Activities calendar

09 January 2018

21:38 - January 9, 2018

శాతావాహన యూనివర్శిటీలో తెంగాణ ఉద్యమం నుంచి పోరాటం చేస్తుందని, అనేక మంది పోరాటలకు తను అండగా నిలుచున్ననాని, ఆ రోజు ఆర్ఎస్ఎస్ వారు భారత్ ఎందుకు తీసుకొచ్చారని, మనస్తృతిని దహనం చేసుటప్పడు తను అక్కడ లేనని ప్రొ. సూరపల్లి సుజాత అన్నారు. పూర్తి వివరాలకువ వీడియో క్లిక్ చేయండి. 

21:36 - January 9, 2018

హైదరాబాద్ : పవన్‌కల్యాణ్‌ నటించిన 'అజ్ఞాతవాసి' సినిమా బుధవారం ప్రపంచవ్యాప్తంగా 2700 థియేటర్లలో రిలీజ్‌ కానుంది. ఓవర్సీస్‌లో 576 థియేటర్లలో విడుదల కానుంది. ఓవర్సీస్‌లో ఎక్కువ థియేటర్లలో రిలీజ్‌ అవుతున్న సినిమాగా అజ్ఞాతవాసి రికార్డ్‌ సృష్టించింది. ఇదిలావుంటే... పవన్‌కల్యాణ్‌ అభిమానులకు తెలంగాణ పోలీసులు షాక్‌ ఇచ్చారు. అర్ధరాత్రి తర్వాత అజ్ఞాతవాసి ప్రీమియర్‌ షోలకు అనుమతి నిరాకరించారు. సినిమా విడుదల సమయంలో అభిమానుల కోసం ప్రత్యేకంగా అన్ని థియేటర్లలో ప్రీమియర్‌ షోలు ప్రదర్శిస్తుంటారు. ఇదే నేపథ్యంలో హైదరాబాద్‌ పోలీసులను అజ్ఞాతవాసి సినిమా నిర్మాతలు కలిసి... ప్రీమియర్‌ షోలకు అనుమతి కోరారు. అయితే... నిర్మాతలు, అభిమానుల ఆశలపై పోలీసులు నీల్లు చల్లారు. క్రేజ్‌ ఉన్న పవన్‌ సినిమాకు అభిమానులు భారీగా తరలివస్తారని... ఈ సందర్భంగా అభిమానుల మధ్య తొక్కిసలాట జరిగే అవకాశముందని పోలీసులు తెలిపారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని నిర్మాతలకు తెలిపారు. ప్రీమియర్‌ షోలు ప్రదర్శించే అన్ని థియేటర్ల వద్ద పోలీసు బందోబస్తు కల్పించలేమని.. అందువల్లే ప్రీమియర్‌ షోలకు అనుమతి ఇవ్వలేమని తేల్చి చెప్పారు.

ప్రీమియర్‌ షోలకు పోలీసులు అనుమతి నిరాకరణ
ప్రీమియర్‌ షోలకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో అభిమానులంతా నిరాశకు గురయ్యారు. ఓవైపు పక్క రాష్ట్రమైన ఏపీలో రోజుకు ఏడు షోలకు అనుమతిస్తే... తెలంగాణలో ప్రీమియర్‌ షోలకు అనుమతి నిరాకరించడంపై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుంటే... ఏపీలో అజ్ఞాతవాసి సినిమాపై ఓ వివాదం చోటు చేసుకుంది. కొడుకా కోటేశ్వరరావు పాట... తమ మనోభావాలను కించపరిచేలా ఉందంటూ కోటేశ్వరరావు అనే న్యాయవాది కృష్ణాజిల్లాలోని మాచవరం పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. వెంటనే పాటను తొలగించాలంటూ డిమాండ్‌ చేశాడు.మొత్తానికి పవన్‌ అజ్ఞాతవాసి సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణలో ప్రీమియర్‌షోలకు అనుమతి ఇవ్వని ప్రభుత్వం... ఐదు షోలకు మాత్రం అనుమతిచ్చింది. 

21:29 - January 9, 2018

కృష్ణా : రైల్వే ప్రాజెక్టుల అమల్లో ఏపీకి ఎప్పుడూ అన్యాయమే జరుగుతుందని ఆ ప్రాంత ఎంపీలు అంటున్నారు. విజయవాడలో దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్‌ యాదవ్‌తో ఏపీ ఎంపీలు భేటీ అయ్యారు. వచ్చే నెల 1న కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. గత ఏడాది నుంచి రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లో విలీనం చేశారు. విభనచట్టంలో ఇచ్చిన హామీ మేరకు విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటులో జరుగుతున్న జాప్యంపై ఎంపీలు రైల్వే అధికారులను నిలదీశారు. 

21:29 - January 9, 2018

ఢిల్లీ : అభివృద్ధి చేయాలంటే నిధులు కావాలి. ఇదే అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం కేంద్రం ముందు ఏకరువుపెట్టింది. వైద్య ఆరోగ్య పథకాలకు ఎక్కువ నిధులు ఇవ్వాలని ఆ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఆహార భద్రతా ప్రమాణాలపై ఢిల్లీలో జరిగిన రాష్ట్రాల వైద్యారోగ్య మంత్రులు భేటీకి లక్ష్మారెడ్డి హాజరయ్యారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను ప్రత్యేకంగా కలిసిన లక్ష్మారెడ్డి.. తెలంగాణ ఎయిమ్స్‌తో పాటు సిద్దిపేట, మహబూబ్‌నగర్‌, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు నిధులు ఇవ్వాలని కోరారు. కొత్త జిల్లాల్లో ఆస్పత్రులు, మాతాశిశు సంరక్షణ కేంద్రాలకు ఆర్థిక సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. 

21:28 - January 9, 2018

చిత్తూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో పర్యటించారు. రామకుప్పం జన్మభూమి-మావూరు కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామ సభ నిర్వహించి ఊళ్లో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. :రామకుప్పం జన్మభూమి గ్రామ సభలో నదుల అనుసంధానం గురించి చంద్రబాబు ప్రధానంగా ప్రస్తావించారు. ఇప్పటికే పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో గోదావరి-కృష్ణా నదులు అనుసంధానం పూర్తైన విషయాన్ని ప్రజల దృష్టికి తెచ్చారు. ఉత్తరాంధ్రలో వంశధార-నాగావళి నదుల గోదావరితో అనుసంధానికి, కృష్ణా నదిని పెన్నా నదిలో అనుసంధానికి ప్రణాళికులు రూపొందించామని చెప్పారు. వచ్చే ఏడాదికి కుప్పం ప్రాంతానికి సాగు నీరు ఇస్తామని హామీ ఇచ్చారు. :ఏపీ పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి లోకేశ్‌ కూడా రామకుప్పం జన్మభూమి గ్రామ సభలో పాల్గొన్నారు. ప్రజలకు అవినీతి రహిత పాలన అందించేందుకు రాష్ట్ర సచివాలయం నుంచి గ్రామ సచివాలయం వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలను టెక్నాలజీతో అనుసంధానం చేస్తున్నామని చెప్పారు. నవ్యాంధ్రను స్వర్ణాంధ్రగా మలచడం ద్వారా సంక్షేమం, అభివృద్ధికి పాటుపడతామని రామకుప్పం గ్రామసభకు హాజరైన ప్రజలతో చంద్రబాబు ప్రతిజ్ఞ చేయించారు. 

21:27 - January 9, 2018

చిత్తూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో పర్యటించారు. రామకుప్పం జన్మభూమి-మావూరు కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామ సభ నిర్వహించి ఊళ్లో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. :రామకుప్పం జన్మభూమి గ్రామ సభలో నదుల అనుసంధానం గురించి చంద్రబాబు ప్రధానంగా ప్రస్తావించారు. ఇప్పటికే పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో గోదావరి-కృష్ణా నదులు అనుసంధానం పూర్తైన విషయాన్ని ప్రజల దృష్టికి తెచ్చారు. ఉత్తరాంధ్రలో వంశధార-నాగావళి నదుల గోదావరితో అనుసంధానికి, కృష్ణా నదిని పెన్నా నదిలో అనుసంధానికి ప్రణాళికులు రూపొందించామని చెప్పారు. వచ్చే ఏడాదికి కుప్పం ప్రాంతానికి సాగు నీరు ఇస్తామని హామీ ఇచ్చారు. :ఏపీ పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి లోకేశ్‌ కూడా రామకుప్పం జన్మభూమి గ్రామ సభలో పాల్గొన్నారు. ప్రజలకు అవినీతి రహిత పాలన అందించేందుకు రాష్ట్ర సచివాలయం నుంచి గ్రామ సచివాలయం వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలను టెక్నాలజీతో అనుసంధానం చేస్తున్నామని చెప్పారు. నవ్యాంధ్రను స్వర్ణాంధ్రగా మలచడం ద్వారా సంక్షేమం, అభివృద్ధికి పాటుపడతామని రామకుప్పం గ్రామసభకు హాజరైన ప్రజలతో చంద్రబాబు ప్రతిజ్ఞ చేయించారు. 

20:39 - January 9, 2018

 

పాపం కోమటిరెడ్డి చిన్నరెడ్డి పెద్ద రెడ్డి ఆశల మీద అఖిల భారత కాంగ్రెస్ పార్టీ కుడ్ది గుమ్మరిచ్చింది.. అగో వస్తున్నది మాకే పీసీసీ.. వచ్చే పాయే.. ఏనుగెల్లింది తోకజిక్కింది అని నిన్నమొన్నటిదాక ఎంటుండె దండుకు చెప్పుకుంటొచ్చిన అన్నదమ్ములకు ఇప్పుడు కార్యకర్తల ముంగట మొఖం చిన్నబుచ్చుకున్నట్టైందట.. మరి మళ్లిప్పుడేం జెప్తరో అని అసక్తిగ జూస్తున్నరు అభిమానులు..

ఓదిక్కు ఎవ్వడన్న లంచం అడ్గితె చెప్పుదీస్కోని కొట్టుండ్రి అని ముఖ్యమంత్రి జెప్తడు.. నిజమే గావొచ్చు ఇద్వర్ సంది లంచాలు ఎవ్వలు దీస్కోరేమో అని అమాయకులు ఆఫీసుల పొంటవోతె.. అప్పటికంతె ఇంత ఎక్వనే అడ్గుతున్నరటగని.. తక్వలేదట.. ఒక పేద బిడ్డ.. ఎమ్మార్వోకు, వీఆర్వోకు లంచం ఇయ్యలేకపోతున్న గావట్టి సస్తాని గ్యాస్ నూనే మీద వోస్కున్నడు..

దరిద్ర్యం ఏందంటే మన దేశంల.. ఐదేండ్ల కొకపారి నాయకుడు అనెటోడు మన ఇంటికొస్తడు.. ఇగ తర్వాత ఐదేండ్లు మనం వాని ఇంటి సుట్టు తిర్గాలే.. సారు మమ్ములను ఆదుకోండ్రి అని.. సరే అదెట్లున్నా.. నిజాం షుగర్ ఫ్యాక్టరీ బాధితులు ఎమ్మెల్యే షకీలును ఇంటి మీద వడ్డరు.. గెల్చినంక వందరోజులళ్లనే ఫ్యాక్టరీని తెర్పిస్తాని చెప్పిన దేవనపల్లి కవిత తప్పిచ్చుక తిర్గుతున్నది నీ సంగతేందంటున్నరు..?

అబ్బా నిన్నియాళ్ల గవర్నర్ నర్సింహాన్ సారును జూస్తె కంట్లె వెట్టుకుంటున్నరుగదా కాంగ్రెసోళ్లు.. ఆయన ముంగట వొర్రి.. వొర్రీ..ఆయన చెవ్వులను కరావు జేశినట్టుండ్రు.. నిన్న రాత్రి చెవ్వులు నొప్పివెడ్తున్నయని గాంధీ దావఖానకు ఉర్కొచ్చి.. బాగ జేపిచ్చుకున్నడట.. గవర్నర్ సారు చెవ్వుల కరావుకు కారణం కాంగ్రెసోళ్లేనా ఏంది అని అనుమాన పడ్తున్నరు నర్సింహాన్ సారు అభిమానులు..

పోశమ్మ పోగేశి పెడ్తె మైసమ్మ మాయం జేశినట్టు.. సర్కారు గొల్లకుర్మోళ్లు బత్కాలే.. అని సబ్సిడీ గొర్లు ఇచ్చుడువెడ్తె.. నడ్మిట్లున్న దళారీగాళ్ల పాలైతున్నది పత్కం.. అడ్డమైన గొర్లు దీస్కొచ్చి అంటగడ్తున్నరు.. లారీల కెళ్లి దిగకముందుకే సచ్చిపోతున్నయ్.. ఇదెక్కడి దిక్కుమాలిన యవ్వారం అని గొల్లకుర్మోళ్లంత గొర్లతోని ధర్నాకు దిగిండ్రు..

ఒక చేతిల పవిత్రమైన భారత రాజ్యాంగం.. ఇంకో చేతిల అశోకుడి ధర్మ చక్రం.. దేశానికి చిహ్నంగ ఉన్న సింహాలు.. బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శంగ.. సాగుతున్న జంబూద్వీపం మహాకాళినడక.. మహా ఆదిగలను మహారాజులను చేస్తూ.. సాగుతున్న డీఎస్పీ యాత్ర.. నకిరేకల్ దాటింది.. మాదిగల గత సంస్కృతిని యాదిజేస్కుంట భారత రాజ్యాంగాన్ని బోదిస్తున్న ఈ ఉద్యమం.. తెలంగాణల హాట్ టాపిక్ అయిపోయింది..

ఏతుల పుంజు చంద్రాలు.. ఇగో ఇది నీకు తెల్వవల్చిన ముచ్చటనే.. కొయ్యరా కొయ్యరా పొలిగా అంటే.. గుంటూరు మిరియాలు తాటికాయంత దొడ్డన్నట్టు.. మాటలు జెప్తవ్ చేతలుండయా..? నిన్న పోలవరం దిక్కు వొయ్యి.. ఎవ్వలు ఎన్నికుట్రలు జేశినా పోలవరం గట్టితీర్తాని పొంకనాలు గొడ్తివిగదా..? సరే దాన్నంటే ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నయ్ పటేలా..? మరి ఈ వికలాంగుల సంగతేంది..?

కూట్లె రాయిదీయలేనోడు ఏట్లె రాయి ఏరవొయ్యినట్టే అయ్యెతట్టుంది నీళ్లు పంచాది జూస్తుంటే.. మాజీ కరీంనగర్ జిల్లా మంథని అంటే.. మంథనిని ముద్దాడుకుంటనే వోతది.. గోదావరి నది.. ఆ మంథని జనానికే ఈ సలికాలంల నీటి కర్వొచ్చిందంటే.. ఇగ ఆ గోదావరి నీళ్లు తెచ్చి తతిమ జనానికి తాపుడు అయ్యెపనేనా అని అనుమానం రావట్టె జనానికి..

 

శ్రీశైలం ఆలయ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ సస్పెండ్

కర్నూలు : శ్రీశైలం ఆలయం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ నాగేశ్వర్ రావును విధులను నుంచి తొలగించారు. విచారణ పేరుతో ఓ గిరిజనుడిని నాగేశ్వరరావు చితకబాదాడు. 

ముగిసిన సబ్ కమిటీ భేటీ

హైదరాబాద్ : మంత్రి జూపల్లి అధ్యక్షతన పంచాయతీరాజ్ బిల్లుపై కేబినెట్ భేటీ ముగిసింది. 7 గంటలకుపైగా మంత్రి వర్గ ఉపసంఘం సమావేశం కొనసాగింది. సర్పంచ్ లకు విస్తృతాధికారలతో పాటు బాధ్యతులు పెంచాలని, ఇకపై పంచాయతీలకు కో ఆప్షన్ సభ్యుడిని నియామించాలని సమావేశంలో నిర్ణయించారు. 

