Activities calendar

12 January 2018

21:28 - January 12, 2018

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ నేతల్లో రోజురోజుకు అసంతృప్తి పెరిగిపోతుంది. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వారు మంత్రివర్గంలో ఉన్నారని ఈ మధ్యే నాయిని వ్యాఖ్యానించగా.. ఆ వ్యాఖ్యలను ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ సమర్దించారు. యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం డైరీ ఆవిష్కరించిన శ్రీనివాస్‌గౌడ్‌... తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమ నాయకులను అవమానించిన వారే కేబినెట్‌లో మంత్రులుగా కొనసాగడం చాలా బాధాకరమన్నారు. ఇవి తలచుకుంటే... కళ్ల వెంట నీళ్లొస్తున్నారు. అయితే... కేసీఆర్‌ ఏ నిర్ణయం తీసుకున్నా... దాని వెనక బలమైన కారణం ఉంటుందన్నారు శ్రీనివాస్‌గౌడ్‌.

కొద్దిసేపటికే ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ తన మాట మార్చారు. తాను చేయని వ్యాఖ్యలను చేసినట్లుగా మీడియా ప్రసారం చేస్తుందన్నారు. తనపై తప్పుడు ప్రచారం చేసినవారికి లీగల్‌ నోటీసులు పంపిస్తామన్నారు. మంత్రి నాయిని ఏ ఉద్దేశంతో వ్యాఖ్యలు చేశారో తెలియదు గానీ... నాపై ఇలాంటి ప్రచారం చేయడం సరైనది కాదన్నారు శ్రీనివాస్‌గౌడ్‌.

21:25 - January 12, 2018

ఢిల్లీ : సుప్రీంకోర్టుల ప్రధాన న్యాయమూర్తి, నలుగురు న్యాయమూర్తుల మధ్య వివాదం కొనసాగుతుండగానే... గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.హెచ్‌.లోయా మృతి అంశం సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. సోహ్రాబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో తీర్పు ఇవ్వడానికి కొద్ది రోజుల ముందు జస్టిస్‌ లోయా మృతి చెందడాన్ని అత్యున్నత న్యాయస్థానం సీరియస్‌గా తీసుకుంది. నిజాయితీపరుడైన ఓ న్యాయమూర్తి చనిపోతే నిర్లక్ష్యం వహించటం సమాజానికి తప్పుడు సంకేతాలు అందిస్తుందని పేర్కొంది. లోయా మృతి కేసుకు సంబంధించి పూర్తి పత్రాలను, పోస్టుమార్టం నివేదికలను సోమవారం సమర్పించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని బెంచ్‌ ఆదేశించింది. సోహ్రబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో వాదనలు వింటున్న లోయా.. సరిగ్గా తీర్పు వెలువరించటానికి కొద్దిరోజుల ముందు మృతి చెందారు. నాగ్‌పూర్‌లో పెళ్లికి హాజరయ్యేందుకు వెళ్లిన లోయా- గుండెపోటుతో మరణించారు. ఆయన మరణంపై లోయా కుటుంబానికి అనుమానాలు ఉన్నాయి. సోహ్రాబుద్దీన్‌ ఎన్‌ కౌంటర్‌ కేసులో బీజేపీ చీఫ్‌ అమిత్‌ షాతోపాటు పలువురు నేతలు, పోలీస్‌ అధికారుల పేర్లు వినిపించాయి. ఈ కేసులో అమిత్‌షాకు అనుకూలంగా తీర్పు చెబితే 100 కోట్లు, ముంబైలో ఓ ఇల్లు అఫర్‌ ఇచ్చినట్లు జడ్జి లోయా సోదరి పేర్కొన్నారు.

21:24 - January 12, 2018

ఢిల్లీ : సుప్రీంకోర్టుకు చెందిన నలుగురు న్యాయమూర్తుల మీడియా సమావేశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రాజకీయపార్టీలు ఈ అంశంపై దృష్టిసారించాయి. జరుగుతున్న పరిణామాలపై కాంగ్రెస్ స్పందించింది.

జడ్జిలు పేర్కొన్న అంశాలను తేలిగ్గా తీసుకోవద్దని...వాటిని శ్రద్ధాగ పరిశీలించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. జస్టిస్‌ లోయా మృతిపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని రాహుల్‌ డిమాండ్‌ చేశారు. అత్యున్నత న్యాయవ్యవస్థపై అందరికీ నమ్మకం ఉందన్నారు. న్యాయమూర్తుల వివాదంలో బిజెపి ఎందుకు మౌనం వహిస్తోందని కాంగ్రెస్‌ ప్రశ్నించింది.

సీపీఎం స్పందన..
అటు సిపిఎం పొలిట్‌ బ్యూరో కూడా ఈ వ్యవహారంపై స్పందించింది. సుప్రీంకోర్టు వ్యవస్థపై తీవ్ర పరిణామాలు చూపే కీలక అంశాలను.. నలుగురు న్యాయమూర్తులు లేవనెత్తారని తెలిపింది. జడ్జిలకు కేసుల కేటాయింపుల్లో నిబంధనలను పాటించడం లేదన్న అంశాలు ప్రస్తావనకు వచ్చాయని పేర్కొంది. దేశంలోని అత్యున్నత న్యాయవ్యవస్థలో పారదర్శకత, ప్రజాస్వామ్యయుత నిర్వహణను దృష్టిలో ఉంచుకుని న్యాయమూర్తుల మధ్య వివాదాలు సమిసిపోతాయని భావిస్తున్నట్లు సిపిఎం ప్రకటించింది.

21:22 - January 12, 2018

ఢిల్లీ : భారత న్యాయవ్యవస్థలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. న్యాయచరిత్రలో ఎన్నడు లేని విధంగా.. న్యాయమూర్తులు మీడియా ముందుకు వచ్చారు. తమలో అసంతృప్తిని... తాము ఎదుర్కొంటున్న సమస్యలను దేశ ప్రజలకు వివరించారు. ప్రధాన న్యాయమూర్తిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న నలుగురు జడ్జిలు... సుప్రీంకోర్టులో పాలన వ్యవస్థ గాడి తప్పిందని ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టును రక్షించకపోతే ప్రజాస్వామ్యమే అంతమవుతుందని హెచ్చరించడం... దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది.

న్యాయచరిత్రలోనే తొలిసారిగా సుప్రీంకోర్టుకు చెందిన నలుగురు న్యాయమూర్తులు ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు సంచలనం సృష్టించింది. జస్టిస్‌ చలమేశ్వర్‌ ఇంట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి న్యాయమూర్తులు రంజన్‌ గోగోయ్, మదన్‌ లోకూర్, కురియన్‌ జోసెఫ్‌ పాల్గొన్నారు. ప్రధాన న్యాయమూర్తిపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. వీరంతా కూడా చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా కొలీజియం సభ్యులు కావడం గమనార్హం.

సుప్రీంకోర్టులో పాలనా వ్యవస్థ సరైన దిశలో నడవడం లేదని... గత కొన్ని రోజులుగా కోర్టులో అవాంఛిత పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని న్యాయమూర్తులు ఆందోళన వ్యక్తం చేశారు. లోపాలను సరిదిద్దమని 2 నెలల క్రితం చీఫ్‌ జస్టిస్‌కు లేఖ రాశామని.... నలుగురం స్వయంగా కలిసి ఆయన దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. ఆ లేఖను బహిరంగ పరుస్తామని...దీంతో అన్ని విషయాలు వెలుగు చూస్తాయని జస్టిస్‌ జలమేశ్వర్‌, జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్‌ చెప్పారు.

తాము ఆత్మను అమ్ముకున్నట్లు మరొకరు వేలెత్తి చూపకుండా ఉండడానికే మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశామని న్యాయమూర్తులు తెలిపారు. సుప్రీంకోర్టులో జరుగుతున్న పరిణామాలను దేశ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మాపై ఉందన్నారు. న్యాయ వ్యవస్థలో స్వేచ్ఛ లేకపోతే ప్రజాస్వామ్యం అంతమవుతుందని హెచ్చరించారు. చీఫ్‌ జస్టిస్‌ను అభిశంసించాలా లేదా అన్నది దేశం తేల్చుకోవాలని జస్టిస్‌ చలమేశ్వర్‌ స్పష్టం చేశారు.

21:19 - January 12, 2018

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా కోటి మందికి పైగా ఉన్న స్కీము వర్కర్లు ఈ నెల 17న సమ్మె చేయాలని నిర్ణయించారు. స్కీము వర్కర్ల సమస్యలపై టీ మాస్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. సమ్మెకు టీ మాస్‌ ఫోరం మద్దతు ప్రకటించింది. వీరిని కార్మికులుగా గుర్తించి నెలకు 18 వేల రూపాయల కనీస వేతనం ఇవ్వడంతోపాటు పీఎఫ్‌, ఈఎస్‌ఐ సౌకర్యాలు కల్పించాలని సమావేశానికి హాజరైన నేతలు కోరారు. స్కీము వర్కర్లుగా ఉన్న ఆశాలు, అంగన్‌ వాడీలు, మధ్యాహ్న భోజన కార్మికులు, ఏఎన్‌ఎంలకు ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ నాయకురాలు రమతోపాటు, టీ మాస్‌ ఫోరం నేత కంచ ఐలయ్య డిమాండ్‌ చేశారు.

21:14 - January 12, 2018

విజయవాడ : సాధారణంగా ప్రభుత్వ అధికారులు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకునే మొత్తం లక్ష వరకు ఉంటుంది. కానీ విజయవాడలో జరిగిన దాడి విషయం తెలిస్తే మీరు ఆశ్చర్యపోకమానరు. లక్ష కాదు.. 2లక్షల కాదు.. ఏకంగా 22లక్షల 50వేల రూపాయలతో ఏసీబీ కొత్త రికార్డ్ సృష్టించింది. విజయవాడలో తన కార్యాలయంలో ఇంత భారీ మొత్తాన్ని లంచంగా తీసుకుంటూ వాణిజ్యపన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్న ఏడుకొడులు ఏసీబీకి చిక్కారు. ప్రస్తుతం ఏడుకొండలు చెక్‌పోస్టులకు ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ఏసీబీ డీజీ ఠాకూర్ పర్యవేక్షణలో ఈ దాడులు జరిగాయి. ఇంత భారీ మొత్తంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడం ఏసీబీ చరిత్రలో ఇదే ప్రథమం. 

21:12 - January 12, 2018

హైదరాబాద్ : విద్యుత్‌ ప్రాజెక్టు కాంట్రాక్టుల అవినీతి ఆరోపణలపై సీబీఐ లేదా సీవీసీ విచారణ జరిపించాలని కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ అంశంపై బహిరంగ చర్చకు వెనక్కతగ్గిన టీఆర్‌ఎస్‌ నేతల వైఖరిపై కాంగ్రెస్‌ నాయకుడు రేవంత్‌ రెడ్డి మండిప్డడారు. విద్యుత్‌ ప్రాజెక్టు టెండర్ల కాంట్రాక్టుల్లో ముఖ్యంత్రి కేసీఆర్‌కు భారీగా ముడుపులు ముట్టాయని ఆరోపించారు. ఈ విషయాన్ని తాను నిరూపించకపోతే హైదరాబాద్‌ అబిడ్స్‌ చౌరాస్తాలో ముక్కు నేలకు రాస్తానని రేవంత్‌ మరోసారి సవాల్‌ విసిరారు. యాదాద్రి, భద్రాద్రి, కొత్తగూడెం విద్యుత్‌ ప్రాజెక్టు నిర్మాణ టెండర్లలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని కాంగ్రెస్‌ నేత రేవంత్‌ చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు రావాలని టీఆర్‌ఎస్‌ ఎంపీ బాల్క సుమన్‌ సవాల్‌ విసిరారు. దీనిని రేవంత్‌ స్వీకరించడంతో ఆత్మరక్షణలో పడ్డ టీఆర్‌ఎస్‌ నేతలు.. ఆ తర్వాత వెనక్కి తగ్గారు. రేవంత్‌కు విశ్వసనీయతలేదంటూ.. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్‌పీ నేత జానారెడ్డి, ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీ చర్చకు రావాలని మెలిక పెట్టారు. అయినా రేవంత్‌రెడ్డి వెనక్కితగ్గకుండా బహిరంగ చర్చకు సిద్ధమై, తన అనుచరులతో కలిసి అసెంబ్లీ సమీపంలోని గన్‌ పార్క్‌ వద్దకు వచ్చారు. విద్యుత్‌ ప్రాజెక్టుల టెండర్లలో అవినీతి బయటపడుతుందనే భయంతోనే బహిరంగ చర్చకు రాకుండా టీఆర్‌ఎస్‌ నేతలు తోక ముడిచారని రేవంత్‌ మండిపడ్డారు. టెండర్లు పిలువకుండా 30,400 కోట్ల పనులను బీహెచ్‌ఈఎల్‌కు ఎలా అప్పగించారాలో టీఆర్‌ఎస్‌ నేతలు సమాధానం చెప్పాలని రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ లేదా సీవీసీతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ పాలనలో జరిగిన అవినీతి చిట్టా తన దగ్గర ఉందన్న రేవంత్‌రెడ్డి, వీటిని ప్రజల ముందువుంచి, ముఖ్యమంత్రిని ప్రగతి భవన్‌ నుంచి చర్లపల్లి జైలుకు పంపిస్తాని హెచ్చరించారు. 

21:10 - January 12, 2018

విజయవాడ : విభజన చట్టంలో అపరిష్కృతంగా ఉన్న హామీలను అమలు చేయకపోతే కోర్డును ఆశ్రయించడం మినహా మరో ప్రత్యామ్నాయంలేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. కేంద్రం చెప్పడంతో ప్రత్యేక హోదాకు బదులు ప్యాకేజీకి ఒప్పుకున్నానని.. అయితే ఇంతవరకు నిధులు ఇవ్వలేదని ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టుతోపాటు రాజధాని అమరావతి నిర్మాణం, మంజూరైన విద్యాసంస్థలకు నిధులు ఇవ్వాలని ఢిల్లీలో ప్రధాని మోడీతో జరిపిన భేటీలో చంద్రబాబు కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ప్రధాని నివాసంలో గంటకుపైగా జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర విభజన చట్టంలోని హామీల అమలుపై చర్చించారు. విభజన చట్టంలోని అపరిష్కృత హామీలపై 17 పేజీల నివేదిక అందజేశారు. దాదాపు ఏడాదిన్నర తర్వాత చంద్రబాబు, మోదీ భేటీ అయ్యారు.

