Activities calendar

07 January 2018

23:46 - January 7, 2018

మాజీ మంత్రి, తెలంగాణ శాసనమండలి కాంగ్రెస్ ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీతో 10 టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీసర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

22:18 - January 7, 2018

నెల్లూరు : జన్మభూమి కమిటీలు రాక్షస కమిటీలుగా మారాయని వాటిని వెంటనే రద్దు చేయాలని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. నెల్లూరు జిల్లా విడవలూరులో సీపీఎం 23వ జిల్లా మహాసభల్లో పాల్గొన్న ఆయన.. ప్రభుత్వ హామీలు అమలయ్యేలా చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలన్నారు. వామపక్ష, ప్రజాతంత్ర శక్తుల ఐక్యత కోసం ఒక ప్రత్యామ్నాయ వేదికను నిర్మించాలని మహాసభలో తీర్మానించినట్లు మధు తెలిపారు. 

 

22:17 - January 7, 2018

హైదరాబాద్‌ : నగరంలోని సరూర్‌నగర్‌లో కోటి రూపాయల విలువైన విదేశీ మద్యాన్ని అబ్కారీ శాఖ అధికారులు పట్టుకున్నారు. విదేశీ మద్యం సహా పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 8 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు నెలకు 600 నుంచి 800 బాటిళ్ల విదేశీ మద్యం విక్రయిస్తున్నారని అబ్కారీ శాఖ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌ తెలిపారు. వీరు నెలలో 50లక్షల విలువైన విదేశీ మద్యాన్ని హైదరాబాద్‌ తీసుకొచ్చి విక్రయిస్తున్నారన్నారు. అయితే విదేశీ మద్యం కొన్నవారికి 3 నుంచి పదేళ్ల పాటు జైలు శిక్ష పడుతుందని, విదేశీ మద్యాన్ని ఎవరూ కొనవద్దని అకున్‌ సబర్వాల్‌ ప్రజలకు సూచించారు.

 

22:16 - January 7, 2018

హైదరాబాద్ : వ్యవసాయ ఉత్పత్తులపై రైతులకు ప్రభుత్వాల నుంచి అందుతున్న కనీస మద్ధతు ధరలపై అధ్యయనం చేయాలని మార్కెటింగ్‌శాఖ ఉన్నతాధికారులను మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. మధ్యప్రదేశ్, మహరాష్ట్ర, కర్నాటక, గుజరాత్ హర్యానా తదితర రాష్ట్రాలలో పర్యటించి.. విధివిధానాలు, అక్కడ అవలంబిస్తున్న పద్దతులు పరిశీలించాలన్నారు. ఈ నెల 13వ తేదిలోగా నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు.

తెలంగాణ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ పనితీరుపై మంత్రి హరీశ్‌రావు సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర రైతులకు మెరుగైన సేవలందించేందుకు మార్కెటింగ్‌ శాఖ అధికారుల బృందం.. మధ్యప్రదేశ్, మహరాష్ట్ర, కర్నాటక, గుజరాత్ హర్యానా రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలన్నారు. రాష్ట్ర రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా కొత్త విధానాలు ప్రవేశ పెట్టేందుకు వీలుగా ఈ నెల 13లోగా  అధికారుల బృందం నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. 

కూరగాయల విక్రయ కేంద్రాలను జీహెచ్ ఎంసీ సమీకృత మార్కెట్లతో పాటు అనువైన మెట్రో రైల్వే స్టేషన్లలోనూ త్వరగా ప్రారంభించాలని ఆదేశించారు. విక్రయ కేంద్రాలలో సేంద్రియ పద్ధతుల్లో పండించిన కూరగాయలు, బియ్యం అమ్మే రైతులను ప్రోత్సహించాలని మంత్రి ఆదేశించారు. మొత్తం 330 నాబార్డు గోదాముల్లో మిగతా 18 గోదాముల నిర్మాణం,  ఈఏడాది మార్చిలోగా ఎట్టి పరిస్తితులలోను పూర్తి చేయాలన్నారు. గోదాముల నిర్మాణాలు పూర్తయిన వెంటనే సంబంధిత మార్కెట్ కమిటీలకు అప్పగించాలని ఆదేశించారు.

కేంద్ర ప్రభుత్వ మోడల్ చట్టం ప్రకారం వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ద్వారా వ్యాపారస్థులు, కమిషన్ ఏజెంట్లకు కొత్తగా జారీ చేసే లైసెన్సుల విషయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. బ్యాంక్ పూచికత్తు విషయంలో అవగాహన కల్పించి నూతన లైసెన్సులు జారీ చేయాలన్నారు. గ్రామపంచాయితీల్లో నిర్వహించే పశువుల మార్కెట్లలో ఏడాదికి కోట్ల ఆదాయం వస్తుంటే..మార్కెట్ కమిటీల్లో తక్కువ రావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 2018 మార్చిలోగా అన్ని పశువుల మార్కెట్లను ప్రత్యేక బృందాల ద్వారా తనిఖీ చేయించాలని ఆదేశించారు. మార్కెట్ ఫీజ్ వసూలు పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మార్కెటింగ్ శాఖలో చాలా కాలంగా ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు.

22:14 - January 7, 2018

హైదరాబాద్ : కత్తి మహేశ్‌, పవన్‌ ఫ్యాన్స్ మధ్య వివాదం ముదురుతోంది. ఇదే అంశంపై నిర్వహించిన చర్చ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త దేవి, విశ్లేషకులు తెలకపల్లి రవి, తెలుగు సినీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ట్రెజరర్ రాంసత్యనారాయణ పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

21:48 - January 7, 2018

తూర్పుగోదావరి : పోలవరం ప్రాజెక్టు కోసం ఏపీ కాంగ్రెస్‌ నేతలు పోరాటం ప్రారంభించారు. ఈ  ప్రాజెక్టును పూర్తి చేసే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు  ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపిస్తూ మహా పాదయాత్ర చేపట్టారు. కాంగ్రెస్‌ హయాంలో ప్రారంభమైన పోలవరం ప్రాజెక్టును 2019లో మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత తామే ప్రారంభిస్తామని  పార్టీ నాయకులు చెబుతున్నారు. 
పోలవరం కోసం ఏపీ కాంగ్రెస్‌ మహాపాదయాత్ర 
పోలవరం ప్రాజెక్టు కోసం ఏపీ కాంగ్రెస్‌ నాయకులు మహాపాదయాత్ర చేపట్టారు. రాజమండ్రి సమీపంలోని దవళేశ్వరంలో సర్‌ ఆర్థర్‌ కాటన్‌ విగ్రహానికి పూలమాలవేసి యాత్ర ప్రారంభించారు. పుదుచ్ఛేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి ఈ యాత్రను ప్రారంభించారు. 
నాలుగు రోజులపాటు పోలవరం పాదయాత్ర 
నాలుగు రోజులపాటు పోలవరం పాదయాత్ర కొనసాగుతుంది. రాష్ట్ర ప్రజల హక్కు పోలవరం ప్రాజెక్టు ఫలాలు అందరికీ అందేవరకు పోరాటం అన్న లక్ష్యంతో కాంగ్రెస్‌ నాయకులు ఈ యాత్ర చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మొదటిరోజు పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరు వరకు 12.5 కి.మీ. పాదయాత్ర చేశారు. 
పాదయాత్రను ప్రారంభించిన పుదుచ్ఛేరి సీఎం నారాయణస్వామి... 
ధవళేశ్వరం వద్ద పోలవరం పాదయాత్రను ప్రారంభించిన పుదుచ్ఛేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి... ఏపీ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఎప్పటికప్పుడు పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం పెంచుతూ చంద్రబాబు దోచుకుంటున్నారని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆరోపించారు. 
సభకు ఉండవల్లి, హర్షకుమార్ హాజరు  
పోలవరం పాదయాత్ర పారంభోత్సవ సభ వేదిక వద్దకు మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణ్‌కుమార్‌, జీవీ హర్షకుమార్‌ హాజరుకావడం చర్చనీయాంశంగా మారింది.  కాంగ్రెస్‌ నాయకులు ఈ ఇద్దర్నీ ఆహ్వానించడంతో వేదికపైకి వచ్చి సంఘీభావం ప్రకటించారు. కాంగ్రెస్‌  నుంచి తనను వెలివేసినా పార్టీ నాయకులతో సంబంధాలు కొనసాగిస్తున్న విషయాన్ని ఉండవల్లి ప్రస్తావించారు. పోలవరం కోసం ఏ పార్టీతోనైనా కలిసి పనిచేయడానికి సిద్ధమన్నారు. కాంగ్రెస్‌ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, కేంద్ర మాజీ మంత్రులు పనబాక లక్ష్మి, పల్లంరాజు, కిల్లి కృపారాణి, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాదయాత్రలో పాల్గొన్నారు. పోలవరంపై వాస్తవ పరిస్థితులను ప్రజల దృష్టికి తెస్తామన్నారు. 
 

21:43 - January 7, 2018

కర్నూలు : ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నామని జన్మభూమి కార్యక్రమం వేదికగా మారిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. కర్నూలు జిల్లా జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. సిద్ధాపురం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని రాయలసీమ ప్రాణనాడిగా మారుస్తామని హామీ ఇచ్చారు.
కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటన
జన్మభూమి-మావూరు కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఆత్మకూరు మండలం సిద్ధాపురంలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. సిద్ధాపురం ఎత్తిపోతల పధకాన్ని ప్రారంభించి, నీరు విడుదల చేశారు. దీనికి బుడ్డావెంగళరెడ్డి సిద్ధాపురం ఎత్తిపోతల పథకంగా పేరు పెట్టారు. 119 కోట్ల రూపాయల వ్యయంతో సిద్ధాపురం ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపట్టామని, ఈ పథకం ద్వారా 23 వేల ఎకరాలకు సాగునీరు, 12 గ్రామాలకు తాగునీరు అందుతుందని చంద్రబాబు అన్నారు. 
ఖనిజ సంపదను సమర్థంగా వినియోగించుకోవాలి : చంద్రబాబు
నీళ్లు, అడవులు, ఖనిజ సంపదను సమర్థంగా వినియోగించుకోవాలని చంద్రబాబు ప్రజలకు పిలుపు ఇచ్చారు. ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. కృష్ణా పుష్కరాలను పెద్ద ఎత్తున నిర్వహించామని, రైతులకు రూ. 24వేల కోట్ల రుణమాఫీ చేశామని, రాయలసీమను హార్టీకల్చర్‌ హబ్‌గా తయారు చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాగునీటి ప్రాజెక్టుల కోసం చేసిన ఖర్చుల వివరాలను ప్రకటించారు. సాగునీటి కోసం ఇంతవరకు 50 వేల కోట్లు ఖర్చు చేసినట్టు ప్రజల దృష్టికి తెచ్చారు. కర్నూలు జిల్లాలో కేసీ కాల్వపై నిర్మిస్తున్న ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని రాయలసీమ ప్రాణనాడిగా మారుస్తామని హామీ ఇచ్చారు. గ్రామ సభకు హాజరైన ప్రజలతో ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మభూమి-మావూరు ప్రతిజ్ఞ చేయించారు. సోమవారం పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో జరిగే జన్మభూమి-మావూరు కార్యక్రంలో చంద్రబాబు పాల్గొంటారు. 
 

