Activities calendar

06 January 2018

22:14 - January 6, 2018
22:13 - January 6, 2018

నిజామాబాద్ : కేసీఆర్ పాలన తెలంగాణ రైతులకు శాపంగా మారిందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలో రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పిన కేసీఆర్‌...  అధికారంలోకి రాగానే రుణమాఫీని నాలుగు విడతలు చేశారన్నారు. దీనిపై అసెంబ్లీలో నిలదీసినా ప్రభుత్వం స్పందించలేదని మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం ఆలూరులో కాంగ్రెస్‌ ఏర్పాటు చేసిన ఎర్రజొన్న, పసుపు రైతుల సదస్సులో ఉత్తమ్‌ పాల్గొన్నారు. నాలుగేళ్ల కేసీఆర్‌ పాలనలో 3వేల 500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని.. దీనికి టీఆర్‌ఎస్‌ సర్కార్‌ బాధ్యత వహించాలన్నారు. 

 

22:10 - January 6, 2018

ఢిల్లీ : అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, ఇతర కమిటీలను కొనసాగిస్తూ ఏఐసీసీ కీలక ప్రకటన చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు కొనసాగుతారని వెల్లడించింది. ఏఐసీసీ ప్రకటనతో ఆశావహుల్లో నిరుత్సాహం నెలకొంది. రాహుల్ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత చాలా వరకు కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులు చోటుచేసుకుంటాయని సీనియర్లు భావించారు. అంతే కాదు కేంద్రంలో అధికారంలో లేనందున రాష్ట్రాల్లోనూ మార్పులు చేర్పులు ఉంటాయని భావించారు. అయితే ఈ విషయంపై రాహుల్ గాంధీ క్లారిటీ ఇచ్చేశారు. అన్నిరాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, కమిటీలు కొనసాగించాలని రాహుల్ నిర్ణయించారు. 

 

22:08 - January 6, 2018

కృష్ణా : విజయవాడ దుర్గగుడిలో తాంత్రిక పూజల వివాదంపై విచారణ చేపట్టిన నిజ నిర్దారణ కమిటీ.. సీఎం చంద్రబాబుకు నివేదిక సమర్పించింది. అలాగే నగర సీపీ గౌతం సవాంగ్‌ కూడా నివేదిక సమర్పించారు. అయితే... ఎలాంటి తాంత్రిక పూజలు జరగలేదని నివేదికలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే... నివేదికలను పరిశీలించిన అనంతరం చంద్రబాబు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

 

22:06 - January 6, 2018

హైదరాబాద్ : ఫిబ్రవరి 15లోగా మిడ్‌ మానేరు పనులన్నీ పూర్తి చేయాలని ఇరిగేషన్‌ శాఖ మంత్రి హరీష్‌రావు అధికారులను ఆదేశించారు. జలసౌధలో అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన.. నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లింపు అంశంపై చర్చించారు. ఇక నష్టపరిహారం కోసం తప్పుడు అఫిడవిట్లు ఇచ్చే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హరీష్‌రావు  హెచ్చరించారు. 

మిడ్‌మానేరు ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి హరీష్‌రావు ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పురోగతి, పెన్‌గంగ నదిపై నిర్మిస్తున్న చనఖా - కొరాటా ఆనకట్ట పనులపై జ‌ల‌సౌధ‌లో అధికారులతో హరీశ్‌రావు సమీక్ష నిర్వహించారు. 

మిడ్ మానేరు స్పీల్ వే పనుల పురోగతి గురించి మంత్రి అడిగి తెలుసుకున్నారు. మొత్తం 25 గేట్ల ఫ్యాబ్రికేషన్ పనులు, బిగింపు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని హరీష్‌రావు ఆదేశించారు. ప్రాజెక్ట్‌ 24 గేట్ల ఫ్యాబ్రికేషన్‌ పూర్తయినట్లు.. మరో వారంలో మిగతా పనులు పూర్తి కానున్నట్లు అధికారులు మంత్రికి తెలిపారు. ఇక ఈ సమావేశంలో ప్రధానంగా భూనిర్వాసితుల నష్టపరిహారంపై చర్చ జరిగింది. నిర్వాసితులకు నష్టపరిహారం కింద 40 కోట్లు.. రీసెటిల్‌మెంట్‌ కింద మరో 25 కోట్లు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు. ఇక సిరిసిల్ల రాజన్న జిల్లాలోని ముంపు ప్రాంతంలో 3 వేలకుపైగా ఇళ్లు నిర్మించినట్లు కలెక్టర్‌ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. మరో 1500 ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నట్లు తెలిపారు. నిర్వాసితులకు పరిహారం చెల్లింపులో అవకతవకలు జరగకుండా చూడాలని హరీష్‌రావు అధికారులకు సూచించారు.  పునరావాసం పనుల్లో జాప్యం, అలక్ష్యం చేస్తే సహించేది లేదన్నారు.  మిడ్ మానేరు పరిధిలో ముంపునకు గురయ్యే చింతల్ ఠాణా, కోదురుపాక, శాబాసుపల్లి, కొడిముంజ, చీర్లవంచ, అనుపురం, ఆరేపల్లి, సంకేపల్లి, రుద్రవరం, వరదవెల్లి  గ్రామాల నిర్వాసితులకు అందిన పరిహారం గురించి మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఇంకా పెండింగ్ లో ఉన్న చెల్లింపులను తక్షణమే పూర్తి చేయాలన్నారు. భూపరిహారం కోసం కొందరు తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పిస్తున్నారని... తప్పుడు అఫిడవిట్లు జారీ చేస్తున్నవారిపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. 

ఇక నిర్వాసితుల ఇళ్లకు ఇందిరా ఆవాస్‌ యోజన పథకం కింద నిధులు మంజూరు చేయాలని హౌసింగ్‌ ఎండీని హరీష్‌రావు ఆదేశించారు. ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని... ఫిబ్రవరిలో 15లోగా మిడ్‌ మానేరు పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను హరీష్‌రావు ఆదేశించారు. 

22:03 - January 6, 2018

కృష్ణా : విజయవాడ సూరంపల్లి పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం జరిగింది. జీఎస్ ఎల్లాయిస్‌ ఫ్యాక్టరీలో ఇనుము కరిగించే బాయిలర్‌ పేలడంతో భారీ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

22:00 - January 6, 2018

బీహార్ : పశు దాణా కుంభకోణం కేసులో రాంచి సిబిఐ ప్రత్యేక కోర్టు దోషులకు శిక్షను ఖరారు చేసింది. ఆర్‌జెడి చీఫ్‌ లాలుప్రసాద్‌ యాదవ్‌తో సహా ఏడుగురికి మూడున్నరేళ్ల జైలుశిక్షతో పాటు 5 లక్షల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. కోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించేందుకు లాలు కుటుంబం సిద్ధమైంది. శిక్షపై స్పందించిన లాలు...చావనైన చస్తాను కానీ....బిజెపి ముందు తల వంచే ప్రసక్తే లేదని ట్విట్టర్‌ ద్వారా స్పష్టం చేశారు. 

పశు దాణా స్కాం కేసులో రాంచిలోని సిబిఐ ప్రత్యేక కోర్టు దోషులకు శిక్షను  ఖరారు చేసింది. బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడి చీఫ్‌ లాలు ప్రసాద్‌ యాదవ్‌తో సహా మరో ఏడుగురికి మూడున్నరేళ్ల జైలుశిక్షతో పాటు 5 లక్షల జరిమానా విధించింది. శిక్ష పడ్డవారిలో లాలుతో పాటు  ఫూల్ చంద్, మహేశ్ ప్రసాద్, బకె జులియస్, సునీల్ కుమార్, సుశీల్ కుమార్, సుధీర్ కుమార్, రాజారామ్‌కు ఉన్నారు.

1990-94 మధ్య బీహార్ సీఎంగా లాలూ ఉన్నప్పుడు... దేవ్‌ఘర్‌ ట్రెజరీ నుంచి 89.27 లక్షలు తప్పుడు వివరాలతో కాజేశారన్న  అభియోగం నిర్ధారణ కావడంతో కోర్టు తీర్పు వెలువరించింది. లాలుతో పాటు 16 మంది దోషులంతా బిర్సాముండా జైలులో ఒకచోట కూర్చుని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తీర్పు విన్నారు.

కోర్టు తీర్పుపై స్పందించిన లాలు తనయులు  న్యాయవ్యవస్థపై తమకు నమ్మకముందన్నారు. జైలు శిక్షకు సంబంధించిన ఉత్తర్వులను చదివిన తర్వాత బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. 21 ఏళ్ల క్రితం నాటి దాణా స్కాం కేసులో లాలు ప్రసాద్‌ యాదవ్‌తో పాటు 15 మందిని దోషులుగా ఖరారు చేస్తూ గత ఏడాది డిసెంబర్‌ 23న సిబిఐ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. జనవరి 3న శిక్ష ఖరారు చేయాల్సి ఉండగా న్యాయవాది మృతితో ఒకరోజు ఆ తర్వాత రెండు రోజులు తీర్పు వాయిదా పడింది.  ఆరోగ్యం, వయసు రీత్యా తనకు శిక్షను తగ్గించాలని న్యాయమూర్తిని కోరుతూ లాలు శుక్రవారం పిటిషన్‌ కూడా వేశారు.

దేవఘర్‌ ట్రెజరీ కేసుకు సంబంధించి సిబిఐ 38 మందిపై అభియోగ పత్రాలు నమోదు చేసింది. వీరిలో 11 మంది మృతి చెందగా...ఇద్దరు తమ నేరాన్ని అంగీకరించడంతో వారికి శిక్షలు పడ్డాయి. ముగ్గురు అప్రూవర్‌గా మారారు. మాజీ సిఎం జగన్నాథ్‌ మిశ్రాతో పాటు ఆరుగురిని కోర్టు నిర్దోషులుగా తేల్చింది. దాణా కొనుగోళ్లలో 950 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు 1996లో వెలుగుచూసింది. దాణా స్కాంపై మొత్తం ఐదు కేసులు నమోదయ్యాయి.  చియబస ట్రెజరీ నుంచి 37.5 కోట్లు నగదు అక్రమంగా ఉపసంహరించిన కేసులో లాలుకు సీబీఐ కోర్టు అయిదేళ్ల జైలుశిక్షతో పాటు 25 లక్షల జరిమానా విధించింది. ఈ తీర్పుతో కొన్నాళ్లు జైళ్లో గడిపిన లాలూకు - 2013లో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బయటకు వచ్చారు. 

21:54 - January 6, 2018

హేతువాది, సైన్స్ ఫర్ సొసైటీ వ్యవస్థాపకులు బాబు గోగినేనితో 10టివి ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించింది. మంత్ర, తంత్రాలతో అతీత శక్తులు వస్తాయా ? అనే అంశంపై ఆయన మాట్లాడారు. మనిషి మానవత్వాన్ని మూఢనమ్మకాలు హరించివేస్తున్నాయన్నారు. మంత్రాలు వస్తాయని చెప్పడమే తప్పు అని తెలిపారు. గుప్త నిధుల కోసం నర బలి చేస్తున్నారని పేర్కొన్నారు. పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. ఆ వివరాలను వీడియలో చూద్దాం..,.

 

21:46 - January 6, 2018

సిరిసిల్ల : అఖిలపక్షం నేతల పాదయాత్ర తంగళ్లపల్లి మండలం జిల్లెల్లకు చేరింది. నేరేళ్ల బాధితులకు న్యాయం చేయాలంటూ సిద్ధిపేట నుంచి పాదయాత్ర ప్రారంభం అయింది. నేరేళ్ల బాధితులకు భరోసా కల్పించేందుకే పాదయాత్ర చేస్తున్నామని నేతలు చెప్పారు. 

 

21:40 - January 6, 2018

తూర్పుగోదావరి : కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. రూ.15 కోట్ల వ్యయంతో నిర్మించిన రక్షిత మంచినీటి సరఫరా పథకాన్ని మంత్రి ప్రారంభించారు. 2019 నాటికి రాష్ట్రంలో తాగునీటి సమస్య లేకుండా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. 