ప్రధాని మోదీతో చర్చించిన వివరాలను చంద్రబాబు వెల్లడించారు. అన్నింటినీ అమలు చేయమని మోదీని కోరామని, లేకపోతే కోర్టుకు వెళ్లడం మినహా మరో గత్యంతరంలేదని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుతోపాటు అమరావతి నిర్మాణానికి వచ్చే బడ్జెట్‌లో ఎక్కువ నిధులు కేటాయించాలని కోరారు. సవరించిన అంచనాల ప్రకారం పోలవరంకు 58 వేల కోట్ల రూపాయలు అవుతుందని చంద్రబాబు ప్రధాని మోదీ దృష్టికి తెచ్చారు. దీని పునరావసం, పునర్నిర్మాణానికే 35 వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని వివరించారు. దీనిపై నిర్ణయం తీసుకోవాలని కోరారు.

విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు 16 వేల కోట్ల రూపాయల రెవెన్యూ లోటు భర్తీ చేయాల్సి ఉండగా ఇంతవరకు చాలా తక్కువ మొత్తమే ఇచ్చిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. దీనిని నేరుగా నగదు రూపంలో ఇవ్వకపోతే పాత రుణాలు చెల్లింపునకు సర్దుబాటు చేయాలని కోరారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయాల్సిన 11 కేంద్ర విద్యాసంస్థలకు 2,900 ఎకరాల భూమి ఇచ్చిన విషయాన్ని చంద్రబాబు ప్రధాని దృష్టికి తెచ్చారు. దీని విలువ 16,600 కోట్లని, మరో 133 కోట్లతో వీటన్నింటికీ ప్రహరీగోడలు నిర్మించిన అంశాన్ని ప్రస్తావించారు. హిందూపురంలో కేంద్రీయ విశవిద్యాలయం, విజయనగరం జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని కోరారు. వీటికి 11,673 కోట్ల రూపాయలు విడుదల చేయాల్సి ఉంటే ఇంతవరకు కేవలం 420 కోట్లు మాత్రమే ఇచ్చారని ప్రధాని దృష్టికి తెచ్చారు. అసెంబ్లీ సీట్లు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

కాకినాడ పెట్రో రసాయనాల పారిశ్రామిక సముదాయం, కడప స్టీల్‌ ప్లాంట్‌, విజయవాడ, విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టులు, విశాఖ-చెన్నై పారిశ్రామికి నడవాను అమల్లోకి తీసుకురావాలని చంద్రబాబు ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. విభజన చట్టంలోని హామీల అమలుకు టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేయాలని కోరారు. వీటన్నింటిని పరిశీలించి, పరిష్కారానికి స్వయంగా చర్యలు తీసుకుంటానని చంద్రబాబుకు మోదీ హామీ ఇచ్చారు. 

న్యాయమూర్తుల స్పందనపై కాంగ్రెస్ వ్యాఖ్యలు..

ఢిల్లీ : నలుగురు సుప్రీం కోర్టు సీనియర్‌ న్యాయమూర్తులు సర్వోన్నత న్యాయస్ధానంలో పరిస్థితి సవ్యంగా లేదని చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ స్పందించింది. న్యాయమూర్తుల ఆవేదన నేపథ్యంలో ప్రజాస్వామ్యం ప్రమాదకర పరిస్థితిలో ఉందని ట్విట్టర్ లో ట్వీట్ చేసింది. 

సంక్రాంతికి 3వేల 262 అదనపు బస్సులు..

హైదరాబాద్ : సంక్రాంతి పండుగ సందర్భంగా పల్లెబాట పట్టే నగరవాసుల కోసం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రద్దీని దృష్టిలో పెట్టుకొని 3వేల 262 అదనపు బస్సులు నడుపుతోంది. పండుగ సందర్భంగా ప్రయాణికులకు అన్ని ఏర్పాట్లు చేశామని రంగారెడ్డి ఆర్టీసీ ఆర్‌ఎమ్‌ యాదగిరి పేర్కొన్నారు. 

సంక్రాంతికి 132 ప్రత్యేక రైళ్లు...

హైదరాబాద్ : సంక్రాంతి ప్రయాణికులతో జంటనగరాల్లోని రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు వెళ్లేవారితో రైళ్లలో రద్దీ పెరిగింది. ప్రయాణికులు అవసరాలను దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ఈసారి 132 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, కాచిగూడ నుంచి తిరుపతి, నర్సాపూర్‌, కాకినాడ, విశాఖపట్నంకు వీటిని నడుపుతున్నారు.

పశ్చిమలో కోళ్ల పందాలు జరుగకుండా...

పశ్చిమ గోదావరి : జిల్లాలో కోడి పందాలు జరక్కుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 700 మందికి పైగా బైండోవర్ కేసులు పెట్టారు. తనిఖీల కోసం 60 ప్రత్యేక బృందాలలను నియమించామంటున్న జిల్లా ఎస్‌పీ రవిప్రకాశ్‌ పేర్కొన్నారు. 

గజల్ శ్రీనివాస్ మరో 14 రోజులు..

హైదరాబాద్ : లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన గజల్ శ్రీనివాస్ కు నాంపల్లి కోర్టు మరో 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. 

సీఎంపై రాళ్ల దాడి..

బీహార్ : రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ కాన్వాయ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు. కాన్వాయ్‌లోని భద్రతా సిబ్బందికి గాయాల‌య్యాయి. బీహార్‌ బక్సర్‌ జిల్లాలోని నందన్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందులో సీఎంకు ఎలాంటి గాయాలు కాలేదు.

 

 

సీఎంపై రాళ్ల దాడి..

బీహార్ : రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ కాన్వాయ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు. కాన్వాయ్‌లోని భద్రతా సిబ్బందికి గాయాల‌య్యాయి. బీహార్‌ బక్సర్‌ జిల్లాలోని నందన్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందులో సీఎంకు ఎలాంటి గాయాలు కాలేదు. 

20:26 - January 12, 2018

మొత్తానికి కలిశారు.. కలిశారు. సరే.. దీనివల్ల ప్రయోజనమేంటి? ఏపీకి ఏం ఒరుగుతోంది? మూడున్నరేళ్లుగా విభజన తర్వాత అనేక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చిందేంటి? రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రాన్ని నిలదీయలేని రాష్ట్ర ప్రభుత్వం.., పైగా ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ల నోళ్లు నొక్కే రాష్ట్ర ప్రభుత్వం... ఏపీలో కనిపిస్తున్న తరుణం. ఇప్పుడు ఏడాది తర్వాత మోడీని కలిసిన చంద్రబాబు ఏపీకేమైనా ప్రయోజనాలు సాధించారా? లేక రాజకీయ ప్రయోజనాలకోసమే కలిశారా? ఈ అంశంపై టెన్ టివిలో ప్రత్యేక కథనం..

ప్రత్యేక హోదా కంటే ఎక్కువే సాయం చేస్తామంటూనే.. దాటవేత కబుర్లు.. కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు ..పాడిందే పాడుతూ కేంద్రం ఏపీకి దారుణంగా మొండిచేయి చూపిందనే విమర్శలు. మరోపక్క ప్రజల పక్షాన ఉంటూ ప్రజల ఆకాంక్షలను కేంద్రానికి వినిపించాల్సిన చంద్రబాబు ప్రభుత్వం సైలెంట్ గా చోద్యం చూస్తున్న తీరు స్పష్టం. ఈ క్రమంలో జరిగిన తాజా భేటీ ఆసక్తికరంగా మారింది. పోలవరానికి నిధులు ప్రవహిస్తాయా? రైల్వేజోన్ శాంక్షన్ అవుతుందా? రాజధానికి నిధులొస్తాయా? విద్యాసంస్థలు వచ్చేస్తాయా? చంద్రబాబు, మోడీ భేటీలో ఏ అంశాలు చర్చకొచ్చాయి? మోడీపై నమ్మకం, ఏపీ ప్రయోజనాలే ముఖ్యం అంటున్న చంద్రబాబు, ఏపీకి ఆశించిన ప్రయోజనం లేకుంటే బీజేపీతో తెగతెంపులకు సిద్ధమౌతారా? మోడీ అపాయింట్మెంట్ చంద్రబాబుకు కష్టంగా దొరికిందా? ఏపీకి న్యాయంగా రావలసిన వాటిని గట్టిగా అడగలేని పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారా?కేంద్రంలో చక్రం తిప్పే నేతగా ప్రొజెక్ట్ అయిన చంద్రబాబు వాయిస్ ఎందుకు తగ్గింది? అసలీ పర్యటన రాజకీయ ప్రయోజనాల కోసమా? లేక రాష్ట్ర హితం కోసమా? సమస్యలు స్పష్టంగా ఉన్నాయి..పరిష్కారం కోసం రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు..న్యాయంగా రావలసింది ఆశిస్తున్నారు.. కానీ, మొండి చేయి.. చెంబుడు మట్టి కాసిన్ని నీళ్ళు ఇచ్చి వాటితో ఎడ్జస్ట్ కావాలన్న కేంద్రం మూడున్నరేళ్లు గడుస్తున్నా ఏపీకి ఒరగబెట్టింది ఏం లేదు.. మరి ఈ భేటీ తర్వాతేమైనా పరిస్థితి మారుతుందా? ఏపీకి కాస్తైనా ఉపయోగం ఉంటుందా?

సమాఖ్య వ్యవస్థలో కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు నిర్వచించబడే ఉంటాయి. అందులోనూ కొత్తగా ఏర్పడే రాష్ట్రాల పట్ల ప్రత్యేక శ్రద్ధను కేంద్రం చూపెట్టాల్సిందే. కానీ, విభజన తర్వాత ఏళ్లు గడుస్తున్నా ఏపీని పట్టించుకోని కేంద్రాన్ని నిలదీసి తమ హక్కుగా రావలసింది సాధించుకోవాలి. కానీ, ఏపీ సర్కారు ఈ విషయంలో ఏ మాత్రం ముందుకు వెళ్లటం లేదు. ఇప్పుడు ఈ నామ్ కే వాస్తే మీటింగ్ తో ఒరిగేది అంతకంటే ఏ మాత్రం లేదు. మరింత విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి. 

20:22 - January 12, 2018

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. కత్తి స్టార్ కత్తి మహేష్.. ఇద్దరి పంచాదిలకు ఉస్మానియా యూనివర్సిటీ ఎంటరైపోయింది.. నీది పవనిజం అయితే మాది కత్తిజం అంటున్నరు.. మా దళిత బిడ్డ కత్తి తెర్వొస్తె కారం బెడ్తం అని హెచ్చరిస్తున్నది ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ.. నిన్న ఓయూకు వొయ్యిన కత్తి మహేస్కు ఖతర్నాక్ వెల్కం జెప్పిండ్రు..గీ ముచ్చట చూడాలంటే వీడియో క్లిక్ చేయండి...

20:19 - January 12, 2018

మనకు ఏడనన్న అన్యాయం అయితే.. కోర్టుకు వోతం.. ఆడగూడ న్యాయంగాకపోతె..ఫలితాలు రాకముందుకే ఓటమి పాలైంది టీఆర్ఎస్ పార్టీ కరెంటి ముచ్చట్ల..చెర్వుమీద కొంగ అల్గితె.. చెర్వుదెండుతదా.?? కొంగదెండుతదా..? ఆ నాగం జనార్థన్ రెడ్డి గారు గూడ.. బీజేపీ కమలానికి కాటు వెడ్తున్నట్టే ఉన్నడుగదా? ఏయ్ మా కేటీఆర్ను తిడ్తరా మీరు..? కబడ్దార్ కాంగ్రెస్ నేతల్లారా అని టీఆర్ఎస్ పార్టోళ్లు..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. కత్తి స్టార్ కత్తి మహేష్.. ఇద్దరి పంచాదిలకు ఉస్మానియా యూనివర్సిటీ ఎంటరైపోయింది...తెలంగాణల గొర్ల పంపిణీ పత్కం తెర్లైంది అనెతందుకు మళ్లొక ముచ్చటొచ్చింది.. ఈ తెలంగాణ రాష్ట్రంల ప్రజలది గాని సంపద ఏదున్నా అది ప్రభుత్వానిదే అంతేనా..? భూములైనా.?మన్సులను వోలిన మన్సులు ఏడ్గురుంటరంటరు.. ఆ ఏడుగుర్ని ఎవ్వడు సూడవొయ్యిండో ఏమో నాకు తెల్వదిగని.. గీ ముచ్చట్లు జూడాలంటే వీడియో క్లిక్ చేయండి. 

19:53 - January 12, 2018

స్వతంత్ర భారత న్యాయవ్యవస్థ చరిత్రలో శుక్రవారం ఒక సంచలనం. సాధారణంగా సామాన్యుడు న్యాయవ్యవస్థను విమర్శించాలంటే భయపడాల్సిన పరిస్థితి...ఉన్నటు వంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులైన నలుగురు సుప్రీంకోర్టు పనితీరును ప్రశ్నించడం హాట్ టాపిక్ అయ్యింది. చీఫ్ జస్టిస్ పై తీవ్రమైన అభియోగాలతో కూడిన విమర్శలు గుప్పించారు. వీరు లేవనెత్తిన అంశాలపై పారదర్శకత ఏర్పడుతుందా ? సుప్రీం పనితీరు ఎలా ఉంది ? తదితర అంశాలపై టెన్ టివి ప్రత్యేక చర్చ చేపట్టింది. ఈ చర్చలో 40 సంవత్సరాలు పాటు న్యాయసేవలందించిన న్యాయ శాస్త్ర నిపుణులు జస్టిస్ చంద్రకుమార్, సీనియర్ న్యాయవాది సురేష్ లు పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి...

