Activities calendar

28 December 2017

21:36 - December 28, 2017

ఢిల్లీ : రాజ్యాంగం, లౌకికవాదంపై తాను చేసిన వివాదస్పద వ్యాఖ్యలకు కేంద్రమంత్రి అనంతకుమార్‌ హెగ్డే లోక్‌సభలో క్షమాపణ చెప్పారు. రాజ్యాంగం, అంబేద్కర్‌, పార్లమెంట్‌ పట్ల తనకెంతో గౌరవం ఉందని...నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని మంత్రి అన్నారు. నా వ్యాఖ్యల వల్ల ఎవరైనా బాధపడితే వారికి క్షమాపణ చెప్పడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని హెగ్డే తెలిపారు. హెగ్డే క్షమాపణలు చెప్పిన తీరుపై విపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. అనంతకుమార్‌ వివరణ సహేతుకంగా లేదని కాంగ్రెస్‌ నేత మల్లికార్జున ఖర్గే అభ్యంతరం వ్యక్తం చేశారు.

21:34 - December 28, 2017

ఢిల్లీ : పాకిస్థాన్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌ కుటుంబ సభ్యుల పట్ల పాక్‌ ప్రభుత్వం వ్యవహరించిన తీరును పార్లమెంట్‌ ఖండించింది. జాదవ్‌ తల్లి, భార్య చేత బొట్టు, తాళి, దుస్తులు తీయించి అవమానకరంగా వ్యవహరించిందని రాజ్యసభ మండిపడింది. పాక్‌ తీరు గర్హనీయమని....జాదవ్‌ భద్రతపై విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. పాకిస్థాన్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌ కుటుంబసభ్యుల పట్ల పాక్‌ ప్రభుత్వం వ్యవహరించిన తీరు అమానవీయమని కేంద్రం పార్లమెంట్‌ ఉభయ సభల్లోను ఓ ప్రకటన చేసింది. భద్రత పేరిట జాదవ్‌ తల్లి, భార్యచేత బొట్టు, మంగళ సూత్రం, గాజులు తీయించారని...దుస్తులు కూడా మార్పించారని కేంద్రం పార్లమెంట్‌కు తెలిపింది. తాను తాళిని ఎప్పుడు తీయలేదని..ఇది తమ సౌభాగ్యానికి ప్రతీకగా చెప్పినప్పటికీ పాక్‌ అధికారులు వినలేదని జాదవ్‌ తల్లి చెప్పినట్లు కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ రాజ్యసభలో తెలిపారు. తల్లిని చూసి దిగ్భ్రాంతికి గురైన జాదవ్- తండ్రి ఎలా ఉన్నారని ప్రశ్నించాల్సి వచ్చిందని మంత్రి పేర్కొన్నారు..

జాదవ్‌ భార్య చెప్పులను కూడా తీసుకుని తిరిగి ఇవ్వలేదు. చెప్పుల్లో కెమెరా చిప్‌ ఉందేమోనని పాక్‌ చెబుతోంది. అవే చెప్పులతో ఆమె రెండు విమానాల్లో ప్రయాణించినపుడు అక్కడి అధికారులు ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడం పాక్‌ అమానవీయత్వానికి నిదర్శనమని సుష్మా అన్నారు. జాదవ్‌ భార్య, తల్లిని పాకిస్తాన్‌ అవమానించడమంటే మొత్తం భారతీయులనే అవమానించినట్లు కాంగ్రెస్‌ నేత గులాంనబీ ఆజాద్‌ అన్నారు. జాదవ్‌ కుటుంబం పట్ల పాకిస్తాన్‌ వ్యవహరించిన తీరుపై రాజ్యసభ ముక్త కంఠంతో ఖండించింది. 

21:30 - December 28, 2017

ఆదిలాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లైనా ఇచ్చిన వాగ్దానాలు అమలు కావడం లేదని టీమాస్ రాష్ట్ర కన్వీనర్ జాన్ వెస్లీ విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన టీ మాస్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఉద్యోగాల భర్తీ, పేదలకు డబుల్ బెడ్‌ రూం ఇళ్లు, రైతు రుణమాఫీ డిమాండ్లతో పాటు జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఎంబీసీలకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల సాధనకోసం జనవరి 2 నుండి 22 వరకు గ్రామ గ్రామాన టీ మాస్‌ నేతలు ప్రజాసంఘాలు పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. 

21:29 - December 28, 2017

హైదరాబాద్ : గ్రేటర్‌లోని పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఈ సంవత్సరం కేసుల సంఖ్య తగ్గిందన్నారు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ శ్రీనివాస రావు. ఈ మేరకు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో 2017 వార్షిక క్రైం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రజలకు మేలు చేసేందుకు సిటీ పోలీసులు ఎప్పుడూ ముందుంటారని సీపీ అన్నారు. భాగ్యనగరంలో శాంతిభద్రతలు నెలకొల్పేందుకు అన్ని విధాల కృషి చేస్తామన్నారు పీసీ శ్రీనివాసరావు. నేరాలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నగరంలో అన్ని పండుగలు శాంతియుతంగా జరిగేలా పని చేశామన్న కమిషనర్‌ వీఐపీ, వీవీఐపీలకు పూర్తి స్థాయిలో భద్రత కల్పించడంలో సక్సెస్‌ అయ్యామన్నారు.

ఈ ఏడాది హత్య కేసులు 26 శాతం, చైన్‌ స్నాచింగ్‌ కేసులు 47 శాతం తగ్గాయన్నారు సీపీ. 2016లో 97 స్నాచింగ్‌ కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 51 కేసులు నమోదైనట్లు తెలిపారు. దొంగతనాలు 71 శాతం తగ్గినట్లు వెల్లడించారు. దాదాపు 10వేల 78 కేసులు లోక్‌ అదాలత్‌లో పరిష్కరించబడ్డాయన్నారు. 94 నార్కోటిక్‌ డ్రగ్‌ కేసులు నమోదు కాగా, రోడ్డు ప్రమాదాల్లో 285 మంది మృతి చెందారన్నారు. ఎమర్జెన్సీ డయల్‌ 100కు 88 వేలకు పైగా కాల్స్‌ రిసీవ్‌ చేసుకున్నామని ఆ కేసులను 3.8 నిమిషాలలోనే చేదించామన్నారు.

644 మందిని షీటీమ్స్‌ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకోవడం జరిగిందని అందులో 122 మంది మైనర్లు, 522 మంది మేజర్లు ఉన్నట్లు తెలిపారు. షీటీమ్స్‌కు వచ్చిన ఫిర్యాదులో ఓ నిందితునిపై పీడీ యాక్టు నమోదైందన్నారు. వరకట్న వేధింపులు వంటి కేసులకు, మహిళా పోలీస్‌స్టేషన్ల ద్వారా కౌన్సిలింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. నగరం భద్రంగా ఉండేలా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు సీపీ. ఇందు కోసం లక్షా 66వేల సిసి కెమెరాలకు జీయో ట్యాగింగ్‌ ఏర్పాటు చేసి నిఘా పెట్టామన్నారు. సిటీ పోలీస్‌ శాఖలో ఉన్న 40 శాతం ఖాళీలు భర్తీ కావాల్సి ఉందన్నారు. 2018 ఫిబ్రవరి కల్లా 17,200 మంది పీసీలు సిటీ పోలీస్‌ శాఖలో సేవలందించబోతున్నారని తెలిపారు. 

21:25 - December 28, 2017

హైదరాబాద్ : డిసెంబర్ 31 అర్ధరాత్రి నుండి వ్యవసాయానికి 24 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు తీసుకొంటోంది. రైతాంగానికి నూతన సంవత్సర కానుకగా సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని 23 లక్షల పంపు సెట్లకు 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేయడానికి విద్యుత్ సంస్థలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి.

ఇప్పటి వరకు వ్యవసాయానికి కొన్ని రాష్ట్రాలు 9 గంటలపాటు ఉచిత్ విద్యుత్ అందిస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాల్లో 24 గంటలు సరఫరా చేస్తున్నా.. అక్కడ ఉచితంగా ఇవ్వడం లేదు. ఇక 24 గంటలు ఉచితంగా వ్యవసాయానికి కరెంటు ఇచ్చే రాష్ట్రంగా తెలంగాణ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి విద్యుత్ సరఫరాలో మెరుగుదలకు ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం.. రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను అందించడంతో పాటు.. అన్ని వర్గాలకు 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని నిర్ణయించింది.

నిరంతర ఉచిత విద్యుత్‌ను తెలంగాణ ప్రభుత్వం 2016 జూలైలో పాత మెదక్, నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అందించింది. ఆ తర్వాత 2016 నవంబర్ 6 నుంచి 20వ తేదీ వరకు 15 రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని ఉచిత విద్యుత్ సరఫరా చేశారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో 2018 జనవరి 1 నుంచి రైతులకు 24 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించాలని నిర్ణయం తీసుకున్నారు. 15 రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని పంపుసెట్లకు 24 గంటల పాటు విద్యుత్ సరఫరాను ప్రయోగాత్మకంగా అందించిన తర్వాత విద్యుత్ సంస్థలు ఒక అంచనాకు వచ్చాయి.

రైతులకు 24 గంటల సరఫరా ద్వారా ఏర్పడే డిమాండ్‌ను కూడా ముందుగానే అంచనా వేసిన విద్యుత్ సంస్థలు అందుకు కావాల్సిన కరెంట్‌ను సమకూర్చుకోవడానికి కూడా వ్యూహాలు ఖరారు చేసాయి. 2014 జూన్ 2కు ముందు రాష్ట్రంలో 5,240 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేసేందుకు అవసరమైన ఆరు 400 కెవి సబ్ స్టేషన్లు మాత్రమే ఉండేవి. వ్యవసాయంతో పాటు అన్ని రంగాలకు 24 గంటల కరెంటు ఇవ్వడానికి దాదాపు 13వేల మెగావాట్ల విద్యుత్ సరఫరా చేయగల సామర్థ్యం కలిగిన 400 కెవి సబ్ స్టేషన్లు అవసరమని భావించిన విద్యుత్ శాఖ కొత్తగా 9 సబ్ స్టేషన్ల నిర్మాణానికి పూనుకున్నది. ఇక 24 గంటల నిరంతర విద్యుత్‌ సరఫరా గడువు సమీపిస్తుండటంతో అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 24 గంటలు కరెంటు ఇవ్వడం వల్ల పడే భారంపై అధికారులతో చర్చలు జరుపుతున్నారు. నిరంతర విద్యుత్ సరఫరాకు రూ.12 వేల 610 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ప్రస్తుతం 14,845 మెగావాట్ల స్థాపిత విద్యుత్ ఉత్పత్తి అందుబాటులో ఉంది. భవిష్యత్తులో మరో 13 వేల మెగావాట్ల విద్యుత్ సమకూర్చుకోవడం కోసం కొత్త ఉత్పత్తి కేంద్రాలు నిర్మిస్తున్నారు. దీంతో 2022 నాటికి తెలంగాణలో 28వేల మెగావాట్ల విద్యుత్‌ను అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో కార్యాచరణ సిద్ధమవుతోంది. 

21:23 - December 28, 2017

గుంటూరు : ఏపీని నేర రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు పోలీసు అధికారులను ఆదేశించారు. పోలీసులు, ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తేనే నేరాలు పెరుగుతాయని.. అన్నారు. అమరావతిలో నిర్మిస్తున్న ఏపీ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ శంకుస్థాపన కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పోలీసులకు పలు సూచనలు ఇచ్చారు. అమరావతిలోని... తుళ్లూరులో మూడు ఎకరాల్లో నిర్మిస్తున్న ఏపీ ఫోరెన్సిక్‌ సైన్స ల్యాబ్‌ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు. ఈ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ను ప్రపంచంలోనే అత్యాధునికంగా తీర్చిదిద్దాలని సీఎం కోరారు. అలాగే ఏపీలో క్రైమ్‌ జరగడానికి వీల్లేదని.. సీఎం అన్నారు. పోలీసులు కేసులు నమోదు చేయడమే కాదు.. తప్పు చేసిన వారికి శిక్ష పడేలా చర్యలు ఉండాలని సూచించారు.

ఏపీ రాజధానిలో FSL ఏర్పాటు చరిత్రలో నిలిచిపోయే విషయమని DGP సాంబశివరావు అన్నారు. పోలీస్‌ శాఖ.. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని.. నేరాల నియంత్రణకు ప్రయత్నిస్తున్నట్టు ... ఆయన చెప్పారు. అలాగే సీఎం చంద్రబాబు చొరవ వల్లే హైదరాబాద్‌లో ఫోరెన్సిక్ ల్యాబరేటరీ ఏర్పాటు చేశారని.. ఏపీ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ అడ్వైజర్‌ గాంధీ అన్నారు. ప్రస్తుతం నిర్మిస్తున్న దానికి అనుబంధంగా రీసెర్చ్‌ ల్యాబరేటరినీ కూడా పీసీసీ పద్ధతుల్లో నిర్మిస్తే బాగుటుందని ఆయన అన్నారు.

ఇంత కీలకమైన కార్యక్రమంలో ఏపీ హోంమంత్రి చినరాజప్పకు అవమానం జరిగింది. ఈ కార్యక్రమానికి పోలీస్ శాఖ హోంమంత్రిని పిలవలేదు. కేవలం మంత్రి కార్యాలయానికి ఇన్విటేషన్ పంపి చేతులు దులుపుకున్నారు. అధికారుల తీరుపై అలిగిన హోంమంత్రి కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. కార్యక్రమానికి రాకపోవడంపై ఆరా తీసిన సీఎం... పోలీస్ ఉన్నతాధికారులను మందలించారు.

21:21 - December 28, 2017

ఢిల్లీ : ఏపీలో కొత్త హైకోర్టును త్వరలోనే ఏర్పాటు చేస్తామని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ స్పష్టం చేశారు. హైకోర్టు కోసం ఏపీ ప్రభుత్వం భవనాలను అన్వేషిస్తోందని... ఈ మేరకు ప్రతిపాదనలు పంపుతున్నట్లు తమకు తెలిసిందన్నారు. నిర్ణయించిన భవనాల్లోకి ఏపీ హైకోర్టు త్వరలోనే మారుతుందన్నారు. అప్పటివరకు ఏపీ, తెలంగాణ పరస్పరం గౌరవభావంతో ఉండాలని రవిశంకర్‌ ప్రసాద్‌ సూచించారు.

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజనపై లోక్‌సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కీలక ప్రకటన చేశారు. విభజన చేస్తే ప్రస్తుత హైకోర్టు తెలంగాణకు చెందుతుందని తెలిపారు. ఏపీ హైకోర్టు ఆ రాష్ట్ర కొత్త రాజధానిలో ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అన్నారు. తాత్కాలికంగా హైకోర్టు ఏర్పాటు చేయడానికి నాలుగు భవనాలు సిద్ధంగా ఉన్నాయని ఏపీ ప్రభుత్వం తెలిపినట్లు చెప్పారు. అందులో ఏదో ఒకటి ఖరారు చేయాల్సిందిగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరారని అన్నారు. హైకోర్టును తాత్కాలికంగా మార్చగలం కానీ శాశ్వతంగా మార్చడానికి చాలా సమయం పడుతుందని రవిశంకర్‌ ప్రసాద్‌ అన్నారు. అంతవరకు పరస్పరం ప్రేమాభిమానాలతో కలిసి ఉండాలని రెండు రాష్ట్రాలను కోరారు.

కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ప్రకటనపై టీఆర్‌ఎస్‌ ఎంపీ జితేందర్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. హైకోర్టు ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం భావించడం సంతోషంగా ఉందన్న ఆయన.. హైకోర్టు నిర్ణయం పూర్తయ్యేవరకు న్యాయమూర్తుల పదోన్నతుల ప్రక్రియ నిలిపివేయాలని కోరారు. ఈ ప్రక్రియ కొనసాగితే తెలంగాణ న్యాయమూర్తులకు అన్యాయం జరుగుతుందని జితేందర్‌ రెడ్డి అన్నారు.

న్యాయమూర్తుల నియామకం, పదోన్నతులు తమ పరిధిలోని అంశం కాదని, నియామకలన్నీ కొలీజియమే చేస్తుందని రవిశంకర్‌ ప్రసాద్‌ అన్నారు. హైకోర్టు విభజన ఒక్కటే సమస్య కాదని... విభజన చట్టంలో అనేక పెండింగ్ అంశాలున్నాయని మరో కేంద్ర మంత్రి సుజనాచౌదరి అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు రెవెన్యూ లోటు, ఇంకా చాలా అంశాలు పరిష్కరించాల్సి ఉన్నాయని సుజనా చౌదరి అన్నారు.

విభజన సమస్యల పరిష్కారం కోసం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుని మాట్లాడుకోవాలని, ఆ సమావేశం ఏర్పాటు చేసేందుకు తాము రెడీగా ఉన్నామని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. మొత్తానికి హైకోర్టు విభజనలో ఓ ముందడుగు పడింది. త్వరలోనే ఏపీలో కొత్త హైకోర్టును ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల విభజన హామీలను అమలు చేయాలని ఇరు రాష్ట్రాల పార్లమెంట్ సభ్యులు కోరుతున్నారు. 

21:19 - December 28, 2017

ఢిల్లీ : ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును లోక్‌సభ ఆమోదించింది. బిల్లుకు విపక్షాలు చేసిన సవరణలు వీగిపోయాయి. అంతకుముందు ఈ బిల్లుపై లోక్‌సభలో వాడి వేడి చర్చ జరిగింది. ముస్లిం మహిళలకు న్యాయం జరిగేందుకే ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును తెస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. మజ్లిస్‌, అన్నా డీఎంకే, బీజేడీ, ఆర్జేడీ, ముస్లింలీగ్‌ ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాయి. ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లు మహిళల హక్కులను పరిరక్షిస్తుందే తప్ప ఏ మతానికి, ఆచారానికి వర్తించదని పేర్కొంది. ట్రిపుల్‌ తలాక్‌ చెప్పడం ఓ నేరమని సుప్రీంకోర్టు చెప్పినా తలాక్‌లు కొనసాగుతున్నాయని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత వంద కేసులు నమోదు అయ్యాయని...ఈ అంశంపై పార్లమెంట్‌ చూస్తూ ఊరుకోవాలా అంటూ న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ప్రశ్నించారు.

ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుకు తాము మద్దతిస్తామని కాంగ్రెస్‌ పేర్కొంది. కాకపోతే దీనిపై విస్తృతంగా చర్చ జరగాలని కాంగ్రెస్‌ పక్షనేత మల్లిఖార్జున ఖర్గే అన్నారు. ఈ బిల్లును పార్లమెంటరీ కమిటీ పరిశీలించాలని....నిబంధనలపై అభ్యంతరాలుంటే వాటిని సవరించాలని సూచించారు. ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును ఎంఐఎం, ముస్లిం లీగ్‌, బిజెడి పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ బిల్లు మహిళల ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందని, చట్టపరమైన పొందిక కొరవడిందని ఎమ్‌ఐఎం ఆరోపించింది. రాజ్యాంగంలోని 14,15 వ అధికరణను ఈ బిల్లు ఉల్లంఘిస్తోందని ఆ పార్టీ నేత అసదుద్దీన్‌ ఓవైసీ అన్నారు. 30 వేల కోట్ల కుంభకోణంలో న్యాయం చేయలేని కేంద్రం...ముస్లిం మహిళలకు ఏ విధంగా న్యాయం చేస్తుందని ఆయన నిలదీశారు. ట్రిపుల్‌ తలాక్‌పై తాము సవరణలు ప్రతిపాదిస్తామని... ఆ సవరణలకు అనుగుణంగా కేంద్రం బిల్లు తేవాలని ఓవైసీ డిమాండ్‌ చేశారు.