21:34 - January 6, 2018

గుంటూరు : ట్రిపుల్‌ తలాఖ్‌ బిల్లు.. ఇపుడు ఏపీ ప్రభుత్వానికి  అనుకోకుండా కలిసొచ్చిన అవకాశంగా మారింది. ఇంతకాలం కేంద్రం సహాయ నిరాకరణపై అసంతృప్తిగా ఉన్న చంద్రబాబు.. ఇపుడు తన చాణక్యనీతికి పదును పెట్టారు. మోదీ ప్రభుత్వ ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు గట్టెక్కాలంటే.. టీడీపీ సపోర్ట్‌ తప్పనిసరి. ఇదే అవకాశంగా రాష్ట్రానికి మరింత సాయం చేయాలన్న డిమాండ్‌ను ముందుకు తెస్తోంది టీడీపీ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో చంద్రబాబు చాణక్యమా... మోదీ వ్యూహమా.. ఏది సక్సెస్‌ అవుతుంది..? ఇపుడు ఇదే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతోంది. 
వ్యూహానికి పదును పెట్టిన చంద్రబాబు 
పోలవరం నిర్మాణంలో అడ్డంకులు.. విభజన చట్టం హామీలను నెరవేర్చుకోడానికి ఏపీ ప్రభుత్వానికి ఇపుడు సమయం కలిసివచ్చింది. మిత్రపక్షం బీజేపీని దారికి తెచ్చుకునేందుకు చంద్రబాబు చాణక్యవ్యూహానికి పదును పెట్టారు. మోదీ ప్రభుత్వ తీరుతో కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న టీడీపీ.. ఇపుడు కమలంపార్టీని ఇరుకున పెట్టేందుకు రెడీ అయింది. ముఖ్యంగా పోలవరం అంశంలో కాంట్రాక్టర్ల మార్పు, నిధుల కేటాయింపులో కేంద్రం వైఖరిపై సీఎం చంద్రబాబు గుర్రుగా ఉన్నారు. కాని విషయాన్ని దిగమింగుతూ సమయంకోసం ఎదురు చూస్తున్నారు. అనుకోకుండా ఇపుడు ట్రిపుల్‌ తకాఖ్ అంశం కలిసి వచ్చింది. పార్లమెంట్‌లో ట్రిపుల్‌తలాఖ్ బిల్లుపై విపక్షాలు మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తున్నాయి. లోక్‌సభలో మెజారిటీ ఉన్న కారణంగా గట్టెక్కినా.. రాజ్యసభలో మాత్రం బిల్లుకు చుక్కెదురవుతోంది. ఇక్కడే బీజేపీకి మిత్రపక్షాల అసరం అనివార్యమయింది. దీన్ని అవకాశంగా తీసుకుని రాష్ట్రానికి మరిన్ని ప్రయోజనాలు రాబట్టాలని సీఎం చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. రాజ్యసభలో ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుకు అనుకూలంగా వ్యవహరించాలంటే.. రాష్ట్రానికి కేంద్రం నుంచి ఇతోధిక సాయం కావాలనే మెలిక పెడుతున్నట్టు సమాచారం. 
రాజ్య సభలో స్వరం మార్చిన టీడీపీ ఎంపీలు
ట్రిపుల్‌ తలాఖ్‌పై టీడీపీ వైఖరి స్పష్టమవుతోంది. రాజ్యసభలో చర్చ సందర్భంగా టీడీపీ ఎంపీలు భిన్నస్వరం వినిపించారు. తలాఖ్‌ అంశాన్ని స్టాండింగ్‌ కమిటీకి పంపాలని పలువురు టీడీపీ ఎంపీలు సూచించారు. 
మోదీ వ్యూహమా..! చంద్రబాబు చణక్యమా..! 
ఇంతకాలం కేంద్రసాయం పొందడానికి మోదీ అండ్‌ టీమ్‌ను బ్రతిమాలుకున్న చంద్రబాబు ప్రభుత్వం.. ఇపుడు ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుకు మద్దతు అవసరాన్ని వాడుకుని కోర్కెల చిట్టాను మోదీ ముందు పెడుతోంది. చూడాలి మోదీ వ్యూహాల ముందు చంద్రబాబు చాణక్యం ఏమేరకు సక్సెస్‌ అవుతుందో అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 

 

21:23 - January 6, 2018

తూర్పుగోదావరి : కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలో టెన్‌ టీవీ క్యాలెండర్‌ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. టీడీపీ సీనియర్‌ నేత, వైస్‌ ఎంపీపీ కర్రి గోపాల కృష్ణ కలిసి క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టెన్‌ టీవీ యాజమాన్యానికి న్యూఇయర్‌, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. 

 

21:21 - January 6, 2018

విశాఖ : లాభాల్లో ఉన్న డీసీఐను ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమైన చర్య అని సీఐటీయూ ఆల్‌ ఇండియా అధ్యక్షురాలు హేమలత అన్నారు. ఈ మేరకు డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ను ప్రైవేటీకరించే ప్రయత్నాన్ని వెంటనే విరమించుకోవాలని డిమాండ్‌ చేస్తూ...విశాఖలో సీఐటీయూ, అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మహాసభ నిర్వహించారు. రాష్ట్రంలో ఉన్న కేంద్రప్రభుత్వ పరిశ్రమ తరలిపోతే రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు సీహెచ్‌ నర్సింగరావు. ప్రైవేటీకరణను ప్రభుత్వం విరమించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 

 

గోదావరిఖని జీవీకే ఇంక్లైన్‌ 1లో విషవాయువులు

పెద్దపల్లి : జిల్లాలోని గోదావరిఖని జీవీకే ఇంక్లైన్‌ 1లోని 33వ డీప్‌లో విషవాయువులు వెలువడుతున్నాయి. దీంతో అప్రమత్తమైన గని అధికారులు..కార్మికులను బయటకు పంపుతున్నారు. ఈ ఘటనలో పలువురు కార్మికులు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. 

21:18 - January 6, 2018

పెద్దపల్లి : జిల్లాలోని గోదావరిఖని జీవీకే ఇంక్లైన్‌ 1లోని 33వ డీప్‌లో విషవాయువులు వెలువడుతున్నాయి. దీంతో అప్రమత్తమైన గని అధికారులు..కార్మికులను బయటకు పంపుతున్నారు. ఈ ఘటనలో పలువురు కార్మికులు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

విజయవాడ సూరంపల్లి పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం

కృష్ణా : విజయవాడ సూరంపల్లి పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

20:55 - January 6, 2018

కుమ్రం భీం అసిఫాబాద్‌ : వార్తను నిర్భయంగా ప్రచారం చేస్తూ ప్రజల కొరకు టెన్‌ టీవీ పనిచేస్తుందన్నారు తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అధ్యక్షుడు అజ్మిరా శ్యాం నాయక్‌. ఈ మేరకు కుమ్రం భీం అసిఫాబాద్‌ జిల్లాలో టెన్‌ టీవీ క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. కొత్త సంవత్సరంలో మరిన్ని విజయాలు సాధించి టెన్‌ టీవీ ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా నిలవాలని కోరారు. 

 

20:54 - January 6, 2018

హైదరాబాద్ : ప్రజల పక్షాన పని చేస్తూ నైతిక విలువలు కాపాడే మీడియాకు సమాజంలో ఎప్పుడూ స్థానం ఉంటుందన్నారు కేంద్ర సమాచార కమిషనర్‌ మాడభూషి శ్రీధర్‌, మాజీ ఎమ్మెల్సీ కె.నాగేశ్వర్‌. హైదరాబాద్‌ ఓయూలో తెలంగాణ జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్‌ మీడియా నైతిక విలువలు అనే అంశంపై సెమినార్‌ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన మాడభూషి శ్రీధర్‌, నాగేశ్వర్‌లు... ఒకే అంశాన్ని వివిధ చానళ్లలో అనేక రకాలుగా చూపిస్తున్నారన్నారు. వాస్తవాలను ప్రసారం చేసినప్పుడే ప్రజల్లో ఆ చానళ్లపై విశ్వసనీయత పెరుగుతుందన్నారు. 

20:21 - January 6, 2018

హైదరాబాద్ : నోట్ల రద్దుతో వెలికి తీసిన నల్లధనాన్ని కార్మికులకు పంచుతానన్న ప్రధాని మోదీ ఇప్పుడెందుకు నోరు మెదపడంలేదని ప్రశ్నించారు సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సాయిబాబు. సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ రాష్ట్ర మహాసభల్లో ఆయన పాల్గొన్నారు. కార్మికులకు ఉద్యోగ భద్రత, కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అంతకు ముందు గోల్కొండ క్రాస్‌ రోడ్‌ నుండి సుందరయ్య పార్క్‌ వరకు వేలాదిమంది కార్మికులతో భారీ ర్యాలీ నిర్వహించారు. 

 

20:13 - January 6, 2018

హైదరాబాద్ : జంప్‌ జిలానీలతో కాంగ్రెస్‌ పార్టీ బాగా కుదేలైనట్లే కనిపిస్తోంది.. టీఆర్‌ఎస్‌ చేసిన ఆపరేషన్‌ ఆకర్ష్‌తో... హస్తం పార్టీకి హ్యాండిచ్చిన ఏడుగురు ఎమ్మెల్యేలు.. కారెక్కేశారు. ఆ లోటును భర్తీ చేసుకునేందుకు కాంగ్రెస్‌ ఏంచేస్తోంది... ఇంతకూ గెలుపు గుర్రాలను ఎంచుకుందా...? లేదా....? వాచ్‌ ది స్టోరీ.. ఆపరేషన్‌ ఆకర్ష్‌తో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ కాంగ్రెస్‌ లోని ఏడుగురు ఎమ్మెల్యేలను కారులోకి ఎక్కించుంది. విడతలవారీగా జరిపిన ఈ ఆపరేషన్‌తో కాంగ్రెస్‌ పార్టీ వణికిపోయింది. ఆ షాక్‌నుంచి తేరుకోవడానికి  కాంగ్రెస్‌కు చాలా సమయమే పట్టింది. దీనిపై సమీక్షించుకున్న  నేతలు జరిగిన లోటును భర్తీ చేయడంపై దృష్టి సారించారు.
గెలుపు గుర్రాల వేటలో కాంగ్రెస్‌
గోడమీది పిల్లుల్లా పార్టీ మారిన ఎమ్మెల్యేల స్థానాల్లో... ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణలో కాంగ్రెస్‌ పార్టీ ఉన్నట్లు  సమాచారం. మిర్యాలగూడ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన భాస్కర్‌ రావు టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకున్నారు.  కానీ.. జానారెడ్డి ప్రభావంతో  క్యాడర్‌ పెద్దగా వెళ్ళలేదు. ఇక్కడ ప్రత్యామ్నాయంగా జానారెడ్డి కుమారుడు రఘువీర్‌ రెడ్డిని బరిలో దించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.   
మక్తల్‌ బరిలో డీకే అరుణ కూతురు! 
మక్తల్‌లో రాజకీయం మరింత రంజుగా మారింది.  ఇక్కడి నుంచి గెలిచిన డీకే అరుణ సోదరుడు చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌లోకి జంప్‌ చేశారు. దీంతో తమ్ముడిపై ప్రతీకారంతో రగిలిపోతున్న డీకే అరుణ... తన కూతురు స్నిగ్దారెడ్డిని బరిలో దించే యోచనలో ఉన్నట్లు సమాచారం. డీకే అరుణ ప్రభావంతో స్నిగ్దారెడ్డి  గెలుపు మరింత సులువన్న భావనలో ఉన్నారు కాంగ్రెస్‌ నేతలు.
పోటీకి సిద్ధపడుతున్న పొంగులేటి సుధాకర్‌రెడ్డి
కాంగ్రెస్‌కు ఖమ్మంలో కూడా  ఇబ్బందిగానే ఉన్నట్లు కనిపిస్తోంది.. రూరల్‌ నియోజకవర్గాలకు చెందిన కోరం కనకయ్య, పువ్వాడ అజయ్‌లు కారెక్కేశారు. ఇల్లందు ఎస్టీ రిజర్వుడు కావడంతో అభ్యర్థి ఎంపిక కాంగ్రెస్‌కు  కష్టంగా మారింది.. ఇక్కడ ప్రత్యామ్నాయం ఎవరన్న క్లారిటీ లేదు.  ఖమ్మం రూరల్‌ నుంచి ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌ రెడ్డి టికెట్‌ ఆశిస్తున్నారు. సో... పువ్వాడ విజయ్‌తో పోటీకి పొంగులేటి ఇప్పటినుంచే సిద్ధపడుతున్నారు.
కాంగ్రెస్‌ టికెట్‌ రేసులో మాజీ ఎమ్మెల్యే నారాయణరావ్
అటు ఆదిలాబాద్‌ జిల్లాలో.. ముధోల్ నుంచి గెలిచిన విఠల్‌రెడ్డి కాంగ్రెస్‌కు ఆదిలోనే ఝలక్‌ ఇచ్చారు. దీంతో అక్కడ మాజీ ఎమ్మెల్యే నారాయణ్ రావ్ పాటిల్‌ పార్టీ బాధ్యతలు మోస్తున్నారు. ఆయన తనకు టికెట్‌ ఇస్తే వచ్చే ఎన్నికల్లో  విఠల్‌ రెడ్డికి గుణపాఠం చెబుతామన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు.
చేవెళ్ళ కాంగ్రెస్‌ టికెట్‌కు పోటాపోటీ
ఇక రంగారెడ్డి జిల్లాలోనూ అదే పరిస్థితి. చేవెళ్ళలో యాదయ్య కాషాయ కండువా కప్పుకున్నారు... ఆస్థానం నుంచి   డీసీసీ మాజీ అధ్యక్షుడు వెంకటస్వామి టికెట్‌ ఆశిస్తున్నారు. కాగా.. ఇటీవల రేవంత్‌ రెడ్డితో కలిసి కాంగ్రెస్‌లో చేరిన సతీష్‌ మాదిగ సైతం టికెట్‌ పోటీలో ఉన్నారు..  వెంకటస్వామికి సబితా ఇంద్రారెడ్డి ఆశీస్సులు ఉండగా... సతీష్‌ మాదిగకు రేవంత్‌రెడ్డి అండ ఉంది.  
డోర్నకల్‌లో కాంగ్రెస్‌ టికెట్‌ ముగ్గురు లీడర్ల ఆసక్తి
ఆపరేషన్‌ ఆకర్ష్‌ ప్రభావం వరంగల్‌ జిల్లా కాంగ్రెస్‌పైనా తీవ్రంగానే పడింది. డోర్నకల్‌ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన రెడ్యానాయక్‌ టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు... ఆ స్థానం నుంచి మాజీ మంత్రి రవీంద్ర నాయక్‌, బెల్లయ్య నాయక్‌లు టికెట్‌ కోసం ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు.  టీడీపీ నుంచి  కాంగ్రెస్‌లో చేరిన డాక్టర్‌ రామచంద్ర నాయక్‌ కూడా టికెట్‌  రేస్‌లో ఉన్నారు..  అభ్యర్థి ఎవరన్నదీ కాంగ్రెస్‌ స్పష్టం చేయలేదు. దీంతో సంధిగ్దం నెలకొంది. హస్తం పార్టీకి హ్యాండిచ్చిన ఎమ్మెల్యేలకు.. ప్రజాక్షేత్రంలో చెక్‌ పెట్టేందుకు  కాంగ్రెస్‌ వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. అందుకోసం గెలుపు గుర్రాల ఎంపికలో నిమగ్నమైంది.  ఇంతకీ ప్రజలు కాంగ్రెస్‌ను బలపరుస్తారో.. లేక వలస నేతలకే జై కొడతారో వేచి చూడాలి.

