Activities calendar

03 January 2018

21:48 - January 3, 2018

ఢిల్లీ : భీమా కోరెగావ్ విజయ్‌ దివస్ సందర్భంగా మహారాష్ట్రలో చెలరేగిన హింసాత్మక ఘటనలపై పార్లమెంట్‌ అట్టుడికింది. పార్లమెంట్‌ ఉభయ సభల్లోనూ కాంగ్రెస్‌ ఈ అంశాన్ని ప్రస్తావించింది.లోక్‌సభలో జీరో అవర్‌లో కాంగ్రెస్‌ ఈ అంశాన్ని లేవనెత్తింది. ప్రతి ఏడాది దళితులు భీమా కోరేగావ్ స్మారకం వద్ద నివాళి అర్పిస్తారని, గతంలో ఎప్పుడూ ఇలాంటి హింస చోటుచేసుకోలేదని కాంగ్రెస్‌ పేర్కొంది. ఈ ఘటన వెనక ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి హస్తం ఉందని ఆరోపించింది. ఈ ఘటనపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేసింది. మోదీని మౌని బాబాగా అభివర్ణించిన ఖర్గే- మహారాష్ట్ర హింసపై ప్రధాని మౌనం వీడాలన్నారు. వరుస ఓటములతో కృంగిపోయిన కాంగ్రెస్‌- బ్రిటిష్‌ పాలకుల వలె 'విభజించు-పాలించు' రాజకీయాలు చేస్తోందని కేంద్రమంత్రి అనంత్‌కుమార్‌ మండిపడ్డారు.

మహారాష్ట్రలో దళితులపై జరిగిన దాడులు
మహారాష్ట్రలో జరిగిన హింసాత్మక ఘటనలపై విపక్షాల హంగామా నడుమ కేంద్రం ట్రిపుల్ తలాక్ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టింది. ట్రిపుల్ తలాక్ బిల్లును సభలోకి రాకుండా అడ్డుకునేందుకు దళితులపై హింసాకాండ అంశాన్ని కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగానే లేవనెత్తిందంటూ బీజేపీ తప్పుపట్టింది. రవిశంకర్ ప్రసాద్ చేసిన ఆరోపణలను కాంగ్రెస్ తిప్పికొట్టింది. మహారాష్ట్రలో దళితులపై జరిగిన దాడులను వ్యతిరేకిస్తున్నామే తప్ప ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును వ్యతిరేకించడం లేదని కాంగ్రెస్‌ నేత గులాం నబీ ఆజాద్‌ మంత్రి అన్నారు. బిజెపి ప్రభుత్వం దళిత వ్యతిరేకిగా పేర్కొన్నారు.

కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ తీర్మానం
ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ తీర్మానం ప్రవేశపెట్టడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. కమిటీలో సభ్యుల పేర్లను కూడా ప్రతిపాదించారు.బిల్లును సెలెక్ట్‌ కమిటికి పంపాలన్న విపక్షాల డిమాండ్‌ను కేంద్రం తోసిపుచ్చింది. ఆరు నెలల గడువులోగా చట్టం తీసుకురావాలని సుప్రీంకోర్టు చెప్పినందున పార్లమెంటు తక్షణం బిల్లును తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. లోక్‌సభలో ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుకు మద్దతు తెలిపిన కాంగ్రెస్‌...రాజ్యసభలో ఎందుకు వ్యతిరేకిస్తుందో అర్ధం కావడం లేదన్నారు. తీర్మానం ప్రవేశ పెట్టాలంటే ఒకరోజు ముందే నోటీసు ఇవ్వాలన్నారు.సభ్యుల గందరగోళం నడుమ రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్‌ కురియన్‌ సభను గురువారానికి వాయిదా వేశారు.

21:46 - January 3, 2018

భద్రాద్రి కొత్తగూడెం : వామపక్షాలు, సామాజిక శక్తులతో నూతన రాజకీయ ఫ్రంట్‌ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రారంభమైన సీపీఎం ప్రథమ జిల్లా మహాసభల్లో ఆయన పాల్గొన్నారు. గత పాలకులకు.. ప్రస్తుత పాలకులకు తేడాలేదని.. అందుకే ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ కోరుకుంటున్నామని తమ్మినేని అన్నారు. ఈ నెల 25న హైదరాబాద్‌లో ప్రజా ఫ్రంట్‌ ఆవిర్భావం జరగనున్నట్లు తమ్మినేని వీరభద్రం తెలిపారు.  

21:45 - January 3, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్‌ విషయంలో కేసీఆర్‌ చెప్పిన అబద్ధాలపై కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీ, కాంగ్రెస్‌ నాయకులు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు కేసీఆర్‌కు ప్రశ్నలు సంధించారు. కేసీఆర్‌ సీఎం అయ్యాక ఒక్క యూనిట్‌ విద్యుత్‌ కూడా ఉత్పత్తి అవలేదన్నారు. భూపాలపల్లి, జైపూర్‌ జూరాల ప్రాజెక్టులు కాంగ్రెస్‌ హయాంలో నిర్మించినవేనని, కేవలం స్విచ్ ఆన్‌ చేసి ప్రాజెక్టులు తామే నిర్మించామని కేసీఆర్‌ ప్రలోభాలు పోతున్నారన్నారు. కేవలం సెల్ఫ్‌ ప్రమోషన్‌ కోసమే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఇచ్చిన ప్రకటనలు ఇచ్చారని అవన్నీ అబద్ధాలే అన్నారు ఉత్తమ్‌. 

21:45 - January 3, 2018

కడప : జిల్లా పులివెందులలో జరిగిన రెండోరోజు జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ రోజు జన్మభూమిలో ఆరోగ్యం-ఆనందంపై అంశానికి ప్రాధాన్యతనిచ్చారు. తొలిరోజు జన్మభూమి కార్యక్రమం విజయవంతమైందన్నారు చంద్రబాబు. 16 వేల గ్రామాలు, వార్డులలో అతిపెద్ద ప్రజాసేవ కార్యక్రమమైన జన్మభూమి కొనసాగుతుందన్నారు. మిగతా రోజుల్లోనూ అన్ని అంశాలపై చర్చిస్తామన్నారు. ప్రభుత్వ పథకాలు పేదలకు సరిగా చేరుతున్నాయా ? లేదా... అనే అంశాలను పరిశీలిస్తామన్నారు . అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్‌ ముందుకు వెళ్తుందన్నారు చంద్రబాబు. ఎవరూ సహకరించకపోయినా రైతులకు రుణ విముక్తి చేశామన్నారు. డ్వాక్రా సంఘాలకు సృష్టికర్తని తానే అన్న చంద్రబాబు.. సాధికారమిత్ర ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నామన్నారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశామని అదే సమయంలో ప్రజలకు ఇబ్బంది లేని సుపరిపాలనకు నాంది పలికామన్నారు సీఎం. తినే తిండి, తాగే నీరు, పరిసరాల పరిశుభ్రత, జీవన విధానంపై మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందన్నారు చంద్రబాబు. అందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజా సంతృప్తే అభివృద్ధి, సంక్షేమానికి కొలమానని చంద్రబాబు అన్నారు.

రాజశేఖర్‌రెడ్డిని పొగడడంతో వాగ్వాదం
ఇక ఈరోజు జన్మభూమి కార్యక్రమానికి స్థానిక ఎంపీ అవినాష్‌రెడ్డి హాజరయ్యారు. సభలో మాట్లాడుతూ.. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిని పొగడడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. జిల్లాలో వైఎస్‌ ఎన్నో అభివృద్ధి పనులు చేశాన్నారు. వైఎస్ హయాంలో గండికోట, చిత్రావతి పనులు 85 శాతం పూర్తి అయ్యాయని.. టీడీపీ ప్రభుత్వం చేసింది 15 శాతం పనులేనన్నారు అవినాష్‌రెడ్డి. దీంతో కొంతమంది టీడీపీ కార్యకర్తలు అవినాష్‌రెడ్డి ప్రసంగాన్ని అడ్డుకోవడంతో సభలో కాసేపు గందరగోళం నెలకొంది. 

