Activities calendar

31 December 2017

20:44 - December 31, 2017

ప్రతి సినిమా వెనక ఎంతో మంది కష్టం ఉంటుందని, ప్రతి ఒక్కరు ఆ సినిమా ఎలా ఉంటుందో అని టెన్షన్ ఫీల్ అవుతారని అక్కినేని యువకిరాణం అఖిల్ అన్నారు. ఆయన గురించి మరిన్ని విషయాలకు వీడియో చూడండి.

 

19:09 - December 31, 2017

నవతరం కామెడీయన్స్ నవీన్, మహేష్, అమిత్ టెన్ టీవీ స్పెషల్ షో వారి గురించి మరిన్ని విషయాలకు వీడియో క్లిక్ చేయండి.

18:47 - December 31, 2017

తూర్పుగోదావరి : గలగల పారే గోదావరి అందాలను వర్ణించాలంటే మాటలు సరిపోవు... వాటిని అనుభవించడం తప్ప చెప్పడానికి సాధ్యం కాదు. కానీ... ఆ మధురానుభూతుల్ని ఆస్వాదించాలనే ఆశ మాత్రం అందరికీ ఉంటుంది. కాబట్టే... పాపికొండలు టూరిజానికి రోజురోజుకూ ప్రాధాన్యత పెరుగుతోంది.. ఐతే సుదూర ప్రాంతాలనుంచి వచ్చే యాత్రికులకు ఇప్పటివరకూ సరైన సౌకర్యాలు లేవు. ఇదివరకూ కేవలం రాజమండ్రిలో మాత్రమే వసతి ఉండేది. అంటే.. సుమారు నలభై కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ సమస్యలను గుర్తించిన ఏపీ టూరిజం... సౌకర్యాలు కల్పించేందుకు రంగంలోకి దిగింది.

ఓ వైపు గోదావరి అందాలు... మరోవైపు ఆ తీరంలోనే పోలవరం
ఓ వైపు గోదావరి అందాలు... మరోవైపు ఆ తీరంలోనే పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులు... అంతేకాదు... హోటల్‌ నుంచే వీరేశ్వర స్వామి ఆలయా దర్శించే అవకాశం కూడా ఉంది.... దీంతో చాలావరకూ యాత్రికుల సమస్యలు తీరినట్లే... సకల సదుపాయాలూ ఒకే చోట అందుబాటులోకి రావడం.... గోదావరి తీరాన సేద తీరాలనుకునేవారికి ఇదొక మంచి అవకాశం. ఇన్ని సౌకర్యాలు కల్పిస్తున్న రివర్‌ ఇన్‌ ప్రాజక్టుకు మంచి ఆదరణ లభిస్తుందని మేనేజ్‌మెంట్‌ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

18:46 - December 31, 2017

తూర్పుగోదావరి : అమలాపురం- మెయిన్‌ రోడ్డుకి సమీపంలోని ఏడిద చక్రధర్‌నగర్‌లోని ఓ రోడ్డు వ్యవహారం కలకలం రేపుతోంది. ఐదేళ్ల క్రితం ఇక్కడ రోడ్డు నిర్మించిన మునిసిపాలిటీ అధికారులు.. రోడ్డుకి చివరిలో ఉన్న ఓ దళిత ఉద్యోగి అయిన తాళ్ల పల్లేశ్వరరావు ఇంటికి మాత్రం రోడ్డు వేయకుండా నిలిపివేశారు. ఈ రోడ్డు చివరిలో 14 మీటర్ల మేర నిలిపివేసి.. కేవలం తమ ఇంటికి మాత్రం రోడ్డు లేకుండా చేశారంటూ బాధితులు వాపోతున్నారు. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అంటున్నారు.

కేవలం దారి సమస్య కాదని.. కుల వివక్ష
దీనిపై పలుమార్లు... అధికారులకు ఫిర్యాదు చేశామని.. వారు ఎప్పటికప్పుడు.. సర్దిచెబుతున్నాన్నారని.. బాధితులు చెబుతున్నారు. ఇది కేవలం దారి సమస్య కాదని.. కుల వివక్ష అని వారు అంటున్నారు. తమ ఇంటికి ఇరువైపులా.. అగ్రకులస్థులున్నారని.. వివిధ రకాలుగా తమను వేధిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.మరోవైపు అదే రోడ్డులో నివసిస్తున్న ఇతరులు మాత్రం దీనిపై భిన్నవాదన వినిపిస్తున్నారు. ప్రత్యామ్నాయంగా మరో మార్గం ఉన్నప్పటికీ ఆ కుటుంబం అనవసరంగా వివాదాలు సృష్టిస్తోందని.. ప్రత్యారోపణలు చేస్తున్నారు. అంతేగాకుండా కోర్టు పరిధిలో ఉన్న కారణంగానే ఆ రోడ్డు పూర్తి చేయలేదని చెబుతున్నారు.

18:45 - December 31, 2017

తూర్పుగోదావరి : 10టీవీ మరిన్ని కార్యక్రమాలతో పురోభివృద్ధి సాధించాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆకాంక్షించారు. 2018 నూతన సంవత్సర క్యాలెండర్‌ ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రేక్షులందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సమస్యలను ప్రస్ఫుటించేలా మరిన్ని కార్యక్రమాలను ప్రసారం చేయాలని ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. 

18:43 - December 31, 2017

తూర్పుగోదావరి : విద్య, వైద్య, గ్రామీణ, పారిశ్రామిక రంగాల్లో మౌలిక వసతులు మెరుగు పరచడం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా.. కాకినాడలో ఆర్థిక శాఖ కార్యాలయం నిర్మాణానికి జిల్లా మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా, స్థానిక శాసన సభ్యులతో కలిసి యనమల రామకృ‌ష్ణుడు శంకుస్థాపన చేశారు. లోటుబడ్జెట్‌ ఉన్నప్పటికీ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తుందని ఆయన అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు సుమారు 30 వేల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలు సృష్టించామన్నారు. ఆర్థిక శాఖ ఖజానా నిండిన తర్వాతే ఉద్యోగులకు చెల్లించాల్సిన పీఆర్సీ ఏరియర్స్‌ చెల్లిస్తామన్నారు.

18:41 - December 31, 2017

కృష్ణా : 2017కు గుడ్‌బై చెప్పి... 2018కు స్వాగతం పలికేందుకు బెజవాడ నగరం సర్వాంగ సుందరంగా తయారైంది. న్యూఇయర్‌ వేడుకలను ఘనంగా సెలబ్రేట్‌ చేసుకునేందుకు యువత ఎదురుచూస్తోంది. మరోవైపు సంబరాలకు నగరమంతా ముస్తాబైంది. నగరంలో అన్ని ప్రాంతాల్లో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. విద్యుద్దీపాలతో అలంకరించారు. ఇయర్‌ ఎండ్‌కు ఘనంగా వీడ్కోలు పలికేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. స్టార్‌ హోటళ్లు, పబ్‌లు, క్లబ్‌లు, ఫంక్షన్‌ హాల్స్‌, మల్టీపెక్స్‌ మాల్స్‌లలో వేడుకలు నిర్వహిస్తున్నారు. డీజేలు, సంగీత విభావరిలతో యూత్‌ను ఆకట్టుకునేందుకు ఏర్పాట్లు చేశారు. ఇక నగరంలో ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్లతో అనేక ఈవెంట్స్‌ చేయనున్నారు. ప్రధానంగా ప్రముఖ దేవీశ్రీ ప్రసాద్‌ నేతృత్వంలో నైట్స్‌ నిర్వహిస్తున్నారు. అలాగే బెర్మ్‌పార్క్‌లో ఐఏఎస్‌ అధికారుల గ్రాండ్‌ న్యూ ఇయర్‌ పార్టీ చేసుకోబోతున్నారు. ఈ వేడుకలకు సీఎస్‌తో పలువురు ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. అలాగే సీఎం చంద్రబాబు కూడా వ చ్చే అవకాశం కనిపిస్తోంది.

రాత్రి 10 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు ప్రత్యేక తనిఖీలు
ఇక నగరంలోని ప్రముఖ హోటళ్లు, పబ్‌లు, క్లబ్బులు న్యూ ఇయర్‌ వేడుకలకు వేదిక కాబోతున్నాయి. ఇప్పటికే ఇందుకోసం హోటళ్లు అన్నీ ముస్తాబయ్యాయి. న్యూ ఇయర్‌ సందర్బంగా పూల వ్యాపారులు భారీ ఎత్తున బొకేలు ఏర్పాటు చేస్తున్నారు. చాలామంది బొకేలు కొనుగోలు చేస్తారనే అంచనా వేస్తున్నారు. మరోవైపు పోలీసులు కూడా న్యూఇయర్‌ వేడుకలకు పటిష్ట చర్యలు చేపట్టారు. నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆదివారం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించనున్నట్లు నగర డీసీపీ కాంతి రాణా తెలిపారు. యూత్‌ నిబంధనలకు లోబడి న్యూ ఇయర్‌ వేడుకలు చేసుకోవాలని సూచించారు. మొత్తానికి కాసేపట్లో మొదలయ్యే సంబరాల కోసం అందరూ వేచి చూస్తున్నారు. కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 

17:38 - December 31, 2017

సంగారెడ్డి : జిల్లా లోని సబ్‌-రిజిస్ట్రార్ కార్యాలయం... నిత్యం జనంతో కిటకిటలాడుతూ ఉంటుంది. 25 ఏళ్లుగా అద్దెభవనంలో ఈ కార్యాలయం నడుస్తోంది. ఇరుకైన గదుల్లో ఇక్కడ సిబ్బంది పనిచేస్తున్నారు. ఇక్కడికి రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే వారి పరిస్థితి వర్ణనాతీతం. ఉదయం వచ్చిన వారు తమ పని పూర్తవ్వాలంటే రాత్రి వరకూ వేచి ఉండాల్సిందే. ఇక టాయిలెట్లు, తాగునీరు, పార్కింగ్ ... సౌకర్యాల సంగతి వేరే చెప్పనక్కర్లేదు. కనీసం వచ్చినవారు కూర్చోవడానికి కూడా చోటు లేని పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కోట్ల రూపాయల్లో ఆదాయం వస్తున్నా ఇక్కడ మాత్రం కనీస సదుపాయాలు కనిపించవు.

