Activities calendar

27 December 2017

21:44 - December 27, 2017

గుంటూరు : ఏపీలో సంక్రాంతి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. భోగి మంటలు... రంగురంగుల ముగ్గులు.. పిండి వంటలు.. ఇంటి నిండా బంధువులు.. వారం రోజుల పాటు ఇంటింటా సందడే సందడి. ఇదంతా ఒక ఎత్తైతే పండుగ సమయంలో గ్రామాల్లో నిర్వహించే కోడి పందాలు మరో ఎత్తు. కోస్తా జిల్లాల్లోని గ్రామాల్లో సంక్రాంతికి కోడి పందాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ పందాలకు నెల ముందు నుంచి కసరత్తు మొదలువుతుంది. ఇందులో భాగంగా పందానికి జాతి పుంజులను సిద్ధం చేస్తారు. మామూలు కోళ్ల కంటే పందెం కోళ్లు ప్రత్యేకంగా కనిపిస్తాయి. సాధారణ కోడిపుంజులకన్నా పందెం పుంజులు ఎత్తుగా, బలంగా ఉంటాయి. రంగురంగుల ఈకలతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి.

పందెం కోళ్లు సుమారు 50 రకాలు
కొన్ని పుంజుల దగ్గరకు వెళ్లడానికి కూడా మనుషులు జంకుతారు. పందెం కోళ్లు సుమారు 50 రకాలు ఉన్నాయి. వీటి ధరలు రూ.5వేల నుంచి లక్షల రూపాయల వరకు ఉంటాయంటే అతిశయోక్తికాదు. పందెం కోళ్లకు ఇచ్చే ఆహారం కూడా ప్రత్యేకమైనదే. వీటికి కాజూ, బాదాం, సజ్జలు, మటన్ కీమా, పచ్చసొన తీసివేసిన కోడిగుడ్లు, రెవిటాల్ టాబ్లెట్లు, 18 రకాల దినుసుల లేహ్యం తినిపిస్తారు. ఒకేచోట నిలబెట్టడం వలన కాళ్లల్లో శక్తి దెబ్బతింటుందని నెట్ కట్టి పుంజును అటూ.. ఇటూ తిప్పుతారు. ఒక విధంగా పుంజుకు వాకింగ్ చేయిస్తారు. కొవ్వు పట్టకుండా గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేయిస్తారు. పుంజు కొద్దిగా నీరసంగా కనిపించినా.. మెడను కదపలేక మేతను తినలేకపోయినా వెంటనే వైద్యం చేయిస్తారు.

కోడిపందాలకు కోస్తాలో ఎంతో క్రేజ్
ఇక కోడిపందాలకు కోస్తాలో ఎంతో క్రేజ్ ఉంది. పండుగకు వారం రోజుల ముందే పందాల పేరుతో పెద్ద వ్యాపారమే జరుగుతుంది. కోడి పందాల్లో గెలుపును పరువు-ప్రతిష్టలకు ప్రతీకగా తీసుకుంటారు. ఈ పందాలు చాలామందికి బతుకుదెరువుగా కూడా మారిపోయాయి. ఇక ఈ కోడి పందాలను చూడటానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాదు.. విదేశాల నుంచి కూడా అభిమానులు తరలివస్తారు. సంక్రాంతి పండుగకు నాలుగు నెలల ముందు నుంచే సమరానికి సిద్ధమయ్యే కోడి పుంజులకు తర్ఫీదు నివ్వడం అంత ఆశామాషీ కాదు. ఇందుకు ప్రత్యేక కసరత్తు చేస్తారు. కోడిపందాల్లో పాల్గొనే కోడి పుంజులు రకరకాల రంగుల్లో ఉంటాయి.. కాకి, నెమలి, డేగ, పచ్చకాకి, పర్ల, సేతువు, పూల, పింగళి, కౌజు, నల్లమచ్చల సేతువు, ఎర్రబోరా, నల్లబోరా, పింగళి, మైల, ఎర్రపొడ, కొక్కిరాయి, నల్ల సవల, ముంగిస, అబ్రాసు, గేరువా ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు ఉన్నాయి. ప్రాంతాలను బట్టి పేర్లు మారుతుంటాయి

కుక్కుట శాస్త్రంలో వివరించిన విధంగా
పందానికి కోడిని సిద్ధం చేసే ముందే పందెం రాయుళ్లు ముందుగా కుక్కుట శాస్త్రాన్ని చదువుతారు. కృష్ణ, శుక్ల పక్షాల్లో కోడి పుంజును ఏయే దిశల్లో ఉంచాలి? ఏ పేరు, రంగు ఉన్న కోడికి ఏ రోజు ఎలాంటి ఆహారం ఇవ్వాలి? ఆరోజు జీర్ణశక్తి ఎలా ఉంటుంది? అనే అంశాలపై దృష్టి పెడతారు. కుక్కుట శాస్త్రంలో వివరించిన విధంగా నియమాలను పాటిస్తూ నిర్వాహకులు కోడిపుంజులను పెంచుతారు. ఇలా శాస్త్రాన్ని ఫాలో అవుతూ మరీ నిర్వాహకులు కోడి పందాలు నిర్వహిస్తుంటే జనం వాటిని చూస్తూ ఆస్వాదిస్తున్నారు. సంక్రాంతి ఐదురోజులు కోడి పందాలతో ఊర్లన్నీ సందడిగా మారిపోతున్నాయి. అధికారులు, పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా కోడి పందాల ముందు అవి బలాదూరే అయిపోతున్నాయి. ఒకప్పుడు కోడి పందాలు ఎక్కడో గోదావరి లంకల్లోనో.. కొబ్బరి తోటల మాటున జరుగుతుండేవి.. అయితే ఇప్పుడు పందెంరాయుళ్లు బాహాటంగానే పందాలు నిర్వహిస్తున్నారు. ఈ పందాలు తూర్పుగోదావరి జిల్లా అల్లవరం, ఐ.పోలవరం, సామర్లకోట, ముమ్మిడివరం మండలాల్లో భారీ ఎత్తున జరుగుతుంటాయి. గత రెండేళ్లుగా పెద్దాపురం, పిఠాపురం, గోకవరం, కోరుకొండ, కాకినాడ రూరల్‌లో సైతం పోటీలు ముమ్మరమయ్యాయి. ఈ ఏడాది జిల్లా అంతా పందెం కోడి కూతలు వినిపించేలానే ఉన్నాయి. ఇక పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం, ఐ.భీమవరం, వెంప, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం వంటి ప్రాంతాల్లో కోడిపందాలకు నిర్వాహకులు సిద్ధమవుతున్నారు.

ఇప్పుడు కోట్ల రూపాయల్లో చేతులు మారుతున్నాయి.
ఒకప్పుడు వేల రూపాయల్లో మొదలైన కోడి పందాలు ఇప్పుడు కోట్ల రూపాయల్లో చేతులు మారుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో గతేడాది వంద కోట్ల రూపాయలకు పైగా చేతులు మారాయని తెలుస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా అదే స్ధాయిలో పోటీ పడిందనేది పందెంరాయుళ్లు చెబుతున్న పరిస్థితి. కోడి పందాలకు వచ్చేవారి సంఖ్య కూడా లక్షల్లో ఉండటంతో కోనసీమ, వేట్లపాలెం, భీమవరం, కాట్రేనికోన ప్రాంతాల్లో పందాల కోసం ఏకంగా స్టేడియంలు రెడీ చేస్తున్నారు. పచ్చని పొలాల్లో బరి గీసి ..రింగులాంటి స్టేడియంలో కోడిపుంజులు యుద్ధం చేస్తుంటే ప్రేక్షకులు కోళ్ల సమరాన్ని చూసి ఆస్వాదిస్తారు. ఓవైపు పందాలు రంజుగా సాగుతుంటే .. మరోవైపు మందు అమ్మకాలు జోరందుకుంటాయి. కోడి పందాలు నిర్వహించడం చట్టబద్ధం కాకపోయినా ఏటా సంక్రాంతి పండుగకు ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ ఎత్తున కోడి పందాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రజా ప్రతినిధులు సైతం తమపై ఉన్న ఒత్తిళ్లతో దగ్గరుండి మరీ పోటీలు నిర్వహిస్తుంటారు. ప్రజా ప్రతినిధుల కనుసన్నల్లోనే కోండి పందాలు జరుగుతుండటంతో పోలీసులది సైతం ప్రేక్షకపాత్రే అవుతోంది. తాజాగా హోం మంత్రి చినరాజప్ప సంస్కృతీ , సాంప్రదాయాలను ప్రజల గౌరవించుకోవాలని, ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని వ్యాఖ్యానించారు. మంత్రి చిన రాజప్ప వ్యాఖ్యలు వింటుంటే ఈ ఏడాది జరిగే కోడి పందాల జోరు మరింత పెరుగుతుందేమో అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. 

21:42 - December 27, 2017

కృష్ణా : కృష్ణాజిల్లా మైలవరంలో 10టీవీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల తహశీల్దార్ శివయ్య, మైలవరం సీఐ రామచంద్రరావు, ఎస్సై రామకృష్ణ , స్ధానిక నేతలు, వ్యాపారస్తులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. 10టీవీ 2018 క్యాలెండర్‌ తమ చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడం ఆనందంగా ఉందని తహశీల్దార్ శివయ్య అన్నారు. 

21:41 - December 27, 2017

కృష్ణా : రాష్ట్రపతి సతీమణి సవితా కోవింద్‌ విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఏపీ ఫైబర్‌ గ్రిడ్‌ ప్రారంభానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ వెంట వచ్చిన ఆయన సతీమణి సవిత, కుమార్తె స్వాతి.. దుర్గ గుడిని సందర్శించారు. దుర్గగుడి ఈవో సూర్యకుమారి, పాలకమండలి ఛైర్మన్‌ గౌరంగబాబు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి ఆలయంలో రాష్ట్రపతి కుటుంబసభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

21:34 - December 27, 2017

హైదరాబాద్ : ముస్లిం మైనార్టీల పట్ల అటు కేంద్రంలోని మోడీ సర్కార్.. తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆవాజ్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఎండీ అబ్బాస్ విమర్శించారు. హైదరాబాద్ పాతబస్తీలో ఆవాజ్ తెలంగాణ రాష్ట్ర మొదటి మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రొ.విశ్వేశ్వరరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డీజీ నర్సింగరావు, ఆవాజ్ నేతలు హాజరయ్యారు. తెలంగాణలో పేదరికంలో ఉన్న ముస్లిం మైనార్టీలను కేసీఆర్ ప్రభుత్వం ఆదుకోవాలని అబ్బాస్ కోరారు. లేదంటే భవిష్యత్‌లో పోరాటాలు చేస్తామని ఆయన హెచ్చరించారు. 

21:34 - December 27, 2017
21:31 - December 27, 2017

హైదరాబాద్ : తెలంగాణలో ఎన్‌కౌంటర్లను నిరసిస్తూ హైదరాబాద్‌- సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రతిఘటన సభ జరిగింది. వామపక్షపార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ సభను నిర్వహించారు. ఎన్‌కౌంటర్లలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులు ఈ సభకు హాజరయ్యారు. తమ వారిని తలచుకుని కన్నీరుమున్నీరయ్యారు.ప్రతిఘటన సభలో పాల్గొన్న టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం.. తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు. కేసీఆర్‌ సర్కార్‌ యధేచ్చగా చట్టాల ఉల్లంఘనకు పాల్పడుతోందన్నారు. ఇందుకు సాక్ష్యమే టేకులపల్లి ఎన్‌కౌంటర్‌ అని చెప్పారు. ఈ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఎవరినైనా పోలీసులు అరెస్ట్‌ చేసిన వెంటనే పోలీసు ఉన్నతాధికారులకు, న్యాయమూర్తులకు తెలిసేలా మెసేజ్‌లు పెట్టాలని మాజీ జస్టిస్‌ చంద్రకుమార్‌ డిమాండ్‌ చేశారు.

