినకరన్ ఉండగా రెండో స్థానంలో అన్నాడీఎంకే అభ్యర్థి మధుసూధన్, మూడో స్థానంలో డీఎంకే అభ్యర్థి మరుదు గణేష్ లున్నారు. 

09:12 - December 24, 2017

తమిళనాడు : ఆర్కే నగర్ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. 19 రౌండ్లలో కౌంటింగ్ జరుగనుంది. దివంగత జయ మరణానంతరం ఏడాది తరువాత ఉప ఎన్నిక జరిగింది. ఈనెల 21వ తేదీన జరిగిన ఉప ఎన్నికలో 77 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 59 మంది బరిలో నిలిచారు. ప్రధానంగా అన్నాడీఎంకే మధుసూధన్, డీఎంకే మరుదుగణేషన్, స్వతంత్ర అభ్యర్థి టిటివి దినకరన్ ల మధ్య పోటీ నెలకొంది. జయకు వారసుడిని తానేనంటూ చెప్పుకుంటున్న దినకరన్ కు ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. ఎన్నికల్లో గెలవాలని ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.

క్విన్స్ మేరీ కళాశాలలో జరుగుతున్న కౌంటింగ్ కేంద్రం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అధికార పార్టీకి చెందిన నేతలు..వారి అనుచరులను మాత్రమే లోనికి అనుమతినిస్తూ తమను అనుమతించడం లేదంటూ స్వతంత్ర అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని సముదాయించారు. చివరకు లోనికి అనుమతించడంతో వివాదం సద్దుమణిగింది. తొలుత పోస్టల్ బ్యాలెట్ లు లెక్కించారు. 412 ఓట్లు దినకరన్ కు రావడం విశేషం. మొదటి రౌండ్ లో కూడా దినకరన్ ఆధిక్యంలో కొనసాగారు. టిటివి దినకరన్ కు 1981 ఓట్లు, అన్నాడీఎంకే అభ్యర్థికి 647 ఓట్లు, డీఎంకే అభ్యర్థికి 360 ఓట్లు పోలయ్యాయి. మరి దినకరన్ ఇదే ఊపు కొనసాగిస్తారా ? లేదా ? అనేది చూడాలి. 

టిటివి దినకరన్ అధిక్యత...

తమిళనాడు : ఆర్కే నగర్ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. 19 రౌండ్లలో కౌంటింగ్ జరుగనుంది. ప్రస్తుతం టిటివి దినకరన్ అధిక్యంలో కొనసాగుతున్నారు. 

09:00 - December 24, 2017
08:59 - December 24, 2017
08:57 - December 24, 2017

విశాఖపట్టణం : పరివాడలో కెమికల్ వ్యర్థ జలాల లీకేజ్ పై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. జవహార్ లాల్ నెహ్రూ ఫార్మా సిటీ నుండి సముద్రంలోకి వేసిన పైపులైన్ లీకేజ్ అయ్యింది. దీనితో పరివాడలో భూగర్భజలాలు కలుషితమౌతున్నాయని, పైపులైన్ లీకేజ్ ని వెంటనే అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. విషరసనాయలతో చేపలు చనిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

08:37 - December 24, 2017

మహబూబ్ నగర్ : జిల్లా సీపీఎం మహాసభలు ఘనంగా జరిగాయి.. 18వ మహాసభల సందర్భంగా సీపీఎం శ్రేణులు భారీగా కదం తొక్కాయి. ఈ మహాసభల్లో పాల్గొన్న సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ...నల్లధనం వెలికి తీస్తానని తెగ ప్రచారం చేసిన భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారని విమర్శించారు. మోడీ ప్రభుత్వం కులాలు..మతాల మధ్య చిచ్చు పెడుతోందన్నారు. మూడున్నరేళ్లవుతున్నా కేసీఆర్ ప్రభుత్వం ఏ ఒక్క హామీ అమలు చెయ్యడం లేదన్నారు. కేసీఆర్ కు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కొడంగల్ - నారాయణ పేట నియోజకవర్గాన్ని అభివృద్ది చేయాలని డిమాండ్ చేశారు. 

08:26 - December 24, 2017

యాదాద్రి : భువనగిరిలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. సహాయక చర్యలు చేపడుతున్న వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొనడం తీవ్ర విషాదం నింపింది.