వచ్చిన వారికి నరకం...
హైదరాబాద్‌కు దగ్గరగా ఉన్న పటాన్ చెరు, కొల్లూరు, తెల్లాపూర్, అమీన్‌పూర్ లాంటి ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసేవారు రిజిస్ట్రేషన్ కోసం సంగారెడ్డి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వస్తుంటారు. రోజుకు వందకు పైగా రిజిస్ట్రేషన్లు ఇక్కడ జరుగుతున్నాయి. భవనం ఇరుకుగా ఉండటం.. వచ్చిన వారు క్రమ పద్ధతి పాటించకపోవడంతో తోపులాటలు జరుగుతూనే ఉంటాయి. అధికారులు పెద్ద బిల్డింగ్ తీసుకోవడంతో పాటు.. వృద్ధులు, మహిళలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాట్లు చేస్తే బావుంటుందని మహిళలు అంటున్నారు. రిజిస్ట్రేషన్‌ కోసం కార్యాలయానికి వచ్చిన వారంతా నరకం చూస్తున్నామని మరికొందరు వాపోతున్నారు. ఉదయం వస్తే.. ఇంటికి చేరేసరికి అర్ధరాత్రి అవుతోందని చెబుతున్నారు. కార్యాలయంలో ఎదురౌతున్న ఇబ్బందులపై మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్‌లో మెసేజ్‌ పెట్టినా.. ఎమ్మెల్యేకు విన్నవించినా స్పందించలేదని హైదరాబాద్‌ నుంచి వచ్చిన శ్రీనివాస్‌గౌడ్ చెబుతున్నారు.

గత 25 ఏండ్ల నుండి ఇదే భవనంలో
గత 25 ఏండ్ల నుండి ఇదే భవనంలో కార్యాలయం నడుస్తోంది. గతంకంటే ఇటీవలకాలంలో రిజిస్ట్రేషన్లు పెరిగిపోయాయి. పెరిగిన అవసరాలకు అనుగుణంగా కార్యాలయంను మార్చుకోకపోతే .. ఇంత రుసుం చెల్లిస్తూ ఇబ్బందులు పడాల్సిందేనా? అని కార్యాలయానికి వచ్చినవారు ప్రశ్నిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా మొత్తంలో పదిహేను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ల ద్వారా వీటికి ఏడాదికి సుమారుగా 250 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతోంది. ఒక్క సంగారెడ్డి కార్యాలయానికి 150 కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. మరి ఇంత ఆదాయం వచ్చే కార్యాలయంలో ప్రజలు ఇన్ని కష్టాలు ఎందుకు పడాల్సి వస్తోందని ప్రశ్నిస్తే రిజిస్ట్రార్ ఏం చెప్పారో చూడండి. రిజిస్ట్రార్ రమేష్ రెడ్డి చెప్పిన ప్రకారం త్వరితగతిన సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాన్ని తరలిస్తే అటు ప్రజలతో పాటు.. ఇటు సిబ్బందికి కూడా ఇబ్బందులు తగ్గే పరిస్థితి కనిపిస్తోంది. 

17:30 - December 31, 2017

హైదరాబాద్ : తెలంగాణాలో కేసీఆర్‌ కుటుంబపాలన సాగుతుందన్నారు టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి. రాష్ట్రంలో కొనసాగుతోన్న తుగ్లక్‌ పాలనను ప్రజలు అంతమొందించాలన్నారు. దళితులకు, మైనారిటీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కేసీఆర్‌ విఫలమయ్యారని, ఉత్తమ్‌ విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక సదుపాయాలు లేకనే ప్రజలు ప్రైవేట్‌ పాఠశాలల బాట పడుతున్నారని సీఎల్పీ ఉపనేత జీవన్‌ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం చెప్పిన కేజీ టూ పీజీ ఎక్కడ ఉందో తెలియదన్నారు. ఉపాధ్యాయ నియామకాల్లో, పదోన్నతుల్లో ఇంకా అన్యాయమే జరుగుతోందని ఆయన ఆరోపించారు. విద్యాహక్కు చట్టం అమలు చేయాలని.. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కరించాలని జీవన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

17:29 - December 31, 2017

అక్లాండ్ : ప్రపంచవ్యాప్తంగా కొత్త సంవత్సరం సంబరాలు మొదలయ్యాయి. న్యూజిలాండ్‌లో ముందుగా.. కొత్త సంవత్సరం వేడుకలు ప్రారంభమయ్యాయి. అక్కడి కాలమానం ప్రకారం 12 గంటలకు న్యూ ఇయర్ వేడుకలు అంబరాన్నంటాయి. బాణాసంచా వెలుగుల మధ్య ఆక్లాండ్ నగరం వెలిగిపోయింది.

17:28 - December 31, 2017

గద్వాల : పట్టణంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కొండపల్లి వెళ్లే దారిలో జయలక్ష్మి కాటన్ ప్రెస్సింగ్ మిల్లులో మంటలు చెలరేగాయి. మంటలకు భారీగా పత్తిబేళ్లు అగ్నికి ఆహుతైయ్యాయి. సుమారు రూ.50లక్షల విలువైన పత్తిబేళ్లు దగ్ధం అయినట్టు తెలుస్తోంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

కొండపై ఆరుగురు యువకులు మిస్సింగ్...

విశాఖపట్టణం : సింహాచలం కొండపై ఆరుగురు యువకులు అదృశ్యమయ్యారు. కొండపై ట్రెక్కింగ్ కు 20 మంది యువకులు వెళ్లారు. మిస్సింగ్ అయినా వారి కోసం గాలిస్తున్నారు. 

న్యూజిలాండ్ లో నూతన సంవత్సరం...

న్యూజిలాండ్ : అక్వాలాండ్ లో నూతన సంవత్సర సంబరాలు మిన్నంటాయి. దేశ ప్రజలు బాణాసంచా కాలుస్తూ నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. 

పుల్వామాలో నలుగురు జవాన్ల వీరమరణం..

జమ్మూ కాశ్మీర్ : పుల్వామాలోని సీఆర్పీఎఫ్ శిక్షణా కేంద్రంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో నలుగురు జవాన్లు వీరమరణం పొందారు. మరో ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. 

కేంద్ర మంత్రికి గాయాలు...

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్ ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో మంత్రితో పాటు మరో ఆరుగురికి స్వల్పగాయాలయ్యాయి. 

నకిలీ నోట్ల స్వాధీనం...

వెస్ట్ బెంగాల్ : బీఎస్ఎఫ్ జవాన్లు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరివద్ద నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. రూ. 6 లక్షల 50 వేల విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. 

15:17 - December 31, 2017

విజయవాడ : త్వరలో పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తవుతాయని టిడిపి నేత గాలి ముద్దుకృష్ణమ్మ నాయుడు జోస్యం చెప్పారు. పోలవరం నిర్మాణంపై పలు విమర్శలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై నిర్మాణం పూర్తవుతుందా ? లేదా ? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఆదివారం గాలి ముద్దుకృష్ణమ్మ నాయుడు మాట్లాడారు. పోలవరం నిర్మాణంపై సీఎం చంద్రబాబు నాయుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారని, ప్రతి సోమవారం రివ్యూ చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికీ 22 పర్యాయాలు సందర్శించి పనులు వేగవంతం చేసేందుకు సీఎం బాబు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. కానీ పోలవరం నిధులు రాకుండా కొన్ని పార్టీలు ప్రయత్నించాయని విమర్శించారు. మొత్తానికి 2019 నాటికి నీళ్లు ఇవ్వాలని కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. 

15:13 - December 31, 2017

గుంటూరు : 2018 సంవత్సరానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నామకరణం చేశారు. ప్రకృతి సేద్యం ఇయర్ గా పేరు పెడుతున్నట్లు వెల్లడించారు. జిల్లాలో ప్రకృతి వ్యవసాయంపై ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో శిక్షణా తరగతులు జరుగుతున్నాయి. రైతు శిక్షణ తరగతులను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. డాక్టర్ సుభాష్ పాలేకర్ నేతృత్వంలో జనవరి 8వ తేదీ వరకు ఈ తరగతులు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం బాబు మాట్లాడారు. 2018 సంవత్సరంలో ప్రకృతి సేద్యానికి కేరాఫ్ అడ్రస్ ఏదీ అంటే ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందని తెలిపారు. అంతకంటే ముందు డాక్టర్ సుభాష్ పాలేకర్ ను బాబు అభినందించారు. 

