Activities calendar

11 January 2018

ఆధార్ పై దుష్ర్పచారం - నందన్ నీలేకని...

ఢిల్లీ : ఆధార్‌ ప్రతిష్టను దెబ్బ తీసేందుకు దుష్ప్రచారం చేస్తున్నారని ఉడాయ్‌ మాజీ ఛైర్మన్‌ నందన్‌ నీలేకని అన్నారు. ఆధార్‌ గోప్యతకు సంబంధించి ట్రిబ్యూన్‌ పత్రికలో వచ్చిన కథనాలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడంపై స్పందించిన నీలేకని- ఇది వంద శాతం కల్పిత ప్రచారమని కొట్టి పారేశారు. 

సిక్కుల అల్లర్ల కేసు...

ఢిల్లీ : 1984 సిక్కులకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్ల కేసు విచారణ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరగనుంది. మూసివేసిన 186 కేసుల విచారణ తిరిగి చేపట్టడానికి కోర్టు ముగ్గురు సభ్యులతో కూడిన సిట్‌ను ఏర్పాటు చేసింది. మాజీ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎన్‌ ధింగ్రా సిట్‌కు నేతృత్వం వహిస్తారు. 

21:20 - January 11, 2018
21:10 - January 11, 2018

హైదరాబాద్ : తెలంగాణలో.. సరికొత్త రాజకీయ ఫ్రంట్‌ ఆవిర్భవించబోతోంది. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్‌లకు ప్రత్యామ్నాయంగా ఈ ఫ్రంట్‌ ఏర్పడుతోంది. బహుజన లెఫ్ట్‌ ప్రంట్ పేరిట ఈనెల 25న మొదలయ్యే ప్రత్యామ్నాయ రాజకీయ వేదికకు.. అధ్యక్షుడిగా నల్లా సూర్యప్రకాశ్‌, కన్వీనర్‌గా తమ్మినేని వీరభద్రం వ్యవహరిస్తారు. తెలంగాణ రాజకీయాల్లో.. సరికొత్త ఐక్య వేదిక పురుడుపోసుకోనుంది. ఈనెల 25న బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ పేరిట ఈ ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఆవిర్భవించనుంది. జ్యోతిరావు ఫూలే, అంబేడ్కర్‌ తరహా విధానాలు, ఆలోచనలతో ఏర్పాటు కానున్న ఈ ప్రత్యామ్నాయ ఫ్రంట్‌లో చేరేందుకు.. ఇప్పటికే 28 రాజకీయ పార్టీలు అంగీకరించాయి. వనస్థలిపురంలో జరిగే ఫ్రంట్‌ ఆవిర్భావ సభకు, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, అంబేడ్కర్‌ మనవడు ప్రకాశ్‌ అంబేడ్కర్‌ హాజరు కానున్నారు.

గురువారం, సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సన్నాహక భేటీలో.. బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ అధ్యక్షుడిగా నల్లా సూర్య ప్రకాష్, కన్వీనర్‌గా తమ్మినేని వీరభద్రం ఎన్నికయ్యారు. రాజ్యాధికార సాధనే లక్ష్యంగా.. తెలంగాణలోని 119 స్థానాల్లోనూ పోటీ చేయాలని బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ భావిస్తోంది. జనాభాలో 93శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమమే ధ్యేయంగా, సామాజిక న్యాయ సాధనే లక్ష్యంగా ఫ్రంట్ పని చేయనుంది. ప్రత్యేక రాష్ట్రం సిద్ధించినా తెలంగాణ ప్రజల జీవన స్థితి గతుల్లో మార్పులు రాలేదని, అందుకే, ప్రత్యామ్నాయ అభివృద్ది నమూనాతో ప్రజల్లోకి వెళ్లాలని ఫ్రంట్‌ నిర్ణయించింది.

రాష్ట్రంలో నూతన రాజకీయ నాయకత్వం అవసరం ఎంతగానో ఉందని.. బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ విశ్వసిస్తోంది. ఆ దిశగా.. వామపక్ష భావజాలమున్న పార్టీలన్నింటినీ కలుపుకు పోవాలని ఫ్రంట్‌ నేతలు భావిస్తున్నారు. బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ అధికారంలోకి వస్తే.. సామాజిక న్యాయ సాధనకు పెద్దపీట వేయాలని తీర్మానించారు.

ప్రజా పోరాటాల ఫలితంగా భౌగోళిక తెలంగాణ సాధించినప్పటికీ.. ప్రజలు ఆశించిన రీతిలో పాలన సాగడం లేదని.. బహుజన ఫ్రంట్‌ రూపకర్తలు భావిస్తున్నారు. ఈనెల 25న బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ ఆవిర్భావం సందర్భంగా.. వనస్థలిపురంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని ఫ్రంట్‌ నేతలు నిర్ణయించారు. అందులో.. ప్రత్యామ్నాయ రాజకీయ ముసాయిదాతో ప్రజల్లోకి వెళ్లేలా కార్యాచరణ రూపొందించనున్నారు. 

21:05 - January 11, 2018

హైదరాబాద్ : తెలంగాణ‌లో పవర్‌ వార్‌ తారాస్థాయికి చేరింది. క‌రెంట్‌ అంశం కాంగ్రెస్ -టీఆర్ఎస్‌ల‌ మ‌ధ్య మంట‌లు పుట్టిస్తోంది. విద్యుత్ కొనుగోలులో అవినితీ ఉంద‌న్న కాంగ్రెస్‌ కామెంట్స్‌తో ఇరు పార్టీల‌ మ‌ధ్య డైలాగ్ వార్‌ కొనసాగుతోంది. బహిరంగ చర్చకు సిద్ధమని కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి అంటుంటే.. విశ్వసనీయత లేని వారితో మాటలేంటని టీఆర్‌ఎస్‌ వాదిస్తోంది.

తెలంగాణలో నిరంతర విద్యుత్‌ సరఫరా అంశం కాంగ్రెస్‌- టీఆర్‌ఎస్‌ మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. విద్యుత్‌ కొనుగోళ్లలో.. ప్లాంట్స్‌ ఏర్పాటులో అవినీతి జరిగిందని కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి ఆరోపణలు చేశారు. ఏపీలో చౌక‌గా విద్యుత్ ఇస్తామ‌ని చెప్పినా ప‌ట్టించుకోని కేసీఆర్ ప్రభుత్వం ప్రైవేటు సంస్థల నుంచి విద్యుత్ కొనుగోళ్ళు ఎలా చేస్తార‌ని ఆయ‌న ప్రశ్నించారు. విద్యుత్‌ అక్రమాలపై ఎక్కడ బహిరంగ చర్చ నిర్వహించినా వస్తానంటూ సవాల్‌ విసిరారు.

రేవంత్‌ ఆరోప‌ణ‌ల‌పై తొలుత టీఆర్ఎస్ కూడా స్ట్రాంగ్ కౌంట‌రే ఇచ్చింది. ప్రభుత్వం రైతుల‌కు 24 గంట‌ల విద్యుత్ స‌ర‌ఫ‌రా చేస్తుంటే .. ఓర్వలేని కాంగ్రెస్ త‌మ స‌ర్కారుపై దుష్ప్రచారానికి దిగుతుంద‌ని గులాబీ నేత‌లు అంటున్నారు. రేవంత్ రెడ్డి ఆరోప‌ణ‌లు అవాస్తవ‌మ‌ని .. దీనిపై బ‌హిరంగ చ‌ర్చకు సిద్ధమ‌ని టీఆర్‌ఎస్‌ ఎంపీ బాల్క సుమన్‌ ప్రకటించారు.

విద్యుత్‌ పాలసీలో ప్రభుత్వ అవినీతిపై తన దగ్గర ఆధారాలు ఉన్నాయని మరో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. సోలార్ విద్యుత్ టెండ‌ర్ల ద‌గ్గరి నుంచి .. యాదాద్రి ప‌వ‌ర్ ప్లాంట్స్‌, బీహెచ్‌ఈఎల్ విద్యుత్ ఒప్పందాల‌న్నింటిలో క‌మీష‌న్ల క‌క్కుర్తి దాగిఉంద‌ని ఆయన ఆరోపించారు. సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే .. బ‌హిరంగ చ‌ర్చకు రావాలని.. తాను ప్రభుత్వం అవినితిని నిరుపించ‌లేక పోతే.. త‌న‌ ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటా అంటూ స‌వాల్ విసిరారు.

కాంగ్రెస్‌ నుంచి అదే స్పీడులో సమాధానాలు వస్తుండటంతో... గులాబీ నేతలు ఆత్మరక్షణలో పడ్డారు. సవాల్‌కు వెనకడుగు వేసేది లేదంటూనే.. కొత్తమెలిక పెట్టారు. రేవంత్‌రెడ్డి లాంటి విశ్వసనీయతలేని వ్యక్తితో చర్చించలేమని.. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి లాంటి కీలక నేతలు వస్తే తాము చర్చలకు వస్తామని కొత్త రాగం అందుకున్నారు. మొత్తానికి కాంగ్రెస్‌- టీఆర్‌ఎస్‌ మధ్య సవాళ్లు.. ప్రతిసవాళ్లతో పవర్‌ వార్‌ కొనసాగుతోంది. 

21:05 - January 11, 2018

విజయవాడ : పోలవరం ప్రాజెక్టుకు కొత్త టెండర్లు ఆహ్వానించేందుకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. వారం రోజుల్లో కొత్త టెండర్లు తెరచి కొత్త సంస్థలకు అప్పగించాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ నిర్ణయించింది. 2019 కల్లా ప్రాజెక్టు పూర్తయ్యేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నట్లు తెలిపింది.

పోలవరం ప్రాజెక్టుకు ఉన్న అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. ప్రాజెక్టును వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా కొత్త టెండర్లను పిలిచేందుకు కేంద్రం అనుమతిచ్చింది. అమరావతిలో మొదటి సారిగా సమావేశం అయిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌ టెండర్ల విషయంపై పీపీఏ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ పనులను ట్రాన్స్‌ ట్రాయ్‌ సంస్థ సక్రమంగా చేయడంలేదని కొంత మేర పనులను 60 సీ నిబంధన కింద తొలగించిన ఏపీ ప్రభుత్వం కొత్తగా 14 వందల 83 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచింది.

అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి కేంద్రం అనుమతి లభించలేదు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు, కేంద్రమంత్రి గడ్కరీతో సీఎం చంద్రబాబు భేటీతో నెలరోజుల పాటు ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థకు గడువిచ్చారు. అయినప్పటికీ పనుల వేగవంతం కాకపోవడంతో పోలవరం ప్రాజెక్టు అథారిటీ టెండర్ల విషయంలో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. వారం రోజుల్లోగా టెండర్లు తెరవాలని పీపీఏ సీఈవో హల్దాల్‌ చెప్పారు.

పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత పనుల పురోగతిపై హల్దార్‌ పీపీఏ సమావేశంలో చర్చించారు. ఇప్పటివరకు ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నప్పటికీ కేంద్రం తరపున ఒక పర్యవేక్షక సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన వాప్కోస్‌ ప్రతిపాదనలు సమర్పించింది. వాప్కోస్‌ ప్రతిపాదనలు పరిశీలిస్తున్నామని, పర్యవేక్షక బాధ్యతలు అప్పగించాలా వద్దా అన్నది త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని పీపీఏ సీఈవో హల్దార్‌ చెప్పారు. అప్పర్‌ కాఫర్‌ డ్యాం విషయంలో ముందుకు వెళ్లాలని సూచించామన్నారు.

మరోవైపు పశ్చిమగోదావరి జిల్లాలో పోలవరం నిర్మాణం పనులు నిలిచిపోయాయి. మూడు నెలల వేతనాలు చెల్లించలేదనే కారణంతో... నాలుగు వందల మంది ట్రాన్స్‌టాయ్‌ ఉద్యోగులు విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. దీంతో స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌, కాంక్రీట్‌ పనులు నిలిచిపోయాయి. పోలవరంపై కొత్త కాంట్రాక్ట్‌పై ఈ నెల 16న పీపీఏ మరోసారి సమావేశం కానుంది. 

లండన్ లో విజయ్ మాల్యా తనయుడు..

లండన్ : విజయ్ మాల్యా తనయుడు సిద్ధార్థ్ నాథ్ లండన్ కు చేరుకున్నారు. వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరయ్యేందుకు ఆయన తండ్రి విజయ్ మాల్యాతో కలిసి వచ్చారు. 

20:21 - January 11, 2018

గేట్లెత్తేశారు..తలుపులు బార్లా తెరిచారు..రావటానికి పోవటానికి ఎలాంటి అడకడంకులు లేకుండా చేసేశారు. దీని ఫలితం ఎలా ఉండబోతోంది? రిటెయిల్ రంగంపై ఇది చావుదెబ్బ కొట్టుందా? మన ఎయిర్ ఇండియాపై విదేశీ శక్తులు పట్టు బిగిస్తాయా? విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయం ఎలాంటి పరిణామాలకు దారి తీయనుంది ? ఈ అంశంపై టెన్ టివి ప్రత్యేక కథనం… ఓడమల్లన్న బోడిమల్లన్న సామెతను అక్షరాలా పాటిస్తున్నారు..విపక్షంలో ఉన్నంతకాలం వ్యతిరేకిస్తున్నాం.. అంటూ కబుర్లు చెప్పి..ఇప్పుడు ఏకంగా అన్ని అడ్డంకులు తొలగించేస్తున్నారు. బడాకంపెనీల సేవల మత్తులో, పెద్దన్న పూజలో పడి.. మన వ్యాపారుల బతుకులను, వారి ఉపాధిని ప్రశ్నార్ధకం చేస్తున్నారు. రిటెయిల్ రంగంపై మోడీ క్యాబినెట్ నిర్ణయం తీవ్రప్రభావం చూపనుందా? చిల్లర వ్యాపారులు, వర్తకుల ఉపాధిపై దెబ్బకొట్టే ప్రమాదం పొంచి ఉందా? బడాకంపెనీలు విచ్చలవిడిగా విస్తరించనున్నాయా? స్థానిక వ్యాపారుల పొట్ట కొట్టే నిర్ణయాలు మోడీ సర్కారు తీసుకుంటోందా?

మాటలకు స్వదేశీ.. చేతలకు విదేశీ..నోరుతెరిస్తే దేశభక్తి వరదలా ప్రవహిస్తుంది.. కానీ, నిర్ణయాల్లో మాత్రం విదేశీ భక్తి అడుగడుగునా స్పష్టమౌతుంది. కాకులను కొట్టి గద్దలకు వేసే ఈ నిర్ణయాలు ఎవరికోసం? ఎవరి ప్రయోజనాల కోసం..? మన వ్యాపారాలను, మన ఉపాధిని ప్రశ్నార్ధకం చేసే తప్పుడు నిర్ణయాలు ఎందుకోసం?

మన ఇంటి తాళాలు ఊరు పేరు తెలియని వారికివ్వటానికి, నూరుశాతం ఎఫ్డీలకు అనుమతింటానికి పెద్ద తేడా ఏం లేదు. నూటికి నూరు శాతం విదేశీ పెట్టుబడులకు తావిస్తే జరిగే పరిణామాలు అత్యంత ప్రమాదకరం.. దేశాన్ని నడిరోడ్డున నిలబెట్టి.. ఎవడిదారిన వాడు రావచ్చు పోవచ్చు అంటే నష్టం ఎవరికి? ఇది దేశ సుస్థిరతను, ఆర్ధిక వ్యవస్థ స్థిరత్వాన్ని ప్రశ్నార్ధకంగా మారుస్తుందనటంలో సందేహం లేదు. మరింత విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి. 

20:19 - January 11, 2018

బహుష కాలజ్ఞానం రాశిన బ్రహ్మంగారే .. ఇప్పుడు చంద్రబాబు రూపంల మళ్ల భూమ్మీదికొచ్చిండా ఏంది..? కాకపోతేంది..మరి బ్రహ్మంగారు భవిష్యత్తుల ఏం జర్గుతదో ముందే ఊహించే చెప్పె మన్షి.. అగో చంద్రాలు గూడ అట్లనే జెప్తున్నడు రేపు ఏం జర్గబోతున్నదో ముందే ఆలోచన జేశి ముందు సూపుతోని ముంగటికి వోతున్నడట.. కావాల్నంటే సారే జెప్తడు వీడియోలో ఇనుండ్రి..

నూతన పంచాయతీ రాజ్ చట్టంపై...

హైదరాబాద్ : నూతన పంచాయతీ రాజ్ చట్టంపై నాలుగో రోజు కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. చట్టంలో పొందుపరచాలని అనుకుంటున్న కీలక అంశాలపై చర్చ జరిగింది. సర్పంచ్ లపై క్రమశిక్షణ చర్చలకు అప్పలేట్ ఆథార్టీగా ట్రిబ్యునల్ ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని జూపల్లి సూచించారు. చట్టాన్ని అతిక్రమించే వారికి జరిమానా విధించే హక్కును సర్పంచ్ నేతృత్వంలో పాలకవర్గానికి అప్పగించే అంశంపై చర్చ జరిగింది. గ్రామాల అక్రమ నిర్మాణాల తొలగింపునకయ్యే ఖర్చును కారకుల నుండే వసూలు చేయాలని సబ్ కమిటీ భావిస్తోంది.