19:41 - January 9, 2018

దేశంలో రెండు టికెట్ విధానలు ఉంటాయని అందులో ఒకటి ఫిక్స్ డ్ టికెటింగ్ విధానం, రెండవది వెరియేబుల్ టికెటింగ్ విధానం ఉంటుందని, సినిమా నిర్మాణాన్ని బట్టి టికెట్ రేటు నిర్ణయించడమనేది మంచి కాదని, 100 కోట్ల సినిమా కు రూ.500 ఉంటే కోటి రూపాయాల సినిమాకు రూ.10 ఉంటుందా అని కత్తి మహేష్ అన్నారు. ఎక్కువ నిర్మాణమనే చర్చ వచ్చిప్పుడు సినిమా టికెట్ ధర ఎవరు నిర్ణయించాలనేది ఇక్కడ తేలాల్సిన విషయమని, కోర్టు ప్రభుత్వాని ఓ కమిటీ వేయమని చెప్పిందని, కానీ ప్రభుత్వం అలా చేయలేదని డీఓఎఫ్ వై రాష్ట్ర కార్యదర్శి విజయ్ అన్నారు. రెండు రాష్ట్రాలు ఉన్నాయని, థియేటర్లకు రెట్టు పెంచుకునే అవకాశం ఉందని అందరు సినిమా బడ్జేట్ పెంచుతున్నారని, దీంతో డిస్టీబ్యూటర్లు ఎక్కువ పెట్టి కొనాల్సి వస్తుందని ప్రముఖ నిర్మాత రామ్ సత్యనారాయణ అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

19:28 - January 9, 2018

హైదరాబాద్ : గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో ప్రజలకు వినోదం కోసం... 200లకు పైగా సినిమా థియేటర్లు, మ‌ల్టీ ప్లెక్సులు ఉన్నాయి. వీటిలో ప్రతి రోజూ క‌నీసం ల‌క్షమంది దాకా సినిమాలు చూస్తుంటారు. వినోదం కోసం వచ్చిన ప్రేక్షకులను థియేటర్‌ యాజమాన్యాలు నిలువుదోపిడీ చేస్తున్నాయి. టికెట్ రుసుంతో పాటు... తినుబండారాలు, కూల్ డ్రింక్స్, పార్కింగ్ పేరుతో అడ్డంగా దోచుకుంటున్నాయి. నిబంధనల‌కు పాత‌రేసి.. అధిక ధ‌ర‌ల‌ను వ‌సూలు చేస్తున్నాయి. ఇందేంట‌ని ప్రశ్నించిన వారిపై దాడుల‌కు సైతం థియేటర్ల యాజమాన్యాలు వెనుకాడ‌టం లేదు.సినిమా థియేటర్లలో అక్రమాలకు పాల్పడితే తాటతీస్తామని బల్దియా హెచ్చరించింది. టికెట్లు కానీ... తినుబండారాలు కానీ... అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తప్పవంది. బీ కేర్‌ ఫుల్‌... అంటూ బీరాలు పలికింది. సినిమా థియేటర్లో జరుగుతున్న దోపిడీపై త్రీమెన్‌ కమిటీని కూడా వేసింది. థియేటర్లపై అధ్యయనానికి ఏర్పాటైన కమిటీ కొంత ఆలస్యంగానైనా నివేదికను అందించింది. థియేటర్ల యాజమాన్యాలు ప్రేక్షకులను దోచుకుంటున్నాయన్న విషయాన్ని నొక్కి చెప్పింది. థియేటర్లలో చట్టవిరుద్ధ చర్యలను కళ్ళకు కట్టినట్లు వివరించింది త్రీమెన్‌ కమిటీ.

పార్కింగ్ ఫీజు వ‌సూలు చెయ్యకూడదు.
చట్టప్రకారం థియేటర్లలో పార్కింగ్ ఫీజు వ‌సూలు చెయ్యకూడదు. కానీ వారు థియేటర్లు మాత్రం ఈ నిబంధనను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. వాహన పార్కింగ్‌ను ఆదాయ మార్గంగా మలచుకున్నాయి. టూ వీలర్, ఫోర్ వీలర్, సైకిల్ ఇలా ఒక్కో వాహనానికి ఒక్కో లెక్కన పార్కింగ్‌ ఫీజు పేరుతో దోచుకుంటున్నాయి. ఆహార ప‌దార్థాల అమ్మకాల‌ విషయంలోనూ థియేటర్లకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. థియేటర్ల యాజమాన్యాల దోపిడీని అరికట్టాలని బ‌ల్దియాకు త్రీమెన్‌ కమిటీ సూచించింది. అధికారులు తమ అధికారాన్ని ఉపయోగించి చర్యలు తీసుకోవాలని కోరింది. త్రీమెన్‌కమిటీ నివేదిక ఇచ్చి ఏడాది కావస్తున్నా.... ఇప్పటికీ బల్దియా ఏ థియేటర్‌పైనా చర్యలు తీసుకున్నది లేదు.థియేటర్లనుంచి ఆస్తి ప‌న్నుతోపాటు.. ట్రేడ్ లై సెన్స్ ఫీజు కూడా వసూలు చెయ్యాల‌ని జీహెచ్ఎంసీ భావించింది. ఐతే దీనిపై థియేటర్‌ యజమానులు కోర్టుకు వెళ్ళారు. దీంతో స‌మ‌స్య మ‌ళ్లీ మొద‌టికి వచ్చింది. అధికారులు బాధ్యతగానూ... తెలివిగానూ వ్యవ‌హ‌రిస్తే బ‌ల్దియాకు ఆదాయంతో పాటు.... ప్రేక్షకుల జేబుకు ప‌డుతున్న చిల్లును కూడా అరిక‌ట్ట వచ్చని పలువురు సూచిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యాన్ని వీడాలని ప్రేక్షకులు కోరుతున్నారు. 

19:26 - January 9, 2018

గుంటూరు : జిల్లా తాడేపల్లిలో ప్రజాశక్తి రాష్ట్ర కార్యాలయానికి మంత్రి కాల్వ శ్రీనివాసులు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ప్రజాశక్తి సంపాదకులు పాటూరు రామయ్య, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుతో పాటు పలువురు పాల్గొన్నారు. ప్రజాసమస్యలను ఎత్తి చూపడంలో, ప్రభుత్వాన్ని, పాలకులను నిలదీయడంలో ప్రజాశక్తి ముందుందన్నారు కాల్వ శ్రీనివాసులు. ప్రశ్నించే తత్వాన్ని బోధించిన వామపక్ష ఉద్యమ భావజాలన్ని.. ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రజాశక్తి ఎనలేని కృషి చేస్తోందన్నారు కాల్వ. ప్రజాశక్తికి తన సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయన్నారు మంత్రి. ప్రజలకు విజ్ఞానం పంచడంలో పత్రికలు ప్రధానపాత్ర వహిస్తున్నాయన్నారు సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు. పాలకులకు తమ బాధ్యతను పత్రికలు నిరంతరం గుర్తు చేయాల్సిన అవసరముందన్నారు రాఘవులు.

ఉద్యమంలో ప్రజాశక్తి, వామపక్ష భావజాలం
ఉద్యమంలో ప్రజాశక్తి, వామపక్ష భావజాలం గొప్పపాత్ర నిర్వహించాయన్నారు సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు. రాష్ట్ర విభజన జరిగాక ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొని ప్రజల మద్దతులో ప్రజాశక్తి నిలదొక్కుకుందన్నారు. సిబ్బంది ఎంతో అకింతభావంతో పని చేస్తూ సంస్థ అభివృద్ధి తోడ్పడుతున్నారన్నారు. పత్రిక చదవడం ద్వారా చైతన్యం పెరుగుతుందన్నారు విశాలంధ్ర మాజీ సంపాదకులు రాఘవాచారి. సమాజంలో ప్రత్యామ్నాయ సంస్కృతిని నిర్మించడంలో ప్రజాశక్తి పత్రిక ఎనలేని కృషి చేసిందన్నారు రాఘవాచారి. త్వరలోనే భవనాన్ని పూర్తి చేస్తామని ప్రజాశక్తి యాజమాన్యం తెలిపింది. ప్రజల చేతిలో ప్రజాశక్తి పాశుపతాస్త్రంగా నిలుస్తుంని... సామాజిక చైతన్యానికి మారుపేరుగా నిలుస్తుందని పలువురు కొనియాడారు. 

చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం

చిత్తూరు : జిల్లా ఏర్పేడు మండలం వాంపల్లి వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు-ఆటో ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. 

19:24 - January 9, 2018

చిత్తూరు : జిల్లా ఏర్పేడు మండలం వాంపల్లి వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు-ఆటో ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

19:23 - January 9, 2018

కృష్ణా : రేపు ప్రపంచవ్యాప్తంగా 2700 థియేటర్లలో పవన్‌కల్యాణ్‌ అజ్ఞాతవాసి సినిమా రిలీజ్‌ కానుంది. దీంతో అభిమానులంతా పండుగ చేసుకుంటున్నారు. ఇప్పటికే థియేటర్ల వద్ద సందడి నెలకొంది. సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. విజయవాడలోని సినిమా థియేటర్ల వద్ద సందడి గురించి తెలుసుకోవాడనికి వీడియో క్లిక్ చేయండి. 

కొడుకా కోటేశ్వరరావు పాటపై పీఎస్ లో ఫిర్యాదు

కృష్ణా : పవన్‌కల్యాణ్‌ 'అజ్ఞాతవాసి' సినిమాపై వివాదం చోటు చేసుకుంది. కొడుకా కోటేశ్వరరావు పాటపై మాచవరం పీఎస్‌లో కోటేశ్వరరావు అనే న్యాయవాది ఫిర్యాదు చేశాడు. తమ మనోభావాలు కించపరిచేలా పాట ఉందంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. వెంటనే ఆ పాటను తొలగించాలని డిమాండ్‌ చేశాడు.

19:22 - January 9, 2018

కృష్ణా : పవన్‌కల్యాణ్‌ 'అజ్ఞాతవాసి' సినిమాపై వివాదం చోటు చేసుకుంది. కొడుకా కోటేశ్వరరావు పాటపై మాచవరం పీఎస్‌లో కోటేశ్వరరావు అనే న్యాయవాది ఫిర్యాదు చేశాడు. తమ మనోభావాలు కించపరిచేలా పాట ఉందంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. వెంటనే ఆ పాటను తొలగించాలని డిమాండ్‌ చేశాడు. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

19:21 - January 9, 2018

హైదరాబాద్ : దేశంలో రెండో ఉత్తమ పోలీస్‌ స్టేషన్‌గా హైదరాబాద్‌ కమిషనరేట్‌లోని పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ అవార్డు దక్కించుకుంది. కేంద్ర హోంశాఖ, క్వాలిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఇటీవల దేశవ్యాప్తంగా మోడల్‌ పోలీస్‌ స్టేషన్లపై సర్వే నిర్వహించింది. వందకు పైగా మోడల్ స్టేషన్లను కేంద్రహోంశాఖ పరిశీలించింది. పోలీస్‌ స్టేషన్ల పనితీరు, పోలీసుల దర్యాప్తు ఇలా.. 140 ప్రమాణాలను పరిగణనలోకి తీసుకొని చివరకు కేంద్ర హోంశాఖ ది సెకండ్ బెస్ట్ పీఎస్‌గా పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌ను ఖరారు చేసింది. గతంలో పది పోలీస్‌ స్టేషన్లతో తుది జాబితా రూపొందించి వాటిలోంచి మూడు ఉత్తమ స్టేషన్లను ఎంపిక చేసింది. ఇందులో పంజాగుట్ట పీఎస్ రెండో స్ధానాన్ని కైవసం చేసుకుంది. ఇదే సర్వేలో తమిళనాడులోని కోయంబత్తూర్‌ పోలీస్‌ స్టేషన్‌ మొదటి స్థానంలో, ఉత్తరప్రదేశ్‌లోని లక్నో కమిషనరేట్‌ పరిధిలోని గుడుంబా పోలీస్‌ స్టేషన్‌ మూడో స్థానంలో నిలిచాయి. మధ్యప్రదేశ్‌ టెకన్‌పూర్‌లోని బీఎస్‌ఎఫ్‌ క్యాంపులో ప్రారంభమైన ఆలిండియా డీజీపీల సదస్సులో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఈ పోలీస్‌ స్టేషన్లకు ట్రోఫీలను అంద జేశారు. డీజీపీ మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్‌ రవీందర్‌ ఈఅవార్డును అందుకున్నారు. ఈ అవార్డు తమ పీఎస్‌కు దక్కడం పట్ల పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

12వేలకు పైగా ఆధునాతన సీసీ కెమెరాలు
2004లో మూడు అంతస్ధుల భవనంలో పంజాగుట్ట పోలిస్ స్టేషన్ ఏర్పాటైంది. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రభుత్వం కొన్ని పోలిస్ స్టేషన్లను మోడల్‌ పోలిస్ స్టేషన్‌గా తీర్చిదిద్దాలని భావించింది. టెక్నాలజి, ఫ్రెండ్లీ పోలిసింగ్, స్మార్ట్ పోలిసింగ్ ను ప్రవేశపెట్టింది. కొన్ని లక్షల రూపాయలు వెచ్చించిన ప్రభుత్వం పంజాగుట్ట పీఎస్ రూపురేఖలే మార్చేసింది. పంజాగుట్టలోని మూడు అంతస్తుల పీఎస్ భవనంలో ఒక్కో క్యాబిన్‌ స్టార్ హోటల్‌లోని రూమ్‌లను తలపిస్తాయి. వాస్తవానికి రద్దీగా ఉండే పంజాగుట్ట లిమిట్స్ లో దాదాపు 29 అతి ముఖ్యమైన ప్రాంతాల్లో పోలీసులు 390 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా.. నేను సైతం అధ్వర్యంలో 12వేలకు పైగా ఆధునాతన సీసీ కెమెరాలు సురక్షిత ప్రాంతంగా పంజాగుట్టను తీర్చిదిద్దుతున్నాయి. 2.5 లక్షల జనాభా నివాసం ఉంటున్న పంజాగుట్ట పీఎస్ పరిధిలో పోలీసులు ప్రణాళికా బద్ధంగా భద్రతా చర్యలు చేపడుతున్నారు.

160 మందికి పైగా పోలీసులు
ఇద్దరు సీఐ ర్యాంక్ అఫీసర్లు, 10మంది ఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుల్స్, హోం గార్డులు, పోలీస్ కానిస్టేబుల్స్, ఏఎస్‌ఐలు, ఆరు బ్లూ కోర్టు టీమ్స్, 3 పెట్రో మొబైల్ టీమ్స్ విధి నిర్వహణలో బిజీగా ఉంటున్నారు. మొత్తం 160కి పైగా పోలీసులు 4 కిలోమీటర్ల వరకు పీఎస్ పరిధిలోని ప్రజానీకానికి భద్రత కల్పిస్తున్నారు. ఇక పంజాగుట్ట పీఎస్ లో హెల్ప్ డెస్క్, రిసెప్షన్ వింగ్, ఉమెన్ హెల్ప్ డెస్క్‌లో ఫిర్యాదుల కోసం వచ్చే వారి పట్ల సీనియర్ స్ధాయి అధికారులు బాధితులకు భరోసా కల్పిస్తున్నారు. వారిని అన్ని విధాల ధైర్యం చెబుతూ బాసటగా నిలుస్తున్నారు. ఎలాంటి ఫిర్యాదులపైనైనా పూర్తి బాధ్యతతో తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నామని చెబుతున్నారు. ఇక్కడ ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వెంటనే స్పందిస్తున్నారని సీనియర్ సిటిజన్స్ చెబుతున్నారు. టెక్నాలజీ, స్మార్ట్ పోలీసింగ్, ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాలతో దూసుకెళ్తున్న సిటీ పోలీసులు దేశంలోని మోడల్ పోలీస్‌ స్టేషన్లలో రెండో స్ధానాన్ని కైవసం చేసుకోవడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరింత బాధ్యతగా ప్రజలకు సేవలు అందిస్తామంటున్న సిటీ కాప్స్‌కు మనం సలామ్ చెబుదాం. ఎల్లవేళలా వారికి సహకరిద్దాం. 