19:49 - January 12, 2018

తిరుగుబాటు సరియైంది కాదని, న్యాయవ్యవస్థలో ప్రక్షాళన చేయడంలో వీరు ముందుకొచ్చారని తెలిపారు. న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యల అనంతరం జరుగుతున్న రూమర్స్ పెద్ద ప్రమాదమన్నారు. అన్యాయాలు..అక్రమాలు..తదితర విషయాలపై సరియైన విధంగా అనుసరించడం లేదన్నప్పుడు సరి చేయాలన్నారు. అనేక కుంభకోణాలను న్యాయవ్యవస్థ బయటపెట్టిందని..ఆయా కుంభకోణాల్లో చాలా మందికి శిక్షలను జడ్జి విధించారని గుర్తు చేశారు. కోట్లాను కోట్లు సంపాదించిన వారు కూడా జైలు శిక్ష అనుభవించారని తెలిపారు. న్యాయవ్యవస్థను ప్రతిష్టను పెంచుతూ వచ్చాయని, ఎక్కడో చిన్న లోపాలు జరుగుతున్నాయంటే..లోపాలను..సరిదిద్దలేదని అనుకోవచ్చా అని ప్రశ్నించారు. న్యాయవాదులు ఎన్నో ప్రయత్నాలు..చేసిన తరువాత బహిరంగంగా వచ్చే పరిస్థితి ఏర్పడిందన్నారు. అందులో భాగంగా చీఫ్ జస్టిస్ కు ఒక లేఖ రాయడం జరిగిందని, ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. 

19:18 - January 12, 2018

నటమూరి నందమూరి 'బాలకృష్ణ' సంక్రాంతి పండుగ సందర్భంగా తన తాజా చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఆయనకిది 102వ చిత్రం. కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో ‘జైసింహా’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రంలో బాలయ్య సరసన మరోసారి 'నయనతార నటించగా మరో హీరోయిన్ గా నటాషాదోషి, హరి ప్రియ కథానాయికలుగా నటించారు. 'బాలకృష్ణ' 'నయనతార' కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలు విజయవంతమైన సంగతి తెలిసిందే. 'జై సింహా' తో మరిసారి ఈ కాంబినేషన్ ప్రేక్షకులు ముందుకొచ్చింది. మరి ఈ కాంబినేషన్ అలరించిందా ? 'జై సింహా' సినిమా ఎలా ఉంది ? తదితర విషయాలు తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

18:30 - January 12, 2018
18:24 - January 12, 2018

విజయవాడ : ఏపీ రాష్ట్రంలో అవినీతి అధికారులకు చెక్ పడడం లేదు. ఏసీబీ అధికారుల్లో పలువురు అవినీతి తిమింగలాలు చిక్కుతున్నా ఇతర అధికారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. గతంలో పట్టుబడిన వారందరూ కొంత నగదుతో పట్టుబడుతుంటే ఓ అధికారి మాత్రం భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ పట్టుబడడం గమనార్హం.

విజయవాడ కమర్షియల్ ట్యాక్స్ డిప్యూటి కమిషనర్ గా ఏడుకొండలు విధులు నిర్వహిస్తున్నారు. ఏపీలో చెక్ పోస్టు ల ఇన్ చార్జీగా కూడా వ్యహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏడుకొండలు లంచం అడిగాడని ఓ వ్యక్తి ఏసీబీకి ఫిర్యాదు చేశారు. గురువారం మధ్యాహ్నం కార్యాలయంలో రూ. 22 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని రెడ్ హ్యాడెండ్ గా పట్టుకున్నారు. ఏకంగా ఆఫీసులోనే లంచం తీసుకుంటూ పట్టుబడడం చర్చనీయాంశంమైంది. ఘటనాస్థలంలోకి మీడియాను మాత్రం అనుమతినించడం లేదు. గతంలో కూడా ఏడుకొండలపై పలు అవినీతి ఆరోపణలున్నట్లు తెలుస్తోంది. 

న్యాయమూర్తుల ప్రెస్ మీట్ పై సీపీఎం స్పందన...

ఢిల్లీ : సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్రెస్ మీట్ పై సీపీఎం స్పందించింది. సుప్రీంకోర్టు వ్యవస్థపై తీవ్ర పరిణామాలు చూపే కీలకాంశాలను న్యాయమూర్తులకు కేసుల కేటాయింపు వంటి అంశాలను న్యాయమూర్తులు ప్రస్తావించారని, రాజ్యాంగ వ్యవస్థకు సుప్రీంకోర్టు నిబద్ధత..స్వతంత్ర ప్రతిపత్తి మూల స్తంభాలని పేర్కొంది. ఎలాంటి రాజీకి అవకాశం లేని వ్యవస్థ న్యాయవ్యవస్థ అని, న్యాయవ్యవస్థలో పారదర్శకత..ప్రజాస్వామ్యయుత నిర్శాహణనను దృష్టిలో ఉంచుకుని న్యాయమూర్తుల మధ్య ఇలాంటి వివాదాలను పరిష్కరించబడుతాయని భావిస్తున్నట్లు తెలిపారు. 

18:16 - January 12, 2018

హైదరాబాద్ : సంక్రాంతి పండుగ వచ్చేస్తోంది..వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు..మరికొంత మంది షాపింగ్ చేయాలని..ఇతరత్రా పనుల కోసం ప్రణాళికలు వేసుకుంటున్నారు..కానీ ఇవన్నీ అమలు కావాలంటే 'డబ్బు' కావాల్సిందే. అదే 'డబ్బు' దొరకడం లేదు. నగరంలోని చాలా ప్రాంతాల్లో ఉన్న ఏటీఎంలలో డబ్బు కొరత వేధిస్తోంది. గతంలో నోట్ల రద్దు అనంతరం నెలకొన్న పరిస్థితులు పునారావృతం అవుతుండడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. తాము దాచుకున్న డబ్బు తీసుకోవడానికి బిచ్చమడగాలా అని ప్రశ్నిస్తున్నారు. తార్నాకాలో నెలకొన్న పరిస్థితుల కోసం వీడియో క్లిక్ చేయండి. 

18:10 - January 12, 2018

హైదరాబాద్ : నగర శివారు ప్రాంతంలో చంగిచర్ల వద్ద జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. పలు వాహనాలు దగ్ధమయ్యాయి. ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. మంటలు నాలుగైదు అంతస్తులకు ఎగిసిపడడంతో పరిస్థితి ఎంత తీవ్రంగా అర్థం చేసుకోవచ్చు.

నిలిపి ఉన్న డీజిల్ ట్యాంకర్..గ్యాస్ సిలిండర్లకు మంటలు అంటుకున్నాయి. కొద్ది క్షణాల్లో మంటలు వ్యాపించాయి. ఆయిల్ ట్యాంకర్ మెరుపు వేగంతో వెనక్కి వెళ్లి పేలిపోయింది. దట్టంగా మంటలు ఎగిసిపడడం..ఒక్కసారిగా పొగ వ్యాపించడంతో అసలు ఏమి జరుగుతుందో అక్కడున్న వారికి అర్థం కాలేదు. రోడ్డు మీద వెళుతున్న వారు మంటల్లో చిక్కుకున్నారు. చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందగా మరో ముగ్గురు చికిత్స పొందుతున్నారు. పెద్ద పెద్ద పేలుడు శబ్దాలతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైరింజన్లతో మంటలను ఆర్పారు. సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. 

ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు...

యాదాద్రి : టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యమంతో సంబంధం లేని వారు కేబినెట్ లో ఉన్నారని, హోం మంత్రి నాయినీ మాటలు వాస్తవమేనన్నారు. అది తలుచుకుంటే కళ్ల వెంట నీళ్లు వస్తాయని, కేసీఆర్ నిర్ణయం వెనుక బలమైన కారణం ఉండవచ్చన్నారు. ఉద్యోగులు లేనిదే సకల జనుల సమ్మె లేదని..తెలంగాణ లేదన్నారు. అప్పుడు తెలంగాణ కోసం పనిచేయని వాళ్లు..ఇప్పుడు మాటలు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. 

కోళ్ల పందాలు..గత తీర్పు అమలు - సుప్రీం..

ఢిల్లీ : కోళ్ల పందాలపై హైకోర్టు నిషేధం విధించడంపై సుప్రీం కోర్టును పిటిషనర్ రఘురామ కృష్ణంరాజు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సంప్రదాయ క్రీడను కొనసాగించాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. కోడి పందాల విషయంలో గత ఏడాది సుప్రీంకోర్టు తీర్పు అమల్లో ఉంటుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వెల్లడించారు. కోళ్లకు కత్తి కట్టవద్దని..తనిఖీల పేరిట ఇళ్లలోకి వెళ్లి కోళ్లను పట్టుకోరాదని..రైతులను అరెస్టు చేయవద్దని కోర్టు పేర్కొంది. 

17:53 - January 12, 2018
17:51 - January 12, 2018

కేసీఆర్ సంక్రాంతి శుభాకాంక్షలు...

హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల జీవితాల్లో కొత్త కాంతులు నింపాలని, అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో వర్దిల్లాలని ఆకాంక్షించారు. 

సుకుమాలో ఎదురు కాల్పులు...

ఛత్తీస్ గడ్ : సుకుమా కుంట సమీపంలో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. పోలీసులు..మావోయిస్టులు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఇద్దరు గ్రామస్తులు మృతి చెందారు. తీవ్ర ఆగ్రహానికి గురైన గ్రామస్తులు 27 పోలీసు వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. 

త్వరలో గ్రామ పంచాయతీలుగా తండాలు - హరీష్ రావు..

వరంగల్ : తండాలను గ్రామ పంచాయతీల్లో చేరుస్తామని..ఇందుకే కేబినెట్ ఆమోదించడం జరిగిందని..త్వరలో చట్టం రూపొందిస్తామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ ఈ విషయంలో మోసం చేసిందన్నారు. ప్రతి ఎకరానికి నీరు..ప్రతింటికి తాగునీరందించడమే లక్ష్యమన్నారు. 

వరంగల్ లో మంత్రి హరీష్ రావు పర్యటన..

వరంగల్ : జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటించారు. రైతులు కోరుకున్నట్లే చెక్కుల రూపంలో పెట్టుబడి అందిస్తామని, కాంగ్రెస్ హాయాంలో నాణ్యమైన కరెంటు అందివ్వలేదని విమర్శించారు. టీఆర్ఎస్ హయాంలో 24గంటల పాటు కరెంటు అందిస్తున్నట్లు తెలిపారు. 

16:15 - January 12, 2018
16:13 - January 12, 2018

మేడ్చల్ : హైదరాబాద్ శివారు ప్రాంతంలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. చంగిచర్ల వద్ద నిలిపి ఉన్న డీజిల్ ట్యాంకర్..గ్యాస్ సిలిండర్లకు మంటలు అంటుకున్నాయి. కొద్ది క్షణాల్లో మంటలు వ్యాపించడంతో పెద్ద ఎత్తున్న పొగ వ్యాపించింది. మంటల్లో పలువురి చిక్కుకుని గాయపడ్డారు. లారీలోని సిలిండర్లు పేలుతుండడంతో పెద్ద పెద్ద శబ్దాలతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్నారు.

ఈ సందర్భంగా ప్రమాదం జరిగిన తీరుపై స్థానికులు..పోలీసు అధికారితో టెన్ టివి మాట్లాడింది. ఏం జరిగిందనే దానిపై తెలుసుకోవాలంటే సమయం పడుతుందని పోలీసు అధికారి పేర్కొన్నారు. పెట్రోల్ దొంగతనంగా సరఫరా చేస్తున్నారని..సమాచారం వస్తోందని ఇదే నిజమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రమాదంలో ఒక భవనం దెబ్బతిన్నదని..కొన్ని వాహనాలు దగ్ధమయ్యాయని..ఒకరికి సీరియస్ గా ఉన్నారని...ఇతర వివరాలు త్వరలో తెలియచేస్తామన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

చెంగిచెర్ల ఘటనలో పది మందికి గాయాలు..

హైదరాబాద్ : మేడ్చల్ జిల్లా పరిధిలోని చెంగిచెర్ల వద్ద జరిగిన ప్రమాదంలో పది మందికి గాయాలయ్యాయి. వీరిని గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

15:55 - January 12, 2018

హైదరాబాద్ : సంక్రాంతి పండగ సందర్భంగా ప్రయాణీకుల తాకిడి పెరిగిపోయింది. ఆర్టీసీ, రైల్వై, ప్రైవేట్‌ ట్రావెల్స్‌ ఎక్క చూసినా... ఇసుకేస్తే రాలనంతగా ప్రయాణీకుల రద్దీ పెరిగిపోయింది. ప్రమాదాన్ని కూడా లెక్క చేయకుండా ఫుట్‌బోర్డ్‌ పై నిలుచుని మరీ జర్నీ చేస్తున్నారు. హైదరాబాద్‌లో సంక్రాంతి ప్రయాణికులు రద్దీపై టెన్‌టీవీ స్టోరీ. సంక్రాంతి పండగ వల్ల రైలుస్టేషన్లలో ప్రయాణీకుల రద్దీ విపరీతంగా పెరిగింది. జనవరి 12 నుంచే విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. మరోవైపు ఆపీసులూ హాలీడేస్‌ ఇచ్చేశాయి. విద్యార్థులు, ఉద్యోగులు పండగకోసం సొంతూళ్లకు పయనం అయ్యారు.

సంక్రాంతికి ఊరుకు వెళుతున్న ప్రయాణీకులతో బస్టాండులు, రైల్వే స్టేషన్లు కిక్కిరిపోతున్నాయి. దీంతో రైల్వే పోలీసులు రైలు వచ్చే సమయానికి ప్రయాణీకులను క్యూలో నిలబెడుతున్నారు. రద్దీకారణంగా నిలుచునే స్థలం లేకున్నా.. ఫుట్‌బోర్డ్‌ మీదే నిలబడి ప్రయాణం చేస్తున్నారు. సొంతూరికి త్వరగా చేరుకోవాలన్న ఆతృతలో ప్రయాణికులు.. ఒక్కసారిగా పెరిగిన రద్దీకి తగినట్టు సర్వీసులు అందుబాటులో ఉంచడానికి రైల్వే, ఆర్టీసీ అధికారుల ఉరుకులు, పరుగులు.. ఇపుడు భాగ్యనగరంలో ఎక్కడ చూసినగా ప్రయాణ హడావిడే కనిపిస్తోంది. 