21:39 - January 7, 2018

హైదరాబాద్ : పవన్‌ కల్యాణ్‌, దర్శకుడు త్రివిక్రమ్‌పై సినీ విమర్శకుడు కత్తి మహేష్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. వారిద్దరు కలిసి క్షుద్రపూజలు చేసింది నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు. తనతో చర్చకు రావాలని  పవన్‌కు సవాల్‌ విసిరిన మహేష్..సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌కు వచ్చి హల్‌చల్‌ చేశారు. అభిమానులు తనపై చేస్తున్న దాడులను పవన్‌ కల్యాణ్‌ ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. తిరుమలలో పవన్‌తో పాటు ఒకే గోత్ర నామాలతో నటి పూనం కౌర్‌ ఎందుకు పూజ చేయించుకున్నారని ప్రశ్నించారు. ఆమెకు బ్రాండ్‌ అంబాసిడర్‌ పదవి ఎలా వచ్చిందో చెప్పాలంటూ కత్తి మహేష్‌ ప్రశ్నల వర్షం కురిపించారు. 
సోషల్‌ మీడియాలో మరింత వేడెక్కిన వార్‌  
సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌, పవన్‌ ఫ్యాన్స్ మధ్య వివాదం అంతకంతకు ముదురుతోంది. సోషల్‌ మీడియాలో కొనసాగుతున్న వార్‌ మరింత వేడెక్కింది. సవాళ్లు, ప్రతిసవాళ్లతో కాక పుటిస్తోంది.  మొన్నటి దాకా ట్విట్టర్‌లో జరిగిన వార్‌..ఇప్పుడు ఫేస్‌ టు ఫేస్‌ అనే దాకా వచ్చింది. చర్చకు రావాలంటూ పవన్‌కు ఓపెన్ ఛాలెంజ్ చేసిన కత్తి మహేష్..అన్నట్లుగానే సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌కు  వచ్చారు. పవన్‌ అభిమానులు కూడా ప్రెస్‌క్లబ్‌కు రావడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ముందుగానే భారీగా మోహరించిన పోలీసులు..పవన్‌ ఫ్యాన్స్‌ను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. 
పూనం కౌర్‌పై కత్తి మహేష్ సంచలన ఆరోపణలు
నటి పూనం కౌర్‌పై కత్తి మహేష్ సంచలన ఆరోపణలు చేస్తూ ప్రశ్నల వర్షం కురిపించారు. తనకు ఏపీ చేనేత బ్రాండ్ అంబాసిడర్ పదవి ఎవరి వల్ల వచ్చిందో పూనం చెప్పాలన్నారు. తిరుమలలో  పవన్ కల్యాణ్‌తో పాటు ఒకే గోత్ర నామాలతో పూనం ఎందుకు పూజ చేయించుకున్నారు? పవన్ మోసం చేశారన్న భావనతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడితే, మిమ్మల్ని కాపాడింది ఎవరు? ఆ  సమయంలో ఆస్పత్రిలో చికిత్సకు ఎంత ఖర్చయింది? ఆ బిల్లు ఎవరు చెల్లించారు? పవన్ మీ అమ్మను కలిసి ఏం ప్రామిస్ చేశారు? ఇప్పటివరకు అది నెరవేర్చారా ? లేదా ? డైరెక్టర్ త్రివిక్రమ్ అంటే  మీకు ఎందుకంత కోపం? ఓ క్షుద్రమాంత్రికుడితో కలసి పవన్‌, త్రివిక్రమ్ పూజలు చేస్తుంటే, అక్కడ మీరు ఏం చేశారు? ఈ ప్రశ్నలకు పూనం సమాధానం చెప్పాలని కత్తి మహేష్ డిమాండ్ చేశారు.  తాను సంధించిన ప్రశ్నలకు సంబంధించి అన్ని ఆధారాలూ తన వద్ద ఉన్నాయని చెప్పారు. 
కోన వెంకట్‌పైనా మండిపడ్డ కత్తి 
సినీ రచయిత కోన వెంకట్‌పైనా మండిపడ్డారు కత్తి మహేష్‌‌. తనపైకి పవన్‌ ఫ్యాన్స్‌ను రెచ్చగొడుతున్నారని ఆక్రోశం వ్యక్తం చేశారు. పవన్‌ ఫ్యాన్స్‌ తీవ్రవాదులుగా మారతారని కోన వెంకట్‌  బెదిరిస్తున్నారని ఆరోపించారు. పవన్‌ అభిమానులు తన కుటుంబ సభ్యులను బూతులు తిడుతుంటే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. ఓ దళితుడిగా తాను ఎన్నోసార్లు సామాజిక  బహిష్కరణను చూశానన్నారు. సినీ ఇండస్ట్రీ నుంచి కూడా తనను బహిష్కరించారని ఆరోపించారు. తన వెనుక ఏ రాజకీయపార్టీ లేదని, ఎలాంటి రాజకీయ అజెండాలేదన్నారు కత్తి మహేష్‌‌. 
రేణుదేశాయ్‌ని విమర్శించినా పవన్‌ స్పందించలేదు : కత్తి మహేష్‌ 
రేణుదేశాయ్ తన రెండో వివాహం గురించి ప్రస్తావిస్తే, ఆమె పెళ్లి చేసుకున్న వ్యక్తిని చంపేస్తామని పవన్‌ అభిమానులు హెచ్చరించడం దారుణమన్నారు కత్తిమహేష్‌. కనీసం ఆ వ్యాఖ్యలను సైతం పవన్  ఖండించలేదని, ఇక ఆయన ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. తన అభిమానులను ఎంతమాత్రమూ కంట్రోల్ చేయలేకపోతున్నారని విమర్శించారు. తాను ఎన్నడూ పవన్ పై వ్యక్తిగత విమర్శలు  చేయలేదని, రాజకీయ వ్యాఖ్యలు మాత్రమే చేశానని, వాటికి సమాధానం చెప్పలేని ఆయన, రాష్ట్రానికి ఏం మేలు చేస్తారని ప్రశ్నించారు. తన ప్రాణాలకు అపాయం ఉందని, దీంతోనే ఈ వివాదానికి  పుల్‌స్టాప్ పెట్టాలని భావిస్తే, తనతో చర్చించేందుకు ఎవరూ రాలేదన్నారు. నిజాలేవీ తెలియకుండా అవాక్కులు చవాక్కులు మాట్లాడుతున్న వ్యక్తిని ఉపేక్షించవద్దని సీనియర్‌ నటి కుష్భూ కత్తి మహేష్‌పై విరుచుకుపడ్డారు. అతన్ని అడ్డుకునే అవకాశం ఉన్నా.. పదే పదే ఎందుకు విమర్శలకు దిగుతున్నాడని ప్రశ్నించారు.  

 

20:40 - January 7, 2018

పాటల రచయిత్రి శ్రేష్ఠతో 10టివి స్పెషల్ చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా శ్రేష్ఠ మాట్లాడారు. తన పాటల కెరీర్ ను వివరించారు. పలు పాటలు పాడి వినిపించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

కోడి పందేల స్థావారాళ్లపై టాస్క్ ఫోర్స్ దాడులు

హైదరాబాద్ : జూబ్లిహిల్స్ లో కోడి పందాల స్థావారాలపై వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. 29 మందిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.70 వేలు, 20 పందెం కోళ్లు, 25 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. 

 

20:06 - January 7, 2018

విజయవాడ : దుర్గ గుడి ఘటనపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. సీఎం చంద్రబాబు తీరునూ ఆయన తప్పుపట్టారు. న్యూ ఇయర్‌కు కూడా దేవాలయాల్లో అలంకరణ చేయకుండా అడ్డుపడుతూ జీవో ఇచ్చారని ఆరోపించారు. ఇప్పడు దుర్గ గుడిలో తాంత్రిక పూజలు చేపట్టారంటే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చన్నారు. ఈ ఘటనలకు కారణం బీజేపీకి చెందిన మాణిక్యాల రావు దేవాదాయ శాఖకు మంత్రిగా ఉండటమేఅన్నారు. సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావును మంత్రి పదవి నుండి తొలగించాలన్నారు.

19:59 - January 7, 2018

పంచాయతీరాజ్ బిల్లు రూపకల్పనకు కమిటీ ఏర్పాటు

హైదరాబాద్ : టీప్రభుత్వం పంచాయతీరాజ్ బిల్లు రూపకల్పనకు కమిటీ ఏర్పాటు చేసింది. సీఎం కేసీఆర్ ఏడుగురు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి చైర్మన్ గా పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును నియమించారు. 

బావిలో దూకి తల్లి సహా ఇద్దరు కూతుళ్లు ఆత్మహత్య

వనపర్తి : వీపనగండ్ల మండలం గోపాల్ దిన్నెలో బావిలో దూకి తల్లి సహా ఇద్దరు కూతుళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కటుంబ కలహాలే కారణమని తెలుస్తోంది. మృతులు తల్లి రోజా, కూతుళ్లు ఆశ (10), వందన (8) గా గుర్తించారు. 

19:09 - January 7, 2018

సూర్యాపేట : జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 20మంది గాయపడ్డారు. విజయవాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు చివ్వెంల మండలం దురాజపల్లి సమీపంలోని తెల్లబండ కాలనీ దగ్గర పల్టీ కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 32మంది ప్రయాణీకులు ఉన్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని సూర్యాపేట ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

19:06 - January 7, 2018

హైదరాబాద్‌ : ఏఎస్‌ రావు నగర్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శైలజ ఫ్యాషన్‌ బొటిక్‌ షాపులో అగ్ని ప్రమాదం జరగడంతో షాపులోని టైలరింగ్‌ మెటీరియల్‌, కుట్టు మిషన్లు పూర్తిగా కాలిపోయాయి. దాదాపు రూ.10లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న ఫైర్‌ సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని మంటలార్పారు.  ప్రమాదానికి షార్ట్‌ సర్క్యూటే కారణమంగా తెలుస్తోంది. 

