Activities calendar

04 January 2018

21:53 - January 4, 2018

హైదరాబాద్ : మూడుముళ్ల బంధం మూన్నాళ్ల ముచ్చటగా మారుతోంది. దంపతుల్లో ఎవరో ఒకరు వేస్తున్న తప్పటడుగులు..పచ్చని సంసారాల్లో చిచ్చురేపుతోంది. వివాహేతర సంబంధాన్ని ఎన్నో కాపురాలను కూల్చేస్తున్నాయి. రోజు రోజుకీ క్షణికసుఖాల కోసం భర్తలను చంపేస్తున్న భార్యలు వెలుగులోకి వస్తున్నారు. మొన్న స్వాతి, నిన్న భారతి, నేడు జ్యోతి.. పేర్లు ఏవైనా వారు చేస్తున్న దారుణాలు మాత్రం ఒక్కటే. ఆ సంబంధాలకు అడ్డొస్తున్న భర్తలను అడ్డంగా లేపేస్తున్నారు. భర్తను చంపిన మరో ఇల్లాలి నేర కథా చిత్రమ్‌ బయటపడింది. హైదరాబాద్‌ కర్మాన్‌ఘాట్‌కు చెందిన కార్పెంటర్‌ నాగరాజు యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసును లాలాగూడా పోలీసులు ఛేదించారు. హత్యకు గురైంది.. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కాదని.. హతుడు కార్పెంటర్‌ నాగరాజు అని పోలీసులు నిర్ధరించారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని తేల్చారు.

కార్తీక్ అనే యువకుడితో ఏర్పడిన పరిచయం
నాగరాజు, జ్యోతి భార్య భర్తలు. అయితే జ్యోతికి కార్తీక్ అనే యువకుడితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం భర్త నాగరాజుకి తెలియడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో భార్య జ్యోతి..వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్న భర్త నాగరాజు మర్డర్‌కు ప్లాన్‌ చేసింది. ప్రియుడు కార్తీక్‌కు సుపారీ ఇచ్చి కిరాతకంగా హత్య చేయించింది. డిసెంబర్‌ 31వ తేదీ రాత్రి కార్తీక్‌.. తన స్నేహితులు దీపక్‌, నరేశ్‌, యాసిన్‌తో కలిసి చౌటుప్పల్‌లో నాగరాజును హత్య చేశారు. ఆ తర్వాత శవాన్ని దగ్గర్లోని చెరువులో పడవేసి వెళ్లిపోయారు. ఈ హత్య విషయం నరేష్ అన్నకు తెలియడంతో.. దీపక్‌ను మందలించాడు. మరోవైపు హత్య విషయం బయటపడితే పోలీసులకు దొరికిపోతామన్న భయం నరేష్‌ను వెంటాడింది. దీంతో 100కి డయాల్‌ చేసిన నరేష్‌.. జరిగిన దారుణాన్ని చెప్పాలనుకున్నాడు. ఆ తర్వాత లాలాపేట పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోవడానికి వచ్చాడు. ధైర్యం సరిపోక లాలపేటకు వెళ్లి బ్లేడ్‌తో గొంతుకోసుకుని ఆత్మహత్యా యత్నం చేశాడు. గాంధీ ఆస్పత్రికి బాధితుడిని తరలించి చికిత్స అందించారు. విషయం తెలిసిన పోలీసులు ఆస్పత్రిలో నరేష్‌ను విచారించడంతో డొంకంతా కదలింది. అతడిచ్చిన సమాచారంతో కార్తీక్‌, దీపక్‌, యాసిన్‌లను అదుపులోకి తీసుకున్నారు.  

21:52 - January 4, 2018

సిరిసిల్ల : జిల్లాలోని... తంగల్లపల్లి మండలం, సిరిసిల్ల పట్టణంలో మంత్రి కేటీఆర్‌ ఆకస్మికంగా పర్యటించారు. పలు అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. ముందుగా తంగళ్ళపల్లి మండలములోని మండేపల్లి శివారులో జరుగుతున్న డబుల్ బెడ్ రూమ్ పనులను ఆయన పరిశీలించారు. అయితే ఆలస్యంగా పనులు జరగడంపై... కేటీఆర్‌.. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి సిరిసిల్ల పట్టణంలో జరుగుతున్న రోడ్ల వెడల్పు పనులను, ఇతర వివిధ అభివృద్ధి పనుల ప్రగతిని అధికారులతో కలసి పరిశీలించారు. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా మంత్రి కేటీఆర్‌ పర్యటన కొనసాగింది. 

21:51 - January 4, 2018

శ్రీకాకుళం : జిల్లా... ఇచ్ఛాపురంలోని జన్మభూమి-మా ఊరు కార్యక్రమం ఘనంగా జరిగింది. సీఎం జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మూడో రోజు జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో స్వచ్ఛాంధ్రప్రదేశ్ అనే అంశానికి ప్రాధాన్యతనిచ్చారు. ప్రతి ఒక్కరూ.. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని.. రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు. అందరూ మరుగుదొడ్లను నిర్మించుకోవాలని... ఆ మేరకు అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించాలని.. ఆయన సూచించారు.అలాగే పేదరికం పూర్తిగా పోవాలని... ఆర్థిక అసమానతలు తగ్గాలని .. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆకాంక్షించారు. రాష్ట్రభివృద్ధికి.. అందరూ ఆనందంగా ఉండడానికి కృషి చేస్తున్నానని... సీఎం అన్నారు.జన్మభూమి కార్యక్రమంలో భాగంగా ... ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సీఎం చంద్రబాబునాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు గర్భిణులకు పసుపు, కుంకుమలు అందజేసి.. ఆశీర్వదించారు. అలాగే చంద్రన్న బీమా స్కాలర్‌షిప్స్‌, బీసీ కార్పొరేషన్‌ , ఎస్సీ కార్పొరేషన్‌ల ద్వారా మంజూరైన చెక్కులను చంద్రబాబు అందజేశారు. పింఛన్లు, ఇళ్ల పట్టాలను కూడా పంపిణీ చేశారు. 

హత్య కేసులో నలుగురికి జీవితఖైదు

కరీంనగర్ : 2014లో గోదావరిఖనిలో ప్రశాంత్ హత్య కేసులో నలుగురు నింధితులకు న్యాయస్థానం జీవితఖైదు విధించింది. నిధింతుల్లో చందు, దినేష్, శ్రీకాంత్, అవేజ్ లు ఉన్నారు. వీరికి శిక్షతో పాటు రూ.1500 చొప్పున జరిమానా కూడా కోర్టు విధించింది. 

విశాఖలో దంపతుల ఆత్మహత్య..

విశాఖ : జిల్లా అరిలోవ ముప్తఫానగర్ లో విషాదం చోటుచేసుకుంది. కూతురు, కుమారుడితో సహా దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. వీరి ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. 

రౌడీ షీటర్ అయూబ్ ఖాన్ విడుదల

హైదరాబాద్ : చంచల్ గూడ జైలు నుంచి అయూబ్ ఖాన్ విడుదలైయ్యాడు. అతనిపై ఉన్న గ్యాంగ్ స్టర్, గోల్డ్ స్మగ్లర్, పీడీ యాక్ట్ ను హై కోర్టు కొట్టివేసింది. ఆయూబ్ ఖాన్ హత్యలు, కిడ్నాప్ ల వంటి 72 కేసుల్లో నింధితుడుగా ఉన్నాడు. 

బద్వేలులో భారీ అగ్నిప్రమాదం

కడప : జిల్లా బద్వేలు మార్దమ్మనగర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 200 గుడిసెలు దగ్థమయ్యాయి. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. 

మేడ్చల్ జవహర్ నగర్ లో అగ్నిప్రమాదం

మేడ్చల్ : జిల్ల జవహర్ నగర్ లోని రాంకీ డంపింగ్ యార్డులో అగ్ని ప్రమాదం జరిగింది. యార్డులో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. 

కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత

కరీంనగర్ : ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. సకాలంలో వైద్యం అందక ఓ పసికందు మృతి చెందింది. పాప మృతికి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని పసికందు మృతదేహంతో బంధువులు ఆందోళనకు దిగారు. వారిని పోలీసుల అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రక్తంగా మారింది.

20:38 - January 4, 2018

సంగారెడ్డి : మున్సిపాలిటీలో డంపింగ్ యార్డు లేకపోవడంతో పట్టణంలో 23 వార్డుకు చెత్తను ఈసుకువచ్చి బడేస్తున్నారు. ఈ చెత్తతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

20:31 - January 4, 2018

డర్బన్ : ట్రెడిషనల్‌ ఫార్మాట్‌లో అసలు సిసలు టెస్ట్‌ సిరీస్‌కు రంగం సిద్ధమైంది.సౌతాఫ్రికాతో టెస్ట్‌ సిరీస్‌కు కొహ్లీ అండ్‌ కో పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది.టెస్టుల్లో టాప్‌ ర్యాంక్‌లో ఉన్న టీమిండియా 2వ ర్యాంకర్‌ సౌతాఫ్రికాపై సఫారీ గడ్డపై తొలి సారిగా సిరీస్‌ విజయం సాధించాలని తహతహలాడుతోంది. 3 మ్యాచ్‌ల సిరీస్‌లోని తొలి టెస్ట్‌కు కేప్‌టౌన్‌లో రంగం సిద్ధమైంది. సౌతాఫ్రికాతో టెస్ట్‌ సిరీస్‌ ఆడబోతోన్న భారత జట్టు అన్ని విభాగాల్లోనూ బలంగా ఉంది.విరాట్‌,రాహుల్‌, పుజారా,విజయ్‌,రహానే,రోహిత్‌ శర్మ వంటి టాప్‌ క్లాస్‌ బ్యాట్స్‌మెన్‌తో పాటు భువనేశ్వర్‌ కుమార్‌,బుమ్రా,ఇషాంత్‌ శర్మ,ఉమేష్‌ యాదవ్‌, అశ్విన్‌,జడేజా వంటి బౌలర్లతో బౌలింగ్‌ ఎటాక్‌ పదునుగా ఉంది.

అన్ని విభాగాల్లోనూ ధీటుగా
మరోవైపు సౌతాఫ్రికా జట్టు భారత్‌కు అన్ని విభాగాల్లోనూ ధీటుగా ఉంది. ఆమ్లా, డివిలియర్స్‌,డు ప్లెసి,క్వింటన్ డి కాక్‌,డీన్‌ ఎల్గార్‌ వంటి బ్యాట్స్‌మెన్‌తో పాటు డేల్ స్టెయిన్‌, మోర్నీ మోర్కెల్‌,ఫిలాండర్‌,రబడ వంటి మేటి ఫాస్ట్‌ బౌలర్లతో పటిష్టంగా ఉంది. టెస్ట్‌ ఫేస్‌ టు ఫేస్ రికార్డ్‌లోనూ భారత్‌పై సౌతాఫ్రికా జట్టుదే పై చేయిగా ఉంది. ఇప్పటివరకూ ఇరు జట్లు 33 టెస్టుల్లో పోటీ పడగా.....దక్షిణాఫ్రికా జట్టు 13 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.భారత్‌ 10 మ్యాచ్‌ల్లో నెగ్గింది.సౌతాఫ్రికాలో ఇప్పటివరకూ 17 టెస్టులు ఆడిన భారత్‌ కేవలం 2 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించగలిగింది.ప్రస్తుతం వరుస టెస్ట్‌ సిరీస్‌ విజయాలతో జోరు మీదున్న టీమిండియా...ఈ సారైనా సౌతాఫ్రికా జట్టుపై సిరీస్‌ నెగ్గి సంచలనం సృష్టించాలని పట్టుదలతో ఉంది.మరి సొంతగడ్డపై ఎదురులేని సౌతాఫ్రికా జట్టు ఆధిపత్యానికి భారత జట్టు చెక్‌ పెట్టగలుగుతుందో లేదో చూడాలి. 

20:29 - January 4, 2018

ముంబై : మహారాష్ట్రలోని భీమా-కోరేగావ్‌ హింసాత్మక ఘటనల వేడి ఇంకా చల్లారలేదు. గుజరాత్ ఎమ్మెల్యే, దళిత కార్యకర్త జిగ్నేష్ మెవానీతో పాటు జేఎన్‌యూ విద్యార్థి ఉమర్ ఖలీద్ పాల్గొనే ఈవెంట్‌ను ముంబై పోలీసులు రద్దు చేశారు. రెండు వర్గాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడరన్న ఆరోపణలపై జిగ్నేష్‌ మేవాని, ఉమర్‌ ఖలీద్‌లపై పుణె పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ముంబైలో వీరిద్దరు పాల్గొనాల్సి ఉన్న కార్యక్రమానికి పోలీసులు అనుమతించకపోవడంతో విద్యార్థులు నిరసనకు దిగారు. జిగ్నేష్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. ఈవెంట్‌ను నిర్వహిస్తున్న వారితో పాటు కార్యక్రమానికి వచ్చిన విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కార్యక్రమం వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని పోలీసులు చెప్పారు.  

20:28 - January 4, 2018

శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్‌లోని సాంబా సెక్టార్‌లో పాకిస్తాన్‌ జరిపిన కాల్పులకు భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. బుధవారం పాకిస్తాన్‌ జరిపిన కాల్పుల్లో పుట్టిన రోజు జరుపుకుంటున్న భారత జవాను ఆర్పీ హజ్రా అమరుడయ్యాడు. దీంతో భారత బిఎస్‌ఎఫ్‌ దళాలు 24 గంటల్లోనే పాకిస్తాన్‌ ఆర్మీకి ఊహించని రీతిలో షాకిచ్చాయి. రెండు పాకిస్తానీ మోర్టార్ పొజిషన్లను పసిగట్టి రాత్రికి రాత్రే నేలకూల్చాయి. బీఎస్ఎఫ్ కాల్పుల్లో దాదాపు 12 మంది పాకిస్తాన్‌ రేంజర్లు హతమైనట్టు సమాచారం. మరోవైపు ఇవాళ ఉదయం 7 గంటలకు అంతర్జాతీయ సరిహద్దు వద్ద కంచె దాటి చొరబాటుకు యత్నించిన ఓ వ్యక్తిని బీఎస్ఎఫ్ మట్టుబెట్టింది. ఆర్‌ఎస్ పురా సెక్టార్‌లోని అర్నియా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 

20:27 - January 4, 2018

ఇస్లామాబాద్ : కూల్‌భూషన్ జాదవ్‌కు చెందిన ఓ వీడియోను పాకిస్థాన్ విడుదల చేసింది. ఈ వీడియోలో జాదవ్‌ పాకిస్తాన్‌ను పొగుడుతున్నట్లుగా ఉంది. పాకిస్తాన్‌ అధికారులు తనకు ఎలాంటి నష్టం కలిగించలేదని జాదవ్‌ చెప్పారు. తల్లి, భార్యను కలుసుకునే అవకాశం కల్పించిన పాకిస్థాన్‌కు జాదవ్ ఆ వీడియోలో థ్యాంక్స్ చెబుతున్నట్లుగా ఉంది. తనను కలుసుకోవడం వల్ల తన భార్య, తల్లి సంతోషంగా ఫీలయ్యారని.... తన ఆరోగ్యం పట్ల తన తల్లి ఆనందం వ్యక్తం చేసిందని, తనకు ఎటువంటి హాని జరగదని జాదవ్ ఆ వీడియోలో అన్నట్లుగా ఉంది. డిసెంబర్ 25వ తేదీన ఇస్లామాబాద్‌లో జాదవ్‌ను ఆయన తల్లి, భార్య కలుసుకున్నారు. జాదవ్ కుటుంబాన్ని పాక్ అవమానించిందని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ వీడియోను విడుదల చేయడం పలు సందేహాలకు దారి తీసింది. పాకిస్థాన్ జాదవ్‌పై వత్తిడి చేసి ప్రకటన ఇప్పించినట్లుగా అనుమానిస్తున్నారు. గూఢచర్యం కేసులో పాకిస్తాన్‌ ఆర్మీ కోర్టు జాదవ్‌కు మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే.

