Activities calendar

25 December 2017

21:30 - December 25, 2017

హైదరాబాద్ : మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు జినుగు నర్సింహారెడ్డి అలియాస్‌.. జంపన్న విప్లవ ఉద్యమ ప్రస్థానాన్ని ముగించారు. భార్య రజితతో కలిసి ఆయన సోమవారం డీజీపీ మహేందర్‌రెడ్డి సమక్షంలో పోలీసుల ఎదుట లొంగిపోయారు. మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలం చర్లపాలేనికి చెందిన జంపన్న పదో తరగతి వరకు సొంత ఊరిలోనే చదివారు. ఆతర్వాత ఐటీఐ చేయడానికి హైదరాబాద్‌ చేరుకున్నారు. ఎనిమిదో దశకంలో వెల్లువెత్తిన విద్యార్థి ఉద్యమ చైతన్యానికి ఆకర్షితుడై... అందులో భాగస్వామి అయ్యారు.

దర్శి నుంచి.. కేంద్ర కమిటీ సభ్యుడి స్థానానికి

జంపన్న రాడికల్‌ విద్యార్థిగా
జంపన్న రాడికల్‌ విద్యార్థిగా తన విప్లవ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు.. ఏటూరు నాగారాన్ని కార్యక్షేత్రంగా చేసుకుని పూర్తికాలం కార్యకర్తగా పనిచేశారు.. దళ సభ్యుడి స్థాయినుంచి డివిజన్‌ కార్యదర్శి స్థాయి వరకూ అక్కడే కొనసాగారు. అక్కడినుంచి దండకారణ్యం బాటలో అంచలంచెలుగా ఉద్యమ విస్తృతితో పాటు... ఆయన హోదా కూడా పెరుగుతూ పోయింది. రాష్ట్ర కార్యదర్శి స్థాయి నుంచి కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగారు. జంపన్న భార్య అనిత అలియాస్‌ రజిత సొంత ఊరు.. ఆత్మకూరు మండలం ఉల్లిగడ్డ దామెర. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ పూర్తి చేసిన రజిత విప్లవ రాజకీయాలవైపు ఆకర్షితులయ్యారు. 2002 నుంచి ఆమె అజ్ఞాతంలోనే ఉన్నారు. ఉత్తర తెలంగాణ జోనల్ కమిటీ ప్రెస్ టీమ్‌లో రజిత చేరారు. అప్పట్లో జంపన్న కమిటీ ప్రెస్ టీమ్ ఇన్‌ఛార్జిగా పని చేశారు. 2009లో జంపన్న- రజిత పెళ్లి చేసుకున్నారు. 2012లో రజితను ఒడిశా స్టేట్ కమిటీకి మార్చారు. మావోయిస్ట్‌ జంపన్న దంపతులపై ఉన్న కేసులు, రివార్డుల గురించి డీజీపీ మహేందర్‌రెడ్డి మీడియాకు వివరించారు. జంపన్న1984లో పీల్స్‌ల్స్‌గ్రూప్‌లో దళ సభ్యుడిగా చేరారని డీజీపీ తెలిపారు. పలు ఉద్యమాల్లో పాల్గొన్న ఆయనఅగ్రనేతగా ఎదిగారని అన్నారు.. జంపన్నమీద మొత్తంగా వంద కేసులు ఉండగా... కేవలం తెలంగాణలోనే సుమారు యాభైకి పైగా కేసులున్నట్లు చెప్పారు.. సైద్ధాంతిక విబేధాలతో మావోయిస్టు దళం నుంచి బయటకు వచ్చి లొంగిపోతున్నట్లు జంపన్న చెప్పారని డీజీపీ వెల్లడించారు. జంపన్నపై ఇరవై ఐదు లక్షలు, రజితపై ఐదు లక్షల రివార్డు ఉన్నట్లు తెలిపారు.. నిబంధనల ప్రకారం ఆ మొత్తాన్ని వారికే అందజేస్తామన్నారు.

ఉద్యమ జీవితానికి స్వస్తి
మావోయిస్ట్‌ దంపతులు జంపన్న, రజిత ఉద్యమ జీవితానికి స్వస్తి పలికి జనజీవనంలోకి రావడానికి గల కారణాలను వారు వివరించారు. రైతాంగం, విద్యార్థులు, ఉద్యోగులతో కలిసి పని చేయడంలో మావోయిస్టు పార్టీ విఫలమైందని ఇదివరకూ మావోయిస్టు అగ్రనేతగా పనిచేసిన జంపన్న అన్నారు. ఈకాలానికి అనుగుణంగా పార్టీ విధివిధానాలు లేవని ఆయన స్పష్టం చేశారు. తనతోపాటు తన సహచరి రజిత సుదీర్ఘ జీవితాన్ని మావోయిస్టు పార్టీ కోసమే అంకితం చేసి పనిచేశామన్నారు.. ఆ అజ్ఞాతన జీవితాన్ని వదులుకుని సాధారణ జీవితంలోకి రావాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం ముందు లొంగిపోతున్నానమని చెప్పారు. పార్టీ నాయకత్వానికి తెలిపిన తర్వాతే .. స్వచ్చందంగా ఇక్కడికి చేరుకున్నామని జంపన్న చెప్పారు. కేవలం సైద్ధాంతిక విబేధాలతోనే ఉద్యమాన్ని వీడుతున్నాం. ఇందులో ఎవరి బలవంతం కానీ ఇతర సమస్యలు కానీ లేవని జంపన్న వివరించారు... పార్టీ . నాయకత్వం చర్చిద్దాం ఉండమన్నా... సాధ్యం కాదని చెప్పి వచ్చేశాను అన్నారు. విప్లవ జీవితం మొత్తం ప్రజల కోసమే నిజాయితీ, నిబద్దతతో పని చేశామని వివరించారు.జంపన్న జనజీవనంలోకి వస్తున్న విషయం తెలియడంతో ఆయన బంధువులు, గ్రామస్తులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. 1984లో చివరిసారి సొంతూరిలో అడుగుపెట్టిన జంపన్న తండ్రి మల్లారెడ్డి ఇప్పటికే మృతిచెందగా... తల్లి యశోద కాజీపేటలోని ఓ వృద్ధాశ్రమంలో గడుపుతున్నారు. తనయుడి రాక కోసం ఆ తల్లి దశాబ్దాలుగా ఎదురుచూస్తోంది. జీవితంలో ఒక్కసారైనా కన్న కొడుకును కళ్ళారా చూడాలని ఉందని ఎన్నో సార్లు పోలీసులను కోరింది. ఇప్పుడు తన కొడుకు రాకతో ఆమె కోరిక తీరుతోంది.  

21:22 - December 25, 2017

గుంటూరు : రెండు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థిగా కేఈ ప్రభాకర్‌ పేరును సీఎం చంద్రబాబు ఫైనల్‌ చేశారు. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు వైసీపీ ప్రకటించింది. తమ పార్టీకి జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఎక్కువమంది ఉన్నా.. పోటీ చేయట్లేదని తెలిపింది. టీడీపీ మరోసారి డబ్బులతో ప్రజాస్వామ్యాన్ని కొనుగోలు చేయకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. LOOKకర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థిగా కేఈ ప్రభాకర్‌ను అధిష్టానం ఎంపిక చేసింది. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు రెండు విడతలుగా కర్నూలు జిల్లా నేతలతో సమావేశమై అభ్యర్థి ఎంపికపై చర్చించారు. చల్లా రామకృష్ణారెడ్డి, కేఈ ప్రభాకర్‌, శివానందరెడ్డి తదితరులతో చర్చించారు. ఫైనల్‌గా కేఈ ప్రభాకర్‌ పేరును ఖరారు చేశారు. అవకాశం దక్కని నేతలకు భవిష్యత్తులో అవకాశం కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

విలువలతో కూడిన రాజకీయాలు
మరోవైపు కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు వైసీపీ ప్రకటించింది. తమ పార్టీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఎక్కువమంది ఉన్నా.. పోటీ చేయట్లేదని తెలిపింది. తెలుగుదేశం పార్టీ మరోసారి డబ్బులతో ప్రజాస్వామ్యాన్ని కొనుగోలు చేయకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని.. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలన్నదే తమ పార్టీ లక్ష్యమని వైసీపీ నేతలు అన్నారు. గతంలో కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న శిల్పా చక్రపాణిరెడ్డి టీడీపీ నుంచి వైసీపీలోకి మారారు. పార్టీ మారే ముందు తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నిక తప్పనిసరిగా మారింది. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నిక నామినేషన్‌ గడువు మంగళవారంతో ముగియనుంది. ఎమ్మెల్సీ ఎన్నిక బరి నుంచి తప్పుకుంటున్నట్లు వైసీపీ ప్రకటించడంతో ఎన్నిక ఇక ఏకగ్రీవం కానుంది.

20:43 - December 25, 2017

కాలచక్రం గిర్రున తిరిగింది. కేలండర్ లో చివరి పేజీల్లో ఉన్నాం. సంవత్సరకాలంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక పరిణామాలు, ప్రమాదాలు, ప్రమోదాలు... కుట్రలతో ప్రపంచాన్ని మభ్య పెట్టి, నిఘాలతో తన ప్రయోజనాలు కాపాడుకునే దౌర్భాగ్యం ఒకరిది. కాళ్లకింద నేలను నిలబెట్టుకోవాలనే ఆరాటం మరోపక్క.., ఎగసిన నినాదాలు.., బిగిసిన పిడికిళ్లు, రాజకీయ చదరంగంలో ఎత్తులకు పై ఎత్తులు.., ప్రకృతి శాపానికి, విలయ తాండవానికి బలైన వారు... ఇలా అనేక ఘటనలను దాటుకుని 2017 ముగింపుకొచ్చింది.. ఈ రోజు వైడాంగిల్ లో వాల్డ్ రౌండప్ ను చూద్దాం..అయిదు దేశాలు..భవిష్యత్ ప్రపంచ ముఖచిత్రాలు.. ఒక్కటైన స్నేహహస్తాలు.. చైనా వేదికగా జరిగిన బ్రిక్స్ సమావేశం ఇప్పుడు అభివృద్ధి, సహకారం లాంటి అంశాలనే కాదు... తీవ్రవాదంలాంటి అంశాలకూ వ్యతిరేకంగా గళమెత్తింది. ప్రపంచంలోని పలుదేశాల కూటములలో అత్యంత ప్రభావం చూపుతున్న కూటమిగా బ్రిక్స్ దేశాల కూటమి నిలబడింది ..

కాళ్లకింద భూమి కదిలిపోతోంది. తలపైన ఆకాశం నిప్పుల వర్షం కురిపిస్తోంది. సంద్రం వైపు ఆశగా చూసే కళ్లను తీరం తిరస్కరిస్తోంది. వెరసి ఎవరికీ చెందని అభాగ్యులయ్యారు. మాతృభూమికి, పరాయిదేశానికి మధ్య బతుకు ప్రశ్నార్ధకంగా మారుతోంది. భూమిపై గీతలు గీసుకున్న సరిహద్దులు, నిబంధనల పేరుతో నిరాకరించి అపహసిస్తున్న పౌరసత్వాలు.. అణచివేతకు పరాకాష్టగా మారిన పరిస్థితులు.. వెరసి రోహింగ్యాలు ఇప్పుడు లెక్కల్లో లేని మనుషులు.. దేశం లేని పౌరులు.. ఉనికి నిరాకరించబడిన దీనులు..ఆధునిక ప్రపంచంలో అణచివేతకు నిజమైన ఉదాహరణగా కనిపిస్తున్నారు రోహింగ్యాలు ..మారణాయుధాలనే నమ్ముకున్న అమెరికా చివరకు తన బిడ్డలను కూడా అవే మారణాయుధాలకు బలితీసుకుంటోంది. అమెరికాలో జరుగుతున్నన్ని తుపాకీ చావులు ప్రపంచంలో మరెక్కడా జరగడం లేదు. అమెరికాలో తుపాకీ కాల్పులు వినిపించని రోజంటూ కనిపించటం లేదు.. గత అక్టోబర్ లో జరిగిన లాస్ వెగాస్ ఘటన అమెరికా గన్ కల్చర్ ఫలితాల్ని స్పష్టం చేస్తోంది.

