Activities calendar

29 December 2017

22:03 - December 29, 2017

ఢిల్లీ : ముంబయి అగ్ని ప్రమాదంపై బీజేపీ ఎంపీ, నటి హేమమాలిని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముంబయిలో అగ్ని ప్రమాదానికి అధిక జనాభే కారణమని తెలిపారు. ముంబయిలోకి పరిమితికి మించి జనాభాను అనుమతించడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని, జనాభా అనుమతికి కూడా కొన్ని పరిమితులు విధించాల్సిన అవసరం ఉందని హేమమాలిని పేర్కొన్నారు. ముంబై ముగిశాక మరో నగరం ప్రారంభం కావాలి...అంతేకాని నగరం ఇంకా విస్తరిస్తూనే ఉండడం వల్ల నియంత్రణ లేకుండా పోతోందని చెప్పారు. పార్లమెంట్‌ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ హేమమాలిని ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రమాద ఘటనపై హేమమాలిని ఆవేదన వ్యక్తం చేయడానికి బదులు అధిక జనాభా కారణమని చెప్పడం విమర్శలకు దారితీసింది.

21:59 - December 29, 2017

ప్రపంచంలో ఇంత పెద్ద పీపీ ప్రాజెక్టు ఎవరు చేయలేదని, ప్రపంచంలో మనం మొదలు పెట్టినప్పుడు 200 మెట్రోలు ఉన్నాయని మెట్రో ఎండీ ఎన్ వీఎస్ రెడ్డి అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

21:55 - December 29, 2017

తెల్గురాష్ట్రాలళ్ల రాజకీయ పార్టీలు ఆడిన నాట్కానికి అమాయక జనం ఎట్ల బలైపోతున్నరో సూడుండ్రి.. వాళ్ల ట్రాపుల వడి.. ఎవ్వని శవాన్ని వాడే బుజం మీద ఏస్కోని పోతున్నడు.. కుట్రలను మాత్రం పశిగట్టలేకపోతున్నరు పేదలు.. ప్రజల నడ్మ ఎప్పుడు తాకులాటలు వెడ్తెనే ఈ అగ్రవర్ణ పార్టీలకు పట్టుంటది గావట్టి వాళ్లు ఎంత గొప్ప కుట్రలు జేస్తరో జర గమనించుండ్రి ప్రజలారా..

సూశిండ్రా ప్రజలారా..? కులాలుగ గాదు.. మన్షులుగ బత్కుదామని చెప్పినందుకు ఒక ఆడిబిడ్డను వట్కోని ఫేస్ బుక్కులళ్ల ఎన్నెన్ని మాటలంటున్నరో.. మనుధర్మశాస్త్రం మన్షులను విడగొట్టింది.. లేని కులాలను అంటగట్టింది.. అటువంటి శాస్త్రం మనకు అక్కెరలేదు అన్నందుకు.. పాపం సూరెపల్లి సుజాతా అనే దళిత బిడ్డ ఫొటోను ఫేస్ బుక్కుల వెట్టి కొంతమంది దొంగసాలేగాళ్లు గలీజు మాటలు తిడ్తున్నరు..

సర్కారు తమాష గమ్మతుంటదివా... పత్తిబాగవండినప్పుడు పత్తికొనుగోలు కేంద్రాలు వెట్టరు.. వరి బాగ వండినప్పుడు వరికొనుగోలు కేంద్రాలు వెట్టరు.. కందులు వండనప్పుడు కందుల కొనుగోలు కేంద్రాలు వెడ్తరు.. తెలంగాణల కందుల దిగుబడే ఈసారి అంతంత మాత్రమున్నది.. అంతంతున్న పంటకు ఆత్రంగ కేంద్రాలు.. అర్జెంటుగ మద్దతు ధరలు.. వారెవ్వ..?

చెప్పేటియి శ్రీరంగ నీతులు చేశేటియి ఏవో అన్నట్టు.. చంద్రబాబు జెప్పె ముచ్చట్లు అన్ని కమ్మగ అనిపిస్తయ్.. చేతలు మాత్రం రోతతీర్గుంటయ్.. నిన్న ఇకతాన మాట్లాడుకుంట... మాట్లాడుకుంట ఏమంటడు.. మనం బైటిదేశాలనుంచి నేర్చుకునుడు గాదు.. మన అమరావతిని జూశి బైటిదేశాలోళ్లు నేర్చుకోవాలె అంటున్నడు.. దేంతోని నవ్వాలే చంద్రాలు..?

పేరుకేమో.. మద్యపాన నిషేధ.. శాఖ.. దాని ఒర్జినల్ పని మద్యాన్ని తాగకుంట ప్రజలను రక్షించే కార్యం కని.. ఇయ్యాళ ఏం జేస్తున్నయ్.. ఆ శాఖలు.. ఏ వైన్సు ఎంత అమ్మాలే.. వాళ్ల టార్గెట్ ఎంత..? వైన్సుల పరిరక్షణ.. ప్రభుత్వానికి ఆదాయం బెంచే మార్గాలు.. ఒక్కమాటల జెప్పాల్నంటే ఇయ్యాళ ప్రభుత్వం బత్కుతున్నదే తాగువోతులమీద..

మామూల్గ ప్రజలు నిరసన దెల్పాలే.. రాజకీయ నాయకులు వాళ్ల కోరికలు నెరవేర్చాలు.. ప్రతిపక్షనాయకులు గూడ నిరసన తెల్పాలే.. ప్రభుత్వాలు నెరవేర్చాలే కని.. ప్రభుత్వం నడ్పుతున్న తెల్గుదేశం కార్పొరేటరే దీక్ష జేస్తున్నడు.. కోరిక నెరవేర్చవల్సింది మళ్ల ఆళ్ల సర్కారే.. ఇది పబ్లిసిటీ కోసం జేస్తరా..? లేకపోతె నిజంగనే జేస్తరా అనేది ఇది జూస్తె మీకే అర్థమైతది..

అమ్మా మీరు గ్రామపంచాది ఆఫీసుకు కరెంటి కట్ జేస్తారు బిడ్డా.. జర్రాగుండ్రి మీ కరెంటి ఆఫీసుకు తాళం ఏస్తమని ఏశిండ్రు.. గ్రామపంచాదికి కరెంటి ఆఫీసుకు నడ్మ న్యూటల్ వైరే షాకు గొడ్తున్నది.. ఆలేరు గ్రామపంచాది ఆఫీసర్లు.. కరెంటోళ్లు ఇద్దరు పట్టింపులకు వొయ్యి.. ఒకలిమీద ఒకలు అధికారం ఇసురుకుంటున్నరు..

కోతులు ఇంతా ఇంతా మన్షి రూపంలకు మారుతున్నట్టే అనిపిస్తున్నది.. మన్షి గూడ కోతి జాతికెళ్లే తయ్యారైండని అంటుంటరు.. కని కొన్ని కోతులు గమ్మతి జేస్తుంటయ్.. ఒక కోతి గొర్లు గాయవోతున్నది.. అడ్వి ఇడ్సిపెట్టి ఊర్లకొచ్చి గొర్ల మందెంటనే తిర్గుతున్నది.. యాదాద్రి బోనగిరి జిల్లా ఆలేరు మండలం శారాజిపేట కాడ ఇచ్చంత్రం కోతి కథ జూడుండ్రి..

21:53 - December 29, 2017

హిట్టనుకున్నారు.. ఫట్టయింది. చిన్న సినిమా అనుకున్నారు.. కలెక్షన్లలో భారీ అని రుజువయింది. ఆ హీరో కథ ముగిసింది అనుకున్నారు..కాదు.. మళ్లీ మొదలయిందని తేలింది.కసిపెట్టి తీశారు.. ప్రేక్షకులు నెత్తిన పెట్టుకున్నారు...టాక్ నెగెటివ్ గా వినపడింది.. కలెక్షన్లు పాజిటివ్ గా వచ్చాయి.. ఇదీ సింపుల్ గా తెలుగు సినిమాకు 2017 మిగిల్చిన గుర్తులు.. ఇదే ఈ రోజు వైడాంగిల్ స్టోరీ.. 2017లో రెండు సినిమాలు విపరీతమైన హైప్ తో వచ్చాయి. ఒకటి మెగాస్టార్ 150 వ చిత్రం.. మరొకటి బాహుబలి2. కట్టప్పను చంపిందెవరో తెలుసుకోటానికి ప్రేక్షకులు ఆరాటపడ్డారు. ఫలితం మెగా హిట్ గా నిలిచింది బాహుబలి. ఇక పోస్టర్ నుంచి సినిమా రిలీజ్ వరకు... ఆ తర్వాత. ఆద్యంతం వివాదాస్పదంగా నిలిచిన అర్జున్ రెడ్డి అనూహ్యంగా ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది. ఈ ఏడాది సత్తా చాటిన మరో భారీ చిత్రం ఖైదీ నంబర్ 150. దాదాపు తొమ్మిదేళ్ల తరువాత హీరోగా నటించిన మెగాస్టార్ చిరంజీవి తన కలెక్షన్ స్టామినా ఏ మాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసుకున్నాడు. ఇక జనతా గ్యారేజ్ లాంటి భారీ విజయం తరువాత ఎన్టీఆర్ నటించిన సినిమా జై లవకుశ రిలీజ్ కు ముందు నుంచే భారీ హైప్ క్రియేట్ అయ్యింది. అందుకు తగ్గట్టు కథా కథనాలు సాగటంతో ఈ సినిమా ఘనవిజయం సాధించింది.

టాక్ తో సంబంధం లేదు.. టాక్ ఫ్లాప్ అంటుంది. కలెక్షన్లు మాత్రం రివర్స్ లో ఉంటాయి. అవును.. 2017లో టాక్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులు తమ అభిమాన హీరోలపై కనకవర్షం కురిపించారు. సినిమాలకు ఫ్లాప్ టాక్.. డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లు మాత్రం తగ్గలేదు.. ఈ ఏడాది చిన్న సినిమాలకు బాగా కలిసొచ్చింది. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిన్న సినిమాలు సంచలన విజయాలు నమోదు చేశాయి. ఎవరూ ఊహించని విధంగా 50 కోట్ల క్లబ్ లో అడుగు పెట్టి స్టార్ హీరోలకు కూడా షాక్ ఇచ్చాయి. అదే సమయంలో చాలా కాలంగా హిట్ చూడని హీరోలు కొందరికి 2017 బంపర్ హిట్ లను అందించింది. ఓ పక్క రొటీన్ సినిమాలు వెల్లువెత్తుతున్నా, మంచి సినిమా వచ్చిందంటే ప్రేక్షకులు ఆదరించటం సహజంగా జరిగే విషయం. 2017లోనూ అదే జరిగింది. కొన్ని అంచనాలు మించాయి. కొన్ని బోల్తా కొట్టాయి. కొన్ని ఓ రేంజ్ లో కలెక్షన్ల వర్షం సాధించాయి. ముఖ్యంగా చిన్న సినిమాలకు లైఫ్ ఉందని ప్రూవ్ అయింది. ఈ ఉత్సాహంతో ఇండస్ట్రీ 2018వైపు ఆశావహంగా అడుగులు వేస్తోంది.

 

21:49 - December 29, 2017

టుడే అవర్ రిసెంట్ రిలీజ్ సినిమా 2 కంట్రీస్... తదైనా పంచ్ డైలాగ్స్ తో హస్యనటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సునీల్ హీరో టర్న్ తీసుకుని విభిన్న కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి చెప్పుకునే హిట్ సినిమాలు తీశాడు. అయితే ఈ మధ్య కాలంలో వరుస ప్లాప్ లతో సతమతమౌతున్నాడు. తాజాగా మళయంలో సూపర్ హిట్టైన 2 కంట్రిస్ సినిమాను తెలుగులో రీమేక్ చేశారు. జయం మనదేరా సినిమాలో కమెడిన్ బాగా డీల్ చేసిన ఎన్ శంకర్ ఈ సినిమాకి దర్శకత్వంతో పాటు నిర్మాణ బాధ్యతలు తీసుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. ట్రైయిలర్ మంచి హిట్ టాక్ తెచ్చుకుని ఈ సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుంది. సునీల్ కి ఎలాంటి విజయాన్ని అందించి అనేది ఇప్పుడు చూద్డాం...కథ విషయానికొస్తే పని పట లేకుండా ఎదుటివారిని మోసం చేసే ఉల్లాస్ వలన మాన మిత్రులతో పాటు కుటంబ సభ్యులు కూడా ఇబ్బంది ఎదుర్కుంటారు. పటేల్ అనే రౌడీ దగ్గర తను తీసుకున్న అప్పు తీర్చలేక రెండు కాళ్లు లేని పటేల్ చెల్లెల్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. తర్వాత ఏం జరిగిందో సినిమాలో చూడాల్సిందే...

