Activities calendar

05 January 2018

22:28 - January 5, 2018
22:16 - January 5, 2018

జగిత్యాల : ప్రత్యేక తెలంగాణ వచ్చింది కానీ త్యాగాల తెలంగాణ రాలేదన్నారు టీ మాస్‌ నేత గద్దర్‌. జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన టీ-మాస్‌ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. సమైక్య రాష్ట్రంలో జరిగినట్లే ఇప్పుడు కూడా ఎన్‌ కౌంటర్లు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలు ఒక్కటికూడా నెరవేర్చలేదంటూ మండిపడ్డారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయన్నారు కానీ ఇంకా నిరుద్యోగులు అలానే ఉన్నారన్నారు. తెలంగాణ మంత్రి వర్గంలో ఉద్యమంలో పాల్గొన్న నేతలు ఒక్కరు కూడా లేరంటూ ఆరోపించారు. 

22:13 - January 5, 2018

కృష్ణా : విజయవాడ దుర్గగుడిలో తాంత్రిక పూజల వ్యవహారంపై విచారణ ముమ్మరమైంది. రంగంలోకి దిగిన నిజనిర్ధరణ కమిటీ సభ్యులు ఆలయ అర్చకులను విచారించారు. డిసెంబర్‌ 26 రాత్రి అసలు ఆలయంలో ఏం జరిగింది? ఆగమశాస్త్రానికి విరుద్ధంగా ఏమైనా జరిగిందా? ఇందులోని లోటుపాట్లు ఏమిటి? అనే విషయాలను కమిటీ విచారించి నిజాల నిగ్గుతేల్చి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. 

ఓవైపు ఆధునిక సాంకేతికతతో శాస్త్రవేత్తలు అద్భుతాలు సృష్టిస్తుంటే.. మరోవైపు క్షుద్రపూజలు, భైరవపూజలు అంటూ కొందరు మూఢనమ్మకాల్లో మునిగితేలుతున్నారు. మొన్నటిదాకా పల్లెసీమలను కుదిపేసిన ఈ అంధవిశ్వాసాలు.. ఇప్పుడు పట్టణాల్లోనూ కలకలం రేపుతున్నాయి. 

బెజవాడ ఇంద్రకీలాద్రిలో సంచలనం సృష్టించిన తాంత్రికపూజల వ్యవహారం మరిచిపోకముందే... శ్రీకాళహస్తిలోనూ కలకలం రేగింది. శ్రీకాళహస్తికి అనుబంధంగా ఉండే భైరవకోనలోని కాలభైరవ ఆలయంలో క్షుద్రపూజలు జరిగాయన్న వీడియోలు హల్‌చల్‌ చేస్తున్నాయి. శ్రీకాళహస్తి ఆలయ సూపరింటెండెంట్ ధనపాల్‌..ఈ పూజలు చేయించారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో ధనపాల్‌ను ఈవో సస్పెండ్ చేయడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ధనపాల్‌ 5 నెలల వ్యధిలో సస్పెండ్‌ కావడం ఇది రెండోసారి. గతంలో ఆలయ డొనేషన్‌ కౌంటర్‌, ప్రసాదాల కౌంటర్‌లో అవతవకలకు పాల్పడినట్లు ఆరోపణలతో సస్పెండ్‌ అయ్యారు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ ధనపాల్‌ను విధుల్లోకి తీసుకున్నారు. తాజాగా దేవస్థానం సొమ్మును కాజేశారనే ఆరోపణలతో పాటు.. భైరవపూజల వ్యవహారం ధనపాల్‌ చుట్టూ ఉచ్చు బిగించింది. 

వివాదం దుమారం రేగడంతో.. క్షుద్రపూజలు కాదని.. అమావాస్య పూజలుగా శ్రీకాళహస్తి ఆలయ ఈవో చెప్పినట్లు తెలుస్తోంది. ప్రతి అమావాస్యకు అర్ధరాత్రి సమయంలో ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడం ఆచారంగా వస్తోందని ఈవో అన్నట్లు సమాచారం. నిధుల దుర్వినియోగం కేసులో విధుల నుంచి తప్పించామని స్పష్టం చేశారు.

మరోవైపు విజయవాడ దుర్గగుడిలో తాంత్రిక పూజల ఘటనపై ప్రభుత్వం నిజ నిర్ధరణ కమిటీని నియమించింది. ఏపీ ఆగమ సలహా మండలి చైర్మన్‌, కృష్ణ యజుర్వేద పండితులు చిర్రావూరి శ్రీరామశర్మ, పెనుగంచిప్రోలు ఈవో మంచనపల్లి రఘునాథ్‌తో కమిటీ వేసింది. రంగంలోకి దిగిన కమిటీ సభ్యులు దుర్గగుడిలో విచారణ చేపట్టారు. సుమారు 40 మందిని విచారించినట్లు కమిటీ సభ్యులు రఘునాథ్‌ తెలిపారు. సీసీటీవీ పుటేజీలో గుమ్మడి కాయలు లేవని.. కొబ్బరికాయలు మాత్రమే ఉన్నాయన్నారు. అవికూడా ఆలయం మూసిన తర్వాతే కొట్టే టెంకాయలని చెప్పారు. 
శుక్రవారం రాత్రి లేదా శనివారం నివేదిక సమర్పిస్తామన్నారు. 

దుర్గమ్మ దగ్గర తాంత్రిక పూజలు చేసే ధైర్యం ఎవరికీ లేదని రాష్ట్ర ఆగమశాస్త్ర సలహాదారుడు శ్రీరాం శర్మ అన్నారు. దుర్గాదేవి, మహిషాసుర మర్దిని రూపాలు ఒక్కటే అన్నారు. ఆలయంలో శుద్ధి ఎప్పుడైనా చేసుకోవచ్చన్నారు. ఏపీలో జరుగుతున్న తాంత్రిక పూజల వ్యవహారాలపై నిజానిజాలు వెలుగు తీసి... ప్రభుత్వం బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

22:10 - January 5, 2018

తూర్పుగోదావరి : జిల్లాలోని టీడీపీలో వర్గ పోరు బయటపడింది. అనపర్తి నియోజకవర్గంలోని పెదపూడి మండలం పెద్దాడ జన్మభూమి కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు మధ్య వాగ్వాదం జరిగింది. గతంలో జరిగిన 'మన ఇంటికి మన ఎమ్మెల్యే' కార్యక్రమంలో తనను దూషించారని బొడ్డు భాస్కరరామారావు... వాదనకు దిగడంతో ఘర్షణ వాతావారణం నెలకొంది. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ మధ్య మాటామాట పెరగడంతో.. ఇరు వర్గాలకు చెందిన కార్యకర్తలు కుర్చీలు విసురుకున్నారు. దీంతో కార్యక్రమంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను చెల్లాచెదురు చేసి... భారీ భద్రత ఏర్పాటు చేశారు. 

 

22:08 - January 5, 2018

హైదరాబాద్ : ఎమ్మార్ కుంభకోణంలో సీబీఐకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే ఎల్వీ సుబ్రహ్మణ్యంపై కేసు కొట్టివేసిన హైకోర్టు.. తాజాగా కోనేరు మధును నిందితుల జాబితా నుంచి తొలగించింది. ట్రైమెక్స్ గ్రూప్ ఛైర్మన్ కోనేరు ప్రసాద్ కుమారుడు.. కోనేరు మధుపై 2013లో సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేయగా... ప్రస్తుతం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ కొనసాగుతోంది. ఎమ్మార్ విల్లాల విక్రయాల్లో కోనేరు మధు అవకతవకలకు పాల్పడినట్లు సీబీఐ ఆరోపించింది. నిర్ణీత ధర కన్నా ఎక్కువ వసూలు చేసిన సొమ్ములో.. కొంత కోనేరుకి చెందిన మధు బ్యాంకు ఖాతాలో జమ అయినట్లు సీబీఐ ఆరోపించింది. అయితే.. సీబీఐ తనపై తప్పుడు కేసు నమోదు చేసిందని.. తనను నిందితుడి జాబితా నుంచి తొలగించాలని కోరుతూ మధు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం.. కోనేరు మధుపై కేసు కొట్టివేస్తూ తీర్పు వెల్లడించింది.

 

22:05 - January 5, 2018

హైదరాబాద్‌ : నగర శివారు ప్రాంతం బుద్వేలులో ఐటీ క్లస్టర్‌ నిర్మాణంపై  మంత్రి కేటీఆర్‌.. ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌తో భేటి అయ్యారు. బుద్వేల్‌ ఐటీ క్లస్టర్‌ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని.. త్వరితగతిన నిర్మాణం పూర్తి అయ్యేలా చూడాలని కేటీఆర్‌ సూచించారు. ఈ క్లస్టర్‌లో కంపెనీలను స్థాపించేందుకు 30కు పైగా సంస్థలు ప్రభుత్వంతో చర్చలు జరిపారని చెప్పారు. త్వరలోనే ఆయా కంపెనీలతో లాంఛనంగా  ఒప్పందాలు చేసుకోనున్నట్టు తెలిపారు.   

 

22:02 - January 5, 2018

హైదరాబాద్ : రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌తో.. కాంగ్రెస్‌ నాయకుల సంవాదానికి సంబంధించిన వార్తలు.. కలకలం రేపుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఫిర్యాదు చేసేందుకు గవర్నర్‌ వద్దకు వెళ్లిన టీ-కాంగ్రెస్‌ నేతలు.. ఆయన స్పందనపై ఆగ్రహంతో ఊగిపోయి.. విమర్శలకు దిగినట్లు ప్రచారం జరుగుతోంది. సోనియా భిక్షతో అధికారంలో ఉన్న మీరు... కేసీఆర్‌కు భజన చేస్తున్నారంటూ విరుచుకుపడ్డట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడీ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

కామారెడ్డిలో ఇసుక మాఫియా ఆగడాలు, మందకృష్ణ అరెస్ట్‌, అక్రమ కేసుల బనాయింపుపై రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌కు టీ-కాంగ్రెస్‌ నేతలు ఫిర్యాదు చేశారు. అయితే ఈ సందర్భంగా... కాంగ్రెస్‌ నేతల ఆరోపణలపై గవర్నర్‌ నరసింహన్‌.. భిన్నంగా స్పందించడంతో వారి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. 

ఇసుక మాఫియా ఆగడాలపై కాంగ్రెస్‌ నేతల ఆరోపణలను కొట్టిపారేసిన గవర్నర్‌ వారు చెబుతున్నవన్నీ అవాస్తవమని వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. వీఆర్‌ఏ మృతి ఘటనలో ఇసుక మాఫియా ప్రమేయం లేదని, మందకృష్ణ ప్రతిసారీ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని గవర్నర్‌ వ్యాఖ్యానించినట్లు సమాచారం. దీంతో గవర్నర్‌ స్పందనపై కాంగ్రెస్‌ నేతలు సర్వే సత్యనారాయణ, మల్లు రవి అభ్యంతరం వ్యక్తం చేసినట్లు భోగట్టా.. సహనం కోల్పోయిన సర్వే.... సోనియా భిక్షతో గవర్నర్‌ పదవిలో ఉన్న మీరు... ప్రభుత్వానికి ఎందుకు వత్తాసు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. 

గవర్నర్‌ నరసింహన్‌ తీరుపై ఇటీవలే.. ఏపీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు కూడా బహిరంగంగానే తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.  గవర్నర్‌ తెలంగాణ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ.. ఏపీకి చెందిన ఫైళ్లను పెండింగ్‌లో పెట్టేస్తున్నారన్నది ఆయన విమర్శ. తాజాగా, తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు కూడా గవర్నర్‌పై విమర్శలకు దిగడం చర్చనీయాంశంగా మారింది. మరి, ఈ వ్యవహారం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి... !

21:57 - January 5, 2018
21:56 - January 5, 2018

హం హై వీర్‌,  శూర్‌ – హం తోడే జంజీర్‌! ప్రపంచంమంతా జనవరి ఒకటి ఉత్సవాల్లో మునిగిన సమయంలో మహారాష్ట్రలో ఈ నినాదాలు నింగినంటాయి. తరతరాల పీడనను ధిక్కరిస్తూ, అసమానతలను, అణచివేతలను ప్రతిఘటిస్తూ పోటెత్తిన మహాజనసంద్రం నింగి దద్దరిల్లేలా ఇచ్చిన నినాదం అది. కానీ, ఆ సంస్మరణపై కొందరు విరుచుకు పడ్డారు. దాడులు చేశారు. అది జాతి వ్యతిరేకమన్నారు. ఎందుకు? అసలు కోరేగావ్ లో ఏం జరిగింది? అది నేటికీ ఎందుకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది? ఇదే ఈ రోజు వైడాంగిల్ స్టోరీ.. 
విజయాలను స్మరించుకోవాలి... 
విజయాలను స్మరించుకోవాలి. అవి మరింత స్పూర్తినిస్తాయి.. పీడన, అణచి వేతలను ధిక్కరించిన సందర్భాలను మననం చేసుకోవాలి. అవి వెలుగు బాటకు దారి చూపుతాయి. వర్తమానంలో మరింత స్పష్టతను ఇస్తాయి.  కానీ, అలాంటి సందర్భం వివాదాస్పదంగా ఎందుకు మారుతోంది ?
భీమా కొరేగావ్‌లో 200ఏళ్ల క్రితం యుద్ధం 
భీమా కొరేగావ్‌లో 200ఏళ్ల క్రితం జరిగిన యుద్ధాన్ని స్మరించుకునేందుకు మహర్‌లు చేసిన ప్రయత్నాన్ని  కొందరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఇది కుల సంబంధ సంస్మరణ గా భావించాలా? జాతి వ్యతిరేకతతో కూడుకున్న కార్యక్రమమా?  ఈ కార్యక్రమాన్ని ఎలా చూడాలి?  మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

21:48 - January 5, 2018

ఢిల్లీ : గుజరాత్‌ ఎమ్మెల్యే, దళిత నేత జిగ్నేష్‌ మేవాని ప్రధాని మోదిపై విరుచుకుపడ్డారు. తనని తాను అంబేద్కర్‌ భక్తునిగా చెప్పుకునే మోది భీమా కోరేగావ్‌ హింసాత్మక ఘటనలపై ఎందుకు మౌనం వహించారని ప్రశ్నించారు. దళితులపై దాడులు ఇలాగే కొనసాగితే... 2019 లోక్‌సభ ఎన్నికల్లో మోదికి దళితులు తగిన గుణపాఠం చెబుతారని జిగ్నేష్‌ హెచ్చరించారు. సామాజిక న్యాయం కోసం జనవరి 9న ఢిల్లీలో భారీ యువజన ర్యాలీ నిర్వహించనున్నట్లు జిగ్నేష్‌ ప్రకటించారు. మహారాష్ట్ర ప్రభుత్వం తనపై కేసు పెట్టడాన్ని తీవ్రంగా మండిపడ్డారు. తాను భీమా-కోరేగావ్‌కు వెళ్లనేలేదని, రెచ్చగొట్టే విధంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదని స్పష్టం చేశారు. గుజరాత్‌ ఎన్నికల్లో 150 స్థానాలకు బదులు 99కే పరిమితమై భంగపడ్డ బిజెపి, సంఘ్‌ పరివార్‌ తనని టార్గెట్‌ చేస్తోందని ఆరోపించారు. 

 

21:44 - January 5, 2018

ఢిల్లీ : పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తేదీలను కేంద్రం ప్రకటించింది.  బడ్జెట్ సమావేశాలు రెండు దఫాలుగా జరుగుతాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్ కుమార్ తెలిపారు. డిసెంబర్‌ 29న తొలి విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభమై ఫిబ్రవరి 9న ముగుస్తాయి. ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశ పెడతారు. రెండో విడత బడ్జెట్ సమావేశాలు మార్చి 5 నుంచి ఏప్రిల్ 6 వరకూ జరుగుతాయని అనంతకుమార్‌ వెల్లడించారు.

 

21:41 - January 5, 2018

ఢిల్లీ : పార్లమెంట్‌లో ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు ఆమోదం పొందకపోవడంపై ముస్లిం మహిళలు నిరసన వ్యక్తం చేశారు. పార్లమెంట్‌ వద్ద తలాక్‌ బాధితులు ఆందోళన చేశారు. కాంగ్రెస్‌ పార్టీ తీరు వల్లే తలాక్‌ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందలేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశఆరు. మోది ప్రభుత్వం తీసుకొచ్చిన తలాక్‌ బిల్లును  ముస్లిం మతపెద్దల ఒత్తిడికి తలొగ్గి కాంగ్రెస్‌  అడ్డుకుందని మండిపడ్డారు. తలాక్‌ చెప్పిన వారికి మూడేళ్లు జైలు శిక్ష సరిపోదని...జీవిత ఖైదు విధించాలని బాధిత మహిళలు డిమాండ్‌ చేశారు. తమ బిడ్డలను ఎవరు చూస్తారని...సమాజంలో తాము తల ఎత్తుకుని ఎలా తిరగగలమని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

 

21:38 - January 5, 2018

తిరుపతి : మార్చి రెండోవారం నుంచి తిరుపతిలోనూ సర్వదర్శనం టైంస్లాట్‌ విధానాన్ని పూర్తి స్థాయిలో అమలుచేస్తామని టీటీడీ ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ చెప్పారు. తిరుపతిలో కూడా భక్తులు బస చేయడానికి వీలుగా 2 వేల 5 వందల వసతి గదుల నిర్మాణం చేపడతామని.. చెప్పారు. అలాగే సర్వదర్శనం టైంస్లాట్‌ విధానం విజయవంతమైందని అన్నారు.

 

21:35 - January 5, 2018

కరీంగనర్ : 10టీవీ ప్రతిక్షణం ప్రజల పక్షాన నిలుస్తుందంటూ అభినందించారు గంగాధర మండల సర్పంచ్‌ వైద రామానుజం. కరీంనగర్‌ జిల్లా గంగాధర మండల కేంద్రంలో 10టీవీ క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఛానెల్‌ ప్రారంభమైన అనతి కాలంలోనే ఎంతో ప్రజాదరణ పొందిందని కితాబిచ్చారు. మండల ప్రజలందరికి..10టీవీ యాజమాన్యానికి, సిబ్బందికి నూతన సంవత్సర, సంక్రాతి శుభాకాంక్షలు తెలిపారు.