 

18:21 - January 6, 2018

సిద్ధిపేట : నేరేళ్ల బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ సిద్దిపేట నుండి నేరేళ్ల వరకు పాదయాత్ర చేపట్టారు వామపక్ష నేతలు. పాదయాత్రను విజయవంతం చేయాలని టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం ప్రజలకు సూచించారు. కేసీఆర్‌ బంధువులే ఇసుక మాఫియాలో ముఖ్య పాత్ర వహిస్తున్నారని ఆరోపించారు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. నేరేళ్ల ఘటనపై మంత్రి కేటీఆర్‌ ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. 

 

టెన్త్ విద్యార్థిని మృతి

వరంగల్‌ అర్బన్‌ : జిల్లాలోని కమలాపూర్‌ మండలం గూడూరు గ్రామంలో 10వ తరగతి విద్యార్థిని కావేరి అనుమానాస్పదంగా మృతి చెందింది. ఇంట్లో అనుమానాస్పదంగా మృతి చెందింది. సవతి తల్లి హారికయే కావేరిని చంపి ఉంటుందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. 

18:14 - January 6, 2018

వరంగల్‌ అర్బన్‌ : జిల్లాలోని కమలాపూర్‌ మండలం గూడూరు గ్రామంలో 10వ తరగతి విద్యార్థిని కావేరి అనుమానాస్పదంగా మృతి చెందింది. ఇంట్లో అనుమానాస్పదంగా మృతి చెందింది. సవతి తల్లి హారికయే కావేరిని చంపి ఉంటుందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. 

 

17:53 - January 6, 2018
17:52 - January 6, 2018

బీహార్ : దాణా స్కాంలో లాలూ ప్రసాద్ యాదవ్ కు శిక్ష ఖరారు అయింది. పశు దాణా కుంభకోణం కేసులో లాలూకు  యాదవ్ కు న్యాయమూర్తి మూడున్నరేళ్ల జైలు శిక్ష విధించారు. జైలు శిక్షతోపాటు ఐదు లక్షల రూపాయల జరిమానా విధించారు. మిగిలిన దోషులకు కూడా శిక్ష ఖరారు చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

17:48 - January 6, 2018

హైదరాబాద్ : టీప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబు విమర్శించారు. తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ ఆండ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర మహాసభల ప్రారంభ సభలో ఆయన ప్రసంగించారు. ప్రభుత్వం కాంట్రాక్టు వ్యవస్థను పెంచి పోషిస్తుందని ఆరోపించారు. ప్రభుత్వ నిధులను కాంట్రాక్టర్లకు కట్టబెడుతుందని మండిపడ్డారు. మిషన్ భగరీథలో వేల, లక్ష రూపాయలను పైపుల కంపెనీలకు ఇస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కార్మికుడికి భద్రత లేదని వాపోయారు. దళితులకు మూడు ఎకరాలు, డబుల్ బెడ్ రూం, రైతులకు రుణమాఫీ వంటి ఏ ఒక్క వాగ్ధానం అమలు కాలేదని ఎద్దేవా చేశారు. 

 

తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ ఆండ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర మహాసభలు ప్రారంభం

హైదరాబాద్ : మున్సిపల్ కార్మికులను ప్రభుత్వం మోసం చేస్తోందని సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబు విమర్శించారు. తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ ఆండ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర మహాసభలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. మహాసభల సందర్భంగా గోల్కొండ క్రాస్ రోడ్డు నుంచి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ప్రదర్శనకు సాయిబాబు హాజరై, మాట్లాడారు. మూడున్నరేళ్లు గడిచినా కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయలేదని విమర్శించారు. వేలాది మంది కార్మికులు హాజరయ్యారు. రెండు రోజులపాటు మహాభలు జరుగనున్నాయి. 

17:33 - January 6, 2018

హైదరాబాద్ : మున్సిపల్ కార్మికులను ప్రభుత్వం మోసం చేస్తోందని సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబు విమర్శించారు. తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ ఆండ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర మహాసభలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. మహాసభల సందర్భంగా గోల్కొండ క్రాస్ రోడ్డు నుంచి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ప్రదర్శనకు సాయిబాబు హాజరై, మాట్లాడారు. మూడున్నరేళ్లు గడిచినా కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయలేదని విమర్శించారు. వేలాది మంది కార్మికులు హాజరయ్యారు. రెండు రోజులపాటు మహాభలు జరుగనున్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

బాల సాయిబాబా భూకబ్జాలపై కలెక్టర్ సత్యనారాయణ సీరియస్

కర్నూలు : బాల సాయిబాబాకు షాక్ తగలింది. ఓర్వకల్లు మండలం హుసేనపురంలో బాల సాయిబాబా భూకబ్జాలపై జిల్లా కలెక్టర్ సత్యనారాయణ సీరియస్ అయ్యారు. బాధితురాలికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. హుసేనపురంలో బోయ లక్ష్మీ అనే మహిళకు చెందిన రెండెకరాల భూమిని బాల సాయిబాబా కబ్జా చేశారు. న్యాయం చేయాలంటూ 2 రోజులుగా బాధితురాలు ధర్నా చేస్తున్నారు. బాధితురాలికి జరిగిన అన్యాయంపై 10 టివి వరుస కథనాలు ప్రసారం చేసింది. 10 టివి కథనాలకు జిల్లా కలెక్టర్ సత్యనారాయణ స్పందించారు. కిందిస్థాయి అధికారుల తీరుపై సీరియస్ అయ్యారు. 

17:20 - January 6, 2018

కర్నూలు : బాల సాయిబాబాకు షాక్ తగలింది. ఓర్వకల్లు మండలం హుసేనపురంలో బాల సాయిబాబా భూకబ్జాలపై జిల్లా కలెక్టర్ సత్యనారాయణ సీరియస్ అయ్యారు. బాధితురాలికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. హుసేనపురంలో బోయ లక్ష్మీ అనే మహిళకు చెందిన రెండెకరాల భూమిని బాల సాయిబాబా కబ్జా చేశారు. న్యాయం చేయాలంటూ 2 రోజులుగా బాధితురాలు ధర్నా చేస్తున్నారు. బాధితురాలికి జరిగిన అన్యాయంపై 10 టివి వరుస కథనాలు ప్రసారం చేసింది. 10 టివి కథనాలకు జిల్లా కలెక్టర్ సత్యనారాయణ స్పందించారు. కిందిస్థాయి అధికారుల తీరుపై సీరియస్ అయ్యారు. అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

16:56 - January 6, 2018

వరంగల్ : హన్మకొండలో 10టీవీ క్యాలెండర్‌ను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ మధుసూదనాచారి ఆవిష్కరించారు. ప్రజలు, ప్రభుత్వానికి 10టీవీ సామాజిక వారధిగా పని చేస్తుందన్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రోత్సహిస్తూనే... అప్పుడప్పుడు జరుగుతున్న లోపాలను 10టీవీ ఎత్తిచూపుతూ ముందుకెళ్తుందన్నారు. 10టీవీ 2018లో మరింతగా ప్రజలకు చేరువై.. అత్యున్నత స్థానంలో నిలవాలని మధుసూదనాచారి ఆకాంక్షించారు. 

16:55 - January 6, 2018

నెల్లూరు : ఆంధ్రప్రదేశ్ ను సంపూర్ణ ఓడీఎఫ్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు అన్నారు. జిల్లాలో నిర్వహించిన జన్మభూమి..మా ఊరు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొని, మాట్లాడారు. స్కూల్స్ లో మరుగుదొడ్లు లేకపోవడంతో ఆడ పిల్లలు బడి మానేస్తున్నారని వాపోయారు. మరుగుదొడ్లు లేకపోవడంతో మహిళలు మనసు చంపుకుని రోడ్డు పక్కన మల విసర్జన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. గ్రామాలు ఆదర్శవంతంగా ఉండాలన్నారు. ప్రతి సోమవారం నీరు ప్రగతి కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. అనేక కార్యక్రమాలకు నాంది పలికామని చెప్పారు. 470 పంచాయతీ బిల్డింగ్స్ లో నిర్మించామని చెప్పారు. ఏదైనా గ్రామంలో పంచాయతీ బిల్డింగ్ లేకపోతే వెంటనే నిర్మిస్తామని చెప్పారు. 4138 అంగన్ వాడీ బిల్డింగ్స్ నిర్మించామని తెలిపారు. డ్వాక్రా సంఘాలకు శ్రీశక్తి భవనాలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. ఏ గ్రామానికి వెళ్లినా చెత్త చెదారం స్వాగతం పలుకుతుందన్నారు. చెత్త నుంచి సంపద ఏ విధంగా సంపాదించచ్చు అనే నూతన విధానాన్ని ప్రవేశపెట్టామని తెలిపారు. మీ ఇంటికే పంచాయతీ అధికారులు వచ్చి...చెత్త సేకరిస్తారని చెప్పారు.
స్కూల్స్ లో క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు 
స్కూల్స్ లో ప్రతి రోజు గంట క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. కూచిపూడి మన రాష్ట్రంలో పుట్టింది....ప్రపంచమంతా నేర్చుకుంది.. మనం మర్చిపోయామని పేర్కొన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో కూచిపూడి నృత్యాన్ని ప్రవేశపెట్టామని చెప్పారు. చిన్న చిన్న సమస్యలకు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, హత్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. వీటన్నింటినీ ఎదుర్కొవాలంటే ప్రజల్లో చైతన్యం రావాలన్నారు. లా ఆండ్ ఆర్డర్ కఠినంగా వ్యవహరించాలని సూచించారు. 48 గంటల్లో రాజమండ్రి కేసును చేధించామని తెలిపారు. 
మహిళల రక్షణకు కృషి 
ఆడ పిల్లల జోలికొస్తే కఠినంగా వ్యవరిస్తామని హెచ్చరించారు. మహిళల రక్షణకు కృషి చేస్తామని తెలిపారు. క్రీడలు చాలా ముఖ్యమన్నారు.  క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు మానసిక ఆనందాన్ని, ఉల్లాసాన్ని కల్గిస్తాయని తెలిపారు. అనునిత్యం వ్యాయామం చేయాలన్నారు. మన శరీరంలో వ్యాయామం ఒక భాగం కావాలన్నారు. శరీరానికి తిండి ఎంత ముఖ్యమో.. వ్యాయామం కూడా అంతే ముఖ్యమన్నారు. రేపు అన్ని మున్సిపాలిటీలు, పట్టణాల్లో 5కే రన్ ఏర్పాటు చేశామని తెలిపారు. 

 

దాణా స్కాంలో లాలూ ప్రసాద్ యాదవ్ కు శిక్ష ఖరారు

ఢిల్లీ : దాణా స్కాంలో లాలూ ప్రసాద్ యాదవ్ కు శిక్ష ఖరారు అయింది. పశు దాణా కుంభకోణం కేసులో లాలూకు  యాదవ్ కు న్యాయమూర్తి మూడున్నరేళ్ల శిక్ష విధించారు. ఐదు లక్షల రూపాయల జరిమానా విధించారు. మిగిలిన దోషులకు కూడా శిక్ష ఖరారు చేశారు. 
 

16:18 - January 6, 2018

కర్నూలు : జిల్లాలోని బనగానపల్లె మండలం దద్దనాల ప్రాజెక్టు వద్ద కారులో మంటలు చెలరేగాయి. కారుతో పాటు అందులో ప్రయాణిస్తున్న వ్యక్తి సజీవ దహనమయ్యాడు. కారు ప్యాపిలి నుండి నంద్యాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. ప్రమాదవశాత్తు మృతి చెందాడా లేదా ఎవరైనా సజీవ దహనం చేశారా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.... 

 