లారీ - ఆల్టో కారు ఢీకొంది. ఆల్టో కారులో ఉన్న శ్రీశైలం, శ్రీనివాస్ లుగా గుర్తించారు. వీరిద్దరూ మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వాహనాలను రోడ్డుపై ఉండగానే మరో జైలో వాహనం వచ్చి ఆల్టో కారును ఢీకొంది. జైలో ఉన్న ఏడుగురికి గాయాలయ్యాయి. అక్కడనే ఉన్న టోల్ గేట్ సిబ్బంది గమనించారు. అందులో పని చేసే ఉద్యోగి సహాయక చర్యలు చేపడుతున్నాడు. ఒక్కసారిగా ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీనితో ఆ ఉద్యోగి అక్కడికక్కడనే మృతి చెందాడు. పోలీసులు సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపడతున్నారు. 

08:19 - December 24, 2017

పోలవరం నిర్మాణం విషయంలో ప్రభుత్వంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలవరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు ప్రజలతో దోబూచులాడుతున్నాయని ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు అమారవతి నిర్మాణంలో అవినీతి అధికమౌతుందని విపక్షాలు పేర్కొంటున్నాయి. ఈ అంశాలపై విజయవాడ టెన్ టివి స్టూడియోలో జరిగిన చర్చా వేదికలో బాబురావు (సీపీఎం), మల్లాది విష్ణు (వైసీపీ) అనురాధ (టిడిపి)లు పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

08:14 - December 24, 2017

తమిళనాడు : అందరి చూపు ఆర్కే నగర్ వైపు ఉంది. ఆర్కేనగర్ కు జరిగిన ఉప ఎన్నిక ఫలితం కాసేపట్లో వెల్లడి కానుంది. దీనికి సంబంధించిన కౌంటింగ్ ను కాసేపటి క్రితం ప్రారంభించారు. జయ మరణానంతరం ఏడాది తరువాత ఇక్కడ పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. 75 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. మొత్తం 59 మంది బరిలో నిలిచారు. కానీ ప్రధానంగా అన్నాడీఎంకే మధుసూధన్, డీఎంకే మరుదుగణేషన్, స్వతంత్ర అభ్యర్థి టిటివి దినకరన్ ల మధ్య పోటీ నెలకొంది. క్వింట్ మేరీ కళాశాలలో ఈ కౌంటింగ్ జరుగుతోంది. ఎన్నిక లెక్కింపు కోసం 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 19 రౌండ్లలో కౌంటింగ్ జరుగనుంది. మధ్యాహ్నం వరకు ఫలితాలు వెల్లడి కానున్నట్లు తెలుస్తోంది. 

యాదాద్రిలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం...

యాదాద్రి : భువనగిరిలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ - ఆల్టో కారు - జైలో వాహనాలు ఢీకొన్నాయి. ప్రమాదంలో ఆల్టోలో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందగా జైలో వాహనంలో ప్రయాణిస్తున్న ఏడుగురికి గాయాలయ్యాయి. మృతులు కోహెడకు చెందిన శ్రీశైలం, శ్రీనివాస్ లుగా గుర్తించారు. 

జగన్ పాదయాత్ర 43వ రోజు...

అనంతపురం : వైసీపీ అధ్యక్షుడు జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర 43వ రోజుకు చేరుకుంది. కదిరి నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగనుంది. మదర్వ తండా, గంగానపల్లె క్రాస్, కమటంపల్లి, కోటిపల్ల క్రాస్, మిద్దివరిగొండి, నల్లవారిపల్లి మీదుగా కొనసాగనుంది. 

06:59 - December 24, 2017
06:56 - December 24, 2017

దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే భారత వన్డే జట్టును బీసీసీఐ ప్రకటించింది. చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ 17 మందితో కూడిన జట్టును ఎంపిక చేసింది. మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ కేదార్‌జాదవ్‌, బౌలర్‌ శార్దూల్‌ ఠాకూర్‌కు జట్టులో చోటు దక్కింది. అశ్విన్‌ , జడేజాకు మరోసారి నిరాశ ఎదురైంది. 2018లో సౌతాఫ్రికాలో జరిగే సిరీస్‌ కోసం వెళ్లే భారత క్రికెట్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. చీఫ్‌ సెలెక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలో సమావేశమైన ఆల్‌ ఇండియా సీనియర్‌ సెలెక్టర్‌ కమిటీ దక్షిణాఫ్రికాతో తలపడే భారతజట్టు సభ్యులను నిర్ణయించింది. మొత్తం 17 మందితో కూడిన జట్టు వివరాలు ప్రకటించింది.