 

21:18 - January 5, 2018

వనపర్తి : ఎన్నికల కోసమే రాష్ట్ర ప్రభుత్వం రైతులపై కపట ప్రేమ చూయిస్తుందన్నారు ఎమ్మెల్యే చిన్నారెడ్డి. వేరుశనగ పంటకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్‌ చేస్తూ వనపర్తి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ సమీపంలోని రోడ్డుపై రైతులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ఎమ్మెల్యే చిన్నారెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జబ్బార్‌ మద్దతు తెలిపారు. రైతుల ధర్నాతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎమ్మెల్యే చిన్నారెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

 

21:15 - January 5, 2018

నెల్లూరు : పట్టణంలో జరిగిన యువజన సభలో వైసీపీ ఎమ్మెల్యే రోజా సీఎం చంద్రబాబును తీవ్రంగా విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావడం చంద్రబాబుకు చేతకాలేదన్నారు. ఓటుకు నోటు కేసులో తప్పించుకునేందుకు ఏపీని కేంద్రానికి తాకట్టుపెట్టారని విమర్శించారు. జయంతికి వర్థంతికి తేడా తెలియని పప్పూకి మంత్రి పదవి ఇచ్చారని, కాని రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగం ఇవ్వలేకపోయారన్నారు.

 

21:04 - January 5, 2018

హైదరాబాద్‌ : కర్మాన్‌ఘాట్‌కు చెందిన కార్పెంటర్‌ నాగరాజు హత్య కేసు మిస్టరీని చౌటుప్పల్‌ పోలీసులు ఛేదించారు. దేహంపై గాయాలు గమనించిన పోలీసులు హత్యగానే అనుమానించారు. ఆ కోణంలోనే దర్యాప్తు ముమ్మరం చేశారు.   భార్యపై అనుమానంతో ఆమె కాల్‌డేటాను విశ్లేషించడంతో గుట్టురట్టయింది. 
నాగరాజు హత్య కేసును ఛేదించిన పోలీసులు 
హైదరాబాద్‌ కర్మాన్‌ఘాట్‌కు చెందిన కార్పెంటర్‌ నాగరాజు హత్య కేసులో మిస్టరీ వీడింది. భార్య జ్యోతి ఈ ఘాతుకానికి కారణమని చౌటుప్పల్‌ పోలీసులు తేల్చారు. ఈ కేసులో పోలీసులు  తీసుకున్న ఒక్కో అడుగు..నాలుగు రోజుల్లోనే కేసును ఛేదించేలా చేశాయి. గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం పడి ఉందన్న సమాచారంతో చౌటుప్పల్‌ పోలీసులు స్పాట్‌కు చేరుకున్నారు. మృతుడి జేబులో లభించిన బిల్లుల ఆధారంగా హైదరాబాద్‌కు చెందిన కార్పెంటర్‌గా గుర్తించారు. అయితే దేహంపై గాయాలు కనిపించడంతో..హత్యగా అనుమానించిన పోలీసులు డెడ్‌బాడీని పోస్ట్‌మార్టంకు తరలించారు. శవపరీక్ష నివేదికలో తలపై బలమైన గాయాలున్నట్లు తేలింది. హతుడి ఫోటో, కాల్‌డేటా ఆధారంగా కర్మాన్‌ఘాట్‌లో ఆరా తీశారు. కుటుంబ సభ్యులు నాగరాజుగా చెప్పడంతో..మృతదేహాన్ని వారికి అప్పగించారు. అయితే జ్యోతి కాల్‌డేటాను పరిశీలించిన పోలీసులు..డిసెంబరు 30,31 తేదీల్లో ఒకే నంబరుకు ఎక్కువగా కాల్స్‌ ఉన్నట్టు గుర్తించారు. ఆ నంబరు కార్తీక్‌దిగా తేలడంతో.. అతడిని అదుపులోకి తీసుకున్నారు. జ్యోతి, కార్తీక్‌ను విచారించడంతో తామే హత్య చేశామని అంగీకరించారు.  
పెళ్లికి ముందే కార్తీక్‌తో జ్యోతి లవ్‌ 
మహబూబ్‌నగర్‌ జిల్లా రాచర్లకు చెందిన జ్యోతికి అదే గ్రామానికి చెందిన నాగరాజుతో ఐదేళ్ల క్రితం పెళ్లయింది. పెళ్లికి ముందే హైదరాబాద్ నాచారానికి చెందిన కార్తీక్‌తో జ్యోతి లవ్‌లో పడింది. అయితే జ్యోతి పేరెంట్స్‌ ప్రేమ పెళ్లికి నిరాకరించి..నాగరాజుతో వివాహం చేశారు. ఆ తర్వాత నాగరాజు హైదరాబాద్ కర్మన్‌ఘాట్‌లో కాపురం పెట్టాడు. కొన్నాళ్లు వీరి కాపురం సవ్యంగా సాగింది. కొడుకు, కూతురు పుట్టారు. ఈక్రమంలో 3 నెలల క్రితం కార్తీక్‌ మళ్లీ జ్యోతి జీవితంలోకి వచ్చాడు. 
నాగరాజు ముఖంపై దిండుతో అదిమిపట్టి చంపారు 
జ్యోతి, కార్తీక్‌ మధ్య కొనసాగుతున్న వివాహేతర సంబంధం.. భర్త నాగరాజుకు తెలియడంతో.. ఆమెను మందలించాడు. భర్తను చంపేస్తే తమకు అడ్డు ఉండదని జ్యోతి, కార్తీక్‌ నిర్ణయించుకున్నారు. కార్తీక్‌ తన స్నేహితులు దీపక్‌, యాసిన్‌, నరేష్‌లతో కలిసి నాగరాజు హత్యకు స్కెచ్‌ వేశారు. డిసెంబరు 30 రాత్రి ఇంటికి వచ్చిన భర్తకు జ్యోతి నిద్రమాత్రలు ఇచ్చింది... ఆ తర్వాత ఫోన్‌ చేసి ప్రియుడు కార్తీక్‌ను ఇంటికి పిలిపించింది. గాఢనిద్రలో ఉన్న నాగరాజు ముఖంపై దిండుతో అదిమిపట్టి చంపారు. ఆ తర్వాత స్నేహితులు సాయంతో కారులో మృతదేహాన్ని తీసుకెళ్లి..చౌటుప్పల్‌లో పడేసి వెళ్లిపోయారు. 4 రోజుల్లోనే కేసును చేధించిన పోలీసులు..కార్తీక్‌ ఇచ్చిన సమాచారంతో దీపక్‌, యాసిన్‌లను అదుపులోకి తీసుకున్నారు. 
నాగరాజును హత్య చేసినట్లు చెప్పిన నిందితుడు నరేష్ 
విషయం తెలుసుకున్న మరో నిందితుడు నరేష్‌...లాలాపేట ఠాణాలో లొంగిపోదామని డయల్‌ 100కు ఫోన్‌చేశాడు. ఆ తర్వాత భయపడి గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. అతన్ని గాంధీ ఆసుపత్రికి తరలించాక..లాలాపేట పోలీసులు విచారించడంతో తన స్నేహితులతో కలిసి నాగరాజును హత్య చేసినట్లు చెప్పాడు. ప్రియుడి మోజులో పడి కట్టుకున్నవాడిని కడతేర్చి పిల్లలను అనాథలను చేసి జైలుపాలైంది జ్యోతి. ఆమెకు సహకరించిన నలుగురూ ప్రస్తుతం ఊచలు లెక్కిస్తున్నారు. 

 

20:57 - January 5, 2018

హైదరాబాద్ : లైంగిక వేధింపుల కేసులో గజల్‌ శ్రీనివాస్‌కు నాంపల్లి కోర్టు బెయిల్‌ పిటిషన్‌ను కొట్టేసింది. కోర్టులో ఇవాళ ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి... బెయిల్‌ ఇవ్వకూడదని తెలిపారు. గజల్‌ కేసులో కోర్టు వాదనలపై న్యాయవాది  సునీల్‌ 10 టివి ఫేస్‌ టు ఫేస్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలు తెలిపారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం.. 

20:44 - January 5, 2018

ఇటీవల వివాహేతర సంబంధాల వల్ల హత్యలు పెరిగిపోయాయి. తెగుతున్న బంధాలు..!, మానవ సంబంధాలు ప్రమాదంలో పడ్డాయా ? వైవాహిక జీవితం ప్రమాదంలో ఉందా ? ఇదే అంశంపై నిర్వహించిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో సామాజిక కార్యకర్త దేవి, ప్రముఖ సైకాలజిస్టు శైలజ, ప్రముఖ రచయిత ఓల్గా పాల్గొని, మాట్లాడారు. ఈ సందర్భంగా వక్తలు పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. విలువైన సలహాలు, సూచనలు చేశారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం.... 

20:39 - January 5, 2018

పశ్చిమగోదావరి : మొగల్తూరులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జన్మభూమి మా ఊరు కార్యక్రమానికి వచ్చిన మంత్రి లోకేష్ ను కలవడానికి వెళ్లిన ఆక్వా ఫుడ్ పోరాట సమితి నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఆరేటి సత్యవతితో సహా సీపీఎం నేతలు, గ్రామస్తులను పోలీసులు అరెస్టు చేశారు. బలవంతంగా ఈడ్చుకెళ్లి వ్యాన్ లో పడేశారు.
 

నల్లబోతు నరేంద్ర మృతి కేసును ఛేదించిన పోలీసులు

గుంటూరు : నాదెండ్ల మండలం పెదనందిపాడు బ్రాంచ్ కాలువ వద్ద నల్లబోతు నరేంద్ర మృతి కేసును పోలీసులు ఛేదించారు. మృతుడి భార్యే హంతకురాలుగా పోలీసులు తేల్చారు. బావ వీరయ్యతో కలిసి భార్య శ్రీవిద్య భర్తను హత్య చేసింది. సైనైడ్ కలిపిన మద్యం తాగించి వీరయ్య హత్య చేశాడు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని హత్య చేశారు. వీరయ్యకు సహకరించిన బాలరాజు, చౌడయ్యలను పోలీసులు అరెస్టు చేశారు. మృతుడి భార్య శ్రీవిద్య అజ్ఞాతంలో ఉంది. 

 

కొత్త రూ.10 నోట్ ను విడుదల

ఢిల్లీ : కొత్త రూ.10 నోట్ ను విడుదల అయింది. మహాత్మగాంధీ సిరీస్ లో చాక్లెట్ కలర్ లో రూ.10 కొత్త నోటు విడుదల చేశారు. కొత్త కరెన్సీ నోటుపై ఒక వైపు కోణార్క్ సూర్య దేవాలయం ఉంటుంది. కొత్త రూ.10 నోటుతో పాత రూ.10 నోటు చెల్లుబాటు అవుతుంది. 

 

రోజుకు 2.10 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని ఆదేశం

హైదరాబాద్ : రానున్న 3నెలల్లో రోజుకు 2.10 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని ఆదేశించారు. వార్షిక లక్ష్యాలను చేరుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సీఎండీ శ్రీధర్ సూచించారు.

పెందుర్తి కృష్ణరాయపురంలో జన్మభూమిలో ఉద్రిక్తత

విశాఖ : పెందుర్తి కృష్ణరాయపురంలో జన్మభూమిలో ఉద్రిక్తత నెలకొంది. అంగన్ వాడీ కేంద్రాల్లో టీచర్లు, సిబ్బంది ఉండటం లేదని ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తికి వైసీపీ ఫిర్యాదు చేసింది. పలువురు వైసీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. 

 

19:50 - January 5, 2018

అనంతపురం : ప్రపంచీకరణ ప్రభావం భారత సంస్కృతిపై తీవ్ర ప్రభావం చూపుతోందని పలువురు ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు. పాశ్యాత్య సంస్కృతి భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై దాడి చేస్తోందని ఆవేదన వెలిబుచ్చారు. పాశ్యత్య విషసంస్కృతి వ్యామోహంలో యువత పెడదారి పడుతోందని,  ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రజా నాట్యమండలి వంటి సంఘాలు  కృషి చేయాలని కోరారు. 
బళ్లారి రాఘవ ప్రజా సాంస్కృతిక ఉత్సవాలు 
ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో అనంతపురంలో మూడు రోజుల పాటు జరిగిన బళ్లారి రాఘవ ప్రజా సాంస్కృతిక ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. వివిధ అంశాలపై  ప్రజానాట్య మండలి కళాకారుల ప్రదర్శనలు అలరించాయి. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వేషధారణలో ఓ బాలుడి ప్రదర్శన అందర్నీ మంత్రముగ్ధుల్ని చేసింది.  బళ్లారి రాఘవ ప్రజా సాంస్కృతిక ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి హాజరైన టాలీవుడ్‌ డైరెక్టర్‌ తమ్మారెడ్డి భరద్వాజ..సామాజిక విలువలు పతనమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజానాట్య మండలి మళ్లీ క్రియాశీలకంగా మారాల్సిన అవసరం ఉందన్నారు. 
విష సంస్కృతిని తిప్పికొట్టాలి... 
సాంస్కృతిక రంగం...నేటి సవాళ్లు అన్న అంశంపై జరిగిన సదస్సుకు హాజరైన తమ్మారెడ్డి భరద్వాజ.. ప్రపంచీకరణ తర్వాత  సంస్కృతిలో వేగంగా చోటు చేసుకుంటున్న మార్పులను ప్రస్తావించారు. యువతను పెడదోవ పట్టించేలా ఉన్న విష సంస్కృతిని తిప్పికొట్టేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించాల్సిన అవరసం ఉందని సదస్సులో ప్రసంగించిన వక్తలు సూచించారు. 

19:47 - January 5, 2018

శ్రీకాకుళం : ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ.. ఒకటి కొంటే మరొకటి ఉచితం. వెయ్యిరూపాయల విలువైన వస్తువు వందకే..! ఇలా పండుగల సీజన్‌లో వ్యాపార ప్రకటనలు వినియోగదారుల్ని తెగ ఊరిస్తాయి. ఈ ఫ్రీ ఆఫర్‌లతో జనం నెత్తిన కోట్ల రూపాయలకు టోపీ పెడుతున్నారు కొందరు వ్యాపారులు. శ్రీకాకుళం నగరంలో బడా సంస్థలు సైతం ఫ్రీ ప్రకటనలతో బూటకపు వ్యాపారానికి తెరతీశాయన్న ఆరోపణలు వస్తున్నాయి.
ప్రకటనలతో ఊరిస్తున్న వ్యాపార సంస్థలు  
సీజన్‌ .. అన్‌సీజన్‌ అనే తేడా లేకుండా.. సరకును అమ్ముకోడానికి వ్యాపార సంస్థలు ప్రకటనలతో ఊరిస్తుంటాయి. ఇక పండుగల సీజన్‌లో అయితే  ఫ్రీలు, ఆఫర్‌ల ప్రచారానికిక హద్దులే ఉండవు. శ్రీకాకుళంలో క్రిస్మస్‌, నూతన సంవత్సరం,  సంక్రాంతి పండుగ సందర్భంగా  వస్త్రవ్యారులు ప్రకటనలతో హోరెత్తిస్తున్నారు. డిస్కౌంట్‌లు ధరలు అంటూ  జేబులు నింపుకుంటున్నారు. కొందరు 50శాతం, మరికొందరు 70శాతం, ఇంకొందరైతే ఏకంగా వెయ్యి రూపాయల వస్త్రాలు 300 వందలకే ఇస్తామంటూ నాసిరకం సరుకునే అంటగడుతున్నారని జనం అంటున్నారు. ఫుట్‌పాత్‌ అమ్మకందార్ల నుంచి హోల్‌సేల్‌ వ్యాపారుల వరకు అందరూ ఇదే దందాను కొనసాగిస్తున్నారు.  
జనం చేబులకు చిల్లులు 
శ్రీకాకుళం నగరంలోని ఏడురోడ్ల కూడలి నుంచి సూర్యమహల్‌ జంక్షన్‌ వరకు దాదాపు 70షోరూంలు వస్త్ర వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయి. వీరంతా పోటాపోటీగా డిస్కౌంట్‌లపేరుతో దగా చేస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మొద్దో తెలియని పరిస్థితి వచ్చిందంటున్నారు. మొత్తం మీద పండుగల సీజన్‌లో కోట్లరూపాయల వ్యాపారం చేస్తున్న వస్త్ర వ్యాపారులు ..జనం చేబులకు చిల్లులు పెడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వ్యాపార లావాదేవీలపై అధికారుల నజర్‌ లేకపోవడంతో.. గోల్‌మాల్‌ వ్యాపారం జోరుగా సాగుతోంది.  
 

 

19:45 - January 5, 2018

పశ్చిమ గోదావరి : జిల్లాలోని పోడూరు మండల గ్రామల్లో జన్మభూమి కార్యక్రమానికి హాజరైన మంత్రి లొకేష్‌కు గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. జున్నూరు వద్ద పెద్ద సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు జేజేలు పలికారు. అనంతరం భారీ ర్యాలీగా కార్యకర్తలు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. జున్నూరులోని ఎన్టీఆర్‌ విగ్రహానికి లొకేష్‌ పూలమాలవేసి నివాళ్లు అర్పించారు. 