20:00 - January 11, 2018

ఢిల్లీ : దాణా స్కాంలో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆర్జేడి చీఫ్‌ లాలు ప్రసాద్‌ యాదవ్‌ ఈసారి మకర సంక్రాంతిని జైలులోనే జరుపుకోనున్నారు. సంక్రాంతి పండగకు లాలు ఇంట్లో 'దహి చురా' స్వీట్‌ను ప్రత్యేకంగా తయారు చేయడం ఆనవాయితి. తనకు అనుమతి ఇస్తే పండగ రోజు ఇంటికి వెళ్లి 'దహి చురా' తింటానని లాలు చేసిన విజ్ఞప్తిని న్యాయమూర్తి శివపాల్‌సింగ్‌ తోసిపుచ్చారు. జైల్లోనే 'దహి చురా' తినే సౌకర్యం కల్పిస్తానని జడ్జి లాలుకు కౌంటర్‌ ఇచ్చారు. లాలూను కలవడానికి వారానికి కేవలం ముగ్గురు విజిటర్లకే న్యాయమూర్తి అనుమతించారు. లాలు జైలులో ఉన్నందున ఆర్జేడి కార్యకర్తలు మకరసంక్రాంతి పండగను జరుపుకోవడం లేదని ఆ పార్టీ ఎమ్మెల్యే భోలా యాదవ్‌ తెలిపారు. దాణా కుంభకోణం కేసులో లాలు ప్రసాద్‌ యాదవ్‌కు మూడున్నరేళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే.

19:58 - January 11, 2018

ఉత్తరప్రదేశ్‌ : బలియా జిల్లాలో హిందుత్వ శక్తులు దళిత యువకుల పట్ల అమానుషంగా ప్రవర్తించాయి. గోవులను చోరీ చేశారన్న కారణంతో హిందూ యువవాహిని కార్యకర్తలు ఇద్దరు దళిత యువకులపై దాడి చేశారు. వారికి శిరోముండనం చేసి వీథుల్లో తిప్పారు. ముఖానికి తెల్లరంగు పూసి 'గాయ్‌ చోర్‌' అని రాసి ఉన్న అట్టను వారి మెడలో వేసి ఊరంతా కలియ తిప్పారు. పోలీసులు వచ్చే వరకు వారిని వదల లేదు. ఆవులను దొంగిలించారన్న కారణంతో పోలీసులు ఇద్దరు దళిత యువకులు ఉమ, సోనులను అరెస్ట్‌ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు శంభు అనే వ్యక్తితో పాటు మరో 15 మంది అజ్ఞాత వ్యక్తులపై కేసు నమోదు చేశారు. సోమవారం జరిగిన ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు బలియా జిల్లా ఎస్పీ అనిల్‌ కుమార్‌ తెలిపారు.

19:56 - January 11, 2018

ఢిల్లీ : పార్లమెంట్‌పై దాడి కేసులో మరణశిక్షకు గురైన అఫ్జల్‌గురు తనయుడు గాలిబ్ గురు చదువులో రాణిస్తున్నాడు. బోర్డ్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ నిర్వహించిన 12వ తరగతి పరీక్షల్లో డిస్టింక్షన్‌లో పాసయ్యాడు. ఈ ఏడాది నవంబర్‌లో నిర్వహించిన 12వ తరగతి పరీక్షల్లో గాలిబ్‌ 88 శాతంతో 441 మార్కులు సాధించాడు. 2001లో పార్లమెంట్‌పై దాడి చేసిన కేసులో దోషిగా తేలిన అఫ్జల్ గురుకు 2013లో ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే. గాలిబ్ గురు పదో తరగతిలో కూడా 95 శాతం మార్కులు సాధించాడు. సోషల్ మీడియాలో గాలిబ్ గురుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. బారాముల్లా జిల్లాలోని సోపూర్ పట్టణంలోని గల వీరి నివాసం సందడిగా మారింది. స్నేహితులు, కుటుంబ సభ్యులు గాలిబ్‌ గురుకు అభినందనలు తెలిపారు. 

19:54 - January 11, 2018

బహుష కాలజ్ఞానం రాశిన బ్రహ్మంగారే .. ఇప్పుడు చంద్రబాబు రూపంల మళ్ల భూమ్మీదికొచ్చిండా ఏంది..? కాకపోతేంది.. ఇన్నొద్దులు ఉల్వశేన్ల వొడగొట్టుకోని కంది చేన్ల ఎంకులాడుకుంటొచ్చిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ.. ఆంధ్ర దేవాదాయ శాఖ మంత్రి, బీజేపీ అణిముత్యం శ్రీ మాణిక్యాల రావు ఏమంటున్నడంటే.. బాప్ ఏక్ నంబర్.. బేటా దస్ నెంబర్ అని అనెతందుకు లోకేశం ముచ్చట్లు సరిపోయినయ్ ఇయ్యాళటికి.. జబర్దస్త్ షోలళ్ల బిజీగుండే.. రోజమ్మ.. జనం బస్తీల పొంట తిర్గుతున్నది..పోలీసోళ్ల దృష్టిల ప్రజలంటే.. దొంగలు దోపిడి దారులు, అనుమానితులు..వారీ ఈ కులాలు మెడలేస్కోని తిర్గే సన్నాశిగాళ్లారా ఒక్క ముచ్చట జెప్పుండ్రి.. ఇంటి దీపమని ముద్దువెట్టుకుంటె మూతిమీసాలు గాలినట్టు.. ఊరును ఉద్దరియ్యివా పటేలా అని ఎంపీటీసీగ గెలిపిస్తె..గీ ముచ్చట్లు జూడాలంటే వీడియో క్లిక్ చేయండి. 

19:51 - January 11, 2018

హైదరాబాద్ : సినీ పరిశ్రమలో సినీ క్రిటిక్ కత్తి మహేష్...సినీ నటుడు పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య విమర్శల యుద్ధానికి ముగింపు పలకాల్సి ఉందని ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు. సాగదీస్తే ఎంతదూరమైనా సాగే అవకాశం ఉందని టెన్ టివి ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇద్దరూ సంయమనం పాటించాలని, విమర్శలు కొనసాగిస్తే ఎంతదూరమైనా పోవచ్చన్నారు. 

19:50 - January 11, 2018

హైదరాబాద్‌ : మాసాబ్‌ట్యాంక్‌లో దారుణం జరిగింది. పోలీస్ ఆఫీసర్స్ మెస్‌ సమీపంలోని ఎలిగెన్స్ అపార్ట్‌మెంట్‌లో ఎయిర్‌ఫోర్స్‌ మాజీ ఉద్యోగి ఇక్రమ్‌పై ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులు, కొబ్బరి బొండాలతో దాడి చేశారు. ఈ దాడిలో ఇక్రమ్‌కు తీవ్రగాలయ్యాయి. గాయపడ్డ ఇక్రమ్‌ను ఆస్పత్రికి తరలించారు. ఇక్రమ్‌పై గతంలోనూ ఓ సారి దుండగుల దాడి చేసినట్లు తెలుస్తోంది. భూతగాదాల నేపథ్యంలో ప్రత్యర్ధులు దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక్రం ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందన వైద్యులు చెప్పారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.

 

19:43 - January 11, 2018

హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్త రాజకీయ ఫ్రంట్‌ ఆవిర్భవించనుంది. ఈ నెల 25న 'బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌' పేరుతో ఆవిర్భావ సభ జరగనుంది. సామాజిక న్యాయ సాధనకు.. రాజ్యాధికార లక్ష్యంగా ఈ ఫ్రంట్‌ పని చేస్తుంది. ఫ్రంట్‌ నూతన అధ్యక్షుడిగా నల్లా సూర్యప్రకష్‌.. కన్వీనర్‌గా తమ్మినేని వీరభద్రం ఎన్నికయ్యారు. తెలంగాణ వచ్చినా ప్రజల బతుకుల్లో మార్పులేదని... ప్రత్యామ్నాయ విధానంతో ప్రజల్లోకి వెళ్తామని తమ్మినేని పేర్కొన్నారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు చాలా ఉన్నా...అన్నీ ఒక తాను గుడ్డలోనని తెలిపారు. కార్పొరేట్..ధనికులకు..భూ స్వాములకు అనుగుణంగా ఆ పార్టీలున్నాయని..ఇప్పటికీ కనీస సౌకర్యాలు లేని వారు ఎంతో మంది ఉన్నారని తెలిపారు.

తెలంగాణ మరింత వెనుకబడి ఉందని, ప్రజలకు అనుగుణంగా పరిపాలించే పార్టీ రాలేదన్నారు. ఈ సమయంలో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఏర్పడిందని..ఇది సరైన సమయంలో ఉద్బవించబోతోందన్నారు. గతంలో అనేక సంవత్సరాల పాటు ప్రధాన శత్రువు పేరిట పార్టీలను ఓడించడానికి..ఇతరత్రా ప్రయత్నాలు జరిగాయని, దీర్ఘకాలికంగా చూస్తే ఎలాంటి ఫలితం రాలేదన్నారు. మిగతా పార్టీలకు..వామపక్ష పార్టీలకు తేడా ఏంటో ప్రజలకు చూపెట్టాలని..ఇలా చేయడం వల్ల ఒక మహాశక్తిగా రూపొందే అవకాశం ఉందన్నారు. 119 స్థానాల్లో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ పోటీ చేస్తుందని తమ్మినేని వెల్లడించారు. 

19:40 - January 11, 2018

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఢిల్లీకి పయనమవుతున్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో భేటి కానున్నారు. ఏడాది తరువాత జరుగుతున్న ఈ భేటీలో... పోలవరం ప్రాజెక్ట్‌, రాష్ట్ర విభజన అంశాలపై మోదీతో చర్చించనున్నారు. ఇతర ముఖ్య అంశాలను ..చంద్రబాబు.. ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీ పర్యటనకు షెడ్యూల్‌ ఖరారైంది. గురువారం రాత్రి చంద్రబాబునాయుడు హస్తినకు బయల్దేరనున్నారు. శుక్రవారం ఉదయం 10.40 గంటలకు ప్రధాని మోదీతో.. చంద్రబాబు సమావేశమవుతున్నారు. ఏడాది తరువాత వీరిద్దరి మధ్య జరుగుతున్న ఈ భేటీలో పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్‌, రాష్ట్ర విభజన అంశాలు కీలకంగా చర్చకు రానున్నట్టు తెలుస్తోంది.

అలాగే ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని చంద్రబాబునాయుడు .. మోదీని కోరనున్నారు. ఈఏపీ నిధుల అంశంపైనా ప్రధానితో చర్చించనున్నారు. అదేవిధంగా.. నియోజకవర్గాల పునర్విభజన, రెవెన్యూలోటు గురించి ప్రస్తావించనున్నారు. ప్రధానితో చర్చించాల్సిన అంశాలపై ఉన్నతాధికారులు ఇప్పటికే ఓ నివేదికను రూపొందించి చంద్రబాబు నాయుడుకు అందించారు. ప్రధానితో భేటీ అనంతరం.. చంద్రబాబు ఇతర కేంద్ర మంత్రులతో కూడా భేటీ కానున్నారు.

19:16 - January 11, 2018

హైదరాబాద్ : గత కొన్ని రోజులుగా న్యాయం కోసం పోరాటం చేస్తున్న సంగీత తన అత్తారింట్లోకి అడుగు పెట్టింది. భర్త శ్రీనివాస్ రెడ్డి ఇంటి ఎదుట 54 రోజులుగా ఆమె పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో మియాపూర్ కోర్టు పలు ఆదేశాలు జారీ చేసింది. అత్తింట్లోనే ఆమె ఉండవచ్చునని..సంగీత..ఆమె పాపను జాగ్రత్తగా చూసుకోవాలని పలు ఆదేశాలు జారీ చేసింది. దీనితో గురువారం సాయంత్రం సంగీత తన పాపతో ఇంటి తాళాన్ని పగులగొట్టి లోనికి ప్రవేశించింది. ఈ సందర్భంగా ఆమె టెన్ టివితో మాట్లాడారు.

‘54 రోజులుగా బయటే ఉంటున్నా. ఇది అందరికీ తెలిసిందే. కోర్టు ద్వారా తేల్చుకుంటానని తన భర్త చెప్పడంతో నేను కూడా కోర్టుకు వెళ్లాను. తనకు..పాపకు రక్షణ కల్పించాలని..తగిన సహాయం చేయాలని పిటిషన్ కోరాను. దీనితో ఇంట్లోకి వెళ్లవచ్చనని..మెంటెనెన్స్ కూడా ఇవ్వాలని కోర్టు పేర్కొనడం సంతోషంగా ఉంది. కోర్టుకు ధన్యవాదాలు. తనలాగే ఇతర మహిళలు ఇబ్బందులు పడవద్దు..పోరాటం చేయాలి..భర్త శ్రీనివాస్ రెడ్డి మొదటి నుండి వేధించాడు. ఏలాంటి నమ్మకం లేదు. హ్యాపీగా చూసుకుంటానని..చెప్పడం..తనకు నమ్మకం కలిగిన తరువాతే కేసులు ఉపసంహరించుకుంటాను. తనకు..తన పాప హక్కుల కోసం పోరాటం చేస్తా. తన వెంట ఉన్న మహిళా సంఘాలకు..స్థానికులకు..తనకు మద్దతిచ్చిన వారందరికీ కృతజ్ఞతలు' అని సంగీత తెలిపారు. 

నేను ఆ ఇంటికి రాను : సంగీత భర్త శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్ : తాను మాత్రం ఆ ఇంటికి రానని సంగీత భర్త శ్రీనివాస్ రెడ్డి అంటున్నారు. ఆ ఇల్లు తనది కాదని..తన తల్లిదండ్రులు ఇంటికి రావద్దంటున్నారని చెప్పారు. కేసులు వెనక్కి తీసుకోవాలని శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. భర్తతో ఉండేందుకు తనకు అభ్యంతరం లేదని సంగీత తెలిపింది. కానీ కేసులు మాత్రం వెనక్కి తీసుకోనని తేల్చి చెప్పింది. 

 

అత్తవారింట్లోకి ప్రవేశించిన సంగీత

హైదరాబాద్ : మియాపూర్ కోర్టు ఆదేశాలతో శ్రీనివాస్ రెడ్డి భార్య సంగీత బోడుప్పల్ లో అత్తవారి ఇల్లు తాళాలు పొగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించింది. 54 రోజులపాటు అత్తింటివారి ఇంటి ముందు సంగీత నిరసన తెలిపింది. 

18:29 - January 11, 2018

మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ లో ఇద్దరు ఇంటర్ విద్యార్థులు గల్లంతు

విశాఖ : మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ లో ఇద్దరు ఇంటర్ విద్యార్థులు గల్లంతయ్యారు. చైతన్య కాలేజ్ ఎన్ ఏడీ బ్రాంచ్ లో ఇంటర్ సెకండియర్ చదువుతున్న జగదీష్, శ్రీకర్ గా గుర్తించారు. ఇద్దరు విద్యార్థుల కోసం అధికారులు గాలిస్తున్నారు. 

 

18:28 - January 11, 2018

సాగర్ ఎడమ కాల్వకు గండి

సూర్యాపేట : మునగాల సమీపంలో సాగర్ ఎడమ కాల్వకు గండి పడి నీరు వృథాగా పోతోంది. మిషన్ భగీరథ పైప్ లైన్ కోసం తవ్వడంతో సాగర్ కాల్వకు గండిపడింది. నీటి ఉధృతి పెరగటంతో నీటిని నిలిపివేసి గండిని పూడ్చాలని కలెక్టర్ సురేంద్ర మోహన్ అధికారులను కోరారు.  

18:08 - January 11, 2018

అనంతపురం : ఏపీ రాష్ట్రంలోని అన్ని నదులను అనుసంధానం చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. జిల్లాలోని ధర్మవరంలో 'జన్మభూమి - మన ఊరు' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ధర్మవరం చెరువుకు జలహారతి ఇచ్చిన అనంతరం ఆయన ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం చంద్రబాబు మాట్లాడారు.

నదుల అనుసంధానంతో మహాసంగమం ఏర్పాటు చేస్తామని చెప్పుకొచ్చారు. ప్రతి ఎకరానికి సాగునీరందిస్తామని, గతంలో కృష్ణా - గోదావరి నదులను కలిపామని..కృష్ణా - గోదావరి -పెన్నా నదులను...వంశధార – నాగావళి నదులన్నింటినీ కలుపుతామన్నారు. రాయలసీమలో ఉన్న నదులన్నింటినీ అనుసంధానం చేసి మహా సంగమంగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. అనంతపురంలో వర్షం పడకపోవడంతో శ్రీకాకుళం నీటిని వాడుకుంటామన్నారు. 

లైంగిక వేధింపుల వ్యవహారంలో సీనియర్ నర్సింగ్ విద్యార్థి సస్పెన్షన్

గుంటూరు : ప్రభుత్వాస్పత్రి అనుబంధ నర్సింగ్ స్కూల్ లో లైంగిక వేధింపుల వ్యవహారంలో సీనియర్ నర్సింగ్ విద్యార్థి దొరబాబుపై 6 నెలలు సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు నర్సింగ్ స్కూల్ కు దొరబాబు బదిలీ అయ్యారు. నర్సింగ్ కాలేజీలో లైంగిక వేధింపులను వెలుగులోకి తెచ్చిన ఇద్దరు విద్యార్థులపైనా అధికారులు చర్యలు తీసుకున్నారు. బాధిత విద్యార్థులు ప్రసాద్ పై 6నెలల సస్పెన్షన్ వేటు పడింది. విశాఖపట్నం నర్సింగ్ స్కూల్ కు బదిలీ అయ్యారు. ప్రియాంక అనే మరో నర్సింగ్ విద్యార్థిని విజయవాడ నర్సింగ్ కాలేజీకి బదిలీ అయ్యారు.