15:06 - December 31, 2017

నెల్లూరు : మార్చి నెలాఖరుకల్లా నెల్లూరులోని పార్కులన్నింటినీ అభివృద్ధి చేస్తామని మంత్రి నారాయణ చెప్పారు. నెల్లూరు కార్పొరేషన్‌ పరిధిలోని పలు పార్కులను ఆయన పరిశీలించారు. నగరంలో ఉన్న 18 పార్కులు వాడుకలో ఉన్నాయని.. మరో 120 లే అవుట్లలో పార్కులకు స్థలాలు కేటాయించామని నారాయణ చెప్పారు. ప్రతి పార్క్‌లో వాకింగ్ ట్రాక్, టాయిలెట్లు, డ్రికింగ్ వాటర్, ఓపెన్ జిమ్ సిద్ధం చేయాలని మంత్రి నారాయణ అధికారులకు ఆదేశించారు. 

నకిలీ చెక్కుతో..

హైదరాబాద్ : నకిలీ చెక్కుతో బ్యాంకును బురిడి కొట్టించేందుకు ముఠా గుట్టురట్టైంది. నకిలీ చెక్కుతో రూ. 8 కోట్ల మోసం చేసేందుకు యత్నించారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. నలుగురు నిందితులు పరారీలో ఉన్నారు. 

14:35 - December 31, 2017

హైదరాబాద్ : న్యూ ఇయర్‌కు కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌కావడంతో.. గ్రాండ్‌గా వెల్‌కం పలికేందుకు యూత్‌ సిద్ధమయ్యింది. 2017కు గుడ్‌బై చెప్పి, కొత్త ఏడాదికి ఆహ్వానం పలికేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. న్యూఇయర్ వేడుకలకు భాగ్యనగరం పూర్తిగా ముస్తాబైంది. నగరంలోని ప్రముఖ హోటళ్లు‌, రెస్టారెంట్లు‌, కన్వెన్షన్ సెంటర్లు న్యూ ఇయర్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసేందుకు పక్కా ప్లాన్స్‌తో రెడీగా ఉన్నాయి. హైదరాబాద్‌తో సహా ప్రధాన పట్టణాల్లోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు న్యూ ఇయర్ వేడుకలను జరుపుకొనేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశాయి. సెలబ్రిటీలు, డీజేలు యూత్‌ను హోరెత్తించేందుకు సిద్ధం అయ్యాయి. మరోవైపు ఫుడ్‌, వైన్‌, మస్తీ అంటూ కాంబో ఆఫర్లు ప్రకటించేశాయి. ఈ ఈవెంట్లలో పాల్గొనేందుకు యువత పోటీ పడుతున్నారు. గతంతో పోల్చుకుంటే ఈ సారి మద్యం ఏరులై పారడం గ్యారెంటీ అనిపిస్తోంది.

యువ ఆసక్తి...
కొత్త సంవత్సరాన్ని ఉత్సాహంగా స్వాగతించేందుకు యువత ఎంతో ఆసక్తి చూపుతోంది. పలు ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో యూత్‌ సిటీకి వస్తున్నారు. డిసెంబరు 25 నుంచి నగరంలోని చాలా హోటల్స్‌లో గదులు ఖాళీల్లేవు. ఇప్పటికే పలుచోట్ల కాలేజీ విద్యార్థులు న్యూ ఇయర్‌ సంబరాల్లో మునిగితేలుతున్నారు. నాలుగైదు రోజుల నుంచి షాపింగ్‌ మాల్స్‌లు కిటకిటలాడుతున్నాయి. బేకరీలు, హోటల్స్‌ వద్ద ఒక్కటే సందడి. నగరంలోని పలు దుకాణాలు, హోటల్స్‌, మద్యం దుకాణాలు, బారులు రంగురంగుల విద్యుత్తుదీపాలతో అలంకరించారు. హోరెత్తే సంగీతంతో ఆయా ప్రాంతాల్లో సందడి నెలకొంది. సిటీలో న్యూ ఇయర్ కేక్స్ సందడి చేస్తున్నాయి. మార్కెట్లో వెరైటీ వెరైటీ కేక్స్ కస్టమర్లను అట్రాక్ట్ చేస్తున్నాయి. డిఫరెంట్ ఫ్లేవర్లలో ఆకట్టుకుంటున్నాయి. కేక్స్ కు డిమాండ్ పెరగడంతో స్పెషల్ డిస్కౌంట్స్ పేరుతో కస్టమర్లను ఆకట్టుకునే పనిలోపడ్డారు వ్యాపారులు. రాష్ట్రంలో డిసెంబర్ 31, జనవరి 1 వేడుకల పేరుతో మద్యం ఏరుల్లా ప్రవహించడం ఖాయంగా కనిపిస్తోంది. అర్థరాత్రి 12 గంటలకు వరకు మద్యం షాపులకు అనుమతి ఉంది.. ఇక బార్‌లతో సహా.. పబ్‌లు, రెస్టారెంట్లూ అన్నింటికీ అర్థరాత్రి ఒంటిగంట వరకు అనుమతి ఇచ్చారు. అటు ఏపీలోనూ అర్థరాత్రి ఒంటి గంట వరకు లిక్కర్ విక్రయించేందుకు అనుమతి ఇచ్చారు. దీంతో భారీ ఎత్తున లిక్కర్ అమ్మేందుకు మద్యం వ్యాపారులు సిద్ధమయ్యారు.

అగ్నిప్రమాదం నేపథ్యంలో ..
ముంబయిలోని ఓ పబ్బులో జరిగిన అగ్నిప్రమాదం నేపథ్యంలో .. న్యూ ఇయర్‌ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించడంతో.. సిటీ పోలీసులు అలెర్ట్‌ అయ్యారు. అర్ధరాత్రి దాటాక మద్యం మత్తులో గొడవలు జరిగేందుకు అవకాశాలున్నాయన్న అంచనాలతో బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, సికింద్రాబాద్‌, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌, పాతబస్తీ ప్రాంతాల్లోని బార్లు, పబ్బుల సమీపంలో తాత్కాలిక పోలీస్‌ పికెట్లను ఏర్పాటు చేస్తున్నారు. సైబరాబాద్‌ పోలీసులు మాదాపూర్‌, నార్సింగి, గచ్చిబౌలి, మియాపూర్‌ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిని పట్టుకుని వాహనాలను అక్కడికక్కడే స్వాధీనం చేసుకొంటారు. మారువేషాల్లో వెళ్లి ... విందులు, వినోదాల్లో పాల్గొనే యువత స్వేచ్ఛకు భంగం కలగకుండానే పోలీసులు మందుబాబుల ఆగడాలపై కన్నేయనున్నారు. వేడుకల నిర్వాహకులు అసభ్య, అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకొంటారు. తక్షణమే వేడుకలను నిలిపివేస్తారు.డిసెంబర్‌ 31 నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఎన్టీఆర్‌ మార్గ్‌, నెక్లెస్‌రోడ్‌ ప్రాంతాల్లో రాత్రి 10 గంటల నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఖైరతాబాద్‌ సర్కిల్‌ నుంచి ఫ్లైవోవర్‌ మీదుగా ఎన్టీఆర్‌ మార్గ్‌వైపు వెళ్లే వాహనాలు రాజ్‌భవన్‌ రోడ్‌ మీదుగా వెళ్లాలి. ఖైరతాబాద్‌ నుంచి నెక్లెస్‌ రోటరీ వైపు వచ్చే వాహనదారులు ఖైరతాబాద్‌, మీరాటాకీస్‌ మీదుగా పయనించాలి. బీఆర్‌కేఆర్‌ భవన్‌ నుంచి ఎన్టీఆర్‌ మార్గ్‌వైపు వెళ్లే వాహనాలు ఇక్బాల్‌ మినార్‌, లక్డీకాపూల్‌, అయోధ్య మీదుగా వెళ్లాలి. మింట్‌ కాంపౌండ్‌ నుంచి సచివాలయం రోడ్డును మూసేస్తారు. నల్లగుట్ట రైల్వే వంతెన నుంచి సంజీవయ్య పార్కు మీదుగా నెక్లెస్‌ రోడ్‌పైపు వచ్చే వాహనాలు కర్బలా మైదాన్‌ లేదా మినిస్టర్‌ రోడ్‌ మీదుగా వెళ్లాలి. సికింద్రాబాద్‌ నుంచి వచ్చే వాహనాలు కవాడిగూడ క్రాస్‌రోడ్స్‌, లోయర్‌ ట్యాంక్‌బండ్‌, కట్టమైసమ్మ దేవాలయం మీదుగా వెళ్లాలి. మూడు కమిషనరేట్ల పరిధుల్లో 150 ప్రత్యేక బృందాలతో డ్రంకెన్‌ డ్రైవ్‌ను నిర్వహించనున్నారు. మోతాదుకు మించి మద్యం తాగి నడిపే వారిని పట్టుకుని వాహనాలను అక్కడికక్కడే స్వాధీనం చేసుకొంటారు.

14:34 - December 31, 2017

హైదరాబాద్ : అన్నదాతలకు 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇవ్వడం భారంగా కాక బాధ్యతగా భావిస్తున్నామని తెలంగాణ విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి అన్నారు. ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. రాబోయే కాలంలో 28 వేల మేగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

 

14:33 - December 31, 2017

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చినప్పట్నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీ ఆరోపించారు. హామీలన్నీ గాలిలో ఉన్నాయని ఎద్దేవా చేశారు. దళితులకు మూడెకరాల భూమి.. ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన షబ్బీర్‌ అలీ సీఎం కేసీఆర్‌కి లేఖ రాశారు. ఇచ్చిన హామీలను గుర్తు చేసేందుకే తాను లేఖ రాశానని షబ్బీర్‌అలీ అన్నారు.

 

నరసింహన్ ప్రజా దర్బార్...