మిడిలార్టర్‌ బ్యాట్స్‌మెన్‌ కేదార్‌జాదవ్‌, బౌలర్‌ శార్దూల్‌ ఠాకూరుకు తుదిజట్టులో చోటు దక్కింది. చాలా కాలంగా జట్టులో స్థానం కోసం ఎదురు చూస్తున్న స్పిన్నర్‌ అశ్విన్‌కు, ఆల్‌రౌండర్‌ జడేజాకు ఈసారి కూడా నిరాశే ఎదురైంది. శ్రీలంకతో జరిగే లిమిటెడ్‌ ఓవర్‌ సిరీస్‌ నుంచి విరామం తీసుకుని వివాహం చేసుకున్న విరాట్‌ కోహ్లీ ఈ సిరీస్‌తో మళ్లీ కెప్టెన్‌గా కొనసాగనున్నాడు. ఫిబ్రవరిలో సౌతాఫ్రికాలో జరిగే ఆరు వన్డేల సిరీస్‌లో ఈ జట్టు తలపడనుంది.

విరాట్‌ కోహ్లీ సారథిగా, రోహిత్‌శర్మ వైఎస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. శిఖర్‌ ధావన్‌, ధోనీ, అజింక రహానె, శ్రేయస్‌ అయ్యర్‌, మనీష్‌పాండేకు జట్టులో చోటు దక్కింది. దినేష్‌ కార్తీక్‌, అక్షర్‌ పటేల్‌, యుజ్వేంద్ర చాహల్‌, కుల్దీప్‌ యాదవ్‌, బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌, హార్థిక్‌ పాండ్యా, మహ్మద్‌షమికి తుదిజట్టులో స్థానం లభించింది. 

06:55 - December 24, 2017

ట్వంటీ ట్వంటీ తొలి వరల్డ్‌ చాంపియన్‌ టీమిండియా ...శ్రీలంక ఆఖరి టీ20 మ్యాచ్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది.టీ20ల్లో తిరుగులేని టీమిండియా, శ్రీలంక మధ్య 3 మ్యాచ్‌ల సిరీస్‌లోని ఆఖరి మ్యాచ్‌కు ముంబై వాంఖడే స్టేడియంలో రంగం సిద్ధమైంది.కటక్‌,ఇండోర్‌ టీ20ల్లో భారీ విజయాలు సాధించిన భారత్‌...సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేయడమే లక్ష్యంగా బరిలోకి దిగబోతోంది. కటక్‌ టీ20లో భారీ విజయం సాధించిన ఇండియాకు....ఇండోర్‌ వన్డేలోనూ పోటీనేలేకుండా పోయింది.3 మ్యాచ్‌ల సిరీస్‌ను ఇప్పటికే 2-0తో సొంతం చేసుకున్న భారత్‌ క్లీన్‌ స్వీప్‌ సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగబోతోంది. రోహిత్‌ ,రాహుల్‌,శ్రేయస్‌ అయ్యర్‌,ధోనీ,మనీష్‌ పాండే ఫామ్‌లో ఉండటంతో భారత్‌ బ్యాటింగ్‌లో ఎప్పటిలానే దుర్భేద్యంగా ఉంది.కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కళ్లు చెదిరే ఫామ్‌లో ఉండటం భారత్‌కు అదనపు బలం అనడంలో సందేహమే లేదు.