లేని దేశాన్ని సృష్టించారు..ఉన్నదేశాన్ని నాశనం చేశారు..ప్రజలను వెళ్లగొట్టారు.. లక్షలాది మంది ప్రాణాలు తీశారు..ఇప్పుడు ఆ దేశ రాజధానిపై కన్ను పడింది. దానిపై జెండా ఎగరేసే కుట్రలు చేస్తున్నారు. అమెరికా, దాని తొత్తు ఇజ్రాయెల్ సాగిస్తున్న దురాగతాలు జెరూసలెం నగరాన్ని పాలస్తీనీయులకు కాకుండా చేసే దిశగా సాగుతున్నాయి. నోరు జారుతున్నారు. సై అంటే సై అంటున్నారు. తెరవెనుక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నీకంత సీన్ లేదంటే నీకంత సీన్ లేదంటున్నారు. నువ్వెంతంటే నువ్వెంతని సవాల్ విసురుతున్నారు..నార్త్ కొరియా మొండితనం, పెద్దన్న మూర్ఖత్వం 2017లో స్పష్టంగా కనిపించిన అంశం.. సరదాగా మొదలౌతుంది. రక్తం చిందటంతో ముగుస్తుంది. ఈ మధ్య కాలంలో నానా రకాల ఆటలాడిస్తుంది. అంతా గేమ్ లో భాగం అనుకుంటారు. కానీ, అది వాడి స్క్రీన్ ప్లేలో భాగమని గుర్తించలేరు. ఆడిస్తూ, పాడిస్తూ, బెదిరిస్తూ చివరకు చావుముంగిట్లోకి పిల్లలను లాక్కెళుతోందా గేమ్. అదే బ్లూ వేల్ ఛాలెంజ్ గేమ్.. 2017లో పిల్లల గురించి భయపడేలా చేసింది ఈ గేమ్గ్లోబల్ టెర్రరిజమ్ ఇండెక్స్.. ప్రపంచాన్ని మేల్కొనమని చెప్తోంది. టెర్రరిజం ఎలాంటి విధ్వంసం కలిగిస్తోందో కళ్లకు కడుతోంది. లెక్కలతో సహా రుజువులు కళ్లముందుంచుతోంది. భారత్ తో పాటు అనేక దేశాలకు ఉగ్రవాద ముప్పు బలంగా ఉందనే అంశాన్ని స్పష్టం చేస్తోంది. మాంచెస్టర్ లో జరిగిన ఘటన ఉగ్రవాదం ఎలా పెరుగుతోందో చెప్తోంది. స్పెయిన్ వేర్పాటు వాదంతో రగిలిపోతోంది. కాటలోనియా స్పెయిన్ నుంచి విడిపోవాలని బలంగా చేస్తున్న ప్రయత్నాలతో ఆ దేశం అట్టుడికి పోతోంది. మరోపక్క రెఫరెండం విడిపోటానికి అనుకూలంగా రావటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజా ఎన్నికల్లో కూడా విడిపోవాలనే వాదనకే మద్దతు లబించింది. ఇదీ వాల్డ్ రౌండప్.... ఇక మన దేశంలో ఏం జరిగింది? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరిగాయి.. ఎలాంటి పరిణామాలు దేశ గతిని మలుపుతిప్పుతున్నాయి... ? పూర్తి వివరాలకువ వీడియో క్లిక్ చేయండి.

20:33 - December 25, 2017

ప్రజలారా ఒక్కటి బాగ గమనించుండ్రి.. ఈ భూమ్మీద ఏ బిడ్డైనా తల్లి కడ్పులకెళ్లే జన్మిస్తడుగదా..? తల్లి కడ్పుల కెళ్లి బైటికి రానంత సేపు వానికి కులం అంటుతదా..? బైటికి రాంగనే కులం అంటుకుంటది.. మనుధర్మ శాస్త్రం అనేది ఎంటవడి వానికి కులాన్ని తలిగిస్తది.. బాపనోళ్లంల తల్కాయలకెళ్లి వుట్టిండ్రట.. పరిపాలించెటోళ్లు బుజాలళ్లకెళ్లి వుట్టిండ్రట.. కోమటోళ్లు తొడలళ్ల కెళ్లి వుట్టిండ్రట.. ఇగ బీసీలు,ఎస్సీ,ఎస్టీలు పాదాలకాడికెళ్లి వుట్టిండ్రట.. ఇట్ల వుడ్తుండొచ్చునా చెప్పుండ్రి..?

టీఆర్ఎస్ పార్టోళ్లే గాదు.. కాంగ్రెస్ పార్టోళ్లు గూడ బీసీల మీద గావురం డ్రమ్ముల కొద్ది కుమ్మరిస్తున్నరుగదా..? అధికారంలున్నప్పుడు వీళ్లు వట్టిచ్చుకోలే వాళ్లు వట్టిచ్చుకోలె.. మళ్ల అధికారం సాధించుకునెతందుకు బీసీలు యాదికొస్తున్నరు.. బీసీలతాన ఓటు అనే ఆయుధం లేకపోతె వాళ్లను దేకగూడ దేకకపోతుండే.. పార్టీల డ్రామాలు జూడుండ్రి బీసీ ప్రజలారా..?

ముల్లును ముల్లుతోనే దీయాలే.. పువ్వును పువ్వుతోనే గొయ్యాలే అన్నట్టు.. పదవికి దూరం జేశిన పాటను పాటతోనే ఎదుర్కోవాలె అనుకున్నట్టుంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ.. రెండువేల పందొమ్మిది ఎన్నికలకు పాటకాళ్లను తయ్యారు జేస్తున్నది.. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తర్పున సాంస్క్రుతిక శాతను ఏర్పాటు జేశి ఏపూరి సోమన్నను చైర్మన్ను జేశింది..

మొన్ననే గాదు సిరిసిల్ల కాడ ఒకామె సచ్చిపోతె కిరాయి ఇంటోళ్లు శవాన్ని తీస్కరాకుండ్రి అని ఎల్లగొట్టింది.. అగో సేమ్ అసొంటిదే మళ్లొకటి అయ్యింది అదే సిరిసిల్ల కాడ.. ఇంట్ల కిరాయి ఉన్నోళ్ల పైసలకు ఏ అంటు ముట్టు ఉండది తీస్కునెతందుకు.. వాళ్లు ఇంట్ల పండుగలు జేస్కుంటె పాపముండది.. కని ఆ ఇంటి మన్షి సచ్చిపోంగనే ఇంటి ఓనర్కు

అమ్మా నేను వుట్టినప్పుడు నువ్వు జోర బొంతల జుట్టి చెత్తకుండిల వడేయలేదుగదా..? నన్ను మంచిగ సాది పెద్దోన్ని జేశ్నందుకు.. నిన్ను దీస్కపోయి చెత్తకుప్పల ఏశి చేతులు గడుక్కుంట అని అన్నంత పనిజేశిండు ఒక కొడ్కు.. కన్నతల్లిని సంచిల మూటగట్టి బత్కుండంగనే చెత్తకుప్పలవడేశెటోన్ని కొడ్కే అందామా..? రాక్షసుడు అందామా చెప్పుండ్రి.. ఆ తల్లే లేకపోతే వీడెవ్వడు ఇంతకు..?

అయ్యా గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు.. శ్రీ నారాచంద్రబాబునాయుడుగారూ.. మీ కొడ్కుకు తాగుడు అల్వాటుండి.. రోజు తాగొచ్చి మీ కోడలును వేధిస్తుంటె ఒప్పుకుంటరా తమరు..? ఒప్పుకోరు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంల మహిళలు ఎందుకు ఒప్పుకోవాలె సారూ..? మీ ఇంటి ఆడోళ్లకున్నట్టు అక్కడి మహిళలకు ఆత్మగౌరవం లేదా..?

అబ్బా ఈ పోలీసోళ్లకు మామూళ్ల వసూలు జేసుడేగని.. పంచుకునుడు తెలుస్తలేనట్టుంది.. గంభీరావు పేట పోలీసు స్టేషన్ల సిబ్బంది మంచిగనే వసూలు జేస్తున్నరు.. ఉశ్కె ఫిల్టర్ల కాడ.. ఆడా ఈడగని.. పంచుకునుడు కాడనే పరేషాన్ అయితున్నదట.. ఆ పంచాది తెగక.. నల్గుట్ల కొచ్చింది ఇగ మరి మనమే తశ్వ జేయవల్సుంటది సూడుండ్రి..

 

20:20 - December 25, 2017

హైదరాబాద్ : తెలుగు భాషను రక్షించాల్సిన బాధ్యత న్యూస్ రీడర్లపై ఉందని హైకోర్టు జస్టిస్ రామలింగేశ్వర్రావు అభిప్రాయపడ్డారు. లలిత కళా స్రవంతి 15వ వార్షికోత్సవం సందర్బంగా హైదరాబాద్ త్యాగరాయగానసభలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా టెన్ టీవీ న్యూస్ రీడర్ జాన్సీని ఉత్తమ న్యూస్ యాంకర్ గా అవార్డుతో సత్కరించారు. ఇదే కార్యక్రమంలో టెన్ టీవీ అసిస్టెంట్ ఎడిటర్ సతీష్ ను ఆత్మీయ పురస్కారంతో... రామలింగేశ్వర్రావు, లలిత కళా స్రవంతి అధ్యక్షులు దీక్షితులు సన్మానించారు.

 

20:19 - December 25, 2017

ఢిల్లీ : మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి 93వ జన్మదినం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మోది స్వయంగా వాజ్‌పేయి ఇంటికి వెళ్లి ఆయన్ని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, విజయ్‌ గోయెల్‌ తదితర నేతలు వాజ్‌పేయి ఇంటికి వెళ్లి వాజ్‌పేయికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్విట్టర్‌ ద్వారా వాజ్‌పేయికి శుభాకాంక్షలు తెలిపారు. వాజ్‌పేయి డిసెంబర్‌ 25, 1924లో గ్వాలియర్‌లో జన్మించారు.

20:18 - December 25, 2017

జైపూర్ : గోవధపై రాజస్థాన్‌కు చెందిన బిజెపి నేత వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆవులను అక్రమ రవాణా చేసినా...వాటిని చంపినా వారికి అదే గతి పడుతుందని బిజెపి ఎమ్మెల్యే జ్ఞాన్‌దేవ్‌ అహుజా హెచ్చరించారు. అల్వర్‌ జిల్లా రామ్‌గఢ్‌ ప్రాంతంలో ఆవుల అక్రమ రవాణాకు యత్నించిన జకీర్‌ ఖాన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. జకీర్‌ నడుపుతున్న ట్రక్కును పోలీసులు ఆపేందుకు యత్నించగా అతడు బారికేడ్లను ఢీకొట్టి పారిపోయాడు. స్థానికులను జకీర్‌ ట్రక్కును అడ్డగించి అతడిపై దాడి చేశారు. ఈ ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే జ్ఞాన్‌దేవ్..జకీర్‌పై దాడి చేయలేదని చెబుతూ గోవధకు పాల్పడినవారికి చావుదెబ్బలు తప్పవంటూ వ్యాఖ్యానించారు. 

20:17 - December 25, 2017

ఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని మెజెంటా మెట్రో రైలు తొలిదశను ప్రారంభించారు. నోయిడాలోని బొటానికల్ గార్డెన్ నుంచి దక్షిణ ఢిల్లీలోని కల్కాజీ మందిర్ వరకు మెట్రో రైలు నడవనుంది. ప్రధాని మోదితో కలిసి ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, తదితరులు మెట్రో రైలులో ప్రయాణించారు. ఈ కార్యక్రమానికి ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌ను ఆహ్వానించకపోవడంపై ఆప్‌ మండిపడింది. రాజకీయ విబేధాల కారణంగానే కేజ్రీవాల్‌ను ఈ కార్యక్రమానికి పిలవలేదని దుయ్యబట్టింది. కోట్లాది రూపాయలు ఖర్చుతో రూపొందుతున్న ఈ మెట్రో రైలు వల్ల వచ్చే వందేళ్ల వరకు కూడా సామాన్య ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందని ప్రధాని మోది పేర్కొన్నారు. ఈ మార్గంతో నోయిడా, దక్షిణ ఢిల్లీ మధ్య ప్రయాణించే సమయం సగానికి సగం తగ్గనుంది.