హైదరాబాద్ : రాజ్ భవన్ లో సోమవారం గవర్నర్ నరసింహన్ ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలను ఆయన కలుసుకోనున్నారు. ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగనుంది. 

ప్రజాస్వామ్యం అపహస్యం - బోత్స..

విజయవాడ : 2017లో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైందని వైసీపీ నేత నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. 22 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తెలుగుదేశం పార్టీ చేర్చుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందన్నారు. 

14:02 - December 31, 2017

మేడ్చల్‌ : బార్‌ యాజమాన్యం అకారణంగా ఓ యువకుడిని చితకాబాదిన ఘటన మేడ్చల్‌ జిల్లా కాప్రా మండలం జమ్మిగడ్డలో చోటుచేసుకుంది. బద్రి బార్‌ యాజమాన్యం తనను చితకబాదిందని ఆరోపిస్తూ చిన్నా అనే యువకుడు ఆందోళనకు దిగాడు. బాధితుడి బంధువులు, స్థానికులు రహదారి ముందు ఆందోళన చేపట్టారు. దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. దీంతో రాధిక, దమ్మాయిగూడా రోడ్లపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. సంఘటనా స్థలికి చేరుకున్న జవహర్‌ నగర్‌ పోలీసులు ఆందోళనకారులకు నచ్చజెప్పారు.

హ్యాపీ న్యూఇయర్ చెప్పిన కేసీఆర్...

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేశారు. కొత్త సంవత్సరంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో గడపాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు, రాష్ట్ర అభివృద్ధి కోసం చేపట్టే కార్యక్రమాలన్నీ 2018 సంవత్సరంలోనూ విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. 

13:55 - December 31, 2017

విజయవాడ : 2017 సం.లో విద్యావ్యవస్థ అనేక ఆటుపోట్లను ఎదుర్కుందని యూటీఎఫ్ నేతలు చెప్పారు. ఈమేరకు వారు 10 టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. పాఠశాల విద్యను పరిరక్షించే విషయంలో యూటీఎఫ్ కీలకపాత్ర పోషించిందని తెలిపారు. పాఠశాల విద్యను ప్రైవేట్ పరం చేయాలనే ప్రభుత్వ కుట్రను తిప్పి కొట్టామన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

13:45 - December 31, 2017
13:42 - December 31, 2017

సినీనటి భూమికతో 10టివి చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆమె తన సినీ కెరీర్ గురించి వివరించారు. ఆమె తెలిపిన మరిన్ని ఆసక్తికరమైన విషయాలను వీడియోలో చూద్దాం.. 

13:39 - December 31, 2017

కుమ్రంభీం ఆసిఫాబాద్‌ : జిల్లాలో భారీగా చోరి జరిగింది. కాగజ్‌ నగర్‌లోని మీనాక్షి జ్యుయెలర్‌లో అర్ధరాత్రి షెట్టర్‌ పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. దాదాపు 80తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లినట్లు జ్యుయెలర్‌ యాజమాని తెలిపారు. సంఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ సందర్శించారు. సుమారు నలుగురు వ్యక్తులు ఈ దోపిడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

13:30 - December 31, 2017

కామారెడ్డి : జిల్లాలో మద్యం వ్యాపారుల సిండికేట్ దందా బట్టబయలైంది. పిట్లం మండల కేంద్రంలో మద్యం టెండర్లు దక్కించుకున్నది ఒకరైతే.. మరొకరు వైన్ షాపు నడిపిస్తున్నారు. టెండర్లు దక్కించుకున్న వ్యక్తికి గుడ్‌విల్ ఆఫర్ చేసి ఈ దందా నిర్వహిస్తున్నారు. రాజన్న, రాజరాజేశ్వర వైన్స్ పేర్లతో పక్కపక్కనే బోర్డ్‌లు పెట్టి ఒకటి రిటెయిల్.. మరొకటి హోల్‌సేల్‌గా మద్యం అమ్ముతున్నారు. ఒక్కో బాటిల్‌పై ఎమ్మార్పీ ధర కంటే రూ.20 నుంచి రూ.50 రేట్లకు అమ్ముతూ దందా చేస్తున్నారు. మరోవైపు రెండు వైన్ షాపులకు ఒకే కెమెరా.. ఒకే పర్మిట్‌ రూంలు నిర్వహిస్తూ ప్రభుత్వ నిబంధనలకు నీళ్లొదులుతున్నారు. ఇంత జరుగుతున్నా వైన్ షాపు యజమానులపై ఎక్సైజ్ అధికారులు చర్యలు చేపట్టకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైన్‌ షాపు యజమానులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు అంటున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

మద్యం వ్యాపారుల సిండికేట్...

కామారెడ్డి : జిల్లాలో మద్యం వ్యాపారుల సిండికేంట్ దందా బయటపడింది. పిట్లం మండల కేంద్రంలో మద్యం టెండర్లు దక్కించుకున్నది ఒకరే. కానీ వైన్స్ షాపులను నడిపిస్తుందని మరొకరు కావడం గమనార్హం. రాజన్న, రాజరాజేశ్వర వైన్స్ పేరిట పక్కపక్కనే వైన్ షాపులు ఉన్నాయి. ఒక్కో బాటిల్ పై రూ. 20 నుండి రూ. 50 అదనంగా అమ్మకాలు జరుపుతున్నారు. రెండూ వైన్ షాపులకు ఒకే కెమెరా..ఒకే పర్మిట్ రూం ఉంది. ప్రభుత్వ నిబంధనలకు నీళ్లొదిలినా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదు. వైన్ షాపు యజమానులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. 

13:21 - December 31, 2017

రంగారెడ్డి : చకొండ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు అయింది. ఇద్దరు నైజీరియన్లను పోలీసులు అరెస్టు చేశారు. న్యూఇయర్ వేడుకలకు డ్రగ్స్ విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. డ్రగ్స్ విలువ దాదాపు 17 లక్షల రుపాయలు ఉంటుందని తెలిపారు. కొకైన్ 16 గ్రాములు, ఎరైన్ 23 గ్రాములు, ఆల్ఫాజోలం 40 గ్రాములు, అంఫటమైన్ 15 గ్రాములు స్వాధనం చేసుకున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

12:53 - December 31, 2017

విజయవాడ : వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ పై ఏపీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవీ వ్యామోహంతోనే జగన్ పాదయాత్రలు చేస్తున్నారని విమర్శించారు. ప్రశ్నించే ధైర్యం లేని, చేతకాని ప్రతిపక్ష నేత జగన్ అని ఎద్దేవా చేశారు. 

12:45 - December 31, 2017

సంగారెడ్డి : జిల్లాలోని రిజిస్ట్రార్ కార్యాలయంలో నిబంధనల ప్రకారమే రిజిస్ట్రేషన్లు చేస్తున్నామని రిజిస్ట్రార్ రమేష్‌రెడ్డి చెప్పారు. ఈమేరకు ఆయనతో టెన్ టివితో ఫేస్ టూ ఫేస్ నిర్వహించింది. రిజిస్ట్రార్ కార్యాలయం ఇరుకుగా ఉన్న మాట వాస్తవమేనని చెప్పారు. రియల్‌ ఎస్టేట్ ప్రభావంతో రిజిస్ట్రేషన్లు పెరగడం వల్ల ఇబ్బంది ఏర్పడిందని ఆయన చెప్పారు. కొత్త భవనంలోకి మార్చడం కోసం ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

12:40 - December 31, 2017

పశ్చిమగోదావరి : జిల్లాలోని కేంద్రంలోని పేకాట క్లబ్‌పై పోలీసులు మెరుపుదాడి చేశారు. ఏలూరు  నడిబొడ్డున ఉన్న టౌన్‌హాల్‌ క్లబ్‌పై ఆకస్మికంగా దాడి చేసి  పేకాడుతున్న ప్రముఖులను అదుపులోకి తీసుకున్నారు.  భారీమొత్తంలో  నగదుతో పాటు...  పేకాటలో వాడే కాయిన్స్‌, సెల్‌ఫోన్లు, వాహనాలను సీజ్‌ చేశారు. పట్టుబడిన వారిలో ఎక్కువ మంది అధికార పార్టీవారే ఉన్నట్లు తెలుస్తోంది.  పోలీసులు తాము అనుకున్న పనిపూర్తి  అయ్యేవరకూ చాలా పకడ్బందీగానూ.. గోప్యంగానూ నిర్వహించారు.

 

డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు...

రాచకొండ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టయ్యింది. ఇద్దరు నైజీరియన్లను పోలీసులు అరెస్టు చేశారు. కొకైన్ 16 గ్రాములు, ఎరైన్ 23 గ్రాములు..అల్ఫాజోలం 40 గ్రాములు..అంఫటమైన్ 15 గ్రాములు స్వాధీనం చేసుకున్నారు. న్యూయర్ వేడుకలకు విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. 