19:20 - January 9, 2018

రంగారెడ్డి : జిల్లా కొల్లూరులో 450 కోట్ల రూపాయలతో నిర్మించిన నాలుగు రింగురోడ్లను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. 159 కిలోమీటర్ల ఔటర్‌రింగ్‌రోడ్డుకు అనుబంధంగా ఉన్న 35 రేడియల్‌ రింగ్‌రోడ్లలో 17 రోడ్లను ఇప్పటికే పూర్తి చేసుకున్నామని కేటీఆర్‌ అన్నారు. నాలుగు రోడ్లను ఇవాళ ప్రారంభించారు. పటాన్‌ చెరువు నియోజకవర్గంలో 300 కోట్ల రూపాయలతో రోడ్లను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రుల తుమ్మల, మహేందర్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, ఎంపీ విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు.

తిరుమలలో బయపటబడ్డ నిఘా లోపం

 

చిత్తూరు : తిరుమలలో మరోసారి నిఘా వైఫల్యం బయటపడింది. వరాహస్వామి అతిథి గృహం వద్ద మందు బాబు హల్ చల్ చేశాడు. ఆ వ్యక్తి బహిరంగంగా మద్యం సేవిస్తూ భక్తులకు ఆందోళన కల్గించే విధంగా ప్రవర్తించాడు. దీంతో అతన్ని విజిలెన్స్ అధికారులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు.

17:37 - January 9, 2018

చిత్తూరు : తిరుమలలో మరోసారి నిఘా వైఫల్యం బయటపడింది. వరాహస్వామి అతిథి గృహం వద్ద మందు బాబు హల్ చల్ చేశాడు. ఆ వ్యక్తి బహిరంగంగా మద్యం సేవిస్తూ భక్తులకు ఆందోళన కల్గించే విధంగా ప్రవర్తించాడు. దీంతో అతన్ని విజిలెన్స్ అధికారులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

17:22 - January 9, 2018

యానాం : క్రీడా మైదానంలో జరిగిన ప్రజా ఉత్సవాల్లో 20వేల రకాలతో ఏర్పాటుచేసిన ఫ్లవర్‌ షో విశేషంగా ఆకట్టుకుంది. బెంగుళూరు, పూణే నుంచి తెచ్చిన గులాబీతోపాటు పలురకాల పూలమొక్కలు, కూరగాయలు, పండ్లను స్టాల్స్‌ లో ప్రదర్శనకు ఉంచారు. అన్నిరకాలనూ ఒకే చోట చూసే అవకాశం దక్కడంతో సందర్శకులు ఆనందానికి అవధులు లేవు.. పూలను పలు ఆకృతుల్లో అందంగా అలంకరించిన తీరు ఆందరినీ కట్టిపడేసింది.యానాం ప్రజా ఉత్సవాలకు సందర్శకులు పోటెత్తారు. అబ్బురపరచే నృత్యప్రదర్శనలు అందరినీ అలరించాయి. ఘంటసాల పార్వతి రవి చేసిన నృత్య ప్రదర్శన అందర్నీ విశేషంగా ఆకట్టుకుంది. సినీ పరిశ్రమకు చెందిన పలువురు గాయకులు పాటలు పాడి అలరించారు. బాడీబిల్డింగ్‌తో పాటు వివిధ ప్రదర్శనలను ఆహూతులు ఆస్వాదించారు. హైదరాబాద్‌, ముంబై నుంచి వచ్చిన మోడళ్ళు ఫ్యాషన్‌ షోతో ఆకట్టుకున్నారు. తొలిరోజు ఉత్సవాలకు పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామి, ముగింపు వేడుకలకు పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ డాక్టర్‌ కిరణ్‌ బేడీ హాజరయ్యారు. యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు, ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రమణ్యం, రచయిత యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌తోపాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులను సత్కరించారు. తొలి రెండు రోజుల్లో డ్యాన్సులు, ఫ్యాషన్‌ షోతో ఆకట్టుకోగా... మూడో రోజు ఆర్కెస్ర్టాతో అలరించారు. 

17:19 - January 9, 2018

అనంతపురం : జిల్లా పుట్టపర్తి వద్ద హైకోర్టు ఉత్తర్వులతో హంద్రీ-నీవా పనులు పునఃప్రారంభమయ్యాయి. పుట్టపర్తి దగ్గరి తొమ్మిదో ప్యాకేజీలో 15 ఎకరాల భూసేకరణ అంశం.. హైకోర్టులో గత మూడేళ్లుగా విచారణ కొనసాగింది. కాలువ నిమిత్తం కోల్పోతున్న భూమి వ్యవహారంలో ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతూ .. రైతులకు వాదనకు మద్దతుగా సింగిల్‌ బెంచ్ తీర్పు ఇచ్చింది. దీనిపై ప్రభుత్వం మరో పిటిషన్ వేసింది. పిటిషన్‌ విచారించిన హైకోర్టు చీఫ్ జస్టిస్‌ నేతృత్వంలోని ధర్మాసనం.. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రిజర్వులో ఉంచింది. ప్రభుత్వ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని.. రైతులకు పరిహారం మొత్తం చెల్లించాలన్నారు.

భూములకు ఎకరాకు కోటి 62 లక్షలు
పరిహారం ఇచ్చే విషయంలో ప్రభుత్వ పక్షపాత ధోరణి అవలంభిస్తోందని రైతులు ఆరోపించారు. తమ భూమి పక్కనే ఉన్న భూములకు ఎకరాకు కోటి 62 లక్షలు ఇచ్చారని.. తమకు మాత్రం కేవలం 23 లక్షలు మాత్రమే ఇచ్చారని తెలిపారు. పరిహారంలో అధికారులు ఇంత వ్యత్యాసం చూపడమేంటని ప్రశ్నించారు. ప్రాజెక్టుకు తాము ఏమాత్రం వ్యతిరేకంకాదని... అయితే తమకూ అందరితో సమానంగా పరిహారం ఇచ్చి న్యాయం చేయాలని కోరారుతమకు పరిహారంపై న్యాయం చేసి పనులు చేపట్టాలంటూ రైతులు పనులకు అడ్డుతగిలారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు.. రంగంలోకి దిగిన పోలీసులు రైతులను లాగేసి పనులు చేపట్టారు. 

17:17 - January 9, 2018

చిత్తూరు : జ్ఞాతవాసి సినిమా విడుదలపై తిరుపతిలో పవన్‌ కల్యాణ్‌ అభిమానల్లో కోలాహలం నెలకొంది. నగరంలోని అన్ని థియేటర్లలో కూడా ఈ అర్థరాత్రి నుంచి ప్రత్యేక షోలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో థియేటర్ల వద్ద టికెట్ల కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. సంక్రాంతి తర్వాత మూడు రోజులు కూడా ఆన్‌లైన్‌ టికెట్లు అందుబాటులో లేవు.

17:16 - January 9, 2018

తూర్పుగోదావరి : తన ఇంటిని కూల్చవద్దంటూ రాజమండ్రిలో ఓ వృద్ధురాలు సెల్‌ టవర్‌ ఎక్కి నిరసనకు దిగింది. ఇందిరా సత్యనగర్ కాలనీకి చెందిన 70 ఏళ్ల వృద్దురాలు కుమారమ్మ సెల్‌ టవర్ ఎక్కి దూకేస్తానని చెప్పడంతో స్థానికంగా కలకలం రేపింది. ఇందిరా సత్యనగర్‌ వాసుల ఇళ్లను కార్పొరేషన్ అధికారులు కూల్చడం కోసం నోటీసులు ఇచ్చారని ... కూల్చివేతలు ఆపడం కోసం 30 రోజులుగా దీక్షలు చేస్తున్నా అధికారులు స్పందించడం లేదని.. ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల తీరును నిరసిస్తూ.. కుమారమ్మ టవరెక్కి నిరసన వ్యక్తం చేస్తోంది. ఎంతమంది నచ్చచెప్పినా వినిపించుకోకుండా ఆమె టవర్ పైనే ఉంది. ప్రభుత్వం తమ ఇళ్లను కూల్చివేయనని చెప్పాలని ఆమె డిమాండ్ చేస్తోంది. 

17:15 - January 9, 2018

గుంటూరు : త్రిక చదవడం ద్వారా చైతన్యం పెరుగుతుందన్నారు విశాలంధ్ర మాజీ సంపాదకులు రాఘవాచారి. గుంటూరుజిల్లా తాడేపల్లిలో ప్రజాశక్తిదినపత్రిక ఏపీ రాష్ట్ర కార్యాలయం శంకుస్థాపనలో ఆయన పాల్గొన్నారు. సమాజంలో ప్రత్యామ్నాయ సంస్కృతిని నిర్మించడంలో ప్రజాశక్తి పత్రిక ఎనలేని కృషిచేసిందన్నారు.

17:14 - January 9, 2018

కృష్ణా :విజయవాడ సింగినగర్‌లోని 53వ డివిజన్‌లో జన్మభూమి-మా ఊరు కార్యక్రమం రసాభాసగా మారింది. స్థానిక ఎమ్మెల్యే బొండా ఉమా ఆధ్వర్యంలో జరిగిన జన్మభూమి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కాల్వ శ్రీనివాసులు హాజరయ్యారు. అయితే గత జన్మభూమిలో ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు అమలు కాలేదని ఇప్పుడు జన్మభూమిలో పెట్టుకున్న అర్జీలు ఎప్పటిలోగా పరిష్కరిస్తారని మంత్రి కాల్వ శ్రీనివాసరావుకు సీపీఎం నేతలు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, సీపీఎం నేతలకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. అనంతరం పోలీసులు సీపీఎం నాయకులను బలవంతంగా ఈడ్చుకుంటూ జీపులోకి ఎక్కించారు. 

విశాఖలో కల్తీ మాఫీయా ముఠా గుట్టు రట్టు

విశాఖ : అధికారులు కల్తీ మాఫియా ముఠా గుట్టు రట్టు చేశారు. ఓ ముఠా విష రసాయనాలతో బొప్పాయి మగ్గపెడుతున్న విషయం తెలుసుకున్న అధికారులు సీతమ్మపేటలోని ఓ ఇంట్లో 4 టన్నుల బొప్పాయి పళ్లు స్వాధీనం చేసుకున్నారు. ముఠా ఇతిఫాన్ అనే రసాయనాన్ని వాడుతున్నట్టు అధికారులు గుర్తించారు. 

ఎస్టీ హాస్టల్ వార్డెన్ యాదయ్య సస్పెండ్

సంగారెడ్డి : జిల్లా జహీరాబాద్ ఎస్టీ బాలుర హాస్టల్ వార్డెన్ యాదయ్యను కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఇద్దరు విద్యార్థులను తలకిందులుగా నిల్చోబెట్టి వార్డెన్ యాదయ్య చితకబాదారు. ఈ ఘటనపై రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ట్రైబర్ వెల్ఫేర్ అధికారి మణెమ్మను కలెక్టర్ ఆదేశించారు.

సిరిసిల్ల కలక్టరెట్ వద్ద ఉద్రిక్తత

కరీంనగర్/సిరిసిల్ల : ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్ ధర్నాకు దిగింది. కలెక్టరేట్ లోకి దూసుకెళ్లేందుకు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాజీ ఎమ్మల్యే శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ పొన్న ప్రభాకర్ యత్నించారు.

16:17 - January 9, 2018
16:16 - January 9, 2018

విశాఖ : అధికారులు కల్తీ మాఫియా ముఠా గుట్టు రట్టు చేశారు. ఓ ముఠా విష రసాయనాలతో బొప్పాయి మగ్గపెడుతున్న విషయం తెలుసుకున్న అధికారులు సీతమ్మపేటలోని ఓ ఇంట్లో 4 టన్నుల బొప్పాయి పళ్లు స్వాధీనం చేసుకున్నారు. ముఠా ఇతిఫాన్ అనే రసాయనాన్ని వాడుతున్నట్టు అధికారులు గుర్తించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

16:11 - January 9, 2018

సంగారెడ్డి : జిల్లా జహీరాబాద్ ఎస్టీ బాలుర హాస్టల్ వార్డెన్ యాదయ్యను కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఇద్దరు విద్యార్థులను తలకిందులుగా నిల్చోబెట్టి వార్డెన్ యాదయ్య చితకబాదారు. ఈ ఘటనపై రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ట్రైబర్ వెల్ఫేర్ అధికారి మణెమ్మను కలెక్టర్ ఆదేశించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

16:05 - January 9, 2018

కరీంనగర్/సిరిసిల్ల : ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్ ధర్నాకు దిగింది. కలెక్టరేట్ లోకి దూసుకెళ్లేందుకు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాజీ ఎమ్మల్యే శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ పొన్న ప్రభాకర్ యత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

బడ్జెట్ 3 నెలల ముందు మీటింగ్ పెట్టాలి : కేశినేని

కృష్ణా : బడ్జెట్ కు 3 నెలల ముందు మీటింగ్ పెట్టాలని, ఇప్పుడు మీటింగ్ పెట్టడం వల్ల ఉపయోగం లేదని టీడీపీ ఎంపీ కేశినేని నాని అన్నారు. బడ్జెట్ పేపర్స్ సిద్ధం అవుతుంటే ఇప్పడు మీటింగ్ ఎందుకుని ఆయన ప్రశ్నించారు. 

చిత్తూరులో అపోలో టైర్ల పరిశ్రమ : సీఎం చంద్రబాబు

చిత్తూరు : వరదయ్య పాలెం మండలం చిన్నపాండూరు వద్ద అపోలో టైర్ల పరిశ్రమ ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. చిత్తూరును ఆటో హాబ్ గా తీర్చిదిద్దుతామని ఆయన అన్నారు. 

తుమ్మిళ్ల రిజర్వాయర్ ను ఎంచుకుంది కాంగ్రెస్సే : సంపత్

మహబూబ్ నగర్ : తుమిళ్ల రిజర్వాయర్ నను ఎంచుకుంది  కాంగ్రెస్ పార్టీ అని, హరీష్ రావు వాస్తవాలను మరిచి కాంగ్రెస్ విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్యే సంపత్ కుమార్ అన్నారు.

15:24 - January 9, 2018
15:20 - January 9, 2018

సినిమా థియేటర్లలో జాతీయ గీతం తప్పనిసరి కాదు : సుప్రీం

ఢిల్లీ : సినిమా థియేటర్లలో జాతీయ గీతంపై సుప్రీంలో విచారణ జరిగింది. థియేటర్లలో జాతాయ గీతాలాపన తప్పనిసరి కాదని సుప్రీం స్ప
ష్టం చేసింది. గతంలో తము ఇచ్చిన సుప్రీం సవరించింది. 

14:37 - January 9, 2018

సినీ ఇండస్ట్రీలో మహిళ పాటల రచయత్రిలు ఇప్పటి వరకు మనకు లేరు కానీ ఆ లోటు ను భర్తీ చేసింది శ్రేష్ఠ. ఎక్కడా ఆదిలాబాద్ లో పుట్టి తెలుగులో మొట్టమొదటి పాటల రచయత్రిగా శ్రేష్ఠ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాడనికి వీడియో క్లిక్ చేయండి. 

తెంగాణలో అజ్ఞాతవాసి ప్రిమియర్ షోకు లేనట్లే

హైదరబాద్ : అజ్ఞాతవాసి ప్రీమియర్ షోలకు తెలంగాణ పోలీసులు అనుమతి నిరాకరించారు. తొక్కిసలాటలు జరిగే అవకాశం ఉండడంతో పోలీసులు అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది.

