Activities calendar

01 January 2018

21:49 - January 1, 2018

శ్రీనగర్ : సీఆర్‌పీఎఫ్‌ శిక్షణా కేంద్రంపై ఆదివారం ఉగ్రదాడి జరిగింది. పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్‌ ఉగ్రవాదులు భద్రతా బలగాలపై గ్రనేడ్లతో దాడి చేసి విచక్షణా రహితంగా కాల్పులకు పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో సిఆర్‌పిఎఫ్‌కు చెందిన ఐదుగురు జవాన్లు అమరులయ్యారు. భద్రతాబలగాలు నిర్వహించిన సెర్చ్‌ ఆపరేషన్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆదివారం ప్రారంభమైన ఈ ఆపరేషన్‌ సోమవారం మధ్యాహ్నం వరకు కొనసాగిందని అధికారులు తెలిపారు. చనిపోయిన ఉగ్రవాదుల్లో 16 ఏళ్ల బాలుడు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ బాలుడు ఓ పోలీస్‌ అధికారి కుమారుడు కావడం గమనార్హం. నెల రోజుల ముందే జైష్‌-ఎ-మహ్మద్‌ సంస్థలో చేరాడు.

సిఆర్‌పిఫ్‌ క్యాంపుపై దాడి
సిఆర్‌పిఫ్‌ క్యాంపుపై దాడికి ముందు ఆ బాలుడు ఓ వీడియో మెసేజ్‌ రికార్డు చేసినట్లు అధికారులు తెలిపారు. 'కొన్ని నెలల క్రితమే ఈ శిబిరంపై దాడి చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ సందేశం మీకు అందేసరికి నేను ఆ దేవుడి వద్దకు చేరిపోయి ఉంటాను. మీరు కూడా జైషే-మహ్మద్‌లో చేరండని మెసేజ్‌ చేశాడు. 8 నిముషాల నిడివి కల ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.దాడి జరుగుతున్నప్పుడు ఓ ఉగ్రవాది ఇలా రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తూ వీడియో తీయడం ఇదే తొలిసారని ఆర్మీ అధికారులు తెలిపారు. దాడి జరిగిన సమయంలో శిక్షణా శిబిరం వద్ద ఉన్న ఆరుగురు జవాన్లు సురక్షితంగా బయటపడ్డారు.ఉగ్రవాద దాడిని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ తీవ్రంగా ఖండించారు. జవాన్ల సాహసంపై తమకు గర్వంగా ఉందన్నారు. దేశమంతా జవాన్ల కుటుంబానికి అండగా ఉంటుందని చెప్పారు. 

21:47 - January 1, 2018

డెహ్రాడూన్ : కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భారత్-చైనా సరిహద్దులో కాపలాకాస్తున్న ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ కుటుంబాలతో నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశికి వెళ్లిన రాజ్‌నాథ్‌కు ఐటీబీపీ సిబ్బంది గౌరవం వందనం సమర్పించారు. ఈ సందర్భంగా ఐటీబీపీ సిబ్బంది నిర్వహించిన సాంస్కృతి కార్యక్రమాలు అలరించాయి. రాత్రంతా ఐటీబీపీ సిబ్బందితో గడిపిన అనంతరం ఆయన నెలాంగ్ లోయకు వెళ్లారు. అక్కడ నెలకొల్పిన పది సరిహద్దు పోస్టుల్లో పరిస్థితిని సమీక్షించారు.రక్తం గడ్డకట్టే చలిలో దేశ సరిహద్దుల వద్ద కాపలా కాస్తున్న ఐటీబీపీ సిబ్బందిని హోంమంత్రి అభినందించారు.

21:46 - January 1, 2018

చెన్నై : తమిళరాజకీయాలను మార్చేసేందుకు ప్రతిఒక్కరూ కలిసి రావాలని తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ పిలుపునిచ్చారు. రజని మన్డ్రమ్‌ డాట్‌ ఓఆర్జీ వెబ్‌ పోర్టల్‌ను ప్రారంభించిన రజనీకాంత్‌.. అందులో అభిమానులు, ప్రజలు తమ పేరును ఓటర్‌ ఐడీ నెంబర్‌ను నమోదు చేసుకోవాలని కోరారు. పోర్టల్‌లో యోగ ముద్రను రజనీకాంత్‌ ప్రధానంగా చూపించారు. తమిళనాట మంచి రాజకీయాలను నెలకొల్పుదామంటూ రజనీకాంత్‌ 74 సెకన్ల వీడియో మెసేజ్‌ను విడుదల చేశారు. 

21:45 - January 1, 2018

ఇస్లామాబాద్ : జమాత్ ఉద్ దవా చీఫ్, ఉగ్రవాది హఫీజ్ సయీద్ ఆస్తులను జప్తు చేసేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. హఫీజ్ సయీద్‌కు సంబంధం ఉన్న ఎన్‌జీవోలు, ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ఓ ప్రణాళిక రూపొందించింది. గత ఏడాది డిసెంబర్‌ 19న వివిధ ప్రావిన్సులకు, ప్రభుత్వ విభాగాలకు రహస్యంగా ఆదేశాలను జారీ చేసింది. హఫీజ్ ఆధ్వర్యంలో నడుస్తున్న రెండు చారిటీలు జమాత్-ఉద్-దవా, ఫలాహ్-ఇ-ఇన్సానియత్ ఫౌండేషన్‌లను టేకోవర్ చేసేందుకు డిసెంబరు 28 లోగా యాక్షన్ ‌ప్లాన్‌ను అందజేయాలని ఐదు ప్రావిన్సుల ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ రెండు సంస్థలు కూడా లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాద అనుబంధ సంస్థలని అమెరికా గుర్తించింది. లష్కరే సంస్థను నడిస్తున్న ఉగ్రవాది హఫీజ్.. 2008లో ముంబైలో జరిగిన దాడిలో కీలక సూత్రధారి. 

21:43 - January 1, 2018

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్థాన్‌కు గట్టి షాక్ ఇచ్చారు. ఉగ్రవాదంపై పాకిస్థాన్ సరైన చర్యలు తీసుకోవడం లేదన్న కారణంతో ఆ దేశానికి అందిస్తున్న సహాయాన్ని నిలిపివేస్తున్నట్లు ట్వీట్‌ చేశారు. పాకిస్తాన్‌ అమెరికా నేతలను మూర్ఖులుగా భావిస్తోందని మండిపడ్డారు. గత 15 ఏళ్లుగా అమెరికా మూర్ఖంగా 33 బిలియన్ డాలర్లకుపైగా పాకిస్థాన్‌కు సహాయం అందజేసిందని మండిపడ్డారు. మా నేతలను మూర్ఖులుగా భావిస్తూ, అబద్ధాలు, మోసాలు తప్ప పాకిస్తాన్‌ మాకు ఇచ్చింది ఏమీ లేదని తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్‌లో మేం వేటాడుతున్న ఉగ్రవాదులకు సురక్షిత ఆశ్రయం కల్పిస్తోందే తప్ప కొంచెం కూడా సహాయపడటం లేదని ట్రంప్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అమెరికా ప్రభుత్వం పాకిస్తాన్‌కు ఇచ్చే 25 కోట్ల 50 లక్షల డాలర్ల సహాయాన్ని నిలిపివేసే దిశగా చర్చలు జరుపుతోంది.

21:39 - January 1, 2018

హైరదాబాద్ : ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో తెలంగాణ రాష్ట్రపోలీస్‌ శాఖ మరో ముందడుగు వేసింది. అగ్రదేశాల్లో కూడా లేనటువంటి టెక్నాలజీతో.. TS COP మొబైల్‌ యాప్‌ని డీజీపీ మహేందర్‌ రెడ్డి ఆవిష్కరించారు. శాంతిభద్రతల విషయంలో అన్ని విభాగాలకు ఉపయోగపడే విధంగా ఈ మోబైల్‌ యాప్‌ ఉంటుందని.. దీంట్లో 54 రకాల సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. నేర పరిశోధన విభాగాల్లోని ఉద్యోగులకు ఉపయోగపడే సమస్త సమాచారం ఈ యాప్‌లో ఉంటుందన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌కు మాత్రమే పరిమితమైన యాప్‌ను రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి తెస్తున్నామని వెల్లడించారు. నేరం జరిగిన ప్రదేశానికి వెళ్లేలోపే ఈ ప్రత్యేక యాప్ ద్వారా చాలా సమాచారం అందుబాటులోకి వస్తుందన్నారు. మున్ముందు మరిన్ని సర్వీసులు అందుబాటులోకి వస్తాయని డీజీపీ మహేందర్‌రెడ్డి ప్రకటించారు.

21:37 - January 1, 2018

కరీంనగర్ : ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి తీరని నష్టం జరిగిందని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ అన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక లోటుతో ఉన్న విద్యుత్‌ కాస్తా మిగులు విద్యుత్‌ గా మారిందని ఆయన అన్నారు. మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కేశారం గ్రామంలో ఈటెల పాల్గొన్నారు. తెలంగాణ రైతాంగానికి నేటి నుండి 24గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వాలు రాత్రి సమయాల్లో కరెంట్‌ ఇచ్చి.. రైతులను ప్రమాదాలకు గురయ్యేలా చేశాయని మండిపడ్డారు. రైతు సమస్యలపై అవగాహాన ఉన్న తెలంగాణ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని ఈటెల రాజేందర్‌ అన్నారు.

21:36 - January 1, 2018

కర్నూలు : జిల్లా రుద్రవరం మండలం నక్కలదిన్నెలో దళితులను అగ్రకులస్తులు గ్రామం నుంచి బహిష్కరించారు. వారికి విద్యుత్‌, నీటితోపాటు నిత్యావసరాలపైనా ఆంక్షలు విధించారు. దళితులతో ఎవరు మాట్లాడవద్దని హుకుం జారీ చేశారు. ఒకవేళ ఎవరైనా మాట్లాడితే 5వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. అగ్రకులస్తుల్లో ఒకరు చనిపోతే అంత్యక్రియల ఏర్పాట్లు చేయలేదని ఆరోపిస్తూ దళితులపై కక్ష కట్టారు. దళిత కాలనీకి వచ్చే మంచినీటి పైపులైనును సైతం పగలగొట్టారు. దీంతో వాళ్లు నానా ఇక్కట్లుపడ్డారు. మరోవైపు దళితులను గ్రామ బహిష్కరణ చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టాలని కేవీపీఎస్‌ డిమాండ్‌ చేసింది. 