20:16 - December 25, 2017

చెన్నై : ఆర్కేనగర్‌ ఉప ఎన్నిక ఓటమి నేపథ్యంలో అన్నాడీఎంకే పార్టీ సమీక్షా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వంతో పాటు పలువురు సీనియర్‌ నేతలు పాల్గొన్నారు. ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఓటమిపై చర్చించారు. అసమ్మతి నేతలు పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడం వల్లే ఘోర పరాజయం చెందినట్లు పార్టీ పేర్కొంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ఆరుగురు నేతలను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది. ఎమ్మెల్యే వెట్రివేల్, తంగ తమిళ్ సెల్వన్, రంగస్వామి, ముత్తయ్య, కలైరాజన్, షోలింగూర్, పార్థిబన్‌లను పార్టీ నుంచి తొలగించారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థి టీటీవీ దినకరన్ గెలుపొందిన విషయం తెలిసిందే. ఆయనకు క్రమంగా మద్దతు పెరుగుతుండడంతో ప్రభుత్వం నిఘా పెంచింది.

20:15 - December 25, 2017

ఇస్లామాబాద్ : పాకిస్తాన్‌ జైలులో ఖైదీగా ఉన్న కులభూషణ్‌ జాదవ్‌ను ఆయన తల్లి, భార్య కలుసుకున్నారు. రెండేళ్ల తర్వాత జాదవ్‌ను కలుసుకున్న ఆయన కుటుంబానికి ప్రత్యక్షంగా చర్చలు జరిపేందుకు అనుమతించలేదు. జాదవ్‌కు ఆయన తల్లి, భార్యకు మద్ద పెద్ద గాజు గ్లాస్‌ను గోడ మాదిరి అడ్డంగా ఏర్పాటు చేశారు. జాదవ్‌ భార్యకు ఫోను ద్వారా మాట్లాడేందుకు పాక్‌ అధికారులు అనుమతించారు. పాకిస్తాన్‌ విదేశాంగ శాఖ కార్యాలయంలో 35 నిముషాల పాటు జాదవ్‌తో వీరి సమావేశం జరిగింది. అంతకుముందు జాదవ్‌ భార్య, తల్లి అవంతిక మధ్యాహ్నం 12 గంటలకు ఇస్లామాబాద్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి వారిని భారీ భద్రత నడుమ భారత హైకమిషన్‌ కార్యాలయానికి తీసుకెళ్లారు. జాదవ్‌ కుటుంబ సభ్యులతో పాటు భారత దౌత్యాధికారి కూడా ఉన్నారు. గూఢచర్యం కేసులో పాకిస్థాన్ మిలిటరీ కోర్టు జాదవ్‌కు మరణ శిక్ష విధించింది. ఆయన ప్రస్తుతం జైలులో ఉన్నారు. జాదవ్‌కు మరణ శిక్షను అమలు చేయడంపై అంతర్జాతీయ న్యాయస్థానం స్టే విధించింది. 

20:14 - December 25, 2017

మనీలా : ఫిలిప్పీన్స్ వరద బాధితులకు SG కన్సల్టెన్సీ సాయం చేసి దాతృత్వం చాటుకుంది. వరద బాదితులకు ఆహారం, తాగునీరు, పళ్లు, పంపిణి చేశారు. దవావోలో ఎంబీబీఎస్‌ చదువుతున్న తెలుగు విద్యార్థులు- బొమ్మరిల్లు హాస్టల్‌ నిర్వాహకులతో కలిసి బాధితులకు ఆపన్న హస్తం అందించారు. 

20:13 - December 25, 2017

ఖమ్మం/మెదక్ : ఖమ్మంలో క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ క్రిస్మస్‌ వేడుకల్లో ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులు.. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేసి.. ఒకరికొకరుశుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మెదక్‌ చర్చ్‌లో క్రిస్మస్‌ సంబరాలు మిన్నంటాయి. క్రిస్మస్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. లోక రక్షకుడైన ఏసుక్రీస్తు లోకంలో అవతరించిన సంతోషాన్ని ఆనందోత్సాహాల మధ్య క్రైస్తవ సోదరులు పంచుకున్నారు.

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

చిత్తూరు : తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. భక్తులు 14 కంపార్టు మెంట్లో వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. 

19:19 - December 25, 2017

గుంటూరు : ఏపీలో క్రిస్మస్ సంబరాలు ఘనంగా జరిగాయి. విశాఖలోని సెయింట్‌ పాల్స్‌ చర్చ్‌లో క్రిస్మస్‌ వేడుకలు మిన్నంటాయి. క్రైస్తవులు పెద్ద ఎత్తున హాజరై ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రీస్తు ప్రభోదించిన బైబిల్‌ను ప్రతి ఒక్కరూ చదవి క్రీస్తు బోధనలను పాటించాలని చర్చ్‌ ఫాదర్‌లు సూచించారు. కృష్ణా జిల్లాలోని విజయవాడలో యేసు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలతో చర్చ్‌లు ఆధ్యాత్మికతను సంతరించుకున్నాయి. క్రిస్మస్‌ వేడుకల సందర్భంగా క్రైస్తవులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని వివిధ చర్చిల్లో ఉదయం నుంచి ప్రార్థనలు నిర్వహించారు. ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని చర్చ్‌ల్లోని దైవ జనులు భక్తి ప్రవచనాలను బోధించారు. అనంతరం క్రీస్తు దైవ కీర్తనలు ఆలపించారు.. ప్రార్థనల అనంతరం ఒకరికి ఒకరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

నెల్లూరులో అమెరికన్‌ బాప్టిస్ట్‌ చర్చ్‌లో
నెల్లూరులో అమెరికన్‌ బాప్టిస్ట్‌ చర్చ్‌లో అర్ధరాత్రి జరిగిన క్రిస్మస్ వేడుకల్లో మంత్రి నారాయణ పాల్గొన్నారు. ప్రజలు ఏసుక్రీస్తు చేసిన త్యాగాన్ని స్ఫూర్తిగా తీసుకుని.. శాంతియుత మార్గంలో నడవాలని మంత్రి సూచించారు. క్రీస్తు జననాన్ని, త్యాగాన్ని గుర్తుచేస్తూ సంతపేటలోని సైంట్ జోసెఫ్ చర్చిలో ఏర్పాటు చేసిన వేషాధారణలు అందరినీ ఆకట్టుకున్నాయి. క్రిస్మస్‌ సందర్భంగా విజయనగరంలోని థియోఫిలస్ చర్చ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. చర్చ్ నుంచి పట్టణంలోని ప్రధాన మార్గాల మీదుగా ఈ ర్యాలీ సాగింది. చిన్నా పెద్దా అంతా కుటుంబ సమేతంగా ఈ వేడుకలలో పాల్గొని క్రీస్తు నామమును స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఫాదర్‌ ప్రసాదరావు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగమూర్తి అయిన క్రీస్తు తాను కరుగుతూ లోకానికి వెలుగునిచ్చిన సందేశాన్ని కొవ్వొత్తుల ర్యాలీ చాటుతుందని అన్నారు.

సర్వ మానవాళికి ఏసు ప్రభువు
సర్వ మానవాళికి ఏసు ప్రభువు ఇచ్చిన భోదనలను ప్రతి ఒక్కరు అనుసరించాలని ఏపీ చీఫ్‌ విప్‌ పల్లె రఘునాథ్‌రెడ్డి అన్నారు. అనంతపురంలోని.. సీఎస్‌ఐ చర్చ్‌లో జరిగిన క్రిస్మస్‌ కార్యక్రమంలో పల్లె రఘునాథ్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులకు పల్లె రఘునాథ్‌రెడ్డి క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. ఏలూరులో క్రిస్మస్‌ వేడుకలు అంబరాన్నంటాయి. యేసు జన్మదినం సందర్భంగా నగరంలోని చర్చ్‌లను అందంగా అలంకరించారు. రంగు రంగుల విద్యుత్ దీపాలతో మెరిమిట్లు గొలిపేలా అలంకరించారు. అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కట్ చేసి ..ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. క్రైస్తవ సోదరులు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. 

19:18 - December 25, 2017

అనంతపురం : జిల్లా హిందూపురంలో వైన్‌షాపు, బార్‌ల యజమానులు ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు. స్వచ్ఛందంగా షాపులను మూసివేసి తమ నిరసన తెలిపారు. మొదట్లో వైన్ షాపులకు 18 శాతం మార్జిన్‌ ఇస్తానన్న ప్రభుత్వం 6 శాతానికి తగ్గించిందని.. షాపు రెంట్లు, సిబ్బంది జీతాలు, ఇతరత్రా ఖర్చులుపోనూ తమకు మిగిలేది ఏమీ లేదని షాపు యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ మార్జిన్‌ పెంచకపోతే.. ఆత్మహత్యలే శరణ్యమన్నారు. అనంతరం ఎక్సైజ్‌ సీఐ ప్రతాప్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు.

19:17 - December 25, 2017

కర్నూలు : జిల్లా ఆధోనిలో క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. బెట్టింగ్‌ నిర్వాహకుడు రాజాతో పాటు మరో 9 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరి వద్ద నుంచి 3 లక్షల 65 వేల రూపాయల నగదు, 25 సెల్‌ఫోన్లు, ఓ ఫోన్‌ లైన్‌ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. బెట్టింగ్‌ ముఠాను పట్టుకున్న పోలీసులను ఆధోని డీఎస్పీ అభినందించారు. 

టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కేఈ ప్రభాకర్

గుంటూరు : కర్నూలు జిల్లా స్థానిక సంస్థల అభ్యర్థిగా కేఈ ప్రభాకర్ ను ఎంపిక చేశారు. కేఈ ప్రభాకర్ పేరును సీఎం అధికారికంగా ఖరారు చేశారు.

19:10 - December 25, 2017

గుంటూరు : కర్నూలు జిల్లా స్థానిక సంస్థల అభ్యర్థిగా కేఈ ప్రభాకర్ ను ఎంపిక చేశారు. కేఈ ప్రభాకర్ పేరును సీఎం అధికారికంగా ఖరారు చేశారు. చంద్రబాబు ఉదయం నుంచి కర్నూలు జిల్లా నేతలతో మంతనాలు జరుపుతున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

ఆస్ట్రేలియాలో నల్లగొండవాసి మృతి

నల్లగొండ : ఆస్ట్రేలియా సిడ్నీలోని ఆపార్ట్ మెంట్ లో మిర్యాలగూడ వాసి ఆదినారాయణ రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. 6 నెలల క్రితమే ఆదినారాయణ రెడ్డి ఆస్ట్రేలియాకు వెళ్లారు.

19:06 - December 25, 2017

నల్లగొండ : ఆస్ట్రేలియా సిడ్నీలోని ఆపార్ట్ మెంట్ లో మిర్యాలగూడ వాసి ఆదినారాయణ రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. 6 నెలల క్రితమే ఆదినారాయణ రెడ్డి ఆస్ట్రేలియాకు వెళ్లారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

కర్నూలు ఎమ్మెల్సీ బరినుంచి తప్పుకున్న వైసీపీ

కర్నూలు : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక నుంచి వైసీపీ తప్పుకుంది. ఈ సందర్బంగా విలువలతో కూడిన రాజకీయాలు చేయడమే తమ లక్ష్యమని, టీడీపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని, టీడీపీ మరోసారి డబ్బులతో ప్రజాస్వామ్యాన్ని కొనుగోలు చేయకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని వైసీపీ తెలిపింది. 

18:17 - December 25, 2017

గుంటూరు : కర్నూలు జిల్లా టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు మరోసారి సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టికెట్ ఎవరికి కేటాయించాలని వారు భేటీలో చర్చించారు. రేపే ఎమ్మెల్సీ నామినేషన్ చివరి తేది కావడంతో నేడు రాత్రి అభ్యర్థి ఫైనల్ చేసే అవకాశం ఉంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

17:56 - December 25, 2017

హైదరాబాద్ : కుక్కల బెడదతో... హైదరాబాద్ వాసులు.. సతమతమవుతున్నారు. గుంపులు గుంపులుగా తిరుగుతూ.. కనిపించిన వారిపై దాడి చేస్తున్నాయి. కుక్క కాట్లతో చాలామంది ఆస్పత్రిపాలవుతున్నారు. 2014 నుంచి ఇప్పటి వ‌ర‌కు జీహెచ్‌ఎంసీ ప‌రిధిలో 70వేల మంది కుక్క కాటుకు గురయ్యారు. ఇక శివారు ప్రాంతాల్లో గ్రామ సింహాల దాడులకు అడ్డు అదుపు లేకుండా ఉంది. దీంతో ఒంటరిగా బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.