 

19:03 - January 7, 2018

రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని నేరెళ్లలో దళితులపై పోలీసుల అమానుష ఘటన జరిగి 6నెలలు పూర్తయ్యాయి. అయితే ఇంతవరకు తమకు న్యాయం జరగలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా జిల్లా ఎస్పీ, ఇతర పోలీసు అధికారుల నుంచి బెదరింపు ఫోన్లు వస్తున్నాయని అంటున్నారు. ఈమేరకు బాధితులతో 10 టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. ఎన్ కౌంటర్ చేస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతోనే తమపై దాడి చేసినట్టు పోలీసులే చెబుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎలాంటి సహాయం అందలేదన్నారు. 

 

ఐసిస్ చెర నుంచి ఏలూరు వాసి డా.రామ్మూర్తి విడుదల

అమరావతి : లిబియాలో ఐసిస్ చెర నుంచి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వాసి డా.రామ్మూర్తి విడుదలయ్యారు. రామ్మూర్తికి వైద్య ఖర్చుల కోసం రూ.1.30 లక్షలు, ఆర్థిక సాయంగా రూ.10 లక్షలు ఏపీ సర్కార్ మంజూరు చేసింది. సదరు మొత్తాన్ని చెల్లించాల్సిందిగా ఎన్ ఆర్జీ సీఈవోగా ఆదేశిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

దుర్గగుడి ఈవో సూర్యకుమారి బదిలీ

అమరావతి : దుర్గగుడి ఈవో సూర్యకుమారి బదిలీ అయ్యారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు సూర్యకుమారిపై బదిలీ వేటు వేశారు. ఈమేరకు సూర్యకుమారిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  ఇంచార్జ్ ఈవోగా దేవాదాయ శాఖ కమిషనర్ అనురాధను నియమించారు. సూర్యకుమారిని సాధారణ పరిపాలన శాఖకు సరెండర్ చేశారు.  

18:20 - January 7, 2018

హైదరాబాద్ : నగరంలో భారీగా విదేశీ మద్యం పట్టుపడింది. సరూర్ నగర్ లో రూ.కోటి విలువైన విదేశీ మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 8 మందిని ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ కమిషనర్ అకున్ సబర్వాల్ మీడియాతో మాట్లాడారు. విదేశీ మద్యం కొన్నవారికి కూడా 34ఏ కింద పది సంవత్సరాలు శిక్ష పడుతుందన్నారు. ఇలాంటి లిక్కర్ ను తీసుకోవద్దు, కొనవద్దని సూచించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

18:17 - January 7, 2018

చిత్తూరు : తిరుపతి అలిపిరిలో సైకో వీరంగం సృష్టించాడు. చేతిలో కర్రపట్టుకుని రహదారిపై హల్ చల్ చేశాడు. టూరిజం ఉద్యోగి ప్రభాకర్ పై దాడి చేశాడు. అతన్ని వారించిన నలుగురిపై దాడి చేశాడు. క్షతగాత్రులను రుయా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సైకోను బంధించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అతన్ని ఆస్పత్రికి తరలించి, సైక్రియాటిక్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

18:02 - January 7, 2018
18:00 - January 7, 2018

అమెరికా : బాంబ్‌ సైక్లోన్‌ అమెరికాను వణికిస్తోంది. ఈదురు గాలులు, భారీ వర్షాలు..  దట్టమైన మంచుతో... మనుగడే కష్టంగా మారింది.  ఉష్ణోగ్రతలు.. మైనస్‌ స్థాయికి పడిపోవడంతో.. పదుల సంఖ్యలో జనం మృతిచెందారు. మంచుతో ట్రాఫిక్‌కు తీవ్ర ఇక్కట్లు నెలకొన్నాయి. 
అమెరికాపై విరుచుకుపడిన మరో తుపాన్‌
అమెరికాపై మరో తుఫాన్‌ విరుచుకుపడింది. ఆ దేశ తూర్పు తీరాన్ని తాకిన 'బాంబ్‌ సైక్లోన్‌' ధాటికి ఇప్పటి వరకు 12 మందికి పైగా చనిపోయారు. ఉత్తర, దక్షిణ కరోలినా, బోస్టన్, ఉత్తర ఫ్లోరిడా, న్యూయార్క్, వాషింగ్టన్, వర్జీనియాల్లో తుపాను ప్రభావం అధికంగా ఉంది.
పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు, భారీ వర్షాలు
తుఫాన్‌ ప్రభావంతో అమెరికాలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు, భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉష్ణోగ్రతలు.. మైనస్‌ స్థాయికి పడిపోవడంతో.... మంచు అధికంగా కురుస్తోంది. దీంతో రోడ్లన్ని మంచు దుప్పటితో కప్పుకున్నాయి. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. మరోవైపు విపరీతంగా మంచు కురుస్తుండటంతో..  స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. పలు విమాన సర్వీసులను రద్దుచేశారు. న్యూయార్క్‌లోని రెండు ప్రధాన రన్‌వేలను మూసివేశారు. నయాగారా  జలపాతం దాదాపుగా గడ్డకట్టుకుపోయింది.
విద్యుత్, టెలీ కమ్యూనికేషన్లపైనా తుఫాన్‌ ప్రభావం
తుఫాన్‌ ప్రభావం విద్యుత్‌, టెలీ కమ్యూనికేషన్లపై కూడా పడింది. వర్జీనియా, ఉత్తర కరోలినాలో విద్యుత్‌ అంతరాయం ఏర్పడింది. అలాగే న్యూయార్క్‌లో ఇప్పటికే అత్యవసర పరిస్థితిని ప్రకటించి, 500 మంది సిబ్బందితో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఉత్తర ఫ్లోరిడా, సౌత్‌ ఈస్టర్న్‌ జార్జియాలోనూ పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. లాంగ్‌ ఐలాండ్, సౌత్‌ ఈస్టర్న్‌ కనెక్టికట్‌లలో గంటకు 88.5 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు. వర్జీనియా తీరం వెంట వాషింగ్టన్, న్యూపోర్ట్‌ న్యూస్‌ల మధ్య రైలు సేవలను నిలిపివేశారు. కాగా అత్యల్ప ఉష్ణోగ్రతలు, శీతల పవనాలు ఈ వారమంతా కొనసాగే అవకాశాలున్నట్టు అమెరికా జాతీయ వాతావరణ సంస్థ వెల్లడించింది. 

 

17:56 - January 7, 2018

సిరిసిల్ల : నేరేళ్ల ఘటన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో సిద్దిపేట నుండి చేపట్టిన పాదయాత్ర తంగళ్లపల్లి మండలం జిల్లెల్లకు చేరింది. నేరేళ్ల బాధితులకు భరోసా కల్పించేందుకు పాదయాత్ర చేస్తున్నామంటున్న అఖిలపక్షం నాయకులతో 10 టివి ఫేస్‌ టు ఫేస్‌ నిర్వహించింది. ఆ వివరాలను వీడియలో చూద్దాం... 
 

17:48 - January 7, 2018

పశ్చిమగోదావరి : జిల్లాలోని పెదపాడు మండలంలో విషాదం చోటుచేసుకుంది. ఏలూరు రామచంద్ర ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థులు వట్లూరు చెరువులో పడి మృతిచెందారు. శనివారం వీరు నలుగురు చెరువుకు సమీపంలోని జామతోటలో కొంత సమయం గడిపిన తర్వాత స్నానాల కోసం చెరువులోకి దిగినట్లు పోలీసులు, స్థానికులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో చింతలపూడికి చెందిన గుమ్మి విజయశంకర్‌, అంకాల సాయికిరణ్‌ పరశురాం, కలిదిండి హరికృష్ణరాజు, కోట సాయి మృతిచెందారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం పోలీసులు ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విద్యార్థుల మృతిపై వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. 

 

17:42 - January 7, 2018

కర్నూలు : జిల్లాలో నిర్మిస్తున్న ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని రాయలసీమకు ప్రాణనాడిగా మారుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కర్నూలు జిల్లాలో జరిగిన జన్మభూమి..మావూరు కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు సిద్ధాపురం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి... నదుల అనుసంధానం, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాగునీటి ప్రాజెక్టుల కోసం చేసిన ఖర్చుల వివరాలను ప్రకటించారు. వచ్చే మార్చి, ఏప్రిల్‌ నాటికి కొత్తగా 11 ప్రాజెక్టులను ప్రారంభిస్తామని చెప్పారు. 

 

అలిపిరి మద్ద సైకో వీరంగం

చిత్తూరు : అలిపిరి మద్ద సైకో వీరంగం సృష్టించాడు. టూరిస్టు ఉద్యోగితోపాటు నలుగురిపై బ్లేడ్ తో దాడి చేశాడు. సైకోను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సైకో దాడిలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం రుయా ఆస్సత్రికి తరలించారు. 

17:33 - January 7, 2018

రంగారెడ్డి : జిల్లాలోని కడ్తాల్‌ లో టెన్‌ టీవీ న్యూఇయర్‌ క్యాలెండర్‌ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. గిరిజన వసతిగృహంలో విద్యార్థుల సమక్షంగా క్యాలెడర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి స్థానిక పీఏఈఎస్ చైర్మన్‌ దశరథనాయక్‌, కాంగ్రెస్‌నేత శ్రీనివాస్‌గౌడ్‌, సర్పంచ్ నరసింహ తదితరులు హాజరయ్యారు. ప్రజలే వార్తాలుగా దూసుకుపోతున్న టెన్‌టీవికి అభినందనలు తెలిపారు. 

 

17:32 - January 7, 2018

నిజామాబాద్‌ : జిల్లాలో పెత్తందారులు బరితెగించారు. బాల్కొండ మండలం చిట్టాపూర్‌ గ్రామంలో  గంగపుత్రులకు సాంఘిక బహిష్కారం విధించారు. గ్రామఅభివృద్ధి కమిటీ విధించిన ఆంక్షలతో గంగపుత్రులు నానా అవస్థలు పడుతున్నారు. గంగపుత్రుల పొలాల్లోకి ట్రాక్టర్లు, కూలీలు వెళ్లకూడదంటూ హుకుం జారీ చేశారు. పెత్తందారులకు తక్కువరేటుకు చేపలు, అధికారులకు కమీషన్లు ఇవ్వనందుకే  తమపై కక్షగట్టారని గంగపుత్రులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు.  పెత్తందారుల ఆగడాలనుంచి తమను కాపాడాలంటూ బాల్కొండ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.   

