Activities calendar

10 January 2018

సైన్యంలో భర్తీ..తొక్కిసలాట...

బీహార్ : రోహతాస్‌ జిల్లాలో జరుగుతున్న ఆర్మీ రిక్రూట్‌మెంట్‌లో అపశ్రుతి చోటుచేసుకుంది. సైన్యంలో భర్తీ కోసం పరీక్ష సందర్భంగా తొక్కిసలాట జరిగి ఓ యువకుడు మృతి చెందాడు. మరో నలుగురు గాయపడ్డారు. ఒకరినొకరు తోసుకోవడం వల్ల కిందపడిపోవడంతో తొక్కిసలాట జరిగింది.

2017లో 138 మంది పాక్ సైనికుల హతం..

జమ్ముకశ్మీర్‌ : నియంత్రణ రేఖ వద్ద కాల్పుల ఉల్లంఘనకు పాల్పడినందుకు పాకిస్తాన్‌ భారీ మూల్యాన్నే చెల్లించుకుంది. 2017లో పాకిస్తాన్‌కు చెందిన 138 మంది సైనికులను బిఎస్‌ఎఫ్‌ జవాన్లు మట్టుబెట్టినట్లు నిఘావర్గాలు తెలిపాయి. జమ్ముకశ్మీర్‌ సరిహద్దులో నియంత్రణ రేఖ దాటి కాల్పులకు పాల్పడ్డ పాక్‌ ఆర్మీ రేంజర్లను భారత సైన్యం దీటుగా సమాధానమిచ్చాయని పేర్కొన్నాయి. 

21:26 - January 10, 2018

జమ్ముకశ్మీర్‌ : నియంత్రణ రేఖ వద్ద కాల్పుల ఉల్లంఘనకు పాల్పడినందుకు పాకిస్తాన్‌ భారీ మూల్యాన్నే చెల్లించుకుంది. 2017లో పాకిస్తాన్‌కు చెందిన 138 మంది సైనికులను బిఎస్‌ఎఫ్‌ జవాన్లు మట్టుబెట్టినట్లు నిఘావర్గాలు తెలిపాయి. జమ్ముకశ్మీర్‌ సరిహద్దులో నియంత్రణ రేఖ దాటి కాల్పులకు పాల్పడ్డ పాక్‌ ఆర్మీ రేంజర్లను భారత సైన్యం దీటుగా సమాధానమిచ్చాయని పేర్కొన్నాయి. భారత్‌ జరిపిన కాల్పుల్లో 138 మంది పాకిస్తాన్‌ సైనికులు హతమయ్యారని, 155 మంది సైనికులు గాయపడ్డారని ఇంటిలిజెన్స్‌ వర్గాలు వెల్లడించాయి. నియంత్రణ రేఖ వద్ద పాక్‌ జరిపిన కాల్పుల్లో 28 మంది భారత సైనికులు అమరులైనట్లు తెలిపాయి. 70 మంది జవాన్లకు గాయాలయ్యాయి. 2017లో పాకిస్తాన్‌ 860 సార్లు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడినట్లు ఆర్మీ అధికార ప్రతినిథి కల్నల్‌ అమన్‌ ఆనంద్‌ తెలిపారు.

21:25 - January 10, 2018

ఢిల్లీ : 1984 సిక్కులకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్ల కేసును పునర్విచారణకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. మూసివేసిన 186 కేసుల విచారణ తిరిగి చేపట్టడానికి కొత్త సిట్‌ను ఏర్పాటు చేసింది. రిటైర్డ్‌ హైకోర్టు న్యాయమూర్తి, ప్రస్తుత ఐపిఎస్‌, రిటైర్డ్‌ ఐపిఎస్‌తో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీని నియమించనున్నట్టు తెలిపింది. సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించి 293 కేసులకు గాను సిట్‌ 186 కేసులను ఎలాంటి విచారణ చేపట్టకుండానే మూసివేసిందని సూపర్‌వైజరీ పానల్‌ నివేదిక పేర్కొంది. మూసివేసిన కేసులను కొత్త సిట్‌ పరిశీలించిన తర్వాత, వాటిని విచారించాలా... లేదా అనే అంశంపై నిర్ణయం తీసుకోనుంది. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ హత్యానంతరం సిక్కు వ్యతిరేక అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే.

21:23 - January 10, 2018

ఖమ్మం : జిల్లాలోని జక్కేపల్లి ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ నేతలు ప్రలోభాలకు పాల్పడుతున్నారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించి మరీ... మద్యం, డబ్బులు పంచుతున్నారు. మరోవైపు అధికార పార్టీకి అనుకూలంగా ఓటేస్తే పింఛన్లు, రుణాలు ఇస్తామని మంత్రి తుమ్మల పీఏ ధర్మరాజు ఓటర్లను ప్రలోభానికి గురి చేసేందుకు యత్నిస్తున్నారు. ఇక కూసుమంచి ఎంపీపీ రామసహాయం వెంకటరెడ్డి తన వాహనంలో.. డబ్బులు, మద్యం తరలిస్తున్న దృశ్యాలు మీడియాకు చిక్కాయి. అయితే... ఇంత జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని... నేతలకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఇదిలావుంటే... మరోవైపు సీపీఎం, కాంగ్రెస్‌, టీడీపీ నేతలను పోలీసులు పీఎస్‌కు పిలిచి... బైండోవర్‌ కేసులు నమోదు చేయడం విశేషం. 

కాళేశ్వరం ప్రాజెక్టు పనులపై సీడబ్ల్యూసీ హర్షం

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులపై కేంద్ర జల వనరుల సంఘం హర్షం వ్యక్తం చేసింది. దేశ చరిత్రలోనే ఇది విభిన్నమైన ప్రాజెక్టు అంటూ కితాబిచ్చింది. రెండు రోజుల పాటు కాళేశ్వరం పనులు పరిశీలించిన ఈ బృందం సమీకృత, బహుళార్థసాధక ప్రాజెక్టుగా కాళేశ్వరంను కొనియాడింది. రెండు రోజుల పాటు కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించిన కేంద్ర జలవనరుల సంఘం ప్రాజెక్టుపై సంతృప్తి వ్యక్తం చేసింది.

21:18 - January 10, 2018

విజయవాడ : ప్రత్యేక ప్యాకేజీ అమలుపై చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీకి రాసిన లేఖలో.. ప్రత్యేక ప్యాకేజీలో పేర్కొన్న విధంగా... రాష్ట్రానికి ఆర్థిక సాయాన్ని... విదేశీ ఆర్థిక సంస్థలనుంచి కాకుండా నాబార్డు నుంచి గ్రాంట్‌ రూపంలో అందించాలని కోరారు. 2020 వరకు రాష్ట్రానికి 16,447 కోట్లు రావాల్సి ఉంటుందని లేఖలో పేర్కొన్నారు. నాబార్డ్‌ నుంచి రుణం అందిస్తేనే కొత్త రాష్ట్రాలకు వెసులుబాటు ఉంటుందన్నారు. 

''కేంద్ర ప్రాయోజిత పథకాల వాటాను 90:10 నిష్పత్తిలో ఇచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్‌కు 2015-16 సంవత్సరానికి రూ. 2,951 కోట్లు  అధికంగా నిధులు రావాల్సి ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం దాన్ని 2,516కోట్ల రూపాయలుగా మాత్రమే అంచనా వేసింది. అదే సూత్రం ప్రకారం 2016-17 ఆర్థిక సంవత్సరానికి 2,854 కోట్లరూపాయలు రావాల్సి ఉంది. 2015-16 తో పోలిస్తే ఇది 13.43శాతం అధికం. అదే వృద్ధిరేటు ప్రకారం చూస్తే 2017-18కి 3,238 కోట్ల రూపాయలు. 2018-19కి 3,673 కోట్ల రూపాయలు, 2019-20కి 4,166 కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. కేంద్రం వేసిన తాత్కాలిక లెక్కల ప్రకారం ఐదేళ్ల కాలానికి 16,447 కోట్ల రూపాయలు ఈ పద్దు కింద ఇవ్వాల్సి ఉందని ముఖ్యమంత్రి తన లేఖలో పేర్కొన్నారు. దీనికి తోడు ప్రత్యేక క్యాటగిరీ రాష్ట్రాలకు కేంద్ర ప్రాయోజిత పథకాలు, విదేశీ ఆర్థిక సాయంతో చేపట్టే ప్రాజెక్టులకు 90:10 నిష్పత్తిలో గ్రాంట్లు పొందే అర్హత ఉంది. అందువలన ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల తరహాల్లోనే విదేశీ ఆర్థిక ప్రాజెక్టుల్లో ఏపీకి 90:10 నిష్పత్తిలో ప్రత్యేక ఆర్థిక సాయం చేయాలి. ఇప్పటికే అమల్లో ఉన్న 2019-20 వరకూ సంతకం అన్ని ప్రాజెక్టులకు దీన్ని వర్తింపచేయాలి. కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్రకటన నేపథ్యంలో వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన ఈఏపీ ప్రతిపాదనలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆర్థిక వ్యవహారాల విభాగానికి పంపింది. ఈఏపీ కింద చేపట్టే ప్రాజెక్టులు మొదలు కావడానికి, పూర్తికావడానికి చాలా సమయం తీసుకుంటాయి. వీటికి విదేశీ ఆర్థిక సంస్థ నుంచి అనుమతులు పొందడానికి సుదీర్ఘ నిబంధనల  ప్రక్రియ పూర్తిచేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియకు ఆర్థిక సాయాన్ని 2020లోపు పూర్తిగా ఖర్చుచేసే సామర్థ్యం ఆంధ్రప్రదేశ్‌కు లేదు'' అని ముఖ్యమంత్రి తన లేఖలో వివరించారు. అందువల్ల పేర్కొన్న ప్రత్యేక ఆర్థికసాయాన్ని విదేశీ ఆర్థిక సంస్థకు బదులుగా నాబార్డు నుంచి ఇప్పించాలని విజ్ఞప్తిచేశారు. నాబార్డు ద్వారా ఏయే ప్రాజెక్టుకు నిధులు కావాలో ఆ జాబితాలు కూడా ముఖ్యమంత్రి అరుణ్‌జైట్లీ దృష్టికి తీసుకెళ్లారు. ఆ మొత్తాన్ని గ్రాంటు రూపంలో ఇవ్వాలని కోరారు. దీనివల్ల అది ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి రాదని, తద్వారా రాష్ట్ర ప్రభుత్వం త్వరగా ప్రాజెక్టు పనులు మొదలుపెట్టడానికి వీలుంటుందని జైట్లీకి సీఎం తెలిపారు. పార్లమెంట్‌లో విభజన బిల్లు ఆమోదింపజేసే విషయంలో చెప్పినట్లుగా ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితిని కొంతమేర ఆదుకోవడానికి ఇది దోహదపడుతుంది' సీఎం తన లేఖలో అభిప్రాయపడ్డారు.

21:03 - January 10, 2018

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులపై కేంద్ర జల వనరుల సంఘం హర్షం వ్యక్తం చేసింది. దేశ చరిత్రలోనే ఇది విభిన్నమైన ప్రాజెక్టు అంటూ కితాబిచ్చింది. రెండు రోజుల పాటు కాళేశ్వరం పనులు పరిశీలించిన ఈ బృందం సమీకృత, బహుళార్థసాధక ప్రాజెక్టుగా కాళేశ్వరంను కొనియాడింది. రెండు రోజుల పాటు కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించిన కేంద్ర జలవనరుల సంఘం ప్రాజెక్టుపై సంతృప్తి వ్యక్తం చేసింది. ప్రాజెక్టు నిర్మాణాలు, వాటి ప్రణాళికలపై ఈ బృందం క్షేత్ర స్థాయిలో పరిశీలనలు జరిపింది. మిడ్‌ మానేరు, ఎస్‌ ఆర్‌ ఎస్పీ సహా పలు ప్రాజెక్టులకు కాళేశ్వరం అనుసంధానం కాబోతుందని, ఇలాంటి భారీ ప్రాజెక్టు ఒక్క తెలంగాణాలోనే కనిపిస్తుందని సీడబ్ల్యూసీ బృంద సారధి దాస్‌ అభిప్రాయపడ్డారు. స్ట్రక్చర్ల నిర్మాణాలు, ప్రణాళిక, పనులవేగం, వాటీ తీరు తమను ఆకట్టుకున్నాయన్నారు.

మూడు షిఫ్టుల వారిగా భారీగా జరుగుతున్న పనుల వేగాన్ని బట్టి చూస్తే వర్షాకాలం నాటికి కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి మైలు రాయి దాటుతుందన్నారు దాస్‌. ప్రాజెక్టు వ్యయం పెరగకుండా పనులు పూర్తి కావాలన్నారు. అందుకు అన్ని శాఖలు కలిసి కట్టుగా పని చేయాలని దాస్‌ సూచించారు. పనులలో వేగం మరింత పెంచాలని ఆయన అభిప్రాయపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని, 18 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడంతో పాటు మరో 18 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీటిని అందించే బృహత్తర ప్రాజెక్టు అని ప్రశంసించారు.

మేడిగడ్డ వద్ద నీటి లభ్యతకు ఎలాంటి సమస్య లేదన్నారు కేంద్ర జలసంఘం హైడ్రాలజీ డైరెక్టర్‌ నిత్యానంద రాయ్‌. కాళేశ్వరం నిర్మాణ పనులు చాలా సంతృప్తికరంగా జరుగుతున్నాయని, దేశంలోనే గొప్ప ప్రాజెక్టుగా కాళేశ్వరం నిర్మాణం అవుతుందన్నారు. జాతీయ అభివృద్ధిలో కాళేశ్వరం భాగస్వామి అవుతుందని, ఇదో మెగా ప్రాజెక్టు అని కొనియాడారు. కోట్లాది మంది రైతుల ప్రయోజనాలతో పాటు బహుళ ప్రయోజనాలు ఇమిడి ఉన్న ఈ ప్రాజెక్టు ఒక అద్భుతమంటూ సీడబ్ల్యూసీ బృందం ప్రశంసల వర్షం కురిపించింది. 

21:00 - January 10, 2018

హైదరాబాద్ : రైతులకు పెట్టుబడి మొత్తాన్ని ఏ విధంగా అందించాలనే దానిపై ప్రభుత్వం దాదాపు ఓ స్పష్టతకు వచ్చింది. వివిధ రకాల సూచనల్లో.. చెక్కుల రూపంలో పెట్టుబడి ఇవ్వడమే ఉత్తమమని.. రాష్ట్ర కేబినెట్‌ సబ్‌కమిటీ భావిస్తోంది. అయితే.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు.. తుది నిర్ణయం తీసుకోవాలని కమిటీ నిర్ణయించింది. పథకం అమలుకు అవసరమైన నగదు నిల్వలు అందుబాటులో ఉండేలా చూడాలని, అధికారులను, బ్యాంకులను సబ్‌కమిటీ కోరింది.

రైతుల పంట పెట్టుబడి పథకం అమలు విధానాలపై.. రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా ఓ అవగాహనకు వచ్చింది. అర్హులైన ప్రతి రైతుకూ.. ఎకరాకు నాలుగు వేల రూపాయలు సమకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే దీనికి సంబంధించినగ్రౌండ్‌ వర్క్‌ చేస్తున్న ప్రభుత్వం.. రైతుల అభీష్టం ప్రకారమే ముందుకు వెళ్లాలని యోచిస్తోంది. దీని కోసం ఏర్పాటు చేసిన... కేబినెట్‌ సబ్‌ కమిటీ.. బుధవారం, వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో.. రెండోసారీ భేటీ అయింది. ఇందులో.. సాగుకు యోగ్యం కాని భూములను పథకం పరిధి నుంచి తొలగించాలని నిర్ణయించారు. ఇప్పటికే రైతులు, రైతు సంఘాల అభిప్రాయాలను సేకరించామని.. చెక్కుల ద్వారా పెట్టుబడి మొత్తాన్ని సమకూర్చాలన్నదే మెజారిటీ రైతుల అభిప్రాయమని కేబినెట్‌ సబ్‌ కమిటీ వెల్లడించింది దీన్ని బట్టి.. ప్రభుత్వం కూడా చెక్కుల ద్వారానే పంట పెట్టుబడిని సమకూర్చనుందన్న భావన వ్యక్తమవుతోంది.