జీహెచ్‌ఎంసీ సెంటర్‌కి 20 నుంచి 25 ఫిర్యాదులు
ఈ నేపథ్యంలో కుక్కలను నియంత్రించాలంటూ... ప్రతిరోజు జీహెచ్‌ఎంసీ సెంటర్‌కి 20 నుంచి 25 ఫిర్యాదులు అందుతున్నాయి. అలాగే అధికారులకు నేరుగా అందే ఫిర్యాదులు ఎక్కువగానే ఉన్నాయి. దీంతో కుక్కలను అరికట్టేందుకు.. ప్రత్యేక ప్రణాళికలు రూపొందించామని .. బల్దియా అధికారులు చెబుతున్నారు. మా ఇంటి నేస్తం పేరుతో ఇప్పటి వరకు వెయ్యి కుక్క పిల్లలను జంతు ప్రేమికులకు అందజేశామంటున్నారు. అలాగే ఐదు జోన్స్‌లో యానిమల్‌ కంట్రోల్‌ సెంటర్లు పెట్టామని.. అంబర్‌పేట్‌, ఆటో నగర్‌, జీడిమెట్ల, చుడి బజార్‌, పటాన్‌చెరు ప్రాంతాల్లో ప్రతిరోజు వందలాది శునకాలకు స్టెరిలైజేషన్‌ చేస్తున్నామని.. అధికారులు చెబుతున్నారు. ఏడాదికి 80 నుంచి 90 వేల కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కూడా చేయిస్తున్నామని చెబుతున్నారు. అధికారులు చర్యలు తీసుకుంటున్నామని.. చెబుతున్నా.. ప్రతి రెండు మూడు వీధులకు కుక్కల సంఖ్య పదికి మించి ఉంటుంది. దీంతో ఏ కుక్క ఎటు నుంచి మీద పడుతుందో తెలియని పరిస్థితి ఎదురవుతోంది. 

17:55 - December 25, 2017

కరీంనగర్ : వీడియో ఫుటేజీ ఆధారంగా... శాతవాహన యూనివర్సిటీలో గొడవకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని సీపీ కమలాసన్‌రెడ్డి అన్నారు. ఎటువంటి గొడవలు జరగకుండా..యూనివర్సిటీ వద్ద ప్రత్యేకంగా పికెట్‌లను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. తాము అదుపులోకి తీసుకున్న విద్యార్థులను విచారించి గొడవకు కారణమైన వారిని గుర్తిస్తామని ఆయన అన్నారు.  

17:53 - December 25, 2017

హైదరాబాద్ : కథా సాహితి నిర్వహణలో జరిగిన తానా నవలల పోటీ 2017విజేతలకు బహుమతి ప్రదానం, తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగింది. నవలా రచయితలు బండి నారాయణ స్వామి, కె.ఎన్.మల్లీశ్వరి, సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డిలకు తానా ప్రచురణల కమిటీ చైర్ పర్సన్ కన్నెగంటి చంద్ర బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో బహుమతి పొందిన శప్తభూమి, నీల, ఒంటరి నవలలు ఆవిష్కరణ జరిగింది. పలువురు సాహితీ ప్రముఖులు, పాఠకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

17:50 - December 25, 2017

యాదాద్రి : క్రిస్మస్‌ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా... చౌటుప్పల్లో తెలంగాణ రాష్ట్ర బాలికల గురుకుల పాఠశాలలో మిస్ వరల్డ్ ఎస్మా వోలోడెర్ సందడి చేశారు. కేక్‌ కట్‌ చేసి.. అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. గురుకుల విద్యార్థులతో కలిసి.. నృత్యం చేసి.. అందరినీ అలరించారు. భారతీయుల సంస్కృతి సంప్రదాయాలు తనకు నచ్చాయని ఆమె అన్నారు. బాలికలు ఆత్మా విశ్వాసంతో లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు.

17:48 - December 25, 2017

నిజమబాద్/సంగారెడ్డి: జిల్లాలో క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. నిజామాబాద్‌తో పాటు కామారెడ్డి, బోధన్‌, ఆర్మూర్‌ పట్టణాలు గ్రామీణ ప్రాంతాల్లోని చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రీస్తు జన్మదినం ప్రపంచానికి వెలుగునిచ్చిందని క్రైస్తవ పాస్టర్లు అన్నారు. క్రీస్తు జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరువులో క్రిస్మస్‌ వేడుకలు మిన్నంటాయి. ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేసి.. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలిపుకున్నారు. స్థానిక కార్పొరేటర్ శంకర్ మాదవ్‌.. అయ్యప్ప స్వామి మాలధారణలో ఉండి కూడా.. క్రైస్తవ సోదరులతో కలిసి ప్రార్థనలు నిర్వహించి.. అందరికీ క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. 

17:47 - December 25, 2017

హైదరాబాద్ :మియాపూర్ భూవివాదం కేసు చివరిదశకు చేరుకుంది. మియాపూర్ భూవివాదం కేసులో కూకట్‌పల్లి సైబరాబాద్ పోలీసులు ఛార్జీషీట్ దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. రిజిస్ట్రేషన్‌ స్టాంప్స్‌ శాఖ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన కూకట్‌పల్లి పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.

భూమి తెలంగాణ ప్రభుత్వానిదే...
కూకట్‌పల్లి, మియాపూర్‌ భూములు తమ పూర్వీకులదంటూ.. నిజాం కుటుంబ సభ్యులు కోర్ట్‌లో పిటిషన్‌ వేశారు. ఇక కబ్జా చేసిన ట్రినిటి కంపెనీ, సువిశాల్‌ కంపెనీలు సైతం వ్యవసాయ భూములుగా నకిలీ డాక్యుమెంట్స్‌ను సృష్టించి తమదంటూ కోర్టులో వాదించారు. ఇరువురి వాదోపవాదనలు విన్న కోర్టు.. 814 ఎకరాల విలువైన భూమి తెలంగాణ ప్రభుత్వానిదేనని తీర్పు ఇచ్చింది. కూకట్‌ పల్లి, మియాపూర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌లో కంపెనీలు సృష్టించిన నాలుగు పాస్‌ పుస్తకాలు, ట్రాన్స్‌ఫర్‌ డాక్యుమెంట్స్‌తో పాటు సేల్‌డీడ్‌, ఫేక్‌ రిజిస్ట్రేషన్‌ ఆధారాలను పోలీసులు సేకరించారు. ఈ వ్యవహరంలో పోలీసులు అనేక అంశాలను పరిశీలించారు. నిందితుల బెయిల్ పిటిషన్‌ను మియాపూర్ కోర్టు డిస్మిస్ చేసింది. నిందితులను కోర్టు అనుమతితో కస్టడిలోకి తీసుకొని పోలీసులు ఈ కేసును మరింత వేగంగా దర్యాప్తు జరిపారు.

వ్యవసాయ భూములుగా చూపిస్తూ
మియాపూర్‌ ప్రభుత్వ భూములను వ్యవసాయ భూములుగా చూపిస్తూ సువిశాల్‌, ట్రినిటీ కంపెనీలు అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. భూకబ్జాలకు పాల్పడిన నిందితులు పార్థసారధితో పాటు సబ్‌ రిజిస్ట్రార్‌ శ్రీనివాస్ మరికొందరు గతంలో అరెస్ట్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈకేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. తాజాగా ఈ కేసులో అన్ని ఆధారాలు, వివరాలతో కూకట్‌పల్లి పోలీసులు ఛార్జిషీట్‌ దాఖలు చేయనుండడంతో ఈకేసు చివరి అంకానికి చేరుకుంది. ఈ కేసులో అన్ని ఆధారాలు పక్కాగా సేకరించిన పోలీసులు.. త్వరలో ఛార్జిషీట్‌తో పాటు సాక్షులను కోర్టు ముందు హజరుపరుచనున్నారు.

కర్నూలు నేతలతో మరోసారి సీఎం భేటీ

గుంటూరు : కర్నూలు జిల్లా టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు మరోసారి సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టికెట్ ఎవరికి కేటాయించాలని వారు భేటీలో చర్చించారు. 

ఎంపీ కార్యాలయంలో పేకాట...

కృష్ణా : జిల్లా కైకలూరులోని ఎంపీ మాగంటి బాబు కార్యాలయంలో పేకాట దందా నిర్వహిస్తున్నారు. ఫైనాన్స్ వ్యాపారులతో రోజు కోట్ల రూపాయల్లో వ్యాపారం చేస్తున్నారు. కార్యాలయంలో పేకాట ఆడే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

16:19 - December 25, 2017

కృష్ణా : జిల్లా కైకలూరులోని ఎంపీ మాగంటి బాబు కార్యాలయంలో పేకాట దందా నిర్వహిస్తున్నారు. ఫైనాన్స్ వ్యాపారులతో రోజు కోట్ల రూపాయల్లో వ్యాపారం చేస్తున్నారు. కార్యాలయంలో పేకాట ఆడే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంత జరుగుతున్నా పోలీసులు అలువైపు కన్నెత్తి కూడా చూడడంలేదు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

16:12 - December 25, 2017

హైదరాబాద్ : భారతరత్న, మాజీ ప్రధాని వాజ్‌పేయి 93వ పుట్టినరోజు సందర్భంగా బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసింది. దేశానికి సుపరిపాలన అందించిన గొప్పనాయకుడు వాజ్‌పేయి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు. ఆయన స్ఫూర్తితోనే మహిళామోర్చా ముందుకు వెళ్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బండారు దత్తాత్రేయ, నార్త్‌ ఢిల్లీ ఎంపీ మనోజ్‌ తివారీ, ఎమ్మెల్సీ రామచంద్రరావు, మహిళామోర్చా అధ్యక్షురాలు ఆకుల విజయ, ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి హాజరయ్యారు.

16:11 - December 25, 2017

గుంటూరు : టీడీపీ కార్యాలయంలో క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో టీడీపీ అధ్యక్షులు, మంత్రులు పాల్గొన్నారు. కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేక్‌ను కట్‌ చేసిన మంత్రులు ప్రజలకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. 

15:32 - December 25, 2017

ఇస్లామాబాద్ : పాక్ విదేశాంగ కార్యాలయంలో కుల్ భూషణ్ జాదవ్ ను ఆయన తల్లి, భార్య కలిశారు. జాదవ్ తో 30 నిమిషాలు మాట్లాడేందుకు పాక్ కోర్టు అనుమతి ఇచ్చింది. 21 నెలల తర్వాత జాదవ్ ను ఆయన కుటుంబ సభ్యులు కలిశారు. గూఢచర్యం జరిపారన్న ఆరోపణలతో పాక్ అతన్ని అరెస్ట చేసింది. ఆయన గత కొంత కాలంగా పాక్ జైల్ లో ఉన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

జాదవ్ ను కలిసిన ఆయన తల్లి, భార్య

ఇస్లామాబాద్ : పాక్ విదేశాంగ కార్యాలయంలో కుల్ భూషణ్ జాదవ్ ను ఆయన తల్లి, భార్య కలిశారు. జాదవ్ తో 30 నిమిషాలు మాట్లాడేందుకు పాక్ కోర్టు అనుమతి ఇచ్చింది. 21 నెలల తర్వాత జాదవ్ ను ఆయన కుటుంబ సభ్యులు కలిశారు. 

మౌనిక అనే గర్భిణి ఆత్మహత్య

పశ్చిమగోదావరి : జిల్లా తాడేపల్లిగూడెంలో మౌనిక అనే గర్భిణి ఆత్మహత్య పాల్పడింది. ఆత్మహత్యకు ముందు మౌనిక సెల్ఫీ వీడియో తీసింది. అందులో మౌనిక తన ఆత్మహత్యకు గల కారణాలను వివరించారు. తన భర్త నరేంద్ర అంటే తనకు ఇష్టంలేదని, తన పెళ్లి ఇచ్చిన నగలు, వస్తులు అన్నీ తీసుకోవాలని ఆమె తల్లిదండ్రులను కోరింది.

15:22 - December 25, 2017
15:19 - December 25, 2017

పశ్చిమగోదావరి : జిల్లా తాడేపల్లిగూడెంలో మౌనిక అనే గర్భిణి ఆత్మహత్య పాల్పడింది. ఆత్మహత్యకు ముందు మౌనిక సెల్ఫీ వీడియో తీసింది. అందులో మౌనిక తన ఆత్మహత్యకు గల కారణాలను వివరించారు. తన భర్త నరేంద్ర అంటే తనకు ఇష్టంలేదని, తన పెళ్లి ఇచ్చిన నగలు, వస్తులు అన్నీ తీసుకోవాలని ఆమె తల్లిదండ్రులను కోరింది. ఏ వస్తువును కూడా వదలొద్దని ఆమె వీడియోలో స్పష్టం చేసింది. 

