Activities calendar

08 January 2018

22:11 - January 8, 2018

దక్షిణాఫ్రికా : సఫారీ గడ్డపై భారత్‌కు తొలి పరాభావం ఎదురైంది. కేప్‌టౌన్ టెస్టులో కోహ్లీ సేన ఓటమి పాలైంది. నిన్నటి వర్షంతో.. పిచ్ బౌలర్లకు అనుకూలంగా మారడంతో... బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. రెండో ఇన్నింగ్స్‌లో 208 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక చతికిలపడింది టీమిండియా. కేవలం 135 పరుగులకే చాపచుట్టేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 209 పరుగులు చేసిన భారత్‌ విజయానికి 72 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఇవాళ ఉదయం ఓపెనర్లకు కోల్పోయి బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా... చకచకా వికెట్లు కోల్పోయింది. 130 పరుగులకే ఆలౌట్ అయ్యారు. షమీ, బుమ్రా చెరో 3 వికెట్ల చొప్పున, భువనేశ్వర్, పాండ్యా.. చెరో 2 వికెట్లు తీసారు. తరువాత 208 పరుగుల లక్ష్యంతో రంగంలోకి దిగిన కోహ్లీసేనలో ఎవరు ఎక్కవ సేపు క్రీజులో నిలవలేదు. బాల్ టర్న్ అవడంతో... ఒక్కక్కరుగా పెవిలియన్ చేరారు. అశ్విన్ 37 పరుగులు, కెప్టెన్ కోహ్లీ 28 పరుగులు చేశారు. మిగిలిన వారంత తక్కువ సంఖ్యకే పరిమితమయ్యారు. సఫారీ బౌలర్ ఫిలాండర్ 6 వికెట్లతో భారత్‌ను దెబ్బతీశాడు. 

 

22:08 - January 8, 2018

హైదరాబాద్ : ఇప్పుడు తెలంగాణలో ఓ విషయంపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది.. అదేంటంటే.. ఇసుక మాఫియా చేతిలో హతమైన సాయిలు ఎవరు..? కుటుంబ సభ్యులు చెబుతున్నట్లు వీఆర్ ఏనా..? ప్రభుత్వం చెబుతున్నట్లు సామాన్య పౌరుడా..? ఇంతకీ అతను చనిపోయింది ఇసుక మాఫియా దాష్టీకానికా..? ప్రభుత్వం చెబుతున్నట్లు ఇటుకలారీ ఘాతుకానికా..? ఈ ప్రశ్నలకు సమాధానాన్ని అన్వేషించే 10టీవీ కథనం ఇప్పుడు..

జనవరి 3..రాత్రి అందరూ నిద్రించే సమయం.. ఇసుక మాఫియా చేతిలో హతమైన సాయిలు.. ఇదంతా విని.. ఇదేదో సాధారణ ప్రమాదమని, ఎవరో అనామకుడు ప్రాణాలు కోల్పోయారని అనుకుంటే తప్పులో కాలేసినట్లే. మృతుడు ఎవరన్నదానిపై ఇప్పుడు విపరీతంగా చర్చ సాగుతోంది. మరణించిన సాయిలు.. ప్రభుత్వంలోని రెవిన్యూ విభాగంలో భాగమైన విఆర్‌ఏ అని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కానీ, ప్రభుత్వం.. ముఖ్యంగా.. రాష్ట్ర ఐటీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సహా.. యంత్రాంగమంతా.. సాయిలు ఎవరో అనామకుడని, విఆర్‌ఏ కానే కాదని చెబుతోంది. 

ఇంతకీ.. సాయిలు విఆర్‌ఏనా.. కాదా..? ఇసుక మాఫియా ఆగడాలకు బలైన సాయిలు.. కచ్చితంగా విఆర్ఏనే అని స్పష్టం చేసే ఆధారాలు లభ్యమయ్యాయి. కట్టుకున్న వాడిని కోల్పోయి.. పుట్టెడు దుఃఖంలో ఉన్న సాయిలు భార్య.. తన భర్త మరణం కన్నా కూడా.. అతడి చావుపైనా.. అతడి ఉద్యోగంపైనా సాక్ష్యాత్తూ ప్రభుత్వమే వేస్తోన్న అభియోగాలతో.. మరింత కుంగిపోతోంది. తండ్రిని కోల్పోయిన బిడ్డల రోదన కరడుగట్టిపోయిన ప్రభుత్వాన్ని కదిలించలేక పోతోంది. సాక్ష్యాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నా ప్రభుత్వం వేరేలా ఎందుకు స్పందిస్తోంది..? ప్రభుత్వ సిబ్బందినే తమవాడు కాదని ఎందుకు బుకాయిస్తోంది..? దీనిపై ప్రజాసంఘాలు.. ముఖ్యంగా టీ-మాస్‌ నిజనిర్ధారణకు ప్రయత్నించింది. వారు కూడా.. సాయిలు ఇసుక మాఫియా ఆగడాలకే బలయ్యాడని, ఆయన సర్కారీ కొలువులోనే కన్నుమూశాడని తేల్చారు. ప్రభుత్వం ఇసుక మాఫియాకు తలొగ్గి.. బాధితుడి కుటుంబాన్ని అన్యాయం చేయాలని చూస్తోందని వారు ప్రజాసంఘాల నేతలు అనుమానిస్తున్నారు. కేసీఆర్‌ సర్కారు సవ్యంగా స్పందించకుంటే.. రాష్ట్రవ్యాప్త ఉద్యమం ద్వారా కదిలించాలని యోచిస్తున్నారు. సాయిలుకు మద్దతుగా ఈ నెల 16న మండల కేంద్రాల్లో ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టాలని టీ-మాస్‌ నిర్ణయించింది. అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే.. జనవరి 22న జిల్లా కలెక్టరేట్ల ముట్టడించాలని.. అలా దశలవారీగా ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని ప్రజాసంఘాలు నిర్ణయించాయి. 

22:03 - January 8, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్‌లో ఉత్తమ్‌కు ఇక తిరుగు లేదా? పార్టీ కెప్టెన్‌గా... ఉత్తమే కొనసాగనున్నారా? ఉత్తమ్‌కుమార్‌పై ఢిల్లీ పెద్దలు సంతృప్తిగా ఉన్నారా?  అంటే అవుననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు..! రెండోసారి ఉత్తమ్‌ను పార్టీ రథసారథిగా రాహుల్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో... కాంగ్రెస్ క్యాడర్‌లో కొత్త జోష్‌ కనిపిస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ పీసీసీ నాయకత్వాన్ని మార్చుతుందనే ఊహగానాలకు తెరపడింది. పార్టీ పగ్గాలు మళ్లీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికే దక్కాయి. ఉత్తమ్‌నే  పార్టీ సారథిగా కొనసాగిస్తూ.. రాహుల్‌గాంధీ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం పట్ల.. కొందరు నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఇది మంచి పరిణామమని తమ ఆమోదం తెలిపారు. అలాగే..  హైకమాండ్‌ తనకు రెండోసారి బాధ్యతలు అప్పగించడం పట్ల ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. రాహుల్‌గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. సమష్టి కృషితో 2019లో పార్టీని అధికారంలోకి తెస్తామన్నారు

హైకమాండ్‌ గ్రీన్‌ సిగ్నల్‌తో ఉత్తమ్‌ స్పీడ్‌ మరింత పెంచేందుకు రెడీ అవుతున్నారు. ముఖ్యంగా... రైతుల అంశాలను ఎజెండాగా తీసుకునే యోచనలో ఉన్నారని సమాచారం. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవడంపై ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టి.. ఊరు-వాడా తిరిగేందుకు పక్కా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. కాంగ్రెస్‌ అధిష్టానం తాజా నిర్ణయంతో... ఉత్తమ్‌ వర్గంలో ఉత్సాహం ఉరకలేస్తుంటే.. నిన్నటి వరకూ  ఆ పదవి కోసం ఆశ పడ్డ వారు ఒక్కసారిగా డీలా పడ్డారు. ఇక చేసేది లేక ఉత్తమ్‌తో కలిసి నడవాల్సిన పరిస్థితి నెలకొంది. 


 

22:00 - January 8, 2018

హైదరాబాద్ : సీఎం చంద్రబాబు పాలనపై విపక్ష వైసీపీ నేతలు విరుచుకుపడ్డారు. అధికారంలోకి వచ్చింది మొదలు సీఎం చంద్రబాబు అబద్ధాలతోనే కాలం గుడుపుతున్నారని విమర్శించారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో వేలకోట్ల రూపాయలు దోచుకుంటున్నారని ఆరోపించారు. అప్పుతెచ్చిన లక్షా 20వేల కోట్లలో కనీసం 20వేల కోట్లు కూడా ప్రజల కోసం ఖర్చుపెట్టలేదని బొత్స అన్నారు. 

 

21:56 - January 8, 2018

జోగులాంబ గద్వాల : తెలంగాణ ప్రభుత్వం.. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో జోరు పెంచింది. ముఖ్యంగా.. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఎత్తిపోతల పథకాల పూర్తికి ప్రయత్నిస్తోంది. తాజాగా.. జోగులాంబ గద్వాల జిల్లాలోని తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. రాజోలిబండ డైవర్షన్‌ స్కీమ్‌ కింద ఆయకట్టుకు ఈ పథకం జీవం పోస్తుందన్నది రైతుల భావన.  ఈ పథకం పూర్తయితే చాలాకాలంగా అరకొర నీటితో బాధపడుతున్న ఆర్డీఎస్ ఆయకట్టుకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ఈ పథకం ద్వారా 70 రోజుల్లో 5.44 టీఎంసీల నీటిని సుంకేశుల రిజర్వాయర్ నుంచి ఆర్డీఎస్ కాల్వలోఎత్తిపోయనున్నారు. 

21:54 - January 8, 2018

కరీంనగర్‌ : తెలంగాణలో ఐటీ ప్రాభవాన్ని మరింతగా పెంచే ప్రయత్నం జరుగుతోంది. ఇప్పటివరకూ హైదరాబాద్‌కే పరిమితమైన ఐటీని.. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలకూ విస్తరించే ప్రయత్నం జరుగుతోంది. ఇందులో భాగంగా.. కరీంనగర్‌లో ఐటీ టవర్‌ నిర్మాణానికి..  మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. 25 కోట్ల రూపాయలతో 62 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని నిర్మిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ అభ్యర్థన మేరకు దీని సామర్ధ్యాన్ని రెట్టింపు చేసేందుకూ.. మంత్రి కేటీఆర్‌ అంగీకరించారు. హైదరాబాద్‌, వరంగల్‌ తర్వాత కరీంనగర్‌లోనే ఐటీ టవర్‌ నిర్మిస్తున్నారు. దీని వలన స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. 

 

21:49 - January 8, 2018
21:48 - January 8, 2018
21:47 - January 8, 2018

పేపర్ల రాశి జనం మీదికి ఇడ్సిపెట్టెటోడుండాలేగని.. ఈ భూమిని.. దాని మీద మన్సులను నేనే తయ్యారు జేశ్నాని చెప్పుకున్నా చెప్పుకుంటడు.. చంద్రాలు.. ఇప్పుడు జెప్తలేడా..? ప్రపంచంలొస్తున్న ప్రతి మార్పుకు నేనే తల్లిని.. నేనే తండ్రిని అని చెప్కతిర్గవట్టే.. ఇప్పుడు క్రీడారంగం మీద వడ్డడు.. మరి అండ్లేంత గప్పాలు గొడ్తున్నడో సూడుండ్రి..

ఆంధ్రల చంద్రబాబేశిన.. జన్మభూమి కమిటీలు.. తెలంగాణల చంద్రశేఖర్ రావేశిన.. రైతు సమైక్య కమిటీలు.. ఇవ్వి రెండు జనాన్ని ఉద్దరిచ్చె కమిటీలైతె గావు.. ఓట్ల సంఘాలను గట్టి మళ్ల గెల్చెతందుకు నాయకులు ఆడుతున్న నాటకంల పుట్టిన పాత్రలే జన్మభూమి, రైతు సమన్వయ సమితి.. ఇవ్విటిని రద్దు జేయాలె అంటున్నరు సీపీఎం పార్టోళ్లు..

బీసీ నాయకులకు ఇప్పుడిప్పుడు కనువిప్పు అయితున్నట్టుంది.. మరి అధికారం దూరమైనంకొస్తున్న మాటలా ఇవ్విలేకపోతె.. నిజంగనే బీసీలకు అన్యాయం అయ్యింది తెల్గు రాష్ట్రాలళ్ల అన్న సోయా తెల్వదిగని.. మాజీమంత్రి.. చింతా మోహన్ గారు మాత్రం.. మా బీసీ ముఖ్యమంత్రి ఎందుకు అయితలేడని కొత్త చర్చను సుర్వు జేశిండు..

ఒక ప్రభుత్వ అధికారి చెప్పపెట్టకుంట ఆఫీసుకు సక్కగ రాకపోతె సస్పెండు జేస్తరు.. బడిపోరడు బడికి సక్కగరాకపోతె హాజిరి లేదని ఫెయిల్ జేస్తరు.. మరి ప్రభుత్వ పదవిని అనుభవిస్తున్న మార్కెట్ కమిటీ చైర్మన్ గూడ మార్కెటుకు సక్కగ రాకపోతె ఆయనను సస్పెండ్ జేయాలేగదా..? రైతులకు గనిపియ్యని మార్కెట్ కమిటీ ఛైర్మన్ను ఏం జేస్తరో చేయిండ్రిగ..

మన దేశం ఇంకా దరిద్ర్యంలనే ఉన్నదంటే.. కారణం పూజలు మంత్రాలు తాయితుల మహిమనే.. మనుషులను బాగుజేశే శక్తి తాయితలకు లేదన్నది తెల్సుగని.. దేశాన్ని నాశ్నంజేశే శక్తిమాత్రం ఈ మంత్రాలు, పూజలు పునస్కారాలకు మాత్రం ఉన్నది.. బైటిదేశాలపొంటి లేని మంత్రాలు, తాయితలు, బాబాలు.. మనదేశంలనే ఉండుడు మన దరిద్రానికి పరాకాష్ట అన్నట్టే..