17:31 - January 7, 2018

మేడ్చల్ : జిల్లాలోని జవహర్‌నగర్‌లో డంపింగ్ యార్డును ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ టీమాస్ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. డంపింగ్ యార్డుతో ప్రజలు ఎదుర్కుంటున్న ఇబ్బందులను తెలుసుకోవడానికి, ప్రజలను కలిసేందుకే నేడు, రేపు పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు టీమాస్ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు సత్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు టీ మాస్ నేతలు పాల్గొన్నారు. 

 

17:14 - January 7, 2018

హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ నేత, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ మండిపడ్డారు. రాష్ట్రంలో సామాజిక వర్గాల మధ్య చిచ్చుపెడుతూ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోమే చంద్రబాబు నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు మోసపూరిత రాజకీయ విన్యాసాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇప్పటికైన ప్రజలకు మేలు జరిగేలా ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో పనిచేయాలని వైసీపీ నేతలు అన్నారు. 

17:05 - January 7, 2018

హైదరాబాద్‌ : మియాపూర్‌ జనప్రియ ఒలింపియాడ్‌ స్కూల్‌లో బస్సులు దగ్ధమయ్యాయి. మూడు బస్సులు కాలిబూడి దయ్యాయి. బస్సుల దగ్ధంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు సిగరెట్ తాగి బస్సులో పడి వేయడంతో బస్సులు దగ్ధమైనట్లు తెలుస్తోంది. గతంలోనూ ఇదే స్కూల్ బస్సులు కాలిపోయాయి. స్కూల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని, విచారణ చేపట్టారు. 

 

సరూర్ నగర్ లో రూ.కోటి విలువైన విదేశీ మద్యం పట్టివేత

హైదరాబాద్ : సరూర్ నగర్ లో రూ.కోటి విలువైన విదేశీ మద్యాన్ని పట్టుకున్నారు. ఎక్సైజ్ పోలీసులు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. 

ఆర్థిక అసమానతలు తగ్గిస్తాం : సీఎం చంద్రబాబు

కర్నూలు : ఎవరైనా సహజ మరణం చెందితే చంద్రన్న పథకం కింద ఐదు లక్షల రూపాయలను ఇస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. 19 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. ట్రాన్స్ జెండర్స్ కు 1500 పించన్లు ఇచ్చామని తెలిపారు. ఆర్థిక అసమానతలు తగ్గిస్తామని చెప్పారు. అందరూ సహకరిస్తే అభివృద్ధిలో వేగంగా ముందుకెళ్తామని పేర్కొన్నారు. సంవత్సరాలుగా అనేక సమస్యలు పేర్కొని ఉన్నాయన్నారు. విశాఖలో 50 వేల ఇళ్ల పట్టాలిచ్చామని తెలిపారు. ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరిస్తుందని అన్నారు. అలసత్వం పనికి రాదని అధికారులకు సూచించారు. జవాబుదారి తనాన్ని అలవర్చుకోవాలన్నారు. 

పెద్ద ఎత్తున టెక్నాలజీ ఉపయోగిస్తున్నాం : సీఎం చంద్రబాబు

కర్నూలు : పెద్ద ఎత్తున టెక్నాలజీ ఉపయోగిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. 16 వేల కోట్ల లోటు బడ్జెట్ తో రాష్ట్రం ఏర్పాటు అయిందన్నారు. హైదరాబాద్ ను తానే డెవలప్ చేశానని తెలిపారు. హైదరాబాద్ వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం వస్తుందన్నారు. బెంగుళూరు వల్ల కర్నాటకకు ఆదాయం వస్తుందన్నారు. అలాంటి నగరాలు మనకు లేవని తెలిపారు. అన్నీ ఇండ్లకు కరెంటు, వంట గ్యాస్ ఇచ్చామని పేర్కొన్నారు. మార్చి లోపు అన్ని ఇళ్లళ్లో మరుగుదొడ్లు నిర్మిస్తామని చెప్పారు. అర్ధకోటి పించన్లు ఇచ్చిన ఏకైక రాష్ట్రం ఏపీ అని కొనియాడారు.

సాక్షి పేపర్ పై సీఎం చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు

కర్నూలు : సాక్షి ఓ పనికిమాలిన పేపర్ అని సీఎం చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జిల్లాలోని 'జన్మభూమి మా ఊరు' కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. సిద్ధాపురం ఎత్తిపోతల పథకాన్ని సీఎం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పబ్లిసిటీ మానేయాలన్నారు. సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. పంటలను కొనడానికి ఒక వ్యవస్థ ఏర్పాటు చేశామని చెప్పారు. పద్ధతి ప్రకారం వెళ్తే అందరి సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు.

16:50 - January 7, 2018

కర్నూలు : సాక్షి... ఓ పనికిమాలిన పేపర్ అని సీఎం చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జిల్లాలో నిర్వహించిన 'జన్మభూమి మా ఊరు' కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. సిద్ధాపురం ఎత్తిపోతల పథకాన్ని సీఎం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పబ్లిసిటీ మానేయాలన్నారు. సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. పంటలను కొనడానికి ఒక వ్యవస్థ ఏర్పాటు చేశామని చెప్పారు. పద్ధతి ప్రకారం వెళ్తే అందరి సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. అధికార యంత్రాంగాన్ని మీ గ్రామానికి పంపించామని తెలిపారు. పెద్ద ఎత్తున టెక్నాలజీ ఉపయోగిస్తున్నామని తెలిపారు. 16 వేల కోట్ల లోటు బడ్జెట్ తో రాష్ట్రం ఏర్పాటు అయిందన్నారు. హైదరాబాద్ ను తానే డెవలప్ చేశానని తెలిపారు. హైదరాబాద్ వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం వస్తుందన్నారు. బెంగుళూరు వల్ల కర్నాటకకు ఆదాయం వస్తుందన్నారు. అలాంటి నగరాలు మనకు లేవని తెలిపారు. అన్నీ ఇండ్లకు కరెంటు, వంట గ్యాస్ ఇచ్చామని పేర్కొన్నారు. మార్చి లోపు అన్ని ఇళ్లళ్లో మరుగుదొడ్లు నిర్మిస్తామని చెప్పారు. అర్ధకోటి పించన్లు ఇచ్చిన ఏకైక రాష్ట్రం ఏపీ అని కొనియాడారు. ఎవరైనా సహజ మరణం చెందితే చంద్రన్న పథకం కింద ఐదు లక్షల రూపాయలను ఇస్తున్నామని చెప్పారు. 19 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. ట్రాన్స్ జెండర్స్ కు 1500 పించన్లు ఇచ్చామని తెలిపారు. ఆర్థిక అసమానతలు తగ్గిస్తామని చెప్పారు. అందరూ సహకరిస్తే అభివృద్ధిలో వేగంగా ముందుకెళ్తామని పేర్కొన్నారు. సంవత్సరాలుగా అనేక సమస్యలు పేర్కొని ఉన్నాయన్నారు. విశాఖలో 50 వేల ఇళ్ల పట్టాలిచ్చామని తెలిపారు. ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరిస్తుందని అన్నారు. అలసత్వం పనికి రాదని అధికారులకు సూచించారు. జవాబుదారి తనాన్ని అలవర్చుకోవాలన్నారు. 

సిద్ధాపురం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

కర్నూలు : జిల్లాలోని జన్మభూమి కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. సిద్ధాపురం ఎత్తిపోతల పథకాన్ని సీఎం ప్రారంభించారు. 

మియాపూర్ లో జనప్రియ ఒలింపియాడ్ స్కూల్ 3 బస్సులు దగ్ధం

హైదరాబాద్ : మియాపూర్ లోని జనప్రియ ఒలింపియాడ్ స్కూల్ బస్సులు దగ్ధం అయ్యాయి. మూడు బస్సులు కాలి బూడిదయ్యాయి. బస్సుల దగ్ధంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. 

15:59 - January 7, 2018

హైదరాబాద్ : పవన్‌ ఫ్యాన్స్‌ నన్ను వ్యక్తిగతంగా, సామాజికంగా టార్గెట్‌ చేస్తున్నారని సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌ అన్నారు. తనపై వ్యక్తిగత, సామాజిక దాడి జరుగుతోందన్నారు. హైదరాబాద్‌ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈసందర్భంగా పవన్‌ఫ్యాన్స్‌ విపరీత ప్రవర్తనను ఖండించారు. సోషల్‌ మీడియాలో తనపై, తన కుటుంబంపై చేస్తున్న అనుచిత విమర్శలను తిప్పికొట్టారు. తాను ప్రచారంకోసం ప్రాకులాడటం లేదని, మీడియా తనకు డబ్బులు ఇవ్వడం లేదన్నారు. తన వెనుక ఏ రాజకీయపార్టీ లేదని, తనకు ఎలాంటి రాజకీయ అజెండా లేదన్నారు కత్తి మహేశ్‌. సినీ రచయిత కోన వెంకట్‌పై కత్తి మహేశ్‌ మండిపడ్డారు. కోనవెంకట్‌ పవన్‌ అభిమానులను రెచ్చగొడుతూ.. తనను చంపుతామన్న ధోరణిలో మాట్లాడుతున్నారని కత్తి మహేశ్‌ ఆందోళన వెలిబుచ్చారు. కోనవెంకట్‌ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. మీడియా సాక్షిగా నటి పూనమ్‌కౌర్‌కు పలు ప్రశ్నలు సంధించారు. తన ప్రశ్నల వల్ల పూనమ్‌కౌర్‌కు న్యాయం జరుగుతుందన్నారు. తనకు ఎలాంటి కీర్తిఖండూతి లేదన్నారు. పూనమ్‌ను వ్యక్తిగతంగా కించపరచం తన ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. పవన్‌ తన ఫ్యాన్స్‌ను అదుపు చేయడం లేదన్నారు. రాజకీయాల్లోకి నీతులు చెబుతున్న పవన్‌ ఇప్పటికైనా తన ఫ్యాన్స్‌ను కట్టడి చేయాలని కత్తిమహేశ్‌ డిమాండ్‌ చేశారు.  
నాపై పవన్‌ ఫ్యాన్స్‌ విమర్శల దాడులు
పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్స్‌ విమర్శల దాడులకు తాను గురవుతున్నాని సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌ అన్నారు. పవన్‌ రాజకీయాలపై అభిప్రాయం చెప్పినందుకే తనపై వ్యక్తిత ఆరోపణలు చేస్తున్నారని కత్తి మహేశ్ ఆందోళన వెల్లడించారు. తనపై రెచ్చిపోతున్న ఫ్యాన్స్‌ను పవన్‌ కంట్రోల్‌ చేయడంలేదని మహేశ్‌ ఆరోపించారు. కోనవెంకట్‌ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని.. పవన్‌ ఫ్యాన్స్‌ను చూపెట్టి తనను బెదిరిస్తున్నారని కత్తి మహేశ్‌ విమర్శించారు. 
నటి పూనమ్‌కౌర్‌కు పలు ప్రశ్నలు సంధించిన కత్తి మహేశ్‌ 
నటి పూనమ్‌ కౌర్‌కు సినీ విమర్శకుడు పలు ప్రశ్నలు సంధించారు. తాను పూనమ్‌కౌర్‌ను విమర్శించడంగాని, ఆమెను వ్యక్తిగతంగా కించపరడం గాని చేయడంలేదని.. కేవలం కొన్ని ప్రశ్నలను మాత్రమే సంధిస్తున్నానని కత్తి మహేశ్‌ అన్నారు. 

