Activities calendar

26 December 2017

21:59 - December 26, 2017
21:57 - December 26, 2017

ఢిల్లీ : భారత సైన్యం పాకిస్థాన్‌పై ప్రతీకారం తీర్చుకుంది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ప్రవేశించి పాకిస్థాన్‌ సైనికులపై కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ముగ్గురు పాక్‌ సైనికులు హతమయ్యారు. మరో జవాను గాయపడ్డారు. మృతులను సజ్జాద్‌, అబ్దుల్‌ రెహ్మాన్‌, ఉస్మాన్‌గా గుర్తించారు. గాయపడిన పాక్‌ సైనికుణ్ని హుస్సేన్‌గా   తేల్చారు. శనివారం పాక్‌ సైనికులు జరిపిన కాల్పుల్లో నలుగురు భారత జవాన్లు హతమయ్యారు. మృతుల్లో ఒక మేజర్‌ కూడా ఉన్నారు.  దీనికి ప్రతీకారంగా మన సైనికులు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోకి ప్రవేశించి కాల్పులు జరిపారు. 

 

21:54 - December 26, 2017

అనంతపురం : ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే వరకు వైసీపీ పోరాడుతుందని.. ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ అన్నారు. అనంతపురం జిల్లా కదిరిలో మహిళా ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆయన హోదా వస్తే ఇన్‌కం టాక్స్‌తో పాటు జీఎస్టీ లాంటి పన్ను మినహాయింపులు ఉంటాయని అన్నారు. రాయితీలు ఉంటేనే పరిశ్రమలు వస్తాయని.. యువతకు ఉద్యోగం, ఉపాధి లభిస్తుందని చెప్పారు. సభలో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే రోజా ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ అరాచకప్రదేశ్‌గా మారిపోయిందని అన్నారు. ఏపీలో మహిళకు భద్రత లేకుండా పోయిందని రోజా మండిపడ్డారు. 
 

21:52 - December 26, 2017

కరీంనగర్ : తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు పట్టుదలకు మారుపేరని మరోసారి రుజువైంది. ఇప్పటికే ఆకస్మిక తనిఖీలు, వరుస పర్యటనలతో తన పట్టుదలను నిరూపించుకున్న హరీశ్‌... ఇప్పుడు మరోసారి తన పట్టుదలను నిరూపించుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు మరింత వేగంగా పూర్తి చేయడానికి ఆయన అర్థరాత్రి వరకు పర్యటించారు. ఎలాంటి హడావుడి లేకుండా  కాళేశ్వరం ప్యాకేజీ 6,7ను సందర్శించారు. అంతేకాదు.. అటవీప్రాంతంలోని సుందిళ్ల బ్యారేజీ పనులను తనిఖీ చేశారు. 
సోమవారం రాత్రి నిరవధిక యాత్ర చేసిన హరీశ్‌
తెలంగాణ జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేసే మంత్రి హరీశ్‌రావు ఇప్పుడు మరో పర్యటన చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము 3గంటల  వరకు  ఆయన నిరవధిక యాత్ర  చేశారు.  సుందిళ్ల బ్యారేజీ సైట్‌లోనే హరీశ్‌రావు బస చేశారు. సోమవారం సాయంత్రం వరకు సిద్దిపేటలో వివిధ కార్యక్రమాల్లో బిజీబిజీగా గడిపిన హరీశ్‌... రాత్రి కాళేశ్వరం ప్యాకేజీ 6,7ను సందర్శించారు.  ఆ తర్వాత అటవీ ప్రాంతంలోని సుందిళ్ల బ్యారేజీ పనులను తనిఖీ చేశారు. నిర్ణీత కాలవ్యవధిలో పనులన్నీ పూర్తి చేయాలని  అధికారులను ఆదేశించారు. మంది మార్బలం లేకుండా ఈ ప్యాకేజీలలోని సొరంగాల నిర్మాణ పనుల పురోగతిని, పంపుహౌజ్‌ పనులను ఆయన పరిశీలించారు.  మంత్రి తనిఖీ చేసిన తీరుతో అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులు అవాక్కయ్యారు.  పోలీసు యంత్రాంగం దిగ్ర్భాంతికి గురయ్యింది.
సీఎం ఆదేశాలతో కదిలిన మంత్రి హరీశ్‌
కాళేశ్వరం ప్రాజెక్టు పనుల సమీక్ష సందర్భంగా హరీశ్‌రావుపై తెలంగాణ ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. ప్రజలకు సాగునీరు అందించేందుకు హరీశ్‌ ఎంతో చురుకుగా పనిచేస్తున్నారని మెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో హరీశ్‌రావు సోమవారం అర్థరాత్రి దాటాక కూడా మెరుపు తనిఖీలు సాగించారు. తెలంగాణలోని 15 జిల్లాలకు తాగు, సాగునీరు అందించే కాళేశ్వరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లభించడంతో వచ్చే జూన్‌కల్లా పంపులు నడిపించాలన్న కృతనిశ్చయంతో ఉన్నారు. ఇక మంగళవారం కన్నెపల్లి పంపు హౌజ్‌ నుంచి అన్నారం బ్యారేజీకి చేపట్టిన ఓపెన్‌ కెనాల్‌ పనులను పరిశీలించారు.  ఓపెన్‌ కెనాల్‌ పనులు నత్తనడకన సాగుతుండడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. 
కాళేశ్వరం ఎత్తిపోతలలో రాడికల్‌ మార్పులు
రాష్ట్ర సాగునీటిరంగ ముఖచిత్రంలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం రాడికల్‌ మార్పులు తీసుకురానుంది. అందుకే  ఈ ప్రాజెక్టు పనులను అత్యంత వేగంగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్‌ సంకల్పించారు. 18.80 లక్షల ఎకరాల ఆయకట్టును స్ధిరీకరించడం, మరో 18లక్షల ఎకరాలను అదనంగా సాగులోకి తేవడం లక్ష్యం. వచ్చే ఏడాది మార్చి నుంచి ఎల్లంపల్లి - మిడ్‌ మానేరు మార్గాన్ని సిద్ధం చేసుకుని...   జూన్‌లోగా మేడారం, అన్నారం, సుందిళ్ల పంపుహౌజ్‌లోనూ మోటర్ల ట్రయల్స్‌ను పూర్తి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు  చేస్తున్నారు. కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పనులు శరవేగంగా పూర్తి చేసేందుకు మంత్రి హరీశ్‌రావు కృషి చేస్తున్నారు.

 

21:46 - December 26, 2017

గుంటూరు : వ్యవసాయ రుణాల విషయంలో ఉదారంగా వ్యవహరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సదస్సులో పాల్గొన్న చంద్రబాబు... రైతులు, కౌలు రైతులు, పారిశ్రామిక వేత్తలకు రుణాలు త్వరితగతంగా ఇచ్చేందుకు 3 కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు గతేడాదితో పోలిస్తే... కౌలురైతులకు రుణ పంపిణి ఏడు రెట్లు పెరిగిందని మంత్రి సోమిరెడ్డి తెలిపారు. మూడో విడత రుణమాఫీలో భాగంగా రైతుల నుంచి 2వేల 900 కోట్ల మేర క్లైములు  వచ్చాయన్నారు.

 

గాంధీనగర్ లో చైన్ స్నాచింగ్

హైదరాబాద్ : గాంధీనగర్ లో దుండగులు చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారు. నడుచుకుంటూ వెళ్తున్న మహిళ నుంచి దుండగులు 3 తులాల బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు. 

 

21:19 - December 26, 2017

మా ఉద్యోగాలు మావే. అంతా లోకలే. ఎక్కడైనా గ్లోబల్ కానీ, ఉద్యోగాల దగ్గర మాత్రం కుదరదు..అంటోంది అమెరికా..  పెట్టుబడుల ప్రవాహానికి అడ్డుకట్ట ఉండకూడదన్నారు. ఇష్టారాజ్యంగా ప్రపంచంలో ఎక్కడైనా పెట్టుబడులు పెట్టి, లాభాలు తరలించుకుంటున్నారు. ఇప్పుడు ఉద్యోగాల వరకు వచ్చేసరికి లోకల్ లోకల్ అంటూ కొత్త రూల్స్ తీసుకొస్తున్నారు. ఇది ఆయా దేశాలకు సంబంధించిన సొంత విషయంగా కనిపిస్తున్నప్పటికీ, అంతిమంగా అనేక దేశాల ఉద్యోగాలపై ప్రభావం పడనుందా? ముఖ్యంగా మన టెకీలపై చాలా ప్రభావం చూపే అవకాశాలున్న కనిపిస్తున్నాయా? మన యువత డాలర్ డ్రీమ్స్ ప్రశ్నార్ధకం కానున్నాయా? ఇదే ఈ రోజు వైడాంగిల్ స్టోరీ..
ఇంజనీరింగ్ పూర్తియితే అమెరికా వైపు చూపు.. 
ఇంజనీరింగ్ పూర్తియితే చాలు... వెంటనే అమెరికా వైపు చూపు.. ఐటి జాబ్ లో చేరి నాలుగు రోజులు కాగానే ఆన్ సైట్ కోసం ఎదురు చూపు.. అమెరికాలో అడుగుపెట్టి... జీవితాన్ని ఉన్నపళాన మార్చేసుకోవాలనే కలలు.. వీటన్నిటికి ట్రంప్ దూకుడు అడ్డుకట్ట వేయనుందా? వీసాల నిబంధనల్లో తాజా మార్పులు గండికొట్టనున్నాయా? మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

21:10 - December 26, 2017

తెలంగాణ, ఆంధ్ర రెండు తెల్గు రాష్ట్రాలళ్ల.. బీసీలు జర్ర హుషారుకొచ్చినట్టే అనిపిస్తున్నది.. ఇద్వరకు ఎవ్వలి కులం వాళ్లకు.. ఎవ్వలి సంఘం వాళ్లకుండేది.. కని ప్రభుత్వాల నిర్ణయాల పుణ్యమాని.. బీసీలంత కులాలను పక్కకు వెట్టి.. మేమంత ఒక్కటే అనేకాడికొచ్చింది.. ఈ వచ్చిన చైతన్యం ఓట్ల పెట్టె దాక ఉంటే.. ఇగ బీసీలను ఆపుడు ఎవ్వలితరం గాదు..

ఏంరా వారీ గట్ల తిర్రి తిర్రి జేస్తున్నవ్.. హౌలెగానివా..? లఫంగ పనులు జేయకు అని పెద్దమన్సులు పోరగాళ్లను అంటుంటరు.. అయితే ఈ మాటలు పెద్దళ్లో చిన్నోళ్లను అనుడు మర్శిపోయిండ్రు ఇప్పుడు రాజకీయనాయకులు సమర్థంగ వాడుకుంటున్నరు.. తెలంగాణల ఈ నడ్మ తిట్ల పంచాది ఎక్వైంది.. మంత్రి లక్ష్మారెడ్డిని అయితే అడ్డగోల్గ తిట్టిండు రేవంత్ రెడ్డి.. ఇగ ఆ తర్వాత గూడ ఈ తిట్లు ఆగుతలేవు..

పోశమ్మ పోగేశి పెడ్తె.. మైసమ్మ మాయం జేశినట్టు..  పాపం గత ప్రభుత్వం పేదలకు ఇండ్లు గట్టుకునెతందుకు జాగలు మంజూరు జేస్తె.. పదేండ్లైతున్నా ఇప్పటికి పట్టాలు చేతులకు రాలేదు.. ఇండ్లు గట్టె ఇగురమే జర్గలేదు.. చంద్రబాబుగారు మీరు హైద్రావాదుల ఇల్లు గూలగొట్టి ఆర్నెళ్లళ్లనే గట్టుకుంటిరిగదా..? మరి పేదోళ్లకు గట్టె ఇండ్లకు ఇన్నేండ్లు ఎందుకు వడ్తున్నట్టు.?