కత్తి మహేష్ కు పలు విద్యార్థి సంఘాల మద్దతు

హైదరాబాద్ : సినీ క్రిటిక్ కత్తి మహేష్ ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లారు. కత్తి మహేష్ కు పలు విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి. పవన్ కు హఠావో పాలిటిక్స్ కో బచావో అంటూ నినాదాలు చేశారు.

17:47 - January 11, 2018

హైదరాబాద్ : ప్రియాంక చోప్రా నటిగా హాలీవుడ్‌లో తానేమిటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తూనే, నిర్మాతగా ప్రాంతీయ భాషల్లో సినిమాలను నిర్మిస్తూ నూతన ప్రతిభను ప్రోత్సహిస్తోంది. 2016లో నిర్మించిన 'వెంటిలేటర్‌' మరాఠి చిత్రానికి మూడు జాతీయ అవార్డులు లభించాయి. అలాగే పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లోనూ ప్రదర్శితమై పురస్కారాలను దక్కించుకుంది. తాజాగా మరో మరాఠి చిత్రాన్ని సొంత సంస్థ పర్పుల్‌ పెబ్బుల్‌ పిక్చర్స్‌పై ప్రియాంక నిర్మిస్తోంది. 
'ఫైర్‌బ్రాండ్‌' టైటిల్‌తో తెరకెక్కించబోతున్న ఈ సినిమా మంగళవారం నుంచి షూటింగ్‌ ప్రారంభించుకుంది. ఈ చిత్రానికి అరుణ్‌రాజె దర్శకత్వం వహిస్తున్నారు. 'మరాఠిలో ఈ ఏడాది మరో సినిమాతో విజయ పరంపరను కొనసాగించబోతున్నాం. 'ఫైర్‌బ్రాండ్‌' పేరుతో నూతన సినిమాను నిర్మిస్తున్నాం. అమేజింగ్‌ స్టోరీతో దర్శకుడు అరుణ్‌రాజె ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. టీమ్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌' అంటూ ప్రియాంక ట్వీట్‌ చేసింది. 

17:44 - January 11, 2018

ఆర్‌.బాల్కీ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు కంగనా రనౌత్‌ గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. ఎవరెస్ట్‌ను అధిరోహించిన తొలి భారతీయ వికలాంగ మహిళా అరుణిమ సిన్హా జీవితం ఆధారంగా ఆర్‌.బాల్కీ ఓ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. ఇందులో అరుణిమ సిన్హా పాత్రకు కంగనాను ఎంపిక చేశారట. బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ మెంటర్‌ పాత్రను పోషించనున్నట్టు తెలుస్తోంది. ఈ పాత్ర కోసం కంగనా ప్రత్యేక శిక్షణ కూడా తీసుకోనుందట. 'ఈ పాత్రకు కంగనా నూటికి నూరుశాతం న్యాయం చేయగలదనే నమ్మకంతో ఉన్నాం. అలాగే ఆమె మెంటర్‌గా బిగ్‌ బి అమితాబ్‌ నటించడం ఆనందంగా ఉంది. అత్యద్భుత ప్రతిభ గల ఇద్దరు ఆర్టిస్టులు ఈ చిత్రంలో నటించడం విశేషంగా భావిస్తున్నాను' అని దర్శక, నిర్మాత ఆర్‌.బాల్కీ తెలిపారు. ఇదిలా ఉంటే ఝాన్సీ రాణి లక్ష్మిభాయి జీవిత కథను ఆధారంగా చేసుకుని హిస్టారికల్‌ నేపథ్యంలో దర్శకుడు క్రిష్‌ 'మణికర్ణిక : ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో కంగనా రనౌత్ నటిస్తోంది. ఈ సినిమాను మొదట మార్చిలో లేదా ఏప్రిల్‌లో విడుదల చేయాలనుకున్నారు. సినిమాలో విజువల్‌ ఎఫెక్స్‌కి సంబంధించిన వర్క్‌ ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో ఈ చిత్ర విడుదల మరోసారి వాయిదా పడనుందట. ఈ సినిమా వాయిదా పడే ఛాన్స్‌ ఉన్న నేపథ్యంలో ఇండో బ్రిటీష్‌ చిత్రం 'స్వార్డ్స్‌ అండ్‌ స్కెప్ట్రెస్‌' చిత్రం బృందం రిలాక్స్‌ అయ్యింది. దీనికి కారణం ఈ చిత్రాన్ని కూడా లక్ష్మీభాయి జీవితాన్ని బేస్‌ చేసుకునే రూపొందించారు. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా మార్చిలో విడుదల చేయనున్నారు.

 

17:31 - January 11, 2018
17:30 - January 11, 2018

వరంగల్ : కాకతీయ విశ్వ విద్యాలయం గొడవలకు నిలయంగా మారింది. పలువురు ఆందోళనలు..నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రిజిష్ట్రార్ కార్యాలయంలో పార్ట్ టైం లెక్చరర్లు బైఠాయించారు. తమ సమస్యలు పట్టించుకోకుండా అధికారులు తప్పించుకుంటూ తిరుగుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జీతాలు సమయానికి ఇవ్వకుండా కాంట్రాక్టు లెక్చరర్లుగా గుర్తించకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

17:26 - January 11, 2018

హైదరాబాద్ : 24 గంటల విద్యుత్ అంశంపై టి.కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి..టీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. విద్యుత్ వెలుగుల వెనుక అక్రమాలు చోటు చేసుకున్నాయని, దీనిపై చర్చకు సిద్ధమని రేవంత్ ప్రకటించారు. గురువారం ఎంపీ బాల్క సుమన్ స్పందించారు. రేవంత్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ఒక అబద్దాల కోరు..నోట్ల కట్టలతో దొంగగా దొరికిపోయాడు..దిగజారుడు రాజకీయాలకు చెందిన వ్యక్తి..పచ్చి అబద్దాలు మాట్లాడిన వ్యక్తి అంటూ అభివర్ణించారు. ఆయనతో చర్చించలేంటీ అని ప్రశ్నించారు. ఆయనతో చర్చించే దానికంటే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్..సీఎల్పీ నేత జానారెడ్డి వస్తారా ? అని తెలిపారు. రేవంత్ రెడ్డి చెప్పినవన్నీ అబద్దాలేనని తాము బుధవారం చెప్పడం జరిగిందన్నారు. ఈ విషయాలు చెప్పకుండా రాత్రి ప్రెస్ నోట్ ను రేవంత్ విడుదల చేశాడని, అనుభవం లేని వారితో ఎందుకు చర్చిస్తామని పేర్కొన్నారు. భద్రాద్రి థర్మల్ విషయంలో ఇద్దరిపై మాత్రమే కేసు నమోదైందని తెలిపారు. 

రేవంత్ రెడ్డి సవాల్ ను స్వీకరించిన ఎంపీ బాల్క సుమన్

హైదరాబాద్ : కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి సవాల్ ను టీఆర్ ఎస్ ఎంపీ బాల్క సుమన్ స్వీకరించారు. విద్యుత్ పై టీఆర్ ఎస్ కు రేవంత్ సవాల్ విసిరారు. విద్యుత్ పై తాము చెప్పినవన్నీ నిరూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. రేవంత్ పై బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ పై తాము టీపీసీపీ చీఫ్ ఉత్తమ్, సీఎల్ పీ నేత జానారెడ్డికి సవాల్  విసిరామని..వారు మాట్లాడకుండా రేవంత్ రెడ్డితో మాట్లాడిస్తున్నారని చెప్పారు. రేవంత్ రెడ్డి విశ్వసనీయత లేని వ్యక్తి అన్నారు. రేవంత్ దగా కోరు, అబద్ధాల కోరు అని అన్నారు. రేవంత్ రెడ్డితో కాకుండా ఉత్తమ్, జానారెడ్డితో చర్చకు సిద్ధమన్నారు.  

17:19 - January 11, 2018

ఢిల్లీ : నాణాల ఉత్పత్తి ఆపు చేయాలని టంకశాలలకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. దీనితో కోల్ కతా, నోయిడా, ముంబై, హైదరాబాద్ లో ఉన్న ముద్రాణాలయాల్లో నాణాలను ముద్రించడం ఆపు చేయనున్నారు. మార్కెట్ లో నాణాలు చలామణి అధికంగా ఉండడం..కోశాగారాల్లో స్థలం సరిపోకపోవడంతో ముద్రణనను ఆర్బీఐ నిలిపివేసినట్లు సమాచారం. పాతనోట్ల రద్దుతో రూ. 5వందలు, రూ. వెయ్యి నోట్లతో కోశాగారాలు నిండిపోయాయి. నాణాలకు కొరత లేదని..సామాన్యులు ఆందోళన చెందవద్దని తెలిపారు. 24 నవంబర్ 2016 వరకు రూ. 1. రూ. 2, రూ. 5, రూ. 10 చెందిన నాణాలు రూ. 672 కోట్ల నిలువ ఉందని ఆర్బీఐ పేర్కొంది. కొన్ని బ్యాంకులు నాణాలు తీసుకోవడం లేదని పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో సీపీఎం ఎంపీ మహ్మద్ సలీం ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. దీనితో అన్ని బ్యాంకులు నాణాలు తీసుకొనేలా చర్యలు తీసుకోవాలని ఆర్బీఐకి ఆర్థిక మంత్రి జైట్లీ సూచించారు. 

17:12 - January 11, 2018

ఢిల్లీ : ఆర్మీ పరేడ్ రిహార్సల్స్ లో అపశృతి చోటు చేసుకుంది. జనవరి 15వ తేదీన ఢిల్లీలో జరిగిన ఆర్మీ పరేడ్ లో జవాన్లు సాహస ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఓ హెలికాప్టర్ లో ఆర్మీ జవాన్లు డ్రిల్ నిర్వహిస్తున్నారు. ఆకాశంలో ఎగురుతున్న హెలికాప్టర్ నుండి తాడు సహయంతో జవాన్లు కిందకు దిగుతున్నారు. ప్రమాదవశాత్తు వారు కిందపడిపోయారు. ఈనెల 9వ తేదీన జరిగిన ఈ ఘటన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. తీవ్రగాయాలైనా వారి ప్రాణాలకు ఎలాంటి అపాయం లేదని తెలుస్తోంది. 

ఈనెల 25న బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఆవిర్భావ సభ

హైదరాబాద్ : ప్రత్యామ్నాయ రాజకీయ ఫ్రంట్ కు బహుజన లెఫ్ట్ ఫ్రంట్ గా పేరు ఖరారు చేశారు. బీఎల్ ఎఫ్ అధ్యక్షుడిగా నల్లా సూర్యప్రకాశ్, కన్వీనర్ గా తమ్మినేని వీరభద్రం ఎన్నుకున్నారు. ఈనెల 25న వనస్థలీపురంలో బీఎల్ ఎఫ్ ఆవిర్భావ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, ప్రకాశ్ అంబేద్కర్ హాజరు కానున్నారు. బీఎల్ ఎఫ్ తరపున 119 స్థానాల్లో పోటీ చేయనున్నారు. 

ప్రత్యామ్నాయ రాజకీయ ఫ్రంట్ కు బహుజన లెఫ్ట్ ఫ్రంట్ గా పేరు ఖరారు

హైదరాబాద్ : ప్రత్యామ్నాయ రాజకీయ ఫ్రంట్ కు బహుజన లెఫ్ట్ ఫ్రంట్ గా పేరు ఖరారు చేశారు. బీఎల్ ఎఫ్ అధ్యక్షుడిగా నల్లా సూర్యప్రకాశ్, కన్వీనర్ గా తమ్మినేని వీరభద్రం ఎన్నికయ్యారు. 

17:07 - January 11, 2018

జమ్మూ కాశ్మీర్ : పీపుల్ డెమోక్రటిక్ పార్టీ ఎమ్మెల్యే ఎజాజ్ అహ్మద్ మీర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అది ఎన్ కౌంటర్ లపై జరుగుతున్న వాటిపై వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతోంది. ఎన్ కౌంటర్ లో చనిపోతున్న వారు అమరవీరులుగా..సోదరులుగా పేర్కొన్నారు. ఉగ్రవాదులతంతా కాశ్మీర్ కు చెందిన వారేనని, కాల్పుల్లో చనిపోతున్న వారందరూ తమ పిల్లలేనన్నారు. ఈ నరమేథం ఎన్నాళ్లు కొనసాగాలని, ఇప్పటికైనా చరమగీతం పాడాలన్నారు. వేర్పాటు వాదులు, ఉగ్రవాదులతో చర్చలు జరపాలని పీడీపీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.  

17:05 - January 11, 2018

పోలవరం కొత్త టెండర్లు ఈనెల 18కి వాయిదా

విజయవాడ : పోలవరం కొత్త టెండర్లు ఈనెల 18కి వాయిదా పడింది. 16న పోలవరం ప్రాజెక్టు అథారిటీ భేటీ తర్వాత చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రేపటితో పోలవరం కొత్త  టెండర్ల గడువు ముగియనుంది. 
  

16:54 - January 11, 2018

విజయవాడ : పోలవరం...ఎన్నో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పోలవరం నిర్మాణం విషయంలో ప్రతిపక్షాలు పలు విమర్శలు..ఆరోపణలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. పోలవరం నిర్మాణంలో పలు వివాదాలు నెలకొన్నాయి. తాజాగా పోలవరం కొత్త టెండర్లు ఈనెల 18వ తేదీకి వాయిదా పడింది. కాసేపటి క్రితం పోలవరం ప్రాజెక్టు అథార్టీ ప్రాజెక్టు సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రేపటితో పోలవరం కొత్త టెండర్ల గడువు ముగియనున్న సంగతి తెలిసిందే. 16వ తేదీన పోలవరం ప్రాజెక్టు అథార్టీ భేటీ అనంతరం చర్చించి నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

గత కొన్ని రోజులుగా పోలవరం టెండర్ల విషయంలో స్తబ్దత కొనసాగుతోంది. కొత్త టెండర్లు తెరిచే విషయంలో ముందుకెళ్లాలని...వారం రోజుల్లోగా టెండర్లు తెరిచి కొత్త వారికి పనులు అప్పగిస్తారని పోలవరం ప్రాజెక్టు అథార్టీ సీఈవో హల్దార్ వెల్లడించారు. పెరిగిన అంచనాల విషయం పరిశీలనలో ఉందని తెలిపారు. 2019కి పోలవరం పూర్తి చేయాలనేది లక్ష్యమని, 2018 నాటికి నీరు ఇచ్చే విషయం ఇప్పుడే చెప్పలేమన్నారు. స్పిల్ వే..కాపర్ వే పనులను ఇప్పటికే ప్రభుత్వానికి పనులు అప్పగించడం జరిగిందన్నారు. 

16:52 - January 11, 2018

ముగిసిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం

కృష్ణా : విజయవాడలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం ముగిసింది. టెండర్ల విషయంలో ముందుకు వెళ్లాలని ప్రభుత్వానికి సూచించామని పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో ఎస్ కే హల్దార్ తెలిపారు. వారం లోగా టెండర్లు చెరిచి కొత్తవారికి అప్పగిస్తారని తెలిపారు. 2019 నాటికి పోలవరం పూర్తి చేయాలనేది లక్ష్యమన్నారు. 

అవనిగడ్డ విద్యానికేతన్ కోచింగ్ సెంటర్ పై ఐటీ దాడులు

కృష్ణా : అవనిగడ్డ విద్యా నికేతన్ కోచింగ్ సెంటర్ పై ఐటీ దాడులు నిర్వహించింది. అక్రమ ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. స్థిరాస్తులు, బ్యాంక్ పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. రికార్డుల పరిశీలన కొనసాగుతోంది. విద్యానికేతన్ విద్యా సంస్థ ఉపాధ్యాయ శిక్షణ ఇస్తోంది. 

16:23 - January 11, 2018

హైదరాబాద్ : తాను ఎలాంటి కేసులు వాపస్ తీసుకోనని గత కొన్ని రోజులుగా న్యాయ పోరాటం చేస్తున్న సంగీత పేర్కొన్నారు. గత 54 రోజులుగా భర్త శ్రీనివాస్ రెడ్డి ఇంటి ఎదుట పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై మియాపూర్ కోర్టు పలు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఇంటిరీయం ఆర్డర్ ను పాస్ చేసింది. ఈ సందర్భంగా సంగీతతో టెన్ టివి మాట్లాడింది. న్యాయపరంగా వెళ్లడానికి తాను సిద్ధమయ్యాయని..ఇంట్లోకి వెళ్లాలని అనుకుంటున్నట్లు..ఇందుకు తాను పిటిషన్ దాఖలు చేయడం జరిగిందన్నారు. ఇంట్లోకి వెళ్లడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తన అమ్మాయికి కుటుంబం కావాలని కోరుకుంటున్నట్లు..ఆర్థికంగా మాత్రమే వచ్చిందని..కుటుంబ పరంగా రాలేదన్నారు. హక్కుల కోసం పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. కేసులను మాత్రం విత్ డ్రా చేయలేనని..భర్త కాపురం చేసుకోవడానికి వస్తే తాను సమ్మతిస్తానని తెలిపారు. వారిలో మార్పు వస్తేనే కేసులు విత్ డ్రా చేసుకుంటానన్నారు. వారి నుండి ప్రాణహానీ ఉందని..కేసులను అందుకే ఉపహరించుకోవడం లేదన్నారు. తాను విడాకులు ఇవ్వనని..పెళ్లి ఎందుకు చేసుకున్నానని సంగీత ప్రశ్నించారు.