20:26 - January 4, 2018

అనంతపురం : తెలుగు భాషను ప్రభుత్వ పాఠశాలల్లో లేకుండా చేస్తున్నారని.. మొదట తెలుగు భాషను కాపాడితేనే సంసృతి సాహిత్యం నిలబడుతుందని ప్రముఖ సినీ డైరెక్టర్‌ తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. మంచి సినిమాలు తీస్తే చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తారన్నారు. రాజకీయాల్లో కానీ సినిమా రంగంలో కానీ వారసత్వాన్ని ప్రజలే మద్దతు ఇస్తున్నారన్నారు. వారుసులు కానీ వారు కూడా ఎంతో మంది సినీ రంగంలో ప్రజాధారణ పొందారన్నారు. ఎంత పెద్ద బడ్జెట్‌తో సినిమాలు తీసినా.. ప్రేక్షకులకు నచ్చిన సినిమాలను మాత్రమే ఆదరిస్తారని తెలిపారు.

20:25 - January 4, 2018

హైదరాబాద్ : సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ హత్యకు గురైనట్లు జరిగిన ప్రచారం ఓ కొలిక్కి వచ్చింది. హత్యకు గురైంది.. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కాదని.. హతుడు కార్పెంటర్‌గా పనిచేస్తున్న నాగరాజు అని పోలీసులు నిర్ధరించారు. వివాహేతర సంబంధమే నాగరాజు హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. భర్తతో సుఖంగా లేనని... లవర్‌తో శారీరక సంబంధాన్ని కొనసాగించిన నాగరాజు భార్య జ్యోతి.. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను చంపించిందని పోలీసుల దర్యాప్తులు తేలింది. లవర్‌ కార్తీక్‌తో కలిసి జ్యోతి సుపారీ ఇచ్చినట్లు తేలింది. 31వ తేదీ రాత్రి దీపక్‌, నరేశ్‌, కార్తిక్‌, యాసిన్‌తో కలిసి చౌటుప్పల్‌లో నాగరాజు హత్య చేసి... అక్కడే శవాన్ని పడవేసి వెళ్లిపోయారు. విషయం తెలియడంతో దీపక్‌ను నరేష్‌ అన్న మందలించాడు. హత్య విషయం భయటపడుతుందని భయపడ్డ నరేష్‌ 100కి డయల్‌ చేసి పోలీసులకు చెప్పాలనుకున్నాడు. అనంతరం లాలాపేట పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోవడానికి వచ్చి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ కేసులో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

20:19 - January 4, 2018

కృష్ణా : క్రిస్మస్‌, న్యూఇయర్‌ డిస్కౌంట్‌ సేల్‌ సందర్భంగా సోనోవిజన్‌ సంస్థ కొనుగోలుదారులకు ఖరీదైన కార్లు బహుకరించింది. ఇందులో భాగంగా విజయవాడ 37వ డివిజన్‌ కార్పొరేటర్‌ కోనూరు శైలజ, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, దేవినేని అవినాష్‌.. లక్కీడ్రాలు తీశారు. ఎంపికైన వారికి హోండా ఇమేజ్‌ కారు, ఎల్‌ఈడీ టీవీ, రిఫ్రిజరేటర్‌ బహుమతులు అందించారు. అతి తక్కువ ధరలతో నమ్మకమైన సర్వీస్‌ అందించే అతిపెద్ద ఎలక్ట్రానిక్‌ షోరూమైన సోనోవిజన్...న్యూ ఇయర్‌, సంక్రాంతి డిస్కౌంట్‌ సేల్‌లో అన్ని కంపెనీల ఎల్‌ఈడీ, ఫ్రిజ్‌, వాషింగ్‌ మిషన్‌, ఎసీలు వడ్డీలేని వాయిదాలతో అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది. కొన్ని మోడల్స్‌... ముందు ఏమీ చెల్లించకుండా వస్తువులు తీసుకెళ్లి వడ్డీలేని వాయిదాలలో చెల్లించవచ్చని అలాగే అన్ని మోడల్స్‌పై వడ్డీలేని వాయిదాల సౌకర్యం కల్పిస్తున్నట్లు సోనోవిజన్ యాజమాన్యం తెలిపింది. 

20:17 - January 4, 2018

పశ్చిమగోదావరి : ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా 10టీవీ వ్యవహరిస్తుందని ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే కలవలపుడి శివ అన్నారు. ఉండిలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో 10టీవీ క్యాలెండర్‌ని ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. 10టీవీ యాజమాన్యానికి, సిబ్బందికి..రాష్ట్ర ప్రజలందరికీ ఎమ్మెల్యే శివ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

20:17 - January 4, 2018

తూర్పుగోదావరి : కొంత కాలంగా వాయిదా పడుతూ వస్తోన్న జేఎన్టీయూ స్నాతకోత్సవాన్ని ఈ ఏడాది నిర్వహించనున్నారు. ఈ నెల 23న నిర్వహించబోయే ఈ కార్యక్రమానికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీకాకుళం నుండి ప్రకాశం జిల్లా వరకు 8 జిల్లాల పరిధిలోని 259 ఇంజనీరింగ్‌ కాలేజీల్లో చదివి 2015-16, 2016-17 సంవత్సరాలలో ఉత్తీర్ణులయిన వారికి డాక్టరేట్‌ ప్రదానం చేయనున్నారు.

ఎంపిక వ్యవహారం తీవ్ర విమర్శలకు
అయితే గౌరవ డాక్టరేట్‌ పంపిణీకి అభ్యర్థుల ఎంపిక వ్యవహారం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ చర్చించుకొని తమలో ఒకరికి డాక్టరేట్‌ పంపిణీకి సిద్ధం కావడం ఈ వివాదాలకు కారణమైంది. ముఖ్యంగా పాలకమండలి సభ్యుడిగా ఉన్న బీవీ మోహన్‌ రెడ్డిని డాక్టరేట్‌కు ఎంపిక చేయడం పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై విద్యార్థి సంఘాలు కూడా తీవ్రంగా విమర్శిస్తున్నాయి. దేశంలో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో సుప్రసిద్ధులున్నప్పటికీ పాలకమండలి సభ్యుడికి డాక్టరేట్‌ ప్రదానం చేయడం విడ్డూరంగా ఉందంటున్నారు. గౌరవ డాక్టరేట్‌ ప్రదానంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నప్పటికీ వర్సిటీ అధికారులు మాత్రం స్నాతకోత్సవ వేడుకల ఏర్పాట్లలో మునిగిపోయారు. పైగా తాము చేసిన ప్రతిపాదనలకు గవర్నర్‌ ఆమోదం తెలిపారని జేఎన్టీయూ వీసీ చెబుతుండడం విశేషం. బీవీ మోహన్‌ రెడ్డి అనే సాఫ్ట్‌వేర్‌ కంపెనీ యజమాని అయిన తమ కాలేజీ పూర్వ విద్యార్థిని ప్రత్యేకంగా సన్మానించడానికి గవర్నర్‌ అనుమతి ఉందంటున్నారు. ఈ వ్యవహారంపై ఉన్నత విద్యాధికారులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే జేఎన్టీయూ ప్రతిష్ట దిగజారే అవకాశాలున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.

 

20:13 - January 4, 2018

తూర్పుగోదావరి : పోలవరం నిర్వాసితుల సమస్యలపై ఉద్యమం తప్పదంటున్నారు సీపీఎం నేతలు. రాజమహేంద్రవరంలో సీపీఎం జిల్లా మహాసభల సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని కోటిపల్లి బస్టాండ్‌ నుండి మెయిన్‌ రోడ్డు మీదుగా ప్రదర్శన సాగింది. అనంతరం సుబ్రహ్మణ్య మైదానంలో బహిరంగ సభ నిర్వహించారు. పోలవరం నిర్వసితుల పట్ల చంద్రబాబు తీరును మాజీ ఎంపీ మిడియం బాబురావు తీవ్రంగా మండిపడ్డారు. 

20:12 - January 4, 2018

గుంటూరు : నవ్యాంధ్రప్రదేశ్‌ స్వర్ణాంధ్రప్రదేశ్‌గా నిలబడాలన్నదే చంద్రబాబు లక్ష్యమని మంత్రి నారాలోకేష్‌ అన్నారు. గుంటూరు జిల్లాలోని కొల్లిపర మండలం అత్తోటలో జరిగిన జన్మభూమి మాఊరు కార్యక్రమంలో మంత్రులు నారాలోకేష్‌, పత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రరాష్ట్రం అభివృద్ధి చెందుతుందని రాష్ట్రపతి కితాబిచ్చారని నారాలోకేష్ తెలిపారు. ప్రతి గ్రామానికి 10 స్టార్లతో రేటింగ్‌ ఇచ్చామన్నారు లోకేష్‌. నవ్యాంధ్రప్రదేశ్‌ స్వర్ణాంధ్రప్రదేశ్‌గా నిలబడాలన్నదే చంద్రబాబు లక్ష్యమని మంత్రి నారాలోకేష్‌ అన్నారు. గుంటూరు జిల్లాలోని కొల్లిపర మండలం అత్తోటలో జరిగిన జన్మభూమి మాఊరు కార్యక్రమంలో మంత్రులు నారాలోకేష్‌, పత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రరాష్ట్రం అభివృద్ధి చెందుతుందని రాష్ట్రపతి కితాబిచ్చారని నారాలోకేష్ తెలిపారు. ప్రతి గ్రామానికి 10 స్టార్లతో రేటింగ్‌ ఇచ్చామన్నారు

కర్పెంటర్ హత్య కేసులో వీడిన మిస్టరీ

హైదరాబాద్ : కార్పెంటర్ నాగరాజు హత్య కేసు వీస్టరీ వీడింది. నాగరాజ్ భర్యనే భర్తను చంపించిందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. భర్త నాగరాజుతో తను సుఖంగా లేనని జ్యోతి అనే వివాహిత లవర్ తో శారీరక సంబంధాని కొనసాగిస్తుంది. వీరి వివాహేతర సంబంధానికి భర్త నాగరాజ్ అడ్డుగా ఉన్నాడని జ్యోతి భర్తను చంపించింది. 

18:19 - January 4, 2018

హైదరాబాద్ : కార్పెంటర్ నాగరాజు హత్య కేసు వీస్టరీ వీడింది. నాగరాజ్ భర్యనే భర్తను చంపించిందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. భర్త నాగరాజుతో తను సుఖంగా లేనని జ్యోతి అనే వివాహిత లవర్ తో శారీరక సంబంధాని కొనసాగిస్తుంది. వీరి వివాహేతర సంబంధానికి భర్త నాగరాజ్ అడ్డుగా ఉన్నాడని జ్యోతి భర్తను చంపించింది. లవర్ కార్తీక్ తో కలిసి జ్యోతి సుఫారీ ఇచ్చింది. పూర్తి వరాలకు వీడియో క్లిక్ చేయండి.

ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రమణ్యంకు ఊరట

హైదరాబాద్ : సీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రమణ్యానికి ఊరట లభిచింది. ఎమ్మార్ ప్రాపర్టీ కేసులో సీబీఐ సబ్రమణ్యం పేరు చేర్చింది. తనపై సీబీఐ పెట్టిన కేసును కొట్టివేయాలని సుబ్రమణ్యం హైకోర్టును ఆశ్రయించారు. 

గజల్ కేసులో పోలీసుల కస్టడీ పిటిషన్ కొట్టివేత

హైదరాబాద్ : గజల్ శ్రీనివాస్ కస్టడీ కోరుతూ పంజాగుట్ట పోలీసులు వేసిన పిటిషన్ నాంపల్లి కోర్టు కొట్టివేసింది. గజల్ బెయిల్ పిటిషన్ పై కోర్టు రేపు విచారణ చేయనుంది. గజల్ శ్రీనివాస్ లైంగిక ఆరోపణల కేసులో 2రోజుల క్రింద అరెస్ట్ చేశారు. 

సిరిసిల్ల జిల్లాలో దారుణం

రాజన్న సిరిసిల్ల : జిల్లా తిమ్మాపూర్ లో దారుణం జరిగింది. డిసెంబర్ 31 రాత్రి స్నేహితల మధ్య గొడవ జరిగింది. గొడవ విషయం తెలిసి సాయికిరణ్ అనే అబ్బాయి తల్లి కవిత అడ్డుకోబోయింది. దీంతో తల్లీ కొడుకులను యువకులు చితబాదారు. ముదిరాజ్ కుల పెద్దలు ఇరువర్గాలకు రూ.2500 జరిమానా విధించారు. కులపెద్దల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కవిత పోలీసులను ఆశ్రయించింది. అంజయ్య, కవిత కుటుంబాన్ని కులపెద్దలు బహిష్కరించారు. 