మెజెంటా లైన్ మెట్రో రైలును ప్రారంభించిన మోడీ

ఢిల్లీ : ప్రధాని మోడీ మెజెంటా లైన్ మెట్రో రైలును ప్రారంభించారు. ఈ కార్యాక్రమానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హాజరైయ్యారు. కల్కాజీ మందిర్ బొటానికల్ గార్డెన్ వరకు మెజెంటా మెట్రో లైన్ 12.64 కిలోమీటర్ల పొడువు ఉంది. 

14:58 - December 25, 2017

కర్నూలు జిల్లా నేతలతో ముగిసిన సీఎం భేటీ

గుంటూరు : కర్నూలు టీడీపీ పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు భేటీకి ముగిసింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఎమ్మెల్సీ టికెట్ ఆశిస్తున్న వారితో చంద్రబాబు విడిగా సమావేశం నిర్వహించారు. 

14:39 - December 25, 2017

నేటి ఆధునిక మహిళలు సృజనాత్మకతకు చిరునామాగా మారుతున్నారు. రోజు రోజుకి పెరుగుతున్న మార్కెట్ తో పోటీ పడుతూ వ్యాపార రంగంలో తమదైనా ముంద్రను కనబరిచేందుకు ఆసక్తి చూపుతున్నారు. నలుగురిలో విభిన్న తమ ప్రాడక్టును తయారు చేస్తూ వ్యాపారంలో రాణిస్తున్నారు. వ్యాపారం అంటే లక్షల పెట్టుబడి పెట్టనక్కర్లేదు. టన్నులకొద్ది స్టాక్ పెట్టుకొనక్కర్లేదు. కానీ చేసే పనిలో కొత్తదనం, ఆకట్టుకునే విధానం ఉంటే వారి వ్యాపారానికి తిరుగు ఉండదు. చిన్ననాటి నుంచి ఆర్ట్ పై ఉన్న ఆసక్తితో కేక్ ల వ్యాపారంలో రాణిస్తున్న ఓ యువతి కథనంలో మీ ముందుకు వచ్చింది ఈనాటి మానవి స్ఫూర్తి ...పూర్తి వివరాలకువ వీడియో చూడండి. 

యువకుని దారుణ హత్య

రంగారెడ్డి : జిల్లా మదనపల్లిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురైయ్యాడు.గుర్తుతెలియని దుండగులు యువకుని పై పెట్రోల్ పోసి నిప్పంటించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

14:09 - December 25, 2017

రంగారెడ్డి : జిల్లా మదనపల్లిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురైయ్యాడు.గుర్తుతెలియని దుండగులు యువకుని పై పెట్రోల్ పోసి నిప్పంటించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

ఢిల్లీ మెట్రో రైలులో మోడీ...

నోయిడా : ఢిల్లీలో మెట్రో రైలులో ప్రధాని మోడీ, ఉత్తర్ ప్రదేశ్ సీఎం ప్రయాణించారు. బొటానికల్ గార్డెన్...కల్కాజీ మందిర్ మీదుగా రైలు వెళ్లనుంది. 

13:13 - December 25, 2017

హైదరాబాద్ : మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు..జంపన్న..33 ఏండ్ల అజ్ఞాతం.. ఎన్నో కేసులు..ఇతర రాష్ట్రాలలో కలిపి అతనిపై కోటి రూపాయల రివార్డు..ఉంది.. పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు జినుగు నర్సింహారెడ్డి ఎలియాస్‌ జంపన్న తన భార్యతో కలిసి ఎస్‌ఐబీ అధికారుల ముందు లొంగిపోయారు. వీరిని డీజీపీ మహేందర్ రెడ్డి మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు. జంపన్నపై నున్న రివార్డును వారికే ఇవ్వనున్నట్లు వెల్లడించారు. మిగతా మావోయిస్టులు కూడా లొంగిపోవాలన్నారు. 

12:45 - December 25, 2017

హైదరాబాద్ : సైద్ధాంతిక సమస్యల వల్లే తాను..తన భార్య లొంగిపోయినట్లు జంపన్న పేర్కొన్నారు. గిడుగు నర్సింహరెడ్డి అలియాస్ జంపన్న అనిత అలియాస్ రంజితలు రెండు రోజుల క్రితం పోలీసుల ఎదుట లొంగిపోయిన సంగతి తెలిసిందే. సోమవారం వీరిద్దరినీ మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు. విచారణలో మావోయిస్టు పార్టీ గురించి జంపన్న ఏమి చెప్పలేదని తెలుస్తోంది. ఇక మీడియా సమావేశంలో జంపన్న మాట్లాడుతూ...లొంగిపోవడం వెనుక ఎలాంటి ఒత్తిడి లేదని, లొంగిపోవడం తాను తప్పని భావించడం లేదని, మారిన పరిస్థితులకు అనుగుణంగా పార్టీ సిద్ధాంతాలు లేవన్నారు. విప్లవగీతాన్ని వదులుకుని సాధారణ జీవితం గడుపుదామని నిర్ణయించుకున్నట్లు, అందుకని లొంగిపోయినట్లు తెలిపారు. మావోయిస్టు పార్టీ నాయకత్వానికి ఇతరులకు తెలియచేయడం జరిగిందని, ఎలాంటి బలవంతమైన..ఇతర సమస్యలు ఏమీ లేవన్నారు. మావోయిస్టు పార్టీతో..ఇతర వారితో తమ విప్లవ జీవితం కొనసాగిందని..ఒక లైన్ ప్రకారం..నిజాయితి..నిబద్ధతతో పనిచేయడం జరిగిందన్నారు. నాటి పీపుల్స్ వార్ లైన్..సీపీఐ మావోయిస్టు లైన్ లు ఆనాడు బాగుండేవని, ఆ లైన్ లు తప్పు కాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో అనేక సామాజిక మార్పులు జరిగాయని..ఇంకా జరుగుతున్నాయని తెలిపారు. అప్పట్లో ఉన్నట్లు భూ స్వాములు ప్రస్తుత పరిస్థితుల్లో లేరని తెలిపారు. మారిన పరిస్థితులకనుగుణంగా పార్టీ అనేక సమస్యలు ఎదుర్కొందన్నారు. పార్టీలో వస్తున్న మార్పులతో సైద్ధాంతికంగా వారితో విబేధించడం జరిగిందన్నారు. ఈ విషయంలో పార్టీకి ఒక నివేదిక ఇవ్వడం జరిగిందన్నారు. 

12:41 - December 25, 2017

ఎలాంటి ఒత్తిడి లేదన్న జంపన్న..

హైదరాబాద్ : సైద్ధాంతిక సమస్యల వల్లే తాను..తన భార్య లొంగిపోయినట్లు జంపన్న పేర్కొన్నారు. లొంగిపోవడం వెనుక ఎలాంటి ఒత్తిడి లేదని, లొంగిపోవడం తాను తప్పని భావించడం లేదని, మారిన పరిస్థితులకు అనుగుణంగా పార్టీ సిద్ధాంతాలు లేవన్నారు. 

సెయింట్ పాల్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు..

విజయవాడ : సెయింట్ పాల్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. బైబిల్ లోని వ్యాక్యలు చదివి బాబు ప్రసంగించారు. క్రైస్తవ సోదరులందరికీ బాబు శుభాకాంక్షలు చెప్పారు. మనుషుల్ని, శత్రువుల్ని ప్రేమించడం క్రీస్తు నేర్పించారని, క్రిస్టియన్ మిషనరీలు ముందు చూపుతో విద్య..వైద్య రంగాలకు ప్రాధాన్యతనిచ్చాయన్నారు. 

ఇస్లామాబాద్ కు కులభూషణ్ జాదవ్ తల్లి..భార్య..

పాకిస్తాన్ : ఇస్లామాబాద్ కు కులభూషణ్ జాదవ్ తల్లి..భార్య చేరుకున్నారు. కాసేపట్లో పాక్ విదేశాంగ కార్యాలయంలో కుల్ భూషణ్ వారిద్దరిని కలువనున్నారు. గూఢచర్యం ఆరోపణలతో పాక్ జైల్లో అతను మగ్గుతున్న సంగతి తెలిసిందే. 

కర్నూలు జిల్లా నేతలతో బాబు భేటీ...

విజయవాడ : సీఎం క్యాంపు కార్యాలయంలో కర్నూలు జిల్లా నేతలతో టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై సమావేశంలో చర్చించారు.

కర్నూలు జిల్లా నేతలతో బాబు భేటీ...

విజయవాడ : సీఎం క్యాంపు కార్యాలయంలో కర్నూలు జిల్లా నేతలతో టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై సమావేశంలో చర్చించారు. 

12:30 - December 25, 2017

హైదరాబాద్ : మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు జంపన్న, భార్య రంజితలు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు డీజీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గిడుగు నర్సింహరెడ్డి అలియాస్ జంపన్న అనిత అలియాస్ రంజితలు పార్టీతో సైద్ధాంతికంగా విబేధించి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని వారు నిర్ణయించుకున్నారని, ఇతరులు కూడా ఇదే విధంగా చేయాలని ఆయన సూచించారు.

33 ఏళ్ల పాటు పార్టీ నిర్వహించిన వివిధ కార్యాక్రమాల్లో పాల్గొన్నారని, కొన్ని ఏళ్ల పాటు సుదీర్ఘంగా వివిధ హోదాల్లో వారు పనిచేశారని తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలో జంపన్న జన్మించాడని, మల్లేపల్లి ఐటీఐలో చదివే సమయంలో రాడికల్స్, పీపుల్స్ వార్ యూనియన్స్ లతో జంపన్నకు పరిచయం ఏర్పడిందని సిద్ధాంతాలకు ఆకర్షితులై మావోయిస్టులో చేరిపోయాడన్నారు. 1984లో దళ మెంబర్ గా జాయిన్ అయ్యాడని..1985లో ఏటూరు నాగారానికి దళ కమాండర్ గా ప్రమోటయ్యారని పేర్కొన్నారు. 1985 నుండి 1995 వరకు పనిచేయడం జరిగిందన్నారు.

1990లో శ్రీకాకుళం ఏరియా కమిటీ సెక్రటరీగా జంపన్న పనిచేశారని, నార్త్ తెలంగాణ ఫారెస్టు డివిజన్ కమిటీకి ఎంపికై వరంగల్..ఖమ్మం జిల్లాలను పర్యవేక్షించాడని తెలిపారు. 2001లో పార్టీ కాంగ్రెస్ సెంట్రల్ కమిటీ మెంబర్ గా ఎలివేట్ అవ్వడం జరిగిందని, 2003లో మిలటరీ కమిషన్ ఇన్ చార్జీగా నార్త్ తెలంగాణ జోన్ కమిటీకి రావడం జరిగిందన్నారు. 2004లో పీపుల్స్ వార్ గ్రూప్, ఎంసీసీఐ రెండిటీని కలిపి రెవల్యూషన్ తీసుకరావడంలో కీలక పాత్ర పోషించాడన్నారు.

ఇక అనేక కేసుల్లో ఇతన పాత్ర ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 51 కేసుల్లో ఇతని ప్రమేయం ఉందన్నారు. 1991 సంవత్సరంలో జయశంకర్ భూపాలపల్లి ప్రాంతంలోని వాజేడ్ పీఎస్ పై దాడి చేసి అక్కడున్న కానిస్టేబుల్ ను గాయపరిచి తుపాకులను ఎత్తుకెళ్లారన్నారు. చలపాక గ్రామం ఏటూరు గ్రామ పీఎస్ పరిధిలో 19981, జూన్ 15న ఎన్నికల విధులు ముగించుకుని వస్తున్న పోలీసు జీపును పేల్చివేసిన ఘటనలో పోలీసులు మరణించారని ఇందులో జంపన్న ప్రధాన పాత్ర వహించారని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 1997లో తరుకు గూడెం పీఎస్ పరిధిలో పలువురు పోలీసులను చంపేసి తుపాకులను ఎత్తుకెళ్లారని తెలిపారు.

2008 నుండి 2012 వరకు ఏఓబీ సెక్రటరీగా ఉన్నారని, 2008 జూన్ 29వ తేదీన బలిమెట ఘటనకు మాస్టర్ మైండ్ జంపన్నను పోలీసులు గుర్తించారు. మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీలోని 14 మందిలో జంపన్న 10వ వ్యక్తి. 