21:22 - December 29, 2017

తమిళనాడులో ఉన్న రాజకీయ పరిస్థితి అక్కడ ప్రాంతీయ పార్టీలు డీఎంకే, అన్నాడీఎంకే మధ్య ఎప్పుడు పోరు జరిగింది. అయితే ప్రస్తుతం జయలలిత లేరు, కరణానిధి వృధ్దప్యంలోకి వెళ్లారు. ప్రస్తుతం డీఎంకే పుంజుకోలేదు అలా అని అన్నాడీఎంకే కూడా బలంగా లేదు దానికి ఉదాహరణ ఆర్కేనగర్ ఉపఎన్నికే అని ప్రముఖ విశ్లేషకులు ప్రొ. నాగేశ్వర్ అన్నారు పూర్తి వివరాలకు వీడియో చూడండి.

21:21 - December 29, 2017

తిరుపతి రావు కమిటీ రిపోర్ట్ తము వ్యతిరేకిస్తున్నామని, అందులో ప్రైవేట్ స్కూల్లకు అనుకూలంగా ఉందని, మే నెలలో ప్రొ. తిరుపతి ఓ నివేదిక ఇచ్చారు. అప్పుడిచ్చిన నివేదికకు ఇప్పుడిచ్చిన నివేదికు చాలా తేడా ఉందని, ఎవరి పర్మిషన్ లేకుండా 10 శాతం ఫీజ్ లు పెంచుకోవచ్చని, ఇతి సామాన్య ప్రజలకు నష్టం కల్గిస్తోందని రెగ్యూలెటరీ కమిటీ సభ్యుడు అశిష్ అన్నారు. ప్రైవేట్ స్కూల్ అన్ని ఒకే గొడుగు కిందకు తీసుకురావడం మంచికాదని, కొన్ని విద్యాసంస్థలు మాత్రమే అధిక ఫీజ్ ను వసూల్ చేస్తోందని, దానికి తము కూడా వ్యతిరేకమని, ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి 42వేలు ఖర్చు పెడుతుందని ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మధుసుదన్ అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

21:20 - December 29, 2017

కృష్ణా : జిల్లా కొండూరు మండల తహసీల్దార్ కార్యాలయంలో 10టీవీ క్యాలెండర్‌ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో కె సుధారాణి పాల్గొన్నారు. 2018 నూతన సంవత్సర క్యాలెండర్‌ ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. పేదల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో 10 టీవీ ముందంజలో ఉండటం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో టెన్‌ టీవీ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. 

21:15 - December 29, 2017

అనంతపురం : స్వర్గీయ ఎన్టీఆర్‌ కలను తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నెరవేర్చడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు నందమూరి బాలకృష్ణ. అనంతపురం జిల్లా హిందూపురం నియోజక వర్గంలో 2వ రోజు పర్యటన సందర్భంగా బాలకృష్ణ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 194 కోట్ల నిధులతో ఏర్పాటు చేస్తున్న పైప్‌ లైన్‌ బృహత్తర నీటి పథకం పనులను ఆయన ప్రారంభించారు. 66 కోట్లతో డ్రైనేజీ, రోడ్డు, వీధి దీపాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు బాలకృష్ణ.

21:13 - December 29, 2017

తూర్పుగోదావరి : కాకినాడ జేఎన్టీయూ సాంకేతిక సమస్యలతో సతమతమవుతోంది. యూనివర్సిటీలో అధికారులు విధులకు డుమ్మా కొట్టి సొంత పనులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తుంది. దీంతో క్యాంపస్ బోసిపోతోంది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

21:11 - December 29, 2017

ఢిల్లీ : పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై జోక్యం చేసుకోవాలని ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేసినట్లు CPI జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. ఈ మేరకు ఢిల్లీలో ప్రధానిని కలిసిన నారాయణ వినతిపత్రం అందించారు. పోలవరం నిర్మాణం విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపం ఎక్కడ వచ్చిందో పరిశీలించాల్సిందిగా మోడీని కోరినట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్‌ కోసం ప్రత్యేకంగా ఒక సెల్‌ను ఏర్పాటు చేసి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి చొరవ చూపించాలని ప్రధానిని కోరామని అన్నారు.

21:10 - December 29, 2017

చిత్తూరు : ఉదయం నుండి క్యూ లైన్లో ఉన్నా తమకు కనీసం మంచి నీళ్లు కూడా ఇవ్వలేదని తిరమలలో భక్తులు టీటీడీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు భక్తులు ఏకంగా టీటీడీ అధికారులను తిట్టడం మొదలు పెట్టారు. అయితే ఇదంతా టీటీడీ ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ తనిఖీలు చేస్తుండగా జరగడంతో ఆయన సంబంధిత అధికారులను మందలించారు. వెంటనే మంచినీరు తెప్పించి భక్తులకు సరఫరా చేయాలని ఆదేశించారు. దీంతో అధికారులు మంచి నీటి బాటిళ్లను తెప్పించి పంపిణీ చేశారు. నిత్యాన్నదానం అధికారులు కూడా భక్తులకు అవసరమైన అన్న ప్రసాదాలను త్వరగా సిద్ధం చేయడంతో భక్తులు శాంతించారు. 

21:08 - December 29, 2017

సంగారెడ్డి : జిల్లా నారాయణఖేడ్‌ నియోజకవర్గంలో కల్తీ మద్యం ఏరులై పారుతోంది. ఎక్సైజ్‌ శాఖ ఆధీనంలో తొమ్మిది మద్యం షాపులు ఉన్నాయి. అయితే నారాయణఖేడ్‌లో నాలుగు ఉండగా మిగతా ఐదు మండలాల్లో ఉన్నాయి. మద్యం ప్రియులను ఆసరాగా చేసుకున్న లిక్కర్‌ మాఫియా.. ప్రతి ఊరులోనూ బెల్ట్‌షాపులను నిర్వహిస్తున్నాయి. బెల్ట్‌ షాపులను నియంత్రించాల్సిన అధికారులు... మామూళ్ల మత్తులో జోగుతూ పట్టించుకోవడం లేదని స్థానికులంటున్నారు. కల్తీ మద్యం గురించి అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఇక్కడ మద్యం బాటిళ్లలో సగ భాగం వరకు తీసేసి స్పిరిట్‌ వంటి పదార్ధాలను కలుపుతూ కల్తీకి పాల్పడుతున్నారు.

డిసెంబర్‌ 31 న్యూ ఇయర్‌ సందర్భంగా
డిసెంబర్‌ 31 న్యూ ఇయర్‌ సందర్భంగా విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతాయని స్థానికులంటున్నారు. అలాగే.. మద్యం అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరోవైపు ఇతర రాష్ట్రాల నుండి మద్యాన్ని దిగుమతి చేసుకొని.. కల్తీకి పాల్పడుతున్నారంటున్నారు. ఇదిలావుంటే... ఎక్సైజ్‌ అధికారులు మాత్రం ప్రభుత్వం నిర్ణయించిన ధరకే మద్యం విక్రయించాలని.. లేకపోతే చర్యలు తీసుకుంటామంటున్నారు. తాజాగా రేట్లు పెరిగినప్పటికీ.. మద్యం బాటిల్‌పై ఉన్న బార్‌ కోడ్ ఉన్న ధరకే మద్యం విక్రయించాలంటున్నారు. ఏది ఏమైనప్పటికీ మద్యం ప్రియుల బలహీనతను ఆసరాగా చేసుకొని కల్తీరాయుళ్లు జోరుగా వెనకేసుకుంటున్నారు. అయితే... కల్తీలతో ఎలాంటి అపాయం జరగకముందే... చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. 

21:06 - December 29, 2017

హైదరాబాద్ : హైదరాబాద్‌ను బెగ్గింగ్‌ ఫ్రీ సిటీగా మార్చేపనుల్లో భాగంగా ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్పలితాలు ఇస్తున్నాయి. నగరంలో ఉన్న యాచకులను చంచల్‌గూడ, చర్లపల్లి జైళ్లలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఆహారం, దుస్తులు అందిస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

21:05 - December 29, 2017

హైదరాబాద్ : హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టు విజయవంతమైంది. గత నెల 28న ప్రధాని మోదీ ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. మియాపూర్‌ - అమీర్‌పేట - నాగోల్‌ మార్గాల్లో రైళ్లు నడుస్తున్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు మొదటి నెలలో 32.25 లక్షల మంది ప్రయాణించారు. రోజుకు సగటున లక్ష మంది ప్రయాణికులు చేరవేస్తోందని మెట్రో రైల్‌ ఎండీ ఎన్‌వీఎస్‌ రెడ్డి చెబుతున్నారు.

21:04 - December 29, 2017

హైదరాబాద్ : ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగపై మంత్రి కడియం శ్రీహరి మండిపడ్డారు. బీజేపీ నేతలతో చెట్టపట్టాలేసుకుని తిరిగితే వర్గీకరణ సాధ్యం అవుతుందా అని మందకృష్ణను ప్రశ్నించారు. జనవరి 5 తర్వాత వర్గీకరణ అంశంపై ప్రధానిని కలుస్తామని మంత్రి కడియం అన్నారు. మందకృష్ణ మాదిగ వ్యవహారం వెనుక ఎవరి రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని కడియం ప్రశ్నించారు. 

16:22 - December 29, 2017

గుంటూరు : ఏపీ హోం మంత్రి చినరాజప్పకు ఫోరెన్సిక్ డైరెక్టర్ గాంధీ క్షమాపణ తెలిపారు. డిప్యూటీ సీఎం చినరాజప్పకు చంద్రబాబు ఫోన్ చేశారు. ఫోరెన్సిక్ ల్యాబ్ శంకుస్థాపన వివాదంపై చంద్రబాబు ఆరా తీశారు. తనకు కనీసం ఆహ్వానం కూడా లేదంటూ జరిగిన విషయాన్ని సీఎంకు చినరాజప్ప వివరించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

కర్నూలు ఎమ్మెల్సీగా కేఈ..

కర్నూలు : నగర ఎమ్మెల్సీగా కేఈ ప్రభాకర్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. ఈ మేరకు ఆయన డిక్లరేషన్ ఫామ్ ను అందుకున్నారు. 

డ్రగ్స్ విలువ రూ. కోటి - సీపీ...

హైదరాబాద్ : రూ. కోటి విలువైన కొకైన్ ను పట్టుకున్నట్లు నగర సీపీ పేర్కొన్నారు. జాన్ చుక్కూ అనే నైజీరియన్ ప్రధాన నిందితుడని, మూడు నెలల క్రితమే జాన్, బెనార్డ్ లు విడుదలయ్యారని పేర్కొన్నారు. 

16:09 - December 29, 2017

హైదరాబాద్ : నగరంలో మళ్లీ భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబండాయి. వాటిని సరఫరా చేస్తున్న నైజీరియన్లు పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

చిన రాజప్పకు బాబు ఫోన్...

విజయవాడ : డిప్యూటి సీఎం చిన రాజప్పకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారు. ఫోరెన్సిక్ ల్యాబ్ శంకుస్థాపన వివాదంపై ఆరా తీశారు. కనీసం ఆహ్వానం కూడా అందలేదని, సాయంత్రం కలుస్తానని సీఎంకు చినరాజప్ప తెలియచేశారు. ఈ నేపథ్యంలో మంత్రి చిన రాజప్పకు ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్ గాంధీ క్షమాపణలు తెలియచేశారు. 

కోకాపేటలో సీఎం కేసీఆర్...

రంగారెడ్డి : జిల్లాలోని కోకాపేటలో సీఎం కేసీఆర్ పర్యటించారు. యాదవ..కుర్మ భవనాలకు ఆయన శంకు స్థాపన చేశారు. ఇందుకు పది ఎకరాలను భూమి కేటాయించారు. 

దివ్యాంగుల వివాహ ప్రోత్సాహకం పెంపు...

హైదరాబాద్ : దివ్యాంగుల వివాహ ప్రోత్సాహకాన్ని టీఎస్ సర్కార్ పెంచింది. రూ. లక్షకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ ఫైలుపై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. 

2017 ఏడాది విజయవాడ నేరాల వార్షిక నివేదిక...