మిస్టరీగా సాప్ట్ వేర్ ఇంజనీర్ హత్య

హైదరాబాద్ : సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ హత్యకేసు మిస్టరీగానే ఉంది. హత్యకేసులో నిందితుడైన నరేష్‌ ఇస్తున్న సమాచారంపై పోలీసులు క్లారిటీకి రాలేకపోతున్నారు. ప్రస్తుతం సెల్‌ఫోన్‌ డేటా కీలకంగా మారింది. హత్యలో భార్య ప్రమేయంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. డిసెంబర్‌ 31వ తేదీ రాత్రి కాల్‌ డేటాను పోలీసులు సేకరిస్తున్నారు. సెల్‌టవర్‌ లొకేషన్‌ ఆధారంగా నరేష్‌ను పలు ప్రాంతాలకు తీసుకెళ్లి విచారిస్తున్నారు. 

18:03 - January 4, 2018

మహబూబ్ నగర్ : జిల్లా కాంగ్రెస్‌ నేతల మధ్య కుమ్ములాటలు తారస్థాయికి చేరాయి. గత ఎన్నికల ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకున్నారో లేదో తెలియదు కానీ.. పాలమూరు జిల్లాలోని కాంగ్రెస్‌ అగ్రనాయకులు... అంతర్గత విభేదాలను మాత్రం మానుకోలేదు. ఎప్పుడో ఏడాదిన్నర తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి తమ వర్గం వారికే టికెట్లు ఇవ్వాలంటూ నేతలు పంతానికి పోతున్నారు. జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నాయకులు... మాజీ కేంద్ర మంత్రి జైపాల్‌ రెడ్డి, మాజీమంత్రి డీకే అరుణ వర్గాల మధ్య ఈ పోటీ మరీ ఎక్కువగా సాగుతోంది. .

కాటం ప్రదీప్‌కుమార్ గౌడ్‌ కూడా టికెట్‌ కోరుతున్నారు...
కాంగ్రెస్‌ పార్టీ దేవరకద్ర నియోజకవర్గంలో... తమ వర్గానికే టికెట్‌ ఇప్పించుకోవాలని, జిల్లా పార్టీ అగ్రనాయకులు ప్రయత్నిస్తున్నారు. ఇంఛార్జి డొకూర్‌ పవన్‌ కుమార్‌రెడ్డి... రెండో సారి పార్టీ టికెట్‌ ఆశిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న కాటం ప్రదీప్‌కుమార్ గౌడ్‌ కూడా టికెట్‌ కోరుతున్నారు. వీరికితోడు లాయర్‌ మధుసూదన్‌ రెడ్డి కూడా టికెట్‌ రేస్‌లో ఉన్నారు. దీంతో కాంగ్రెస్‌ టికెట్‌కు త్రిముఖ పోటీ నెలకొంది. దేవరకద్రలో ఇంతవరకూ డీకే అరుణ వర్గం ఆధిపత్యమే కొనసాగింది.. కాగా ఇప్పుడు జైపాల్‌ రెడ్డి వర్గం పట్టుకోసం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా ప్రదీప్‌ కుమార్‌ పండుగ శుభాకాంక్షలతో బ్యానర్లు ఏర్పాటు చేశారు.. ఐతే తమ నేత ఫోటో లేదంటూ మరోవర్గం వాటిని తొలగించింది. దీంతో వ్యవహారం పోలీస్‌ కేసు దాకా వెళ్ళింది.

వివాదానికి ఫ్లెక్సీలే కారణం
ఫ్లెక్సీలు కట్టి.. వివాదానికి కారణమయ్యాడని ప్రత్యర్థులు ఆరోపిస్తున్న ప్రదీప్‌కుమార్‌ మాత్రం.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ తనదేనన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి చేసిన సేవలు, తన అనుభవం కారణంగానే తనకు వస్తుందని ఘంటాపథంగా చెప్పగలుగుతున్నానని అంటున్నారు. మొత్తానికి, ఎన్నడూ లేనంతగా.... కాంగ్రెస్‌ పార్టీ దేవరకద్ర శాఖలో చిచ్చురాజుకుంది. జైపాల్‌రెడ్డి, డి.కె.అరుణ వర్గీయుల మధ్య మాటల యుద్ధం తార స్థాయికి చేరింది. ఈ కుమ్ములాటలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. దీంతో.. దేవరకద్ర కాంగ్రెస్‌ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

18:01 - January 4, 2018

కరీంనగర్ : జిల్లా హుజురాబాద్‌లో జమ్మికుంట మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ పింగళి రమేష్‌ టెన్‌టీవీ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తూ... సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోందని పింగళి రమేశ్‌ అన్నారు. టెన్‌టీవీ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులతోపాటు కార్మికులు పాల్గొన్నారు.

18:00 - January 4, 2018

జగిత్యాలం : తాజా సమాచారాన్ని అందించడంలో 10టీవీ ముందంజలో ఉంటుందని జగిత్యాల జిల్లా ఎస్పీ అనంత శర్మ అన్నారు. పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో ఎస్పీ చేతుల మీదుగా 10టీవీ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. భవిష్యత్తులో కూడా మరింత సమాచారాన్ని అందిస్తు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటుందని ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుడు టీవీ సూర్యం అన్నారు. కార్యక్రమంలో టీమాస్‌ కన్వినర్‌ నక్క విజయ్‌, తదితరులు పాల్గొన్నారు.

17:59 - January 4, 2018

మహబూబ్ నగర్ : జిల్లా పెద్దాయిపల్లి జాతీయ రహదారిపై కారు-లారీ ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. కారు టైరు పగిలిపోవడంతో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతిచెందిన ఇద్దరు షాబాద్‌కి చెందిన మాదవరెడ్డి, పూర్ణచందర్‌గా గుర్తించారు.

17:58 - January 4, 2018

పెద్దపల్లి : నిర్భయ లాంటి కఠిన చట్టాలొచ్చినా ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతోంది. ఏ మాత్రం అవకాశం దొరికినా మృగాళ్లు చెలరేగిపోతున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌కు చెందిన 16 ఏళ్ల బాలికపై.. కడంబాపూర్‌కు చెందిన పెద్ది నగేష్‌ లైంగికదాడికి తెగబడ్డాడు. కనుకుల అటవీ ప్రాంతంలో కట్టెలు ఏరేందుకు వెళ్లిన మైనర్‌కు కూల్‌డ్రింక్‌లో మత్తుమందు ఇచ్చిన నగేష్‌ అత్యాచారం చేశాడు. ఆ దృశ్యాలను వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. అయితే రాజీ కుదిర్చేందుకు స్థానికంగా ఉన్న పెద్దమనుషులు విఫలయత్నం చేశారు. నెల రోజుల తర్వాత బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

17:57 - January 4, 2018

హైదరాబాద్ : సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ హత్యకేసు మిస్టరీగానే ఉంది. హత్యకేసులో నిందితుడైన నరేష్‌ ఇస్తున్న సమాచారంపై పోలీసులు క్లారిటీకి రాలేకపోతున్నారు. ప్రస్తుతం సెల్‌ఫోన్‌ డేటా కీలకంగా మారింది. హత్యలో భార్య ప్రమేయంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. డిసెంబర్‌ 31వ తేదీ రాత్రి కాల్‌ డేటాను పోలీసులు సేకరిస్తున్నారు. సెల్‌టవర్‌ లొకేషన్‌ ఆధారంగా నరేష్‌ను పలు ప్రాంతాలకు తీసుకెళ్లి విచారిస్తున్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

17:56 - January 4, 2018

హైదరాబాద్ : విశ్వనగరంగా మార్చుతామన్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఓల్డ్‌ సిటీని ఎందుకు అభివృద్ధి చేయడంలేదని ప్రశ్నించారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి హనుమంతరావు. ఓల్డ్‌ సిటీలో మెట్రో రైల్‌ ప్రారంభించాలంటూ పాతబస్తీ మెట్రో రైల్‌ జేఏసీ ఆధ్వర్యంలో సోమాజీగూడ ప్రెస్‌ క్లబ్‌లో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. నగర అభివృద్ధిపై కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే పాతబస్తీలోనూ మెట్రో ప్రారంభించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు నారాయణ డిమాండ్‌ చేశారు. 

17:55 - January 4, 2018

కామరెడ్డి : జిల్లాలో ఇసుకమాఫియా రక్తం చిందించింది. తమ వ్యాపారానికి అడ్డొచ్చిన వారిపై శివాలెత్తిపోతోంది. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునే వారికి నరకం చూపిస్తోంది. ప్రత్యక్ష దాడులకు దిగుతూ తమ పైశాచికాన్ని చాటుకుంటోంది. ఇసుక తరలింపును అడ్డుకున్నందుకు ఓ వీఆర్ఏను కిరాతకంగా హతమార్చారు. పిట్లం మండలం కంబాపూర్ శివారులోని కాకివాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న వీఆర్ఏ సాయిలు రాత్రి సమయంలో అక్కడకు చేరుకున్నాడు. సాయిలు అక్కడే నిలబడి ఇసుక మాఫియా ముఠాని అడ్డుకున్నాడు. దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సాయిలుపై కోపంతో ఊగిపోయిన మాఫియా అతడిని ట్రాకర్ట్‌తో ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన వీఆర్‌ఏ అక్కడికక్కడే చనిపోయాడు.

ట్రాకర్ట్‌తో ఢీకొట్టి హత్య
కారెగాం గ్రామానికి చెందిన సాయిలు మార్తాండ గ్రామంలో వీఆర్ఏగా విధులు నిర్వహిస్తున్నారు. కాకివాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న సమాచారం అందుకున్న సాయిలు... పై అధికారులకు విషయాన్ని చెప్పి ఘటనాస్థలానికి వెళ్లినట్లు తెలుస్తోంది. వీఆర్‌ఏ సాయిలు హత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపడంతో.. కారెగాం, మార్తాండ గ్రామస్థులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకు దిగారు. స్థానిక ఎమ్మార్వో, పోలీసులు అక్కడకు చేరుకుని ఇరు గ్రామాల ప్రజలను శాంతింపజేశారు. పరారీలో ఉన్న నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కారెగాం, మార్తాండ వాసులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో చెలరేగిపోతున్న ఇసుకమాఫియాపై రెవిన్యూ అధికారులు, పోలీసులు కొరడా ఝుళిపించాలంటున్నారు. 

17:42 - January 4, 2018

కృష్ణా : దుర్గగుడి పాలకమండలి వ్యవహారంపై ఎమ్మెల్సీ బుద్ధావెంకన్నతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. దుర్గ గుడిలో వివాదాలకు చెక్‌ పెట్టేలా పాలకమండలితో చర్చించి నివేదక అందించాలని సూచించారు. దీంతో విజయవాడలోని కేశినేని భవన్‌లో ఎమ్మెల్సీ పాలకమండలితో అత్యవసర సమావేశం నిర్వహించారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ఎవరు వ్యవహరించినా ఉపేక్షించమని ఆన్నారు.

17:41 - January 4, 2018

కర్నూలు : పేద మహిళ భూమిపై బాలసాయిబాబా కన్నేశారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం హుసేనపురానికి చెందిన బోయ లక్ష్మికి వారసత్వంగా రెండెకరాల భూమి వచ్చింది. అయితే ఈ భూమిలో బాలసాయిబాబా ట్రస్ట్‌ బోర్డు వెలిసిందని లక్ష్మి ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓర్వకల్లు ఎమ్‌ఆర్‌ఓ కార్యాలయం ముందు ధర్నా చేపట్టింది. భూమికి కోటి రూపాయల విలువ ఉంటుందని.. అందుకే బాలసాయిబాబా కన్నేసాడని ఆరోపించింది. రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై ఆక్రమించుకున్నారని చెప్పింది. మరోవైపు నిబంధనల ప్రకారం భూమిని కొనుగోలు చేశామని బాలసాయిబాబా ట్రస్ట్ నిర్వాహకులు అంటున్నారు. 

జూబ్లీహిల్స్ లో పట్టపగలే దారుణం

హైదరాబాద్ : జూబ్లీహిల్స్ లో పట్టపగలే దారుణం జరిగింది. రోడ్ నెం.10లో దోపిడి జరిగింది. ఓ కంపెనీలో పనిచేసే ఉద్యోగిపై ముగ్గురు వ్యక్తులు కత్తులతో దాడి చేసి, పర్సు, టూవీలర్ లాక్కొని దుండగులు పరారైయ్యారు. 

17:30 - January 4, 2018

హైదరాబాద్ : జూబ్లీహిల్స్ లో పట్టపగలే దారుణం జరిగింది. రోడ్ నెం.10లో దోపిడి జరిగింది. ఓ కంపెనీలో పనిచేసే ఉద్యోగిపై ముగ్గురు వ్యక్తులు కత్తులతో దాడి చేసి, పర్సు, టూవీలర్ లాక్కొని దుండగులు పరారైయ్యారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

గజల్ కేసులో పోలీసుల కస్టడీ పిటిషన్ కొట్టివేత

హైదరాబాద్ : గజల్ శ్రీనివాస్ కస్టడీ కోరుతూ పంజాగుట్ట పోలీసులు వేసిన పిటిషన్ నాంపల్లి కోర్టు కొట్టివేసింది. గజల్ బెయిల్ పిటిషన్ పై కోర్టు రేపు విచారణ చేయనుంది. గజల్ శ్రీనివాస్ లైంగిక ఆరోపణల కేసులో 2రోజుల క్రింద అరెస్ట్ చేశారు.

సిరిసిల్ల జిల్లాలో దారుణం

రాజన్న సిరిసిల్ల : జిల్లా తిమ్మాపూర్ లో దారుణం జరిగింది. డిసెంబర్ 31 రాత్రి స్నేహితల మధ్య గొడవ జరిగింది. గొడవ విషయం తెలిసి సాయికిరణ్ అనే అబ్బాయి తల్లి కవిత అడ్డుకోబోయింది. దీంతో తల్లీ కొడుకులను యువకులు చితబాదారు. ముదిరాజ్ కుల పెద్దలు ఇరువర్గాలకు రూ.2500 జరిమానా విధించారు. కులపెద్దల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కవిత పోలీసులను ఆశ్రయించింది. అంజయ్య, కవిత కుటుంబాన్ని కులపెద్దలు బహిష్కరించారు. 

17:12 - January 4, 2018

హైదరాబాద్ : సీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రమణ్యానికి ఊరట లభిచింది. ఎమ్మార్ ప్రాపర్టీ కేసులో సీబీఐ సబ్రమణ్యం పేరు చేర్చింది. తనపై సీబీఐ పెట్టిన కేసును కొట్టివేయాలని సుబ్రమణ్యం హైకోర్టును ఆశ్రయించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

17:11 - January 4, 2018

హైదరాబాద్ : గజల్ శ్రీనివాస్ కస్టడీ కోరుతూ పంజాగుట్ట పోలీసులు వేసిన పిటిషన్ నాంపల్లి కోర్టు కొట్టివేసింది. గజల్ బెయిల్ పిటిషన్ పై కోర్టు రేపు విచారణ చేయనుంది. గజల్ శ్రీనివాస్ లైంగిక ఆరోపణల కేసులో 2రోజుల క్రింద అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలకువ వీడియో క్లిక్ చేయండి.