సభలోనే గందరగోళం చేయాలని చూస్తున్నారు..
అనంతరం మాట్లాడిన చంద్రబాబు... తన సభలోనే గందరగోళం చేయాలని సృష్టించాలనుకోవడం సరికాదన్నారు. జన్మభూమి సభలో రాజకీయాలు మాట్లాడడం సరికాదన్నారు. కుప్పం కంటే పులివెందులకే ముందుగా నీరిచ్చామని గుర్తు చేశారు. రాయలసీమను రతనాలసీమగా మారుస్తామని స్పష్టం చేశారు. పెండింగ్‌ పనులన్నీ పూర్తి చేస్తామని... ఇంకా ఏవైనా కావాలంటే వినతిపత్రం ఇస్తే పరిశీలిస్తామన్నారు చంద్రబాబు. జన్మభూమిలో భాగంగా చంద్రబాబు.. గండికోట చిత్రావతి ఎత్తిపోతలను జాతికి అంకితం చేశారు. ఎత్తిపోతల జలాలకు పూజలు చేసి సీఎం హారతిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దేవినేని, సోమిరెడ్డి, ఆదినారాయణ రెడ్డి పాల్గొన్నారు. 

20:39 - January 3, 2018

సమాజం చిమ్మ చీకట్లో మగ్గే కాలంలో వెలుగు వైపు నడిపించే క్రాంతదర్శి కావాలి..బానిస సంకెళ్లు పట్టి పీడించే కాలంలో వాటిని తెగ్గొట్టే ధీరులు కావాలి.. స్త్రీలోకాన్ని దురాచారాలు అణచివేసే కాలంలో ధైర్యంగా తలెత్తి చూసే యోధురాలు కావాలి.. అక్షర జ్ఞానం అందని కాలంలో బతుకులో వెలుగు నింపే ఉపాధ్యాయురాలు కావాలి. అలా మన చదువుల తల్లి.. మెరిసిన మొదటి అక్షరం.. మన చదువుల దేవత.. ఈ దేశ మహిళలకు, బడుగు బలహీన వర్గాల ప్రజలకు అక్షర జ్ఞానమే బతుకునిస్తుందని చెప్పని త్యాగశీలి సావిత్రీ బాయ్ ఫూలే... 187వ జయంతి సందర్భంగా వైడాంగిల్ ప్రత్యేక కథనం..

ఆమె కదిలితే అక్షరం మెరిసింది. ఆమె మాట్లాడితే స్వేచ్ఛా గానం వెల్లివిరిసింది. ఆమె అంటే చదువు.. ఆమె అంటే వెలుగు.. ఆమె అంటే ముందడుగుఆమె అంటే తిరుగుబాటు.ఆమెఅంటేపోరాటం.ఆమెమనతొలిఉపాధ్యాయురాలు తొలిఅధ్యాపకురాలు.సామాజిక సేవకురాలు..సమాజం మారాలని మాటలు చెప్పకుండా చేతలతో చూపిన వనిత..స్త్రీలోకపు ఆత్మగౌరవం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన ధీర..మాతృహృదయంతో సమాజానికి ప్రేమ పంచిన మహనీయురాలు సావిత్రీ బాయ్ ఫూలే..ఆకాశంలో సగం అంటూ మాటలకే పరిమితమౌతున్న కాలం..

అందని ఆకాశం కాదు.. కింద నేలమీద సగం కావాలి..అలాంటి స్ఫూర్తిని తన జీవితం ద్వారా రగిలించారు సావిత్రీ బాయ్ ఫూలే..హక్కులను నిరాకరిస్తూ.. మహిళల పట్ల చిన్న చూపు చూసే సమాజంలో మార్పు రావాలని తపించిన తొలి అధ్యాపకురాలు సావిత్రీ బాయ్ ఫూలే..మార్పు సాకారమయిందా?మహిళలు వివక్షను అధిగమించి దూసుకెళ్తున్నారా..?పైపైన చూస్తే చాలా మార్పు వచ్చినట్టు కనిపిస్తుంది. కానీ, రూపు మార్చుకునే వివక్ష స్త్రీని వస్తువులా చూస్తూనే ఉంది. అలాంటి సమయంలో సావిత్రీ బాయ్ ఫూలు జీవితం మనకు ఆదర్శం కావాలి. ఆమె అడుగు జాడల్లో మహిళా లోకం, ఈ సమాజం ఉద్యమించాలి. స్వేచ్ఛా సమానత్వాలకోసం పోరాడాలి. 

19:24 - January 3, 2018

భారతదేశంలో గత 50 సవంత్సరల నుంచి ప్రశ్నలు వేస్తున్నారని, జ్యోతిష్యం నిజమా కాద అని ప్రతి సారి ప్రశ్నలు తల్తెతున్నాయిని, మనం చిన్నప్పుడు చదువుకున్న పుస్తకాల్లో సూర్యుడు చుట్టు 9 గ్రహలు ఉంటాయని మనం చదువుకున్నామని. సూర్యుడు ఒక నక్షత్రం అని, జ్యోతిష్యంలో ఉన్న గ్రహాలు, తిథులు అన్ని అవాస్తమని బాబు గోగినేని అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

https://youtu.be/QBTZKsGbQVY

 

జగన్ అక్రమాస్తుల కేసులో ఆస్తుల అటాచ్

హైదరాబాద్ : జగన్ అక్రమాస్తుల కేసులో జగన్ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. రూ.117.74కోట్ల ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ ప్రకటించింది. శ్యాంప్రసాద్ రెడ్డి, ఇందు ప్రాజెక్ట్ ఆస్తులు అటాచ్ చేశారు. ఎంబసీ ప్రాపర్టీ డెలప్ మెంట్, వసంత ప్రాజెక్ట్ ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేసింది.   

19:16 - January 3, 2018

ఢిల్లీ : ట్రిపుల్ తలాక్ బిల్లుపై రాజ్యసభ దద్దరిలింది. లోక్ సభలో ప్రశాంతంగా ఆమోదం పొందిన ట్రిపుల్ తలాక్ బిల్లు రాజ్య సభలో మాత్రం అడ్డంకులు ఎదుర్కొవాల్సి వచ్చింది. ట్రిపుల్ తలాక్ బిల్లులో లోపాలున్నాయని, బిల్లును సెలక్ట్ కమిటీ పంపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. దీనిపై కాంగ్రెస్ తీర్మానం కూడా చేసింది. కాంగ్రెస్ తీరు పై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తీవ్రంగా స్పందించారు. తీర్మానం ఇవ్వలంటే ఒక రోజు ముందు నోటీసులు ఇవ్వాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ తీరు దేశం చూస్తుందని జైట్లీ తెలిపారు. 

19:09 - January 3, 2018

హైదరాబాద్ : జగన్ అక్రమాస్తుల కేసులో జగన్ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. రూ.117.74కోట్ల ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ ప్రకటించింది. శ్యాంప్రసాద్ రెడ్డి, ఇందు ప్రాజెక్ట్ ఆస్తులు అటాచ్ చేశారు. ఎంబసీ ప్రాపర్టీ డెలప్ మెంట్, వసంత ప్రాజెక్ట్ ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేసింది.   

18:43 - January 3, 2018

చిత్తూరు : తిరుపతిలో ఫార్మా డి విద్యార్థులు ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఆరేళ్ళ కోర్సు పూర్తి చేసినా...ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. వారం రోజులుగా ఆందోళన చేస్తున్నా పట్టించుకునేనాథుడే కరువయ్యాడని మండిపడుతున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. 

18:43 - January 3, 2018

కడప : జిల్లా పులివెందులలో జరుగుతున్న జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, ఎంపీ అవినాశ్‌రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. జన్మభూమి కార్యక్రమంలో ప్రసంగించిన అవినాష్‌రెడ్డి.. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిని పొగిడారు. జిల్లాలో వైఎస్‌ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారన్నారు. దీంతో వేదికపై గందరగోళం నెలకొంది. దీంతో అవినాష్‌రెడ్డి మైక్‌ను కట్‌ చేసి.. పలువురు అడ్డుకున్నారు. దీనిపై కల్పించుకున్న చంద్రబాబు.. ఈ వేదికపై రాజకీయాలు చేయకూడదని సూచించారు. ముఖ్యమంత్రి సభలోనే గందరగోళం సృష్టించాలనుకోవడం సరికాదన్నారు. ఎవరేమీ అభివృద్ధి చేశారో ప్రజలకు తెలుసని చంద్రబాబు అన్నారు.

18:41 - January 3, 2018

కృష్ణా : విజయవాడ దుర్గగుడిలో తాంత్రిక పూజలపై విశాఖ పెందుర్తి శ్రీసరదాపీఠాధిపతి స్వరూపానంద సరస్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్రమైన హిందూ ఆలయంలో తాంత్రిక పూజలు జరపడం అపచారమన్నారు. సంప్రదాయాలను కాపాడాల్సినవారే ఇలాంటి చర్యలకు పాల్పడటం సబబు కాదన్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. దుర్గ గుడిలో ఎలాంటి తాంత్రిక పూజలు జరగలేదని దుర్గ గుడి ఈవో సూర్యకుమారి మరోసారి స్పష్టం చేశారు. నిత్యం జరిగే పూజలు, శుద్ది కార్యక్రమం మాత్రమే నిర్వహించారన్నారు. ఈ ఘటనపై విచారణ జరుగుతుందని... కొంతమంది సహించలేనివారే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారన్నారు సూర్యకుమారి. 