రెండు టీ20ల్లోనూ లెగ్‌ స్పిన్‌ ట్విన్స్‌ కుల్దీప్‌ యాదవ్‌, యజ్వేంద్ర చహాల్‌ ఎంతలా చెలరేగారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇద్దరూ కలిపి 2 టీ20ల్లో 14 వికెట్లు తీసి భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. మరోవైపు తిసెరా పెరీరా సారధ్యంలోని శ్రీలంక జట్టు అయోమయంలో పడింది.భారత బ్యాట్స్‌మెన్‌ ముందు లంక బౌలర్లు తేలిపోతుండటం....బ్యాటింగ్‌లో నిలకడలేకపోవడంతో లంక జట్టు తేలిపోయింది. రెండు టీ20ల్లోనూ టాస్‌ నెగ్గిన తిసెరా పెరీరా ...ఫీల్డింగ్‌ ఎంచుకుని పెద్ద పొరపాటే చేశాడనే చెప్పాలి. ఆఖరి టీ20లో అయినా నెగ్గి పరువు దక్కించుకోవాలని శ్రీలంక భావిస్తోంది. ఇక టీ20 ఫేస్‌ టు ఫేస్‌ రికార్డ్‌లోనూ శ్రీలంకపై ఇండియాదే పై చేయిగా ఉంది.ఇప్పటివరకూ ఇరు జట్లు 13 టీ20ల్లో పోటీ పడగా భారత్‌ 9 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా...శ్రీలంక 4 మ్యాచ్‌ల్లో నెగ్గింది. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరుగనున్న 3 టీ20లో ఆల్‌రౌండ్ పవర్‌తో పటిష్టంగా ఉన్న టీమిండియానే హాట్‌ ఫేవరెట్‌ అనడంలో అనుమానమే లేదు. మరి రోహిత్ అంక్‌ కో టీ 20 సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ సాధించి 2017 సీజన్‌ను ఘనంగా ముగించడం దాదాపు ఖాయమే.  

06:52 - December 24, 2017

తమిళనాడు : ఆర్కే నగర్‌ రేసులో గెలుపు గుర్రమెవరు? త్రిముఖ పోటీలో విక్టరీ ఎవరి తలుపు తట్టనుంది? విజేత ఎవరు , పరాజితులు ఎవరు? యావత్‌ దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆర్కే నగర్‌ ఫలితం మరికొద్ది గంటల్లో తేలనుంది. ఓట్ల లెక్కింపునకు ఎన్నికల యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది.

తమిళ రాజకీయాల్లో మార్పులకు ఆర్కేనగర్‌ ఉప ఎన్నిక రెఫరెండంగా మారింది. ఈ గెలుపుతో తామ బలహీనపడలేదని చాటుకునేందుకు అన్నాడీఎంకే అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. అదే గెలుపు తన వశం చేసుకుని సత్తా చాటుకోవడమే లక్ష్యంగా అన్నాడీఎంకే అమ్మ శిబిరం కుస్తీలు పట్టింది. పాలకుల మీద ప్రజలు తీవ్ర ఆక్రోశంతో ఉన్నారని చాటా రీతిలో , ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, అధికారం తమదేనని నిరూపించుకునేందుకు ఈ ఉప ఎన్నికను డీఎంకే సీరియస్‌గా తీసుకుంది. గెలుపును మూడు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఆర్కేనగర్‌ ఉప ఎన్నిక దేశా ప్రజానీకాన్ని ఆకర్షించింది.

ఎన్నికల రేసులో చాంతాడంత క్యూ ఉన్నా... గెలుపు ఓటములు మాత్రం డీఎంకే, అన్నాడీఎంకే, అన్నాడీఎంకే అమ్మ శిబిరాల మధ్యే ఉంది. త్రిముఖ పోటీ ఉంది. ఇప్పటికే తమ తీర్పు ఏంటో 21వ తేదీన జరిగిన పోలింగ్‌లో ప్రజలు ఈవీఎంలలో భద్రపరిచారు. ఓటింగ్‌ శాతం జరిగిన మేరకు డీఎంకే అభ్యర్థి మరుగు గణేషన్‌, అన్నాడీఎంకే అభ్యర్థి మధుసూదనన్‌, అన్నాడీఎంకే అమ్మ అభ్యర్థి దినకరన్‌ మధ్య గెలుపు ఊగిసలాడుతోంది. విజయం ఎవరిని వరించనుందో ఇవాళ తేలనుంది. ఓటరు నాడి ఎలా ఉంటుందో అనే ఉత్కంఠ తప్పడం లేదు. ఇవాళ ఈవీఎంలలోని ఫలితాలు బయటకు రానుండడంతో ఆర్కేనగర్‌ రేస్‌లో గెలుపు గుర్రంగా నిలబడబోతున్నదెవరోన్న ఎదురు చూపులు పెరిగాయి.