నల్లగొండలో లారీ భీభత్సం

నల్లగొండ : జిల్లా పెద్దపూర మండల కేంద్రంలో లారీ భృభత్సం సృష్టించింది. లారీ అదుపు తప్పి రోడ్డు మీద ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదం ఆటో సహా పలు బైకులు ధ్వసం అయ్యాయి. పలువుకి గాయాలకు కూడా తగిలాయి. లారీ డ్రైవర్ క్యాబిన్ ఇరుక్కుపోయి మరణించాడు. ప్రొక్లెన్ సహయంతో లారీ డ్రైవర్ ను క్యాబిన్ నుంచి బయటకు తీశారు.

అధికారుల ముందు రైతుల ఆత్మహత్యాయత్నం

కర్నూలు : జిల్లా డోన్ నియోజవర్గం గోసానిపల్లెలో రైతులు ఆత్మహత్యాయత్నం చేశారు. జన్మభూమి కార్యక్రమంలో అధికారుల ఎదుట పురుగుల వారు తాగారు. పోలీసుల అప్రమత్తతో ప్రమాదం తప్పింది. తమ భూములను ఇతర వ్యక్తుల పేరుపై రికార్డుల్లో మారుస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

17:00 - January 4, 2018

హైదరాబాద్ : గజల్ శ్రీనివాస్ కస్టడీ కోరుతూ పంజాగుట్ట పోలీసులు వేసిన పిటిషన్ నాంపల్లి కోర్టు కొట్టివేసింది. గజల్ బెయిల్ పిటిషన్ పై కోర్టు రేపు విచారణ చేయనుంది. గజల్ శ్రీనివాస్ లైంగిక ఆరోపణల కేసులో 2రోజుల క్రింద అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలకువ వీడియో క్లిక్ చేయండి.

16:59 - January 4, 2018

రాజన్న సిరిసిల్ల : జిల్లా తిమ్మాపూర్ లో దారుణం జరిగింది. డిసెంబర్ 31 రాత్రి స్నేహితల మధ్య గొడవ జరిగింది. గొడవ విషయం తెలిసి సాయికిరణ్ అనే అబ్బాయి తల్లి కవిత అడ్డుకోబోయింది. దీంతో తల్లీ కొడుకులను యువకులు చితబాదారు. ముదిరాజ్ కుల పెద్దలు ఇరువర్గాలకు రూ.2500 జరిమానా విధించారు. కులపెద్దల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కవిత పోలీసులను ఆశ్రయించింది. అంజయ్య, కవిత కుటుంబాన్ని కులపెద్దలు బహిష్కరించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

16:26 - January 4, 2018

నల్లగొండ : జిల్లా పెద్దపూర మండల కేంద్రంలో లారీ భృభత్సం సృష్టించింది. లారీ అదుపు తప్పి రోడ్డు మీద ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదం ఆటో సహా పలు బైకులు ధ్వసం అయ్యాయి. పలువుకి గాయాలకు కూడా తగిలాయి. లారీ డ్రైవర్ క్యాబిన్ ఇరుక్కుపోయి మరణించాడు. ప్రొక్లెన్ సహయంతో లారీ డ్రైవర్ ను క్యాబిన్ నుంచి బయటకు తీశారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

16:25 - January 4, 2018

కర్నూలు : జిల్లా డోన్ నియోజవర్గం గోసానిపల్లెలో రైతులు ఆత్మహత్యాయత్నం చేశారు. జన్మభూమి కార్యక్రమంలో అధికారుల ఎదుట పురుగుల వారు తాగారు. పోలీసుల అప్రమత్తతో ప్రమాదం తప్పింది. తమ భూములను ఇతర వ్యక్తుల పేరుపై రికార్డుల్లో మారుస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

డాక్టర్ల నిర్లక్ష్యంతో మహిళ మృతి

రంగారెడ్డి : జిల్లా హస్తినాపురంలోని అమ్మా ఆసుపత్రిలో విషాదం జరిగింది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే బుచ్చమ్మ (35) మృతి చెందిందంటూ బంధువులు ఆందోళనకు దిగారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

కోడిపందాలపై హైకోర్టు ఆగ్రహం

హైదరాబాద్ : కోడి పందాలపై హైకోర్టులో విచారణ జరిగింది. కోడిపందాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని హైకోర్టు స్పష్టం చేసింది. గత సంవత్సరం ఇచ్చిన ఆర్డర్ ను పట్టించుకోలేదని, సంక్రాంతికి కోడిపందాలను అడ్డుకోలేకపోయారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 

16:09 - January 4, 2018
16:08 - January 4, 2018

రంగారెడ్డి : జిల్లా హస్తినాపురంలోని అమ్మా ఆసుపత్రిలో విషాదం జరిగింది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే బుచ్చమ్మ (35) మృతి చెందిందంటూ బంధువులు ఆందోళనకు దిగారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

16:07 - January 4, 2018

హైదరాబాద్ : కోడి పందాలపై హైకోర్టులో విచారణ జరిగింది. కోడిపందాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని హైకోర్టు స్పష్టం చేసింది. గత సంవత్సరం ఇచ్చిన ఆర్డర్ ను పట్టించుకోలేదని, సంక్రాంతికి కోడిపందాలను అడ్డుకోలేకపోయారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

చాక్లెట్ కలర్ తో రూ.10 కొత్త నోటు

ఢిల్లీ : మహాత్మాగాంధీ సిరీస్ లో చాక్లెట్ కలర్ లో రూ.10 కొత్త నోటు విడుదల చేయనున్నారు. కొత్త కరెన్సీ నోటుపై ఒక వైపు కోణార్క్ సూర్య దేవాలయం ఉంటుంది.

15:02 - January 4, 2018
15:00 - January 4, 2018

హైదరాబాద్ : నిర్వహించింది. నేరగాళ్లు, అనుమానిత వస్తువులు, బాంబులను ఎలా నిర్వీర్యం చేస్తారో ప్రజలకు అవగాహన కల్పించారు. ఎలాంటి పరిస్థితులు అయినా ఎదుర్కునేలా డాగ్స్‌కి శిక్షణ ఇచ్చామని అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

14:59 - January 4, 2018

చిత్తూరు : బీసీ సర్టిఫికేట్ అందుకున్న రోజే మాకు నిజమైన పండుగ అని కాపు సామాజిక నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. కాపు ఉద్యమాన్ని ఆపలేదని.. మార్చి 31 వరకూ తాత్కాలికంగా వాయిదా వేసినట్లు ఆయన చెప్పారు. కాపు నేతలతో తిరుపతిలో జరిగిన సమావేశంలో ముద్రగడ పాల్గొన్నారు. పవన్ కల్యాణ్‌తో తనకు పరిచయం లేదన్నారు ముద్రగడ. పవన్‌ను తాను వ్యక్తిగతంగా ఎప్పుడూ కలవలేదని.. కేవలం సినిమాల్లో మాత్రమే చూశానని ముద్రగడ చెప్పారు.

 

14:59 - January 4, 2018

చిత్తూరు : బీసీ సర్టిఫికేట్ అందుకున్న రోజే మాకు నిజమైన పండుగ అని కాపు సామాజిక నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. కాపు ఉద్యమాన్ని ఆపలేదని.. మార్చి 31 వరకూ తాత్కాలికంగా వాయిదా వేసినట్లు ఆయన చెప్పారు. కాపు నేతలతో తిరుపతిలో జరిగిన సమావేశంలో ముద్రగడ పాల్గొన్నారు. పవన్ కల్యాణ్‌తో తనకు పరిచయం లేదన్నారు ముద్రగడ. పవన్‌ను తాను వ్యక్తిగతంగా ఎప్పుడూ కలవలేదని.. కేవలం సినిమాల్లో మాత్రమే చూశానని ముద్రగడ చెప్పారు.

 

14:58 - January 4, 2018

హైదరాబాద్ : విజయవాడ దుర్గగుడిలో తాంత్రిక పూజలపై వైసీపీ నేత బొత్స సత్యనారాయణ స్పందించారు. ఘటన జరిగి వారంరోజులవుతున్నా ఇంకా విచారణ కొనసాగుతుండడంపై మండిపడ్డారు. ఎప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చినా ఏదో ఒక ఘటన జరుగుతుందన్నారు. కడప పులివెందుల సభలో ఎంపీ అవినాష్‌రెడ్డిపై సీఎం తీరును బొత్స ఖండించారు. ప్రజాస్వామ్య పద్దతిలో టీడీపీ కార్యక్రమాలు జరగడంలేదని విమర్శించారు. 

14:47 - January 4, 2018

ఢిల్లీ : జనవరి 1న భీమా-కోరేగావ్‌లో జరిగిన హింసాత్మక ఘటనలపై రాజ్యసభలో చర్చ జరిగింది. దేశవ్యాప్తంగా దళితులు, మైనారిటీలు, మహిళలపై జరుగుతున్న దాడుల పట్ల విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. 267 నిబంధన కింద జీరో అవర్‌లో చర్చను ప్రారంభించిన కాంగ్రెస్‌... ప్రభుత్వ వైఫల్యంతోనే మహారాష్ట్రలో అల్లర్లు చెలరేగాయని ఆ పార్టీ ఎంపీ రజనీ పాటిల్‌ ఆరోపించారు. హిందుత్వ శక్తులకు ప్రభుత్వం అండగా ఉంటోందని ధ్వజమెత్తారు. చారిత్రక భీమా-కోరేగావ్‌లో దళితులు విజయ్‌ దివస్‌ జరుపుకోవడం సాధారణమేనని... గత 50 ఏళ్లలో హింసాత్మక ఘటనలు జరగడం తానెప్పుడూ చూడలేదని ఎన్‌సిపి నేత శరద్‌ యాదవ్‌ అన్నారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు సిటింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని సిపిఎం తదితర పార్టీలు డిమాండ్ చేశాయి. భవిష్యత్‌లో దళితులు, మహిళలు, మైనార్టీలపై ఇలాంటి దాడులు జరగకుండా శాశ్వత పరిష్కారం చూడాల్సిన అవసరం ఉందని డిఎంకె సూచించింది.

14:37 - January 4, 2018

ఈ ఆధునిక కాలంలో కూడా ఆడపిల్లల పట్ల వివక్ష కొనసాగుతున్న మన దేశంలో ఓ అద్భుతం అవిష్కృతమైంది. విద్యా వ్యవస్థలో ఆమ్మాయిల ప్రతినిధ్యం ఘణనీయంగా పెరుగుతోంది. విద్యాసంస్థల్లో ప్రవేశం పొందే ఆడపిల్లల సంఖ్య పెరగడం ఆనందించాల్సిన విషయం. అలాగే ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు అందుకుంటున్నారు. విద్యావ్యవస్థలో మహిళల పాత్ర మరిన్ని విషయాలకు వీడియో క్లిక్ చేయండి. 

ఇచ్చాపురం చేరుకున్న సీఎం చంద్రబాబు

శ్రీకాకుళం : జిల్లా ఇచ్చాపురానికి సీఎం చంద్రబాబు చేరుకున్నారు. కాసేపట్లో రాజావారి మైదానంలో జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు.

కాసేపట్లో లాలూకు శిక్ష ఖరారు చేయనున్న కోర్టు

రాంచీ : దాణా కుంభకోణం కేసులో కాసేపట్లో లాలూ ప్రసాద్ కు సీబీఐ ప్రత్యేక కోర్టు శిక్ష ఖరారు చేయనుంది. ఇప్పటికే సీబీఐ కోర్టుకు లాలై ప్రసాద్ చేరుకున్నారు. నిన్న లాయర్ మృతి కారణంగా లాలూ శిక్ష వాయిదా పడింది. 

బుద్ధా వెంకన్నతో మాట్లాడిన బాబు..

విజయవాడ : దుర్గగుడి వ్యవహారంపై బుద్ధా వెంకన్నతో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. పాలకమండలితో చర్చించి నివేదిక ఇవ్వాలని బాబు ఆదేశించారు. ఎంపీ కేవశినేని భవన్ లో బుద్దా వెంకన్న అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దుర్గగుడి పాలక మండలి సభ్యులు పాల్గొని తాంత్రిక పూజల వివాదంపై చర్చించారు. ఈవో తమతో సంప్రదింపులు చేయకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని సభ్యులు బుద్ధా వెంకన్న దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. 

13:18 - January 4, 2018

కామారెడ్డి : నిజామాబాద్..కామారెడ్డి జిల్లాలో ఇసుక మాఫియా పెట్రోగిపోతోంది. ఎన్ని దాడులు..దారుణాలు చోటు చేసుకుంటున్నా ప్రభుత్వం మాత్రం ఇసుక మాఫియాను అరికడుతున్నామని చెబుతోంది. తాజాగా కామారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న వీఆర్వోను ఇసుక మాఫియా చంపేసింది. కామారెడ్డి జిల్లాలో పిట్ల మండలం కారేగాం శివారులోని కాకి వాగు నుండి ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని వీఆర్ఏ సాయిలు గుర్తించారు. గురువారం అక్కడకు వెళ్లి అక్రమ రవాణాను అడ్డుకొన్నారు. ఆగ్రహానికి గురైన ఇసుక మాఫియా ఏకంగా ట్రాక్టర్ తో ఢీకొట్టించి సాయిలుని చంపేశారు. జిల్లాలో ఇన్ ఛార్జీ కలెక్టర్ పాలన కొనసాగుతుండడంతో ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారని తెలుస్తోంది. ఈ దారుణ ఘటనపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. 

13:11 - January 4, 2018

ఢిల్లీ : లోక్ సభలో ఎలాంటి సవరణలు లేకుండా ట్రిపుల్ తలాక్ బిల్లును ఆమోదించుకున్న అధికారపక్షం రాజ్యసభలో మాత్రం వారి పాచిక పారడం కష్టతరమౌతోంది. రాజ్యసభలో గురువారం ట్రిపుల్ తలాక్ బిల్లు ముందుకొచ్చింది. ఈ బిల్లుపై విపక్ష సభ్యులు ప్రభుత్వ తీరుపై పలు విమర్శలు గుప్పిస్తున్నారు. మూడేళ్ల జైలు శిక్ష, నష్టపరిహారం విషయంలో పొంతన లేదని విపక్షం పేర్కొంటోంది. ముస్లింల వివాహానికి దీనికి ఎలా ఆపాదిస్తారని ప్రశ్నిస్తోంది. సెలక్షన్ కమిటీకి పంపించి సమగ్ర నివేదిక వచ్చిన తరువాత రాజ్యసభలో ఓటింగ్ చేపట్టాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. ఈ సెలక్షన్ కమిటీకి మూడు నెలల కాలపరిమితి ఉంటుందని తెలుస్తోంది. కాలపరిమితిని రాజ్యసభ ఛైర్మన్ నియమించే అవకాశం ఉంది. శుక్రవారం సమావేశాలకు ఆఖరి రోజు కావడంతో వచ్చే సమావేశాల్లో ఈ బిల్లు రానుంది. 

