Activities calendar

02 January 2018

21:37 - January 2, 2018

 

హైదరాబాద్ : స్కూల్స్‌ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం నియమించిన తిరుపతిరావు కమిటీ నివేదికను సర్కార్‌కు సమర్పించింది. దాదాపు 9నెలలుగా నాన్చుతూ వచ్చిన కమిటీ కీలక ప్రతిపాదనలు చేసింది. ఏ స్కూల్ కూడా డొనేషన్ తీసుకోకూడదని.. ప్రతి ఏడాది 10 శాతం ఫీజులు పెంచుకొవచ్చని కమిటీ ప్రతిపాదించింది. అంతకన్నా ఫీజులు పెంచుకోవాలంటే జోనల్ ఫీ రెగ్యూలేటరీ అనుమతి అవసరమని కమిటీ నిర్ణయించింది. ఒకవేళ ఫీజును పెంచుకోవాలంటే అంతకు ముందు రెండు సంవత్సరాలకు సంబంధించిన ఆదాయ, వ్యయ ఆడిటింగ్ వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన వివరాల్ని ఆన్‌లైన్ పెట్టాల్సిందిగా కమిటీ ప్రతిపాదించింది.

ఇక ఫీజులను డిజిటల్ మోడ్‌లోనే
ఇక ఫీజులను డిజిటల్ మోడ్‌లోనే తీసుకోవడంతో పాటు.. ఉద్యోగుల జీతాలను కూడా ఆన్‌లైన్‌లోనే చెల్లించాలని తిరుపతిరావు కమిటీ ప్రతిపాదించింది. ఉద్యోగుల జీతాలు పీఆర్సీ, సంస్ధ ఆర్ధిక సరళిని దృష్టిలో ఉంచుకుని పెంచాలి. జీతాలు, స్కూలు నిర్వహణ తదితర అంశాలకు ఎంత శాతం ఖర్చు చేయాలనేది కమిటీ రిపోర్ట్‌లో పేర్కొంది. కార్పొరేట్ స్కూల్స్ ఏ స్కూలుకి సంబంధించిన ఆడిట్‌ రిపోర్ట్‌ను అదే స్కూల్‌కి సమర్పించాలని ప్రతిపాదించిన కమిటీ తప్పుడు వివరాలు ఇస్తే పెనాల్టీ చెల్లించవలసి వస్తుంది నివేదికలో తెలిపింది. స్కూల్స్ ప్రాంగణాల్లో బుక్స్, మెటీరియల్స్ అమ్మకాలు లాంటివి చేపట్టకూడదని ..ప్రాస్పెక్టర్ కింద వందరూపాయలు, రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.500 మించి తీసుకోరాదని ప్రతిపాదించింది. విద్యాసంస్థలు లాభాపేక్ష లేకుండా పనిచేయాలని తిరుపతిరావు కమిటీ తమ నివేదికలో స్పష్టం చేసింది. టూర్లు, వార్షికోత్సవాలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించిన సమయంలో విద్యార్ధుల నుండి బలవంతంగా ఫీజులు వసూలు చేయకూడదని తెలిపింది.

ఏ స్కూల్ లో ఎంత ట్యూషన్ ఫీ ఉందో
ఏ స్కూల్ లో ఎంత ట్యూషన్ ఫీ ఉందో ముందే తెలపాలని తిరుపతిరావు కమిటీ ప్రతిపాదించింది. ఆడిట్ వివరాలు సమర్పించని పాఠశాలలు ఫీజులు పెంచుకుంటూ పోతే గుర్తింపు రద్దు చేయవచ్చని స్పష్టం చేసింది. జోనల్ ఫీ రెగ్యులేటరి కమిటీ చైర్మన్‌గా రిటైర్డ్ హైకోర్ట్‌ జడ్జిని నియమించాలని తిరుపతిరావు కమిటీ ప్రతిపాదించింది.మరోవైపు ఏటా 10 శాతం ఫీజులు పెంచుకోవాలన్న తిరుపతిరావు కమిటీ ప్రతిపాదనపై HSPA మండిపడుతున్నారు. విద్యాశాఖమంత్రి కడియం శ్రీహరి కలిశారు. ఏటా 10శాతం ఫీజులు పెంచుకునే సిఫార్సును ఉపసంహరించాలని కోరారు. అయితే మంత్రి నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ప్రభుత్వంపై వారు ఆగ్రహం చేశారు. మంత్రి ఇచ్చిన వివరణ తమకు తీవ్ర అసంతృప్తినిచ్చిందని మండిపడ్డారు. మంత్రి తమ విజ్ఞప్తిని పట్టించుకోలేదని.. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా మహాధర్నా నిర్వహిస్తాని వారు తేల్చి చెప్పారు. ఫీజులు భారమవుతున్నాయని తాము ఆందోళన చేస్తేనే ప్రొఫెసర్‌ తిరుపతిరావు ఆధ్వర్యంలో కమిటీ ఏర్పడిందని పేరెంట్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు గుర్తు చేశారు. తమకు అనుకూలంగా రిపోర్ట్‌ వస్తుందని ఊరించి.. ఇప్పుడు స్కూల్‌ యాజమాన్యాల ఫీజు దందాకు బార్లా తలుపులు తెరిచేలా రిపోర్ట్‌ ఇచ్చారని దుయ్యబట్టారు. ప్రభుత్వం తక్షణమే తిరుపతిరావు కమిటీ సిఫార్సులు నిలిపివేయాలని.. లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. మరి దీనిపై త ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

20:55 - January 2, 2018

నా దారి రహదారి.. లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తా... దేవుడు శాసిస్తాడు.. నేను చేస్తాను..ఇవన్నీ రజనీ దశాబ్దాలుగా చెప్తున్న మాటలు. ఇప్పుడు మాటలనుంచి చేతల సమయం వచ్చింది. పొలిటికల్ ఎంట్రీ ప్రకటనతో ఒక్కసారిగా తమిళ రాజకీయాల్లో కలకలం రేగింది. ఎన్నాళ్లో వేచిన ఉదయం అంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. మరి తమిళ రాజకీయాల్లో రజనీ ఎలాంటి ప్రభావం చూపిస్తారు.సూపర్ స్టార్ రజనీకాంత్....సినిమాల్లోనే కాదు.. తమిళనాట ఈ పేరు అన్నిరకాలుగా ప్రభంజనమే. కోట్లాది అభిమానులున్న ఈ సూపర్ స్టార్ పొలిటికల్ ఎంట్రీ ప్రకటనతో సీన్ ఒక్కసారిగా వేడెక్కింది. జయ మరణం తర్వాత అనేక మలుపులు తిరుగుతున్న తమిళ రాజకీయాల్లో ఏర్పడిన శూన్యాన్ని ఇప్పుడు రజనీ భర్తీ చేస్తాడా? ఆయన దారి రహదారి. సినిమా డైలాగే కానీ... రజనీ తీరుని చెప్తుందని ఫ్యాన్స్ నమ్మకం. మరి ఇది సినిమాల వరకేనా, లేక పాలిటిక్స్ లో కూడానా? ఇప్పుడు రజనీకాంత్ ఎంట్రీ తో పరిస్థితులు ఎలా మారతాయి..? డీఎంకే, అన్నా డీఎంకే లను చావు దెబ్బతీస్తారా? లేక విపరీతమైన హైప్ తో వచ్చి చతికిల పడిన కొందరు నటుల్లా రజనీ మిగిలిపోతారా? ప్రకటించేశాడు..వెబ్ సైట్ ప్రారంభించేశాడు..అభిమానులను సన్నద్ధం కావాలంటూ పిలుపునిచ్చాడు..ఏం చేస్తానో చెప్తాను.. చేయలేకపోతే రాజీనామా చేస్తాను అంటున్నాడు.. రెండు దశాబ్దాల ఉత్కంఠకు తెరదింపాడు..

రేపెవరిది... ఇదే తమిళనాడులో వినిపిస్తున్న ప్రశ్న. ఈ రోజు ఎవరేంటో అందరికీ తెలుసు..కానీ, రేపటిని గెలుచుకునేదెవరు? ప్రజల గుండెల్లో పాగా వేసేదెవరు? అధికార పీఠాన్ని అధిరోహించేదెవరు? ఇవే తమిళనాడులో వినిపిస్తున్న ప్రశ్నలు. ఈపీఎస్, ఓపీఎస్, శశికళ, స్టాలిన్ మొదలైన రెగ్యులర్ ప్లేయర్స్ తో పాటు, లేటెస్ట్ గా రజనీ, ఈ మధ్యే ఉత్సాహంగా మారిన కమల్ లాంటి స్టార్ హీరోలు.. కనిపిస్తున్న ఫీల్డ్ లో పైచేయి ఎవరు సాధించబోతున్నారు? ఆల్రెడీ ఈ బాటలో ఉన్న నటులు ఏం సాధించారు. అది ఇప్పటి చరిత్ర కాదు.. దశాబ్దాల నుండి పీఠంపై సినీ తారలనే కూర్చోబెడుతున్నారు. అక్కడ ఫిల్మ్ స్టార్స్ కే పట్టంకడుతున్నారు. దక్షిణాదినే కాదు.. ఆ మాటకొస్తే, దేశం మొత్తంమీద కూడా ఆ రాష్ట్ర రాజకీయాలకు చాలా ప్రత్యేకత ఉంది. ఈ వరుసలో రజనీ పాలిటిక్స్ లో ఎంటరైతే దుమ్మురేపటం ఖాయమా? సినీ నటుల తళుకుబెళుకులే ప్రధానంగా నిలుస్తున్నతమిళ రాజకీయాల్లో ప్రస్తుతం ఉన్నవాళ్లంతా ఇమేజ్ వాడిపోయిన తారలే. ఇలాంటి సందర్భంలో రజనీ ఎంట్రీ ఇస్తే అది... చెప్పుకోదగ్గ మార్పులకు కారణం అవుతుందా...రాజకీయ శూన్యం నుండి కొత్త శక్తులు పుట్టుకురావటం కొత్త విషయం కాదు.. వివిధ రాష్ట్రాల రాజకీయాల్లో దీనికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు తమిళనాట అదే దృశ్యం కనిపిస్తోంది. మరి దీనిని రజనీకాంత్ తనకు అనుకూలంగా మలుచుకుంటాడా, అభిమానుల ఆశలు నెరవేరుస్తాడా అనే అంశం త్వరలో తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రేయాన్స్ ఫ్యాక్టరీ కంపెనీ ప్రతినిధులతో మంత్రుల భేటీ

హైదరాబాద్ : కమలాపూర్ రేయాన్స్ ఫ్యాక్టరీ యూనియన్ల జేఏసీ, కంపెనీ ప్రతినిధులతో మంత్రుల భేటీ అయ్యారు. ఈ నెల 9 లోపు ఒక నెల జీతవ ఇవ్వాలని కార్మికులు కోరారు. 