చంద్రబాబు ఎంపీ అవినాష్ రెడ్డి మధ్య వాగ్వాదం

కడప : సీఎం చంద్రబాబు సభకు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి హాజరైయ్యారు. సభలో వైఎస్ ను పొగుడుతూ అవినాష్ రెడ్డి ప్రసంగించారు. అలా మాట్లాడటం తప్పని సీఎం అవినాష్ రెడ్డిని వారించారు. సభలో కొద్దిసేపు గందరగోళ పరిస్థితి మారింది. 

బస్టాండ్ లో బాత్రూమ్ లు కట్టాలని స్తంభం ఎక్కిన వ్యక్తి

వనపర్తి : జిల్లా ఖిల్లా ఘనపురం బస్టాండ్ లో బాత్రూమ్ లు నిర్మించాలంటూ సామ్యానాయక్ అనే వ్యక్తి కరెంట్ స్తంభం ఎక్కారు. 

హైకోర్టు విభజనపై న్యాయవాదుల భేటీ

హైదరాబాద్ : హైకోర్టు విభజనపై ఉమ్మడి రాష్ట్రాల న్యాయవాదులు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కోర్టు విభజన పై చర్చించారు. 

ట్రిపుల్ తలాక్ బిల్లుకు తము వ్యతిరేకం కాదు : కాంగ్రెస్

ఢిల్లీ : ట్రిపుల్ తలాక్ బిల్లుకు తము వ్యతిరేకం కాదని, బిల్లును మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతోనే  సెలక్ట్ కమిటీ పంపాలని కోరుతున్నామని కాంగ్రెస్ తెలిపింది. 

మంద కృష్ణ బెయిల్ పిటిషన్ నిరాకరణ

హైదరాబాద్ : ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ బెయిల్ పిటిషన్ కోర్టు నిరాకరించింది. ఆయన 48 గంటల ఉపవాస దీక్ష చేసినందుకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనకు ఈనెల 11వరకు రిమాండ్ విధించింది.

17:41 - January 3, 2018
17:40 - January 3, 2018

పెద్దపల్లి : టెన్‌టీవీ ప్రజలతో మమేకమై... ప్రజా మన్ననలు పొందుతోందని మంథని ఎమ్మెల్యే పుట్ట మధుకర్‌ అన్నారు... అదే ఒరవడిని కొనసాగిస్తూ... మరింతగా సమస్యలను వెలుగులోకి తేవాలని కోరారు... టెన్‌టీవీ క్యాలెండర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే మధుకర్... టెన్‌టీవీ ప్రభుత్వానికి ప్రతిపక్షంగా నిలవాలన్నారు.

17:39 - January 3, 2018

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలో రోడ్డుప్రమాదం జరిగింది. అశ్వాపురం మండలం బి.జి.కొత్తూరు గ్రామం దగ్గర ప్రధాన రహదారిపై జరిగిన ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఎనిమిది మంది గాయపడ్డారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ పైపులైన్‌ పని చేస్తున్న కూలీలపైకి లారీ దూసుకుపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడ్డవారిని చికిత్సకోసం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

17:38 - January 3, 2018

నిజామాబాద్ : జిల్లా రెంజల్‌ మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో ఓ విద్యార్థిని భవనంపై నుంచి దూకిన సంఘటన జరిగింది. ఏడో తరగతి చదువుతున్న శ్వేత క్రిస్మస్‌కు ఇంటికి వెళ్లి వచ్చినప్పటి నుంచి మళ్లీ ఇంటికి వెళ్తానని.. ఉపాధ్యాయులకు చెప్పింది. అయితే... సంక్రాంతి సెలవులకు పంపిస్తామని చెప్పారు. ఇంతలోనే శ్వేత మొదటి అంతస్తుపైకి వెళ్లి కిందకు దూకేసింది. వెంటనే శ్వేతను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో శ్వేత కాలుకు గాయమైంది. 

17:37 - January 3, 2018

హైదరాబాద్ : లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్‌ అయిన గజల్‌ శ్రీనివాస్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. గజల్ శ్రీనివాస్‌ బెయిల్, కస్టడీ పిటిషనన్లపై నాంపల్లి కోర్టులో విచారణ సాగింది. బెయిల్ ఇవ్వొద్దంటూ పంజాగుట్ట పోలీసులు కోర్టులో కౌంటర్ వేశారు. బయటకు వస్తే సాక్ష్యులను ప్రభావితం చేస్తారంటూ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వాదించారు.

నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్‌
మరోవైపు గజల్‌ శ్రీనివాస్‌కు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్‌ చేశారని శ్రీనివాస్‌ తరపు లాయర్‌ ఆరోపించారు. సమాజంలో పేరు ప్రతిష్టలు ఉన్న శ్రీనివాస్‌ను కుట్రపూరితంగా కేసులో ఇరికించారన్నారు. గజల్‌పై పెట్టిన సెక్షన్లన్నీ బెయిలబుల్ కేసులని..బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు. దీనికి ప్రతిగా వాదించిన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌.. అన్ని ఆధారాలతోనే గజల్‌ శ్రీనివాస్‌ను అరెస్ట్‌ చేసినట్టు న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. విచారణను న్యాయమూర్తి గురువారానికి వాయిదా వేశారు. ఈ కేసులో ఏ-2గా ఉన్న గజల్‌ శ్రీనివాస్‌ పనిమనిషి పార్వతిని విచారించేందుకు సన్నద్ధమయ్యారు పంజాగుట్ట పోలీసులు. ఈ వ్యవహారంలో ఆమె పాత్ర ఎంత వరకు ఉందనే దానిపై ఆరా తీయనున్నారు. బాధితురాలు ప్రధానంగా పార్వతిపై ఆరోపణలు చేసింది. తనను గజల్‌ శ్రీనివాస్‌తో గడపాలని ఒత్తిడి చేసిందని చెప్పింది. దీనిపై పార్వతిని ప్రశ్నించనున్నారు.

గజల్‌ శ్రీనివాస్‌కు మరో షాక్
మరోవైపు గజల్‌ శ్రీనివాస్‌కు మరో షాక్‌ తగిలింది. సేవ్‌ టెంపుల్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా గజల్‌ శ్రీనివాస్‌ను తొలగిస్తున్నట్లు ఆ సంస్థ అధ్యక్షుడు ప్రకటన చేశారు. సంస్థ పేరును అడ్డం పెట్టుకుని ఎలాంటి అశ్లీల కార్యక్రమాలకు పాల్పడ్డా సహించేది లేదన్నారు. తమ సంస్థలో మహిళలను దేవతలుగా గౌరవిస్తామన్నారు. మొత్తానికి గజల్‌ శ్రీనివాస్‌ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

17:36 - January 3, 2018

పెద్దపల్లి : ఎస్‌ఆర్ఎస్పీ అధికారుల తీరు పై పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ కార్యలయంలో సిఇ శంకర్‌తో తన నియోజక వర్గం పెద్దపల్లికి ఎందుకు కేటాయించిన నీటిని విడుదల చేయడం లేదంటూ ఆయన వాగ్వాదానికి దిగారు. నియోజక వర్గంలో రైతాంగం నీరందక పంట నష్ట పోతున్నారని మండిపడ్డారు. అధికారులు పోంతన లేని సమాధానం చెప్పడంతో ఎమ్మెల్యే అసహనానికి గురయ్యారు. తన నియోజక వర్గం పై ఎందుకు చిన్న చూపు చూస్తున్నరంటు అధికారులను ప్రశ్నించాడు. ఈ రోజు ఉదయం మంత్రి ఈటెల రాజేందర్‌, రసమయి బాల కిషన్‌లు హుజురాబాద్‌, మానకోండుర్‌ నియోజక వర్గాలకు లోయర్‌ మానేరు డ్యామ్ నుంచి కాకతీయ కెనాల్‌ ద్వార నీటిని విడుదల చేశారు. అవి వారి స్వంత నియోజక వర్గల కావడంతో.. పెద్దపల్లి ఎమ్మెల్యే నా నియోజకవర్గం పరిస్థితి ఏంటనే రీతిలో అధికారులతో గోడవకు దిగారు. మొత్తానికి అధికార పార్టీ ఎమ్మెల్యేల మధ్య నీటి యుద్దం ఆరంభం అయినట్లు ఈ రోజు ఘటనలతో అర్థం అవుతుంది.