రైతే రాజు... రైతును రాజును జేస్తం.. అన్నదాతను ఆదుకుంట.. ఇవ్వన్ని బట్టవాయి మాటలే మాన రాజకీయ నాయకులు జెప్పేటియి.. ఎవ్వడు ఆదుకోడు రైతును.. ఎవ్వని పొట్టవాడే నింపుకుంటడు.. ఇంకా గమ్మతి ముచ్చటేందంటే.. రైతును రాజును గాదు రాక్షసున్ని జేస్తరు.. తెల్గు రాష్ట్రాలళ్ల రైతుల గోస రాస్తె రామాయణమే అయ్యెతట్టున్నది..

సర్కారు బడి సారు ఊర్లె ఉన్న రాజకీయాలళ్ల కాలు వెట్టి కంపు కంపు జేస్తున్నడట.. ఊర్ల జనానికి నడ్మ తాకులాటలు వెడ్తున్నడట.. ఒక సారు జెయ్యంగ ఊరంత ఆగమైందట.. ఊర్లె పిల్లలకు సద్వు జెప్పి గ్రామానికి వెల్గులు దేవాల్సిన సారు.. పంచాదులు వెట్టి పగలు వెంచుతున్నడట.. ఇగ ఊరిజనమంత ఒక్కటే ఎంత పనిజేశిండ్రో సూడుండ్రి..

అయ్యా గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు.. శ్రీ నారాచంద్రబాబునాయుడుగారూ.. మీ కొడ్కుకు తాగుడు అల్వాటుండి.. రోజు తాగొచ్చి మీ కోడలును వేధిస్తుంటె ఒప్పుకుంటరా తమరు..? ఒప్పుకోరు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంల మహిళలు ఎందుకు ఒప్పుకోవాలె సారూ..? మీ ఇంటి ఆడోళ్లకున్నట్టు అక్కడి మహిళలకు ఆత్మగౌరవం లేదా..? 

మేము కొట్టినట్టు జేస్తం మీరు ఏడ్సినట్టు జేయుండ్రి.. ఆపాటికి సంకురాత్రి ఒడ్సిపోతది.. మీ కోడి పందాల కోరిక తీర్తది.. మనమంత గల్సి కోర్టును ఫూల్ జేద్దాం అన్నట్టు జెప్తున్నడు ఆంధ్రా హోంమంత్రి గారు.. కోడి పందాలు ఆడుకోండ్రి.. మేము అడ్డుకోము.. హైకోర్టు జెప్పిన దాని ప్రకారం నడ్సినట్టు యాక్టింగ్ జేస్తమంటున్నడు.. ఒక మంత్రిగారు మాట్లాడవల్సిన మాటనేనా ఇది..?

వారెవ్వ.. పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్టు.. ఖైదీలందు పుణ్య ఖైదీలు వేరయా అనుకుంటున్నరో ఏమో జైళ్ల శాఖోళ్లు.. లాలు ప్రసాద్ యాదవుకు గడ్డి తిన్నడని జైళ్ల ఏశిండ్రుగదా..? అగో ఆ కేసుల జైళ్లున్న లాలు సారుకు ఇంటికాడ లేని వసతులు గూడ జైళ్లనే ఏర్పాటు జేశిండ్రంటే.. దొంగలను మేపుతున్నరా..? ఊపుతున్నరా అర్థంగాదు..

సమస్యలపై దృష్టి పెట్టకుండా ఎన్నికలపై దృష్టి పెట్టడం దురదృష్టకరం : పవన్

హైదరాబాద్ : ఫాతీమా మెడికల్ కాలేజ్ విద్యార్ధుల సమస్యలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్‌లో స్పందించారు. చట్టాలు, శిక్షలు బలహీనుల కోసమే రూపొందించినట్లు అనిపిస్తోందని ఆయన అన్నారు. ఫాతిమా కాలేజీ విద్యార్ధులకు జరిగిన అన్యాయం అభివృద్ధి చెందిన దేశాలలో జరిగితే భారీ జరిమానా విధించడమే కాకుండా కఠినమైన శిక్షలు అమలయ్యేవని పవన్ అన్నారు. ప్రభుత్వం, అధికారులు విద్యార్ధుల సమస్యలపై దృష్టి పెట్టకుండా వచ్చే ఎన్నికలపై దృష్టి పెట్టడం దురదృష్టకరమని పవన్ ట్విట్టర్‌లో వెల్లడించారు. 

20:37 - December 26, 2017

చెన్నై : సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ పొలిటికల్‌ ఎంట్రీ ఇక ఖాయమేనా..? ఇవాళ్టి నుంచి ప్రారంభమైన ఫ్యాన్స్‌తో భేటీ దీనికి తుది కసరత్తేనా..? తలైవా పొలిటికల్‌ ఎంట్రీకి ముహూర్తం ఈ భేటీల్లోనే ఖరారు కానుందా? ఈ అన్ని ప్రశ్నలకూ సమాధానం ఈనెల 31 న దొరుకుతుందని రజనీ ఫ్యాన్స్‌ భావిస్తున్నారు.  
సినీ హీరోల్లో రజనీకాంత్‌ స్టైలే వేరు...
సినీ హీరోల్లో రజనీకాంత్‌ స్టైలే వేరు. ఆయన సినిమాల్లో చూపే మానరిజమ్‌, డైలాగ్‌ డెలివరీ ప్రేక్షకులను ముగ్దుల్ని చేస్తుంది. సినిమా సినిమాకో స్టైల్‌తో అభిమానులను అలరిస్తారు. అందుకే ఆయన అభిమానుల ఆరాధ్యం అయ్యారు. తలైవా పొలిటికల్‌ ఎంట్రీ ఇస్తారన్న ఊహాగానాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. జయలలిత మరణం తర్వాత అభిమానుల ఒత్తిడి రజనీపై ఎక్కువైంది. ముత్తు పాలిటిక్స్‌లోకి రావాలని... అందుకే ఇదే సరైన సమయమని కోరారు. అయితే రజనీమాత్రం  తన పొలిటికల్‌ ఎంట్రీపై క్లారిటీ ఇవ్వలేదు. అప్పుడప్పుడు అభిమానులతో సమావేశమవుతుండడంతో.. రజనీ రాజకీయ రంగప్రవేశం ఖాయమన్న ఊహాగాలు ఊపందుకున్నాయి. మంగళవారం అరుణాచలం అభిమానులతో మరోసారి సమావేశం అయ్యారు.  చెన్నైలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో అభిమానులతో రెండోవిడత ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. అయితే దళపతి ఈ సమావేశంలోనైనా రాజకీయ ఆరంగ్రేటంపై ప్రకటన చేస్తారని అందరూ భావించారు. కానీ రజనీకాంత్‌ మాత్రం మళ్లీ సస్పెన్సే క్రియేట్‌ చేశారు. ఈనెల 31న తన నిర్ణయం ప్రకటిస్తానంటూ అందరినీ ఉత్కంఠకు గురిచేశారు. ఎన్నికలంటే ఓ యుద్ధమని.. ఆ యుద్ధంలో గెలవాలంటే వీరత్వం ఒక్కటే ఉంటే సరిపోదని.... అందుకు తగిన వ్యూహం కూడా ఉండాలన్నారు. యుద్ధరంగంలో అడుగుపెట్టాక తప్పకుండా గెలవాలని, దేవుడి దయ ఉంటే తప్పకుండా రాజకీయాల్లోకి వస్తానని చెప్పారు. తనకు రాజకీయాలు కొత్తేంకాదని.. కాకపోతే ఆలస్యమైందని చెప్పారు. 
అభిమానులతో తన జీవితాన్ని గుర్తుచేసుకున్న రజనీ  
అభిమానులతో తన జీవితాన్ని రజనీ గుర్తు చేసుకున్నారు. తాను సినిమాల్లోకి వస్తానని అనుకోలేదని, హారో కావడం తనకే ఆశ్చర్యం కలిగించిందన్నారు. మొదట్లో హీరోగా చేయడానికి భయపడ్డానని చెప్పారు. తాను మొదట్లో నటించేదే నటన అనుకున్నానని... దర్శకుడు మహేంద్రన్‌ తనకు నటనలో మరిన్ని మెళకువలు  నేర్పించారన్నారు. నటనలో తనను మరో స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి మహేంద్రన్‌ అని రజనీ కొనియాడారు. అభిమానులతో రజనీకాంత్‌ రెండో దఫా సమావేశాలు ఈనెల 31 వరకు కొనసాగనున్నాయి. అదేరోజూ తలైవా పొలిటికల్‌ ఎంట్రీపై ఓ క్లారిటీ వస్తుందని ఫ్యాన్స్‌ కూడా నమ్ముతున్నారు. మరి ఈసారైనా తలైవా తలూపుతారా..? లేక ఎప్పట్లాగానే వాయిదా వేసేస్తారా..? వెయిట్‌ అండ్‌ సీ..
 

 

20:32 - December 26, 2017
20:30 - December 26, 2017

అనంతపురం : ప్రజలకు ఆల్‌లైన్‌ విధానం ద్వారా మెరుగైన సేవలు అందిస్తున్నామని అనంతపురం జిల్లా రవాణా ఉప కార్యనిర్వహణ అధికారి డాక్టర్‌ సుందర్‌ వడ్డి తెలిపారు. అనంతపురం రవాణా కార్యాలయంలో ఇప్పుడు క్యాష్‌లెస్‌ విధానాన్ని కూడా అమలు చేస్తున్నామన్నారు. క్యాష్‌లెస్‌ విధానం అమలు చేస్తోన్న ఆర్టీవోల్లో తాము మొదటి స్థానంలో ఉన్నామని తెలిపారు. ఈ విధానం ద్వారా ప్రజలు ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదన్నారు. ఆన్‌లైన్‌లోనే వెహికిల్‌ రిజిస్ట్రేషన్లు, లైసెన్స్‌లు అప్లై చేసుకోవచ్చని చెప్పారు. బ్రోకర్ల వ్యవస్థను పూర్తిగా తొలగించామన్నారు. 

 

20:28 - December 26, 2017

అనంతపురం : జిల్లాలోని హిందూపురంలో టమోటా రైతులు రోడ్డెక్కారు. కేజీ టమోటా ధర 50 పైసలు మాత్రమే పలుకుతుండటంతో.. రోడ్డుపైన పారబోయి నిరసన తెలిపారు. టమోటా పండిస్తే లాభం మాటామోగానీ కూలీ డబ్బులు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ఎకరం టమోటా సాగు చేస్తే దాదాపు 50 వేల రూపాయలు ఖర్చు అవుతుందని.. టమోటా పంటకు 5 వేల రూపాయలు కూడా రావడం లేదన్నారు. ప్రభుత్వం టమోటా రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. కేజీ టమోటాకు కనీసం 15 రూపాయల మద్దతు ధరైనా వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. హిందూపురంలో కోల్డ్‌ స్టోరేజీ సౌకర్యం ఏర్పాటు చేయాలని టమోటా రైతులు డిమాండ్‌ చేశారు. 

 

20:25 - December 26, 2017

హైదరాబాద్ : ఫాతీమా మెడికల్ కాలేజ్ విద్యార్ధుల సమస్యలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్‌లో స్పందించారు. చట్టాలు, శిక్షలు బలహీనుల కోసమే రూపొందించినట్లు అనిపిస్తోందని ఆయన అన్నారు. ఫాతిమా కాలేజీ విద్యార్ధులకు జరిగిన అన్యాయం అభివృద్ధి చెందిన దేశాలలో జరిగితే భారీ జరిమానా విధించడమే కాకుండా కఠినమైన శిక్షలు అమలయ్యేవని పవన్ అన్నారు. ప్రభుత్వం, అధికారులు విద్యార్ధుల సమస్యలపై దృష్టి పెట్టకుండా వచ్చే ఎన్నికలపై దృష్టి పెట్టడం దురదృష్టకరమని పవన్ ట్విట్టర్‌లో వెల్లడించారు. 