పోలీసుల అదుపులో ఇంకా ముగ్గురు
టేకులపల్లి ఎన్‌కౌంటర్‌ ప్రభుత్వ హత్యేనని విరసం నేత వరవరరావు ఆరోపించారు. బాధ్యులైన పోలీసులను సస్పెండ్‌ చేసి .. వారిపై హత్యానేరం నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. పోలీసుల అదుపులో ఇంకా ముగ్గురు ఉన్నారని.. వారిని వెంటనే కోర్టులో హాజరుపర్చాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజాస్వామిక గొంతులను నొక్కేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆరోపించారు. బూటకపు ఎన్‌కౌంటర్ల మీద జ్యూడీషియరీ ఎంక్వైరీ ఏర్పాటు చేయాలన్నారు.

హిందూత్వ శక్తులు ఏకంగా రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్రచేస్తున్నాయని టీ మాస్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య అన్నారు. ప్రజాస్వామికవాదులంతా రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని కోరారు.

నేరెళ్ల ఘటన జరిగిన ఆరు నెలలు
నేరెళ్ల ఘటన జరిగిన ఆరు నెలలు గడుస్తున్నా ఇంతవరకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు నంద్యాల నర్సింహ్మారెడ్డి అన్నారు. ముగ్దూం భవన్‌లో నేరెళ్ల బాధితులతో జరిగిన ముఖాముఖిలో పాల్గొన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పోలీసులు తమను చావకొట్టినా తమ ఎమ్మెల్యే కేటీఆర్‌ స్పందింలేదని నేరెళ్ల బాధితుడు బాణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల రక్షణలో నేటికీ ఇసుకమాఫియా ఆగడాలు కొనసాగుతున్నా పట్టించుకోవడం లేదని, కేసీఆర్‌ సర్కార్‌కు సరైన సమయంలో బుద్దిచెప్తామన్నారు.తెలంగాణలో ప్రజాస్వామిక వాతావారణం కోసం అందరూ కృషి చేయాలని నేతలు పిలుపునిచ్చారు. ఎన్‌కౌంటర్లకు వ్యతిరేకంగా ఉద్యమించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా కళాకారులు పాడిన పాటలు అందరినీ ఆలోచింపజేశాయి.

21:28 - December 27, 2017

ఢిల్లీ : విభజన హామీలను వెంటనే అమలు చేయాలంటూ టీఆర్‌ఎస్‌ ఎంపీలు లోక్‌సభలో ఆందోళనకు దిగారు. హైకోర్టు విభజనపై వాయిదా తీర్మానం ప్రవేశపెట్టిన టీఆర్‌ఎస్ ఎంపీలు.. స్పష్టమైన ప్రకటన కోసం డిమాండ్ చేశారు. ఎంపీ కవిత, జితేందర్‌ రెడ్డి వెల్‌లోకి దూసుకువెళ్లి నినాదాలు చేశారు. దీంతో లోక్‌సభ స్తంభించిపోయింది. హైకోర్టు విభజనపై టీఆర్‌ఎస్ ఎంపీలు పట్టువిడవకపోవడంతో లోక్‌సభ రెండు సార్లు వాయిదా పడింది.మూడున్నరేళ్లు గడిచినా హైకోర్టు విభజన చేయకపోవడం దురదృష్టకరమని టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం చొరవ చూపి వెంటనే హైకోర్టును విభజించాలన్నారు. లేకపోతే తమ ఆందోళన కొనసాగుతుందని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు తమ ఆందోళన కొనసాగుతుందన్నారు.తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు అత్యవసరమని పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్ కుమార్ అన్నారు.

ఎంపీల ఆందోళనతో కేంద్రం కదిలింది...
హైకోర్టు విభజన అంశాన్ని న్యాయశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. దేశంలోని అన్ని రాష్ర్టాలకు ప్రత్యేక హైకోర్టులు ఉన్నాయని.. అదే విధంగా తెలంగాణకు కూడా ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుకు చొరవ తీసుకుంటామని కేంద్రమంత్రి అనంత్ కుమార్ తెలిపారు. మొత్తానికి టీఆర్‌ఎస్‌ ఎంపీల ఆందోళనతో కేంద్రం కదిలింది.. హైకోర్టు విభజనపై హామీ లభించింది. దీనిపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ గురువారం చెబుతామని హామీ ఇచ్చినట్లు ఎంపీ వినోద్‌ తెలిపారు. గులాబి పార్టీ ఎంపీలు విభజన హామీలపై పార్లమెంట్‌లో హీట్ పుట్టించారు. ఇప్పటికైనా.. హైకోర్టు విభజన జరుగుతుందో లేదో ? చూడాలి.

21:27 - December 27, 2017

గుంటూరు : ఏపీ సర్కార్ ఇంటింటికి ఇంటర్నెట్ కలను సాకారం చేస్తూ.. ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టును రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రారంభించారు. అమరావతిలో జరిగిన ప్రారంభోత్సవంలో.. ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ తదితరులు పాల్గొన్నారు. డిజిటల్‌ ఆంధప్రదేశ్‌లో భాగంగా ఈ ఫైబర్‌గ్రిడ్‌ను అభివృద్ధి చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా తక్కువ రేటుకే కేబుల్‌ టీవీ, ఇంటర్నెట్‌, టెలిఫోన్‌ సౌక్యరం కల్పిస్తారు. ఏపీ ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న ఐదు గ్రిడ్లలో ఫైబర్‌ గ్రిడ్‌ ఒకటి. ఏపీ ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు ప్రజల సామాజిక, ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చెప్పారు. ఇంటర్నెట్‌ వినియోగం ద్వారా విద్యార్థులు, రైతులు, అధికారులు... ఇలా అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఏపీ ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వస్తాయని గవర్నర్‌ నరసింహన్‌ చెప్పారు. వర్చువల్‌ క్లాస్‌ రూమ్‌ విధానంలో విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయన్నారు. ఈ వ్యవస్థ ప్రజల జీవన విధానంలో మార్పు తీసుకొస్తుందని ఏపీ ఫైబర్‌ గ్రిడ్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో చెప్పారు. ఏపీ ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు ద్వారా వెల్లువెత్తే సమాచార విప్లవం.. ప్రజల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.

గిరిజన గ్రామాలకు సమాచార వ్యవస్థ
గిరిజన గ్రామాలకు సమాచార వ్యవస్థను విస్తరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌ చెప్పారు. ఫైబర్‌ గ్రిడ్జ్‌ ప్రాజెక్టు ద్వారా ఒకే కనెక్షన్‌తో రోజంతా వైఫై, 15 ఎంబీపీఎస్ ఇంటర్నెట్, 250 చానల్స్ అందించనున్నారు. విద్యుత్ స్తంభాలను ఉపయోగించుకుని రూ.400 కోట్లతో ఈ ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం చేపట్టింది. మరోవైపు రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలకు వచ్చే ఏడాది డిసెంబర్‌ నాటికి ఉచిత వైఫై సౌకర్యం కల్పించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే ఏప్రియల్ నాటికి 25 లక్షల మందికి ఫైబర్ నెట్ సౌకర్యం కల్పించబోతున్నారు. ఫైబర్ నెట్ ద్వారా ఎలాంటి మోడెం అవసరం లేకుండా సెట్‌ టాప్ బాక్సు ద్వారా వైఫై సౌకర్యం పొందవచ్చు. వైఫై అందుబాటులోకి రావడం ద్వారా ప్రతి ఇంట్లో ఇంటర్నెట్ వాడకం పెరుగుతుంది. టీవీ స్క్రీన్‌పైనే ప్రజలు తమకు కావాల్సిన సేవల్ని పొందే అవకాశం ఉంటుంది.

రెండు సెట్‌ టాప్ బాక్సులే కీలకం
ఫైబర్ నెట్ కనెక్షన్‌లో రెండు సెట్‌ టాప్ బాక్సులే కీలకం. వీటి వల్ల టీవీ కంప్యూటర్‌లా పనిచేస్తుంది. వైర్‌లెస్ కీబోర్డు, మౌస్‌ను ఉపయోగించి ఇంటర్నెట్‌ను వాడుకోవచ్చు. కంప్యూటర్‌లో చేసే అన్ని పనులను టీవీ స్క్రీన్‌పై చేసుకోవచ్చు. ఎంఎస్ ఆఫీస్‌లో మనకు అవసరమైన పనులు చేసుకోవడంతో పాటు పీడీఎఫ్ ఫైల్స్‌ను సైతం చూడొచ్చు. ఇక సెట్‌టాప్‌ బాక్సుల్లోనే వైఫై రూటర్‌ కూడా ఉంటుంది. దీని ద్వారా ఇంట్లోని మొబైల్, ట్యాబ్, ల్యాప్ టాప్‌లలోనూ ఇంటర్నెట్‌ను చూసుకోవచ్చు. వీడియో కాలింగ్‌ కోసం కెమెరాను, ల్యాండ్‌లైన్‌ను కూడా ఈ బాక్సులోనే అనుసంధానం చేస్తారు. దీంతో పాటు అలారం సెట్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. టీవీలో నచ్చిన ప్రోగ్రాంను మెమరీకార్డు, పెన్‌ డ్రైవ్‌లలో కాపీ చేసుకోవచ్చు. ఇంట్లో సీసీ కెమెరాలు ఉంటే వాటికి కూడా టీవీని అనుసంధానం చేసుకునే వీలుంటుంది.

సెట్‌ టాప్‌ బాక్సుల ఖరీదు రూ.4 వేలు
ప్రతి కనెక్షన్‌కు అవసరమైన సెట్‌ టాప్‌ బాక్సుల ఖరీదు రూ.4 వేల రూపాయలు.. వీటిని ప్రభుత్వం ప్రతి నెల రూ.99 చొప్పున నాలుగేళ్ల పాటు వాయిదా పద్ధతిపై చెల్లించే ఏర్పాటు చేసింది. దీంతో కనెక్షన్‌కు నెలకు రూ.149తో పాటు సెట్‌ టాప్ బాక్సు వాయిదా రూ.99 కడితే సరిపోతుంది. ఇప్పటికే ఏపీలోని కృష్ణా జిల్లాలో 14వేల 698 ఇళ్లకు.. గుంటూరు జిల్లాలో 5 వేల 692 ఇళ్లకు ఫైబర్ నెట్ కనెక్షన్లు ఇచ్చారు. బాక్సులు అందుబాటులో ఉన్నమేర వ్యాపార, విద్యా సంస్థలకు కూడా కనెక్షన్లు ఇస్తున్నారు. 

క్రికెట్ బెట్టింగ్ లపూ పోలీసులు దాడులు

కృష్ణా : విజయవాడలో క్రికెట్ బెట్టింగ్ లపై పోలీసు దాడులు కొనసాగుతున్నాయి. కృష్ణలంకలో ఐదుగురు బుకీలు, ముగ్గురు సబ్ బుకీలను అరెస్ట్ చేశారు. వారి నుంచి నాలుగు కమ్యూనికేటర్ బాక్స్ లు, ఐదు ల్యాప్ టాప్ లు స్వాధీనం చేసుకున్నారు.

20:49 - December 27, 2017

ఈ సంవత్సరంలో ఏడు రాష్ర్టాల్లో ఎన్నికలు జరగడం, శశికళ జైలు వెళ్లాడం, లాలూ జైలు వెళ్లాడం, దేశ ఆర్థిక వ్యవస్థ నష్టపోవడం, జీఎస్టీ అమలు పై రివైండ్ 2017. గత సంవత్సంర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు దేశ ఆర్థిక వ్యవస్థనే క్షిణించింది. గుజరాత్ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ స్వల్ప తేడా గెలిచింది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

20:41 - December 27, 2017

దొంగది గాదు దొడ్లకు రాదన్నట్టు.. ఆ బట్టెవాయి మాటలు ఎందుకు మాట్లాడాలే మళ్ల ఎందుకు మత్పరియ్యాలే జనగామా ఎమ్మెల్యేగారూ..? విద్యల రిజర్వేషన్లు తీశేయాలని కుద్దుగ అంటివి మళ్ల.. డ్యాష్ కథలు వడవడ్తివి నేను అట్ల అనలేదు.. చేయలేదని.. ఒక్కదినంలనే మాటమార్చెటోనివి నువ్వు ఎమ్మెల్యే పదవి శిగ్గుదీస్తున్నవ్ గదా..? ప్రజలారా సూడుండ్రి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి బాగోతం..