17:35 - January 3, 2018

నల్లగొండ : చెరువులు బోరు బావుల కింద సాగు చేస్తున్న రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. నీటి సామర్థ్యం తగ్గిన మిర్యాలగూడ మండలం రుద్రారం చెరువును ఆయన పరిశీలించారు. ప్రభుత్వం 24గంటల కరెంట్‌ ఇవ్వడం మూలాన.. వాగులు వంకల పరిధిలో ఉన్నా రైతులు పెద్ద మొత్తంలో మోటార్లు బిగించి నీటిని తొడుకోవడంతో చెరువుల్లోకి సరిపడ నీరు రాక భూగర్భ జలాలు అడుగంటుతున్నాయన్నారు. చెరువులోకి నీరు చేరకపోవడంతో సాగు విషయంలో రైతులు ఆందోళనకు గురవుతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సాగర్‌ కెనాల్‌ నీటితో మొదటగా పైన ఉన్నా చెరువులు నింపి అ నీటిని రుద్రారం చెరువుకు మళ్లించాలని జూలకంటి డిమాండ్‌ చేశారు.

17:34 - January 3, 2018

కరీంనగర్ : లోయర్‌ మానేరు డ్యామ్‌ చివరి ఆయకట్టు రైతాంగానికి సాగునీరిచ్చి ఆదుకుంటామని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. కరీంనగర్‌ లోయర్‌ మానేరు డ్యామ్ నుంచి కాకతీయ కాలువకు ఆయన ఎంపి వినోద్‌ కుమార్‌తో కలిసి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా జలాశయంలో పూజలు నిర్వహించారు. ఆ తర్వాత దిగువకు నీటిని విడుదల చేశారు. ఆన్‌ ఆఫ్‌ సిస్టమ్‌ ద్వారా వారం రోజుల పాటు హుజురాబాద్‌, మానకోండుర్‌, వరంగల్ రైతంగానికి సాగు నీరందించనున్నట్టు తెలిపారు. పరస్పర సహకారం..సమన్వయంతో నీటిని వాడుకోవాలని రైతులకు ఆయన సూచించారు.

17:33 - January 3, 2018

వరంగల్ : విద్యావ్యవస్థను బలపర్చడం కోసం ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని.. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని.. కస్తూర్భాగాంధీ బాలికల గురుకుల పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విద్యార్ధినులకు ఆరోగ్య పరిశుభ్రతా కిట్లను పంపిణీ చేశారు. విద్యార్థినులు ఆరోగ్యంగా ఉండటానికి 15 కోట్ల రూపాయలతో హెల్త్&కాస్మొటిక్ కిట్లను ఇస్తున్నామని ఆయన తెలిపారు. ప్రతి 3 నెలలకోసారి బాలికలకు సరిపడా కాస్ట్యూమ్‌ కిట్లను ప్రభుత్వం తరపున అందిస్తామని కడియం శ్రీహరి తెలిపారు.

17:32 - January 3, 2018

హైదరాబాద్ : నగరంలో జీహెచ్‌ఎంసీ సమగ్ర రోడ్డు అభివృద్ధి పథకంలో మొదటి అండర్‌ పాస్‌ను ఈ రోజు మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. 25వేల కోట్లతో సిటీలోని 50జంక్షన్‌లలో స్కైవేలు, ఫ్లై ఓవర్‌లు, గ్రేడ్‌ సపరేటర్లు నిర్మించాలని ప్లాన్‌ చేసింది బల్దియా. మొదటి దశలో మూడు వేల కోట్లతో పలు ప్రాంతాల్లో పనులు ప్రారంభం కాగా మాదాపూర్‌-శిల్పారామం భూగర్భ మార్గంలో రోడ్డు నిర్మాణం పూర్తయ్యింది. సిటీలో ట్రాఫిక్‌ కష్టాలను అధిగమించేందుకు ఎస్‌ఆర్‌డీపీ పనుల్లో వేగం పెంచుతామంటున్న జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ అన్నారు.

కాంగ్రెస్ తీర్మాణం చెల్లదు : జైట్లీ

హైదరాబాద్ : కాంగ్రెస్ తీర్మానం చెల్లదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. తీర్మానం పెట్టాలంటే ఒకరోజు ముందు నోటీసు ఇవ్వాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ నిబంధనలు పాటించడంలేదని జైట్లీ విమర్శించారు. ట్రిపుల్ తలాక్ బిల్లుకు లోక్ సభలో మద్దతిచ్చారని, రాజ్యసభను మాత్రం కాంగ్రెస్ తప్పుతోవపట్టిస్తోందని అన్నారు. 

గజల్ శ్రీనివాస్ కు మరో షాక్

హైదరాబాద్ : గజల్ శ్రీనివాస్ కు మరో షాక్ తగిలింది. సేవ్ టెంపుల్ బ్రాండ్ అంబాసిడర్ గా గజల్ శ్రీనివాస్ తొగిస్తున్నట్టు ఆ సంస్థ అధ్యక్షుడు వెలగపూడి ప్రకాశ్ రావు తెలిపారు. మా సంస్థలో పనిచేస్తున్న మహిళలను దేవతల్లా గౌరవిస్తామని, సంస్థ పేరును అడ్డుపెట్టుకుని అశ్లీల కార్యక్రమాలు నిర్వహిస్తే సహించలేమని ఆయన స్పష్టం చేశారు. 

16:06 - January 3, 2018

రాజ్యసభ రేపటికి వాయిదా

ఢిల్లీ : రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. ట్రిపుల్ తలాక్ బిల్లు రాజ్యసభలో మంత్రి ప్రవేశపెట్టగానే విపక్షాలు బిల్లును సెలక్ట్ కమిటీ పంపాలని పట్టుపట్టాయి. దీంతో సభలో గందరగోళం ఏర్పాడింది. 

15:34 - January 3, 2018
15:30 - January 3, 2018

హైదరాబాద్ : గజల్‌ శ్రీనివాస్‌ అనైతిక.. అసభ్య వ్యవహారం బయటపడింది. దేశానికి సందేశాలివ్వడం ఓ కోణమైతే.. దేహానికి మసాజ్‌ చేయాలంటూ సిబ్బందిని వేధించడం.. కాదంటే భవిష్యత్తు లేకుండా చేస్తానంటూ వేధించడం.. ఈ ప్రబుద్ధుడి మరో కోణమని ససాక్ష్యంగా వెల్లడైంది. లైంగిక వేధింపుల కేసులో గజల్ శ్రీనివాస్ అడ్డంగా బుక్కయ్యారు. మసాజ్‌ పేరుతో అమ్మాయిలను వేధిస్తున్నట్లు ఆధారాలతో సహా దొరికిపోయారు. సెక్స్‌లో పాల్గొనాలని, తనను ఎప్పుడూ సంతోషంగా ఉంచాలంటూ ఒత్తిడి తెస్తూ... మాటవినని వారిపై సిబ్బందితో బ్లాక్‌మెయిల్‌కు దిగుతున్నాడు.. అడ్డు చెప్పేవారికి భవిష్యత్‌ లేకుండా చేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. పైకి గజల్స్‌, దైవసూక్తులు, నీతిబోధలు చేసే శ్రీనివాస్‌.. మరో కోణంలో కాముకుడని తేలిపోయింది. ఆలయవాణి అనే సంస్థకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌..తన కామక్రీడల కోసం శ్రీనివాస్‌ కార్యాలయంలోనే బెడ్‌రూమ్‌ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఆలయవాణిలో రేడియో జాకీగా పనిచేసే ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తిస్తూ తన పైశాచికత్వాన్ని బయటపెట్టుకున్నాడు. మసాజ్‌ చేయాలని ఆమెపై తీవ్ర ఒత్తిడి తెచ్చాడు. అప్పటికే పనిమనిషి పార్వతితో చనువుగా ఉంటూ ఆమెతో రాయబారం నడిపాడు. పనిలేకున్నా అర్ధరాత్రి వరకు ఆఫీస్‌లో ఉండాలని బాధితురాలిని వేధించాడు. ఇలా రకరకాలుగా యువతిని మానసికంగా హింసించాడు. చివరకు ఉద్యోగం లేకుండా చేస్తానని భయపెట్టి ఆమెతో మసాజ్‌ చేయించుకున్నాడు. తనగదిలోకి పిలిపించి బలవంతంగా హగ్ చేసుకోవడం, ముద్దులు పెట్టడం, కాళ్లు పట్టించుకోవడం లాంటి పనులు చేయించుకున్నాడు.