 

20:15 - December 26, 2017

చిత్తూరు : ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా.. కుప్పం నియోజకవర్గంలోని పల్లెలు జ్వరంతో వణుకుతున్నాయి. ఆయా గ్రామాల్లోని ప్రజలు అనారోగ్యంతో మృత్యువాత పడుతున్నారు. గ్రామాల్లో పారిశుధ్య అధ్వానంగా ఉండడంతో.. ప్రజలు వాంతులు, విరేచనాలతో.. ఆస్పత్రి పాలవుతున్నారు. ఇప్పటికే కంచిబందార్లపల్లెలో  అనారోగ్యంతో ఓ చిన్నారి మృతి చెందగా.. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. అలాగే కుప్పం పట్టణంలోని నేతాజీ రోడ్డు, విజయలక్ష్మీ రోడ్డు, మునస్వామిపురం, ఎస్సీ, బీసీ కాలనీలకు చెందిన మరో 25 మందికి పైగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దీంతో కుప్పం ఏరియా ఆస్పత్రి జ్వర పీడితులతో నిండింది. దీంతో.. ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఇంత జరుగుతున్నా.. జిల్లా వైద్యాధికారులు  మాత్రం పట్టించుకోవడం లేదు. 

 

20:09 - December 26, 2017

విశాఖ : ఏజెన్సీలో దారుణం చోటు చేసుకుంది. విద్యా, బుద్ధులు నేర్పించాల్సిన గురువులే.. గాడి తప్పారు.  విద్యార్థినులపై  లైంగిక దాడికి పాల్పడ్డారు.  ఆగ్రహించిన తల్లిదండ్రులు.. దేహశుద్ధి చేశారు.  జి.మాడుగుల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఐదుగురు విద్యార్థినులపై  ముగ్గురు ఉపాధ్యాయులు... లైంగిక వేధింపులకు  పాల్పడ్డారు. ఒంటిపై చేతులు వేసి.. అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో ఆ విద్యార్థునులు పాఠశాలకు వెళ్లడం మానేశారు. దీనిపై తల్లిదండ్రులు నిలదీయడంతో.. విద్యార్థునులు అసలు విషయం చెప్పారు. ఆగ్రహించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయులను నిలదీశారు.
ఒకరికి దేహశుద్ధి చేశారు. 

 

విశాఖ ఏజెన్సీలో దారుణం

విశాఖ : ఏజెన్సీలో దారుణం చోటు చేసుకుంది. విద్యా, బుద్ధులు నేర్పించాల్సిన గురువులే.. గాడి తప్పారు.  విద్యార్థినులపై  లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆగ్రహించిన తల్లిదండ్రులు.. దేహశుద్ధి చేశారు.  జి.మాడుగుల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఐదుగురు విద్యార్థినులపై  ముగ్గురు ఉపాధ్యాయులు... లైంగిక వేధింపులకు  పాల్పడ్డారు. ఒంటిపై చేతులు వేసి.. అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో ఆ విద్యార్థునులు పాఠశాలకు వెళ్లడం మానేశారు. దీనిపై తల్లిదండ్రులు నిలదీయడంతో.. విద్యార్థునులు అసలు విషయం చెప్పారు. ఆగ్రహించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయులను నిలదీశారు. ఒకరికి దేహశుద్ధి చేశారు. 

 

20:04 - December 26, 2017

కర్నూలు : జిల్లాలోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక నామినేషన్‌ ప్రక్రియ ముగిసింది. ఇందులో నలుగురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ నుంచి కేఈ.ప్రభాకర్ నాలుగు సెట్ల నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశారు. బహుజన సమాజ్‌వాదీ పార్టీకి చెందిన దండు శేషుయాదవ్ 2 సెట్ల నామినేషన్‌ పత్రాలు దాఖలు చేయగా..బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అనుచరుడు మాజీ జడ్పీటీసీ పుల్యాల నాగిరెడ్డి ఒక సెట్‌ నామినేషన్‌ వేశారు. సంగం ఎంపీటీసీ పులి జయప్రకాష్‌రెడ్డి ఇండిపెండెంట్‌గా ఒక సెట్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. జనవరి 12న పోలింగ్‌ జరగనుండగా.. 16న కౌంటింగ్‌ ఉంటుంది. మరోవైపు తనపై నమ్మకం వుంచి సీఎం చంద్రబాబు అవకాశం కల్పించారని కేఈ ప్రభాకర్‌ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలల్లో గెలిస్తే జిల్లా అభివృద్ధికి పాటు పడుతానని ప్రభాకర్‌ తెలిపారు. 

19:19 - December 26, 2017

మహబూబ్‌నగర్‌ : అధికారంలో ఉన్నామనే అహంకారంతో టీఆర్ ఎస్ నేతలు రెచ్చిపోతున్నారు. టీఆర్ ఎస్, సీఎం కేసీఆర్ ను విమర్శిస్తే చాలు ఒంటి కాలితో లేస్తున్నారు. బూతుపురాణంతో దండెత్తుతున్నారు. దౌర్జన్యాలు, దాడులకు పాల్పడుతున్నారు. రేవంత్‌రెడ్డి, లక్ష్మారెడ్డి వివాదం కాస్తా పార్టీ నేతల మధ్య దూషణలకు కారణమవుతోంది. మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబుపేటకు చెందిన ఆంజనేయులు అనే యువకుడు వాట్సాప్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫోస్ట్‌ చేశాడని ఆరోపిస్తూ.. అదే గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ నేత మాడెమోని నర్సింహులు ఫోన్ లో ఆంజనేయులును నానా బూతులు తిట్టాడు. 'టీఆర్ ఎస్, కేసీఆర్ గురించి మాట్లాడితే చంపేస్తా అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. 'చదువుకునే వాడివి నీకెందుకురా రాజకీయాలు' అంటూ.. చంపుతానని' బెదిరించాడు. నీ ఇంటికొచ్చి చంపేస్తానని బెదిరించాడు. దీంతో బాధితుడు ఆంజనేయులు నవాబుపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  
నాకు ప్రాణ హానీ ఉంది : ఆంజనేయులు 
మాడెమోని నర్సింహులు రాత్రి నాకు ఫోన్ చేసి...నన్ను దుర్బాషలాడారు. మా నాయకున్ని, ప్రభుత్వంపై అనవసరపు కామెంట్లు ఎందుకు పెడుతున్నావంటూ అసభ్యంగా మాట్లాడాడు. మా అమ్మ గురంచి అసభ్యంగా మాట్లాడాడు. ఆయనది మా గ్రమమే... అతను వరుసకు నాకు మామ అవుతాడు. నేను ఎవరినీ ఉద్దేశించి పోస్ట్ పెట్టలేదు. ఓర్వలేక ఇలాంటివి చేస్తున్నరు. అధికారంలో ఉన్నామనే బెదిరింపులకు పాల్పడుతున్నరు. నాకు ప్రాణ హానీ ఉంది. ఏ రాజకీయ నాయకుడు ఇలాంటి చర్యలకు పాల్పడవద్దు.. అవినీతి రహిత సమాజాన్ని నెలకొల్పాలి' అని అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

టీఆర్ ఎస్ నాయకుడు బూతుపురాణం

మహబూబ్‌నగర్‌ : రేవంత్‌రెడ్డి-లక్ష్మారెడ్డి వివాదం కాస్తా పార్టీ నేతల మధ్య దూషణలకు కారణమవుతోంది. మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబుపేటకు చెందిన ఆంజనేయులు అనే యువకుడు వాట్సాప్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫోస్ట్‌ చేశాడని ఆరోపిస్తూ.. అదే గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ నేత మాడెమోని నర్సింహులు  నానా బూతులు తిట్టాడు. చదువుకునే వాడివి నీకెందుకురా రాజకీయాలు అంటూ.. చంపుతానని బెదిరించాడు. దీంతో బాధితుడు ఆంజనేయులు నవాబుపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  

 

18:45 - December 26, 2017

భద్రాద్రి కొత్తగూడెం : తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి... కొత్తగూడెం ఆకస్మికంగా పర్యటించారు. ఎస్ ఐబీ చీఫ్ సజ్జనార్‌తో కలిసి.. హెలికాఫ్టర్‌లో కొత్తగూడెం చేరుకున్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో.. పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో నిర్మిస్తున్న ఎస్పీ కార్యాలయం, మౌలిక వసతులు, మావోయిస్టుల కార్యాకలాపాలపై రివ్యూ సాగింది. 

 

18:17 - December 26, 2017

హైదరాబాద్ : ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు బెయిల్ మంజూరైంది. సికింద్రాబాద్ సివిల్ కోర్టు... షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతి 10రోజులకోసారి రాంగోపాల్ పేట పీఎస్‌లో హాజరుకావాలని షరతు విధించింది. ఇద్దరు వ్యక్తులతో పదివేల పూచీకత్తు సమర్పించాలని కూడా ఆదేశించింది. ఎస్సీ రిజర్వేషన్ల కోసం ట్యాంక్‌బండ్ ముట్టడికి వెళ్తుండగా మందకృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం చంచల్‌ గూడ జైల్లో ఉన్న మందకృష్ణ... ఇవాళ విడుదలయ్యే అవకాశముంది. 

శాతవాహన యూనివర్సిటీలో టెన్షన్

కరీంనగర్‌ : పట్టణంలోని శాతవాహన యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బహుజన, లెఫ్ట్‌ విద్యార్థి సంఘాలు మనుధర్మ శాస్త్ర ప్రతులను దగ్ధం చేయడం.. ఏబీవీపీ సంఘాలు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో ఇరువర్గాలు పరస్పరం రాళ్లతో దాడి చేసుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. వర్సిటీలో పికెటింగ్ ఏర్పాటు చేసి... డ్రోన్ కెమెరాలతో నిఘా పెంచారు. ఘర్షణకు దిగిన విద్యార్థులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మరోవైపు యూనివర్సిటీ అధికారులు సెలవులు ప్రకటించడంతో.. విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోతున్నారు. 

18:14 - December 26, 2017

కరీంనగర్‌ : పట్టణంలోని శాతవాహన యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బహుజన, లెఫ్ట్‌ విద్యార్థి సంఘాలు మనుధర్మ శాస్త్ర ప్రతులను దగ్ధం చేయడం.. ఏబీవీపీ సంఘాలు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో ఇరువర్గాలు పరస్పరం రాళ్లతో దాడి చేసుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. వర్సిటీలో పికెటింగ్ ఏర్పాటు చేసి... డ్రోన్ కెమెరాలతో నిఘా పెంచారు. ఘర్షణకు దిగిన విద్యార్థులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మరోవైపు యూనివర్సిటీ అధికారులు సెలవులు ప్రకటించడంతో.. విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోతున్నారు. 

 

బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ కార్యక్రమం

హైదరాబాద్ : నగరంలోని బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దంపతులు, సీఎం కేసీఆర్, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, సీఎల్ పీ నేత జానారెడ్డి, బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 
 

17:43 - December 26, 2017

హైదరాబాద్ : నగరంలోని బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దంపతులు, సీఎం కేసీఆర్, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, సీఎల్ పీ నేత జానారెడ్డి, బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 
 

17:20 - December 26, 2017
17:19 - December 26, 2017

కర్నూలు : జిల్లాలోని స్థానిక సంస్థల టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి కేఈ ప్రభాకర్‌ నామినేషన్ వేశారు. తనపై నమ్మకం వుంచి సీఎం చంద్రబాబు అవకాశం కల్పించారని కేఈ ప్రభాకర్‌ తెలిపారు. ఈమేరకు ఆయనతో 10టివి ఫేస్ టూ ఫేస్ నిర్వహించింది. ఈ సందర్భంగా కేఈ మాట్లాడుతూ కర్నూలు అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానని చెప్పారు. కర్నూలులో వైసీపీకి బలం లేదని.. అందుకే వైసీపీ పోటీ నుంచి వైదొలిగిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలల్లో గెలిస్తే తను జిల్లా అభివృద్ధికి పాటు పడుతానని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దా.... 