14:29 - January 9, 2018
14:22 - January 9, 2018
14:21 - January 9, 2018

ఢిల్లీ :ప్రార్లమెంటు వద్ద యువ హుంకార్ ర్యాలీ ప్రారంభమైంది. గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ, అఖిల్ గొగోయ్, కన్హయ్య కుమార్లతో పాటు దళిత, విద్యార్ధి, రైతు, మహిళా సంఘాల నేతలు ఈ ర్యాలీలో పాల్గొంటారు. పీఎంవో కు వెళ్లి ప్రధాని ముందు మనుస్మృతి, రాజ్యాంగం రెండు పుస్తకాలు ఉంచుతానని ఆయన ఏది ఎంచుకుంటారో తేల్చుకోవాలని గత వారం జిగ్నేష్ మేవానీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో జిగ్నేష్ ర్యాలీకి సిద్ధమవుతున్నారు. మరోవైపు ఢిల్లీ పోలీసులు ర్యాలీకి అనుమతి లేదంటున్నారు. యువర్యాలీ నేపథ్యంలో సెంట్రల్ ఢిల్లీలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

14:21 - January 9, 2018

హైదరబాద్ : అజ్ఞాతవాసి ప్రీమియర్ షోలకు తెలంగాణ పోలీసులు అనుమతి నిరాకరించారు. తొక్కిసలాటలు జరిగే అవకాశం ఉండడంతో పోలీసులు అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

అజ్ఞాతవాసి ప్రీమియర్‌ షోలకు నో చెప్పిన తెలంగాణ పోలీసుల

హైదరాబాద్ : అజ్ఞాతవాసి ప్రీమియర్‌ షోలకు తెలంగాణ పోలీసులు నో చెప్పారు. తొక్కిసలాటలు జరిగే అవకాశం ఉన్నందున ప్రీమియర్‌ షోలకు అనుమతి లేదని అంటున్నారు. అర్ధరాత్రి తరువాత ప్రీమియర్‌ షోలకు తెలంగాణ పోలీసులు నిరాకరించారు.

 

రోడ్డుప్రమాదంలో విద్యార్థిని మృతి

రంగారెడ్డి : జిల్లాలోని శంషాబాద్ మండలం బూర్జుగడ్డ పివన్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం జరిగింది. కారు బోల్తా కొట్టిన ఘటనలో హెచ్‌సీయూ విద్యార్ధిని మృతి చెందింది. నితిన్, నికిత అనే మరో ఇద్దరు విద్యార్ధులు గాయాలతో బయటపడ్డారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అనన్య ఢిల్లీలో డిగ్రీ పూర్తి చేసింది. సెంట్రల్ యూనివర్సిటీలో  పీజీ మొదటి సంవత్సరం చదువుతోంది. విద్యార్ధులంతా శంషాబాద్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

సినిమా థియేటర్లలో జాతీయ గీతంపై సుప్రీంకోర్టు విచారణ

ఢిల్లీ : సినిమా థియేటర్లలో జాతీయ గీతంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. థియేటర్లలో జాతీయ గీతాలాపన తప్పనిసరి కాదని కోర్టు తీర్పు ఇచ్చింది. గతంలో తప్పనిసరి అని ఇచ్చిన తీర్పును సుప్రీం సవరించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

14:09 - January 9, 2018

గుంటూరు : జిల్లాలోని తాడేపల్లిలో ప్రజాశక్తి పత్రిక ఏపీ రాష్ట్రకార్యాలయానికి మంత్రి కాల్వశ్రీనివాసులు శంకుస్థాపన చేశారు. ప్రజాసమస్యలను ఎత్తిచూపడంలో, ప్రభుత్వాలను, పాలకులను నిలదీయడంలో ప్రజాశక్తి పత్రిక ముందుంది అన్నారు.  ప్రజలకు ప్రశ్నించే తత్వాన్ని బోధించిన వామపక్ష ఉద్యమ భావజాలాన్ని.. ప్రజల్లోకి తీసుకుపోవడంలో ప్రజాశక్తి ఎనలేని కృషిచేస్తోందన్నారు మంత్రి కాల్వ శ్రీనివాసులు. 
ప్రజలకు విజ్ఞానం పంచడంలో పత్రికలకు ప్రముఖ ప్రాధాన్యత: బివి.రాఘవులు 
ప్రజలకు విజ్ఞానం పంచడంలో పత్రికలకు ప్రముఖ ప్రాధాన్యత ఉందన్నారు సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు. గుంటూరుజిల్లా తాడేపల్లిలో ప్రజాశక్తి దినపత్రిక ఏపీ రాష్ట్ర కార్యాలయం శంకుస్థాపనలో ఆయన పాల్గొన్నారు. పాలకులకు తన బాధ్యతను పత్రికలు నిరంతరం గుర్తుచేయాలన్నారు రాఘవులు. 
జాతీయ ఉద్యమంలో ప్రజాశక్తి, వామపక్ష భావజాలం గొప్పపాత్ర : పి.మధు 
జాతియ ఉద్యమంలో ప్రజాశక్తి, వామపక్ష భావజాలం గొప్పపాత్ర  నిర్వహించాయన్నారు సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు. మూఢనమ్మకాలను ఎదిరించడంలో ప్రజాశక్తి నిరంతరం కృషిచేస్తోందన్నారు. గుంటూరుజిల్లా తాడేపల్లిలో ప్రజాశక్తి ఏపీ రాష్ట్ర కార్యాలయం శంకుస్థాపనలో మధు పాల్గొని ప్రసంగించారు. 
పత్రిక చదవడం ద్వారా చైతన్యం పెంపు : రాఘవాచారి 
పత్రిక చదవడం ద్వారా చైతన్యం పెరుగుతుందన్నారు విశాలంధ్ర మాజీ సంపాదకులు  రాఘవాచారి. గుంటూరుజిల్లా తాడేపల్లిలో ప్రజాశక్తిదినపత్రిక ఏపీ రాష్ట్ర కార్యాలయం శంకుస్థాపనలో ఆయన పాల్గొన్నారు.   సమాజంలో ప్రత్యామ్నాయ సంస్కృతిని  నిర్మించడంలో ప్రజాశక్తి పత్రిక ఎనలేని కృషిచేసిందన్నారు.  

 

14:04 - January 9, 2018

ఢిల్లీ : సినిమా థియేటర్లలో జాతీయ గీతంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. థియేటర్లలో జాతీయ గీతాలాపన తప్పనిసరి కాదని కోర్టు తీర్పు ఇచ్చింది. గతంలో తప్పనిసరి అని ఇచ్చిన తీర్పును సుప్రీం సవరించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

14:01 - January 9, 2018

రంగారెడ్డి : జిల్లాలోని శంషాబాద్ మండలం బూర్జుగడ్డ పివన్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం జరిగింది. కారు బోల్తా కొట్టిన ఘటనలో హెచ్‌సీయూ విద్యార్ధిని మృతి చెందింది. నితిన్, నికిత అనే మరో ఇద్దరు విద్యార్ధులు గాయాలతో బయటపడ్డారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అనన్య ఢిల్లీలో డిగ్రీ పూర్తి చేసింది. సెంట్రల్ యూనివర్సిటీలో  పీజీ మొదటి సంవత్సరం చదువుతోంది. విద్యార్ధులంతా శంషాబాద్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

 

13:58 - January 9, 2018

ఢిల్లీ : కేంద్ర హోంశాఖ అధికారులతో గవర్నర్‌ నరసింహన్‌ భేటీ అయ్యారు. ఈ భేటీకి ప్రాధానత్య ఏమీ లేదన్నారు. ఏపీలో బీజేపీ, తెలంగాణలో కాంగ్రెస్‌నేతల తనపై చేస్తున్న విమర్శలను గవర్నర్‌ కొట్టిపారేశారు. కుటుంబంలో అపార్థాలు తలెత్తినప్పుడు సర్దుకుపోయినట్టే.. విపక్షనేతల విమర్శలు కూడా తీసుకోవాలన్నారు. పిల్లలు, పెద్దలకు మధ్య కోపతాపాలు సహజమే అని గవర్నర్‌ అన్నారు. కేంద్ర హోంశాఖతో భేటీ అడ్మినిష్ట్రేషన్‌లో భాగమే,  ప్రాధాన్యత ఏమీ లేదన్నారు. 

13:56 - January 9, 2018

హైదరాబాద్ : అజ్ఞాతవాసి ప్రీమియర్‌ షోలకు తెలంగాణ పోలీసులు నో చెప్పారు. తొక్కిసలాటలు జరిగే అవకాశం ఉన్నందున ప్రీమియర్‌ షోలకు అనుమతి లేదని అంటున్నారు. అర్ధరాత్రి తరువాత ప్రీమియర్‌ షోలకు తెలంగాణ పోలీసులు
నిరాకరించారు.

13:53 - January 9, 2018

గుంటూరు : ప్రజాశక్తికి ప్రజలు అమోఘమైన మద్దతు ఇచ్చారని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. తాడేపల్లిలో ప్రజాశక్తి పత్రిక ఏపీ రాష్ట్ర కార్యాలయం శంకుస్థాపన అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్ర విజభన సమయంలో, ఏపీ ఏర్పడిన తర్వాత ప్రజాశక్తి పత్రికకు చాలా ఒడిదుడులు, ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపారు. ప్రజాశక్తి పత్రికకు ప్రజలు గొప్ప మద్దతు ఇచ్చారని పేర్కొన్నారు. పత్రిక సిబ్బంది మూల స్థంబాలుగా నిలబడ్డారని కొనియాడారు. రాష్ట్ర కేంద్ర కార్యాలయం లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొందన్నారు. పత్రిక మరో అడుగు ముందుకు వేయాలని కోరుకున్నారు. వీలైనంత తొందరగా యాజమాన్యం భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నారు. 1942 నుంచి ప్రజాశక్తి అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని, నిలబడిందని తెలిపారు.

 

13:49 - January 9, 2018

గుంటూరు : ప్రజాశక్తి సామాజిక బాధ్యత కల్గిన పత్రికని ఏపీ మంత్రి కాల్వ శ్రీనివాసులు కొనియాడారు. తాడేపల్లిలో ప్రజాశక్తి పత్రిక ఏపీ రాష్ట్ర కార్యాలయానికి మంత్రి కాల్వ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్రికలు సామాజిక బాధ్యతతో ఉండాలన్నారు. ప్రజాశక్తికి సామాజిక బాధ్యత ఉంటుందని తెలిపారు. మిగతా పత్రికలకు ఆ బాధ్యత ఉండదన్నారు. సామాజిక బాధ్యత కల్గిన పత్రికలనే ప్రజలు స్వాగతించే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రజాశక్తి ఏ ఉద్ధేశాల కోసం ఆరంభం అయిందో.. అందుకోసం పని చేయాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పని చేయాలని సూచించారు. ప్రశ్నించే మనుషులుంటే ప్రభుత్వానికి జవాబుదారీతనం ఉంటుందన్నారు. పత్రికలు ఏక పక్షంగా ఉండకూడదని తెలిపారు. ప్రభుత్వ పక్షం, పార్టీ పక్షం ఉండకుండా..ప్రజాపక్షం ఉండాలన్నారు. తాను కూడా పాత్రికేయ వృత్తి నుంచి వచ్చానని తెలిపారు. గతంలో వామపక్ష ఉద్యమంలో కొంత కాలం ఉన్నానని గుర్తు చేశారు. పత్రిక యాజమాన్యానికి తన వంత సహాయ సహకారాలు అందచేస్తానని అన్నారు. 

 

13:41 - January 9, 2018

గుంటూరు : స్వేచ్ఛ ఉన్నప్పుడే పత్రిక మనుగడ సాధ్యమని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు అన్నారు. తాడేపల్లిలో ప్రజాశక్తి పత్రిక ఏపీ రాష్ట్ర కార్యాలయానికి ఏపీ మంత్రి కాల్వ శ్రీనివాసులు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో బివి.రాఘవులుతోపాటు ప్రజాశక్తి సంపాదకులు పాటూరి రామయ్య, సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ పత్రికలు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని పేర్కొన్నారు. మాతృభాష అభివృద్ధి చెందితేనే ఏ జాతి అయినా అభివృద్ధి చెందుతుందన్నారు. పత్రికల్లో వచ్చే విజ్ఞానం అందిపుచ్చుకోవాలంటే మాతృ భాష వచ్చి ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. పత్రికలు ప్రజలకనుకూలంగా ఉండాలని.. ప్రజలకు ఉపయోగపడే వార్తలు రాయాలని సూచించారు. ఆంక్షలతో స్వేచ్ఛకు భంగం కలిగించాలనుకున్నప్పుడు...ప్రతిఘటించాల్సిన అవసరం ఉందన్నారు. 

 

13:23 - January 9, 2018

తూర్పు గోదావరి : అశ్వం... వేగానికి మారుపేరు... అశ్వం... అందానికీ... రాజసానికీ రారాజు...  అలాంటి మేలురకపు గుర్రాలు దౌడు తీస్తుంటే... చూడ్డానికి రెండు కళ్ళూ చాలవు... ఇప్పటివరకూ ధనికులకు మాత్రమే పరిమితమైన హార్స్‌ రైడింగ్‌... ఇప్పుడు సామాన్యులకు చేరువవుతున్నాయి... తూర్పు గోదావరి జిల్లా పల్లెసీమల్లో పరుగులకు సిద్ధమవుతున్న గుర్రప్పందాలపై టెన్‌టీవీ ప్రత్యేక కథనం.

హార్స్‌ రైడింగ్‌.. ఒకప్పుడు విదేశాల్లోనూ... మన దేశంలో ధనికులకు మాత్రమే పరిమితం. కానీ...  ఇప్పుడు సామాన్యుల ముంగిట కనువిందుచేయనుంది.  తూర్పుగోదావరి జిల్లా తుని, టీ తిమ్మాపురంలో  గుర్రాల పోటీలకు సర్వం సిద్ధమైంది. ఈ పోటీల్లో గుర్రాలు దౌడు తీయనున్నాయి. ఈ అశ్వాలు కేవలం పరుగులోనే కాదు... అందంలోనూ పోటీకి సై అంటున్నాయి. అందుకోసం మేలు రకపు జాతుల గుర్రాలు పలు ప్రాంతాలనుంచి తిమ్మాపురానికి చేరుకున్నాయి. 

సంక్రాంతికి ముందే తిమ్మాపురంలో సందడి నెలకొంది. ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడికి చెందిన యనమల ఫౌండేషన్‌, వైఆర్కే స్పోర్ట్స్‌ అండ్‌ కల్చరల్‌ వారి ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. సాధారణంగా హార్స్‌ రైడింగ్‌ అంటే...కొన్ని గుర్రాలు పరుగు తీస్తే... వాటిపై పందాలు కాస్తారు. కానీ..  ఇక్కడ జరిగేది జూదం కాదు... కేవలం వినోద ప్రధానమైన పోటీలు.
గుర్రాలకు పరుగులతో పాటు... అందాల పోటీలు కూడా నిర్వహించనున్నారు. మార్వాడి, కాట్వాడి జాతుల గుర్రాలు ఈ పోటీల్లో నిలవనున్నాయి. సుమారు 80 గుర్రాలు పరుగుకు సిద్ధపడుతున్నాయి.. 40 ఎకరాల విశాల ప్రాంగణంలో... చుట్టూ ట్రాక్‌ నిర్మించారు.  అందుకు తగ్గట్టుగానే 25 ఎకరాల స్థలంలో పార్కింగ్‌ ఏర్పాటు చేశారు. 

 పరుగులోనూ, అందంలోనూ గెలుపొందిన  వాటికి ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులను ఇస్తారు. మూడు మగ, మూడు ఆడ, మూడు పిల్ల గుర్రాలకు బహుమతులు ప్రదానం చేయనున్నారు. ఈ పోటీలకు  ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పతోపాటు.. పలువురు రాజకీయనాయకులు, ప్రముఖులు  హాజరుకానున్నారు. 

ఎన్నడూ లేనివిధంగా... సామాన్య ప్రజల మధ్యన జరుగుతున్న ఈ గుర్రం పందాలపై ప్రజలు అమితాసక్తి చూపిస్తున్నారు.. మరోవైపు కోడిపందాలపై కోర్టు ఆంక్షలు ఉండడంతో... గుర్రప్పందాలకు భారీ సంఖ్యలో జనం వస్తారని నిర్వాహకులు భావిస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో ఏఎస్పై మృతి

నల్గగొండ : మిర్యాలగూడ సమీపంలోని ఏడుకోట్ల తండా వద్ద ఆగివున్న లారీని బైకు ఢీకొట్టింది. వేములపల్లి ఏఎస్పై మస్తాన్ వలి మృతి చెందారు. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా అర్ధరాత్రి ఘటన చోటుచేసుకుంది.