ఉశ్కెలారీలు ఏమన్న సప్పుడు ఎట్లున్నది తెలంగాణల.. ఏమన్న అంటే.. డబుల్ బెడ్రూం ఇండ్లు గట్టెతందుకు ఉశ్కెను తీస్కపోతున్నమని లారీలకు బ్యానర్ గట్టుంటది.. ఈ మూడున్నర నాల్గేండ్లళ్ల ఎత్కపోయిన ఉశ్కె లెక్కలు జూస్తె.. తెలంగాణల ఇప్పటికే డబుల్ బెడ్రూం ఇండ్లు గట్టుడు పూర్తి గావాలె.. గంత ఉశ్కెవాగులు దాటుతున్నది.. అంటె చెట్టుపేరు జెప్పి కాయలమ్ముకున్నట్టు.. ప్రభుత్వ పథకాల నిర్మాణం పేరుజెప్పి ఉశ్కెదోస్తున్నరు..

నేటి బాలలే రేపటి పౌరులు.. అని ఒక సామెత ఉంటది.. దానంత బట్టెవాయి సామెత ఇంకోటి లేకుండొచ్చు.. నేటి బాలలే రేపటి పౌరులు అని ఉన్నదిగని.. బాలలు రేపటిదాక గూడ ఆగుతలేరు.. నేటి పౌరులుగ మారిపోతున్నరు.. నిజామాబాద్ జిల్లాల మీసాలు రాని పోరల ఏశాలు ఎట్లున్నయో టెన్ టీవీ కెమేరాకు దొర్కింది సూడుండ్రి..

రోడ్డు మీద ప్రయాణం అంటే.. వస్తుంటె పోతుంటే.. మంచైతది.. చెడైతది.. ఆర్టీసీ బస్సు నా కారుకు తాకింది గావట్టి వాడు నా కాళ్లు మొక్కాలే అట్లైతెనే ఇడ్సిపెడ్తాని ఎల్బీనగర్ దిక్కు ఒక కారు పార్టాయిన కయ్యం దీస్తె.. పోలీసోళ్లు, లీడర్లు అంత దగ్గరుండి ఆ డ్రైవర్ తోని కాళ్లు మొక్కవెట్టిండ్రు.. ఇది అధికార మదం అనకపోతె ఇంకేమంటరు అనేది మీరే జెప్పాలే సూశి..

వారెవ్వ సన్మానం అంటే ఇట్లుండాలే.. డప్పు సప్పుళ్లతోని.. బాజా బజంత్రీలతోని ఊరువాడ తిర్గుకుంట.. బాబు నాకే ఓటేయుండ్రి అంటే.. జనం పులదండలు దీస్కొచ్చి మెడలేస్తరనుకున్నడో ఏమో.. ఒక బీజేపీ లీడరు.. ఓట్ల ప్రచారం కోసం ఒకతాన తిర్గుతుంటే.. వాని మీద మంటతోని ఒక పెద్దాయన ఎంత పనిజేశిండో సూడుండ్రి.. ఆ లీడర్కు ఏమాత్రం ఇజ్జత్ మానం ఉన్నా..? మళ్ల అటెంకాళ్ల గనిపియ్యొద్దు...

21:35 - January 8, 2018
21:28 - January 8, 2018

వీఆర్ ఏ సాయిలుది హత్యేనని వక్తలు అన్నారు. సాయిలు వీఆర్ ఏ కాదని వాదిస్తుందని.. అది కారెక్టు కాదని సాయిలు వీఆర్ ఏ అన్న పక్కా ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చ కార్యక్రమంలో టీకాంగ్రెస్ అధికార ప్రతినిధి ఇందిరాశోభన్, వీఆర్ ఏ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాములు, టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్, సాయిలు భార్య పాల్గొని, మాట్లాడారు. సాయిలు హత్య ఘటనపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. సాయిలు కుటుంబాన్ని కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. అతని కుటుంబానికి ఐదు ఎకరాలు, డబుల్ బెడ్ రూం  ఇళ్లు, 25 లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సాయిలు భార్య మాట్లాడుతూ తన భర్త సాయిలును హత్య చేశారని తెలిపారు. ఎమ్మార్వోకు చెబుతాడని ఇసుక ట్రాక్టర్ తో గుద్ది చంపారని పేర్కొన్నారు. తన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

21:13 - January 8, 2018

విశాఖ : లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగం సంస్థ డీసీఐ ప్రైవేటీకరణపై స్థానిక బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు వింతవాదన లేవనెత్తారు. 2015-16లో సంస్థకు లాభాలు ఎక్కడ వచ్చాయని ప్రశ్నించారు. ఏ సంస్థ  వ్యాపారాన్ని నిర్వహించాలో, ఏ సంస్థ నిర్వహించకూడదో కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుందని చెప్పారు. ఈ విషయంలో తమ పాత్ర ఏమీలేదన్నారు. సంస్థ వార్షిక నివేదికలో డీసీఐ గత సంవత్సరం నష్టాల్లో ఉందని తేలిందన్నారు. డీసీఐ ప్రైవేటీకరణపై గత ఏడాది నవంబర్‌ నుంచి పట్టించుకోని హరిబాబు.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించే విధంగా మాట్లాడడాన్ని సంస్థ ఉద్యోగులు, వామపక్ష నేతలు తప్పుపడుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.... 

20:52 - January 8, 2018

అనంతపురం : విలువలతో కూడిన వార్తలను అందిస్తూ ముందుకు దూసుకు వెళుతున్న 10 టీవీ యాజమాన్యానికి ఒలంపిక్‌ రాష్ట్ర కార్యదర్శి జేసీ పవన్‌ కుమార్‌ రెడ్డి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన క్యాంప్‌ ఆఫీస్‌లో 10టీవీ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. 10టివి యాజమాన్యానికి, ప్రేక్షకులకు  సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియచేశారు.        

20:48 - January 8, 2018
20:44 - January 8, 2018

అనంతపురం : పట్టణంలోని.. పాత ఊరులో.. యశోదమ్మ అనే దాత సాయంతో.. సీడీ ఆస్పత్రిలో నిర్మించిన భవనాన్ని ప్రారంభించారు. గ్రామానికి చెందిన.. అమిలినేని వకీలు కొండప్ప కుమార్తె యశోదమ్మ.. 18 లక్షలు విరాళం ఇవ్వడంతో... సీడీ ఆస్పత్రిలో అసంపూర్ణంగా నిలిచిపోయిన భవనాన్ని నిర్మించడం జరిగింది.. ఈ మేరకు ఆ భవనాన్ని సోమవారం.. దాత యశోదమ్మ, కలెక్టర్‌ వీర పాండ్యన్‌, ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా విరాళం ఇచ్చిన యశోదమ్మను సత్కరించారు. ప్రతి ఒక్కరూ..  వారి జీవితంలో.. ఏదో ఒక మంచి పని చేయాలని.. యశోద సూచించారు. 

 

దుర్గ గుడికి ఇంచార్జ్‌ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన అనురాధ

కృష్ణా : విజయవాడ దుర్గ గుడికి దేవాదాయ శాఖ కమిషనర్‌గా ఉన్న అనురాధను ఇన్‌చార్జ్‌ ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. ఆలయ అధికారులు, వేదపండితులు, అర్చక స్వాములు ఆమెకు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజల్లో ఆమె పాల్గొంది. డిసెంబర్‌26న జరిగిన ప్రత్యేక పూజలపై పూర్తి స్థాయి విచారణ జరుగుతుందని.. ఇప్పటికే సీఎంకి నివేధిక అందించినట్లు ఆమె తెలిపారు. విచారణ సమయంలో ఆరోపణలున్న వారు ఈవోగా ఉండకూడదని.. ప్రభుత్వాదేశంతో  గుడికి ఈవోగా బాధ్యతలు చేపట్టడం జరిగిందన్నారు.

 

20:39 - January 8, 2018

కృష్ణా : విజయవాడ దుర్గ గుడికి దేవాదాయ శాఖ కమిషనర్‌గా ఉన్న అనురాధను ఇన్‌చార్జ్‌ ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. ఆలయ అధికారులు, వేదపండితులు, అర్చక స్వాములు ఆమెకు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజల్లో ఆమె పాల్గొంది. డిసెంబర్‌26న జరిగిన ప్రత్యేక పూజలపై పూర్తి స్థాయి విచారణ జరుగుతుందని.. ఇప్పటికే సీఎంకి నివేధిక అందించినట్లు ఆమె తెలిపారు. విచారణ సమయంలో ఆరోపణలున్న వారు ఈవోగా ఉండకూడదని.. ప్రభుత్వాదేశంతో  గుడికి ఈవోగా బాధ్యతలు చేపట్టడం జరిగిందన్నారు.

 

20:38 - January 8, 2018

గుంటూరు : దళితులపై దాడికి పాల్పడిన అగ్రవర్ణాల వారిని తక్షణమే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ దళిత సంఘాలు గుంటూరు కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టాయి. దాడులకు పాల్పడ్డ వారిని అరెస్ట్‌ చేయకుండా స్థానిక ఎమ్మెల్యే రావెల కిషోర్‌ బాబు, ఎస్పీ కలెక్టర్‌లు సెటిల్‌మెంట్‌ పేరుతో దళితులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని దళిత నేతలు ఆరోపిస్తున్నారు. దళితుల ఆందోళనపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం...

 

డీసీఐకు లాభాలెక్కడ వచ్చాయి : ఎంపీ హరిబాబు

విశాఖ : లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగం సంస్థ డీసీఐ ప్రైవేటీకరణపై స్థానిక బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు వింతవాదన లేవనెత్తారు. 2015-16లో సంస్థకు లాభాలు ఎక్కడ వచ్చాయని ప్రశ్నించారు. ఏ సంస్థ  వ్యాపారాన్ని నిర్వహించాలో, ఏ సంస్థ నిర్వహించకూడదో కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుందని చెప్పారు. ఈ విషయంలో తమ పాత్ర ఏమీలేదన్నారు. సంస్థ వార్షిక నివేదికలో డీసీఐ గత సంవత్సరం నష్టాల్లో ఉందని తేలిందన్నారు. డీసీఐ ప్రైవేటీకరణపై గత ఏడాది నవంబర్‌ నుంచి పట్టించుకోని హరిబాబు.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించే విధంగా మాట్లాడడాన్ని సంస్థ ఉద్యోగులు, వామపక్ష నేతలు తప్పుపడుతున్నారు. 

20:34 - January 8, 2018

విశాఖ : లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగం సంస్థ డీసీఐ ప్రైవేటీకరణపై స్థానిక బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు వింతవాదన లేవనెత్తారు. 2015-16లో సంస్థకు లాభాలు ఎక్కడ వచ్చాయని ప్రశ్నించారు. ఏ సంస్థ  వ్యాపారాన్ని నిర్వహించాలో, ఏ సంస్థ నిర్వహించకూడదో కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుందని చెప్పారు. ఈ విషయంలో తమ పాత్ర ఏమీలేదన్నారు. సంస్థ వార్షిక నివేదికలో డీసీఐ గత సంవత్సరం నష్టాల్లో ఉందని తేలిందన్నారు. డీసీఐ ప్రైవేటీకరణపై గత ఏడాది నవంబర్‌ నుంచి పట్టించుకోని హరిబాబు.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించే విధంగా మాట్లాడడాన్ని సంస్థ ఉద్యోగులు, వామపక్ష నేతలు తప్పుపడుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.... 

20:29 - January 8, 2018

పశ్చిమగోదావరి : పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయడంలో విఫలమైన టీడీపీ, బీజేపీలకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే నైతిక హక్కులేదని కాంగ్రెస్‌ విమర్శించింది. పోలవరం కోసం కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన మహా పాదయాత్ర రెండో రోజుకు చేరింది.  తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం నుంచి ప్రారంభమైన పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో కొనసాగుతోంది. 2018 నాటికి పోలవరం ప్రాజెక్టు నుంచి గ్రావిటీ ద్వారా నీరు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రగల్బాలు ఏమయ్యాయని.. ఇప్పుడు ఎందుకు దాని గురించి మాట్లాడటం లేదని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ప్రశ్నించారు. 

 

20:27 - January 8, 2018

పశ్చిమ గోదావరి : పోలవరంపై కాంగ్రెస్‌ దివాళాకోరు రాజకీయాలు చేస్తుందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. పోలవరం ప్రాజెక్ట్‌ పనులను పరిశీలించిన చంద్రబాబు... కాంగ్రెస్‌ పాదయాత్రపై స్పందించారు. విభజనకు ముందు సమస్యలు వస్తాయని కాంగ్రెస్‌ నేతలు ఎందుకు ఆలోచించలేదని చంద్రబాబు ప్రశ్నించారు. కాంగ్రెస్‌, వైసీపీ నేతలు ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నాలు చేయడంతో పాటు... నిర్వాసితులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు చంద్రబాబు.

 

కేఫ్ టౌన్ టెస్ట్ లో దక్షిణాఫ్రికా విజయం

దక్షిణాఫ్రికా : కేఫ్ టౌన్ టెస్ట్ లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. 72 పరుగల తేడాతో భారత్ పై గెలుపొందింది. 

20:19 - January 8, 2018

పశ్చిమగోదావరి : రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇస్తోందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా  వేగేశ్నపురంలో జరిగిన జన్మభూమి గ్రామ సభలో చంద్రబాబు పొల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా  400 మంది ప్రవాస భారతీయులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వేగేశ్నపురం గ్రామ సభకు వంద మంది ఎన్‌ఆర్‌ఐలు హాజరయ్యారు. జన్మభూమి కార్యక్రమంలో పాల్గొంటున్న ఎన్‌ఐఆర్‌ను చంద్రబాబు అభినందించారు. వేగేశ్నపురం జన్మభూమి గ్రామసభలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చంద్రబాబు ప్రధానంగా ప్రస్తావించారు. 