పంటకు పెట్టుబడి పథకం అమలు దాదాపు ఆరువేల కోట్ల రూపాయల ఫిజికల్‌ మనీ అవసరం అవుతోంది. ఇంత మొత్తం... బ్యాంకు వద్ద ఉండే అవకాశం లేదు. కాబట్టి ఇది సమస్యగా మారే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అందుకే, అధికారులు ఈనెల 17న ఢిల్లీ వెళ్లి.. కేంద్ర ఆర్థిక మంత్రితో పాటు, ఆర్బీఐ ఉన్నతాధికారులను కలవనున్నారు. మే నెల వరకు బ్యాంకుల్లో నగదు నిల్వ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరనున్నారు. ఈలోగా.. కేబినెట్‌ సబ్‌ కమిటీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తుది నివేదికను అందించనుంది. ఆయన ఆదేశాల మేరకు.. పెట్టుబడి మొత్తాన్ని ఏ రూపంలో పంపిణీ చేయాలో నిర్ణయిస్తారు. 

20:59 - January 10, 2018

తూర్పుగోదావరి : చంద్రన్న పెళ్లి కానుక, నిరుద్యోగ భృతి పథకాల అమలుకు త్వరలోనే శ్రీకారం చుట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. పెళ్లి కానుక పథకాన్ని రెండు, మూడు రోజుల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం జన్మభూమి గ్రామ సభలో వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు. జిల్లా కేంద్రం కాకినాడలో ఆధునిక హంగులతో కొత్తగా నిర్మించిన టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన చంద్రబాబు... ముమ్మడివరం మండలం సీహెచ్‌ గున్నేపల్లిలో జన్మభూమి - మా ఊరు గ్రామ సభలో పాల్గొన్నారు.

సీహెచ్‌ గున్నేపల్లి జన్మభూమి గ్రామ సభలో.. ఊళ్లో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. సామాజిక పించన్లు సకాలంలో అందుతున్నాయా ? లేదా ? అని ప్రశ్నించి సమాధానాలు రాబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చంద్రబాబు ప్రధానంగా ప్రస్తావించారు. చంద్రన్న పెళ్లి కానుక పథకాన్ని రెండు మూడు రోజుల్లో ప్రారంభిస్తామని చెప్పారు.

నిరుద్యోగులకు తర్వలో భృతి చెల్లింపు ప్రారంభిస్తామని చెప్పిన చంద్రబాబు... అన్నా క్యాంటీన్ల విస్తరణకు చర్యలు తీసుకుంటున్నామని గ్రామ సభలో చెప్పారు. గ్రామ సభకు హాజరైన ప్రజలతో చంద్రబాబు జన్మభూమి ప్రతిజ్ఞ చేయించారు. గ్రామ సభ తర్వాత బాలింతలకు ఎన్టీఆర్‌ బేబీ కిట్లు, రైతులకు వ్యవసాయ ఉపకరణాలు, యంత్రపరికరాలు, విద్యార్థినిలకు సైకిళ్లు పంపిణీ చేశారు.

20:57 - January 10, 2018

సంక్షుభిత సమయాలు పరిష్కారాలకోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తాయి. అణచివేత ఆకాశాన్నంటితే పాతాళాన్ని చీల్చుకుంటూ కత్తుల చేతులు, నిప్పుల స్వరాలూ దూసుకొస్తాయి. వివక్షను బోధించిన విలువలతో దేశాన్ని అధోగతి పాల్జేస్తామంటే నిజమైన దేశభక్తి అంటే ఏంటో కొత్త పాఠాలు మొదలవుతాయి. పరిష్కారాల దిశగా దూసుకెళ్లే పావన నవజీవన బృందావన నిర్మాతలుగా కొందరు నవయువకులు తెరపైకివస్తారు.. ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నాయా లేక మనుస్మృతిని నెత్తిన పెట్టుకున్నాయా అనే సందేహం వచ్చినపుడు యువ హుంకార్ అంటూ ఏకమవుతారు. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమం గురించి ప్రత్యేక కథనం..ఓ చేతిలో రాజ్యాంగం.. మరో చేతిలో మనుస్మృతి..ఏది కావాలి? ఏది అనుసరిస్తారు..?

హక్కులను, రక్షణలను, సమానత్వాన్ని ప్రసాదించిన రాజ్యాంగాన్నా లేక వివక్షను, అణచివేతను బోధించిన సమాజాన్ని పీడనతో నింపిన మనుస్మృతినా? ఏది కావాలి మీకు? ఇదే యువ హుంకార్ వేసిన ప్రశ్న..హస్తినలో యువ హుంకార్‌ ర్యాలీ గర్జించింది. మోది ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేసింది. అవినీతి, పేదరికం, నిరుద్యోగం లాంట ప్రధాన సమస్యలను పక్కన బెట్టి.. ఘర్‌ వాప్‌సి, లవ్‌ జిహాద్‌ లాంటి అంశాలకు ప్రాధ్యనత నిస్తోందని మండిపడింది. దేశానికి మనువాదం ముప్పు పొంచి ఉందని యువతను హెచ్చరించింది. సామాజిక న్యాయం కోసం తమ పోరు కొనసాగుతుందని స్పష్టం చేసింది.

అడుగడుగునా పోలీసుల నిర్బంధం.. వాటర్ కెనాన్లు, బారికేడ్లు, లాఠీలు...భాష్పవాయుగోళాలు.. వీటన్నిటి మధ్య పార్లమెట్ స్ట్రీట్ లో పెద్ద సంఖ్యలో యువత ఏకమయింది. దళిత, మైనార్టీ వర్గాలపై వివక్ష ఆపాలని, యువతకు ఉపాధి, ఉద్యోగాలు కల్పించాలని, విద్యార్థి హక్కులను కాపాడాలని, లింగ సమానత్వం కావాలని..., భీమ్‌ కొరెగావ్‌లోని దళితులపై దాడులకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ రాజధానిలో యువత ఏకస్వరమయింది.

మాకు స్వాతంత్ర్యం కావాలి. విముక్తి కావాలి. దేశంలోపల కోట్లాది ప్రజలను పట్టి పీడిస్తున్న సకల సమస్యలనుండి మాకు విముక్తి కావాలి. ప్రజలంతా సమానమనే వ్యవస్థ సిద్ధించాలి. దానికి అడ్డుగా ఉన్న విలువలు, నమ్మకాలు వాటి మూల సిద్ధాంతాలపై పోరాటం చేస్తూనే ఉంటాం.. గెలుపు దక్కేంత వరకు మా పోరాటం ఆగదు. ఈ క్రమంలో సకల రోగాలకు కారణమైన మనుస్మృతిని వ్యతిరేకిస్తాం.. అంబేద్కర్ రాజ్యాంగాన్ని నమ్ముతాం.. ఇదీ యువ హుంకార్ ర్యాలీ ఇస్తున్న సందేశం.. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

20:54 - January 10, 2018

అయ్యా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారూ.. మీకేమన్న శీమునెత్తురు ఇజ్జత్ మానం.. శిగ్గుశరం ఉన్నయా సారూ..? మన్షివేనా నువ్వింతకు..? అది నాల్కెనా తాటిమట్టనా..? ఒక ప్రభుత్వ అధికారిని వట్కొని నీ అమ్మమొగనికి ఫోన్ జేస్తున్నావ్ రా అని తిడ్తవా..? లేదు సారు మీ అమ్మకే ఫోన్ జేస్తున్నా అని ఆ అధికారి సమాధానం ఇస్తె ఏమన్న శిగ్గు ఉంటుండెనా నీది..? నీ బల్పు బండకేశి కొట్ట..గీ ముచ్చట జూడాలంటే వీడియో క్లిక్ చేయండి.

20:52 - January 10, 2018

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్రం బార్లా తెరచింది. సింగిల్‌ బ్రాండ్‌ రిటేల్‌లో 100 శాతం, ఎయిర్‌ ఇండియాలో 49 శాతం విదేశి పెట్టుబడులకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కేంద్ర క్యాబినెట్ నిర్ణయాన్ని కాన్ఫిడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ తీవ్రంగా ఖండించింది. కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల దేశీయ పారిశ్రామిక రంగానికి తీరని నష్టం వాటిల్లనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో వేణుగోపాల్ (AIEA జాతీయ ఉపాధ్యక్షులు), అద్దంకి దయాకర్ (టి.కాంగ్రెస్), ప్రేమేందర్ రెడ్డి (బీజేపీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

20:51 - January 10, 2018

ఢిల్లీ : విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్రం బార్లా తెరచింది. సింగిల్‌ బ్రాండ్‌ రిటేల్‌లో 100 శాతం, ఎయిర్‌ ఇండియాలో 49 శాతం విదేశి పెట్టుబడులకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కేంద్ర క్యాబినెట్ నిర్ణయాన్ని కాన్ఫిడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ తీవ్రంగా ఖండించింది. కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల దేశీయ పారిశ్రామిక రంగానికి తీరని నష్టం వాటిల్లనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రధానమంత్రి నరేంద్రమోది అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన కేంద్ర కాబినెట్‌ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను మరింత సరళీకరించాలని నిర్ణయించింది. సింగిల్ బ్రాండ్ రిటేల్ రంగంలోకి వంద శాతం ఎఫ్‌డీఐలకు కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం సింగిల్ బ్రాండ్ రిటేల్ రంగంలో 49 శాతం ఎఫ్‌డీఐలకు మాత్రమే అనుమతి ఉంది. అంతకు మించి పెట్టుబడులు పెట్టాలంటే ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. ఇప్పుడు ఆ పరిమితిని కేంద్రం ఎత్తేసింది.

నిర్మాణ రంగంలో ఆటోమెటిక్‌ రూట్‌ ద్వారా 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కూడా కేంద్ర కాబినెట్‌ ఆమోదం తెలిపింది. ఎయిర్ ఇండియాలో విదేశీ సంస్థలు 49 శాతం పెట్టబడులు పెట్టేందుకు కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎయిర్‌ ఇండియా భారత్‌ ఆధ్వర్యంలోనే కొనసాగుతుందని అధికారవర్గాలు పేర్కొన్నాయి.మరింత విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ఎఫ్‌డీఐలను సరళీకరించినట్లు ... విదేశీయులకు ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ వాతావరణం కల్పిస్తున్నట్లు మంత్రిమండలి పేర్కొంది. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య వల్ల ఆర్థికవృద్ధితో పాటు....మరిన్ని ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్న భావనను క్యాబినెట్ వినిపించింది.

100 శాతం ఎఫ్‌డీఐలపై కేంద్రం తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాన్ఫిడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టింది. ఈ నిర్ణయం వల్ల విదేశాలకు చెందిన పెద్ద కంపెనీలు భారత్‌ రిటేల్‌ మార్కెట్‌ను ఆక్రమిస్తాయని, చిన్న కంపెనీలు దెబ్బ తింటాయని ఆందోళన వ్యక్తం చేసింది.

కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయాన్ని సిపిఎం తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ నిర్ణయం వల్ల దేశీయ పారిశ్రామిక రంగానికి తీరని నష్టం వాటిల్లనుందని హెచ్చరించింది. ఎయిర్‌ ఇండియాను క్రమంగా విదేశీ విమాన సంస్థల చేతికి అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధమైందని ఆరోపించింది. ఎయిర్‌ ఇండియా ప్రయివేటీకరణ ఆలోచనను కనీసం 5 సంవత్సరాలు వాయిదా వేయాలన్న స్థాయి సంఘం సూచనలను పరిగణన లోకి తీసుకోవాలని సిపిఎం డిమాండ్‌ చేసింది. విపక్షంలో ఉన్నపుడు రిటైల్‌ రంగంలో సంస్కరణలను వ్యతిరేకించిన బిజెపి ఇపుడు ఎఫ్‌డిఐలపై సరళీకరణ విధానాన్ని అవలంబిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి.

ఇస్రో తదుపరి ఛైర్మన్ గా..

ఢిల్లీ : ఇస్రో తదుపరి ఛైర్మన్ గా కె.శివన్ నియమితులు కానున్నారు. విక్రమ్ సారాబాయి అంతరిక్ష సంస్థ డైరెక్టర్ గా శివన్ ఉన్నారు. మూడేళ్ల పాటు ఇస్రో ఛైర్మన్ గా శివన్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. 

ఆధార్ కు ప్రత్యామ్నాయంగా..

ఢిల్లీ : ఆధార్ కు ప్రత్యామ్నాయంగా తాత్కాలిక వర్చువల్ ఐడీని యూఐడీఏఐ తీసుకరానుంది. వ్యక్తిగత వివరాలను వెల్లడించకుండా ఉండే సదుపాయం కల్పించే దిశగా చర్యలు తీసుకొనే అవకాశం ఉంది. 16 అంకెల వర్చువల్ ఐడీతో ఆధార్ ఆధారిత సేవలను మార్చి చివర్లోగా అందుబాటులోకి తీసుకొచ్చే యోచిస్తోంది. 

గాంధీ భవన్ అబద్ధాల భవన్ - ఎంపీ బాల్క సుమన్..

హైదరాబాద్ : గాంధీ భవన్ అబద్ధాల భవన్ గా మారిందని ఎంపీ బాల్క సుమన్ పేర్కొన్నారు. రేవంత్ ఆరోపణలు తప్పని నిరూపిస్తే ఏం చేస్తారని ప్రశ్నించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక విద్యుత్ ఉత్పత్తిని 6వేల మె.వా. నుండి 114,913 మె.వా.కు పెంచామన్నారు. యాదాద్రి, భద్రాద్రి ప్లాంట్లు కాంగ్రెస్ వల్లే జాప్యం జరిగిందన్నారు. 

లోకేష్ ఎదుట మహిళల ఆవేదన...

అనంతపురం : పెనుగొండలో మంత్రి లోకేష్ పర్యటించారు. మహిళలు లోకేష్ ను అడ్డుకున్నారు. పెనుగొండలో కీయో కార్ల పరిశ్రమ వచ్చాక ఇంటి యజమానులు అద్దె విపరీతంగా పెంచేస్తున్నారని లోకేష్ ఎదుట మహిళల ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి అద్దెలపై తరువాత మాట్లాడుతానని మంత్రి లోకేష్ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. 

సాగర్ ఎడమ కాల్వలో తండ్రి కొడుకుల గల్లంతు...

నల్గొండ : వేములపల్లి మండలం శెట్టిపాలెం వద్ద సాగర్ ఎడమ కాల్వలో పడి తండ్రి కొడుకులు గల్లంతయ్యారు. వీరు సూర్యాపేట ఇందిరమ్మ కాలనీకి చెందిన చేత వెంకన్న, జగదీష్ గా గుర్తించారు. 

అధికార పార్టీ ఓవర్ యాక్షన్...

ఖమ్మం : జిల్లా కూసుమంచి మండలం మల్లేపల్లిలో అధికార పార్టీ ఓవర్ యాక్షన్ చేసింది. నేతలు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు.మంత్రి తుమ్మల పీఏ ధర్మ రాజును గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇప్పటికే ఎన్నికల బరిలో నుండి టిడిపి, కాంగ్రెస్ అభ్యర్థులు తప్పుకున్నారు. 