21:35 - January 1, 2018

హైదరాబాద్ :జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తొలిసారిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను.. అధికారిక నివాసం ప్రగతి భవన్‌లో కలుసుకున్నారు. కొత్తసంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల రాష్ట్రపతి పర్యటన సందర్భంగా గవర్నర్‌ నరసింహన్‌ ఇచ్చిన విందులోనూ పవన్‌- కేసీఆర్‌ను కలిసి చాలాసేపు మాట్లాడుకున్నారు. అయితే, ఇప్పుడు మరోసారి సీఎంతో భేటీ కానుండటంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

21:34 - January 1, 2018

హైదరాబాద్ : మందుబాబులకు ట్రాఫిక్‌ పోలీసులు షాక్ ఇచ్చారు. థర్టీ ఫస్ట్‌ నైట్‌ వేడుకల్లో ఎంజాయి చేసిన వారికి కొన్ని గంటల్లోనే ఆ మత్తుదిగేలా చేశారు. సిటీలో పెద్ద ఎత్తున డ్రంకెన్‌డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించిన పోలీసులు వేల సంఖ్యలో కేసులు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో టీవీ యాంకర్‌ ప్రదీప్‌ పట్టుబడ్డారు. బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌ 45 వద్ద ప్రదీప్‌ కారును పోలీసులు ఆపారు. బ్రీత్‌ అనలైజ్‌ పరీక్ష చేయగా.. 178 పాయింట్లు నమోదయ్యాయి. సాధారణంగా 35 పాయింట్లు దాటితే వాహనం నడిపిన వ్యక్తికి శిక్షతో పాటు వాహనం సీజ్‌ వంటి చర్యలుంటాయి. మోతాదు కంటే ఎక్కువ మద్యం సేవించి, వాహనం నడిపిన ప్రదీప్‌కు సవరించిన నిబంధనలను అనుసరించి శిక్షలు పడే అవకాశం ఉంది. ప్రదీప్ విషయంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలియాల్సి ఉంది.

1500 వాహనాలు సీజ్
ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు స్పెషల్‌ డ్రంకెన్‌ డ్రైవ్‌ చేపట్టారు. సుమారు 2వేల మందిపై కేసులు నమోదు చేసి 1500 వాహనాలు సీజ్ చేశారు. గత సంవత్సరాలతో పోల్చితే ఇది చాలా ఎక్కువ అని తెలుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ల పరిధిలోనే వేయి మంది వరకు పట్టుబడినట్లు సమాచారం. పట్టుబడిన వాహనాల్లో 276 కార్లు ఉన్నాయి. వీటిని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లు కార్లతో కిటకిటలాడుతున్నాయి. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డ వారందరికీ మంగళవారం కుటుంబసభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చి, అనంతరం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. బ్రీత్ ఎనలైజర్ టెస్టులో నమోదు అయిన పాయింట్లనుబట్టి వారికి శిక్షలు పడే అవకాశం ఉంది.

అమ్మాయిలను వేధించేందుకు యత్నించారు..
మరోవైపు సరూర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆకతాయిలు అమ్మాయిలను వేధించేందుకు యత్నించి అడ్డంగా దొరికిపోయారు. వివినగర్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటున్న ఐదుగురు యువకులు.. సమీపంలోని లేడీస్‌ హాస్టల్‌లో చొరబడేందుకు యత్నించారు. అమ్మాయిలు బయటకు రావాలంటూ కేకలు వేశారు. హాస్టల్‌పైకి రాళ్లు రువ్వి కిటికీల అద్దాలు ధ్వంసం చేశారు. అడ్డుకోబోయిన యాజమాని, వాచ్‌మెన్‌పై దాడి చేశారు. యువతుల ఫోన్‌ సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఐదుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు. 

21:31 - January 1, 2018

గుంటూరు : చంద్రబాబునాయుడు... క్యాంప్ కార్యాలయంలో బిజీబిజీగా ఉన్నారు. ఉదయం నుంచి పలువురు మంత్రులు, నేతలు, అధికారులు.. చంద్రబాబును కలుసుకున్నారు. కొత్త సంవత్సరంలో... ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి పథంలోకి పయనించాలని కోరుకుంటూ... అందరికి ముఖ్యమంత్రి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

21:31 - January 1, 2018
21:30 - January 1, 2018
21:29 - January 1, 2018

కృష్ణా : విజయవాడ నగరంలోని స్వరాజ్య మైదానంలో నిర్వహించిన పుస్తక మహోత్సవం కార్యక్రమాన్ని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సీఎం చంద్రబాబు కలిసి ప్రారంభించారు. ఈనెల 11 వరకు నిర్వహించనున్న ఈ పుస్తక మహోత్సవం మధ్యాహ్నం రెండు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు పుస్తక ప్రదర్శన జరగనుంది. భాషాప్రయుక్త రాష్ట్రాలకు ఏపీతోనే నాందిపలికామని, తెలుగుభాషను కాపాడుకోవడం మనందరి భాద్యత అని సీఎం చంద్రబాబు అన్నారు. ఉపాధి కోసం ఆంగ్లం నేర్చుకున్నప్పటికీ మన భాష, సంస్కృతీ సంప్రదాయాలు కాపాడుకుందామని పిలుపునిచ్చారు. విభజన కష్టాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామని.. పూర్వవైభవం తెచ్చేలా అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నామన్నారు. 2018ను తెలుగు భాషా పరిరక్షణగా నామకరణం చేసుకోవాలన్నారు.

పుస్తకాలకు ఎంతో ప్రాధాన్యత
నిత్యజీవితంలో పుస్తకాలకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. పుస్తక మహోత్సవాన్ని భావితరాలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉందన్నారు. 2018ని తెలుగుభాషా పరిరక్షణ సంవత్సరంగా ప్రకటించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. విజయవాడలో పుస్తకాలు ఆదరణ ఎక్కువగా ఉందన్నారు సీపీఐ నేత నారాయణ. అజ్ఞానం పోవాలంటే పుస్తకపఠనం చేయాలని సూచించారు. ఈనెల 11 వరకు జరగనున్న ఈ ప్రదర్శనలో అరుదైన పుస్తకాలతో పాటు...చిన్నారులకు విజ్ఞానాన్ని పంచే విజ్ఞాన దీపికలు ఎన్నో కొలువుదీరాయి. 

దళితుల బహిష్కరణలో 11 మందిపై కేసు

కర్నూలు : జిల్లా నక్కలదిన్నెలో దళితుల గ్రామ బహిష్కరణ ఘటనలో 11 మందిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసీటీ కేసు నమోదు చేశారు.

20:55 - January 1, 2018

కేలండర్ మారింది. కొత్త సంవత్సరం వచ్చేసింది. కాలం శరవేగంగా మారుతోంది. కాలంతోపాటే టెక్నాలజీ కూడా పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. ప్రపంచాన్ని ముంచేస్తోంది. రోబోలు నట్టింట్లో తిష్టవేస్తాయి. వర్చువల్ క్లాస్ రూమ్ లు అడుగడుగునా కనిపిస్తాయి. పొలాలు ఇళ్లపైకెక్కుతాయి. డ్రైవర్ లేకుండానే కార్లు షికార్లు కొడతాయి. తలెత్తిచూస్తే డ్రోన్లు విచ్చలవిడిగా విహారం చేస్తుంటాయి. కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు రూపు రేఖలను మార్చేసుకుంటాయి. అవును.. ప్రపంచం మరింత స్మార్ట్ గా మారుతోంది. ముందున్నదంతా స్మార్ట్ పండుగే.. ఇదే ఈ రోజు వైడాంగిల్ స్టోరీ.. కాలంతో పాటు మార్పులు రావటం సహజమే. మనిషిలో, సమాజంలో, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో మార్పులు రావటం సాధారణం. అయితే ఈ మార్పులు ఇప్పుడున్న స్థితిని సమూలంగా మార్చేదైతే, అది తెలుసుకోవలసిన విషయమే. లైఫ్ స్టైల్ తో పాటు, ప్రపంచ స్వరూపాన్ని మార్చే అలాంటి అంశాలు అనేకం 2018లోనే ప్రపంచాన్ని పలుకరించబోతున్నాయి. సాంకేతిక విప్లవం కొత్త పరవళ్లు తొక్కే కొద్దీ మానవ జీవితంలో అనేక మార్పులొస్తున్నాయి. యాంత్రీకరణతో ప్రపంచ స్వరూపం మారిపోయి.. కొత్త విలువలు, కొత్త సంస్కృతి, సరికొత్త జీవన విధానాలు ఈ ప్రపంచాన్ని నింపేశాయి. ఇదే క్రమంలో వచ్చిన కంప్యూటర్లు, సాఫ్ట్ వేర్ ప్రోగ్రామ్ లు, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధనల ఫలితంగా వచ్చిన రోబోలు విప్లవాత్మక మార్పులు తెస్తున్నాయి. రోబోల తర్వాత మరింత ఎక్కువగా భవిష్యత్తుని ఆక్రమించే వాటిలో డ్రోన్లు కూడా ఒకటి. అయితే, వీటి వాడకం చుట్టూ అనుమానాలు, భయాలు ఎలా ఉన్నా సినిమా షూటింగ్ లను మాత్రం డ్రోన్ లు చాలా సింపుల్ గా మార్చేశాయి. కొరియర్ సర్వీసులకు, వ్యవసాయ రంగంలోను డ్రోన్ల వాడకం మరింత పెరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

బండెడు పుస్తకాలు మోసుకుంటూ స్కూలుకెళ్లే శ్రమ ఉండదు...ఆ మాటకొస్తే అసలు స్కూల్ కే వెళ్లనక్కర్లేదు..ఇంట్లోంచే క్లాస్ రూమ్ లో ఉన్న అనుభవాన్ని పొందొచ్చు. ఇక కారెక్కితే డ్రైవింగ్ చేయనక్కర్లేదు. మనిషికంటే జాగ్రత్తగా గమ్యాన్ని చేర్చే కార్లొస్తున్నాయి. పొలంతో పనిలేని వ్యవసాయం ఇప్పటికే వచ్చింది. కంప్యూటర్ రంగంలో మరిన్ని విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి.మట్టి వాసన, పొలాలు, బురద నీళ్లు, కలుపు మొక్కలు, ఇవన్నీ పల్లెలలతో కాస్త సంబంధం ఉన్న అందరికీ తెలిసిన విషయాలే. ఐదు వేళ్లు లోపలికి పోవాలంటే రైతన్న మట్టిలో నానా కష్టాలు పడాల్సిందే. కానీ, భవిష్యత్తు వ్యవసాయంలో పొలం లేని పంట ఉండబోతోంది. అవును.. ఇళ్ల పైకప్పులపై పంటలను పెద్ద ఎత్తున పండించబోతున్నారు. అలాగే రక్తం కొరత అనేది లేకుండా కృత్రిమ రక్తం, బరువు తగ్గించే మాత్రలు.. అన్నీ అందుబాటులోకి వస్తున్నాయి. అనంతకాల గమనంలో, మానవ జాతి అనేక పరిణామాలకు లోనయింది. ఎంతో ముందడుగు వేసింది. ఆ ముందడుగు ఇప్పుడు మరింత వేగంగా సాగుతోంది. ప్రపంచ స్వరూపాన్ని సమూలంగా మార్చి... మనుషుల జీవితాలను అమితంగా ప్రభావితం చేసే దిశగా సాగుతోంది. అయితే సైన్స్ ఎప్పుడూ రెండంచుల కత్తిలాంటిది. దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారనే దానిపైనే ఫలితాలు ఆధారపడి ఉంటాయి. 

భారత విదేశీ వ్యవహారల సెక్రటరీగా విజయ్ కేశ్ గోఖలే

ఢిల్లీ  : భారత్ విదేశీ వ్యవహారల నూతన కార్యదర్శిగా విజయ్ కేశవ్ గోఖలే ను ప్రభుత్వం నియమించింది. జైశంకర్ స్థానంలో విజయ్ గోఖలేను భర్తీ చేసింది. గోఖలే 1981 ఐఎఫ్ఎస్ బ్యాచ్ కు చెందిన వారు. ప్రస్తుత కార్యదర్శి పదవికాలం ఈ నెల 28తో ముగుస్తుంది.