16:19 - January 11, 2018

హైదరాబాద్ : తనకు న్యాయం చేయాలని...భర్త శ్రీనివాస్ రెడ్డి..అత్త..మామలపై చర్యలు తీసుకోవాలని గత 54 రోజులుగా పోరాటం చేస్తున్న సంగీతకు కొంత ఊరట లభించినట్లైంది. మియాపూర్ కోర్టు పలు ఆదేశాలు జారీ చేసింది. గురువారం సంగీత వేసిన పిటిషన్ పై కోర్టు విచారించింది. ఈ విషయంలో కోర్టు ఇంటిరీయం ఆర్డర్ ను పాస్ చేసింది. సంగీత భర్త శ్రీనివాస్ రెడ్డి వేసిన కౌంటర్ ను కోర్టు డిస్మిస్ చేసింది. సంగీత అదే ఇంట్లో ఉంటుందని, సంగీతకు..వారి పాపకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శ్రీనివాస్ రెడ్డి..అత్త..మామ చూసుకోవాలని ఆర్డర్ జారీ చేసింది. సంగీతకు నెలకు రూ. 20వేల మెయింటెనెన్స్ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.

ఈ సందర్భంగా సంగీత తరపు న్యాయవాది టెన్ టివితో మాట్లాడారు. సంగీత వారింట్లో ఉండే విధంగా కోర్టు అవకాశం కల్పించిందని, శ్రీనివాస్ రెడ్డి చేసిన ఆరోపణలను కోర్టు నమ్మలేదన్నారు. కోర్టు ఇచ్చిన ఆదేశాలు ఈ రోజు నుండి అమల్లోకి వస్తాయని, ఇంట్లో ఉండనీవమని..వేరే ఇంట్లో అవకాశం ఇస్తామని శ్రీనివాస్ రెడ్డి తరపు న్యాయవాది వాదించారని పేర్కొన్నారు. 499 ఏ సెక్షన్ కింద విచారించలేదని..తరువాత విచారించే అవకాశం ఉందన్నారు. 

16:16 - January 11, 2018

'స్పైడర్‌' సినిమా తర్వాత రకుల్‌ ప్రీత్‌సింగ్‌కు తెలుగులో కంటే హిందీ, తమిళ చిత్రాల్లోనే నటించే మంచి మంచి ఆఫర్లు వచ్చాయి. ప్రస్తుతం పలు ఇతర భాషా చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్న రకుల్‌ తాజాగా తెలుగులోనూ ఓ రెండు ప్రాజెక్టుల్లో నటించేందుకు పచ్చజెండా ఊపిందని సమాచారం. అయితే ఈ రెండు ప్రాజెక్టులు కూడా మల్టీస్టారర్‌ చిత్రాలు కావడం విశేషం. వీటిలో మొదటగా నాగార్జున, నాని కలిసి నటిస్తున్న మల్టీస్టారర్‌ ఉంది. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమాలో నాని సరసన కథానాయిక పాత్ర కోసం రకుల్‌ని చిత్రబృందం అప్రోచ్‌ అయ్యిందట. అందుకు ఆమె కూడా ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలాఉంటే యువ కథానాయకులు నితిన్‌, శర్వానంద్‌ హీరోలుగా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో దిల్‌రాజు 'దాగుడుమూతలు' పేరుతో ఓ మల్టీస్టారర్‌ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్లుగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సాయిపల్లవిని ఎంపిక చేశారట. ఇటీవల ప్రారంభమైన సూర్య సినిమాలోనూ రకుల్‌, సాయిపల్లవి హీరోయిన్లుగా నటిస్తున్న విషయం విదితమే. ఈ చిత్రానికి సెల్వ రాఘవన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. దీంతోపాటు రకుల్‌ ప్రస్తుతం హిందీలో అక్షయ్ కుమార్‌, తమిళంలో కార్తీ సరసన నటిస్తోంది.

 

16:09 - January 11, 2018

ఆరుపదుల వయసులో మోహన్ బాబు ద్విపాత్రాభినయం చేయనున్నారు. మోహన్‌బాబు ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం 'గాయత్రి'. మదన్‌ రామిగాని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఇందులో ఇటీవల కొన్ని యాక్షన్‌ సన్నివేశాలను తెరకెక్కించారు. యాక్షన్‌ స్టంట్లను సొంతంగా చేసి మోహన్‌బాబు అందరినీ ఆశ్చర్యపరిచారట. మోహన్‌బాబు చేసిన స్టంట్లకు ఆశ్చర్యపోయిన యాక్షన్‌ డైరెక్టర్‌ కనల్‌ కణ్ణన్‌ స్పందిస్తూ, 'మోహన్‌బాబు లాంటి పెద్ద ఆర్టిస్ట్‌ను డైరెక్ట్‌ చేయడం గొప్ప విషయమే. అద్భుతమైన స్టంట్స్‌తో కూడిన యాక్షన్‌ సన్నివేశాలను 67ఏండ్ల వయసులో కూడా ఆయన చాలా బాగా చేశారు. ఈ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. బాగా ప్లాన్‌ చేసి ఎలాంటి రిస్క్‌లు లేకుండా వీటిని తెరకెక్కిస్తున్నాం. ఎనిమిది రోజులపాటు ఈ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది' అని తెలిపారు. వీటి కోసం ఆస్ట్రేలియా నుంచి స్టంట్‌మెన్‌ను పిలిపించారట. ఈ చిత్రంలో మంచు విష్ణు, శ్రియా, నిఖిలా విమల్‌, అనసూయ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. చిత్రాన్ని లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌ పతాకంపై మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 

15:58 - January 11, 2018

హీరో రవితేజ, డైరెక్టర్ శ్రీనువైట్ల కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కనుందంట. త్వరలోనే పట్టాలెక్కబోతుందట. శ్రీనువైట్ల మార్క్‌ కామెడీతో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉండబోతుందని సమాచారం. అమెరికాలో ఎక్కువ శాతం సాగే ఈ చిత్రంలో రవితేజ ఎన్‌ఆర్‌ఐగా కనిపించనున్నారట. ప్రస్తుతం స్క్రిప్ట్‌ ఫైనల్‌ దశలో ఉందని, ఫైనలైజ్‌ అయ్యాక సినిమాను మొదలు పెట్టేందుకు చిత్ర బృందం ముమ్మర సన్నాహాల్లో ఉంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించనుందట. గతంలో రవితేజ, శ్రీనువైట్ల కాంబినేషన్‌లో 'నీకోసం', 'దుబారు శ్రీను', 'వెంకీ' చిత్రాలు మంచి విజయం సాధించాయి. ప్రస్తుతం రవితేజ 'టచ్‌ చేసి చూడు' చిత్రంలో నటిస్తున్నారు. విక్రమ్‌ సిరికొండ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాశీఖన్నా, సీరత్‌ కపూర్‌ కథానాయికలు. ఈ చిత్రం ఫిబ్రవరిలో విడుదల కానుంది. 

సంగీత కేసులో మియాపూర్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు

హైదరాబాద్ : సంగీత కేసులో మియాపూర్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. శ్రీనివాస్ రెడ్డి కౌంటర్ పిటిషన్ ను కోర్టు డిస్మిస్ చేసింది. సంగీతను అత్త వారింట్లోనే ఉంచాలని కోర్టు తెలిపింది. సంగీతకు నెలకు రూ.20 వేలు నిర్వహణ ఖర్చు ఇవ్వాలని పేర్కొంది. సంగీతకు, ఆమె పాపకు ఎలాంటి ఇబ్బందులు కలిగించొద్దని సూచించింది. రోజు వారీ దినచర్యలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా సంగీతను చూసుకోవాలని భర్త శ్రీనివాస్ రెడ్డికి ఆదేశించారు. 

 

15:44 - January 11, 2018
15:42 - January 11, 2018
15:41 - January 11, 2018

కర్నూలు : చిల్లర వర్తక రంగంలో నూరు శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్రం అనుమతినించడం పట్ల ఏపీ సీపీఎం వ్యతిరేకించింది. దీనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని పార్టీ రాష్ట్ర కార్యదర్శి మధు వెల్లడించారు. దీని కారణంగా చిన్న వ్యాపారస్తులు చితికిపోయే ప్రమాదం ఉందన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

15:37 - January 11, 2018

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గురువారం రాత్రి దేశ రాజధానికి పయనం కానున్నారు. ఈ ఢిల్లీ పర్యటనపై ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవలే పోలవరం..విభజన సమస్యలపై విపక్షాలు పలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీకి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు ప్రధాన మంత్రితో ఇటీవలే భేటీ అయ్యారు. ప్రధాన మంత్రితో త్వరలో బాబు భేటీ కానున్నారని ఎంపీలు పేర్కొన్నారు. ప్రధాన మంత్రి అపాయింట్ కేటాయించినట్లు గురువారం పీఎంవో కార్యాలయం నుండి సమాచారం అందించింది.

ఉదయం 10.40గంటలకు ప్రధానితో బాబు భేటీ కానున్నారు. ఇక ఈ భేటీలో విభజన హామీలు, పోలవరం హామీలు, రాష్ట్రానికి ప్రత్యేక సాయం..నియోజకవర్గాల పెంపు అంశాలపై ప్రధానితో మాట్లాడనున్నారు. మరి ఈ భేటీలో ప్రధాన మంత్రి ఎలాంటి హామీలు ఇస్తారో చూడాలి. 

15:33 - January 11, 2018

అనంతపురం : వివిధ సంఘాలు..పేద వారికి రూ. 4, 537 కోట్ల 47 లక్షలు ఇచ్చామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. జిల్లాలోని ధర్మవరంలో జన్మభూమి- మా ఊరు కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. కుమ్మరి, శాలివాహన 1595 మందికి 22 కోట్లు, కృష్ణ బలిజ, పూసల బలిజ ఫెడరేషన్ వారికి రూ. 3.54 లక్షలు ఇచ్చినట్లు..మేజర్ కార్పొరేషన్ లో 641 మందికి రూ. 7 కోట్లు, కల్లుగీత రంగానికి చెందిన 261 మందికి రూ. 2 కోట్ల 83 లక్షలు, సగర ఉప్పరికి చెందిన 2, 100 మందికి రూ. 18 కోట్లు, బ్రాహ్మణ కార్పొరేషన్ 150 కోట్లు..డ్వాక్రాకు చెందిన 70, 062 సంఘాలకు రూ. 2,111 కోట్ల బ్యాంకు లింకేజ్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. మొత్తంగా 2, 42, 663 మందికి రూ. 4,537 కోట్ల 47 లక్షలు ఇచ్చినట్లు తెలిపారు. పేదలను ఆర్థికంగా పైకి తీసుకరావడం కోసం కృషి చేయడం జరగుతోందని, తగిన విధంగా లోన్లు ఇవ్వకపోతే డిపాజిట్లు ఇవ్వబోమని..సహకారం ఇవ్వబోమని గట్టిగా హెచ్చరించడం జరిగిందని, ఎస్ఎల్ బిసి, ప్రభుత్వ అధికారులు..ఇతరులు సమర్థవంతంగా పనిచేయడం జరిగిందని, ఇంతవరకు ఎన్నడూ ఇంత డబ్బు ఇవ్వలేదన్నారు.

పారిశుధ్య కార్యక్రమంలో పాల్గొనే 500 మంది ఎస్సీ సోదరులకు ట్రాక్లర్ల యజమానులు చేయడం జరిగిందని, 125 మందికి ట్రాక్టర్ల పంపిణీ చేయడం జరిగిందన్నారు. 5వేల మంది ఎస్సీ సోదరులకు ఎలక్రిక్టల్ ఆటోలను పంపిణీ చేస్తామని, ప్రభుత్వం ఇచ్చే వాటిని ఉపయోగించుకోవాలన్నారు. గ్రామాల నుండి వెళ్లిన వారందరూ తిరిగి రావాలని పిలుపునివ్వడం జరిగిందని..సంక్రాంతి పండుగ సందర్భంగా కుటుంబసభ్యులతో మెలగాలని సూచించడం జరిగిందన్నారు. తన పిలుపును పట్టించుకున్న వారందరూ వారి వారి గ్రామాలకు వెళ్లడంతో ఆయా గ్రామాలు కళకళలాడుతున్నాయన్నారు. జన్మభూమి రుణం తీర్చుకోవడం కోసం గ్రామాలకు వెళ్లాలని మరోమారు పిలుపునిచ్చారు.

విద్యా వికాసం అందరికీ తప్పనిసరి అని, పిల్లలను చదవించాలని..ఆడ పిల్లలపై నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిపారు. ఆడపిల్లలకు ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్ ఆనాడు కల్పించడం జరిగిందని, మైక్రోసాప్ట్ అధినేత నాదెళ్ల సత్యం తెలుగు రాష్ట్రానికి చెందిన వారుగా కావడం గొప్ప గర్వకారణమన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

పౌష్టికాహారం తీసుకోవాలి : సీఎం చంద్రబాబు

అనంతపురం : ధర్మపురంలో నిర్వహించిన జన్మభూమి...మా ఊరు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. పేదవారిని బంధువులుగా, అతిథులుగా చూసుకుంటున్నామని తెలిపారు. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉందన్నారు. పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు.

15:11 - January 11, 2018

నేరాల సంఖ్య పెరుగుతోంది. దీనికి అనేక కారణాలున్నా ఆర్థిక కారణాలతో నేరాలు జరుగుతున్నట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా ప్రియుడుతో కలిసి భర్తలను చంపిన భార్యల వార్తలు తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తున్నాయి. పక్కా ప్రణాళికతో చేస్తున్నారా ? లేక ఆవేశంతో చేస్తున్నారా ? అనేది పక్కన పెడితే వీటికి మూల కారణాలు ఏంటీ ? ఇంతటి భయంకరమైన పరిస్థితులకు అసలు కారణాలు ఏంటీ ? వివాహేతర సంబంధాల కేసుల్లో మహిళలను నిందితురాలిగా చేయాలన్న అంశాన్ని సుప్రీంకోర్టు పరిశీలనకు తీసుకోవడం యాదృచ్చకమైనా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు భర్తల హత్యలు హల్ చల్ చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో గత మూడు నెలల కాలంలో పది హత్యలు జరిగినట్లుగా తెలుస్తోంది. నేరం ఎవరు చేసిన మహిళలు చేసిన నేరంపై ఎందుకు పెద్దగా మాట్లాడుకోవాల్సి వస్తోంది ? వారి పిల్లల భవిష్యత్ ఏంటీ ? తదితర అంశాలపై టెన్ టివి ఫోకస్ ప్రత్యేక చర్చ చేపట్టింది. ఈ చర్చలో దేవి (సామాజిక కార్యకర్త) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

జన్మభూమి...మా ఊరు కార్యక్రమంలో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు

అనంతపురం : ధర్మపురంలో నిర్వహించిన జన్మభూమి...మా ఊరు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. పేదవారిని బంధువులుగా, అతిథులుగా చూసుకుంటున్నామని తెలిపారు.

ఇంట్లో అనుమతి ఇచ్చిన దానిపై శ్రీనివాస్ రెడ్డి కౌంటర్ దాఖలు

హైదరాబాద్ : ఇంట్లో అనుమతి ఇచ్చిన దానిపై శ్రీనివాస్ రెడ్డి కౌంటర్ దాఖలు చేశారు. ఇప్పుడున్న ఇంట్లో మా తల్లిండ్రులు ఉంటున్నారు. వేరే ఇంట్లోకి మారడానికి అవకాశం ఇవ్వాలన్న కౌంటర్ పై 2.30 గంటలకు మరోసారి కోర్టు విచారించనుంది. 
 

రేపు ఉ.10.40 గం.లకు ప్రధానితో చంద్రబాబు భేటీ

హైదరాబాద్ : ఢిల్లీలో రేపు ఉదయం 10.40 గంటలకు ప్రధానితో చంద్రబాబు భేటీ అయ్యారు. సీఎం చంద్రబాబు ఈరోజు రాత్రి ఢిల్లీ బయల్దేరిన వెళ్లనున్నారు. 

 

నాలా బిల్లును ఆమోదించిన గవర్నర్ నరసింహన్

హైదరాబాద్ : ఏపీ నాలా బిల్లును గవర్నర్ నరసింహన్ ఆమోదించారు. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన వివరణతో బిల్లుకు ఆమోదం తెలిపారు. ఆమోదం తర్వాత బిల్లును గవర్నర్ ఏపీ ప్రభుత్వానికి పంపారు. 