లోక్‌సభలో వాడి వేడి చర్చ అనంతంరం బిల్లులో విపక్షాల సవరణలపై ఓటింగ్‌ నిర్వహించారు. ఓవైసీ ప్రతిపాదనలకు మద్దతు లభించలేదు. విపక్షాల సవరణలను స్పీకర్‌ తిరస్కరించారు. మూజూవాణి ఓటుతో ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఎవరైనా వ్యక్తి తన భార్యకు నేరుగా... లిఖిత రూపంగా.. ఎలక్ట్రానిక్ మాధ్యమంలో మూడుసార్లు తలాక్ చెప్పడాన్ని నేరంగాను, చెల్లనిదిగాను పరిగణిస్తూ కేంద్రం ఈ బిల్లును రూపొందించింది. ఈ నిబంధన ఉల్లంఘించిన భర్తలకు గరిష్ఠంగా మూడేళ్ళ జైలు శిక్ష, జరిమానా విధించడానికి ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. బాధితురాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించి జీవన భృతి కోరడానికి వీలుంటుంది. మైనర్ పిల్లల సంరక్షణకు న్యాయమూర్తి ద్వారా ఉత్తర్వులు పొందవచ్చు.

కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం ?

కర్నూలు : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవ దిశగా సాగుతోంది. శనివారం నామినేషన్ ను జయప్రకాష్ రెడ్డి ఉపసంహరించుకోబోతున్నారు. ఏంపీటీసీల ప్రోద్బలంతో నామినేషన్ వేయడం జరిగిందని, ఎంపీటీలకు ప్రభుత్వం అండగా ఉంటుందని కేఈ హామీనిచ్చారని పేర్కొన్నారు. కేఈ హామీతో నామినేషన్ ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. 

యోగి విడుదల...

హైదరాబాద్ : సెంట్రల్ జైలు నుండి షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ యోగి విడుదలయ్యారు. బెయిల్ పై విడుదలయ్యారు. తనను వేధించాడని యోగిపై షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ హారిక కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. 

ముస్కాన్ పేటలో ప్రేమ జంట ఆత్మహత్య..

రాజన్న సిరిసిల్ల : ఇల్లంతకుంట (మం) ముస్కాన్ పేటలో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. పెద్దలు ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదని మనస్థాపానికి చెంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. మధు (25), సుస్మిత (21)గా గుర్తించారు. 

ఏపీ దుర్గాభాయి మహిళా వికాస్ కేంద్రం పేరు మార్పు...

విజయవాడ : ఏపీ దుర్గాభాయి మహిళా వికాస్ కేంద్రం పేరు మార్చారు. నందమూరి తారకరామారావు కేంద్రంగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

 

20:21 - December 28, 2017

ఆకాశాన్నంటుతున్న ధరలు.. భారమైపోయిన సామాన్యుడి బతుకు... హక్కుల కోసం ఉద్యమాలు.. అస్థిత్వం కాపాడుకునే ఆరాటం.. ప్రజల బాగోగులు చివరి ప్రాధాన్యతగా పెట్టుకున్న ప్రభుత్వాలు.. పైపై మెరుగులు తప్ప సామాన్యుడి బతుకును నిర్లక్ష్యం చేసే విధానాలు..దళితులపై పెరుగుతున్న దాడులు.. పరువు కోసం హత్యలు...విదేశీ సదస్సుల ఆడంబరాలు... పరిమళించిన తెలుగు ఉత్సవాలు.. పరుగులెత్తుతున్న మెట్రో రైలు, రికార్డుల బాహుబలి2 ఇవీ 2017లో తెలుగు ప్రజలు చూసిన అనుభవాలు.. ఇలాంటి ఘటనల సమాహారంగా రెండు రాష్ట్రాల్లో జరిగిన ముఖ్యాంశాలపై ప్రత్యేక కథనం..

హోరెత్తే ప్రచారం.. ఘాటైన విమర్శలు..పదునైన కామెంట్లు..దుమ్మురేపిన రోడ్ షోలు.. మీటింగ్ లు..వెరసి గెలుపుకోసం అంతులేని ఆరాటం.. సెమీఫైనల్ గా భావించిన నంద్యాల ఉపఎన్నిక ఏపీలో హడావుడి చేసింది. ఎప్పుడెప్పుడా అని నగరవాసి ఎదురు చూసిన మెట్రో రైలు నగరంలో పరుగులు తీస్తోంది. ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారంగా, కాలుష్యానికి దూరంగా, సౌకర్యవంతమైన ప్రయాణంతో, మెట్రో రైలు సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. మెట్రో టికెట్టు ధరలపై మాత్రం విమర్శలు ఎక్కువవుతున్నాయి..పాదయాత్రలు అధికారాన్ని తెచ్చిపెట్టాయి. ప్రజలకు దగ్గరచేశాయి.. పాదయాత్ర పునాదిగా ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అది చరిత్ర. ఇప్పుడు ఏపీలో మహాసంకల్ప యాత్ర నడుస్తోంది.. దీంతో ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ప్రజాసంకల్ప యాత్రతో తన సంకల్ప సాధన కోసం జగన్ ప్రయత్నాలు 45 రోజులుగా సాగు

హైదరాబాద్ లో ప్రపంచ తెలుగు మహా సభలు ఘనంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి నిర్వహిస్తున్న మహాసభలకు ప్రపంచ నలుమూలలా నుంచి అనేకమంది భాషాభిమానులు, సాహితీవేత్తలు హాజరయ్యారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరై... జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ప్రపంచ తెలుగు మహాసభలకు 42 దేశాలనుంచి 400 మంది భాషాభిమానులు.. మొత్తం ఉత్సవాలకు 8 వేల మంది ప్రతినిధులు హాజరయ్యారయ్యారు. పవిత్ర సంగమం కాస్తా విషాద సంగమమయింది. గతేడాది గోదావరి పుష్కరాల్లో 30 మందిని బలిగొన్న ఘటన ఇంకా కళ్లముందు నుంచి చెరిగిపోలేదు. దానిపై విచారణ ఇప్పటికీ అతీగతీ లేదు. ఈ లోగా కృష్ణా నదిలో ఈ ప్రమాదం జరిగింది.. ఇక కార్తీక మాసంలో పవిత్ర సంగమం వద్ద జనం పోటెత్తుతారని తెలిసినా యంత్రాంగం అప్రమత్తం కాని తీరు స్పష్టంగా కనిపిస్తోంది. అదే సమయంలో బినమా పేర్లతో అక్రమ అనుమతులతో బోట్లు నడుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే నేతల తీరు కూడా తెరపైకి వచ్చింది.

నగరవాసులంతా ఇవాంకా రావా మా వంక అని పిలిచారు. ఇవాంక వస్తే చాలు.. తమ ప్రాంత చిత్రంలో కాస్తయినా మార్పు వస్తుందని భావించారు. ఇన్నేళ్లుగా హైదరాబాద్ లో ఉంటున్నం.. అప్పుడెప్పుడో బిల్ క్లింటన్ వస్తున్నాడని చంద్రబాబు హడావుడి చేసిన తర్వాత.. మళ్లీ ఇప్పుడు కెసీఆర్ హయాంలో ఈ హడావుడి కనిపిస్తున్నదని చెవులు కొరుక్కుంటున్నారు నగర వాసులు.. జీఈఎస్ ఘనంగా నిర్వహించారని తెలంగాణ సర్కారు క్రెడిట్ పొందినా, నగరంలో మౌలిక సదుపాయాల విషయంలో మామూలు సమయంలో చూపే నిర్లక్ష్యం కూడా తెరపైకి వచ్చింది.

ఇండియన్ సెల్యులాయిడ్ పై ఆవిష్కృతమైన భారీ చిత్రం.. కనీవినీ ఎరుగనంత భారీ బడ్జెట్.. ఎన్నో అంచనాల మధ్య.. మరెంతో ఉత్కంఠను రేకెత్తించి, లక్షలాది ప్రేక్షకులను అలరించింది. మగధీర, ఈగ బాటలోనే బాహుబలి వన్ బాటలోనే బాహుబలి2 కూడా సత్తా చాటింది. 2017 ఏప్రిల్ లో రిలీజ్ అయిన ఈ సినిమా రికార్డు స్థాయి కలెక్షన్లు రాబట్టింది. తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటింది. పోలవరం ప్రాజెక్టు అంచనాలు దాటుతోంది. టార్గెట్ సమయం దాటుతోంది..నిధుల కొరత వేధిస్తోంది..పనులు ఆగిన పరిస్థితి కనిపిస్తోంది.. మొత్తానికి 2017లో పోలవరం పరిస్థితి అంతంత మాత్రంగానే సాగిందని చెప్పాలి.. తెలుగు రాష్ట్రాల్లో దళితులపై, బహుజనులపై దాడులు మరింత పెరిగాయి.. కులం దన్ను, రాజకీయ బలం, ఆర్ధిక బలాన్ని చూసుకుని కొందరు పేట్రేగి పోతున్న తీరు స్పష్టంగా కనిపిస్తోంది. అదే సమయంలో పరువు హత్యలు కూడా పెరుగుతున్నాయి. 2017లో నరేశ్, మధుకర్ ల హత్యలతో పాటు, గరగపర్రు ఘటన సంచలనం కలిగించాయి..

చంద్రన్న మాల్స్‌ ద్వారా నిత్యావసర వస్తువులతో పాటు, గృహోపకరణాలు, సౌందర్య సాధనాలు తక్కువ ధరలకు వస్తాయా? అలా వస్తాయంటూ చెప్తున్న సీఎం మాటల్లో నిజమెంత? చంద్రన్న మాల్స్‌తో ప్రజలకు జరిగే మేలు కన్నా, కార్పొరేట్లకు చేకూరే లబ్ధి ఎక్కువా? రిలయన్స్ లాంటి సంస్థలు ఒక్క రూపాయి పెట్టుబడి కూడా పెట్టకుండా గ్రామీణ ప్రాంతాల్లో దందాకు దిగుతున్నాయా? దానికి ఏపీ సర్కారు వత్తాసు పలుకుతోందా? ప్రజాపంపిణీ వ్యవస్థకు తూట్లు పొడిచే పనికి 2017లో ఏపీ సర్కారు దిగింది.
ఇవీ 2017లో తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ముఖ్య ఘటనల వివరాలు. గుర్తు చేసుకోవలసిన అంశాలు.. అనంత కాల గమనంలో మరో వసంతం గడిచిపోతోంది. 2018 రెండు రాష్ట్రాల్లో శాంతి, సామరస్యాలు నెలకొని, ప్రజలకు మంచి జరగాలని ఆశిద్దాం. పూర్తి విశ్లేషణకు వీడియో క్లిక్ చేయండి. 

20:15 - December 28, 2017

ఒకవేళ ఈ ముచ్చట నిజమే అయితే మట్టుకు.. తెలంగాణలున్న తాగువోతులకు ఇదో పండుగ దినం అన్నట్టే..చలో అన్నట్టే మళ్లొక ఉద్యమాన్ని తయ్యారు జేశిండు మంద క్రిష్ణ మాదిగ.. జనవరి ఒక్కటి సంది.. కాంగ్రెస్ పార్టీ వుట్టి నూట ముప్పై మూడు ఏండ్లైందట.. మన్షిని మన్షిగ గుర్తించలేని శాస్త్రాన్ని తల్గవెట్టుడు గాదు పాతిపెట్టాలే అంటున్నడు తమ్మినేని వీరభద్రం సారు.. ఒక వడ్డెరోళ్ల బిడ్డను శీతగోసవెడ్తున్నరట.. ఎటువొయ్యినయ్ వడ్డెర సంఘాలు.. ఎడవన్నయ్....? సారు మా భూమిలకు జొర్రవడి గుంజుకుందామని సూస్తున్నడు..రోడ్ల మీద బిచ్చమడుక్కోని రోజుకు ఐదారు వందలు సంపాయించెటోళ్లను అరెస్టు జేశి చర్లపల్లి జైళ్ల వెట్టిన అనాథాశ్రమంల ఏశిండ్రుగదా..? బాబా ఏశం గట్టాలే బట్టెవాయి పనులు జేయాలే.. ఆడ భక్తులు రాంగనే అది ఇది జెప్పి ఆకర్శించుకోవాలె.. 

20:13 - December 28, 2017

కాంగ్రెస్ పార్టీ వుట్టి నూట ముప్పై మూడు ఏండ్లైందట.. ఇయ్యాళ పుట్టినదినం జేశిండ్రు దేశమంతట.. దేశమంత ముచ్చటమనకెందుకుగని.. గాంధీభవన్ కథ జూద్దాం పాండ్రి.. జెండా ఎగిరేశినంక మేమంత ఐక్యమత్యంతోని కల్సిమెల్చి ముంగటికి వోతున్నమని చెప్పిండ్రు.. ఓదిక్కు ఈ ముచ్చట చెప్తుండంగనే.. ఐకమత్యంతోని ఒకల్నొకలు నూకేసుకున్నరు..

 

తిరుమలలో భారీగా భక్తుల రద్దీ...

చిత్తూరు : తిరుమలలో భారీగా భక్తుల రద్దీ పెరిగిపోయింది. 44 కంపార్ట్ మెంట్ నిండి 3 కిలోమీటర్ల మేర వెలుపలకు క్యూ లైన్లు చేరిపోయాయి. 6గంటల నుండి క్యూ లైన్ లో ఉన్న వారికి శుక్రవారం దర్శనం కల్పించలేమని టిటిడి అధికారులు పేర్కొంటున్నారు. చలికి వృద్ధులు..చిన్నారులు వణికిపోతున్నారు. వీఐపీలకు సకల సౌకర్యాలు కల్పించారని, సామాన్యులను గాలికొదిలేశారంటూ భక్తుల నినాదాలు చేశారు. 

19:50 - December 28, 2017

కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీలో జరిగిన ఘర్షణ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. విశ్వవిద్యాలయ ఆవరణలో కొంతమంది విద్యార్థి నాయకులు మను ధర్మ శాస్త్రాన్ని దగ్ధం చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. అయితే మనుధర్మ శాస్త్రంను దగ్ధం చేయడాన్ని వ్యతిరేకిస్తూ మరో వర్గం ఆందోళనకు దిగింది. దీనితో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మనుధర్మ శాస్త్రాన్ని కాల్చివేయాలని అంబేద్కర్ పిలుపునివ్వడంతో తాము ఆ రోజున అలా చేయడం జరిగిందని కొన్ని విద్యార్థి సంఘాలు పేర్కొంటున్నాయి. మరోవైపు యూనివర్సిటీలో ఇంకా ఘర్షణపూరిత వాతావరణం నెలకొంది. ఎవరి వాదన ఎలా ఉన్నా విద్యార్థి సంఘాల మధ్య ఈ తరహా ఘర్షణలు..భావస్వేచ్చను అడ్డుకోవడం కిందకే వస్తాయా ? అసలు యూనివర్సిటీలో ఇలాంటి సంస్కృతిని స్వాగతిద్దామా ? అనే దానిపై టెన్ టివిలో ప్రత్యేక చర్చ చేపట్టింది. ఈ చర్చలో పసునూరి రవీందర్ (సామాజిక విశ్లేషకులు), ముస్ ఫీర్ (ఎస్ఎఫ్ఐ), చందు (ఏబీవీపీ), గౌతమ్ (పీడీఎస్ యు) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

19:48 - December 28, 2017

జనవరి 2 నుండి జన్మభూమి -మా ఊరు...

విజయవాడ : 'జన్మభూమి-మా ఊరు' ఓ పండుగలా నిర్వహించాలని ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. జనవరి 2 నుండి 11 వరకు నిర్వహించనున్న కార్యక్రమాలపై సీఎం సమీక్ష నిర్వహించారు.

 

ట్రిపుల్ తలాక్ కు ఆమోదం..

ఢిల్లీ : ట్రిపుల్ తలాక్ కు లోక్ సభ ఆమోదం తెలిపింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. అనంతంర దీనిపై సుదీర్ఘ:గా చర్చ జరిగింది. రాత్రి సవరణలపై ఓటింగ్ నిర్వహించారు. మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. 

19:35 - December 28, 2017

సమగ్ర కుటుంబ సర్వే గణాంకాల వివరాల యాప్...

హైదరాబాద్ : తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే గణాంకాల వివరాల మొబైల్ యాప్ ను రాష్ట్ర ప్రణాళిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీపీ ఆచార్య ప్రారంభించారు. గణాంకాలను త్వరలో జిల్లా కలెక్టర్లకు, క్షేత్రస్థాయి సిబ్బందికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. 2014 ఆగస్టు 19న సమగ్ర కుటుంబ సర్వే నిర్వాహణ గ్రామాల వారీగా సమగ్ర కుటుంబ సర్వే వివరాలు చేపట్టారు. యాప్ ను నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ రూపొందించింది.

18:29 - December 28, 2017
18:27 - December 28, 2017

పశ్చిమగోదావరి : సంక్రాంతి పండుగ..ఇంకా రెండు వారాలు ఉంది. కానీ అప్పుడే రగడ మొదలైంది. పశ్చిమగోదావరి..తూర్పుగోదావరి జిల్లాల్లో కోళ్ల పందాలు జోరుగా సాగుతుంటాయనే సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే వెంప గ్రామంలో నిర్వహిస్తున్న కోళ్ల పందాల ముసుగులో జూదం, వ్యభిచారం జరుగుతోందని గ్రామస్తుడు కలిదిండి రామచంద్రరాజు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీని గురించి తెలుసుక్ను వెంప చుట్టుపక్కల గ్రామాల ప్రజలు గ్రామసభ నిర్వహించారు. ఈ సభకు ఎమ్మెల్యేను పిలిపించారు. ఎలాంటి అసాంఘీక కార్యకలాపాలు జరగడం లేదని..సంప్రదాయబద్ధంగా కోళ్ల పందాలు జరుగుతాయని వారు పేర్కొన్నారు. కోడిపందాల్లో ఎలాంటి అసాంఘీక కార్యక్రమాలు జరగడం లేదని తీర్మానం చేశారు. గ్రామ పరువు తీసేలా కోర్టులో పిటిషన్ వేసిన రామచంద్రరాజుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

కోళ్ల పందాల ముసుగులో...

