Activities calendar

30 December 2017

21:29 - December 30, 2017

రాజ్యసభ..ఆప్ అభ్యర్థులు ఎవరు ?

ఢిల్లీ : రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. ఢిల్లీ అసెంబ్లీలో ఆప్‌కు ఉన్న సంఖ్యాబలంతో ముగ్గురిని పెద్దల సభకు పంపవచ్చు. ఇందులో ఓ స్థానం కోసం ఆ పార్టీ నేత సంజయ్‌ సింగ్‌ పేరును ఖరారు చేసింది. మరో రెండు స్థానాల పేర్లను ఆప్ ఇంకా ఎంపిక చేయలేదు.

రోగి ప్రాణం తీసిన ఆధార్‌..

హర్యానా : రాష్ట్రంలో ఆధార్‌ కార్డు ఓ రోగి ప్రాణం తీసింది. ఆధార్‌ కార్డు లేదన్న కారణంతో ప్రయివేటు ఆసుపత్రి యాజమాన్యం చికిత్సకు నిరాకరించడంతో ఓ కార్గిల్‌ అమరజవాను హవల్దార్ లక్ష్మణ్ దాస్ భార్య 55 ఏళ్ల శకుంతల దేవీ మృతి చెందింది. దేవి గత కొంత కాలం నుంచి గొంతు క్యాన్సర్‌తో బాధ పడుతున్నారు. ఈ నెల 27న దేవీ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఎక్స్ సర్వీస్‌మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ హాస్పిటల్‌కు తరలించారు.

పాక్ త్వరలో అమెరికా షాక్...

ఢిల్లీ : అమెరికా త్వరలోనే పాకిస్తాన్‌కు పెద్ద షాక్‌ ఇవ్వనుంది. అమెరికా ప్రభుత్వం పాకిస్తాన్‌కు ఇచ్చే 25 కోట్ల 50 లక్షల డాలర్ల సహాయాన్ని నిలిపివేసే దిశగా చర్చలు జరుపుతోంది. 

21:24 - December 30, 2017

ఢిల్లీ : అమెరికా త్వరలోనే పాకిస్తాన్‌కు పెద్ద షాక్‌ ఇవ్వనుంది. అమెరికా ప్రభుత్వం పాకిస్తాన్‌కు ఇచ్చే 25 కోట్ల 50 లక్షల డాలర్ల సహాయాన్ని నిలిపివేసే దిశగా చర్చలు జరుపుతోంది. ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్‌ అనుసరిస్తున్న విధానంపై ఆగ్రహంతో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్- ఆ దేశానికిచ్చే సహాయాన్ని నిలిపి వేయాలని సూచించినట్లు సమాచారం. అరాచకత్వం, హింస, ఉగ్రవాదాన్ని వ్యాపింపజేసే వ్యక్తులపై కఠిన చర్యలు చేపట్టాలన్న అమెరికా ఆదేశాలను పాక్‌ పెడచెవిన పెడుతుండడంతో ట్రంప్‌ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పాకిస్తాన్‌కు 2002 నుంచి సహాయం చేస్తున్న అమెరికా ఇప్పటివరకు 33 బిలియన్‌ డాలర్లను అందజేసింది.

21:22 - December 30, 2017

హర్యానా : రాష్ట్రంలో ఆధార్‌ కార్డు ఓ రోగి ప్రాణం తీసింది. ఆధార్‌ కార్డు లేదన్న కారణంతో ప్రయివేటు ఆసుపత్రి యాజమాన్యం చికిత్సకు నిరాకరించడంతో ఓ కార్గిల్‌ అమరజవాను హవల్దార్ లక్ష్మణ్ దాస్ భార్య 55 ఏళ్ల శకుంతల దేవీ మృతి చెందింది. దేవి గత కొంత కాలం నుంచి గొంతు క్యాన్సర్‌తో బాధ పడుతున్నారు. ఈ నెల 27న దేవీ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఎక్స్ సర్వీస్‌మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ హాస్పిటల్‌కు తరలించారు. ఆమెకు మెరుగైన వైద్యం అత్యవసరమని భావించిన వైద్యులు.. సోనిపత్‌లోని తులిప్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. అయితే ఆ ఆస్పత్రి సిబ్బంది దేవీ ఆధార్ కార్డు ఉంటేనే అడ్మిట్ చేసుకుంటామని చెప్పినట్లు మృతురాలి కుమారుడు పవన్‌ కుమార్‌ తెలిపాడు. ఆ సమయంలో తన దగ్గర కార్డు లేకపోవడంతో మొబైల్‌లోని ఆధార్‌ కార్డు చూపించి చికిత్స చేయాలని వేడుకున్నా వారు కనికరించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. మరోవైపు చికిత్స కోసం తాము ఎవరిని నిరాకరించలేదని తులిప్‌ ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.

21:20 - December 30, 2017

ఢిల్లీ : రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. ఢిల్లీ అసెంబ్లీలో ఆప్‌కు ఉన్న సంఖ్యాబలంతో ముగ్గురిని పెద్దల సభకు పంపవచ్చు. ఇందులో ఓ స్థానం కోసం ఆ పార్టీ నేత సంజయ్‌ సింగ్‌ పేరును ఖరారు చేసింది. మరో రెండు స్థానాల పేర్లను ఆప్ ఇంకా ఎంపిక చేయలేదు. రాజ్యసభ సభ్యత్వం కోసం కుమార్‌ విశ్వాస్‌ తీవ్రంగా యత్నిస్తున్నప్పటికీ... కేజ్రీవాల్‌కు ఉన్న విభేదాల కారణంగా ఆయన పేరుకు ఆమోదం లభించే అవకాశం లేదు. ఆప్‌కు చెందిన మరో నేత ఆశుతోష్‌ పేరు కూడా పరిశీలనలో ఉంది. మూడో అభ్యర్థికి ఒక ప్రొఫెసర్‌ను పంపాలని మొదట నుంచి కేజ్రీవాల్‌ ఆలోచిస్తున్నారు. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్‌ రాజన్‌, అరుణ్‌ శౌరి పేర్లు తెరపైకి వచ్చినా వారు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో ఢిల్లీ సిఎం పదవికి రాజీనామా చేసి తానే మూడో అభ్యర్థిగా పోటీ చేయాలనే భావనలో కేజ్రీవాల్‌ ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రాజ్యసభకు నామినేషన్ల గడువు జనవరి 5తో ముగుస్తుంది. జనవరి 16న ఎన్నికలు జరుగుతాయి. 

21:17 - December 30, 2017

హైదరాబాద్ : నీట్‌ను నీరుగార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని టీ జాక్ చైర్మన్ ప్రొ.కోదండరామ్ విమర్శించారు. నీట్ అంశంపై డాక్టర్ల జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని కోటి ఐఎంఏ హాల్‌లో చర్చా గోష్టి జరిగింది. కార్పొరేట్ వైద్యశాలలకు లబ్ది చేకూరే విధంగా మెడికల్ కౌన్సిల్ స్ధానంలో మెడికల్ కమిషన్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని.. ఆ ప్రతిపాదనలు ఉపసంహరించుకోవాలని కోదండరామ్ డిమాండ్ చేశారు. వైద్య విద్యార్ధుల సీట్ల ఎంపికలో వైద్యుల పాత్ర లేకుండా ఇతరులను చేర్చడం నీట్‌ నిబంధనలకు విరుద్ధమని కోదండరామ్ అన్నారు. నీట్ అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కదలికలు తెచ్చేందుకు ఆందోళన బాట పడతామని తెలిపారు. 

21:09 - December 30, 2017

హైదరాబాద్ : కమ్యూనిస్టు కురువృద్ధుడు వీరపనేని రామదాసు జీవితం అందరికీ ఆదర్శమని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. జీవితకాలంలో ఎన్ని ఒడుదుడుకులు ఎదురైనా నమ్మిన సిద్ధాంతం కోసం కడవరకు నిలబడిన ధీరోదాత్తుడని అన్నారు. వీరపనేని రామదాసు నేటి రాజకీయ నాయకులకు ఆదర్శప్రాయుడని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. రామదాసు శత జన్మదిన వేడుకలు హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగాయి. కమ్యూనిస్టు కురువృద్ధుడు వీరపనేని రామదాసు శత జన్మదిన వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. ఓ హోటల్‌లో జరిగిన ఈ వేడుకల్లో సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, విజయవాడ ఎంపీ కేశినేని నాని, రాజ్యసభ సభ్యుడు గరికపాటి రామ్మోహన్‌రావు, సీనియర్‌ పాత్రికేయుడు తెలకపల్లిరవి హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరపనేని రామదాసు జీవిత చరిత్రను వివరిస్తూ రాసిన అలుపెరుగని యోధుడు పుస్తకాన్ని ఆవిష్కరించారు.

వీరపనేని రామదాసు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. బాల్యం నుంచే ఆయన ఉద్యమబాటను ఎంచుకున్నారని తెలిపారు. క్విట్‌ ఇండియా ఉద్యమం మొదలుకొని తెలంగాణ సాయుధపోరాటం వరకు అనేక ఉద్యమాల్లో ఆయన పాల్గొన్నారని, జీవితంలో ఆటుపోటులెన్ని ఎదురైనా నమ్మిన సిద్ధాంతం కోసం కడవరకు నిలిచారని కొనియాడారు. ఆయన జీవితాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు.

వంద ఫ్లెక్సీలు పెట్టి... వాటిని ట్విట్టర్‌, వాట్సాప్‌లో పోస్ట్‌ చేసి నేడు కొందరు రాజకీయనాయకులు అయిపోతున్నారని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు వారికేమీ పట్టడం లేదన్నారు. దీంతో రాజకీయాలకు అర్థమే మారిపోతోందని తెలిపారు. పార్టీ సిద్ధాంతాలను తు.చ. తప్పకుండా పాటించే వ్యక్తి వీరపనేని రామదాసు అని ప్రస్తుతించారు. రామదాసు ఆశయాలను నేటియువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. నీతి, నిబద్ధత కలిగిన వ్యక్తి వీరపనేని రామదాసు అని సీనియర్‌ పాత్రికేయుడు తెలకపల్లి రవి అన్నారు. ఆయన శత జన్మదిన వేడుకల్లో పాల్గొనడం తనకు ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా వీరపనేని రామదాసు.. పాత జ్ఞాపకాలు, అనుభూతులను నెమరు వేసుకున్నారు. వీరపనేని రామదాసు శత జన్మదిన వేడుకల్లో ఆయన కుటుంబ సభ్యులతోపాటు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

21:07 - December 30, 2017

హైదరాబాద్ : నగరంలో న్యూ ఇయర్‌ ఫీవర్‌ మొదలైంది. కొత్త సంవత్సర వేడుకలను ఉత్సాహంగా జరుపుకునేందుకు అన్ని వర్గాల ప్రజలు సిద్ధం కాగా.. వారికి ఆతిథ్యం ఇచ్చేందుకు పబ్‌లు, హోటళ్లు, రిసార్ట్‌లు రెడీ అయ్యాయి. కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఈవెంట్‌ మేనేజర్లు కొత్త ప్రణాళికలు రచిస్తున్నారు. కొత్త సంవత్సర వేడుకలకు నగరంలోని పబ్‌లు, రెస్టారెంట్లు, హోటళ్లు సిద్ధమయ్యాయి. కస్టమర్లను... ఎంటర్‌టైన్‌ చేసేందుకు ఈవెంట్‌ మేనేజర్లు... ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా తమ కస్టమర్లను మత్తులో ముంచేందుకు సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నారు.

ముఖ్యంగా తమ కస్టమర్లను గంజాయి మత్తులో ముంచడానికి... ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసుల నిఘా వల్ల.. ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్ సరఫరా లేకపోవడంతో.. గంజాయి నుంచి లిక్విడ్‌ రూపంలో మత్తు మందును తయారు చేసి సరఫరా చేసేందుకు సిద్ధమవుతున్నారు. గంజాయి నుంచి ప్రమాదకరమైన బంగ్‌ను, రకరకాల పండ్ల రసాలను పోలిన లిక్విడ్‌లను తయారు చేయనున్నారు. గంజాయిని మెత్తగా నూరి ఉండలుగా చేసి.. పలు రకాలుగా అందజేయనున్నారు. మరోవైపు న్యూ ఇయర్‌ వేడుకలు సందర్భంగా.. పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎటువంటి ఆసాంఘిక కార్యకలాపాలకు.. అవాంఛ సంఘటనలకు తావు లేకుండా.. పోలీసులు నిఘా పెంచారు. రాష్ట్ర సరిహద్దు వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా గంజాయి సరఫరాను అడ్డుకునేందుకు ఎస్వోటీ బృందాలు సిద్ధమవుతున్నాయి.  

21:05 - December 30, 2017

హైదరాబాద్ : తెలంగాణలో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది క్రైమ్‌రేట్‌ పెరిగింది. క్రైమ్‌రేట్‌ పెరిగినా శాంతి భద్రతలకు మాత్రం ఎలాంటి విఘాతం కలగలేదని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చేలా 2018 ప్రణాళికను సిద్ధం చేశామన్నారు. ఈ ఏడాది క్రైమ్‌రివ్యూ ప్రకటించిన డీజీపీ... 2018ని పీపుల్స్‌ ఫ్రెండ్లీ పోలీసింగ్‌ సంవత్సరంగా ప్రకటించారు. శాంతిభద్రతలు అదుపులో ఉంచేందుకు పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు.

2018లో తెలంగాణ పోలీస్‌శాఖ చేయబోతున్న కార్యక్రమాలపై డీజీపీ మహేందర్‌రెడ్డి ఓ డాక్యుమెంటరీని విడుదల చేశారు. ఆ తర్వాత పోలీస్‌శాఖ వార్షిక నివేదికను ప్రకటించారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలతో కలిసి శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తామని తెలిపారు. 2018 సంవత్సరాన్ని టెక్నాలజీ, ఫ్రెండ్లీ పోలీసింగ్‌గా ప్రకటించారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చే విధంగా 2018 ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. నేరం చేస్తే దొరికిపోతామన్న భయం నిందితుల్లో వచ్చేలా పోలీస్‌ వ్యవస్థను రూపుదిద్దుతామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పీఎస్‌ల్లో సీసీటీవీలతోపాటు రిసెప్షన్‌ డెస్క్‌లు ఏర్పాటు చేసి వారి ఫీడ్‌బ్యాక్‌ రిపోర్టును పర్యవేక్షిస్తామన్నారు.

గత ఏడాదితో పోల్చితే 2017లో క్రైమ్‌రేట్‌ 12.93శాతం పెరిగిందన్నారు. నేరాలు పెరిగినా రాష్ట్రంలో శాంతి భద్రతలకు మాత్రం ఎలాంటి విఘాతం కలుగలేదన్నారు. సైబరాబాద్‌, రాచకొండ, ఖమ్మం కమిషనరేట్ల పరిధిలో క్రైమ్‌రేట్‌ పెరిగిందన్నారు. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది మహిళలపట్ల నేరాలు 18.3శాతం పెరిగాయని చెప్పారు. 2572 మంది మహిళలను రిస్క్‌ చేసి కాపాడామన్నారు. అదృశ్యమైన 4374 మంది చిన్నారులను వారి తల్లిదండ్రులకు అప్పగించామని చెప్పారు. రోడ్డు ప్రమాదాలు మాత్రం గతంతో పోల్చితే 9.73శాతం తగ్గాయన్నారు.

ఈ ఏడాది తెలంగాణలో జరిగిన అనేక జాతీయ, అంతర్జాతీయ సదస్సులను ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరుగకుండా విజయవంతం చేశామని డీజీపీ చెప్పారు. 2018లో నూతనంగా 17వేల కానిస్టేబుల్‌ పోస్టులకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిందని... వీటిని త్వరలోనే భర్తీ చేస్తామన్నారు. నూతన సంవత్సరంలో నయీమ్‌ అనుచరుడు శేషన్నను అరెస్ట్‌ చేస్తామని.. నయీమ్‌ బాధితులకు న్యాయం చేసేదిశగా చర్యలు తీసుకుంటామన్నారు. దేశంలోనే తెలంగాణ పోలీస్‌శాఖకు మంచి పేరు తీసుకొచ్చేలా అందరం కృషి చేస్తామని చెప్పారు. పోలీసుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని మహేందర్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే వెల్ఫేర్‌ కోసం 2 కోట్ల 56 లక్షల రూపాయల రుణాలు ఇచ్చామన్నారు. తెలంగాణ పోలీస్‌ సంక్షేమంలో అగ్రస్థానంలో ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు.