 

19:44 - January 5, 2018

కడప : బలహీన వర్గాల శ్రేయస్సు కోసం పక్షపాతవైఖరి లేకుండా వార్తలను ప్రసారం చేయడంలో 10టీవీ ముందుంటుందని టీడీపీ ఇన్‌చార్జ్‌ కస్తూరి విశ్వనాథనాయుడు అన్నారు. కడప జిల్లా రైల్వే కోడూరులో 10టీవీ క్యాలెండర్‌ను ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల రాయుడు ఆవిష్కరించారు. రాజకీయనాయకుల అధికారుల అవినీతి బాగోతాలు వెలికితీయండంలో ఛానెల్‌ ముందుంటుందని చెంగలరాయుడు అన్నారు. 10టీవీ యాజమాన్యానికి, సిబ్బందికి నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

19:43 - January 5, 2018

అనంతపురం : జిల్లా కేంద్రంలో 10టీవీ క్యాలెండర్‌ను ధర్మవరం ఎమ్మెల్యే సూర్యనారాయణ ఆవిష్కరించారు. ప్రజాసమస్యలను చూపించడంలో 10టీవీ ముందుంటుందని ధర్మవరం ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ అన్నారు. అనంతపురంలోని తన నివాసంలో 10టీవీ క్యాలెండర్‌ను ఆయన  ఆవిష్కరించారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ మరింత ముందుకు 10టీవీ దూసుకుపోవాలని ఎమ్మెల్యే సూర్యనారాయణ అన్నారు. నియోజకవర్గ ప్రజలకు, 10టీవీ సిబ్బందికి.. యాజమాన్యానికి నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

19:41 - January 5, 2018

కాకినాడ : మిస్ వరల్డ్ ఆస్ట్రేలియా ఎస్మా వోల్డర్ తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో సందడి చేసింది. తెలుగు ప్రిన్సెస్ ఆధ్వర్యంలో శనివారం జరగబోయే మిస్ కాకినాడ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా విచ్చేసిన ఎస్మా గాంధీనగర్‌లోని బాల సదన్‌ను సందర్శించారు. అక్కడి అనాథ పిల్లలతో సరదాగా గడిపారు. హెల్ప్ ద చిల్డ్రన్ అనే కార్యక్రమం ద్వారా ఇండియాలో పర్యటిస్తున్నామన్నారు ఎస్మా. దేశంలోని వివిధ నగరాల్లో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల ద్వారా వచ్చిన మొత్తాన్ని అనాథ మరియు అంగవైకల్యం కలిగిన పిల్లల అభివృద్ధికి ఉపయోగిస్తున్నామన్నారు. బాల సదన్‌లో పిల్లలకు సిబ్బంది మంచి సేవలు అందిస్తున్నారని ఆమె ప్రశంసించారు. 

19:27 - January 5, 2018

కృష్ణా : జిల్లాలోని తిరువూరులో.. ఫస్ట్‌ క్లాస్‌ అదనపు జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు.. నూతన భవనాన్ని.. వినూత్న రీతిలో ప్రారంభించారు. హైదరాబాద్‌లోని .. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వి.రామసుబ్రహ్మణియన్‌, ఎస్‌ఎంఎస్‌ ద్వారా సందేశం అందగానే.. దానికి అనుసంధానించిన ఎలెక్ట్రానిక్‌ మోటార్.. శిలాఫలకంపై కప్పిన తెరను తొలగించింది. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని తిరువూరులోని వాహిని ఇంజనీరింగ్‌ కాలేజీ విద్యార్థులు, తమ ప్రొఫెసర్‌ల సహకారంతో రూపొందించారు. తొలిసారిగా ఎలెక్ట్రానిక్‌ పద్ధతిలో కోర్టు భవనాన్ని ప్రారంభించిన జస్టిస్‌ సుబ్రహ్మణియన్‌.. ఈ విధానం ద్వారా, విలువైన సమయం, ధనం వృథా కాకుండా చూడగలిగామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. 

 

19:24 - January 5, 2018

తూర్పుగోదావరి : దొంగలను పట్టుకునే ఖాకీలనే ఏమార్చారు. కారుణ్య నియామకం కింద ఉద్యోగం కల్పించడం లేదంటూ కోర్టును కూడా ఆశ్రయించారు. ఉద్యోగం ఎందుకు ఇవ్వరంటూ ఎస్పీ కార్యాలయంలో హల్‌చల్‌ చేశారు. అసలు సంగతి బయటపడ్డంతో కటకటాల పాలయ్యారు తండ్రీకొడుకులు. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఈ ఘటన జిల్లా పోలీస్‌శాఖలో కలకలం రేపింది. 
పోలీస్‌ ఉద్యోగం కోసం ఘరానా మోసం
తూర్పుగోదావరిజిల్లాలో ఘరానా మోసగాళ్ల బండారం బయటపడింది. ఫేక్‌ సర్టిఫికెట్లతో ఉద్యోగం సంపాదించాలనుకున్న తండ్రీ కొడుకులను పోలీస్‌లు అరెస్టు చేశారు. సోదరుని వరుస  అయ్యే కానిస్టేబుల్‌ చనిపోతే.. కారుణ్య నియామకం కింద పోస్టును పట్టేయాలనుకున్న పథకాన్ని తూర్పుగోదావరి జిల్లా పోలీసులు వమ్ము చేశారు. 
నకిలీ సర్టిఫికెట్లు 
తూర్పుగోదావరి జిల్లా గంగవరం గ్రామానికి  చెందిన కొంగర తమ్మయ్యదొర పోలీసు కానిస్టేబుల్ గా పనిచేస్తూ 2000 సంవత్సరంలో చనిపోయాడు. తమ్మయ్యదొర భార్య కూడా గతంలోనే చనిపోయింది. వారి కుమారుడు సునీల్‌ చిన్నవాడు కావడంతో కారుణ్య నియామకం కింద ఉద్యోగం కల్పించడానికి వయస్సు సరిపోలేదు. దీంతో పోలీస్‌శాఖ ఇస్తున్న పెన్షన్‌తో సునీల్‌ చదువుకుంటున్నాడు. దీన్ని అవకాశంగా తీసుకున్న తమ్మయ్యదొర తోడల్లుడు కృష్ణమూర్తి చావుతెలివితేటలు ప్రదర్శించాడు. తనకుమారుడు చంద్రశేఖర్‌ను రంగంలోకి దించాడు. చంద్రశేఖర్‌నే మృతిచెందిన కానిస్టేబుల్‌  తమ్మయ్యదొర కొడుకుగా నకిలీ సర్టిఫికెట్లు సృష్టించాడు. 
తండ్రీ కొడుకులు కటకటాల పాలు 
ఫేక్‌ డాక్యుమెంట్లను తీసుకుని 2005లో జిల్లా ఎస్పీని కలిశారు. చంద్రశేఖర్‌కు కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలని కోరారు.  దీనిపై పోలీస్‌శాఖ నిర్ణయం తీసుకునేలోపుగానే .. ఈ ఇద్దరు తండ్రీకొడుకులు కోర్టును ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన ఎస్పీకార్యాలయం అధికారులు.. చంద్రశేఖర్‌ సమర్పించినవి నకిలీ సర్టిఫికేట్లని తేల్చారు. పోలీస్‌శాఖతో పాటు కోర్టును కూడా తప్పుదోవ పట్టించిన ఈ మోసగాళ్లపై కాకినాడ టూటౌన్‌ పీఎస్‌లో కేసునమోదు చేశారు. మొత్తానికి ఎస్పీకార్యాలయాన్నే తప్పుదోవ పట్టించడానికి యత్నించిన ఈ తండ్రీ కొడుకులు కటకటాల పాలయ్యారు. 

 

మొగల్తూరులో ఉద్రిక్తత పరిస్థితులు

పశ్చిమగోదావరి : మొగల్తూరులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జన్మభూమి మా ఊరు కార్యక్రమానికి వచ్చిన మంత్రి లోకేష్ ను కలవడానికి తుందుర్రు ఆక్వా ఫుడ్ పోరాట సమితి నాయకురాలు ఆరేటి సత్యవతితో సహా సీపీఎం నేతలు, పోలీసులు అరెస్టు చేశారు.

 

 

ఇండోర్ లో రోడ్డు ప్రమాదం

మధ్యప్రదేశ్ : ఇండోర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు, స్కూల్ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులతోపాటు డ్రైవర్ మృతి చెందారు. 

 

19:00 - January 5, 2018

కడప : జిల్లాలోని వేంపల్లి మండలంలో పంచాయితీ కాంట్రాక్టర్‌ సిబ్బంది ఆందోళన బాట పట్టారు. ఆరునెలలుగా వేతనాలు చెల్లించడం లేదని 70 మంది కార్మికులు వేంపల్లి పంచాయితీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఆందోళన చేస్తున్న కార్మికులపై వేంపల్లి సర్పంచ్‌ విష్టువర్దన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయితీ ఈవో నాగభూషణం రెడ్డి కలగజేసుకొని కార్మికులతో మాట్లాడి నాలుగు నెలల వేతనానికి సంబంధించి చెక్కును కార్మికులకు అందజేశారు. త్వరలోనే వేతనాలు అందేలా చేస్తామని హామీ ఇవ్వడంతో సిబ్బంది ఆందోళనను విరమించారు. 

 

18:58 - January 5, 2018

చిత్తూరు : శ్రీకాళహస్తీశ్వరాలయంలోనూ తాంత్రిక పూజల వివాదం.. చోటుచేసుకుంది. శ్రీకాళహస్తి దేవస్థానానికి అనుబంధంగా వేడాం గ్రామం వద్ద గల భైరవకోనలోని కాల బైరవుని ఆలయంలో సూపరింటెండెంట్‌ ధనపాల్‌ క్షుద్ర పూజలు చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు ఓ వీడియో కూడా.. సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఆలయ అధికారులు కూడా.. ధనపాల్‌ను సస్పెండ్ చేయడం జరిగింది. అయితే ఆలయ ఈవో ఆ వివరాలు తెలియజేయడం లేదు. దీంతో...అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. 

 

18:54 - January 5, 2018

టీ విరామానికి సౌతాఫ్రికా 230/7

కేప్ టౌన్ : భారత్, దక్షణాఫ్రికా మధ్య జరగుతున్న మొదటి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా టీ విరామానికి  230 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజ్ లో మహారాజ, రబడ ఉన్నారు. 

ఏడో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా

కేప్ టౌన్ : భారత్, దక్షణాఫ్రికా మధ్య జరగుతున్న మొదటి టెస్టులో సౌతాఫ్రికా ఏడో వికెట్ కోల్పోయింది. 228 పరుగుల వద్ద ఫిలాండ్ ఔటయ్యాడు. 

కాంగ్రెస్ హయాంలోనే ఇసుక మాఫియా

హైదరాబాద్ : కాంగ్రెస్ హయాంలోనే ఇసుక మాఫియా రాజ్యమేలిందని ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రజలే బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. కామారెడ్డి ప్రమాదంలో చినిపోయింది వీఆర్ఏ కాదని కేటీఆర్ తెలిపారు. 

కొత్త పదిరూపాయల నోటు విడుదల చేసిన ఆర్బీఐ

ముంబై : ఆర్బీఐ కోత్త పది రూపాయ నోటు విడుదల చేసింది. ఈ నోటు మహాత్మా గాంధీ సిరీస్ లో చాక్లెట్ కలర్ లో ఉంది. కొత్త కరెన్సీ నోటుపై ఒక వైపు కోణార్క్  సూర్య దేవాలయం ఉంది. కొత్త రూ.10 నోటుతో పాటు పాత రూ.10 నోటు కూడా చెల్లబాటు అవుతాయి. 

రాజధాని రైతులకు ఊరట

హైదరాబాద్ : రాజధాని భూ సేకరణ రైతులకు ఊరట లభిచింది. పెనుమాక, వనలూరు రైతులు భూసేకరణపై హైకోర్టు కు వెళ్లారు. దీనిపై ఇచారించిన కోర్టు భూములకు ఎలాంటి అవార్డు జారీ యెయోద్దని ఆదేశించింది. 

18:10 - January 5, 2018

హైదరాబాద్ : గవర్నర్, కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. కామారెడ్డి ఘటనలో గవర్నర్ ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చారు. వర్గీకరణపై మందకృష్ణ అలా చేసి ఉండకూడదని గవర్నర్ అన్నారు. ప్రభుత్వ నిబంధనలను మందకృష్ణ ఉల్లంఘించారని గవర్నర్ అనడంతో కాంగ్రెస్ నేతలు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. గవర్నర్ తీరుపై సర్వే సత్యనారాయణ, మల్లురవి మండిపడ్డారు. కేసీఆర్ కు భజన చేస్తూ పదవిలో కొనసాగుతున్నావని కాంగ్రెస్ నేతలు గవర్నర్ ను అన్నారు. గవర్నర్ తీరు బాగాలేదని సర్వే సత్యనారాయణ నిలదీశారు. సోనియా భిక్షతో గవర్నర్ పదవిలో ఉన్నావని నరసింహన్ ను సర్వే అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

స్వచ్చ ఏపీ బ్రాండ్ అంబాసిడర్ పదవి గజల్ తొలగింపు

గుంటూరు : జన్మభూమి రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమని, ప్రధాని మోడీ ఫొటో పెట్టాల్సిన అవసరం లేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ అన్నారు. బీజేపీ నేతలు ఆరోపణలు చేయడం సరికాదని ఆయన అన్నారు. ఏపీ స్వచ్చ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న గజల్ శ్రీనివాస్ ను ప్రభుత్వం తొలగించిందని ఆయన అన్నారు.

ఇండోర్ లో ఘోర రోడ్డు ప్రమాదం....

భోపాల్ : మధ్యప్రదేశ్ లోని ఇందోర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్రక్కును స్కూల్ బస్సు ఢీకొన్న ఘటనలో ఐదుగురు విద్యార్థులతో సహా డ్రైవర్ మృతి చెందాడు. 

17:56 - January 5, 2018

హైదరాబాద్ : గజల్ శ్రీనివాస్ కు నాపంల్లి కోర్టులో చుక్కెదురైంది. శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. శ్రీనివాస్ బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారన్న పీపీ వాదనలతో కోర్టు ఏకిభవించింది. లైంగిక వేధింపుల కేసులో గజల్ శ్రీనివాస్ అరెస్టైన విషయం తెలిసిందే. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

17:54 - January 5, 2018

హైదరాబాద్ : మాదాపూర్‌లోని రహేజా మైండ్‌ స్పేస్‌లోని వారిజన్‌ డాటా సర్వీసెస్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీ...నగరంలో దాదాపు 500 మంది ఐటీ ఉద్యోగులను అకారణంగా తొలగించింది. దీంతో ఉద్యోగస్తులు యజమాన్యాన్ని ప్రశ్నించారు. కారణం చెప్పకుండా రిజైన్‌ చేసేది లేదని  పట్టుబట్టడంతో యాజమాన్యం బౌన్సర్‌లతో బలవంతంగా సంతకాలు తీసుకుందని ఉద్యోగస్తులు ఆవేదన చెందుతున్నారు. ఈ విషయమై మాదాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఉద్యోగులు తెలిపారు. 

 

17:52 - January 5, 2018

పెద్దపల్లి : జిల్లాలోని ఉసేన్‌మియా వాగుపై చేపట్టే ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకంగా కాల్వశ్రీరాంపూర్‌ మండలంలోని పలు గ్రామాల ప్రజలు నిరసన వ్యక్తం చేస్తూ రోడ్డెక్కారు. మండలంకి చెందిన ఐడీసీ చైర్మన్‌ ఈద శంకర్‌ రెడ్డి వాగుపై ప్రాజెక్ట్‌ కోసం ప్రత్యేకంగా 22కోట్ల 18లక్షల రూపాయలను మంజూరు చేశారు. ఎగువన ప్రాజెక్ట్‌ నిర్మించడం వల్ల వాగునుండి నీరు రాక తమకు నష్టం కలుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగపేటకి చెందిన రైతులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఐడీసీ చైర్మన్‌, స్థానికి ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

 

17:49 - January 5, 2018

హైదరాబాద్ : అంధుల కోసం మరిన్ని సంక్షేమ పథకాలను ప్రభుత్వం చేపట్టనుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. మలక్‌పేటలో అంధులకోసం నేషనల్‌ పార్క్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ దేశంలోనే ఇదే మొదటి పార్క్‌ అని తెలిపారు. ఇదే విధంగా రాష్ట్రంలోని ఆరు కార్పోరేషన్లలో పార్క్‌లను ఏర్పాటు చేస్తామని అన్నారు. మలక్‌ పేటలో అంధులకోసం నేషనల్‌ పార్క్‌ను ప్రారంభించడం ఏంతో సంతోషంగా ఉందని హైదరాబాద్‌ ఎంపీ అసదుద్ధిన్‌ ఓవైసీ అన్నారు. కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, మంత్రి మహేందర్‌ రెడ్డి, హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి  హాజరయ్యారు. 

బిల్లుపై టీఆర్ఎస్ తీరుపై ఎంఐఎం వైఖరేంటో తెలపాలి : షబ్బీర్

హైదరాబాద్ : ట్రిపుల్ తలాక్ బిల్లుపై టీఆర్ఎస్ తీరుపై ఎంఐఎం వైఖరి ఏంటో స్పష్టం చేయాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. ట్రిపుల్ తలాక్ బిల్లు పై వాకవుట్ చేసిన టీఆర్ఎస్ బిల్లుకు మద్దతిస్తుందో లేదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ సెక్యూలర్ ముసుగు వేసుకుని ముస్లింలను మోసం చేస్తున్నారని షబ్బీర్ అలీ విమర్శించారు. 

17:45 - January 5, 2018

హైదరాబాద్ : వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు హైకోర్టులో కొంత ఊరట లభించింది. పౌరసత్వం రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై 6 వారాల పాటు హైకోర్టు స్టే విధించింది. ఈ అంశంపై మళ్లీ వాదనలు వింటామని కోర్టు స్పష్టం చేసింది. చెన్నమనేని రమేశ్ భారత పౌరసత్వాన్ని డిసెంబర్‌లో కేంద్రం రద్దు చేసినట్లు ఆగస్టు 31 న హోంశాఖ తీర్పు ఇవ్వగా చెన్నమనేని రివ్యూ పిటిషన్‌ దాఖలు చేశారు. సంవత్సరం పాటు భారత్‌లో ఉండాలనే నిబంధనను రమేశ్‌ పాటించనందున పౌరసత్వం రద్దు చేస్తున్నట్లు హోంశాఖ తెలిపింది. దీనిపై చెన్నమనేని హైకోర్టును ఆశ్రయించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

దారిదోపిడీకి యత్నించిన దుండగులు

హైదరాబాద్ : బహదూర్ పురాలో దుండగులు దారిదోపిడీకి యత్నించారు. ఓ వ్యక్తి నుంచి బ్యాగ్ ఎత్తుకెళ్లేందుకు యత్నించారు. సీసీ టీవీ పుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. నిన్న జూబ్లీహిల్స్ లో జరిగిన ఘటనతో సంబంధంపై ఆరా తీశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు. 