పశ్చిమగోదావరి : జిల్లాలో కోడి పందాల రగడ మొదలైంది. భీమవరం మండలం వెంపలో కోడి పందాల ముసుగులో జూదం, వ్యభిచారం జరుగుతోందని గ్రామస్తుడు కలిదిండి రామచంద్రరాజు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రామచంద్రరాజుకు వ్యతిరేకంగా వెంప చుట్టుపక్కల గ్రామాల ప్రజలు గ్రామ సభ నిర్వహించారు. ఈ గ్రామ సభలో భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులు పాల్గొన్నారు. కోడిపందాల్లో ఎలాంటి అసాంఘీక కార్యక్రమాలు జరగడం లేదని తీర్మానం చేశారు. గ్రామ పరువు తీసేలా కోర్టులో పిటిషన్ వేసిన రామచంద్రరాజుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ల

18:21 - December 28, 2017
18:17 - December 28, 2017

విజయవాడ : కేబుల్ వ్యవస్థ నాశనం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని, అందుకనే ప్రభుత్వం ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును ప్రవేశ పెట్టిందన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి కేబుల్ ఆపరేటర్స్ ను తమ ఆధీనంలోకి తీసుకోవాలని, రూ. 149 అన్ని ఇస్తామని చెబుతున్నారని పేర్కొన్నారు. కానీ అది అసాధ్యమని తెలిసినా వారిని మోసం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోందన్నారు. కేబుల్ ఆపరేటర్లను ప్రభుత్వం నడిబజార్లో నిలబెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఫైబర్ గ్రిడ్ వల్ల ప్రజలకు ఏ మాత్రం ఉపయోగం లేదని స్పష్టం చేశారు. 

18:14 - December 28, 2017

విజయవాడ : బైరెడ్డి రాజశేఖరరెడ్డి..కొంత విలక్షణ నాయకుడు. టిడిపి పార్టీలో పనిచేశారు. కానీ గత కొంతకాలంగా ఆయన పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. రాయలసీమను అభివృద్ధి చేయాలని ఆయన పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. అంతేగాకుండా రాయలసీమ పరిరక్షణ సమితి కూడా ఏర్పాటు చేశారు. గురువారం మాత్రం అమరావతిలో ప్రత్యక్షమయ్యారు. దీనితో ఆయన టిడిపిలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. తాను బాబును కలవడానికి రావడం జరిగిందని, భేటీ అనంతరం ఇతర వివరాలు వెల్లడిస్తానని బైరెడ్డి మీడియాకు తెలిపారు. ఆయన టిడిపి కండువా కప్పుకుంటారా ? లేదా ? అనేది కొద్దిసేపట్లో తెలియనుంది. 

18:11 - December 28, 2017

విజయవాడ : ఏపీ హోం మంత్రి అలకపాన్పు ఎక్కారు. సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొనే కార్యక్రమానికి సరైన రీతిలో పిలవలేదనే కారణంతో ఆయన అలకవహించారు. గురువారం తుళ్లూరులో ఉదయం పోలీసు శాఖ ఫోరెన్సిక్ ల్యాబ్ కు సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. కానీ ఈ కార్యక్రమానికి హోం మంత్రి గైర్హాజర్ అయ్యారు. కేవలం ఓ కానిస్టేబుల్ తో ఆహ్వానపత్రం పంపడం పట్ల హోం మంత్రి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విజయవాడలో ఉన్నా శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లలేదు. దీనితో వేడుకలో పాల్గొన్న వారంతా హోం మంత్రి రాకపోవడంపై చర్చించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు దీనిపై ఆరా తీశారు. విజయవాడలో ఉన్నా సరైన విధంగా ఆహ్వానం పలకలేదని తెలుసుకున్న బాబు పోలీసు ఉన్నతాధికారులను మందలించారు. ఘటనకు సంబంధించి పోలీసు ఉన్నతాధికారులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. 

తెలంగాణలో 2018-19 కామన్ ఎంట్రన్స్ ల షెడ్యూలు విడుదల

హైదరాబాద్ : తెలంగాణలో 2018-2019 కామన్ ఎంట్రన్స్ టెస్టుల షెడ్యూల్ ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటించింది. 2018 మే 2 నుంచి 5 వరకు ఎంసెట్ పరీక్ష, మే 9న ఈసెట్, మే 17న ఐసెట్, మే 20 నుంచి పీఈసెట్, మే 25న లాసెట్, మే 26న పీజీఎల్ సెట్, మే 27న పీజీఈసెట్, మే 31న ఎడ్ సెట్ టెస్టులు నిర్వహించనున్నారు.

క్ర.సంఖ్య
టెస్టు
తేదీ 

1
ఎంసెట్
మే 2 నుంచి మే 5, 2018

2
ఈసెట్ 
మే 9, 2018

3
ఐసెట్ 
మే 17, 2018

4
పీఈసెట్ 
మే 20, 2018

ఫాతిమా కాలేజీ విద్యార్థులకు గుడ్ న్యూస్...

విజయవాడ : ఫాతిమా మెడికల్ కాలేజీ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. విద్యార్థులకు నష్టం జరుగకుండా ప్రత్యేక ఆర్డినెన్స్ తేవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఫాతిమా విద్యార్థులను నేరుగా ప్రభుత్వ వైద్య కాలేజీల్లో అడ్మిషన్లు ఇచ్చేలా ఆర్డినెన్స్ ను రూపొందించనన్నట్లు తెలుస్తోంది. వచ్చే వారంలో ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనుంది. 

17:51 - December 28, 2017

ఖమ్మం : వైకుంఠ ఏకాదశి సందర్భంగా భద్రాచల పుణ్యక్షేత్రం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. ముక్కోటి వేడుకలను పురస్కరించుకొని తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజుమున స్వామివారు ఉత్తర ద్వారం నుంచి దర్శనమివ్వనున్నారు. ఏకాదశి సందర్భంగా భద్రాచలం వైకుంఠ శోభను సంతరించుకుంది. ఇవాళ నిర్వహించే తెప్పోత్సవానికి అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. గోదావరి నదీ తీరాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. హంసాలంకార లాంచీపై సీతారాములకు తెప్పోత్సవం నిర్వహించనున్నారు. భక్తులకు కావాల్సిన ఏర్పాట్లలో దేవస్థానం, రెవెన్యూ, నీటిపారదుల శాఖ, గ్రామ పంచాయితీలు నిమగ్నమయ్యాయి.

ఈ సందర్భంగా భద్రచల పట్టణాన్ని స్వాగత ద్వారాలతో శోభయమానంగా తీర్చిదిద్దారు. రామాలయాన్ని విద్యుత్‌ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. విద్యుత్‌ కాంతులతో పరిసరాలు ధగ ధగ మెరుస్తున్నాయి. ఈ వేడుకలకు పలువురు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు తదితరులు హాజరు కానున్నట్లు దేవస్ధానం కార్యనిర్వహణ అధికారి శ్రీనివాస ప్రభాకర్ తెలిపారు.

గతేడాది ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు ముఖ్యమంత్రి సతీమణి శోభ హాజరయ్యారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ పెద్దలు ఈ వేడుకలకు విచ్చేశారు. అయితే ఈసారి వేడుకలకు ఎవరు వస్తారో అన్న విషయంపై స్పష్టత లేదు. ప్రజాప్రతినిధులు వస్తారా లేదా అన్న దానిపై ఇప్పటివరకు అధికారులకు సమాచారం అందలేదు. భద్రాచలంలో ఒక ఎంపీటీసీ స్థానానికి వచ్చేనెల 11న ఎన్నిక జరగనుంది. ఈ కారణంగా ముక్కోటి ఉత్సవాల వేళ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంటుందంటున్నారు అధికారులు. ఈ పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులకు ప్రోటోకాల్‌ పాటిస్తారా లేక సాధారణ మర్యాదలు అందిస్తారా అన్నదానిపై స్పష్టత లేకపోవడంతో గందరగోళం నెలకొంది. ఈ వ్యవహారంతో సామాన్య భక్తులకు చిక్కులు తప్పేలా లేవు. ప్రోటోకాల్‌ ప్రకారం ప్రముఖుల కోసం ఎదురు చూడాలా లేక వచ్చిన భక్తులకు వసతి కల్పించాలా అన్నది అధికారులు తేల్చుకోలేక పోతున్నారు. 

తెలంగాణలో 2018-19 కామన్ ఎంట్రన్స్ ల షెడ్యూలు విడుదల

హైదరాబాద్ : తెలంగాణలో 2018-2019 కామన్ ఎంట్రన్స్ టెస్టుల షెడ్యూల్ ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటించింది. 2018 మే 2 నుంచి 5 వరకు ఎంసెట్ పరీక్ష, మే 9న ఈసెట్, మే 17న ఐసెట్, మే 20 నుంచి పీఈసెట్, మే 25న లాసెట్, మే 26న పీజీఎల్ సెట్, మే 27న పీజీఈసెట్, మే 31న ఎడ్ సెట్ టెస్టులు నిర్వహించనున్నారు.

క్ర.సంఖ్య
టెస్టు
తేదీ 

1
ఎంసెట్
మే 2 నుంచి మే 5, 2018

2
ఈసెట్ 
మే 9, 2018

3
ఐసెట్ 
మే 17, 2018

4
పీఈసెట్ 
మే 20, 2018

17:29 - December 28, 2017

సంగారెడ్డి : జిల్లాలో వే బ్రిడ్జి నిర్వాహకులు బరితెగిస్తున్నారు. వీరి మోసాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. తూకాల్లో అవకతవకలు... దొంగబిల్లుల జారీలతో వినియోగదారుల్ని నిలువునా ముంచేస్తున్నారు. తనిఖీలు చేయాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. సంగారెడ్డి వేబ్రిడ్జి మోసాలపై 10టీవీ స్పెషల్‌ రిపోర్ట్‌..

సంగారెడ్డి జిల్లాలో వేబ్రడ్జిల నిర్వాహకుల మోసాలకు అంతు లేకుండా పోయింది. నిజాయితీగా తూకాలు చేసేవారి సంఖ్య వేళ్లపైనే లెక్కించే స్థాయిలోనే ఉంటోంది. జిల్లాలోని జాతీయ రహదారులపైనా, పారిశ్రామిక ప్రాంతాల్లో సుమారు 150 దాకా వేబ్రిడ్జిలున్నాయి. వీటిలో అత్యధిక శాతం వేబ్రిడ్జిలు అక్రమాల పుట్టలుగా మారాయి.

వేబ్రిడ్జి నిర్వాహకులకు.. స్థానిక లారీ యజమానులకు మధ్య విడదీయరాని బంధం కొనసాగుతోంది. సంగారెడ్డి పట్టణంలో.. మూడు లారీ ఓనర్స్‌ అసోసియేషన్స్‌ ఉన్నాయి. వీరి పరిధిలో దాదాపు మూడు వందల లారీలు తిరుగుతున్నాయి. వీరు భూపాలపల్లి జిల్లా మల్లారం నుంచి ఇసుకను తెస్తూ సంగారెడ్డిలో విక్రయిస్తుంటారు. ఇంతవరకూ సవ్యంగానే ఉన్నా.. ఇక్కడే అసలు కథ మొదలవుతోంది. ఐదు టన్నుల లోడుతో వచ్చి.. వేబ్రిడ్జి నిర్వాహకులను మచ్చిక చేసుకుని.. పది టన్నుల లోడు తెచ్చినట్లుగా బిల్లు సృష్టిస్తున్నారు. ఆ తర్వాత.. దొడ్డిదారిన ఇసుకను తెచ్చి.. దొంగ వేబిల్లుల ఆధారంగా.. అక్రమ ఇసుకను యధేచ్చగా.. భారీ మొత్తాలకు అమ్మేసుకుంటున్నారు. వినియోగదారులను నిలువునా దోచుకుంటున్నారు.

వాహనంలో ఉన్న పరిమాణం కన్నా అదనంగా ఇచ్చే ఇసుకకు టన్నుకు మూడు వందల వరకూ వేబ్రిడ్జి నిర్వాహకులు వసూలు చేస్తున్నారు. సంగారెడ్డి పట్టణంలో రోజుకు సుమారు వెయ్యి టన్నుల ఇసుక అమ్మకాలు జరుగుతుంటాయి. ఆ లెక్కన రోజుకు ఏ స్థాయిలో అక్రమాలు జరుగుతుంటాయో ఊహించు కోవచ్చు. స్థానికంగా మూడు అడ్డాలలో ఇసుక వ్యాపారం జరుగుతుంది. ఇలాంటి కొందరు మోసగాళ్ల వల్ల తాము పూర్తిగా నష్టపోతున్నామని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంగారెడ్డి పట్టణంలోని విఘ్నేశ్వర వేబ్రిడ్జి యజమానులు యధేచ్చగా మోసాలకు పాల్పడుతున్నట్లు.. తూనికలు-కొలతల అధికారులకు సమాచారం అందింది. దీంతో అధికారులు బుధవారం అక్కడికి చేరుకుని, తనిఖీలు చేశారు. వేబ్రిడ్జి నిర్వాహకులు మోసానికి పాల్పడినట్లు గుర్తించి, వే బ్రిడ్జిని సీజ్‌ చేశారు. అధికారులు సీజ్‌ చేసిన శ్రీ విఘ్నేశ్వర వేబ్రిడ్జి గురించి భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. అక్కడ మోసం చేస్తున్నారన్న సమాచారంతోనే అధికారులు తనిఖీ చేసి సీజ్‌ చేశారు... అయితే.. వేబ్రిడ్జి వారిపై లారీ యజమానులు తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చి, బెదిరించి అక్రమ బిల్లులు తీసుకుంటున్నారన్న మరో వాదనా వినిపిస్తోంది. తూనికలు, కొలతల శాఖ అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్న కారణంగానే.. ఈ అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలున్నాయి. అధికారులు వేబ్రిడ్జిలతో పాటు.. ఇసుక అక్రమ రవాణాదారులపైనా ప్రత్యేక నిఘాపెట్టి... తమను కాపాడాలని వ్యాపారులు, వినియోగదారులు కోరుతున్నారు. 

17:26 - December 28, 2017

హైదరాబాద్ : తెలంగాణ సెక్రటేరియట్‌లోని డీ బ్లాక్‌లో బ్రాహ్మాణ సంక్షేమ పరిషత్, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ సంయుక్త ఆధ్వర్యంలో బ్రాహ్మణులకు హెల్త్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ రమణాచారి, ఎమ్మెల్సీ పురాణం సతీష్, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తాము భాగస్వాములు కావడం సంతోషంగా ఉందని నేషనల్ ఇన్సూరెన్స్ రీజనల్ మేనేజర్ సరళ చెప్పారు. ఈ స్కీమ్‌ను బ్రాహ్మణులు వినియోగించుకోవాలని ఆమె సూచించారు. 

17:24 - December 28, 2017

ఢిల్లీ : రాహుల్‌ గాంధీ పప్పూ కాదు... పప్పా అంటూ... బీజేపీకి కౌంటర్‌ ఇచ్చారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి. హనుమంతరావు.. కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా వీహెచ్‌ టెన్‌టీవీతో మాట్లాడిన వీహెచ్‌... మోడీకి ధీటైన వ్యక్తి రాహుల్‌ గాంధీనే అన్నారు. రాహుల్‌ అధ్యక్షతన 2019లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని చెప్పారు. బీజేపీ నేతల తీరు రాజ్యాంగాన్ని, అంబేడ్కర్‌ను అవమానించేలా ఉందని మండిపడ్డారు.

 

17:24 - December 28, 2017

హైదరాబాద్ : తెలంగాణలో కేసీఆర్ పాలన బ్రిటీష్‌ పరిపాలనను తలపిస్తోందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో జరిగిన కాంగ్రెస్ పార్టీ 133 ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో ఉత్తమ్‌తో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణలో నిత్యం దళితులు, గిరిజనులకు అవమానం జరుగుతోందని ఉత్తమ్ ఆరోపించారు. 2019లో రాహుల్ గాంధీ నాయత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడే విధంగా పనిచేయాలంటూ కాంగ్రెస్ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.

 

ఏపీ సచివాలయానికి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

గుంటూరు : ఏపీ సీఎం ను కలిసేందుకు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సచివాలయానికి వచ్చారు. ఆయన టీడీపీలో చేరుతారనే ప్రచారం నేపథ్యంలో సచివాలయానికి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎంను కలిసిన తర్వాత ఎందుకు వచ్చానో చెబుతానని ఆయన అన్నారు.

17:13 - December 28, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో 24గంటల పాటు విద్యుత్ ను అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రైతులకు ఉచితంగా 24గంటల పాటు విద్యుత్ అందిస్తామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అందుకనుగుణంగా విద్యుత్ అధికారులు కొన్ని జిల్లాల్లో ట్రయల్ రన్ నిర్వహించారు. వస్తున్న సమస్యలు..ఏర్పడే సమస్యలపై అధ్యయనం చేశారు. ఈ

సమయంలో 13 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ వచ్చినా ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండానే విద్యుత్ సరఫరా చేశారు. అనంతరం నిరంతర విద్యుత్ సరఫరా అందించే వీలుందని నిర్ధారించుకుని ఏర్పాట్లు చేశాయి. డిసెంబర్ 31 అర్ధరాత్రి నుండి విద్యుత్ సరఫరా చేయాలని, ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు సూచించారు. విద్యుత్ సౌధ వద్ద పరిస్థితిని ట్రాన్స్ కో సీఎండీ పర్యవేక్షించారు. 24గంటలు కరెంటు ఇవ్వడంపై పడే భారాన్ని చర్చిస్తున్నారు. రూ. 12,600 కోట్ల భారం పడుతుందని అధికారులు అంచనా వేశారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

మిథాలిరాజ్ కు రూ. కోటి చెక్ అందించిన పద్మారావుగౌడ్

హైదరాబాద్ : భారత్ మహిళ క్రికెట్ కెప్టెన్ మిథాలిరాజ్ కు రూ. కోటిరూపాయల చెక్ తోపాటు, ఇంటి స్థలం పేపర్లను యువజన క్రీడశాఖ మంత్రి పద్మారావుగౌడ్ అందించారు. 

24గంటలూ విద్యుత్..

హైదరాబాద్ : డిసెంబర్ 31న అర్ధరాత్రి నుండి 24గంటలూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు విద్యుత్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యుత్ సౌధ వద్ద ట్రాన్స్ కో సీఎండీ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. 

టిడిపిపై సోము వీర్రాజు వ్యాఖ్యలు...

విజయవాడ : బీజేపీ బలపడాలనుకోవడాన్ని టిడిపి జీర్ణించుకోవడం లేదని, విడిపోయిన తరువాత ఉత్తరాంధ్ర జిల్లాల పరిస్థితి ఎలా ఉందని సోము వీర్రాజు ప్రశ్నించారు. రాష్ట్రం విడిపోయిన తరువాత రాయలసీమ పరిస్థితి ఏంటని ? అమరావతి లాగే ప్రతి జిల్లాను అభివృద్ధి చేయాలని సూచించారు. హైదరాబాద్ అభివృద్ధి చేసి ఇప్పటికే ఇబ్బంది పడుతున్నామన్నారు. 2014లో 14 సీట్లు ఇచ్చి నాలుగు చోట్లే నెగ్గనిచ్చారని, కాకినాడలోనూ 9 సీట్లిచ్చి ఇండిపెండెంట్లను ప్రోత్సాహించారని తెలిపారు. 