విజయవాడ : 2017 ఏడాది నగర నేరాల వార్షిక నివేదికను సీపీ గౌతమ్ సవాంగ్ నివేదికను ప్రవేశ పెట్టారు. సైబర్ క్రైమ్ పోలీసులకు సవాల్ గా మారిందని, 185 సైబర్ నేరాలు నమోదయ్యాయన్నారు. ఆన్ లైన్ బ్యాంకింగ్ మోసాలు 120..48 కేసులు చేధించి రూ. 27,83,649 రికవరీ చేయడం జరిగిందన్నారు. బ్యాంకు ఖాతాదారులకు ఆన్ లైన్ లావాదేవీలపై అవగాహన లేకపోవడమే సైబర్ క్రైమ్ పెరగడానికి కారణమన్నారు. ఎవరైనా ఫోన్ చేసి బ్యాంకు ఖాతా వివరాలు అడిగితే చెప్పవద్దని, బ్యాంకు అధికారులు ఎప్పటికీ ఓటీపీ వివరాలు అడగరన్నారు. 

15:38 - December 29, 2017

వరంగల్: వైకుంఠ ఏకాదశి సందర్భంగా వరంగల్‌ అర్బన్‌ జిల్లా వ్యాప్తంగా వైష్ణవ ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. స్వామి వారి దర్శనం కోసం భక్తులు ఉదయం నుండే ఆలయ ప్రాంగణంలో బారులు తీరారు. స్వామి వారి నామస్మరణలతో ఆలయ ప్రాంగణాలు మార్మోగాయి. 

15:37 - December 29, 2017

కరీంనగర్ : శాతవాహన యూనివర్సిటీలో విద్యార్ధుల ఘర్షణపై ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత స్పందించారు. మనుస్మృతులను దగ్ధం చేస్తే బీజేపీ, ఆర్‌ఎస్ఎస్‌లకు ఎందుకు ఆగ్రహం వస్తుందని ప్రశ్నించారు. మహిళలను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ఎంతవరకూ సమంజసమంటూ బీజేపీ నేతలను ప్రశ్నించారు. సోషల్ మీడియాలో చేసిన అసభ్యకర కామెంట్లపై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఆమె చెప్పారు. యూనివర్సిటీలో విద్యార్ధులను రెచ్చగొట్టడం లేదని.. దళితుల పక్షాన పోరాటాలు మాత్రమే చేస్తున్నామని అంటున్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

15:35 - December 29, 2017

కృష్ణా : విజయవాడలో నేరాలను అదుపుచేయడంలో పోలీస్‌ యంత్రాంగం సమర్థంగా పనిచేస్తోందన్నారు నగర పోలీస్‌ కమిషనర్‌ గౌతం సవాంగ్‌. కొత్త టెక్నాలజీని ఉపయోగించి మంచి ఫలితాలు రాబట్టామన్నారు. నేరాలను అదుపు చేయడంతో ప్రజల సహకారం తీసుకుంటున్నామన్నారు.

15:34 - December 29, 2017

వరంగల్ : వరంగల్‌లోని బాలవికాసలో సమావేశమైన హిజ్రాలు కేసీఆర్‌ చిత్రపటానికి వినతిపత్రం అందించారు. సమాజంలో గౌరవంగా బతికేందుకు ప్రభుత్వం చేయూత నివ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

15:33 - December 29, 2017

మహబూబ్ నగర్ : జిల్లా జడ్చర్లలో కాంగ్రెస్ ర్యాలీలో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. రేవంత్ రెడ్డి, మల్లు రవి పాల్గొన్న ఈ ర్యాలీని కొందరు టీఆర్ఎస్ కార్యకర్తలు... అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో టీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ర్యాలీలో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. 

15:22 - December 29, 2017

జడ్చర్లలో కాంగ్రెస్ ర్యాలీ..ఉద్రిక్తత..

మహబూబ్ నగర్ : జడ్చర్లలో కాంగ్రెస్ నిర్శహిస్తున్న ర్యాలీలో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ ర్యాలీలో రేవంత్ రెడ్డి, మల్లు రవిలు పాల్గొన్నారు. ర్యాలీని టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకొనేందుకు ప్రయత్నించాయి. పోలీసులు టీఆర్ఎస్ శ్రేణులను అడ్డుకున్నారు. టీఆర్ఎస్..కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 

14:52 - December 29, 2017

దేశంలోని 6 మెట్రో నగరాల్లో మహిళలకు సురక్షిత నగరంగా చెన్నై నిలిచింది. చెన్నై తర్వాత ముంబై, కోలకత్తా నిలిచాయి. మహిళలకు రక్షణలేని నగరంగా ఢిల్లీ నిలిచింది. ఈ వివరాలను నేషనల్ క్రైమ్ రిపోర్ట్ వారు వెల్లడించారు. ఐదు రోజుల్లో మౌంట్ ఎవరెస్ట్ రెండుసార్లు అధరోహించింది అన్షూ. ఈ మే 16 మొదటిసారిగా, 26న రెండవసారి మౌంట్ అధిరోహించి రికార్డు సృష్టించారు. ఇలాంటి మరిన్ని విషయాలకు వీడియో క్లిక్ చేయండి.

14:51 - December 29, 2017
14:50 - December 29, 2017

రాయ్ పూర్ : చత్తీస్ గఢ్ లోని సుక్మాజిల్లా అటవీ ప్రాంతంలో 12 మంది మావోయిస్టు మిలీషయా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవలి కాలంలో పోలీసు వాహనాలు కాల్చివేయండతో పాటు దాడుల నిర్వహించిన వారిలో వీరు ఉన్నారు. మరింత సమాచారం వీడియో క్లిక్ చేయండి. 

మావోయిస్టు మిలీషియా సభ్యుల అరెస్టు...

ఛత్తీస్‌గఢ్ : సుక్మా జిల్లా అటవీ ప్రాంతంలో 12 మంది మావోయిస్టు మిలీషియా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల మిలీషియా సభ్యులు పోలీసు వాహనాలను కాల్చివేయడం.. దాడులకు తెగబడటం వంటి దుశ్చర్యలకు పాల్పడ్డారు. 

14:40 - December 29, 2017

హైదరాబాద్ : నగరంలో మరోసారి డ్రగ్స్ కలంకలం సృష్టించింది. ముగ్గురు నైజీరియన్లను పోలీసులు అరెస్ట్ చేశారు వారి వద్ద 225 గ్రాముల కొకైన్ 30 గ్రాముల హెరాయిన్ పట్టుబడింది. న్యూఇయర్ కోసం వారు డ్రగ్స్ ను హైదరాబాద్ కు తరలిస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

14:25 - December 29, 2017

శ్రీకాకుళం : గిరిజన సంక్షేమ శాఖలోని డీఈఈ కృష్ణకుమార్ పై ఏసీబీ కొరడా ఝులిపిచింది. కృష్ణకుమార్ ఇళ్లపై ఏసీబీ దాడులు చేసింది. గుంటూరు, విశాఖపట్నం, గరివిడి, శ్రీకాకుళం, రాజాంలో తనిఖీలు చేశారు. కోటికి పైగా ఆస్తులున్నట్లు ప్రకటించారు. విశాఖ, భోగాపురంలో స్థలాలున్నట్లు గుర్తించారు. 150 గ్రాముల బంగారం, రెండు కార్లు, విలువైన పత్రాలు లభ్యం అయ్యాయి. కేసు నమోదు చేసి..దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. .

14:16 - December 29, 2017

నాకర్ కర్నూలు : సుధాకర్ రెడ్డి హత్య కేసులో నిందితులకు 14 రోజులు రిమాండ్ విధించారు. ప్రియుడు రాజేష్ తో కలిసి స్వాతి.. భర్త సుధాకర్ రెడ్డిని దారుణంగా హతమార్చింది. భర్త స్థానంలో ప్రియుడు రాజేష్ ను తెచ్చేందుకు స్వాతి హైడ్రామా అడింది. స్వాతి నాటకాన్ని సుధాకర్ రెడ్డి కుటుంబసభ్యులు బయటపెట్టారు. రాజేష్, స్వాతిని నాగర్ కర్నూలు పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. నిందితులకు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

14:07 - December 29, 2017

హైదరాబాద్ : తెలంగాణలో వివిధ పోటీ పరీక్షలకు తేదీలు ఖరారయ్యాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని పలు పరీక్షలను ఈసారి ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఎంసెట్‌ను మే 2 నుంచి 5 వరకు  నాలుగు రోజుల పాటు నిర్వహించాలను డిసైడ్‌ చేశారు. ఇక ఎడ్‌సెట్‌ను మే 31న నిర్వహించనున్నారు. 

తెలంగాణలో వచ్చే విద్యా సంవత్సరం ఉన్నత విద్యలో ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌లో నిర్వహించే వివిధ ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. మే 2 నుంచి 5వ తేదీ వరకు ఎంసెట్‌ నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఇక ఎంసెట్‌ నిర్వహించే బాధ్యత హైదరాబాద్‌ జెఎన్టీయూకు అప్పగించారు. ఇక ఈసెట్‌ మే 9న, ఐసెట్‌ మే 17న, పీఈసెట్‌ మే 20న నిర్వహించాలని నిర్ణయించారు. ఈసెట్‌ హైదరాబాద్‌ జెఎన్టీయూ, ఐసెట్‌ కేయూ, పీఈసెట్‌ మహాత్మాగాంధీ యూనివర్సిటీ నిర్వహించనున్నాయి. మే 25న లాసెట్‌, 26న పీజీ లాసెట్‌ ఓయూ నిర్వహించనుంది. అలాగే పీజీ ఈసెట్‌ మే 27న ఓయూ నిర్వహించనుంది. ఇక ఎడ్‌సెట్‌ను మే 31న ఓయూ నిర్వహిస్తుందని ఉన్నత విద్యామండలి తెలిపింది. 

ఇక ఈసారి పీఈసెట్‌ మినహా అన్ని పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ప్రతిష్టాత్మకమైన ఎంసెట్‌ను నాలుగురోజుల పాటు ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి ప్రకటించారు. ప్రతిరోజు 50 వేల మంది ఆన్‌లైన్‌ పరీక్షకు హాజరుకానున్నారు. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం రెండుపూటలా పరీక్ష జరగనుంది. ఒక్కోసారి పరీక్షకు 25 వేల మంది హాజరవుతారు. వచ్చే సంవత్సరంలో ప్రవేశ పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించామని... తెలంగాణ స్టేట్‌ టెక్నాలజీ సర్వీసెస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు పాపిరెడ్డి. 

సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో.. తెలంగాణ విద్యార్థులు పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాల్సిన అవసరముందన్నారు పాపిరెడ్డి. ప్రవేశపరీక్షల కన్వీనర్ల పేర్లను త్వరలోనే ప్రకటిస్తామని... రాత పరీక్షల నిర్వహణ, దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను టీసీఎస్‌ నిర్వహిస్తుందన్నారు పాపిరెడ్డి. కన్వీనర్ల నియామకం తర్వాత సెట్‌ కమిటీలను ప్రకటిస్తామన్నారు. ఇక గతేడాది ఈసెట్‌ నిర్వహణలో తలెత్తిన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అనేక జాగ్రత్తలు పాటిస్తామన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. 

14:03 - December 29, 2017

చిత్తూరు : ఓ వైపు భరించలేని చలి..మరోవైపు తాగడానికి నీళ్లు కూడా లేని దుస్థితి. చంటిపిల్లలు, వృద్ధులతో తిరుమలలో గదులు దొరక్క భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు క్యూలైన్‌గా మారిపోయింది. 5 నుంచి 6 కిలోమీటర్ల వరకు భక్తులు బారులు తీరారు. అంచనాలకు మించి భక్తులు రావడంతో టీటీడీ అధికారులు కూడా ఏం చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. తిరుమల కొండపై భక్తులు పడుతున్న కష్టాలను వీడియోలో చూద్దాం... 

14:00 - December 29, 2017

చిత్తూరు : పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల భక్త జనసందోహంతో కిక్కిరిసిపోయింది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. 4 కిలోమీటర్లుకు పైగా క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. తిరుమలలో గదులు దొరకక ఇబ్బందులు పడుతున్నారు. 2.60 లక్షల మందికి దర్శనం చేయిస్తామని టీటీడీ చెబుతోంది. దీనిపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం.. 

డిసెంబర్ 31 నుండి స్మార్ట్ పోలీసింగ్ రోబో...

హైదరాబాద్ : స్మార్ట్ పోలీసింగ్ రోబో ను ప్రారంభించారు. హెచ్ బోట్స్ స్టార్టప్ సంస్థ దీనిని తయారీ చేసింది. డిసెంబర్ 31న ఈ రోబోను అందుబాటులోకి తేనున్నారు. ప్రజా సమస్యలను తెలుసుకుని పోలీసులను అప్రమత్తం చేయనుంది. అంతేగాకుండా ప్రజల నుండి ఫిర్యాదు కూడా తీసుకోనుంది. 