 

20:16 - January 8, 2018

భద్రత లేని సంచార జీవితం.... గంగిరెద్దు కుటుంబాల కష్టాలు... ఇదే అంశంపై మానవి నిర్వహించిన వేదిక చర్చా కార్యక్రమంలో గంగిరెద్దు కుటుంబ సభ్యులు రజిని, పద్మ పాల్గొని, మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని కుల వృత్తుల వారికి సహాయం చేస్తూ తమ కుల వృత్తిని మానేయాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తోందన్నారు. తమపై లైంగిక దాడులు జరుగుతున్నాయని అన్నారు. షీ టీమ్స్ వల్ల తమకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు.  మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

వ్యక్తి నుంచి లక్ష రూపాయలు లాక్కెళ్లిన దుండగులు

కృష్ణా : విజయవాడ వన్ టౌన్‌లోని దుర్గా కో-ఆపరేటివ్ బ్యాంక్‌ ప్రాంగణంలో చోరీ జరిగింది. డబ్బులు డ్రా చేసుకొని వెళ్తున్న వ్యక్తి నుంచి దుండగులు... లక్ష రూపాయలు లాక్కొని వెళ్లారు. దీంతో బాధితుడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. బ్యాంక్‌లోని సీసీ ఫుటేజి ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. బ్యాంక్‌ ఆవరణలోనే దొంగతనం జరగడంతో ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు.

20:07 - January 8, 2018

కృష్ణా : విజయవాడ వన్ టౌన్‌లోని దుర్గా కో-ఆపరేటివ్ బ్యాంక్‌ ప్రాంగణంలో చోరీ జరిగింది. డబ్బులు డ్రా చేసుకొని వెళ్తున్న వ్యక్తి నుంచి దుండగులు... లక్ష రూపాయలు లాక్కొని వెళ్లారు. దీంతో బాధితుడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. బ్యాంక్‌లోని సీసీ ఫుటేజి ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. బ్యాంక్‌ ఆవరణలోనే దొంగతనం జరగడంతో ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దా.... 

20:02 - January 8, 2018

హైదరాబాద్ : తెలంగాణ ప్రజలకు పానీపట్టు యుద్ధాలు ఎప్పుడు తప్పుతాయి? తాగునీటి  కష్టాలకు మోక్షమెప్పుడు? గుక్కెడు నీటికి అల్లాడిన పల్లెలు జలసిరితో మురిసిపోయేదెప్పుడు? పనులు వదులుకొని కుటుంబ సభ్యులంతా తాగునీటి కోసం బారులు తీరే రోజులు ఎప్పుడు కనుమరుగవుతాయి? మిషన్‌ భగీరథ పథకం పల్లెల దాహార్తిని ఎప్పుడు తీర్చనుంది?మిషన్‌ భగీరథ పనులపై 10టీవీ గ్రౌండ్‌ రిపోర్ట్‌.. 
పూర్తికావొచ్చిన మిషన్‌ భగీరథ పనులు
తెలంగాణ ప్రజల దాహార్తిని తీర్చడం కోసం తీసుకొచ్చిన మిషన్‌ భగీరథ పనులు దాదాపు పూర్తికావచ్చాయి. ఇప్పటికే 90శాతం పనులు పూర్తైనట్టు ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటి వరకు 19 ఇన్‌టెక్‌వెల్‌ల నిర్మాణాలు పూర్తయ్యాయి. 425 సంపులకుగాను 396 సంపుల నిర్మాణాలు పూర్తి చేశారు. 149 జీఎల్‌బీఆర్‌లకు 143 నిర్మాణాలు కంప్లీట్‌ అయ్యాయి. 566 ఓహెచ్‌బీఆర్‌లకుగానూ...457 పూర్తి చేశారు.  ప్రధాన పైప్‌లైన్‌ 48,923 కిలోమీటర్లకుగాను... ఇప్పటి వరకు 43, 752 కిలోమీటర్లు పూర్తయ్యింది.  మిషన్‌ భగీరథ ద్వారా ఇప్పటికే 4,488 గ్రామాలకు, ఏడు పట్టణాలకు నీటి పంపిణీ చేస్తున్నారు. 1955 గ్రామాల్లోని కుటుంబాలకు ఇంటింటికి నల్లాలు బిగించి నీటి పంపిణీ జరుగుతోంది.  ఈ పథకం అమలు కోసం 417 విలేజ్‌ ట్యాంకులు, 3 బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్లను, ఒకగ్రౌండ్‌ లెవల్‌ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ను, 417 ఓవర్‌ హెడ్‌ ట్యాంకులను నిర్మించారు. మిషన్‌ భగీరథ నిర్వహణకు  1.8 మెగావాట్ల విద్యుత్‌ వినియోగించేందుకు సబ్‌స్టేషన్లను సిద్ధపరిచారు. రానున్న రోజుల్లో ఎక్కడికక్కడ సోలార్‌ ప్లాంట్లను నిర్మించి వాటి ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేసుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 
90శాతం మిషన్‌ భగీరథ పనులు పూర్తి : అధికారులు
ప్రస్తుతం పాలేరు, జనగామా ప్రాంతాల్లో 90శాతం మిషన్‌ భగీరథ పనులు పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నారు.  మరో 6నెలల్లో ఇంటింటికి నల్లా కనెక్షన్‌లను కూడా పూర్తి చేస్తామంటున్నారు. పాలేరు సెగ్మెంట్‌లోని ఇంటెక్‌వెల్‌ నుంచి నీటి విడుదలకు  ట్రయల్‌రన్‌ నిర్వహిస్తున్నారు.  జనగామ సెగ్మెంట్‌లో ఇప్పటికే పనులు పూర్తికావడంతో 692 గ్రామాలకు బల్క్‌గా నీటిని చేరుస్తున్నారు. ట్రయల్‌రన్‌ విజయవంతమైన ప్రాంతాల్లోని గ్రామాలకు దశలవారీగా నీరందిస్తున్నారు. పాలకుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి గ్రామంలో గత కొద్దిరోజులుగా వేసిన ట్రయల్‌రన్‌ విజయవంతం అయ్యింది. దీంతో ఈ ఆ గ్రామంలో ప్రతిరోజు ఇంటింటికి నల్లా నీరు వస్తుండడంతో గ్రామస్తుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
మిషన్‌ భగీరథ పూర్తైతే రికార్డే 
మొత్తానికి మిషన్‌ భగీరథ పూర్తైతే ఓ రికార్డే సృష్టిస్తుంది. ఇక నుంచి కుళాయిల దగ్గర కొట్లాటలు కనిపించవు. వేసవి వచ్చినా, కరువు నెలకొన్నా గుక్కెడు నీటికోసం పడేకష్టాలు ఇక దారిదాపుల్లో కనిపించవు. తాగేందుకు మంచినీటిని కొనుగోలు చేసే దుస్థితి పోతుంది. బంగారు తెలంగాణ ఆవిష్కరణలో ఈ భగీరథ పథకం సరికొత్త అధ్యాయానికి తెరతీయనుందనడంలో ఎలాంటి సందేహం లేదు.  

 

19:54 - January 8, 2018

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 24 గంటలు విద్యుత్‌ పథకం ద్వారా భూగర్భ జలాలు పడిపోయాయని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమట్‌ రెడ్డి వెంకట్‌ రెడ్డి అన్నారు. ప్రభుత్వం 24 గంటల విద్యుత్‌ పథకాన్ని పునసమీక్షించాలని సూచించారు. కేసీఆర్‌కు రైతులపై నిజంగా ప్రేమ ఉంటే ఎకరానికి 4వేల పెట్టుబడి పథకం ఈ సీజన్‌ నుండే అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. రుణమాఫీలో 70 శాతం వడ్డీలకే సరిపోయిందని విమర్శించారు కోమటిరెడ్డి. 

 

19:43 - January 8, 2018

కామారెడ్డి : జిల్లాలోని పిట్లం మండలం కారేగావ్‌లో వీఆర్‌ఏ సాయిలు హత్య ఘటనపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలని ప్రజాగాయకుడు గద్దర్‌ డిమాండ్‌ చేశారు. సాయిలును ఇసుక మాఫియా చంపలేదన్న ప్రభుత్వ పెద్దలు వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. ఇంటికి పెద్దదిక్కు కోల్పోయిన సాయిలు కుటుంబానికి 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేదంటే పేదల ఉసురు తగిలి ప్రభుత్వం పతనమవడం ఖాయమని గద్దర్‌ అన్నారు.

 

19:41 - January 8, 2018

హైదరాబాద్ : టీవీ యాంకర్‌ ప్రదీప్‌ కౌన్సిలింగ్‌కు హాజరయ్యారు. గోషా మహల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు తండ్రితో కలిసి వచ్చారు. న్యూ ఇయర్‌ రోజు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డ ప్రదీప్‌ ఆ తరువాత ప్రదీప్ ఇన్నిరోజులు కౌన్సిలింగ్‌ వాయిదా వేస్తూ వచ్చారు.  బిజీ షెడ్యూల్ ఉన్నందునే ఇన్నిరోజులు కౌన్సెలింగ్‌కు హాజరు కాలేకపోయానని ప్రదీప్ స్పష్టం చేశారు. కౌన్సెలింగ్‌ ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాను. మద్యం ఆరోగ్యానికి హానికరమని ప్రదీప్ తెలిపారు. ఈ కౌన్సెలింగ్ ద్వారా తనకు తెలిసిన విషయాలు మిగతా వారికి తెలియజేస్తాను. తాను చేసినట్లు ఎవరూ కూడా చేయవద్దని విజ్ఞప్తి చేశారు. 

 

న్యాయపోరాటం చేస్తున్న సంగీత

హైదరాబాద్ : భర్త, అత్తమామల నుంచి న్యాయం కోసం సంగీత చేస్తున్న పోరాటం 50 రోజులు దాటింది. ఇన్నిరోజులుగా ధర్నా చేస్తున్న ఇంతవరకు ఎలాంటి న్యాయం జరగలేదు. న్యాయం చేస్తామన్న నేతలు మొహం చాటేశారు. అటు ఈ కేసులో అరెస్టైన భర్త, అత్తమామలు బైయిల్ పై  బయటకు వచ్చారు. ఒంటరిగా చిన్నపాపతో 51రోజులుగా సంగీత పోరాడుతోంది. చలితో తనతో పాటు కూతురి ఆరోగ్యం క్షీణిస్తోన్నా... సంగీత పోరాటం మాత్రం ఆపడం లేదు. 

19:34 - January 8, 2018

హైదరాబాద్ : భర్త, అత్తమామల నుంచి న్యాయం కోసం సంగీత చేస్తున్న పోరాటం 50 రోజులు దాటింది. ఇన్నిరోజులుగా ధర్నా చేస్తున్న ఇంతవరకు ఎలాంటి న్యాయం జరగలేదు. న్యాయం చేస్తామన్న నేతలు మొహం చాటేశారు. అటు ఈ కేసులో అరెస్టైన భర్త, అత్తమామలు బైయిల్ పై  బయటకు వచ్చారు. ఒంటరిగా చిన్నపాపతో 51రోజులుగా సంగీత పోరాడుతోంది. చలితో తనతో పాటు కూతురి ఆరోగ్యం క్షీణిస్తోన్నా... సంగీత పోరాటం మాత్రం ఆపడం లేదు. 
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

18:34 - January 8, 2018

పశ్చిమగోదావరి : పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి అని సీఎం చంద్రబాబు అన్నారు. జిల్లాలో నిర్వహించిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో సీఎం పాల్గొని, మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే రాష్ట్రాన్ని సస్యశ్యామలం అవుతుందన్నారు. పోలవరం పూర్తి చేస్తే సముద్రం కలిసే నీటిని వినియోగించుకోవచ్చన్నారు. కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలతోపాటు పలు జిల్లాలకు నీరు అందుతుందని తెలిపారు. నదులను అనుసంధానం చేస్తామని చెప్పారు. వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టామన్నారు. సంక్షోభం పోవాలంటే, డబుల్ గ్రోత్ రేట్ రావాలంటే వ్యవసాయ సంక్షోభం పోవాలని...అందుకు వ్యవసాయంపై దృష్టి పెట్టామని తెలిపారు. ఆహారపు అలవాట్లు మారాయన్నారు. కరెంట్ చాలా కీలకమన్నారు. వ్యవసాయం, ఇండ్లు, పరిశ్రమలకు కరెంట్ అవసరమనని తెలిపారు. మూడు నెలల్లో కరెంట్ కొరత లేకుండా చేశామన్నారు. భవిష్యత్ లో కరెంట్ చార్జీలు పెంచబోమని స్పష్టం చేశారు. 24 వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేశామని చెప్పారు. అప్పుడు ఆర్ బీఐ అడ్డుపడిందని, బ్యాంకులు వ్యతిరేకించాయని గుర్తు చేశారు. వ్యవసాయానికి నీరు చాలా అవససరమన్నారు. నీటి సమస్య పరిష్కారానికి రూ.50 వేల కోట్లు ఖర్చు పెట్టామని తెలిపారు. చాలా ప్రాజెక్టులు పూర్తి చేశామని పేర్కొన్నారు. ఎన్ టీఆర్ ప్రారంభించిన ప్రాజెక్టులను తాను పూర్తి చేశామని తెలిపారు. ప్రపంచం మొత్తం పండ్లు, కూరగాయలు తింటున్నారని చెప్పారు. వ్యవసాయం నుంచి ఆర్టికల్చర్, పండ్ల తోటలకు పోవాలనుకుంటున్నామని తెలిపారు. వాణిజ్య పంటలతో ముందుకు వెళ్లాలని..మన ఆదాయం పెరుగుతుందన్నారు. 50 లక్షల హెక్టార్ల సేద్యం చేస్తున్నామన్నారు. వ్యవసాయం కంటే పండ్ల తోటలు, కూరగాయల వల్ల అధిక ఆదాయం వస్తుందన్నారు. పౌల్ట్రీ, గొర్రెల పెంపకం లాభదాయకం అయిందని పేర్కొన్నారు. చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. వ్యవసాయంలో నూతన విధానానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. రెయిన్ గన్ తీసుకొచ్చామని తెలిపారు. వినూత్న విధానంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. మనిషి ఆరోగ్యం ఎంత ముఖ్యమో భూమి ఆరోగ్యం అంతే ముఖ్యమన్నారు. రైతులందరికీ మైక్రో న్యూట్రిషన్ సరఫరా చేశామని తెలిపారు. అగ్రిటెక్ 2017 నిర్వహించామని తెలిపారు. డ్రోన్ ద్వారా సాయిల్ టెస్ట్ చేసుకునే అవకాశం వచ్చిందన్నారు. పశ్చిమగోదావరిని ఆదర్శంగా తీసుకుంటామని తెలిపారు. రైతులందరినీ ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. వ్యవసాయం లాభసాటి కావాలన్నారు. రైతుకు అండగా ఉండాలని ఆదునీకరణమైన టెక్నాలజీకి శ్రీకారం చుట్టామని తెలిపారు. కరెంటు, నీరు, ఎరువులు ఇస్తున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో దయ్యాలు కూడా పెన్షన్ తీసుకున్నాయని విమర్శించారు. స్మశానం నుంచి దయ్యాలు వచ్చి పెన్షన్ తీసుకుని మళ్లీ స్మశానాకి వెళ్లాయని ఎద్దేవా చేశారు. 