బాబును కలవడానికి వచ్చిన బైరెడ్డి...

విజయవాడ : సీఎం చంద్రబాబును కలిసేందుకు రాయలసీమ నేత బైరెడ్డి అమరావతికి చేరుకున్నారు. డిప్యూటి సీఎం కేఈ ఛాంబర్ లోకి బైరెడ్డి వెళ్లారు. పార్టీ మారిన తరువాత తొలిసారి బాబును ఆయన కలువనున్నారు. 

44 మందిపై వేటు..

చెన్నై : టిటివి దినకరన్ కు మద్దతుగా నిలిచిన 44 మందిపై వేటు పడింది. వారి ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు తమిళనాడు సీఎఈం పళని స్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం గురువారం ప్రకటించారు. 

16:21 - December 28, 2017
16:16 - December 28, 2017

విజయవాడ : చిన రాజప్ప...ఈయన ఏపీ రాష్ట్ర హోం మంత్రి...ఆ శాఖ పరిధిలో జరిగే ఏ కార్యక్రమమైనా ఉన్నతాధికారులు, అధికారులు పిలవాల్సి ఉంటుంది. అందులో ముఖ్యమంత్రి పాల్గొంటున్నారంటే ముందుగానే ఆ మంత్రికి సమాచారం అందించాల్సి ఉంటుంది. కానీ అధికారులు అలా చేయలేదు. దీనితో హో మంత్రి చిన రాజప్పకు అవమానం ఎదురైంది. గురువారం ఉదయం పోలీసు శాఖ ఫోరెన్సిక్ ల్యాబ్ కు సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. కానీ ఈ కార్యక్రమానికి హోం మంత్రి పిలవలేదు. కేవలం మంత్రి కార్యాలయానికి ఆహ్వాన పత్రాలు పంపి చేతులు దులుపుకున్నారు. అధికారుల తీరుపై హోం మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమానికి రాకపోవడంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. విషయం తెలుసుకున్న బాబు పోలీసు ఉన్నతాధికారులను మందలించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

ఏపీ హోంమంత్రికి అవమానం

గుంటూరు : ఏపీ హోంమంత్రి చినరాజప్పకు అవమానం జరిగింది. ఇవాళ ఉదయం పోలీస్ శాఖ ఫోరెన్సిక్ ల్యాబ్ కు శంకుస్థాపనకు ఆయనను పోలీస్ శాఖ పిలవలేదు.  కేవలం మంత్రి కార్యాలయానికి ఇన్విటేషన్ ఇచ్చి అధికారులు చేతులు దులుపుకున్నారు. హోం మంత్రి చినరాజప్ప అధికారుల తీరుపై అలక వహించారు. 

15:56 - December 28, 2017

ఎప్పుడు విభిన్న పాత్రలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే రానా ఇప్పుడు మరో భిన్నమైన రోల్ తో అభిమానుల ముందుకు వస్తున్నాడు. ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం ''రాజరథం''ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. అందులో రానా అననగా ఒక ఊరిలో..ఒక కాలేజీ రానా బ్యాగ్ రౌండ్ వాయిస్ తో ట్రైలర్ మొదలౌతుంది. అందులో డౌలగ్ లను ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. గాలై వస్తాను...మెరుపై పోతాను...నాది రాజవంశం.... నా వేగానికి ఏదైనా ధ్వసం... నేను నడిచే దారి రాజపథం....నా పేరు రాజరథం..అనే మాటలతో ట్రైలర్ ఎండ్ అవుతుంది.

లాంచెస్టర్ రోడ్డు గోడౌన్ లో విజిలెన్నస్ అధికారుల తనిఖీలు

గుంటూరు : జిల్లా లాంచెస్టర్ రోడ్డులోని ఓ గోడౌన్ లో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రూ.2 కోట్ల విలువైన కాలపరిమిత పూర్తై ప్రభుత్వ అనుమతులులేని పురుగు మందులను అధికారలుఉ గుర్తించారు. 

15:37 - December 28, 2017

ఐపీఎల్ ముంబై ఇండియన్స్ తరుపున ఆడే కృనాల్ పాండ్యా పెళ్లి మెహెందీ ఫంక్షన్ సందర్భంగా అతని సోదరుడు టీం ఇండియ అల్ రౌండర్ హార్దిక్ పాండ్యా రెచ్చిపోయి డ్యాన్స్ చేశాడు. ఓ వైపు ముంబైలో విరాట్ కోహ్లీ రిసెప్షన్ జరుగుతుండగా మరో వైపు కృనాల్ పాండ్యా మెహెందీ ఫంక్షన్ జరిగింది. ఈ నెల 27న కృనాల్ పాండ్యా తన గర్లఫ్రెండ్ పంకురి శర్మను పెళ్లి చేసుకున్నాడు. మెహెందీ వేడుకగా ఇద్దరు అన్నదమ్ములు, కృనాల్, హార్ధిక్ పాండ్యాలు కలిసి డ్యాన్స్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలుగా మారాయి. 

15:34 - December 28, 2017
15:33 - December 28, 2017

చిత్తూరు : వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల కోసం తిరుమల దివ్యంగా ముస్తాబైంది. ఈ నెల 29న వైకుంఠ ఏకాదశి, 30న ద్వాదశి రావడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. రేపటి దర్శనం కోసం ఇప్పటి నుండే క్యూ లైన్ లో వేచి ఉన్నారు. నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన 15 తాత్కాలిక కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. రెండు క్యూ కాంప్లెక్స్‌ల్లోని 56 కంపార్ట్‌మెంట్లు నిండితే వెలుపల భక్తులు వేచి ఉండటానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.ఈ రెండు రోజుల్లో 1.70 వేల నుండి 2లక్షల భక్తులు వస్తారని టిటిడి అంచనా వేస్తోంది.

15:26 - December 28, 2017

ప్రజలకు రవాణా సౌకర్యాలు కల్సించాడనికి హైదరాబాద్ లో మోన్ రైలు తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మోనో రైలు మొదటి దశ కింద మియాపూర్ శిల్పారామం గచ్చిబౌలి మీదుగా 15 కిలోమీటర్ల దూరం చేపట్టనుంది. ఈ ప్రాజెక్టు కు నోడల్ ఏజెన్సీ గా టీఎస్ఐఐసీ ను నియమించింది. మోనో రైలు ప్రాజెక్టు కోసం సలహా సంస్థను నియమించి, దాని ద్వారా అధ్యయనం చేయించి సంభావ్యత నివేదికను తయారీకి టీఎస్‌ఐఐసీ సన్నాహాలు ప్రారంభించింది.

15:24 - December 28, 2017

ట్రిపుల్ తలాక్ సవరణలు చేయాలి : అసుదుద్దీన్

ఢిల్లీ : ట్రిపుల్ తలాక్ బిల్లుకు సవరణలు ప్రతిపాదించానని, సవరణలకు అనుకూలంగా కేంద్రం చట్టం చేయాలని ఎంఐఎ ఎంపీ అసుదుద్దీన్ అన్నారు. రూ.30వేల కోట్ల కుంభకోణంలో న్యాయం చేయలేదని కేంద్రం ముస్లిం మహిళకు ఏ విధంగా న్యాయం చేస్తుందని ఆయన ప్రశ్నించారు. 

15:05 - December 28, 2017

నేటి యువతులు ట్రెండ్ ను ఫాలో అవడంలో ముందంజలో ఉంటున్నారు. అవి వేసుకునే డ్రెస్ లో కావచ్చు..ఇయర్ రింగ్స్ లో కావచ్చు...వేసుకొనే డ్రస్ కు మ్యాచ్ అయ్యే ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు. అవి కూడా తక్కువ బరువుతో ట్రెండ్ కు తగ్గట్టూ ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. మరి అలాంటి ఇయర్ రింగ్స్ ఎలా తయారు చేయాలి ? విషయాలకు వీడియో క్లిక్ చేయండి. 

ప్రకాశం జిల్లా ప్రజాప్రతినిధులతో లోకేష్ భేటీ

గుంటూరు : ప్రకాశం జిల్లా ప్రజాప్రతినిధులు, గ్రామీణ నీటి సరఫరా అధికారులతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. జిల్లాలో తాగునీటి సమస్యపై చర్చించారు. నియోజవర్గాల వారీగా గ్రామాల్లో ఉన్న తాగునీటి సమస్యలపై లోకేష్ అడిగి తెలుసుకున్నారు.

సీఐ సుబ్బారావు సస్పెన్షన్

నెల్లూరు : జిల్లా బుచ్చిరెడ్డిపాలెం సీఐ పి. సుబ్బరావుపై సస్పెన్షన్ వేటు పడింది. సీఐ సస్పెండ్ చేస్తూ గుంటూరు రేంజ్ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. 

14:57 - December 28, 2017

'సాంకేతిక రంగం'....సరికొత్త ఉత్పత్తులకు వినూత్న ఆవిష్కరణలకు వేడుక. ఈ సాంకేతిక రంగం ప్రపంచాన్ని శాసిస్తోంది. కొత్త కొత్త ఆవిష్కరణలతో..ఆధునిక ప్రపంచ పోకడలను తనలో అనుసంధానం చేసుకుని మానవ అవసరాలకు చిరునామాగా మారింది. అంతటి శక్తివంతమైన సాంకేతిక రంగంలో మహిళలు అత్యున్నతస్థాయిలో రాణిస్తున్నారు. సోషల్ మీడియాలో మహిళల పాత్ర అంశంపై టెన్ టివి మానవిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. కార్యక్రమ పూర్తి విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి. 

14:49 - December 28, 2017

ముంబై : విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ రిసెప్షన్ లో బాలీవుడ్ తారలు, క్రీడకారులు తలుక్కుమన్నారు. బాలీవుడ్ బాద్ షా నూతన జంటతో స్టెప్పులేశారు. సచిన టెండూల్కర్, కుంబ్లే, ధోని వారి ఫ్యామిలీతో విందు హాజరైయ్యారు. ఈ విందులో యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ పంజాబీ డ్యాన్స్ చేసి అందరిని అలరించారు. వారు డ్యాన్స్ చేయడమే కాకుండా విరాట్ తో కూడా స్టెప్పులెంచారు. 

14:44 - December 28, 2017

కావాల్సిన పదార్థాలు...
బియ్యపు పిండి రెండు కప్పులు, పచ్చి మిర్చి పది, ఉల్లిగడ్డ, వెల్లుల్లి, పల్లిలు, నువ్వులు, నూనె, ఉప్పు తగినంత, జీలకర్ర, ఉల్లాకు, నీరు.......

తయారీ విధానం...
ముందుగా ఉల్లిగడ్డ, జీలకర్ర, వెల్లుల్లి, మెత్తగా మిక్సి పట్టుకోవాలి, పచ్చి మిర్చిని కూడా మిక్సి పట్టుకోవాలి. రెండు కప్పుల బియ్యపు పిండి తీసుకుని అందులో ఉల్లిగడ్డ జీలకర్ర ముద్దను వేయాలి, అనంతరం మిక్సి చేసుకున్న మిర్చి ముద్దను కూడా బియ్యపు పండితో కలపాలి. పిండిలో నీరు పోసి ముద్ద చేసుకోవాలి. తర్వాత సర్వపిండి బౌల్ తీసుకుని అందులో నూనె పోయాలి. తర్వాత మెత్తగా ఉన్న పిండి ముద్దను బౌల్ లో వేసి చిన్న పొరలగా బౌల్ అంచులకు వత్తాలి. తర్వాత స్టావ్ అన్ చేసి బౌల్ స్టావ్ పెట్టాలి. 10 నిమిషాల తర్వాత నొరురించే సర్వపిండి రెడీ అవుతుంది.

14:32 - December 28, 2017

ఖమ్మం : వైకుంఠ అధ్యయనోత్సవాలలో భాగంగా ఇవాళ భద్రాద్రి రామయ్యకు తెప్పోత్సవం నిర్వహించనున్నారు. ఈ వేడుకలను తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది. దీంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. భద్రాద్రిలో తెప్పోత్సవం వేడుకలపై మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

14:32 - December 28, 2017

విజయవాడ : ఏపీని నేర రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసు అధికారులను ఆదేశించారు. పోలీసులు, ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తేనే నేరాలు పెరుగుతాయన్నారు. రౌడీలు, ఫ్యాక్షనిస్టులు, దొంగలు పెరిగిపోతారని, ఏపీ ఇందుకు అతీతంగా ఉండాలని పోలీసులను ఆదేశించారు. అమరావతిలో మూడు ఎకరాల్లో నిర్మిస్తున్న ఏపీ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌కు శంకుస్థాపన చేశారు. ప్రపంచంలోనే దీనిని అత్యాధునిక FSLగా తీర్చిదిద్దాలని కోరారు. నేరాల నియంత్రణకు అంతర్జాతీయంగా ఏ టెక్నాలజీ అందుబాటులో ఉన్నా అమరావతి FSLకు తీసుకురావాలని సంస్థ డైరెక్టర్‌ గాంధీని ఆదేశించారు. 

హైకోర్టు ముందు అడ్వకేట్ల ఆందోళన

హైదరాబాద్ : హైకోర్టును విభజించాలంటూ తెలంగాణ అడ్వకేట్లు ఆందోళనకు దిగారు. వారు హైకోర్టు ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. 

14:28 - December 28, 2017

ఢిల్లీ : కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టారు. మహిళలకు న్యాయం చేసే విషయమై పార్లమెంట్‌ నిర్ణయిస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ట్రిపుల్‌ తలాక్‌ చెప్పడం ఓ నేరమని సుప్రీంకోర్టు కూడా నిర్ధారించిందని మంత్రి తెలిపారు. ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు ముస్లిం మహిళలకు న్యాయం చేకూరుస్తుందని రవిశంకర ప్రసాద్‌ అన్నారు. ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును ఎంఐఎం, ముస్లిం లీగ్‌, బిజెడిలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ బిల్లు మహిళల ప్రాథమిక హక్కులకు భంగకరమని ఎంపీ అసుదుద్దీన్‌ ఓవైసీ చెబుతున్నారు.

14:01 - December 28, 2017

'2 కంట్రీస్' సినిమా హీరో సునీల్ తో 10 టివి చిట్ చాట్ నిర్వహిచింది. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ సినిమా విశేషాలు తెలిపారు. సినిమా అనుభవాలను వివరించారు. కామెడీ చేయడం చాలా కష్టమన్నారు. సినిమాకు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలు మాట్లాడారు. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం.. 

13:48 - December 28, 2017
13:46 - December 28, 2017
13:45 - December 28, 2017

హిందు సంప్రదాయం ప్రకారం రోజు తులసి చెట్టుకు పూజ చేస్తాం. కానీ తులసి వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చాలా మందికి తెలియదు. తులసిలో అనేక రకాల ఔషధ గుణాలున్నాయి. రోజుకు ఒక తులసి ఆకు తినడం వల్ల రక్తం శుభ్రపడుతుంది. దాంతో చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. తులసిలో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ మచ్చలను తొలగిస్తుంది. ఎండిన తులసి ఆకు పొడితో పళ్లు తొముకుంటే నోటి దుర్వాసన పోవడమే కాకుండా చిగుళ్ల సమస్యలు తగ్గుతాయి.జలుబూ, దగ్గుతో బాధపడుతున్నప్పుడు వాటికి సంబంధించిన మాత్రలే వేసుకోవాలని లేదు. అలాంటి సమస్యలు ఉన్నప్పుడు పరగడుపున కొన్ని పచ్చి తులసి ఆకులను బుగ్గన పెట్టుకుని రసం మింగడం వల్ల పరిష్కారం దొరుకుతుంది.

13:45 - December 28, 2017

గుంటూరు : జిల్లాలోని క్రోనూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి బెల్లంకొండ దళ సభ్యులు బెదిరింపు లేఖ రాశారు. క్రోనూరు సబ్‌ రిజిస్ట్రార్‌ పి. శ్రీనివాసరావు, సుధీర్‌లు రిజిస్ట్రేషన్‌కు వచ్చిన వారి వద్దనుండి లంచాలు వసూలు చేస్తూ, ప్రజలను ఇబ్బందిపెడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. ఇకనైనా వారు పద్దతి మార్చుకోక పోతే వారి పిల్లలను కిడ్నాప్‌ చేస్తామంటూ హెచ్చరించారు. బెల్లంకొండ దళ సభ్యుడి పేరిట రాసిన లేఖను రిజిస్ట్రార్‌ కార్యాలయంలో గుర్తుతెలియని వ్యక్తులు పడవేశారు. ఈ విషయమై క్రోనూరు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

 

విభజన జరిగేవరకు ప్రమోషన్లు ఆపాలి : టీఆర్ఎస్

ఢిల్లీ : హైకోర్టు విభజన జరిగే వరకు కోర్టుల్లో ఉద్యోగుల ప్రమోషన్లు నిలిపివేయాలని టీఆర్ఎస్ ఎంపీలు లోక్ సభలో డిమాండ్ చేశారు. 

హైకోర్టు విభజనపై రవిశంకర్ ప్రకటన

ఢిల్లీ : హైకోర్టు విభజనపై లోక్ సభలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రకటన చేశారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాల్సి అవసరం ఉందని అన్నారు. ఏపీలో హకోర్టు భవనం వెతుకుతున్నామని కొత్త భవనం దొరకగానే హైకోర్టు ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.

13:33 - December 28, 2017

హైదరాబాద్ : క్రైమ్‌ రిపోర్ట్‌ 2017ను పోలీస్‌ ఉన్నతాధికారులు విడుదల చేశారు. హత్య కేసులు 26 శాతం, స్నాచింగ్‌ కేసులు 47 శాతం తగ్గాయన్నారు. గతేడాది 97 స్నాచింగ్‌ కేసులు నమోదు కాగా...ఇప్పుడు 51 కేసులు నమోదైనట్లు తెలిపారు. గతేడాది 185 కిడ్నాప్‌ కేసులు నమోదైనట్లు చెప్పారు. 10,075 కేసులు లోక్‌ అధాలత్‌లో పరిష్కరించబడ్డాయన్నారు. గతేడాది 3,378 కేసులు పరిష్కరించబడ్డాయని వెల్లడించారు. 94 డ్రగ్‌ కేసులు నమోదు అయ్యాయని తెలిపారు.  

మంత్రి ధర్మేంధ్రను కలిసిన ఎంపీ జితేందర్ రెడ్డి

ఢిల్లీ : టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి, రాష్ట్ర పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కేంద్రం పెట్రోలియం శాఖ మంత్రి దర్మేంధ్ర ప్రధాన్ ను కలిశారు. కేంద్రం తాజాగా తీసుకువచ్చిన నిబంధనలతో పెట్రోలియం డీలర్లు పడుతున్న ఇబ్బందుల గురించి మంత్రికి ప్రతినిధులు వివరించారు.

13:26 - December 28, 2017

ఢిల్లీ : ఉమ్మడి హైకోర్టు విభజనపై లోక్ సభలో చర్చ జరిగింది. హైకోర్డు విభజనకు టీఆర్ ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. ఈమేరకు సభలో అందోళన చేపట్టారు.ఉమ్మడి హైకోర్టులో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని టీఆర్ ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి వాపోయారు. అందుకే ఉమ్మడి హైకోర్టు విభజన చేయాలని కోరారు. 