తెలంగాణ ప్రవేశ పరీక్షల కన్వీనర్ల ప్రకటన

హైదరాబాద్ : తెలంగాణ ప్రవేశ పరీక్షల కన్వీనర్లను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఎంసెట్ కన్వీనర్ గా జేఎన్ టీయూ (హెచ్) రిజిస్ట్రార్ యాదయ్య, ఈసెట్ కన్వీనర్ గా జేఎన్టీయూహెచ్ ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్, ఐసెట్ కన్వీనర్ గా కేయూ ప్రొఫెసర్ ఎం. సుబ్రహ్మణ్య శర్మ, పీఈసెట్ కన్వీనర్ గా ఎంజీయూ ప్రొఫెసర్ సత్యనారాయణ, పీజీఎల్ సెట్, లాసెట్ కన్వీనర్ గా ప్రొఫెసర్ ద్వారకనాథ్, పీజీఈసెట్ కన్వీనర్ గా సమీన్ ఫాతిమాను నియమించారు.

వ్యవసాయ మార్కెట్ యార్డులో విత్తన అక్రమ నిల్వలు

గద్వాల జోగులాంబ : వ్యవసాయ మార్కెట్ యార్డు గోదాములో భారీగా పత్తి విత్తనాల అక్రమ నిల్వలు గుర్తించారు. విత్తనాల విలువ రూ.7 కోట్లుగా అధికారులు గుర్తించారు.

కోల్ ఇండియా చైర్మన్ అండ్ ఎండీగా శ్రీధర్ పేరును ప్రతిపాదించిన రాష్ట్రం

హైదరాబాద్ : కోల్ ఇండియా చైర్మన్ అండ్ ఎండీగా తెంలగాణ రాష్ట్రం తరుపున ఎన్.శ్రీధర్ పేరును ప్రతిపాదించారు. ఈ మేరకు కేంద్ర బొగ్గు, గనులశాఖకు రాష్ట్ర సర్కార్ లేఖ రాశారు. దరఖాస్తులో ఎన్. శ్రీధర్ బయోడేటాను సీఎస్ ఎస్పీ సింగ్ జతపరిచారు. గత పదేళ్లుగా ఎన్. శ్రీధర్ పై ఎలాంటి అభియోగాలు లేవని లేఖ సర్కార్ పేర్కొంది. 

సీఎస్ ను కలిసిన కోదండరామ్

హైదరాబాద్ : సీఎస్ ను టీ.జేఏసీ చైర్మన్ కోదండరామ్ కలిశారు. ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని ఆయన సీఎస్ ఎస్పీ సింగ్ ను కోరారు. రైతులకు 24 గంటల విద్యుత్ ను స్వాగతిస్తున్నామని కోదండరామ్ అన్నారు. 

18:30 - January 2, 2018

చిత్తూరు : జిల్లా శేషాచలం ఆడువుల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు కూబింగ్ చేస్తుండగా వారికి ఎర్రచందనం స్మగ్లర్లు కట్టపడడంతో వారి లొంగిపోమ్మని పోలీసులు హెచ్చరించారు. కాని వారు రాళ్లతో దాడికి దిగారు. దీంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరపడంతో స్మగ్లర్లు పారిపోయాడు. పోలీసులు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

18:05 - January 2, 2018

విజయనగరం : సురేష్ పబ్లిక్ స్కూల్ లో నూతన్ సంవత్సర వేడుకల్లో డీజే లైటింగ్ వల్ల 200 మంది విద్యార్థులకు కంటి సమస్యలు తలెత్తాయి. ఈ ఘటన పై విచారణ కు వచ్చిన డీప్యూటీ డీఈవో సత్యనారాయణ మీడియాతో దురుసుగా ప్రవర్తించారు. మీడియా ప్రతినిధులను బయటకు గెట్టెశారు. దీంతో మీడియా ప్రతినిధులు రస్తారోకో నిర్వహించాయి. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

 

17:33 - January 2, 2018

హైదరాబాద్ : నేరేళ్ల ఘటన జరిగి ఏడు నెలలు గడిచిన బాధితులకు ప్రభుత్వం ఇంతవరకు న్యాయం చేయలేదని, వారికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని, సిద్డిపేట నుంచి నేరేళ్ల వరకు పాదయాత్ర చేస్తామని టీ జేఏసీ చైర్మన్ కోదండరామ్ అన్నారు. బాధితులను కేసులను ఉపసంహరించుకోవాలని వారిని భయందోళనకు గురిచేస్తున్నారని తెలిపారు. 

17:29 - January 2, 2018

జగిత్యాల : జిల్లా మెట్ పల్లిలో ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు టెన్ టీవీ క్యాలెండర్ ను అవిష్కరించారు. ప్రజా సమస్యలను టెన్ టీవీ ఎత్తు చూపుతుందని ఆయన కొనియాడారు. 

17:24 - January 2, 2018

చిత్తూరు : జిల్లా వి.కోట మండలం శివునికుప్పంలో దారుణం జరిగింది. మద్యం మత్తులో తల్లిపై కుమారుడు అత్యాచారం చేసి హత్య చేశాడు. గ్రామస్తులు నింధితుడు సుబ్రమణ్యంను స్తంభానికి కట్టేసి చితకబాదారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

17:13 - January 2, 2018

హైదరాబాద్ : గాంధీ ఆసుపత్రిలో డిసెంబర్ 25న ఓ మహిళ ప్రసవించింది. ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు ఆమె జన్మనిచ్చింది. కేసీఆర్ కిట్ ఇద్దరికే వర్తిస్తుందని అధికారులు తెలిపారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

17:09 - January 2, 2018

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఎస్టీ, ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేసింది. కమిషన్ చైర్మన్ గా ఎర్రోళ్ల శ్రీనివాస్ ను నియమించారు. కమిషన్ లో ఆరుగురు సభ్యులకు అవకాశం కల్పించారు. సభ్యులుగా బోయిళ్ల విద్యాసాగర్, ఎం.రాంబాల్ నాయక్, కుర్సం నీలాదేవీ, సుంకపాక దేవయ్య, నర్సిసింహా ఉన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

16:46 - January 2, 2018
16:45 - January 2, 2018
16:40 - January 2, 2018
16:21 - January 2, 2018
16:20 - January 2, 2018

హైదరాబాద్ : కోడి పందెలపై హైకోర్టు సీరియస్ గా స్పందించింది. కోడి పందెల నిర్వాకులు, అధికారులు తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తిం చేసింది. గతంలో తాము ఇచ్చిన ఆదేశాలను ఎందుకు పాటించడంలేదని ప్రశ్నించింది. సుప్రీం ఆదేశాలను సైతం వక్రీకరిస్తున్నారని కోర్టు ఘటు వ్యాఖ్యలు చేసింది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

చిత్తూరు : జిల్లా గంగవరం మండలం కల్లుపల్లి గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ డ్రైవర్ ఓవర్ టేకింగ్ చేస్తూ ఎదురుగా వచ్చిన ఆటోను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా మరొకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. 

మంత్రి గంటాకు చేదుఅనుభవం

విశాఖ : జిల్లా జన్మభూమి కార్యక్రమంలో మంత్రి గంటాకు చేదు అనుభవం ఎదురైంది. కాపులుప్పాడు గ్రామ మత్స్యకారులు గంటాను నిలదీశారు. ప్రభుత్వగృహాల మంజూరులో అన్యాయం చేశారనఙ మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

15:59 - January 2, 2018
15:58 - January 2, 2018

చిత్తూరు : జిల్లా గంగవరం మండలం కల్లుపల్లి గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ డ్రైవర్ ఓవర్ టేకింగ్ చేస్తూ ఎదురుగా వచ్చిన ఆటోను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా మరొకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

15:57 - January 2, 2018

విశాఖ : జిల్లా జన్మభూమి కార్యక్రమంలో మంత్రి గంటాకు చేదు అనుభవం ఎదురైంది. కాపులుప్పాడు గ్రామ మత్స్యకారులు గంటాను నిలదీశారు. ప్రభుత్వగృహాల మంజూరులో అన్యాయం చేశారనఙ మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

గజల్ శ్రీనివాస్ కు రిమాండ్ విధించిన కోర్టు

హైదరాబాద్ : గజల్ శ్రీనివాస్ కు నాంపల్లి కోర్టు ఈ నెల 12 వరకు రిమాండ్ విధించింది. గజల్ శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ న్యాయస్థానం కొట్టివేసింది.

15:39 - January 2, 2018

హైదరాబాద్ : గజల్ శ్రీనివాస్ కు నాంపల్లి కోర్టు ఈ నెల 12 వరకు రిమాండ్ విధించింది. గజల్ శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ న్యాయస్థానం కొట్టివేసింది. కాసేపట్లో ఆయనను పోలీసులు రిమాండ్ కు తరలించనున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

15:12 - January 2, 2018

మంత్రి పై పీఎస్ లో ఫిర్యాదు చేసిన కార్యకర్తలు

తూర్పుగోదావరి : జిల్లా టీడీపీలో కలకలం రేగింది. మంత్రి జవహర్ పై కొవ్వూరు పీఎస్ లో టీడీపీ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. ఇంటికి పిలిపించుకుని ఇద్దరు కార్యకర్తలున కొట్టాడంటూ జవహర్ పై టీడీపీ కార్యకర్తలు ఆరోపణ చేస్తున్నారు.

15:05 - January 2, 2018

బొగ్గు కుంభకోణం కేసులో ఢిల్లీ హైకోర్టు స్టే

ఢిల్లీ : జార్ఖండ్ బొగ్గు కుంభకోణం కేసులో సీబీఐ కోర్టు తీర్పుపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు స్టే కొనసాగుతుందని కోర్టు స్పష్టం చేసింది.

14:43 - January 2, 2018

ట్రిపుల్ తలాక్ పై కేంద్రం బిల్లు ప్రవేశపెట్టింది. కేంద్రం చేసిన ట్రిపుల్ తలాక్ బిల్లు ఉన్న లోపాలు ఉన్నాయి. ట్రిపుల్ తలాక్ ఉన్న లోటుపాట్ల ఉన్నాయని ముస్లింల కోసం పోరాడుతున్న జమీన నిషత్ అన్నారు. ట్రిపుల్ తలాక్ చెబితే జైల్లో పెట్టడం మంచి పద్దతి కాదని ఆమె అన్నారు. మరిన్ని విషయాలకు వీడియో క్లిక్ చేయండి.

 

పవన్ కల్యాణ్ టార్గెట్ చేసిన వీహెచ్

హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ పవన్ కల్యాణ్ టార్గెట్ చేశారు. కేసీఆర్ పవన్ పొగడడం దారుణమని ఆయన అన్నారు. డ్రగ్స్ మాఫియాను కాపాడేందుకే పవన్ కేసీఆర్ ను కలిశారని ఆయన ఆరోపించారు. రాష్ట్రపతి కార్యక్రమంలో ఇద్దరు కలినప్పుడే అనుమానం వచ్చిందని వీహెచ్ అన్నారు. కెల్విన్ పై ఎందుకు చార్జిషీట్ నమోదు చేయలేదని వీహెచ్ ప్రశ్నించారు. 

14:29 - January 2, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ పవన్ కల్యాణ్ టార్గెట్ చేశారు. కేసీఆర్ పవన్ పొగడడం దారుణమని ఆయన అన్నారు. డ్రగ్స్ మాఫియాను కాపాడేందుకే పవన్ కేసీఆర్ ను కలిశారని ఆయన ఆరోపించారు. రాష్ట్రపతి కార్యక్రమంలో ఇద్దరు కలినప్పుడే అనుమానం వచ్చిందని వీహెచ్ అన్నారు. కెల్విన్ పై ఎందుకు చార్జిషీట్ నమోదు చేయలేదని వీహెచ్ ప్రశ్నించారు. 