15:57 - January 6, 2018

పశ్చిమ గోదావరి : కోడిపందాలపై హైకోర్టు సీరియస్ అయ్యింది. పందాలు నిలువరించడంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్ధానం ఆదేశాలతో అధికారులకు ముచ్చెమటలు పడుతున్నాయ. మరోవైపు కోర్టు తీర్పుతో పందెం రాయుళ్లకు గట్టి షాక్ తగిలింది. ఈ నేపథ్యంలో ఈ సంక్రాంతికి గోదావరి జిల్లాల్లో కోడి పందాలు ఉన్నట్లా? లేనట్లా? వాచ్ ది స్టోరి. 
కోడి పందాలపై హైకోర్టు సీరియస్
సంక్రాంతి పండుగ వచ్చిందంటే గోదావరి జిల్లాల్లో కోడిపందాలు జోరుగా సాగుతుంటాయి. భోగి, సంక్రాంతి, కనుమ రోజుల్లో పందాలు కాయడమే పండుగ అన్నట్లు పందెం రాయుళ్లు కోడి పందాల్లో మునిగి తేలుతుంటారు. కోట్లాది రూపాయలు బెట్టింగ్‌లకు పాల్పడుతూ డబ్బులు వెదజల్లుతుంటారు. ఈ ఏడాది కూడా పండుగకు పందాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. అయితే కోడి పందాల నిర్వహణ ముసుగులో అనైతిక, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న అంశాన్ని దృష్టిలో ఉంచుకుని హైకోర్టు సీరియస్‌గా తీసుకుంది. ఈ తరహా కార్యక్రమాలకు పాల్పడే వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఉమ్మడి హైకోర్టు గోదావరి జిల్లాల పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. 
కోడిపందాల ముసుగులో అసాంఘిక కార్యక్రమాలు
కోడి పందాల నిర్వహణ పేరుతో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలను కట్టడి చేయాలని కె.రామచంద్రరాజు అనే వ్యక్తి హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. దీంతో ఈ అంశంపై తెరపైకి వచ్చింది. అసాంఘిక కార్యకలాపాలకు చెక్‌ పెట్టాలని డిసెంబర్‌లోనే న్యాయస్ధానం పశ్చిమగోదావరి జిల్లా అధికారులను, ఎస్పీ, కలెక్టర్‌ను ఆదేశించింది. తమ ఉత్తర్వులకు వ్యతిరేకంగా పందాలు జరిగితే ప్రభుత్వమే పూర్తిబాధ్యత వహించాలని కూడా స్పష్టంగా పేర్కొంది. అయితే కోడి పందాలను కట్టడి చేయడంలో ఎలాంటి చర్యలు చేపట్టారో సమగ్రంగా వేర్వేరుగా నివేదికలు సమర్పించాలంటూ సీఎస్, డీజీపీలకు న్యాయస్ధానం ఆదేశాలు జారీ చేసింది. తాజాగా పందాలు జరగకుండా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని ఏపీ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. 
డైలమాలో పడ్డ పందెం రాయుళ్లు
ఇక 2016 సంక్రాంతి సమయంలో కోర్టు ఉత్తర్వులను పాటించని  పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన 43 మంది తహశీల్దార్లు. 49 మంది స్టేషన్ హౌస్ అధికారులపై ఏం చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని 2017 జనవరి 4 పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది. అలాగే వీరిని కోర్టు ధిక్కార వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చి వివరణ కోరతామని కోర్టు గట్టి వార్నింగ్ ఇచ్చింది. దీంతో ఏజీ జోక్యం చేసుకుంటూ ఇప్పటికే వారికి సంజాయిషీ నోటీసులిచ్చామని, వారిపై తీసుకున్న చర్యల వివరాలను కోర్టుకు సమర్పిస్తామని స్పష్టం చేశారు. దీంతో కోర్టు ధిక్కార చర్యల హెచ్చరికను ధర్మాసనం ఉపసంహరించుకుంది. తదుపరి విచారణను జనవరి 29కి వాయిదా వేసింది. మరోవైపు తమ తీర్పును వ్యతిరేకించి పందాలు జరిపిన అధికారులు, పందెంరాయుళ్లపై కఠినచర్యలు తప్పవని హైకోర్టు సంకేతాలు పంపడంతో పందెంరాయుళ్లకు మింగుడు పడట్లేదు. ఒకవేళ పందాలు నిర్వహిస్తే తమను తాము ఎలా కాపాడుకోవాలనే డైలమాలో పడ్డారు. 
పందాలకు సిద్ధమవుతున్న పందెం రాయుళ్లు
ఇదిలా ఉంటే పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలు, విజయనగరం, కృష్ణా, గుంటూరు జిల్లాలతోపాటు అటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో అధికారుల కంట పడకుండా ఎట్టి పరిస్థితుల్లో పందాలు నిర్వహించాలని పావులు కదుపుతున్నారు. ఈసారి పండుగకు తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పందెం రాయుళ్లు తరలి వస్తారని..  పందాలు నిర్వహించకపోతే నష్టపోతామనే భావనలో పందెం రాయుళ్లు పందాలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈసారి సంక్రాంతికి అటు పందెంరాయుళ్లు.. ఇటు అధికార యంత్రాంగానికి మధ్య కోడి వార్ జరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. 

 

15:49 - January 6, 2018

విజయవాడ : దేశంలో పెద్ద సమస్యగా మారిన సీపీఎస్ విధానానికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 10వ తేదీన జిల్లాస్ధాయిలో కలెక్టరేట్స్ ముందు ధర్నా చేపడుతున్నట్లు ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు చెప్పారు. మార్చిలో చలో అసెంబ్లీ కార్యక్రమం చేపడుతున్నట్లు ప్రకటించారు. ఉద్యోగులతో ధర్నాలతో జన్మభూమి కార్యక్రమానికి ఆటంకం అనుకోవడం లేదని ఆయన చెప్పారు. ఒకవేళ ప్రభుత్వం ఆటంకంగా భావించినా ధర్నాల ద్వారా తమ సమస్య ప్రభుత్వానికి తెలియాలని అశోక్‌బాబు తెలిపారు. ప్రభుత్వం వెంటనే సీపీఎస్ విధానం నుంచి బయటకు రావాలని లేదంటే ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచుతామని అశోక్‌బాబు స్పష్టం చేశారు. 

 

నెల్లూరు జన్మభూమి..మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు

నెల్లూరు : జిల్లాలో నిర్వహించిన జన్మభూమి..మా ఊరు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ప్రతి సోమవారం నీరు ప్రగతి కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. అనేక కార్యక్రమాలకు నాంది పలికామని చెప్పారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. గ్రామాలు ఆదర్శవంతంగా ఉండాలన్నారు. 

ఖమ్మం జిల్లాలో మిషన్ భగీరథ పనులపై సమీక్షా సమావేశం

ఖమ్మం : తిరుమలాయపాలెం మండలం మాదిరిపురం వద్ద మిషన్ భగీరథ పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్ పాల్గొన్నారు. వర్క్ ఏజన్సీలపై కమిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల పురోగతిపై పెదవి విరిచారు.

 

ఏడాది తర్వాత మోడీతో భేటీ కానున్న సీఎం చంద్రబాబు

గుంటూరు : ఈనెల 12న ప్రధాని మోడీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. దాదాపు ఏడాది తర్వాత ప్రధాని మోడీతో చంద్రబాబు సమావేశం అవ్వనున్నారు. విభజన హామీలు, పోలవరంపైనే ప్రధానంగా చర్చించే అవకాశముంది. 

15:01 - January 6, 2018

గుంటూరు : ఈనెల 12న ప్రధాని మోడీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. దాదాపు ఏడాది తర్వాత ప్రధాని మోడీతో చంద్రబాబు సమావేశం అవ్వనున్నారు. విభజన హామీలు, పోలవరంపైనే ప్రధానంగా చర్చించే అవకాశముంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

విశాఖ కలెక్టర్, సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ పై ఎఫ్ ఐఆర్

విశాఖ : కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తో పాటు సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ రమణమూర్తిపై ఎఫ్ ఐఆర్ నమోదు అయింది. 2016 లో యువతి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు అయింది. ఎస్సీ, ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్, సీఆర్ పీసీ 156 క్లాజ్ ఎంవీపీ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. అత్యవరసర సాయం కింద బాధితురాలికి తనకు నష్టపరిహారం చెల్లింపులో ఆలస్యం చేయడమే కాకుండా సెక్షన్లను తారుమారు చేశారంటూ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో యవతి ఫిర్యాదు చేసింది. 

 

14:55 - January 6, 2018

రాజా ది గ్రేట్ సినిమాతో ఊపు మీద ఉన్న హీరో రవితేజ తాజాగా 'టచ్ చేసి చూడు' మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రానికి విక్రమ్ సిరికొండ దర్శకత్వం వహిస్తున్నాడు. రవితేజకు జంటగా రాశిఖన్నా, శరత్ కపూర్ నటిస్తున్నారు. నల్లమలపు బుజ్జి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టీజర్ విడుదల చేశారు. టీజర్ లో రవితేజ డైలాగ్ కొత్తగా కనిపించాయి. టచ్ చేసి చూస్తే తెలుస్తుంది. హీరోలో ఎంత పవర్ వున్నది' అనే ఉద్దేశంతోనే ఈ సినిమాకి 'టచ్ చేసి చూడు' అనే టైటిల్ ను సెట్ చేశారు. 

 

 

 

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బంగారం పట్టివేత

రంగారెడ్డి : శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ అధికారులు గోల్డ్‌బిస్కెట్లు స్వాధీనం చూసుకున్నారు. మస్కట్‌ దేశం నుంచి వచ్చిన ఓ ప్రాయణికుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు.. షూస్‌లో బంగారు బిస్కట్లు ఉన్నట్టు గుర్తించారు. దాదాపు 350గ్రాముల గోల్డ్‌ను స్వాధీనం చేసుకున్నారు.

13:33 - January 6, 2018

రంగారెడ్డి : జిల్లా శంషాబాద్‌లో తెలంగాణ మత్స్యకారుల సంఘం రెండవ మహాసభలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి బీసీ సబ్‌ప్లాన్‌ సాధనాసమితి రాష్ట్ర వైస్‌ చైర్మన్‌ మురళీమనోహర్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మత్స్యకార వృత్తి పరిరక్షణ, సంక్షేమం, అభివృద్ధి చట్టాన్ని తీసుకురావలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మత్స్యకార్మికుల సంక్షేమానికి బడ్జెట్‌లో 3వేల కోట్లు కేటాయించాలన్నారు. రాష్ట్రంలోని ప్రతి నగరం, జిల్లాకేంద్రాల్లో శాశ్వత ప్రాతిపధికన హోల్‌సేల్‌ మార్కెట్లు నిర్మించాలన్నారు. వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులకు 75శాతం రాయితీతో 10లక్షల రూపాయల రుణం అందించాలని కోరారు. 50ఏళ్లు పైబడిన కార్మికులకు వృద్ధాప్య పెన్షన్‌తోపాటు మృతిచెందిన కార్మికుల కుటుంబాలకు 5లక్షల పరిహారం ఇవ్వాలని మహాసభలో నాయకులు డిమాండ్‌ చేశారు. 

13:33 - January 6, 2018

రంగారెడ్డి : శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ అధికారులు గోల్డ్‌బిస్కెట్లు స్వాధీనం చూసుకున్నారు. మస్కట్‌ దేశం నుంచి వచ్చిన ఓ ప్రాయణికుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు.. షూస్‌లో బంగారు బిస్కట్లు ఉన్నట్టు గుర్తించారు. దాదాపు 350గ్రాముల గోల్డ్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

13:29 - January 6, 2018

విశాఖ : ఫేస్‌బుక్‌లో పరిచయంతో ఇద్దరూ సహజీవనం చేశారు. 3నెలలు కలిసి తిరిగారు. తీరా పెళ్లి ప్రస్తావన తెచ్చేసరికి ప్రియుడు కాస్తా జంపయ్యాడు. ఢిల్లీకి చెందిన కిరణ్‌సింగ్‌, రాజస్థాన్‌కు చెందిన కిషన్‌పాల్‌సింగ్‌ ఫేస్‌బుక్‌లో పరిచయం అయ్యారు. పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ప్రియుడు కిషన్‌ విశాఖస్టీల్‌ ప్లాంట్‌లో ట్రయినింగ్‌ కోసం వచ్చాడు. తనవద్దకు రావాలని ప్రియురాలు కిరణ్‌సింగ్‌ను కూడా పిలిచాడు. విశాఖకు వస్తే పెళ్లిచేసుకుంటానని మాట ఇచ్చాడు. మూడునెలల తర్వాత ఇద్దరూ కలిసి ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో ప్రియురాలిని వదిలేసిన కిషన్‌సింగ్‌ కనబడకుండా వెళ్లిపోయాడు. దిక్కుతోచని బాధితురాలు మళ్లీ విశాఖకు వచ్చి కిషన్‌సింగ్‌ గురించి ఆరాతీసింది. కిషన్‌సింగ్‌ ట్రైనింగ్‌ పూర్తి చేసుకుని రాజస్థాన్‌కు వెళ్లిపోయాడని తెలయడంతో కిరణ్‌సింగ్‌ స్టీల్‌ప్లాంట్‌లోని మహిళా పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు పారిపోయిన ప్రియుడు కోసం వెదుకుతున్నారు.

ఇసుక మాఫియాలో కేసీఆర్ బంధువులు : తమ్మినేని

సిద్దిపేట : ఇసు మాఫియాలో కేసీఆర్ బంధువులు ఉన్నారని, నేరేళ్ల లో దళితులపై దాడి చేసినవారిపై ఇంత వరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రశ్నించారు. బాధితులకు నష్టపరిహారం కూడ ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు. 

నేరేళ్ల బాధితుల కోసం కొనసాగుతున్న అఖిలపక్ష పాదయాత్ర

సిద్దిపేట : నేరేళ్ల ఘటనలో బాధ్యుపై చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ అఖిలపక్షం పాదయాత్ర చెపట్టింది. అంబేద్కర్ చౌరస్తా నుంచి పాదయాత్ర నేరేళ్ వరకు కొనసాగుతుంది. పాదయాత్రలో తమ్మినేని, చాడ, కోదండరామ్ పాల్గొన్నారు. 

ఏపీ సచివాలయం ఎదుట తెలంగాణ ఉద్యోగుల ఆందోళన

హైదరాబాద్ : ఏపీ సచివాలయం ముందు ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. తక్షణమే తమను వెనక్కి తీసుకురావాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. 

వనపర్తిలో వరుస చోరీలు

వనపర్తి : జిల్లా కేంద్రంలో వరుస చోరీలు జగడంతో జిల్లా వాసులు ఆందోళన చెందుతున్నారు. నిన్న రాత్రి 10 ఇళ్లలో దుండగులు చోరీలకు పాల్పడ్డారు. మొత్తం 16 తులాల బంగారం, రూ.2.5లక్షల అపహరణ గురైయ్యాని బాధితులు వాపోతున్నారు. 

జన్మభూమి కార్య్రక్రమాన్ని అడ్డుకున్న గ్రామస్తులు

విశాఖ : జిల్లా రావికమతం మండలం కొమిర గ్రామంలో ప్రజలు ఆందోళకు దిగారు. జన్మభూమి సభ నిర్వహణను అడ్డుకున్నారు. గత జన్మభూమిలో ఇచ్చిన దరఖాస్తులు, సమస్యలను పరిష్కరించాలని పట్టుబట్టారు. అధికారులు గ్రామంలోకి రాకుండా రోడ్డుపై బైఠాయించారు. కె.ఎమ్‌ ఛానల్‌ ద్వారా గ్రామానికి నీరు, హుద్‌హుద్‌ తుఫాను బాధితులకు పరిహారం, పెన్షన్లు లాంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. 

నెల్లూరుకు చేరుకున్న చంద్రబాబు

నెల్లూరు : సీఎం చంద్రబాబు నెల్లూరు చేరుకున్నారు. ఆయన విక్రమసీంహపురి యూనివర్శిటీలో నూతన భవనాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. 