06:50 - December 24, 2017

విజయవాడ : నగరంలో క్రిస్మస్ పండుగ శోభ సంతరించుకుంది. పండుగ సమీపంచడంతో.. నగరమంతా అందంగా ముస్తాబైంది. పండుగను ఘనంగా నిర్వహించుకునేందుకు క్రైస్తవ సోదరులు సమాయత్తమయ్యారు. చర్చ్‌లు, ప్రార్థనా మందిరాలు ఆకర్షణీయంగా మారాయి. వాడవాడలా సెమి క్రిస్మస్‌ సందడి నెలకొంది. ప్రత్యేక ప్రార్థనలు.. సాంస్కృతిక కార్యక్రమాలతో చర్చ్‌ల్లో పండుగ వాతావరణం చోటుచేసుకుంది. ఇప్పటికే క్రిస్మస్‌ గొప్పదనాన్ని.. ఫాదర్‌లు భక్తులకు తెలియజేస్తున్నారు.

నగరంలోని గుణదల మేరీ మాత చర్చ్‌, విద్యాధరపురంలోని ఫిలదెల్పియా చర్చ్, పెనమలూరు ఆర్‌సీఎం చర్చ్, సింగ్ నగర్‌లోని సెయింట్ ఆన్ చర్చ్, బెంజ్ సర్కిల్లోని సెయింట్ క్యాతెడ్రల్‌ చర్చ్‌లలో భారీ ఎత్తున క్రిస్మస్‌ పండుగను నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.

క్రిస్మస్‌ను పురస్కరించుకుని.. నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేకంగా అలంకరణలు చేశారు. క్రిస్మస్ వైభవాన్ని చాటేలా క్రిస్మస్ ట్రీలు, నక్షత్రాలు, రంగురంగుల విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. అలాగే చర్చ్‌లలో భక్తులను అలరించేలా... వివిధ రకాల బొమ్మలు, కొవ్వొత్తులు, పశువుల పాక సెట్‌లను ఏర్పాటు చేశారు. భక్తుల కోలాహాలం, చర్చ్‌ల్లో ప్రార్థనలతో.. నగరంలో .. ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడింది.

06:45 - December 24, 2017

హైదరాబాద్ : హారికను తాను వేధించలేదని షార్ట్‌ ఫిలిం డైరెక్టర్ యోగి చెప్పారు. కావాలనే హారిక తనపై ఆరోపణలు చేస్తుందన్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకొనేందుకు టెన్ టివి యోగితో మాట్లాడింది. 10 వేల రూపాయలు ఇవ్వలేదన్న కారణంతో తనను పోలీసులతో కొట్టించిందని చెప్పారు. ఓ ప్రొడ్యూసర్‌ కుమారునితో హారికకు సంబంధాలు ఉన్నాయని.. అవి బయటపడటానికి తానే కారణమని కేసులు పెట్టిందన్నారు. తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్‌ లేదని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

06:40 - December 24, 2017

హైదరాబాద్ : మంత్రి లక్ష్మారెడ్డి పై మరోసారి ఫైరయ్యారు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి. తాను జడ్చర్ల సభలో మాట్లాడిన విషయాల్లో తప్పేముందో చెప్పాలన్న ఆయన లక్ష్మారెడ్డి చీకటిజీవితం ఆధారాలన్నీ త్వరలోనే బయట పెడతానన్నారు. నా ఆస్తుల గురించి మాట్లాడిన లక్ష్మారెడ్డి కి మా ఉరికొస్తే నా ఆస్తులేంటో నా చరిత్ర ఏంటో తెలుస్తుందన్నారు. లక్ష్మారెడ్డి బినామీ చరిత్రను త్వరలోనే ఆధారాలతో సహా బయటపెడతానన్నారు. చంచల్ గూడా జైలులో మందకృష్ణను పరామర్శించిన రేవంత్ బీజేపీ కి చిత్తశుద్ధి ఉంటె వర్గీకరణపై కాంగ్రెస్ ప్రవేశపెట్టే ప్రవేట్ బిల్లుకు మద్దతివ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక 25 ఏళ్ల వర్గీకరణ ఉద్యమంలో మంద కృష్ణను జైలులో పెట్టిన చరిత్ర కేసీఆర్ దేనన్నారు. 

06:37 - December 24, 2017

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే... ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్రంలో లక్ష ఉద్యోగాలు ఖాళీగా ఉంటే.. 40నెలల్లో 7వేల ఉద్యోగాలే భర్తీ చేశారన్నారు. గాంధీభవన్‌లో సుమారు 600 మంది ఉస్మానియా విద్యార్థులు కాంగ్రెస్‌లో చేరారు. కార్యక్రమంలో పాల్గొన్న ఉత్తమ్... కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు 3వేల భృతి కల్పిస్తామని హామీ ఇచ్చారు. 