కేసీఆర్ ను కలిసిన పవన్

హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ ను జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కలిశారు. కొత్త సంవత్సరం సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిశానట్టు తెలుస్తోంది.

20:07 - January 1, 2018

సురేష్ పబ్లిక్ స్కూల్ నిర్వాకం..

విజయనగరం : జిల్లా పార్వతీపురం సురేష్ పబ్లిక్ స్కూల్ లో నిన్న రాత్రి నూతన సంవత్సర వేడుకల వల్ల 200 మంది విద్యార్థులకు కంటి సమస్యలు తలెత్తాయి. డీజే లైటింగే కారణమని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 

ప్రగతిభవన్ కు వచ్చిన పవన్ కల్యాణ్

హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రగతిభవన్ కు వచ్చారు. ఆయన కాసేపట్లో సీఎం కేసీఆర్ తో భేటీ కానున్నారు. పవన్ ప్రగతి భవన్ కు రావడం ఇదే మొదటి సారి. 

పాకిస్థాన్ పై విరుచుకుపడ్డ ట్రంప్

వాషింగ్టన్ : పాకిస్థాన్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విరుచుకపడ్డారు. పాకిస్థాన్ ఉగ్రవాదులకు స్వర్గధామని, 15 ఏళ్లలో పాక్ కు 33 బిలియన్ డాలర్ల సాయం చేశామని, ప్రతిఫలంగా పాకిస్థాన్ అమెరికాను మోసం చేసిందని ట్రంప్ తీవ్ర పదజాలంతో పాక్ ను విమర్శించారు. పాక్ కు సాయం చేసి అమెరికా తప్పు చేసిందని ఆయన అన్నారు. ఇకపై పాకిస్థాన్ కు ఏ చిన్న సాయం కూడా చేయమని ట్రంప్ స్పష్టం చేశారు. 

రంజీ ట్రోఫీలో చరిత్ర సృష్టించిన విదర్బ

ముంబై : రంజీ ట్రోఫీలో విదర్బ చరిత్ర సృష్టించింది. తొలిసారి రంజీ ట్రోఫీని విదర్భ గెలుచుకుంది. రంజీ ఫైనల్లో 9 వికెట్ల తేడాతో విదర్బ విజయం సాధించింది. 

18:21 - January 1, 2018

పశ్చిమగోదావరి : పోలవరం నిర్మాణం రోజుకో మలుపు తిరుగుతోంది. గత నాలుగు నెలలుగా నిధుల కొరతతో పనులు నిలిచిపోయాయి. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీని తప్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చి కేంద్రానికి తెలపడంతో పోలవరంపై రగడ మొదలైంది. కేంద్రమంత్రి గడ్కరీ, పవన్‌కళ్యాణ్‌, వైసీపీ నేతల వరుస పర్యటనలతో కొంత వేడి పుట్టినా కేంద్ర జలవనరుల శాఖ ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీకి పనులను వేగం చేయాలని నెల రోజుల గడువు ఇవ్వడంతో మళ్లీ పనులు ప్రారంభమయ్యాయి.

ఎగువ కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణానికి అనుమతి
ఇటీవల పోలవరంలో నేషనల్‌ హైడ్రో పవర్‌ కార్పోరేషన్‌ ప్రతినిధులు పర్యటించి ఎగువ కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణానికి అనుమతిని ఇస్తూనే కొన్ని సూచనలు కూడా చేశారు. దీంతో ట్రాన్స్‌ట్రాయ్‌ సహా సబ్‌కాంట్రాక్ట్‌లు చేస్తున్న త్రివేణీ, బావర్‌,బెకం,ఎల్‌ అండ్‌ టీ కంపెనీలు పనులను వేగవంతం చేశాయి. గత 20రోజులుగా పనుల్లో వేగం పుంజుకుంది. ట్రాన్స్‌ట్రాయ్‌ పనితనాన్ని నిరూపించుకోవడానికి నెల రోజులు కేంద్రం గడువు ఇవ్వడంతో ట్రాన్స్‌ట్రాయ్‌ని మార్చాలన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం వెనక్కి తీసుకుంది. సబ్‌కాంట్రాక్టర్లు చేస్తున్న పనులు మినహాయించి స్పిల్‌వే, స్పిల్‌ ఛానెల్‌ పనులను ట్రాన్స్‌ట్రాయ్‌ వేగం చేసింది. గత 20రోజుల నుండి అంతా సవ్యంగా పోలవరం పనులు జరుగుతున్నాయి అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు పిడుగులాంటి వార్త పోలవరం నిర్మాణంపై పడింది. ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీ కెనరా బ్యాంక్‌కు 745కోట్ల రూపాయల అప్పు ఉంది.

డిసెంబర్‌ 22 నాటికి రూ. 489 కోట్లు బ్యాంక్‌కు కట్టాల్సి ఉంది..
డిసెంబర్‌ 22 నాటికి రూ. 489 కోట్లు బ్యాంక్‌కు కట్టాల్సి ఉండగా బ్యాంక్‌ గ్యారెంటీగా ఇచ్చిన రూ.379 కోట్లు మాత్రమే ఉండటంతో ట్రాన్స్‌ ట్రాయ్‌ని దివాళా తీసినట్లు ప్రకటించాలని లా ట్రిబ్యునల్లో కెనరా బ్యాంక్‌ అధికారి కోటేశ్వర రావు ఫిటిషన్‌ వేశారు. ట్రాన్స్‌ట్రాయ్‌ని దివాళా తీసిన కంపెనీగా ప్రకటించాలని, కార్పోరేట్‌ ఇన్‌ సాల్వేన్సీ ప్రక్రియ చేపట్టాలని కోరింది. దీంతో ట్రాన్స్‌ట్రాయ్‌ భవితవ్యంతో పాటు పోలవరం నిర్మాణంపై కూడా నీలి నీడలు కమ్ముకున్నట్లు ఇప్పటికే పోలవరం నిర్మాణంలోని కొన్ని పనులను సబ్‌ కాంట్రాక్టర్లకు అప్పగించిన అన్నిటికన్నా ముఖ్యమైన స్పిల్‌ వే, స్పిల్‌ చానల్‌ నిర్మాణం ఇప్పటికే ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీనే చేపట్టడంతో నిర్మాణ పనులు మళ్లీ ఆగే అవకాశం కనిపిస్తోంది. గేట్ల తయారీ, మట్టి, రాక్‌ తొలగింపు, డయాఫ్రాం వాల్‌ నిర్మాణం, కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణ పనులు నిలిచిపోకుండా పనులు జరిగినా.. పోలవరం ప్రాజెక్ట్‌కి ప్రధాన స్పిల్‌ వే, స్పిల్‌ చానెల్‌ నిర్మాణం జరగకపోతే 2019 నాటికి గ్రావిటీతో నీళ్లు అందిస్తామని చెప్తున్న ప్రభుత్వ అంచనాలు తప్పే అవకాశం ఉంది.రాష్ట్ర ప్రభుత్వం NHPC సూచనలను అమలు చేయాల్సివస్తుంది కాబట్టి పోలవరం నిర్మాణానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. దీనికి తోడు ఇప్పుడు ప్రధాన కాంట్రాక్టర్‌గా ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీ దివాళా అంశం తెరపైకి రావడంతో లా ట్రిబ్యునల్‌ తీసుకునే చర్యలను బట్టి పోలవరం పనులు కొనసాగే అవకాశం ఉంది. ఒకవేళ లా ట్రిబ్యునల్‌ కెనరా బ్యాంక్‌కు అనుకూలంగా ట్రాన్స్‌ట్రాయ్‌పై చర్యలు తీసుకుంటే ఎప్పటి నుండో ట్రాన్స్‌ట్రాయ్‌ని తప్పించాలి అనుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ పని చేస్తుంది. ట్రాన్స్‌ట్రాయ్‌ని తప్పిస్తే దీని స్థానంలో మరో కొత్త కాంట్రాక్టర్‌ను నియమించి.. పనులు ప్రారంభించాల్సి వస్తోంది. వీటన్నింటిని పరిశీలిస్తే రాష్ట్ర ప్రభుత్వం 2019 నాటికి గ్రావిటీతో కూడిన నీటిని అందిచడం అసాధ్యమని నీటిపారుదల రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

18:14 - January 1, 2018

సిద్దిపేట : జిల్లా చేర్యాల మండలం వేచరేణి గ్రామస్థులకు... కోతులు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను... తీరా చేతికొచ్చే సమయంలో నాశనం చేస్తున్నాయి.. అంతటితో ఆగకుండా గ్రామస్తులపై కూడా దాడి చేస్తున్నాయి. కోతులు ఒక్కసారిగా గుంపులు గుంపులుగా వచ్చి పొలాలపై తెగబడుతున్నాయి. రైతులు పొలంలో పంటకు కాపలా కాయాలో... తాము తెచ్చుకున్న అన్నం గిన్నెలను కాపాడుకోవాలో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం స్పందించి తమను కోతుల బెడదనుంచి కాపాడాలని రైతులు వేడుకుంటున్నారు. రైతు పంటల సాగు ఎంతగా మంచి పద్ధతిలో చేస్తున్నా... కోతులు మాత్రం సర్వ నాశనం చేస్తున్నాయి. విత్తనాలు, ఎరువులకు డబ్బు పెట్టి... నిద్రాహారాలు లేకుండా రైతులు కష్టపడుతున్నారు. ఐతే కోతులవల్ల తాముపడ్డ శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరులా... వృధా అవుతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు.

కోతుల బారినుంచి తమను రక్షించాలి
కోతుల బారినుంచి తమను తాము రక్షించుకునేందుకు... గ్రామస్థులంతా ఏకమయ్యారు. హడలెత్తిస్తున్న కోతుల బెడదకు ఎలాగైనా చెక్‌ పెట్టాలని నిర్ణయించకున్నారు. ఈ సమస్యపై గ్రామపంచాయితీలో తీర్మానం కూడా చేశారు. ఇంటింటికీ చందా వేసుకుని కోతులు పట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మొదట ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టంలోని కర్నూలు, నెల్లూరు జిల్లాలనుంచి కోతులు పట్టే బృందాలను రప్పించారు. ఐతే బయటి ప్రాంతాలనుంచి వారిని పిలిపంచడం ఆర్థికంగా భారమైంది.. దీంతో కోతులు పట్టడానికి స్థానిక వ్యక్తినే ఎంచుకున్నారు. గ్రామసర్పంచ్‌ సహాయంతో ప్రత్యేకంగా బోనులను కూడా తయారు చేయించారు. కానీ.. తమ కృషికి తగ్గట్టు ప్రభుత్వం కూడా చేయూత ఇవ్వాలని వారు కోరుతున్నారు.కోతుల వల్ల పంటకే...తమ ప్రాణాలకు కూడా ముప్పు ఉందంటున్నారు రైతులు. ప్రభుత్వం తేలిగ్గా తీసుకోకుండా సహాయం చేసి ఆదుకోవాలని గ్రామస్థులంతా ముక్త కంఠంతో వేడుకుంటున్నారు.