14:19 - January 2, 2018
14:13 - January 2, 2018
14:01 - January 2, 2018

సూపర్‌స్టార్ అంటే తెలియనివారుండరు. అంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రజనీకాంత్‌ తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ప్రపంచాన్ని శాసించే నటుడైనా పామరుడిలా జీవించడం ఆయనకే చెందుతుంది. రజనీకాంత్‌ సినిమా ప్రస్థానం నుండి రాజకీయ రంగ ప్రవేశ ప్రకటన వరకు ఆయన ఎదిగిన తీరుపై టెన్‌ టీవీ ప్రత్యేక కథనం. మనుషుల్లో మహాపురుషుడు, నటుల్లో నరసింహుడు, నటనలో బాస్... అయిన రజనీకాంత్‌ ఇప్పుడు రాజకీయాల్లో రంగప్రవేశం చేస్తున్నారు. రజనీకాంత్‌ అసలు పేరైన శివాజీగైక్వాడ్‌ అంటే ఎవరికీ పరిచయంలేని పేరు. కానీ రజనీకాంత్‌ అంటే మాత్రం తెలియనివారుండరు. అయితే ఎన్నో ఒడిదుడుకులతో రజనీ ప్రస్థానం సాగింది.

ఒకప్పటి మైసూరు రాష్ట్రంలోని బెంగుళూరులో 1950 డిసెంబర్‌ 12న రజినీకాంత్‌ జన్మించారు. సాధారణ కానిస్టేబుల్‌ కొడుకు నుండి సూపర్‌స్టార్‌గా మారడం వెనుక ఎంతో శ్రమ, పట్టుదల ఉన్నాయి. బెంగుళూరు ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌లో కండక్టర్‌ స్థాయి నుండి ప్రపంచం గుర్తించదగ్గ నటుడిగా రూపాంతరం చెందడం వెనుక ఆయన అవిశ్రాంత కృషి ఉంది.

స్నేహితుల సలహాలతో బెంగుళూరులోనే డ్రామాల్లో నటించినా, సినిమాలకు చిరునామా అయిన చెన్నైలోని ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌లో చేరినా, ఒక్క ఛాన్స్‌ అంటూ చెన్నై వీధుల్లో కాళ్లరిగేలా తిరిగినా, రజనీ జీవితం వెనుక కాళ్లరిగిన పాత జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. చెన్నైలోని ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌లో నట శిక్షణ తీసుకుంటున్న రజనీకాంత్‌... దర్శక శిఖరం బాలచందర్‌ కంట్లో పడటానికి కారణం ఆయన స్టైలే. కమల్‌ హాసన్‌ హీరోగా బాలచందర్‌ తెరకెక్కించిన అపూర్వరాగంగల్‌ చిత్రంలో ఓ చిన్న పాత్రకు రజనీ ఎంపికయ్యారు. ఆ చిత్రంలోని ప్రతినాయక పాత్ర నుండి ప్రపంచ సూపర్‌స్టార్‌ కావడానికి బాలచందర్‌, భారతీరాజా వంటి దిగ్గజ అవకాశాలే ఆరంభంలో మొదటి మెట్లుగా ఎదురొచ్చాయని చెప్పవచ్చు.

తెలుగులో వచ్చిన అంతులేని కథ నుండి నేటి శివాజి, రోబో వరకు అన్నిట్లో ఆయన స్టైల్‌, నటనలో ఆయన తపన, కృషి పట్టుదల, నిరాడంబరతే ఆయనను సూపర్‌స్టార్‌గా నిలబెట్టాయి. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, చిత్రాలతో దక్షినాది భాషల్లో రజనీ నటిస్తూ వచ్చారు. 1983లో మొదటిసారిగా అమితాబచ్చన్‌తో కలిసి రజనీ నటించిన అంధాకానూన్ హిందీలో సంచలన విజయం సాధించడంతో దక్షినాది సూపర్‌స్టార్‌ కాస్తా ఇండియా సూపర్‌స్టార్‌గా మారిపోయారు. ఆ వరుసలోనే బెంగాలీ చిత్రాల్లో నటిస్తూ రోజూవారి కాల్‌షీట్లు ఇచ్చే హీరోగా రూపాంతరం చెందారు. బ్లడ్‌స్టోన్‌ అనే హాలీవుడ్‌ చిత్రంలో నటించడంతో ఆయనకు ప్రపంచస్థాయి గుర్తింపు దక్కింది. అంతే కాదు కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో రజనీ నటించిన ముత్తు ప్రపంచంలోని నలుమూలల ప్రజలకు చేరువైంది. ఈ చిత్రం తర్వాత వేలాది మంది జపనీయులు రజనీకి వీరాభిమానులు కావడమే కాదు, ఆయన్ను చూసేందుకు చెన్నై తరలివచ్చారంటే ఆయనకు క్రేజ్‌ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

నాలుగు దశాబ్దాల సినీ జీవితం ఆయనలో నైరాశ్యతను పెంచాయని చెప్పవచ్చు. ఒకానొక దశలో ఎందుకీ జీవితం అంటూ హిమాలయాలకు వెళ్లి అక్కడే చివరి దశను ముగించుకోవాలనే వైరాగ్యం పెరిగింది. రాఘవేంద్ర స్వామి భక్తుడైన ఆయన ఆ దైవం పాత్రలో నటించినా తన గురువు మహావతార్‌ బాబాజీ బోధించిన పాత్రలో జీవించినా ఏదో తెలియని లోటు ఆయన్ను వెంటాడుతూనే ఉండేది.

సినిమా అయినా, జీవితమైనా రాజకీయమైనా ఆయనకు ఆయనే సాటి. సినిమాలను ఎప్పుడో ఏలేసిన రజనీకాంత్‌ ప్రస్తుతం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారారు. నా రూటే సపరేట్‌ అంటూ తమిళ రాజకీయాల్లో కేంద్రబిందువయ్యారు. రజనీకాంత్‌ దేశ చలన చిత్ర సీమలో సూపర్‌స్టార్‌గా ప్రభంజనం ఎగురవేస్తున్న తరుణంలో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావుతో ఉన్న పరిచయం తమిళనాడులో అన్నాడీఎంకే పొత్తుతో కాంగ్రెస్‌ విజయం సాధించింది. అప్పడు ఆయన రాజకీయాల్లోకి రాలేదు గాని కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచాడు. దీంతో అప్పటి ఎన్నికల్లో కాంగ్రెస్‌ అన్నాడీఎంకే విజయదుందుభి మోగించింది. కాని కొన్ని రాజకీయ కక్షసాధింపు చర్యలు ఆయనకు ఆగ్రహాన్ని తెప్పించాయి. ఆ తర్వాత ఆయన డీఎంకే, టీఎంసీ కూటమికి మద్దతివ్వడంతో ప్రజలు ఆ కూటమికే పట్టం కట్టారు. రాజకీయ నాయకుల విధానాలు నచ్చకపోవడంతో అప్పటి నుండి రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు రజనీ.

తమిళనాడులో పెద్ద పార్టీల అధ్యక్షులు కరుణానిధి, జయలలితతో పాటు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ నేతలైన నరేంద్రమోదీ, చిదంబరం వంటి అగ్రనేతలతో రజనీ స్నేహబంధం కొనసాగించారు. కాని రాజకీయాలపై మాత్రం నోరు మెదపలేదు. ఎన్నోసార్లు అభిమానులు ఆయన్ను రాజకీయాల్లోకి రావాలని కోరినా ఆయన సుముఖత చూపలేదు.

విమర్శలు, అనారోగ్యం ఎదురైనా రజనీ నిరాశ పడలేదు. అన్నింటినీ అధిగమించి కెరటంలా ముందుకు దూసుకుపోయారు. ఆయన పొందని అవార్డు లేదు, అందుకోని పురస్కారం లేదు. దేశ అత్యున్నత గౌరవమైన పద్మభూషన్‌తో పాటు, ఎన్నో సత్కారాలు ఆయనకు అందాయి. ముందుండి నడిపించే సతీమణి లత, ఇద్దరు కుమార్తెలు ఆయనకెప్పుడూ రెండు కళ్లే. ప్రతి పుట్టిన రోజున ఆధ్యాత్మిక దారిలో వేడుకలకు దూరంగా ఉండే రజనీ 2016లో అభిమానుల ముందుకు రాగా ఈఏడు ఏకంగా రాజకీయ అరంగ్రేటం చేశారు. 

గజల్ శ్రీనివాస్ స్పందన...

హైదరాబాద్ : యువతి ఫిర్యాదుతో గజల్ శ్రీనివాస్ ను పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. లైంగికంగా వేధించాడంటూ ఆ యువతి చేస్తోన్న ఆరోప‌ణ‌లు హల్ చల్ చేస్తున్నాయి. త‌న‌పై ఆరోప‌ణ‌లు వ‌స్తోన్న‌ నేప‌థ్యంలో గ‌జ‌ల్ శ్రీనివాస్ స్పందించారు. త‌న‌పై ఆమె ఎందుకు ఆరోప‌ణ‌లు చేసిందో త‌న‌కు తెలియ‌ద‌ని అన్నారు. ఆమెతో తాను మసాజ్ చేయించుకోలేదని, ఆమె చేస్తోన్న ఆరోపణల్లో నిజం లేదని అన్నారు. 

13:41 - January 2, 2018
13:40 - January 2, 2018

హర్యానా : రాష్ట్రంలోని పల్ వల్ జిల్లాలో ఒక్కరోజే ఆరు హత్యలు జరగడం తీవ్ర కలకలం రేపింది. ఓ సైకో ఇనుప రాడ్ తో దాడి చేసి అతి కిరాతకంగా చంపేశాడు. రాత్రి 2గంటల నుండి తెల్లవారుజాము వరకు ఈ కిరాతకం కొనసాగింది. ఐదుగురిని రోడ్డుపై హత్య చేయగా ఓ ఆసుపత్రిలో మహిళను చంపేశాడు. హత్యకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మతిస్థిమితం లేకపోవడంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆసుపత్రిలో సైకో సంచరిస్తుండడం దృశ్యాలు రికార్డయ్యాయి. ఒక్కసారిగా జరిగిన ఈ హత్యలతో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. 

నాంపల్లి కోర్టుకు గజల్ శ్రీనివాస్..

హైదరాబాద్ : ప్రముఖ గజల్ గాయకుడు 'గజల్ శ్రీనివాస్' ను పోలీసులు నాంపల్లి కోర్టుకు తరలించారు. లైంగిక వేధించాడని యువతి పంజాగా పీఎస్ లో ఫిర్యాదు చేసింది. 

13:32 - January 2, 2018

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ మాయమాటలు చెప్పడంలో దిట్ట అని..ఆయన చేసిన మాయ మాటలతో జనసేనానీ అధినేత పవన్ కళ్యాణ్ పడిపోయరని టి.కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని, విద్యుత్ వెనుకున్న దోపిడిని పవన్ గుర్తించాలన్నారు. వాస్తవాలు తెలుసుకోవడానికి విద్యుత్ ఇంజినీర్ రాసిన పుస్తకం పవన్ కు పంపిస్తామనాన్రఉ. విద్యుత్ కోరత లేకుండా చేసింది కాంగ్రెస్సేనని, రైతులు 24గంటలు కరెంటు అడబగడం లేదని నాణ్యమైన విద్యుత్ ఉదయం వేళ 9గంటలు ఇస్తే చాలని రైతులు కోరుతున్నట్లు రేవంత్ తెలిపారు. 