17:57 - January 8, 2018

కేఫ్ టౌన్ : భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా 130 పరుగులకు ఆలౌట్ అయింది. షమీ, బుమ్రాలు విజృంభించారు. దక్షిణాఫ్రికా 207 పరుగుల ఆధిక్యంలో ఉంది. 

 

17:51 - January 8, 2018

సంగారెడ్డి : జిల్లాలోని జహీరాబాద్‌లో వార్డెన్‌ దారుణంగా ప్రవర్తించాడు. షేకాపూర్‌లోని ఎస్సీహాస్టల్‌లో విద్యార్థులను వార్డెన్‌ యాదయ్య చితకబాదాడు. అల్లరి చేస్తున్నారంటూ తలకిందులుగా నిలబెట్టి ప్లాస్టిక్‌ పైపుతో విచక్షణా రహితంగా కొట్టాడు. 
వార్డెన్ యాదయ్య...
'పిల్లలు రాళ్లతో కొట్టుకున్నారు. అందుకే వారిని భయపెట్టేందుకు విద్యార్థులను మందలించాను. ఎలాంటి దురుద్ధేశంతో చేయలేదు. తల్లిదండ్రుల లాగా ప్రవర్తించాను. ప్రాథమిక విద్యా హక్కు చట్టం ప్రకారం నేను చేసింది తప్పే' అని ఒప్పుకున్నాడు. 

 

17:46 - January 8, 2018

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని అశ్వారావుపేట వ్యవసాయ పాలిటెక్నికల్‌ కాలేజీలో విద్యార్థులు, అధ్యాపకుల మధ్య తలెత్తిన వివాదం తారాస్థాయికి చేరింది. అధ్యాపకురాలు రేణుక తమ పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. రేణుక వేధింపులతో మనస్తాపానికి గురైన డిప్లొమా రెండో సంవత్సరం విద్యార్థిని రోహిణి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఈ వ్యవహారంపై విద్యార్థులు, అధ్యాపకులు పరస్పరం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. 
భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట వ్యవసాయ పాలిటెక్నికల్‌ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం 

 

17:40 - January 8, 2018

హైదరాబాద్ : టీవీ యాంకర్‌ ప్రదీప్‌ కౌన్సిలింగ్‌కు హాజరయ్యారు. గోషా మహల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. న్యూ ఇయర్‌ రోజు ప్రదీప్‌ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డారు. ఆ తరువాత ప్రదీప్ ఇన్నిరోజులు కౌన్సిలింగ్‌ వాయిదా వేస్తూ వచ్చారు. ఈరోజు గోషామహల్ ట్రాఫిక్‌ పీఎస్‌కు హాజరయ్యారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

17:36 - January 8, 2018

హైదరాబాద్ : ఇసుక మాఫియాకు టీ సర్కార్‌ కొమ్ముకాస్తుందన్న ఆరోపణలు మరోసారి బయటపడ్డాయి. సాయిలు వీఆర్ఏ కాదని , అతనిది హత్య కాదని మంత్రి కేటీఆర్, కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ ప్రకటించడం అతని కుటుంబ సభ్యులను ఆవేదనకు గురిచేసింది. సాయిలు వీఆర్ఏ అని అతను డ్యూటీ చేసినట్లు రికార్డులు ఉన్నాయని కుటుంబసభ్యులు మీడియాకు చూపించారు. జనవరి3వ తేదీ రాత్రి డ్యూటీకి వెళ్లాడని, తన భర్తను ఇసుక ట్రాక్టర్‌తో ఢీ కొట్టి..హత్య చేసారని భార్యా, పిల్లలు కన్నీటి పర్యంతమయ్యారు. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయామని తమను ఆదుకోవాలంటున్న సాయిలు కుటుంబ సభ్యులతో 10 టివి ఫేస్ టూ ఫేస్ నిర్వహించింది.  
సాయిలు భార్య...
'నా భర్తను ఇసుక ట్రాక్టర్‌తో యాక్సిడెంట్ చేసి చంపేశారు. యాక్సిడెండ్ చేసిన వారు పీఎస్ లో కూర్చున్నారు. మమ్మల్ని కూడా డీజిల్ పోసి కాలబెట్టండి. నాకు ఇద్దరు అమ్మాయిలు, ఒక బాబు ఉన్నాడు. సాయిలు తల్లిదండ్రులు ఉన్నారు. వారు ముసలివాళ్లు. మమ్మల్ని ఆదుకునేది ఎవరని' కన్నీటి పర్యంతమయ్యారు. కుటుంబాన్ని ఆదుకోవాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని వేడుకుంటున్నారు. 
కూతురు... 
'నాన్నకు అన్నం పెట్టినం. అన్నం తిన్న తర్వాత బిల్ల అంగికి పెట్టుకుని, కట్ట తీసుకుని వెళ్లాడు. పెద్దగాల నాన్న చనిపోయారని' చెప్పారు. 
కుమారుడు..
'నాన్న అన్నం తిన్నడు. అన్నం తిన్న తర్వాత అంగికి బిల్ల పెట్టుకున్నాడు. కట్టె తీసుకుని వెళ్లాడని' తెలిపారు.  

 

రెండో వికెట్ కోల్పోయిన భారత్

కేప్ టౌన్ : భారత్, సౌతాఫ్రికా మధ్య జరగుతున్న మొదటి టెస్టులో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. 30 పరుగుల వద్ద మురళీ విజయ్(13) ఔటయ్యాడు. 

రేపు నాంపల్లి కోర్టు హాజరుకానున్న యాంకర్ ప్రదీప్

హైదరాబాద్ : యాంకర్ ప్రదీప్ అతని తల్లిదండ్రుల మధ్య పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. ప్రదీప్ రేపు నాంపల్లి కోర్టుకు హాజరుకానున్నారు. 

తుమ్మిళ్ల ఎత్తిపోతలకు హరీష్ రావు శంకుస్థాపన

గద్వాల : తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకానికి భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. 

16:35 - January 8, 2018

హైదరాబాద్ : ఇసుక మాఫియాకు టీ సర్కార్‌ కొమ్ముకాస్తుందన్న ఆరోపణలు మరోసారి బయటపడ్డాయి. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం కారేగావ్‌లో ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్నందుకు సాయిలు అనే వీఆర్‌ఏను అక్రమార్కులు ఇసుక ట్రాక్టర్లతో తొక్కించి హత్య చేశారు. అయితే సాయిలు వీఆర్‌ఏ కాదని మంత్రి కేటీఆర్‌తో పాటు కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ ప్రకటించారు. అయితే సాయిలు వీఆర్ఏనే అని అతను డ్యూటీ చేసినట్లు రికార్డులు ఉన్నాయని కుటుంబసభ్యులు మీడియాకు చూపించారు. జనవరి 3వ తేదీ రాత్రి డ్యూటీకి వెళ్లాడని, తన భర్తను ఇసుక ట్రాక్టర్‌తో ఢీ కొట్టి..హత్య చేసారని భార్యా, పిల్లలు కన్నీటి పర్యంతమయ్యారు. 

నరసరావు పేట కిడ్ని రాకెట్ పై విచారణ

గుంటూరు : నరసరావుపేట కిడ్నీ రాకెట్ కేసులో పోలీసుల ఎదుట విచారణకు టీడీపీ నత కపిలవాయి విజయ కుమార్ హాజరైయ్యారు. 

ఈ నెల 25న పద్మావత్ సినిమా విడుదల

ముంబై : ఈ నెల 25న పద్మావత్ సినిమా విడుదల చేయనున్నారు. 5 మార్పులతో పద్మావత్ సినిమా విడుదలకు సెన్సార్ బోర్డు అనుమతి ఇచ్చింది. 

16:16 - January 8, 2018

కరీంనగర్ : ఆధునికంగా మనం ఎంతగా ఎదుగుతున్నా.... సమాజంలో మూఢనమ్మకాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వీధికో బురుడీ బాబా దుఖాణం తెరుస్తున్నాడు.. తాజాగా కరీంనగర్‌లో  టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఓ దొంగ బాబాను అరెస్ట్‌ చేశారు... నగదుతోపాటు బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
బరితెగిస్తున్న బురిడీ బాబాలు
ఆధునికంగా ఎంత ఎదిగినా... సమాజంలో ఆటవిక పోకడలు ఏ మాత్రం తగ్గడంలేదు. జ్వరం వచ్చినా.. జలుబు చేసినా... కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఇలా ప్రతి చిన్న విషయానికీ బాబాలను ఆశ్రయించడం ఎక్కువైంది... ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న దొంగబాబాలు అక్రమ సంపాదనకు బరితెగిస్తున్నారు.
చేతబడి, బాణామతి, మంత్రాలు, తంత్రాలతో మోసం
తాజాగా కరీంనగర్‌లో ఓ దొంగ బాబా బండారం బయటపడింది.  వేములవాడ మండలం శాత్రాజుపల్లి గ్రామానికి చెందిన బషీర్‌ బాబా... కరీంనగర్‌లోని విద్యానగర్‌ వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో ఉంటున్నాడు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలన్న అత్యాశతో అమాయకులను టార్గెట్‌ చేశాడు. చేతబడి, బాణామతి చేయడం మొదలు పెట్టాడు. తాను ఇచ్చే మంత్రాలతో..తాయత్తులతో సమస్యలు ఇట్టే పరిష్కారమవుతాయి అంటూ...నమ్మించాడు. నమ్మివచ్చిన భక్తుల నుంచి డబ్బులు గుంజి భారీగా కూడబెట్టాడు.
నగదు, బంగారు, వెండి ఆభరణాల స్వాధీనం
దొంగ బాబా చేతిలో మోసపోయామని తెలుసుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల సమాచారం అందుకున్న టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు బషీర్‌ బాబా ఇంటిపై దాడిచేశారు. నిందితున్ని అదుపులోకి తీసుకుని...4లక్షలా 23వేలు  నగదు, 250 గ్రాముల బంగారం, 5 కేజీల 600 గ్రాముల వెండితోపాటు పూజ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్‌ సీఐ శ్రీనివాసరావు వివరించారు. ఆరోగ్య సమస్యలు కానీ.. మరే ఇతర ఏ సమస్యలుగానీ ఉంటే సంబంధిత నిపుణులను సంప్రందించాలని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు. దొంగ బాబాల గురించి తెలిస్తే... తమకు సమాచారం ఇవ్వాలని వారు కోరుతున్నారు.

 

రెండో ఇన్నింగ్స్ లో రాణించిన బౌలర్లు

కేప్ టౌన్ : టెస్టులో సాతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ లో భారత్ ఫాస్ట్ బౌలర్లు షమీ, బూమ్రా రాణించారు. వీరిద్దరి చెరో మూడు వికెట్లు పడ్డాయి. భూవీ, పాండ్యా చెరో రెండు వికెట్లు దక్కాయి. 

గోషామహల్ పీఎస్ లో కౌన్సిలింగ్ కు హాజరైన యాంకర్ ప్రదీప్

హైదరాబాద్ : డ్రంకన్ ఆండ్ డ్రౌవ్ కేసులో టీవీ యాంకర్ ప్రదీప్ గోషామహల్ పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ కు హాజరయ్యారు. ట్రాఫిక్ పోలీసుల కౌన్సిలింగ్ కు ప్రదీప్ హాజరయ్యారు. గత నెల 31 రాత్రి మద్యం సేవించి ప్రదీప్ పోలీసులకు దొరికిపోయాడు.

130 పరుగులకే కుప్పకూలిన సౌతాఫ్రికా

కేప్ టౌన్ : భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న మొదటి టెస్టులో దక్షణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ లో 130 పరుగులకే అలౌటయింది. భారత్ విజయలక్ష్యం 208 పరుగులుగా ఉంది. రెండో ఇన్నింగ్స్ లో భారత్ బౌలర్లు షమీ, బూమ్రా విజృభించారు. 

ఆరో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా

కేప్ టౌన్ : భారత్, సౌతఫ్రికా మధ్య జరుతున్న మొదటి టెస్టులో సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ లో ఆరో వికెట్ కోల్పోయింది. జట్టు 92 పరుగుల వద్ద డీకాక్(8) ఔటయ్యాడు. 

24గంటల విద్యుత్ పథకాన్ని పున:సమీక్షించాలి

నల్లగొండ : 24 గంటల పథకాన్ని ప్రభుత్వం పున: సమీక్షించాలని, రైతులకు 12 గంటల విద్యుత్ చాలంటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. 24 విద్యుత్ తో భూగర్భ జలాలు దారుణంగా పడిపోయాయని ఆయన తెలిపారు.

14:53 - January 8, 2018

భూపాల్ : మధ్యప్రదేశ్‌లో ఓ బీజేపీ నేతకు ఊహించని పరిణామం ఎదురైంది. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆ నేతకు స్థానికుడు ఒకరు చెప్పుల దండ వేసి నిరసన వ్యక్తం చేశాడు. మధ్యప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికలు జనవరి 17న జరగనున్న నేపథ్యంలో ఓట్ల కోసం ప్రచారానికి వెళ్లిన దినేష్‌ శర్మకు ఈ అవమానం ఎదురైంది. తమ ప్రాంతంలో నీటి సమస్య తీవ్రంగా ఉందని...ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో ఇలా నిరసన వ్యక్తం చేశానని దండ వేసిన పెద్దాయన పేర్కొన్నారు. ఆయన చర్య పట్ల తనకు ఎలాంటి కోపం లేదని...వారి అవసరాలు తీర్చేందుకు మరింత పనిచేస్తానని బీజేపీ నేత చెప్పారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

 

జోనల్ వ్యవస్థపై సబ్ కమిటీ భేటీ

హైదరాబాద్ : తెలంగాణలో జోనల్ వ్యవస్థపై నియమించిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అధ్యక్షతన ఈ భేటీ కొనసొగుతుంది. 