ట్రిపుల్ తలాక్ పై బాబు స్పందన...

విజయవాడ : ట్రిపుల్ తలాక్ పై టిడిపిలో ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవని, ఈ బిల్లు రద్దుకు ప్రతొక్కరూ మద్దతిస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. బిల్లుపై అభిప్రాయాలు సేకరించడం జరిగిందని, ముస్లింల్లో 44 శాతం పురుషులు..56 శాతం మహిళలు బిల్లును స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. 

13:59 - December 29, 2017

తూర్పుగోదావరి : జిల్లాలో కోరుకొండ మండలం జంబుపట్నంలో దారుణం జరిగింది. కూతురిని హత్య చేసేందుకు ప్రయత్నించాడో పెంపుడు  తండ్రి. ఉదయం స్కూలుకు వెళ్తుండగా తనపై కత్తితో దాడి చేశాడని కూతురు వెంకట లక్ష్మి చెబుతోంది.  బాధితురాలు లక్ష్మిని రాజమహేంద్రవరంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే కుటుంబవిభేదాలతోనే లక్ష్మిపై దాడి జరిగిందని బాధితురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.  

 

13:56 - December 29, 2017

సంగారెడ్డి : జిల్లా వైకుంఠపురంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు అంబరాన్నంటాయి. అతిపురాతనమైన వైకుంఠపురం ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకునేందుకు భక్తులు తెల్లవారుజామునుంచే పోటెత్తారు. వేలాదిగా తరలివచ్చే భక్తుల కోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం..

తెనాలి మార్కెట్ లో రైతుల ఆందోళన...

గుంటూరు : తెనాలి మార్కెట్ లో మినుములు కేంద్రం ప్రారంభించి రెండు రోజులైనా కొనుగోళ్లు జరపడం లేదని రైతులు నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. 

13:54 - December 29, 2017

కర్నూలు : టీడీపీ వ్యూహం ఫలించింది. కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కేఈ ప్రభాకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పోటీ నుంచి బైరెడ్డి అనుచరుడు నాగిరెడ్డి తప్పుకోవడంతో కేఈ ప్రభాకర్ ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. 

13:52 - December 29, 2017

కృష్ణా : విజయవాడ కేంద్రంగా గుట్కా మాఫియా చెలరేగిపోతుంది. రాష్ట్రంలోని అన్ని నగరాలు,.. గ్రామీణ ప్రాంతాలకు యధేచ్చగా గుట్కా, పాన్‌ మసాలాల దందా కొనసాగుతోంది. అక్రమంగా కోట్ల రూపాయల క్రయవిక్రయాలను జరుగుతున్నాయి.
మాదకద్రవ్యాల అడ్డాగా బెజవాడ
మాదక ద్రవ్యాలకు బెజవాడ అడ్డాగా మారుతోంది. నిఘా వ్యవస్థకే సవాల్ విసురుతూ బెజవాడ కేంద్రంగా ప్రజలకు హాని కల్గించే వాటిని గుట్టుచప్పుడు కాకుండా.. గుట్కా మాఫియా తరలిస్తోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా టన్నులకొద్ది గుట్కా, గంజాయి, మాదక ద్రవ్యాలను విచ్చలవిడిగా.. సరఫరా చేస్తున్నారు. ఈ మధ్యనే భారీ ఎత్తున గుట్కా పట్టుబడడమే దీనికి నిదర్శనం. 
నిద్రావస్థలో నిఘా వ్యవస్థ
గత మూడేళ్లుగా గుట్కా, గంజాయి, మాదక ద్రవ్యాలను వ్యాన్లు, మినీ ఆటోలు, ట్రక్కులు, లారీల్లో అక్రమంగా జిల్లాలు, రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు. నగరాన్ని టార్గెట్ చేసుకుని తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూపోతుంది గుట్కా మాఫియా. పగలు, రాత్రి తేడా లేకుండా గుట్కాల తరలింపు అడ్డగోలుగా జరుగుతోంది. అయితే.. ఇంత జరుగుతున్నా పసిగట్టి పట్టుకోవాల్సి నిఘా వ్యవస్థ నిద్రావ్యవస్థలో మునిగిపోయింది. 
ఒడిశా నుండి విజయవాడకు సరఫరా
ఒడిశాలోని బరంపురం, రాయగడ, నవరంగపూర్ తదితర ప్రాంతాల నుంచి.. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల మీదుగా విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడకు పోలీసుల కళ్లుగప్పి గుట్కా లోడ్‌లను తీసుకువస్తున్నారు. తమిళనాడులోని చెన్నై పరిసర ప్రాంతాల నుంచి నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, కృష్ణాజిల్లాకు తరలి వస్తోంది.  అటు బెంగళూరు నుంచి అనంతపురం, బళ్లారి నుంచి కర్నూలు జిల్లాకు, ఈశాన్య రాష్ట్రాలు, ఢిల్లీ తదితర ప్రాంతాల నుంచి విజయవాడ, గుంటూరుకు సరుకు యథేచ్ఛగా  సరఫరా అవుతోంది. 
గుట్కాపై కేంద్ర ప్రభుత్వం నిషేధం
ప్రాణాంతక గుట్కాపై ఐదారేళ్ల క్రితమే కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఏపీలో గుట్కా, పాన్‌ మసాలాలను నిషేధిస్తూ 2013 జనవరిలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిషేధం అమలు బాధ్యత వైద్య ఆరోగ్యం, విజిలెన్స్ అండ్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌, వాణిజ్య పన్నులు, పోలీస్, రవాణా శాఖలు తీసుకోవాల్సి ఉంది. ఆరోగ్యాన్ని పాడుచేసే విషపూరిత గుట్కాలను అమ్మినా, కొనుగోలు చేసినా సెక్షన్‌270, 273 కింద నేరంగా పరిగణించబడుతోంది.
గుట్కా విక్రయాలపై మండిపడుతున్న స్థానికులు
గుట్కాలు యధేచ్చగా విక్రయించడం ద్వారా.. ప్రజలు క్యాన్సర్‌ బారిన పడుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు. గుట్కాలపై నిషేధం ఉన్నప్పటికీ... విజయవాడలో యదేచ్చగా విక్రయాలు కొనసాగడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
మాఫియా భారీ ఎత్తున వ్యాపారం 
పోలీస్ వ్యవస్థకు, నిఘా వ్యవస్థకు సవాల్ విసురుతు.. మాఫియా భారీ ఎత్తున వ్యాపారం కొనసాగిస్తోంది. దేశంలో ఇప్పటికే క్రైమ్‌రేటులో విజయవాడ పేరుండగా... తాజాగా గుట్కా, గంజాయి, మాదక ద్రవ్యాల సిటీగా మారుతోంది. ఇప్పటికైనా అధికారులు గుట్కా మాఫియను అరికట్టి... ప్రజల ఆరోగ్యాలతో పాటు.. నగర ప్రతిష్టను  కాపాడాలని పలువురు కోరుతున్నారు. 

గిరిజన శాఖ డీఈఈ కోటికి పైగా అక్రమాస్తులు..

శ్రీకాకుళం : గిరిజన శాఖ డీఈఈ కృష్ణకుమార్ ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు ఆరోపణలున్నాయి. గుంటూరు, విశాఖ, గరివిడి, శ్రీకాకుళం, రాజాంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. కోటికి పైగా ఆస్తులున్నట్లు, విశాఖ, భోగాపురంలో స్థలాలున్నట్లు గుర్తించారు. 150 గ్రాముల బంగారం, రెండు కార్లు, విలువైన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. 

నగరంలో మళ్లీ డ్రగ్స్ కలకలం...

హైదరాబాద్ : నగరంలో మళ్లీ డ్రగ్స్ కలకలం రేగింది. కొత్త సంవత్సరం వేడుకల కోసం నగరానికి డ్రగ్స్ ను నైజీరియన్ ముఠా తరలిస్తోంది. ముగ్గురు నైజీరియన్లను పోలీసులు అరెస్టు చేశారు. 225 గ్రాముల కొకైన్, 30 గ్రాముల హెరాయిన్ ను సీజ్ చేశారు. 

రాజేష్..స్వాతికి రిమాండ్...

మహబూబ్ నగర్ : రాజేష్, స్వాతిని కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. సుధాకర్ రెడ్డి హత్య కేసులో శుక్రవారం నిందితులకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. భర్త స్థానంలో ప్రియుడు రాజేష్ ను తెచ్చేందుకు స్వాతి హై డ్రామా ఆడిన సంగతి తెలిసిందే. స్వాతి నాటకాన్ని సుధాకర్ కుటుంబసభ్యులు బయటపెట్టారు.

13:44 - December 29, 2017

గుంటూరు : జనవరి 2 నుంచి 11 వరకు ఐదో విడత జన్మభూమి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. జన్మభూమి కార్యక్రమాల వివరాలను వివరించారు. 10 రోజుల్లో 16 వేల గ్రామ జన్మభూములు జరుగుతాయన్నారు. లక్ష 80వేల మీటింగ్ లు జరుగుతాయన్నారు. ఈసారి జన్మభూమి కార్యక్రమాలు పకడ్బందిగా జరుగుతాయన్నారు. రోజుకో అంశంపై ప్రజలకు అవగాహనా కార్యక్రమాలుంటాయన్నారు. జన్మభూమి జరిగే రోజుల్లో రోజుకో జిల్లాలో పర్యటిస్తానని చెప్పారు.

పది జిల్లాల్లో పర్యటన..
పది జిల్లాల్లో పర్యటిస్తానని చెప్పారు. అన్ని ఊళ్లళ్లో గ్రామ సభలు జరుగుతాయన్నారు. జీవితానికి నాంది పలికింది స్వంత ఊరన్న విషయాన్ని మరువద్దన్నారు. ప్రజలు, ప్రవాస భారతీయులందరూ జన్మభూమిలో పాల్గొనాలన్నారు. 11న అన్ని మండలాల్లో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తామని చెప్పారు. గ్రామాల్లో క్రీడలు, కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తామని చెప్పారు. ఊరిలో ఉండే ఆటలను నిర్వహిస్తామని తెలిపారు. గ్రామ,  వార్డు, మున్సిపాలిటీ, జిల్లా స్థాయిలో క్రీడలు నిర్వహిస్తామని చెప్పారు. ఊరుకొక టీమ్ ఏర్పాటు చేసి క్రీడలను నిర్వహిస్తామని చెప్పారు. ఆశా వర్కర్, వీఈవో, వీఆర్ వో, గ్రామస్థాయిలో ఉండే ప్రభుత్వ అధికారులందరూ ఉంటారని చెప్పారు. వీరికి జిల్లా ఆఫీసర్, హెడ్ మాస్టర్ ను కో ఆర్డినేటర్ గా నిర్వహిస్తామని తెలిపారు. జన్మభూమిలో కొత్త పెన్షన్స్ ఇస్తామని చెప్పారు. రాబోయేకాలంలో జెన్కోలు గిన్కోలు పోతాయని అన్ని ఊర్లళ్లో సోలార్ విద్యుత్ అందుబాటులోకి వస్తుందన్నారు.  

న్యూ ఇయర్ సందర్భంగా ప్రత్యేక నిఘా - విజయవాడ డీసీపీ...

విజయవాడ : కొత్త సంవత్సరం సందర్భంగా ఏపీ రాష్ట్రంలో పోలీసులు పలు ఆంక్షలు విధించారు. నగరంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయనున్నట్లు, రాత్రి 10 నుండి తెల్లవారుజామున 4గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని విజయవాడ డీసీపీ కాంతిరాజు టాటా పేర్కొన్నారు. వేగంగా వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామని, ప్రధాన కూడళ్లలో బారికేడ్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఆడిటోరియంలో న్యూ ఇయర్ వేడుకలకు ముందస్తు పోలీసుల అనుమతి తీసుకోవాలని సూచించారు. 