18:10 - January 1, 2018

హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమంలో టీ-జాక్‌ కీలక పాత్ర పోషించింది. టీఆర్‌ఎస్‌తో పాటు ఇతర పార్టీలు కూడా అప్పట్లో టీ-జాక్‌తో కలిసి పనిచేశాయి. తెలంగాణ ఏర్పడ్డాక టీ-జాక్‌ అవసరం ఉండదని అనుకున్నా.. అధికార పార్టీ తీరు టీ-జాక్‌ను నిరుత్సాహపరిచింది. అధికార పగ్గాలు చేపట్టి మూడున్నరేళ్లు పూర్తి చేసుకున్నా.. తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసిన కార్యకర్తలకు ఇప్పటికీ గుర్తింపు దక్కడం లేదన్న వాదన గులాబీ పార్టీలో బలంగా వినిపిస్తోంది.

ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత
ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత పార్టీలో చేరిన నేతలకు దక్కుతున్న గుర్తింపు.. ఉద్యమ సమయం నుంచి గులాబీ జెండా మోసిన కార్యకర్తలకు పార్టీలో, పదవుల్లో ప్రాధాన్యత దక్కడం లేదని పార్టీలో బహిరంగంగా నేతలు చర్చించుకుంటున్నారు. మరో ఏడాదిన్నర సమయంలో ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంది. ఈ సమయంలో అసంతృప్తులను చల్లార్చేందుకు పార్టీ పెద్దలు కూడా ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. దీంతో అసంతృప్తిగా ఉన్న కార్యకర్తలు తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేసిన టీ-జాక్‌ వైపు వెళ్లే అవకాశం ఉందని గులాబీ నేతల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీ-జాక్‌ గత కొంత కాలంగా ప్రజా క్షేత్రంలో తిరుగుతోంది. ఈ చర్యను అధికార పార్టీ జీర్ణించుకోలేకపోతుంది. కాంగ్రెస్‌ పార్టీ ప్రణాళికల్లో భాగంగా జాక్‌ పనిచేస్తుందని ఇన్ని రోజులు అధికార పార్టీ నేతలు ఆరోపణలు చేశారు. తాజాగా టీ-జాక్‌ కూడా రాజకీయ పార్టీగా ఆవిర్భవించనుందన్న ప్రచారంతో అధికార పార్టీ నేతలను అయోమయానికి గురిచేస్తోంది. దాదాపు మూడున్నరేళ్ల తర్వాత టీ-జాక్‌ తెలంగాణ జనసమితిగా ప్రజల్లోకి వస్తోందన్న ప్రచారంపై గులాబీ నేతలు ఆరాతీయడం మొదలు పెట్టారు.

టీ-జాక్‌ కూడా రాష్ట్రం మొత్తం దృష్టి సారించకుండా..
టీ-జాక్‌ కూడా రాష్ట్రం మొత్తం దృష్టి సారించకుండా.. తమకు బలం ఉన్న నియోజకవర్గాలపైన ఇప్పటికే కసరత్తు కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. దాదాపు 20 నుంచి 30 నియోజకవర్గాల్లో బలమైన రాజకీయ శక్తిగా ఎదగాలని యోచిస్తోంది. దీంతో అవి ఏయే నియోజకవర్గాలన్నది ఉత్కంఠరేపుతోంది. అధికార పార్టీలో ఉన్న ఉద్యమనేతలకు టీ-జాక్‌ నేతలతో పరిచయాలు ఉండటం.. ఇప్పడు అధికార పార్టీ పెద్దలు ఆందోళనకు గురవుతున్నారు. టీ-జాక్‌ ఎన్నికల్లో విజయం సాధించినా.. సాధించకపోయినా.. తమకు మాత్రం నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న ఆందోళన అధికార పార్టీ నేతల్లో మొదలైంది.

18:08 - January 1, 2018

కరీంనగర్/సిరిసిల్ల : నూతన సంవత్సరం రోజు వేములవాడ రాజన్న దేవస్థానం భక్తులతో కిటకిటలాడుతోంది. నూతన సంవత్సరం మొదటిరోజు సోమవారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు స్వామి వారికి తలనీలాలర్పించారు. కోడె మొక్కులు చెల్లిస్తూ.. ధర్మగుండంలో స్నానమాచరించారు. అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

18:07 - January 1, 2018

హైదరాబాద్ : నూతన సంవత్సరం సందర్భంగా.. ప్రగతి భవన్‌లో పలువురు ప్రముఖులు సీఎం కేసీఆర్‌ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. శాసన మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌తో పాటు.. పలువురు మంత్రులు.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పీ. సింగ్‌ కలిశారు. డీజీపీ మహేందర్‌ రెడ్డితో పాటు పలువురు ఐఎఎస్‌, ఐపీఎస్‌ అధికారులు సీఎంను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఇతర ప్రజాప్రతినిధులతో పాటు.. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు.

18:06 - January 1, 2018

హైదరాబాద్ : వ్యవసాయరంగానికి నాణ్యమైన నిరంతర విద్యుత్ అందించడం తెలంగాణ సాధించిన అద్భుత విజయమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. తీవ్ర సంక్షోభంలో ఉన్న విద్యుత్ రంగాన్ని నేడు అన్ని రంగాలకు 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయగలుతున్నామన్నారు. ఇందుకు విద్యుత్ సంస్థల ఉద్యోగుల కృషి ఎంతో ఉందని చెప్పారు. దేశమంతా తెలంగాణవైపు చూసే విధంగా విద్యుత్ రంగంలో విప్లవాత్మక విజయాలు సాధించారని అభినందించారు. తెలంగాణ ప్రజలంతా విద్యుత్ శాఖ పనితీరు పట్ల ఆనందంగా ఉన్నారని సిఎం చెప్పారు.జనవరి 1 నుంచిS రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్న నేపథ్యంలో ప్రగతి భవన్‌లో విద్యుత్‌ శాఖ అధికారులతో సీఎం కేసీఆర్‌ సమావేశమయ్యారు. విద్యుత్ సంస్థల డైరెక్టర్లు, సీనియర్ ఉద్యోగులకు సీఎం అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యుత్ సంస్థల ఉద్యోగులకు నూతన సంవత్సర కానుకగా ఒక ప్రత్యేక ఇంక్రిమెంటు ఇస్తున్నట్లు సిఎం ప్రకటించారు.

వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా
వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేయడంతో తెలంగాణ రాష్ట్రం చరిత్రలో నిలిచిపోతుందని కేసీఆర్‌ అన్నారు. టిఆర్ఎస్ ఎన్నికల మానిఫెస్టోలో కూడా రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇవ్వలేదని.. చెప్పకపోయినా రైతులకు అత్యంత అవసరమని భావించి వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇవ్వాలని నిర్ణయించామని సీఎం అన్నారు. దేశంలో కొన్ని రాష్ట్రాలు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందిస్తున్నప్పటికీ, పరిమిత గంటల్లో మాత్రమే ఇస్తున్నాయన్నారు. కొన్ని రాష్ట్రాల్లో 24 గంటల విద్యుత్‌ వ్యవసాయానికి ఇస్తున్నప్పటికీ చార్జీలు వసూలు చేస్తున్నారన్నారు. 24 గంటల పాటు ఉచితంగా వ్యవసాయానికి కరెంటు ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ తప్ప దేశంలో మరేదీ లేదని కేసీఆర్‌ అన్నారు. విద్యుత్ శాఖ ఉద్యోగులందరికీ ఒక ప్రత్యేక ఇంక్రిమెంటు ప్రకటించినందుకు సీఎం కేసీఆర్‌కు ఆ శాఖ ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు. 

18:05 - January 1, 2018

సంగారెడ్డి : జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలో ZPTC శ్రీకాంత్‌గౌడ్‌ 10టీవీ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. నిజాలను నిర్భయంగా చూయించడంలో టెన్‌టీవీ ముందుందన్నారు ZPTC. టెన్‌ టీవీ కార్యక్రమాలు ప్రజలకు చేరువయ్యేలా ఉన్నాయని అభినందించారు. 

18:05 - January 1, 2018

ప్రకాశం : జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో 10 టీవీ క్యాలెండర్‌ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. గిద్దలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ముత్తముల అశోక్‌రెడ్డి ఈ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. జనవిజ్ఞాన వేదిక రాష్ట్రనాయకులు స్వరూపారెడ్డి, సర్కిల్‌ ఇన్స్‌పెక్టర్‌ శ్రీరాం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

18:02 - January 1, 2018

నెల్లూరు : ప్రజల సమస్యలను ఎత్తిచూపడంలో టెన్‌ టీవీ ఎంతగానో కృషి చేస్తుందన్నారు మంత్రి నారాయణ. నెల్లూరులోని నారాయణ మెడికల్‌ కాలేజీ క్యాంపస్‌లో మంత్రి టెన్‌ టీవీ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 

18:02 - January 1, 2018

అనంతపురం : పద్య నాటకాన్ని విశ్వవాప్తం చేసి పౌరాణిక నాటక రంగానికి ఘన కీర్తి తెచ్చిన వ్యక్తి బళ్లారి రాఘవ. స్వాతంత్ర్య ఉద్యమంలో సామాజిక మార్పు కోసం ప్రదర్శనలిచ్చి ప్రజా కళాకారుడిగా గుర్తింపు పొందారు. స్వాతంత్య్ర సమరయోధులుగా, న్యాయవాదిగా, నటుడిగా పేరొందిన బళ్లారి రాఘవను స్మరించుకునేందుకు..ఆయన పేరిట సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహిస్తోంది ప్రజానాట్యమండలి. మరుగునపడిన సాంస్కృతిక సౌరభాలను నేటి తరానికి పరిచయం చేయడానికి ప్రజా నాట్యమండలి ఈ ఉత్సవాలను ఘనంగా జరపాలని సంకల్పించింది. ప్రజానాట్యమండలి 9వ రాష్ట్ర మహాసభల్లో భాగంగా..అనంతపురం ఆర్ట్స్ట్‌ కాలేజీ ఆవరణలో 2,3,4 తేదీల్లో బళ్లారి రాఘవ స్మారక రాష్ట్రస్థాయి ప్రజా సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించనున్నారు.

అన్ని జిల్లాల కళా ప్రదర్శనలకు ప్రాధన్యత
లలిత కళాపరిషత్‌లో మూడు రోజుల పాటు చర్చలు, ఉపన్యాసాలు, సమావేశాలు, నాటక పదర్శనలు జరగనున్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కళా ప్రదర్శనలకు ప్రాధన్యత కల్పిస్తున్నారు. తొలిరోజు కళాకారులు, రచయితలు, కవులు, కళాభిమానులతో నగరంలో ప్రదర్శన నిర్వహించనున్నారు. బళ్లారి రాఘవ పేరిట సాంస్కృతిక ఉత్సవాలు చేపట్టమంటే..ప్రజా కళలలను స్మరించుకోవడమే అని రచయితలు, కవులు, కళాకారులు కొనియాడుతున్నారు. అంటరాని తనం రూపుమాపాలని పోరాడిన గొప్పవ్యక్తి అని అభివర్ణిస్తున్నారు. బళ్లారి రాఘవ స్మారక రాష్ట్రస్థాయి ప్రజా సాంస్కృతిక ఉత్సవాలను జయప్రదం చేయాలని ప్రజానాట్యమండలి సహా కవులు, కళాకారులు కోరుతున్నారు.