12:25 - December 31, 2017

వెల్లుల్లిలో సల్ఫర్ పుష్క‌లంగా ఉంటుంది. స‌ల్ఫ‌ర్‌ రక్తనాళాల్లో గార (ప్లాక్) పేరుకుపోకుండా చూస్తుంది. ఆజోయేన్ రక్తం గడ్డ కట్టకుండా చేస్తుంది. దీనివ‌ల్ల గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి. ఇందులోని అలిసిన్ రోగ‌కార‌క సూక్ష్మకిముల‌పై పోరాడుతుంది.
జ‌లుబు, శ్వాస‌కోస స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. వెల్లుల్లిని రోజూ తింటే శ‌రీరంలో ఉండే వాపులు, నొప్పులు త‌గ్గుతాయి. ఆలీల్ సల్ఫయిడ్లు కొన్ని రకాల క్యాన్సర్ల నివారణకూ తోడ్పడతాయి. దీని వ‌ల్ల క్యాన్స‌ర్ల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. శ‌రీరంలో ఐర‌న్ చేర‌డంతో పాటు వాపులు, నొప్పులు తగ్గుతాయి. ప్ర‌తి రోజూ నేరుగా లేదా కూర‌లో వేసుకుని వెల్లుల్లిని తిన‌వ‌చ్చు. గ్యాస్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డేవారు ఇని త‌గ్గించి తినాలి. వెల్లుల్లిని రోజూ తింటే డిప్రెష‌న్ నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మానసిక ప్ర‌శాంత‌త క‌లుగుతుంది.

పీజీటీ ఫలితాల విడుదల..

హైదరాబాద్ : పీజీటీ ఫలితాలను కాసేపటి క్రితం టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. వెబ్ సైట్ లో అభ్యర్థుల జాబితా పొందుపరిచింది. 513 పోస్టుల భర్తీకి సంబంధించిన జాబితాను విడుదల చేసింది. గణితం 120 పోస్టులకు 114 మందిని...ఫిజిక్స్ 188 పోస్టులకు 174 మందిని...సోషల్ 177 పోస్టులకు 166 మందిని..బయోలజీ 22 పోస్టులకు 21 మందిని..ఎంపిక చేసింది. త్వరలో వికలాంగుల కోటా జాబితాను కూడా విడుదల చేయనుంది. 

రజనీకి బిగ్ బి విషెస్...

చెన్నై : ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై బాలీవుడ్ ప్రముఖ సినీ నటుడు అమితాబ్ బచ్చన్ స్పందించారు. ఆయన ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. రాజకీయాల్లో సక్సెస్ కావాలని ఆకాక్షించిస్తున్నట్లు, ఇందుకు విషెస్ తెలియచేస్తున్నట్లు పేర్కొన్నారు. 

12:14 - December 31, 2017


హైదరాబాద్ : ఆర్టీసి కార్మికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వేతన సవరణ ఎప్పుడు జరగనుంది? గత వేతన ఒప్పందం సందర్భంగా సిఎం కేసిఆర్ ఇచ్చిన హామీ ఏమైంది? వేతన సవరణకు ఆర్టీసి కార్మిక సంఘాలు ఇచ్చిన ప్రతిపాదనలేంటి? పిఆర్సీ పట్ల ఆర్టీసి యాజమాన్యం వైఖరేంటి? అధికార పార్టీకి చెందిన గుర్తింపు సంఘం ఏమంటోంది? అనే అంశాలపై టెన్ టీవి స్పెషల్ స్టోరీ.. 
పీఆర్సీ కోసం ఉద్యోగులు ఎదురుచూపులు
తెలంగాణ ఆర్టీసీలో వేతన సవరణ గడువు ముగిసి ఎనిమిది నెలలు గడుస్తోంది. గత ఏప్రిల్‌లో కొత్త పీఆర్సీ ఇవ్వాల్సినప్పటికీ.. ఆ దిశగా ప్రయత్నాలే జరగడం లేదు. పే రివిజన్‌ కమిటీ వేసినప్పటికీ.. పీఆర్సీపై స్పష్టతే లేదని ఆర్టీసీ ఉద్యోగులు వాపోతున్నారు. అయితే.. పీఆర్సీ సందర్బంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇప్పటివరకు నెరవేర్చడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
పీఆర్సీ ఆలస్యమైన కొద్దీ వేతన బకాయిలు భారం 
ఇక పీఆర్సీ ఆలస్యమైన కొద్దీ వేతన బకాయిల భారం పెరగనుంది. రాష్ట్ర విభజన సమయంలో బకాయిలు చెల్లించడం భారం కావడంతో విడతల వారీగా 50 శాతం... మిగిలిన 50 శాతం బాండ్ల రూపంలో చెల్లించారు. ఈసారి కూడా అదే పరిస్థి నెలకొనే అవకాశముందని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నేతలంటున్నారు. 
వేతన సవరణ ప్రతిపాదనలిచ్చిన ఆర్టీసీ సంఘాలు  
వేతన సవరణ కోసం ఆర్టీసీ యాజమాన్యం ఏర్పాటు చేసిన కమిటీకి... ఆర్టీసీ సంఘాలు వేతన సవరణ ప్రతిపాదనలు ఇచ్చాయి. టీఎంయూ 50 శాతం, ఎంప్లాయిస్‌ యూనియన్‌ 62 శాతం, స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ 70 శాతం వేతనం పెంచాలని ప్రపోజల్స్‌ ఇచ్చాయి. అయితే ఇప్పటి వరకు కమిటీ మాత్రం ఏ విషయాన్ని ప్రకటించలేదు. అయితే... 50 శాతం ఖచ్చితంగా వేతన సవరణ సాధిస్తామని గుర్తింపు సంఘమైన టీఎంయూ ధీమా వ్యక్తం చేస్తోంది. 
62శాతం వేతన సవరణ జరగాలి : ఈయూ 
ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన వేతనం రావాలంటే 62శాతం వేతన సవరణ జరగాలని ఎంప్లాయిస్‌ యూనియన్‌ అంటోంది. 
70శాతం వేతన సవరణ జరగాలన్న ఎస్ డబ్ల్యు ఎఫ్  
కనీస వేతనం 18 వేలు ఉండాలంటే.. 70శాతం వేతన సవరణ జరగాలని స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ నాయకత్వమంటోంది. వేతన సవరణే కాకుండా సర్వీసు రూల్స్, రెగ్యూలేషన్స్ కూడా సవరించాలని డిమాండ్‌ చేస్తోంది. పీఆర్సీ విషయంలో యాజమాన్యం తీరు సరిగా లేదనడానికి గుర్తింపు సంఘం నిరసనలు, దీక్షలు చేపట్టడమే దానికి నిదర్శమని వామపక్షయూనియన్‌ నేతలంటున్నారు.  
పీఆర్సీ ఉసేత్తని సీఎం కేసీఆర్ 
గత వేతన ఒప్పందం సందర్భంగా.. వేతన సవరణ గడువుకు ముందే పీఆర్సీ ఇస్తామని ప్రకటించిన కేసీఆర్‌.. గడువు ముగిసి ఎనిమిది నెలలైనా ఆ ఊసే ఎత్తకపోవడంపై ఆర్టీసీ కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి.. వెంటనే పీఆర్సీ ప్రకటించాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

 

ఏపీలో రైతు శిక్షణా తరగతులు...

గుంటూరు : ప్రకృతి వ్యవసాయంపై ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో శిక్షణా తరగతులు జరుగుతున్నాయి. రైతు శిక్షణ తరగతులను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. డాక్టర్ సుభాష్ పాలేకర్ నేతృత్వంలో జనవరి 8వ తేదీ వరకు ఈ తరగతులు కొనసాగనున్నాయి. 

'నేటి నుండి రైతులకు 24గంటల ఉచిత విద్యుత్'...

హైదరాబాద్ : నేటి నుండి రాష్ట్రంలో రైతులకు 24గంటల ఉచిత విద్యుత్ అందచేయనున్నట్లు మంత్రి జగదీశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. టెన్ టివితో ఆయన మాట్లాడారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని, సీఎం దూర దృష్టితో ఇది సాధ్యమైందన్నారు. రైతులు సంతోషంగా ఉండాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని, గృహ, పారిశ్రామిక అవసరాలకు ఎలాంటి ఇబ్బందేమి లేదన్నారు. తమ ప్రణాళికలు చూసి పారిశ్రామిక వేత్తలు సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. విద్యుత్ ఉద్యోగులు, అధికారుల కృషిని ఆయన కొనియాడారు. విద్యుత్ కోతలు లేనందు వల్లే పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నారన్నారు. 

12:00 - December 31, 2017

'నాని'...టాలీవుడ్ దర్శక..నిర్మాతలకు వరంగా మారిపోయాడు. ఆయన నటించిన సినిమాలన్నీ వరుసగా విజయవంతమవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన నటించిన 'ఎంసిఏ' మిడిల్ క్లాస్ అబ్బాయి చిత్రం డివైడ్ టాక్ పొందినా భారీగా కలెక్షన్లు సాధిస్తూ ముందుకెళుతోంది. ఈ సినిమా షూటింగ్ కొనసాగుతుండగానే 'మేర్లపాక గాంధీ' చిత్రంలో కూడా నాని నటిస్తున్నాడు. ఇందులో నాని డబుల్ రోల్ పాత్ర పోషిస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ సినిమాకు 'కృష్ణార్జున యుద్ధం' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. బోయనపల్లి సమర్పణలో షైన్‌ స్క్రీన్న్‌ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మిస్తున్నారు. 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌', 'ఎక్స్‌ప్రెస్‌ రాజా' చిత్రాల దర్శకుడు మేర్లపాక దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది. వెంకట్‌ అనుపమ పరమేశ్వరన్‌, రుఖ్సార్‌ మీర్‌ నాయికలుగా నటిస్తున్నారు.

ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకొంటోంది. ఈ షెడ్యూల్ లో కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ తో చిత్ర షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్‌ 12న గ్రాండ్‌ రిలీజ్‌ చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. 