20:40 - December 27, 2017

అబ్బ మొత్తం మీద సర్కారు ఎమ్మార్పీఎస్ ఉద్యమం ముంగట దోషిగ నిలవడక తప్పలేదు సూడుండ్రి.. మంద క్రిష్ణ మాదిగనే అరెస్టు జేశి ఆరు రోజులు వట్టి జైళ్ల వెట్టిన ప్రభుత్వం.. బెయిల్ రాకుంట శాతనైన కాడికి బాగనే తన్లాడింది.. కని ఎట్టకేలకు బెయిల్ మంజూరై బైటికొచ్చిండు.. ఇగ మరి సర్కారు మీదికి యుద్దానికి తయ్యారైతున్నడా..? కేసీఆర్ ప్రభుత్వానికి ఏం జెప్పవోతున్నడనేది సూద్దాం..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పచ్చి అవద్దాలు జెప్తున్నడట.. మశివూశి మారెడు గాయ జేశి.. ఇగో ఇదే చందమామా అని చెప్కతిర్గుతున్నడట.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బాగనే సొట్ల వెట్టిండు.. అవద్దాల మీదనే తెలంగాణ ప్రభుత్వం నడుస్తున్నది.. ఈ ప్రభుత్వం ఉండుడు ప్రజాస్వామ్య దేశంల మంచిదిగాదన్కొచ్చిండు..

దొంగది గాదు దొడ్లకు రాదన్నట్టు.. ఆ బట్టెవాయి మాటలు ఎందుకు మాట్లాడాలే మళ్ల ఎందుకు మత్పరియ్యాలే జనగామా ఎమ్మెల్యేగారూ..? విద్యల రిజర్వేషన్లు తీశేయాలని కుద్దుగ అంటివి మళ్ల.. డ్యాష్ కథలు వడవడ్తివి నేను అట్ల అనలేదు.. చేయలేదని.. ఒక్కదినంలనే మాటమార్చెటోనివి నువ్వు ఎమ్మెల్యే పదవి శిగ్గుదీస్తున్నవ్ గదా..? ప్రజలారా సూడుండ్రి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి బాగోతం..

గురిగింజ నల్పెర్గదన్నట్టు.. తెల్గుదేశమోళ్లు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ల తప్పులు ఏరుకుంట తమాష జేస్తున్నరు.. ఈ భూమ్మీద తెల్గుదేశం పార్టీ లీడర్లు మాత్రమే ఆణిముత్యాలు తతిమోళ్లంత దగాకోర్లు, కబ్జాకోర్లు.. కూనికోర్లు అన్నట్టు ముచ్చట జెప్తున్నది అనురాధా మేడం.. ఆ కథ ఏందో జర మీరు గూడ ఇనాలే.. మళ్ల మనం గూడ అనాలే..

పదికిలోల బాటు మీదికి ఇశిరేశి.. బుజానికి తాకిచ్చుకుంటరా..? బొక్కలు సూర సూర అయితయ్.. టీవీలళ్ల అప్పుడప్పుడు వస్తుంటయ్ సూడుండ్రి వాళ్లు టీవీలళ్ల కండలు తిర్గి.. గుండె ధైర్యం తోని జేశే సాహసాలు మాత్రమే జూశ్నంమనంగని.. వాళ్ల బత్కు ఎంత దీనంగుంటదో సూడలే.. అందరికి ఆనందం పంచే ఆ సాహసవీరులు.. ఊర్లె మాత్రం ఎక్కిరింతల పాలైతున్నరు..

కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోస్టు ఖాళీ అయ్యిందని తెల్వంగనే ఎంటనే తన పార్టీ మన్షితోని నామినేషన్ ఏపిచ్చి.. భర్తీ జేయవోతున్నడు ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. మరి ఎమ్మెల్సీ పోస్టులు భర్తీ జేస్కునెకాడున్న ఆత్రం.. సర్కారు దావఖాండ్లళ్ల డాక్టర్లను భర్తీ జేసెకాడ ఎందుకు లేదు..? చంద్రాలు ఇగో జనం గోసజూడు..

 

తెలంగాణ సీఎస్ విరుచుకుపడ్డ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్ : ఇరు రాష్ట్రాల సీఎస్ లు విభజన చట్టానికి వ్యతిరేకంగా వ్యహరిస్తున్నారని, ఎవరికీ తెలియకుండా తాజ్ కృష్ణలో ఏపీ, తెలంగాణ సీఎస్ భేటీ అయ్యారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. ఈ విషయాన్ని సీఎం దృష్టి తీసుకెళ్తామని ఆయన అన్నారు. ఏపీలోని పోస్టులు వాళ్లకే, తెలంగాణకు రావాల్సిన 18 పోస్టులు ఏపీ వాళ్లకేనా శ్రీనివాస్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. రీ అప్షన్ ఎలా ఇచ్చారో సీఎస్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 

తమిళనాడులో పట్టాలు తప్పిన రైలు

చెన్నై : తమిళనాడులోని అవడి స్టేషన్ లోకల్ రైలు పట్టాలు తప్పింది. దీంతో ఆ రూట్లో నడిచే పలు రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది.

ఏపీలో ఇద్దరు మున్సిపల్ కమిషనర్ల బదిలీ

గుంటూరు : ఏపీలో ఇద్దరు మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేశారు. నెల్లూరు అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ గా ఢిల్లీరావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

19:45 - December 27, 2017

బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టు పగ్గాలు లేకుండా వ్యవహరిస్తున్నారని, స్వాతంత్ర ఉద్యమంతోని ఎలాంటి సంబంధం లేని వారు, భారతదేశాన్ని వెనక్కు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇటువంటి చర్యలు లౌకిక వాదానికి ప్రమాదమని, ప్రతి ఒక్కరు దీనిపై స్పందించాల్సి అవసరం ఉందని నవతెలంగాణ ఎడిటర్ వీరయ్య అన్నారు. 1976 రాజ్యంగ సవరణ చేశారని, రాజ్యంగంలో రెండు పదాలు చేర్చారని, పార్లమెంట్ జరిగిన చర్చలో కేటీషా ఇండియ సామ్యావాద, లౌకిక దేశమని రాతపూర్వకంగా ఇచ్చారని, దీనిక అంబేద్కర్ మన రాజ్యంగలోనే లౌకిక వాదం ఉందని అన్నారని బీజేపీ నేత రఘునందన్ రావు అన్నారు. బీజేపీ నాయకులే మంత్రి వ్యాఖ్యలను ఖండించారని, ప్రధానంగా బీజేపీ ఎప్పుడు అధికారంలోకి వచ్చిన రాజ్యంగ మార్చే అవకాశం ఉందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి బెల్లయ నాయక్ అన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

చెరువులో దూకేందుకు తల్లీకొడుకుల యత్నం

రంగారెడ్డి : జిల్లా గండిపేట్ చెరువులో దూకేందుకు తల్లీకొడుకు యత్నించారు. భర్త వేధింపులతో విసిగిపోయిన పెద్ద మంగళారానికి చెందిన అనూషకు భిక్షపతి కొన్ని సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. వారికి ఓ కుమారుడు ఉన్నాడు. రాత్రి మద్యం సేవించిన భార్య, కొడుకును భిక్షపతి చితబాదాడు. వేధింపులు భరించలేని వారు ఆత్మహత్య చేసుకునేందుకు చెవరువు వద్ద వచ్చారు. 

18:03 - December 27, 2017

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లా టేకులపల్లి మండలం సులానగర్‌లో డబుల్‌ బెడ్రూం ఇళ్ల కేటాయంపులో అన్యాయం జరిగిందంటూ గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. లబ్దిదారుల లిస్ట్‌లో పేరున్న వారికి ఇళ్లు కేటాయించలేదని ఆందోళన చేశారు. ఇళ్లను ప్రారంభించనున్న నేపథ్యంలో లోకల్‌ లీడర్లు వ్యవహరిస్తున్న తీరుకు నిరసగా తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. 

18:02 - December 27, 2017

కరీంనగర్ : కరీంనగర్‌ శాతవాహన యూనివర్సిటీలో వామపక్ష విద్యార్థి సంఘాలపై జరిగిన దాడిని తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఖండించారు. మనుధర్మశాస్త్రం హిందువుల మధ్య చిచ్చుపెట్టే అధర్మశాస్త్రమని మండిపడ్డారు. సమానత్వాన్ని కోరుకునే వారంతా మనధర్మశాస్త్రాన్ని వ్యతిరేకించాలని అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో కోసం క్లిక్ చేయండి. 

18:01 - December 27, 2017

హైదరాబాద్ : విభజన హామీలను వెంటనే అమలు చేయాలంటూ టీఆర్‌ఎస్‌ ఎంపీలు లోక్‌సభలో ఆందోళనకు దిగారు. హైకోర్టు విభజన కోరుతూ పలుమార్లు సభకు అంతరాయం కలిగించారు. మూడున్నరేళ్‌లు గడిచినా హైకోర్టు విభజన చేయకపోవడం దురదృష్టకరమని టీఆర్‌ఎస్‌ ఎంపీలు అన్నారు. కేంద్ర ప్రభుత్వం చొరవ చూపి వెంటనే హైకోర్టును విభజించాలన్నారు. లేకపోతే తమ ఆందోళన కొనసాగుతుందని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు తమ ఆందోళన కొనసాగుతుందన్నారు.

18:00 - December 27, 2017

హైదరాబాద్ : కమెడియన్ విజయ్‌ భార్య వనితారెడ్డి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయింది. తాను ఏ తప్పూ చేయలేదని.. ఎక్కడికీ పారిపోలేదని ఆమె చెబుతోంది. తన తప్పు లేదని నిరూపించే కొన్ని ఆధారాలు సేకరించడానికే తాను తిరుగుతున్నట్లు వనితారెడ్డి చెప్పింది. ఆధారాలు చూసాక పోలీసులు ఏ విధంగా చెబితే అలా చేస్తానంటోంది. శశిధర్‌ ఎవరో తనకు తెలియదని.. తాను వాడుతున్న కారు తన తండ్రి ఇచ్చారని ఆమె తెలిపింది. మరోవైపు జూబ్లీహిల్స్ పోలీసులు వనితారెడ్డిని విచారిస్తున్నారు. 

17:59 - December 27, 2017

హైదరాబాద్ : షార్ట్‌ఫిల్మ్‌ డైరెక్టర్‌ యోగి, మోడల్‌ హారిక పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. యోగి తనను వేధించారని హారిక ఆరోపిస్తోంది. తాను ఎవరినీ వేధించలేదని... తనపై హారిక అసత్య ఆరోపణలు చేస్తోందని... పోలీసులతో తనను కొట్టించిందని యోగి చెప్తున్నారు. ఇద్దరి మధ్య జరిగిన వాట్సాప్‌ సంభాషణను యోగి పోలీసులకు ఇచ్చారు. అయితే యోగి చూపిన ఆధారాలు కేవలం క్రియేషనేనని.. అవి వాస్తవం కాదని హారిక చెబుతోంది. 

17:55 - December 27, 2017

హైదరాబాద్ : ఉద్యోగాల కోసం నిరుద్యోగులు పోరుబాటపట్టారు. విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యలో ఉద్యోగసాధన పోరాటయాత్రకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్‌లోని ఏవీకాలేజీ గ్రౌండ్స్‌నుంచి ప్రారంభమైన యాత్రకు ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ హాజరయ్యారు. ప్రభుత్వరంగంలో ఉన్న ఖాళీలను ఒకేసారి భర్తీచేయడంతోపాటు ప్రస్తుతం ఉన్న ఖాళీలపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ప్రతి సంవత్సరం అకడమిక్‌ క్యాలెండర్‌ను ప్రకటించాలని డిమాండ్‌ చేస్తున్నారు. జనవరి 2న వరంగల్‌ సభతో యాత్ర ముగుస్తుందని విద్యార్థి సంఘాలు తెలిపాయి. 

17:54 - December 27, 2017

కృష్ణా : రాష్ర్టపతి కోవింద్‌ సతీమణి సవిత కోవింద్‌, వారి కుమార్తె విజయవాడలో పర్యటించారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో సవిత కోవింద్‌కు అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. అక్కడనుంచి బందర్‌రోడ్డులోని పీడబ్య్లుడీ గ్రౌండ్‌లో జరుగుతున్న ఫ్లవర్‌ షోను తిలకించారు. ఈ కార్యక్రమంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచి పర్యావరణానికి దోహదపడాలని స్పీకర్‌ కోరారు. రాష్ర్టపతి పర్యటన సందర్భంగా నగరంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

17:54 - December 27, 2017

గుంటూరు : రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలకు వచ్చే ఏడాది డిసెంబర్‌ నాటికి ఉచిత వైఫై సౌకర్యం కల్పించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. గిరిజన గ్రామాలకు సమాచార వ్యవస్థను విస్తరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌ చెప్పారు. అమరావతిలో జరిగిన ఏపీ ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో లోకేశ్‌ ఈ విషయం చెప్పారు. 