పెదగొట్టిపాడులో ఉద్రిక్తత

గుంటూరు : ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడులో ఉద్రిక్తత నెలకొంది. న్యూ ఇయర్ సందర్భంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతవరణం చోటుచేసుకుంది. ఇరువర్గాల వారు పరస్పరం రాళ్లురువ్వుకున్నారు. 

టీఎస్ కాప్ యాప్ ను విడుదల చేసిన డీజీపీ

హైదరాబాద్ : తెలంగాణ పోలీస్ శాఖ టెక్నాలజీలో మరో ముందడుగు పడింది. ఫ్రెండ్లీ పోలీసింగ్ ను క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడానికి టీఎస్ కాప్ మొబైల్ యాప్ ను డీజీపీ మహేందర్ రెడ్డి విడుదల చేశారు. 

16:18 - January 1, 2018

తరగతి గదిలో మద్యం...

కరీంనగర్/పెద్దపల్లి : జిల్లా మంథని ప్రబుత్వ బాలుర జూనియర్ కళాశాలలో అదనపు తరగతి గదులను మంత్రి ఈటల ప్రారంభించారు. ఈటల కాలేజీ నుంచి వెళ్లిపోగానే తరగతి గదిలో కాంట్రాక్టర్ శ్రీనివాస్ సహచరుడు మద్యం సేవించాడు. శ్రీనివాస్ మద్యం తాగుతున్న కాలేజీ సిబ్బంతి పట్టించుకోవడం లేదు.

16:12 - January 1, 2018

కరీంనగర్/పెద్దపల్లి : జిల్లా మంథని ప్రబుత్వ బాలుర జూనియర్ కళాశాలలో అదనపు తరగతి గదులను మంత్రి ఈటల ప్రారంభించారు. ఈటల కాలేజీ నుంచి వెళ్లిపోగానే తరగతి గదిలో కాంట్రాక్టర్ శ్రీనివాస్ సహచరుడు మద్యం సేవించాడు. శ్రీనివాస్ మద్యం తాగుతున్న కాలేజీ సిబ్బంతి పట్టించుకోవడం లేదు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

జమ్మూలో ఎన్ కౌంటర్

శ్రీెనగర్ : జమ్మూకాశ్మీర్ లోని పుల్మామా జిల్లాలో సూన్యం నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ప్రస్తుతం కూడా ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. 

రికార్డ్ స్థాయిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

హైదరాబాద్ : న్యూ ఇయర్‌ వేడుకల్లో మద్యం ఏరులై పారింది. కేవలం ఆరు గంటట్లోనే 582 డ్రంక్ అండ్ డ్రైవ్‌ కేసులు నమోదయ్యాయి. మాదాపూర్‌లో-80, మియాపూర్‌లో-76, కూకట్‌పల్లిలో-116, బాల్‌నగర్‌లో-52, జీడిమెట్లలో-52, అల్వాల్‌లో-62, రాంనగర్‌లో-103, శంషాబాద్‌లో-41 డ్రంక్‌ అండ్‌ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి.

16:02 - January 1, 2018

హైదరాబాద్ : న్యూ ఇయర్‌ వేడుకల్లో మద్యం ఏరులై పారింది. కేవలం ఆరు గంటట్లోనే 582 డ్రంక్ అండ్ డ్రైవ్‌ కేసులు నమోదయ్యాయి. మాదాపూర్‌లో-80, మియాపూర్‌లో-76, కూకట్‌పల్లిలో-116, బాల్‌నగర్‌లో-52, జీడిమెట్లలో-52, అల్వాల్‌లో-62, రాంనగర్‌లో-103, శంషాబాద్‌లో-41 డ్రంక్‌ అండ్‌ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. మరిం సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

15:58 - January 1, 2018

ప్రేక్షకులను అలరిస్తున్న కాఫ్రిషో బ్యాండ్ తో న్యూ ఇయర్ జోష్. సంవత్సరం నుంచి అందరం కలిసి కాఫ్రిషా బ్యాండ్ లో ఉన్నామని సింగర్ గణేష్ అన్నారు. బ్యాండ్ బ్యాచ్ లో సాయి తేజ్, వన్, సాయి కిరణ్ ఉన్నారని, కాఫ్రిషో అనేది ఇటలీయన్ పదమని ఆయన అన్నారు. కాఫ్రిషో గురించి తెలుసుకోవాడానికి వీడియో క్లిక్ చేయండి.

15:19 - January 1, 2018
15:17 - January 1, 2018

ఖమ్మం : 10టీవీ నూతన క్యాలెండర్‌ను జిల్లా పోలీసు కమిషనర్‌ తప్సీర్‌ ఇక్బాల్‌ ఆవిష్కరించారు. ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సమస్యలను వెలికి తీయడంలో 10టీవీ పాత్ర ఆమోఘమని ఖమ్మం పోలీసు కమిషనర్‌ తప్సీర్‌ ఇక్బాల్‌ అన్నారు.

15:16 - January 1, 2018

రంగారెడ్డి : జిల్లా షాద్‌నగర్‌లో 10టీవీ క్యాలెండర్‌ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. 2018 సంవత్సరంలో ప్రజా సమస్యలపై పోరాడుతూ.. మరింత ముందుకు వెళ్లాలని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ అన్నారు. 10టీవీ ప్రజల సమస్యలపై పోరాడుతూ.. నాణ్యమైన వార్తలను అందించడంలో 10టీవీకి ప్రత్యేక స్థానం ఉందన్నారు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌ రెడ్డి. క్యాలెండర్‌ ఆవిష్కరణలో అంజయ్య యాదవ్‌, ప్రతాప్‌ రెడ్డితో పాటుగా పలువురు రాజకీయ నాయకులు పాల్గొన్నారు.

15:16 - January 1, 2018

నాగర్ కర్నూలు : ప్రజా సమస్యల్ని వెలికి తీసి, నిరంతరం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి.. కర్షకులవైపు పోరాడే ఛానెల్‌ 10టీవీ అన్నారు పార్లమెంట్‌ మాజీ సభ్యులు మంద జగన్నాధం అన్నారు. నాగర్‌ కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి యూటీఎఫ్‌ భవన్‌లో 10టీవీ క్యాలెండర్‌ను మాజీ ఎంపీ మంద జగన్నాధం, మాజీ మంత్రి రాములు, మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌లు కలిసి ఆవిష్కరించారు. ప్రజలకు ఉపయోగపడే వార్తలను, కథనాలను ప్రసారం చేయడంలో 10టీవీ ముందువరుసలో ఉందని మాజీ మంత్రి రాములు అన్నారు. ప్రజల భాగస్వామ్యంతోటి నడుస్తున్న ఛానెల్‌ 10టీవీ అని జైపాల్‌ యాదవ్‌ అన్నారు.

15:14 - January 1, 2018

జగిత్యాల : నూతన సంవత్సరం సందర్భంగా జగిత్యాల జిల్లా.. కోరుట్లలోని కిరాణా వర్తక సంఘం, నగర వాసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నగర వాసులంతా కలిసి నిత్యజనగణమన కార్యక్రమాన్ని చేపట్టారు. ఏకంగా 101 జెండాలను ఒకేసారి ఎగిరేలా ఏర్పాట్లు చేసి జెండాలను ఎగరవేశారు. జాతీయ గీతం ప్రారంభంకాగానే ఎక్కడి వారక్కడే నిలబడి సెల్యూట్‌ చేస్తూ జాతీయగీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌ రావు, డీఎస్పీ మల్లారెడ్డి, రాష్ట్ర మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ లోకబాపురెడ్డి జెండాలను ఎగరవేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమం ప్రతి రోజు ఉదయం 9 గంటలకు చేస్తామని తెలిపారు.

15:13 - January 1, 2018

సంగారెడ్డి : జిల్లా పఠాన్‌చెరు సమీపంలో మంజీరా పైప్‌లైన్‌ లీక్‌ అయ్యింది. ముత్తంగి సమీపంలోని పైప్‌నుంచి నీరు ఎగసిపడుతోంది. వారం రోజులుగా నీరు వృధాగా పోతున్న పట్టించుకున్న నాథుడే లేరు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించిన పాపాపోలేదు. దీంతో త్రాగునీరు రోడ్లపై వృథాగా పారుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. 

15:13 - January 1, 2018

హైదరాబాద్ : రాజ్‌ భవన్‌లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఓపెన్‌ హౌజ్‌ పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖులు, రాజకీయ నాయకులతోపాటు ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌ దంపతులు రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ఆనందంగా, సంతోషంగా ఉండాలన్నారు. కొత్త ఏడాది అందరి జీవితాల్లో కొత్త విజయాలను తీసుకురావాలని ఆకాంక్షించారు.

15:12 - January 1, 2018

కృష్ణా : తెలుగు భాషను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. భాషా పరిరక్షణలో పుస్తకాలదే ప్రముఖపాత్ర అన్నారు. ఉపాధి కోసం ఆంగ్లం నేర్చుకున్నప్పటికీ మన భాష, సంస్కృతీ సంప్రదాయాలు కాపాడుకుందామని పిలుపునిచ్చారు. చరిత్రను కాపాడుకోవాలంటే పుస్తకాలు అవసరం అని... పుస్తకాలు లేకపోతే అసలు చరిత్రే లేదన్నారు. విజయవాడలోని స్వరాజ్యమైదానంలో పుస్తక ప్రదర్శన ప్రారంభమైంది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో కలిసి చంద్రబాబు పుస్తక మహోత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం తుమ్మపల్లి కళాక్షేత్రంలో జరిగిన సభలో మాట్లాడిన చంద్రబాబు... భవిష్యత్‌ తరాలకు చరిత్రగురించి తెలియాలంటే పుస్తకాల ఉండాలన్నారు. నాశనం లేనిది.. నలుగురికి జ్ఞానాన్ని పంచేది అక్షరమే అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. నిత్య జీవితంలో పుస్తకానికి ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. 

15:08 - January 1, 2018

మహిళలను శక్తి సామార్థ్యలకు ప్రతీకలుగా ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి. ప్రతి సంవత్సరం మంచి చెడ్డల కలబోతాలు సహజమే. ఈ నేపథ్యంలో 2017లో భిన్న రంగాలలో రాణించిన మహిళలు పలు గౌరవాలను అందుకున్నారు. విభిన్న రంగాలలో విజయకేతనం ఎగరవేసి భారతదశపు కీర్తి ప్రతిష్టాలను చాటి చెప్పారు. 2017 సంవత్సరంలో మహిళలను సాధించిన విజయాలను మానవి మీ ముందుకు తీసుకోస్తుంది. మరిన్ని వివరాలకు వీడియో చూడండి. 

సెల్ కాన్ కంపెనీలో భారీ మోసం

హైదరాబాద్ : సెల్ కాన్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపై మాదాపూర్ పీఎస్ లో కేసు నమోదైంది. తన షేర్లను తనకు చెప్పకుండా అమ్మి రూ.15 కోట్ల నష్టం చేసిందని స్వప్న కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. సెల్ కాన్ కంపెనీలో అనేక మోసాలు జరుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

14:46 - January 1, 2018
14:28 - January 1, 2018

హైదరాబాద్ : సెల్ కాన్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపై మాదాపూర్ పీఎస్ లో కేసు నమోదైంది. తన షేర్లను తనకు చెప్పకుండా అమ్మి రూ.15 కోట్ల నష్టం చేసిందని స్వప్న కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. సెల్ కాన్ కంపెనీలో అనేక మోసాలు జరుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. సెల్ కాన్ చైర్మన్ గురుస్వామి నాయుడు, మరో ముగ్గురు డైరెక్టర్లు పై కేసు నమోదు చేశారు. 