14:50 - January 8, 2018

కర్నాటక : బెంగళూరులో కుంబారా సంఘా భవనంలోని కైలాశ్ బార్ అండ్ రెస్టారెంట్‌లో ఆదివారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో బార్‌లో నిద్రిస్తున్న ఐదుగురు సిబ్బంది సజీవ దహనమయ్యారు. ఆదివారం రాత్రి 2.30 గంటల సమయంలో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలు పక్కనున్న భవనాల్లోకి వ్యాపించకుండా అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై బార్ యజమాని దయాశంకర్‌ను  పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతుల్లో స్వామి 23, ప్రసాద్ 20, మహేశ్ 35 అనే ముగ్గురు వ్యక్తులు కర్నాటకలోని తుముకూర్ ప్రాంతంవారు కాగా..మంజునాథ్ 45, హాసన్ అండ్ కీర్తి 24 మాండ్యకు చెందినవారిగా గుర్తించారు. 

 

వీఆర్ఏ సాయిలు కుటుంబాన్ని పరామర్శించిన గద్దర్

హైదరాబాద్ : సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కామారెడ్డిలో హత్యకు గురైన వీఆర్ఏ సాయిలు కుటుంబాన్ని ప్రజా గాయకుడు గద్దర్ పరామర్శించారు. సాయిలు కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని గద్దర్ డిమాండ్ చేశారు. వీఆర్ఏ సాయిలు హత్య జరిగిన ఘటనాస్థలికి కేసీఆర్ వెళ్లాలని, సాయిలు వీఆర్ఏ కాదని మంత్రి ఏలా అంటారని ఆయన ప్రశ్నించారు. 

కరీంనగర్ లో ఐటీ టవర్ శంకుస్థాపన చేసిన కేటీఆర్

కరీంనగర్ : జిల్లా కేంద్రంలో ఐటీ టవర్ కు ఐటీ మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.  రూ.25 కోట్లతో జీ+5గా దీన్ని నిర్మించనున్నారు. 9 నెలల్లో ఐటీ టవర్ పూర్తి చేయాలని లక్ష్యంగి పెట్టుకున్నమని మంత్రి తెలిపారు. 

గాంధీలో గవర్నర్ ఆకస్మిక తనిఖీలు

హైదరాబాద్ : సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో గవర్నర్ ఆస్మిక తనిఖీలు నిర్వహించారు. రోగులకు అందుతున్న సదుపాయాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఐసీయూ బాగా ఉందని గవర్నర్ కితాబిచ్చారు. 

కాంగ్రెస్ మహాపాదయాత్రపై చంద్రబాబు ఆగ్రహం

పశ్చిమగోదావరి :  కాంగ్రెస్ నాయకుల మహాపాదయాత్రపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తి చేశారు. పోలవరం పై కాంగ్రెస్ దివాళాకోరు రాజకీయాలు చేస్తున్నారని, ఏడు ముంపు మండలాలు కలపకపోతే సీలేరు నుంచి నీళ్లొచ్చేవా అని చంద్రబాబు ప్రశ్నించారు. విభజన ముందు సమస్యలొస్తాయని ఎందుకు ఆలోచించలేదని  సీఎం చంద్రబాబు అన్నారు. 

మే 3న ఏపీ ఈసెట్

గుంటూరు : ఏపీ ఈసెట్ మే 3న జేన్టీయూ నిర్వహిస్తుందని,  పీఈసెట్ మే 4న ఏఎన్ యూ నిర్వహిస్తుందని మంత్రి గంటా తెలిపారు. అన్ని పరీక్షలు ఆన్ లైన్ లో నే జరుగుతాయని మంత్రి స్పష్టం చేశారు. అన్ని పరీక్షల ఫలితాలు వారంలోపే విడుదల చస్తామని ఆయన అన్నారు. 

ఓఆర్ఆర్పఐ సీఎం ఓఎస్డీ ఆకస్మిక తనిఖీలు

హైదరాబాద్ : ఓఆర్ఆర్ పై సీఎం ఓఎస్డీ ప్రియాంక ఆస్మిక తనిఖీలు చేశారు. హరితహారంలో భాగంగా ఓఆర్ఆర్ వెంట చేపట్టిన పచ్చదనం పనులను పరిశీలించారు. ప్రియాంక కీసర జంక్షన్ లో నాటిన మొక్కలను పరిశీలించారు. 

జహీరాబాద్ లో దారుణం

సంగారెడ్డి : జిల్లా జహీరాబాద్  మండలం షేకాపూర్ లో దారుణం జరిగింది. ఎస్టీ హాస్టల్లో విద్యార్థులను వార్డెన్  చితకబాదారు. వార్డెన్ విద్యార్థులను తలకిందులుగా నిలబెట్టి పైపుతో కొట్టారు. 

13:35 - January 8, 2018
13:34 - January 8, 2018

విజయవాడ : సంక్రాంతి వస్తుందంటే చాలు..ఓ వివాదం తెరపైకి వస్తుంది..కోర్టులో పిటిషన్ లు దాఖలు అవుతాయి..విచారణ జరుగుతున్నా కొద్ది కొంతమందిలో ఉత్కంఠ నెలకొంటూ ఉంటుంది. సంక్రాంతి అంటే పతంగులు..పిండి వంటకాలతో పాటు కోళ్ల పందాలు గుర్తుకొస్తుంటాయి. ఏపీ రాష్ట్రంలో ఉభయ గోదావరి జిల్లాలో కోళ్ల పందాలు నిర్వహిస్తుంటారు. కోట్లాది రూపాయలు చేతులు మారుతుంటాయనే సంగతి తెలిసిందే. కోళ్ల పందాలు నిర్వహించవద్దని పండుగకంటే ముందు పలువురు పేర్కొంటుంటారు. వీరు కోర్టు మెట్లు ఎక్కి పిటిషన్ లు దాఖలు చేస్తున్నారు. తాజాగా హైకోర్టు పలు ఆదేశాలు జారీ చేసింది. కోళ్ల పందాలు జరుగకుండా చూడాలని ఏపీ డీజీపీ, ఇతర అధికారులకు నోటీసులు జారీ చేసింది. పందాల నిర్వాహణలో నిర్లక్ష్యంగా ఉన్న తహశీల్దార్ లపై కోర్టు ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రఘురామకృష్ణం రాజు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోడి పందాలు తెలుగు ప్రజల సంప్రదాయానికి చిహ్నమని పేర్కొన్నారు. కోళ్లను..పెంచుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారని తెలిపారు. ఈ పిటిషన్ పై బుధవారం విచారణకు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి సుప్రీం ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో వేచి చూడాలి. 

13:24 - January 8, 2018

సంగారెడ్డి : స్కూల్లో పిల్లలు అల్లరి చేస్తుంటారు...అప్పుడు ఉపాధ్యాయులు..హాస్టల్ వార్డెన్ ఏం చేస్తారు ? వారిని సముదాయించే ప్రయత్నం చేస్తుంటారు అని చెబుతారు కదా..కానీ కొంతమంది విద్యార్థులపై దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఇష్టమొచ్చినట్లుగా కొడుతున్నారు. ఇలాంటి ఘటనలు ఎన్నో చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎస్టీ హాస్టల్ వార్డెన్ దారుణంగా ప్రవర్తించారు. ఇద్దరు విద్యార్థులను తలకిందులుగా నిలబడాలని చెప్పి..ఓ పైపుతో చితకబాదాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ ఘటన జహీరాబాద్ లోని షేకాపూర్ లో ఉన్న ఎస్టీ హాస్టల్ లో చోటు చేసుకుంది. అల్లరి చేస్తున్నారనే కారణంతో వార్డెన్ యాదయ్య ఈ శిక్ష విధించాడు. అతను కొడుతున్న దృశ్యాలు చూసిన పలువురు చలించిపోయారు. హాస్టల్ లో ఉంటున్న ఇతర విద్యార్థులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ విషయంపై కొంతమంది బాలల హక్కు సంఘం ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది.

బాలల హక్కుల సంఘం అచ్యుతారావు టెన్ టివితో స్పందించారు. పిల్లలు చదువు కోసం రావాలంటే భయపడుతారని, అక్షరాస్యత ఎలా పెరుగుతుందని ప్రశ్నించారు. నైజాం కాలంలో ఇలాంటివి జరగలేదని, వీడియో బయట వచ్చిన తరువాత కూడా హాస్టల్ వార్డెన్ ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. తాము హెచ్చార్సీని సంప్రదిస్తామని, బాలలకు న్యాయం జరిగేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. ఇలానే కొనసాగితే అక్షరాస్యత పెరగదని..ఇలాంటి దుర్మార్గాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని సూచించారు. దీనిపై విద్యాశాఖ, అధికారులు సమాధానం చెప్పాల్సినవసరం ఉందన్నారు. 

13:22 - January 8, 2018

విజయవాడ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు నటి పూనం కౌర్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం నడుస్తున్న వివాదం నుండి బయటపడేయాలని వేడుకుంది. కొద్దిసేపటికే ఆ ట్వీట్ ను డిలీట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. గత కొన్ని రోజులుగా సినిమా క్రిటిక్ 'కత్తి మహేష్'..నటి 'పూనం కౌర్' మధ్య మాటల తూటాలు పేలుతున్న సంగతి తెలిసిందే. ఆదివారం ప్రెస్ మీట్ నిర్వహించిన కత్తి మహేష్ కొన్ని ప్రశ్నలు సంధించారు. ఆ ప్రశ్నలపై పూనం సమాధానం చెప్పాలని, ఇందుకు సంబంధించిన ఆధారాలు తన దగ్గరనున్నాయని పేర్కొన్నారు. సోమవారం ఉదయం పూనం స్పందించారు. నేరుగా పవన్ కళ్యాణ్ కు ఓ ట్వీట్ చేశారు. ఈ వివాదం నుండి తనను కాపాడాలని, స్పందిస్తేనే తన కెరీర్..తన ఫ్యామిలీ..మర్యాదను కాపాడిన వారవుతారని తెలిపింది. వాళ్ల రాజకీయాలకు తాను టార్గెట్ కాదల్చుకోలేదని, అవసరమైతే ఇదే విషయాన్ని మీడియా ముందుకు వచ్చి చెబుతానని తెలిపారు. కానీ కాసేపటికే ఈ ట్వీట్ ను ఆమె డిలీట్ చేశారు.

ఇదిలా ఉంటే వివాదంపై పూనం సోదరుడు శ్యామ్ సింగ్ స్పందించారు. పూనంకు చేనేతపై పూర్తి అవగాహన ఉందని, గత మూడేళ్లుగా ఆమె చేనేతపై ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారని పూనమ్ సోదరుడు శ్యామ్ సింగ్ పేర్కొన్నారు. పూనం కృషి చూసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టారని, తమకు ఏ దర్శకుడితో విబేధాలు లేవన్నారు. కత్తి మహేష్ పై కేసు పెడుతామని హెచ్చరించారు. 

ఏ దర్శకుడితో విభేదాలు లేవు : పూనం సోదరుడు

హైదరాబాద్ : పూనం కౌర్ నిప్ట్ లో చదువుకుందని, తన సోదరికి చేనేతపై పూర్తి అవగాహన ఉందని పూనం సోదరుడు శ్యామ్ సింగ్ అన్నారు. గత మూడేళ్లుగా ఆమె చేనేతపై ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారని, పూనం కృషి చూసి చంద్రబాబు బాండ్ర్ అంబాసిడర్ గా నియమించారని ఆయన అన్నారు. ఏ దర్శకుడితో తమకు విభేదాల్లు లేవని శ్యామ్ సింగ్ అన్నారు. 

 

కత్తి కామెంట్లపై స్పందించిన పూనం కౌర్

హైదరాబాద్ : కత్తి కామెంట్లపై పూనం కౌర్ స్పందించారు. దీనిపై ఆమె పవన్ కల్యాణ్ కు ట్విట్టర్ ద్వారా విజ్ఞాన చేశారు. తనను ఈ వివాదం నుంచి కాపాడాలని, పవన్ కల్యాణ్ స్పందిస్తే నా కెరీర్ నా కుటుంబాన్ని, నా మర్యాదను కాపాడినవారవుతారని, కొందరు రహస్య ఎజెండా పెట్టుకుని మాట్లాడుతున్నారని, తను రాజకీయంగా టార్గెట్ కాదల్చుకోలేదని, ఇదే విషయంపై స్వయంగా వచ్చి మతో మాట్లాడతా అని పూనం ట్వీట్ట్ చేశారు. 

12:53 - January 8, 2018

సినీ క్రిటిక్ కత్తి మహేష్ పై హాస్యనటుడు వేణు మాధవ్ వ్యంగ్యాస్త్రాలు సందించాడు. పెద్దవాళ్లు, అంకుల్స్ తో తను మాట్లాడనంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. కత్తి మహేష్ పాల్గొన్న ఓ టీవీ లైవ్ డిబెట్ లో వేణు మాధవ్ ఫోన్ ద్వారా మాట్లాడుతూ యాంకర్ శ్రీను మీరు తెలుసు మీతో మాట్లాడుతా..కానీ నాకు పరియం లేనివారితో నేను మాట్లాడనని అన్నారు. ఆడవాళ్ల మీద, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులపైనా మాట్లాడితే, వారిపై చర్యలు తీసుకోక తప్పదు. నేను ఎవరినీ విమర్శించను. విమర్శించే అలవాటు నాకు లేదు. పెద్దవాళ్లు, అంకుల్స్ (కత్తి మహేశ్)తో నేను ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడను.

నేడు ప్రదీప్ కౌన్సిలింగ్ హాజరరైయ్యే అవకాశం

హైదరాబాద్ : యాంకర్ ప్రదీప్ నేడు కౌన్సిలింగ్ హాజరైయ్యే అవకాశం ఉందని పోలీసులు అటున్నారు. ప్రదీప్ కు బేగంపేట ట్రాఫిక్ పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు. న్యూఇయర్ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ లో ప్రదీప్ పట్టుబడ్డ  విషయం తెలిసిందే. ప్రదీప్ గడువులోగా కౌన్సిలింగ్ హాజరుకాకపోతే చార్జిషిట్ వేసి అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. 