15:53 - January 12, 2018

ఢిల్లీ : శ్రీహరి కోటలో పీఎస్‌ఎల్వీ సీ-40 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఈ ప్రయోగం ద్వారా ఇస్రో అంతరిక్ష ప్రయోగాల్లో తిరుగులేని రికార్డు సృష్టించింది. నెల్లూరు జిల్లా శ్రీహ‌రికోట‌లోని షార్ కేంద్రం నుంచి ఇస్రో వందో ఉపగ్రహాన్నిప్రయోగించి విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. సరిగ్గా 9గంటల 29 నిముషాలకు పీఎస్‌ఎల్వీ సీ-40 రాకెట్ 31 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లింది. వీటిలో భారత్‌కు చెందిన కార్టోశాట్-2ఇ, ఒక నానో శాటిలైట్, ఒక సూక్ష్మ ఉపగ్రహంతో పాటు అమెరికా, బ్రిటన్ , రిపబ్లిక్ ఆఫ్ కొరియా, ఫ్రాన్స్, ఫిన్‌ల్యాండ్, కెనడాలకు చెందిన 28ఉపగ్రహాలు ఉన్నాయి. పీఎస్‌ఎల్వీ సీ-40 విజయవంతం కావడంతో రోదసిరంగంలో అగ్రగాములుగా ఉన్న అమెరికా, రష్యాల సరసన భారత్‌ చేరింది. అమెరికా, రష్యాల రికార్డులను బద్దలు కొట్టడమే కాకుండా సమీపకాలంలో ఎవరూ అందుకోని రికార్డును ఇస్రో సాధించింది. పీఎస్ఎల్వీ సీ-40 విజయవంతం కావడం పట్ల ఇస్రో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం దేశానికి ఇస్రో ఇచ్చిన కొత్త సంవత్సర కానుక అన్నారు ఇస్రో చైర్మన్ శివన్. అందరి సమిష్టి కృషితో ఈ విజయం సాధ్యమైందని ఆయన అన్నారు. 

15:47 - January 12, 2018

అటార్నీ జనరల్ తో జస్టిస్ మిశ్రా భేటీ...

ఢిల్లీ : అటార్నీ జనరల్ తో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మిశ్రా భేటీ అయ్యారు. నలుగురు న్యాయమూర్తుల సమావేశంపై చర్చించారు. 

జాతీయ రహదారులపై భారీ రద్దీ..

హైదరాబాద్ : సంక్రాంతి పండుగ దగ్గర పడుతుండంతో నగర వాసులు సొంతూళ్లకు పయనమవుతున్నారు. దీనితో హైదరాబాద్ - విజయవాడ రహదారిపై భారీగా వాహనాలు పయనిస్తున్నాయి. ఆయా టోల్ గేట్ల వద్ద భారీగా రద్దీ నెలకొంది. పంతంగి టోల్ ఫ్లాజా వద్ద, కీసర టోల్ గేట్..ఇతర ప్రాంతాల్లో ఉన్న టోల్ గేట్ల వద్ద వాహనాలు క్యూలు కట్టాయి. 

రాజేష్..స్వాతిలకు రిమాండ్..

మహబూబ్ నగర్ : సుధాకర్ రెడ్డి హత్య కేసులో ఏ1, ఏ 2 నిందితులు రాజేష్, స్వాతిని పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. వీరికి 14 రోజుల రిమాండ్ విధిస్తున్నట్లు కోర్టు పేర్కొంది. 

సుప్రీంకోర్టులో కోళ్ల పందాలపై విచారణ..

ఢిల్లీ : సుప్రీంకోర్టులో కోళ్ల పందాలపై విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా ఈ కేసును విచారించారు. తమ ఒరిజనల్ ఆర్డర్ అమల్లో ఉందని పేర్కొన్నట్లు తెలుస్తోంది. తీర్పుపై సవరణలకు హైకోర్టుకు వెళ్లవచ్చని సుప్రీం సూచించింది. 

15:24 - January 12, 2018

మేడ్చల్ : జిల్లా శివారు ప్రాంతమైన మేడిపల్లి శుక్రవారం మధ్యాహ్నం వణికిపోయింది..బోడుప్పల్ ప్రాంతంలోని చెంగిచెర్లలో భారీ పేలుడు సంభవించింది..అకస్మాత్తుగా పెట్రోల్ వాహనానికి మంటలు అంటుకున్నాయి.. స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురై పరుగులు తీశారు. పెట్రోల్ ట్యాంకర్ పేలడం..పక్కనే ఉన్న సిలిండర్ల లారీలకు మంటలు వ్యాపించాయి. భారీగా నిప్పు రవ్వలు ఎగిసిపడ్డాయి. రోడ్డుపై వెళుతున్న వారిపై పడడంతో హాహాకారాలు మిన్నంటాయి. ఈ ఘటనలో ఐదుగురు కాలిపోయారని..వారి పరిస్థితి విషమంగా ఉందని ఓ ఫైర్ సిబ్బంది టెన్ టివికి తెలిపారు. ఏడు వాహనాలు దగ్ధమయ్యాయని, పది మందికి గాయాలయ్యాయని పేర్కొన్నారు. సమాచారం తెలుసుకున్న అధికారులు మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

పెట్రోల్ కంపెనీ నుండి బయటకు వచ్చాక ప్రైవేటు గోడౌన్ లో పెట్రోల్ దొంగిలిస్తుండగా ప్రమాదం జరిగినట్లు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ప్రమాదంలో మంటలు అంటుకుని పలు వాహనాలు దగ్ధమయ్యాయి. భారీ పేలుడుతో స్థానికులు తీవ్ర భయాందోనళకు గురయ్యారు. దీని గురించి పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి. ఘటన గురించి మరింత సమాచారం తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి...

మేడిపల్లిలో భారీ అగ్నిప్రమాదం..

మేడ్చల్ : జిల్లాలోని మేడిపల్లిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పేలుడు ధాటికి ద్విచక్రవాహనదారుడు మృతి చెందినట్లు తెలుస్తోంది. పెట్రోల్ కంపెనీ నుండి బయటకు వచ్చాక ప్రైవేటు గోడౌన్ లో పెట్రోల్ దొంగిలిస్తుండగా ప్రమాదం జరిగినట్లు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ప్రమాదంలో మంటలు అంటుకుని పలు వామనాలు దగ్ధమయ్యాయి. భారీ పేలుడుతో స్థానికులు తీవ్ర భయాందోనళకు గురయ్యారు. 

14:56 - January 12, 2018

ఢిల్లీ : రాష్ట్ర విభజన సమస్యలను పరిష్కరించాలని ప్రధానిని కొరానన్నరు సీఎం చంద్రబాబు. సేవారంగంలో దక్షిణాదిరాష్ట్రాలకంటే ఏపీ చాలా వెనుకబడిందన్నారు. రాష్ట్రంలో సర్వీస్‌ సెక్టార్‌ అభివృద్ధికి చేయూత ఇవ్వాలని ప్రదాని మోదీకి విజ్ఞప్తి చేశామన్నారు. 14వ ఆర్థిక సంఘం కూడా రాష్ట్రం రెవెన్యూలోటును ఎదుర్కొంటున్నట్టు పేర్కొన్నదని .. ఈ విషయాన్ని కూడా ప్రధాని దృష్టికి తీసుకెళ్లానన్నారు. షెడ్యూల్‌-9, 10 లలో విభజన సరిగా జరగలేదని.. ఆ సమస్యలను వెంటనే పరిష్కరించడానకి చొరవచూపాలని ప్రధానికి విజ్ఞప్తి చేశానన్నారు చంద్రబాబు.

రాజధాని నిర్మాణానికి మరిన్ని నిధులు ఇవ్వాలని ప్రధానికి విజ్ఞప్తి చేశానన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇప్పటికే ఇచ్చిన 2500 కోట్లు తోడుగా మరో వెయ్యికోట్లు త్వరలో మంజూరు చేస్తామని ప్రధాని చెప్పారన్నారు. విభజన చట్టం 13లో పేర్కొన్న 11 సంస్థల ఏర్పాటుపై చర్చించానన్నారు చంద్రబాబు. ఇప్పటికే 9 సంస్థలను శాక్షన్‌ చేశారన్నారు. ఇంకా కేంద్రీయ విశ్వవిద్యాలయం, గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సహకరించాలని కోరామన్నారు. దుగరాజు పట్నం పోర్టును త్వరగా పూర్తి చేయడానికి సాయం చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేశామన్నారు సీఎం చంద్రబాబు.

14:29 - January 12, 2018

ఢిల్లీ : దేశంలోనే తొలిసారి..అది బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో...తొలిసారిగా సుప్రీం జడ్జీలు సమావేశం కావడం సంచలనం సృష్టిస్తోంది. జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నివాసంలో ఈ సమావేశం కొనసాగింది. జస్టిస్ చలమేశ్వర్ తో సహా మీడియా సమావేశంలో నలుగురు జడ్జీలు పాల్గొన్నారు. సుప్రీంకోర్టులో కొన్ని నెలలుగా అవాంఛనీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని, ఈ పరిణామాలు ప్రజలకు చెప్పాలనే ఉద్ధేశ్యంతో మీడియా ముందుకొచ్చామని జస్టిస్ చలమేశ్వర్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు పవిత్రత నిలబడకపోతే ప్రజాస్వామ్యానికి చేటని, స్వేచ్చాయుత న్యాయవ్యవస్థ లేకపోతే ప్రజాస్వామ్యం లేదన్నారు. సుప్రీంకోర్టులో పాలన తీరు సరైన పద్ధతులో లేదని, సుప్రీంకోర్టులో పాలనా వ్యవస్థను సరిదిద్ధాలన్నారు. ప్రధాన జడ్జీని ఒప్పించడంలో విఫలమయ్యామని పేర్కొన్నారు.

అంతకంటే ముందు సీజేలకు నలుగురు న్యాయమూర్తులు లేఖ రాశారు. తీవ్రమైన ఆవేదన, ఆందోళనతో సీజేఐకి లేఖ రాయడం జరుగుతోందని, కొత్త ఉత్తర్వులు, న్యాయవితరణ..హైకోర్టుల స్వతంత్ర ప్రతిపత్తిని ప్రభావితం చేస్తున్నాయన్నారు. ఆ ఉత్తర్వులు సీజేఐ పరిపాలన కార్యక్రలాపాలను ప్రభావితం చేస్తున్నాయన్నారు. కోల్ కతా ముంబై, మద్రాసు హైకోర్టు స్థాపన నుండి కొన్ని సంప్రదాయాలు, కట్టుబాటులు కొనసాగుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో కాసేపట్లో సుప్రీం ప్రధాన న్యాయమూర్తి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. 

గన్ పార్కు వద్ద రేవంత్..సంపత్..

హైదరాబాద్ : టీఆర్ఎస్ నేతల సవాల్ కు టి.కాంగ్రెస్ నేత రేవంత్ సై అన్నారు. గన్ పార్కు వద్దకు రేవంత్ రెడ్డి..సంపత్ లు చేరుకున్నారు. టీఆర్ఎస్ సవాలను స్వీకరించే తాము గన్ పార్కు కు రావడం జరిగిందని, కానీ 24గంటలు గడువకముందే టీఆర్ఎస్ వెనక్కిపోయిందని ఎద్దేవా చేశారు. దోపిడిని బయటపెడుతాననే టీఆర్ఎస్ నేతలు ముఖం చాటేశారని, ప్రభుత్వ విద్యుత్ వెలుగుల వెనుక అవినీతి నిజంగానే ఉందని మరోసారి రేవంత్ స్పష్టం చేశారు. 

మరోసారి గజల్ శ్రీనివాస్ పిటిషన్...

హైదరాబాద్ : లైంగిక వేధింపుల కేసులో మరోసారి నాంపల్లి కోర్టును గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్ ఆశ్రయించారు. ఆయన కాసేపటి క్రితం బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. 18న విచారణ జరుగనుంది. 

తగులబడుతున్న డీజిల్ ట్యాంకర్...

మేడ్చల్ : మేడిపల్లి చెంగిచర్ల రహదారిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. డీజీల్ ట్యాంకర్ తగులబడుతోంది. మూడు ఫైరింజన్లతో మంటలను ఫైర్ సిబ్బంది ఆర్పుతున్నారు. 

జడ్జీల వివాదంపై మోడీ..

ఢిల్లీ : సుప్రీంకోర్టు జడ్జీల వివాదంపై ప్రధాన మంత్రితో కేంద్ర మంతి రవిశంకర్ ప్రసాద్ భేటీ కానున్నారు. అంతకంటే ముందు ఆయనతో మోడీ ఫోన్ లో మాట్లాడారు. మరోవైపు అటర్నీ జనరల్ తో చీఫ్ జస్టిస్ భేటీ కానున్నారు. 

సేవా రంగంలో తెలంగాణ ముందుంది - బాబు..

ఢిల్లీ : వ్యవసాయరంగంలో ఏపీ ముందుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పారిశ్రామిక రంగంలో కూడా ఏపీ ముందుందని, సేవా రంగంలో తెలంగాణకు ఆదాయం ఎక్కువ వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. సేవా రంగంలో ఏపీ వెనుకబడి ఉందని, దక్షిణాది రాష్ట్రాల్లో తలసరి ఆదాయంలో ఏపీ తక్కువ సగటులో ఉందని తెలిపారు. ఏపీలో రూ. 42వేల కోట్ల రెవెన్యూ లోటు ఉందని 14వ ఆర్థిక సంఘం చెప్పిందన్నారు. 

14:14 - January 12, 2018
14:12 - January 12, 2018

అనంతపురం : జిల్లాలోని కదిరిలో ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా 10టీవీ నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. నిరంతరం ప్రజా సమస్యలను స్పందిస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్న 10టీవీకి చాంద్‌ బాషా అభినందనలు తెలిపారు. అందరికీ చాంద్‌ బాషా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 

14:10 - January 12, 2018

అనంతపురం : జిల్లాలోని హిందూపురంలో కసాయి కొడుకుల నిర్వాకం వెలుగు చూసింది. మానవత్వం మర్చిపోయిన కసాయి కొడుకులు వృద్ధులైన  తల్లిదండ్రులను ఇంటి నుంచి గెంటేశారు. ముద్దిరెడ్డిపల్లికి చెందిన వృద్ధ దంపతులు కిష్టప్ప, ఓబులమ్మలను లక్ష్మీనారాయణ, లోకేశ్ ఇద్దరు కొడుకులు. పెద్ద కుమారుడు లక్ష్మీనారాయణ స్ధానికంగా బట్టల దుకాణం నడుపుతున్నాడు. రెండో కొడుకు లోకేశ్ బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. వారిద్దరూ తల్లిదండ్రులను ఇంట్లోంచి గెంటేసి తాళం వేసుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగకపోవడంతో దంపతులిద్దరూ ఆరుబయటే కాలం గడుపుతున్నారు. వృద్ధుల కష్టాలు చూసి స్ధానికులు చలించిపోతున్నారు. కిష్టప్ప, ఓబులమ్మ పేరిట ముద్దిరెడ్డిపల్లి, అనంతపురాల్లో ఇళ్లు, స్థలాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

14:08 - January 12, 2018

జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని కాటారంలో దారుణం చోటుచేసుకుంది. 501 సర్వే నెంబర్‌లోని భూ తగదాలతో ఇద్దరు వీఆర్‌ఏలపై సోదరి శ్రీను అనే వ్యక్తి గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటనలో దొడ్డు రాములు మృతి చెందగా.. బొడ్డు లక్ష్మణ్‌ పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం అతన్ని ఆస్పత్రికి తరలించారు.