బ్యాంక్‌లో చోరీకి దొంగలు యత్నం

రంగారెడ్డి : జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో దొంగలు అర్ధరాత్రి ఓ బ్యాంక్‌లో చోరీకి ప్రయత్నించారు. వికాస్‌ గ్రామీణ బ్యాంక్‌లో చోరీ చేయడానికి విఫలయత్నం చేశారు. కిటికీగ్రిల్స్‌ తొలగించి బ్యాంకులోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. స్థానికులు గమనించడంతో పరారయ్యారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీపీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

13:39 - January 1, 2018

రంగారెడ్డి : జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో దొంగలు అర్ధరాత్రి ఓ బ్యాంక్‌లో చోరీకి ప్రయత్నించారు. వికాస్‌ గ్రామీణ బ్యాంక్‌లో చోరీ చేయడానికి విఫలయత్నం చేశారు. కిటికీగ్రిల్స్‌ తొలగించి బ్యాంకులోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. స్థానికులు గమనించడంతో పరారయ్యారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీపీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

 

13:35 - January 1, 2018

ఢిల్లీ : హస్తినను పొగమంచు కప్పేసింది. ఉదయం పది గంటలు అవుతున్నా మంచు తొలగడం లేదు. దీంతో విమానరాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పొగమంచు ప్రభావంతో 220 విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 150 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరో 50 ప్లైట్‌లను దారి మళ్లించినట్టు ఢిల్లీ విమానాశ్రయ అధికారులు తెలిపారు.  మరోవైపు ఢిల్లీలో విమానాలేకాదు... 90 రైళ్లు సైతం ఆలస్యంగా నడస్తున్నాయి. 15 రైళ్లను రద్దుచేశారు. మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం.. 

13:31 - January 1, 2018

హైదరాబాద్‌ : దిల్‌సుఖ్‌నగర్‌లో ఆకతాయిలు రెచ్చిపోయారు. మద్యం మత్తులో అర్థరాత్రి వీరంగం సృష్టించారు.  న్యూఇయర్‌ సందర్భంగా పీకలదాకా మద్యం సేవించిన కొంతమంది ఆకతాయిలు అమ్మాయిల హాస్టల్ దగ్గర రభస సృష్టించారు. అమ్మాయిలను బయటకు రావాలంటూ కేకలు వేశారు. అంతేకాదు... హాస్టల్‌పైకి రాళ్లు రువ్వారు. హాస్టల్‌ కిటికీల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఆకతాయిలపై హాస్టల్‌ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అల్లరి మూకల వీరంగాన్ని స్థానికులు వీడియో తీశారు. ఆకతాయిల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 

కర్నూలు ప్రభుత్వాసుపత్రి వైద్యుల నిర్వాకం

కర్నూలు : ప్రభుత్వాసుపత్రి వైద్యులు తీరుమార్చుకోవడం లేదు. రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఒకరికి అందించాల్సిన వైద్యం మరొకరికి అందించి ఒకరి మృతికి కారణమయ్యారు. అనంతపురం జిల్లా డీ. హీరేహల్‌ మండలం సదం గ్రామానికి చెందిన బీమప్ప రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో కర్నూలు ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పూర్తికావడంతో డిశ్చార్జి చేశారు. ఇది మరచిపోయిన వైద్యులు... మహబూబ్‌నగర్‌ జిల్లా ఐజ మండలం రాజపురానికి చెందిన తెలుగు భీమన్నకు అందించారు. దీంతో బీమన్న వైద్యం వికటించి చనిపోయాడు.

13:28 - January 1, 2018

కర్నూలు : ప్రభుత్వాసుపత్రి వైద్యులు తీరుమార్చుకోవడం లేదు. రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఒకరికి అందించాల్సిన వైద్యం మరొకరికి అందించి ఒకరి మృతికి కారణమయ్యారు. అనంతపురం జిల్లా డీ. హీరేహల్‌ మండలం సదం గ్రామానికి చెందిన బీమప్ప రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో కర్నూలు ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పూర్తికావడంతో డిశ్చార్జి చేశారు. ఇది మరచిపోయిన వైద్యులు... మహబూబ్‌నగర్‌ జిల్లా ఐజ మండలం రాజపురానికి చెందిన తెలుగు భీమన్నకు అందించారు. దీంతో బీమన్న వైద్యం వికటించి చనిపోయాడు. కేషీట్లు మారినకారణంగా ఈ ఘటన జరిగినట్టు వైద్యులు చెప్తున్నారు. మరోవైపు తమకు న్యాయం చేయాలని మృతుని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

13:22 - January 1, 2018

పశ్చిమ గోదావరి : పాపికొండలు టూరిస్టులకు గుడ్‌ న్యూస్‌.... గోదావరి తీరంలో సేదతీరేవారికి సౌకర్యాలు కల్పిస్తోంది ఏపీ టూరిజం శాఖ. రివర్‌ ఇన్‌ పేరుతో నిర్మించిన హోటల్‌ ను అందుబాటులోకి తెస్తోంది.. సో... గోదావరి అందాల విందుకు రా రమ్మని ఆహ్వానిస్తోంది ఏపీ టూరిజం..
పాపికొండలు టూరిజానికి ప్రాధాన్యత 
గలగల పారే గోదావరి అందాలను వర్ణించాలంటే మాటలు సరిపోవు...  వాటిని అనుభవించడం తప్ప చెప్పడానికి సాధ్యం కాదు. కానీ... ఆ మధురానుభూతుల్ని ఆస్వాదించాలనే ఆశ మాత్రం అందరికీ ఉంటుంది. కాబట్టే... పాపికొండలు టూరిజానికి రోజురోజుకూ ప్రాధాన్యత పెరుగుతోంది.. ఐతే సుదూర ప్రాంతాలనుంచి వచ్చే యాత్రికులకు ఇప్పటివరకూ సరైన సౌకర్యాలు లేవు. ఇదివరకూ కేవలం రాజమండ్రిలో మాత్రమే వసతి ఉండేది. అంటే..  సుమారు నలభై  కిలోమీటర్ల దూరం ఉంటుంది.  ఈ సమస్యలను గుర్తించిన ఏపీ టూరిజం... సౌకర్యాలు కల్పించేందుకు రంగంలోకి దిగింది. 
యాత్రికులకు సౌకర్యాల కల్పన
ఏపీ టూరిజం  పట్టిసీమలో అన్నివిధాలా సౌకర్యవంతమైన హోటల్‌ను నిర్మించింది.. దాన్ని రాజమండ్రికి చెందిన రివర్‌ బే హోటల్‌ మేనేజ్‌ మెంట్ కి బిడ్డింగ్‌ లో కేటాయించారు. దానిపేరే...  రివర్‌  ఇన్‌.  ఈ హోటల్‌లో రూమ్స్, రెస్టారెంట్, డార్మెంటరీ, బాంక్వెట్‌ హాల్‌ వంటి   ఏర్పాట్లు చేశారు. పాపికొండలు వచ్చే యాత్రికులకు హోటల్‌ నుంచే బోటింగ్‌ చేసే  సదుపాయం కల్పిస్తున్నారు.. 
హోటల్‌ నుంచే వీరేశ్వర స్వామి 
ఓ వైపు గోదావరి అందాలు... మరోవైపు  ఆ తీరంలోనే పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులు... అంతేకాదు... హోటల్‌ నుంచే వీరేశ్వర స్వామి ఆలయా దర్శించే అవకాశం కూడా ఉంది.... దీంతో చాలావరకూ యాత్రికుల సమస్యలు తీరినట్లే... సకల సదుపాయాలూ ఒకే చోట అందుబాటులోకి రావడం.... గోదావరి తీరాన సేద తీరాలనుకునేవారికి  ఇదొక మంచి అవకాశం. ఇన్ని సౌకర్యాలు కల్పిస్తున్న రివర్‌ ఇన్‌ ప్రాజక్టుకు మంచి ఆదరణ లభిస్తుందని మేనేజ్‌మెంట్‌  ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

13:15 - January 1, 2018

హైదరాబాద్ : న్యూఇయర్‌ సందర్భంగా పోలీసులు మందుబాబులపై కొరడా ఝలిపించారు. నగరంలో పలు ప్రధాన కూడళ్లలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఈ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పలువురు మందుబాబులతోపాటు ప్రముఖులు పోలీసులకు పట్టుబడ్డారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు మందుబాబులు తెగ ప్రయత్నించారు. తమకు  వారు వీరు తెలుసంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇక  బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 45లో ప్రముఖ టీవీ యాంకర్‌ ప్రదీప్‌ పట్టుబడ్డాడు. పోలీసులు అతని వాహనాన్ని సీజ్‌ చేశారు. బ్రీత్‌ ఎనలైజర్‌ టెస్టులో ప్రదీప్‌కు 178 పాయింట్లు నమోదయ్యాయి...  కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా మందుబాబులను దృష్టిలో పెట్టుకుని ఈ తనిఖీలు నిర్వహించినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

13:10 - January 1, 2018

హైదరాబాద్ : న్యూఇయర్‌ సందర్భంగా పోలీసులు మందుబాబులపై కొరడా ఝలిపించారు. నగరంలో పలు ప్రధాన కూడళ్లలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఈ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పలువురు మందుబాబులతోపాటు ప్రముఖులు పోలీసులకు పట్టుబడ్డారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు మందుబాబులు తెగ ప్రయత్నించారు. తమకు  వారు వీరు తెలుసంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇక  బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 45లో ప్రముఖ టీవీ యాంకర్‌ ప్రదీప్‌ పట్టుబడ్డాడు. పోలీసులు అతని వాహనాన్ని సీజ్‌ చేశారు. బ్రీత్‌ ఎనలైజర్‌ టెస్టులో ప్రదీప్‌కు 178 పాయింట్లు నమోదయ్యాయి...  కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా మందుబాబులను దృష్టిలో పెట్టుకుని ఈ తనిఖీలు నిర్వహించినట్లు తెలుస్తోంది.