 

13:01 - January 9, 2018

ఢిల్లీ : తెలుగు రాష్ట్రాలను ఊరిస్తున్న నియోజకవర్గాల పునర్విభజన వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. గతంలో తెలుగు రాష్ట్రాల నేతలు పలుమార్లు మొరపెట్టుకున్నా కేంద్రం తన వైఖరిని స్పష్టం చేయలేదు. గుజారత్‌ ఎన్నికల్లో బీజేపీకి అనుకున్నన్ని మోజార్టీ సీట్లు రాకపోవడంతో.. ప్రాంతీయ పార్టీలను చేరదీసుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో నియోజకవర్గాల పెంపుపై స్పష్టత ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
కీలకంగా మారిన పునర్విభజన వ్యవహారం
రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో నియోజకవర్గాల పునర్విభజన కీలక వ్యవహారంగా మారింది. పునర్విభజన చట్ట ప్రకారం రెండు రాష్ట్రాల శాసనసభా స్థానాలను పెంచాలన్న వాదన తెరపైకి వచ్చింది. సాంకేతికంగా ఇందుకు సంబంధించి సమస్యలు ఏర్పడడంతో చట్ట సవరణ తప్పదన్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దాదాపు మూడేళ్లుగా ఇరు రాష్ట్రాలు  కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నా.. కేంద్రం పెద్దగా స్పందించ లేదు. గతంలో కేంద్రం పునర్విభజన సాధ్యం కాదని పరోక్షంగా సంకేతాలను ఇచ్చింది.
విభజన చట్టం హామీలను తెరపైకి తెస్తున్న ఎంపీలు
విభజన చట్టంలోని హామీలను తెరపైకి తెస్తున్న ఇరు రాష్ట్రాల ఎంపీలు.. ఇటీవల జరిగిన పార్లమెంట్‌ సమావేశాల్లో కూడా కేంద్రంపై ఒత్తిడి పెంచారు. దీంతో నియోజకవర్గాల పునర్విభజన వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన అసెంబ్లీ స్థానాలను కూడా పెంచాలన్న ప్రతిపాదనలు ఉన్నాయంటూ ప్రచారం సాగుతోంది. దీంతో తెలుగు రాష్ట్రాలు నియోజకవర్గాల పెంపుపై స్పష్టత నివ్వాలని కేంద్రంపై గులాబీ నేతలతో పాటు టీడీపీ నేతలు కూడా తమ వాదనను బలంగా వినిపించారు. రాజకీయ కారణాలతోనే నియోజకవర్గాల పెంపుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించడం లేదన్న  ప్రచారం కొనసాగుతోంది. 
గుజరాత్‌ ఎన్నికల్లో దక్కని స్పష్టమైన మెజార్టీ
ఇటీవల జరిగిన గుజరాత్‌ ఎన్నికల్లో కూడా బీజేపీ ఆశించిన స్థాయిలో శాసనసభా స్థానాలు దక్కించుకోకపోవడంతో ప్రాంతీయ పార్టీలకు చేరువయ్యే యత్నాలను కూడా చేస్తోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి కరంగా మారిన నియోజకవర్గాల పునర్విభజన వ్యవహారంపై బీజేపీ.. జనవరి 3వ వారం నాటికి స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని అధికార పార్టీ నేతలు అంటున్నారు. బీజేపీ రాజకీయంగా నిర్ణయం తీసుకుంటే ఈ నెలాఖరున మొదలయ్యే బడ్జెట్‌ సమావేశాల్లోనే పునర్విభజనపై పార్లమెంట్‌లో సవరణలకు ఆమోదం దక్కే అవకాశం ఉందన్న ధీమాను  గులాబీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.

 

12:56 - January 9, 2018

నిజామాబాద్‌ : జిల్లాలో పెత్తందారుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. మెండోర మండలం, బుస్సాపూర్‌గ్రామంలో సర్పంచ్‌ కుటుంబాన్ని సాంఘిక బహిష్కరణ చేశారు. సర్పంచ్‌ జుక్కల మమత, ఆమె కుటుంబ సభ్యులకు  పాలు,నీళ్లు ఇవ్వొద్దని పెత్తందారుల హుకుం జారీచేశారు. తమ భూమిని గ్రామానికి ఇవ్వాలని అగ్రకుల పెద్దలు ఒత్తిడి చేస్తున్నారని సర్పంచ్‌ జుక్కల మమత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెత్తందారుల ఆగడాల నుంచి తమను కాపాడాలని కలెక్టర్‌కు సర్పంచ్‌ దంపతులు ఫిర్యాదు చేశారు. 

 

12:53 - January 9, 2018

కర్నూలు : జిల్లాలోని తుగ్గలి మండలం చెన్నంపల్లి కోటకు ముప్పు వాటిల్లుతోందని పురావస్తు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 28రోజులుగా తవ్వకాలు సాగుతున్నా గుప్తనిధుల ఆనవాళ్లు కూడా లభించలేదు. అయినా కోటమొత్తాన్ని అధికారులు జల్లెడ పడుతున్నారు. మొదటి పదిరోజుల తవ్వకాల్లో ఎముకలు మాత్రమే బయడగా రెండో విడతలో కోట బురుజును తవ్విపోశారు. అయినా ఎలాంటి నిధులు కనిపించలేదు. కాగా ఇవాళ్టి నుంచి మూడో విడత తవ్వకాలు మొదలు పెట్టారు. పాతాళగంగలో వాటర్‌ప్రూఫ్‌ కెమెరాలతో నిధి అన్వేషణ కొనసాగుతోంది. అయితే ప్రణాళికలేని తవ్వకాలతో  చెన్నంపల్లి కోట రూపు రేఖలు కోల్పోతోందని స్థానికులు అంటున్నారు.  

 

గవర్నర్ నరసింహన్ ఢిల్లీ టూర్

ఢిల్లీ : కేంద్ర హోం శాఖ అధికారులతో తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ భేటీ అయ్యారు. ఈరోజు సాయంత్రం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో పాటు, ప్రధాని మోడీని నరసింహన్ కలవనున్నారు. విశిష్టభారత్‌ 2022 లో భాగంగా కేంద్ర హోం శాఖ వేసిన సబ్‌ కమిటీకి నరసింహన్ చైర్మన్‌గా ఉన్న నేపథ్యంలో సంస్కరణలపై వేసిన కమిటీ రిపోర్టును ఈరోజు గవర్నర్ నరసింహన్ రాష్ట్రపతికి అందజేయనున్నారు. గతంలో 5 రాష్ట్రాల గవర్నర్లతో విశిష్ట భారత్‌ 2022ఏర్పాటైంది. కేంద్ర హోం శాఖ వేసిన సబ్‌ కమిటీకి నరసింహన్ చైర్మన్‌గా ఉన్నారు. సంస్కరణలపై వేసిన కమిటీ రిపోర్టును నరసింహన్ రాష్ర్టపతికి అందజేయనున్నారు. 

12:46 - January 9, 2018

ఢిల్లీ : కేంద్ర హోం శాఖ అధికారులతో తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ భేటీ అయ్యారు. ఈరోజు సాయంత్రం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో పాటు, ప్రధాని మోడీని నరసింహన్ కలవనున్నారు. విశిష్టభారత్‌ 2022 లో భాగంగా కేంద్ర హోం శాఖ వేసిన సబ్‌ కమిటీకి నరసింహన్ చైర్మన్‌గా ఉన్న నేపథ్యంలో సంస్కరణలపై వేసిన కమిటీ రిపోర్టును ఈరోజు గవర్నర్ నరసింహన్ రాష్ట్రపతికి అందజేయనున్నారు. గతంలో 5 రాష్ట్రాల గవర్నర్లతో విశిష్ట భారత్‌ 2022ఏర్పాటైంది. కేంద్ర హోం శాఖ వేసిన సబ్‌ కమిటీకి నరసింహన్ చైర్మన్‌గా ఉన్నారు. సంస్కరణలపై వేసిన కమిటీ రిపోర్టును నరసింహన్ రాష్ర్టపతికి అందజేయనున్నారు. 

 

ఢిల్లీలో దట్టంగా పొగమంచు

ఢిల్లీ : హస్తినలో దట్టంగా పొగమంచు కమ్ముకుంది. పొగమంచు కారణంగా విమాన, రైలు సర్వీసుల రాకపోకలకు అంతరాయం కల్గింది. 45 రైళ్లు ఆలస్యంగా నడవనున్నాయి. 22 రైళ్లు రద్దు అయ్యాయి. 4 రైళ్ల వేళల్లో మార్పు చేశారు. 

 

తాడేపల్లిలో ప్రజాశక్తి పత్రిక ఏపీ రాష్ట్ర కార్యాలయానికి శంకుస్థాపన

గుంటూరు : తాడేపల్లిలో ప్రజాశక్తి పత్రిక ఏపీ రాష్ట్ర కార్యాలయానికి ఏపీ మంత్రి కాల్వ శ్రీనివాసులు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాశక్తి సంపాదకులు పాటూరి రామయ్య, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు, సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు పాల్గొన్నారు. 

ఈరోజు ఢిల్లీ పార్లమెంటు వద్ద యువ హుంకార్ ర్యాలీ

ఢిల్లీ  : ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ ప్రార్లమెంటు వద్ద యువ హుంకార్ ర్యాలీ జరగనుంది. గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ, అఖిల్ గొగోయ్, కన్హయ్య కుమార్లతో పాటు దళిత, విద్యార్ధి, రైతు, మహిళా సంఘాల నేతలు ఈ ర్యాలీలో పాల్గొంటారు. పీఎంవో కు వెళ్లి ప్రధాని ముందు మనుస్మృతి, రాజ్యాంగం రెండు పుస్తకాలు ఉంచుతానని ఆయన ఏది ఎంచుకుంటారో తేల్చుకోవాలని గత వారం జిగ్నేష్ మేవానీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో జిగ్నేష్ ర్యాలీకి సిద్ధమవుతున్నారు. మరోవైపు ఢిల్లీ పోలీసులు ర్యాలీకి అనుమతి లేదంటున్నారు. యువర్యాలీ నేపథ్యంలో సెంట్రల్ ఢిల్లీలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

 

11:59 - January 9, 2018

సంగారెడ్డి : జిల్లాలోని పటాన్‌చెరు మండలం చిటుకుల్ వడ్డెరకాలనీలో పోలీసులు 150 మంది పోలీసులతో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 50 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు సరైన వాహన పత్రాలు లేని కారణంగా 40 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పటాన్‌చెరు పోలీస్ సబ్‌ డివిజన్ అధికారి సీతారాం ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి కార్డన్ సెర్చ్‌లో పాల్గొన్నారు. 

 

11:58 - January 9, 2018

ఢిల్లీ : ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ ప్రార్లమెంటు వద్ద యువ హుంకార్ ర్యాలీ జరగనుంది. గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ, అఖిల్ గొగోయ్, కన్హయ్య కుమార్లతో పాటు దళిత, విద్యార్ధి, రైతు, మహిళా సంఘాల నేతలు ఈ ర్యాలీలో పాల్గొంటారు. పీఎంవో కు వెళ్లి ప్రధాని ముందు మనుస్మృతి, రాజ్యాంగం రెండు పుస్తకాలు ఉంచుతానని ఆయన ఏది ఎంచుకుంటారో తేల్చుకోవాలని గత వారం జిగ్నేష్ మేవానీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో జిగ్నేష్ ర్యాలీకి సిద్ధమవుతున్నారు. మరోవైపు ఢిల్లీ పోలీసులు ర్యాలీకి అనుమతి లేదంటున్నారు. యువర్యాలీ నేపథ్యంలో సెంట్రల్ ఢిల్లీలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

11:57 - January 9, 2018

హైదరాబాద్ : భర్త చేతిలో మోసపోయిన సంగీత 52 రోజులుగా అత్తింటి ముందు ఆందోళన కొనసాగిస్తోంది. అయితే ఇప్పటి వరకూ వారి నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఇవాళ్టి నుంచి నిరాహారదీక్షకు దిగుతున్నట్లు సంగీత ప్రకటించింది. న్యాయం జరిగేవరకూ దీక్ష విరమించేది లేదని సంగీత స్పష్టం చేసింది. సత్వరమే న్యాయం చేయాలన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

జమ్మూకాశ్మీర్ లో ఎదురు కాల్పులు

జమ్మూకాశ్మీర్ : అనంతనాగ్ లో భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. భద్రతా దళాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. 

 

10:39 - January 9, 2018

విజయవాడ : పాత అధికారిపై వేటు ...! కొత్త అధికారి బాధ్యతల స్వీకరణ..! చకచకా జరిగిపోయాయి. అయితే అమ్మవారి సన్నిధిలో తాంత్రిక పూజల మిష్టరీ మాత్రం వీడలేదు. ఆలయ ప్రతిష్టను దెబ్బతీసిన.. క్షుద్ర పూజల కళంకం.. ఎలా తొలగుతుంది? విచారణతోనే ముగిసిపోతుందా? నిజాలు బట్టబయలవుతాయా? దుర్గ గుడి వ్యవహారంపై టెన్‌ టీవీ కథనం. 
ఈవో సూర్యకుమారిపై బదిలీ వేటు
వివాదాలతో దెబ్బతిన్న ఇంద్రకీలాద్రి ఆలయ ప్రతిష్టను తిరిగి పెంచేందుకు అధికారులు సిద్ధమయ్యారు. దీనికోసం దిద్దుబాటు చర్యలకు పూనుకున్నారు. దుర్గగుడిలో.. తాంత్రిక పూజల విషయం గురించి మీడియాలో వచ్చిన కథనాలతో కదిలిన యంత్రాంగం.. విచారణ చేపట్టింది. ప్రత్యేక కమిటీ ఇచ్చిన రిపోర్టును పరిశీలించిన అనంతరం... ఈవో సూర్యకుమారిని బదిలీ చేశారు. కొత్తగా ఇన్‌చార్జ్‌ ఈవోగా అనురాధను నియమించారు. 
తాంత్రిక పూజలపై సస్పెన్స్‌
అయితే డిసెంబర్‌ 26వతేదీ రాత్రి ఇంద్రకీలాద్రిపై తాంత్రిక పూజలు జరిగాయా?  లేదా? అన్నది సస్పెన్స్‌గానే  కొనసాగుతోంది. నిజంగా తాంత్రిక పూజలు జరిగాయా? ముగ్గురు  అఘ్నాత వ్యక్తులు లోపల ఏం చేశారు? అనే ప్రశ్నలకు.. సమాధానాలు మాత్రం దొరకలేదు. ఈ మేరకు కొత్త ఈవోగా బాధ్యతలు స్వీకరించిన అనురాధ వీటిపై ప్రధానంగా దృష్టిసారించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై ఆమె అంతర్గత విచారణ ప్రారంభించినట్టు సమాచారం. అదే విధంగా పాత ఈవో సూర్యకుమారి పాలనలో జరిగిన అభివృద్ధి, ఆమెపై వచ్చిన అవినీతి ఆరోపణలపై కూడా విచారణ కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. 
పాత ఈవోపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం?
ఈవో బాధ్యతారాహిత్యం వల్లే .. బయట వ్యక్తులు.. గర్భగుడిలోకి ప్రవేశించారనే కారణంతో పాత ఈవో సూర్యకుమారిపై వేటు వేయడం జరిగింది. కానీ ఇదివరకే ఆమె తీసుకున్న పలు వివాదాస్పద నిర్ణయాలతో చర్యలు తీసుకోవడానికి.. రంగం సిద్ధం చేశారు.  ఆలయంలో ఆమె వివాదాస్పద నిర్ణయాలపై అనేక విషయాలను టెన్‌ టీవీ గతంలో వెలుగులోకి తేవడం జరిగింది. ముఖ్యంగా.. ఆమె ఒంటెద్దు పోకడ వ్యవహరం, భక్తులపై ధరల భారం,  భక్తుల మనో భావాలను దెబ్బతీసే నిర్ణయాలు తీసుకోవడం... ఆలయ ప్రతిష్టపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. దీంతో అసంతృప్తికి గురైన.. ఉద్యోగులు, సిబ్బంది  ఈవో సూర్యకుమారి వైఖరిపై గుర్రుగా ఉన్నారు. ఆమె ప్రవర్తనపై ఇప్పటికే సీఎం పేషీకి కూడా  కీలక రిపోర్ట్‌ను అందజేశారు. ఇంతలో ఈ తాంత్రిక పూజల ఆరోపణలు రావడం.. ఆమెను తప్పించడం జరిగిపోయింది.
నిజ నిర్ధారణ కమిటీ విచారణ
అయితే అధికారిని తప్పించారు.. కానీ.. అసలు విషయం మాత్రం ఇంకా బయటకు రాలేదు. అర్ధరాత్రి సమయంలో గర్భగుడిలోకి ముగ్గురు వ్యక్తులు ప్రవేశించడంపై పోలీసుల విచారణ, నిజ నిర్ధారణ కమిటీ విచారణ కొనసాగుతూనే ఉంది. దీనిపై లోతుగా విచారిస్తున్నామని.. పోలీసుల చెబుతున్నారు. మరోవైపు ఆలయ శుద్ధి కోసమే.. ఆ సమయంలో అక్కడ ఉన్నామని.. ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న.. ఆలయ ప్రధాన అర్చకుడు బద్రినాథ్‌ చెబుతున్నారు. ఈ క్రమంలో నిజాయితీ గల అధికారిగా పేరొందిన కొత్త ఇన్‌చార్జ్‌ ఈవో అనురాధ ఈ సవాల్‌ను ఎలా ఎదుర్కొంటారనే ఆసక్తి  సర్వత్రా నెలకొంది. 