గవర్నర్ ను కలిసిన కాంగ్రెస్ నేతలు

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ నేతలు గవర్నర్ నరసింహన్ కలిశారు. ఇసుక మాఫియా, మందకృష్ణ అరెస్ట్ పై ఆయనకు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. దీనిపై గవర్నర్ స్పందిస్తూ కామారెడ్డి ఘటనలో ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చారు. దీంతో కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహానికి లోనైయ్యారు. సర్వే, మల్లురవి గవర్నర్ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. 

17:39 - January 5, 2018

హైదరాబాద్ : బహదూర్ పురాలో దుండగులు దారిదోపిడీకి యత్నించారు. ఓ వ్యక్తి నుంచి బ్యాగ్ ఎత్తుకెళ్లేందుకు యత్నించారు. సీసీ టీవీ పుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. నిన్న జూబ్లీహిల్స్ లో జరిగిన ఘటనతో సంబంధంపై ఆరా తీశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు. 
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

17:30 - January 5, 2018

త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కల్యాణ్ కలయికలో వస్తున్న చిత్రం అజ్ఞాతవాసి. ఈ చిత్రం ఈ నెల 10న విడుదల కానుంది. ఈ సినిమా విడుదలకు ఇంక ఐదు రోజులు ఉండడంతో పవన్ అభిమానులు టికెట్లు బుక్ చేసుకోవడంలో బిజీగా మారారు. మొదటి రెండు వారాలకు టికెట్ ధరలు పెంచుకునే విషయంలో ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు. అయినా కూడా తెలుగు రాష్ట్రాల్లో ఈపాటికే కొన్ని సెంటర్స్ లో బుక్ మై షో పేటీఎం ద్వారా టికెట్ అమ్మకాలు మొదలు పెట్టేసారు. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. అందులో అధిక శాతం థియేటర్ బుకింగ్స్ కి టికెట్ ధర ఎంతనో ప్రస్తావించకుండా సీట్ కన్ఫర్మేషన్ కోసం కేవలం రిజర్వేషన్ చార్జీలు మాత్రమే వసూలు చేస్తున్నారు. మరి షో టైం కి అక్కడికి వెళ్ళాక ఫస్ట్ క్లాస్ కనీస ధర 200 రూపాయలు ఉండొచ్చని అనుకుంటున్నారు.

ఒంగోలులో పదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం

ప్రకాశం : జిల్లా ఒంగలులో పదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. పోలీసులు బాలుడిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. బాలుడి ఇంట్లో డ్రైవర్ గా పని చేస్తున్న వసీం అక్రమ్ నింధితుడిగా పోలీసులు గుర్తించారు. 

నగరంలో డ్రగ్స్ కలకలం..

హైదరాబాద్ : వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 5 కిలోల ఓపీఎం డ్రగ్స్ స్వాధానం చేసుకున్నారు. నలుగురు నింధితులను అదుపులోకి తీసుకున్నారు. 

గజల్ శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ తిరస్కరణ

హైదరాబాద్ :  లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన గజల్ శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ ను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. శ్రీనివాస్ బయటకు వస్తే సాక్షులను ప్రభవితం చేస్తురన్న పీపీ వాదనలతో కోర్టు ఏకిభవించింది. 

ఆర్డీవో గోవర్ధన్ రెడ్డి దుర్మార్గం

రంగారెడ్డి : జిల్లా మంచాల్ మండలం ఆరుట్లలో మన్నెగూడ ఆర్టీవో గోవర్ధన్ రెడ్డి దుర్మార్గం బయటకు  విచ్చంది. ఓ వ్యక్తి వాహనానికి అన్ని పత్రాలు ఉన్నా రూ.20 వేలు జరిమానా విధించారు. దీంతో మనస్తాపం చెందిన ఆ వ్యక్తి పురుగుల మందు తాగా ఆత్మహత్యాయత్నం చేశాడు.

17:00 - January 5, 2018

నేను ఏ తప్పు చేయలేదన్న బద్రీనాథ్ బాబు

కృష్ణా : విజయవాడ ఇంద్రకీలాద్రిపై నిజనిర్ధారణ కమిటీ విచారణ కొనసాగుతోంది. పూజలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆలయ ప్రధాన అర్చకులు బద్రీనాథ్ బాబు, ఆయన సహాయకులు రాజాను గంటన్నర పాటు కమిటీ విచారించింది. తాను ఏ తప్పు చేయలేదని బద్రీనాథ్ బాబు కమిటీకి చెప్పారు. ఆలయ శుద్ధి, అమ్మవారి అలంకారం మాత్రమే చేశానని తెలిపారు. 

ప్రధాని మోడీతో ముగిసిన టీడీపీ, బీజేపీ ఎంపీల భేటీ

ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీతో టీడీపీ, బీజేపీ ఎంపీల భేటీ ముగిసింది. రాష్ట్రానికి ఇచ్చిన హామీలను కాలపరిమితిలో పూర్తి చేసేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఎంపీలు ప్రధానిని కోరారు. టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు ప్రధాని సానుకూలంగా స్పందిచారని ఎంపీలు తెలిపారు. రెండు రోజుల్లో ప్రధానితో చంద్రబాబు భేటీ కానున్నారు. మోదీ, చంద్రబాబు భేటీ అనంతరం హామీలపై మరింత స్పష్టత వస్తుందని చెప్పారు.

16:49 - January 5, 2018

ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీతో టీడీపీ, బీజేపీ ఎంపీల భేటీ ముగిసింది. రాష్ట్రానికి ఇచ్చిన హామీలను కాలపరిమితిలో పూర్తి చేసేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఎంపీలు ప్రధానిని కోరారు. టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు ప్రధాని సానుకూలంగా స్పందిచారని ఎంపీలు తెలిపారు. రెండు రోజుల్లో ప్రధానితో చంద్రబాబు భేటీ కానున్నారు. మోదీ, చంద్రబాబు భేటీ అనంతరం హామీలపై మరింత స్పష్టత వస్తుందని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

రెసిడిన్సియల్ స్కూల్స్ గా సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ : సీఎం చంద్రబాబు

విశాఖ : ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాల, మైనార్టీల పిల్లలపై అధిక ప్రాధాన్యత ఇస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ ను రెసిడిన్సియల్ స్కూల్స్ గా కన్వర్ట్ చేస్తున్నామని చెప్పారు. 640 సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ ను రెసిడెన్షియల్ స్కూల్స్ గా కన్వర్ట్ చేశామని తెలిపారు. అన్ని స్కూల్స్ లో డిజిటల్ క్లాస్ రూములు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో 5 వేల స్కూల్స్ లో డిజిటల్ క్లాసు రూములు పెట్టామని తెలిపారు. రాష్ట్రంలోని పిల్లలు చాలా స్మార్ట్ గా ఆలోచిస్తున్నారని, కష్టపడి చదువుతున్నారని పొగిడారు. రాష్ట్రం నుంచి 11 మంది ఐఏఎస్ లుగా సెలెక్ట్ అయ్యారని తెలిపారు.

రాష్ట్రంలో 352 కేజీబీఎస్ స్కూల్స్ : సీఎం చంద్రబాబు

విశాఖ : స్కూల్స్ లో ఆధార్ కు బయోమెట్రిక్ అటెండెన్స్ ఏర్పాటు చేస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. పిల్లలు స్కూల్ వెళ్లారో లేదో తల్లిదండ్రులు ఇంటి నుంచే తెలుసుకోవచ్చాన్నారు. విశాఖలో జరిగిన జన్మభూమి...మా ఊరు కార్యక్రమంలో సీఎం పాల్గొని, మాట్లాడారు. పిల్లలను మంచిగా తయారు చేసే బాధ్యత తల్లిదండ్రులకు ఉందన్నారు. ఎంతమంది అవసరమైతే అంతమంది టీచర్స్ ను అపాయింట్ మెంట్ చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో 352 కేజీబీఎస్ స్కూల్స్ లో 70 వేల మంది చదువుతున్నారని పేర్కొన్నారు. 89 శాతం రిజల్ట్ వస్తుందన్నారు. అన్ని స్కూల్స్ లో డిజిటల్ క్లాస్ రూములు ఏర్పాటు చేశామని తెలిపారు.

16:37 - January 5, 2018

విజయనగరం : స్కూల్స్ లో ఆధార్ కు బయోమెట్రిక్ అటెండెన్స్ ఏర్పాటు చేస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. పిల్లలు స్కూల్ వెళ్లారో లేదో తల్లిదండ్రులు ఇంటి నుంచే తెలుసుకోవచ్చాన్నారు. విశాఖలో జరిగిన జన్మభూమి...మా ఊరు కార్యక్రమంలో సీఎం పాల్గొని, మాట్లాడారు. పిల్లలను మంచిగా తయారు చేసే బాధ్యత తల్లిదండ్రులకు ఉందన్నారు. ఎంతమంది అవసరమైతే అంతమంది టీచర్స్ ను అపాయింట్ మెంట్ చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో 352 కేజీబీఎస్ స్కూల్స్ లో 70 వేల మంది చదువుతున్నారని పేర్కొన్నారు. 89 శాతం రిజల్ట్ వస్తుందన్నారు. అన్ని స్కూల్స్ లో డిజిటల్ క్లాస్ రూములు ఏర్పాటు చేశామని తెలిపారు. బడికొస్తా పథకం కింద 9 వ తరగతి ఆడపిల్లలకు సైకిల్స్ పంపిణీ చేశామన్నారు. రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేశామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాల, మైనార్టీల పిల్లలపై అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ ను రెసిడిన్సియల్ స్కూల్స్ గా కన్వర్ట్ చేస్తున్నామని చెప్పారు. 640 సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ ను రెసిడెన్షియల్ స్కూల్స్ గా కన్వర్ట్ చేశామని తెలిపారు. అన్ని స్కూల్స్ లో డిజిటల్ క్లాస్ రూములు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో 5 వేల స్కూల్స్ లో డిజిటల్ క్లాసు రూములు పెట్టామని తెలిపారు. రాష్ట్రంలోని పిల్లలు చాలా స్మార్ట్ గా ఆలోచిస్తున్నారని, కష్టపడి చదువుతున్నారని పొగిడారు. రాష్ట్రం నుంచి 11 మంది ఐఏఎస్ లుగా సెలెక్ట్ అయ్యారని తెలిపారు. ఒకేషనల్ ఎడ్యుకేషన్ కు ప్రాధ్యాన్యత ఇస్తున్నామన్నారు. జ్ఞానభూమి పోర్టల్ తీసుకొచ్చామని తెలిపారు. బీపీఎస్ కార్డు ( బియ్యం కార్డు) ఉంటే స్కూల్ లో ఫీజు రియింబర్స్ మెంట్ ఇస్తామని చెప్పారు. తెలుగును ప్రమోట్ చేయాలన్నారు. అన్ని ధానాల కంటే విద్యాధానం గొప్ప అని అన్నారు. పిల్లలు అధిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. పిల్లలు బాధపడకుండా చదువు చెప్పాలని సూచించారు. 

 

దాణా కుంభకోణంలో దోషులకు రేపు శిక్ష ఖరారు

రాంచీ : దాణా కుంభకోణంలో దోషులకు రేపు శిక్ష ఖరారు కానుంది. రేపు మధ్యాహ్నం 2 గంటలకు కోర్టు శిక్ష ఖరారు చేయనుంది. 

 

16:19 - January 5, 2018

అతి పిన్నవయస్సులో, 19 ఏళ్లకే కంప్యూటర్ సంస్థకు సీఈవో అయిన శ్రీలక్ష్మీ సురేష్ , త్రిపుల్ తలాక్ బిల్లుపై రాజ్యసభలో తీవ్ర గందరగోళం, ప్రముఖ కర్నాటక సంగీత విద్వాంసురాలు ఎమ్ ఎస్ సుబ్బలక్ష్మీ కుమార్తె రాధావిశ్వనాథన్ కన్నుమూత, నారీ వెబ్ సైట్ ప్రారంభం, బెంగుళూరులో యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన అల్లరిమూకలు, మహిళలను కదిలించిన 'మీ టూ' ఉద్యమం, సామాన్య వ్యక్తిగా వీధిలో నడిచిన నిర్మలా సీతారామన్.. వంటి పలు మహిళా వార్తలకు సబంధించిన పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం.. 

మదనపల్లిలో బీటీ కాలేజ్‌ యాజమాన్యం దౌర్జన్యం

చిత్తూరు : జిల్లాలోని మదనపల్లిలో బీటీ కాలేజ్‌ యాజమాన్యం దౌర్జన్యానికి పాల్పడింది. జన్మభూమి సభలకు యాజమాన్యం బలవంతంగా విద్యార్ధులను తరలిస్తోంది. సభలకు వెళ్లకుంటే టీసీలు ఇచ్చి పంపిస్తామంటూ యాజమాన్యం బెదిరిస్తుందంటూ విద్యార్ధులు కాలేజ్ ఎదుట ఆందోళనకు దిగారు. తమను బలవంతంగా జన్మభూమి సభలకు తరలిస్తున్నారని ఆరోపిస్తున్నారు. 

ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుకు రాజ్యసభలో లభించని ఆమోదం

ఢిల్లీ : పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ముగిశాయి. పార్లమెంట్‌ ఉభయ సభలు నిరవధిక వాయిదా పడ్డాయి. శీతాకాల పార్లమెంట్‌ సమావేశాల్లో భాగంగా లోక్‌సభలో కేంద్రం 16 బిల్లులను ప్రవేశ పెట్టింది. కీలక ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుతో పాటు 12 బిల్లులకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. 13 రోజుల పాటు జరిగిన శీతాకాల సమావేశాలు జరిగాయి. లోక్‌సభ 78 శాతం, రాజ్యసభలో 54 శాతం మాత్రమే ప్రొడక్టవిటి జరిగింది. రాజ్యసభలో ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుకు ఆమోదం లభించలేదు.  ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపించాల్సిందేనని విపక్షాలు డిమాండ్‌ చేయగా... ఈ బిల్లును పార్లమెంట్‌ కమిటీకి పంపడానికి ప్రభుత్వం నిరాకరించింది.

ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుతో పాటు 12 బిల్లులకు లోక్‌సభ ఆమోదం

ఢిల్లీ : పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ముగిశాయి. పార్లమెంట్‌ ఉభయ సభలు నిరవధిక వాయిదా పడ్డాయి. శీతాకాల పార్లమెంట్‌ సమావేశాల్లో భాగంగా లోక్‌సభలో కేంద్రం 16 బిల్లులను ప్రవేశ పెట్టింది. కీలక ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుతో పాటు 12 బిల్లులకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. 13 రోజుల పాటు జరిగిన శీతాకాల సమావేశాలు జరిగాయి. లోక్‌సభ 78 శాతం, రాజ్యసభలో 54 శాతం మాత్రమే ప్రొడక్టవిటి జరిగింది. 

వాహనాలు సీజ్‌ చేసేందుకు పోలవరం ప్రాజెక్టుకు చేరుకున్న దేనా బ్యాంక్‌ అధికారులు

పశ్చిమగోదావరి : పోలవరం ప్రాజెక్టు గుత్తేదారయిన ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థ బకాయిలపై దేనా బ్యాంక్ అధికారులు చర్యలు చేపట్టారు. వాహనాల కొనుగోళ్ల కోసం రూ.150 కోట్లను ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థ బ్యాంకు నుండి సేకరించింది. బకాయిలు తిరిగి చెల్లించకపోవడంతో వాహనాలు సీజ్‌ చేసేందుకు బ్యాంక్‌ అధికారులు పోలవరం ప్రాజెక్టుకు చేరుకున్నారు. రూ.150 కోట్ల బకాయిలు చెల్లించలేదని కోర్టు ఆదేశాలతో వాహనాల సీజ్‌కు సిద్ధమయ్యారు. కాని అక్కడ ఎలాంటి వాహనాలు లేకపోవడంతో బ్యాంక్‌ అధికారులు పనులను పరిశీలిస్తున్నారు.

15:50 - January 5, 2018

విశాఖ : రాష్ట్ర ప్రజలకు సుస్థిరపాలన అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. విశాఖ జిల్లా ధర్మారంలో జరిగిన జన్మభూమి..మా ఊరు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ప్రజల అభివృద్ధే లక్ష్యంగా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. నయాపైసా ఇవ్వకుండానే ప్రభుత్వం నుంచి సేవలు పొందేలా పారదర్శకంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. పేదరిక నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి ప్రాజెక్ట్‌ను నిర్దేశిత సమయంలో పూర్తి చేసి లక్షా 50వేల ఎకరాలను సాగులోకి తీసుకొస్తామన్నారు. రాష్ట్రంలోని పెండింగ్‌ ప్రాజెక్టులనూ పూర్తి చేస్తామన్నారు. కృష్ణా, గోదావరి బేసిన్‌లోని నదులను అనుసంధానం చేయనున్నట్టు చెప్పారు.    