 

13:22 - December 28, 2017

'అజ్ఞాతవాసి' పవన్ సాంగ్ టీజర్ రిలీజ్ అయింది. కొడకా...కోటేశ్వరరావు అంటూ పవన్ కళ్యాణ్ పాట పాడారు. పవన్ అభిమానులు సంబర పడిపోతున్నారు. డిసెంబర్ 31 సాయంత్రం 6 గంటలకు పూర్తి పాటను రిలీజ్ చేయనున్నారు. పాట కోసం పవన్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 

 

సైన్స్ కాంగ్రెస్ తరలిపోవడం తెలంగాణకు అవమానం

హైదరాబాద్ : ఓయూలో నిర్వహించ తలపెట్టిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ మణిపూర్ తరలి వెళ్లాడం తెలంగాణకు అవమానమని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ అన్నారు. ఓయూలో నిరసనలకు భయపడి కేసీఆర్ సైన్స్ కాంగ్రెస్ నో చెప్పారని, ఓయూ పట్ల కేసీఆర్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన ఆయన విమర్శించారు. సదస్సు నిర్వహించకపోవడంతో ఓయూ రూ.1000 కోట్లు నష్టమని షబ్బీర్ అన్నారు. సదస్సు తరలిపోవడం ఎడ్యుకేషన్ బ్లాక్ డే అని ఆయన తెలిపారు.

తిరుమలలో భారీగా భక్తుల రద్దీ...

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భుక్తుల రద్దీ పెరిగినట్టు ఆలయ అధికారలు తెలిపారు. అన్ని కంపార్ట్ మెంట్లు, నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన 20 భారీ షెడ్లలో భక్తులు వేచి ఉన్నారు. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను జేఈవో, వీవీఎస్ వో, అర్బన్ ఎస్పీ అభిషేక్ మహంతి, టీటీడీ ముఖ్య భద్రతాధికారి రవికృష్ణ పర్యవేక్షిస్తున్నారు.

13:13 - December 28, 2017

కృష్ణా : విజయవాడలో ప్రభుత్వ ఐటిఐ ట్రైనింగ్ ఆఫీసర్ కోనేరు శ్రీనివాస్ కుమార్ ఇంటిపై ఏసీబీ రైడ్స్‌ నిర్వహించింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగివున్నారన్న ఆరోపణలతో దాడులు చేపట్టింది. ఏక కాలంలో ఆరు ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది. 

 

హైకోర్డు విభజనకు టీఆర్ ఎస్ ఎంపీలు డిమాండ్

ఢిల్లీ : ఉమ్మడి హైకోర్టు విభజనపై లోక్ సభలో చర్చ జరిగింది. హైకోర్డు విభజనకు టీఆర్ ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. ఉమ్మడి హైకోర్టులో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు.
 

13:09 - December 28, 2017

జనగాం : జిల్లాలో 10టివి న్యూ ఇయర్ 2018 క్యాలెండర్ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. క్యాలెండర్ ను జిల్లా కలెక్టర్ శ్రీదేవిసేన ఆవిష్కరించారు. 10 టివి క్యాలెండర్ ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. 10టివి యాజమాన్యానికి, సిబ్బందికి, జనగామ జిల్లా ప్రజలకు శ్రీదేవిసేన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.  

13:05 - December 28, 2017

ఢిల్లీ : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పాలన సాగిస్తోందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ విమర్శించారు. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న రాహుల్‌... ప్రధాని మోదీ విధానాలపై విరుచుకుపడ్డారు. మోదీ ప్రభుత్వం అన్నీ అవాస్తవాలను ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ వంటి మహనీయులను కూడా బీజేపీ నేతలు అవమానిస్తున్నారని  విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నా... లేకపోయినా నీతి, నిజాయితీలు, రాజ్యాంగ స్ఫూర్తికి కట్టుబడి నిజాన్ని నిర్భయంగా చెబుతుందని, భవిష్యత్‌లో కూడా ఇదే ఒరవడిని కొనసాగిస్తుందని రాహుల్‌ స్పష్టం చేశారు. 

12:52 - December 28, 2017

ఢిల్లీ : పాకిస్థాన్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌ కుటుంబ సభ్యులు పట్ల పాక్‌ ప్రభుత్వం వ్యవహరించిన తీరును రాజ్యసభ ఖండించింది. కుల్‌భూషణ్‌ తల్లి, భార్య రెండు రోజుల క్రితం ఇస్లామాబాద్‌ జైల్లో కుల్‌భూషణ్‌కు కలిశారు. కుల్‌భూషణ్‌ కుటుంబ సభ్యుల బొట్టు, తాళి తీయించి, అవమానకరంగా పాక్‌ వ్యవహరించడంపై విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ రాజ్యసభలో ప్రకటన చేశారు. పాక్‌ వ్యవహారం మానవహక్కుల ఉల్లంఘిన కిందకు వస్తుందని వివిధ పక్షాల సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.

 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలవి నియంత పాలన : ఉత్తమ్

హైదరాబాద్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియంత పాలన సాగిస్తున్నాయని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ విమర్శించారు. దళిత, బడుగు, బలహీన వర్గాలపై దాడులు మితిమీరిపోతున్నాయన్నారు. 

పాక్ 120 కోట్ల భారతీయులను అవమానించింది : ఆజాద్

ఢిల్లీ : జాదవ్ కుటుంబ సభ్యుల పట్ల పాక్ తీరుపై భారత్ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ పార్లమెంట్ లో ప్రకటన చేశారు. అనంతరం కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంపై పాకిస్తాన్ కు నమ్మకం లేదన్నారు. పాక్ అవమానించింది ఒక్క జాద్ కుటుంబాన్నే కాదు.. 120 కోట్ల భారతీయులను అవమానించిందని పేర్కొన్నారు. 

12:41 - December 28, 2017

ఢిల్లీ : జాదవ్ కుటుంబ సభ్యుల పట్ల పాక్ తీరుపై భారత్ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ పార్లమెంట్ లో ప్రకటన చేశారు. అనంతరం కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంపై పాకిస్తాన్ కు నమ్మకం లేదన్నారు. పాక్ అవమానించింది ఒక్క జాద్ కుటుంబాన్నే కాదు.. 120 కోట్ల భారతీయులను అవమానించిందని పేర్కొన్నారు. 

పాకిస్తాన్ మావనహక్కులను ఉల్లఘించిందన్న సుష్మాస్వరాజ్

ఢిల్లీ : జాదవ్ కుటుంబ సభ్యుల్ని పాకిస్తాన్ ప్రభుత్వం ఘోరంగా అవమానించిందని భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ అన్నారు. రాజ్యసభలో ఆమె మాట్లాడారు. జాదవ్ కుటుంబ సభ్యుల పట్ల పాక్ తీరుపై పార్లమెంట్ లో ప్రకటన చేశారు. జాదవ్ ముందే భార్య, తల్లిని తాళితో సహా బొట్టు తొలగించారని పేర్కొన్నారు. చెప్పుల్లో చిప్పులు ఉన్నాయని తప్పుడు ఆరోపణలు చేశారని తెలిపారు. పాకిస్తాన్ మావనహక్కులను ఉల్లఘించిందన్నారు. కుల్ భూషణ్ ను విడిపించేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.

 

12:36 - December 28, 2017

ఢిల్లీ : జాదవ్ కుటుంబ సభ్యుల్ని పాకిస్తాన్ ప్రభుత్వం ఘోరంగా అవమానించిందని భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ అన్నారు. రాజ్యసభలో ఆమె మాట్లాడారు. జాదవ్ కుటుంబ సభ్యుల పట్ల పాక్ తీరుపై పార్లమెంట్ లో ప్రకటన చేశారు. జాదవ్ ముందే భార్య, తల్లిని తాళితో సహా బొట్టు తొలగించారని పేర్కొన్నారు. చెప్పుల్లో చిప్పులు ఉన్నాయని తప్పుడు ఆరోపణలు చేశారని తెలిపారు. పాకిస్తాన్ మావనహక్కులను ఉల్లఘించిందన్నారు. కుల్ భూషణ్ ను విడిపించేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.

 

12:24 - December 28, 2017

విజయనగరం : జిల్లాను వందశాతం బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ఆ జిల్లా యంత్రాంగం అవిరాళంగా కృషి చేస్తోంది. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ఈ కార్యక్రమాన్ని ఓ ఉద్యమంలా తీసుకొని పట్టుదలతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తున్నారు. ఫిబ్రవరి 15 నాటికి జిల్లాలో శతశాతం ఓడిఎఫ్ లక్ష్యాన్ని పూర్తి చేస్తామంటున్న కలెక్టర్ వివేక్ యాదవ్‌తో 10టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

12:19 - December 28, 2017

హైదరాబాద్ : జంపన్న లొంగుబాటు అంశంపై మావోయిస్ట్‌ సెంట్రల్‌ కమిటీ ప్రకటన విడుదల చేసింది. జంపన్న ఉద్యమ ద్రోహం చేశారంటూ లేఖలో ఆరోపించింది. జంపన్న పార్టీలో ఉంటూ సమాచారం లీక్‌ చేశారని..సిద్ధాంతం పేరుతో మావోయిస్టు పార్టీని నాశనం చేసే ప్రయత్నం చేశారని మండిపడింది. జంపన్నను ఏడాది క్రితమే మావోయిస్టు పార్టీ నుంచి సస్పెండ్‌ చేశామని... సస్పెండ్‌ తర్వాతే మావోయిస్టు పార్టీ వేధిస్తున్నట్లు ఆరోపించారని పేర్కొంది. లొంగుబాటు అంశంపై జంపన్న మాతో చర్చించలేదని మావోయిస్టు సెంట్రల్‌ కమిటీ తెలిపింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

12:16 - December 28, 2017

గుంటూరు : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఫిరంగిపురం దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో.. నలుగురు విద్యార్థులతోపాటు ఆటో డ్రైవర్‌ మృతి చెందాడు. మరో నలుగురికి గాయాలు అయ్యాయి. స్కూల్‌ ఆటోను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో ఈ ఘోరం జరిగింది. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జు అయ్యింది. మరణ వార్త విన్న...  విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ దుర్ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

12:12 - December 28, 2017

కరీంనగర్‌ : జిల్లాలోని చొప్పదండి మండలం వెదురు గట్టు గ్రామంలో విషాదం జరిగింది. కట్టెల పొయ్యిలో కిరోసిన్‌ పోయడంతో పొయ్యి వద్ద ఆడుకుంటున్న ఇద్దరు పిల్లలకు మంటలు అంటుకున్నాయి. దీంతో పిల్లలను ఆస్పత్రికి తరలిస్తుండగా ఒకరు మృతి చెందారు. మరో బాలుడు వంశీ ఆస్ప్రత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

12:02 - December 28, 2017

గుంటూరు : ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా ఏపీలోని ప్రతి ఇల్లు ఓ వైఫై కేంద్రంగా మారబోతోంది. ఇంటింటికీ ఇంటర్నెట్ సేవలు అందించాలనే లక్ష్యంతో ఏపీ సర్కార్‌ కేవలం 149 రూపాయలకే టీవీ, ఇంటర్నెట్, ఫోన్ సేవలు అందిస్తోంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఫైబర్‌ నెట్ కనెక్షన్లు అందుబాటులోకి తెచ్చింది. అసలు ఫైబర్ నెట్ కనెక్షన్‌ ద్వారా ఎలాంటి సేవలు పొందవచ్చు.. వాచ్ ది స్టోరి. 
ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు ప్రారంభించిన రాష్ట్రపతి
స్మార్ట్ టీవీతో పనిలేదు.. ఇంట్లో టీవీ ఉంటే చాలు. అదే కంప్యూటర్‌లా పనిచేస్తుంది. నచ్చిన ఛానల్‌.. నచ్చిన వీడియో టీవీలోనే చూసేయొచ్చు..కావాలంటే డౌన్ లోడ్ కూడా చేసుకోవచ్చు..ఇప్పుడు ఫైబర్‌ నెట్‌తో ఆంధ్రప్రదేశ్‌లో ఇవన్నీ సాధ్యం కాబోతున్నాయి. ఇంటింటికీ ఇంటర్నెట్ సేవలు అందించాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫైబర్‌గ్రిడ్ ప్రాజెక్టును రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అమరావతిలో ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే ఏప్రియల్ నాటికి 25 లక్షల మందికి ఫైబర్ నెట్ సౌకర్యం కల్పించబోతున్నారు. ఫైబర్ నెట్ ద్వారా ఎలాంటి మోడెం అవసరం లేకుండా సెట్‌ టాప్ బాక్సు ద్వారా వైఫై సౌకర్యం పొందవచ్చు. వైఫై అందుబాటులోకి రావడం ద్వారా ప్రతి ఇంట్లో ఇంటర్నెట్ వాడకం పెరుగుతుంది. టీవీ స్క్రీన్‌పైనే ప్రజలు తమకు కావాల్సిన సేవల్ని పొందే అవకాశం ఉంటుంది. 
ఫైబర్ నెట్ కనెక్షన్‌లో సెట్‌ టాప్ బాక్సులే కీలకం 
ఫైబర్ నెట్ కనెక్షన్‌లో రెండు సెట్‌ టాప్ బాక్సులే కీలకం. వీటి వల్ల టీవీ కంప్యూటర్‌లా పనిచేస్తుంది. వైర్‌లెస్ కీబోర్డు, మౌస్‌ను ఉపయోగించి ఇంటర్నెట్‌ను వాడుకోవచ్చు. కంప్యూటర్‌లో చేసే అన్ని పనులను టీవీ స్క్రీన్‌పై చేసుకోవచ్చు. ఎంఎస్ ఆఫీస్‌లో మనకు అవసరమైన పనులు చేసుకోవడంతో పాటు పీడీఎఫ్ ఫైల్స్‌ను సైతం చూడొచ్చు. ఇక సెట్‌టాప్‌ బాక్సుల్లోనే వైఫై రూటర్‌ కూడా ఉంటుంది. దీని ద్వారా ఇంట్లోని మొబైల్, ట్యాబ్, ల్యాప్ టాప్‌లలోనూ ఇంటర్నెట్‌ను చూసుకోవచ్చు. వీడియో కాలింగ్‌ కోసం కెమెరాను, ల్యాండ్‌లైన్‌ను కూడా ఈ బాక్సులోనే అనుసంధానం చేస్తారు. దీంతో పాటు అలారం సెట్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. టీవీలో నచ్చిన ప్రోగ్రాంను మెమరీకార్డు, పెన్‌ డ్రైవ్‌లలో కాపీ చేసుకోవచ్చు. ఇంట్లో సీసీ కెమెరాలు ఉంటే వాటికి కూడా టీవీని అనుసంధానం చేసుకునే వీలుంటుంది. 
సెట్‌ టాప్స్ బాక్సుల ఖరీదు రూ.4000
ప్రతి కనెక్షన్‌కు అవసరమైన సెట్‌ టాప్‌  బాక్సుల ఖరీదు రూ.4 వేల రూపాయలు.. వీటిని ప్రభుత్వం ప్రతి నెల రూ.99 చొప్పున నాలుగేళ్ల పాటు వాయిదా పద్ధతిపై చెల్లించే ఏర్పాటు చేసింది. దీంతో కనెక్షన్‌కు నెలకు రూ.149తో పాటు సెట్‌ టాప్ బాక్సు వాయిదా రూ.99 కడితే సరిపోతుంది. ఇప్పటికే ఏపీలోని కృష్ణా జిల్లాలో 14వేల 698 ఇళ్లకు..  గుంటూరు జిల్లాలో 5 వేల 692 ఇళ్లకు  ఫైబర్ నెట్ కనెక్షన్లు ఇచ్చారు. బాక్సులు అందుబాటులో ఉన్నమేర వ్యాపార, విద్యా సంస్థలకు కూడా కనెక్షన్లు ఇస్తున్నారు. 

 

11:54 - December 28, 2017

కడప : హెల్మెట్‌ పెట్టుకోలేదన్న కారణంతో ఓ వ్యక్తిని కడప జిల్లా చాపాడు ఎస్సై శివశంకర్‌ చితకబాదారు. మైదుకూరుకు చెందిన మాచనూరు సుధీర్‌ బైక్‌పై ప్రొద్దుటూరు వెళ్తుండగా.. వాహన తనిఖీలు నిర్వహిస్తున్న చాపాడు పోలీసులు ఆపారు. హెల్మెట్‌ ఎందుకు పెట్టుకోలేదని ప్రశ్నించగా.. ఇంట్లో మరిచిపోయానని చలానా వేయమన్నందుకు ఎస్సై శివశంకర్‌ శివాలెత్తిపోయారు. తీవ్రంగా గాయపడ్డ బాధితుడిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

11:52 - December 28, 2017

ఢిల్లీ : ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మరోసారి తనదైన స్టైల్‌లో స్పందించారు. మిత్రపక్షమైన బీజేపీ నుంచి తమకు సరైన న్యాయం జరగడం లేదన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా చంద్రబాబు ముందుకు సాగుతున్నారన్నారు. ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చడం లేదో బీజేపీ ఆలోచించుకోవాలన్నారు. దేశంలో ఉన్న పరిస్థితుల నేపథ్యంల బీజేపీతో పొత్తు కొనసాగుతుందన్నారు. 