 

14:04 - January 12, 2018

ఢిల్లీ : భారత న్యాయవ్యవస్థలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. సుప్రీంకోర్టుకు చెందిన నలుగురు న్యాయమూర్తులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సీనియర్‌ న్యాయమూర్తులు జస్టిస్‌ చలమేశ్వర్, రంజన్‌ గోగోయ్, మదన్‌ లోకూర్, కురియన్‌ జోసఫ్‌లో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. సుప్రీంకోర్టులో చోటు చేసుకున్న అవాంఛ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు పరిపాలన సరైన దిశలో నడవడం లేదన్నారు. లోపాలను సరిదిద్దమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లినా ఆయన పట్టించుకోవడం లేదని న్యాయమూర్తులు పేర్కొన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు జలమేశ్వర్‌ చెప్పారు. సుప్రీంకోర్టులో జరుగుతున్న పరిణామాలను దేశ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మాపై ఉందన్నారు. చీఫ్‌ జస్టిస్‌ను అభిశంసించే విషయంలో దేశ ప్రజలే నిర్ణయించాలన్నారు. 

13:59 - January 12, 2018

ఢిల్లీ : భారత న్యాయవ్యవస్థలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. సుప్రీంకోర్టుకు చెందిన నలుగురు న్యాయమూర్తులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సీనియర్‌ న్యాయమూర్తులు జస్టిస్‌ చలమేశ్వర్, రంజన్‌ గోగోయ్, మదన్‌ లోకూర్, కురియన్‌ జోసఫ్‌లో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. సుప్రీంకోర్టులో చోటు చేసుకున్న అవాంఛ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు పరిపాలన సరైన దిశలో నడవడం లేదన్నారు. లోపాలను సరిదిద్దమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లినా ఆయన పట్టించుకోవడం లేదని న్యాయమూర్తులు పేర్కొన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు జలమేశ్వర్‌ చెప్పారు. సుప్రీంకోర్టులో జరుగుతున్న పరిణామాలను దేశ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మాపై ఉందన్నారు.

 

13:56 - January 12, 2018

నెల్లూరు : శ్రీహరికోటలో పీఎస్‌ఎల్వీ సీ-40 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది..ఈ ప్రయోగం ద్వారా ఇస్రో అంతరిక్ష ప్రయోగాల్లో తిరుగులేని రికార్డు సృష్టించింది. నెల్లూరు జిల్లా శ్రీహ‌రికోట‌లోని షార్ కేంద్రం నుంచి  ఇస్రో వందో ఉపగ్రహాన్నిప్రయోగించి విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. సరిగ్గా 9గంటల 29 నిముషాలకు పీఎస్‌ఎల్వీ సీ-40 రాకెట్ 31 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లింది.  వీటిలో భారత్‌కు చెందిన కార్టోశాట్-2ఇ, ఒక నానో శాటిలైట్, ఒక సూక్ష్మ ఉపగ్రహంతో పాటు అమెరికా, బ్రిటన్ , రిపబ్లిక్ ఆఫ్ కొరియా, ఫ్రాన్స్, ఫిన్‌ల్యాండ్, కెనడాలకు చెందిన 28ఉపగ్రహాలు ఉన్నాయి. పీఎస్‌ఎల్వీ సీ-40 విజయవంతం కావడంతో రోదసిరంగంలో అగ్రగాములుగా ఉన్న అమెరికా, రష్యాల సరసన భారత్‌ చేరింది. అమెరికా, రష్యాల రికార్డులను బద్దలు కొట్టడమే కాకుండా సమీపకాలంలో ఎవరూ అందుకోని రికార్డును ఇస్రో సాధించింది. పీఎస్ఎల్వీ సీ-40 విజయవంతం కావడం పట్ల ఇస్రో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం దేశానికి ఇస్రో ఇచ్చిన కొత్త సంవత్సర కానుక అన్నారు ఇస్రో చైర్మన్ శివన్. అందరి సమిష్టి కృషితో ఈ విజయం సాధ్యమైందని ఆయన అన్నారు. 

13:53 - January 12, 2018

ఢిల్లీ : బీజేపీతో టీడీపీ పొత్తు కొనసాగుతుందని స్పష్టం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు  ప్రధాని మోడీతో మాట్లాడి ఏపీకి రావాల్సినవన్నీ సాధించుకుని వస్తారని జేపీ అన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు సాధ్యమో , కాదో కేంద్రం చెప్పాలని ఆయన అన్నారు. మిడిమిడి జ్ఞానంతో కొందరు బీజేపీ నేతలు చేసే వ్యాఖ్యలు సరికావన్నారు.

రాష్ట్ర అభివృద్ధిపై మాత్రమే చర్చ : సీఎం చంద్రబాబు

ఢిల్లీ : ఎటువంటి రాజకీయ చర్చ జరగలేదని.. రాష్ట్ర అభివృద్ధిపై మాత్రమే చర్చ జరిగిందని సీఎం చంద్రబాబు అన్నారు. 2019 నాటికి పోలవరం పూర్తి అవుతుందని అనుకుంటున్నామని తెలిపారు. అన్ని అంశాలపై ప్రధాని సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. రాష్ర్టానికి న్యాయం జరిగేదిశలో ముందుకు పోతానని తెలిపారు. 

విశాఖ రైల్వే జోన్ గురించి విజ్ఞప్తి చేశా : సీఎం చంద్రబాబు

ఢిల్లీ : విశాఖ రైల్వే జోన్ గురించి విజ్ఞప్తి చేశానని సీఎం చంద్రబాబు చెప్పారు. నియోజకవర్గాల పెంపు, రెవెన్యూ లోటుకు సహాయం, యూనివర్సిటీలు, పోర్టుల అభివృద్ధికి సహాయం చేయాలని కోరామన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అన్ని అవరోధాలు తొలగినట్లేనని స్పష్టం చేశారు. 

పోలవరం పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కోరాం : సీఎం చంద్రబాబు

 ఢిల్లీ : రాబోయే కేంద్ర బడ్జెట్ ఏపీ రాష్ట్రానికి మరిన్ని నిధులు కేటాయించాలని ప్రధాని మోడీని కోరినట్టు సీఎం చంద్రబాబు చెప్పారు. ప్రధానితో చంద్రబాబు గంటపాటు భేటీ అయ్యారు. సమావేశం ముగిసిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలిపారు. పోలవరం పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కోరామని తెలిపారు. 

13:17 - January 12, 2018

ఢిల్లీ : రాబోయే కేంద్ర బడ్జెట్ ఏపీ రాష్ట్రానికి మరిన్ని నిధులు కేటాయించాలని ప్రధాని మోడీని కోరినట్టు సీఎం చంద్రబాబు చెప్పారు. ప్రధానితో చంద్రబాబు గంటపాటు భేటీ అయ్యారు. సమావేశం ముగిసిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలిపారు. పోలవరం పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కోరామని తెలిపారు. విశాఖ రైల్వే జోన్ గురించి విజ్ఞప్తి చేశానని చెప్పారు. నియోజకవర్గాల పెంపు, రెవెన్యూ లోటుకు సహాయం, యూనివర్సిటీలు, పోర్టుల అభివృద్ధికి సహాయం చేయాలని కోరామన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అన్ని అవరోధాలు తొలగినట్లేనని స్పష్టం చేశారు. ఎటువంటి రాజకీయ చర్చ జరగలేదని.. రాష్ట్ర అభివృద్ధిపై మాత్రమే చర్చ జరిగిందన్నారు. 2019 నాటికి పోలవరం పూర్తి అవుతుందని అనుకుంటున్నామని తెలిపారు. అన్ని అంశాలపై ప్రధాని సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. రాష్ర్టానికి న్యాయం జరిగేదిశలో ముందుకు పోతానని తెలిపారు. 

 

సుప్రీంకోర్టులో పరిణామాలు ఆందోళనకరం : సీనియర్ జడ్జీలు

ఢిల్లీ : సుప్రీంకోర్టులో జరుగుతున్న పరిణామాలు ఆందోళనకరమని సీనియర్ జడ్జీలు అన్నారు. సుప్రీంకోర్టు పరిపాలన విధానం సరిగ్గా లేదని తెలిపారు. చీఫ్ జస్టిస్ ను ఒప్పించలేకపోతున్నామని చెప్పారు. ఎలాంటి అవకాశాలు లేకనే ప్రజలు ముందుకు వచ్చామని తెలిపారు. సుప్రీంకోర్టులో గత కొన్ని నెలలుగా అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని పేర్కొన్నారు. న్యాయవ్యవస్థలో అవాంచనీయ పరిణామాలు సరిచేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేశామని చెప్పారు. 

12:44 - January 12, 2018

ఢిల్లీ : సుప్రీంకోర్టు నలుగురు సీనియర్ జడ్జీలు మీడియా మీట్ నిర్వహించారు. జస్టిస్ చలమేశ్వర్ నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. తొలిసారిగా సుప్రీంకోర్టు జడ్జీలు ప్రెస్ మీట్ నిర్వహించారు. జడ్జీల మీడియా మీట్ సంచలనంగా మారింది. భారత న్యాయ వ్యవస్థలో కీలక పరిణామం చోటుచేసుకుంది. న్యాయవ్యవస్థలో అవినీతిపై జడ్జీలు మాట్లాడారు. సుప్రీంకోర్టులో జరుగుతున్న పరిణామాలు ఆందోళనకరమని సీనియర్ జడ్జీలు అన్నారు. సుప్రీంకోర్టు పరిపాలన విధానం సరిగ్గా లేదని తెలిపారు. చీఫ్ జస్టిస్ ను ఒప్పించలేకపోతున్నామని చెప్పారు. ఎలాంటి అవకాశాలు లేకనే ప్రజలు ముందుకు వచ్చామని తెలిపారు. సుప్రీంకోర్టులో గత కొన్ని నెలలుగా అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని పేర్కొన్నారు. న్యాయవ్యవస్థలో అవాంచనీయ పరిణామాలు సరిచేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేశామని చెప్పారు. 

 

12:35 - January 12, 2018

ఢిల్లీ : ప్రధాని మోడీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం ముగిసింది. గంటపాటు సమావేశం కొనసాగింది. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. పోలవరం, రాజధాని నిర్మాణానికి మరింత సాయంపై చర్చించారు. రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీకి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గాల పెంపు, రెవెన్యూ లోటుపై సాయం అడిగినట్లు తెలుస్తోంది. రాబోయే కేంద్ర బడ్జెట్ లో ఏపీకి మరిన్ని నిధులు కేటాయించాలని మోడీని కోరారు. రాష్ట్ర విభజన చట్టం హామీలపై ప్రధానితో చర్చించారు. 16 పేజీల నివేదికను చంద్రబాబు, మోడీకి అందజేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

నలుగురు సీనియర్ జడ్జీలు మీడియా మీట్

ఢిల్లీ : సుప్రీంకోర్టు నలుగురు సీనియర్ జడ్జీలు మీడియా మీట్ నిర్వహించారు. జస్టిస్ చలమేశ్వర్ నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. తొలిసారిగా సుప్రీంకోర్టు జడ్జీలు ప్రెస్ మీట్ నిర్వహించారు. జడ్జీల మీడియా మీట్ సంచలనంగా మారింది. 

ముగిసిన ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు భేటీ

ఢిల్లీ : మోడీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం ముగిసింది. గంటపాటు సమావేశం కొనసాగింది. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు.  

11:48 - January 12, 2018

తమిళనాడు : ఊటీ అంటేనే ప్రకృతి అందాలకు పుట్టినిల్లు. కొండ..కోనలకు నెలవైన ఊటీని చలికాలం మంచుదుప్పటి కప్పేసింది. ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు చేరుకోవడంతో ఊటీ హిమగిరులను తలపిస్తోంది. మిట్ట మధ్యాహ్నం వేళ కూడా మంచు తెరలు వీడటం లేదు. మంచుతో తడిసి ముద్దైన పచ్చికబయళ్లు కనువిందు చేస్తున్నాయి. ఊటీ మంచు అందాలు చూసి సందర్శకులు ముచ్చటపడిపోతున్నారు. 

ప్రధాని మోడీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ

ఢిల్లీ : ప్రధాని మోడీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. పోలవరం, రాజధాని నిర్మాణాలకు కేంద్ర సహకారంపై చర్చించనున్నారు. రాష్ట్రంలో శాసనసభ నియోజకవర్గాల పెంపు అంశాలతోపాటు విభజన చట్టం హామీలను నెరవేర్చాలని చంద్రబాబు మోడీని కోరనున్నారు. కేంద్ర విద్యుత్, జల పరిశోధన కేంద్రం రూపొందించిన త్రీడీ నమూనాను చంద్రబాబు పరిశీలించనున్నారు. మోడీతో భేటీ అనంతరం పూణె వెళ్లనున్నారు. 

 

11:40 - January 12, 2018

అనంతపురం : తాడిపత్రిలోని పాఠశాలల్లో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అలనాటి పండుగల ఆచారాలు ఉట్టిపడేలా వేడుకలను నిర్వహించారు. పాఠశాలలో ముగ్గులు వేసి.. రంగురంగుల బొమ్మల కొలువులను ఏర్పాటు చేశారు. అష్టలక్ష్మి దేవతల రూపంలో పిల్లలు అలరించారు. హరిదాసు వేషాలతో పిల్లలు.. నృత్యాలు చేస్తూ సందడి చేశారు.