13:23 - January 2, 2018

కర్నూలు : రోడ్డు ప్రమాదాలకు చెక్ పడడం లేదు. మితిమీరిన వేగం..నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేయడం వల్ల నిండు జీవితాలు గాలిలో కలసిపోతున్నాయి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా పది మందికి గాయాలయ్యాయి. ఎమ్మిగనూరు నుండి ఆదోనికి టాటా ఎస్ వాహనం వెళుతోంది. ఇందులో 12 మం ప్రయాణీకులున్నారు. కోటేకల్లు గ్రామం వద్ద టాటా ఎస్ ని లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. గాయాలైన పది మందిని ఆసుపత్రికి తరలించారు. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనలో టాటా ఎసీ నుజ్జునజ్జయ్యింది. ప్రమాదంలో గాయపడిన వారు..ప్రమాదంలో మృతి చెందిన కుటుంబసభ్యుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం మిన్నంటింది. 

పాక్ అత్యవసర సమావేశం..

ఇస్లామాబాద్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలతో పాక్ ప్రభుత్వ ప్రధాని షాహిద్ ఖాన్ అబ్బాసి జాతీయ భద్రత కమిటీతో అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. 

13:10 - January 2, 2018

హైదరాబాద్ : ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ పోలీసులు అరెస్టు చేయడం కలకలం రేపుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో గజల్స్ పాడడం..స్పూర్తివంతమైన పాటలు పాడే 'గజల్ శ్రీనివాస్' అరెస్టు కావడం సంచలనం సృష్టించింది. తనను లైంగికంగా వేధించారంటూ ఆలయ వాణి రేడియో జాకీ కుమారి పంజాగుట్ట పీఎస్ లో ఫిర్యాదు చేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన పోలీసులు గజల్ శ్రీనివాస్ ను అరెస్టు చేశారు. పంజాగుట్ట పీఎస్ లో ఆయన్ను విచారిస్తున్నారు. ఫిర్యాదు చేసిన మహిళను కూడా విచారిస్తున్నారు. యువతి ఎలాంటి ఆధారాలు సమర్పించారనేది తెలియడం లేదు. తాను ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదని గజల్ శ్రీనివాస్ పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. గజల్ శ్రీనివాస్ ను అరెస్టు చేశారన్న వార్త తెలుసుకున్న ఆయన అభిమానులు పీఎస్ కు చేరుకుంటున్నారు. పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. 

సురేష్ స్కూల్ వద్ద ధర్నా...

విజయనగరం : పార్వతీపురం సురేష్ స్కూల్ వద్ద ఎస్ఎఫ్, డీవైఎఫ్ఐ, వామపక్ష పార్టీ నేతలు ధర్నా నిర్వహించారు. స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పేర్కొంటూ హాస్టల్ లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. స్కూల్ యాజమాన్యం అడ్డుకుంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు.

ఎస్ టివో కార్యాలయానికి తాళం...

మెదక్ : నర్సాపూర్ ఎస్ టివో కార్యాలయానికి తాళం పడింది. అద్దె చెల్లించకపోవడంతో ఇంటి యజమాని తాళం వేశాడు. 10-15 నిమిషాలు ఉద్యోగులు బయటే నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు...

నెల్లూరు : రావూరు, సోమశిల, ఉదయగిరి మండలాల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. రూ. 50 లక్షల విలువైన ఎర్రచందనం, రూ. 8 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. 14 మంది అంతర్ రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేశారు. పట్టుబడిన వారిలో ఆరుగురు కడప జిల్లా వాసులున్నారు. 

12:32 - January 2, 2018

హైదరాబాద్ : ప్రముఖ గజల్ గాయకుడు 'గజల్ శ్రీనివాస్' ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనపై లైంగిక ఆరోపణలున్నాయి. శారీరకంగా వేధిస్తున్నాడని రేడియో జాకీ కుమారి పంజాగుట్ట పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును అందుకున్న పోలీసులు సాక్ష్యాధారాలు పరిశీలించారు. పక్కా సాక్ష్యాధారాల ఉండడంతో గజల్ శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆలయవాణి అనే రేడియో ను గజల్ శ్రీనివాస్ నిర్వహిస్తున్నారు. ఇందులో రేడియో జాకీగా కుమారి పనిచేస్తోందని తెలుస్తోంది. 

12:30 - January 2, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకున్న నిర్ణయంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 24గంటల పాటు రైతులకు కరెంటు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం పేర్కొన్న సంగతి తెలిసిందే. దీనిపై మంగళవారం టి.కాంగ్రెస్ నేత రేవంత్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మొత్తం 55 లక్షల 54 వేల మంది రైతులున్నారని, అందులో 48 లక్షల మంది చిన్న, సన్నకారు రైతులని పేర్కొన్నారు. ఒక ఎకరం..ఐదు ఎకరాల భూమి ఉన్న వారు 90 శాతం రాష్ట్రంలో ఉన్నారని, ఐదెకరాల పొలం ఉంటే ఒక ఎకరానికి నీరు రావాలంటే 5హెచ్ పీ మోటర్ ఉపయోగిస్తే గంట సమయం పడుతుందని పేర్కొన్నారు. 9 గంటలు ఉదయం పూట నిరంతరం సరఫరా ఇవ్వాలని, 24గంటలు ఇవ్వడంలో ఎలాంటి లాభం జరగదన్నారు. 24 గంటల కరెంటు ఇవ్వడంలో చాలా ప్రమాదం దాగి ఉందని, గతంలో కరెంటు సరఫరా విషయంలో ఆనాడు ప్రశ్నించారని గుర్తు చేశారు. ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు లాభం చేకూర్చాలని ప్రభుత్వం పయనిస్తోందన్నారు. 

గజల్ శ్రీనివాస్ అరెస్టు..

హైదరాబాద్ : ప్రముఖ గజల్ గాయకుడు 'గజల్ శ్రీనివాస్' ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయపై లైంగిక వేధింపులు ఆరోపణలున్నాయి. తనను లైంగికంగా వేధించడంటూ పంజాగుట్ట పీఎస్ లో రేడియో జాకీ కుమారి ఫిర్యాదు చేశారు.

గవర్నర్ తో డీజీ జేఏసీ నేతలు...

హైదరాబాద్ : ఉభయ రాష్ట్రాల గవర్నర్ ను డీజీ జేఏసీ నాయకులు కలిశారు. ఆదిలాబాద్ గిరిజనులపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని, ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని కోరారు. 

12:13 - January 2, 2018
12:11 - January 2, 2018

విజయవాడ : దుర్గగుడిలో తాంత్రిక పూజలు చేశారనే ఓ ప్రచారం కలకలం రేపుతోంది. అర్దరాత్రి మహిషాసుర మర్దిని అవతారంలో అలంకరించి పూజలు నిర్వహించారని పుకార్లు షికారవుతున్నాయి. పలు సమస్యలు ఏర్పడుతుండడంతో పూజలు నిర్వహించడం ఒక్కటే పరిష్కారమని పలువురు సూచించడంతో పూజారి భద్రినాథ్ ఇతరుల సహాయం తీసుకుని అర్ధరాత్రి పూజలు నిర్వహించినట్లు తెలుస్తోంది. దీనిపై ఆలయ అధికారులు కొట్టిపారేస్తున్నారు. రాష్ట్రపతి సతీమణి పర్యటన నేపథ్యంలో ఆలయాన్ని శుద్ధి చేయడం జరిగిందని పేర్కొంటున్నారు. ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు విచారణ చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఆలయంలో ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

దుర్గగుడిలో అర్ధరాత్రి పూజలు...?

విజయవాడ : దుర్గగుడిలో తాంత్రిక పూజలు నిర్వహించారని ప్రచారం జరుగుతోంది. సమస్యలు అధిగమించేందుకు పూజలు నిర్వహించాలని చెప్పడంతో పూజలు చేశారని తెలుస్తోంది. అర్ధరాత్రి పూజలు చేయడం ఆగమశాస్త్ర విరుద్ధమని పండితులు పేర్కొంటున్నారు. రాష్ట్రపతి సతీమణి పర్యటన నేపథ్యంలో ఆలయాన్ని శుద్ది చేశామని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు.

 

11:38 - January 2, 2018
11:37 - January 2, 2018

పశ్చిమగోదావరి : జిల్లాలోని నిడదవోలులో ఓల్డ్ క్రిస్టియన్ పేటలో స్థానికులు వినూత్నంగా నూతన సంవత్సరం జరుపుకున్నారు. వైఎంసీఏ ఆధ్వర్యంలో పలువురు ఓ రైలును ఆపివేశారు. దానిని అలంకరించి కేక్ కట్ చేసి నూతన సంవత్సరం జరుపుకోవడం విశేషం. 

11:25 - January 2, 2018

హైదరాబాద్ : బేగంపేట పీఎస్ కు మందుబాబులు..వారి తల్లిదండ్రులతో కిటకిటలాడింది. డిసెంబర్ 31 రాత్రి మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిని ట్రాఫిక్ పోలీసులు పట్టుకుని వాహనాలను సీజ్ చేశారు. తల్లిదండ్రులతో హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. బుల్లితెర యాంకర్ కూడా పోలీసులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. మంగళవారం ఉదయం బేగంపేట పీఎస్ కు నోటీసులు అందుకున్న వారందరూ వచ్చారు. వీరికి ప్రొజక్టర్ సహాయంతో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్బంగా టెన్ టివితో ట్రాఫిక్ పోలీసు అధికారి మాట్లాడారు. డిసెంబర్ 31వ తేదీన మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిని పట్టుకోవడం జరిగిందని, వీరందరికీ తాము కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతోందన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ఎదురయ్యే ప్రమాదాలు వారికి తెలియచేయడం జరుగుతోందని, యాంకర్ ప్రదీప్ తప్పకుండా కౌన్సిలింగ్ హాజరు కావాల్సిందేనని స్పస్టం చేశారు. శనివారం లోపు హాజరు కావాల్సి ఉంటుందన్నారు. 

11:09 - January 2, 2018

హైదరాబాద్ : పేరెంట్స్ అసోసియేషన్ ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉంది. తిరుపతిరావు కమిటీ చేసిన ప్రతిపాదనలు పేరెంట్స్ కు అనుకూలంగా నిర్ణయాలు లేవని, కార్పొరేట్ స్కూల్ యాజమాన్యాలకు అనుకూలంగా ఉందని స్కూల్ పేరెంట్స్ నేతలు పేర్కొంటున్నారు. మంగళారం డిప్యూటి సీఎం కడియం శ్రీహరిని ప్రతినిధులు కలిశారు. సమావేశం అనంతరం వాళ్లు మీడియాతో మాట్లాడారు. ఏటా పది శాతం ఫీజులు పెంచుకోవ్చని చెప్పడం దారుణమని, తక్షణమే దీనిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సంక్రాంతికి శుభవార్త చెబుతామని గతంలో ప్రకటించారని, బంగారు తెలంగాణలో విద్య అందని ద్రాక్షగా ఉంటుందని సమావేశం అనంతరం అర్థమయ్యిందని తెలిపారు. ఆర్డినెన్స్ జారీ చేసే ప్రతిపాదన ప్రభుత్వంలో లేదని పేర్కొనడం సబబు కాదన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

కడియంతో పేరెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు...