19:06 - January 10, 2018

టుడే అవర్ రీసెంట్ రిలీజ్ లో ఉన్న సినిమా 'అజ్ఞాతవాసి'. 'పవన్ కళ్యాణ్' హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ నుండి కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్ గా తెరకెక్కిన సంక్రాంతి ఫెస్టివల్ స్పెషల్ ఫిలిం 'అజ్ఞాతవాసి' సినిమా. ఈ సినిమా ఇవాళ్టి 'నేడే విడుదల' రివ్యూ టైం లో ఉంది. రైటర్ గా తన టాలెంట్ ప్రూవ్ చేసుకొని డైరెక్షన్ లో కూడా సూపర్ హిట్ సినిమాలతో హిట్ ట్రాక్ లో ఉన్న డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వచ్చిన ఫామిలీ ఎంటర్టైనర్ ఈ 'అజ్ఞాతవాసి' సినిమా. పంచ్ డైలాగ్స్ తో సినిమాని కామెడీ టచ్ తో నడిపించే త్రివిక్రమ్ 'అజ్ఞాతవాసి' సినిమాని కూడా ఎంటెర్టైనేమేంట్ అండ్ యాక్షన్ తో పాటు గ్లామర్ లవ్ ఫీల్ ఉన్న కధగా రెడీ చేసాడు. మెగా ఫామిలీ నుండి వచ్చిన స్టార్ హీరో పవన్ కళ్యాణ్. సెలెక్టివ్ గా స్టోరీలను ఒకే చేస్తూ సినిమాల విషయంలో జాగర్త పడుతూ ఆడియన్స్ కి దగ్గరౌతున్నాడు. కానీ తన ప్రీవియస్ ఫిలిమ్స్ ప్రేక్షకులను కొంచం నిరాశకు గురిచేయడంతో 'అజ్ఞాతవాసి' సినిమాని కేర్ ఫుల్ గా హేండిల్ చేసాడు అని టాక్. 'అజ్ఞాతవాసి' సినిమాలో ఒక ఉన్నత కుటుంబం నుండి వచ్చిన వ్యక్తిగా అలరించాడా లేదా అనేది ఆన్ స్క్రీన్ మీద చూడాల్సిందే.

'అజ్ఞాతవాసి' సినిమాలో గ్లామర్ కి ఏమి తక్కువ లేదు. త్రివిక్రమ్ రెగ్యులర్ ఫార్ములా ఇద్దరు హీరోయిన్స్ ఈ సినిమాలో కూడా కనిపిస్తారు. ఈ మధ్య కాలంలో హిట్ సినిమాలతో సందడి చేస్తూ తన అందంతో అభినయంతో తెలుగు ఆడియన్స్ కి బాగా రీచ్ అయిన హీరోయిన్ కీర్తి సురేష్, గ్లామర్ రోల్స్ లో అస్సలు తగ్గని అను ఇమ్మాన్యుయేల్ ఇద్దరూ పవన్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.

సినీ ఇండస్ట్రీనీ తెలుగు పండగలని వేరు చేసి చూడలేము. పండగ వచ్చింది అంటే కచ్చితంగా ఒక స్టార్ హీరో బొమ్మ థియేటర్ లో పడాల్సిందే. అందులోనూ సంక్రాంతి బరిలో సినిమా రిలీజ్ కి ఉంది అంటే ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. సంక్రాంతి లాంటి పెద్ద పండుగకు సినిమా రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేసిన త్రివిక్రమ్ - పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి' సినిమా అనుకున్న విధంగానే బెనిఫిట్ షో లతో హడావుడి చేసింది.

పండగ బరిలో హీరోగా నిలవాలని ప్రతి స్టార్ హీరో కి ఉంటుంది. ఆ అవకాశాన్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ దక్కించుకున్నాడు. కామన్ ఆడియన్స్ కూడా ఒక పెద్ద సినిమా వస్తే బాగుండు అనుకునే టైం లో మోస్ట్ వెయిటింగ్ మెగా ప్రాజెక్ట్ " అజ్ఞాతవాసి " రిలీజ్ అయింది. ఈ "అజ్ఞాత వాసి" సినిమాపై టెన్ టివి సినీ డెస్క్ తమ రివ్యూ ఇవ్వడానికి ఉన్నారు ఆ రివ్యూ ఇప్పుడు చూద్దాం. ప్రేక్షకుల స్పందనతో పాటు టెన్ టివి సినీ డెస్క్ రివ్యూ కూడా తీసుకున్న తర్వాత "అజ్ఞాతవాసి" సినిమాకి 10టీవీ ఇచ్చే రేటింగ్ తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

18:31 - January 10, 2018

విశాఖపట్టణం : అనాకపల్లిలో ఓ వృద్ఢుడు ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. తండ్రి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడని తెలుసుకున్న కుమారుడికి గుండెపోటు వచ్చింది. వివరాల్లోకి వెళితే..రామానాయుడికి చెందిన భూమి వివాదంలో చిక్కుకుంది. వెబ్ ల్యాండ్ లో మరొకరి పేరిట తన భూమి ఉందని తెలుసుకున్న రామానాయుడు మనోవేదనకు గురయ్యాడు. తన సమస్య పరిష్కరించాలని అధికారులు చుట్టూ తిరిగినా ఫలితం కనబడలేదని సమాచారం. జన్మభూమిలో సైతం ఈ సమస్యకు పరిష్కారం దొరకలేదని తెలుస్తోంది. ఎలాంటి పరిష్కారం కాకపోవడంతో తన భూమి తనకు చెందదనే కారణంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. సొంత భూమిలోనే పురుగుల మందు తాగాడు. వెంటనే స్పందించిన స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు. తండ్రి ఆత్మహత్యాయత్నం చేసుకున్న విషయం తెలుసుకున్న కుమారుడు గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. వీరివురినీ ఆసుపత్రికి తరలించారు. దీనితో ఆ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

వృద్ధుడు ఆత్మహత్యాయత్నం...

విశాఖపట్టణం : జిల్లా అనాకపల్లి (మం) అచ్చెయ్యపల్లిలో వృద్ధుడు ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. భూ వివాదం కారణంగా పురుగుల మందు తాగాడు. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించారు.

 

18:23 - January 10, 2018

చిత్తూరు : ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు మోసం చేశారని వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోసారి విమర్శలు గుప్పించారు. వైసీపీ ఆధ్వర్యంలో నిరుద్యోగులు 'బాబు జాబేదీ'..'ఇంటికో ఉద్యోగం ఇంకెన్నాళ్లీ మోసం' అంటూ ప్ల కార్డులు పట్టుకుని నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ నిరసన ప్రదర్శనలో ఎమ్మెల్యే రోజా పాల్గొని విమర్శలు గుప్పించారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో ఉద్యోగులు వలసలు...ఆత్మహత్యలు ఎంచుకుంటున్నారని, యువతను చైతన్య పరిచేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి తనయుడు లోకేష్ కు మాత్రం మంత్రి పదవి ఇచ్చారని ఎద్దేవా చేశారు. 

18:15 - January 10, 2018

తూర్పుగోదావరి : ప్రజలే ముందు అనే కార్యక్రమం ద్వారా సుమారు రెండు లక్షల మందికి ఆధునిక పరికరాలు అందచేయడం జరుగుతుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ముమ్మడివరంలో ఐదో విడత జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా ముందుకు వెళుతున్నట్లు, పేదల జీవన ప్రమాణాలు పెంచేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా అంటే తనకు అమితమైన అభిమానమని, దేశంలో ఎక్కడా ఇలాంటి సుందరమైన ప్రదేశం లేదని తెలిపారు. ప్రజలకు ఏ కష్టమొచ్చినా తాను అండగా ఉంటానని బాబు మరోసారి పేర్కొన్నారు. అంతకంటే ముందు కాకినాడలో టిడిపి జిల్లా కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. 

18:03 - January 10, 2018

సిరిసిల్ల : యాజమాన్యం వేధింపులు తాళలేక నటరాజ్‌ అనే సూపర్వైజర్ ఆత్మహ్యతకు పాల్పడ్డాడు. సిరిసిల్ల జిల్లా పద్మావతి స్టోన్‌ క్రషర్‌లో గత పదేళ్లుగా సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. గత కొద్దిరోజులుగా యాజమాన్యానికి నటరాజ్‌కి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉదయం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మానేరు బ్రిడ్జిపై నుంచి దూకాడు. గమనించిన స్థానికులు నటరాజ్‌ను స్థానిక జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. 

17:53 - January 10, 2018

హైదరాబాద్ : తెలంగాణ ఆల్‌ పెన్షనర్‌ రిటైర్డ్‌ పర్సన్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నూతన సంవత్సర డైరీని నవ తెలగాణ ఎడిటర్‌ ఎస్‌.వీరయ్య ఆవిష్కరించారు. ప్రభుత్వాల నిర్లక్ష్యం వలన విశ్రాంతి తీసుకోవాల్సిన రిటైర్డ్‌ ఉద్యోగులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ప్రభుత్వం రిటైర్డ్‌ ఉద్యోగుల పెన్షన్‌లలో కోతలు విధించే విధంగా సీసీఎస్‌ విధానాన్ని ప్రవేశపెట్టిందని ఇది ఉద్యోగులకు ప్రమాదకరమన్నారు.

17:52 - January 10, 2018

సంగారెడ్డి : పయనీర్‌ పాఠశాలలో వార్షికోత్సవం ఘనంగా జరిగింది. పర్యావరణ హితాన్ని కోరుతూ చేసిన సాంస్కృతిక నృత్యాలు అదర్నీ అలరించాయి. ఏ మాధ్యమంలో చదివిన పిల్లలైనా సంస్కారం ముందుగా నేర్చుకోవాలని సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి అన్నారు. పర్యావరణం సురక్షితంగా ఉంటేనే అందరం ఆరోగ్యంగా ఉంటామని.. కార్గిల్‌ వార్‌ వెటరన్‌ జిజే రావు అన్నారు. కార్యక్రమానికి హాజరైన వారందరికీ..పర్యావరణాన్ని కాపాడాలంటూ మొక్కలను పంపిణీ చేశారు. 

17:50 - January 10, 2018

ఖమ్మం : అధికారం చేతిలో ఉండడంతో నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం మల్లేపల్లిలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నా యదేచ్చగా ఉల్లంఘిస్తున్నారు. ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో అనేక ప్రలోభాలకు పాల్పడుతున్నారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు మంత్రి తుమ్మల పీఏ ధర్మరాజును అడ్డుకున్నారు. ఇప్పటికే అధికార పార్టీ నేతలు ఎన్నికల బరి నుంచి టీడీపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులను బలవంతంగా విత్‌డ్రా చేయించారు.

ధర్మరాజు వాహనాన్ని అడ్డుకున్నా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలున్నాయి. సర్వసాధారణమైన ఎంపీటీసీ ఎన్నికపై కూడా అధికార పార్టీకి చెందిన నేతలు ప్రలోభాలకు దిగడం సర్వత్రా చర్చనీయాంశమైంది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

17:47 - January 10, 2018

ఢిల్లీ : హైదరాబాద్‌లో నిర్మిస్తున్న ఫార్మాసిటీని నేషనల్‌ ఇన్వెస్టిమెంట్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ జోన్‌గా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌... ఢిల్లీలో కేంద్ర వాణిజ్య మంత్రి సురేశ్‌ ప్రభుతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. వచ్చే నెలలో స్విట్జర్లాండ్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరు కావాలని కేటీఆర్‌ను సురేశ్‌ ప్రభు ఆహ్వానించగా.. మంత్రి ఒప్పుకున్నారు. విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌తో కూడా కేటీఆర్‌ భేటీ అయ్యారు. గల్ఫ్‌ బాధితుల సమస్యలపై చర్చించారు.

17:45 - January 10, 2018

 కరీంనగర్ : రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణకు నిధుల గండం పొంచివుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మొత్తం 5 వేల 600 కోట్ల రూపాలయ వ్యయంతో పునర్నిర్మాణం జరుగుతున్న ఈ ప్రాజెక్టు ఇంకా బాలారిష్టాలను అధిగమించలేదు. అంచనా వ్యయంలో 74 శాతం పెట్టుబడికి వాటాలు పూర్తయ్యాయి. మిగిలిన 26 శాతం వాటా పెట్టుబడుల కోసం ఎదురుచూపులు తప్పడంలేదు. పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ ప్రశ్నార్థకంగా మారుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 

దశాబ్దంన్నర క్రితం మూతపడిన రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ పనులకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. ఎన్నో ఉద్యమాలు, ఆందోళనల తర్వాత పునర్నిర్మానం జరుగుతున్న ఈ ఫ్యాక్టరీ ఇప్పుడు నిధుల కొరతతో సతమతమవుతోంది. రామగుండం ఫెర్టిలైజర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా సంస్థ పేరును రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌గా మార్చి 2015 ఫిబ్రవరి 17న పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయి. చేపట్టిన పనులు ఎప్పుడు పూర్తవుతాయో తెలియని ఆయోమయ పరిస్థితుల్లో సంస్థ అధికారులు కొట్టుమిట్టాడుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం నిధుల కొరత. మొత్తం 5,600 కోట్ల అంచనా వ్యయంలో 74 శాతం పెట్టుబడుల వాటా పూర్తైంది. ఎన్‌ఎఫ్‌ఎల్‌, ఈఐఎల్‌ సంస్థలు 26 శాతం వాటా తీసుకున్నాయి. ఎఫ్‌సీఐ, తెలంగాణ ప్రభుత్వం చెరో 11 శాతం వాటా తీసుకున్నాయి. మిగిలిన 26 శాతం వాటా తీసుకునేందుకు ఏ సంస్థా ముందుకురాకపోవడంతో పునరుద్ధరణపై ప్రభావం చూపుతోంది. రామగుండం ఎవురుల కర్మాగారంలో సింగరేణి సంస్థ తరుపున పెట్టుబడులు పెట్టించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ ప్లాంటు నుంచి ఉప ఉత్పత్తులుగా వచ్చే పేలుడు పదార్థాలను సింగరేణి తీసుకునే విధంగా పెట్టుబడులకు చేపట్టిన చర్యలు సఫలంకాలేదు.

వాటా దారుల కోసం సంస్థ చేస్తున్న ప్రయత్నాలు ఇంకా కొలిక్కిరాలేదు. యూనియా, అమ్మోనియా ప్లాంటు నిర్మాణానికి సాంకేతిక సహకారం అందిస్తున్న డెన్మార్క్‌ కంపెనీలు హాల్దర్స్‌ టాప్స్‌, సైఫమ్‌లను వాటాదారులుగా మార్చేందుకు ఆర్‌ఎఫ్‌సీఎల్‌ యాజమాన్యం చర్యలు చేపట్టింది. ఈ సంస్థలకు చెందిన ముగ్గురు ప్రతినిధుల బృందం గురువారం క్షేత్రస్థాయి పర్యటనకు వస్తున్నాయి. ఈ సందర్భంగా 13 శాతం పెట్టుబడులకు అవగాహన ఒప్పందం కుదిరే అవకాశం ఉందని భావిస్తున్నారు.

అయినా మిగిలిన 13 శాతం వాటా నిధులను ఎక్కడ నుంచి సమకూర్చుకోవాలన్న అంశంపై ఆర్‌ఎఫ్‌సీఎల్‌ అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. విదేశీ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాకపోతే స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రుణమే శరణ్యమవుతుందన్న భావంతో రామగుండం ఎరువుల కర్మాగారం అధికారులు ఉన్నారు. రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణలో జరుగుతున్న జాప్యంపై కేంద్ర ప్రభుత్వం కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ప్లాంటు ప్రారంభానికి మూడు నెలల ముందే గ్యాస్‌ పైప్‌లైన్‌ నిర్మాణాన్ని పూర్తి చేసే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నా... ఈ పనులు కూడా నత్తనడకన నడుస్తున్నాయి. దీంతో రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ ఎప్పటికి పూర్తవుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. 