విపక్ష డిమాండ్ కు తలొగ్గిన అధికారపక్షం...

ఢిల్లీ : రాజ్యసభలో విపక్ష డిమాండ్ కు అధికారపక్షం తలొగ్గింది. వచ్చే సమావేశాల వరకు ట్రిపుల్ తలాక్ బిల్లుపై ప్రతిష్టంభన నెలకొంది. ఈ బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపాలని ప్రభుత్వం యోచిస్తోంది. 

కర్నాటక మంత్రితో మంత్రి హరీష్ భేటీ...

హైదరాబాద్ : జలసౌధాలో కర్ణాటక ఇరిగేషన్ మంత్రి పాటిల్ తో మంత్రి హరీశ్ రావు సమావేశమయ్యారు. తుంగభద్ర జలాల వినియోగంపై ఇరు రాష్ట్రాల మధ్య చర్చ జరుగుతోంది. ఈ భేటీలో ఎమ్మెల్యే సంపత్ కూడా పాల్గొన్నారు. 

ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో శిక్షణా తరగతులు...

హైదరాబాద్ : ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి పార్టీ జెండాను టి.రాష్ట్ర అధ్యక్షుడు రమణ ఆవిష్కరించారు. రెండు రోజుల పాటు ఈ తరగతులు కొనసాగనున్నాయి. 

రెచ్చిపోయిన ఇసుక మాఫియా..వీఆర్ఏ దారుణ హత్య...

కామారెడ్డి : జిల్లాలో అక్రమంగా ఇసుక రవాణాను అడ్డుకున్న వీఆర్ఏ ను దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన సంచలనం సృష్టిస్తోంది. కామారెడ్డి జిల్లాలో పిట్ల మండలం కారేగాం శివారులో ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని వీఆర్ ఏ సాయిలు గుర్తించారు. గురువారం దీనిని అడ్డుకొన్నారు. ఒక్కసారిగా ఇసుక మాఫియా రెచ్చిపోయింది. ఏకంగా ట్రాక్టర్ తో ఢీకొట్టించి చంపేశారు. 

12:22 - January 4, 2018

కామారెడ్డి : తెలంగాణ రాష్ట్రంలో ఇసుక మాఫియా పెట్రేగిపోతోంది. గతంలో పలు ఘటనలు చోటు చేసుకున్నా..ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నట్లు ప్రభుత్వ పెద్దలు పేర్కొంటున్నారు. కానీ కామారెడ్డి జిల్లాలో అక్రమంగా ఇసుక రవాణాను అడ్డుకున్న వీఆర్ఏ ను దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన సంచలనం సృష్టిస్తోంది. కామారెడ్డి జిల్లాలో పిట్ల మండలం కారేగాం శివారులో కాకి వాగు నుండి ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని వీఆర్ఏ సాయిలు గుర్తించారు. గురువారం దీనిని అడ్డుకొన్నారు. ఒక్కసారిగా ఇసుక మాఫియా రెచ్చిపోయింది. ఏకంగా ట్రాక్టర్ తో ఢీకొట్టించి చంపేశారు. ప్రస్తుతం జరిగిన ఈ ఘటనపై ప్రభుత్వ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి. 

12:11 - January 4, 2018

విశాఖపట్టణం : ఓ యువతిపై లైంగిక దాడికి యత్నించిన సీఐపై వేటు పడింది. ప్రాథమిక ఆధారాలు రుజువు కావడంతో త్రీ టౌన్ సీఐగా బెండి వెంకట రావును సస్పెండ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ రాష్ట్రానికి చెందిన ఓ యువతి మలేషియాలో జాబ్ చేస్తోంది. వారణాసికి చెందిన యువకుడు..ఈమె ప్రేమించుకుంటున్నారు. కొన్ని పరిణామాల అనంతరం యువకుడు పనిచేసే హోటల్ లోనే ఆ యువతి పనిచేస్తోంది. గత సంవత్సరం నవంబర్ లో హఠాత్తుగా ఆ యువకుడు పరారయ్యాడు. దీనితో యువతి పీఎస్ లో ఫిర్యాదు చేయగా పంజాబ్ లో పోలీసులు అరెస్టు చేసి లుథియానా కోర్టులో హాజరు పరిచారు. ఈ నేపథ్యంలో అతను పెళ్లికి నిరాకరిస్తాడనే భయంతో త్రీ టౌన్ సీఐ బెండి వెంకట రావును కలిసింది. ఎలాగైనా న్యాయం చేయాలని కోరింది. కానీ న్యాయం చేయాల్సిన సీఐ కీచకుడి అవతారమెత్తాడు. ఓ హోటల్ కు పిలిపించుకుని లైంగిక దాడికి యత్నించాడు. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలతో సీపీని బాధితురాలు కలిసి ఫిర్యాదు చేసింది. అనంతరం జరిగిన విచారణలో రుజువు కావడంతో సీఐని సస్పెండ్ చేస్తున్నట్లు సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. 

11:59 - January 4, 2018

కాకినాడ : జేఎన్టీయూలో గౌరవ డాక్టరేట్ వివాదం చెలరేగుతోంది. బీవీ మోహన్ రెడ్డికి గౌరవ డాక్టరేట్ ప్రకటించడం పట్ల తీవ్ర విమర్శలు..అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయి. ఒక పాలక మండలి సభ్యుడిని ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని జేఎన్టీయూలోని అధికారులు తెలుగు రాష్ట్రాల గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. గవర్నర్ అనుమతితో అవార్డును ప్రకటించామని జేఎన్టీయూ వీసీ వెల్లడిస్తున్నారు. కోటి రూపాయల చందా ఇస్తే ఆయనకు గౌరవ డాక్టరేట్ ఇస్తారా ? అంటూ విద్యార్థి సంఘాలు, ఇతరులు ప్రశ్నిస్తున్నారు. జనవరి 23న జరిగే స్నాతకోత్సవంలో ఆయనకు గౌరవ డాక్టరేట్ ను బహుకరించనున్నారు. ఇందు కోసం యాజమాన్యం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న వివాదంపై జేఎన్టీయూ యాజమాన్యం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

జేఎన్టీయూలో గౌరవ డాక్టరేట్ ప్రకటన వివాదం...

కాకినాడ : బీవీ మోహన్ రెడ్డి కు గౌరవ డాక్టరేట్ ప్రకటించడం పట్ల పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రసిద్ధులైన వారికి గౌరవ డాక్టరేట్ ఇవ్వాలని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మోహన్ రెడ్డి ఎంపికపై గవర్నర్ అనుమతి ఉందని జేఎన్టీయూ వీసీ కుమార్ పేర్కొంటున్నారు. 

'తాంత్రిక పూజలు చేయాల్సినవసరం లేదు'...

విజయవాడ : లోకేష్ సీఎం అవడం కోసం తాంత్రిక పూజలు చేయాల్సినవసరం లేదని టిడిపి నేత పంచుమర్తి అనురాధ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏదీ జరిగినా టిడిపికి ఆపాదించడం సబబు కాదని, వేల కోట్లు ఈడీ అటాచ్ మెంట్ పై జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షంగా వైసీపీ ఎందుకు విఫలమైందో ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు దక్కవని జోస్యం చెప్పారు. 

సిక్కోలులో సీపీఎం నేతల ముందస్తు అరెస్టులు...

శ్రీకాకుళం : జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన ఉండడంతో సీపీఎం నేతలను పోలీసులు ముందస్తు అరెస్టు చేస్తున్నారు. 

సచివాలయ ముట్టడికి టీఆర్టీ అభ్యర్థులు రెడీ...

హైదరాబాద్ : టీఆర్టీలో హిందీ పండిట్ లకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ టీఆర్టీ అభ్యర్థులు సచివాలయాన్ని ముట్టడించనున్నారు. 

మందకృష్ణ మాదిగ ఉప వాస దీక్ష...

హైదరాబాద్ : చంచల్ గూడ జైల్లో ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ ఉపవాస దీక్ష కొనసాగిస్తున్నారు. ఆయనతో పాటు 26 మంది ఎమార్పీఎస్ నేతలు దీక్ష చేపడుతున్నారు. 

11:42 - January 4, 2018

హైదరాబాద్ : లాలాపేటలో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపుతోంది. ఓ యువతి హత్యలో తనను ఇరికిరస్తారనే భయంతో యువకుడు ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. డిసెంబర్ 30వ తేదీన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న యువతిని హత్య చేసి నల్గొండలోని ఓ చెరువులో మృతదేహాన్ని పడేసినట్లు నరేష్ పేర్కొన్నాడు. ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. తనను హత్య కేసులో ఇరికిస్తారని భయంతో నరేష్ గొంతు కోసుకున్నాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో పోలీసులు అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అతనికి ఎలాంటి ప్రమాదం లేదని తెలుస్తోంది. హత్యలో ఎవరు పాల్గొన్నారు ? హత్య చేయడానికి గల కారణమేంటీ ? మృతదేహాన్ని ఎక్కడ పడేశారు ? తదితర వివరాలు నరేష్ కోలుకుంటే కాని తెలియదు. పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

 

11:31 - January 4, 2018

గుంటూరు : జిల్లాలో కిడ్నీల రాకెట్ వ్యవహారం కలకలం రేపుతోంది. నర్సరావుపేటలో రోగి బంధువు పేరిట బయటి వ్యక్తి ఆధార్ మార్ఫింగ్ సృష్టించి అనుమతి పొందే ప్రయత్నం బెడిసికొట్టడంతో ఈ విషయం వెలుగు చూసింది. గుంటూరు చంద్రమౌళి నగర్ కు చెందిన శివ నాగమల్లేశ్వరరావు రెండు కిడ్నీలు చెడిపోయి వేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కిడ్నీ మార్పిడి విషయంలో నర్సరావుపేటలోని ప్రకాష్ నగర్ కు చెందిన అతని బంధువు రవి చౌదరిని సంప్రదించాడు. వీరిద్దరూ కలిసి దుర్గి మండలం ముటుకూరుకు చెందిన ముదావత్ వెంకటేశ్వర నాయక్ ను కలిశారు. కిడ్నీ మార్పిడి విషయాన్ని వెల్లడించారు. కిడ్నీలు ఇవ్వాలంటే బంధువులు ఇవ్వాలి..లేనిపక్షంలో ఇతరులు ఇస్తే ఎమ్మార్వో అనుమతి పొందాల్సి ఉంటుంది. దీనితో వీరు ఒక డ్రామా ఆడాలని నిర్ణయించుకున్నారు. అనంతరం రావూరి రవి చౌదరి ఆధార్ కార్డును మార్ఫింగ్ చేసి వెంకటేశ్వర నాయక్ ఫొటో పెట్టారు. ఇతరత్రా..వివరాలు జోడించి ఎమ్మార్వో దగ్గర దరఖాస్తు పెట్టారు. ఎమ్మార్వో కు అనుమానం రావడంతో దర్యాప్తు చేపట్టారు. దీనితో అసలు మోసం బయటపడింది. 

చింతా మోహన్ తో ముద్రగడ భేటీ...

తిరుపతి : కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ తో ముద్రగడ పద్మనాభం భేటీ అయ్యారు. సీఎం చంద్రబాబు కానుకతో తమ కడుపు నిండలేదని, కాపుల ఉద్యమం ఆగదన్నారు. మార్చి 31లోగా కాపులను బీసీల్లో చేర్చకుంటే మళ్లీ ఉద్యమిస్తామని పేర్కొన్నారు. 

11:10 - January 4, 2018

విజయవాడ : ప్రముఖ గజల్ గాయకుడు 'గజల్ శ్రీనివాస్'పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు మంత్రి మాణిక్యాలరావు ప్రకటించారు. లైంగిక ఆరోపణలపై పోలీసులు గజల్ శ్రీనివాస్ ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం వెలుగు చూసిన అనంతరం మంత్రి మాణిక్యాలరావు స్పందించారు. కొందరు కుట్రపూరితంగా ఇరికించారని..చిన్నప్పటి నుండి తాను శ్రీనివాస్ ను చూసినట్లు వ్యాఖ్యలు చేశారు. దీనిపై తీవ్ర వివాదం చెలరేగడంతో మంత్రి మాణిక్యాలరావు గురువారం మీడియాతో మాట్లాడాల్సి వచ్చింది.

మీడియాలో తాను చేసిన వ్యాఖ్యలపై చాలా మంది స్పందించి తనను కలవడం జరిగిందని, అనంతరం వాళ్లు కొన్ని వీడియోలు చూపించడం జరిగిందన్నారు. ఈ వీడియోలు చూసిన అనంతరం షాక్ కు గురయ్యానన్నారు. ఈ ఘటనను సమాజం ఖండించాల్సిందేనన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన గజల్ శ్రీనివాస్ ఈ విధంగా వ్యవహరిస్తాడని అనుకోలేదని, తప్పనిసరిగా తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. పోలీసులు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అమ్మనాన్న..దేశభక్తి అంటూ పాడే గజల్ శ్రీనివాస్ పై పవిత్రమైన భావం ఉండేదని, శ్రీనివాస్ ఇలా వ్యవహరిస్తాడని కలలో కూడా అనుకోలేదన్నారు. బాధితురాలికి న్యాయం జరగాలని, ప్రభుత్వం శ్రీనివాస్ పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. 

గజల్ పై చేసిన వ్యాఖ్యలపై మాణిక్యాలరావు స్పందన...

పశ్చిమగోదావరి : గజల్ శ్రీనివాస్ ను సమర్థిస్తూ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు మంత్రి మాణిక్యాలరావు పేర్కొన్నారు. తాను మాట్లాడిన దానికి సిగ్గుపడుతున్నట్లు, అతని వ్యక్తిత్వం ఇంత దిగజారుడుతనంగా ఉంటుందని అనుకోలేదని, శ్రీనివాస్ ను నాణేనికి ఒకవైపు చూశానని ఈ విధంగా ప్రవర్తించే వ్యక్తి అనుకోలేదన్నారు. వీడియోలు చూసిన తరువాత షాక్ అయ్యాయని తెలిపారు. 