రోజు రోజుకు గజల్‌ శ్రీనివాస్‌ వ్యవహారం శ్రుతిమించడం
రోజు రోజుకు గజల్‌ శ్రీనివాస్‌ వ్యవహారం శ్రుతిమించడంతో.. బాధితురాలు తట్టుకోలేకపోయింది. ఆయన బండారాన్ని బయటపెట్టేందుకు పనిమనిషితో సన్నిహితంగా ఉన్న దృశ్యాలు, మసాజ్‌ చేయించుకుంటున్న దృశ్యాలు సెల్‌ఫోన్లో వీడియో తీసింది. ఈ ఆధారాలతో గతనెల 29న పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలు సమర్పించిన ఆధారాలను పరిశీలించిన పోలీసులు దర్యాప్తు స్పీడ్‌ పెంచారు. ఆలయవాణి వెబ్ రేడియో ఆఫీసులో ఉద్యోగులను విచారించారు. పక్కా ఆధారాలతో గజల్ శ్రీనివాస్‌ను అరెస్టు చేశారు. 354, 354ఏ, 509 సెక్షన్ ఐపీసీ కింద కేసులు నమోదు చేశారు. పోలీసుల అదుపులోకి వెళ్లిన గజల్‌ శ్రీనివాస్‌.. తొలుత తనే తప్పూ చేయలేదంటూ బొంకాడు. ఆ అమ్మాయి తనపై ఎందుకు తప్పుడు ఫిర్యాదు చేసిందో అర్థం కావడం లేదని, ఆమెను తన బిడ్డలా చూసుకున్నానని బుకాయించాడు. ఫిజియోథెరపిస్ట్‌ రాకపోతే ఆ అమ్మాయే ఇష్టపూర్తిగా మసాజ్‌ చేసిందని, అయితే ఆమె పట్ల తనకు ఎలాంటి చెడు ఉద్దేశం లేదన్నారు.

ఇంటి పనిమనిషిపై కూడా లైంగిక వేధింపులు
గజల్‌ శ్రీనివాస్‌ ఇంటి పనిమనిషిపై కూడా లైంగిక వేధింపులకు సంబంధించి, బాధితురాలని ఒత్తిడి చేసినట్లుగా అభియోగాలు వచ్చాయి. వ్యవహారం వెలుగు చూడగానే, ఆమె కూడా శ్రీనివాస్‌ని కవర్‌ చేసుకునేందుకే ప్రయత్నించింది. మీడియా ప్రతినిధులు ఎంత గుచ్చి గుచ్చి ప్రశ్నించినా.. బాధితురాలిదే తప్పన్నట్లుగా చెప్పుకొచ్చిందీ పనిమనిషి. కేసును లోతుగా దర్యాప్తు చేసిన పంజాగుట్ట పోలీసులు.. ఏ1గా గజల్‌ శ్రీనివాస్‌, ఏ2గా గజల్‌ శ్రీనివాస్‌ పనిమనిషి పార్వతి పేర్లను చేర్చారు. ఆ తర్వాత గజల్‌ శ్రీనివాస్‌ను నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టగా..న్యాయస్థానం ఈనెల 12 వరకు రిమాండ్‌ విధించింది. శ్రీనివాస్ బెయిల్‌ పిటిషన్‌పై విచారణను కోర్టు బుధవారానికి వాయిదా వేసింది. దీంతో గజల్‌ శ్రీనివాస్‌ను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు.

15:23 - January 3, 2018

ప్రకాశం : ఆంధ్రప్రదేశ్‌లో ఐదో విడత జన్మభూమి కార్యక్రమం ప్రారంభమైంది. ప్రకాశం జిల్లా దర్శిలో జన్మభూమి-మా ఊరు కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించారు. 10 రోజుల పాటు 13 వేల గ్రామాలు, 3 వేల వార్డుల్లో జన్మభూమి సభలను అంగరంగ వైభవంగా జరపాలని నిర్ణయించారు. జన్మభూమి తొలిరోజును సంక్షేమం-ఆనందానికి కేటాయించారు.

కార్పొరేషన్లు, ప్రత్యేక పథకాల ద్వారా చొరవ
అన్ని కులాల్లోని పేదలను ఆదుకునేందుకు కార్పొరేషన్లు, ప్రత్యేక పథకాల ద్వారా చొరవ తీసుకుంటున్నట్లు చంద్రబాబు తెలిపారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను నిర్లక్ష్యం చేసిందని.. టీడీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసిందన్నారు సీఎం. పేదలందరికీ రేషన్‌ కార్డులు, ఇళ్లు కట్టిస్తామని ప్రకటించారు. అర్హులైన వారందరికీ పెన్షన్లు అందిస్తామన్నారు. 2022 నాటికి అభివృద్ధిలో రాష్ట్రం.. దేశంలోని మూడు ప్రధాన నగరాల్లో ఒకటిగా నిలుస్తుందన్నారు. పునర్విభజన చట్టం ప్రకారం కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం ప్రయత్నిస్తున్నామన్నారు చంద్రబాబు. ప్రకాశం జిల్లాకు సంజీవని అయిన వెలుగొండ మొదటి దశ పనులను ఈ ఏడాదిలో పూర్తి చేస్తామని... ప్రాజెక్ట్‌ పనులను వేరే కాంట్రాక్టర్‌కు అప్పగిస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు. ఇక జిల్లాలో మైనింగ్‌ విశ్వవిద్యాలయం, పప్పుధాన్యాలు పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. గతంలో ప్రకటించిన ట్రిపుల్‌ ఐటీ, దొనకొండ పారిశ్రామిక కారిడార్‌, హెలికాప్టర్స్‌ హబ్‌లకు అవాంతరాలు ఏర్పడ్డాయని.. అయినా సమస్యలన్నీ అధిగమించి అన్నింటిని పూర్తి చేస్తామన్నారు. ప్రకాశం జిల్లాలో బ్రిడ్జిలు, చెక్‌డ్యామ్‌ల నిర్మాణాల కోసం 200 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. రైతాంగం కోసం 150 కోట్ల రూపాయలతో నాగార్జునసాగర్‌ కాలువకు మరమ్మతులు చేపట్టినట్లు చంద్రబాబు తెలిపారు.

గురుకుల విద్యార్థి విజయ్‌కుమార్‌ ప్రసంగం
జన్మభూమి ప్రారంభోత్సవంలో గురుకుల విద్యార్థి విజయ్‌కుమార్‌ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. చంద్రబాబు చేస్తున్న ప్రగతిని విజయ్‌కుమార్‌ వివరించాడు. విజయ్‌కుమార్‌ ప్రసంగిస్తున్నంత సేపు చంద్రబాబు ముఖంపై చిరునవ్వు కనిపించింది. భవిష్యత్‌లో ఏం అవుతావని విజయ్‌కుమార్‌ను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. డాక్టర్‌ అవుతానని విజయ్‌కుమార్‌ చెప్పడంతో బాగా చదవాలని సూచించాడు. అనంతరం చంద్రబాబు విజయ్‌కుమార్‌ గిఫ్ట్‌ అందజేశాడు. విజయ్‌కుమార్‌ పేరిట 50వేల రూపాయలు డిపాజిట్‌ చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. అంతకుముందు సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గ్రామీణ క్రీడలు, రంగవల్లులను చంద్రబాబు తిలకించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టాల్స్‌ను కూడా సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. 