 

15:48 - January 5, 2018

చిత్తూరు : జిల్లాలోని మదనపల్లిలో బీటీ కాలేజ్‌ యాజమాన్యం దౌర్జన్యానికి పాల్పడింది. జన్మభూమి సభలకు యాజమాన్యం బలవంతంగా విద్యార్ధులను తరలిస్తోంది. సభలకు వెళ్లకుంటే టీసీలు ఇచ్చి పంపిస్తామంటూ యాజమాన్యం బెదిరిస్తుందంటూ విద్యార్ధులు కాలేజ్ ఎదుట ఆందోళనకు దిగారు. తమను బలవంతంగా జన్మభూమి సభలకు తరలిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

15:44 - January 5, 2018

ఢిల్లీ : పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ముగిశాయి. పార్లమెంట్‌ ఉభయ సభలు నిరవధిక వాయిదా పడ్డాయి. శీతాకాల పార్లమెంట్‌ సమావేశాల్లో భాగంగా లోక్‌సభలో కేంద్రం 16 బిల్లులను ప్రవేశ పెట్టింది. కీలక ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుతో పాటు 12 బిల్లులకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. 13 రోజుల పాటు జరిగిన శీతాకాల సమావేశాలు జరిగాయి. లోక్‌సభ 78 శాతం, రాజ్యసభలో 54 శాతం మాత్రమే ప్రొడక్టవిటి జరిగింది. రాజ్యసభలో ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుకు ఆమోదం లభించలేదు.  ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపించాల్సిందేనని విపక్షాలు డిమాండ్‌ చేయగా... ఈ బిల్లును పార్లమెంట్‌ కమిటీకి పంపడానికి ప్రభుత్వం నిరాకరించింది. దీంతో తలాక్‌ బిల్లు స్తంభించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

దుర్గగుడి వివాదంపై కొనసాగుతున్న విచారణ

విజయవాడ : దుర్గగుడిలో పూజల వివాదంపై నిజ నిర్ధారణ కమిటీ విచారణ కొనసాగుతోంది. ప్రధాన అర్చకులు బద్రీనాధ్ బాబు, సహాయకులు రాజాని, గంటన్నరకు పైగా విచారిస్తున్నారు. 

15:42 - January 5, 2018

పశ్చిమగోదావరి : పోలవరం ప్రాజెక్టు గుత్తేదారయిన ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థ బకాయిలపై దేనా బ్యాంక్ అధికారులు చర్యలు చేపట్టారు. వాహనాల కొనుగోళ్ల కోసం రూ.150 కోట్లను ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థ బ్యాంకు నుండి సేకరించింది. బకాయిలు తిరిగి చెల్లించకపోవడంతో వాహనాలు సీజ్‌ చేసేందుకు బ్యాంక్‌ అధికారులు పోలవరం ప్రాజెక్టుకు చేరుకున్నారు. రూ.150 కోట్ల బకాయిలు చెల్లించలేదని కోర్టు ఆదేశాలతో వాహనాల సీజ్‌కు సిద్ధమయ్యారు. కాని అక్కడ ఎలాంటి వాహనాలు లేకపోవడంతో బ్యాంక్‌ అధికారులు పనులను పరిశీలిస్తున్నారు.  మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

వ్యవసాయంపై కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ శాఖ  పై ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, అధికారులు హాజరైయ్యారు. 

ఈ నెల 29 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

ఢిల్లీ : జనవరి 29 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు ఏప్రిల్ 6 వరకు కొనసాగుతాయి. ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 9వరకు తొలి విడత సమావేశాలు,  మార్చి 5 నుంచి ఏప్రిల్ 6  వరకు రెండో విడత సమావేశాలు జరుగుతాయి. 

15:18 - January 5, 2018

ఒక మెడిసిన్ రూ.50 వేలు పెట్టి కొనాలంటేనే సాధారణ ప్రజలు ఆలోచిస్తారు. ఎందుకంటే వారి దగ్గర డబ్బు ఉండదు కాబట్టి. కానీ ఓ సంస్థ తన మెడిసిన్ ఏకంగా రూ.5 కోట్ల ధరను నిర్ణయించింది. అమెరుకాలోని ఫిడెల్ఫియాకు చెందిన స్పార్క్ థెరపిటిక్స్ అనే సంస్థ అంధత్వాన్ని తగ్గించేందుకు అత్యంత ఖరీదైన మెడిసిన్ తయారు చేసింది. దానికి లక్స్ టోర్నా గా నామకరణం చేసింది. ఈ మెడిసిన్ వంశపారపర్యంగా వచ్చే రేటినా జీవకణజాల క్షీణతకు సంబంధించిన వ్యాధిని తగ్గిస్తుదట. ఈ మెడిసిన్ ధర రూ. 5,39,79,250గా నిర్ణయించారు. 

మోడీతో ముగిసిన ఏపీ ఎంపీల సమావేశం

ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ తో ఏపీ టీడీపీ, బీజేపీ ఎంపీల భేటీ ముగిసింది. ఈ సమావేశంలో ఏపీకి ఇచ్చిన హామీలు కాల పరిమితితో పూర్తి చేసేందకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఎంపీలు మోడీని కోరారు. 

మూడో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా

కేప్ టౌన్ : భారత్, దక్షణాఫ్రికా మధ్య జరుగుతున్న మొదటి టెస్టులో సౌతాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది. 12 పరుగుల వద్ద హషీమ్ ఆమ్లా(3) ఔటయ్యాడు.  

పార్లమెంట్ ఉభయసభలు నిరవధిక వాయిదా..

ఢిల్లీ : పార్లమెంట్ ఉభయసభలు నిరవధిక వాయిదా పడ్డాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మొత్తం 13 రోజుల పాటు జరిగాయి. 

ట్రాన్స్ ట్రాయ్ మిషనరీని సీజ్ చేస్తున్న దేనా బ్యాంక్ అధికారులు

పశ్చిమగోదావరి : జిల్లా పోలవరం ప్రాజెక్టు వద్ద ట్రాన్స్ ట్రాయ్ కి చెందిన దేనా బ్యాంక్ అధికారులు మిషనరీని సీజ్ చేస్తున్నారు. దేనా బ్యాంకుకు రూ.100కోట్లు బకాయి ఉండటంతో బ్యాంకు అధికారులు  మిషనరీని స్వాధీనం చేసుకున్నారు.

విచారణ ప్రాంరంభించిన నిజనిర్ధారణ కమిటీ

కృష్ణా : విజయవాడ దుర్గగుడి తాంత్రిక పూజల వివాదంపై నిజనిర్ధారణ కమిటీ విచారణ చేపట్టింది. ఉద్యోగులు, అర్చకులను కమిటీ విడివిడిగా విచారిస్తుంది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా

కేప్ టౌన్ : భారత్, దక్షణాఫ్రికా మధ్య జరుగుతున్న మొదటి టెస్టులో సౌతాఫ్రికా టాస్ గెలిచి బ్యాంటింగ్ ఎంచుకుంది. 

13:44 - January 5, 2018
13:42 - January 5, 2018

అనంతపురం : ప్రజాసమస్యలను చూపించడంలో 10టీవీ ముందుంటుందని ధర్మవరం ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ అన్నారు. అనంతపురంలోని తన నివాసంలో 10టీవీ క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ మరింత ముందుకు 10టీవీ దూసుకుపోవాలని ఎమ్మెల్యే సూర్యనారాయణ అన్నారు. నియోజకవర్గ ప్రజలకు, 10టీవీ సిబ్బందికి.. యాజమాన్యానికి నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

13:41 - January 5, 2018

విజయవాడ : ఏపీ డిప్యూటీ సీఎం చినరాజప్ప కాన్వాయ్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. కాన్వాయ్‌లోని ఎస్కార్ట్ జీపు దగ్ధం కాగా.. అందులో ఉన్న ఆరుగురు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో చినరాజప్ప నర్సీపట్నం వెళ్తుండగా మాకవరపాలెం వద్ద ఘటన చోటు చేసుకుంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 

13:32 - January 5, 2018

విజయవాడ : విభజన హామీలు నెరవేర్చాలని..పెండింగ్ లో ఉన్న అంశాలను పరిష్కరించాలని టిడిపి, బిజెపి ఎంపీలు కోరుతున్నారు. పార్లమెంట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడడంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ కావాలని టిడిపి, బిజపి ఎంపీలు నిర్ణయించారు. ఈమేరకు వారికి అపాయింట్ మెంట్ దొరకడంతో కాసేపట్లో ఈ భేటీ జరుగనుంది. విభజన హామీలు అమలు చేయాలని, ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం..విభజన హామీలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దృష్టికి తీసుకరానున్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశం కూడా ప్రధాన చర్చ జరిగే అవకాశం ఉంది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

కాసేపట్లో మోడీని కలవనున్న ఏపీ బీజేపీ, టీడీపీ ఎంపీలు

ఢిల్లీ : కాసేపట్లో ప్రధాన మంత్రి మోడీతో ఏపీ బీజేపీ, టీడీపీ ఎంపీలు సమావేశం కానున్నారు. ఈ భేటీలో ఏపీలో పెండింగ్ అంశాలు, విభజన హామీలు అమలుపై వారు ప్రధానితో చర్చించే అవకాశం ఉంది. 

శ్రీకాళస్తీలో తాంత్రిక పూజల వివాదం

చిత్తూరు : జిల్లా శ్రీకాళస్తీశ్వరాలయంలో తాంత్రిక పూజల వివాదం నెలకొంది. ఆలయ సూపరింటెండెంట్ కాలభైరవుని ఆలయంలో క్షుద్ర పూజలు చేసినట్టు సోషల్ మీడియాలో వీడియో హల్ చల్ చేస్తుంది. అధికారులు ధన్ పాల్ ను సస్పెండ్ చేశారు. దీనిపై ఈవోను ప్రశ్నించగా సమాధానం చెప్పలేదు. అధికారులు నోర మెదపకపోవడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. 

13:22 - January 5, 2018
13:20 - January 5, 2018

చిత్తూరు : ఆలయాల్లో తాంత్రిక పూజలు జరుగుతున్నాయా ? ఎందుకు చేస్తున్నారు ? ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మాధ్యమాల్లో పుకార్లు షికారు చేస్తున్నాయి. తాజాగా మరో ఆలయంలో తాంత్రిక పూజలు చేసినట్లుగా ఉన్న వీడియోలు హల్ చల్ చేస్తున్నట్లు సమాచారం. శ్రీకాళహస్తిలో ఈ ఘటన జరిగినట్లు కలకలం రేపుతోంది. శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా కాల భైరవ ఆలయం ఉంది. దీనికి భైరవకొన అని పేరు కూడా ఉంది. నిర్మానుష్యప్రాంతంలో ఉండే ఈ ఆలయం వద్ద గత కొన్ని రోజులుగా తాంత్రిక పూజలు చేస్తున్నారని తెలుస్తోంది.
ఐదారు మంది పూజలు నిర్వహించినట్లు..అందులో కొంతమంది నగ్నంగా ఉంటూ పూజలు నిర్వహించారని పుకారు షికార్లు చేస్తున్నాయి. పౌర్ణమి..అమవాస్య రోజుల్లో ఎక్కువగా పూజలు నిర్వహిస్తారని ప్రచారం ఉంది. ఆలయానికి చెందిన ధనపాల్ గత కొంతకాలంగా తాంత్రిక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రసాదాల కౌంటర్ లో అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో ధన్ పాల్ ను సస్పెండ్ చేశారు. ఈ విషయాన్ని ఈవో భ్రమరాంబ దృష్టికి వచ్చినా స్పందించడం లేదని తెలుస్తోంది. 

ఎమ్మార్ ప్రాపర్టీ కేసులో కోనేరు మధుకు ఊరట

హైదరాబాద్ : ఎమ్మార్ ప్రాపర్టీ కేసులో కోనేరు మధుకు హైకోర్టులో ఊరట లభించింది. సీబీఐ తనపై అక్రమంగా చార్జీషీట్ దాఖలు చేసిందని, మధు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. కోనేరు మధుపై సీబీఐ కేసును హైకోర్టు కొట్టవేసింది.

ఈటలను కలిసిన గంగిరెద్దుల సంఘం నాయకులు

హైదరాబాద్ : ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ను గంగిరెద్దుల సంఘం నాయకులు కలిశారు. హైదరాబాద్ లో గంగిరెద్దులను నిషేధించడం సరైంది కాదని, కులవృత్తి అడ్డుపడితే అసెంబ్లీ ఎదుట ఆందోళన చేపడతామని గంగిరెద్దుల సంఘనాయకులు తెలిపారు. 

12:52 - January 5, 2018

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా నటిస్తున్న చిత్రం ' నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' చిత్రంలో అను ఇమ్మానియేల్ కథనాయికిగా చేస్తున్నారు. వక్కతం వంశీ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీని బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ మూడొంతలు పూర్తయింది. ఇటీవల ఇంపాక్ట్ టీజర్ కూడా విడుదల చేశారు. ఈ చిత్రాని ఏప్రిల్ 27న విడుదల చేయనున్నారు. అదే తేదీన మహేష్ బాబు సినిమా భరత్ అను నేను, రజనీకాంత్ 2.0 చిత్రాలు విడుదల కాబోతున్నాయి. ఇప్పటికే భరత్ అను నేను చిత్ర నిర్మాతతో చర్చించామని, చెన్నై వెళ్లి 2.0 నిర్మాతతో చర్చిస్తామని చిత్ర నిర్మాత లగడపాటి శ్రీధర్ అన్నారు. 

ప్రియుడి కోసమే భర్తను చంపా : జ్యోతి

హైదరాబాద్ : తన ప్రియుడు కార్తీక్ తో కలిసి ఉండాలని తన భర్త నాగరాజును చంపేశామని నాగరాజు భార్య జ్యోతి తెలిపింది. కార్తీక్ డిసెంబర్ 19 నిద్రమాత్రలు తీసుకొచ్చాడని, 31న నిద్రమాత్రలు పాలలో కలిపి నాగరాజు ఇచ్చానని, నిద్రలోకి వెళ్లగానే ఊపిరి ఆడకుండా చేసి చంపేశామని జ్యోతి తెలిపింది. పెళ్లికి ముందు నుంచి కార్తీక్ తనకు సంబంధం ఉందని జ్యోతి ఒప్పుకుంది. తన తల్లిదండ్రులు ఇష్టంలేని పెళ్లి చేశారని పోలీసులకు తెలిపింది. 

12:39 - January 5, 2018

హైదరాబాద్ : తన సంబంధానికి అడ్డుగా వస్తున్నాడనే కారణంతో భార్య..ప్రియుడు భర్తను దారుణంగా హత మార్చారు. చౌటుప్పల్ లో నాగరాజు హత్య కేసు మిస్టరీ వీడింది. ఈ కేసులో భార్య జ్యోతి, ప్రియుడు కార్తీక్..అతని స్నేహితులు దీపక్, యాసిన్, నాగేష్ లను పోలీసులు అరెస్టు చేసి మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా నిందితులతో టెన్ టివి మాట్లాడింది. హత్యకు గల కారణాలు ఆరా తీసింది. హత్యకు సంబంధించిన విషయంలో భిన్నమైన సమాధానాలు చెప్పారు.

తనకు జ్యోతి ఓ పెళ్లిలో పరిచయం ఏర్పడిందని కార్తీక్ పేర్కొన్నాడు. తాను ఫోన్ చేయలేదని..జ్యోతి తనకు ఫోన్ చేసి మాట్లాడేదని తెలిపాడు. పెళ్లి అనంతరం మాట్లాడలేదని..రెండు నెలల క్రితం మాట్లాడిందన్నాడు. కలిసి ఉండాలంటే భర్త (నాగరాజు)ను చంపేయాలని జ్యోతి స్నేహితురాలు మౌనిక చెప్పిందన్నాడు. జ్యోతి నిద్రమాత్రలు ఇచ్చిన తరువాత తాను ఇంటికి వెళ్లి దిండు పెట్టి సృహ లేకుండా చేసినట్లు చేసిన ఘోరాన్ని తెలియచేశాడు. తాను చంపేస్తున్నట్లు స్నేహితులకు చెప్పలేదన్నాడు. నాగరాజు టార్చర్ చేస్తుండే వాడని జ్యోతి తనకు చెప్పిందన్నాడు.

ఇదే విషయంపై జ్యోతిని ప్రశ్నించగా భిన్నమైన సమాధానం చెప్పింది. నాగరాజు టార్చర్ చేయలేదని..బాగానే ఉండేవాడని తెలిపింది. నిద్రమాత్రలు మాత్రమే ఇచ్చానని...ఏం జరుగుతుందో..ఏమి చేస్తున్నారో తనకు చెప్పలేదని పేర్కొంది. తనకు భయం ఏర్పడిందని హత్యలో పాల్గొన్న నరేష్ అనే వ్యక్తి పేర్కొన్నాడు. వాళ్లు దొరికిపోయారని తనకు తెలియదని..ఈ విషయంలో భయం ఏర్పడి ఆత్మహత్యకు యత్నించినట్లు తెలిపారు.

ఇంకా వాళ్లు ఏమని చెప్పారో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

బిల్లు చెల్లించిన స్థాయిలో పోలవరం పనులు జరగలేదు : ఉండవల్లి

కడప : ప్రభుత్వం బిల్లు చెల్లించిన స్థాయిలో పోలవరం పనులు జరగలేదని మాజీ ఎంపీ, కాంగ్రెస్ నాయకుడు ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. జనవరి 1న పార్లమెంటులో చెప్పిన లెక్కల ప్రకారం ఎర్త్ వర్క్ 71 శాతం, కాంక్రీట్ వర్క్ 12 శాతం, గేట్ల తయారీ 31 శాతం జరిగిందని ఆయన తెలపారు.

12:31 - January 5, 2018

చౌటుప్పల్ : కార్పెంటర్‌ నాగరాజు హత్య కేసులో భార్య జ్యోతి..ప్రియుడు కార్తీక్..సహకరించిన మరో ముగ్గురుని అరెస్టు చేసినట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు. నాగరాజు యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసును లాలాగూడా పోలీసులు ఛేదించారు. హత్యకు గురైంది.. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కాదని.. హతుడు కార్పెంటర్‌ నాగరాజు అని పోలీసులు నిర్ధరించారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని తేల్చారు.