11:59 - December 31, 2017

చిత్తూరు : తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్తులు ఉద్యోగం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దాదాపు 44 మంది ఉన్నట్లు నివేదికలో బయటపడింది. టీటీడీలో అన్యమతస్తులు పని చేయడంపై సర్వత్రా విమర్శలు తలెత్తడంతో... వారిపై వేటు వేసేందుకు సిద్దమవుతున్నారు ఉన్నతాధికారులు.
ఉద్యోగులుగా అన్యమతస్తులు 
తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్తులు ఉద్యోగులుగా కొనసాగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తిరుమలలో అన్యమత ప్రచార నివారణకు గతంలో అనేక చట్టాలు చేశారు. అన్యమత ప్రచారానికి పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలని... టీటీడీలో వారికి ఉద్యోగాలు ఇవ్వకూడదని 2007లో పాలకమండలి ఓ చట్టం తీసుకువచ్చారు. 
కొంతమంది అధికారులు నిర్లక్ష్యంతో అన్యమత ప్రచారం 
అయితే... టీటీడీలో కొంతమంది అధికారులు నిర్లక్ష్యంతో తిరుమలలో అన్యమత ప్రచారం కొనసాగుతూనే ఉంది. తాజాగా టీటీడీ సంక్షేమ విభాగం డిప్యూటీ ఈవోగా పని చేసే స్నేహలత డిసెంబర్‌ మొదటి వారంలో టీటీడీ వాహనంలో... చర్చికి వెళ్లినట్లు వార్తలు బయటకు వచ్చాయి. దీనిపై టీటీడీ వైఖరిని పీఠాధిపతులతో పాలు పలువురు తప్పుబట్టారు. దీంతో స్పందించిన ఉన్నతాధికారులు.. ఈ ఘటనపై విజిలెన్స్‌ విచారణకు ఆదేశించారు. అయితే... విచారణలో అనేక ఆసక్తికర అంశాలు బయటపడినట్లు తెలుస్తోంది. 
నిబంధనలకు విరుద్ధంగా అన్యమతస్తులకు ఉద్యోగాలు 
గతంలో టీటీడీ ఈవోలుగా పని చేసినవారు నిబంధనలకు విరుద్ధంగా అన్యమతస్తులకు ఉద్యోగాలు కట్టబెట్టినట్లు బయటపడింది. 1989-2007 మధ్య కాలంలో 37 మంది అన్యమతస్తులు.. రిజర్వేషన్లతో టీటీడీలో ఉద్యోగాలు పొంది.. బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే.. అన్యమతస్తులను ప్రాముఖ్యం కలిగిన విభాగాలు, ఆలయాల్లో విధులకు దూరంగా ఉంచాలని నిబంధనలున్నాయి. కానీ.. వాటిని అమలు చేయడంలో టీటీడీ విఫలమైందని పలువురంటున్నారు. 
అన్యమతస్తుల తొలగింపుకు టీటీడీ సిద్ధం
ఇక స్నేహలత వ్యవహారంపై విచారణ జరిపిన కమిటీ... టీటీడీలో మొత్తం 44 మంది అన్యమతస్తులు పని చేస్తున్నారని గుర్తించింది. దీంతో వారిని తొలగించేందుకు టీటీడీ సిద్ధమవుతోంది. ప్రభుత్వం అంగీకరిస్తే వారందరిని సర్కార్‌కు హ్యాండ్‌ ఓవర్‌ చేయాలని టీటీడీ భావిస్తోంది. 

 

11:47 - December 31, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో కీలక నిందితుడు కెల్విన్‌కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. చర్లపల్లి జైలు నుంచి విడుదలైన కెల్విన్ మీడియాతో మాట్లాడాడు. డ్రగ్స్ కేసులో తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని చెప్పారు. తన కుటుంబానికి దూరమై చాలా బాధపడ్డానని చెప్పాడు. ఇకపై సాధారణ జీవితాన్ని గడుపుతానని తెలిపాడు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

11:36 - December 31, 2017

చెన్నై : పొలిటికల్ ఎంట్రీపై సూపర్ స్టార్ రజనీకాంత్ కీలక ప్రకటన చేశారు. రాజకీయాల్లోకి వస్తున్నట్లు తలైవా ప్రకటించారు. తాను రాజకీయాల్లోకి వస్తున్నానని సూపర్ స్టార్ రజనీకాంత్ స్పష్టం చేశారు. ఆరో రోజు అభిమానులతో రజనీకాంత్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి రావడం ఖాయమన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త పార్టీ స్థాపిస్తానని తేల్చి చెప్పారు. సొంతంగా పార్టీ పెడతానని స్పష్టం చేశారు. 234 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పారు. రాజకీయాలంటే తనకు భయం లేదన్నారు. యుద్ధం చేస్తానని గెలుపోటములు దేవుడే నిర్ణయిస్తాడని పేర్కొన్నారు. అధికారం, డబ్బు కోసం తాను రాజకీయాల్లోకి రావడం లేదని స్పష్టం చేశారు. దేశంలో రాజకీయాలు భ్రష్టుపట్టిపోయాయని తెలిపారు. కొన్ని రోజులుగా తమిళనాడులో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు తనను మనస్తాపానికి గురిచేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు నేతల వల్ల తమిళనాడు పరువుపోయిందన్నారు. అవినీతిని అంతం చేయాలని పిలుపునిచ్చారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

సీఎం కుర్చీ పిచ్చితో పాదయాత్ర - దేవినేని...

విజయవాడ : 2017లో జలవనరుల శాఖకు అంతా మంచే జరిగిందని మంత్రి దేవినేని ఉమ వ్యాఖ్యానించారు. 2018లో గోదావరి, పెన్నా నది అనుసంధానానికి సీఎం కృషి చేస్తున్నారని, పోలవరం పవర్ ప్రాజెక్టు టెండర్ కొట్టేయడానికి జగన్ పావులు కదిపారని, టెండర్ దక్కలేదనే కారణంతో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. 2019 ఎన్నికల్లో జగన్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని, సీఎం కుర్చీ పిచ్చితో పాదయాత్ర చేస్తున్నారని విమర్శించారు.

నిలిచిపోయిన మెట్రో రైలు...

హైదరాబాద్ : అమీర్ పేట స్టేషన్ లో మెట్రో రైలు నిలిచిపోయింది. సాంకేతిక సమస్యతో రెండు గంటల పాటు రైలు నిలిచిపోవడంతో ప్రయాణీకులు ఇబ్బందులు పడ్డారు. దీనితో అమీర్ పేట - నాగోల్ మధ్య మెట్రో సేవలు నిలిచిపోయాయి. నిలిచిపోయిన మెట్రో రైలును అదనపు ట్రాక్ పైకి తీసుకొచ్చారు. 

రజనీ పొలిటికల్ ఎంట్రీపై కమల్ స్పందన..

చెన్నై : ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై మరో ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ స్పందించారు. ఆయన ఓ జాతీయ ఛానెల్ తో మాట్లాడారు. రాజకీయాల్లో ప్రవేశం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు. 

11:10 - December 31, 2017

బుల్లితెరపై ప్రసారమయ్యే 'జబర్దస్త్' షోలో తన పంచ్ డైలాగ్స్ తో ..కామెడీ డైలాగ్స్ ఆకట్టుకునే నటుల్లో 'ఛమ్మక్ చంద్ర' ఒకరు. పలు చిత్రాల్లో కూడా ఆయన కామెడీ రోల్స్ చేసి అభిమానులను ఆకట్టుకున్నాడు. కానీ తెలుగులో మాత్రం పూర్తిస్థాయిలో చిత్రంలో నటించలేదు. తాజాగా కోలీవుడ్ లో ఇతను అడుగుపెట్టబోతున్నాడు. అదీ పూర్తిస్థాయి చిత్రంలో అంట.

‘సెయల్' పేరిట రూపొందుతున్న సినిమాలో 'ఛమ్మక్ చంద్ర'కు ఛాన్స్ దక్కిందని టాక్. ఓ కీలక పాత్రకు ఇతను దర్శకుడు ఫైనల్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఈ సినిమాలో విలన్ పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. అబ్బులు దర్శకత్వంలో చిత్రం రూపొందబోతోంది. రాజన్ తేజేశ్వర్, థరుషి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలో త ఎలియనున్నాయి. 

11:06 - December 31, 2017

బాలీవుడ్ కండల వీరుడు తాజా చిత్రం కూడా రికార్డుల దిశగా దూసుకెళుతోంది. ఆయన నటించిన గత చిత్రాలు వందల కోట్ల క్లబ్ లో సునాయసంగా చేరిన సంగతి తెలిసిందే. ఆయన నటించిన తాజా చిత్రం 'టైగర్ జిందా హై' ఇటీవలే విడుదలైంది. రెండో వారంలో అడుగు పెట్టినా కలెక్షన్లలలో ఏ మాత్రం మార్పు రావడం లేదు. వీకెండ్ లో ఇంకా కలెక్షన్లు పెరిగే అవకాశాలున్నట్లు సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆయన నటించిన భజరంగీ భాయిజాన్ రూ. 320 కోట్లు...సుల్తాన్ రూ. 300 కోట్లు..రికార్డును సినిమా ఛేంజ్ చేస్తోందన్నారు. ఇప్పటికే ఈ సినిమా రూ. 200కోట్లు దాటిపోయిన సంగతి తెలిసిందే.