17:42 - January 10, 2018

హైదరాబాద్ : కేసీఆర్‌ ప్రవేశ పెట్టిన 24 గంటల విద్యుత్‌ వెలుగుల వెనకాల చీకటి కోణం దాగుందన్నారు కాంగ్రెస్‌ పార్టీ నేత రేవంత్‌రెడ్డి. కమీషన్ల కోసమే కేసీఆర్‌ విద్యుత్‌ అడ్డంపెట్టుకొని వేల కోట్లు సంపాదిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ ప్రారంభించాలనుకున్న పవర్‌ ప్రాజెక్టుల గురించి శ్వేతపత్రం విడుదల చేయాలని రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. తెలంగాణాలో విద్యుత్‌ ఉత్పత్తి సంస్థల నిర్మాణం, అందుకోసం తీసుకువస్తున్న అప్పులు, దీని వెనకాల ఉన్న అవినీతి భాగోతం అనే అంశాలపై రేవంత్‌ రెడ్డి వివరించారు. 

అక్రమ కట్టడాల కూల్చివేత...

సంగారెడ్డి : జిల్లా అమీన్‌పూర్‌ గ్రామ పంచాయితీ పరిధిలో అక్రమ కట్టడాలను గ్రామపంచాయితీ సిబ్బంది కూల్చివేశారు. దాదాపు 30 కట్టడాలను గుర్తించిన అధికారులు ఉదయం నుండి పోలీసుల బందోబస్తుతో కూల్చివేతలు చేపట్టారు. నకిలీ పర్మిషన్‌తో డాక్యుమెంట్లు సృష్టించిన వారిపై ఫిర్యాదు చేసినట్టు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. 

 

17:39 - January 10, 2018

సంగారెడ్డి : జిల్లా అమీన్‌పూర్‌ గ్రామ పంచాయితీ పరిధిలో అక్రమ కట్టడాలను గ్రామపంచాయితీ సిబ్బంది కూల్చివేశారు. దాదాపు 30 కట్టడాలను గుర్తించిన అధికారులు ఉదయం నుండి పోలీసుల బందోబస్తుతో కూల్చివేతలు చేపట్టారు. నకిలీ పర్మిషన్‌తో డాక్యుమెంట్లు సృష్టించిన వారిపై ఫిర్యాదు చేసినట్టు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

జైట్లీకి బాబు లేఖ...

విజయవాడ : కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఏపీకి రావాల్సిన ఆర్థిక సాయంపై లేఖలో పేర్కొన్నారు. ఏపీలో చేపడుతున్న ఆరు ప్రాజెక్టులకు రూ. 16,725 కోట్లు నిధులు కేటాయించాలని బాబు కోరారు. నాబార్డు రుణాలు ఏపీ రుణ పరిమితిలో చేర్చవద్దని విజ్ఞప్తి చేశారు. తాగునీటి సమస్యకు రూ. 4,500 కోట్లు, పాత బ్రిడ్జీ మరమ్మత్తులు, కొత్త బ్రిడ్జీల నిర్మాణం కోసం రూ. 3,200 కోట్లు కేటాయించాలని కోరారు. 

17:31 - January 10, 2018

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన 'సంగీత' న్యాయపోరాటం ఇంకా కొలిక్కి రావడం లేదు. తనకు న్యాయం చేయాలని..భర్త శ్రీనివాస్ రెడ్డి..అతని కుటుంబసభ్యులపై చర్యలు తీసుకోవాలని సంగీత డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఆమె శ్రీనివాస్ రెడ్డి ఇంటి ఎదుట ఆందోళన చేపడుతోంది. ఈ సందర్భంగా భర్త శ్రీనివాస్ రెడ్డితో టెన్ టివి ముచ్చటించింది. ఇందులో ఆయన సంచలనాత్మక విషయాలు వెల్లడించారు. సంగీత తన తల్లిదండ్రులపై దాడి చేయడం వల్లే ఆమెపై చేసుకోవడం జరిగిందని ఆనాటి ఘటనపై వివరణనిచ్చారు. పెళ్లి అయిన అనంతరం సంగీత పుట్టింట్లోనే ఉండడం వల్ల విబేధాలు మొదలయ్యాయని, తనకు ముందే పెళ్లి అయిన విషయం సంగీతకు తెలుసని స్పష్టం చేశారు.

దేవీ జగదేశ్వరీని మూడో వివాహం చేసుకోవడం అబద్దమని స్పష్టం చేశారు. ఆమెకు తల్లితో ఉన్న విబేధాల కారణంగా తమింట్లో ఆశ్రయం పొందిందని, ఈ కేసులో సీఐ జగన్నాథరెడ్డి బెదిరిస్తున్నారని ఆరోపించారు. సంగీతతో సెటిల్ మెంట్ చేసుకోవాలని, రాజకీయ వత్తిళ్లు ఉన్నాయని బెదిరిస్తుండడంతో రాచకొండ కమీషనరేట్ లో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. సంగీత తనపై కేసులు విత్ డ్రా చేసుకుంటే ఆమెతో కలిసి ఉంటానని..బిడ్డను తనకిచ్చేస్తే మంచిగా చూసుకుంటానని పేర్కొన్నారు. మహిళా సంఘాలపై తనకు గౌరవం ఉందని, తల్లి..మేనత్త..అక్క సాటి మహిళలు కారా అని ఎదురు ప్రశ్నించారు. అన్ని విషయాలు చెబుతూనే కోర్టులో తేల్చుకుంటామని చెప్పడం గమనార్హం. మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

కల్బుర్గి హత్య కేసుపై సుప్రీంలో పిటిషన్..

ఢిల్లీ : ప్రముఖ సాహితీవేత్త హేతువాది కల్బుర్గి హత్య కేసుపై ఆయన భార్య ఉమాదేవి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కల్బుర్గి హత్య కేసును సిట్ తో దర్యాప్తు చేయించాలని పిటిషన్ దాఖలు చేశారు. కేంద్రానికి..కర్నాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 

సిక్కు అల్లర్ల కేసుపై సుప్రీం సంచలన ఆదేశం..

ఢిల్లీ : 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసుపై సుప్రీంకోర్టు సంచలన ప్రకటన చేసింది. కేసును తిరిగి ప్రారంభించాలని సుప్రీం ఆదేశించింది. 186 మంది సిక్కులపై హత్యాకాండ కేసుల్లో దర్యాప్తునకు ఆదేశించింది. ముగ్గురు సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని పేర్కొంది. 

ఎఫ్ డీఐలను వ్యతిరేకించిన సీపీఎం...

ఢిల్లీ : కీలక రంగాల్లో 100 శాతం ఎఫ్ డీఐలను సీపీఎం పొలిట్ బ్యూరో వ్యతిరేకించింది. కేంద్రం నిర్ణయాలు దేశీయ రిటైల్ మార్కెట్ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతాయని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎఫ్ డీఐలను, విదేశీ సంస్థలను రిటైల్ రంగంలో బీజేపీ వ్యతిరేకించిందని, ఎఫ్ డీఐలపై సరళీకరణ విధానాలను అవలంబిస్తోందని తెలిపారు. ఎయిరిండియాను ప్రైవేటీకరించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు ముమ్మరం చేసిందన్నారు. 

కృష్ణా నది త్రిసభ్య కమిటీ సమావేశం..

హైదరాబాద్ : కృష్ణా నది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం జరిగింది. బోర్డు సభ్య కార్యదర్శి, ఇరు రాష్ట్రాల ఈఎన్ సీలు హాజరయ్యారు. కృష్ణా జిలాల్లో తెలంగాణ 50 టీంఎసీలు, ఆంధ్రప్రదేశ్ 60 టీఎంసీలు వాడుకోవాలని బోర్డు సూచించింది. 

16:35 - January 10, 2018

ఎఫ్ డీఐలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్...

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో వ్యతిరేకించిన ఎఫ్ డీఐలకు ఇప్పుడు బార్లా తెరిచేసింది. ఎఫ్ డీఐ పాలసీ సరళీకరణకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ బ్రాండ్ రిటైల్, నిర్మాణ రంగంలో విదేశీ ప్రత్యేక్ష పెట్టుబడులకు అనుమతినిస్తూ బుధవారం అతి కీలకమైన నిర్ణయం తీసుకుంది.

16:32 - January 10, 2018

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో వ్యతిరేకించిన ఎఫ్ డీఐలకు ఇప్పుడు బార్లా తెరిచేసింది. ఎఫ్ డీఐ పాలసీ సరళీకరణకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ బ్రాండ్ రిటైల్, నిర్మాణ రంగంలో విదేశీ ప్రత్యేక్ష పెట్టుబడులకు అనుమతినిస్తూ బుధవారం అతి కీలకమైన నిర్ణయం తీసుకుంది. కేంద్ర మంత్రివర్గం పలు సవరణలకు ఆమోదం తెలిపింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రభుత్వ అనుమతి లేకుండానే నేరుగా విదేశీ పెట్టుబడులు పెట్టే అవకాశం కల్పించినట్లైంది. 49 శాతం పెట్టుబడులను 100 శాతానికి కేంద్రం పెంచింది. విమానయానం, నిర్మాణ రంగంలాంటి సంస్థల్లో 100 శాతం ప్రత్యక్ష పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎయిర్ ఇండియాలో విదేశీ ఎయిర్ లైన్లు 49 శాతం పెట్టుబడులు పెట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని కాన్ఫడరేషన్ ఫర్ ఆల్ ఇండియా ట్రేడర్స్ వ్యతిరేకించింది. ఈ నిర్ణయంతో రిటైల్ వ్యాపారంలోకి మల్టీ నేషనల్ కంపెనీలు సులువుగా వస్తాయని..ఫలితంగా దేశంలోని చిన్న కంపెనీలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నిర్ణయాన్ని అప్పట్లోనే సీపీఎం తీవ్రంగా ఖండించింది. వివిధ రంగాల్లో వంద శాతం పెట్టుబడులను స్వాగతించిన సంగతి తెలిసిందే. 

ముమ్మడివరంలో 'జన్మభూమి - మా ఊరు'..

తూర్పుగోదావరి : జిల్లాలోని ముమ్మడివరంలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు. పలు వృత్తులకు చెందిన వారు సమస్యలతో బాధ పడుతున్నారని వారి సమస్యలు పరిష్కరించడానికి కృషి చేయడం జరగుతోందన్నారు. 

15:22 - January 10, 2018
15:19 - January 10, 2018

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'..మాటల మాంత్రికుడు 'త్రివిక్రమ్' కాంబినేషన్ లో రూపొందిన 'అజ్ఞాత వాసి'.. చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమాను చూడటానికి అభిమానులు థియేటర్లకు పోటెత్తారు. మరి

సినిమా ఎలా ఉంది ? ప్రేక్షకులను మెప్పించిందా ? అనే దానిపై టెన్ టివి ప్రత్యేక చర్చ చేపట్టింది. ఈ చర్చలో కత్తి మహేష్ (సినీ క్రిటిక్), కృష్ణ సాయిరాం (టెన్ టివి ఇన్ పుట్ ఎడిటర్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ట్రైలర్ చూసిన అనంతరం సినిమాపై నమ్మకం కలిగిందని, సినిమా చూసిన అనంతరం ఆశ కాస్త నిరాశే మిగిలిందని సినిమా క్రిటిక్ 'కత్తి మహేష్' పేర్కొన్నారు. మంచి కథ తీసుకున్నారని..కథలో గమనం లేకపోవడంతో సినిమాను అపహస్యం చేశారన్నారు. ఫ్యాన్స్ ను కూడా పూర్తిగా నిరాశపరిచిందన్నారు. మాస్..ఫ్యామిలీ డ్రామాతో తెరకెక్కించాలని ప్రయత్నించారని, కానీ చిత్ర యూనిట్ కన్ ఫ్యూజ్ అయ్యారని టెన్ టివి ఇన్ పుట్ ఎడిటర్ 'కృష్ణ సాయిరాం' పేర్కొన్నారు. ఇంకా ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారో పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

ఒంటేరు ప్రతాప్ రెడ్డిని రిలీజ్ చేయాలి - మోత్కుపల్లి...

హైదరాబాద్ : ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఫోన్లు ట్యాప్ చేయడం దారుణమని, ప్రశ్నించే వాళ్ల గొంతు నొక్కడం ప్రజాస్వామ్యం కాదని టిటిడిపి నేత మోత్కుపల్లి పేర్కొన్నారు. గురువారం సాయంత్రంలోగా ఒంటేరు ప్రతాప్ రెడ్డిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేసు కొట్టివేయకపోతే ప్రగతి భవన్ ఎదుట ధర్నా చేపడుతామని హెచ్చరించారు.  

ఎన్డీఎంసీ అధికారుల తనిఖీలు..

ఢిల్లీ : ఎన్డీఎంసీ అధికారులు లోధి కాలనీలోని పలు మార్కెట్ లో తనిఖీలు చేపట్టింది. అపరిశుభ్రంగా ఉన్న పలు దుకాణాలను సీజ్ చేసినట్లు తెలుస్తోంది. 

14:52 - January 10, 2018

వినియోగదారులు అంటే అందరూ వినియోగదారుల కిందకే వస్తారని..అనేక రకాల వస్తువులను కొనుక్కోవడం..అనేక సర్వీసులను పొందుతుంటామని లాయర్ పార్వతి పేర్కొన్నారు. వినియోగదారుల చట్టం అంటే ఏమిటీ ? ఈ చట్టం ఏ పరిస్థితుల్లో ఆశ్రయించవచ్చనే దానిపై టెన్ టివి మానవి 'వేదిక'లో లాయర్ పార్వతి పాల్గొని విశ్లేషించారు. డబ్బులు ఇచ్చి వస్తువులను కొనుక్కొనే వారు..డబ్బులు ఇచ్చి సర్వీసులను పొందే వారు వినియోగదారులంటారని తెలిపారు. పూర్తిగా డబ్బు చెల్లించడం..ఇన్ స్టాల్ మెంట్ ద్వారా..ఇతరత్రా దారుల్లో వస్తువులను కొనుక్కోవడం జరుగుతుందని తెలిపారు. నిత్య జీవితంలో అనేక సమస్యలు..మోసాలను ఎదుర్కోవడం జరుగుతుందని పేర్కొన్నారు. అందుకే వినియోగదారుల రక్షణ చట్టం రూపొందించబడిందన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

కాన్పూర్ లో వ్యాపారస్తుల ఆందోళన...

కాన్పూర్ : జీఎస్టీ అమలు విధానాన్ని నిరసిస్తూ కాన్పూర్ లోని స్థానిక వ్యాపారస్తులు నిరసన తెలియచేశారు. చేతులకు సంకెళ్లు వేసుకుని తమ ఆందోళన కొనసాగించారు. 

కేంద్ర మంత్రివర్గ కీలక నిర్ణయాలు...

ఢిల్లీ : కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. నిర్మాణం..సింగిల్ బ్రాండ్ రిటైల్ రంగాల్లో స్వయంచాలిత విధానం కింద వందశాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల అనుమతికి ఆమోదం తెలిపింది. 2020 మార్చి 31 వరకు ఎంపీ ల్యాండ్స్ కొనసాగింపునకు కూడా ఆమోదం తెలిపింది. 

దంపతుల ఆత్మహత్యాయత్నం..భార్య మృతి...