21:03 - December 30, 2017

భద్రాద్రి : ప్రేమ అన్నాడు.. పెళ్లి అన్నాడు..! వెంటపడ్డాడు... వేధించాడు..! ఆమె తిరస్కరించినందుకు... భయపెట్టాడు.. బెదిరించాడు..! ఉన్మాదంతో.. రెచ్చిపోయాడు..! తనకు దక్కనదని... ఎవరికీ దక్కకూడదనుకున్నాడు...! ఆమె ప్రాణాలు తీసి... తనూ ప్రాణాలు తీసుకున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. దమ్మపేట మండల నెమలిపేటలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమోన్మాది యువతిని కత్తితో పొడిచి దారుణంగా హతమార్చాడు. అనంతరం గ్రామ శివారులో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నెమలిపేటలో విద్యావాలంటీర్‌గా పనిచేస్తున్న మీనా ప్రవళ్లికను .. మావయ్య శ్రీనివాసరావు.. పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. అయితే మీనా ప్రవళ్లిక.. ఆమె కుటుంబ సభ్యులు.. ఆ పెళ్లి ప్రపోజల్‌ను నిరాకరించారు. వేరొకరితో ప్రవళ్లికకు పెళ్లిని కూడా నిశ్చయించారు.

ఈ నేపథ్యంలో శనివారం శ్రీనివాసరావు.. పాఠశాలకు వెళ్తున్న ప్రవళ్లిక వెంటపడి.. వేధించాడు. సాయంత్రం పాఠశాలలో విధులు ముగించుకుని ఇంటికి బయలుదేరుతున్న సమయంలో శ్రీనివాసరాజు మరోసారి పాఠశాల వద్దకు వచ్చి తనను పెళ్లి చేసుకోవాలని ప్రవళ్లికను బలవంతంపెట్టాడు. భయపడిన ప్రవళ్లిక వెంటనే తన కాబోయే భర్తకు ఫోన్‌చేయగా..ఆయన ఆ విషయాన్ని ప్రవళ్లిక అన్నయ్యకు తెలియజేశాడు. దీంతో ఆయన ఘటనా స్థలానికి చేరుకున్నాడు. అయితే రెచ్చిపోయిన శ్రీనివాసరావు.. ప్రవళ్లిక అన్నయ్య కళ్ల ముందే.. ప్రవళిక గొంతుపై కత్తితో పొడిచి..ఆమెను హతమార్చాడు. అనంతరం అక్కడికక్కడే పురుగుల మందు తాగి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రవళ్లిక మృతితో .. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచార మందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి.. దర్యాప్తు చేస్తున్నారు. 

21:02 - December 30, 2017

విజయవాడ : కోడిపందేలను ప్రోత్సహించొద్దని ఏపీ సీఎం చంద్రబాబు కోరారు. ఈరోజు పార్టీ నేతలతో సీఎం క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జన్మభూమితో పాటు జిల్లాల్లోని పార్టీ పరిస్థితులపై చర్చించారు. ఇందులో భాగంగానే సీఎం చంద్రబాబు కోడి పందేలపై పలు సూచనలు చేశారు. కోడిపందేలను సంప్రదాయంగానే చూడాలని, ప్రోత్సహిస్తే జూదంలా మారుతుందని ఆయన అన్నారు. జూదంలా మారితే కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయన్నారు. గోదావరి జిల్లా నాయకులు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. 

21:01 - December 30, 2017

వరంగల్ : గొర్రెలు, బర్రెలు, చేపపిల్లలు ఇస్తే సామాజిక న్యాయం చేకూరదని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సీపీఎం వరంగల్‌ అర్బన్‌ జిల్లా మహాసభల్లో పాల్గొన్న ఆయన.. బీసీ సబ్‌ప్లాన్‌ను ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని, బడ్జెట్‌లో బీసీలకు అనుకూలంగా నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. అలాగే ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచకుండా వాళ్ల మధ్య తగాదాలు పెట్టడం సరికాదన్నారు. కేసీఆర్ అబద్ధాలు చెబుతూ మాటాల గారడీ చేస్తున్నారని తమ్మినేని మండిపడ్డారు. జనవరి చివరి వారంలో సామాజిక, వామపక్ష పార్టీలతో కలిసి పొలిటికల్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేస్తామని తమ్మినేని తెలిపారు.

 

20:56 - December 30, 2017

భయమే లేదు..ఓపెన్ గా చెబుతానని..చంద్రబాబు నాయుడిని కాదని..ఏం చేయనని టిడిపి సీనియర్ నేత మోత్కుపల్లి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు..టిడిపి పరిస్థితి తదితర వివరాలపై ఆయనతో టెన్ టివి ముచ్చటించింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమస్యలపై మాట్లాడుకుంటారని..సిద్ధాంతం ప్రకారం నడుచుకుంటారని వ్యాఖ్యానించారు. 2019లో ఆలేరు నుండే పోటీ చేస్తానని..టిడిపి నుండే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. టీఆర్ఎస్..టిడిపి పొత్తుపై ఆయన స్పందించారు. టీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉందో చెప్పలేనని..ఆనాడు ఉన్నటువంటి ఊపు ఈనాడు ఉందా ? అని ప్రశ్నించారు. కానీ పొత్తు ఉండడం వల్ల వారికి లాభం జరుగుతుంది..ఇక్కడ లాభం జరుగుతుందన్నారు. పదవులపై తనకు వ్యామోహం లేదని..వస్తే రావచ్చని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

1న ప్రత్యేక పూజలు చేసుకోవచ్చన్న హైకోర్టు...

హైదరాబాద్ : జనవరి 1వ తేదీన అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసుకోవచ్చని ఉభయ రాష్ట్రాల హైకోర్టు పేర్కొంది. జనవరి 1న ఆలయాల్లో ఎలాంటి ప్రత్యేక పూజలు చేయవద్దని నిర్వహించొద్దంటూ ఏపీ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ సర్క్యూలర్ జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

 

బౌన్సర్ పై కిరోసిన్ పోసి వ్యక్తి ఆత్మహత్యాయత్నం...

హైదరాబాద్ : సోమాజిగూడలోని పార్క్‌ హోటల్‌లో ఓ బౌన్సర్ ..యువకుడి మధ్య ఘర్షణ చెలరేగింది. దీనితో యువకుడు బౌన్సర్ పై పెట్రోల్ పోసి తాను పోసుకుని నిప్పంటించుకున్నాడు. వెంటనే అక్కడున్న సిబ్బంది స్పందించి వారిని ఆసుపత్రికి తరలించారు. 

గుజరాత్ కేబినెట్ లో విబేధాలపై హార్థిక్ స్పందన.

 

గుజరాత్ : రాష్ట్ర కేబినెట్ లో నెలకొన్న విబేధాలపై హార్థిక్ పటేల్ స్పందించారు. డిప్యూటి సీఎంతో పాటు పది మంది బీజేపీ పార్టీని వీడేందుకు సిద్ధమౌతున్నారని, ఈ విషయంలో కాంగ్రెస్ వారితో మాట్లాడి తగిన విధంగా గౌరవం లభించే విధంగా మాట్లాడుతానని హార్ధిక్ పేర్కొన్నారు. 

 

20:32 - December 30, 2017

ఐసీస్ ఉగ్రవాదుల కంటే ఎక్కువ మోపయినయ్ గద వీధి కుక్కలు...పాత నల్గొండ జిల్లా మొత్తం అవిటి వ్యవహారం నడుస్తున్నట్లే ఉంది గదా...మిర్యాలగూడ దిక్కు 20 మందిని కరిచి సత్తా చాటినయంట. ఆత్మకూరు మండలంలో కూడ పది మందిని కరిచి ఆడ వాళ్ల ఉనికిని చాటుకున్నయంట. కుక్కల సంగతేంటో వీడియో క్లిక్ చేయండి. 

20:28 - December 30, 2017

టెన్ టివి ప్రజల కోసం..వారి అన్యాయాన్ని బాహ్యాప్రపంచానికి చూపెట్టేందుకు నిరంతరం కృషి చేస్తోంది..అందరికీ న్యాయం కావాలన్నదే టెన్ టివి లక్ష్యం..మంథని లో దళితుల బహిష్కరణపై టెన్ టివి గొంతెత్తి నినదించింది....పేరుకు మద్యపాన నిషేధం..ఆ శాఖలు ఏం చేస్తున్నయి..పాత నల్గొండ జిల్లాలో పిచ్చి కుక్క వీరంగం సృష్టించింది...మల్లన్న అడిగే ప్రశ్నకు సరియైన సమాధానం చెప్పింది ఎవరు ? ఇవాళ్టి ప్రశ్న..కోతులు ఇంతింత మనిషి రూపంలో మారుతున్నట్లే అనిపిస్తోంది...భారతరత్న లెక్క..స్టోరీ రత్న అవార్డు పెడితే బాగుండు..దేశంలో ఉత్తమ చోరకళ ప్రదర్శించినోడికి పిలుచుకుని సత్కరించుకుంటే ఆ కళను గుర్తించినట్లుండు..39 మందిని పెళ్లి చేసుకుని 94 మందిని పిల్లలు కన్నడు..గిసొంటి ముచ్చట్ల కోసం వీడియో క్లిక్ చేయండి...

2007లో లంచం తీసుకున్న కేసులో...

హైదరాబాద్ : 2007లో లంచం తీసుకున్న కేసులో వర్క్స్ అకౌంట్స్ డిపార్ట్ మెంట్ మాజీ సూపరింటెండెంట్ రమణారావుకు ఏడాది జైలు శిక్ష..రూ. 10 వేల జరిమాన విధించింది.

చితకబాదిన కలెక్టర్ల గన్ మెన్లు..

మహబూబ్ నగర్ : దామరగిద్ద (మం) వత్తుగుండ్లలో రోడ్డుపై కేజీవీల్స్ తో ట్రాక్టర్ నడుపుతున్న వ్యక్తిని కలెక్టర్ మందలించారు. కలెక్టర్ కు ట్రాక్టర్ డ్రైవర్ ఎదురు తిరగడంతో అక్కడే ఉన్న కలెక్టర్ గన్ మెన్లు ఆ వ్యక్తిని చితకబాదారు. గన్ మెన్ల తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ జీపు టైర్లలో గాలి తీసేసి ఆందోళన చేపట్టారు. 

తిరుమలలో అదే రద్దీ...

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 46 కంపార్ట్ మెంట్లు నిండిపోవడంతో క్యూ లైన్లు వెలుపలికి వచ్చాయి. శ్రీవారి సర్వ దర్శనానికి 10గంటల సమయం పడుతోంది. ఉదయం నుండి శ్రీవారిని 71,309 మంది దర్శించుకున్నారు. నేడు శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.16 కోట్లుగా ఉంది. 

19:46 - December 30, 2017

పోలవరం కథ కంచికి చేరుతోందా..? మరో ఏడాదిలో ప్రాజెక్టు పూర్తిచేయాలన్న ఏపీ ప్రభుత్వం మాటలకే పరిమితం అవుతోందా..? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో.. ఇప్పటికే నిర్మాణ పనులకు బ్రేకులు పడగా ..తాజాగా కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌ ట్రాయ్‌పై కెనరాబ్యాంకు దివాలా పిటిషన్‌ దాఖలు చేసింది. దీంతో మరో ఏడాదిలో నీరు ఇచ్చేమాట అటుంచితే.. మరో రెండేళ్లయినా ప్రాజెక్టు పూర్తికాని పరిస్థితి తలెత్తింది. ఈ అంశంపై విజయవాడ టెన్ టివి స్టూడియోలో జరిగిన చర్చా వేదికలో అన్సీ దాసు (ఆర్థిక విశ్లేషకులు), జయకర్ (విజయవాడ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

కూచిపూడి పీఎస్ ఎదుట వైసీపీ నేతల ధర్నా...

కృష్ణా : కూచిపూడి పీఎస్ ఎదుట వైసీపీ నేతలు ధర్నా నిర్వహించారు. ఫేస్ బుక్ లో జగన్ కు వ్యతిరేకంగా పోస్టింగ్ పెట్టిన వ్యక్తిపై ఫిర్యాదు చేయడానికి వైసీపీ నేతలు పీఎస్ కు వెళ్లారు. ఫిర్యాదు తీసుకోకుండా పామర్రు వైసీపీ ఇన్ ఛార్జీ పట్ల ఎస్ఐ అనుచితంగా ప్రవర్తించారని వైసీపీ నేతలు ఆరోపించారు. పామర్రు వైసీప ఇన్ ఛార్జీ అనీల్ కుమార్ ఆధ్వర్యంలో పీఎస్ ఎదుట వైసీపీ నేతలు ఆందోళన చేపట్టారు. 

47వ రోజు జగన్ పాదయాత్ర..

చిత్తూరు : వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర కొనసాగుతోంది. 47వ రోజు 14.3 కిలోమీటర్ల మేర నడిచారు. శనివారం సాయంత్రం రామిగానివారిపల్లె వద్ద ఆయన తన పాదయాత్రను ముగించారు.

ఏపీ డీజీపీగా..

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీగా మాలకొండయ్య నియమితులయ్యారు. ఆదివారం ప్రస్తుత డీజీపీ సాంబశివరావు పదవీ విరమణ చేయనున్నారు. ఉదయం 8గంటలకు వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. ఏపీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ గా మాల కొండయ్య బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 

19:11 - December 30, 2017

విజయవాడ : పాపను బతికించుకుందామని పోరాటం చేసిన ఆ తల్లిదండ్రుల ఆశ నెరవేరలేదు. వైద్యుల తీవ్ర నిర్లక్ష్యం ఫలితంగా తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలినట్లైంది. రాజరాజేశ్వరీ పేటలో నివాసం ఉంటున్న సాయిదుర్గ అనే బాలిక వాంతులు చేసుకోవడంతో విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స చేసిన అనంతరం పాప మృతి చెందిందని చెప్పడంతో తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లారు. ఉదయం పాపలో కదలిక రావడంతో స్థానిక ఆర్ఎంపీకి చూపించారు. అతను కూడా పాప మృతి చెందిందని చెప్పాడు. కానీ అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ వారు చికిత్స అందించేందుకు అనుమతించలేదు. చివరకు బంధువుల ఆందోళనతో చికిత్స అందించేందుకు అంగీకరించారు. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. చికిత్స పొందుతూ సాయి దుర్గ కన్నుమూసింది.

దీనితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. దీనికంతటికీ వైద్యుల నిర్లక్ష్యమే కారణమని పేర్కొన్నారు. మరి ఈ ఘటనపై ప్రభుత్వం స్పందిస్తుందా ? లేదా ? అనేది చూడాలి. 

18:46 - December 30, 2017
18:42 - December 30, 2017

విజయవాడ : ఒకరేమో చనిపోయిందని చెబుతారు..మరొకరు ప్రాణాలతో ఉందని చెబుతారు..మరొకరు తమ ఆసుపత్రికి తీసుకరావద్దని చెబుతారు..దీనితో బిడ్డను బతికించుకొనేందుకు ఆ తల్లిదండ్రులు నరకయాతన అనుభవించారు. ఈ ఘటన మళ్లీ విజయవాడలోనే చోటు చేసుకుంది.

రాజరాజేశ్వరీ పేటలో నివాసం ఉంటున్న సాయిదుర్గ అనే బాలిక వాంతులు చేసుకోవడంతో విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. కానీ బాలిక కోమాలోకి వెళ్లినట్లు..వైద్యులు పేర్కొన్నారు. అరగంట అనంతరం పాప మృతి చెందిందని వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అనంతరం అర్ధరాత్రి సమయంలో అంబులెన్స్ లో రాజరాజేశ్వరీపేటకు తీసుకెళ్లారు. డబ్బులు ఇవ్వకపోవడంతో మరణ ధృవీకరణ పత్రం ఇవ్వకుండానే డ్రైవర్ వెనుదిరిగాడు. ఉదయం దహన సంస్కారాలకు అన్ని ఏర్పాట్లు చేశారు.

ఆ సమయంలో సాయిదుర్గ చేతులు కదలడం..గుండె కొట్టుకోవడాన్ని తల్లిదండ్రులు గమనించారు. స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ వైద్యుడు పరీక్షించి బాలిక మృతి చెందినట్లు పేర్కొన్నారు. కానీ బాలికలో కదలికలు ఉండడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు పాయకరావుపేటలో ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అక్కడి ఆసుపత్రి యాజమాన్యం బాలికకు చికిత్స అందించేందుకు నిరాకరించారు. బంధువులు ఆందోళన చేయడంతో బాలికను లోనికి అనుమతినించారు. ప్రస్తుతం పాప పరిస్థితి..ఇతరత్రా వివరాలు తెలియాల్సి ఉంది. 