10:35 - January 4, 2018

హైదరాబాద్ : ఉమ్మడి ఏపీలో ప్రతిభావంతులైన క్రీడాకారులకు స్థానం లేకుండా పోయిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పుడు తెలంగాణలో ఇదే సీను రిపీట్‌ అయింది. అధికారుల నిర్వాకంతో హైదరాబాద్‌కు చెందిన అంతర్జాతీయ క్రీడాకారుడు భరత్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన హర్షితా రాజ్‌ తీవ్రంగా నష్టపోయారు. స్కేటింగ్‌, హాకీలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలను సాధించిన వీరికి మెడికల్ సీట్ల కేటాయింపులో అన్యాయం జరిగింది. భరత్‌, హర్షితా రాజ్‌ తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో పలు అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నారు. స్పోర్ట్స్ కోటా మెడికల్‌ సీట్లకు దరఖాస్తు చేసుకున్నా.. అధికారులు ప్రాధాన్యత ఇవ్వలేదు. భారత క్రీడా ప్రాధికార సంస్థ ఇచ్చిన సర్టిఫికెట్లనూ కూడా పట్టించుకోలేదు. అర్హతలేని క్రీడాకారులు మెడికల్‌ సీట్లు కేటాయించి పెద్ద ఎత్తున డబ్బు గుంజినట్టు స్పోర్ట్స్‌ సర్టిఫికెట్ల కమిటీలోని కొందరు సభ్యులపై ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన సంభాషణల టేపులు కూడా ఉనప్పటికీ వాటిని బయటపెట్టేందుకు బాధితులు బయపడుతున్నారు.

2008 నుంచి 2016 వరకు అంతర్జాతీయ, జాతీయ క్రీడాకారులకు నిబంధనల ప్రకారం ప్రాధాన్యత ఇచ్చారు. గతంలో ఆయా క్రీడా సమాఖ్యలు ధ్రువీకరించిన సర్టిఫికెట్లను పరిగణనలోకి తీసుకున్నారు. ఐదుగురు విద్యార్థులకు మెడిసిన్‌లో సీట్లు కేటాయించారు. ఆ కమిటీలోని సభ్యులే ఈ కమిటీలో కూడా ఉన్నారు. కానీ ఈసారి ఇద్దరు అంతర్జాతీయ క్రీడాకారులను పక్కన పెట్టడంతో సమస్య తీవ్రమైంది. క్రీడల కోటాలో మెడికల్‌ సీట్లు పొందిన విద్యార్థులకు జాతీయ పోటీల్లో పతకాలు రాకపోయినా.. వచ్చినట్టుగా తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ అధికారులు రికార్డులు సృష్టించారు. ఏపీకి చెందిన ఒక క్రీడాకారిణికి స్కేటింగ్‌, హాకీలో పతకాలు రాకపోయినా హైదరాబాద్‌లోని ఓ ప్రయివేటు కాలేజీలో ఓపెన్‌ స్పోర్ట్స్‌ కోటాలో ఎంబీబీఎస్‌ సీటు వచ్చింది. అయితే ఇదే విద్యార్థిని ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్‌టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీలో ఎంబీబీఎస్‌ సీటు కోసం దరఖాస్తు చేసుకుంటే, అక్కడ మాత్రం చుక్కెదురైంది. సదరు విద్యార్థిని కేవలం పోటీల్లో మాత్రమే పాల్గొన్నట్టు ఏపీ అధికారులు తేల్చారు. ఈ సీటు విషయంలో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ అధికారులకు భారీగా డబ్బులు ముట్టినట్టు ఆరోపణలు గుప్పుమంటున్నాయి.

స్పోర్ట్స్‌ కోటా మెడికల్‌ సీట్ల అక్రమ సీట్ల కేటాయింపుల వ్యవహారంలో ఇద్దరు కమిటీ సభ్యులుగా లంచంగా కార్లు అందుకున్నట్టు ఆరోపణలున్నాయి. మిగిలిన వారికి లక్షల్లో ముడుపులు అందినట్టు ఫిర్యాదులున్నాయి. తమ పిల్లలకు జరిగిన అన్యాయాన్ని బాధితులు ప్రభుత్వం దృష్టి తెచ్చారు. తమ పిల్లల విలువైన విద్యాసంవత్సరాన్ని వృధా చేసారంటూ తల్లిదండ్రులు భోరుమంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాదికారులు స్పోర్ట్స్ కోటా సీట్లపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకొని, నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో స్పోర్ట్స్‌ కోటా మెడికల్‌ సీట్ల గోల్‌మాల్‌ వ్యవహారం ఏ ములుపు తిరుగుతుందో చూడాలి. 

10:32 - January 4, 2018

హైదరాబాద్ : మెడికల్‌ సీటు కోసం విద్యార్ధులు నిద్రాహారాలు మానేసి కష్టపడి చదువుతారు. కానీ కొందరు విద్యార్ధులు అలాంటి శ్రమ చేయకుండానే అప్పనంగా సీటు దక్కించుకొంటున్నారు. కోట్లు కుమ్మరిస్తే ఏ ప్రైవేటు మెడికల్ కాలేజీలో అయినా సీటు దొరుకుతుంది. కానీ తెలంగాణలో మాత్రం అధికారులకు అమ్యామ్యాలు ముట్టచెప్పి స్పోర్ట్స్ కోటాలో ఎంబీబీఎస్ సీటు దక్కించుకున్నారు. ప్రతిభావంతులైన విద్యార్ధులకు తీరని అన్యాయం జరిగింది. స్పోర్ట్స్‌ కోటా మెడికల్‌ సీట్ల అక్రమ దందా పై 10టీవీ స్పెషల్ ఫోకస్‌.

ఎంబీబీఎస్ లో సీటు సాధించాలంటే చిన్నప్పటి నుంచి మహాయజ్ఞంగా చదవాలి. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి కోచింగ్‌ తీసుకోవాలి. ప్రవేశపరీక్షలో మంచి ర్యాంకు వచ్చినా ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో సీటు కోసం కోట్లు ధారపోయాయి. రిజర్వేషన్‌ కోటాలో కొందరికి సీట్లు దక్కుతాయి. ఇవేమీ లేకపోతే అడ్డదారిలోనైనా సాధించుకునే సత్తా ఉండాలి. స్పోర్ట్స్ విద్యార్ధులు కొందరు చివరి మార్గాన్నే ఎంచుకున్నారు. అందుకే ఇంటర్నేషనల్స్‌ ఆడిన క్రీడాకరులను పక్కన పెట్టి, నేషనల్స్ లో పాల్గొని, పతకాలు సాధించకపోయినా కొందరు క్రీడాకారులు దర్జాగా మెడికల్‌ సీట్లు సాధించారు. ఇదంతా తెలంగాణ క్రీడాప్రాధికార సంస్థ ఉన్నతాధికారుల అండదండలతోనే జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.

ప్రతిభ ఉన్న క్రీడాకారులకు దక్కాల్సిన స్పోర్ట్స్ కోటా మెడికల్‌ సీట్లను కొందరు అనర్హులు చేజిక్కించుకున్నారు. కోట్లు పెట్టి మెడికల్‌ సీట్లు కొనలేనివారు లక్షలిచ్చి స్పోర్ట్స్‌ సర్టిఫికెట్లతో పాటు అధికారులనూ కొనేశార్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రతిభావంతులైన క్రీడాకారులకు అన్యాయం జరిగిందని ఫిర్యాదులు వస్తున్నాయి. గతంలో ఇటువంటివి జరిగినా వెలుగులోకి రాకుండా మానేజ్ చేసుకోగలిగారు. అయితే ఈసారి స్పోర్ట్స్ కోటాలో పది సీట్ల కేటాయింపుల్లోనూ అక్రమాలు జరిగినట్టు ఆధారాలతో సహా బయటపడింది.

ప్రస్తుత విద్యాసంవత్సరంలో కాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలోని మెడికల్‌ కాలేజీల్లో ఉన్న రెండు వేల సీట్లలో స్పోర్ట్స్‌ కోటాకు 0.5 శాతం కింద 10 సీట్లు కేటాయిస్తారు. పదవ నంబర్‌ జీవో ఆధారంగా ఈ సీట్లు కేటాయిస్తారు. ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో బీ కేటగిరి సీటుకు 55 లక్షల నుంచి 80 లక్షల వరకు చెల్లించాలి. సీ కేటగిరి సీటుకు కోటికి పైనే ఇచ్చుకోవాలి. అయితే స్పోర్ట్స్‌ కేటగిరిలో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో ఏడాదికి కేవలం పదివేలు, ప్రైవేటు కాలేజీల్లో కేవలం 60 వేల రూపాయలతో మెడిసిన్‌ చేస్తున్నారు. కొందరు క్రీడాకారులు అడ్డదారులు తొక్కి అప్పనంగా సీట్లు పొందడంతో ప్రతిభావంతులకు అన్యాయం జరిగిందిన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

స్పోర్ట్స్‌ కోటా మెడికల్‌ సీట్ల దరఖాస్తుల పరిశీలనకు 8మంది డిప్యూటీ డైరెక్టర్ల స్థాయి అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. అయితే ఈ కమిటీలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒకరిద్దరు అధికారులకు స్థానం కల్పించినట్టు ఫిర్యాదులు రావడంతో... ఈ మొత్తం వ్యవహారంపై విజిలెన్స్‌ విచారణ జరుగుతున్నట్టు సమాచారం.  

మెహదిపట్నంలో దారుణం...

హైదరాబాద్ : మెహదిపట్నంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మూడు రోజుల క్రితం ఓ వివాహితను ముగ్గురు యువకులు హత్య చేశారు. మృతదేహాన్ని సాగర్ కాల్వలో పడేశారు. హత్య విషయం బయటపడుతుందనే భయంతో లాలాపేటలో యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. యువకుడు ఆత్మహత్యాయత్నంతో ఈ ఘటన వెలుగు చూసింది. 

10:11 - January 4, 2018

విజయవాడ : ప్రముఖ పేరొందిన దుర్గమ్మ గుడిలో తాంత్రిక పూజలు చేశారనే ప్రచారం తీవ్ర వివాదాస్పదమౌతోంది. చిలికిచిలికి గాలి వానగా మారుతోంది. దీనిపై వస్తున్న వార్తలపై సీఎం చంద్రబాబు నాయుడు చర్యలకు ఉపక్రమించారు. దీనిపై ఓ నివేదిక ఇవ్వాలని ఆదేశించడంతో దేవాదాయ శాఖ అధికారులు ప్రాథమిక నివేదిక అందించారు. పూర్తిస్థాయి నివేదికను గురువారం సాయంత్రంలోగా అందచేయాలని సీఎం బాబు ఆదేశించారు. దీనితో దేవాదాయశాఖ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. పూజలు జరిగాయా ? లేదా ? జరిగితే ఎందుకు జరిపినట్లు అనే కోణంలో కమిటీ దర్యాప్తు చేయనుంది. మరోవైపు పోలీసులు కూడా కేసుపై దర్యాప్తు చేపడుతున్నారు. దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు స్పందించారు. పూజలు జరిగాయన్న దానిపై సమాచారం లేదని మంత్రి పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. 

10:06 - January 4, 2018

అజ్ఞాతంలో యాంకర్ ప్రదీప్...

హైదరాబాద్ : బుల్లితెర యాంకర్ ప్రదీప్ అజ్ఞాతంలోకి వెళ్లాడా ? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇటీవలే డ్రంక్ అండ్ డ్రైవ్ లో ప్రదీప్ పట్టుబడిన సంగతి తెలిసిందే. దీనితో ఆయన కౌన్సిలింగ్ కు హాజరు కావాల్సి ఉన్నా ఇంతవరకు హాజరు కాలేదు. దీనితో ట్రాఫిక్ పోలీసులు నోటిసులు పంపించే అవకాశం ఉందని తెలుస్తోంది. 

09:28 - January 4, 2018

గుంటూరు : జిల్లాలో కిడ్నీ రాకెట్ గుట్టురట్టైంది. కిడ్నీ కొనుగోలు చేయడానికి తహశీల్దార్ ను బురిడి కొట్టించడానికి ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యారు. ఒక రోగికి కిడ్నీ అవసరమైతే దగ్గరి బంధువులు కిడ్నీ ఇవ్వడానికి ముందుకొస్తుంటారు. కానీ బయటి వ్యక్తులు ఇవ్వాల్సి వస్తే కొన్ని నియమ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. కొంతమంది ఆధార్ ఫొటో మార్చి బంధువుగా సృష్టించి కిడ్నీల విక్రయాలు చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. గుంటూరు, నరసరావుపేట కేంద్రంగా కిడ్నీ విక్రయాల దందా కొనసాగుతోంది. రోగి బంధువు పేరిట బయటి వ్యక్తి ఆధార్ ను మార్ఫింగ్ చేసి అనుమతి పొందే ప్రయత్నం చేశారు. దీనిపై పోలీసులకు తహశీల్దార్ ఫిర్యాదు చేశారు. వీరందరూ గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తులుగా పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే మూడు కిడ్నీలు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. నాలుగో కిడ్నీ కొనుగోలుతో కిడ్నీ రాకెట్ గుట్టు రట్టైంది. 

09:22 - January 4, 2018

హైదరాబాద్ : తమకు సీటు రావాలని కొంతమంది విద్యార్థులు కష్టపడి చదువుతుంటారు. కానీ మరికొంతమంది అక్రమ మార్గాల్లో సీట్లు సంపాదించుకుంటూ ప్రతిభావంతులకు తీరని అన్యాయం చేస్తున్నారు. సీట్ల కేటాయింపు విషయంలో అధికారుల తీరుపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్పోర్ట్స్ కోటాలో పది మెడికల్ సీట్ల కేటాయింపుల్లో గోల్ మాల్ జరిగిందని వార్త హల్ చల్ చేస్తోంది. అర్హులైన క్రీడాకారులను పక్కన పెట్టి అనర్హులకు సీట్లు కేటాయించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ, అంతర్జాతీయ పతకాలు సాధించిన వారిని కూడా అధికారులు పక్కన పెట్టడం గమనించాల్సిన విషయం. పతకాలు సాధించకపోయినా క్రీడల్లో పాల్గొన్న వారికి మెడికల్ సీట్లు కేటాయించారు. స్పోర్ట్స్ సర్టిఫికేట్ల పరిశీలన కమిటీ అధికారులపై అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్పోర్ట్స్ మెడికల్ సీట్ల కేటాయింపు అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరుపునున్నట్లు తెలుస్తోంది.