ఖమ్మం : వైరా మండలం గౌండ్లపాలెంలో కుటుంబ కలహాలతో దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. భార్య మృతి చెందగా భర్త గుండ్ల రమేష్ విషమ పరిస్థితిలో చికిత్స పొందుతున్నాడు. 

కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి - గువ్వల బాలరాజు...

హైదరాబాద్ : సంపత్ ను చేర్చుకోవాల్సిన అవసరం లేదని, సంపత్ ద్వంద్వ ప్రమాణాలతో ముందుకు సాగుతున్నారని ఎమ్మెల్యే గువ్వల బాల రాజు పేర్కొన్నారు. సంపత్ పై రేవంత్ ప్రభావం ఉన్నట్టుందని, ఉమ్మడి రాష్ట్రంలో ఆర్డీఎస్ కు జరిగిన అన్యాయంపై కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలన్నారు. 

పోలీసులపైకి తమిళ కూలీల దాడులు...

కడప : సుండుపల్లి, వీరబల్లి, చిన్నమండెం పరిధిలోని అటవీ ప్రాంతాల్లో పోలీసులు దాడులు జరిపారు. పోలీసులపై రాళ్లు..కత్తులతో తమిళ కూలీలు దాడికి యత్నించారు. 28 మంది తమిళ కూలీలను అరెస్టు చేసిన పోలీసులు 30 ఎర్రచందంన దుంగలను స్వాధీనం చేశారు. 

రైతుకిచ్చే రూ. 4వేలపై మంత్రి పోచారం స్పందన...

హైదరాబాద్ : వచ్చే వానాకాలం నుండి రైతులకు ఎకరానికి రూ. 4వేల ఆర్థిక సాయం అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరావు పేర్కొన్నారు. రూ. 4వేలు ఏ విధంగా పంపిణీ చేయాలో సబ్ కమిటీ సమావేశంలో చర్చించడం జరిగిందని, చెక్కు ద్వారా రైతులకిస్తే బాగుంటుందని మెజార్టీ అభిప్రాయం వ్యక్తమైందన్నారు. తుది నివేదికను సీఎం కేసీఆర్ కు అందచేయడం జరుగుతుందని, 626 మండలాల్లో 62,730 రైతుల నుండి సమాచారం సేకరించినట్లు తెలిపారు. భూ సర్వేలో 71 లక్షల 75 వేల మంది రైతులను గుర్తించినట్లు, ఇన్ని ఎకరాల వరకే పెట్టుబడి ఇస్తామనే ఆలోచన లేదన్నారు.

పోలవరం వద్ద రఘువీరా..నేతలు...

పశ్చిమగోదావరి : పోలవరం ప్రాజెక్టును ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా సందర్శించారు. ఆయనతో పాటు పళ్లంరాజు, కిల్లి కృపారాణి, కేవీపీ పలువురు నేతలున్నారు.

 

13:44 - January 10, 2018

హైదరాబాద్ : వచ్చే ఖరీఫ్‌ నుంచి రైతులకు ప్రతి ఎకరానికి 4వేల రూపాయల గ్రాంట్‌ ఇవ్వాలని నిర్ణయించామన్నారు.. తెలంగాణ వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి. హైదరాబాద్‌ ప్రగతి భవన్‌లో క్యాబినెట్‌ సబ్‌కమిటీ రెండో భేటీ జరిగింది. రైతులకు పంట పెట్టుబడి పథకం అమలుపై సబ్‌కమిటీలో చర్చించారు. నగదు పంపిణీ ఎలా ఉండాలన్న దానిపై రాష్ట్రవ్యాప్తంగా 551 మండలాల్లో 621 గ్రామాల్లో రైతుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నామన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రం   రైతులకు చెక్కులు ఇవ్వాలని అభిప్రాయపడినట్టు మంత్రి తెలిపారు. వీటన్నిటీపై ఇవాళ్టి సబ్‌కమిటీ భేటీలోచర్చించామన్నారు. సబ్‌కమిటీ నిర్ణయాన్ని ముఖ్యమంత్రికి వివరిస్తామన్నారు. సీఎం తీసుకునే తుది నిర్ణయం ప్రకారం రైతులకు వ్యవసాయ పెట్టుబడి పథకాన్ని అమలు చేస్తామన్నారు మంత్రి పోచారం. 

 

13:42 - January 10, 2018

పశ్చిమగోదావరి : ప్రజలే వార్తలుగా .. ప్రజాసమస్యలను ఎత్తిచూపడంలో టెన్‌టీవీ దూసుకుపోతోందన్నారు.. మంత్రి జవరహర్‌. పశ్చిమగోదావరిజిల్లా ద్వారకాతిరుమల మండలం  మారంపల్లిలో  టెన్‌టీవీ కేలండర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈసందర్భంగా ద్వారకా తిరుమల దేవస్థానం కమిషనర్ త్రినాథరావు టెన్‌టీవీ కేలండర్‌ను భక్తులకు అందించారు.  ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు, జిల్లాపరిషత్‌ చైర్మన్‌ కనుమూరి బాపిరాజు కలెక్టర్‌ భాస్కరావు తదితరులు పాల్గొన్నారు. 

 

13:41 - January 10, 2018

కృష్ణా : బెజవాడలో ప్రభుత్వ ఆస్తులు, స్థలాలు ప్రైవేటు పరం కాబోతున్నాయా? కోట్లాది రూపాయలు విలువ చేసే భవంతులను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు టీడీపీ సర్కార్ సిద్ధమౌతోందా?  ఇప్పుడు ఇదే అంశంపై ప్రజలు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు తీవ్ర స్ధాయిలో మండిపడుతున్నాయి. ఉద్యమించడానికి సిద్ధమవుతున్నాయి. 

విజయవాడలోని బందర్‌, ఏలూరు రోడ్లలోని ప్రముఖ ప్రాంతాల్లో ప్రభుత్వ ఆస్తులు ప్రైవేటు పరం కాబోతున్నాయి. కోట్ల విలువైన ఆర్టీసీ స్థలాలు, డిపోలు మొదలుకొని పాత డీజీపీ కార్యాలయం, గుణదలలోని విద్యుత్ సౌధ, పీడబ్ల్యూడీ గ్రౌండ్, స్టేట్ గెస్ట్ హౌస్, మున్సిపల్ కార్యాలయం, నగరపాలక సంస్థ కార్యాలయం, పాలక మండలి సమావేశ మందిరం, మున్సిపల్ రోడ్డు, రాజీవ్ గాంధీ పార్క్, పాత పోలీస్ క్వార్టర్స్, హోల్ సేల్ కూరగాయల మార్కెట్..  ఇలా అనేక ఎకరాల ప్రభుత్వ భూములను పర్యాటకాభివృద్ధి ముసుగులో ప్రైవేట్ సంస్థల పేరిట బినామీలకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. . 

తాజాగా బందరు రోడ్ లోని జిల్లా పరిషత్తుకు చెందిన జెడ్పీ అతిథి గృహం స్థలాన్ని ఏపీటీడీసీకి లీజుకు  కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అతిథి గృహం ఆవరణలోని 5వేల 131 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న స్థలాన్ని లీజుకు కేటాయిస్తూ పంజాయతీరాజ్ శాఖ 2018 జనవరి 8వ తేదీన జీవో నెంబర్ 2ను విడుదల చేసింది. అయితే మూడేళ్లకు లీజు ఇవ్వగా, 33 ఏళ్ల లీజుకు ఇస్తూ జీవో జారీ చేయడం విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ అతిధి గృహం స్థలాన్ని పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్మాణమౌతున్న ఓ స్టార్ హోటల్‌కు కేటాయించారు. బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు చెందిన సంస్థ ఈ స్టార్  హోటల్ ను నిర్మిస్తోంది. గత పదేళ్లుగా అసంపూర్తిగా ఈ హోటల్ నిర్మాణం వాస్తు దోషం కారణంగా మధ్యలోనే నిలిచిపోయింది.  జెడ్పీలో తీర్మానం చేసి పంపాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతో మళ్లీ ఈ ఫైల్‌ను కదిపారు. కమిషనర్ స్వయంగా ఆదేశించడంతో ఇటీవల జిల్లా పరిషత్తు పాలకవర్గంలో లీజుకి కేటాయిస్తూ చేసిన తీర్మానం ఆమోదించారు. 

మరోవైపు నదీ ముఖ ద్వార పర్యాటక ప్రాజెక్టులు, సిటీ స్క్వేర్, స్టార్ హోటళ్ల పేరిట నగరం నడిబొడ్డున, కృష్ణానది తీరంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, ఖాళీ స్థలాలను ప్రభుత్వం కైంకర్యం చేస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పంచాయతీరాజ్, నగరపాలక సంస్థల చట్టం ప్రకారం స్థానిక సంస్థల పాలకమండళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం  వాస్తవంగా జోక్యం చేసుకోకూడదు. అందుకు విరుద్ధంగా ఉన్నతస్థాయిలో భూ వినియోగ మార్పిడి చేయాలని ఆదేశాలు జారీ చేయించడంపై  ప్రతిపక్షం, వామపక్షాలు, ప్రజా సంఘాలు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలపై భగ్గుమన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం తాను అనుసరిస్తున్న చర్యలు మానుకోవాలని, ప్రజలకు చెందిన స్థలాలు, కార్యాలయాలు ఇతరులకు ఇవ్వకూడదని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే భవిష్యత్‌లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరిస్తున్నాయి. 

జోయలుక్కాస్‌ జువెలరి షాపుల్లో కొనసాగుతున్న ఐటీ దాడులు

ఢిల్లీ : జోయలుక్కాస్‌ జువెలరి షాపుల్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ట్యాక్స్‌ ఎగవేత ఆరోపణలతో  దేశవ్యాప్తంగా ఏకకాలంలో జోయలుక్కాస్‌ షాపులపై దాడులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోనూ జోయలుక్కాస్‌ జువెలరీ షాపులపై ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి. షాపులు మూసేసి లోపలే తనిఖీలు అధికారులు నిర్వహిస్తున్నారు. 

నిప్పంటించుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

విశాఖ : పెందుర్తిలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. పెందుర్తి పోలీస్టేషన్‌ ఎదురుగా మహాలక్ష్మీనాయుడు అనే వ్యక్తి ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని  నిప్పుపెట్టుకున్నాడు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు, పోలీసులు మంటలు ఆర్పారు. తీవ్రగాయాలతో ఉన్న మహాలక్ష్మినాయుడును విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అయితే గతంలో భార్యతను క్రికెట్‌బ్యాట్‌తో హతమార్చిన కేసులో మహాలక్ష్మినాయుడు నిందితుడిగా ఉన్నాడు. కేసు దర్యాప్తు సాగుతుండగానే మహాలక్ష్మినాయుడు ఆత్మహత్యయత్నించాడు.  

 

13:23 - January 10, 2018
13:19 - January 10, 2018
13:17 - January 10, 2018

చిత్తూరు : జోయలుక్కాస్‌ జువెలరి షాపుల్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ట్యాక్స్‌ ఎగవేత ఆరోపణలతో  దేశవ్యాప్తంగా ఏకకాలంలో జోయలుక్కాస్‌ షాపులపై దాడులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోనూ జోయలుక్కాస్‌ జువెలరీ షాపులపై ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి. షాపులు మూసేసి లోపలే తనిఖీలు అధికారులు నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

13:14 - January 10, 2018

విశాఖ : పెందుర్తిలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. పెందుర్తి పోలీస్టేషన్‌ ఎదురుగా మహాలక్ష్మీనాయుడు అనే వ్యక్తి ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పుపెట్టుకున్నాడు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు, పోలీసులు మంటలు ఆర్పారు. తీవ్రగాయాలతో ఉన్న మహాలక్ష్మినాయుడును విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అయితే గతంలో భార్యతను క్రికెట్‌బ్యాట్‌తో హతమార్చిన కేసులో మహాలక్ష్మినాయుడు నిందితుడిగా ఉన్నాడు. కేసు దర్యాప్తు సాగుతుండగానే మహాలక్ష్మినాయుడు ఆత్మహత్యయత్నించాడు.  

 

13:07 - January 10, 2018

చిత్తూరు : తిరుమతి ఎస్వీ యూనివర్సిటీ ఏఈ రుద్రకుమార్‌ ఇళ్లపై ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. మొత్తం 6చోట్ల ఏకకాంలో తనిఖీలు  నిర్వహించిన అధికారులు... పెద్దమొత్తంలో అక్రమ ఆస్తులను గుర్తించినట్టు తెలుస్తోంది. ఏఈ రుద్రకుమార్‌  భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు ఆరోపణల నేపథ్యంలో దాడులు నిర్వహిస్తున్నారు. 

 

13:05 - January 10, 2018

అనంతపురం : పవన్ కల్యాణ్ అజ్ఞాతవాసి సినిమా రిలీజ్ సందర్భంగా అనంతపురానికి  చెందిన ఆయన అభిమాని వినూత్నంగా అభిమానం చాటుకున్నాడు. ముదిరెడ్డిపల్లికి చెందిన ఆనంద్‌ పట్టుచీరపై పవన్ కల్యాన్‌ రూపాన్ని చిత్రించి అందరినీ ఆకట్టుకున్నాడు. రెండురోజుల పాటు శ్రమించి ఈ చీరను తయారు చేసినట్లు ఆనంద్ చెప్పాడు. తయారు చేయడానికి రూ.25 వేలు ఖర్చు అయ్యిందని.. త్వరలోనే చీరను పవన్ కల్యాణ్‌కు అందిస్తానని ఆనంద్ చెప్పాడు. 
పవన్‌పై వినూత్నంగా అభిమానం చాటుకున్న అనంతపురం అభిమాని

 

13:02 - January 10, 2018

చిత్తూరు : జోయలుక్కాస్‌ జువెలరి షాపుల్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ట్యాక్స్‌ ఎగవేత ఆరోపణలతో  దేశవ్యాప్తంగా ఏకకాలంలో జోయలుక్కాస్‌ షాపులపై దాడులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోనూ జోయలుక్కాస్‌ జువెలరీ షాపులపై ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి. షాపులు మూసేసి లోపలే తనిఖీలు అధికారులు నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

పూడూరులో జన్మభూమికి బ్రేక్

కర్నూలు : జిల్లాలో జన్మభూమి...మా ఊరు కార్యక్రమానికి బ్రేక్ పడింది. పూడూరులో జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులను అధికారులు ఎండలో కూర్చొబెట్టారు. దీంతో జన్మభూమి కార్యక్రమాన్ని స్థానికులు అడ్డుకున్నారు. 