18:33 - December 30, 2017
18:33 - December 30, 2017
18:30 - December 30, 2017

హైదరాబాద్ : జనసేనానీ అధినేత పవన్ కళ్యాణ్ ను ఫాతిమా కళాశాల విద్యార్థులు కలిశారు. ఇటీవలే ఏపీలో పర్యటించిన పవన్ కళ్యాణ్ ను కలిసిన ఫాతిమా కళాశాల విద్యార్థులు తమ గోడును విన్నవించుకున్నారు. దీనితో వారికి ఆయన అభయం ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులతో తాను మాట్లాడి సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తానని పవన్ హామీనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫాతిమి విద్యార్థుల సమస్యలు పరిష్కరించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకొంటోంది. దీనితో పవన్ కు కృతజ్ఞతలు తెలిపేందుకు ఫాతిమా విద్యార్థులు..వారి తల్లిదండ్రులు హైదరాబాద్ కు వచ్చారు. శుక్రవారం రాత్రి జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ ను కలిశారు. న్యాయం కోసం మూడేళ్లుగా ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. 

18:22 - December 30, 2017

కృష్ణా : జిల్లా మైలవరం వద్ద ఘోరమైన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి చెందారు. సద్గురి లత, గురజాల నాగమణి, మందమేరీలు మృతి చెందిన వారిలో ఉన్నారు. ఆటోలో ప్రయాణిస్తున్న మరో 9మందికి గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బిటెక్ విద్యార్థులు మద్యం తాగి వాహనం నడపడంతోనే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. 

సైబర్ నేరాస్థుల ముఠా అరెస్ట్

కృష్ణా : విజయవాడలో పోలీసులు  ఇంటర్నెట్ ప్రోటో కాల్ ద్వారా మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టు చేశారు. దుబాయ్, అమెరికా, సాప్ట్ వేర్లతో కాల్స్ డైవర్ట్ చేసే 9 మందిని ఇంటిలిజెన్స్ బృందం అరెస్టు చేసింది. వారి వద్ద నుంచి ల్యాప్ టాప్ లు, రూటర్లు, మానిటర్లు, సిమ్ రూటర్లు, సీపీయూలు, కారు, హార్డ్ డిస్కలు, కీబోర్డులు స్వాధీనం చేసుకున్నారు.

18:16 - December 30, 2017

ప్రకాశం : రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని ఏపీ డీజీపీ సాంబశివరావు వ్యాఖ్యానించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో శుక్రవారం మోడల్ పోలీస్ స్టేషన్ కు ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో అనేక సందర్భాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని శాంతిభద్రతలను అదుపులో ఉంచినట్లు, ప్రజలకు మరింత మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తామన్నారు. 

18:03 - December 30, 2017

కరీంనగర్ : తెలంగాణ చిత్రపటంపై కరీంనగర్‌ను నంబర్‌వన్‌గా తీర్చి దిద్దుతామని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. త్వరలోనే మానేరు రివర్ ఫ్రంట్ శంకుస్థాపనకు సీఎం కేసీఆర్ వస్తారని ఆయన చెప్పారు. కరీంనగర్ మానేరు నదిపై 149 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించ తలపెట్టిన కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి మంత్రి ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావులు శంకుస్థాపన చేశారు. దీంతో పాటుగా కరీంనగర్ నుంచి సదాశివపల్లి వరకు 34 కోట్లతో ఫోర్ లైన్ రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్ధానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్, రసమయి బాలకిషన్‌లు పాల్గొన్నారు. అనంతరం భారీ బహిరంగ సభ జరిగింది.  

18:01 - December 30, 2017

సిద్ధిపేట : అడవిలో ఉండాల్సిన కోతులు ఊరి మీద పడ్డాయి.... పొలంలో పంటా... ఇంట్లో వంటా దేన్నీ వదలకుండా నాశనం చేస్తున్నాయి. కోతి చేష్టలతో సిద్ధిపేట జిల్లా చేర్యాల మండలం వేచరేణి గ్రామస్థులు హడలి పోతున్నారు. కోతుల బెడదపై టెన్‌టీవీ ప్రత్యేక కథనం. సిద్ధిపేట జిల్లా చేర్యాల మండలం వేచరేణి గ్రామస్థులకు... కోతులు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను... తీరా చేతికొచ్చే సమయంలో నాశనం చేస్తున్నాయి.. అంతటితో ఆగకుండా గ్రామస్తులపై కూడా దాడి చేస్తున్నాయి. కోతులు ఒక్కసారిగా గుంపులు గుంపులుగా వచ్చి పొలాలపై తెగబడుతున్నాయి. రైతులు పొలంలో పంటకు కాపలా కాయాలో... తాము తెచ్చుకున్న అన్నం గిన్నెలను కాపాడుకోవాలో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం స్పందించి తమను కోతుల బెడదనుంచి కాపాడాలని రైతులు వేడుకుంటున్నారు.

రైతు పంటల సాగు ఎంతగా మంచి పద్ధతిలో చేస్తున్నా... కోతులు మాత్రం సర్వ నాశనం చేస్తున్నాయి. విత్తనాలు, ఎరువులకు డబ్బు పెట్టి... నిద్రాహారాలు లేకుండా రైతులు కష్టపడుతున్నారు. ఐతే కోతులవల్ల తాముపడ్డ శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరులా... వృధా అవుతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. వీటి బారినుంచి తమను తాము రక్షించుకునేందుకు... గ్రామస్థులంతా ఏకమయ్యారు. హడలెత్తిస్తున్న కోతుల బెడదకు ఎలాగైనా చెక్‌ పెట్టాలని నిర్ణయించకున్నారు. ఈ సమస్యపై గ్రామపంచాయితీలో తీర్మానం కూడా చేశారు. ఇంటింటికీ చందా వేసుకుని కోతులు పట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

మొదట ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టంలోని కర్నూలు, నెల్లూరు జిల్లాలనుంచి కోతులు పట్టే బృందాలను రప్పించారు. ఐతే బయటి ప్రాంతాలనుంచి వారిని పిలిపంచడం ఆర్థికంగా భారమైంది.. దీంతో కోతులు పట్టడానికి స్థానిక వ్యక్తినే ఎంచుకున్నారు. గ్రామసర్పంచ్‌ సహాయంతో ప్రత్యేకంగా బోనులను కూడా తయారు చేయించారు. కానీ.. తమ కృషికి తగ్గట్టు ప్రభుత్వం కూడా చేయూత ఇవ్వాలని వారు కోరుతున్నారు. కోతుల వల్ల పంటకే...తమ ప్రాణాలకు కూడా ముప్పు ఉందంటున్నారు రైతులు. ప్రభుత్వం తేలిగ్గా తీసుకోకుండా సహాయం చేసి ఆదుకోవాలని గ్రామస్థులంతా ముక్త కంఠంతో వేడుకుంటున్నారు.

విజయవాడలో ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం

కృష్ణా : విజయవాడలో ప్రభుత్వ వైద్యులు బతికున్న బాలికను చనిపోయిందని తేల్చారు. బాలిక సాయిదుర్గ చనిపోయిందనుకొని తల్లిదండ్రులు అంబులెన్స్ లో ఇంటికి తరలించారు. బాలిక అంత్యక్రియలు ఏర్పాటు చేస్తుండగా సాయిదుర్గ స్పృహలోకి వచ్చింది. దీంతో సాయిదుర్గను కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. 

17:58 - December 30, 2017

హైదరాబాద్ : విద్యార్థులకు తరగతి గదుల్లో కంటే వారిని సైన్స్‌ ప్రాజెక్టుల్లో భాగంచేసి ప్రదర్శనలు చేయిస్తే వారిలో విజ్ఞానం, సృజనాత్మకత మెరుగుపడుతుందన్నారు విజ్ఞాన్‌ స్కూల్‌ చైర్మన్‌ రుద్రమదేవి. హైదరాబాద్‌ మదీనగూడలోని విజ్ఞాన్‌ గ్లోబల్‌ జెన్‌ స్కూల్‌లో న్యూ ఇయర్‌ కార్నివాల్‌ పేరుతో న్యూఇయర్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రుద్రమదేవి పాల్గొని వేడుకలను ప్రారంభించారు. విద్యార్థులు వారు రూపొందించిన ప్రాజెక్టులను ఈ కార్యక్రమంలో ప్రదర్శించారు. రాబోయే రోజుల్లో రోబోటిక్స్‌ పాత్ర వాటి ఉపయోగాలను వివరించారు.

17:57 - December 30, 2017
17:54 - December 30, 2017
17:54 - December 30, 2017
17:52 - December 30, 2017

మంజీరా పైప్ లైన్ లీకేజీ

సంగారెడ్డి : ముత్తండిలో మంజీరా పైప్ లైన్ లీక్ అయింది. దీంతో నీరు వృథాగా పోతుంది. ఇంతవరకు అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో లీక్ అయిన ప్రాంతం బురద గా మారింది.

17:31 - December 30, 2017

హైదరాబాద్ : 2019 ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ పనిచేయదని టి.కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కుల రాజకీయాలు చేస్తున్నారని, గొల్ల కురుమ శంకుస్థాపన కార్యక్రమంలో కేసీఆర్ ప్రగల్బాలు పలికారని విమర్శించారు. ఎన్నికలకు ముందు ఇంటికో ఉద్యోగం అన్న కేసీఆర్ నేడు ఆ మాటే మరిచిపోయారని, ఆయన సొంత నియోజకవర్గంలో ఎంతో మంది రైతులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోలేదన్నారు. ఎవరికి డబ్బులు ఇస్తే వారికి అవార్డులు ఇస్తారని..మంత్రి కేటీఆర్ కు అవార్డులు రావడంలో గొప్పతనం లేదని ఎద్దేవా చేశారు. 

17:21 - December 30, 2017

జమ్మికుంట సీఐపై ప్రశాంత్ రెడ్డిపై డీజీపీకి ఫిర్యాదు

కరీంనగర్ : కమిషనరేట్ పరిధిలోని జమ్మికుంట సీఐ ప్రశాంత్ రెడ్డిపై డీజీపీతో పాటు హోంశాఖ సెక్రటరీకి పాపయ్య అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ప్రశాంత్ రెడ్డి సీసీ కెమెరాలు, స్మార్ట్ పోలీస్ స్టేషన్ల నిర్మిణం పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతన్నారని సీఐ పై ఆరోపణ ఉంది. 

17:20 - December 30, 2017
17:17 - December 30, 2017
17:17 - December 30, 2017
17:16 - December 30, 2017

భద్రాద్రి : తెలంగాణ రాష్ట్రంలో నేరాలు ఘోరాలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రేమ పేరిట కొంతమంది యువకులు దారుణంగా వ్యవహరిస్తున్నారు. ప్రేమించాలని..పెళ్లి చేసుకోవాలని..వేధించడం..నిరాకరించిన పలువురి యువతులను దారుణంగా చంపేస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్ నగరంలో ప్రేమించడం లేదనే కారణంతో కిరోసిన్ పోసి ఓ యువతిని దారుణంగా హత మార్చిన సంగతి తెలిసిందే. తాజాగా భద్రాద్రి జిల్లాలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. పెళ్లికి నిరాకరించిందనే కారణంతో విద్యావాలంటీర్ ను యువకుడు దారుణంగా పొడిచి చంపేశాడు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దమ్మపేట మండలం నెమలిపేటలో ప్రవళ్లిక అనే యువతి విద్యావాలంటీర్ గా పనిచేస్తోంది. ఈమెకు తల్లిదండ్రులు వివాహం సంబంధాలు చూస్తున్నారు. వనమ శ్రీనివాస్ తో పెళ్లి సంబంధం కుదుర్చుకోవాలని అనుకుని విరమించుకున్నారు. అశ్వరాపేట పేటకు చెందిన మరొక యువకుడితో ప్రవళ్లిక వివాహం నిశ్చయించారు. ఇది తెలుసుకున్న శ్రీనివాస్ తననే పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టాడు. లేనిపక్షంలో చంపేస్తానని బెదిరించినట్లు తెలుస్తోంది. శనివారం ప్రవళ్లిక పాఠశాలకు వస్తుండగా శ్రీనివాస్ ఆమెతో వాగ్వాదానికి దిగాడు. ఈ సమయంలో తన సోదరుడికి ప్రవళ్లిక ఫోన్ చేసింది. బెదిరించినట్లుగానే ప్రవళ్లిక గొంతు కోసం విచక్షణారహితంగా పొడిచి చంపేశాడు. అనంతరం తాను పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తీవ్ర కలకలం నింపిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. 

కర్ణాటక మంత్రి రేవన్నపై కుంతియా ఆగ్రహం

హైదరాబాద్ : కర్ణాటక కాంగ్రెస్ మంత్రి రేవన్నపై టీ. కాంగ్రెస్ వ్యవహారల ఇంచార్జ్ కుంతియా ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ను పొగడడంపై కుంతియా ఫైర్ అయ్యారు. రెవన్న పై చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీకి లేఖ రాస్తానని కుంతియా తెలిపారు. 

కాకానిపై పరువునష్టదావా వేసిన సోమిరెడ్డి

నెల్లూరు : వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడిపై మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరువునష్టం దావా వేశారు. సోమిరెడ్డి అక్రమంగా ఆస్తులు కూడబెట్టారంటూ గతంలో కాకాని కొన్ని డాక్యుమెంట్లు విడుదల చేశారు. అవి అన్ని నకిలీ డాక్యుమెంట్లని సోమిరెడ్డి అన్నారు.

15:51 - December 30, 2017
15:50 - December 30, 2017

కావలసిన ఐటమ్స్..
బాసుమతి బియ్యం ఒక్కటిన్నర కప్పు, చికెన్ అర కేజి, బిర్యానీ మాసాల పొడి అర టీస్పూను, ఉల్లిగడ్డ ఒక్కటి (పెద్దది సన్నగా తరిగి నూనెలో వేయించాలి) సన్నగా తరిగిన కోతిమీర, పుదీన, నూనె రెండు టెబుల్ స్పూన్లు, కుంకుమ పువ్వు, అల్లంవెల్లుల్లి, పచ్చి మిర్చి, పెరుగు, నిమ్మకాయ,

తయారీ...
అల్లంవెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చిముక్కలు, పసుపు, పెరుగు, నిమ్మరసం, కారం, బీర్యానీ మసాల పొడి, గ్రీన్ యాలకుల పొడి, ఉప్పు వేసి చికెన్ బాగా పట్టేలా కలపాలి. ఆ మిశ్రమాన్ని రెండు గంటల పాటు నానబెట్టాలి. తర్వాత బియ్యన్ని బాగా కడిగి నానబెట్టుకోవాలి. కుక్కర్ నీరుపోసి వేడిచేయాలి. అందులో ఉప్పు, ఒక టీ స్పూన్ నూనె వేయాలి. తర్వాత నానబెట్టిన బియ్యం వేయాలి బియ్యం కొంచెం ఉడికిన తర్వాత నాన బెట్టిన చికెన్ ప్యాన్ లో వేసి అందులో ముందుగా వేయించిన ఉల్లిపాయాలను వేయాలి. ఉడికిన అన్నాన్ని చికెన్ పై ఒక పొరాల వేసి ఆవిరి బయటకు రాకుండా మూత పెట్టాలి. అలా 30 నిమిషాలు ఉంచి స్టావ్ పై నుంచి దించాలి.

 

15:38 - December 30, 2017

ముంబై : వాణిజ్య కేంద్రంగా పేరొందిన ముంబైలో జరిగిన అగ్నిప్రమాదంతో అధికారులు మేల్కొన్నారు. గురువారం రాత్రి జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 14 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఘటన జరిగిన అనంతరం రెస్టారెంట్ యజమానులు పారిపోయారు. దీనితో వారికి లుక్ ఔట్ నోటీసులు జారీ చేసింది. ఇదిలా ఉంటే ఈ ఘటనపై సీఎం స్పందించి ఐదుగురు బిఎంసీ అధికారులపై వేటు వేశారు.

శనివారం బిఎంసి అధికారులు మేల్కొని పలు చర్యలకు ఉపక్రమించారు. కమలామిల్స్ కు సమీపంలోని అక్రమ కట్టడాలను తొలగించడం మొదలుపెట్టారు. రఘువంశీ మిల్స్ సముదాయంలోని అక్రమ కట్టడాలను అధికారులు తొలగించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఏ అక్రమ కట్టడాన్ని వదిలేది లేదని బిఎంసీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. 

15:37 - December 30, 2017

మేడ్చల్ జిల్లాలో విషాదం

మేడ్చల్ : జిల్లా జవహర్ నగర్ లో విషాదం చోటుచేసుకుంది. రెవెన్యూ అధికారుల వేధింపులతో ఓ వ్యక్తి యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వీఆర్వో స్వాతి, వెంకటేశ్ ఆధ్వర్యంలో చెన్నపురం చౌరస్తాలో ఆక్రమణల కూల్చివేత చేపట్టారు. ఎండి. యాసిన్ కు చెందిన ఇంటి గోడను జేసీబీతో కూల్చే ప్రయత్నం చేయగా వద్దని యాసిన్ అధికారులను కోరారు వారు వినకపోవడంతో యాసిడ్ తాగాడు. 