'ఏక్ థా టైగర్' చిత్రానికి సీక్వెల్‌గా 'టైగర్ జిందా హై' సినిమా రూపొందింది. ఈ చిత్రానికి అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించారు. ఇంతకు ముందు సల్మాన్‌తో ‘సుల్తాన్' సినిమా తీశాడు. సల్మాన్ ఖాన్ మూవీస్‌లో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన 12వ బాలీవుడ్ చిత్రం ‘టైగర్ జిందా హై’. ఈ చిత్రం కలెక్షన్ల పరంగా సల్మాన్ ఖాన్‌కు ఆల్ టైమ్ హైగా నిలిచే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనావేస్తున్నాయి. 

10:52 - December 31, 2017

చెన్నై : తాను రాజకీయాల్లోకి వస్తున్నానని సూపర్ స్టార్ రజనీకాంత్ స్పష్టం చేశారు. ఆరో రోజు అభిమానులతో రజనీకాంత్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి రావడం ఖాయమన్నారు. 234 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త పార్టీ స్థాపిస్తానని తేల్చి చెప్పారు. అధికారం, డబ్బు కోసం తాను రాజకీయాల్లోకి రావడం లేదని స్పష్టం చేశారు. కొందరు నేతల వల్ల తమిళనాడు పరువుపోయిందన్నారు. అవినీతిని అంతం చేయాలని పిలుపునిచ్చారు. 

 

ఇద్దరు మావోయిస్టుల మృతి...

ఛత్తీస్ గడ్ : సుకుమా జిల్లా చింతగుప్ప అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మూడు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవలే అరెస్టు చేసిన ఇద్దరు మిలీషియా సభ్యులను ఎన్ కౌంటర్ చేసినట్లు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. 

జగన్ 48వ రోజు..

చిత్తూరు : వైసీపీ అధ్యక్షుడు జగన్ చేపట్టిన పాదయాత్ర 48వ రోజుకి చేరుకుంది. ఆదివారం ఉదయం చిత్తూరు జిల్లా మూలపల్లిక్రాస్‌ నుంచి వైఎస్‌ జగన్‌ తన పాదయాత్రను ప్రారంభించారు. ఎర్రసానిపల్లె, ఎద్దులవారిపల్లె, కన్నెమడుగు, కె రామిగానివారిపల్లో, రేణుమాకులపల్లి క్రాస్‌, మీదుగా తిమ్మయ్యగారిపల్లి మీదుగా పాదయాత్ర జరుగనుంది. పరదేశిపల్లె, దాదంవారిపల్లి, తుపల్లి క్రాస్‌ మీదుగా ముదివేడు వరకు పాదయాత్ర జరుగనుంది. 

సీఆర్పీఎఫ్ శిక్షణా శిబిరంపై ఉగ్ర దాడి...

జమ్మూ కాశ్మీర్ : దక్షిణ కశ్మీర్‌లోని లెత్‌పోరలో సీఆర్‌పీఎఫ్ శిక్షణా కేంద్రంపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఆదివారం తెల్లవారుజామున ఉగ్రవాదులు గ్రనేడ్లు విసురుతూ, కాల్పులు జరుపుతూ శిక్షణా కేంద్రంలోకి చొరబడేందుకు ప్రయత్నించారు. ఈ దాడులో ముగ్గురు సీఆర్‌పీఎఫ్ సిబ్బంది గాయపడ్డారు. 

విశాఖలో కనిష్ట ఉష్ణోగ్రతలు..

విశాఖపట్టణం : జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదివారం పాడేరులో 11 డిగ్రీలు, మినుములూరులో 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

రజనీ సంచలన ప్రకటన..

చెన్నై : అందరూ అనుకున్నట్లు రజనీకాంత్ సంచలన ప్రకటన చేశారు. అభిమానులతో భేటీ అయిన రజనీ రాజకీయాల్లోకి వస్తున్నానని సంచలన ప్రకటన చేశారు. తమిళనాడులోని 234 నియోజకవర్గాల్లో పోటీ చేయబోతున్నామని, యుద్ధం చేయబోతున్నానని... గెలుపు, ఓటమి భగవంతుడి చేతిలోనే ఉందన్నారు. రాజకీయాల్లో గెలిస్తే విజయమని... లేదంటే విరమణ అని చెప్పారు. కాలమే తన రాజకీయ అరంగేట్రాన్ని నిర్ణయించిందని అన్నారు. 

దేశ రాజధానిలో పొగమంచు...

ఢిల్లీ : దేశ రాజధానిని పొగ మంచు వీడడం లేదు. దీని కారణంగా రవాణా వ్యవస్థపై పెను ప్రభావం చూపెడుతోంది. ఆదివారం పొగమంచు కారణంగా పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. పది విమానాల రాకపోకలను మార్చారు. 

డీజీపీ సాంబశివరావు పదవీ విరమణ..

విజయవాడ : నేడు డీజీపీ సాంబశివరావు పదవీ విరమణ సందర్భంగా మంగళగిరి 6వ ఎస్పీ బెటాలియన్ లో వీడ్కోలు కార్యక్రమం జరిగింది. పరేడ్ గౌరవవందనాన్ని సాంబశివరావు స్వీకరించారు. ఈ పరేడ్ లో నూతన డీజీపీ మాలకొండయ్య, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

రాజకీయాల్లోకి వచ్చేస్తున్నా - తలైవా..

చెన్నై : రాజకీయం అంటే భయం లేదని..మీడియా అంటే భయమని ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ వ్యాఖ్యానించారు. ఆరో రోజు అభిమానులతో భేటీ అయిన ఆయన రాజకీయ ఎంట్రీపై కీలక ప్రకటన చేశారు. రాజకీయాల్లోకి వచ్చేస్తున్నట్లు, సొంతంగా పార్టీ పెట్టనున్నట్లు వెల్లడించారు. రాజకీయం చెడిపోయింది..ప్రజాస్వామ్యం పాడైపోయిందని..దేశ రాజకీయాలు భ్రష్టు పట్టాయని వ్యాఖ్యానించారు. రాజకీయ మార్పు కోసం సమయం ఆసన్నమైందని, నిజాయితీతో కూడిన రాజకీయాలు చేస్తానన్నారు. ప్రతి గ్రామంలో రాజకీయ వేదికలు పటిష్టం చేయాలని పిలుపునిచ్చారు.

జమ్మూకాశ్మీర్ లో ఉగ్రదాడి..జవాను మృతి

శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదుల బీభత్సం సృష్టించారు. ఉగ్రవాదులు సీఆర్ పీఎఫ్ శిక్షణాకేంద్రంలోకి చొరబడి గ్రానైడ్ లు విసిరి, కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక జవాను మృతి చెందారు. మరో ముగ్గురు భద్రతా సిబ్బందికి గాయాలు అయ్యాయి. ముగ్గురు ఉగ్రవాదులు దాడిలో పాల్గొన్నట్టు అనుమానాలున్నాయి. ముష్కరుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. 

 

08:07 - December 31, 2017

శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదుల బీభత్సం సృష్టించారు. ఉగ్రవాదులు సీఆర్ పీఎఫ్ శిక్షణాకేంద్రంలోకి చొరబడి గ్రానైడ్ లు విసిరి, కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక జవాను మృతి చెందారు. మరో ముగ్గురు భద్రతా సిబ్బందికి గాయాలు అయ్యాయి. ముగ్గురు ఉగ్రవాదులు దాడిలో పాల్గొన్నట్టు అనుమానాలున్నాయి. ముష్కరుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. 

 

07:59 - December 31, 2017

ఏపీ ప్రభుత్వం చేపట్టబోయే జన్మభూమి కార్యక్రమం ఎలక్షన్ క్యాంపెయిన్ గా ఉందని వక్తలు విమర్శించారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సీపీఎం కేంద్రకమిటీ సభ్యులు ఎంఎ.గఫూర్, టీడీపీ అధికార ప్రతినిధి రామకృష్ణప్రసాద్ వైసీపీ నేత హనుమంతరావు పాల్గొని, మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. జన్మభూమి పేరుతో సీఎం చంద్రబాబు ప్రచార అర్భాటాలకు పోతున్నారని పేర్కొన్నారు. జన్మభూమి కమిటీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