15:10 - January 3, 2018
15:06 - January 3, 2018

హైదరాబాద్ : జనవరిలో జరుపుకునే భోగి, సంక్రాంతి, కనుమ పండుగకు ఇంకా సమయం ఉన్నా... కోళ్లను బరిలో దించేందుకు ఇప్పటినుంచే ఉవ్విల్లూరుతున్నారు. పనిలోపనిగా కొన్ని చోట్ల చాటుమాటుగా ఇప్పటికే పందాలు సాగుతున్నాయి. ఓ వైపు బాగా మేసిన కోళ్లు ... నువ్వా నేనా అన్నట్లు కదనానికి కాలుదువ్వుతుంటే.... మరోవైపు పందెం కోళ్ల అమ్మకాలు ఊపందుకున్నాయి... పందాలకు పుంజుకోళ్ళు ముందే కూతేస్తుంటే...మరో వైపు... మేమేం తక్కువ తిన్నామా అంటూ పొట్టేళ్ళూ పోటీకి కాలు దువ్వుతున్నాయి... టెక్నాలజీ పరంగా ఎంత మారినా.. పందాల అభిరుచిలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు... పైగా అందుబాటులో ఉన్న టెక్నాలజీని కూడా పందాలకు ఉపయోగిస్తున్నారు. సోషల్‌ మీడియా, మొబైల్‌ ఫోన్లలోనే బెట్టింగ్‌ కాస్తున్నారు. కోడిందాలకు ప్రసిద్ధి చెందిన కోనసీమ పందెంరాయుళ్లకు వేదికగా మారుతోంది. కొబ్బరి చెట్లు, పచ్చని ప్రకృతి, గడ్డివాములు కోడి పందాలకు మాంచి అనువైన వాతావరణంగా మారుతోంది.. పూర్వకాలం నుంచీ సంప్రదాయంగా కొనసాగుతున్న ఈ కోడిపందాలు ఏ యేటికాయేడు పెద్దసంఖ్యలో పెరుగుతున్నాయి. ముందు లక్షలతో మొదలయ్యే పందాలు... కోట్ల రూపాయలను దాటిపోతుంటాయి. కోళ్లు, పొట్టేళ్ల పందాలతోపాటు జూదం భారీ ఎత్తున జరుగుతుంది.సంక్రాంతి సందడి మొదలైతే చాలు... గన్నవరం, పెనమలూరు, కృష్ణా జిల్లాలోని ఉయ్యూరు, దివిసీమ, నాగాయలంక, ఉభయ గోదావరి జిల్లాల్లో పందాలు బహిరంగంగానే నిర్వహించడం అతి మామూలు విషయం... టెంట్లు, పందిళ్లు, ఎల్ఈడీ స్ర్కీన్లు, డ్రోన్‌ కెమెరాలు, మొబైల్‌ కెమెరాలతో కళ్ళు చెదిరే రీతిలో భారీ ఎర్పాట్లమధ్య నిర్వహించే పోటీలు చూడటానికి రెండు కళ్ళూ చాలవేమో అన్నంతగా నిర్వహిస్తారు.

అన్నీ తామై చూస్తుంటారు...
కొందరు ప్రజాప్రతినిధులు, పలు శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది అంతా పందెం కోడికి కత్తులు కట్టే దగ్గరనుంచి పోటీలు ధూమ్‌ధామ్‌గా ముగిసే వరకూ అన్నీ తామై చూస్తుంటారు. ముఖ్యంగా అరటి, చెరకు, మామిడి తోటల్లో ఎక్కువగా కోళ్ల పందాలు అతిసాధారణంగా జరిగిపోతుంటాయి. ఇలాంటి చోట్ల ఎలాంటి నిఘానేత్రాలకు చిక్కకుండా పకడ్బంధీ ఏర్పాట్లు చేసుకుంటారు.వందలాదిగా ఖరీదైన కార్లు, బైక్‌లపై దర్జాగా పందెం కోళ్ల సమరానికి క్యూ కడుతుంటారు. పందెం జరిగే ప్రాంతంలోనే విందు, వినోదాలతోపాటు సర్వసదుపాయాలు సిద్ధంగా ఉంచుతారు. సాధారణంగా ఈ పందాలకు చిన్నపిల్లలను తీసుకుపోకూడదు.... కానీ ఇప్పుడు కుటుంబ సమేతంగా కోళ్ళ పందాలకు వెళ్ళడం పరిపాటిగా మారింది. గుంటూరు జిల్లా బాపట్ల, కోటప్పకొండ, కవులూరు, కారంపూడి, దాచేపల్లి, వట్టి చెరుకూరు, కృష్ణాజిల్లాలోని వెంట్రప్రగడ, డోకుపర్రు, భుజబలపట్నం, భైరవపట్నం, పెందుర్తి, వాడవల్లి, పులపర్రు, ప్రొద్దువాక, వడాలి, కొరగుంటపాళెం, చిగురుకోట వంటి ప్రాంతాల్లో కోడి పందాలు యధేచ్చగా సాగుతుంటాయి.

ఈ పందాల్లో మరింత ఆసక్తికరం
ఈ పందాల్లో మరింత ఆసక్తికరం ఏంటంటే.... పందెం కోళ్ళలో దాదాపు యాభై రకాలు ఉన్నాయి. వాటి రంగు, శరీరాన్నిబట్టి నెమలి,కాకి, డేగ, రసంగి, అంబరస, సేతువ, పచ్చకాకి, సవల, కసంగి వంటి పలురకాల పేర్లతో పిలుస్తారు. అందులోనూ ప్రాంతాన్ని బట్టి పందెం కోడి ధర మారుతూ ఉంటుంది. ఒక్కో కోడి ధర ఐదువేల నుంచి లక్ష రూపాయల వరకూ ఉంటుంది. ఇక బ్రీడింగ్‌ కోళ్లయితే లక్ష నుంచి ఒకటిన్నర లక్ష ధర పలుకుతుంది. పందెం కోళ్ల పెంపకాన్ని కూడా వారు ఓ కళగా భావిస్తారు. వాటికి పూర్తిగా నాన్‌ వెజ్‌ మాత్రమే పెట్టి మేపుతారు. మటన్‌కైమా, ఉడికించిన కోడిగుడ్లు, జీడిపప్పు, రాగులు వంటి పౌష్టిక ఆహారం పెట్టి పందానికి సిద్ధం చేస్తారు. కోడి పందాల ముసుగులో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలను హైకోర్టు సీరియస్‌గా భావిస్తోంది. ఈ అసాంఘిక చర్యలకు అడ్డుకోవాలంటూ కె. రామచంద్రరాజు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్‌ కూడా వేశారు. దీనిపై స్పందించిన ఉమ్మడి హై కోర్టు చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఉభయ గోదావరి జిల్లాల పోలీసు అధికారులను ఆదేశించింది. తదుపరి ఎలాంటి చర్యలు తీసుకున్నదీ తెలపాలని కూడా కోరింది.ముఖ్యంగా కొల్లేరు ప్రాంతం కోడిపందాలకు యమా సేఫ్‌జోన్‌. కొల్లేరు పరిసర ప్రాంతాల్లో పలు రాజకీయ పార్టీనేతల బ్యానర్లు, ఫ్లెక్సీలు భారీ ఎత్తున ఏర్పాటు చేస్తారు. ఈ కోడిపందాలు బహిరంగ రహస్యంలా కొనసాగుతున్నా... అధికారులు మాత్రం తమకేమీ తెలియదన్న రీతిలో ఉండడం కొసమెరుపు.

14:34 - January 3, 2018
14:28 - January 3, 2018

సూర్యకుమారి బదిలీకి రంగం సిద్ధం

కృష్ణా : విజయవాడ దుర్గగుడి ఈవో సూర్యకుమారి బదిలీకి రంగం సిద్ధమైంది. నూతన ఈవోగా రామచంద్రన్ కు ఇంచార్జి బాధ్యతులు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన సింహాచలం నరసింహస్వామి ఆలయ ఈవోగా విధులు నిర్వహిస్తున్నారు. 

14:19 - January 3, 2018

కృష్ణా : విజయవాడ దుర్గగుడి ఈవో సూర్యకుమారి బదిలీకి రంగం సిద్ధమైంది. నూతన ఈవోగా రామచంద్రన్ కు ఇంచార్జి బాధ్యతులు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన సింహాచలం నరసింహస్వామి ఆలయ ఈవోగా విధులు నిర్వహిస్తున్నారు. 

నోటిసులు ఇవ్వకుండా అరెస్టు చేశారు..

హైదరాబాద్ : గజల్ శ్రీనివాస్ పిటిషన్ పై విచారణను నాంపల్లి కోర్టు రేపటికి వాయిదా పడింది. కేసు విచారణలో వాడివేడిగా వాదనలు జరిగాయి. ఎలాంటి నోటిసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారని గజల్ శ్రీనివాస్ లాయర్ అన్నారు. గజల్ పై పెట్టిన సెక్షన్లు అన్ని బెయిలబుల్ సెక్షన్లే అని లాయర్ వాదించారు. 

14:11 - January 3, 2018

హైదరాబాద్ : గజల్ శ్రీనివాస్ పిటిషన్ పై విచారణను నాంపల్లి కోర్టు రేపటికి వాయిదా పడింది. కేసు విచారణలో వాడివేడిగా వాదనలు జరిగాయి. ఎలాంటి నోటిసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారని గజల్ శ్రీనివాస్ లాయర్ అన్నారు. గజల్ పై పెట్టిన సెక్షన్లు అన్ని బెయిలబుల్ సెక్షన్లే అని లాయర్ వాదించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

 

అనంత టీడీపీలో వర్గపోరు

అనంతపురం : జిల్లా తాడిపత్రి టీడీపీలో వర్గ వభేదాలు చోటు చేసుకున్నాయి. అక్కడ నేతల మధ్య వర్గపోరు తారస్థాయికి చేరింది. ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ కాకర్ల శేఖర్ మధ్య వివాదం చెలరేగింది. శేఖర్ చెందిన అన్నా ట్రాన్స్ పోర్ట్ కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారు. లారీ, ఇన్నోవా కారు, అద్దాలు ఫర్నీచర్ ధ్వసం చేశారు. ఎమ్మెల్యే వర్గీయులపై కాకర్ల శేఖర్ పోలీసులుకు ఫిర్యాదు చేశారు.