11:48 - December 28, 2017

హైదరాబాద్ : షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ యోగి-నటి హారిక కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. తప్పు నువ్వు చేశావంటే..నువ్వు చేశావని పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. హారిక చేసిన వాట్సాప్ మెసేజ్‌లను డైరెక్టర్‌ యోగి లీక్ చేశాడు. తనపై యోగి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ సెల్ఫీ వీడియోతో హారిక కౌంటర్‌ ఇచ్చింది. 
యోగి, నటి హారిక మధ్య ముదురుతోన్న వివాదం  
షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ యోగి, నటి హారిక మధ్య వివాదం ముదురుతోంది. పరస్పరం ఆరోపణలు, విమర్శలతో చినికి చినికి గాలివానలా మారుతోంది. ఏ తప్పు చేయలేదంటూ ఇద్దరు ఇస్తున్న లీకులు షార్ట్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.  
హారిక ఆరోపణలపై యోగి ఎదురుదాడి 
తనను లైంగిక వేధింపులకు గురిచేశారన్న హారిక ఆరోపణలపై షార్ట్‌ఫిల్మ్‌డైరెక్టర్‌ ఎదురుదాడికి దిగాడు. గతంలో హారిక తనకు పెట్టిన వాట్సాప్‌ మెసేజ్‌లు బయటపెట్టి ఆమె అమాయకురాలేం కాదని ఆరోపిస్తున్నాడు. అవకాశాల కోసం కాంప్రమైజ్ అవుతానని హారిక తనతో చెప్పిందన్నాడు. తన వ్యక్తిగత జీవితం ఆనందంగా లేదని, ఎవరితోనైనా డేటింగ్‌ చేయాలని, విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేయాలని ఉందని చాట్‌ చేసినట్లు వెల్లడించాడు. సంతోషంగా లేనప్పుడు విలువలు ఎందుకు పాటించాలని ప్రశ్నించిందని, అయితే, అలా ఎందుకు ఆలోచిస్తున్నావని తాను హారికను హెచ్చరించినట్లు యోగి తెలిపాడు. ఇద్దరి మధ్య జరిగిన వాట్సాప్ మెసేజ్‌ల మొబైల్ స్క్రీన్ షాట్లను పోలీసులకు అప్పగించాడు యోగి. 
యోగి ఆరోపణలపై హారిక కౌంటర్‌ అటాక్‌ 
మరోవైపు యోగి ఆరోపణలపై నటి హారిక కౌంటర్‌ అటాక్‌ ఇచ్చింది. సెల్ఫ్‌ వాట్సాప్‌ మెసేజ్‌లతో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడింది. క్రిమినల్‌ బ్రెయిన్‌తో తప్పుడు స్టోరీలు క్రియేట్‌ చేస్తున్నాడని ఆరోపించింది. తాను తప్పు చేస్తే పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేస్తానంది. యోగి తరహా వ్యక్తులు ఏరంగంలో ఉన్నా.. మహిళలు వారి  వేధింపులు భరించాల్సిన అవసరం లేదని చెప్పింది. తనను బూతులు తిట్టడం వల్లే అడిషనల్‌ డీసీపీ గంగారెడ్డి యోగిని తన్నినట్లు తెలిపింది. పోలీస్‌ స్టేషన్‌లో జరిగిన దృశ్యాలు తాను వీడియో తీయలేదని చెప్పింది. 
హరిక ఫిర్యాదుపై యోగి అరెస్ట్ 
యోగి తనను వేధింపులకు గురిచేస్తున్నారని హారిక చేసిన ఫిర్యాదుపై గచ్చిబౌలి పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అయితే ఎవరి ఆరోపణల్లో నిజమెంత అనే విషయాలపై నిగ్గు తేల్చేందుకు పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. 

11:42 - December 28, 2017

హైదరాబాద్ : ఏరు దాటే దాకా బోటు మల్లన్న... ఏరు దాటాక బోడి మల్లన్న... అన్న చందంగా టీఆర్‌ఎస్‌ తీరు ఉందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే.. వంద రోజుల్లోనే అన్ని సమస్యలను పరిష్కరిస్తామన్న టీఆర్‌ఎస్‌.. లేని సమస్యలను సృష్టిస్తోందని ఆవేదన చెందుతున్నారు నిజామాబాద్‌ జిల్లా ప్రజలు.... కాంగ్రెస్‌కు కంచుకోటలాంటి జిల్లాలో... టీఆర్‌ఎస్‌ను అందలం ఎక్కించిన ప్రజలకు ఆపార్టీ చేసిన మోసమేంటి..? వారు చెప్పిన బంగారు తెలంగాణతోపాటు... వందరోజుల ముచ్చటపై టెన్‌టీవీ  ప్రత్యేక కథనం..
హామీలతో ఆశపెట్టిన టీఆర్‌ఎస్‌..
ఎన్నికలకు ముందు హామీలతో ఆశపెట్టిన టీఆర్‌ఎస్‌.. గద్దెనెక్కాక వాటినిగాలికొదిలేసిందని నిజామాబాద్‌ జిల్లాప్రజలు మండిపడుతున్నారు. ఆ పార్టీ ఎన్నికల హామీలన్నీ.. నీటి మూటలుగానే మారాయని ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే వందరోజుల్లోనే అన్నీ పనులు పూర్తిచేస్తామన్న టీఆర్‌ఎస్‌... ఏ ఒక్కటీ  చేయలేదని ఆరోపిస్తున్నారు.  కర్మాగారాలకు పూర్వ వైభవం తెస్తామని హామీలిచ్చిన  నేతలు... ఇప్పుడు ఏకంగా లే ఔట్‌నే ప్రకటించారు.
బోధన్‌ చక్కెర ఫ్యాక్టరీ టే ఔట్‌
టీఆర్‌ఎస్‌ అదినేత కేసీఆర్,  ప్రస్తుత ఎంపీ కవిత, ఐటీ శాఖమంత్రి కేటీఆర్‌ ఎన్నికలకు ముందు... బోదన్‌లో నిర్వహించిన బహిరంగ సభలో  హామీల వర్షం కురిపించారు.. బోధన్‌ చక్కెర కర్మాగారాన్ని  అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే స్వాధీనం చేసుకుని... చెరుకు రైతులను, కార్మికులను ఆదుకుంటామని ఉపన్యాసాలతో ఊదరగొట్టారు. పూర్వవైభవం మాటేమో గానీ.. ఇంకో అడుగు ముందుకేసి ఏకంగా లే ఔట్‌నే ప్రకటించారు.-బోధన్‌ షుగర్‌ ఫ్యాక్టరీ గురించి కార్మికులు ఎన్నో సార్లు నిరసనలు, ఆందోళనలు, రిలేదీక్షలు చేపట్టారు. అయినా లాభం లేకపోయింది
మూతపడ్డ కో ఆపరేటివ్‌ షుగర్‌ ఫ్యాక్టరీ
తెలంగాణలోనే ఎక్కడాలేని విధంగా సారంగపూర్‌ గ్రామంలో ఉన్న కో-ఆపరేటివ్‌ షుగర్‌ ఫ్యాక్టరీ కూడా  మూత పడింది.  దీన్ని కూడా అధికారంలో వస్తే వందరోజుల్లో స్వాధీనం చేసుకుంటామని చెప్పారు టీఆర్‌ఎస్‌ నేతలు.  కానీ అధికారంలోకి రాగానే ఆ విషయాన్ని మరచిపోయారని కార్మికులు విమర్శిస్తున్నారు. బైట్‌-ఫ్యాక్టరీ కార్మిక నేత
తెలంగాణ యూనివర్సిటీకి నామమాత్రపు నిధులు
వందరోజుల్లో తెలంగాణా యూనివర్సిటీకి వంద కోట్లు కేటాయిస్తామని మహా గొప్పగా చెప్పారు.. ఐతే  వారు అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్ళు కావస్తోంది.. ఇంతవరకూ కేవలం  నామ మాత్రంపు నిధులతోనే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేతులు దులుపుకుంది.
మిషన్‌ భగీరథలో పెద్దఎత్తున అక్రమాలు
ఇంటింటికీ మంచినీటిని సరఫరా చేస్తామన్న నీటి హామీనీ కూడా నీళ్ల పాలు చేశారు.మిషన్‌ భగీరథ కోసం గుంతలు తవ్వడం వదిలేయడమే కానీ ఇవి ఎప్పటికి పూర్తవుతాయో తెలియదు. యడం లేదని అంటున్నారు. మిషన్‌ భగీరథ పనుల్లో పెద్దఎత్తున అవినీతి, అక్రమాలు జరుగుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని ప్రజలు తీవ్రంగా మండి పడుతున్నారు. 
కవిత హామీలపై ప్రశ్నిస్తున్న ప్రజలు
రాష్ర్టంలోనే  పసుపు పంటకు ప్రసిద్ధి నిజామాబాద్‌ జిల్లా..  ఇక్కడి రైతులు వేలాది ఎకరాల్లో పసుపు పంటను పండిస్తారు. ఐతే ఇంతవరకూ వారికి పసుపు బోర్డ్‌ను  ఏర్పాటు చేయలేదు. ఫలితంగా ప్రతీసారీ దళారులు రైతులను  దోపిడీ చేస్తూనే ఉన్నారు.  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం  అధికారంలోకి వస్తే వందరోజుల్లో పసుబోర్డును ఏర్పాటు చేస్తామని  ప్రస్తుత ఎంపీ కవిత హామీ ఇచ్చారు. కానీ.. ఇంతవరకూ అది అమలుకు  నోచుకోలేదని రైతులు విమర్శిస్తున్నారు. 
భూమి పూజలతో సరిపెట్టిన ప్రభుత్వం
కామారెడ్డి, నిజామాబాద్‌  జిల్లా వ్యాప్తంగా పేదలకు డబుల్‌ బెడ్‌ రూమ్‌లను ఏర్పాటు చేసి ఇస్తామని కూడా తెరాసా నేతలు హామీ ఇచ్చారు. ఆ హామీని కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చిన దాఖలాలు లేవు. మంత్రి ఇలాఖాలోని కోటగిరి మండలం దోమల్‌ ఎడ్గి, రుద్రరు మండలం అక్బర్‌నగర్‌ గ్రామం, నగేంద్రపూర్‌ ప్రాంతాల్లో మాత్రమే  పూర్తి చేశారు.  దాదాపు తొమ్మిది నియోజకవర్గాల్లో కేవలం భూమి పూజతోనే సరిపెట్టారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్ళు ఐనా... డబుల్‌బెడ్‌రూమ్‌లు ఇలాంటి దుస్థితిలో ఉన్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. తరతరాలుగా ఆదరించిన పార్టీలను కాదని... టీఆర్‌ఎస్‌ పార్టీని అక్కున చేర్చుకున్నారు నిజామాబాద్‌ జిల్లా ప్రజలు.. అలాంటి వారిని నమ్మించి నట్టేట ముంచడం సరైంది కాదని జిల్లా  ప్రజలు అంటున్నారు.

 

జాదవ్ కుటంబంపై పాక్ తీరుపై సుష్మాస్వరాజ్ ప్రకటన

ఢిల్లీ : కుల్ భూషణ్ జాదవ్ కుటుంబ సభ్యులపై పాక్ వ్యవహరించిన  తీరుపై విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ రాజ్యసభలో ప్రకటన చేశారు. జాదవ్ కుటుంబసభ్యులపట్ల పాక్ వైఖరి అభ్యంతరకరమని, పాక్ వ్యవహరించిన తీరు అమానీయమని సుష్మాస్వరాజ్ అన్నారు. పాక్ ప్రవర్తన భారతీయులు మనోభావాలను దెబ్బతీసిందని, జాదవ్ భార్య, తల్లి బొట్టు మంగళసూత్రం తీయించారని, చెప్పులు, షూ విడిపించారని ఇది చాల దారుణమని ఆమె తెలిపారు.

మావోయిస్టు పార్టీకి జంపన్న ద్రోహం

ఖమ్మం :  మావోయిస్టు పార్టీకి జంపన్న ద్రోహం చేశాడని, పార్టీలో ఉంటూ సమాచారన్ని లీక్ చేశాడని, జంపన్నను ఏడాది క్రితమే సస్పెండ్ చేశామని మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ తెలిపింది. జంపన్న లొంగిపోయాని చెప్పడం అవాస్తమని వారు స్పష్టం చేశారు. 

11:33 - December 28, 2017

హైదరాబాద్ : టేకులపల్లి ఎన్‌కౌంటర్‌ బూటకపు ఎన్‌కౌంటర్‌ అని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపించారు. చిత్రహింసలు పెట్టి చంపారని.. కనీసం మృతదేహాలను చూడనివ్వలేదని ఆక్రోశం వ్యక్తం చేశారు. బాధ్యులైన పోలీసులను అరెస్ట్‌ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న బాధిత కుటుంబ సభ్యులతో 10టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. ప్రభుత్వమే న్యాయం చేయాలని బాధితులు వేడుకున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

కరీంనగర్ జిల్లాలో విషాదం...

కరీంనగర్ : జిల్లా చొప్పదండి మండలం వెడురుగట్ట గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కట్టెల పొయ్యలో కిరోసిన్ పోయడంతో మంటలు వ్యాపంచాయి. దీంతో పొయ్య వద్ద మంటలు చెలరేగడంతో అక్కడే ఉన్న ఇద్దరు పిల్లలకు అంటుకున్నాయి. అందులో ఓ బాలుడికి తీవ్ర గాయం కావడంతో ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. 

11:28 - December 28, 2017

ఆది ప్రేమకావాలి మూవీతో తెలుగు తెరకు పరిచయమైయ్యాడు. ఈ సినిమా మంచి టాక్ కూడా తెచ్చుకుంది. కానీ తర్వాత ఆది తీసిని ఏ సినిమా కూడా బాక్సఫీస్ వద్ద విజయం సాధించలేకపోయాయి. ఆయనకు తెలుగు అవకాశలు తగ్గిపోయాయి. దీంతో ఆది కన్నడలో ఎంట్రీ ఇవ్వలనుకున్నాడు. ఈ నేపథ్యంలోనే తమిళంలో ఆదితో సినిమా చేస్తానని జ్ఞానవేల్ రాజా మాటిచ్చారట. జ్ఞానవేల్ స్టూడియో గ్రీన్ సంస్థ పేరు గురించి ఆది ఆ సంస్థ నుంచి పిలుపు ఎప్పుడు వస్తోందో అని ఎదురు చూశారట. కానీ ఆ సంస్థ తాజాగా ఓ సినిమాకు హీరో విజయ్ దేవరకొండను తీసుకున్నారట. 

11:25 - December 28, 2017

బెంగుళూరు : మరో ఐదు నెలల్లో ఎన్నికలకు సిద్ధమవుతోన్న కర్నాటకలో.. జలరాజకీయాలు కాకపుట్టిస్తున్నాయి. దశాబ్దాలుగా గోవాతో ఉన్న మహాదాయి నదీజలాల పంపిణీ వ్యవహారం ఇప్పుడు.. రాజకీయాలను వేడెక్కిస్తోంది. కొన్నాళ్లుగా.. ఈ అంశంపై బీజేపీ-కాంగ్రెస్‌ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం సాగుతోంది. తాజాగా, ఈరోజు.. ఉత్తర కర్నాటక అంతటా.. రైతులు బంద్‌ పాటించారు. 
రాజకీయ పార్టీల మధ్య రగడ
కర్నాటకలో జల రాజకీయం.. రాష్ట్రాన్ని అట్టుడికిస్తోంది. ఉత్తర కర్నాటకలోని నాలుగు జిల్లాలు, 13 తాలూకాల పరిధిలో.. రైతులు.. రాజకీయ నాయకులపై తీవ్ర స్థాయిలో భగ్గుమంటున్నారు. జయకర్నాటక సంఘటన నేతృత్వంలో రైతులు, బుధవారం ఉత్తరకర్నాటక వ్యాప్తంగా బంద్‌ పాటించారు. దశాబ్దాలుగా ఎడతెగని ఈ సమస్య.. వారం క్రితం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. వెన్వెంటనే.. రాజకీయ పార్టీల మధ్య రగడకు హేతువైంది. 
ఇరు రాష్ట్రాల మధ్య రెండు దశాబ్దాలకు పైగా వివాదం 
గోవా, కర్నాటక రాష్ట్రాల మీదుగా ప్రవహించే మహాదాయి నది జలాల పంపిణీ వ్యవహారంపై ఇరు రాష్ట్రాల మధ్య రెండు దశాబ్దాలకు పైగా వివాదం కొనసాగుతోంది. దీని పరిష్కారం కోసం.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా వేసిన ఓ ఎత్తుగడ.. కర్నాటక రాజకీయాలను వేడెక్కించింది. వచ్చే ఎన్నికల్లో కర్నాటకలో జెండా ఎగరేయాలని భావిస్తోన్న అమిత్‌షా.. మహాదాయి నదీజలాల వివాదంపై..  గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌, కర్నాటక బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్పలతో ఓ సమావేశం ఏర్పాటు చేశారు. ఇదే.. కన్నడనాట తాజా వివాదానికి కారణమైంది.  
రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్న మహాదాయి అంశం  
ఎన్నికల ముంగిట్లో ఉన్న కర్నాటకలో.. మహాదాయి అంశం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉత్తర కర్నాటకలోని హుబ్లి, బాగల్‌కోట, ధారవాడ, బెళగావి, గదగ్‌, హావేరి జిల్లాల్లోని 56 అసెంబ్లీ సెగ్మెంట్లలో బలాన్ని గణనీయంగా పెంచుకోవాలన్న భావనతో.. బీజేపీ ఇప్పుటి నుంచే పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే.. అమిత్‌షా, ముఖ్యమంత్రుల స్థాయిలో జరగాల్సిన సమావేశాన్ని.. ఓ రాష్ట్రముఖ్యమంత్రికి, మరో రాష్ట్రంలోని పార్టీ అధ్యక్షుడికి మధ్య నిర్వహించి.. వివాదానికి తెరలేపారు. 
కమలనాథులు పన్నిన ఎత్తుగడని విమర్శలు
యడ్యూరప్పతో భేటీ అనంతరం.. మనోహర్‌ పారికర్‌ ఆయనకు ఓ లేఖను రాస్తూ.. సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తామని పేర్కొనడం.. కర్నాటకలో అధికారంలోని కాంగ్రెస్‌ నేతలకు మింగుడ పడడం లేదు. ఇదంతా ఎన్నికల స్టంట్‌ అని.. ఓట్లు దండుకునేందుకు కమలనాథులు పన్నిన ఎత్తుగడ అని విమర్శలకు దిగారు. సమస్య పరిష్కారం అవుతుంటే.. కాంగ్రెస్‌ నాయకులకు ఉలుకెందుకంటూ బీజేపీ నాయకులూ ఎదురుదాడికి దిగుతున్నారు. మొత్తానికి, మహాదాయి నదీజల వివాదం.. ఈసారి ఉత్తర కర్నాటకలో కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చబోతోందనడంలో ఎలాంటి సందేహం లేదు. 

 

11:17 - December 28, 2017

మొదట్లో శింభు, తర్వాత ప్రభుదేవా యనతార ప్రేమయణం నడిపారు. ఇప్పుడు విఘ్నేశ్ శివన్ తో ప్రేయాణం సాగిస్తున్నట్టు తెలుస్తోంది. కానీ వీరి మధ్య సంబంధం గురించి ఎప్పుడు కూడా బయటకు చెప్పలేదు. కానీ వీరు ప్రేమికులని మీడియా ఎప్పుడు ముంద్ర వేసింది. తాజాగా విఘ్నేశ్ వివన్ ట్విట్టర్ ఫొటోలు షేర్ చేశారు. ఆ ఫొటోలు వీరు లవ్ ఉన్నారని స్పష్టం చేస్తున్నాయి. నయనతార, విఘ్నేశ్ ఇద్దరు కలిసి క్రిస్మస్ జరుపుకున్న ఫొటలను శివన్ షేర్ చేశాడు. ఆ ఫొటో పాటు నయన్ పై పొగడ్తల వర్షం కురిపించాడు. నయన్ ఇండస్ట్రీకి వచ్చి 14 ఏళ్లు అవుతుందని, ఆమె నటించిన మొదటి చిత్రం మనసినక్కరే క్రిస్మస్ రోజునే విడుదలైందని, అదే రోజు మేము ఇద్దరం క్రిస్మస్ వేడుకు జరుపుకున్నామని తెలిపాడు.