12:55 - January 10, 2018

కామారెడ్డి : జిల్లాలో ఇసుక మాఫియా చెలరేగిపోతోంది. అడ్డొచ్చిన వారిపై భౌతిక దాడులకు దిగడమే కాకుండా మట్టుబెడుతున్నారు. మొన్న పిట్లం మండలం కారేగాం శివారులో ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్న వీఆర్‌ఏ సాయిలుపై అదే వాహానం ఎక్కించి చంపేశారు. ఇసుక మాఫియాకు అధికార పార్టీ అండదండలతో పోలీసులు కూడా కేసును తప్పు దోవ పట్టిస్తున్నారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు.  
చెలరేగిపోతున్న ఇసుక మాఫియా
అనుమతుల ముసుగులో అక్రమ రవాణా
కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాలో ఇసుక మాఫియా చెలరేగిపోతుంది. మంజీర నదిని చిద్రం చేస్తూ.. అనుమతుల ముసుగులో కొంతమంది అనుమతులు లేకుండా మరికొంత మంది అక్రమ రవాణా చేస్తున్నారు. ప్రభుత్వానికి భారీగా గండి కొడుతూ... కోట్ల రూపాయలను సంపాదిస్తున్నారు. ప్రభుత్వ అనుమతుల ముసుగులో వే బిల్లుపై కనీసం మూడు నుండి నాలుగు ట్రిప్పుల ఇసుకను అక్రమంగా తరలిస్తు సొమ్ము చేసుకుంటున్నారు. రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ లేకపొవటంతో వీరి ఆగడాలకు అడ్డు లేకుండా పోతోంది.
అడ్డొస్తే హతమారుస్తున్న ఇసుక మాఫియా
ఉమ్మడి జిల్లాల్లో ట్రాక్టర్లు, ట్రిప్పర్లతో ఇసుకను తరలిస్తున్నారు. రాత్రికి రాత్రే అక్రమంగా ఇసుకను తరలిస్తూ... అడ్డు వచ్చిన వారిని అదే ట్రాక్టర్‌, టిప్పర్లను ఎక్కించి హతమారుస్తున్నారు. తాజాగా పిట్లం మండలం కారేగావ్‌ శివారులో ఇసుక ట్రాక్టరును అడ్డుకున్న వీఆర్ఏ సాయిలును గుద్దటంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన స్థానికంగా కలకలకం సృష్టించింది. ఇసుక ట్రాక్టర్‌ స్థానిక అధికార పార్టీ నేతలు కావటంతో కేసును తప్పు దొవ పట్టించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసులు సైతం వీఆర్ఏ ను ఢీకొట్టింది ఇసుక ట్రాక్టర్ కాదని ఇటుక ట్రాక్టరంటూ కేసును తప్పు దొవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని.. మృతుని కుటుంబీకులు ఆరోపిస్తూన్నారు.
ఇసుక మాఫియాకు బలైన అభాగ్యులు
ఇసుక మాఫియా తాకిడికి కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాలో చాలా మంది అభాగ్యులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. ఇసుక మాఫియా తమ దందాకు ఎవరు అడ్డొచ్చిన.. వారిని ట్రాక్టర్లతో టిప్పర్లతో  ఢీకొట్టించి చంపేస్తూ.. సెటిల్‌మెంట్‌కు తెరతీస్తున్నారు. వీఆర్‌ఏ సాయిలు తలకు కూడా వారు వెలకట్టారని తెలుస్తోంది. మృతుని కుటుంబానికి రెండున్నర లక్షలు ఇస్తామని.. మృతుని కుటుంబాన్ని మచ్చిక చేసుకొని.. ఏలాగైనా ఈ కేసు నుండి బయట పడాలని చూస్తున్నారని స్థానికులు ఆరొపిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో  2016-17లో 119 కేసులు నమోదు కాగా 12లక్షల 98వేలకు పైగా జరిమానాలు విధించారు. 2017లో 148 కేసుల్లో రూ.25లక్షలకు పైగా జరిమానాలు విధించారు.
ఇసుకాసురుల వెనుక అధికార పార్టీ నేతలు
నిజామాబాద్‌ జిల్లాలొని కొన్ని ప్రాంతాల్లో గ్రామాభివృద్ధి కమిటీలు రంగంలోకి దిగి... ఇసుక అక్రమ రవాణా దారుల నుండి ట్రిప్పుకు 100 నుండి వెయ్యి రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో క్వారీలకు అనుమతులు ఇవ్వకున్నా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. వీరిని అడ్డుకునే వారు లేకపోవడంతో రెవెన్యూ అధికారులు వెళ్లగా ఇసుక మాఫియాపై దాడులకు పాల్పడుతున్నారు. వీరికి అధికార పార్టీ నేతలు కొందరు కొమ్ముకాస్తుండటంతో.. వీరిని అడ్డుకునే వారు కరువయ్యారు. 
150 ట్రిప్పులు అక్రమంగా తరలింపు
నాళేశ్వర్‌ వాగు నుండి నిజామాబాద్‌ అర్బన్‌లో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణానికి..నిజాంసాగర్‌ కాలువల ఆధునీకీకరణ పనులకు రోజు 60 టిప్పర్ల ఇసుక కేటాయించగా.. అక్రమంగా 150 ట్రిప్పుల ఇసుకను తరలిస్తున్నారు. మోర్తాడ్‌ మండలం సుంకెట్‌ దర్మొరా సమీపంలో కొందరు ముఠాగా ఏర్పడి ట్రాక్టర్‌కి వెయ్యి రూపాయలను వసూలు చేస్తున్నారు. దర్పలల్లి మైలారం వాగు నుండి అనధికారికంగా 20 ట్రిప్పులు తరలిపోతోంది. ఒక్కో ట్రిప్పుకు 600 చొప్పున గ్రామానికి చెందిన కొందరు ముఠాగా ఏర్పడి ఇప్పటి వరకు సుమారుగా 40 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇది కామారెడ్డి నిజామాబాద్ జిల్లలొ జరుగుతున్న ఇసుక మాఫియా తీరు. మొత్తానికి అధికార పార్టీ నేతల అండదండలతో ఇసుక మాఫియా కామారెడ్డి, నిజామాద్‌ జిల్లాలో చెలరేగిపోతున్నారు. అడ్డొచ్చిన వారిని హతమారుస్తూ.. దందా కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరుస్తుందా లేదా అనేది వేచి చూడాలి..

12:38 - January 10, 2018

కర్నూలు : జిల్లాలోని చెన్నంపల్లి కోటలో 27 రోజులుగా గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నా ఏ ఫలితం దక్కలేదు. ఇప్పుడు మళ్లీ పాతాళగంగ టార్గెట్‌గా తవ్వకాలు మొదలుపెట్టారు. పాతాళగంగను దాటి కిందకు వెళ్తే నిజంగానే గుప్తనిధులు ఉన్నాయా? గుప్తనిధిని చేరుకునే మార్గం ఇదేనా? వాచ్‌ ది స్టోరి. 
పాతాళ గంగలోపల గుప్త నిధులు 
రాతిపై మూడు తలల నాగు పాము... ముందుకెళ్తే 11 మంది దేవతామూర్తుల ప్రతిమలు.. బొమ్మలు దాటుకుని ముందుకెళ్తే పాతాళగంగ... కర్నూలు జిల్లా చెన్నంపల్లి కోట రెండవవైపు ఉన్న ఈ పాతాళ గంగలోపల గుప్త నిధులు ఉన్నాయని ఇప్పుడు జోరుగా ప్రచారం జరుగుతోంది. చెన్నంపల్లి కోటలో గుప్త నిధుల కోసం 27 రోజులుగా  తవ్వకాలు జరిపారు. క్యావిటీ స్కానర్లు, జీపీఎస్ స్కానర్లతో భూమిలో క్యావిటీల కోసం వెతికారు. భూమి లోపలికి 30 అడుగుల లోతు వరకూ తవ్వినా ఫలితం దక్కలేదు. ఇప్పుడు కొత్తగా కోట రెండవవైపు ఉన్న పాతాళ గంగ బావి దగ్గర తవ్వకాలు మొదలుపెట్టారు.
గుప్త నిధులు దొరుకుతాయో? 
ప్రస్తుతం పాతాళ గంగలో ఉన్న నీటిని మోటార్ ద్వారా బయటకు తోడేస్తున్నారు. ఈ బావిలో 11 మెట్లు ఉంటాయని... తరువాత సొరంగం ఉంటుందని.. ఆ సొరంగం ద్వారా ముందుకు వెళ్తే నిధిని చేరుకుంటామని స్ధానికులు నమ్ముతున్నారు. ఈ తవ్వకాల్లో అందరూ అనుకుంటున్నట్లు గుప్త నిధులు దొరుకుతాయో? ప్రభుత్వానికి ఖర్చు, శ్రమే మిగులుతుందో వేచి చూడాలి. 

 

12:33 - January 10, 2018

హైదరాబాద్ : సినిమా హాళ్ళలో దోపిడీ అనేది బహిరంగ రహస్యం.... దాన్ని నిర్ధారించడానికి ప్రత్యేకంగా త్రీమెన్‌ కమిటీని నియమించింది బల్దియా.. కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా... దోపిడి నిజమే అంటూ నివేదిక ఇచ్చింది ఆ కమిటీ... చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మాత్రం అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారు.  థియేటర్లలో నిలువు దోపిడీపై టెన్‌టీవీ స్పెషల్‌ స్టోరీ..
ప్రశ్నించిన వారిపై థియేటర్ల యాజమాన్యాలు దాడులు 
గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో ప్రజలకు వినోదం కోసం... 200లకు పైగా సినిమా థియేటర్లు, మ‌ల్టీ ప్లెక్సులు ఉన్నాయి. వీటిలో ప్రతి రోజూ కనీసం ల‌క్షమంది దాకా సినిమాలు చూస్తుంటారు. వినోదం కోసం వచ్చిన ప్రేక్షకులను థియేటర్‌ యాజమాన్యాలు నిలువుదోపిడీ చేస్తున్నాయి. టికెట్ రుసుంతో పాటు... తినుబండారాలు, కూల్ డ్రింక్స్, పార్కింగ్ పేరుతో  అడ్డంగా దోచుకుంటున్నాయి. నిబంధనల‌కు పాత‌రేసి..  అధిక ధ‌ర‌ల‌ను వ‌సూలు చేస్తున్నాయి. ఇందేంట‌ని ప్రశ్నించిన వారిపై దాడుల‌కు సైతం థియేటర్ల యాజమాన్యాలు వెనుకాడ‌టం లేదు.  
థియేటర్లలో అక్రమాలపై హెచ్చరించిన బల్దియా
సినిమా థియేటర్లలో అక్రమాలకు పాల్పడితే తాటతీస్తామని బల్దియా హెచ్చరించింది. టికెట్లు కానీ... తినుబండారాలు కానీ... అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తప్పవంది. బీ కేర్‌ ఫుల్‌... అంటూ బీరాలు పలికింది. సినిమా థియేటర్లో జరుగుతున్న దోపిడీపై త్రీమెన్‌ కమిటీని కూడా వేసింది. 
దోపిడీ నిజమే : త్రీమెన్‌ కమిటీ
థియేటర్లపై అధ్యయనానికి ఏర్పాటైన కమిటీ  కొంత ఆలస్యంగానైనా నివేదికను అందించింది.  థియేటర్ల యాజమాన్యాలు  ప్రేక్షకులను దోచుకుంటున్నాయన్న  విషయాన్ని నొక్కి చెప్పింది. థియేటర్లలో చట్టవిరుద్ధ చర్యలను కళ్ళకు కట్టినట్లు వివరించింది త్రీమెన్‌ కమిటీ.
చట్టప్రకారం పార్కింగ్ ఫీజు వ‌సూలు చెయ్యకూడదు 
చట్టప్రకారం థియేటర్లలో పార్కింగ్ ఫీజు వ‌సూలు చెయ్యకూడదు. కానీ  వారు  థియేటర్లు మాత్రం ఈ నిబంధనను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. వాహన పార్కింగ్‌ను ఆదాయ మార్గంగా మలచుకున్నాయి.  టూ వీలర్, ఫోర్ వీలర్, సైకిల్ ఇలా ఒక్కో వాహనానికి ఒక్కో లెక్కన పార్కింగ్‌ ఫీజు పేరుతో దోచుకుంటున్నాయి. ఆహార ప‌దార్థాల అమ్మకాల‌ విషయంలోనూ థియేటర్లకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. థియేటర్ల యాజమాన్యాల  దోపిడీని అరికట్టాలని  బ‌ల్దియాకు  త్రీమెన్‌ కమిటీ సూచించింది. అధికారులు తమ అధికారాన్ని ఉపయోగించి చర్యలు తీసుకోవాలని  కోరింది. త్రీమెన్‌కమిటీ నివేదిక ఇచ్చి  ఏడాది కావస్తున్నా....  ఇప్పటికీ  బల్దియా ఏ థియేటర్‌పైనా చర్యలు తీసుకున్నది లేదు.
ఫీజు వసూలుకు సిద్ధపడిన జీహెచ్‌ఎంసీ
థియేటర్లనుంచి ఆస్తి ప‌న్నుతోపాటు..  ట్రేడ్ లై సెన్స్ ఫీజు కూడా వసూలు  చెయ్యాల‌ని  జీహెచ్ఎంసీ భావించింది. ఐతే దీనిపై  థియేటర్‌ యజమానులు కోర్టుకు వెళ్ళారు. దీంతో స‌మ‌స్య మ‌ళ్లీ మొద‌టికి వచ్చింది. అధికారులు బాధ్యతగానూ... తెలివిగానూ వ్యవ‌హ‌రిస్తే బ‌ల్దియాకు ఆదాయంతో పాటు.... ప్రేక్షకుల జేబుకు ప‌డుతున్న చిల్లును కూడా అరిక‌ట్ట వచ్చని పలువురు సూచిస్తున్నారు. 

12:22 - January 10, 2018

వాషింగ్టన్ : అమెరికాలోని విదేశీ ఐటీ నిపుణులు... ముఖ్యంగా భారతీయులకు ఊరట కలిగించే నిర్ణయాన్ని అమెరికా ప్రభుత్వం తీసుకుంది. వేలాది మంది హెచ్..1బీ వీసాదారులను యూఎస్‌ నుంచి వెనక్కి పంపే ప్రతిపాదనలను ట్రంప్‌ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. అమెరికా సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌  సర్వీసెస్‌ విభాగం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. దీంతో అమెరికాలో శాశ్వత నివానికి అనుమతి ఇచ్చే  గ్రీన్‌ కార్డు కోసం వేచిచూస్తున్న అక్కడి భారతీయ హెచ్..1బీ వీసాదారులకు ఊరట లభిస్తుంది.
వెనక్కి తగ్గిన ట్రంప్‌ ప్రభుత్వం  
అమెరికాలో పనిచేసే విదేశీ వృత్తి నిపుణులకు ఇచ్చే హెచ్‌1బీ వీసాలపై ఆంక్షలు విధించాలన్న నిర్ణయంపై ట్రంప్‌ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. వీసా పొడిగింపు నిరాకరించి, వేలాది మంది హెచ్‌1బీ వీసాదారులను బలవంతంగా అమెరికా నుంచి వెనక్కి పంపాలనే నిబంధనను పరిగణలోకి తీసుకోలేదని అమెరికా సిటిజన్‌ షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ విభాగం ప్రకటించింది. 
హెచ్‌1బీ వీసా ఎన్నిసార్లైనా పొడిగించుకునే అవకాశం
విదేశీ వృత్తి నిపుణులకు ఇచ్చే హెచ్‌1బీ వీసాల పొడిగింపుకు రెండుసార్లకు పరిమితం చేయాలన్న ప్రతిపాదనలను ట్రంప్‌ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. దీంతో ఈ వీసాలను ఎన్నిసార్లైనా పొడిగించుకునే అవకాశం కొనసాగుతుంది. విదేశీ వృత్తి నిపుణులను తాత్కాలిక ప్రాతిపదికన అమెరికా రప్పించేందుకు అమెరికా కాంగ్రెస్‌ 2000 సంవత్సరంలో కాంపిటీటివ్‌నెస్‌ ఇన్‌ ట్వంటీఫస్ట్‌ సెంచరీ చట్టం చేసింది. గ్రీన్‌ కార్డు దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా వీసాను ఎన్నిసార్లైనా పొడిగించుకునే అవకాశం ఈ చట్టంలో ఉంది.  పదిహేడేళ్లుగా అమలవుతున్న ఈ చట్టాన్ని సవరిస్తామని 2016 అధ్యక్ష ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ట్రంప్‌ దీనికి సవరణలు ప్రతిపాదించారు. బై అమెరికన్‌, హై అమెరికా విధానాన్ని తీసుకొచ్చి, అమెరికా పౌరులకే ఉద్యోగాలు ఇవ్వాలన్నారు.  అమెరికా ఐటీ దిగ్గజ సంస్థలతోపాటు, యూఎస్‌ చాంబర్ ఆఫ్ కామర్స్‌ కూడా ఈ సవరణలను వ్యతిరేకించింది. ట్రంప్‌ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే అమెరికా వృత్తి నిపుణుల కొరత ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఆందోళన వ్యక్తమైంది. వీసా పొడిగింపు ఆంక్షలు అమల్లోకి వస్తే అగ్రరాజ్యం ఆర్థికంగా దివాలాతీసే ప్రమాదం ఉందన్న నిపుణులు హెచ్చరించారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న ట్రంప్‌ ప్రభుత్వం హెచ్‌1బీ వీసాల పొడిగింపుపై  ఆంక్షలు విధించాలన్న ప్రతిపాదనలపై వెనక్కి తగ్గింది. ఈ నిర్ణయం వల్ల అమెరికాలో ఉంటున్న దాదాపు 5 నుంచి ఏడున్నర లక్షల మంది  భారతీయులకు ఊరట లభిస్తుంది. ట్రంప్‌ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై అమెరికాలోని విదేశీ వృత్తి నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
 

12:15 - January 10, 2018

నెల్లూరు : జిల్లాలోని అల్లీపురంలో మంత్రి సోమిరెడ్డి ఆయన నివాసంలో 10టీవీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు. క్యాలెండర్ ఆవిష్కరించడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు సోమిరెడ్డి. ప్రజా సమస్యల పరిష్కారంలో 10టీవీ దూసుకుపోతోందని మంత్రి సోమిరెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు. 