13:44 - January 3, 2018

నిజామాబాద్ : నిజామాబాద్‌ జిల్లాలో రైల్వే ప్రాజెక్టులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారయ్యాయి. నిజాం నవాబుల కాలంలో వేసిన సికింద్రాబాద్‌-మన్మాడ్‌ మీటర్‌ గేజ్‌ రైల్వే లైన్‌ను బ్రాడ్‌ గేజ్‌గా మార్చడం మినహా... ఇప్పటి వరకు జిల్లాకు కొత్తగా వచ్చిన ప్రాజెక్టులేమీ పెద్దగా లేవు. జిల్లాలో ఉన్న రైలు మార్గాల డబ్లింగ్‌కు నోచుకోలేదు. ఈ విషయంలో జిల్లా నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించిన ఎంపీలు ఇచ్చిన హమీలు నీటి మూటలుగానే మిగిలిపోయాయి. డబ్లింగ్‌ పనులకు రైల్వే బోర్డు అనుమతి ఇచ్చినా... పట్టించుకునే దిక్కు లేకపోవడంతో ఈ ప్రాజెక్టు అతీగతీ లేదు. సికింద్రాబాద్‌-మేడ్చల్‌ మధ్య డబ్లింగ్‌, విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయి. కామారెడ్డి, నిజామాబాద్‌ మార్గంలో ఇంకా చేపట్టలేదు. సింగిల్‌ లైన్‌ కావడంతో రైళ్లు పట్టాలు తప్పినా, సాంకేతిక సమస్యతో ఆగిపోయినా ప్రత్యామ్నాయం లేక ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడంలేదు.

నిజామాబాద్‌-పెద్దపల్లి రైల్వే లైన్‌ను పూర్తి
సోయా, ధాన్యం, బియ్యంతోపాటు ఇతర సరకు రవాణా కూడా ఎక్కువగానే జరుగుతోంది. అయినా డబ్లింగ్‌ గురించి పట్టించుకోవడంలేదు. ఇక్కడ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రస్తుత టీఆర్‌ఎస్‌ ఎంపీ కవిత నిజామాబాద్‌-పెద్దపల్లి రైల్వే లైన్‌ను పూర్తి చేయించారు. సికింద్రాబాద్‌-మన్మాడ్‌ లైను మీటర్‌గేజ్‌గా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న చమురు డిపోలకు ముంబై నుంచి ఆయిల్‌ తరలించి తెలంగాణ జిల్లాలకు సరఫరా చేసేవారు. గేజ్‌ మార్పిడి సమయంలో ఆయిల్‌ సరఫరా నిలిచిపోవడంతో హెచ్‌పీసీఎల్‌, బీసీసీఎల్‌ డిపోలు ఇక్కడ నుంచి కొండపల్లి తరలిపోయాయి. ప్రజా ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తే ఆయిల్‌ డిపోలకు పునఃప్రారంభించే అవకాశం ఉన్నా ఎవరూ పట్టించుకోవడంలేదన్న కొత్త రైల్వే లేన్లకు మోక్షం లేదు. నిజామాబాద్‌-ఆదిలాబాద్‌, బోధన్‌-బాన్సువాడ-బీదర్‌ రైల్వే లైన్లకు సర్వే పూర్తైనా నిధులకు మోక్షం లభించలేదు. ఈ ప్రాజెక్టులను కూడా నేతలు పట్టించుకోవడంలేదు. నిజామాబాద్‌ కేంద్రంగా ఏర్పాటు కావాల్సిన డివిజన్‌ మహారాష్ట్రలోని నాందేడ్‌కు తరలిపోయింది. ప్రజాప్రతినిధుల ఉదాసీన వైఖరే ఇందుకు కారణమన్న నిజామాబాద్‌ కేంద్రంగా కోచ్‌ రిపేర్‌ వర్క్‌ షాపు ఏర్పాటుకు కేంద్రం ఇచ్చిన హమీ ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. గ్యాంగ్‌మెన్‌ శిక్షణా కేంద్రం కూడా అతీగతీ లేదు. హైదరాబాద్‌ డివిజన్‌లో కాచిగూడ తర్వాత నిజామాబాద్‌ స్టేషన్‌ నుంచే ఎక్కువ కలెక్షన్‌ వస్తోంది. అయినా ప్రయాణికుల సౌకర్యాలు శూన్యం. వచ్చే బడ్జెట్‌లోనైనా నిజామాబాద్‌ జిల్లా రైల్వే ప్రాజెక్టుకు నిధులు మంజూరయ్యే విధంగా ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. 

13:43 - January 3, 2018

హైదరాబాద్ : తెలంగాణ మీడియా అకాడమీ ఏర్పాటు చేసిన ప్రముఖ అరుణ్‌సాగర్‌ స్మారకార్థం ఏర్పాటు చేసిన ఉత్తమ జర్నలిస్టు, సాహితీ పురస్కారం ప్రదానోత్సవం ఘనంగా జరిగిది. తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు అవార్డులు అందుకున్నారు. వాగ్గేయకారుడు గోరటి వెంకన్నకు అరుణ్‌సాగర్‌ సాహితీ పురస్కారాన్ని అందజేశారు. ప్రముఖ జర్నలిస్టు పాలగుమ్మి నాయినాథ్‌, రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, తుమ్మల నాగేశ్వరరావు సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

అరుణ్‌సాగర్‌ స్మారకోపన్యాసం
పాలగుమ్మి సాయినాథ్‌ అరుణ్‌సాగర్‌ స్మారకోపన్యాసం చేస్తూ... పాత్రికేయం ప్రమాదకరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. కత్తిమీద సాములాగ పరిణమించిన జర్నలిజం సంక్షోభంలో చిక్కుకుందని ఆవేదన వెలిబుచ్చారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న జర్నలిస్టుల హత్యలను సాయినాథ్‌ ప్రస్తావించారు. అరుణ్‌సాగర్‌ 10 టీవీ సహా వివిధ చానళ్లు, పత్రికల్లో చేసి, జర్నలిజానికి చేసిన సేవలను కార్యక్రమానికి హాజరైన ప్రముఖలు స్మరించుకున్నారు. అరుణ్‌సాగర్‌తో తనకున్న కొద్దిపాటి పరిచయాన్ని రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు గుర్తు చేసుకున్నారు. అరుణ్‌సాగర్‌ సాహీతి పురస్కార గ్రహీత గోరటి వెంకయ్య... పేదల బతుకులకు జర్నలిస్టుల జీవితాలను పెద్దగా తేడా లేదన్నారు. గల్లీ చిన్నది, గరీబోళ్ల కథ పెద్దది.. అంటూ ఈ విషయాన్ని పాటరూపంలో వినిపించారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ, పెద్దపల్లి టీఆర్‌ఎస్‌ ఎంపీ బాల్క సుమన్‌, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 

13:41 - January 3, 2018

హైదరాబాద్ : న్యూ ఇయర్‌ రోజున తెలుగు రాష్ట్రాల్లో మద్యం ఏరులై పారింది. అర్ధరాత్రి వరకు మద్యం షాపులు తెరిచి ఉండటం, డిసెంబర్ 31 వేడుకలు ఆదివారం రావడం వంటి కారణాలతో ఈ ఒక్కరోజే రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. పాత సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ.. కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మద్యం ఏరులై పారింది. అక్షరాలా 160 కోట్ల రూపాయల మద్యాన్ని మందుబాబులు తాగేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా రూ.50 కోట్ల విలువైన మద్యం అమ్ముడవగా, రెండోస్థానంలో హైదరాబాద్ నిలిచింది. హైదరాబాద్ జిల్లాలో 40 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. ఇక రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన జిల్లాల్లో 70 కోట్ల మద్యం విక్రయమైంది.