 

14:43 - January 11, 2018

పశ్చిమగోదావరి : జిల్లాలోని ఉండి మండలం చిలుకూరు గ్రామ పంచాయతీలో కొందరు అనుమతి లేకుండానే 600 ఎకరాల భూముల్లో తవ్వకాలు జరిపేస్తున్నారు. నెల రోజుల నుండి చిలుకూరు గ్రామ పంచాయతీ అక్రమ చేపల చెరువుల తవ్వకాలను యదేచ్చగా జరుపుతున్నారు. ఇంత తతంగం జరుగుతున్నా జిల్లా కలెక్టర్, తహశీల్దార్, గ్రామ పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదు. అధికారుల వ్యవహారంతోనే అక్రమ దారులు పెట్రేగిపోతున్నారని గ్రామస్తులు పేర్కొంటున్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమలను ప్రభుత్వం ఆదుకుంటోంది : కేటీఆర్

హైదరాబాద్ : రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమతి సభ్యులతో మంత్రి కేటీఆర్ సమావేశం కానున్నారు. వినూత్న కార్యక్రమాలతో రాష్ట్ర ప్రభుత్వం చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమలను ఆదుకుంటోందని కేటీఆర్ తెలిపారు. ఇండస్ట్రీ హెల్త్ క్లినిక్ లో బ్యాంకర్లు భాగస్వాములు కావాలన్నారు. బ్యాంకుల సహకారం లేకుండా చిన్న తరహా పరిశ్రమలను ఆదుకోలేమని చెప్పారు. 

 

14:38 - January 11, 2018

పశ్చిమగోదావరి : ఏపీ జీవనాడిగా పిలవడే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో పనులు నిలిచిపోయాయి. ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఇప్పటికే దీనిపై పలు వివాదాలు నెలకొన్నాయి. తాజాగా ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు పనులు చేయకపోవడంతో పోలవరం నిర్మాణాలు నిలిచిపోయాయి.
ట్రాన్స్ ట్రాయ్ సంస్థలో పనిచేస్తున్న వారందరికీ జీతాలు చెల్లించకపోవడంతో పనులను నిలిపివేశారు. 400పైగా ఉద్యోగులకు మూడు నెలల నుండి జీతాలు ఇవ్వడం లేదని తెలుస్తోంది. సంక్రాంతి పండుగ వస్తున్న సందర్భంగా..ఇతరత్రా పనుల నిమిత్తం డబ్బులు అవసరం వస్తుందని..ఈ నేపథ్యంలో బాకీ ఉన్న వేతనాల డబ్బులను ఇవ్వాల్సిందేనని ఉద్యోగులు ఖరాఖండిగా చెబుతున్నారు. దీనితో ట్రాన్స్ ట్రాయ్ సంస్థ ఉద్యోగులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. మొత్తానికి వారం రోజుల పాటు పనులు నిలిచే అవకాశాలున్నట్లు సమాచారం. 

రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమతి సభ్యులతో మంత్రి కేటీఆర్ భేటీ

హైదరాబాద్ : రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమతి సభ్యులతో మంత్రి కేటీఆర్ సమావేశం కానున్నారు. చిన్న సూక్ష్మ తరహా పరిశ్రమలకు బ్యాంకుల నుంచి అందించాల్సిన సహాయంపై చర్చించనున్నారు. 

 

14:35 - January 11, 2018

చిత్తూరు : ప్రేమ హత్యలు..ప్రేమ మరణాలు పెరిగిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలే పలు దారుణ ఘటనలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. చిత్తూరు జిల్లా కుప్పం మండలం క్రిష్టాపురంలో దారుణం చోటు చేసుకుంది. ప్రియురాలు ఇంకొకరిని వివాహం చేసుకుందని ఓ ప్రియుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుప్పంలో నివాసం ఉండే స్నేహాంజలితో తిరుపతి నివాశి దామోదర్ కు పరిచయం అయ్యింది. గత కొన్ని రోజులుగా స్నేహాంజలిపై ప్రేమను పెంచుకున్నాడు. కానీ స్నేహాంజలి కూడా ప్రేమించిందా ? లేదా ? అనేది తెలియరాలేదు. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల కిందట కుప్పంకు చెందిన ఓ వ్యక్తితో స్నేహాంజలికి వివాహం జరిగింది. స్థానికంగా టీచర్ ఉద్యోగం కూడా చేస్తోంది. వివాహం చేసుకున్న విషయం తెలుసుకున్న దామోదర్ జీర్ణించుకోలేకపోయాడు. తిరుపతి నుండి కుప్పంకు వెళ్లిన దామోదర్..స్నేహాంజలి ఇంటి ఎదుట ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటికున్నాడు. స్థానికులు ఇతడిని ఆసుపత్రికి తరలించారు. 75 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నాడు. బతికే అవకాశం లేదని వైద్యులు పేర్కొంటున్నట్లు సమాచారం. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

14:31 - January 11, 2018

ప్రభుత్వ నిర్భందంపై రౌండ్ టేబుల్ సమావేశం...

విజయవాడ : జన్మభూమి గ్రామ సభల్లో ప్రభుత్వ నిర్భందంపై అఖిలపక్షం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. జన్మభూమి సభల్లో ప్రజా సమస్యలు పరిష్కారం కావడం లేదని సీపీఎం నేత బాబురావు, వైసీపీ నేతలు మల్లాది, వెల్లంపల్లిలు పేర్కొన్నారు. 

అటెన్షన్ డైవర్షన్ ముఠా అరెస్టు....

హైదరాబాద్ : అటెన్షన్ డైవర్షన్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. సౌదీ, ఇండియా కరెన్సీని లంగర్ హౌస్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. ఓడిశా, యూపీ, ముంబైలలో రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. 

నెల్లూరు మేయర్ అజీజ్ పై చీటింగ్ కేసు

నెల్లూరు : కార్పొరేషన్ మేయర్ అబ్దుల్ అజీజ్ షాక్ తగిలింది. మేయర్ అజీజ్, ఆయన సోదరుడు, డైరెక్టర్ అనిల్ పై చీటింగ్ నమోదు అయింది. వీరి పై మద్రాస్ సెంట్రల్ క్రైమ్ బోర్డ్ చీటింగ్ కేసు నమోదు చేసింది. స్టార్ అగ్రోలో వాటా కోసం ఇచ్చిన రూ.42 కోట్లను అజీజ్ తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. 

ఏపీ నాలా బిల్లును ఆమోదించిన గవర్నర్

హైదరాబాద్ : ఏపీ నాలా బిల్లును గవర్నర్ నరసింహన్ ఆమోదించారు. ఏపీ ప్రభుత్వం వివరణతో గవర్నర్ సంతృప్తి చెంది బిల్లు ఆమోదించినట్టు తెలుస్తోంది. 

రేపు కోడిపందాలపై సుప్రీంలో విచారణ

ఢిల్లీ : కోడి పందాల నిషేధంపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రఘురామకృష్ణం రాజు అనే వ్యక్తి సుప్రీం ఆశ్రయించాడు. ఎల్లుండి నుంచి పండగ నేపథ్యంలో రేపే సుప్రీం కోర్టులు వాదనలు జరగనున్నాయి.

13:32 - January 11, 2018
13:31 - January 11, 2018
13:29 - January 11, 2018

నెల్లూరు : కార్పొరేషన్ మేయర్ అబ్దుల్ అజీజ్ షాక్ తగిలింది. మేయర్ అజీజ్, ఆయన సోదరుడు, డైరెక్టర్ అనిల్ పై చీటింగ్ నమోదు అయింది. వీరి పై మద్రాస్ సెంట్రల్ క్రైమ్ బోర్డ్ చీటింగ్ కేసు నమోదు చేసింది. స్టార్ అగ్రోలో వాటా కోసం ఇచ్చిన రూ.42 కోట్లను అజీజ్ తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

13:28 - January 11, 2018

హైదరాబాద్ : ఏపీ నాలా బిల్లును గవర్నర్ నరసింహన్ ఆమోదించారు. ఏపీ ప్రభుత్వం వివరణతో గవర్నర్ సంతృప్తి చెంది బిల్లు ఆమోదించినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

13:27 - January 11, 2018

ఢిల్లీ : కోడి పందాల నిషేధంపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రఘురామకృష్ణం రాజు అనే వ్యక్తి సుప్రీం ఆశ్రయించాడు. ఎల్లుండి నుంచి పండగ నేపథ్యంలో రేపే సుప్రీం కోర్టులు వాదనలు జరగనున్నాయి. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

పవన్ కంటే కత్తి అందంగా ఉన్నారు : వర్మ

హైదరాబాద్ : అజ్ఞాతవాసి సినిమాపై వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ స్పందించారు. పవన్ కల్యాణ్ కన్నా కత్తి మహేషే అందంగా ఉన్నాడని, టెన్ టీవీ చర్చ క్లిప్ ను వర్మ పోస్ట్ చేశారు. 

మియాపూర్ కోర్టులో సంగీతకు ఊరట

హైదరాబాద్ : సంగీతకు అనుకూలంగా మియాపూర్ కోర్టు తీర్పునిచ్చింది. నెలకు రూ.20 వేలు, ఇంట్లోకి వెళ్లడానికి కోర్టు సంగీతకు అనుమతి ఇచ్చింది. ఇప్పటికే సంగీత అత్త, మామ, భర్త మియాపూర్ కోర్టు చేరుకున్నారు.

12:19 - January 11, 2018

పశ్చిమగోదావరి : జిల్లాలో అక్రమంగా చేపల చెరువులను తవుతున్నారు. అధికారులు లంచలు తీసుకుని అటు వైపే చూడడంలేదు. దీనిపై మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

12:16 - January 11, 2018

హైదరాబాద్ : అజ్ఞాతవాసి సినిమాపై వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ స్పందించారు. పవన్ కల్యాణ్ కన్నా కత్తి మహేషే అందంగా ఉన్నాడని, టెన్ టీవీ చర్చ క్లిప్ ను వర్మ పోస్ట్ చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

12:15 - January 11, 2018

హైదరాబాద్ : సంగీతకు అనుకూలంగా మియాపూర్ కోర్టు తీర్పునిచ్చింది. నెలకు రూ.20 వేలు, ఇంట్లోకి వెళ్లడానికి కోర్టు సంగీతకు అనుమతి ఇచ్చింది. ఇప్పటికే సంగీత అత్త, మామ, భర్త మియాపూర్ కోర్టు చేరుకున్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

12:04 - January 11, 2018

తూర్పుగోదావరి : వంపులు తిరిగిన రహదారులు..విస్తారంగా పరుచుకున్న అందమైన వనాలు..గలగల పారే జలపాతాలు...తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి ప్రకృతి అందాలతో కళకళలాడుతోంది. ఏజెన్సీలో వంపులు తిరిగిన రహదారులపై కొండల అంచున సాగే ఘాట్ రోడ్డు ప్రయాణం గమ్మత్తుగా ఉంటుంది. కాఫీ తోటల నుంచి వచ్చే పరిమళాలు మనసుని ఆస్వాదింపచేస్తాయి. రాజమండ్రికి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న మారేడుమిల్లి చుట్టూ ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. రాజమండ్రి నుంచి భద్రాచలం వెళ్లే రోడ్డుని ఆనుకుని ఉన్న ఈ ప్రాంతంలో పర్యాటకులకు కనువిందు చేసే ఎన్నో ప్రకృతి సోయగాలు కొలువై ఉన్నాయి. మంచు కురిసే వేళలో మన్యం అందాలు చూడాలంటే రెండు కళ్లు చాలు. కొండవాలులో మంచు కురుస్తున్నప్పుడు .. చెట్ల పొదల చాటు నుంచి భానుడు కనిపించే దృశ్యం కనువిందు చేస్తుంది. ఆ అనుభూతిని చెప్పాలంటే మాటలు సరిపోవు. మారేడుమిల్లి సమీపంలో జలతరంగిణి సహా అనేక జలపాతాలున్నాయి. రంప సమీపంలోనూ జలపాతం ఉంది. అన్నింటికీ మించి మారేడుమిల్లి వెళ్లే మార్గంలో ఉన్న భూతిపాలెం రిజర్వాయర్ కడు రమణీయంగా ఉంటుంది. బోటింగ్ సదుపాయం కూడా ఉండటంతో ఆ ముచ్చట తీర్చేసుకోవచ్చు.

ఏజెన్సీలో గిరిజనులు వారి జీవన విధానం..
మారేడుమిల్లి ఏజెన్సీలో గిరిజనులు వారి జీవన విధానం.. సంస్కృతి సంప్రదాయాలనూ ఎంతగానో అవగాహన ఏర్పడుతుంది. వారి సంప్రదాయ నృత్యాలు, ఆటపాటలు మనసుని హత్తుకుంటాయి. కాలామానాలను బట్టి ఇక్కడి అడవి అందాలు మార్చుకుంటుంది. ముఖ్యంగా మన ప్రాంతంలో ఉన్నవి ఆకురాల్చే అడవులు కావడంతో ఫిబ్రవరి తరువాత మరింత కొత్తందాలు సంతరించుకుంటాయి. మళ్లీ వసంతమాసంలో ఆకులు చిగురించి మరో రూపు దాల్చుతాయి. మారేడుమిల్లిలో శీతాకాలంలో కనిష్టంగా 4 డిగ్రీలు , వేసవిలో అత్యధికంగా 35 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు ఉంటాయి. మారేడుమిల్లికి ఏటా పెద్ద సంఖ్యలో జనం తరలి వస్తుంటారు. ఫిబ్రవరి నుంచి సెప్టెంబర్ వరకూ రద్దీ మరింత ఎక్కువ ఉంటుంది. అందుకు తగ్గట్లుగా ఫారెస్ట్ అధికారులు ఇక్కడ సదుపాయాలను మెరుగుపరుస్తున్నారు. 10 ఏళ్ల క్రితం ఇక్కడ ఎకో టూరిజం పేరుతో కాటేజీలు నిర్మించినప్పటికీ.. ప్రస్తుతం పర్యాటకులు పదింతలు పెరిగిపోయారు. దాంతో వారి అవసరాలకు అనుగుణంగా సౌకర్యాలపై దృష్టి పెట్టాలని టూరిస్టులు చెబుతున్నారు.

ఫిబ్రవరి నుంచి సెప్టెంబర్ వరకూ రద్దీ
మారేడుమిల్లికి ఏటా పెద్ద సంఖ్యలో జనం తరలి వస్తుంటారు. ఫిబ్రవరి నుంచి సెప్టెంబర్ వరకూ రద్దీ మరింత ఎక్కువ ఉంటుంది. అందుకు తగ్గట్లుగా ఫారెస్ట్ అధికారులు ఇక్కడ సదుపాయాలను మెరుగుపరుస్తున్నారు. 10 ఏళ్ల క్రితం ఇక్కడ ఎకో టూరిజం పేరుతో కాటేజీలు నిర్మించినప్పటికీ.. ప్రస్తుతం పర్యాటకులు పదింతలు పెరిగిపోయారు. దాంతో వారి అవసరాలకు అనుగుణంగా సౌకర్యాలపై దృష్టి పెట్టాలని టూరిస్టులు చెబుతున్నారు. మారేడుమిల్లి మన్యంలో ఓ రోజంతా గడపడానికి పాములేరులో చేస్తున్న ఏర్పాట్లు చాలామందిని ఆకట్టుకుంటున్నాయి. వాటికి తోడు ప్రైవేటు రిసార్ట్స్ కొన్ని పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. వాటిలో కొన్ని చోట్ల సదుపాయాలు లేకపోవడంతో టూరిస్టులు కొంత అవస్థలు పడుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే త్వరలో ఫారెస్టు అధికారుల చొరవతో కొత్త రిసార్ట్స్ అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. మరోవైపు జిల్లా అటవీ శాఖ అధికారిణి నందినీ సలారియా కూడా వీటిపై దృష్టి కేంద్రీకరించారు. ప్రత్యేక సదుపాయాలు కల్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఫారెస్ట్ అధికారులకు తోడు టూరిజం శాఖ కూడా కొంత ప్రయత్నాలు సాగిస్తోంది. ముఖ్యంగా మారేడుమిల్లి సమీపంలో ఉడ్ తో కూడిన కాటేజీలు, స్విమ్మింగ్ పూల్ సహా పలు సదుపాయాలను సిద్ధం చేస్తోంది. వచ్చే వేసవి నాటికి మొత్తానికి విజ్ఞానం, వినోదం అందిస్తున్న మారేడుమిల్లి మన్యంలో ఏర్పాట్లు మెరుగైతే టూరిస్టులు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా త్వరలోనే తూర్పుగోదావరి జిల్లా అటవీ ప్రాంతం పర్యాటక హబ్‌గా రూపొందడానికి అడుగులు పడుతున్నాయి. 

12:03 - January 11, 2018

హైదరాబాద్ : నూటికో కోటికో ఒక్కరు.. హైమన్‌ డార్ఫ్‌ గురించి చెప్పుకోవాలంటే ఇదే వాక్యం సరిపోతుంది. ఎక్కడో ఇంగ్లడ్‌ దేశానికి చెందిన వ్యక్తి.. ఇండియాలో ఆదిలాబాద్‌ ఆదివాసీల బాధలకు చలించి పోయారు. అడవిబిడ్డల జీవితాలతో మమేకం అయి.. వారి బాధలను తీర్చడానికి నాటి నిజాం పాలకులకు కనువిప్పు కలిగించేందుకు సతీసమేతంగా.. అవిశ్రాంతంగా పాటుపడ్డారు సైమన్ డార్ఫ్‌. అది 1932 -40 ప్రాంతం.. హైదరాబాద్ రాజ్యంలో ఏడో నిజాం పాలన సాగుతున్న రోజులు. దొరలు, దోపడీదార్లకు వత్తాసుపలికే అధికారం యంత్రాంగం పట్టులో పాలన ఉన్న రోజులు. మైదాన ప్రాంత పల్లెల్లో ప్రజలు నిలువుదోపిడీకి గురవుతున్న కాలంలో.. మారుమూల ఆదివాసీ గూడేల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని.. అధికారులు.. దొరలు, వ్యాపారులు అడవిని, అడవి బిడ్డలను దోచుకోవడంపై గిరిజన పౌరుషం తిరగబడింది. కొమురంభీమ్ నేతృత్వంలో ఆదివాసీలు నాటి నిజాం సైన్యానికి వ్యతిరేకంగా ఆయుధాలు పట్టారు. జల్‌జంగ్‌జమీన్‌ నినాదంతో.. అడవిపై హక్కులు తమవేనని గర్జించారు.