15:29 - December 30, 2017

వరంగల్ : సీపీఎం వరంగల్ అర్బన్ జిల్లా 19వ మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు ఈ సభలు జరుగనున్నాయి. మహాసభల సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. కళ్యాణి ఫంక్షన్ హాల్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ప్రదర్శనలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి.వెంకట్, జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకట్ టెన్ టివితో మాట్లాడారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు - అమలుపై చర్చిస్తామని, ప్రజా వ్యతిరేక విధానాలపై భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

15:25 - December 30, 2017

ఢిల్లీ : కొన్ని రోజులుగా విడుదల విషయంలో నలుగుతున్న 'పద్మావతి' సినిమా విడుదలకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ సినిమాకు 'యు/ఎ' సర్టిఫికెట్‌ను ఇచ్చిన సెన్సార్ బోర్డ్.. కొన్ని షరతులను పెట్టింది. అందులో 'పద్మావతి' పేరును 'పద్మావత్‌'గా మార్చాలని...సినిమాలో 26 సన్నివేశాలకు కత్తెర వేయాలని చెప్పింది.

బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ రూ. 190 కోట్లతో ఈ సినిమా ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ర‌ణ్‌వీర్ సింగ్‌, దీపికా ప‌దుకునే, షాహిద్ క‌పూర్ లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించారు. అయితే సినిమా సెట్స్ పై ఉండగానే వివాదాలు చుట్టుముట్టాయి. దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ రాణి 'పద్మావతి' జీవిత కథను వక్రీకరిస్తున్నారని పలువురు కేసులు పెట్టారు. ఈ సమస్యను సెన్సార్ బోర్డ్ దగ్గరే పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనితో సీబీఎఫ్‌సీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్) ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేసి, వారికి ఈ చిత్రాన్ని చూపించి 'యు/ఎ' సర్టిఫికెట్‌ను జారీ చేసింది. ఇక ఈ చిత్రాన్ని జనవరి 26న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. 

15:25 - December 30, 2017

బాలీవుడ్ కండాల వీరుడు సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటించిన చిత్రం టైగర్ జిందా హై ఈ సినిమా విడుదలై వారం రోజులు కాకముందే రూ.200 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. 2017వ సంవత్సరం ముగింపు సందర్భంలో విరీతమైన వసూళ్లతో రూ.300కోట్ల వైపు దూసుకెళ్తుంది. అదే జరిగితే రూ.300 కోట్ల క్లబ్ లో ఎక్కువ సినిమాలు ఉన్న హీరోగా సల్మాన్ రికార్డ్ సృష్టించనున్నారు. సల్మాన్ బజరంగీ భాయ్ జాన్, సుల్తాన్ సినిమాలు రూ.300 కోట్ల క్లబ్ చేరిన సంగతి తెలిసిందే...

15:11 - December 30, 2017

హైదరాబాద్ : తాజ్ మహల్ హోటల్ లో పనిచేస్తున్న ఓ బాలుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది. శుక్రవారం జరిగిన ఈ ఘటనను హోటల్ యాజమాన్యం గోప్యంగా ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటన నారాయణగూడలో చోటు చేసుకుంది. కానీ హోటల్ యాజమాన్యం మాత్రం బాలలను పనిలో ఎందుకు పెట్టుకుందనేది తెలియడం లేదు.

ఒడిషా రాష్ట్రానికి చెందిన లాచయ్య అనే బాలుడు శుక్రవారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సీసీ టివి కెమెరా ఫుటేజ్ లో ఆత్మహత్యకు పాల్పడిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆత్మహత్యకు పాల్పడడానికంటే ముందు అక్కడ ఇతర వారు కూడా ఉన్నారు. అందరూ మాట్లాడుతుండగా...లాచయ్య లేచి అమాంతం పై నుండి కిందకు దూకేసినట్లు దృశ్యాలు చూస్తే తెలుస్తోంది. అక్కడ పనిచేస్తున్న వారు బాలలే అని తెలుస్తోంది. గాంధీ ఆసుపత్రి నుండి ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి. 

నారాయణగూడలో దారుణం

హైదరాబాద్ : నారాయణగూడలో దారుణం జరిగింది. తాజ్ మహల్ హోటల్ లో పనిచేస్తున్న లాచయ్య అనే బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బాలుడు హోటల్ ఐదవ అంతస్థు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నిన్న సాయంత్రం 6.20 నిమిషాలకు జరిగింది. ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం

కృష్ణా : జిల్లా మైలరవం జాతీయ రహదారిపై రోడ్డుప్రమాదం జరిగింది. కారు, ఆటో ఢీకొని ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయలయ్యాయి. వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

14:42 - December 30, 2017

గుజరాత్ : కొత్తగా ఏర్పాటైన గుజరాత్‌ కాబినెట్‌లో అప్పుడే విభేదాలు పొడసూపాయి. మొన్నటివరకు మంత్రివర్గంలో నెంబర్‌ టూగా వెలుగొందిన డిప్యూటి సిఎం నితిన్‌ పటేల్‌కు కీలక శాఖలు దక్కకపోవడంతో ఆయన తన పదవికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారు. ఆర్థిక శాఖ, పట్టాణాభివృద్ధి, పెట్రోలియం శాఖలు దక్కకపోవడంతో నితిన్‌ ఇంతవరకు బాధ్యతలు స్వీకరించలేదు. ఆర్థిక శాఖను సౌరభ్‌ పటేల్‌కు అప్పగించగా, పెట్రోలియం, పట్టణాభివృద్ధి శాఖలను సీఎం రూపానీ తనవద్దే అట్టిపెట్టుకున్నారు. నితిన్‌ పటేల్‌కు రోడ్లు, భవనాలు, ఆరోగ్యం-కుటుంబ సంక్షేమం, నర్మదా-కల్పసర్‌ ప్రాజెక్టు శాఖలను కేటాయించారు. దీన్ని అవమానంగా భావిస్తున్న నితిన్‌ పటేల్ అధిష్టానంతో తాడో పేడో తేల్చుకునేందుకు 48 గంటల అల్టిమేటం ఇచ్చినట్లు సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. కాబినెట్‌లో కలహాల నేపథ్యంలో నితిన్‌ పటేల్‌ బిజెపిని వదిలి కాంగ్రెస్‌లో చేరాలని హార్దిక్‌ పటేల్‌ సలహా ఇచ్చారు.

14:41 - December 30, 2017

ముంబయి : దాడుల సూత్రధారి హఫీజ్‌ సయీద్‌తో పాలస్తీనా రాయబారి వలీద్‌ అబు అలీ ఓ ర్యాలీలో కలిసి పాల్గొనడం వివాదస్పదంగా మారింది. జమత్‌-ఉద్‌-దవా ఉగ్రవాద సంస్థ చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌ పాకిస్థాన్‌లోని రావల్పిండిలో ఓ ర్యాలీ నిర్వహించాడు. ఈ సభకు పాలస్తీనా రాయబారి వలీద్‌ అబు అలీ కూడా హాజరై సయీద్‌తో కలిసి వేదికపై మాట్లాడారు. ఈ ఘటనపై భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. హఫీజ్‌ సయీద్‌తో కలిసి దౌత్యవేత్త సభలో పాల్గొన్న అంశాన్ని పాలస్తీనాతో చర్చించినట్లు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రావేశ్‌ కుమార్‌ తెలిపారు. పాక్‌కు చెందిన సుమారు 40 రాజకీయ, మతపరమైన సంస్థలు ఆ సమావేశాన్ని నిర్వహించాయి. జెరూసలెం విషయంలో అమెరికా వైఖరిని వ్యతిరేకిస్తూ పాలస్తీనాకు భారత్‌ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.

 

14:38 - December 30, 2017

ఉత్తరప్రదేశ్‌లో : ఓ మదర్సాపై పోలీసులు దాడి చేసి 51 మంది అమ్మాయిలకు విముక్తి కల్పించారు. మదర్సా మేనేజర్‌ అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడన్న ఆరోపణలతో పోలీసులు అధికారులతో కలిసి సంయుక్తంగా దాడి నిర్వహించారు. లక్నోలోని షహాదత్‌గంజ్‌లో ఉన్న మదర్సాపై శుక్రవారం రాత్రి పోలీసులు దాడులు నిర్వహించి మేనేజర్‌ను అరెస్ట్‌ చేశారు. మదర్సాను నిర్వహిస్తున్న కారీ తైయబ్‌ జియా అమ్మాయిలను తన ఆఫీసు కార్యాలయానికి పిలిపించుకుని కాళ్లను ఒత్తమని బలవంతం చేసేవాడు. లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. ఎవరైనా ఎదురు తిరిగితే వారిని లాఠీలతో బాదేవాడు. ఆ కీచకుడి చర్యలతో విసిగిపోయిన అమ్మాయిలు ఓ లేఖ ద్వారా స్థానికులకు తెలియజేయడంతో ఈ వ్యవహారం బయటపడినట్లు పోలీసులు చెప్పారు. మేనేజర్‌తో పాటు మదర్సాలోని మిగతా సిబ్బంది కూడా తమను లైంగికంగా వేధించినట్లు బాధితులు తెలిపారు.

కాళేశ్వరం పూర్తి చేసి కేసీఆర్ రుణం తీర్చుకుంటారు : తుమ్మల

కరీంనగర్ : కాళేశ్వరం పూర్తి చేసి కేసీఆర్ కరీంనగర్ ప్రజల రుణం తీర్చుకుంటారని రోడ్డు భవనల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు. రాష్ట్రన్ని పార్టీలకతీతంగా అభివృధ్ది చేస్తున్నామని తుమ్మల అన్నారు. 

14:36 - December 30, 2017

సంగారెడ్డి : జిల్లా పటాన్‌చెరువు మండలం ముత్తంగి మెయిన్‌రోడ్డులో ఫాల్‌కాన్‌ పంప్స్‌ నూతన షోరూంను ఆ సంస్థ సీఎండీ దిరాజ్‌లాల్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా తయారీ సంస్థ భీమ్‌ సిరీస్‌ పంప్‌ సెట్‌ను మార్కెట్‌లోకి రిలీజ్‌ చేసింది. ఫాల్కన్‌ పంప్‌ సెట్లను రైతులకు మరింత చేరువ చేసేందుకు ఎక్స్‌ఛేంజ్‌ మేళా రైతు చైతన్య రథం ఏర్పాటు చేసినట్లు తెలుగు రాష్ట్రాల డిస్టిబ్యూటర్‌ సిటీ ఇంజనీరింగ్‌ కార్పొరేషన్‌ అధినేత నల్లపాటి కళ్యాణ్‌ తెలిపారు. 

14:34 - December 30, 2017

నల్గొండ : 93 శాతం ఉన్న బహుజనులు ఏకం కావాలని ప్రజా గాయకుడు, టీమాస్‌ రాష్ట్ర స్టీరిందగ్‌ కమిటీ సభ్యులు గద్దర్‌ పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లా.. మిర్యాలగూడలో టీ మాస్‌ ఆవిర్భావ సభ జరిగింది. ఈ సందర్భంగా.. గద్దర్‌ తన పాటతో టీమాస్‌ లక్ష్యాన్ని ప్రజలకు వివరించారు. రాష్ట్రంలో నియంత్రణ పాలన సాగిస్తున్న ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని గద్దర్‌ అన్నారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని, కేసీఆర్‌ దొరల పాలన సాగిస్తున్నాడని.. టీ మాస్‌ రాష్ట్ర కన్వీనర్‌ జాన్‌ వెస్లీ, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. 

మానేరు నదిపై కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన

కరీంనగర్ : మానేరు నదిపై రూ.149 కోట్లతో నిర్మించనున్న కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి మంత్రలు తుమ్మల, ఈటెల శంకుస్థాపన చేశారు. 21.5 మీటర్ల వెడల్పు, 520 మీటర్ల పొడవు, 16 మీటర్ల ఎత్తులో, కేబుల్ కు సపోర్ట్ కోసం 45 మీటర్ల ఎత్తులో 2 టవర్ల నిర్మాణం, 2.5 మీటర్ల వెడల్పుతో ఫుట్ పాత్ నిర్మాణం చేయనున్నారు.

14:32 - December 30, 2017

పశ్చిమగోదావరి : పోలవరం కథ కంచికి చేరుతోందా..? మరో ఏడాదిలో ప్రాజెక్టు పూర్తిచేయాలన్న ఏపీ ప్రభుత్వం మాటలకే పరిమితం అవుతోందా..? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో.. ఇప్పటికే నిర్మాణ పనులకు బ్రేకులు పడగా ..తాజాగా కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌ ట్రాయ్‌పై కెనరాబ్యాంకు దివాలా పిటిషన్‌ దాఖలు చేసింది. దీంతో మరో ఏడాదిలో నీరు ఇచ్చేమాట అటుంచితే.. మరో రెండేళ్లయినా ప్రాజెక్టు పూర్తికాని రిస్థితి తలెత్తింది. నిర్మాణం పూర్తికాకుండానే పోలవరం మునిగిపోతోంది.. అయితే నీటితో కాదు.. కాంట్రాక్టు సంస్థ నిర్వాకంతో పోలవరం ప్రధాన నిర్మాణ సంస్థ ట్రాన్స్‌ ట్రాయ్‌పై కెనరాబ్యాంకు దివాలా పిటిషన్‌ దాఖలు చేసింది. దీంతో మరో ఏడాదిలో పోలవరం నుంచి నీరు ఇస్తామని ప్రకటించిన ఏపీ ప్రభుత్వం ఇపుడు దిక్కుతోచని స్థితిలో పడిపోయింది.

ట్రాన్స్‌ ట్రాయ్‌ సంస్థ తమకు 725 కోట్ల రూపాయల మేరకు బకాయి పడిందని కెనరాబ్యాంకు అంటోంది. ఈనెల 22న వరకు 489 కోట్లు చెల్లించాల్సి ఉండగా .. ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీ బ్యాంకు గ్యారెంటీ కింద 379 కోట్లు మాత్రమే ఉంచిgదని కెనరా బ్యాంకు పేర్కొంది. ఈమేరకు నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన బ్యాంకు అధికారులు... ట్రాన్స్‌ట్రాయ్‌ కాంట్రాక్టు సంస్థ దివాలా తీసినట్టు ప్రకటించాలని కోరారు. దీనిపై ట్రిబ్యునల్‌ ఇన్‌సాల్వెన్సీ ప్రక్రియ ప్రారంభించనుందని కెనారాబ్యాంకు అధికారులు తెలిపారు. మరోవైపు ఇప్పటికే పోలవరం అంశంలో కేంద్రం - ఏపీ ప్రభుత్వాల మధ్య వివాదం నడుస్తోంది. స్పిల్‌వే, కాపర్‌డ్యాం లాంటి కీలకమైన పనుల నుంచి ప్రధాన కాంట్రాక్టర్‌ అయిన ట్రాన్స్‌ట్రాయ్‌ను తొలగించాలని చంద్రబాబు ప్రభుత్వం కోరుతుండగా.. దీనిపైమరో రెండు నెలల తర్వాతే నిర్ణయమని కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ గడువు విధించారు. దీంతో ఆర్థికంగా చతికిల పడిన ట్రాన్స్‌ట్రాయ్‌ను కొనసాగిస్తే.. 2019నాటికి ప్రాజెక్టు నిర్మాణం కష్టమేనని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అందుకే కీలక పనులకు కొత్తగా టెండర్లు కూడా పిలిచింది. అయితే కేంద్రం జోక్యంతో ఆ ప్రక్రియకు బ్రేకులు పడ్డాయి. ఈ నేపథ్యంలో తాజాగా కెనరాబ్యాంకు ట్రాన్స్‌ట్రాయ్‌పై దాఖలు చేసిన దివాలా పిటిషన్‌ .. ప్రాజెక్టు నిర్మాణానికి శరాఘాతంగా మారే అవకాశం ఉందని ఇంజనీరింగ్ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

ట్రాన్స్‌ట్రాయ్‌పై కెనరాబ్యాంకు పిటిషన్‌ నేపథ్యంలో విపక్షాలు విమర్శలను మరింత పెంచాయి. ఓవైపు కేంద్రం, తాజాగా కెనరా బ్యాంకు పిటిషన్‌తో ఏపీ ప్రభుత్వం మరింత ఒత్తిడిని ఎదుర్కొంటోంది. మరో ఏడాదిలో గ్రావిటీద్వారా పోలవరం నీరు పొలాలకు అందిస్తామని చెబుతున్న చంద్రబాబు సర్కారుకు ఈ పరిస్థితి సవాల్‌గా మారింది. సీఎం చంద్రబాబు ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారనేది ఇపుడు ఆసక్తిగా మారింది. 