జంపన్న..రంజితలను విచారిస్తున్న పోలీసులు...

హైదరాబాద్ : మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు జంపన్న, భార్య రంజితను ఎస్ఐబీ కార్యాలయంలో పోలసీలు విచారిస్తున్నారు. కాసేపట్లో డీజీపీ మహేందర్ రెడ్డి వీరిని మీడియా ఎదుట ప్రవేశ పెట్టనున్నారు. అనారోగ్య కారణాల వల్లే వీరు లొంగిపోయినట్లు సమాచారం. 

11:56 - December 25, 2017
11:25 - December 25, 2017

సిద్ధిపేట : జిల్లాలోని కోమటి చెరువుపై మంత్రి హరీష్ రావ్ సోమవారం మార్నింగ్ వాక్ చేశారు. చెరువును మినీ ట్యాంక్ బండ్ లాగా మారుస్తున్నారు. దీనికి సంబంధించి పనులను ఆయన సందర్శించారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మున్సిపల్ ఛైర్మన్ కు సూచించారు. చెరువు పరిసరాల్లో చెత్తా..చెదారం పేరుకపోవడాన్ని గ్రహంచిన మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

11:12 - December 25, 2017

కరీంనగర్ : శాతవహన యూనివర్సిటీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. విద్యార్థి సంఘాలు దాడులకు దిగాయి. సోమవారం మనస్మృతిని యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు దగ్ధం చేశాయి. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ...ఆర్ఎస్ ఎస్ నేతలు వర్సిటీకి చేరుకున్నారు. దగ్ధం చేసిన సంఘాల నేతలపై దాడికి పాల్పడ్డారు. ఇరువర్గాలు రాళ్లు విసురుకున్నారు. ఒక్కసారిగా పరిస్థితులు ఉద్రిక్తతంగా మారిపోయాయి. ఘర్షణలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి పలువురు విద్యార్థి సంఘాల నేతలను అదుపులోకి తీసుకున్నారు. 

11:07 - December 25, 2017

ఢిల్లీ : దేశంలోని పలు రాష్ట్రాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దేశ రాజధానిలో పరిస్థితి దారుణంగా తయారైంది. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయని..పొగమంచు దట్టంగా అలుముకుంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సోమవారం పొగమంచు అలుముకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 11గంటలవుతున్నా పరిస్థితిలో ఏ మాత్రం మార్పు రాలేదు. సమీపంలో ఉన్న వాహనాలు కనిపించకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రవాణా వ్యవస్థ పై ప్రభావం చూపిస్తోంది. రైలు..విమాన సర్వీసులు ఆలస్యంగా ప్రయాణిస్తుండడం..రద్దు అవుతున్నాయి. 17 రైళ్లను రద్దు చేయగా ఆరు రైలు సర్వీసులను రీ షెడ్యూల్ చేశారు. 26 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచిస్తోంది.

 

వాజ్ పేయి నివాసానికి మోడీ..

ఢిల్లీ : మాజీ ప్రధాని వాజ్ పేయి నివాసానికి భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోడీ చేరుకున్నారు. నేడు వాజ్ పేయి జన్మదినమైన సంగతి తెలిసిందే. 

టమాటలను రోడ్డుపై పారపోసిన రైతులు...

అనంతపురం : క్లాక్ టవర్ వద్ద రైతులు టమాటలను రోడ్డు మీద పారపోశారు. రైతు సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. 

మనుస్మృతిని దగ్ధం చేసిన విద్యార్థి సంఘాలు..

కరీంనగర్ : శాతవాహన యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మనస్మృతిని యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు దగ్ధం చేశాయి. నిరసనగా వర్సిటీ విద్యార్థులపై బీజేపీ, ఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఇరువర్గాలు రాళ్ల దాడి చేసుకున్నారు. దీనితో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. 

10:35 - December 25, 2017

కర్నూలు : జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరు ? జిల్లా పచ్చ తమ్ముళ్ల గుండెలు దబ దబ మంటూ కొట్టుకుంటున్నాయి. ఎందుకంటే ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరో నేడే తేలనుంది. జనవరి 12న కర్నూలు ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరుగనున్న సంగతి తెలిసిందే. మంగళవారం నామినేషన్లకు చివరి తేదీ. ఎమ్మెల్సీ పదవి దక్కించుకోవాలని తెలుగు తమ్ముళ్లు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆశావాహులు భారీగా ఉండడంతో ఎవరిని ఎంపిక చేయాలో అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఇప్పటికే ఓ మారు చర్చలు జరిపినా ఎమ్మెల్సీ అభ్కర్థిపై స్పష్టత రాలేదు. దీనితో సోమవారం మరోసారి పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జిల్లా నేతలతో చర్చించనున్నారు.

ప్రధానంగా మొత్తం ఐదుగురు నేతలు ఎమ్మెల్సీ టికెట్‌ కోసం పోటీపడుతున్నట్లు సమాచారం. బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డికి సీటు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. నంద్యాల ఎంపీ ఎస్పీవైరెడ్డి అల్లుడు శ్రీధర్ రెడ్డి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు, నందికొట్కూరు పార్టీ ఇన్‌చార్జ్ ఎం. శివానందరెడ్డి కూడా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఇక టిడిపి అభ్యర్థి ఖరారు అనంతరం తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించాలని వైసీపీ యోచిస్తున్నట్లు టాక్. 19 నుంచి 26 వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరిస్తారు. 27న వాటి పరిశీలన, 29న ఉపసంహరణ ఉంటుంది. జనవరి 12న జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఎన్నికలు జరుగుతాయి. 16న కౌంటింగ్‌ ఉంటుంది. ఈ ఎన్నికలకు రిటర్నింగ్‌ అధికారిగా జాయింట్‌ కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ వ్యవహరించనున్నారు.

10:28 - December 25, 2017

మెదక్ : అన్నార్తుల ఆకలి తీర్చడం కోసం వెలసిన దేవాలయం అది. పరమత సహనాన్ని చాటుతూ శాంతికి...ప్రేమకు ప్రతీకగా నిలిచిన ఆధ్యాత్మిక కట్టడం అది. తరాలు కాల గర్భంలో కలిసిపోతున్నా చెక్కుచెదరకుండా నిర్భయంగా...నిశ్చలంగా నిలబడ్డ ప్రార్థనా మందిరం అది. అదే ఆసియాలోనే అతిపెద్ద కట్టడం మెదక్‌ చర్చ్‌. అక్కడ అడుగుపెడితే చాలు ఆధ్యాత్మిక పరిమళాలు...అల్లంత దూరాన్నుంచి చూసినా నిండుగా గాంభీర్యంగా.. కనిపించే మీనార్‌. కరుణామయుడే ప్రేమగా తన మందిరానికి పిలుస్తున్నాడని క్రైస్తవులు భావించే అత్యద్భుత ఆధ్యాత్మిక కట్టడం మెద

మెదక్‌ పట్టణంలో ఉన్న ఈ పురాతన చర్చ్‌ ఆసియాఖండంలోనే ప్రఖ్యాతి గాంచింది. గోతిక్ పునరుజ్జీవన తరహాలో కట్టిన ఈ చర్చికి 1914లో పునాదిరాయి పడితే 1924కు నిర్మాణం పూర్తయింది. లండన్‌కు చెందిన రెవరాండ్ చార్లెస్ వాకర్ ప్రోస్నేట్ అనే మతగురువు మెదక్ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ ప్రాంతమంతా కరువు కాటకాలతో, అనారోగ్యాలు, ఆకలితో అలమటిస్తోంది. ఇక్కడి వారికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రోస్నేట్ చర్చ్‌ నిర్మాణానికి పూనుకున్నాడు. పనికి ఆహార పథకంలాంటి దానిని ప్రవేశపెట్టి చర్చ్‌ నిర్మాణంలో అందరూ పాలపంచుకునేలా పని కల్పించాడు. 12 వేల మంది కార్మికులు 10 సంవత్సరాల పాటు శ్రమించి అత్యద్భుత కట్టడాన్ని నిర్మించారు. ఇందుకావలసిన నిధులను పస్నేట్‌ ఇంగ్లాండ్‌ నుంచే విరాళాలుగా సేకరించాడు. అప్పటిలో చర్చ్‌ నిర్మాణానికి ఖర్చయినది కేవలం 14 లక్షల రూపాయలు మాత్రమే. అలా మహోన్నత ఉద్దేశంతో, శ్రమజీవుల చెమట నుంచి పుట్టినదే మెదక్‌ చర్చ్.

ఇటలీ దేశస్తులతో పాటు భారత దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నిర్మాణ రంగ నిపుణులు, కళాకారులు చర్చిని అత్యంతసుందరంగా రూపుదిద్దారు. ఈ చర్చికి 200 అడుగుల పొడవు, 100 అడుగుల వెడల్పుతో ఉన్న కేథడ్రాల్ ఉంది. అతి పెద్దగా ఉండే ఈ కేథడ్రాల్‌లో ఒకేసారి 5,000 మంది ప్రార్ధన చేసుకోవొచ్చు. బ్రిటన్ నుంచి ప్రత్యేకంగా దిగుమతి చేసిన ఆరు వేర్వేరు రంగుల మొసాయిక్ టైల్స్ ఈ చర్చిలో ఉన్నాయి. ఈ చర్చికి చెందిన గచ్చు పనిని ఇటలీ తాపీ వారు చేశారు. ఇంగ్లాండ్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన అద్దాలపై యేసు ప్రతిమ.. క్రీస్తు జీవన విధానం తెలియజేసే అందమైన అక్షరాలతో దేవుడి చరిత్ర ముద్రించి ఉంటుంది. కుడి వైపు క్రీస్తు జననం.. ఎడమ వైపు శిలువ వేసిన దృశ్యం.. ముందు భాగంలో యేసు పునఃరుద్దరణం చిత్రాలు అద్భుతంగా దర్శనమిస్తాయి. సూర్యకిరణాలు తాకగానే ఈ చిత్రాలు మరింత ప్రకాశవంతంగా వెలుగుతుండటం ఈ చర్చ్‌ ప్రత్యేకత.

పూర్తిగా రాళ్లు, దంగుసున్నాన్ని ఉపయోగించి నిర్మించిన ఈ చర్చ్‌లో ప్రతీ అడుగు ఒక కళాఖండమే. పిల్లర్లు, బీములు లేకుండా రెండు అంతస్తులతో విశాలమైన ప్రార్థనా మందిరాన్ని, 175 అడుగుల ఎత్తైన శిఖరాన్ని నిర్మించడంతో నాటి పనితనానికి నిదర్శనం. చారిత్రక కట్టడంగాను, ఆధ్యాత్మిక కేంద్రంగాను ప్రఖ్యాతిగాంచిన మెదక్‌ చర్చ్‌ను చూసేందుకు దేశవిదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. క్రిస్మస్‌ పర్వదినాల్లో పర్యాటకుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. క్రిస్మస్‌ సందర్భంగా ఈ చర్చ్ విద్యుత్‌కాంతులతో మరింత శోభాయమానంగా ఉంటుంది. ఒక్క క్రైస్తవులే కాదు మిగతా మతాలవారు క్రిస్మస్‌ పర్వదినాల్లో ఈచర్చ్‌కు వచ్చి ప్రార్థనల్లో పాల్గొనడం పరమతసహనానికి ఓ నిదర్శనం.

10:27 - December 25, 2017
10:25 - December 25, 2017

తమిళనాడు : కాంచీపురంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న కారును ప్రభుత్వ బస్సు ఢీకొనడంతో ఏడుగురు మృత్యువాత పడ్డారు. పుదుకొట్టే ప్రాంతానికి చెందిన కుటుంబం కారులో ప్రయాణిస్తున్నారు. అచ్చరపాక్కం గ్రామ సమీపంలో రోడ్డు పక్కన కారును కొద్దిసేపు నిలిపారు. అదే సమయంలో వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు కారును ఢీకొంది. రోడ్డుపక్కనే ఉన్న చెరువులో కారు పడిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 

కాంచీపురంలో రోడ్డు ప్రమాదం...

తమిళనాడు : కాంచిపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అచ్చరపాక్కం గ్రామ సమీపంలో కారును బస్సు ఢీకొట్టింది. కారు చెరువులో పడిపోవడంతో ఆరుగురు చనిపోగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. 

కర్నూలు ఎమ్మెల్సీ అభ్యర్థిపై బాబు కసరత్తు...