1940లో జోడేఘాట్‌లో జరిగిన భీకర పోరు
అడవిబిడ్డల పోరాటాన్ని శాంతిభద్రతల సమస్యగానే చూసిన నాటి నిజాం అధికార యంత్రాంగం.. ఆదివాసీలపై సైన్యాన్ని నడిపింది. 1940లో జోడేఘాట్‌లో జరిగిన భీకర పోరులో గిరజన నేత కొమురం భీమ్‌ను మట్టుబెట్టారు. ఉద్యమాన్ని బలవంతంగా అణిచివేసినా.. అసలు ప్రభుత్వంపై ఆదివాసీల పోరాటానికి మూలలను వెదకాలని .. నిజాం పాలకులు నిర్ణయించారు. ఈ క్రమంలో 1935-36 కాలం‌లో రాక్‌ఫెలర్ ఫౌండేషన్ తరపున భారత్‌లోని ఆదివాసీలపై అధ్యయనం చేస్తున్న హైమన్‌డార్ఫ్‌ ను నాటి నిజాం సర్కార్‌ సంప్రదించింది. అప్పటికే ఈశాన్య రాష్టాల్లోని నాగాలపైనా, తర్వాత నాటి అవిభక్త మద్రాస్ రాష్ట్రం‌లోని గోదావరిజిల్లా గొండులపైనా పరిశోధనలు చేసి... నాగాలాండ్‌లో నివాస ఏర్పరచుకున్న హెమన్‌డార్ఫ్ దంపతులు... ఐదునెలల్లోనే నాగాల భాషను నేర్చుకొని ద్విభాషి సహాయం‌ లేకుండానే స్థానికులతో సంభాషించే స్థాయికి చేరుకున్నారు. నిజాం ప్రభువుల అభ్యర్థనతో ఆదిలాబాద్‌ గోండుల తిరుగుబాటుకు, వారి కష్టాలపై అధ్యయనం చేయడానకి హైమన్‌డార్ఫ్‌ ఆదిలాబాద్‌ ఏజెన్సీకి చేరుకున్నారు. దట్టమైన అడవులతో నిండివున్న మారుమూల గోండు గూడం మార్లవాయి చేరుకున్నారు హైమర్‌డార్ఫ్‌ ఆయన భార్య బేటీ డార్ఫ్‌. ' పుట్టిన ప్రతి మనిషీ అభివృద్ధికి అర్హుడే' అన్న ప్రగాఢమైన విశ్వాసాన్ని గుండెల నిండా నింపుకొని హైమన్ డార్ఫ్ దంపతులు 1941లో మార్లవాయిలో అడుగుపెట్టారు.గోండుగూడేల్లో తిరుగుతూ వారి జీవినశైలితోపాటు .. వారి కష్టనష్టాలపై అధ్యయనం చేశారు. దీనికోసం హైమన్‌ దంపతులు గోండుభాషను నేర్చుకున్నారు. ఆదివాసీలతో వారి సొంతభాషలోనే మాట్లాడి మరింత దగ్గరయ్యారు. అంతేకాదు గిరిజనులకు చదువు నేర్పాలన్న పట్టుదలతో లిపిలేని ఆదివాసీల భాషకు దేవనాగరి లిపిలో గోండుభాషను అక్షబద్ధం చేశారు.

అడవిబిడ్డల ఆటపాటల్లోనూ.. పండుగల్లోనూ మమేకం
అడవిబిడ్డల ఆటపాటల్లోనూ.. పండుగల్లోనూ మమేకం అయ్యారు. మొదట వారు మొర్లవాయికి వచ్చినపుడు ఇక్కడ హైమన్‌డార్ఫ్‌ దంపతులకు మర్లవాయి గ్రామ సర్పంచ్‌ లచ్చుపటేల్‌ ఓ గుడిసెను ఏర్పాటు చేసి.. అన్ని అవసరాలు చూసుకున్నాడు. దీంతో లచ్చుపటేల్‌కు డార్ఫ్‌ దంపతులు బంధువులుగా మారిపోయారు.ఈ క్రమంలో లచ్చుపటేల్ జబ్బుతో మరణిస్తే.. డార్ఫదంపతులు తమ పురిటి బిడ్డకు లచ్చుపటేల్‌ అని పేరుపెట్టుకుని ఆదివాసీల జీవితాలతో మమేకం అయ్యారు. 1940 నంచి 43 వరకు పూర్తిగా మొర్లవాయిలోనే ఉన్న హైమన్‌డార్ఫ్‌ .. ఆతర్వాత 1956 వరకు ఆదివాసీల గూడేల్లో పర్యటిస్తూ సమగ్ర నివేదికను నిజాం ప్రభుత్వానికి అందించారు. గిరిజనుల జీవన స్థితిగతులపై తమ పరిశీలనను 3650 పేజీలలో, 100 గంటల నిడివితో చలన చిత్రాల్లోనూ, 10వేలకు పైగా ఛాయాచిత్రాలలోనూ నమోదు చేశారు హెమన్‌డెర్ఫ్ దంపతులు. దాంతో గిరిజనుల పోరాటానకి మూలాలు తెలుసుకున్న 7 నిజాం సర్కారు.. కఠినమైన గిరిజన చట్టాలను రూపొందించింది. అడవిపై హక్కులను ఆదివాసీలకే కల్పించింది. వారి విద్యాభివృద్ధి, ఆరోగ్య అవసరాల కోసం చర్యలు తీసుకుంది. ఇలా హైమన్‌డార్ఫ్‌ కృషితో నాడు రూపొందించిన అటవీ చట్టాలు నేటికీ ప్రభుత్వాలు ఆచరిస్తున్నాయి.

ఆస్ట్రీయాదేశంలోని వియెన్నానగరం..
ఆస్ట్రీయాదేశంలోని వియెన్నానగరంలో 1909 జూన్ 22న జన్మించిన క్రిష్టఫర్ వాన్‌ ఫరో హెమన్‌డర్ఫ్ వియెన్నా విశ్వవిద్యాలయం‌నుండి మానవ పరిణామ శాస్త్రం‌లో పీ హేచ్‌డీ పట్టా తీసుకున్నారు. అమెరికాలొని రాక్‌ఫెలర్ ఫౌండేషన్ ఆర్ధిక సహాయంతో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో విఖ్యాత మానవ పరిణామ శాస్త్ర అధ్యాపకుడు బ్రోనిస్‌లా మాలినోవ్‌స్కి వద్ద అధ్యయనం చేశారు. గిరిజనుల అభివృధ్ధి అంటే వేష భాషలు మార్చుకొనే ఆధునీకరణ కాదనీ వారి సాంస్కృతీ సాంప్రదాయలను కొనసాగిస్తూనే విద్యార్జన ద్వారా మేధోపరమైన అభివృధ్ధిని సాధించడమనీ, తమ తదుపరి తరాలవారిని ఉన్నత తీరాలకు చేర్చదమనీ హెమన్‌డెర్ఫ్ దంపతులు చెప్పేవారు. ఇంగ్లండుకు తిరిగి వెళ్ళిన తరువాతకూడా హెమెన్‌డెర్ఫ్ దంపతులు తరచుగా మర్లవాయికి వచ్చేవారు. మరణానంతరం భౌతిక కాయాన్ని గిరిజన పద్ధతులతో మర్లవాయిలో గిరిజన లచ్చు పటేల్ సమాధి పక్కనే పూడ్చిపెట్టాలని ఎలిజబెత్ గిరిజనుల దగ్గర మాట తీసుకుంది. తర్వాత రెండు సంవత్సరాలకే ఆమె మరణించింది. ఎలిజబెత్ కోరిక మేరకు ఆత్మబంధువులైన గోండులు లచ్చు పటేల్ సమాధి పక్కనే సమాధి నిర్మించి కర్మకాండ జరిపారు. మానసికంగా కుంగిపోయిన హైమన్ డార్ఫ్ భార్య సమాధి పక్కనే తనకూ ముందుగానే సమాధి నిర్మింపజేసుకున్నాడు. 1995లో హైమన్‌డార్ఫ్‌ తుదిశ్వాస విడిచారు.

తన తల్లి బెటీ సమాధి పక్కనే
2012 ఫిబ్రవరిలో25న మర్లవాయికి చేరుకున్న డార్ఫ్‌ కుమారుడు నికోలస్‌ ఇక్కడ తన తల్లి బెటీ సమాధి పక్కనే తన తండ్రి అస్తికలను ఉంచి సమాధి నిర్మించారు. నికొలస్‌ భార్య సారా, కొడుకు హైమన్‌తో హైదరాబాద్ చేరుకున్నాడు. గిరిజన సంప్రదాయబద్ధంగా మనవడు హైమన్ డార్ఫ్ తన తాత కర్మకాండను నిర్వహించాడు. మనవడిలో తాతను చూసుకొని ఆ తరం గోండులు తన్మయత్వం చెందారు. ఏ కొమ్మకు పూసిన పువ్వు ఎటువైపు దృష్టి సారిస్తుందో, ఏ గాలికి గంధాన్ని పులుముతుందో, ఏ వానకు రాలి ఏ ప్రవాహంలో పడి, ఏ మట్టిలో కలిసిపోతుందో ఎవరూ చెప్పలేరు. మనిషి జీవితం పువ్వులాంటిదే. డార్ఫ్ దంపతుల జీవితమే దీనికి సజీవ సాక్ష్యం. మార్లవాయి గిరిజన మానవీయతకు దూరంగా వెళ్ళడం ఇష్టం లేక మరణించినా తామిక్కడే సమాధి కావాలనుకున్నారు. మానవ పరిణామ శాస్త్రాన్ని అధ్యయం చేసిన హైమన్‌డార్ఫ్‌ .. గొప్ప మానవతా వాదిగా గిరిజన బంధువుగా పేరొందారు. హైమన్‌డార్ఫ్‌కు ఆదివాసీ జనం ఘనంగా నివాళుర్పిస్తోంది. 

12:02 - January 11, 2018

చిత్తూరు : టీటీడీ బోర్డు ఏర్పాటు అంశం టీడీపీ సర్కార్‌కు ప్రహసనంగా మారింది. గత పాలకవర్గం గడువు ఏప్రిల్‌తో ముగిసినా సీఎం చంద్రబాబు ఇప్పటివరకూ కొత్త బోర్డును ఏర్పాటు చేయలేకపోయారు. మిత్రపక్షమైన బీజేపీ పెద్దలు లెక్కకు మించి సిఫార్సులు చేస్తుండమే ఈ జాప్యానికి కారణమని టీడీపీ వర్గాలు అంటున్నాయి. 2014లో ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏడాదిపాటు బోర్డు లేకుండానే కాలం గడిచిపోయింది. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబుతో సహా జేఈవో టీడీపీ నేతల్ని అవమానించారంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక అవన్నీ మర్చిపోయి అదే జేఈవోతో కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా వేయాల్సిన బోర్డులో తీవ్ర పోటీ నెలకొంది. ఎవరికి వారు తమకు ఒక అవకాశం ఇవ్వాలని చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు వడపోసి టీటీడీ బోర్డును సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సంక్రాంతి పండుగ అనంతరం కొత్తబోర్డు ఏర్పాటుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమాచారం.

చైర్మన్ రేసులో పుట్టా సుధాకర్ యాదవ్
ఇక టీటీడీ బోర్డు చైర్మన్‌గా ఎప్పటి నుండో వినిపిస్తున్న పుట్టా సుధాకర్ యాదవ్ పేరే చైర్మన్ రేసులో ముందుంది. చంద్రబాబు పుట్టా సుధాకర్‌నే ఈసారి టీటీడీ చైర్మన్‌గా నియమించాలని నిర్ణయించినట్లు సమాచారం. ముందుగా ఈ పదవి కోసం మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు, మాజీ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ, ఎంపీ రాయపాటి సాంబశివరావు, మరో ఎంపీ మాగంటి మురళీమోహన్‌లు పోటీపడ్డారు. అయితే పదవుల్లో ఉన్నవారికి నో ఛాన్స్ .. అని చెప్పడంతో వారంతా పోటీ నుంచి తప్పుకున్నారు. ఆర్ధికమంత్రి యనమలకు సుధాకర్ యాదవ్ వియ్యంకుడు కావడంతో పాటు... స్ధానికంగా మాజీ మంత్రి డీఎల్.రవీంద్రారెడ్డికి వచ్చే ఎన్నికల్లో మైదుకూరు టికెట్ ఇవ్వాలని భావిస్తుండటంతో సుధాకర్ యాదవ్ ఎంపికకు మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది. కాగా..అప్పట్లో పుట్టా అన్యమతస్తుడనే వివాదం చెలరేగడంతో సీఎం నిర్ణయం సందిగ్ధంలో పడింది. దీనిపై సీఎం ఉన్నతస్ధాయి విచారణ కూడా జరిపించారు. విచారణలో సుధాకర్ యాదవ్‌పై వచ్చిన వివాదం అవాస్తవం అని తేలడంతో ఆయనకే పదవి కట్టబెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

కేంద్రం నుంచి చైర్మన్ పదవి కోసం
అటు కేంద్రం నుంచి చైర్మన్ పదవి కోసం తమ వారికి అవకాశం కల్పించాలని ముగ్గురి పేర్లు రాష్ట్ర ప్రభుత్వానికి పంపినట్లు తెలుస్తోంది. మరోవైపు బోర్డు పదవుల కోసం గత పాలక మండలిలో ఉన్నవారిలో అత్యధికులు ఈసారి కూడా సభ్యత్వం ఆశిస్తున్నారు. అయితే ఈసారి కొత్తవారికి అవకాశమివ్వాలని అధిష్ఠానం యోచిస్తోంది. రాష్ట్ర పార్టీ కార్యాలయ కార్యదర్శి ఏవీ రమణ గత పాలకమండలిలో నిజాయితీ పనిచేశారనే పేరుండటంతో మరోసారి ఆయనకు అవకాశం దక్కవచ్చని తెలుస్తోంది. గత పాలకమండలిలో సభ్యుడిగా ఉన్న తెలంగాణ రాష్ట్ర సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కూడా మరోసారి అవకాశం కోసం ప్రయత్నిస్తున్నారు. అటు ప్రతిపక్ష నేత జగన్ సైతం పాదయాత్రలో టీటీడీ బోర్డు నియమించకపోవడంపై విమర్శలు గుప్పించారు. అదే విధంగా ఇటీవల వైకుంఠ ఏదాదశి సందర్భంగా కొండపై జరిగిన పరిణామాలను చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు తెలుగు తమ్ముళ్లు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో బోర్డు జాప్యం తగదని చంద్రబాబు డిసైడైనట్లు తెలుస్తోంది. ఇక అధికారికంగా ఎవరు చైర్మన్.. ఎవరు పాలకమండలి సభ్యులు తెలియాలంటే సంక్రాంతి పండుగ వెళ్లేవరకూ ఆగాల్సిందే. 

12:01 - January 11, 2018

గుంటూరు : పౌరసరఫరాల పంపిణీలో అవినీతి, అక్రమాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. అడ్డుకోవాల్సిన అధికార పార్టీనే అక్రమాలకు పాల్పడుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కృష్ణా, గుంటూరు జిల్లాలో అధికార పార్టీ నేతల కనుసన్నల్లో రైస్ మాఫియా నడుస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.అక్రమార్కులు రేషన్ డీలర్లతోపాటు అధికారులను లోబరుచుకుని... పేదల బియ్యం నల్లబజారుకు తరలిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు మరోవైపు రేషన్ బియ్యం తీసుకోవడం ఇష్టం లేని కొందరితో నేరుగా కొంటున్నారు. కిలో 9రూపాయలకు తీసుకున్న బియ్యం పాలీష్‌ చేసి.. బ్లాక్‌ మార్కెట్‌లో 50 రూపాయలకు అమ్ముతున్నట్లు సమాచారం.

ఇప్పటికే అధికారులు దాడులు చేసి ఎన్నో కేసులు పెట్టారు. ఐనా మాఫియా ఆగడాలు మాత్రం ఆగడంలేదు.