14:29 - December 30, 2017

అనంతపురం : నేటి విద్యార్థులు ఒత్తిడినుంచి బయటపడేందుకు క్రీడలు చాలా అవసరమని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. అనంతపురం జిల్లాలో ఆయన రెండోరోజు పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ఎంజిఎం క్రీడా మైదానంలో బసవతారకరామ మెమోరియల్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ టాస్‌ వేసి ప్రారంభించారు. అనంతరం ఆయన బ్యాట్‌ పట్టుకుని ఆడారు.

పద్మావతి సినిమా విడుదలకు లైన్ క్లియర్

ముంబై : పద్మావతి మూవీ విడుదలకు లైన్ క్లియర్ అయింది. సినిమాకు సెన్సార్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ చిత్రంలో రన్ వీర్ సింగ్, షహిద్ కపూర్, దీపిక పదుకొణె ప్రధాన పాత్రదారులుగా సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించారు.

14:26 - December 30, 2017

రంగారెడ్డి : జిల్లా మహేశ్వరం మండలం దుబ్బచర్లలో మహిళ హత్యకేసును పోలీసులు చేధించారు. నిందితుణ్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈనెల 21న దుబ్బచర్లలో జరిగిన హత్య స్థానికంగా కలకలం రేపింది. కర్నూలు జిల్లాకు చెందిన జయమ్మ, వనపర్తిజిల్లాకు చెందిన రాజు దుబ్బచర్లలోనే అద్దెఇంట్లో కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. కాగా ఇటీవల కల్లుతాగి వచ్చిన రాజు చికెన్‌ వండాలని జయమ్మను వేధించాడు. చికెన్‌ లేదని చెప్పడంతో జయమ్మపై దాడిచేశాడు. తలకు తీవ్రగాయాలు తగలడంతో జయమ్మ మృతి చెందింది. దీంతో జయమ్మ మృదేహాన్ని చెత్తకుప్పల్లో పూడ్చిపెట్టిన రాజు పరారయ్యాడని పోలీసులు తెలిపారు. 

ఆంధ్ర అసోసియేషన్ క్యాలెండర్ అవిష్కరణ

ఢిల్లీ : ఆంధ్ర అసోసియేషన్ క్యాలెండర్ అసోసియేషన్ క్యాలెండర్ అవిష్కరణలో కేంద్ర పౌర విమానయన శాఖ మంత్రి అశోక గజపతిరాజు పాల్గొన్నారు. రాజకీయంగా హెచ్చుతగ్గులు ఎవరికైనా సహజమని, మానవ విలువలతో ముందుకెళ్లటం ముఖ్యమని ఆయన అన్నారు.

14:17 - December 30, 2017

విజయవాడ : ట్రాన్స్ జెండర్స్ కు ఏపీ శుభవార్త అందించింది. సమాజంలో గౌరవంగా బతికేందుకు ప్రభుత్వం చేయూత నివ్వాలని చేస్తున్న వారి డిమాండ్ నెరవేర్చే విధంగా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. ట్రాన్స్ జెండర్స్ పాలసీకి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విభిన్న ప్రతిభావంతులు - దివ్యాంగులు - సీనియర్స్ సిటిజన్స్ శాఖకు అదనంగా ట్రాన్స్ జెండర్ పేరును పెడుతున్నట్లు పేర్కొంది. 18 ఏళ్లు దాటిన వారికి పెన్షన్ సౌకర్యం...అన్ని సంక్షేమ కార్పొరేషన్లలో రుణాలు పొందే హక్కు...అన్ని రకాల ఎన్నికల్లో పోటీ చేసే హక్కు...లను కల్పించనుంది. ప్రభుత్వ శాఖలకు సంబంధించిన దరఖాస్తుల్లో థర్డ్ జెండర్ కాలమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

సుప్రీంకోర్టు చేసిన మార్గదర్శకాలను కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తుండగా ఏపీలో అమలు చేయడం లేదనే సంగతి తెలిసిందే. దీనితో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. ఇందుకు మెడికల్ సర్టిఫికేట్ అమలు చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. విద్యాలయాల్లో అనుమతి నిరాకరిస్తే మాత్రం వారిపై చర్యలు తీసుకుంటామని, వారిపై ఎలాంటి వివక్ష చూపవద్దని ఆదేశించింది. ఉద్యోగ రంగాల్లో కూడా అవకాశాలు కల్పించడం..వేధింపులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ట్రాన్స్ జెండర్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

14:13 - December 30, 2017

తెలుగు సినీఇండస్ట్రీలో హిట్ పేయిర్స్ ఉన్నాయి. అందులో వెంకటేష్ సౌందర్య, చిరంజీవి రాధిక, బాలకృష్ణ నయనతార ఉన్నారు. బోయపాటి డైరెక్షన్ లో బాలకృష్ణ, నయనతార జంటగా నటించారు. ఆ చిత్రం భారీ విజయం సాధించింది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో జై సింహా వస్తోంది. ఈ సందర్భంగా నయనతార మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. బాలయ్యను తను తండ్రిలా భావిస్తానని చెప్పింది. ఆయనను చూస్తే గౌవరంతో రెండు చేతులు జోడించి దండం పెట్టాలనిపిస్తోందని ఆమె అన్నారు. నయనతార చేసిన వ్యాఖ్యలపై బాలయ్య ఫ్యాన్స్ గరంగా ఉన్నట్టు తెలుస్తోంది.

2017 నారావారి నరకాసుర నామసంవత్సరం : రోజా

హైదరాబాద్ : 2017 లో చంద్రబాబు పాలనలో మహిళలకు చేదు అనుభవాలు ఎదురుకున్నారని, 2017ను నారావారి నరకాసుర నామసంవత్సరంగా పిలావాలని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరిగాయని, ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆమె విమర్శించారు.

13:53 - December 30, 2017

హైదరాబాద్ : టీడీపీ ప్రభుత్వంలో మహిళలకు ఒరిగిందేమీ లేదని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. ఈమేరకు ఆమె మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి రావడానికి 2014 ఎన్నికల్లో మహిళలకు అన్ని అబద్ధాలే చెప్పారని ఎద్దేవా చేశారు. కానీ రాష్ట్రంలో మహిళల తలరాత మారిందా అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి కూడా మహిళలకు పంగ నామాలు పెట్టారని విమర్శించారు. టీడీపీ మహిళలకు చేసిందేమీ లేదన్నారు. ఈనెల 31 న బార్లు, 
వైన్ షాపులకు ప్రభుత్వం అనుమతిచ్చిందన్నారు. ఆడవాళ్ల జీవితాలు చెడిపోయినా, వారిపై అత్యాచారాలు, హత్యలు జరిగినా పర్వాలేదని ప్రభుత్వం అనుకుంటుందని ఆరోపించారు. దీన్ని చూస్తేనే రాష్ట్రంలో పరిపాలన ఎంత దిగజారిపోతుం దో అర్థం అవుతుందన్నారు. సీఎం చంద్రబాబు అవకాశవాదంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. 

 

13:45 - December 30, 2017

టీఇండియా సిక్సర్ల వీరుడు యువరాజ్ సింగ్ ఆటలోనే కాదు మాటలోను తన ప్రముఖ్యన్ని చాటుకున్నారు. పాకిస్థాన్ మాజీ పేసర్, రావల్పిండి ఎక్స్ ప్రెస్ షోయబ్ ఆక్తర్ ను యువీ తన ట్విట్ తో ఆటపట్టించాడు. సోషల్ మీడియా వేదకగా ఆక్తర్ ఓ ఫొటోను ట్విట్టర్ పోస్టు చేశాడు. ఆ ఫొటోలో ఆక్తర్ హెల్మెంట్ పట్టుకుని, గ్టౌజ్ ధరించి, కళ్ల అద్దాలు పెట్టుకుని ఉన్నాడు. ఆ ట్విట్ కు యువీ నుంచి బౌన్సర్ వంటి సమాధానం వచ్చింది. ఆ ట్విట్ కు రీ ట్విట్ గా ఓ ఆక్తర్ భాయ్ వెల్డింగ్ చేయడానికి ఎక్కడికి పోతున్నావు అని వ్యాఖ్యనించాడు. 

13:44 - December 30, 2017

పెద్దపల్లి : ప్రజలకు చేరువలో 10 టీవీ కార్యక్రమాలు ఉన్నాయన్నారు మాజీ మంత్రి శ్రీధర్‌ బాబు. ఈ సందర్భంగా పెద్దపల్లిలో 10 టీవీ క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. 5వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన 10టీవీ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. 

 

13:43 - December 30, 2017

పెద్దపల్లి : జిల్లాలోని మంథనిలో టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్‌ రెడ్డి 10టీవీ క్యాలెండర్‌ ఆవిష్కరించారు. ప్రజా సమస్యల పరిష్కరానికి 10 టీవీ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. 10 టీవీ కార్యక్రమాలు ప్రజల్లో సామాజిక స్పృహ కల్పించేలా ఉన్నాయని, రెండు రాష్ట్రాల ప్రజల్లో మంచి స్థానం సంపాదించుకుందన్నారు. ఈ సందర్భంగా 10 టీవీ ప్రేక్షకులకు ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 

13:38 - December 30, 2017

హైదరాబాద్ : 2017 సంవత్సరంలో శాస్త్ర, సాంకేతిక రంగాలను పూర్తి స్ధాయిలో వినియోగించుకోవడంలో, సర్వీసులు అందజేయడంలో జీచ్ ఎంసీ ముందుందన్నారు మేయర్‌ బొంతు రామ్మోహన్‌. ఈజీ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో తెలంగాణ అగ్రస్థానం సాధించడానికి  జీహెచ్‌ఎమ్‌సీ కీలకపాత్ర పోశించిందన్నారు. సిటిజన్స్‌ సహకారంతోనే జీహెచ్ ఎంసీ అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు వెళ్లగలిగిందన్నారు జీహెచ్ ఎంసీ కమిషనర్‌ సోమేశ్‌ కుమార్‌. స్వచ్చ సర్వేక్షన్‌లో భాగంగా మెట్రో నగరానికి నంబర్‌ వన్‌ ర్యాంక్‌ వచ్చింది అయితే అంతర్జాతీయ స్థాయిలో నంబర్‌ వన్‌గా నిలవడానికి కృషి చేస్తామని తెలిపారు. 

 

13:33 - December 30, 2017

బాహుబలి సినిమా తర్వాత దేశంలోనే ప్రముఖ హీరోగా పేరు తెచ్చుకున్న హీరో ప్రభాస్. ఆయన తర్వాత మూవీ సాహో బాహుబలి తర్వాత ప్రభాస్ అదే రేంజ్ మూవీని అభిమానులు ఆశిస్తున్నారు. సాహో ఎలాగైనా హిట్టు చేయాలని దర్శకుడు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమై కొన్ని నెలలు గడుస్తోంది. కానీ షూటింగ్ చాలా నెమ్మదిగా కొనసాగుతోంది. వచ్చే వారంలో దుబాయ్ లో ప్రభాస్ తో ఫైటింగ్ సన్నివేశాలు ప్లాన్ చేస్తున్నారు. ఈ ఫైట్స్ కోసం ప్రభాస్ గత కొన్ని రోజులుగా అమెరికాలోని లాస్ ఏంజిల్స్ ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు.  

ఏపీలో ట్రాన్స్ జెండర్స్ పాలసీ విడుదల

గుంటూరు : ఏపీ సర్కార్ ట్రాన్స్ జెండర్స్ పాలసీ జీవోను జారీ చేసింది. ఈ జీవో ప్రకారం 18 ఏళ్లు నిండిన హిజ్రాలకు రూ.1500 పెన్షన్ సౌకార్యం కల్పించనున్నారు.

ఏపీ పోలీస్ వార్షిక నివేదిక విడుదల చేసిన డీజీపీ

గుంటూరు : జిల్లా మంగళగిరి పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏపీ డీజీపీ సాంబశివరావు వార్షిక నివేదిక విడుదల చేశారు. రాష్ట్ర పోలీఉ వ్వవస్థలో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారని, ఏపీ పోలీసుల తీరు అత్యుత్తమంగా ఉందని డీజీపీ అన్నారు. 

13:22 - December 30, 2017

విజయవాడ : కొత్త ఏడాదిలో బ్యాటరీతో నడిచే బస్సులను ప్రవేశపెడతామని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ డాక్డర్ ఎం.మాలకొండయ్య అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రైవేటు ఆపరేటర్లకు ధీటుగా ప్రయాణికులకు చాలా మెరుగైన సేవలు అందించామని చెప్పారు. 2017 సం.లో ఏపీఎస్ ఆర్టీసీ సవాళ్లను ఎదుర్కొని నిల్చిందన్నారు. నష్టాలను కొంతవరకు తగ్గించామని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

తెలంగాణలో శాంతిభద్రతల సమస్యలేదు : డీజీపీ

హైదరాబాద్ : తెలంగాణలో  శాంతిభద్రతల సమస్యలేదని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. 2018లో తెలంగాణ పోలీస్ శాఖ చేయబోతున్న కార్యక్రమాలపై ఓ డాక్యుమెంటరీని విడుదల చేస్తామని డీజీపీ తెలిపారు. 2018లో 8 ముఖ్యమైన గోల్స్ పెట్టుకున్నామని ఆయన అన్నారు. ప్రజల జీవన ప్రమాణాల్ని మెరుగుపరించేందుకు కృషి చేస్తామని డీజీపీ తెలిపారు.

12:46 - December 30, 2017

చెన్నై : పోయెస్ గార్డెన్ లో ఐటీ అధికారులు సర్వే చేస్తున్నారు. పొయెస్ గార్డెన్ పరిసరాలు పోలీసుల అదుపులో ఉన్నాయి. గతంలోనే వేద నిలయానికి అధికారులు సీల్ వేశారు. పొయెస్ గార్డెన్ ను జయ స్మారక మందిరంగా మార్చేందుకు పరిశీలిస్తున్నారు. అన్నాడీఎంకే అభిమానులు పొయెస్ గార్డెన్ కు భారీగా వస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

తెలంగాణలో శాంతిభద్రతల సమస్యలేదన్న డీజీపీ

హైదరాబాద్ : తెలంగాణలో శాంతిభద్రతల సమస్యలేదని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. 2018లో ఏం చేయబోతున్నామనేది ఓ డాక్యుమెంటును విడుదల చేస్తామని చెప్పారు. 

 

టీడీపీలో చేరిన పులివెందుల వైసీపీ నేతలు

కృష్ణా : సీఎం చంద్రబాబు సమక్షంలో శ్రీకాకుళం, పులివెందులకు చెందిన పలువురు వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. చాలా మంది టీడీపీలో చేరుతున్నారని, జగన్ పాదయాత్ర చేస్తున్నా వలసలు ఆగలేదని మంత్రి కళా వెంట్రావ్ అన్నారు.

12:08 - December 30, 2017
12:03 - December 30, 2017

గుంటూరు : జిల్లా కేంద్రంలో 2018 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. మాజీ ఎమ్మెల్సీ కేఎస్.లక్ష్మణ్ తెలుగు సాహితీ వెలుగుల పేరుతో క్యాలెండర్ రూపొందించారు. ఈ సందర్భంగా కెఎస్.లక్ష్మణ్ మాట్లాడుతూ సాహితీ వేత్తలపై ఓ చర్చ జరగాలన్న ఉద్ధేశ్యంతోనే క్యాలెండర్ రూపొందించానని తెలిపారు. 

 

ఆర్టీసీ సమర్థమంతమైన సేవలు అందించింది : మాలకొండయ్య

కృష్ణా : ఈ ఏడాది ఆటుపోట్లు ఎదుర్కొన్నా ఏపీఎస్ ఆర్టీసీ సమర్థమంతమైన సేవలు అందించిందని టెన్ టీవీతో అర్టీసీ వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ పూనం మాలకొండయ్య అన్నారు. ఆర్టీసీలో నష్టాలు కొంత మేరకు అధిగమించామని, ప్రైవేట్ ఆపరేటర్ల పోటీని ధీటుగా ఎదుర్కొన్నామని, వచ్చే ఏడాదిలో రూ.250 కోట్లతో బస్సులను ప్రవేశపెడతామని ఆమె తెలపారు.