17:13 - December 26, 2017

తమిళనాడు: అఖిల భారత బీమా ఉద్యోగుల సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి, ఎన్‌.ఎం.సుందరం, ఈ ఉదయం చెన్నైలోని స్వగృహంలో కన్నుమూశారు. 1967 నుంచి 2007 దాకా.. మొత్తం నలభై సంవత్సరాల పాటు.. ఆయన ఇన్స్యూరెన్స్‌ ఉద్యమ నాయకుడిగా విశేష సేవలందించారు. 1988 నుంచి 2003 వరకు, ఆల్‌ ఇండియా ఇన్స్యూరెన్స్‌ ఎంప్లాయీస్ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శిగాను, 2003 నుంచి 2007 వరకు సంఘం అధ్యక్షుడిగాను కొనసాగారు. బీమా రంగాన్ని ప్రైవేటు పరం చేయాలన్న ప్రభుత్వ ఆలోచనను.. ప్రజా చైతన్యంతో నిలువరించవచ్చునని సోదాహరణంగా నిరూపించారు. ఈ దిశగా.. ఆయన నేతృత్వంలో సాగిన కోటి 56 లక్షల సంతకాల ఉద్యమం.. ట్రేడ్‌ యూనియన్‌ల చరిత్రలో ఇప్పటికే ప్రత్యేకంగానే నిలిచిపోయింది. ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా ఎన్‌.ఎం. సుందరం అనుసరించిన విధానాలు, సాధించిన విజయాలు, మిగిలిన ట్రేడ్‌ యూనియన్లకు స్ఫూర్తిదాయకంగా ఉండేవి. ఆయన ప్రపంచీకరణ అంశాలపై పలు విమర్శనాత్మక పుస్తకాలు రాశారు. సుందరం మృతి పట్ల, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. 

 

16:49 - December 26, 2017

ఢిల్లీ : ఏపీ భవన్‌లోని అంబేడ్కర్ ఆడిటోరియంలో బ్యాడ్మింటెన్ క్రీడాకారులు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్‌లకు ఆత్మీయ సన్మానం జరిగింది. రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్‌, ఢిల్లీలోని తెలుగు సంఘాల నేతల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఏపీ భవన్‌లో ఉన్న  షటిల్ కోర్టులో సింధు, కిదాంబి శ్రీకాంత్‌లు షటిల్ ఆడి సందడి చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తెలుగువారు తరలివచ్చారు. 2020 ఒలింపిక్స్‌లో పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్‌లు మెడల్స్ తీసుకురావాలని రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్ ఆకాంక్షించారు. 

 

శ్రీకాకుళం జిల్లాలో ఇసుక మాఫియా

శ్రీకాకుళం : జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరికలు సైతం పక్కన పెట్టి అక్రమార్కులు యథేచ్ఛగా త్రవ్వకాలు జరుపుతున్నారు. పాలకొండ మండలం గొట్ట మంగళాపురం- నాగావళి నదిలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ఆర్.డీ.ఓ కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని స్థానికులు మండిపడుతున్నారు. 

16:46 - December 26, 2017

శ్రీకాకుళం : జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరికలు సైతం పక్కన పెట్టి అక్రమార్కులు యథేచ్ఛగా త్రవ్వకాలు జరుపుతున్నారు. పాలకొండ మండలం గొట్ట మంగళాపురం- నాగావళి నదిలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ఆర్.డీ.ఓ కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని స్థానికులు మండిపడుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులను, అధికారులను మేనేజ్ చేసుకుంటున్నామని అనధికారిక ర్యాంపు నిర్వాహకులు చెబుతున్నారు. రోజుకు డెబ్భై ట్రాక్టర్ల లోడులతో పాటు.. ఇరవై లారీల ఇసుకను తరలిస్తున్నారు. ఇసుక మాఫియా ఆగడాలపై రెవెన్యూ, పోలీస్ వర్గాలు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటం వెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉన్నట్లు విమర్శలు వస్తున్నాయి. అధికారపార్టీ నేతల హస్తంతోనే ఇసుక మాఫియా రెచ్చిపోతుందని స్థానికులు అంటున్నారు. 
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

16:42 - December 26, 2017

హైదరాబాద్ : 2017లో కాంగ్రెస్‌ జోరు బాగానే పెరిగింది. నిన్న మొన్నటి వరకు వలసలతో ఉక్కిరి బిక్కిరి అయిన హస్తం పార్టీ... గులాబీ ఆపరేషన్‌ ఆకర్ష్‌కు దీటుగా దూకుడు పెంచింది. మరోవైపు సర్కార్‌పై ఏ మాత్రం స్పీడ్‌ తగ్గకుండా పోరు కొనసాగిస్తూ ప్రజల్లోకి వెళ్లింది. ఇక తెలంగాణ కాంగ్రెస్‌లోకి రేవంత్‌రెడ్డి రావడం... మరోవైపు పార్టీ దేశ అధ్యక్ష పగ్గాలు రాహుల్‌ అందుకోవడంతో.. ఇటు గల్లీ నుంచి ఢిల్లీ వరకు కార్యకర్తల్లో జోష్‌ కనిపిస్తోంది. 
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు త‌రువాత కాంగ్రెస్‌కు కష్టాలు 
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు త‌రువాత కాంగ్రెస్‌కు కష్టాలే ఎదురయ్యాయి. 2014 ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షానికే పరిమితమైన కాంగ్రెస్‌కు.. ఆ తరువాత వచ్చిన ఏ ఉప ఎన్నిక కూడా కలిసిరాలేదు. వాటికితోడు గులాబీ ఆపరేషన్‌ ఆకర్ష్‌తో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చాలామంది కారెక్కడంతో కాంగ్రెస్‌ను ఉక్కిరిబిక్కిరి చేసింది. మరోవైపు నేతల మధ్య అంతర్గత పోరుతో 2016 వరకు అనేక ఇబ్బందులు పడింది. ఆ తర్వాత 2017లో పక్కా ప్రణాళికలు అమలు చేసి.. గ్రాఫ్‌ పెంచుకుంది. డీలాపడ్డ నేతలు, కేడర్‌ను ఏకం చేస్తూ అధికార పార్టీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్సేనని చాటి చెప్పింది. 
అధికార పార్టీపై దూకుడు పెంచిన కాంగ్రెస్‌... 
అధికార పార్టీపై దూకుడు పెంచిన కాంగ్రెస్‌... అందివచ్చిన ప్రతి ప్రజాసమస్యను వాడుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తమ ఎజెండాగా మార్చుకుని ముందుకెళ్లింది. ఇందులోభాగంగా ఈ ఏడాది జనవరిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ఆందోళనలు చేపట్టింది. అన్ని కలెక్టరేట్ల ముందు ధర్నాలతో పాటు.. హైదరాబాద్‌లో చార్మినార్‌ నుండి గాంధీభవన్‌ వరకు భారీ ర్యాలీతో సమరశంఖం పూరించారు. హైదరాబాద్‌లో ఇందిరాపార్క్‌ దగ్గర ధర్నా చౌక్‌ ఎత్తివేయకుండా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టి ఇటు రాష్ట్రంలో గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు... రాష్ట్రపతి గడప తొక్కి జాతీయస్థాయిలో కేసీఆర్‌ వ్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. 
ప్రజా సమస్యలను ఎత్తిచూపిన హస్తం పార్టీ 
ముఖ్యంగా నోట్ల రద్దుతో నిరసనలకు పరిమితం కాకుండా.. ఆ నిర్ణయంతో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను ఎత్తిచూపింది హస్తం పార్టీ. తెలంగాణవ్యాప్తంగా సభలు పెట్టి.. నోట్ల రద్దుతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఫోకస్‌ చేశారు కాంగ్రెస్‌ నేతలు. ఇక మార్చి నెలలో మరోసారి ధర్నా చౌక్‌ తొలగింపు అంశంపై.. నిరసన కార్యక్రమాలు చేపట్టి.. కేసీఆర్‌ది నిరంకుశ పాలనంటూ ఎండగట్టే ప్రయత్నం చేశారు. ధర్నాచౌక్‌పై టీడీపీ, బీజేపీ, వామపక్షాలు, జేఏసీలను అందరినీ ఏకం చేసింది కాంగ్రెస్‌. 
మిర్చి రైతుల ఇష్యూ కాంగ్రెస్‌కు రాజకీయంగా ప్లస్‌ 
ఇక ప్రధానంగా ఖమ్మం జిల్లాలో మిర్చి రైతుల ఇష్యూ కాంగ్రెస్‌కు రాజకీయంగా ప్లస్‌ అయింది. దీన్ని అవకాశంగా మలుచుకున్న ఆ పార్టీ నేతలు ఖమ్మంలో పర్యటించి బాధిత రైతులను పరామర్శించారు. మిర్చి రైతులకు పోలీసులు బేడీలు వేయడంపై సర్కార్‌పై విరుచుకుపడ్డారు. అలాగే వరంగల్‌ జిల్లా మిర్చి రైతుల కష్టాలపై పోరుబాట చేపట్టిన హస్తం నేతలు... మిర్చి యార్డుల్లో ఆందోళనలు చేపట్టారు. అలాగే గండ్ర వెంకటరమణారెడ్డి మౌనదీక్షలతో సర్కార్‌ ద్వంద్వ నీతిని ఎండగట్టడంలో సక్సెస్‌ సాధించారు. ఇక కేడర్‌లో జోష్‌ నింపేందుకు పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌.. సునీతాలక్ష్మారెడ్డితో కలిసి పాదయాత్ర చేశారు. మే నెలలో గల్ఫ్‌ బాధితుల సమస్యలపై దృష్టి సారించిన నేతలు... వారి సమస్యలపై కేసీఆర్‌ అనుసరిస్తున్న నిర్లక్ష్యంపై ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో సదస్సు నిర్వహించారు. 
జూన్‌లో మరింత దూసుకుపోయిన కాంగ్రెస్‌ 
ప్రభుత్వంపై ఆందోళనలు, విమర్శలతో ముందుకెళ్తున్న కాంగ్రెస్‌ పార్టీ.. జూన్‌లో మరింత దూసుకుపోయింది. సంగారెడ్డిలో నిర్వహించిన ప్రజాగర్జనకు రాహుల్‌గాంధీ హాజరయ్యారు. ఆ సభ పార్టీ ఊహించిన దానికంటే సక్సెస్‌ కావడంతో... పార్టీకి కొత్త ఉత్సాహం వచ్చింది. ఇక ఇదే నెలలో వెలుగుచూసిన మియాపూర్‌ భూకుంభకోణాన్ని ఆయుధంగా మలచుకుని టీఆర్‌ఎస్‌పై మరింత దూకుడు పెంచింది. ఈ స్కామ్‌పై ప్రభుత్వంపై పోరుకు అన్ని పార్టీలను ఏకం చేసింది హస్తం పార్టీ. ఇక స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు శిక్షణా తర్వగతులు నిర్వహించి.. ఓ భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 
ప్రజాసమస్యలపై కాంగ్రెస్‌ మరింత జోష్‌
జులై నెలలో ప్రజాసమస్యలపై కాంగ్రెస్‌ మరింత జోష్‌ పెంచింది. ప్రజాగర్జనలతో హోరెత్తించారు. దీనికితోడు సిరిసిల్ల జిల్లా నేరెళ్లలో దళితులపై పోలీసుల దాడి కాంగ్రెస్‌కు బాగా కలిసివచ్చింది. సిరిసిల్లలో ఇసుక మాఫియా పేరుతో గులాబీ సర్కార్‌ను ఇరుకున పెట్టిన హస్తం నాయకులు.. దళితులపై కేసీఆర్‌ సర్కార్‌ అణిచివేత ధోరణి అవలంబిస్తుందంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఇక కరీంనగర్‌ జిల్లాలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటుపై మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ చేపట్టిన నిరాహారదీక్ష జిల్లాలో పార్టీకి బాగా కలిసివచ్చింది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో విద్యార్థుల అవస్థలపై ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట్‌ చేపట్టిన పాదయాత్ర విద్యార్థుల్లో కదలిక తీసుకువచ్చింది. 
టీ.కాంగ్రెస్‌లో భారీ మార్పులు 
ఇక ఆగస్టు నెలలో తెలంగాణ కాంగ్రెస్‌లో భారీ మార్పులు జరిగాయి. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జీగా ఉన్న దిగ్విజయ్‌సింగ్‌ను తప్పించి.. ఆయన స్థానంలో రామచంద్ర కుంతియాకు అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. ఆయనతో పాటు... మరోనేత సతీష్‌కు అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఇక కుంతియా రాకతో.. రాష్ట్ర కాంగ్రెస్‌ మరింత దూకుడు పెంచింది. కుంతియా నియామకంపై పెదవి విరిచిన నేతలు సైతం... ఆయన చేపడుతున్న ఆపరేషన్‌ సక్సెస్‌పై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పార్టీలోకి వలసలపై కుంతియా తీసుకున్న యాక్షన్‌ ప్లాన్‌ పార్టీగా బాగా ప్లస్‌ అయ్యింది. 
నీటి విడుదలకు సీఎం సిద్దరామయ్యను ఒప్పించిన కాంగ్రెస్ నేతలు  
ఇక సెప్టెంబర్‌లో పాలమూరు జిల్లా సాగు, తాగునీటి అవసరాల కోసం ఉత్తమ్‌ నేతృత్వంలో జిల్లా నేతల బృందం కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యను కలిసి జిల్లాకు నీటి విడుదలకు ఒప్పించారు. ఇది పార్టీకి పెద్ద విజయంగా చెప్పుకోవచ్చు. ఓవైపు ప్రభుత్వాన్ని నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ.. తామే ఆ ఘనత సాధించినట్లు ఫోకస్‌ చేసుకున్నారు. ఇక పార్టీ చేపట్టిన ఇందిరమ్మ బాట కార్యక్రమం ద్వారా కేడర్‌లో ఉత్సాహం తీసుకువచ్చారు. అలాగే మెట్రోరైలు పనుల జాప్యంపై ప్రభుత్వం నిర్లక్షాన్ని నిరసిస్తూ హైదరాబాద్‌లో భారీ ఎత్తున ర్యాలీ చేపట్టారు. 
ఆపరేషన్‌ ఆకర్ష్‌కు తెరలేపిన కాంగ్రెస్‌   
ఇక కాంగ్రెస్‌ తెరలేపిన ఆపరేషన్‌ ఆకర్ష్‌కు అక్టోబర్‌ నెల వేదికైంది. వలసలతో ఉడికిపోయిన కాంగ్రెస్‌... టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డిని పార్టీలో చేర్చుకుని రాష్ట్ర రాజకీయాల్లో ఆకర్ష్‌ సెగలు పెంచింది. అప్పటిదాకా టీఆర్‌ఎస్‌ ఆకర్ష్‌తో ఉక్కిరిబిక్కిరి అయిన హస్తంకు... రేవంత్‌తో మొదలైన కాంగ్రెస్‌ మార్క్‌ పాలిటిక్స్‌తో టీఆర్‌ఎస్‌కు ధీటుగా సమాధానమిచ్చింది. టీఆర్‌ఎస్‌, టీడీపీ, బీజేపీ, వైసీపీల నుంచి కాంగ్రెస్‌కు వలసలు మొదలయ్యాయి. అంతేకాకుండా పలు ప్రజాసంఘాల నతేలు, ఓయూ విద్యార్థులు భారీగా కాంగ్రెస్‌ గూటికి చేరారు. దీనికితోడు రాహుల్‌ ఏఐసీసీ పగ్గాలు చేపట్టడం... గుజరాత్‌ ఫలితాలతో రాహుల్‌ గ్రాఫ్‌ ఒక్కసారిగా పెరగడం... కాంగ్రెస్‌కు పాజిటివ్‌ వేవ్‌ ప్రారంభమైందని రాజకీయ విశ్లేషకులంటున్నారు. దీంతో అంతరంగ పోరుతో రగిలిపోయిన నైతలు సైతం సైలెంట్‌ అయ్యారు. 
క్యాడర్‌ నుండి లీడర్స్‌ వరకు కొత్త జోష్‌ 
ఇక అచ్చంపేట, కోస్గి, జడ్చర్లలో పార్టీ నిర్వహించిన ప్రజాగర్జనలు, సభలు సూపర్‌ సక్సెస్‌ కావడంతో... క్యాడర్‌ నుండి లీడర్స్‌ వరకు కొత్త జోష్‌ నిండింది. మొత్తానికి 2016లో ఓటమి నైరాశ్యం...  వలసలతో ఉక్కిరిబిక్కిరి అయిన కాంగ్రెస్‌.. 2017లో అన్నింటిని అధిగమించించి. ప్రజల సమస్యలను ఎజెండాగా చేసుకుని.. అధికార పార్టీపై దూకుడు పెంచింది. అధికార పార్టీకి తామే ప్రత్యామ్నాయమనే స్థాయికి చేరింది. మొత్తానికి 2017 ఓవరాల్‌గా కాంగ్రెస్‌కు బాగానే కలిసివచ్చింది. మరి... కొత్తగా సారధ్య బాధ్యతలు స్వీకరించిన రాహుల్‌ సారధ్యంలో 2018 ఎలా ఉంటుందో చూడాలి. 