 

అన్ని సమస్యలపై జన్మభూమిలో చర్చిస్తున్నాం : సీఎం చంద్రబాబు

కర్నూలు : జిల్లాలో నిర్వహించిన జన్మభూమి..మా ఊరు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని, మాట్లాడారు. రోజుకో అంశంపై, అన్ని అవసరాలపై జన్మభూమి కార్యక్రమంలో చర్చ చేస్తున్నామని తెలిపారు. జన్మభూమిలో అన్ని సమస్యలపై చర్చిస్తున్నామని చెప్పారు. సహజ వనరులు, అభివృద్ధిపై చర్చ చేస్తున్నామని తెలిపారు. 16 వేల గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి..సమస్యలపై చర్చిస్తామని చెప్పారు. చరిత్రను ఎవరూ మార్చలేరన్నారు. ప్రతిపక్షం తనను అనేక ఇబ్బందులకు గురి చేసిందని వాపోయారు. పట్టిసీమ పూర్తి కాకూడదని, పట్టిసీమ రాకూడదని కుట్ర పన్నారని ఆరోపించారు. కృష్ణా పుష్కరాలను పెద్ద ఎత్తున నిర్వహించామని తెలిపారు.

ప్రకృతిని మనం కాపాడితే.. ప్రకృతి మనల్ని కాపాడుతుంది : సీఎం చంద్రబాబు

కర్నూలు : ప్రకృతిని కాపాడుకోవాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. కర్నూలులో నిర్వహించిన జన్మభూమి..మా ఊరు కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. ప్రకృతిని మనం కాపాడితే.. ప్రకృతి మనల్ని కాపాడుతుందని తెలిపారు. నీరు, చెట్లు, అడవులు, ఖనిజ సందపను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలన్నారు. నేటితో జన్మభూమి ఆరో రోజుకు చేరిందన్నారు. 

15:33 - January 7, 2018

కర్నూలు : ప్రకృతిని కాపాడుకోవాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. కర్నూలులో నిర్వహించిన జన్మభూమి..మా ఊరు కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. ప్రకృతిని మనం కాపాడితే.. ప్రకృతి మనల్ని కాపాడుతుందని తెలిపారు. నీరు, చెట్లు, అడవులు, ఖనిజ సందపను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలన్నారు. నేటితో జన్మభూమి ఆరో రోజుకు చేరిందన్నారు. రోజుకో అంశంపై, అన్ని అవసరాలపై జన్మభూమి కార్యక్రమంలో చర్చ చేస్తున్నామని తెలిపారు. జన్మభూమిలో అన్ని సమస్యలపై చర్చిస్తున్నామని చెప్పారు. సహజ వనరులు, అభివృద్ధిపై చర్చ చేస్తున్నామని తెలిపారు. 16 వేల గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి..సమస్యలపై చర్చిస్తామని చెప్పారు. చరిత్రను ఎవరూ మార్చలేరన్నారు. ప్రతిపక్షం తనను అనేక ఇబ్బందులకు గురి చేసిందని వాపోయారు. పట్టిసీమ పూర్తి కాకూడదని, పట్టిసీమ రాకూడదని కుట్ర పన్నారని ఆరోపించారు. కృష్ణా పుష్కరాలను పెద్ద ఎత్తున నిర్వహించామని తెలిపారు. రైతు లేకపోతే ఎవరికీ తిండి లేదన్నారు. రైతులకు 24 వేల కోట్లు రుణమాఫీ చేశామని చెప్పారు. రైతు విముక్తి చేశామన్నారు. ఏరువాక కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

13:31 - January 7, 2018
13:29 - January 7, 2018
13:23 - January 7, 2018

హైదరాబాద్ : సోమాజిగూడ సినీ క్రిటిక్ కత్తి మహేష్ ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన పవన్ కల్యాణ్ ను చర్చకు రామ్మని బహిరంగా సవాల్ విసిరారు. పవన్ ఫ్యాన్స్ తనను మానసికంగా వేధిస్తున్నారని, పవన్ తన అభిమానులకు సద్దిచెప్పడం లేదని ఆయన అన్నారు. కోన వెంకట్ వ్యాఖ్యలపై కూడా తీవ్రంగా మండిపడ్డాడు. కొన వెంకట్ పవన్ అభిమానులను రెచ్చగొడుతున్నారని, మూడో కన్ను తెరిస్తే ఏమౌతుందని కత్తి ప్రశ్నించాడు. అలాగే పూనం కౌర్ కూడా కొన్ని ప్రశ్నాలు సంధించారు. మొదటి ప్రశ్నగా పూనం అంబాసిడర్ ఎలా వచ్చింది. రెండవ ప్రశ్నగా తిరుపతిలో పూనం, పవన్ కల్యాణ్ ఒకే గోత్రనామాలతో పూజ ఎందుకు చేశారు. మూడవ ప్రశ్నగా పూనం ఆత్మహత్యాయత్నం చేసుకుంటే ఆమెను ఆసుపత్రిలో చేర్చి, బిల్లు కట్టింది ఎవరు. నాలుగవ ప్రశ్నగా పవన్ కల్యాణ్ పూనం కౌర్ తల్లిని కలిసి ఏం మాట ఇచ్చారు. ఆ మాట పవన్ నిలబెట్టుకున్నారా. ఐదవ ప్రశ్నగా డైరెక్టర్ త్రివిక్రమంటే పూనం ఎందుకంత కోపం. ఆరోవ ప్రశ్నగా నార్సింగం అనే క్షద్ర మంత్రికుడు చేసిన పూజల్లో పవన్, త్రివిక్రమ్ తో పాటు పూనం ఎందుకు ఉన్నారు. 

13:20 - January 7, 2018

హైదరాబాద్ : జూబ్లీహిల్స్ రోడ్ నెం 10 లో నిన్న రాత్రి రోడ్రు ప్రమాదం జరిగింది. ఘటనాస్థలంలోనే మస్తానీ మృతి చెందింది. అనూష అనే ఆమ్మాయికి బ్రెయిన్ డెడ్ అయింది. విష్ణువర్ధన్ అనే వ్యక్తి మద్యం మత్తులో నిర్లక్ష్యంగా కారు డ్రైవ్ చేయడంతోనే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

10 టీవీ ఎఫెక్ట్

నిజామాబాద్ : జిల్లా బాల్కోండ మండలం చిట్టాపూర్ లో గంగపుత్రుల బహిష్కరణపై టెన్ టీవీలో వచ్చిన కథనానికి రెవెన్యూ అధికారులు, పోలీసులు స్పందించారు. అధికారులు ఇరువర్గాలతో చర్చించి గంగపుత్రలకు గ్రామ బహిష్కరణ నుంచి విముక్తి చెందారు. 

ప్రాంరంభమైన కాంగ్రెస్ మహాపాదయాత్ర

తూర్పు గోదావరి : ధవళేశ్వరం నుంచి పోలవరం కోసం కాంగ్రెస్ మహాపాదయాత్ర ప్రారంభమైంది. పుదుచ్చేరి సీఎం నారాయణస్వామీ యాత్రను ప్రారంభించారు. పాదయాత్ర ప్రారంభోత్సవంలో కేవీపీ రామచంద్రరావు, శైలజానాథ్, పనబాక లక్ష్మీ, పాల్గోన్నారు. 

12:49 - January 7, 2018

హైదరాబాద్ : సోమాజిగూడ సినీ క్రిటిక్ కత్తి మహేష్ ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన పవన్ కల్యాణ్ ను చర్చకు రామ్మని బహిరంగా సవాల్ విసిరారు. పవన్ ఫ్యాన్స్ తనను మానసికంగా వేధిస్తున్నారని, పవన్ తన అభిమానులకు సద్దిచెప్పడం లేదని ఆయన అన్నారు. కోన వెంకట్ వ్యాఖ్యలపై కూడా తీవ్రంగా మండిపడ్డాడు. అలాగే పూనం కౌర్ కూడా కొన్ని ప్రశ్నాలు సంధించారు. మొదటి ప్రశ్నగా పూనం అంబాసిడర్ ఎలా వచ్చింది. రెండవ ప్రశ్నగా తిరుపతిలో పూనం, పవన్ కల్యాణ్ ఒకే గోత్రనామాలతో పూజ ఎందుకు చేశారు. మూడవ ప్రశ్నగా పూనం ఆత్మహత్యాయత్నం చేసుకుంటే ఆమెను ఆసుపత్రిలో చేర్చి, బిల్లు కట్టింది ఎవరు. నాలుగవ ప్రశ్నగా పవన్ కల్యాణ్ పూనం కౌర్ తల్లిని కలిసి ఏం మాట ఇచ్చారు. ఆ మాట పవన్ నిలబెట్టుకున్నారా. ఐదవ ప్రశ్నగా డైరెక్టర్ త్రివిక్రమంటే పూనం ఎందుకంత కోపం. ఆరోవ ప్రశ్నగా నార్సింగం అనే క్షద్ర మంత్రికుడు చేసిన పూజల్లో పవన్, త్రివిక్రమ్ తో పాటు పూనం ఎందుకు ఉన్నారు. 

కర్నూలు చేరుకున్న సీఎం చంద్రబాబు

కర్నూలు : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కర్నూలు చేరుకున్నాడు. ఆయన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో పాల్గొనున్నారు. 