వ్యవసాయ బావిలో ఉపాధ్యాయుని మృతదేహం

కరీంనగర్ : జిల్లా చొప్పదండి శివారులోని వ్యవసాయ బావిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడి మృతదేహం లభ్యమైంది. ఇది హత్య లేక ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

వ్యవసాయ బావిలో ఉపాధ్యాయుని మృతదేహం

కరీంనగర్ : జిల్లా చొప్పదండి శివారులోని వ్యవసాయ బావిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడి మృతదేహం లభ్యమైంది. ఇది హత్య లేక ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

జలవనురులశాఖ కార్యాలయంలో కలకలం

ప్రకాశం : జిల్లా జలవనురులశాఖ కార్యాలయంలో కలకలం రేగింది. సీనియర్ అసిస్టెంట్ హనుమంతరావు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆయనను ఆసుపత్రికి తరలించారు. 

ఆర్ డబ్ల్యూఎస్ పథకాన్ని ప్రారంభించిన లోకేష్

తూర్పుగోదావరి : జిల్లా కాకినాడ మండలం పండూరులో ఆర్ డబ్ల్యూఎస్ మంచినీటి పథకాన్ని మంత్రి లోకేష్ ప్రాంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కోసం రూ.22వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని ఆయన తెలిపారు. 

యూపీలో రైతుల వినూత్న నిరసన

లక్నో : యూపీ అసెంబ్లీ ఎదుట రైతులు వినూత్న ఆందోళనకు దిగారు. రైతులు అసెంబ్లీ ముందు అలుగడ్డలను పారబోసి నిరసన తెలుపుతున్నారు. ఉత్తరప్రదేశ్ లో అలుగడ్డ ధరలు భారీగా పడిపోయాయి. ప్రస్తుతం యూపీ కిలో అలు కు రూ.4 పలుకుతుంది. 

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం

ప్రకాశం : జిల్లా ఉప్పుగుండూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎన్ఎస్ఎన్ ప్రైవేట్ కాలేజీ బస్సును, ఓ ప్రైవేట్ బస్సు ఢీకొంది. దీంతో కాలేజీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో కాలేజీ బస్సులో 56 మంది విద్యార్థులున్నారు. 

శంషాబాద్ లో మహిళ కిడ్నాప్ కలకలం

రంగారెడ్డి : జిల్లాలో అరుణ అనే మహిళ కిడ్నాప్‌ కలకలంగా మారింది. శంషాబాద్‌మండలం మల్కారంలోని ఆశాజ్యోతి రిహాబిలిటేషన్‌ సెంటర్‌లో మానసిక చికిత్స తీసుకుంటున్న అరుణను కిడ్నాప్‌ చేశారు. గతనెల 30న బంధువులమని చెప్పిన ఇద్దరు వ్యక్తులు అరుణను తమతో తీసుకెళ్లారు. కాగా జనవరి 3న అరుణ సోదరి రిహాబిలిటేషన్‌ సెంటర్‌కు ఫోన్‌చేసి తమ చెల్లెలి క్షేమ సమాచారం అడిగింది. దీంతో ఖంగుతిన్న కేంద్రం నిర్వాహకులు..అరుణను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారని తెలుసుకున్నారు. శంషాబాద్‌ రూరల్‌ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడి

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. సోపోర్‌లోని గోల్‌ మార్కెట్‌ ప్రాంతంలో శక్తివంతమైన ఐఈడీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో నలుగురు పోలీసులు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. పేలుడు దాటికి దుకాణాలు ధ్వంసమయ్యాయి. 

12:35 - January 6, 2018

విశాఖ : జిల్లా రావికమతం మండలం కొమిర గ్రామంలో ప్రజలు ఆందోళకు దిగారు. జన్మభూమి సభ నిర్వహణను అడ్డుకున్నారు. గత జన్మభూమిలో ఇచ్చిన దరఖాస్తులు, సమస్యలను పరిష్కరించాలని పట్టుబట్టారు. అధికారులు గ్రామంలోకి రాకుండా రోడ్డుపై బైఠాయించారు. కె.ఎమ్‌ ఛానల్‌ ద్వారా గ్రామానికి నీరు, హుద్‌హుద్‌ తుఫాను బాధితులకు పరిహారం, పెన్షన్లు లాంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. 

12:34 - January 6, 2018

రంగారెడ్డి : జిల్లాలో అరుణ అనే మహిళ కిడ్నాప్‌ కలకలంగా మారింది. శంషాబాద్‌మండలం మల్కారంలోని ఆశాజ్యోతి రిహాబిలిటేషన్‌ సెంటర్‌లో మానసిక చికిత్స తీసుకుంటున్న అరుణను కిడ్నాప్‌ చేశారు. గతనెల 30న బంధువులమని చెప్పిన ఇద్దరు వ్యక్తులు అరుణను తమతో తీసుకెళ్లారు. కాగా జనవరి 3న అరుణ సోదరి రిహాబిలిటేషన్‌ సెంటర్‌కు ఫోన్‌చేసి తమ చెల్లెలి క్షేమ సమాచారం అడిగింది. దీంతో ఖంగుతిన్న కేంద్రం నిర్వాహకులు..అరుణను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారని తెలుసుకున్నారు. శంషాబాద్‌ రూరల్‌ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

12:33 - January 6, 2018

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. సోపోర్‌లోని గోల్‌ మార్కెట్‌ ప్రాంతంలో శక్తివంతమైన ఐఈడీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో నలుగురు పోలీసులు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. పేలుడు దాటికి దుకాణాలు ధ్వంసమయ్యాయి. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

12:32 - January 6, 2018

హైదరాబాద్ : ప్రతీ ఏడాది కళాకారులకు, న్యూస్‌ రీడర్లకు అవార్డులను ఇస్తూ ప్రోత్సహిస్తోంది ఆరాధన సంస్థ. ఏ సంవత్సరం టెన్‌ టీవీ నుంచి 2017 బెస్ట్‌ న్యూస్‌ రీడర్‌ అవార్డును షేక్‌ వలీ అందుకున్నారు. ఈ అవార్డును అందుకోవడం ఆనందంగా ఉందని వలీ అన్నారు.

12:32 - January 6, 2018

సంగారెడ్డి : జిల్లా ... నారాయణ ఖేడ్‌ ప్రాంతంలో.. స్మగ్లర్ల నుంచి అటవీ సంపదను రక్షించాల్సిన అధికారే .. స్వాహా చేస్తున్నాడు. బీట్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న శంకర్‌ కలపతో ఫర్నీచర్‌ చేయించి.. విక్రయించుకుని సొమ్ము చేసుకుంటున్నాడు. దొంగ రికార్డుల సృష్టించి.. కలపను తరలిస్తూ.. అక్రమంగా డబ్బు సంపాదించుకుంటున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. దాడి చేసి.. శంకర్‌ను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన కలపను ఓ షాపుకు తరలిస్తూ..శంకర్‌ పోలీసులకు దొరికిపోయాడు. దీంతో ఆటోలో.. ఇంట్లో ఉన్న ఉన్న కలపను స్వాధీనం చేసుకున్నారు. అయితే అనుమతితోనే కలప రవాణా చేస్తున్నానని.. నిందితుడు శంకర్‌ అంటున్నాడు. తన దగ్గర అన్ని ఆధారాలున్నాయని.. డబ్బులు చెల్లించే కలప తీసుకున్నానని.. బుకాయిస్తున్నాడు. అయితే పూర్తిగా విచారణ జరిపిన తర్వాత.. చర్యలు తీసుకోవడం జరుగుతుందని.. అటవీ శాఖ అధికారులు తెలిపారు. 

12:31 - January 6, 2018

పెద్దపల్లి : నియోజకవర్గం జిల్లాల పునర్విభజనతో పెద్దపల్లి ప్రస్తుతం జిల్లా కేంద్రంగా ఆవిర్భవించింది. నియోజక వర్గం దాదాపుగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. రామగుండం, చొప్పదండి, మంథని నియోజక వర్గాల్లో శరవేగంగా నీటి ప్రాజెక్టుల నిర్మాణాలు జరుగుతున్నా.. పెద్దపల్లి పరిధిలో ఆశించిన స్థాయిలో నిర్మాణాలు జరగక పోవడంతో ఇక్కడి ప్రజలకు నీటి సమస్య ఎక్కువైంది.

116తో పాటుగా డి- 83, 86 కెనాళ్ల ద్వారా నీరు
నియోజకవర్గంలోని రైతాంగం పంటలు పండించుకోడానికి శ్రీరామ్ సాగర్ నీటి రాక కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. శ్రీరామ్‌ సాగర్‌ నీటి కాలువలు 116తో పాటుగా డి- 83, 86 కెనాళ్ల ద్వారా నీరు విడుదల జరిగితే చివరి ఆయకట్టు పంట పొలాలకు నీరంది పంటలు సమృద్దిగా పండుతాయి... లేదంటే పంటలు ఎండి రైతులు నష్టాలను చూడాల్సిన పరిస్థితి తలెత్తుతుంది.ప్రస్తుతం యాసంగి పంటలు వేయడానికి రైతాంగం సన్నద్ధమవుతుండటంతో సాగునీటి సమస్య ఏర్పడుతుంది. దీంతో తీరా పంట వేస్తే సమయానికి నీళ్లు వస్తాయో లేదో అన్న సందేహంతో రైతన్నలు అయోమయ స్థితిలో పడ్డారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి విడుదల చేసిన నీరంత పెద్దపల్లికి 116 పాయింట్ వద్ద నుంచి డి-83, 86 కెనాళ్ల ద్వారా ఆన్ ఆఫ్‌ సిస్టం పద్ధతిలో 6 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాల్సి ఉంది. అధికారులు మాత్రం 2800 క్యూసెక్కుల నీటి విడుదల జరుగుతుందని చెప్తున్నప్పటికి.. కేవలం 900 నుంచి 1200 క్యూసెక్కుల నీటి విడుదలవుతుందని ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డి అంటున్నారు. ఇంత తక్కువ నీరు ఆయకట్టు చివరి భూములకు అందడం కష్టంగా మారిందని.... ఎమ్మెల్యే తెలిపారు.

శ్రీరామ్‌ సాగర్‌ ప్రాజెక్టు నుంచి...
శ్రీరామ్‌ సాగర్‌ ప్రాజెక్టు నుంచి విడుదలైన నీటితో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో లక్షల ఎకరాల భూములు సాగవుతుంటాయి. ఈసారి ప్రాజెక్టులో సరిపడ నీటి లభ్యతో లేకున్నప్పటికి జిల్లాకు చెందిన మంత్రులు,ఎమ్మెల్యేల ఒత్తిడితో మంజీర, సింగూరు, నిజాం సాగర్‌ జలాలను శ్రీరామ్‌ సాగర్‌లోకి విడుదల చేసి.. అక్కడి నుంచి కరీంనగర్‌ లోయర్‌ మానేర్‌ డ్యామ్‌ లోకి 14.40 టిఎంసిల నీటిని విడుదల చేయడం జరిగింది. లోయర్‌ డ్యామ్‌కు చేరిన నీటిని మంత్రి ఈటల, రసమయిలు.. వారు ప్రాతినిధ్యం వహిస్తున్న హుజురాబాద్, మానకోండుర్ నియోజక వర్గాలకు కాకతీయ కెనాల్ ద్వారా నీటిని విడుదల చేసుకున్నారు. దీంతో పెద్దపల్లికి నీటి విడుదలకి అవకాశం ఉన్నప్పటికీ... ఎందుకు విడుదల చేయడం లేదని మనోహర్ రెడ్డి ఎస్‌ఆర్‌ఎస్పీ అధికారులతో వాగ్వాదానికి దిగారు.అధికారులతో మనోహర్ రెడ్డి గోడవ పడిన విషయం మంత్రి ఈటలకి తెలిసినప్పటికి విషయంపై స్పందించక పోవడం గమనార్హం. కాకతీయ కాలువకు నీటి విడుదల సమయంలో... పెద్దపల్లి, మంథనితో పాటు మిగతా నియోజవర్గ రైతాంగం... నీటిని దుర్వినియోగం చేసుకోవద్దని ఈటల సూచన చేయడం చర్చనీయాంశమైంది.

ఎమ్మెల్యే నీటివాటలు...
ఎమ్మెల్యే నీటివాట అడిగినప్పటికి అధికార పార్టీలోని తోటి ఎమ్మెల్యేలు మాత్రం ఆయన గోడును అర్థం చేసుకోలేక పోతున్నరని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొదట్నుంచి ఎమ్మెల్యేలంతా తనపై వివక్ష చూపుతున్నారని పలు సందర్భాల్లో ఆయన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.అయితే ఎమ్మెల్యేపై వివక్షకి కారణం కూడా లేకపోలేదు. వచ్చే ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి బరిలో ఎమ్మెల్సీ భాను ప్రసాద రావు, ఈడీసీ చైర్మన్‌ ఈద శంకర్ రెడ్డి, కాల్వ శ్రీరాంపూర్‌ ఎంపీపీ సారయ్య గౌడ్‌లు ఉవ్విళ్లు ఊరుతున్నారు. దీంతో నియోజక వర్గానికి నీళ్లొస్తే మనోహర్ రెడ్డికి ప్రజల్లో ఆదరణ పెరుగుతుందనే ఉద్దేశ్యంతో వీరు అడ్డుపడుతున్నరనే ఆరోపణలున్నాయి. మంత్రి ఈటెల రాజేందర్ కు సన్నిహితులైన ఈ నేతలు పెద్దపల్లికి ఎందుకు నీరివ్వడం లేదని ప్రశ్నించక పోవడంలో అర్థం ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి ముగ్గురు నేతలు... నియోజక వర్గానికి నీళ్లు తీసుకురావాల్సిన బాధ్యత వీరిపై ఉందనేది స్థానికుల అభిప్రాయం. భవిష్యత్ రాజకీయాల కోసం ఆరాట పడుతున్న నేతలకు రైతులు తమ జీవితాలతో ఆడుకోకుండంటూ వేడుకుంటున్నారు. ఓట్లకోసం నీటి రాజకీయాలు చేయవద్దని కోరుతున్నారు. 