06:32 - December 24, 2017

హైదరాబాద్ : మియాపూర్‌ భూ వివాదం చివరి దశకు చేరుకుంది. కేసును క్షుణ్ణంగా దర్యాప్తు జరిపిన సైబరాబాద్ పోలీసులు ఛార్జీషీట్‌ దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. భూకుంభకోణంలోని నిందితులను గతంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కంపెనీలకు సంబంధించిన విధివిధానాల పత్రాలు, వారి మినిట్స్ నిర్ణయాల ప్రతాల కోసం రిజిస్టర్‌ ఆఫ్‌ కంపెనీస్‌కు లేఖలు రాసి ఆధారాలు సేకరించారు. త్వరలో పోలీసులు ట్రినిటి, సువిశాల్ కంపెనీల అక్రమాలపై హైకోర్టులో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయనున్నారు.

కూకట్‌పల్లి, మియాపూర్‌ భూములు తమ పూర్వీకులదంటూ.. నిజాం కుటుంబ సభ్యులు కోర్ట్‌లో పిటిషన్‌ వేశారు. ఇక కబ్జా చేసిన ట్రినిటి కంపెనీ, సువిశాల్‌ కంపెనీలు సైతం వ్యవసాయ భూములుగా నకిలీ డాక్యుమెంట్స్‌ను సృష్టించి తమదంటూ కోర్టులో వాదించారు. ఇరువురి వాదోపవాదనలు విన్న కోర్టు.. 814 ఎకరాల విలువైన భూమి తెలంగాణ ప్రభుత్వానిదేనని తీర్పు ఇచ్చింది. కూకట్‌ పల్లి, మియాపూర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌లో కంపెనీలు సృష్టించిన నాలుగు పాస్‌ పుస్తకాలు, ట్రాన్స్‌ఫర్‌ డాక్యుమెంట్స్‌తో పాటు సేల్‌డీడ్‌, ఫేక్‌ రిజిస్ట్రేషన్‌ ఆధారాలను పోలీసులు సేకరించారు. ఈ వ్యవహరంలో పోలీసులు అనేక అంశాలను పరిశీలించారు. నిందితుల బెయిల్ పిటిషన్‌ను మియాపూర్ కోర్టు డిస్మిస్ చేసింది. నిందితులను కోర్టు అనుమతితో కస్టడిలోకి తీసుకొని పోలీసులు ఈ కేసును మరింత వేగంగా దర్యాప్తు జరిపారు.

మియాపూర్‌ ప్రభుత్వ భూములను వ్యవసాయ భూములుగా చూపిస్తూ సువిశాల్‌, ట్రినిటీ కంపెనీలు అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. భూకబ్జాలకు పాల్పడిన నిందితులు పార్థసారధితో పాటు సబ్‌ రిజిస్ట్రార్‌ శ్రీనివాస్ మరికొందరు గతంలో అరెస్ట్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈకేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. తాజాగా ఈ కేసులో అన్ని ఆధారాలు, వివరాలతో కూకట్‌పల్లి పోలీసులు ఛార్జిషీట్‌ దాఖలు చేయనుండడంతో ఈకేసు చివరి అంకానికి చేరుకుంది. ఈ కేసులో అన్ని ఆధారాలు పక్కాగా సేకరించిన పోలీసులు.. త్వరలో ఛార్జిషీట్‌తో పాటు సాక్షులను కోర్టు ముందు హజరుపరుచనున్నారు.

ఓటింగ్ ప్రచార కార్యక్రమం...

హైదరాబాద్ : నేడు గ్రేటర్ పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రచార కార్యక్రమం జరుగనుంది. ఓటరు జాబితాలో పేరు నమోదు...సవరణలకు అవకాశం కల్పించనున్నారు. 

జెర్రిపోతులపాలెంకు వెళ్లనున్న వైసీపీ నేతలు..

విజయవాడ : జెర్రిపోతుల పాలెంలో దాడి జరిగిన దళిత మహిళ కుటుంబాన్ని వైసీపీ నేతలు పరామర్శించనున్నారు.

నేటి నుండి రాష్ట్రపతి శీతాకాల విడిది...

హైదరాబాద్ : నేటి నుండి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ శీతాకాల విడిది కోసం నగరానికి రానున్నారు. మధ్యాహ్నం 1 గంటకు బేగంపేట ఎయిర్ పోర్టుకు రాష్ట్రపతి చేరుకోనున్నారు. రాత్రి రాజ్ భవన్ లో విందుకు ఆయన హాజరు కానున్నారు. 