కర్నూలు : జిల్లాకు ఏపీ టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వెళ్లనున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై జిల్లా నేతలతో చర్చించనున్నారు. రేపటితో ఎమ్మెల్సీ నామినేషన్ల స్వీకరణ ముగియనుంది.

 

09:20 - December 25, 2017

హైదరాబాద్ : సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ చర్చీలో క్రిస్మస్ సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. చర్చీలో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొనేందుకు ఉదయం నుండే చర్చ్ కు బారులు తీరారు. హిందీ..ఇంగ్లీషు..తెలుగు భాషల్లో ప్రార్థనలు చేయడం విశేషం. దేశ..తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో మెలగాలని ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు క్రైస్తవులు పాటలు పాడుతూ సంబరంగా గడిపారు. 

09:18 - December 25, 2017

సెయింట్ పాల్ చర్చ్ కు విచ్చేయనున్న బాబు..

విజయవాడ : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొననున్నారు. సోమవారం ఉదయం బెంజ్‌ సర్కిల్‌ సమీపంలోని సెయింట్‌పాల్‌ కథెడ్రల్‌ చర్చికి విచ్చేయనున్నారు. 

వాజ్ పేయికి బాబు జన్మదిన శుభాకాంక్షలు..

విజయవాడ : బీజేపీ సీనియర్ నేత అటల్ బిహారీ వాజ్‌పేయి పుట్టిన రోజు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

'హైదరాబాద్‌ నవాబ్స్‌' మూవీ ఫేమ్‌ ఆర్కేకు గాయాలు..

హైదరాబాద్ : జూబ్లీహిల్స్‌లో జరిగిన ప్రమాదంలో 'హైదరాబాద్‌ నవాబ్స్‌' మూవీ ఫేమ్‌ ఆర్‌కేకు స్వల్ప గాయాలయ్యాయి. జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబరు 31 వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారున మరో కారు ఢీకొంది. 

08:28 - December 25, 2017
08:15 - December 25, 2017
08:14 - December 25, 2017

కర్నూలు : క్షణికావేశం ఎంతో మంది జీవితాల్లో తీవ్ర విషాదం నింపుతోంది. నిండు ప్రాణాలు తీస్తూ..ప్రాణాలు తీసుకుంటూ ఇతరులకు తీవ్ర దు:ఖాన్ని నింపుతున్నారు. అంగన్ వాడీకి వెళ్లలేదనే చిన్న కారణంతో చిన్నారిని కసాయి తండ్రి చితకబాదాడు. ఈ ఘోరాన్ని చూడలేక అతని భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణ ఘటన గోనెగండ్ల (మం)ఎర్రవాడులో చోటు చేసుకుంది. అంగన్ వాడీకి వెళ్లలేదని కూతురు లావణ్య (3) కాలును కసాయి తండ్రి పాపారాయుడు విరగ్గొట్టాడు. అడ్డొచ్చిన భార్య అనంతమ్మపైనా దాడి చేశాడు. తీవ్ర మనస్థాపానికి గురైన అనంతమ్మ విషగుళికలు మింగి ఆత్మహత్య చేసుకుంది. అనంతమ్మ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు..

దేవర ఎర్రవాడులో విషాదం...

కర్నూలు : గోనెగండ్ల (మం) దేవరెర్రవాడులో విషాదం చోటు చేసుకుంది. అంగన్ వాడీకి వెళ్లలేదని కూతురు లావణ్య (3) కాలును కసాయి తండ్రి పాపారాయుడు విరగ్గొట్టాడు. అడ్డొచ్చిన భార్య అనంతమ్మపైనా దాడి చేశాడు. తీవ్ర మనస్థాపానికి గురైన అనంతమ్మ విషగుళికలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. 

08:03 - December 25, 2017

అందరి అంచనాలను తలకిందులు చేస్తూ తమిళనాడు ఆర్కే నగర్ ఉప ఎన్నికలో శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్‌ జయకేతనం ఎగురవేశారు. 40,707 ఓట్ల భారీ మెజార్టీతో అన్నాడీఎంకే అభ్యర్థి మధుసూదనన్‌పై విజయం సాధించారు. ఇది జయలలిత మెజార్టీ కంటే ఎక్కువ. ఎన్నికల్లో సత్తాచాటాలనుకున్న డీఎంకే డిపాజిట్‌ కోల్పోయింది. ఇక తమిళనాడులో పాగా వేయాలని భావించిన బీజేపీకి పరాభవమే మిగిలింది. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో తెలకపల్లి రవి (విశ్లేషకులు), రాకేష్ (బీజేపీ), బెల్లయ్య నాయక్ (టి.కాంగ్రెస్), రాజేంద్ర ప్రసాద్ (టిడిపి ఎమ్మెల్సీ), కరణం ధర్మశ్రీ (వైసీపీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ చర్చీలో...

హైదరాబాద్ : సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ చర్చీలో క్రిస్మస్ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. చర్చీలో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతున్నాయి.

 

వేములవాడకు భారీగా భక్తులు..

రాజన్న సిరిసిల్ల : వేములవాడ ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు. దీనితో స్వామి వారి దర్శనానికి పది గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీతో స్వామి వారి ఆర్జిత సేవలను రద్దు చేశారు. 

06:44 - December 25, 2017

ఢిల్లీ : టీమిండియా 2017ను ఘనంగా ముగించింది. వాంఖడే వేదికగా జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో భారత్‌ ఘన విజయం సాధించింది. శ్రీలంకపై ఐదు వికెట్ల తేడాతో గెలిచి.. టీ-20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసి.. టీ20 ఫార్మాట్‌లో రెండో ర్యాంకులో నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. లంక బ్యాట్స్‌మెన్లు పరుగులు చేయకుండా భారత్‌ బౌలర్లు నిలువరించారు. ఆదిలోనే లంకను దెబ్బతీశారు. జయదేవ్‌ ఉన్కదత్‌, సుందర్‌లు చెరో రెండు వికెట్లు తీసి పద్దెనిమిది పరుగులకే నాలుగు వికెట్లు పడగొట్టారు. ఆ తర్వాత సమర విక్రమ, అసేల గుణరత్నె కాసేపు నిలకడగా ఆడి పరుగులు రాబట్టారు. చివర్లో దసున్‌ శనక 29 పరుగులు చేసి నాటౌట్‌గా నిల్చి జట్టు స్కోరును 135కు చేర్చాడు.

స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. 4వ ఓవర్‌లోనే ఓపెనర్ కేఎల్ రాహుల్ ఎల్‌బీడబ్ల్యూ రూపంలో ఔట్ అయ్యాడు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ 20 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ బాది 27 పరుగులు చేసి పెవిలియన్ బాటపట్టాడు. ఈ పరిస్థితిలో యువ ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్, మనీస్ పాండే జట్టుకు భారీ స్కోర్ అందించేందుకు ప్రయత్నించారు. 81 పరుగుల వద్ద ధనంజయ బౌలింగ్‌లో శ్రేయస్ రనౌట్‌ అయ్యాడు. అ తర్వాత భారీ అంచనాలతో బరిలోకి దిగిన హార్థిక్ పాండ్యా 4 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అనంతరం దినేష్ కార్తీక్, ధోనీ విజృంభించి జట్టుకు విజయం అందజేశారు.

చివరి మ్యాచ్‌ కూడా భారత్‌ గెలిచి సీరీస్‌ను కైవసం చేసుకుంది. మూడు మ్యాచ్‌ల టీ20 సీరీస్‌ను భారత్‌ క్లీన్‌ స్విప్‌ చేసింది. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌, మ్యాన్‌ ఆఫ్‌ ద సీరీస్‌ అవార్డులు జయదేవ్‌ ఉన్కదత్‌ దక్కింది. శ్రీలంకతో జరిగిన టెస్ట్, వన్డే, టీ-20 సిరీస్‌లను భారత్‌ కైవసం చేసుకొని ఈ ఏడాదిని అద్భుతంగా ముగిచింది.

06:39 - December 25, 2017

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దు తర్వాత నుండి డిజిటల్‌ పేమెంట్స్‌ ఊపందుకుంటున్నాయి. నగదు చెల్లింపులకు కాలం చెల్లినట్లు కనిపిస్తోంది. అంతేకాదు నెట్‌ బ్యాంకింగ్‌, డెబిట్‌, క్రెడిట్‌ కార్డులకు తోడు... మొబైల్‌ వ్యాలెట్లు, పేమెంట్‌ బ్యాంకులు, భారత్‌ క్యూఆర్‌, ఆధార్‌ ఆధారిత ఎలక్ట్రానిక్‌ నిర్ధారణ సదుపాయం, మొబైల్‌ బ్యాంకింగ్‌ సదుపాయం అమల్లోకి రావటంతో చెల్లింపుల విధానం పూర్తిగా మారిపోయింది.

మన దేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత డిజిటల్‌ పేమెంట్లు గణనీయంగా పెరిగినట్లు ఐడీసీ ఫైనాన్షియల్‌ అనే సంస్థ తెలిపింది. అంతేకాదు 2022 నాటికి నగదు లావాదేవీల కంటే డిజిటల్‌ చెల్లింపులే అధికంగా ఉన్నట్లు పేర్కొంది. ప్రపంచంలో ఇంటర్నెట్‌ను అధికంగా ఉపయోగిస్తున్న దేశాల్లో మూడో స్థానంలో ఉన్న భారత్‌లో 30 కోట్ల మంది ఇంటర్నెట్‌ వినియోగదారులున్నారు. ఇందులో సగం మంది మొబైల్‌ నెట్‌ వినియోగదారులే. అయితే చెల్లింపుల్లో కొత్త విధానాలు కూడా అమల్లోకి రావడంతో డిజిటల్‌ చెల్లింపులు మరింత సులభంగా జరుగుతున్నాయి. 2016-17 లో జరిగిన మొత్తం లావాదేవీల్లో డిజిటల్‌ లావాదేవీల వాటా రెట్టింపు అయింది. 2017-18 నాటికి ఈ లెక్క 62 శాతానికి పెరుగుతుందని ఐడీసీ అంచనా వేస్తోంది.

ఆర్బీఐ గణాంకాల ప్రకారం ఈ ఏడాది అక్టోబర్‌లో 96.5 కోట్ల డిజిటల్‌ లావాదేవీలు నమోదయ్యాయి. ఇక ఏటీఎమ్‌ లావాదేవీలు తగ్గముఖం పడుతున్నాయి. 2022 నాటికి ఏటీఎం నుండి నగదు తీసుకోవడం కంటే పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ మెషీన్ల ద్వారానే చెల్లింపులు ఎక్కువగా చేస్తారని ఐడీఎస్‌ నివేదిక తెలిపింది. ఎటీఎమ్‌ లావాదేవీలను పీఓఎస్‌ లావాదేవీలు మించిపోతాయని ఐడీసీ అంచనా వేసింది.

ప్రీ పెయిడ్‌ విధానానికి కూడా ఆదరణ పెరుగుతున్నట్లు ఆర్‌బీఐ గణాంకాలు చెబుతున్నాయి. మొబైల్‌ ప్రీపెయిడ్‌ కార్డులు, గిఫ్ట్‌ కార్డులు, విదేశీ ప్రయాణ కార్డులు, కార్పొరేట్‌ కార్డులు, సోషల్‌ బెనిఫిట్‌ కార్డులు లాంటి ప్రీ పెయిడ్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ ద్వారా లావాదేవీలు 2015-16లో 74.80 కోట్లు నమోదు కాగా, 2016-17లో ఈ సంఖ్య 196.40 కోట్లకు పెరిగింది. పెద్ద నోట్ల రద్దు, డిజిటల్‌ చెల్లింపులకు ఇస్తున్న ప్రోత్సాహమే ఇందుకు కారణమని ఆర్‌బీఐ వివరించింది.

ప్రపంచంలో డిజటల్‌ చెల్లింపుల్లో చైనాకు తిరుగులేదు. కేవలం ముబైల్‌ చెల్లింపుల్లోనే చైనా గత ఏడాది 5.5 ట్రిలియన్‌ కంటే మించిపోయాయి. అమెరికాతో పోల్చితే 50 రెట్లు అధికంగా ఉంది. భారత్‌లో కేవలం 24 బిలియన్‌ డిజిటల్‌ లావాదేవీలు మాత్రమే నమోదవుతున్నాయి. అయితేనేం డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థ చైనా, యూకే, సింగపూర్‌లాంటి దేశాలతో పోలిస్తే భారత్‌ ఎంతో బలంగా ఉన్నట్లు యూఎస్‌కు చెందిన టెక్నాలజీ సేవల సంస్థ అయిన ఎఫ్‌ఐఎస్‌ ఒక నివేదికలో వెల్లడించింది. దేశంలో అమల్లో ఉన్న ఇమిడియెట్‌ పేమెంట్‌ సర్వీస్‌, యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌ విదానాలు దీనికి కారణమని ఆ సంస్థ వివరించింది. 2022 నాటికి ఇండియా డిజిటల్‌ పేమెంట్స్‌లో దూసుకుపోతుందనడంలో ఏమాత్రం సందేహంలేదంటున్నారు నిపుణులు. 