కోడిపందెలపై సుప్రీంను ఆశ్రయించిన

ఢిల్లీ : కోడిపందెలపై రఘురామకృష్ణంరాజు అనే వ్యక్తి సుప్రీంను కోర్టును ఆశ్రయించారు. కోడిపందాలు నిర్వహించొద్దన్న హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆయన సుప్రీం కోర్టు వెళ్లాడు. 

12:33 - January 8, 2018

హైదరాబాద్ : వచ్చే ఖరీఫ్ సీజన్ నుండి ఎకరానికి రూ. 4వేల రూపాయల పెట్టుబడి అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసులు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న 71.75వేల లక్షల మంది రైతులకు ఇది అందచేయడం జరుగుతుందని, అయితే నిధులు ఎలా అందచేయాలనే దానిపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయ్యిందని తెలిపారు. మంత్రి పోచారం అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, తుమ్మల నాగేశ్వరరావు, ఈటెల రాజేందర్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి పోచారం మీడియాతో మాట్లాడారు. వచ్చే వానకాలం నుండి ప్రతి ఎకరానికి..ప్రతి పంట కు రూ. 4వేల నగదు ఇవ్వాలని, గ్రాంట్ కింద ఇవ్వాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి తీసుకున్నారని, భూ ప్రక్షాళన ఆధారంగా 71లక్షల 75వేల మంది రైతులున్నారని తమకు అంచనా వచ్చిందని, వారి అర్హత..వారికి ఉన్న భూమిని బట్టి రూ. 4వేలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. రైతుకు ఎలా నగదు అందాలనే దానిపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారని, ఈ సబ్ కమిటీ మొదటి సమావేశం జరిగిందన్నారు. 

12:15 - January 8, 2018

హైదరాబాద్ : యాంకర్ ప్రదీప్ అంశం ఇంకా ఫుల్ స్టాప్ పడడం లేదు. ఇటీవలే డ్రంక్ అండ్ డ్రైవ్ లో ప్రదీప్ పట్టుబడిన సంగతి తెలిసిందే. ఆయన కారును సీజ్ చేసిన పోలీసులు తల్లిదండ్రులతో బేగంపేట ట్రాఫిక్ పీఎస్ లో జరిగే కౌన్సెలింగ్ కు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. 31వ తేదీన ఘటన జరగగా జనవరి 8వ తేదీ వరకు కౌన్సెలింగ్ కు హాజరు కాలేదు. ప్రదీప్ ఎప్పుడు హాజరవుతారో తెలియదని..కానీ కౌన్సెలింగ్ కు మాత్రం హాజరు కావాల్సిందేనని ట్రాఫిక్ పోలీసులు తేల్చిచెబుతున్నారు. ఈ మధ్యలో ప్రదీప్ ఒక వీడియోను సామాజిక మాధ్యమాల్లో రిలీజ్ చేశారు. తాను ఎక్కడకు వెళ్లడం లేదని...షూటింగ్ లు పూర్తి చేయాల్సి ఉన్నందున కౌన్సెలింగ్ కు హాజరు కాలేకపోతున్నట్లు వీడియోలో పేర్కొన్నారు. చట్ట ప్రకారం నడుచుకుంటానని పేర్కొన్నారు.

ఈ వీడియో విడుదల చేసి మూడు రోజులవుతున్నా ప్రదీప్ ఇంకా కౌన్సెలింగ్ కు హాజరు కాకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ రోజు పట్టుబడిన ఇతరులు తమ తమ తల్లిదండ్రులతో కౌన్సెలింగ్ కు హాజరవుతున్నారు. ప్రదీప్ ఫోన్ కూడా స్విచ్చాఫ్ పెడుతున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ ప్రదీప్ రాకపోతే ఆయనపై ఛార్జీషీట్ నమోదు చేసి అదుపులోకి తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి ప్రదీప్ హాజరవుతారా ? లేదా ? అనేది త్వరలో తెలియనుంది. 

పోలవరం చేరుకున్న సీఎం చంద్రబాబు

పశ్చిమగోదావరి : ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం చేరుకున్నారు. ఆయన ఏరియల్ సర్వే ద్వారా పోలవరం పనులను పరిశీలించారు. అంనతరం ఆయన ప్రాజెక్టు అధికారులతో సమావేశమయ్యారు. 

11:56 - January 8, 2018

ప్రముఖ సినీక్రిటిక్ కత్తి మహేష్ మరో సంచలనానికి తెర తీశారు. పవన్ స్టార్ పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ పూనం కౌర్ కు పవన్ మధ్య సంబంధం గురించి తన దగ్గర ఆధారులున్నాయని ఆయన ప్రకటించారు. కొద్ది రోజులుగా కత్తి మహేష్ పై పవన్ అభిమానులు, మొన్న ఈ మధ్య పూనం కౌర్ కూడా ట్విట్టర్ వేదికగా కత్తి మహేష్ ను విమర్శించింది. సెలబ్రెటిలను విమర్శించే కొంత మందిని మీడియా చానెళ్లు హైలెట్ చేస్తున్నాయని పూనం ట్విట్ చేసింది. వీటన్నింటి పై కత్తి మహేష్ ఆదివారం సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్ ప్రెస్ పెట్టాడు. ఈ మీట్ లో పవన్ విమర్శంచిడంతో పాటు ఓ కొత్త వివాదాన్ని ఆయన తెరపైకి తీసుకొచ్చారు. పూనం కౌర్ కు పవన్ మధ్య సంబంధం ఏమిటని. కత్తి మహేష్ పూనం కౌర్ ఆరు ప్రశ్నలను సందించారు. మొదటి ప్రశ్నగా పూనం కౌర్ అంబాసిడర్ గా ఏ విధంగా వచ్చింది..? రెండవ ప్రశ్నగా తిరుమల తిరుపతి దేవాస్థానంలో పూనం కౌర్, పవన్ కల్యాణ్ ఒకే గోత్రనామాలతో పూజలు చేశార లేదా...? మూడవ ప్రశ్నగా పూనం కౌర్ ఆత్మహత్యాయత్నం చేసుకున్నప్పుడు ఆమెను ఆసుపత్రిలో చేర్పించి, బిల్లు కట్టింది ఎవరు...? నాలుగువ ప్రశ్నగా పవన్ కల్యాణ్ పూనం కౌర్ అమ్మకు ఇచ్చిన మాట ఏమిటి ఆ మాట నిటబెట్డుకున్నాడ లేదా..? ఐదవ ప్రశ్నగా త్రివిక్రమ్ అంటే పూనం కౌర్ ఎందుకంత కోపం...? ఆరవ ప్రశ్నగా నార్సింగం అనే క్షుద్రమంత్రికుడితో పవన్, త్రివిక్రమ్ క్షుద్రపూజలు చేసినప్పుడు పూనం అక్కడ ఎందుకు ఉంది...? కత్తి ప్రశ్నలను బట్టి చూస్తే పవన్ కల్యాణ్ కు పూనం కౌర్ మధ్య ఏదో ఉన్నట్టు కొత్త మంది నెటిజన్లు ప్రశ్నలను రేకితిస్తున్నారు. మరి వారి మధ్య ఉన్న సంబంధం ఎటువంటిదని తెలియాల్సి ఉంది. లేక పబ్లిసిటీ కోసమే కత్తి మహేష్ ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారని మరికొంత మంది అంటున్నారు.


 


 


 

పోలీసులు అడ్డుకున్నారు - బుద్ధా వెంకన్న...

గుంటూరు : వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన ఆరోపణలపై సత్తెనపల్లిలో రుజువు చేస్తానని పేర్కొనడం జరిగిందని కానీ పోలీసులు అడ్డుకున్నారని టిడిపి నేత బుద్ధా వెంకన్న తెలిపారు. తాను ప్రజాస్వామ్యయుతంగానే వెళుతున్నానని, అంబటి విసిరిన సవాల్ ను అబద్ధమని నిరూపిస్తానన్నారు. 

టిడిపి నేతలను ఎందుకు అడ్డుకోవడం లేదు - అంబటి...

గుంటూరు : తాను చర్చకు వెళుతానని అనుకుంటే హౌజ్ అరెస్టు చేశారని వైసీపీ నేత అంబటి రాంబాబు పేర్కొన్నారు. సత్తెనపల్లిలో తమ పార్టీకి చెందిన నేతలు..కార్యకర్తల నివాసాల వద్ద పోలీసులు మోహరించి అడ్డుకుంటున్నారని తెలిపారు. టిడిపికి చెందిన నేతలను..కార్యకర్తలను అడ్డుకోవడం లేదని ఆరోపించారు. 

11:34 - January 8, 2018

కర్నూలు : జిల్లాలో తెలుగు తమ్ముళ్లు చితకబాదుకున్నారు. బండి ఆత్మకూరు మండలం సింగవరం గ్రామంలో టిడిపి పార్టీకి చెందిన నేతలు ఘర్షణకు దిగారు. రాళ్లు..కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం రాత్రి సింగవరం గ్రామానికి చెందిన దళిత వర్గానికి చెందిన వ్యక్తిని ఇంట్లో నిర్భందించిన ఓ వర్గం దాడికి పాల్పడింది. ఈ దాడిని మరో వర్గానికి చెందిన నేతలు అడ్డుకున్నారు. దీనితో ఇరువర్గాలు ఘర్షణకు దిగారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని శాంతింప చేసే ప్రయత్నం చేశారు. పోలీసు చెక్ పోస్టును ఏర్పాటు చేసి గాయపడిన వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

11:24 - January 8, 2018

గుంటూరు : సత్తెనపల్లిలో సోమవారం ఉదయం ఉద్రిక్త పరిణామాలు చోటు చేసుకున్నాయి. బుద్ధా వెంకన్న..అంబటి రాంబాబు మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సత్తెనపల్లి నియోజకవర్గంలో అర్హులైన వారికి పెన్షనర్లు అందడం లేదని..పచ్చచొక్కాల నేతలకే అందుతున్నాయని వైసీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై టిడిపి నేత బుద్ధ వెంకన్న స్పందించి ప్రతి సవాల్ విసిరారు. సత్తెనపల్లి బస్టాండు వద్దకు వస్తానని..చర్చకు రావాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా బుద్ధా వెంకన్న..అంబటిలు మీడియాతో మాట్లాడారు. తాను సత్తెనపల్లిలో రుజువు చేస్తానని పేర్కొనడం జరిగిందని కానీ పోలీసులు అడ్డుకున్నారని బుద్ధా వెంకన్న తెలిపారు. తాను ప్రజాస్వామ్యయుతంగానే వెళుతున్నానని, అంబటి విసిరిన సవాల్ ను అబద్ధమని నిరూపిస్తానన్నారు. ప్రజల మధ్య కూర్చొని మాట్లాడాలని, సంక్షేమ పథకాలు పేదలకే అందుతున్నాయని మరోసారి బుద్ధా పేర్కొన్నారు.

తాను చర్చకు వెళుతానని అనుకుంటే హౌజ్ అరెస్టు చేశారని అంబటి రాంబాబు పేర్కొన్నారు. సత్తెనపల్లిలో తమ పార్టీకి చెందిన నేతలు..కార్యకర్తల నివాసాల వద్ద పోలీసులు మోహరించి అడ్డుకుంటున్నారని తెలిపారు. టిడిపికి చెందిన నేతలను..కార్యకర్తలను అడ్డుకోవడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో అర్హులైన వారికి పెన్షన్ లు అందుతున్నాయా ? లేదా ? అనేది చూడాలన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో పెన్షన్ లు అందడం లేదని తాను ఆరోపించడం జరిగిందని, పెన్షన్ అందలేని వారు వేల మంది ఉన్నారని, జన్మభూమి కమిటీలు రికమెండ్ చేయడం లేదని తెలిపారు. పెన్షన్ లు రాని వారు టిడిపికి ఓటేయలేకపోవడమే కారణమని అంబటి ఆరోపించారు. 

11:12 - January 8, 2018

గుంటూరు : ప్రతిపక్షానికి చెందిన ఓ నేత సవాల్ విసరడం..అధికార పార్టీకి చెందిన ఓ నేత స్వీకరించడం...చర్చకు రావాలని ఇరువురు నేతలు సిద్ధం కావడంతో ఉద్రిక్తత పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇదంతా గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో చోటు చేసుకుంది. ప్రభుత్వ పథకాలు టిడిపి నేతలు..కార్యకర్తలకే అందుతున్నాయని వైసీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై టిడిపి నేత బుద్ధా వెంకన్న ప్రతి సవాల్ విసిరారు. సత్తెనపల్లి బస్టాండు వద్ద చర్చకు రావాలని బుద్ధా వెంకన్న డిమాండ్ చేశారు. ఇరు పార్టీలకు చెందిన నేతలు..కార్యకర్తలు మోహరిస్తే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందనే ఉద్ధేశ్యంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి సోమవారం ఉదయం ఆరు గంటలకే అంబటి ఇంటి వద్దకు చేరుకున్నారు. ఆయన్ను గృహ నిర్భందం చేశారు. మరోవైపు చెక్ పోస్టు సెంటర్ వద్ద వెళుతున్న బుద్ధా వెంకన్న కాన్వాయ్ ను పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై టిడిపి కార్యకర్తలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఆందోళనకు దిగిన టిడిపి కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

బుద్ధా వెంకన్న అరెస్టుకు పోలీసుల యత్నం...

గుంటూరు : టిడిపి నేత బుద్ధా వెంకన్నను అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. సోమవారం చెక్ పోస్టు వద్ద వెళుతున్న బుద్ధా కాన్వాయ్ ను పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై టిడిపి కార్యకర్తలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఆందోళనకు దిగిన టిడిపి కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

56వ రోజు ప్రజా సంకల్పయాత్ర..

చిత్తూరు: వైఎస్‌ జగన్ పాదయాత్ర కొనసాగుతోంది. చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు నియోజకవర్గంలో 56వ రోజు పాదయాత్ర మొదలు పెట్టారు. మొరవ పాటూరు నుంచి ప్రారంభమైన పాదయాత్ర తలుపులపల్లి గ్రామం చేరుకోనుంది. 