శుక్రవారం నిందితులను మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారి మాట్లాడుతూ....భార్య జ్యోతిని అదుపులోకి తీసుకుని ఇంటరాగేషన్ చేయడం జరిగిందన్నారు. ఓ పెళ్లికి వెళ్లిన జ్యోతికి అక్కడ కార్తీక్ తో పరిచయం ఏర్పడిందని..ఈ పరిచయం ప్రేమగా మారిపోయిందన్నారు. ఈ విషయం తెలుసుకున్న జ్యోతి తల్లిదండ్రులు స్వగ్రామానికి తీసుకెళ్లి నచ్చచెప్పే ప్రయత్నం చేశారని తెలిపారు. అనంతరం కార్పెంటర్ గా పని చేస్తున్న నాగరాజుతో జ్యోతి వివాహం చేశారని, వీరిద్దరూ కర్మన్ ఘాట్ నివాసం ఉండే వారని పేర్కొన్నారు. వీరికి అబ్బాయి..అమ్మాయి..జన్మించారని..గతంలో ఉన్న పరిచయం ఆసరాగా తీసుకుని కార్తీక్ సెల్ ఫోన్ నెంబర్ ను జ్యోతి తెలుసుకుందన్నారు. అనంతరం వీరిద్దరూ మాట్లాడుకొనే వారని..అక్రమ సంబంధం కొనసాగించారన్నారు.

భర్తను వదిలించుకోవాలని నిర్ణయం తీసుకున్నారని 30వ డిసెంబర్ పథకాన్ని అమలు చేశారన్నారు. భర్త నాగరాజుకు బూస్ట్ లో నిద్రమాత్రలు ఇచ్చిందని..సృహ కోల్పోయిన అనంతరం సమాచారాన్ని కార్తీక్ కు జ్యోతి చేరవేసిందన్నారు. రాత్రి 12.30గంటల సమయంలో కార్తీక్..అతని స్నేహితులు..దీపక్, యాసిన్, నాగేష్ లు ఇంటికి చేరుకున్నారని తెలిపారు. సృహ లేకుండా ఉన్న నాగరాజుపై దిండు పెట్టి చంపేశారని తెలిపారు. చనిపోయాడని అనుకున్న తరువాత కారులో నాగరాజును తరలించినట్లు, చౌటుప్పల్ దాటిన తరువాత బయటకు తీసే క్రమంలో నాగరాజు తలకు తీవ్రగాయమైందని వైద్యులు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారని తెలిపారు. కేసులో ఉన్న నరేష్ తప్పు చేశానని ఉద్ధేశ్యంతో గొంతు కోసుకోవడం జరిగిందని..ఇతని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారని పేర్కొన్నారు. ఆరా తీస్తే డొంకంత కదినట్లు తెలిపారు. ఈ కేసులో కారు..మూడు సెల్ ఫోన్లు..హత్యకు ఉపయోగించిన దిండును స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. 

12:30 - January 5, 2018

డైలాగ్ కింగ్ మోహన బాబు తనయుడు విష్ణు సతిమణి విరోనికా జనవరి 1న పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. విష్ణు, మనోజ్ తర్వాత వారి వంశంలో పుట్టిన మొదటి బిడ్డ కావడంతో వారి ఇల్లు సంబురాలతో నిండింది. బుధవారం పుట్టిన బాబుకు నామకరణం చేశారు. బాబు పేరు అవ్రామ్ భక్త గా పేరు పెట్టారు. ఈ పేరులో ఓ విషయం ఉంది. మోహన్ బాబు అసలు పేరు భక్తవత్సలం నాయుడు. ఆ పేరులో భక్త అని బాబు పెట్టారు.

బీసీ ప్రణాళికపై మంత్రులు, అధికారులు భేటీ

హైదరాబాద్ : బీసీ అభివృద్ధి ప్రణాళికపై మంత్రులు, అధికారులు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు ఈటల, జగదీష్ రెడ్డి, జోగు రామన్న, బీసీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వీరు తయారు చేసిన నివేదికను సీఎం అందించనున్నారు. 

బీసీ సంక్షేమ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన వెంకటేశం

హైదరాబాద్ : బీసీ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శిగా బుర్రా వెంకటేశం బాధ్యతలు స్వీకరించారు. 

12:12 - January 5, 2018

కావాల్సినవి..
బియ్యం, నూవ్వులు, ఓమా, నూనె, ఉప్పు, నీరు...

తయారీ విధానం.
బియ్యన్ని ఒక రోజు ముందుగా నానబెట్టుకోవాలి. తర్వాత వాటిని పిండిగా మరఅడించాలి( గిర్నిలో పిండి పట్టుట). పిండిలో కావాల్సిన ఉప్పు, నూవ్వులు, ఓమా, నీరు పోసి చపాతి పిండికంటే కాస్త కొంచెం నీరు ఎక్కువగా పోయాలి. తర్వాత క్లాత్ పై చేయితో పిండిని మూడు వరుసలు పోయాలి. తర్వాత వాటిని నూనెలో వేయాలి. దోర వెగించి నూనెలో నుంచి తియాలి. అంతే చకినాలు రెడీ....

12:10 - January 5, 2018
12:03 - January 5, 2018

మనం రోజు తీసుకునే ఆహరంలో రోగ నిరోధశక్తిని పెంచే గుణాలు ఎన్నో ఉంటాయి. కానీ మనం తీసుకునే ఆహరం సమతుల్యంలో ఉండాలి. అంటే ఎప్పుడు ఒకే రకమైన తిండి తినకూడదు. ఈ రోజు మనం క్యాబేజీ గురించి తెలుకుద్దాం..క్యాబేజీలో మిటవిన్ సి, థయేసల్ఫేట్, ఇండోల్ 3 కార్బినాల్, జియాగ్జాంథిన్, సల్ఫరోఫేన్, ఐసోథయోసల్ఫేట్, వంటి శక్తివంతమైన రసాయనాలు ఉంటాయి. ఇవి ఆర్యోగానికి మేలు చేస్తాయి. రొమ్ము, పెద్దప్రేగు, ప్రొటెస్ట్ క్యాన్సర్లను నివారిస్తాయి.

క్యాబేజీలో మిటమిన్ బి కాంప్లెక్స్ చెందిన పాంటథోనిక్ యాసిడ్ ( మిటమిన్ బి5) ఉంటుంది. పైరిడాక్సిన్( మిటమిన్ బి6), థయామిన్( మిటమిన్ బి1) కూడా ఉంటాయి. క్యాబేజీలో కె మిటమిన్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకల గట్టిదనానికి ఉపయోగపడుతుంది.

 

బీజాపూర్ లో మావోయిస్టుల మృతదేహాలు లభ్యం

రాయ్ పూర్ : చత్తీస్ గఢ్ లోని బీజాపరూర్ లో మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ముదువండి కవాద్ గావ్ అటవీ ప్రాంతంలో ఇద్దరు మావోయిస్టుల మృతదేహౄలు పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలిలో 303, 12 బోర్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.

11:46 - January 5, 2018

టీం ఇండియా పాస్ట్ బౌలర్ మహ్మాద్ షమీ చేసిన ట్వీట్ పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త సంవత్సం సందర్భంగా షమీ తన అభిమానులను ఉద్దేశించి నూతన సంవత్సరంలో మీకు, మీ కుటుంబానికి అన్ని శుభాలే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, అందరికి హ్యాపీ న్యూఇయర్ అని పూలతో అలంకరించిన శివలింగ ఫొటోను ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ పై సోషల్ మీడియాలో దూమరం చెలరేగింది. దీంతో షమీ ఆ పోస్టును తొలగించాడు. ఈ ట్వీట్ పై ముస్లిం వర్గానకి చెందిన అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది ఇస్లాంకు వ్యతిరేకమని ఘటుగా స్పందించారు. 

11:40 - January 5, 2018
11:39 - January 5, 2018

పోలెండ్ చెందిన ఓ చిన్నారి జిబిగ్జ్ కొడకా కోటేశ్వరా పాట అలపించాడు. చిన్నారికి కష్టమైనప్పటికి తెలుగు మీద అభిమానంతో తెలుగు పాటలు పాడడం, తెలుగు డైలాగ్ లు చెప్పాడం. వాటిని పోస్టు చేయడం ద్వారా ఈ చిన్నారి వార్తల్లో నిలిచాడు. ఈ చిన్నారి పడిన పాటకు ఇంప్రెస్ అయిన పవన్..చిన్నారి నేస్తం నువ్వు పాడిన పాట నాకు చేరింది. నువ్వు ఇచ్చిన కొత్త సంవత్సరం కానుకకు కృతజ్ఞాతలు. ఆ భగవంతుడు నిన్ను చల్లగా చూడాలని అంటూ ట్వీట్ చేశాడు.

11:38 - January 5, 2018

హైదరాబాద్ : దివ్యాంగుల కోసం డబుల్ బెడ్ రూంలు కల్పించే విధంగా చూడాలని జీహెచ్ఎంసీ కమిషనర్ కు మంత్రి కేటీఆర్ సూచించారు. శుక్రవారం మలక్ పేటలో దివ్యాంగుల కోసం నిర్మించిన నేషనల్ పార్క్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. దివ్యాంగుల కోసం ప్రభుత్వం అనేక పనులు చేపడుతోందని, పేదలకు..ఇతర వర్గాలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ ఆలీ, మంత్రులు మహేందర్ రెడ్డి, నాయినీ, ఎంపీ అసదుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. 

దివ్యాంగుల కోసం నేషనల్ పార్క్

హైదరాబాద్ : మలక్ పేట్ లో దివ్యాంగుల కోసం మంత్రి కేటీఆర్ నేషనల్ పార్క్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు మహేందర్ రెడ్డి, నాయిని, ఎంపీ అసదుద్దీన్ పాల్గొన్నారు. 

గజల్ బెయిల్ పిటిషన్ విచారించనున్న కోర్టు

హైదరాబాద్ : గజల్ బెయిల్ పిటిషన్ పై నేడు నాంపల్లి కోర్టు విచారించనుంది. గజల్ శ్రీనివాస్ బెయిల్ ఇవ్వకూడదని పోలీసులు కౌంటర్ పిటిషన్ వేశారు. గజల్ శ్రీనివాస్ ను గత మూడు రోజుల కింద పోలీసులు అరెస్ట్ చేశారు. 

11:33 - January 5, 2018

విశాఖపట్టణం : ఏపీ హోం మంత్రి చిన రాజప్పకు ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయ్ లో ప్రమాదం ఏర్పడింది. ఎస్కార్ట్ వాహనం దగ్ధమైంది. ఆరుగరు ఎస్కార్ట్ సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. సీఎం చంద్రబాబు నాయుడు ధర్మసాగరంలో 'జన్మభూమి- మా ఊరు' కార్యక్రమంలో పాల్గొననున్నారు. దీనితో ఇన్ ఛార్జీ మంత్రిగా ఉన్న హోం మంత్రి చిన రాజప్ప కార్యక్రమంలో పాల్గొనేందుకు రోడ్డు మార్గం గుండా బయలుదేరారు. నర్సీపట్నం వెళుతుండగా మాకవరపాలెం వద్ద మంత్రి కాన్వాయ్ లోని ఎస్కార్ట్ వాహనంలో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ఎస్కార్ట్ సిబ్బంది వాహనంలో నుండి దిగిపోయారు. వాహనం దగ్ధమైంది. 

11:28 - January 5, 2018
11:27 - January 5, 2018

హైదరాబాద్ : 'నా భర్తకు నిద్రమాత్రలే ఇచ్చినా..తరువాత ఏం చేశారో నాకు తెల్వదు' అంటూ భర్త హత్య కేసులో నిందితురాలిగా ఉన్న భార్య జ్యోతి టెన్ టివికి తెలిపింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకోవాలని భార్య రజిత..ప్రేమికుడు కార్తీక్ లు ప్లాన్ చేసి హత్య చేసిన సంగతి తెలిసిందే. అనంతరం జ్యోతిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా జ్యోతితో టెన్ టివి మాట్లాడింది. హత్య తాను చేయలేదని, కేవలం కార్తీక్ తో తాను ఫోన్ లో మాట్లాడడం జరిగిందని తెలిపింది. పెళ్లి చేసుకుంటానని..తల్లిదండ్రులతో మాట్లాడుతానని చెప్పడం జరిగిందన్నారు. నిద్ర మాత్రలు వేయాలని కార్తీక్ చెప్పడంతో అలాగే చేసినట్లు, అనంతరం కార్తీక్ అతని స్నేహితులు రాత్రి 12.30 గంటలకు వచ్చాడని తెలిపింది. ఇంట్లోకి రాకు..ఎవరైనా వస్తే చెప్పాలని తనను బయటే నిలబెట్టాడని, లోపల ఏం చేశారో తెల్వదని పేర్కొంది. భర్త నాగరాజు మృతి చెందాడని పోలీసులు చెబితే కాదని తనకు తెల్వదని జ్యోతి పేర్కొంది.

హైదరాబాద్‌ కర్మన్‌ఘాట్‌కు చెందిన కార్పెంటర్‌ నాగరాజు యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసును లాలాగూడా పోలీసులు ఛేదించారు. హత్యకు గురైంది.. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కాదని.. హతుడు కార్పెంటర్‌ నాగరాజు అని పోలీసులు నిర్ధరించారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని తేల్చారు. నాగ రాజు..జ్యోతిలు భార్య భర్తలు. కానీ జ్యోతికి కార్తీక్ అనే యువకుడితో అక్రమ సంబంధం ఉంది. ఈ విషయం భర్త నాగరాజుకి తెలియడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో భార్య జ్యోతి..వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్న భర్త నాగరాజు మర్డర్‌కు ప్లాన్‌ చేసింది. డిసెంబర్‌ 31వ తేదీ రాత్రి కార్తీక్‌.. తన స్నేహితులు దీపక్‌, నరేశ్‌, యాసిన్‌తో కలిసి చౌటుప్పల్‌లో నాగరాజును హత్య చేశారు. నల్గొండ చౌటుప్పల్ పీఎస్ పరిధిలోని నిర్మానుష్యమైన ప్రదేశంలో పడేశారు. హత్య విషయం తెలిసిపోతుందనే భయంతో నరేష్ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గొంతు కోసుకున్న నరేష్ ను గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. విషయం తెలిసిన పోలీసులు ఆస్పత్రిలో నరేష్‌ను విచారించడంతో డొంకంతా కదలింది. అక్రమ సంబంధం మరొకరి ప్రాణాలు తీసింది. 

డిప్యూటీ సీఎం చినరాజప్పకు తృటిలో తప్పిన ప్రమాదం

గుంటూరు : ఏపీ డిప్యూటీ సీఎం చినరాజప్ప కాన్వాయ్ కు తృటిలో ప్రమాదం తప్పింది. కాన్వాయ్ ఎస్కార్ట్ జీపు దగ్ధమైంది. ఆరుగు ఎస్కార్ట్ సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. సీఎం పర్యటన నేపథ్యంలో నర్సీపట్నం వెళ్తుండగా మాకవరపాలెం వద్ద ఈ ప్రమాదం జరిగింది. 

11:18 - January 5, 2018

అమీర్ ఖాన్ నటించిన బాలీవుడ్ మూవీ దంగల్ చైనాలో రికార్డు సృష్టంచింది. చైనీస్ ఐఎండీబీలో దంగల్ చిత్రంలో మొదటి స్థానంలో నిలిచింది. ఐఎండీబీ నిర్వహించిన వెబ్ సైట్ సర్వేలో దంగల్ మూవీకే ఎక్కువ మంది మద్దతు తెలిపారు. దంగల్ దేశీయంగా కూడా రికార్డు స్థాయిలో వసూల్ చేసింది. లేడీ బాక్సర్ కథ అంశంగా చిత్ర తెరకెక్కింది. దంగల్ ప్రపంచ వ్యాప్తంగా 2000వేల కోట్లను వసూల్ చేసింది. 

11:16 - January 5, 2018

జయం సినిమాతో టాలీవుడ్ కు పరిచయమై హీరో నితిన్ తర్వాత దిల్ సినిమాతో మాస్ ప్రేక్షకుల మానసు దొచుకున్నారు. ఆ తర్వాత సై చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. తర్వాత నితిన్ చేసిన సినిమాలు ఏవి కూడా హిట్ట్ కాలేపోయాయి. చాలా రోజుల తర్వాత వచ్చి ఇష్క్ తో నితిన్ మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడు. గుండె ఝారిగల్లంతయిందే, అఆ సినిమాతో మరింత క్రేజ్ సంపదించాడు నితిన్. అయితే లెటెస్ట్ గా వచ్చిన లై సినిమా కాస్త నిరశపరిచిన ప్రస్తుతం త్రివిక్రమ్, పవన్ కల్యాణ్ నిర్మాణ సారధ్యంలో కృష్ణ చైతన్య దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఆ సినిమా కు గుర్తుందా శీతాకాలం టైటిల్ ను ఖరారు చేశారు. ఈ మూవీ తర్వాత దిల్ నిర్మిస్తున్న శ్రీనివాస కళ్యాణంలో చేస్తున్నాడు. 

దుర్గగుడి తాంత్రిక పూజలపై నిజనిర్ధారణ కమిటీ

కృష్ణా : దుర్గగుడిలో ఆర్ధరాత్రి జరిగిన తాంత్రిక పూజలపై ప్రభుత్వం నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ ఏర్పాటు చేస్తూ దేవాదాయశాఖ కమిషనర్ ఉత్తర్వలు జారీ చేశారు. ఈ కమిటలో సభ్యులుగా దేవాదాయశాఖ ఇంచార్జీ, అదనుపు కమిషనర్ రఘునాథ్, ఆగమశాస్త్ర సలహాబోర్డు సభ్యుడు చిర్రావుల శ్రీరామశర్మ ఉన్నారు.