హైదరాబాద్ : డిప్యూటి సీఎం కడియం శ్రీహరిని పేరెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు కలిశారు. తిరుపతి రావు కమటీ ప్రతిపాదనలు అమలు చేయవద్దని కోరారు. 

బాబు టెలీకాన్ఫరెన్స్...

విజయవాడ : జన్మభూమి మా ఊరు నిర్వాహణపై సీఎం చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్లు, నోడల్ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 

10:32 - January 2, 2018
10:29 - January 2, 2018

హైదరాబాద్ : టీమాస్ అంటే పేదల జీవితాలను మార్చేదని టీ మాస్ నేత కంచ ఐలయ్య తెలిపారు. హైదరాబాద్ లోని మైసమ్మ బండలో టీ మాస్ నేతలు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తాము ఎన్నికల్లో పోటీ చేయబోమని, పోటీ చేసే వారికి మద్దతిస్తామని వెల్లడించారు. బస్తీల్లో షావుకార్ల వ్యవస్థ మారాలని, పేద వారంతా షాపులు పెట్టే స్థాయికి ఎదగాలన్నారు. 

10:23 - January 2, 2018

 

హైదరాబాద్ : న్యూ ఇయర్ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో బుల్లితెర యాంకర్ ప్రదీప్ పట్టుబడడం సంచలనం సృష్టించింది. 31వ రోజు రాత్రి మద్యం సేవించి వాహనాలు నడుపవద్దని..నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ముందస్తు హెచ్చరికలు చేశారు. ఈ హెచ్చరికలు బేఖాతర్ చేసిన పలువురు మద్యం బాబులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం రాత్రి బంజారహిల్స్ లో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. టీఎస్ 07 ఇయూ 6666 కారులో వస్తున్న యాంకర్ 'ప్రదీప్'ను బ్రీత్ టెస్టు నిర్వహించారు. బ్రీత్ ఎనలైజర్ టెస్టులో ఏకంగా ప్రదీప్ కు 178 పాయింట్లు నమోదైంది. వెంటనే ఆయన కారును స్వాధీనం చేసుకున్నారు. పాయింట్ల ఆధారంగా రెండు నుండి ఏడు రోజుల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. బేగంపేట పీఎస్ లో కౌన్సిలింగ్ ప్రదీప్ తో పాటు ఆయన తల్లిదండ్రులు కావాల్సి ఉంటుందని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ఈ నేపథ్యంలో ప్రదీప్ కౌన్సిలింగ్ కు హాజరవుతారా ? లేదా ? అనేది తెలియరాలేదు. కోర్టు ఫైన్ తో సరిపెడుతుందా ? జైలు శిక్ష విధిస్తారా ? చూడాల్సి ఉంది. 

10:13 - January 2, 2018

హైదరాబాద్ : లంగర్ హౌస్ లో రౌడీషీటర్లు రెచ్చిపోయారు. అప్పు తీర్చాలని కోరిన వ్యక్తి ఇంటిపై రౌడీషీటర్ల ముఠా దాడికి పాల్పడింది. డిఫెన్స్ కాలనీలో నివాసం ఉంటున్న హకీం ఇంటిపై రౌడీషీటర్లు దాడికి పాల్పడ్డారు. మూసి ఉన్న తలుపులను ధ్వంసం చేసి ఇంట్లోకి చొరబడ్డారు. హకీం ఇంట్లో లేకపోవడంతో ఆయన భార్య..కుమారుడిపై దాడి చేశారు. హాకీ స్టిక్స్..తల్వార్ లతో ఇంట్లో ఉన్న సామాగ్రీని ధ్వంసం చేశారు. బీరువాలో ఉన్న రూ. 40వేల నగదు..హకీం భార్యపై ఉన్న నగలను దొంగిలించారు. ఇంటి బయట ఉన్న స్కూటర్ ను ధ్వంసం చేస్తూ స్థానికులను బెదిరించుకుంటూ వెళ్లిపోయారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. 

10:08 - January 2, 2018

చిత్తూరు : మళ్లీ ఎర్రచందనం స్మగ్లర్లు పేట్రేగిపోయారు. కూంబింగ్ నిర్వహిస్తున్న టాస్క్ ఫోర్స్ పోలీసులపైకి రాళ్ల వర్షం కురిపించారు. శ్రీవారి మెట్టు సమీపంలోని వాటర్ సంప్ సమీపంలోని అడవిలో టాస్క్ ఫోర్స్ పోలీసులు సోమవారం అర్ధరాత్రి కూంబింగ్ నిర్వహించారు. పోలీసులకు ఎర్రచందనం స్మగ్లర్లు తారసపడ్డారు. లొంగిపోవాలని పోలీసులు సూచించారు. కానీ స్మగర్లు రాళ్ల దాడికి పాల్పడ్డారు. కత్తులు..బరిసెలను పోలీసులపైకి విసిరారు. ఈ ఘటనలో హరికృష్ణ అనే పోలీసు చేతికి తీవ్రగాయమైంది. ఆత్మరక్షణార్థం పోలీసులు గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. వెంటనే స్మగ్లర్లు తలో దిక్కుకు పారిపోయారు. ఘటనా స్థలంలో 29 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 30 మంది స్మగ్లర్లు ఉంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు. స్మగ్లర్ల కోసం టాస్క్ ఫోర్స్ పోలీసులు గాలింపులు చేపడుతున్నారు. 

సోమిడిలో దంపతుల దారుణ హత్య...

వరంగల్ : కాజీపేట (మం) సోమిడిలో దారుణం చోటు చేసుకుంది. దంపతులను దుండగులు దారుణంగా హత్య చేశారు. కుటుంబ కలహాలే కారణమని తెలుస్తోంది. 

నక్కలదిన్నెలో ఎస్పీ..డీఎస్పీల పర్యటన...

కర్నూలు : దళితుల గ్రామ బహిష్కరణ నేపథ్యంలో రుద్రవరం (మం) నక్కలదిన్నెలో జిల్లా ఎస్పీ గోపినాథ్, డీఎస్పీ చక్రవర్తిలు పర్యటించారు. దళిత వాడకు ఎస్పీ నీటి సరఫరాను పునరుద్ధరించారు. 

09:34 - January 2, 2018

జమ్ము కాశ్మీర్‌ : పుల్వామా జిల్లాలో సెర్చ్‌ ఆపరేషన్‌ ముగిసింది. సెర్చ్‌ ఆపరేషన్‌లో భాగంగా భద్రతాదళాలు ముగ్గురు జైషే మహ్మద్‌కు చెందిన ఉగ్రవాదులను హతమార్చాయి. చనిపోయిన ఉగ్రవాదుల్లో 16 ఏళ్ల బాలుడు ఉండడం గమనార్హం. ఆదివారం సిఆర్‌పిఎఫ్‌ శిక్షణా కేంద్రంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఐదుగురు జవాన్లు అమరులయ్యారు. సీఆర్‌పీఎఫ్‌ శిక్షణా కేంద్రంపై ఆదివారం ఉగ్రదాడి జరిగింది. పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్‌ ఉగ్రవాదులు భద్రతా బలగాలపై గ్రనేడ్లతో దాడి చేసి విచక్షణా రహితంగా కాల్పులకు పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో సిఆర్‌పిఎఫ్‌కు చెందిన ఐదుగురు జవాన్లు అమరులయ్యారు.

భద్రతాబలగాలు నిర్వహించిన సెర్చ్‌ ఆపరేషన్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆదివారం ప్రారంభమైన ఈ ఆపరేషన్‌ సోమవారం మధ్యాహ్నం వరకు కొనసాగిందని అధికారులు తెలిపారు. చనిపోయిన ఉగ్రవాదుల్లో 16 ఏళ్ల బాలుడు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ బాలుడు ఓ పోలీస్‌ అధికారి కుమారుడు కావడం గమనార్హం. నెల రోజుల ముందే జైష్‌-ఎ-మహ్మద్‌ సంస్థలో చేరాడు. సిఆర్‌పిఫ్‌ క్యాంపుపై దాడికి ముందు ఆ బాలుడు ఓ వీడియో మెసేజ్‌ రికార్డు చేసినట్లు అధికారులు తెలిపారు. 'కొన్ని నెలల క్రితమే ఈ శిబిరంపై దాడి చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ సందేశం మీకు అందేసరికి నేను ఆ దేవుడి వద్దకు చేరిపోయి ఉంటాను. మీరు కూడా జైషే-మహ్మద్‌లో చేరండని మెసేజ్‌ చేశాడు. 8 నిముషాల నిడివి కల ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

09:28 - January 2, 2018

లంగర్ హౌస్ లో రౌడీషీటర్ల హల్ చల్..

హైదరాబాద్ : అప్పు తీర్చాలని అడిగినందుకు ఓ దంపతులపై దాడికి దిగారు. నానా బీభత్సం సృష్టించారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. లంగర్ హౌస్ డిఫెన్స్ కాలనీలో హకీం దంపతులు నివాసం ఉంటున్నారు. అప్పు తీర్చాలని అడిగినందుకు కొంతమంది రౌడీషీటర్లు వారి నివాసం ముందు హల్ చల్ చేశారు. హాకీ స్టిక్స్..తల్వార్ లతో యువకులు హకీం ఇంటికి వచ్చి దాడికి పాల్పడ్డారు.

రాజధానిని వీడని పొగమంచు...

ఢిల్లీ : దేశ రాజధానిని పొగ మంచు వీడడం లేదు. దట్టంగా మంచు ఉండడంతో రవాణా వ్యవస్థపై పెనుప్రభావం చూపించింది. విమానాలు..రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. మంగళవారం 21 రైళ్లను రద్దు చేయగా, 24 రైళ్ల రాకపోకల్లో మార్పు చేశారు. 6 విమానాలను రద్దు చేయగా 20 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. 

09:21 - January 2, 2018

ఢిల్లీ : దేశ రాజధానిని పొగ మంచు వీడడం లేదు. దట్టంగా మంచు ఉండడంతో రవాణా వ్యవస్థపై పెనుప్రభావం చూపించింది. విమానాలు..రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. మంగళవారం 21 రైళ్లను రద్దు చేయగా, 24 రైళ్ల రాకపోకల్లో మార్పు చేశారు. 6 విమానాలను రద్దు చేయగా 20 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీనితో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

09:17 - January 2, 2018

హైదరాబాద్ : అప్పు తీర్చాలని అడిగితే ఏం చేస్తారు ? ఏం చేస్తారు. ఆ రోజు కాకపోతే మరుసటి రోజు..ఫలానా టైంలో ఇస్తామని చెబుతారు...అంటారు కదా..కానీ అప్పు తీర్చాలని అడిగినందుకు ఓ దంపతులపై దాడికి దిగారు. నానా బీభత్సం సృష్టించారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. లంగర్ హౌస్ డిఫెన్స్ కాలనీలో హకీం దంపతులు నివాసం ఉంటున్నారు. అప్పు తీర్చాలని అడిగినందుకు కొంతమంది రౌడీషీటర్లు వారి నివాసం ముందు హల్ చల్ చేశారు. హాకీ స్టిక్స్..తల్వార్ లతో యువకులు హకీం ఇంటికి వచ్చి దాడికి పాల్పడ్డారు. దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ టివి ఫుటేజ్ లో రికార్డయ్యాయి. బీరువాలోని నగదు..నగలను ఎత్తుకెళ్లినట్లు సమాచారం. రౌడీషీటర్ సయ్యద్ తో పాటు మరో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. 