 

11:38 - January 12, 2018

హైదరాబాద్ : సంక్రాంతికి స్పెషల్‌  దోపిడి  కొనసాగుతోంది. పండగ సీజన్ వచ్చిందంటే చాలు.. ప్రయాణీకుల నుంచి  ప్రైవేట్‌ ట్రావెల్ష్‌ మొదలుకొని ఆర్టీసీ, రైల్వేదాకా అందరూ అదనపు వసూళ్ళకు తెరలేపుతారు. ఒక్క సంక్రాంతి అనేకాదు... పండగ ఏదైనా ఇదే తంతు. ప్రతియేటా ప్రయాణీకులపై ఈ ప్రత్యేక బాదుడు మాత్రం తప్పదు.  సంక్రాంతి అంటే మరింత స్పెషల్‌గా బాదాలని చూస్తారు. అటు ఆర్టీసీ, ఇటు రైల్వే బహిరంగ దోపిడీకి పాల్పడుతుంటే... మేమేం తక్కువా అన్నట్లు ప్రైవేటు ట్రావెల్స్ కూడా సంక్రాంతిని క్యాష్‌ చేసుకునే పనిలో ఉన్నాయి. 
సంక్రాంతికి అదనపు ఛార్జీలు
ప్రజలు పండగ చేసుకుంటారో లేదో కానీ... ఆర్టీసీ, రైల్వే, ప్రైవేటు ట్రావెల్స్‌కు మాత్రం పండగే పండగ. సంక్రాంతి పండుగ ప్రజలు సరిగ్గా చేసుకుంటారో లేదో తెలియదుకానీ... రవాణా సంస్థలు మాత్రం అధిక ధరలతో చేసుకుంటున్నాయి. అసలు పండుగ ఆనందమంతా వారిదే అన్నట్టు ఉంది పరిస్థితి.  సంక్రాంతి పండుగకు ఆర్టీసీ 50 శాతం అదనంగా చార్జీలు వసూలు చేస్తోంటే... ప్రైవేటు ట్రావెల్స్‌ మళ్ళీ ఈ  ఛాన్స్‌ రాదేమో అన్నట్లు... ఇష్టానుషారంగా  ప్రయాణీకుల నుంచి వసూళ్ళు చేస్తున్నారు.. సమయాన్ని బట్టి ఎప్పటికప్పుడు అధిక రేట్లను నిర్ణయిస్తూ... ప్రయాణీకులను బెంబేలెత్తిస్తున్నారు. 
8రోజులు ప్రత్యేక సర్వీసులు
జనవరి 12నుంచి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. దీంతో 8రోజులు పాటు ప్రధాన రూట్లలో ప్రత్యేకంగా 829 బస్సులను నడుపుతున్నారు. హైదరాబాద్‌, విశాఖ, చెన్నై, బెంగుళూరు నగరాల మధ్య 12వతేదీన 112 బస్సులను నడుపుతోంది. ఇక  14 నుంచి 17వ తేదీవరకు రోజూ 125 సర్వీసులను  నడుపుతోంది.
అన్ని రూట్లలోనూ అదనపు ఛార్జీలే
విజయవాడ, హైదరాబాద్‌కు సూపర్‌ లగ్జరీ బస్సు ఛార్జీ సాధారణ రోజుల్లో  355 రూపాయలు.  సంక్రాంతి పండుగకు మాత్రం 530 రూపాయలు వసూలు చేస్తున్నారు. విజయవాడ-విశాఖపట్నం సాధారణ ఛార్జీ  480రూపాయలు కాగా... ప్రస్తుతం 620 వసూలు చేస్తున్నారు. విజయవాడ-బెంగుళూరుకు సాధారణ ఛార్జీ 850 రూపాయలు కాగా.. ప్రస్తుతం 1275 తీసుకుంటున్నారు. విజయవాడ-చెన్నై సాధారణ ఛార్జీ 580 కాగా... 870 రూపాయలు వసూలు చేస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి విజయవాడకు సీట్లన్నీ ముందుగానే నిండిపోయాయి. 14, 15, 16 తేదీల్లో ఆర్టీసికి ఎన్నడూ లేని డిమాండ్‌ ఏర్పడింది. 
వెయ్యి రూపాయలకు పైగా వసూలు 
విజయవాడ హైదరాబాద్‌ మధ్య సాధారణంగా ఏసీ సర్వీస్ ధర 600 రూపాయల వరకూ ఉంటుంది. ఇప్పుడు వెయ్యి రూపాయలకు పైగా వసూలు చేస్తున్నారు. ఇక నాన్‌ ఏసీ ధర 350 ఉండగా...  850 వరకూ వసూలు చేస్తూ ప్రయాణీకుల నడ్డి విరిస్తున్నారు.  గుంటూరు నుంచి హైదరాబాద్‌కు సాధారణంగా  ఏసీలో 600, నాన్‌ ఏసీలో 400 కాగా.. ప్రస్తుతం ఏసీ 1300, నాన్‌ ఏసీ 1100 వసూలు చేస్తూ నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు.  విజయవాడనుంచి బెంగుళూరుకు  ఏసీ బస్సుకు సాధారణ ఛార్జీ 1200, నాన్‌ ఏసీకి 800 ఉండతగా... ఏసీకి పండుగ సీజనంటూ 2500 నుంచి 3వేల వరకు వసూలు చేస్తున్నారు. నాన్‌ ఏసీకి 1500 వరకు గుంజుతున్నారు. గుంటూరు నుంచి బెంగుళూరుకు కూడా ధరలు భారీగానే పెంచేశారు. సాధారణంగా ఏసీకి 900, నాన్‌ ఏసీకి 800 ఉంటే..  ఇప్పుడు ఏసీ 2500, నాన్‌ ఏసీ 1500 వరకూ వసూలు చేస్తున్నారు.
ప్రధాన నగరాలకు ప్రత్యేక బస్సులు
రాయలసీమ, హైదరాబాద్, విశాఖపట్నం, చెన్నై, బెంగుళూరు నగరాలకు 13వతేదీ వరకూ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. చెన్నై, బెంగుళూరుకు 20, రాయలసీమకు 94, విశాఖ సహా కోస్తాంధ్రకు 202 బస్సులు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌కు అవసరాన్ని బట్టి మరిన్ని ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ఇక రైల్వే కూడా ఏమీ తక్కువ తినలేదు. పండుగ  రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్లాట్‌ఫామ్‌ ధరలు పెంచేసింది. నిన్న మొన్నటి వరకు పది రూపాయలున్న ప్లాట్‌ఫామ్‌ ధరను.. ఏకంగా 20 రూపాయలు చేసింది. ఆర్టీసీ, రైల్వే, ప్రైవేటు ట్రావెల్స్ ఇలా ప్రతీ సంస్థ పండగను అవకాశంగా తీసుకుని అదనపు మోత మోగిస్తున్నారు.  పెంచిన ఛార్జీల ధరలు భరించలేక పేదలు కష్టపడుతుంటే... ఆర్థిక స్థోమత ఉన్నవారు... డబ్బుపెట్టి కూడా కూర్చునేందుకు చోటు లేక ఫుట్‌బోర్డు ప్రయాణంతో పడరాని పాట్లు పడుతున్నారు.

 

11:21 - January 12, 2018

నెల్లూరు : పీఎస్‌ఎల్‌వీ సీ 40రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. పీఎస్‌ఎల్‌వీ సీ 40 రాకెట్ ను నింగిలోకి పంపారు. శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ రాకెట్‌ ద్వారా 31 ఉపగ్రహాలను శాస్త్రవేత్తలు కక్ష్యలోకి పంపారు. మూడు స్వదేశీ ఉపగ్రహాలు, 28 విదేశీ ఉపగ్రహాలు. ఈ ప్రయోగంతో 100 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిన రికార్డును ఇస్రో సొంతం చేసుకుంది. ఈ ప్రయోగం సక్సెస్ పై శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు.

10:59 - January 12, 2018

నెల్లూరు : పీఎస్‌ఎల్‌వీ సీ 40రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. పీఎస్‌ఎల్‌వీ సీ 40 రాకెట్ ను నింగిలోకి పంపారు. శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ రాకెట్‌ ద్వారా 31 ఉపగ్రహాలను శాస్త్రవేత్తలు కక్ష్యలోకి పంపారు. మూడు స్వదేశీ ఉపగ్రహాలు, 28 విదేశీ ఉపగ్రహాలు. ఈ ప్రయోగంతో 100 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిన రికార్డును ఇస్రో సొంతం చేసుకుంది.

 

10:51 - January 12, 2018

ఢిల్లీ : ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు.  ఉదయం 10.40 గంటలకు ప్రధాని మోడీతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. పోలవరం, రాజధాని నిర్మాణాలకు కేంద్ర సహకారంపై చర్చించనున్నారు. రాష్ట్రంలో శాసనసభ నియోజకవర్గాల పెంపు అంశాలతోపాటు విభజన చట్టం హామీలను నెరవేర్చాలని చంద్రబాబు మోడీని కోరనున్నారు. కేంద్ర విద్యుత్, జల పరిశోధన కేంద్రం రూపొందించిన త్రీడీ నమూనాను చంద్రబాబు పరిశీలించనున్న 
మోడీతో భేటీ అనంతరం పూణె వెళ్లనున్నారు. 

10:40 - January 12, 2018

విజయవాడ : సమాజంలోని వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొనే సమస్యలను వెలుగులోకి తేవడంలో టెన్‌టీవీ ముందంజలో ఉందన్నారు మెగా ఇంజనీర్‌ కంపెనీ ఛైర్మన్‌ పిపి.రెడ్డి. 2018 టెన్‌టీవీ క్యాలెండర్‌ను ఆవిష్కరించిన పిపిరెడ్డి ప్రజా సమస్యల పరిష్కారంలో టెన్‌టీవీ ప్రముఖ పాత్రపోషిస్తోందన్నారు. అన్ని వర్గాల ప్రజల మన్ననలు, ఆదరాభిమానాలు పొందుతోందని కొనియాడారు.

 

10:39 - January 12, 2018

మహబూబ్ నగర్ : ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ... వారధిగా పనిచేస్తున్న ఏకైక ఛానెల్‌ టెన్‌టీవీ అని టీఆర్‌ఎస్‌  నాయకుడు శివకుమార్‌రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా నారాయణపేటలో టెన్‌టీవీ క్యాలెండర్‌ ఆయన ఆవిష్కరించారు.  అందర్నీ మేల్కొలిపే కథనాలను టెన్‌టీవీ ప్రసారం చేస్తోందని అభినందించారు. 

10:31 - January 12, 2018

ఢిల్లీ : ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. ఈరోజు 10 గంటల 40 నిముషాలకి ప్రధాని మోడీతో భేటీ అవుతారు. పోలవరం రాజధాని నిర్మాణాలకు కేంద్రం సహకారం, రాష్ట్రంలో శాసనభ నియోజకవర్గాల పెంపు అంశాలపై చర్చిస్తారు. దాంతో పాటు రాష్ట్ర విభజన చట్టం ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చాల్సిందిగా ప్రధానిని చంద్రబాబు కోరనున్నారు. విభజన చట్టంలోని హామీలను త్వరగా అమలు చేయాలని టీడీపీ ఎంపీలు ఇప్పటికే ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఎంపీల  విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన మోదీ.. చంద్రబాబుకు అపాయింట్‌మెంట్ ఇచ్చారు. నేపథ్యంలో ఇవాళ ప్రధానితో జరగనున్న చంద్రబాబు భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానితో భేటీ అనంతరం చంద్రబాబు పూణె వెళ్తారు. అక్కడ కేంద్ర పోలవరం ప్రాజెక్టు త్రీడీ నమూనాను ఆయన పరిశీలిస్తారు. మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్ చంద్రబాబు వెంట పూణె వెళ్తారు. 

ఉదయం 10.40 గంటలకు మోడీతో చంద్రబాబు భేటీ

ఢిల్లీ : ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు.  ఉదయం 10.40 గంటలకు ప్రధాని మోడీతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. పోలవరం, రాజధాని నిర్మాణాలకు కేంద్ర సహకారంపై చర్చించనున్నారు. రాష్ట్రంలో శాసనసభ నియోజకవర్గాల పెంపు అంశాలతోపాటు విభజన చట్టం హామీలను నెరవేర్చాలని చంద్రబాబు మోడీని కోరనున్నారు. కేంద్ర విద్యుత్, జల పరిశోధన కేంద్రం రూపొందించిన త్రీడీ నమూనాను చంద్రబాబు పరిశీలించనున్నారు.  

విజయవంతమైన పీఎస్ ఎల్ వీ..సీ 40 రాకెట్ ప్రయోగం

నెల్లూరు : పీఎస్‌ఎల్‌వీ సీ 40ని నింగిలోకి పంపారు. పీఎస్‌ఎల్‌వీ సీ 40రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ రాకెట్‌ ద్వారా 31 ఉపగ్రహాలను శాస్త్రవేత్తలు కక్ష్యలోకి పంపారు. ఈ ప్రయోగంతో 100 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిన రికార్డును ఇస్రో సొంతం చేసుకుంది.

07:57 - January 12, 2018

రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని వక్తలు విమర్శించారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు తులసీదాస్, టీడీపీ నేత శ్రావణ్ కుమార్, బీజేపీ నేత లక్ష్మీపతి రాజా పాల్గొని, మాట్లాడారు. రాష్ట్ర విభజన సౌకర్యాల కల్పనలో కేంద్రం తీవ్ర జాప్యం చేస్తోందన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దా.. 

 

07:53 - January 12, 2018

కౌలు రౌతుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి సాగర్‌ అన్నారు. రైతుకు ఎకరానికి నాలుగు వేలు ఇచ్చే స్కీంని కౌలు రైతులకు పోడు భూములను సాగు చేసుకునే రైతులకు కూడా అందించాలని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'రైతుకు ఎకరానికి నాలుగు వేలు ఇచ్చే స్కీంని కౌలు రైతులకు పోడు భూములను సాగు చేసుకునే రైతులకు కూడా అందించాలి. ఈ స్కీం మాత్రమే కాకుండా గిట్టుబాటు ధర లేక నష్టపోతున్న రైతుకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలి. ఇదే డిమాండ్‌తో తెలంగాణలో రైతు సంఘం ఆందోళనలు చేపట్టింది. ఈ ఆందోళన కార్యక్రమాల ఉద్ధేశ్యాల్ని రైతుల పట్ల ప్రభుత్వ విధానంపై' చర్చించారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం... 