ఉయ్యూరులో 13 క్వింటాళ్ళ బియ్యం
ఉయ్యూరులో 13 క్వింటాళ్ళ బియ్యం అధికారులు గుర్తించారు., రైస్‌ మాఫియాకు చెందిన ఓ చోటా నేత ఇంట్లో 10 లక్షల విలువైన బియ్యం స్వాధీనం చేసుకున్నారు, కంకిపాడు మండలం చలివేంద్రపాళెం వద్ద అక్రమంగా బియ్యం తరలిస్తున్న వాహనం పట్టుబడింది. మరో మూడు రైస్‌ మిల్లుల్లో లక్షలాది రూపాయల విలువైన బియ్యం పట్టుబడ్డాయి. కృష్ణా, గుంటూరు జిల్లాలనుంచి తెలంగాణ రాష్ర్టానికి అక్రమంగా బియ్యం తరలిస్తున్న ఉదంతాలు కూడా వెలుగుచూశాయి. పేదల కడుపు నింపాల్సిన బియ్యంతో చేస్తున్న అక్రమ వ్యాపారాన్ని అడ్డుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వం స్పందించి రైస్‌ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని అంటున్నారు.

11:59 - January 11, 2018

గుంటూరు : సీపీఐ నేత నారాయణ ఏపీ అసెంబ్లీ, సెక్రటేరియట్ ఎదుట సైకిల్‌పై చక్కెర్లు కొట్టారు. సైకిల్‌పై వెలగపూడి సచివాలయానికి చేరుకున్న ఆయన ఎస్పీఎఫ్ సిబ్బందిని పరుగులు పెట్టించారు. సైకిల్‌పై సెక్రటేరియట్‌ ప్రాంగణానికి చేరుకున్న నారాయణను.. సైకిల్‌పై కాకుండా నడుచుకుంటూ లోనికి వెళ్లాల్సిందిగా భద్రతా సిబ్బంది కోరారు. అయితే సైకిల్‌పైనే కాసేపు చక్కెర్లు కొట్టిన నారాయణ తిరిగి వెళ్లిపోయారు. 

నిర్మాత బండ్ల గణేష్ తమ్ముడిపై అట్రాసిటీ కేసు

రంగారెడ్డి : జిల్లా షాద్ నగర్ లో సినీ నిర్మాత బండ్ల గణేష్ తమ్ముడి శివబాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. భూముల కొనుగోలు విషయంలో డాక్టర్ దిలీప్ చంద్ర, అతని భార్యను దూషించారని పీఎస్ లో వారు ఫిర్యాదు చేశారు. 

11:30 - January 11, 2018

హైదరాబాద్ : గజల్ శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ పై నేడు నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించనుంది. ఏ2 నింధితులరాలు పార్వతి ఇంకా పరారీలోనే ఉందని, బాధితురాలి స్టేట్ మెంట్ రికార్డు చేయాల్సి ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

నేడు గజల్ బెయిల్ పిటిషన్ విచారణ

హైదరాబాద్ :  గజల్ శ్రీనివాస్  కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. గజల్ బెయిల్ మంజూరు చేయవద్దని పోలీసులు కూడా కౌంటర్ పిటిషన్ వేశారు. యువతిని లైంగికంగా వేధించిన కేసులో గజల్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

వరంగల్ కార్పొరేటర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం

వరంగల్ : కార్పొరేషన్ 44 వ వార్డు కార్పొరేటర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి 835 ఓట్ల మెజారిటీ తో అనిశెట్టి సరిత గెలుపొందారు. 

09:29 - January 11, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్ రాష్ట్ర పీసీసీ చీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి టెన్ టీవీ క్యాలెండర్ ను అవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెన్ టీవీ ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టి తీసుకురావడంలో ముందుందని ఆయన కొనియడారు.

గోల్డ్ స్టోన్ ప్రసాద్ కు ఐటీ షాక్

హైదరాబాద్ : గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఐటీ షాక్ ఇచ్చింది. ఆయనకు చెందిన కంపెనీల ఆస్తులను ఐటీశాఖ అటాచ్ చేసింది.  భూముల అమ్మకాలు జరిపి ట్యాక్స్ కట్టలేదని ప్రసాద్ ఆరోపణలు ఉన్నాయి. ఐటీ శాఖ రూ.2కోట్లకు పైగా ట్యాక్స్ చెల్లంచలేదని నోటీసులు పంపింది. 

జక్కేపల్లిలో కొనసాగుతున్న ఎంపీటీసీ ఉపఎన్నిక

ఖమ్మం : జిల్లా కూసుమంచి మండలం జక్కేపల్లిలో ఎంపీటీసీ ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. టీఆర్ఎస్ నేతలు ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ప్రతిపక్షం వారు అంటున్నారు.  

09:13 - January 11, 2018

నిర్మల్ : జిల్లా కడం మండలం నవాబ్‌ పేట్‌లో దారుణం వెలుగుచూసింది. కులాంత వివాహం చేసుకుందన్న కక్షతో ఆమె అక్కను కులం నుంచి బహిష్కరించారు. కరీంనగర్‌కు చెందిన ముస్కె లత... మంచిర్యాల జిల్లా దండేపల్లికి చెందిన కార్తీక్‌ కొన్నాళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకున్నారు. లత బెస్త కులానికి చెందిన అమ్మాయికాగా.... కార్తీక్‌ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవాడు. లత అక్క జ్యోతి నిర్మల్‌ జిల్లా కడం మండలంలోని నవాబ్‌పేట్‌లో నివాసముంటోంది. జ్యోతి భర్త ఉపాధి కోసం దుబాయ్‌ వెళ్లాడు. అయితే జ్యోతి ఇంటి దగ్గరే ఉంటూ కూలిపనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తోంది. తన చెల్లెలు లత ప్రేమ వివాహం చేసుకుందని తెలిసిన జ్యోతి... వారిని తన ఇంటికి ఆహ్వానించింది.

వాహనంలోంచి కిందకు దించేశారు...
తన చెల్లెలు, మరిది ఇంటికి వచ్చిన రోజే గ్రామంలో వనభోజనాలు జరుగుతున్నాయి. దీంతో జ్యోతి కులస్తులు వనభోజనాలకు రావాలంటూ ఆహ్వానించారు. తీరా బయల్దేరే సమయంలో మీ చెల్లి కులం తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకుందని... మాతో రావొద్దంటూ వాహనంలోంచి కిందకు దించేశారు. అంతటితో ఆగకుండా కులం నుంచి బహిష్కరించారు. జ్యోతితో ఎవరైనా మాట్లాడితే 5వేలు జరిమానా వసూలు చేస్తామంటూ ఆంక్షలు విధించారు. తమకు న్యాయం చేయాలని కులపెద్దలను బాధితురాలు జ్యోతి వేడుకుంది. కుల సంఘానికి 20 వేల రూపాయలు చెల్లిస్తే... గ్రామ బహిష్కరణ రద్దు చేస్తామని వారు చెప్పారు. అంత ఆర్థిక స్థోమత లేదని ఎంత ప్రాధేయపడినా వారు వినిపించుకోలేదు... చివరికి బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

గ్రామాల్లో కులజాఢ్యం రాజ్యమేలుతూ
తమ కుటుంబాన్ని బహిష్కరించారని జ్యోతి అనే మహిళ ఫిర్యాదు చేసిందని ఖానాపూర్‌ సీఐ తెలిపారు.ఈ విషయంపై గ్రామంలో విచారణ జరిపి.. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ అన్నారు. దేశం ఒకవైపు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దూసుకుపోతుంటే... మరోవైపు గ్రామాల్లో కులజాఢ్యం రాజ్యమేలుతూనే ఉంది. ఆటవిక న్యాయం కొనసాగుతూనే ఉంది. ఎన్ని చట్టాలు వచ్చినా అవి ఆచరణకు నోచుకోవడం లేదు. ఫలితంగా గ్రామాల్లో కుల బహిష్కరణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు కులం పేరుతో జరిగే దాడులు, బహిష్కరణలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

మాసబ్ ట్యాంక్ లో దారుణం

హైదరాబాద్ : మాసబ్ ట్యాంక్ దారుణం జరిగింది. ఎయిర్ ఫోర్స్ మాజీ ఉద్యోగి విక్రమ్ పై గుర్తుతెలియఇన వ్యక్తులు దాడి చేశారు. దుండగులు కత్తులతో దాడి చేయడంతో విక్రమ్ కు తీవ్ర గాయలయ్యాయి. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. పాత కక్షలే దాడికి కారణమని తెలుస్తోంది. కేసు నమోదు చేసు దర్యాప్తు చేస్తున్నారు.

మసాజ్ సెంటర్లపై పోలీసుల దాడులు

హైదరాబాద్ : మసాజ సెంటర్లపై పోలీసులు దాడులు నిర్వహించారు. మాదాపూర్ లోని రైన్ స్పా మసాజ్ సెంటర్ పోలీసులు దాడి చేయగా మసాజ్ సెంటర్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తుండడంతో ముగ్గురు యువతులను, ఇద్దరు విటులను పోలీసులు అదపులోకి తీసుకున్నారు.

08:22 - January 11, 2018

హైదరాబాద్ : మాసబ్ ట్యాంక్ దారుణం జరిగింది. ఎయిర్ ఫోర్స్ మాజీ ఉద్యోగి విక్రమ్ పై గుర్తుతెలియఇన వ్యక్తులు దాడి చేశారు. దుండగులు కత్తులతో దాడి చేయడంతో విక్రమ్ కు తీవ్ర గాయలయ్యాయి. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. పాత కక్షలే దాడికి కారణమని తెలుస్తోంది. కేసు నమోదు చేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

08:21 - January 11, 2018

హైదరాబాద్ : మసాజ సెంటర్లపై పోలీసులు దాడులు నిర్వహించారు. మాదాపూర్ లోని రైన్ స్పా మసాజ్ సెంటర్ పోలీసులు దాడి చేయగా మసాజ్ సెంటర్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తుండడంతో ముగ్గురు యువతులను, ఇద్దరు విటులను పోలీసులు అదపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.7 వేల నగదు, ఆరు సెల్ ఫోన్లు, స్వైపింగ్ మెషీన్లు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. భక్తులు 4 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. సాధారణ భక్తులకు 6 గంటలు నడక దారిన భక్తులకు 2 గంటల సమయం పడుతుంది. 

బ్యాంకర్లతో మంత్రి కేటీఆర్ భేటీ

హైదరాబాద్ : నేడు బ్యాంకర్లతో మంత్రి కేటీఆర్ భేటీ కానున్నారు. సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు ఆర్థిక సహాయంపై ఆయన బ్యాంకు అధికారులతో చర్చించనున్నారు. 

రాజకీయ ఫ్రంట్ పై పార్టీల సన్నాహక సమావేశం

హైదరాబాద్ : తెంలగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ ఫ్రంట్ పై నేడు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వివిధ పార్టీలు సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని హాజరు కానున్నారు. 

అనంతలో సీఎం చంద్రబాబు పర్యటన

అనంతపురం : జిల్లాలో నేడు సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఆయన బుక్కపట్నం చెరువులో జలహారతి, ఫైలాన్  ను అవిష్కరించనున్నారు. 

07:23 - January 11, 2018

చెక్ రూపంలో ఇస్తేనే బాగుంటుందని, నగదు రూపంలో ఇస్తే అవినీతి జరిగే అవకాశం ఉందని, అయితే రాష్ట్రంలో 18 శాతం మంది దగ్గర ఉందని, మిగతా 82 శాతం భూమి భూ స్వాముల దగ్గర ఉందని, ఇది ప్రచారానికి ఇది ఉపయోగడతుందని, 100 ఎకారల ఉన్నవాడికి రూ.4లక్షలు వస్తుందని నవ తెలంగాణ ఎడిటర్ వీరయ్య అన్నారు. ఈ పథకం ద్వారా ఎక్కువగా రైతు లబ్ధి పొందుతారని, బీనామీ భూములు ఉండవచ్చు అని, ఈ పథకం పై పూర్తి నియామ నిబంధనలు ప్రభుత్వం విడుదల చేయలేదని టీఆర్ఎస్ నేత మన్నే గోవర్ధన్ రెడ్డి అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

07:22 - January 11, 2018

ఎఫ్ డీఐ పాలసీ అనేది 1991 లో భారత్ మొదలైందని, ఏ గవర్నమెంట్ ఉన్న వాటిని పెంచుతున్నారని, ఇదివరకు ఎయిర్ లైన్స్ కు మినహాయింపు ఉండేదని కానీ ఇప్పుడు ఎయిర్ లైన్స్ లో కూడా ఎఫ్ డీఐలు తీసుకురావడం దేశ భద్రతకు ముప్పుగా భావించవచ్చని ఆర్థిక విశ్లేషుకులు శశికుమార్ అన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

 

07:21 - January 11, 2018

చెన్నై : తిరుమల తిరుపతి దేవస్థానంపై డీఎంకే కనిమొళి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన హుండీనే కాపాడుకోలేని దేవుడు పేదవాడిని ఏం కాపాడుతాడన్నారు. తిరుచ్చిలో జరిగిన డీఎంకే సమావేశంలో ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తనను ఒకసారి వెంకయ్యనాయుడు తిరుమల తీసుకువెళ్లారని, ప్రపంచంలోనే ఒక గొప్ప కార్యనిర్వాహణ జరిగే సంస్థ తిరుమల అన్నారు. ఇక్కడ దేవుడి వద్ద అందరూ ఒకటే అన్నది పచ్చి అబద్ధమని, డబ్బుంటే ప్రత్యేక దర్శనం లేదంటే రెండు రోజులు లైన్లో నిలబడాలన్నారు. అసలు దేవుడు లేడనేది నా నమ్మకమన్న ఆమె పేదవాడి కష్టాన్ని తీర్చేవాడే నిజమైన దేవుడన్నారు. 

07:20 - January 11, 2018

హైదరాబాద్ : ఎలాంటి సాక్ష్యాలు లేకుండా కేవలం నేర ఆరోపణతోనే ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ సాయిబాబాకు జీవితఖైదు విధించారన్నారు ఆయన భార్య వసంత. ప్రజాసమస్యలపై పోరాడినందుకు తన భర్తను అరెస్ట్‌ చేశారని ఆరోపించారు. ప్రస్తుతం సాయిబాబాను నాగ్‌పూర్‌ అండాసెల్‌లో ఉన్నారని, ఆయన ఆరోగ్యం క్షీనిస్తోందని తెలిపారు. సాయిబాబాను చర్లపల్లి జైలుకు తరలించి, సరైన వైద్యం అందించాలని కోరుకుంటున్నామన్నారు. 

07:19 - January 11, 2018

హైదరాబాద్ : ప్రేమోన్మాదానికి మరో యువతి బలైపోయింది. ప్రేమను తిరస్కరించినందుకు.. హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో జానకి అనే అమ్మాయిని .. ఓ ప్రేమోన్మాది దారుణంగా హత్య చేశాడు. శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం గుయ్యనవలస గ్రామానికి చెందిన బోను జానకి కేపీహెచ్‌బీలోని డీమార్ట్‌ సూపర్‌ మార్కెట్‌లో పనిచేస్తోంది. మూసాపేట హబీబ్‌నగర్‌లో ఓ అద్దె ఇంట్లో రూప అనే మరో యువతితో కలసి ఉంటోంది. అయితే అదే సూపర్‌ మార్కెట్‌లో పనిచేస్తున్న...అనంతప్ప అలియాస్‌ ఆనంద్‌.. తనను ప్రేమించాలంటూ.. జానకి వెంటపడ్డాడు.. ! అతని ప్రేమను జానకి తిరస్కరించింది. దీంతో రగిలిపోయిన ఆనంద్‌.. ఆమెను తిట్టాడు, కొట్టాడు.

10 రోజుల క్రితం జానకి ఇంటికి వెళ్లి..
10 రోజుల క్రితం జానకి ఇంటికి వెళ్లి.. తనను ప్రేమించకపోతే చంపేస్తానని బెదిరించాడు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ఇంటికి వచ్చిన రూపకు .. అపస్మారస్థితిలో ఉన్న జానకి కనిపించింది. ఆమె కడుపులో కత్తితో పొడిచిన గాయాలు కనిపించాయి. దీంతో రూప.. స్థానికులు, సహోద్యోగుల సహాయంతో .. జానకిని సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించింది. అక్కడ చికిత్స పొందుతూ అర్ధరాత్రి జానకి మృతిచెందింది. నిరుపేద కుటుంబానికి చెందిన జానకి.. డబ్బులు దాచుకుని.. పెళ్లిచేసుకుందామనుకుందని.. కానీ ఇంతలో ఇలా జరిగిపోయిందని.. ఆమె బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితుడు ఆనంద్‌ను కూకట్‌ పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆనంద్‌ రంగారెడ్డి జిల్లా..పెద్దేముల్‌ సమీపంలోని మారెపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.

07:18 - January 11, 2018

కరీంనగర్ : సవతి తల్లి కర్కశత్వానికి కరీంనగర్‌లో కావేరి అనే పదవతరగతి బాలిక బలైంది. కొందరు గ్రామస్థులతో కలిసి గొంతు నులిమి చంపిన సవతి తల్లి... ఆత్మహత్యగా చిత్రీకరించింది... మృతురాలి మెడపై గాయాలు ఉండడంతో... స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. ఆ కోణంలో విచారణ చేపట్టిన పోలీసులు నిందితురాలితోపాటు... ఆమెకు సహకరించిన వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. 