09:11 - January 2, 2018

చెన్నై : ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. ఈ మేరకు ఆయన ఓ కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మంగళవారం మహారాజు రామకృష్ణ గణ మిషన్ కు రజనీ వెళ్లారు. అక్కడ మహారాజ గౌతమానంద ఆశీస్సులను తీసుకున్నారు. ఏదైనా కార్యక్రమం చేపట్టే ముందు ఆయన స్వామి ఆశీస్సులను తీసుకుంటారని ప్రచారం ఉంది. రాజకీయాల్లో అనుసరించాల్సిన దానిపై రజనీ వ్యూహావలు రచిస్తున్నట్లు టాక్. ఇప్పటికే ఓ వెబ్ పోర్టల్ ను కూడా రజనీ ప్రారంభించారు. రాజకీయాలు మార్పు కోరుకొనే వారందరూ సభ్యత్వం తీసుకోవాలని కోరారు. రోబో, కాలా సినిమాలు పూర్తయిన తరువాత ఆయన పొలిటికల్ లో రానున్నారు. 

08:54 - January 2, 2018

చెన్నై : తమిళ రాజకీయాలను మార్చేసేందుకు ప్రతిఒక్కరూ కలిసి రావాలని తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ పిలుపునిచ్చారు. రజని మండ్రమ్‌ డాట్‌ ఓఆర్జీ వెబ్‌ పోర్టల్‌ను ప్రారంభించిన రజనీకాంత్‌.. అభిమానులు, ప్రజలు తమ పేరును ఓటర్‌ ఐడీ నెంబర్‌ను నమోదు చేసుకోవాలని కోరారు. పోర్టల్‌లో యోగ ముద్రను రజనీకాంత్‌ ప్రధానంగా చూపించారు. తమిళనాట మంచి రాజకీయాలను నెలకొల్పుదామంటూ రజనీకాంత్‌ 74 సెకన్ల వీడియో మెసేజ్‌ను విడుదల చేశారు. 

08:14 - January 2, 2018

పశ్చిమగోదావరి : బుట్టాయిగూడెం మండలం చినజీడిపూడి కాలనీలో కట్టం నాగేశ్వరరావు అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా చంపేశారు. నిద్ర పోతున్న సమయంలో ఆయన తలపైకి నాటు తుపాకీతో కాల్చారు. ఇతనికి కొత్తూరులో 8 ఎకరాల భూమి ఉంది. పోలవరం ముంపు కింద నాగేశ్వరరావుకు కోటి రూపాయలు అందాల్సి ఉంది. భార్య మృతి చెందడంతో ఒంటిరిగా నివాసం ఉంటున్నాడు. పోలవరం ముంపు కింద ఇతని పరిహారం రావాల్సి ఉంది. సుమారు కోటి రూపాయలు రానున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం డబ్బు అందిందని స్థానికులు పేర్కొంటున్నారు. ఆప్తి విషయంలో బంధువులకు ..నాగేశ్వరరావుకు విబేధాలున్నట్లు సమాచారం. ఈ తరుణంలో ఆయన హత్యకు గురికావడం గమనార్హం. 

07:34 - January 2, 2018

వ్యవసాయరంగానికి నాణ్యమైన నిరంతర విద్యుత్ అందించడం తెలంగాణ సాధించిన అద్భుత విజయమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. తీవ్ర సంక్షోభంలో ఉన్న విద్యుత్ రంగాన్ని నేడు అన్ని రంగాలకు 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయగలుతున్నామన్నారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ప్రగతి భవన్‌లో భేటీ అయ్యారు. ముందుగా పుష్ఫగుచ్ఛం ఇచ్చి నూతన సంవత్సన శుభాకాంక్షలు చెప్పారు. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా కార్యక్రమంలో నంద్యాల నర్సింహరెడ్డి (సీపీఎం), కైలాష్ (టి.కాంగ్రెస్), రాకేష్ (టీఆర్ఎస్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

ఇవాళ్టి నుంచి జన్మభూమి-మావూరు..

విజయవాడ : ఏపీలో ఇవాళ్టి నుంచి జన్మభూమి-మావూరు కార్యక్రమం ప్రారంభవుతోంది. ఐదో విడత జన్మభూమి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ప్రజల వద్దకు వెళ్తోంది. ఈనెల 11 వరకు పది రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. పదిరోజుల పాటు జరిగే జన్మభూమి-మావూరు కార్యక్రమంలో ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తారు. ప్రకాశం జిల్లా దర్శిలో ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిని ప్రారంభిస్తారు. 

07:23 - January 2, 2018

ప్రభుత్వ హామీల అమలు కోసం టీ మాస్‌ పోరు బాట పట్టింది. ప్రభుత్వ హామీలను రంగాల వారీగా సర్వే చేసి.. అమలు కానీ హామీల కోసం విడతల వారీగా ఆందోళనలతో జనవరి మాసం మొత్తం జనంలోకి అనే కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఇంతకీ ఈ కార్యక్రమం ఉద్దేశ్యమేంటి. టీ మాస్‌ చేస్తున్న డిమాండ్‌లేమిటి ? తదితర అంశాలపై టెన్ టివి జనపథంలో టీ మాస్‌ నాయకులు జాన్‌ వెస్లీ విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

దేశ వ్యాప్తంగా ఎంఐఎం ఆందోళనలు..

హైదరాబాద్ : నేడు దేశ వ్యాప్తంగా ఎంఐఎం ఆందోళనలు చేపట్టనుంది. మెడికల్ కమిషన్ ఏర్పాటు..మెడికల్ కౌన్సిల్ రద్దును నిరసిస్తూ ఆందోళనలు చేపట్టనుంది. 

ఢిల్లీకి మంత్రి ఇంద్రకిరణ్...

ఢిల్లీ : నేడు తెలంగాణ రాష్ట్ర మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. మేడారం జాతరను జాతీయ సంపదగా గుర్తించాలని కోరనున్నారు. 

06:57 - January 2, 2018

అమెరికా : అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్థాన్‌కు గట్టి షాక్ ఇచ్చారు. ఉగ్రవాదంపై పాకిస్థాన్ సరైన చర్యలు తీసుకోవడం లేదన్న కారణంతో ఆ దేశానికి అందిస్తున్న సహాయాన్ని నిలిపివేస్తున్నట్లు ట్వీట్‌ చేశారు. పాకిస్తాన్‌ అమెరికా నేతలను మూర్ఖులుగా భావిస్తోందని మండిపడ్డారు. గత 15 ఏళ్లుగా అమెరికా మూర్ఖంగా 33 బిలియన్ డాలర్లకుపైగా పాకిస్థాన్‌కు సహాయం అందజేసిందని మండిపడ్డారు. మా నేతలను మూర్ఖులుగా భావిస్తూ, అబద్ధాలు, మోసాలు తప్ప పాకిస్తాన్‌ మాకు ఇచ్చింది ఏమీ లేదని తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్‌లో మేం వేటాడుతున్న ఉగ్రవాదులకు సురక్షిత ఆశ్రయం కల్పిస్తోందే తప్ప కొంచెం కూడా సహాయపడటం లేదని ట్రంప్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అమెరికా ప్రభుత్వం పాకిస్తాన్‌కు ఇచ్చే 25 కోట్ల 50 లక్షల డాలర్ల సహాయాన్ని నిలిపివేసే దిశగా చర్చలు జరుపుతోంది.

06:56 - January 2, 2018

ఢిల్లీ : దేశవ్యాప్తంగా ప్రజలు నూతన సంవత్సర వేడుకలు సంబరంగా జరుపుకుంటుంటే ఈశాన్య రాష్ట్రమైన అసోం ప్రజలు మాత్రం ఆందోళనతో గడిపారు. నేషనల్‌ రిజిస్టర్‌ సిటిజన్స్‌ ఆ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన జాబితాను ఆదివారం అర్థరాత్రి విడుదల చేయడమే ఇందుకు కారణం. రాష్ట్రంలో 1.9 కోట్ల మందిని మాత్రమై చట్టబద్ధమైన పౌరులుగా గుర్తిస్తూ ఎన్‌ఆర్‌సి తొలి ముసాయిదాను ప్రచురించింది. మొత్తం 3 కోట్ల 29 లక్షలమంది దరఖాస్తు చేసుకోగా.. అందులో 1కోటి 39లక్షమంది పేర్లు లేకపోవడంతో వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సోషల్‌ మీడియాలో సైతం పుకార్లు షికార్లుగా చక్కర్లు కొట్టాయి. దీనిపై స్పందించిన అధికారులు మరో జాబితాను త్వరలోనే విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ జాబితాలో పేరులేని 'నిజమైన పౌరులు' ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తుది జాబితాలో వారి పేర్లు తప్పకుండా ఉంటాయని అసోం సీఎం సోనోవాల్‌ అన్నారు. రాష్ట్రంలో ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా ప్రభుత్వం 50 వేల మిలటరీ, పారా మిలటరీ దళాలతో భద్రతా చర్యలు చేపట్టింది.

06:54 - January 2, 2018

ఢిల్లీ : ఖాళీగా ఉన్న ఆరు లోక్‌సభ స్థానాలకు గాను మూడు సీట్లకు మాత్రమే ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిషన్‌ తీరును సీపీఎం తప్పు పట్టింది. కమిషన్‌ తీరుపై సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విస్మయం వ్యక్తం చేశారు. రాజస్థాన్‌లోని అల్వార్‌, అజ్మీర్‌, బెంగాల్‌లోని ఉలుబెరియా లోక్‌సభ స్థానాలకు ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన సీఈసీ... యూపీలోని ఘోరఖ్‌పూర్‌, పుల్పూర్‌, బీహార్‌లోని అరారియా సీట్లకు ఎన్నికల షెడ్యూలు ప్రకటించకపోవడాన్ని ఏచూరి తప్పు పట్టారు. రాజ్యాంగాన్ని పరిరక్షించేలా ఎన్నికల కమిషన్‌ వ్యవహరించాలని ట్వీట్‌ చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా, నిస్పాక్షికంగా పనిచేయాలని సూచించారు.  