 

07:45 - January 12, 2018

కృష్ణా : విజయవాడను గ్రేటర్‌ నగరంగా మలిచేందుకు అడుగులు శరవేగంగా పడుతున్నాయి. గ్రేటర్‌ సిటీలోకి గ్రామ పంచాయతీలను విలీనం చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. గత కొన్నేళ్లుగా విజయవాడను గ్రేటర్‌ చేయాలనే డిమాండ్‌ ఉంది. రాజధాని ప్రాంతంగా పేరొందిన విజయవాడను గ్రేటర్‌ సిటీగా సాకారం దిశగా యంత్రాంగం అడుగులు వేస్తోంది.
విజయవాడ గ్రేటర్ కల త్వరలోనే సాకారం 
నవ్యాంధ్ర రాజధాని ప్రాంతమైన విజయవాడ గ్రేటర్ కల త్వరలోనే సాకారం కానుంది. ఈ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.  2017 అక్టోబర్ 14వ తేదీన సీఎం చంద్రబాబు విజయవాడ నగరంలో ఆకస్మిక తనిఖీల్లో భాగంగా గ్రేటర్ అంశాన్ని ప్రస్తావించారు. విజయవాడ చుట్టుపక్కల 45 గ్రామాలను దశలవారీగా నగరపాలక సంస్థలో విలీనం చేస్తామని ప్రకటించారు. దీంతో గ్రేటర్ ప్రక్రియ జోరందుకుంది. 
విజయవాడ చుట్టుపక్కల గ్రామ పంచాయతీలు విలీనం 
విజయవాడ చుట్టుపక్కల గ్రామ పంచాయతీలు నగరంలో విలీనం కానున్నాయి. విలీనంపై తీర్మానాలు చేయాలంటూ పంచాయతీలకు డీపీవో ఉత్తర్వులు జారీ చేశారు. విజయవాడ నగరం చుట్టుపక్కల ఉన్న పంచాయతీల సర్పంచులు, కార్యదర్శులు, అధికారులతో డివిజనల్ పంచాయతీ అధికారి  ఈనెల 19న కానూరులోని తులసినగర్‌లో  ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి పంచాయతీలను విలీనం చేస్తూ చేసిన తర్మానాలతో రావాలని ఉత్తర్వుల్లో స్పష్టం  చేశారు. విజయవాడ డివిజన్ పరిధిలోని ఇబ్రహీంపట్నం, పెనమలూరు, కంకిపాడు, విజయవాడ గ్రామీణ మండల పరిధిలోని గ్రామాల పంచాయతీ కార్యదర్శులకు ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. నూజివీడు డివిజన్ పరిధిలోకి వచ్చే గన్నవరం నియోజకవర్గం పరిధిలోని మరికొన్ని గ్రామాలను కూడా విలీనం చేసే ప్రక్రియను రూపొందిస్తున్నారు. 
విజయవాలో గ్రామాలు కలిస్తే 425.59 చ.కి.మీ
ప్రస్తుతం నగర విస్తీర్ణం 61.88 చదరపు కిలోమీటర్లు ఉంది. విలీన ప్రతిపాదిత  45 గ్రామాల విస్తీర్ణం 363.71 చదరపు కిలోమీటర్ల మేర ఉంది. గ్రేటర్ లో 45 గ్రామాలన్నీ విలీనమైతే..  425.59 చదరపు కిలోమీటర్ల మేర నగరం విస్తరించనుంది. బెజవాడ గ్రేటర్‌గా రూపాంతరం చెందితే 15,17,732 మంది నగర జనాభాగా మారతారు. ప్రభుత్వం 45 గ్రామాలను విజయవాడ నగర పరిధిలోకి తీసుకొస్తే ప్రయోజనాలుంటాయన్న అభిప్రాయం అధికారుల్లో వ్యక్తమవుతోంది. త్వరితగతిన గ్రేటర్ పరిధిలోకి నగరాన్ని తెచ్చి గుంటూరు, విజయవాడ నగరాలను కూడా జంట నగరాలుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వ యంత్రాంగం భావిస్తోంది.
గ్రేటర్‌ బెజవాడ నిర్ణయంపై కొన్ని పక్షాల వ్యతిరేకత
విజయవాడను గ్రేటర్‌ మార్చాలన్న ప్రభుత్వ తీరుపై కొన్ని పక్షాల  నుంచి నిరసన వ్యక్తమవుతోంది. తమపై పన్నుల భారాలు మోపవద్దని నగరవాసులు కోరుతున్నారు. విజయవాడ నగరాన్ని గ్రేటర్ సిటీగా మార్చితే ప్రజలపై పన్నుల భారం లేకుండా చూడాలని  వామపక్షాలు కోరుతున్నాయి. ప్రజలపై పన్నుల భారం మోపేలా చర్యలు చేపడితే అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాయి.
గ్రేటర్ బెజవాడపై ప్రజల్లో వ్యతిరేకత
మొత్తానికి ప్రభుత్వం బెజవాడను గ్రేటర్‌ సిటీగా మార్చాలని భావిస్తుంటే.... ప్రజల నుంచి మాత్రం వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రజలపై భారాలులేని గ్రేటర్‌ కావాలని కోరుతున్నారు. ప్రజలందరికీ మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

 

07:40 - January 12, 2018

హైదరాబాద్ : భర్త ఇంటి ముందు దీక్ష చేస్తున్న సంగీతకు తొలి విజయం లభించింది. మియాపూర్‌ కోర్టులో ఆమెకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో సంగీత భర్త ఇంటి తాళాలను పగులగొట్టి .. లోపలికి ప్రవేశించింది. ఈ సందర్భంగా.. ఆమె న్యాయస్థానానికి, సహకరించిన మహిళా సంఘాలకు కృతజ్ఞతలు తెలియజేసింది. 
మియాపూర్‌ కోర్టులో సంగీతకు అనుకూలంగా తీర్పు 
బోడుప్పల్లో  భర్త ఇంటిముందు.. న్యాయం కోసం పోరాడుతున్నసంగీతకు కోర్టులో ఊరట లభించింది. దీంతో సంగీత.. భర్త ఇంట్లోకి ప్రవేశించింది.  మియాపూర్‌ ఫ్యామిలీ కోర్టులో గురువారం సంగీత కేసు విచారణకు వచ్చింది. సంగీతకు అనుకూలంగా కోర్టు తీర్పునిచ్చింది. సంగీతకు నెలవారీ ఖర్చు కింద ఆమె భర్త శ్రీనివాస్‌రెడ్డి 20 వేల రూపాయలు ఇవ్వాలని  మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. అలాగే ఇప్పటివరకు శ్రీనివాస్‌రెడ్డితో ఉన్న ఇంట్లోనే సంగీత ఉండాలని తేల్చి చెప్పింది.  భర్త, అత్త, మామలు ఆమెకు ఎలాంటి ఇబ్బంది కలింగిచరాదని కోర్టు స్పష్టం చేసింది. 
కోర్టు తీర్పుపై కౌంటర్‌ దాఖలు చేసిన భర్త శ్రీనివాస్‌రెడ్డి
అయితే కోర్టు తీర్పుపై  సంగీత భర్త శ్రీనివాస్‌రెడ్డి కౌంటర్‌ దాఖలు చేశాడు. ఇంట్లోకి అనుమతించిన తర్వాత సంగీతకు డబ్బులు ఇవ్వడం దేనికంటూ శ్రీనివాస్‌రెడ్డి కౌంటర్‌లో పేర్కొన్నాడు. ఇప్పుడున్న ఇల్లు తనది కాదని.. వేరే ఇంట్లోకి మారడానికి అవకాశం ఇవ్వాలని పిటిషన్‌లో కోరాడు. అయితే శ్రీనివాస్‌రెడ్డి వేసిన కౌంటర్‌ పిటిషన్‌ను కొట్టి వేయడం జరిగింది. 
ఇంట్లోకి ప్రవేశించిన సంగీత  
కోర్టు ఇచ్చిన ఆదేశాలతో సంగీత..  భర్త శ్రీనివాస్‌రెడ్డి.. ఇంటి తాళాలను పగులగొట్టి.. లోపలికి ప్రవేశించింది.  ఈ సందర్భంగా సంగీత న్యాయ స్థానానికి కృతజ్ఞతలు తెలిపింది. అయితే భర్త శ్రీనివాస్‌రెడ్డిపై పెట్టిన  కేసులు ఎత్తివేసే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు.  భర్తపై పూర్తి నమ్మకం కలిగిన రోజున కేసులు ఎత్తివేస్తారని ఆమె అన్నారు. అలాగే తన పోరాటానికి మద్దతుగా నిలిచినవారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఏది ఏమైనా తన భర్తలోమార్పు వచ్చేంత వరకూ.. తన హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తానని..సంగీత స్పష్టం చేశారు.  
 

 

07:36 - January 12, 2018

గుంటూరు : ప్రభుత్వాసుపత్రి అనుబంధ నర్సింగ్‌ కళాశాలలో వెలుగు చూసిన లైంగిక వేదింపుల వ్యవహారంలో తీసుకున్న చర్యలు వివాదాస్పదంగా మారాయి.వేధింపులకు పాల్పడిన దొరబాబుతోపాటు.. బాధితులపై కూడా చర్యలు తీసుకోవటాన్ని విద్యార్థి సంఘాలు తప్పుపడుతున్నాయి. వాటిని వెంటనే వెనక్కు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. లేదంటే జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ రాజునాయుడుకు వ్యతిరేకంగా ఆందోళన చేపడతామని ఎస్‌ఎఫ్‌ఐ నేతలు హెచ్చిరిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

07:31 - January 12, 2018

హైదరాబాద్ : నాగం జనార్దన్‌రెడ్డి కాంగ్రెస్‌వైపు చూస్తున్నారా? హస్తంగూటికి చేరేందుకు ఇప్పటి నుంచే గ్రౌండ్‌ వర్క్‌ ప్రిపేర్‌ చేసుకుంటున్నారా? నాగం కమలంతో కటీఫ్‌ చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారా? ఇంతకు నాగం కాంగ్రెస్‌ ఎప్పుడు చేరుతారు? వాచ్‌ దిస్‌ 10టీవీ స్పెషల్‌ స్టోరీ...
కాంగ్రెస్‌ గూటికి నాగం?
నాగం జనార్దన్‌రెడ్డి వైద్యవృత్తికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. తెలుగుదేశం పార్టీలో నంబర్‌ టూగా ఉంటూ.. సుదీర్ఘకాలం మంత్రిగా కూడా పనిచేశారు. ప్రత్యేక తెలంగాణ డిమాండ్‌పై చంద్రబాబుతో విభేదించి  టీడీపీకి గుడ్‌బై చెప్పారు. ఆ తర్వాత తెలంగాణ నగారా సమితి పెట్టారు. అంతగా ఆదరణలేకపోవడంతో  బీజేపీ కండువాకప్పుకున్నారు. కమలం పార్టీలో చేరిన నాటి నుంచీ నాగం జనార్దన్‌రెడ్డి అసంతృప్తితోనే  ఉంటూ వస్తున్నారు. 
అంతర్గత కుమ్ములాటలతో విసిగిపోయిన నాగం
బీజేపీలోని అంతర్గతకుమ్ములాటలతో విసిగిపోయిన నాగం... చాలాసార్లు పార్టీ హైకమాండ్‌ దృష్టికి తీసుకెళ్లారు. అధిష్టానం పట్టించుకోకపోవడంతో పార్టీ అగ్రనాయకత్వంపై ఒకింత అసంతృప్తికి గురయ్యారు. దీంతో ఇన్నాళ్లూ అయిష్టంగానే బీజేపీలో కొనసాగిన ఆయిన.. ఇక ఆ పార్టీని వీడాలని డిసైడ్‌ అయ్యారు.  త్వరలోనే కమలంపార్టీకి రాంరాం చెప్పేందుకు రెడీ అయ్యారు. అనుచరుల నుంచి వస్తున్న ఒత్తిడితో ఇక ఆలస్యం చేయకూడదని నిర్ణయించారు. కార్యకర్తల ఒత్తిడి, తన రాజకీయ భవిష్యత్‌ దృష్ట్యా ఉగాది తర్వాత తన నిర్ణయం ప్రకటిస్తాని చెప్పారు.
వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు
తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్‌ రోజురోజుకు బలం పెంచుకుంటోంది. రేవంత్‌రెడ్డి ఈ మధ్య కాంగ్రెస్‌లో చేరడంతో టీఆర్‌ఎస్‌తో ఆ పార్టీ ఢీ అంటే ఢీ అంటోంది. కాంగ్రెస్‌ క్యాడర్‌లోనూ  నూతనోత్సాహం వచ్చింది.  దీంతో నాగం చూపు కాంగ్రెస్‌ వైపు మళ్లింది. కాంగ్రెస్‌ సీనియర్‌నేత జైపాల్‌రెడ్డితో ఉన్న సత్సంబంధాలతో హస్తం గూటికి చేరేందుకు తెరవెనుక మంత్రాంగం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో నాగర్‌కర్నూలు నుంచి నాగంను పోటీ చేయించాలన్న దానిపై కాంగ్రెస్‌ పెద్దలు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. 
త్వరలోనే కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్న నాగం
వాస్తవానికి ఈ నెలాఖరులోనే నాగం కాంగ్రెస్‌ కండువా కప్పుకోవాలనుకున్నారు. కానీ అనివార్య కారణాల వల్ల అది కుదరలేదు. ఫిబ్రవరి మొదటివారంలో రాహుల్‌గాంధీ తెలంగాణకు వస్తున్నారు. రాహుల్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో  చేరాలని నాగం భావిస్తున్నారు. లేదంటే రేవంత్‌ తరహాలో ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్‌ కప్పుకోవాలా అన్నది ఆలోచిస్తున్నారు. మొత్తానికి బీజేపీ జర్నీకి కటీఫ్‌ చెప్పాలని డిసైడ్‌ అయిన నాగం... ఇక హస్తం గూటికి చేరడమే తరువాయిగా మారింది. మరిరెండు రోజుల్లో ఎప్పుడు చేరుతారన్న దానిపై స్పష్టత రానుంది.