మొదలైన తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు...

చెన్నై : తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ ప్రసంగానికి డీఎంకే, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడ్డు తగిలారు. సభ నుండి ఆ పార్టీల సభ్యులు వాకౌట్ చేశారు. 

ఘజియాబాద్ లో కాల్పులు..

ఉత్తర్ ప్రదేశ్ : ఘజియాబాద్ లో క్రిమినల్స్..పోలీసులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఓ పొలంలో దాక్కున్న క్రిమినల్స్ ను పట్టుకొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 

10:17 - January 8, 2018
10:16 - January 8, 2018

కరీంనగర్ : వేముల వాడ ఆలయం వద్ద ఓ వ్యక్తిని దారుణంగా చంపేశారు. ఈఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఆలయం పార్కింగ్ వద్ద ఓ వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు..బ్లేడు..కత్తులతో దాడులు చేశారు. తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తి రక్తపుమడుగులో కుప్పకూలిపోయాడు. చనిపోయాడని నిర్ధారించుకున్న తరువాత దుండగులు పరారయ్యారు. చనిపోయిన వ్యక్తి మెదక్ జిల్లా ఘన్ పూర్ కు చెందిన బాలయ్యగా గుర్తించారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇతను కుటుంబసభ్యులతో వచ్చాడా ? స్నేహితులతో వచ్చాడా ? అనేది విచారణలో తెలియనుంది. ఆ ప్రాంతంలో ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ లను పోలీసులు పరిశీలిస్తున్నారు. 

10:12 - January 8, 2018

హైదరాబాద్ : సరదా అనుకుంటుంటారు..ఆయుధాలతో విన్యాసాలు చేస్తారు..దీని కారణంగా పలువురు తీవ్రంగా గాయపడటం..మృతి చెందడం జరుగుతుంటాయి..ఇదంతా పాతబస్తీలో సర్వసాధారణమైపోయింది. పాతబస్తీలో పెళ్లి బారాత్, పుట్టినరోజు వేడుక.. ఏదైనా సరే.. ఉంటే తుపాకులు, లేకుంటే కత్తులు చేతపట్టుకొని యువకులు వీరంగం చేయడం సాధారణంగా మారింది. ఇటీవల పాతబస్తీలో పలు ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఒక బాలుడు మృతి చెందడం తీవ్ర విషాదం నింపింది. రాయదుర్గం హుస్సేన్ వాలిలో ఓ పెళ్లి బారాత్ జరుగుతోంది. ఈ బారాత్ లో కత్తులతో మైనర్ బాలురు విన్యాసాలు చేశారు. ఒక బాలుడు నిర్లక్ష్యంగా కత్తి తిప్పడంతో సయ్యద్ హామెద్ (15) బాలుడు మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు పది మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపిస్తారా ? లేక అరెస్టు చేస్తారా ? అనేది చూడాల్సి ఉంది. 

వేములవాడ ఆలయం వద్ద దారుణం..

కరీంనగర్ : వేములవాడ ఆలయం వద్ద దారుణం చోటు చేసుకుంది. ఆలయం పార్కింగ్ సమీపంలో ఓ వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి చంపేశారు. మెదక్ జిల్లా ఘన్ పూర్ కు చెందిన బాలయ్యగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 6 డిగ్రీలు...

ఢిల్లీ : దేశ రాజధానిలో కనిష్ట ఉష్ణోగ్రత 6గా నమోదైంది. పొగమంచు కారణంగా ఢిల్లీ ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. రహదారులపై ముందున్న వాహనాలు కనిపించకపోవడంతో వాహనదారులు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. 

బారాత్ లో కత్తుల విన్యాసం..బాలుడు మృతి...

హైదరాబాద్ : రాయదుర్గం హుస్సేన్ వాలిలో పెళ్లి బారాత్ లో కత్తులతో మైనర్ బాలురు విన్యాసాలు చేశారు. ఒకతను నిర్లక్ష్యంగా కత్తి తిప్పడంతో సయ్యద్ హామెద్ (15) మృతి చెందాడు. పోలీసులు రంగ ప్రవేశం చేసి పది మంది యువకులు అదుపులోకి తీసుకున్నారు. 

సెషన్ కోర్టులో అగ్నిప్రమాదం...

ముంబై : సెషన్ కోర్టులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ ఐదు అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. 

యూపీలో ముస్లిం యువతికి ట్రిపుల్ తలాక్...

ఉత్తర్ ప్రదేశ్ : బారెల్లిలో ప్రాంతంలో తన భర్త ట్రిపుల్ తలాక్ ఇచ్చాడని ఓ ముస్లిం మహిళ వాపోయింది. తనను కొట్టడమే కాకుండా రూ. 50 వేలు తేవాలని డిమాండ్ చేశాడని పేర్కొంది.

 

కరువు లేకుండా చేయాలి - బాబు..

విజయవాడ : పాడి పంటలతో గ్రామాలు పచ్చగా ఉండాలని, ప్రకృతి ప్రసాదించిన వనరులను కాపాడుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. వర్షపు నీటిని ఒడిసి పట్టుకుని భవిష్యత్తుతో కరువన్నది లేకుండా చేయాలని, అదొక్కటే ప్రభుత్వ లక్ష్యమన్నారు. 

09:37 - January 8, 2018

గుంటూరు : వైసీపీ నేత అంబటి రాంబాబును పోలీసులు ఇంటి నుండి బయటకు రానివ్వడం లేదు. సోమవారం ఉదయం ఆరు గంటలకు చేరుకున్న పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేసి గృహ నిర్భందం చేశారు. దీనికి ఆయన సవాల్ విసరడమే కారణం. ప్రభుత్వ పథకాలు పచ్చచొక్కాల వారికే అందుతున్నాయని ఆయన పలు ఆరోపణలు గుప్పించారు. దీనిపై చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు. ఈ సవాల్ ను బుద్ధా వెంకన్న స్వీకరించారు. సత్తెనపల్లి బస్టాండు వద్ద తేల్చుకుందామని ప్రతి సవాల్ విసిరారు. దీనితో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఆర్పీసీ 149 ప్రకారం అంబటికి నోటీసులు ఇచ్చారు. దీనితో సత్తెనపల్లిలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. 

09:32 - January 8, 2018

హైదరాబాద్ : జనరల్ స్టోర్స్ మాటున అక్రమంగా గుట్కాలు విక్రయిస్తున్నారు. నగరంలోని చాలా ప్రాంతాల్లో వివిధ పాన్ షాపులు..వివిధ కిరాణా షాపుల్లో వీటిని విక్రయిస్తున్నారు. కుషాయిగూడలోని వివిధ ప్రాంతాల్లో గుట్కాలను తరలిస్తూ విక్రయిస్తున్నారని పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీనితో మల్కాజ్ గిరి ఎస్ వోటీ పోలీసులు రంగంలోకి దిగి మూడు రోజుల నుండి దాడులు కొనసాగిస్తున్నారు. వీరి దాడుల్లో సుమారు పది లక్షల విలువైన గుట్కా ప్యాకెట్ లను స్వాధీనం చేసుకున్నారు. బీదర్ నుండి నిషేధిత పొగాకు ఉత్పత్తులను నాగార్జున నగర్ కు తరలిస్తున్నారని..ఇక్కడి నుండి నగరంలోని వివిధ పాన్ షాప్ లకు..కిరాణా షాపులకు విక్రయిస్తున్నారని పోలీసు అధికారి పేర్కొన్నారు. ఆనంద్, రవి వ్యాపారులను అరెస్టు చేయడం జరిగిందన్నారు. 

అంబటి గృహ నిర్భందం...

గుంటూరు : ప్రభుత్వ పథకాలు పచ్చచొక్కాలకే అందుతున్నాయని, దీనిపై చర్చకు రావాలంటూ అంబటి సవాల్ విసిరారు. దీనిని బుద్ధా వెంకన్న స్వీకరించారు. సత్తెనపల్లి బస్టాండు వద్ద తేల్చుకుందామని ప్రతిసవాల్ విసిరారు. దీనితో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఆర్పీసీ 149 ప్రకారం అంబటికి నోటీసులు ఇచ్చారు. ఉదయం ఆరు గంటలకు అంబటిని పోలీసులు గృహ నిర్భందం చేశారు. 

గుట్కా స్వాధీనం..

హైదరాబాద్ : కుషాయిగూడలోని నాగార్జున నగర్ కాలనీలో మల్కాజ్ గిరి ఎస్ వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. పది లక్షల విలువైన గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. గుట్కా వ్యాపారం చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. 

09:10 - January 8, 2018

విజయవాడ : దుర్గ గుడి ఆలయంలో తాంత్రిక పూజలు జరిగాయన్న వివాదంపై అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఈవోగా ఉన్న సూర్యకుమారిని సాధారణ పరిపాలన శాఖకు దేవాదాయ శాఖ బదిలీ చేసింది. దేవాదాయ శాఖ కమిషనర్ గా ఉన్న అనురాధ సాధారణ పరిపాలన శాఖకు బదిలీ అయ్యారు. తాంత్రిక పూజలపై నిజనిర్ధారణ కమిటీ నివేదిక ఆధారంగా విచారణ చేస్తామని, భక్తులలో నెలకొన్న అపోహలను తొలగిస్తామని ఈవో అనురాధ పేర్కొన్నారు. ఇతరత్రా విషయాలు ఇప్పుడే ఏమీ మాట్లాడలేనని స్పష్టం చేశారు.

దుర్గగుడిలో నెలకొన్న సమస్యలు..ఇతరత్రా కారణాలు పరిష్కారం కావాలంటే తాంత్రిక పూజలు చేయాలని కొంతమంది సూచనలు చేశారని, దీనితో ఆలయంలో ఉన్న ఓ పూజారి ఆ విధంగా చేశారని ప్రచారం జరిగింది. దీనిపై తీవ్ర వివాదం నెలకొంది. సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తొందరగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. దీనితో దేవాదాయ శాఖ సీఎం బాబుక ప్రాథమిక నివేదిక అందచేసింది. అనంతరం నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు, అతి త్వరలోనే విచారణ జరిపి వాస్తవాలు బయటకు తెలియచేస్తామని దేవాదాయ శాఖ పేర్కొంది. మరి ఈ నిజనిర్ధారణ కమిటీ విచారణలో ఎలాంటి విషయాలు వెలుగు చూస్తాయో చూడాలి. 

సూర్యకుమారి బదిలీ...

విజయవాడ : దుర్గగుడి దేవాదాయ శాఖ కమిషనర్ గా అనురాధ నియమితులయ్యారు. ఇప్పటి దాక ఆ పదవిలో ఉన్న సూర్య కుమారిని సాధారన పరిపాలన శాఖకు బదిలీ చేశారు. తాంత్రిక పూజలపై నిజనిర్ధారణ కమిటీ నివేదిక ఆధారంగా విచారణ చేస్తామని, భక్తులలో నెలకొన్న అపోహలను తొలగిస్తామని ఈవో అనురాధ పేర్కొన్నారు. 

08:03 - January 8, 2018

ఈనెల 12వ తేదీన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అపాయింట్ మెంట్ ఇచ్చారు. దీనితో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. పోలవరం నిర్మాణం..విభజన సమయంలో ఇచ్చిన హామీలు..అమలు చేయాలని..నిధులు కేటాయించాలని తదితర వాటిపై భేటీలో చర్చించే అవకాశం ఉంది. దీనిపై టెన్ టివి చర్చలో శేఖర్ రెడ్డి (టీఆర్ఎస్), ఉమా మహేశ్వరరావు (సీపీఎం), కోటేశ్వరరావు (బీజేపీ), దుర్గా ప్రసాద్ (టిడిపి), జంగా గౌతమ్ (ఏపీ పీసీసీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

మాజీ శివసేన కార్పొరేటర్ దారుణ హత్య ?

ముంబై : మాజీ శివసేన కార్పొరేటర్ దారుణ హత్యకు గురైనట్లు వార్తలు వస్తున్నాయి. కందివి ప్రాంతంలో ఆయన నివాసం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన దాడిలో మృతి చెందినట్లు సమాచారం. 

జోగులాంబలో ఆరుగురు మృతి...

జోగులాంబ గద్వాల : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ధరూర్ మండలం పారుచర్ల స్టేజీ వద్ద బొలెరో వాహనం బోల్తా పడింది. ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా 20 మందికి గాయాలయ్యాయి. 

07:40 - January 8, 2018

జోగులాంబ గద్వాల : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బొలెరో వాహనం బోల్తా పడడంతో ఆరుగురు అక్కడికక్కడనే మృతి చెందారు. స్థానికంగా ఉన్న జిల్లింగ్ మిల్లులో పనిచేసే కార్మికులు విధులు ముగించుకుని అర్ధరాత్రి సొంత ఇళ్లకు పయనమయ్యారు. బొలెరో వాహనంలో 25-30 మంది ప్రయాణీస్తున్నట్లు తెలుస్తోంది. ధరూర్ మండలం గోసుపాడు మధ్య ఉన్న పారుచర్ల స్టేజీ వద్ద బొలెరో వాహనం బోల్తా పడింది. 6 గురు మృతి చెందగా 20 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో పది మంది పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం..నిర్లక్ష్యంగా ఉండడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

టాప్ టెన్ లో పంజాగుట్ట పీఎస్..

ఢిల్లీ : భారతదేశంలో టాప్ టెన్ పీఎస్ లో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సాధించింది. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ మేరకు ట్వీట్ చేశారు. కోయంబత్తూరు ఆర్ఎస్.పురం మొదటి స్థానం సంపాదించగా హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట పీఎస్ రెండో స్థానంలో నిలిచింది. 

ఆల్ ఇండియా విప్ లు..చీఫ్ విప్ ల సమావేశం...

ఢిల్లీ : నేడు రాజస్థాన్ లో ఆల్ ఇండియా విప్ లు, చీఫ్ విప్ ల సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో తెలంగాణ నుంచి విప్ లు, చీఫ్ విప్, అసెంబ్లీ కార్యదర్శి హాజరు కానున్నారు.

జోగులాంబలో ఘోర ప్రమాదం..