 

సర్పంచ్‌ కుటుంబం సాంఘిక బహిష్కరణ

నిజామాబాద్‌ : జిల్లాలో పెత్తందారుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. మెండోర మండలం, బుస్సాపూర్‌గ్రామంలో సర్పంచ్‌ కుటుంబాన్ని సాంఘిక బహిష్కరణ చేశారు. సర్పంచ్‌ జుక్కల మమత, ఆమె కుటుంబ సభ్యులకు పాలు, నీళ్లు ఇవ్వొద్దని పెత్తందారుల హుకుం జారీచేశారు. తమ భూమిని గ్రామానికి ఇవ్వాలని అగ్రకుల పెద్దలు ఒత్తిడి చేస్తున్నారని సర్పంచ్‌ జుక్కల మమత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెత్తందారుల ఆగడాల నుంచి తమను కాపాడాలని కలెక్టర్‌కు సర్పంచ్‌ దంపతులు ఫిర్యాదు చేశారు. 

10:32 - January 9, 2018

నిజామాబాద్‌ : జిల్లాలో పెత్తందారుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. మెండోర మండలం, బుస్సాపూర్‌గ్రామంలో సర్పంచ్‌ కుటుంబాన్ని సాంఘిక బహిష్కరణ చేశారు. సర్పంచ్‌ జుక్కల మమత, ఆమె కుటుంబ సభ్యులకు పాలు, నీళ్లు ఇవ్వొద్దని పెత్తందారుల హుకుం జారీచేశారు. తమ భూమిని గ్రామానికి ఇవ్వాలని అగ్రకుల పెద్దలు ఒత్తిడి చేస్తున్నారని సర్పంచ్‌ జుక్కల మమత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెత్తందారుల ఆగడాల నుంచి తమను కాపాడాలని కలెక్టర్‌కు సర్పంచ్‌ దంపతులు ఫిర్యాదు చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.... 

 

10:26 - January 9, 2018

హైదరాబాద్ : డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో పట్టుబడిన యాంకర్‌ ప్రదీప్‌ ఎట్టకేలకు పోలీసుల ముందు హాజరయ్యారు. గోషామహల్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్టిట్యూట్‌లో కౌన్సిలింగ్‌కు హాజరయ్యారు. డిసెంబర్ 31 రాత్రి తాగి వాహనం నడుపుతూ ట్రాఫిక్‌ పోలీసులకు దొరికిన ప్రదీప్‌ తన తండ్రితో కలిసి కౌన్సిలింగ్‌ తీసుకున్నారు. ప్రదీప్‌ను పోలీసులు ఇవాళ నాంపల్లి కోర్టులో హాజరు పరచనున్నారు. 

నూతన సంవత్సర వేడుకల్లో మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డ యాంకర్ ప్రదీప్... ట్రాఫిక్ పోలీసుల ముందుకు వచ్చారు. షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్ల వారం రోజుల తర్వాత ప్రదీప్‌ ఈ కౌన్సిలింగ్‌కు హాజరయ్యారు. డిసెంబర్ 31 రాత్రి బ్రీతింగ్‌ ఎనాలసిస్‌లో 178 పాయింట్లు నమోదు కావడంతో పోలీసులు ప్రదీప్‌ వాహనాన్ని సీజ్‌ చేసి కౌన్సిలింగ్‌కు హాజరుకావాలని చెప్పారు. 

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో పట్టుబడడం తప్పేనని ఒప్పుకున్నారు ప్రదీప్‌. ఇంకెప్పుడూ అలాంటి తప్పు చేయనన్నారు. అనుకోకుండా ఆరోజు అలా జరిగిందన్నారు. తనలాంటి తప్పు మరొకరు చేయకూడదన్నారు. కౌన్సిలింగ్‌లో పాల్గొన్న ప్రదీప్‌ ఇకనుంచి నిబంధనల ప్రకారం నడుచుకుంటానని చెప్పారు. 

ఒకరికి చెప్పాల్సిన స్థానంలో ఉన్న ప్రదీప్ .. తానే ఇలా మద్యం సేవించి వాహనం నడపడంతో ప్రదీప్ కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. మంగళవారం కోర్టులో ప్రవేశ పెట్టిన తర్వాత న్యాయమూర్తి తీర్పును బట్టి ఎలాంటి శిక్ష పడుతుందన్నది న్యాయమూర్తిపై ఆధారపడి ఉందంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. దీంతో ప్రదీప్ మంగళవారం నాంపల్లి కోర్టుకు హాజరుకానున్నారు. న్యాయస్థానం ఎన్ని రోజుల శిక్ష విధిస్తుందో కూడా తేలుతుంది. 

కొనసాగుతున్న సంగీత న్యాయపోరాటం

హైదరాబాద్ : భర్త చేతిలో మోసపోయిన సంగీత 52 రోజులుగా అత్తింటి ముందు ఆందోళన కొనసాగిస్తోంది. అయితే ఇప్పటి వరకూ వారి నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఇవాళ్టి నుంచి నిరాహారదీక్షకు దిగుతున్నట్లు సంగీత ప్రకటించింది. న్యాయం జరిగేవరకూ దీక్ష విరమించేది లేదని సంగీత స్పష్టం చేసింది. 

10:23 - January 9, 2018

హైదరాబాద్ : భర్త చేతిలో మోసపోయిన సంగీత 52 రోజులుగా అత్తింటి ముందు ఆందోళన కొనసాగిస్తోంది. అయితే ఇప్పటి వరకూ వారి నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఇవాళ్టి నుంచి నిరాహారదీక్షకు దిగుతున్నట్లు సంగీత ప్రకటించింది. న్యాయం జరిగేవరకూ దీక్ష విరమించేది లేదని సంగీత స్పష్టం చేసింది. 
మహిళ సంఘాలు..
'ప్రభుత్వం సంగీత ఫ్యామిలీ సమస్య అంటుంది. జీవిత సమస్యని సంగీత అంటున్నారు. సంగీత న్యాయపోరాటానికి మహిళ సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఆమెకు రావాల్సిన హక్కులు రావాలన్నారు. ప్రభుత్వం ఆమెకు న్యాయం చేయాలని' కోరుతున్నారు. 
సంగీత...
'నా అత్తింటి వారి నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇప్పటివరకు నాకు ఎలాంటి న్యాయం జరగలేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి న్యాయం, హామీ రాలేదు. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తా. అవసరమైతే ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధమేనని' తెలిపారు. 

 

10:18 - January 9, 2018

హైదరాబాద్ : సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని భరత్‌నగర్ రైల్వేస్టేషన్‌ సమీపంలో రైలు ఢీకొని శ్రీలత అనే మహిళ మృతి చెందింది. ఈ ఘటనలో ఆమె కుమారుడు క్షేమంగా బయటపడ్డాడు. పోలీసులు ఆత్మహత్యగా భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

10:01 - January 9, 2018

తూర్పుగోదావరి : జిల్లాలోని పెద్దాపురం టీడీపీ వాట్సాప్‌ గ్రూపులో అసభ్య వీడియోలు కలకలం సృష్టిస్తున్నాయి. మున్సిపల్‌ వైస్ చైర్మన్ ఈ ఫోటోలు, వీడియోలు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. స్థానికంగా ఈ వీడియోలకు సంబంధించి పెద్ద దుమారం చెలరేగింది. వాట్సాప్‌లో ఫొటోలు, వీడియోలపై టీడీపీ శ్రేణుల్లో కలకలం రేగింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.... 

 

తూర్పుగోదావరి జిల్లా టీడీపీ నేతల అసభ్య బాగోతం

తూర్పుగోదావరి : జిల్లాలోని పెద్దాపురం టీడీపీ వాట్సాప్‌ గ్రూపులో అసభ్య వీడియోలు కలకలం సృష్టిస్తున్నాయి. వైస్ చైర్మన్ ఈ ఫోటోలు, వీడియోలు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. స్థానికంగా ఈ వీడియోలకు సంబంధించి పెద్ద దుమారం చెలరేగింది. 

 

రైలు కిందపడి మహిళ మృతి

హైదరాబాద్ : సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని భరత్‌నగర్ రైల్వేస్టేషన్‌ సమీపంలో రైలు ఢీకొని శ్రీలత అనే మహిళ మృతి చెందింది. ఈ ఘటనలో ఆమె కుమారుడు క్షేమంగా బయటపడ్డాడు. పోలీసులు ఆత్మహత్యగా భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

09:55 - January 9, 2018

ప్రకాశం : జిల్లాలోని కనిగిరిలో సీపీఎం 12వ జిల్లా మహాసభలు సోమవారం ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాల్లో జాతీయస్థాయి నాయకులతోపాటు రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు, సీపీఎం కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై నేతలు మండిపడ్డారు. కార్పొరేట్‌ సంస్థల కొమ్ముగాస్తున్న మోదీ ప్రభుత్వం సామాన్యులపై పన్నుల భారం మోపుతోందని విమర్శించారు. ఇక ఏపీ చంద్రబాబు ప్రభుత్వం ఏ కొత్త పథకం ప్రారంభించినా అది టీడీపీ కార్యకర్తల జేబులు నింపడానికేనని సీపీఎం నేతలు విమర్శించారు. 

 

09:54 - January 9, 2018

హైదరాబాద్ : సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని భరత్‌నగర్ రైల్వేస్టేషన్‌ సమీపంలో రైలు ఢీకొని శ్రీలత అనే మహిళ మృతి చెందింది. ఈ ఘటనలో ఆమె కుమారుడు క్షేమంగా బయటపడ్డాడు. పోలీసులు ఆత్మహత్యగా భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

08:51 - January 9, 2018

సర్పంచ్ కు పరోక్ష ఎన్నిక నిర్వహించాలనే ఆలోచన ఏ మాత్రం సరికాదని వక్తలు అన్నారు. ఈ ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలన్నారు. ఇవాళ్టి న్యూస్ మార్నింగ్ చర్చ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టీఆర్ ఎస్ నేత, టీఎస్ పీస్ కే చైర్మన్ రాకేష్ పాల్గొని, మాట్లాడారు. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశారని పేర్కొన్నారు. 
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

08:44 - January 9, 2018

జన్మభూమి కమిటీలను రద్దు చేయాలని సీపీఎం ఏపీ రాష్ట్ర నాయకులు బాబురావు అన్నారు. జన్మభూమి కమిటీలు రాజ్యాంగ విరుద్ధమైన, చట్ట విరుద్ధమైన కమిటీలని మండిపడ్డారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ నేతలు అరాచకం సృష్టిస్తున్నారని విమర్శించారు. జన్మభూమి కమిటీలు పెత్తనం చెలయిస్తున్నాయని పేర్కొన్నారు. చిత్తశుద్ధితో జన్మభూమి సభలను నిర్వహించాలన్నారు. 'జన్మభూమి సభలు ప్రజా సమస్యలపై చర్చిస్తున్నాయా? లేక అధికార పార్టీ సభల్లా మారాయా? పింఛన్లు, రేషన్‌కార్డులు, రుణమాఫీ, ఇళ్ల స్థలాలు తదితర సమస్యలపై  చర్చ జరుగుతుందా? అసలు జన్మభూమి సభలో ప్రజా సంఘాలు ఆందోళన ఎందుకు చేస్తున్నాయి? ఇలాంటి తదితర అంశాలపై బాబురావు మాట్లాడారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం... 

 

08:38 - January 9, 2018

దక్షిణాఫ్రికా : టీమ్‌ ఇండియా జైత్రయాత్రకు బ్రేక్‌ పడింది. సఫారీ గడ్డపై భారత్‌కు తొలి పరాభావం ఎదురైంది. కేప్‌టౌన్ టెస్టులో కోహ్లీ సేన ఓటమి పాలైంది.  పిచ్ బౌలర్లకు అనుకూలంగా మారడంతో... బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. రెండో ఇన్నింగ్స్‌లో 208 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక విరాట్‌సేన చతికిలపడింది.72 పరుగుల తేడాతో ఓడి... మూడుటెస్ట్‌ల సిరీస్‌లో సౌతాఫ్రికాకు 1-0 ఆధిక్యాన్ని ఇచ్చింది.
మొదటి టెస్ట్‌లో టీమ్‌ ఇండియా ఓటమి
దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్‌లో జరిగిన మొదటి టెస్ట్‌లో టీమ్‌ ఇండియా ఓటమిపాలైంది. ఒకరోజు ఆట మిగిలి ఉండగానే చేతులెత్తేసింది. 72 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. సఫారీ పేసర్ల ధాటికి భారత బ్యాట్స్‌మెన్లు డ్రెస్సింగ్‌రూమ్‌ బాట పట్టారు.  రెండో ఇన్సింగ్స్‌లోనూ భారత బౌలర్లు అద్భుతంగా రాణించినా... బ్యాట్స్‌మెన్‌ మాత్రం పరుగులు సాధించడంలో చేతులెత్తేశారు. 
భారత్‌కు 208 పరుగుల లక్ష్యం 
మొదటి టెస్ట్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న సౌతాఫ్రికా తొలి ఇన్సింగ్స్‌లో 286 పరుగులు చేసి ఆలౌట్‌ అయ్యింది. టీమ్‌ ఇండియా తొలి ఇన్సింగ్స్‌లో భారత టాప్‌ఆర్డర్‌ ఆటగాళ్లు ఘోరంగా విఫలం కావడంతో 209 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. దీంతో సఫారీలు 77 పరుగుల ఆధిక్యం సాధించారు. రెండో ఇన్సింగ్స్‌లో దక్షిణాఫ్రికా 130 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. భారత్‌కు 208 పరుగుల లక్ష్యాన్ని ముందుంచింది.
భారత ఆటగాళ్లు ఘోర విఫలం 
సఫారీలు తమ ముందుంచిన 208 పరుగుల టార్గెట్‌ను చేరుకోవడంలో భారత ఆటగాళ్లు ఘోరంగా విఫలం అయ్యారు. ఓపెనర్లు ధవన్‌ 16 పరుగులు, విజయ్‌ 13 పరుగులు చేసి పెవిలియన్‌ చేఆరు. ఇక చతేశ్వర్‌ పుజారా  4 పరుగులు మాత్రమే చేసి మోర్కెల్‌ బౌలింగ్‌లో క్యాచ్‌ ఔట్‌ అయ్యాడు.  ఈ నేపథ్యంలో రాణించి జట్టును విజయతీరాలకు చేర్చుతాడనుకున్న  కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ కూడా 28 పరుగులకే అవుట్‌ అయ్యాడు.  రోహిత్‌ 10 రన్స్‌, హార్థిక్‌ ఒక రన్‌ చేసి స్వల్ప స్కోరుకే వెనుదిరిగారు. ఆశ్విన్‌, భువనేశ్వర్‌తో కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. 53 బాల్స్‌ ఆడిన అశ్విన్‌ ఐదు బౌండరీలు బాది 37 పరుగులు చేసి ఔట్‌ అయ్యాడు. అదే ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన షమీ, బుమ్రా వరుస బంతుల్లో పెవిలియన్‌ చేరారు. దీంతో రెండో ఇన్సింగ్స్‌లో భారత జట్టు 135 పరుగులు చేసి ఆలౌట్‌ అయ్యింది. 72 రన్స్‌ తేడాతో ఈ టెస్ట్‌మ్యాచ్‌ను కోల్పోయింది.  దీంతో మూడు టెస్ట్‌ల సిరీస్‌లో సౌతాఫ్రికా 1-0 తేడాతో లీడ్‌లోకి వెళ్లింది. ఫిలాందర్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది.