17:53 - December 27, 2017

గుంటూరు : ఏపీ ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టును రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రారంభించి, రాష్ట్ర ప్రజలకు అంకితం చేశారు. ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు ప్రజల సామాజిక, ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చెప్పారు. ఇంటర్నెట్‌ వినియోగం ద్వారా విద్యార్థులు, రైతులు, అధికారులు... ఇలా అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అమరావతిలోని జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ తదితరులు పాల్గొన్నారు. డిజిటల్‌ ఆంధప్రదేశ్‌లో భాగంగా ఈ ఫైబర్‌గ్రిడ్‌ను అభివృద్ధి చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా తక్కవ రేటుకే కేబుల్‌ టీవీ, ఇంటర్నెట్‌, టెలిఫోన్‌ సౌక్యరం కల్పిస్తారు. ఏపీ ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న ఐదు గ్రిడ్లలో ఫైబర్‌ గ్రిడ్‌ ఒకటి. విద్యుత్‌, మంచినీరు, గ్యాస్‌, రోడ్లను కూడా ఏపీ అభివృద్ధి చేస్తోంది. ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వస్తాయని గవర్నర్‌ నరసింహన్‌ చెప్పారు. వర్చువల్‌ క్లాస్‌ రూమ్‌ విధానంలో విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయన్నారు. ఈ వ్యవస్థ ప్రజల జీవన విధానంలో మార్పు తీసుకొస్తుందని ఏపీ ఫైబర్‌ గ్రిడ్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో చెప్పారు. ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు ప్రజల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. సమాచార విప్లవం ప్రజల జీవన విధానంలో మార్పు తీసుకొస్తుందిన ఫైబర్‌ గ్రిడ్‌ ప్రారంభోత్సవంలో చెప్పారు. 

17:38 - December 27, 2017

రంగారెడ్డి : జిల్లా గండిపేట్ చెరువులో దూకేందుకు తల్లీకొడుకు యత్నించారు. భర్త వేధింపులతో విసిగిపోయిన పెద్ద మంగళారానికి చెందిన అనూషకు భిక్షపతి కొన్ని సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. వారికి ఓ కుమారుడు ఉన్నాడు. రాత్రి మద్యం సేవించిన భార్య, కొడుకును భిక్షపతి చితబాదాడు. వేధింపులు భరించలేని వారు ఆత్మహత్య చేసుకునేందుకు చెవరువు వద్ద వచ్చారు. వారిని గమనించిన స్థానికులు లేక్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారిని రక్షించారు. మరింత సమాచారం కోసం వీడియ్ క్లిక్ చేయండి.

కాసేపట్లో రిమాండ్ కు యోగి

హైదరాబాద్ : కాసేపట్లో షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ యోగిని రిమాండ్ కు తరలించారు. వేధింపులకు గురిచేసినట్టు హారిక అనే వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు యోగిని అరెస్ట్ చేశారు. 

17:22 - December 27, 2017

హైదరాబాద్ : కాసేపట్లో షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ యోగిని రిమాండ్ కు తరలించారు. వేధింపులకు గురిచేసినట్టు హారిక అనే వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు యోగిని అరెస్ట్ చేశారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

భర్త ఇంటి ముందు భార్య ఆందోళన

కరీంనగర్ : జిల్లాలో అత్త ఇంటిముందు కోడలు మానస ఆందోళనకు దిగింది. అదనపు కట్నం కోసం వేధిస్తున్నారంటూ ఇప్పటికే రూ.50లక్షల కట్నం తీసుకున్నారని మానస తెలిపింది. అత్త మామలు శారీరకంగా వేధిస్తున్నారని మానస ఆరోపిస్తోంది. తన భర్త సంసార జీవితానికి అర్హుడు కాడని మానస అభియోగం మోపారు. పెళ్లికి ముందే తన భర్తకు పెరాలసిస్, మానసిక వ్యాధి ఉందన్న మానస అన్నారు.

16:54 - December 27, 2017

కరీంనగర్ : జిల్లాలో అత్త ఇంటిముందు కోడలు మానస ఆందోళనకు దిగింది. అదనపు కట్నం కోసం వేధిస్తున్నారంటూ ఇప్పటికే రూ.50లక్షల కట్నం తీసుకున్నారని మానస తెలిపింది. అత్త మామలు శారీరకంగా వేధిస్తున్నారని మానస ఆరోపిస్తోంది. తన భర్త సంసార జీవితానికి అర్హుడు కాడని మానస అభియోగం మోపారు. పెళ్లికి ముందే తన భర్తకు పెరాలసిస్, మానసిక వ్యాధి ఉందన్న మానస అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి. 

నూజివీడు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కు పవర్ కట్

కృష్ణా : నూజివీడు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ పవర్ కట్ అయింది. రూ.90వేల విద్యుత్ బకాయిలు చెల్లించలేదని విద్యుత్ అధికారులు విద్యత్ సరఫరా నలిపివేశారు. దీంతో రిజిస్ట్రేషన్లు నిలచిపోయాయి. దీంతో రిజిస్ట్రేషన్ వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

16:01 - December 27, 2017

తరలిపోయిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్

హైదరాబాద్ : ఓయూలో నిర్వహించాల్సిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలను మణిపూర్ కు తరలించారు. సైన్స్ కాంగ్రెస్ నిర్వహించేందుకు దేశవ్యాప్తంగా 7 యూనిర్శిటీలు పోటీ పడుతున్నాయి.

15:41 - December 27, 2017
15:40 - December 27, 2017

హైదరాబాద్ : ఓయూలో నిర్వహించాల్సిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలను మణిపూర్ కు తరలించారు. సైన్స్ కాంగ్రెస్ నిర్వహించేందుకు దేశవ్యాప్తంగా 7 యూనిర్శిటీలు పోటీ పడుతున్నాయి. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

హారిక సెల్ఫీ వీడియో విడుదల...

హైదరాబాద్ : షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ యోగి ఆరోపణలపై హారిక స్పందించింది. ఆమె సెల్ఫీ వీడియో విడుదల చేసింది.సెల్ఫ్ వాట్సాప్ మెసేజ్ లతో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, క్రిమినల్ బ్రెయిన్ తో స్టోరీలు క్రియోట్ చేస్తున్నారని, నేను తప్పు చేస్తే ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హారిక అన్నారు. 

15:20 - December 27, 2017

హైదరాబాద్ : షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ యోగి ఆరోపణలపై హారిక స్పందించింది. ఆమె సెల్ఫీ వీడియో విడుదల చేసింది.సెల్ఫ్ వాట్సాప్ మెసేజ్ లతో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, క్రిమినల్ బ్రెయిన్ తో స్టోరీలు క్రియోట్ చేస్తున్నారని, నేను తప్పు చేస్తే ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హారిక అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

ప్రగతి విద్యాసంస్థలపై ఐటీ దాడులు

కృష్ణా : జిల్లా అవనిగడ్డలో ప్రగతి విద్యాసంస్థలపై ఐటీ దాడులు నిర్వహిస్తోంది. ప్రగతి విద్యాసంస్థల చైర్మన్ పూర్ణచంద్రరావు ఇంట్లోనూ ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ప్రగతి విద్యాసంస్థ ఉపాధ్యాయ, ఉద్యోగ పరీక్షలకు శిక్షణ ఇస్తోంది.

15:09 - December 27, 2017

కృష్ణా : జిల్లా అవనిగడ్డలో ప్రగతి విద్యాసంస్థలపై ఐటీ దాడులు నిర్వహిస్తోంది. ప్రగతి విద్యాసంస్థల చైర్మన్ పూర్ణచంద్రరావు ఇంట్లోనూ ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ప్రగతి విద్యాసంస్థ ఉపాధ్యాయ, ఉద్యోగ పరీక్షలకు శిక్షణ ఇస్తోంది. ఆదాయానికి తగ్గట్టు లెక్కలు చూపకపోవడంంతో ఐటీ దాడలు చేస్తోంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

14:37 - December 27, 2017

ప్రస్తుతం ఉన్న ఆధునిక సమాజంలో డైవర్స్ కేసులు పెరిగాయని, భార్య, భర్తలు వీడిపోయిన తర్వాత పిల్లలు ఎవరికి చెందుతారో తెలపాడానికి, న్యాయ సలహాల గురించి వివరించడానికి ప్రముఖ అడ్వకేట్ పార్వతి గారు మావని మై రైట్ వచ్చారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

14:32 - December 27, 2017

విభజన చేసే వరకు పోరాటం

ఢిల్లీ :  హైకోర్టు విభజనపై కేంద్రం స్పష్టత వచ్చే వరకు పార్లమెంట్ లో నిరసన కొనసాగిస్తామని టీఆర్ఎస్ ఎంపీ కవిత అన్నారు. నిరసన ద్వారా తెలంగాణ ప్రజల ఆకాంక్షను తెలియజేస్తామని ఆమె అన్నారు. 

భూ సేకరణపై విచారణను బహిష్కరించిన ముంపు గ్రామాలు

సిద్దిపేట : వేములఘాట్ లో మల్లన్న సాగర్ భూసేకరణ విచారణను ముంపు  గ్రామస్తులు బహిష్కరించారు. రిజర్వాయర్ ను వ్యతిరేకిస్తూ  ముంపు గ్రామాల ప్రజలు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు 571  వ రోజుకు చేరుకున్నాయి. 

13:58 - December 27, 2017
13:56 - December 27, 2017

గుంటూరు : ఏపీ ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టును రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రారంభించి, రాష్ట్ర ప్రజలకు అంకితం చేశారు. అమరావతిలోని జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ తదితరులు పాల్గొన్నారు. డిజిటల్‌ ఆంధప్రదేశ్‌లో భాగంగా ఈ ఫైబర్‌గ్రిడ్‌ను అభివృద్ధి చేశారు.  ఈ ప్రాజెక్టు ద్వారా తక్కవ రేటుకే  కేబుల్‌ టీవీ, ఇంటర్నెట్‌, టెలిఫోన్‌ సౌక్యరం కల్పిస్తారు. ఏపీ ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న ఐదు గ్రిడ్లలో ఫైబర్‌ గ్రిడ్‌ ఒకటి.  విద్యుత్‌, మంచినీరు, గ్యాస్‌, రోడ్లను కూడా ఏపీ అభివృద్ధి చేస్తోంది. 
 