సాధారణంగా రోజుకు దాదాపు 8 కోట్లు
హైదరాబాద్‌లో సాధారణంగా రోజుకు దాదాపు 8 కోట్ల రూపాయల మద్యం అమ్ముడువుతుంది. డిసెంబర్ 31న ఐదు రెట్లు ఎక్కువగా మద్యం విక్రయాలు జరిగాయి. గతేడాది గ్రేటర్‌ పరిధిలో 82 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరగగా.. ఈ ఏడాది రూ.90కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. ఇది రాష్ట్ర మద్యం ఆదాయంలో 56 శాతంగా నమోదైంది. కాగా, నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌తో పాటు బేగంపేట, పాతబస్తీ, రంగారెడ్డి పరిధిలోని కొన్ని మద్యం దుకాణాల్లో నోస్టాక్ బోర్డులు కనిపించాయి. కాగా.. వరంగల్‌, కరీంగనర్‌, సిద్దిపేట, నిజామాబాద్‌, సంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కూడా మద్యం విక్రయాలు గణనీయంగా పెరిగాయి. గతేడాది కంటే అదనంగా మద్యం నిల్వలను వైన్‌షాపు యజమానులు కొనుగోలు చేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి.

అటూ ఆంధ్రప్రదేశ్‌లో కూడా..
అటూ ఆంధ్రప్రదేశ్‌లో కూడా మద్యం ప్రియులు న్యూ ఇయర్‌కు మంచి కిక్‌తో స్వాగతాన్ని పలికుతూ.. కోట్లాది రూపాయల మద్యాన్ని తాగేశారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి 12 గంటల వరకు మద్యం షాపులకు పర్మిషన్ ఇవ్వడంతో మద్యం ఏరులైపారింది. ఏకంగా రూ.230 కోట్ల విలువైన మద్యాన్ని తాగేశారు. రాష్ట్రంలోని మద్యం దుకాణాల్లో రోజూ సగటున రూ.40 కోట్ల మేర మద్యం అమ్ముతుండగా.. ఒక్క డిసెంబర్ 31న రూ.230 కోట్ల మేర విక్రయాలు జరిగాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో రూ.50 కోట్లు, విశాఖలో రూ.30 కోట్ల మేర విక్రయాలు జరిగాయి. మొత్తానికి డిసెంబర్‌ 31 ఆదివారం కావడంతో విక్రయాలు మరింతగా రెట్టింపయ్యాయి. ఇరు రాష్ట్రాల్లో మద్యం ప్రియులు పోటాపోటీగా మద్యం సేవించి.. ప్రభుత్వ ఖజానా నింపారు. 

12:27 - January 3, 2018

ఢిల్లీ : నేడు రాజ్యసభ ముందుకు ట్రిపుల్ తలాక్ బిల్లు రానుంది. రాజ్యసభలో న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ బిల్లును ప్రవేశపెట్టానున్నారు. గతవారం లోక్ సభలో ఎలాంటి సవరణలు లేకుండా ఈ బిల్లు ఆమోదం పొందింది. ట్రిపుల్ తలాక్ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. బిల్లులో మూడేళ్ల జైలుశిక్ష, నష్టపరిహారం అంశాలపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

12:22 - January 3, 2018
12:07 - January 3, 2018

కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం

కర్నూలు : అప్పరి రైల్వేగేటు సమీపంలో రోడ్డుప్రమాదం జరిగింది. ఓ మిని టిప్పర్ అదుపు తప్పి బోల్తా పడింది ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

11:42 - January 3, 2018

హైదరాబాద్ : శిల్పారామం నుంచి అయ్యప్ప సొసైటీ వరకు 450 మీటర్ల అండర్ పాస్ ను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హోం మంత్రి నాయిని, కేటీఆర్, మహేందర్ రెడ్డి , ఎమ్మెల్యేలు, జీహెచ్ ఎంసీ అధికారులు పాల్గొన్నారు.

11:41 - January 3, 2018

కర్నూలు : అప్పరి రైల్వేగేటు సమీపంలో రోడ్డుప్రమాదం జరిగింది. ఓ మిని టిప్పర్ అదుపు తప్పి బోల్తా పడింది ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. బాధితులు పొట్టకూటి కోసం వేరే ప్రాంతానికి పనికి వెళ్లి తిరిగి వస్తున్నారు. 

అండర్ పాస్ రోడ్డు ప్రారంభము

హైదరాబాద్ : శిల్పారామం నుంచి అయ్యప్ప సొసైటీ వరకు 450 మీటర్ల అండర్ పాస్ ను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హోం మంత్రి నాయిని, కేటీఆర్, మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. 

కాకతీయ కెనాల్ కు నీరు విడుదల చేసిన మంత్రి, ఎంపీ

కరీంనగర్ : లోయర్ మానేర్ డ్యామ్ నుంచి కాకతాయ కెనాల్ కు ఆర్థిక మంత్రి ఈటల, ఎంపీ వినోద్ నీటిని విడుదల చేశారు. ఆన్ ఆఫ్ పద్దతిలో వారం రోజులు పాటు సాగునీరు విడుదల చేయనున్నారు.

11:31 - January 3, 2018

కాసేపట్లో పార్వతిని విచారించనున్న పోలీసులు

హైదరాబాద్ : గజల్ కీచక పర్వం కేసులో ఆయన పని మనిషి, గజల్ తో అక్రమ సంబంధం పెట్టుకున్న పార్వతిని కాసేపట్లో పంజాగుట్ట పీఎస్ లో పోలీసులు విచారించనున్నారు. గజల్ తో గడపమని పార్వతి, తనను ఒత్తిడి చేసినట్లు అరుణ ఫిర్యాదు చేసింది. 

బదిలీలపై ఐఏఎస్ ల నారాజ్

హైదరాబాద్ : తెలంగాణలో బదిలీలపై ఐఏఎస్ ల నారాజ్ గా ఉన్నారు. సీనియర్ అధికారులకి ప్రాధాన్యతలేని పోస్టులు ఇచ్చారని వారు ఆవేదన చెందుతున్నారు. స్పెషల్ సీఎస్ క్యాడర్ అధికారులకు కూడా జాయింట్ సెక్రటరీ పోస్టులు ఇవ్వడంతో తమకు అన్యాయం జరిగిందని ఐఏఎస్ లు వాపోతున్నారు. ఎక్సైజ్ కమిషనర్ గా ఉన్న సీనియర్ అధికారికి డిజాస్టర్ శాఖ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదా ఉన్న సురేష్ చందాను ఎస్సీ కమిషనర్ గా బదిలీ చేశారు.

దుర్గగుడి తాంత్రిక పూజలపై సీఎం సీరియస్

కృష్ణా : విజయవాడ దుర్గగుడిలో తాంత్రిక పూజల నిర్వహణపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన పై సీఎం విచారణకు ఆదేశించారు. 24 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. పూజల నిర్వహణపై పోలీసులు విచారణ ప్రారంభించారు.

11:25 - January 3, 2018

హైదరాబాద్ : గజల్ కీచక పర్వం కేసులో ఆయన పని మనిషి, గజల్ తో అక్రమ సంబంధం పెట్టుకున్న పార్వతిని కాసేపట్లో పంజాగుట్ట పీఎస్ లో పోలీసులు విచారించనున్నారు. గజల్ తో గడపమని పార్వతి, అరుణ కుమారిని ఒత్తిడి చేసినట్లు అరుణ ఫిర్యాదు చేసింది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

11:24 - January 3, 2018

హైదరాబాద్ : తెలంగాణలో బదిలీలపై ఐఏఎస్ ల నారాజ్ గా ఉన్నారు. సీనియర్ అధికారులకి ప్రాధాన్యతలేని పోస్టులు ఇచ్చారని వారు ఆవేదన చెందుతున్నారు. స్పెషల్ సీఎస్ క్యాడర్ అధికారులకు కూడా జాయింట్ సెక్రటరీ పోస్టులు ఇవ్వడంతో తమకు అన్యాయం జరిగిందని ఐఏఎస్ లు వాపోతున్నారు. ఎక్సైజ్ కమిషనర్ గా ఉన్న సీనియర్ అధికారికి డిజాస్టర్ శాఖ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదా ఉన్న సురేష్ చందాను ఎస్సీ కమిషనర్ గా బదిలీ చేశారు. దీని పై మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

11:22 - January 3, 2018

కృష్ణా : విజయవాడ దుర్గగుడిలో తాంత్రిక పూజల నిర్వహణపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన పై సీఎం విచారణకు ఆదేశించారు. 24 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. పూజల నిర్వహణపై పోలీసులు విచారణ ప్రారంభించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

11:17 - January 3, 2018

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ టెన్ టీవీ క్యాలెండర్ అవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెన్ టీవీ ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడంలో ముందుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరెటర్లు, టెన్ టీవీ రిపోర్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Don't Miss