 

08:33 - January 9, 2018

యానాం : ప్రజలు సంక్రాంతికి ముందే అంతకన్నా పెద్ద పండుగచేసుకున్నారు. ఇక్కడ జరిగిన యానాం ప్రజా ఉత్సవాలను చూసిన ప్రజలు మైమరిచిపోయారు. ఎన్నో ప్రత్యేకతలు, విశేషాలతో నిర్వహించిన ఈ వేడుకలు చూసిన ప్రతి ఒక్కరూ తన్మయత్వానికి లోనయ్యారు. యానాం క్రీడా మైదానంలో జరిగిన ప్రజా ఉత్సవాల్లో 20వేల రకాలతో ఏర్పాటుచేసిన ఫ్లవర్‌ షో విశేషంగా ఆకట్టుకుంది. బెంగుళూరు, పూణే నుంచి తెచ్చిన గులాబీతోపాటు పలురకాల పూలమొక్కలు, కూరగాయలు,  పండ్లను స్టాల్స్‌ లో ప్రదర్శనకు ఉంచారు. అన్నిరకాలనూ ఒకే చోట చూసే అవకాశం దక్కడంతో సందర్శకులు ఆనందానికి అవధులు లేవు.. పూలను పలు ఆకృతుల్లో అందంగా అలంకరించిన తీరు ఆందరినీ కట్టిపడేసింది.
ప్రజా ఉత్సవాలకు పోటెత్తిన సందర్శకులు  
యానాం ప్రజా ఉత్సవాలకు సందర్శకులు పోటెత్తారు. అబ్బురపరచే నృత్యప్రదర్శనలు అందరినీ అలరించాయి. ఘంటసాల పార్వతి రవి చేసిన నృత్య ప్రదర్శన అందర్నీ విశేషంగా ఆకట్టుకుంది. సినీ పరిశ్రమకు చెందిన పలువురు గాయకులు పాటలు పాడి అలరించారు. బాడీబిల్డింగ్‌తో పాటు వివిధ ప్రదర్శనలను ఆహూతులు ఆస్వాదించారు. హైదరాబాద్‌, ముంబై నుంచి వచ్చిన మోడళ్ళు ఫ్యాషన్‌ షోతో ఆకట్టుకున్నారు. 
ఉత్సవాలకు హాజరైన పుదుచ్చేరి సీఎం, లెఫ్టినెంట్ గవర్నర్ 
తొలిరోజు ఉత్సవాలకు పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామి, ముగింపు వేడుకలకు పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ డాక్టర్‌ కిరణ్‌ బేడీ హాజరయ్యారు. యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు,  ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రమణ్యం, రచయిత యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌తోపాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులను సత్కరించారు. తొలి రెండు రోజుల్లో డ్యాన్సులు, ఫ్యాషన్‌ షోతో ఆకట్టుకోగా... మూడో రోజు ఆర్కెస్ర్టాతో అలరించారు. 

 

08:15 - January 9, 2018

హైదరాబాద్‌ : నగరానికి మరో అరుదైన గౌరవం దక్కింది. విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న భాగ్యనగరంలో సౌత్‌ ఇండియా సైన్స్‌ ఫెయిర్‌ ఘనంగా ప్రారంభమైంది. నిన్న ప్రారంభమైన ఈ సైన్స్‌ఫెయిర్‌ ఈనెల 12 వరకు కొనసాగనుంది.  ఇందులో మన రాష్ట్రంతోపాటు మరో 5 రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొంటున్నారు. సైన్స్‌ ఫెయిర్‌ చిన్నారులకు ఎంతగానో ఉపయోగపడుతుందని వక్తలు అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్‌ లో సౌత్‌ ఇండియా సైన్స్‌ ఫెయిర్‌ 
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తొలిసారిగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌... సౌత్‌ ఇండియా సైన్స్‌ ఫెయిర్‌కు వేదికైంది. సోమవారం సికింద్రాబాద్‌లోని సెయింట్‌ ప్యాట్రిక్స్‌ హైస్కూల్‌లో ఈ సైన్స్‌ ఫెయిర్‌ ఘనంగా మొదలైంది.  తెలుగు రాష్ట్రాలతోపాటు కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, కర్నాటకకు చెందిన పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇందులో పాల్గొంటున్నారు. సౌత్‌ ఇండియా సైన్స్‌ఫెయిర్‌ను తెలంగాణ విద్యాశాఖమంత్రి కడియం శ్రీహరి ప్రారంభించారు.  ఉపముఖ్యమంత్రి మహమూద్‌అలీ, హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే సాయన్న, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కిషన్‌తోపాటు ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 
యువసైంటిస్టులను ప్రోత్సహిస్తాం  : కడియం 
విద్యార్థుల్లో దాగున్న సృజనాత్మకత, ఆలోచనాశక్తిని వెలికి తీసేందుకు సైన్స్‌ఫెయిర్‌లు ఎంతగానో ఉపయోగపడుతాయని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. యువసైంటిస్టులను ప్రోత్సహించడంలో తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందన్నారు. రాబోయే రోజుల్లో మరింత కృషి జరిపి యువశాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించాలని కోరారు.
సైన్స్‌ ఫెయిర్‌లో 300 ప్రదర్శనలు 
సైన్స్‌ ఫెయిర్‌లో ప్రతి రాష్ట్రం నుంచి 50 ప్రదర్శలను ఉంటాయి. అన్ని రాష్ట్రాలు కలిపి దాదాపు 300 ప్రదర్శనలు ఉంటాయి. వీటిలో ప్రతి రాష్ట్రం నుంచి 15 గ్రూప్‌ ప్రదర్శనలు, 20 వ్యక్తిగత ప్రదర్శనలు, మరో 15 ఉపాధ్యాయ ప్రదర్శనలు ఉంటాయి. విద్యార్థులు ప్రదర్శిస్తోన్న అంశాలను చూసేందుకు హైదరాబాద్‌, దాని చుట్టూరా ఉన్న పాఠశాలల విద్యార్థులు భారీగా తరలివస్తున్నారు. మన దగ్గర శాస్త్రవేత్తల కొరత తీవ్రంగా ఉందని... ఈ కొరత పూడ్చాల్సిన బాధ్యత నేటియువతరం మీదనే ఉందని ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ అభిప్రాయపడ్డారు.
సైన్స్‌ ఎగ్జిబిషన్‌ 
వివిధ అంశాలపై విద్యార్థులు ప్రదర్శిస్తున్న సైన్స్‌ ఎగ్జిబిషన్‌ అందరినీ ఆలోచింప చేస్తోంది. శాస్త్ర, సాంకేతి రంగాల్లో సాధించిన ప్రగతి వివరిస్తూ ఏర్పాటు చేసిన పలు ప్రదర్శనలు ఆసక్తిగా తిలకిస్తున్నారు. సాయంత్రం జరిగిన విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
 

 

నేటి నుంచి సీపీఎం విజయనగరం జిల్లా మహాసభలు

విజయనగరం : నేటి నుంచి రెండు రోజులపాటు పార్వతీపురంలో సీపీఎం జిల్లా మహాసభలు జరుగనున్నాయి. సీహెచ్.నర్సింగరావు, ఎం.కృష్ణమూర్తి హాజరుకానున్నారు.

 

సంగారెడ్డి జిల్లాలో పోలీసులు కార్డెన్ సెర్చ్

సంగారెడ్డి : పటాన్ చెరు మండలం చిట్కుల్ వడ్డెర కాలనీలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. డీఎస్పీతోపాటు 15 మంది సీఐలు, 20 మంది ఎస్సైలు, 170 మంది కానిస్టేబుళ్లు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. 

07:52 - January 9, 2018

హైదరాబాద్ : ఈ ఏడాది నుంచి రైతులకు ఎకరాకు ఎనిమిది వేలు అందించనుంది ప్రభుత్వం. మే 15 నుంచి విడతలవారీగా రైతులకు నగదు అందించేందుకు కావాల్సిన కసరత్తును మొదలు పెట్టింది. భూ రికార్డుల ప్రక్షాళన పేరుతో సాగుభూమి వివరాలు సేకరించిన సర్కార్‌... రైతుకు చెల్లించే నగదుతో తమకు  క్రెడిట్ రావాలంటే ఎం చేయాలి... ఏ పద్దతులను అనుసరించాలనే అంశాలను కేబినెట్‌ సబ్‌ కమిటీ చర్చించింది. 
నగదు సాయంపై కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీ
తెలంగాణ ప్రభుత్వం రైతులకు చెల్లించే నగదు క్రెడిట్ కోసం ఆరాటపడుతుంది. మే నుంచి రెండు విడతలుగా  రైతాంగానికి ముందస్తు పెట్టుబడిగా.. ప్రతి సీజన్‌కు ఎకరాకు నాలుగు వేల రూపాయలను ఇచ్చే అంశంపై మంత్రి పోచారం నేతృత్వంలోని కేబినెట్‌ సబ్‌ కమిటీ చర్చించింది. 
భూప్రక్షాళన ద్వారా ప్రభుత్వానికి క్లారిటీ
ఇదిలా ఉంటే రాష్ట్రంలోని సాగుభూమి ఎంత ఉందో.. భూప్రక్షాళన ద్వారా ప్రభుత్వానికి క్లారిటీ వచ్చింది. రాష్ట్రంలో రైతులు ఎంతమంది... వారికి ఉన్న భూమి ఎంత ఉందనే నివేదిక ప్రభుత్వానికి అందింది. అయితే ఈ నగదు సహాయ కార్యక్రమం అందరికీ వర్తింపజేయాలా ? లేదా ? చేస్తే ఎంతమేరకు లిమిట్ విధించాలనే దానిపై కేబినెట్‌ సబ్‌కమిటీ చర్చించింది. త్వరలోనే ఎన్నికలు రానున్న నేపథ్యంలో... దీని ద్వారా ప్రభుత్వానికి లాభమెంత? నష్టమెంత ? అని పొలిటికల్‌ కోణంలో కూడా చర్చించినట్లు తెలుస్తోంది. సంక్షేమ కార్యక్రమాల్లో దేశంలోనే నెంబర్‌ వన్‌ అని చెప్పుకుంటున్న తమకు... నగదు పంపిణీలో శ్లాబ్‌ విధానం అమలు చేస్తే సీన్‌ రివర్స్‌ అవుతుందా ? అనే అంశాన్ని కూడా పరిశీలించినట్లు సమాచారం.
71 లక్షల 75 వేల మందికి రైతులకు బ్యాంక్‌ ఖాతాలు ఉన్నట్లు గుర్తించారు.  
ప్రభుత్వ రెవెన్యూ రికార్డుల ప్రకారం కేటగిరి ఎ కింద రాష్ట్రంలో 71 లక్షల 75 వేల మందికి రైతులకు బ్యాంక్‌ ఖాతాలు ఉన్నట్లు గుర్తించారు. వీరులో 85 శాతానికి పైగా చిన్న, సన్నకారు రైతులున్నారని సబ్‌కమిటీ సభ్యులు గుర్తించారు. ప్రస్తుతం రైతులకు ఉన్న బ్యాంకు ఖాతాలోనే ఈ నగదును జమ చేసినట్లయితే పాత బకాయిల కిందే... జమకట్టారని రైతులనుకుంటారనే అనుమానాలు సబ్‌కమిటీ వ్యక్తం చేసింది. దీనిపై రైతులకు అవగాహన కల్పించేందుకు గ్రామాలలో సభలు, సమావేశాలు ఏర్పాటు చేయనున్నట్లు పోచారం తెలిపారు. మొత్తానికి రైతులకు అందించే నగదు సాయంపై మరో అడుగు ముందుకుపడింది. మరిన్ని అంశాలపై చర్చించేందుకు ఈనెల 10న మరోసారి భేటీ కావాలని సబ్‌కమిటీ నిర్ణయించింది. 

 

07:46 - January 9, 2018

హైదరాబాద్ : పవన్‌కల్యాణ్‌-కత్తి మహేష్‌ ట్వీట్ల వివాదం మరో మలుపు తిరిగింది. పూనమ్‌కౌర్‌పై కత్తి మహేష్‌ అనేక ప్రశ్నలు సంధించడం.. ఆమె పవన్‌కు ట్వీట్‌ చేయడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ వివాదం నుంచి తనను కాపాడాలని,.. మీరు స్పందిస్తేనే నా కెరీర్‌, ఫ్యామిలీ, మర్యాద దక్కుతుందని ఆమె ట్వీట్‌ చేయడంతో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఇన్నాళ్లు ట్వీట్ల వార్‌పై స్పందించాలని కత్తి మహేష్‌ కోరినా స్పందించని పవన్‌... ఇప్పుడు పూనమ్‌ ట్వీట్‌పై స్పందిస్తారా ? అనే ఉత్కంఠ అందరినీ వెంటాడుతోంది.
ఆరోపణలపై స్పందించిన పూనమ్‌కౌర్‌ 
పవన్‌కల్యాణ్‌ కత్తి మహేష్‌ ట్వీట్ల వార్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న పూనమ్‌కౌర్‌ స్పందించారు. తనపై కత్తి మహేష్‌ అనేక ఆరోపణలు చేసిన నేపథ్యంలో... ఆమె పవన్‌కు ట్వీట్‌ చేయడం సంచలనం రేకెత్తింది. ఆంధ్రప్రదేశ్ చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా మిమ్మల్ని ఎవరు రికమెండ్ చేశారు.? తిరుమలలో పవన్, మీరు ఒకే గోత్రనామాలతో అర్చన చేయించుకున్నారా... లేదా...? పవన్ మిమ్మల్ని మోసం చేసాడని ఆత్మహత్యాయత్నం చేసింది నిజం కాదా..? అప్పుడు మిమ్మల్ని ఎవరు ఆసుపత్రికి తీసుకెళ్లారు? బిల్లు ఎవరు కట్టారు ? మీ అమ్మను కలిసిన పవన్,.. ఆవిడకు ఏం హామీ ఇచ్చారు? అది నెరవేరిందా..లేదా..? దర్శకుడు త్రివిక్రమ్ అంటే మీకెందుకు కోపం..? క్షుద్రమాంత్రికుడు నర్సింగ్ చేసిన తాంత్రిక పూజలో పవన్, త్రివిక్రమ్‌లతో పాటు మీరు అక్కడెందుకున్నారు అని కత్తి మహేష్‌ ఆరు ప్రశ్నలు పూనమ్‌కౌర్‌పై సంధించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆమె స్పందించి... పవన్‌కు ఓ ట్వీట్‌ చేశారు. తనను ఈ వివాదం నుండి కాపాడాలని పవన్‌ను ఆమె ట్వీట్‌లో కోరారు. తాను రాజకీయంగా టార్గెట్‌ కాదల్చుకోలేదని... మీరు స్పందిస్తేనే నా కెరీర్‌, ఫ్యామిలీ, మర్యాద దక్కుతుందని పవన్‌ను వేడుకున్నారు. 
కత్తి మహేష్‌ ఆరోపణలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం 
కత్తి మహేష్‌ ఆరోపణలపై నెటిజన్లు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో కత్తి మహేష్‌కు అనేక ప్రశ్నలు సంధిస్తున్నారు. వ్యక్తిగతం, కుటుంబానికి సంబంధించిన అనేక ప్రశ్నలు వేస్తున్నారు. వీటిలో కత్తి మహేష్‌ తల్లికి సంబంధించినవి కూడా ఉన్నాయి. అయితే... వీటిపై కూడా పూనమ్‌ కౌర్‌ స్పందించారు. ఎవ‌రైనా కానీ, ఓ వ్యక్తి త‌ల్లిని కించ‌ప‌రుస్తూ మాట్లాడ‌కూడ‌దని ట్వీట్‌ చేశారు. ద‌య‌చేసి ఎవరూ కత్తి మహేష్‌ తల్లి గురించి మాట్లాడవద్దని వేడుకున్నారు. 
కత్తి మహేష్‌ ఆరోపణలపై స్పందించిన పూనమ్‌ సోదరుడు 
పూనమ్‌కౌర్‌పై కత్తి మహేష్‌ చేసిన ఆరోపణలపై ఆమె సోదరుడు శ్యాంసింగ్‌ స్పందించారు. తన సోదరికి ఏ దర్శకుడితో విభేదాలు లేవని... ఆ ఆరోపణలన్నీ అవాస్తవమన్నారు. నిఫ్ట్‌ చదివిన పూనమ్‌కు చేనేతపై పూర్తి అవగాహన ఉందని... అందుకే ఏపీ ప్రభుత్వం బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించిందన్నారు. తన సోదరిని అవమానించిన కత్తి మహేష్‌పై పరువు నష్టం దావా వేస్తానన్నారు శ్యాంసింగ్‌. గత కొంతకాలంగా ట్వీట్ల వివాదంపై స్పందించాలని కత్తి మహేష్‌ కోరుతుండగా.. ఎలాంటి స్పందన లేదు. అయితే... తాజాగా పూనమ్‌పై ఆరోపణలు... ఆమె పవన్‌కు ట్వీట్‌ చేసిన నేపథ్యంలో అజ్ఞాతవాసి ఎలా స్పందిస్తారోనన్న ఉత్కంఠ అందరినీ వెంటాడుతోంది. 