ఏలూరు చెరువుల మృతదేహాలు కలకలం

పశ్చిమగోదావరి : జిల్లా ఏలూరు భోగపురం చెరువులో మృతదేహాలు కలకలం సృష్టించాయి. నలుగురు విద్యార్థుల మృతదేహాలు చెరువులో తేలాయి. మృతులు రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులుగా గుర్తించారు. బీటెక్ 3వ సంత్సరం చదువుతున్నారు.

12:39 - January 7, 2018

మహబూబాబాద్ : మరో వారం రోజుల్లో కానిస్టేబుళ్ల నోటిఫికేషన్ విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రకటించారు. దాదాపు 10 వేల పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని ఆయన అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పోలీసు శాఖ నిర్వహిస్తున్న ట్రైయినింగ్ సెంటర్ ప్రారంభించారు. 

12:38 - January 7, 2018

కృష్ణా : విజయవాడలో అమరావతి మారథాన్ నిర్వహించారు. రన్ సందర్భంగా బెంజ్ సర్కిల్ నుంచి రాఘవయ్య పార్క్ వరకు ట్రాఫిక్ అంక్షాలు విధించారు. రన్ మంత్రి దేవినేని ఉమా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీపీ గౌతమ్ సవాంగ్ పాల్గొన్నారు. 

12:27 - January 7, 2018

పశ్చిమగోదావరి : జిల్లా ఏలూరు భోగపురం చెరువులో మృతదేహాలు కలకలం సృష్టించాయి. నలుగురు విద్యార్థుల మృతదేహాలు చెరువులో తేలాయి. మృతులు రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులుగా గుర్తించారు. బీటెక్ 3వ సంత్సరం చదువుతున్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

పూనం కౌర్ కత్తి ఆరు ప్రశ్నాలు

హైదరాబాద్ : కత్తి మహేష్ హీరోయిన్ పునం  కౌర్ ఆరు ప్రశ్నలు సందించారు.1. పూనం ఎలా అంబాసిడర్ పదవి వచ్చింది. 2. తిరుపతలో పవన్ తో కలిసి ఒకే గోత్రనామాలతో పూజ ఎందుకు చేశారు. 3.పూనం ఆత్మహత్యయత్నం చేస్తే ఆసుపత్రిలో చేర్చి బిల్లు కట్టింది ఎవరు,  4. వవన్ పూనం తల్లి కలిసి ఏ మాట ఇచ్పారు. 5. డైరెక్టర్ త్రివిక్రమంటే పూనం ఎందుకంత కోపం. 6. నార్సింగం అనే క్షుద్ర మంత్రికుడు చేసి పూజల్లో పవన్, త్రివిక్రమ్ తో పాటు పూనం ఎందుకు ఉంది.   

కత్తి మహేష్ ప్రెస్ మీట్

హైదరాబాద్ : సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కత్తి మహేష్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. దీంతో అక్కడకి పవన్ అభిమానులు రావడంతో ఉద్రిక్తత నెలకొంది. పవన్ అభిమానులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

కత్తి మహేష్ ప్రెస్ మీట్

హైదరాబాద్ : సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కత్తి మహేష్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. దీంతో అక్కడకి పవన్ అభిమానులు రావడంతో ఉద్రిక్తత నెలకొంది. పవన్ అభిమానులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

12:07 - January 7, 2018
12:05 - January 7, 2018
12:04 - January 7, 2018

నిజాబాబాద్ జిల్లాలో కుల బహిష్కరణ

నిజామాబాద్ : జిల్లా బాల్కొండ మండలం చిట్టాపూర్ పెత్తందార్ల ఆగడాలు మితిమిరాయి. గ్రామాభివృద్ధి కమిటీ ముసుగులో గంగపుత్రులను సాంఘిఖ బహిష్కరణ చేశారు. గంగపుత్రల పొలాల్లోకి ట్రాక్టర్లు, కూలీలు వెళ్లొద్దంటూ పెత్తందార్లు హుకుం జారీ చేశారు.

10:16 - January 7, 2018

నిజామాబాద్ : జిల్లా బాల్కొండ మండలం చిట్టాపూర్ పెత్తందార్ల ఆగడాలు మితిమిరాయి. గ్రామాభివృద్ధి కమిటీ ముసుగులో గంగపుత్రులను సాంఘిఖ బహిష్కరణ చేశారు. గంగపుత్రల పొలాల్లోకి ట్రాక్టర్లు, కూలీలు వెళ్లొద్దంటూ పెత్తందార్లు హుకుం జారీ చేశారు. పెత్తందార్లకు తక్కువ ధరకు చేపలు ఇవ్వనందుకే గంగపుత్రులను బహిష్కరించారని తెలుస్తోంది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

వెస్ట్ జోన్ పరిధిలో కార్డన్ సెర్చ్

హైదరాబాద్ : నగరంలోని వెస్ట్ జోన్ పరిధిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. జూబ్లీహిల్స్, ఎస్సార్ నగర్, బోరుబండ, శ్రీరామ్ నగర్ లో డీసీపీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 250 మంది పోలసులతో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 500 ఇళ్లను తనిఖీలు చేశారు.పోలీసులు కొత్త కాప్ టెక్నాలజీ ద్వారా కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. 

09:11 - January 7, 2018

ఢిల్లీ : సింధు సరిహద్దు ప్రాంతంలో వెయిట్ లిప్టర్లు ప్రయాణిస్తున్న కారు పొగమంచు కారణంగా డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదం లో నలుగు వెయిట్ లిప్టర్లు మృతి చెందారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

09:10 - January 7, 2018

హైదరాబాద్ : నగరంలోని వెస్ట్ జోన్ పరిధిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. జూబ్లీహిల్స్, ఎస్సార్ నగర్, బోరుబండ, శ్రీరామ్ నగర్ లో డీసీపీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 250 మంది పోలసులతో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 500 ఇళ్లను తనిఖీలు చేశారు.పోలీసులు కొత్త కాప్ టెక్నాలజీ ద్వారా కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. భక్తులు 12 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతుంది. 

08:59 - January 7, 2018

కొత్తగూడెం : జిల్లా అశ్వారావు పేట సీఐ టెన్ టీవీ క్యాలెండర్ ను అవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెన్ టీవీ ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో ముందందని అన్నారు. మరింత ప్రజా హితం కోసం టెన్ టీవీ ముందుకు సాగాలని ఆయన కోరుకున్నారు.  

08:20 - January 7, 2018

హైదరాబాద్ : అధికారంలో ఏపార్టీ ఉంటే .....ఆ పార్టీకి అండగా నిలుస్తుందన్న పేరు ఎంఐఎంకు ఉంది. గతంలో టీడీపీ అధికారంలో ఉంటే టీడీపీకి, కాంగ్రెస్‌ అధికారంలో ఉంటే కాంగ్రెస్‌కు సపోర్ట్‌ ఇచ్చింది. రాష్ట్ర విభజనానంతరం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌తోనూ ఎంఐఎం పాతపంథానే ఎంచుకుంది. టీఆర్‌ఎస్‌కు అండగా నిలుస్తోంది. తెలంగాణ ఉద్యమాన్ని ఎంఐఎం వ్యతిరేకించినా... గులాబీ పార్టీకి అధికార పగ్గాలు దక్కిన తర్వాత మిత్రపక్షంగా మారింది. అధికారపార్టీకి తమ అండదండలు పూర్తిగా అందిస్తోంది. కేసీఆర్‌ సర్కార్‌ తీసుకుంటున్న నిర్ణయాలను మొదట్లో వ్యతిరేకించినా.... ఆ తర్వాత క్రమక్రమంగా గులాబీపార్టీతో దోస్తీ మొదలుపెట్టింది. శాసనసభలో అధికారపార్టీకి అండగా నిలుస్తూ ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు చేసేందుకూ వెనుకాడడం లేదు.

మైనార్టీల కోసం టీఆర్‌ఎస్‌ అనేక కార్యక్రమాలు
మైనార్టీల కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూడా అనేక కార్యక్రమాలు తీసుకుంటోంది. షాదీముబారక్‌తో ముస్లిం యువతుల వివాహానికి ఆర్థికసాయం చేస్తోంది. మసీదుల్లో పనిచేసే వారికీ గౌరవ వేతనాలు ఇస్తోంది. కేసీఆర్‌ తీసుకుంటున్న నిర్ణయాలతో మైనార్టీల్లో ప్రభుత్వంపై మద్దతు పెరుగుతోంది. దీంతో ఎంఐఎం పార్టీకి కంటగింపుగా మారుతోంది. ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న నిర్ణయాలతోపాటు రాజకీయంగా వేస్తున్న అడుగులు ఎంఐఎంలో ఆందోళన రేపుతున్నాయి. ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌కు ఓవైసీ ఇప్పటి వరకు మైనార్టీల్లో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా గుర్తింపు ఉంది. అయితే తాజాగా మైనార్టీలు నిర్వహించిన ఓ సర్వేతో అసదుద్దీన్‌కంటే కేసీఆర్‌కే ఎక్కువ ప్రజాదరణ ఉందన్న విషయం వెలుగుచూసింది. ఆ సర్వే ప్రకారం 54శాతం మంది ముస్లింలు కేసీఆర్‌ను ప్రజాదరణ ఉన్ననేతగా గుర్తించినట్టు తేలింది. ఇక అసదుద్దీన్‌ ఓవైసీకి ఈ సర్వేలో 44శాతం పాయింట్లు వచ్చాయి. దీంతో ఎంఐఎంలో ఆందోళన వ్యక్తమవుతోంది.

అనధికార మిత్రపక్షంగా..
అధికార పార్టీకి అనధికార మిత్రపక్షంగా కొనసాగుతున్న ఎంఐఎం... ఈ సర్వేతో అప్రమత్తమవుతోంది. గులాబీ పార్టీకి మరింత దగ్గరయ్యేందుకు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. తమ కృషి ఫలితంగానే ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కోసం కార్యక్రమాలు చేపడుతుందన్న ప్రచారం చేయాలని భావిస్తోంది. 

జూబ్లీహిల్స్ రోడ్ నెం.10లో రోడ్డుప్రమాదం

హైదరాబాద్ : జూబ్లీహిల్స్ రోడ్ నెం.10 రోడ్డు ప్రమాదం జరిగింది. కారు స్కూటీని ఢీకొట్టడంతో మస్తానీ అనే యవతి మృతి చెందింది. మరో ఇద్దరు అనుషా, ప్రియకు గాయాలయ్యాయి. మద్యతం తాగి అతివేకంగా కారు నడపడంతోనే ప్రమాదం జరిగింది. 