06:52 - January 2, 2018

అనంతపురం : ఆయన కళామతల్లి ముద్దుబిడ్డ.. కళల కోసం, బడుగుజీవుల అభ్యున్నతి కోసం పోరాడిన మహానటుడు. చిన్న వయసులోనే నాటకరంగంలోకి అడుగుపెట్టి..దేశవిదేశాల్లో అబ్బురపరిచే ప్రదర్శనలిచ్చి ఔరా అనిపించారు. తన నాటక ప్రదర్శనతో జాతిపిత మహాత్మాగాంధీ చేత కూడా ప్రశంసలు పొందిన గొప్ప కళాకారుడు బళ్లారి రాఘవ. అనంతపురంలో ఆయన పేరిట సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించేందుకు సన్నద్ధమైంది ప్రజానాట్యమండలి. పద్య నాటకాన్ని విశ్వవాప్తం చేసి పౌరాణిక నాటక రంగానికి ఘన కీర్తి తెచ్చిన వ్యక్తి బళ్లారి రాఘవ. స్వాతంత్ర్య ఉద్యమంలో సామాజిక మార్పు కోసం ప్రదర్శనలిచ్చి ప్రజా కళాకారుడిగా గుర్తింపు పొందారు. స్వాతంత్య్ర సమరయోధులుగా, న్యాయవాదిగా, నటుడిగా పేరొందిన బళ్లారి రాఘవను స్మరించుకునేందుకు..ఆయన పేరిట సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహిస్తోంది ప్రజానాట్యమండలి. మరుగునపడిన సాంస్కృతిక సౌరభాలను నేటి తరానికి పరిచయం చేయడానికి ప్రజా నాట్యమండలి ఈ ఉత్సవాలను ఘనంగా జరపాలని సంకల్పించింది. ప్రజానాట్యమండలి 9వ రాష్ట్ర మహాసభల్లో భాగంగా..అనంతపురం ఆర్ట్స్ట్‌ కాలేజీ ఆవరణలో 2,3,4 తేదీల్లో బళ్లారి రాఘవ స్మారక రాష్ట్రస్థాయి ప్రజా సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించనున్నారు.

లలిత కళాపరిషత్‌లో మూడు రోజుల పాటు చర్చలు, ఉపన్యాసాలు, సమావేశాలు, నాటక పదర్శనలు జరగనున్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కళా ప్రదర్శనలకు ప్రాధన్యత కల్పిస్తున్నారు. తొలిరోజు కళాకారులు, రచయితలు, కవులు, కళాభిమానులతో నగరంలో ప్రదర్శన నిర్వహించనున్నారు. బళ్లారి రాఘవ పేరిట సాంస్కృతిక ఉత్సవాలు చేపట్టమంటే..ప్రజా కళలలను స్మరించుకోవడమే అని రచయితలు, కవులు, కళాకారులు కొనియాడుతున్నారు. అంటరాని తనం రూపుమాపాలని పోరాడిన గొప్పవ్యక్తి అని అభివర్ణిస్తున్నారు. బళ్లారి రాఘవ స్మారక రాష్ట్రస్థాయి ప్రజా సాంస్కృతిక ఉత్సవాలను జయప్రదం చేయాలని ప్రజానాట్యమండలి సహా కవులు, కళాకారులు కోరుతున్నారు.

06:50 - January 2, 2018

హైదరాబాద్ : ఆ యాప్‌ నేరగాళ్ల పాలిట సింహస్వప్నం. ఘటనా స్థలానికి చేరుకునే లోపే పోలీసులకు అక్కడి వివరాలన్నీ అందజేస్తుంది. ఆ ప్రాంతంలో క్రిమినల్స్‌ ఎవరు ? రౌడీ షీటర్లు ఎవరు? ఇప్పటికే అక్కడ ఎలాంటి నేరాలు జరిగాయి? ఇలా సమస్త సమాచారాన్ని అందిస్తుంది. నేరాలు చేసి తప్పించుకున్నా వారి గుట్టును బయటపెడుతుంది? తెలంగాణ పోలీసులు మరో ముందడుగు వేశారు. నేరగాళ్ల పాలిట సింహస్వప్నంలాంటి స్మార్ట్‌ పోలీస్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. పోలీసులంద‌రినీ ఒకే గొడుగు కింద‌కు తేవడంతో పాటు.. ద‌ర్యాప్తు వేగాన్ని పెంచేందుకు ఉపయోగపడే టీఎస్‌కాప్‌ యాప్‌ను డీజీపీ మహేందర్‌ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. తొలుత హైదరాబాద్‌ కాప్‌ పేరుతో ప్రారంభమైన ఈ సేవలు.. ఇప్పుడు టీఎస్‌కాప్‌ పేరుతో రాష్ట్రమంత విస్తరించారు. శాంతిభద్రతల విషయంలో అన్ని విభాగాలకు ఉపయోగపడే టీఎస్ కాప్ మొబైల్ యాప్‌ను డీజీపీ అందుబాటులోకి తెచ్చారు. ఈ యాప్ ద్వారా 54 రకాల పోలీస్‌ సేవలు అందించనున్నారు. నేర పరిశోధన విభాగాల్లోని పోలీసులకు ఉపయోగపడే సమస్త సమాచారం యాప్‌లో ఉండనుంది. నేరం జరిగిన ప్రదేశానికి వెళ్లేలోపే ఈ ప్రత్యేక యాప్ ద్వారా చాలా సమాచారం అందుబాటులోకి వచ్చేలా డిజైన్‌ చేశారు.

డయల్‌ -100కి వచ్చే ఫిర్యాదులు నేరుగా సమీపంలోని పోలీస్ పెట్రోలింగ్ సిబ్బందికి చేరుతుంది. నేర పరిశోధన విభాగాల్లోని పోలీసులు అక్కడికి చేరుకునే లోపే...ఆ ప్రాంతంలో జరిగిన నేరాలు, నేరస్తుల వివరాలు స్క్రీన్‌లో ప్రత్యక్షమవుతాయి. నేరగాళ్లు ప్రస్తుతం ఏం చేస్తున్నారు.. ఎక్కడ ఉన్నారు? ఒకే తరహాలో నేరాలు ఎక్కడెక్కడ జరిగాయి? ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఎక్కడున్నాయి? ఆలయాలు, ప్రార్థనా మందిరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి. ఇలా అన్ని వివరాలు TSCOP యాప్‌లో దర్శనమిస్తాయి. దీంతో నేరం ఎవరు చేసి ఉంటారు? ఈ తరహా నేరాలు ఎవరు చేస్తారు అనే దానిపై పోలీసులకు అవగాహన వచ్చేలా ఈ యాప్‌ను తీర్చిదిద్దారు.

నేరాలు జరిగిన ప్రదేశాలకు చేరడంతో పాటు పోలీస్‌ పోర్స్‌ను అలెర్ట్ చేయడానికి ఈ యాప్ ఉపయోగపడుతుంది. ఒక్క బ‌ట‌న్ నొక్కితే అంద‌రూ అధికారులు అప్రమత్తమవుతారు. ఒక్కొ స్థాయి అధికారులకు వారికి ఉప‌యోగ‌ప‌డే వివ‌రాలు మాత్రమే క‌నిపిస్తాయి. టీఎస్‌కాప్‌ యాప్‌ ద్వారా పారదర్శక సేవలతో పాటు.. నేరాలను అదుపుచేయడానికి ఉపయోగపడుతుందని డీజీపి మహేందర్‌ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. 

06:47 - January 2, 2018

విజయనగరం : జిల్లా పార్వతీపురంలో న్యూ ఇయర్ వేడుకలు కలకలం రేపాయి. స్థానిక సురేష్ పబ్లిక్‌ స్కూల్‌లో రాత్రి న్యూ ఇయర్ వేడుకలు జరిగాయి. ఉదయం నుంచి సుమారు 200మంది విద్యార్థులకు కంటి సమస్య ఏర్పడింది. డీజే లైటింగ్‌ వల్లే కంటిసమస్యకు కారణంగా భావిస్తున్నారు. ఈ ఘటనతో... యాజమాన్యం స్కూలుకు సెలవు ప్రకటించింది. స్కూల్ యాజమాన్యం తీరుపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

06:41 - January 2, 2018

హైదరాబాద్‌ : అతిపెద్ద పారిశ్రామిక ప్రదర్శనగా పేరొందిన నుమాయిష్ ఘనంగా ప్రారంభమైంది. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో 78వ నుమాయిష్‌ను ఉప ముఖ్యమంత్రులు క‌డియం శ్రీహ‌రి, మహమూద్ అలీ, మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో 78వ నుమాయిష్‌ ఘనంగా ప్రారంభం అయింది. డిప్యూటీ సీఎంలు కడియం శ్రీహరి, మహమూద్‌ అలీ ఈ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు.

ప్రపంచంలోనే హైదరాబాద్ నుమాయిష్‌ కి ప్రత్యేక గుర్తింపు ఉన్నదని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు.1938లో 100 స్టాళ్లతో ప్రారంభమైన నుమాయిష్ .. ప్రస్తుతం 2500 స్టాళ్లకు చేరుకోవడం గొప్పవిషయం అన్నారు. ఎగ్జిబిషన్‌ సొసైటీకి తెలంగాణ ప్రభుత్వం అన్నివిధాల అండగా ఉంటుందని మంత్రి ఈట రాజేందర్‌ అన్నారు. నుమాయిష్‌ను మరింత గొప్పగా తీర్చిదిద్దుతామన్నారు.

ఎగ్జిబిషన్ సొసైటీ ద్వారా రాష్ట్రంలో 18 విద్యాసంస్థలు నిర్వహిస్తున్నారని సొసైటీ నిర్వహకులను మంత్రి కడియం శ్రీహరి ప్రశంశించారు. నుమాయిష్ ద్వారా వచ్చే డబ్బును రాష్ట్రంలో విద్య అభివృద్ధి ఉపయోగించడం గతంలో నిరాధరణకు గురైన ఎయిడెడ్ విద్యాసంస్థలను తమ ప్రభుత్వం ఆదుకుంటోందని, ఎగ్జిబిషన్‌ సొసైటీయిక అన్నివిధాల సాయం అందిస్తామని మంత్రి కడియం అన్నారు. భినందనీయం అన్నారు.

మరోవైపు నుమాయిష్‌కు వచ్చేవారి కోసం తెలంగాణ ప్రభుత్వం ఫ్రీవైఫై అందిస్తోంది. సందర్శకులకు ఎలాంటీ ఇబ్బందులు కలగకుండా దాదాపు 200 మంది వాలంటీర్లను నియమించామని ఎగ్జిబిషన్‌ సొసైటీ తెలిపింది. వచ్చే నెల 15 వరకు నుమాయిష్ కొనసాగుతుందని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నిర్వహకులు తెలిపారు.

06:37 - January 2, 2018

విజయవాడ : 2018లో ఏపీని జలనిధి రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంగా నిర్ణయించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ఈ లక్ష్య సాధనను జలవనరుల శాఖ ఇంజనీర్లు బాధ్యతగా తీసుకోవాలాని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్ర ప్రజల జీవనాడి పోలవరం సహా సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయాలని నిర్ణయించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వమించారు. జలవనరులు, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు, కాంట్రాక్టులు హాజరైన ఈ సమావేశంలో ప్రస్తుతం జరుగుతున్న పనులను వర్చువల్‌ పద్ధతిలో పరిశీలించారు. పోలవరంపై చంద్రబాబు సమీక్ష నిర్వహించడం ఇది 48వ సారి. ఎర్త్‌ వర్క్‌, స్పిల్‌వే రెగ్యులేటర్‌, కాఫర్‌ డ్యామ్‌, గేట్ల నిర్మాణంపై సమీక్షించారు. గతనెల 11 నుంచి 31 వరకు 21 రోజులు పాటు జరిగిన పనులను అధికారులు చంద్రబాబుకు వివరించారు. కాంక్రీట్‌ పనులు వేగం పెంచాలని ఆదేశించారు.