 

సచివాలయంలో తెలంగాణ కేబినెట్ సబ్‌ కమిటీ భేటీ

హైదరాబాద్ : సచివాలయంలో తెలంగాణ కేబినెట్ సబ్‌ కమిటీ భేటీ అయింది. వ్యవసాయానికి, రైతులకు సహాయం అందించే పెట్టుబడి పథకంపై చర్చిస్తున్నారు. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

12:13 - January 10, 2018

హైదరాబాద్ : సచివాలయంలో తెలంగాణ కేబినెట్ సబ్‌ కమిటీ భేటీ అయింది. వ్యవసాయానికి, రైతులకు సహాయం అందించే పెట్టుబడి పథకంపై చర్చిస్తున్నారు. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

12:12 - January 10, 2018

ఎస్వీ యూనివర్సిటీ ఏఈ రుద్రకుమార్‌ ఇళ్లపై ఏసీబీ రైడ్స్

చిత్తూరు : తిరుమతి ఎస్వీ యూనివర్సిటీ ఏఈ రుద్రకుమార్‌ ఇళ్లపై ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. మొత్తం 6చోట్ల ఏకకాంలో తనిఖీలు  నిర్వహించిన అధికారులు... పెద్దమొత్తంలో అక్రమ ఆస్తులను గుర్తించినట్టు తెలుస్తోంది. ఏఈ రుద్రకుమార్‌  భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు ఆరోపణల నేపథ్యంలో దాడులు నిర్వహిస్తున్నారు. 

12:07 - January 10, 2018

చిత్తూరు : తిరుమతి  ఎస్వీ యూనివర్సిటీ ఏఈ రుద్రకుమార్‌ ఇళ్లపై ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. మొత్తం 6చోట్ల ఏకకాంలో తనిఖీలు  నిర్వహించిన అధికారులు... పెద్దమొత్తంలో అక్రమ ఆస్తులను గుర్తించినట్టు తెలుస్తోంది. ఏఈ రుద్రకుమార్‌  భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు ఆరోపణల నేపథ్యంలో దాడులు నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

12:01 - January 10, 2018

హైదరాబాద్ : డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో యాంకర్‌ ప్రదీప్‌ ఇవాళ నాంపల్లి కోర్టుకు హాజరవుతున్నారు. మద్యం సేవించిన కారునడిపిన కేసులో ఏడాదిపాటు లైసెన్స్‌ రద్దయ్యే ఛాన్స్‌ ఉందని లాయర్లు అంటున్నారు.అలాగే 2రోజుల పాటు జైలుశిక్షపడే అవకాశంకూడా ఉందంటున్నారు.  

11:59 - January 10, 2018

హైదరాబాద్‌ : కూకట్‌పల్లిలో ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన యువతి మృతి చెందింది. శ్రీకాకుళం పట్టణానికి చెందిన జానకి.. కూకట్‌పల్లిలో సేల్స్‌గర్ల్‌గా పనిచేస్తోంది. కాగా కొంతకాలంగా ఆనంద్‌ అనే యువకుడు ప్రేమించాలంటూ వేధిస్తున్నాడు. ప్రేమకు నిరాకరించిందన్న కారణంతో జానకిపై కత్తితో దాడిచేశాడు. తీవ్రంగా గాయపడిన జానకి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

11:58 - January 10, 2018

పశ్చిమ గోదావరి : ఏపీ మంత్రి మాణిక్యాలరావు పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో సందడి చేశారు. పవన్‌ అభిమానులతో కలిసి అజ్ఞాతవాసి సినిమాను వీక్షించారు. సినిమా చూసేందుకు వచ్చిన  మంత్రికి థీయేటర్‌ యాజమాన్యం  పూలమాలలతో స్వాగతం పలికారు. థీయేటర్‌ వద్ద పవన్‌ అభిమానుల కోలాహం కనిపించింది. 

 

నాంపల్లి కోర్టుకు హాజరైన యాంకర్ రవి

హైదరాబాద్ : టీవీ యాంకర్ రవి నాంపల్లి కోర్టుకు హాజరైయ్యారు. 'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమా ఆడియో ఫంక్షన్ లో మహిళలపై సినీ నటుడు చలపతిరావు చేసిన వ్యాఖ్యల కేసులో రవిపై అభియోగం ఉంది. తదుపరి విచారణ ఫిబ్రవరి 7 కు వాయిదా వేశారు. 

10:52 - January 10, 2018

హైదరాబాద్‌ : కూకట్‌పల్లిలో ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన యువతి మృతి చెందింది. శ్రీకాకుళం పట్టణానికి చెందిన జానకి.. కూకట్‌పల్లిలో సేల్స్‌గర్ల్‌గా పనిచేస్తోంది. కాగా కొంతకాలంగా ఆనంద్‌ అనే యువకుడు ప్రేమించాలంటూ యువతిని వేధిస్తున్నాడు. జానికి ప్రేమకు నిరాకరించింది. ప్రేమకు నిరాకరించిందన్న కారణంతో అనంద్ జానకిపై కత్తితో దాడిచేశాడు. తీవ్రంగా గాయపడిన జానకి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

విజయవాడలో పవన్ అభిమానుల కోలాహలం

హైదరాబాద్ : ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా అజ్ఞాతవాసి రిలీజ్‌తో థీయేటర్ల వద్ద అభిమానుల కోలాహలం కనిపిస్తోంది. అజ్ఞాతవాసి రిలీజ్‌తో సందర్భంగా విజయవాడలో పవన్ అభిమానులు సందడి చేస్తున్నారు. 

తిరుపతిలో అజ్ఞాతవాసి సందడి

హైదరాబాద్ : ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా అజ్ఞాతవాసి రిలీజ్‌తో థీయేటర్ల వద్ద అభిమానుల కోలాహలం కనిపిస్తోంది. తిరుపతిలో పవన్ అభిమానులు సందడి చేస్తున్నారు. ఏపీలో 7షోలు, తెలంగాణలో 5షోలకు అనుమతి లభించడంతో పవన్‌ అభిమానులకు పండగలా మారింది. పవర్‌స్టార్‌ మూవీ రికార్డులపై దృష్టి పెట్టింది. ప్రపంచవ్యాప్తంగా 2700 థియేటర్లలో రిలీజ్‌ కానుంది. ఓవర్సీస్‌లో 576 థియేటర్లలో విడుదల అజ్ఞాతవాసి కానుంది. 

10:47 - January 10, 2018

హైదరాబాద్ : ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా అజ్ఞాతవాసి రిలీజ్‌తో థీయేటర్ల వద్ద అభిమానుల కోలాహలం కనిపిస్తోంది. అజ్ఞాతవాసి రిలీజ్‌తో సందర్భంగా విజయవాడలో పవన్ అభిమానులు సందడి చేస్తున్నారు. ఏపీలో 7షోలు, తెలంగాణలో 5షోలకు అనుమతి లభించడంతో పవన్‌ అభిమానులకు పండగలా మారింది. పవర్‌స్టార్‌ మూవీ రికార్డులపై దృష్టి పెట్టింది. ప్రపంచవ్యాప్తంగా 2700 థియేటర్లలో రిలీజ్‌ కానుంది. ఓవర్సీస్‌లో 576 థియేటర్లలో విడుదల అజ్ఞాతవాసి కానుంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దా.. 

 

10:45 - January 10, 2018

హైదరాబాద్ : ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా అజ్ఞాతవాసి రిలీజ్‌తో థీయేటర్ల వద్ద అభిమానుల కోలాహలం కనిపిస్తోంది. తిరుపతిలో పవన్ అభిమానులు సందడి చేస్తున్నారు. ఏపీలో 7షోలు, తెలంగాణలో 5షోలకు అనుమతి లభించడంతో పవన్‌ అభిమానులకు పండగలా మారింది. పవర్‌స్టార్‌ మూవీ రికార్డులపై దృష్టి పెట్టింది. ప్రపంచవ్యాప్తంగా 2700 థియేటర్లలో రిలీజ్‌ కానుంది. ఓవర్సీస్‌లో 576 థియేటర్లలో విడుదల అజ్ఞాతవాసి కానుంది. 
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దా..

శ్రీకాళహస్తిలో కత్తిమహేశ్‌ దిష్టిబొమ్మను దగ్ధం

చిత్తూరు : జిల్లాలోని శ్రీకాళహస్తిలో పవన్‌ కల్యాణ్ ఫ్యాన్స్‌ హంగామా చేశారు. సినీ విమర్శకుడు కత్తిమహేశ్‌ దిష్టిబొమ్మను  దగ్ధం చేశారు. కత్తి మహేశ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కత్తి మహేశ్‌ నోరుఅదుపులో పెట్టుకోకుంటే తీవ్ర పరిణామాలు అంటూ హెచ్చరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

10:32 - January 10, 2018

చిత్తూరు : జిల్లాలోని శ్రీకాళహస్తిలో పవన్‌ కల్యాణ్ ఫ్యాన్స్‌ హంగామా చేశారు. సినీ విమర్శకుడు కత్తిమహేశ్‌ దిష్టిబొమ్మను  దగ్ధం చేశారు. కత్తి మహేశ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కత్తి మహేశ్‌ నోరుఅదుపులో పెట్టుకోకుంటే తీవ్ర పరిణామాలు అంటూ హెచ్చరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

10:27 - January 10, 2018

హైదరాబాద్ : ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా అజ్ఞాతవాసి రిలీజ్‌తో థీయేటర్ల వద్ద అభిమానుల కోలాహలం కనిపిస్తోంది. ఏపీలో 7షోలు, తెలంగాణలో 5షోలకు అనుమతి లభించడంతో పవన్‌ అభిమానులకు పండగలా మారింది. పవర్‌స్టార్‌ మూవీ రికార్డులపై దృష్టి పెట్టింది. ప్రపంచవ్యాప్తంగా 2700 థియేటర్లలో రిలీజ్‌ కానుంది. ఓవర్సీస్‌లో 576 థియేటర్లలో విడుదల అజ్ఞాతవాసి కానుంది.  కృష్ణా జిల్లాలో 'కొడుకా కోటేశ్వరరావు' పాటపై వివాదం నెలకొంది. మాచవరం పీఎస్‌లో ఓ న్యాయవాది ఫిర్యాదు చేశారు. పాటతో తమ మనోభావాలు దెబ్బతింటాయని కోటేశ్వరరావు అంటున్నారు. పాటను వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

అజ్ఞాతవాసి రిలీజ్‌

హైదరాబాద్ : ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా అజ్ఞాతవాసి రిలీజ్‌తో థీయేటర్ల వద్ద అభిమానుల కోలాహలం కనిపిస్తోంది. ఏపీలో 7షోలు, తెలంగాణలో 5షోలకు అనుమతి లభించడంతో పవన్‌ అభిమానులకు పండగలా మారింది. 

10:13 - January 10, 2018

యాదాద్రి భువనగిరి : కస్టమర్లకు స్వచ్చమైన పాలు అందించడమే లక్ష్యమన్నారు చరక అమృత్‌ సంస్థ మార్కెటింగ్‌ చైర్మన్‌ రామకృష్ణారెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లోని ఇందిరమ్మ కాలనీలో.. సహజ సిద్దమైన వాతావరణంలో దేశవాళీ ఆవులతో నిర్వహిస్తున్న డైరీని ప్రారంభించారు. స్వతహాగా కొంతమంది రైతులు కలిసి ఈ డైరీని ఏర్పాటు చేసినట్లు రామకృష్ణారెడ్డి తెలిపారు. ఆవుల మేతలో కూడా ఎలాంటి రసాయనాలు ఉపయోగించకుండా... స్వతహాగా తామే పంటలు పండించి దాణా అందిస్తున్నామన్నారు నిర్వాహకుడు గోలి నరేందర్‌రెడ్డి. ఈ పాలను ప్రజలంతా కొనుగోలు చేసి తమకు ప్రోత్సాహం అందించాలని ఈ సందర్భంగా చరక అమృత్‌ సంస్థ నిర్వాహకులు కోరారు. 

 

10:11 - January 10, 2018

హైదరాబాద్ : ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా అజ్ఞాతవాసి రిలీజ్‌తో థీయేటర్ల వద్ద అభిమానుల కోలాహలం కనిపిస్తోంది. ఏపీలో 7షోలు, తెలంగాణలో 5షోలకు అనుమతి లభించడంతో పవన్‌ అభిమానులకు పండగలా మారింది. విశాఖలో అజ్ఞాతవాసి మానియాతో ఫ్యాన్స్‌ ఊగిపోతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

కూకట్ పల్లిలో యువతి హత్య

హైదరాబాద్ : నగరంలో దారుణం జరిగింది. కూకట్ పల్లిలో జానకి అనే యువతి హత్య గావించబడింది. డిమార్ట్ లో పని చేస్తున్న జానకిని ప్రేమించాలని అనంద్ అనే యువకుడు గతం కొంతకాలంగా వేధిస్తున్నాడు. ఆనందే ఈ హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. 

కరీబియన్ సముద్రంలో భారీ భూకంపం

హైదరాబాద్ : కరీబియన్ సముద్రంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకపం తీవ్రత 7.8 గా నమోదు అయింది. కరీబియన్ దీవుల్లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. 

 

08:02 - January 10, 2018

మోడీ పాలనలో దేశంంలో కాషాయీకరణ జరుగుతుందని వక్తలు అన్నారు. న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు నంద్యాల నర్సింహ్మారెడ్డి, బీజేపీ అధికార ప్రతినిధి డా.నరేష్ పాల్గొని, మాట్లాడారు. ఢిల్లీలో నిర్వహించిన యువ హుంకార్ ర్యాలీ మోడీ ప్రభుత్వానికి హెచ్చరిక అని అన్నారు. గత మూడేళ్ల కాలం నుంచి దళితులు, అణగారిన వర్గాల్లో బీజేపీ ప్రభుత్వంపై నెలకొన్న అసంతృప్తే యువ హుంకార్ ర్యాలీ అని పేర్కొన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...  