ఢిల్లీలో దట్టంగా కమ్ముకున్న పొగ మంచు

ఢిల్లీ : లో పొగ మంచు దట్టంగా కమ్ముకుంది. పొగమంచు కారణంగా విమాన, రైలు సర్వీసులను కొన్నింటిని రద్దు చేశారు. మరికొన్ని రైళ్ల వేళల్లో మార్పులు చేశారు. 

ఢిల్లీలో రోడ్డు ప్రమాదం

ఢిల్లీ : లోని సింధు సరిహద్దులో రోడ్డు ప్రమాదం జరిగింది. నలుగురి వెయిట్ లిప్టర్లు మృతి చెందారు. ఇద్దరు గాయపడ్డారు. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

బాల్కొండలో దారుణం

నిజామాబాద్ : జిల్లా బాల్కొండ మండలంలో చిట్టాపూర్ లో దారుణం జరిగింది. వీవీసీ సభ్యులు గంగపుత్రులను సాంఘీక బహిష్కరించారు. బాధితులు తహశీల్దార్, ఎస్సైలకు ఫిర్యాదు చేశారు. 

55వ రోజుకు చేరుకున్న జగన్ ప్రజా సంకల్ప యాత్ర

చిత్తూరు : వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర 55వ రోజుకు చేరుకుంది. నేడు చంద్రగిరి నియోజవర్గంలో పాకాల, ఐరాల, పూతలపట్టు మండలాల మీదుగా పాదయాత్ర కొనసాగునుంది. 

పోలవరం సాధన కోసం కాంగ్రెస్ మహాపాదయాత్ర

తూర్పుగోదావరి : పోలవరం ప్రాజెక్టు సాధన కోసం కాంగ్రెస్ మహాపదయాత్ర చేపడుతుంది. నేడు ధవళేశ్వరంలో కాంగ్రెస్ మహాపాదయాత్ర ప్రారంభం అవుతుంది.  ఈ పాదయాత్రను పాండిచ్చేరి సీఎం ప్రారంభిస్తారు. ఈ పాదయాత్రలో పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, పళ్లం రాజు, కేవీపీ రామచంద్రరావు పాల్గొననున్నారు. 

07:59 - January 7, 2018

రాష్ట్రంలో రెండో అతిపెద్ద దేవాలయం కనుకదుర్గ ఆలయం ఉందని, ఈ గుడికి రెండు రాష్ట్రాల ప్రజలేకాకుండా దేశం మొత్తమీద భక్తులు వస్తారని, గత నెల 26 తేదీన అర్ధరాత్రి తాంత్రిక పూజలు జరిగాయని, ఈవో ఒక విధంగా చెబుతారని, పాలక మండలి మరోరకంగా చెబుతున్నారని, లోకేష్ సీఎం అవ్వడం కోసం తాంత్రిక పూజలు జరిగినట్టు తెలుస్తుందని వైసీపీ నాయకుడు కొనిజేటి రమేష్ అన్నారు. రాష్ట్రంలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో బెజవాడ దుర్గమ్మ పవిత్రమైనదని, ఈ జరగడం బాధకరమని, వైసీపీ వారు గుడిని, బడిని కూడా రాజకీయం చేస్తున్నారని, లోకేష్ ను ప్రమోట్ చేయడానికి తాంత్రిక పూజలు చేయవాల్సిన అవసరం లేదని టీడీపీ నాయకురాలు అచంట సునీత అన్నారు. వాస్తవానికి ఇది కోట్ల మంది మనోభావాలకు చెందిన విషయమని, తప్పు జరిగిందని చెప్పడం కాదని అది ఎందుకు జరిగింది, ఎవరు చెయించారు అనే దానిపై విచారణ చేయాలని కేవలం ఈవోను బదిలీ చేస్తే సరిపోదని, దీని వెనక ఎవరు ఉన్నారో ప్రభుత్వం నిగ్గుతేల్చాలని సీపీఎం పార్టీ నాయకులు ఉమా మాహేశ్వరావు అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

07:48 - January 7, 2018

మిరప పంట నారు పోసుకోని నాటే వరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మిరపలో ముఖ్యంగా వైరస్ తెగుళ్లు వస్తుందని, రైతులు తేజ, జీ4 అనే రకాలను విత్తుకున్నట్టైయితే వైరస్ వ్యాధి రకుండా చూసుకోవచ్చని, ఎకరానికి 650 మిరప విత్తనాలు అవసరం అవుతాయని మధు బాబు అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

07:46 - January 7, 2018

గుంటూరు : పవన్‌ కల్యాణ్‌ నటించిన అజ్ఞాతవాసి సినిమా అదనపు షోల ప్రదర్శనకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈనెల 10న ప్రపంచ వ్యాప్తంగా అజ్ఞాతవాసి విడుదలకానుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలవుతోన్న ఈ సినిమాకు... రోజూ ఏడు ఆటల ప్రదర్శనకు నిర్మాతలు ఏపీ ప్రభుత్వాన్ని అనుమతి కోరారు. ప్రతి రోజూ ఉదయం పది నుంచి రాత్రి 12 గంటల వరకు నాలుగు ఆటలు ప్రదర్శించే అనుమతి ఉంది. పవన్‌ సినిమాకు ప్రేక్షకుల్లో ఉన్న ఆత్రుతను దృష్టిలో పెట్టుకుని రాత్రి ఒంటిగంట నుంచి ఉదయం పదిగంటల వరకు మరో మూడు అదనపు షోలకు అనుమతి ఇవ్వాలని నిర్మాతలు చేసిన విజ్ఞప్తిపై ఏపీ ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఆడించే నాలుగు ఆటలతో ఈ మూడు ఆటలు కలిపితే రోజుకు ఏడు షోల చొప్పున ఎనిమిది రోజులపాటు ప్రదర్శనకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో రిలీజైన అన్ని థియేటర్లలోనూ 24 గంటలూ సినిమా ప్రదర్శించేందుకు మార్గం సుగమమైంది. 

07:46 - January 7, 2018

హైదరాబాద్ : వన్‌ కల్యాణ్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అజ్ఞాతవాసి ట్రైలర్‌ వచ్చేసింది. అర్థరాత్రి అజ్ఞాతవాసి ట్రైలర్‌ను విడుదల చేశారు. కుర్చీ గురించి పవన్‌ చెప్పిన డైలాగ్స్‌ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. జీవితంలో మనం కోరుకునే ప్రతిసౌకర్యం వెనకాల... ఓ మినీయుద్ధమే ఉంటుందంటూ పవన్‌ చెప్పిన డైలాగ్‌ ఆసక్తి రేపుతోంది. పొలిటికల్‌ యాంగిల్‌ను టచ్‌ చేశారన్న చర్చ నడుస్తోంది. సినిమాపై ఈ ట్రైలర్‌ మరింత ఆసక్తిని పెంచుతోంది. ఈనెల 10న.. సంక్రాంతి కానుకగా అజ్ఞాతవాసి విడుదలకానుంది. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో హారికా హాసిని బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందింది. సంగీత దర్శకుడు అనిరుధ్‌ ఈ చిత్రంలో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు.

07:45 - January 7, 2018

హైదరాబాద్ : పుస్తకాలు చదివేందుకు లైబ్రరీకి వెళ్లే వారి సంఖ్య రోజురోజుకు తగ్గిపోతుందన్నారు హైకోర్టు జస్టిస్‌ షమీమ్‌ అక్తార్‌. గచ్చిబౌలి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని లైబ్రరీలో ఉర్దూ పుస్తకాలను రెఫ్తా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో డిజిటలైజేషన్‌ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్‌ షమీమ్‌ అక్తార్‌... ప్రాచీన గ్రంధాలను ఒకచోటికి చేర్చి భద్రపరుస్తున్న ట్రస్ట్‌ సభ్యులను అభినందించారు. పుస్తకాలను పక్కకు పడేస్తున్న తరుణంలో... టెక్నాలజీని ఉపయోగించి వాటిని డిజిటలైజేషన్‌ చేయడం గొప్ప విషయమన్నారు. గచ్చిబౌలి, బాగ్‌లింగంపల్లిలోని ఎస్వీకేలు లైబ్రరీ నిర్వహణకే కాకుండా... అనేక ప్రజాహితమైన కార్యక్రమాలు చేపడుతుందన్నారు ఎస్వీకే ట్రస్ట్‌ సభ్యులు నంద్యాల నర్సింహారెడ్డి. 

07:43 - January 7, 2018

తూర్పుగోదావరి : ఆంధ్రప్రదేశ్‌ ప్రజల జీవనాడి పోలవరం. ఈ విషయాన్ని అధికార.. విపక్ష నేతలే కాదు ప్రజలంతా ముక్త కంఠంతో చెబుతారు. 2019లోగా ప్రాజెక్టును పూర్తి చేసి ఆయకట్టుకు నీరందిస్తామంటున్న సీఎం చంద్రబాబు ఆ దిశగా సాగుతున్నారా? ఏడాదిలో ప్రాజెక్టు పూర్తవుతుందా అంటే చెప్పడం కష్టమే.పోలవరం ప్రాజెక్టులో కాఫర్ డ్యాం ఎత్తు విషయం వివాదాస్పదంగా మారి దాదాపు మూడు నెలల పాటు పనులు నిలిచి పోయాయి. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? సీఎం చంద్రబాబా లేక ప్రధాని మోదీనా.. లేక ఇద్దరి మధ్య సమన్వయ లోపమే కారణమా? తాజాగా కాఫర్ డ్యాంను రాష్ట్ర ప్రభుత్వ డిజైన్‌కు తగిన విధంగా నిర్మించేందుకు కేంద్రం అనుమతించడం అంటే మోదీపై చంద్రబాబు విజయం సాధించినట్లే భావించాలంటున్నారు విశ్లేషకులు. అయితే ఈ విజయం రాష్ట్ర ప్రజలకు లాభమా? నష్టమా? అంటే నష్టమే అన్నది వారి భావన.