06:36 - December 25, 2017

కర్నూలు : జిల్లా చెన్నంపల్లి కోట తవ్వకాల అంశం కొత్త మలుపు తిరిగింది. కోట వారసులమంటూ ఓ వ్యక్తి తెరపైకి వచ్చారు. తామే కోట వారసులంటూ త్రివిక్రమరాజు అనే వ్యక్తి వంశ వృక్షాన్ని చూపిస్తున్నారు. చట్ట ప్రకారం కోట తమదేనని చెప్తున్నారు. కోటలో ఇక నుంచి ఎలాంటి తవ్వకాలు చేపట్టరాదని త్రివిక్రమరాజు తెలిపారు. తవ్వకాలు జరిపిన అధికారులపై కోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి..

06:34 - December 25, 2017

విజయనగరం : వైఎస్‌ జగన్‌పై కేంద్రమంత్రి అశోక్‌ గజపతిరాజు ఫైర్‌ అయ్యారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, వైఎస్‌ జగన్‌ను దొంగలుగా అభివర్ణించారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. రాబోయే ముప్పై ఏళ్ళు తానే ముఖ్యమంత్రిని అని జగన్‌ చెప్పుకోవడం హాస్యాస్పదమని అశోక్‌ గజపతి ధ్వజమెత్తారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సుజయ కృష్ణ రంగారావు ప్రతిపక్షనేత జగన్‌పై విమర్శలు గుప్పించారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధి ప్రతిపక్షనేతకు కనిపించటంలేదా అని ప్రశ్నించారు.

 

06:31 - December 25, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లోని అధికార, ప్రతిపక్ష నేతలంతా ఒక్కచోట కలిశారు. పార్టీలకతీతంగా హాజరైన నేతలంతా... యోగక్షేమాలతో పాటు.. అనేక అంశాలపై చర్చించుకున్నారు. కాసేపు ఆహ్లాదకరంగా గడిపారు. ఇందుకోసం రాష్ట్రపతి గౌరవార్ధం గవర్నర్‌ ఇచ్చిన విందు వేదికగా మారింది. శీతాకాలం విడిది కోసం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ హైదరాబాద్‌కు విచ్చేశారు. బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌లో విడిది చేశారు. రేపటి వరకు నగరంలోనే ఉండనున్నారు. రాష్ట్రపతి గౌరవార్ధం గవర్నర్‌ నరసింహన్‌.. రాజ్‌భవన్‌లో ప్రత్యేక విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్‌లు పాల్గొన్నారు. ఏపీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, తెలంగాణ శాసనమండలి చైర్మన్‌ స్వామీగౌడ్‌, డిప్యూటీ సీఎంలు కడియం శ్రీహరి, మహమూద్‌అలీ, నాయిని నర్సింహారెడ్డితో పాలు పలువురు నేతలు హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి హాజరైన కేసీఆర్‌, చంద్రబాబులు కాసేపు ముచ్చటించుకున్నారు. గవర్నర్‌ వారిద్దరిని రాష్ట్రపతి వద్దకు తీసుకెళ్లారు. ఇద్దరూ సీఎంలు అనేక అంశాలపై చర్చించుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం కేసీఆర్‌, చంద్రబాబులు రాష్ట్రపతి పక్కనే నిలబడి ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో హైలెట్‌గా చిరంజీవి, పవన్‌కల్యాణ్‌ నిలిచారు. ఈ కార్యక్రమానికి హాజరైన పవన్‌.. చిరంజీవితో కాసేపు ముచ్చటించుకున్నారు. చాలా కాలం తర్వాత అన్నదమ్ములిద్దరూ ఒకే దగ్గర కలవడం ఆసక్తి కలిగించింది. అలాగే పవన్‌కల్యాణ్‌, చిరంజీవి... రాష్ట్రపతి, కేసీఆర్‌, చంద్రబాబులతోనూ మాట్లాడారు. పార్టీలతో సంబంధం లేకుండా.. ఇరు రాష్ట్రాల నేతలు ఒకే దగ్గర కలిసి కాసేపు అన్ని అంశాలపై మాట్లాడుకోవడం విశేషం. 

06:29 - December 25, 2017

హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా క్రిస్మస్‌ సంబరాలు మిన్నంటాయి. అర్ధరాత్రి నుంచే చర్చిల్లో పండగ వాతావరణం నెలకొంది. క్రిస్మస్‌కు కొన్ని గంటల ముందు నుంచే అంతటా సందడి వాతావరణం నెలకొంది. కుటుంబ సమేతంగా క్రైస్తవులు క్రిస్మస్‌ వేడుకలను జరుపుకుంటున్నారు. చర్చిలన్నీ విద్యుత్‌ కాంతులతో వెలిగిపోతున్నాయి. క్రీస్తు జన్మదినం సంధర్భంగా క్రైస్తవ సోదరులు చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్‌ సందడి అంబరాన్ని తాకింది. శనివారం రాత్రి హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. కుటుంబ సభ్యులంతా చర్చిలకు చేరుకుని ప్రార్ధనలో పాల్గొన్నారు. క్రిస్మస్‌ కేక్‌ కట్‌ చేసి శుభాభినందనలు తెలుపుకున్నారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మెదక్‌ చర్చ్‌లో సంబరాలు మిన్నంటాయి. అర్ధరాత్రి నుంచే చర్చ్‌లో సందడి మొదలైంది. క్రిస్మస్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు అర్థరాత్రి నుంచే ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. లోక రక్షకుడైన ఏసుక్రీస్తు లోకంలో అవతరించిన సంతోషాన్ని ఆనందోత్సాహాల మధ్య క్రైస్తవ సోదరులు పంచుకుంటున్నారు. ఇతర ప్రాంతాల నుండి కూడా మెదక్‌ చర్చ్‌కు పెద్ద ఎత్తున క్రైస్తవులు చేరుకున్నారు.

ఖమ్మం జిల్లాలోని చర్చ్‌లన్నీ రంగు రంగుల కాంతులతో అలంకరించారు. పండుగని పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్ధనలు చేపట్టారు. మంచిర్యాల జిల్లాలోని లక్కెట్టిపేటలోని చర్చ్‌లో కూడా క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 85 ఏళ్ల చరిత్ర కల్గిన ఈ చర్చ్‌లో అర్ధరాత్రి నుండే ప్రత్యేక ప్రార్ధనలు చేపడుతున్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖులు క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌, ఇరు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, కేసీఆర్‌, వివిధ పార్టీల నేతలు శుభాకాంక్షలు తెలిపారు.

అటు విజయవాడలో గుణదలమాత చర్చిలో క్రిస్మస్ సంబరాలు అంబరాన్ని అంటాయి. గుణదలమాత గాయక బృందం ఆలపించిన క్రిస్మస్ గీతాలు భక్తులను ఆలరించాయి. భక్తులు కొవ్వొత్తులు వెలిగించి గీతాలు ఆలపించారు. ఈ వేడుకలకు బెజవాడ చుట్టు పక్కల ప్రాంతాల నుండి భక్తులు ఆశేష సంఖ్యలో తరలిరావడంతో ఆ ప్రాంగణం కళకళలాడింది. క్రీస్తు జన్మదినం సందర్భంగా ప్రత్యేక ప్రార్ధనలు చేపట్టారు.

విశాఖలో కూడా చర్చిలన్నీ వారం ముందు నుండే ముస్తాబయ్యాయి. విశాఖలో ఉన్న 18వ శతాబ్దానికి చెందిన సెయింట్‌ పాల్స్‌ చర్చి, భీమీలిలో ఉన్న ఫ్రెంచ్‌ చర్చ్‌ల్లో ప్రత్యేక ప్రార్ధనలు చేపట్టారు. ఒంగోలు లోని పురాతన మైన జ్యూవెట్‌ మెమోరియల్‌ బాపిస్ట్‌ చర్చ్‌లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. క్రీస్తుకు సంబంధించిన ప్రదర్శనలు చేపట్టారు. అటు రాజమండ్రి, కాకినాడలో కూడా ప్రత్యేక ప్రార్ధనలు అర్ధరాత్రి నుంచే ప్రారంభించారు. క్రీస్తు జననం సంధర్బంగా చర్చ్‌లోని బిషప్‌లు భక్తులకు శాంతి సందేశాన్ని ఇచ్చారు. ఇతరుల పట్ల ప్రేమ, దయ, కలిగి శాంతి స్థాపనకు ప్రయత్నించాలని సూచించారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కరుణమయుడి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రత్యేక ప్రార్థనలతో చర్చిలు మార్మోగిపోతున్నాయి. 

మెదక్ చర్చీలో ప్రత్యేక ప్రార్థనలు...

మెదక్ : ప్రఖ్యాతిగాంచిన మెదక్ చర్చ్ లో క్రిస్మస్ సందడి నెలకొంది. ఆదివారం అర్ధరాత్రి నుండే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దేశ..విదేశాల నుండి భారీగా క్రైస్తవులు తరలివచ్చారు. 

జగన్ పాదయాత్రకు బ్రేక్..

అనంతపురం : వైసీపీ అధ్యక్షుడు జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రకు ఒక రోజు విరామం ఇచ్చారు. సోమవారం క్రిస్మస్ పురస్కరించుకుని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. 

నేడు క్రిస్మస్ పర్వదినం..

హైదరాబాద్ : నేడు క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రైస్తవులు చర్చీల్లో ప్రార్థనలు జరుపుతున్నారు. చర్చీలను అందంగా అలంకరించారు. అర్ధరాత్రి నుండే ప్రత్యేక ప్రార్థనలు చేశారు. 

ఏకాంతంగా మాట్లాడుకున్న బాబు..కేసీఆర్...

హైదరాబాద్ : రాష్ట్రపతి గౌరవార్దం గవర్నర్‌ ఇచ్చిన విందులో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. విందులో పాల్గొన్న ఇద్దరు చంద్రులు చాలా సేపు ఏకాంతంగా మాట్లాడుకున్నారు. అయితే వీరి మధ్య ఏం చర్చ జరిగిందన్నది ఆసక్తి రేపుతోంది. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలపై చర్చించుకున్నట్టు తెలుస్తోంది.

ఇడుపులపాయకు వెళ్లనున్న జగన్ ఫ్యామిలీ...

కడప : జిల్లా ఇడుపులపాయలో క్రిస్మస్ వేడుకల్లో వైఎస్ కుటుంబసభ్యులు పాల్గొన్నారు. వైఎస్సార్ సమాధి వద్ద నివాళులు అర్పించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్.విజయమ్మ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.

హిమాచల్ సీఎంగా ...

హిమాచల్‌ప్రదేశ్‌ : రాష్ట్ర సీఎంగా బీజేపీ సీనియర్ నేత జైరామ్ ఠాకూర్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. అయితే సీఎం అభ్యర్ధి ధుమాల్ అనూహ్యంగా ఓటమి చవి చూశారు.

మనీలాలో భారీ అగ్నిప్రమాదం..37 మంది బలి..

ఢిల్లీ : ఓ పక్క భారీ తుపానుతో ఫిలిప్పీన్స్‌ దేశం వణికిపోతుంటే... మరోపక్క ఓ షాపింగ్‌మాల్‌లో జరిగిన అగ్నిప్రమాదం 37 మందిని బలితీసుకుంది. మనీలాలోని ఓన్సీసీ మాల్‌లోని ఫర్నీచర్‌ దుకాణంలో అగ్నిప్రమాదం జరిగింది.

టెంబిన్ తుఫాన్..200 మంది మృతి..

ఢిల్లీ : టెంబిన్‌ తుపాను ఫిలిప్పీన్స్‌ను అతలాకుతలం చేసింది. ఈ తుపాను 200 మందికి పైగా ప్రజలను బలితీసుకుంది. వేలాది మంది గాయడ్డారు. వంద మందికి పైడా జాడ తెలియకుండా పోయింది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. 

Don't Miss