12:29 - January 6, 2018

మహబూబ్ నగర్ : జిల్లా కాంగ్రెస్‌ నేతల మధ్య కుమ్ములాటలు తారస్థాయికి చేరాయి. గత ఎన్నికల ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకున్నారో లేదో తెలియదు కానీ.. పాలమూరు జిల్లాలోని కాంగ్రెస్‌ అగ్రనాయకులు... అంతర్గత విభేదాలను మాత్రం మానుకోలేదు. ఎప్పుడో ఏడాదిన్నర తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి తమ వర్గం వారికే టికెట్లు ఇవ్వాలంటూ నేతలు పంతానికి పోతున్నారు. జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నాయకులు... మాజీ కేంద్ర మంత్రి జైపాల్‌ రెడ్డి, మాజీమంత్రి డీకే అరుణ వర్గాల మధ్య ఈ పోటీ మరీ ఎక్కువగా సాగుతోంది.

దేవరకద్ర నియోజకవర్గంలో...
కాంగ్రెస్‌ పార్టీ దేవరకద్ర నియోజకవర్గంలో... తమ వర్గానికే టికెట్‌ ఇప్పించుకోవాలని, జిల్లా పార్టీ అగ్రనాయకులు ప్రయత్నిస్తున్నారు. ఇంఛార్జి డొకూర్‌ పవన్‌ కుమార్‌రెడ్డి... రెండో సారి పార్టీ టికెట్‌ ఆశిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న కాటం ప్రదీప్‌కుమార్ గౌడ్‌ కూడా టికెట్‌ కోరుతున్నారు. వీరికితోడు లాయర్‌ మధుసూదన్‌ రెడ్డి కూడా టికెట్‌ రేస్‌లో ఉన్నారు. దీంతో కాంగ్రెస్‌ టికెట్‌కు త్రిముఖ పోటీ నెలకొంది. దేవరకద్రలో ఇంతవరకూ డీకే అరుణ వర్గం ఆధిపత్యమే కొనసాగింది.. కాగా ఇప్పుడు జైపాల్‌ రెడ్డి వర్గం పట్టుకోసం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా ప్రదీప్‌ కుమార్‌ పండుగ శుభాకాంక్షలతో బ్యానర్లు ఏర్పాటు చేశారు.. ఐతే తమ నేత ఫోటో లేదంటూ మరోవర్గం వాటిని తొలగించింది. దీంతో వ్యవహారం పోలీస్‌ కేసు దాకా వెళ్ళింది.

ఫ్లెక్సీలతో వివాదం..
ఫ్లెక్సీలు కట్టి.. వివాదానికి కారణమయ్యాడని ప్రత్యర్థులు ఆరోపిస్తున్న ప్రదీప్‌కుమార్‌ మాత్రం.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ తనదేనన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి చేసిన సేవలు, తన అనుభవం కారణంగానే తనకు వస్తుందని ఘంటాపథంగా చెప్పగలుగుతున్నానని అంటున్నారు. మొత్తానికి, ఎన్నడూ లేనంతగా.... కాంగ్రెస్‌ పార్టీ దేవరకద్ర శాఖలో చిచ్చురాజుకుంది. జైపాల్‌రెడ్డి, డి.కె.అరుణ వర్గీయుల మధ్య మాటల యుద్ధం తార స్థాయికి చేరింది. ఈ కుమ్ములాటలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. దీంతో.. దేవరకద్ర కాంగ్రెస్‌ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

 

12:28 - January 6, 2018

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ సంస్థ సీఈఏ 2017-18కి సంబంధించి దేశంలోని పలు రాష్ట్రాల్లో జరుగుతున్న విద్యుత్ సరఫరా పరిస్థితిపై సమీక్ష నిర్వహించింది. అసలు విద్యుత్ కోతలు లేకుండా విద్యుత్ ఉన్న రాష్ట్రాలు చండీఘర్, ఢిల్లీ, పంజాబ్, హర్యానా , గుజరాత్, గోవా , మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, పాండిచేరి, కేరళ, సిక్కిం, ఒడిశా, వెస్ట్ బెంగాల్ , జార్ఖండ్, మేఘాలయ కాగా కేంద్ర పాలిత ప్రాంతాలలో కూడా విద్యుత్ కోతలు లేవు. రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ , మిజోరాం , నాగాలాండ్, త్రిపుర, బీహార్ రాష్ట్రాల్లో కేవలం 1 నుండి 2 శాతం లోటు ఉంది..అలాగే 2017-18 సంవత్సరంలో27 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో విద్యుత్ కొరత ఉండదని, మిగిలిన రాష్ట్రాల్లో కూడా అతితక్కువ కొరత ఉంటుందనీ, ఒకవేళ ఉన్నా వాళ్ళు బహిరంగ మార్కెట్లో విద్యుత్తును కొనుక్కోవడం ద్వారా కోతను అధిగమించడం సాధ్యమవుతుందనీ సీఈఏ రిపోర్టులో తెలిపింది.

రైతులు ఎలాంటి ప్రయోజనం లేదు
ఇక దేశ వ్యాప్తంగా 2017-18లో అవసరమైన విద్యుత్తు 12 లక్షల 29 వేల 661 యూనిట్లు కాగా, లభ్యత 13 లక్షల 37వేల 828 మిలియన్ యూనిట్లు, మిగులు 10 లక్షల 81 వేల 67 మిలియన్ యూనిట్లు..అంటే అవసరమైన విద్యుత్తు కన్నా లభ్యత ఎక్కువగా ఉంది. తెలంగాణ వచ్చిన తరువాత మొదలుపెట్టిన ఒక్క ప్రాజెక్టూ ఇప్పటివరకూ ఉత్పత్తి మొదలుపెట్టలేదు. ప్రతి విద్యుత్ ప్రాజెక్టుపై దామాషాలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు వినియోగించుకోవాలి. తెలంగాణ 20.52 లక్ష పంపు సెట్లు పనిచేయాలి..వీటికి 12 వేల 432 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం. వర్షాభావ పరిస్థితులు, కరువు కారణంగా వీటిలో 13 లక్షల పంపుసెట్లు పనిచేయడం లేదు. దీనికి కారణంగా ఆ విద్యుత్‌ను డొమెస్టిక్‌గా వాడుతున్నారు. దీంతో నిరంతర విద్యుత్ సరఫరా కారణంగా రైతులు ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదు.

ముడి సరుకు లేకుండా 75శాతం మూతపడ్డాయి.
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 90 వేల 971 పరిశ్రమల్లో 3వేల 506 వ్యవసాయ ఆధారితమైనవి ఉన్నాయి. రైస్ మిల్లులు ,పప్పు పత్తి మిల్లులు ముడి సరుకు లేకుండా 75శాతం మూతపడ్డాయి..వీటికి వినియోగించే విద్యుత్తు అంతా ఇప్పుడు ఆదా అవుతోంది. రాష్ట్రంలో ఉన్న విద్యుత్ ఉత్పాదక కేంద్రాలపై ప్రభుత్వం దృష్టి సారించకుండా అదనంగా విద్యుత్ కొనుగోలు చేస్తూ నిరంతర విద్యుత్ ఇవ్వడం వల్ల తెలంగాణకు ఒరిగేది లేదని రైతు సంఘ నేతలు అంటున్నారు. 9 గంటల విద్యుత్‌ను సక్రమంగా అమలు చేస్తే చాలునని.. 24 గంటల విద్యుత్‌ను కోరడం లేదని చెబుతున్నారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరాకు సుమారు వెయ్యికోట్ల భారం విద్యుత్ సంస్థలపై పడుతోంది. ప్రభుత్వం మాత్రం కేవలం రూ.5 వేల 500 కోట్ల భారం భరిస్తానంటోంది. ఇప్పటికే విద్యుత్ సంస్థలు చేస్తున్న అదనపు విద్యుత్ కొనుగోళ్ళ ఖర్చులకు ప్రభుత్వం చెల్లింపులు చేయకపోవడంతో విద్యుత్ సంస్థలు ఆర్ధికంగా నష్టాల బాట పడుతున్నాయి. తెలంగాణ వచ్చిన తరువాత విద్యుత్ షాక్‌ల మరణాలు అనూహ్యంగా పెరిగాయి. 2014లో 400 మంది చనిపోతే 2017 నాటికి 600 కి పెరిగింది. మరోవైపు రైతులకు గిట్టుబాటు ధర లేదు.. దొరికేవన్నీ నకిలీ విత్తనాలే.. పంట బీమా లేదు.. రుణమాఫీ అరకొరగా అందుతోంది. కొత్త రుణాలు దొరికేలా లేవు. సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గంలో రికార్డు స్ధాయిలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడినా పట్టించుకునే నాథుడు లేడు. తెలంగాణలో మూడేళ్లలో రైతాంగం అనేక తీవ్ర ఇబ్బందులు ఎదుక్కున్నారు. వాటిపై దృష్టి సారించాల్సిన ప్రభుత్వం నిరంతర విద్యుత్ సరఫరాపైనే దృష్టి సారించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతులకు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిరంతర విద్యుత్ అందిస్తున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వం ఇప్పుడు ఏం సమాధానం చెబుతుందో వేచి చూడాలి. 

12:25 - January 6, 2018

హైదరాబాద్ : 2018 జనవరి 1 నుంచి తెలంగాణ వ్యాప్తంగా 24 గంటల నిరంతర విద్యుత్త్ సరఫరా అవుతోంది. అయితే నిరంతర విద్యుత్ సరఫరాలో ఎదురయ్యే సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించకపోవడంపై రైతాంగం పెదవి విరుస్తోంది. ఓవైపు హాస్టళ్లలో చలికి పిల్లలు గజగజ వణికిపోతున్నా.. కనీసం వారికి దుప్పట్లు , టాయిలెట్లు ఇవ్వలేని ప్రభుత్వం రైతులకు 24 గంటలు విద్యుత్‌ అందించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది.
తెలంగాణ ఏర్పడ్డాక గడిచిన నాలుగేళ్ల కాలంలో వ్యవసాయంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. కేవలం 15 లక్షల హెక్టార్లకు చేరింది. ఉదయం 4 గంటలు.. సాయంత్రం 4 గంటలు మాత్రమే రైతులు విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. మిగిలిన సమయాల్లో సాగుపై దృష్టి సారిస్తున్నారు. గతంలో ప్రభుత్వాలు రైతులకు 9 గంటల విద్యుత్‌ను సమయపాలన లేకుండా సరఫరా చేయడంతో పెద్ద సంఖ్యలో రైతులు మృత్యువాత పడ్డారు. అర్ధరాత్రుల సరఫరా కారణంగా చాలామంది రైతులు పాముకాటులు, కరెంట్ తీగలు తగిలి వేలాదిమంది ప్రాణాలొదిలారు. నిరంతర విద్యుత్ సరఫరా కారణంగా కొంత ప్రయోజనం ఉన్నా.. పూర్తిగా ఉపయోగం లేదన్నది రైతుల వాదన.

చాలా చోట్ల పూర్వ కాలం నాటి కరెంట్ పోల్స్
తెలంగాణ పల్లెల్లో అక్కడక్కడ మినహా చాలా చోట్ల పూర్వ కాలం నాటి కరెంట్ పోల్స్, ట్రాన్స్ ఫార్మర్ ఫిడర్లతో విద్యుత్ సరఫరా చేస్తున్నారు. 9 గంటల విద్యుత్‌ సరఫరాకు పాత లైన్లు పనిచేసినా.. నిరంతర విద్యుత్ సరఫరాకు ఆ విద్యుత్‌ లైన్లు ఉపకరించవు. ఏటా విద్యుత్ సరఫరా చేస్తున్న డిస్కమ్‌లకు విద్యుత్ లైన్ల పునరుద్ధరణ, ట్రాన్స్‌ఫార్మర్ల మార్పుకు సబ్సిడీగా వేల కోట్ల రూపాయలు ఇస్తున్నా.. తాత్కాలిక లైన్ల మరమ్మతు, ట్రాన్స్‌ఫార్మర్ల మార్పులు మాత్రమే చేశారు. ఓ వైపు ప్రభుత్వం నుంచి సబ్బిడి పొందుతున్నా..డిస్కమ్‌లు ఆదనంగా రైతుల నుంచి విద్యుత్ లైన్ల పునరుద్ధరణ పేరుతో వసూళ్లకు పాల్పడున్నాయి..కానీ క్షేత్ర స్ధాయిలో మాత్రం లైన్ల మార్పు జరగలేదు.

ట్రాన్స్‌ ఫార్మార్లు ప్రమాదాలు
ఇక నిరంతర విద్యుత్‌ సరఫరాతో చాలా ట్రాన్స్‌ ఫార్మార్లు ప్రమాదాలకు గురౌతున్నాయి. నాణ్యమైన కరెంట్ సరఫరా చేయకపోవడంతో విద్యుత్ ఫిడర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయి. గతంలో 9 గంటలు విద్యుత్ సరఫరా చేసినపుడు రైతులు మాటిమాటికీ పొలాలకు వెళ్లే పరిస్థితి నుంచి బయటపడేందుకు ఆటోమేటిక్ స్టాటర్లను వినియోగించారు. తాజాగా ప్రభుత్వం వాటిని రైతులు స్వచ్ఛందంగా తొలగించాలని విజ్ఞప్తి చేసింది. నిజానికి నిరంత విద్యుత్ గ్రామీణ స్ధాయిలో సరఫరా అవుతున్నా...విద్యుత్ అంతరాయల కారణంగా రైతుల పొలాల్లో మోటార్లు మధ్యలో అగిపోతున్నాయి. దాంతో రైతులు మళ్లీ పొలానికి వెళ్లి మోటార్ ఆన్‌ చేయాల్సి వస్తోంది. 