జోగులాంబ గద్వాల : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ధరూర్ మండలం పారుచర్ల స్టేజీ వద్ద బొలెరో వాహనం బోల్తా పడింది. ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. 

06:42 - January 8, 2018

మున్సిపల్‌ కార్మికులను రెగ్యూలరైజేషన్‌ చేయాలి. జిల్లాలో పనిచేస్తున్న కార్మికుల వేతనాలను పెంచాలి. ఈ డిమాండ్లను హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు జరిగిన మున్సిపల్‌ వర్కర్స్‌ ఆండ్‌ ఎంప్లాయిస్‌ రాష్ట్ర మహాసభలు డిమాండ్‌ చేశాయి. ఈ మహాసభల్లో మున్సిపల్ కార్మికులకు సంబంధించిన సమస్యలపై చర్చించి పలు తీర్మానలను, డిమాండ్లను లేవనెత్తింది. ఈ మహాసభలలో చర్చించిన విషయాలను, డిమాండ్లపై టెన్ టివి జనపథంలో మున్సిపల్ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన పాలడుగు భాస్కర్‌ విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

06:40 - January 8, 2018

నెల్లూరు : వేల కిలోమీటర్ల దూరం నుండి వచ్చిన విహంగాలు అక్కడ సేదతీరుతాయి. ఆ ప్రాంతంలోని పక్షుల కిలకిల రావాలు, విహంగాలు చేసే విన్యాసాలు చూసేందుకు సందర్శకులు దేశవిదేశాల నుండి తరలివస్తారు. అదే నెల్లూరు జిల్లాలోని నేలపట్టు పక్షుల కేంద్రం. ఇక్కడికి వచ్చే ప్రకృతి ప్రేమికుల కోసం ప్రభుత్వం ప్రతి ఏటా పక్షుల పండుగను నిర్వహిస్తుంది. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 25 జాతుల విదేశీ పక్షులకు విడిది కేంద్రమైంది నెల్లూరు జిల్లాలోని నేలపట్టు. నెల్లూరు-చెన్నై మార్గంలో నాయుడుపేట-సూళ్లూరుపేట మధ్య దొరవారి సత్రం మండల కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం. రాష్ట్రంలో కొల్లేరు తర్వాత అతి పెద్ద ఉప్పునీటి సరస్సు అయిన పులికాట్‌...సముద్ర ముఖ ద్వారం నుండి వచ్చిన నీటితో ఏర్పడింది. ఈ ప్రాంతంలో పక్షులకు ఆహారం సమృద్ధిగా దొరకడంతో ప్రతి ఏటా పక్షులు వేల కిలోమీటర్ల నుండి ప్రయాణం చేసి ఇక్కడకు వస్తాయి. కొంత కాలం ఇక్కడ సంతానోత్పత్తి చేసుకొని తిరుగు ముఖం పడుతాయి.

ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో వర్షాలు ప్రారంభమైన నాటి నుండి నైజీరియా, కజకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, బర్మా వంటి దేశాల నుండి వివిధ జాతులకు చెందిన పక్షులు నేలపట్టుకు వస్తాయి. నత్తగుల్ల కొంగలు, నీటి కాకులు, నీటిబుడ్డలు, తెడ్డుముక్కు కొంగలు, తెల్ల కంకణాయి, బాతు పక్షులతో పాటు ఫెలికాన్‌ పక్షులు ఇక్కడ సేదతీరుతాయి. చెట్లపై గుంపులు గుంపులుగా ఒదిగి ఉండే ఈ పక్షుల విన్యాసాలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఇక్కడ సంతానోత్పత్తి చేసుకున్న పక్షులు మార్చి, ఏప్రిల్‌ నెలలో తిరిగి వాటి స్వస్థలాలకు వెళ్లిపోతాయి.

ఈ ఏడాది వర్షాలు సుమారుగా పడటం, పులికాట్‌ సరస్సు నీటితో కళకళలాడుతుండటంతో విడిదికి పక్షులు భారీగా వచ్చి చేరాయి. దీంతో నేలపట్టులో సందర్శకుల తాడికి ఇప్పటికే పెరిగింది. పక్షుల కేంద్రంలోకి ప్రవేశించిన కొద్ది దూరంలోనే ఉన్న జింకల పార్కు సందర్శకులను ఆకట్టుకుంటోంది. ఇక్కడే చిన్నారుల వినోదం కోసం పార్కుతో పాటు సందర్శకుల కోసం ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ సెంటరును ఏర్పాటు చేశారు. ఇందులో విహంగాల జీవన శైలిని కళ్లకు కట్టినట్టుగా చూయించారు.

ఇతర జిల్లాలతో పాటు దేశ విదేశాల నుండి పర్యటకులు ఇక్కడకు తరలివస్తారు. పర్యటకుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ప్రతి ఏడాది ఫ్లెమింగో ఫెస్టివల్‌ను నిర్వహిస్తుంది. నేలపట్టు, అటకానితిప్ప, సూళ్లూరుపేట, బీవీ పాలెంలో ఫ్లెమింగో ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నారు. ఇందుకోసం 6 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఫ్లెమింగో ఫెస్టివల్‌ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక్కడ కేటాయించే నిధులతో స్థానిక ప్రాంతాల్లో అభివృద్ది పనులు చేయిస్తారు. టూరిజం ఆధ్వర్యంలో తడ సమీపంలోని బీవీపాలెం పులికాట్‌ సరస్సులో బోట్‌ షికార్‌ ఏర్పాటు చేస్తున్నారు. సూళ్లూరుపేట వేదికగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు స్థానిక యువతకు ఆటల పోటీలు నిర్వహించనున్నారు. 

06:37 - January 8, 2018

ఖమ్మం : వాయు కాలుష్యంలో ఖమ్మం నగరం మహానగరాలతో పోటీ పడుతోంది. నగరంలోని దానవాయిపేట డపింగ్‌ యార్డు కాలుష్యం ప్రాణాలను కబళించివేస్తోంది. పగలు, రాత్రి అన్న తేడా లేకుండా కాల్చివేస్తున్న వ్యర్థాలతో ఎన్నో అనర్థాలు తలెత్తున్నాయి. సమీప కాలనీల్లోని ప్రజలు ఆరోగ్య సమ్యలతో అల్లాడుతున్నారు. దానవాయిపేట డంపింగ్‌ యార్డుపై 10 టీవీ ప్రత్యేక కథనం. నగరంలో సేకరించే చెత్త, ఇతర వ్యర్థాలకు ఇక్కడకు తెచ్చి కాల్చివేస్తున్నారు. కొండల్లా పేరుకుపోయిన చెత్త గుట్టలను మున్సిపల్‌ సిబ్బంది రాత్రి, పగలు అన్న తేడా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు కాల్చి వేస్తున్నారు. దీంతో ఈ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకుని ఊపిరాడక జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దానవాయిపేట దంపింగ్‌ యార్డు నుంచి వస్తున్న పొగలను పీలుస్తున్న ప్రజలు రకరకాల వ్యాధులతో బాధపడుతున్నారు. ముఖ్యంగా శ్వాసకోశ, గుండె జబ్బులతో బాధపడుతున్నారు. చర్మవ్యాధులు ఇబ్బంది పెడుతున్నాయి. గర్భిణిలు, చంటిపిల్లలు, వృద్ధుల బాధలు వర్ణనానీతంగా ఉన్నాయి.

డంపింగ్‌ యార్డు పొగతో ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితులు నెలకొన్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దానవాయిపేట డంపింగ్‌ యార్డు పొగతో గర్భిణిలు ఎన్నో బాధలు పడుతున్నారు. పట్టబోయే బిడ్డల ఆరోగ్యంపై కాలుష్యం తీవ్ర ప్రభావం చూపుతుందని డాక్టర్లు చెబుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను ఈ ప్రాంత ప్రజలు ఎన్నోసార్లు ప్రభుత్వం, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. కానీ ఎవరూ ఏమీ చేయడంలేదని ఆవేదన చెందుతున్నారు. ఖమ్మం మున్సిపాలిటీగా ఉన్నప్పుడు దానవాయిపేట డంపింగ్‌ యార్డు పట్టణానికి చాలా దూరంగా ఉండేంది. మున్సిపల్‌ కార్పొరేషన్‌గా మారిన తర్వాత నగరం బాగా విస్తరించింది. ఎన్నో ఉద్యమాలు, ఆందోళనలు, విన్నపాల తర్వాత ఇటీవల దానవాయిపేట డంపింగ్‌ యార్డు ప్రాంతానికి వచ్చిన మున్సిపల్‌ కమిషనర్‌ సందర్శించారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించడానికి బదులు... ఫిర్యాదు చేసిన కాలనీ వాసులను బెదిరించారన్న ఆరోపణలు ఉన్నాయి.

నగర పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ దానవాయిపేట డపింగ్‌ యార్డును తరలిస్తామని ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదని టీఆర్‌ఎస్‌ నేతలే అంటున్నారు. డంపింగ్‌ యార్డు సమస్యపై ఫిర్యాదు చేసినా పట్టించుకోని మున్సిపల్‌ కమిషనర్‌ వ్యవహారంపై ఈ ప్రాంత ప్రజలు మండిపడుతున్నారు. డంపింగ్ యార్డును తరలించకపోతే ఉద్యమం తప్పదని సీపీఎం నేతలు హెచ్చరిస్తున్నారు. ఈ అంశంపై చర్చించేందుకు అఖిపక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నారు. దట్టమైన పొగమంచుకు డంపింగ్‌ యార్డు పొగతోడవడంతో ఈ ప్రాంతంలో అతిసమీపంలోని దృశ్యాలు కూడా కనిపించని దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. డంపింగ్‌ యార్డు తరలింపుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని దానవాయిపేట డంపింగ్‌ యార్డు ప్రాంత కాలనీల ప్రజలు కోరుతున్నారు. 

06:34 - January 8, 2018
06:32 - January 8, 2018

పశ్చిమ గోదావరి : జిల్లాలో విషాదం జరిగింది. పెదవేగి మండలం భోగాపురం వద్ద చెరువులో విద్యార్థుల మృతదేహాలు తేలియాడటం కలకలం రేపింది. గ్రామస్థుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాలను వెలికి తీశారు. మొదట ఒక విద్యార్థి మృతదేహం మాత్రమే లభ్యంకాగా, రెస్క్యూ టీం గాలింపులో మరో ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఘటన జరిగిన చెరువు సమీపంలోని జామతోటలో నలుగురు విద్యార్థులకు చెందిన కాలేజీ బ్యాగ్‌లు, ఐడీ కార్డులను పోలీసులు గుర్తించారు. మృతులు స్థానిక రామచంద్ర ఇంజనీరింగ్‌ కాలేజీకి చెందిన విద్యార్థులుగా నిర్దారించారు. మృతులు హరికృష్ణరాజు, విజయశంకర్‌, ఎఎస్‌కే పరుశురామ్‌లు ఇంజనీరింగ్‌ మూడవ సంవత్సరం చదువుతుండగా, కోట సాయి మొదటి సంవత్సరం చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల కుటుంబీకులు, స్నేహితులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. విద్యార్థుల మృతదేహాలను చూసి శోకసంద్రంలో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న కాలేజీ ప్రిన్సిపల్‌ ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే విద్యార్థులు శనివారం కాలేజీకి రాలేదని, విద్యార్థుల మృతి చాలా బాధాకరమన్నారు. విద్యార్థులు శనివారం ఇక్కడి జామ తోటలో పార్టీ చేసుకున్నారని, వీరిలో ముగ్గురు మొదట చెరువులో దిగి కొట్టుకుపోతుండగా మరో విద్యార్థి వారికోసం చెరువులోకి దిగి మునిగిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. విద్యార్థుల మృతదేహాలను శవపరీక్ష కోసం ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

06:28 - January 8, 2018

హైదరాబాద్ : భారత క్రికెట్‌ టీమ్‌ మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ అజారుద్దీన్‌కు హెచ్‌సీఏ స్పెషల్‌ మీటింగ్‌లో చేదు అనుభవం ఎదురైంది. సమావేశంలో పాల్గొనేందుకు అజార్‌ను అనుమతించలేదు.. దీనిపై అజారుద్దీన్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వారి సమాధానం కోసం అజారుద్దీన్‌ చాలాసేపు ఎదురుచూస్తూ ఉండడటం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ విషయంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి. హనుమంతరావు తీవ్రంగా మండిపడ్డారు. ఘాటు వ్యాఖ్యలు చేసిన వీహెచ్‌ ఓ సమయంలో సహనం కోల్పోయి మైక్‌ కూడా విరగ్గొట్టారు. 

16 నుండి 19వ తేదీ వరకు ఆందోళనలు - జాన్ వెస్లీ...

హైదరాబాద్ : ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వృత్తిదారుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 16వ తేదీ నుండి 19వ తేదీ వరకు తహసీల్దార్ కార్యాలయాల ఎదుట రిలే నిరహార దీక్షలు, 22న కలెక్టరేట్ల ముట్టడి చేపట్టనున్నట్లు టీ మాస్ కన్వీనర్ జాన్ వెస్లీ వెల్లడించారు. 

తిరుమలకు పోటెత్తిన భక్తులు..

చిత్తూరు : తిరుమలకు భక్తులు పోటెత్తారు. 23 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 7గంటల సమయం పడుతోంది. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.27 కోట్లుగా నమోదైంది. 

ఏపీ కాంగ్రెస్ నేతల మహాపాదయాత్ర...

విజయవాడ : పోలవరం ప్రాజెక్టు కోసం ఏపీ కాంగ్రెస్‌ నేతలు పోరాటం ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేసే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపిస్తూ మహా పాదయాత్ర చేపట్టారు. కాంగ్రెస్‌ హయాంలో ప్రారంభమైన పోలవరం ప్రాజెక్టును 2019లో మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత తామే ప్రారంభిస్తామని పార్టీ నాయకులు చెబుతున్నారు.

జూబ్లీహిల్స్ లో కోళ్ల పందాలు..

హైదరాబాద్‌ : జూబ్లీహిల్స్‌లో కోళ్లపందెం స్థావరాలపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు నిర్వహించారు. 20 పందెం కోళ్లు, 29 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 25 సెల్‌ఫోన్లు, 70వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 

Don't Miss