11:13 - December 28, 2017

గుంటూరు : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఫిరంగిపురం దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో.. ముగ్గురు విద్యార్థులతోపాటు ఆటో డ్రైవర్‌ మృతి చెందాడు. మరో నలుగురికి గాయాలు అయ్యాయి. స్కూల్‌ ఆటోను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో ఈ ఘోరం జరిగింది. శ్రీశైలం..పొన్నూరు ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జు అయ్యింది. ఘటనా స్థలం రక్తపు మడుగులతో ఉంది. మరణ వార్త విన్న... విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతుల కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ దుర్ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది. క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ముగ్గురి మృతదేహాలను నర్సారావుపేట మార్చురీకి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం చేయనున్నారు. ప్రమాద ఘటనపై మంత్రులు అచ్చెన్నాయుడు, నక్కా ఆనంద్ బాబు, స్పీకర్ కోడెల శివప్రసాద్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను మంత్రి నక్కా ఆనంద్ బాబు పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీకి శంకుస్థాపన చేసిన చంద్రబాబు

గుంటూరు : ఏపీ సీఎం చంద్రబాబు ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీకి శంకుస్థాపన చేశారు. 3 ఎకరాల్లో ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి నారాయణ, డీజీపీ సాంబశివరాలు హాజరైయ్యారు. 

రాజధాని ప్రాంతంలో మంత్రి నారాయణ పర్యటన

గుంటూరు : రాజధాని ప్రాంతంలో నారాయణ పర్యటిస్తున్నారు. రాజధాని నిర్మాణాలను పరిశీలించాడానికి ఆయన పర్యటిస్తున్నారు. ఆయన రోడ్లు, ప్రభుత్వ భవనాలను క్షత్ర స్థాయిలో పరిశీలించారు. రాజధానిలో 1680 కి. మీ మేర రోడ్లు నిర్మిస్తున్నామని, 2018 చివరి నాటికి రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నమని ఆయన తెలిపారు. 

10:58 - December 28, 2017

ఢిల్లీ : ప్రార్లమెంట్‌ లైబ్రరి హాల్‌లో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ప్రధాని మోదీ, అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, పలువురు కేంద్రమంతులు హాజరయ్యారు. త్రిపుల్‌ తలాక్‌ బిల్లు, కులభూషన్‌ జాద్‌ వ్యవహారంపై ప్రధానంగా చర్చించనున్నారు. జాదవ్‌ కుటుంబ సభ్యుల పట్ల పాక్‌ తీరుపై కేంద్రం ఆగ్రహం చేసింది. ఎంపీలకు ప్రధాని మోదీ దిశనిర్దేశం చేయనున్నారు. త్రిపుల్‌ తలాక్‌ బిల్లును లోక్‌సభలో న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్ ప్రవేశపెట్టనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

ఏపీ సీఎం ఇంటి వద్ద ఉద్రిక్తత

గుంటూరు : అమరావతిలోని ఉండవల్లి సీఎం నివాసం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇబ్రహీంపట్నానకి చెందిన రోడ్డు విస్తరన బాధితులు ఆందోళనకు దిగారు. కిరోసిన్ డబ్బాలతో బాధితులు ఆందోళన చేస్తున్నారు.

10:54 - December 28, 2017

నాని డ్యూయల్ రోల్ లో నటిస్తున్న చిత్రం 'కృష్ణార్జున యుద్ధం' ఈ మూవీ ఏప్రిల్ 18, 2018లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాని మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్నారు. సంగీత దర్శకుడిగా హిప్ హాప్ తమిజా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాని వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నారు. ఇందులో నాని సరసన అనుమప పరమేశ్వరన్ నటిస్తున్నారు. 

10:53 - December 28, 2017

గుంటూరు : జిల్లాలోని ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం వాసులు కిరోసిన్‌ డబ్బాలతో ఆందోళనకు దిగారు. జాతీయ రహదారి విస్తరణలో ఇళ్లు కోల్పోయిన బాధితులు పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఇళ్లు తొలగించి పరిహారం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

10:52 - December 28, 2017

పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కంబినేషన్ లో వస్తున్న చిత్రం అజ్ఞాతవాసి ఈ చిత్రంలో అనుఇమ్మాన్యుయల్ హీరోయిన్ గా చేస్తోంది. ఈ చిత్ర పాటలు ఈ నెల 19న విడుదలైయ్యాయి. ఆ సయంలో ఐదు పాటలు మాత్రమే రిలీజ్ చేశారు. ప్రస్తుతం అందరి దృష్టి ఆరో పాటపై ఉంది ఎందుకంటే ఆ పాట పాడేది పవన్ కల్యాణ్ కాబట్టి, పవన్ అత్తారింటిక దారేది మూవీలో కాటమరాయుడ పాటతో అభిమానులను అలరించారు. ఇప్పుడు అదే పంథాను కొనసాగిస్తూ అజ్ఞాతవాసిలో కూడా పాటు పాడారు. ఆ పాట కొడుక కోటేశ్వరరావు అన్న పల్లవితో ప్రారంభం అవుతుంది. ఈ పాట టీజర్ ను చిత్రం యూనిట్ ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. టీజర్ లో పవన్ కొడుక అంటూ పడి పడి నవ్వడం, పవన్ సార్ అంత ఈజీగా ఏమి తెలియనీయరు. అది నాకు అర్థమవుతోందని భాస్కర్ భట్ల అనడం ఉంది. ఈ పాట ను కొత్త సంవత్సరం కానుకగా ఈ నెల 31 విడుదల చేయనున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఉండవల్లి సీఎం నివాసం వద్ద ఇబ్రహీంపట్నం వాసుల ఆందోళన

గుంటూరు : జిల్లాలోని ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం వాసులు కిరోసిన్‌ డబ్బాలతో ఆందోళనకు దిగారు. జాతీయ రహదారి విస్తరణలో ఇళ్లు కోల్పోయిన బాధితులు పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఇళ్లు తొలగించి పరిహారం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు.  

 

10:49 - December 28, 2017

విశాఖ : తెలుగు రాష్ర్టాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. విశాఖ మన్యం చలికి వణుకుతోంది. లంబసింగిలో 2, చింతపల్లిలో నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

 

కొనసాగుతున్న బీజేపీ పార్లమెంటరీ సమావేశం

ఢిల్లీ : పార్లమెంట్ లైబ్రరీ భవనంలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కొనసాగుతోంది. ఈ భేటీకి మోడీ, అమిత్ షా, రాజ్ నాథ్, కేంద్రమంత్రులు, ఎంపీలు హాజరైయ్యారు. ఈ సమావేశంలో ట్రిపుల్ తలాక్ బిల్లు, కుల్ భూషణ్ జాదవ్ వ్యవహారంపై ఎంపీలకు మోడీ దిశానిర్దేశం చేశారు. 

అభిమానులతో 3వ రోజు రజనీ భేటీ

చెన్నై : లోని కొడంబకంలోని రాఘవేంద్ర ఫంక్షన్ హాల్ లో రజనీకాంత్ మూడవ రోజు తన అభిమానులతో సమావేశమయ్యారు. ఆయన పార్టీ పై ఈ నెల 31న ప్రకటన చేస్తారన్న విషయం తెలిసిందే. 

10:32 - December 28, 2017

కేంద్రమంత్రి అనంతకుమార్ హెగ్డేను పదవి నుంచి బర్తరఫ్ చేయాలని వక్తలు డిమాండ్ చేశారు. ఇవాళ్టి న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు నంద్యాల నర్సింహ్మారెడ్డి బీజేపీ అధికారి ప్రతినిధి నరేష్ పాల్గొని, మాట్లాడారు. పార్లమెంట్ లో అనంతకుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన వారు ప్రజాప్రతినిధులుగా కొనసాగడానికి, ప్రభుత్వం పదవుల్లో ఉండటానికి వీల్లేదన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

రోడ్డు ప్రమాద ఘటనపై అచ్చెన్నాయుడు, కోడెల తీవ్ర దిగ్ర్భాంతి

గుంటూరు : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఫిరంగిపురం దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో.. ముగ్గురు విద్యార్థులతోపాటు ఆటో డ్రైవర్‌ మృతి చెందాడు. మరో నలుగురికి గాయాలు అయ్యాయి. స్కూల్‌ ఆటోను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో ఈ ఘోరం జరిగింది. ప్రమాద ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు, కోడెల శివప్రసాద్ ఘటనపై తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. 

09:52 - December 28, 2017

గుంటూరు : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఫిరంగిపురం దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో.. ముగ్గురు విద్యార్థులతోపాటు ఆటో డ్రైవర్‌ మృతి చెందాడు. మరో నలుగురికి గాయాలు అయ్యాయి. స్కూల్‌ ఆటోను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో ఈ ఘోరం జరిగింది. శ్రీశైలం..పొన్నూరు ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జు అయ్యింది. ఘటనా స్థలం రక్తపు మడుగులతో ఉంది. మరణ వార్త విన్న... విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతుల కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ దుర్ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది. క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ముగ్గురి మృతదేహాలను నర్సారావుపేట మార్చురీకి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం చేయనున్నారు. ప్రమాద ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు, కోడెల శివప్రసాద్ ఘటనపై తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

తెలుగు రాష్ర్టాల్లో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు

విశాఖ : తెలుగు రాష్ర్టాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి.  విశాఖ మన్యం చలికి వణుకుతోంది. లంబసింగిలో 2, చింతపల్లిలో నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

 

09:36 - December 28, 2017
09:34 - December 28, 2017

గుంటూరు : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు, ఆటో డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందారు. ఆరుగురు ఆటోలో స్కూల్ కు వెళ్తున్నారు. ఫిరంగిపురం సమీపంలో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో శ్రీశైలం..పొన్నూరు ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు విద్యార్థులు, ఆటో డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

09:15 - December 28, 2017

విశాఖ : మేఘన ట్రావెల్స్ యాజమాన్యం నిర్వాకం బయటపడింది. రెగ్యులర్ డ్రైవర్ రాకపోవడంతో యాజమాన్యం ఆఫ్ టింగ్ డ్రైవర్ ను ఇచ్చి పంపింది. బస్సు ఆలస్యంగా నడుపుతున్నారని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఎన్ ఏడీ కొత్త రోడ్డు జంక్షన్ లో బస్సు నిలిపివేసి డ్రైవర్ పరారయ్యారు. డోర్ లాకవడంతో బస్సులో 30 మంది ప్రయాణికులు చిక్కుకున్నారు. స్థానికులు బస్సు డోర్ తీసారు. విశాఖ నుంచి బస్సు హైదరాబాద్ వెళ్తోంది. మేఘన ట్రావెల్స్ యాజమాన్యం పట్టించుకోలేదు. 

09:12 - December 28, 2017

చిత్తూరు : వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల కోసం తిరుమల దివ్య ముస్తాబైంది. ఈ నెల 29న వైకుంఠ ఏకాదశి, 30న ద్వాదశి రావడంతో భక్తులు శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు బారులు తీరనున్నారు. భక్తులకు ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు విస్త్రత ఏర్పాట్లు చేశారు. ఈ నెల 29న వైకుంఠ ఏకాదశి కావడంతో తిరుమల ముస్తాబైంది. గురువారం అర్ధరాత్రి నుండి స్వామి వారికి కైంకర్యాలు ప్రారంభం కానున్నాయి. స్వామి వారిని దర్శించుకుని వైకుంఠ ద్వారంలో ప్రవేశించడానికి వేలాదిగా భక్తులు తరలివస్తారని టీటీడీ అంచనా వేస్తోంది. అందుకు తగ్గట్లుగా అధికారులు భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రెండు క్యూ కాంప్లెక్స్‌ల్లోని 56 కంపార్ట్‌మెంట్లు నిండితే వెలుపల భక్తులు వేచి ఉండటానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నారాయణగిరి ఉద్యానవనంలో 15 తాత్కాలిక కంపార్ట్‌మెంట్లు ఏర్పాటు చేశారు. 
శ్రీవారిని దర్శించుకోడానికి వేచిఉన్న భక్తులు
ప్రతి ఏటా వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో శ్రీవారి ఆలయంలోని వైకుంఠ వాకిలి 48 గంటలు తెరచి ఉంచుతారు.  ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి శుక్రవారం వస్తుండడంతో ఆరోజున స్వామివారికి అభిషేకం నిర్వహించిన తరవాత మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.  అభిషేకం కారణంగా ఈ ఏడాది సామాన్య భక్తులకు దర్శన సమయం 39 నుండి 40 గంటలు మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీంతో అధికారులు దర్శనం విషయంలో ఆచితూచి వ్వవహరిస్తున్నారు. ఉన్న సమయంలో సుమారు 1.70 లక్షలమందికి మాత్రమే దర్శనం చేయించే అవకాశం ఉందని అధికారులు  చెబుతున్నారు. ఉదయం 5.30 గంటలకు తొలుత వీఐపీ భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. అనంతరం ఉదయం 8.00 గంటల నుండి సామాన్య భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.
సామాన్య భక్తులకే ప్రాధాన్యత ఇవ్వనున్న టీటీడీ
టీటీడీ అధికారులు కూడా ఆరెండు రోజులు సామాన్యభక్తులకే అధిక ప్రధాన్యతనివ్వాలని నిర్ణయం తీసుకున్నారు. తిరుమలకు వచ్చిన భక్తులందరకీ వైకుంఠ ద్వారం ప్రవేశం కల్పించాలని అధికారులు భావిస్తున్నారు. రెండు రోజులు సిఫార్సు ఉత్తరాలను పూర్తిగా రద్దు చేసారు. ప్రోటోకాల్ పరిధిలోని వీఐపీలు స్వయంగా వస్తే అటువంటి వారికి ఆరుమందికి మించకుండా పాసులు ఇవ్వాలని టీటీడీ నిర్ణయం తీసుకొంది. ఆర్జితసేవలు, వృద్ధులు, వికలాంగుల తదితర ప్రత్యేక దర్శనాలను కూడా రద్దు చేసారు. మొత్తానికి వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో టీటీడీ అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులందరూ స్వామివారిని దర్శించుకునేలా ఏర్పాట్లు  చేస్తున్నారు. 

09:08 - December 28, 2017

హైదరాబాద్ : న్యూ ఇయర్‌ వేడుకలకు ప్రజలు సిద్ధమవుతున్న వేళ.. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌కు చెక్‌ పెట్టేందుకు ట్రాఫిక్‌ పోలీసులు సమాయత్తమవుతున్నారు. దీనికోసం నగర వ్యాప్తంగా 100 ముబైల్‌, డెకాయ్‌ టీమ్స్‌ రంగంలోకి దిగనున్నాయి. నగరంలో సేఫ్‌ న్యూ ఇయర్‌ దిశగా ట్రాఫిక్‌ పోలీసులు అడుగులు వేస్తున్నారు. 
సరికొత్త వ్యూహాలతో మందుకెళ్తోన్న ట్రాఫిక్ పోలీస్‌ విభాగం
న్యూ ఇయర్‌ వేడుకలు సమీపిస్తుండడంతో నగర ట్రాఫిక్‌ పోలీస్‌ విభాగం సరి కొత్త వ్యూహాలతో ముందుకెళ్లబోతోంది. డిసెంబర్‌ 31 రాత్రి ప్రమాదాలు జరగకుండా చేసేందుకు సిటీ కాప్స్‌ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తాగుబోతులకు చెక్‌ పెట్టేలా డ్రంకన్‌ డ్రైవ్‌ను విస్తృతంగా నిర్వహించాలని ట్రాఫిక్‌ పోలీస్‌ విభాగం యోచిస్తోంది. డిసెంబర్‌ 31 రాత్రంతా వీలున్న ప్రతి చోటా తనిఖీలు నిర్వహించాలని నిర్ణయించారు. 
ఆదివారం రాత్రి 10 గం.ల నుండి సోమవారం ఉ.5 గంటల వరకు తనిఖీలు 
ఆదివారం రాత్రి 10 గంటల నుండి సోమవారం ఉదయం 5 గంటల వరకు ఈ తనిఖీలు నిర్వహించనున్నారు. సాధారణ రోజుల్లోనూ రాత్రి 10 గంటల నుండి ఒంటిగంట వరకు తనిఖీలు చేపట్టాలని నిర్ణయించారు. ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేపట్టనున్నారు.  
స్టాటిక్‌ బృందాలతో పాటు మొబైల్‌ టీమ్స్‌ ఏర్పాటు
31 ఆదివారం మాత్రం ఒకే చోట పనిచేసే స్టాటిక్‌ బృందాలతో పాటు మొబైల్‌ టీమ్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే వాహనదారులతో కలిసి సంచరిస్తూ డ్రైవింగ్‌ చేస్తున్న మందుబాబులను పట్టుకోవడానికి డెకాయ్‌ టీమ్స్‌ను రంగంలోని దింపనున్నాయి. గ్రేటర్‌లో మొత్తం 100 ట్రాఫిక్‌ పోలీస్‌ బృందాలు వీధుల్లో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. 
2017లో 9వేలకు పైగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు
మద్యం తాగుతూ వాహనాలు నడిపితే వారిపై కేసు నమోదు చేయడంతో పాటు తక్షణమే వారి నుండి వాహనాన్ని స్వాధీనం చేసుకోనున్నారు. గతంలో ట్రాఫిక్‌ పోలీసులకు చిక్కి జైలుకెళ్లిన మందుబాబుల సంఖ్య పరిశీలిస్తే గనక 2015లో 2వేల ఐదువందలు ఉండగా 2016లో ఈ సంఖ్య 7వేల ఐదువందలకు పెరిగింది. ఇక ఈ ఏడాది ఈ సంఖ్య 9 వేలకు చేరినట్లు పోలీసు లెక్కలు చెబుతున్నాయి. మొత్తానికి న్యూఇయర్‌ వేడుకల్లో తాగి బైక్‌లపై స్వైర విహారం చేయాలనుకునే వారికి కచ్చితంగా కష్టకాలమేనని చెప్పక తప్పదు.