12:24 - January 6, 2018

విశాఖ : జిల్లాలో జరిగిన అగ్నిప్రమాదంలో ఓ వృద్ధురాలు సజీవదహనం అయ్యింది. నర్సిపట్నం మండలం చెట్టుపల్లి గ్రామంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌తో గుడిసెకు నిప్పంటుకుంది. అర్ధరాత్రి నిద్రలో ఉన్న వృద్ధురాలు వరమలమ్మ ఇది గమనించలేదు. ఒక్కసారిగా మంటలు వ్యాపించంతో గుడిసె కూలిపోయింది. దీంతో లోపల ఉన్న వరమలమ్మ మంటల్లో నిలువునా కాలిపోయింది.  

12:04 - January 6, 2018
12:03 - January 6, 2018
12:02 - January 6, 2018

లక్నో : యూపీ అసెంబ్లీ ఎదుట రైతులు వినూత్న ఆందోళనకు దిగారు. రైతులు అసెంబ్లీ ముందు అలుగడ్డలను పారబోసి నిరసన తెలుపుతున్నారు. ఉత్తరప్రదేశ్ లో అలుగడ్డ ధరలు భారీగా పడిపోయాయి. ప్రస్తుతం యూపీ కిలో అలు కు రూ.4 పలుకుతుంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

12:02 - January 6, 2018

 

హైదరాబాద్ : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, కత్తి మహేష్ కు కౌంటర్ ఇచ్చారు. వ్యక్తిత్వంలో నిన్ను ఓడించడం చేతకానివాళ్లు నీ కులం, మతం, ధనం, వర్ణం గురించి మాట్లాడుతారని పవన్ ట్వీట్ చేశాడు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

12:01 - January 6, 2018

ముంబై : గుజరాత్ దళిత నేత జిగ్నేష్ మేవాని మోడీ పై విరుచుకు పడ్డారు. మోడీ అంబేద్కర్ వారసుడని చెప్పుకుంటూ దళితులను వేధిస్తున్నారని ఆయన అన్నారు. మహారాష్ట్ర లోని గోరేగావ్ ఘటన వెనక ఉన్న శక్తులను ఎందుకు అరెస్ట్ చేయాలేదని ఆయన ప్రశ్నించారు.

12:00 - January 6, 2018

రాంచీ : రాంచీ లోని సీబీఐ కోర్టు దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ కు శిక్షను ఖరారు చేయనున్నారు. లాలూ శిక్ష ఖరారు ఇప్పటికే అనేక సార్లు వాయిదా పడింది. మరో వైపు లాలూ ప్రసాద్ యాదవ్ తన వయస్సు మీద పడిందని, తను ఆర్యోగం బాగాలేదని శిక్షను తక్కువ విధించాలని ఆయన కోర్టును కోరారు.

తాంత్రిక పూజలు జరగలేదట...!

కృష్ణా : విజయవాడ కనుకదుర్గగుడిలో తాంత్రిక పూజలు జరగలేదని నిజనిర్ధారణ కమిటీ తెలిపింది. కమిటీ సభ్యులు ఇవాళ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. కమిటీ సభ్యులు ఈవో సూర్యకుమారి సహా 40 మందిని ప్రశ్నించారు. సీసీటీవి దృశ్యాల్లో ఉన్నవి కొబ్బరికాయలు, గుమ్మడికాయలు కావని, అమ్మవారికి తాంత్రిక పూజలు చేసే ధైర్యం ఎవరకి లేదని కమిటీ సభ్యుడు శ్రీరామ్ శర్మ అన్నారు. 

బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం

కడప : జిల్లాలో ఓ బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. కిడ్నాప్ మిస్టరీని పోలీసులు నాలుగు గంటల్లో ఛేదించారు. సెల్ సిగ్నల్ ఆధారంగా నింధితుడు ఉన్న ప్రాంతాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో కిడ్నాపర్ బాబు ఒదిలేసి పారిపోయాడు. బాలుడు రిమ్స్ కు వెళ్లే దారిలో బొరుగుల ఫ్యాక్టరీ వద్ద గాయలతో కనిపించాడు. బాలుడిని వెంటనే స్థినిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. 

09:08 - January 6, 2018

కృష్ణా : విజయవాడ కనుకదుర్గగుడిలో తాంత్రిక పూజలు జరగలేదని నిజనిర్ధారణ కమిటీ తెలిపింది. కమిటీ సభ్యులు ఇవాళ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. కమిటీ సభ్యులు ఈవో సూర్యకుమారి సహా 40 మందిని ప్రశ్నించారు. సీసీటీవి దృశ్యాల్లో ఉన్నవి కొబ్బరికాయలు, గుమ్మడికాయలు కావని, అమ్మవారికి తాంత్రిక పూజలు చేసే ధైర్యం ఎవరకి లేదని కమిటీ సభ్యుడు శ్రీరామ్ శర్మ అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

09:01 - January 6, 2018

కడప : జిల్లాలో ఓ బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. కిడ్నాప్ మిస్టరీని పోలీసులు నాలుగు గంటల్లో ఛేదించారు. సెల్ సిగ్నల్ ఆధారంగా నింధితుడు ఉన్న ప్రాంతాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో కిడ్నాపర్ బాబు ఒదిలేసి పారిపోయాడు. బాలుడు రిమ్స్ కు వెళ్లే దారిలో బొరుగుల ఫ్యాక్టరీ వద్ద గాయలతో కనిపించాడు. బాలుడిని వెంటనే స్థినిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. బాలుడు క్షేమంగా బయటపడడంతో కుటుంబసభ్యులు ఆనందంలో మునిగితెలారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

నేడు భోపాల్ లో అన్నిరాష్ట్రాల డీజీపీ సమావేశం

భోపాల్ : నేటి నుంచి మధ్యప్రదేశ్ లో అన్ని రాష్ట్రాల డీజీపీ ల సమావేశం ప్రారంభం కానుంది. ప్రధాని మోడీ డీజీపీల సమావేశాన్ని ప్రారంభించనున్నారు. ఈ డీజీపీ సమావేశాలు మూడు రోజులపాటు జరుగుతాయి. 

నేడు జేఏసీ, వామపక్షాల పాదయాత్ర

సిద్దిపేట : నేరేళ్ల బాధితులకు న్యాయం చేయాలని ఉదయం 10 గంటలకు వామపక్షాల, టీజేఏసీ ఆధ్వర్యంలో సిద్దిపేట నుంచి నేరేళ్ల వరకు పాదయాత్ర చేయనున్నారు. 

నేడు నెల్లూరులో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు

గుంటూరు : నేడు ఏపీ సీఎం చంద్రబాబు నెల్లూరు జిల్ల కోడూరుపాడులో పర్యటించనున్నారు. ఆయన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో పాల్గొననున్నారు.

07:41 - January 6, 2018

టీడీపీ ఎంపీలు ఈ రోజు నిద్రలేచరని, విభజన హామీలు ఇంతవరు అలాగే ఉన్నాయని, శంకుస్థాపనకు వచ్చిన మోడీ మట్టి నీళ్లు ఇచ్చారు తప్ప ఏమీ ఇవ్వలేదని, టీడీపీ ఎంపీలు ఖాళీగా ఉన్నారని, వారి అసెంబ్లీ పెంచడమనేది తప్ప వేరే విషయం లేదని, ప్రభుత్వం ఏది కట్టిన తాత్కలికంగా నిర్మిస్తున్నారని వైసీపీ వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. విభజన హామీలు అమలు జరగలేదని మంత్రి సుజన చౌదరితో సహా బీజేపీ నేతలు అంగీరించారని, వారు ప్రధాని నుంచి ఒక్క హామీ పొందారు అదేంటంటే సీఎం అపాయింట్ మెంట్ ఇవ్వడమని, 20 వేల కోట్లు రావాలని సీఎం చెప్పారని, ఇంతవరకు రైల్వే జోన్ రాలేదని, రాయలసీమకు ప్యాకెజీలు కూడా రాలేదని సీపీఎం ఏపీ రాష్ట్ర నాయకులు బాబురావు అన్నారు. రాష్ట్ర నేతలు మోడీని అనేక దఫాలుగా కలిశారని, సీఎం చంద్రబాబు అనేక సార్లు ప్రధానిని కలిశారని, తాడేపల్లిగూడెంలో నీట్ వచ్చింది, తిరుపతిలో వచ్చింది కానీ కొంత జాప్యం జరిగిందని, నిర్ధిష్టమైన సమయంలో ఇవ్వన్ని వస్తాయ అని అంటే చెప్పలేమని టీడీపీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ అన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

07:28 - January 6, 2018

డైరీ మొదలు పెట్టలకునుకుంటున్నవారు మూడు విషయాలను తెలుసుకోవాలి. ఒకటి మార్కెటింగ్, రెండు సిటీ దగ్గరగా ఉండడం, డైరీ నిర్వహణ గురించి తెలుసుకోవాలని, చలికాలంలో పశువులకు నిమోనియా వచ్చే అవశాకం ఉంటుంది కాబట్టి పశువులకు షెడ్డు నిర్మించాలని, గాలి వెలుతురు వచ్చే విధంగా షెడ్డు ఏర్పాటు చేయాలని, పశుసంవర్ధశాఖ సహాయ సంచాలకులు డా.అనిల్ అన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

07:27 - January 6, 2018

కేప్ టౌన్ : మ్యాచ్‌ ఆరంభమైన 30 నిమిషాల్లోనే ముగ్గురు టాప్‌ ఆర్డర్‌ ఆటగాళ్లను పెవిలియన్‌కు పంపి భువనేశ్వర్‌ కుమార్‌ భారత్‌కు శుభారంభం అందించాడు. దీంతో ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు 4.5 ఓవర్లకు 12 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.ఈ దశలో క్రీజులోకి వచ్చిన డివిలియర్స్‌ భారత పేసర్లపై ఎదురుదాడికి దిగాడు. అప్పటి వరకు చెమటలు పట్టించిన భువీ బౌలింగ్‌లో 9వ ఓవర్లో 4 ఫోర్లు బాది 17 పరుగులు సాధించాడు. వైవిధ్య బంతులను ఎదుర్కొంటూ ఏబీడీ, డుప్లెసిస్‌ మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడారు. సఫారీ సారథి డుప్లెసిస్‌ సహకారంతో దూకుడుగా ఆడిన డివిలియర్స్‌ కెరీర్‌లో 41వ అర్ధశతకం సాధించాడు. లంచ్‌ విరామం తర్వాత ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఈ జోడీని 114 పరుగుల వద్ద బుమ్రా విడదీశాడు. టెస్టుల్లో అరంగేట్రం చేసిన యువ బౌలర్‌ బుమ్రా బౌలింగ్‌లో విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ డివిలియర్స్‌ బౌల్డ్‌ అయ్యాడు. అప్పటి వరకు ఎవరికీ చిక్కకుండా ఆడిన ఏబీడీని ఔట్‌ చేసి బుమ్రా ప్రశంసలందుకున్నాడు.

నిలకడగా ఆడుతూ వచ్చిన డుప్లెసిస్
క్రీజులో అడుగుపెట్టింది మొదలు నిలకడగా ఆడుతూ వచ్చిన డుప్లెసిస్ ఈ క్రమంలో కెరీర్‌లో 16వ అర్ధశతకం నమోదు చేశాడు. అనంతరం కొద్దిసేపటికే యువ ఆల్‌రౌండర్‌ పాండ్య వేసిన బంతికి జట్టు స్కోరు 142 పరుగుల వద్ద వెనుదిరిగాడు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన డికాక్‌ 40 బంతుల్లో 7 ఫోర్లతో 43 పరుగులు సాధించాడు. ఫిలాండర్‌ 35 బంతుల్లో 4 ఫోర్లతో 23 పరుగులు చేశాడు. వీరిద్దరూ చాలా వేగంగా 60 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే వీరిద్దరూ ఔటైన తర్వాత కూడా కేశవ్‌ మహరాజ్‌(35), కగిసో రబాడ(26) ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. వీలైనన్ని పరుగుల్ని స్కోరు బోర్డుపై ఉంచాలనే ఉద్దేశంతో సింగిల్స్‌ తీస్తూనే బౌండరీలు బాదారు. ఇన్నింగ్స్‌ ఆఖర్లో రబాడ, మోర్కెల్‌ను అశ్విన్‌ ఔట్‌ చేశాడు. భారత బౌలర్లలో భువనేశ్వర్‌ నాలుగు, అశ్విన్‌ రెండు, షమీ, బుమ్రా, పాండ్య తలో వికెట్‌ దక్కించుకున్నారు. దక్షిణాఫ్రికాను తొలి ఇన్నింగ్స్‌లో 286 పరుగులకు కట్టడి చేసి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు.. సఫారీ బౌలర్లు షాకిచ్చారు. టాప్‌ ఆర్డర్‌ ముగ్గురు ఆటగాళ్లు చెత్త షాట్లు ఆడి పెవిలియన్‌కు వరుస కట్టారు. దీంతో తొలిరోజు ఆట ముగిసేసరికి భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 11 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 28 పరుగులు చేసింది. భారత్‌ ఇంకా 258 పరుగులు వెనుకబడి ఉంది. పుజారా(5), రోహిత్‌ శర్మ(0) క్రీజులో ఉన్నారు.

07:26 - January 6, 2018

హైదరాబాద్ : లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ జైలుకెళ్లిన గజల్‌ శ్రీనివాస్‌ బెయిల్‌ పిటిషన్‌ను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిల్‌ మంజూరు చేయవద్దంటూ పంజాగుట్ట పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు. గజల్‌ బయటకు వస్తే సాక్ష్యాలను ప్రభావితం చేస్తాడని పోలీసులు కౌంటర్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు. దీంతో కోర్టు బెయిల్‌ పిటిషన్‌ను కొట్టేసింది.