12:49 - December 29, 2017

హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు విజయవంతమైందని మెట్రో రైలు ఎండీ ఎన్ వీఎస్ రెడ్డి అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. మనమందరం 2017 గుర్తుంచుకోవాల్సిన సంవత్సరమని చెప్పారు. హైదరాబాద్ చరిత్రను ప్రీ మెట్రో, పోస్ట్ మెట్రో అని చెప్పుకోవచ్చన్నారు. హైదరాబాద్ లో అభివృద్ధి జరుగుతోందన్నారు. మెట్రో రైలు హైదరాబాద్ చిరకాల స్వప్నమన్నారు. మెట్రో రైలు నిర్మాణ సమయంలో అనేక సమస్యలు ఎదుర్కొన్నామని తెలిపారు. పూర్తి చేస్తామా లేదా... అని చాలా భయమేసిందన్నారు. ఈ ప్రాజెక్టు పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ విధానంలో నిర్వహించామని తెలిపారు. ప్రపంచంలో ఎవరూ చేయలేని సాహసం చేశామని చెప్పారు. నవంబర్ 28న ప్రధాని నరేంద్రమోడీ మెట్రో రైలును ప్రారంభించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అయిన కొత్తలో ఎల్ ఆండ్ టీ వెళ్లిపోతుందని కొంతమంది ప్రచారం చేశారని చెప్పారు. హైదరాబాద్ ను సీఎం కేసీఆర్ విశ్వనగరం చేయాలన్నారని గుర్తు చేశారు. విశ్వనగరం చేయడంలో మెట్రో రైలు ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. 

 

హిమాచల్ కు రాహుల్...

హిమాచల్ ప్రదేశ్ : ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హిమాచల్ ప్రదేశ్ కు చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో ఆయనకు నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఇటీవలే జరిగిన ఎన్నికల్లో పార్టీ నుండి గెలుపొందిన ఎమ్మెల్యేలతో రాహుల్ భేటీ కానున్నారు. 

తిరుమలలో ఎన్నడూ లేని రద్దీ...

చిత్తూరు : తిరుమల జనసంద్రంతో కిక్కిరిసిపోతోంది. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా భారీగా భక్తులు తిరుమలకు పోటెత్తారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భక్తుల రద్దీ పెరగడంతో పలు సమస్యలు ఏర్పడుతున్నాయి. ఉదయం క్యూ లైన్ లో వేచి ఉన్న వారికి దర్శనం కోసం 30గంటల పాటు వేచి ఉండాల్సి వస్తుంది. మధ్యాహ్నం 12గంటల తరువాత క్యూ లైన్ లోకి ఎవరినీ అనుమతించబోమిన టిటిడి తేల్చిచెబుతున్నట్లు తెలుస్తోంది. 

కర్నూలు ఎమ్మెల్సీగా..

కర్నూలు : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఎట్టకేలకు ఏకగ్రీవమైంది. ఇద్దరు స్వతంత్ర్య అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఎమ్మెల్సీగా టిడిపి అభ్యర్థి కేఈ ప్రభాకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 

వచ్చే వారం రాజ్యసభకు ట్రిపుల్ తలాక్..

ఢిల్లీ : రాజ్యసభకు వచ్చే వారం ట్రిపుల్ తలాక్ బిల్లు రానుంది. ఇప్పటికే లోక్ సభలో ఈ బిల్లు ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. 

నకిలీ ఏసీపీ అరెస్టు...

హైదరాబాద్ : సెంట్రల్ జోన్ పరిధిలో నకిలీ ఎసీపీ రాఘవేంద్ర సత్యపాల్ ను పోలీసులు అరెస్టు చేశారు. కారు, రెండు బైక్ లను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ ఐడీ కార్డుతో ఓ ఇంజినీరింగ్ కాలేజీలో సెక్యూర్టీ ఇన్ ఛార్జీగా సత్యపాల్ ఉద్యోగం పొందాడు.

 

టీఎస్పీఎస్సీ ముట్టడి..

హైదరాబాద్ : నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ ముట్టడి జరిగింది. గ్రూప్ 2 ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని, ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. 

12:15 - December 29, 2017
12:06 - December 29, 2017

చెన్నై : రాజకీయాల్లోకి రావాలంటే కాలం, సమయం కలసిరావాలని తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అన్నారు. ఇవాళ నాల్గవ రోజు అభిమానులతో రజనీ భేటీ అయ్యారు. కోయంబత్తూరు, ఈరోడ్‌, తిరుప్పూర్‌, వేలూరు జిల్లాల నుంచి అభిమానులు తరలివచ్చారు. మొన్న శివాజీ గణేశన్‌, నిన్న నేను, ఇవాళ మరొకరు... కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుందన్నారు. తన నిర్ణయాన్ని ప్రకటించేందుకు ఇంకా రెండు రోజులే మిగిలివుందన్నారు. అభిమాలను మిస్‌ అవుతున్నానని, కాలంతోపాటు వెళ్లకతప్పదని చెప్పారు. ఎంజీఆర్‌ నటుడైనా రాజకీయాల్లో నిబద్ధతతో రాణించిన విషయాన్ని గుర్తు చేశారు. 

 

12:01 - December 29, 2017

శ్రీకాకుళం : జిల్లాలోని రాజాంలో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి తగాదాలతో కన్నకొడుకునే తండ్రి కడతేర్చాడు. కొడుకును అతిదారుణంగా కత్తితో పొడిచి చంపాడు. రాజాం పట్టణంలోని నవ్యనగర్‌కు చెందిన శ్రీకాంత్‌ నాయుడు, సీతం నాయుడు తండ్రీకొడుకులు. సీతం నాయుడు రిటైర్డ్ ఉపాధ్యాయుడు, శ్రీకాంత్ నాయుడు హైదరాబాద్ లోని సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. వీరి మధ్య కొన్ని రోజులుగా ఆస్తి గొడువలు జరుగుతున్నాయి. ఇవీవలే శ్రీకాంత్ నాయుడు స్వగ్రామానికి వెళ్లాడు. మరోసారి వీరి మధ్య ఆస్తి తగాద జరిగింది. కుమారుడు తనను ఎదురిస్తున్నాడని క్షణికావేశంతో విచక్షణ కోల్పోయిన సీతం నాయుడు కొడుకును అతిదారుణంగా కత్తితో పొడిచి చంపాడు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. హత్య చేసినట్లు సీతం నాయుడు ఒప్పుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

11:55 - December 29, 2017

డబుల్ హ్యాట్రిక్ హిట్స్ తో సత్తా చాటిన ఓ యంగ్ హీరో మరో ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. ఇటీవల నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన ఆ యువ కథానాయకుడు.. ఓ ఆసక్తికరమైన పాత్రకు గాత్రదానం చేయనున్నాడు.. ఎవరా హీరో ఏంటా పాత్ర. వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని, ఇటీవల నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి ‘అ!’ అనే సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. డిఫరెంట్ కాన్పెప్ట్ తో ప్రయోగాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో ప్రశాంత్ వర్మ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. నిత్యామీనన్. రెజీనా, ఈషా రెబ్బా, అవసరాల శ్రీనివాస్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో నాని నిర్మాతగానే కాక మరో కీలక పాత్ర పోషించనున్నాడు.

ఈ సినిమా కోసం నాని పోషించే రెండో పాత్ర కూడా తెర వెనుకకే పరిమితం కానుంది. ఈ సినిమాలో కనిపించే ఓ చేప పాత్రకు నాని డబ్బింగ్ చెపుతున్నాడు. తాజాగా ఆ చేప క్యారెక్టర్ ను పరిచయం చేస్తూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇప్పటికే మేజర్ పార్ట్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నిర్మిస్తున్నారు. నాని తో పాటు మరో స్టార్ హీరో రవితేజ కూడా ఈ సినిమాలో క్యారెక్టర్ కు డబ్బింగ్ చెపుతున్నాడు.

ప్రశాంత్ చెప్పిన కథ నచ్చటంతో సినిమా నిర్మించేందుకు అంగీకరించానన్న నాని గతంలో ఇలాంటి సినిమా తెలుగు తెర మీద రాలేదని గట్టిగా చెపుతున్నాడు. ఇటీవల 'మిడిల్ క్లాస్ అబ్బాయ్' గా 'ఎంసీఏ' సినిమాతో మరోసారి ఆకట్టుకున్న నాని.. డివైడ్ టాక్ వచ్చిన మంచి వసూళ్లు సాదిస్తున్నాడు. ఈ సినిమా నాని కెరీర్ లోనే బిగెస్ట్ ఓపెనర్ గా నిలిచి సత్తా చాటింది.

11:46 - December 29, 2017

పశ్చిమ బెంగాల్ : కోల్‌కతాలో తెలుగు విద్యార్థుల కష్టాలు పడుతున్నారు. ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్‌కు హాజరయ్యేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి 100 మంది విద్యార్థులు వెళ్లారు. వసతి సదుపాయాలు లేకపోవడంతో విద్యార్థులు వరండాల్లో పడుకుంటున్నారు. వసతి ఏర్పాట్లకు జాదవపూర్ యూనివర్సిటీ 1500 రూపాయలు వసూలు చేసింది. ఉత్తర, దక్షిణ భారత విద్యార్థుల మధ్య వివక్ష చూపుతున్నారని తెలుగు విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి విద్యార్థులకు రూములు ఇచ్చి తమకు ఇవ్వడం లేదని ఆక్రోశం వెల్లగక్కారు. రెండురోజులుగా రూములు ఇవ్వకుండా సాకులు చెబుతున్నారని ఆరోపించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

వచ్చే ఎన్నికల వరకు జగన్ కేసు తేలదా ?

హైదరాబాద్ : వైసీపీ అధ్యక్షుడు జగన్ సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు పది ఛార్జ్ షీట్లపై విచారణ జరిగింది. జగన్, విజయసాయి డిశ్చార్జ్ పిటిషన్లపై వాదనలు ముగిశాయి. వచ్చే ఎన్నికల వరకు ఈ కేసు తేలదని సీబీఐ యోచిస్తోందని తెలుస్తోంది.

 

కాల్వ విజ్ఞప్తి..కేంద్ర మంత్రి సానుకూల స్పందన..

ఢిల్లీ : కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రిని మంత్రి కాల్వ శ్రీనివాసులు కలిశారు. వాల్మికి, బోయలకు ఎస్టీ హోదా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి కాల్వ విజ్ఞప్తికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. 

11:41 - December 29, 2017

తూర్పుగోదావరి : జిల్లాలోని అన్నవరం సత్యనారాయణస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి  ఉత్సవాలు ఘనంగా జరగుతున్నాయి. రత్నగిరిపై వెలసిన సత్యనారాయణస్వామి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఉత్తర ద్వారం నుంచి స్వామిని దర్శించుకుంటున్నారు. వైకుంఠ ఏకాదశి కోసం ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. 
 

11:39 - December 29, 2017

అనంతపురం : జిల్లాలోని వ్యాప్తంగా వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉత్తరద్వార దర్శనానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామునుంచే ఆలయాల దగ్గర బారులు తీరారు. అనంతపురం నగరంలోని పురాతన ఆలయం చెన్నకేశవ ఆలయంతో పాటు పలు వేంకటేశ్వర  ఆలయాలు కిటకిటలాడుతున్నాయి.

 

11:38 - December 29, 2017

హైదరాబాద్‌ : చిక్కడపల్లి వెంకటేశ్వరాలయంలో  వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామి దర్శనానికి భక్తుల తరలివస్తున్నారు. దర్శనానికి వచ్చే భక్తలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. దీనిపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం.. 

11:33 - December 29, 2017

చెన్నై : చెన్నైలోను వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైష్ణవ ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.  కలియుగ వైకుంఠంగా విరాజిల్లుతున్న  శ్రీరంగం ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. లక్షల సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకుంటున్నారు. ప్రఖ్యాతిగాంచిన  ట్రిప్లికేన్‌లోని శ్రీపార్ధసారథి స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది.

 

తిరుమలలో ఏమవుతోంది ?

చిత్తూరు : తిరుమలకు భక్తులు పోటెత్తారు. వీఐపీ సేవలో టిటిడి అధికారులు తరిస్తుండడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 32 గంటలకు పైగా క్యూ లైన్ లో నే భక్తులు వేచి ఉన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు వరకు భక్తులు వేచి ఉన్నారు. ఈ క్యూలైన్ లలో తోపులాట చోటు చేసుకోవడంతో పలువురు భక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని ఆసుపత్రికి తరలించారు. కనీసం మంచినీరు కూడా అందించడం లేదని భక్తులు వాపోతున్నారు. 

11:21 - December 29, 2017

ఒక్క సినిమా హిట్ అయితే చాలు ఆ హీరో చుట్టూ స్టార్ డైరెక్టర్లు కూడా క్యూ కట్టేస్తారు. అది కూడా ఓ స్టార్ వారసుడైతే ఇంక ఆ హైపే వేరు.. ఇటీవల ఓ మంచి హిట్ తో ఆకట్టుకున్న ఓ స్టార్ వారసుడి నెక్ట్స్ ప్రాజెక్ట్ పై టాలీవుడ్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.. అక్కినేని నటవారసుడిగా వెండితెరకు పరిచయం అయిన యంగ్ హీరో అఖిల్, తొలి సినిమాతో అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. దీంతో ఎలర్ట్ అయిన అక్కినేని ఫ్యామిలీ రెండో సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కింగ్ నాగార్జున దగ్గరుండి అన్ని పనులు చూసుకున్నాడు. విక్రమ్ కె కుమార్ దర‍్శకత‍్వంలో తెరకెక్కిన అఖిల్ రెండో సినిమా 'హలో'కు మంచి టాక్ రావటంతో ఇప్పుడు ఈ యంగ్ హీరో తదుపరి చిత్రంపై చర్చ మొదలైంది.