07:49 - December 31, 2017
07:44 - December 31, 2017

విజయవాడ : 2017కు వీడ్కోలు చెబుతూ.. 2018కు స్వాగతం పలికేందుకు ప్రపంచమంతా సిద్దమైంది. ఈ ఏడాది చివరి రోజున ఎంజాయ్‌ చేస్తూ కొత్త ఏడాదిలో ఉత్సాహంగా అడుగుపెట్టేందుకు అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. నగరవాసులంతా ఎంజాయ్‌ చేయడానికి బెజవాడలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హోటళ్లు, రిసార్ట్స్‌లు నగరవాసులను ఆకట్టుకునేందుకు ముస్తాబు చేస్తున్నారు. సినీ తారలను ఆహ్వానించి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 
సర్వాంగ సుందరంగా బెజవాడ ముస్తాబు  
2017కు గుడ్‌బై చెప్పి... 2018కు స్వాగతం పలికేందుకు బెజవాడ నగరం సర్వాంగ సుందరంగా తయారైంది. న్యూఇయర్‌ వేడుకలను ఘనంగా  సెలబ్రేట్‌ చేసుకునేందుకు యువత ఎదురుచూస్తోంది. మరోవైపు సంబరాలకు నగరమంతా ముస్తాబైంది. నగరంలో అన్ని ప్రాంతాల్లో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. విద్యుద్దీపాలతో అలంకరించారు.
ఇయర్‌ ఎండ్‌కు వీడ్కోలు పలికేందుకు కార్యక్రమాలు 
ఇయర్‌ ఎండ్‌కు ఘనంగా వీడ్కోలు పలికేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. స్టార్‌ హోటళ్లు, పబ్‌లు, క్లబ్‌లు, ఫంక్షన్‌ హాల్స్‌, మల్టీపెక్స్‌ మాల్స్‌లలో వేడుకలు నిర్వహిస్తున్నారు. డీజేలు, సంగీత విభావరిలతో యూత్‌ను ఆకట్టుకునేందుకు ఏర్పాట్లు చేశారు. ఇక నగరంలో ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్లతో అనేక ఈవెంట్స్‌ చేయనున్నారు. ప్రధానంగా ప్రముఖ దేవీశ్రీ ప్రసాద్‌ నేతృత్వంలో నైట్స్‌ నిర్వహిస్తున్నారు. అలాగే బెర్మ్‌పార్క్‌లో ఐఏఎస్‌ అధికారుల గ్రాండ్‌ న్యూ ఇయర్‌ పార్టీ చేసుకోబోతున్నారు. ఈ వేడుకలకు సీఎస్‌తో పలువురు ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. అలాగే సీఎం చంద్రబాబు కూడా వ చ్చే అవకాశం కనిపిస్తోంది. 
హోటళ్లు అన్నీ ముస్తాబు 
ఇక నగరంలోని ప్రముఖ హోటళ్లు, పబ్‌లు, క్లబ్బులు న్యూ ఇయర్‌ వేడుకలకు వేదిక కాబోతున్నాయి. ఇప్పటికే ఇందుకోసం హోటళ్లు అన్నీ ముస్తాబయ్యాయి. న్యూ ఇయర్‌ సందర్బంగా పూల వ్యాపారులు భారీ ఎత్తున బొకేలు ఏర్పాటు చేస్తున్నారు. చాలామంది బొకేలు కొనుగోలు చేస్తారనే అంచనా వేస్తున్నారు. 
న్యూఇయర్‌ వేడుకలకు పోలీసులు పటిష్ట చర్యలు
మరోవైపు పోలీసులు కూడా న్యూఇయర్‌ వేడుకలకు పటిష్ట చర్యలు చేపట్టారు. నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆదివారం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించనున్నట్లు నగర డీసీపీ కాంతి రాణా తెలిపారు. యూత్‌ నిబంధనలకు లోబడి న్యూ ఇయర్‌ వేడుకలు చేసుకోవాలని సూచించారు. మొత్తానికి కాసేపట్లో మొదలయ్యే సంబరాల కోసం అందరూ వేచి చూస్తున్నారు. కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 

 

07:37 - December 31, 2017

హైదరాబాద్ : 2017 కాలగర్భంలో కలిసిపోతోంది. కోటి ఆశలతో కొత్త సంవత్సరం.. 2018 ప్రవేశిస్తోంది. ప్రతి ఇంటా కొత్త క్యాలెండర్ ప్రత్యక్షం కాబోతోంది.. ప్రతి మదిలో కోటి ఆశలు ఊపిరి పోసుకుంటున్నాయి. పాత సంవత్సరాన్ని నెమరు వేసుకుంటూ కొత్త లక్ష్యాలను సిద్ధం చేసుకుంటూ అందరూ సంబరాలకు సిద్ధమవుతున్నారు. ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ.. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నారు. 
అందరిలోనూ జోష్ 
న్యూ ఇయర్ మొదలవుతోంది అనగానే.. అందరిలోనూ ఓ రకమైన జోష్ నిండిపోతుంది. కొత్త ఉత్సాహం ఉరకలేస్తుంది. పాత సంవత్సరపు చేదు జ్ఞాపకాల్ని మర్చిపోవాలని కొందరు.. సాధించలేకపోయిన లక్ష్యాల్ని కొనసాగించాలని మరికొందరు.. సరికొత్త నిర్ణయాలు తీసుకుంటారు. గడిచిన ఏడాదికి గుడ్‌బై చెప్పి కోటి ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పేందుకు అందరూ సిద్ధమవుతున్నారు. 
ఒకప్పుడు గ్రీటింగ్స్ పంపి శుభాకాంక్షలు 
ఒకప్పుడు న్యూ ఇయర్‌కి ముందుగానే దూర ప్రాంతాల్లో ఉండే తమ వారికి గ్రీటింగ్స్ పంపి శుభాకాంక్షలు చెప్పేవారు. తిరిగి తాము అందుకున్న గ్రీటింగ్స్ చూసుకుని మురిసిపోయేవారు. ఇప్పుడు వాటితో పని లేకుండా ఎప్పటికప్పుడు సెల్‌ఫోన్లలో ఒకరినొకరు చూసుకుంటూ.. మాట్లాడుకుంటూ శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు. ఇక ఫేస్‌బుక్, వాట్సాప్‌ల అప్‌డేట్‌ ఉండనే ఉంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ సందడి మొదలెట్టేశారు. 
పల్లెసీమలకూ వ్యాపించిన హంగామా 
కొత్త సంవత్సరం మొదలయ్యేది జనవరి 1న అయినా.. అసలు హంగామా అంతా డిసెంబర్ 31 అర్ధరాత్రి తేదీ మారే సమయంలోనే. కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పే ముందు నగరాల్లో సందడి అంబరాన్ని అంటుతుంది. ఒకప్పుడు సిటీల్లో ఉండే హంగామా ఇప్పుడు పల్లెసీమలకూ వ్యాపించింది..అపార్ట్‌మెంట్లు, పబ్బులు, క్లబ్బులు సందడిగా మారిపోతాయి. ఇక కుర్రకారు కేరింతలకు అలుపుండదు. ఆటలు.. పాటలతో వీధులన్నీ మారుమోగిపోతాయి. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ కొత్త సంవత్సర వేడుకల్లో ముగిపోతారు. గడియారం 12 కొట్టగానే బాణాసంచా మోత మోగిపోవాల్సిందే. ఇక న్యూ ఇయర్ వేడుకల్లో అసలు జోష్ అంతా యూత్‌దే.
కొత్త సంవత్సరం.. అందరిలోనూ ఉత్కంఠ  
కొత్త సంవత్సరం ఎలా ఉండబోతోందనే ఉత్కంఠ అందరిలోనూ ఉంటుంది..గడిచిన ఏడాదిగా అందరి జీవితాల్లో ఎదురైన చేదు జ్ఞాపకాల్ని మరిచిపోవాలి. నిరుపేదల జీవితాల్లో వెలుగులు నిండాలి. అసమానతలు మరిచిపోయి అందరూ ఐకమత్యంగా ముందుకు సాగాలి. శాంతి సౌభాగ్యాలు వెల్లివిరియాలి. కొత్త ఏడాది కోసం కన్న కలలు నిజం కావాలి. కొత్త సంవత్సరానికి ఇవే ప్రధాన లక్ష్యాలు కావాలి. 

 

07:26 - December 31, 2017

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌ నూతన డీజీపీగా ఆర్టీసీ ఎండీ ఎం.మాలకొండయ్యను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు శనివారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుత డీజీపీ సాంబశివరావు పదవీ కాలం ముగియడంతో మాలకొండయ్యను నియమించారు. మాలకొండయ్య ఈ పదవిలో ఆరు నెలల పాటు కొనసాగనున్నారు. 1985 బ్యాచ్‌కు చెందిన మాలకొండయ్య స్వస్థలం... ప్రకాశంజిల్లా. ఆయన న్యాయశాస్త్రం, వ్యవసాయ విద్యలో పట్టభద్రుడు. మాలకొండయ్య ఆంధ్రా యూనివర్సిటీ నుండి క్రిమినాలజీలో డాక్టరేట్‌ పొందారు. ఐపీఎస్‌కు ఎంపిక కాకముందు బ్యాంక్‌ ఉద్యోగం కూడా చేశారు. సమైక్య రాష్ట్రంలో తూర్పుగోదావరి, వరంగల్‌, ఆదిలాబాద్‌, మెదక్‌, గుంటూరు, పశ్చిమగోదావరి, విశాఖ జిల్లాల్లో ఏఎస్పీ, అదనపు ఎస్పీ, ఎస్పీ హోదాలో బాధ్యతలు నిర్వహించారు. గుంటూరు, ఏలూరు రేంజిల్లో డీఐజీగానూ పని చేశారు. విధి నిర్వహణలో ముక్కుసూటిగా వ్యవహరించడమే కాకుండా... సౌమ్యుడిగా మాలకొండయ్యకు పేరుంది. ప్రస్తుతం వైద్యశాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేస్తున్న పూనం మాలకొండయ్య... ఆయన సతీమణి. 

 

నేడు, రేపు రాత్రి 12 గం.ల వరకు మద్యం దుకాణాలు, బార్లకు అనుమతి

అమరావతి : కొత్త సంవత్సరం సందర్భంగా నేడు, రేపు రాత్రి 12 గంటల వరకు మద్యం దుకాణాలు, బార్లకు అనుమతిచ్చారు. 

నేడు ఏపీ డీజీపీ సాంబ శివరావు పదవీ విమరణ

గుంటూరు : ఏపీ ప్రస్తుత డీజీపీగా ఉన్న సాంబ శివరావు నేడు పదవీ విమరణ చేయనున్నారు. ఉదయం 8 గంటలకు అధికారికంగా వీడ్కోలు సభ నిర్వహించనున్నారు. 

 

నేడు ఆరో రోజు అభిమానులతో రజనీకాంత్ సమావేశం

చెన్నై : నేడు ఆరో రోజు అభిమానులతో రజనీకాంత్ సమావేశం అవుతారు. రాజకీయరంగ ప్రవేశంపై ప్రకటన చేసే అవకాశం ఉంది. 

 

Don't Miss