నిర్మాణం పూర్తైన ప్రాజెక్టులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని సమీక్షలో నిర్ణయించారు. ఈనెల 3న కడప జిల్లాలో జరిగే జన్మభూమి కార్యక్రమంలో గండికోట సీబీఆర్‌ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తారు. అదే విధంగా కర్నూలు జిల్లాలో నిర్మించిన సిద్ధాపురం ఎత్తిపోతలకు ఈనెల 7న నీరు విడుదల చేయాలని నిర్ణయించారు. ఈనెల 11న అనంతపురం జిల్లాలోని ధర్మవరం, బుక్కపట్నం చెరువులకు జలహారతి ఇస్తారు. శ్రీకాకుళం జిల్లా వంశధార ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాసాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. 

06:35 - January 2, 2018

హైదరాబాద్ : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ప్రగతి భవన్‌లో భేటీ అయ్యారు. ముందుగా పుష్ఫగుచ్ఛం ఇచ్చి నూతన సంవత్సన శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం ఇద్దరు నేతలు అరగంటకుపైగా వివిధ అంశాలపై చర్చించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలతోపాటు తాజా రాజకీయ పరిస్థితులు, పరిమాణాలపై చర్చించారు. గత నెల 15 నుంచి 19 వరకు హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభలకు పనిఒత్తిడి కారణంగా హాజరుకాలేకపోయానని పవన్‌ కల్యాణ్‌... ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తెచ్చారు. వ్యవసాయరంగానికి 24 గంటల విద్యుత్‌ సరఫరా అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. ఈ విషయంలో అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన కేసీఆర్‌ను పవన్‌ ప్రశంసించారు. తెలంగాణ విడిపోతే అంధకారం అవుతుందని పలువురు విమర్శించిన విషయాన్ని పవన్‌ గుర్తు చేశారు. ఏపీ నేతలు, పాలకులు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఆదర్శంగా తీసుకోవాలని జనసేనాని కోరారు.

మరోవైపు కేసీఆర్‌తో పవన్‌ భేటీపై రాజకీయవర్గాల్లో చర్చోపర్చలు సాగుతున్నాయి. పవన్‌.. కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారా లేకా రాజకీయ కోణం ఏమైనాఉందా.. అన్న అంశంపై ఉత్కంఠత నెలకొంది. కేసీఆర్ నుంచి పవన్‌ రాజకీయ సలహాలు తీసుకున్నట్టు సమాచారం. తెలంగాణ ఉద్యమానికి ముందు, రాష్ట్ర అవతరణ అనంతరం జరిగిన పరిణామాలపై ఆకసక్తిరమైన చర్చ సాగినట్టు వినిపిస్తోంది. 2019 ఎన్నికల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్న పవన్‌... సీఎం కేసీఆర్‌తో భేటీ కావడం ఆసక్తికరంగా మారింది.

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శీతాకాల విడిది కోసం గత నెల 24న హైదరాబాద్‌ వచ్చారు. రాష్ట్రపతి గౌరవార్థం ఆ రోజు రాత్రి గవర్నర్‌ నరసింహన్‌ ఇచ్చిన విందులో కూడా వపన్‌ కల్యాణ్‌... ముఖ్యమంత్రి కేసీఆర్‌ని కలిశారు. ఇద్దరూ ఒకరినొకరు పలకరించుకున్నారు. కాసేపు మాట్లాడుకున్నారు. పవర్‌, కేసీఆర్‌ భేటీ అప్పట్లో రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. నంద్యాల ఉప ఎన్నిక సమయంలో జనసేన పార్టీకి ఒక శాతం ఓట్లు కూడా రావంటూ కేసీఆర్‌ ఎద్దేవా చేశారు. దీనిపై పవన్‌ తనదైన శైలిలో స్పందించారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య సుహృద్భా వాతావరణం కనిపించిన దాఖలాలు లేవు. ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌ ప్రగతి భవన్‌కు వెళ్లి కేసీఆర్‌ను కలవడం ఆసక్తికరంగా మారింది. 

06:32 - January 2, 2018

విజయవాడ : ఏపీలో ఇవాళ్టి నుంచి జన్మభూమి-మావూరు కార్యక్రమం ప్రారంభవుతోంది. ఐదో విడత జన్మభూమి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ప్రజల వద్దకు వెళ్తోంది. ఈనెల 11 వరకు పది రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. పదిరోజుల పాటు జరిగే జన్మభూమి-మావూరు కార్యక్రమంలో ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తారు. ప్రకాశం జిల్లా దర్శిలో ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిని ప్రారంభిస్తారు.

ఈనెల 11 వరకు జరిగే జన్మభూమి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రామ సభల్లో పాల్గొంటారు. రోజుకు రెండు గ్రామ సభలకు హాజరుకావాలని నిర్ణయించుకున్నారు. ఇవాళ మొదటి రోజు ప్రకాశం జిల్లా దర్శిలో జన్మభూమి -మావూరు కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభిస్తారు. ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో గ్రామంలో ఎప్పటి నుంచే అపరిష్కృతంగా ఉన్న పనులను అధికారులు ఆగమేఘాలపై పూర్తి చేశారు. గ్రామ సభ నిర్వహణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. ప్రజల నుంచి అందే సమస్యలను ఆన్‌లైన్‌లో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. పరిష్కారం అయ్యే సమస్యలను పరిష్కరించి, కాని వాటిని కావని ప్రజకు చెప్పే ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి జన్మభూమి కార్యక్రమంలో సాధించిన ప్రగతి ఆధారంగా గ్రామాలకు స్టార్ రేటింగ్‌ ఇవ్వనున్నారు. రేపు కడప జిల్లా లింగాల మండలం పార్నపల్లె, పులివెందులలో జరిగే జన్మభూమి-మావూరు గ్రామ సభల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు.

పాక్ కు షాకిచ్చిన ట్రంప్...

ఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్థాన్‌కు గట్టి షాక్ ఇచ్చారు. ఉగ్రవాదంపై పాకిస్థాన్ సరైన చర్యలు తీసుకోవడం లేదన్న కారణంతో ఆ దేశానికి అందిస్తున్న సహాయాన్ని నిలిపివేస్తున్నట్లు ట్వీట్‌ చేశారు. పాకిస్తాన్‌ అమెరికా నేతలను మూర్ఖులుగా భావిస్తోందని మండిపడ్డారు. గత 15 ఏళ్లుగా అమెరికా మూర్ఖంగా 33 బిలియన్ డాలర్లకుపైగా పాకిస్థాన్‌కు సహాయం అందజేసిందని మండిపడ్డారు. మా

హఫీజ్ ఆస్తుల జప్తుకు రంగం సిద్ధం...

ఢిల్లీ : జమాత్ ఉద్ దవా చీఫ్, ఉగ్రవాది హఫీజ్ సయీద్ ఆస్తులను జప్తు చేసేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. హఫీజ్ సయీద్‌కు సంబంధం ఉన్న ఎన్‌జీవోలు, ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ఓ ప్రణాళిక రూపొందించింది. 

రజనీ మన్ర్డమ్ డాట్...ఓ ఆర్జీ వెబ్ పోర్టల్...

చెన్నై : తమిళ రాజకీయాలను మార్చేసేందుకు ప్రతిఒక్కరూ కలిసి రావాలని తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ పిలుపునిచ్చారు. రజని మన్డ్రమ్‌ డాట్‌ ఓఆర్జీ వెబ్‌ పోర్టల్‌ను ప్రారంభించిన రజనీకాంత్‌.. అందులో అభిమానులు, ప్రజలు తమ పేరును ఓటర్‌ ఐడీ నెంబర్‌ను నమోదు చేసుకోవాలని కోరారు. 

చైనా సరిహద్దులో రాజ్ నాథ్...

ఢిల్లీ : కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భారత్-చైనా సరిహద్దులో కాపలాకాస్తున్న ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ కుటుంబాలతో నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశికి వెళ్లిన రాజ్‌నాథ్‌కు ఐటీబీపీ సిబ్బంది గౌరవం వందనం సమర్పించారు. 

అమరులైన ఐదుగురు జవాన్లు..

ఢిల్లీ : జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో సెర్చ్‌ ఆపరేషన్‌ ముగిసింది. సెర్చ్‌ ఆపరేషన్‌లో భాగంగా భద్రతాదళాలు ముగ్గురు జైషే మహ్మద్‌కు చెందిన ఉగ్రవాదులను హతమార్చాయి. చనిపోయిన ఉగ్రవాదుల్లో 16 ఏళ్ల బాలుడు ఉండడం గమనార్హం. ఆదివారం సిఆర్‌పిఎఫ్‌ శిక్షణా కేంద్రంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఐదుగురు జవాన్లు అమరులయ్యారు. 

కమలా మిల్స్ ఘటనలో అరెస్టు..

ముంబై : కమలా మిల్స్‌ అగ్ని ప్రమాదం ఘటన కేసుకు సంబంధించి ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. కమలా కాంపౌండ్‌లోని రూఫ్‌టాప్‌లో ఉన్న వన్‌ ఎబో పబ్‌లో పనిచేస్తున్న ఇద్దరు మేనేజర్లు గిబ్సన్‌ లోపేజ్‌, కెవిన్‌ బావాలను ఉదయం అరెస్టు చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు. 

అసోంలో ప్రజల ఆందోళన..

ఢిల్లీ : దేశవ్యాప్తంగా ప్రజలు నూతన సంవత్సర వేడుకలు సంబరంగా జరుపుకుంటుంటే ఈశాన్య రాష్ట్రమైన అసోం ప్రజలు మాత్రం ఆందోళనతో గడిపారు. నేషనల్‌ రిజిస్టర్‌ సిటిజన్స్‌ ఆ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన జాబితాను ఆదివారం అర్థరాత్రి విడుదల చేయడమే ఇందుకు కారణం. రాష్ట్రంలో 1.9 కోట్ల మందిని మాత్రమై చట్టబద్ధమైన పౌరులుగా గుర్తిస్తూ ఎన్‌ఆర్‌సి తొలి ముసాయిదాను ప్రచురించింది.  

ఇండియా గేట్ కు పోటెత్తిన పర్యాటకులు..

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని ఇండియాగేట్‌ పర్యాటకులతో కిక్కిరిసిపోయింది. న్యూ ఇయర్‌ సందర్భంగా లక్షలాది మంది పర్యటకులు ఇండియాగేట్‌ను సందర్శించారు. దీంతో ఢిల్లీ వ్యాప్తంగా ట్రాఫిక్‌ జాం ఏర్పడింది. 

టీఎస్ కాప్ యాప్..

హైదరాబాద్ : ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో తెలంగాణ రాష్ట్రపోలీస్‌ శాఖ మరో ముందడుగు వేసింది. అగ్రదేశాల్లో కూడా లేనటువంటి టెక్నాలజీతో.. TS COP మొబైల్‌ యాప్‌ని డీజీపీ మహేందర్‌ రెడ్డి ఆవిష్కరించారు. శాంతిభద్రతల విషయంలో అన్ని విభాగాలకు ఉపయోగపడే విధంగా ఈ మోబైల్‌ యాప్‌ ఉంటుందని.. దీంట్లో 54 రకాల సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. 

అమెరికాకు కిమ్ హెచ్చరిక..

ఢిల్లీ : ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ నూతన సంవత్సరం తొలిరోజే అమెరికాకు తీవ్ర హెచ్చరిక చేశారు. అమెరికా భూభాగంలోని ఏ ప్రాంతాన్నైనా అణ్వాయుధాలను ప్రయోగించే చేసే శక్తి తమ దేశానికి ఉందని స్పష్టం చేశారు. కొత్త సంవత్సరం సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

Don't Miss