 

16:29 - December 26, 2017

కృష్ణా : జిల్లాలోని మైలవరంలో 10టీవీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల తహశీల్దార్ శివయ్య, మైలవరం సీఐ రామచంద్రరావు, ఎస్సై రామకృష్ణ , స్ధానిక నేతలు, వ్యాపారస్తులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు ఎదుర్కుంటున్న అనేక సమస్యలపై చర్చ జరిగింది. 

16:24 - December 26, 2017

గుంటూరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవిద్ ఈనెల 27న అమరావతిలో పర్యటించనున్నారు. నాగార్జున యూనివర్సిటీలో 4 రోజులపాటు జరిగే ఇండియన్ ఎకనమిక్ సమ్మిట్‌ను రాష్ట్రపతి ప్రారంభించనున్నారు. దీంతో పాటు ఏపీ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును రామ్‌నాథ్ కోవిద్ ప్రారంభిస్తారు. అనంతరం రియల్ టైం గవర్నెన్స్ కార్యాలయాన్ని ఆయన సందర్శిస్తారు. అమరావతిలో రాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

16:19 - December 26, 2017

గుంటూరు : ప్రజా సమస్యల పరిష్కారంలో అధికార వ్యవస్థలో ఎక్కడా నిర్లక్ష్యం కనిపించరాదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజా ఫిర్యాదులు, జన్మభూమి..మాఊరు దరఖాస్తుల క్లియరెన్సుపై జిల్లా కలెక్టర్లతో ఆర్టీజీ నుంచి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. ఈనెల 31 లోపు అన్ని ఫిర్యాదులు పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

 

16:14 - December 26, 2017

కడప : జంబలకిడి పంబ సిన్మా సీన్‌ కడప జిల్లాలో రిపీట్‌ అయ్యింది. ఆ సిన్మాలో ఆడాళ్లు మగళ్లాలా.. మగవాళ్లు ఆడవాళ్లలా ప్రవర్తిస్తారు. అదే తరహాలో ఓ కిలాడీ లేడీ మగవేషంలో ముగ్గురు యువతులను పెళ్లాడింది. కడప జిల్లా కాశినాయన మండలం ఇటికలపాడు గ్రామానకి చెందిన రమాదేవి.. తమిళనాడు రోహిణి మిల్లో ఉద్యోగం చేస్తోంది. పెద్ద ఉద్యోగం చేస్తున్నట్లు బిల్డప్‌ ఇచ్చి పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు చేసుకుంది. ప్రొద్దుటూరుకు చెందిన బుజ్జితో మొదటి పెళ్లి...అనంతపురం కొత్తచెరువుకు చెందిన వందనతో రెండో పెళ్లి.. భీమగుండం గ్రామానికి చెందిన నిర్మలతో మూడో పెళ్లి చేసుకుంది. అయితే రమాదేవి మోసాన్ని పసిగట్టిన మూడో భార్య నిర్మల ఆమె బండారాన్ని బయటపెట్టింది. పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడంతో.. డొంకంతా కదిలింది.  

 

మందకృష్ణ మాదిగకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు

హైదరాబాద్ : ఎమ్మార్పీస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు బెయిల్ మంజూరు అయింది. సికింద్రాబాద్ సివిల్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇద్దరు వ్యక్తులతో రూ.10 వేలతో పూచీకత్తు, పదిరోజులకోసారి రాంగోపాల్ పేట, కార్ఖానా పీఎస్ లలో హాజరు కావాలని కోర్టు అదేశించింది. 

 

ప్రపంచంపై అమెరికా పెత్తనాన్ని వ్యతిరేకించాలి : బీవీ.రాఘువులు

సిద్దిపేట : ప్రపంచంపై అమెరికా పెత్తనాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఆసన్నమైందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు అన్నారు. శివమ్స్ గార్డెన్ లో సీపీఎం జిల్లా మహాసభలు జరుగుతున్నాయి. ఈ మహాసభలకు హాజరయ్యారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు వంతపాడుతూ మోడీ దేశ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. భారత వ్యవసాయ రంగాన్ని అమెరికా శాసిస్తోందన్నారు. భారత్ పై అమెరికా పెత్తనాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. హెచ్..1బీ వీసాల విషయంలో అమెరికా అనుసరిస్తున్న విధానాన్ని భారత్ ఎందుకు వ్యతిరేకించడం లేదని ప్రశ్నించారు.

సీపీఎం సిద్దిపేట జిల్లా మహాసభలకు హాజరైన బీవీ.రాఘవులు

సిద్దిపేట : శివమ్స్ గార్డెన్ లో సీపీఎం జిల్లా మహాసభలు జరుగుతున్నాయి. ఈ మహాసభలకు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు హాజరయ్యారు. 

 

15:42 - December 26, 2017

కల్తీ ఆహారంతో అప్రమత్తతంతా ఉండాలని వక్తలు అన్నారు. ఇదే అంశంపై మానవి నిర్వహించిన వేదిక చర్చా కార్యక్రమంలో న్యూట్రిషియనిస్ట్ సుజాతా స్టీఫెన్, గైనకాలజిస్టు నర్మద పాల్గొని, మాట్లాడారు. ఈ సందర్భంగా వారు పలు ఆర్యోగ సలహాలు, సూచనలు చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

15:36 - December 26, 2017

గుంటూరు : భాష్యం విద్యా సంస్థల పూర్వ విద్యార్థులు సరికొత్త గిన్నీస్‌ బుక్ రికార్డు నెలకొల్పారు. గతంలో కర్నాటకలో ఉన్న రికార్డును  బ్రేక్ చేశారు. భాష్యం సిల్వర్ జూబ్లీ సందర్భంగా గుంటూరు మెయిన్ బ్రాంచ్‌లో చదివిన నాలుగు వేల రెండు వందల యాబై మూడు మంది పూర్వ విద్యార్థులు ఒకే వేదికపై హాజరయ్యారు. గతంలో కర్నాటకలో ఒకే వేదికపై 3 వేల 6 వందల 48 మంది పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. ఇప్పుడు ఆ  రికార్డును భాష్యం విద్యార్థులు బ్రేక్‌ చేశారు. ఒకే వేదికపై ఎనిమిది వేల మంది పూర్వ విద్యార్థులు హాజరవడం ఆనందంగా ఉందని భాష్యం విద్యా సంస్థల అధినేత రామకృష్ణ అన్నారు.