12:00 - December 30, 2017

హైదరాబాద్ : తిరుపతిరావు కమిటీ నివేదికను వ్యతిరేకిస్తున్నట్లు పేరెంట్స్ అసోసియేషన్ కమిటీ పేర్కొంది. ప్రైవేట్ ఫీజుల విసూళ్లపై కమిటీ ప్రభుత్వానికి ఇవ్వబోయే నివేదికను ఖండిస్తున్నామని తెలిపారు. కమిటీ నిర్ణయాన్ని స్వాగతించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. నివేదిక ఇచ్చేముందు తమను సంప్రదించాలని డిమాండ్ చేశారు. రిపోర్టు సబ్ మిట్ చేయొద్దని, నివేదికను ఆపేయాలని కోరారు. ఇది తిరుపతిరావు కమిటీ రిపోర్టుగా లేదని...స్కూల్ మేనేజ్ మెంట్ ఇచ్చిన నివేదిక లాగా ఉందని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం నియమించిన తిరుపతిరావు కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. తిరుపతిరావు తమ నివేదికలో కీలక ప్రతిపాదనలు చేసినట్టు తెలుస్తోంది. ప్రతిఏటా 10శాతం వరకు స్కూల్స్‌ ఫీజు పెంచుకోవచ్చన్న ప్రతిపాదన వివాదాస్పదంగా మారింది. తిరుపతిరావు కమిటీపై పేరెంట్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫీజులు పెంచాలన్న ప్రతిపాదనపై తల్లిదండ్రుల కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

11:56 - December 30, 2017

మహేష్ బాబు అభిమానులంత ఎంతో అత్రుతగా ఎదురు చూస్తున్న చిత్రం భరత్ అనే నేను కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కైరా అద్వాని హీరోయిన్ గా చేస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏప్రిల్ 27 న విడుదల కానుంది. బ్రహ్మోత్సవం, స్ర్పైడర్ చిత్రాలు మహేష్ కు నిరాశ మిగిల్చాయి. దీంతో భరత్ అనే నేను పై మహేష్, అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. శివ, మహేష్ కాంబినేషన్ వచ్చిన శ్రీమంతుడు ఎంత పెద్ద హిట్టో అందరికి తెలిసిందే.. ఈ మూవీ తర్వాత మహేష్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు.

11:49 - December 30, 2017

చెన్నై : ఐదో రోజు అభిమానులతో సూపర్ స్టార్ రజనీకాంత్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2.0, కాలా చిత్రాల తర్వాత దేవుడే తన భవిష్యత్ నిర్ణయిస్తాడని తెలిపారు. ఏప్రిల్ లో 2.0 చిత్రం, రెండు నెలల తర్వాత కాలా చిత్రం విడుదల అవుతాయని పేర్కొన్నారు. తాను సినీ రంగానికి రావడానికి తన మిత్రుడు రాజ బహదూర్ కారణమన్నారు. గురువు బాలాచందర్ లేకపోతే రజనీకాంత్ ఉండేవాడు కాదని చెప్పారు. తాను నిరుపేద కుటుంబంలో జన్మించానని తెలిపారు. 

 

గౌతమ్ మోడల్ స్కూల్ లో దారుణం

హైదరాబాద్ : ఏఎస్ రావు నగర్ లో ని గౌతమ్ మోడల్ స్కూల్ లో దారుణం జరిగింది. అల్లరి చేస్తున్నాడని టెన్త్ విద్యార్థి శశిధర్ ను ఉపాధ్యాయుడు సయ్యద్ బాజీ చితకబాదారు. విద్యార్థి శశిధర్ కు కంటి వద్ద గాయాలు కావడంతో స్కూల్ ఎదుట విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. 

విశాఖ పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం

విశాఖ : పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం జరిగింది. సీవోఆర్ వైఏ ఆర్గానిక్ ప్రైవేట్ లిమిటెడ్ లో 2 రియక్లర్లు పేలిపోయాయి. ఈ ప్రమాదంలో 8 మందికి గాయాలు కాగా అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 

పోయెస్ గార్డెన్ వేద నిలయంలో అధికారుల సర్వే

చెన్నై : పోయెస్ గార్డెన్ వేద నిలయంలో అధికారుల సర్వే చేశారు. జయలలిత నివాసాన్ని స్మారకంగా మార్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సర్వే చేశారు. 

 

విశాఖ పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం

విశాఖ : పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం జరిగింది. సీవోఆర్ వైఏ ఆర్గానిక్ ప్రైవేట్ లిమిటెడ్ లో రెండు రియాక్టర్లు పేలాయి. ఈ ప్రమాదంలో 8మందికి గాయాలయ్యాయి. ఇద్దరి పరస్థితి విషమంగా ఉంది.

 

ఐదో రోజు అభిమానులతో రజనీకాంత్

చెన్నై : ఐదో రోజు అభిమానులతో సూపర్ స్టార్ రజనీకాంత్ సమావేశం అయ్యారు. ఆ రెండు చిత్రాల తర్వాతే దేవుడే నా భవిష్యత్ ను నిర్ణయిస్తాడని తెలిపారు. తాను నిరుపేద కుటుంబంలో జన్మించినట్లు తెలిపారు. 

 

అభిమానులతో ఐదో రోజు రజనీ భేటీ

చెన్నై : తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులతో ఐదో రోజు సమావేశం నిర్వహిస్తున్నారు. ఆ రెండు చిత్రాల విడుదల తర్వాతే దేవుడే నా భవిష్యత్తును నిర్ణయిస్తాడని రజనీ తెలిపారు. తను సినీ రంగానికి రావడానికి నా మిత్రుడు రాజ బహుదూర్ కారణమని రజనీ అన్నారు. తను నిరుపేద కుటుంబంలో జన్మించానని, గురువు బాలచందర్ లేకపోతే రజనీకాంత్ ఉండేవాడు కాదని రజనీకాంత్ అన్నారు.

10:56 - December 30, 2017

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం నియమించిన తిరుపతిరావు కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. తిరుపతిరావు తమ నివేదికలో కీలక ప్రతిపాదనలు చేసినట్టు తెలుస్తోంది. ప్రతిఏటా 10శాతం వరకు స్కూల్స్‌ ఫీజు పెంచుకోవచ్చన్న ప్రతిపాదన వివాదాస్పదంగా మారింది. తిరుపతిరావు కమిటీపై పేరెంట్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫీజులు పెంచాలన్న ప్రతిపాదనపై తల్లిదండ్రుల కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతిఏటా పదిశాతం ఫీజులు పెంచుకుంటూ పోతేఎలా చెల్లించాలని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫీజులు ఎలా చెల్లించాలని పేరెంట్స్ అసోసియేషన్స్ ప్రశ్నించింది. ఇదొక దొంగ కమిటీ లాగా ఉందని విద్యార్థుల పేరెంట్స్ విమర్శించారు. ఇది తిరుపతిరావు రిపోర్ట్ గా లేదని.. స్కూల్ మేనేజ్ మెంట్ రాసినట్లుగా ఉందని ఆరోపించారు.

 

ట్రాన్స్ ట్రాయ్ కంపెనీపై దివాలా పిటిషన్

గుంటూరు : ట్రాన్స్ ట్రాయ్ కంపెనీపై కెనరా బ్యాంకు దివాలా పిటిషన్ వేసింది. ట్రాన్స్ ట్రాయ్ పై కెనరా బ్యాంకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ను ఆశ్రయించింది. ట్రాన్స్ ట్రాయ్ రూ. 725 కోట్లు బకాయి పడిందని కెనరా బ్యాంక్ పిటిషన్ వేసింది. ట్రాన్స్ ట్రాయ్ దివాల తీసిందని ప్రకటించాలని పిటిషన్ లో కోరింది. ఇప్పటికే కాంట్రాక్టర్ మార్పుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం నెలకొంది. ప్రధాన కాంట్రాక్టర్ ను మార్చాలని చంద్రబాబు ప్రభుత్వం తెలిపింది. అయితే కాంట్రాక్టర్ మార్పు 2 నెలలు ఆగిన తర్వాతే ఆలోచిద్దామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.

10:35 - December 30, 2017

గుంటూరు : ట్రాన్స్ ట్రాయ్ కంపెనీపై కెనరా బ్యాంకు దివాలా పిటిషన్ వేసింది. ట్రాన్స్ ట్రాయ్ పై కెనరా బ్యాంకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ను ఆశ్రయించింది. ట్రాన్స్ ట్రాయ్ రూ. 725 కోట్లు బకాయి పడిందని కెనరా బ్యాంక్ పిటిషన్ వేసింది. ట్రాన్స్ ట్రాయ్ దివాల తీసిందని ప్రకటించాలని పిటిషన్ లో కోరింది. ఇప్పటికే కాంట్రాక్టర్ మార్పుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం నెలకొంది. ప్రధాన కాంట్రాక్టర్ ను మార్చాలని చంద్రబాబు ప్రభుత్వం తెలిపింది. అయితే కాంట్రాక్టర్ మార్పు 2 నెలలు ఆగిన తర్వాతే ఆలోచిద్దామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. కెనరా బ్యాంకు దివాలా పిటిషన్ తో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి విఘాతం కలిగే అవకాశముంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

10:30 - December 30, 2017

టీ.సర్కార్ హామీలు అమలుకు నోచుకోవడం లేదని వక్తలు విమర్శించారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు వినయ్ కుమార్, టీఆర్ ఎస్ అధికార ప్రతినిధి రాకేష్ పాల్గొని, మాట్లాడారు. ఎన్నికల ముందు టీఆర్ ఎస్ ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. మూడున్నరేళ్ల పాలనలో ప్రభుత్వం ప్రజలకు చేసింది శూన్యమని ఎద్దేవా చేశారు. గొల్ల కురుమలకు సబ్సిడీ గొర్రెలు పంపణీ చేసినట్లు మిగిలిన వర్గాలకు కూడా ఉపాధి కల్పించాలని కోరారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

విశాఖలో దారుణం

విశాఖ : ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ద్వారకా వైన్స్ వద్ద దారుణం జరిగింది. సురేష్ అనే యువకుడిపై దుండగులు కత్తులతో దాడి చేశారు. పరిస్థితి విషమించడంతో అతన్ని కేజీహెచ్ కు తరలించారు. 

231 ఎస్ ఐలకు సీఐలుగా ప్రమోషన్

హైదరాబాద్ : 2007 బ్యాచ్ కు చెందిన 231 ఎస్ ఐలను సీఐలుగా ప్రమోషన్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. 

09:44 - December 30, 2017

హైదరాబాద్ : కుషాయిగూడలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. మల్కాజ్ గిరి డీసీపీ ఉమామహేశ్వర శర్మ ఆధ్వర్యంలో తెల్లవారుజామున 300 మంది పోలీసులతో తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 45 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలు, 2 కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

ఢిల్లీలో దట్టంగా అలుముకున్న పొగమంచు

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీని మంచు దుప్పటి కప్పేసింది. హస్తినలో దట్టంగా పొగమంచు అలుముకుంది. పొగమంచు వల్ల 36 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. 2 రైళ్ల రాకపోకల్లో మార్పులు చేశారు. 13రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించారు.

 

ఫీజులు పెంచాలన్న ప్రతిపాదనపై తల్లిదండ్రుల కమిటీ ఆగ్రహం

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం నియమించిన తిరుపతిరావు కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. తిరుపతిరావు తమ నివేదికలో కీలక ప్రతిపాదనలు చేసినట్టు తెలుస్తోంది. ప్రతిఏటా 10శాతం వరకు స్కూల్స్‌ ఫీజు పెంచుకోవచ్చన్న ప్రతిపాదన వివాదాస్పదంగా మారింది. తిరుపతిరావు కమిటీపై పేరెంట్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫీజులు పెంచాలన్న ప్రతిపాదనపై తల్లిదండ్రుల కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతిఏటా పదిశాతం ఫీజులు పెంచుకుంటూ పోతేఎలా చెల్లించాలని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫీజులు ఎలా చెల్లించాలని పేరెంట్స్ అసోసియేషన్స్ ప్రశ్నించింది.

09:33 - December 30, 2017

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం నియమించిన తిరుపతిరావు కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. తిరుపతిరావు తమ నివేదికలో కీలక ప్రతిపాదనలు చేసినట్టు తెలుస్తోంది. ప్రతిఏటా 10శాతం వరకు స్కూల్స్‌ ఫీజు పెంచుకోవచ్చన్న ప్రతిపాదన వివాదాస్పదంగా మారింది. తిరుపతిరావు కమిటీపై పేరెంట్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫీజులు పెంచాలన్న ప్రతిపాదనపై తల్లిదండ్రుల కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతిఏటా పదిశాతం ఫీజులు పెంచుకుంటూ పోతేఎలా చెల్లించాలని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫీజులు ఎలా చెల్లించాలని పేరెంట్స్ అసోసియేషన్స్ ప్రశ్నించింది. మరోవైపు ఫీజు రెగ్యులేటరీ కమిటీ సమావేశంలో స్కూల్స్‌ అసోసియేషన్‌, పేరెంట్స్‌ అసోయేషన్‌ మధ్య వాగ్వాదం జరిగింది.

08:37 - December 30, 2017
08:36 - December 30, 2017

మహారాష్ట్ర : దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 14 మంది సజీవ దహనమయ్యారు. కమలా మిల్స్‌ కాంపౌండ్‌లోని రూఫ్‌ టాప్‌ రెస్టారెంట్‌లో బర్త్‌డే వేడుకలు జరుగుతుండగా ఈ ఘటన జరిగింది. పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్న 28 ఏళ్ల ఖుష్బూ మెహతాతో పాటు పార్టీకి హాజరైన కొందరు మహిళలు అగ్నికి ఆహుతి కావడం పెను విషాదాన్ని నింపింది.
25 మంది సజీవదహనం
ముంబై లోయర్‌ పరేల్‌లోని కమలా మిల్స్‌ సముదాయంలో మోజోస్‌ లాంజ్‌లో గురువారం అర్ధరాత్రి 12.30 గంటలకు  ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. కమలా మిల్స్‌ కాంపౌండ్‌లోని రూఫ్‌ టాప్‌ రెస్టారెంట్‌లో తొలుత మంటలు అంటుకున్నాయి. ఆ తర్వాత వేగంగా భవనంలోకి వేగంగా మంటలు వ్యాపించాయి. నాలుగు అంతస్థుల్లో ఉన్న ఈ వాణిజ్య సముదాయంలో రెస్టారెంట్లు, పబ్బులు, టీవీ చానళ్ల కార్యాలయాలు ఉన్నాయి. సమాచారమందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. మూడు గంటల పాటు శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో 11 మంది మహిళలతో సహా 14 మంది అగ్నికి ఆహుతయ్యారు.  మరో 19 మంది గాయపడగా వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు చెప్పారు.
పుట్టినరోజు వేడుకల్లో విషాదం 
అగ్నిప్రమాదం జరిగిన సమయంలో రూఫ్‌ టాప్‌ రెస్టారెంట్‌లో ఖుష్బూ మెహతా తన 28వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. బర్త్‌డే  జరుపుకుంటున్న మహిళతో పాటు పార్టీకి హాజరైన పలువురు మహిళలు సజీవ దహనం కావడం పెను విషాదాన్ని నింపింది. మృతుల్లో చాలా మంది 30 ఏళ్ల లోపువారే. మంటల నుంచి తప్పించుకునేందుకు వారంతా పక్కనే ఉన్న టాయిలెట్‌లోకి వెళ్లారు. అక్కడ వెంటిలేటర్‌ లేకపోవడంతో వూపిరాడక 48 ఏళ్ల ప్రీతి చనిపోయింది. 
రెస్టారెంట్‌ యజమానిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు 
ఈ ఘటన జరిగిన సమయంలో రెస్టారెంట్‌లో 50 మంది ఉన్నారు. అద్దాల గోడలు పగలగొట్టి లోనికి ప్రవేశించిన అగ్నిమాపక సిబ్బంది కొంతమంది బాధితులను కాపాడగలిగారు. ఈ ఘటనకు సంబంధించి రెస్టారెంట్‌ యజమానిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. భవన నిర్మాణంలో సరైన భద్రతా ప్రమాణాలు పాటించలేదని సమాచారం. భవనంలోకి వెళ్లేందుకు, వచ్చేందుకు ఒకే ద్వారం ఉండడం వల్ల మృతుల సంఖ్య పెరిగిందని స్థానికులు ఆరోపించారు. 
అగ్నిప్రమాదంపై రాష్ట్రపతి ప్రధాని తీవ్ర దిగ్భ్రాంతి 
ఈ ఘటనకు బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు చేపట్టాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ బీఎంసీ మేయర్‌ విశ్వనాథ్‌ మహదేశ్వర్‌ను ఆదేశించారు. అధికారులు దర్యాప్తు చేపట్టారు. అగ్నిప్రమాదంపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ప్రధాని మోది తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు.