13:52 - December 27, 2017

పాకిస్తాన్ : కులభూషణ్‌ జాదవ్‌తో ములాఖత్‌ వేళ.. ఆయన కుటుంబ సభ్యుల పట్ల... పాకిస్తాన్‌ అధికారులు వ్యవహరించిన తీరుపై.. తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారతీయ సంప్రదాయాన్ని హేళన చేసేలా.. భర్త బతికుండగానే.. జాదవ్‌ భార్య మంగళసూత్రాలను తీయించారని, నుదుటి బొట్టును.. కాళ్ల చెప్పులనూ తీసేయించారని కథనాలు వచ్చాయి. పాక్‌ అధికారుల తీరుపై భారత్‌లో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 
జాదవ్‌ కుటుంబ సభ్యులకు దారుణ అవమానం..
పాక్‌ జైల్లో జాదవ్‌ నిర్బంధం..పరామర్శకు వెళ్లిన కుటుంబ సభ్యులకు దారుణ అవమానం.. తాళి తీయించి, నుదుటి బొట్టు చెరిపేయించిన పాక్‌ అధికారగణం... గూఢచర్యం కేసులో.. పాక్‌ నిర్బంధించిన కులభూషణ్‌ జాదవ్‌ను... కళ్లారా చూసేందుకు వెళ్లిన ఆయన తల్లి అవంతి, భార్య చేతనలకు తీవ్ర అవమానం ఎదురైంది. అక్కడి నుంచి తిరిగి వచ్చిన జాదవ్‌ కుటుంబ సభ్యులు.. తాము ఎదుర్కొన్న అవమానాన్ని.. కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు వివరించారు. జాదవ్‌తో ఏకాంతంగా మాట్లాడే అవకాశం ఇవ్వక పోగా.. జైల్లోకి అనుమతించే ముందు.. జాదవ్ భార్య చేతన ధరించిన చెప్పులు తీసేసుకున్నారు. అంతేకాదు భారతీయ మహిళలు పవిత్రంగా భావించే మంగళసూత్రాన్ని, నుదుటి బొట్టును తీసేయించారు. అవంతి, చేతనలు స్వయంగా ఈ విషయాలను సుష్మాస్వరాజ్‌కు వివరించారు. 
మాతృభాషలో మాట్లాడేందుకూ అనుమతినిరాకరణ 
కులభూషణ్‌తో మాతృభాషలో మాట్లాడేందుకూ పాక్‌ అధికారులు అనుమతించలేదని, పైగా, తమ దుస్తులు మార్చుకోవాలంటూ బలవంతం చేశారని జాదవ్‌ తల్లి అవంతి, భార్య చేతనలు సుష్మా స్వరాజ్‌ ఎదుట కళ్లనీళ్ల పర్యంతమయ్యారు. దీనికి సంబంధించిన వార్తలు వెలుగు చూడడంతో.. పాక్‌ అధికారుల తీరుపై భారతీయుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 
గతేడాది జాదవ్‌ను అదుపులోకి పాక్‌ సైన్యం  
భారత గూఢచారిగా పనిచేస్తూ, ఇరాన్‌ మీదుగా తమ భూభాగం బలూచిస్థాన్‌లోకి ప్రవేశించాడన్న ఆరోపణలపై జాదవ్‌ను గతేడాది మార్చిలో పాక్‌ సైన్యం అదుపులోకి తీసుకుంది. కోర్టు అతడికి మరణశిక్ష విధించింది. అయితే భారత్ ప్రయత్నం... ఐక్యరాజ్యసమితి చొరవతో, అంతర్జాతీయ న్యాయస్థానం.. జాదవ్‌కు ప్రకటించిన మరణశిక్ష అమలుపై స్టే విధించింది. పాక్‌ జాతిపిత మహమ్మద్‌ ఆలీ జిన్నా జయంతి సందర్భంగా, జాదవ్‌ను కలిసేందుకు కుటుంబ సభ్యులను అక్కడి ప్రభుత్వం అనుమతించింది. ఈ క్రమంలో.. పాక్‌ వెళ్లిన అవంతి, చేతనలను... అద్దం ఆవల ఇంటరాగేషన్‌ రూములో... కెమెరాలు, అధికారుల పహారా మధ్య కూర్చున్న జాదవ్‌తో.. కేవలం టెలిఫోనిక్‌ సంభాషణలకే అనుమతించారు. దీనిపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
భేటీ ఫొటోలను ట్విట్టర్‌లో పోస్టు 
మరోవైపు అద్దాల గోడకు అవతల నుంచి జాదవ్‌ నిలబడి ఉండగా, ఇవతల తల్లి, భార్య ఉండి మాట్లాడుతున్న వీడియోను పాక్‌ ప్రభుత్వం విడుదల చేసింది. జాదవ్‌ను కలుసుకొని ఆయన కుటుంబసభ్యులు వెనుదిరిగిన కొద్దిసేపటికే పాక్‌ ప్రభుత్వం వారి భేటీ ఫొటోలను ట్విట్టర్‌లో పోస్టు చేసింది. వెనువెంటనే తన తల్లి, భార్యతో ములాఖత్ ఏర్పాటు చేసిన పాకిస్తాన్‌ అధికారులకు జాదవ్‌ 'ధన్యవాదాలు' చెబుతున్నట్టు ఉన్న ఓ వీడియోనూ విడుదల చేసింది. జాదవ్‌ కేసు ప్రస్తుతం అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణలో ఉన్నందున.. కోర్టు దృష్టిలో మార్కులు కొట్టేసేందుకే పాక్‌ ఇలాంటి ఎత్తుగడలు వేస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. 

 

13:45 - December 27, 2017

చెన్నై : ఆర్కేనగర్‌ ఉప ఎన్నికల్లో టీటీవీ దినకరన్‌ గెలుపు దేనికి సంకేతం.? తమిళ రాజకీయాలపై దినకరన్‌ గెలుపు ఎలాంటి ప్రభావం చూపనుంది..? దినకరన్‌ గెలుపు.. తమిళ రాజకీయాలు మలుపు తిప్పే సంక్షోభానికి దారితీయనుందా..? ఆర్కే నగర్‌ ఉప ఎన్నికతో బీజేపీ నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏమిటి?
ప్రకంపనలు సృష్టిస్తోన్న ఆర్కేనగర్‌ ఉప ఎన్నిక ఫలితం
జయలలిత మరణం తర్వాత అనేక మలుపులు తిరుగుతున్న తమిళ పాలిటిక్స్‌లో ఆర్కేనగర్‌ ఉప ఎన్నిక ఫలితం ప్రకంపనలు సృష్టిస్తోంది. శశికళ వర్గానికి చెందిన టీటీవీ దినకరన్‌ భారీ మెజార్టీతో గెలుపొందడం తమిళ రాజకీయాల్లో సంచలంగా మారింది.  ఈ గెలుపు అధికార అన్నాడీఎంకేతో పాటు... ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకేకూ షాక్‌ నిచ్చింది. జయ మరణానంతరం శశికళ సీఎం కావాలని ఆశించడం.. సీఎం పదవి చేతికందేలోపే ఆమెకు శిక్షపడటం, పళనిస్వామి ముఖ్యమంత్రికావడం చకచకా జరిగిపోయాయి.  ఆ తర్వాతే అసలు రాజకీయం మొదలైంది. పన్నీర్‌, పళని వర్గాలు ఏకమై... దినకరన్‌ను ఏకాకిని చేశాయి. ఆ తర్వాత దినకరన్‌ను కేసులు చుట్టుముట్టాయి. ఇన్ని ప్రతికూలతల మధ్య ఆర్‌కే నగర్‌ ఓటర్లు శశికళ వర్గానికి, ప్రధానంగా దినకరన్‌కు రాజకీయంగా ఊపిరిపోశారనే చెప్పవచ్చు.
తమిళనాట మళ్లీ సంక్షోభం తప్పదా?
ఆర్కేనగర్‌ ఎన్నిక జయలలిత వారసులెవరన్న అంశం చుట్టూనే తిరిగింది. తామంటే తామే అమ్మ వారసులమని శశికళవర్గం, ఇటు పన్నీర్‌,పళని వర్గాలు చెప్పుకున్నాయి.  అయితే జయవారసులమని చెప్పుకున్న పన్నీర్‌, పళనికి ఈ ఉప ఎన్నికలో ఆదరణ దొరకలేదు. ఓటర్లంతా దినకరనే అమ్మవారసుడని చెప్పకనే చెప్పినట్టైంది. ఉప ఎన్నికలో గెలుతో ఊపుమీదున్న దినకరన్‌ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తమిళ పాలిటిక్స్‌లో చర్చనీయాంశమయ్యాయి. మూడు నెలల్లో పళని ప్రభుత్వం కూలిపోతుందన్న  దినకరన్‌ వ్యాఖ్యలు కాక పుట్టిస్తున్నాయి.  అది జరిగినా, జరగకపోయినా పళని ప్రభుత్వం మాత్రం ఇబ్బందులు పడటం మాత్రం తప్పకపోవచ్చు. ఎందుకంటే.. సెప్టెంబర్‌లో పళని ప్రభుత్వం బలపరీక్ష ఎదుర్కొనవలసిన తరుణంలో దినకరన్‌ వర్గంలోని 18మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను స్పీకర్‌ ధన్‌పాల్‌ అనర్హులుగా ప్రకటించారు. వారి పిటిషన్‌ స్వీకరించిన మద్రాసు హైకోర్టు బలపరీక్షను నిలుపుచేసింది. ఇప్పుడా బలపరీక్ష జరిగినా, వారి అనర్హత సబబేనని తీర్పు వెలువడి ఉప ఎన్నికలొచ్చినా పళని సర్కారుకు సమస్యలు తప్పవు. అంతేకాదు ప్రస్తుత ప్రభుత్వంలోని ఎమ్మెల్యేల్లో తనకు 18మంది మద్దతు ఉందని దినకరన్‌ చెప్తున్నారు. దినకరన్‌ తన వ్యూహానికి పదునుపెట్టి ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నాలు చేయరని అనుకోవడానికి ఏమీలేదు.  దీంతో తమిళనాట మళ్లీ సంక్షోభవం తప్పదనే ప్రచారం సాగుతోంది.
ఆర్కే నగర్‌ ఉప ఎన్నికలో డీఎంకే డిపాజిట్‌ గల్లంతు
ఇక రాష్ట్రంలో ఎదురులేదని, ఎప్పుడు ఎన్నికలొచ్చినా అధికారం తనదేనని భావిస్తున్న డీఎంకేకు ఆర్కేనగర్‌ ఉప ఎన్నికలో డిపాజిట్‌ గల్లంతుకావడం మింగుడుపడటం లేదు.  ఇది కేవలం ఆర్కేనగర్‌లో కనబడిన ధోరణా లేక రాష్ట్రంలో వీస్తున్న గాలో అర్థంకాక అయోమయంలో పడింది డీఎంకే.  ఆర్కేనగర్‌ ఫలితాల్లో డీఎంకేకు ఊహించనిషాకే తగిలింది. ఇక  కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఆర్కేనగర్‌ ఫలితాలతో దిమ్మతిరిగింది.  తెరవెనుక ఉంటూ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న బీజేపీ అధిష్ఠానికి ఇదో షాక్‌. ఢిల్లీ నుంచి రాష్ట్రాల్లో జోక్యం చేసుకుని చక్రం తిప్పాలని చేసిన ప్రయత్నాలపై తమిళ ప్రజలు ఆగ్రహం తెలిపారని చెప్పవచ్చు. ఇందిరాగాంధీ బాటలో ఎవరు నడిచినా గుణపాఠం తప్పదన్న ప్రజాస్వామిక సంకేతం ఇచ్చారు. జయలలిత మరణంతో తమిళ రాజకీయాల్లో జొరబడి సొమ్ము చేసుకోవాలని ఆత్రుతపడిన బీజేపీకి ఆర్కేనగర్‌ నియోజకవర్గ ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టారు.  తమిళనాట పాగా వేస్తామని బీరాలు పలికిన బీజేపీ అభ్యర్థికి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. నోటాకు 2373 ఓట్లురాగా... బీజేపీకి 1417 ఓట్లు మాత్రమే వచ్చాయి.   ఆర్కేనగర్‌ ఫలితంతో తమిళనాట బీజేపీ స్థానమేంటో తేలిపోయిందని, విశ్లేషకులు భావిస్తున్నారు.

 

హిమాచల్ ప్రదేశ్ సీఎంగా జైరాం ఠాకూర్ ప్రమాణస్వీకారం

సిమ్లా : హిమాచల్ ప్రదేశ్ సీఎంగా జైరాం ఠాకూర్ ప్రమాణస్వీకారం చేశారు. 14 వ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, అమిషా, అద్వానీ హాజరయ్యారు. 

13:18 - December 27, 2017
13:09 - December 27, 2017

హైదరాబాద్ : చంచల్ గూడ జైలు నుంచి ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణమాదిగ విడుదల అయ్యారు. బెయిల్ పై ఆయన్ను విడుదల చేశారు. మందకృష్ణతోపాటు మరో 14 మంది నేతలు, కార్యకర్తలను విడుదల చేశారు. మందకృష్ణతోపాటు 14 మంది 10 రోజులు పాటు జైలులో ఉన్నారు. చంచల్ గూడ జైలు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. పోలీసులు ట్రాఫిక్ ను మళ్లించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

13:04 - December 27, 2017

హైదరాబాద్ : షార్ట్‌ ఫిలిం డైరెక్టర్‌ యోగి, నటి హారిక వివాదంలో మరో ట్విస్ట్‌ వెలుగుచూసింది. గచ్చిబౌలి పోలిస్‌స్టేషన్‌లో షార్ట్‌ ఫిలిమ్‌ డైరెక్టర్‌ యోగిపై అభియోగాలు మోపి కేసు పెట్టిన హారిక డబుల్‌ గేం ఆడినట్లు యోగి చెబుతున్నారు. 'తాను వ్యక్తిగతంగా ఆనందంగా లేనంటూ యోగికి హారిక వాట్సప్‌ మెసేజ్‌ చేసింది. సంతోషంగా లేనప్పుడు విలువలతో ఎందుకు ఉండాలంటూ హారిక చేసిన వాట్సప్‌ మెసేజ్‌లను యోగి మీడియాకు సమర్పించారు. అడిషనల్‌ డీసీపీ గంగిరెడ్డిపై వేటు పడటానికి కారణమైన వీడియో తీసింది హారికయే అని యోగి తెలిపారు. రొటీన్‌ లైఫ్‌ విసుగొస్తుంది, ఎవ్వరితోనైనా విదేశాలకు వెళ్లి ఎంజాయ్‌ చేయాలనిపిస్తుందని నాకు మెసేజ్‌ చేసిందని యోగి అన్నారు. తమ మధ్య వాట్సాప్‌ చాటింగ్‌ వివరాలు యోగి మీడియాకు వెల్లడించారు. పోలీసు స్టేషన్‌ దృశ్యాలను రికార్డ్‌ చేసింది హారికేనని యోగి అన్నారు. పోలీస్‌ స్టేషన్‌ దృశ్యాలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిందీ హారికేనని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.... 