 

15:30 - December 26, 2017

ఢిల్లీ : సీపీఐ 92వ ఆవిర్భావ దినోత్సవం  ఘనంగా జరిగింది. ఢిల్లీలోని పార్టీ కార్యాలయం అజయ్‌ భవన్‌లో నిర్వహించిన ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో ఆ పార్టీ ఎంపీ రాజా జెండా ఎగురవేశారు. సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు నారాయణ, కార్మిక సంఘ నేతలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం, ప్రజల హక్కుల పరిరక్షణకు సీపీఐ పోరాడుతోందని ఈ సందర్భంగా రాజా చెప్పారు. దేశంలో నిరంకుశపాలన సాగుతోందని, దీనికి వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రజాస్వామ్య శక్తులన్నీ ఏకంకావాలని రాజా పిలుపుఇచ్చారు. 

 

15:27 - December 26, 2017

హైదరాబాద్ : ఆదివాసీ.. లంబాడీల ఘర్షణలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. హైదరాబాద్‌ ఎంబీ భవన్‌లో వామపక్షాలు భేటీ అయ్యాయి. ఈ సందర్భంగా తమ్మినేనితో 10టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. లంబాడీలు, ఆదివాసీల మధ్య సామరస్యం కోసం కృషిచేస్తామని చెప్పారు. లంబాడీ.. ఆదివాసీల నేతలు, మేధావులతో మాట్లాడతామని తెలిపారు. గిరిజనుల మధ్య సామరస్యం కోసం లెఫ్ట్‌ పార్టీలు కృషిచేస్తాయన్నారు. 

15:16 - December 26, 2017

విశాఖ : జిల్లాలోని దువ్వాడ వడ్లపూడి లక్ష్మీపురంలో రెండు వర్గాల మహిళల మధ్య ఘర్షణ జరిగింది. ఇంటి సందు వీధి విషయంలో ప్రారంభమైన గొడవ శిగపట్లకు దారి తీసింది. గర్భవతైన తన భార్యను ఈ ఘర్షణ నుంచి విడిపించేందుకు జోక్యం చేసుకున్న ఆటో డ్రైవర్‌ మరో మహిళపై చేయిచేసుకోవడం వివాదాస్పదంగా మారింది. ఇరు వర్గాలు దువ్వాడ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నాయి. 

 

15:11 - December 26, 2017

రంగారెడ్డి : శంషాబాద్‌ మర్డర్‌ కేసు మిష్టరీ వీడింది. చిన్నతప్పుతో నిందితులు పోలీసులకు చిక్కారు. శంషాబాద్‌ మండలం... మదనపల్లి సమీపంలో దొరికిన యువకుడి మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. పోలీసులు ఆ మృతదేహం జియాగూడకు చెందిన మహేశ్‌గా గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని మార్చురికి తరలించి..విచారణ మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం శంషాబాద్‌ ఓ కార్ల సర్వీసింగ్ కేంద్రానికి ఇద్దరు వ్యక్తులు వచ్చి తమ కారును సర్వీసింగ్‌కు ఇచ్చారు. అయితే కారును శుభ్రం చేయడానికి సిబ్బంది తలుపు తీయగా అందులో రక్తపు మరకలు కనిపించాయి. దీంతో సర్వీసింగ్‌ సెంటర్‌ యజమాని పోలీసులకు ఆ సమాచారం తెలియజేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా... మహశ్‌ను దారుణంగా గొంతు కోసి హత్య చేసి... ఆ పై పెట్రోల్‌ పోసి కాల్చేసినట్టు తేలింది. అయితే ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది. 

 

ఈతకెళ్లి ఇద్దరు విద్యార్ధులు మృతి

సూర్యపేట : కోదాడ మండలం బాలాజీనగర్ లో విషాదం నెలకొంది. ఎన్ ఎస్పీ కాల్వలో ఈతకెళ్లి ఇద్దరు విద్యార్ధులు మృతి చెందారు. మృతులు వేణు మాధవ్ (18), ప్రవీణ్ (17).  

 

13:43 - December 26, 2017

తూర్పుగోదావరి : న్యూస్‌ ఈజ్‌ పీపుల్‌ అంటూ ప్రజలకు చేరువైన 10టీవీ.. కొత్త సంవత్సర కేలెండర్‌ను ఆవిష్కరించింది. టెన్‌టీవీ రూపొందించిన కాకినాడ నగర కేలండర్‌ను శ్రీఅక్షర హాస్పిటల్స్‌ అధనేత డాక్టర్‌ బ్రహ్మారెడ్డి, డాక్టర్‌ గాయత్రి సంయుక్తంగా ఆవిష్కరించారు. సమాజికాంశాలను ప్రతిబింబిస్తున్న టెన్‌టీవీ ప్రజలకు మరింత చేరువకావాలని వక్తలు ఆకాంక్షించారు. 

13:42 - December 26, 2017

ఆసిఫాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 3.8 డిగ్రీలుగా నమోదవుతున్నాయి. మూడేళ్ల తర్వాత ఇదే అత్యల్ప ఉష్ణోగత్ర. చలి తీవ్రతకు తట్టుకోలేక ప్రజలు ఇబ్బందులు పుడుతున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

13:41 - December 26, 2017

గుంటూరు : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాయంలో రేపటి నుంచి నాలుగు రోజుల పాటు జరిగే భారత ఆర్థిక సంఘం శతాబ్ది ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఐఈఏ సమావేశాలను ప్రారంభిస్తారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

13:40 - December 26, 2017

కర్నూలు : జిల్లాలో.. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కేయీ ప్రభాకర్‌ నామినేషన్‌ వేశారు. పార్టీ ఆఫీస్‌ నుంచి ర్యాలీగా వెళ్లి నామినేషన్‌ను వేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి కాల్వ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు. కాగా ఇవాళ్టితో నామినేషన్ దాఖల కార్యక్రమం ముగియనుంది. 

కళ్యాణదుర్గంలో ఉద్రిక్తత

అనంతపురం : జిల్లా కళ్యాణదుర్గంలో విషాదం చోటుచేసుకుంది. మార్కెట్ విస్తరణలో భాగంగా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. అక్రమంగా కూల్చివేస్తున్నారంటూ కేఆర్ రామన్న అనే వ్యక్తి అధికారులతో వాగ్వాదానికి దిగారు. అధికారులతో మాట్లాడుతూనే రామన్న గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. 

13:26 - December 26, 2017

అనంతపురం : జిల్లా కళ్యాణదుర్గంలో విషాదం చోటుచేసుకుంది. మార్కెట్ విస్తరణలో భాగంగా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. అక్రమంగా కూల్చివేస్తున్నారంటూ కేఆర్ రామన్న అనే వ్యక్తి అధికారులతో వాగ్వాదానికి దిగారు. అధికారులతో మాట్లాడుతూనే రామన్న గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. అధికారుల తీరు వల్లే రామన్నకు గుండె పోటు విచ్చిందని ఆయన మృతదేహంతో టీ సర్కిల్ వద్ద వ్యాపారులు ఆందోళనకు దిగారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

వామపక్ష పార్టీల సమావేశం

హైదరాబాద్ : ఎంబీభవన్ లో వమపక్ష పార్టీల సమావేశం జరిగుతోంది. ప్రజాసమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై సమావేశంలో చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హాజరైయ్యారు. గిరిజనుల, ఆదివాసీల మధ్య ఘర్షణకు ప్రభుత్వ వైఖరే కారణమని తమ్మినేని అన్నారు.

12:27 - December 26, 2017

చిత్తూరు : తిరుమల శ్రీవారి సన్నిధిలో కోయిల్‌ అళ్వార్‌ తిరుమంజనం జరిగింది. ఈనెల 29న వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాన్ని శుద్ధి చేశారు. ప్రతిఏడాది నాలుగు సార్లు తిరుమంజనం జరుగుతుందని టీటీడీ చైర్మన్‌ తెలిపారు. ఉగాది, ఆణివారఅస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాది సందర్భాల్లో ఈ తిరుమంజనం జరుగుతుందన్నారు. అదే సంప్రదాయంలో ఇవాళ ఆలయ శుద్ధి చేపట్టామన్నారు. పసుపు,కుంకుమ, ఇతర సుగంధ ద్రవ్యాలతో ఆలయం మొత్తం శుద్ధి చేపట్టామన్నారు.  

12:26 - December 26, 2017

హైదరాబాద్ : రాష్ట్రంలో గిరిజనుల మధ్య అధికారపార్టీ నేతలే ఘర్షలు రెచ్చగొడుతున్నారని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. హైదరాబాద్‌లోని ఎంబీభవన్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో వామపక్షాల నాయకులు మాట్లాడారు. శృతిమించుతున్న లంబాడా-ఆదివాసీల గొడవకు తక్షణ పరిష్కారం కనుగొనాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తోందని తమ్మినేని విమర్శించారు. గిరిజనుల మధ్య ఐక్యతకోసం వామపక్షాలు చొరవ తీసుకుంటున్నాయన్నారు. లంబాడీల, ఆదివాసీల నాయకులు, మేధావులతో విడివిడిగా, కలిసికట్టుగా చర్చలు జరపుతామన్నారు. సమస్య పరిష్కారానికి రెండు వర్గాలు సహకరించాలని తెలంగాణ రాష్ట్ర వామపక్షాల తరపున తమ్మినేని విజ్ఞప్తి చేశారు. 

12:25 - December 26, 2017

గుంటూరు : ల్లా తెనాలి మండలం కొలకలూరు రైల్వేస్టేషన్‌లో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. టికెట్‌ బుకింగ్‌ కౌంటర్‌ పాక్షింగా కాలిపోయింది. అయితే అక్కడ మద్యం బాటిళ్లు, ఎమ్మార్పిఎస్‌ జెండాలు ఉండటంతో అనుమానాలు కలుగుతున్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు వివరాలు ఆరా తీస్తున్నారు. 

గుజరాత్ సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారం

ఆహ్మాదాబాద్ : గుజరాత్ సీఎం విజయ్ రూపానీ ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, రాజస్థాన్ సీఎం వసుంధర రాజే, యూపీ యోగి ఇతర బీజేపీ నేతలు హాజరైయ్యారు.

నామినేషన్ దాఖలు చేసిన కేఈ ప్రభాకర్

కర్నూలు : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా కేఈ ప్రభాకర్ నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి డీప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి హాజరైయ్యారు. 

12:01 - December 26, 2017

ఆహ్మదాబాద్ : గుజరాత్‌లో బీజేపీ ప్రభుత్వం మరోసారి కొలువుతీరింది. ముఖ్యమంత్రిగా విజయ్‌ రూపానీ ప్రమాణ స్వీకారం చేశారు. గాంధీనగర్‌లోని సచివాలయం మైదానంలో జరిగిన ఈ కార్యక్రమంలో గుజరాత్‌ గవర్నర్‌ ఓపీ కోహ్లీ... విజయ్‌ రూపానీతో ప్రామాణం చేయించారు. ఉపముఖ్యమంత్రిగా నితిన్‌ పటేల్‌ ప్రమాణం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా, పార్టీ అగ్రనేత అద్వానీ, మాజీ ముఖ్యమంత్రులు ఆనందీబెన్‌ పటేల్‌, కేశూభాయ్‌ పటేల్‌, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రూపానీ, నితిన్‌ పటేల్‌తోపాటు మరో 18 మంది మంత్రులు ప్రమాణం చేశారు. ఈ నెలలో రెండు విడదలుగా జరిగిన ఎన్నికల్లో 98 సీట్లతో బీజేపీ విజయం సాధించింది. గుజరాత్‌లో బీజేపీ ప్రభుత్వం కొలువుతీరడం వరుసగా ఇది ఆరోసారి. విజయ్‌ రూపానీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఇది రెండోసారి. 