నిర్మాణంలో కాఫర్ డ్యాం భాగం కానేకాదు...
ప్రాజెక్టు నిర్మాణంలో కాఫర్ డ్యాం భాగం కానేకాదు. ప్రాజెక్టు నిర్మాణానికి ఏమాత్రం సంబంధం లేదు. అయితే ప్రధాన జలాశయం నిర్మించే ప్రాంతంలో వర్క్ స్పేస్‌ను కల్పించటంతో పాటు నదీప్రవాహం... పనులకు అడ్డం కాకుండా ఉండేందుకే కాఫర్ డ్యాంను నిర్మిస్తారు. ప్రపంచంలో ఎక్కడ ప్రాజెక్టు చేపట్టినా దీనినే పాటిస్తారు. అయితే ఇక్కడ వచ్చిన చిక్కల్లా రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా సీఎం చంద్రబాబు కాఫర్ డ్యాంనే ప్రధాన జలాశయంగా భావిస్తుండటం. 2019లో శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. ఆలోగా పోలవరం పూర్తిచేయటం సాధ్యంకాదు. కాఫర్ డ్యాంను జలాశయం తరహాలో నిర్మించి దాని ద్వారా కుడి - ఎడమ కాలువలకు నీరివ్వాలనేది సీఎం ఉద్దేశం. అందులో భాగంగానే కాఫర్ డ్యాం ఎత్తును తొలుత డిజైన్‌లో ప్రతిపాదించిన దానికన్నా అధికంగా అంటే 42.5 మీటర్లకు పెంచుతూ డిజైన్‌ను సిద్ధం చేశారు. దీనిని కేంద్ర ప్రభుత్వం మూడు నెలల క్రితం తిరస్కరించింది. నిజానికి కాఫర్ డ్యాం అనేది తాత్కాలిక నిర్మాణం. ప్రధాన జలాశయం పూర్తయిన తరువాత దీనిని తొలగిస్తారు.

కాఫర్ డ్యాం ఎత్తు పరిమితికి మించి ఉండకూడదు..
కాఫర్ డ్యాం భారీ వరదను మరీ ముఖ్యంగా 20 లక్షల క్యూసెక్కులు ఆపైన వరద ప్రవాహం వస్తే తట్టుకోలేదు. దానిపైనుంచి నీరు ప్రవహిస్తుంది. ఆ క్రమంలో కాఫర్ డ్యాం దెబ్బతిని ప్రధాన జలాశయంలోని పనులకు ఆటంకం కలిగే ప్రమాదం ఉంటుంది. అందుకే కాఫర్ డ్యాం ఎత్తు పరిమితికి మించి ఉండకూడదని నిపుణులు చెబుతారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నీటిని నిల్వ చేసి దాని ద్వారానే ప్రాజెక్టు పాక్షికంగా పూర్తి చేశామని నమ్మించే ప్రయత్నం కోసం ఎత్తు పెంచాలని యోచిస్తోంది. దీనిని కేంద్ర ప్రభుత్వం అధీనంలోని ఎన్ హెచ్ పీసీ తిరస్కరించింది. ఎన్‌హెచ్‌పీసీ అనేది జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్ నిపుణులతో కూడిన సంస్థ. ఇది ఎన్నో ప్రాజెక్టులను నిర్మించింది. పూర్తిగా సాంకేతికపరమైన ఈ సంస్థ రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ విభాగం కన్నా ఎంతో పెద్దది. ఈ విషయం రాష్ట్ర ఇంజనీర్లకు కూడా తెలుసు. అయితే వారిపై ప్రభుత్వ ఒత్తిడి ఉంది. అందువల్లనే ఎత్తు పెంచి ఎగువ కాఫర్ డ్యాం నిర్మించాలని పట్టుబట్టి సాధించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ లాబీయింగ్ ముందు ఎన్ హెచ్ పీసీ సిఫార్సులు బుట్టదాఖలయ్యాయి.

మూడు నెలల పాటు పనులు ఆగిపోయాయి..
కాఫర్ డ్యాం విషయం వివాదాస్పదంగా మారి మూడు నెలల పాటు పనులు ఆగిపోయాయి. సొంత నిర్ణయాలు తీసుకుంటే .. ప్రాజెక్టు వ్యయాన్ని తాము భరించేది లేదని కేంద్రం స్పష్టం చేసింది. దీనికి తోడు నిర్మాణ సంస్థ ట్రాన్స్ ట్రాయ్‌ నత్తనడకన పనులు సాగించటం అవరోధంగా మారింది. మొత్తంగా మూడు నెలల సమయం వృథా అయ్యింది. ప్రధానంగా ప్రాజెక్టుకు ఇది వర్కింగ్ సీజన్. ఈ సమయంలోనే వరద ఉండదు కాబట్టి పనులు వేగంగా జరుగుతాయి. ఇప్పుడు జరిగిన ఆలస్యానికి ఎవరు బాధ్యత వహిస్తారు. అన్ని ప్రశ్నలకు వెబ్ సైట్లో వివరాలు ఉంటాయని ముఖ్యమంత్రి చెబుతున్నారు. కానీ ప్రభుత్వం తరపున సమాచారం మాత్రమే అందులో ఉంటుంది కాని - ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఉండవు.మొత్తానికి కాఫర్ డ్యాం వివాదం విలువైన మూడు నెలల కాలాన్ని వృధా చేసింది. దాంతో పాటు ప్రాజెక్టు బడ్జెట్‌సైతం భారీగా పెరిగింది. ఇదంతా ప్రజలపైనే భారం పడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 

07:42 - January 7, 2018

తూర్పుగోదావరి : పోలవరం ప్రాజెక్ట్‌ విషయంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ ఏపీ కాంగ్రెస్‌ పార్టీ మహాపాదయాత్రకు రెడీ అయ్యింది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం నుంచి పాదయాత్ర ప్రారంభించనుంది. నేడు ఈ పాదయాత్ర ప్రారంభంకానుంది. నాలుగు రోజులపాటు సాగే ఈ పాదయాత్ర దాదాపు 54 కిలోమీటర్లమేర సాగనుంది.కాంగ్రెస్‌ పార్టీ మహాపాదయాత్రకు నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు. రాజమహేంద్రవరంలో డిమాండ్లతో కూడిన బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ పాదయాత్రలో పీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి, కేంద్రమాజీమంత్రి పల్లంరాజు, జేడీ శీలంతోపాటు కేవీపీ రామచంద్రరావు పాల్గొంటున్నారు. పాండిచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి ఈ పాదయాత్రను ప్రారంభించనున్నారు.

ముగింపు రోజున భారీ బహిరంగ సభ
పోలవరం ప్రాజెక్ట్‌ విషయంలో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రప్రజలను మభ్యపెడుతున్నాయని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. పోలవరం పూర్తికి కేంద్రం నిధులు విడుదల చేయాలన్నారు. లేకుంటే తమ ఆందోళన మరింత ఉధృతం చేస్తామన్నారు.పోలవరం ప్రాజెక్ట్‌ రాష్ట్ర ప్రజల హక్కని రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు అన్నారు. కేంద్రం నిధులతో పోలవరాన్ని నిర్మించి ప్రజలకు అందించాల్సిన బాధ్యత రాష్ట్రానిదేనన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకే తమపాదయాత్ర జరుగుతుందని స్పష్టం చేశారు. పాదయాత్ర ముగింపు రోజున భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. కాంగ్రెస్‌ పార్టీ జాతీయ నాయకులు బహిరంగ సభకు హాజరవుతారు.

07:41 - January 7, 2018

కృష్ణా : విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ ఈవో సూర్యకుమారిపై ప్రభుత్వం ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆమెపై బదిలీవేటు వేసింది. కనకదుర్గ ఆలయ ఈవో బాధ్యతల నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. దేవాదాయశాఖ కమిషనర్‌ అనురాధకు అదనపు బాధ్యతలు అప్పగించారు. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దుర్గగుడి ఆలయ వివాదంపై సమీక్షించారు. దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు, విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ గౌతమ్‌సవాంగ్‌తోపాటు ఇతర అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో సూర్యకుమారిని ఈవో బాధ్యతల నుంచి తప్పించాలని నిర్ణయం తీసుకున్నారు. గతనెల 26వ తేదీ అర్థరాత్రి ఆలయంలో తాంత్రిక పూజలు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అనుమతిలేని పూజారులు ప్రవేశించడం - రాత్రివేళ పూజలు జరిగినట్లు జరుగుతున్న ప్రచారంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విచారించిన న్యాయ నిర్ధారణ కమిటీ తమ ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.

ఈవో పనితీరుపై తీవ్ర ఆగ్రహం..
దీంతో చంద్రబాబు ఈవో పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులకు తెలియకుండా దుర్గగుడిలోకి అపరిచిత వ్యక్తులు ఎలా వచ్చారని సీఎం ప్రశ్నించారు. అధికారుల మధ్య విభేదాలతో దుర్గగుడి పరువు తీస్తున్నారని అవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినవారిపై వేటు వేయాల్సిందేనని సూటిగా చెప్పారు. సూర్యకుమారిని ఈవో బాధ్యతల నుంచి తప్పిస్తూ , తదుపరి విచారణ కొనసాగించాలని ఆయన ఆదేశించారు. దీంతో సూర్యకుమారిని తప్పిస్తున్నట్టు మంత్రి మాణిక్యాలరావు ప్రకటించారు. ఆలయంలో నిర్వహణ లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నట్లు ప్రభుత్వం అభిప్రాయపడుతోందన్నారు. ఈవోగా సూర్యకుమారి ఇక్కడే ఉంటే విచారణ కోనసాగదని- అందుకే తాత్కాలికంగా తొలగించి విచారణ కొనసాగించాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు మంత్రి మాణిక్యాలరావు తెలిపారు. ఆలయ నిర్వహణలో పాలనా పరమైన లోపాలు ఉన్నందువ‌ల్లే సూర్యకుమారిపై చర్యలు తీసుకున్నట్టు చెప్పారు.మొత్తానికి సూర్యకుమారి బదిలీతో ప్రభుత్వం దుర్గగుడిలో తాంత్రిక పూజల ఆరోపణలకు ఫుల్‌స్టాప్‌ పెట్టినట్టైంది.

సూర్యాపేటలో రోడ్డు ప్రమాదం

సూర్యాపేట : జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 20మంది గాయపడ్డారు. విజయవాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు చివ్వెంల మండలం దురాజపల్లి సమీపంలోని తెల్లబండ కాలనీ దగ్గర పల్టీ కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 32మంది ప్రయాణీకులు ఉన్నారు.

07:40 - January 7, 2018

సూర్యాపేట : జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 20మంది గాయపడ్డారు. విజయవాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు చివ్వెంల మండలం దురాజపల్లి సమీపంలోని తెల్లబండ కాలనీ దగ్గర పల్టీ కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 32మంది ప్రయాణీకులు ఉన్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని సూర్యాపేట ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Don't Miss