27న అమరావతికి రాష్ట్రపతి...

విజయవాడ : ఈ నెల 27న ఉదయం 10.30కి ANUలో జరిగే ఇండియన్ ఎకనమిక్ సమ్మిట్‌‌ లో భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పాల్గొననున్నారు. ఈనెల 27న ఉదయం 11.45 గంటలకు వెలగపూడి సచివాలయానికి రాష్ట్రపతి వస్తారు. అనంతరం మధ్యాహ్నం 12గంటలకు ఫైబర్ గ్రిడ్‌ను ప్రారంభించనున్నారు. అనంత‌రం చంద్రబాబు రాష్ట్రప‌తికి విందు ఇవ్వనున్నారు. 

జనవరి 31 నుండి మేడారం జాతర...

హైదరాబాద్ : జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు జరగనున్న మేడారం జాతరలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు కల్పించడానికి ప్రయత్నిస్తున్నామని మంత్రి కడియం శ్రీహరి అన్నారు. అలాగే మేడారం జాత‌ర‌ను జాతీయ పండుగ‌గా గుర్తించాల‌ని కేంద్రాన్ని కోర‌తామ‌ని దీని కోసం జ‌న‌వ‌రి 2న కొంతమంది మంత్రులు ఢిల్లీ వెళ్తామని చెప్పారు.

మదనపల్లిలో సీపీఎం 12వ మహాసభలు..

చిత్తూరు : జిల్లా మదనపల్లిలో సీపీఎం జిల్లా 12వ మహా సభలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇప్పటివరకూ రాష్ట్రాల్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలు రైతాంగానికి సబ్సిడీలో కోత పెట్టాయని సీపీఎం ఏపీ రాష్ర్ట కార్యదర్శి మధు విమర్శించారు. 

రాజస్థాన్ లో పెరిగిన మృతుల సంఖ్య..

రాజస్థాన్‌ : సవాయ్‌ మాధోపూర్‌ దుంబి ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు వంతెనపై నుంచి బస్సు పడిపోయిన ఘటనలో మృతుల సంఖ్య 32కు చేరింది. పదిమందికి తీవ్ర గాయాలయ్యాయి.. 

పాక్ మళ్లీ కాల్పులు...

జమ్మూ కాశ్మీర్ : రాష్ట్ర సరిహద్దులో పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. రాజౌరి జిల్లాలోని కెరి సెక్టార్‌లో పెట్రోలింగ్‌ చేస్తున్న భారత జవాన్లపై పాకిస్తాన్‌ సైన్యం కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో ఆర్మీ మేజర్‌తో పాటు ముగ్గురు జవాన్లు అమరులయ్యారు. మరో జవానుకు గాయాలయ్యాయి.

గుజరాత్ లో పర్యటించిన రాహుల్..

ఢిల్లీ : అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మరోసారి గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా రాహుల్‌ సోమ్‌నాథ్ ఆలయంలో శివుడికి పూజలు చేశారు. ఉదయం కేశోడ్ విమానాశ్రయం చేరుకున్న తర్వాత ఆయన రోడ్డు మార్గం ద్వారా సోమ్‌నాథ్‌కు వెళ్లారు. 

గ్యాంగ్ రేప్ కేసులో నిందితులకు జీవిత ఖైదు..

మధ్యప్రదేశ్‌ : రాజధాని భోపాల్‌లో సంచలనం సృష్టించిన గ్యాంగ్‌ రేప్‌ కేసులో అడిషనల్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టు తీర్పు వెల్లడించింది. 19 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడిన నలుగురు నిందితులను దోషులుగా తేల్చిన కోర్టు వారికి జీవిత ఖైదు విధించింది.

మరో క్లీన్ స్వీప్ పై కన్నేసిన టీమిండియా..

ఢిల్లీ : టీ20ల్లో తిరుగులేని టీమిండియా....ఫటా ఫట్‌ ఫార్మాట్‌లో మరో సిరీస్‌ క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది.తొలి రెండు టీ20ల్లో ఎదురులేని రోహిత్‌ అండ్‌ కో ...3వ టీ20లోనూ నెగ్గి సిరీస్‌తో పాటు సీజన్‌ను విజయంతో ముగించాలని తహతహలాడుతోంది. 

Don't Miss