07:09 - January 11, 2018

హైదరాబాద్ : భారతదేశ చరిత్రలో భీమా కోరేగావ్‌ యుద్ధం చాలా ప్రముఖమైందని.. దళితుల ప్రతిఘటనకు స్మారక చిహ్నమని ప్రొఫెసర్‌ కంచె ఐలయ్య అన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు యునివర్సిటీలో నిర్వహించిన 200 వంద ఏళ్ల భీమాకోరేగావ్‌ విజయోత్సవ సభను నిర్వహించింది. కార్యాక్రమంలో రోహిత్‌ వేముల మాతృముర్తి రాధిక, బామ్‌సేఫ్‌ జాతీయ కార్యదర్శి శ్రీకాంత్‌, హెచ్‌సీయూ స్కాలర్‌ అరుణ గోగుల మంద, డిక్కి అధ్యక్షుడు రాహుల్‌ కిరణ్‌ హాజరయ్యారు. తనను తాను బీసీ నేతగా చెప్పుకునే మోదీ.. అంటరానితనాన్ని రూపుమాపాలని కంచె ఐలయ్య డిమాండ్‌ చేశారు.

07:09 - January 11, 2018

హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ మంచి జోష్‌లో ఉంది. పీసీసీ రథసారధి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దూకుడు పెంచారు. గులాబీ సర్కార్‌పై అన్ని వర్గాల్లో వ్యతిరేకత పెరిగిందని భావిస్తున్న హస్తంపార్టీ.... రాజకీయ వాతావరణాన్ని తమకు అనుకూలంగా మలచుకునేందుకు ప్రణాళికలు వేస్తోంది. ఇతర పార్టీల నుంచి నేతలు హస్తంగూటికి క్యూ కడుతుండడంతో మంచి ఊపుమీదున్న కాంగ్రెస్‌... క్యాడర్‌లో మరింత సమరోత్సాహాన్ని నింపేందుకు రెడీ అవుతోంది. పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తన యాక్షన్‌ప్లాన్‌ను సిద్ధం చేసుకుంటున్నారు.

2019 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా
2019 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు. ఎన్నికల వరకు తానే పీసీసీ చీఫ్‌గా కొనసాగుతానని భావిస్తున్న ఆయన...స్పీడ్‌ పెంచారు. ఇప్పటికే గులాబీబాస్‌పై ఒంటికాలిపై లేస్తూ సర్కార్‌ వైఫల్యాలను ఎండగడుతున్న ఆయన... అన్ని నియోజకవర్గాల ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్లాన్‌ చేసుకుంటున్నారు. ఇందుకోసం బస్సుయాత్రనే సరైందని భావిస్తున్నారు. బస్సుటూర్‌తో పార్టీలో నేతల మధ్య సమన్వయం ఏర్పర్చుకోవడం.. అందిరితో కలిసి సమష్టిగా యాత్రం చేయడంతో నాయకుల మధ్య విభేదాలకు చెక్‌ పెట్టవచ్చని భావిస్తున్నారు. బస్సుయాత్ర గతంలో కాంగ్రెస్‌కు బాగా కలిసివచ్చిందన్న సెంటిమెంట్‌ కూడా ఉండడంతో ... మళ్లీ దాన్నే ఉత్తమ్‌ ఎంచుకున్నారు.1999లో పీజేఆర్‌ సీఎల్పీ లీడర్‌గా ఉన్నప్పుడు హైదరాబాద్‌ పెద్దమ్మగుడి నుంచి చేపట్టిన బస్సుయాత్రతో పార్టీకి బాగా కలిసివచ్చింది. ఆ తర్వాత వైఎస్‌ చేవెళ్ల నుంచి పాదయాత్ర చేసిన తర్వాత.. మళ్లీ నేతలందరినీ కలుపుకొని 2003లో బస్సుయాత్ర చేపట్టారు. ఆ బస్సుయాత్ర తర్వాత 2004లో కాంగ్రెస్‌ అధికారం కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌కు బస్సుయాత్ర సెంటిమెంట్‌గా మారడంతో ఇప్పుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా అదే సెంటిమెంట్‌ను ఫాలో కావాలని భావిస్తున్నారు.

బస్సు యాత్ర...
కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పలువురు సీనియర్‌ నేతలు పాదయాత్ర చేస్తామంటూ హైకమాండ్‌ దగ్గర వినతులు పెట్టుకున్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తాను రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర చేస్తానంటూ హైకమాండ్‌ తలుపు తట్టారు. పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టివిక్రమార్క కూడా దళితుల ఆత్మగౌరవయాత్ర పేరుతో పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌రెడ్డి కూడా పాదయాత్రపై అధిష్టానం దగ్గర ప్రతిపాదన పెట్టినట్టు తెలుస్తోంది. అయితే వ్యక్తిగత పాదయాత్రలతో పార్టీకి మరికొన్ని సమస్యలు కొనితెచ్చుకున్నట్టు అవుతుందని భావించిన ఢిల్లీ పెద్దలు ఎవరికీ అనుమతి ఇవ్వలేదు. దీన్ని అవకాశంగా తీసుకున్న ఉత్తమ్‌.... పాదయాత్రలన్నింటికీ చెక్‌పెట్టేలా బస్సుయాత్రను తెరమీదికి తీసుకొచ్చారు. పార్టీ ముఖ్యనేతలతో కలిసి అన్ని నియోజకవర్గాలను ఒకసారి చుట్టిరావాలని రూట్‌మ్యాప్‌ కూడా ఉత్తమ్‌ సిద్ధం చేసుకున్నారు. అయితే ఈ బస్సుయాత్రను ఎక్కడి నుంచి ప్రారంభించాలన్నది మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. గద్వాల జిల్లాలోని జోగులాంబా దేవాలయం నుంచి ప్రారంభించాలని ఓ ప్రతిపాదన ఉంటే... యాదాద్రి నుంచి మొదలుపెడితే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారు. దీనిపై ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశముంది. బస్సుయాత్రను కూడా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పకడ్బందీగా ప్లాన్‌ చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యమైన నేతలు ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే పూర్తిస్థాయి బస్సులో కొనసాగేలా ప్లాన్‌ చేసినట్టు తెలుస్తోంది. మిగతా నేతలు ఎవరికి సంబంధించిన నియోజకవర్గాల్లో వారు బస్సుయాత్రలో పాల్గొనాలని నిర్ణయించారు. అన్ని వ్యూహాలను సిద్ధంచేసుకుని బస్సుయాత్ర చేపట్టాలని ఉత్తమ్‌తీసుకున్న నిర్ణయం పార్టీకి ఏమేరకు ఉపయోగపడనుందో వేచి చూడాలి.

07:07 - January 11, 2018

హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌కు అనేకమంది నేతలు వెన్నుదన్నుగా నిలిచారు. వారిచ్చే సూచనలు , సలహాలు టీఆర్‌ఎస్‌ బాస్‌.. కేసీఆర్‌కు ఎంతో ఉపయోగపడ్డాయి. ఉద్యమం విజయవంతమైంది. స్వరాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత టీఆర్‌ఎస్‌ అధికారపగ్గాలు చేతపట్టింది. కానీ ఉద్యమ సమయంలో కేసీఆర్‌ వెంట నడిచిన చాలామంది పార్టీకి దూరమయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఇలాంటి నేతల సంఖ్య భారీగానే ఉంది.

సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది ఉద్యమకారులు పార్టీకి దూరమయ్యారు. కేసీఆర్‌ కూడా అప్పుడు వారిని పెద్దగా పట్టించుకోలేదు. సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో కేసీఆర్‌ పార్టీకి దూరమైన నేతలపై దృష్టిసారించినట్టు తెలుస్తోంది. ఉద్యమ సమయంలో తమవెంట నడిచిన నేతలను కారెక్కించుకునేందుకు అధికారపార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మారుతున్న రాజకీయ సమీకరణాలతో... వారిని కూడా పార్టీలో చేర్చుకోవాలని టీఆర్‌ఎస్‌ రెడీ అయ్యింది. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కేసీఆర్‌ పావులు కదుపుతున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ఉన్నా.. ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలనూ కారెక్కించుకున్నారు. ఒక్కో నియోజకవర్గంలో ఇద్దరు, ముగ్గరు నేతలు పార్టీలోకి వస్తున్నా... నాటి ఉద్యమకారులను కూడా చేర్చుకునేందుకు గులాబీ బాస్‌ స్కెచ్‌ వేసినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే.. ఉద్యమ సమయం నాటి నుంచి టీఆర్‌ఎస్‌లో కొనసాగిన మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి నిన్న మొన్నటి వరకు బీజేపీలో కొనసాగారు. గులాబీపార్టీ ఆపరేషన్‌ ఘర్‌ వాపసీతో ప్రతాప్‌రెడ్డిని పార్టీలోకి చేర్చుకోవడానికి సిద్ధమైంది.

త్వరలోనే మూహూర్తం ఖరారు...
త్వరలోనే మూహూర్తం ఖరారు చేయనున్నారు. ఇదేబాటలో మరికొంతమంది నేతలు కూడా టీఆర్‌ఎస్‌తో టచ్‌లో ఉన్నట్టు పార్టీలో చర్చజరుగుతోంది. జిట్టా బాలకృష్ణారెడ్డి, కేకే మహేందర్‌రెడ్డి, యెన్నం శ్రీనివాస్‌రెడ్డిలాంటి నేతలను కూడా కారెక్కించుకునే అవకాశమున్నట్టు పార్టీవర్గాల్లో చర్చ నడుస్తోంది.పార్టీలో చేర్చుకున్న వారిలో కొంతమందికి ఎన్నికల్లో పోటీచేసే అవకాశం కల్పించే సంకేతాలను గులాబీబాస్‌ వారికి ఇస్తున్నారు. దీంతో వారంతా పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రయత్నాలు రానున్న రోజుల్లో మరింత ముమ్మరం చేసే యోచనలో గులాబీ బాస్‌ ఉన్నారు. పార్టీని మరింత బలోపేతం చేసుకునే దిశగా సాగుతున్న కేసీఆర్‌ ప్రయత్నాలు.. ఏమేరకు సక్సెస్‌ అవుతాయో చూడాలి.

07:06 - January 11, 2018

విశాఖ : తెలుగు రాష్ర్టాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌పై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తీవ్రంగా మండిపడ్డారు. గవర్నర్‌ ఆంధ్రప్రదేశ్‌పై సవతితల్లి ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. ఆయన ఏ రోజైనా ఆంధ్రప్రదేశ్‌కు పెద్దదిక్కులా వ్యవహరించారా? అని ప్రశ్నించారు. ఏపీలో కనీసం నాలుగు రోజులైనా గడిపారా? అంటూ గవర్నర్‌ను నిలదీశారు. నాలా బిల్లును ఆరు నెలలనుంచి పెండింగ్‌లో పెట్టారంటూ తీవ్రంగా విమర్శించారు. ఈ పరిస్థితుల్లో ఏపీకి ప్రత్యేక గవర్నర్‌ కావాలని విష్ణుకుమార్‌ డిమాండ్ చేశారు.. ఈ విషయంలో నేతలంతా పార్టీలకతీతంగా కేంద్రంతో మాట్లాడాలని ఆయన కోరారు.

07:05 - January 11, 2018

హైదరాబాద్ : టీఆర్ఎస్-కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. విద్యుత్ రంగంపై బహిరంగచర్చకు సిద్ధమని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి, టీఆర్ఎస్ ఎంసీ బాల్క సుమన్ సవాల్ విసురుకున్నారు. ప్రభుత్వ విద్యుత్ ఒప్పందాలన్నీ గోల్‌మాల్ ఒప్పందాలేనని తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. యూపీఏ ప్రభుత్వం ముందుచూపు నిర్ణయాలతోనే దేశవ్యాప్తంగా మిగులు విద్యుత్ సాధ్యమైందని చెప్పారు. తక్కువ ధరకే ఏపీ ప్రభుత్వం విద్యుత్ ఇస్తానని ప్రకటిస్తున్నా.. తెలంగాణ ప్రభుత్వం ఎందుకు విద్యుత్‌ను కొనుగోలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. రేవంత్‌ ఆరోపణలపై స్పందించిన ఎంపీ బాల్క సుమన్.. విద్యుత్ రంగంపై చర్చకు తాము సిద్ధం అని ప్రకటించారు. వేదిక, తేది రేవంత్‌రెడ్డే చెప్పాలన్నారు. తాము చెప్పేవి అబద్ధాలైతే ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరిన సుమన్.. రేవంత్ చెప్పేవి అబద్ధాలైతే ముక్కు నేలకు రాయాలన్నారు. టీఆర్ఎస్ సవాల్‌కు కాంగ్రెస్ సిద్ధమని రేవంత్‌ తెలిపారు. విద్యుత్‌పై ఈనెల 12న మధ్యహ్నం 2 గంటలకు చర్చకు సిద్ధమంటూ ప్రతిసవాల్‌ విసిరారు.  

07:04 - January 11, 2018

పశ్చిమగోదావరి : మంత్రి మాణిక్యాలరావుకు కోపమొచ్చింది. పశ్చిమగోదావరి జిల్లా రామన్నగూడెం జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. తన నియోజకవర్గంలోనే తనను అంటరానివాడిగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను నిలదీయాలని చూస్తే.. ప్రభుత్వాన్ని నిలదీస్తాన్నారు.

07:03 - January 11, 2018

హైదరాబాద్ : ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో మూడోరోజూ నూత‌న పంచాయ‌తీరాజ్ చ‌ట్టంపై సమావేశమైన మంత్రుల సబ్‌కమిటీ 8గంటలపాటు అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది. అనుమతిలేని లే అవుట్లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేయకుండా చర్యలు తీసుకుంటే ఎలా ఉంటుందన్న దానిపై కమిటీ ప్రధానంగా చర్చించింది. పంచాయతీలలో ఎలాంటి అనుమతి లేకుండానే లేఅవుట్లు చేస్తూ విచ్చలవిడిగా ప్లాట్ల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని కమిటీ అభిప్రాయపడింది. దీనివల్ల సామాన్యులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని కమిటీలో చర్చ జరిగింది. లేఅవుట్లకు అనుమతి ఉంటేనే ప్లాట్లకు రిజిస్ట్రేషన్‌ చేసేలా చర్యలు తీసుకోవాలని కేబినెట్‌ సబ్‌కమిటీ అభిప్రాయపడింది.

డుమ్మా కొడితే అనర్హత వేటు..
ప్రస్తుతం జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ల్లో ఉన్నట్టుగానే పంచాయతీ పాలకవర్గ సమావేశాలకు హాజరయ్యే సభ్యులకు కూడా సిట్టింగ్‌ ఫీజు ఇవ్వాలని కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రత్యేక పరిస్థితుల్లో మినహా వరుసగా మూడుసార్లు పాలకవర్గ సమావేశాలకు డుమ్మా కొడితే అనర్హత వేటు వేసే అంశంపైనా కమిటీ చర్చ జరిగింది. పంచాయతీల్లో కో-ఆప్షన్‌ సభ్యులను నియమించే అంశాన్ని మంత్రివర్గ ఉపసంఘం పరిశీలిస్తోంది. ఇందులో ఎన్‌ఆర్‌ఐలకు గ్రామంలో లేనివారికి కూడా అవకాశం ఇస్తే ఎలా ఉంటుందన్న అంశంపైనా చర్చించారు. పంచాయతీలోని జనాభాను బట్టి ఇద్దరు లేదా ముగ్గురిని కూడా నామినేట్‌ చేసుకునే అవకాశాలపై కమిటీ సభ్యులు చర్చించారు. ఇందులో గ్రామానికి చెందిన ఎన్‌ఆర్‌ఐలు, గ్రామ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు, నిపుణులకు అవకాశం కల్పించడంతో గ్రామ అభివృద్ధికి వారి సహకారం ఉపయోగపడుతుందనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. 200 చదరపు గజాలలోపు విస్తీర్ణంలో జీప్లస్‌-2 ఎత్తులో నిర్మించే భవనాల అనుమతులను గ్రామపంచాయతీలో ఇస్తుండగా... అంతకన్నా ఎక్కువ విస్తీర్ణంలో అయితే మండలాల్లోనూ, ఎంపీడీవో, తహసీల్దార్‌, ఈవోపీఆర్డీ, పంచాయతీరాజ్‌ ఏఈల నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసి అనుమతించే అంశంపైనా చర్చించారు.

వారం రోజుల్లోనే పంచాయతీ క్లియరెన్స్‌
ఇక భవన నిర్మాణానికి హెచ్‌ఎండీఏ అనుమతిచ్చిన వారం రోజుల్లోనే పంచాయతీ క్లియరెన్స్‌ ఇవ్వాలని, లేనిపక్షంలో అది అనుమతిచ్చినట్టుగానే భావించాల్సి ఉండేలా చట్టంలో పొందుపర్చాలన్నది సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి పంచాయతీల నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేకుండా చట్టంలో పొందుపర్చే అంశంపైనా చర్చించారు. ఇక సర్పంచ్‌లకు విస్తృత అధికారాలు కల్పించే దిశగా కొత్తచట్టంలో మార్పులు చేయాలని భావిస్తున్న సబ్‌కమిటీ.. అదే సమయంలో ప్రజలకోసం ప్రత్యేకంగా హక్కుల జాబితాను కూడా చట్టంలో పొందుపర్చే యోచన చేస్తోంది. ప్రధానంగా డంప్‌యార్డులు, వైకుంటదామాలు, పారిశుద్ద్యంలాంటివి ప్రజల హక్కులుగా చట్టంలో పెట్టే అంశంపై చర్చించారు. ఇవాళ కూడా సబ్‌కమిటీ మరోసారి సమావేశమై తుదినిర్ణయం తీసుకోనుంది.

Don't Miss