 

07:55 - January 10, 2018

కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కాంట్రాక్ట్‌ అధ్యాపకుల సంఘం నాయకుడు సురేష్, శోభన్ బాబు  డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన వారు పాల్గొని, మాట్లాడారు. 'వారు పర్మినెంట్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తారు. కానీ సమాన వేతనం ఉండదు. కనీసం ఉద్యోగ భద్రత కూడా ఉండదు. ఇది కాంట్రాక్ట్‌ ఉద్యోగుల పరిస్థితి. కాంట్రాక్ట్‌ ఉద్యోగులను పర్మినెంట్‌ చేస్తామని ఎన్నికల ముందు హామీలిచ్చే ప్రభుత్వాలు ఎన్నికల తర్వాత మర్చిపోతున్నారు. మొన్న కామారెడ్డి జిల్లాలో సయ్యద్‌ పాషా  అనే కాంట్రాక్ట్ ఉద్యోగి ఉద్యోగ భద్రత లేక వేతనాలు సరిగా రాక.. అప్పులపాలై  గుండెపోటుతో మరణించడం కాంట్రాక్ట్‌ కార్మికుల పరిస్థితిని చర్చకు తెరలేపింది. ఈ కాంట్రాక్ట్‌ ఉద్యోగుల అవస్థలపై వారు మాట్లాడారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

ఢిల్లీలో దట్టంగా పొగమంచు

ఢిల్లీ : హస్తినలో పొగమంచు దట్టంగా కమ్మేసింది. పొగమంచు కారంణంగా పలు విమాన, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 49 రైళ్లు ఆలస్యంగా నడవనున్నాయి.22 రైళ్లను రద్దు చేశారు. 

07:42 - January 10, 2018

ఢిల్లీ : హస్తినలో యువ హుంకార్‌ ర్యాలీ గర్జించింది. మోది ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేసింది.  అవినీతి, పేదరికం, నిరుద్యోగం లాంట ప్రధాన సమస్యలను పక్కన బెట్టి.. ఘర్‌ వాప్‌సి, లవ్‌ జిహాద్‌ లాంటి అంశాలకు ప్రాధ్యనత నిస్తోందని మండిపడింది. దేశానికి మనువాదం ముప్పు పొంచి ఉందని యువతను హెచ్చరించింది. సామాజిక న్యాయం కోసం తమ పోరు కొనసాగుతుందని స్పష్టం చేసింది. 
భారీ భద్రత మధ్య సభ 
ఢిల్లీలోని పార్లమెంట్‌ స్ట్రీట్‌లో దళిత యువనేత, గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవాని నేతృత్వంలో 'యువ హుంకార్' ర్యాలీ జరిగింది. మొదటి నుంచి ర్యాలీకి నిరాకరిస్తున్న పోలీసులు చివరి నిముషంలో పోలీసులకు, నిర్వాహకులకు మధ్య అవగాహన కుదరడంతో భారీ భద్రత మధ్య సభ నిర్వహించారు. 
మోది ప్రభుత్వంపై జిగ్నేష్‌ మేవాని ఫైర్   
గుజరాత్‌ ఎమ్మెల్యే, దళిత యువనేత జిగ్నేష్‌ మేవాని మోది ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అవినీతి, పేదరికం, నిరుద్యోగం లాంటి ప్రధాన అంశాలను ప్రధాని ప్రస్తావించడం లేదని...ఘర్‌ వాప్‌సీ, లవ్‌ జిహాద్‌ లాంటి అంశాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని మండిపడ్డారు. చంద్రశేఖర్, రోహిత్‌ వేములకు న్యాయం జరగాలని డిమాండ్‌ చేశారు. గుజరాత్‌ ఎన్నికల్లో 150 స్థానాలను సాధిస్తామన్న బిజెపి కలలకు హార్దిక్‌, అల్పేష్‌, తాను అడ్డుగా నిలవడంతో తమని  టార్గెట్‌ చేస్తున్నారని జిగ్నేష్‌ ఆరోపించారు. గత 22 ఏళ్లుగా వాళ్లు విభజిస్తుంటే తాము జోడిస్తున్నామని చెప్పారు. గుజరాత్ శాసనసభ్యుడిగా అవినీతికి సంబంధించిన ఫైళ్లను బయటపెడతానని మోదీని హెచ్చరించారు.
కార్పోరేట్లకు తొత్తుగా మోది ప్రభుత్వం : కన్హయ్య 
మోది ప్రభుత్వం కార్పోరేట్లకు తొత్తుగా మారిందని జెఎన్‌యు మాజీ విద్యార్థి నేత కన్హయ్య కుమార్‌ విమర్శించారు. కార్పోరేట్లను బలోపేతం చేయడం కాదని, తమకు సామాజిక న్యాయం కావాలని డిమాండ్‌ చేశారు. తాము ప్రజాస్వామ్యం కోసమే పోరాడుతున్నామని చెప్పారు.
దళిత సంస్థ భీమ్ ఆర్మీ వ్యవస్థాపకుడు చంద్రశేఖర్ ఆజాద్‌ ఫొటోలు సందడి
హుంకార్‌ ర్యాలీలో దళిత సంస్థ భీమ్ ఆర్మీ వ్యవస్థాపకుడు చంద్రశేఖర్ ఆజాద్‌ను ఫొటోలు సందడి చేశాయి. ఉత్తరప్రదేశ్ షెహరాన్‌పూర్ జిల్లాలో గత జూన్‌లో ఠాకూర్లు, దళితుల మధ్య జరిగిన ఘర్షణల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న 30 ఏళ్ల ఆజాద్‌ను హిమాచల్ ప్రదేశ్‌లో అరెస్టు చేశారు. ఆజాద్‌ను వెంటనే విడుదల చేయాలని అనుచరులు డిమాండ్‌ చేశారు.  జేఎన్‌యూ, ఢిల్లీ యూనినర్శిటీ, లక్నో యూనివర్శిటీ, అలహాబాద్ యూనివర్శిటీకి చెందిన విద్యార్థులతో పాటు అసోం రైతు నేత అఖిల్ గొగోయ్, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కూడా హాజరయ్యారు. 

 

07:36 - January 10, 2018

హైదరాబాద్ : కేసీఆర్‌ సర్కార్‌పై .. కాంగ్రెస్‌ మళ్లీ ధ్వజమెత్తింది. ప్రభుత్వం కరెంట్‌ ద్వారా కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతుందని.. విమర్శలు గుప్పించింది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. విద్యుత్ కొనుగోళ్లు, సరఫరాపై శ్వేతపత్రంపై విడుదల చేయాలని సవాల్‌ విసిరింది.
నిరంతర విద్యుత్ సరఫరా వెనుక అవినీతి : రేవంత్ రెడ్డి 
కేసీఆర్‌ ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. తాజాగా కేసీఆర్‌ అమల్లోకి తీసుకొచ్చిన 24 గంటల విద్యుత్‌పై గురి పెట్టింది. నిరంతర విద్యుత్ సరఫరా వెనుక భారీ అవినీతి దాగుందని విమర్శించింది. దివాళా తీసిన విద్యుత్‌ కంపెనీలతో ఎక్కువ రేట్లకు విద్యుత్‌ను కొనుగోళ్లు చేస్తూ వేల కోట్లు స్వాహా చేశారని.. రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే ప్రభుత్వ రంగ డిస్ట్రిబ్యూషన్‌లను నిర్వీర్యం చేస్తుందని రేవంత్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌ తన సన్నిహితులను సీఎండీలుగా నియమించుకుని.. అడ్డగోలు ఒప్పందాలు చేసుకున్నారని విమర్శించారు. విద్యుత్‌ కొనుగోళ్లు, సరఫరాపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా.. తెలంగాణలో 24 గంటల విద్యుత్‌ ముసుగులో... జరుగుతున్న అవినీతిని బట్టబయలు చేస్తామని హస్తం నేతలు అంటున్నారు. ఈ విషయాన్ని అన్ని ఆధారాలతో ప్రజలకు తెలియజేస్తామంటున్నారు.

 

07:29 - January 10, 2018

హైదరాబాద్ : తెలంగాణలో పెద్దమొత్తంలో ప్రైవేట్‌ డిగ్రీ కాలేజీల మూసివేతకు రంగం సిద్ధమైంది. డిగ్రీ కాలేజీలపై వేటు వేసేందుకు టీ సర్కార్ కసరత్తు చేస్తోంది. మరో వారంలో కాలేజీ యాజమాన్యాలతో సంప్రదింపులు జరిపి వచ్చే విద్యా సంవత్సరంలో ఈ కాలేజీలకు తాళాలు వేసేందుకు సన్నద్ధమైంది. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రైవేటు యాజమాన్యాలు వ్యతిరేకిస్తున్నాయి. 
ప్రైవేట్‌ డిగ్రీ కాలేజీలపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు
విద్యా ప్రమాణాలు పాటించడం లేదనే కారణంతో... డిగ్రీ కాలేజీలపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.  ఇందులో భాగంగా ఆరు యూనివర్సిటీల పరిధిలో కొత్త డిగ్రీ కాలేజీలకు, కొత్త కోర్సులకు, సీట్ల పెంపునకు అనుమతి ఇచ్చేది లేదని  విద్యా మండలి స్పష్టం చేసింది. 
కాలేజీలు, సీట్లను తగ్గిచేందుకు కసరత్తు
రాష్ట్రంలో కాలేజీలు, సీట్లను తగ్గించేందుకు కసరత్తు ప్రారంభమైంది. ఈ మేరకు రాష్ట్రంలో కాలేజీలు, సీట్లు ఎక్కువగా ఉన్నాయని... సీట్లు తగ్గించాలని భావిస్తున్నామని ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి చెప్పారు. రాష్ట్రంలో 25 శాతం కంటే తక్కువ విద్యార్థులుండే కాలేజీలు 150కి పైగా ఉన్నాయని మొదట వాటిని మూసివేస్తామని,  ప్రమాణాలు పాటించని కాలేజీలపై కూడా చర్యలు తీసుకుంటామని పాపిరెడ్డి చెప్పారు. 
ప్రభుత్వం నిర్ణయంపై ప్రైవేట్‌ డిగ్రీ కళాశాల యాజమాన్యాల మండిపాటు
అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల పైవేట్‌ డిగ్రీ కళాశాలల యాజమన్యాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.  ఫీజుల బకాయిలు అడుగుతున్నామనే ... కాలేజీల మూతకు సిద్ధమవుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫీజుల బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం నాణ్యతా ప్రమాణాల గురించి మాట్లడటం ఎంతవరకు సమంజసమని  ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా... ఈ నిర్ణయంపై విద్యార్థుల భవిష్యత్తు కూడా  దాగి ఉంది. మరీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎలాంటి ఫలితాలనిస్తుందో..  వేచి చూడాలి.

 

07:18 - January 10, 2018

విజయవాడ : రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల అమల్లో జరుగుతున్న జాప్యంపై ఏపీ  పార్లమెంటు సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి బడ్జెట్ ముందు మొక్కుబడిగా సమావేశాలు నిర్వహించి చేతులు దులుపుకోవడం  రైల్వే అధికారులకు అలవాటుగా మారిందని మండిపడ్డారు. కొత్త రైళ్లు, రైల్వే ప్రాజెక్టుల మంజూరుకు  ఎంపీలు ఇస్తున్న ప్రతిపాదలను బుట్టదాఖలు చేస్తున్నారని దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిర్వహించిన సమావేశంలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.
ద.మ. రైల్వే జనరల్‌ మేనేజర్‌ ఏపీ ఎంపీలతో భేటీ 
పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ఈనెల 31 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ ఏపీ ఎంపీలతో విజయవాడలో భేటీ అయ్యారు. కొత్త రైళ్లు, ప్రాజెక్టుల మంజూరు, ఉన్న రైళ్ల వేగం పెంపు, కొత్త స్టాప్‌ ఏర్పాటు, ప్లాట్‌ఫారాల విస్తరణ, స్టేషన్ల అధునీకరణ, సౌకర్యాల కల్పన రైల్వే లైన్లపై రోడ్‌ ఓవర్‌ బ్రిడ్జి, అండర్‌ బ్రిడ్జిల నిర్మాణం వంటి అంశాలపై చర్చించారు.
సమావేశం నిర్వహణ పట్ల ఎంపీలు అసంతృప్తి 
వచ్చే నెల 1న కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న తరుణంలో ఈ సమావేశం నిర్వహించడం పట్ల ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్‌ ప్రత్రాలు ముద్రితమవుతున్న సమయంలో ఇలాంటి మొక్కుబడి మీటింగులతో ప్రయోజనం ఏముంటుదని  ప్రశ్నించారు. నరసాపురం-కోటిపల్లి, నడికుడి-శ్రీకాళహస్తి, కొవ్వూరు-భద్రాచలం లైన్ల పురోగతిపై సమీక్షించారు. కొవ్వూరు-భద్రచాలం లైను నిర్మాణంలో సాంకేతిక సమస్యలు ఎదురువున్న విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఎంపీ దృష్టికి తెచ్చారు. మంజూరైన కాకినాడ పిఠాపురం రైల్వే  ప్రాజెక్టును ఉపసంహరించుకోడాన్ని ఎంపీలు తప్పుట్టారు. తిరుపతి రైల్వే స్టేషన్‌ ఆధునీకరణ పునులను చేపట్టని అధికారుల వైఖరిని ఎండగట్టారు. 
విశాఖ రైల్వే జోన్‌కు అతీగతీలేకపోడాన్ని ప్రస్తావించిన ఎంపీలు 
ఏపీ పునర్విభజన చట్టంలో ఇచ్చిన విశాఖ రైల్వే జోన్‌కు అతీగతీలేకపోడాన్ని ఎంపీలు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇది రాజకీయ నిర్ణయమని దక్షిణ మధ్య రైల్వే అధికారులు.. పార్లమెంటు సభ్యుల దృష్టికి తెచ్చారు. దీనిపై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఎంపీల నుంచి అందిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్‌ యాదవ్‌ హామీ ఇచ్చారు. బడ్జెట్‌కు కొద్ది రోజుల ముందు సమావేశం నిర్వహించడంపై ఎంపీలు వ్యక్తం చేసిన అసంతృప్తిని పరిగణలోకి తీసుకున్న జీఎం వినోద్‌కుమార్‌.. వచ్చే ఏడాది నుంచి పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలకు రెండు నెలల ముందుగానే ఇలాంటి భేటీలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.

 

07:04 - January 10, 2018

చిత్తూరు : ప్రజలకు అవినీతి రహిత పాలన అందించడమే ప్రభుత్వం లక్ష్యమని ఏపీ పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి లోకేశ్‌ చెప్పారు. చిత్తూరు జిల్లా రామకుప్పంలో జరిగిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేశ్‌.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలను ప్రధానంగా ప్రస్తావించారు. రాష్ట్ర సచివాలయం నుంచి గ్రామ సచివాలయం వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలను టెక్నాలజీతో అనుసంధానం చేస్తున్నామని లోకేశ్‌ చెప్పారు. 
 

నేడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టీ.టీడీపీ నేతలు సమావేశం

హైదరాబాద్ : నేడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో తెలంగాణ టీడీపీ నేతలు సమావేశం కానున్నారు. ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు. 

 

నేడు ఆర్థికవేత్తలతో ప్రధాని మోడీ సమావేశం

ఢిల్లీ : నేడు ఆర్థికవేత్తలతో ప్రధాని మోడీ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో నీతి ఆయోగ్, ఆర్థిక సలహా మండలి సభ్యులు పాల్గొననున్నారు. ఉద్యోగాల కల్పన, ఆర్థిక ప్రగతి తదితర అంశాలపై చర్చించనున్నారు. 

 

నేడు ఢిల్లీ వెళ్లనున్న తెలంగాణ సీఎస్ ఎస్పీ సింగ్

హైదరాబాద్ : తెలంగాణ సీఎస్ ఎస్పీ సింగ్ నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. పలు అంశాలపై చర్చించనున్నారు. 

Don't Miss