కుట్రపూరితంగానే స్ట్రింగ్‌ ఆపరేషన్‌..
గజల్‌ తరపున న్యాయవాది ఉమామహేశ్వరరావు వాదనలను వినిపించారు. 41 సీఆర్పీ నోటీసు ఇచ్చిన వెంటనే.. దానిపై పూర్తి వివరణ ఇవ్వడానికి కూడా సమయం ఇవ్వలేదన్నారు. కుట్రపూరితంగానే స్ట్రింగ్‌ ఆపరేషన్‌ చేసి.. గజల్‌ను ఇరికించారన్నారు. గజల్‌పై వేసిన 354, 354A, 509 సెక్షన్లు బెయిలెబులే అని, పోలీసుల కస్టడీకి అనుమతించకుండా బెయిల్‌ ఇవ్వాలని వాదించారు. విచారణ పేరుతో పీఎస్‌కు పిలిచి అరెస్ట్‌ చేసినా.. ఇంకా విచారించేది ఏముంటుందని ప్రశ్నించారు గజల్‌ తరపు న్యాయవాది.బాధితురాలు ఇచ్చిన ఆధారాలతోనే గజల్‌ను అరెస్ట్‌ చేశామన్నారు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌. 41 సీఆర్పీ నోటీసు ఇచ్చినప్పటికీ... దానికి సరైన సమాధానం ఇవ్వనందుకే అరెస్ట్‌ చేశామని తెలిపారు. ఈ కేసులో ఏ2 నిందితురాలిగా ఉన్న పార్వతి ప్రస్తుతం పరారీలో ఉందని, ఇంకా కొందరిని ఈ కేసులో విచారించవలసి ఉందని కోర్టుకు తెలిపారు. ఈ కేసులో స్వాధీనం చేసుకున్న సీడీలను ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపిస్తామన్నారు. అయితే మీడియాలో ఇంటర్వూలు ఇస్తున్న నిందితురాలు పరారీలో ఉన్నట్లు ఎలా చెబుతారని, అనుమతి లేకుండా సీడీలను ఎఫ్‌ఎస్‌ఎల్‌కు ఎలా పంపిస్తారని కోర్టు పీపీని ప్రశ్నించింది.

బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేత..
తన క్లయింటుకు బెయిల్‌ మంజూరు చేయాలని గజల్‌ తరపు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. ఈ కేసులో బాధితురాలు చెప్పిన విధంగా గజల్‌ వేధించినట్లు, లైంగిక హింస చేసినట్లు ఎక్కడా ఆధారాలు లేవన్నారు. వీడియోలో ఉన్నది బాధితురాలు కుమారి కాదని, పథకం ప్రకారమే గజల్‌ను కేసులో ఇరికించారన్నారు. గజల్‌ బెయిల్‌ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలుకు పోలీసులు గడువు కోరారు. అయితే... అందుకు అంగీకరించని కోర్టు అరగంటలో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. దీంతో పోలీసులు అరగంటలో కౌంటర్‌ దాఖలు చేశారు. అనంతరం పోలీసుల వాదనతో ఏకీభవించిన కోర్టు గజల్‌ బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసింది. మొత్తానికి బెయిల్‌ పిటిషన్‌లో గజల్‌ శ్రీనివాస్‌కు నిరాశే ఎదురైంది. అయితే... నాంపల్లి కోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ గజల్‌ హైకోర్టుకు వెళ్తారా లేదా అన్నది వేచి చూడాలి.

 

07:24 - January 6, 2018

ఢిల్లీ : పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ ఆంధ్రప్రదేశ్‌ టీడీపీ, బీజేపీ ఎంపీలు ప్రధాని మోదీని కలిశారు. పార్లమెంట్‌ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడడంతో... మర్యాదపూర్వకంగా ప్రధానిని కలిసిన ఎంపీలు... అన్ని అంశాలపై మోదీ సానుకూలంగా స్పందించారన్నారు. రైల్వేజోన్‌, ప్రత్యేక ప్యాకేజి, పోలవరం, అసెంబ్లీ స్థానాల పెంపు అంశాలను ఎంపీలు ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. మొత్తం 16 పేజీల మెమోరాండాన్ని మోదీకి అందజేశారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీలను కాల పరిమితితో పూర్తి చేసేందుకు టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయాలని కోరారు.

రెవెన్యూ లోటు 7500 కోట్ల రూపాయలు
ఇక 2014-15 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ లోటు 7500 కోట్ల రూపాయలపాయలకు గాను 3979 కోట్లు మాత్రమే ఇచ్చిన విషయాన్ని మోదీకి తెలిపారు. మిగిలిన బకాయిలు చెల్లించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. EAP ప్రాజెక్టులకు రుణాల రూపంలో నిధులివ్వాలని కోరారు. అలాగే... కేంద్రం, నాబార్డ్‌ ఇచ్చిన రుణాలకు చెల్లించాల్సిన వడ్డీల కింద EAP కింద ఇచ్చే నిధులను జమ చేసుకోవాలని ఎంపీలు విజ్ఞప్తి చేశారు. ఇక ఏపీ భవన్‌ విభజనను కూడా వేగవంతం చేయాలని ఎంపీలు కోరారు. అయితే.. త్వరలోనే చంద్రబాబు తనను కలవనున్నట్లు మోదీ తెలిపారన్నారు ఎంపీలు. అన్ని అంశాలను భేటీలో చర్చించనున్నట్లు ప్రధాని తెలిపారన్నారు.మొత్తానికి రాష్ట్ర సమస్యల పట్ల మోదీ సానుకూలంగా స్పందించడంతో నేతలంతా సంతోషం వ్యక్తం చేశారు. 

07:23 - January 6, 2018

కృష్ణా : గత నెల 26వ తేదీ అర్థరాత్రి విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ ఆలయంలో తాంత్రిక పూజలు నిర్వహిచనట్టు జరిగిన ప్రచారం చినికి చినికి గాలివాన చందంగా మారింది. ఈ వ్యవహారంపై చిలవుల, పలవులుగా ప్రచారం జరిగింది. ఆలయంతోపాటు ప్రభుత్వ ప్రతిష్ట మంటకలిసేలా ఉన్న ఈ వివాదంలో నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆగమశాస్త్ర సలహాదారు శ్రీరామ్‌ శర్మ అధ్యక్షతన ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిజనిర్ధారణ కమిటీ తన పనిని దాదాపు పూర్తి చేసింది. ఆలయ కమిటీ చైర్మన్‌తోపాటు పాలకమండలి సభ్యులను విచారించి, ఇవాళ ప్రభుత్వానికి నివేదిక అందించే అవకాశం ఉంది.

40 మందిని కమిటీ సభ్యులు
తాంత్రిక పూజల వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న 40 మందిని కమిటీ సభ్యులును విచారించారు. కార్యనిర్వహణాధికారి సూర్యకుమారిని కూడా ప్రశ్నించారు. వైదిక కమిటీ సభ్యులతోపాటుఅంతరాలయంలో పూజలు నిర్వహించే ప్రధాన అర్చకుడు బద్రినాథ్‌ బాబును విచారించి, సమాచారం రాబట్టారు. సీసీ టీవీలో రికార్డైన దృశ్యాలను నిజనిర్ధారణ కమిటీ సభ్యులు పరిశీలించారు. కొబ్బరికాయలు మినహా, గుమ్మడికాయలు లేవన్న నిర్ణయానఇకి వచ్చారు.

నిజనిర్ధారణ కమిటీ ఏమి తేల్చింది
దుర్గ గుడిలో తాంత్రిక పూజల వివాదంపై నిజనిర్ధారణ కమిటీ ఏమి తేల్చింది ? ఈ వివాదానికి తెరదించేలా తాంత్రిక పూజలు జరగలేదన్ననిర్ణయానికి ఈ కమిటీ వచ్చిందా ? అన్న ప్రశ్నలు ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారాయి. నిజనిర్ధాణ కమిటీ సభ్యుల అభిప్రాయాలు చూస్తుంటే.. దుర్గ గుడిలో తాంత్రిక పూజలు జరగలేదన్న నిర్ణయాన్ని వచ్చినట్టు కనిపిస్తోంది. నిజనిర్ధారణ కమిటీ నివేదిక తర్వాత తాంత్రిక వూజల వివాదానికి తెరపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. తాంత్రిక పూజల వివాదం, పోలీసులు, నిజర్థారణ కమిటీ విచారణలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న దుర్గగుడి అర్చకులు, అధికారులకు ఊరట లభించే చాన్స్‌ ఉంది. కొద్ది గంటల్లోనే దీనిపై స్పష్టత వస్తుంది. 

07:22 - January 6, 2018

హైదరాబాద్ : ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికైన పంచాయతీ రాజ్‌ సంస్థల పాలకవర్గాల పదవీకాలం త్వరలో ముగియనుంది. దీంతో తెలంగాణలో పంచాయతీరాజ్‌ సంస్థల ఎన్నికలపై నేతల్లో ఉత్కంఠ నెలకొంది. పంచాయతీ రాజ్‌ చట్టాన్ని సవరించి కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త పంచాయతీరాజ్‌ చట్టానికి శాసనసభ, శాసనమండలి ఆమోదం లభించిన తర్వాత ఎన్నికలకు వెళ్లాలన్న యోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నారు.

నిర్ణీత గడువు ప్రకారమే ఎన్నికలు
నిర్ణీత గడువు ప్రకారమే ఎన్నికలకు వెళ్లాలని ఇటు ప్రభుత్వం, అటు టీఆర్‌ఎస్‌ అధినాయకత్వం భావిస్తోంది. అయితే కొందరు ఎమ్మెల్యేలు మాత్రం జాప్యం చేస్తే మంచిదన్న అభిప్రాయంతో ఉన్నారు. జిల్లాల నేతలతో సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌... స్థానిక ఎన్నికలకు సిద్దం కావాలన్న సంకేతాలు ఇస్తున్నట్టు సమాచారం. దీంతో నేతలకు గుబులు పట్టుకుటుంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పాటై మూడున్నరేళ్లు గడుస్తున్నా శాసనసభ్యులు క్షేత్ర స్థాయిలో పట్ట సాధించలేకపోయారన్న వాదనలు ఉన్నాయి. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, దిగువస్థాయి నేతలు కూడా ఎమ్మెల్యేలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేరుతున్నాయన్న అభిప్రాయంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నారు. దీంతో టీఆర్‌ఎస్‌కు ప్రజలు అండగా ఉంటారన్న ధీమాతో టీఆర్‌ఎస్‌ అధినాయకత్వంలో వ్యక్తమవుతోంది.

నేతల బలం, బలహీనత..
స్థానిక ఎన్నికలు జరిగితే నేతల బలం, బలహీనతలతో పాటు ప్రభుత్వ విధానాలు, పార్టీ బలాబలాలపై కూడా అవగాహన వస్తుందని నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ నెలాఖరు నాటికి శాసనసభ, మండలిని సమావేశపరిచి, పంచాయతీ రాజ్‌ చట్ట సవరణ బిల్లును ఆమోదింపచేసుకోవాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. 

07:21 - January 6, 2018

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవసాయ శాఖ కార్యకలాపాలపై ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. పలువురు మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరైన ఈ భేటీలో రైతు సమస్యలపై చర్చించారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ సరఫరా, ఎకరానికి 8 వేల రూపాయల ఆర్థిక సాయం, వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాల బలోపేతం, భూరికార్డులు ప్రక్షాళన వంటి అంశాలను సమీక్షించారు.

వ్యవసాయ రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని
సమైక్య రాష్ట్రంలో వ్యవసాయ రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందన్న విషయాన్ని అధికారుల దృష్టికి తెచ్చిన కేసీఆర్‌.. దీనిని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, చెరువుల పునురద్ధరణ వంటి అంశాలను ప్రస్తావించారు. రైతులు పండించిన పంటలకు మార్కెట్‌లో గిట్టుబాటు ధరలు లభించకపోతే ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేసే విధానాన్ని తీసుకురాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. ఈ విషయంలో రైతు సమస్వయ సమితులను క్రియాశీలకంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. వ్యవసాయం బాగుంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంటున్న విషయాన్ని అధికారుల దృష్టికి తెచ్చారు. రైతులకు స్థిరమైన ఆదాయం వస్తే రాష్ట్రం కూడా ప్రశాంతంగా ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

రైతులకు వ్యవసాయ పెట్టుబడి..
రైతులకు వ్యవసాయ పెట్టుబడి మద్దతు పథకం అమలుపై కేసీఆర్‌ ప్రత్యేకంగా సమీక్షించారు. ఈ ఏడాది మే నుంచి అమలు చేసేందుకు ఇప్పటి నుంచి పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మే 15 నాటికి మొదటి విడతగా ఎకరానికి 4 వేల రూపాయల పెట్టుబడి సాయాన్ని రైతులకు అందిచాలని నిర్ణయించారు. ఈ ఏడాది నుంచి వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌ ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు. అన్నదాతలను ఆదుకోడానికి అవసరమైన అన్ని నిధులను దీనిలో కేటాయిస్తారు. భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమం పూర్తైందని కేసీఆర్‌ ప్రకటించారు. రాష్ట్రంలో 71 లక్షల 75 వేల 96 వ్యవసాయ ఖాతాలున్న విషయాన్ని ప్రస్తావించారు. కోటి 42 లక్షల 12 వేల 826.17 ఎకరాల సాగుయోగ్యమైన భూమి ఉన్నట్టు లెక్క తేలిందని అధికారుల దృష్టికి తెచ్చారు. వీటి ఆధారంగా రైతులకు కొత్త పాసు పుస్తకాలు ఇవ్వాలని నిర్ణయించారు. వచ్చే ఖరీఫ్‌కు అవసరమైన అన్ని రకాల విత్తనాలు, ఎరువుల కోసం ఇప్పటి నుంచే పకద్బందీ ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. 

దాణా కుంభకోణంలో నేడు లాలూ శిక్ష ఖరారు

రాంచీ : దాణా కుంభకోణం కేసులో దోషిగా తెలిన లాలూ ప్రసాద్ యాదవ్ తో పాటు మరో కొంత మంది నేడు మధ్యాహ్నం 2 గంటలకు కోర్టు శిక్ష ఖరారు చేయనున్నది. 

Don't Miss