 

ఐఈఏ సమావేశాలను ప్రారంభించిన రాష్ట్రపతి

గుంటూరు : నాగార్జునా యూనివర్సిటీ సమీపంలోని బైబిల్‌ మిషన్‌ ప్రాంగణంలో భారత ఆర్థిక సంఘం శతాబ్ది ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ జ్యోతి వెలిగించి లాంఛనంగా ఐఈఏ భేటీని ప్రారంభించారు. పదహారు దేశాలకు చెందిన 60 మంది ఆర్థికవేత్తలు పాల్గొంటున్నారు. 

12:54 - December 27, 2017
12:52 - December 27, 2017

గుంటూరు : నాగార్జునా యూనివర్సిటీ సమీపంలోని బైబిల్‌ మిషన్‌ ప్రాంగణంలో భారత ఆర్థిక సంఘం శతాబ్ది ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ జ్యోతి వెలిగించి లాంఛనంగా ఐఈఏ భేటీని ప్రారంభించారు. పదహారు దేశాలకు చెందిన 60 మంది ఆర్థికవేత్తలు పాల్గొంటున్నారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు, పలువురు రాష్ట్ర మంత్రులు, ప్రముఖ ఆర్థికవేత్త, ఉమ్మడి ఏపీ మాజీ గవర్నర్‌ రంగరాజన్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. నాలుగు రోజుల పాటు ఈ సమావేశాలు జరుగుతాయి.

 

12:37 - December 27, 2017

చంచల్ గూడ జైలు నుంచి విడుదలైన మందకృష్ణమాదిగ

హైదరాబాద్ : చంచల్ గూడ జైలు నుంచి ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణమాదిగ విడుదల అయ్యారు. బెయిల్ పై ఆయన్ను విడుదల చేశారు. 

12:27 - December 27, 2017
12:26 - December 27, 2017

కర్నూలు : జిల్లాలోని స్థానిక సంస్థల ఎన్నికల బరి నుంచి ప్రతిపక్ష వైసీపీ వైదొలగడం ఆ పార్టీ దివాలాకోరుతనానికి నిదర్శనమని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి విమర్శించారు. టీడీపీ నాయకత్వం కేఈ ప్రభాకర్‌ను అభ్యర్థిగా నిర్ణయించడంతో ఫలితాలు వేరుగా ఉంటాయన్న భయంతోనే వైసీపీ పోటీకి దూరంగా ఉందని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితం ప్రభావం 2019 ఎన్నికలపై ఉంటుందని కేఈ కృష్ణమూర్తి  చెప్పారు. 

12:13 - December 27, 2017

అనంతపురం : రాయలసీమలోని పెండింగ్‌ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసేందుకు ప్రధాన్యత ఇవ్వాలని  జలవనరుల శాఖ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. తెలుగుగంగ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకొంటున్నామని  నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ చెప్పారు.  అనంతపురం జిల్లాలోని భైరవానితిప్ప ప్రాజెక్టుకు వచ్చే నెలలో శంకుస్థాపన చేసి, 2018 డిసెంబర్‌ చివరినాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించించామన్నారు. పేరూరు ప్రాజెక్టు నుంచి వచ్చే నెలలో నీరు ఇస్తామని దేవినేని చెప్పారు.

 

09:50 - December 27, 2017

గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న రాష్ట్రపతి కోవింద్

కృష్ణా : రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబు రాష్ట్రపతికి స్వాగతం పలికారు.

 

09:49 - December 27, 2017

గుంటూరు : రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ విజయవాడకు బయల్దేరారు. ఇవాళ రాష్ట్రపతి రామ్ నాథ్ ఏపీ రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. ఉదయం 9.35 గంటలకు గన్నవరం చేరుకోనున్నారు. ఉదయం 10.30 గంటలకు ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ శతాబ్ధి వేడుకలకు రాష్ట్రపతి ప్రారంభించనున్నారు. ఉదయం 11.25 గంటలకు ఏపీ సచివాలయాన్ని రాష్ట్రపతి సందర్శించనున్నారు. ఉదయం 11.45 గంటలకు ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును రాష్ట్రపతి ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 3.10 గంటలకు గన్నవరం నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు.

09:36 - December 27, 2017

మహబూబ్‌నగర్‌ : జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. నవాబ్‌పేట మండలం జంగమయ్యపల్లి శివారులో మారుతీ అల్టోకారు దగ్ధమయింది. దానిలోనే డ్రైవర్‌కుడా సజీవదహనం అయ్యాడు. కొందరు దుండగులు డ్రైవర్‌ను లోపల ఉంచి కారుకు నిప్పుపెట్టినట్టుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు విచారణ చేస్తున్నారు. 

 

09:16 - December 27, 2017

తెలంగాణ రాష్ట్రంలో టీసర్కార్ చేపట్టిన సాగు, తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై వక్తలు భిన్నవాదనలు వినిపించారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యవర్గసభ్యులు బండారి రవికుమార్, టీఆర్ ఎస్ నేత మన్నె గోవర్ధన్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు. ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయడంలో జాప్యం జరుగుతుందని రవికుమార్ అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం పనులను వేగవంతం చేశామని, త్వరలో పూర్తి చేస్తామని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

విజయవాడ బయల్దేరిన రాష్ట్రపతి కోవింద్

ఢిల్లీ : రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ విజయవాడకు బయల్దేరారు. ఇవాళ రాష్ట్రపతి రామ్ నాథ్ ఏపీ రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. ఉదయం 9.35 గంటలకు గన్నవరం చేరుకోనున్నారు. ఉదయం 10.30 గంటలకు ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ శతాబ్ధి వేడుకలకు రాష్ట్రపతి ప్రారంభించనున్నారు. ఉదయం 11.25 గంటలకు ఏపీ సచివాలయాన్ని రాష్ట్రపతి సందర్శించనున్నారు. ఉదయం 11.45 గంటలకు ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును రాష్ట్రపతి ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 3.10 గంటలకు గన్నవరం నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు. 

 

08:57 - December 27, 2017

రాష్ట్రంలోని ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డివైఎఫ్ ఐ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్‌కుమార్‌, ఏఐఎస్ ఎఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణు డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో వారు పాల్గొని, మాట్లాడారు. ఉద్యోగ అకాడమిక్‌ క్యాలెండర్‌ను విడుదల చేయాలని, ఎంప్లాయిమెంట్‌ యాక్ట్‌ తీసుకురావాలన్నారు. 'తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగాలు కీలక అంశం. కానీ తెలంగాణ వచ్చినా రావాల్సినన్ని ఉద్యోగాలు రాలేదని ఉద్యోగాల కోసం మరో ఉద్యమం తప్పదని విద్యార్థి, యువజన సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఖాళీగా ఉన్న ప్రతి పోస్టును వెంటనే భర్తీ చేయాలని, ఉద్యోగ అకాడమిక్‌ క్యాలెండర్‌ను విడుదల చేయాలని, ఎంప్లాయిమెంట్‌ యాక్ట్‌ తీసుకురావలని నినాదాలతో ఉద్యోగాల సాధన సమితి నేటి నుంచి తెలంగాణలో బస్సు యాత్రకు సిద్ధమైంది. ఈ బస్సుయాత్రకు దారితీసిన పరిస్థితులు వారి డిమాండ్ల'పై విజయ్‌కుమార్‌, వేణు మాట్లాడారు. మరిన్నివివరాలను 
వీడియోలో చూద్దాం.. 

 

08:45 - December 27, 2017

రంగారెడ్డి : క్షణిక సుఖాలు..తప్పటడుగులు..ఇవి ప్రాణ స్నేహితుల మధ్య కూడా చిచ్చుపెడుతున్నాయి. అప్పటివరకు కలిసున్న వారి మధ్య దూరాలు పెంచుతున్నాయి. తాను కోరుకున్నది తనకే దక్కాలనే ఆవేశంతో దారుణాలకు తెగబడుతున్నారు. అడ్డొస్తున్నది ఆప్తుడైనా పట్టించుకోవడం లేదు. క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో అడ్డంగా దొరికిపోతున్నారు. 
మహేష్‌గౌడ్‌ హత్య కేసులో వీడిన మిస్టరీ.. 
రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో మహేష్‌గౌడ్‌ హత్య కేసును పోలీసులు ఛేదించారు. హైదరాబాద్‌ జియాగూడకు చెందిన మహేష్‌ను స్నేహితులే అత్యంత దారుణంగా హతమార్చారు. వివాహేతర సంబంధమే ఈ దారుణానికి కారణమని పోలీసులు గుర్తించారు. మహేశ్‌ను హతమార్చిన రమేష్, నరేష్, కారు డ్రైవర్ శివను  అరెస్ట్ చేశారు. 
కారులోనే గొంతుకోసి హత్య 
మహేష్ గౌడ్‌ జిమ్మెరాత్ బజార్‌లోని ఓ కిరాణ షాపులో పనిచేస్తున్నాడు. మహిళ విషయంలో మహేష్‌, రమేష్‌ మధ్య గొడవలు పెరిగాయి. వివాహేతర సంబంధానికి మహేష్‌ అడ్డొస్తున్నాడని రమేష్‌ రగిలిపోయాడు. అతన్ని అంతం చేసేందుకు పక్కా ప్లాన్‌ చేశాడు. పార్టీ పేరుతో మహేష్‌ను మైసిగండి తీసుకెళ్లి ఫుల్‌గా మద్యం తాగించాడు.  నిషాలో ఉన్న మహేష్‌ను కారులోనే గొంతు కోసి పాశవికంగా హతమార్చాడు. ఆ తర్వాత డెడ్‌బాడీని శంషాబాద్‌ మండలం మదనపల్లి తీసుకెళ్లాడు. నరేష్‌, కారు డ్రైవర్‌ శివ సాయంతో పెట్రోల్ పోసి తగలబెట్టాడు. 
నలుగురి అరెస్టు
యువకుడి మృతదేహం మదనపల్లి సమీపంలో కాలిన స్థితిలో పడి ఉందని సమాచారం అందడంతో పోలీసులు డాగ్‌ స్క్వాడ్‌తో దర్యాప్తు చేపట్టారు. విచారణ అనంతరం మృతుడు జియాగూడకు చెందిన మహేశ్‌ గౌడ్‌గా తెలుసుకున్నారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించి దర్యాప్తు ముమ్మరం చేశారు. మరోవైపు రక్తపు మరకలతో ఉన్న కారును రమేష్‌ అతడి స్నేహితుడితో వెళ్లి శంషాబాద్‌లో సర్వీసింగ్‌కు ఇచ్చారు. కారును శుభ్రం చేసేందుకు సిబ్బంది తలుపు తెరవగా అందులో రక్తం మరకలు కనిపించాయి. సర్వీసింగ్‌ సెంటర్‌ యజమాని ఇచ్చిన సమాచారంతో రంగంలోకిదిన ఆర్జీఐఏ పోలీసులు..అక్కడి సీసీటీవీ పుటేజీ ఆధారంగా రమేష్, నరేష్, కారు డ్రైవర్ శివను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో సంబంధం ఉన్న మరో వ్యక్తి యాదయ్యను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

 