మెడికల్ సీట్లకు సంబంధించి 2017-18 అకాడమిక్ ఇయర్ కు సంబంధించి విషయాలను తెలంగాణకు చెందిన భరత్ కుమార్, ఏపీకి చెందిన విషితలు దీనిని బయట పెట్టారు. ఆర్టీఐ చట్టం ప్రకారం వారి వివరాలు తీయడంతో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీరిద్దరూ ఇంటర్నేషనల్ స్థాయిలో జరిగిన పోటీల్లో గెలుపొంది పతకాలు సాధించారు. భరత్ కుమార్ కు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహకంగా మూడు లక్షల రూపాయల చెక్ కూడా అందించింది. దీనిపై ఉన్నతాధికారులు స్పందిస్తున్నారు. అవినీతి ఆరోపణలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొంటున్నారు. 

09:14 - January 4, 2018

హైదరాబాద్ : ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ బెయిల్..కస్టడీ పిటిషన్ పై కోర్టు విచారించి తీర్పునివ్వనుంది. ఆయనకు బెయిల్ వస్తుందా ? రాదా ? అనేది ఉత్కంఠ నెలకొంది. లైంగిక వేధింపుల ఆరోపణల్లో గజల్ శ్రీనివాస్ ను పోలీసులు అరెస్టు చేసి చంచల్ గూడ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. తొలుత నోటీసులు ఇచ్చిన తరువాతే అరెస్టు చేయడం జరిగిందని పోలీసుల తరపు న్యాయవాదులు, కుట్ర పూరితంగా అరెస్టు చేశారని గజల్ శ్రీనివాస్ తరపు న్యాయవాదులు వాదించారు. అన్నీ సెక్షన్లు బెయిలబుల్ కిందకే వస్తాయని గజల్ తరపు న్యాయవాది పేర్కొన్నారు. కానీ బయటకు వస్తే సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో కస్టడీకి అప్పగించాలని పోలీసు తరపు న్యాయవాది పేర్కొంటున్నారు. ఏ 2 నిందితురాలిగా ఉన్న పావని మాత్రం తప్పు చేయలేదని వాదిస్తోంది. ఈమెను పోలీసులు మరోసారి విచారించనున్నట్లు తెలుస్తోంది. కస్టడీ పిటిషన్ కు అనుమతినివ్వకపోతే బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

స్పోర్ట్స్ కోటాలో గోల్ మాల్ ?

హైదరాబాద్ : స్పోర్ట్స్ కోటాలో పది మెడికల్ సీట్ల కేటాయింపుల్లో గోల్ మాల్ జరిగిందని తెలుస్తోంది. అర్హులైన క్రీడాకారులను పక్కన పెట్టి అనర్హులకు సీట్లు కేటాయించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ, అంతర్జాతీయ పతకాలు సాధించిన వారిని కూడా అధికారులు పక్కన పెట్టడం గమనించాల్సిన విషయం. పతకాలు సాధించకపోయినా క్రీడల్లో పాల్గొన్న వారికి మెడికల్ సీట్లు కేటాయించారు. స్పోర్ట్స్ సర్టిఫికేట్ల పరిశీలన కమిటీ అధికారులపై అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్పోర్ట్స్ మెడికల్ సీట్ల కేటాయింపు అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరుపునున్నట్లు తెలుస్తోంది. 

ఉత్తర్ ప్రదేశ్ లో చలి పులి..

ఉత్తర్ ప్రదేశ్ : రాష్ట్రంలో చలి పంజా విసురుతోంది. పలు ప్రాంతాల్లో దట్టంగా పొగమంచు అలుముకుంది. చలితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

మరోల్ లో అగ్నిప్రమాదం...

ముంబై : మరోల్ ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ భవనంలో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. నలుగురు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. 

08:18 - January 4, 2018

హైదరాబాద్ : ప్రముఖ గాయకుడు 'గజల్ శ్రీనివాస్' కు ఉచ్చు బిగుస్తోంది. ఆయన కు బెయిల్ వస్తుందా ? లేదా అనే ఉత్కంఠ నెలకొంది. బెయిల్, కస్టడీ పిటిషన్లపై నాంపల్లి కోర్టులో నేడు తీర్పు రానుంది. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన్ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

బెయిల్ ఇవ్వవద్దని పంజాగుట్ట పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. బయటకొస్తే సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉందని పోలీసులు పేర్కొంటున్నారు. కానీ గజల్ పై పెట్టిన సెక్షన్లన్నీ బెయిలబుల్ కేసులేనని, కుట్రపూరితంగా శ్రీనివాస్ ను కేసులో ఇరికించారని శ్రీనివాస్ తరపు న్యాయవాది వాదించారు. ప్రస్తుతం గజల్ శ్రీనివాస్ చంచల్ గూడ జైలుకు తరలించారు. విచారణ నిమిత్తం ఏడు రోజుల పాటు కస్టడీ ఇవ్వాలని పోలీసులు పేర్కొంటున్నారు. 

08:12 - January 4, 2018

హైదరాబాద్ : అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, వారి అనుచరుల ఆగడాలకు అంతుపట్టడం లేదు. తాము ప్రజాప్రతినిధులకు చెందిన వ్యక్తులమంటూ ఇతరులపైకి దాడులు దిగుతుండడం తెలిసిందే. తాజాగా నాగోల్ కు చెందిన ఓ కార్పొరేటర్ అనుచరులు వీరంగం సృష్టించారు. ఓ హోటల్ యజమానిని తీవ్రంగా గాయపరిచి ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. ఈ ఘటన ఎల్బీనగర్ లో చోటు చేసుకుంది. ఆల్కాపురీ కాలనీలో ఉన్న లక్కీ రెస్టారెంట్ కు అర్ధరాత్రి కొంతమంది యువకులు చేరుకున్నారు. తమకు బిర్యానీ కావాలని అడగడంతో లేదని హోటల్ యజమాని సయ్యద్ ఆలీ పేర్కొన్నారు. దీనికి తీవ్ర ఆగ్రహానికి గురైన యువకులు తాము నాగోల్ కార్పొరేటర్ సంగీత భర్త మనుషలమని పేర్కొన్నారు. అనంతరం సయ్యద్ ను గాయపరిచారు. హోటల్ లో ఉన్న ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. దీనిపై యజమాని సయ్యద్ ఆలీ ఎల్ బినగర్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్నారు. కేసు వెనక్కు తీసుకోవాలంటూ స్థానికంగా ఉన్న నేతలు సయ్యద్ పై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. 

07:52 - January 4, 2018

మహారాష్ట్రలో దళిత సంఘాలు చేపట్టిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ మనవడు ప్రకాశ్‌ అంబేద్కర్‌ ఇచ్చిన పిలుపు మేరకు బంద్‌ను విరమించారు. దళితులపై హింసాకాండను రెచ్చగొట్టిన వారిని అరెస్ట్‌ చేయాలని ప్రకాశ్‌ అంబేద్కర్‌ డిమాండ్‌ చేశారు. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చలో రాజేశ్వరరావు (టి.కాంగ్రెస్), జూలకంటి రంగారెడ్డి (సీపీఎం), ఆచారి (బీజేపీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

అర్ధరాత్రి బిర్యాని ఇవ్వలేదని...

హైదరాబాద్ : ఎల్బీనగర్ లోని అల్కాపురి కాలనీలో అర్ధరాత్రి యువకులు హల్ చల్ చేశారు. అర్ధరాత్రి బిర్యాని అడిగితే ఇవ్వలేదనే కారణంతో ఓ హోటల్ యజమానిపై, సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. హోటల్ లో ఉన్న ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. 

07:07 - January 4, 2018

భారతీయ వైద్య మండలి స్థానంలో నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ తీసుకొచ్చేందుకు కేంద్రం పార్లమెంట్‌లో తీసుకొచ్చిన బిల్లుపై వైద్యులనుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమతోంది. ఇది పేషంట్‌ వ్యతిరేకమైన బిల్లని దీనివల్ల వైద్య విధానానికి ప్రమాదం ఏర్పడుతుందని వారు ఆరోపిస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఇది వైద్య వృత్తికి ప్రయోజనకరమైనదని చెప్తుంది. మరి ఈ బిల్లును వైద్యులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారన్న అంశంపై టెన్ టివి జనపథంలో జూనియర్‌ వైద్యుల సంఘం నాయకులు శ్రీనివాస్‌, అభిలాష్ లు విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

06:44 - January 4, 2018

అనంతపురం : ప్రజాకళాకారుడు బళ్లారి రాఘవ స్మారక సాంస్కృతిక ఉత్సవాలు అనంతపురంలో ఘనంగా జరిగాయి. స్థానిక లలిత కళాపరిషత్‌లో జరిగిన సమావేశాల్లో ప్రజానాట్యమండలి ప్రదర్శనలు వీక్షకులను కట్టిపడేశాయి. కళాకారులు సమాజ అభ్యుదయంలో భాగం కావాలని సమావేశంలో పాల్గొన్న వక్తలు ఆకాంక్షించారు. అనంతపురం నగరంలో ప్రజాకళలు మార్మోగాయి. బళ్లారి రాఘవ స్మారక ఉత్సవాల్లో భాగంగా జరిగిన సమావేశంలో సాంస్కృతిక కార్యక్రమాలు, కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. తొలి రోజు అనతంపురం వీధుల్లో కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

రెండు రోజుల సమావేశంలో ప్రజానాట్యమండలి భవిష్యత్తుకార్యాచరణ, ప్రణాళికలపై చర్చలు సాగాయి. రెండో రోజు కార్యక్రమాన్ని కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత, ప్రముఖ సాహితీ విమర్శకులు ఆచార్య రాచపాళ్యం చంద్రశేఖర్‌రెడ్డి ప్రారంభించారు. ప్రజాసంస్కృతి ప్రజలను కలుపుతుంది.. ప్రభు సంస్కృతి సమాజాన్ని విడదీస్తుందని.. నేటి సినిమా సంస్కృతి సమాజానికి చీడలా దాపురించిందన్నారు.

కార్యక్రమంలో మహాకవి గురజాడ అప్పారావు గీతాల ప్రదర్శన ఆకట్టుకుంది. దేశమును ప్రేమించుమన్న గీతానికి కళాకారుల నృత్యం చూపరులను కట్టిపడేసింది. కళ కళకోసం కాదు అది ప్రజలకు చెందాలన్న ప్రజానాట్యమండలి ప్రయత్నాన్ని ఉత్సవాల్లో పాల్గొన్న వక్తలు ప్రశంశించారు. బళ్లారి రాఘవ చేసిన కళాసేవను కొనియాడారు. 

06:41 - January 4, 2018

హైదరాబాద్ : ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ.. ఒకటి కొంటే మరొకటి ఉచితం. వెయ్యిరూపాయల విలువైన వస్తువు వందకే..! ఇలా పండుగల సీజన్‌లో వ్యాపార ప్రకటనలు వినియోగదారుల్ని తెగ ఊరిస్తాయి. ఈ ఫ్రీ ఆఫర్‌లతో జనం నెత్తిన కోట్ల రూపాయలకు టోపీ పెడుతున్నారు కొందరు వ్యాపారులు. శ్రీకాకుళం నగరంలో బడా సంస్థలు సైతం ఫ్రీ ప్రకటనలతో బూటకపు వ్యాపారానికి తెరతీశాయన్న ఆరోపణలు వస్తున్నాయి. సీజన్‌ .. అన్‌సీజన్‌ అనే తేడా లేకుండా.. సరకును అమ్ముకోడానికి వ్యాపర సంస్థలు ప్రకటనలతో ఊరిస్తుంటాయి. ఇక పండుగల సీజన్‌లో అయితే ఫ్రీలు, ఆఫర్‌ల ప్రచారానికిక హద్దులే ఉండవు. శ్రీకాకుళంలో క్రిస్మస్‌, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగ సందర్భంగా వస్త్రవ్యారులు ప్రకటనలతో హోరెత్తిస్తున్నారు. డిస్కౌంట్‌లు ధరలు అంటూ జేబులు నింపుకుంటున్నారు. కొందరు 50శాతం, మరికొందరు 70శాతం, ఇంకొందరైతే ఏకంగా వెయ్యి రూపాయల వస్త్రాలు 300 వందలకే ఇస్తామంటూ నాసిరకం సరుకునే అంటగడుతున్నారని జనం అంటున్నారు. ఫుట్‌పాత్‌ అమ్మకందార్ల నుంచి హోల్‌సేల్‌ వ్యాపారుల వరకు అందరూ ఇదే దందాను కొనసాగిస్తున్నారు.

శ్రీకాకుళం నగరంలోని ఏడురోడ్ల కూడలి నుంచి సూర్యమహల్‌ జంక్షన్‌ వరకు దాదాపు 70షోరూంలు వస్త్రవ్యారాన్ని కొనసాగిస్తున్నాయి. వీరంతా పోటాపోటీగా డిస్కౌంట్‌లపేరుతో దగా చేస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మొద్దో తెలియని పరిస్థితి వచ్చిందంటున్నారు. మొత్తం మీద పండుగల సీజన్‌లో కోట్లరూపాయల వ్యాపారం చేస్తున్న వస్త్ర వ్యాపారులు ..జనం చేబులకు చిల్లులు పెడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వ్యాపార లావాదేవీలపై అధికారుల నజర్‌ లేకపోవడంతో.. గోల్‌మాల్‌ వ్యాపారం జోరుగా సాగుతోంది.  

06:39 - January 4, 2018

జనగామ : జిల్లాలో సావిత్రి బాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. సావిత్రీ బాయి పూలే అంటరానితనాన్ని నివారిస్తూ, మహిళల కోసం పాఠశాలలు ఏర్పాటు చేశారన్నారు కేజీబీవీ జిల్లా కన్వీనర్‌ కల్పనాదేవి. సావిత్రీబాయిపూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని ఆమె కోరారు. జిల్లా యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు.

06:38 - January 4, 2018

భద్రాద్రి కొత్తగూడెం : వామపక్షాలు, సామాజిక శక్తులతో నూతన రాజకీయ ఫ్రంట్‌ ఏర్పాటుకు ప్రయత్నం చేస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రారంభమైన సీపీఎం ప్రథమ జిల్లా మహాసభల్లో ఆయన పాల్గొన్నారు. గత పాలకులకు.. ప్రస్తుత పాలకులకు తేడాలేదని.. అందుకే ప్రత్యామ్నాయ రాజకీయాలవైపు ప్రజలు చూస్తున్నారని తమ్మినేని అన్నారు. ఈ నెల 25న హైదరాబాద్‌లో ప్రజా ఫ్రంట్‌ ఆవిర్భావం జరగుతుందని తమ్మినేని వీరభద్రం తెలిపారు.