 

07:21 - January 12, 2018

హైదరాబాద్ : రాష్ట్రంలో ఖాయిలాపడిన పరిశ్రమ పునరుద్ధరణకు ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక రూపొందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు రుణాలు కీలకమని భావిస్తున్న సర్కారు... బ్యాంకులను ఒప్పించ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఖాయిలా పరిశ్రమ పునరుద్ధరణ జరిగితే వేలాది మందికి ఉపాధి అవకశాలు లభిస్తాయని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ చెప్పారు. 
రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం 
తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. కోఠిలోని ఎస్‌బీఐ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ భేటీకి రాష్ట్ర ప్రభుత్వ అధికారులతోపాటు వివిధ బ్యాంకుల మేనేజర్లు, సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. 
ఖాయిలా పడిన పరిశ్రమ పునరుద్ధరణపై సమీక్ష 
ఎస్‌ఎల్‌బీసీలో పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా ఖాయిలా పడిన పరిశ్రమ పునరుద్ధరణపై సమీక్షించారు. ఉత్పత్తులకు మంచి మార్కెటింగ్‌ అవకాశాలు ఉన్నా పెట్టుబడిలేకపోవడంతో పరిశ్రమలు మూతపడిన విషయాన్ని పారిశ్రామికవేత్తలు ప్రస్తావించారు. జిల్లా పరిశ్రమల కేంద్రాలతో కలిసి వీటి పునరుద్ధరణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కేటీఆర్‌ బ్యాంకర్లకు సూచించారు.
ఇండస్ట్రియల్‌ హెల్త్‌ క్లినిక్‌ ఏర్పాటు 
సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఇండస్ట్రియల్‌ హెల్త్ క్లినిక్‌ను ఏర్పాటు చేసిన విషయాన్ని కేటీఆర్‌  బ్యాంకర్ల దృష్టికి తెచ్చారు. దీనిని బ్యాంకింగేతర ఆర్థిక సంస్థగా ఆర్‌బీఐ గుర్తించిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ సంస్థలో బ్యాంకర్లు భాగస్వాములు కావాలని కేటీఆర్‌ కోరారు. ముద్రా లోన్ల పంపిణీ, ఆహారశుద్ధి, తోలు ఉత్పత్తులు తయారీ పరిశ్రమల ఏర్పాటుకు రుణాల మంజూరు, రుణాల పంపిణీలో మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలపై రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీలో సమీక్షించారు. 
 

 

07:17 - January 12, 2018

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌లో కొంతకాలంగా వివాదం నెలకొన్న నాలా బిల్లుకు ఎట్టకేలకు గవర్నర్‌ నరసింహన్‌ ఆమోదం లభించింది. మూడోసారి ప్రభుత్వం ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందిన గవర్నర్‌ బిల్లును ఆమోదించారు. దీంతో రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందని పారిశ్రామికవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 
నాలా బిల్లుకు ఆమోదం తెలిపిన గవర్నర్‌
వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చుకునే నాలా బిల్లుకు గవర్నర్‌ నరసింహన్‌ ఆమోదం లభించింది. రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అనుకూలంగా ఉండేందుకు గత ఏడాది నాలా బిల్లును రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకోవాలంటే భారీ ఎత్తున నాలా రుసుము చెల్లించాల్సి వచ్చేది. విశాఖపట్నం, గుంటూరు, విజయవాడలో నాలా రుసుము 5 శాతం, మిగితా ప్రాంతాల్లో 9 శాతం నాలా రుసుము ఉండేది. నాలా రుసుము ఎక్కువగా ఉండటంతో చాలా మంది వ్యవసాయ భూములు కొనుగోలు చేసి, వాటిని ఇతర భూములుగా మార్చుకునే సాహసం చేయలేకపోయారు. దీంతో  రాష్ట్ర ప్రభుత్వం కొత్త నాలా బిల్లును తీసుకువచ్చింది. ఈ బిల్లును ఆర్డినెన్స్‌ రూపంలో గవర్నర్‌ ఆమోదం కోసం పంపింది. 
నాలా బిల్లుపై గవర్నర్‌ అభ్యంతరం
రాష్ట్ర ప్రభుత్వం పంపిన నాలా బిల్లుపై గవర్నర్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తూ వెనక్కి పంపారు. ఆ తరువాత జరిగిన అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో నాలా బిల్లును ప్రవేశ పెట్టి, అసెంబ్లీలో ఆమోదం పొందిన తర్వాత మరోసారి గవర్నర్‌కు పంపారు. రెండోసారి ప్రభుత్వం పంపిన బిల్లు మొదటి బిల్లు మాదిరే ఉండటంతో రెండోసారీ గవర్నర్‌ ఆమోదం తెలపలేదు.
గవర్నర్‌ వివరణ, సూచనలు 
ఈ బిల్లులో కొన్ని అంశాలపై గవర్నర్‌ వివరణ అడగడంతో పాటు కొన్ని సూచనలు కూడా చేశారు. ముఖ్యంగా నాలా రుసుము చెల్లించిన వెంటనే భూ వినియోగ మార్పిడి చేయడం ఎంతవరకు సబబు అనే అంశాన్ని గవర్నర్‌ లేవనెత్తారు. భూమి మారిన తర్వాత అది ఏ కేటగిరీ కిందకు వస్తుంది, ఆ భూమి ప్రభుత్వానిదా లేక ఇతర ప్రభుత్వ శాఖల వారిదా అనే దానిపై స్పష్టత ఇవ్వాలన్నారు. వీటితో పాటు కొత్త నాలా బిల్లు అమల్లోకి వస్తే ఆర్థిక శాఖ కోల్పోయే ఆదాయంపై కూడా గవర్నర్‌ సందేహాలు వ్యక్తం చేశారు. వీటన్నిటిపై తాజాగా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంతో గవర్నర్‌ బిల్లుకు ఆమోదం తెలిపారు. 
గవర్నర్‌ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారన్న బీజేపీ ఎమ్మెల్యే
అయితే నాలా బిల్లుకు ఆమోదం తెలిపే విషయంలో గవర్నర్‌ ఆలస్యం చేశారని.. పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌, ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు బుధవారం ఆరోపించారు. తెలంగాణకు వారం రోజుల్లో నాలా బిల్లు ఆమోదించిన గవర్నర్‌ ఏపీ ప్రభుత్వం పంపిన బిల్లును రెండు సార్లు ఎందుకు వెనక్కి పంపారని ప్రశ్నించారు. మొత్తానికి ప్రభుత్వ విమర్శలతో పాటు రాజకీయ ఆరోపణలు ఎదుర్కొంటున్న నాలా బిల్లుకు గవర్నర్‌ ఆమోదం తెలపడంతో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు చిన్న, మధ్య తరహా పారిశ్రామిక వేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

 

 

07:11 - January 12, 2018

గుంటూరు : ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఢిల్లీకి పయనమయ్యారు. ఇవాళ ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఆయన  భేటి కానున్నారు. ఏడాది తరువాత జరుగుతున్న ఈ భేటీలో... పోలవరం ప్రాజెక్ట్‌, రాష్ట్ర విభజన అంశాలపై మోదీతో చర్చించనున్నారు. ఇతర ముఖ్య అంశాలను ..చంద్రబాబు.. ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు. 
పోలవరం, రాష్ట్ర విభజన అంశాలపై చర్చ 
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీ పర్యటనకు  షెడ్యూల్‌ ఖరారైంది. గురువారం రాత్రి చంద్రబాబునాయుడు హస్తినకు బయల్దేరనున్నారు.  శుక్రవారం ఉదయం 10.40 గంటలకు ప్రధాని మోదీతో..  చంద్రబాబు సమావేశమవుతున్నారు. ఏడాది తరువాత వీరిద్దరి మధ్య జరుగుతున్న ఈ భేటీలో పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్‌, రాష్ట్ర విభజన అంశాలు కీలకంగా చర్చకు రానున్నట్టు తెలుస్తోంది. 
మోదీకి దృష్టికి ఈఏపీ నిధుల అంశం
అలాగే ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని చంద్రబాబునాయుడు .. మోదీని కోరనున్నారు. ఈఏపీ నిధుల అంశంపైనా ప్రధానితో చర్చించనున్నారు. అదేవిధంగా.. నియోజకవర్గాల పునర్విభజన, రెవెన్యూలోటు గురించి ప్రస్తావించనున్నారు. ప్రధానితో చర్చించాల్సిన అంశాలపై ఉన్నతాధికారులు ఇప్పటికే ఓ నివేదికను రూపొందించి  చంద్రబాబునాయుడుకు అందించారు. ప్రధానితో భేటీ అనంతరం.. చంద్రబాబు ఇతర కేంద్ర మంత్రులతో కూడా భేటీ కానున్నారు.

చంద్రబాబునాయుడు ఢిల్లీ పర్యటనకు షెడ్యూల్‌ ఖరారు

సీఎం చంద్రబాబు ఢిల్లీకి పయనం

గుంటూరు : ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఢిల్లీకి పయనమయ్యారు. ఇవాళ ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఆయన  భేటి కానున్నారు. ఏడాది తరువాత జరుగుతున్న ఈ భేటీలో... పోలవరం ప్రాజెక్ట్‌, రాష్ట్ర విభజన అంశాలపై మోదీతో చర్చించనున్నారు. ఇతర ముఖ్య అంశాలను ..చంద్రబాబు.. ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు. 

07:04 - January 12, 2018

నెల్లూరు : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. నేడు శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ40ని నింగిలోకి పంపనుంది. ఇందుకోసం సర్వం సిద్ధమైంది. ఈ రాకెట్‌ ద్వారా 31 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపనున్నారు శాస్త్రవేత్తలు. ఈ ప్రయోగంతో వంద ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిన రికార్డును ఇస్రో సొంతం చేసుకోనుంది.
సర్వం సిద్ధం చేసిన శాస్త్రవేత్తలు
అంతరిక్షంలో అద్భుతాలు సృష్టిస్తూ... భారత కీర్తి పతాకను నలుదిశగా వ్యాప్తి చేస్తోంది ఇస్రో. ఇప్పటికే అనేక  అనేక రాకెట్లను నింగిలోకి పంపి రికార్డులు సృష్టించింది. ఇప్పుడు మరో ప్రయోగానికి ఇస్రో శ్రీకారం చుట్టింది. శ్రీహరికోటలోని సతీష్‌ థావన్‌ స్పేస్‌ సెంటర్‌ వేదికగా ఉదయం 9 గంటల 28 నిమిషాలకు పీఎస్‌ఎల్‌వీ సీ40 రాకెట్‌ను ప్రయోగించనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు శాస్త్రవేత్తలు. కౌంట్‌డౌన్‌ కూడా నడుస్తోంది.
నింగిలోకి 30 ఉపగ్రహాలను పంపనున్న శాస్త్రవేత్తలు
పీఎస్‌ఎల్‌వీ సీ40 రాకెట్‌తో కార్టోశాట్‌-2 ఈఆర్‌ అనే ఉపగ్రహంతో పాటు మరో 30 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపనున్నారు. ఇందులో రెండు స్వదేశానికి చెందిన మైక్రో, నానో ఉపగ్రహాలు ఉండగా... అమెరికా, బ్రిటన్‌, రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా, ప్రాన్స్‌, ఫిన్‌లాండ్‌, కెనడా దేశాలకు చెందిన 28 ఉపగ్రహాలు ఉన్నాయి. మొత్తం 1323 కేజీల బరువును పీఎస్‌ఎల్‌వీ సీ40 రాకెట్‌ నింగిలోకి తీసుకెళ్లనుంది. ఈ ప్రయోగంలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది కార్టోశాట్‌ సిరీస్‌ గురించే.  భూవాతావరణంలో స్థితిగతులను తెలుసుకునేందుకు 2007లో ఈ సిరీస్‌ను ప్రారంభించారు. భూవాతావరణాన్ని అధ్యయనం చేసే సిరీస్‌ల్లో కార్టోశాట్‌ సిరీస్‌ మూడోది. 710 కిలోల బరువు కలిగిన ఈ ఉపగ్రహం భూమిపైన వాతావరణ స్థితిగతులు, సముద్రగర్భం, తుఫానులు తదితరాలను ముందుగా తెలుసుకునేలా స్పష్టమైన ఫోటోలను పంపిస్తుంది. దీంతో ఈ ప్రయోగంపై పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉన్నారు శాస్త్రవేత్తలు. 
పీఎస్‌ఎల్‌వీ - సీ40తో మరో రికార్డు సృష్టించినున్న ఇస్రో
పీఎస్‌ఎల్‌వీ సీ40 ప్రయోగంతో ఇస్రో మరోమైలురాయి చేరుకోనుంది. ఇప్పటికే వాణిజ్యపరంగా ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపుతూ గెలుపు గుర్రంగామారిన  పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌తో ఈసారి 28విదేశీ ఉపగ్రహాలను నింగిలోకి పంపుతున్నారు. స్వదేశీ ఉపగ్రహాల కోటాలో ఇప్పుడు పంపించే ఉపగ్రహాలతో వంద శాటిలైట్‌లను అమ్ములపొదిలోకి పంపిన ఘనత ఇస్రోకు దక్కనుంది. గతేడాది ఆగస్టులో పంపించిన పీఎస్‌ఎల్‌వీ సీ39 ఫెయిల్యూర్‌తో ఈ దఫా రాకెట్‌ను సక్సెస్‌ చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు శాస్త్రవేత్తలు.  మొదటి లాంచ్‌పాడ్‌ నుంచి ఈ రాకెట్‌ ప్రయోగానికి సిద్ధంగా ఉంచారు. రాకెట్‌ ప్రయోగం సందర్భంగా షార్‌లో సీఆర్‌పీఎఫ్‌ బృందాలు భారీ భద్రత ఏర్పాటు చేశాయి. మొత్తానికి ఇవాళ ప్రయోగించనున్న పీఎస్‌ఎల్‌వీ సీ40 సక్సెస్‌ కావాలని యావత్‌ భారతదేశ ప్రజలు ఎదురు చూస్తున్నారు. మరి శాస్త్రవేత్తల ప్రయోగం విజయవంతం కావాలని మనం కూడా ఆల్‌ దిబెస్ట్‌ చెబుదాం..

 

నేడు పీఎస్ ఎల్ వీ..సీ 40 రాకెట్ ప్రయోగం

నెల్లూరు : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. నేడు శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ40ని నింగిలోకి పంపనుంది. ఇందుకోసం సర్వం సిద్ధమైంది. ఈ రాకెట్‌ ద్వారా 31 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపనున్నారు శాస్త్రవేత్తలు. ఈ ప్రయోగంతో వంద ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిన రికార్డును ఇస్రో సొంతం చేసుకోనుంది.

 

కోడిపందాల నిర్వహణపై నేడు సుప్రీంకోర్టులో విచారణ

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ లో కోడిపందాల నిర్వహణపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది.
 

 

Don't Miss