08:35 - December 27, 2017

శ్రీకాకుళం : పొందూరు ఖాదీకి మంచి రోజులు రానున్నాయి. చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నిండనున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఖాదీ ఉత్పత్తులు విస్తరించాలన్న లక్ష్యంతో ప్రత్యేక క్లస్టర్‌ ఏర్పాటుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఆ దిశగా పాలకులు సన్నాహాలు చేస్తున్నారు. 
చేనేత కార్మికులను ఆదుకునేందుకు యత్నాలు
దశాబ్దాలుగా  గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న..ఖాదీ పరిశ్రమ అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి.  అగమ్యగోచరంగా  ఉన్న చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపే దిశగా ... ప్రయత్నాలు సాగుతున్నాయి.  పొందూరు ఖాదీకి ప్రపంచ స్థాయి గుర్తింపు.. తెచ్చేందుకు .. ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 
అభివృద్ధికి నోచుకోని ఖాదీ పరిశ్రమ
శ్రీకాకుళం జిల్లా... పొందూరు ఖాదీ వస్త్రాలకు శతాబ్దాల చరిత్ర ఉంది. అయితే గత కొన్నేళ్లుగా.. ఆ ఖాదీ పరిశ్రమ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. ఆశించిన స్థాయిలో అభివృద్ధికి నోచుకోలేదు. సహకార, సహకారేతర సంఘాల ద్వారా చేనేత కార్మికులకు ప్రోత్సాహం  అందడం లేదు.  ఏడు వేల మగ్గాలతో దాదాపు ఆరు కోట్ల వ్యాపారం జరుగుతున్నా.. కార్మికులకు తగినంత ఉపాధి లభించడం లేదు. దీంతో పొందూరు పరిసర ప్రాంతాల్లోని చాలామంది కార్మికులు వలస బాట పడుతున్నారు. 
ఖాదీ క్లస్టర్‌కు 25 కోట్లు మంజూరు
అయితే ఇన్నాళ్లకు ఈ ఖాదీ పరిశ్రమపై ప్రభుత్వం దృష్టి సారించింది. పొందూరులో ప్రత్యేక ఖాదీ క్లస్టర్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. 30 ఎకరాల్లో ఖాదీ క్లస్టర్ ఏర్పాటు చేసి చేనేత కార్మికులకు మెరుగైన టెక్నాలజీ అనుసంధానం చేయాలని యోచిస్తోంది. ఈ ప్రాజెక్ట్ కు డీపీఆర్‌ కూడా సిద్ధమవుతోంది. దీని కోసం 25 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయగా.. స్థల సేకరణ బాధ్యతను  ప్రభుత్వం కన్సల్టెన్సీకి అప్పగించింది. క్లస్టర్‌ ఏర్పాటైతే.. చేనేతపై ఆధారపడిన వేలాదిమంది కార్మికులకు ఉపాధి లభించే అవకాశం ఉంది. అయితే ఇంత భారీ ప్రాజెక్ట్‌ త్వరితగతిన పూర్తవుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

 

08:32 - December 27, 2017

కృష్ణా : ప్రభుత్వం, అధికార పార్టీ నేతలు చేస్తున్న ప్రకటనలు.. కేవలం ప్రచార ఆర్భాటానికే పరిమితమవుతున్నాయి. టీడీపీ అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు దాటుతున్నా.. బందరు పోర్టు అభివృద్ధి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. సరైన కార్యాచరణ లేకపోవడంతోనే.. పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. 
ఎన్నికల హామీగా మిగిలిపోతున్న పోర్ట్‌ ఏర్పాటు
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్మించతలపెట్టిన బందర్‌ పోర్ట్‌ ద్వారా తమకు భవిత ఉంటుందని ఆశపడ్డ ప్రజలకు నిరాశే ఎదురవుతోంది. దశాబ్ధాల కాలంగా బందర్‌ నౌకాశ్రయం కోసం ప్రజలు ఉద్యమిస్తున్నా.. పోర్ట్‌ ఆశ కార్యారూపం దాల్చడం లేదు. ఎన్నికలకు ముందు నేతలు ఇచ్చిన హామీలు నీటిమూటలుగానే మిగిలిపోతున్నాయి.
ఇద్దరు సీఎంలు మారిన పురోగతిలేని పోర్ట్‌ నిర్మాణం
గతంలో కాంగ్రెస్‌ పార్టీ కూడా బందరు పోర్ట్‌ నిర్మిస్తామని ఎన్నికల హామీని ఇచ్చింది. 2008లో ఆనాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తర్వాతి కాలంలో ఇద్దరు సీఎంలు మారినా పోర్టు నిర్మాణంలో పురోగతి లేకుండాపోయింది.
పోర్ట్‌ నిర్మాణం కోసం టీడీపీ హామీ
ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ కూడా పోర్టు నిర్మాణం చేపడతామని ప్రజలకు హామీ ఇచ్చింది. బందరు పోర్టుకు భూ సమీకరణ విధానానికే ప్రభుత్వం మొగ్గుచూపుతోంది. భూ సేకరణ ద్వారా భూములు తీసుకునేందుకు నిధుల్లేవని గతంలో సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పోర్టు నిర్మాణానికి మొత్తం 5,292 ఎకరాలు అవసరం కాగా, సుమారు 3 వేల ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్ భూములను పోర్టుకు అప్పగించారు. మిగతా భూమికి సుమారు 750 ఎకరాల వరకు రైతులు అంగీకారపత్రాలు సమర్పించారు. మిగిలిన 1500 ఎకరాలు రైతుల వద్దే ఉంది. వీరిని ఒప్పించడంలో అధికార, పాలక యంత్రాంగాలు వైఫల్యం చెందుతున్నాయి. భూసమీకరణా.. సేకరణ అనే విషయంలో ఏకాభిప్రాయానికి వస్తే సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం చూస్తోంది.  దీంతో భూసేకరణ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. 
పోర్ట్‌ ప్రారంభమైతే తొలగనున్న నిరుద్యోగ సమస్య
ఇదిలావుంటే... అనేక కారణాలతో బందరు పోర్టు నిర్మాణం ముందుకు కదలడం లేదు.  భూముల సేకరణ అంశాన్ని ప్రభుత్వ పరిష్కరించాల్సి ముందుకెళ్లాలని పలువురు కోరుతున్నారు. పోర్ట్‌ ప్రారంభమైతే నిరుద్యోగ సమస్య తీరి.. ఎంతో మందికి ఉపాధి లభిస్తుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. 
అవసరానికి మించి భూములు సేకరిస్తున్నారన్న ఆరోపణలు
అయితే అవసరానికి మించిన భూమిని ప్రభుత్వం సేకరిస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఈ భూసేకరణను ప్రభుత్వం విరమించుకోవాలని పలువురు సూచిస్తున్నారు. మొత్తానికి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పోర్ట్‌ నిర్మాణం చేపట్టాలని అన్ని వర్గాలు కోరుతున్నాయి. 

 

08:25 - December 27, 2017

హైదరాబాద్ : అధికార పార్టీలో అమాత్యులు అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.  అటు తాము నిర్వహిస్తున్న శాఖలపై పూర్తి పట్టు సాధించలేక....ఇటు తమ నియోజకవర్గం....జిల్లాల్లో  రాజకీయంగా ఆధిప్యతం చలాయించలేక పోతున్నారన్న విమర్శలు తీవ్రమవుతున్నాయి.
కొంతమంది మంత్రులపై కేసీఆర్‌ అసంతృప్తి
వచ్చే ఎన్నికల్లో పూర్తి మెజార్టీ సాధించి.. మరోసారి అధికార పగ్గాలు చేపట్టాలని గులాబీ దళపతి కేసీఆర్‌ ఉవ్విళ్లూరుతున్నారు. కానీ ఇందుకోసం తన మంత్రివర్గ సహచరుల నుంచి కేసీఆర్‌కు ఆశించిన మద్దతు లభించడం లేదనే వాదన పార్టీ నేతల నుంచే వినిపిస్తోంది. మంత్రులుగా అవకాశం దక్కించుకున్న మెజార్టీ నేతలు ఆ స్థాయిలో తమ పనితీరును ఇప్పటికీ మెరుగుపరుచుకోకపోవడంపై కేసీఆర్‌ సైతం అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో మరికొంత మంది మంత్రులు వ్యవహరిస్తున్న తీరు ఆయా జిల్లాలో అధికార పార్టీకి రాజకీయంగా ఇబ్బందులు సృష్టించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 
స్వపక్ష నేతలకు కూడా అమాత్యులే టార్గెట్‌ 
ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలలో ప్రతిపక్ష నేతలతో పాటు.. స్వపక్ష నేతలకు కూడా అమాత్యులే టార్గెట్‌గా మారడం చర్చనీయాంశమైంది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, ఆదిలాబాద్‌, నల్లగొండ, నిజామాబాద్‌ జిల్లాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న అమాత్యుల పరిస్థితి అధికార పార్టీ నేతల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. మంత్రి లక్ష్మారెడ్డి మూడేళ్లుగా మంత్రివర్గంలో కొనసాగుతున్నా... ఆ స్థాయిలో జిల్లాలో రాజకీయంగా పట్టు సాధించలేదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. మంత్రి ముందే నేతలు నిలదీసుకున్న ఘటనలు జరిగినా... లక్ష్మారెడ్డి వాటిని సరిదిద్దలేకపోయారనే ఆరోపణలు స్వపక్ష నేతల నుంచే వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రతిపక్షాల ఆరోపణలకు సైతం ధీటైన సమాధానం ఇవ్వడం లేదనే అభిప్రాయం గులాబీ నేతల్లో వ్యక్తమవుతోంది. 
మహేందర్‌రెడ్డి ఏకపక్ష ధోరణితో పార్టీకి కొత్త చిక్కులు 
ఇక మరోమంత్రి మహేందర్‌రెడ్డి పరిస్థితి తాండూరు నియోజకవర్గంతో పాటు జిల్లాలో కూడా అదే విధంగా ఉంది. ఓవైపు మంత్రిని ఓ వర్గం బలంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ.. మహేందర్‌రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తుండడం పార్టీకి కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. 
ఆదిలాబాద్‌, నల్లగొండ జిల్లాల అమాత్యులపై పార్టీలో అసంతృప్తి
అలాగే... ఆదిలాబాద్‌, నల్లగొండ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అమాత్యులపై కూడా సొంత పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆయా జిల్లాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం కేసీఆర్‌ ఎలా వ్యవహరిస్తారోనన్న ఉత్కంఠ కలుగుతోంది. ఎన్నికల నాటికి అమాత్యుల తీరులో మార్పు రాకపోతే.. పార్టీకి నష్టం కలుగుతుందనే అనుమానాలు గులాబీ నేతల్లో వ్యక్తమవుతోంది. మరి నేతల వ్యవహారశైలి మార్పు కోసం గులాబీ దళపతి ఏం చేసి... పార్టీని బలోపేతం చేస్తారనే ఉత్కంఠ అందరినీ వెంటాడుతోంది.  