 

12:50 - January 1, 2018

కర్నూలు : శాస్త్రసాంకేతికపరంగా ఎంత అభివృద్ధి చెందినా దళితులపై వివక్ష, దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. 60 ఏళ్ల స్వాతంత్య్రంలో దళితులు అడుగడుగునా అవమానాలకు గురవుతూనే ఉన్నారు. అగ్రకులాలు దళితులను అసలు మనుషులుగానే చూడడం లేదు. రోజు రోజుకూ వారి వికృత చేష్టలు మితిమీరిపోతున్నాయి. ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. బరితెగింపు చర్యలకు పాల్పడుతున్నారు. అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ దళితుడు, ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దళితుడు. రాష్ట్రపతిగా ఒక దళితుడు ఉన్నా సరే... గ్రామాలు, పట్టణాల్లో దళితులపై వివక్ష, దాడులు, బహిష్కరణ వంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. న్యూఇయర్ లోనూ దళితులకు అవమానం తప్పలేదు. కర్నూలు జిల్లాలో ఆటవికన్యాయం రాజ్యమేలుతోంది. అగ్రకులాలు దళితులను గ్రామ బహిష్కరణ చేశారు. జిల్లాలోని రుద్రవరం మండలంలోని నక్కలదిన్నెలలో అగ్రకులాలకు చెందిన ఒక వ్యక్తి మరణించాడు. అతని దహన సంస్కారాలు కోసం గుంత తీయాలని దళితులను అడిగారు. అయితే తాము ఇద్దరమే ఉన్నామని.. తమకు ఆరోగ్యం బాగా లేదని...గుంత తవ్వడం తమ వల్ల కాదని చెప్పారు. దీంతో ఆగ్రహించిన అగ్రకులస్తులు దళితులను గ్రామ బహిష్కరణ చేశారు. వారికి విద్యుత్‌, నీరుతోపాటు నిత్యావసరాలపైనా ఆంక్షలు విధించారు. దళితులతో ఎవరు మాట్లాడవద్దని హుకుం జారీ చేశారు. ఒకవేళ ఎవరైనా మాట్లాడితే 5వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. బాధితులు రుద్రవరం పోలీస్ స్టేషన్ లో చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

దళితులను గ్రామ బహిష్కరణ చేసిన అగ్రకులాలు

కర్నూలు : రుద్రవరం మండలంలోని నక్కలదిన్నెలలో అగ్రకులాలు దళితులను గ్రామ బహిష్కరణ చేశారు. దళితులతో ఎవరూ మాట్లాడవద్దని హుకుం జారీ చేశారు. దళితులతో మాట్లాడితే రూ.5 వేలు జరిమానా విధించారు. దళితులకు విద్యుత్, నీరు, నిత్యవసరాలపై ఆంక్షలు విధించారు.  

ప్రజాదర్బార్ లో గవర్నర్ దంపతులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

హైదరాబాద్ : రాజ్ భవన్ లో ప్రజా దర్బార్ లో గవర్నర్ దంపతులకు బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు, కలెక్టర్ యోగితా రాణా, వివిధ పార్టీల నాయకులు  శుభాకాంక్షలు తెలిపారు. 

 

12:08 - January 1, 2018
12:01 - January 1, 2018
11:57 - January 1, 2018

జాతీయ, రాష్ట్ర రాజకీయాలపై వక్తలు మాట్లాడారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ కార్యక్రమంలో టీఆర్ ఎస్ నేత శేఖర్ రెడ్డి, ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి, అఖిల భారత ఆదివాలసీల నాయకుడు బెల్లనాయక్, ఏపీ టీడీపీ నేత దుర్గప్రసాద్, బీజేపీ అధికార ప్రతినిధి కుమార్ పాల్గొని, మాట్లాడారు. తమిళనాడులో రజనీకాంత్ రాజకీయ రంగం ప్రవేశం, టీఆర్ ఎస్ పాలన, ఏపీ ప్రభుత్వం పాలన, పోలవరం ప్రాజెక్టు వంటి పలు అంశాలపై వక్తలు మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

11:52 - January 1, 2018

ప్రస్తుత విద్య సామాన్యుడికి అందనంత దూరంలో ఉందని తెలంగాణ పేరెంట్స్‌ అసోసియేషన్ నాయకులు నారాయణ అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే సామాన్యుడికి అందనంత దూరంలో ఉన్న విద్య మరింత కాస్ట్‌లీ కానుందా ? ప్రొఫెసర్‌ తిరుపతిరావు కమిటీ ప్రభుత్వానికి ఇస్తున్న నివేదిక ఏంటి  ? దీనిపై పేరెంట్స్‌ సంఘాలకు ఉన్న అభ్యంతరాలు ఏంటి ? ప్రస్తుతం పేరెంట్స్‌ సంఘాలు చేస్తున్న ఆందోళనలకు కారణాలు తదితర అంశాలపై నారాయణ మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

11:45 - January 1, 2018

పవన్‌ కళ్యాణ్‌ నటించిన అజ్ఞాతవాసి సినిమా మొదటి వీడియో సాంగ్‌ని రిలీజ్‌ చేశారు. రిలీజ్‌ చేసిన కొద్ది సేపట్లోనే లక్షల్లో వ్యూస్‌ వచ్చాయి. పవన్‌ కళ్యాణ్‌ ప్రత్యక్షంగా పాడటంతో ప్రేక్షకులు, అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.

 

11:43 - January 1, 2018

తూర్పుగోదావరి : మొక్కలతో ఏపీ అసెంబ్లీ భవనం.. నర్సరీలో కొలువుదీరిన అమరావతి నగరం.. తీర్చి దిద్దిన మొక్కలతో అమరావతి నగరం కనువిందు చేస్తోంది. తూర్పుగోదావరిజిల్లా కడియం నర్సరీ నిర్వహకులు ప్రజలకు వినూత్న పద్దతిలో న్యూ ఇయర్‌ విషెస్‌ చెప్పారు. 
మొక్కలతో కొత్త సంవత్సర శుభాకాంక్షలు 
తూర్పుగోదావరి జిల్లాలో అమరావతి నగరం కొలువుదీరింది. మొక్కలతోనే తీర్చిదిద్దిన అసెంబ్లీ భవనం, రాజధాని నమూనాలు సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. మొక్కలతోనే కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు కడియంలోని నర్సరీ నిర్వహకులు 
విన్నూత్నంగా శుభాకాంక్షలు 
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని నర్సరీలు సహజ సౌందర్యానికి కేరాఫ్ గా కనిపిస్తున్నాయి. విరబూసిన పూలు, అందరంగా పరుచుకున్న మొక్కలతో అలరిస్తున్నాయి.  న్యూ ఇయర్ సందర్భంగా విన్నూత్నంగా శుభాకాంక్షలు చెబుతూ సంర్శకులను తెగా ఆకర్షిస్తున్నారు  ఇక్కడి నర్సరీ యజమానులు. పచ్చని  మొక్కల మధ్య కొలువుదీరిన అమరావతి నగరం నమూనా కనువిందుచేస్తోంది. ఏపీ ప్రభుత్వం తాజాగా ఆమోదించిన ఆకృతిని ఇలా వివిధ రకాల మొక్కలను ఒక్కచోట పేర్చి ఇలా రూపొందించారు. అంతేకాదు మేక్‌ఇన్‌ ఇండియా  నినాదాన్ని ప్రతిబింబించేలా  రూపొందించిన ఆకృతి సందర్శకులను ఆట్టుకుంటోంది. మొత్తం 85వేల మొక్కలతో వారంరోజుల పాటు శ్రమించి ఇలా వివిధ ఆకృతులను తీర్చిదిద్దామంటున్నారు. సంక్రాంతి పండుగ వరకు ఈ మొక్కల ఆకృతులను ప్రధర్శనకు ఉంచుతామని నర్సరీ యాజమాని చెబుతున్నారు. ఇలా మొక్కలతోనే న్యూఇయర్‌ విషెస్‌ చెబుతున్న నర్సరీ యాజమాన్యాన్ని స్థానికులు అభినందిస్తున్నారు.  

 

10:55 - January 1, 2018

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. 16అంతర్జాతీయ విమాన రాకపోకలు ఆలస్యం కానున్నాయి. 15 రైళ్లు రద్దు అయ్యాయి. 56 రైళ్లు ఆలస్యంగా నడవనున్నాయి. 20 రైళ్ల రాకపోకల్లో మార్పులు చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

ఢిల్లీలో పొగమంచు...విమాన రాకపోకలు ఆలస్యం

ఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. 16అంతర్జాతీయ విమాన రాకపోకలు ఆలస్యం కానున్నాయి. 15 రైళ్లు రద్దు అయ్యాయి. 56 రైళ్లు ఆలస్యంగా నడవనున్నాయి. 20 రైళ్ల రాకపోకల్లో మార్పులు చేశారు.

10:36 - January 1, 2018

హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా న్యూ ఇయర్‌ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సంబరాలు అంబరాలన్ని అంటుతున్నాయి. ముందుగా న్యూజిలాండ్‌  వాసులు న్యూఇయర్‌కు వెల్కమ్‌ చెప్పారు. ఆ తర్వాత ఆస్ట్రేలియాలోని సిడ్నీలో నూతన సంవత్సరం ప్రారంభమైంది. ఆస్ట్రేలియా తర్వాత జపాన్‌, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ ... ఇలా ఒక్కో దేశంలో కోలాహలంగా కొత్త సంవత్సర వేడుకులు హోరెత్తాయి. 
ముందుగా న్యూజిలాండ్‌ వాసులు న్యూఇయర్‌కు స్వాగతం 
ప్రపంచ వ్యాప్తంగా న్యూ ఇయర్‌ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఫైర్‌ వర్క్స్‌తో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. అన్ని దేశాల్లో విద్యుత్‌ దీపాల కాంతులు విరజిమ్ముతున్నాయి. ముందుగా న్యూజిలాండ్‌ వాసులు న్యూఇయర్‌కు స్వాగతం పలికారు. ఆ దేశ రాజధాని ఆక్లాండ్‌లోని ప్రఖ్యాత స్కై టవర్‌ వద్దకు చేరిన ప్రజలు  బాణాసంచా కాలుస్తూ  ఆనందోత్సాహాల మధ్య కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టారు. కళ్లు మిరుమిట్లుగొలిపే బాణాసంచా వెలుగులు మధ్య న్యూజిలాండ్‌ ప్రజలు 2017కు వీడ్కోలు చెప్పి, 2018కి స్వాగతం  పలికారు. 
సిడ్నీలో
ఆస్ట్రేలియాలోని సిడ్నీలోని ప్రముఖ పర్యాటక కేంద్రం ఒపెరా హౌస్‌ వద్దకు చేరిన ప్రజలు న్యూ ఇయర్‌కు స్వాగతం పలికారు. ఒపెరా హౌస్‌ను రంగురంగుల విద్యుత్‌ దీపాలతో అందంగా అలంకరించారు. బాణాసంచా, విద్యుత్‌ దీపాల వెలుగుల మధ్య సిడ్నీ హార్బర్‌ బ్రిడ్జి కొత్త కొతులీనింది.
హాంకాంగ్‌లో
హాంకాంగ్‌లోని ఆకాహార్మియాలపై నుంచి ప్రజలు నక్షత్ర వెలుగుల బాణాసంచా కాల్చి న్యూ ఇయర్‌ వేడుకలు జరుపుకున్నారు. ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలాలో ఫైర్స్‌ వర్క్స్‌ అందరి దృష్టిని ఆకర్షించాయి. 
ఇండోనేషియాలో 
ఇండోనేషియా రాజధాని జకార్తా ఘనంగా న్యూ ఇయర్‌ వేడుకులు జరిగాయి. ప్రపంచంలో ఎత్తైన భవన్‌ దుబాయ్‌లోని బుర్జ్‌ ఖలీఫా వద్ద  భారీ ఎత్తున ఫైర్‌ వర్క్స్‌ నిర్వహించి, లేజర్‌ షోతో సంబరాలు చేసుకున్నారు.
రష్యాలో 
రష్యా రాజధాని మాస్కోలోని 36 ప్రధాన కూడళ్లలో బాణాసంచా వెలుగుల మధ్య న్యూ ఇయర్‌కు స్వాగతం పలికారు. టర్కీలోని అంకారాలో కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. 
అమెరికాతో ముగిసిన న్యూఇయర్‌ వేడుకలు 
ఫ్రాన్స్‌, జపాన్‌, ఇటలీ, బ్రెజిల్‌, అర్జెంటీనా.. ఇలా ఒక్కో దేశంలో ఒక్కో విధంగా న్యూ ఇయర్‌ వేడుకలు జరుపుకున్నారు. ఆక్లాండ్‌లో ప్రారంభమైన న్యూ ఇయర్‌ వేడుకలు అమెరికాతో ముగిశాయి. అమెరికాలోని న్యూయార్క్‌, లాస్‌ ఏంజెలిస్‌, లాస్‌ వేగాస్‌.. అన్ని నగరాల్లో కూడా న్యూఇయర్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. న్యూ ఇయర్‌ వేడుకులను విచ్ఛిన్నం చేస్తామని ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రవాదులు హెచ్చరించిన నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య నూతన సంవత్సర వేకడులను నిర్వహించారు. 