08:30 - December 30, 2017

ఆదిలాబాద్‌ : ఆదిలాబాద్‌ పేరు చెప్పగానే మనకు ఆదివాసీలు గుర్తుకు వస్తారు. ఇప్పుడైతే రికార్డ్‌ స్థాయిలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు కనిపిస్తున్నాయి. ఇదే చలి కొంతమందికి ఇబ్బంది కలిగిస్తుండగా మరికొంతమందికి జీవితాన్ని ఇవ్వబోతుంది. కాశ్మీర్‌లో ఉంటున్నట్లు చలి ఉండడమే కాదు.. అక్కడే పండే యాపిల్స్‌ ఇక్కడ పండబోతున్నాయి. త్వరలోనే మార్కెట్‌లోకి ఆదిలాబాద్‌ ఆపిల్స్‌ రాబోతున్నాయి. 
ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో కాశ్మీర్‌ అందాలు 
ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌ జిల్లాలు కాశ్మీర్‌ అందాలను తలపిస్తున్నాయి. ప్రస్తుతం రికార్డ్‌ స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోవడమే దీనికి నిదర్శనం. అయితే... ఓ వైపు చలి తీవ్రత రోజురోజుకు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతుండగా... అదే వాతావరణం కొంతమందికి అనుకూలంగా మారుతోంది. కాశ్మీర్‌లో ఉండే చలి మాత్రమే కాదు... అలాంటి ఆపిల్స్‌ ఇక్కడ పండుతున్నాయి. 
యాపిల్స్‌ సాగుకు అనుకూలంగా దనోరా ప్రాంతం 
ఆసిఫాబాద్‌ జిల్లాలోని దనోరా ప్రాంతం యాపిల్స్‌ సాగుకు అనుకూలంగా మారింది. గత కొంతకాలంగా ఇక్కడ ఉష్ణోగ్రతలు పడిపోవడంతో... యాపిల్‌ సాగుకు అనుకూలంగా ఉంటుందని భావించిన బాలాజీ అనే రైతు... కాశ్మీర్‌లో ఉన్న తన బంధువుల వద్ద నుంచి యాపిల్‌ మొక్కలు తెప్పించాడు. వాటిని జాగ్రత్తగా సాగు చేయడంతో అవి చెట్లుగా మారాయి. గత రెండేళ్లుగా కొద్దికొద్దిగా కాపు కాస్తున్నాయి. అయితే.. ఈ విషయం తెలుసుకున్న సీసీఎంబీ శాస్త్రవేత్తలు... ధనోరా ప్రాంతంలో అనేక ప్రయోగాలు చేశారు. ఇక్కడ వాతావరణం యాపిల్‌ సాగుకు అనుకూలంగా ఉందని నిర్దారించారు. దీంతో... ఉద్యానవన శాఖ రంగంలోకి రైతులకు యాపిల్‌ మొక్కలు పంపిణీ చేయడం జరుగుతోంది. 
రైతులకు శాస్త్రవేత్తలు సూచనలు  
ఇక్కడకు విచ్చేసి పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు పంటల సాగుకు కావాల్సిన సూచనలు రైతులకు అందిస్తున్నారు. మొక్కలు నాటే ముందు గుంతలు తవ్వి, పోలీడాన్‌, గోబర్‌ ఎరువును వేయాలని... నాటిన తర్వాత ఫోరెట్‌ క్రిమి సంహారక మందులు వేయాలని రైతులకు సూచిస్తున్నారు. మూడేళ్ల తర్వాత పంట రానున్న నేపథ్యంలో అప్పటివరకు పంటను జాగ్రత్తగా కాపాడుకోవాలంటున్నారు. తాను సేంద్రీయ ఎరువులు వాడుతూ ఆపిల్‌ చెట్లను కాపాడుకుంటున్నట్లు రైతు చెబుతున్నారు. త్వరలోనే పూర్తి స్థాయి దిగుబడి వస్తుందని రైతు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. యాపిల్‌ దిగుబడులు పెరిగితే ఇకపై మార్కెట్‌లో ఆదిలాబాద్‌ యాపిల్స్‌ కూడా దర్శనమివ్వనున్నాయి. ఇప్పటి వరకు మార్కెట్‌లో లభిస్తున్న కాశ్మీర్‌, హిమాచల్‌ ఆపిల్స్‌కు గట్టి పోటీ ఇస్తాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

 

చర్లపల్లిలో పోలీసులు కార్డన్ సెర్చ్

హైదరాబాద్ : చర్లపల్లిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. మల్కాజ్ గిరి డీసీపీ ఆధ్వర్యంలో 300 మంది పోలీసులతో తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 45 ద్విచక్ర వాహనాలు, 2 కార్లు సీజ్ చేశారు. ఏడుగురు అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు.

 

08:07 - December 30, 2017

హైదరాబాద్ : నూతన సంవత్సరం వేడుకల నేపథ్యంలో భాగ్యనగరంలో భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. కోటిరూపాయలు విలువ చేసే డ్రగ్స్ సరఫరా చేస్తున్న నైజీరియన్ ముఠాను వెస్ట్ జోన్ టాస్క్‌ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చందానగర్‌లో ఓ ఇంజినీరింగ్ విద్యార్ధి వద్ద భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. వీరంతా యూత్‌ని టార్గెట్‌గా చేసుకుని డ్రగ్స్ దందాకు తెర లేపినట్లు తెలుస్తోంది.
భారీ మొత్తంలో పట్టుబడ్డ మాదక ద్రవ్యాలు 
న్యూ ఇయర్ అనగానే యూత్‌లో ఎక్కడ లేని జోష్ వచ్చేస్తుంది. పబ్బుల్లో ..పార్టీల్లో ఆటపాటల్లో మునిగి తేలుతుంటారు. ఇదే టైంలో వారిని టార్గెట్ చేస్తూ డ్రగ్స్ ముఠాలు క్యాష్ చేసుకునే పనిలో పడ్డాయి. తాజాగా హైదరాబాద్‌లో భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. ముగ్గురు నైజీరియన్లతో పాటు..ఓ ఇంజినీరింగ్ విద్యార్ధి డ్రగ్స్ దందాకు పాల్పడుతూ పట్టుబడ్డారు. 
నైజేరియన్ ముఠా అరెస్టు
హైదరాబాద్‌లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న నైజేరియన్ ముఠాను వెస్ట్ జోన్ టాస్క్‌ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి కోటి రూపాయలు విలువ చేసే 250గ్రాముల కొకైన్, 25గ్రాముల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నైజీరియన్ల నుంచి రెండు లాప్ టాప్ లు,10 సెల్ ఫోన్స్ , 30 డ్రగ్స్ చాక్ లెట్స్‌ స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 250గ్రాములు కొకైన్ స్వాధీనం చేసుకోగా.. ఈ ఏడాది మొత్తం 900 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు నగర పోలీస్ కమిషనర్ శ్రీనివాసరావు చెప్పారు. 
డేవిడ్ క్రిస్‌ ద్వారా జాన్ చిక్కు డ్రగ్స్‌కు బానిస
నైజీరియన్ ముఠాలోని ప్రధాన నిందితుడు జాన్ చిక్కు రెండేళ్ల క్రితం చదువుకునేందుకు హైదరాబాద్‌కు వచ్చాడు. ఇక్కడ పబ్బులో పరిచయమైన డేవిడ్ క్రిస్‌ ద్వారా డ్రగ్స్‌కు బానిసయ్యాడు. అలాగే విల్సన్ అనే మరో వ్యక్తిని పరిచయం చేసుకుని నగరంలో డ్రగ్స్ దందాకు తెరలేపినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే వీరు ముంబై కేంద్రంగా లుకాస్ అనే వ్యక్తి ద్వారా డ్రగ్స్‌ను హైదరాబాద్‌కు తీసుకువస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులపై ఎన్ డీపీఎస్ 1985 యాక్ట్ క్రింద సెక్షన్ అండర్ 8 సి, రెడ్ విత్ 20బి, సెక్షన్ 14ఏ అండ్ ఫారినర్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశామని సిపి వివరించారు. 
భారీ మొత్తంలో పట్టుపడ్డ డ్రగ్స్ 
మరోవైపు శేరిలింగంపల్లి ఎక్సైజ్ అధికారుల ప్రత్యేక తనిఖీల్లో చందానగర్‌ రెడ్డీ కాలనీలో ఉంటున్న గోనకుర్తి సంతోష్‌కుమార్ అనే ఇంజినీరింగ్ విద్యార్ధి వద్ద భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుపడ్డాయి. ఎండీఎంఎ, ఎల్ ఎస్ డీ అనే డ్రగ్స్‌ గోవా నుండి దిగుమతి న్యూఇయర్ వేడుకల్లో విక్రయించేందుకు సంతోష్‌కుమార్ సిద్ధమవుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. న్యూఇయర్ వేడుకలకు ఇప్పటికే భారీగా డ్రగ్స్ దిగుమతి అయ్యాయన్న సమాచారంతో.. పోలీసులు భారీగా తనిఖీలకు సిద్ధమవుతున్నారు. 

 

07:59 - December 30, 2017

గుంటూరు : అమరావతిలో అటవీ భూములను సీఆర్డీఏకి బదిలీ చేసే ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. ఈ భూముల్లో పచ్చదనానికి భంగం వాటిల్లకుండా నిర్మాణాలు చేపట్టాలని  కేంద్రం సూచించింది. దీనికనుగుణంగా సీఆర్డీఏ అధికారులు నివేదికలు సిద్దం చేసే పనిలో పడ్డారు. 
7వేల హెక్టార్లు డీనోటిఫైకి కేంద్రానికి ప్రతిపాదన
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా అటవీ భూములను డీనోటిఫై చేసి సీఆర్డీఏకి బదిలీచేసే ప్రక్రియకు కొనసాగుతోంది. రాజధాని నిర్మాణానికి గుంటూరు జిల్లా అటవీశాఖ పరిధిలోని 12 బ్లాకులలో 7 వేల హెక్టార్ల భూమిని డీనోటిఫై చేసి.. బదిలీ చేయడానికి అనుమతించాలని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. ఇందులో వెంకటపాలెం, తాడేపల్లి బ్లాకుల్లో అటవీభూమి డీనోటిఫై చేయడానికి అనుమతించిన కేంద్రం... మిగిలిన బ్లాకులకు సంబంధించి మరింత స్పష్టమైన సమాచారం కావాలని కోరింది. వెంకటపాలెం బ్లాకులో 1850 హెక్టార్లు, తాడేపల్లి బ్లాకులో 230 హెక్టార్లు కలిపి మొత్తం 2080 హెక్టార్ల భూమికి అనుమతిచ్చింది. ఇందులో ఆక్టోపస్‌, గ్రేహౌండ్స్‌, పోలీసుల శిక్షణ సంస్థలు, ఫైరింగ్‌ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు పంపడంతో కేంద్రం అనుమతించింది. 60శాతం పచ్చదనం కాపాడుతూ.. 
అభివృద్ధి చేయాలని సూచించింది. 
అభివృద్ధి పనుల కోసం సమగ్ర ప్రణాళిక
ఎంపిక చేసినటవీ ప్రాంతంలో ఏయే  అభివృద్ధి పనులు చేపట్టనున్నారో సమగ్రమైన ప్రణాళికలు తయారు చేస్తోంది సీఆర్డీఏ. ప్రస్తుతం ఉన్న చెట్లకు నష్టం లేకుండా నిర్మాణాలు చేపట్టడానికి అనువైన వాటికే అనుమతిచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అటవీశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ.. నివేదికలు సిద్దం చేస్తున్నారు. సీఆర్డీకి ఇస్తున్న భూములకు ప్రత్యామ్నాయంగా రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో అటవీశాఖకు భూములు ప్రభుత్వం కేటాయించింది. ఈ భూముల్లో అడవులు అభివృద్ధి చేయడానికి సీఆర్డీఏ రూ.280 కోట్లు అటవీశాఖకు చెల్లించాల్సి ఉంది. 
అడవులను నరికేయవద్దని విపక్షాలు డిమాండ్‌
అటవీశాఖ నుంచి సీఆర్డీఏ తీసుకుంటున్న భూముల్లో ఉద్యానవనాలు, క్రీడామైదానాలు, హరితభవనాలు ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారు. ఇప్పటికే వృక్ష సంపద అంతరించిపోతుందని.. ఇప్పడు రాజధాని నిర్మాణం పేరుతో అడవులను నరికివేయవద్దని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఇతర ప్రాంతాల్లో అడవుల కోసం కేటాంయించిన భూముల్లో అటవీ సంపదని పెంచాలని సూచిస్తున్నారు.
రెండో విడత కోసం నివేదికలు 
మొత్తానికి సీఆర్డీఏ తొలి దశలో తీసుకున్న భూములలో నిర్మాణాలకు ప్రణాళికలు రూపొందిస్తూ... రెండో విడత కోసం నివేదికలు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రం సరైన కారణాలు చూపితే... కేంద్రం మిగతా భూములను కూడా డీనోటిఫై చేయనుంది. 

 

07:54 - December 30, 2017

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం నియమించిన తిరుపతిరావు కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. తిరుపతిరావు తమ నివేదికలో కీలక ప్రతిపాదనలు చేసినట్టు తెలుస్తోంది. ప్రతిఏటా 10శాతం వరకు స్కూల్స్‌ ఫీజు పెంచుకోవచ్చన్న ప్రతిపాదన వివాదాస్పదంగా మారింది. ప్రతిఏటా పదిశాతం ఫీజులు పెంచుకుంటూపోతే ఎలా చెల్లించాలని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఫీజు రెగ్యులేటరీ కమిటీ సమావేశంలో స్కూల్స్‌ అసోసియేషన్‌, పేరెంట్స్‌ అసోయేషన్‌ మధ్య వాగ్వాదం జరిగింది.
కీలక ప్రతిపాదనలు చేసిన తిరుపతిరావు కమిటీ
స్కూల్స్‌ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం నియమించిన తిరుపతిరావు కమిటీ శనివారం నివేదికను సర్కార్‌కు సమర్పించనుంది. దాదాపు 9నెలలుగా నాన్చుతూ వచ్చిన కమిటీ ఎట్టకేలకు డ్రాఫ్ట్‌ నివేదికను సిద్ధం చేసింది.  ఇందులో కీలక ప్రతిపాదనలు చేసినట్టు తెలుస్తోంది. పాఠశాలల ఫీజులను శ్లాబ్స్‌గా నిర్ణయించినట్టు సమాచారం. అంతేకాదు... జోనల్‌ విధానంలో ఫీజు రెగ్యులేషన్‌ కమిటీలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. స్కూల్స్‌ అడ్మిషన్లు ఆన్‌లైన్‌లోనే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని తిరుపతిరావు తన నివేదికలో ప్రతిపాదించారు. స్కూల్స్‌ వసూలు చేస్తోన్న డొనేషన్స్‌, అడ్మిషన్‌ ఫీజులు రద్దు చేయాలని కూడా నివేదికలో పొందుపర్చినట్టు సమాచారం. ప్రతిఏటా ప్రైవేట్‌ స్కూల్‌ యాజమాన్యాలు పదిశాతం వరకు ఫీజు పెంచుకునేలా వీలు కల్పించాలని కూడా నివేదికలో ఓ ప్రతిపాదన చేసినట్టు తెలుస్తోంది.
తిరుపతిరావు కమిటీపై పేరెంట్స్‌ అసోసియేషన్స్‌ ఆగ్రహం
ప్రొఫెసర్‌ తిరుపతిరావు కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందించనున్న నేపథ్యంలో చివరిసారి శుక్రవారం సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి కమిటీ సభ్యులతోపాటు పేరెంట్స్‌ అసోసియేషన్స్‌, ప్రైవేట్‌ స్కూల్‌ యాజమాన్యాలు హాజరయ్యాయి. ప్రతిఏటా స్కూల్స్‌ పదిశాతం వరకు ఫీజులు పెంచుకోవాలని తిరుపతిరావు కమిటీ చేసిన ప్రతిపాదనపై పేరెంట్స్‌ అసోసియేషన్స్‌ తీవ్ర అభ్యంతరం తెలిపాయి. ప్రతిఏటా పదిశాతం ఫీజులు పెంచుకుంటూపోతే ఎక్కడి నుంచి తీసుకురావాలని ప్రశ్నించాయి. ఆ ప్రతిపాదనను తొలగించాలని డిమాండ్‌ చేశాయి. దీంతో పేరెంట్స్‌ అసోసియేషన్‌ సభ్యులకు, ప్రైవేట్‌ స్కూల్‌ యాజమాన్యాలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. కమిటీ కన్వీనర్‌ ముందే ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. ఫీజులు తగ్గించాలని, ప్రైవేట్‌, కార్పొరేట్‌ స్కూల్స్‌ ఫీజుల దందాకు తెరదించాలని ఆందోళన తాము ఆందోళన చేసిన ఫలితంగా తిరుపతిరావు కమిటీ ఏర్పడిందని గుర్తు చేశారు. ఇప్పుడు కమిటీ స్కూల్స్‌ యాజమాన్యాలకు అనుకూలంగా ప్రతిపాదనలు సిద్ధం చేసిందని ఆరోపించారు. కమిటీ ప్రతిపాదనల ప్రతులను పేరెంట్స్‌ అసోసియేషన్‌ సభ్యులు చించివేశారు.
ప్రైవేట్‌ స్కూల్‌ యాజమాన్యాలకు తలొగ్గి రిపోర్ట్‌ తయారు : పేరెంట్స్‌ 
తిరుపతిరావు కమిటీ ప్రైవేట్‌ స్కూల్‌ యాజమాన్యాలకు తలొగ్గి రిపోర్ట్‌ తయారు చేసిందని పేరెంట్స్‌ అసోసియేషన్స్‌ ప్రతినిధులు మండిపడ్డారు. తమను పూర్తిగా కమిటీ మోసం చేసిందని ధ్వజమెత్తారు. 10శాతం ఫీజులు పెంచుకోవాలన్న ప్రతిపాదన తొలగించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

 

నేడు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్న తిరుపతిరావు కమిటీ

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం నియమించిన తిరుపతిరావు కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. తిరుపతిరావు తమ నివేదికలో కీలక ప్రతిపాదనలు చేసినట్టు తెలుస్తోంది. ప్రతిఏటా 10శాతం వరకు స్కూల్స్‌ ఫీజు పెంచుకోవచ్చన్న ప్రతిపాదన వివాదాస్పదంగా మారింది. ప్రతిఏటా పదిశాతం ఫీజులు పెంచుకుంటూపోతే ఎలా చెల్లించాలని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

07:46 - December 30, 2017

ఢిల్లీ : ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకం కింద అర్హులైన పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు ఏపీ మంత్రి కాల్వ శ్రీనివాసులు. ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి నరేందర్ సింగ్‌ తోమర్‌తో భేటీ అయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు పక్కా ఇళ్లు కట్టించేందుకు కేంద్రం సహాయం అందించమని కోరినట్లు మంత్రి తెలిపారు. గత ప్రభుత్వాలు సర్వే విషయంలో శ్రద్ధ చూపకపోవడంతో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని వాపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన  ప్రజా సాధికారత సర్వేలో 31 లక్షల మంది తమకు ఇళ్లు కావాలని కోరగా 20 లక్షల 99 వేల మంది అర్హులుగా తేలారన్నారు మంత్రి కాలువ.  