 

08:16 - December 27, 2017

కర్నూలు : జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ల గడువు ముగిసింది. టీడీపీ నుంచి కేఈ ప్రభాకర్‌తో సహా మొత్తం నలుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. బీఎస్పీతో పాటు మరో ఇద్దరు ఇండిపెండెంట్లు బరిలో ఉన్నారు. వైసీపీ పోటీ నుంచి వైదొలగడంతో ఏకగ్రీవం అవుతుందనుకున్న కర్నూలు ఎమ్మెల్సీ స్థానం ఇండిపెండెంట్ల పోటీతో ఆసక్తికరంగా మారింది. 
బరిలో నలుగురు అభ్యర్థులు 
కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బరిలో నలుగురు అభ్యర్థులు నిలిచారు. టీడీపీ నుంచి కేఈ ప్రభాకర్‌, బీఎస్పీ నుంచి దండు శేషుయాదవ్‌, ఇండిపెండెంట్లుగా బైరెడ్డి అనుచరుడు పుల్యాల నాగిరెడ్డి,  సంగం ఎంపీటీసీ పులి జయప్రకాష్‌రెడ్డి నామినేషన్లు వేశారు. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత పోటీలో ఎంతమంది ఉంటారనే దానిపై క్లారిటీ రానుంది. వైసీపీ వైదొలడంతో ఏకగ్రీవం అవుతుందనుకున్న ఎమ్మెల్సీ ఎన్నిక ఇండిపెండెంట్లు పోటీకి రావడంతో ఆసక్తికరంగా మారింది. 
నామినేషన్‌ వేసిన టీడీపీ అభ్యర్థి కేఈ ప్రభాకర్‌ 
టీడీపీ అభ్యర్థి కేఈ ప్రభాకర్‌.. మంత్రి కాల్వ శ్రీనివాసులు, అనుచరులతో కలిసి కలెక్టరేట్‌కు వెళ్లి రిటర్నింగ్‌ అధికారికి నాలుగు సెట్ల నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. తనపై నమ్మకం వుంచి సీఎం చంద్రబాబు అవకాశం కల్పించారని ప్రభాకర్‌ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలల్లో గెలిస్తే జిల్లా అభివృద్ధికి పాటు పడుతానని తెలిపారు. కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో టీడీపీకి తిరుగులేని మెజార్టీ వస్తుందని మంత్రి కాల్వశ్రీనివాసులు అభిప్రాయపడ్డారు. 
జనవరి 12న పోలింగ్‌ 
మరోవైపు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోనందునే తాము బరిలో దిగాల్సి వచ్చిందని ఇండిపెండెంట్‌ అభ్యర్థులు అన్నారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు నిధులు కేటాయించడం లేదని.. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని వారు ఆరోపించారు. కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎన్నికకు జనవరి 12న పోలింగ్‌ జరగనుంది. 16న కౌంటింగ్‌ జరిగి.. అదేరోజు ఫలితం వెలువడనుంది.

 

08:10 - December 27, 2017

గుంటూరు : ప్రభుత్వ పథకాల అమలుకు బ్యాంకర్ల సహకారం ఎంతో అవసరమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. బ్యాంకర్లకు, ప్రభుత్వం మధ్య మరింత సమన్వయం అవసరమన్నారు. ఇందుకోసం రాష్ట్ర, జిల్లా, క్షేత్రస్థాయుల్లో 3 కమిటీలు వేయనున్నట్టు తెలిపారు. మంగళవారం సచివాలయంలో చంద్రబాబు.. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. 
బ్యాంకర్లతో సీఎం చంద్రబాబు సమావేశం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో పాల్గొన్నారు. సంక్షేమ పథకాలు అమలుకావాలంటే ప్రభుత్వానికి బ్యాంకర్ల సహకారం ఎంతో అవసరమని అన్నారు. ప్రభుత్వానికి, బ్యాంకర్ల మధ్య మరింత సమన్వయం అవసరమని అభిప్రాయపడ్డారు. ఇందుకోసం మూడు స్థాయుల్లో 3 కమిటీలు వేస్తామన్నారు. ప్రభుత్వం తరపున ఈ కమిటీల్లో నలుగురు కార్యదర్శులు ఉంటారని చెప్పారు. కమిటీలో ఉండే  తమ ప్రతినిధులను కూడా త్వరలో ప్రకటిస్తామని ఎస్‌ఎల్‌బీసీ చైర్మన్‌ సురేష్‌ ఎన్‌.పటేల్‌ తెలిపారు.  జన్మభూమి - మా ఊరు కార్యక్రమం చివరి రోజున 2 లక్షల మందికి రుణాలు ఇస్తామని పటేల్‌ చెప్పారు.
పాదయాత్ర హామీ మేరకు రుణ ఉపశమన పథకం
జనవరి 9, 10 తేదీల్లో గ్రామాలకు వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకోవాలని ముఖ్యమంత్రి బ్యాంకర్లను కోరారు.  వ్యవసాయ రుణాలు ఇవ్వటంలో బ్యాంకర్లు ఉదారంగా వ్యవహరించాలన్నారు. కౌలు రైతులు సంతోషంగా ఉండాలన్నది తమ విధానమని, కౌలు రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు బ్యాంకర్లు సహకరించాలని సీఎం కోరారు.  అవాంతరాలు ఎన్ని వచ్చినా  పాదయాత్రలో తాను ఇచ్చిన హామీ మేరకు రైతాంగానికి రుణ ఉపశమన పథకం అమలు చేశామన్నారు. పరిపాలనపై ప్రజల్లో 80% సంతృప్తి తీసుకొచ్చే దిశగా కష్టపడి పనిచేస్తున్నామని తెలిపారు. డిజిటల్ లావాదేవీలపై సేవా చార్జీలు తక్కువగా ఉంటే ఎక్కువ మంది ఖాతాదారులు డిజిటల్ లావాదేవీలపై మళ్లుతారని సీఎం సూచించారు.
ఎస్‌ఎల్‌బీసీ వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యం రూ. 87,471 కోట్లు
ఎస్. ఎల్. బి.సి వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యం 87.471 కోట్లు కాగా ఈ ఏడాది సెప్టెంబర్ నెలాఖరు దాకా 49,055 కోట్ల చెల్లింపు  లక్ష్యాన్ని  సాధించారు.  ఎం.ఎస్.ఎం.ఇ రుణాల చెల్లింపు లక్ష్యం  25,000 కోట్లు కాగా... సాధించిన లక్ష్యం 13,553 కోట్లుగా ఉన్నట్టు వివరించారు.  
బ్యాంకర్లతో జిల్లా కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్‌
జిల్లా కలెక్టర్లు బ్యాంకర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొంటూ క్షేత్రస్థాయి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం త్వరలో పదవీ విరమణ చేయనున్న ఆంధ్రాబ్యాంక్‌ సీఎండీ, ఎస్‌ఎల్‌బీసీ చైర్మన్‌ సురేష్‌ ఎన్‌.పటేల్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు సత్కరించారు. అనంతరం నాబార్డు రూపొందించిన రైతు ఉత్పత్తిదారుల కంపెనీల స్థాపన, విధివిధానాల కరదీపిక పుస్తకాన్ని చందబ్రాబు ఆవిష్కరించారు.  

 

మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం

మహబూబ్ నగర్ : జిల్లాలోని జంగమయ్యపల్లిలో దారుణం జరిగింది. కారు దగ్ధం అయింది. కారులో డ్రైవర్ సజీవదహనం  అయ్యారు. కారుకు నిప్పుపెట్టి సజీవదహనం చేసినట్లుగా అనుమానిస్తున్నారు. పోలీసులు వివరాలు ఆరా తీస్తున్నారు.  

 

07:58 - December 27, 2017

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ తొలిసారిగా పర్యటించనున్నారు. ఇవాళ ఎకనామిక్‌ అసోషియేషన్‌ శతాబ్ది వేడుకలను ప్రారంభించడంతో పాటు ఎపీ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఎపీ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్‌ను రాష్ట్రపతి ప్రారంభిస్తారు. రాష్ట్రపతి పర్యటన విజయంతమయ్యేలా ఏపీ ప్రభుత్వం భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బుధవారం అమరావతికి వస్తున్నారు. ఇండియన్ ఎకనామిక్‌ అసోసియేషన్‌ శతాబ్ది వేడుకలను ప్రారంభించడంతో పాటు పలు ప్రాజెక్టులను రాష్ట్రపతి ప్రారంభిస్తారు. రాష్ట్రపతి పర్యటన విజయంతం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 
ఉ.9:35 గం.లకు రాష్ట్రపతి గన్నవరం విమానాశ్రయానికి రాక
ఉదయం 9.35 నిముషాలకు రాష్ట్రపతి విజయవాడలోని గన్నవరం విమానాశ్రయానికి రాష్ట్రపతి చేరుకుంటారు. అక్కడి నుండి హెలీకాప్టర్ ద్వారా 10:30 నిమిషాలకు నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న బైబిల్ మిషన్ గ్రౌండ్‌కు చేరుకుంటారు. అనంతరం కోవింద్ ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ శతాబ్ది వేడుకలను ప్రారంభిస్తారు. గవర్నర్ నరసింహన్‌తో పాటు సీఎం చంద్రబాబు, దేశంలోని ప్రముఖ ఆర్ధిక వేత్తలు, ప్రముఖలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం 11:45 నిముషాలకు రాష్ట్రపతి వెలగపూడికి చేరుకుంటారు. 
బహిరంగ సభలో ప్రసంగించనున్న రాష్ట్రపతి
వెలగపూడికి చేరుకున్న రాష్ట్రపతికి మంత్రి నారా లోకేష్, అధికారులు స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి కాన్వాయ్ ద్వారా సచివాలయంలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి చేరుకుంటారు. ఏపీ ఫైబర్ గ్రిడ్, ఏపీ సర్వైలెన్స్, డ్రోన్ ప్రాజెక్టు, ఫైబర్ నెత్ ప్రాజెక్టులను రామ్‌నాథ్ కోవింద్ జాతికి అంకితం చేస్తారు. అనంతరం రాజధాని నిర్మాణ ఆకృతులు, ఛాయాచిత్ర ప్రదర్శనలను రాష్ట్రపతి సందర్శిస్తారు. అనంతరం సచివాలయంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభా వేదిక వద్దకు చేరుకుని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ సందర్బంగా పోలవరం ప్రాజెక్ట్ , రాజధాని నిర్మాణం , ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్‌కి సంబంధించి సీఎం చంద్రబాబు వర్చువల్ ప్రజంటేషన్ ఇస్తారు. మధ్యాహ్నం 12:50 నిముషాలకు సీఎం కార్యాలయంలో రియల్ గవర్నెన్స్‌ సెంటర్‌కు రాష్ట్రపతి చేరుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రియల్ టైమ్ గవర్నెన్స్ విధానం పని తీరును ఆయన పరిశీలిస్తారు. అనంతరం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు చంద్రబాబు విందు ఇవ్వనున్నారు. విందు అనంతరం వెలగపూడి నుండి గన్నవరం చేరుకుని 3గంటలకు రాష్ట్రపతి ఢిల్లీ చేరుకుంటారు. 
వెలగపూడి పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు
అమరావతిలో రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాట్లపై చంద్రబాబు రివ్యూ నిర్వహించారు. ప్రథమ పౌరుని పర్యటన నేపథ్యంలో వెలగపూడి పరిసర ప్రాంతాల్లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసారు. 

నేడు కరీంనగర్ జిల్లాలో విద్యా సంస్థల బంద్

కరీంనగర్ : నేడు జిల్లాలో విద్యార్థి సంఘాలు విద్యా సంస్థల బంద్ నిర్వహించనున్నారు. శాతవాహన వర్సిటీలో మనువాదుల దాడికి నిరసనగా విద్యా సంస్థల బంద్ కు పిలపునిచ్చారు.

నేడు టీమాస్ ఆధ్వర్యంలో 'చలో శాతవాహన యూనివర్సిటీ'

కరీంనగర్ : మనువాదుల దాడిని నిరసిస్తూ నేడు టీమాస్ ఆధ్వర్యంలో చలో శాతవాహన యూనివర్సిటీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హాజరుకానున్నారు. 

నేడు హిమాచల్ ప్రదేశ్ సీఎంగా జైరాం ఠాకూర్ ప్రమాణస్వీకారం

సిమ్లా : హిమాచల్ ప్రదేశ్ సీఎంగా నేడు జైరాం ఠాకూర్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. 

నేడు సంబులపుల కుంట నుంచి తిరిగి ప్రారంభంకానున్న జగన్ పాదయాత్ర

అనంతపురం : నేడు సంబులపుల కుంట నుంచి వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర తిరిగి కొనసాగనుంది. 

నేడు త్రిపుర డీజీపీ నాగరాజు ఆస్తుల కేసులో తీర్పు

అగర్తల : త్రిపుర డీజీపీ నాగరాజు ఆస్తుల కేసులో సీబీఐ కోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. 

 

నేడు అమరావతిలో పర్యటించనున్న రాష్ట్రపతి రామ్ నాథ్

గుంటూరు : నేడు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఏపీ రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. ఉదయం 9.35 గంటలకు గన్నవరం చేరుకోనున్నారు. పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 10.30 గంటలకు ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ శతాబ్ధి వేడుకలకు రాష్ట్రపతి ప్రారంభించనున్నారు. ఉదయం 11.25 గంటలకు ఏపీ సచివాలయాన్ని రాష్ట్రపతి సందర్శించనున్నారు. ఉదయం 11.45 గంటలకు ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును రాష్ట్రపతి ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 3.10 గంటలకు గన్నవరం నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు. 

Don't Miss