తాజాగా అఖిల్ నెక్ట్స్ సినిమాపై ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అఖిల్ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్న అక్కినేని ఫ్యామిలీ త్వరలో నెక్ట్స్ ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టనున్నారు. అఖిల్ తదుపరి చిత్రానికి బోయపాటి శ్రీను లేదా సుకుమార్‌ల దర్శకత్వం వహించే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఈ ఇద్దరి దర్శకుల్లో ఎవరు ముందు ఖాళీ అయితే వాళ్లతోనే అఖిల్ సినిమా ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. జయ జానకీ నాయక హిట్ తరువాత బోయపాటి శ్రీను ఇంత వరకు తదుపరి చిత్రాన్ని ప్రారంభించలేదు. అయితే రామ్ చరణ్, బాలకృష్ణ లతో బోయపాటి సినిమాపై చర్చలు జరుగుతున్నాయన్న టాక్ మాత్రం బలంగా వినిపిస్తోంది. వరుసగా రెండు ప్రయోగాలు చేసిన చరణ్ కూడా బోయపాటి లాంటి మాస్ డైరెక్టర్ తో సినిమా చేయాలని భావిస్తున్నాడట. దీంతో అఖిల్ తో బోయపాటి సినిమా ఉండే అవకాశాలు తక్కువే.

ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా రంగస్థలం సినిమాను తెరకెక్కిస్తున్న సుకుమార్.. తన తదుపరి చిత్రంపై ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. ఇతర హీరోలతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా వార్తలు కూడా లేవు. దీంతో రంగస్థలం తరువాత సుకుమార్ అఖిల్ తో సినిమా చేసే ఛాన్స్ ఉందంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అయితే రంగస్థలం రిలీజ్ తరువాత సుకుమార్ తో సినిమా చేయటంపై అక్కినేని ఫ్యామిలీ నిర్ణయం తీసుకోనుంది.

మానవత్వమా నీవెక్కడ ? కొడుకును చంపేసిన తండ్రి...

శ్రీకాకుళం : రాజాంలోని నవ్యనగర్ లో ఆస్తి తగదాలతో కొడుకును సొంత తండ్రి చంపేశాడు. హత్య చేసిన సీతం నాయుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సదస్సుకు వెళితే...

కోల్ కతా : రాష్ట్రంలో తెలుగు విద్యార్థులు కష్టాలు పడుతున్నారు. ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సదస్సుకు హాజరయ్యేందుకు వంద మంది తెలుగు విద్యార్థులు అక్కడకు వెళ్లారు. కానీ వసతి సదుపాయాలు లేకపోవడంతో విద్యార్తులు వరండాలో పడుకొనే పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే వసతి ఏర్పాట్లకు మాత్రం జాదవ్ యూనివర్సిటీ రూ. 1500 వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఉత్తర, దక్షిణ భారత విద్యార్థుల మధ్య వివక్ష చూపుతున్నారని, రెండు రోజులుగా రూములు ఇవ్వకుండా సాకులు చెబుతున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఎంపీ రామ్మోహన్ ప్రైవేటు బిల్లు...

విశాఖపట్టణం : జిల్లా కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని నేడు లోక్ సభలో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రైవేట్ బిల్లును ప్రవేశ పెట్టనున్నారు. 

10:48 - December 29, 2017

చెన్నై : అభిమానులతో సూపర్ స్టార్ రజనీకాంత్ నాల్గోరోజు సమావేశమయ్యారు. తన నిర్ణయాన్ని ప్రకటించేందుకు ఇంకా రెండు రోజులే మిగిలివుందన్నారు. ఎవరైనా కాలంతో ప్రయాణం చేయక తప్పదని పేర్కొన్నారు. దేన్నైనా కాలమే నిర్ణయిస్తుందని చెప్పారు. ఎంజీఆర్ రాజకీయాల్లో నిబద్ధతతో రాణించారని కొనియాడారు. ఎవరికీ ఏదీ శాశ్వతం కాదన్నారు. నిన్న శివాజీ గణేషన్, నేడు నేను, రేపు మరొకరు అంటూ వ్యాఖ్యానించారు. హోదా, సంపాదన ముఖ్యం కాదని పేర్కొన్నారు. 

 

10:40 - December 29, 2017
10:37 - December 29, 2017

రాజన్న సిరిసిల్ల : జిల్లా కేంద్రంలోని శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం... భక్తుల గోవింద నామస్మరణతో మార్మోగుతోంది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ముస్తాబైన ఈ ఆలయంలో... శ్రీవారి దర్శనానికి తండోపతండాలుగా వస్తున్నభక్తులతో ఆలయం కిటకిటలాడుతోంది. తెల్లవారు జామున ఒంటిగంటకే ఆలయాన్ని తెరిచారు.. అనంతరం ఉత్తర ద్వారా దర్శనం కోసం శ్రీవారిని గరుడ వాహనంపై ఊరేగించి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.  

10:34 - December 29, 2017

చిత్తూరు : వైకుంఠ ఏకాదశికి తిరుమలకు భక్తులు పోటెత్తారు. అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట రెండు కిలో మీటర్ల మేర వేచివున్నారు. తిరుమలలో నెలకొన్న భక్తుల రద్దీపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం... 

10:32 - December 29, 2017

పశ్చిమగోదావరి : జిల్లా ద్వారకాతిరుల వెంకటేశ్వరాలయంలో వైకుంఠ ఏకాదశి  ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్తరద్వారం నుంచి స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఉత్తరద్వారం నుంచి స్వామిని దర్శించుకుంటు సలక శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ముక్కోటికి ద్వారకాతిరుమల ఆలయాన్ని శోభాయమానంగా అలంకరించారు. గోవిందనామస్మరణతో ఆలయం మార్మోగుతోంది. దీనిపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం...

 

10:27 - December 29, 2017

మేట్ల తొలగింపు ఆలోచన మానుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బుర్రి ప్రసాద్‌ అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. మేట్ల తొలగింపు ఆలోచన మానుకొని జీవో నంబర్‌1786 రద్దు చేయాలని పెండింగ్‌లో ఉన్న ఉపాధి హామీ కూలీ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ వ్యవసాయ కార్మిక సంఘాలు ఈ నెల 27,28,29 తేదీలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ ఆందోళనకు దారి తీసిన పరిస్థితుల్లో ప్రభుత్వ విధానాలపై ఆయన చర్చించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

అభిమానులతో రజనీ..

చెన్నై : అభిమానులతో ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ సమావేశమయ్యారు. తాను చెప్పిన గడువుకు రెండు రోజులే ఉందని, ఎవరికీ ఏదీ శాశ్వతం కాదన్నారు. నిన్న శివాజీ గణేషన్..నేడు నేను..రేపు మరొకరు అంటూ వ్యాఖ్యానించారు. హోదా..సంపాదన ముఖ్యం కాదని పేర్కొన్నారు. 

వీఐపీ దర్శనం..సామాన్య భక్తుల ఇక్కట్లు...

తిరుమల : వీఐపీ బ్రేక్ దర్శనం ఇంకా కొనసాగుతోంది. శ్రీవారిని పలువురు సినీ, రాజకీయ, ఇతర ప్రముఖులు దర్శించుకున్నారు. నాలుగున్నర గంటల నుండి వీఐపీ దర్శనం కొనసాగుతుండడంతో సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టిటిడి అధికారులు వీఐపీల సేవలో తరిస్తున్నారని భక్తులు విమర్శలు గుప్పిస్తున్నారు. సుమారు 30 గంటలకు పైగా క్యూ లైన్ లో భక్తులు పడి గాపులు పడుతున్నారు. 

 

గిరిజన శాఖ డీఈఈ ఇంటిపై సోదాలు...

నెల్లూరు : రంగనాయకుల పేటలో గిరిజన శాఖ డీఈఈ కృష్ణకుమార్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు ఆరోపణలున్నాయి. శ్రీకాకుళం, పాతపట్నం, రాజాంలలో తనిఖీలు కొనసాగుతున్నాయి. 

10:21 - December 29, 2017

ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని ఓ పబ్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. లోయర్‌ పరేల్‌ కమలా మిల్స్‌ సముదాయంలో ఉన్న లండన్‌ టాక్సీ గ్యాస్ట్రో పబ్‌లో జరిగిన ఈ దుర్ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 12 మంది మహిళలున్నారు. వీరంతా 28.. 30 ఏళ్ల లోపు యువతీయువకులే. మరో 12 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ పబ్‌ రూఫ్‌ టాప్‌లో జరిగిన ఓ మహిళ బర్త్‌ డే పార్టీకి వచ్చి, అగ్ని ప్రమాదంలో సజీవదహనమయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కమలామిల్స సముదాయం ముంబై నైట్‌ లైఫ్‌ హబ్‌. ఇక్కడ 37 ఎకరాల విస్తీర్ణంలో రెస్టారెంట్లు ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

10:18 - December 29, 2017

విశాఖ : సింహాచలంలోని వరాహ లక్ష్మీనరసింమస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి  ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సింహాద్రి అప్పన్న దర్శనం కోసం ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు ఒడిశా నుంచి భక్తుల తరలివస్తున్నారు. వరాహ లక్ష్మీనరసింహస్వామిని ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శన్నం ఇస్తున్నారు.  ఆలయాన్ని పూలు, విద్యుత్‌ దీపాలతో అందంగా అలంకరించారు. వరాహ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునే సామాన్య భక్తులు, వీఐపీలకు వేర్వేరుగా ఏర్పాట్లు చేశారు. 

 

10:16 - December 29, 2017

పశ్చిమగోదావరి : జిల్లాలోని ద్వారకాతిరుల వెంకటేశ్వరాలయంలో వైకుంఠ ఏకాదశి  ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్తరద్వారం నుంచి స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఉత్తరద్వారం నుంచి స్వామిని దర్శించుకుంటు సలక శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ముక్కోటికి ద్వారకాతిరుమల ఆలయాన్ని శోభాయమానంగా అలంకరించారు. గోవిందనామస్మరణతో ఆలయం మార్మోగుతోంది. 
 

10:15 - December 29, 2017

జగిత్యాల : జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారభమయ్యాయి. తెల్లవారుజామున స్వామి వారి మూలవిరాట్లకు క్షిరాభిషేకాలు నివేదించారు. సప్త హారతుల అనంతరం వేదపండితుల మంత్రోచ్ఛారణ మధ్య వైకుంట ద్వారం తెరిచారు. స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. 

 

పోలీసుల అదుపులో తూనికలు కొలతల శాఖాధికారి...

సూర్యాపేట : తూనికలు కొలతల శాఖాధికారి అశోక్ తో పాటు హూజూర్ నగర్ లోని పసుపులేటి పెట్రోల్ బంక్ యజమానిలను సూర్యాపేట టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈనెల 5న తూనికలు కొలతల శాఖ జిల్లా కార్యాలయంలో ఉద్ధేశ్యపూర్వకంగా అగ్నిప్రమాదానికి పాల్పడ్డారని వారిపై ఆరోపణలున్నాయి. పెట్రోల్ బంక్ లో చిప్ లను ఉంచి మోసాలకు యాజమాన్యం పాల్పడుతోంది. తూనికలు కొలతల శాఖ తనిఖీల్లో చిప్ లు పట్టుబడ్డాయి. పెట్రోల్ బంక్ యాజమాన్యంతో రూ. 8 లక్షలకు డీల్ కుదిరింది. చిప్ లతో పాటు కార్యాలయానికి నిందితులు నిప్పు పెట్టారు. అగ్నిప్రమాదం జరిగిందనట్లుగా నమ్మించే ప్రయత్నం చేశారు. 

సింహాచలం అప్పన్న ఆలయానికి...

విశాఖపట్టణం : సింహాచలం అప్పన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. మహావిష్ణువు అలంకారంలో లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనమిస్తున్నారు. 