మోర్తాడ్ లో గౌడకులస్తుల బహిష్కరణ

నిజామాబాద్ : జిల్లా మోర్తడు మండలం వడ్కాట్ గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ గౌడ కులస్తులను బహిష్కరించింది. దీంతో గౌడ కులస్తులు పోలీసులు ఆశ్రయించారు. 

బాలిక పై అత్యాచారం

జగిత్యాల : జిల్లా రాయకల్ మండలం మైతాపూర్ లో దారుణం చోటుచేసుకుంది. 8న తరగతి విద్యార్థినిపై అత్యాచారం జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అత్యాచార నింధితుల్లో మైనర్ బాలుడు కూడా ఉన్నాడు. మరో నింధితుడు విజయ్ పరారీలో ఉన్నాడు. 

బీసీ హాస్టల్ వార్డెన్ ఇంట్లో ఏసీబీ సోదాలు

కడప : జిల్లా పులివెందులలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. నల్లపురెడ్డిపల్లె బీసీ హాస్టర్ వార్డెన్ రాజకుళ్లాయప్ప ఇంటిలో ఏసీబీ తనిఖీలు నిర్వహిస్తోంది. ఎన్జీవో నాయకుడు జగన్నాథరెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు చేస్తోంది.

10:31 - December 26, 2017

జగిత్యాల/కరీంనగర్ : జిల్లా రాయకల్ మండలం మైతాపూర్ లో దారుణం చోటుచేసుకుంది. 8న తరగతి విద్యార్థినిపై అత్యాచారం జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అత్యాచార నింధితుల్లో మైనర్ బాలుడు కూడా ఉన్నాడు. మరో నింధితుడు విజయ్ పరారీలో ఉన్నాడు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

31న పార్టీపై ప్రకటన : రజనీకాంత్

చెన్నై : తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులతో సమావేశం నిర్వహిస్తున్నారు. దేవుడు ఆదేశిస్తే రాజకీయాల్లోకి వస్తానని ఆయన అన్నారు. పార్టీ ప్రకటన, రాజకీయ ప్రవేశంపై ఈ నెల 31న ప్రకటన చేస్తానని రజనీకాంత్ తెలిపారు.

10:21 - December 26, 2017

కడప : జిల్లా పులివెందులలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. నల్లపురెడ్డిపల్లె బీసీ హాస్టర్ వార్డెన్ రాజకుళ్లాయప్ప ఇంటిలో ఏసీబీ తనిఖీలు నిర్వహిస్తోంది. ఎన్జీవో నాయకుడు జగన్నాథరెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు చేస్తోంది. ఏడు ప్రాంతాల్లో ఏసీబీ ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తోంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

10:13 - December 26, 2017

చెన్నై : తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులతో సమావేశం నిర్వహిస్తున్నారు. దేవుడు ఆదేశిస్తే రాజకీయాల్లోకి వస్తానని ఆయన అన్నారు. పార్టీ ప్రకటన, రాజకీయ ప్రవేశంపై ఈ నెల 31న ప్రకటన చేస్తానని రజనీకాంత్ తెలిపారు. తను సినిమాల్లోకి వస్తానని అనుకోలేదని, దేవుడు దయ వల్లే వచ్చానని అన్నారు. రజనీకాంత్ చేసిన ప్రకటన పై తమిళ రాజకీయాల్లో చర్చ మొదలైంది. ఒకవేళ తమిళనాడు లో రజనీ పార్టీ ప్రారంభిస్తే తమిళ రాజకీయాలో పెనుసంచలనం సృష్టిండమనేది ఖాయమని విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం ఉన్న ద్రవిడ పార్టీలు సినీ ప్రముఖు స్థాపించిన పార్టీలే కాబట్టి రజనీ పార్టీ కూడా తమిళ ప్రజలు ఆధరిస్తారని రజనీ అభిమానులు అంటున్నారు. మరోవైపు రజనీ రాజకీయ ప్రవేశంపై గతంలో తమిళ నటుడు శరత్ కుమార్ పలు వ్యాఖ్యలు చేశారు. రజనీ స్థానికుడు కాదని వ్యాఖ్యనించాడు. రజనీ పార్టీ స్థాపిస్తారో లేక ఎప్పటిలాగే దేవుడు ఎప్పుడు ఆదివిస్తే అప్పుడు వస్తానని చెబుతాడో చూడాలి....

09:31 - December 26, 2017
09:12 - December 26, 2017

హైదరాబాద్ : నగరంలోని పాతబస్తీలో మరో తలాక్ వివాదం చోటుచేసుకుంది. 2008లో ఓమన్ కు చెందిన హమాద్ పాతబస్తీ చెందిన గౌసీయాబేగంను నిఖా(పెళ్లి) చేసుకున్నాడు. అప్పటి నుంచి గౌసియా హైదరాబాద్ లో ఉంటుంది. రెండు రోజుల క్రితం గౌసియాబేగంలకు హమాద్ ఫోన్ చేసి ఫోన్లోనే తలాక్ చెప్పాడు. దీనిపై గౌసియాబేగం న్యాయం చేయాలంటూ భారత విదేశాంగ శాఖకు లేఖ రాసింది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

జమ్మూకాశ్మీర్ లో ఎన్ కౌంటర్

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ లోని పాంపోర్ జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది మృతి చెందాడు. 

నేటి నుంచి అభిమానులతో రజనీ భేటీ

చెన్నై : నేటి నుంచి తన అభిమానులతో రజనీకాంత్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 31 వరకు అభిమానులతో ఆయన సవమావేశం కానున్నారు.

నేడు విజయ్ రూపానీ ప్రమాణస్వీకారం

ఆహ్మాదాబాద్ : నేడు గుజరాత్ సీఎంగా విజయ్ రూపానీ ప్రమాణాస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ మంత్రి హాజరు కానున్నారు. 

07:53 - December 26, 2017

కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ప్రతి రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని, అమిత్ షా, మోడీ ఎన్నికల సమయంలో తీవ్ర ప్రయత్నలు చేస్తోందని, తమిళనాడులో బీజేపీ జోక్యం చేసుకుంటుందని ఇది ఆర్కేనగర్ ప్రజలకు నచ్చలేదని, లాలూ శిక్ష పడింది కానీ టూ జీ స్కామ్ లో మాత్రం కనిమొళికి, రాజాకు శిక్ష పడలేదని దానికి కారణం బీజేపే అని సీపీఎం పార్టీ మాజీ శాసన సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. దాణా కేసు ఇప్పుడు పెట్టిన కేసు కాదని, దేవగౌడ ప్రభుత్వ హయంలో జరిగిందని, బీజేపీ డీఎంకెతో కలిసి ఉంది, అన్నాడీఎంకెతో కలిసి ఉందని బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ పై నింధరోపణలు చేశారని, బీజేపీ తమిళనాడులో ఎంటరై కీలక పాత్ర పోషించాలని చూశారు కానీ తమిళ ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్పారని ఏఐసీసీ అధికార ప్రతినిధఙ రామ కృష్ణ అన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

07:40 - December 26, 2017

గ్రామీణ విద్యాసదస్సులు అనేది పేరు కొత్తదే అయిన ఇది తము ఎప్పుడో నిర్ణయం తీసుకుందని, ప్రభుత్వ పాఠశాలపై ప్రజలకు నమ్మకం పోయిందని, తప్పును మొత్ం ఉపాధ్యాయులపై వేస్తున్నారని, తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ కలెక్టర్ కొడుకు, సామాన్యుని కొడుకు ఒకే స్కూల్ చదువుకోవాలని అన్నారని యూటీఎఫ్ అధ్యక్షుడు చావా రవి అన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

07:39 - December 26, 2017

అమెరికా : ఉద్యోగాల కోసం అమెరికా వెళ్ళే భారతీయులకు ఇక కష్టకాలమే... ఎందుకంటే.. హెచ్‌-1బీ వీసా జారీ విధానంలో అమెరికా కఠినంగా వ్యవహరించనుంది. అందుకోసం అమెరికా హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం ప్రతిపాదనను సిద్ధం చేసినట్లు సమాచారం.. హెచ్‌-1బీ వీసా పిటిషన్‌దారుల ఎంపిక ప్రక్రియలోనే కఠిన నిబంధనలను చేర్చింది... ఈ విషయాన్నిఅంతర్జాతీయ ఇమ్మిగ్రేషన్‌ సంస్థ ఫ్రాగోమెన్‌ ప్రకటించింది.

మళ్ళీ మార్పులు...
అమెరికా ప్రభుత్వం ఈ వీసా నిబంధనలపై 2011లో చేసిన ప్రతిపాదనకు మళ్ళీ మార్పులు చేయనుంది. అవి అమల్లోకి వస్తే హెచ్‌-1బీ వీసా కోసం దరఖాస్తు దారులు ముందు క్యాప్‌ లాటరీ కోసం రిజిస్టర్‌ చేసుకోవాలి. క్యాప్‌ నంబర్లు వచ్చిన తర్వాతే వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. కానీ.. ఈ నంబర్లను ఇవ్వడంలోనే పెద్దఎత్తున వడపోత జరుగుతుంది. ఈ విషయంలో ప్రాధాన్యత పద్ధతిని పాటించాలని హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ ప్రతిపాదిస్తోంది. దీంతో ఎక్కువ నైపుణ్యం, ఎక్కువ జీతం వచ్చే వారికే ఈ క్యాప్‌ నంబర్లలో ప్రాధాన్యం ఇస్తారు.

మరింత కఠినంగా...
ఇప్పటికే ఈ విసాలపై ఆంక్షలు విధించిన అమెరికా ఇకమీదట మరింత కఠినంగా వ్యవహరించనుంది. సెమి ఆన్యువల్‌ రెగ్యులేటరీ ఎజెండాలో భాగంగా హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ వీసాల జారీలో మార్పులకు శ్రీకారం చుడుతోంది.. కొత్త ప్రతిపాదనలు అమల్లోకి వస్తే.. వేతనాల్లోనూ భారీగా మార్పులు చేసే అవకాశం ఉంది.. ఇప్పటికే హెచ్‌-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు ఎలాంటి ఉద్యోగాలు చేయకూడదని ట్రంప్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్‌ చేపట్టే మార్పులు మరింత నిరాశ కలిగించేవిధంగా ఉన్నాయి.వీసాల విషయంలో ట్రంప్‌ ప్రభుత్వం తీసుకోనున్న కఠిన నిర్ణయాల ప్రభావం ఎక్కువగా భారత్‌, చైనాలపైనే పడనుంది. ఈ రెండు దేశాల నుంచే అమెరికాలో ఉద్యోగాలకోసం వెళ్తుంటారు. అమెరికా పౌరులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకే ట్రంప్‌ ఈ విధానాన్ని కఠినంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. 

07:38 - December 26, 2017

తూర్పుగోదావరి : తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలోని వెల్ల గ్రామంలో.. పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ మంత్రిగా ఉన్న సమయంలో ఇందిరమ్మ మూడో ఫేజ్‌ కోసం నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం 21 ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించాలని నోటిఫికేషన్‌ ఇచ్చారు. అందులో 9 ఎకరాల 10 సెంట్ల భూమికి... రైతులకు నష్టపరిహారం చెల్లించి...ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత 400 కుటుంబాలకు సెంటున్నర చొప్పున పట్టాలు అందించారు. కానీ...ఆ తర్వాత ఇళ్ల నిర్మాణం చేపట్టలేదు. ఇదిలావుంటే... పట్టాలతో పాటు... ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కూడా చేపట్టినట్లు రికార్డుల్లో నమోదు చేయడం విశేషం.