 

07:42 - December 30, 2017

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటుపై టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు పార్లమెంటులో ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టారు. మూడున్నరేళ్లుగా కేంద్రం నుంచి సరైన స్పష్టత రాకపోవడంతోనే బిల్లు ప్రవేశపెట్టినట్లు రామ్మోహన్‌నాయుడు చెప్పారు. రైల్వే చట్టం 1989 ని సవరించి విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని బిల్లులో కోరినట్లు ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో అన్ని మార్గాలను ఉపయోగించుకుని రాష్ట్రానికి న్యాయం జరిగేలా కృషి చేస్తామని రామ్మోహన్‌నాయుడు చెప్పారు. 

 

07:38 - December 30, 2017

మహబూబ్ నగర్ : కాంగ్రెస్‌ ఫైర్‌బ్రాండ్‌ రేవంత్‌రెడ్డి మంత్రి కేటీఆర్‌పై విమర్శలతో విరుచుకు పడ్డారు. కేటీఆర్‌ అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్జర్ల నియోజకవర్గంలోని మిడ్జిల్‌ లో ఆయన పర్యటించారు. రేవంత్‌రెడ్డి రాక సందర్భంగా కాంగ్రెస్‌ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు.  ఈ ర్యాలీని అడ్డుకోడానికి టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు యత్నించడంపై రేవంత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలను పోలీసులు 
అదుపులోకి తీసుకున్నారు. 

 

07:33 - December 30, 2017

హైదరాబాద్ : మంత్రి కేటీఆర్‌ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ట్విట్టర్ వేదికగా.. తెలంగాణ ప్రజలతో కేటీఆర్‌ అనుసంధానమయ్యారు. ప్రజలతో లైవ్‌ చాట్ చేశారు. నెటిజన్లు వ్యక్తం చేసిన.. అభిప్రాయాలకు, ప్రశ్నలకు.. తనదైన శైలిలో స్పందించారు. 
రెండు గంటల పాటు కేటీఆర్‌ లైవ్‌చాట్‌
తెలంగాణ ఐటీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్... సోషల్ మీడియాలో ప్రజలకు చేరువయ్యారు. ట్విట్టర్ వేదికగా... రెండు గంటలకు పైగా సాగిన కేటీఆర్‌ లైవ్‌చాట్‌... మూడు సమాధానాలు, ఆరు చమత్కారాలుగా  సాగింది. రాజకీయ, వ్యక్తిగత, వృత్తిగత, పరిపాలనాపరమైన అంశాలపై కేటీఆర్‌.. సూటిగా.. సందర్భోచితంగా స్పందించారు. ప్రముఖులకు  సంబంధించి...వచ్చిన ప్రశ్నలపై.. ఒక్క పదంతో.. వారి వ్యక్తిత్వాన్ని నిర్వచించే ప్రయత్నం చేశారు. సీఎం కేసీఆర్‌ .. ఓ టాస్క్‌ మాస్టర్‌...! హరీశ్‌రావు.. హార్డ్‌వర్కర్‌..! సచిన్‌.. ఓ లెజెండ్‌..! అని చెప్పిన కేటీఆర్‌.. పవన్‌ ఓ ఎనీగ్మా..! రేవంత్‌ రెడ్డి ఎవరూ అంటూ..? తన సంభాషణను ఆసక్తికరంగా.. సాగించారు.   
ఆ రెండు కలిస్తేనే ప్రజాస్వామ్యం : కేటీఆర్‌
అలాగే చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావడం లేదెందుకు అని అడిగితే... ప్రభుత్వం, ప్రజలు వేరు అనే భావన ఉందని.. నిజానికి రెండు కలిస్తేనే ప్రజాస్వామ్యమని కేటీఆర్‌ బదులిచ్చారు. వచ్చే ఎన్నికల్లో విజయం మీదే అంటూ ఆంధ్ర నెటిజిన్‌ అన్న మాటకు ఎన్నికల గురించి వర్రీ లేదన్నారు. కేంద్ర కెబినెట్లో చేరుతారా? అని అడిగితే ఉన్నదాంతోనే సంతోషంగా ఉన్నానన్నారు. 
పాత బస్తీకి మెట్రో రైలు వస్తుందన్న కేటీఆర్ 
అలాగే తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌ కేంద్రీకృతంగా మాత్రమే కాకుండా..  సమ్మిళిత అభివృద్ధి దిశగా పోతుందని... పాత బస్తీకి కచ్చితంగా మెట్రో రైలు వస్తుందని చెప్పారు. సీఎన్జీ, ఎల్పీజీ బస్సుల వినియోగం గురించి అడిగితే ఎలక్ట్రికల్‌ వాహనాలే సరైన పరిష్కారం అన్నారు. నగరంలో వైఫై  ప్రాజెక్ట్ మూడు వంతులు పూర్తైందని.. త్వరలోనే మరిన్ని హాట్‌ స్పాట్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. త్వరలోనే లక్షల ఉద్యోగాల భర్తీ పూర్తవుతుందన్నారు.  
తన అభిరుచులను వెల్లడించిన కేటీఆర్‌ 
అలాగే తన అభిరుచులను కూడా.. కేటీఆర్‌ వెల్లడించారు. బాలివుడ్‌ నటుడు షారుఖ్‌ ఖాన్ తన అభిమాన నటుడని.. రాహుల్‌ ద్రావిడ్‌, కోహ్లీ, రోహిత్‌లు అభిమాన క్రికెటర్లని చెప్పారు. బరాక్ ఒబామా తాను అధికంగా ఇష్టపడే రాజకీయ నాయకుడన్నారు. ఇక ఇండియన్‌ చైనీస్‌ తనకు ఇష్టమైన ఆహారమని.. అమెరికాలో ఉన్నప్పుడు వంట చేసిన విషయాన్ని చెప్పారు. అదే విధంగా.. అల్లు అర్జున్‌, జూనియర్‌ ఎన్‌టీఆర్‌, మహేశ్‌బాబుల గురించి.. తన అభిప్రాయాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ తన సోదర రాష్ట్రమని..  టీఆర్‌ఎస్‌ను ఆంధ్రలో విస్తరించే ఆలోచనలేవీ తనకు తెలియవని చెప్పారు.
నెర్వస్‌గా ఫీల్ అయ్యాను : కేటీఆర్‌ 
అలాగే మెట్రో ప్రారంభం, జీఈఎస్ సమావేశం రెండూ ఒకేరోజు ఉండటమే ఈ ఏడాది గుర్తుండిపోయే రోజని వివరించారు. జీఈఎస్ సదస్సులో చర్చను నిర్వహించిన సందర్భంలో నెర్వస్‌గా ఫీల్ అయ్యానని కేటీఆర్‌ చెప్పారు. అలాగే  ఫిట్‌గా ఉండటమే కొత్త సంవత్సర తీర్మాణామని మంత్రి కేటీఆర్ నెటిజన్లకు స్పష్టం చేశారు. 

 

07:27 - December 30, 2017

గుంటూరు : జనవరి 2 నుంచి 11 వ తేదీ వరకు జన్మభూమి-మా ఊరు కార్యక్రమాన్ని నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. పది రోజుల పాటు జరిగే జన్మభూమి కార్యక్రమంలో రోజుకు రెండు గ్రామసభల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. ఈసారి జరిగే జన్మభూమి కార్యక్రమంలో ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. 
జనవరి 2 నుండి 22 వరకూ కార్యక్రమం
ఐదో విడత  'జన్మభూమి-మా ఊరు' కార్యక్రమం నిర్వహించడానికి ఏపీ సర్కార్ సన్నద్ధమైంది. జనవరి 2 నుండి 11 వరకూ జరిగే ఈ కార్యక్రమానికి సంబంధించి సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పలు అంశాలపై జిల్లా కలెక్టర్లు, శాఖాధిపతులకు సీఎం దిశానిర్దేశం చేశారు. 
జన్మభూమి నిర్వహణకు రూ.కోటి కేటాయింపు 
జన్మభూమి నిర్వహణకు ప్రభుత్వం కోటి రూపాయలు కేటాయించింది. పదిరోజుల పాటు జరిగే జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో పది అంశాలపై  దృష్టి సారించనున్నారు. ప్రజా వినతులను నూరు శాతం పరిష్కరించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం జరగనుంది. ముఖ్యంగా వినతులను ఆర్ధిక, ఆర్ధికేతర అంశాలుగా విభజించి వేగవంతంగా పరిష్కరించే బాధ్యత కలెక్టర్లకు అప్పగించారు. అన్నింటి కన్నా ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. 
రోజుకు రెండు గ్రామ సభల్లో పాల్గొంటున్న చంద్రబాబు
రోజుకు రెండు గ్రామ సభల్లో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. ఒక్కో అంశంపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. జన్మభూమిలో వ్యాసరచన, చిత్రలేఖనం, క్రీడలు, చర్చా కార్యక్రమాలు జరగనున్నాయి. వీటిలో గెలుపొందిన వారికి బహుమతులు అందిస్తారు. జనవరి 11న మండల కేంద్రాల్లో ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు లబ్దిదారులకు ఆస్తుల పంపిణీ కార్యక్రమం జరగనుంది. రాష్ట్రంలోని అన్ని పంచాయతీల్లో జనవరి 7 ఉదయం 6:30 నుంచి 7:30 వరకూ 5కె రన్ నిర్వహిస్తారు. 
జన్మభూమిలో గ్రామాలకు స్టార్ రేటింగ్‌లు
ఈసారి జన్మభూమిలో గ్రామాలకు స్టార్ రేటింగ్‌లు ఇవ్వనున్నారు. అందుకోసం మొత్తం 10 స్టార్లను కేటాయించారు. వివిధ అంశాలకు సంబంధించి సాధించిన ఫలితాల ఆధారంగా రేటింగ్ ఇస్తారు. అర్హులైన వారందరికీ జన్మభూమి కార్యక్రమంలో పింఛన్లు అందిస్తారు. మండల కేంద్రాల్లో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఇక ప్రకృతిని ప్రేమించే భారతీయ సంస్కృతికి కొనసాగింపుగా ఏరువాక, జలసిరికి హారతి, వనమహోత్సవం, సూర్య ఆరాధన వంటి కార్యక్రమాలు కూడా చేపట్టారు. 

 

07:23 - December 30, 2017

హైదరాబాద్ : రాష్ట్రంలో  గొల్ల-కురుమల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు సీఎం  కేసీఆర్‌. రాష్ట్రంలో చేపట్టిన గొర్రెల పంపిణీ ప్రతి గొల్ల-కురమ కుటుంబానికి అందాలన్నారు. ఇందుకోసం మరో 5వేల కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌ కోకాపేటలో గొల్ల-కురమ సంక్షేమభవన్‌కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.
యాదవుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న సీఎం కేసీఆర్‌ 
రాష్ట్రంలో ఉన్న 35 లక్షల మంది యాదవుల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం కేసీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌లోని కోకాపేటలో గొల్ల-కురుమ సంక్షేమభవన్‌కు ఆయన శంకుస్థాపన చేశారు. తెలంగాణ గొల్ల-కురుమలు దేశంలో అత్యంత ధనవంతులుగా ఎదగడానికి  గొర్రెల పంపిణీ చేపట్టామని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రోజుకు 6వందల లారీల వరకు గొర్రెలు, మేకలు దిగుమతి అవుతున్నాయని, యాదవులకు గొర్రెల పంపిణీ చేస్తే.. ఆమేరకు దిగుమతులపై రాష్ట్రం కోల్పోతున్న సంపదను కాపాడుకోవచ్చని కేసీఆర్‌ అన్నారు. ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పథకాన్ని రాష్ట్రంలోని ప్రతి గొల్ల-కురుమ కుటుంబానికి అందిస్తామన్నారు. అయితే మొదట 84లక్ష గొర్రెలు పంపిణీ చేస్తే సరిపోతాయని అనుకుంటే.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి మారిపోయిందన్నారు. గొర్రెల డిమాండ్‌ ఏకంగా కోటి 60లక్షలకు చేరిందన్నారు. ఖర్చుకు వెనుకాడకుండా అందిరికీ గొర్రెలు యూనిట్లు ఇచ్చేందుకు మరో 5వేల కోట్ల రూపాయలు కేటాయిస్తామన్నారు. 
పశువులకు అంబులెన్స్‌ 
రాష్ట్రంలో బీసీల సంక్షేమానికి తమ ప్రభుత్వం పలు అభివృద్ధిపథకాలు ప్రవేశపెట్టిందన్నారు సీఎం కేసీఆర్‌. మంత్రి తలసాని అలోచనలతోనే  దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పశువులకు అంబులైన్స్‌లు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో గొల్లకురుమల సంక్షేమం కోసం ప్రత్యేకంగా నిధిని ఏర్పాటు చేయాలని నేతలకు ముఖ్యమత్రి సూచించారు. దీనికోసం  ప్రభుత్వం తరపున కోటిరూపాయలను మంజూరు చేస్తున్నట్టు సీఎం తెలిపారు. 
గొల్ల కురుమల పిల్లల విదేశీ చదువుల కోసం సాయం
రాష్ట్రంలో గొల్లకురుమల పిల్లలు విదేశాల్లో చదువుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం చేయూత ఇస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. యాదవ సంక్షేమభవన్‌ ప్రారంభోత్సవానికి తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి గొల్ల-కురుమ నేతలు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా కర్నాటకు నుంచి ఆ రాష్ట్ర మంత్రి రేవణ్ణ కూడా హాజరయ్యారు. 

 

నేడు కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాసన

కరీంనగర్ : నేడు కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాసన చేయనున్నారు. మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, ఈటల రాజేందర్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. 

 

నేడు కృష్ణకుమార్ ను ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్న అధికారులు

శ్రీకాకుళం : నేడు కృష్ణకుమార్ ను అధికారులు ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నారు. సీతంపేట ఐటీడీఏ ఆస్తులపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. కృష్ణకుమార్ వద్ద రూ.1.60 లక్షల ఆస్తులను గుర్తించారు. 

 

నేడు కమాన్..సదాశివపల్లి రోడ్డు పనులకు శంకుస్థాపన

కరీంనగర్ : నేడు కమాన్..సదాశివపల్లి రోడ్డు పనులకు శంకుస్థాపన చేయనున్నారు. రూ.34 కోట్లతో నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం జరుగనుంది. 

 

నేడు బీసీ విద్యార్థి గర్జన

హైదరాబాద్ : నేడు సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో బీసీ విద్యార్థి గర్జన నిర్వహించనున్నారు. మంత్రి ఈటెల రాజేందర్, జోగు రామన్న, వివిధ పార్టీల నేతలు పాల్గొనున్నారు. 

 

నేడు కరీంనగర్ జిల్లాలో మంత్రి తుమ్మల పర్యటన

కరీంనగర్ : నేడు జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. 

Don't Miss