10:12 - December 29, 2017

భద్రాద్రి కొత్తగూడెం : తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ముక్కోటి సందర్భంగా భద్రాచలం రామాలయానికి భక్తులు పోటెత్తారు. ఉత్తరద్వారం నుంచి భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. రామనామ స్మరణతో ఆయలం మార్మోగుతోంది. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత సీతారాముల దర్శనానికి భక్తులను అనుమతి ఇచ్చారు. భద్రాచలంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. భద్రాచలంలో ముక్కోటి వేడుకలపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం.. 
 

ద్వారకా తిరుమలలో వైభవంగా వైకుంఠ ఏకాదశి

పశ్చిమ గోదావరి : ద్వారకా తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఆలయానికి భక్తులు పోటెత్తారు.

భద్రాద్రి రామయ్య దర్శనానికి పోటెత్తిన భక్తులు

భద్రాద్రి : భద్రాద్రి ఆలయంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. గోదావరిలో భక్తులు స్నానం చేస్తున్నారు. భద్రాద్రి రామయ్య దర్శనానికి భక్తులు పోటెత్తారు.

 

07:58 - December 29, 2017

ఉమ్మడి హైకోర్టు విభజనపై కేంద్రప్రభుత్వం అలసత్వం వహిస్తోందని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చ కార్యక్రమంలో నవతెలంగాణ ఎడిటర్, విశ్లేషకులు ఎస్.వీరయ్య, బీజేపీ అధికార ప్రతినిధి ఎన్ వి.సుభాష్ పాల్గొని, మాట్లాడారు. ఉమ్మడి హైకోర్టు విభజన విషయంలో కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. కేంద్రం బాధ్యతగా వ్యవహరించడం లేదని విమర్శించారు. విభజన ప్రక్రియను కేంద్రం సజావుగా జరిపించాలన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

07:51 - December 29, 2017

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2017లో పథకాల అమలు కంటే ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. సమీక్షలు, సమావేశాలు, సదస్సులు, మహాసభలతో కాలం వెళ్లబుచ్చింది. సమస్యల పరిష్కారాన్ని గాలికి వదిలేసి, ప్రజల ఆగ్రహానికి గురైంది. లక్ష్యానికి ఆమడదూరంలో  అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలవుతున్నా..  పట్టించుకునే దిక్కులేకుండా పోయింది. 2017లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ కార్యకలాపాలపై 10 టీవీ ఆత్మావలోకనం... 
ప్రచార పటాటోపంగా మారిన కార్యక్రమాలు 
2017లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్వహించిన ఘనకార్యాలు పెద్దగా లేవు. నిర్వహించిన కార్యక్రమాలన్నీ ప్రచార పటాటోపంగా మారాయి. హెచ్‌ఐసీసీలో జరిగిన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు, ప్రపంచ తెలుగు మహాసభలు ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. హెచ్‌ఐసీసీలో జరిగిన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కుమార్తె రావడంతో హైదరాబాద్‌ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అట్టహాసంగా నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభలకు విపక్షాలు, సాహితీ విమర్శకులకు స్థానం కల్పించకపోవడం విమర్శలకు తావిచ్చింది. అన్ని స్థాయిలో ఉన్న టీఆర్‌ఎస్‌ మంది, మార్బలాన్ని రంగంలోకి దింపి సింగరేణి ఎన్నికల్లో విజయం సాధించి, తమ బలం చెక్కు చెదరలేదని నిరూపించుకునే ప్రయత్నం చేసింది. 
కాళేశ్వరం ప్రాజెక్టుకు 265 అనుమతులు 
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పనులను వేగవంతం చేసేందుకు స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ రంగంలో దిగాల్సి వచ్చింది. దీనికి అవసరమైన దాదాపు 265 అనుమతులు సాధించింది. నిర్ణీత సమయానికి ప్రాజెక్టును పూర్తిచేసి.. 2019 ఎన్నికల ప్రజాక్షేత్రంలో దిగాలని భావిస్తోంది. మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం పూర్తి చేసేందుకు జలవనరుల శాఖ మంత్రి హరీశ్‌రావు  రాత్రింబవళ్లు తిరిగారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కూడా నిర్మించేందుకు చర్యలు ముమ్మరం చేసింది. ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, హోంగార్డులకు వేతనాలు పెంచించింది. 
సామాజిక వర్గాల వారీగా ప్రజాప్రతినిధులతో భేటీలు 
ఆయా సామాజికవర్గాలను తమవైపు తిప్పుకునేందుకు స్థలాలు కేటాయించి భవన నిర్మాణాలు చేపట్టేందుకు చర్యలు చేపట్టింది. సామాజిక వర్గాల వారీగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీలు నిర్వహించిన కేసీఆర్‌... ఆయా వర్గాలకు  వరాలు ప్రకటించారు. జనాభాలో యాభై శాతంపైగా ఉన్న బీసీల ఓటు బ్యాంకు కోసం.. ప్రత్యేక కార్యాచరణకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సిద్ధమైంది. దళిత, గిరిజన ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశాల్లో వచ్చిన సూచలనకు అనుగుణంగా కార్యాచరణ లేకపోవడం అసంతృప్తికి దారి తీసింది.  కొత్త జిల్లాల్లో పాలన సజావుగా సాగేందుకు వీలుగా సమీకృత భవన నిర్మాణాలను యుద్ధ ప్రాదిపదికన పూర్తి చేసేందుకు పనిలో అధికార యంత్రాంగం నిగమన్నమైంది. 
కేసీఆర్‌ను కలవరానికి గురిచేసిన తమ్మినేని పాదయాత్ర 
సమగ్రాభివృద్ధి, సామాజిక తెలంగాణ లక్ష్య సాధన కోసం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి  తమ్మినేని వీరభద్రం 2016 అక్టోబర్‌లో ప్రారంభించిన పాదయాత్ర 2017 మార్చిలో ముగిసింది. తమ్మినేని యాత్రకు ప్రజల నుంచి వచ్చిన స్పందనతో కేసీఆర్‌ సర్కార్‌ కలవరానికి గురైంది. తమ్మినేని పాదయాత్ర ముగింపు సందర్భంగా హైదరాబాద్‌ సరూర్‌నగర్‌ స్టేడియంలో నిర్వహించిన సభ కేసీఆర్‌ ప్రభుత్వాన్ని కదిలించింది. ఎంబీసీ కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తున్నట్టు హడావుడిగా ప్రకటించిన సర్కారు... ఎంబీసీల్లో ఏయే కులాలను వర్గీకరించకపోవడం గందరగోళానికి దారితీస్తోంది. బీసీ కమిషన్‌ కూడా కాలయాపన కమిటీగా మారిందన్న విమర్శలు ఎదుర్కొంటోంది.  
లక్షకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న కేసీఆర్‌ 
తెలంగాణలో నిరుద్యోగం తాండవిస్తోంది. ఉద్యమ సమయంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఊదరగొట్టిన కేసీఆర్‌... అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిని విస్మరించారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న లక్షకుపైగా పోస్టుల భర్తీ చేస్తానని కేసీఆర్‌ చెప్పిన మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయాయి. కొద్ది పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్‌సీ నిర్వహించిన పోటీ పరీక్షలు కూడా తప్పుల తడకలుగా మారడంతో విమర్శలకు తావిచ్చింది.  టీఎస్‌పీఎస్‌సీ తీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. టీఎస్‌పీఎస్‌సీతో ప్రభుత్వ ప్రతిష్ఠ ఇనుమడిస్తుందనుకుంటే, మరింత దిగజారిందని టీఆర్‌ఎస్‌ అంతర్గ సమావేశాల్లో కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ పనీతీరుకు అద్దంపడుతోంది. ఉపాధ్యాయ నిమాయక పరీక్ష నిర్వహణకు 31 జిల్లాలకు జారీ చేసిన నోటిఫికేషన్‌ను హైకోర్టు అక్షింతలతో చివరికి పది జిల్లాలకే పరిమితం చేయాల్సి వచ్చింది. సింగరేణి వారసత్వ ఉద్యోగాలు, కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసుల క్రమబద్ధీకరణ విషయంలో ప్రభుత్వ వ్యూహం బెడిసికొట్టింది. 
అందని ద్రాక్షగా మిగిలిన మిషన్‌ భగీరథ నీరు 
ప్రభుత్వ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణ పథకం పడకేసింది. లక్ష్యానికి ఆమడదూరంలో ఈ పథకం అమలవుతోంది. ఇంటింటికి శుద్ధిచేసిన మంచినీరు అందించే మిషన్‌ భగీరథ అందని ద్రాక్షగానే మిగిలిపోంది. గొర్రెలు, బర్రెల పంపిణీ పథకాలు కూడా అభాసుపాలయ్యాయి. ప్రజా పంపిణీ వ్యవస్థ  అస్తవ్యస్తంగా మారింది.  ఇక టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ విధాన నిర్ణయాలపై ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ఇందరా పార్క్‌ ధర్నా చౌక్‌ తరలింపు, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు ఎంఆర్‌పీఎస్‌ పోరాటాలు, ధరలు పాతాళానికి పడిపోవడంతో మిర్చి రైతుల ఆందోళన, పత్తి రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగుల ఆకలి యాత్రలు, టీజేసీ చైర్మన్‌ కోదండరామ్‌ కొలువులపై కొట్లాట సభలు... ఇలా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఊపిరి సలుపుకోకుండా చేశాయి. అన్ని ఉద్యమాలపై ఉక్కుపాదం మోపేందుకే ప్రభుత్వం ప్రయత్నించింది. 
అధికార యంత్రాంగాన్ని క్రియాశీలకంగా మార్చే చర్యలు 
ఏడాదిన్నరలో ఎన్నికలు 
ఏడాదిన్నరలో ఎన్నికలు ఉన్నాయి. దీంతో ఇంకా ఉదాసీనంగా వ్యవహరిస్తే లాభం లేదనుకున్న కేసీఆర్‌... తాను క్రీయాశీలకంగా మారడంతోపాటు, అధికార యంత్రాన్ని యాక్టివ్‌ చేసేందుకు చర్యలు చేపట్టారు. పరిపాలనలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. అధికార యంత్రాన్ని ప్రక్షాళన చేసేందుకు చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్‌ నుంచి  సచివాలయంలో పనిచేసే ముఖ్య కార్యదర్శి వరకు కొత్త టీమును ఏర్పాటు చేసుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ పదవీకాలం వచ్చే నెలతో ముగియనున్న నేపథ్యంలో ఎస్‌కే జోషికి కొత్త సీఎస్‌గా అవకాశం కల్పించాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. అన్ని స్థాయిల్లో అధికార యంత్రాంగాన్ని ప్రక్షాళనచేసి, అభివృద్ధి, సంక్షేమ పథకాలను పరుగులు పెట్టించాలని చూస్తున్నారు. 
కొంగొత్త స్కీములు ప్రారంభించేందుకు కేసీఆర్‌ సన్నాహాలు 
2017లో కొత్త పథకాలేని లేకపోవడంతో కొత్త... కొంగొత్త స్కీములు ప్రారంభించేందుకు కేసీఆర్‌ సన్నాహాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా నూతన సంవత్సరం ప్రారంభం నుంచి వ్యవసాయానికి 24 గంటలు విద్యుత్‌ సరఫరా చేసేందుకు టీఆర్‌ఎస్‌  సర్కారు చర్యలు చేపట్టింది. కొత్త పథకాలను ప్రారంభించి ప్రజలను ఆకట్టుకునేందు ఎత్తుగడలు వేస్తున్నారు. మొత్తమ్మీద.. 2017వ సంవత్సరం.. ప్రభుత్వ నిష్క్రియాపరత్వానికి ప్రతీకగానే మిగిలిందన్న వాదనలు వినిపిస్తున్నాయ. 

ముంబై లోయర్ పరేల్ లో ఘోర అగ్నిప్రమాదం

ముంబై : లోయర్ పరేల్ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. కమలా మిల్స్ కాంపౌండ్స్ లోని మూడంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందారు. మరో 12 మందికి గాయాలు అయ్యాయి. 

 

అహోబిళం నరసింహక్షేత్రంలో ఉత్తర ద్వారం దర్శనం

కర్నూలు : అహోబిళం నరసింహక్షేత్రంలో ఉత్తర ద్వారం దర్శనం జరుగుతుంది. అహోబిళం క్షేత్రానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. 

కాళేశ్వరం క్షేత్రంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు

భూపాలపల్లి : కాళేశ్వరం క్షేత్రంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు జరుగుతున్నాయి. శ్రీరామాలయంలో ఉత్తర ద్వారం నుంచి స్వామివారి దర్శనం ఇస్తున్నారు. 

సింహాచలం అప్పన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

విశాఖ : సింహాచలం అప్పన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. మహావిష్ణువు అలంకారంలో లక్ష్మీ నరసింహస్వామివారి దర్శనం ఇస్తున్నారు. 