 

06:35 - January 4, 2018

హైదరాబాద్ : తెలంగాణలో స్పోర్ట్స్‌ కోటా మెడికల్‌ సీట్ల భర్తీలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై చర్యలు తప్పవని తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ వెంకటేశ్వరరెడ్డి హెచ్చరించారు. అర్హులైన క్రీడాకారులకు పక్కనపెట్టి, అనర్హులకు సీట్లు కేటాయించడంపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ఈ వ్యవహారంలో భారీగా డబ్బు చేతులు మారినట్టు ఆరోపణలు వచ్చాయి. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

06:33 - January 4, 2018

విజయవాడ : దుర్గగుడిలో తాంత్రిక పూజల వ్యవహారంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై 24 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పూజల నిర్వహణపై విచారణ ప్రారంభించిన పోలీసులు ప్రాథమిక నివేదిక ప్రభుత్వానికి అందజేశారు. మరోవైపు దుర్గగుడి ఈవో సూర్యకుమారిపై బదిలీ వేటుకు రంగం సిద్ధమైంది. ఈ ఘటనపై సీరియస్‌గా ఉన్న సీఎం చంద్రబాబు..విచారణ చేపట్టి 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. దీంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ప్రాథమిక నివేదిక అందిజేసిన పోలీసులు..అన్ని కోణాల్లోనూ ఆరా తీస్తున్నారు. మరోవైపు శాఖపరమైన విచారణకు దేవాదాయశాఖ ఆదేశించింది. విచారణ అధికారిగా సింహాచలం దేవస్థానం ఈవో రామచంద్రన్‌ను నియమించింది. ఈనేపథ్యంలో దుర్గగుడి ఆలయ ఈవో సూర్యకుమారి బదిలీకి రంగం సిద్ధమైంది. నూతన ఈవోగా రామచంద్రన్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తారన్న ప్రచారం ఊపందుకుంది.

దుర్గగుడిలో తాంత్రిక పూజల వ్యవహారంపై విపక్షాలు, న్యాయవాదులు, ఆధ్యాత్మికవేత్తలు భగ్గుమంటున్నారు. ఘటనపై విజయవాడ వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో న్యాయవాదులు, వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈవో సూర్యకుమారి, ప్రధాన అర్చకుడితో పాటు మరో ఐదుగురిని అరెస్ట్‌ చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆగమ శాస్త్రానికి, సంప్రదాయానికి విరుద్ధంగా ఆలయంలో అర్థరాత్రి పూజలు చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీశారని పేర్కొన్నారు. ఆలయంలో తాంత్రిక పూజలు జరిగాయో? లేదో.. ప్రభుత్వం ప్రజలకు వెల్లడించి వారి అనుమానాలు నివృత్తి చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇంద్రకీలాద్రిలో తాంత్రిక పూజల ఘటనపై విశాఖ పెందుర్తి శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానంద సరస్వతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్రమైన హిందూ ఆలయంలో తాంత్రిక పూజలు జరపడం అపచారమన్నారు. సంప్రదాయాలను కాపాడాల్సినవారే ఇలాంటి చర్యలకు పాల్పడటం సబబు కాదన్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

మరోవైపు దుర్గ గుడిలో ఎలాంటి తాంత్రిక పూజలు జరగలేదని ఆలయ ఈవో సూర్యకుమారి స్పష్టం చేశారు. నిత్యం జరిగే పూజలు, శుద్ది కార్యక్రమం మాత్రమే నిర్వహించారని తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుగుతుందని...కొంతమంది సహించలేనివారే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. ఏదేమైనా పవిత్ర పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిలో ఇలాంటి ఘటనలు పునారావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని బెజవాడ వాసులు కోరుతున్నారు. 

06:31 - January 4, 2018

హైదరాబాద్ : జంటనగరాల్లో గంగిరెద్దుల కళాకారులకు నిలువ నీడ లేకుండా పోయింది. ఎక్కడ ప్రదర్శనలిస్తే అక్కడ వీరిని పోలీసులు అరెస్టుచేసి జైళ్లకు తరలిస్తున్నారు. దీనిని నిరసిస్తూ గంగిరెద్దుల కళాకారులు ఆందోళకు దిగుతున్నారు. గంగిరెద్దుల కళాకారులకు కష్టకాలం వచ్చింది. బిక్షాటన నిషేధం పేరుతో వీరి ప్రదర్శలను పోలీసులు అడ్డుకుంటూ, అరెస్టులు చేస్తున్నారు. పోలీసులు తీరుపై వీరు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉన్న ఊరిలో ఉపాధిలేదు. చదుకున్నా ఉద్యోగం లేదు. కులవృత్తిని నమ్ముకుని జోలెపట్టుకుని అడుక్కుతిందామని హైదరాబాద్‌ వస్తే అరెస్టు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బిక్షాటన నిషేధం పేరుతో గంగిరెద్దుల కళాకారులను అరెస్టు చేయడాన్ని ఎంబీసీ సంఘాల నేతలు తప్పుపడుతున్నారు. గంగిరెద్దుల కళాకారుల విషయంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, పోలీసులు వ్యవహరిస్తున్న తీరును టీ మాస్‌ ఫోరం నేతలు తప్పు పడుతున్నారు. మరోవైపు సంచార జాతికి చెందిన గంగిరెద్దుల కళాకారులు వృత్తి భిక్షాటన కిందకు రాకపోవచ్చిన జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి భావిస్తున్నారు. గంగిరెద్దుల ఆటను కులవృత్తిగా పరిగణించి, ఈ కళాకారులకు స్వేచ్ఛ కల్పించే విషయంలో అన్ని విభాగాలతో మాట్లాడి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. 

06:29 - January 4, 2018

హైదరాబాద్ : జనసేన అధినేత పవన్‌ రాజకీయ పయనం ఎటువైపు..? ప్రశ్నిస్తా.. నిలదీస్తా .. అంటూ రాజకీయాల్లోకి వచ్చిన పవర్‌స్టార్‌ ఇపుడు తానే ఓ పెద్ద ప్రశ్నగా మారుతున్నారా ? ప్రజాసమస్యలపై గళం విప్పుతున్న ఆయన ప్రతిపక్షాలనే ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారు? ఏపీ, తెలంగాణలో అధికార పార్టీలను ఎందుకు పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు ? వచ్చే ఎన్నికల్లో జనసేన అధికారపార్టీలతోనే కలిసి సాగనుందా ? 2019 ఎన్నికల్లో జనసేన పోటీచేస్తుందని ఇప్పటికే ప్రకటించిన పవన్‌ కళ్యాణ్‌.. వ్యవహరా శైలి అభిమానులకు కూడా మింగుడు పడని విధంగా తయారైంది. ఏపీ, తెలంగాణలో అధికారపార్టీలపై పవన్‌ ప్రశంశలు ఇపుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌పై ఘాటు విమర్శలు చేసిన పవన్‌ కళ్యాణ్‌.. ఇపుడు గులాబీబాస్‌ను పొగడ్తల్లో ముంచెత్తడం ఆసక్తికరంగా మారింది. ప్రగతిభవన్‌లో సీఎంతో సమావేశం అయిన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆకాశానికెత్తారు. 24గంటల విద్యుత్‌ ఇవ్వడాన్ని మెచ్చుకున్నారు. సీఎంను కలిసి న్యూ ఇయర్‌ విషెస్‌ చెప్పిన జనసేన అధినేత.. కేసీఆర్‌ పాలను తెగ పొగిడారు. ఈ వ్యవహారం చూస్తుంటే.. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్‌ఎస్‌తో కలిసి సాగడానికే పవన్‌ నిర్ణయించుకున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే తెలంగాణలో పవన్‌కి అభిమానులు ఉన్నా.. సొంతంగా పోటీచేసి గెలిచే పరిస్థితి లేదు. అందుకే గులాబీపార్టీతో దోస్తీకి పవన్‌ యత్నిస్తున్నారనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. మరోవైపు 2019 ఎన్నికల్లో టీడీపీతో పొత్తుకు అధికారపార్టీ యత్నిస్తుందన్న ప్రచారం కూడా సాగుతోంది. అందుకే రేవంత్‌రెడ్డి పార్టీని వీడిపోయారనే చర్చలు రాజకీయ వర్గాల్లో నడుస్తున్నాయి. దీంతో రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్‌ఎస్- టీడీపీ- జనసేన కూటమిగా ఏర్పడే అవకాశం ఉందనే అభిప్రాయాలు వస్తున్నాయి.

ఇక ఏపీలో కూడా అధికాపార్టీని వదిలి విపక్ష వైసీపీ, కాంగ్రెస్‌లపై ఒంటికాలిమీద లేస్తున్నారు. ప్రజాసమస్యలపై ప్రశ్నించాల్సి వస్తే... ప్రభుత్వాన్నో, అధికారంలో ఉన్నటీడీపీనో ప్రశ్నించాలి కాని.. పవన్‌ విపక్షపార్టీలను టార్గెట్‌ చేయడం వెనుక రాజకీయ వ్యూహం ఎంటనే ప్రశ్నలు వస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో టీడీపీతో కలిసి సాగాలనే యోచనలో ఉన్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో అటు తెలంగాణ, ఇటు ఏపీలో జనసేనాని పయనం అధికారపార్టీల వైపే సాగుందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. మొత్తానికి ప్రశ్నిస్తా.. ప్రశ్నిస్తా అంటూ పార్టీని స్టార్ట్ చేసిన పవర్‌స్టార్‌.. అధికారపార్టీలను పొగడ్తల్లో ముంచెత్తడం ..ఇపుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు తెరలేచింది. 

06:26 - January 4, 2018

హైదరాబాద్ : 24 గంటల విద్యుత్తుపై సీఎం కేసీఆర్‌ చేప్పేవన్నీ అబద్ధాలే అన్నారు టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. రాష్ట్రంలో విద్యుత్తు పరిస్థితిపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చిన కాంగ్రెస్‌నేతలు .. ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు. కేసీఆర్‌ సీఎం అయ్యాక అదనంగా ఒక్క యూనిట్‌ విద్యుత్‌ కూడా ఉత్పత్తి కాలేదన్నారు. భూపాలపల్లి, జైపూర్‌ జూరాల ప్రాజెక్టులు కాంగ్రెస్‌ హయాంలో నిర్మించినవేనన్నారు. కేవలం స్విచ్ ఆన్‌ చేసి ప్రాజెక్టులు తామే నిర్మించామని కేసీఆర్‌ గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. సెల్ఫ్‌ ప్రమోషన్‌ కోసమే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పేపర్‌ ప్రకటనలు ఇచ్చారని కాంగ్రెస్‌నేతలు ఎద్దేవాచేశారు. 

సిక్కోలుకు బాబు...

శ్రీకాకుళం : నేడు జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఇచ్చాపురంలో 'జన్మభూమి - మా ఊరు' కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. 

సంక్రాంతి ప్రత్యేక రైళ్లు..

హైదరాబాద్ : సంక్రాంతి పండుగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపనుంది. 84 ప్రత్యేక రైళ్లను నడుపనున్నారు. తిరుపతి -విశాఖ - తిరుపతి మధ్య 16 ప్రత్యేక రైళ్లు నడువనున్నాయి. విశాఖ - తిరుపతి మధ్య 4 ప్రత్యేక రైళ్లను నడుపనున్నారు. జనవరి 7 నుండి ఫిబ్రవరి 28 వరకు ప్రతి బుధవారం ప్రత్యేక రైళ్లు నడువనున్నాయి. 

06:10 - January 4, 2018

హైదరాబాద్ : మాదాపూర్ అయ్యప్ప సొసైటీ, శిల్పారామం మార్గంలో పూర్తైన అండర్ పాస్ నిర్మాణాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ ఫసివుద్దీన్, కమిషనర్ జనార్ధన్ రెడ్డి..మంత్రులు మహేందర్ రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి పాల్గొన్నారు. SRDP ప్రాజెక్టు మొదటి దశ ప్రాజెక్టు పూర్తి చేసుకోవడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. నిర్మాణానికి 12 నెలల సమయం ఉన్నా.. 9 నెలలకే పూర్తి చేసిన సందర్భంగా అధికారులకు కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా రెండు రహదారుల్లో ఎలివేటెడ్ కారిడార్లు, స్కైవేల నిర్మాణానికి సంబంధించి భూముల విషయంలో కేంద్ర ప్రభుత్వంతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. 

గజల్ శ్రీనివాస్ కు షాక్..

హైదరాబాద్ : ప్రముఖ గజల్ గాయకుడు గజల్‌ శ్రీనివాస్‌కు మరో షాక్‌ తగిలింది. సేవ్‌ టెంపుల్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా గజల్‌ శ్రీనివాస్‌ను తొలగిస్తున్నట్లు ఆ సంస్థ అధ్యక్షుడు ప్రకటన చేశారు. సంస్థ పేరును అడ్డం పెట్టుకుని ఎలాంటి అశ్లీల కార్యక్రమాలకు పాల్పడ్డా సహించేది లేదన్నారు. 

25న ప్రజా ఫ్రంట్ ఆవిర్భావం..

హైదరాబాద్ : ఈ నెల 25న హైదరాబాద్‌లో ప్రజా ఫ్రంట్‌ ఆవిర్భావం జరగనున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రారంభమైన సీపీఎం ప్రథమ జిల్లా మహాసభల్లో ఆయన పాల్గొన్నారు. 

దుర్గమ్మ ఆలయంలో ఘటనపై బాబు సీరియస్...

విజయవాడ : ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో తాంత్రిక పూజల వ్యవహారం చినికి చినికి గాలివానలా మారుతోంది. ఈ ఘటనపై సీరియస్‌గా ఉన్న సీఎం చంద్రబాబు..విచారణ చేపట్టి 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. దీంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. 

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు..

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లోని ... రహదారులు నెత్తురోడాయి..! వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు. 22 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

 

'మోడీ మౌనం వీడాలి'..

ఢిల్లీ : భారత ప్రధాని మోడీని మౌని బాబాగా అభివర్ణించిన ఖర్గే- మహారాష్ట్ర హింసపై ప్రధాని మౌనం వీడాలన్నారు. ప్రతి ఏడాది దళితులు భీమా కోరేగావ్ స్మారకం వద్ద నివాళి అర్పిస్తారని, గతంలో ఎప్పుడూ ఇలాంటి హింస చోటుచేసుకోలేదని కాంగ్రెస్‌ పేర్కొంది. 

Don't Miss