ఇక ఒక్కో ఇంటికి 26 వేల రూపాయలు
ఇక ఒక్కో ఇంటికి 26 వేల రూపాయలు విడుదల చేసినట్లు కలెక్టర్‌ ఉత్తర్వులు కూడా ఇచ్చారు. కానీ... అది కాగితాలకే పరిమితమైంది తప్ప... లబ్దిదారులకు అందలేదు. మరోవైపు పట్టా పత్రాలు అందినా... స్థలాలు మాత్రం దక్కలేదు. దీంతో లబ్దిదారులంతా లబోదిబోమంటున్నారు. ఇక ఈ వ్యవహారం కొనసాగుతుండగానే... 12 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించకుండా కౌలుదారుడు కోర్టుకెళ్లాడు. దాంతో అప్పటినుంచి ఆ వ్యవహారం కోర్టులోనే ఉంది. ఇక లబ్దిదారులకు ఇళ్ల స్థలం కేటాయించాలంటే కోర్టు కేసు తేలాలని అధికారులు కాలయాపన చేశారు. అయితే... ఈ వ్యవహారంలో నష్టపరిహారం తీసుకుని భూమి ఇచ్చేందుకు యాజమానులు అంగీకరించినా...కౌలుదారుడు అడ్డుకోవడం విశేషం. ఇక ఇప్పుడు ప్రభుత్వం మారినా తర్వాత సీన్‌ మారింది. పేదలకు పట్టాల ప్రకారం స్థలాలు ఇచ్చే ప్రయత్నం చేయకుండా... కోర్టులో ఉన్న వ్యవహారాన్ని సొమ్ము చేసుకునేందుకు పాలకపక్షం కొత్త ఎత్తులు వేస్తోంది. అందులో భాగంగా ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇచ్చినట్టు రికార్డుల్లో ఉన్న రెడ్‌ కలర్‌ మార్క్‌ని ఇటీవలే రెవెన్యూ అధికారులు తొలగించారు. ఇందుకు నియోజకవర్గ ప్రతినిధి నడుపుతున్న వ్యవహారమే కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు కోర్టులో ఉన్న 12 ఎకరాల స్థలాన్ని అప్పటి రేటు ప్రకారమే అధికార పార్టీ నాయకుడి బంధువులకు కట్టబెట్టే ప్రయత్నం నడుస్తోందని ప్రచారం జరుగుతోంది. అలాగే రిజిస్ట్రేషన్‌కు అడ్డంకులు లేకుండా చూసేందుకు రెవెన్యూ అధికారులు తోడ్పడటం... రైతులపై పాలకపక్షం ఒత్తిళ్లు తీసుకురావడం జరుగుతోంది. ఇక కోర్టుకెళ్లిన కౌలుదారుడి వ్యవహారాన్ని కూడా లోక్‌అదాలత్‌లో ముగించినట్లు కనిపిస్తోంది.

నిరుపేదల అనేక అవస్థలు
మొత్తానికి ఈ భూమిని పదేళ్ల క్రితం నాటి ధరకే కొంతమంది సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 4 కోట్ల రూపాయల విలువైన భూమిని కోటి రూపాయలకు అప్పనంగా నొక్కేసేందుకు అధికార పార్టీలు పావులు కదుపుతున్నారు. రేపో మాపో వీరికి కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదిలావుంటే లబ్ధిదారుల మాత్రం తమకు త్వరగా ఇళ్లు కట్టించాలని కోరుతున్నారు. ఇదిలావుంటే... గ్రామంలో 900 మంది లబ్దిదారులు ఉన్నారని... వీరికి ఇళ్లు నిర్మించాలంటే... మరో 12 ఎకరాలు అదనంగా కావాలని ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు వర్గీయులు అంటున్నారు. త్వరలోనే గ్రామస్తులందరితో సమావేశమై... ఈ సమస్యను పరిష్కరిస్తామంటున్నారు. మొత్తానికి రాజకీయాల కారణంగా సొంతగూటికి నోచుకోని నిరుపేదలు అనేక అవస్థలు పడుతున్నారు. కోట్ల రూపాయల విలువైన భూములు కాజేస్తున్న పెద్దలు తమ కష్టం గురించి మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

07:36 - December 26, 2017

కరీంనగర్ : కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీలో... రెండు విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరు తమ నిరసన వ్యక్తం చేయగా..! వారి నిరసనపై మరొక వర్గం విరుచుకుపడింది. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితి చోటుచేసుకుంది. యూనివర్సిటీ ఆవరణలో PDSU, DSU, DSF విద్యార్థి నాయకులు మనుధర్మ శాస్త్ర ప్రతులను దహనం చేసి.. తమ నిరసన వ్యక్తం చేశారు. అయితే మనుధర్మ శాస్త్ర ప్రతులను దహనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ABVP నాయకులు ఆందోళనకు దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం ఒకరిపైఒకరు రాళ్లు రువ్వుకున్నారు.

పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని.. విద్యార్థులను చెదరగొట్టారు. కొంతమంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్న ఏబీవీపీ కార్యకర్తలను విడిచిపెట్టాలని డిమాండ్‌ చేస్తూ.. బీజేపీ నాయకులు యూనివర్సిటీ ముందు బైఠాయించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో... సీపీ కమలాసన్‌ రెడ్డి యూనివర్సిటీకి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. వీడియో ఫుటేజీ ఆధారంగా... గొడవకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని కమలాసన్‌రెడ్డి అన్నారు. అదుపులోకి తీసుకున్న విద్యార్థులను విచారించి గొడవకు కారణమైన వారిని గుర్తిస్తామని ఆయన అన్నారు. మరోవైపు ఈ ఏబీవీపీ, ఆర్‌ఎస్‌ఎస్ గుండాల దాడులకు నిరసనగా... ఈ నెల 27న విద్యాసంస్థల బంద్‌కు SFI, AISF, PDSU, AISB, TVV, DSU, DSF విద్యార్థి సంఘాలు నిర్ణయించాయి. 

07:35 - December 26, 2017

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్ట్‌ పనులకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. సీఎం పెట్టిన గడువుకు ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉన్నా.. ప్రాజెక్ట్ పనులు మాత్రం ఓ కొలిక్కి రాలేదని తెలుస్తోంది. మిషన్‌ భగీరథ కార్పొరేషన్‌.. ప్రాజెక్ట్‌కు సంబంధించి 98 శాతం పనులు పూర్తయ్యాయని చెబుతున్నా, ఆచరణలో అందుకు భిన్నమైన పరిస్థితి కనబడుతోంది. సీఎంకు ఇచ్చిన నివేదికలో అధికారులు 70 నుంచి 80 శాతం పనులు పూర్తైనట్టు చూపుతున్నా, ఇంకా చాలాచోట్ల అసంపూర్తిగానే ఉన్నట్టు తెలుస్తోంది.

19 ప్రముఖ అంతర్జాతీయ కంపెనీలు
26 వేల ఆవాసాలకు తాగునీటి అందించాలనే లక్ష్యంతో చేపట్టిన భగీరథ ప్రాజెక్ట్‌ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 26 సెగ్మెంట్లలో పనులు చేపట్టారు. 19 ప్రముఖ అంతర్జాతీయ కంపెనీలు ఆన్‌లైన్‌ టెండర్ల ద్వారా పనులను దక్కించుకున్నాయి. అయితే సీఎం, భగీరథ వైస్‌ చైర్మెన్‌, ఇంకోవైపు చీఫ్‌ ఇంజనీర్‌ వెంటపడుతున్నా పనులు మాత్రం కొలిక్కి రాలేదు. పదే పదే సమీక్షలు, క్షేత్ర స్థాయి తనిఖీలు చేసినప్పటికీ నల్గొండ, సూర్యాపేట, వరంగల్‌, తదితర జిల్లాల్లో పనులు ఆలస్యమవుతున్నాయి. ప్రధానమైన పైపులైనింగ్‌, వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు, ఇంటెక్‌ వెల్స్‌, ఎలక్ట్రో మెకానికల్‌ పనులు ప్రభుత్వం ఆశించిన స్థాయిలో జరగలేదని సమాచారం.

అధికారుల్లో కలవరం......
సీఎం ఇచ్చిన సమయం దగ్గర పడినా.. ఇంకా పనులు పూర్తికాకపోవడంతో.. అధికారుల్లో కలవరం మొదలైంది. ఇప్పటికే ఇంట్రా విలేజ్‌ నెట్‌వర్క్‌ పనుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంతో ఈఈ, డీఈ స్థాయి అధికారులపై చర్యలు తీసుకున్నారు. కొన్ని జిల్లాల్లో ఏఈ స్థాయి అధికారులు షోకాజ్‌ నోటీసులు కూడా ఇచ్చారు. దీంతో ఆచరణలో పథకం పనులు వేగంగా చేయించడంలో సర్కారు ఒకింత విఫలమైందనే తెలుస్తోంది. భగీరథతో... తెలంగాణ పల్లెల్లో నీటి ఎద్దడికి తెరపడుతుందనుకుంటే.. ఆ ఆశ .. ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. 

07:34 - December 26, 2017

హైదరాబాద్ : గతేడాది తెలంగాణలోని ఎమ్మెల్యే, ఎంపీల పనితీరుపై.. నియోజకవర్గాల వారిగా సీఎం కేసీఆర్‌ సర్వేలు చేయించారు. సర్వేల వివరాలను గులాబీ దళపతి అధికారికంగా వెల్లడించారు. ఎంపీ, ఎమ్మెల్యేలకు మార్కులు కూడా ఇచ్చారు. ఆ తర్వాత కూడా పార్టీ పరంగా సర్వేలను అధికార పార్టీ చేయిస్తూనే ఉంది. సర్వే ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం సంబంధిత శాసన సభ్యులను, పార్లమెంట్‌ సభ్యులను సీఎం ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ.. పలువురు నేతలకు హెచ్చరికలు కూడా చేస్తున్నారు.

పార్టీ నేతల్లో హాట్‌ టాపిక్‌గా
టీఆర్‌ఎస్‌ పార్టీపరంగా కూడా గత పదిహేను రోజుల క్రితం ఓ సర్వే పూర్తయిందన్న సమాచారం ఇప్పుడు పార్టీలోని నేతల్లో గుబులు లేపుతోంది.. ఇప్పడు ఈ సర్వే పార్టీ నేతల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. సర్వే వివరాలు బయటపడటంతో అధికార పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఈ సర్వే ప్రకారం గులాబీ పార్టీకి 45 నుండి 50 స్థానాలు సులువుగా దక్కుతాయని తెలుస్తోంది. మరో 15 నుండి 20 స్థానాల్లో హోరా హోరిగా ఉంటుందని.. కష్టపడితే వాటిలో కూడా మోజార్టీ సీట్లు దక్కించుకోవచ్చన్న అభిప్రాయం వెల్లడైందని తెలుస్తోంది. మిగిలిన స్థానాల్లో విజయం దక్కడం దాదాపు అసాధ్యమని సర్వే నివేదికల్లో ఉన్నట్లు సమాచారం. సర్వే వివరాలు బయటకు పొక్కడంతో తమ పరిస్థితి ఎలా ఉందో అని.. అధికార పార్టీ శాసనసభ్యులు ఆరా తీసే పనిలో పడ్డారు. పరిస్థితి ఇలాగే కొనసాగుతుందా.. లేక వచ్చే ఎన్నికల నాటికి మారుతుందా అన్న అనుమానాలు నేతలను వెంటాడుతున్నాయి. వీటితో పాటు సోషల్ మీడియాలో జరుగుతున్న సర్వేల ప్రచారం నేతల్లో కొత్త ఆందోళన రేపుతోంది.

నేడు కోహ్లీ, అనుష్క రిసెప్షన్

ముంబై : నేడు విరాట్ కోహ్లీ అనుష్క శర్మ రిసెప్షన్ జరగనుంది. ఈ రిసెప్షన్ క్రికెట్ సహాచరులు, బాలీవుడ్ తారలు హాజరుకానున్నారు. 

నేడు శ్రీవారికి కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

చిత్తూరు : నేడు శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఉదయం 11 గంటలకు సర్వదర్శనం ప్రారంభం. 29న వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయంలో శుద్ధి చేయనున్నారు. 

Don't Miss