07:27 - December 29, 2017

విశాఖ : ఉక్కు నగరంలో విశాఖ ఉత్సవ్‌ అట్టహాసంగా ప్రారంభమైంది. ఒకప‌క్క సాగ‌ర ఘోష, మ‌రో ప‌క్క ఉత్సవ శోభ.. నగరవాసులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. పుష్ప పరిమాళాలు.. సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని మైమరిపిస్తున్నాయి. మరో రెండు రోజులు కూడా అద్భుతమైన కార్యక్రమాలు అందరినీ అలరించనున్నాయి. 
ఉత్సవ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన స్పీకర్‌ కోడెల  
మూడు రోజుల పాటు జ‌ర‌గ‌నున్న విశాఖ ఉత్సవ్ కార్యక్రమాన్ని స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌రావు ప్రారంభించారు. సాగ‌ర తీరంలో ఏర్పాటు చేసిన వివిధ ర‌కాల సాంస్కృతిక కార్యక్రమాలు, కార్నివాల్, 
శకటాల ప్రదర్శన, జాతర, క్రీడలు అందర్ని ఆకట్టుకున్నాయి. 
ఆకట్టుకున్న ఫ్లవర్‌ షో 
దాదాపు 5వేల రకాల పుష్పాలతో ఎంజీఎం మైదానంలో ఏర్పాటు చేసిన ఫ్లవర్‌ షో చూపరులను ఆకట్టుకున్నాయి. విశాఖలోని ప్రముఖ ఆలయాల నమూనాలను సందర్శన కోసం ఏర్పాటుచేశారు. మొద‌టి రోజు ఉత్సవాలు నృత్యాలు, గిరిజన జాతరలతో హోరెత్తాయి. ఆటపాటలు అందరినీ అలరించాయి. ఈ ఫెస్ట్‌లో ఉత్సవాలే కాకుండా... అనేక క్రీడలు నిర్వహించారు. పారా మోటార్‌, బీచ్‌ ఫుట్‌బాల్‌లాంటి గేమ్స్‌ ఏర్పాటు చేశారు. ఈ గేమ్స్‌లలో ఎంతోమంది ఔత్సాహికులు పాల్గొన్నారు. ఈ పోటీలలో పాల్గొన్న వారికి బహుమతులు అందజేసి.. ఉత్తేజపరిచారు. 
ప్రజల ముందుకు టీయూ 142 ఫైటర్‌ విమానం
ఇక ఈ ఫెస్ట్‌లో పర్యాటకులంతా ఎప్పడెప్పుడా అని ఎదురుచూసే టీయూ -142 ఫైటర్‌ విమానాన్ని ప్రజలకు ముందుకు తీసుకువచ్చారు. చేసిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. మూడు రోజులపాటు జరగనున్న ఈ ఫెస్టివల్‌లో తొలిరోజు నగరవాసులు, పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఈ ఫెస్ట్‌కు సినీహీరోలు కూడా రానున్నారు. అఖిల్‌, అల్లూ శిరీష్‌, సంగీత దర్శకుడు ప్రియతమ్‌లు ఈ ఫెస్ట్‌లో పాలుపంచుకోనున్నారు. 

 

07:22 - December 29, 2017

వరంగల్ : మావోయిస్టు ఉద్యమంలో కీలకపాత్ర పోషించి తాజాగా జన జీవన స్రవంతిలో కలిసిన జంపన్న.. ఇప్పుడు వరంగల్‌ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారారు. ఆయన అధికార పార్టీలో చేరుతారనే విస్తృత ప్రచారం జరుగుతుండడంతో.. ఓరుగల్లు పాలిటిక్స్‌లో ఎలాంటి మార్పులు జరుగుతాయోనన్న ఆసక్తి నెలకొంది. అయితే... కొంతమంది తమ అవసరాల కోసం జంపన్నను రాజకీయ రంగంలోకి దింపేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. 
మావోయిస్టు ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన జంపన్న 
మూడు దశాబ్ధాలకు పైగా మావోయిస్టుల ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన నర్సింహారెడ్డి అలియాస్‌ జంపన్న అధికార పార్టీ తీర్ధం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పోలీసులకు లొంగిపోయేందుకు అధికార పార్టీ నేలు సహకరించారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అందుకనుగుణంగానే వరంగల్‌ జిల్లా రాజకీయాలు కూడా హీటెక్కుతున్నట్లు సమాచారం. జంపన్న దంపతులు లొంగుబాటుకు జిల్లాకు చెందిన ఇద్దరు నేతలు కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితులలో జంపన్నను ఎన్నికల్లో రంగంలోకి దించాలనే ప్రయత్నాలు కూడా ఆ ఇద్దరు నేతలు చేస్తున్నారనే చర్చ సర్వత్రా వినిపిస్తోంది. 
ఎర్రబెల్లిని రాజకీయంగా ఎదుర్కొనేందుకు రంగంలోకి జంపన్న ?
వరంగల్‌ జిల్లా రాజకీయాల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న సీనియర్‌ నేత ఎర్రబెల్లిని రాజకీయంగా ఎదుర్కొనేందుకు జంపన్నను రంగంలోకి దించేందుకు.. కొంతమంది యత్నిస్తున్నట్లు గులాబీ పార్టీలో ప్రచారం జరుగుతోంది. గతంలో పార్టీ అధినేత కేసీఆర్‌ మావోయిస్టు నేత సాంబశివుడికి పార్టీలో క్రియాశీల పాత్ర కల్పించడంతో... జంపన్నకు అంతకంటే ఎక్కువగా ప్రాధాన్యత దక్కుతుందన్న అంచనాను గులాబీ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఎర్రబెల్లి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తి నుంచి జంపన్నను రంగంలోకి దించాలని వరంగల్‌ నేతలు పావులు కదుపుతున్నట్లు సమాచారం. జంపన్న జనజీవన స్రవంతిలో కలిసినా.. రాజకీయ భవిష్యత్‌పై ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ కూడా పార్టీ నేతల్లో కనిపిస్తోంది. జంపన్న కారెక్కితే తమకు పార్టీ పరంగా లబ్ధి చేకూరుతుందనే దీమా అధికార పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. 

 

07:14 - December 29, 2017

హైదరాబాద్ : మిషన్‌ కాకతీయ నాలుగో దశ పనుల నిర్వహణకు సర్కార్‌ సిద్ధమైంది. నాలుగో ఫేజ్‌లో  ఐదు వేలకు పైగా.. చెరువుల పునరుద్ధరణకు నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరులోగా  ఈ చెరువులకు పరిపాలన అనుమతులు మంజూరు చేయాలని కూడా టార్గెట్‌గా పెట్టుకుంది. మిషన్‌ కాకతీయలో భాగంగా రాష్ట్రంలో ఉన్న సుమారు 46 వేల చెరువులను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం పూనుకుంది.  ఇందుకోసం దఫదఫాలుగా పనులను నిర్వహించడం జరుగుతోంది. ఇప్పటి వరకూ మూడు ఫేజ్‌లను పూర్తి చేసిన ప్రభుత్వం.. జనవరి నుంచి నాలుగోఫేజ్‌ పనులను ప్రారంభించనుంది. 
మూడు ఫేజ్‌లలో 23 వేలకు పైగా చెరువుల పునరుద్ధరణ
ఇప్పటి వరకూ జరిగిన మూడు ఫేజ్‌లలో 23 వేలకుపైగా చెరువుల పునరుద్ధరణ చేసినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. ఇక నాలుగో  ఫేజ్‌ కింద 5 వేల ఏడు వందల మూడు చెరువుల పునరుద్ధరణ చేయనున్నారు. ఇందు కోసం ఈ నెలాఖరులోగా  పరిపాలనాపరమైన అనుమతి పొందాలని ప్రభుత్వం.. ఇరిగేషన్ శాఖ అధికారులను  ఆదేశించింది. ఈ ఫేజ్‌లో చేపట్టనున్న చెరువుల జాబితాను ముందుగానే వ్యవసాయ అధికారులకు అందించనుంది.  అలాగే చెరువుల్లోని పూడిక మట్టిని రైతులు వాడుకునే ముందు తప్పనిసరిగా పరీక్షించాలని సూచించింది.   పూడికలో ఉండే పోషకాలపై రైతులకు అవగాహన కల్పించాలని కోరింది. 
అందుతున్న మిషన్ కాకతీయ ఫలాలు
ఇక మిషన్‌ కాకతీయ వల్ల ఫలాలు అందుతున్నట్టుగా కూడా  ప్రభుత్వం ప్రకటించింది. ఆదిలాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, మెదక్‌, నల్లగొండ, నిజామాబాద్, రంగారెడ్డి, వరంగల్‌ జిల్లాల్లో పలు మండలాల్లో గ్రౌండ్‌ వాటర్ పెరిగినట్టుగా ఇరిగేషన్‌ శాఖ అధికారులు చెబుతున్నారు. సుమారు పది మీటర్ల మేర భూగర్భ జలాలుపైకి వచ్చినట్టుగా తెలిపారు. అలాగే మిషన్‌ కాకతీయ ప్రభావాలపై అధ్యయనం చేసిన నాబ్‌కాన్‌ సంస్థ పూడిక మట్టి వల్ల రసాయనిక ఎరువుల వాడకం తగ్గినట్టు తెలిపిందని.. అధికారులు చెబుతున్నారు.  వరి, కందులు, పత్తి తదితర పంటలు దిగుబడి రెండు నుంచి ఐదు క్వింటాళ్లు పెరిగినట్టు ప్రభుత్వానికి నివేదించిందని అధికారులు చెబతున్నారు. అయితే  చెరువు పనుల్లో కాంట్రాక్టర్లు సరిగా  పని చేయడం లేదనే.. చర్చ కూడా జరుగుతోంది. దీంతో పనుల్లో ఆలస్యంగా జరుగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి.  

 

07:08 - December 29, 2017

రాజన్నసిరిసిల్ల : జిల్లాలోని ఇల్లంతకుంట మండలం తాళ్లపల్లి గ్రామ శివారులో దారుణం జరిగింది. ప్రియురాలిని చంపి ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతారం గ్రామానికి చెందిన మధు, సుస్మిత గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. సుస్మిత బీఈడీ చదువుతుండగా.. మధు ఓ బేకరిలో పనిచేస్తున్నాడు. వీరి ప్రేమను పెద్దలు కాదనడంతో.. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. కోళ్ల ఫారంలో కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలిపి తాగాలనుకున్నారు. దాన్ని విరమించుకున్నారు. సుస్మిత ఒంటిపైన గాయాలు ఉండటంతో.. ఆమె మీద దాడి చేసి చంపిన అనంతరం మధు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

 

07:06 - December 29, 2017

హైదరాబాద్‌ : నగరంలో ఓ మహిళను ఊబర్ క్యాబ్ డ్రైవర్ కిడ్నాప్‌ చేసేందుకు యత్నించడం కలకలం రేపింది. లండన్ బయలుదేరుతూ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు ఓ మహిళ క్యాబ్ బుక్ చేసుకుంది. క్యాబ్‌ ఎక్కిన తరువాత డ్రైవర్ ప్రవర్తనపై అనుమానం రావడంతో కారు ఆపమని ఆమె బతిమాలింది. డ్రైవర్ రూటు మార్చి మహిళను సుబాబుల్ తోట వైపుకు తీసుకెళ్లాడు. అయితే ఇదంతా గమనిస్తున్న వాహనదారుడు కారును వెంబడించాడు. రోడ్డుకు అడ్డంగా టెంట్ ఉండటంతో డ్రైవర్ కారు ఆపాడు. మహిళ అరుపులు విన్న స్ధానికులు డ్రైవర్‌ను పట్టుకుని మాదన్నపేట్‌ పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు. మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

 

మ.12 గం.లకు సీఎం చంద్రబాబు మీడియా సమావేశం

గుంటూరు : ఏపీ సీఎం చంద్రబాబు మధ్యాహ్నం 12 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. పలు అంశాలపై మాట్లాడనున్నారు. 

వైకుంఠ ఏకాదశి..వేయి స్తంభాల గుడిలో ప్రత్యేక పూజలు

వరంగల్ : నేడు వైకుంఠ ఏకాదశి సర్వదినం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా వేయి స్తంభాల గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. 

ద్వారకా తిరుమలలో భారీగా వేచివున్న భక్తులు

ప.గో: వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారా దర్శనం. ద్వారకా తిరుమలలో భారీగా భక్తులు వేచి ఉన్నారు. 

 

వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతున్న దేవాలయాలు

హైదరాబాద్ : వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

 

Don't Miss