11:14 - January 5, 2018

విజయవాడ : దుర్గగుడిలో తాంత్రిక పూజల వివాదం ఓ కొలిక్కి రావడం లేదు. డిసెంబర్ 26వ తేదీన ఆలయంలో తాంత్రిక పూజలు చేశారని పుకార్లు షికారు చేసిన సంగతి తెలిసిందే. ఎలాంటి పూజలు జరగలేదని ఆలయ నిర్వాహకులు, మంత్రి మాణిక్యాలరావు పేర్కొంటున్నారు. వివాదం మరింత ముదురుతుండడంతో స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగారు. వెంటనే తనకు నివేదిక అందచేయాలని దేవాదాయ శాఖకు సూచించారు. రెండు సార్లు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దేవాలయాన్ని శుద్ధి చేశారని బాబుకు సమర్పించిన ప్రాథమిక నివేదికలో మంత్రి మాణిక్యాలరావు పేర్కొన్నట్లు తెలుస్తోంది.

ప్రాథమిక నివేదిక ఒకటి...ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న..పాలక మండలి సభ్యులు సమర్పించిన నివేదికలు బాబుకు చేరాయి. తాజాగా శుక్రవారం ప్రభుత్వం నిజనిర్ధారణ కమిటీ కూడా ఏర్పాటు చేసింది. ఇందుకు దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నిజనిర్ధారణ కమిటీలో దేవాదాయ శాఖ ఇన్ చార్జీ అదనపు కమిషనర్ రఘునాథ్, ఆగమశాస్త్ర సలహాబోర్డు సభ్యుడు చిర్రావుల శ్రీరామశర్మలున్నారు. నేడు లేదా రేపు విచారణ ప్రారంభించే అవకాశం ఉంది. ఇప్పటికే పలువురు ఆలయ ఈవో సూర్యకుమారి సిబ్బందికి నోటీసులు పంపించారు. ఏఈవో తిరుమల రావు, సూపరింటెండెంట్ గోపి, చీఫ్ సెక్యూర్టీ ఆఫీసర్ నరసింహరావుకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. క్యూ లైన్ ఇన్స్ పెక్టర్ చిన్న కేశవరావును బదిలీ చేశారు. 

10:12 - January 5, 2018

హైదరాబాద్ : అక్రమ సంబంధం..భర్తల ప్రాణాలు తీస్తోంది..క్షణిక సుఖాల కోసం ప్రాణాలు తీస్తున్నారు. దిద్దుకోలేని తప్పులు చేస్తున్నారు..తాజాగా మరో భర్తను హత్య చేసిన యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్ డేటా ఆధారంగా మిస్టరీ వీడింది. హత్యలో ప్రమేయం ఉన్న ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించడం..పోలీసుల విచారణలో పలు విషయాలు వెలుగు చూశాయి.

హైదరాబాద్‌ కర్మన్‌ఘాట్‌కు చెందిన కార్పెంటర్‌ నాగరాజు యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసును లాలాగూడా పోలీసులు ఛేదించారు. హత్యకు గురైంది.. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కాదని.. హతుడు కార్పెంటర్‌ నాగరాజు అని పోలీసులు నిర్ధరించారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని తేల్చారు. నాగ రాజు..జ్యోతిలు భార్య భర్తలు. కానీ జ్యోతికి కార్తీక్ అనే యువకుడితో అక్రమ సంబంధం ఉంది. ఈ విషయం భర్త నాగరాజుకి తెలియడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో భార్య జ్యోతి..వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్న భర్త నాగరాజు మర్డర్‌కు ప్లాన్‌ చేసింది. డిసెంబర్‌ 31వ తేదీ రాత్రి కార్తీక్‌.. తన స్నేహితులు దీపక్‌, నరేశ్‌, యాసిన్‌తో కలిసి చౌటుప్పల్‌లో నాగరాజును హత్య చేశారు. నల్గొండ చౌటుప్పల్ పీఎస్ పరిధిలోని నిర్మానుష్యమైన ప్రదేశంలో పడేశారు.
హత్య విషయం తెలిసిపోతుందనే భయంతో నరేష్ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గొంతు కోసుకున్న నరేష్ ను గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. విషయం తెలిసిన పోలీసులు ఆస్పత్రిలో నరేష్‌ను విచారించడంతో డొంకంతా కదలింది. అక్రమ సంబంధం మరొకరి ప్రాణాలు తీసింది. 

ప్రదీప్ కు ముగియనున్న గడువు..

హైదరాబాద్ : మద్యం తాగి కారు నడుపుతూ ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడిన యాంకర్ ప్రదీప్ కౌన్సెలింగ్ కు హాజరు కావడం లేదు. గడువు శుక్రవారంతో ముగియనుంది. తప్పనిసరిగా నేడు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 

తమిళనాడులో ట్రాన్స్ పోర్టు వర్కర్స్ సమ్మె...

తమిళనాడు : రాష్ట్రంలో ట్రాన్స్ పోర్టు వర్కర్స్ సమ్మె చేపట్టారు. దీని ఫలితంగా బస్సులు బస్ డిపోలకే పరిమితమయ్యాయి. దీనితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేతన సవరణ చేయాలని..ఇతరత్రా డిమాండ్స్ పరిష్కరించాలని కార్మికులు సమ్మె చేపడుతున్నారు. 

భారత బలగాల సెర్చ్ ఆపరేషన్...

జమ్మూ కాశ్మీర్ : రాజౌరి నౌషేరా సెక్టార్ లో భారత బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. డ్రోన్ల సహాయంతో బాంబులను, ఎల్ ఈడీలను కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. 

4వ రోజు జన్మభూమి - మా ఊరు...

విజయవాడ : జన్మభూమి - మా ఊరు కార్యక్రమం నాలుగో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల కలెక్టర్లు, నోడల్ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మూడు రోజులు జన్మభూమి అద్భుతంగా జరిగిందని, ఇదే స్పూర్తిని రాబోయే ఏడు రోజుల్లో కూడా చూపించాలని బాబు సూచించారు. ప్రజల్లో 80 శాతం సంతృప్తి రావాలని, సానుకూలత సాధించాలని, 15 శాతం వృద్ధి రేటును వచ్చే 15 ఏళ్లు కొనసాగించాలన్నారు. ప్రతి శాఖ సామర్థ్యం పెరగాలని, పనితీరు మెరుగుపడాలన్నారు.

09:18 - January 5, 2018
09:15 - January 5, 2018

భద్రాద్రి కొత్తగూడెం : తెలంగాణలో వరుసగా దారుణ ఘటనలు వెలుగు చూస్తున్నాయి. కుటుంబ కలహాలు..అక్రమ సంబంధాలు...ఇతరత్రా కారణాలతో చంపేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం ఇల్లందులో భార్యను ఓ భర్త చంపేసి పరారయ్యాడు. కొత్తగూడెంకు చెందిన ప్రభాకర్ కు ఇల్లందు పట్టణానికి చెందిన పద్మకు వివాహం జరిగింది. కానీ మూడు నెలల క్రితం విబేధాలు రావడంతో విడివిడిగా ఉంటున్నారు. పద్మ ఖమ్మం పరిషత్ కార్యాలయంలో టైపిస్టుగా పనిచేస్తోంది. యదావిధిగా గురువారం సాయంత్రం తన స్నేహితులతో పద్మ ఇంటికి వస్తోంది. మార్గమధ్యంలో ప్రభాకర్ అటకాయించి వేరే ఆటోలో పద్మను తీసుకెళ్లాడు. మెట్లగూడెం అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి ఇద్దరు స్నేహితుల సహాయంతో చున్నీతో ఉరి వేసి పద్మను చంపేశాడు. అనంతరం ప్రభాకర్ పరారయ్యాడు. 

09:10 - January 5, 2018

గుంటూరు : రేపల్లె పీఎస్ లో యువకుడి ఆత్మహత్య కలకలం రేగింది. ఇటీవలే మైనర్ బాలికను శ్రీనివాసరావు అనే యువకుడు పెళ్లి చేసుకున్నాడు. బాలిక బంధువులు ఫిర్యాదు చేయడంతో డిసెంబర్ 31న పోలీసులు అతడిని అరెస్టు చేశారు. పీఎస్ లోని బాత్ రూంకు వెళ్లిన శ్రీనివాసరావు ఉరి వేసుకుని చనిపోయాడు. దీనితో ఒక్కసారిగా పీఎస్ లో కలకలం రేగింది. మనస్థాపంతోనే ఆత్మహత్య చేసుకున్నాడా ? ఇతరత్రా కారణాలున్నాయా ? అనేవి తెలియరాలేదు. 

రేపల్లె పీఎస్ లో యువకుడి సూసైడ్...

గుంటూరు : రేపల్లె పీఎస్ లో యువకుడి ఆత్మహత్య కలకలం రేగింది. ఇటీవలే మైనర్ బాలికను శ్రీనివాసరావు పెళ్లి చేసుకున్నాడు. పోలీసులకు బాలిక బంధువులు ఫిర్యాదు చేయడంతో డిసెంబర్ 31న అతడిని అరెస్టు చేశారు. పీఎస్ లోని బాత్ రూంలో శుక్రవారం శ్రీనివాసరావు ఉరి వేసుకుని చనిపోయాడు. 

08:15 - January 5, 2018

హైదరాబాద్ : 'తప్పు చేశాను..తనలాగా ఎవరూ చేయవద్దు' అంటూ బుల్లితెర యాంకర్ యువతకు సూచించారు. డిసెంబర్ 31న అర్ధరాత్రి మద్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. అనంతరం 'ప్రదీప్' కనిపించకుండా పోయాడు. కౌన్సిలింగ్ తప్పని సరిగా హాజరు కావాల్సిందేనని..చట్టప్రకారం వ్యవహరిస్తామని ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. కానీ ఆయన కౌన్సిలింగ్ హాజరు కాకపోవడంతో రకరకాల పుకార్లు షికారు చేశాయి. వీటన్నింటికీ తెరదించుతూ 'ప్రదీప్' ఓ వీడియో విడుదల చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

'డిసెంబర్ 31న అర్ధరాత్రి ఏం జరిగిందో అందరికీ తెలుసు. పోలిసుల కౌన్సిలింగ్ కు గాని...తర్వాత జరిగే ప్రొసీడింగ్స్‌కు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నా. అయితే ముందుగా ఒప్పందం చేసుకున్న ప్రోగ్రామ్స్, షూటింగ్స్‌తో బిజీగా ఉండడం వల్లే రాలేకపోయాను. ఫోన్ ఆగకుండా మోగుతుండడం వల్ల కొన్ని ముఖ్యమైన ఫోన్లను రిసీవ్ చేసుకోలేకపోయి ఉండొచ్చు. దీనితో అందరికీ ఆందోళన కలిగింది. చట్టప్రకారం ప్రొసీడింగ్స్‌ను ఫాలో అవుతాను. గతేడాది డ్రంకెన్ డ్రైవ్ గురించి చెప్పిన నేను దురదృష్టవశాత్తు అందులోనే దొరికిపోయాను. నేను చేసిన తప్పును ఇంకెవరూ చేయకూడదని కోరుకుంటున్నా'. అని ప్రదీప్ పేర్కొన్నారు. మరి కౌన్సెలింగ్ కు ఎప్పుడు హాజరవుతారు ? ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. 

08:08 - January 5, 2018

పశ్చిమగోదావరి : జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పొట్ట కూటి కోసం ఏపీ రాష్ట్రానికి వచ్చి ఓ కంపెనీలో డ్యూటి చేసుకుంటున్న వారి జీవితాల్లో విషాదం నింపింది. మినీ బస్సు బోల్తా పడడంతో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన భీమవరంలో చోటు చేసుకుంది. అశ్విని రొయ్యల ఫ్యాక్టరీలో పని చేసేందుకు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన యువతులు పని చేస్తున్నారు. గురువారం అర్ధరాత్రి పనులు ముగించుకున్న తరువాత నివాసం ఉంటున్న ప్రాంతానికి వెళ్లేందుకు మినీ బస్సు ఎక్కారు. ఏకంగా 40 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదవశాత్తు అదుపు తప్పడంతో మినీ బస్సు కాల్వలోకి దూసుకెళ్లింది. బస్సు బోల్తా పడడంతో ఇద్దరు మృతి చెందగా 25 మంది మహిళలకు గాయాలయ్యాయి. ఒడిశా రాష్ట్రానికి చెందిన లైజా (18), సుందరి (20)లు మృతి చెందిన వారిలో ఉన్నారు. కంపెనీలో పనిచేస్తున్న వారందరూ 16-17 సంవత్సరాలున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

దేశ రాజధానిలో పొగమంచు...

ఢిల్లీ : దేశ రాజధానిలో భౄరీగా పొగమంచు అలుముకొంటోంది. 62 రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా 20 రైళ్ల రాకపోకల్లో మార్పు చేశారు. 18 రైళ్లను రద్దు చేశారు. 

07:34 - January 5, 2018

ఇసుక తరలింపును అడ్డుకున్నందుకు ఓ వీఆర్ఏను కిరాతకంగా హతమార్చారు. పిట్లం మండలం కంబాపూర్ శివారులోని కాకివాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న వీఆర్ఏ సాయిలు రాత్రి సమయంలో అక్కడకు చేరుకున్నాడు. సాయిలు అక్కడే నిలబడి ఇసుక మాఫియా ముఠాని అడ్డుకున్నాడు. దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సాయిలుపై కోపంతో ఊగిపోయిన మాఫియా అతడిని ట్రాకర్ట్‌తో ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన వీఆర్‌ఏ అక్కడికక్కడే చనిపోయాడు. ఈ అంశంపై టెన్ టివి చర్చలో వీరయ్య (విశ్లేషకులు), సత్యనారాయణగుప్త (టీఆర్ఎస్) పాల్గొని అభిప్రాయం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

కాల్వలోకి దూసుకెళ్లిన మినీ బస్సు...

పశ్చిమగోదావరి : భీమవరంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మినీ బస్సు కాల్వలో బోల్తా పడడంతో ఇద్దరు మృతి చెందగా 25 మంది మహిళలకు గాయాలయ్యాయి. అశ్విని రొయ్యల ఫ్యాక్టరీకి చెందిన మినీ బస్సు అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ఒడిశాకు చెందిన లైజా (18), సుందరి (20)లు మృతి చెందిన వారిలో ఉన్నారు.

బీసీల ప్రగతి ప్రణాళికపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ...

హైదరాబాద్ : బీసీల ప్రగతి ప్రణాళికపై నేడు మంత్రివర్గ ఉప సంఘం భేటీ కానుంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ సమావేశం జరుగనుంది. 

06:47 - January 5, 2018

సంక్రాంతి అంటే గుర్తొచ్చేది గంగిరెద్దులు.. సంక్రాతిని సందడిగా మార్చడంలో వారి పాత్ర కీలకమైంది. ఒక పక్క వారి కులవృత్తి కనపడకుండా పోతుంటే మరోపక్క వారి పట్ల ప్రభుత్వ విధానం సరిగా లేకపోవటం ఆందోళన కలిగిస్తుంది. వారిని భిక్షగాళ్ళుగా పరిగణిస్తూ వారిని అరెస్టు చేస్తూ పోలీసులు అనుకరిస్తున్న వైఖరిపై ప్రస్తుతం వారు ఆందోళన చేస్తున్నారు. ఈ విషయాలపై టెన్ టివి జనపథంలో గంగిరెద్దు సంఘం నాయకులు కోటయ్య, అశోక్‌, రజనీలు విశ్లేషించారు. వారి బాధలు..గాథలు..పడుతున్న బాధలు తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

06:41 - January 5, 2018

అనంతపురం : ప్రపంచీకరణ ప్రభావం భారత సంస్కృతిపై తీవ్ర ప్రభావం చూపుతోందని పలువురు ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు. పాశ్యాత్య సంస్కృతి భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై దాడి చేస్తోందని ఆవేదన వెలిబుచ్చారు. పాశ్యత్య విషసంస్కృతి వ్యామోహంలో యువత పెడదారి పడుతోందని, ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రజా నాట్యమండలి వంటి సంఘాలు కృషి చేయాలని కోరారు. ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో అనంతపురంలో మూడు రోజుల పాటు జరిగిన బళ్లారి రాఘవ ప్రజా సాంస్కృతిక ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. వివిధ అంశాలపై ప్రజానాట్య మండలి కళాకారుల ప్రదర్శనలు అలరించాయి. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వేషధారణలో ఓ బాలుడి ప్రదర్శన అందర్నీ మంత్రముగ్ధుల్ని చేసింది.

బళ్లారి రాఘవ ప్రజా సాంస్కృతిక ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి హాజరైన టాలీవుడ్‌ డైరెక్టర్‌ తమ్మారెడ్డి భరద్వాజ..సామాజిక విలువలు పతనమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజానాట్య మండలి మళ్లీ క్రియాశీలకంగా మారాల్సిన అవసరం ఉందన్నారు. సాంస్కృతిక రంగం - నేటి సవాళ్లు అన్న అంశంపై జరిగిన సదస్సుకు హాజరైన తమ్మారెడ్డి భరద్వాజ.. ప్రపంచీకరణ తర్వాత సంస్కృతిలో వేగంగా చోటు చేసుకుంటున్న మార్పులను ప్రస్తావించారు. యువతను పెడదోవ పట్టించేలా ఉన్న విష సంస్కృతిని తిప్పికొట్టేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించాల్సిన అవరసం ఉందని సదస్సులో ప్రసంగించిన వక్తలు సూచించారు. 

06:38 - January 5, 2018

విజయవాడ : హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లాలో కోడిపందేల నిర్వహణ సందిగ్ధంగా మారింది. ఇప్పటికే ఈ విషయమై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో తాజా పరిణామాలు ఇటు ప్రజాప్రతినిధులను, అటు అధికారులను కూడా సంకటంలో పడేశాయి. ఈసారి కోడిపందేలు జరుగుతాయా? హైకోర్టు కోర్టు ఆదేశాలను అధికారులు ఏవిధంగా అమలు చేస్తారు? అన్న అంశాలు ఏపీలో చర్చనీయాంశంగా మారాయి. కోడిపందేలు జరిగే పది రోజుల ముందు నుంచీ ఈ విషయంలో స్పష్టత రాకుండా ఉండటం, చివరి నిముషంలో ఏదోవిధంగా నిర్వహించడం పరిపాటిగా మారింది. అయితే ఈసారి హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యల నేపథ్యంలో ఇటు రెవెన్యూ, అటు పోలీసు అధికారులు వీటిని ఏవిధంగా అడ్డుకుంటారన్న విషయం ఆసక్తికరంగా మారింది.