 

10:29 - January 1, 2018

ఢిల్లీ : దేశ వ్యాప్తంగా న్యూ ఇయర్‌ వేడుకలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. యువత సంబరాలు అంబరాలన్ని అంటుతున్నాయి. హైదరాబాద్‌తోపాటు, కోల్‌కతా, బెంగళూరు, చెన్నై నగరాల్లో వేడుకలు ఘనంగా జరిగాయి. అటు ముంబై, ఢిల్లీల్లో తెల్లవార్లు యువత రోడ్లపై సందడి చేశారు. రంగురంగుల విద్యుత్‌ వెలుగుల్లో.. డీజే మ్యూజిక్‌ను ఎంజాయ్‌ చేస్తూ స్టెప్‌లేశారు. ఒకరికొకరు న్యూఇయర్‌ విషెస్‌ చెప్పుకున్నారు. 
ఈశాన్య రాష్ట్రాల్లో 
2018 న్యూ ఇయర్‌ వేడుకులు మొదట ఈశాన్య రాష్ట్రాల్లో మొదలవగా.. కోల్‌కతాలో యువత ఆటపాటలతో వీధులన్నీ హోరెత్తాయి. హైదరాబాద్‌లో న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ అదరహో అనిపించాయి. రాత్రంతా విషెస్‌ చెప్పుకుంటూ యూత్‌ రోడ్లపై తిరుగుతూ ఎంజాయ్‌ చేశారు. పబ్‌లు యూత్‌ ఆటపాటలతో హోరెత్తాయి. 
చెన్నైలో 
చెన్నైనగరం న్యూఇయర్‌ వేడుకలతో ఉర్రూతలూగింది. మెరీనా బీచ్‌లో పెద్ద సంఖ్యలో కూడిన యూత్‌ స్టెప్‌లతో ఇరగదీశారు. 2018కి ఘనంగా స్వాగతం పలికారు. కొత్త సంవత్సరానికి ముంబై నగరం గ్రాండ్‌గా వెల్కం చెప్పింది. పార్కులు, బీచ్‌లు ఆటపాటలతో మార్మోగాయి. బాణాసంచా వెలుగుల్లో ముంబై నగరం కొత్త అందం సంతరించుకుంది. 

 

09:13 - January 1, 2018

హైదరాబాద్ : న్యూ ఇయర్ సంబరాల సందర్భంగా నగరంలోని పలుచోట్ల పోలీసులు డ్రంక్ ఆండ్ డ్రైవ్ నిర్వహించారు. మందుబాబులపై కొరడా ఝుళింపించారు. టీవీ యాంకర్ ప్రదీప్ మద్యం సేవించి పోలీసులకు పట్టుబడ్డాడు. బంజారాహిల్స్ రోడ్ నం. 45 లో ప్రదీప్ కారును పోలీసులు ఆపారు. ప్రదీప్ కు బ్రీత్ ఎనలైజర్ పరీక్షలో 178 పాయింట్లుగా గుర్తించారు. కొత్త నిబంధనల ప్రకారం ప్రదీప్ కు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. 

 

09:01 - January 1, 2018

కడప : జిల్లాలో కొత్త సంవత్సరంలో విషాదం నెలకొంది. పెండ్లిమర్రిలోని ఇందిరానగర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చలిమంట దగ్గర కూర్చున్నవారిపైకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ తోసహా ఐదుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను రిమ్స్ కు తరలించారు. మృతులు లక్ష్మీనరసింహ్మా, కార్తీక్, గిరి, భాస్కర్ లుగా గుర్తించారు.  పులివెందుల నుంచి వస్తుండగా ఈ ఘటన ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో కారు నడపం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...  

 

08:53 - January 1, 2018

కర్నూలు : న్యూ ఇయర్ లో విషాదం నెలకొంది. జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శిరవేళ్ల మండలం కేంద్రంలో ఆగిఉన్న జేఏబీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. మరో ఇద్దరికి గాయాలు కాగా.. వారిని నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులను హైదరాబాద్‌ వాసులుగా గుర్తించారు. తిరుపతి నుంచి హైదరాబాద్‌ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 

 

 

08:49 - January 1, 2018

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో న్యూ ఇయర్‌  వేడుకలు అంబరాన్ని అంటాయి. ప్రజలందరూ ఆనందోత్సాహాలతో నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. యువతీ, యువకులు కేరింతలు కొడుతూ  2017 కు వీడ్కోలు చెప్పి, 2018కి స్వాగతం పలికారు. కొత్త ఏడాదిలో అంతా మంచే జరగాలని ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు. 
2018కి గ్రాండ్‌ వెల్కమ్‌  
తెలుగు రాష్ట్రాల ప్రజలు 2018కి గ్రాండ్‌ వెల్కమ్‌  చెప్పారు. నగరాలు, పట్టణాలు, పల్లెలు..  అన్న తేడా లేకుండా అన్ని చోట్ల ఆనందోత్సాహాలతో న్యూ ఇయర్‌ వేడుకలు జరుపుకున్నారు. 
డాన్స్‌తో హోరెత్తిన హోటళ్లు, పబ్‌లు, క్లబ్‌లు  
హైదరాబాద్‌లోని హోటళ్లు, పబ్‌లు, క్లబ్‌లు డాన్స్‌తో హోరెత్తాయి. యువతీ, యువకుల నృత్యాలతో నగరంలో న్యూ ఇయర్‌ వేడకులు జరుపుకున్నారు. జంటనగరాల శివారు ప్రాంతాల్లో ఉన్న రిసార్ట్స్‌లో న్యూ ఇయర్‌ సెలబ్రేషన్లు ఘనంగా జరిగాయి. డీజేలత సంబరాలు హోరెత్తాయి. టీ మాస్‌ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో న్యూ ఇయర్‌ వేడుకులు వినూత్న రీతిలో జరిగాయి. 2018 కల్చరల్‌ ఫెస్ట్ పేరుతో నిర్వహించిన ఈ వేడుకల్లో  బాలబాలికలు ఆట పాటలతో అదరగొట్టారు. 
విజయవాడలో 
విజయవాడలో న్యూ ఇయర్‌ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఎక్కడ చూసినా యువతీ యువకులు  ఆనందోత్సాహాలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. విజయవాడ న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌లో అమెరికన్‌ సూపర్‌ఫిల్మ్‌ హీరో  హల్క్‌ వేషధారి హల్‌చల్‌ చేశాడు. కార్యక్రమానికి వచ్చిన పిల్లలు హల్క్‌తో కలిసి డాన్స్‌ చేశారు. న్యూ ఇయర్‌ సందర్భంగా నగరం డాన్స్‌లతో హోరెత్తింది. ఏ వీధిలో చూసినా సంబరాలు అంబరాన్ని అంటాయి. 
తిరుపతిలో 
తిరుపతి వాసులు 2018కి గ్రాండ్‌ వెల్కమ్‌ చెప్పారు. వీధులన్నీ యువతీ యువకుల నృత్యాలతో  హోరెత్తాయి. న్యూ ఇయర్‌ సందర్భంగా తిరుపతిలో నిర్వహించిన ఫ్యాషన్‌ షో అదరింది. అందాల భామలు ర్యాంప్‌పై క్యాట్‌ వాక్‌ చేశారు. ఫ్యాషన్‌ షోలో పాల్గొన్న  విద్యార్థినులు ఆనందం వ్యక్తం చేశారు. 
సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ లో 
పిల్లలు, యువతీ, యువకులు కేరింతలు కొడుతూ హ్యపీ న్యూ ఇయర్‌ చెప్పుకున్నారు. సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సందీప్‌ శాండిల్య ఆధ్వర్యంలో పోలీసు అధికారులు కేక్‌ కట్‌ చేసి న్యూ ఇయర్‌ వేడుకలు జరుపుకున్నారు. న్యూఇయర్‌ సందర్భంగా అన్ని చోట్ల విస్తృతమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 
 

హైదరాబాద్ లో న్యూ ఇయర్ సంబరాలు

హైదరాబాద్ : నగరంలో న్యూ ఇయర్ సంబరాలు జరిగాయి. ఆటపాటలతో పిల్లలు, పెద్దలు, యువత న్యూ ఇయర్ సందడి చేశారు. ట్యాంక్ బండ్ వద్ద జరిగిన సంబరాల్లో భారీగా యువత పాల్గొంది.  

ప్రపంచవ్యాప్తంగా కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం

హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం పలికారు. తొలుత న్యూలిలాండ్ లోని ఆక్లాండ్ లో 2018 సంవత్సరానికి ప్రజలు స్వాగతం పలికారు. 

నేడు 49వ రోజు జగన్ ప్రజా సంకల్పయాత్ర

చిత్తూరు : నేడు 49 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభం కానుంది. తంబళ్లపల్లి నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగనుంది. 

 

ఆస్తిపన్ను చెల్లింపునకు నిన్నటితో గుడువు మగింపు

హైదరాబాద్ : ఆస్తిపన్ను చెల్లింపునకు నిన్నటితో గుడువు మగిసింది. ఆస్తిపన్ను చెల్లించని వారికి జీహెచ్ ఎంసీ ఈరోజు నుంచి 2 శాతం జరిమానా  విధించనున్నారు. 

 

నేడు రాజ్ భవన్ లో గవర్నర్ ప్రజా దర్బార్

హైదరాబాద్ : రాజ్ భవన్ లో నేడు గవర్నర్ ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ఉదయం 10 గంటల నుంచి 12 వరకు ప్రజలతో నరసింహన్ భేటీ కానున్నారు. 

రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి

కడప : జిల్లాలోని పెండ్లిమర్రిలోని ఇందిరానగర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చలిమంట దగ్గర కూర్చున్న వారిపైకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. 

డ్రంక్ ఆండ్ డ్రైవ్...పట్టుబడ్డ టీవీ యాంకర్ ప్రదీప్

హైదరాబాద్ : నగరంలోని పలు చోట్ల పోలీసులు డ్రంక్ ఆండ్ డ్రైవ్ నిర్వహించారు. టీవీ యాంకర్ ప్రదీప్ మద్యం సేవించి పోలీసులకు పట్టుబడ్డాడు. బంజారాహిల్స్ రోడ్ నం. 45 లో ప్రదీప్ కారును పోలీసులు ఆపారు. ప్రదీప్ కు బ్రీత్ ఎనలైజర్ పరీక్షలో 178 పాయింట్లుగా గుర్తించారు. కొత్త నిబంధనల ప్రకారం ప్రదీప్ కు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. 

 

Don't Miss