 

కాచిగూడ ఎస్బీఐ, ఐసీఐసీఐల్లో చోరీ

హైదరాబాద్ : కాచిగూడ ఆక్వాకేఫ్ చౌరస్తాలోని ఎస్బీఐ, ఐసీఐసీఐల్లో చోరీ జరిగింది. పోలీసులు సీసీ పుటేజీని పరిశీలిస్తున్నారు. 

07:38 - January 9, 2018

పశ్చిమగోదావరి : పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో మరో ముందడుగు పడింది. ప్రాజెక్టులో కీలకమైన కాపర్ డ్యామ్ నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి. ఇవాళ ప్రాజెక్ట్ వద్దకు వచ్చిన చంద్రబాబు.. కాపర్ డ్యామ్ పనులకు శంకుస్థాపన చేశారు. ఎవరెన్ని ఆరోపణలు చేసినా... నదుల అనుసంధానం చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా మారుస్తామన్నారు చంద్రబాబు. 
కాంగ్రెస్‌ యాత్రపై చంద్రబాబు ఫైర్‌ 
కాంగ్రెస్‌ నేతల పోలవరం యాత్రపై చంద్రబాబు ఫైర్‌ అయ్యారు. ప్రాజెక్ట్‌ పనుల పరిశీలనలో భాగంగా పోలవరం వచ్చిన చంద్రబాబు...  కాంగ్రెస్‌ దివాళాకోరు రాజకీయాలు చేస్తుందన్నారు.  కాంగ్రెస్‌, వైసీపీ నేతలు పోలవరం ప్రాజెక్టును అడ్డుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.   విభజన జరిగితే సమస్యలు వస్తాయని కాంగ్రెస్‌ నేతలు ఎందుకు ఆలోచించలేదని చంద్రబాబు ప్రశ్నించారు. 
పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించిన బాబు 
అంతకుముందు చంద్రబాబు.. పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించారు. ముందుగా అగ్రిగేట్‌ కూలింగ్‌ ప్లాంట్‌ను ప్రారంభించారు. అనంతరం ఎగువ కాపర్‌ డ్యామ్‌ ప్రారంభ పనులకు పూజలు నిర్వహించారు. స్పిల్‌వే, ఎగువ కాపర్‌ డ్యామ్‌, డయాఫ్రం వాల్‌, గేట్ల తయారీ పనులను పరిశీలించారు. అధికారంలోకి వచ్చినప్పుడు 29 సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని... అందులో 9 ప్రాజెక్టులు పూర్తి చేశామన్నారు. మరో 8 ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. గోదావరి, పెన్నా నదుల అనుసంధానం ఐదు ఫేజ్‌ల ద్వారా పూర్తి చేసి... రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. నదుల అనుసంధానంతో సాగు, తాగునీటి కొరత తీరడమే కాకుండా పారిశ్రామికంగా కూడా అభివృద్ధి సాధిస్తామన్నారు చంద్రబాబు. పోలవరం ప్రాజెక్ట్‌ పనులను పరిశీలించిన చంద్రబాబు... త్వరితగతిన పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 

 

07:33 - January 9, 2018

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా అమలు చేస్తోన్న 24 గంటల ఉచిత విద్యుత్‌ పథకంపై వస్తున్న స్పందనేంటి? వారం రోజులుగా అమలవుతోన్న ఈ నాన్‌స్టాప్‌ పవర్‌తో వస్తున్న అనుభవాలు ఏంటి? ఈ పథకంపై విపక్షాలు ఏమంటున్నాయి? ప్రభుత్వం విపక్షాల దాడిని ఎలా ఎదుర్కొనబోతోంది? లెట్స్‌ వాచ్‌దిస్‌ స్పెషల్‌ స్టోరీ..
24గంటల ఉచిత విద్యుత్‌ 
డిసెంబర్‌ 31 అర్థరాత్రి నుంచి తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్‌ పథకం అమల్లోకి తీసుకొచ్చింది. రైతుల కరెంట్‌ కష్టాలు తీర్చేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చామని ప్రభుత్వం చెప్తోంది. రైతులకు నాన్‌స్టాప్‌ కరెంట్‌ ఇవ్వడంతోనే ప్రభుత్వానికి అసలు చిక్కు వచ్చిపడింది.  9 గంటల విద్యుత్‌ అమలవుతున్న సమయంలోనే బోర్ల ద్వారా నీటిని తోడుతున్న క్రమంలో భూగర్భజలాలు అడుగంటుతున్నాయన్న వాదనలు వచ్చాయి. రైతుల నుంచి ఆందోళన కూడా వ్యక్తమయ్యింది. వాస్తవానికి ప్రస్తుతం అమల్లో ఉన్న 9 గంటల విద్యుత్‌తో రైతులకు వచ్చిన నష్టమేమీలేకపోయినా... వారేమీ అడగకపోయినా.. ప్రభుత్వమే 24 గంటల ఉచిత విద్యుత్‌ను అందిస్తోంది. ఇది రైతులకు ఎంతమాత్రం ఉపయోగం కాదని కాంగ్రెస్‌ నేతలు విమర్శలు చేస్తున్నారు.
డైలమాలో ప్రభుత్వం  
24 గంటల ఉచిత విద్యుత్‌పై అటు విపక్షాల నుంచి, ఇటు రైతుల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం డైలమాలో పడింది. అసలు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని భావించింది. దీంతో అధికారులను పురమాయించింది. ప్రభుత్వ ఆదేశంలో అధికారులు వారం రోజులుగా అమలవుతున్న 24 గంటల ఉచిత విద్యుత్‌పై కేస్‌ స్టడీ చేయడం మొదలుపెట్టారు.  ఫిబ్రవరి ఫస్టుకు వివరాలు ప్రభుత్వానికి అందించనున్నారు.  ప్రస్తుతం 14,845 మెగావాట్ల స్థాపిత విద్యుత్‌ ఉత్పత్తి అందుబాటులో ఉంది. భవిష్యత్తులో మరో 13వేల మెగావాట్ల విద్యుత్‌ సమకూర్చుకోవడం కోసం కొత్త ఉత్పత్తి కేంద్రాలు నిర్మిస్తున్నారు. దీంతో 2022 నాటికి తెలంగాణలో 28వేల మెగావాట్ల విద్యుత్‌ను అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో  కార్యాచరణ అమలవుతోంది.
డిమాండ్‌కు అనుగుణంగా అధికారుల ప్రణాళికలు
తెలంగాణ రాష్ట్రంలో డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్‌ ఉత్పత్తి ప్రణాళికలు వేశామని, దానికి అనుగుణంగా సరఫరా చేయనున్నామని విద్యుత్‌ అధికారులు చెప్తున్నారు.  డిమాండ్‌కు తగ్గట్టు సరఫరా చేయాలంటే పంపిణీ వ్యవస్థ పటిష్టంగా ఉండాలని భావించి.. కొత్త సబ్‌స్టేషన్లు, లైన్లు, పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్లు వేస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం 9500 మెగావాట్ల గరిష్ట డిమాండ్‌ ఏర్పడుతోందన్నారు. వ్యవసాయానికి 24 గంటల కరెంటు అందివ్వడంతోపాటు, ఎత్తిపోతల పథకాలకు, మిషన్‌ భగీరథకు, పెరిగే పరిశ్రమలకు కరెంట్ సరఫరా చేస్తే మరో 50శాతం అదనంగా విద్యుత్‌ సరఫరా చేయాల్సి వస్తుందని అంచనా వేశారు. ఉత్పత్తి కూడా గణనీయంగా పెరుగుతున్నందున పంపిణీ వ్యవస్థను విస్తరించారు. రానున్న రోజుల్లో  అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ అందించాలనే నిర్ణయానికి అనుగుణంగా విద్యుత్‌ సంస్థలు సమాయాత్తం అవుతున్నాయని అధికారులు స్పష్టపరుస్తున్నారు.
నాన్‌స్టాప్‌ కరెంట్‌పై మండిపడుతున్న రైతు సంఘాలు
తెలంగాణలో అమలవుతోన్న నాన్‌స్టాప్‌ కరెంట్‌తో పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు పూర్తిగా దెబ్బతినే ప్రమాదం కూడా లేకపోలేదని రైతులు, రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ఆటోమేటిక్‌ స్టార్టర్లను తొలగిస్తే కొంతమేర ప్రయోజనం ఉన్నప్పటికీ... దుర్వినియోగం ఎక్కువయ్యే అవకాశం ఉందని వాపోతున్నారు. ప్రభుత్వం మాత్రం దీన్ని కొనసాగించాలన్న ఆలోచనలోనే ఉంది. మరోవైపు నాన్‌స్టాప్‌ ఉచిత విద్యుత్‌  సరఫరాపై దేశంలోని పలు రాష్ట్రాలు తెలంగాణ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తున్నాయి.  ఈ విధానాన్ని అధ్యయనం చేయడానికి త్వరలో పలు రాష్ట్రాల ప్రతినిధులు తెలంగాణకు రానున్నారు. 

 

07:28 - January 9, 2018

హైదరాబాద్ : బడ్జెట్‌ రూపకల్పనకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.  ఇందుకోసం శాఖలవారీగా ప్రతిపాదనలు కోరుతోంది. అంతేకాదు.. ఇప్పటి వరకు ఖర్చు చేసిన నిధులపై ఆరా తీస్తోంది. 2018-19 బడ్జెట్‌ ప్రతిపాదనల సమర్పణకు ఈనెల 15ను డెడ్‌లైన్‌గా నిర్ణయించింది. 
బడ్జెట్‌ రూపకల్పనకు కసరత్తు ప్రారంభం
2018-19 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌పై ప్రభుత్వం దృష్టిసారించింది. ఇప్పటి నుంచే బడ్జెట్‌ రూపకల్పనకు కసర్తతు ప్రారంభించింది.  ఇప్పటి వరకు  శాఖలవారీగా కేటాయించిన నిధులు, వాటి వినియోగంపై సమాచారం తీసుకుంటోంది. కొత్త బడ్జెట్‌కు ప్రతిపాదనలను ఇవ్వాలని శాఖలను ఆదేశించింది. ఈనెల 15లోగా ప్రతిపాదనలు పంపాలని అన్నిశాఖలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ ఆదేశించారు. ప్రతిశాఖలో పనిచేస్తోన్న ఉద్యోగుల వివరాలను సీజీజీ పోర్టల్‌లో ఉంచామని.. వాటిని సరిచూసుకోవాలన్నారు. తేడాలేమైనా ఉంటే తెలపాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులు జమచేస్తున్న బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలు ప్రతిశాఖ సమర్పించాలని ఆదేశించారు.
ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధులపై సీఎస్‌ సమీక్ష
ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధులపై సీఎస్‌ సమీక్షించారు.  సబ్‌ప్లాన్‌ నిధుల వ్యయాన్ని వేగవంతం చేయాలన్నారు. 15వ ఫైనాన్స్‌ కమిషన్‌ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అత్యధిక నిధులు పొందేలా వివిధ శాఖల అధికారులు తమ శాఖలకు సంబంధించిన వివరాలను ఆర్థికశాఖకు సమర్పించాలన్నారు. 15వ ఆర్థిక సంఘానికి సమర్పించాల్సిన నివేదిక, బడ్జెట్‌ ప్రతిపాదనలు, ఎస్సీ,ఎస్టీ ప్రత్యేక నిధుల వ్యయంపై ప్రభుత్వం శాఖాధిపతులను సమాచారం కోరింది.  ఫిబ్రవరి 7లోగా వివరాలు సమర్పించాలని ఎస్పీ సింగ్‌ ఆదేశించారు. 
ఆర్థికశాఖలో ప్రత్యేకటీమ్‌, నోడల్‌ అధికారి నియామకం
స్థానిక సంస్థలకు గ్రాంట్లు, ట్యాక్స్‌ రీవాల్యూయేషన్‌ వివరాలు, జిల్లాల వారీగా అభివృద్ధి, వివిధ అంశాలలో సాధించిన ప్రగతి, ఆదాయవ్యయాలు, పన్నుల వసూళ్లపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టిసారించింది. ఆర్థికశాఖలో ప్రత్యేక టీమ్‌, నోడల్‌ అధికారిని నియమించింది. కేంద్ర ఆర్థికసంఘం మొదటిసారిగా రాష్ట్రాల పురోగతిని దృష్టిలో ఉంచుకుని ఇన్సెంటివ్‌ బేస్‌డ్‌ గ్రాంట్స్‌ ఇవ్వనుందని, ఇందుకోసం అన్నిఅంశాలను ప్రాతిపదికగా తీసుకుంటుందనని ఎస్పీ సింగ్‌ అన్నారు.  అందుకే అన్నిశాఖలు ప్రత్యేక నివేదికలు రూపొందించాలని ఆదేశించారు.
 


 

నేటి నుంచి ఏపీ సచివాలయంలో ఆహార పండుగ

గుంటూరు : ఏపీ సచివాలయంలో నేటి నుంచి ఆహార పండుగ నిర్వహించనున్నారు. నాలుగు రోజులపాటు ఆహార పండుగ కొనసాగనుంది. 
 

నేడు రైల్వే శాఖ ఉన్నతాధికారులతో ఏపీ ఎంపీలు భేటీ

విజయవాడ : నేడు రైల్వే శాఖ ఉన్నతాధికారులతో ఏపీ ఎంపీలు సమావేశం కానున్నారు. పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై ఎంపీలు చర్చించనున్నారు. 

 

Don't Miss