ఇప్పటికే పోలీసులు కోడిపందేలు నిర్వహిస్తున్న వారిపై కేసులు నమోదు చేయడం, కోళ్లను స్వాధీనం చేసుకోవడం విస్తృతంగా చేస్తున్నారు. ఇటువంటి నివేదికలను కూడా హైకోర్టు తోసిపుచ్చిన నేపథ్యంలో ఈసారి ఏవిధంగా ముందుకు వెళతారనేదానిపై సందిగ్ధత నెలకొంది. గడిచిన అయిదేళ్లుగా కోడిపందేల నిర్వహణ పశ్చిమగోదావరి జిల్లాలో కొంతమంది నాయకులకు ముఖ్యంగా ఎమ్మెల్యేలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. కోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోకుండా గతంలో కొంతమంది ఎమ్మెల్యేలు పందేలను ప్రారంభించి, పాల్గొన్న సందర్భాలున్నాయి.

అయితే ఈసారి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పందేలకు దూరంగా ఉండాలని ప్రజలు, పార్టీ నేతలకు సూచించారు. అయితే కొందరు పందెం రాయుళ్లు తమ ప్రాంతంలో నిర్వహించే పందేల వద్దకు పోలీసులు రాకుండా చూడాలని ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. గతం ఏడాది పండుగ మూడు రోజులు ఈ ఒత్తిడి పనిచేసింది. ఈసారి హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో నియోజకవర్గ స్థాయి నాయకులు తమ వ్యూహాలు మార్చుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఇప్పటికే కొన్ని చోట్ల బరుల ఏర్పాటు జరిగింది. కోడిని సంవత్సరం మొత్తం మేపడం ద్వారా దాని సామర్థ్యాన్ని బట్టి రూ. 50 వేల నుంచి రూ. 2 లక్షల వరకూ అమ్మకాలు, కొనుగోళ్లు జరుపుతున్నారు. ఇదేక్రమంలో ఈసారి పండుగకు కూడా భారీగా కోళ్ల కొనుగోళ్లు పూర్తయ్యాయి. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో భీమవరం ప్రాంతంలో ఇప్పటికే ఏర్పాటు చేసిన బరులను వేరు ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు మొదలయ్యాయని సమాచారం. ఎప్పుడూ వార్తల్లో నిలిచే ప్రాంతాలను పక్కనపెట్టి ప్రత్యామ్నాయ ప్రాంతాల్లో పందేల నిర్వహణకు రంగం సిద్ధమవుతోందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి ఆయా ప్రాంతాల్లో ఎటువంటి సందడి లేకపోయినా చిన్నచిన్న పందేలు ఇప్పటికే ప్రారంభించారు. అయితే వీటి వివరాలు ప్రాంతాలు ఎక్కడా బయటకు రాకుండా జాగ్రత్తపడుతున్నారు. ఈసారి కూడా జిల్లాల్లో భారీగా పందేలు నిర్వహించే అవకాశం ఉందని భావిస్తున్నారు. పందేల ముసుగులో ఇతర జూద కార్యకలాపాలు భారీగా జరిగే చాన్స్‌ లేకపోలేదు. వీటిని అడ్డుకోవడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు. కోర్టు జోక్యం నేపథ్యంలో ఇప్పుడు పోలీసులు ఏవిధంగా ఎదుర్కొంటారన్న విషయం ఆసక్తిగా మారింది.

కోడిపందేల విషయంలో రాజీపడేది లేదని పోలీసులు, రెవెన్యూ అధికారులు తెగేసి చెబుతున్నారు. గ్రామాల్లో రెవెన్యూ ఉద్యోగులను బాధ్యులను చేస్తామంటూ హెచ్చరికలు చేశారు. తాజాగా పోలీసు, రెవెన్యూ అధికార యంత్రాంగం కలిసి గ్రామాల్లో ఎక్కడ కోడిపందేలు, జూదం ఆటలు జరగకుండా అరికట్టే దిశగా వ్యూహంతో నడుస్తున్నారు. ఆయా పోలీసు స్టేషన్లు, తహశీల్దార్‌ కార్యాలయాల పరిధిలో గ త ఏడాది ఎక్కడెక్కడ కోడిపందేలు జరిగాయన్న వివరాలను సేకరించారు. ఈ పందేల నిర్వాహకులపై బైండోవర్‌ కేసులు నమోదుచేసి రూ. లక్ష పూచీకత్తుపై విడుదల చేస్తున్నారు. ఈసారి ఎటువంటి పరిస్థితుల్లో పందేలు నిర్వహించరాదని హెచ్చరికలు చేస్తున్నారు.

గతంలో పందేలు నిర్వహించిన స్థల యాజమానులకు ఈసారి ఆ స్థలాలు ఇస్తే చట్టపరమైన అన్నిరకాల చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కోళ్లకు కత్తులు కట్టే వ్యక్తులపైన బైండోవర్‌ కేసులు నమోదవుతున్నాయి. ఈ పరిణామాలతో అందరూ కలవరపడుతున్నారు. ప్రధానంగా స్థల యాజమానులకు నోటీసులు అందడంతో ఇదెక్కడి తలనొప్పి అంటూ ఈసారి ఇచ్చేదిలేదని తేల్చి చెబుతున్నారు. దీంతో కొత్త స్థలాలు కోసం అన్వేషిద్దామన్నా... ఈ విషయం తెలిసి ఆయా స్థలాల యాజమానులు వెనుకంజ వేస్తున్నారని సమాచారం. కోడిపందేలు, పేకాట ఆడే వ్యక్తులతో పాటు గుండాట, మూడుముక్కలాట వంటి నిర్వాహకులపైన నిఘా ఉంచారు. జిల్లా మొత్తమ్మీద ఇప్పటివరకు 500కు పైగా బైండోవర్‌ కేసులు నమోదు చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. 

06:35 - January 5, 2018

హైదరాబాద్ : ఏపీలో కోడిపందేల నిర్వహణపై హైకోర్టు సీరియస్‌ అయ్యింది. ఈసారి పందేలు జరగడానికి వీల్లేదని ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పింది. సంక్రాంతి సందర్భంగా ఏపీలో కోడి పందేలు జరగకుండా చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. పందేలు జరగడానికి వీల్లేదని ఆంధప్రదేశ్‌ ప్రభుత్వాన్నిన్యాయస్థానం ఆదేశించింది.


కోడి పందేల విషయంలో గత ఏడాది ఇచ్చిన ఆదేశాలను అమలు చేయని ఏపీ ప్రభుత్వ తీరుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. గత సంక్రాంతి సందర్భంగా జరిగిన ఉల్లంఘనలపై ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక అందచేసింది. 43 మంది తహశీల్దార్లు, 49 మంది పోలీసు అధికారులకు సంజాయిషీ నోటీసులు జారీ చేసినట్టు నివేదించింది. అయితే ఈ నోటీసుల తర్వాత ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఈనెల 22వ తేదీలోగా తెలపాలని ఏపీ ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. కోడి పందేలు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించాయని, ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసుకుని హాజరవుతున్న విషయాన్ని న్యాయస్థానం ప్రస్తావించింది. ఈ ఏడాది కోడిపందేలు జరగకుండా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం అడ్వకేట్‌ జనరల్‌ హామీ ఇచ్చారు. అడ్వకేట్‌ జనరల్‌ హామీని నమోదు చేసిన హైకోర్టు.. కోడి పందాలు జరగడానికి వీల్లేదని, నిర్వహించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

సంక్రాంతి సందర్భంగా ప్రశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం ప్రాంతంలో ఎక్కువగా కోడి పందేలు నిర్వహిస్తారు. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజాప్రతినిధులు హాజరవుతుంటారు. వందల కోట్ల రూపాయాలు చేతులు మారతాయి. రెండేళ్లుగా ఈ విషయంలో హైకోర్టులో కేసులు దాఖలయ్యాయి. కోడిపందేలను నిర్వహించకూడదనే స్పష్టమైన ఆదేశాలు ఉన్న ప్పటీకి గత ఏడాది కొందరు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కోళ్లకు కత్తులుకట్టి, హింసించకుండా కత్తులు కట్టకుండా జీవులను హింసించకుండా ముందుకు వెళ్లవచ్చన్న వాదనను తెరమీదకు తీసుకొచ్చారు. దీంతో పందెం రాయుళ్లు యథేచ్ఛగా కొడిపందేలు నిర్వహించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను కొంతమంది పక్కదోవ పట్టించారన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తాజాగా హైకోర్టు దీనిపై ఘాటుగా స్పందించింది. డీజీపీ, ప్రధాన కార్యదర్శులను బాధ్యులను చేసింది.

06:32 - January 5, 2018

కడప : జిల్లా బద్వేలులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పాలిటెక్నిక్‌ కళాశాల సమీపంలో ఉన్న గుడిసెలో విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. దాదాపు వెయ్యి గుడిసెలు దగ్ధమయ్యాయి. కళాశాల సమీపంలో గుడిసెలు వేసుకుని దాదాపు 3వేల కుటుంబాలు జీవిస్తున్నాయి. మంటలార్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. తహశీల్దార్‌ మాధవకృష్ణారెడ్డి, సీఐ రెడ్డప్ప పరిస్థితి సమీక్షించారు. ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. 

06:31 - January 5, 2018

విశాఖపట్టణం : కాపాడాల్సిన రక్షకభటుడే కాటేసేందుకు యత్నించాడు. కామంతో కళ్లుమూసుకుపోయి న్యాయం కోసం వచ్చిన యువతిని లొంగదీసుకునేందుకు యత్నించాడు. కానీ.. కథ అడ్డం తిరిగింది. కీచక సీఐ భాగోతాన్ని బాధితురాలు ఆధారాలతో బయటపెట్టడంతో అయ్యగారిపై సస్పెన్షన్‌ వేటు పడింది. న్యాయం కోసం మహిళలు ఠాణాకు వస్తే కొందరు పోలీసులు దానిని అవకాశంగా మార్చుకుంటున్నారు. సమస్యను పరిష్కరించాల్సింది పోయి వారి పాలిట సమస్యగా మారుతున్నారు. బాధ్యాతాయుతమైన వృత్తిలో ఉంటూనే లెక్కతప్పుతున్నారు. గుక్కతిప్పుకోకుండా లెక్చర్లు దంచుతున్న సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు.

వారణాసికి చెందిన యువకుడు విశాఖపట్నంలోని ఓ హోటల్లో పనిచేస్తున్నాడు. మలేషియాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న యువతితో సోషల్ మీడియాలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అయితే ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో..యువకుడు ముఖం చాటేశాడు. ఆ తర్వాత యువతి ప్రియుడి ఆచూకీ కనిపెట్టాలంటూ విశాఖ త్రీటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పంజాబ్‌లో ఉన్న అతన్ని పట్టుకొచ్చి జైలుకు తరలించారు.

అయితే ప్రియుడిని జైలుకు పంపొద్దని యువతి సీఐ బెండి వెంకటరావును కోరింది. దీన్ని అవకాశంగా మలుచుకున్న సీఐ యువతిని లైంగికంగా వేధించాడు. డిసెంబర్ 28న ఆమె ఉంటున్న హోటల్ గదికి వెళ్ళి అత్యాచారానికి యత్నించాడు. బాధితురాలు సీఐ ప్రవర్తనను వీడియో తీసి, నగర కమీషనర్‌కు యోగానంద్‌కు ఫిర్యాదు చేసింది. కమీషనర్ వెంటనే విచారణకు ఆదేశించారు. వీడియో సాక్ష్యాల ఆధారంగా సీఐ బెండి వెంకటరావును సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

06:26 - January 5, 2018

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేయిస్తున్న సర్వేలు అధికార పార్టీ నేతలను కలవరానికి గురి చేస్తున్నాయి. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి అంతా బాగానే ఉందన్న సంకేతాలు ఇస్తున్న ముఖ్యమంత్రి..నియోజకవర్గల్లో టీఆర్‌ఎస్‌ పరిస్థితి పై మాత్రం స్పష్టత ఇవ్వడంలేదు. దీంతో నేతల్లో ఆందోళన పెరుగుతోంది. ఏడాది క్రితం సర్వేలను నియోజకవర్గాల వారీగా వెల్లడించిన సిఎం కేసీఆర్..తాజా సర్వేలను బహిర్గతం చేయకపోవడంపై నేతల్లో అనుమానాలు పెరుగుతున్నాయి. ప్రభుత్వ పాలన, పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేయిస్తున్న సర్వేలు టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులను అయోమయానికి గురిచేస్తున్నాయి. సర్వే నివేదికలతో నేతలను అప్రమత్తం చేస్తూ ప్రజల్లో ఉన్నఅసంతృప్తిని చల్లార్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా సూచనలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వ నిర్ణయాలు ఎలా ఉన్నా పార్టీ పరంగా, నియోజకవర్గాల వారీగా వస్తున్న ఫలితాలు మాత్రం గులాబీ నేతలను కలవరానికి గురి చేస్తున్నాయి.

ఇటీవలే ఓ సర్వే పూర్తయిందన్న సమాచారం నేతలకు అందడంతో వివరాలను తెలుసుకునే ప్రపయత్నిస్తున్నారు. పార్టీకి సానుకూల పవనాలు కనిపిస్తున్నా.... ప్రస్తుత శాసనసభ్యులపై మాత్రం వ్యతిరేకత పెరుగుతోందన్న అభిప్రాయం తాజా సర్వేలో తేలిందన్న సమాచారం టీఆర్‌ఎస్‌ నేతలను ఆందోళనకు గురి చేస్తోంది. తనను కలిసిన ఎమ్మెల్యేలతో పరిస్థితులు బాగానే ఉన్నాయంటూ... ధీమా నింపే ప్రయత్నాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేస్తున్నప్పటికీ వీరిలో అనుమానాలు మాత్రం తగ్గడంలేదు. వచ్చే ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యేల్లో 30 శాతం మందికి టికెట్ల దక్కే అవకాశం లేదన్న ప్రచారం పార్టీలో ఊపందుకుంది. ఈ పరిస్థితుల్లో సర్వే వివరాలు వెల్లడించకుండా అందరినీ సంతృప్తి పరిచే పనిలో ముఖ్యమంత్రి ఉన్నారని పార్టీ నేతలు చెబుతున్నారు.

శాసనసభ్యులతోపాటు ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో సానుకూలత ఉంటే.. గతంలో మాదిరిగా సర్వే ఫలితాలను బహిర్గతం చేసి ఉండేవారన్న అభిప్రాయం వ్యక్తం మవుతోంది. కేసిఆర్ అనుకున్న విధంగా సర్వే ఫలితాలు లేకపోవడంతోనే రహస్యంగా ఉంచుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. మొత్తానికి కేసీఆర్‌ సర్వేలు అటు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతోపాటు ఇటు మంత్రులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. 

గుంటూరులో విజ్ఞాన్ మహోత్సవ్...

గుంటూరు : వడ్లమూడిలోని విజ్ఞాన్‌ యూనివర్సిటీలో విజ్ఞాన్‌ మహోత్సవ్‌ శుక్రవారం నుండి జరుగనుంది. రెండు రోజుల పాటు యువజనోత్సవాలు నిర్వహిస్తున్నట్టు వీసీ డాక్టర్‌ ఎంవైఎస్‌ ప్రసాద్‌ వెల్లడించారు. 

బిచ్చగాళ్లపై ఆంక్షలు కంటిన్యూ...

హైదరాబాద్‌ : నగరంలో మరో రెండు నెలల పాటు బిచ్చగాళ్లపై ఆంక్షలు విధిస్తున్నట్లు సీపీ వీవీ శ్రీనివాస్‌రావు వెల్లడించారు. రోడ్డుపై ప్రయాణికులకు ఇబ్బందుల పాలు చేస్తున్నారని, అంతేగాకుండా చిన్నారులను కూడా ఇందులో దింపుతున్నారని ఆయన పేర్కొన్నారు. 

పది నుండి కొత్త పొదుపు బాండ్లు..

ఢిల్లీ : భారత్ లో నివసించే వ్యక్తులు..జాయింట్ హోల్డింగ్ లు, హిందూ అవిభాజ్య కుటుంబాల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త పొదుపు బాండ్లు ప్రవేశ పెట్టింది. 

'లాలూ మనుషుల నుండి ఫోన్లు వచ్చాయి'..

ఢిల్లీ : లాలూ ప్రసాద్ యాదవ్ మనుషుల నుండి తనకు ఫోన్లు వచ్చినట్లు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జడ్జి శివపాల్ సింగ్ వెల్లడించారు. దాణా కుంభకోణం కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ శిక్ష ఖరారును సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం శనివారానికి వాయిదా వేసింది. 

కనిగిరిలో కుటుంబం ఆత్మహత్య...

ప్రకాశం : కనిగిరిలో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. పిల్లలు విష్ణు, జాహ్నవిలకు విషం ఇచ్చి ఉరేసుకుని దంపతులు రాజేష్ రెడ్డి, సౌమ్యలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. 

గజల్ కేసు..నేడు విచారణ..

హైదరాబాద్ : గజల్‌ శ్రీనివాస్‌కు కస్టడీ కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్‌పై నాంపల్లి కోర్టుతోసిపుచ్చింది. నాలుగు రోజుల కస్టడీ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. నిందితునిపై 354 సెక్షన్‌ వర్తించదన్న గజల్‌ తరపు న్యాయవాది వాదనను ఏకీభవిస్తు ఈ తీర్పు ప్రకటించింది. గజల్‌ బెయిల్‌ పిటిషన్‌పై శనివారం మరోసారి విచారించనుందని నాంపల్లి కోర్టు న్యాయవాది అమర్‌ తెలిపారు. 

Don't Miss