 

09:00 - December 28, 2017

హైదరాబాద్ : 2019 ఎన్నికల కోసం కాంగ్రెస్‌ కసరత్తు మొదలుపెట్టింది. ఎలాగైనా గెలుపు సాధించాలనే లక్ష్యంతో వ్యూహాలు రచిస్తోంది. ఈ ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అయితే... గెలుపు గుర్రాలను పట్టుకునేందుకు హస్తం అధిష్టానం రచిస్తున్న ప్లాన్‌ ఏంటి ? ఢిల్లీ పెద్దల ఆలోచనలపై రాష్ట్ర నేతలు ఏమంటున్నారు. ఈ ప్లాన్‌ పార్టీకి ఎంతవరకు లాభం చేకూరనుంది? వాచ్‌ దిస్‌ స్టోరీ.. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా.. ఎన్నికల్లో ఓటమికి గురైంది కాంగ్రెస్‌ పార్టీ. ఆ తర్వాత వచ్చిన ప్రతి ఉప ఎన్నికల్లోనూ ఓటమి చవి చూసింది. దీంతో కేడర్‌ అంతా నిరూత్సాహంలో కొట్టుమిట్టాడుతోంది. అయితే... వాటన్నింటిని నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న హస్తం పార్టీ... 
తెలంగాణపై అధిష్టానం ప్రత్యేక దృష్టి 
దేశంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటి అని పార్టీ భావిస్తోంది. అందుకోసం రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేస్తూనే... రాష్ట్రంలోని పరిస్థితులు... నియోజకవర్గాల వారీగా గెలుపు-ఓటముల పరిస్థితిని అంచానా వేస్తోంది. అలాగే క్షేత్రస్థాయిలో నేతల పనితీరును పరిశీలిస్తోంది. పార్టీ కేడర్‌లో నేతలపై ఉన్న అభిప్రాయాలను అధిష్టానం నేరుగా సేకరిస్తోంది. 
గెలుపు గుర్రాలే లక్ష్యంగా ప్రణాళికలు 
అయితే.. గెలుపు గుర్రాలే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న అధిష్టానం.. అందుకు ఒక కొత్త ఫార్ములాను తెరపైకి తెచ్చినట్లు సమాచారం. నియోజకవర్గంలో రెండుసార్లు వరుసగా ఓటమికి గురైన వారికి టికెట్‌ ఇవ్వకూడదని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. అది ఎంపీ అభ్యర్థి అయినా.. ఎమ్మెల్యే అభ్యర్థి అయినా సరే ఇదే విధానం అమలు చేయాలని భావిస్తోంది. మరోవైపు భారీ తేడాతో ఓటమికి గురైన అభ్యర్థులను సైతం దూరం పెట్టాలని యెచిస్తోంది.  అయితే... అధిష్టానం జరిపిన సర్వే ప్రకారం... రాష్ట్రంలో 30 మందికి టికెట్లు దక్కే అవకాశం కనిపించడం లేదని తెలుస్తోంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు, మాజీ మంత్రులకు డోకా లేకపోయినప్పటికీ.. కొందరు మాజీలకు టికెట్లు కట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ ప్రమేయం లేకుండా... నియోజకవర్గ అభ్యర్థి పేరును ఎవరూ ప్రకటించవద్దని అధిష్టానం సంకేతాలు పంపింది. 
అధిష్టానం నిర్ణయంపై రాష్ట్ర నేతల్లో ఆసక్తికర చర్చ 
అయితే... అధిష్టానం నిర్ణయంపై రాష్ట్ర నేతల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఢిల్లీ పెద్దల నిర్ణయంతో పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని నేతలు అభిప్రాయపడుతున్నారు. ఓటమి ప్రాతిపదికను చాలా కోణాల్లో విశ్లేషించుకోవాల్సి వస్తుందని చెబుతున్నారు. గతంలో రెండుసార్లు వరుసగా ఓడిన నేతలు.. ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచారన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అధిష్టానం ఈ ఫార్ములాను పక్కనపెట్టి... 2019 ఎన్నికల్లో గెలుపే ప్రాతిపదికన అభ్యర్థుల ఎంపిక చేయాలని సీనియర్లు సూచిస్తున్నారు. 
ఫార్ములాపై మిశ్రమ స్పందన 
మొత్తానికి హైకమాండ్‌ అనుసరిస్తున్న ఫార్ములాపై మిశ్రమ స్పందన కనిపిస్తోంది. కొత్తగా టికెట్లు ఆశిస్తున్న వారిలో జోష్‌ నింపుతుంటే... గతంలో ఓటమి చవిచూసిన వారికి ఆందోళన కలిగిస్తోంది.  ఇప్పటికే కొంతమంది సీనియర్లు దీనిపై పెదవి విరుస్తున్నారు. మరి... వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని అధిష్టానం ఎలా ముందుకె వెళ్తుందో చూడాలి. 

08:53 - December 28, 2017

కరీంనగర్ : కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ నిర్మాణంలో అత్యంత ఆధునిక టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు మంత్రి హరీష్‌రావు తెలిపారు. ప్రాజెక్ట్‌ పనులను రెండు రోజులుగా పరిశీలిస్తున్న మంత్రి... నాలుగు రోజుల్లో పెండింగ్‌ భూసేకరణ పూర్తి చేయాలన్నారు. జనవరి 15లోగా అన్ని డిజైన్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీ పనులను త్వరగా పూర్తి చేయాలని మంత్రి హరీష్‌రావు అధికారులను ఆదేశించారు. కాళేశ్వరం పెండింగ్‌ భూసేకరణను నాలుగు రోజుల్లో పూర్తి చేసి.. జనవరి 15లోగా అన్ని డిజైన్లను ఫైనల్‌ చేయాలన్నారు. భూసేకరణ, నిర్మాణ పనుల పురోగతి, బ్యారేజీ గేట్ల తయారీ అంశాలపై మంత్రి హరీష్‌రావు కన్నెపల్లి పంప్‌హౌజ్‌ దగ్గర మైక్రో లెవల్‌ పరీక్ష జరిపారు. 
మహారాష్ట్రలో 74 ఎకరాల భూసేకరణ పూర్తి చేయాలని సూచన
మేడిగడ్డ బ్యారేజీ పనుల్లో భాగంగా మహారాష్ట్రలోని 74 ఎకరాల భూసేకరణ పూర్తి చేయాలని హరీష్‌రావు సూచించారు. ఇందుకుగాను గడ్చిరోలి జిల్లా కలెక్టర్‌ సహకారం తీసుకోవాలన్నారు. ఇక మూడు బ్యారేజీల గేట్ల నిర్మాణ పనులను సమీక్షించిన హరీష్‌రావు... గేట్ల ఫ్యాబ్రికేషన్‌ పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. ఏ రోజుకారోజు ప్రోగ్రెస్‌ తనకు వాట్సాప్‌లో అందించాలని సూచించారు. 
జనవరి 15లోగా డిజైన్లు ఖరారు చేయాలని ఆదేశం 
కన్నెపల్లి..అన్నారం అప్రోచ్‌ కెనాల్‌కు అవసరమైన 31 స్ట్రక్చర్ల డిజైన్లను యుద్ధ ప్రాతిపదికన ఖరారు చేయాలన్నారు. ఇందులో ఐదు డిజైన్లు వైల్డ్‌ లైఫ్‌ బోర్డుతో ముడిపడి ఉన్నందున బోర్డుతో సంప్రదింపులు జరిపి ఫైనల్‌ చేయాలన్నారు. జనవరి 15లోగా డిజైన్లు ఖరారు చేయాలని ఆదేశించారు హరీష్‌రావు. కాళేశ్వరం పనులను జనవరి 17 నుంచి మూడు రోజులపాటు పరిశీలిస్తానని హరీష్‌రావు స్పష్టం చేశారు. 

 

08:46 - December 28, 2017

హైదరాబాద్ : తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు మరొక అరుదైన గౌరవం లభించింది. వచ్చే నెలలో జరగనున్న వరల్డ్ ఏకానామిక్‌ ఫోరమ్‌ వార్షిక సదస్సుకు కేటీఆర్‌కు ఆహ్వానం అందింది.  స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే సమావేశంలో పాల్గొనాలని మంత్రికి ఆహ్వానం పలికారు. 
తొలిసారి రాష్ట్రమంత్రికి వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ ఆహ్వనం 
తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు మరో అరుదైన గౌరవం లభించింది. తొలిసారిగా రాష్ర్ట మంత్రి అయిన కేటీఆర్‌కు వరల్డ్‌ ఏకానామిక్‌ ఫోరమ్‌ ప్రత్యేక అహ్వానం పంపింది. తెలంగాణ రాష్ర్టం ఈజ్ అఫ్ డూయిండ్ బిజినెస్‌ ర్యాంకింగ్‌లో అగ్రస్ధానంలో నిలవడంపైన ఫోరమ్‌ అభినందనలు తెలిపింది.
జనవరి 17,18 తేదీల్లో సదస్సు
జనవరి 17,18 తేదీల్లో జరగనున్న సదస్సుకు హాజరుకావాలని కేటీఆర్‌కు ఆహ్వానం పంపారు. ఈ సదస్సులో పత్రి ఏడాది 2500 మంది వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రతినిధులు, ఆర్ధికవేత్తలు పాల్గొంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సదస్సుకు మంచి పేరుంది. ఇప్పటివరకు కేంద్రమంత్రులు, రాష్ర్టాల అధినేతలు మాత్రమే.. ఆహ్వానాలకు హాజరుకాగా.. తొలిసారి రాష్ట్రమంత్రికి ఆహ్వానం దక్కింది. 
ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు విజయంలో కేటీఆర్‌ భాగస్వామ్యం
ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు విజయంలో మంత్రి కేటీఆర్ భాగస్వామ్యం.. తెలంగాణ పెట్టుబడుల ముఖచిత్రంగా ఉన్న తీరును ఫోరమ్ పరిగణలోకి తీసుకుని.. కేటీఆర్‌ను ఆహ్వానించి తెలుస్తోంది. రెండు రోజులపాటు ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల సీఈవోలతో కేటీఆర్ సమావేశమై చర్చించనున్నారు. సదస్సులో పాల్గొనే అవకాశం రావడంపై కేటీఆర్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ పాలసీలను, ముఖ్యంగా పారిశ్రామిక విధానాన్ని, పెట్టుబడుల అవకాశాలను ప్రపంచం ముందు ఉంచుతామన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున ప్రాతినిధ్యం వహించడం సంతోషంగా ఉందన్నారు కేటీఆర్‌.
 

08:40 - December 28, 2017

గుంటూరు : నవ్యాంధ్ర రాజధాని అమరావతి మరో వేదికకు సిద్ధం కాబోతుంది. సిటీస్‌ ఆఫ్‌ ద ఫ్యూచర్‌ పేరుతో మార్చి నెలాఖరులో అమరావతి ఇన్నోవేషన్ సమ్మిట్‌ నిర్వహించనున్నారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సు అమరావతి నగర రూపకల్పనలో సరికొత్త దిశానిర్దేశాన్ని అందిస్తుందని ప్రభుత్వం భావిస్తుంది. 
సీఆర్డీపై సీఎం చంద్రబాబు సమీక్ష
అమరావతి సచివాలయంలో సీఆర్డీఏ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. రాజధాని నిర్మాణ పనుల పురోగతిపై చర్చించారు. వచ్చే ఏడాది మార్చి లో..  సిటీస్ ఆఫ్‌ ద ఫ్యూచర్‌ పేరుతో  అమరావతి ఇన్నోవేషన్‌ సమ్మిట్‌కు కార్యక్రమాన్ని నిర్వహించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ సదస్సు ప్రధానంగా నగర అభివృద్ధి ప్రణాళికలకు సంబంధించిందిగా ఉండనుంది. ఆధునిక సాంకేతికత, నవ్య ఆవిష్కారాలు, వినూత్న విధానాలతో నగర రూపకల్పన జరపడానికి దోహదపడేలా సదస్సులో మేధోమధనం జరపనున్నారు.
విశ్వనగరం తీరును ప్రజలకు చెప్పేందుకు సదస్సు దోహదం
రాజధాని పరిధిలో హ్యాపీసిటీ హ్యాకథాన్‌
అమరావతిని విశ్వనగరంగా అభివృద్ధి చేస్తున్న తీరును ప్రజలకు విపులంగా చెప్పేందుకు ఈ సదస్సు దోహదపడుతుందని భావిస్తున్నారు. దీనికోసం రాజధాని పరిధిలోని పలు ప్రాంతాలలో హ్యాపీసిటీ హ్యాకథాన్‌ నిర్వహిస్తారు. నగర నిర్మాణాలలో ప్రఖ్యాతిగాంచిన నిపుణులతో మొదటి రెండు రోజులూ బృంద చర్చలు, కార్యగోష్ఠులు ఉండనున్నాయి. చివరిరోజు అమరావతిని విశ్వస్థాయి నగరంగా 21వ శతాబ్దం వైపు నడిపించేందుకు అవసరమైన వినూత్న సాంకేతిక విధానాలు, ఆవిష్కారాలకు సంబంధించిన పోటీలను నిర్వహిస్తారు. నూతన ఆవిష్కరణలు, నవ్య సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన అంశాలలో వచ్చే 15 ఏళ్లలో ప్రపంచంలోనే అత్యధిక ఆర్థిక కార్యకలాపాలు భారత్‌లో సాగనున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తుచేశారు. 
రాజధాని ప్రాంతాన్ని సుందరీకరించాలని ఆదేశం
భవిష్యత్‌ అవసరాలకు తగినట్టుగా ఇప్పటి నుంచే సిద్ధం కావాలని ఏడీసీ, సీఆర్‌డీఏ అధికారులకు చంద్రబాబు సూచించారు. ఇన్నోవేషన్ సమ్మిట్‌ను ఏటా క్రమం తప్పకుండా నిర్వహించి.. నగర అభివృద్ధి విషయంలో ప్రపంచ గమనంతో సమానంగా పోటీ పడాలని సూచించారు. రాజధాని ప్రాంతాన్ని మొత్తం వెంటనే సుందరీకరించాలని ముఖ్యమంత్రి సమావేశంలో ఆదేశించారు. గుంటూరు-విజయవాడ జాతీయరహదారి మార్గంలో పచ్చదనం వెల్లివెరిసేలా తీర్చిదిద్దాలని చెప్పారు. రాజధాని పరిధిలోని శాఖమూరు, ఐనవోలు గ్రామాలలోని 198.52 ఎకరాల ప్రాంతాన్ని ఐటీ పార్కుగా గుర్తించడానికి సమావేశం ఆమోదం తెలిపింది. ఇందులో ఐనవోలు గ్రామ పరిధిలోని 53.10 ఎకరాల ప్రదేశాన్ని ఐటీ సెజ్‌గా గుర్తించడానికి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించాలని సమావేశం నిర్ణయించింది. రాజధాని ప్రాంతంలో జరుగుతున్న రహదారి నిర్మాణాలు ఏప్రిల్ నాటికి పూర్తిస్థాయిలో సిద్ధం చేస్తామని అధికారులు చెప్పగా, అంతకంటే ముందే పూర్తిచేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు.

 

ఢిల్లీలో దట్టమైన పొగమంచు

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీంతో 26 రైళ్లు ఆలస్యంగా నడవనున్నాయి. 7 రైళ్ల సమయాల్లో మార్పులు చేశారు. 19 రైళ్లను రద్దు చేశారు. 

 

గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం

గుంటూరు : ఫిరంగిపురం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు టెన్త్ విద్యార్థులతోపాటు ఆటో డ్రైవర్ మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. 

 

08:17 - December 28, 2017

ఢిల్లీ : టీఆర్‌ఎస్‌ ఎంపీల ఆందోళనతో లోక్‌సభ దద్దరిల్లింది. హైకోర్టు విభజన కోసం..ఎంపీలు గళమెత్తారు. వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. పలుమార్లు సభకు అంతరాయం కలిగించారు. స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని డిమాండ్ చేశారు. 
లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ ఎంపీల ఆందోళన
విభజన హామీలను వెంటనే అమలు చేయాలంటూ టీఆర్‌ఎస్‌ ఎంపీలు లోక్‌సభలో ఆందోళనకు దిగారు. హైకోర్టు విభజనపై వాయిదా తీర్మానం ప్రవేశపెట్టిన టీఆర్‌ఎస్ ఎంపీలు.. స్పష్టమైన ప్రకటన కోసం డిమాండ్ చేశారు. ఎంపీ కవిత, జితేందర్‌ రెడ్డి వెల్‌లోకి దూసుకువెళ్లి నినాదాలు చేశారు. దీంతో లోక్‌సభ స్తంభించిపోయింది. హైకోర్టు విభజనపై టీఆర్‌ఎస్ ఎంపీలు పట్టువిడవకపోవడంతో లోక్‌సభ రెండు సార్లు వాయిదా పడింది.
హైకోర్టు విభజన చేయకపోవడం దురదృష్టకరం : టీఆర్‌ఎస్‌ ఎంపీలు 
మూడున్నరేళ్లు గడిచినా హైకోర్టు విభజన చేయకపోవడం దురదృష్టకరమని టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం చొరవ చూపి వెంటనే హైకోర్టును విభజించాలన్నారు. లేకపోతే తమ ఆందోళన కొనసాగుతుందని హెచ్చరించారు.  కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు తమ ఆందోళన కొనసాగుతుందన్నారు.
తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు అత్యవసరం : అనంత కుమార్
తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు అత్యవసరమని పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్ కుమార్ అన్నారు. హైకోర్టు విభజన అంశాన్ని న్యాయశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. దేశంలోని అన్ని రాష్ర్టాలకు ప్రత్యేక హైకోర్టులు ఉన్నాయని.. అదే విధంగా తెలంగాణకు కూడా ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుకు చొరవ తీసుకుంటామని కేంద్రమంత్రి అనంత్ కుమార్ తెలిపారు. 
టీఆర్‌ఎస్‌ ఎంపీల ఆందోళనతో కేంద్రంలో కదిలిక 
మొత్తానికి టీఆర్‌ఎస్‌ ఎంపీల ఆందోళనతో కేంద్రం కదిలింది. హైకోర్టు విభజనపై హామీ లభించింది. దీనిపై  కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ గురువారం చెబుతామని హామీ ఇచ్చినట్లు ఎంపీ వినోద్‌ తెలిపారు. గులాబి పార్టీ ఎంపీలు విభజన హామీలపై పార్లమెంట్‌లో హీట్ పుట్టించారు.  ఇప్పటికైనా..  హైకోర్టు విభజన జరుగుతుందో లేదో ? చూడాలి.

 

07:44 - December 28, 2017

చిత్తూరు : జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. కర్ణాటక ఆర్టీసీ బస్సు, టెంపో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి, చెందగా.. 11 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. గాయాలైన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తిరుమల నుంచి మైసూర్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక మృతులంతా మహారాష్ట్రకు చెందినవారుగా గుర్తించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

మేఘన ట్రావెల్స్ యాజమాన్యం నిర్వాకం

విశాఖ : మేఘన ట్రావెల్స్ యాజమాన్యం నిర్వాకం బయటపడింది. రెగ్యులర్ డ్రైవర్ రాకపోవడంతో యాజమాన్యం ఆఫ్ టింగ్ డ్రైవర్ ను ఇచ్చి పంపింది. బస్సు ఆలస్యంగా నడుపుతున్నారని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఎన్ ఏడీ కొత్త రోడ్డు జంక్షన్ లో బస్సు నిలిపివేసి డ్రైవర్ పరారయ్యారు. డోర్ లాకవడంతో బస్సులో 30 మంది ప్రయాణికులు చిక్కుకున్నారు. స్థానికులు బస్సు డోర్ తీసారు. విశాఖ నుంచి బస్సు హైదరాబాద్ వెళ్తోంది. మేఘన ట్రావెల్స్ యాజమాన్యం పట్టించుకోలేదు. 

 

నేటి నుంచి ఎన్ టీఆర్ బయోపిక్ చిత్ర షూటింగ్ ప్రారంభం

హైదరాబాద్ : నేటి నుంచి ఎన్ టీఆర్ బయోపిక్ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. డైరెక్టర్ తేజ దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్ టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటిస్తున్నారు. జనవరి 18న టీజర్ విడుదల కానుంది. 

 

రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి

చిత్తూరు : బంగారుపాళ్ళం మండలం కేజీసత్రం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కర్ణాటక ఆర్టీసీ బస్సు, టెంపో వ్యాన్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరో 11 మందికి గాయాలయ్యాయి. మృతులు మహారాష్ట్ర వాసులుగా గుర్తించారు. 

 

Don't Miss